airline
-
మరో విమానయాన సంస్థ మాయం
న్యూఢిల్లీ: చౌక విమానయాన సర్విసులను అందించిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ లిక్విడేషన్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశాలు జారీ చేసింది. గో ఫస్ట్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఆర్థిక సమస్యల కారణంగా విమాన సర్విసులు నిలిపివేసింది. 2023 మేలో సంస్థ స్వయంగా తన ఆర్థిక సమస్యలను ప్రస్తావిస్తూ స్వచ్ఛందంగా చట్టపరమైన పరిష్కార ప్రక్రియ కోసం ఎన్సీఎల్టీలో దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో 15 పేజీల తాజా ఉత్తర్వుల్లో ఎయిర్‌లైన్స్‌ను లిక్విడేట్ చేయాలని ఎన్సీఎల్టీ పేర్కొంది. సంస్థను లిక్విడేట్ చేయాలన్న క్రెడిటార్స్ కమిటీ (సీఓసీ) తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా ఎన్సీఎల్టీ ప్రస్తావించింది.17 సంవత్సరాల ప్రయాణం.. గో ఎయిర్ పేరుతో ప్రారంభమైన ఈ ఎయిర్‌లైన్ తర్వాత గో ఫస్ట్‌గా పేరు మార్చుకుంది. ఇది 17 సంవత్సరాల పాటు సర్విసులు అందించింది. 2023 మే 3న సర్వీసులు నిలిపివేసింది. ఎయిర్‌లైన్ 2005లో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తన తొలి సర్విసు ప్రారంభించి, 2018–19లో అంతర్జాతీయ సర్విసులకు శ్రీకారం చుట్టింది. 2022–23లో దాదాపు రూ.1,800 కోట్ల నష్టాన్ని నమోదుచేసుకుంది.దివాలా పరిష్కార ప్రక్రియ తీరిది... ఇన్సాల్వెన్సీ పరిష్కార ప్రక్రియలో స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్‌తో కలిసి బిజీ బీ ఎయిర్వేస్ బిడ్డింగ్ ప్రక్రియలో నిలిచింది. కాగా ఈ బిడ్డింగ్ సమయంలో డీజీసీఏ గో ఫస్ట్‌కు చెందిన 54 విమానాలను డీరిజిస్టర్ చేయడంతో రిజల్యూషన్ ప్రక్రియ అమలు కాలేదు. దీంతో తాజాగా ఎన్సీఎల్టీ లిక్విడేషన్ ఆదేశాలు జారీ ఆయ్యాయి.లిక్విడేషన్ అంటే.. ఒక కంపెనీ లిక్విడేషన్ అనేది రుణ బకాయిల్లో ఉన్న కంపెనీ ఆస్తులను అమ్మి అప్పులు తీర్చడం. మిగిలిన ఆస్తులను షేర్హోల్డర్లకు పంపిణీ చేయడం. దీన్ని కంపెనీ మూసి వేత (వైండింగ్ అప్) అని కూడా అంటారు. -
స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు.. 77 మంది మహిళా పైలట్ల నియామకం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండిగో తన ఎయిర్‌బస్, ఏటీఆర్ విమానాల కోసం 77 మంది మహిళా పైలట్లను నియమించుకుంది. కొత్తగా చేరిన వారితో కలిపి సంస్థలోని మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 800కు పెరిగింది.ఇండిగో సంస్థ నియమించుకున్న 77 మందిలో ఎయిర్‌బస్ ఫ్లీట్‌కు 72 మందిని, ఏటీఆర్ ఫ్లీట్‌కు 5 మంది మహిళా పైలట్లను విభజించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం పైలట్లలో మహిళలు సగటున 7-9 శాతంగా ఉన్నారని సంస్థ తెలిపింది. అదే ఇండిగోలోని మొత్తం పైలట్లలో మహిళా సిబ్బంది 14 శాతంగా ఉన్నారని సంస్థ ఫ్లైట్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ అషిమ్ మిత్రా పేర్కొన్నారు. మార్చి 31, 2024 నాటికి ఇండిగోలో 5,038 పైలట్లు, 9,363 క్యాబిన్ సిబ్బందితో సహా 36,860 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. సంస్థలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలు -
ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అనే మెసేజ్ వస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇలా మెసేజ్ వచ్చిన వెంటనే సిస్టమ్ రీస్టార్ట్ అవుతోంది. దీంతో సమాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించిన మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ సేవలు, ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లపై తీవ్రప్రభావం పడుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ముంబయి, దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ల్లో ఇండిగో, ఆకాశ, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు సంస్థలు ప్రకటించాయి. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనూ సర్వర్లు డౌన్ అయినట్లు తెలిసింది. హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో సిస్టమ్స్ పనిచేయకపోవడంతో మ్యానువల్ చెకింగ్ చేస్తున్నారు.హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ సాంకేతిక సమస్య కొనసాగుతున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ‘మైక్రోసాఫ్ట్ విండోస్ సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా చాలా విమానయాన సంస్థలు, విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేస్తోంది. దయచేసి ప్రయాణికులు దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ సమయంలో అందరం సహనం పాటించాలి’ అని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.డెన్వర్‌లోని ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్, ఫ్రాంటియర్ గ్రూప్ హోల్డింగ్స్ ఇంక్ యూనిట్లో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ సమస్యల కారణంగా రెండు గంటలకు పైగా విమానాలను నిలిపివేశారు. విమానయాన సంస్థ బుకింగ్, చెక్-ఇన్ సిస్టమ్‌లతో పాటు బోర్డింగ్ పాస్ యాక్సెస్‌పై తీవ్ర ప్రభావం పడినట్లు తెలిపింది.ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లుఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ ‘మాకు ఈ సమస్య గురించి తెలుసు. దాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఇంటర్నల్‌గా సమస్యకు గల కారణాన్ని గుర్తించాం’ అని వివరణ ఇచ్చింది.VIDEO | Passengers stranded at Goa airport following a technical glitch with the check-in system. Further details are awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/XAYjtLRlpJ— Press Trust of India (@PTI_News) July 19, 2024pic.twitter.com/SI8mcURA1H— IndiGo (@IndiGo6E) July 19, 2024@IndiGo6E Stuck at Dubai airport for over an hour now. Check-in servers down, no movement in sight. Frustrating start to travel. @DubaiAirports any updates? #DubaiAirport #TravelTroubles pic.twitter.com/fsU6XesWsD— Sameen (@MarketWizarddd) July 19, 2024 -
అంబానీ పెళ్లి వేడుక : టిక్ టాకర్ లగేజీ గాయబ్..చివరికి!
View this post on Instagram A post shared by jewelswithjules • julia hackman chafé (@juliachafe)అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకలు సోషల్ మీడియాలో ట్రెండిగ్‌లో నిలుస్తున్నాయి. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు దేశ విదేశాలకు చెందిన సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ వేడులకు ఉత్సాహంగా పయనమైన యుఎస్ టిక్‌టాకర్, కంటెంట్ క్రియేటర్ జూలియా చాఫ్కు వింత అనుభవం ఎదురైంది. బిలియనీర్ అంబానీ కుటుంబంపై నెలల తరబడి వీడియోలు చేసిన ఆమెకు అంబానీ ఇంట పెళ్లి సందడికి హాజరవ్వాలనేది డ్రీమ్. కానీ ఊహించని పరిస్థితి ఎదురైంది.. స్టోరీ ఏంటంటే..అంబానీ ఫ్యామిలీనుంచి అందిన ఆహ్వానం నేపథ్యంలో జూలియా చాఫ్ ఉత్సాహంగా సోమవారం ఇండియాకు బయలుదేరింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇంతలో ఏజియన్ ఎయిర్‌లైన్స్ లో నాలుగు బ్యాగుల లగేజీ మొత్తాన్ని పోగొట్టుకుంది. ఏథెన్స్లో చిక్కుకుపోయింది. దీంతో సంబంధిత ఎయిర్‌లైన్ ట్యాగ్ చేస్తూ మరో పోస్ట్ పెట్టింది. మొత్తానికి లగేజీ తిరిగి దొరకడంతో తన కలను సాకారం చేసుకుంది. అంబానీ ఇంట జరిగిన వేడుకలకు హాజరైంది. ఈ వీడియోపై ఇంటర్నెట్ సంచలనం ఓరీ స్పందించాడు. View this post on Instagram A post shared by jewelswithjules • julia hackman chafé (@juliachafe) కాగా జూలియా చాఫ్తో జెమ్ డీలర్ కూడా. అంబానీ కుటుంబానికి చెందిన డైమండ్, లగ్జరీ ఆభరణాల గురించి ఈమెకు తెలిసినంతగా ఇండియన్ మీడియాకు కూడా తెలియదట. దీనికి సంబంధించిన కంటెంట్‌తోనే జూలియా బాగా పాపులర్ అయింది. -
విమానంలో భారీ కుదుపులు.. 30 మందికి గాయాలు
విమానం గాల్లో ఉండగా కుదుపులకు లోనవడం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఓ విమానం కుదుపులకు ప్రయాణికుడు ఏకంగా ఏగిరి పైకప్పులో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన స్పెయిన్ నుంచి ఉరుగ్వే వెళ్తున్న ఓ అంతర్జాతీయ విమానంలో చోటుచేసుకుంది. ఎయిర్ యూరోపా 787-9 డ్రీమ్ లైనర్ విమానం బ్రెజిల్‌కు సమీపంలోకి వస్తుండగా గాల్లో తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పైలట్లు విమానాన్ని ఎంత అదుపు చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.అదే సమయంలో కదుపుల తీవ్రతకు ఓ ప్రయాణికుడు ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి పైకప్పులో ఉన్న హెడ్ బిన్‌లోకి దూరిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది, తోటి ప్రయాణికులు అతన్ని బయటికి తీసుకొచ్చారు. మరికొంతమంది తమ సీట్ల నుంచి దూరంగా నెట్టివేయబడ్డారు.మొత్తం 30 మంది ప్రయాణికులు ఈ కుదుపుల కారణంగా తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో బ్రెజిల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమానంలో ఉన్న ప్రయాణికులు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఇందులో ఓ వీడియోలో విమానం ఓవర్ హెడ్ బిన్లో నుంచి ఒక వ్యక్తి కాళ్లను బయటకు తీయడం కూడా కనిపించింది.Strong turbulence on an Air Europa Boeing 787-9 Dreamliner flight from Madrid to Montevideo threw passengers out of their seats, with one man stuck in an overhead compartment.A total of 30 passengers were injured, while the flight made an emergency landing in Brazil. There… pic.twitter.com/Q35hkl2VWe— Vani Mehrotra (@vani_mehrotra) July 2, 2024 -
బ్రెజిల్‌ను దాటేసిన భారత్.. డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్లో రికార్డ్
భారతదేశంలో ఏవియేషన్ రంగంలో బలమైన వృద్ధి చెందుతోంది. పది సంవత్సరాల ముందు 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎయిర్‌లైన్ మార్కెట్.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా అవతరించింది.పది సంవత్సరాల క్రితం భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో అతి చిన్న మార్కెట్‌గా ఉండేది. ఆ సమయంలో ఇండోనేషియా 4వ స్థానంలో,బ్రెజిల్ 3వ స్థానంలో, అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. అయితే ఇప్పుడు భారత్ ఎయిర్‌లైన్ మార్కెట్ భారీగా వృద్ధి చెంది బ్రెజిల్‌ను వెనక్కు నెట్టి ఇండియా ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఇండోనేషియా ఐదు, బ్రెజిల్ నాలుగు, అమెరికా రెండు, చైనా మొదటి స్థానాల్లో ఉన్నాయి. కేవలం పది సంవత్సరాల్లో భారాతదేశ ఎయిర్‌లైన్ సీట్ల వృద్ధి రేటు మొదటి ఐదు దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి పెరిగింది.గత 10 సంవత్సరాలలో ఇండిగో మార్కెట్ వాటా రెట్టింపు అయింది. 2014లో 32 శాతం ఉన్న ఇండిగో సామర్థ్యం నేడు 62 శాతానికి చేరింది. ఇండిగో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9 శాతంగా ఉందని తెలుస్తోంది. భారతదేశంలో డొమెస్టిక్ విమానాల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో భారత్ ఈ రంగంలో మరింత వృద్ధి చెందుతుంది. -
అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..!
విమానాల్లో అత్యధిక దూరం ప్రయాణించిన ఈ పెద్దమనిషి పేరు టామ్ స్టూకర్. అమెరికాలోని న్యూజెర్సీవాసి. ప్రస్తుతం ఇతడి వయసు 69 ఏళ్లు. విమాన ప్రయాణాల మీద మక్కువతో 1990లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి 2.90 లక్షల డాలర్లకు (రూ.2.41 కోట్లు) లైఫ్‌టైమ్ పాస్ తీసుకున్నాడు.ఇక అప్పటి నుంచి తోచినప్పుడల్లా విమానాల్లో దేశాదేశాలను చుట్టేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఇతగాడు విమానాల్లో ఏకంగా 20 మిలియన్ మైళ్లకు (3.21 కోట్ల కిలోమీటర్లు) పైగా ప్రయాణాలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత విరివిగా విమాన ప్రయాణాలు చేసే వ్యక్తిగా రికార్డులకెక్కాడు. లైఫ్‌టైమ్ పాస్ కోసం అప్పట్లో తాను పెద్దమొత్తమే చెల్లించినా, అలా చెల్లించడం వల్ల ఇప్పటి వరకు లెక్కిస్తే తనకు 2.44 మిలియన్ డాలర్లు (రూ.20.30 కోట్లు) మిగిలినట్లేనని టామ్ చెప్పడం విశేషం. అతి తక్కువ లగేజీతో తాను ప్రయాణాలు చేస్తానని, చేసే ప్రయాణాల కంటే, ప్రయాణాల్లో మనుషులను కలుసుకోవడం తనకు చాలా ఇష్టమని అతడు చెబుతాడు.ఇవి చదవండి: అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే! -
ఒక్కొక్కరూ, రెండు సీట్లు కొనుక్కోండి : ఎయిర్‌లైన్ సిబ్బంది అమానుషం
బరువుఎక్కువగా ఉన్నారనే కారణంతో ఇద్దరు మహిళల్ని విమానం నుంచి దించేసిన అమానుష ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. మార్చి 8వ తేదీ అంతర్జీతీయ మహిళా దినోత్సవం రోజు ఈ పరిణామం జరగడం గమనార్హం. అయితే ఈ వివాదంపై స్పందించిన ఎయిర్ న్యూజిలాండ్ ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెప్పింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి: ఏంజెల్ హార్డింగ్ మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి నేపియర్ నుండి ఆక్లాండ్ ఇంటికి ప్రయాణిస్తుండగా ఈ షాకింగ్ పరిణామం ఎదురైంది. విమానం ఎక్కి, విమానం రన్‌వేపైకి చేరుకుందో లేదో అటెండెంట్ వచ్చి సీట్ ఆర్మ్‌రెస్ట్‌ను కిందకు దించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఎందుకని ప్రశ్నిస్తే అది సరిగ్గా ఫిట్ అయ్యేంతవరకు విమానం టేకాఫ్ చేయబోనని పైలట్ చెప్పినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తన పట్ల అటెండెంట్ చాలా దురుసుగా వ్యవహరించిందని ఏంజెల్ హార్డింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు సిబ్బంది తమను కిందకు దించేస్తామని బెదిరించారట. దీంతో ఈ వివాదం మరింత ముదిరి విమానాన్ని బోర్డింగ్ ప్రదేశానికి తీసుకొచ్చారు. మరోవైపు తమకు ఇబ్బంది కలుగుతోంది అంటూ మిగిలిన ప్రయాణీకులు ఒత్తిడి తేవడంతో బాధిత మహిళల్ని దిగిపోవాలని సిబ్బంది కోరారు. అయితే ఇలా ఎందుకు బాధిత మహిళలు గట్టిగా నిలదీశారు. ఇక్కడ సిబ్బంది సమాధానంతో వారు షాకయ్యారు. ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇలాంటి అవమానకర పరిస్థితి మనమందరం మనుషులం,మరెవ్వరికీ తన లాంటి అవమానం ఎదురుకాకూడదంటూ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన సంస్థ బాధితులకు క్షమాపణలు చెప్పింది. వారి విమాన ప్రయాణ బిల్లును చెల్లించి, వారి ఖర్చు లన్నింటినీ భరించింది. అలాగే ప్రయాణికులతో హుందాగా నడుచుకునేలా చూస్తామని ఎయిర్‌లైన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. అయితే ఈ అవమానానికి తగిన పరిహారం చెల్లించాల్సిందే అంటూ హార్డింగ్ స్నేహితుడు పట్టుపడుతున్నాడు. -
విమానంలో సీట్ కుషనింగ్ మాయం! - ఏం జరిగిందంటే..
ఇటీవల ఓ మహిళకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. విమానంలోని కుషనింగ్ లేకుండా ఉన్న సీటు చూసి ఒక్కసారిగా షాకయింది. దీనికి సంబంధించిన ఫోటో తీసి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. యవనిక రాజ్ షా అనే మహిళ బెంగళూరు నుంచి భోపాల్‌కు వెళ్లే సమయంలో ఆమె ప్రయాణించే ఇండిగో 6E 6465 విమానంలో కుషనింగ్ లేని సీటు చూసి, ఫోటోను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. బ్యూటిఫుల్ @IndiGo6E నేను సురక్షితంగా ల్యాండ్ అవుతానని ఆశిస్తున్నానని ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన ఇండిగో.. మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు అంటూ.. క్లీనింగ్ కోసం కుషన్లను మార్చామని, క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించినట్లు, శుభ్రమైన సీట్లను కేటాయించడంలో భాగంగా ఇలా జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు వావ్ మసాజ్ సీట్లు అని పేర్కొన్నారు. మరో వ్యక్తి బహుశా మునుపటి ప్రయాణికులు వాటిని తీసుకెళ్లిపోయారేమో అని అన్నారు. Beautiful @IndiGo6E — I do hope I land safely! :) This is your flight from Bengaluru to Bhopal 6E 6465. pic.twitter.com/DcPJTq3zka — Yavanika Raj Shah (@yavanika_shah) March 6, 2024 -
హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. అత్యంత చెత్త అంటూ!
గతంలో డైరెక్టర్‌తో ముద్దు సీన్‌తో పెద్ద ఎత్తున వైరలైన హీరోయిన్ మన్నారా చోప్రా. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెకు టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ అందరి ముందే ముద్దు పెట్టి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఆ వీడియో సంచలనంగా మారింది. పెద్దఎత్తున వైరల్ కావడంతో పాటు ఆయన భారీగా ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు. కాగా.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ హిందీ బిగ్ బాస్ సీజన్-17లో మెరిసింది. అంతే కాదు టాప్-3 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. నేను ప్రయాణించిన అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్ ఇదే.. ఇలా జరగడం నాకు రెండోసారని పేర్కొంది. గతంలో ఒకసారి నా బ్యాగ్‌ను డ్యామేజ్ చేశారని.. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా మళ్లీ దురుసుగా ప్రవర్తించారని వెల్లడించింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే మన్నారా చోప్రా ట్వీట్‌కు విమానయాన సంస్థ స్పందించింది. " మన్నారా ట్వీట్‌పై ఎయిర్‌లైన్స్ . "మన్నారా.. మీకు కలిగిన ఇబ్బందికి మేము చింతిస్తున్నాం. మా బృందం విమానాశ్రయంలోనే అదనపు బ్యాగేజీ రుసుము విధానాన్ని వివరించిందని అర్థం చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మీ రుసుమును మాఫీ చేయలేము. ఈ విషయంలో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే మీకు ఇంతకు ముందు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. దయచేసి మాకు ఆ వివరాలను పంపించండి" అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి మన్నారా చోప్రా బదులిస్తూ.. "ఏం వ్రాస్తున్నారు సార్.. మీ సిబ్బంది నాతో అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించారు. ఈ రోజు ఉదయం నాకు ఆరోగ్యం బాగాలేదు. మీ ఉద్యోగితో ఈ విషయాన్ని ప్రస్తావించా. మీరు చాలా బాగా నటిస్తున్నారు.. వెళ్లి మా మేనేజర్‌తో మాట్లాడండని దురుసుగా ప్రవర్తించింది. కనీసం మీ మేనేజర్ వచ్చి సమస్యను అర్థం చేసుకునే పని కూడా చేయలేదు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. మన్నారా థ్రిల్లర్ జిద్ అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ చిత్రంలో కనిపించనుంది. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ సీజన్ -17లో మూడోస్థానంలో నిలిచింది. The worst airlines to travel with @AkasaAir .this is my second experience with them,first time I travelled they damaged my bag and this time I’m not feeling well they ended up being rude again — Mannara Chopra (@memannara) February 18, 2024 -
మానవత్వం.. మంటగలిసిన వేళ, ఎయిరిండియాపై తీవ్ర విమర్శలు
మానవత్వం మంటగలిసింది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పరోక్షంగా ఓ ప్రయాణికుడు ప్రాణం పోయేందుకు కారణమైనట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. అమెరికా న్యూయార్క్ నుంచి ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ 80 ఏళ్ల ప్రయాణికుడు కుప్పకూలాడు. ఆపై ప్రాణాలొదిలాడు. అయితే ఈ విషాదానికి ముందు ఎయిరిండియా విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ ప్రదేశం నుంచి టెర్మినల్ వరకు సుమారు.1.5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చాడు సదరు ప్రయాణికుడు. వయో భారం దృష్ట్యా ల్యాండింగ్ తర్వాత ఎయిరిండియా సిబ్బందిని తనకు వీల్ చైర్ ఇవ్వాలని కోరాడు. కానీ వీల్ చైర్ కొరత ఉండడంతో తాము ఇవ్వలేమని తిరస్కరించారు. చేసేది లేక కిలోమీటర్ దూరం నడుచుకుంటూ టెర్మినల్‌కు చేరుకున్న ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదంతో ప్రయాణికుల పట్ల ఎయిరిండియా సిబ్బంది వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఎయిరిండియా యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్పటికే తాము బాధితుడి భార్యకు వీల్ ఛైర్ కేటాయించామని, తనకూ మరో వీల్ ఛైర్ కావాలని కోరడంతో.. ప్రయాణికుల రద్ది కారణంగా వీల్ ఛైర్ ఇచ్చేందుకు కొద్ది సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి చూడాలని కోరినట్లు తెలిపింది. కానీ ప్రయాణికుడు మాత్రం తన భార్యతో కలిసి నడుచుకుంటూ టెర్మినల్‌లోకి వచ్చినట్లు వెల్లడించింది. ప్రయాణికుడు టెర్మినల్‌లో స్పృహ కోల్పోయిన వెంటనే ఎయిర్‌పోర్ట్‌కి చెందిన మెడికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని, నిమిషాల వ్యవధిలో స్థానిక ఆస్పత్రికి తరలిచారు. అప్పటికే ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని ఎయిరిండియా యాజమాన్యం వివరణ ఇచ్చింది. చదవండి👉 : ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్‌లో చికెన్ ముక్కలు’! -
జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణకు మరో 100 కోట్లు
ముంబై: జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) మరో రూ. 100 కోట్లు సమకూర్చింది. దీనితో, కోర్టు ఆమోదిత పరిష్కార ప్రణాళిక ప్రకారం మొత్తం రూ. 350 కోట్లు సమకూర్చినట్లయిందని జేకేసీ తెలిపింది. కంపెనీపై పూర్తి అధికారాలు దక్కించుకునేందుకు అవసరమైన నిబంధనలన్నింటినీ పాటించినట్లయిందని పేర్కొంది. ఎయిర్‌లైన్ కార్యకలాపాల పునరుద్ధరణ ప్రణాళికలో ఎటువంటి మార్పులు ఉండవని, వచ్చే ఏడాది (2024) నుంచి ప్రారంభించేందుకు కొత్త ప్రమోటర్లు దృఢనిశ్చయంతో ఉన్నట్లు జేకేసీ వివరించింది. లాంచ్ తేదీని రాబోయే వారాల్లో ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్ 17 నుంచి నిల్చిపోయిన సంగతి తెలిసిందే. -
ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా ఇండిగో
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే అద్భుతమైన, అధిక పోటీతో కూడిన ఏవియేషన్ మార్కెట్ అని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. ఇండిగో మరింత పెద్ద, మెరుగైన, ప్రపంచ స్థాయి సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించారు. తనకంటూ సొంతంగా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంటున్నట్టు, ఇతర ఎయిర్‌లైన్ సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లోని పట్టణాల నుంచి విదేశీ గమ్యస్థానాలకు మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఎల్బర్స్ తెలిపారు. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ 320కు పైగా విమానాలతో 1,900 రోజువారీ సరీ్వసులు నిర్వహిస్తోంది. దేశీ విమానయాన మార్కెట్లో ఈ సంస్థకు 63 శాతం వాటా ఉంది. 32 అంతర్జాతీయ, 81 దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే ఇటీవల పీఅండ్‌డబ్ల్యూ ఇంజన్లలో సమస్యల కారణంగా కొన్ని ఏ320 విమానాలను నిలిపివేయాల్సి వచి్చంది. దీన్ని అధిగమించేందుకు సంస్థ కొన్ని విమానాలను వెట్‌లీజ్ తీసుకుంది. టికెట్ ధరలు కీలకం.. విమానాల నిర్వహణ వ్యయాలు, టికెట్ ధరల మధ్య సహ సంబంధం ఉండాలని, లేకపోతే విమానయాన సంస్థలు మనుగడ సాగించలేవని ఎల్బర్స్ అభిప్రాయపడ్డారు. ఇండిగో అందుబాటు ధరలపైనే దృష్టి సారించినట్టు చెబుతూ, సీజన్ డిమాండ్‌కు అనుగుణంగా ఇవి పెరుగుతూ, తరుగుతూ ఉంటాయని వెల్లడించారు. ఇండిగో వృద్ధి దశలో ఉందన్నారు. అదే సమయంలో దేశంలో ఏవియేషన్ హబ్‌ల అవసరాన్ని ప్రస్తావించారు. సొంతంగా నెట్వర్క్ నిర్మించుకోవడంతోపాటు, ప్రస్తుత పట్టణాలను నూతన మార్గాలతో (భువనేశ్వర్–సింగపూర్ తరహా) అనుసంధానిస్తున్నట్టు పీటర్ ఎల్బర్స్ తెలిపారు. అలాగే, ఇతర ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యాలను కూడా పెంచుకుంటున్నట్టు వివరించారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో కోడ్õÙర్ భాగస్వామ్యాన్ని ఈ నెలలోనే ఇండిగో కుదుర్చుకోవడం గమనార్హం. -
రూ. రెండు కోట్ల ఖర్చుతో 20 కోట్ల లబ్ది.. ‘ఏక్ దిన్ కా సుల్తాన్’.. అంతా గాల్లోనే
మహా అయితే ఇన్ని దేశాలు తిరిగొచ్చాను అని చెబుతుంటారు. లేదంటే సుమారు లక్షల మైళ్ల వరకు వెళ్లి ఉండొచ్చని అంటారు. కానీ, నిరతరం ప్రయాణించడం మాత్రం అసాధ్యమే. అది కూడా కొద్ది మొత్తం డబ్బుతోనే.. దాదాపు ఆరు సార్లు చంద్రుని పర్యటనకి వెళ్లడానికి పట్టేంత దురాన్ని చుట్టి రావడం అంటే నమ్మశక్యం కానీ విషయమే! కానీ అది నిజం అతను అంత దురాన్ని విమానంలో చుట్టొచ్చాడు. కేవలం ఆకాశం, ఎయిర్‌పోర్ట్‌లలోనే గడుపుతూ.. నిర్విరామంగా ప్రయాణించాడు. ఆ వ్యక్తే యూఎస్‌కి చెందిన 69 ఏళ్ల టామ్ స్టుకర్. అతను 1999లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కి సుమారు రూ. 2 కోట్లు చెల్లించి జీవితకాల ఎయిర్ పాస్ని పొందాడు. దీన్ని తాను పెట్టిన అత్యుత్తమమైన పెట్టుబడిగా స్టుకర్ చెప్పుకుంటాడు. 33 ఏళ్ల క్రితం తీసుకున్న ఈ పాస్‌తో కనీసం 23 మిలియన్ల కి.మీ. దూరం ప్రయాణిస్తే చాలు అనుకున్నాడు. గానీ ఏకంగా 37 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణిస్తానని ఊహించలేదు. ఈ జర్నీలో అతను కొన్ని సమయాల్లో సుమారు 12 రోజుల వరకు బెడ్‌పై పడుకోకుండా అలానే ప్రయాణించినట్లు తెలిపాడు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయినప్పుడూ తప్ప మిగతా అన్ని వేళలా ఆకాశంలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ హోటల్ సూట్లు, క్రిస్ట్ క్రూయిజ్‌లు వంటి వాటిల్లో కొన్ని వారాల పాటు ‘ఏక్ దిన్ సుల్తాన్’ మాదిరి భోగాలు అనుభవించాడు. మొత్తం 1.46 మిలియన్ల మైళ్ల దురం పర్యటించేందుకు సుమారు 373 విమానాల్లో ప్రయాణించినట్లు చెప్పాడు. నిజానికి అతడు గనుక ఈ పాస్ బుక్ తీసుకోనట్లయితే ఇంత దూరం పర్యటించినందుకు ఆ ఫ్లైట్లకి సుమారు రూ. 20 కోట్లు ఖర్చయ్యేవి. అదీగాక ఇన్ని మైళ్ల దూరం జర్నీ చేసేందుకు అన్ని విమానాలను ప్రతిసారి బుక్‌చేసుకోవడం కూడా కష్టమే కానీ ఈ పాస్ ఉండటం కారణంగానే అతను ఈజీగా అన్ని విమానాల్లో ప్రయాణించగలిగాడు. అతను 2019లో ఇంత దూరం పర్యటించాడు. అతను పర్యటించిన దూరం ఆరుసార్లు చంద్రుని పర్యటనకు వెళ్లిన దానితో సమానమని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అంతేగాదు చరిత్రలో అతని మాదిరి అంతలా పర్యటించిన వ్యక్తి మరొకరు లేరని కూడా సదరు విమానయాన సంస్థ పేర్కొనడం విశేషం. (చదవండి: వాట్ యాన్ ఐడియా! ఆ తల్లి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!) -
వివాదంలో జెట్ ఎయిర్వేస్ సీఈవో.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో ఉన్న మెట్రో స్టేషన్ల సౌందర్యం,ఆర్కిటెక్చర్‌పై (aesthetics and architecture) ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ వైట్‌ఫీల్డ్-కేఆర్ పురం మెట్రో మార్గం (పర్పుల్ లైన్) - దుబాయ్ మెట్రో స్టేషన్ ఫోటోల్ని ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లపై ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్ నడుస్తున్నది. సంజీవ్ కపూర్ భారత్ - దుబాయ్‌లోని మౌలిక సదుపాయాలను పోల్చారు. దుబాయ్ మౌలిక సదుపాయాలతో పోలిస్తే ఇండియన్ మెట్రోస్టేషన్లు ‘కళ లేని కాంక్రీటు కళ్లజోళ్లు’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అంతే ఆ ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు జెట్ ఎయిర్వేస్ సీఈవోను ట్రోలింగ్ చేస్తున్నారు. ఓ ట్విటర్ యూజర్ బెంగుళూరు, గుర్గావ్, కోల్కతాలలోని ఓవర్‌గ్రౌండ్/ఓవర్ హెడ్ మెట్రో స్టేషన్లు కళావిహీనంగా ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ సంబంధిత మెట్రోస్టేషన్ ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో పాటు దుబాయ్ మెట్రోస్టేషన్ కంటే భారత్‌లో మెట్రో స్టేషన్లు బాగున్నాయని నొక్కాణిస్తూ మరిన్ని ఫోటోల్ని షేర్ చేశారు. చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా అందంగా ఉన్న మెట్రోస్టేషన్లను, వాటి డిజైన్ ఫోటోల్ని ట్విటర్లో పంచుకుంటున్నారు. 'అది కూడా కరెక్టే కదా సార్' సంజీవ్ కపూర్ అభిప్రాయాన్ని ఏకీభవించిన మరికొందరు.‘‘అది కూడా కరెక్టే కదా సార్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యావరణ అనుకూలమైనది కాదు. ఖర్చుతో కూడుకున్నది. కేవలం మెట్రో స్టేషన్ మాత్రమే కాదు ఇతర పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. ఈ రోజుల్లో ప్రైవేట్ నిర్మాణాలు సైతం అందానికి తక్కువ ప్రాముఖ్యతనిచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ చేతులు మీదిగా కాగా, జెట్ ఎయిర్వేస్ సీఈవో ట్వీట్ చేసిన బెంగళూరులోని 13 కిలోమీటర్ల వైట్‌ఫీల్డ్-కెఆర్ పురం మెట్రో (పర్పుల్ లైన్) రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 25న ప్రారంభించనున్నారు. Delhi Metro for you! pic.twitter.com/HA8z0g6AZZ — Rahul Kapoor (@okwithrk) March 18, 2023 The same station from some distance has this look (not the right part of pic), but yes, most of the stations are box shaped. •Sri Sathya Sai Hospital Metro Station#Bangalore pic.twitter.com/SCWEUxtmk6 — Bangalore Metro Updates (@WF_Watcher) March 18, 2023 Bangalore metro has amazing artwork on the walls. They let artists paint the walls later on. Case in point, church street metro: pic.twitter.com/41ojhy7JQx — Srijan R Shetty (@srijanshetty) March 19, 2023 -
అందరికీ విమానయోగం
శివమొగ్గ/బెల్గావీ: ‘‘హవాయి చెప్పులేసుకునే సామాన్యులు కూడా హవాయీ జహాజ్ (విమాన) ప్రయాణం చేయగలగాలి. ఆ కల ఇప్పుడు నిజమవుతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సోమవారం కర్నాటకలోని శివమొగ్గలో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. భారత వైమానిక రంగం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. ‘‘మున్ముందు మనకు వేలాది విమానాలు అవసరమవుతాయి. వాటిని ప్రస్తుతానికి దిగుమతి చేసుకుంటున్నా భారత్‌లోనే తయారు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పుడు మనమంతా దర్జాగా మేడిన్ ఇండియా విమానాల్లోనే ప్రయాణిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. చిన్న నగరాలు, పట్టణాల్లోనూ విమానాశ్రయాల నిర్మాణంతో బీజేపీ ప్రభుత్వం విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిందని మోదీ చెప్పారు. 2014 దాకా దేశంలో మొత్తం 74 విమానాశ్రయాలుంటే గత తొమ్మిదేళ్లలోనే తాము మరో 74 కొత్త విమానాశ్రయాలు నిర్మించామన్నారు. కాంగ్రెస్ పాలనపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘2014కు ముందు ఎయిరిండియాను నష్టాలు, కుంభకోణాల సంస్థగా చూసే పరిస్థితి ఉండేది. నేడు అలాంటి సంస్థ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. నూతన భారతదేశానికి ప్రతీకగా విజయపుటంచులు చూస్తోంది’’ అన్నారు. రూ.3,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. శివమొగ్గ జిల్లాకే చెందిన కర్నాటక మాజీ సీఎం, బీజేపీ అగ్ర నేత బి.ఎస్.యడియూరప్ప సోమవారం 80వ పుట్టినరోజు జరుపుకున్నారు. దాంతో సభికులంతా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలపాల్సిందిగా మోదీ కోరారు. ఆయన జీవితమంతా ప్రజా సేవకు అంకితం చేశారని, రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. డబుల్ ఇంజన్ సర్కారుకే మరో అవకాశమివ్వాలని కర్నాటక ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారన్నారు. అనంతరం బెల్గావీలో మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు కారులో నుంచుని అభివాదం చేస్తూ సాగారు. అభివృద్ధి చేసిన బెల్గావీ రైల్వేస్టేషన్ భవనాన్ని, రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 8 కోట్ల మంది రైతులకు ప్రధాన్‌మంత్రీ కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) పథకంలో 13వ విడతగా రూ.16 వేల కోట్ల నిధులను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో విడుదల చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కోవిడ్ ముందస్తుకన్నా తక్కువే!
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య కోవిడ్ ముందస్తు కాలం 2019తో పోలిస్తే 2022లో 85.7 శాతానికి చేరిందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. అంతర్జాతీయంగా చూస్తే ఇది 68.5 శాతం అని తెలిపింది. ‘డిసెంబర్‌తో సహా గతేడాది రికవరీ కొనసాగింది. దేశీయ ట్రాఫిక్ 2021తో పోలిస్తే 2022లో 48.8 శాతం వృద్ధి చెందింది. ఇంటర్నేషనల్ ట్రాఫిక్ గతేడాది 152.7 శాతం దూసుకెళ్లింది. కోవిడ్ నిబంధనలు సడలించడంతో ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణాలు చేశారు. ఈ ట్రెండ్ 2023లోనూ కొనసాగుతుంది. అంతర్జాతీయంగా సరిహద్దులు మూసివేయడం, ప్రయాణ పరిమితుల కారణంగా మహమ్మారి వ్యాప్తి వేగానికి కట్టడి వేశారు. అయితే ప్రయాణాలు, సరుకుల రవాణాతో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలు, జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపింది’ అని ఐఏటీఏ వివరించింది. -
విమానంలో మరో ఘటన..మహిళా ఫ్లైట్ అటెండెంట్ల పట్ల అసభ్య ప్రవర్తన
తీవ్ర కలకలం రేపిన ఎయిర్ ఇండియాలోని తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువక మునుపే మరో ఘటన చోటు చేసుకుంది. గో ఫస్ట్ విమానంలోని మహిళా ఫ్లైట్ అటెండెంట్ల పట్ల ఒక విదేశీ టూరిస్ట్ అసభ్యంగా ప్రవర్తించి.. వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. జనవరి 5న ఢిల్లీ నుంచిగోవా వెళ్లే గో ఫస్ట్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఒక విదేశీ పర్యాటకుడుతో ఫ్లైట్ అటెండెంట్ కూర్చొగా..అతను మరొకరితో అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సదరు వ్యక్తిని గోవాలోని కొత్త విమానాశ్రయంలోని భద్రతా ఏజెన్సీకి అప్పగించారు. ఆ తర్వాత డీజీసీఏకి ఈ విషయమై సమాచారం అందించారు. గోవాలోని మోపాలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాలు చేసిన రోజే జరగడం గమనార్హం. ఇప్పటికే విమానాల్లో ఇలాంటి ఘటనలపై డైరక్టరేట్ జనరల్ సవిల్ ఏవియేషన్ సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు వరుసగా బయటకు రావడంతో సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా అంతర్గత కమిటీని సైతం డీజీసీఏ ఏర్పాటు చేసింది. (చదవండి: వినూత్నంగా జనగణన..ఫుల్ క్లారిటీ ఇచ్చిన బిహార్ సీఎం) -
షాకింగ్ ఘటన: విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..
ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహ ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక వ్యక్తి మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆరిపోవడంతో.. అక్కడ ఏం జరుగుతోందో కొందరి ప్రయాణికులకే అర్థమైంది. పైగా మూత్ర విసర్జన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లకుండా అలానే నుంచొని ఉన్నాడు. అతడి వికృత చర్య కారణంగా.. సదరు ప్రయాణికురాలి బట్టలు, బూట్లు, మూత్రంతో తడిచిపోయాయి. దీంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విమాన సిబ్బంది ఆమెకు బట్టలు, చెప్పులు ఇచ్చి మళ్లీ తన సీటుకే రావలని చెప్పారు. ఐతే ఆమె అందుకు గట్టిగా నిరాకరించడంతో మరో సీటు పురమాయించారు.ఐతే సిబ్బంది ఆ సీటు కవర్లు మార్చి, వాసన రాకుండా స్ప్రె చల్లారు గానీ ఆ సీటుపై కూర్చోవాలంటేనే చిరాకనిపించదని ఆ మహిళ వాపోయింది. ఆ ఘటన తర్వాత ఆమె మరొక సిబ్బంది సీటులో కూర్చొని విమానంలో మిగతా ప్రయాణాన్ని కొనసాగించారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా సదరు ఎయిర్‌లైన్ అధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సదరు మహిళకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్‌కి ఈ విషయమై లేఖ రాశారు. అంతేగాదు ఆమె లేఖలో.. బిజినెస్ క్లాస్‌లో సీట్లన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ మరో క్యాబిన్ సీటు కూడా తనకి ఇవ్వలేదని ఎయిర్ ఇండియా సిబ్బందిపై కూడా ఆరోపణలు చేసింది. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విషయమై సదరు ఎయిర్‌లైన్ నుంచి వివరణ కోరింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే గాక సదరు వ్యక్తిని నోఫ్లై లిస్ట్‌లో చేర్చనున్నట్లు పేర్కొంది. (చదవండి: బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం) -
విమానం టేక్ అఫ్ టైంలో ఫోన్ మిస్సింగ్.. పైలెట్ కిటికిలోంచి వంగి మరీ..
ఓ ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు తన ఫోన్‌ని మర్చిపోయాడు. ఐతే ఇంతలో విమానంలో ప్రయాణికులంతా ఎక్కేశారు. ఇక బయలుదేరుతుంది అనేలోపు ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఈ విషయాన్ని డల్లాస్ చెందిన ఎయిర్‌లైన్ ఫేస్బుక్లో పేర్కొంది. వివరాల్లోకెళ్తే...కాలిఫోర్నియాలోని లాంట్ బీజ్ ఎయిర్‌పోర్ట్‌లో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రయాణికులంతా ఎక్కేయడంతో టేకాఫ్‌కి రెడీ అయ్యింది. ఇంతలో గ్రౌండ్ సిబ్బంది గేట్ వద్ద ఒక ప్రయాణికుడు ఫోన్ మర్చిపోవటాన్ని గుర్తించారు. దీంతో వారు వెంటనే అప్రమత్తమై టేకాఫ్ అవుతున్న విమానం దగ్గరకు వచ్చి ప్రయాణికుడి ఫోన్ ఇచ్చేందుకు వస్తారు. విషయం గ్రహించిన ఫైలెట్ కిటికిలోంచి వంగి మరీ సిబ్బంది నుంచి ఫోన్‌ని అందుకున్నాడు. ఆ తర్వాత ప్రయాణకుడికి అతను మర్చిపోయిన ఫోన్‌ని అందజేశారు. అందుకు సంబంధించిన వీడియోని డల్లాస్ ఎయిర్‌లైన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ...మా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ని ప్రేమించండి. ఇలా మా సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులకు సాయం చేయడాన్ని కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అంటారు అని పేర్కొంది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. When our Employees at @LGBairport noticed a Customer's phone left behind in a gate area after a flight that was already boarded and pushed back from the gate, they didn't hesitate. #WorldKindnessDay pic.twitter.com/cf3gJy8Nmy — Southwest Airlines (@SouthwestAir) November 13, 2022 (చదవండి: వామ్మో! భగభగమండే సూర్యుని ఉపరితలంపై స్నేక్) -
విమాన ప్రయాణికులకు అలర్ట్.. వాటిని నిషేదిస్తూ కీలక నిర్ణయం!
విమాన ప్రయాణానికి యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ ప్రమాదం అంటూ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్ తెలిపింది. అందుకే తమ సంస్థకు చెందిన విమాన ప్రయాణాల్లో యాపిల్ ఎయిర్ ట్యాగులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. విమాన ప్రయాణంలో తమ వెంట తెచ్చుకున్న లగేజీ సేఫ్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు అదే ఎయిర్ ట్యాగ్స్‌పై జర్మనీ ఎయిర్‌లైన్ ఆంక్షలు విధించింది. అయితే లుఫ్తాన్సా ఇటీవల ‘ఎయిర్ ట్యాగ్లు ప్రమాదమని.. కాబట్టే యాక్టివేటెడ్ ఎయిర్‌ట్యాగ్‌లను ప్రయాణికుల వినియోగంచుకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. ఐసీఏఓ (ఇంటర్నేషనల్ సివిలియన్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) మార్గదర్శకాల కారణంగా లుఫ్తాన్సా ఎయిర్‌ట్యాగ్‌ని నిషేధించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీలు, 15 అంగుళాల యాపిల్ మాక్ ప్రో (సెప్టెంబర్ 2015 ఫిబ్రవరి 2017 మధ్య కొనుగోలు చేసిన)లపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయి. యాపిల్ సంస్థ లిథియం- అయాన్ బ్యాటరీలు వినియోగించదు. ఎయిర్ ట్యాగ్స్ కోసం యాపిల్ సంస్థ సీఆర్2032 సెల్స్‌ను ఉపయోగిస్తుంది. ఒకవేళ ఆ సెల్స్ ప్రమాదకరమని భావిస్తే స్మార్ట్‌వాచ్‌లను విమానాల్లో అనుమతించకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి. యాపిల్ ఎయిర్ట్యాగ్పై లుఫ్తాన్సా ఎయిర్‌లైన్ ఎందుకు నిషేధం విధించిందో స్పష్టమైన నిషేధాన్ని కారణాలు వివరించనప్పటికీ, అనేక నివేదికలు మాత్రం ప్రయాణికుల లగేజీని ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
క్యాంప్‌బెల్ విల్సన్: ఆ పిచ్చే ఎయిరిండియా సీఈవోని చేసింది!
ఎయిరిండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా క్యాంబెల్ విల్సన్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని టాటా సన్స్ ప్రకటించింది. 50ఏళ్ల విల్సన్‌కు విమానయాన రంగంలో 26ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్ఐఏ) అనుబంధ సంస్థ అయిన స్కూట్‌కు సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విల్సన్‌ను ఎయిరిండియాకు సీఈవోగా నియమించడం పట్ల ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను నిర్మించడంలో విల్సన్‌తో కలిసి చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఐకానిక్ ఎయిరిండియా “ఐకానిక్ ఎయిరిండియాకు నాయకత్వం వహించడానికి, అత్యంత గౌరవనీయమైన టాటా గ్రూప్‌లో భాగస్వామి అవ్వడం గౌరవంగా ఉంది. ఎయిరిండియా ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా అవతరించే దిశగా ప్రయాణం కొనసాగుతుంది. భారతీయ ఆతిథ్యం ప్రతిబింబించేలా ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవల్ని అందిస్తోంది. ఆ ఆశయాన్ని సాకారం చేసే లక్ష్యం దిశగా ఎయిరిండియా, టాటా సహోద్యోగులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది"అంటూ ఎయిరిండియా కొత్త బాస్ విల్సన్ తెలిపారు. ఆ పిచ్చే ఎయిరిండియా సీఈవోని చేసింది న్యూజిలాండ్‌లో పుట్టి పెరిగిన కొత్త ఎయిర్ ఇండియా బాస్ క్యాంప్ బెల్ విల్సన్ న్యూజిలాండ్ కాంటర్బరీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా..ఎందుకో మనసు యూరప్, అమెరికాపై మళ్లింది.ఆ రెండు దేశాలు తిరిగి స్వదేశమైన న్యూజిల్యాండ్‌కు వచ్చిన ఆయనకు జర్నీలపై పిచ్చి పెరిగింది. ఆ జర్నీ పిచ్చే విల్సన్ ఎయిరిండియా సీఈవో అయ్యేందుకు దోహద పడిందనే చెప్పుకోవాలి. ఇక న్యూజిల్యాండ్‌కు తిరిగి వచ్చిన ఆయనకు విమానయాన రంగంపై మక్కువతో సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్ఐఏ)లో మేనేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు దాని అనుబంధ సంస్థ స్కూట్కి సీఈవో స్థాయికి చేరుకున్నారు. అనేక పదవుల్లో చక్రం తిప్పారు ఏప్రిల్ 1996 నుండి ఎస్ఐఏ గ్రూప్‌లో ఉన్న అతను అనేక పదవులు చేపట్టారు. మే 2011లో అంటే స్కూట్‌లో చేరడానికి ముందు సింగపూర్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్‌గా,హాంకాంగ్‌కు ఎస్ఐఏ జనరల్ మేనేజర్‌తో పాటు, కెనడా ఎస్ఐఏకు వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్ఐఏ హెడ్ ఆఫీస్ నెట్వర్క్ ప్లానింగ్, నెట్వర్క్ రెవెన్యూ మేనేజ్మెంట్ విభాగాలలో 3ఏళ్లు విధులు నిర్వహించారు. విల్సన్ ఎస్ఐఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్, మార్కెటింగ్)గా పనిచేశారు. దీంతో పాటు ధర, పంపిణీ, ఇ-కామర్స్, మర్చండైజింగ్, బ్రాండ్ అండ్ మార్కెటింగ్, గ్లోబల్ సేల్స్, ఎయిర్‌లైన్ యొక్క విదేశాల్లో ఉన్న ఎస్ఐఏ కార్యాలయాల్ని పర్యవేక్షించారు. ఏప్రిల్ 2020లో స్కూట్ సీఈవోగా పదోన్నతి సాధించారు. ఇప్పుడు ఎయిరిండియా సీఈవోగా ఆ సంస్థ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. చదవండి👉టాటా గ్రూపుకి షాక్! సీఈవో పోస్టు వద్దన్న ఇల్కర్ ఆయ్‌సీ -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..!
ఇండియన్ బిగ్బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా జూన్ నుంచి విమాన సర్వీసుల్ని ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఝున్‌ఝున్‌వాలాకు చెందిన 'ఆకాశ ఎయిర్' కార్యకలాపాలు జూన్ నుంచి ప్రారంభం కానున్నాయని ఆ సంస్థ సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు దుబాయ్ వేదికగా జరిగిన సైడ్‌లైన్స్ ఆఫ్ వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినయ్ దూబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే 5ఏళ్లలో 72 ఆకాశ ఎయిర్ విమాన కార్యకలాపాలు నిర్వహిస్తాయని తెలిపారు. ఇప్పటికే మినిస్టరీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) లైసెన్స్ పొందామని, జూన్ నెలలో ఆకాశ ఎయిర్ తొలి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాదు తమ వద్ద ప్రస్తుతం 18 విమానాలు ఉండగా.. ఏడాదికి 12 నుంచి 14 విమాన సేవల్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు దుబే చెప్పారు. ఇలా 5 ఏళ్లలో మొత్తం 72 విమానాల్ని అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఎక్కడి నుంచి ప్రారంభం ఆకాశ ఎయిర్ లైన్ సేవల్ని మెట్రో నగరాల నుంచి టైర్-2, టైర్-3 నగరాల్లో, మెట్రో సిటీస్ నుంచి మరో మెట్రో సిటీలకు సర్వీసులు ఉంటాయని ఆకాశ ఎయిర్ లైన్ సీఈఓ తెలిపారు. ఇలా క్యాలండర్ ఇయర్-2023లో మొత్తం 20 విమాన సర్వీసుల్ని ప్రారంభించేలా టార్గెట్ పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. సుమారు రూ.66వేల కోట్లు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) గా ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా -
లాభాలే..లాభాలు: విమనాశ్రయాల ప్రైవేటీకరణ..సమర్ధించుకున్న కేంద్రమంత్రి!
కరోనా ప్రభావాల నుండి విమానయాన రంగం క్రమంగా కోలుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గణాంకాల ప్రకారం గత ఏడు రోజుల్లో రోజువారీగా 3.82 లక్షల మంది ప్రయాణించారని ఆయన పేర్కొన్నారు. 2018–19లో 14.50 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2023–24 నాటికి 40 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు లోక్‌సభకు మంత్రి వివరించారు. వచ్చే 2–3 ఏళ్లలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ రంగ సంస్థలు విమానాశ్రయాల ఏర్పాటుపై రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ఆయన చెప్పారు. విమానాశ్రయాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. దీని వల్ల ఏఏఐ లాభదాయకత పెరుగుతుందని పేర్కొన్నారు. 2014 వరకూ దేశీయంగా 74 ఎయిర్‌పోర్టులు ఉండగా గడిచిన ఏడేళ్లలో కొత్తగా 66 విమానాశ్రయాలు వచ్చాయని సింధియా చెప్పారు. దేశ ఎకానమీలో భారీగా ఉద్యోగాల కల్పన ద్వారా ఏవియేషన్ రంగం కీలకంగా మారిందని పేర్కొన్నారు. దేశీయంగా మొత్తం పైలట్లలో 15 శాతం మంది మహిళలే ఉన్నారని.. అంతర్జాతీయంగా ఈ సగటు 5 శాతమేనని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్ పరిశ్రమ ఒడిదుడుకులు ఎదురు కొంటూ ఉండగా.. భారత్‌లో రెండు కొత్త ఎయిర్‌లైన్స్ (జెట్, ఆకాశ) త్వరలో తమ సర్వీసులు ప్రారంభించనున్నాయని సింధియా వివరించారు. -
టైముకు రాదు.. రీఫండ్ చేయరు... వీళ్లతో ఎలా వేగేది ?
ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య, రైల్వే బుకింగ్‌లో వెయిటింగ్ సమస్య అదే ఎయిర్‌లైన్స్ అయితే ప్రయాణికులకు ఏ కష్టాలు ఉండవు అనుకుంటూ పొరపాటే. ఎర్రబస్సయినా ఎయిర్‌బస్ అయినా వాటిలో కామన్ పాయింట్ కస్టమర్లను ఇబ్బంది పడటం. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే నిజం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టు ఇదే విషయం చెబుతోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ 2022 ఫిబ్రవరికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇందులో గతేడాదితో పాటు గత నెలతో పోల్చుతూ ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో ఏవియేషన్ సెక్టార్ ఎలా చెబుతూ పలు గణాంకాలు ప్రచురించింది. ఇందులో కస్టమర్లు ఏ అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు చేస్తున్నారు, విమానాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయంటూ పలు వివరాలను ప్రకటించింది. రీఫండ్ ఇబ్బందులు డీజీసీఏ ప్రకటించిన వివరాల్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా విమాన ప్రయాణికులకు కూడా రీఫండ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. డీజీసీఏకి అందుతున్న ఫిర్యాదుల్లో నూటికి 31 శాతం కేవలం రీఫండ్ సమస్య మీదనే వస్తున్నాయి. వాస్తవానికి ఎయిర్ ట్రావెల్ కస్టమర్లకు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తుంది. ట్రావెల్ ఏజెంట్లు మొదలు టిక్కెట్ బుకింగ్ యాప్‌లు, విమాన సర్వీసు సంస్థలు బాగానే ట్రీట్ చేస్తాయి. కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల విమానం రద్దయినా లేదా టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్నా.. వాటికి తాలుకు నగదు ప్రయాణికులకు తిరిగి చెల్లించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. మంచి విమానం కావాలి రీఫండ్ కంటే ఎక్కువగా విమాన ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్న అంశం విమానం గురించి. ఫ్లైట్ చార్జీలు, స్టాఫ్ బిహేవియర్, లగేజ్ లాంటి కీలక అంశాలన్నీ పట్టించుకునే స్థితిలో విమాన ప్రయాణికులు ఉండటం లేదు. ఎందుకంటే వాళ్ల ప్రధాన ఫిర్యాదులే విమానం మీద ఉంటున్నాయి. ఆలస్యంగా ప్రయాణించడం మొదలు సీట్లు కంఫర్ట్‌గా లేకపోవడం వరకు 34 శాతం ఫిర్యాదులు విమానాల మీదే ఉంటున్నాయి. ఇవే ప్రధానం రోజురోజుకి విమానయాన రంగం దేశంలో పుంజుకుంటోంది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు ఉదాన్లాంటి పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. ఈ తరుణంలో విమాన ప్రయాణికుల్లో దాదాపు 60 శాతానికిపైగా కేవలం విమానాలు(34 శాతం), రీఫండ్(31 శాతం) ఫిర్యాదులు అందుతుండటం శుభపరిణాం కాదని నిపుణులు అంటున్నారు. సర్వీసుల నిర్వాహాణ, నగదు చెల్లింపుల విషయంలో మరింత జాగ్రత్తగా సర్వీస్ ప్రొవైడర్లు వ్యవహరించేలా డీజీసీఏ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలస్యం ఎందుకంటే? ఆలస్యం వల్ల అనేక సార్లు ప్రయాణాలు రద్దవుతుంటాయి. ముఖ్యంగా కనెక్టింగ్ ఫ్లైట్ జర్నీ చేసే వాళ్లకు ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర విమానాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం రియాక్షనరీ 58 శాతం ఉంది. అంటే ఎవరైనా ప్రయాణికులు ఆలస్యం రావడం, కనెక్టింగ్ ఫ్లైట్ రాకపోవడం ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే కారణాల వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయి. మన దగ్గర ఏవియేషన్ సెక్టార్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇదే తరహా పనితీరు ఉంటే నూట నలభై కోట్ల జనాభాలో కనీసం 20 శాతం మంది విమాన ప్రయాణాలు రెగ్యులర్ చేసినా తట్టుకోవడం కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. -
నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాత్రమే బిజినెస్‌మెన్‌గా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా రాణిస్తున్న చెర్రి.. పలు వ్యాపార సంస్థలో కూడా భాగస్వామ్యం తీసుకున్నారు. అందులో ఓ విమానాయాన సంస్థ కూడా ఉంది. 2015లో చరణ్ తన స్నేహితుడితో కలిసి ట్రూజెట్ పేరుతో డొమాస్టిక్ ఎయిర్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ విమానాలు హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు తమ ట్రూజెట్ ద్వారా విమానయాన సేవలు అందిస్తోంది. తక్కువ ఖర్చుతో దేశీయ విమానయానాన్ని అందించాలానే ఉద్దేశంతో తన స్నేహితుడు ఉమేశ్‌తో కలిసి టర్బో మేఘా ఎయిర్వేస్ సంస్థను ప్రారంభించిన రామ్ చరణ్. ఈ సంస్థ ట్రూజెట్ పేరుతో విమాన సర్వీసులు నడుపుతోంది. జులై 12వ తేదీ 2015 లో సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు నిరాటకంగా ఈ విమానాలు నడుస్తూ వచ్చాయి. అయితే ఇటీవల ఈ సంస్థ నష్టాల్లో నడుస్తుండటంతో దీనిపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ట్రూజెట్ విమానాలు నష్టాల్లో ఉండటంతో ఈ కంపెనీని మూసేస్తున్నారని, ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సంస్థ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ట్రూజెట్ కంపెనీ స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనని విడుదల చేస్తూ.. ‘ట్రూజెట్ విమానాలు ఆపేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి వార్తలని నమ్మకండి. ఈ సంస్థలో పని చేసే ఇద్దరూ అధికారులు గతంలో రిజైన్ చేసి వెళ్లిపోయారు. వారి స్థానంలో కొత్త వారిని కూడా నియమించాము. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు త్వరలోనే ఇన్వెస్టర్ కూడా రానున్నారు. ఇన్వెస్టర్స్ వచ్చాక కొత్త సీఈఓని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఉమేష్ గారే కొనసాగనున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ‘వివిధ అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ కారణాల వల్ల ట్రూజెట్ విమానయాన కార్యకలాపాలకు తాత్కాలిక నిలిపివేశాం. టెంపరరిగా ట్రూజెట్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాం. త్వరలోనే మళ్లీ పునఃప్రారంభిస్తాం. నవంబర్ 2021 నుండి ఉద్యోగులకు ఒక్క పైసా కూడా చెల్లించడం లేదని చెప్పే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. వారికి పాక్షిక జీతాలు ఇస్తున్నాము. తక్కువ సాలరీ ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చాము” అని ఈ ప్రకటనలో తెలిపారు. చదవండి: బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్! pic.twitter.com/XE4RQ1paG5 — TruJet (@FlyTruJet) February 16, 2022 -
ఎయిరిండియాను పటిష్టంగా తీర్చిదిద్దుతాం
ముంబై: ఇటీవల వేలంలో దక్కించుకున్న ఎయిరిండియాను టాటా గ్రూప్ ఆర్థికంగా పటిష్టంగా చేస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. సంస్థకు ఉన్న విమానాలను అప్‌గ్రేడ్ చేస్తామని, కొత్త విమానాలను తీసుకుంటామని, ఎయిరిండియాను ప్రపంచంలోనే టెక్నాలజీపరంగా అత్యాధునిక ఎయిర్‌లైన్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వర్చువల్ ప్రసంగంలో చంద్రశేఖరన్ ఈ విషయాలు చెప్పారు. సంస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సంస్థాగతంగా మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా కంపెనీ కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తామని.. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి భారత్‌ను అనుసంధానించాలన్నది తమ లక్ష్యమని చంద్రశేఖరన్ వివరించారు. అత్యుత్తమ కస్టమర్ సర్వీసులు అందించడం, అత్యాధునికంగా తీర్చిదిద్దడం, విమానాలను ఆధునీకరించుకోవడం, ఆతిథ్యాన్ని మెరుగుపర్చుకోవడంపై ఎయిరిండియా ప్రధానంగా దృష్టి పెడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐ–ఎస్ఏటీఎస్లో మొత్తం 15,000 మంది ఉద్యోగులు ఉండగా.. వర్చువల్ సమావేశంలో 10,000 మంది పైగా పాల్గొన్నారు. -
విమాన టికెట్ ధరలకు పోటీగా..
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఏసీ మొదటి, రెండో తరగతి వెయిటింగ్ లిస్ట్ 50కు మించి ఉంది. తత్కాల్లో కూడా టికెట్లు లభించక ప్రయాణికులు ఉసూరుమన్నారు. కిక్కిరిసి ఆ రైలు ఢిల్లీకి పరుగుపెట్టింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ బోగీలో ఐదుగురు, సెకండ్ క్లాస్ బోగీల్లో 15 మంది ఉన్నారు. మిగతా సీట్లన్నీ ఖాళీ. వెలవెలబోతూ ఈ ప్రీమియం ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ బయల్దేరింది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ దొరకని ప్రయాణికులు ‘రాజధాని’ వైపు ఎందుకు చూడలేదు. ప్రత్యామ్నాయంగా అదేరోజు ఈ ప్రీమియం ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉన్నా.. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకునేందుకే ఎందుకు మొగ్గు చూపారు. ఎందుకంటే ఆదాయ వేటలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలే కారణం. సాక్షి, హైదరాబాద్: విమానయాన సంస్థలో అమల్లో ఉన్న డైనమిక్ ఫేర్ విధానాన్ని ప్రారంభించిన రైల్వే శాఖ ఇప్పుడు చేతులు కాల్చుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్‌ను బట్టి టికెట్ ధరను సవరించటమే ఈ విధానం. ఎక్కువ డిమాండ్ ఉన్న రోజులు, అప్పటికప్పుడు బుక్ చేసుకున్న సందర్భంలో టికెట్ ధర అమాంతం పెరుగుతుంది. ఇంతకాలం పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్లాలన్న ఆ శాఖ ఇప్పుడు ఈ విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని చూస్తోంది. ఇటీవల రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ హైదరాబాద్ పర్యటనలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆయన దాన్ని సమీక్షించేందుకు ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హైదరాబాద్ నుంచే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ సంగతి.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డిమాండ్ లేని సాధారణ రోజుల్లో అడ్వాన్సుగా టికెట్ బుక్ చేసుకుంటే విమాన చార్జీ రూ.4 వేల లోపు ఉంటుంది. అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే రూ.ఐదున్నర వేల నుంచి మొదలవుతుంది. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమి యం రైళ్లలో మొదటి శ్రేణి, రెండో శ్రేణి టికెట్ ధర కూడా విమాన టికెట్‌కు దగ్గరగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువే. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సెకండ్ ఏసీ ధర (డైనమిక్‌లో నిలకడ ఉండదు) దాదాపు రూ.4,800 ఉంటోంది. కొన్నిమార్లు రూ.5 వేలు మించుతోంది. పీక్ డిమాండ్‌లో ఫస్ట్‌క్లాస్ చార్జి రూ.7 వేలు పలుకుతోంది. ఈ రైలు ప్రయాణ సమయం 22 గంటలు. అంత చార్జి భరించి ఇన్ని గంటలు ప్రయాణించే బదులు, అంతే చార్జి ఉండే విమానంలో 2 గంటల్లో వెళ్లిపోవచ్చు. దీంతో డబ్బున్న వాళ్లు, విమానాల వైపు, సాధారణ ప్రజలు మరో రైలువైపు చూస్తున్నారు. ఇలా రైల్వేకు భారీ నష్టం వాటిల్లుతోంది. రైలు నిర్వహణ ఖర్చులు యథావిధిగా ఉంటుం డగా, టికెట్ ఆదాయం నామమాత్రంగా ఉంటోంది.ఆ రైలు వల్ల మరో రైలును అదే సమయంలో నడిపే అవకాశం లేక ప్రయాణ అవకాశాన్ని కూడా ప్రయాణికులు కోల్పోవాల్సి వస్తోంది. ఆ విధానాన్ని మార్చాలి.. ఈ సమస్యకు కారణమవుతున్న డైనమిక్ ఫేర్ విధానాన్ని మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. తాజాగా రైల్వే బోర్డు పరిధిలోని ఆలిండియా రైల్వే ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ సభ్యుడు వెంకటరమణి, రైల్వే ప్యాసింజర్స్ ఎమినిటీస్ కమిటీ సభ్యుడు ప్రేమేందర్‌రెడ్డితో కలసి మంగళవారం రైల్వే మంత్రి పీయూష్ గోయెల్‌తో దీనిపై చర్చించారు. తాము ఈ కేటగిరీ రైళ్ల తీరును అధ్యయనం చేసి వాస్తవాలు గుర్తించామని, ఈ రైళ్లు ఖాళీగా వెళ్లడం వల్ల నష్టం వాటిల్లుతోందని, డైనమిక్ ఫేర్ విధానాన్ని సడలిస్తే ఆ రైళ్లు కూడా నిండుతాయని పేర్కొన్నారు. -
ఇండిగో నష్టం 1,062 కోట్లు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.652 కోట్ల నికర నష్టాలు రాగా ఈ క్యూ2లో ఈ నష్టాలు రూ.1,062 కోట్లకు పెరిగాయని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తెలిపింది. లీజు ఆస్తుల నిర్వహణకు సంబంధించి రూ.428 కోట్ల ఫారెక్స్ నష్టాలు, రూ.319 కోట్ల నిర్వహణ వ్యయాల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ రొనొజాయ్ దత్తా చెప్పారు. మొత్తం ఆదాయం రూ.6,514 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ.8,540 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.987 కోట్లుగా ఉన్న స్థూల నష్టాలు ఈ క్యూ2లో రూ.1,032 కోట్లకు పెరిగాయని దత్తా చెప్పారు. ఈ క్యూ2లో ఒక్కో విమాన ప్రయాణికుడి నుంచి వచి్చన సగటు చార్జీ 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇక మొత్తం వ్యయాలు 28 శాతం పెరిగి రూ.9,572 కోట్లకు పెరిగాయని తెలిపారు. వృద్ధి ప్రణాళికలపైననే దృష్టి పెడుతున్నానమని, దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. -
జెట్ పునరుద్ధరణపై ఆశలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కార్యకలాపాలు నిల్చిపోయిన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణపై ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తూ తాజాగా బ్రిటన్ వ్యాపారవేత్త జేసన్ అన్స్వర్త్.. కంపెనీలో వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మెజారిటీ వాటాల కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేస్తూ జెట్ సీఈవో వినయ్ దూబేకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన దూబే .. ఇతర సీనియర్ జెట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేలా ఏర్పాటు చేశారని అన్స్వర్త్ తెలిపారు. వాటాల కొనుగోలు కోసం జెట్ రుణదాతలకు కూడా గతంలో లేఖ రాసినప్పటికీ.. వారి నుంచి ఇంకా స్పందన రాలేదని ఆయన వివరించారు. ‘జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు జీతభత్యాలు అందుకునేలా, సంస్థ మరిన్ని అసెట్స్‌ను కోల్పో కుండా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేలా చూడాలన్నది నా ఉద్దేశం‘ అని అన్స్వర్త్ తెలిపారు. అట్మాస్ఫియర్ ఇంటర్కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్ పేరిట స్టార్టప్ సంస్థను ప్రారంభించిన అన్స్వర్త్.. లండన్‌లోని స్టాన్స్టెడ్ ఎయిర్‌పోర్టు నుంచి భారత్, దుబాయ్ తదితర ప్రాంతాలకు ఈ ఏడాది ఆఖర్లోగా విమాన సేవలు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్లాన్ ఉంది.. జెట్ సమస్యలు, అప్పుల భారాల గురించి తనకు తెలుసని, వాటిని అధిగమించేందుకు తన దగ్గర ప్రణాళిక కూడా ఉందని అన్స్వర్త్ తెలిపారు. అట్మాస్ఫియర్‌పై ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లలో కొంత మంది జెట్‌పై కూడా ఆసక్తి చూపుతున్నారని ఆయన వివరించారు. 2015లో అట్మాస్ఫియర్‌ను ఏర్పాటు చేసినప్పటినుంచీ వివిధ స్థాయిల్లో వివిధ సంస్థలతో కలిసి పనిచేయడమనేది జెట్ పునరుద్ధర ణకు తోడ్పడగలదని చెప్పారు. కంపెనీ విలువ మరింత పడిపోకుండా సాధ్యమైనంత త్వరగా సం స్థ కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యేలా చూడటం ముఖ్యమని తెలిపారు. ఇప్పటికే చాలా మంది జెట్ ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లిపోతున్నారని, అట్మాస్ఫియర్ ఎయిర్‌లైన్స్ భారత విభాగానికి కూడా జెట్ ఉద్యోగుల నుంచి వందల కొద్దీ దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. విదేశీ రూట్లపై దృష్టి.. ప్రధానంగా విదేశీ రూట్లలో సేవలపై దృష్టి పెట్టడం ద్వారా జెట్‌ను పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు అన్స్వర్త్ చెప్పారు. సవాళ్లున్నప్పటికీ చౌక చార్జీల విమానయాన సంస్థలతో పోలిస్తే పూర్తిస్థాయి ఎయిర్‌లైన్స్‌కు దీర్ఘకాలంలో అవకాశాలు పుష్కలం గా ఉన్నాయన్నారు. వినోదం, రిఫ్రెష్మెంట్స్తో సరైన రేటుకి ప్రీమియం అనుభూతినివ్వడం ఇం దుకు కీలకమని చెప్పారు. భారీ రుణభారంతో కుంగుతున్న జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17న సర్వీసులను నిలిపివేసింది. దీంతో 20,000 మంది పైచిలుకు ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కంపెనీని రుణదా తలు వేలానికి ఉంచాయి. ఎతిహాద్ ఎయిర్ వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, ఎన్ఐఐ ఎఫ్ సంస్థలు షార్ట్లిస్ట య్యాయి. ఇవి మే 10లోగా తుది బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంది. అయితే ప్రధానమైన స్లాట్స్, వి మానాలు, పైలట్లు, ఉద్యోగులు సంస్థ చేజారిపో తుండటంతో బిడ్డర్స్ కూడా ఆసక్తి చూపకపోవచ్చే మోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్లాట్స్ కేటాయింపు తాత్కాలికమే: కేంద్రం విమానాశ్రయాల్లో జెట్ ఎయిర్వేస్ స్లాట్స్‌ను ఇతర సంస్థలకు కేటాయించడం తాత్కాలికం మాత్రమేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంగళవారం తెలిపింది. జెట్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభించిన వెంటనే తిరిగి అప్పగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. జెట్ ఎయిర్వేస్ సర్వీసుల రద్దు కార ణంగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకే మూడు నెలల పాటు తాత్కాలికంగా జెట్ స్లాట్స్‌ను ఇతర ఎయిర్ లైన్స్‌కు ఇవ్వనున్నట్లు కేంద్రం వివరించింది. స్లాట్స్ కేటాయింపు పారదర్శ కంగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ కమిటీలో ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ, ప్రైవేట్ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ తదితర సంస్థల ప్రతినిధులు ఉంటారు. -
ఇండియాలో మూతపడ్డ 12 ఎయిర్‌లైన్ కంపెనీలు
-
విస్తారా ‘24–గంటల’ ఆఫర్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తారా మరోసారి పండుగల ఆఫర్‌ను ప్రకటించింది. ‘24–అవర్స్ ఓన్లీ’ పేరుతో అన్ని పన్నులతో కలిపి రూ.999కే విమాన ప్రయాణమని తెలిపింది. ఈ ఆఫర్ ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్‌లకు వర్తిస్తుందని తెలిపింది. అయితే, ప్రారంభ టికెట్ ధర ఆఫర్ పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా నుంచి గువాహటి మార్గానికి మాత్రమే పరిమితమని పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం 12:01 సమయానికి బుకింగ్స్ ప్రారంభం కాగా, డిసెంబర్ 27 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వరకు ప్రయాణాలకు ఆఫర్ వర్తిస్తుంది. ఇతర మార్గాలలో రూ.1,199 నుంచి రూ.2,599 టికెట్ ధరను ఆఫర్ చేసింది. -
జెట్‌పై నేడు టాటా సన్స్ భేటీ..
ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో వాటా కొనుగోలు చేసే ప్రతిపాదనపై టాటా సన్స్ అంతర్గతంగా సమాలోచనలు జరుపుతోంది. ఇందుకు సంబంధించి సంస్థ బోర్డు శుక్రవారం సమావేశమయ్యే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ‘జెట్ ఎయిర్వేస్ కోసం బిడ్ చేసే ప్రతిపాదనపై చర్చించేందుకు టాటా సన్స్ బోర్డు శుక్రవారం సమావేశమవుతుంది‘ అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, టాటా సన్స్, జెట్ ఎయిర్వేస్ ప్రతినిధులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఊహాగానాలపై తాము స్పందించబోమని టాటా సన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ తమ సిబ్బందికి జీతాలివ్వడంలోనూ, లీజుకు తీసుకున్న విమానాల అద్దెలు చెల్లించడంలోనూ విఫలమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,261 కోట్ల మేర నికర నష్టాన్ని ప్రకటించింది. నిధుల సమీకరణలో భాగంగా 6 బోయింగ్ 777 విమానాలను విక్రయానికి ఉంచింది కూడా. విలీనానికి అంగీకరిస్తేనే? ఇప్పటికే విమానయాన సేవల వెంచర్స్ ఉన్న టాటా సన్స్.. తాజా పరిస్థితుల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసే ప్రయత్నాలపై దృష్టి సారించింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తార పేరిట ఒక వెంచర్‌ను, మలేషియాకి చెందిన ఎయిర్‌ఏషియాతో కలిసి ఎయిర్ ఏషియా ఇండియా పేరిట మరో విమానయాన వెంచర్‌ను నిర్వహిస్తోంది. ఈ వెంచర్స్‌కి ఉపయోగపడేలా ఉంటే జెట్ ఎయిర్వేస్లో వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. వీటి ప్రకారం జెట్ ఎయిర్వేస్ను పూర్తిగా విలీనం చేసుకుంటే శ్రేయస్కరమని విస్తార మాతృసంస్థ టాటా–సింగపూర్ ఎయిర్‌లైన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయొచ్చు. దీనిలో జెట్ వైస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కుటుంబం, జెట్‌లో వాటాలు ఉన్న ఎతిహాద్ ఎయిర్వేస్, టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వాములుగా ఉంటారు. షేరు జూమ్.. టాటా సన్స్ టేకోవర్ వార్తల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ షేరు గురువారం దాదాపు 26 శాతం దాకా ఎగిసింది. బీఎస్ఈలో 24.5 శాతం పెరిగి రూ.320.95 వద్ద క్లోజయింది. అటు ఎన్ఎస్ఈలో 26.41 శాతం ఎగిసి రూ. 326 వద్ద ముగిసింది. -
ట్రూజెట్... చిల్డ్రన్స్ డే ప్రయాణం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానయాన రంగ సంస్థ ‘ట్రూజెట్’ పేద పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 40 మంది పిల్లలను బుధవారం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి సేలంకు తీసుకెళ్లింది. వీరంతా తమిళనాడుకు చెందిన ఎస్ఆర్వీవీ పాఠశాల విద్యార్థులు. వెల్లప సెంబనా గౌండర్ మెమోరియల్ ట్రస్ట్ సాయంతో పిల్లలకు విమానయాన అవకాశం కలిగింది. ‘వింగ్స్ ఆఫ్ హోప్’ కార్యక్రమం కింద ఏటా 300 మంది పేద పిల్లలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ట్రూజెట్‌ను ప్రమోట్ చేస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్ కమర్షియల్ హెడ్ సెంథిల్ రాజా తెలియజేశారు. -
ఎయిరిండియాకు రూ. 980 కోట్ల నిధులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కేంద్రం మూలధన నిధుల కింద రూ. 980 కోట్లు సమకూర్చనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు పౌర విమానయాన శాఖ.. పార్లమెంటు ఆమోదాన్ని కోరింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 11,698 కోట్ల అదనపు వ్యయాలకు సంబంధించి మంగళవారం కేంద్రం పార్లమెంటు ముందు ఉంచిన సప్లిమెంటరీ గ్రాంట్ ప్రతిపాదనల్లో ఇది కూడా ఉంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియాను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన 2012 నాటి పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా కేంద్రం ఈక్విటీ పెట్టుబడులు సమకూరుస్తూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 650 కోట్లు సమకూర్చింది. సుమారు రూ. 48,000 కోట్ల మేర రుణభారం ఉన్న ఎయిరిండియాకు మొత్తం మీద ఇప్పటిదాకా కేంద్రం రూ. 27.195 కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడులు అందించింది. -
‘విస్తార’ విస్తరణ!
