భారతదేశంలో ఏవియేషన్ రంగంలో బలమైన వృద్ధి చెందుతోంది. పది సంవత్సరాల ముందు 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎయిర్‌లైన్ మార్కెట్.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా అవతరించింది.
పది సంవత్సరాల క్రితం భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో అతి చిన్న మార్కెట్‌గా ఉండేది. ఆ సమయంలో ఇండోనేషియా 4వ స్థానంలో,బ్రెజిల్ 3వ స్థానంలో, అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. అయితే ఇప్పుడు భారత్ ఎయిర్‌లైన్ మార్కెట్ భారీగా వృద్ధి చెంది బ్రెజిల్‌ను వెనక్కు నెట్టి ఇండియా ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఇండోనేషియా ఐదు, బ్రెజిల్ నాలుగు, అమెరికా రెండు, చైనా మొదటి స్థానాల్లో ఉన్నాయి. కేవలం పది సంవత్సరాల్లో భారాతదేశ ఎయిర్‌లైన్ సీట్ల వృద్ధి రేటు మొదటి ఐదు దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి పెరిగింది.
గత 10 సంవత్సరాలలో ఇండిగో మార్కెట్ వాటా రెట్టింపు అయింది. 2014లో 32 శాతం ఉన్న ఇండిగో సామర్థ్యం నేడు 62 శాతానికి చేరింది. ఇండిగో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9 శాతంగా ఉందని తెలుస్తోంది. భారతదేశంలో డొమెస్టిక్ విమానాల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో భారత్ ఈ రంగంలో మరింత వృద్ధి చెందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment