అభ్యర్థి ఒక కంపెనీలో ఉద్యోగం కోసం ఏం చేసాడో తెలుసా? | UK: Genius Job Applicant Prints His Resume On Companys flyers | Sakshi
Sakshi News home page

అభ్యర్థి ఒక కంపెనీలో ఉద్యోగం కోసం ఏం చేసాడో తెలుసా?

Published Sun, Jan 30 2022 8:48 PM | Last Updated on Sun, Jan 30 2022 9:15 PM

UK: Genius Job Applicant Prints His Resume On Companys flyers - Sakshi

లండన్​: ఉద్యోగం సాధించడంలో రెజ్యూమ్​ ఎంతో కీలకమైంది. అభ్యర్థి ఉద్యోగం కోసం.. కంపెనీ మెయిల్స్​​, లింక్డ్​ ఇన్​​, నౌకరీ డాట్​ కామ్​.. రకరకాల మాధ్యమాలతో కంపెనీలకు తమ రెజ్యుమ్​ను పంపుతుంటారు. ఒక వ్యక్తి రెజ్యూమ్​ చూసి.. అతని పట్ల కంపెనీలు కొంత అవగాహనకు వస్తాయి. రెజ్యూమ్​లలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, వారు సాధించిన అంశాలు దానిలో పొందుపరుస్తూ ఉంటారు.

అయితే, చాలా కంపెనీలు వాటిని వ్యక్తికరించడంలో కొంత సృజనాత్మకతను కొరుకుంటాయి. అయితే, ఇక్కడ యూకేకి చెందిన ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వినూత్నంగా ఆలోచించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పూర్తి వివరాలు.. యూకే కు చెందిన జోనాథన్​ స్విఫ్ట్​ అనే వ్యక్తి ఇన్​స్టాంట్​ ప్రింట్​ ఉద్యోగం కోసం.. తన రెజ్యూమ్​ ప్రింట్​ను సదరు కంపెనీ పార్కింగ్​ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క కారుకు అంటించాడు. అయితే, యార్క్​షైర్​ కు చెందిన ప్రిటింగ్​ హౌస్​ కంపెనీలో చేరడానికి అతను.. ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఆ కంపెనీలో సదరు వ్యక్తి చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఆనోట.. ఈనోట.. చివరకు ఆ కంపెనీ మార్కెటింగ్​ మేనేజర్​ వరకు వెళ్లింది. దీంతో ఆయన  సదరు వ్యక్తి ఉద్యోగం పట్ల చూపిన ఆసక్తికి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత.. అతడిని కంపెనీవారు కాల్​ చేసి ఇంటర్వ్యూకి పిలిచారు. దీనిపై కంపెనీ మేనేజర్​ స్పందించారు.

‘సదరు వ్యక్తి పార్కింగ్​ ఉన్న కార్లకు రెజ్యూమ్​ను అతికించిడం కిటికీలో నుంచి చూసినట్లు వాసెల్​ అనే మేనేజర్​ తెలిపారు’. అయితే, ఆ ఉద్యోగానికి 140 అప్లికేషన్​లు వచ్చినట్లు కంపెనీ మేనేజర్​ తెలిపారు. జోనాథన్​ స్విఫ్ట్ ను ఉద్యోగానికి ఎంపిక చేసినట్లు కూడా ప్రకటించారు. 

చదవండి: ఇంటి నుంచి కిడ్నాప్​ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement