Unemployee
-
అభ్యర్థి ఒక కంపెనీలో ఉద్యోగం కోసం ఏం చేసాడో తెలుసా?
లండన్: ఉద్యోగం సాధించడంలో రెజ్యూమ్ ఎంతో కీలకమైంది. అభ్యర్థి ఉద్యోగం కోసం.. కంపెనీ మెయిల్స్, లింక్డ్ ఇన్, నౌకరీ డాట్ కామ్.. రకరకాల మాధ్యమాలతో కంపెనీలకు తమ రెజ్యుమ్‌ను పంపుతుంటారు. ఒక వ్యక్తి రెజ్యూమ్ చూసి.. అతని పట్ల కంపెనీలు కొంత అవగాహనకు వస్తాయి. రెజ్యూమ్‌లలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, వారు సాధించిన అంశాలు దానిలో పొందుపరుస్తూ ఉంటారు. అయితే, చాలా కంపెనీలు వాటిని వ్యక్తికరించడంలో కొంత సృజనాత్మకతను కొరుకుంటాయి. అయితే, ఇక్కడ యూకేకి చెందిన ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వినూత్నంగా ఆలోచించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పూర్తి వివరాలు.. యూకే కు చెందిన జోనాథన్ స్విఫ్ట్ అనే వ్యక్తి ఇన్స్టాంట్ ప్రింట్ ఉద్యోగం కోసం.. తన రెజ్యూమ్ ప్రింట్‌ను సదరు కంపెనీ పార్కింగ్ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క కారుకు అంటించాడు. అయితే, యార్క్‌షైర్ కు చెందిన ప్రిటింగ్ హౌస్ కంపెనీలో చేరడానికి అతను.. ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కంపెనీలో సదరు వ్యక్తి చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఆనోట.. ఈనోట.. చివరకు ఆ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వరకు వెళ్లింది. దీంతో ఆయన సదరు వ్యక్తి ఉద్యోగం పట్ల చూపిన ఆసక్తికి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత.. అతడిని కంపెనీవారు కాల్ చేసి ఇంటర్వ్యూకి పిలిచారు. దీనిపై కంపెనీ మేనేజర్ స్పందించారు. ‘సదరు వ్యక్తి పార్కింగ్ ఉన్న కార్లకు రెజ్యూమ్‌ను అతికించిడం కిటికీలో నుంచి చూసినట్లు వాసెల్ అనే మేనేజర్ తెలిపారు’. అయితే, ఆ ఉద్యోగానికి 140 అప్లికేషన్లు వచ్చినట్లు కంపెనీ మేనేజర్ తెలిపారు. జోనాథన్ స్విఫ్ట్ ను ఉద్యోగానికి ఎంపిక చేసినట్లు కూడా ప్రకటించారు. Here’s some CCTV footage of the #jobseeker in action! He’s been the talk of the office since covering everyone's cars in CVs. I love it when we get a #creativejobapplication - Craig, Marketing Manager pic.twitter.com/OmE5puQgwI — instantprint (@instantprintuk) January 18, 2022 చదవండి: ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు! -
నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగి ఆత్మహత్య
కోటపల్లి (చెన్నూర్): ‘కేసీఆర్ సార్.. ప్లీజ్ నోటిఫికేషన్లు ఇవ్వండి. నాలా బాధపడేవారు చాలామంది చావడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి వారినైనా కాపాడండి. మీ కాళ్లు పట్టుకుంటా. అమ్మా నాన్నా క్షమించండి.. మన ఇంటి పరిస్థితి బాగాలేదు. కానీ జాబ్ లేక, మీ మీద ఆధారపడి జీవించలేక ఈ నిర్ణయం తీసుకున్నా. నా చావుతోనైనా ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలి. నిరుద్యోగుల ఆత్మహత్యల్లో నాదే చివరిది కావాలి’అని ఓ నిరుద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. కోటపల్లి మండలం బబ్బరుచెల్క గ్రామానికి చెందిన అసంపెల్లి శివక్క– వెంకన్న దంపతులకు కుమారుడు మహేశ్ (23)తోపాటు ఒక కుమార్తె ఉంది. కూతురుకు పెళ్లిచేశారు. మహేశ్‌ను డీఎడ్, డిగ్రీ చదివించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉద్యోగం కోసం రెండేళ్లుగా ప్రిపేర్ అవుతున్నారు. నోటిఫికేషన్లు రాకపోవడంతో చెన్నూర్‌లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో చేరారు. ఇటీవల ఆ కంపెనీని మూసివేయడంతో నాలుగు నెలలుగా మహేశ్ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడంతో కలత చెంది సూసైడ్ లెటర్ రాశారు. లెటర్‌ను ఇంట్లో పెట్టి బయటకి వెళ్లిపోయారు. ఈ లెటర్‌ను చూసిన కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో మహేశ్ తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక్కగానొక్క కొడుకు ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న రైస్‌మిల్ సమీపంలోని పత్తి చేనులో మహేశ్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. జైపూర్ ఏసీపీతోపాటు సీఐలు, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వైద్యులను అక్కడికే రప్పించి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. మహేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, అతడి స్నేహితులు ఎన్‌హెచ్–63పై బైఠాయించారు. బాధిత కుటుంబానికి 4 ఎకరాల భూమి, 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏసీపీ నరేందర్ మహేశ్ తల్లిదండ్రులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మహేశ్ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు వాంగ్మూలం ఇచ్చారని సీఐ నాగరాజు చెప్పారు. జాతీయ రహదారిపై అందోళన చేస్తున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు -
ఆరుగురి మృతి: నడివీధిలో కత్తితో నిరుద్యోగి హల్చల్
బీజింగ్: ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాడు.. ఇంట్లో ఉందామంటే కుటుంబ కలహాలు.. దీంతో ఆ యువకుడు పిచ్చోడిలా మారాడు. ఎవరిపైనో కోపం.. ఆ కోపాన్ని ఎవరిపై చూపించుకోవాలో తెలియదు. కానీ ఫస్ట్రేషన్ తీవ్రంగా ఉంది. దీంతో చివరకు ఉండబట్టలేక వీధిలోకి వచ్చాడు. వచ్చి రాగానే కనిపించిన వారందరిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. అతడి చేతికి ఆరుమంది బలయ్యారు. మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన చైనాలో జరిగింది. ఈశాన్య చైనాలో హువైనింగ్ కౌంటీలో నివసించే వూ (25) నిరుద్యోగి. నిరాశవాదంతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి తోడు ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో మనశ్శాంతి కోల్పోయాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అనుహుయ్ ప్రావిన్స్‌లోని ఆన్‌కింగ్ నగరంలోకి వచ్చాడు. కత్తి తీసుకుని వచ్చి కనిపించిన వారందరినీ తీవ్రంగా గాయపర్చాడు. అతడు కత్తితో బీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు పెట్టాడు. ఈక్రమంలో అతడు మొత్తం 20 మందిని గాయపర్చాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అతి కష్టంగా అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డవారిలో ఆదివారం ఆరుగురు మృతి చెందారు. ఇంకా 14 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ‘ఆన్‌కింగ్ నగరంలోని రెన్మిన్ రోడ్డులో ఫుట్‌పాత్‌పై నడుస్తున్నవారిని వూ కత్తితో దాడి చేశాడు’ అని మున్సిపల్ అధికారులు తెలిపారు. అsతడు కుటుంబ కలహాలతో పాటు నిరాశావాదంతో బాధ పడుతున్నాడని అక్కడి పోలీస్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆక్రోశం.. బాధ తట్టుకోలేక కత్తితో దాడి చేశాడు అని వివరించారు. చదవండి: నగ్న ఫొటోలు, వీడియో.. కంపెనీకి కోట్ల జరిమానా -
భీమిలిలో ఉద్యోగాల పేరుతో జోతిష్కుడు టోకరా
-
ఉద్యోగం రాలేదని..ఆత్మహత్య
ఒకటి కాదు.. రెండు కాదు.. 600 హామీల్లో ప్రభుత్వం ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయింది. నిరుద్యోగుల జీవితాల్లోనూ ఆశలు రేపి ఉసురు తీస్తోంది. ఈ కోవలోనే గుంతకల్లుకు చెందిన ప్రహ్లాద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంతకల్లు టౌన్: పట్టణంలోని హనుమేష్‌నగర్‌కి చెందిన కరణం ప్రహ్లాద (45) అనే నిరుద్యోగికి ఉద్యోగవకాశాలు రాక , ఒంటరి జీవితం గడపలేక జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మృతుడి సోదరుడు సంతోష్‌కుమార్, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలమేరకు... పట్టణానికి చెందిన ప్రహ్లాద డిప్లమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. కొన్నేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని సీఎన్సీ మిషన్ ఆపరేటర్‌గా పనిచేశాడు. గుత్తికి చెందిన విద్య అనే మహిళతో వివాహం కూడా జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా కొన్నేళ్ల క్రితం వారు విడాకులు తీసుకున్నారు. అయితే మూడేళ్ల నుండి ఉద్యోగం కోల్పోయిన ప్రహ్లాద తనకు ఉద్యోగం రావడం లేదని కుటుంబ సభ్యులతో మంగళవారం రాత్రి బాధపడ్డాడు. బుధవారం సాయంత్రమైనా అతను బయటికిరాకపోగా, సెల్‌ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు సంతోష్, బంధువులు బుధవారం రాత్రి అతని ఇంటికి వెళ్లిచూడగా ఉరితాడుకు వేలాడుతున్నారు. దీంతో వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఉద్యోగం లేక ఒంటరి జీవితం గడపలేకనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని వారు తెలియజేశారు. ప్రహ్లాద మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు శవపరీక్షలు నిర్వహించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు వెల్లడించారు. -
రేపు పెళ్లి.. ఈ రోజు ఉరి
సాక్షి, సూర్యాపేట : డిగ్రీ పట్టాసాధించాడు. సర్కారీ కొలువు కోసం శతవిధాల ప్రయత్నించాడు. అయినా ఫలితం లేదు. తప్పని పరిస్థితుల్లో ట్యూటర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. ఇంతలో పెళ్లి కూడా కుదిరింది.. కానీ ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో బలవ్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు.. అర్వపల్లి మండలం బొల్లం పల్లిలో కేసాగని సతీష్(25) డిగ్రీ పూర్తి చేశాడు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించినా రాలేదు. ఈ విషయమై స్నేహితుల దగ్గర చాలా సార్లు వాపోయాడు. తప్పనిసరి పరిస్థితుల్లో బతుకుదెరువు కోసం నారాయణ జూనియర్ కాలేజీలో ట్యూటర్‌గా పనిచేస్తున్నాడు. ఇలీవలే సతీష్‌కు పెళ్లి కూడా కుదిరింది. శనివారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఉద్యోగం లేని కారణంగా తీవ్ర మనోవేదనతో ఉన్న సతీష్ శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేపు పెళ్లి పీటలపై కూర్చున్న కొడుకు మీద అక్షింతలు చల్లాల్సింది పోయి.. చితికి నిప్పు పెట్టాల్సి వచ్చిందంటూ తల్లిదండ్రలు కన్నీరు మున్నీరు అయ్యారు. తాము ఏం పాపం చేశామంటూ అవిసేలా రోదిస్తున్నారు. -
ప్రేయసి పోయింది.. లాటరీ తగిలింది..
లండన్: అదృష్టవంతుడిని ఆపలేరు.. దురదృష్టవంతుడిని మార్చలేరు అని ఓ సామెత ఉంది. చాలా మందికి అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. నిన్న మొన్నటిదాకా అతనో సాధారణ మనిషి. ఉద్యోగం కూడా లేదు. ఈ మధ్యనే ఆయన్ను కూడా ప్రేయసి వద్దు పొమ్మంది. జీవితం ఇంతే అనుకున్న తరుణంలో హఠాత్తుగా భాగ్యలక్ష్మి వచ్చి పడింది. బంపర్ లాటరీ తగిలింది. ఒక్కసారిగా లక్షాధికారి అయ్యాడు. యూకేకి చెందిన పాల్ లాంగ్ అనే ఓ నిరుద్యోగి కథ ఇది. పాల్ లాటరీలో 9.3 మిలియన్స్ పౌండ్స్(దాదాపు 851.62 లక్షలు) తగలడంతో ఒక్క రోజులోనే కోటీశ్వరైపోయాడు. లాల్‌కి లాటరీ తగిలిన విషయం యూకే పత్రికల్లో ద్వారా దేశం అంతటా తెలిసింది. దీంతో లాల్ ఆనందానికి అవద్దుల్లేకుండా పోయింది. ‘కొద్ది రోజులుగా జీవితంలో గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ 24 గంటలతో నా జీవితమే మారిందంటే నమ్మలేకపోతున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రేయసి నాతో కలిసి ఉన్నప్పుడే నేను లాటరీ వేశాను. ఇప్పుడు ఆమె నాతో లేదు. మేమిద్దరం స్నేహపూర్వకంగానే విడిపోయాం. ఆమెను పిలిచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని ది మిర్రర్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ చెప్పారు. పాల్ మాజీ ప్రేయసి జూలీ వెస్ట్(52) మాట్లాడుతూ.. పాల్కి లాటరీ తగలడం సంతోషంగా ఉంది. మేమిద్దరం కొన్ని కారణాల వల్ల విడిపోయాం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన జీవితం బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. గతంలో ఫోర్డ్ ప్లాంట్లోలో ఉద్యోగం చేసిన పాల్, ఆరోగ్యకారణాల వల్ల ఉద్యోగం మానేశారు. ‘లాటరీ డబ్బులను వృధాగా ఖర్ఛు చేయను. ఓ కారును కొంటాను. మిగతా డబ్బుతో కుటుంబానికి, స్నేహితులకి సహాయం చేస్తాను. పిల్లల ఆరోగ్య సమస్యలకై కొంత డబ్బు డిపాజిట్ చేస్తాను. నేను సాధారణ వ్యక్తిని. ఇప్పుడు కూడా సాధారణంగానే ఉంటాను. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేస్తాను’ అని పాల్ పేర్కొన్నారు. -
తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య
సాక్షి, నిర్మల్ : ఉద్యోగం రాలేదని మనస్తాపంతో తెలంగాణ రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా (కె)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెస్సీ బీఈడీ చదివిన బదుల భూమేష్ అనే యువకుడు గత కొంతకాలంగా ఉద్యోగం వస్తుందో రాదో అనే భయంతో మానసికంగా క్రుంగిపోయాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. అయితే గత రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో, ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
-
నిరుద్యోగులు కలెక్టరేట్ ముట్టడికి యత్నం
-
నిరుద్యోగులకు చంద్రబాబు దగా
గన్నవరం : విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి వంటి ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం యువత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత యువజన సమాఖ్య ( ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.లెనిన్‌బాబు పిలుపునిచ్చారు. స్థానిక రాయ్‌నగర్ కళ్యాణ మండపంలో శుక్రవారం జిల్లా 17వ మహాసభ జరిగింది. తొలుత జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఎఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న లెనిన్‌బాబు మాట్లాడుతూ...యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు యువతకు కోటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, విదేశాల్లో ఉన్న నల్లదానాన్ని దేశానికి తీసుకువచ్చి పేద కుటుంబాలకు పంపిణీ చేస్తామనే వాగ్ధానాలను కేంద్రం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. యువతకు జాబ్ కావలంటే బాబు రావాలని హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలహామీల్లో ప్రకటించిన నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు దగాకోరు విధానాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల వేదనను గుర్తించి ఖాళీగా లక్ష నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జయప్రదం చేయండి ఈ నెల 29, 30, 31 తేదిల్లో ఏలూరులో జరిగే ఎఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ముప్పాల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఇన్ఛార్జ్ గడ్డం కోటేశ్వరరావు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు సిహెచ్. కోటేశ్వరరావు, ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ పాల్గొన్నారు. -
నిరుద్యోగి లేని తెలంగాణ.. నా కల
-
నిరుద్యోగి లేని తెలంగాణ.. నా కల
గవర్నర్ నరసింహన్ ఆకాంక్ష ప్రతి ఒక్కరూ సొంతంగా తమ కాళ్లపై నిలబడాలి కలిసికట్టుగా ఉంటే సాధించలేనిదేమీ లేదు సహకారం తీసుకోవాలేగానీ పూర్తిగా ప్రభుత్వాలపై ఆధారపడొద్దు మహబూబ్‌నగర్: ‘‘రాబోయే రెండేళ్లలో తెలంగాణలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా ఉండరాదు.. ఇది నా కల..’’ అని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం హాజీపల్లి, కిషన్‌నగర్‌లో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో మంత్రులు కె.తారక రామారావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో కలిసి గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్యా న్ని పెంచుకొని సొంతకాళ్లపై నిలబడాలన్నారు. గ్రామస్తులు కలిసికట్టుగా ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదని.. ఇందుకు కిషన్‌నగర్, హాజీపల్లి గ్రామాలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో నిరక్షరాస్యతను పారదోలడానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని అందిపుచ్చుకోవాలే తప్ప ప్రభుత్వాలపైనే పూర్తిగా ఆధారపడడం సమంజసం కాదన్నారు. ‘గుడ్డు’పై సీరియస్..: ఉదయం 10 గంటలకు కిషన్‌నగర్ చేరుకున్న గవర్నర్ మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల మధ్యే గడిపారు. ప్రతి అంశంపై చర్చ జరిపి, అందుకు బాధ్యులైన అధికారులను గ్రామస్తుల ముందే నిలదీశారు. ప్రభుత్వ సొమ్మును దుబారా చేయొద్దని గట్టిగా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు సక్రమంగా అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికి రెండ్రోజులు ఇవ్వాల్సిన గుడ్డు ఒక్కరోజు మాత్రమే ఇస్తున్నారని కిషన్‌నగర్‌లో విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో గవర్నర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మండల విద్యాశాఖ అధికారిని గ్రామసభకు పిలిచి గుడ్డు ఇవ్వకపోవడంపై నిలదీశారు. ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే రూ.6.38 సరిపోవడం లేదని ఓసారి.. తాను చెప్పినా కాంట్రాక్టర్ వినడం లేదంటూ మరోసారి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మంత్రి కేటీఆర్, గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా ఇదే డబ్బుతో వారానికి రెండు రోజులు గుడ్లు ఇస్తున్నప్పుడు.. ఇక్కడెందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. రెండు గుడ్లు ఇస్తున్నట్లు ప్రభుత్వ నిధులను ఎందుకు డ్రా చేస్తున్నారని, కాంట్రాక్టర్ ఇచ్చే బిల్లులపై ఎలా సంతకాలు పెడుతున్నారని అడిగారు. కట్టెల పొయ్యి మీద మధ్యాహ్న భోజనం తయారు చేయడం ఇబ్బందికరంగా ఉంటుందని, అన్ని పాఠశాలలకు తక్షణం వంటగ్యాస్ సిలిండర్లను, పొయ్యిని అందజేయాలని గవర్నర్.. కలెక్టర్‌ను ఆదేశించారు. రేషన్ షాపుకెళ్దామా..? తనకు రేషన్ బియ్యం రావడం లేదని అంతమ్మ అనే మహిళ ఫిర్యాదు చేయడంతో డీలర్‌ను సమాధానం చెప్పాల్సిందిగా గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ కోరారు. తాను సక్రమంగానే బియ్యం పంపిణీ చేస్తున్నానని డీలర్ చెప్పడంతో.. అయితే షాపుకెళ్లి తనిఖీ చేద్దామా, కీ రిజిస్టర్ చూపిస్తావా అంటూ గవర్నర్ ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రామాల్లో బడి ఈడు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపిస్తామని తమకు గ్రామస్తులు మాటివ్వాలని, ఈ మేరకు ప్రతిజ్ఞ చేయాలని నరసింహన్ కోరారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తను సేకరించడం కోసం 750 మందికి ఒక రిక్షా చొప్పున అందిస్తున్నామన్నారు. చెత్తను డంప్‌యార్డుకు తరలించడానికే పరిమితం కాకుండా, దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు గ్రామస్తులు ప్రణాళికలు రూపొందించాలని గవర్నర్ కోరారు. అనంతరం రెండు గ్రామాల ప్రజలతో కలిసి గవర్నర్ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, కిషన్‌నగర్ సర్పంచ్ దేవి తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు దసరా పండుగకు తీపి కబురు అందించారు. నిరుద్యోగుల వయో పరిమితి పెంచుతూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు సడలింపు ఇచ్చింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వయోపతిమితికి దగ్గరగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు మళ్లీ చిగురించినట్లే. రాష్ట్రంలో నిరుద్యోగులకు వివిధ ఉద్యోగ పరీక్షలకు వయోపరిమితి పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.