ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వీడియోలో 'సుధీర్ భావే' రకరకాల సైకిల్స్ రూపొందించారు. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈయన సృజాత్మకత చూపరులను ఎంతగానో మంత్రం ముగ్దుల్ని చేస్తోంది. దీనికి ఆనంద్ మహీంద్రా సైత ఫిదా అయ్యారు. క్రియేటివిటీ అనేది కేవలం యువకుల సొంతం మాత్రమే కాదని.. సుధీర్ భావేను ప్రశంసించారు.
ప్రయోగశాల అవసరమైతే.. గుజరాత్‌లోని వడోదరలోని మహీంద్రా వర్క్‌షాప్‌ను ఉపయోగించుకోవచ్చని భావేకు.. ఆనంద్ మహీంద్రా అవకాశం కల్పించారు. సుధీర్ మీరు రిటైర్డ్ కాదు.. జీవితంలో చురుకైన & వినూత్నమైన కాలంలో ఉన్నారని కొనియాడారు.
సుధీర్ భావే రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్. కాబట్టి అనేక సైకిల్స్ వ్యాయామాలకు ఉపయోగపడే విధంగా కస్టమైజ్ చేశారు. ఇందులో ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కూడా ఉంది. భావే సుమారు 40 ఏళ్లపాటు స్టీల్ పరిశ్రమలో పనిచేశారు. తాను ప్రతిరోజూ సైకిళ్లను ఎక్కువగా ఉపయోగిస్తానని పేర్కొన్నారు.
This wonderful story showed up in my inbox today.
I bow low to Sudhir Bhave’s irrepressible creativity and energy.
Sudhir has demonstrated that inventiveness & a startup DNA in India is not only the prerogative of the young!
And if you want to use the workshop of our… pic.twitter.com/0Cp821pIyA— anand mahindra (@anandmahindra) July 18, 2024
Comments
Please login to add a commentAdd a comment