ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు. కాలం కలిసి వస్తే రాత్రి రాత్రి సెలబ్రిటీలైన వారు ఉన్నారు, అదృష్టంతో ఒక్క రోజులో ధనవంతులుగా మారిన వారు ఉన్నారు. ఇక్కడ వరకు ఓకే గానీ దీని తర్వాత అంతా మన చేతులోనే ఉంటుంది. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా, నిర్లక్ష్యం వహించినా సీన్ ఒక్కసారిగా తారుమారవుతుంది. సరిగ్గా ఇదే తరహాలోనే ఓ వ్యక్తి అకస్మాత్తుగా 100 కోట్లకు యజమానిగా మారాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ ఉన్నదంతా పోయి చివరికి రోడ్డున పడ్డాడు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది.
లక్‌లో లాటరీ.. అంతా పోయింది
ఇది జాన్ మెక్‌గిన్నిస్ కథ. అతను 1997లో రూ. 100 కోట్ల భారీ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. దీంతో అతని లైఫ్ స్టైయిల్ మారింది. అయితే క్రమశిక్షణ అనేది ఎవరికైన ముఖ్యం. అది ప్రవర్తన పరంగా కావచ్చు లేదా ఆర్థికపరంగానే కావచ్చు. ఇది లేకపోతే ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా అవేవి నిలబడవు. జాన్ గురించి తెలుసుకుంటే ఈ విషయం మీకే అర్థమవుతుంది. లక్‌లో లాటరీని గెలుచుకున్న తర్వాత జాన్ చాలా ఖరీదైన కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో బెంట్లీ, మెర్సిడెస్, జాగ్వార్, ఫెరారీ, బీఎండబ్ల్యూ మోడల్స్ కార్లు ఉన్నాయి.
యూకేలోని సౌత్ లానార్క్‌షైర్‌లోని బోత్‌వెల్‌లో రూ.13 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేశాడు. సముద్ర తీరంలో రూ. 5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొన్నాడు. ఇది కాకుండా దాదాపు 30 కోట్ల రూపాయలను తన కుటుంబం కోసం ఖర్చు చేశాడు. చాలా చోట్ల అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. కొన్ని సమస్యల కారణంగా కోర్టుకు కూడా హాజరు కావాల్సి వచ్చింది.పక్కా ప్రణాళిక లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టడంతో లాటరీ సొమ్ముతో కూడబెట్టినదంతా పోగొట్టుకున్న జాన్ చివరికి క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా కట్టుకోలేని స్థితికి చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment