మహా అయితే ఇన్ని దేశాలు తిరిగొచ్చాను అని చెబుతుంటారు. లేదంటే సుమారు లక్షల మైళ్ల వరకు వెళ్లి ఉండొచ్చని అంటారు. కానీ, నిరతరం ప్రయాణించడం మాత్రం అసాధ్యమే. అది కూడా కొద్ది మొత్తం డబ్బుతోనే.. దాదాపు ఆరు సార్లు చంద్రుని పర్యటనకి వెళ్లడానికి పట్టేంత దురాన్ని చుట్టి రావడం అంటే నమ్మశక్యం కానీ విషయమే! కానీ అది నిజం అతను అంత దురాన్ని విమానంలో చుట్టొచ్చాడు. కేవలం ఆకాశం, ఎయిర్‌పోర్ట్‌లలోనే గడుపుతూ.. నిర్విరామంగా ప్రయాణించాడు. ఆ వ్యక్తే యూఎస్‌కి చెందిన 69 ఏళ్ల టామ్ స్టుకర్.
అతను 1999లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కి సుమారు రూ. 2 కోట్లు చెల్లించి జీవితకాల ఎయిర్ పాస్‌ని పొందాడు. దీన్ని తాను పెట్టిన అత్యుత్తమమైన పెట్టుబడిగా స్టుకర్ చెప్పుకుంటాడు. 33 ఏళ్ల క్రితం తీసుకున్న ఈ పాస్‌తో కనీసం 23 మిలియన్ల కి.మీ. దూరం ప్రయాణిస్తే చాలు అనుకున్నాడు. గానీ ఏకంగా 37 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణిస్తానని ఊహించలేదు. ఈ జర్నీలో అతను కొన్ని సమయాల్లో సుమారు 12 రోజుల వరకు బెడ్‌పై పడుకోకుండా అలానే ప్రయాణించినట్లు తెలిపాడు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయినప్పుడూ తప్ప మిగతా అన్ని వేళలా ఆకాశంలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
ఈ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ హోటల్ సూట్‌లు, క్రిస్ట్ క్రూయిజ్‌లు వంటి వాటిల్లో కొన్ని వారాల పాటు ‘ఏక్ దిన్ సుల్తాన్’ మాదిరి భోగాలు అనుభవించాడు. మొత్తం 1.46 మిలియన్ల మైళ్ల దురం పర్యటించేందుకు సుమారు 373 విమానాల్లో ప్రయాణించినట్లు చెప్పాడు. నిజానికి అతడు గనుక ఈ పాస్ బుక్ తీసుకోనట్లయితే ఇంత దూరం పర్యటించినందుకు ఆ ఫ్లైట్‌లకి సుమారు రూ. 20 కోట్లు ఖర్చయ్యేవి.
అదీగాక ఇన్ని మైళ్ల దూరం జర్నీ చేసేందుకు అన్ని విమానాలను ప్రతిసారి బుక్‌చేసుకోవడం కూడా కష్టమే కానీ ఈ పాస్ ఉండటం కారణంగానే అతను ఈజీగా అన్ని విమానాల్లో ప్రయాణించగలిగాడు. అతను 2019లో ఇంత దూరం పర్యటించాడు. అతను పర్యటించిన దూరం ఆరుసార్లు చంద్రుని పర్యటనకు వెళ్లిన దానితో సమానమని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అంతేగాదు చరిత్రలో అతని మాదిరి అంతలా పర్యటించిన వ్యక్తి మరొకరు లేరని కూడా సదరు విమానయాన సంస్థ పేర్కొనడం విశేషం.
(చదవండి: వాట్ యాన్ ఐడియా! ఆ తల్లి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment