Vadodara
-
దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి
వడోదర: గుజారాత్‌లో అమానుష ఉదంతం చోటుచేసుకుంది. వడోదర(Vadodara) జిల్లాలోని ఒక దర్గాలోకి బూట్లు ధరించి ప్రవేశించిన నలుగురు విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. ఆ విద్యార్థులకు గుజరాతీ భాష అర్థం కాకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు.ఈ దాడిలో ఒక విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి వాఘోడియా పోలీస్ స్టేషన్(Police station)లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం థాయిలాండ్, సూడాన్, మొజాంబిక్, బ్రిటన్‌కు చెందిన నలుగురు విద్యార్థులు పరుల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. మార్చి 14న సాయంత్రం ఈ విద్యార్థులను దాదాపు 10 మంది వ్యక్తులు వెంబడించి దాడి చేశారు. ఆ విద్యార్థులు గుజరాతీ భాష అర్థం చేసుకోలేకపోవడంతో వారిపై దాడి చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వారు ఒక దర్గాకు వెళ్లగా, వారిని బూట్లు ధరించి రాకూడదని ఒక వ్యక్తి సూచించారు. ఇది వారికి అర్థం కాలేదు.దాడి సమయంలో ముగ్గురు విద్యార్థులు తప్పించుకోగలిగారని, థాయ్ విద్యార్థి సుపచ్ కంగ్వాన్రత్న (20)తలకు తీవ్ర గాయాలు అయ్యాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బాధితుడిని పరుల్ సేవాశ్రమ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వాఘోడియా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: 43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. మండిపోతున్న ఎండలు -
Vadodara: ‘తాగలేదు.. గుంతల వల్లే కారు అదుపు తప్పింది’
వడోదర: గుజరాత్‌లోని వడోదర(Vadodara)లో కారును వేగంగా నడిపి, ఒక మహిళ మృతికి కారణమైన రక్షిత్ రవీష్ చౌరాసియా పోలీసుల ముందు తన వాదన వినిపించాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో లేనని పేర్కొన్నాడు. గురువారం రాత్రి వడోదరలో రక్షిత్ నడుపుతున్న కారు ఒక స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలో పోలీసులు రక్షిత్‌ను అరెస్టు చేశారు.నిందితుడు రక్షిత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ గురువారం రాత్రి తాను నడుపుతున్న కారు ఆ స్కూటీ కంటే ముందుగా వెళుతున్నదని, ఇంతలో తాను రైట్ సైడ్ తీసుకున్నానని తెలిపారు. అక్కడ రోడ్డుపై పెద్ద గుంత ఉన్నదని, దీంతో కారు అదుపుతప్పి, పక్కనే ఉన్న స్కూటీని ఢీకొన్నదన్నారు. ఇంతలో ఎయిర్ బ్యాగ్ తెరుచుకున్నదని, ఆ తరువాత ఏం జరిగిందో తమకు తెలియలేదన్నారు. తమ కారు ప్రమాదం జరిగిన సమయంలో50 కి.మీ. స్పీడులోనే వెళుతున్నదని, తాను మద్యం తీసుకోలేదని, హోలికా దహనం కార్యక్రమానికి వెళ్లి వస్తున్నామని రక్షిత్ తెలిపారు. #WATCH | Vadodara, Gujarat: One woman has died, and four others are injured after an overspeeding four-wheeler rammed into a two-wheeler (14/03). Accused Rakshit Ravish Chaurasia claims, " We were going ahead of the scooty, we were turning right and there was a pothole on the… pic.twitter.com/7UMundtDXH— ANI (@ANI) March 15, 2025వడోదర పోలీస్ కమిషనర్(Police Commissioner) నరసింహ మీడియాతో మాట్లాడుతూ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారన్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడున్నవారి నుంచి సమాచారం సేకర్తిస్తున్నామని, రక్షిత్ మద్యం తాగి వాహనం నడిపినట్లు కేసు నమోదయ్యిదన్నారు. అయితే రక్షిత్ ప్రమాదం జరిగిన సమయంలో మద్యం మత్తులో లేనని చెబుతున్నాడని, ఈ కేసులో నిజానిజాలు నిర్థారించాల్సి ఉందన్నారు. ఇది కూడా చదవండి: దేశ విభజనలో రైల్వే పంపకాలు.. నాడు భారత్-పాక్‌లకు ఏమి దక్కాయి? -
Vadodara: కారుతో నలుగురిని ఢీకొని.. ‘అనెదర్ రౌండ్’ అంటూ..
వడోదర: గుజరాత్‌లోని వడోదర(Vadodara)లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఒక యువకుడు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడిపి, పలువురిని ఢీకొన్నాడు. ఈ ఘటన కరోలీబాగ్లోని ఆమ్రపాలీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ రోడ్డు ప్రమాదం జరిగిన దరిమిలా జనం సంఘటనా స్థలంలో గుమిగూడారు. దీంతో ట్రాఫిక్ జామ్(Traffic jam) అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్ కూడా తెరుచుకుంది. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటాన్ని స్ణానికులు గుమనించారు. అతను గట్టిగా అరుస్తూ కారు నడిపాడని వారు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం కారు దిగిన ఆ యువకుడు ‘అనెదర్ రౌండ్’ అంటూ అరవసాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డీసీపీ పన్నా మోయాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందిందని, నలుగురు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, అతనిని వారణాసికి చెందిన రవీష్ చౌరాసియాగా గుర్తించామన్నారు. రవీష్ లా చదువుకుంటున్నాడని, ప్రమాదం జరిగిన సమయంలో అతని స్నేహితులకు కూడా అతనితో పాటు ఉన్నారని, ఆ తరువాత పరారయ్యారన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు(Police teams) గాలిస్తున్నాయన్నారు. కారు ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: కార్గిల్‌లో భూకంపం -
రక్షణ రంగంలో కొత్త అధ్యాయం
వడోడర: భారత ప్రైవేట్ రక్షణ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ఆరంభమైంది. భారత్‌లోనే తొలి ప్రైవేట్ సైనిక, సరకు రవాణా విమానం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు గుజరాత్‌లోని వడోదర పట్టణంలోని టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వేదికైంది. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో కలిసి భారత ప్రధాని మోదీ సోమవారం ఈ ప్లాంట్‌లో సీ295 రకం సైనిక రవాణా విమాన తయారీని ప్రారంభించారు. అక్కడి విడిభాగాల ఎగ్జిబిషన్‌ను ఇరునేతలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, స్పెయిన్ భాగస్వామ్యం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంచేయడమే కాకుండా మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. కొత్త ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచి్చన ఎయిర్‌బస్, టాటా బృందాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్‌లో విదేశీ సరకు రవాణా విమానం తయారీ కలను సాకారం చేసిన వ్యాపార జగజ్జేత రతన్ టాటాకు ఘన నివాళులు’’ అని అన్నారు. కొత్త పని సంస్కృతికి నిదర్శనం ‘‘ నూతన భారత దేశ కొత్తతరహా పని సంస్కృతికి సీ295 ఫ్యాక్టరీ ప్రతిబింబింగా నిలవనుంది. 2022 అక్టోబర్‌లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటినుంచి ఉత్పత్తిదాకా భారత వేగవంతమైన ఉత్పాదకతకు నిదర్శనం ఈ కర్మాగారం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత స్పానిష్ రచయిత ఆంటోనియో మకాడో కవితలోని ‘మనం లక్ష్యం సాధించేందుకు ముందుకెళ్తుంటే మార్గం దానంతట అదే ఏర్పడుతుంది’ అనే వాక్యాన్ని మోదీ గుర్తుచేశారు. ‘‘కొత్తగా మొదలైన టాటా–ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశీయంగా 18,000 విమాన విడిభాగాల తయారీని ఈ ఫ్యాక్టరీ సుసాధ్యం చేయనుంది. భవిష్యత్తులో భారత పౌరవిమానయాన రంగానికి అవసరమైన విమానాల తయారీకి ఈ ఫ్యాక్టరీ బాటలువేస్తోంది’’ అని మోదీ అన్నారు.స్పెయిన్‌లో యోగా, ఇండియాలో ఫుట్‌బాల్ ‘‘ఇరుదేశాల ప్రజల మధ్య బంధమే దేశాల మధ్య బంధాన్ని బలీయం చేస్తోంది. యోగా స్పెయిన్‌లో తెగ పాపులర్. ఇక స్పానిష్ ఫుట్‌బాల్‌ను భారతీయులూ బాగా ఇష్టపడతారు. ఆదివారం రియల్ మాడ్రిడ్‌తో మ్యాచ్ లో బార్సిలోనా బృందం సాధించిన ఘనవిజయం గురించి భారత్‌లోనూ తెగ చర్చ జరుగుతోంది. ఆహారం, సినిమా లు, ఫుట్‌బాల్.. ఇలా ప్రజల మధ్య బంధం దేశాల మధ్య పటిష్ట బంధానికి కారణం. 2026 ఏడాదిని ‘ఇండియా–స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం, ఏఐ’గా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం సంతోషకరం’’ అని మోదీ అన్నారు.బంధం బలీయం: స్పెయిన్ అధ్యక్షుడు ‘‘1960లలోనే ప్రఖ్యాత స్పెయిన్ క్లాసిక్, జాజ్ సంగీత కళాకారుడు పాకో డిలూసియా, భారతీయ సంగీత దిగ్గజం పండిత్ రవిశంకర్ రెండు దేశాల సంగీత ప్రియులను ఒక్కటి చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, స్నేహబంధాలకు ఈ ఫ్యాక్టరీ గుర్తుగా నిలుస్తుంది’ అని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ అన్నారు.40 విమానాల తయారీ ఇక్కడే ఎయిర్‌బస్ సీ295 రకం మధ్యశ్రేణి రవాణా విమానాన్ని తొలుత స్పెయిన్‌కు చెందిన సీఏఎస్ఏ ఏరోస్పేస్ సంస్థ డిజైన్చేసి తయారుచేసేది. ప్రస్తుతం ఇది యూరప్ బహుళజాతి ఎయిర్‌బస్ సంస్థలో భాగంగా ఉంది. యుద్ధంలో బాంబులతోపాటు అవసరమైన సందర్భాల్లో వైద్య పరికరాలు, విపత్తుల వేళ బాధితుల తరలింపునకు, తీరప్రాంతాల్లో గస్తీ, నిఘా కోసం సైతం పలురకాలుగా వినియోగించుకోవచ్చు. ఎయిర్‌బస్ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తంగా సీ295 రకం 56 విమానాలను సైన్యానికి అప్పగించనున్నారు. వీటిలో 16 విమానాలను స్పెయిన్‌లోని సవీలేలో తయారుచేసి ఎయిర్‌బస్ నేరుగా నాలుగేళ్లలోపు భారత్‌కు పంపనుంది. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వారి ఆధ్వర్యంలో వడోదరలోని తయారీయూనిట్లో తయారుచేస్తారు. -
రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని వడోదరలో స్పానిష్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌తో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) క్యాంపస్‌లో టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాను గుర్తుచేసుకుంటూ రతన్ టాటా ఈ రోజు మన మధ్య ఉండివుంటే, మరింత సంతోషించేవారన్నారు. సీ 295 ఫ్యాక్టరీ కొత్త భారతదేశానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు.టీఏఎస్ఎల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తన స్నేహితుడు పెడ్రో శాంచెజ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. నేటి నుంచి భారత్, స్పెయిన్ మధ్య భాగస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం ఏర్పడనుంది. సీ 295 రవాణా విమానాల తయారీ కోసం ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ భారతదేశం- స్పెయిన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్‌ను బలోపేతం చేయనుందన్నారు.ఈ సందర్భంగా స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్ మాట్లాడుతూ నేడు మనం ఆధునిక పరిశ్రమను మాత్రమే ప్రారంభించడం లేదని, రెండు ప్రముఖ కంపెనీల మధ్య ఒక అసాధారణ ప్రాజెక్ట్ ప్రారంభమవడాన్ని చూస్తున్నామన్నారు. భారతదేశానికి, ప్రధాని మోదీ విజన్‌కు ఇది మరో విజయం అని అన్నారు. భారతదేశాన్ని పారిశ్రామిక శక్తిగా మార్చడం, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచడంపై మోదీ దృష్టి సారించారన్నారు. ఇది కూడా చదవండి: స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో -
వడోదరలో టాటా- ఎయిర్ బస్ ఎయిర్ క్రాఫ్ట్ అసెంబ్లింగ్ ప్లాంట్
-
సీపీఆర్ చేసి పాము ప్రాణాలు కాపాడిన యువకుడు.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసిప్రాణాలను నిలుపుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా, గుజరాత్ వడోదరలో ఓ వ్యక్తి ఇలానే ప్రాణాపాయంలో ఉన్న పాముకు సీపీఆర్ చేసి దాని ప్రాణాలు నిలపాడు. నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న నిజంగానే జరిగింది. వివరాలు.. బృందావన్ చౌరస్తాలో రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో ఉన్న పామును గుర్తించిన కొందరు జంతు సంరక్షణ కార్యకర్తలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బృందం దానికి సీపీఆర్ చేయాలని నిర్ణయించింది. వెంటనే యశ్ తాడ్వి అనే యువకుడు నిర్జీవంగా పడివున్న పాముపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. దాని ప్రాణాలు పోలేదని నిర్ధారించుకున్న అతడు వెంటనే దానికి నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు. పాము నోరు తెరిచి నోటిలోకి మూడు నిమిషాలు ఊది స్పృహలోకి తీసుకురావడానికి యత్నిచాడు.మొదటి రెండు ప్రయత్నాలలో సీపీఆర్ ఇచ్చినా, దాని పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. మూడోసారి పాములో చలనం వచ్చింది. CPR to the snake with his mouth and unconscious snake back to life.This video going viral on social media from Vadodara, Gujarat, India#CPR #Life #Viral #India pic.twitter.com/VZXEOuTXKz— Chaudhary Parvez (@ChaudharyParvez) October 17, 2024 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. -
గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. 20 మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. పలు నగరాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 300 మందిని సహాయక బృందాలు కాపాడాయి. మోర్బీలో ఒకరు, గాంధీనగర్‌లో ఇద్దరు, ఆనంద్‌లో ఆరుగురు, వడోదరలో ఒకరు, ఖేదాలో ఒకరు, మహిసాగర్‌లో ఇద్దరు, ఒకరు మరణించారు. భరూచ్‌లో మరణించగా, అహ్మదాబాద్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 23,870 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 1,696 మందిని రక్షించారు. అయితే మంగళవారం వర్షం తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణవాఖ గుజరాత్‌కు హచ్చరికలు జారీ చేసింది.#HeavyRainfallअगर बहुत जरूरी ना हो तो इस समय गुजरात घूमने से बचे,बारिश ने कहर मचाया हुआ है। खासकर अहमदाबाद,वडोदरा में भयंकर बारिश है।प्रभु धीर धरो..बाढ़ के हालात हैं #GujaratFlood #HeavyRain #GujaratRains #vadodararain #HeavyRainAlert #Gujarat #Ahmedabad #AhmedabadRains pic.twitter.com/5ddCzz6SdU— Monu kumar (@ganga_wasi) August 28, 2024 రెస్క్యూ. రిలీఫ్ ఆపరేషన్లను వేగవంతం చేయడానికి , గుజరాత్ ప్రభుత్వం ఆరు ఇండియన్ ఆర్మీ బృందాల సాయం కోరింది దేవభూమి ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్ జిల్లాల్లో సైన్యం, 14 ఎన్డీఆర్ఎఫ్, 22 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. వర్షాల ధాటికి సురేందర్‌నగర్ జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయింది. వర్షాల పరిస్థితి, సహాయక చర్యలను సమీక్షించేందకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న నదులు, డ్రెయిన్లు, సరస్సుల్లోకి ఎవరూ వెళ్లకుండా పోలీసుల సహకారం తీసుకుని పూర్తి అప్రమత్తతతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అంతే కాకుండా వాతావరణ శాఖ ప్రత్యేకంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదనే హెచ్చరికను కచ్చితంగా పాటించాలని తీర ప్రాంతాల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.गुजरात में भारी बारिश से जनजीवन अस्त व्यस्त.. कृपया इस मौसम में सावधानी बरतेंसावधान रहें.! सुरक्षित रहे.!!#HeavyRainfall #GujaratRains #HeavyRainAlert pic.twitter.com/n9Qlh9pmPy— Mukesh Jeetrawal (@MukeshJeetrawal) August 28, 2024 ఇక గుజరాత్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నదుల్లో నీటి మట్టం పెరిగి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరత్, వడోదర నగరాల్లో వరద ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తోంది. రాజధాని గాంధీనగర్లోనూ రోడ్లపైకి నీరు చేరింది. వడోదరలో విశ్వమిత్రి నదిలో నీట మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలో ఏడు వంతెనలను మూసివేశారు. నది పక్కనే ఉన్న అనేక ఇళ్లు నీట మునిగాయి. డైమండ్ సిటీ సూరత్‌లోనూ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. -
క్రియేటివిటీకి ఆనంద్ మహీంద్రా ఫిదా!.. బంపరాఫర్
ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.వీడియోలో 'సుధీర్ భావే' రకరకాల సైకిల్స్ రూపొందించారు. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈయన సృజాత్మకత చూపరులను ఎంతగానో మంత్రం ముగ్దుల్ని చేస్తోంది. దీనికి ఆనంద్ మహీంద్రా సైత ఫిదా అయ్యారు. క్రియేటివిటీ అనేది కేవలం యువకుల సొంతం మాత్రమే కాదని.. సుధీర్ భావేను ప్రశంసించారు.ప్రయోగశాల అవసరమైతే.. గుజరాత్‌లోని వడోదరలోని మహీంద్రా వర్క్‌షాప్‌ను ఉపయోగించుకోవచ్చని భావేకు.. ఆనంద్ మహీంద్రా అవకాశం కల్పించారు. సుధీర్ మీరు రిటైర్డ్ కాదు.. జీవితంలో చురుకైన & వినూత్నమైన కాలంలో ఉన్నారని కొనియాడారు.సుధీర్ భావే రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్. కాబట్టి అనేక సైకిల్స్ వ్యాయామాలకు ఉపయోగపడే విధంగా కస్టమైజ్ చేశారు. ఇందులో ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కూడా ఉంది. భావే సుమారు 40 ఏళ్లపాటు స్టీల్ పరిశ్రమలో పనిచేశారు. తాను ప్రతిరోజూ సైకిళ్లను ఎక్కువగా ఉపయోగిస్తానని పేర్కొన్నారు.This wonderful story showed up in my inbox today. I bow low to Sudhir Bhave’s irrepressible creativity and energy. Sudhir has demonstrated that inventiveness & a startup DNA in India is not only the prerogative of the young! And if you want to use the workshop of our… pic.twitter.com/0Cp821pIyA— anand mahindra (@anandmahindra) July 18, 2024 -
హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్కమ్
టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం తొలిసారి తన సొంత పట్టణమైన వడోదరకు వచ్చిన టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. హార్దిక్‌ను ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా తీసుకెళ్లేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. హార్దిక్ ఓపెన్ టాప్ వాహనంలో వడోదర వీధుల గుండా తన స్వగృహానికి చేరకున్నాడు. హార్దిక్ విజయోత్సవ ర్యాలీకి ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. A HERO'S WELCOME FOR HARDIK PANDYA IN VADODARA. 😍🏆 pic.twitter.com/LFY0g1ZgOX— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024హార్దిక్ నామస్మరణతో వడోదర వీధులు మార్మోగిపోయాయి. హార్దిక్ ఓపెన్ టాప్ వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. హార్దిక్ విజయోత్సవ ర్యాలీకి చెందిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ర్యాలీ అనంతరం పట్టణంలోని ఓ బహిరంగ ప్రదేశంలో హార్దిక్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హార్దిక్‌తో పాటు అతని సోదరుడు కృనాల్ పాండ్యా కూడా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో "చక్‌దే ఇండియా" పాట ప్లే చేయగా జనాలు ఉర్రూతలూగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది.Hardik Pandya and Krunal Pandya dancing on Chak De India. 🇮🇳 pic.twitter.com/Q2S8OMuCSv— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024కాగా, హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం ముంబైలో జరిగిన టీమిండియా విజయోత్సవ ర్యాలీలో పాల్గొని అక్కడే ఉండిపోయాడు. అనంతరం హార్దిక్ అనంత అంబానీ వివాహా వేడుకలో సందడి చేసి ఇవాళ (జులై 15) వడోదరకు చేరుకున్నాడు.ఇదిలా ఉంటే.. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జూన్ 29న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్.. ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. -
‘ఆమెను ఇక్కడ ఉండనిస్తే.. మేం ప్రశాంతంగా ఉండలేం’!
ఆమె పేరు ఫాతిమా(పేరుమార్చాం). గుజరాత్‌లోని ఓ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగంలో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వడోదర హార్నీ ఏరియాలో నిర్మించిన మోట్‌నాథ్ హౌజింగ్ క్లాంపెక్స్‌లో ఏడేళ్ల కిందట ఆమెకు ఫ్లాట్ కేటాయించారు. అయితే ఇన్నేళ్లు అయినా ఆమె అక్కడ అడుగుపెట్టలేకపోయింది. అధికారులు కారణం కాదు.. ఆమెతో పాటు ప్లాట్ పొంది హాయిగా అక్కడ నివసిస్తున్నవాళ్లలో కొందరు ఆమెను అడ్డుకుంటున్నారు.వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌లోని కాంప్లెక్స్‌లో 462 ఇళ్లు ఉన్నాయి. అర్హత జాబితా ప్రకారం.. 2017లో ఫాతిమాకు అందులో ఇంటిని కేటాయించారు. అయితే ఆ హౌజింగ్ కాంప్లెక్స్‌లో ఉండే 33 మంది ఓనర్లు ఆమెకు ఇంటికి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమె ముస్లిం అని, ఆమె గనుక అక్కడ ఉంటే.. గొడవలు జరిగే అవకాశం ఉందంటూ 2020లో ముఖ్యమంత్రి కార్యాలయానికి, కలెక్టర్‌కు, స్థానిక అధికారులకు లేఖలు రాశారు. అంతటితో ఆగకుండా ధర్నాకు సైతం దిగారు. దీంతో.. ఆమె అక్కడికి వెళ్లకుండా ఆగిపోయారు.భర్తను కోల్పోయిన ఆమె.. ఇంతకాలం ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది. కొడుకు అదే ఏరియాలో మరో ఇంట్లో ఉంటున్నాడు. ఇన్నేళ్లు గడిచాయి కదా.. పరిస్థితులు శాంతించి ఉంటాయని, తాను తన కొడుకుతో అక్కడికి షిఫ్ట్ అయ్యిందని అనుకుంది. అయితే ఈ విషయం తెలిసి మళ్లీ ఆ 32 మంది ఓనర్లు ధర్నాకు దిగారు. ప్రశాంతంగా ఉంటున్న తమ సమముదాయంలో ఆమె వల్ల అలజడి చెలరేగడం తమకు ఇష్టం లేదని, అందుకే ఆమెను ఇక్కడ ఉండనివ్వబోమని నిరసన చేపట్టారు. దీనిపై స్పందించేందుకు అధికారులెవరూ ఇష్టపడడం లేదు. ఇది ఆ కాంప్లెక్స్‌లో ఉంటున్న నివాసితుల సమస్య గనుక వాళ్లే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలంటూ చేతులెత్తేశారు.One flat was allotted under CM scheme to a #Muslim woman out of 461 flats in a residential building in #Vadodara, #Gujarat.The #Hindu residents started a protest demanding that no #Muslims should live there with them.Where our country is heading? 😞 pic.twitter.com/hQY7QA9Gae— Hate Detector 🔍 (@HateDetectors) June 14, 2024 -
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ వేపై నిలిపి ఉంచిన ట్రక్కుపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. ఖేడా జిల్లాలోని నదియాడ్ పట్టణం సమీపంలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. అతివేగం కారణంగా మారుతీ సుజుకి ఎర్టిగా కారు అదుపుతప్పి ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. బాధితులు వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో 93 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు చదవండి: ‘అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్‌నాథ్ ఫైర్ -
బీజేపీకి షాక్.. పోటీ నుంచి తప్పుకున్న మరో ఎంపీ అభ్యర్థి
గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్ధుల ప్రకటన, ప్రచారాలతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఓవైపు పార్లమెంట్ ఎన్నికల్లో సీటు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు.. పార్టీ మారి, లేదా స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కేంద్రంలోని అధికార బీజేపీకి చెందిన పలువురు ఎంపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు లోక్ సభ అభ్యర్ధులు పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వివరాలు.. గుజరాత్‌కు చెందిన బీజేపీకి చెందిన మహిళా ఎంపీ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు శనివారం వెల్లడించారు. బీజేపీకి చెందిన రంజన్‌బెన్ ధనంజయ్ భట్ వడోదర నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. దీంతో మూడోసారి కూడా వడోదర నుంచి ఆమెనే అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. చదవండి: కాంగ్రెస్‌కు షాక్!.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే వడోదర లోక్‌సభ స్థానం నుంచి భట్‌ను తిరిగి నామినేట్ చేయడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ బ్యానర్లు వెలిశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రంజన్‌బెన్ భట్ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రంజన్ భట్ తన అభ్యర్ధిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే మరో బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఎన్నికల రేసు నుంచి వైదొలిగారు. సబర్కాంత బీజేపీ అభ్యర్థి భిఖాజీ ఠాగూర్ కూడా వ్యక్తిగత కారణాలతో ఎంపీగా పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ప్రకటించారు. అయితే అతని ఇంటి పేరు, కులంపై వివాదం చెలరేగడంతో ఆయన ఈ నిర్ణంయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సబర్కాంత నుంచి రెండుసార్లు గెలుపొందిన దిప్సిన్ రాథోడ్‌ను కాదని భిఖాజీకి ఈసారి బీజేపీ టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ఎంపీ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. -
రెయిలింగ్‌ను ఢీకొని బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి!
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు రోడ్డుపైనున్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందనున్న ప్రదేశంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఖేడా జిల్లాలోని నడియాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎస్పీ సహా పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ రాజేష్ గధియా మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గురైన బస్సు అహ్మదాబాద్ నుంచి పూణె వెళుతోందని తెలిపారు. బస్సులో దాదాపు 23 మంది ప్రయాణికులు ఉన్నారు. హైవేపై అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి వచ్చిన సిమెంట్ ట్యాంకర్.. బస్సును ఢీకొంది. దీంతో బస్సు అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు. #WATCH | Nadiad: SP Rajesh Gadhiya says, "...The bus was going from Ahmedabad to Pune in which there were about 23 passengers. The driver of a cement tanker suddenly turned left and hit the bus...Two people have died & several people have been injured...A case will be filed… https://t.co/B9DKPMKTf5 pic.twitter.com/LrSFa3AepN — ANI (@ANI) February 23, 2024 -
Hetvi Khimsuriya: బంగారంలాంటి బిడ్డ
గుజరాత్‌లోని వడోదరకు చెందిన హెత్వి ఖిమ్సూరియా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పీఎం నేషనల్ చైల్డ్ అవార్డ్ (ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్–పీఎంఆర్బీపి) అందుకుంది. వివిధ రంగాలలో పిల్లలు సాధించిన అద్భుత విజయాలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారం ఇది. పదమూడు సంవత్సరాల హెత్వి సెరిబ్రల్ పాల్సీని అధిగమించి పెయింటింగ్, పజిల్ సాల్వింగ్‌లో అసా«ధారణ ప్రతిభ చూపుతోంది. తనకు వచ్చే పెన్షన్‌ను దివ్యాంగుల సంక్షేమ నిధికి ఇస్తోంది. తన ఆర్ట్‌పై యూట్యూబ్ చానల్ నడుపుతోంది.... వడోదరలోని 8–గ్రేడ్ స్టూడెంట్ హెత్వి ఖిమ్సూరియాకు పురస్కారాలు కొత్త కాదు. ప్రశంసలు కొత్తకాదు. గత సంవత్సరం ఫ్రీహ్యాండ్ పెయింటింగ్, క్రాఫ్ట్, పజిల్ సాల్వింగ్‌లో చూపుతున్న ప్రతిభకు ‘గుజరాత్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. ‘వరల్డ్స్ ఫస్ట్ సీపీ గర్ల్ విత్ ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్’ టైటిల్ సాధించింది. వంద ఎడ్యుకేషనల్ పజిల్స్ సాల్వ్ చేసిన ఫస్ట్ సీపీ గర్ల్‌గా ఆమెను ‘ది లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు సాధించిన హెత్వి గీసిన చిత్రాలు యాభై ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శితమయ్యాయి. చిత్రకళలపై పిల్లల్లో ఆసక్తి కలిగించడానికి ‘స్పెషల్ చైల్డ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ–హెత్వి ఖిమ్సూరియా’ అనే యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. హెత్వి విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. కూతురు ప్రస్తావన వచ్చినప్పుడు ‘అయ్యో! మీ అమ్మాయి’ అంటూ ఎంతోమంది సానుభూతి చూపే సమయాల్లో ‘బాధ పడాల్సిన అవసరం ఏముంది. మా అమ్మాయి బంగారం. భవిష్యత్‌లో ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడండి’ అనేవారు. ఆ మాట అక్షరాలా నిజమైంది. చిన్నప్పటి నుంచి బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. హెత్విని చూసుకోవడానికి ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది. రంగులు, పజిల్స్‌తో బేసిక్స్ ప్రారంభించారు. రంగులు, పజిల్స్ అంటే హెత్విలో ఇష్టం ఏర్పడేలా చేశారు. బొమ్మలు వేస్తున్నప్పుడు, పజిల్స్ పరిష్కరిస్తున్నప్పుడు ఆ అమ్మాయి కళ్లలో శక్తి కనిపిస్తుంది. ఆ శక్తితో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని తల్లిదండ్రులలో నింపింది. హెత్వి మోములో ఎప్పుడూ చెరగని చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వే ఈ చిన్నారి బలం. హెత్వి ఖిమ్సూరియా మర్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. -
Gujarat: పడవ బోల్తా.. 13 మంది విద్యార్థులు మృతి
వడోదర: గుజరాత్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వడోదర శివార్లలోని హర్ని సరస్సులో విహార యాత్రకు వెళ్లిన స్కూల్ విద్యార్థుల పడవ తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదమూడు మంది విద్యార్థులు చనిపోయారు. ప్రమాదం జరిగినపుడు పడవలో మొత్తం 27 మంది విద్యార్థులున్నారు. సరస్సులో పడిపోయిన మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతయిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ చెప్పారు. పడవ ఓవర్‌లోడ్ అవడం, పిల్లలెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని జిల్లా కలెక్టర్ ఏబీ గోర్ తెలిపారు. #WATCH | Gujarat: Vadodara MP Ranjanben Dhananjay Bhatt says, "The NDRF team is carrying out the rescue operation. The children have been taken to different hospitals...Strict action will be taken in this matter." pic.twitter.com/TsbhTrGPGK — ANI (@ANI) January 18, 2024 #WATCH | Gujarat: A boat carrying children capsized in Vadodara's Harni Motnath Lake. Rescue operations underway. pic.twitter.com/gC07EROBkh — ANI (@ANI) January 18, 2024 ఇదీచదవండి.. భారత స్పేస్ స్టేషన్.. ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన -
వేడి వేడి ఉల్లి పుష్పము
పకోడీలు, బజ్జీలు తెలుసు. కాని ఉల్లిపాయను తామరపువ్వులా ఒలిచి శనగపిండిలో కలిపి నూనెలో వేయించి ఉల్లి పుష్పంగా తయారు చేసి సర్వ్ చేస్తే 11 లక్షల వ్యూస్ లొట్టలేశాయి. వడోదర స్ట్రీట్‌ఫుడ్‌లో తాజా హల్చల్ ఇది. స్ట్రీట్‌ఫుడ్ ఎంత నోరూరించేదిగా ఉన్నా శుభ్రత పాటించరనే కంప్లయింట్‌తో కొందరు తినరు. కాని వడోదరలోని ఈ తాజా చిరుతిండి హల్చల్ చేయడమే కాక అందరి మన్ననా పొందింది. ‘చేస్తే ఇంత శుభ్రంగా చేయాలి’ అనే మెచ్చుకోలు అందుకుంది. వడోదర (గుజరాత్)లోని ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకమైన స్టాల్ పెట్టి ఈ ‘ఉల్లి పుష్పం’ (ఉల్లి బజ్జీ) అమ్ముతున్నారు. ఇందుకు పెద్దసైజు ఉల్లిగడ్డలను వాడుతున్నారు. వాటిని పువ్వులా కట్ చేసే మిషన్‌ను తయారు చేయించుకున్నారు. శుభ్రంగా వొలిచిన ఉల్లిపాయను ఈ మిషన్ కింద పెడితే పువ్వులా రెక్కలు వచ్చేలా కట్ చేస్తుంది. దానిని శనగపిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేయిస్తే ఉల్లిపువ్వు ఆకారంలో బజ్జీలు తయారవుతున్నాయి. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో జనం ఎగబడుతున్నారు. అంతే కాదు చేస్తున్న పద్ధతి శుభ్రంగా ఉండటంతో సంకోచం లేకుండా తింటున్నారు. ఒక వ్లోగర్ ఈ ఉల్లిపువ్వు బజ్జీ తయారీని వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే క్షణాల్లో 11 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘కొత్త కొత్త ఆలోచనలే వ్యాపారాన్ని నిలబెడతాయి’ అంటున్నారు. అందరి దగ్గరా ఉల్లిపాయలు ఉంటాయి. అందరూ బజ్జీలు వేస్తారు. కాని ‘ఉల్లిపువ్వు బజ్జీ’ అనే ఐడియా వీరికే వచ్చింది. ఆ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఉన్నవాళ్లనే విజయం వరిస్తుంది. కొత్తగా ఆలోచించండి... పెద్ద విజయం సాధించండి... అని ఈ ఉల్లిపువ్వు కరకరలాడుతూ సందేశం ఇస్తోంది. -
H3N2 Influenza: గుజరాత్లో తొలి హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా మరణం..
గాంధీనగర్: భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా ఉపరకం H3N2 కేసులతోపాటు మరణాల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. తాజాగా గుజరాత్లో హెచ్3ఎన్2 తొలి మరణం సంభవించింది. ఈ వైరస్‌కు గురైన 58 ఏళ్ల మహిళ వడోదరలోని ఎస్ఎస్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు గుజరాత్ అధికారులు మంగళవారం వెల్లడించారు. దీంతో హెచ్3ఎన్2 కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 7కు పెరిగింది. ఈ వైరస్‌కు గురై తొలి మరణం కర్ణాటకలో చోటుచేసుకుంది. హాసన్ జిల్లాకు 82 ఏళ్ల వ్యక్తి ఇన్ఫ్లుయెంజా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా జనవరి 2 నుంచి మార్చి 5 మధ్య భారతదేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర వైద్యాఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే దేశంలో వైరస్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అంతేగాక ఈ నెలఖరు నాటికి కేసులు తగ్గుముఖం పట్టనున్నట్లు అంచనా వేసింది. మరోవైపు హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నందున దేశంలో మాస్క్‌ల వాడకం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ప్రజలు సొంత మెడికేషన్ తీసుకోరాదని, ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడవద్దని ఐసీఎంఆర్ ఇటీవల హెచ్చరించింది. హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ నాన్ హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా అని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ ప్రకటనలో పేర్కొంది. దగ్గు, ముక్కు కారడం(జలుబు), వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పి వంటి సాధారణ లక్షణాలుగా పేర్కొంది. -
Axar Patel Wedding : టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి ఫొటోలు
-
న్యూట్రీషనిష్టుతో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ పెళ్లి.. వీడియో వైరల్
Axar Patel- Meha Patel Wedding: టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి మెహా పటేల్‌ను వివాహమాడాడు. వడోదరలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలతో మెహాతో ఏడడుగులు నడిచాడు. గురువారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లి నేపథ్యంలో సెలవు తీసుకున్న అక్షర్ పటేల్ న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక ఇటీవలి కాలంలో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. మెహాతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న అక్షర్ పటేల్ గతేడాది తన పుట్టినరోజున ఆమె చేతివేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ జరిగిన ఏడాది తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు మెహాను పెళ్లాడి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. కాగా మెహా న్యూట్రిషనిస్ట్, డైటీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరి పెళ్లికి అక్షర్ స్నేహితుడు, క్రికెటర్ జయదేవ్ ఉనాద్కట్ కుటుంబంతో హాజరయ్యాడు. ఇదిలా ఉంటే టీమిండియా మరో స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ జనవరి 23న బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లాడిన విషయం తెలిసిందే. మూడు రోజుల(జనవరి 26) తర్వాత అక్షర్ కూడా ఈవిధంగా శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్‌కు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. Axar Patel married to me, took seven rounds with his meha in Vadodara... #axarpatel #mehapatel pic.twitter.com/yimPDvfUaD — Meha Patel (@Meha_Patela) January 27, 2023 Happy married life Axar Patel 💞👩❤️👨#AxarPatel #MehaPatel #WeddingNight #WeddingDay pic.twitter.com/priqlc2R6k — Meha Patel (@Meha_Patela) January 26, 2023 -
మీ కోడలు సంపాదించాల్సిన అవసరం ఏముందంటూ నాడు మాటలు.. ఇప్పుడేమో
అనల్ కొటాక్ను గుజరాత్ ఎంగెస్ట్ ఫుడ్ ఎక్స్‌పర్ట్‌గా శ్లాఘిస్తారు. చిన్న వయసులో జాతీయ స్థాయిలో గుజరాతీ వంటలకు గుర్తింపు తేవడమే ఆమె ఘనత. యూ ట్యూబ్‌లో వీడియోలతోపాటు మూడు నగరాల్లో ‘ది సీక్రెట్ కిచెన్’ పేరుతో నడుపుతున్న సొంత రెస్టరెంట్లు కిటకిటలాడుతుంటాయి. ఇంటి ఫంక్షన్లో వంటవాళ్లు రాకపోయేసరికి అనుకోకుండా గరిటె పట్టిన అనల్ నేడు బాండీలో కరెన్సీకి పోపేస్తోంది. పెళ్లయ్యాక, కోడలి హోదాలో ఒక రెస్టరెంట్ ప్రారంభించాలంటే ఎన్ని ఇబ్బందులుంటాయో అనల్ని అడగాలి. ‘నేను వడోదరాలో నా తొలి రెస్టరెంట్‌ను ప్రారంభించాలనుకున్నాను. దాని పని రాత్రి పది దాకా జరిగేది. అప్పుడు ఇల్లు చేరేదాన్ని. అది చూసి ఇరుగుపొరుగు వారు మా అత్తగారి దగ్గరకు వెళ్లి ఏమిటేమిటో చెప్పేవారు. మీ కోడలు హోటలు నడిపితే ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అత్తగారు అయ్యాక కూడా మీరే వండుతున్నారా? మీకు ఇప్పుడు మీ కోడలు సంపాదించాల్సినంత డబ్బు అవసరం ఏమొచ్చింది? బాగనే ఉన్నాయిగా మీకు... ఇలా మాట్లాడేవారు. కాని మా అత్తగారు, మామగారు, నా భర్త ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అందుకే మొదలైన రెండు నెలల్లో నా రెస్టరెంట్– ది సీక్రెట్ కిచెన్ సూపర్ హిట్ అయ్యింది’ అంటుంది అనల్ కొటాక్. అనల్కు ఇప్పుడు వడోదర, సూరత్, అహ్మదాబాద్‌లలో ‘ది సీక్రెట్ కిచెన్’ పేరుతో రెస్టరెంట్లు ఉన్నాయి. ఇవి కాక కెఫేలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కూడా చైన్ రెస్టరెంట్లు ఉన్నాయి. ఇవన్నీ భర్త సపోర్ట్‌తో అనల్ నడుపుతోంది. ఫుడ్ ఎంట్రప్రెన్యూర్‌గా ఆమె సాధించిన ఈ విజయం సామాన్యమైనది కాదు. వంట పిచ్చి ‘చిన్నప్పటి నుంచి నాకు వంట అంటే ఆసక్తి ఉండేది. మాది కలిగిన కుటుంబం. అమ్మమ్మ, నానమ్మ రకరకాల వంటలు చేసేవారు. వారిలాగా వండటం ఇప్పటికీ నాకు అసాధ్యం. కాని నేర్చుకున్నాను. నాకు హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఉండేది. మా నాన్న ‘ఏంటి వంట చదువు చదువుతావా?’ అన్నారు. దాంతో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను నిఫ్ట్‌లో. కాని వంట మీద ఆశైతే చావలేదు. అప్పుడే ‘కలర్స్ గుజరాతీ’ చానల్లో ‘రసోయి షో’ అని వచ్చేది. అందులో పాల్గొనాలని వెళితే నీకింకా 19 ఏళ్లే. ఇక్కడంతా 40 ఏళ్ల గృహిణులు ఉన్నావు... నువ్వు నెగ్గలేవు అని పంపించేశారు. మరుసటి సంవత్సరం నా పెళ్లికి మెహందీ జరుగుతుండగా ఆ చానల్ నుంచి అదే షో కోసం ఆడిషన్‌కు పిలిచారు. ఇంట్లో అమ్మకు మస్కా కొట్టి వెళ్లి ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. పెళ్లయ్యాక ఆ షోలో పాల్గొంటే ఫైనల్ స్టేజ్‌కు చేరి ‘యంగెస్ట్ చెఫ్ ఆఫ్ గుజరాత్’గా అవార్డు అందుకున్నాను. ఆ పాపులారిటీతో అదే చానల్‌వారు వంట షోకు నన్ను యాంకర్‌గా తీసుకున్నారు. అలా నేను వంటల ప్రపంచంలో అడుగుపెట్టాను’ అంటుంది అనల్. డిప్రెషన్ ‘రెస్టరెంట్ బాగా నడుస్తున్నప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను. దాంతో అమ్మానాన్న, అత్తమామలు పని తగ్గిచ్చుకో... బాబుకు టైమ్ ఇవ్వాలి అనడం మొదలెట్టారు. గర్భంతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో నా పని నేను చేసుకోలేనా అని డిప్రెషన్ మొదలయ్యింది. చాలా బాధ పడ్డాను. కాని లోపలి నుంచి నా బిడ్డ నాకు ధైర్యం చెప్పినట్టు అనిపించింది. నేను నీకు బలమే అవుతానమ్మా... బలహీనతగా మారను అన్నట్టుగా భావించి మళ్లీ మామూలుగా పనిలో పడ్డాను. కొడుకు పుట్టాడు. వాడికి మూడేళ్లు. పొద్దున వెళ్లి తిరిగి రాత్రి ఎనిమిదికే వాణ్ణి చూస్తాను. కాని ఉన్నంతసేపు వాడికి పూర్తి సమయం ఇస్తాను. వాడికి మంచి అమ్మగా ఉంటూనే నేను సాధించాల్సిన విజయాలన్నీ సాధిస్తాను’ అంది అనల్. అనల్ ఇప్పుడు గృహిణుల కోసం తన సొంత మసాలాలను ‘టిఎస్కె’ బ్రాండ్ మీద అమ్ముతోంది కూడా. ఇంట్లో నలుగురి కోసం వండేది వంటే. కాని అందులో ప్రావీణ్యం, ప్రయత్నం ఉంటే వంటతో కూడా ఐశ్వర్యం పొందవచ్చు. అందుకు అనల్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మసాలా రహస్యం ‘నాకు రెస్టరెంట్ ప్రారంభించాలనిపించింది. కాని జనం డబ్బు తీసుకుని ఆహారం అమ్మాలి. అది ఎంత రుచిగా ఉండాలి. మన దేశం మసాలాలకు పట్టుగొమ్మ. ఆ మసాలాల రహస్యం తెలుసుకోవాలనుకున్నాను. సొంతగా మసాలాలు తయారు చేశాను. ఆ రహస్య మసాలాలతో నా రెస్టరెంట్ ‘ది సీక్రెట్ కిచెన్’లో వంటలు చేశాను. రెండు నెలల్లో పేరు వచ్చింది. ఎంత పేరంటే ముంబై నుంచి గుజరాతీలు వడోదరా వచ్చి మరీ తినడం మొదలెట్టారు’ అంటుంది అనల్. గుజరాత్లో సౌత్ ఇండియన్ రెస్టరెంట్‌ను ‘సౌత్ఏకె’ పేరుతో తెరిచిందామె. చదవండి: Rishi Sunak: అక్కడ మొదలైన రిషి- అక్షత ప్రేమకథ.. మామగారి గురించి బ్రిటన్ ప్రధాని ఏమన్నారంటే! -
గర్బా డ్యాన్స్‌తో అలరించిన నీరజ్ చోప్రా
జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఆటలోనే కాదు డ్యాన్స్‌లోనూ ఇరగదీయగలనని నిరూపించాడు. నీరజ్ చోప్రా గర్బా డ్యాన్స్‌తో తన అభిమానులను అలరించాడు. విషయంలోకి వెళితే.. బుధవారం గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ఒక ఈవెంట్‌కు నీరజ్ చోప్రా హాజరయ్యాడు. వేదిక వద్ద పూజలు చేసిన అనంతరం కొంత మంది సభ్యులతో కలిసి గర్భా నృత్యంతో అలరించాడు. ఇక స్టేజ్ మీదకు నీరజ్ వెళ్లిన సమయంలో జన.. ''నీరజ్.. నీరజ్'' అంటూ భారీగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకున్న నీరజ్ పలు టోర్నీల్లో పతకాలతో మెరిశాడు. ఇటీవలే ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీట్ ఫైనల్లో ఈటెను 88.34 మీటర్ల దూరం విసిరి నీరజ్ చోప్రా తొలిసారి టైటిల్ గెలిచాడు. #WATCH | Gujarat: Tokyo Olympics gold medallist Neeraj Chopra participated in a Garba event in Vadodara yesterday#navratri2022 pic.twitter.com/lM7MAmVgm2 — ANI (@ANI) September 29, 2022 🇮🇳's Golden Boy @Neeraj_chopra1 attends special Garba night in #Vadodara among thousands of people🤩 The enthusiasm and celebrations at the garba ground multiplied when he surprised his fans at the spot🤩#36thNationalGames #NationalGames2022 pic.twitter.com/VYxyhIFwIM — SAI Media (@Media_SAI) September 28, 2022 -
‘నేను మగాడిని కాదని నా భార్యకు ముందే తెలుసు!’
షాకింగ్ ఘటనలో ఇప్పుడు మరో ట్విస్ట్ వెలుగు చూసింది. తన భర్త మగాడు కాదని, సర్జరీ చేయించుకున్న మహిళ అని, ఆ రహస్యం దాచి తనకు అన్యాయం చేశాడని, న్యాయం చేయాలంటూ.. పెళ్లైన ఎనిమిదేళ్లకు ఓ భార్య పోలీసులను ఆశ్రయించిన ఉదంతం తెలిసే ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో భర్త మీడియా ముందుకు వచ్చాడు. తాను మగాడిని కాదనే విషయం తన భార్యకు ముందే తెలుసని అంటున్నారు డాక్టర్ విరాజ్‌వర్థన్. అంతేకాదు తాను లింగమార్పిడి సర్జరీలకు వెళ్తున్నాననే విషయం కూడా ఆమెకు తెలుసని.. భార్య చేసిన ఆరోపణలను ఖండించాడు. ఆమె, ఆమె బిడ్డ తనకు ఎంతో దగ్గరయ్యారని, అంతేకాదు ఆమె కూతురిని తాను దత్తత కూడా తీసుకున్నానని ఆయన మీడియాకు వెల్లడించారు. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా మేం కలుసుకున్నాం. అయితే.. తన లోపాన్ని సాకుగా చూపించి ఇల్లు తనపేరిట రాయాలంటూ ఆమె ఆ టైంలో డిమాండ్ చేసింది. ఇవ్వడం కుదరనే సరికి ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకుంది. కానీ, కొన్నాళ్లకు కూతురు వంకతో మళ్లీ వచ్చింది. పెద్దల సమక్షంలో ఎలాగోలా వివాహం జరిగింది. అంతా తెలిసి ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత ఆమె నేను విషయం దాచానంటూ మీడియా ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉంది అని విరాజ్ అలియాస్ విజేత పేర్కొన్నారు. పెళ్లైనప్పటి నుంచి తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామని, అసహజ లైంగిక చర్యలో పాల్గొన్న ఆరోపణలను సైతం ఆయన ఖండించారు. అయితే.. గత ఏడాది కాలంగా మాత్రం వేర్వేరు గదుల్లో పడుకుంటున్నామని, ఆమె తన గదిలో సీసీకెమెరా ఇన్స్టాల్ చేసి రహస్యంగా ఫొటోలు తీయడం ప్రారంభించిందని, ఈ ఏప్రిల్ నెలలో తన సోదరుడితో వచ్చి ఆ ఫొటోలు చూపించి ఆస్తి తన పేరిట రాయాలని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందని చెప్పారాయన. తాను పుట్టుకతో మహిళనే విషయం తెలిపిన విరాజ్.. పెళ్లికి ముందే ట్రాన్స్‌జెండర్ అయ్యానని, ప్రస్తుతం పురుషుడిగా మారేందుకు సర్జరీలు చేయించుకుంటున్నాననే విషయాన్ని అంగీకరించారు. గుజరాత్ వడోదర సయాంజిగంజ్‌కు చెందిన సదరు మహిళకు గతంలో పెళ్లై.. ఓ కూతురు ఉంది. అయితే భర్త చనిపోయాక 2014లో మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా ఢిల్లీకి చెందిన డాక్టర్ విరాజ్‌తో వివాహం జరిగింది. అయితే తన భర్త మగవాడుకాదని.. ఆపరేషన్ ద్వారా మారిన స్త్రీ అంటూ గోత్రీ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది. -
‘భర్త’ చేసిన పనితో గుండె బద్ధలైన భార్య
ఎనిమిదేళ్లుగా ఆ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. చుట్టుపక్కల వాళ్లకు ఆదర్శంగా నిలిచింది. అలాంటి జంట జీవితంలో.. ఎనిమిదేళ్ల తర్వాత అనుకోకుండా ఒకరోజు అలజడి రేగింది. భర్త తన దగ్గర దాచిన నిజంతో ఆ భార్య గుండెబద్ధలైంది. న్యాయం కోసం ఇప్పుడు ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె భర్త పురుషుడే కాదన్న నిజం.. ఆమెను వణికిపోయేలా చేసింది. గుజరాత్ వడోదరకు చెందిన మహిళ.. మొదటి భర్త 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఒక కూతురు ఉన్న ఆమె 2014లో ఢిల్లీలో పని చేస్తున్న విరాజ్ వర్దన్ అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే శారీరకంగా కలవకుండా చాలాకాలంపాటు ఆమెను దూరం పెడుతూ వచ్చాడు విరాజ్. దీంతో ఆమె ఒత్తిడి చేయగా.. గతంలో రష్యాలో ఉండగా తనకు యాక్సిడెంట్ అయ్యిందని.. సంసార సుఖానికి తాను పనికిరానని, మైనర్ సర్జరీ జరిగితే తాను మామూలు స్థితికి రాలేనని ఆమెతో చెప్పేశాడు. దీంతో నిజాయితీగా నిజం ఒప్పుకున్నాడనుకుని ఆమె అతన్ని క్షమించేసింది. ఆపై ఆ జంట అన్యోన్యంగానే మెదులుతూ వచ్చింది. ఇలా ఉండగా.. 2020 జనవరిలో బరువు తగ్గే సర్జరీ కోసం కోల్‌కతా వెళ్లాడు విరాజ్. తిరిగొచ్చిన విరాజ్.. తన భార్యతో శారీరకంగా కలవడం మొదలుపెట్టాడు. అయితే అతను కోల్‌కతా వెళ్లింది బరువు తగ్గే సర్జరీ కోసం కాదని.. పురుషుడి అవయవాల మార్పిడి కోసమని డాక్టర్ రిపోర్టుల ద్వారా తెలుసుకున్న ఆమెకు నోట పడిపోయింది. భర్త చేసిన మోసం ఒక్కొక్కటిగా ఆమెకు తెలిశాయి. విజైతా అనే యువతి.. సర్జరీ ద్వారా విరాజ్‌గా మారి.. మ్యాట్రిమోనియల్ సర్జరీ ద్వారా తనను సంప్రదించిందని, విజైతా కుటుంబం కూడా తనను మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొంది సదరు మహిళ. ఢిల్లీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి.. వడోదరాకు తీసుకొచ్చారు పోలీసులు. ప్రస్తుతం ఈ జంటకు కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఇదీ చదవండి: తాగిన మత్తులో .. మహిళతో ఇలాగేనా ప్రవర్తించేది? -
నా భర్తకు 89 ఏళ్లు.. రోజూ అదే ధ్యాస.. నన్ను కాపాడండి
గాంధీనగర్: గుజరాత్ వడోదరలో 89ఏళ్ల భర్తపై ఫిర్యాదు చేసింది 87ఏళ్ల భార్య. వృద్ధ వయసులోనూ ఆయన రోజూ శృంగారం కావాలని తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది. మహిళల కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ 181 అభయంకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. తన భర్త నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదు విని షాక్‌కు గురైన అభయం టీం వెంటనే రంగంలోకి దిగింది. వృద్ధ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ వయసులో యోగా చేయాలని, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని సూచించింది. వీలైతే సీనియర్ సిటిజెన్ల కోసం ఏర్పాటు చేసిన పార్కులలో సేదతీరాలని చెప్పింది. భార్యను ఇబ్బందిపెట్టవద్దని భర్తకు సూచించి సమస్యను పరిష్కరించింది. తన భర్తకు ఎప్పుడూ అదే ధ్యాస అని, శృంగారానికి ఒప్పుకోకపోతే తనపై కోపపడతాడని భార్య చెప్పింది. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా భర్త పదే పదే బలవంతం చేయడం వల్లే గత్యంతరం లేక ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. చదవండి: డ్రగ్స్ మత్తులో రోడ్డుపై కాలు కదపలేని స్థితిలో యువతి.. వీడియో వైరల్.. -
రూ.1,000 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్లో మరోమారు భారీస్థాయిలో మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో కనీసం రూ.1,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మంగళవారం పట్టుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వడోదరలోని ఓ గోదాంపై దాడి చేపట్టింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. ఈ దాడుల్లో 200 కిలోల మెఫెడ్రోన్ దొరికినట్టు అధికారులు తెలిపారు. భరుచ్ జిల్లాలో ఔషధాల ముసుగులో దీన్ని తయారు చేసినట్టు తేలిందన్నారు. ఇందుకు సంబంధించి పలువురికి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిషేధిత మెఫెడ్రోన్‌ను మ్యావ్ మ్యావ్, ఎండీగా కూడా పిలుస్తారు. ఇదీ చదవండి: ఎంఎస్పీ కమిటీ భేటీని బహిష్కరించిన రైతు సంఘాలు -
రన్నర్ రాంబాయి.. 105 నాట్అవుట్
వయసు సెంచరీ దాటిన తరువాత రెండు అడుగులు వేయాలంటే.. కర్ర, మంచం, కుర్చి, వాకర్ వంటివాటి సాయం తప్పక తీసుకోవాల్సిందే. అటువంటిది హరియాణాకు చెందిన 105 ఏళ్ల ‘రాంబాయి’ బామ్మ అత్యంత వేగంగా పరుగెత్తి జాతీయ రికార్డులను తిరగరాయడమేగాక, రెండు స్వర్ణపతకాలను అవలీలగా గెలుచుకుంది. శాకాహారం మాత్రమే తీసుకునే ఈ బామ్మ ఇంతటి లేటువయసులో ఎంతో చలాకీగా ఉంటూ యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. జూన్ 15న అథ్లెటిక్స్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వడోదరాలో నిర్వహించిన ప్రారంభ నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో వంద మీటర్ల దూరాన్ని కేవలం 45.40 సెకన్లలో పరుగెత్తి స్వర్ణపతకాన్ని గెలుచుకుంది రాంబాయి. గతంలో 101 ఏళ్ల మన్ కౌర్ ఇదే వంద మీటర్ల దూరాన్ని 74 సెకన్లలో పూర్తిచేసి రికార్డు నెలకొల్పింది. కౌర్‌కంటే వేగంగా పరుగెత్తిన రాంబాయి ఈ రికార్డుని బద్దలు కొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజాగా ఆదివారం (జూన్19)న నిర్వహించిన రెండు వందల మీటర్ల పరుగు పందేన్ని ఒక నిమిషం 52.17 సెకనులలో పూర్తిచేసి మరో స్వర్ణపతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. హరియాణాలోని చరికదాద్రీ జిల్లా కద్మా గ్రామంలో 1917లో పుట్టింది రాంబాయి బామ్మ. చిన్నప్పటి నుంచి రేసుల్లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. పరుగు పందెంలో పాల్గొనడానికి అవకాశం రావడంతో... గతేడాదిలో రన్నింగ్ సాధన మొదలు పెట్టి రేసులలో పాల్గొనడం ప్రారంభించింది. గతేడాది నవంబర్‌లో వారణాసిలో తొలిసారి పరుగు పందెంలో పాల్గొంది. అక్కడ రాంబాయి రన్నింగ్ బావుండడంతో..ఆ తరువాత కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో జరిగే పోటీల్లో పాల్గొని డజనకు పైగా పతకాలను గెలుచుకుంది. తాజాగా వడోదరలో వందేళ్లకు ౖపైబడిన వారికి నిర్వహించే పరుగు పందెంలో ఎంతో చలాకీగా పాల్గొని రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్న ఉత్సాహంతో.. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని విజేతగా నిలవాలని కలలు కంటూ పాస్‌పోర్టును సిద్ధం చేసుకుంటోంది ఈ సెంచరీ బామ్మ. రాంబాయి కుటుంబంలో ఆమె ఒక్కరే కాకుండా కొంతమంది కుటుంబ సభ్యులు సైతం వివిధ క్రీడల్లో పతకాలు సాధించిన వారే. రాంబాయి 62 ఏళ్ల కూతురు సంత్రా దేవి రిలే రేస్‌లో స్వర్ణ పతకం, కుమారులు ముఖ్తార్ సింగ్, వధు భటెరీలు రెండు వందల మీటర్ల రేస్‌లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పాలు పెరుగు... రాంబాయి శాకాహారి. అరకేజీ పెరుగు,అరలీటరు పాలు, పావుకేజీ వెన్న, జొన్న పిండితో చేసిన బ్రెడ్‌ను రోజువారి ఆహారంగా తీసుకుంటుంది. ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి రోజూ పొలంలో పనిచేయడానికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తుంది. సొంత పొలంలో పండిన పంటనే ఆహారంగా తీసుకోవడం, క్రమం తప్పని నడకతో వయసు సెంచరి దాటినప్పటికీ.. యాక్టివ్‌గా ఉంటోంది. అవకాశం ఇవ్వలేదు... ‘నేను ఎప్పుడో పరుగెత్తాలని అనుకున్నాను. కానీ నాకెవరు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం నా మనవరాలు షర్మిలతో వచ్చి ఇక్కడ పాల్గొన్నాను. మా కుంటుబంలో ఎక్కువ మంది క్రీడారంగంలో రాణిస్తున్నారు. ఈ రోజు నేను కూడా వారి జాబితాలో చేరాను. షర్మిల కూడా పతకాలు గెలుచుకుంది. పాలు పెరుగు, చుర్మాలే నన్ను గెలిపించాయి. ఇవే నన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నాయి’ అని రాంబాయి చెప్పింది. -
100 మీటర్ల రేసులో 105 ఏళ్ల బామ్మ కొత్త చరిత్ర
100 మీటర్ల పరుగు పందెంలో 105 ఏళ్ల రామ్బాయి కొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో ఈ బామ్మ వంద మీటర్ల రేసులో భాగంగా 45.40 సెకన్లలోనే గమ్యాన్ని చేరింది. అయితే సమాచారం ప్రకారం ఈ రేసులో రామ్బాయి తప్ప మరెవరు పాల్గొనలేదంట. కేవలం 100 ఏళ్లు పైబడిన వారికే నిర్వహించిన రేసులో రామ్బాయి ఒక్కరే పాల్గొన్నారు. ఎవరు పోటీ లేకపోవడం.. తన రికార్డును తానే బద్దలు కొట్టి గమ్యాన్ని చేరిన రామ్బాయికి స్వర్ణ పతకం అందజేశారు. కాగా అదే రోజున నిర్వహించిన 200 మీటర్ల స్ప్రింట్‌ను ఒక నిమిషం 52.17 సెకన్లలో గమ్యాన్ని అందుకొని స్వర్ణం సాధించడం విశేషం. కాగా 100, 200 మీటర్ల రేసులో విజయం సాధించిన తర్వాత రామ్బాయిని స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలతో అభినందించారు. అనంతరం ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక ఇదే గుంపులో రామ్బాయి మనవరాలు.. అథ్లెట్ అయిన షర్మిలా సంగ్వాన్ కూడా ఉంది. తన నానమ్మ విజేతగా నిలవడంతో ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆమె మాట్లాడుతూ.. ''మా నానమ్మ విజయం మాకు గర్వకారణం. ఈ విజయానికి ఆమె అర్హురాలు. ఎందుకంటే సాధారణ రోజుల్లో ఉదయాన్నే లేచి 3-4 కిలో మీటర్లు ఆగకుండా పరిగెత్తడం ఆమెకు అలవాటు. ఇది ఆమెను మరింత బలంగా తయారయ్యేలా చేసింది.'' అంటూ పేర్కొంది. At 105 years, super grandma sprints new 100m record. #Rambai ran alone in #Vadodara as there was no competitor above 85 competing at the National Open Masters Athletics Championship pic.twitter.com/iCIPTOkuFt — TOI Bengaluru (@TOIBengaluru) June 21, 2022 చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే Manoj Tiwary On Work And Cricket: పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని -
Sologamy: మూడు రోజుల ముందే.. క్షమాబిందు స్వీయ వివాహం
అహ్మదాబాద్: తనను తానే వివాహమాడబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమాబిందు(24) తన పెళ్లి వేడుకను బుధవారం సాయంత్రం సొంతింట్లోనే జరుపుకున్నట్లు వెల్లడించింది. తన స్వీయ వివాహం(సోలోగమీ) వ్యవహారం మరింత వివాదస్పదంగా మారకూడదనే మూడు రోజులు ముందుగానే జరుపుకున్నట్లు గురువారం మీడియా ఎదుట ప్రకటించింది. వడోదరలోని గోత్రి ప్రాంతానికి చెందిన క్షమాబిందు దగ్గర్లోని ఆలయంలో ఈనెల 11వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఇలాంటి పెళ్లిళ్లు ఏ గుడిలో జరిగినా అడ్డుకుంటామంటూ బీజేపీ వడోదర విభాగం ఉపాధ్యక్షురాలు సునీతా శుక్లా హెచ్చ రించారు. హిందూ యువతను పెడదోవ పట్టిస్తోందంటూ నన్ను తప్పుబట్టారు. వైదిక సంప్రదాయంలో పెళ్లి తంతును జరిపించేందుకు పూజారి నిరాకరించారు’ అని ఆమె తెలిపింది. దీంతో ఇంట్లోనే పెళ్లి జరుపుకుంది. ఈ కార్యక్రమం వీడియోను విడుదల చేసింది. సంప్రదాయ వివాహ వేడుక మాదిరిగానే జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది సన్నిహితులు హాజరైనట్లు తెలిపింది. తన వివాహం దేశంలోనే మొట్టమొదటిదని క్షమాబిందు అంటోంది. త్వరలో హనీమూన్కూ వెళ్తానని ప్రకటించింది. -
ప్రేమించిన వ్యక్తిని మనువాడితే తప్పేంటి?
తనను తాను ప్రేమించుకోలేని వాళ్లు.. ఇతరుల మీద ఏం ప్రేమ చూపిస్తారు? కానీ, 23 ఏళ్ల వయసున్న ఆ యువతికి తనను తాను ప్రేమించుకోవడం.. తప్పైంది. ప్రేమ వరకైతే ఫర్వాలేదు.. ఏకంగా పెళ్లి వరకు వెళ్లిందామె. అందుకే విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. తనను తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన అమ్మాయి.. ఊహించని ట్విస్టే ఇచ్చింది ఇప్పుడు. పెళ్లి చేసుకోవడానికి ఓ వరుడు కావాలి. అంతేగానీ ఎవరికో భార్యగా ఉండాల్సిన అవసరం నాకైతే లేదు. ఆ వరుడిని నేనే ఐతే ఏంటి నష్టం? తనను తాను ప్రేమించుకోవాలని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు.. వివాహ బంధంతో ఒక్కటైతే ఎందుకు అభ్యంతరాలు చెప్తున్నారో అర్థం కావడం లేదు? అంటూ ప్రశ్నిస్తోంది క్షమా బిందు. గుజరాత్ వడోదరాకు చెందిన 23 ఏళ్ల క్షమా బిందు.. దేశంలో తొలి సోలోగామీ ట్రెండ్‌కు తెర తీసింది. తనను తాను పెళ్లాడి.. తన మీద తనకు ఎంత ప్రేమ ఉందో నిరూపించుకునే ప్రయత్నం చేసిందామె. వాస్తవానికి జూన్ 11వ తేదీన ఆమె ఆలయంలో శాస్త్రోత్తంగా పురోహితుడి సమక్షంలో వివాహం చేసుకోవాలనుకుంది. ఈలోపు కొన్ని రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాలతో జూన్ 8న ఇంట్లోనే వివాహం చేసుకుంది ఆమె. View this post on Instagram A post shared by Kshama Bindu (@kshamachy) సోలోగామీ ట్రెండ్.. క్షమా బిందు ద్వారా యావత్ దేశానికి పరిచయం అయ్యింది. మెహెందీ, హల్దీ ఫంక్షన్లతో దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్యే తనను తాను మనువాడింది ఆమె. తొలుత తటపటాయించిన తల్లిదండ్రుల వర్చువల్ ఆశీర్వాదంతోనే వివాహ వేడుకను ముగించేసుకుంది క్షమా. ఆమె కాన్సెప్ట్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కాగా, వివాదం, విమర్శలు, ట్రోలింగ్ ఎదురైంది. ఆమె తీరును తప్పుబట్టారు ఎందరో. ఆఖరికి పెళ్లి జరిపించే పురోహితుడికి కూడా బెదిరింపులు వెళ్లాయి. ఈ క్రమంలో.. ఆమె ముందుగానే వివాహతంతు పూర్తి చేసుకుంది. వివాహం తర్వాత అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫేస్బుక్ ద్వారా ఓ వీడియో రిలీజ్ చేసింది. అందరికీ కృతజ్ఞతలు.. నేను నమ్మిన విషయాన్ని నమ్మి, పోరాడేందుకు నాకు మద్దతు రూపంలో శక్తి ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అని చెప్పిందామె. క్షమా అందరిలాంటి అమ్మాయి కాదు. దామన్(గుజరాత్)లో పుట్టి పెరిగి.. వడోదరాలో స్థిరపడింది. సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ రిక్రూటర్‌గా పని చేస్తోంది. ఫ్రీలాన్స్ మోడలింగ్తోనూ రాణిస్తోందామె. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఇంజనీర్లు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉంటుండగా.. తల్లి సరితా దుబే అహ్మదాబాద్‌లో ఉంటోంది. తన కోసం తాను బతకాలనే నిబద్ధత.. ఎలాంటి షరతులు లేని ప్రేమకు చిహ్నం నా ఈ స్వీయ-వివాహం. నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు. అలాగే.. నన్ను నేను ప్రేమిస్తున్నా. అందుకే ఈ పెళ్లి అని చెప్తోంది క్షమా బిందు. అభ్యంతరాలు ఉన్న వాళ్లకు సమాధానం ఇచ్చే ముందు.. తామంటే తాము ఇష్టం లేదని ఒప్పుకుంటారా? అని ప్రశ్నిస్తోంది. View this post on Instagram A post shared by Kshama Bindu (@kshamachy) -
నన్నే పెళ్లాడతా.. యువతికి షాక్!
తనను తానే పెళ్లాడి.. ఎంచక్కా సోలో హనీమూన్ ప్లాన్ చేసుకున్న గుజరాత్ యువతికి షాక్ తగిలింది. ఆమె వివాహాన్ని అడ్డుకుని తీరతామని బీజేపీ ప్రకటించింది. వడోదరా మాజీ డిప్యూటీ మేయర్ సునీతా శుక్లా ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. వడోదరాకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు తనను తాను పెళ్లి చేసుకుంటానని(మోలోగమీ) ప్రకటించుకుంది. సాధారణ పెళ్లి లాగే అంతా పద్ధతి ప్రకారం వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది. అన్ని ఆర్భాటాలతో (ఒక్క వరుడు, బరాత్) తప్పా అన్నీ సంప్రదాయబద్దంగా జరుపుకోవాలనుకుంది. అయితే.. క్షమా ప్రకటన మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. దేశంలో ఇదే తొలి సోలోగమీ వివాహమంటూ చర్చ కూడా నడుస్తోంది. చాలామంది వ్యతిరేకిస్తుంటే.. కొందరు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షమా ప్రకటనను సునీతా శుక్లా తీవ్రంగా ఖండించారు. క్షమా వివాహాన్ని అడ్డుకుని తీరతామని ప్రకటించారామె. ‘‘ఈ తరహా వివాహాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఆమె ఏ గుడిలో వివాహం చేసుకోవడానికి మేం అనుమతించం. ఇలాంటి వివాహాలు హిందూ మతానికి, భారత సంప్రదాయానికి విరుద్ధం. ఇలాంటి వాళ్ల చేష్టలతో హిందువుల జనాభా తగ్గే ప్రమాదం ఉంది. మతానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే.. ఏ చట్టమూ ఒప్పుకోదు’’ అని పేర్కొన్నారామె. Gujarat | I'm against the choice of venue, she'll not be allowed to marry herself in any temple. Such marriages are against Hinduism. This will reduce the population of Hindus. If anything goes against religion then no law will prevail: BJP leader Sunita Shukla (03.06) https://t.co/Jf0y13WOiE pic.twitter.com/3Cus9JMwsR — ANI (@ANI) June 4, 2022 ఇదిలా ఉంటే.. హరిహరేశ్వర్ ఆలయంలో తనను తాను వివాహం చేసుకునేందుకు జూన్ 11న ముహూర్తం ఖరారు చేసుకుంది క్షమా బిందు. తాజా ప్రకటన నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: దేశంలోనే తొలిసారి.. తనను తాను పెళ్లాడనున్న యువతి.. -
దేశంలోనే తొలిసారి.. తనను తాను పెళ్లాడనున్న యువతి..
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. మరి అబ్బాయి, అమ్మాయిలకే పెళ్లిళ్లు నిశ్చయిస్తారా? అమ్మాయి, అమ్మాయి.. అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం కూడా మచ్చుకు కొన్ని చూస్తూనే ఉన్నాం. జెండర్ ఏదైనా ఒకరికి ఒకరు తోడుగా ఉండటం కామన్ పాయింట్. అయితే ఇక్కడ ప్రస్తవించే పెళ్లి మాత్రం వీటన్నింటికి చాలా భిన్నం.. ప్రత్యేకం కూడా. ఓ యువతి తనకు వేరేకొరి తోడు లేకుండానే పెళ్లి చేసుకోబోతుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.. గుజరాత్‌కు చెందిన ఓ యువతి తనను తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమా బింధు స్వీయ పరిణాయమడనుంది. అయితే సాధారణ పెళ్లి లాగే అన్ని వేడకలను నిర్వహించాలనుకుంది. జూన్11న అన్ని ఆర్భాటాలతో పెళ్లి చేసుకోబోతుంది. ఒక్క వరుడు, బరాత్ తప్పా అన్నీ సంప్రదాయబద్దంగా జరుపుకోనుంది. తన పెళ్లి గురించి క్షమా మాట్లాడుతూ.. తనెప్పుడూ ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోవాలనుకోలేదని పేర్కొంది. అయితే పెళ్లికూతురు మాత్రం తయారు కావాలని అనుకున్నానని, అందుకే తనను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ‘స్వీయ వివాహం అనేది మనకోసం మనం నిలబడాలనే నిబద్ధత.. నీపై నువ్వు ప్రేమను చూపించడం. కొందరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకుంటారు. కానీ నన్ను నేను ప్రేమిస్తున్నాను. అందుకే స్వీయ వివాహం చేసుకుంటున్నాను. అంతేకాదు, ఇంతకు ముందు దేశంలో ఎవరైనా ఇలా చేశారా? అని ఆన్లైన్లో వేతికినా వివరాలు రాలేదు. బహుశా నేనే మొదటి వ్యక్తిని కావచ్చు. ఇలాంటి వివాహం అసందర్భమైందని అంటుంటారు కానీ, సమాజానికి స్త్రీలు ముఖ్యమని తెలియజేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాను’ అని తెలిపింది. చదవండి: అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలు ఆ గ్రామాన్నే ఖాళీ చేశారు! ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న గోత్రిలోని ఓ గుడిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది. తన పెళ్లికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ కాదు కానీ పెళ్లి తర్వాత హనీమూన్ కూడా వెళ్లనుందట ఈ పెళ్లికూతురు.. సోలోగా రెండు వారాలు గోవాకు వెళ్తున్నట్లు పేర్కొంది. అయితే ఇలాంటి వివాహం జరగడం గుజరాత్‌లోనే కాదు దేశంలోనే మొదటిసారి. ప్రస్తుతం ఈ పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Nishitha Rajput: 3 కోట్ల రూపాయలు సేకరించింది.. నువ్వు చల్లంగుండాలమ్మా!
Nishitha Rajput: వడోదరా, గుజరాత్... ఆరోజు నిషిత రాజ్‌పుత్ వాళ్ల ఇంటికి పని మనిషి తన కూతుర్ని తీసుకువచ్చింది. ఆ అమ్మాయి వయసు పద్నాలుగు సంవత్సరాలు. ‘ఏం చదువుతున్నావు?’ అని పలకరింపుగా అడిగింది నిషిత. ఆ అమ్మాయి సమాధానం చెప్పక ముందే వాళ్ల అమ్మ ఇలా అంది ‘ఆడపిల్లకు చదువు ఎందుకమ్మా. ఇంక రెండు సంవత్సరాలు ఆగితే పెళ్లి చేయడమే కదా...’ ఆ అమ్మాయిలో ఎలాంటి స్పందన లేదు. కళ్లలో అంతులేని అమాయకత్వం కనిపించింది. తమ బంధువులలో కూడా అమ్మాయిల చదువు గురించి పెద్దగా ఆలోచించరని పనిమనిషి చెప్పినప్పుడు... ఆ సమయంలో తనకు అనిపించింది ‘ఇలా జరగడానికి వీలులేదు’ అని. చిన్నప్పుడు స్కూల్లో, ఇంట్లో తల్లిదండ్రుల నోట విన్న ‘అన్ని దానాలలో కంటే విద్యాదానం గొప్పది’ అనే మాట తనకు బాగా నచ్చే మాట. ఎందుకంటే చదువు ఎంతోమంది జీవితాల్లో నింపిన వెలుగును తాను స్వయంగా చూసింది. కొన్ని తరాల సామాజిక స్థాయిని మార్చిన చదువు అనే శక్తిని తాను చూసింది. తమ చుట్టుపక్కల ప్రాంతాలలో 150 మంది వరకు అమ్మాయిలు బడికి దూరంగా ఉన్నారు. వారిని బడికి పంపించేలా తల్లిదండ్రులను ఒప్పించింది. ఫీజులో రాయితీ కోసం మహారాణి స్కూల్, శ్రీవిద్యాలయ....మొదలైన స్థానిక పాఠశాలల సహకారం తీసుకుంది. ఈ కృషి తక్కువ కాలంలోనే సత్ఫాలితాలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో తన కార్యక్రమాన్ని మరింత విస్తృతపరచాలనే ఆలోచనకు వచ్చింది నిషిత. ఇందుకు నిధుల సేకరణ అనేది తప్పనిసరి. అయితే అది అంత తేలికైన విషయం కాదు అనేది తనకు తెలుసు. అనుమానాలుంటాయి... అవమానించే మాటలు వినిపిస్తాయి. తాను ఊహించినట్లుగానే జరిగింది. ‘ఎవరో ముక్కూముఖం తెలియని అమ్మాయి కోసం మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి?’ అని ఒకరంటే... ‘మేము ఇచ్చే డబ్బులు దుర్వినియోగం కావని గ్యారెంటీ ఏం ఉంది?’ అంటారు ఇంకొకరు. దీంతో నిధుల సేకరణలో పారదర్శక విధానానికి రూపకల్పన చేసింది నిషిత. అందులో ఒకటి దాతలు రాసే చెక్‌లు స్కూల్ పేరు మీద ఉంటాయి. తాము ఇచ్చే డబ్బు ఏ అమ్మాయి చదువు కోసం వినియోగిస్తున్నారు అనే దాని గురించి పూర్తి వివరాలు ఇస్తారు. ఈ విధానం మంచి ఫలితాన్ని ఇచ్చింది. కొందరు దాతలు తాము చదివిస్తున్న పిల్లల దగ్గరకు వెళ్లి స్వయంగా మాట్లాడేవారు. కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా చదువులో వారు ఎలా రాణిస్తున్నారో తెలుసుకోవడం మంచి విషయం అంటుంది నిషిత. కొందరు దాతలు పేద మహిళలకు కుట్టుమిషన్లు కొనిస్తారు. దీనివల్ల తాము ఉపాధి పొందడమే కాదు పిల్లల చదువుకు ఆసరా అవుతుంది. ‘నా భర్త ఆటో నడుపుతాడు. అయితే అప్పుల వల్ల పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఎవరో నిషిత గురించి చెప్పారు. వెళ్లి కలిస్తే వెంటనే సహాయం చేశారు. ఆమె చేసిన మేలు మరవలేము’ అంటుంది కృతజ్ఞతాపూర్వకంగా చంద్రిక గోస్వామి. నిషితను నిండు మనసుతో దీవించే వందలాది మందిలో చంద్రిక ఒకరు. ఒక అంచనా ప్రకారం మూడు కోట్ల రూపాయల సేకరణ ద్వారా 34,000 బాలికలు విద్యావంతులు కావడానికి సహకారం అందించింది నిషిత రాజ్‌పుత్. చదవండి: Priyanka Nanda: బాలీవుడ్లో అడుగుపెట్టాలనుకుంది.. కానీ గ్లామర్ ప్రపంచాన్ని వదిలి గ్రామానికి.. సర్పంచ్‌గా పోటీ! View this post on Instagram A post shared by Baisa Nishita Rajput (@rajputnishitabaisa) -
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 4 మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
Vadodara Chemical Factory Boiler Blast గుజరాత్: వడోదర ఇండస్ట్రియల్ జోన్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన బాయిలర్‌లో శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిముషాలకు జరిగిన పేలుడులో నాలుగేళ్ల బాలిక, 65 ఏళ్ల వృద్ధుడు సహా నలుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా, గాయాలైన తల్లి (30)తోపాటు గాయపడిన వారినందరిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసు అధికారి సాజిద్ బలోచ్ వెల్లడించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల గోడలు కూలడమేకాక, 1.5 కిలోమీటర్ల మేర ఉన్న భవనాల అద్దాలు పగిలిపోయాయి. ఐతే ఘటనలో మృతి చెందినవారు, గాయపడిన వ్యక్తులు ఫ్యాక్టరీ కార్మికులు, ప్రయాణికులుగా గుర్తించారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు తయారుచేసే కాంటన్ లేబొరేటరీస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా గుజరాత్లో ఎనిమిది రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. డిసెంబర్ 16న పంచమహల్ జిల్లాలో ఇదే తరహాలో ఫ్యాక్టరీ పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చదవండి: Rain Alert: ఈ నెల 27 నుంచి 30 వరకు చలిగాలులతో కూడిన వానలు! -
వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి..
గాంధీనగర్: భారీ వర్షాల కారణంగా ఒక్కొసారి అడవిలోని జంతువులు మానవ ఆవాసాల దగ్గరికి వస్తుంటాయని విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి గుజరాత్లో చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ రెండు భయంకరమైన జీవులు జనావాసాల సమీపంలోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, వడోదరకు సమీపంలో ఒక చెరువు ఉంది. ఈ క్రమంలో, అక్కడి నుంచి 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి రెండు కూడా జనావాసాల్లోకి వచ్చాయి. వీటిని చూడగానే స్థానికులు భయంతో వణికిపోయారు. ఆ తర్వాత వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వెంటనే ఆ జీవులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో కలిసి కొండచిలువ, మొసలిని బంధించారు. ఆ తర్వాత వాటిని దగ్గరలోని అడవిలోకి వెళ్లి వదిలినట్లు ఫారెస్టు అధికారి అర్వింద్ పవార్ తెలిపారు. కాగా, ఆ జీవుల నుంచి ఎలాంటి అపాయం లేకుండా రెస్క్యూ సిబ్బంది పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు -
గాయాలతో మొసలి.. 25 నిమిషాలు నిలిచిన రాజధాని ఎక్స్‌ప్రెస్
ముంబై: మొసలి పట్టాలపైకి రావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన వడోదర-ముంబై రైల్వే లైన్ మధ్య చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం రైలు పట్టాలపై గాయంతో బాధపడుతున్న మొసలి ప్రత్యక్షమైంది. దీంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు 25 నిమిషాల పాటు నిలిచిపోయింది. భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మొసలిని పక్కకు తీసిన అనంతరం రైళ్ల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. మిగతా రైళ్లు దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం కర్జన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. వన్యప్రాణుల కార్యకర్త హేమంత్ వద్వాన వచ్చి మొసలికి సపర్యలు చేసి పట్టాలపై నుంచి తొలగించాడు. ‘నాకు 3.15 నిమిషాలకు కర్జాన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ పట్టాలపై మొసలి ఉందని ఫోన్ చేశారు. మొసలి వలన రైలు ఆగడం ఆశ్చర్యమేసింది. స్టేషన్ నుంచి మేం మొసలి ఉన్న దగ్గరకు వెళ్లడానికి ఐదు నిమిషాలు పట్టింది.’ అని హేమంత్ తెలిపారు. ‘మొసలి తీవ్ర గాయాలతో బాధపడుతోంది. ఆలస్యంగా వెళ్లి ఉంటే మొసలి చనిపోయి ఉండేది’ అని మరో వన్యప్రాణి కార్యకర్త నేహ పటేల్ వివరించారు. చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు ‘పట్టాలపై నుంచి మొసలిని తొలగించిన అనంతరం కిసాన్ రైలులో తరలించాం. అనంతరం అటవీ శాఖ అధికారులకు మొసలిని అప్పగించాం’ అని కర్జాన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సంతోశ్ శర్మ తెలిపారు. వన్యప్రాణి కార్యకర్తలంతా అగ్నివీర్ ప్రాణీణ్ ఫౌండేషన్ సభ్యులు. వారు ఇలా వన్యప్రాణులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ఈ ఫౌండేషన్ సభ్యులు కాపాడుతారు. -
కోవిడ్ కాలం.. అంకురం కోసం...
భర్త ప్రాణం తీసుకెళుతున్న యుముణ్ణి సంతాన వరం కోరి భర్తను కాపాడుకుని పురాణాల్లో నిలిచింది సావిత్రి. ఇప్పుడు వడోదరాలో ఇద్దరు స్త్రీలు ఈ కారణం చేతనే అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. కోవిడ్ వల్ల భర్త మరణించగా ముందే నిల్వ చేసిన అతని వీర్యంతో ఒక భార్య తల్లి కావాలనుకుంటూ ఉంటే కోవిడ్ వల్ల చావు అంచుల్లో ఉన్న భర్త వీర్యాన్ని హైకోర్టుకు వెళ్లి మరీ సేకరించి తల్లి కావాలని నిర్ణయించుకుంది మరో భార్య. మాతృత్వ భావన, సహచరుడి పట్ల ఉన్న గాఢమైన ప్రేమ ఈ స్త్రీలను నేటి సావిత్రులుగా మార్చింది. వివాహం అయ్యాక భార్యాభర్తలు ఎన్ని ఊసులాడుకుంటారో ఎవరికి తెలుసు? పుట్టబోయే సంతానం గురించి ఎన్ని కలలు కంటారో ఎవరికి తెలుసు? పరస్పరం ఎంత అనురాగం పంచుకుంటారో ఎవరికి తెలుసు? వైవాహిక జీవితం సంతానం కలగడంతో ఫలవంతం అవుతుంది. మనిషి తన కొనసాగింపును సంతానం తో ఆశిస్తాడు. తన ఉనికి సంతానం ద్వారా వదిలిపెడతాడు. ఆ సంతానం కలిగే లోపే ఆ ఉనికి మరుగున పడిపోయే పరిస్థితి వస్తే? అతని సంతానం కావాలి మూడు రోజుల క్రితం గుజరాత్ హైకోర్టుకు అత్యవసర ప్రాతిపదికన ఒక మహిళ అప్పీలు చేసుకుంది. ‘నేను సంతానవతిని కాదల్చుకున్నాను. అందుకు నా భర్త నుంచి వీర్యం తీసి సంరక్షించుకునేందుకు అనుమతినివ్వండి’ అని. మంగళవారం (జూలై 20) కోర్టుకు వెళితే ఆ సాయంత్రానికే కోర్టు అనుమతినిస్తే అదే రోజు రాత్రి ఆమె భర్త నుంచి వీర్యాన్ని సేకరించి భద్ర పరిచారు డాక్టర్లు. వడోదరాలోని స్టెర్లింగ్ హాస్పిటల్లో ఈ ఉదంతం జరిగింది. ‘పేషెంట్‌కు కోవిడ్ వల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగింది. అతను ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్నాడు. ప్రాణాలు దక్కే ఆశలు అతి స్వల్పం. అందుకే అతని భార్య అతని వీర్యం ద్వారానే కృత్రిమ పద్ధతిలో భవిష్యత్తులో సంతానవతి అయ్యే విధంగా వీర్యాన్ని సేకరించమని మమ్మల్ని కోరింది. భర్త కుటుంబం అందుకు అంగీకరించింది. అయితే అలా వీర్యాన్ని సేకరించాలంటే ఆ పురుషుడి అనుమతి ఉండాలి. అనుమతి ఇచ్చే స్థితిలో అతను లేడు. అందుకే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోమన్నాం. ఆమె కోర్టు నుంచి అనుమతి తీసుకురావడంతో వెంటనే వీర్యాన్ని సేకరించాం. అలా వీర్యాన్ని సేకరించే ప్రొసీజర్‌కు అరగంట సమయం పట్టింది’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మాతృత్వపు హక్కు ప్రతి స్త్రీకి ఉంటుంది. సహజంగా వీలు లేకపోతే కృత్రిమ పద్ధతి ద్వారా, సరొగసి ద్వారా ఆమె తల్లి కావచ్చు. కాని ఈ కోవిడ్ కాలంలో అన్నీ హటాత్తుగా జరిగిపోతున్నాయి. ఎన్నో ఆశలు, కలలు కన్న జీవన భాగస్వాములు రోజుల వ్యవధిలో అదృశ్యమవుతున్నారు. సంతాన కల నెరవేరక ముందే వారు మరణించే పరిస్థితి ఎన్నో కుటుంబాల్లో ఈ కోవిడ్ కాలంలో జరిగినా ఈ మహిళ మాత్రం భర్త ద్వారానే సంతానాన్ని కనడానికి ఈ విధం గా నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది. ఆమెను అర్థం చేయించే ప్రయత్నం చేస్తోంది. హైకోర్టు ఆమె నిర్ణయానికి మద్దతుగా ‘కృత్రిమ పద్ధతిలో ఆమె తల్లి అయ్యే విషయం లో మీ అభిప్రాయం ఏమిట’ని ప్రభుత్వాన్ని, ఆస్పత్రి వర్గాలని కూడా సమాధానం కోరుతూ నోటీసులు ఇచ్చింది. భర్త చనిపోయాక తల్లి కావాలని... అయితే ఇదే వడోదరాలో రెండు నెలలుగా మరో మహిళ కూడా ఇదే కారణంతో వార్తల్లో ఉంది. ఆమె పేరు హెలీ ఏర్కే. వయసు 36. వడోదరాలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. ఆమె భర్త సంజయ్ టీచర్‌గా పని చేసేవాడు. ఏప్రిల్ మొదటి వారంలో అతడు కోవిడ్ వల్ల మరణించాడు. ‘నా భర్త ఎంతో మంచివాడు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనాలని నాకు చెప్పేవాడు. నేనంటే ఎంతో ప్రేమ. నాకు 30 ఏళ్లకు పెళ్లయ్యింది. ఆయన నా కంటే పెద్ద. పెళ్లి సమయంలోనే మేము లేటు వయసు వల్ల గర్భధారణకు ఇబ్బంది వస్తుందా అని సందేహించాం. రెండు మూడు ఆస్పత్రులకు తిరిగి చివరకు ఒక ఆస్పత్రి లో మా ‘ఎంబ్రియో’ (అండం, వీర్యాల ఫలదీకరణం. దీనిని గర్భంలో ప్రవేశపెట్టాక పిండం అవుతుంది)లు ఐదారు సంరక్షించుకున్నాం. నా భర్త జీవించి ఉండగా ఒక ఎంబ్రియోతో గర్భం దాల్చడానికి ప్రయత్నించాను. నిలువలేదు. ఇప్పుడు నా భర్త లేడు. కాని అతని వారసుణ్ణి కనాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నా కుటుంబం సమాజం ఇందుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను’ అని హెలీ అంది. సంతానం కలిగితే ఆ సంతానంలో భర్తను చూసుకోవాలని ఆమె తపన. ‘నా గర్భాశయం గర్భం మోయడానికి అనువుగా లేదని డాక్టర్లు తేల్చేశారు. మా ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును నేను తల్లి కావడానికి వెచ్చిస్తాను. సరొగసీ ద్వారా నేను నా భర్త అంకురాన్ని నిలబెట్టుకునే ప్రయత్నిస్తాను’ అని హెలీ అంది. కోవిడ్ ఎందరికో మరణశాసనాలు రాస్తోంది. కాని మనుషులు జీవించే ఆశను పునరుజ్జీవింప చేసే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఒక మనిషి మరణించినా అతడి సంతానం జన్మనెత్తే వినూత్న సమయాలను ఇప్పుడు మనిషి సృష్టిస్తున్నాడు. క్రిమి మరణిస్తుంది. మనిషి తప్పక జయిస్తాడు. హెలీ ఏర్కె, సంజయ్ -
ఘనంగా పరూల్ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం
-
30 వేలమంది అమ్మాయిలకు విద్యాదానం
‘అమ్మాయిలను విద్యావంతులను చేయండి’ అనే నినాదంతో పాటు వారి చదువు కోసం 12 ఏళ్లలో 3.25 కోట్ల నిధిని సమీకరించి, అవసరమైన వారికి అందజేసింది. తన పెళ్లికోసం జమ చేసిన డబ్బు ను కూడా నిరుపేదల చదువుకోసం కేటాయించింది 28 ఏళ్ల నిషితా రాజ్‌పుత్ వడోదర. ‘నా జీవితం పేద అమ్మాయిలను విద్యావంతులను చేయడానికే అంకితం’ అంటున్న నిషిత ఉంటున్నది గుజరాత్. ఆర్థిక లేమి కారణంగా అమ్మాయి ల చదువులు ఆగిపోకూడదన్న ఆమె ఆశయం అందరి అభినందనలు అందుకుంటోంది. ఈ సంవత్సరం 10 వేల మంది బాలికలకు ఫీజులు కట్టి, వారికి ఉన్నత విద్యావకాశాలను కల్పించిన నిషిత 2010లో 151 మంది అమ్మాయిలకు ఫీజులను కట్టడంతో ఈ సాయాన్ని ప్రారంభించింది. ప్రతి యేడాది ఈ సంఖ్యను పెంచుతూ వస్తోంది. గుజరాతీ అయిన నిషిత ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిల ఉన్నత విద్యకు ఫీజులు చెల్లించింది. తండ్రి సాయంతో .. ‘నా 12 ఏళ్ల వయస్సులో, నా క్లాస్మేట్ ఒక అమ్మాయి సడన్‌గా స్కూల్ మానేసింది. తను డబ్బు లేక చదువు ఆపేసిందనే విషయం చాలా రోజుల వరకు నాకు తెలియలేదు. ఆ పరిస్థితి మరి ఏ పేద అమ్మాయికీ రాకూడదనుకున్నాను. నా ఆశయానికి మా నాన్న నాకు అండగా నిలిచారు’ అని చెప్పింది నిషిత మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానంగా. నిషిత తండ్రి గులాబ్ సింగ్ వ్వాపారి. తండ్రి సాయంతో మొదట్లో తనకు తెలిసిన అమ్మాయిలకు ఫీజులు చెల్లిస్తూ ఉండేది. సంఖ్య పెరుగుతున్న కొద్దీ డబ్బు అవసరం మరింత పెరుగుతుందని అర్థం అయాక, తెలిసినవారి ద్వారా నిధులను సేకరించడం మొదలుపెట్టింది. అలా ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిలకు ఫీజులు చెల్లించింది. ఈ సంవత్సరం 10,000 మంది అమ్మాయిలకు ఫీజులు ఏర్పాటు చేసింది. పెళ్లికి దాచిన డబ్బు చదువులకు.. అమ్మాయిల చదువుకు అవసరమైనప్పుడు తన పెళ్లి కోసం దాచిపెట్టిన లక్షన్నర రూపాయలను 21 మంది అమ్మాయిల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. నిరుపేద అమ్మాయిల చదువుకు ఫీజు చెల్లించడమే కాకుండా, వారికి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు,. పండుగ సందర్భాలలో బట్టలు అందజేస్తుంది. టిఫిన్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి, మహిళలకు ఉపాధిని ఇచ్చింది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు ఉచితంగా టిఫిన్లు పెట్టే సదుపాయాన్ని కల్పించింది. నిషిత చేసే సేవలో దేశంలోని ప్రముఖులు మాత్రమే కాదు, అమెరికన్ సంస్థలు కూడా జత చేరాయి. ఒక్క అడుగుతో నిషిత మొదలుపెట్టిన ఈ విద్యాదానానికి ఇప్పుడు ఎన్నో అడుగులు జత కలిశాయి. ‘ఈ విద్యాయజ్ఞంలో మేము సైతం...’ అంటూ కదలివస్తున్నాయి. నిషిత లాంటి యువత చేసే మంచి ప్రయత్నాలు ఎంతోమందికి జ్ఞానకాంతిని చూపుతూనే ఉంటాయి. -
వేదికపై కుప్పకూలిన సీఎం, పీఎం ఆరా
సాక్షి,వడోదర: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (64) వేదికపై హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంలో అస్వస్థతకు గురైన ఆయన స్టేజ్‌పైనే పడిపోయారు. దీంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రథమ చిక్సిత అనంతరం అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇతర బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. వడోదరలోని నిజాంపురలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీసారు. (గుజరాత్ సీఎంకు కరోనా) ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్థానికబీజేపీ నాయకులు వెల్లడించారు. వడోదరలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా సీఎంకు కళ్లు తిరిగాయనీ దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పడిపోకుండా పట్టుకున్నారనీ బీజేపీ నేత భరత్ తెలిపారు. అనంతరం ఆయనను వడోదర నుంచి అహ్మదాబాద్‌కు హెలికాప్టర్లో తరలించామన్నారు. కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంతో రెండు రోజులుగా సీఎం ఆరోగ్యం దెబ్బతిందన్నారు. లో బీపీ, రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో నీరిసించి పోయారని వైద్యులు తెలిపారని చెప్పారు. కాగా గుజరాత్‌లోని వడోదరతో సహా కీలకమైన ఆరుమునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరగనున్నాయి. మునిసి పాలిటీలు, జిల్లాలు, తాలూకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయి. -
తండ్రి మరణం: హార్దిక్ ఎమోషనల్ పోస్టు
అహ్మదాబాద్: తండ్రి మరణం పట్ల టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఆయన లేని లోటు జీవితంలో పూడ్చలేనిదని పేర్కొన్నాడు. జీవితంలో తన తండ్రి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోవడం అత్యంత కఠినమైనదని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫోటోతోపాటు భావోద్వేగ పోస్టు చేశాడు. ‘నాన్నా.. నువ్ నా హీరో. నువ్ ఇక లేవు అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. మీరు వదిలి వెళ్లిన ఎన్నో మధుర జ్ఞాపకాలను, మీ నవ్వును ఎప్పుడూ మరువం నాన్నా. అన్నయ్య, నేను ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం మీరే. మీ కష్టం, మీపై మీకున్న నమ్మకం మీ కలల్ని నిజం చేసింది. మీ లేమితో ఈ ఇంటికి కళ తప్పింది. మిమ్మల్నెప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాం. మీ పేరు నిలబెడతాం. మీరు ఎక్కడున్నా మమ్మల్ని కనిపెడుతూనే ఉంటారని ఆశిస్తున్నా. మమ్మల్ని చూసి మీరు గర్వపడ్డారు. కానీ, మీ ఆదర్శవంతమైన జీవన ప్రయాణం చూసి మేమంతా గర్విస్తున్నాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా కింగ్. ప్రతిరోజు ప్రతి గడియా మిమ్మల్ని మిస్ అవుతా. లవ్ యూ డాడీ!!’ అని పాండ్యా పేర్కొన్నాడు.! (చదవండి: శార్దూల్, వషీ జబర్దస్త్; గతం గుర్తు చేసుకున్న సెహ్వాగ్) కాగా, భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు పితృవియోగం కలిగింది. వారి తండ్రి, 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండెపోటుతో శనివారం వడోదరలో కన్నుమూశారు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో బరోడా జట్టుకు సారథ్యం వహిస్తూ నగరంలోనే ఉన్న కృనాల్ ఇంటికి బయల్దేరగా... ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ముంబైలో సన్నద్ధమవుతోన్న హార్దిక్ వెంటనే వడోదర చేరుకున్నాడు. హిమాన్షు పాండ్యా మృతి పట్ల భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ సంతాపం తెలియజేశారు. (చదవండి: నేను ఇలాగే ఆడతా : రోహిత్ శర్మ) View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
పాండ్యా సోదరులకు పితృ వియోగం
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు పితృవియోగం కలిగింది. వారిద్దరి తండ్రి, 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండెపోటుతో శనివారం వడోదరలో కన్నుమూశారు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో బరోడా జట్టుకు సారథ్యం వహిస్తూ నగరంలోనే ఉన్న కృనాల్ ఇంటికి బయల్దేరగా... ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ముంబైలో సన్నద్ధమవుతోన్న హార్దిక్ వెంటనే వడోదర చేరుకున్నాడు. హిమాన్షు పాండ్యా మృతి పట్ల భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ సంతాపం తెలియజేశారు. -
నెలసరి దాచిపెట్టిందని విడాకులు
వడోదర: రుతుక్రమం ఆడవాళ్లకు శాపం కాదని, అది వారి శరీరధర్మంలో ఓ భాగమని మహిళా సంఘాలు చెప్తున్నాయి. కానీ ఓ వివాహిత మహిళకు మాత్రం రుతుక్రమం శాపంగా మారింది. గుజరాత్‌లోని వడోదరలో తన దగ్గర నెలసరి విషయాన్ని దాచిపెట్టిందని భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడో భర్త. అలాగే తన గొంతెమ్మ కోర్కెలు తీర్చడం తన వల్ల కాదంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి, టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళ ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో సదరు మహిళకు నెలసరి ఉన్నప్పటికీ ఈ విషయాన్ని భర్తకు చెప్పలేదు. తీరా పెళ్లయ్యాక గుడికి వెళ్తుంటే తను లోపలకు రాలేనని అసలు విషయాన్ని చెప్పింది. (చదవండి: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య) అలా వాళ్ల మధ్య వాగ్వాదం జరగ్గా ఈ విషయంలో ఆమె మీద నమ్మకం పోయిందని విడాకుల పిటిషన్లో పేర్కొన్నాడు. ఇంట్లోవాళ్లకు పైసా కూడా ఇవ్వొద్దని పోరు పెట్టేదన్నాడు. కేవలం ఆమె చేతి ఖర్చుల కోసమే ప్రతి నెలా రూ.5 వేలు ఇవ్వాలని, ఇంట్లో ఒక ఏసీ పెట్టించాలని హింసించేదని తెలిపాడు. తన దగ్గర అంత డబ్బు లేదని, ఆమె చెప్పిన కోరికలను తీర్చడం తన వల్ల కాదని చెప్పడంతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయేదని పిటిషన్లో వివరించాడు. చాలాసార్లు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రతి చిన్నదానికి పుట్టింటికి వెళ్లి సతాయించేందని వాపోయాడు. తను అడిగినవి చేయకపోతే.. నీచంగా బెదిరించేదన్నాడు. ఆమె మాటలను పట్టించుకోకుండా కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ గొడవలు మాత్రం ఆగడం లేదన్నాడు. ఒక రోజైతే టెర్రస్ మీద నుంచి దూకి చనిపోతానని భయపెట్టిందని చెప్పాడు. భార్యతో వేగలేనని ఎలాగైనా విడాకులు ఇప్పించమని కోరాడు. (చదవండి: ప్రాణం మీదికి తెచ్చిన ఫేస్బుక్ ప్రేమ) -
వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గాంధీనగర్/వడోదర: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం తెల్లవారుజామున వడోదర శివారులో వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలోని వంతెనపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో సూరత్ నుంచి పావగఢకు వెళ్తున్న ట్రక్కు వాఘోడియా వద్ద మరో ట్రక్కును ఢీకొట్టింది. వేకువజామున ప్రమాదం జరగడంతో అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి సీఎం విజయ్ రుపానీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. (చదవండి: మానవత్వం చాటుకున్న మంత్రులు..) Saddened by the loss of lives due to a road accident near Vadodara. Instructed officials to do needful. May those who have been injured recover at the earliest. I pray for the departed souls: Gujarat CM Vijay Rupani (File photo) https://t.co/DfjccVSVmN pic.twitter.com/peVSC1Jykk — ANI (@ANI) November 18, 2020 -
వయసు 25ఏళ్లు.. చేసిన మోసం రూ. 50 కోట్లు
అహ్మదాబాద్: ఇరవై ఐదేళ్ల సీఏ విద్యార్థిని వడోదరలో జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. టాక్స్ ఎగ్గొట్టడానికి ఫేక్ కంపెనీలను సృష్టించి 50.2 కోట్ల రూపాయల మేరకు తప్పుదారి పట్టించాడు. దీంతో అధికారులు అతనిని అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన మనీష్ కుమార్ ఖత్రీ 115 షల్ కంపెనీలు సృష్టించి, వివిధ రూపాలలో పన్ను ఎగ్గొట్టాడు. అనుమానాస్పద టాక్స్ పేయర్స్‌ను వెలికితీసే ప్రయత్నంలో ఖత్రీ వ్యవహారం రాష్ట్ర జీఎస్టీ అధికారుల దృష్టికి వచ్చింది. ఖత్రీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి టాక్స్ కట్టాల్సిన డబ్బును వివిధ కంపెనీలకు తరలించి 50 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దాహుద్ అనే చిన్న గ్రామంలో ఉన్న అమాయకుల నుంచి వారి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని వారి పేరు మీద ఈ కంపెనీలు సృష్టించినట్లు అధికారులు కనుగొన్నారు. వారికి నెలకు కొంత మొత్తం చెల్లిస్తానని ఖత్రీ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కంపెనీలు పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం అందించేందుకుఫేక్ వెబ్‌సైట్‌తో నకిలీ కంపెనీలు సృష్టించినట్లు ఖత్రీ అంగీకరించాడు. చదవండి: గుజరాత్లో విషాదం: ముగ్గురు మృతి -
గుజరాత్లో విషాదం: ముగ్గురు మృతి
గాంధీనగర్: గుజరాత్లో విషాదం చోటు చేసుకుంది. రాష్టంలోని వడోదర జిల్లా బవమన్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందకున్న స్థానిక పోలీసులు, రెస్కూ టీం ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలిలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కంగనా!
అహ్మదాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతితో పాటు మాదకద్రవ్యాల అంశానికి సంబంధించి బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు హిందీ చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయంగా సైతం సంచలనం సృష్టిస్తున్నాయి. కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ రామ్‌దాస్ అథవాలే కంగనాకు మద్దతుగా నిలిచారు. దీంతో కంగనా రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో వెలుగుచూసిన ఓ పోస్టర్ చర్చనీయాంశమైంది. త్వరలో జరగబోయే వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆర్పీఐ కంగనా ఫొటోలతో ఉన్న పోస్టర్‌ను వాడింది. (చదవండి: ఎన్ని నోళ్లు మూయించగలరు?) కాలాఘోడా ప్రాంతంలో వెలిసిన ఈ పోస్టర్లో అథవాలే, కంగనా ఉన్నారు. కంగనాకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆర్పీఐ వడోదర చీఫ్ రాజేశ్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. ముంబై వచ్చేందుకు కంగానా ఇబ్బందులు పడుతున్న సమయంలో తమ పార్టీ అధినేత అథవాలే ఆమెకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కాగా, యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి బంధుప్రీతి కారణమని వార్తల్లో నిలిచిన కంగనా, బాలీవుడ్‌ను డ్రగ్స్ మాఫియా శాసిస్తోందని చెప్పి తీవ్ర విమర్శలు చేసింది. దాంతోపాటు సుశాంత్ మృతి కేసు విచారణలో ముంబై పోలీసులపై నమ్మకం లేదని తేల్చి చెప్పింది. కంగనా వ్యాఖ్యలపై శివసేన పార్టీ నేతలు అభ్యంతరం తెలపడంతో వివాదం ముదిరింది. ఈక్రమంలోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ముంబై కార్పొరేషన్ కంగనా కార్యాలయంలో కొంత భాగాన్ని కూల్చేసింది. కక్ష సాధింపు చర్యలు చేపట్టారంటూ ఆమె హైకోర్టుకు వెళ్లడంతో.. అధికారుల దుందుడుకు చర్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్: కంగనా) -
వైరల్: పొలాల్లో ఏడడుగుల మొసలి
అహ్మదాబాద్: సాధారణంగా మొసళ్లు నదులు, పెద్ద చెరువుల్లో సంచరిస్తాయి. కానీ, గుజరాత్ వడోదరలోని ఓ గ్రామంలో మాత్రం పంట పొలాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా వడోదరాలో కేలన్పూర్ గ్రామంలోని పంట పొలాల్లోకి ఏడు అడుగుల మొసలి కనిపించింది. దాన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అదించారు. మొసళ్లను పట్టే ఫారెస్ట్ రెస్క్యూ బృందం కేలన్పూర్కు చేరుకొని మొసలిని పట్టుకున్నారు. చాలా శ్రమపడి ఎట్టకేలకు రెస్క్యూ బృందం మొసలిని పట్టుకొని బంధించి గుజరాత్ ఆటవీశాఖ ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను ‘మై వడోదరా’ ట్విటర్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (బ్రిటన్‌లో మరో జార్జ్ ఫ్లాయిడ్!) A crocodile was rescued by wildlife rescuers from Kelanpur. Crocodile was handed over to Forest dept.#vadodara #wildlife pic.twitter.com/r9MDkrw9Ex — My Vadodara (@MyVadodara) July 18, 2020 ‘తమ గ్రామంలోని పంట పొలాల్లో మొసలి సంచరిస్తోందని కేలన్పూర్ గ్రామస్తులు మాకు ఫోన్ ద్వారా సమాచారం అందిచారు. వెంటనే మేము ఆ ప్రదేశానికి చేరుకొని మొసలిని పట్టుకొని గుజరాత్ ఆటవీ శాఖ జంతసంరక్షణ కేంద్రానికి తరలించాము’ అని రెస్క్యూ టీంలోని ఓ వ్యక్తి తెలిపారు. అదే విధంగా ఈ గ్రామంలో మొసలిని పట్టుకోవటం ఇది ఏడోసారి అని చెప్పారు. ఇక జంతువులను పట్టుకునే క్రమంలో జాగ్రత్తలు పాటిస్తాము. తగిన భద్రలు చర్యలు తీసుకుంటాము. మేము జంతువులకు సాయం చేస్తున్నామని వాటికి తెలియదు. అందుకే తమపై దాడి చేయానికి ప్రయత్నిస్తాయని పేర్కొన్నారు. -
మహిళా కమెడియన్‌కు లైంగిక వేధింపులు
-
మహిళా కమెడియన్‌కు లైంగిక వేధింపులు
ముంబై : ప్రముఖ మహిళా కమెడియన్‌పై సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఓ వ్యక్తిని ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ముంబైకు చెందిన స్టాండప్ కమెడియన్ అగ్రిమా జాషువా 2019లో మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్న చత్రపతి శివాజీ విగ్రహం గురించి వీడియో రూపంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది జరిగిన ఏడాదికి కొంతమంది నెటిజన్లు ప్రస్తుతం ఆమెపై విమర్శల దాడికి దిగారు. మరాఠా పాలకుడు చత్రపతి శివాజీని అగ్రిమా అగౌరవపరించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వడోదరకు చెందిన శుభం మిశ్రా అనే వ్యక్తి అగ్రిమాను అసభ్య పదజాలంతో దూషించాడు. చత్రపతి శివాజీ గురించి అగ్రిమా మాట్లాడిన వ్యాఖ్యలను ఉద్ధేశిస్తూ ఆమెను లైంగిక వేధింపులతో బెదిరిస్తూ మిశ్రా శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోలను పోస్ట్ చేశాడు. (కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్ ట్వీట్) దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. మిశ్రా వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మా గుజరాత్ డీజీపీకి లేఖ రాశారు. మహిళలకు సోషల్ మీడియాలో సురక్షిత వాతావరణాన్ని, సైబర్ భద్రతను కల్పించేందుకు ఎన్సీడబ్ల్యూ కట్టుబడి ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇక నిందితుడు మిశ్రాపై వడోదర పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ల ప్రకారం నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుజరాత్ డీజీపీ శివానందర్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా కమెడియన్ జాషువాపై విమర్శలు వెల్లువెత్తడంతో చత్రపతి శివాజీ అనుచరుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమె క్షమపణలు కోరారు. అలాగే దీనికి సంబంధించిన వీడియోను డిలీట్ చేశారు. (నటుడు రాజన్ సెహగల్ కన్నుమూత) Vadodara City Police took suo moto action in respect of an abusive, threatening video which was uploaded and shared on Social media by Shubham Mishra. We have detained him and initiated legal process for registration of FIR against him under relevent section of IPC and IT act. pic.twitter.com/XM6J8y4nDx — Vadodara City Police (@Vadcitypolice) July 12, 2020 -
సస్పెన్షన్ తొలగించినా కోచ్‌గా నియమించలేదు
వడోదరా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ అతుల్ బెదాడేపై విధించిన సస్పెన్షన్‌ను బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) తొలగించింది. అయితే సీనియర్ మహిళా జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి అతన్ని తప్పించింది. ఆరోపణల నేపథ్యంలో అతనిపై ప్రాథమిక విచారణ చేశాం. ఉన్నతస్థాయి కమిటీ... అతనిపై వచ్చిన ఆరోపణలు, జరిగిన విచారణపై చర్చించింది. అనంతరం ఈ సమస్యకు ముగింపు పలికిన కమిటీ బెదాడేపై సస్పెన్షన్‌ను తొలగించింది. అయితే సున్నితమైన ఈ అంశంపై వివాదం రేపకూడదన్న ఉద్దేశంతో మహిళా క్రికెట్ జట్టుకు కోచ్‌గా అతన్ని తప్పించింది’ అని బీసీఏ కార్యదర్శి అజిత్ లెలె తెలిపారు. త్వరలోనే బరోడా మహిళా జట్టుకు అంజూ జైన్‌ను హెడ్ కోచ్‌గా నియమించనున్నారు. (ఇక టెస్టులు ఆడటం నాకు సవాలే) -
వంటిల్లుగా మారిన పోలీస్ స్టేషన్
వడోదర: రూల్స్ బ్రేక్ చేస్తే లాఠీ ఎత్తడమే కాదు, ఆకలి అని పిలిస్తే అన్నం పెట్టేందుకు రెడీ అంటున్నారు పోలీసులు. ఇందుకోసం పోలీస్ స్టేషన్‌ను వంటశాలగా మార్చేసిన అద్భుత దృశ్యం గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది. లాక్డౌన్ వల్ల వలస కూలీలతోపాటు నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. వారి ఘోసలు చూసిన పోలీసుల మనసు చలించిపోయింది. కానీ నిస్సహాయులుగా మిగిలిపోయారు. మరోవైపు ఓ వ్యక్తి, ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురు క్యాన్సర్ కారణంగా మరణించింది. దీంతో అతను ఎంతగానో కుమిలిపోయాడు. తన గారాల పట్టి జ్ఞాపకార్థంగా ఏదైనా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అన్నదానానికి సిద్ధమయ్యాడు. (ప్రతాప్.. మళ్లీ పోలీస్) ఇందుకోసం వడోదరా పోలీసులను కలిసి తన ఆలోచన వివరించాడు. అప్పటికే కళ్ల ముందు కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు చూసి చలించిపోయిన పోలీసులు అతని ఆలోచనను ఆచరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం డీసీపీ సరోజ్ కుమారి ఎనిమిది మంది సభ్యులతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా తమ డ్యూటీలు పూర్తైన తర్వాత కిచెన్‌లో చెమటోడ్చుతారు. స్వహస్తాలతో వంట చేసి నిరుపేదలకు భోజనం పెడతారు. ఈ విషయం తెలిసిన చాలామంది పుట్టిన రోజులు, పెళ్లి రోజులకు పెట్టే ఖర్చును డబ్బు లేదా సరుకు రూపేణా పోలీస్ స్టేషన్‌కు విరాళంగా ఇస్తున్నారు. వీటి సహాయంతో పోలీసులు వంట చేసి ప్రతి రోజు 600 మందికి కడుపు నింపుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. (అనాథ ఆకలి తీర్చిన పోలీస్) -
‘లూడో’లొ ఓడించిందని భార్యను..
వడోదర : లాక్‌డౌన్‌తో ఇప్పుడు అందరూ ఇండోర్ గేమ్స్ మీద పడ్డారు. అష్టాచమ్మా, వైకుంఠపాళీ, లూడో లాంటి పాతకాలపు ఆటలను మళ్లీ ఇప్పుడు ఆడుతూ చక్కగా కాలక్షేపం చేస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ వదలలేని వాళ్లు గేమ్స్ కూడా ఫోన్లోనే ఆడుతున్నారు. అయితే ఈ ఆన్లైన్ గేమ్స్ కాస్త గొడవలకు దారి తీస్తున్నాయి. లూడో గేమ్‌లో తనను తరచూ ఓడిస్తుందన్న కోపంతో భార్యను చితకబాదాడు ఓ భర్త. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది. (చదవండి : వామ్మో! ఖైదీల లాక్డౌన్ అంటే ఇలానా?) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడోదరకు చెందిన ఓ మహిళ ట్యూషన్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేసేవాడు.లాక్డౌన్ నేపథ్యంలో ఖాళీగా ఉండడంతో భర్తతో లూడో గేమ్ ఆడాలకుంది. భర్తను ఒప్పించి ఆన్లైన్లో లూడో గేమ్ ఆడారు. వారితో పాటు కాలనీలోని మరికొంత మంది కూడా ఆన్లైన్లో లూడో గేమ్ ఆడారు. అయితే ప్రతిసారి ఆమె తన భర్తను ఓడించింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. ఆమెతో గొడవదిగి దాడి చేశాడు. తీవ్రంగా దాడి చేయడంతో ఆమె వెన్నెముక విరిగిపోయిందని వైద్యులు వెల్లడించారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. భర్త క్షమాపణలు కోరడంతో ఆమె కేసు విత్‌డ్రా చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: 12మంది మృతి
గాంధీనగర్: గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాద్రా తాలుకాలోని మహువాద్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో, ట్రక్కు ఢీ కొన్న ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మరణించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. -
వడోదరలోని గ్యాస్ కర్మాగారంలో పేలుడు
వడోదర: గుజరాత్ వడోదర జిల్లాలోని ఓ మెడికల్ గ్యాస్ తయారీ కర్మాగారంలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సుమారు 11 గంటల సమయంలో పద్రా తహసీల్ గవాసద్ గ్రామంలోని ఎయిమ్స్ ఇండస్ట్రీస్‌లో ఈ పేలుడు చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని పోలీసులు చెప్పారు. సిలిండర్లలో గ్యాస్ నింపే సమయంలో ఈ పేలుడు సంభవించిందని వడోదర రూరల్ ఎస్పీ సుధీర్ చెప్పారు. -
గుజరాత్లో భారీ పేలుడు; ఐదుగురు మృతి
వడోదర : గుజరాత్‌లోని వడోదర ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మెడికల్ గ్యాస్ ప్లాంట్‌లో శనివారం భారీ పేలుడు చోటుచేసుకొని ఐదుగురు మృతి చెందారు. కాగా ఈ అగ్ని ప్రమాదం ఉదయం 11గంటలకు జరిగినట్లు పోలీసులు పేర్కోన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీ పోలీసింగ్‌ను ప్రశంసించిన మోదీ
సాక్షి, విజయవాడ: గుజరాత్‌లోని వడోదరలో పోలీస్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను గురువారం సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పోలీసుల పనితీరును ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖల స్టాల్స్‌ను ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ నేటి నుంచి నవంబర్ 6 వరుకు కొనసాగనుంది. ఏపీ పోలీస్ స్టాల్ అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో.. ఏపీ స్టాల్ వద్ద ప్రత్యేక పోలీస్ విధానంపై ప్రధాని మోదీ ఆసక్తి కనబరిచారు. అంతేకాక రాష్ట్ర పోలీసుశాఖలో అమలు చేస్తున్న స్పందన, వీక్లీఆఫ్ సిస్టమ్ వివరాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. స్పందన, వీక్లీ ఆఫ్‌ల పనితీరును ప్రశంసిస్తూ వాటిని పూర్తి స్థాయిలో అమలుచేసి వివరాలు అందజేయాలని ప్రధాని మోదీ పోలీసుశాఖను కోరారు. కాగా స్పందన, వీక్లీ ఆఫ్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్, ఫేస్ రికగ్నైజేషన్, ఈ విజిట్, డీజీ డాష్ బోర్డ్, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ వివరించే టేబుల్స్‌ను స్టాల్లో ఏర్పాటు చేశారు. -
అమ్మో! ఎంత పెద్ద కొండచిలువ
వడోదర : గుజరాత్లో శనివారం 10 అడుగులున్న కొండచిలువను వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వడోదరకు చెందిన వ్యక్తి రోజు మాదిరిగానే శనివారం ఉదయం పొలం పనులు చూసుకునేందుకు తన ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. కాసేపటి తర్వాత ఏదో అలికిడయిన శబ్దం వినిపించడంతో చెట్ల పొదల్లోకి తొంగి చూడగా కొండచిలువ కనిపించింది. వెంటనే వైల్డ్ లైఫ్ రెస్క్యూకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని చెట్ల పొదలను తొలగించి 10 అడుగుల కొండచిలువను బయటికి తీశారు. తర్వాత ఆ కొండచిలువను అక్కడి అటవీ అధికారులకు అప్పజెప్పారు. కాగా,ఈ వీడియోనూ తీసిన ఒక మీడియా సంస్థ తమ ట్విటర్లో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. -
ఇప్పుడెలా వేస్తారు ట్రాఫిక్ చలానా!?
గాంధీనగర్: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తూ.. జేబు గుల్ల చేస్తోంది. వాహనానికి సంబంధించి ఏ చిన్న కాగితం లేకపోయినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గతంలో మాదిరి ఇంట్లో మర్చిపోయాను సర్ అంటే కుదరదు. అన్ని కాగితాలను మనతో పాటు తీసుకెళ్లాల్సిందే. ఈ క్రమంలో ఓ వ్యక్తి బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించుకుని తిరుగుతున్నాడు. వివరాలు.. గుజరాత్ వడోదరకు చెందిన రామ్ షా అనే వ్యక్తి ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా రోజంతా ఎక్కడెక్కడో తిరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం వచ్చిన నూతన మోటార్ వాహన చట్టం వల్ల ఏ చిన్న కాగితం మిస్ అయినా పెద్ద మొత్తంలో చలాన్ కట్టాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి రామ్ షా ఓ వినూత్న మార్గం కనుగొన్నాడు. ఎక్కడికెళ్లినా హెల్మెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. దాంతో బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించాడు. ఇక నేను కాగితాలు చూపించడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పని లేదు.. ఫైన్ కట్టాల్సిన అవసరం లేదంటున్నాడు రామ్ షా. ఇతని ప్రయత్నాన్ని ట్రాఫిక్ పోలీసులు కూడా అభినందిస్తున్నారు. (చదవండి: విక్రమ్ ల్యాండర్‌కు చలాన్ విధించం) -
వడోదరలో ఎక్కడ చూసినా మొసళ్లే
-
ఎక్కడ చూసినా మొసళ్లే.. బిక్కుబిక్కుమంటూ జనం!
వడోదర : ఎండాకాలం పోయింది. వర్షాలు కురుస్తున్నాయి. చల్లగా ఉంటుందిలే అనుకుంటే గుజరాత్‌లోని వడోదర నగర వాసులకు ‘కొత్త’ కష్టాలు మొదలయ్యాయి. బుధవారం నుంచి భారీ వర్షాలు కురవడంతో వరదనీరు నగరాన్ని ముంచెత్తింది. అంతేనా.. శనివారం కాస్త వర్షాలు తగ్గి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఊపిరిపీల్చుకుంటున్న నగరవాసులకు మొసళ్ల రూపంలో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. వరదలతోపాటే నగరంలోకి కొట్టుకొచ్చిన మొసళ్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుండటంతో వారు భయంతో వణికిపోతున్నారు. ఎక్కడి నుంచి మొసలి వచ్చి దాడి చేస్తుందేమోనని భయపడి ఇళ్లలోనుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇలా మొసళ్లతో పడుతున్న బాధలను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు వడోదర నుంచి ఏ పోస్టు వచ్చినా మొసళ్లతో పడుతున్న బాధల గురించే ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు మొసళ్లు అక్కడి రోడ్లపై ఏ రేంజ్లో స్వైరవిహారం చేస్తున్నాయో.. మొన్న నీళ్లలోంచి మొసలి హఠాత్తుగా వచ్చి వీధి కుక్కపై దాడి చేయబోయిన వీడియో వైరల్ కాకముందే తాజాగా నడిరోడ్డుపై మొసలి కనిపించడం, దాన్ని రెస్క్యూ టీం చాకచక్యంగా బంధించే వీడియో వైరల్ అవుతోంది. రెస్క్యూ సిబ్బంది గత మూడు రోజులుగా మొసళ్లను బంధించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఒక దాన్ని బంధించి సురక్షిత ప్రదేశంలో విడవగానే మరొకచోట నుంచి ఫోన్ వస్తోందని రెస్క్యూ సిబ్బంది ఒకరు వెల్లడించారు. నగరంలో నుంచి వరద నీరు పూర్తిగా వెళ్లేంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
రెండు యూనిట్లు మూత: సైంటిస్టులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : వరుస నష్టాలు లేదా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కార్పొరేట్ దిగ్గజాలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి తాత్కాలిక ఉద్యోగులను తొలగించగా, ఫార్మ దిగ్గజం సన్‌ఫార్మ కూడా బాటలో ఇదే పయనిస్తోంది. రెండు యూనిట్లను మూసి వేయడంతో ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టులను పెద్ద సంఖ్యలో తొలగించింది. క్లినికల్ ఫార్మకాలజీ విభాగంలో పనిచేస్తున్న 85 మందికి ఉద్వాసన పలికింది. వడోదర ఆర్ అండ్ డి యూనిట్లలో పనిచేస్తున్న వీరిని ముందస్తు సమాచారం లేకుండానే వేటు వేసింది. ఇది ఉద్యోగుల్లో ఆందోళనకు దారి తీసింది. వడోదరలోని తాండల్జా, అకోటాలోని తమ రెండు కేంద్రాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వాటిని బయో-ఈక్వెలెన్స్ స్టడీస్‌కు ఉపయోగించినట్టు చెప్పింది. అయితే, ఈ యూనిట్లలో తమ కార్యకలాపాలను నిలిపివేసి, ఇతర సౌకర్యాలకు మార్చామని సన్ ఫార్మాస్యూటికల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఆర్ అండ్ డి కార్యకలాపాలలో పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొంది. బయో-ఈక్వెలెన్స్ స్టడీస్ నిర్వహించే క్లినికల్ ఫార్మకాలజీ యూనిట్ల (సీపీయూ) సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి వడోదరలోని తాండల్జా, అకోటాలోని రెండు కేంద్రాలలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని సన్‌ఫార్మ ప్రతినిధి చెప్పారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల జీతం ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో ఉద్యోగులను నియంత్రించేందుకు బౌన్సర్లను వినియోగించారన్న వార్తలు సోషల్ మీడియాలోగుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను సన్‌ఫార్మ ఖండించింది. బాధిత ఉద్యోగులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. అవుట్‌ప్లేస్‌మెంట్ కోసం సహాయం చేస్తున్నామని ప్రకటించింది. నిబంధనలకనుగుణంగానే వ్యవహరిస్తున్నామనీ రెగ్యులేటరీ అధికారులకు పూర్తి సమాచారాన్ని అందిస్తున్నామనికూడా కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. -
టబ్‌లో చిన్నారి; సెల్యూట్ సార్!
అహ్మదాబాద్ : అత్యవసర సమయాల్లో కఠినంగా వ్యవహరించడమే కాదు విపత్కర కాలంలో ప్రాణాలకు తెగించైనా పౌరులకు అండగా నిలుస్తామని నిరూపించారో ఎస్సై. వరదలో చిక్కుకున్న తల్లీ కూతుళ్లను సురక్షితంగా బయటికి తీసుకువచ్చి ప్రశంసలు అందుకుంటున్నారు. గుజరాత్‌లోని వడోదర పట్టణం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్టణ సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎన్నో కుటుంబాలు వరదలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఈ క్రమంలో వరద మరింత ఉధృతం కానుందన్న సమాచారం నేపథ్యంలో దేవీపురలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించారు. రక్షణ చర్యల్లో భాగంగా తన బృందంతో అక్కడికి చేరుకున్న ఎస్సై గోవింద చద్వాకు మహిళ, ఏడాదిన్నర వయస్సున్న ఆమె బిడ్డ సాయం కోసం అర్ధించడం కనిపించింది. దీంతో పాపను ఓ టబ్‌లో పడుకోబెట్టిన గోవింద తన తలపై ఆమెను మోసుకుంటూ తీసుకువచ్చారు. వరదలో కిలోమీటరున్నర దూరం నడిచి పాపను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. అనంతరం పాప తల్లితో పాటు వరదల్లో చిక్కుకున్న మరికొంత మందిని కూడా కాపాడారు. ఈ క్రమంలో ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది. ఇక ఈ విషయంపై స్పందించిన గోవింద ఇదంతా తన విధి నిర్వహణలో భాగమేనని... పాపను రక్షించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. -
మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే!
-
మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే!
దండిగా వర్షాలు పడ్డాయి. వీధులు చెరువులుగా మారాయి. భారీ వర్షాలతో గుజరాత్‌లోని వడోదరా పట్టణం ఇప్పుడు అతలాకుతలం అవుతోంది. వీధుల్లో వరదనీరు వచ్చి చేరడంతో పట్టణంలోని చాలా వీధులు చెరువుల్ని తలపిస్తున్నాయి. చుట్టూ చేరిన నీరుతో బయటకు వెళ్లలేక పట్టణవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికితోడు వరద నీళ్లో మొసళ్లు తిష్టవేశాయి. వరదనీటిలో ఎక్కడ చూసినా మొసళ్లు తిరుగుతున్నాయి. దీంతో గుండెల్ని అరచేత పట్టుకొని.. వడోదరా వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వడోదర వీధుల్లోని వరదనీటిలో మొసళ్లు తిష్టవేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియోలో వరదనీటిలో మొసలి వేట భయంగొలిపే రీతిలో ఉంది. వరదనీటిలో చేరిన మొసలి.. వరదలో బిక్కుబిక్కమంటూ ఉన్న ఓ కుక్కను మింగేయాలని చూసింది. కుక్కకు ఏమాత్రం అనుమానం కలుగకుండా మెల్లగా దానిని అనుసరిస్తూ.. దగ్గరగా వెళ్లి.. అమాంతం దాడి చేసేందుకు మొసలి ప్రయత్నించింది. అయితే, అప్రమత్తంగా ఉన్న కుక్క వెంటనే పక్కకు తొలగడంతో దాడి నుంచి తప్పించుకుంది. అక్కడే మరో కుక్క బిక్కుబిక్కుమంటూ ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
భారీ వర్షాలతో ఆ ఎయిర్పోర్ట్ మూసివేత
అహ్మదాబాద్ : గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. వదోదరలో వరద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. వదోదర రైల్వే స్టేషన్‌ను మూసివేయడంతో 22కి పైగా రైళ్లు రద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించే ప్రక్రియలో సహకరిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. అహ్మదబాద్, సూరత్ సహా మధ్య గుజరాత్లో భారీ వర్షాలతో సాధారణ జనజీవనం స్థంభించింది. మరో 48 గంటలు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుజరాత్లో వరదల పరిస్థితిపై సీఎం విజయ్ రూపాని అధికారులతో సమీక్షించారు. -
మహిళలు స్విమ్మింగ్ చేస్తుండగా ఫొటోలు తీసినందుకు..
వడోదరా : మహిళలు స్విమ్మింగ్ చేస్తుండగా ఫొటోలు తీయటమే కాకుండా, ఫొటోలు తీయవద్దన్నందుకు మహిళలను దూషించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వడోదరకు చెందిన ఆకాశ్ పటేల్ (30) ఇంటి దగ్గరలో ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. సోమవారం ఇంటి బాల్కనీలోకి చేరుకున్న అతడు.. స్విమ్మింగ్ పూల్‌లోని మహిళలను మొబైల్లో ఫొటోలు తీయటం ప్రారంభించాడు. ఇది గమనించిన మహిళలు ఫొటోలు తీయవద్దని హెచ్చరించటంతో వారిపై తిట్లదండకం ఎత్తుకున్నాడు. దీంతో ఓ మహిళ ఆకాశ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 354, 294, 506క్రింద అతడిపై కేసు నమోదు చేశారు. -
17 నెలలు పాక్ చెరలో బందీ..
గాంధీనగర్: పాకిస్తాన్లో బందీలుగా ఉన్న భారతీయ జాలర్లను విడిపించేందుకు భారత విదేశాంగశాఖ చేసిన ప్రయత్నలు ఫలించాయి. పాకిస్తాన్‌ను నుంచి ఈనెల 8న విడుదలైన 100 భారత జాలర్లు శుక్రవారం మాతృభూమిపై అడుగుపెట్టారు. వాఘా సరిహద్దులో దేశంలోకి ప్రవేశించిన వారు గురువారం అర్థరాత్రి అనంతరం వడోదర చేరుకున్నారు. గుజరాత్‌కు చెందిన జాలర్లు 17 నెలల క్రితం చేపలు పడుతూ అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటి పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లారు. దీంతో 100 మంది జాలర్లను పాక్ గస్తీ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారందరినీ కరాచీ జైలులో నిర్భందించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ పలు దఫాలుగా పాక్ ప్రభుత్వంతో చర్చించింది. ఏడాదిన్నర కాలం తర్వాత జాలర్లను జైలు నుంచి విడుదల చేసిన పాక్.. ఈ నెల 8న అట్టారీ -వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యానికి అప్పగించింది. అక్కడ్నుంచి అమృత్సర్ మీదుగా వడోదరకు రైలులో జాలర్లను తీసుకువచ్చారు. జాలర్ల విడుదలపై వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. తమను ఒక గదిలో బంధించారని, వేరే చోటకు వెళ్లేందుకు అనుమతించలేదని ఓ జాలర్ వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించాలనే ఉద్దేశంతో.. 360 మంది భారత ఖైదీలను విడుదల చేస్తామని ఏప్రిల్ 5వ తేదీన పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు విడతల్లో అందరినీ విడుదల చేస్తామని పాక్ ప్రకటించింది. -
వడోదర పోటీలో వివేక్ ఒబెరాయ్..?
సాక్షి, వడోదర: ఒకవేళ తాను 2024లోపు తాను రాజకీయ ప్రవేశం చేస్తే, గుజరాత్‌లోని వడోదర స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతానని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నాడు. గత ఎన్నికల్లో ప్రధాని మోదీ వడోదర నుంచి లోక్‌సభ బరిలో ఉన్నప్పుడు.. ఇక్కడి ప్రజలు చూపింపన ప్రేమ, వాత్సల్యాలు తనను చాలా ఆకట్టుకున్నాయని ఆయన ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మకథ ఆధారంగా తీస్తున్న పీఎం నరేంద్రమోదీ సినిమా ప్రమోషన్లో భాగంగా వడోదరలోని పారుల్ విశ్వవిద్యాలయాన్ని వివేక్ ఒబెరాయ్ సందర్శించారు. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శనివారం కొట్టేసిన సంగతి తెలిసిందే. ప్రజలను ఏమార్చడానికి, మభ్యపెట్టడానికి, ఆకట్టుకోవడానికే ఈ బయోపిక్‌ను తెరకెక్కించారని కాంగ్రెస్ నేత వేసిన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ‘పీఎం నరేంద్ర మోదీ చిత్రం చేసే ముందు మోదీ బాడీ లాంగ్వేజ్‌ను చాలా రోజులు గమనించాను. మోదీ లుక్ ఖరారుకు 16 రోజల సమయం తీసుకున్నాం. ఇది అందరిలో స్ఫూర్తినింపే సినిమా. ఎవరి అండదండలు లేకుండా దేశ ప్రధానిగా, ప్రపంచంలోని ముఖ్య నేత స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తి అపురూప గాథను ఈ సినిమాలో చూడొచ్చ’ని వివకేక్ ఒబెరాయ్ అన్నారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, ప్రశాంత్ నారాయణ్, బర్ఖా బిష్త్, రాజేంద్ర గుప్తా, జరీనా వాహబ్ ప్రధాన పాత్రలు పోషించారు. -
కీలక నియోజకవర్గాలు: ఈ విశేషాలు తెలుసా!?
కాషాయ కోట గుజరాత్‌లోని లోక్‌సభ నియోజకవర్గమిది. ఇంతకు పూర్వం దీనిని బరోడాగా పిలిచేవారు. 2009 నుంచి వడోదర అని పిలుస్తున్నారు. బరోడా మహారాజు ఫతేసింగ్‌రావ్ గైక్వాడ్ ఈ నియోజకవర్గం మొట్టమొదటి ఎంపీ. 2009లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. బరోడా రాజ వంశానికి చెందిన ముగ్గురు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1991 ఎన్నికల్లో టీవీ రామాయణంలో సీతగా నటించిన దీపికా చిఖాలియా బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ మిస్త్రీపై 5,70,128 ఓట్ల రికార్డు మెజారిటీతో గెలిచారు. అయితే, ఆ ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. దాంతో వడోదరను వదిలేసుకున్నారు. ప్రస్తుతం బీజేపీ నేత రంజన్‌బెన్ ధనంజయ్ భట్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1998 నుంచి ఇంత వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీయే గెలిచింది. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు(సావ్లి, వఘోదియా, వడోదర షహెర్, సయజిగంజ్, అకోట, రావుపుర, మంజల్పూర్) ఉన్నాయి. మేనకా గాంధీ అడ్డా ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ సతీమణి మేనకా గాంధీ సొంత నియోజకవర్గంగా పేరు పొందింది ఫిలిబిత్. అంతే కాకుండా దేశంలో ఒక మహిళను ఐదు కంటే ఎక్కువ సార్లు పార్లమెంటుకు పంపిన ఘనత కూడా ఈ నియోజకవర్గానిదే. ప్రారంభంలో వరసగా మూడు సార్లు ఇక్కడ ప్రజా సోషలిస్టు పార్టీ (పీఎస్పీ) గెలిచింది. తర్వాత నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1989 నుంచి మేనకాగాంధీ ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆమె వివిధ పార్టీల అభ్యర్థి, ఇండిపెండెంటుగా పోటీ చేసినా గెలవడం విశేషం.1991లో అయోధ్య ప్రభావంతో జనతాదళ్ తరఫున పోటీ చేసిన మేనకా గాంధీ బీజేపీ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆమె బీజేపీలో చేరారు. 2004, 2014లలో మేనకాగాంధీ బీజేపీ టికెట్టుపై ఇక్కడ పోటీ చేసి గెలిచారు. 2009లో మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ఈ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆమె అవోన్లా నుంచి గెలిచారు. గత ఎన్నికలో ఆమె సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి బద్సేన్ వర్మపై 3,07,052 ఓట్ల ఆధిక్యతతో ఈ స్థానం నుంచి గెలిచారు. శరద్ పవార్‌దే పవర్ మహారాష్ట్రలోని మరో కీలక నియోజకవర్గం బారామతి. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో(దవుంద్, ఇండపూర్, బారామతి, పురందర్, భోర్, కథక్వశాల) కూడిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన శరద్ పవార్ ఈ పార్టీని స్థాపించారు. 1957 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో 9 సార్లు కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. శరద్‌పవార్ 1984లో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) తరఫున పోటీ చేసి నెగ్గారు. 1991 ఉప ఎన్నికల నుంచి 1998 వరకు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999 నుంచి 2004 వరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. 2009 నుంచి ఆయన కుమార్తె సుప్రియ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె ఆర్‌ఎస్‌పీఎస్ అభ్యర్థి మహదేవ్ జగన్నాథ్ జంకార్పై 69,719 ఓట్ల ఆధికత్య సాధించారు. పట్నా సాహిబ్.. సిన్హా బిహార్ రాజధాని పట్నా జిల్లాలో ఉందీ నియోజకవర్గం. 2008 వరకు రాజధాని పట్నా ఒకే నియోజకవర్గంగా ఉండేది. ఆ సంవత్సరం నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో దీనిని రెండు నియోజకవర్గాలు చేశారు. ఒకటి పట్నా సాహిబ్ కాగా రెండోది పాటలీపుత్ర (బిహార్‌ను పూర్వ పాటలీపుత్రం అని పిలిచేవారు). దీని పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు (భక్తియార్పూర్, దిఘ, బంకిపూర్, కుమ్రార్, పట్న సాహిబ్, ఫతుహ) ఉన్నాయి. బీజేపీ తరఫున శత్రుఘ్న సిన్హా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికల్లో కూడా ఈయనే గెలిచారు. గత ఎన్నికల్లో శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ అభ్యర్థి కునాల్ సింగ్‌పై 2,65,805 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. -
పెళ్లి ఊరేగింపులో అమర జవాన్లకు ఘన నివాళి
వడోదరా: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశ ప్రజలు ఘనంగా నివాళులు ఆర్పిస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన నూతన వధూవరులు కూడా పుల్వామా ఉగ్రదాడిపై తమలో ఉన్న ఆవేదనను చాటిచెప్పారు. అందులో భాగంగా తమ పెళ్లి ఊరేగింపు వేడుకలో అమరులైన సైనికులకు ఘన నివాళులర్పించారు. వివాహనికి ముందు జరిగిన పెళ్లి ఊరేగింపులో భాగంగా గుర్రపు రథంలో కూర్చున్న వధూవరులు జాతీయ జెండాతో పాటు.. ఓ ఫ్లకార్డును ప్రదర్శించారు. దేశంలో కేవలం 1427 పులులు మాత్రమే ఉన్నాయని ఎవరు అన్నారు.. సరిహద్దులో ఉన్న 13 లక్షల పులులు దేశానికి రక్షణ కల్పిస్తున్నాయనే సందేశాన్ని అందులో ఉంచారు. వధూవరులు మాత్రమే కాకుండా ఆ వివాహ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు జాతీయ జెండాను చేతబూని అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ గత గురువారం జరిపిన ఆత్మహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. -
న్యూ ఇయర్ వేడుకల్లో పొట్టి దుస్తులకు నో..
అహ్మదాబాద్ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మహిళల భద్రతపై రాజీపడబోమని వడోదర పోలీసు అధికారులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో పొట్టి దుస్తులు వేసుకోరాదని మహిళలు, యువతులను పోలీసులు హెచ్చరించారు. చిన్నారులు, సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపే కార్యకలాపాల్లో పాల్గొనరాదని పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యపానం, మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని వడోదర పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గహ్లోత్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏటా నూతన సంవత్సర వేడుకల పేరుతో డిసెంబర్ 31న విపరీతంగా మద్యం,డ్రగ్స్ సేవించడంతో పాటు అసభ్యకర ధోరణులతో సంఘ వ్యతిరేక శక్తులు చెలరేగుతున్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో లౌడ్ స్పీకర్లు వాడరాదని, రాత్రి పదిగంటల తర్వాత బాణాసంచా కాల్చరాదని స్పష్టం చేశారు. వేడుకల నిర్వాహకులు సీసీటీవీ కెమెరాలు అమర్చాలని, అశ్లీల నృత్యాలు చేయరాదని పేర్కొన్నారు. ఇక న్యూఇయర్ వేడుకల సందర్భంగా వడోదరలో 40 చెక్‌పోస్టులు నగరంలో 1000 మంది పోలీసులను మోహరిస్తున్నట్టు నోటిఫికేషన్లో పొందుపరిచారు.కాగా పోలీసులు జారీ చేసిన నోటిఫికేషన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. మహిళలు, పురుషులు వారు ఏం ధరించాలనేదానిపై నియంత్రణలు తగవని ఇది మోరల్ పోలీసింగ్‌కు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
ఆంటీ మీరు కూడనా..!
-
ఆంటీ మీరు కూడనా..!
గాంధీనగర్ : ‘కికీ చాలెంజ్’.. ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తూ, వారిని నడిరోడ్లపై నాట్యం చేయిస్తూ, పోలీసులకు నిద్ర లేకుండా చేస్తోంది. ‘ఈ చాలెంజ్ చాలా ప్రమాదకరం’ అని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తోన్న వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. యువతరం మొదలుకొని సెలబ్రిటీస్ వరకూ ఈ చాలెంజ్‌ను స్వీకరించి తమ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు వీరి కోవలోకి ఒక వడోదర ఆంటీ చేరారు. సెలబ్రెటీలు చేసిన కికీ డ్యాన్స్ కంటే ఎక్కువగా ఇప్పుడు ఈ ఆంటీ డ్యాన్సే ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. కికీ పుణ్యామా అని కేవలం ఒక్క రోజులోనే కావాల్సినంత పబ్లిసిటీ దక్కించుకోని పాపులర్ అయ్యారు ఈ వడోదర ఆంటీ. కానీ ఈ వెర్రి ఇక్కడకు కూడా పాకడంతో తలలు పట్టుకుంటున్నారు వడోదర పోలీసులు. దాంతో సదరు వీడియోలో ఉన్న ఆంటీ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. వివరాల ప్రకారం.. వడోదరకు చెందిన మధ్య వయస్కురాలైన రిజ్వానా మిర్ కికీ చాలెంజ్‌లో భాగంగా ‘ఇన్ మై ఫిలింగ్స్’ సాంగ్‌కు డాన్స్ చేసి, ఆ వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. కికీ సాంగ్‌కు ఈ ఆంటీ వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘వాహ్ ఆంటీ.. ఏం ఎనర్జీ, అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రసుత్తం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లకు నచ్చిన ఈ ఆంటీ డ్యాన్స్, పోలీసులకు మాత్రం వణుకు పుట్టిస్తోంది. దాంతో వడోదర పోలీసులు ఈ వీడియోపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. అంతేకాక ఇలాంటి ప్రమాదకర చాలెంజ్‌లు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కికీ చాలెంజ్ మీద పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కికీ చాలెంజ్ అనే ఈ ఇంటర్నెట్ సంచలనానికి మరో పేరు ‘ఇన్ మై ఫీలింగ్స్’. డ్రేక్ గ్రాహం అనే 24 ఏళ్ల కెనడియన్ యువ గాయకుడు ఇటీవల విడుదలైన తన ‘స్కార్పియన్’ ఆల్బంలోని ‘ఇన్మై ఫీలింగ్స్’ అనే పాటలో ‘కికీ డూ యూ లవ్ మీ’ అని ప్రశ్నిస్తాడు. అయితే ఈ పాటకీ, ‘కికీ చాలెంజ్’కీ ఏ సంబంధమూ లేదు. ఇంటర్నెట్ కమెడియన్ షిగ్గీ ఈ పాటకు డాన్స్ చేసి దాన్ని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో వేలాది మంది అనుసరిస్తున్నారు. -
సార్.. మీ కాళ్లు వదిలిపెట్టం.. వైరల్
గాంధీనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా వడోదర చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తాగునీళ్లు ఇప్పించండి మహాప్రభో అంటూ అధికారుల కాళ్లపై పడి ప్రాధేయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వడోదరలోని హనుమాన్ నగర్ వాసులు చాలాకాలం నుంచి తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకున్నారు. స్థానికుడు మంజ్మాహుడా ఆ ఉన్నతాధికారి కాళ్లపై పడి దీనంగా ప్రాధేయపడటం వాళ్ల తాగునీటి సమస్య తీవ్రతను బహిర్గతం చేస్తోంది. మీ సమస్య తీరుస్తానని ఎంత నచ్చ చెప్పినా హుడా మాత్రం కచ్చితంగా తాగునీళ్లు అందించాలని వేడుకోవడం వీడియోలో చూడవచ్చు. దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రతి ఏడాది ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి సమస్యలు పెరిగిపోతున్నాయి. -
తాగునీటి కోసం కాళ్లు పట్టుకుని వేడుకున్నారు
-
స్కూలుపై పగ; 90 సెకన్లలో విద్యార్థి హత్య..!
వడోదర: గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. యాజమాన్యంపై పగ పెంచుకున్న 10వ తరగతి విద్యార్థి ఎలాగైనా స్కూలును మూసేయించాలని పథకం పన్నాడు. పాఠశాలలో చదివే ఓ విద్యార్థిని హత్య చేస్తే తన లక్ష్యం నెరవేరుతుందనుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 9వ తరగతి చదువుతున్న దేవ్ తాడ్వి(14)ని హత్య చేసి టాయ్లెట్లో పడేశాడు. వడోదర ఎస్పీ మనోజ్ శశిధర్ ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు.. నిందితుడు శ్రీ భారతీ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రవర్తన సరిగా లేనందున అతన్ని టీచర్లు పలుమార్లు మందలించారు. దాంతో అతడు పాఠశాలపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. ఎవరినైనా హత్య చేస్తే స్కూలు మూతపడుతుందని భావించాడు. శుక్రవారం మధ్యాహ్నం టాయ్లెట్ల వద్దకు వచ్చిన దేవ్ తాడ్విపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. 90 సెకన్ల కాలంలోనే నిందితుడు తాడ్వి ప్రాణాలు తీశాడని ఎస్పీ తెలిపారు. మృతుడి శరీరంపై 31 కత్తిగాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని గుర్తించామని అన్నారు. స్కూలు పక్కనే ఉన్న దేవాలయం వద్ద లభించిన ఓ బ్యాగులో పదునైన ఆయుధాలు, కారం నీళ్లతో కూడిన సీసాను గుర్తించామన్నారు. హత్యానంతరం ఇల్లు విడిచి పారిపోయిన బాలున్ని మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని, పాఠశాలను శాశ్వతంగా మూసేయాలని మృతుని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిందితుడి మానసిక స్థితి సరిగా లేనందున అతనిపై చర్యలకు అప్పుడే డిమాండ్ చేయలేమని గుజరాత్ మహిళా, శిశు సంక్షేమ బోర్డు చైర్మన్ జాగృతి పాండ్యా అన్నారు. ఇదే తరహా ఉదంతం గతేడాది హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. పాఠశాలను మూసేయించాలనే పన్నాగంతో అక్కడే చదువుతున్న ఓ ఏడేళ్ల బాలున్ని గొంతుకోసి చంపేశారు. -
వడోదరా స్కూల్లో బాలుడి హత్య
వడోదరా: గుజరాత్ వడోదరాలోని ఓ పాఠశాలలో బాలుడు హత్యకు గురయ్యాడు. బారన్పురా ప్రాంతంలోని భారతి స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుడిని 9వ తరగతి చదువుతున్న దేవ్ భగవాన్‌దాస్ తాడ్వి(14)గా గుర్తించారు. గతేడాది సెప్టెంబర్‌లో గురుగ్రామ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన ఏడేళ్ల విద్యార్థి హత్యోదం తాన్ని గుర్తుచేస్తున్న ఈ ఘటనలో.. మృతుడి శరీరంపై 10 కత్తి పోట్లు ఉన్నాయి. భోజన విరామ సమయంలో తాడ్వి తన తరగతి గదికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టి, అతని మృతదేహాన్ని వాష్‌రూంలో వదిలిపెట్టి పోయారని పోలీసులు తెలిపారు. స్కూలు పక్కనే ఉన్న దేవాలయం వద్ద లభించిన ఓ బ్యాగులో పదునైన ఆయుధాలు, కారం నీళ్లతో కూడిన సీసాను పోలీసులు గుర్తించారు. తాడ్విని హత్య చేసిన తరువాత నిందితులు ఆ సంచిని అక్కడ వదిలిపెట్టి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డీసీపీ ఆర్ఎస్ భగోరా వివరాలు వెల్లడిస్తూ..శవపరీక్ష నిమిత్తం తాడ్వి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించామని చెప్పారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కూలుకు చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. వారం క్రితమే ఈ స్కూలులో చేరిన తాడ్వి ఇక్కడ తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. అతని తల్లితండ్రులు ఆనంద్ పట్టణంలో నివసిస్తున్నారు. -
మోదీ ఐడియా.. సెటిలైన కాంగ్రెస్ నేత!
గాంధీనగర్, గుజరాత్ : ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పకోడాలు (పకోడీలు) అమ్ముకోవడం కూడా ఉద్యోగమే’ అన్న సంగతి తెలిసిందే. అయితే మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కానీ నేడు మోదీ ఇచ్చిన ‘పకోడా ఐడియా’నే ఒక కాంగ్రెస్ కార్యకర్త జీవితాన్ని మార్చేసింది. వడోదరకు చెందిన నారాయణభాయ్ రాజ్‌పుత్ హిందీ లిటరేచర్‌లో పోస్టు గ్రాడ్యూయేట్. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. ఎన్ఎస్యూఐలో కార్యకర్తగా చేరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అయితే పీజీ చేసిన నారాయణభాయ్ నిరుద్యోగి. మోదీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను అతడు కూడా చూశాడు. మోదీ చెప్పిన ‘పకోడా ఐడియా’ అతనికి బాగా నచ్చింది. పనిపాటా లేకుండా ఖాళీగా ఉండటం కంటే పకోడా బిజినెస్ చేయడం మంచిదని భావించాడు. తొలుత ఒక స్టాల్‌తో ప్రారంభమైన నారాయణభాయ్ పకోడా వ్యాపారం నేడు మొత్తం 35శాఖలుగా, వడోదర నగరమంతా విస్తరించింది. ఈ విషయం గురించి నారాయణభాయ్ ‘ప్రధాని ‘పకోడా బిజినెస్ ఐడియా’ విన్న తర్వాత నేను ఎందుకు ఆ మార్గంలో వెళ్లకూడదు అనుకున్నాను. నిరుద్యోగిగా ఉండటం కంటే పకోడా అమ్మి రోజుకు కనీసం 200 రూపాయలు సంపాదించడం మంచిదే కదా అనిపించింది. అందుకే ఒకసారి ప్రయత్నించి చుద్దామని భావించాను. మొదట 10 కేజీల పదార్థాలతో, 100 గ్రాముల పకోడా ఒక్కొక్కటిగా 10 రూపాయలుగా ఒక స్టాల్‌ను ప్రారంభించాను. నేడు నగరవ్యాప్తంగా నా పకోడా స్టాల్స్ 35 ఉన్నాయి. ప్రతిరోజు 500 - 600 కేజీల పకోడాలు అమ్ముతున్నాను’ అని తెలిపాడు. వ్యాపారం ప్రారంభించిన రెండు నెలల్లోనే నారాయణభాయ్ ‘పకోడా బిజినెస్’కు మంచి పేరు వచ్చింది. నారాయణభాయ్ రోజు ఉదయం 7 - 11 గంటల వరకూ అలానే సాయంత్రం కూడా ఇదే సమయంలో పకోడాను అమ్ముతుంటాడు. -
యూట్యూబ్‌లో వీడియో.. వ్యక్తి అరెస్టు!
వడోదర : మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేరీతిలో ఓ వీడియోను తన యూట్యూబ్ పేజీలో పోస్టుచేసిన వ్యక్తిని వడోదర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గత శనివారం రాత్రి ఈద్ వేడుకలు, మహారాణా ప్రతాప్ జయంతి ర్యాలీ సందర్భంగా వడోదర నగరంలోని ఓల్డ్ సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మయూర్ కదం (30) వ్యక్తి తన యూట్యూబ్ పేజీ ‘ధరమ్ యోధ’లో ఓ వీడియోను పోస్టు చేశాడు. మహారాణా ప్రతాప్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలను పెట్టి.. ఈ వీడియోను రూపొందించాడు. ఈ వీడియో పోస్టు చేసిన ఒక్కరోజులోనే 2500 లైకులు వచ్చాయి. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉండటంతో సైబర్ సెల్ పోలీసులు ఈ వీడియోను ఒక్కరోజులోనే యూట్యూబ్లోంచి తొలగించారు. మయూర్ కదం తన నేరాన్ని ఒప్పుకున్నాడని, ప్రజలను వీడియో ద్వారా చైతన్యపరచాలని ఆ వీడియోను పోస్టుచేసినట్టు అంగీకరించడాని వడోదర జాయింట్ కమిషనర్ కేజీ భటీ తెలిపారు. నగరంలో ఏ చిన్న మతపరమైన ఉద్రిక్తత చోటుచేసుకున్నా.. మతఘర్షణలు రెచ్చగొట్టే ఉద్దేశంతో కొందరు దుండగులు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, దీనిపట్ల అప్రమత్తంగా ఉంటూ.. ఈ చర్యలను నియంత్రిస్తున్నామని ఆయన తెలిపారు. మయూర్‌ను ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడని, అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
మరో భారీ కుంభకోణం: వేలకోట్ల రూపాయలకు టోకరా
-
మరో భారీ కుంభకోణం: వేలకోట్ల రూపాయలకు టోకరా
సాక్షి,న్యూఢిల్లీ: మరో భారీ బ్యాంకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వడోదరకు చెందిన విద్యుత్ కేబుల్స్, సామగ్రిని తయారు చేసే కంపెనీ వేలకోట్ల రూపాయల మేర బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టింది. 11 బ్యాంకుల కన్సార్టియాన్ని భారీ ఎత్తున మోసం చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేశామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం ప్రకటించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లోన్ డిఫాల్టర్ల లిస్ట్‌లోనూ, ఎక్స్పోర్ట్ క్రెడిట్ హామీ కార్పొరేషన్ హెచ్చరిక జాబితాలో ఉన్నప్పటికీ కంపెనీ, దాని డైరెక్టర్లు తప్పుడు పద్ధతుల్లో రుణాలు పొందారని ఆరోపించింది. వివిధ బ్యాంకుల నుంచి అక్రమ మార్గాల్లో డైమెండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డిపిఐఎల్) రూ. 2,654 కోట్ల రుణాలను తీసుకుందని సీబీఐ తెలిపింది. ఈ కుంభకోణానికి సంబంధించి కంపెనీపైనా, డైరెక్టర్లపైనా కేసు నమోదు చేసినట్లు చెప్పింది. కంపెనీ ప్రమోటర్ ఎస్ఎన్ భట్నాగర్, అతని కుమారులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అమిత్ భట్నాగర్, సుమిత్ భట్నాగర్లపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా- రూ.670.51కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా- రూ.349 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు- 279.46 కోట్ల రూపాయలు రుణాలు పొందినట్టుగా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అలాగే గుజరాత్ వడోదరాలోని కంపెనీ కార్యాలయంతో పాటు డైరెక్టర్ల నిసాసాల్లో సీబీఐ సోదాలు ప్రారంభించింది. కాగా సీబీఐ అందించిన సమాచారం ప్రకారం 2008 జూన్‌లో యాక్సిస్ బ్యాంకు నేతృత్వంలోని 11బ్యాంకుల కన్సార్టియం (పబ్లిక్, ప్రైవేట్) ద్వారా మోసపూరితంగా డిపిఐఎల్ రుణాలను పొందింది. నగదు క్రెడిట్ పరిమితులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్యాంకుగా ఉంది. ఈ మొత్తం 2016 జూన్ 29 నాటికి రూ .2,654.40 కోట్ల రూపాయలకు చేరింది. అయితే 2016-17లో ఎన్పీఏగా ప్రకటించడం గమనార్హం. -
ప్రియా ‘కన్నుగీటు’తో ప్రజల్లో అవగాహన
వడోదర : ఒక్క కన్ను గీటుతో మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎంత ఉర్రూతలూగించిందో అందరికీ తెలిసిందే. ఆ కన్నుగీటుతో ఆమెకి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ పాపులారిటీని వడోదర సిటీ పోలీసులు, సురక్షితమైన డ్రైవింగ్‌పై అవగాహన కల్పించడానికి వాడుతున్నారు. ప్రియా ప్రకాశ్ కన్ను గీటుతో ఓ క్యాప్షన్ పోస్టర్‌ను వారు విడుదల చేశారు. ‘రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతాయి. పరధ్యానంగా లేకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. #ట్రాఫిక్ఏక్సర్కార్.. ’ అనే పోస్టర్‌ను విడుదల చేశారు. పోలీసులు క్రియేటివ్‌తో రూపొందించిన ఈ పోస్టర్, ప్రస్తుతం వైరల్ అయింది. ఈ మాదిరిగా సందేశాన్ని తెలియజేయడం గొప్ప మార్గమంటూ ట్విటర్ యూజర్లు పొగుడుతున్నారు. ‘ఈ వినూత్న బ్యానర్ మేము చాలా ప్రేమిస్తున్నాం. అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న వర్క్ చాలా అభినందనీయం’ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వేధింపులు, వెంబడింపులపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఫేమస్ 'హసినా మాన్ జాయేగి' పాటను ఉపయోగించింది మరో పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. యువతరాన్ని ఎక్కువగా చేరుకోడానికి అంతకముందు సిటీ పోలీసులు సోషల్ మీడియా క్రియేటివిటీని వాడారు. ఇటీవల వడోదర, ముంబై పోలీసు, బెంగళూరు పోలీసులు ఆకట్టుకునే పదబంధాలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. -
ఒకేసారి వంద జంటలకు పెళ్లి , హెలికాప్టర్ నుండి పూలవర్షం
-
తొలి రైల్వే వర్సిటీకి పచ్చజెండా
న్యూఢిల్లీ: దేశంలో తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని వడోదరలో నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీ(ఎన్‌ఆర్‌టీయూ) పేరిట దీన్ని నెలకొల్పాలని బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. దీంతో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించినట్లయింది. కంపెనీల చట్టం–2013 ప్రకారం రైల్వే మంత్రిత్వ శాఖ నెలకొల్పే లాభాపేక్ష లేని కంపెనీ ప్రతిపాదిత యూనివర్సిటీని నిర్వహిస్తుంది. వర్సిటీకి అవసరమైన ఆర్థిక, మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు చాన్స్‌లర్, ఇతర ముఖ్యమైన బోధనా సిబ్బందిని ఆ కంపెనీయే నియమిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. విద్య, పాలన విధులు నిర్వర్తించేందుకు స్వతంత్ర బోర్డును కూడా ఏర్పాటుచేస్తామని పేర్కొంది. ఏడాదికి 3 వేల మంది విద్యార్థులు వేర్వేరు ఫుల్‌టైమ్ కోర్సుల్లో నమోదుచేసుకోవచ్చని, అధునాతన పద్ధతుల్లో బోధన కొనసాగుతుందని పేర్కొంది. వినియోగదారుల రక్షణ బిల్లుకు ఓకే: వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతిపాదించిన కొత్త బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2015 నాటి చట్టంలో పలు సవరణలు చేసి దీన్ని రూపొందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలపై జరిమానా, నిషేధం విధించనున్నారు. ‘టెక్స్టైల్స్’లో నైపుణ్యాభివృద్ధికి రూ.1300 కోట్లు వ్యవస్థీకృత టెక్స్టైల్స్ రంగంలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన పెంచేందుకు రూ.1300 కోట్ల వ్యయంతో కొత్త పథకానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ‘స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్’ పేరిట టెక్స్టైల్స్ రంగంలోని వేర్వేరు విభాగాల్లో 10 మంది లక్షల మందిని సుశిక్షితులుగా తీర్చిదిద్ది సర్టిఫికెట్లు ఇస్తారు. వారిలో కనీసం 70 శాతం మందికి స్థిర వేతనంతో కూడిన ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోహిణి కమిటీ పదవీకాలం పొడిగింపు ఓబీసీల ఉపవర్గీకరణపై ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిటీ పదవీకాలాన్ని కేంద్రం వచ్చే ఏప్రిల్ 2 వరకు పొడిగించింది. అక్టోబర్ 11న పని ప్రారంభించిన కమిటీ 10 వారాల్లోనే నివేదిక సమర్పించాల్సి ఉండగా తాజాగా గడువు పొడిగించారు. -
వడోదరలో హైస్పీడ్ రైల్ ట్రైనింగ్ సెంటర్
సాక్షి, వడోదర : గుజరాత్‌లోని వడోదరలో 600 కోట్ల రూపాయలతో మొదటి హైస్పీడ్ రైల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) బుధవారం ప్రకటించింది. ఈ సెంటర్ మొత్తం 5 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అస్కాత్ ఖరే చెప్పరు. ట్రైనింగ్ సెంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ట్రైనింగ్ సెంటర్లో ఓవర్‌హెడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, బుల్లెట్ ట్రైన్ ట్రాక్ ఏర్పాటు వంటివాటిపై ప్రాథమిక శిక్షణ ఉంటుందని చెప్పారు. -
వినాయకుడిని మోస్తున్న మోదీ.. పక్కనే షా
సాక్షి, అహ్మదాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలూ భక్తిని ప్రద్శరిస్తూనే తమదైన టచ్ ఇస్తూ ఈ మధ్య కొందరు విగ్రహాలను పెట్టేస్తున్నారు. బాహుబలి లాంటి క్రేజీ చిత్రాల దగ్గరి నుంచి పాపులర్ వ్యక్తులను కూడా విగ్రహాల్లోకి లాగేస్తూ సమ్‌థింగ్ స్పెషల్‌ను చూపిస్తున్నారు. వడోదరలోని జుని గడి వినాయక మండపంలోని విగ్రహం కూడా ఇలాంటి కోవలోనిదే. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ భుజాన వినాయకుడితో ఏర్పాటు చేసిన విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పక్కనే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రతిమను కూడా చేర్చారు. చైనా పై దాడికి సిద్ధం అంటూ పక్కనే ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేయటం గమనించవచ్చు. ప్రస్తుత పరిస్థితులకు సరిపోయేలా ఈ మండపాన్ని రూపొందిచినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది గుజరాత్ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ విగ్రహం ప్రత్యేకతను సంతరించుకుందనే చెప్పొచ్చు. -
షారూఖ్ అరెస్ట్ తప్పదా..?
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ ఏడాది మొదట్లో విడుదలైన తన మూవీ రాయిస్ ప్రమోషన్ సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు ఇబ్బందుల్లో పడేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయిస్ ప్రమోషన్ కోసం షారూఖ్ రైల్లో ప్రయాణించారు. ప్రతీ స్టేషన్ లోనూ అభిమానులను పలకరిస్తూ ఉత్సాహపరుస్తూ సాగారు. అయితే వడోదరా స్టేషన్లో మాత్రం పరిస్థితి అదుపు తప్పి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో షారూఖ్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ ఏడాది జనవరి 23న రాయిస్ మూవీ ప్రమోషన్లో భాగంగా షారూఖ్ వడోదరా స్టేషన్‌కు చేరుకున్నారు. షారూఖ్ వస్తున్నాడన్న విషయం ముందే తెలియటంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు. అభిమానులను మరింత ఉత్సాహ పరిచేందుకు టీషార్ట్స్, బాల్స్‌ను వాళ్లు మీదకు విసిరాడు షారూఖ్. దీంతో తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మరణించాడు. కొంత మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షారూఖ్ ఖాన్, రాయిస్ బృంద నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కోర్టుకు తెలిపారు. షారూఖ్‌తో పాటు రాయిస్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్పై ఐపీసీ సెక్షన్ 304 ఏ 2 (నిర్లక్షంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణం కావటం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసు కారణంగా షారూఖ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
అంబేడ్కర్ విగ్రహం వద్ద తోపులాట
-
బాణసంచా దుకాణంలో ఘోర ప్రమాదం
వడోదర: గుజరాత్‌లోని వడోదరలో ఘోర ప్రమాదం జరిగింది. దీపావళి పండగ సందర్భంగా అమ్మేందుకు తీసుకువచ్చిన బాణసంచాను ఉంచిన దుకాణంలో శుక్రవారం సాయంత్రం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. పోలీసులు, అధికారులు వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
విమానయానం కల కాదు!
మధ్యతరగతికి అందుబాటులో ప్రయాణం ► చిన్న నగరాల్లోనూ విమానసేవలు ►వడోదర టెర్మినల్ భవన ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వడోదర: భారత పౌర విమానయాన రంగం మిషన్మోడ్(లక్ష్యాలను నిర్దేశించుకుని, కార్యాచరణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని అమలుకు సిద్ధంగా)లో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. శనివారం వడోదర విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని జాతికి అంకితం చేసిన తర్వాత మోదీ మాట్లాడారు. మధ్యతరగతి కుటుంబీకులకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ఈ రంగంలో మరింత విస్తృతమైన పురోగతికి బాటలు పడతాయన్నారు. త్వరలోనే విమానాశ్రయాల కార్యకలాపాల్లో ప్రపంచంలోనే మూడో స్థానాన్ని అందుకోనున్నట్లు తెలిపారు. విస్తీర్ణంలో పెద్దదైన భారత్‌కు 80 నుంచి 100 ఎయిర్పోర్టులున్నా సరిపోవని.. 2టైర్, 3టైర్ నగరాల్లో వినియోగంలోలేని విమానాశ్రయాలను మళ్లీ తెరవాల్సిన అవసరం ఉందన్నారు. తొలి ఏవియేషన్ విధానం తెచ్చాం ప్రాంతీయ అనుసంధాన పథకం ద్వారా 500 కిలోమీటర్ల దూరాన్ని రూ.2,500కే అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే.. స్వతంత్ర భారతంలో తొలిసారిగా ఏవియేషన్ పాలసీని తీసుకొచ్చింది. దీనికోసం మిషన్‌మోడ్‌లో మా ప్రభుత్వం పనిచేస్తోంది. వినియోగదారుల అవసరాలపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాం’ అని తెలిపారు. ఈ రంగం వృద్ధి చెందటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వడోదరలో తొలి రైల్వేవర్సిటీ ఏర్పాటు కానుందని.. దీని వల్ల రైల్వే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ లెక్కల ప్రకారం 2035 కల్లా భారత్‌లో 32.5 కోట్ల మంది విమానప్రయాణీకులు పెరగనున్నారు. 2026 కల్లా ఈ విషయంలో యూకేను భారత్ మించిపోనుంది. వడోదర పూర్తి పర్యావరణ అనుకూలమైన, విద్యుత్‌ను ఆదా చేసే (సోలార్‌తో నడిచే) విమానాశ్రయమని ప్రధాని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విమాన ప్రయాణికుల సంఖ్యలో 20% పెరుగుదల ఉందని పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. నల్లధనంపై ‘సర్జికల్’ లేకుండానే.. అనంతరం దివ్యాంగులకు సహాయ పరికరాల ప్రదానోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలను విస్మరించాయని విమర్శించిన మోదీ.. తమ ప్రభుత్వం వీరి సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిందన్నారు. ఇటీవల పీవోకేలో జరిపిన సర్జికల్ స్ట్రైక్‌ను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. నల్లధనం విషయంలో ఇలాంటి దాడులు జరపకుండానే.. రూ. 65వేల కోట్లుబయటకు (జరిమానా, పన్నుల రూపంలో) వచ్చాయన్నారు. సబ్సిడీల్లో లీకేజీలను అరికట్టడం ద్వారా మరో రూ.36వేల కోట్లు ప్రభుత్వానికి మిగిలాయన్నారు. ఇక్కడ సర్జికల్ దాడులు జరగకుండానే లక్షకోట్లు బయటకొచ్చాయన్నారు. నల్లధనం విషయంలో మరింత సమయం ఇచ్చామని.. అవన్నీ బయటకు తెస్తామని మోదీ తెలిపారు. పాపకు మోదీ నామకరణం ప్రధాని మోదీ మరో చిన్నారికి నామకరణం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లా మారుమూల ప్రాంతానికి చెందిన భరత్ సింగ్, విభా సింగ్‌ల బిడ్డకు ఆయన పేరు పెట్టారు. ఈ దంపతులకు ఆగస్టు 13న కూతురు జన్మించింది. పాపకు పేరు పెట్టాలని మోదీని కోరుతూ వీరు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. బాలికల విషయంలో మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసిస్తూ.. ఒలింపిక్స్‌లో ఇద్దరు యువతులే పతకాలు తీసుకురావటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. సరిగ్గా వారం రోజుల తర్వాత (సెప్టెంబర్ 20న) వీరికి ప్రధాని ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరి బిడ్డకు తల్లి, తండ్రి పేరు కలిపి ‘వైభవి’ అని పేరుపెట్టారు. రెండు నిమిషాలు మాట్లాడారు. ఈ ఆనందాన్ని పంచుకునేందుకు గ్రామంలో అందరికీ ‘ప్రధాని ఫోన్’ గురించి భరత్ చెప్పాడు. దీన్నెవరూ నమ్మలేదు. దీంతో తనకు కాల్ వచ్చిన నెంబరుకు (పీఎంవో) తిరిగి కాల్ చేసి.. ప్రధాని నుంచి లేఖ వస్తే సంతోషిస్తామని కోరారు. వస్తుందో రాదో అని పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ఆశ్చర్యంగా ఆగస్టు 30న వీరికి పీఎంవో నుంచి లేఖ వచ్చింది. ‘మీరు వైభవి ఆకాంక్షలను పూర్తి చేస్తారు. వైభవి మీ శక్తి. శుభాకాంక్షలు’ అని లేఖ సారాంశం. దీంతో భరత్, విభ దంపతుల ఆనందానికి హద్దుల్లేవు. -
నీటిలో ఉండాల్సిన మెసళ్లు జనావాసాల్లోకి
-
హవ్వా.. ఆయనా ఓ డాక్టరేనా..!
వడోదర: గుజరాత్లో ఓ వైద్యుడు ఆ వృత్తికి అపవాదు తెచ్చాడు. ఏడేళ్ల బాలికకు పశువులకు వేసే ముందులు ఇయ్యడంతో వాటిని ఉపయోగించి ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు లోనైంది. సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన ఆ వైద్యుడిపై ఆ బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వడోదరలోని బాపోడ్ లోగల వాగోదియా రోడ్డులో ఉన్న ఓ ఆస్పత్రికి విభా చంద్వాని అనే ఏడేళ్ల బాలికను జగదీశ్ షా అనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది. తన కూతురు తలలో ఎక్కువగా పేలు ఉన్నాయని, ఆ సమస్యతో తీవ్రంగా బాధపడుతుందని వైద్యం చేయాలని చెప్పింది. దీంతో ఆ వైద్యుడు ఆ పాపకు పిప్జెట్ హెచ్ సిరప్ తోపాటు ఓ లోషన్ ను నుదురుపై రాయాలని మందుల చీటిలో రాశాడు. వాటిని ఉపయోగించిన ఆ బాలిక తీవ్ర తలనొప్పి వాంతులుతో అనారోగ్యానికి లోనవ్వగా సకాలంలో వైద్యం చేయించారు. ఆ మందులు పరిశీలించగా అవి పశువులకు ఇచ్చేవని తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై చర్యలు తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు. -
అక్కడ.. పోకెమాన్ గేమ్ బ్యాన్!
పోకేమాన్ గో ప్లేయర్స్ కు వడోదరా మ్యూజియం తలుపులు మూసేసింది. మ్యూజియం ప్రాంగణంలో పోకేమాన్ గేమ్ ఆడకూడదన్న నిబంధన విధించింది. సెక్యూరిటీ కారణాల నేపథ్యంలోనూ, సందర్శకుల ఫిర్యాదుల మేరకు మ్యూజియం లోపల పోకేమాన్ ఆటను ను బ్యాన్ చేసినట్లు మ్యూజియం అధికారులు వెల్లడించారు. ప్రపంచాన్ని మత్తులో దింపేసిన పోకేమాన్ గో గేమ్ ను ఇప్పుడు వడోదరా మ్యూజియం బ్యాన్ చేసింది. మ్యూజియం ప్రాంగణంలో పోకేమాన్ ఆడకూడదన్న నిబంధనను విధించినట్లు అధికారులు తెలిపారు. అనేక భద్రతా కారణాలకు తోడు, సందర్శకుల ఫిర్యాదుల మేరకు పోకేమాన్ ను మ్యూజియంలో ఆడేందుకు నిరాకరించినట్లు తెలిపారు. ఈ నేథ్యంలో మ్యూజియం ప్రధాన ద్వారం వద్ద పోకేమాన్ ప్లేయర్స్ కు లోపలికి అనుమతి లేదంటూ ఓ నోటీసును కూడా అంటించారు. మ్యూజియం భద్రతను పెంచడంతోపాటు, సందర్శకుల రక్షణలో భాగంగా మ్యూజియం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ఈ తాజా నిర్ణయం తీసుకుంది. వందేళ్ళనాటి మ్యూజియం, పిక్చర్ గ్యాలరీ సందర్శించేందుకు వచ్చిన వారికి సింహద్వారం వద్ద కనిపించేట్లుగా అధికారులు నోటీసులు అంటించారు. మ్యూజియంలో నడిచే సమయంలోనూ, అలాగే ప్రాంగణంలోని గడ్డిపై నడుస్తూ కూడా సందర్శకులు పోకేమాన్ ఆడటం న్యూసెన్స్ ను క్రియేట్ చేస్తోందని అధికారులు చెప్తున్నారు. ఈ పోకేమాన్ గో గేమ్ ఆటగాళ్ళ దృష్టిని దెబ్బతీస్తోందని, ఓ ఇన్ఫెక్షన్ లా మారిపోయిందని మ్యూజియం క్యూరేటర్ విజయ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంగణంలోని గడ్డిలో అనేక విష సర్పాలు, కీటకాలు ఉంటాయని, అక్కడ ఆడొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆటగాళ్ళు పట్టించుకోవడం లేదని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాక మ్యూజియం చూసేందుకు వచ్చిన సందర్శకులకు కూడా పోకేమాన్ ఆడేవారు పెద్ద సమస్యగా మారుతున్నారని, అందుకే మ్యూజియంలో పోకేమాన్ గో గేమ్ బ్యాన్ చేసినట్లు వివరించారు. -
సెలవుల్లో మావయ్య ఇంట్లో గడిపేందుకు వెళ్లి..
వడోదర: వేసవి సెలవుల్లో తన అంకుల్ ఇంటివద్ద గడిపేందుకు వెళ్లిన ఎనిమిదేళ్ల బాలిక జీవితం విషాధంగా మారింది. తన మేనమామ పొలంలో ఆడుకుంటున్న జిగ్నా గోహిల్ అనే బాలికపై చిరుతపులి దాడి చేసి చీరేసింది. తీవ్రగాయాలతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్‌లోని సోమనాథ్ గిర్ జిల్లాలోగల సనాఖడ అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం తన మావయ్య పొలంలోని మామిడితోటలో ఆడుకునేందుకు వెళ్లిన బాలికపై ఓ చిరుత దాడి చేసి చంపేసింది. రాత్రి సమయంలో కూడా బాలిక రాకపోవడంతో వెతికి చూడగా చిరుత దాడి చేసిన విషయం తెలిసింది. తీవ్రగాయాలతో ఉన్న బాలిక ప్రాణాలతో ఉందేమోనన్న ఆశతో ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
అమరావతికి తూచ్.. వడోదరకు రైల్వే వర్సిటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఓ వరం ప్రకటించారు. దేశంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న రైల్వే యూనివర్సిటీని వడోదరకు కేటాయించారు. ఈ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నగరానికి కేటాయించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే రైల్వే మంత్రికి, ప్రధానమంత్రికి విజ్ఞప్తులు చేశారు. పరిశీలిస్తామని చెప్పినా.. చివరకు ప్రధాని సొంత రాష్ట్రానికే దాన్ని తరలించుకుపోయారు. ఇక దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్న రైల్వే ఆటో హబ్‌ను తమిళనాడు రాజధాని చెన్నైకి కేటాయించారు. ఇది ఏంటన్న విషయమై ఇంకా వివరణ మాత్రం రాలేదు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరుగుతుండటంతో ఆ రాష్ట్రానికి ఇది వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. -
వడోదరలో ఆరుగురు అనుమానితుల అరెస్ట్
-
వడోదరలో ఆరుగురు అనుమానితుల అరెస్ట్
న్యూ ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో పలు మెట్రో నగరాల్లో దాడులు నిర్వహించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ) అధికారులు దేశ వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో దాడులు జరిపి 14 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు తాజాగా గుజరాత్‌లోని వడోదరలో ఐదుగురు ఐఎస్ ఉగ్ర అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా ఉగ్రవాదులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని టార్గెట్ చేశారనే సమాచారం అందిన నేపథ్యంలో దేశ రాజధానిలో తనిఖీలు ముమ్మరం చేశారు. -
విద్యార్థులు, తల్లిదండ్రులపై ఓ ట్యూటర్ దుశ్చర్య
వడోదర: ఎలాగైనా మంచి మార్కులు సాధించడమేకాకుండా, గొప్ప ఉద్యోగాలు సంపాధించాలని విద్యార్థుల ఆత్రుత.. దానిని మరింత పరుగులుపెట్టించేంతగా తల్లిదండ్రుల ఒత్తిడి వెరసి ఓ ప్రైవేటు టీచర్‌కు బుద్ధితక్కువ ఆలోచనకు దారి తీసింది. నేలపై గాజుపెంకలు పరిచి వాటిపై నడిచి మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి అంటూ ఆ పనిచేయించాడు గుజరాత్ లో ఓ ప్రైవేటు ట్యూషన్ టీచర్.. ఆ పని కేవలం ఆ యువ విద్యార్థులతోనే కాకుండా వారి తల్లిదండ్రులతో కూడా చేయించాడు. ఈ విషయం బయటకు తెలిసి పోలీసులు విచారణ ప్రారంభించారు. వడోదరాలో రాకేశ్ పటేల్ అనే ఓ ప్రైవేటు టీచర్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు. అతడి వద్దకు శిక్షణకు వస్తున్న యువకుల్లో ఓ 70మందిని ఎంచుకొని వారి తల్లిదండ్రులను కూడా పిలిపించాడు. అనంతరం తన కోచింగ్ సెంటర్ లోనే నేలపై గాజు పెంకలు పరిచి వాటిపై నడవమన్నాడు. తాను కూడా గతంలో అలాగే చేశానని, అందువల్ల తనలో గొప్పగా ఆత్మవిశ్వాసం పెంపొందిందని చెప్పాడు. చాలామంది ఈ గాజుపెంకులపై నడిచారని, వారికి ఏమీ కాలేదని అన్నారు. కాగా, ఈ అంశాన్ని వడోదర కలెక్టర్ తోపాటు గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్రసిన్హ చుదాశ్మ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి చర్యలకు దిగుతున్నవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. -
2 పరుగులు.. 2 వికెట్లు
ఇర్ఫాన్ పఠాన్ 5/13 * హైదరాబాద్, ఆంధ్ర పరాజయం * పాండే, చావ్లా హ్యాట్రిక్... * ముస్తాక్ అలీ టి20 టోర్నీ కొచ్చి: జాతీయ జట్టులోకి తిరిగి ఎంపికైన తర్వాత ఆడిన తొలి టి20 మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌లో నిరాశపర్చాడు. ముస్తాక్ అలీ దేశవాళీ జాతీయ టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ 5 బంతుల్లో 2 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీసినా అప్పటికే పంజాబ్ జట్టు పరాజయం ఖరారైపోయింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మన్దీప్ సింగ్ (52 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో పంజాబ్ 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ 6 వికెట్లకు 133 పరుగులు చేసింది. రాజేశ్ బిష్ణోయ్ (32 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) గెలిపించాడు. వడోదర: ఈశ్వర్ పాండే (4/20) హ్యాట్రిక్ సహాయంతో మధ్యప్రదేశ్ 5 వికెట్లతో ఆంధ్రపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్. శ్రీనివాస్ (22)దే అత్యధిక స్కోరు. మ్యాచ్ నాలుగో ఓవర్లో పాండే వరుస బంతుల్లో భరత్, ప్రశాంత్, ప్రదీప్‌లను అవుట్ చేయడం విశేషం. అనంతరం ఎంపీ 5 వికెట్లకు 96 పరుగులు చేసింది. కటక్: ఉత్తరప్రదేశ్ 7 వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. కేదార్ జాదవ్ (29 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో మహారాష్ట్ర 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. యూపీ బౌలర్ పీయూష్ చావ్లా (4/28) హ్యాట్రిక్ సాధించడం విశేషం. అనంతరం యూపీ 3 వికెట్లకు 113 పరుగులు చేసింది. షమీకి 3 వికెట్లు... నాగపూర్: వృద్ధిమాన్ సాహా (47 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), సాయన్ మోండల్ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో బెంగాల్ 61 పరుగులతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బెంగాల్ 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ 16.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. అక్షత్ రెడ్డి (32) మినహా అంతా విఫలమయ్యారు. మొహమ్మద్ షమీ (3/18) రాణించాడు. వడోదర: దీపక్ హుడా (48 నాటౌట్), కేదార్ దేవధర్ (48) రాణించడంతో బరోడా 49 పరుగులతో అస్సాంను ఓడించింది. బరోడా 8 వికెట్లకు 165 పరుగులు చేయగా...అస్సాం 116 పరుగులకే కుప్పకూలింది. ఇర్ఫాన్ పఠాన్ 13 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక్కడే జరిగిన మరో మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్లతో రైల్వేస్‌ను ఓడించింది. ముందుగా రైల్వేస్ 2 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌరభ్ వకాస్కర్ (55 బంతుల్లో 118; 7 ఫోర్లు, 11 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్‌తో సెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ ఈ భారీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఆదిత్య కౌశిక్ (53), ఉన్ముక్త్ (38), నేగి (35 నాటౌట్), రాణా (34) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. -
ట్రిపుల్ రైడింగ్‌ను అడ్డుకున్నందుకు చితకబాదారు!
వడోదర: గుజరాత్‌లోని వడోదరలో దాదాపు గంటపాటు ఓ ట్రాఫిక్ పోలీసును కోపోద్రిక్త మూక చితకబాదింది. దాదాపు 40 మంది మూగి అతనిపై దాడి చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ మోటార్ బైక్‌ను తగులబెట్టారు. ముగ్గురు పోలీసులు వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను మూక నుంచి రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పోలీసులు అతన్ని తమ జీపులో ఎక్కించుకున్నా.. అతన్ని బయటకు లాగి చితకబాదారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ శాంతిలాల్ పర్మార్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతికష్టం మీద పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం కానిస్టేబుల్ శాంతిలాల్ ఒకే బైక్ మీద వెళుతున్న ముగ్గురిని ఆపే ప్రయత్నం చేశాడు. దీంతో వారు డివైడర్‌కు ఢీకొని కింద పడ్డారని, బైక్ నడుపుతున్న యువకుడికి ముఖంపై గాయాలయ్యాయని పోలీసులు చెబుతుండగా.. కానిస్టేబుల్ లాఠీని విసిరికొట్టడం వల్లే బైక్ మీద నుంచి యువకుల కిందపడ్డారంటూ దాదాపు 40 వ్యక్తులు గుమిగూడి వడోదరలో దాదాపు గంటపాటు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనను ఓ టీవీ రిపోర్టర్ రికార్డు చేయడంతో ఈ వీడియో ఆధారంగా దాడి చేసిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
పోలీసును ఉతికి ఆరేశారు
వడోదర: ట్రాఫిక్ పోలీసుపై వడోదర ప్రజలు కన్నెర్ర జేశారు. మిగతా పోలీసులు వచ్చినా అతడిని కాపాడలేకపోయారు. గుజరాత్ లోని వడోదరలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. బైకు వెళుతున్న ముగ్గురిని కానిస్టేబుల్ శాంతిలాల్ పార్మర్ ఆపాడు. అతడు తమను లాఠీతో కొట్టాడని ఆరోపిస్తూ కానిస్టేబుల్ పై వారు దాడికి దిగారు. దాదాపు 40 మందిపోగై అతడిని చితకొట్టారు. మరో ముగ్గురు పోలీసులు అతడిని కాపాడేందుకు జీపులోకి ఎక్కించారు. జీపులోంచి బయటకు లాగి మరోసారి దాడికి పాల్పడ్డారు. పోలీసుల బైకును తగులబెట్టారు. ఇదంతా వీడియోలో రికార్డైంది. తాము లాఠీ ఝుళిపించలేదని, రోడ్డు డివైడర్ గుద్దుకుని బైకుపై వెళుతున్న వారు పడిపోయారని పోలీసులు తెలిపారు. వీడియో ఫుటేజీ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తిస్తున్నామని, ఒకరిని అరెస్ట్ చేశామని చెప్పారు. -
15 వ కాన్పులో మగబిడ్డ..
వడోదర: పుత్రసంతానం కోసం తపించి పోయే భారతీయ దంపతుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. తమకు మగపిల్లాడు పుట్టాలనే కోరికతో పూజలు చేస్తూ, మొక్కుబడులు పెట్టుకునే వాళ్ల దగ్గర నుంచి ఆడపిల్ల అని తెలిస్తే భ్రుణహత్యకు పాల్పడే వాళ్లు, పుట్టాకా పసిపాపను వదిలించుకునే వాళ్లు కూడా అనునిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మరి అలాంటి వారికి భిన్నంగా పుత్ర సంతానం తపనలో ఏకంగా 14 కాన్పుల్లో 14మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఈ గుజరాతీ మహిళ. పిల్లాడు పుట్టే వరకూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నట్టుగా వ్యవహరించిన ఆ భార్యభర్తల పేర్లు కానూ సంగోద్, రామ్సిన్హా. గుజరాత్‌లోని ఝరీభుజ్హీ అనే ఒక మారుమూల గ్రామానికి చెందిన వీళ్లు కథ ఆసక్తికరంగా ఉంది. 20 యేళ్ల కిందట వీళ్ల వివాహం జరిగింది. అప్పటి నుంచి వీళ్ల తపన, ఇంట్లో వాళ్ల కోరిక ఒకటే... తొలి కాన్పులోనే అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు. అయితే అది జరగక పాప పుట్టింది. తనకు సారంగన అని పేరు పెట్టుకున్నారు. రెండోసారి అయినా బాబు అనుకుంటే.. మళ్లీ పాప. అయినా వీళ్లు రాజీపడలేదు. అలా ఒకసారి కాదు. ఆ తర్వాత పన్నెండు సార్లు కానూ గర్భం దాలిస్తే ప్రతిసారీ అమ్మాయే పుట్టింది. ‘చివరకు దేవుడు మా ప్రార్థనను ఆలకించాడు...’ 15 వ ప్రసవం తర్వాత కానూ, రామ్ దంపతుల మాట ఇది. రెండేళ్ల క్రితం కానూ ఒక బాబుకు జన్మనిచ్చింది. ఈ విజయానికి గుర్తుగా వారు తనకు ‘విజయ్’ అని పేరు పెట్టుకుని మురిసిపోయారు. అయితే సంతప్తి మాత్రం లేదు. మరో అబ్బాయి పుడితే బాగుంటుందనే కోరిక... కానూ ఇప్పుడు మళ్లీ గర్భవతి. ఈ సారి మరో అబ్బాయి పుడతాడు అనే ఆశాభావంతో ఉన్నారు ఆ దంపతులు. కుటుంబ నియంత్రణ అనేదాన్ని ఏ మాత్రం ఖాతరు చేయని ఈ దంపతుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే. తమ 14 మంది అమ్మాయిల్లో ఐదుమందినే వీళ్లు స్కూల్‌కు పంపుతున్నారు, మిగిలిన వాళ్లు వ్యవసాయపనులు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. తాము గిరిజన జాతికి చెందిన వాళ్లం అని.. తమ కుటుంబాల్లో అబార్షన్ నిషిద్ధమని దీంతో అబ్బాయి కోసం తపనలో ఇలా జరిగిపోయిందని కానూ దంపతులు చెబుతున్నారు. అయితే కుటుంబ పోషణ చాలా బారమైందని కూడా పెద్దకుటుంబంతో ఉండే బాధలను ఏకరువు పెడుతున్నారు. -
అమ్మాయితో కలిసి చిందేసిన ఖాకీలు
-
వరుస అత్యాచారాల ముఠా అరెస్ట్
వడోదర(గుజరాత్): వరుసగా అత్యాచారాలకు పాల్పడిన ఏడుగురు సభ్యల ముఠాలో ఆరుగురిని వడోదర రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతవారం షినోర్ తాలుకాలో 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో వీరిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు మరిన్ని విషయాలు బయటపెట్టారు. షినోర్, సమీప గ్రామాల్లో గత ఆరునెలల కాలంలో కనీసం 8 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు వారు వెల్లడించారు. నిందితులందరూ రోజువారీ కూలీలని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ లో మరో నిందితుడిని అరెస్ట్ చేయాల్సివుందని చెప్పారు. -
ఇదో సరికొత్త ఛాలెంజ్!
ఐస్ బకెట్ ఛాలెంజ్ అయిపోయింది... ఆ తర్వాత రైస్ బకెట్ ఛాలెంజీ ఇప్పుడు పాతబడిపోయింది. అమెరికా అధ్యక్షుడి స్థాయి నుంచి అతి సామాన్యులు, సెలబ్రిటీల దాకా ఈ ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ, మరికొంతమందికి ఆ సవాలును విసురుతూ వార్తల్లోకి వచ్చారు. ఏదోవ్యాధి బాధితుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఐస్ బకెట్ ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. పేదల కడుపు నింపడానికి రైస్ బకెట్ ఛాలెంజ్ కూడా అంతే ఆదరణ పొందింది. ఈ రెండూ సదుద్దేశంతో కూడిన కార్యక్ర మాలు కాబట్టి మీడియా కూడా బాగానే ప్రచారమిచ్చింది. అలాంటి ఐస్ బకెట్ ఛాలెంజ్ స్ఫూర్తితో మెట్రో నగరాల్లో ఇప్పుడిప్పుడే మరో కార్యక్రమం మొదలవుతోంది. మహిళల ఆరోగ్యం గురించిన ఉద్యమమిది. ‘హైజీన్ బకెట్ ఛాలెంజ్’ పేరుతో ఈ కార్యక్రమం ప్రచారంలోకి వస్తోంది. వడోదరా కేంద్రంగా పనిచేసే ‘వాత్సల్య ఫౌండేషన్’ వారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒక బకెట్ నిండా శానిటరీ న్యాపికిన్లను విరాళంగా సేకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. మురికివాడల్లో నివసించే మహిళలకు ఆ శానిటరీ న్యాపికిన్లను అందించడానికి ఆ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. పేదరికంలో మగ్గుతున్న మహిళల్లో శానిటరీ న్యాప్కిన్లపై అవగాహన నింపడం, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది వాత్సల్య ఫౌండేషన్. ఇందులో భాగంగా వీరు కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ‘‘గ్రామీణ మహిళల్లోనే కాదు.. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద మహిళల్లో కూడా శానిటరీ న్యాప్కిన్ల గురించి అవగాహన లేదు. ఫలితంగా వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వారికి సాయంగా నిలవడానికే ఈ ప్రయత్నం. ఈ నేపథ్యంలో కొంత సామాజిక ప్రచారం... దాతల సహకారం కోసం ఐస్‌బకెట్ ఛాలెంజ్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం..’’ అని ఫౌండేషన్ నిర్వాహకులు చెప్పారు. ముందుగా ఈ ఛాలెంజ్‌ను వడోదరాకే చెందిన కల్పనా షా అనే మహిళ స్వీకరించింది. ఆమె ఒక బకెట్ న్యాప్కిన్లను తన పనిమనిషికి డొనేట్ చేసింది. తను డొనేట్ చేయడమే గాక తన స్నేహితురాళ్లలో కొందరిని ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా కల్పనా షా ఛాలెంజ్ చేసింది. దీనికి స్పందనగా కొంతమంది మహిళలు ఈ విరాళానికి ముందుకొచ్చారు. విద్యావేత్త అయిన నందితా అమిన్ తమకు సమీపంలోని గ్రామంలోని అమ్మాయిల బాధ్యత తీసుకొన్నారు. కొంతమంది అమ్మాయిలకు ఈ విషయంలో అండగా నిలబడేందుకు ఆమె ముందుకొచ్చారు. ఆర్థిక స్థితి బాగుండక అనేక మంది మహిళలకు శానిటరీ న్యాప్కిన్లు వాడే అవకాశం లేకుండా పోతోందని.. పేదరికం పర్యవసనంగా మహిళల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తడాన్ని నిరోధించడంలో భాగస్వామి అవుతున్నందుకు ఆనందంగా ఉందని అమిన్ చెప్పారు. ఇలా ఆ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యక్రమం క్రమంగా ఊపందుకొంటోంది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలు అనేకమంది గ్రామీణ, పేద మహిళల పరిస్థితిని అర్థం చేసుకొని సాటి మహిళలుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ కార్యక్రమం ద్వారా కొన్ని వందల మంది మహిళలకు శానిటరీ న్యాప్కిన్ల సాయం అందిందని వాత్సల్య ఫౌండేషన్ నిర్వాహకులు అంటున్నారు. ఒకవైపు ప్రభుత్వాలు కూడా మహిళల ఆరోగ్యప్రయోజనాలను గుర్తించి శానిటరీ న్యాప్కిన్ల విషయంలో అవగాహన నింపడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి సామాజిక సేవా సంస్థలు కూడా ఈ దిశగా ప్రయత్నించడం ద్వారా కొంతమంది మహిళలకు బాసటగా నిలిచినా అది అభినందించదగ్గ ప్రయత్నమే అవుతుంది. -
ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో అనుహ్య ఫలితాలు వస్తున్నాయి. భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ చాలా చోట్ల గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే... కేవలం రెండు చోట్ల మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. మిగిలిన 9 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ దూసుకుపోతోంది. ఈ పదకొండు స్థానాలు బీజేపీవే. ఉత్తరప్రదేశ్‌లో పెచ్చరిల్లిన అత్యాచారాలు, మతఘర్షణలు ఉపఎన్నికలపై ప్రభావం చూపలేకపోయాయి. ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కావడంతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ ఈ ఎన్నికల్ని చాల సీరియస్‌గా తీసుకున్నారు. మతఘర్షణలతో ఓట్లు చీలి ఉత్తరప్రదేశ్‌లో లాభపడతామని ఆశించిన బీజేపీకి ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించేవే. అటు మోడీ ఖిల్లా గుజరాత్‌లోనూ రాజకీయాలు మారిపోయాయి. బీజేపీకి చెందిన సిట్టింగ్ స్థానాలు రెండింటిలో కాంగ్రెస్ పాగా వేసింది. గుజరాత్లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా కేవలం ఆరు స్థానాల్లోనే బీజేపీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. గడిచిన 12 ఏళ్లలో గుజరాత్లో మోడీ లేకుండా జరిగిన తొలిఎన్నికలివి. ఇక గుజరాత్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం బీజేపీని ఇబ్బందుల్లో నెట్టినట్టు కనిపిస్తోంది. ఉపఎన్నికల్లో సీనియర్ నేతలెవరూ ప్రచారం చేయలేదు. మోడీ ఎమ్మెల్యేగా ఉన్న మణినగర్ నియోజకవర్గంలో కేవలం 33 శాతం పోలింగ్ నమోదవటం గుజరాత్ ఓటర్ల నిరాకస్తతను తెలిపింది. వడోదరాలో భారీ మెజార్టీతో రంజన్ బెన్ గెలవడం బీజేపీకి ఊరటే. ఇక రాజస్థాన్‌లోనూ కమలం వాడిపోయింది. నాలుగు సిట్టింగ్ స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్‌కు అప్పగించింది. ఒక్క చోట మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. అటు శారదా చిట్స్ స్కామ్ మమతా బెనర్జీ సర్కారుపై ప్రభావం చూపుతుందన్న అంచనాలు తప్పాయి. బెంగాల్లో ఉపఎన్నికలు జరిగిన రెండు చోట్ల ఓ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్, మరో స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. -
వడోదరలో భారీ ఆధిక్యంతో బీజేపీ విజయం
వడోదర : ప్రధాని నరేంద్ర మోడీ కంచుకోట అయిన వడోదరను భారతీయ జనతా పార్టీ మరోసారి కైవసం చేసుకుంది. వడోదర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్ బెన్ భట్టా భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రావత్‌పై లక్షా 83 వేల ఓట్ల మెజార్టీతో రంజన్ బెన్ గెలుపొందారు. మోడీ వడోదర స్థానం నుంచి గెలుపొంది ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. మొత్తం 2,86,880 ఓట్లు పోల్ అవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి 1,04,540 ఓట్లు గెలుచుకున్నారు. మరోవైపు గుజరాత్‌లోని మణినగర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకుంది. -
గుజరాత్, రాజస్థాన్‌లో బీజేపీ హవా
-
గుజరాత్, రాజస్థాన్‌లో బీజేపీ హవా
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గుజరాత్లో తొమ్మిది అసెంబ్లీ, ఓ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో 45మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేసిన వడోదర లోక్‌సభ స్థానం కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వడోదరలో బీజేపీ దూసుకెళుతోంది. * ఇక గుజరాత్, రాజస్థాన్‌లలో ట్రెండ్స్ బీజేపీకి అసంతృప్తి కలిగించే విధంగా ఉన్నాయి. గుజరాత్లో తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. * రాజస్థాన్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడుచోట్ల బీజేపీ, ఓ స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. * ఉత్తరప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాల్లో ఆరుచోట్ల బీజేపీ, నాలుగు స్థానాల్లో సమాజ్‌వాదీ ఆధిక్యంలో ఉండగా, పశ్చిమ బెంగాల్లో రెండు స్థానాలకు గానూ తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. -
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోక్‌సభతో పాటు వడోదర, మెయిన్‌పురి పార్లమెంట్ ఫలితాలు మధ్యాహ్నానికి వెలువడతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నందిగామ అసెంబ్లీ ఫలితాలు ఉదయం 11 గంటలలోపే తెలిసే అవకాశముంది. టీఆర్ఎస్ తరపున ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి జగ్గారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఇక మెదక్ లోక్‌సభ ఓట్ల లెక్కింపుకు సంబంధించి 14 రౌండ్లలో పూర్తి అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. మెదక్ జిల్లా పటాన్చెరు మండలంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఈ లెక్కింపు కొనసాగుతోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. 121 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 120 మంది కౌంటింగ్ అసిస్టెంట్ల్లు లెక్కింపులో పాల్గొన్నారు. నందిగామ ఉపఎన్నిక ఫలితాలు కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.. టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమార్తె సౌమ్య టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. మానవీయ దృక్పథంతో, గత సంప్రదాయాలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభ్యర్థిని నిలుపలేదు. కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబూరావు పోటీలో ఉన్నప్పటికీ నామమాత్రమే. -
మెదక్ బైపోల్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది?
-
ప్రశాంతంగా ఉప ఎన్నికలు
3 లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్ - 16న ఓట్ల లెక్కింపు ప్రక్రియ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పది రాష్ట్రాల్లోని 3 లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. తెలంగాణలోని మెదక్, గుజరాత్‌లోని వడోదర, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి ఎంపీ స్థానాలతోపాటు యూపీలో 11, గుజరాత్లో తొమ్మిది, రాజస్థాన్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్లో రెండు, ఈశాన్య రాష్ట్రాల్లో ఐదు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. వడోదర లోక్‌సభ స్థానానికి 49 శాతం, మెయిన్‌పురిలో 56 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి యూపీలో 53 శాతం, గుజరాత్లో 49 శాతం, రాజస్థాన్‌లో 66 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్లోని రెండు అసెంబ్లీ స్థానాల్లో భిన్నమైన పోలింగ్ సరళి కనిపించింది. బసీర్హత్ దక్షిణ్ స్థానానికి 79.59 శాతం పోలింగ్ నమోదైతే.. ఛౌరింగి స్థానానికి 47.13 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 50 శాతం, అస్సాంలో 70 శాతం, త్రిపురలో 87 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 16న జరగనుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న రెండో ఉప ఎన్నికలివీ. కొద్దిరోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీయడంతో ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోడీ ప్రజాదరణకు పరీక్షే. దీంతో ఈసారి సత్తా చాటేందుకు కమలదళం తీవ్రంగా శ్రమించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో లోక్‌సభ ఎన్నికల మ్యాజిక్ పునరావృతం చేస్తామని బీజేపీ నేతలు చెపుతున్నారు.అయితే యూపీలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కమలనాథులకు గట్టిపోటీని ఇస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో రెండు చోట్ల గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మెయిన్‌పురి నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. అటు గుజరాత్లో మోడీ స్థానంలో ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్న ఆనందీబెన్ పటేల్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. -
వడోదర బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్టా
న్యూఢిల్లీ: గుజరాత్ లోని వడోదర లోక్‌సభ స్థానానికి తమ అభ్యర్థిగా రంజన్‌బెన్ భట్టా పేరును బీజేపీ ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయడంతో వడోదర స్థానం ఖాళీ అయింది. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వడోదర్ లో మోడీ 5.7లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచ్చారు. వారణాసిలో కూడా ఆయన విజయం సాధించడంతో వడోదర సీటు వదులుకున్నారు. కాగా, కాంగ్రెస్ తరపున నరేంద్ర రావత్ పోటీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 13న వడోదర ఉప ఎన్నిక జరగనుంది. -
వడోదరాలో మోడీ ఎన్నికల వ్యయం రూ. 50 లక్షలు
వడోదరా: గుజరాత్‌లోని వడోదరా స్థానం నుంచి కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారానికి సుమారు రూ. 50 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు తేల్చారు. వడోదరాలో మోడీ మొత్తం ఎన్నికల వ్యయం రూ. 50,03,598గా లెక్కగట్టారు. ఇందుకు సంబంధించిన లెక్కలను మోడీ ప్రచార వ్యయం ఇన్చార్జి, వడోదరా మేయర్ భరత్ షా శుక్రవారం స్థానిక ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమర్పించారు. దీని ప్రకారం మోడీ ఏప్రిల్ 9న నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా నిర్వహించిన సభతోపాటు మే 16న విజయోత్సవ సభ (వడోదరాలో 5.70 లక్షల ఓట్ల మెజారిటీతో మోడీ గెలిచారు) నిర్వహణకు రూ. 25.80 లక్షలు ఖర్చు అయింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పెద్ద రాష్ట్రాల్లో రూ. 40 లక్షల నుంచి రూ. 70 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో రూ. 22 లక్షల నుంచి రూ. 54 లక్షలకు పెంచడం తెలిసిందే. -
100 రోజుల ఎజండా
* కీలకమైన అంశాలను గుర్తించి లక్ష్యంలోగా పూర్తి చేయండి * మంత్రులకు ప్రధాని మోడీ మార్గనిర్దేశం * అభివృద్ధిలో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించాలి * దేశాభివృద్ధికి పది సూత్రాల ప్రణాళిక న్యూఢిల్లీ: ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మూడు రోజులకే తన మంత్రివర్గ సహచరులకు నరేంద్రమోడీ 100 రోజుల ఎజెండాను నిర్దేశించారు. తమ మంత్రిత్వశాఖల్లో ప్రాధాన్యతలవారీగా కీలకమైన అంశాలను గుర్తించి 100 రోజుల్లోగా వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. సమర్థ పాలనతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు పెద్దపీట వేయాలని సూచించారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యమే ముఖ్యమని చెబుతూ.. రాష్ట్రాలు, ఎంపీలు లేవనెత్తే సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్బోధించారు. గురువారమిక్కడ జరిగిన కేబినెట్ భేటీలో మోడీ ఈ మేరకు మార్గనిర్దేశం చేశారు. దేశాభివృద్ధికి పది సూత్రాల ప్రణాళికలో భాగంగా ప్రధాని ఈ విషయాలను మంత్రులకు వివరించారు. ఈ పది సూత్రాల ప్రణాళికలో... దేశంలో పెట్టుబడులను గణనీయంగా పెంచడం, ఇప్పటికే చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయడం, దేశ పురోగతికి సహజ వనరులను వినియోగించుకోవడం వంటి అంశాలకు మోడీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ 4 నుంచి 11 వరకు జరుగనున్న పార్లమెంట్ సమావేశాల అనంతరం మోడీ తన పది సూత్రాల ప్రణాళికను వివరిస్తూ జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశాలున్నాయి. తొలి వంద రోజుల్లో మంత్రిత్వ శాఖల్లో ముఖ్యమైన అంశాలను గుర్తించి, వాటిని పూర్తి చేయాలని మోడీ చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరల నియంత్రణ, వ్యవసాయం, మహిళల భద్రతకు సహజంగానే పెద్దపీట వేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వడోదర సీటును వదులుకున్న మోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసితోపాటు గుజరాత్‌లోని వడోదర నుంచి నెగ్గిన మోడీ గురువారం వడోదర లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. వడోదరలో ఆయన కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీపై 5.7 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. చట్టం ప్రకారం రెండుస్థానాల్లో నెగ్గిన ఎంపీ.. ఫలితాలు వెలువడిన 14 రోజుల్లోపు ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాలి. ఈ గడువు గురువారంతో పూర్తికానున్న నేపథ్యంలో మోడీ వడోదర స్థానానికి రాజీనామా చేశారు. చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టినందుకు వడోదర నియోజకవర్గ ప్రజలకు ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి, ఆజాంగఢ్ల నుంచి నెగ్గిన ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ కూడా మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలు అందినట్లు పార్లమెంట్ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి. పీఎంవో అధికారులతో మాటామంతీ.. ప్రధానిగా మూడోరోజు నరేంద్రమోడీ సౌత్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో కలియదిరిగారు. స్వయంగా సిబ్బంది వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. కార్యాలయంలో పలు విభాగాలు, ఉద్యోగుల విధులు, వసతుల గురించి మోడీ వాకబు చేసినట్లు పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం సిబ్బంది, అధికారులతో కలిసి దిగిన ఫొటోను మోడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మోడీ 10 సూత్రాల ప్రణాళిక 1. పాలనలో పారదర్శకత, ఈ-వేలంకు పెద్దపీట 2. అధికారవర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందించడం 3. అధికారుల నుంచి సృజనాత్మక ఆలోచనలను స్వీకరించడం, పనిలో స్వేచ్ఛ కల్పించడం 4. విద్య, ఆరోగ్యం, తాగునీరు, ఇంధనం, రోడ్లకు ప్రాధాన్యం 5. ప్రజా అనుకూల విధానాల రూపకల్పన 6. మౌలిక వసతులు, పెట్టుబడుల్లో సంస్కరణలు 7. శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక వ్యవస్థ 8. ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి కృషి 9. నిర్దేశిత గడువులోగా విధానాల అమలు 10. ప్రభుత్వ విధానాల్లో సుస్థిరత మంత్రులకు 7 మార్గదర్శకాలు * కీలకాంశాలను గుర్తించి 100రోజుల్లో పరిష్కరించండి * సుపరిపాలనపై దృష్టి పెట్టండి * పథకాల అమలులో సమర్థంగా వ్యవహరించండి *రాష్ట్రాలు, ఎంపీలు లేవనెత్తిన అంశాలపై తక్షణమే స్పందించండి. వాటిని పెండింగ్‌లో పెట్టొద్దు. * గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను ప్రాధాన్యతలవారీగా చేపట్టండి * నిర్ణయాల్లో సహాయ మంత్రులనూ విశ్వాసంలోకి తీసుకుని, వారికి కూడా పనులు అప్పగించండి * సిబ్బంది నియామకాల్లో బంధుప్రీతి కూడదు -
సొంత రాష్ట్రానికి మోడీ గుడ్‌బై
సొంత రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టాటా చెప్పేశారు. తనను భారీ మెజారిటీతో గెలిచిపించిన వడోదర ప్రజలకు గుడ్‌బై చెప్పారు. దాదాపు 5.40 లక్షల మెజారిటీతో గెలిచిన వడోదర లోక్‌సభ స్థానానికి నరేంద్ర మోడీ గురువారం నాడు రాజీనామా చేశారు. గుజరాత్‌లోని వడోదరతో పాటు.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి కూడా మోడీ ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. రెండింటిలో ఏదో ఒకటే స్థానాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన వారణాసి ఎంపీ పదవిని అట్టిపెట్టుకుని, వడోదరకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, తనను రికార్డు మెజారిటీతో గెలిపించిన వడోదర స్థానంలో అభ్యర్థిగా ఆయన ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గుజరాత్ మాజీ హోం మంత్రి, మోడీకి అత్యంత సన్నిహితుడు, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 78 ఎంపీ స్థానాలు అందించిన అమిత్ షా ఇక్కడినుంచి పోటీ చేసే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. లేనిపక్షంలో.. అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభ రెండింటిలోనూ సభ్యత్వం లేకపోయినా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన స్మృతి ఇరానీ లేదా నిర్మలా సీతారామన్ ఇద్దరిలో ఒకరికైనా అవకాశం ఇవ్వచ్చని చెబుతున్నారు. -
4 లక్షల ఓట్లతో వడోదరలో మోడీ విజయం
తన కంచుకోట వడోదర లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ మిస్త్రీ పై ఆయనకు 4 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం లభించింది. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి 326 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, యూపీఏ కూటమి 65 స్థానాలకు పరిమితం అయ్యింది. ఇతరులు 152 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ గాంధీనగర్ స్థానంలో ఘన విజయం సాధించారు. తొలుత ఆయన అక్కడినుంచి పోటీ చేయడానికి విముఖత కనబరిచినా, గుజరాత్ కావడంతో మోడీ స్వయంగా ఆయన విజయబాధ్యతను తన భుజానికి ఎత్తుకున్నట్లు తెలిసింది. కేవలం బీజేపీ ఒక్కటే 265 స్థానాలలో తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. కర్ణాటకలో లింగాయత్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ మళ్లీ తన పాత వైభవాన్ని కనబరుస్తోంది. లింగాయత్ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప మళ్లీ బీజేపీలో చేరడంతో ఈ ఆధిక్యం వచ్చినట్లు తెలుస్తోంది. -
నరేంద్ర మోడీకి మరో మోడీ బెడద!
వడోదర: ఎన్నికలలో చిత్రవిచిత్రాలు చాలా జరుగుతూ ఉంటాయి. ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అదే పేరు గల వారిని పోటీకి పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అదే పేరు గల వారు పోటీ చేస్తూ ఉంటారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కూడా ఇలాంటి ఓ చిక్కు వచ్చి పడింది. గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానంలో మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో నరేంద్రమోడీ కాకుండా మరో మోడీ కూడా పోటీలో ఉన్నారు. నరేంద్ర బాబూ లాల్ మోడీ అనే వ్యాపారవేత్త వడోదరలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కొంతమంది ఓటర్లు పేర్లను చూసి తికమక పడి ఆ మోడీకి వేయబోయి ఈ మోడీకి వేసే అవకాశం ఉంది. తన పేరులోనూ నరేంద్ర మోడీ ఉన్నందున కలసి వస్తుందని ఈ నరేంద్ర బాబూ లాల్ మోడీ అనుకున్నారేమో! ఈ మోడీకి అసలు మోడీ ఓట్ల ఎన్ని కొల్లగొడతారో తెలియాలంటే ఫలితాల వరకూ వేచిచూడవలసిందే. -
మోడీ - పెళ్లికాని ప్రసాదు కాదు...
-
మోడీ - పెళ్లికాని ప్రసాదు కాదు... పెళ్లి దాచిన ప్రసాదు
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అవివాహితుడు కారు. ఆయనకు నలభై అయిదేళ్ల క్రితమే పెళ్లైంది. అంతే కాదు. ఇన్నాళ్లూ ఆయన వివిధ ఎన్నికల అఫిడవిట్లలో వైవాహిక జీవితానికి సంబంధించిన కాలమ్ ను ఖాళీగా వదులుతూ వచ్చారు. బుధవారం వడోదరలో నామినేషన్ వేస్తూ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన తాను వివాహితుడని, తన భార్య పేరు యశోదా బెన్ అని చెప్పుకున్నారు. దీంతో నరేంద్ర మోడీ రహస్యమయ వ్యక్తిగత జీవితం పై మరిన్ని ఊహాగానాల తేనెతుట్టెని కదిలించినట్టయింది. తాను పెళ్లి చేసుకున్నట్టు మోడీ మొట్టమొదటిసారి అంగీకరించారు. యశోదాబెన్ తో మోడీకి వివాహమైన విషయం గుజరాత్ లో బహిరంగ రహస్యం. మోడీ స్వగ్రామం వడ్ నగర్ కి పది కి.మీ దూరంలోని ఒక ఊళ్లో యశోదాబెన్ టీచర్ గా పనిచేస్తున్నారు. స్థానిక బిజెపి కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఇన్నేళ్ల తరువాత మోడీ తనకు పెళ్లైన విషయాన్ని ఒప్పుకున్నారు. ఆమె ఆస్తిపాస్తుల విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పుకున్నారు. కానీ మోడీ ఈ విషయాన్ని తన అఫిడవిట్లలో ఇంతవరకూ ఎందుకు వెల్లడించలేదు? 2012 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లోనూ దీని గురించి ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా తనకు పెళ్లైన విషయాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఎన్నికల తరువాత తన వైవాహిక స్థాయి విషయంలో వివాదం తలెత్తకూడదనే ఇలా చేశారా? బిజెపి తరఫు నుంచి కూడా దీని గురించి ఎవరూ స్పష్టీకరణనివ్వడం లేదు. మోడీ తనకు పెళ్లైందా లేదా అన్న విషయాన్ని అఫిడవిట్ లో స్పష్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మోడీ మొదటిసారి ఈ వెల్లడి చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఇది వివాదమై, తాను ప్రధాని కాకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఇలా చేశారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మోదీ అన్నగారైన దామోదర్ దాస్ మోడీ మాత్రం మోడీకి బాల్య వివాహం జరిగిందని, అప్పట్లో తమ కుటుంబంలో ఇలాంటి విషయాల పట్ల అవగాహన లేదని, కుటుంబంలో ఎవరూ అప్పట్లో పెద్దగా చదువుకున్న వారు లేరని ఒక ప్రకటనలో తెలియచేశారు. తరువాత కాలంలో మోడీ పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. ఆరెస్సెస్ ప్రచారక్ కావాలని నిర్ణయించుకున్న తరువాత ఆయన పూర్తిగా బ్రహ్మచర్య జీవనాన్నే పాటించారు. -
వడోదర నా కర్మభూమి: మోడీ
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి అంతకుముందు భారీ రోడ్ షో గైక్వాడ్ల పాలనపై మోడీ ప్రశంసల జల్లు వడోదర(గుజరాత్): బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బుధవారం లాంఛనంగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దూకారు. అట్టహాసంగా వడోదర స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. భారీసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా కలెక్టరేట్‌కు చేరుకుని తంతు ముగించారు. కిరణ్ మహిదా అనే టీ వ్యాపారి, ఒకప్పటి బరోడా(వడోదర) సంస్థానాన్ని పాలించిన గైక్వాడ్ వంశానికి చెందిన శుభాంగినీదేవీ రాజే గైక్వాడ్ తదితరులు మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. రాజకీయాల్లోకి రాకముందు టీ అమ్మానని మోడీ చెబుతుండడం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ముందు మోడీ వడోదర వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలతో రోడ్లు కిక్కిరిశాయి. రోడ్‌షో ముస్లింలు నివసించే ప్రాంతాల గుండా సాగినప్పుడు ఆ వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో మోడీని పలకరించడం కనిపించింది. నామినేషన్ అనంతరం మోడీ విలేకర్లతో మాట్లాడారు. గైక్వాడ్ల పాలనపై ప్రశంసలు కురిపించారు. ‘సుపరిపాలన, ప్రజాసంక్షేమానికి కృషి చేసిన గైక్వాడ్ల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. వడోదర నా కర్మభూమి. నాకు ఘనస్వాగతం పలికినందుకు నగర ప్రజలకు కృతజ్ఞతలు’ అని అన్నారు. వడోదరలో గైక్వాడ్‌లు ఏర్పాటు చేసిన సంస్థల నుంచి లబ్ధి పొందానని, వారు స్థాపించిన బడిలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశానని గుర్తు చేసుకున్నారు. తాను జన్మించిన వాద్నగర్ గైక్వాడ్ల రాజ్యంలో భాగంగా ఉండేదని, నామినేషన్ వేసిన చోటుకి 200 అడుగుల దూరంలోనే నివసించానని చెప్పారు. మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరచే అవకాశం రావడంపై టీ వ్యాపారి కిరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రధాని అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు నాలాంటి సామాన్యుడినిగుర్తు చేసుకోరు. ఒక్క మోడీ మాత్రమే గుర్తు చేసుకున్నారు’ అని అన్నారు. వడోదర బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాలకృష్ణ శుక్లా డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నెల 30న వడోదరలో ఎన్నికలు జరగనున్నాయి. మోడీపై మధుసూదన్ మిస్త్రీ కాంగ్రెస్ అభ్యర్థిగా, మెకానికల్ ఇంజనీర్ సునీల్ కులకర్ణి ఆమ్ ఆద్మీ పార్టీఅభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచీ లోక్‌సభకు పోటీ చేస్తుండడం తెలిసిందే. ‘దేశం కాంగ్రెస్‌ను నమ్మదు’ షోలాపూర్/లాతూర్(మహారాష్ట్ర): కాంగ్రెస్‌పై, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శల వాడిని పెంచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్‌ను దేశం నమ్మదని దుయ్యబట్టారు. మోడీ బుధవారం షోలాపూర్, లాతూర్‌లలో ఎన్నికలసభల్లో మాట్లాడారు. మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, శరద్ పవార్లపై నిప్పులు చెరిగారు. ‘ఢిల్లీలోని యూపీఏ ప్రభుత్వాన్ని మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలో ఒక్క కారణం చెప్పగలరా? సుశీల్, పవార్లు మీకి చ్చిన హామీలు తుంగలో తొక్కలేదా?’ అని ప్రజలతో అన్నారు. ‘షిండేజీ! మీరు హోం మంత్రి. షోలాపూర్ చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే యూనిఫారాలను పోలీసులకు అందించి, వారికి జీవనోపాధి కల్పించాలన్న ఆలోచన మీకెందుకు రాలేదు? ఆయన (షిండే) మేడంను(సోనియా గాంధీ) ఎలా సంతోషంగా ఉంచాలో రేయింబవళ్లు ఆలోచిస్తుంటారు. వీరంతా ఒకే కుటుంబ (గాంధీ కుటుంబ) భక్తులు’ అని విమర్శించారు. కాంగ్రెస్ పేదరికాన్ని పర్యాటకంలా చూస్తోందని, ఆగర్భశ్రీమంతుడైన రాహుల్‌కు పేదరికమంటే ఏంటో తెలియదని మోడీ విమర్శించారు. -
వడోదరలో నరేంద్ర మోడీ నామినేషన్
-
మోడీ కోసం ‘డూప్లికేట్ ’ ప్రచారం
వడోదరా: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దేశవ్యాప్త ప్రచారంలో బిజీబిజీగా ఉంటే ఆయన కోసం ఓ ‘డూప్లికేట్’ మోడీ రంగంలోకి దిగాడు. ఆయన పోలికలతో ఉన్న జితేంద్ర వ్యాస్ అనే స్థానికుడు మోడీ విజయం కోసం వడోదరాలో ప్రచారం చేస్తున్నాడు. మోడీ వారణాసితోపాటు వడోదరా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాస్ వడోదరాలో శుక్రవారం ఆలయంలో పూజ చేసి ప్రచారం ప్రారంభించాడు. ‘మోడీ దేశమంతా తిరుగుతూ ప్రచార కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఇక్కడ ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించలేడు. అందుకే ఆయనకు మద్దతుగా వడోదరాలో నేను ప్రచారం చేసి రికార్డు స్థాయిలో గెలిపిస్తా’ అని వ్యాస్ చెప్పాడు. -
వడోదరలో మోడీపై పోటీకి ఢీ అంటున్నఓ సామాన్య నేత!
అహ్మదాబాద్: ఒకవైపు రాజకీయాల్లో కాకలు తీరిన నేత... మరొక వైపు రాజకీయాల గురించి పెద్దగా తెలియని ఓ సామాన్య నేత. వీరిద్దరి మధ్య పోరుకు గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానం వేదిక కానుంది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానంలో... పట్టణ కాంగ్రెస్ నేత నరేంద్రరావత్ తలపడనున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆచరణలోకి తెచ్చిన కొత్త విధానం ద్వారా రావత్‌ను పార్టీ ఎంపిక చేసింది. రావత్ వత్తిరీత్యా ఇంజనీర్. మహారాజ సయాజీరావు యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగానూ ఉన్నారు. అయితే, ఇంతకుముందు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసిన అనుభవం ఆయనకు లేదు. దీంతో మోడీ గెలుపు నల్లేరుపై నడక కానుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో మోడీ పోటీచేయనున్న విషయం తెలిసిందే. రెండో స్థానంగా మోడీ సొంత రాష్ట్రంలోని సురక్షిత స్థానమైన వడోదరను ఎంచుకున్నారు. -
గతేడాది 43 % వీసాలను మంజూరు చేశాం: అమెరికా కాన్సులేట్
వడోదరా: గతేడాది భారతీయ విద్యార్థులకు 43% వీసాల కేటాయించామని యూఎస్ వైస్ కాన్సులెట్ జెస్సీ వాల్తర్ తెలిపారు. సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పొల్గొన్న ఆయన అమెరికా వీసా విధివిధానాలపై వివరణ ఇచ్చారు. బీ-1, బీ-2, ఎఫ్-1 సవరణలు చేయడంతో ఇది సాధ్యపడిందని తెలిపారు గత సంవత్సరం భారతీయులకు ఆరు లక్షలపైగా అమెరికా వీసాలు మంజూరు చేశామన్నారు. భారతీయ విద్యార్థులకు అమెరికా వీసా కేటాయింపులు పెరిగడంతో లక్షలాది మంది విద్యార్థుల లక్ష్యమైన అమెరికా చదువుకు మరింత అవకాశం పెరిగింది. నిరుడు అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 5600 స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేసింది. అంతకుముందు కంటే ఇది 50 శాతం ఎక్కువ. 2012 నివేదిక ప్రకారం 2011- 12 లో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 3.5 శాతం తగ్గింది. కానీ ఆ తర్వాతి క్రమేపీ పుంజుకుంది. అమెరికాలో ప్రస్తుతం 1,00,270 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. భారతీయ విద్యార్థుల స్పందన సానుకూలంగా ఉందని, ఈ పరిణామం తమకు సంతోషకరమని అమెరికా కాన్సులేట్ అధికారులు చెబుతున్నారు. -
గుజరాత్లో కూలిన జంట భవనాలు
సాక్షి, ముంబై/వడోదరా: గుజరాత్లో మూడంతస్తుల జంట భవనాలు కుప్పకూలిపోయాయి. వదోదరా నగరంలో అట్లాదారా ప్రాంతంలోనున్న మాధవ్‌నగర్‌లో బుధవారం వేకువ జామున 4.30 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. 11మంది దుర్మరణం చెందారు. మరో 40 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృం దాల సాయంతో స్థానిక యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు సాగిస్తోంది. శిథిలాల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల శిశువు, పదమూడేళ్ల బాలు డు ఉన్నట్లు సర్ సాయాజీరావు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేశ్వర్ పాండే చెప్పారు. జంట భవనాలు వేకువ జామున కుప్పకూలాయని, అప్పటికి అందరూ గాఢనిద్రలో ఉండటంతో ఎవరూ తప్పించుకోలేకపోయారని వదోదరా అగ్నిమాపక అధికారులు చెప్పారు. -
వడొదరలో కుప్పకూలిన భవనం: ముగ్గురు మృతి
గుజరాత్ రాష్ట్రంలోని వడొదర నగరంలో అట్లాండర ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున మూడంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించారని నగర పోలీసు కమిషనర్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను నగరంలోని ఎస్ఎస్జీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని తెలిపారు. కాగా శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఆ దుర్ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే వడొదర మేయర్, మున్సిపల్ కమిషనర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను వారు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. 13 నుంచి 14 కుటుంబాలు కుప్పకూలిన భవనంలో నివాసం ఉంటున్నారని చెప్పారు. శిథిలాలను తొలగిస్తే గాని మరణించిన, గాయపడిన వారి సంఖ్య స్పష్టంగా తెలుస్తుందని మేయర్ ఓ ప్రకటన తెలిపారు. అట్లాండర గ్రామం కొద్ది సంవత్సరాల క్రితమే వడొదర నగరంలో విలీనం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ దుర్ఘటనకు గల కారణాలను అన్వేషిస్తామని మేయర్ ఈ సందర్భంగా చెప్పారు.