లాటరీ గెలిచిన ఆనందోత్సవంలో పాల్ లాంగ్
లండన్: అదృష్టవంతుడిని ఆపలేరు.. దురదృష్టవంతుడిని మార్చలేరు అని ఓ సామెత ఉంది. చాలా మందికి అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. నిన్న మొన్నటిదాకా అతనో సాధారణ మనిషి. ఉద్యోగం కూడా లేదు. ఈ మధ్యనే ఆయన్ను కూడా ప్రేయసి వద్దు పొమ్మంది. జీవితం ఇంతే అనుకున్న తరుణంలో హఠాత్తుగా భాగ్యలక్ష్మి వచ్చి పడింది. బంపర్ లాటరీ తగిలింది. ఒక్కసారిగా లక్షాధికారి అయ్యాడు. యూకేకి చెందిన పాల్ లాంగ్ అనే ఓ నిరుద్యోగి కథ ఇది. పాల్ లాటరీలో 9.3 మిలియన్స్ పౌండ్స్(దాదాపు 851.62 లక్షలు) తగలడంతో ఒక్క రోజులోనే కోటీశ్వరైపోయాడు.
లాల్‌కి లాటరీ తగిలిన విషయం యూకే పత్రికల్లో ద్వారా దేశం అంతటా తెలిసింది. దీంతో లాల్ ఆనందానికి అవద్దుల్లేకుండా పోయింది. ‘కొద్ది రోజులుగా జీవితంలో గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ 24 గంటలతో నా జీవితమే మారిందంటే నమ్మలేకపోతున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రేయసి నాతో కలిసి ఉన్నప్పుడే నేను లాటరీ వేశాను. ఇప్పుడు ఆమె నాతో లేదు. మేమిద్దరం స్నేహపూర్వకంగానే విడిపోయాం. ఆమెను పిలిచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని ది మిర్రర్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ చెప్పారు.
పాల్ మాజీ ప్రేయసి జూలీ వెస్ట్(52) మాట్లాడుతూ.. పాల్‌కి లాటరీ తగలడం సంతోషంగా ఉంది. మేమిద్దరం కొన్ని కారణాల వల్ల విడిపోయాం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన జీవితం బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. గతంలో ఫోర్డ్ ప్లాంట్లోలో ఉద్యోగం చేసిన పాల్, ఆరోగ్యకారణాల వల్ల ఉద్యోగం మానేశారు. ‘లాటరీ డబ్బులను వృధాగా ఖర్ఛు చేయను. ఓ కారును కొంటాను. మిగతా డబ్బుతో కుటుంబానికి, స్నేహితులకి సహాయం చేస్తాను. పిల్లల ఆరోగ్య సమస్యలకై కొంత డబ్బు డిపాజిట్ చేస్తాను. నేను సాధారణ వ్యక్తిని. ఇప్పుడు కూడా సాధారణంగానే ఉంటాను. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేస్తాను’ అని పాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment