ఫిట్నెస్ పాస్ తో కోరుకున్నచోట వ్యాయామం! | Now, workout wherever, whenever using a fitness pass | Sakshi

ఫిట్నెస్ పాస్ తో కోరుకున్నచోట వ్యాయామం!

Published Tue, Mar 29 2016 4:58 PM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

ఫిట్నెస్ పాస్ తో కోరుకున్నచోట వ్యాయామం!

ఫిట్నెస్ పాస్ తో కోరుకున్నచోట వ్యాయామం!

ఇప్పుడు కేవలం ఆన్ లైన్లో నెలవారీ పాస్ తీసుకుంటే చాలు.. ఢిల్లీ ప్రజలు వారనుకున్న చోట వ్యాయామం చేసుకునేందుకు వీలు కలుగుతుంది.

వ్యాయామం కోసం ఫిట్ నెస్ సెంటర్ కు దూర ప్రాంతాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? ఇక మీదట అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వ్యాయామం చేసుకునేందుకు వీలుగా  ఫిట్నెస్ పాస్ లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయ్.  నెలవారీ సభ్యత్వం కట్టి  పాస్ పొందితే చాలు... ఓ ఆన్ లైన్ పోర్టల్ ఈ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.  ప్రజలకు  ఫిట్నెస్ సెంటర్ లు, జిమ్ లు అందుబాటులో ఉండేట్టు ప్రత్యేక సౌకర్యంతో  వర్క్ అవుట్ ఆప్షన్లు ఎంచుకునేందుకు వీలు కల్పించింది.

ఇప్పుడు కేవలం ఆన్ లైన్లో నెలవారీ పాస్ తీసుకుంటే చాలు.. ఢిల్లీ ప్రజలు వారనుకున్న చోట వ్యాయామం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం రాజధాని నగరంలో  ఫిట్నెస్ పాస్ ఆన్ లైన్ పోర్టల్.. పాస్ ల సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ ను నగరంలోని వెయ్యి జిమ్ లు, స్టూడియోల్లోను వినియోగించుకొనే అవకాశంతోపాటు... లక్షకు పైగా రోజువారీ వ్యాయామం చేసుకునే ప్రత్యేక ఆప్షన్లను అందిస్తోంది. వినియోగదారులు నెలకు కేవలం రూ.999 చెల్లించి పాస్ ను పొందితే  జుంబా, పిలేట్స్, ఏరోబిక్స్, ఎంఎంఏ, క్రాస్ ఫిట్, సర్క్యూట్ శిక్షణ, కిక్బాక్సింగ్, స్పిన్నింగ్, బూట్ క్యాంప్ వంటి మరిన్ని వ్యాయామాలను చేసుకునే అవకాశం ఉంది. భారతదేశంలో ఎంతోమంది వ్యాయామం చేయాలని కోరుకుంటున్నా అందుకు తగ్గ అవకాశాలు, సమయం లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకొంటున్నారు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొన్న ఫిట్ పాస్ సంస్థ.. అనుకూల ధర, సౌలభ్యంతోపాటు దీర్ఘకాలిక ఒప్పందాలతో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు అక్షయ్ వర్మ తెలిపారు.

ప్రస్తుత మార్కెట్ అసమానతలను తొలగించి, సూపర్ ఫిట్నెస్ ను భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ఈ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా జిమ్ లు , ఫిట్నెస్ స్టూడియోల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కస్టమర్లను పెంచేందుకు కూడ తాము సహకరించినట్లు అవుతుందని వర్మ చెప్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా లాభాలను విస్తరించేందుకు, కస్టమర్ల అనుభవాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ యాబ్స్, సెక్సీకాల్వ్స్, డోలే షోలే, 36-24-36,  పెక్స్ ఆఫ్ స్టీల్, బికిని బాడ్ వంటి మొత్తం ఆరు యాజమాన్య ఉత్పత్తులను  ఫిట్నెస్ పాస్ ద్వారా పోర్టల్ అందిస్తుంది. దీంతోపాటు వినియోగదారులు ప్రణాళిక ప్రకారం ఫిట్నెస్ సాధించేందుకు సహకరించే డైట్ ప్లాన్ తో కూడిన వర్కవుట్ గైడ్ ను కూడా అందిస్తున్నారు. త్వరలో ఫిట్ పాస్ సేవలను బెంగళూరు, పుణె, ముంబై, హైదరాబాద్, చండీగఢ్ నగరాల్లో కూడ విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement