pass
-
టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!
జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తున్నప్పుడు టోల్‌ప్లాజ్ రుసుం చెల్లిస్తుంటాం కదా. అయితే ఇకపై ఆ ఛార్జీ చెల్లించాల్సిన పనిలేదు. అవునండి..మీరు నిత్యం అదే రహదారి గుండా ప్రయాణిస్తూ, మీ ఇళ్లు స్థానికంగా టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అందుకు కొన్ని ధ్రువపత్రాలు సమర్పించి టోల్‌పాస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.ముందుగా టోల్ ప్లాజా వద్ద సిబ్బందితో మాట్లాడి మీ దగ్గరున్న అడ్రస్ ప్రూఫ్ సమర్పించాలి. ఆ సమయంలో మీ ఫాస్టాగ్ అకౌంట్‌తో అడ్రస్ప్రూఫ్ను లింక్ చేసి లోకల్ పాస్ జారీ చేస్తారు. అందుకోసం రూ.340 చెల్లించాల్సి ఉంటుంది. ఇది నెలపాటు పని చేస్తుంది. వచ్చేనెల తిరిగి ఈ పాస్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కేవలం రూ.340 చెల్లించి నెలరోజులపాటు టోల్ ఛార్జీలు పేచేయకుండా ప్రయాణించవచ్చు. అయితే ఈ లోకల్పాస్ కేవలం సంబంధిత టోల్‌ప్లాజాలో మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినపుడు మాత్రం అక్కడి టోల్రేట్లకు తగినట్లుగా పూర్తి ఛార్జీలు ఫాస్టాగ్ ద్వారా చెల్లించాల్సిందే.ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!2021 ఆర్థిక సంవత్సరంలో ఫాస్టాగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.34,778 కోట్లు ఆదాయం సమకూరింది. 2022లో అది 46 శాతం పెరిగి రూ.50,855 కోట్లకు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి పది నెలలకాలంలో రూ.50 వేలకోట్ల మార్కును దాటింది. -
అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..!
విమానాల్లో అత్యధిక దూరం ప్రయాణించిన ఈ పెద్దమనిషి పేరు టామ్ స్టూకర్. అమెరికాలోని న్యూజెర్సీవాసి. ప్రస్తుతం ఇతడి వయసు 69 ఏళ్లు. విమాన ప్రయాణాల మీద మక్కువతో 1990లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి 2.90 లక్షల డాలర్లకు (రూ.2.41 కోట్లు) లైఫ్‌టైమ్ పాస్ తీసుకున్నాడు.ఇక అప్పటి నుంచి తోచినప్పుడల్లా విమానాల్లో దేశాదేశాలను చుట్టేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఇతగాడు విమానాల్లో ఏకంగా 20 మిలియన్ మైళ్లకు (3.21 కోట్ల కిలోమీటర్లు) పైగా ప్రయాణాలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత విరివిగా విమాన ప్రయాణాలు చేసే వ్యక్తిగా రికార్డులకెక్కాడు. లైఫ్‌టైమ్ పాస్ కోసం అప్పట్లో తాను పెద్దమొత్తమే చెల్లించినా, అలా చెల్లించడం వల్ల ఇప్పటి వరకు లెక్కిస్తే తనకు 2.44 మిలియన్ డాలర్లు (రూ.20.30 కోట్లు) మిగిలినట్లేనని టామ్ చెప్పడం విశేషం. అతి తక్కువ లగేజీతో తాను ప్రయాణాలు చేస్తానని, చేసే ప్రయాణాల కంటే, ప్రయాణాల్లో మనుషులను కలుసుకోవడం తనకు చాలా ఇష్టమని అతడు చెబుతాడు.ఇవి చదవండి: అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే! -
సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్: రూ.699కే నెలంతా థియేటర్లో సినిమాలు!
సినీ ప్రేక్షకుల కోసం ప్రముఖ సినిమా చైన్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ 'PVR INOX పాస్‌పోర్ట్' అనే కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రేక్షకులను తరచూ థియేటర్లకు లక్ష్యంతో తీసుకొచ్చిన మొదటి సినిమా సబ్స్క్రిప్షన్ పాస్ ఇది. ఈ నెలవారీ సబ్స్క్రిప్షన్ పాస్‌లు అక్టోబర్ 16 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ పాస్ ద్వారా కేవలం రూ.699తో నెలకు 10 సినిమాల వరకు చూడవచ్చు. అయితే వీటికి కొన్ని షరతులు ఉన్నాయి. పీవీఆర్ ఐనాక్స్ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం అవి ఏంటంటే.. ఈ ఆఫర్ సోమవారం నుంచి గురువారం వరకు వర్తిస్తుంది. ఐమ్యాక్స్, గోల్డ్, లక్, డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం థియేటర్లకు ఇది వర్తించదు. సినిమా చైన్ యాప్ లేదా వెబ్సైట్ నుంచి కనీసం మూడు నెలల సబ్స్క్రిప్షన్ వ్యవధికి 'PVR INOX పాస్‌పోర్ట్' కొనుగోలు చేయవచ్చు. రిడీమ్ చేసుకోవడానికి వినియోగదారులు లావాదేవీ చెక్ అవుట్ సమయంలో చెల్లింపు ఎంపికగా పాస్‌పోర్ట్ కూపన్‌ను ఎంచుకోవలసి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ టికెట్లు కొంటున్నట్లయితే, ఒక టికెట్‌కు పాస్‌పోర్ట్ కూపన్‌ని ఉపయోగించవచ్చు. ఈ పాస్‌పోర్ట్ అనేది బదిలీ చేయలేని సబ్స్క్రిప్షన్. ఒకరే వినియోగించాల్సి ఉంటుంది. థియేటర్లోకి వెళ్లే ముందు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. ఇక ఆహారం, పానీయాల విషయంలోనూ పీవీఆర్ ఐనాక్స్ ఇదివరకే వాటి ధరలను 40 శాతం తగ్గించింది. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రూ. 99 నుంచి ప్రారంభమయ్యే ఫుడ్ కాంబోలను పరిచయం చేసింది. -
టెట్ ప్రాథమిక కీ, తుది కీ మధ్య తేడాలు.. ఇంత‘కీ’ ఏం జరిగింది!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించి ప్రాథమిక ‘కీ’లో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం..తుది ’కీ’ఆలస్యంగా వెబ్సైట్ ఉంచడంతో పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక కీ చూసుకొని పాస్ గ్యారంటీ అనుకున్నవారు కూడా ఫెయిల్ అవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది. ప్రాథమిక కీలో ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ తుది కీ వచ్చే నాటికి మార్చడం కూడా ఈ పరిస్థితికి కారణమని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు నిజమని భావిస్తే, సాధారణంగా రెండు ఆప్షన్లు ఇస్తారని, అప్పుడు అభ్యర్థులకు అన్యాయం జరగదని టెట్ రాసినవారు అంటున్నారు. ఇదేమీలేకుండా, ఆప్షన్లు మార్చడం వల్ల కొంతమంది ఐదు మార్కుల వరకూ కోల్పోయినట్టు చెబుతున్నారు. ఒకటి, రెండు మార్కులు తక్కువై అర్హత సాధించలేని వారు దాదాపు 50 వేల మంది ఉన్నారని అధికారవర్గాలు అంటున్నాయి. అధికారుల గోప్యతపై అనుమానాలు టెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా అధికారులు ఏ విషయంపైనా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. తుది కీ కూడా ఆలస్యంగా వెబ్సైట్లో ఉంచారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు ఏమిటి? అందులో వేటిని పరిగణనలోనికి తీసుకున్నారు? వేటిలో మార్పులు చేశారు? అనే సమాచారం వెల్లడించనేలేదు. టెట్ రాసిన అభ్యర్థులు ఓంఎంఆర్ షీట్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ..టెట్ కన్వినర్‌ను కలిసినా స్పందించలేదు. ఈ విషయమై పలువురు మంత్రిని కలిసి, టెట్, ఆప్షన్ల మార్పు, సమాచారం వెల్లడించకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పరీక్ష, ఫలితాల వెల్లడిపై సరైన సమన్వయం లేదని అధికారవర్గాల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. టెట్ కన్వీనర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని, ఏ సమాచారం చెప్పేందుకు వెళ్లినా ఆమె పట్టించుకోవడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. మంత్రి కార్యాలయం నుంచి వచ్చే సూచనలు కూడా పరిశీలించని సందర్భాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహణ తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దారుణంగా దెబ్బతిన్న పేపర్–2 అభ్యర్థులు పేపర్–2కు రాష్ట్రవ్యాప్తంగా 2,08,499 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1,90,047 మంది పరీక్ష రాశారు. కేవలం 29,073 మంది మాత్రమే అర్హత సాధించారు. జనరల్ కేటగిరీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫలితాలు దారుణంగా పడిపోయాయి. కేవలం 563 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే 3.65 శాతం ఉత్తీర్ణతగా నమోదైంది. జనరల్ కేటగిరీలో 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత సాధిస్తారు. ఈ కారణంగా చాలామంది ఫెయిల్ అయినట్టు చెబుతున్నారు. -
రూ. రెండు కోట్ల ఖర్చుతో 20 కోట్ల లబ్ది.. ‘ఏక్ దిన్ కా సుల్తాన్’.. అంతా గాల్లోనే
మహా అయితే ఇన్ని దేశాలు తిరిగొచ్చాను అని చెబుతుంటారు. లేదంటే సుమారు లక్షల మైళ్ల వరకు వెళ్లి ఉండొచ్చని అంటారు. కానీ, నిరతరం ప్రయాణించడం మాత్రం అసాధ్యమే. అది కూడా కొద్ది మొత్తం డబ్బుతోనే.. దాదాపు ఆరు సార్లు చంద్రుని పర్యటనకి వెళ్లడానికి పట్టేంత దురాన్ని చుట్టి రావడం అంటే నమ్మశక్యం కానీ విషయమే! కానీ అది నిజం అతను అంత దురాన్ని విమానంలో చుట్టొచ్చాడు. కేవలం ఆకాశం, ఎయిర్‌పోర్ట్‌లలోనే గడుపుతూ.. నిర్విరామంగా ప్రయాణించాడు. ఆ వ్యక్తే యూఎస్‌కి చెందిన 69 ఏళ్ల టామ్ స్టుకర్. అతను 1999లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కి సుమారు రూ. 2 కోట్లు చెల్లించి జీవితకాల ఎయిర్ పాస్ని పొందాడు. దీన్ని తాను పెట్టిన అత్యుత్తమమైన పెట్టుబడిగా స్టుకర్ చెప్పుకుంటాడు. 33 ఏళ్ల క్రితం తీసుకున్న ఈ పాస్‌తో కనీసం 23 మిలియన్ల కి.మీ. దూరం ప్రయాణిస్తే చాలు అనుకున్నాడు. గానీ ఏకంగా 37 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణిస్తానని ఊహించలేదు. ఈ జర్నీలో అతను కొన్ని సమయాల్లో సుమారు 12 రోజుల వరకు బెడ్‌పై పడుకోకుండా అలానే ప్రయాణించినట్లు తెలిపాడు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయినప్పుడూ తప్ప మిగతా అన్ని వేళలా ఆకాశంలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ హోటల్ సూట్లు, క్రిస్ట్ క్రూయిజ్‌లు వంటి వాటిల్లో కొన్ని వారాల పాటు ‘ఏక్ దిన్ సుల్తాన్’ మాదిరి భోగాలు అనుభవించాడు. మొత్తం 1.46 మిలియన్ల మైళ్ల దురం పర్యటించేందుకు సుమారు 373 విమానాల్లో ప్రయాణించినట్లు చెప్పాడు. నిజానికి అతడు గనుక ఈ పాస్ బుక్ తీసుకోనట్లయితే ఇంత దూరం పర్యటించినందుకు ఆ ఫ్లైట్లకి సుమారు రూ. 20 కోట్లు ఖర్చయ్యేవి. అదీగాక ఇన్ని మైళ్ల దూరం జర్నీ చేసేందుకు అన్ని విమానాలను ప్రతిసారి బుక్‌చేసుకోవడం కూడా కష్టమే కానీ ఈ పాస్ ఉండటం కారణంగానే అతను ఈజీగా అన్ని విమానాల్లో ప్రయాణించగలిగాడు. అతను 2019లో ఇంత దూరం పర్యటించాడు. అతను పర్యటించిన దూరం ఆరుసార్లు చంద్రుని పర్యటనకు వెళ్లిన దానితో సమానమని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అంతేగాదు చరిత్రలో అతని మాదిరి అంతలా పర్యటించిన వ్యక్తి మరొకరు లేరని కూడా సదరు విమానయాన సంస్థ పేర్కొనడం విశేషం. (చదవండి: వాట్ యాన్ ఐడియా! ఆ తల్లి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!) -
హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్..! తొలిసారిగా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శ్రీకారం చుట్టింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్‌కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్‌కు రూ.600గా, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్‌కు రూ.1000గా ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్‌ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్ తో ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌లో ప్రయాణికులకు జనరల్ బస్ టికెట్ అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్ పాస్‌కు రూ.1150, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్‌కు రూ.1300గా ధర ఉంది. ఈ పాస్ దారులు సిటీ సబర్బన్ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్‌లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది. తక్కువ దూరం ప్రయాణించే వారికి చేరువ కావడం కోసమే జనరల్ రూట్ పాస్‌ను టీఎస్ఆర్టీసీ రూపొందించింది. “గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు అనేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు జనరల్ రూట్ పాస్‌ను సంస్థ ప్రారంభించింది. చదవండి: BCCI: అవసరమా?.. ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్ రిక్వెస్ట్.. ట్వీట్‌తో.. రాష్ట్రంలో విద్యార్థులకు మాత్రమే రూట్ పాస్‌లను ఇస్తున్నాం. తొలిసారిగా సాధారణ ప్రయాణికులకు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. సాధారణంగా ఆర్డీనరీ రూట్ పాస్‌కు రూ.800, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్‌కు రూ.1200గా ఉంటుంది. ప్రారంభ నేపథ్యంలో రూ.200 రాయితీని కల్పించి.. సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ ను రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ రూ.1000కే అందిస్తున్నాం. హైదరాబాద్‌లో ప్రస్తుతం జనరల్ మెట్రో పాస్‌లు 1.30 లక్షలు, ఆర్డీనరీ పాస్‌లు 40 వేల వరకు ఉన్నాయి. వాటి మాదిరిగానే కొత్తగా తీసుకువచ్చిన రూట్ పాస్‌ను ప్రయాణికులు ఆదరించాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. -
తాతగారు టెన్త్ పాస్!
ఝరాసంగం (జహీరాబాద్): 70 సంవత్సరాల వృద్ధుడు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన రైతు గాల్‌రెడ్డి ఝరాసంగం గ్రామానికి చెందిన ఓపెన్ స్కూల్లో పదో తరగతి విద్యను అభ్యసించారు. 2021 – 22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పది పరీక్షల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు. జూలైలో ఫలితాలు విడుదల కాగా శనివారం విద్యాశాఖ అధికారుల నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా గాల్రెడ్డిని శాలువాతో సన్మానించారు. సర్పంచ్‌గా పోటీ చేయాలంటే పదో తరగతి విద్యార్హత కలిగిన వారు అర్హులని ప్రభుత్వం ప్రకటించడంతో పదో తరగతి పరీక్ష రాశానని గాల్‌రెడ్డి తెలిపారు. (చదవండి: స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి) -
మిరాకిల్ అంటే ఇదే... మీద నుంచి కారు వెళ్లిపోయినా..
యాక్సిడెంట్‌కి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. కానీ కొన్ని వీడియోల్లో సదరు వ్యక్తులు బతకరు అనిపించేంత దారుణమైన ప్రమాదం జరుగుతుంది. అయినప్పటికీ చాలా మంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటనలు ఎన్నో చూశాం. ఐతే ఈ ఘటన మాత్రం అందుకు విరుద్ధం. ఎందుకంటే ఇక్కడొక చిన్నారిపై నుంచి కారు వెళ్లిపోయింది. ఐతే ఆమెకి ఒంటిపై ఒక్క గాయం కూడ కాలేదు. పైగా ఆ చిన్నారి సైలెంట్‌గా తనకు తానుగా లేచి వెళ్లిపోయింది. అసలేం జరిగిందంటే...ఒక చిన్నారి తన చిన్న సైకిల్‌తో రోడ్డుపై వెళ్తోంది. ఇంతలో అటుగా వస్తున్న ఒక కారు ఆ చిన్నారిని ఢీ కొడుతుంది. దీంతో ఆ చిన్నారి కారు కింద పడిపోతుంది. అంతేగాదు కారు ముందు చక్రం ఆ చిన్నారి పై నుంచి వెళ్లిపోతుంది. ఐతే అనుహ్యంగా ఆమెకు ఎలాంటి గాయం కాలేదు. పైగా ఆ చిన్నారి తనకు తాను లేచి భయంతో ఏడుస్తూ వెళ్లిపోతుంది. మిరాకిల్ అంటే ఇది కదా!. బతకాలని రాసిపెట్టి ఉంటే ఎలాగైనా బతికేస్తాం కాబోలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. जाको राखे सईंया मार सके ना कोय। यकीन करना मुश्किल है कि बच्ची ऐसे हादसे मे बच गयी. अभिभावक और वाहन चालाक दोनों ने घोर लापरवाही बरती जिसका नतीजा बच्ची के लिए प्राणघातक हो सकता था... pic.twitter.com/ng5gLZ8b2s — Dipanshu Kabra (@ipskabra) October 21, 2022 (చదవండి: అరే ఏం యాక్ట్ చేశాయి మేకలు....అందర్నీ బకరాలు చేశాయిగా!) -
గోటబయకు ఊరట... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సింగపూర్!
కొలంబో: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆందోళనకారులు చేసిన నిరసనల నడమ లంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన మాల్దీవులు అక్కడ నుంచి సింగపూర్‌కు పరారయ్యారు. ఐతే గోటబయకు సింగపూర్ ఆశ్రయం ఇచ్చిందంటూ వార్తలు గుప్పుమనడంతో వాటన్నింటిని సింగపూర్ అధికారులు ఖండించారు. లంక మాజీ అధ్యక్షుడు ఆశ్రయం కోరనూలేదూ, తాము ఆశ్రయం ఇవ్వనూలేదని తెగేసి చెప్పింది. అది గోటబయ వ్యక్తి గత పర్యటన అని నొక్కి చెప్పింది. ఈ క్రమంలో సింగపూర్ ఇమిగ్రేషన్ అధికారులు మీడియా సమావేశంలో తాజాగా గోటబయకు స్వల్పకాలిక సందర్శన పాస్ మంజూరు చేసినట్లు పేర్కొంది. సింగపూర్పర్యటన నిమిత్తం వచ్చే పర్యాటకులకు ఇక్కడ బస చేసేందుకు సాధారణంగా 30 రోజుల వ్యవధితో కూడిని ఎస్టీవీపీ జారీ చేయబడుతుందని తెలిపారు. ఒకవేళ పొడిగించుకోవాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులబాటు కూడా ఉంది. గతవారం ఆశ్రయం ఇవ్వలేదన్న సింగపూర్ ఇప్పుడు మాటమార్చి పర్యటన పాస్ మంజూరు చేశామని చెప్పడం గమనార్హం. (చదవండి: శ్రీలంకలో మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన) -
ఫెయిలైన విద్యార్థులంతా పాస్..
-
జాబ్ నిలవాలంటే టెన్త్ పాసవ్వాలన్నారు, ఎట్టకేలకు 57 ఏళ్ల వయసులో
భువనేశ్వర్: ఒడిశాలో ఆశావర్కర్‌గా పనిచేస్తున్న స్వర్ణలత పాటి చిన్ననాటి నుంచి కష్టాలను చాలా దగ్గర్నుంచి చూశారు. తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో ఆమెను పెద్దగా చదివించలేదు. ఏడో తరగతి వరకు చదువుకున్న స్వర్ణలతకు చిన్నతనంలోనే పెళ్లి చేశారు. ఆమెకు 27 ఏళ్ల వయసులో భర్తను కోల్పోవడంతో కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. తన ఇద్దరు పిల్లలనే ఆమె తన జీవితంగా భావించి వారికోసం కష్టపడుతూ వచ్చింది. ఏదైనా జాబ్ చేయాలని అనుకున్నా ఆమెకు సరైన విద్యార్హత లేకపోవడంతో ఉపాధి దొరకడం కష్టంగా మారింది. చివరికి తన ఊర్లోని స్కూల్లో వంద రూపాయలకు కుక్‌గా చేరి తన పిల్లలిద్దరిని పోషించుకుంది. కాగా 2005లో ఆమె జీవితం మరో మలుపు తీసుకుంది. ఆమె తాను పని చేస్తున్న గ్రామంలోనే ఆశావర్కర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆశావర్కర్‌గా ఆమె చూపిన పనితనానికి, ప్రతిభకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. తనకు వచ్చిన డబ్బుతో ఇద్దరి పిల్లలను ప్రస్తుతం పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిస్తోంది. అయితే 2019లో ఒడిశా ప్రభుత్వం ఆశావర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు టెన్త్ తప్పనిసరిగా ఉండాలని మెలిక పెట్టింది. టెన్త్ పాస్ అయితేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో స్వర్ణలతా తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి పది పరీక్షలు రాయడానికి సిద్ధమైంది. 2019 డిసెంబర్లో మెట్రిక్ పరీక్షలు రాసేందుకు ఓపెన్ స్కూల్లో అప్లికేషన్ పెట్టుకుంది. కరోనా కారణంగా 2020 మార్చిలో జరగాల్సిన పరీక్షలు సెప్టెంబర్‌కు వాయిదా పడ్డాయి. కష్టపడి చదివిన స్వర్ణలత సెప్టెంబర్‌లో రాసిన పరీక్షల్లో ఒక్క ఇంగ్లీష్ తప్ప అన్ని సబ్జెక్టులు పాసయ్యింది. ఇంగ్లీష్ కూడా కేవలం నాలుగు మార్కులతో ఫెయిల్ అయింది. తాను ఫెయిల్ అయ్యానని కుంగిపోకుండా మరోసారి ఇంగ్లీష్ పరీక్ష రాసింది. ఈసారి కూడా ఫలితం ఆమెకు వ్యతిరేకంగానే వచ్చింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో స్వర్ణలతకు ఓడిశా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈసారి ఆమెను దేవుడు కరోనా రూపంలో కరుణించాడు. కరోనా కారణంగా గతేడాదితో పాటు ఈ ఏడాది ఓపెన్‌లో అప్లై చేసుకున్న అందరిని పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంకేముంది తాను పాసయినట్లు తెలుసుకున్న స్వర్ణలతా దాన్ని ఒక పెద్ద పండగలా చేసుకుంది. ఇక తన జాబ్ ఎక్కడికి పోదని.. తనకు అన్ని సౌకర్యాలు లభిస్తాయని ఆనందం వ్యక్తం చేసింది. చదవండి: మొబైల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా -
కరోనా ఉంటే ఫ్రీడమ్ పాస్‌లు ఇస్తారట!
లండన్ : ప్రాణాంతక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్ పూర్తయ్యాక ‘ఫ్రీడమ్ పాస్’ ఇస్తామని చెప్పింది. ఈ పాస్‌లు మూడు నెలల పాటు చెల్లుతాయని, ఈ పాస్లతోని బ్రిటిష్ పౌరులు తమ ఇష్టానుసారం ఏమైనా చేసుకోవచ్చని కరోనా వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సర్ జాన్ బెల్ తెలిపారు. కరోనా పరీక్షల్లో లేదని తేలిన వారికి వెంటనే స్వేచ్ఛను ప్రసాదిస్తామని, వారు తమ ఇష్టానుసారం ఎక్కడైనా తిరగొచ్చు, తమ ఇష్టమైనది చేయవచ్చని జాన్ బెల్ చెప్పారు. అయితే నెగెటివ్ వచ్చిన వారు కూడా అనుమానాలు వచ్చినప్పుడల్లా తరచుగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని ఆయన అన్నారు. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రాకపోయినట్లయితే ‘లివర్‌పూల్’లో లాగా నిర్బంధంగా పరీక్షలు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. చదవండి: ‘ఫైజర్’ వ్యాక్సిన్ భారత్‌కు వస్తుందా!? -
ముగ్గురూ పాసయ్యారు
కొడుకు పాఠాలు చెప్పే మాస్టర్ అయ్యాడు. తల్లిదండ్రులు స్టూడెంట్స్ అయ్యారు. ముగ్గురూ ఇంటర్లో పాస్ అయ్యి విన్నవారి పెదాల మీద చిర్నవ్వు, కళ్లల్లో ప్రశంస పుట్టిస్తున్నారు. కేరళ మలప్పురంలో జరిగింది ఇది. ఆ ఊరి ముస్తఫా టెన్త్ పాసయ్యాక చదువు మానేసి ఆ పనులూ ఈ పనులూ చేసి అబూదాబీ వెళ్లాడు. అక్కడ ఒక హాస్పిటల్లో పని చేస్తూ తిరిగి వచ్చి పదోక్లాసు చదివిన నుసైబాను పెళ్లి చేసుకుని తిరిగి అబూదాబీ వెళ్లిపోయాడు. కొడుకు పుడితే వాణ్ణి మలప్పురంలోనే చదివించారు. ఐదేళ్ల క్రితం కేరళ వచ్చేసిన ఈ దంపతులిద్దరూ చిన్నపాటి వ్యాపారం చేస్తూ ఆపేసిన చదువును కొనసాగించడం ఎలా అని ఆలోచించారు. ఈలోపు కొడుకు ఇంటర్‌కు వచ్చాడు. కొడుకుతో పాటు తాము ఇంటర్ చదివితే బాగుంటుందని అనుకున్నారు. కాని వారిని నేరుగా చేర్చుకునే కాలేజీలు లేవు. అయితే కేరళ సాక్షరతా మిషన్ వారి ఇంటర్ సమాన కోర్సు ఉందని తెలుసుకుని అందులో చేరారు. కొడుకు రెగ్యులర్ కోర్సు చేస్తుంటే వీరు సండే క్లాసెస్ ద్వారా ఇంటర్ చదివారు. ‘మా అబ్బాయి షమాస్ మంచి స్టూడెంట్. వాడు తనతోపాటు మేము కూడా చదువుతుంటే ఎగ్జయిట్ అయ్యాడు. మాకు టీచరై డౌట్స్ తీర్చాడు. ప్రశ్నలు అడిగి ఎంకరేజ్ చేశాడు’ అన్నాడు ముస్తఫా. మొన్నటి పరీక్షల్లో ముగ్గురూ పరీక్షలు రాశారు. కొడుకు షమాస్ ఏ ప్లస్‌లో పాస్ అయ్యాడు. తల్లి నుసైబాకు 80 శాతం మార్కులు వచ్చాయి. తండ్రి ముస్తఫాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ‘బిజినెస్ ట్రిప్పుల వల్ల కొన్ని క్లాసులు మిస్ అయ్యాను. లేకుంటే నాకూ మంచి మార్కులు వచ్చేవి’ అని మొహమాటంగా నవ్వాడు ముస్తఫా. ‘ముందు ఇదంతా మా బంధువుల నుంచి దాచిపెడదామనుకున్నాం. ఈ వయసులో చదువంటే ఏమనుకుంటారో అని. కాని ఇప్పుడు అందరూ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అన్నారు తల్లిదండ్రులు. అయితే కథ ఇంతటితో అయిపోలేదు. తల్లిదండ్రులు ఇద్దరూ బి.కామ్ చదవాలని నిశ్చయించుకున్నారు. కొడుకు సి.ఏ చేద్దామనుకుంటున్నాడు. మొత్తం మీద ‘చదివితే ఎదుగుతావు’ అని సందేశం ఇస్తున్నారు ఈ ముగ్గురు. -
ఓపెన్ విద్యార్థులందరూ పాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహిస్తున్న దూరవిద్యా ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ విద్యా ర్థులంతా పాస్ అయ్యారు. అందరికీ ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్ మార్కు లను ఇచ్చి ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రారామచంద్రన్ శుక్రవారం జీవో 12ను జారీ చేశారు. కరోనా కారణంగా గత ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించాల్సిన ఓపెన్ స్కూల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో విద్యాశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయిం తీసుకుంది. పరీక్షలు రాసేందుకు అర్హత కలిగిన విద్యార్థులందరికీ కనీస పాస్ మార్కులను ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ప్రకటించింది. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్లో అదనపు సబ్జెక్టు, ప్రాక్టికల్స్‌లోనూ 35 శాతం మార్కులతో పాసైనట్టేనని పేర్కొంది. ప్రస్తుతం కనీస పాస్ మార్కులతో పాసైన విద్యార్థులు తమ మార్కులను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ స్కూల్ సొసైటీ తదుపరి నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు హాజరుకావచ్చని వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 75 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. అందులో ఎస్సెస్సీ విద్యార్థులు 43 వేల మంది, ఇంటర్మీడియట్ విద్యార్థులు 32 వేల మంది ఉన్నట్లు తెలిపారు. కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
పాసుల కోసం పడిగాపులు
గచ్చిబౌలి: స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పాస్‌ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు పోలీస్ స్టేషన్లకు పోటెత్తుతున్నారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వందల సంఖ్యలో వలస కూలీలు తరలి రావడంతో పోలీసులు వారిని ఫంక్షన్ హాళ్లలో కూర్చోబెట్టి పాస్‌లు జారీ చేశారు. లాక్డౌన్ కారణంగా నగరంలో చిక్కుకు పోయిన బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్ఘడ్, ఒడిషా, వెస్ట్‌బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు మంగళవారం ఉదయం 8 గంటలకే పీఎస్‌లకు చేరుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు సంధ్య కన్వెన్షన్‌లో, మాదాపూర్ పోలీసులు హైటెక్స్‌లో, రాయదుర్గం పోలీసులు జేఆర్సీ కన్వెన్షన్‌లో, మియాపూర్ పోలీసులు విశ్వనాథ్ గార్డెన్, చందానగర్ పోలీసులు బీకే రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో పాస్‌లు జారీ చేశారు. ఒక్క హైటెక్స్‌కు దాదాపు నాలుగు వేల మంది తరలిరాగా మియాపూర్ విశ్వనాథ్ గార్డెన్లో 2 వేల మందికి పైగా వచ్చారు. గచ్చిబౌలి, రాయదుర్గం పీఎస్‌ల వద్ద రెండువేల మంది బారు లు తీరారు. మాదాపూర్ సబ్‌డివిజన్ పరిధిలో ఒక్కరోజే 5వేల మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నట్లు ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు వివరించారు. మీర్‌చౌక్ డివిజన్లో.. యాకుత్‌పురా: వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మీర్‌చౌక్ డివిజన్ పోలీసులు చర్యలు చేపట్టారు. పేర్లు నమోదు చేసుకున్నారు. మీర్‌చౌక్ ఏసీపీ ఆనంద్ కథనం మేరకు... ఇప్పటి వరకు డివిజన్లోని డబీర్‌పురాలో 440, మొఘల్‌పురాలో 450, మీర్చౌక్లో 450, రెయిన్‌బజార్ 460 మంది వలస కార్మికులను గుర్తించామన్నారు. ఇందులో 56 మందిని సోమవారం రాత్రి ప్రత్యేక రైలులో పంపినట్లు తెలిపారు. ఎండలోనే నిరీక్షణ.. రహమత్‌నగర్: ఇతర రాష్టాల వలస కూలీలు పాస్‌లు తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ధృవీకరణ పత్రాలతో మంగళవారం స్థానిక పోలీస్ అవుట్ పోస్టుకు వందలాంది మంది చేరుకోవడంతో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక ఫంక్ష హాల్లో దరఖ>స్తులు తీసుకుంటామని చెప్పడంతో వారు ఎండను సైతం లెక్క చేయకండా జాతీయ రహదారిపై పడిగాపులు కాశారు. పాఠశాలలో కౌంటర్ ... గోల్కొండ: స్వస్థలాలకు తిరిగి వెళ్లదలచుకున్న వలస కూలీలు పేర్లు నమోదు చేసుకునేందుకు గోల్కొండ ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. టోలీచౌకీ, గోల్కొండ, షేక్‌పేట్ తదితర ప్రాంతాలకు 2 వేల మంది తరలివచ్చారు. కుత్బుల్లాపూర్ పరిధిలో.. కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేష పరిధిలో భవన నిర్మాణ పనులు చేస్తున్న వలస కూలీలు పోలీస్‌స్టేషన్ ఎదుట పాస్‌లు తీసుకునేందుకు క్యూ కట్టారు. మా ఊరికి పంపించండి సారూ.. విజయనగర్‌కాలనీ: ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న వలస కూలీలు తమను స్వస్థలాలకు పంపించాలని కోరారు. సోమవారం రాత్రి 110 మందిని బిహార్‌కు పంపించినట్లు ఇన్స్పెక్టర్ నాగం రవీందర్ తెలిపారు. అలాగే మాసబ్‌ట్యాంక్ చాచా నెహ్రూ పార్కు వద్ద వలస కూలీల వివరాలు నమోదు చేసుకుంటున్నట్లు హుమాయూన్‌నగర్ ఇన్స్పెక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు. ఐడీ నంబర్ ఆధారంగా.. ముషీరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతి కోసం మంగళవారం ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో అనుమతి కోసం వచ్చిన వలస కార్మికుల వివరాలను సేకరించి వారికి ఐడీ నంబర్ కేటాయిస్తున్నారు. త్వరలో వారి ఫోన్లకు రైలు ఎప్పుడు, ఎన్ని గంటలకు బయలుదేరే విషయంపై సమాచారం వస్తుందని, అప్పటి వరకు వేచిచూడాలని ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం సుమారు 2 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. -
పాస్‌ల పంచాయితీ!
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ నేపథ్యంలో వేర్వేరు రాష్ట్రాలు, నగరాల్లో చిక్కుకుపోయి, తమ స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న వారికి జారీ చేసే పాస్‌ల విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఇచ్చిన ఆదేశాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. వీటిలో కచ్చితంగా వన్‌వే పాస్‌లు మాత్రమే జారీ చేయాలంటూ స్పష్టంగా పేర్కొనడంతో పోలీసు విభాగం ఆ మేరకు మాత్రమే ఇస్తోంది. వీటిని చూసిన అద్దె వాహనాల డ్రైవర్లు తాము రాలేమంటూ స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా నగరంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు, టూరిస్ట్‌లు తదితరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మార్గదర్శకాలు.. లాక్డౌన్ ఫలితంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్నవారి స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతించిన ఎంహెచ్ఏ ఆ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో ఇలా తమ స్వస్థలాలకు వెళ్లాలని భావించే వారు చిక్కుకున్న ప్రాంతానికి చెందిన పోలీసులకు పాస్ కోరుతూ ఆన్లైన్లో లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలా వెళ్లాలని భావిస్తున్న వాళ్లు ఎలా వెళ్తున్నారు? ఆ వాహనం నంబర్ ఏంటి? తదితర అంశాలను దరఖాస్తులో పూరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది ముందే తేలికపాటి వాహనాలు, బస్సులు తదితరాలను అద్దెకు తీసుకుంటూ డ్రైవర్లు, యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆ తర్వాతే సదురు వాహనం నంబర్‌తో పాస్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎంహెచ్ఏ విధించిన ఓ షరతు కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ తరహా పాస్‌ల్ని కేవలం వన్‌వే మాత్రమే జారీ చేయాలని ఆ నిబంధన స్పష్టం చేస్తోంది. ప్రయాణికుల్ని ఆయా రాష్ట్రాల్లో దింపిన తర్వాత వాహనంతో సహా డ్రైవర్లు తిరిగి రావడానికి అక్కడ మళ్లీ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటోంది. దీంతో వన్ వే పాస్‌లు మాత్రమే జారీ అవుతున్నాయి. నగర పోలీసులు మాత్రం ఇలా పాస్ ఇప్పించే బాధ్యత వాహనాన్ని బాడుగకు తీసుకువెళ్లే వారిదేనని స్పష్టం చేస్తున్నారు. వాహనం దిగిన తర్వాత ఆ ప్రయాణికుడు ఎంత వరకు బాధ్యత తీసుకుంటాడనేది చెప్పలేకపోతున్నారు. ఈ కారణంగానే పాస్ చూసిన అనేక మంది డ్రైవర్లు, యజమానులు కిరాయికి రామంటూ రద్దు చేసుకుంటున్నారు. ఫలితంగా పాస్ లభించినా ఆయా రాష్ట్రాలకు చెందిన వారు మాత్రం ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. నిబంధనల ఆధారంగా.. కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం ముందుగా ఆయా రాష్ట్ర, నగరాల పోలీసులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని రిటర్న్ పాస్ పొందిన తర్వాతే తమ ప్రాంతం నుంచి వెళ్లడానికి పాస్‌లు జారీ చేస్తున్నాయి. నగరానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లోని నిబంధనల ఆధారంగా పాస్‌లు జారీ చేస్తున్నాం. మూడు కమిషనరేట్లలోనూ కలిపి మూడు రోజుల్లో 14 వేల పాస్‌లు జారీ చేశాం. వీటిలో కేవలం వెయ్యి మాత్రమే టు వే పాస్‌లు. మెడికల్ ఎమర్జెన్సీ, డెలివరీ, డెత్ వంటి అంశాల్లోనే టు వే పాస్ ఇస్తున్నాం. మిగిలిన వారు వన్ వే పాస్ ఇవ్వడంవల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవమే. వీటిని ఎంహెచ్ఏ దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఏవైనా సవరణలు వస్తే అందుకు అనుగుణంగా మార్పు చేర్పులు చేస్తాం’ అన్నారు. ఇలా వన్ వే పాస్‌లు జారీ చేయడం వల్ల దోపిడీని అరికట్టడానికి, ఇతర రాష్ట్రాల్లోని వారికి రవాణా సౌకర్యం కల్పించడానికి కూడా దోహదపడుతోందని అధికారులు చెబుతున్నారు. టు వే పాస్ దుర్వినియోగం..? నగరంలో ఉన్న ఇతర రాష్ట్రాల వారిని తీసుకువెళ్లి దింపి, తిరిగి రావడానికి ఒకేసారి టు వే పాస్ ఇస్తే దుర్వినియోగానికి అవకాశం ఉంటుంది. దీని ఆధారంగా ప్రయాణికులను అక్కడ దింíపిన తర్వాత.. అక్కడ ఉన్న వారు ఇక్కడకు రావడానికి వాహన డ్రైవర్‌ను సంప్రదిస్తే భారీ మొత్తం డిమాండ్ చేసే ప్రమాదం ఉంటుందని వివరిస్తున్నారు. అలా కాకుండా ఇక్కడకు తిరిగి రావడానికి అక్కడ పాస్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆయా అధికారులు ఆ వాహనం వివరాలు తెలుస్తాయి. దీంతో అప్పటికే ఇక్కడకు రావడానికి దరఖాస్తు చేసుకున్న వారికి వాహనం వివరాలు అందించి, దోపిడీ లేకుండా రావడానికి అవకాశం కల్పించవచ్చని పేర్కొంటున్నారు. గుజరాత్లో చిక్కుకున్న కొందరు ప్రయాణికుల్ని తీసుకుని ఓ బస్సు సోమవారం నగరానికి చేరుకుంది. ఈ డ్రైవర్ తిరిగి వెళ్లడం కోసం ఇక్కడ పోలీసులకు పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు నగరం నుంచి గుజరాత్‌కు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ బస్సు వివరాలు తెలిపారు. వాళ్లు ఇదే వాహనం బుక్ చేసుకుని తిరిగి వెళ్లడానికి అవకాశం కల్పించారు. ఇలాగే ఇతర ప్రాంతాల్లోనూ జరిగే ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ వేగవంతం.. మరోవైపు వలస కార్మికుల వివరాలు ‘టీఎస్ పోలీసు పాస్ మేనేజ్మెంట్’ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియను పోలీసులు వేగవంతం చేశారు. మంగళవారం నాటికి మూడు కమిషనరేట్ల నుంచి దాదాపు 50 వేల మంది వలస కూలీల వివరాలు ఈ యాప్‌లో రిజిస్టర్ అయ్యాయి. ఠాణాల్లో, కూలీలు ఉండే ప్రాంతాలతో పాటు స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాళ్లలోనూ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. వలస కార్మికుల్ని తరలించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఒక్కో రైలులోనూ గరిష్టంగా 1,250 మందిని తరలిస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ సమయంలోనే పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన నగరంలోనే ఉండేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము చేస్తున్న ప్రయత్నాలతో 30 శాతం మంది ఇక్కడే ఉండటానికి ఆసక్తి కనబరుస్తున్నారని ఓ అధికారి తెలిపారు. -
కేబీఆర్ పార్కు పాస్‌ల ధర పెంపు
బంజారాహిల్స్: నగరంలోని కేబీఆర్ పార్కు వార్షిక పాస్‌ల రెన్యువల్ తేదీని ప్రకటించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు వాకర్లు తమ వార్షిక ప్రవేశ పాసులను పార్కు వెబ్సైట్లో రెన్యువల్ చేసుకోవాలని డీఎఫ్ఓ విజ్ఞప్తి చేశారు. కాగా.. 2019–20 సంవత్సరానికి వార్షిక పాస్‌లతో పాటు అన్ని కేటగిరీల పాసుల ధరలను పెంచారు. గతేడాది వార్షిక పాస్ రుసుం రూ.1,850 ఉండగా ఈసారి రూ.2,035కు పెంచారు. అలాగే సీనియర్ సిటిజన్ల పాస్ గతేడాది రూ.1,200 ఉండగా దాన్ని రూ.1,320కి పెంచారు. ఇక నెలవారీ పాసులను సైతం రూ.550 చేశారు. రోజువారీ ఎంట్రీ టికెట్ ధర రూ.25 నుంచి రూ.30కి, పిల్లలకు రూ.10 నుంచి రూ.15కు పెరిగాయి. -
ఉదయం పాస్.. సాయంత్రానికి ఫెయిల్
కదిరి: ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విద్యార్థులను అయోమయంలో పడేశాయి. సోమవారం డిగ్రీ చివరి సంవత్సరం ఫలితాలు విడుదల కాగా ఉదయం ఉత్తీర్ణులైనట్లు చూపించిన ఫలితాలు... సాయంత్రంలోపు మారిపోయి ఫెయిల్ అయినట్లు చూపించాయి. ఇందుకు నిరసనగా డిగ్రీ విద్యార్థులు స్థానిక వేమారెడ్డి కూడిలి సమీపంలో కదిరి–హిందూపురం రహదారిపై రాత్రి సమయంలో గంటపాటు బైఠాయించారు. అదే సమయంలో అశోక్, అజయ్, ప్రతీష్, రవితేజ, త్యాగి, శ్రీకాంత్ అనే ఐదురుగు డిగ్రీ విద్యార్థులు అక్కడే సమీపంలోని సెల్ టవర్ ఎక్కి దూకేస్తామంటూ గట్టిగా కేకలు వేశారు. విద్యార్థులు రాస్తారోకోతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ హేమంత్ కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. అక్కడి నుంచి టవర్ దగ్గరకు చేరుకుని టవర్‌పైకి ఎక్కిన విద్యార్థులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి వారు దిగేలా చేశారు. -
సర్పంచులకు ‘పది’ ముప్పు
సాక్షి, కడప, బద్వేలు : స్థానిక సంస్థల్లో షాడో పెత్తనానికి చెక్ పడనుంది. అక్షరజ్ఞానం లేని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను నడిపించే తెర వెనుక నాయకుల పెత్తనానికి తెర పడే సమయం వచ్చింది. కనీసం పదో తరగగి పాసైతే కాని పంచాయతీ సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే నిబంధనను తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయమై తీవ్ర కసరత్తు చేసింది. ఎటువంటి విద్యార్హత లేకున్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి ఇతర ప్రజాప్రతినిధులకు లేని ప్రత్యేకాధికారమైన చెక్ పవర్ గ్రామ సర్పంచులకు ఉంది. అదే విధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలుగా గెలిచిన పలువురు సభ్యుల్లో కనీస విద్యార్హత ఉండటంలేదు.వీరిని స్థానిక షాడో నేతలు తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారనేది బహిరంగ సత్యం. దీంతో పాటు తమ చేతుల్లో ఉంచుకునేందుకు చాలా పార్టీల నేతలు అక్షరజ్ఞానం లేని, సామాజిక అంశాల పట్ల అవగాహన లేని వారిని పోటీల్లోకి దింపడం, గెలిచిన తర్వాత వారిని డమ్మీగా మార్చి పెత్తనాన్ని తమ చేతుల్లోకి చేస్తున్నారు. దీంతో పాటు అభివృద్ధి ఫలాల నిధులు మింగేయడం, ఎదురు తిరిగిన సర్పంచుల చెక్‌పవర్‌ను అడ్డదారిలో తొలగించడం నిత్యం సాధారణంగా మారాయి. ఇలాంటి సమస్యలన్నింటిని అడ్డుకునేందుకు పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత ఉండాలని కేంద్రం ప్రతిపాదించింది. హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేసింది. మిగతా రాష్ట్రాల కంటే అక్కడే స్థానిక సంస్థల పాలన మెరుగ్గా ఉండటాన్ని గమనించిన లోక్‌సభ అంచనాల కమిటీ ఈ అంశంపై అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా కనీస విద్యార్హత ఉండాలని ప్రతిపాదిస్తూ కేంద్రం నివేదిక సిద్ధం చేసి ఆయా రాష్ట్రాలకు నివేదిక కోరుతూ లేఖ రాసింది. నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసినా సరైన నిర్ణయం తీసుసుకోవాలని పలుమార్లు లేఖలు రాసింది. మన రాష్ట్రం కూడా సుముఖత వ్యక్తం చేయడంతో పాటు తగిన సూచనలు చేయాలంటూ పంచాయతీరాజ్ కార్యాలయానికి సూచించింది. అక్కడి అధికారులు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో పాటు ఆ నివేదికను రాష్ట్రానికి అందించే పనిలో ఉన్నారు. నలిగిపోతున్న సర్పంచులు జిల్లాలోని 50 మండలాలలో 795 పంచాయతీలు ఉన్నాయి. దాదాపు 1000 ఎంపీటీసీలు, 50 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. సర్పంచుల్లో దాదాపు 450కిపైగా అభ్యర్థులు పదో తరగతి కంటే తక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు. ఎంపీటీసీల్లో 600 మంది వరకు ఇదే పరిస్థితి. జడ్పీటీసీల్లో 25 మంది విద్యార్హత పదిలోపే. వీటిలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వందల సంఖ్యలో ఉన్నారు. రిజర్వేషన్లు ఉండటంతో మహిళలు కూడా పోటీ చేసి గెలుపొందారు. వీరిలో చాలామందికి చదువు లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పని చేయించుకునే సామర్థ్యం ఉండదు. చాలామంది స్థానిక బడా నేతల చేతల్లో నలిగిపోతున్నారు. ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకున్నామని పేర్కొంటూ వారి స్థానంలో షాడో పెత్తనం సాగిస్తున్నారు. సర్పంచుల దగ్గర నుంచి జడ్పీ ఛైర్మన్ వరకు ఇలా కొనసాగుతుందంటే ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం జిల్లాలో సగం మంది స్థానిక ప్రజాప్రతినిదుల బడా నేతల పెత్తనంతో విలవిలలాడుతున్నారు. కాస్తో కూస్తో పెత్తందారుల అక్రమాలను తెలుసుకుని అడ్డం తిరిగితే చెక్ పవర్ లేకుండా చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి అర్హత తప్పనిసరైతే చాలా గ్రామ పంచాయతీల్లో పాలన మెరుగు అవడమే కావ అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంది. -
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
–డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి పాములపాడు: 10వ తరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. గురువారం స్థానిక ఏఎన్ఆర్ జిల్లా పరిషత్ హైస్కూలు, తుమ్మలూరు జెడ్పీ హైస్కూలును తనిఖీ చేశారు. విద్యార్థుల చేత పాఠాలు చదివించారు. ఓ విద్యార్థిని తెలుగు చదవకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల తరువాత మళ్లీ వస్తానని, పిల్లలు చదవకపోతే చర్యలు తప్పవని ఉపాధ్యాయులను హెచ్చరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వారం మ«ధ్యాహ్న భోజనంలో 3 గుడ్లు ఇవ్వాలన్నారు. ఇందుకు బిల్లులు సైతం పెంచినట్లు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. మార్చి 7నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ పెంచేందుకు çప్రతి మండలం నుంచి తెలుగు, ఆంగ్లమాధ్యమాల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులను సబ్జెక్టుల వారిగా 7గురిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వీరి పర్యవేక్షణలో విద్యార్థులను తీర్చి దిద్ది అధిక చి మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో 279 సక్సెస్ స్కూళ్లు, 35 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయన్నారు. విద్యార్థి తల్లితండ్రులు కోరితే ఆ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ సుమతి, ఎంఈఓ బాలాజీనాయక్, హెచ్ఎం పుల్లారెడ్డి ఉన్నారు. -
చనిపోయినా సరిహద్దు భద్రత..!