న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్థ ’విస్తార’... దేశీ, విదేశీ రూట్లలో కార్యకలాపాలను భారీగా విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 19 ఎయిర్‌బస్, బోయింగ్ విమానాలకు ఆర్డరు ఇవ్వనుంది. వీటి విలువ 3.1 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 21,344 కోట్లు) ఉండనుంది. అలాగే ఏ320 నియో రకానికి చెందిన మరో 37 విమానాలను లీజుకు తీసుకోనుంది. విస్తార బుధవారం ఒక ప్రకటనలో ఈ మేరకు విస్తరణ ప్రణాళికలను వివరించింది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తార.. కార్యకలాపాలు ప్రారంభించి మూడేళ్లు దాటింది. ప్రస్తుతం కంపెనీకి ఏ–320 రకం విమానాలు 21 ఉన్నాయి. 22 ప్రాంతాలకు వారానికి 800 పైచిలుకు ఫ్లయిట్స్ నడుపుతోంది. ఈ ఏడాది విదేశీ రూట్లలో కూడా సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది. రెండు సంస్థలతో ఒప్పందాలు.. కార్యకలాపాల విస్తరణ నేపథ్యంలోనే కొత్తగా ఎయిర్‌బస్ సంస్థ నుంచి ఏ320 నియో రకానికి చెందిన 13 విమానాలు, బోయింగ్ నుంచి 6 డ్రీమ్‌లైనర్స్‌ను (787–9 ఎయిర్‌క్రాఫ్ట్) కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు విస్తార పేర్కొంది. ఎయిర్‌బస్‌తో ఒప్పందం ప్రకారం విస్తార ముందుగా ఏ320, ఏ321 రకానికి చెందిన 13 విమానాలను కొనుగోలు చేయనుంది. సందర్భాన్ని బట్టి మరో ఏడు ఏ320 రకం విమానాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే లీజింగ్ కంపెనీల నుంచి మరో 37 కొత్త ఏ320 నియో విమానాలను కూడా విస్తార లీజు కు తీసుకోనుంది. నియో విమానాలు 2019– 2023 మధ్య డెలివరీ అయ్యే అవకాశముంది. ఈ విమానాలను దేశీ రూట్లలోనూ, సందర్భాన్ని బట్టి అంతర్జాతీయ రూట్లలోనూ ఉపయోగించనున్నారు. ఇక, బోయింగ్‌తో ఒప్పందం ప్రకారం విస్తార 787–7 డ్రీమ్‌లైనర్ విమానాలు ఆరు కొనుగోలు చేయనుంది. 787 డ్రీమ్‌లైనర్ కోవకి చెందిన మరో నాలుగింటినీ కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. -
నేపాల్ విమాన ప్రమాదం
-
కఠ్మాండు ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలిన విమానం
-
విమానం క్రాష్‌ల్యాండ్: 50 మంది మృతి
కఠ్మాండు : నేపాల్‌లోని కఠ్మాండు విమానాశ్రయంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం కఠ్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 50మంది ప్రయాణికులు మరణించినట్టు సమాచారం. మరో 20 మంది ప్రయాణికులను సహాయక సిబ్బంది కాపాడి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఢాకా నుంచి వచ్చిన విమానం.. ఇక్కడి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఒక్కసారిగా నిలకడ కోల్పోయి.. క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. విమానం క్రాష్‌ల్యాండ్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిమాపక బృందాలు విమానంలో ఎగిసిన మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 20మంది ప్రయాణికులను కూలిన విమానం నుంచి కాపాడామని, మరింతమందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని నేపాల్ ఆర్మీ తెలిపింది. నలుగురు సిబ్బంది, 67మంది ప్రయాణికులు సహా మొత్తం 71మంది విమానంలో ఉన్నారు. వారిలో 50 మంది ప్రయాణికులు మృతిచెందారని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. సహాయకర చర్యలు కొనసాగుతున్నాయని, కూలిన విమానంలో ప్రాణాలతో ఉన్న కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. తమ కళ్లముందే విమానం క్రాష్‌ల్యాండ్ అయిందని, ఒక్కసారిగా దట్టమైన పొగలు ఎగిశాయని ఎయిర్‌పోర్టులో ఆ సమయంలో ఉన్న పలువురు ప్రయాణికులు ట్వీట్ చేస్తున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విమానయాన సంస్థలపై సీసీఐ జరిమానా
న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మూడు విమానయాన సంస్థలపై రూ.54 కోట్ల మేర జరిమానా విధించింది. సరుకుల రవాణాపై సర్ చార్జీ విధించే విషయమై అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడినందుకు సీసీఐ ఈ జరిమానా విధించింది. జెట్ ఎయిర్వేస్పై రూ.39.81 కోట్లు, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో)పై రూ.9.45 కోట్లు, స్పైస్‌జెట్‌పై రూ.5.10 కోట్ల చొప్పున జరిమానాను సీసీఐ వడ్డించింది. ఇదే ఫిర్యాదుపై మూడేళ్ల కాలంలో సీసీఐ ఉత్తర్వులు జారీ చేయడం ఇది రెండోసారి. ఇలాంటి పోటీ వ్యతిరేక విధానాలను విడనాడాలని ఆయా విమాన సంస్థలను తాజాగా సీసీఐ ఆదేశించింది. అయితే అప్పుడు విధించిన జరిమానా(రూ.257 కోట్లు) కంటే ఇప్పుడు వడ్డించిన జరిమానా తక్కువ కావడం విశేషం. 2015, నవంబర్‌లో సీసీఐ (అప్పట్లో కాంపిటీషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్) జెట్ ఎయిర్వేస్పై రూ.152 కోట్లు, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌పై రూ.64 కోట్లు, స్పైస్‌జెట్‌పై రూ.43 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఈ జరిమానాలపై ఆయా కంపెనీలు అప్పీల్ చేయడంతో ఆ ఉత్తర్వులను సీసీఐ పక్కనపెట్టింది. విచారణ అనంతరం తాజాగా సీసీఐ తక్కువ జరిమానాలను విధించింది. ఫ్యూయల్ సర్‌చార్జీ ముసుగులో రవాణా చార్జీలను అధికంగా విధించడం వినియోగదారులపై భారాన్ని మోపడమే కాకుండా ఆర్థిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీసీఐ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఎయిర్ ఇండియా, గో ఎయిర్‌లపై ఎలాంటి జరిమానాను సీసీఐ విధించలేదు. -
ఎఫ్‌డీఐ నిబంధనలపై ఎయిర్‌లైన్స్ ఆందోళన
న్యూఢిల్లీ: భారత విమానయాన సంస్థల్లో విదేశీ ఎయిర్‌లైన్స్‌యేతర సంస్థలకు 100% యాజ మాన్య హక్కులు ఇచ్చే నిబంధనపై వివిధ విమానయాన సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది భద్రతాపరమైన సమస్యలు సృష్టించవచ్చని విమానయాన సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో ఆందోళన వ్యక్తం చేశాయి. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్, ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఏవియేషన్ చాలా కీలకమైన రంగం కావడంతో ఈ విధమైన ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు వల్ల భద్రతపరమైన సమస్యలు తలెత్తవచ్చని వారు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
దీపా మలిక్ పట్ల దురుసు ప్రవర్తన
న్యూఢిల్లీ: పారా ఒలింపిక్ రజత పతక విజేత దీపా మలిక్ పట్ల ఎయిర్ లైన్స్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. వీల్ చైర్ సర్వీస్, క్యాబిన్ క్రౌ సిబ్బంది తన పట్ల దురుసుగా వ్యవహరించిన తీరుపై ఆమె డొమెస్టిక్ విమానయాన సంస్థ విస్తారాకు ఫిర్యాదు చేశారు. టాటా గ్రూప్, సింగపూర్ కు చెందిన సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యూకే 902 విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి మంగళవారం బయలుదేరారు. ఫిజికల్ హ్యాండీక్యాప్ వ్యక్తులను వీల్ చైర్ నుంచి సీట్లోనికి చేరవేయడం సరిగాలేదని, ఫ్లైట్ ఆలస్యంపై సిబ్బందిని అడగ్గా గట్టిగా అరిచి సమాధానం చెప్పారని దీపా పేర్కొన్నారు. ఈవిషయంలో విస్తారా తగుచర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆమె ఫీడ్ బ్యాక్ బుక్కులో రాశారు. దీనిపై స్పందించిన విస్తారా సీఈఓ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని దీనిపై పర్సనల్ గా విచారణ జరుపుతానని ఆమెకు హామీ ఇచ్చారు. -
చౌక ధరకు విమానం టికెట్ కావాలా..?
మీరు విహారయాత్రకు వెళ్లాలని ఉంది. కానీ విమానం టికెట్ కొనడం మరీ ఖరీదైన వ్యవహారంగా భావిస్తున్నారా? మీ కన్నా మీ తోటి ప్రయాణికుడికి తక్కువ ధరకు విమానం టికెట్ ఎలా దొరికిందని ఆశ్చర్యపోతున్నారా? తక్కువ ధరకు టికెట్ బుక్ చేసుకోవడానికి ఏమిటి మార్గాలు అన్వేషిస్తున్నారా? అయితే, ఈ టిప్స్ మీకోసమే.. ఒకటే విమానాయాన సంస్థను చెక్ చేస్తున్నారా? ఈరోజుల్లో విమాన సేవల వెబ్సైట్లు, విమాన టికెట్ ధరల యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ప్రయాణికులు కేవలం ఒకే ఎయిర్‌లైన్స్ సంస్థ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకు టికెట్ లభిస్తుందని మీరు ఎప్పుడూ ఫలానా ఎక్స్ సంస్థ విమానంలో ప్రయాణిస్తూ ఉండవచ్చు. కానీ మరో ఎయిర్‌లైన్స్ ఆ రూట్లో కొత్త సేవలు ప్రారంభించి ఉండవచ్చు. పోటీ కారణంగా మరో సంస్థ ధరలు తగ్గించి ఉండవచ్చు. కాబట్టి ముందుగా చెక్ చేసుకొని.. మిగతా సంస్థల ఆఫర్లపై ఓ లుక్కేసిన తర్వాత టికెట్ బుక్ చేసుకోండి. ఆకస్మిక.. హడావిడి కొనుగోళ్లు.. విమాన టికెట్లను ఆదరాబాదరాగా బుక్ చేసుకోవడం, ఆకస్మికంగా, అకస్మాత్తుగా కొనుగోలు చేయడం అంత మంచిది పద్ధతి కాదు. మీకున్న ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని.. పోటీ సంస్థల ఆఫర్లన్నింటినీ ఆసారి చూసిన తర్వాత టికెట్ బుక్ చేసుకోండి. ఒకవేళ హడావిడిగా టికెట్ బుక్ చేసుకున్నా దానిని 24 గంటల్లోపు రద్దుచేసుకొనే అవకాశాన్ని చాలా విమానాయాన సంస్థలు ఇస్తున్నాయి కాబట్టి ఆ ఆప్షన్ ను ఉపయోగించుకోవచ్చు. బుక్ చేసుకోవడంలోనూ మెలుకువ విమాన టికెట్‌ను సరైన రోజున బుక్ చేసుకోవడం వల్ల కూడా టికెట్ ధరలో ప్రయాణికులకు కలిసి వచ్చే అవకాశముంది. హోప్పర్ అధ్యయనం ప్రకారం గురువారం నాడు దేశీయ టికెట్లు, వీకెండ్స్ (శుక్ర,శని, ఆదివారాల్లో) విదేశీ టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధర చాలా చౌకగా లభించే అవకాశముంది. గురువారం నాడు బుక్ చేసుకొనే టికెట్ల ధర విషయంలో బేరసారాలకు కూడా అవకాశముంటుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రత్యామ్నాయ విమానాశ్రయాలపై లుక్ వేయడం.. చాలావరకు ప్రపంచ ప్రముఖ నగరాల్లో ఒకటి కన్నా ఎక్కువ ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు న్యూయార్క్‌లో న్యూవార్క్, జేఎఫ్‌కే, లా గార్డియో విమానాశ్రయలు, లండన్‌లో గేట్‌విక్, సాంస్టెడ్, హిత్రూ, వాషింగ్టన్ డీసీలో రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం, డుల్స్ అంతర్జాయ విమానాశ్రయం, బాల్టీమోర్-వాషింగ్టన్ విమానాశ్రయం వంటివి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, టికెట్ కొనేముందు మీరు వెళ్లే ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఎయిర్‌పోర్టులు, ఆ ఎయిర్‌పోర్టుల నుంచి మీరు వెళ్లాల్సిన ప్రదేశాలు, ఎక్కడి నుంచి వెళితే ధర కలిసివస్తుందని అన్నది బేరిజు వేసుకొని బెస్ట్ ఆఫర్ ను ఎంచుకోవడం మంచిది. రూట్ కూడా చూసుకోవాలి! మీరు హంగేరిలోని బుడాపెస్ట్ వెళ్లాలనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్లేందుకు ఏ ఎయిర్‌లైన్స్ కూడా ఆఫర్ ఇవ్వడం లేదు. టికెట్ ధర తడిసి మోపడయ్యే అవకాశముంది. అలాంటప్పుడు తెలివైన ప్రయాణికుడు బుడాపెస్ట్ సమీపంలోని ప్రదేశాల్లో ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అని వాకబు చేస్తాడు. నేరుగా వెళ్లడం కంటే వియత్నాం నుంచో, మ్యూనిచ్ నుంచో రూట్ మారిస్తే.. ఎంతో కలిసివచ్చే అవకాశం కూడా ఉంటుంది. యూరోపియన్ ఎయిర్‌లైన్స్ చాలావరకు ఆల్ట్రానేట్ డెస్టినేషన్స్‌కు చౌక ధరకే చాలా ఆఫర్లు ఇస్తున్నాయి. ఒక్క యూరప్ అనే కాదు.. మీరు ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. ఆ సమీప ప్రాంతాలకు ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? నేరుగా కాకుండా రూట్ కొంచెం మార్చడం వల్ల ఏమైనా కలిసి వస్తుందా అన్నది చెక్ చేసుకుంటే బాగుంటుంది. డేట్స్తోనూ కలిసి వస్తుంది కొన్ని రూట్లలో వచ్చివెళ్లే తేదీల్లో కొద్దిగా మార్పులు చేసుకున్నా.. విమాన ధరల విషయంలో బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశముంది. బుధవారాల్లో ముఖ్యంగా డిపార్చర్ పెట్టుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయల్లో 60 డాలర్ల వరకు కలిసి వచ్చే అవకాశముంది. అది ఆదివారమైతే తడిసి మోపేడు అవుతుంది. అలాగే అంతర్జాతీయ ప్రయాణాల్లో రిటర్న్ జర్నీకి కూడా బుధవారం బెస్ట్ డేట్ అంటున్నాయి అధ్యయనాలు. దేశీయ ప్రయాణాల్లో మంగళవారం బాగా చౌక ధరకు టికెట్లు దొరికే అవకాశముంది. తేదీల విషయంలో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే పెద్దమొత్తంలో సేవ్ చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. పన్నులు, ఫీజులు.. ఆఫర్లు ఎలా ఉన్నా అదనపు ఫీజులు, ఎయిర్‌పోర్టు పన్నులు తదితరాలు తడిసి మోపేడయ్యే అవకాశముంది. గతంలో కన్నా వీటి విషయంలో విమాన పరిశ్రమ ఇప్పుడు పారదర్శకత పాటిస్తోంది. కాబట్టి, లగేజ్ ఫీజులు, ఎక్స్ట్రా చార్జులు వంటివి ముందే తెలుసుకొని.. మనకు సౌలభ్యంగా ఉన్న ఆప్షన్స్ ఎంచుకోవడం ఉత్తమమైన పద్ధతి. లేట్ బూకింగ్తో చిక్కులే! ప్రస్తుత రోజుల్లో అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని ప్రయాణలు చేయడం అంటే అది మంచి పద్ధతి కాదు. లేట్‌గా బుక్ చేసుకొనే వారికి టికెట్ ధరలు చుక్కలు చూపించే అవకాశముంది. కాబట్టి ఏదైనా విదేశీయానం, విహారయాత్రకు ప్లాన్ చేసుకున్నప్పుడు కనీసం 25రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోండి. ముందు అన్ని ఆఫర్లను శోధించి.. మీకు చౌకగా, ఆనందంగా ప్రయాణం సాగేలా చూసుకోండి -
ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్లు
-
చుక్కలు చూపించిన దీపిక!
అదో ప్రముఖ విమానయాన సంస్థ... తమకు ప్రచారకర్తగా ఓ స్టార్ హీరోయిన్ కావాలనుకున్నారు. దీపికా పదుకొనేని మించిన స్టార్ ఎవరుంటారు? అనుకున్నారు. పైగా నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్‌కే పరిమితమైన ఆమె ఇప్పుడిప్పుడే హాలీవుడ్లో కూడా ఫేమస్ అయిపోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్‌గా కూడా వర్కవుట్ అవుతుందని వాళ్ల ఆలోచన. దీపిక క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. అంతే.. తమ ఎయిర్‌లైన్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరించాలని అడిగారు. యాడ్ చిత్రీకరణ కోసం నాలుగు రోజులు కాల్షీట్ అడిగారు. దీపిక సంతోషంగా ఓకే చెప్పేశారు. కానీ ఆమె అడిగిన పారితోషికం విని, ఆ కంపెనీ ప్రతినిధులు కళ్లు తేలేశారు. ఏదో రెండు.. మూడు కోట్లు అడుగుతుందని లెక్కలేసుకున్నారట. కానీ, దీపిక ఎనిమిది కోట్లు అడగడంతో షాక్ తిన్నారు. ఆ తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుని వేరే హీరోయిన్ని వెతికే పనిలో పడ్డారని సమాచారం. -
జెట్ ఎయిర్ వేస్ 20 శాతం డిస్కౌంట్ ఆఫర్
ముంబై: విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ.. దేశీ విమానాల్లోని బిజినె స్, ఎకానమీ తరగతుల టికెట్ బేస్ ధరల్లో 20 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. జూన్ 2-6 మధ్యకాలంలో టికెట్లను బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు జూన్ 25 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని వివరించింది. -
హైదరాబాద్ టూ చంఢీగర్ వయా ఢిల్లీ
విస్తారా కొత్త సర్వీసు ప్రారంభం చంఢీగర్: దేశీయ విమానయాన సంస్థ విస్తారా మరో నూతన సర్వీసును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. సింగపూర్ ఎయిర్‌లైన్సు, టాటాసన్స్ తో సంయుక్తంగా పనిచేసే విస్తారా ఢిల్లీ మీదుగా హైదరాబాద్ నుంచి చంఢీగర్కు కొత్త సర్వీసును సోమవారం ప్రారంభించారు. త్వరలో ఢిల్లీ మీదుగా చంఢీగర్ నుంచి బెంగుళూరు, పుణే, ముంబై, భువనేశ్వర్, అహ్మదాబాద్ సర్వీసులను కూడా నడుపుతామని విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ అధికారి సంజీవ్ కపూర్ తెలిపారు. చంఢీగర్, ఢిల్లీ మధ్య ధర రూ. 1990 గా ఉంది. ఈ రూటులో బిజినెస్, ఎకానమీనే కాకుండా ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను ప్రవేశపెట్టాం. ఉత్తర భారతంలో చంఢీగర్ కీలక ప్రాంతం. ఇక్కడ పర్యాటకానికి, వ్యాపారానికి పుష్కల అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్, విశ్రాంత ప్రయాణికులపైనే ప్రధానంగా దృష్టి సారించాం. కొత్త రూటు అంతర్జాతీయ సర్వీసులకు అనుసంధానం చేసేందుకు వీలుగా ఉంటుందని సంజయ్ కపూర్ అన్నారు. నూతనంగా ప్రారంభమైన సర్వీసుతో కలిపి ఉత్తర భారతంలో ఆరు, దేశవ్యాప్తంగా 12 మార్గాల్లో విస్తారా సేవలు అందిస్తోంది. ప్రస్తుతానికి తొమ్మిది విమానాలున్నాయి. అక్టోబర్ కల్లా మరో నాలుగు కొనుగోలు చేస్తాం. వారానికి 16 మార్గాల్లో 417 సర్వీసులు నడుపుతున్నాం. త్వరలో వీటిని 580 కి పెంచుతామని కపూర్ పేర్కొన్నారు. -
విమానంలో పుట్టిన 'జెట్ స్టార్'
ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు ఎయిర్ లైన్స్ పేరు పెట్టుకుంది. నిండు గర్భిణిగా ఉన్న మహిళ జెట్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తుండగా నొప్పులు రావడంతో ఆమెకు సిబ్బంది సహా... విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు డాక్టర్లు కూడ సహకరించారు. దీంతో సుఖప్రసవాన్ని పొందిన ఆమె.. పుట్టిన మగ బిడ్డకు ఎయిర్స్ లైన్స్ పేరు పెట్టుకుంది. ఏప్రిల్ 22 శుక్రవారం సింగపూర్ నుంచి మయన్మార్ కు ప్రయాణిస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో సా లెర్ టు అనే మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఉన్నట్టుండి ఆమెకు నొప్పులు రావడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది సహా విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గరు డాక్టర్లు సహకరించి సుఖ ప్రసవం జరిగేట్లు చూశారు. విమాన సిబ్బంది తనపై చూపించిన అభిమానానికి కృతజ్ఞతతో సా లెర్ తన బిడ్డకు 'జెట్ స్టార్' అని పేరు పెట్టుకుంది. అనుకోకుండా ఆమె ఇంటిపేరు కూడ స్టార్ అని ఉండటంతో ఆపేరు కలసి వచ్చింది. విమాన ప్రయాణంలో ఎటువంటి ప్రమాదం లేకుండా మహిళకు సహకరించి ఓ అతిచిన్న ప్రయాణీకుణ్ని సురక్షితంగా ప్రసవించేందుకు తమ సిబ్బంది సహాయపడ్డందుకు ఎంతో గర్వంగా ఉందని ఎయిర్ లైన్స్ తెలిపింది. సహ ప్రయాణీకులతో పాటు బేబీ జెట్ స్టార్ కూడ ప్రయాణించి ప్రశంసలు అందుకున్నాడని, ఇది ఎప్పటికీ మరచిపోలేని సంఘటన అని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. జెట్ స్టార్ పుట్టిన సందర్భాన్ని వేడుకగా జరుపుకునేందుకు వెయ్యి డాలర్ల ఖరీదైన పిల్లల ఉత్పత్తులను జెట్ స్టార్ కుటుంబానికి బహుమతిగా ఇచ్చింది. మా విమానంలో సా జెట్ స్టార్ పుట్టిన విషయాన్ని తెలియజేయడం మాకెంతో గర్వంగా ఉందని జెట్ ఎయిర్ వేస్ పోస్ట్ చేసింది. కస్టమర్ సర్వీస్ మేనేజర్ నేతృత్వంలో సిబ్బంది సహాయం అందించారని, ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలు 3K583 విమానంలో యాన్ గన్ లో ల్యాండ్ అయ్యారని, అనంతరం యాన్ గన్ లోకల్ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారని ఎయిర్ లైన్స్ పోస్ట్ లో తెలిపింది. 6 పౌండ్ల, ఏడు ఔంసుల బరువుతో పుట్టిన శిశువు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని, ఏషియా విమానంలో ప్రసవం జరగడం ఇదే మొదటి సారని, వెయ్యి డాలర్ల ఖరీదైన పిల్లల ఉత్పత్తులను జెట్ స్టార్ కుటుంబానికి బహుమతిగా ఇచ్చామని పోస్ట్ లో వివరించారు. -
ఎయిర్ లైన్స్ స్టీవార్డెస్ బ్యాగ్ లో 30 కిలోల కొకైన్
లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల కొకైన్ ను పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా మహిళ తీసుకు వెడుతున్న క్యారీ బ్యాగ్ లో కొకైన్ ఉన్నట్లు గుర్తించామని డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి వెల్లడించారు. విమాన సిబ్బందిగా భావిస్తున్న ఆమె... శుక్రవారం టర్మినల్ కు వచ్చి... అక్కడ తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని చూసి, తనతో తెచ్చిన బ్యాగ్ లు వదిలి తప్పించుకొని పారిపోయిందని స్పెషల్ ఏజెంట్ తిమోతి మాసినో తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు డీఈఏ తెలిపింది. అయితే నిందితురాలి ఆచూకీకోసం దర్యాప్తు ప్రారంభించిన అధికారులు సోమవారం సాయంత్రానికి ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆమె ఏ ఎయిర్ లైన్స్ లో పనిచేస్తోంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఖంగారుగా ఓ ఫోన్ కాల్ చేసిన తర్వాత అక్కడినుంచీ పారిపోయిన ఆమె ఏ భాషలో మాట్లాడిందన్నది సరిగా గుర్తించలేకపోయామని, అయితే ఆమె ఎస్కలేటర్ నుంచి పారిపోయేప్పుడు ఓ జత డిజైనర్ షూ వదిలి వెళ్ళిపోయిందని ఓ వార్తా సంస్థ తమ వెబ్ సైట్ లో వెల్లడించినట్లు లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టు పోలీసులు, ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ అధికారులు తెలిపారు. -
టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్‌కు 20 ఎయిర్‌బస్‌లు
-
టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్‌కు 20 ఎయిర్‌బస్‌లు
దోహా: టాటా-ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ సంస్థ సింగపూర్‌కు చెందిన బీఓసీ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీ నుంచి 20 ఎయిర్‌బస్ విమానాలను లీజుకు తీసుకోనున్నది. ఈ సెప్టెంబర్-అక్టోబర్ నుంచి ఈ విమానాలను టాటా-ఎస్ఐఏకు అందజేయడం ప్రారంభిస్తామని బీఓసీకు చెందిన ఇన్వెస్టర్ రిలేషన్స్ హెడ్ క్లెయిరీ లియో వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్న ఐఏటీఏ వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె ఈ వివరాలు తెలిపారు. కాగా ఈ సంస్థ ఇప్పటికే జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్- ఈ రెండు భారత విమానయాన సంస్థలకు కొన్ని విమానాలను లీజుకు ఇచ్చింది. టాటా సన్స్ సంస్థ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి 51:49 భాగస్వామ్యంతో టాటా-ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ఏ 320-200, ఏ 320-200(నియో) విమానాల ద్వారా తన సర్వీసులనందజేయనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించనున్నది. ఢిల్లీ కేంద్రంగా ముంబై, గోవా, పాట్నా, చంఢీగర్, శ్రీనగర్, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు విమాన సర్వీసులను నిర్వహించాలని ఈ సంస్థ యోచిస్తోంది. ఆ తర్వాత పుణే, లక్నో, వారణాసి, జైపూర్, కోల్‌కత, అమృత్సర్, బగ్దోగ్రా, ఇండోర్, కొచ్చిన్‌లకు విమాన సర్వీసులను విస్తరించనున్నది. ఈ సంస్థ విమానయాన సర్వీసులకు అనుమతిని ఇంకా పొందలేదు. కాగా టాటా గ్రూప్, ఢిల్లీకి చెందిన టెలిస్ట్రాలు భారత వెంచర్ భాగస్వాములుగా ఉన్న ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి.