creativity
-
క్రియేటివిటీకి ఆనంద్ మహీంద్రా ఫిదా!.. బంపరాఫర్
ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.వీడియోలో 'సుధీర్ భావే' రకరకాల సైకిల్స్ రూపొందించారు. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈయన సృజాత్మకత చూపరులను ఎంతగానో మంత్రం ముగ్దుల్ని చేస్తోంది. దీనికి ఆనంద్ మహీంద్రా సైత ఫిదా అయ్యారు. క్రియేటివిటీ అనేది కేవలం యువకుల సొంతం మాత్రమే కాదని.. సుధీర్ భావేను ప్రశంసించారు.ప్రయోగశాల అవసరమైతే.. గుజరాత్‌లోని వడోదరలోని మహీంద్రా వర్క్‌షాప్‌ను ఉపయోగించుకోవచ్చని భావేకు.. ఆనంద్ మహీంద్రా అవకాశం కల్పించారు. సుధీర్ మీరు రిటైర్డ్ కాదు.. జీవితంలో చురుకైన & వినూత్నమైన కాలంలో ఉన్నారని కొనియాడారు.సుధీర్ భావే రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్. కాబట్టి అనేక సైకిల్స్ వ్యాయామాలకు ఉపయోగపడే విధంగా కస్టమైజ్ చేశారు. ఇందులో ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కూడా ఉంది. భావే సుమారు 40 ఏళ్లపాటు స్టీల్ పరిశ్రమలో పనిచేశారు. తాను ప్రతిరోజూ సైకిళ్లను ఎక్కువగా ఉపయోగిస్తానని పేర్కొన్నారు.This wonderful story showed up in my inbox today. I bow low to Sudhir Bhave’s irrepressible creativity and energy. Sudhir has demonstrated that inventiveness & a startup DNA in India is not only the prerogative of the young! And if you want to use the workshop of our… pic.twitter.com/0Cp821pIyA— anand mahindra (@anandmahindra) July 18, 2024 -
కంటెంట్ క్రియేటర్ల కోసం బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవే! ధరలు ఎలా ఉన్నాయంటే?
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది సొంతంగా ఎదగాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొందరు కంటెంట్ క్రియేట్ చేసుకోవడం లేదా యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. అలాంటి వారి అవసరాలకు, ప్రత్యేకించి 'కంటెంట్ క్రియేటర్ల'కు ఉపయోగపడే HP ల్యాప్‌టాప్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 15 హెచ్‌పీ కంపెనీ కంటెంట్ క్రియేటర్ల కోసం రూపొందించిన ల్యాప్‌టాప్‌లలో ఒకటి 'ఎన్వీ ఎక్స్360 15'. ఇది 15.6 ఇంచెస్ ఓఎల్ఈడీ టచ్ డిస్ప్లే కలిగి వారి వినియోగానికి తగిన విధంగా మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే స్క్రీన్‌ను 360 డిగ్రీలు తిప్పవచ్చు. ఇది NVIDIA GeForce RTX 3050 లేదా AMD Radeon గ్రాఫిక్స్‌తో సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్లు లేదా AMD రైజెన్ 5 పొందుతుంది. ఈ ల్యాప్‌టాప్ HP ఆన్లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 78999. హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 14 హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 14 కూడా అద్భుతమైన పనితీరుని అందించే ఉత్తమమైన ల్యాప్‌టాప్. ఇది కూడా OLED డిస్ప్లేను పొందుతుంది. దీని ధర రూ. 169999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ల్యాప్‌టాప్ HP ఆన్లైన్ స్టోర్లలో మాత్రమే కాకుండా, ఈకామర్స్ సైట్లలోనూ లభిస్తుంది. పర్ఫామెన్స్ మాత్రమే కాకుండా.. న్యూరల్ ప్రాసెసింగ్ కూడా కలిగి ఉంటుంది. వీడియో ఎడిటింగ్ వంటి వాటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 16 రూ. 179999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 16 ల్యాప్‌టాప్ HP ఆన్లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్లలో లభిస్తుంది. మంచి డిజైన్ కలిగిన ఈ ల్యాప్‌టాప్ 16 ఇంచెస్ డిస్ప్లే కలిగి హై-రిజల్యూషన్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి వాటికి ఉపయోగపడుతుంది. ఇదీ చదవండి: మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల! హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 మంది డిజైన్, కంటెంట్ క్రియేటర్లకు అవసరమైన ఫీచర్స్ కలిగిన ఈ హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 ల్యాప్‌టాప్ 2560 x 1600 రిజల్యూషన్, 400 నిట్ల బ్రైట్‌నెస్‌ని అందించే 16 ఇంచెస్ డిస్ప్లే ప్యానెల్ పొందుతుంది. ఇది ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 16.0 GB ర్యామ్ వంటి వాటిని పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 124999. ఇది కూడా HP ఆన్లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్లలో లభిస్తుంది. -
యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు విపరీతమైన డిమాండ్.. అలా చేస్తే సూపర్ సక్సెస్
అద్భుత దృశ్యాలను వర్ణించడానికి...‘రెండు కళ్లు సరిపోవు’ అంటాం. అద్భుత దృశ్యాలను సృష్టించడానికి రెండు కళ్లతో పాటు మూడోకన్ను కూడా అవసరం.దాని పేరే... క్రియేటివ్ ఐబూమింగ్ మార్కెట్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెరగడం ఒక కోణం అయితే, ఉపాధి అవకాశాలు పెరగడం, యువతరం క్రియేటివిటీకి విశాలమైన వేదిక దొరకడం అనేది మరో కోణం... ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఇరవై ఏడు సంవత్సరాల అభినవ్ భరద్వాజ్ ఫ్యాషన్ బ్లాగర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్. వీఎఫ్ఎక్స్, యానిమేషన్లో డిగ్రీ పూర్తి చేసిన అభినవ్‌కు ఎన్నో పురాణ పాత్రలపై అవగాహన ఉంది. ఇరవై సంవత్సరాల వయసులో ఆర్ట్, డిజైనింగ్‌ను కెరీర్‌గా చేసుకున్న అభినవ్ లాక్డౌన్ సమయంలో ట్రెండింగ్ టాపిక్స్‌పై లెక్కలేనన్ని డిజైన్లను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో సృష్టించాడు. వాటికి మంచి స్పందన రావడం ఒక ఎత్తయితే పాపులర్ బ్రాండ్ల నుంచి అవకాశాలు రావడం మరో ఎత్తు. ‘మనకు ఉన్న రెండు కళ్లతో పాటు క్రియేటివ్ ఐ అనే మూడో కన్ను కూడా ఉండాలి. అది ఉన్నప్పుడే బ్రాండ్ డిజైనింగ్ నుంచి సినిమా వీఎఫ్ఎక్స్ వరకు రాణించగలం’ అంటాడు అభినవ్. కలర్స్ నుంచి డ్రెస్సింగ్ సెన్స్ వరకు అతడి యూనిక్ స్టైల్ స్టేట్మెంట్కు యువతలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల్లో బెంగళూరుకు చెందిన శ్రీతేజస్వి ఒకరు. డిగ్రీ రెండోసంవత్సరం చదువుతున్న తేజస్వి వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను విడుదలైన మొదటి రోజే చూస్తుంది. ఆ సాంకేతికత గురించి తన అభిప్రాయాలను ఫేస్బుక్లో రాస్తుంది. వినోద రంగంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీకి ఇది బంగారు కాలం. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్ స్టూడియోల సంఖ్య పెరుగుతోంది. ముంబై, చెన్నై, బెంగళూరు... మొదలైన నగరాలు యానిమేషన్ కంపెనీలు, అకాడమీలకు కేంద్రాలుగా మారాయి. మన దేశానికి పెద్ద ఎంటర్టైన్మెంట్ మార్కెట్ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం ఈ రంగంలో 2025 కల్లా 75,000 నుంచి 1,25,000 ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. కమర్షియల్స్, వెబ్ సిరీస్, మూవీస్, వోటీటీకి హై–క్వాలిటీ మెటీరియల్ కావాలి. ఈ నేపథ్యంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు ప్రాధాన్యత పెరిగింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ బిజినెస్ కాంబినేషన్ యువతను ఆకర్షిస్తుంది. కొత్త ఆలోచనలకు అవకాశం కల్పిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ యానిమేషన్‌కు డిమాండ్‌ను పెంచే కథలను సిద్ధం చేస్తోంది. ‘వీఎఫ్ఎక్స్, యానిమేషన్లకు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ పెరిగింది. అంచనాలకు అందని విధంగా ఈ రంగం చాలా అడ్వాన్స్డ్గా ఉంది. వీఎఫ్ఎక్స్ అనేది సాంకేతికత మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. కథాసం విధానంలో భాగం’ అంటున్నాడు వీఎఫ్ఎక్స్ నిపుణుడు రాజీవ్ కుమార్. స్కూల్ రోజుల నుంచే వీఎఫ్ఎక్స్ అంటే రాజీవ్‌కు ఆసక్తి. అయితే దాన్ని కెరీర్‌గా ఎలా చేసుకోవాలనే దానిపై స్పష్టత ఉండేది కాదు. పుణెలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన రాజీవ్ ముంబైకి వెళ్లి వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీతో ప్రయాణం మొదలుపెట్టి భారీ విజయం సాధించాడు. మలయాళ చిత్రం కందిట్టుండు (అది చూడు) బెస్ట్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డ్ గెలుచుకుంది. 25 సంవత్సరాల అదితి క్రిష్టదాస్ ఈ చిత్రానికి దర్శకురాలు. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ (ఎన్ఐడీ) లో యానిమేషన్ కోర్సు చేసిన అదితి క్రిష్ణదాస్ తొలి చిత్రంతోనే జాతీయ అవార్డ్ అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకుంది చెన్నైకి చెందిన ప్రియాంక సుబ్రమణియన్. లండన్ ఫిల్మ్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక ఫ్రెండ్ ద్వారా మూవింగ్ పిక్చర్ కంపెనీకి తరచు వెళ్లేది. ఇండస్ట్రీ ధోరణులను అర్థం చేసుకోవడం కోసం ఎందరో కళాకారులతో మాట్లాడేది. పుస్తకాలు చదివేది. స్టూడియోలలో అవసరమైన వారికి టీ, కాఫీలు, వోల్డ్ టేప్‌లు, హార్డ్ డిస్క్‌లు అందించేది. వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన ప్రియాంక సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని కలలు కనేది. వీఎఫ్ఎక్స్ స్టూడియో రూపంలో తన కలను సాకారం చేసుకుంది. మీ శక్తి వృథా చేయవద్దు వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అప్పుడు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా చేసే శక్తి ఉంటుంది. ఆ శక్తి నిరుపయోగం కాకుండా చూసుకోవాలి. – ప్రియాంక సుబ్రమణియన్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ అ కథలు మళ్లీ ఇప్పుడు మనకు తరతరాల కథల సంపద ఉంది. అమ్మమ్మలు, నానమ్మల నోటి నుంచి కథలు వినే దృశ్యాలు అరుదైపోయాయి. ఈ నేపథ్యంలో యానిమేషన్‌కు ప్రాధాన్యత పెరిగింది. మరుగున పడిన ఎన్నో కథలను పిల్లలకు ఆకట్టుకునేలా చెప్పవచ్చు. యానిమేషన్ ఫిల్మ్స్ అంటే ఫన్నీ కార్టూన్స్‌ను మాత్రమే కాదు. – అదితి క్రిష్ణదాస్, డైరెక్టర్ -
చెన్నైలో ఆటో డ్రైవర్ సృజన.. అతని ఆటోనే ఓ మినీ గార్డెన్
అవడానికి అది ఓ చిన్న ఆటో మాత్రమే. కానీ అందులో ఏకంగా ఒక మినీ గార్డెన్‌నే సృష్టించాడతను. చెన్నైకి చెందిన కుబేందిరన్ అనే ఆటో డ్రైవర్ మది నుంచి పుట్టుకొచి్చన ఈ సృజనాత్మక ఆలోచన నెటిజన్ల మది దోచుకుంటోంది. ఇంటర్నెట్ నిండా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది... కుబేందిరన్. చెన్నైలోని దాదాపు లక్ష మంది ఆటో డ్రైవర్లలో ఒకడు. కానీ పర్యావరణం మీది ప్రేమ అతన్ని మిగతా వారికంటే ఎంతో ప్రత్యేకంగా నిలిపింది. దేశమంతటా అతని పేరు మారుమోగేలా చేసింది. రకరకాల మీనియేచర్ మొక్కలు తదితరాలతో ఆటోను కదిలే తోటగా తీర్చిదిద్దాడు. ముందు, వెనక సీట్ల మధ్య, వెనక వైపు, సీలింగ్ మీద మాత్రమే గాక సీలింగ్ లోపలి వైపు కూడా పచ్చని మొక్కలతో నింపి ఆకట్టుకుంటున్నాడు. ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ప్రయాణికులు మైమరచిపోతున్నారు. అందుకే ఇప్పుడు కుబేందిరన్ ఆటోను చెన్నైవాసులు ప్రయాణించే పార్కుగా అభివరి్ణస్తూ మురిసిపోతున్నారు. అందులో ప్రయాణించిన వాళ్లు ’గ్రీన్ ఆటో’, ’మూవింగ్ పార్క్’, ఇంకా రకరకాలుగా ప్రశంసిస్తున్నారు. ఇంత చక్కని ఆలోచన చేసినందుకు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు కూడా. మరెన్నో విశేషాలు: ఇది మాత్రమే కాదు, ఆటో ఎక్కే వారు చదువుకోవడం కోసం ఎన్నెన్నో స్ఫూర్తిదాయక పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచాడు కుబేందిరన్. అంతేగాక వారికి స్వచ్ఛమైన చల్లని మంచినీరు కూడా ఇస్తాడు. వీటికి తోడు చక్కని సూక్తులు, నినాదాలతో కూడిన బ్యానర్లు కూడా ఆటో నిండా కనువిందు చేస్తుంటాయి. వాటిని తరచూ మారుస్తూ మరింత ఆకట్టుకుంటాడతను. రోడ్డు భద్రత గురించి కూడా అందరికీ వీలైనంత వరకూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తనవంతు సామాజిక బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఆటోపై రూఫ్ గార్డెన్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి చెందిన మహేంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ కూడా ఇలాగే తన ఆటో రూఫ్ టాప్ మీద గార్డెన్ పెంచి వార్తల్లో నిలిచాడు. ఈ గార్డెన్ 2020 నుంచీ అందరినీ అలరిస్తోంది. కుమార్‌తో పాటు అతని ఆటో ఎక్కేవాళ్లు కూడా మండే ఢిల్లీ ఎండల్లో కూడా చక్కని చల్లదనం అనుభవిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. అతన్నీ, అతని ఆటో రూఫ్ టాప్నూ అంతా ఎప్పుడు చూసినా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు! – నేషనల్ డెస్క్, సాక్షి -
ఏంటీ ఈ 'లిపి'..? గవర్నర్ సైతం.. 'వాహ్ శభాష్' అంటూ..
వరంగల్: ఏటా నిర్వహించే సైన్స్‌ఫేర్‌లో ఎవరూ చేయని అద్భుతాన్ని ఆవిష్కరించాలనుకున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఫిజికల్సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మడ్క మధు. అతడి దృఢ సంకల్పానికి విద్యార్థుల ఆసక్తి తోడైంది. దీంతో నోటితో మాట్లాడకుండా, చెవితో వినకుండా కళ్ల సైగలతో, చెవుల కదలికలతో మాట్లాడే ఓ లిపిని విద్యార్థులు, ఉపాధ్యాయుడు కలిసి తయారు చేశారు. విద్యార్థుల ప్రతిభను చూసి 'గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాహ్ శభాష్' అంటూ అభినందించారు. విద్యార్థుల్ని, టీచర్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆకుతోట మల్లిక, సల్పాల దేవిక, ఆరెందుల రాజశేఖర్, మద్దిరాల శివ నవదీప్, సల్పాల నందిని, సల్పాల సంకీర్తన ‘ఐ’ కోడింగ్, ‘ఇయర్’ కోడింగ్‌లో ఉపాధ్యాయుడు మధు వద్ద శిక్షణ పొంది ప్రతిభ కనబరుస్తున్నారు. వీటితోపాటు గారడి, ఐబ్రోస్ (కనుబొమ్మలు)సైగలతో భావవ్యక్తీకరణ జరుపుతున్నారు. లిప్(పెదవు)ల మూవ్‌మెంట్‌ను బట్టి మాట్లాడింది చెప్పేస్తున్నారు. విద్యార్థులు వీటిపై మరింత శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికే పాఠశాలలో 10 మందికి పైగా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయుడు మధు శిక్షణ ఇస్తున్నారు. ఏంటీ ఈ లిపి..? ‘ఐ’కోడింగ్ అంటే కను సైగలతో మాట్లాడడం. ఏ, బీ, సీ, డీ ఒక్కో అక్షరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వీటిని కనుసైగలతో వ్యక్తీకరిస్తారు. చెవుల కదలికలతో సైతం భావాల్ని వ్యక్తపరుస్తున్నారు. దీనికీ ప్రత్యేకంగా ఓ లిపిని తయారు చేశారు. ఐ, ఇయర్ కోడింగ్ భాష దేశ రక్షణకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సీబీఐ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, రా ఇతర నిఘావర్గాలకు ఈ లిపి ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయుడు మధు, విద్యార్థులు చెబుతున్నారు. ఒక పేపర్లో ఉన్నది చదివి విద్యార్థి నోటిని తెరవకుండా కళ్లు మూస్తూ.. తెరుస్తూ... మీదకు, కిందికి ఎగరేస్తూ.. చెవులను కదిలిస్తూ సైగలతో భావాల్ని వ్యక్తీకరిస్తే.. మరో విద్యార్థి ఆ సైగలు చూసి పొల్లుపోకుండా పేపర్‌పై రాసి చూపిస్తుంది. విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని చేతిలో ఏముందో చెబుతూ మంత్రాలు, తంత్రాలు లేవని గ్రామీణులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. దేశ రక్షణకు ఉపయోగం.. గవర్నర్ కితాబిచ్చారు.. ‘చెవులను కదిలించడం జంతువులకే సాధ్యం అలాంటిది మీరు చేస్తున్నారంటే గ్రేట్’ అని గవర్నర్ మేడమ్ కితాబిచ్చారు. మా టీచర్ల ప్రోత్సాహంతో బాగా శిక్షణ పొందుతున్నాం. మేం, మా భాష దేశ రక్షణకు ఉపయోగపడితే చాలు. పోలీస్ జాబ్ చేయాలనేది నా కోరిక. – శివ నవదీప్, ఎనిమిదో తరగతి మరిచిపోలేని అచీవ్మెంట్.. ఐ కోడింగ్ గురించి మా గైడ్ టీచర్ మధు చెప్పారు. ఆసక్తితో నేర్చుకున్నాను. ఈ భాషను భవిష్యత్‌లో దేశానికి ఉపయోగపడేలా సాధన చేస్తాం. గవర్నర్ మేడమ్ మమ్మల్ని మెచ్చుకోవడం మరిచిపోలేని అచీవ్మెంట్. – ఆకుతోట మల్లిక, పదో తరగతి ప్రపంచంలో ఎక్కడా లేని భాష.. సైన్స్‌ఫేర్‌లో కొత్తగా ఉండాలని ఐ, ఇయర్ కోడింగ్ రెండు ప్రత్యేక భాషలు ఎంచుకున్నా. దీనికి ప్రత్యేకంగా లిపిని తయారు చేశా. దీనికి మాప్రాంతంలో మంచి ఆదరణ వస్తోంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఈ భాష లేదని అనుకుంటున్నా. గవర్నర్‌ను విద్యార్థులతో కలవడం మరిచి పోలేం. విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి దేశానికి ఉపయోగపడేలా చేయాలనేది నా లక్ష్యం. ఇంకా గారడి, ఐబ్రోస్, లిప్ మూవ్‌మెంట్‌పై సాధన జరుగుతోంది. – మడ్క మధు, ఫిజికల్సైన్స్ ఎస్ఏ, మహదేవపూర్ -
కార్పెంటర్ క్రియేటివిటీకి మంత్రి కేటీఆర్ ఫిదా..
-
ఏం క్రియేటివిటీ! మహిళ ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ఫిదా..
మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ట్విటర్లో ఆయన ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన కంటెంట్‌ను, వైరల్ వీడియోలను షేర్ చేస్తుంటారు. వాటిపై తన అభిప్రాయాలను ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా ఓ మహిళ స్టాపిల్ పిన్‌లతో బొమ్మ కారు తయారీ చేసిన వీడియోను షేర్ చేశారు. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వీడియోలో ఓ మహిళ స్టాపిల్ పిన్‌లతో చిన్న బొమ్మ కారును చిటికెలో తయారు చేశారు. కారు చక్రాలు, బానెట్, రూఫ్ ఇలా ప్రతీతి స్టాపిల్ పిన్లతోనే ఎంతో నేర్పుగా చేశారు. ఆమె నైపుణ్యానికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర.. ఆమెకు తమ సంస్థలో జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తన ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వీడియో పలువురు యూజర్లు స్పందించారు. ఆమె ప్రతిభను అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. How on earth did she come up with this idea using just simple staples?? Incredibly creative but she should work on real car manufacturing &design now. We’ll be ready to recruit her! pic.twitter.com/UBxjxvm91P — anand mahindra (@anandmahindra) July 8, 2023 ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ మూర్తిపై మహాభారత పాత్ర ప్రభావం.. అప్పట్లో కరుడుకట్టిన వామపక్షవాది! -
రాజాధి రాజ... రాజ గంభీర... విరాట్ మహారాజా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ పాపులర్ అయిన తరువాత ఆర్టిస్ట్‌లకు కంటినిండా పనిదొరికింది. తమ క్రియేటివిటీకి ఏఐ ఆర్ట్‌ను జత చేస్తూ ఎన్నో ఆశ్చర్యాలను ఆవిష్కరిస్తున్నారు. తాజాగా డిజిటల్ క్రియేటర్ షాహీద్ సృష్టించిన విరాట్ కోహ్లీ ‘దశావతారం’ ఏఐ ఇమేజ్‌లు వైరల్ అవుతున్నాయి. కామెంట్ సెక్షన్లో బోలెడు ‘హార్ట్’ ఇమోజీలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రోనాట్, ఫుట్‌బాల్ ప్లేయర్, డాక్టర్, మ్యూజిషియన్, సోల్జర్, ఫైటర్ పైలట్, పోలీస్, మహారాజా... ఇలా రకరకాల గెటప్‌లలో విరాట్ కనిపిస్తాడు. ‘ఇంతకీ విరాట్ ఏ గెటప్‌లో బాగున్నాడు?’ అనే విషయానికి వస్తే.... నెటిజనులలో అత్యధికులు ‘మహారాజా’ గెటప్‌కు ఓటు వేశారు. View this post on Instagram A post shared by SK MD ABU SAHID (@sahixd) -
కమ్మని కాఫీలాంటి కళ
యువతరంలో చాలామంది..తమ క్రియేటివ్ స్కిల్స్‌ను అభిరుచికి మాత్రమే పరిమితం చేసుకోవడం లేదు. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఆసక్తి, అభిరుచులనే కెరీర్ ఛాయిస్‌గా తీసుకుంటున్నారు. కాపీరైటర్ కావాలనే కల కూడా అందులో ఒకటి. ‘మేకిట్ సింపుల్. మేకిట్ మెమొరబుల్’ ‘రైట్ వితౌట్ ఫియర్. ఎడిట్ వితౌట్ మెర్సీ’... లాంటి మాటలను గుండెలో పెట్టుకొని తమ కలల తీరం వైపు కదులుతున్నారు.. పశ్చిమ బెంగాల్‌లోని చిన్న పట్టణం నుంచి తన కలల తీరమైన ముంబైకి వచ్చింది అనూష బోస్. మాస్ కమ్యూనికేషన్లో పట్టా పుచ్చుకున్న అనూష ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో చేరింది. జింగిల్స్, డైలాగులు రాయడంలో తనదైన శైలిని సృష్టించుకుంది. మూడురోజుల్లో రాసే టైమ్ దొరికినా కేవలం 30 సెకండ్లలో మాత్రమే రాసే అవకాశం ఉన్నా.. ఎక్కడా తడబాటు ఉండకూడదనేది తన ఫిలాసఫీ. ‘ఇండస్ట్రీలో నేను కూడా ఒకరిని అనుకోవడం కాదు. మనలోని ప్రత్యేకత గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా క్రియేటివిటీకి సానబట్టాలి’ అంటుంది సీనియర్ కాపీ రైటర్ అయిన అనూష బోస్. ట్రైనీ కాపీరైటర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ముంబైకి చెందిన ఆకృతి బన్సాల్. చిన్నప్పటి నుంచి తనకు టీవీలో వచ్చే యాడ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనని అడ్వర్టైజింగ్ ఫీల్డ్‌కు తీసుకువచ్చింది. అది ఏ వ్యాపారానికి సంబంధించినది అనేదానికంటే ఆ యాడ్ వెనుక ఉన్న ఐడియా తనకు బాగా నచ్చేది. ‘హోం సైన్స్’ చదువుకున్న ఆకృతికి ‘ఎడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్రిలేషన్’ ఒక సబ్జెక్ట్‌గా ఉండేది. ఆ సబ్జెక్ట్ ఇష్టంగా చదువుకున్న తరువాత ‘ఈ రంగంలో నేను ప్రయత్నించవచ్చు’ అనుకుంది. ఫీల్డ్‌కు వచ్చిన తరువాత ప్రతిరోజు, ప్రతి డెడ్‌లైన్‌ను ఒక సవాల్‌గా స్వీకరించింది. ‘చాలెంజ్ ఉన్నప్పుడే మజా ఉంటుంది’ అంటుంది ఆకృతి బన్సాల్. మరి ఆమె భవిష్యత్ లక్ష్యం ఏమిటి? ‘ప్రతిష్ఠాత్మకమైన ఎడ్వర్టైజింగ్ అవార్డ్ తీసుకోవాలి లేదా నా తల్లిదండ్రులు రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి నచ్చిన యాడ్ హోర్డింగ్ నేను రాసినదై ఉండాలి’ అంటుంది ఆకృతి బన్సాల్. రాధిక నాగ్‌పాల్ టీనేజ్ నుంచి పుస్తకాల పురుగు. భాషలోని సొగసు అంటే ఇష్టం. రాధిక జర్నలిజం కోర్స్ చేసింది. అందులో ఒక సబ్జెక్ట్ అయిన ఎడ్వర్టైజింగ్ తనకు బాగా నచ్చింది. రాధిక ఇప్పుడు ‘సోషియోవాష్’లో సీనియర్ కాపీ రైటర్. ‘యాడ్ ఏజెన్సీలో పనిగంటలు అంటూ ఉండవు. కాలంతో పరుగెత్తాల్సిందే. బ్రాండ్‌ను అర్థం చేసుకోవడంతో పాటు క్లయింట్ ఆశిస్తున్నది ఏమిటి? ఆడియెన్స్‌ను వేగంగా ఎలా చేరుకోవాలి? అనే దానిపై అవగాహన ఉండాలి. మనం చెప్పదల్చుకున్నది సింగిల్ లైన్లోనే క్యాచీగా చెప్పగలగాలి’ అంటుంది రాధిక. విస్తృతంగా చదవాలి. గత అనుభవాల నుంచి రెఫరెన్స్ తీసుకోవడానికి ఎంతో ఉంది’ అనేది ఔత్సాహిక కాపీరైటర్లకు రాధిక ఇచ్చే సలహా. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన అంజు న్యూస్పేపర్లలో వచ్చే ఎడ్వర్టైజింగ్లను ఫైల్ చేస్తుంటుంది. ఆమె ఎన్నోసార్లు చదివిన పుస్తకం క్లాడ్ సీ.హాప్కిన్స్ రాసిన సైంటిఫిక్ ఎడ్వర్టైజింగ్ (1923). ఈ పుస్తకంలోని సరళమైన భాష అంటే అంజుకు ఇష్టం. ‘జస్ట్ సేల్స్‌మన్‌షిప్’ ‘ఆఫర్ సర్వీస్’ ‘హెడ్ లైన్స్’ ‘బీయింగ్ స్పెసిఫిక్’ ‘ఆర్ట్ ఇన్ ఎడ్వర్టైజింగ్’ ‘టెల్ యువర్ ఫుల్స్టోరీ’ ‘ఇన్ఫర్మేషన్’ ‘స్ట్రాటజీ’ ‘నెగెటివ్ రైటింగ్’... మొదలైన చాప్టర్ల గురించి అనర్గళంగా మాట్లాడగలదు. అంజు భవిష్యత్ లక్ష్యం ‘కాపీ రైటర్’ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు! వీరు కూడా.. ప్రముఖ సినీ నటి రాశీఖన్నా న్యూ దిల్లీ, లేడీ శ్రీరామ్ కాలేజీ స్టూడెంట్. కాలేజీ రోజుల నుంచి చదవడం రాయడం అంటే ఇష్టం. కాపీరైటర్ కావాలనేది తన కల. కలను నిజం చేసుకోవడానికి ముంబైకి వెళ్లింది. అయితే సినిమాల్లో అవకాశాలు రావడంతో తన రూట్ మారింది. కాపీరైటర్ కాబోయి యాక్టర్ అయిందన్నమాట! సినిమారంగంలో ఉన్నప్పటికీ గుడ్ కాపీరైటింగ్ కోసం వెదుకుతుంది. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ కాలేజీ చదువు పూర్తికాగానే ఒక యాడ్ ఏజెన్సీలో కాపీరైటర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. ఇప్పటికీ చిన్న చిన్న రచనలు చేస్తుంటాడు. మన ప్రత్యేకతే మన శక్తి ఇండస్ట్రీలో నేను కూడా ఒకరిని అనుకోవడం కాదు. మనలోని ప్రత్యేకత గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా క్రియేటివిటీకి సాన పట్టాలి. – ఆకృతి బన్సాల్, కాపీ రైటర్ ఒక ఐడియా... వెయ్యి ఏనుగుల బలం ఒక ఐడియా స్ట్రైక్ అయ్యేవరకు మనసులో భయంగా ఉంటుంది. తళుక్కుమని ఒక ఐడియా మెరిసిందా...ఇక అంతే. వెయ్యి ఏనుగుల బలం దరి చేరుతుంది! క్రియేటివ్ బ్లాక్స్ రాకుండా ఉండడానికి పుస్తకాలు చదువుతాను. నచ్చిన పుస్తకాలు మళ్లీ చదువుతాను. – రాధిక నాగ్‌పాల్, సీనియర్ కాపీ రైటర్ (చదవండి: కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయ్! ) -
కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!
మద్దిపాడు: గొర్రెల కాపరికి తన జీవాలంటే ప్రాణం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే కదా! తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం, చింతగుంట గ్రామానికి చెందిన కురమయ్య సుమారు వెయ్యి గొర్రెల మందకు కాపరి. అన్ని జీవాలకు మేత కావాలి కదా! అందుకే వాటిని మేపుకుంటూ ప్రస్తుతం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి, గుండ్లాపల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. ఇతనితో పాటు మరో ముగ్గురు కూడా మందకు రక్షణగా ఉంటారు. ఇంత పెద్ద సమూహంలో పిల్లలు పుట్టడం సహజమే. అయితే అవి నడవలేవు కాబట్టి వాటి కోసం బాడుగ వాహనం కావాలి. అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో కురమయ్యకు ఓ ఐడియా వచ్చింది. చిలకలూరిపేటలో ఓ ఆటోమొబైల్ గ్యారేజీకి వెళ్లి 38వేల రూపాయలు ఖర్చు చేసి ఇనుప గ్రిల్స్‌తో ట్రాలీ తయారు చేయించాడు. దానిని తన ద్విచక్రవాహనానికి అమర్చడంతో ట్రాలీ వాహనంలా మారిపోయింది. ప్రస్తుతం 60 మేక పిల్లలను ఎంత దూరమైనా సులువుగా తీసుకువెళుతున్నామని దీనివలన ఖర్చు తగ్గిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం) -
సృజనకు సాన.. వైజ్ఞానిక ప్రదర్శన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచి.. వారి ఆలోచనలకు సానపెట్టి నూతన ఆవిష్కరణలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజ్ఞాన శాస్త్రం, గణితం, పర్యావరణాన్ని ముడి సరుకులుగా వినియోగించి సృ‘జన’హితమైన ఆవిష్కరణలు తీసుకువచ్చేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సమాయత్తం చేస్తున్నారు. విజ్ఞాన ప్రదర్శనల ద్వారా చిన్నతనం నుంచే ఆవిష్కరణల ఆలోచనలు పెంచేలా మార్గదర్శకం చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా పాఠశాల స్థాయిలో సైన్స్ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనల్లో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి వాటిని మండల స్థాయికి పంపుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనల్లో తమ నైపుణ్యాన్ని రంగరించి మండల స్థాయి అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయికి తమ ఆవిష్కరణలు వెళ్లాలనే ఆసక్తి విద్యార్థుల్లో కనిపిస్తోంది. వారికి గైడ్ టీచర్లు సూచనలిస్తూ మరింత పదును పెడుతూ ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రదర్శనలు విద్యార్థుల్లో సహజంగా ఉండే బెరుకును పోగొట్టడానికి తొలుత వారి ఆవిష్కరణలను తమతో ఎప్పుడూ తిరిగే, తాము రోజూ చూసే సహ విద్యార్థుల మధ్యనే ఈ ప్రదర్శనలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో మొదటగా వారు చదివే పాఠశాలలోనే విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించే ఏర్పాటుచేసింది. దీని ద్వారా తోటి విద్యార్థుల నుంచి వెల్లడయ్యే అభిప్రాయాలు, వారి నుంచి అందుకునే అభినందనలు విద్యార్థులకు సగం బలాన్నిస్తాయనేది ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలో ఈనెల 22, 23 తేదీల్లో పాఠశాల స్థాయిలో విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు. ఆవిష్కరణలకు మార్గనిర్దేశనం విద్యార్థులు ఆవిష్కరణలు చేయడానికి తగిన అంశాలను వెతుక్కోవాల్సిన పనిలేకుండా ప్రభుత్వమే కొన్ని అంశాలను సూచించింది. ఈ మేరకు విద్యార్థు లు పర్యావరణ అనుకూల పదార్థాలపై, ఆరోగ్యం, పరిశుభ్రతపై, సాఫ్ట్వేర్–యాప్స్ అభివృద్ధి, పర్యావరణం–వాతావరణ మార్పులు, గణిత నమూనాలు అనే అంశాలపై తమ ప్రాజెక్టులను సిద్ధం చేశారు. ఆయా ప్రాజెక్టులను పాఠశాల స్థాయిలో మంగళ, బుధవారాల్లో ప్రదర్శించారు. మండల స్థాయికి ఐదు చొప్పున.. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన వాటిలో ఉత్తమమైన ఐదు ప్రాజెక్టులను ఎంపిక చేసి మండల స్థాయి ప్రదర్శనలకు పంపనున్నారు. ఇలా ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు మండల స్థాయిలో ప్రదర్శనకు వెళ్లనున్న నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంది. వచ్చేనెల 12, 13వ తేదీల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో మండల స్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సృజనాత్మకతకు పెంచేలా.. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తికి పదును పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాల స్థాయి ప్రదర్శనలు పూర్తయ్యాయి. కేవలం ప్రాజెక్టులు రూపొందించేలా ప్రోత్సహించడంతో పాటు ఆయా ప్రాజెక్టులను చూసి ఇతర విద్యార్థులు స్ఫూర్తి పొందడం ప్రదర్శనల ఉద్దేశం. అలాగే ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మిగిలిన పిల్లలు ఇటుగా ఆలోచించేలా కృషిచేస్తున్నాం. అందుకే పాఠశాల స్థాయిలో నిర్వహించిన ప్రదర్శనలకు సమీపంలోని ఇతర పాఠశాలల విద్యార్థులను కూడా తీసుకువెళ్లి వారికి ప్రాజెక్టులను పరిచయం చేయాలని సంబంధిత స్కూళ్ల ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. – ఆర్ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు -
విచిత్రమైన తలపాగ.. ఫ్యాన్ హెల్మెట్ ధరించిన వ్యక్తి: వీడియో వైరల్
సృజనాత్మకతకు కాసింత మేథస్సును జోడించి కొత్త కొత్త ఆవిష్కరణలను సృష్టించిన వారెందరో ఉన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు తాము ఎదర్కొంటున్న సమస్యల నుంచి పుట్టుకొచ్చినవే. అచ్చం అలానే ఇక్కడొక సామాన్య వ్యక్తి తన సమస్యకు చెక్‌పెట్టే ఒక వినూత్న ఆవిష్కరణకు నాంది పలికాడు. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక బాబాజీ ఫ్యాన్‌తో కూడిన హెల్మట్‌ని ధరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఎందుకలాగా అంటే..ఆయన ఎండలో వెళ్లినప్పడూ ఉక్కపోతను భరించలేక ఇబ్బందులు పడేవారు. అదీగాక సాధువులు, బాబాజీలు పాదాచారులగా బిక్షటన చేసి జీవిస్తుంటారు. అలా వారికి నచ్చిన ప్రాంతాలకు తరలిపోతూ...ఇక అక్కడే ఏ ఆశ్రమాలకో వెళ్లి జపాలు, ధ్యానాలు వంటివి చేస్తుంటారు. అందరికి తెలిసిందే. ఆ క్రమంలో ఆ బాబాజీ పాదాచారిగా వెళ్తుంటే బయట ఎండ ధాటికి తట్టుకోలేక ఒక వినూత్న ఆవిష్కరణకు తెరలేపారు. అదే సోలార్ శక్తితో పనిచేసే ప్యాన్ హెల్మట్. ఆ వ్యక్తి ఒక హెల్మట్కి ఫ్యాన్, సోలార్ ప్లేట్ అమర్చి హెల్మట్ మాదిరిగా ధరించాడు. చూసేందుకు తలపాగ మాదిరిగా ఉంది. ఎంతటి ఎండలోనైనా హాయిగా చల్లటి గాలిని ఆశ్వాదిస్తూ వెళ్లేలా రూపొందించాడు. జనాలు కూడా ఆ బాబా తెలివికి మంత్రముగ్దులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. देख रहे हो बिनोद सोलर एनर्जी का सही प्रयोग सर पे सोलर प्लेट और पंखा लगा के ये बाबा जी कैसे धूप में ठंढी हवा का आनंद ले रहे है ! pic.twitter.com/oIvsthC4JS — Dharmendra Rajpoot (@dharmendra_lmp) September 20, 2022 (చదవండి: ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్లే లవ్‌లో పడ్డా: లవ్ స్టోరీ వైరల్) -
ఈడీ దాడులు: అప్పుడు నోట్ల కట్టలు.. ఇప్పుడేమో!
వైరల్: సోషల్ మీడియా జనాల జీవితాలకు అతుక్కుపోయింది. స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉన్న చాలామంది ఉత్తపుణ్యానికి రీల్స్, వీడియోస్ అంటూ ఇంటర్నెట్ డాటాను తెగ ఖర్చు చేసేస్తున్నారు. అదే సమయంలో ఈ వాడకాన్ని పరిగణనలోకి తీసుకుని తమ తమ ప్రమోషన్ల కోసం సోషల్ మీడియాను వాడేస్తున్నారు. సినీ, పొలిటికల్, స్పోర్ట్స్ నుంచి పోలీసుల దాకా, పబ్లిక్.. ప్రైవేట్ రంగాల్లో ఇప్పుడు సోషల్ మీడియా ప్రమోషన్ సాధారణం అయిపోయింది. ఆఖరికి అవగాహన కోసం కూడా ఈ ఫ్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో.. తామేం తక్కువ తీసిపోలేదని అంటోంది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తాజాగా బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించి బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ సన్నిహితురాలి ఇంట్లో రూ.50 కోట్లకు పైగా రికవరీ చేసి.. ఆ నోట్ల కట్టలను ఈడీ అనే అక్షరాల షేప్‌లో పేర్చి.. ఆ ఫొటోలను మీడియాకు రిలీజ్ చేసింది. అలాగే జార్ఖండ్‌లోనూ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ అనుచరులు, సీఎం హేమంత్ సోరెన్ అనుచరుడు పంకజ్ మిశ్రా ఇళ్లలో దాడుల అనంతరం అలాగే నోట్ల కట్లను ఈడీ అనే అక్షరాలు వచ్చేలా పేర్చింది. తాజాగా సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో జరిపిన తనిఖీల్లో రెండు ఏకే-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా.. రైఫిల్స్‌ను, బుల్లెట్లను ఈడీ షేప్‌లో పేర్చి.. ఆ ఫొటోలను రిలీజ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. తాము మాత్రం తమ విధులను సక్రమంగానే నిర్వహిస్తున్నామని, కావాలంటే తమ పని తీరును చూస్కోమంటూ ఇలా సోషల్‌మీడియా ద్వారా ఫొటోలను వైరల్ చేస్తోంది ఈడీ. ఇదీ చదవండి: ఎక్సర్‌సైజులతో అతని సగం బుర్ర మాయం! -
అభ్యర్థి ఒక కంపెనీలో ఉద్యోగం కోసం ఏం చేసాడో తెలుసా?
లండన్: ఉద్యోగం సాధించడంలో రెజ్యూమ్ ఎంతో కీలకమైంది. అభ్యర్థి ఉద్యోగం కోసం.. కంపెనీ మెయిల్స్, లింక్డ్ ఇన్, నౌకరీ డాట్ కామ్.. రకరకాల మాధ్యమాలతో కంపెనీలకు తమ రెజ్యుమ్‌ను పంపుతుంటారు. ఒక వ్యక్తి రెజ్యూమ్ చూసి.. అతని పట్ల కంపెనీలు కొంత అవగాహనకు వస్తాయి. రెజ్యూమ్‌లలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, వారు సాధించిన అంశాలు దానిలో పొందుపరుస్తూ ఉంటారు. అయితే, చాలా కంపెనీలు వాటిని వ్యక్తికరించడంలో కొంత సృజనాత్మకతను కొరుకుంటాయి. అయితే, ఇక్కడ యూకేకి చెందిన ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వినూత్నంగా ఆలోచించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పూర్తి వివరాలు.. యూకే కు చెందిన జోనాథన్ స్విఫ్ట్ అనే వ్యక్తి ఇన్స్టాంట్ ప్రింట్ ఉద్యోగం కోసం.. తన రెజ్యూమ్ ప్రింట్‌ను సదరు కంపెనీ పార్కింగ్ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క కారుకు అంటించాడు. అయితే, యార్క్‌షైర్ కు చెందిన ప్రిటింగ్ హౌస్ కంపెనీలో చేరడానికి అతను.. ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కంపెనీలో సదరు వ్యక్తి చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఆనోట.. ఈనోట.. చివరకు ఆ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వరకు వెళ్లింది. దీంతో ఆయన సదరు వ్యక్తి ఉద్యోగం పట్ల చూపిన ఆసక్తికి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత.. అతడిని కంపెనీవారు కాల్ చేసి ఇంటర్వ్యూకి పిలిచారు. దీనిపై కంపెనీ మేనేజర్ స్పందించారు. ‘సదరు వ్యక్తి పార్కింగ్ ఉన్న కార్లకు రెజ్యూమ్‌ను అతికించిడం కిటికీలో నుంచి చూసినట్లు వాసెల్ అనే మేనేజర్ తెలిపారు’. అయితే, ఆ ఉద్యోగానికి 140 అప్లికేషన్లు వచ్చినట్లు కంపెనీ మేనేజర్ తెలిపారు. జోనాథన్ స్విఫ్ట్ ను ఉద్యోగానికి ఎంపిక చేసినట్లు కూడా ప్రకటించారు. Here’s some CCTV footage of the #jobseeker in action! He’s been the talk of the office since covering everyone's cars in CVs. I love it when we get a #creativejobapplication - Craig, Marketing Manager pic.twitter.com/OmE5puQgwI — instantprint (@instantprintuk) January 18, 2022 చదవండి: ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు! -
"కదిలే టాటుల అద్భుతమైన వీడియో
న్యూఢిల్లీ: ప్రస్తుతం యువతకు టాటులంటే ఎంత క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిపైన ఎక్కడొ ఒక చోట టాటు లేకుండా మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరూ మంచి టాటు వేయించుకోవాలనే అనుకుంటారు. అదేవిధంగా ఆర్టిస్టు కూడా తన కస్టమర్‌కి మంచి టాటును ఇచ్చి తన నైపుణ్యన్ని ప్రదర్శించడం కోసం ఆరాటపడటం సహజం. కానీ ఇక్కడ ఒక టాటో ఆర్టిస్ట్ తన సృజనాత్మకతను మరోస్థాయికి తీసుకువెళ్లాడు. (చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’) అతను చిత్రించిన 76 టాటులతో కదిలే టాటులకు సంబంధించిన అద్భుతమైన వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియోను టాటూ ఆర్టిస్ట్ ఫిల్ బెర్జ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 76 టాటూల గురించి వివరిస్తూ..ఒక క్యాప్షన్‌ని జోడించి పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు కళాకారుల సృజనాత్మకతను అందుకోలేం, అమేజింగ్ వీడియో అంటూ రకరకాలుగా టాటు ఆర్టిస్ట్‌ని ప్రశంసిస్తూ ట్విట్ చేస్తున్నారు. (చదవండి: షారుక్ ప్రకటనలు నిలిపేసిన ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్) -
క్రియేటివిటీ : తెరిస్తే టీవీ.. మడిస్తే లైట్
పై ఫోటోలో కనిపిస్తోన్న బుక్‌ఫైల్‌ను తెరిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది ఒక టూ ఇన్ వన్ టీవీ. టూ ఇన్ వన్ అంటే.. టీవీ ఫ్లస్ బుక్ అనుకునేరు. కాదు టీవీ ఫ్లస్ టేబుల్ ల్యాంప్. కెనాడాకు చెందిన జీన్ మైకెల్ రిచాట్ రూపొందించిన ఈ టీవీ.. ఫొల్డబుల్ ఓఎల్ఈడీ 24 ఇన్చెస్ డిస్ప్లే, ఇన్‌బిల్ట్ బ్లూటూత్ స్పీకర్‌తో ఉంటుంది. దీని పైన బుక్‌ఫైల్‌ను తలపించేలా లైట్ బ్లూ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. మీకు ఎప్పుడైనా టీవీ చూడాలనిపిస్తే ఈ బుక్‌ఫైల్‌ను తెరిస్తే చాలు. అలాగే లైట్ అవసరమైతే.. అప్పుడు ఈ బుక్‌ఫైల్‌ను మూయండి. బాగుంది కదూ. అయితే..ఈ టీవీ ధరను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించి మార్కెట్లో ప్రవేశ పెట్టనున్నారు. చదవండి : క్రియేటివిటీ : తెరిస్తే టీవీ.. మడిస్తే లైట్ -
తండ్రి ప్రేమ
‘నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అని ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో నిరూపితమైన విషయమే. అయితే కోవిడ్ 19 విజృంభణ నేపథ్యంలో మరోసారి రుజువైంది. త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ తన రాష్ట్రంలోని ఓ తండ్రిని ప్రశంసిస్తూ పై నానుడిని ఉదహరించారు. త్రిపుర రాజధాని అగర్తలలో పార్థ సాహా తన కూతురి కోసం కొత్తరకం బైక్ తయారు చేశాడు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మనిషికి మనిషికీ మధ్య భౌతిక దూరం పాటించడం తప్పని సరి కావడంతో పార్థ తన కూతురిని స్కూలుకు తీసుకెళ్లడానికి పైన ఫొటోలో కనిపిస్తున్నట్లు బైక్‌కు రూపకల్పన చేశాడు. పార్థ సాహా టీవీలు రిపేర్ చేస్తాడు. ఈ లాక్డౌన్ ఖాళీ సమయాన్ని అతడు ఇలా ఉపయోగించుకున్నాడు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత స్కూళ్లు తెరుస్తారు. లాక్డౌన్ పూర్తయినా సరే మనుషుల మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించి తీరాల్సిందే. రద్దీగా ఉండే బస్సుల్లో కూతురిని స్కూలుకు పంపించడం తనకు ఇష్టం లేదని, తాను రూపొందించిన ఈ బైక్ మీదనే తీసుకెళ్తానని చెప్పాడు పార్థ సాహా. దీనికి సోషల్ డిస్టెన్సింగ్ బైక్ అని పేరు పెట్టాడతడు. స్క్రాప్ నుంచి ఈ బైక్ పార్థ సాహా అగర్తలలోని పాత ఇనుప సామానుల దుకాణం నుంచి తూకానికి అమ్మేసిన ఒక బైక్‌ను కొన్నాడు. కొద్దిపాటి మార్పులు చేసి, రెండు చక్రాల మధ్య ఒక మీటరు రాడ్‌ను పెట్టి వెల్డింగ్ చేయించాడు. ఈ బైక్ బ్యాటరీతో పని చేస్తుంది. గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. బైక్ బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి మూడు గంటల సమయం పడుతుంది. ఒక సారి ఫుల్‌గా చార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. పార్థ సాహా తాను రూపొందించిన బైక్‌కు ట్రయల్ రన్లు పూర్తి చేసి, ఇప్పుడు ఈ బైక్ మీద కూతుర్ని ఎక్కించుకుని అగర్తలలో విహరిస్తున్నాడు. ఈ బైక్ నగరంలో తిరుగుతుంటే కోవిడ్ 19 నివారణకు తీసుకోవాల్సిన సోషల్ డిస్టెన్స్ గురించి జనానికి మళ్లీ మళ్లీ గుర్తు చేసినట్లవుతోంది. పార్థ బైక్ ప్రజలను చైతన్యపరచడానికి బాగా ఉపయోగపడుతోందని, అవసరం కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. పార్థ ప్రయత్నాన్ని అవసరం చేసిన ఆవిష్కరణ అనుకుంటున్నాం, కానీ నిజానికి ఇది తండ్రి ప్రేమ నుంచి పుట్టిన ఆవిష్కరణ. సోషల్ డిస్టెన్సింగ్ ఈ బైక్ పెంచింది తండ్రీకూతుళ్ల మధ్య భౌతిక దూరాన్ని మాత్రమే. మానసికంగా ఇద్దరి మధ్య ఎంతో దగ్గరితనాన్ని తెచ్చి తీరుతుంది. తన కోసం తండ్రి చేసిన ఈ పని కూతురికి ఎప్పటికీ గర్వకారణమే. సైకిల్‌పై కుమార్తెతో పార్థా సాహా -
బల్బులో భారతదేశం
సాక్షి, వజ్రపుకొత్తూరు : వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి గ్రామానికి చెందిన యువకుడు తామాడ జోగారావు భారత దేశ చిత్ర పటం, జాతీయ జెండా చిత్రాలను విద్యుత్ బల్బులో నిక్షిప్తం చేసి దేశ భక్తిని చాటుకున్నాడు. తన చేతి నైపుణ్యంతో రూపొందించిన అపురూప క్రాఫ్ట్ అందరికీ ఆకట్టుకుంది. పలాస ప్రభుత్వ కళాశాలలో ఐఐటీ చదువుకున్న యువకుడు వినూత్న రీతిలో ఆలోచిస్తూ ఆకట్టుకుంటున్నాడు. -
ప్రయోగాలపై పట్టింపేదీ..?
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉంది జిల్లాలో ఇన్స్పైర్ మానక్ పరిస్థితి. బాలశాస్త్ర వేత్తలను తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై హెచ్ఎంలు, సైన్స్ ఉపాధ్యాయులు దృష్టి పెట్టడంలేదు. ప్రాజెక్టుల తయారీకి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నా.. జిల్లాలోని 841 పాఠశాలలకుగాను.. ఇప్పటివరకు మూడు పాఠశాలలే దరఖాస్తు చేశాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ‘ఇన్స్పైర్ మానక్’కు స్పందన కరువు సాక్షి, నల్లగొండ: పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మళ్లించేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ మానక్ (మిలియన్ మైండ్స్ ఆన్ మెంటింగ్ నేషనల్ అసిరెన్స్ నాలెడ్జ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించేందుకు విద్యార్థులను పాఠశాలస్థాయి నుంచే ప్రయోగాల బాట పట్టించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, అధికారులు దృష్టి సారించని కారణంగా ఇన్స్పైర్ మానక్ కార్యక్రమానికి జిల్లాలోని పాఠశాలల నుంచి స్పందన కరువైంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకుల, కస్తూరిబా, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఫిబ్రవరిలో కేంద్రశాస్త్ర సాంకేతిక మండలి ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లాలోని రెండు మూడు పాఠశాలలు మినహా దరఖాస్తులు అందలేదు. అంటే ఉపాధ్యాయులు, అధికారులు ఇన్స్పైర్ మానక్‌పై ఎంత దృష్టి పెట్టారనేది స్పష్టమవుతోంది. బాలశాస్త్రవేత్తలను తయారు చేసేలా.. బాలలను చిన్నప్పటి నుంచే శాస్త్ర సాంకేతిక రంగంవైపు మళ్లించాలన్న ఉద్దేశంతో కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక మండలి ఏటా ఇన్స్పైర్ మానక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా పాఠశాలల నుంచి సైన్స్ ప్రాజెక్టుల తయారీకి ఆన్లైన్లో దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 3 ప్రాజెక్టులు, ఉన్నత పాఠశాలల నుంచి 5 ప్రాజెక్టుల చొప్పున తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఏఏ ప్రాజెక్టులు తయారు చేస్తారు అనే దానిపై ఆన్లైన్లో ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఆయా పాఠశాలల హెచ్ఎం, సైన్స్ ఉపాధ్యాయుడు కలిసి ప్రాజెక్టులను తయారు చేస్తామని దరఖాస్తు చేయాల్సి ఉంది. ఇందులో జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు గురుకుల, కస్తూరిబా, మోడల్ స్కూళ్లు, ప్రయివేట్, ఎయిడెట్ పాఠశాలలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో దరఖాస్తులకు ఆహ్వానం.. ఇన్స్పైర్ మానక్ కార్యక్రమంలో భాగంగా సైన్స్ ప్రాజెక్టుల తయారీకి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి సూచించింది. కాగా జిల్లాలోని 841 పాఠశాలలు ఉండగా అందులో కేవలం రెండు మూడు పాఠశాలలు మాత్రమే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 చివరి తేదీ. ఇటు అధ్యాపకులగానీ, అటు విద్యాశాఖ ఉన్నతాధికారులుగానీ ఇన్స్పైర్ మానక్‌పై దృష్టి సారించని కారణంగా విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా నిర్లక్ష్యం ఇన్స్పైర్ మానక్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టుల తయారీకి ఒక్కో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆయా విద్యార్థుల అకౌంట్లలోనే రూ.10వేలను జమ చేస్తుంది. అందులో రూ.5వేలు ప్రాజెక్టును తయారు చేసేందుకు ఖర్చు చేయాల్సి ఉండగా, మిగిలిన రూ.5వేలు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇన్స్పైర్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరిపైనా రూపాయి భారం పడని పరిస్థితి. ప్రభుత్వం నిధులు ఇచ్చినా ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారుల నుంచి స్పందన కరువవుతోంది. నష్టపోనున్న విద్యార్థులు.. బాల శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.కోట్లను ఖర్చు చేస్తోంది. ఉపాధ్యాయులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారడంతోపాటు విద్యార్థులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక ఒకవేళ ఆయా పాఠశాల విద్యార్థులు పంపిన ప్రాజెక్టు రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రదర్శనలో ఎంపికైతే ఒక్కో ప్రాజెక్టుకు రూ.20వేల పైచిలుకే డబ్బులను కూడా కేంద్రమే చెల్లిస్తుంది. దానికితోడు రాష్ట్రపతిని కలిసే అవకాశం కలవడంతో పాటు జాతీయ స్థాయిలో శాస్త్రజ్ఞుల సలహాలను కూడా పొందే అవకాశం ఈ ప్రాజెక్టుల తయారీ ద్వారా లభించనుంది. ఇన్ని అవకాశాలను అధ్యాపకుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా స్పందిస్తే మేలు.. విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల అధికారులు, సైన్స్ ఉపాధ్యాయులు స్పందించి విద్యార్థుల ప్రయోగాల తయారీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ పక్క దేశం అన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోతుంటే జిల్లా నుంచి బాల శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు విద్యాశాఖ తనవంతు పాత్రగా జిల్లా నుంచి సైన్స్ ప్రయోగాల తయారీకి పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తుల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఇన్స్పైర్ మానక్ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో మేలు. చిన్నప్పటి నుంచే సైన్స్ ప్రయోగాలు చేయడం వల్ల వారు బాలశాస్త్రవేత్తలు అయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక మండలి ఏటా ఇన్స్పైర్ మానక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రాజెక్టుల తయారీకి సంబంధించిన వివరాలను దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 చివరి తేదీ. ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమే. ఇంకా పాఠశాలలు ముందుకు వస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి, నల్లగొండ -
జల్లెడని నీళ్లతో నింపండి!
ఒక గురువు తన శిష్యులకు సృజనాత్మకత గురించి అద్భుతమైన పాఠం చెప్పాడు. ఆ పాఠం మనసులో నాటుకుపోయి, తమ సృజనాత్మకత నిరూపించుకునే అవకాశం అడిగారు శిష్యులు. వారి చేతికి ఒక జల్లెడ అందించి దాని నిండా నీరు నింపమని ఆదేశించాడు గురువు. దగ్గరలోని నదికి వెళ్ళి నీటితో జల్లెడ నింపుతున్నారు శిష్యులు. ప్రతిసారీ రంధ్రాల ద్వారా ధారలు కురిసి జల్లెడ ఖాళీ అవుతోంది తప్ప శిష్యులు సఫలీకృతులు కాలేదు. చాలా సేపటి తరువాత వారిని వెతుకుతూ వచ్చిన గురువు జరిగింది తెలుసుకుని చిరునవ్వు నవ్వాడు. జల్లెడ అందుకుని ప్రవాహంలో దిగి నీటి లోపల వదిలాడు. జల్లెడ నీటిలో పూర్తిగా మునిగింది. జల్లెడ నీటితో నిండింది. ఆ ఆలోచన రానందుకు సిగ్గుపడ్డారు శిష్యులు. ‘‘జల్లెడను వెనక్కు ఇవ్వమనే నిబంధన లేనప్పుడు సృజనాత్మకంగా ఆలోచించి వుంటే జల్లెడ నింపడం సులువయ్యేది’’ అన్నాడు గురువు. శిష్యుల మాదిరిగానే చాలా మంది మూస ధోరణిలో ఆలోచిస్తూనే తమ ప్రయత్నాలను గుర్తించడం లేదని, సృజనాత్మకత మరుగున పడి మసక బారుతోందని గగ్గోలు పెడతారు. ఇందుకు మరో ఉదాహరణ చూద్దాం... జైలులో ఉన్న యువకుడైన కొడుక్కి వృద్ధుడైన తండ్రి ‘వయసు మీద పడి తోట తవ్వలేక పోవడం వలన తల్లికి ఇష్టమైన బంగాళ దుంపలు వేయలేక పోయానని’ ఉత్తరం రాసాడు. ఆ కొడుకు ఆలోచించి ‘‘పొరపాటున కూడా తోట తవ్వకు. అందులో తుపాకులు దాచానని తంతి సమాచారం తిరిగి పంపాడు. ఆ ఉత్తరం చదివిన పోలీసులు మందీ మార్బలంతో వెళ్లి తోట మొత్తం తవ్వించారు. ఆ భూమిలో తుపాకులు దొరకలేదు. పోలీసులు చేసిన పని వివరిస్తూ మరో ఉత్తరం కొడుక్కి రాసాడు తండ్రి. ‘‘జైలులో వున్న నేను ఇంతకన్నా సాయం చేయలేను. ఎలాగూ పోలీసులు భూమిని తవ్వారు. ఇప్పుడు అమ్మకిష్టమైన బంగాళదుంపలు పండించు’’ అని జవాబిచ్చాడు కొడుకు. ఆ యువకుడిలా కొత్తగా ఆలోచిస్తే పనులు సులభంగా పూర్తవుతాయి. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
సృజనాత్మకత పెంచుకోవాలి
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సృజనాత్మకను, నైపుణ్యాలను పెంచుకుంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుం దని, అలాగే విద్యా వ్యవస్థలో నాణ్యమైన విద్యను అందించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. గ్రామాలే కేంద్రంగా అభివృద్ధి జరగాలని అప్పుడే అనుకున్న ప్రగతి సాధించగలుగుతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్)లో ‘‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ డెవలప్మెంట్ డిస్కోర్స్’’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ చదువంటే కేవలం పరీక్షల కోసమేనన్న భావన నుంచి బయటకు రావాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి దోహదపడతాయన్నారు. టాటా కన్సల్టెంట్ సర్వీస్(టీసీఎస్) నిర్వహించిన సర్వేలో గణిత సమస్యల సాధనలో ఇండియాలోని 21 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఓఈసీడీ దేశాల 15 ఏళ్ల విద్యార్థుల కంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉండటం బాధాకరమన్నారు. మన దేశ విద్యా విధానాన్ని ప్రక్షాళన చేసే దిశగా కృషి జరగాలన్నారు. యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరముందని లేకుంటే అది సమాజా నికి పెను సవాలుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తు న్నా గిరిజన గ్రామాలు ఇంకా అభివృద్ధి ఫలా లు అందుకోలేకపోతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ వైస్ చైర్మన్ డా.రాజీవ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇవ్వాలి
న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు చదువుతో పాటు సృజనాత్మకతకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సృజనాత్మకత అంటూ లేకుండాపోతే మానవ జీవితం దుర్భరమైపోతుందని వ్యాఖ్యానించారు. ‘అకడమిక్ లీడర్షిప్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ రీసర్జెన్స్’ పేరుతో కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ(హెచ్ఆర్డీ) శనివారం నాడిక్కడ నిర్వహించిన సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ‘జ్ఞానం అన్నది పుస్తకాలకు పరిమితమైన విషయం కాదు. చదువు ముఖ్యోద్దేశం అన్ని కోణాల్లోనూ మనల్ని మనం పరిపూర్ణులుగా మలచుకోవడమే. కానీ సృజనాత్మకత లేకుండా అది సాధ్యం కాదు. సరికొత్త ఆలోచనలు లేకుంటే మానవ జీవితం దుర్భరమైపోతుంది. మన ప్రాచీన విశ్వవిద్యాలయాలైన తక్షశిల, నలంద, విక్రమశిల చదువుతో పాటు సృజనాత్మకతకు సమ ప్రాధాన్యం ఇచ్చాయి. కళాశాలలను, విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేయడం ద్వారా వారిలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించాలి. తద్వారా దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు లభించే వీలుంది’ అని మోదీ తెలిపారు. ‘చదువు, జ్ఞానం కంటే వ్యక్తిత్వ నిర్మాణానికి అంబేడ్కర్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, రామ్మనోహర్ లోహియా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పరిపూర్ణమైన విద్యే ఓ వ్యక్తిని మనిషిగా తీర్చిదిద్దుతుందని స్వామి వివేకానంద నొక్కి వక్కాణించారు’ అని అన్నారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైంది దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమయిందనీ, ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి దూరం జరిగిపోయిందని మోదీ విమర్శించారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం, అబద్ధాలను ప్రచారం చేయడమే ఏకైక అజెండాగా ఆ పార్టీ పెట్టుకుందని ఎద్దేవా చేశారు. బిలాస్పూర్, బస్తీ, చిత్తోర్‌గఢ్, ధనబాద్, మందసౌర్‌లోని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి శనివారం ‘నమో యాప్’ ద్వారా ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అన్ని మాధ్యమాలను విస్తృతంగా వాడుకోవాలనీ, ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని మోదీ కార్యకర్తలకు సూచించారు. దేశంలో విజన్(దూరదృష్టి) లేనివారు టెలివిజన్‌లా మారి కామెడీ చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా రియల్ఎస్టేట్ రంగంలో నల్లధనం తుడిచిపెట్టుకుపోయిందనీ, స్థిరాస్తుల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రజలు పొదుపు చేస్తున్న మొత్తం గత నాలుగేళ్లలో పెరిగిందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, తీసుకుంటున్న చర్యలతో 2014–17 మధ్యకాలంలో దాదాపు 3,500 మావోయిస్టులు లొంగిపోయారని ప్రధాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్స్ యధార్థతను ప్రశ్నిస్తూ దేశానికి వ్యతిరేకంగా వెళుతోందని ప్రధాని విమర్శించారు. కార్గిల్ యుద్ధ విజయోత్సవాలను జరుపుకునేందుకు కాంగ్రెస్ నిరాకరించిందన్నారు. -
బుర్రలో కొత్త ఐడియా!
కడవంత గుమ్మడి కాయ అయినా కత్తి పీటకు లోకువే... అని సామెత. గుమ్మడికాయ, సొరకాయ, బీరకాయ వంటి తీగజాతి కాయలు మనకు ఎన్నో పండుతాయి. లేతగా ఉన్నప్పుడే చెట్టు నుంచి కోసి, తరిగి పులుసులో వేసేస్తాం. చక్కగా భోంచేసి ఆ కాయ జీవితానికి ధన్యత్వాన్ని ప్రసాదించినట్లు పోజ్ కొడతాం. పొరపాటున ఏ కాయ అయినా ముదిరిపోతే అది ఎందుకూ పనికిరానిదయిపోతుంది. ఎవరికీ కొరగానిదయిపోతుంది. సొరకాయ కూడా అంతే కానీ, క్రియేటివిటీ ఉన్న వాళ్ల కళ్లలో పడితే మాత్రం.. ముదిరిన కాయ కూడా ఇదిగో ఇలా ఎల్లకాలం ఇంట్లో ఒక డెకరేషన్ ఐటమ్‌గా ఉండిపోతుంది. మన పూర్వికులు తమ బుర్రను ఉపయోగించి సొరకాయ బుర్రతో వీణ మీటారు, పొలం పోయే రైతులు మంచినీటి సీసాగా మలిచారు. ఆదివాసులైతే ధాన్యాన్ని దాచుకునేది పెద్ద సొరకాయ బుర్రల్లోనే. ఆధునిక ప్రపంచం.. పింగాణి గుమ్మడికాయలో గుమ్మడికాయ సాంబారు వడ్డిస్తోంది, పింగాణి పనసకాయ, దోసకాయల్లో పులుసు, పెరుగు వడ్డించి భుజాలు చరుచుకుంటోంది. కానీ... ఎవరెన్ని విన్యాసాలు పోయినా బస్తర్ ఆదివాసుల దగ్గర ఈ ఒరిజినల్ కళ ఇంకా బతికే ఉంది. కాయను చెట్టునే ఎండనిచ్చి గింజలు తీసి బుర్రను శుభ్రం చేసి ఉపయోగిస్తారు. మైసూర్‌కు చెందిన సీమా ప్రసాద్ సరిగ్గా ఇదే ఫార్ములాను పట్టుకున్నారు. అయితే ఆమెను ప్రభావితం చేసింది ఆఫ్రికా ఆదివాసులు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం సీమా ప్రసాద్ భర్త కృష్ణప్రసాద్ వ్యాపారరీత్యా కెన్యా, టాంజానియాలకు వెళ్లేవారు. అక్కడ వాటిని చూసిన సీమకు ఇండియాలో సొంతూరు గుర్తుకు వచ్చింది. పొలాల్లో తీగలకు ఎన్నెన్ని సొరకాయలు, వండినవి వండుకోగా మిగిలినవి ఎండి నేలపాలు కావడమే. వాటికి మార్కెట్ పెద్దగా ఉండదు కాబట్టి కాపు ఎంత విరివిగా ఉన్నా సరే సొరకాయను సాగుచేసే వాళ్లుండరు. సొరకాయలతో ఇంత చక్కని కళాకృతులను చేయవచ్చని తన ఊరి వాళ్లకు నేర్పిస్తే... సొరకాయలను పండించడానికి రైతులు కూడా ముందుకు వస్తారు. పెట్టుబడి తక్కువ, లాభాలకు మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. రెండు రకాల ప్రయోజనాలున్నప్పుడు ఓ ముందడుగు తానే ఎందుకు వేయకూడదు.. అనుకుంది సీమ. అలా పుట్టిందే ‘సీమసమృద్ధ’ సీమ బుర్రలో ఆలోచన తట్టినంత వేగంగానే సొంతూరులో అచరణలోకి వచ్చింది. ఇరుగుపొరుగు రైతు మహిళలనూ ఆమె కలుపుకుంది. ‘సీమ సమృద్ధ’ పేరుతో ఎన్జివో స్థాపించింది. మన సంప్రదాయ వంగడాలను సేకరించి పరిరక్షించే బాధ్యత తీసుకుంది. ఇండియాలో దొరికే దేశీయ సొరకాయ, గుమ్మడి వంటి తీగ పాదులతోపాటు ఆఫ్రికా నుంచి మన దగ్గర కనిపించని కొత్త రకం కాయల గింజలను సేకరించింది. పండించడం వరకు సరే, ఆ తర్వాత ఆ కాయలను కళాకృతులుగా మార్చడం ఎలా? అందుకోసం నిపుణులను మైసూరుకు పిలిపించింది. ఆసక్తి ఉన్న మహిళలకు ట్రైనింగ్ ఇప్పించింది, తానూ నేర్చుకుంది. కాయ ఆకారం పాడవకుండా గుజ్జు, గింజలు తీసి శుభ్రం చేయడంతోపాటు డిజైన్‌కి అనుగుణంగా రంగులు వేయడం కూడా నేర్చుకున్నారు. సీమ ఆఫ్రికాలో చూసిన, మన దగ్గర లేని డిజైన్లను నేర్చుకోవడానికి మరోసారి ఆఫ్రికాకు వెళ్లింది. అరచేతులకు మెహిందీ డిజైన్ పెట్టుకున్నట్లు సొరకాయ బుర్రల మీద డిజైన్ గీసి, ఆ డిజైన్‌కి అనుగుణంగా రంధ్రాలు చేయడం, రంగు వేయడం నేర్చుకుంది. అలా అందంగా రూపుదిద్దుకున్న ల్యాంప్ షేడ్లకు ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ లేని గిరాకీ. కాయ కూడా గిట్టుబాటే! తినడానికి మార్కెట్‌కొచ్చే సొరకాయ ధర కిలో పది నుంచి పన్నెండు రూపాయలుంటే, కళాకృతుల కోసం పెంచే కాయలకు వంద రూపాయల వరకు పలుకుతోంది. అయితే ఇక్కడ కొద్దిగా మెలకువలు పాటించాల్సి ఉంటుంది. తినడానికి సొరకాయ ఏ రూపంలో ఉన్నా పట్టింపు ఉండదు. వీటికి ఆకారం తీరుగా ఉండాలి. అందుకే పిందెగా ఉన్నప్పుడే ఆ తీగను ఎత్తు పందిరికి అల్లించి కాయ నిటారుగా కిందకు దిగేటట్లు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వాటికి ఆ ధర పలుకుతుంది. సీమ చేతిలో పడిన సొరకాయ ఇప్పుడు వాల్ హ్యాంగింగ్ అవుతోంది, కొండపల్లి బొమ్మలను పోలిన బొమ్మగానూ రూపాంతరం చెందుతోంది. ఈ ‘ట్యూమా క్రాఫ్ట్’కి మంచి డిమాండ్ ఉంది. – మను -
గోడలే పాఠాలు చెబుతాయి..
ఆ పాఠశాలలోని తరగతి గదుల్లో గోడలే విద్యార్థులకు పాఠాలు చెబుతాయి. గుణింతాలు లెక్కల చిక్కు ముడులు విప్పుతుంటాయి. సూక్తులు భవితకు స్ఫూర్తిగా గోచరిస్తుంటాయి. దేశ నాయకుల ఫొటోలు ఆదర్శంగా ఆహ్వానిస్తుంటాయి. ఎగిరే పక్షులు, తిరిగే జంతువులు, పారే సెలయేరు ఇలా ప్రకృతి అందాలన్నీ కనువిందు చేస్తుం టాయి. విద్యార్థుల కంటికి నిండుగా..మదిలో విజ్ఞానాన్ని మెండుగా చొప్పిస్తుంటాయి. ఇదిగో ఇవన్నీ ముప్పాళ్ల మండలం దమ్మాలపాడులోని ఎంపీపీఎస్ పాఠశాలలో దర్శనమిస్తున్నాయి. అక్కడ ఉపాధ్యాయుల కృషికి ఇవి కొలమానంగా.. ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. దమ్మాలపాడు(ముప్పాళ్ళ): మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు గాను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దటంలో దమ్మాలపాడు ఎంపీపీఎస్(పీఎస్) పాఠశాలలోని ఉపాధ్యాయులు అహర్నిశలు కృíషి చేస్తున్నారు. 10 సార్లు నోటితో చెప్పడం కన్నా.. ఒక్కసారి కంటితో చూస్తే మదిలో జ్ఞాపకం ఉండిపోతాయాయని అంటున్నారు ప్రధానోపాధ్యాయుడు వి.వి.కృష్ణారావు, ఉపాధ్యాయులు ఎం.పద్మశ్రీ, ఎం.వి.పద్మకుమార్, ఎం.సాంబిరెడ్డి, వి.ఖాన్‌సాహెబ్, షేక్ నజీరున్నీసాలు. పాఠశాలలో 132 మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలోని సృజనాత్మతకను పెంపొందిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. అందులో భాగంగానే మూడేళ్ల కిందట స్థానికుల తోడ్పాటుతో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి, అమలు చేస్తున్నారు. ఈ ఏడాది నూతనంగా తరగతి గదుల గోడలపై గుణింతాలు, తెలుగు సంవత్సరాలు, 100 సూక్తులు, రాష్ట్ర, దేశ పటాల చిత్రాలు, పక్షులు, సైన్స్ ఇంకా అనేక రకాల విషయాలకు సంబంధించిన చిత్రాలను గీయించారు. విద్యార్థులు తరగతి గదిలోకి వెళితే గోడలపై ఉన్న చిత్రాలు మదిలో మెదలాడుతూ ఉంటాయి. రోజు వాటిని చూస్తుండటం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగి, విజ్ఞానం పెంపొందుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గోడలపై చిత్రాలను చూసిన పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంటితో ఒక్కసారి చూస్తే చాలు 10 సార్లు నోటితో చెప్పడం కన్నా ఒక్కసారి బొమ్మలతో చూపించి చెబితే మదిలో జ్ఞాపకం ఉండిపోతుంది. ఈ ఉద్దేశంతోనే తనవంతుగా ఈ విధానం చేపట్టాం. స్థానికలు, సహచర ఉపాధ్యాయులు తోడ్పాటు బాగుండటంతో పాఠశాలలో అన్ని వసతులు కల్పించుకోగలుగుతున్నాం. విద్యార్థులకు తనకున్నంతలో సేవచేసి పాఠశాలను ఆదర్శంగా నిలపటమే లక్ష్యం.–వి.వి.కృష్ణారావు, ప్రధానోపాధ్యాయుడు పాఠాలు అర్థమవుతున్నాయి గోడలపై ఉన్న బొమ్మలను చూపిస్తూ చెబుతున్న లెక్కలు, సైన్సు పాఠాలు బాగా అర్థమవుతున్నాయి. తరగతి గదులు కూడా చాలా అందంగా ఉన్నాయి. అర్థం కాని వాటిని మళ్లీ మళ్లీ వివరిస్తూ చెబుతున్నారు. –ఆర్.రఘురామ్, 5వ తరగతి -
మీ ప్రతి పనిలో కొత్తదనం కోరుకుంటున్నారా?
సెల్ఫ్‌చెక్ ఎప్పుడూ ఒకేలా ఉంటే జీవితం చాలా బోర్ కొడుతుంది. అందుకే మనమంతా రోజువారీ జీవితంలో కాస్త ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటాం. కొందరైతే ఎప్పుడూ ఫ్రెష్‌గా ఆలోచిస్తుంటారు. ఈ ఫ్రెష్ థింకింగే పదిమందిలో గుర్తింపు తెస్తుంది. మీరూ కొత్తగా ఆలోచించగలరా లేక మూసధోరణిలో జీవితాన్ని వెళ్లదీస్తున్నారా... తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్‌చెక్ పూర్తిచేయండి. 1. ఇంట్లో ఫర్నిచర్‌ను ఎప్పుడూ ఒకే స్థలంలో ఉంచకుండా తరచూ మారుస్తుంటారు. ఎ. అవును బి. కాదు 2. ఆఫీసులో పనిని అందరిలా కాకుండా కొత్తగా చేయటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 3. ఇబ్బందుల్లో ఉన్నవారికి సూచనలు ఇస్తుంటారు. మీ ఆలోచనలకు చాలా గౌరవం ఉంటుంది. ఎ. అవును బి. కాదు 4. మీ వృత్తి లాభసాటిగా, ప్రశాంతంగా సాగిపోతున్నా ఇంకా బాగా చేయాలి లేదా సంపాదించాలన్న ఉద్దేశంతో మీ ప్లాన్లను అప్డేట్ చేస్తుంటారు ఎ. అవును బి. కాదు 5. క్రియేటివిటీ అంటే మీకు చాలా ఇష్టం. రొటీన్‌కు భిన్నంగా సృజనాత్మకతతో ఉన్న సినిమాలు, పుస్తకాలను బాగా ఇష్టపడతారు. ఎ. అవును బి. కాదు 6. ఇతరుల మాటల్లో కొత్త విషయాలను గ్రహిస్తూ వాటిని ఉపయోగించుకుంటారు. ఎ. అవును బి. కాదు 7.ఊహలకు తావివ్వకుండా ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇస్తారు. ఎ. అవును బి. కాదు 8. కొత్త విషయాలు తెలుసుకోవటం కోసం మీ వృత్తికి సంబంధం లేని కోర్సులు చేయటానికి ఉత్సాహం చూపుతారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు 5 దాటితే మీరు ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించగలరు. అయితే ప్రతి పనినీ భిన్నంగా చేయాలనే పట్టుదలను పెంచుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు అవి నెగెటివ్ ఫలితాలు ఇవ్వచ్చు. ‘బి’ సమాధానాలు ‘4’ కంటే ఎక్కువ వస్తే మీరు భిన్నంగా ఆలోచించటానికి కాస్త ఇబ్బందిపడతారని అర్థం. అనవసర ప్రయోగాలు ఎందుకు చేయాలనే భావన మీలో ఉండవచ్చు. -
మీలో ఊహాశక్తి ఉందా?
సెల్ఫ్ చెక్ సృజనాత్మకతకు తొలి మెట్టు ఊహ. దీనిద్వారానే అభివృద్ధి సాధ్యం. కథ చదివేటప్పుడు కొందరు ఆయా సీన్లను ఊహించుకుంటూ చదవగలరు. మరికొందరికి అలాంటి శక్తి తక్కువ. మీలో ఇమాజినేషన్ పవర్ ఉందోలేదో ఒకసారి చెక్ చేసుకోండి. 1. విషమిస్తున్న పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు. ఎ. కాదు బి. అవును 2. మీ ఆలోచనలనలతో ఒక పుస్తకం రాయవచ్చు. ఎ. కాదు బి. అవును 3. మీరు చదివిన కథను మార్చి కొత్తగా చెప్పగలరు. ఎ. కాదు బి. అవును 4. అసమాన పరిస్థితులు మీ ఊహల్లో ఉంటాయి. ఎ. కాదు బి. అవును 5. కావలసిన వాళ్లు సమయానికి రాకపోతే వారు ఎక్కడికి వెళ్లివుంటారో గెస్ చేయగలరు. ఎ. కాదు బి. అవును 6. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ను ఇష్టపతారు. ఎ. కాదు బి. అవును 7. ఫిక్షన్, అతీంద్రియ కథల పుస్తకాలను ఇష్టపడతారు. ఎ. కాదు బి. అవును 8. ఏ పని చేయాలన్నా దాని పర్యవసానాలను అంచనా వేయగలుగుతారు. ఎ. కాదు బి. అవును ‘బి’ లు ఆరు దాటితే మీలో ఊహాశక్తి ఉంటుంది. దీనివల్ల ప్రయోజనాలు పొందుతారు. ‘ఎ’ లు ఎక్కువగా వస్తే మీలో ఇమాజినేషన్ పవర్ తక్కువనే చెప్పాలి. కథలు చదవడం, రాయటం, విషయాల పట్ల క్యూరియాసిటీ పెంచుకోవటం ద్వారా ఊçహాశక్తిని పెంచుకోవచ్చు. -
సృజనకు ‘అనంత’ పట్టం..
– సమాజహితమే ధ్యేయంగా ‘అనంతలక్ష్మి’ పరిశోధనలు అను నిత్యం నూతనంగా ఆలోచించే యువత.. తమలోని సృజనకు పదును పెడుతోంది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని సమాజ హితానికి దోహదపడే ఆవిష్కరణలతో రాణిస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) వినియోగం అనివార్యమైంది. ఇంటర్నెట్ ఆధారితంగా పనిచేసే ఈ వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి అన్ని రంగాలకు విస్తరింపజేయడంలో యువత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ని వినియోగించుకుని రూపొందించిన అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల పలు ఆవిష్యరణలు అద్భుత ఫలితాలను సాధిస్తున్నాయి. - జేఎన్టీయూ సాంకేతిక వ్యవ‘సాయం’ వ్యవసాయనికి సాంకేతికత అనుసంధానం అనివార్యమైన రోజులివి. పండ్లతోటలు, ఇతరత్రా తడి పంటల్లో ఐఓటీ ద్వారా అన్నదాతకు దన్నుగా ఆవిష్కరణలు జరిపారు. ‘ఆటోమేటిక్ మెయిషర్ డిటెక్షన్ సిస్టమ్ ’ అనే ఆవిష్కరణను ఈసీఈ చదువుతన్న తరుణ్, రెడ్డిశేఖర్, జయరాములు, ఆరీఫుల్లా రూపకల్ప చేశారు. ప్రతి మొక్క వద్ద ఐఓటీకి అనుసంధానం చేసిన సెన్సార్లను ఉంచడం ద్వారా నీటి శాతం తక్కువైనా.. ఎక్కువైనా వెంటనే ఆ విషయాన్ని మన సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుంది. దీని ద్వారా నీటి యాజమాన్యాలను చేపట్టవచ్చు. దీనిని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి. పండ్లతోటలకే కాకుండా అన్ని రకాల పంటలకు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్ బ్రేక్ రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఓటీ ద్వారా నూతన ఆవిష్కరణ చేశారు పి.మహేష్ కుమార్ (కంప్యూటర్ సైన్సెస్ మూడో సంవత్సరం), జే.సాదిక్ (ఈసీఈ మూడో సంవత్సరం), పి.శ్రీనివాసులు (కంప్యూటర్ సైన్సెస్ మూడో సంవత్సరం), కృష్ణ సాయి ధీరజ్ (కంప్యూటర్ సైన్సెస్ మూడో సంవత్సరం), సాయి ప్రతాప్ రెడ్డి (ఈసీఈ మూడో సంవత్సరం). మన బైక్ లేదా కారుకు అమర్చిన సెన్సార్ ఉన్న ఈ పరికరం ద్వారా వాహనానికి రెండు మీటర్ల దూరం (ఈ దూరం వాహనదారుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది)లో వచ్చే అడ్డంకులను గుర్తించి, వాహన వేగం నియంత్రించే వీలుగా ఎంబీడెడ్ సిస్టమ్ద్వారా ప్రోగ్రాం రాస్తారు. మనం ఎంత వేగంగా వెళుతున్నప్పటికీ రెండు మీటర్ల దూరంలో అడ్డంకి ఎదురైన వెంటనే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు పడతాయి. గాలితో నడిచే వాహనం ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌ను టూ స్ట్రోక్ ఇంజిన్‌గా మార్చి గాలితో నడిచే వాహనాన్ని ఆవిష్కరించారు మెకానికల్ విభాగం మూడో సంవత్సరం విద్యార్థులు జె.దేవకాంత్, కె.అఖిల్, ఎ.జయదీప్, డి.వి.హరీష్, ఎం.చైతన్య రెడ్డి, ఆర్.రజనీకాంత్, నిఖిల్ యాదవ్. కంప్రెస్ట్ ఎయిర్ ఆధారంగా చలనం కలుగుతుంది. గంటలకు 30 నుంచి 40 కిటోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. పరిశోధనలకు ఊతం : పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి విద్యార్థులకు ఇది దోహదపడుతుంది. పరిశోధనలకు ఉపయుక్తమయ్యే అధునాతన పరికరాలను మా కళాశాలలో ఏర్పాటు చేశాం. –ఎం. రమేష్ నాయుడు, డైరెక్టర్, అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ఆర్ అండ్ డీ కీలకం ఏ వ్యవస్థ అయినా పురోగతి చెందడానికి పరిశోధనలు, అభివృద్ధి కీలకమైనవి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ అండ్ డీ). కళాశాలలో నేర్చుకొన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఇష్టంగా చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. విద్యార్థులు ఎంతో సృజనతో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడం గర్వకారణం. – డాక్టర్ బండి రమేష్ బాబు, ప్రిన్సిపల్, అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల. అనంతపురం. -
క్లౌడ్‌సోర్సింగ్‌తో కుడ్య చిత్రకళ
విశ్లేషణ కుడ్య చిత్రకళలో ఇది కొత్త నియంత్రిత ప్రక్రియ. చూసేవారికి వెంటనే సందే శాన్ని అందించడానికి జట్టంతా కలసి కళా సృజనను నిర్వహించడం. సృజనాత్మక ఉద్వేగాలను కవాతు చేయించడం, వ్యక్తీకరణలో ఏకత్వాన్ని సాధించడం. బిల్హార్, మహాబలేశ్వర్ పంచాగ్ని ప్రాంతంలోని ఒక గ్రామం. అక్కడ పండించే స్ట్రాబెర్రీ పండ్లను కొనుక్కోవడం కోసం పర్యాటకులు అక్కడికి రావడం పరిపాటే. గ్రామంలోని పాతికకు పైగా గోడలపై చిత్రాలను గీయ డానికి పెద్ద చిత్రకారుల బృందం అక్కడకు వచ్చింది. ‘స్వత్వ,’ వాట్సాప్ ఆధారిత సాంప్రదాయేతర చిత్రకళాకారులు, చిత్ర కళారాధకుల అనుసంధాన సంస్థ. మహారాష్ట్ర ప్రభుత్వం అందించే పుస్తకాలను భద్రపరచడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వివిధ గృహాల గోడలపై తమ రంగులు, కుంచెలకు పని చెప్పే బాధ్య తను పురమాయించింది. ఇలా పుస్తకాలను భద్రపరచే ఇళ్లు తదితర ప్రదేశాలలో ఒక చోట బాల సాహిత్యం, మరో చోట మహిళలకు సంబంధించినవి, ఇంకో చోట రుషిపుంగవుల రచనలు వగైరా ఉంటాయి. ప్రభుత్వం అందించిన పది వేల పుస్తకాలను 22 చోట్ల భద్ర పరచడానికి వీలుగా వాటిని వేరు చేశారు. ‘పుస్తకాంచె గావో’ (మరా ఠీలో పుస్తకాల గ్రామం) భారీ లక్ష్యంతో చేపట్టిన పథకం. ఇది రెండు ఉద్దేశాలతో చేపట్టినది. మహాబలేశ్వర్, పంచాగ్ని పర్యాటకులు అక్కడ కాలం వెళ్లబుచ్చి పోవడం గాక, పుస్తకాలతో కాలక్షేపం చేసే అవకాశాన్ని కూడా కల్పించడం, అది ఆ ప్రాంత వాసులలో పఠనాసక్తిని ప్రేరేపించగలదనే ఆశ సైతం ఉంది. రెండు బస్సులలో శుక్రవారం ఉదయం వచ్చి, ఆది వారం రాత్రికి తిరిగి వెళ్లిన 70 మంది చిత్రకళాకారు లలో వివిధ స్థాయిల ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నవారు న్నారు. వారిలో ఒకడినైన నాకు, నూతనమైన ఈ చిత్రకళను క్రౌడ్‌సోర్సింగ్... ప్రపంచంతో పంచుకోవా ల్సినదనిపిస్తోంది. కుడ్య చిత్రకళలో ఇది ఒక కొత్త నియంత్రిత ప్రక్రియను సృష్టిస్తోంది. ఇది గోడలను కంటికింపైన రంగులతో నింపి వెళ్లడానికి మించినది. ఇది వ్యక్తులు తమ సృజనాత్మక వాంఛల వెంటపడి చిత్రించుకుపోవడం కాదు. అందుకు భిన్నంగా చూసే వారికి వెంటనే ఒక సందేశాన్ని అందించడం కోసం ఒక జట్టు మొత్తం కలసి కళా సృజనను నిర్వహించడం. కాబట్టి, ఇది సృజన్మాత్మక ఉద్వేగ ప్రవాహాలను క్రమ పద్ధతిలో కవాతు చేయించడం, వ్యక్తీకరణలో ఏక త్వానికి హామీని కలగజేయడం. అయితే అందుకు పీడ కలా సదృశమైన సరఫరాలు, నియంత్రణ, నిర్వహణ తదితర ఏర్పాట్లు అవసరం. ప్రతి వ్యక్తి తన లోలోపలి స్వీయత్వాన్ని వెలికి తెచ్చేలా చేయాలని స్వత్వ కోరుకుంటుంది. ఈ కృషిలో పాల్గొనదలచిన ఔత్సాహికులలో ఏ ఒక్కరినీ స్వత్వ వద్దన్నది లేదు. ప్రధానంగా థానే కేంద్రంగా పనిచేసే స్వత్వకు ఇండోర్, పుణేల వంటి సుదూర ప్రాంతాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తలు వచ్చి చేరడం మహో త్తేజాన్ని కలిగించింది. సామాజిక మాధ్యమాల పుణ్య మాని ఇది సాధ్యమైంది. ఈ పర్యటనలో బడి వసతి గృహంలో ఉంటూ, పిల్లల స్నానాల గదిలో ఒకేసారి ఆరుగురు స్నానాలు చేస్తూ గడ్డు జీవితం గడపాల్సి వచ్చింది. సుప్రసిద్ధులు, చెప్పుకోదగిన గుర్తింపున్న కళాకారులు కొత్తవాళ్లతో భుజాలు రాసుకునే కాదు, ఆవేశాలను పూసుకు తిరిగారు. థానే మునిసిపాలిటీ మద్దతుతో పలు గోడలపై చిత్రాలను వేసేటప్పుడు చూసేవారు ఎవరైనా బ్రష్‌తో చేయి కలుపుతానంటే ఆహ్వానించారు. ఇలాంటి ఔత్సాహికులు చేసే పొరపాట్లను సీని యర్ కళాకారులు చడీచప్పుడు లేకుండా సరిచేసేవారు. లేదంటే తక్షణమే లేదా ఆ తర్వాత ఉప యోగకరమైన సూచనను చేసే వారు. అయితే దాని ఉద్దేశం మాత్రం ప్రోత్సహించడమే. అయితే, థానేకు 250 కిలోమీటర్ల దూరంలోని బిల్హార్లో చేపట్టిన ఈ సాహసం అందుకు భిన్న మైనది. కేవలం మూడు రోజు ల్లోనే అంతా చేయాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లిన బృందం లోని వారు ఒకరికొకరు పరిచయ మైనది బస్సు ఎక్కేటప్పుడు, వారి నైపుణ్యాలతో పరి చయమైనది గోడల మీద బొమ్మలు వేసే పని చేయడం మొదలయ్యాకే. ప్రతి జట్టులోని వారికి నేతృత్వం వహించడానికి ఒక అనుభవజ్ఞుడైన కళాకారులు ఉండే వారు. ఆయన లేదా ఆమె తమ జట్టు సభ్యులు ఒక్కొ క్కరిలో ఉన్న భిన్న నైపుణ్యాలతో కూడిన ప్రతిభను ఒకే సమష్టి సృజనాత్మకతగా వ్యక్తమయ్యేలా మార్గదర్శ కత్వం వహించాల్సివచ్చింది. అలా పెంపొందిన సృజ నాత్మక సమన్వయం వల్ల జట్లు దాదాపు ప్రతిరోజూ రాత్రింబవళ్లూ పని చేశాయి. రంగులు, కుంచె చేయగల అద్భుతాలకు విభ్రాం తులై, ముందు ముందు ఏమైనా చేయవచ్చనుకున్న వారు సైతం జట్లలో చేరారు. అలాంటి వారు కేవలం అదీ ఇదీ అందిం^è డం, తెచ్చి ఇవ్వడం లాంటి పనులు చేయడానికి వెనుకాడలేదు. ఆ తరువాత వాళ్లు చిత్ర కళను తమంతట తాముగానే నేర్చుకుంటామని లేదా చిత్రకళ కోర్సులో చేరుతామని చెప్పారు. కొన్ని సంద ర్భాల్లో ప్రముఖులైన సీనియర్లు వాట్సాప్ ద్వారా తమ మార్గదర్శకత్వాన్ని కొనసాగిస్తామని ముందుకొచ్చారు. చిత్రలేఖనాన్ని 64వ ఏట మొదలుపెట్టిన నేను ఇంకా దాన్ని కొనసాగిస్తుండటానికి వారు సహాయపడ్డారు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు బహుమతుల పంట
వేంపల్లె : వేంపల్లె మండలంలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వైజ్ఞానిక, సృజనాత్మకత రంగంలో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారని డైరక్టర్ భగవన్నారాయణ తెలిపారు. తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు చేతులమీదుగా విద్యార్థులు పురష్కారాలను అందుకున్నారని తెలిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ‘‘జెడ్ఎఫ్ ఇన్నేవేషన్ చాలెంజ్’’ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో విద్యార్థులను అనేక దశలుగా పరీక్షించి 42బృందాలను క్వార్టర్ ఫైనల్‌కు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఈ బృందాలకు ప్రజెంటేషన్ పెట్టి సెమీ ఫైనల్‌కు 5బృందాలను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 24న ఈ ఎంపిక జరిగింది. ఫైనల్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రథమ, తృతీయ స్థానాలలో నిలబడి ట్రిపుల్ ఐటీ వైజ్ఞానిక విజయ దుందుభిని మ్రోగించారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలోనే ఈ విద్యార్థులు సృజనాత్మక ఆలోచన దోరణికి జెడ్ఎఫ్ టెక్నాలజీ యాజమాన్యం మెచ్చుకొని సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం శుభపరిణామమని ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆచార్య రామచంద్రరాజు తెలిపారు. విద్యార్థుల ప్రొత్సహకానికి ముందుండి నడిపిస్తున్న డైరెక్టర్ భగవన్నారాయణను అభినందించారు. విద్యార్థులను మెచ్చుకున్నారు. ప్రథమ బహుమతిని శివప్రసాద్, సురేంద్ర, దుర్గా ప్రసాద్, ప్రదీప్‌కుమార్ బృందం ‘‘అటానమస్ డ్రైవింగ్ వెహికల్’’ ప్రాజెక్టుకు వీరికి ఈ బహుమతి వచ్చింది. తృతీయ బహుమతిని శివప్రసాద్, శ్రీనాథ బృందం భీమవరం ఎస్ఆర్కే కళాశాల విద్యార్థి విద్యా సాగర్, కరబ్రహ్మచారి బృందం ‘‘స్మార్ట్ ఇరిగేషన్ మానటరింగ్ సిస్టం అండ్ డ్రైవర్ గ్రోసినెస్ డిబెక్షన్ బై పీపుల్ డిబెక్షన్ రెస్పిక్టివిల్లీ’’ సంయుక్త ప్రాజెక్టుకు ఈ బహుమతి వచ్చింది. వీరి ప్రతిభను మెచ్చి డైరెక్టర్లు విశ్వనాథరెడ్డి, భగవన్నారాయణలు అభినందించారు. రాబోవు రోజులలో తమ విద్యార్థుల వైజ్ఞానిక, సాంకేతిక ఖ్యాతిని దేశ విదేశాల్లో మరింతగా ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏవో అమరేంద్రకుమార్, విద్యా సంరక్షణ అధికారి కొండారెడ్డి, అధ్యాపకులు రామకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
సృజనాత్మక సమ్మేళనం
ప్రతిభా పాటవాలకు వేదికగా ‘ఇన్స్పైర్’ ప్రదర్శనలతో అలరించనున్న విద్యార్థులు నేటి నుంచి మూడు రోజుల పాటు పోటీలు వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 330 ఎగ్జిబిట్ల ప్రదర్శన మహబూబాబాద్ రూరల్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఇన్స్పైర్ ప్రదర్శనలు, ప్రాజెక్టుల పోటీలు ఎంతో దోహదపడుతున్నాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు అందరికీ తెలి యాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్‌కు రంగం సిద్ధమైంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాపరిశోధన సంస్థ పాఠశాల విద్యాశాఖ జిల్లా ఇన్నోవేషన్ ఇన్ సైన్స ఫర్ ష్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్స్పైర్) జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన–2016ను మహబూబాబాద్ మండలం అనంతారం మోడల్ పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈనెల 22, 23, 24 తేదీల్లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలాం ప్రాంగణంగా వేదికను తీర్చిదిద్దారు. మూడు రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనకు మహబూబాబాద్ డివిజన్‌తోపాటు ఖమ్మం జిల్లాలో ఇన్స్పైర్ అవార్డులు పొందిన విద్యార్థులు హాజరై తాము తయారు చేసిన ఎగ్టిబిట్లను ప్రదర్శించనున్నారు. మొత్తం 330 వరకు ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, మహబూబాబాద్ డివిజన్ ఉపవిద్యాధికారి తోట రవీందర్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో పాల్గొనే విద్యార్థులు, గైడ్ టీచర్లకు భోజన, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్స్పైర్ ఎగ్జిబిట్ల నిర్వహణకు మండల విద్యాశాఖ అధికారులను కన్వీనర్లుగా, పీజీ హెచ్ఎంలను కో కన్వీనర్లుగా నియమించడంతో పాటు 16 కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్స్పైర్ రిసోర్స్ పర్సన్లుగా వి.గురునాథరావు, టి.శ్రీనాథ్, బి. అప్పారావు వ్యవహరించనున్నట్లు డిప్యూటీ ఈఓ రవీందర్ తెలిపారు. 2008లో ప్రారంభం.. వినూత్న కార్యక్రమంగా పేర్కొనే ఇన్‌స్పైర్‌ను 2008 డిసెంబర్లో ప్రారంభించారు. 2009–10 ఏడాది నుంచి పాఠశాల స్థాయి మొదలుకుని పరిశోధన స్థాయి వరకు అవార్డులు అందజేస్తున్నారు. 2015–16లో ఇన్స్పైర్ ఆవార్డులు పొందిన విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు, నమూనాలను జిల్లాస్థాయి పోటీల్లో ప్రదర్శించనున్నారు. ఒక నిర్ధిష్ట అంశాన్ని ఎంచుకుని వినూత్నంగా ప్రాజెక్టులు తయారు చేయడంతో పాటు సృజనాత్మకత, ఆలోచనలు, భావనలతో నమూనాలు తయారుచేసి విద్యార్థులు ప్రదర్శించనున్నారు. ముఖ్యాంశాలు.. చిన్నతనంలోనే విజ్ఞాన శాస్త్రంలో విద్యార్థులకు సృజనాత్మకత వైపు ఆసక్తిని కలిగించి తద్వారా పరిశోధన, అభివృద్ధి ఆధారంగా శాసీ్ర్తయ, సాంకేతిక విధానాలను తెలియజేయడం ఇన్స్పైర్ ఉద్దేశం ఇన్‌స్పైర్‌లో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్, స్వస్్థభారత్ అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులను రూపొందించవచ్చు. రెడీమేడ్ ఎగ్జిబిట్లు ప్రదర్శించవద్దు. ప్రాజెక్టు నిరే్ధశిత, శాసీ్ర్తయ సూత్రం ఆధారంగా అభివృద్ధి చేయాలి. ప్రాజెక్టు సాధారణ రూపం, అందుకు సంబంధించిన వివరాలు పొందు పర్చాలి. ప్రాజెక్టు అయినా సరే అందులోని భౌతిక రూపం కంటే శాసీ్ర్తయ సృజనాత్మకత భావనకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్థానిక, శాస్త్ర, సాంకేతిక, ప్రాంత అవసరాలకు సంబంధించిన అంశంగా> జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు రూపొందిస్తే ఎంతో మేలు. -
వ్యాస రచనతో సృజనాత్మకత పెరుగుతుంది
చిలుకూరు: వ్యాసరచన పోటీల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్ అన్నారు. శనివారం చిలుకూరులో ఏఐఎస్ఎఫ్ 81 వార్షికోత్సవం సందర్భంగా స్థానిక సీపీఐ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ– విద్యార్థుల పాత్ర అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల ప్రారంభం కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కొండల్, ఉపాధ్యాయులు గుండు ఆదినారాయణ, నాగేశ్వరరావు, మురళి, షరీఫ్, విద్యార్థి, యువజన సంఘం నాయకులు తమ్మనబోయిన నరేష్ , ముక్క లక్ష్మీనారాయణ, రఫి తదితరులు పాల్గొన్నారు. -
'క్రియేటివిటీని చంపొద్దు'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. సృజనాత్మకతను చంపడానికి ప్రయత్నిచడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. తన తాజా చిత్రం 'టీఈ3ఎన్' సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఉడ్తా పంజాబ్' వివాదంపై విలేకరులు ఆయనను ప్రశ్నించారు. 'ఈ వివాదం గురించి పూర్తిగా నాకు తెలియదు. దీని గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాను. క్రియేటివిటీని చంపడానికి ప్రయత్నం చేయొద్దని నేను చెప్పదల్చుకున్నాను. సృజనాత్మకతను చంపితే ఆత్మను నాశనం చేసినట్టే. నిబంధనలు, నియంత్రణల గురించి నాకు తెలుసు. వీటిని అమలు చేయడానికి ప్రభుత్వం ఉంది. కళాకారుడిగా, క్రియేటివ్ పర్సన్ గా సృజనాత్మకతను చంపొద్దని కోరుకుంటున్నా'ని అమితాబ్ పేర్కొన్నారు. సినిమా విడుదల దగ్గరపడే వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్లే నిర్మాతలు ఇబ్బంది పడాల్సివస్తోందని అభిప్రాయపడ్డారు. -
సృజనాత్మకతకు ఓ వేదిక!
♦ జెనీవాలో 44వ ఇన్నోవేషన్ షో ప్రారంభం ♦ ఈ నెల 17 వరకు కొనసాగనున్న ప్రదర్శన ♦ 48 దేశాల నుంచి ఔత్సాహికుల హాజరు కొన్ని సమస్యలు చిన్నగా అనిపిస్తాయి. కాని వాటి పరిష్కారాలు కనిపెట్టడమే చాలా కష్టం. ఎంతో మంది ఇలాంటి సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలను కనిపెడుతూనే ఉంటారు. అయితే సృజనాత్మకత ఉన్న వారంతా ఒకే చోట చేరితే.. ఇలాంటి వారందరూ తమ ఆలోచనలను నలుగురితో పంచుకునేందుకు స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికైంది. ఏప్రిల్ 13న ప్రారంభమైన 44వ ‘ఇన్వెన్షన్ షో’ 17 వరకు కొనసాగనుంది. ఇందులో 48 దేశాలకు చెందిన 752 మంది తాము రూపొందించిన దాదాపు వెయ్యి ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. అందులో మచ్చుకు కొన్ని మీకోసం.. పొరపాటున తప్పిపోయిన చిన్న పిల్లలను ఈ బూట్లు తమ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాయి. ఎలాగంటే వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను మీ స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేస్తే చాలు. పిల్లల తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లు ఫోన్లో కనిపిస్తాయి. ఈ బూట్లను దక్షిణ కొరియాకు చెందిన లీ యాన్ యున్ తయారు చేశారు. యున్ది మంచి స్మార్ట్ ఆలోచన కదా..! మొక్కజొన్న పిండిని రకరకాల వంటల్లో వాడుతుంటాం. అయితే శ్రీలంకకు చెందిన శోభనీ అనుషా విజయత మాత్రం కొంచెం వినూత్నంగా ఆలోచించింది. ఆ పిండికి మరికొన్ని పదార్థాలు కలిపి కేక్‌ల అలంకరణకు వాడే ‘ఐసింగ్’ స్థానంలో వాడే ఓ పదార్థాన్ని తయారు చేసింది. ఈ పదార్థం అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని కేక్ పాడవకుండా ఉంచడమే కాకుండా షుగర్ ఫ్రీ కూడా ముడిచమురును తరలించే పైపు దేశదేశాలను దాటుకుని వెళుతుంటుంది. ఈ పైపుల్లో ఎక్కడైనా చిన్న లోపమొచ్చి లీకేజీ అయినా నష్టం భారీగా ఉంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. ఫొటోలో ఉన్న యంత్రంతో ఈ ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చు. రుమేనియాకు చెందిన అడ్రియన్ తొమోయిగా ఈ యంత్రాన్ని కనిపెట్టాడు. దీని సాయంతో పెద్దపెద్ద పైపుల్లోని లోపాలను కనిపెట్టడమే కాదు మరమ్మతులు కూడా చేయొచ్చని చెబుతున్నాడు. కొన్ని రకాల పండ్లు పచ్చిగా ఉన్నా, బాగా మగ్గినా ఒకే రంగులో కనిపిస్తాయి. ఫొటోలో ఉన్న డ్యూరియన్ పండు కూడా అలాంటి కోవలోకే వస్తుంది. ఓ పండు కింద ఉన్న యంత్రాన్ని చూశారుగా! పండు ఏ స్థాయిలో మగ్గింది అనే విషయాన్ని ఇది సూక్ష్మ తరంగాల ద్వారా గుర్తించి మనకు చెబుతుంది. దీన్ని థాయ్‌లాండ్‌కు చెందిన సొరావత్ చివప్రీచ కనుగొన్నాడు. -
పిల్లలకూ ఉండాలోయ్ ‘ప్రపంచం’
సాక్షి, హైదరాబాద్: పిల్లల రూమ్ ఇలాగే ఉండాలంటూ రూల్స్ ఏమీలేవు. వారి ఆసక్తులు, అభిరుచులు, లింగ భేదం.. దృష్టిలో ఉంచుకుంటే చాలు. దీనికి తోడు పిల్లల ఆరోగ్యం, చదువు, ప్రవర్తనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు ఉత్సాహాన్నిచ్చేలా కొంచెం సృజనాత్మకతను జోడిస్తే ఆ గదికి తిరుగే ఉండదు. రంగులే కీలకం: పిల్లల గదిని రూపొందించడంలో రంగులదీ ప్రధాన పాత్ర. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్ కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్‌లు కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగుని ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. దీనితో పాటు ఒక్కో రంగు ఒక్కో అంశాన్ని బహిర్గతపరచడానికి ప్రేరణ కల్పిస్తుందని కలర్ సైకాలజీ చెబుతోంది. ఎరుపు అధికంగా ప్రభావితం చేసే రంగు, ఇక ఆరెంజ్ స్నేహ స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆడుకునే చోట, పిల్లలు కూర్చునే చోట ఈ కలర్ ఉంటే బాగుంటుంది. పసుపు ఏకాగ్రతను పెంచేందుకు తోడ్పడుతుంది. అందువల్ల చదువుకునే చోట వేస్తేసరి. పిల్లల కంటూ ప్రత్యేకించి గది చిన్నదైతే బాగా దట్టంగా వేయడం వల్ల మరింత చిన్నదిగా కనిపించే ప్రమాదముంది. కాబట్టి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగజేయవచ్చు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లలు కొత్తల్లో బయపడే అవకాశం ఉంది. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్ రంగులు లేదా స్టెన్సిల్‌తో పెయింటింగ్‌లు వేస్తే చీకట్లో కూడా హాయిగా నిద్రపోతారు. -
అది మీలో నిజాయితీ లేకుండా చేస్తుంది!
న్యూయార్క్: మీలో సృజనాత్మకత ఎక్కువగా ఉందని భావిస్తున్నారా? అయితే, దాని వెనుకే అసంతృప్తిని కలిగించే అంశం కూడా ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో నిజాయితీ లోపిస్తుందని, ఆ కళే నిజాయితీ లేకుండా ఉండేలా ఒక వ్యక్తిని తయారు చేస్తుందని సిరాకస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్, రీసెర్చర్ లిన్నే విన్సెంట్ తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి అత్యంత అరుదుగా ఉండే విలువైన క్రియేటివిటీ తనకు మాత్రమే ఉందని ఎప్పుడు భావిస్తాడో అతడిలో అవసరం లేని ఆలోచనలు చుట్టుముడతాయి, అవే తనలో నిజాయితీ పరిమాణాన్ని కొంచెంకొంచెం తగ్గిస్తాయి. ఎలాగో తనకు సృజనాత్మకత సృష్టి శక్తి ఉందనే భావనలో ప్రాక్టికల్‌గా చేయాల్సిన అంశాలు కూడా నిర్లక్ష్యం చేస్తారని, వాటి గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే యత్నంలో పడి నిజాయితీలేని వ్యక్తులుగా మిగిలిపోతారని అధ్యయనం వెల్లడించింది. -
ఈవినింగ్ విత్ షార్ట్‌ఫిల్మ్స్
రెండున్నర గంటల పెద్ద సినిమాలో కనిపించని ఎన్నో భావాలు పొట్టి చిత్రంలో తొంగిచూస్తున్నాయి. క్రియేటివిటీకి కేరాఫ్‌గా నిలుస్తున్న నేటి యువత సామాజిక స్పృహను కలిగించే చిత్రాలు తీసి శభాష్ అనిపించుకుంటోంది. అలాంటి చిత్రాలను కొన్నింటిని ఎంపిక చేసి బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 1లోని లామకాన్‌లో ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రదర్శించనున్నారు. ‘ఎ షార్ట్ ఈవినింగ్ విత్ ఫిల్మ్స్-17’ పేరుతో ఆక్టోపస్ స్టూడియోస్ ఈ చిట్టి చిత్రాల ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ప్రవేశం ఉచితం. -
ప్రయోగాలతోనే సృజనాత్మకత
వేంపల్లె : విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాం కానీ.. వారిలో ఉన్న ృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు మరిన్ని ప్రయోగాలు అవసరమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చెర్మైన్ విజయ్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు. శనివారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న అభియంత్ టెక్ ఫెస్టివల్-15 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులు, అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాం కానీ.. వారిలో ఉన్న ృజనాత్మకత శక్తిని వెలికి తీయడంలో వైఫల్యం చెందుతున్నామన్నారు. ృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను 2029 నాటికి సన్‌రైజ్ స్టేట్‌గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే విద్యార్థులలో ృజనాత్మకత శక్తి పెరగాలన్నారు. ఇప్పటికే విశాఖపట్టణంలో సన్‌రైజ్ విలేజ్ ప్రారంభమైందన్నారు. 2029 నాటికి 5వేల సన్‌రైజ్ విలేజ్‌లు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా ఉందన్నారు. ఇది సాధ్యం కావాలంటే ఇలాంటి ఇంజనీరింగ్ విద్యార్థులే కీలకం అని చెప్పారు. బూత్ క్యాంపులు ఏర్పాటు చేసి వారిలో ఉన్న ృజనాత్మకత శక్తిని వెలికి తీయాలని అధికారులకు సూచించారు. గ్లోబల్ స్థాయిలో జరిగే కాంపిటీషన్లో నెగ్గేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ట్రిపుల్ ఐటీలలో మిగతా కళాశాలలకు భిన్నంగా అధ్యాపకులకు బదులు మెంటార్స్ ఉండటం విశేషమన్నారు. వీరివలన విద్యార్థులలో నైపుణ్యత శక్తి పెరుగుతోందన్నారు. ట్రిపుల్ ఐటీల్లో వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి ఫెస్టివల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇక్కడ టీం స్పిరిట్ ఎంతో బావుందన్నారు. ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంవల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులను సమీపంలోని పరిశ్రమలకు తీసుకెళ్లి.. అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పిస్తే బావుంటుందన్నారు. మైనింగ్ ఓపెన్ కాస్ట్‌పై పరిశోధనలు జరపడానికి క్షేత్ర స్థాయి పర్యటనలు విద్యార్థుల చేత చేయించాలన్నారు. ప్రజలకు సాంకేతికత మరింత దగ్గర కావాలన్నారు. అందుకు సంబంధించిన డిజైన్‌ను తయారు చేసుకొని ముందుకు వెళ్తే విజయం తథ్యం అన్నారు. గురువుకు బదులు గూగుల్ అనే పదం వినపడుతోందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు కష్టపడి చదవడంతోపాటు ృజనాత్మకతను కలిగి భావి భారత శాస్త్రవేత్తలు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
యాంత్రికత కాదు, సృజనాత్మకత కావాలి
నాలెడ్జ్ ఎకానమీకీ, గత ఆర్థికవ్యవస్థకీ తేడా ఉన్నది. కాబట్టి పాఠశాలలు మడికట్టుకొని సమాజానికి దూరంగా ఉంటే విద్యార్థి నిరర్థకుడు అవుతాడు. భవిష్యత్తును తీర్చే నైపుణ్యాన్ని కలిగిస్తేనే మానవ సంపదగా మనిషి మారతాడు. ప్రతి ఉదయం లాగే ఈరోజు కూడా 6 గంటలకు ఉస్మాని యా ప్రాంగణం దగ్గర వాకిం గ్‌కి వెళ్లినపుడు ప్యాంట్లు, షర్టు లతో ఉన్న కొందరమ్మాయిలు చేతిలో ల్యాప్‌టాప్‌లతో పరిగె డుతూ కనిపించారు - బస్ కోసం. ఆ సన్నివేశం నన్ను ఐదారు దశాబ్దాల వెనక్కు లాక్కెళ్లింది. 50, 60 ఏళ్ల క్రితం అదే వయసున్న అమ్మా యిలు గుంపులు గుంపులుగా కొడవళ్లు పట్టుకొని కూలి పనులకు వడివడిగా వెళ్లే దృశ్యం గుర్తొచ్చింది. ఇరవ య్యేళ్ల క్రితం ఆదిలాబాద్‌లో తిరుగుతున్నప్పుడు ఉద యమే పారలు పట్టుకొని పరిగెత్తుతున్న కార్మికులను చూశాను. 60 ఏళ్లలో ఎంత మార్పు! ఈ మార్పును చైనాలో, పోలెండ్‌లో, అమెరికాలో కూడా చూశాను. ఈనాడు సామాజిక విప్లవానికి సమాంతరంగా విజ్ఞానంతో కూడిన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతు న్నది. దీనికి సంతోషపడుతుంటే దానికి సమాంతరంగా నిరుద్యోగం కూడా పెరుగుతున్నది. సాంకేతిక పరిజ్ఞా నం పుణ్యమా అని చాలా ఉద్యోగాలను యంత్రాల ప్రాతిపదికగా రూపొందిస్తున్నారు. ఒక షిఫ్ట్‌లో వంద మంది చేసే పనిని ఒకే ఒక్క యంత్రం అర నిమిషంలో చేస్తోంది.పెట్టుబడిదారుడు మనిషికన్నా యంత్రాన్నే వ్యాపార సాధనంగా భావిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఆవిష్కరణ జరిగితేనే మనిషి సమ స్యలను పరిష్కరించుకోగలుగుతాడు. నూతన ఆవిష్కర ణలకు మూలం జ్ఞానం. ఇది నాలెడ్జ్ ఎకానమీ. దీనిలో విద్యారంగాన్ని ప్రతిక్షణం మార్చుకుంటూ కొత్త భావా లను దీక్షతో అమలు చేయగలిగితేనే ఆర్థిక రంగంలో కొత్త ఉద్యోగావకాశాలు, కొత్త సంపదను సృష్టించడం సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు పెట్టుబడిదారీ దేశాలు వినియోగంలోకి రుణాలు ఇచ్చి, డబ్బు చలామణీతో ఆర్థిక వ్యవస్థను నడిపించగలిగాయి. అది ఫలితాలివ్వక అక్కడ వాల్‌స్ట్రీట్ ఉద్యమం లేక స్ప్రింగ్ ఉద్యమాలు ఆవిర్భవించాయి. కాబట్టి విద్యారంగాన్ని కాలానుగుణం గా ఎంత సంస్కరించగలిగితే అంత కొత్త ఆర్థిక వ్యవ స్థను మనం ముందు తరాలకు అందించగలుగుతాం. ఇది ఏదో ఒక దేశం సమస్య కాదు. ప్రపంచ దేశాలన్నీ ఇదే పరిస్థితిని గమనించి తమ విద్యావ్యవస్థలను సంస్క రించుకుంటున్నాయి. ఇదివరకు ఏ దేశ సమస్యను ఆ దేశమే పరిష్కరించుకొనేది. కానీ నేడు సమస్య ఏ దేశా నిదైనా, దాని పరిష్కారం అనేక దేశాలతో ముడిపడి ఉం టోంది. ఆ పరిష్కారం గ్లోబల్ పరిష్కారంగా మారు తున్నది. ఇప్పుడు దేశ సరిహద్దుల సమస్య కాదు ప్రధా నం. ఆ దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆర్థిక సంక్షోభాలు, ప్రజల అనేకా నేక సమస్యలే ప్రధానం. ఆయా సమస్యల ఆధారంగా జరగాల్సిన నూతన ఆవిష్కరణలు వాటికి పరిష్కారం. అలాంటి ఆవిష్కరణలకు పునాది నిర్మించుకోవడానికి విశ్వవిద్యాలయాలనే కాదు, చిన్న తరగతుల నుంచి కూడా మన బోధనా పద్ధతులు మార్చుకోవాలి. వెనుకటి కాలంలో పుస్తకాలలో ముద్రించింది బోధిస్తే సరిపోయే ది. కానీ దానితో గత సమాజమే ఆవిష్కృతం అవుతుం ది. అంతే తప్ప ప్రస్తుత సమస్యకు పరిష్కారం దొరకదు. చరిత్రను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించకపోతే భవిష్యత్తుని నష్టపోతాం. మనం నిన్నటి సమాజం కన్నా రేపటి సమాజం గురించి ఆలోచించవలసి ఉన్నది. రేపు పిల్లవాడికి కావాల్సింది నైపుణ్యం మాత్రమే. అనగా రేపటి సమస్యలను పరిష్కరించడానికి వర్తమాన విద్యా ర్థుల్లో క్లిష్ట సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచనను అలవాటుగా మార్చాలి. సృజనాత్మక విద్యా బోధనను అలవర్చాలి. దీనినే క్రిటికల్ థింకింగ్ అం టాం. అది యాంత్రిక బోధన ద్వారా సాధ్యంకాదు. సృజనాత్మకత కావాలి. సమాచార రంగంలో కూడా విప్ల వాలు వచ్చాయి. ఈనాడు ఒంటరిగా ఆలోచించడం కన్నా నలుగురితో కలసి ఆలోచించడం అవసరం. ఆ నలుగురు ఒకే గదిలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక జట్టుతో కలసి పనిచేసే అలవాటు రావా లి. మనకు కనపడని వ్యక్తులతో కలసి పనిచేయాలి. ఇత రుల సహకారం కావాలంటే వారి నాగరికత, సంస్కృతి అలవాట్లను గౌరవించే లక్షణం కూడా ఉండాలి. దాన్నే టీం స్పిరిట్ అంటారు. టీం స్పిరిట్ కావాలంటే మన అభిప్రాయాలను ఇతరులకు అందజేసే శాసనాలపైన మనకు అభినివేశం కావాలి. అనగా ఓరల్ కమ్యూని కేషన్, రిటెన్ కమ్యూనికేషన్ ఉంటేనే ఇతరులతో కలసి ఆలోచించవచ్చు. కాబట్టి ఈనాటి విద్యార్థికి కంఠస్థం చేయడంకన్నా కొత్త సమాజం సృష్టించేందుకు నైపుణ్యం కావాలి. అందుకు పునాది మన తరగతి గదిలోనే పడవ లసి ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక రంగానికీ, ఆర్థిక రంగానికీ విద్యాలయాలు తోడైతేనే క్లాసులో కనపడే విద్యార్థికి భవిష్యత్తులో ఉపాధి, జీవించే లక్షణం ఏర్పడ తాయి. నాలెడ్జ్ ఎకానమీకీ, గత ఆర్థిక వ్యవస్థకీ తేడా ఉన్నది. కాబట్టి పాఠశాలలు మడికట్టుకొని సమాజానికి దూరంగా ఉంటే మీ దగ్గర ఉన్న విద్యార్థి నిరర్థకుడు అవుతాడు. భవిష్యత్తును తీర్చే నైపుణ్యాన్ని కలిగిస్తేనే మానవ సంపదగా మనిషి మారతాడు. ఈనాటి సవాలు ఇదే. విద్యారంగంతో సంబంధమున్న వారంతా దీనికి సమాయత్తం కావాలి. అప్పుడే ఈ ప్రజాస్వామిక వ్యవ స్థలో భాగస్వాములమవుతాం. లేకుంటే కూలీలుగానే మిగిలిపోతాం. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త) -
అందమైన అద్దం
అద్దంలో అందం చూసుకుని మురిసిపోవడం అందరికీ అనుభవమే. మరి ఇంటిని అద్దంలా మెరిసేట్టు చేయాలంటే..? ఇంట్లో గ్లాస్ డెకరేషన్ ఉంటే సరి. ఇలాంటి వారికోసం ఆవిర్భవించిందే ‘ఇర్షికా హ్యూజ్ డిజైనర్ గ్లాస్’ కంపెనీ. పేపర్ వెయిట్ నుంచి పెరట్లో డెకరేషన్ వరకూ అందమైన పెయింటింగ్ అద్దాలను అమర్చే కల్పనారావ్లో చాలా క్రియేటివిటీ ఉంది. అదేమిటో ఆమె మాటల్లోనే... - భువనేశ్వరి ఇంట్లో గ్లాస్ డెకరేషన్ కొత్త కళేమీ కాదు. పూర్వమెప్పటి నుంచో ఉన్నదే. ప్రత్యేకంగా ఆ పని మాత్రమే చేసేవారు మార్కెట్లో లేకపోవడంతో వాటిపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు. నాకు ఇలాంటి ఆలోచన రావడానికి కారణం.. పదిహేనేళ్ల కిందట జరిగిన ఓ సంఘటన. ఒకరోజు మా బంధువుల ఇంట్లో పాతమంచానికి ఉన్న గ్లాస్‌వర్క్ పాడైపోయిందని, ఎవరైనా బాగుచేసేవారుంటే చూడమన్నారు. నేను వెళ్లి చూశాను. ‘నేను చేయలేనా?’ అనుకుని పని మొదలుపెట్టాను. ఆ మంచం ప్రత్యేకత ఏంటంటే.. చుట్టూ గ్లాస్ వర్క్ ఉంటుంది. లోపలి వైపు అరలు కూడా ఉంటాయి. చేయడం సులువే కానీ.. మెటీరియల్ దొరకడం చాలా కష్టమైపోయింది. నానా తిప్పలు పడీ.. మంచి ఆర్టిస్ట్, స్కల్ప్చర్ ఆర్ట్‌లో మంచి అనుభవం ఉన్న మా అమ్మ లావణ్యారావ్ సాయంతో పని పూర్తిచేశాను. చూసినవారంతా చాలా బాగుందన్నారు. వారి ప్రశంసలే నాతో డిజైనింగ్ గ్లాస్‌వర్క్ కంపెనీ పెట్టించాయి. మొదట్లో ఆర్డర్లను బట్టి మెటీరియల్ తెచ్చుకుని ఇంట్లోనే చేశాను. గిరాకీ పెరిగాక ‘ఇర్షికాహ్యూజ్ డిజైనర్ గ్లాస్’ కంపెనీ పెట్టాను. యూనిక్ డిజైన్స్... అప్పుడప్పుడే ఇంట్లో డిజైనింగ్ గ్లాస్ ఉండాలని కోరుకుంటున్న రోజులు. కానీ దానికోసం ప్రత్యేకంగా పనిచేసే కంపెనీ లేకపోవడం, గ్లాస్ వర్క్ చేసేవారు ఉన్నా.. ఎక్స్‌క్లూజివ్ డిజైన్లు అందుబాటులో లేకపోవడం నాకు ప్లస్ అయ్యింది. కాకపోతే మెటీరియల్ కోసం నేను గుజరాత్, హర్యానా రాష్ట్రాలకు వెళ్లాల్సివచ్చేది. అందరికీ అద్దాల అందాలను పరిచయం చేయడానికి చాలానే కష్టపడ్డాను. నేను అదే సమయంలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో విమెన్ ఎంటర్ప్రెన్యూర్ విభాగంలో మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేయడం కంపెనీ డెవలప్మెంట్కి కలిసొచ్చింది. అమ్మ ఆర్ట్‌ని జతచేయడంతో యూనిక్ డిజైన్లను పరిచయం చేయగలిగాను. అభిరుచికి తగినట్టు... పేపర్ వెయిట్ దగ్గర నుంచి అన్ని రకాల గ్లాస్ మెటీరియల్స్ ఉంటాయి. అద్దాల వర్క్ అనగానే సాధారణంగా కిటికీలు ఒక్కటే గుర్తుకొస్తాయి. అలాకాకుండా... పూజగది, వంటిల్లు, డైనింగ్ హాల్స్‌లో చేసే గ్లాస్వర్క్తో ఇంటి లుక్ మొత్తం మారిపోతుంది. ఉడ్వర్క్కి బదులు గ్లాస్‌వర్క్, కొన్ని రకాల వాల్ డిజైన్స్ చేస్తాం. లేడీస్ స్పెషల్... గ్లాస్ వర్క్ అంటే సాధారణంగా పురుషులే చేస్తారు. కానీ... మా వద్ద గ్లాస్ పెయింటింగ్‌తో పాటు మ్యూరల్స్ వర్క్, పిక్చర్ ఫ్రేమింగ్ తదితర పనులన్నీ మహిళలే చేస్తారు. విమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్‌తో 90 శాతం మహిళల్నే ఉద్యోగులుగా నియమించి శిక్షణ ఇస్తున్నాం. కోవెల ఆర్గనైజేషన్‌లో స్కిల్ డెవలప్మెంట్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తున్నా. ఈ సంస్థ సహకారంతో పల్లెల్లో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, వారే సొంతంగా ఈ పని చేసుకొనేలా సహకారం అందించాలన్నది లక్ష్యం. -
న్యూ ఫిలిం ఇండస్ట్రీ @క్రియేటివిటీ
సినిమా ఇండస్ట్రీ అనగానే ఫిలిం సిటీలు.. స్టూడియోలు.. ల్యాబ్‌లు.. పెద్దపెద్ద సెట్టింగులు.. భారీ బడ్జెట్.. కొంతమంది బడా బాబులదే గుత్తాధిపత్యం.. సామాన్యునికి చోటులేని సినిమా ఇండస్ట్రీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేవి ఇవే. కానీ సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ మాత్రం సినిమా ఇండస్ట్రీకి సరికొత్త భాష్యం చెప్పారు. కేవలం రెండు సాధారణ కెమెరాలు.. సెల్‌ఫోన్.. ఒకే ఒక్క కంప్యూటర్ను ఉపయోగించి రూ.2.5 లక్షలతోనే సినిమా నిర్మించి తన సత్తా ఏమిటో చూపారు. ఇదే బడ్జెట్‌తో ఇటీవల తాను రూపొందించిన ఐస్‌క్రీం-2 చిత్రాన్ని ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కరీంనగర్లో న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ చర్చాగోష్టిలో సినీ ఔత్సాహికుల ఎదుట 15 నిమిషాల పాటు ప్రదర్శించి బడ్జెట్ కంటే క్రియేటివిటీయే గొప్పదని నిరూపించారు. టవర్‌సర్కిల్: సినిమా తీయాలంటే ప్రత్యేకమైన ఇండస్ట్రీ ఏమీ లేదని.. మనిషి మేధస్సే న్యూ ఫిలిం ఇండస్ట్రీ రాంగోపాల్‌వర్మ అన్నారు. ‘సాక్షి’ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ శివారులోని చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘కరీంనగర్లో న్యూ ఫిలిం ఇండస్ట్రీ- సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ప్రపంచం కుగ్రామంగా మారిందని.. సినిమా అనేది ఒకరి సొత్తు కాదని.. ప్రస్తుతం ఇండస్ట్రీ అనేది ఒక భ్రమ అన్నారు. ఎక్కడైనా సినిమాలు తీయవచ్చని, తాను తీసిన ఐస్‌క్రీమ్-2 సినిమానే నిదర్శనమని నిరూపించారు. తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ క్వాలిటీ ఉన్న సినిమా నిర్మించడం సాధ్యమేనన్నారు. మంచి క్వాలిటీ ఉన్న సినిమాకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందన్నారు. సినిమా చూసే సగటు ప్రేక్షకుడికి సినిమా డెరైక్ట్ చేసేంత అవగాహన వస్తుందని తెలిపారు. తాను కూడా ఆ స్థాయి నుంచే ఎది గానని గుర్తుచేశారు. కరీంనగర్లో సినిమా తీసే వారికి తన సహకారం అందిస్తానన్నారు. కొత్తదనం కోసం వెతకాలి... హైదరాబాద్‌కు ఫిలిం ఇండస్ట్రీ వచ్చినప్పుడు కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే నిర్మాణం జరిగేదన్నారు. ిసినిమా రంగంలో ఉన్న ఆంధ్రా వాళ్లంతా హైదరాబాద్‌లో ఉండి తమ ప్రాంతంపైనే దృష్టిపెట్టారని, తాను కూడా అదేపని చేశానని అంగీకరించారు. ఈ ప్రాంతం నుంచి ఎదిగిన వారు కూడా కరీంనగర్‌కు కనెక్ట్ కాలేకపోయారని అన్నారు. ఫిలిం ఇండస్ట్రీగా వెలుగొందుతున్న హైదరాబాద్ నుంచి కొత్తగా సినిమాలు రావడానికి ఏమీ లేదని, కరీంనగర్ నుంచి సినిమా నిర్మిస్తే అంతా కొత్త దనమే అవుతుందన్నారు. కొత్త దనం కోసం వెతుకుతూ ముందుకు వెళ్లాలని, ఆసక్తి ఉన్న వారికి తాను సలహాలు, సూచనలు అందిస్తానని తెలిపారు. ప్రాంతీయ ప్రేమ ఉండాలి... నాది.. నా ఊరు అనే ప్రేమ ఉంటే చాలు.. మంచి కథలు, యదార్థ ఘటనలు అన్నీ కథావస్తువులే అవుతాయని వర్మ అన్నారు. మీ ఊల్లోనే సినిమా మొదలు పెట్టాలని, సినిమా తీసిన తర్వాత ఆడకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని, ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకెళ్లాలని సూచించారు. కరీంనగర్ కేంద్రంగా సినిమాలు తీస్తే అదే ఇండస్ట్రీ అవుతుందని, లోకల్ టాలెంట్స్‌కు అవకాశం దక్కుతుందన్నారు. సినిమా తీయడమంటే కొంత మందికే సాద్యమన్న విషయాన్ని మరిచిపోవాలన్నారు. యదార్థ ఘటనలను కథలుగా మలిచి పది మంది భాగస్వాములై తక్కువ ఖర్చుతో తెరకెక్కిస్తే.. సంస్కృతీ, సాంప్రదాయాలు, ప్రాంతీయత కళ్ల ముందు కదలాడుతుందన్నారు. హైదరాబాద్ పాతబడిందని, కొత్తదనం ఉంటుందనే ఇక్కడ ఇండస్ట్రీ పెట్టించేందుకు వచ్చానని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ నిర్మాణం అనేది ఒకరు చేసేది కాదని, మన కోసం మనమే నెలకొల్పాలని ఉద్ఘాటించారు. డెరైక్టర్లు.. యాక్టర్లు అంతా మీరే.. కరీంనగర్లో ఇండస్ట్రీ నిలబడాలంటే డెరైక్టర్లు, యాక్టర్లు అంతా లోకల్వారే ఉండాలని, అప్పుడే ఇండస్ట్రీ నిలబడుతుందన్నారు. సినీ ఇండస్ట్రీ ఫలానా చోటనే ఉండాలనే నిబంధనలేమీ లేవని, టెక్నాలజీ పెరిగాక ఇండస్ట్రీఒక చోటకుపరిమితం కాలేదన్నారు. తీసిన సినిమా ఒకసారి ఆడకపోతే నిరాశచెందకుండా రెండోసారి ప్రయత్నించాలని, అప్పు డే సక్సె స్ అవుతారని అన్నారు. హాజరైన ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వారిలో ఉన్న ఉత్సాహాన్ని గమనించి వారికి ప్రోత్సాహం అందిస్తానని, ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తానని హామీ ఇచ్చారు. -
3 స్కిల్స్ ఉంటే..కార్పొరేట్ కొలువు ఖాయం!
గెస్ట్ కాలమ్ కార్పొరేట్ కంపెనీలు కొత్త నియామకాల సమయంలో ప్రధానంగా మూడు అంశాల్లో నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నాయి. అవి.. సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేనాటికి ఈ మూడు స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేస్తే జాబ్ మార్కెట్ పోటీలో ముందంజలో నిలిచి కార్పొరేట్ కొలువు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ కార్పొరేట్ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నెలకొల్పిన శివనాడార్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిఖిల్ సిన్హా. ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్‌లో ఇంగ్లిష్‌లో బీఏ ఆనర్స్.. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియాలో కమ్యూనికేషన్స్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు అకడమిక్, కార్పొరేట్ రంగంలో విశేష అనుభవం గడించిన ప్రొఫెసర్ నిఖిల్ సిన్హాతో ఇంటర్వ్యూ.. ఆధునిక విధానాలు.. సరళమైన కరిక్యులం విద్యార్థులు అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా దీటుగా రాణించాలంటే ఇన్స్టిట్యూట్ల స్థాయి నుంచే మార్పులు మొదలవ్వాలి. బోధన పద్ధతుల్లో ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేయాలి. అదేవిధంగా కరిక్యులంలోనూ మార్పులు తేవాలి. కరిక్యులం సరళంగా, సృజనాత్మక నైపుణ్యాలను వెలికితేసేలా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను అందించే విధంగా ఆధునిక కరిక్యులంను రూపొందించాలి. ముఖ్యంగా వృత్తివిద్యా కోర్సుల్లో నేటి పరిస్థితుల్లో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ సిస్టమ్ ఎంతో అవసరం. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్‌లో నాణ్యత దిశగా విస్తృత దృక్పథంతో ఆలోచించి, అంతర్జాతీయ అవసరాలకు సరితూగేలా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. యూనివర్సిటీల స్థాయిలోనూ మార్పులు అవసరం యూనివర్సిటీల స్థాయిలో అందించే సంప్రదాయ బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ మార్పులు రావాలి. ఒక డిగ్రీ కోర్సులో ఒకే సబ్జెక్ట్‌ను మేజర్‌గా ఎంచుకునే విధానం ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదు. మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ దృక్పథంతో కోర్సులను రూపొందించాలి. ప్రతి కోర్సులోనూ ‘గ్రూప్ సబ్జెక్ట్స్’ అనే విధానాన్ని అనుసరిస్తూనే ఇతర సబ్జెక్ట్లతో ఇంటిగ్రేట్ చేయడం ఎంతో అవసరం. నేటి విద్యా వ్యవస్థలో ప్రధాన లోపం.. ప్రస్తుతం అమలవుతున్న బోధన పద్ధతులు. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినప్పటికీ ఇంకా 20వ శతాబ్దపు బోధన విధానాలే అమలవుతున్నాయి. దీనివల్ల విద్యార్థులకు అంతర్జాతీయ నైపుణ్యాలు లభించట్లేదు. కొత్త సవాళ్లను స్వీకరించేలా విద్యార్థులు రూపొందలేకపోతున్నారు. ప్రయోగాత్మక అభ్యసనానికి పెద్దపీట విద్యార్థులు ప్రయోగాత్మక అభ్యసనానికి (ఎక్స్పరిమెంటల్ లెర్నింగ్)కు పెద్దపీట వేయాలి. ఈ క్రమంలో ఇంటర్న్షిప్స్, సర్వీస్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ వంటి క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించే వాటిలో పాల్పంచుకోవడం ద్వారా అకడమిక్ స్థాయిలోనే ప్రాక్టికల్ నైపుణ్యాలు అలవర్చుకోవాలి. ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు కూడా ఈ విషయంలో తమ వంతు కృషి చేయాలి. చొరవ తీసుకోవాలి. క్లాస్ రూం, లేబొరేటరీల్లో శిక్షణతోపాటు పరిశోధన కార్యకలాపాల్లో పాల్పంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. మౌలిక సదుపాయాలే.. మొదటి సాధనాలు విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుండాలంటే అకడమిక్ స్థాయిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మెరుగ్గా ఉంటే విద్యార్థులకు మరిన్ని అభ్యసన సాధనాలు అందుబాటులోకి వస్తాయి. వీటివల్ల చక్కటి ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. తద్వారా సదరు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్కు కూడా గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా ఒక విద్యా సంస్థ లక్ష్యాలు నెరవేరడానికి భౌతిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు ఎంతో దోహదం చేస్తాయి. అందుకే వీటి మెరుగుకు కృషి చేయాలి. నిపుణులైన ఫ్యాకల్టీ, ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం మౌలిక సదుపాయాల లేమి కారణంగా గుర్తింపునకు నోచుకోని యూనివర్సిటీలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. ‘గ్యాప్’ తగ్గించాలనే ఇటీవల దేశంలో పలు కార్పొరేట్ సంస్థలు విద్యా రంగంలోకి అడుగుపెట్టి సొంతంగా ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేస్తున్నాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నెలకొన్న గ్యాప్‌ను తగ్గించడం కోసమే సొంతంగా విద్యాసంస్థలను నెలకొల్పుతున్నాయి. కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో నెలకొన్న అకడమిక్ ఇన్స్టిట్యూట్లు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తూ.. టీచింగ్, లెర్నింగ్ విధానంలో వినూత్న పద్ధతులు అనుసరిస్తున్నాయి. తద్వారా కోర్సు పూర్తయ్యేనాటికి వాస్తవ అవసరాలకు సరితూగేలా, జాబ్ రెడీ స్కిల్స్‌తో బయటికి వచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. అకడమిక్స్ నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే ఎంతో అవసరం. ఇటీవల కాలంలో మన దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన పెరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇదే సమయంలో మరెందరో ఔత్సాహికులు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేదా స్టార్టప్ నెలకొల్పాలంటే వారసత్వం ముఖ్యమనే అభిప్రాయంలో ఉన్నారు. దీన్ని విడనాడాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేవలం ఫ్యామిలీ బిజినెస్ సంస్థలకే పరిమితం కాదు. ఔత్సాహికులకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అటు అకడమిక్‌గానూ తరగతి గది నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలు, అర్హతలపై అవగాహన పెంపొందించాలి. ఆ మూడూ ముఖ్యం ప్రస్తుతం సంస్థలు.. ఉద్యోగార్థుల విషయంలో.. కొత్త నియామకాల సమయంలో ప్రధానంగా మూడు అంశాల్లో నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నాయి. అవి.. సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇప్పుడు ఆయా కోర్సుల్లో ఉన్న విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేనాటికి ఈ స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేస్తే.. జాబ్ మార్కెట్ పోటీలో ముందంజలో నిలుస్తారు. అదే విధంగా రెగ్యులర్ లెర్నింగ్ దృక్పథాన్ని అనుసరిస్తే కెరీర్ కూడా నిత్య నూతనంగా ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఇదే నా సలహా. -
అందాల ఏరువాక...ఏటికొప్పాక
ఎల్లలు దాటిన లక్కబొమ్మల ఖ్యాతి అంకుడు కర్రతో అద్భుతాలు సూదిమొన సైజు నుంచి కళాఖండాలు ఆ బొమ్మ ముచ్చట గొలుపుతుంది... ఆ బొమ్మ ముచ్చట్లాడుతుంది... సహజసిద్ధమైన రంగులతో అపురూపమైన ఆకృతుల్లో ఇంటికి శోభను చేకూరుస్తుంది... కళాభిమానుల మనసు దోచుకుంటుంది. అంకుడు కర్రతో అద్భుతాలను ఆవిష్కరించే ఏటికొప్పాక లక్క బొమ్మలకు అందుకే ఖండాంతర ఖ్యాతి. కళాకారుల సృజనాత్మకత, వారి కళాతృష్ణ మన కళ్లను కట్టిపడేస్తుంటాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఇక్కడి హస్త కళాకారులకు లక్కతో పెట్టిన విద్య. ఉపాధి కోసం కొందరు బొమ్మలు చేస్తుంటే, ప్రతిభకు సానపెట్టి తమకు, తమ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తేవడానికి మరికొందరు కళాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ అవార్డులు సాధించిన ప్రతిభావంతులు ఇక్కడున్నారు. సూదిమొన సైజులో కళాఖండాలను సృష్టించడంలో ఏటికొప్పాక హస్తకళాకారుల నైపుణ్యత ఎంతటి వారినైనా సరే ఔరా అన్పిస్తుంది. -యలమంచిలి అంకుడు కర్ర కొరత... పెరిగిన ధర లక్కబొమ్మల తయారీకి కావాల్సిన అంకుడు కర్ర దొరకడం ఇప్పుడు గగనమైపోతోంది. మునుపటి మాదిరిగా అంకుడు కర్ర లభించడం లేదని కళాకారులు ఆవేదన వెలిబుచ్చున్నారు. అనధికారికంగా దీనిపై కొందరు ఆంక్షలు పెడుతుండటం వల్ల అంకుడు కర్రను సరఫరా చేసే వారు ఒక్కసారిగా దానిపై ధరను పెంచేశారు. ఇది కళాకారులకు మరింత భారంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దడానికి జిల్లా యంత్రాంగం మరింత కృషి చేయాల్సివుంది. వేలాది ప్రజానీకానికి ఇలవేల్పుగా ఉన్న బండిమాంబ అమ్మవారి ఆలయాన్ని స్పృశిస్తూ... పరవళ్లు తొక్కుతూ ప్రవహించే వరహానది చెంతనున్న ఏటికొప్పాక గ్రామం... లక్కబొమ్మల తయారీలో మేటికొప్పాకగా ఎంతో ఖ్యాతి, గుర్తింపు పొందుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే బొమ్మల తయారీతో యలమంచిలి మండలం ఏటికొప్పాక హస్తకళాకారులు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు 150 ఏళ్ల కిందట నక్కపల్లిలో బీజం పడింది. అంకుడు కర్ర దొరకకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటంతో నక్కపల్లిలో లక్కబొమ్మలు తయారు చేసే నాలుగు కుటుం బాలు ఏటికొప్పాకకు అప్పట్లోనే వలస వెళ్లాయి. క్రమేపీ హస్తకళాకారులు, వారి కుటుంబాలు పెరుగుతూ వచ్చా యి. నాడు నాలుగు కుటుంబాలుంటే ఇప్పుడవి 250కు చేరుకున్నాయి. లక్కబొమ్మల తయారీ, అమ్మకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుం బాలు ఇప్పుడు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ప్రకృతి రంగుల పరవశం కర్రతో తయారు చేసిన బొమ్మలకు రసాయనాలు మిశ్రమం చేసిన రంగులను అద్దితే పిల్లల ఆరోగ్యానికి ఇబ్బందికరమవుతుందన్న ఉద్దేశంతో రెండు దశాబ్దాల నుంచీ సహజసిద్ధమైన రంగులనే ఇక్కడి కళాకారులు ఉపయోగిస్తున్నారు. ఔషధ మొక్కలు, వనమూలికల ద్వారా ప్రకృతి సిద్ధమైన రంగుల తయారీలో పద్మావతి అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఇక్కడి కళాకారులు 1992 నుంచి శిక్షణ తీసుకున్నారు. ఈ రంగుల తయారీకి ప్రధాన ముడిసరుకైన లక్కను రాంచీ నుంచి కొనుగోలు చేస్తుంటారు. చాలామంది కళాకారులు వారు తయారు చేసిన కళాఖండాలను స్థానికంగా ఉన్న పద్మావతి అసోసియేట్స్‌కు విక్రయిస్తుంటారు. కళాకారుల శ్రమ, పెట్టుబడులను గుర్తించి పద్మావతి అసోసియేట్స్ ధర నిర్ణయిస్తుంది. అద్భుతమైన బొమ్మలను ఇండెంట్లపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. మరికొందరు కళాకారులు వారి ఉత్పత్తులను స్థానికంగా ఉండే అనేక దుకాణాలకు వెళ్లి విక్రయిస్తుంటారు. దీంతో లక్కబొమ్మల విక్రయం ద్వారా అనేక మంది వ్యాపారాలు సాగిస్తూ జీవనం పొందుతున్నారు. దేశ విదేశాలకు పాకిన ఖ్యాతి దేశంలో ఏమూలకెళ్లినా మార్కెట్లో ఏటికొప్పాక బొమ్మలు కచ్చితంగా కన్పిస్తుంటాయి. ఈ సామర్ధ్యం మరెవ్వరికీ సాధ్యం కాకపోవడంతో దేశ, విదేశాల్లో ఈ లక్క బొమ్మలకు ప్రాచుర్యం ఏర్పడింది. ఢిల్లీ, మద్రాస్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూర్, భువనేశ్వర్, రాజస్థాన్, హైదరాబాద్, పాట్నా, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి పట్టణాలతోపాటు స్విట్జర్లాండ్, హాలెండ్, అమెరికా, నేపాల్, లండన్, బ్రిటన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఇక్కడి బొమ్మలు ఎగుమతి అవుతుంటాయి. చూసిన కళ్లు ధన్యం... పిల్లల నుంచి పెద్దల వరకు, కూలివారి నుంచి కోటీశ్వరుల వరకు ఎవరైనా ఏటికొప్పాక హస్తకళాకారులు తయారు చేసిన లక్కబొమ్మలను చూసి ముగ్ధులు కావాల్సిందే. వీటిని ఎలా చేశారంటూ కళాభిమానులు ఆశ్చర్యపోతున్నారంటే వీరి నైపుణ్యత ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. చాలామంది తమ ఇళ్ల షో కేసుల్లో ఏటికొప్పాక బొమ్మలను అలంకరించుకోవాలనుకుంటారు. మరికొంద రు అధికారులు, అతిథు లు, బంధువులకు, శుభకార్యాల సమయంలో ఈ బొమ్మలను కానుకగా ఇవ్వడానికి అమితాసక్తి కనబరుస్తుంటారు. అవార్డులెన్నో... గతంలో నిరక్షరాస్యులైన కార్మికులే లక్కబొమ్మలను తయారు చేసేవారు. రానురాను చదువుకున్నవారు, మంచి అభిరుచి ఉన్నవారు కళాకారులుగా ఎదిగారు. ‘కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా’ అన్న కవి వాక్కును నిజం చేస్తూ అక్షరాస్యులైన ఎంతో మంది లక్కబొమ్మల తయారీలో ప్రత్యేక తర్ఫీదు పొందారు. దీనికి వారి సృజనాత్మకత తోడవ్వటంతో అపురూపమైన కళాఖండాలెన్నింటినో వీరు సృజిస్తున్నారు. ఇలా చిన్నప్పటి నుంచే ఇదే వృత్తిపై ఆధారపడిన శ్రీశైలపు చిన్నయాచారికి పదేళ్ల కిందట తొలిసారిగా జాతీయ అవార్డు లభించింది. హస్తకళా నైపుణ్యంలో రాటుతేలిన చిన్నయాచారి చేతిలో ఆవిస్కృతమైన ఒక బొమ్మకు అప్పటి రాష్ట్రపతి కలాం చేతుల మీదుగా అవార్డు లభించింది. సాధారణ కోడిగుడ్డు సైజులో, ఒక కోడిగుడ్డులో 32 గుడ్లు ఇమిడి ఉండేలా చిన్నయాచారి తయారు చేసిన బొమ్మలకు తొలిసారిగా జాతీయ గుర్తింపు లభించింది. ఆయన తరువాత పెదపాటి శరత్ కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్, లిమ్కా బుక్‌లలో కూడా ఏటికొప్పాక హస్తకళాకారులు చోటు సంపాదించుకున్నారు. -
ఏవీ..ఆ కాంతులు
ఆతిథ్యమిచ్చినా.. ఒక్కటే మిగిలింది! విజ్ఞాన ప్రదర్శనలో తుస్సుమన్న జిల్లా ఇన్స్పైర్ చేయలేని విద్యాశాఖ ఆ ఒక్క రోజు హడావుడే ముంచిందా? పథకం : విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంచాలి. వారిలో దాగివున్న సృజనాత్మకతను, విజ్ఞానాన్ని వెలికి తీయాలి. సైన్స్ పురోభివృద్ధి వైపు ముందడుగు వేసేలా పోత్సహించాలి. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డుల్ని ప్రవేశపెట్టింది. నిధులు : ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తోంది. ప్రతి పాఠశాలలో ఒకరిని, ఉన్నత పాఠశాలలయితే ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం వారెంట్(ప్రోత్సాహకం) అందిస్తుంది. ఫలితం : విద్యార్థుల్ని బాల శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తున్నా ఫలితం మాత్రం అంతంతే. ఇటీవల విశాఖ ఎస్ఎఫ్ఎస్ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో జిల్లా నమూనాలు తీవ్ర నిరాశ పరిచాయి. ఒకే ఒక నమూనా జాతీయ పోటీలకు ఎంపిక కావడ మే ఇందుకు నిదర్శనం. సాక్షి, విశాఖపట్నం : ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా స్థాయిలో 2011లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు ప్రదర్శనలు జరిగాయి. 2011లో నాలుగు నమూనాలు, 2012లో ఆరు నమూనాలు జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. 2012లో దక్షిణ భారత్ స్థాయిలో జతిన్వర్మ అనే విద్యార్థి రూపొందించిన రోబో ఎంపికయింది. 2013లో జిల్లాకు చెందిన 16 నమూనాలు అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వెళ్లాయి. అందులో నాలుగు(గబ్బాడ-నర్సీపట్నం, బూరుగుపాలెం-మాకవరపాలెం, దిమిలి-రాంబిల్లి, చీడిగుమ్మల-గొలుగొండ జెడ్పీ హైస్కూళ్ల) ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. అయితే అదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఏ ఒక్క నమూనా కూడా జాతీయ స్థాయికి పంపలేకపోయారు. తాజాగా ఈ నెల 20, 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనకు విశాఖ ఆతిథ్యమిచ్చింది. ఇందులో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 506 నమూనాలు ఎంపికగా అందులో 456 రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వచ్చాయి. జిల్లా నుంచి కేవలం 12 నమూనాలు మాత్రమే ప్రదర్శనకు నోచుకోగా అందులో ఒక్కటే(తిమ్మరాజుపేట-మునగపాక) జాతీయ స్థాయికి ఎంపికయింది. ఎందుకిలా..! రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా తొలి విడత తిరుపతిలో ఏడు జిల్లాలకు చెందిన నమూనాలు, రెండో విడతగా విశాఖలో ఆరు జిల్లాలకు చెందిన నమూనాలు ప్రదర్శనకు ఉంచారు. ఇందులో జిల్లా నుంచి 12 నమూనాలు మాత్రమే ప్రదర్శనకు నోచుకోవడం వెనుక పాఠశాల స్థాయి నుంచి జిల్లా విద్యాశాఖ వరకు తిలాపాపం తలా పిడికెడు పంచుకున్నారన్న ఆక్షేపణలున్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 1300కు పైగా వారెంట్ల కోసం దరఖాస్తులు గతేడాది జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. అయితే విద్యాశాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ జాబితాను ఎస్సీఈఆర్టీకి పంపడంలో జాప్యం చేశారు. దీంతో కేవలం 199 స్కూళ్లకు మాత్రమే వారెంట్లు వచ్చాయి. అందులో కూడా అత్యధిక భాగం గ్రామీణ ప్రాంతాలకు చెందిన స్కూళ్లే కావడం గమనార్హం. ఆ ‘ఒక్క రోజే’ ముంచిందా? మరోవైపు జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖామాత్యుల వైఖరి కూడా ఈసారి ఇన్స్పైర్ ప్రదర్శనలో జిల్లా చతికిలపడటానికి కారణమన్న ఆక్షేపణలున్నాయి. ఈ ఏడాది జిల్లా స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌ను జూలై 31న ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతకు ఒక్క రోజు ముందే మంత్రిగారి ఉత్తర్వులతో హడావుడిగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరూ పూర్తి స్థాయిలో నమూనాలను తయారు చేసుకోలేకపోయారు. సులభంగా పూర్తయ్యే/రెడీమేడ్ నమూనాలనే ప్రదర్శనకు తీసుకొచ్చారు. 199 అంశాల్లో 163 మంది మాత్రమే ప్రదర్శనకు వచ్చారు. దీంతో వీటి నుంచే 12 నమూనాలను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయాల్సి వచ్చింది. నిబంధనల మేరకు వీటినే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో ఉంచారు. దీంతో మిగిలిన జిల్లాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల ముందు విశాఖ విద్యార్థుల నమూనాలు తేలిపోయాయి. -
నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ అలోక్
స్ఫూర్తి కొందరు విజయం సాధించడానికి జీవితమంతా పోరాడుతూనే ఉంటారు. కానీ కొందరు విజయం సాధించడం కోసమే పుడతారు. అలోక్శెట్టి ఈ రెండో కోవకు చెందినవారు. ఆయన ఏదైనా అనుకోవడానికి వెనుక ముఖ్యమైన కారణం ఉంటుంది. అనుకున్నది సాధించడం వెనుక అలుపెరుగని కృషి ఉంటుంది. అదే ఆయనను ఇరవై ఎనిమిదేళ్లకే తిరుగులేని విజేతను చేసింది. ఇటీవలే టైమ్స్ వారు ఎంపిక చేసిన ఆరుగురు ‘నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్’లో ఒకరిగా నిలిచిన అలోక్ ప్రస్థానం, ఎంతో ఆసక్తికరం... రెండు దశాబ్దాల క్రితం... బెంగళూరులోని ఓ సైట్లో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అంతలో ఒకాయన తన కొడుకును తీసుకుని వచ్చారు. తను పని చేసుకుంటుంటే, పిల్లాడు ఆడుకుంటాడులే అనుకున్నారాయన. కానీ ఆ అబ్బాయి ఆడుకోలేదు. అక్కడ జరిగే ప్రతి పనినీ గమనించాడు. అప్పుడే కాదు... తన తండ్రితో కన్స్ట్రక్షన్ సైటుకి వెళ్లిన ప్రతిసారీ ఆ బుడతడి కళ్లు అన్నిటినీ నిశితంగా పరిశీలించేవి. అక్కడ చెక్కముక్కలు, ఇనుపరేకులు, విరిగిన ఇటుకలు పడి వుండటం చూసి, అవన్నీ అలా వృథా అయిపోవాల్సిందేనా అనుకునేవాడు. ఆ ఆలోచనే నిర్మాణ రంగంలో సరికొత్త విధానాలకు తెర తీసేందుకు అతణ్ని ప్రోత్సహించింది. వ్యర్థాలతో సైతం నిర్మా ణాలు జరిపేందుకు పురికొల్పింది. అంతే కాదు... నిర్మాణ కూలీల అగచాట్లను చూసి ఆ పసిమనసు కదిలిపోయింది. తల దాచుకోవడానికి సరయిన చోటు కూడా లేక, పని జరిగేచోటే పాలిథీన్ షీట్లతో, గోనెలతో గుడిసెలు వేసుకునే వారి దీనస్థితి, పెద్దయిన తర్వాత పదిమంది గురించీ ఆలోచించేలా చేసింది. ఇవాళ ప్రపంచం ముందు అతణ్ని హీరోగా నిలబెట్టింది. ప్రతి అడుగూ వినూత్నమే... అందరూ చేసే పని అయినా, దాన్ని కొత్త తరహాలో చేయడమే తన శైలి అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించాడు అలోక్. ఈజిప్టు నాగరికతను పరిశీలిస్తే... ఇళ్లన్నీ రాళ్లతో నిర్మితమై ఉంటాయి. ఎందుకంటే, వారికి రాయి విరివిగా దొరికేది. మెసపొటేమియా నాగరికతా కాలంలో ఇటుకలతో నిర్మాణం కావించేవారు. ఎందుకంటే, వారికి మన్ను బాగా దొరికేది. కానీ ఈ కాలంలో ఇళ్లను నిర్మించాలంటే ఎక్కువగా లభించేది ఏంటి? ఈ ప్రశ్నకు అలోక్ చెప్పే సమాధానం చాలా షాకింగ్‌గా ఉంటుంది. ఇంతకీ ఆ సమాధానం ఏమిటో తెలుసా... చెత్త. అవును. అలోక్ అదే చెబుతాడు. ఆయా నాగరికతల కాలంలో దొరికేది వాళ్లు వాడినప్పుడు, మన కాలంలో దొరికేది మనం వాడాలి కదా అంటాడు నవ్వుతూ. మన దేశంలో ఎక్కడ చూసినా కనిపించేది చెత్తే, దానివల్ల కాలుష్యం పెరుగుతుంది, వ్యాధులు ప్రబలుతాయి. పోనీ దాన్ని ఏరి పారేద్దామా అంటే అందుకు కొన్ని కోట్లు ఖర్చవుతాయి. అందుకే చెత్తను రూపుమాపడానికి దాన్ని తన పనికి ముడి సరుకుగా చేసుకున్న మేధావి అలోక్. రీసైక్లింగ్ వస్తువులతో పాటు స్థానికంగా దొరికే కలప, వెదురు వంటి వాటితో అతడు నిర్మించిన ఇళ్లను చూస్తే హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. అయితే ఇంత సృజనాత్మకత అతడికి అనుభవంతో రాలేదు. అలోక్ సహజంగానే సృజనశీలి. లేదంటే, పంతొమ్మిదేళ్ల వయసులోనే ఓ ఆసుపత్రిని డిజైన్ ఎలా చేయగలుగుతాడు?! బెంగళూరులోని ఆర్వీ కాలేజీలో ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు... ఓ కాంపిటీషన్ కోసం హాస్పిటల్ నమూనాను రూపొందించాడు అలోక్. మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. అది చూసిన ఓ వ్యాపారవేత్త... తాను జైపూర్‌లో నిర్మించాలనుకున్న హాస్పిటల్ని డిజైన్ చేయమని అడిగారు. ఆ వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అతడు పెద్ద కసరత్తే చేశాడు. పలువురు డాక్టర్లు, నర్సులను కలిశాడు. హాస్పిటల్ ఎలా ఉండాలనుకుంటారు అంటూ వాళ్ల ఆలోచనలను తెలుసుకున్నాడు. పలు ఆసుపత్రుల్లోని పేషెంట్లను కలిసి, మీకు హాస్పిటల్ ఎలా ఉంటే ఇష్టం అనడిగాడు. అందరి అభిప్రాయాలనూ తరచి చూసి, మంచి హాస్పిటల్ అంటే ఎలా ఉండాలో నిర్ణయించుకుని, అలా డిజైన్ చేశాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. మనసుతో చేస్తాడు... ఓ ఇంటిని నిర్మించడమంటే... ఇటుకలు పేర్చి, సిమెంటు రాసి, పైకప్పు పరచడం కాదు అలోక్‌కి. అది చాలా గొప్ప పని అంటాడు. ముఖ్యంగా పేదవారికి ఓ ఇల్లు కట్టేటప్పుడు తను పొందే ఆనందం అంతా ఇంతా కాదంటాడు. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేసి వచ్చాక, డబ్బు ఎలా సంపాదిద్దాం అని ఆలోచించలేదు అలోక్. తన ప్రతిభను దేశానికి, తనవారికి ఎలా ఉపయోగించాలా అని ఆలోచించాడు. పూరి గుడిసెలు చూసినప్పుడల్లా మథన పడేవాడు. వాన గట్టిగా కురిస్తే ఎగిరిపోయే టార్పాలిన్ పైకప్పులు, వరద నీటి ప్రవాహంలో కరిగి కలిసిపోయే మట్టి గోడలు చూసి... వారి కోసం తానేం చేయగలనా అని ఆలోచించాడు. వానకూ వరదకూ చెక్కు చెదరని ఇళ్లకు రూపకల్పన చేశాడు. వెదురు, కలపల సహాయంతో అతడు నిర్మించే ఆ ఇళ్లు చాలా తేలికగా ఉంటాయి. తుపాను, వరదల సమయంలో వేరే చోటికి కూడా తరలించేసుకోవచ్చు. కొన్ని ఇళ్లయితే డిస్‌మ్యాండిల్ చేసి మళ్లీ అతికించుకోవచ్చు. వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు కేవలం పద్దెనిమిది వేల రూపాయలు. అందుకే అంటాడు అలోక్... ‘ఒక ధనవంతుడు సెల్‌ఫోన్ కొనుక్కోవడానికి వెచ్చించే సొమ్ముతో పేదవాడికి ప్రశాంతమైన నివాసాన్ని ఏర్పరచవచ్చు’ అని! ఇంకా నిర్మాణ రంగంలో అతడు చేసిన ప్రయోగాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ఓడల మీద సరుకులను రవాణా చేసే భారీ కంటెయినర్లను రెండు వందలకు మంది పైగా కూర్చోగల ఆడిటోరియమ్స్గా మార్చి చూపించాడు. భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో... వ్యర్థాలతో తయారుచేసిన తేలికైన ఇటుకలతో ఇళ్లు నిర్మించాడు. అవి కూలినా ఆస్తి నష్టం, ప్రాణనష్టం ఉండదు. ఇలా అతడు నిర్మాణరంగంలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి కాకముందే తాను నెలకొల్పిన ‘భూమిపుత్ర’ అనే నిర్మాణ సంస్థ ద్వారా తన ఆశయాలను నెరవేర్చుకుంటున్నాడు. మరో పదిమంది ప్రతిభావంతులైన ఆర్కిటెక్ట్స్ సాయంతో దేశవ్యాప్తంతో ఎన్నో భారీ నిర్మాణాలను పూర్తి చేశాడు. అయితే వాటికంటే ఎక్కువ ఆనందం... పేదవారికి గూడు ఏర్పరచినప్పుడే కలుగుతోందని చెప్పే అలోక్ ఆదర్శనీయుడు, అనితరసాధ్యుడు! - సమీర నేలపూడి కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే మా నాన్నను చూసి నేను కూడా నిర్మాణ రంగంలోనే స్థిరపడాలనుకున్నాను. డబ్బు సంపాదించడానికి కాక సమాజానికి ఉపయోగపడే ఆర్కిటెక్టును కావాలను కున్నాను. అలా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాను. అందుకే నేను చేసేదాన్ని ఆర్కిటెక్చర్ అనను. ప్రాబ్లెమ్ సాల్వింగ్ అంటాను. తన భూమిపుత్ర సంస్థ ద్వారా స్కాలర్షిప్ను ఏర్పాటు చేసి, ఎంతోమంది పేద చిన్నారులకు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు అలోక్. బెంగళూరులోని ‘పరిణామ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు అలోక్. తీరిక దొరికితే వెళ్లి చేయడం కాదు... సేవ కోసం తీరిక చేసుకుంటాడు. ‘స్లమ్ డెవెలప్మెంట్ ప్రాజెక్ట్’ ద్వారా వారంలో ఒకరోజు తన టీమ్‌తో కలిసి మురికివాడల్లోని వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే పనిలోనే ఉంటాడు. నిర్మాణాన్ని నిలబెట్టేందుకు ఉపయోగించే బొంగులు, నిర్మాణ సమయంలో మిగిలిపోయే వస్తు వుల్ని సేకరించి, వాటిని పేదవారి ఇళ్ల నిర్మాణంలో ఉపయోగిస్తుంటాడు. -
న్యూ యోగా.. ఓకే!
క్రియేటివిటీని కొత్త పుంతలు తొక్కించాలనుకున్నారో, రొటీన్‌కు కాస్త భిన్నంగా ఫీలవ్వాలనిపిం చిందో.. రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్, ఆమె ర్యాప్‌స్టార్ హజ్బెండ్ కానె వెస్ట్.. యోగాను వినూత్నంగా ఎంజాయ్ చేశారు. మ్యారేజ్ లైఫ్‌లో పరవళ్లు తొక్కుతున్న ప్రేమను ఆసాంతం ఆస్వాదించాలనుకున్న ఈ జంట.. నగ్నంగా యోగా క్లాసుల్లో మునిగితేలింది. ఎప్పుడూ బిజీగా ఉండే మనసులకు కాసింత రిలాక్స్నివ్వాలనే ఆలోచన కిమ్‌ది. దానికి కార్యరూపమే ఇది. అంతేకాదు.. మిగిలిన ‘హోమ్ వర్క్’ కూడా ఇలానే చేసేసి ఫుల్‌గా కూల్ అయిందట ఈ జంట. -
పాఠశాలలు విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాలి
తిరుపతి: ‘విద్యార్థులలో సృజనాత్మకత, కొత్త విషయాలపై జి జ్ఞాస పెరగాలి. వారిలో దేశ భక్తిని, సమాజం పట్ల బాధ్యతను పెంపొందించాలి. ఇది ప్రాథమిక విద్య స్థాయి నుంచి అమలు జరగాలి. ఆ సదుద్దేశంతోనే సంకల్పం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం’ అని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. ఆదివారం సా యంత్రం మహతి ఆడిటోరియంలో జిల్లా సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన సంకల్పం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కా ర మహోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ పాఠశాల కాంప్లెక్స్‌లు సమగ్ర విజ్ఞాన నిలయాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఫలితాలు ప్రధానం కాద ని ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేసి విద్యార్థులతో స్నేహం గా మెలగి వారిని విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దితే ఫలితాలు వాటంతట అవే వస్తాయన్నారు. ఉపాధ్యాయుల మధ్య నాలె డ్జ్ షేరింగ్ ఉండాలన్నారు. పాఠశాలలో ఇలాంటి సమగ్రత ఏర్పడినపుడు విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతుందన్నారు. అనంతరం వివిధ మండలాలకు చెంది పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయులకు ఆయన ఉత్తమ ఉపాధ్యాయ ప్రశంసా పత్రాలను అందచేశారు. స్ఫూర్తి నింపింది సంకల్పం కార్యక్రమం తమలో స్ఫూర్తి నింపిందని పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో ప్రసంగించిన పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసే సంప్రదాయానికి తోడుగా ఉపాధ్యాయుల పనితీరును అధ్యయనం చేసి ప్రశంసాపత్రాలు అందచేసే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ సిద్ధార్థ జైన్‌ను వారు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అభిలషించారు. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్షా అభియాన్ పథకాల ప్రగతిని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మి, డీవైఈవోలు శామ్యూల్, శేఖర్ పాల్గొన్నారు. జవహర్ బాలభవన్ విద్యార్థులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆందరినీ ఆకట్టుకున్నాయి. కుర్చీలు చాలక ఇబ్బందులు సంకల్పం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం కార్యక్రమానికి హాజరైన పలువురు కుర్చీలు లేక ఇబ్బంది పడ్డారు. ఉ త్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు ఎంపికైన 1500 మందికి జిల్లా విద్యాశాఖ ఆహ్వానం పంపింది. అయితే కోరకనే వచ్చిన అవార్డును అందుకోవడానికి ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా తరలిరావడంతో మహతిలో కుర్చీలు చాలక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామంది కార్యక్రమం పూర్తయే వరకు నిల్చొనే ఉండాల్సి వచ్చింది. -
‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ గడువు పొడిగింపు
ఈనెల 30 వరకు రిజిస్ట్రేషన్లు సాక్షి, విజయవాడ : దేశంలోనే ప్రతిష్టాత్మక ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ’ రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించారు. పాఠశాల విద్యార్థుల్లో సృ జనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న స్పెల్‌బీ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు విద్యార్థుల్లో ఆంగ్ల పదాల స్పెలింగ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఈపోటీలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆగస్టు ఒకటో తేదీ నుంచి పేర్ల నమోదు ప్రారంభించారు. వాస్తవానికి ఈనెల నాలుగో తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగియనుంది. అయితే వరుస సెలవులు రావటం, పాఠశాల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు రిజిస్ట్రేషన్ల గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించారు. పోటీల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఇంగ్లిషు గ్రామర్, పదాలతో కూడిన రిఫరెన్స్ బుక్‌ను అందజేస్తారు. మొత్తం నాలుగు కేటగిరిల్లో పోటీలు జరుగుతాయి. మొదటి కేటగిరిలో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు, రెండో కేటగిరిలో మూడు, నాలుగు తరగతులు, మూడో కేటగిరిలో ఐదు, ఆరు, ఏడు తరగతుల విద్యార్థులు, నాలుగో కేటగిరిలో ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు పాల్గొంటారు. ఈపోటీలు నాలుగు దశల్లో జరుగుతాయి. మొదటి మూడు దశలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి నిర్వహిస్తారు. నాలుగో దశలో (ఫైనల్స్) రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా పోటీ పరీక్షలు ఉంటాయి. తొలిదశలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి పాఠశాల స్థాయిలోనే ఇండియా స్పెల్‌బీ పరీక్ష ఆక్టోబర్ 15న (రాత పరీక్ష) ఉంటుంది. రెండోదశలో భాగంగా తొలిదశలో ఎంపికైన విద్యార్థులకు నవంబర్ 9న జిల్లా ప్రధాన కేంద్రం అయిన విజయవాడలోని ప్రత్యేక కేంద్రాల్లో (క్వార్టర్‌ఫైనల్స్) పరీక్షలు నిర్వహిస్తారు. మూడో దశలో సెమీ ఫైనల్స్ స్టేజ్ పరీక్షలు కూడా జిల్లా కేంద్రాల్లోనే జరుగుతాయి. ఫైనల్‌కు అర్హత సాధించిన విద్యార్థులలో ఒక్కొక్క కేటగిరి నుంచి పది మంది చొప్పున ఎంపిక చేసి ఫైనల్ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి బహుమతిగా... అంతిమ విజేతలకు మొదటి బహుమతిగా బంగారుపతకంతో పాటు రూ.25 వేల నగదు అందజేస్తారు. రెండో బహుమతిగా రజత పతకం, రూ.15 వేల నగదు , మూడో బహుమతిగా కాంస్య పతకం, రూ.10వేల నగదును అందజేస్తారు. రెండు, మూడు దశల్లో లైవ్ టెలికాస్ట్ ద్వారా నిర్వహించే పోటీల్లో ప్రేక్షకులు కూడా స్పెల్లింగ్‌లను పంపి బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. పేర్ల నమోదు ఇలా... ఈపోటీల్లో పాల్గొనే విద్యార్థులు WWW.INDIASPELLBEE.INవైబ్‌సైట్ ద్వారా పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ‘సాక్షి’, విజయవాడ బ్రాంచ్ కార్యాలయం (0866-2547433), మేనేజర్ ఐ.సూర్యనారాయణ (మొబైల్: 9912272599) ఫోన్ నంబర్లకు కాల్ చేసి పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. -
క్రియేటివిటీ +సోషల్ రెస్పాన్సిబిలిటీ =శంకర్
ఒక ‘జెంటిల్‌మేన్’ పుట్టాలంటే, ఏ ‘జీన్స్’ కావాలో..! వాడు ‘భారతీయుడై’... దుండగుల పాలిట ‘అపరిచితుడై’... నరకంలో శిక్షలన్నీ భూమ్మీదే ఆచరణలో పెట్టేసి, అవినీతిని అంతమొందించేసి... ఒక్కరోజులోనే ముఖ్యమంత్రై, రాష్ట్రాన్ని బాగుచేసిన ‘ఒకే ఒక్కడు’... ఆగస్టు 17న పుడితే... అతనే దక్షిణ భారత దర్శకుల స్థాయిని, మోడరన్ జెనరేషన్లో సినిమా బడ్జెట్‌ని, మార్కెట్‌ని వంద కోట్లు దాటించిన ‘రోబో’టిక్ బ్రెయిన్, వీర ‘శివాజీ’ - శంకర్! పేరుకి తమిళ దర్శకుడైనా, తెలుగువారికి చాలా సుపరిచితుడు, ఆప్తుడు, అభిమాన దర్శకుడు శంకర్‌కి జన్మదిన శుభాకాంక్షలతో ఈ హార్టికల్ని చిరుకానుకగా అందిస్తున్నాను. సినిమాలో పెద్ద హీరో ఉండాలి. ప్రతి దర్శకుడి కోరికే ఇది. సినిమాకి బాగా ఖర్చుపెట్టే నిర్మాత కావాలి. ప్రతి దర్శకుడి అవసరమే ఇది. సినిమా సూపర్హిట్టవ్వాలి. ప్రతి దర్శకుడి కలే ఇది. కానీ, సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండాలి. కేవలం దర్శకుడు శంకర్‌కి మాత్రమే మొదటి సినిమా నుంచి ఈ రోజుదాకా ఉన్న నిబద్ధత ఇది. నియమం ఇది. కట్టుబాటు ఇది. అన్ని కమర్షియల్ కథల్లో హీరోలాగే శంకర్ సినిమాలో హీరో కూడా దొంగతనాలు చేస్తాడు. చట్టం నుంచి తప్పించుకుంటాడు. కానీ విద్యావ్యవస్థ మీద విరక్తి చెంది, పేద విద్యార్థుల్ని పెద్ద చదువులు చదివిస్తాడు. సామాన్య విద్యార్థుల కలల్ని తను కంటాడు. అందుకే అతను జెంటిల్‌మేన్. పదిహేడు సంవత్సరాలు అసిస్టెంట్ డెరైక్టర్‌గా, అసోసియేట్ డెరైక్టర్‌గా, కో-డెరైక్టర్‌గా ఎస్.ఎ.చంద్రశేఖర్, కె.బాలచందర్ తదితరుల దగ్గర సుశిక్షితుడై, కె.టి.కుంజుమోన్ నిర్మాతగా ‘జెంటిల్‌మేన్’ సినిమాకి మొదటిసారి మెగాఫోన్ పట్టారు శంకర్. అప్పుడే విక్రమ్ధర్మా అనే ఫైట్ మాస్టర్ కోసం రోజూ లంచ్ బ్రేక్‌లో ‘భైరవ ద్వీపం’ షూటింగ్‌కి వచ్చేవారు. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డెరైక్టర్ని. విక్రమ్ధర్మాకి నాపై ఉన్న అభిమానం వల్ల, శంకర్‌తో కథాచర్చల్లో నన్నూ కూర్చోబెట్టుకునేవారు. ఆయన విజన్‌ని ఆయన మాటల్లో స్వయంగా నేనూ చూశాను. మనిషి వీర సౌమ్యుడు, సహనశీలి. ఆలోచనల్లో వీర కసి. పని అయ్యేదాకా సడలని పట్టుదల. స్ప్లిట్ పర్సనాలిటీ. అందుకే ‘అపరిచితుడు’ కథను అంత బాగా రాసుకోగలిగారు. ‘జెంటిల్‌మేన్’ సూపర్‌హిట్ అయ్యాక కూడా విక్రమ్ధర్మాని కలవడానికి వచ్చేవారు. అప్పుడు నేను కమల్‌హాసన్ సినిమా ‘నమ్మవర్’కి అసోసియేట్ని. ‘భారతీయుడు’ రూపుదిద్దుకుంటోంది... ఎ.ఎం.రత్నం నిర్మాతగా తెలుగు, తమిళ భాషల్లో. ఆ సినిమాకి నన్ను పనిచేయమని అడిగారు. అప్పటికే ఆయన దగ్గర తమిళ అసిస్టెంట్ డెరైక్టర్లు క్యూ కడుతున్నారు. మొదటి సినిమా రిలీజ్‌కి ముందు, రెండో సినిమా మేకింగ్‌లోనూ ఒకే రకమైన డౌన్ టూ ఎర్త్ నేచర్. ఆ టైమ్‌లోనే వాహినీ స్టూడియోకొచ్చి ఆయన పెళ్లికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి వెళ్లారు. అప్పుడు నేను ‘శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాకి అసోసియేట్ని. శంకర్‌ని కలిసినప్పుడు సినిమా గురించి తప్ప సినిమావాళ్ల గురించి ఆయన ఒక్కమాట కూడా తేడాగా మాట్లాడటం నేను వినలేదు. కలిసిన ప్రతిసారీ ఆయన స్థాయిలో అనూహ్యమైన మార్పులున్నాయి. కానీ స్వభావంలో అణువంతైనా మార్పు లేదు. స్థిత ప్రజ్ఞత అతన్నుంచి నేను నేర్చుకున్న మొదటి లక్షణం. సంగీతం, సాహిత్యం, హాస్యం, శృంగారం, రౌద్రంలో ఎక్కడా అతి గానీ, అసభ్యత గానీ, అశ్లీలం గానీ లేకపోవడం అతన్నుంచి దర్శకుడిగా నేను నేర్చుకున్న రెండో లక్షణం. 1990ల తర్వాతి దక్షిణ భారత చలనచిత్ర సీమ గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో కచ్చితంగా శంకర్ ముందు వరుసలో ఉంటారు. సామాన్య మానవుడిని, నిరక్షరాస్యుడిని కూడా మెప్పించేలా, ఆలోచింపజేసేలా మంచి మాటలు చెప్పాలంటే, ఆ సినిమా దర్శకుడు చాలా విజ్ఞుడై ఉండాలి. తెలివితేటలు, సాహితీ పరిజ్ఞానంతో పాటు చాలా కామన్సెన్స్ ఉన్నవాడై ఉండాలి. గొప్ప టెక్నీషియన్స్‌ని, మేథావులైన రచయితల్ని, స్టార్స్‌ని, బాగా డబ్బుపెట్టే నిర్మాతని సమకూర్చుకున్నంత మాత్రాన శంకర్ స్థాయి దర్శకుడైపోరు ఎవరూ. నేల, బెంచీ, బాల్కనీ, రిజర్వ్డ్, ఎగ్జిక్యూటివ్, గోల్డ్ క్లాస్ టిక్కెట్లు కొన్న కోట్లమంది మెదళ్లని ఏకకాలంలో కదిలించి, నవ్వించి, ఒళ్లు గగుర్పొడిపించి, అద్భుతం అనిపించి, ఆ! అవును నిజమే కదా అని ఆలోచింపజేసి, సినిమా సూపర్‌హిట్ అనిపించడం అంటే... నేను ఈ ఆర్టికల్ రాసినంత సింపుల్ కాదు... శంకర్ లైఫ్ స్టైల్ అంత సింపుల్ కూడా కాదు - శంకర్ అంత టఫ్ - శంకర్ అంత కాంప్లికేటెడ్. ఎంతో ధైర్యం, విజన్, యాటిట్యూడ్, ఫైర్, గట్ ఫీలింగ్, సెల్ఫ్ బిలీఫ్ ఉంటే తప్ప ఎవరూ శంకర్ కాలేరు. శంకర్ ఒక ప్యాకేజీ. నవీన దర్శకుడి లక్షణాలకి ఒక నమూనా. న్యూ ట్రెండ్ సినిమాకి, టెక్నికల్‌గా ఎదుగుతున్న సొసైటీకి ఒక దిక్సూచి. యూత్‌కి ఒక రోల్ మోడల్. రజనీకాంత్ నల్లగా ఉంటాడని మనకి చిన్నప్పట్నుంచీ తెలుసు. కానీ నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టే పెళ్లి చేసుకోను అనేస్తుంది శ్రీయ ‘శివాజీ’లో. ఆశ్చర్యంగా రజనీ తెల్లగా తయారవుతారు. ఇది టెక్నికల్‌గా సాధ్యమే అయినా, ఈ థాట్‌ని సినిమాలో పెట్టాలంటే, దర్శకుడికి చాలా విషయం ఉండాలి. హిమాలయాలకి వెళ్లొచ్చీ వెళ్లొచ్చీ హిమాలయమంత కీర్తిని మూటగట్టుకున్న సూపర్‌స్టార్‌కి ఏ విలన్ని పెట్టినా, వెయ్యి మంది విలన్లని పెట్టినా ఆనదనిపించి, ఆయనకి ఆయన్నే విలన్ని చేసేశారు శంకర్ ‘రోబో’లో. అది హైట్స్ ఆఫ్ ఇంటెలిజన్స్. కేరళ విద్యను ప్రయోగించి, లంచగొండుల భరతం పట్టే స్వాతంత్య్ర సమరయోధుడు ‘భారతీయుడు’. కవలలు పుడితే... ప్రేమించే అమ్మాయి కూడా కవలలే కావాలని పట్టు పడితే, సాంకేతికంగా తనో చెల్లెల్ని సృష్టించుకున్న అమ్మాయి కథ ‘జీన్స్’. చాలామంది విద్యార్థినీ విద్యార్థులకి చిన్నప్పట్నుంచీ వ్యాసరచన పోటీల్లోనో, వక్తృత్వ పోటీల్లోనో ఇచ్చే టాపిక్ ‘‘నేనే ముఖ్యమంత్రినైతే...’’. ఆ టాపిక్‌కి ఆయన వెండితెర మీద రాసిన అద్భుత వ్యాసరచన ‘ఒకే ఒక్కడు’. అన్నీ జీవితాల్లోంచి పుట్టినవే. సామాన్య, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జీవితాల్లోని అంతః సంఘర్షణలే. ఆవిష్కరించే తీరు మాత్రం అద్భుత రసంతో. అందుకే ఆయన సినిమాలు ఒకే రకమైన సామాజిక పరిస్థితుల్లో పెరిగిన దక్షిణ భారతావనిలో పెద్ద హిట్టు. బహుశా ఈ బలమే వేరే వ్యక్తిత్వం ఉన్న ఉత్తర భారతంలో బలహీనత అయినట్టుంది. వాళ్లకీ సమస్యలు చిన్నవిగానో, అసలు లేనట్టో ఉండుంటాయి. మాఫియా గన్నులో, ప్రియురాలి కన్నులో... ఈ రెండే దశాబ్దాలుగా ప్రధాన టాపిక్ అయిన నార్త్ ఇండియాలో పెన్షన్ ఆఫీసుల్లో లంచాలు, స్వతంత్ర సమరయోధుల బాధలు, అవినీతి, విద్యావ్యవస్థలో ప్రక్షాళనలు - ఇంత హెవీనెస్ అర్థం కాకపోయి ఉండొచ్చు. లేదా సహజంగా అనిపించకపోయి ఉండొచ్చు. ఏదేమైనా శంకర్ ఎడాప్ట్ చేసుకోవలసిన అవసరం లేదు. ఈ పుట్టినరోజు బాలుడు మనోహరుడై మళ్లీ ముందుకు వస్తున్నాడు. ఈసారి సమస్య ఏదో, పరిష్కారం ఏదో! భారతీయ పురాణ ఇతిహాసాలు వేదాల సారమా? అత్యాధునిక సాంకేతిక మాయాజాలమా? మనిషి సాధారణంగా ఉండాలి. కలలు అసాధారణంగా ఉండాలి. అలా సినిమాని కలగన్నారు శంకర్. వాటిని అన్ని సినిమాల స్థాయిలో కాకుండా, ఇంకా విపరీత ధరలకి అమ్మే రేంజ్లో కలలు కన్నారు. ఆ కలల్లో ఒక అర్థవంతమైన, అవినీతి రహితమైన సమాజానికి కావాల్సిన సందేశాల్ని చుట్టి ఇస్తున్నారు. బురద ఆర్థికంగా నిరుపేద అయితే, అందులో పుట్టిన పద్మం వెలకట్టలేనంత విలువైనది. శంకర్ మనిషిగా, మామూలు దర్శకుడిగా వెలకట్టలేని విలువైన వ్యక్తి. ఇది ఒక్క రాత్రిలోనో, అదృష్టాన్ని నమ్ముకుంటేనో జరగలేదు. పదిహేడేళ్ల పునాది, ఆగని చదువు, అపరిమితమైన మేధోమథనం - ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, అతను తీసే సినిమాలని కలిపి అనలైజ్ చేయలేం. కానీ ఒక దర్శకుడు తీసే సినిమాల వల్ల, అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనకి తెలిసిపోతుంది. శంకర్ అంత గొప్పవాడు. తను నిర్మాతగా మారి, తన దగ్గర పనిచేసిన మంచి సహాయ దర్శకుల్ని దర్శకులుగా ప్రమోట్ చేసిన సహృదయుడు. న్యూవేవ్ దర్శకులందరికీ టార్గెట్ తన సినిమా, సినిమాకీ మరో వందమైళ్లు ముందుకి జరిపి కష్టపెట్టిస్తున్న కృషీవలుడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మర్యాదగా, వినయంగా మాట్లాడతారు. క్లుప్తంగా చెప్తారు. గుప్తంగా దానాలు చేస్తారు. 20 ఏళ్ల కెరీర్లో, సెలెబ్రిటీ లైఫ్‌లో ఎటువంటి చిన్న కాంట్రవర్సీ గానీ, చెడు గాసిప్పు గానీ అంతర్జాలంలోను, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలోనూ లేని ఏకైక వ్యక్తి శంకర్. ఇది నిజంగా చాలా చాలా కష్టం. కలల వ్యాపారంలో సంఘ సంస్కరణలని అమ్మడం అన్నిటికన్నా అత్యంత కష్టమైన పని. దానిని అమిత ఇష్టంగా చేసే వ్యక్తిగా, దర్శకుడిగా శంకర్ అంటే తెలుగు, తమిళ ప్రేక్షకులలాగా నాక్కూడా అమిత ఇష్టం. సాటి దర్శకుడిగా చాలా గౌరవం. ఈ పుట్టినరోజు ఆయనకి మనోహరమైన మంచి హిట్టుని ఇస్తుందని గట్టిగా నమ్ముతూ... ఒక దర్శకుడినైనా, సాటి దర్శకుడు శంకర్ గురించి నన్ను ఈ సందర్భంగా ఆర్టికల్ రాయమని పురమాయించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. - మీ వి.ఎన్.ఆదిత్య వ్యక్తిగతంగా శంకర్... తమిళ చిత్రం ‘కుంగుమమ్’లో శివాజీ గణేశన్ పాత్ర పేరు శంకర్. తనకో కొడుకు పుడితే శంకర్ అని పేరు పెడతానని అనుకున్నారట శంకర్ తల్లి. పుట్టగానే ఆ పేరే పెట్టేశారట. సినిమాల్లోకి రాకముందే చెన్నయ్‌లోని హాల్డా కంపెనీలో శంకర్ పనిచేవారు. అప్పుడు కార్మిక సంఘం కార్యకలాపాల విషయంలో చిన్న వివాదం జరిగి, మూడు రోజులు జైలు శిక్ష కూడా అనుభవించారట. శంకర్‌కి గడియారాలంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు రకరకాల గడియారాలను సేకరించారు. ఎలాంటి సమయంలో అయినా చేతికి ఉన్న గడియారానికి ఒక్క గీటు కూడా పడకుండా జాగ్రత్తపడతారట. పెళ్లయిన తర్వాత శంకర్ స్వయంగా షాప్స్కి వెళ్లి బట్టలు కొన్నదే లేదట. తన భార్య ఈశ్వరి సెలక్ట్ చేసినవే ఆయన ధరిస్తారట. ‘బాయ్స్’ సినిమాకి ముందు శంకర్ సిగరెట్లు తాగేవారు. ఆ సినిమా తర్వాత పూర్తిగా మానేశారు. అప్పుడప్పుడు రజనీకాంత్ ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ‘అంత సులువుగా ఎలా మానేయగలిగావ్ శంకర్’ అని అడగుతుంటారట. షూటింగ్ లొకేషన్లో సిల్లీ జోకులేయడం శంకర్‌కి నచ్చదు. చాలా సీరియస్‌గా ఉంటారు. ఒకవేళ తనకు నచ్చనిది ఏదైనా జరిగితే.. అక్కణ్ణుంచి దూరంగా వెళ్లిపోతారు. కోపం తగ్గిన తర్వాతే లొకేషన్లోకి అడుగుపెడతారట. ప్రతి రోజూ దాదాపు గంటసేపు షటిల్ కాక్ ఆడటం శంకర్ అలవాటు. షూటింగ్ లొకేషన్లో అప్పుడప్పుడూ తన సహాయ దర్శకులతో కూడా ఆడుతుంటారట. భారతదేశంలో తాజ్‌మహల్, విదేశాల్లో పీసా టవర్ అత్యద్భుత కట్టడాలని శంకర్ అంటారు. తాజ్‌మహల్‌ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని, పీసా అలా ఒరిగిపోయి ఉండటం వింతగా ఉంటుందని అంటుంటారట. -
పెద్దంచు... కొత్త చీర
సంప్రదాయం ఉట్టిపడుతూనే సవాళ్లను ఎదుర్కొనేంత ధీమాగా కనపడాలన్నదే ఆధునిక మహిళ ఆంతర్యం. నవతరం మహిళ మనసెరిగిన డిజైనర్లు కంచిపట్టుకూ, క్రేప్కూ క్రియేటివిటీని జోడిస్తున్నారు. బ్రొకేడ్ను, బెనారస్నూ... పెద్ద పెద్ద బార్డర్లతో, ట్రెడిషనల్ డిజైన్లతో అమర్చి... సంప్రదాయ వేడుకలకు వైవిధ్యాన్ని తీసుకువస్తున్నారు. చూపులతోనే అల్లుకుపోయే... చక్కదనాల పెద్దంచు చీరలు ఈ శ్రావ ణానికి ప్రత్యేకం. 1- సంప్రదాయపు వేడుక... ఆకుపచ్చని చందేరీ చీరకు జరీ వర్క్ గులాబీల అంచు. 2- ఆధునిక కళ ..శాటిన్ షేడెడ్ చీరకు ముత్యాల అంచు. 3- ముచ్చటగొలిపే... పెద్ద బార్డర్ పైన మరో డిజైనర్ అంచు.కట్టడి చేసే ఆకర్షణకు... హాఫ్‌వైట్ పట్టు చీరకు జర్దోసీ అంచు. 4- అబ్బురపరిచే వైవిధ్యం..సాదా కంచి పట్టుచీరకు పెద్ద అంచు, దానిపైన వర్క్ చేసిన మరో చిన్న అంచు. లక్ష్మీదేవిలా అలంకరించుకునేందుకు మగువలు ఈ మాసాన ముచ్చటపడుతుంటారు. కళను పెంచే కలర్ చీరలు ఉంటే సరి, లేదంటే కొత్త డిజైన్ల కోసం మార్కెట్‌ను జల్లెడపడుతుంటారు. కానీ, ఉన్న చీరలనే కొత్తగా మార్చేస్తే.. మీ ఆలోచనకు సరికొత్త రూపం ఇవ్వడానికే ఈ డిజైనర్ చీరలు కొలువుదీరాయి. ఆకుపచ్చ చందేరీ చీరకు జరీ పువ్వుల గులాబీ అంచును, చివరన సన్నని లేస్‌ను జతచేయాలి. అదే రంగు బ్లౌజ్ ధరిస్తే పండగ శోభ రెట్టింపు కాకుండా ఉండదు. ప్లెయిన్ మస్టర్డ్ కలర్ కంచిపట్టు చీరకు జర్దోసీ వర్క్ చేసిన నీలాకాశం రంగు అంచును, పల్లూను జత చేరిస్తే వినూత్న కళతో వెలిగిపోతుంది. హాఫ్‌వైట్ బెనారస్ పట్టు చీరను పసుపు, గులాబీ, వంగపండు రంగు శాటిన్ అంచులతో తీర్చిదిద్దడంతో చూపులను కట్టిపడేస్తుంది. గులాబీరంగు పట్టు క్లాత్‌పై చేసినస్వరోస్కి వర్క్ అబ్బురపరుస్తుంది. సిల్వర్ బార్డర్ గల ఎరుపు రంగు బ్రొకేడ్ చీరకు అంచుపైన కుందన్ వర్క్ చేసిన మరో చిన్న అంచును జత చేయడంతో పండగకు దీపకళను తీసుకువచ్చింది. ఎరుపు, వెండి రంగుల కలయికతో ఉన్న శాటిన్ చీరకు ముత్యాలు పొదిగిన అంచు ప్రధాన ఆకర్షణగా మారింది. పెద్ద అంచులు ఇప్పుడు ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉన్నాయి. ఉన్న వాటికే ఇలా ఆకర్షణీయమైన సొబగులు అద్ది, కొత్తగా అందమైన చీరలను మీరూ రూపొందించుకోవచ్చు. ఇవి ఏ వేడుకలోనైనా ప్రత్యేకతను చాటుతాయి. భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
చూసొద్దాం... రాక్ గార్డెన్స్!
దేనికీ స్పందించని మనిషిని రాతితో పోలుస్తుంటారు. కానీ ఈ రాతి ఉద్యానాలను సందర్శించిన వారు ఆ పోలిక తప్పని చెబుతారు. జీవం ఉట్టిపడే ఈ ఉద్యానాల ప్రత్యేకత అలాంటిది. రాతి కట్టడాల గురించి తెలుసు, పచ్చని మొక్కలతో అలరారే ఉద్యానాలూ తెలుసు... మరి పూర్తిగా రాళ్లతోనే నిర్మితమైన ఉద్యానాల గురించి తెలుసా!! లేదంటే ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనిషి చేతుల్లో పురుడు పోసుకున్న ఈ ప్రకృతి వనాలను సందర్శిస్తే ‘రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు...’ అని సంధించిన ఓ మహాకవి ప్రశ్నకు సమాధానం ఇవేనా అనిపించకమానదు. నెక్ చంద్ రాతి వనం మన దేశంలోని చండీగఢ్‌లో సుఖ్నా సరస్సుకు దగ్గరలో ఉన్న రాతి ఉద్యానం సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణకు, అద్భుత చాతుర్యానికి పెట్టింది పేరు. చండీగఢ్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్స్పెక్టర్ అయిన నెక్ చంద్ ఈ ఉద్యాన సృష్టికర్త. 1957లో 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లపాటు కృషి చేసి దేశంలోనే ప్రత్యేక ఉద్యానంగా దీన్ని తీర్చిదిద్దాడు. వాస్తవానికి ఈ గార్డెన్ ఏర్పాటుపై నిషేధం విధించింది అప్పటి ప్రభుత్వం. అందుకని 18 ఏళ్లపాటు చీకటి రాత్రుల్లోనే ఎవరికీ తెలియకుండా ఈ రాతి తోటను సృష్టించాడు. రాత్రివేళ రహస్యంగా సమీపంలోని అడవికి వెళ్లి, రాళ్లను చేతులతో మోసుకొచ్చేవాడు. కొండ ప్రాంతాలకు సైకిల్ పై వెళ్లి పెద్ద పెద్దరాళ్లను తీసుకువచ్చేవాడు. కూల్చివేసిన భవనాల నుంచి వ్యర్థాలను సేకరించి తెచ్చేవాడు. వీటన్నింటి మిశ్రమంతో నృత్యభంగిమల్లో ఉన్నవి, సంగీతకారుల శిల్పాలు, జంతువులకు సంబంధించిన శిల్పాలను ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఈ పార్క్ కోసం 50 మంది శ్రామికులు రేయింబవళ్లు ఏకాగ్రతతో పని చేశారు. 1975లో ఈ రాతి ఉద్యానం వెలుగులోకి రావడం, ప్రభుత్వం చంద్ శ్రమను గుర్తించి, పట్టణంలో పనికిరాని వస్తువులను, విరిగిన సెరామిక్ రాళ్లను ఇందుకోసం ఉపయోగించమని సూచించింది. 1976లో ఈ పార్క్‌ను పబ్లిక్ ప్లేస్‌గా గుర్తించి ప్రజల సందర్శనకు అనుమతి ఇచ్చింది. 1983లో ఈ ఉద్యానం పేరిట ప్రత్యేక తపాలా బిళ్ళను వెలువరించారు. ఈ రాక్‌గార్డెన్ సందర్శనకు ప్రతిరోజూ 5 వేల మందికి పైగా సందర్శకులొస్తున్నారు. సన్ యట్-సెన్ చైనీస్ గార్డెన్ కెనడాలోని వాంకోవర్‌లో కొలువుదీరిన ఈ సంప్రదాయ గార్డెన్‌ను రాయి, నీరు, గ్రహాలు, నిర్మాణం.. ఈ నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని రూపొందించారు ఉద్యాన సృష్టికర్తలు జో వాయ్, డొనాల్ వ్యుఘన్లు. 1985-1986లో నిర్మించిన ఈ గార్డెన్‌కి చైనాలోని తాయ్ సరస్సు దగ్గర ఉన్న రాళ్లను తెప్పించి నిర్మించారు. తాయ్ సరస్సులోని రాళ్లకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, అదృష్టాన్ని కలిగిస్తాయని చైనీయుల నమ్మకం. ఆధునిక చైనా జాతీయ నాయకుడైన డాక్టర్ సన్ యట్-సెన్ పేరును దీనికి పెట్టారు. ప్రకృతికి దీటుగా ఏర్పాటు చేసిన ఈ ఉద్యానం విజ్ఞాన, విహార, ధ్యానానుభూతులను ఏకకాలంలో కలిగిస్తోంది. డంబర్టన్ ఓక్స్ గార్డెన్ అమెరికాలోని వాషింగ్టన్ డి.సిలో డంబర్టన్ ఓక్స్పేరుతో ఉంది ఈ రాతి వనం. బీట్రిక్స్ ఫెర్రాండ్ అనే వ్యక్తి రంగురంగు రాళ్లతో అత్యద్భుతంగా 1920ల కాలంలో ఈ రాతి ఉద్యానాన్ని రూపొందించారు. అలంకరణ కోసం రకరకాల రాతి ముక్కలను ఈ స్టైల్ గార్డెన్ నిర్మాణానికి ఉపయోగించారు. వాకర్ రాక్ గార్డెన్ వాషింగ్టన్లో వాకర్ రాక్ గార్డెన్‌ను ఆంటోనీ గౌడి 1950లో అభివృద్ధి చేశాడు. దీని రూపకర్త మిల్టన్ వాకర్. ఇతను బోయింగ్ విమానాల మెకానిక్‌గా పనిచేసేవాడు. తన భార్య మిల్టన్‌తో కలిసి 20 ఏళ్లపాటు అత్యంత ప్రేమగా ఈ ఉద్యానాన్ని సృష్టించాడు. ఈ రాతి ఉద్యానంలోని కట్టడాలకు రాళ్లు, చెక్కలు, రంగురంగుల గాజు ముక్కలను ఉపయోగించాడు. 18 అడుగుల పొడవైన టవర్, అలంకృత ఫౌంటెయిన్లు, ఆల్ఫ్స్ పర్వతాలను పోలిన సుందర రూపాలు, సీతాకోకచిలుకలను పోలిన రాళ్ల నిర్మాణాలు ఇక్కడ కనువిందుచేస్తాయి. -
దేవతలారా... మన్నించండి!
నమో నాస్తికా! సృజనాత్మకత అదుపు తప్పితే ఘోర ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో కళాకారుడి ప్రతిష్ట కాళ్లూ చేతులు పోగొట్టుకుంటుంది. నష్టం లేదు. కానీ చుట్టుపక్కల దెబ్బతినే మనోభావాల మాటేమిటి? వాటికి ఏ కళాకారుడొచ్చి మందు రాస్తాడు? రాసినా అది ఓదార్పో, ఉపశమనమో అవుతుంది కానీ పరిహారమో, ప్రాయశ్చిత్తమో కాలేదు. ఇలాంటి ఘోర ప్రమాదమే ఒకటి ఇటీవల ముంబైలోని ‘తప్రూట్’ అనే యాడ్ ఏజెన్సీ వల్ల జరిగింది. గృహహింసకు వ్యతిరేకంగా ఈ సంస్థ రూపొందించిన చిత్రాలలోని మితిమీరిన సృజనాత్మకత వివాదానికి కారణమయింది. లక్ష్మీదేవి, సరస్వతీ దేవి, దుర్గామాత... వీరు ముగ్గురూ గృహ హింసకు గురైనట్లుగా, వారి ముఖాలపై గాయాలను, కమిలిన గుర్తులను చేర్చి ఈ ఏజెన్సీ పోస్టర్లు విడుదల చేసింది. వాటి కింద ఇలా రాసి ఉంటుంది. ‘‘ఇలాంటి రోజు ఒకటి రాకూడదని ప్రార్థించండి. నేడు భారతదేశంలో 68 శాతం మంది గృహహింసకు గురవుతున్నారు. రేపు ఎవరూ ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఆఖరికి మనం పూజించే దేవతలు కూడా’’. ‘సేవ్ అవర్ సిస్టర్స్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ కోసం తయారైన పోస్టర్లు ఇవి. అయితే ప్రమాదాన్ని ముందుగా ఊహించిన ఆ సంస్థ వీటిని ఇంటర్నెట్ ప్రచార ఉద్యమానికి మాత్రమే పరిమితం చేసింది. ఉద్దేశాలు మంచివే కావచ్చు. కానీ వాటిని వ్యక్తం చేసే విధానం సక్రమంగా లేకపోతే వాటిని ఎవరూ సమర్థించరు. మత విశ్వాసాల విషయంలో అస్సలు క్షమించరు. ఎంతటి సృజనశీలురైనా ఈ వాస్తవాన్ని గుర్తించక తప్పదు. -
ఏజెన్సీకి వన్నె తెస్తున్న భద్రాద్రి బాలోత్సవ్
కొండల్లో కోయిల పాటై...భావిపౌరులకు బంగారు బాటై..భద్రాద్రిలో కళారూపమై..విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడంలో ఏటేటా ప్రవర్దమానమై...భరతనాట్యమై..కూచిపూడియై... రేల నృత్యమై...క్విజ్‌లో ప్రతిభను చాటుతూ...అడవి బిడ్డలకు అందమైన ఫ్యాన్సీ డ్రెస్ చూయిస్తూ...ముగ్గులతో రంగవల్లులు అద్దుకునే భద్రాద్రి ‘భళా’ఉత్సవ్...రానే వస్తోంది. మూడేళ్లుగా జిల్లాస్థాయిలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న బాలోత్సవ్ పోటీలను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు నిర్వాహకులు సమాయత్తం అవుతున్నారు. భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు భద్రాద్రి బాలోత్సవ్ దోహదపడుతోంది. విద్యార్థుల అంతర్గత శక్తిని వెలికితీసేందుకు ఇది ఉపయోగపడుతోంది. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా బాలోత్సవ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వారిలో సృజనాత్మకతకు వెలుగులోకి వస్తుందని...ఇది వారి భావిజీవితానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలుపుతున్నారు. రెండురోజుల పాటు స్వేచ్ఛావాతావరణం, స్వీయ అనుభవాలతో ఇక్కడ నేర్చుకునే పాఠాలు కొన్ని నెలలపాటు తరగతి గదుల్లో తెలుసుకున్నా బోధపడవని అంటున్నారు. ఒకరి ఆలోచనకు మరొకరి ఆచరణ పునాదిగా ‘భద్రాద్రి బాలోత్సవ్’ ఆవిర్భవించింది. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తేనే వారు భవిష్యత్‌లో సమగ్ర వికాసం చెందుతారనే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు దీనికి ఆలోచన చేశారు. డబ్బు ద్వారా వచ్చే కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కాదని, నలుగురికి నాలుగు విధాలుగా సహాయపడినప్పుడు వచ్చే కీర్తి మాత్రమే శాశ్వతం అని తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తాళ్లూరి పంచాక్షరయ్య నమ్మేవారు. ఆ విశ్వాసం కొద్దీ ఆయన బాలోత్సవ్‌కు శ్రీకారం చుట్టారు. 2010లో తొలిసారి ఈ భద్రాద్రి బాలోత్సవ్‌ను నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలో చదువుతున్న 6-14 సంవత్సరాలలోపు పిల్లలను నిర్వాహకులు ఆహ్వానించారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి అపూర్వస్పందన రావడంతో అదే ఉత్సాహంతో 2011లోనూ నిర్వహించారు. అనుకోని అవాంతరాల వల్ల 2012లో భద్రాద్రి బాలోత్సవ్‌ను నిర్వహించలేదు. 2013లో వీరికి ఐటీసీ పీఎస్పీడీ, ఖమ్మం జిల్లా గాంధీపథంలు కూడా తోడవడంతో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో బాలోత్సవ్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సమస్త కళలకు వేదికగా భద్రాద్రి : ఈ బాలోత్సవ్ విద్యార్థుల ఉత్సాహానికి, ఉల్లాసానికి, ఆనందానికి వేదికగా నిలుస్తోంది. ఈ ఉత్సవాల్లో సంప్రదాయ ఆదివాసీ నృత్యాలు, విచిత్ర వేషధారణలు, కథా రచనలు, వ్యాసరచనలు, వక్తృత్వ పోటీలు, క్విజ్, ఫ్యాన్సీ డ్రెస్ షో,గిరిజన సంప్రదాయ నృ త్యాలు, భరతనాట్యం, కూచి పూడి, స్పాట్ డ్రాయింగ్, ముగ్గుల పోటీలు, ఆటలు, పాటల పోటీలు ఇలా... సమస్త కళలలో విద్యార్థులు పాల్గొనేలా పోటీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులనూ ఈ ఉత్సవాలు ఆకర్షిస్తున్నాయి. తమ పిల్లలు బహుమతులు సాధించేలా ప్రోత్సహిస్తుండటం విశేషం. ఇప్పటికే 2013 బాలోత్సవ్ సందడి ప్రారంభమైంది. ఈ భద్రాద్రి బాలోత్సవ్ ఏటేటా ప్రవర్ధమానమై...జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎదగాలని ఆశిద్దాం. రేపటిపౌరులు సమాజస్థాపనకు పునాదిరాళ్లవ్వాలని.. విద్యతోపాటు వివిధ రంగాల్లో రేపటి పౌరులు రాణించాలని...మంచి సమాజ స్థాపనకు పునాదిరాళ్లుగా మారాలనే ఉద్దేశంతో భద్రాద్రి బాలోత్సవ్‌ను ప్రారంభించాం. ఈ ఉత్సవ్ ద్వారా విద్యార్థులు తమశక్తిని తాము తెలుసుకొని సమాజానికి ఉపయోగపడేలా తయారవ్వాలనే నా అభిమతం. - తాళ్లూరి పంచాక్షరయ్య, తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శిగా.. బాలోత్సవ్‌లో ఆటపాటలతో పాటు పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మార్గదర్శకాలపై తొలిసారి ఈ ఏడాది పోటీల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాం. అలాగే పర్యావరణం- ప్లాస్లిక్భూతంపై చర్చాగోష్ట్ఠి కార్యక్రమాలు రూపొందించాం. ఈ బాలోత్సవ్ విజయవంతం అవడానికి పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు...సహాయసహకారాలు అందిస్తున్నందుకు వారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు. - బెక్కంటి శ్రీనివాసరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, బాలోత్సవ్ కన్వీనర్