rich people
-
దేశంలో అధిక ధనవంతులు గల రాష్ట్రాలు(ఫొటోలు)
-
ధనవంతులు ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాలు: తెలంగాణ ఎక్కడుందంటే..
2024లో దేశంలో ఎక్కువ మంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాను హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఇందులో ఏ రాష్ట్రంలో ఎంతమంది ధనవంతులనున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2020తో పోలిస్తే ధనవంతుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. ఇది ఆ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను మాత్రమే కాకుండా.. సంపద సృష్టిని ప్రతిబింబిస్తుంది. ● భారతదేశంలో ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాలో అగ్రగామిగా మహారాష్ట్ర ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో మొత్తం 470 మంది ధనవంతులున్నట్లు సమాచారం. 2020తో (247 మంది) పోలిస్తే ఈ సంఖ్య 222 పెరిగినట్లు తెలుస్తోంది. ● 2020లో 128 మంది ధనవంతులతో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ఇప్పుడు 213మందితో మళ్ళీ అదే స్థానంలో నిలిచింది. ● గుజరాత్ రాష్ట్రంలో 129 మంది, తమిళనాడులో 119 ధనవంతులున్నట్లు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో 2020లో వరుసగా 60, 65 మంది ధనవంతులు ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే గుజరాత్, తమిళనాడులో కూడా ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది. ● తెలంగాణాలో 109 మంది ధనవంతులు, కర్ణాటకలో 108 మంది ధనవంతులున్నట్లు నివేదికలో వెల్లడైంది. 2020లో ఈ రెండు రాష్ట్రాల్లో 54, 72 మంది ధనవంతులున్నారు. తెలంగాణ ఇప్పుడు ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల్లో కర్ణాటకకు అధిగమించింది. ● పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా 70, 40, 36, 28 మంది ధనవంతులున్నారు. 2020లో ఈ రాష్ట్రాల్లో ఉన్న ధనవంతుల సంఖ్య వరుసగా 32, 16, 9, 9 మాత్రమే. 2024లో ఈ రాష్ట్రాల్లో కుబేరుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.2020లో ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉన్న తమిళనాడు, కర్ణాటక ఈ సారి కొంత వెనుకబడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2024లో మన దేశంలో ఉన్న ధనవంతుల సంఖ్య 1,322 మంది. 2020లో ఈ సంఖ్య 693 మాత్రమే. దీని ప్రకారం 2024లో 629 మంది ధనవంతులు కొత్తగా జాబితాలోకి చేరినట్లు తెలుస్తోంది. -
భారతీయుల తీరుపై నితిన్ కామత్...
భారతదేశంలోని బిలియనీర్లలో ఒకరైన జరోధా సీఈఓ 'నితిన్ కామత్' ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లిష్టమైన ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం చెప్పారు. బెంగళూరు జరిగిన టెక్‌స్పార్క్స్ 2024 ఈవెంట్లో యువర్‌స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ.. భారతీయులు ధనవంతులను ఎందుకు ద్వేషిస్తారు? అని ప్రశ్నించారు.ధనవంతుల విషయంలో భారతీయులకు, అమెరికన్లకు మధ్య వ్యత్యసాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. యుఎస్‌లో ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదించి.. లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తే, అలాంటి విషయాలను న్యూస్ పేపర్ కవర్ పేజీ మీద ముద్రిస్తారు. అక్కడ ఇదంతా సర్వ సాధారణం.కానీ.. భారతదేశంలో ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు అంటే.. ఏదో తప్పుడు దారిలో డబ్బు సంపాదిస్తున్నారని చాలామంది భావిస్తారు. ఆ తరువాత వాళ్ళను ద్వేషించడం మొదలుపెడతారు. అమెరికా పూర్తిగా పెట్టుబడిదారీ సమాజం, భారత్ మాత్రం పెట్టుబడిదారీ సమాజంగా నటిస్తున్న సోషలిస్టు సమాజం అని అన్నారు. ఇప్పటికీ చాలామంది ప్రజల గుండెల్లో సోషలిస్టు భావాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైనా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భారతీయులు పేదరికాన్ని గౌరవ చిహ్నంగా ధరిస్తారని ఒకరు అన్నారు. భారతదేశంలో, ధనికులు తగిన పన్నులు చెల్లించకుండా, మోసాలకు పాల్పడుతున్నారని, పేద.. మధ్యతరగతి వర్గాలను దోపిడీ చేయడం ద్వారా ధనవంతులు అవుతున్నారని మరొకరు అభిప్రాయపడ్డారు. View this post on Instagram A post shared by Shradha Sharma (@shradhasharmayss) -
బిలియనీర్ల నగరం ముంబై
ముంబై: బిలియనీర్ల విషయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై తాజాగా బీజింగ్‌ను అధిగమించింది. మంగళవారం విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్టు ప్రకారం ముంబైలో 92 మంది అత్యంత సంపన్నులు ఉండగా బీజింగ్‌లో ఈ సంఖ్య 91గా ఉంది. ఇక చైనాలో మొత్తం 814 మంది బిలియనీర్లు ఉండగా భారత్‌లో 271 మంది ఉన్నారు. దేశీయంగా కుబేరుల మొత్తం సంపద 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 115 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత ఏడాది వ్యవధిలో ఆయన సంపద మరో 40 శాతం (33 బిలియన్ డాలర్లు) పెరిగింది. ఇక హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతో గణనీయంగా దెబ్బతిన్న గౌతమ్ అదానీ తిరిగి కోలుకున్నారు. ఆయన సంపద 62 శాతం వృద్ధి చెందింది. అంతర్జాతీయంగా అంబానీ పదో స్థానంలో ఉండగా, అదానీ 15వ స్థానంలో ఉన్నారు. 231 బిలియన్ డాలర్లతో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ నంబర్ వన్‌గా ఉన్నారు. కొత్త బిలియనీర్లయిన వారి విషయంలో చైనాను భారత్ అధిగమించింది. భారత్ నుంచి ఈ లిస్టులో 94 మంది చోటు దక్కించుకోగా, చైనా నుంచి 55 మందికి చోటు దక్కింది. గత ఏడాది వ్యవధిలో ముంబైలో 27 మంది బిలియనీర్లు కాగా, బీజింగ్‌లో ఆరుగురు మాత్రమే ఈ హోదా దక్కించుకున్నారు. -
Oxfam: దేశంలో 77శాతం సంపద ఎక్కడుందంటే..
భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే అయిదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్న విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత జీడీపీ వృద్ధి ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మెరుగ్గా ఉందన్న కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఒక వైపు మన జీడీపీ పెరుగుతుంటే, మరోవైపు ప్రజల్లో ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదిక ప్రకారం దేశ సంపదలో 77శాతం కేవలం 10శాతం ధనవంతుల చేతిలో ఉంది. ప్రస్తుతం ఇండియాలో 119 మంది బిలియనీర్లు ఉన్నారు. వారి సంపద గత పదేళ్లలో 10 రెట్లు పెరిగింది. రోజుకు కనీసం 70 మంది కొత్తగా మిలియనీర్లు అవుతున్న జాబితాలో చేరుతున్నారు. మరోవైపు విద్య, వైద్య ఖర్చులు భరించలేక దేశీయంగా ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. ఇండియాలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలపైనా సరైన దృష్టి సారించాలి. లేకుంటే, ప్రజల జీవితాలు మరింత దుర్భరంగా మారతాయి. ప్రభుత్వ ఆదాయాలూ పడిపోయి, దేశ ఆర్థిక పురోగతి దెబ్బతింటుందని నివేదిక చెబుతుంది. -
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..
Hurun India Rich List: దేశవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను 360 వన్ వెల్త్ అండ్ హురూన్ ఇండియా విడుదల చేసింది. దేశంలో అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ నిలిచారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఇందులో చోటు సంపాదించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతేడాది టాప్‌లో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానంలోకి చేరారు. ఆగస్టు చివరి నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా భారత్‌లోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది హురూన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వీటిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఉన్నారు. వీరిలో అయిదుగురు మహిళలకు స్థానం దక్కింది. మొత్తం అందరి సంపద విలువ ఏకంగా రూ.5.25 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే వీరి సంపద ఏకంగా 33 శాతం పెరగడం విశేషం. ఈ 105 మందిలో 87 మంది హైదరాబాద్ వారే కావడం గమనార్హం. కొత్తగా 33 మంది ఇందులో చోటు సంపాదించారు. వీరి ద్వారానే మొత్తం రూ.76 వేల కోట్లు జమైనట్లు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. దివీస్ మురళి రూ. 55,700 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మేధా సర్వో డ్రైవ్స్ నుంచి అయిదుగురు ఈ లిస్ట్‌లో ఉన్నారు. హెటెరో ల్యాబ్స్ జి.పార్థసారధి రెడ్డి కుటుంబం రూ.21,900 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. అరబిందో ఫార్మా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి రూ. 21,000 కోట్ల సంపద, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం రూ.20,900 కోట్లు, మైహోం ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు సంపద రూ.17,500 కోట్లుతో తరువాత స్థానాల్లో నిలిచారు. మహిళల్లో మహిమా దాట్ల మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.5700 కోట్లు. -
ధనవంతులకు ఉపయోగపడేలా ఎయిర్‌పోర్టులు కట్టాను: చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు రూరల్: సమస్యలు చెప్పుకోవడానికి రైతులు తన వద్దకు వస్తుంటే రాకుండా అడ్డుకుని భయపెడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి తాను వస్తుంటే.. రైతులను రానీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌పోర్టులు, పోర్టులు అభివృద్ధి చేసి ధనవంతులకు బాగా ఉపయోగపడ్డానని గుర్తు చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయితే కోస్తాలో ఆక్వా కల్చర్, రాయలసీమలో హార్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఆక్వా జోన్ పరిమితి లేకుండా ఆక్వా సాగుదారులందరికీ రూ.1.50కే కరెంట్ ఇస్తానని తెలిపారు. రాష్ట్రంలో రైస్ మిల్లర్లు దళారులుగా మారారని ధ్వజమెత్తారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. పరిహారం ఇవ్వాలని అడిగినా అసమర్థ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. చదవండి: ‘వరం’ పోయిందని కడుపు మంట సంక్షోభంలో ఉన్న రైతులను పరామర్శించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రతి ఎకరాకూ రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం వస్తుందని చెబుతుంటే తన మీద విమర్శలు, ప్రతిదాడి చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తాను 72 గంటల సమయం ఇచ్చినా రైతుల సమస్య పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం కల్లాల్లోని ధాన్యం కొనే వరకు రైతుల తరఫున పోరాడతానని చెప్పారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని వెల్లడించారు. -
రూ.100 కోట్లు.. లగ్జరీ కార్లు, విల్లా నుంచి .. బిల్లులు కట్టలేని దీనస్థితికి!
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు. కాలం కలిసి వస్తే రాత్రి రాత్రి సెలబ్రిటీలైన వారు ఉన్నారు, అదృష్టంతో ఒక్క రోజులో ధనవంతులుగా మారిన వారు ఉన్నారు. ఇక్కడ వరకు ఓకే గానీ దీని తర్వాత అంతా మన చేతులోనే ఉంటుంది. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా, నిర్లక్ష్యం వహించినా సీన్ ఒక్కసారిగా తారుమారవుతుంది. సరిగ్గా ఇదే తరహాలోనే ఓ వ్యక్తి అకస్మాత్తుగా 100 కోట్లకు యజమానిగా మారాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ ఉన్నదంతా పోయి చివరికి రోడ్డున పడ్డాడు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. లక్‌లో లాటరీ.. అంతా పోయింది ఇది జాన్ మెక్గిన్నిస్ కథ. అతను 1997లో రూ. 100 కోట్ల భారీ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. దీంతో అతని లైఫ్ స్టైయిల్ మారింది. అయితే క్రమశిక్షణ అనేది ఎవరికైన ముఖ్యం. అది ప్రవర్తన పరంగా కావచ్చు లేదా ఆర్థికపరంగానే కావచ్చు. ఇది లేకపోతే ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా అవేవి నిలబడవు. జాన్ గురించి తెలుసుకుంటే ఈ విషయం మీకే అర్థమవుతుంది. లక్‌లో లాటరీని గెలుచుకున్న తర్వాత జాన్ చాలా ఖరీదైన కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో బెంట్లీ, మెర్సిడెస్, జాగ్వార్, ఫెరారీ, బీఎండబ్ల్యూ మోడల్స్ కార్లు ఉన్నాయి. యూకేలోని సౌత్ లానార్క్‌షైర్‌లోని బోత్‌వెల్‌లో రూ.13 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేశాడు. సముద్ర తీరంలో రూ. 5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొన్నాడు. ఇది కాకుండా దాదాపు 30 కోట్ల రూపాయలను తన కుటుంబం కోసం ఖర్చు చేశాడు. చాలా చోట్ల అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. కొన్ని సమస్యల కారణంగా కోర్టుకు కూడా హాజరు కావాల్సి వచ్చింది.పక్కా ప్రణాళిక లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టడంతో లాటరీ సొమ్ముతో కూడబెట్టినదంతా పోగొట్టుకున్న జాన్ చివరికి క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా కట్టుకోలేని స్థితికి చేరుకున్నాడు. -
దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలోని అధిక ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? చాలా మందికి దీన్ని తెలుసుకోవాలని ఉంటుంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ సర్వే పరిశీలిస్తే.. అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులకు (యూహెచ్ఎన్డబ్ల్యూఐ/అధిక ధనవంతులు) అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనం ఈక్విటీలే అని తెలుస్తోంది. 34% పెట్టుబడులను ఈక్విటీలకే కేటాయిస్తున్నారు. ఆ తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో 25 శాతం, బాండ్లలో 16 శాతం, ప్రైవేటు ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ రూపంలో 10 శాతం, బంగారంలో 6 శాతం, ఇతర ఇష్టమైన వస్తువులపై (కళాకృతులు, కారు) 4% చొప్పున పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిసింది. నైట్ ఫ్రాంక్ సంస్థ అంతర్జాతీయంగా సర్వే నిర్వహించి ‘ద వెల్త్ రిపోర్ట్ అవుట్‌లుక్ 2023’పేరుతో విడుదల చేసింది. సర్వే ఫలితాలు.. ► దీర్ఘకాలంలో ఎంతో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 88 శాతం మంది భారతీయ అధిక ధనవంతుల సంపద 2022లో వృద్ధి చెందింది. ► గతేడాది 10 శాతానికి పైగా తమ సంపద పెరిగినట్టు 35 శాతం మంది చెప్పారు. ► ఈ ఏడాది కూడా తమ సంపద కనీసం 10 శాతం వృద్ధి చెందుతుందని 53 శాతం మంది అధిక ధనవంతులు అభిప్రాయపడుతున్నారు ► 47 శాతం మంది 10 శాతానికి పైనే పెరగొచ్చన్న అంచనాతో ఉన్నారు. ► అంతర్జాతీయంగా.. సంపన్నుల కంటే ధనవంతులే ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ► మన దేశంలో అధిక ధనవంతులు కనీసం ఒక్కొక్కరు 5 నివాస ఆస్తులను కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా ఇది 4.2గానే ఉంది. ► 2022లో 14 శాతం మంది అధిక ధనవంతులు ఇంటిని కొనుగోలు చేయగా, 2023లో 10 శాతం మంది ఇంటిని కొనుగోలు చేస్తారని అంచనా. ► యూకే, యూఏఈ, యూఎస్ఏ ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్య ప్రాంతాలుగా ఉన్నాయి. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు వాడేవారు పేదలు కారని వాదిస్తారు.. కానీ
సంక్షేమ పథకాలూ, వాటిని అమలుచేసే ప్రభుత్వాలపై విమర్శ పెరిగింది. తాము చెల్లిస్తున్న పన్నులతోనే వాటిని అమలు చేస్తున్నారనీ, అలగా జనానికి మా సొమ్ము ఖర్చవుతోందనీ, తమకు అన్యాయం జరుగుతోందనీ మధ్య, ఉన్నత మధ్య తరగతి ప్రజల వాదన. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తారు. వీటిని ఎగేసే అవకాశాలు, ఎగ్గొట్టించే వృత్తి సంస్థలు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తారు. బీడీలు, సబ్బులు, బియ్యం, ఉప్పు పప్పుల పన్నులు ఇలాంటివి. వీటిని తప్పించుకోలేరు. మనం సమాజం నుండి చాలా పొందుతాము. మనం వాడే రోడ్లు, భవనాలు, గ్రంథాలయాలు, విద్యా, వైద్యాలయాలు ప్రజాధనంతో నిర్మించినవే. వాటిపై ప్రభుత్వం నిరంతరంగా నిర్మాణ, నిర్వహణ ఖర్చులు పెడుతూ ఉంటుంది. ఈ ఖర్చుల కోసం ప్రజలు పన్నులు చెల్లించాలి. ఎవరు ఏ సౌకర్యాలను వాడుతున్నారు, ఎవరు వేటిపై పన్నులు చెల్లించాలి, అని తేల్చటం కష్టం. అందుకే సంపాదనలపై ప్రత్యక్ష పన్నులు, వినియోగాలపై పరోక్ష పన్నులు విధిస్తారు. శ్రమ శక్తి మాత్రమే కలిగిన కార్మికులు సమాజ సౌకర్యాలను తక్కువ వాడుతారు. వాళ్ళు స్థానిక ప్రయాణాలే గాని సుదీర్ఘ ప్రయాణాలు తక్కువ చేస్తారు. చదువుకోనివారు విద్యాలయాలను వాడరు. తులనాత్మకంగా ఆస్పత్రులను కూడా తక్కువ వాడుతారు. చదువరులు, అందులో వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం మొదలగు వృత్తి విద్యలను అభ్యసించినవారు ఎక్కువగా ప్రజాధనాన్ని ఉపయోగిస్తారు. సమాజం నుండి ఎక్కువగా నేర్చుకుంటారు. సమాజ సంపద, మౌలిక సదుపాయాలనూ ఎక్కువగా వినియోగిస్తారు. పేదల కంటే, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్కువ మోతాదులో సమాజానికి తిరిగి ఇవ్వాలి. కాని వాళ్ళు సమాజానికి అనగా ప్రభుత్వానికి చెల్లించ వలసినదాని కంటే తక్కువే చెల్లిస్తారు. అందుకే మేము ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాము, మా డబ్బుతో పేదలు, శ్రామికులు బతుకుతున్నారన్న వీరి ప్రచారంలో వాస్తవం లేదు. కార్పొరేట్ సంస్థల అధిపతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, సంపన్నులు ప్రభుత్వాల నుండి మౌలిక సదుపాయాలు, బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. తమ వాణిజ్యంలో ప్రజలకు భాగస్వామ్య కల్పనలో భాగంగా ప్రజల సొమ్మును సేకరిస్తారు. నామమాత్రపు సొంత డబ్బుతో లాభాలు సంపాదిస్తారు. పేదలు, శ్రామికులు, దిగువ మధ్య తరగతి ప్రజలకు తమ శ్రమ శక్తియే సంపాదన వనరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సౌకర్యాలు, రాయితీలు వారి శ్రమ శక్తి ఉపయోగానికి సౌకర్యాలుగా మారుతాయి. వారు శ్రమ శక్తిని ఎక్కువగా వాడే వెసులుబాటు కలుగుతుంది. దీంతో వారి దిన కూలీ పెరగదు. కాని వారి శ్రమ సాంద్రత, నిపుణత, ఉత్పత్తి స్థాయి, వారు పని చేసే సంస్థల యాజమాన్య లాభాలు పెరుగుతాయి. సమాజం ప్రగతి సాధించి, దేశ సంపదలు అభివృద్ధి చెందుతాయి. సంక్షేమ పథకాలు, రాయితీలు సమాజ శ్రేయస్సు, దేశోన్నతి సాధనాలు. ప్రజలకు సామాజిక దృక్పథం అవసరం. సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు, టీవీలు వాడేవారు పేదలు కారని కొందరు వాదిస్తారు. ఇవి నాగరిక పేదరిక అవసరాలు. సెల్ ఫోన్ రోజు కూలి పని సంపాదనలో, అందుకు అవసరమైన సాధనాల సమకూర్పులో, పని స్థలాల నిర్ణయంలో సహాయపడుతుంది. నగరాల్లో పనిస్థలాలకు చేరుకోడానికి మోటర్ సైకిళ్ళు అవసరం. రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి కృషి చేయవలసిందే. అటువంటి కార్యక్రమాలకు ఎవరూ అడ్డు తగలకూడదు. (క్లిక్ చేయండి: తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
సంపన్నులకు కలిసిరాని 2022.. బిలియనీర్ క్లబ్ నుంచి 22 అవుట్!
న్యూఢిల్లీ: ఐశ్వర్యవంతులకు ఈ ఏడాది అచ్చిరాలేదు. మార్కెట్ల పతనంతో బిలియనీర్ల స్థానాలు చెల్లా చెదురయ్యాయి. బడా బిలియనీర్లు మరింత బలపడితే.. బిలియనీర్ క్లబ్ (కనీసం బిలియన్ డాలర్లు అంతకుమించి సంపద ఉన్నవారు)లో దిగువన ఉన్నవారు ఏకంగా ఆ హోదానే కోల్పోవాల్సి వచ్చింది. ఒక్క అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీకి 2022ను జాక్‌పాట్ సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దేశ కుబేరుడిగా ఉన్న ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి, దేశంలోనే అత్యంత ఐశ్వర్యమంతుడిగా మొదటి స్థానానికి చేరుకోవడమే కాదు.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎగబాకారు. 2021 చివరికి అదానీ నెట్‌వర్త్ (సంపద విలువ) 80 బిలియన్ డాలర్లు ఉండగా, ఏడాది తిరిగేసరికి 70 శాతం పెరిగి 135.7 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూంబర్గ్ గణాంకాల ప్రకారం ఆసియాలోనూ అదానీయే నంబర్ 1గా ఉన్నారు. డాలర్ మారకంలో బిలియనీర్ ప్రమోటర్ల సంఖ్య ఈ ఏడాది 120కి తగ్గింది. 2021 చివరికి వీరి సంఖ్య 142గా ఉంది. అయితే 24 మంది ప్రమోటర్లు బిలియనీర్ క్లబ్లో స్థానం కోల్పోగా.. కొత్తగా ఐఐఎఫ్ఎల్ ప్రమోటర్లు ఇద్దరు ఉమ్మడిగా, క్యాప్రిగ్లోబల్ ప్రమోటర్ ఇందులోకి వచ్చి చేరారు. బిలియనీర్ల ఉమ్మడి సంపద సైతం ఈ ఏడాది కొంత కరిగిపోయింది. 8.8 శాతం క్షీణించి 685 బిలియన్ డాలర్లకు (రూ.56.62 లక్షల కోట్లు) పరిమితమైంది. 2021 చివరికి వీరి ఉమ్మడి సంపద విలువ 751.6 బిలియన్ డాలర్లుగా ఉండడాన్ని గమనించొచ్చు. దేశంలోని టాప్–10 సంపన్న పారిశ్రామికవేత్తల్లో ఈ ఏడాది గౌతమ్ అదానీతోపాటు, సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి, భారతీ ఎయిర్టెల్ సునీల్ భారతీ మిట్టల్ మినహా మిగిలిన ఏడుగురి సంపద విలువ క్షీణించింది. ముకేశ్ సంపద 102 బిలియన్ డాలర్లు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్థానచలనం పొందారు. 2021 చివరికి జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, దీన్ని గౌతమ్ అదానీకి కోల్పోయి రెండో స్థానంలోకి వచ్చారు. ముకేశ్ అంబానీ కుటుంబ సంపద విలువ 2.5 శాతం క్షీణించి గతేడాది చివరికి ఉన్న 104.4 బిలియన్ డాలర్ల నుంచి 101.75 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ప్రభావాలతో ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు బలహీన పనితీరు చూపించడం, బిలియనీర్ల సంపద తగ్గడానికి గల కారణాల్లో ప్రధానమైనది. టెలికం రంగంలో చిన్నాచితకా కంపెనీలన్నీ మూతపడిపోవడం, చివరికి వొడాఫోన్ ఐడియా సైతం బక్కచిక్కడం, టారిఫ్‌లను గణనీయంగా పెంచడంతో ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ సంపద వృద్ధి చెందింది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే! -
17 బ్యాంకులు, 5వేల కోట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం మన భారత్‌లోనే.. ఎక్కడో తెలుసా!
గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎందుకంటే దేశ సమగ్ర అభివృద్ధిలో అవే కీలకంగా కాబట్టి. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే కొన్ని పల్లెటూర్లు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండగా, మరికొన్ని పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. కొన్ని మాత్రం పేరుకే గ్రామాలుగా ఉన్నా రోడ్లు, తాగునీరు, భవంతులు, కరెంట్ సౌకర్యం ఇలా ప్రజలకు కావాల్సిన వసతులతో పట్టణాలను తలపిస్తున్నాయి. అటువంటి గ్రామాల్లో ఒకటి మన దేశంలోనే ఉంది. ఇది మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఆ ఊరుని చూస్తే పల్లెటూరు అంటే నమ్మరు. లగ్జరీ ఇళ్లు.. కార్లు, విశాలమైన రోడ్లుతో, బ్యాంకులు, కోట్ల సంపద.. ఖరీదైన హంగులతో అలరారుతుంది. అలా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో మాదాపర్ అనే గ్రామం ప్రపంచంలోనే సంపన్న గ్రామంగా నిలిచింది. దేశానికే ఆదర్శం.. ఈ గ్రామం ఆ గ్రామం గురించి పూర్తి వివరాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సాధారణంగా పల్లెటూరులో అభివృద్ధి అంటే.. బ్యాంకు, చిన్నపాటి ఆస్పత్రి, బస్సు, విద్యుత్త్ సౌకర్యం, రోడ్డు ఇలా ఉంటాయి. కానీ గుజరాత్‌లోని మదాపర్ గ్రామం వీటన్నికంటే భిన్నమైంది. అక్కడ ఏకంగా 17 బ్యాంకులు, అందులో 5 వేల కోట్లకు పైగా డిపాజిట్ ఉన్నాయంటే.. దీని బట్టి ఆ ఊరంతా కోటీశ్వరులే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. దాదాపు అక్కడ 7600 గృహాలు ఉన్నాయి. శ్రీమంతుడు తరహాలో.. ఆ గ్రామంలో ప్రజలు కెనడా, యూకే, అమెరికా, గల్ఫ్ అంటూ పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు, వాపారాలు చేస్తూ బాగా ఆర్జిస్తున్నారు. వారి సంపాదనలోంచి తిరిగి తమ ఊరిలోని కుటుంబ సభ్యులకు పంపుతున్నారు. కాలక్రమేనా వారి పంపుతున్న డబ్బులతో అక్కడ కార్పొరేట్ స్కూళ్లు, చెరువులు, పార్కులు, డ్యామ్‌లు, ఆసుపత్రులు, దేవాలయాలు ఏర్పాటయ్యాయి. ఈ ఎన్నారైలలో చాలామంది అప్పుడప్పుడు గ్రామాలకు తిరిగి వస్తుంటారు. నివేదికల ప్రకారం, మాదాపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థ 1968లో లండన్‌లో స్థాపించబడింది. ఇది విదేశాలలో నివసిస్తున్న మాదాపర్ ప్రజల మధ్య సమావేశాలను సులభతరం చేస్తుంది. ప్రజల మధ్య మృదువైన కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి గ్రామంలో కూడా ఇదే విధమైన కార్యాలయం ప్రారంభించారు. మరో విషయం ఏంటంటే ,ఆ గ్రామంలో సగటు తలసరి డిపాజిట్ దాదాపు 15 లక్షలుగా ఉందట. అలా అందరి సహకారముతో అభివృద్ధిలో దూసుకుపోతున్న మాదాపర్ గ్రామం.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. చదవండి: 19 ఎకరాలు.. దేశంలోనే పెద్ద మాల్.. ఎక్కడో తెలుసా! -
ధనవంతులూ వలసబాట
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): పొట్ట చేతబట్టుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ పేదలు వలస వెళ్లడం మనం ఎప్పుడూ చూసేదే. వ్యాపార అవకాశాలను, సౌకర్యాలను, పన్ను రాయితీలను వెతుక్కుంటూ కోటీశ్వరులు కూడా వలసబాట పట్టడం కూడా ఎప్పుడూ ఉన్నదే. సాధారణంగా పేదలు దేశంలోనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వెళ్తారు. ధనవంతులు అందుకు భిన్నంగా వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న దేశాలకు వెళ్తారు. కానీ, పత్రికల్లో పేదల వలసలే పతాక శీర్షికలవుతాయి. పెద్దల వలసల గురించి వార్తలు పెద్దగా కనిపించవు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లకు బెదిరి.. మన దేశంలో కోట్ల మంది పేదలు వలసబాట పట్టారు. కానీ, కోటీశ్వరులు మాత్రం కరోనా సమయంలో వలస బాటపట్టలేదు. ఉన్న దేశం నుంచి కదల్లేదు. కరోనా శాంతించిన వెంటనే అవకాశాలు వెతుక్కుంటూ రెట్టింపు సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా తమకు అనుకూలంగా ఉన్న దేశాలకు వలస వెళ్లడం ప్రారంభించారు. 2022లో 88వేల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (10 లక్షల డాలర్ల సంపద కలిగి ఉన్న వ్యక్తులు) తమ మాతృదేశాన్ని వదిలి మరో దేశానికి వలస వెళ్తారని ‘హెన్లీ గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్’ అంచనా వేసింది. ధనవంతుల వలసలు పెరుగుతాయే తప్ప కనుచూపు మేరలో తగ్గే అవకాశంలేదని చెప్పింది. ధనవంతులంతా ఏ దేశం నుంచి ఏ దేశం వెళ్తున్నారనే విషయం ఆసక్తికరం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. ఆ దేశం అనుసరిస్తున్న టైలర్‌మేడ్ వలస విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను, ధనవంతులను ఆకర్షించడానికి కారణంగా నిలుస్తున్నాయి. రెండోస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలో చౌకగా వైద్యం అందుబాటులో ఉండటం, వారసత్వ పన్ను లేకపోవడం, మంచి ఆర్థికవ్యవస్థ కావడం.. ధనవంతులను ఆకర్షిస్తున్న కారణాలని నిపుణులు చెబుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో వివిధ దేశాల నుంచి 80 వేల మంది కోటీశ్వరులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారని నివేదిక పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ నుంచి అధికంగా.. ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాల నుంచి కోటీశ్వరులు పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్నారు. ఉక్రెయిన్‌లోని కోటీశ్వరుల్లో 42 శాతం మంది వలస బాట పడతారని అంచనా వేస్తున్నారు. అలాగే, రష్యాలో 15 శాతం మంది కోటీశ్వరులు దేశం విడిచిపెట్టి వెళ్తారని అంచనా. మిగతా అన్ని దేశాలు రెండు శాతం, అంతకంటే తక్కువ మంది కోటీశ్వరులు వలస వెళ్లొచ్చని భావిస్తున్నారు. భారత్ నుంచి వలస వెళ్తారని అంచనా వేస్తున్న 8 వేల మంది, దేశంలోని మొత్తం కోటీశ్వరుల్లో 2 శాతం అని నివేదిక పేర్కొంది. ధనవంతులను ఆకర్షిస్తున్న యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలోని అన్ని దేశాల ధనవంతులను ఆకర్షిస్తోంది. దీని కోసం.. ► వీసా నిబంధనలను సరళతరం చేసింది. ► 5.44 లక్షల యూఎస్ డాలర్ల విలువైన ఆస్తి కొనుగోలు చేసే వారికి 10 సంవత్సరాల గోల్డెన్ వీసా ఇస్తున్నారు. ► 2.72 లక్షల డాలర్లు యూఏసీ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారికీ గోల్డెన్ వీసాకు అర్హత ఉంటుంది. ► ప్రపంచంలో ఎక్కడైనా తమ స్టార్టప్ కంపెనీని 1.9 మిలియన్ డాలర్లకు విక్రయించిన వారికి కూడా గోల్డెన్ వీసా తీసుకోవడానికి అర్హత కల్పిస్తూ యూఏఈ నిబంధనలను సడలించింది. ► కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికే కాకుండా, ప్రతిభావంతులైన సిబ్బందిని ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చుకోవడానికి కూడా యూఏఈ అవకాశం కల్పిస్తోంది. ► ఇక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలనే కాకుండా, శాస్త్రవేత్తలు, ప్రొఫెషనల్స్, వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది. -
బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కంపెనీలు.. మాఫీ అయిన లక్షల కోట్ల జాబితా ఇదే!
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం ఎంతో తెలుసా?.. దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే కూడా ఎక్కువ. అక్షరాలా తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల నలభై కోట్లు.. ఇందులో ఒక్క స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన రికార్డులలో నుంచి తొలగించిన (రైటాఫ్ చేసిన) అప్పు రూ.2,04,486 లక్షల కోట్లు..చిన్న వ్యాపారాలు చేస్తూ అనారోగ్యంతోనో, మరో కారణంతోనో నష్టాల బారినపడి రుణాలు చెల్లించలేకపోయిన 1.86 కోట్ల మంది తీసుకున్న రుణాల మొత్తం రూ.1.41 లక్షల కోట్లు అయితే.. రూ.100 కోట్లు, ఆపై రుణాలు తీసుకుని ఎగవేసిన 5,400 మందిలో టాప్ 810 మంది రుణాల మొత్తం ఏకంగా రూ.2.41 లక్షల కోట్లు కావడం గమనార్హం. ఈ లెక్క ఇక్కడితో ఆగిపోలేదు. ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రూ.9.91 లక్షల కోట్లను బ్యాంకులు నిరర్థక ఆస్తుల కింద గుర్తించి రికార్డుల నుంచి తొలగించాయి. ఇలా రైటాఫ్ చేసినా కూడా ఎగవేతదారుల నుంచి రుణ వసూలు ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఇదంతా పేరుకేనని, బ్యాంకులు వారి నుంచి రుణాల వసూలుపై సీరియస్‌గా వ్యవహరించడం లేదని బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు గగ్గోలు పెడుతున్నాయి. రుణాలు ఇచ్చేటప్పుడు మాత్రమే కాదు రుణమాఫీ కోసం కూడా కొందరు బ్యాంకుల ఉన్నతాధికారులు ఎగవేతదారులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. మామూలు ఉద్యోగికి అన్ని అర్హతలు ఉండి వ్యక్తిగత రుణం కోసమో, గృహ రుణం కోసమో దరఖాస్తు చేస్తే.. సవాలక్ష కొర్రీలు పెడుతున్న బ్యాంకులు ఎగవేతదారులకు మాత్రం సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నాయని పుణేకు చెందిన వివేక్ వేలంకర్ ఇటీవల విజిలెన్స్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అందుకు ఆధారాలుగా వందల కొద్దీ డాక్యుమెంట్లను అందజేశారు. అయినా ప్రయోజనం లేదని, ఈ దేశంలో ధనవంతులకు ఉన్న వెసులుబాటు పేదలకు లేదని వేలంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు! తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా రుణ ఎగవేతదారులు వేల సంఖ్యలో ఉండగా.. అందులో ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడినవారు వందల మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు పైబడిన బకాయిదారుల్లో ఉద్దేశపూర్వకంగా ఎగవేసినవారు 90 శాతానికిపైగా ఉన్నారని రిజర్వు బ్యాంకు అధ్యయనంలో తేలింది. ఆర్టీఐ కింద పొందిన సమాచారం ప్రకారం.. 31 డిసెంబర్ 2021 నాటికి దేశవ్యాప్తంగా 2,237 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు ఉన్నారు. వారు రుణం ఎగవేతపై ముందే నిర్ణయించుకుని రూ.1,84,863.32 లక్షల కోట్లను బ్యాంకుల నుంచి తీసుకున్నారు. ఈ 2,278 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను రిజర్వు బ్యాంకు ఇటీవల సమాచార హక్కు చట్టం కింద విడుదల చేసింది. ‘‘ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేయాలనుకున్న వారి పేర్లను అడిగాను. అతి కష్టం మీద ఆర్బీఐ ఆ జాబితా అందజేసింది. ఆ సమాచారం ప్రకారం 312 మంది పెద్ద ఉద్దేశపూర్వక ఎగవేతదారులు రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలను ఎగ్గొట్టారు. వారందరి బకాయిలు కలిపి రూ.1.41 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఎగవేతదారులందరిపై కేసులు నమోదు చేశామని ఆర్బీఐ చెప్తున్నా.. ఏ ఒక్కరి మీద కూడా కనీస చర్యలు లేవు‘ అని పుణేకు చెందిన వివేక్ వేలంకర్ చెప్పారు. రుణ ఎగవేతదారుల వివరాల కోసం ఆయన ఏడాదిగా ఉద్యమం చేస్తున్నారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత దేశవ్యాప్తంగా 25 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ఆయన గుర్తించి.. సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు ఫిర్యాదు చేశారు. కస్టమర్ల డేటా గోప్యత పేరుతో.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ‘కస్టమర్ డేటా గోప్యత’ పేరిట పెద్ద ఎగవేతదారుల పేర్లను బహిర్గతం చేయడానికి నిరాకరిస్తున్నాయి. నిజానికి అక్రమంగా రుణాలు ఇవ్వడమే కాదు, వాటిని ఎగవేయడానికి కూడా కొన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ‘‘ఎగవేతదారుల ఆస్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే బదులు.. ఎగవేతదారుల తరఫున దివాలా ప్రక్రియ ప్రారంభించడానికి బ్యాంకు ఉన్నతాధికారులే వత్తాసు పలుకుతున్నారు. ఒకసారి దివాలా ప్రక్రియ ప్రారంభమైందంటే ఎగవేతదారులకు ఎలాంటి ఢోకా ఉండదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మాజీ ఎంపీలు, ఒక ప్రస్తుత ఎంపీ ఈ రకంగా బ్యాంకులను దివాలా తీయించారు’’ అని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రుణ ఎగవేతదారుల్లో చాలా మంది కంపెనీల పేరిట తీసుకున్న రుణాల సొమ్మును కుటుంబ సభ్యుల పేరిట ఆస్తుల కొనుగోలుకు బదలాయించారు. కొందరు విదేశాలకు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన రెండు విద్యుత్ కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని ఇలా దుర్వినియోగం చేశాయి’’ అని ఆర్బీఐ అధికారి ఒకరు వివరించారు. చదవండి: Anand Mahindra: ‘ఇదే నా టాలెంట్, ప్లీజ్ సార్ జాబ్ ఇవ్వండి’.. ఆనంద్ మహీంద్రా రిప్లై ఇదే! -
కోటీశ్వరుల వలస.. మళ్లీ మొదలైంది.. వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?
ఉద్యోగం కోసం ఉపాధి కోసం వలస వెళ్లడం మనకు తెలుసు.. మరి ఇక్కడ కోటీశ్వరులే వలస వెళ్లిపోతున్నారు. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో వివిధ దేశాలకు చెందిన కోటీశ్వరులు మళ్లీ వలసల బాటపడుతున్నారని ప్రముఖ పెట్టుబడుల కన్సల్టెన్సీ సంస్థ హెన్లే అండ్ పార్ట్నర్స్ తెలిపింది. ఈ ఏడాది 88 వేల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (కనీసం రూ.8 కోట్ల చరాస్తులు కలిగిన వ్యక్తులు) స్వదేశాలను వీడొచ్చని హెన్లే గ్లోబల్ సిటిజన్స్ నివేదిక అంచనా వేసింది. ఇంతకీ వీరందరూ తమ స్వదేశాలను ఎందుకు వీడుతున్నారు? వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఓసారి చూద్దామా.. వలస వెళ్లిన సంపన్నుల సంఖ్య రష్యాకు కోటీశ్వరుల బైబై ఈసారి అత్యధికంగా కోటీశ్వరులు వీడుతున్న దేశాల జాబితాలో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం తాలూకు దుష్ప్రభావాల బారి నుంచి బయటపడేందుకు రష్యాతోపాటు ఉక్రెయిన్‌లోని సంపన్నులు తమ దేశాలను వీడుతున్నారని హెన్లే విశ్లేషించింది. ఈ ఏడాది చివరికల్లా రష్యా నుంచి ఏకంగా 15 వేల మంది, ఉక్రెయిన్ నుంచి 2,800 మంది విదేశాలకు తరలిపోవచ్చని పేర్కొంది. ఇటు భారత్ నుంచి కూడా 8 వేల మంది విదేశాలకు వెళ్లిపోవచ్చని అంచనా వేసింది. మిలియనీర్ల స్వర్గధామం యూఏఈ అత్యధిక మంది కోటీశ్వరులు స్థిరపడేందుకు ఎంపిక చేసుకునే దేశాల జాబితాలో యూఏఈ తొలిస్థానంలో ఉంది. ఈ ఏడాది చివరికల్లా 4 వేల మంది తమ గమ్యస్థానంగా యూఏఈని ఎంపిక చేసుకోవచ్చని హెన్లే పేర్కొంది. ప్రైవేటు పెట్టుబడులతోపాటు అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించేందుకు యూఏఈ అనుసరిస్తున్న వలస విధానాలు ఇందుకు కొంత కారణం కావొచ్చని వివరించింది. వలసలు ఎందుకు? నిర్ణీత మొత్తంలో పెట్టుబడులు పెడితే విదేశీ పౌరసత్వం లభిస్తుందనో లేదా శాశ్వత నివాస హక్కు పొందవచ్చనో నచ్చిన దేశానికి కోటీశ్వరులు క్యూ కడుతున్నారు. అలాగే తమ కుటుంబాలకు మెరుగైన భద్రత, రక్షణ కోరుకునే వారు, కాలుష్యరహిత పర్యావరణంలో జీవించాలనుకునే వారు, ప్రభుత్వాల అణచివేత ధోరణులు లేదా అవినీతి ప్రభుత్వాల బారి నుంచి బయటపడాలనుకునే వ్యక్తులు, ఉన్నతవిద్య, ప్రపంచస్థాయి వైద్యం పొందాలనుకొనే మిలియనీర్లు కూడా సాధారణంగా వలసల వైపు మొగ్గు చూపుతుంటారని హెన్లే అండ్ పార్ట్నర్స్ విశ్లేషించింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
లైన్లో నిలబడితే డబ్బులే డబ్బులు.. గంటకు రూ.2 వేలు పక్కా!
UK Queuer Earnings: క్యూలైన్లో గంటల తరబడి నిల్చోడమంటే ఎవరికైనా చిరాకే! కానీ ఓ వ్యక్తి క్యూలైన్లో నిలబడమే వృత్తిగా మార్చుకున్నాడు. సాధారణంగా ఒకరికోసం ఒకరు క్యూలైన్లో నిలబడటం మనం చూస్తుంటాం. అతను మాత్రం లైన్లో నిల్చోవడానికి డబ్బులు తీసుకుంటాడు. కొంతమంది ధనవంతులకు సమయం లేక, క్యూలైన్లో నిల్చోవడం ఇష్టపడరు. అయితే అలాంటివారందరూ ఫ్రెడ్డీ బెకిట్ కస్టమర్లే. లండన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెకిట్ ఈ మధ్య ఇలా ఎనిమిది గంటల పాటు లైన్లో నిల్చోని 160 పౌండ్లు(రూ.16,248) సంపాదించాడు. దీంతో ఈ ఘటన ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆ ఒక్కరోజు డబ్బున్నవాళ్ల కోసం ‘వీఅండ్‌ఏ డియర్’ ఎగ్జిబిషన్ క్యూలో 8 గంటలు నిలబడి ఉన్నాడు ఫ్రెడ్డీ. నిజానికి ఆ క్యూ లైన్ కేవలం మూడు గంటలపాటు మాత్రమే నిలబడాలని కోరారు. కానీ కొందరు టికెట్లు కూడా సేకరించాలనడంతో మరో ఐదు గంటలు అతను క్యూలో నిలబడాల్సి వచ్చింది. అందుకోసం అదనపు ఛార్జ్ కూడా వేశాడు. సాధారణంగా గంట లైన్లో నిల్చుంటే అతను 20 (సుమారు రూ.2,027) పౌండ్లు ఛార్జ్ వేస్తాడు. అయితే ఆ రోజు 8 గంటల పాటు క్యూలో నిలబడటంతో భారీ మొత్తం సంపాదించాడు. -
మోదీకి పేదల గోడు పట్టదు
మొరేనా / జబల్పూర్: ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ధనికుల కోసమే పనిచేస్తోందనీ, సమాజంలో పేదల గోడు వారికి పట్టదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆదివాసీ హక్కుల చట్టం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తామని హమీ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో ‘ఆదివాసీ ఏక్తా పరిషత్’ అనే సంస్థ శనివారం నిర్వహించిన సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ‘దేశంలోని ధనవంతులకు సాయం చేయాలని మీకు( ప్రధాని మోదీ) అనిపిస్తే చేయండి. కానీ సమాజంలోని పేదలు, రైతులు, ఇతర బలహీనవర్గాలనూ పట్టించుకోండి. ధనికులకు సంబంధించి రూ.3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయగలిగినప్పుడు అదే తరహా లబ్ధిని సమాజంలోని పేదలు, రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?’ అని రాహుల్ ప్రశ్నించారు. రైతులు, భూ యజమానులు నష్టపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంతో పాటు పంచాయితీరాజ్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. రాహుల్ రోడ్‌షో.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించారు. నర్మదా నదికి పూజలు చేసిన రాహుల్ అనంతరం జిల్లా కేంద్రంలోని అబ్దుల్ హమీద్ చౌక్ నుంచి తన యాత్రను ప్రారంభించారు. నర్మదా నది వద్ద పూజల సందర్భంగా రాహుల్‌ను ‘నర్మదా భక్తుడి’గా అభివర్ణిస్తూ వందలాది పోస్టర్లు వెలిశాయి. 8 కి.మీ పాటు సాగిన ఈ రోడ్‌షో రడ్డీ చౌక్‌లో ముగిసింది. -
డబ్బున్నోళ్ల వల్లే.. ఆలయాలు బ్రహ్మాండం: సీఎం
సాక్షి, విజయవాడ: డబ్బునోళ్లు ఎక్కువ రేట్లు పెట్టి దైవ దర్శనం టిక్కెట్లు కొనటం, విరాళాలు ఇవ్వడంతోనే మన దేవాలయాలు బ్రహ్మాండంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దుర్గగుడిలో అమ్మవారి అంతరాలయం దర్శనం టికెట్‌ను రూ.300కి పెంచడాన్ని ఆయన సమర్ధించారు. బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రం మూలనక్షత్రం సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. దసరా ఉత్సవాలు రాష్ట్ర పండుగ గనుక ప్రభుత్వం తరఫున ఎంత డబ్బులిచ్చారని ప్రశ్నిస్తారే తప్ప ఎంత బాగా ఏర్పాట్లు చేశారనేది చూడటం లేదని విలేకరులను సీఎం విమర్శించారు. విలేకరులు మారాలంటూ సలహా ఇచ్చారు. దేవాలయాలకు డబ్బులుండబట్టే భక్తులకు మెరుగైన సేవలు అందుతున్నా యన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, కాళహస్తీశ్వరుడు, సింహాచలం అప్పన్న, అన్నవరం దేవాలయాలకు డబ్బుల కొరత లేదని, మేనేజ్మెంట్ కొరతే ఉందన్నారు. మరో రూ.42 వేల కోట్లు కావాలి: పోలవరం పూర్తి చేసేందుకు మరో రూ. 42 వేల కోట్లు అవసరమని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 1.4.2014కి ముందు ఖర్చుచేసిన నిధులు ఇవ్వబోమని, అప్పటి ఎస్ఎస్ఆర్ రేట్లను బట్టి డబ్బులు ఇస్తామని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారన్నారు. పోటెత్తిన భక్తకోటి....: మూల నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవార్ని దర్శించుకునేందుకు భక్తకోటి పెద్ద ఎత్తున తరలి రావటంతో 5 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు కిటకిటలాడాయి. -
అంబానీ సంపద... యెమెన్ జీడీపీకి రెట్టింపు!
-
అంబానీ సంపద... యెమెన్ జీడీపీకి రెట్టింపు!
ముంబై: హురుణ్ ఇండియా సంపన్నుల జాబితా–2017లో ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈయన టాప్ స్థానాన్ని దక్కించుకోవడం ఇది వరుసగా ఆరోసారి. అలాగే హురుణ్ గ్లోబల్ జాబితాలో అంబానీ ఏకంగా తొలిసారి టాప్– 15లోకి చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేర్లు మార్కెట్లో ర్యాలీ జరపడం వల్ల అంబానీ సంపద 58 శాతం వృద్ధితో రూ.2,57,900 కోట్లకు చేరింది. అంబానీ సంపద తను జన్మించిన యెమెన్ దేశపు జీడీపీ కన్నా 50% ఎక్కువ కావడం గమనార్హం!!. ఇక పతంజలి సీఈవో బాలకృష్ణ సంపద 173% వృద్ధితో రూ.70,000 కోట్లకు చేరింది.దీంతో ఈయన టాప్–10లోకి ఎంట్రీ ఇచ్చి 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతేడాది ఈయన 25వ స్థానంలో ఉన్నారు.ఈ జాబితాలో తొలితరం పారిశ్రామికవేత్తలుగా రాణించి, స్వశక్తితో బిలియనీర్లుగా ఎదిగిన వారిలో మీడియా.నెట్ హెడ్ దివ్యాంక్ తురాఖియా (34 ఏళ్లు), బెంగళూరుకు చెందిన 42 ఏళ్ల అంబిగ సుబ్రమణియన్ స్థానం దక్కించుకున్నారు. అంబిగ.. మ్యు–సిగ్మా సహ వ్యవస్థాపకురాలు. ఈ ఏడాది జాబితాలో మొత్తంగా 51 మంది మహిళలు స్థానం పొందారు. జాబితాలో మ్యాన్‌కైండ్ ఫార్మాకు చెందిన ఏక్లవ్య జునేజా చాలా పిన్న వయస్కుడిగా నిలిచారు. ఈయనకు కంపెనీలో 12 శాతం వాటా ఉంది. ధనిక రియల్ ఎస్టేట్ బిలియనీర్‌గా డీఎల్ఎఫ్కు చెందిన కుశాల్ పాల్ సింగ్ ఉన్నారు. ఈయన సంపద రూ.27,400 కోట్లుగా ఉంది. లోధా గ్రూప్‌నకు చెందిన మంగల్ ప్రభాత్ లోధా.. సంపన్న ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్నారు. ఈయన సంపద రూ.15,700 కోట్లుగా ఉంది. కాగా జాబితాలోకి కొత్తగా 26 మంది ఎంట్రీ ఇచ్చారు. దమాని సంపద 320 శాతం అప్ జాబితాలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డి–మార్ట్) ఫౌండర్ చైర్మన్ రాధాకృష్ణ దమాని సంపదలో గరిష్టంగా 320 శాతం వృద్ధి నమోదయ్యింది. దీనికి అవెన్యూ సూపర్మార్కెట్స్ లిస్టింగ్ ప్రధాన కారణం. దమాని తర్వాతి స్థానంలో ఎండ్యూరెన్స్ టెక్ ఎండీ అనురాగ్ జైన్ ఉన్నారు. ఈయన సంపదలో 286 శాతం వృద్ధి కనిపించింది. జూలై 31 నాటి డాలర్ విలువ 64.1 ఆధారంగా సంపద పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్నారు. ముంబైలోనే ఎక్కువ..: ముంబైలో 182 మంది సంపన్నులు ఉన్నారు. తర్వాతి స్థానంలో న్యూఢిల్లీ (117), బెంగళూరు (51) ఉన్నాయి. 26 మందితో అహ్మదాబాద్ నగరం కూడా ఈ సారి టాప్–5లో స్థానం దక్కించుకుంది. చెన్నై (22), కాన్పూర్ (11) తొలిసారి టాప్–10లోకి వచ్చాయి. జాబితాలో కొత్తగా 18 ప్రాంతాలు వచ్చాయి. ఉదయ్‌పూర్‌లో ముగ్గురు, వడోదరలో ఇద్దరు ఉన్నారు. కాంచీపురం, ఫరీదాబాద్‌లో ఒకరు చొప్పున ఉన్నారు. -
ధనవంతులకేనా ఉచిత న్యాయ సేవలు!
► హైకోర్టు ఆక్షేపణ ► న్యాయ సేవాధికార సంస్థ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ► ఏపీ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థలకు కోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: సమాజంలో న్యాయ సహాయం పొందే స్తోమత లేని వారి కోసం ఉద్దేశించిన ‘ఉచిత న్యాయ సేవలను.. కోర్టు ఫీజు మినహాయింపులను’ కొందరు డబ్బున్న వ్యక్తులు ఉపయోగించుకుంటూ దుర్వినియోగం చేస్తుండ డంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కోర్టు ఫీజు మినహాయింపు కావాలని ఎవరైనా కోరినప్పుడు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఆ వ్యక్తుల ఆర్థిక స్థితిగతుల గురించి లోతుగా విచారణ చేపట్టడం లేదని ఆక్షేపించింది. విచారణ జరపకుండానే.. కోర్టు ఫీజు మినహా యింపునకు అర్హులని తేలుస్తుండటాన్ని తప్పుç ³ట్టింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయని తెలిపింది. కొందరు బడాబాబులు తమకు ఆర్థిక స్తోమత లేదంటూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, కోర్టు ఫీజు మినహాయింపులు పొందుతూ, మరోపక్క భారీ ఫీజులు ఇచ్చి ప్రైవేట్ న్యాయవాదుల సేవలను ఉపయోగించుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కోర్టు పేర్కొంది. ఆధారాలు లేకున్నా ఫీజు మినహాయింపా? విశాఖపట్నం చినవాల్తేరులోని ఓ ఆస్తి వివాదం జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చేరింది. తమకు కోర్టు ఫీజు చెల్లించేంత స్తోమత లేదని, అందువల్ల తమకు ఫీజు చెల్లింపు నుంచి మినహా యింపు ఇవ్వాలంటూ ఆ ఆస్తితో సంబంధం ఉన్న 20 మంది సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకు న్నారు. ఇందుకు వారు తహసీల్దార్ ఇచ్చిన ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేశారు. 20 మంది తమ వార్షిక ఆదాయం రూ.72 వేలుగా పేర్కొన్నారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం–1987 ప్రకారం వార్షిక ఆదాయం నామమాత్రంగా ఉన్న వారు కోర్టు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు పొందవచ్చు. ఆదాయ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి రూ.18.59 లక్షల కోర్టు ఫీజు మినహాయింపునిస్తూ ఫిబ్రవరిలో సర్టిఫికేట్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆస్తి వివాదం ఎదుర్కొంటున్న నవ్య ఇన్ఫ్రాకన్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనం ఇరుపక్షాల వాదన విని ఇటీవల తీర్పు వెలువరించింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆ 20 మంది ఆర్థిక స్థితిగతులను తెలుసుకోలేదని పేర్కొంది. వీరంతా ఒకే కుటుం బానికి చెందిన వారైనప్పటికీ, అందరూ ఆదా యాన్ని రూ.72 వేలుగా పేర్కొనడం, దానిపై అధికారులు వివరణ కోరకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇచ్చిన ఫీజు మినహాయింçపును రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అప్రమత్తంగా ఉండాల్సిందే పేదలు, అవసరమైన వారి కోసం తీసుకొచ్చిన చట్ట నిబంధనలు అర్హత లేని వారికి, అనవసరంగా వివాదాలు సృష్టించే వ్యక్తులకు వరంగా మారుతున్నాయని హైకోర్టు తెలిపింది. ఇకనైనా కోర్టు ఫీజు మినహాయింపులు ఇచ్చేటప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. న్యాయ సేవాధికార సంస్థల చట్టం–1987లో ఉన్న లోపాలను సరిదిద్ది, చట్టం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల న్యాయ సేవాధికార సంస్థలకు సూచించింది. కోర్టు ఫీజు మినహాయింపులు పొందిన వారు న్యాయ సేవాధికార సంస్థకు చెందిన ప్యానల్ న్యాయవాదుల సేవలనే వినియోగించుకోవడాన్ని తప్పనిసరి చేసే విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది. -
ధనికులకు గ్యాస్ సబ్సిడీ కట్!
ఆ దిశగా కేంద్రం యోచన: జైట్లీ న్యూఢిల్లీ: దేశంలోని ధనికులకు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని తొలగించే దిశగా ప్రభుత్వం యోచి స్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కొందరు హర్షించినా, హర్షించకపోయినా దేశ శ్రేయస్సు దృష్ట్యా అతి ముఖ్యమైన ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పదని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ... ఎల్పీజీ సబ్సిడీ తొలగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉన్నత స్థాయి లో ఉన్న రాజకీయ నాయకుడు నిర్ణయం తీసుకోగలిగితే ఎలాంటి క్లిష్ట సమస్య అయినా సులువుగా పరిష్కారమవుతుందన్నారు. బొగ్గు గనులు, డీజిల్, గ్యాస్ ధరలు, తదితర సమస్యలపై గత ప్రభుత్వాలు వీటిపై ఏళ్లు వృథా చేశాయని, తమ ప్రభుత్వం మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.