మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్!
మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్!
Published Tue, Sep 30 2014 5:23 PM | Last Updated on Thu, Apr 4 2019 5:42 PM
వాషింగ్టన్: మొబైల్ రంగంలో కొత్తకొత్త ఫీచర్స్, వివిధ రకాల మోడల్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల్ని ఆకట్టుకునే మార్కెటింగ్ లో భాగంగా ఆరు ఇంచుల డిస్ ప్లే ఉన్న మొబైల్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే వాచీలా చేతికి కట్టుకునే విధంగా రూపొందించారు. అండ్రాయిడ్ తోపాటు ఇతర ప్రత్యేకతలున్నా ఈ స్మార్ట్ ఫోన పేరు పోర్టల్.
ఈ ఫోన్ స్మార్ట్ వాచీగా, ఫిట్ నెస్ ట్రాకర్ గా పనిచేస్తుందని, వాటర్ ఫ్రూఫ్, షటర్ ఫ్రూఫ్ పీచర్లు కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ స్పేస్ తో కెపాసిటీతో పోర్టల్ ను రూపొందించారు. ఈ స్మార్ట్ ఫోన్ రూపొందించిన డెవలపర్లు 3లక్షల డాలర్ల పెట్టుబడి కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకు వెళ్లేందుకు ఇన్వెస్టర్లు సిద్దమైతే వచ్చే జూలై నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తామని డెవలపర్లు తెలిపారు.
Advertisement
Advertisement