న్యూ ఢిల్లీః మరణించినా ఆ సిపాయి కర్తవ్యం కొనసాగుతూనే ఉంది. భారత సైనిక దళంలో చేరి, హిమాలయపర్వతాల్లోని ఎత్తైన ప్రాంతమైన.. భారత్-చైనా సరిహద్దు నాతుల్లాలో బాధ్యతలను నిర్వహిస్తూ... దురదృష్ట వశాత్తు అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితేనేం ఇప్పటికీ అతని ఆత్మ అక్కడ సరిహద్దు కాపలా బాధ్యతలను చేపడుతున్నట్లు స్థానికులే కాదు... తోటి సైనికులూ నమ్ముతారు. విచిత్రంగా ఉంది కదూ... విదేశీ ఆక్రమణ దారులనుంచి మాతృభూమిని కాపాడటంలో భారత సైనికుల త్యాగం మరువలేనిది. అయితే 1968 లో మృతి చెందిన బాబా హర్బజన్ సింగ్.. ఇప్పటికీ సరిహద్దుల్లో తన బాధ్యతలు ఆత్మ రూపంలో నిర్వహిస్తున్నట్లుగా అంతా విశ్వసిస్తారు. సిక్కింలో భారీ వరదల కారణంగా సైనికులను ఇరత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్న హర్బజన్..వరద బీభత్సానికి దురదృష్ట వశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. మాతృభూమి రక్షణలో భాగంగా విధినిర్వహణలోనే ప్రాణాలు వదిలాడు. తీవ్రమైన ప్రవాహంతో మూడు రోజులుదాకా అతడి శరీరం దొరకలేదు. ఇంతలో క్యాంపులోని ఓ సిపాయికి కలలో కనిపించిన హర్బజన్.. తన శరీరం ఉన్న ప్రాంతాన్ని సూచించాడని, అక్కడే తనకు సమాధి కడితే సరిహద్దులో బాధ్యతలను కొనసాగిస్తానని చెప్పినట్లు కథనం. అయితే సైనికుడి కలలో చెప్పినట్లుగానే చోక్యాచో ప్రాంతంలో హర్బజన్ శరీరం దొరకడంతో స్థానికులే కాక సైనికులూ విషయాన్ని నమ్మారు. అదే ప్రాంతంలో పూర్తి మిలటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి, సమాధిని కూడా కట్టారు. అతడు చనిపోయినా అక్కడే అతడి ఆత్మ సరిహద్దు భద్రతను కాపాడుతుందంటూ జనం నేటికీ నమ్ముతున్నారు. పంజాబ్ రెజిమెంట్ లోని 23వ బెటాలియన్ కు చెందిన హర్బజన్.. దేశంపై సిపాయిలకుండే ప్రేమను నిరూపించాడు. భారత సరిహద్దు ప్రాంతాల భద్రతను కాపాడే నిజమైన సైనికుడుగా మిగిలిపోయాడు. హర్బజన్ విషయంలో ఆర్మీ కూడా మనోభావాలను, నమ్మకాలను గౌరవించినట్లుగా కనిపిస్తుంది. హర్బజన్ ను హానరరీ కెప్టెన్ గా గుర్తించి, నేటికీ జీతాన్ని ప్రతినెలా హర్బజన్ కుటుంబానికి అందజేస్తుంది. అంతేకాదు అమర సైనికుడి గౌరవార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 ను సెలవుదినంగా పాటిస్తుంది. కొన్నేళ్ళ క్రితం వరకూ.. (హర్బజన్ అధికారిక విరమణ తేదీ వరకూ) ఆయన వాడిన వస్తువులను ప్యాక్ చేసి, సిపాయిలు.. హర్బజన్ స్వగ్రామానికి తీసుకెళ్ళి తిరిగి తీసుకురావడం నియమంగా పాటించారు. ఇటీవల భారత చైనా సరిహద్దు ప్రాంతమైన నాతుల్లాను సాధారణ పౌరుల సందర్శనా స్థలంగా కూడా మార్చారు. భారత్ చైనా సరిహద్దుల్లో ఇరుదేశాలూ నిర్వహించే శాంతి సమావేశాల్లో చైనా సైనిక అధికారులు హర్బజన్ సింగ్ కోసం ఓ కుర్చీవేసి గౌరవ సూచకంగా దాన్ని ఖాళీగా ఉంచడం కూడా కనిపిస్తుంది. కొందరు స్థానికులు హర్బజన్ సమాధిని దేవాలయంగా భావిస్తారు. తమ ప్రాంతాన్ని దేశాన్ని కాపాడమంటూ ప్రార్థిస్తుంటారు. -
మా పుట్టి మునుగుతుంది
పట్టాదార్ పాస్ పుస్తకాల రద్దుపై రైతుల బెంబేలు జీఓ నం: 271పై వ్యక్తమవుతున్న తీవ్ర అభ్యంతరం వెబ్‌ల్యాండ్ వివరాల్లో 60 శాతం తప్పులే.. యాజమాన్య హక్కులతో పాటు రుణసదుపాయానికీ భంగకరమని ఆందోళన నేడు అమలాపురంలో అఖిలపక్ష, రైతు సంఘాల ప్రతినిధులు సమావేశం lచర్చల అనంతరం భవిష్యత్ కార్యాచరణ భూమిపై యాజమాన్య హక్కును కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పట్టాదార్ పాస్ పుస్తకాలను ప్రవేశపెడితే..ఆయన వారసుడినని చెప్పుకొనే చంద్రబాబు వాటిని రద్దు చేయడం రైతులకు ఆగ్రహం కలిగిస్తోంది. పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిలో అనుమానాల్నీ, ఆందోళననూ రేకెత్తిస్తోంది. భూమిపై హక్కులు కోల్పోతామని, బ్యాంకు రుణాలు కూడా రావని బెంబేలు పడుతున్నారు. అమలాపురం : పట్టాదార్ పాస్ పుస్తకాలను రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లా రైతాంగం మండిపడుతోంది. ఆందోళనపథంలో అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే అమలాపురం మండలం ఈదరపల్లి జనహిత భవనంలో గురువారం అఖిల పక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. కాగిత రహితపాలనలో భాగంగా ప్రభుత్వం ఈ–పాస్ విధానం ప్రవేశ పెట్టింది. ఇప్పుడున్న పాస్ పుస్తకాలను రద్దు చేస్తూ వెబ్ ల్యాండ్‌లో ఉంచిన 1బి నమోదుల ఆధారంగా భూ యాజమాన్య హక్కుల బదలాయింపులు, రుణాల మంజూరు చేయాలని జీవో నం : 271 విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 1బిలో నమోదు కాని అనేక మార్పులు పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా రైతులు రుణాలు పొందడం, భూముల క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఈ–పాస్ విధానం ప్రవేశపెట్టాలనుకున్న ప్రభుత్వం అందుకు తగిన విధంగా భూములను రీ సర్వే చేయాలి. నిజమైన భూమి యజమానులను గుర్తించి వెబ్‌ల్యాండ్‌లో పక్కాగా నమోదు చేయాలి. ఇప్పటి వరకూ వెబ్‌ల్యాండ్‌లో నమోదైన దానిలో 40 శాతం అసలైన భూమి యజమానులు ఉండగా మిగిలిన 60 శాతం తప్పుల తడకేనని రైతుల సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. వీటిని సవరించకుండా పాస్ పుస్తకాలు రద్దు చేస్తే తాము మునిగిపోతామని రైతులు వాపోతున్నారు. తాతలు, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు వారసత్వంగా పొంది చాలా మంది పాస్ పుస్తకాలు చేయించుకున్నారు. అయితే 1బిలో మార్పులు చేయలేదు. ఇతర వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినవారు, పసుపుకుంకుమ కింద భూములు పొందిన కూతుళ్లు, వారి సంతానం పాస్‌పుస్తకాల మార్పులతో సరిపెట్టుకున్నారు. అవి వారి తల్లిదండ్రుల పేరుతోనే ఉన్నాయి. కొన్నిచోట్ల మూడెకరాలు ఉంటే 1బిలో ఒక ఎకరం నమోదయింది. మిగిలిన రెండు ఎకరాలు మరొకరి పేరు మీద ఉన్నాయి. కొన్నిచోట్ల దేవాదాయశాఖ బహిరంగం వేలం ద్వారా విక్రయించిన భూములు కూడా పాస్‌పుస్తకాలు మారాయి కాని 1బిలో నమోదు కాలేదు. వీటిని సరిదిద్దకుండా 1బి ఆధారంగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చే సేశారు. ఈ తప్పులను సరిదిద్దాలంటే చాలా వ్యయప్రయాసలకు లోనుకావాల్సి ఉంది. ఇప్పుడున్న భూ యజమానులకు భూమి చెందేలా చేయాలంటే రైతుల దస్తావేజులు తనిఖీ చేయాలి. అవసరమైన సందర్భాలలో రీ సర్వే కూడా చేయించాలి. ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థలో సిబ్బంది కొరత, మరీ ముఖ్యంగా సర్వేయర్ల కొరత వల్ల ఇది అసాధ్యమని రైతులు అంటున్నారు. ఏకపక్షంగా రద్దు చేస్తే ఎన్నో అనర్థాలు.. ఈ మార్పులు చేయకుండా పాస్ పుస్తకాలను ఏకపక్షంగా రద్దు చేస్తే పలు అనర్థాలు జరిగే అవకాశముందన్నది రైతులు ప్రధాన అభ్యంతరం. 1బిలో ఉన్నవారు నేరుగా విక్రయాలు చేస్తే అసలు భూ యజమానులు నష్టపోతారని వారు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా బ్యాంకు రుణాలు రావని ఆవేదన చెందుతున్నారు. అమలాపురంలో అఖిలపక్షాలతో సమావేశం కానున్న రైతు సంఘాల ప్రతినిధులు చర్చించిన ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. -
టెన్త్ సప్లమెంటరీ ఉత్తీర్ణత 82.03 శాతం
–రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం నల్లగొండ : పదో తరగతి సప్లమెంటరీ ఫలితాల్లో నల్లగొండ జిల్లా విద్యార్థులు 82.03 ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. సప్లమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 8,225 మంది పరీక్షలు రాయగా 6,747 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 4,438 మందికిగాను 3,550 (79.99శాతం), బాలికలు 3,787 మందికిగాను 3,197 (84.42శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. -
ఫిట్నెస్ పాస్ తో కోరుకున్నచోట వ్యాయామం!
వ్యాయామం కోసం ఫిట్ నెస్ సెంటర్ కు దూర ప్రాంతాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? ఇక మీదట అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఫిట్నెస్ పాస్ లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయ్. నెలవారీ సభ్యత్వం కట్టి పాస్ పొందితే చాలు... ఓ ఆన్ లైన్ పోర్టల్ ఈ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు ఫిట్నెస్ సెంటర్ లు, జిమ్ లు అందుబాటులో ఉండేట్టు ప్రత్యేక సౌకర్యంతో వర్క్ అవుట్ ఆప్షన్లు ఎంచుకునేందుకు వీలు కల్పించింది. ఇప్పుడు కేవలం ఆన్ లైన్లో నెలవారీ పాస్ తీసుకుంటే చాలు.. ఢిల్లీ ప్రజలు వారనుకున్న చోట వ్యాయామం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం రాజధాని నగరంలో ఫిట్నెస్ పాస్ ఆన్ లైన్ పోర్టల్.. పాస్ ల సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ ను నగరంలోని వెయ్యి జిమ్ లు, స్టూడియోల్లోను వినియోగించుకొనే అవకాశంతోపాటు... లక్షకు పైగా రోజువారీ వ్యాయామం చేసుకునే ప్రత్యేక ఆప్షన్లను అందిస్తోంది. వినియోగదారులు నెలకు కేవలం రూ.999 చెల్లించి పాస్ ను పొందితే జుంబా, పిలేట్స్, ఏరోబిక్స్, ఎంఎంఏ, క్రాస్ ఫిట్, సర్క్యూట్ శిక్షణ, కిక్‌బాక్సింగ్, స్పిన్నింగ్, బూట్ క్యాంప్ వంటి మరిన్ని వ్యాయామాలను చేసుకునే అవకాశం ఉంది. భారతదేశంలో ఎంతోమంది వ్యాయామం చేయాలని కోరుకుంటున్నా అందుకు తగ్గ అవకాశాలు, సమయం లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకొంటున్నారు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొన్న ఫిట్ పాస్ సంస్థ.. అనుకూల ధర, సౌలభ్యంతోపాటు దీర్ఘకాలిక ఒప్పందాలతో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు అక్షయ్ వర్మ తెలిపారు. ప్రస్తుత మార్కెట్ అసమానతలను తొలగించి, సూపర్ ఫిట్నెస్ ను భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ఈ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా జిమ్ లు , ఫిట్నెస్ స్టూడియోల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కస్టమర్లను పెంచేందుకు కూడ తాము సహకరించినట్లు అవుతుందని వర్మ చెప్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా లాభాలను విస్తరించేందుకు, కస్టమర్ల అనుభవాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ యాబ్స్, సెక్సీకాల్వ్స్, డోలే షోలే, 36-24-36, పెక్స్ ఆఫ్ స్టీల్, బికిని బాడ్ వంటి మొత్తం ఆరు యాజమాన్య ఉత్పత్తులను ఫిట్నెస్ పాస్ ద్వారా పోర్టల్ అందిస్తుంది. దీంతోపాటు వినియోగదారులు ప్రణాళిక ప్రకారం ఫిట్నెస్ సాధించేందుకు సహకరించే డైట్ ప్లాన్ తో కూడిన వర్కవుట్ గైడ్ ను కూడా అందిస్తున్నారు. త్వరలో ఫిట్ పాస్ సేవలను బెంగళూరు, పుణె, ముంబై, హైదరాబాద్, చండీగఢ్ నగరాల్లో కూడ విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. -
పరీక్ష రాసింది 12,000.. పాసైంది 20,000
ఆగ్రా: బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ బీఈడీ పరీక్షల ఫలితాలను ప్రకటించడానికి ఉపక్రమించిన అధికారులు తమ చేతిలో ఉన్న గణాంకాలను చూసి షాక్‌కు గురయ్యారు. ఆగ్రాలోని ఈ యూనివర్సిటీ తరపున మొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు 12,800 మంది ఉన్నట్లు తొలుత తెలిపిన అధికారులు తీరా ఫలితాలను ప్రకటించే సమయానికి 20,089 మంది పాసైనట్లు గుర్తించారు. దీనిపై యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ మహమ్మద్ ముజమ్ముల్ విచారణకు ఆదేశించి, చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేశారు. యూనివర్సిటీ బీఈడీ పరీక్షల ఫలితాల లిస్టును తయారు చేయడానికి ఓ ప్రైవేట్ ఏజెన్సీని నియమించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అనుమతించడం వలనే ఈ గందరగోళం ఏర్పడిందని భావిస్తున్నారు. పరీక్షలు మొదలయ్యే రోజున కూడా కొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కళాశాలలు తమకు కేటాయించిన సీట్లకు మించి విద్యార్థులను చేర్చుకున్నట్లు గుర్తించిన అధికారులు.. కళాశాలల యాజమాన్యాన్ని విద్యార్థుల లిస్టును తీసుకురావాల్సిందిగా ఆదేశించారు.