2024లో దేశంలో ఎక్కువ మంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాను హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఇందులో ఏ రాష్ట్రంలో ఎంతమంది ధనవంతులనున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2020తో పోలిస్తే ధనవంతుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. ఇది ఆ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను మాత్రమే కాకుండా.. సంపద సృష్టిని ప్రతిబింబిస్తుంది.
● భారతదేశంలో ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాలో అగ్రగామిగా మహారాష్ట్ర ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో మొత్తం 470 మంది ధనవంతులున్నట్లు సమాచారం. 2020తో (247 మంది) పోలిస్తే ఈ సంఖ్య 222 పెరిగినట్లు తెలుస్తోంది.
● 2020లో 128 మంది ధనవంతులతో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ఇప్పుడు 213మందితో మళ్ళీ అదే స్థానంలో నిలిచింది.
● గుజరాత్ రాష్ట్రంలో 129 మంది, తమిళనాడులో 119 ధనవంతులున్నట్లు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో 2020లో వరుసగా 60, 65 మంది ధనవంతులు ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే గుజరాత్, తమిళనాడులో కూడా ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది.
● తెలంగాణాలో 109 మంది ధనవంతులు, కర్ణాటకలో 108 మంది ధనవంతులున్నట్లు నివేదికలో వెల్లడైంది. 2020లో ఈ రెండు రాష్ట్రాల్లో 54, 72 మంది ధనవంతులున్నారు. తెలంగాణ ఇప్పుడు ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల్లో కర్ణాటకకు అధిగమించింది.
● పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా 70, 40, 36, 28 మంది ధనవంతులున్నారు. 2020లో ఈ రాష్ట్రాల్లో ఉన్న ధనవంతుల సంఖ్య వరుసగా 32, 16, 9, 9 మాత్రమే. 2024లో ఈ రాష్ట్రాల్లో కుబేరుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
2020లో ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉన్న తమిళనాడు, కర్ణాటక ఈ సారి కొంత వెనుకబడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2024లో మన దేశంలో ఉన్న ధనవంతుల సంఖ్య 1,322 మంది. 2020లో ఈ సంఖ్య 693 మాత్రమే. దీని ప్రకారం 2024లో 629 మంది ధనవంతులు కొత్తగా జాబితాలోకి చేరినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment