Anand Mahindra Impressed With This Woman and Wants to Recruit Her - Sakshi
Sakshi News home page

Anand Mahindra: ఏం క్రియేటివిటీ! మహిళ ప్రతిభకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా..

Published Sat, Jul 8 2023 8:36 PM | Last Updated on Sat, Jul 8 2023 8:43 PM

Anand Mahindra impressed with this woman and wants to recruit her - Sakshi

మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ట్విటర్‌లో ఆయన ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన కంటెంట్‌ను, వైరల్‌ వీడియోలను షేర్‌ చేస్తుంటారు. వాటిపై తన అభిప్రాయాలను ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా ఓ మహిళ స్టాపిల్‌ పిన్‌లతో బొమ్మ కారు తయారీ చేసిన వీడియోను షేర్‌ చేశారు. 

ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన వీడియోలో ఓ మహిళ స్టాపిల్‌ పిన్‌లతో చిన్న బొమ్మ కారును చిటికెలో తయారు చేశారు. కారు చక్రాలు, బానెట్‌, రూఫ్‌ ఇలా ప్రతీతి స్టాపిల్‌ పిన్‌లతోనే ఎంతో నేర్పుగా చేశారు. ఆమె నైపుణ్యానికి ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్ర.. ఆమెకు తమ సంస్థలో జాబ్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన వీడియో పలువురు యూజర్లు స్పందించారు. ఆమె ప్రతిభను అభినందిస్తూ కామెంట్లు పెట్టారు.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌ మూర్తిపై మహాభారత పాత్ర ప్రభావం.. అప్పట్లో కరుడుకట్టిన వామపక్షవాది! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement