‘ఆమెను ఇక్కడ ఉండనిస్తే.. మేం ప్రశాంతంగా ఉండలేం’! | Why Vadodara Residents Protest Allotment Of Flat To A Muslim Family | Sakshi
Sakshi News home page

‘ఆమెను ఇక్కడ ఉండనిస్తే.. మేం ప్రశాంతంగా ఉండలేం’!

Published Fri, Jun 14 2024 2:32 PM | Last Updated on Fri, Jun 14 2024 2:45 PM

Why Vadodara residents protest allotment of flat to A Muslim family

ఆమె పేరు ఫాతిమా(పేరుమార్చాం). గుజరాత్‌లోని ఓ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగంలో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద వడోదర హార్నీ ఏరియాలో నిర్మించిన మోట్‌నాథ్‌ హౌజింగ్‌ క్లాంపెక్స్‌లో ఏడేళ్ల కిందట ఆమెకు ఫ్లాట్‌ కేటాయించారు. అయితే ఇన్నేళ్లు అయినా ఆమె అక్కడ అడుగుపెట్టలేకపోయింది. అధికారులు కారణం కాదు.. ఆమెతో పాటు ప్లాట్‌ పొంది హాయిగా అక్కడ నివసిస్తున్నవాళ్లలో కొందరు ఆమెను అడ్డుకుంటున్నారు.

వడోదర మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని కాంప్లెక్స్‌లో 462 ఇళ్లు ఉన్నాయి. అర్హత జాబితా ప్రకారం.. 2017లో ఫాతిమాకు  అందులో ఇంటిని కేటాయించారు. అయితే ఆ హౌజింగ్‌ కాంప్లెక్స్‌లో ఉండే 33 మంది ఓనర్లు ఆమెకు ఇంటికి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  ఆమె ముస్లిం అని, ఆమె గనుక అక్కడ ఉంటే.. గొడవలు జరిగే అవకాశం ఉందంటూ  2020లో ముఖ్యమంత్రి కార్యాలయానికి,  కలెక్టర్‌కు, స్థానిక అధికారులకు లేఖలు రాశారు. అంతటితో ఆగకుండా ధర్నాకు సైతం దిగారు. దీంతో.. ఆమె అక్కడికి వెళ్లకుండా ఆగిపోయారు.

భర్తను కోల్పోయిన ఆమె.. ఇంతకాలం ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది. కొడుకు అదే ఏరియాలో మరో ఇంట్లో ఉంటున్నాడు. ఇన్నేళ్లు గడిచాయి కదా.. పరిస్థితులు శాంతించి ఉంటాయని, తాను తన కొడుకుతో అక్కడికి షిఫ్ట్‌ అయ్యిందని అనుకుంది. అయితే ఈ విషయం తెలిసి మళ్లీ ఆ 32 మంది ఓనర్లు ధర్నాకు దిగారు. ప్రశాంతంగా ఉంటున్న తమ సమముదాయంలో ఆమె వల్ల అలజడి చెలరేగడం తమకు ఇష్టం లేదని, అందుకే ఆమెను ఇక్కడ ఉండనివ్వబోమని నిరసన చేపట్టారు. దీనిపై స్పందించేందుకు అధికారులెవరూ ఇష్టపడడం లేదు. ఇది ఆ కాంప్లెక్స్‌లో ఉంటున్న నివాసితుల సమస్య గనుక వాళ్లే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలంటూ చేతులెత్తేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement