hindus
-
హిందూ ధర్మం విశ్వజనీనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యం. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజందే ప్రధాన పాత్ర. సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణలో ఆలయాల పాత్ర కీలకం’ అని ఏపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవీస్, డాక్టర్ ప్రమోద్ సావంత్ అన్నారు. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో మూడు రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్న ‘అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ఎక్స్పో’ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 – ఫౌండర్, అంత్యోదయ ప్రతిష్ఠాన్ ప్రవీణ్ దారేకర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు.అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలుఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయాల పరిరక్షణ, భద్రత, ఆర్థిక స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ముందంజలో ఉన్నప్పటికీ, విశ్వాసం ముందు అవి ఏమీ చేయలేవని చెప్పారు. టీటీడీ పాలకమండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణ వర్గాలను సభ్యులుగా చేరుస్తామన్నారు. మతపరమైన టూరిజాన్ని పెంచేందుకు అటవీ, ఎండోమెంట్, పర్యాటక శాఖ మంత్రులతో ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అర్చకుల వేతనాన్ని, నిరుద్యోగ వేద పండితులకు గౌరవ వేతనం పెంచుతామని, ఆలయాలు, వేద వ్యవహారాల్లో స్వయంప్రతిపత్తికే అవకాశం కల్పిస్తామని తెలిపారు. తిరుమల బాలాజీని మోసం చేస్తే ఆయన క్షమించడని చెప్పారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులను సాంస్కృతిక, ఆర్థిక ఉద్యమంలో ఏకం చేయడంలో ఈ సమావేశం చొరవ చూపడం హర్షణీయమని అన్నారు.భారత ఆలయాలు శక్తి స్వరూపాలు : దేవేంద్ర ఫడ్నవీస్ ప్రపంచ దేశాల ప్రజలు భారత ఆలయాలను ఆధ్యాత్మిక నిలయాలుగా, శక్తి స్వరూపాలుగా పరిణగనిస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. దేశంలోని దేవాలయాల చరిత్ర అతి పురాతనమైనదని, దక్షణ భారత్‌లోని ఆలయాలు చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయని తెలిపారు. వేల ఏళ్ల క్రితం ఇలాంటి ఆలయ నిర్మాణం ఎలా జరిగిందని ఆరా తీస్తూ భక్తి భావానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 55 శాతం మంది ధర్మ పర్యటనల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూడటానికి ఆధ్యాత్మిక సంపద, సంస్కృతే కారణమని వివరించారు. సనాతన భక్తి భావం పెంపొందించడంలో, హిందువుల సమైక్యత, సంస్కృతిని కాపాడడంలో ఈ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో దోహదపడుతుందని తెలిపారు.ధర్మ రక్షణే భారత ప్రజల సిద్ధాతం: డాక్టర్ ప్రమోద్ సావంత్ధర్నాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అనేదే భారత ప్రజల సిద్ధాంతమని గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ చెప్పారు. గోవులను పూజించడం, రక్షించడం మన కర్తవ్యం కావాలని అన్నారు. హిందువులు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పవిత్రతకు మూల స్తంభాలైన దేవాలయాలను పరిరక్షించాల్సిన భాద్యత ప్రతి హిందువుకూ ఉందని చెప్పారు.ఎక్స్పో ప్రధాన ఉద్దేశమిదీ..అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో 58 దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పాల్గొని, 1581 దేవాలయాలను ఓకే వేదికపై అనుసంధానించడం లక్ష్యంగా ఈ ఎక్స్పో నిర్వహించారు. ప్రధానంగా స్థిరత్వ, పునరుత్పాదక ఇంధనం, దేవాలయ పాలన, దేవాలయ ఆర్థిక వ్యవస్థ, లక్ష్యాలు, స్మార్ట్ టెంపుల్ పరిష్కారాలు వంటి అంశాలపై మూడు రోజుల పాటు సెమినార్లు నిర్వహించనున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కులకర్ణి, ఐటీసీ పూర్వ చైర్మన్ ప్రసాద్ లాడ్ భవిష్యత్ కార్యక్రమాలను వివరించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద నాయక్, సాధు ప్రతినిధి ఆచార్య గోవింద్ దేవ్ మహారాజ్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ముకుంద్ తదితరులు ప్రసంగించారు. ఈ సభలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, గోవా రాష్ట్ర మంత్రులు ఆశీష్ షెలార్, విశ్వజిత్ రాణే, ప్రభుత్వ సలహాదారు రోహన్ కౌంటే తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు జరిగిన పార్లమెంట్ దిగువసభ ఎన్నికల్లో గెలిచిన నలుగురు హిందువులు శుక్రవారం సభలో అడుగుపెట్టారు. అమెరికాలో మైనారిటీ వర్గమైన హిందువులు ఒకేసారి నలుగురు దిగువసభకు ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఆరుగురు భారతీయ మూలాలున్న వ్యక్తులు ఈసారి దిగువసభ ఎన్నికల్లో గెలవగా వారిలో నలుగురు హిందువులుకావడం విశేషం. గెలిచిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల్లో క్రైస్తవేతర, యూదుయేతర మతవిశ్వాసం ఉన్న వ్యక్తులు కేవలం 14 మంది మాత్రమే. వీరిలో హిందువులు నలుగురు, ముస్లింలు నలుగురు, బౌద్ధులు ముగ్గురు, ఏ మతాన్ని ఆచరించని వాళ్లు ముగ్గురు ఉన్నారు. హిందువులు సుహాస్ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం, రో ఖన్నా, శ్రీ థానేదార్ తాజాగా ఎన్నికల్లో విజయపతాక ఎగరేయడం తెల్సిందే. భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్ ప్రమీలా జయపాల్ తన మతం ఏమిటనేది పేర్కొనలేదు. భారతీయ మూలాలున్న మరో సీనియర్ దిగువసభ సీనియర్ సభ్యుడు డాక్టర్ అమీ బెరా దేవుడొక్కడే అనే విశ్వాసాన్ని తాను నమ్ముతానని చెప్పారు. ‘‘12 ఏళ్ల క్రితం నేను దిగువసభలో ప్రమాణంచేసేటపుడు నేనొక్కడినే భారతీయఅమెరికన్ను. ఇప్పుడు మా బలం ఆరుకు పెరిగింది’’అని అమీబెరీ అన్నారు. మొత్తం సభ్యుల్లో క్రైస్తవులదే మెజారిటీ కాగా 31 మంది(ఆరు శాతం) యూదు మతస్థులున్నారు. గెలిచిన రిపబ్లికన్ పార్టీ సభ్యుల్లో 98 శాతం మంది, డెమొక్రటిక్ పార్టీ సభ్యుల్లో 75 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. స్పీకర్‌గా మళ్లీ మైక్ 52 ఏళ్ల మైక్ జాన్సన్ ప్రతినిధుల సభ స్పీకర్‌గా మళ్లీ ఎన్నికయ్యారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పదవికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా కేవలం మూడు ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన నెగ్గారు. గత వందేళ్ల చరిత్రలో ఇంత తక్కువ మెజారిటీతో గెలిచిన స్పీకర్‌గా మైక్ చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున మైక్ బరిలో దిగారు. దిగువసభలో 219 మంది రిపబ్లికన్లు ఉండగా, 215 మంది డెమొక్రాట్లు ఉన్నారు. ఈయనకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 215 మంది పడ్డాయి. డెమొక్రటిక్ సభ్యుడు హకీమ్ జెఫ్రీస్ సైతం మైక్‌కే ఓటేయడం విశేషం. స్వల్ప మెజారిటీతో నెగ్గిన మైక్ వెంటనే స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. -
సరైన దిశలో ఒక ప్రయత్నం
ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. బంగ్లాదేశ్‌లోని పరిస్థితి పట్ల తన మనోభావాలను భారత్ స్పష్టంగా పంచుకోగలిగింది. బంగ్లాదేశ్‌లోని మధ్యంతర సర్కారుకు ప్రధాన సలహాదారైన మహమ్మద్ యూనస్, బంగ్లా విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్ తదితరులతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఢాకాలో సమావేశమవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత్ నుంచి తొలిసారిగా ఓ ఉన్నతాధికారి బంగ్లా వెళ్ళడం, దౌత్య భేటీ జరపడం విశేషమే. ఇటు హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం, అటు బంగ్లాలో అల్పసంఖ్యాక హిందువులపై దాడులతో ద్వైపాక్షిక సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా భేటీలో ఇరుపక్షాలూ నిర్మొహమాటంగా పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం సరైన దిశలో పడిన అడుగు. హసీనా హయాంతో పోలిస్తే, భారత్ పట్ల పెద్ద సానుకూలత లేని సర్కారు బంగ్లాలో ప్రస్తుతం నెలకొన్నందున తాజా దౌత్యయత్నాలు కీలకం. చారిత్రకంగా మిత్రత్వం, పరస్పర ప్రయోజనాలున్న పొరుగు దేశాలు అపోహలు, అనుమానాలు దూరం చేసుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపకరిస్తాయో చూడాలి. బయట ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో జరిగిన ఈ చర్చలు మైనారిటీలపైన, హిందూ ఆలయాలపైన దాడులు, రాజద్రోహ నేరంపై హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు సహా అనేక వివాదాస్పద అంశాలపై దృష్టి సారించాయి. రెండు కోట్ల పైగా హిందువులున్న ముస్లిమ్ మెజారిటీ దేశంలో మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తే, ఆ ఘటనలు రాజకీయమైన వంటూ బంగ్లా వాదించింది. ప్రజల భావోద్వేగాలు, రాజకీయ ప్రయోజనాలు కలగలిసినప్పుడు పరస్పర భిన్న వాదనల మధ్య రాజీ కుదర్చడం కష్టమే. కానీ, విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీతో చిరు ప్రయత్నమైనా సాగడం విశేషం. బంగ్లాదేశ్ సైతం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, జరుగుతున్నదే మిటో గ్రహించి, అసలంటూ సమస్య ఉన్నదని గుర్తించడానికి ఈ భేటీ ప్రేరేపిస్తే మంచిదే. 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరులో భారత్ పాత్ర మరపురానిది. అదే సమయంలో స్వాతంత్య్రం ముందు నుంచి చారిత్రకంగా ఉన్న అనుబంధం రీత్యా సాహిత్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ పరంగా ఆధునిక భారతావని రూపుదిద్దుకోవడంలో బంగాళ ప్రాంతపు భాగ స్వామ్యం అవిస్మరణీయమే. బ్రిటీషు కాలం నుంచి భౌగోళిక రాజకీయాలు, సామాజిక సాంస్కృతిక కారణాలతో ముడిపడిన భారత – బంగ్లా బంధం ఇటీవలి ఉద్రిక్తతల నడుమ నలిగిపోతోంది. ఇరుదేశాల మధ్య 4,096 కి.మీల ఉమ్మడి సరిహద్దుంది. ప్రపంచంలోనే సుదీర్ఘమైన అయిదో సరిహద్దు ఇది. పైగా, చాలా ప్రాంతంలో పూర్తిస్థాయిలో సరిహద్దుల గుర్తింపు జరగనేలేదు. సరిహద్దులో నెలకొన్న పశ్చిమ బెంగాల్‌లోని ఒక్క పెట్రాపోల్ వద్దనే రెండు దేశాల మధ్య భూమార్గ వాణిజ్యంలో 30 శాతం జరుగుతుంది. ఏటా సుమారు 23 లక్షల మంది సరిహద్దులు దాటి, భారత్‌కు వైద్య చికిత్సకు వస్తుంటారు. కాబట్టి, ఇటీవలి ఉద్రిక్తతల్ని దాటి వాణిజ్యం, ఇంధనం, సహకారం, సామర్థ్యాల పెంపు దలను బంగ్లా చూడగలగాలి. ఇరుదేశాలూ చేతులు కలిపి అడుగులు వేస్తేనే అభివృద్ధి సాధ్యం. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లి లాంటి నిత్యావసర వస్తువుల విషయంలో ఢిల్లీ పైనే ఢాకా ఆధారపడి ఉంది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం దేశీయ ఉత్పత్తిని పెంచుకొని, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇక, బంగ్లా రోగులకు శస్త్రచికిత్స చేసేది లేదంటూ కొన్ని భారతీయ ఆస్పత్రులు అమానవీయంగా, మూర్ఖంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ఈ చర్యల వల్ల బంగ్లా దేశీయులు ఇప్పుడు మలేసియాను ఆశ్రయిస్తున్నట్టు వార్త. ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో భారత ప్రయోజనాలకే దెబ్బ. అసలు మిగతా ప్రపంచంతో భారత వాణిజ్యంతో పోలిస్తే, సరుకుల్లో భారత – బంగ్లాల ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందింది. అనేక అంశాలు ముడిపడి ఉన్నందున తెగేదాకా లాగడం ఇరుపక్షాలకూ మంచిది కాదు. కొత్త వాస్తవాలను గుర్తించక ఒకవేళ మనం ఇదే వైఖరితో ముందుకు సాగితే చివరకు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు, మయన్మార్ వరుసలోనే బంగ్లాదేశ్ సైతం ఢిల్లీకి దూరమవుతుంది. పొరుగున మిత్రులెవరూ లేని దుఃస్థితి భారత్‌కు దాపురిస్తుంది. యూనస్ సారథ్యంలోని ప్రస్తుత బంగ్లా సర్కార్ పాక్‌కు చేరువవుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య వీసాల ఎత్తివేత, రక్షణ ఒప్పందాలు, కరాచీ నుంచి పాకిస్తానీ సరుకుల రవాణా నౌకను చిట్టగాంగ్ వద్ద లంగరేసుకునేందుకు అనుమతించడం లాంటివి చూస్తే అదే అనిపిస్తోంది. దాదాపు 47 ఏళ్ళ తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా సముద్ర నౌకాయాన సంబంధాల పునరుద్ధరణకు ఇది ఒక సూచన. వ్యూహాత్మకంగా సుస్థిర దక్షిణాసియాకు కట్టుబడ్డ భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. బంగ్లా అంతర్గత రాజకీయాల్లోకి అతిగా జొరబడి, ప్రస్తుత హయాం నమ్మకాన్ని పోగొట్టు కోరాదు. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగ కార్యదర్శి ఢాకా పర్యటన ఇరుగుపొరుగు బాంధవ్యం, భాగస్వామ్యాల ప్రాధాన్యాన్ని గుర్తించినట్టే అనిపిస్తోంది. బంగ్లా సైతం ముందుగా తన అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. ఆ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే, మైనారిటీలు సురక్షితంగా ఉంటే, పాత బంధం మళ్ళీ మెరుగవుతుంది. వెరసి, భారత్ – బంగ్లాలు ప్రస్తుతం నాలుగురోడ్ల కూడలిలో నిలిచాయి. మనసు విప్పి మాట్లాడుకొని, పరస్పర ప్రయోజనాల్ని కాపాడుకుంటే మేలు. అలాకాక సహకార మార్గం బదులు సంఘర్షణ పథాన్ని ఎంచుకుంటే ఇరువురికీ చిక్కే! -
సంబంధాల్లో సహనం అవసరం
షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పటి నుండీ... హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. విస్తృత సరిహద్దు రీత్యా, అక్కడి పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి. ఇటీవల శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ లాంటి పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో భారత్ పాఠాలు నేర్చుకోవాలి. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో తోడ్పాటు అందించాలి. హసీనాకు ఏకపక్ష మద్దతివ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన విధానాలను దిద్దుకోవాల్సిన అవసరం ఉందనీ అర్థం చేసుకోవాలి.షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఒక ప్రజా తిరుగుబాటుతో కూల్చివేసినప్పటి నుండీ, హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. అక్కడి మైనా రిటీ హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సంఘటనల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం ‘మైనారిటీలతో సహా బంగ్లాదేశ్ పౌరులందరి భద్రతకు, రక్షణకు ప్రాథమిక బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే’ అని స్పష్టం చేసింది.బంగ్లాదేశ్ పరిణామాలను రెండు రకాలుగా చూడవచ్చు. మొదటిది, హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ ఉక్కు పాదాన్ని తొలగించిన తర్వాత... ఇస్లామిస్టులు, పాకిస్తాన్ కి చెందిన ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్ ్స (ఐఎస్ఐ) పట్టు సాధించారు. ఈ క్రమంలో హిందూ మైనారిటీలు హింసకు గురవుతున్న సందర్భంగా ఆ దేశం పాక్షిక అరాచక స్థితికి చేరుకుంటోంది. రెండవ పరిణామం ఏమంటే, గత దశాబ్ద కాలంగా నిజమైన ప్రజాస్వామ్యం లేని బంగ్లా దేశ్, తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో అడుగులేయడానికి ప్రయ త్నిస్తూ ఒక తాత్కాలిక దశ గుండా పయనిస్తోంది.సరిహద్దుల చుట్టూ?బంగ్లాదేశ్ బహుశా దక్షిణాసియాలో భారతదేశానికి అత్యంత పర్యవసానాలతో కూడిన పొరుగు దేశం. దాని సరిహద్దులను దాదాపు భారత్ పరివేష్టించి ఉంది. 4,367–కిలోమీటర్ల సరిహద్దులో, కేవలం 271 కిలోమీటర్లు మాత్రమే మయన్మార్‌తో ఉండగా, మిగిలిన 4,096 కిలోమీటర్లు భారతదేశంతో ఉంది. త్రిపుర, మిజోరాం, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో ఆ దేశం సరిహద్దులను కలిగి ఉంది. అందుకే ఈశాన్య ప్రాంతపు ఆర్థిక అభివృద్ధి, భద్రతకు ఇది కీలకం. బంగ్లాదేశ్ సరిహద్దు స్వభావాన్ని బట్టి చూస్తే, దానిని పూర్తిగా మూసివేయడం చాలా కష్టం. ఫలితంగా, ఆ దేశంలోని వివిధ ప్రభు త్వాల పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపు తున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి. నియంతలైన జియావుర్ రెహ్మాన్, హెచ్ఎమ్ ఎర్షాద్ తమ నియంత్రణను కొనసాగించే ప్రయత్నంలో దేశంలో ఇస్లా మీకరణను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఈ ఎగుడు దిగుళ్లు తప్ప లేదు. పాకిస్తాన్ లాగే, జమాత్–ఎ–ఇస్లామీ కూడా బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ, ఈ ప్రక్రియలో అది గణనీయమైన పాత్ర పోషిస్తూనే పెరిగింది.భారత వ్యతిరేక గ్రూపులుఅయితే, బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది కేవలం భారతదేశానికి సంబంధించినది మాత్రమే కాదు... చైనా, మయన్మార్, ఆగ్నేయాసి యాతో సహా విస్తృత ప్రాంతంపై దీని ప్రభావం ఉంటోంది. దాని అతి పెద్ద ముస్లిం జనాభాలో పెరిగిపోతున్న సమూల మార్పువాదం (రాడి కలైజేషన్) విస్తృత ప్రపంచ పరిణామాలను కలిగి ఉంటుంది. జమాత్–ఎ–ఇస్లామీతో పాటు, హర్కత్–ఉల్–జిహాద్–అల్–ఇస్లామీ, జమాత్–ఉల్–ముజాహిదీన్ బంగ్లాదేశ్, అలాగే అల్–ఖైదా, ఇస్లామిక్ స్టేట్ల వంటి ఇతర రాడికల్ గ్రూపులు కూడా ఆ దేశంలో ఉన్నాయి. మదర్సా నాయకుల నెట్వర్క్ అయిన హెఫాజత్–ఎ–ఇస్లాం కూడా దేశంలో షరియా పాలనను కోరుకుంటూ, అక్కడ లౌకిక రాజకీయ స్థాపనను వ్యతిరేకిస్తోంది.బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ)తో జమాత్–ఎ–ఇస్లామీ పొత్తు పెద్ద సమస్యగా మారింది. తత్ఫలితంగా, 1991–96లోనూ 2001–06లోనూ ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్న పదవీకాలం అనేది... దాదాపుగా ఐఎస్ఐ, ఈశాన్య ప్రాంతంలో భారతదేశానికి వ్యతిరేకంగా క్రియాశీలంగా ఉన్న తిరుగుబాటు గ్రూపుల వర్గానికి విశృంఖల స్వేచ్ఛను ఇచ్చింది. 2009లో హసీనా ప్రభుత్వ స్థాపనతో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధం స్థిరపడింది. మరీ ముఖ్యంగా, ఇది ఐఎస్ఐ లేదా వివిధ ఈశాన్య తిరుగుబాటు గ్రూపులు, బంగ్లాదేశ్ భూభాగాన్ని భారత వ్యతిరేక శక్తులకు ఉపయోగించడాన్ని తనిఖీ చేయడంలో సహాయపడింది. రెండు దేశాలను కలిపే భూ మార్గాలను తిరిగి తెరవడానికీ, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్ గుండా ప్రాంతీయ ట్రాఫిక్ కదలికను ప్రోత్సహించేందుకు మోటార్ వాహ నాల ఒప్పందంపై సంతకం చేయడానికీ ఈ పరిణామం దారి తీసింది.మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం పక్కనే బంగాళాఖాతం శిఖర ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ స్థానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు, భారతదేశాన్ని నియంత్రించడం అనే తన పెద్ద విధానంలో భాగంగా చైనా తొలి నుంచి బంగ్లాదేశ్‌పై గణనీయమైన ఆసక్తిని పెంచుకుంది. ఇక్కడ చైనా ముఖ్యమైన పెట్టుబడులను కలిగి ఉంది. ఇక్కడి నుండి ఒక పైప్‌లైన్ మలక్కా జలసంధిని దాటవేస్తూ చైనాలోని యునాన్‌కు క్యుక్పియు నౌకాశ్రయం నుండి చమురును తీసుకు వెళుతుంది. బంగ్లాదేశ్‌లో వంతెనలు, రోడ్లు, పవర్ ప్లాంట్లను నిర్మించడంలో చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా దేశానికి అతిపెద్ద సైనిక సరఫరాదారుగా కూడా అవతరించింది.భారత్ చేయాల్సింది!పైన ఉదహరించిన అనేక కారణాల వల్ల, బంగ్లాదేశ్‌లోని వ్యవహా రాలను భారత్ చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. పరిస్థితి చాలా అస్థిరంగా ఉంది. అక్కడ పరిస్థితులు అదుపు తప్పవచ్చు కూడా. ఫలితంగా భారతదేశానికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. అక్కడి ప్రజా ఉద్యమంపై భారత వ్యతిరేక కథనాన్ని రుద్దేందుకు ఐఎస్ఐ ఓవర్‌టైమ్ పని చేసే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత జఠిలమైంది.ఇటీవల పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయ వంతంగా నిర్వహించడం నుండి భారతదేశం పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా, భారత్ గణనీయంగా మంచిపేరు సాధించింది. దీనివల్ల అనూర కుమార దిస్సనాయకే ప్రభుత్వంలో ప్రయోజనాలను పొందు తున్నాం. అదేవిధంగా, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజూతో ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా, ఆయన ప్రచారం చేసిన ‘భారత్ వైదొలిగిపో’ వ్యూహాన్ని మట్టుబెట్టింది.నేపాల్లోనూ ఇలాంటి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. చైనాలో అధికార పర్యటనలో ఉన్న భారత వ్యతిరేక ప్రధాని కేపీ శర్మ ఓలీ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద బీజింగ్‌తో తమ దేశం ఎలాంటి కొత్త రుణ ఒప్పందంపై సంతకం చేయదని ముందే స్పష్టం చేశారు. నిజానికి, నేపాలీలు తమ దేశంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పరిధిని తగ్గించే కొత్త ఒప్పందంపై చైనాతో సంతకం చేయాలనుకుంటున్నారు.బంగ్లాదేశ్‌తో కూడా భారతదేశం వ్యూహాత్మక సహన విధానాన్ని అనుసరించాలి. బంగ్లాదేశ్ పరివర్తనలో ఉన్న దేశం. అక్కడ ప్రజా స్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియకు న్యూఢిల్లీ మద్దతు ఇవ్వాలి.హిందువులపై దాడులను అతిగా చూసే ధోరణి నెలకొంది. ప్రారంభంలో కాస్త పెరిగిన తర్వాత, అటువంటి దాడులు ఇప్పుడు తగ్గాయి. మనం హసీనాకు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన బంగ్లాదేశ్ విధానానికి దిద్దుబాటును అందించాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి.మనోజ్ జోషి వ్యాసకర్త ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’లో డిస్టింగ్విష్డ్ ఫెలో(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పెద్ద ప్లానే..! ట్రంప్ సనాతన మంత్రం
-
భారత్, బంగ్లాదేశ్ రెండూ ఒక్కటే
జమ్మూ: భారత్‌లోని మైనారిటీల పరిస్థితి మాదిరిగానే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులపై అణచివేత కొనసాగుతోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ‘బంగ్లాదేశ్‌లో హిందూ సోదరులు అణచివేతకు గురవుతున్నారని వింటున్నాం, మరి మన దేశంలోని మైనారిటీలు కూడా అలాంటి అనుభవాలనే చవిచూస్తున్నారు. రెండూ ఒక్కటే. నాకైతే తేడా కనిపించడం లేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు బాగో లేవన్నారు. ప్రఖ్యాత అజ్మీర్ దర్గాలో ఏఎస్ఐ సర్వే వ్యవహారంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దర్గాను కూడా తవ్వేస్తారా. ఇలా ఎంతకాలం?’’ అని ముఫ్తీ ప్రశ్నించారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించే శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోకుంటే 1947 నాటి ఘర్షణలు పునరావృత్తమయ్యే ప్రమాదముంది’’ అన్నారు. -
ఇద్దరు పూజారుల అరెస్టు
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువుల నిర్బంధం, అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ముస్లిం అతివాదులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతుండటం తెలిసిందే. ఇప్పటికే హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను దేశ ద్రోహం నేరం మోపి జైలులో పెట్టిన బంగ్లా మధ్యంతర ప్రభుత్వం తాజాగా ఆయన శిష్యులిద్దరినీ అరెస్ట్ చేసింది. ఇస్కాన్ కార్యాలయంపై శనివారం గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. చిట్టోగ్రామ్‌లోని జైలులో ఉన్న చిన్మయ్ దాస్‌కు గురువారం ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఆయన శిష్యులు రుద్రకోటి కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామ సుందర్ దాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుండలినీ ధామ్ మఠానికి చెందిన ప్రొఫెసర్ కుశాల్ బరుణ్ చక్రవర్తి తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారాం దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు లేకుండానే వీరిని నిర్బంధంలోకి తీసుకున్నారని వివరించారు. అదేవిధంగా, ఢాకాలోని కిశోర్‌గంజ్ జిల్లా భైరబ్‌లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంపై దుండుగులు దాడి చేసిన దృశ్యాలను కూడా ఆయన పోస్ట్ చేశారు. బంగ్లాదేశీయులకు ఆస్పత్రుల్లో నో ఎంట్రీకోల్కతా/అగర్తలా: బంగ్లాదేశీయులకు తాము వైద్యం చేయబోమని కోల్‌కతాలోని జేఎన్ రే హాస్పిటల్, త్రిపుర రాజధాని అగర్తలాలో ఉన్న ఐఎల్ఎస్ ఆస్పత్రి ప్రకటించాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు బంగ్లాదేశ్ పౌరులను చేర్చుకోబోమని శుక్రవారం స్పష్టం చేశాయి. అఘాయిత్యాలను అడ్డుకోండి: ఆర్ఎస్ఎస్ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతు న్న అఘాయిత్యాలపై రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీ సుకోవాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా, హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళె శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. -
బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు.. ఖండించిన భారత్
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది. కృష్ణదాస్‌ను అరెస్టు చేసి, బెయిల్ నిరాకరించడంపై భారత విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.దాస్ అరెస్టు విషయంలో బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నట్లు తెలిపింది. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైస్వాల్ తెలిపారు.బంగ్లాదేశ్‌లో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై వరుస దాడులు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే తాజాగా ఘటన జరగడంపై ఆందోళనకరమని విదేశాంగ శాఖ పేర్కొంది. మైనార్టీలపై కాల్పులు, దోపిడీ, దొంగతనం. వ్యాపార సంస్థల్లో విధ్వంసం, దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి దుశ్చర్యలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఇలాంటి దుర్మార్గాలకు కారణమైన వారిని కాకుండా.. శాంతియుత సమావేశాల ద్వారా న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పనిచేస్తున్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని పేర్కొంది. కాగా బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్ ప్రభును దేశద్రోహం ఆరోపణలపై బంగ్లాదేశ్‌లోని ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తును చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఆయన్ను పోలీసులు రిమాండ్‌కు కోరకపోవడంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. నిర్బంధ సమయంలో అతనికి అన్ని మతపరమైన అధికారాలను మంజూరు చేయాలని ఆదేశించింది.అయితే కృష్ణదాస్ గత అక్టోబర్‌లో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎక్కువ ఎత్తిలో ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండాను ఎగురవేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణదాస్‌తోపాటు మరో 18 మందిని అరెస్ట్ చేసి దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో కృష్ణదాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈవిషయంపై భారత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఆయన్ను విడిపించాలని ఇస్కాన్ ఆలయ అధికారులు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. -
Bangladesh: చిన్మయ్ ప్రభు అరెస్టుపై నిరసనల వెల్లువ
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో హిందువులపై దాడుల ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఇస్కాన్ పుండరీక్ ధామ్ అధ్యక్షుడు చిన్మయ్ కృష్ణన్ దాస్‌ను చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్ట్‌కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపాయి.ఇంతలో బీఎన్పీ, జమాత్ కార్యకర్తలు హిందువులపై దాడికి దిగారు. ఈ దాడిలో దాదాపు 50 మంది గాయపడ్డారు. చిన్మయ్ కృష్ణన్ దాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ హిందువులు మౌల్వీ బజార్లో ‘జై సియా రామ్’, ‘హర్ హర్ మహాదేవ్’ అని నినాదాలు చేస్తూ భారీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపధ్యంలోనే వారిపై దాడులు చోటుచేసుకున్నాయి. ఇదేవిధంగా షాబాగ్‌లో చిట్టగాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుశాల్ బరన్పై కూడా దాడి జరిగింది. గాయపడిన ఆందోళనకారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు దాడుల తీవ్రతను తెలియజేస్తున్నాయి.పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఈ సంఘటనలను ఖండించారు. చిన్మయ్ ప్రభు అరెస్టు అన్యాయమని, దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, వెంటనే చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల హక్కుల కోసం చిన్మయ్ ప్రభు నిరంతరం పోరాడుతున్నారని సుకాంత్ మజుందార్ ట్విట్టర్లో రాశారు. ఆయన అరెస్టు దరిమిలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Fighting between colleges have started in US-backed Noble Laureate ruled Bangladesh. Students carrying weapons attacking each other. Many casualties. Chaos at campuses. Situation grim pic.twitter.com/EwQbmKMPBM— Megh Updates 🚨™ (@MeghUpdates) November 25, 2024బంగ్లాదేశ్ పోలీసులు ఢాకా విమానాశ్రయంలో చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని అరెస్టు చేశారు. పోలీసు డిటెక్టివ్ బ్రాంచ్ ప్రతినిధి రెజౌల్ కరీమ్ తెలిపిన వివరాల ప్రకారం చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే అరెస్టు జరిగింది. తదుపరి చర్యల కోసం చిన్మయ్ దాస్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనలు బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల భద్రతపై పలు సందేహాలను లేవనెత్తుతున్నాయి.ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన -
కెనడాలో హిందువుల ర్యాలీ
టొరంటో: కెనడాలో హిందూ దేవాలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడిని నిరసిస్తూ వేలాది మంది సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. నార్త్ అమెరికా హిందువుల కూటమి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరిగిన ర్యాలీలో ఇరు దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించారు. జై శ్రీరామ్, ఖలిస్తాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కెనడాలోని హిందువులు ఏళ్లుగా నిరంతర వివక్షకు గురవుతున్నారని వాపోయారు.కెనడా ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. ‘‘హిందూ కెనడియన్లు కెనడాకు ఎంతో విధేయులు. వారిపై ఈ దాడులు సరికాదని రాజకీయ నాయకులంతా గ్రహించాలి. భారత్, కెనడా సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నాం’’ అని వెల్ల డించారు. ర్యాలీ సందర్భంగా హిందువులపై పోలీ సులు వివక్ష చూపారని ఆరోపించారు. దాన్ని కూడా నిరసిస్తూ శాంతియుతంగా ప్రదర్శన జరిపా మన్నారు. హిందూఫోబియాకు కెనడా అడ్డుకట్ట వేయాలని హిందూ న్యాయవాద బృందం కోరింది.పోలీసుల ఓవరాక్షన్నిరసనల సందర్భంగా కెనడా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. అవి చట్ట విరుద్ధమని ప్రకటించారు. వాటిలో పాల్గొన్న వారి దగ్గర ఆయుధాలు కనిపించాయని ఆరోపించారు. తక్షణం వెళ్లిపోకుంటే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. దీన్ని హిందూ సమాజం తీవ్రంగా నిరసించింది. పోలీసులపై కేసు పెట్టే యోచనలో ఉంది. ఖలిస్తానీ వ్యతిరేక నినాదాలు చేసినందుకు ముగ్గురిని అరెస్టు చేశారని ఆలయ అధికార ప్రతినిధి పురుషోత్తం గోయల్ తెలిపారు. వారిలో 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఆలయ ప్రవేశ ద్వారాన్ని దిగ్బంధించేందుకు, బలప్రయోగానికి పోలీసులకు అధికారం లేదని గోయల్ అన్నారు. వారిని విడుదల చేసేదాకా పోలీసు ప్రధాన కార్యాలయం బయట ఆలయ యాజమాన్యం నిరసనకు దిగింది.ఉగ్రవాదులకు కెనడా అండ: జై శంకర్కాన్బెర్రా: కెనడాలోని బ్రాంప్టన్ హిందూ ఆలయంలో ఆదివారం ఖలిస్తానీలు దౌర్జన్యానికి పాల్పడటంపై విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ స్పందించారు. కెనడా ప్రభుత్వం ఉగ్రవాదులకు రాజకీయంగా అండగా ఉన్న విషయం ఈ ఘటనను బట్టి తెలుసుకోవచ్చని, ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎలాంటి ఆధా రాలు చూపకుండా ఆరోపణలు చేయడమనే వైఖరిని కెనడా అనుసరిస్తోంది.మా దౌత్యాధికారులపై నిఘా పెట్టింది. ఇది చాలా ఆక్షేపణీయం. ఆందోళనకరం’అని జై శంకర్ అన్నారు. బ్రాంప్టన్ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే చాలు.. ఆ దేశ ప్రభుత్వం ఉగ్రవాదులకు రాజకీయంగా ఎలాంటి అవకాశమిచ్చిందీ అవగతమవుతుందన్నారు. భారత కాన్సులేట్, ఆలయ నిర్వాహకులు కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఖిలిస్తాన్ వాదులు అడ్డుకోవడం, హిందువులపై దాడికి పాల్పడటం తెలిసిందే. ఆ ఘటనను విదేశాంగ శాఖతో పాటు మోదీ కూడా ఖండించారు. -
కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీలు.. హిందువులపై దాడి వీడియోలు వైరల్
-
కాషాయ జెండా ఎగరేసినందుకు.. బంగ్లాదేశ్‌లో 18 మందిపై దేశ ద్రోహం కేసు
ఢాకా: మైనారిటీ హిందువులే లక్ష్యంగా బంగ్లాదేశ్ యంత్రాంగం వ్యవహరిస్తున్నదనేందుకు తాజా ఉదాహరణ. మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు చట్టాలు తేవాలంటూ ఇటీవల చత్తోగ్రామ్‌లో హిందువులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాషాయ జెండా ఎగురవేశారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో 18 మందిపై దేశ ద్రోహ చట్టం కింద కేసు నమోదైంది. మరో 20 మంది వరకు గుర్తు తెలియని వ్యక్తులపైనా అక్టోబర్ 25న కేసు నమోదు చేశారు. తమ 8 డిమాండ్ల అజెండాకు బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్, భారత ప్రభుత్వం సాయంగా నిలిచాయని పుండరీక్ ధామ్ ప్రెసిడెంట్, కేసు బాధితుడు అయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తెలిపారు. తమ నిరసన బంగ్లా ప్రభుత్వానికి వ్యతిరేకం కానే కాద న్నారు. కాగా, ఈ చర్యను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ సైతం ఎన్నికల ప్రచారంలో ఖండించడం గమనార్హం. ఇలా ఉండగా, హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఉంటేనే తప్ప, పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి దేశ ద్రోహం కేసును తనంత తానే నమోదు చేయలేరని పరిశీలకులు అంటున్నారు. నేరం రుజువైతే జీవిత కాల జైలు శిక్ష పడవచ్చు. -
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి తీవ్రంగా ఖండించిన డొనాల్డ్ ట్రప్
-
హిందువులను విస్మరించారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను వారిద్దరూ పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై హింసను తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత అనాగరికమైన చర్యగా పేర్కొన్నారు. ట్రంప్ తన దీపావళి సందేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. హిందూ అమెరికన్లకు రక్షణ కలి్పస్తామని ప్రతిజ్ఞ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలపై అరాచక మూకల దాడులను, వారి ఆస్తులను దోచుకుంటున్న అనాగరిక హింసను తీవ్రంగా ఖండించారు. ఎక్స్‌లో ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. తాను అధ్యక్షునిగా ఉంటే ఇలా ఎప్పటికీ జరిగేది కాదన్నారు. ఇజ్రాయెల్ మొదలుకుని ఉక్రెయిన్ మీదుగా అమెరికా దక్షిణ సరిహద్దు దాకా బైడెన్, హారిస్ విధానాలు ఘోరంగా విఫలమయ్యాయంటూ ధ్వజమెత్తారు. మునుపటి కంటే మెరుగైన అమెరికాను తీర్చిదిద్దుతా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్ -
ఎన్ఐఏతో విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిపై దాడి, విగ్రహ ధ్వంసంపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు విభాగానికి (ఎన్ఐఏ) అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, డీజీపీ జితేందర్‌కు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరలోని ఓ హోటల్లో దేశ వ్యతిరేక శక్తులు, దాడులకు పాల్పడిన వారు నెలల తరబడి జరిపిన అక్రమ కార్యకలాపాలపై నివేదిక తెప్పించుకోవాలని గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో మూడునెలలుగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరారు. సోమవారం ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు, డీజీపీ కార్యాలయంలో వేర్వేరుగా ఎంపీలు ఈటల రాజేందర్,ఎం.రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, రాకేష్‌రెడ్డి, నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ తదితరులు వినతిపత్రాలు సమరి్పంచిన వారిలో ఉన్నారు. హిందువులపై కేసులు పెడుతున్నారు : ఈటల రాజ్‌భవన్ వద్ద ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ హిందువులపైనే కేసులు పెడుతున్నారు..ఆత్మగౌరవాన్ని కించపరిస్తే క్షమించేది లేదు అని సీఎంను హెచ్చరించారు. ‘హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడు అని ముద్ర వేసి వదిలేసే ప్రయత్నం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్నర్‌ను కోరాం’ అని ఈటల తెలిపారు. హిందూ దేవాలయాలపై దాడి జరిగినా సీఎం ఖండించలేదు : ఏలేటి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే సీఎం రేవంత్ ఇంతవరకు ఖండించలేదన్నారు. ‘నిందితుల మీద ప్రభుత్వం కేసు పెట్టకుండా ఏం చేస్తోంది? నగరంలో దాడులకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? దేవాలయాల మీద దాడి.. మా తల్లి మీద దాడిలా భావిస్తాం.. తిప్పికొడతా’ అని మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. స్లీపర్ సెల్స్ ఏమైనా కుట్రలు చేస్తున్నాయా : రఘునందన్‌రావు డీజీపీ కార్యాలయం వద్ద ఎంపీ రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ ‘ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్‌పై పూర్తిస్థాయి విచారణ జరగాలి. సంఘ విద్రోహశక్తులు, స్లీపర్ సెల్స్ ఏమైనా కుట్రలు చేస్తున్నాయా అన్నది పరిశీలించాలి. ముత్యాలమ్మ టెంపుల్‌కు సమీపంలో స్లీపర్ సెల్స్‌కు శిక్షణ ఇచ్చారా? రాష్ట్రంలో 3 నెలల వ్యవధిలో 15 గుడులపై దాడుల వెనుక కుట్రకోణంపై విచారణ జరపాలి’ అని రఘునందన్ డిమాండ్ చేశారు. -
బంగ్లాలో హిందువులపై హింస.. మహారాష్ట్రలో నిరసన ర్యాలీ
గోండియా: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొని, హిందువులకు మద్దతుగా పలు నినాదాలు చేశారు.బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఫొటోలు, వార్తలు వెలువడుతున్న దరిమిలా ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ నేపధ్యంలో గోండియాలో 70కి పైగా హిందూ గ్రూపులకు చెందిన 20 వేల మంది బంగ్లాదేశ్‌లోని హిందువులకు మద్దతుగా ర్యాలీని చేపట్టారు. జైస్తంభ్ చౌక్ నుండి కిలోమీటరు మేర పాదయాత్ర చేపట్టారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత కల్పించాలంటూ వారు ర్యాలీలో నినదించారు.ర్యాలీలో పాల్గొన్న కొందరు మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని అన్నారు. మత ఛాందసవాదులు మైనారిటీ హిందువుల దేవాలయాలపై దాడులు చేస్తున్నారని, హిందువుల ఇళ్లను ద్వంసం చేసి, వారిని నిరాశ్రయులుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత ఏర్పడినప్పుడల్లా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తున్నదని అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న హింస, అరాచకాలు, అశాంతి అంతం కావాలని ర్యాలీలో పాల్గొన్నవారు నినదించారు. చివరిగా భారతదేశ జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు -
అస్థిరత ఏర్పడినప్పుడల్లా... హిందువులే టార్గెట్
అంటారియో: బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న హింసపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులతో సహా మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ఆయన ఎత్తిచూపారు. కెనడా పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. బంగ్లాలో అస్థిరత ఏర్పడినప్పుడల్లా ఈ సమూహాలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా అవుతున్నారని, ఎక్కువగా హింసకు గురవుతున్నారని వాపోయారు. 1971లో బంగ్లాకు స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచీ జనాభాలో మతపరమైన మైనారిటీల సంఖ్య భారీగా తగ్గిందని వెల్లడించారు. కెనేడియన్ హిందువులు బంగ్లాదేశ్‌లోని తమ బంధువులు, ఆస్తుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఆర్య తెలిపారు. దీనిపై అవగాహన కలి్పంచేందుకు సెపె్టంబర్ 23న కెనడా పార్లమెంట్ ముందు ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలున్న కెనేడియన్ బౌద్ధులు, క్రిస్టియన్ల కుటుంబాలు కూడా ఇందులో పాల్గొంటాయని తెలిపారు. హిందువులపై దాడులు బంగ్లాదేశ్‌లో ఇటీవలి తిరుగుబాటు తర్వాత దేశవ్యాప్తంగా హింస చెలరేగడం తెలిసిందే. దేశవ్యాప్తంగా 27 జిల్లాల్లో హిందువులు దాడులను ఎదుర్కొంటున్నారు. హిందూ దేవాలయాలను భారీగా టార్గెట్ చేశారు. ప్రార్థనా మందిరాలతో సహా మతపరమైన మైనారిటీలను ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నట్టు బంగ్లాదేశ్‌లోని జమాతే ఇస్లామీ అంగీకరించింది. దీనికితోడు రాజీనామా చేసి దేశం వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులను హతమార్చడం, వారి ఇళ్లకు నిప్పు పెట్టడం వంటివి పెద్దపెట్టున జరిగాయి. మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న హింసపై విచారణకు ఐరాస మానవ హక్కుల నిజ నిర్ధారణ బృందం తాజాగా ఢాకా చేరుకుంది. ఎవరీ ఆర్య? ఎంపీ చంద్ర ఆర్య కర్ణాటకకు చెందినవారు. రెండేళ్ల క్రితం కెనడా పార్లమెంటులో తన మాతృభాష కన్నడలో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అంటారియోలోని నేపియాన్ ఎలక్టోరల్ జిల్లాకు కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్నాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన ఆర్య కెనడా రాజకీయాల్లో పనిచేస్తూనే తన భారత మూలాలతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. -
నమాజ్ వేళ దుర్గా పూజ మైకులు ఆపండి
ఢాకా: షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు, ఆంక్షలు పెరిగాయన్న వార్తల నడుమ దుర్గాపూజకూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోంది. ముస్లింలు నమాజ్, అజాన్ వేళల్లో దుర్గామాత మండపాల వద్ద పూజా కార్యక్రమాలు నిశ్శబ్దంగా జరగాలని, ఎలాంటి సంగీత వాయిదాల శబ్దాలు వినిపించడానికి వీల్లేదని తాత్కాలిక సర్కార్ గురువారం హుకుం జారీచేసింది. దేశంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నమాజ్, అజాన్ సమయాల్లో దుర్గాపూజ మండపాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టమ్‌లను వాడకూడదని, సంగీత పరికరాలను వాయించకూడదని బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి చెప్పారు. -
ఇంత జరుగుతున్నా నోరు మెదపరేం?
బంగ్లాదేశ్ భయానక పరిస్థితులు గమనిస్తుంటే దేశ విభజన నాటి గాయాలు గుర్తుకొస్తున్నాయి. రిజర్వేషన్ల ముసుగులో ఆందోళన చేపట్టిన అల్లరి మూకలు హిందూ సంహారం కొనసాగిస్తున్నాయి. విద్యార్థులు, యువకులు తమ ఉపాధి, ఉద్యో గాల కోసం చేస్తున్న పోరాటాలు హిందూ వ్యతి రేకతే లక్ష్యంగా సాగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువుగా పుట్టడమే పాపం అయిపోయింది. మైనారిటీలు (హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు)గా జీవించడమే శాపం అయిపోయింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందాల్సిన వారు హిందువులను వెంటాడి వేటాడితే రిజర్వేషన్లు లభిస్తాయా? హిందూ దేవాల యాలను ధ్వంసం చేస్తేనో, హిందూ అమ్మా యిలపై అత్యాచారం చేస్తేనో, హిందువులను చంపితేనో కొలువులు వస్తాయా? ఈ భూమిపై చిట్టచివరి హిందువును సైతం అంతం చేసే వరకు మా పోరాటం ఆగదు అంటూ కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రకటించడం వెనుక భయంకర ఉపద్రవం దాగి ఉంది. శత్రువులను సైతం స్వాగతించి అక్కున చేర్చుకోవడం హిందువుల స్వభావం. నాడు సామాజిక రచయిత్రి తస్లీమా నస్రీన్‌ను బంగ్లా నుంచి తరిమేస్తే... భారత్ అక్కున చేర్చుకుంది. నేడు జిహాదీల హత్య నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన షేక్ హసీనాకు సైతం ఆశ్రయం ఇచ్చిన భారత్... శాంతి, సహనంతో ప్రజాస్వామ్య విలువలతో కూడిన దేశంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రక్షించాల్సిన పోలీసులే రజాకారులుగా మారణకాండను ప్రోత్సహిస్తున్నారు. న్యాయ స్థానా లను ఆశ్రయిద్దామంటే ఆందోళనకారులు జడ్జిలను కూడా వదలడం లేదు. కోర్టులను చుట్టుముట్టి న్యాయమూర్తులనే దిగిపోవాలని హుకుమ్ జారీ చేస్తుంటే, అక్కడి మైనారిటీలకు రక్షణ ఏది? ఆస్తులు, ఇళ్లు, పొలాలు వదిలి పారిపోవాలా? ప్రాణం కోల్పోవాలా? మతం మారాలా? అర్థం కాని స్థితిలో నరకం అనుభవించడం హిందువుల వంతయింది. ఏ తప్పు చేయకున్నా హిందువులు పిట్టల్లా ప్రాణాలు కోల్పోవడం నేటి మానవతా సమాజానికి మచ్చగా మారుతోంది.హిందువు అనే ఒకే ఒక్క కారణంతో బంగ్లాదేశ్ క్రికెటర్ ఇంటికి మంట పెట్టడం... భయంతో పారిపోతున్న సినిమా హీరోలను, నిర్మాతలను కొట్టి చంపడం, సాహిత్యకారులు, కళాకారుల ఇళ్లను వారి కార్యాలయాలను, కళాస్మృతులను ధ్వంసం చేయడంపై క్రీడాలోకం, చిత్ర, సాహిత్య లోకాలూ స్పందించకపోవడం బాధాకరం. బంగ్లాకు–భారత్‌కు అనుసంధానంగా ఉన్న ఇందిరాగాంధీ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రాన్ని ధ్వంసం చేస్తే... కనీసం ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులు స్పందించకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? వారి మౌనం ఆందోళనకారులకు మద్దతి చ్చినట్లే భావించాలా? సమాజం ఆలోచించాలి.ఇంత జరుగుతున్నా సినీనటులూ, కళాకారులూ, మానవహక్కుల సంఘాలవాళ్ల గొంతు పెగలక పోవడం బాధాకరం. భారతదేశంలో కుక్కలపై, పిల్లులపై దాడి జరిగితే గగ్గోలుపెట్టే గ్యాంగులు... హిందువుల ఊచకోతను కనీసం పత్రికా ముఖంగానైనా ఎందుకు ఖండించడం లేదు? ఏది ఏమైనా ‘సేవ్ బంగ్లా’ అంటూ ప్రపంచంలోని హిందువు లంతా ఏకతాటిపైకి రావడం హర్షణీయం. దీని గురించి రాజకీయాలకు, కులాలకు అతీతంగా ప్రతి హిందువూ చర్చించడం స్వాగతించాల్సిందే. బంగ్లా విడిపోయిన సమయంలో 32 శాతం ఉన్న హిందూ జనాభా నేడు అక్కడ ఏడు శాతానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తూనే... ప్రతి హిందువూ తమ ఆత్మబంధు వేనని ముందుకు రావడం హిందూ ఐక్యతకు నిదర్శనంగా చెప్పవచ్చు.– పగుడాకుల బాలస్వామిప్రచార ప్రసార ప్రముఖ్; విశ్వహిందూ పరిషత్, తెలంగాణ ‘ 99129 75753 -
బంగ్లాలో హిందూ టీచర్లపై దాడులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత హిందూ ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మైనారిటీలైన హిందూ ఉపాధ్యాయులతో విద్యార్థులు, స్థానికులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఇలా 50 మంది దాకా రాజీనామా చేశారు. వెలుగులోకి రాని ఉదంతాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఆఫీసును ముట్టడించి... బరిషాల్లోని బేకర్‌గంజ్ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ శుక్లా రాణి హాల్దర్ కార్యాలయాన్ని ఆగస్టు 29న మూకలు ముట్టించాయి. వీరిలో బయటి వ్యక్తులతో పాటు ఆ కాలేజీ విద్యార్థులూ ఉన్నారు! తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గంటల తరబడి బెదిరింపులకు దిగారు. దాంతో వేరే మార్గం లేక ఖాళీ కాగితం మీదే ‘నేను రాజీనామా చేస్తున్నాను’ అంటూ సంతకం చేసిచ్చారామె. అజీంపూర్ బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్ గీతాంజలి బారువాతో పాటు అసిస్టెంట్ హెడ్ టీచర్ గౌతమ్ చంద్ర పాల్ తదితరులతో బలవంతంగా రాజీనామా చేయించారు. వారంతా తన కార్యాలయంపై దాడి చేసి తనను అవమానించారని గీతాంజలి వాపోయారు. వైరలవుతున్న వీడియోలు... బంగ్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రాజీనామా లేఖలపై సంతకాలు చేయాలంటూ హిందూ టీచర్లను, ఇతర సిబ్బందిని బలవంతం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేధింపుల దెబ్బకు ప్రొక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వచి్చందని కాజీ నజ్రుల్ వర్సిటీ పబ్లిక్ అసోసియేట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ముఖర్జీ తెలిపారు. ఖండించిన తస్లీమా ఈ ఘటనలపై బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ మండిపడ్డారు. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించడం లేదని ఆరోపించారు. ‘‘హిందూ ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు హత్యలకు, వేధింపులకు గురవుతున్నారు. జైలుపాలవుతున్నారు. దర్గాలను కూలి్చవేస్తున్నారు. అయినా యూనస్ నోరు విప్పడం లేదు’’ అంటూ ఎక్స్‌లో దుయ్యబట్టారు. టీచర్లపై వేధింపులను బంగ్లా ఛత్ర ఐక్య పరిషత్ ఖండించింది. -
ప్రధాని మోదీకి బైడెన్ ఫోన్.. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై చర్చ
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రపంచంలోని వివిధ సమస్యలపై చర్చించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన ఎక్స్ హ్యాండిల్లో తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. అక్కడి హిందువులకు రక్షణ కల్పించాలని అన్నారు.బంగ్లాదేశ్, ఉక్రెయిన్లలో నెలకొన్న తాజా పరిస్థితులపై కూడా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షునితో చర్చించారు. ఉక్రెయిన్‌లో శాంతి, సుస్థిరతలను వీలైనంత త్వరగా తిరిగి తీసుకువచ్చే విషయంలో భారత్ మద్దతు ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ఎక్స్ హ్యాండిల్లో.. ‘మేము ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితితో సహా వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై విస్తృత చర్చలు జరిపాం. శాంతి, సుస్థిరతలను వీలైనంత త్వరగా తిరిగి తీసుకువచ్చేందుకు భారతదేశ మద్దతును పునరుద్ఘాటించాను. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితిపై కూడా చర్చించాం. త్వరలోనే సాధారణ స్థితిని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాం. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువులకు భద్రత కల్పించాలని కోరాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారత్, యూఎస్‌ల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై బైడెన్‌కు ఉన్న నిబద్ధతను మోదీ ప్రశంసించారు. ఈ ఫోను సంబాషణలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన కీవ్ పర్యటన గురించి అమెరికా అధ్యక్షునికి వివరించారు. తాను అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశానని తెలిపారు. దౌత్యానికి అనుకూలంగా భారతదేశ కట్టుబాటును, స్థిరమైన వైఖరిని ప్రధాని మరోమారు పునరుద్ఘాటించారు. Spoke to @POTUS @JoeBiden on phone today. We had a detailed exchange of views on various regional and global issues, including the situation in Ukraine. I reiterated India’s full support for early return of peace and stability.We also discussed the situation in Bangladesh and…— Narendra Modi (@narendramodi) August 26, 2024 -
Yogi Adityanath: విడిపోతే ఊచకోతే
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆగ్రాలో దుర్గాదాస్ రాథోడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ‘విడిపోతే ఊచకోత కోస్తారు’ అంటూ హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్‌లో ఏమవుతోందో చూస్తున్నారుగా! ఆ తప్పిదాలను భారత్‌లో పునరావృతం చేయొద్దు. విడిపోయామంటే ఇక అంతే సంగతులు. మనల్ని ఊచకోత కోస్తారు. కలిసుంటేనే సురక్షితంగా ఉండగలం. అభివృద్ధి చెందగలం’’ అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలను ఎక్స్‌లో కూడా యోగి పోస్ట్ చేశారు. వీటిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ముస్లిం విద్వేషంతో యూపీని విడదీస్తున్నదే యోగి అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ‘‘మైనారిటీల ఇళ్లపైకి ఆయన ఇప్పటికే బుల్డోజర్లు నడుపుతున్నారు. ఇప్పుడిలా మరో అడుగు ముందుకేసి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. యూపీని మతపరంగా మరింతగా విడదీయజూస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. సీఎం పదవి చేజారేలా ఉండటంతో అభద్రతా భావంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని కావాలని యోగికి ఎంత కోరికగా ఉన్నా మరీ ఇప్పట్నుంచే ఇలా విదేశీ వ్యవహారాల్లో వేలు పెట్టొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. -
హిందువులకు రక్షణ కల్పిస్తాం: యూనుస్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పిస్తామని, దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. యూనుస్ శుక్రవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాతి పరిణామాల్లో మోదీ, యూనుస్‌లు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ‘ప్రజాస్వామ్యయుత, సుస్థిర, శాంతికాముక, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించాను’ అని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. ‘ప్రొఫెసర్ యూనుస్ కాల్ చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని, సురక్షితంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు’ అని మోదీ తెలిపారు. వివిధ అభివృద్ధి పనుల్లో బంగ్లాదేశ్ ప్రజలకు సహాయపడటానికి కట్టుబడి ఉన్నామని యూనుస్‌కు తెలిపారు. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కలి్పంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపులోకి వచి్చందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మోదీకి స్పష్టంచేసినట్లు యూనుస్ ‘ఎక్స్’లో తెలిపారు. -
హిందువుల రక్షణ మన బాధ్యత: మోహన్ భగవత్
బంగ్లాదేశ్‌లో హింసకు బలవుతున్న హిందువులను రక్షించాల్సిన బాధ్యత భారత్‌పై ఉన్నదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకున్నారంటూ వస్తున్న వార్తలపై మోహన్ భగవత్ స్పందించారు.అక్కడ నివసిస్తున్న హిందువులను అకారణంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడున్న హిందువులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన దేశంపై ఉందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు.ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం భారతదేశంలో ఉందన్నారు. గత కొన్నేళ్లుగా భారత్ ఎవరిపైనా దాడి చేయలేదని, అందుకు బదులుగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించామన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అస్థిరత, అరాచకాల వల్ల అక్కడున్న హిందువులు అవస్థల పాలవుతున్నారని అన్నారు. అందుకే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. -
Bangladesh: రోడ్లపై నిరసనలకు దిగిన హిందువులు
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజధాని ఢాకాలో హిందువులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. వీరికి విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తున్నది. మరోవైపు బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం తాజాగా బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఢాకాలో నిరసన తెలిపాయి. హిందూ దేవాలయాల ధ్వంసంపై పలు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ‘హిందువులకు జీవించే హక్కు ఉంది’ అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని పలువురు హిందువులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందువులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. తమ ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ వారు చేశారు. ఇదేవిధంగా లండన్, ఫిన్లాండ్తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో నిరసనలు కొనసాగాయి. కాగా బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
వందేళ్ల వాగ్దానం.. ఆ గ్రామంలో హిందువుల మొహర్రం
మొహర్రం పండుగను దేశవ్యాప్తంగా నేడు (బుధవారం) జరుపుకుంటున్నారు. మొహర్రం అనేది సంతాపాన్ని సూచించే పండుగ. అయితే బీహార్‌లోని ఆ గ్రామంలో హిందువులు మొహర్రంను జరుపుకుంటారు. గత వందేళ్లుగా ఆ గ్రామంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.బీహార్‌లోని కతిహార్‌లోని హిందువులు గత వందేళ్లుగా తమ పూర్వీకుల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ముహర్రంను జరుపుకుంటున్నారు. హసన్‌గంజ్ బ్లాక్‌లోని మహమ్మదియా హరిపూర్ గ్రామంలోని హిందువులు మొహర్రంను జరుపుకోవడం ద్వారా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.ఇక్కడ విశేషమేమిటంటే ఈ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. కానీ ఇప్పటికీ ప్రతి సంవత్సరం మొహర్రం పండుగను సంప్రదాయ రీతిలో ఇక్కడ జరుపుకుంటారు. దివంగత చెడి సాహ్ సమాధి ఈ గ్రామంలో ఉంది. ఈ ప్రాంతం మియాన్ (ముస్లిం మతపెద్ద)కు చెందినదని గ్రామస్తులు చెబుతున్నారు. అతని కుమారులు అనారోగ్యంతో మృతి చెందారట. ఈ నేపధ్యంలో ఆయన ఆవేదనకులోనై తన భూమికి ఈ గ్రామానికి అప్పగించారట. ఆ తర్వాత అతను కన్నుమూసే ముందు గ్రామస్తులంతా ప్రతీయేటా మొహర్రం జరుపుకోవాలని కోరారట. ఈ మేరకు తమ గ్రామ పూర్వీకులు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నామని గ్రామస్తులు చెబుతుంటారు. 100 साल पहले किया वो वादा... बिहार के इस गांव में हिंदू भी मनाते हैं मुहर्रम #Bihar | #Muharram | #Hindu pic.twitter.com/1mIU57HtRp— NDTV India (@ndtvindia) July 17, 2024 -
‘ఆమెను ఇక్కడ ఉండనిస్తే.. మేం ప్రశాంతంగా ఉండలేం’!
ఆమె పేరు ఫాతిమా(పేరుమార్చాం). గుజరాత్‌లోని ఓ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగంలో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వడోదర హార్నీ ఏరియాలో నిర్మించిన మోట్‌నాథ్ హౌజింగ్ క్లాంపెక్స్‌లో ఏడేళ్ల కిందట ఆమెకు ఫ్లాట్ కేటాయించారు. అయితే ఇన్నేళ్లు అయినా ఆమె అక్కడ అడుగుపెట్టలేకపోయింది. అధికారులు కారణం కాదు.. ఆమెతో పాటు ప్లాట్ పొంది హాయిగా అక్కడ నివసిస్తున్నవాళ్లలో కొందరు ఆమెను అడ్డుకుంటున్నారు.వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌లోని కాంప్లెక్స్‌లో 462 ఇళ్లు ఉన్నాయి. అర్హత జాబితా ప్రకారం.. 2017లో ఫాతిమాకు అందులో ఇంటిని కేటాయించారు. అయితే ఆ హౌజింగ్ కాంప్లెక్స్‌లో ఉండే 33 మంది ఓనర్లు ఆమెకు ఇంటికి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమె ముస్లిం అని, ఆమె గనుక అక్కడ ఉంటే.. గొడవలు జరిగే అవకాశం ఉందంటూ 2020లో ముఖ్యమంత్రి కార్యాలయానికి, కలెక్టర్‌కు, స్థానిక అధికారులకు లేఖలు రాశారు. అంతటితో ఆగకుండా ధర్నాకు సైతం దిగారు. దీంతో.. ఆమె అక్కడికి వెళ్లకుండా ఆగిపోయారు.భర్తను కోల్పోయిన ఆమె.. ఇంతకాలం ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది. కొడుకు అదే ఏరియాలో మరో ఇంట్లో ఉంటున్నాడు. ఇన్నేళ్లు గడిచాయి కదా.. పరిస్థితులు శాంతించి ఉంటాయని, తాను తన కొడుకుతో అక్కడికి షిఫ్ట్ అయ్యిందని అనుకుంది. అయితే ఈ విషయం తెలిసి మళ్లీ ఆ 32 మంది ఓనర్లు ధర్నాకు దిగారు. ప్రశాంతంగా ఉంటున్న తమ సమముదాయంలో ఆమె వల్ల అలజడి చెలరేగడం తమకు ఇష్టం లేదని, అందుకే ఆమెను ఇక్కడ ఉండనివ్వబోమని నిరసన చేపట్టారు. దీనిపై స్పందించేందుకు అధికారులెవరూ ఇష్టపడడం లేదు. ఇది ఆ కాంప్లెక్స్‌లో ఉంటున్న నివాసితుల సమస్య గనుక వాళ్లే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలంటూ చేతులెత్తేశారు.One flat was allotted under CM scheme to a #Muslim woman out of 461 flats in a residential building in #Vadodara, #Gujarat.The #Hindu residents started a protest demanding that no #Muslims should live there with them.Where our country is heading? 😞 pic.twitter.com/hQY7QA9Gae— Hate Detector 🔍 (@HateDetectors) June 14, 2024 -
నిప్పుతో చెలగాటమా!
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల పేరిట హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ నిప్పుతో చెలగాటం ఆడుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఈసారి 400 స్థానాల్లో గెలిచి కొన్ని రాష్ట్రాల్లో మరింత మెరుగైన రాజకీయప్రతిభ కనబరచనుందని వ్యాఖ్యానించారు. పీటీఐతో ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు, అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. రాహుల్ గాంధీలో ఫైర్ లేదు ‘‘ రాహుల్ గాం«దీలో గొప్ప నాయకత్వ లక్షణం(ఫైర్)లేదుగానీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి విద్వేష మంటలు రాజేసే ఫైర్ చాలా ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సామాజిక సామరస్యాన్ని నాశనంచేస్తోంది. మత విద్వేషాలకు కారణమవుతోంది. ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తోంది. మేం గెలిస్తే ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి నిర్ణయాలను అమలుచేస్తాం.రాజ్యాంగపీఠికను బీజేపీ ఎన్నటికీ మార్చబోదు. రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్సే ఇప్పటికి 80 సార్లు రాజ్యాంగసవరణలు చేసింది. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగ పీఠికలోనూ మార్చులు చేశారు. జనాల్లో భయాలు పెంచి వారి మద్దతు సాధించాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. రిజర్వేషన్లు తొలగిస్తామని మాపై అబద్ధాల బురద చల్లుతోంది’’ ప్రశంసలో ఆంతర్యమేంటి?‘‘పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుస్సేన్ ఇటీవల రాహుల్ గాం«దీని నెహ్రూతో పోలుస్తూ ప్రశంసల్లో ముంచెత్తడం నిజంగా ఆందోళనకర విషయమే. భారత్‌ను అస్థిరపరచాలని చూసే శత్రుదేశం నేత రాహుల్‌ను ప్రశంసించడంలో ఉన్న ఆంతర్యమేంటో? అసలు పాక్‌తో కాంగ్రెస్‌కు ఉన్న సంబంధమేంటి? సంపద పంపిణీ విషయంలో శనివారం కూడా ఆయన పొగిడారు. ఆయన మాటల వెనుక బలమైన కారణం ఉండి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచి్చతంగా వివరణ ఇవ్వాలి. లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేద్దామని పాక్ ప్రయతి్నస్తోంది. కానీ పాక్‌కు అంత సత్తా లేదు’’ 400 సీట్లు ఖాయం ‘‘ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తుంది. బీజేపీ 370కిపైగా స్థానాల్లో గెలుస్తుంది. పశి్చమబెంగాల్లో మరిన్ని సీట్లు సాధిస్తాం. తమిళనాడులోనూ మెరుగవుతాం. కేరళలో బోణీ కొడతాం. ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ మెరుగైన సీట్లు సాధిస్తాం. ఛత్తీస్‌గఢ్‌లో క్లీన్‌స్వీప్ చేస్తాం. ఉత్తరప్రదేశ్‌లో 75 సీట్లదాకా గెలుస్తాం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలికలు, సీట్ల సర్దుబాటు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువ సీట్లు సాధిస్తాం. తొలి రెండు దశల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవ్వడం వల్ల బీజేపీకి వచి్చన నష్టమేమీ లేదు’’ సంపద పునఃపంపిణీ సరికాదు‘‘ కాంగ్రెస్ చెబుతున్నట్లు సంపదను పునఃపంపిణీ చేస్తామన్న విధానం సహేతుకంకాదు. అర్జెంటీనా, వెనిజులా దేశాలు దీనిని అమలుచేసి చేతులుకాల్చుకున్నాయి. విపరిణామాలను ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్ ఇలా చేస్తే భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలి వెనిజులా మాదిరిగా ద్రవ్యోల్బణం కట్టుతప్పుతుంది. భారత్‌పై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోతారు’’ పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే ‘‘ పాక్ ఆక్రమిత కశీ్మర్ ముమ్మాటికీ మనదే. అంతమాత్రాన పీవోకేను బలవంతంగా ఆక్రమించాల్సిన అవసరం లేదు. జమ్మూకశ్మీర్‌లో సాకారమైన అభివృద్ధిని చూశాక పీఓకే ప్రజలే భారత్‌లో విలీనంకావాలని కోరుకుంటున్నారు. జమ్మూకశీ్మర్‌లో సాయుధబలగాల ప్రత్యేక అధికారాల(ఏఎఫ్ఎస్పీఏ) చట్టంను తొలగించాల్సిన సమయం దగ్గరపడింది. దీనిపై కేంద్ర హోం శాఖ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. అయితే ఖచి్చతంగా ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం’’ సరిహద్దు చర్చలు సానుకూలం ‘‘ తూర్పు లద్దాఖ్‌లో చైనా, భారత్ జవాన్ల ఘర్షణ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతను సద్దుమణిగేలా చేసేందుకు చర్చల ప్రక్రియ సానుకూల వాతావరణంలో కొనసాగుతోంది. సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ నమ్మకం పెట్టుకుంది. చైనా కూడా అదే నమ్మకంతో చర్చలకు ముందుకొచి్చంది. సరిహద్దు వెంట మౌలికవసతుల పటిష్టానికి త్వరితగతిన ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తున్నాం. సరిహద్దు త్వరలో మరింత సురక్షితంగా ఉండబోతోంది’’ -
అయోధ్యపై టీఎంసీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ
పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన రామాలయాన్ని అపవిత్ర ప్రదేశంగా అభివర్ణించారు. హిందువులెవరూ ఇలాంటి అపవిత్ర ప్రదేశంలో పూజలు చేయకూడదని కూడా అన్నారు. హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తృణమూల్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సువేందు తన ట్విట్టర్ హ్యాండిల్లో తృణమూల్‌పై విరుచుకుపడ్డారు.. అధికార పార్టీ నేతల మాటలు హిందువులపై జరుగుతున్న దాడులకు నిదర్శనం అని అన్నారు. శ్రీరాముని ఆలయాన్ని ‘అపవిత్రం’ అని అభివర్ణించేంతలా వారి వైఖరి మారిపోయిదన్నారు. ఇది తృణమూల్ నేతల భావజాలాన్ని వెల్లడిస్తుందన్నారు. Simply Outrageous. TMC MLA of Tarakeswar Assembly Constituency - Ramendu Sinha Roy, who is also the TMC President of Arambagh Organizational District has labeled the Grand Ram Mandir as 'UNHOLY'. He has also stated that no Indian Hindu should offer Puja at such unholy site.… pic.twitter.com/xBBQuqpTzn — Suvendu Adhikari (Modi Ka Parivar) (@SuvenduWB) March 4, 2024 -
జ్ఞానవాపి కేసులో కీలక మలుపు
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది. ఈ మేరకు వారంలోగా పూజలకు ఏర్పాటు చేయాలని వారణాసికి కోర్టు బుధవారం అనుమతులు జారీ చేసింది. దీంతో హిందు శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను హిందువుల భారీ విజయంగా కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ అభివర్ణిస్తోంది. కోర్టు ఉత్తర్వులతో.. సీల్ చేసిన మసీదు బేస్మెంట్ ప్రాంతంలోని హిందూ దేవతల విగ్రహాలకు వారంలోగా పూజలు ప్రారంభిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. 'జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసేందుకు హిందు పక్షం వారికి కోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లా యంత్రాంగా ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఈ తీర్పు చరిత్రాత్మకమైనది. 1983లో అయోధ్య రామాలయ తాళాలు తెరవాలని జస్టిస్ కృష్ణ మోహన్ పాండ్ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం జ్ఞానవాపిలోను నేలమాళిగ తాళాలు తెరవాలని కోర్టు ఆదేశించింది.' అని హిందువుల తరుపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలు.. ఏఎస్ఐ సర్వే నేపథ్యంతో మసీద్ బేస్మెంట్కు సీల్ వేశారు. అయితే తాజా కోర్టు ఆదేశాలతో ఆ బారికేడ్లను తొలగించనున్నారు. అంతేకాదు విశ్వనాథ్ ఆలయ పూజారులు ఈ పూజలు నిర్వహించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు అంతకుముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమయిందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) ఇటీవల నివేదిక ఇచ్చింది. ప్రస్తుత నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని సర్వేలో తేలింది. దీంతో హిందూ పక్షం వారు పూజలు చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: Indian Army: ఆర్మీలో ‘జై శ్రీరామ్’, ‘జై బజరంగబలి’ నినాదాలు ఎందుకు? -
బాబార్ రోడ్డును అయోధ్య మార్గ్‌గా మార్చాలంటూ..
దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ సేన కార్యకర్తలు బాబర్ రోడ్డు పేరును అయోధ్య రోడ్డుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు బాబర్ రోడ్డు అని ఉన్న సూచిక బోర్డుపై అయోధ్యమార్గ్ అనే పేరు అతికించారు. ఈ సందర్భంగా హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ ‘బాబర్ రోడ్డు పేరును మార్చాలని హిందూ సేన చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ దేశం భారతదేశం.. ఇది శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, వాల్మీకి, గురు రవిదాస్ తదితర మహానుభావులు నడయాడిన దేశం. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మిస్తున్నారు. బాబర్ నిర్మించిన బాబ్రీ మసీదు ఇక లేనప్పుడు, ఢిల్లీలోని బాబర్ రోడ్డు పేరు వల్ల ఉపయోగం ఏమిటి?’ అని ప్రశ్నించారు. న్యూఢిల్లీలోని బెంగాలీ మార్కెట్లో ఉన్న బాబర్ రోడ్డు పేరు మార్చాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఎన్డీఎంసీ ఛైర్మన్‌కు ఒక లేఖరాశారు. బాబర్ ఒక చొరబాటుదారుడని, హిందువులపై దౌర్జన్యాలను సాగించాడని, అందుకే బాబర్ పేరుతో ఉన్న ఈ రహదారి పేరును అయోధ్య మార్గ్‌గా మార్చాలని ఆ లేఖలో కోరారు. -
అయోధ్యతో కుదరాలి సయోధ్య
జనవరి 22న అయోధ్యలో రావ్ులల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. ఏ విధంగా చూసినా ఇదొక చరిత్రాత్మక ఘట్టమే. ఇది హిందువుల ఐదు వందల ఏళ్ల ధార్మిక, రాజకీయ, న్యాయ పోరాటాల ఫలితం. ఈ వాస్తవాన్ని నిరాకరించడం విజ్ఞత కాదు. కొన్ని పీఠాల ఆచార్యులు, రాజకీయ పార్టీలు, ముహూర్తం గురించి, బీజేపీ ప్రమేయం గురించి లేవనెత్తుతున్న వివాదాలు ఇప్పుడు ప్రతిష్ఠను ఆపలేవు. అసలు కొత్త వివాదాలు లేవదీయడమేఅసంగతం. శ్రీరామచంద్రుడిని హిందువులు మర్యాద పురుషోత్తమునిగా కొలుస్తారు. ఆ విశ్వాసాన్ని మిగిలిన మతస్థులు గౌరవించడం మర్యాద. ఆత్మ గౌరవానికి సంబంధించిన భావన ఇందులో బలమైనది, ప్రధానమైనది. భారతదేశ వైవిధ్యం పరిఢవిల్లాలంటే అన్ని మతాల మధ్య సయోధ్య నెలకొనాలి. రామాలయ నిర్మాణం అంటే ఇటుకలు, సిమెంట్, ఒక నిర్మాణం అనుకోవద్దని లాల్‌కృష్ణ అడ్వానీ రథయాత్ర సమయం నుంచి సంఘ పరివార్ చెబుతూనే ఉన్నది. విదేశీ పాలనలతో మిగిలిపోయిన మానసిక బానిసత్వ జాడలు తొలగించుకోవాలన్న తాత్త్వికత కలిగిన రాజకీయ పక్షం, దాని నాయకత్వంలోని ప్రభుత్వం హయాంలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. బాబ్రీ కమిటీ తరఫున కోర్టులో పోరాడిన అన్సారీ సహా, పలువురు ముస్లింలు అయోధ్య ఆలయ నిర్మాణ స్ఫూర్తిని సరిగానే గ్రహించారు. పలువురు సిక్కులు కూడా. మనమంతా ఈ దేశ వారసులం, ఈ భూమిపుత్రులం అన్న ఏకసూత్రాన్ని ప్రాణప్రతిష్ఠ వారిలో ప్రతిష్ఠించింది. ఆలయ నిర్మాణం పూర్తయింది కాబట్టి గతాన్ని మరచి అంతా సమైక్యంగా ఉండాలంటూ కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిస్వామి వంటి వారు పిలుపునివ్వడం శుభసూచకమే. అలాగే ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కె.కె.మహమ్మద్ కొద్దిరోజుల క్రితమే కాశీ, మధుర కూడా హిందువులకు అప్పగించడం సరైన చర్య అవుతుందని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడమూ అసంగతం కాబోదు. డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు ఇస్తున్న గణాంకాల ప్రకారం విదేశీయుల దండయాత్రలతో, మతోన్మాదంతో, పాలనలో ముప్పయ్ నుంచి నలభయ్ వేల హిందూ దేవాలయాలు నేలమట్ట మైనాయి. హిందూ సమాజం వాటి గురించి పట్టుపట్టడం లేదు. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డా.మోహన్ భాగవత్ కూడా ప్రతి మసీదులోనూ శివలింగాలను వెతికే పని చేయవద్దని నిర్మాణాత్మక మైన సూచన చేశారు. అయినా చరిత్రకారులుగా, ఉదారవాదులుగా చలామణి అవుతున్న కొందరి వైఖరి హిందువులే తగ్గి ఉండాలన్న ట్టుగా ఉంది. భారతదేశ వైవిధ్యం పరిఢవిల్లాలంటే అన్ని మతాల వారి మధ్య సయోధ్య నెలకొనాలి. సెక్యులరిజం అంటే మెజారిటీ మతస్థుల మనోభావాలకు మన్నన లేకపోవడం, మైనారిటీల బుజ్జగింపు కాదన్న దృష్టి అవసరం. ఒక ఆర్థిక శక్తిగా అవతరిస్తున్న భారత్ మత ఉద్రిక్తత లతో తన ప్రగతివేగాన్ని తనే తగ్గించుకోవడం ఆగిపోవాలి. దానికి రామమందిర ప్రాణ ప్రతిష్ఠతో శ్రీకారం చుట్టాలి. బాబ్రీ మసీదు రగడలో ముస్లింల వైపు నుంచి మతోన్మాద దృక్కో ణాన్ని చూడక్కరలేదు. మొదటి నుంచి బుజ్జగింపు రాజకీయాలనే నమ్ముకున్న పార్టీలు, కుహనా సెక్యులరిస్టు చరిత్రకారుల వల్ల ఇది రావణకాష్ఠం అయింది. ఈ మాట సంఘపరివార్ అన్నది కాదు. పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ కె.కె. మహమ్మద్ అన్నదే. అయోధ్యగురించి పదే పదే మాట్లాడి సమస్యను జటిలం చేసిన కొందరు చరిత్ర కారులను సాక్షాత్తు సుప్రీంకోర్టు 2019 నాటి తన తీర్పులో అభిశంసించిన సంగతిని మరచిపోవవద్దు. నిజానికి మసీదులను తరలించడం, ముస్లిమేతరులు కూల్చడం, స్వయంగా ముస్లిములే తొలగించడంవంటి ఘట్టాలు బాబ్రీ కూలిన 1992 డిసెంబర్ 6కు ముందు ఉన్నాయి, తరువాత కూడా జరిగాయి. కొన్ని ఉదాహరణలు చూడాలి. మొదటిగా చెప్పుకోవలసినది సౌదీ అరేబియాలో ప్రవక్త మహ మ్మద్ జీవితంతో సంబంధం ఉన్న మసీదులు, ప్రాంతాలను కూడా వారు అవసరం మేరకు తొలగించారు. ప్రవక్త మసీదు అందులో ఒకటి. ఇది ప్రవక్త కట్టించిన పెద్ద మసీదులలో రెండవదని ముస్లిం సమాజం నమ్ముతుంది. ఈ పనిని అక్కడి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా చేసింది. కానీ బాబ్రీ అయోధ్య విషయంలో ఇంత అవాంఛ నీయ వాతావరణం ఎందుకు ఏర్పడింది? దాని వెనుక ఉన్న శక్తులు ఏమిటనేది పరిశీలిస్తే అర్థమవుతుంది. అయోధ్య రగడకు కేంద్రబిందువు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్‌కు మరణానంతరం జరిగిన గౌరవం ఏమిటో తెలియాలంటే, ఆయన సమాధికి పట్టిన గతి ఏమిటో తెలియాలి. 1530లో చనిపోవడానికి ముందే తన అంత్య క్రియలు అఫ్గానిస్తాన్‌లో జరగాలని వారసులను కోరాడు బాబర్. కానీ వారు ఆగ్రాలోనే నిర్వహించారు. బాబర్ కొడుకు హుమాయున్ను తరి మేసి అధికారంలోకి వచ్చిన షేర్షా సూర్ 1539 ప్రాంతంలో బాబర్ కోరికను నెరవేరుస్తున్న తీరులో ఆ అవశేషాలను కాబూల్ నగర శివార్లకు చేర్చాడు. అక్కడే సమాధి ఏర్పడింది. దానిని షాజహాన్, జహంగీర్ తరువాత పెద్ద గార్డెన్‌గా అభివృద్ధి చేశారు. అఫ్గాన్ రాజు నాదిర్షా ఈ గార్డెన్‌ను (11 హెక్టార్లు) ఒక విహార యాత్రా స్థలంగా మార్చాడు. సమాధి రూపు మార్చాడు. అక్కడంతా ఐరోపా శైలిలో భవనాలు కట్టి, హోటళ్లు, వినోదకేంద్రాలు ఏర్పాటు చేశాడు. పోలెండ్ చరిత్రంతా రష్యా జార్ చక్రవర్తులతో, ‘ఎర్ర జార్’లతో పోరాటమే. 1920లో రాచరిక జార్ల ఆధిపత్యం పోయిన తరవాత రాజధాని వార్సాలోని అలెగ్జాండర్ నెవ్స్కీ కెథడ్రల్‌ను పోలెండ్ ప్రభుత్వమే కూల్చింది. 1894లో నిర్మాణం మొదలుపెట్టి 1912లో పూర్తి చేశారు. 70 మీటర్ల ఎత్తయిన ఈ నిర్మాణం లియోన్ బెనొయిస్ అనే నాటి ప్రఖ్యాత వాస్తుశిల్పి ఆధ్వర్యంలో గొప్ప కళాత్మకంగా జరి గింది. అయినా నిర్మాణం పూర్తయిన పదేళ్లకే కూల్చారు. కారణం ఒక్కటే. పోలెండ్ ప్రజల జాతీయభావాలను అవమానించడానికి జార్ చక్రవర్తి ఈ చర్చ్‌ను నిర్మించాడని స్వతంత్ర పోలెండ్ భావించడమే. రెండు దేశాలవారు క్రైస్తవులే. తమ ప్రార్థనాలయాలే అయినాఅందులో జార్ చక్రవర్తి అణచివేత జాడలను చూశారు. ఇక చైనాలో వీగర్ ముస్లింలు, వారి అస్తిత్వం ప్రశ్నార్థకమైన సత్యాన్ని వీగర్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ నివేదిక వివరాలు కాస్త పరిశీలించినా అర్థమవుతుంది. కేరియా ఈద్ కాహ్ మసీదు 1200 సంవత్సరం ప్రాంతంలో నిర్మించినది. ఈ మసీదు రూపాన్ని వికృతం చేసి, పగోడాలా తయారు చేశారు. 1540 నాటి కార్గిలిక్ మసీదును పూర్తిగా ధ్వంసం చేశారు. 2016లో 100 మసీదులను నేలమట్టం చేయడం లేదా, రూపురేఖలను మార్చడం జరిగింది. అంటే మసీదును సంకేతించే గుమ్మటాలు, మీనార్లు తొలగించారు. అయోధ్య మసీదు విషయంలో రగడ చేసిన వామపక్షాల వారు, వారి అనుంగు చరిత్ర కారులు వీగర్ ముస్లింల మీద కాస్తయినా సానుభూతి ప్రకటించరేమి? ఇంచుమించు కాన్సెంట్రేషన్ క్యాంపులలోనే బతుకుతున్న వీగర్ ముస్లింల గురించి పాకిస్తాన్, టర్కీ పెదవి విప్పవేమి? ఇవి కొన్ని ఉదాహరణలు. ఇక్కడ రెండు విషయాలు గమనార్హం. ఈ విధ్వంసంలో ఎక్కడా హిందువులకు సంబంధం లేకపోవడం. బాబ్రీ విషయంలో మాత్రమే ఇంత రగడ జరగడం. అయోధ్య ఉద్యమం తీవ్రరూపం దాల్చి, అత్యధికంగా హిందువులు రామా లయం కోరుకున్నా కూడా మూడు దశాబ్దాలు వేచి చూడడం, వేచిఉండేటట్టు చేయడం ఎందుకు? నమాజ్ జరగని ఒక మసీదు కోసం ఇంత రగడను ఎందుకు కొనసాగించినట్టు? ఇంతకీ, అయోధ్యలో కడుతున్న కొత్త మసీదు పేరు బాబ్రీ మసీదు కాదు. మరి దేని కోసం జరిగింది ఈ అడ్డగింత? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుందాం. వాస్తవాలు గ్రహిద్దాం. అందులో మొదటిది, హిందువుల పరమత సహనం గురించి. అయోధ్య ఉద్యమ సమయంలో, ఆ నగరంలో లేదా భారతదేశంలో కావాలని ఏ మసీదునైనా కూల్చిన దాఖలాలు ఉన్నాయా? ఆరోపణలు ఉన్నాయా? మెజారిటీ ప్రజల మనోభావా లను అవమానించే తీరులో మైనారిటీలు వ్యవహరించడం సయోధ్యకు ఉపయోగపడేది కాదు. మెజారిటీ ప్రజలలో మెజారిటీ మనస్తత్వం సరికాదని చెబుతున్నవారు మైనారిటీల కొన్ని చర్యలలోని అసంబ ద్ధతను కూడా ఎత్తి చూపే బాధ్యతను స్వీకరించాలి. - వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ఈ–మెయిల్: pvg@ekalavya.net - పి. వేణుగోపాల్ రెడ్డి -
వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు
గౌహతి: మతపరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అఫ్తాబ్ ఉద్దీన్ మొల్లా(Aftab Uddin Mollah)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గౌహతిలో ఎమ్మెల్యే వాజెద్ అలీ చౌదరి నివాసం నుంచి మొల్లాను అరెస్టు చేశారు. Assam Police has arrested Congress MLA Aftabuddin Mollah for allegedly making derogatory remarks about the priests, namgharias and saints. A case has been registered at Dispur police station under sections 295(a)/ 153A(1)(b)/505(2) IPC), confirms DGP GP Singh More details… — ANI (@ANI) November 8, 2023 గోల్పారా జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో హిందువులు, పూజారులపై మొల్లా తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మొల్లాకు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చింది. మొల్లా అభ్యంతకర వ్యాఖ్యలపై డిస్పూర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
2050 నాటికి ఏ దేశాల్లో హిందువులు అధికం? భారత్ పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో మతపరమైన జనాభాలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ విషయమై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర పరిణామాలు వెలుగుచూశాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ 2015లో ఈ పరిశోధన నిర్వహించింది. రాబోయే నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని మతపరమైన జనాభాలో వేగవంతమైన, పెను మార్పులు రావచ్చని అధ్యయనంలో వెల్లడయ్యింది. హిందూ మతంతో పాటు క్రైస్తవం, ఇస్లాం, అనేక ఇతర మతాలు కూడా పరిశోధన పరిధిలో చేరాయి. ఈ పరిశోధన ద్వారా రాబోయే 40 ఏళ్లలో ఏ దేశంలో ఏ మతపరమైన జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2050 నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి జనాభా ప్రపంచ జనాభాలో 15 శాతానికి చేరుకుంటుంది. అదే సమయంలో భారతదేశంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య అప్పటికీ అధికంగానే ఉంటుంది. అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా 2050 నాటికి 1.297 (ఒక బిలియన్.. 100 కోట్లు) బిలియన్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించేవారు ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 79 శాతానికి పైగా ఉంది. హిందువుల జనాభా పరంగా భారతదేశం తర్వాత నేపాల్ రెండవ స్థానంలో ఉంది. నేపాల్‌లో హిందువుల జనాభా 3.812 కోట్లు. 2006కి ముందు నేపాల్ హిందూ దేశంగా ఉండేది. ఆ తర్వాత నేపాల్ సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం 2050నాటికి అమెరికాలో 47.8 లక్షల మంది హిందువులు ఉంటారు. 2015లో అమెరికాలో హిందువుల జనాభా 22.3 లక్షలు. ఇండోనేషియాలో వచ్చే 27 ఏళ్లలో హిందువుల జనాభా 41.5 లక్షలకు పెరగవచ్చని అధ్యయనంలో తేలింది. శ్రీలంక, మలేషియా, బ్రిటన్, కెనడాలలో హిందువుల జనాభా రాబోయే కాలంలో మరింతగా పెరగవచ్చని అధ్యయనంలో తేలింది. ఇది కూడా చదవండి: టన్నుల కొద్దీ బంగారమున్న గ్రహశకలం ఏది? -
మితి మీరితే... మరో ప్రమాదం!
పవిత్ర చార్ధామ్ యాత్ర ఎప్పటి లానే ఈ ఏడూ మొదలైంది. అక్షయ తృతీయ వేళ గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ తెరిచేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మొదలవుతూనే ఈ యాత్ర అనేక ప్రశ్నలనూ మెదిలేలా చేసింది. హిమాలయ పర్వతాల్లో కఠోర వాతావరణ పరిస్థితుల మధ్య సాగే ఈ యాత్రలో కొండచరియలు విరిగిపడి బదరీనాథ్ హైవే తాజాగా మూసుకుపోవడం పొంచివున్న ప్రమాదాలకు ముందస్తు హెచ్చరిక. యమునోత్రి ప్రయాణంలో తొలిరోజే ఇద్దరు గుండె ఆగి మరణించడం యాత్రికుల శారీరక దృఢత్వానికి సంబంధించి అధికారుల ముందస్తు తనిఖీ ప్రక్రియపై అనుమానాలు రేపుతోంది. ఇప్పటికే 16 లక్షల మందికి పైగా యాత్రకు పేర్లు నమోదు చేసుకున్న వేళ... రానున్న కొద్ది వారాల్లో ఈ పర్వత ప్రాంత గ్రామాలు, పట్నాల మీదుగా ప్రయాణంపై భయాందోళనలు రేగుతున్నాయి. ‘దేవభూమి’ ఉత్తరాఖండ్ అనేక హిందూ దేవాలయాలకు ఆలవాలం. చార్‌ధామ్‌గా ప్రసిద్ధమైన యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బదరీనాథ్‌లు ఇక్కడివే. ఇన్ని ఆలయాలు, ప్రకృతి అందాలకు నెలవైన ఉత్తరాఖండ్‌కు ఆర్థిక పురోభివృద్ధి మంత్రాల్లో ఒకటి – పర్యాటకం. అయితే, అదే సమయంలో హిమాలయాల ఒడిలోని ఈ ప్రాంతం పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతం. ఈ సంగతి తెలిసినా, పర్యావరణ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నా పాలకులు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ఉత్పాతాలనూ లెక్క చేయకుండా, చార్ధామ్ ప్రాంతాలను వ్యాపారమయం చేసి, భరించలేనంతగా యాత్రికుల్ని అనుమతిస్తున్నారు. హిమాలయాల్లో పద్ధతీ పాడూ లేక ఇష్టారాజ్యంగా చేపడుతున్న సోకాల్డ్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, అనియంత్రిత పర్యాటకం కలగలసి మానవ తప్పిదంగా మారాయి. ఈ స్వయంకృతాపరాధాలతో వాతావరణ మార్పులకు మంచుదిబ్బలు విరిగిపడుతున్నాయి. జోషీ మఠ్ లాంటి చోట్ల జనవరిలో భూమి కుంగి, ఇళ్ళన్నీ బీటలు వారి మొదటికే మోసం రావడం తెలిసిందే! నియంత్రణ లేని విపరీత స్థాయి పర్యాటకం ఎప్పుడైనా, ఎక్కడైనా మోయలేని భారం. విషాదమేమంటే, ప్రాకృతిక సంపదైన హిమాలయాలను మన పాలకులు, ప్రభుత్వాలు ప్రధాన ఆర్థిక వనరుగా చూస్తుండడం, వాటిని యథేచ్ఛగా కొల్లగొట్టడం! అభివృద్ధి, పర్యాటక అనుభవం పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడం! కనీసం ఆ ప్రాంతాలు ఏ మేరకు సందర్శకుల తాకిడిని తట్టుకోగలవనే మదింపు కూడా ఎన్నడూ మనవాళ్ళు చేయనేలేదు. బదరీనాథ్, కేదార్‌నాథ్‌లు తట్టుకోగలవని పర్యావరణ నిపుణులు అంచనా వేసిన రద్దీ కన్నా రెండు, మూడింతలు ఎక్కువగా, దాదాపు 15 వేల మందికి పైగా జనాన్ని నిరుడు ప్రభుత్వం అనుమతించడం విచిత్రం. ఒక్క గడచిన 2022లోనే ఏకంగా కోటి మంది పర్యాటకులు ఉత్తరాఖండ్‌ను సందర్శించినట్టు లెక్క. కేవలం చార్ధామ్ యాత్రాకాలంలోనే రికార్డు స్థాయిలో 46 లక్షల మంది వచ్చారు. ఈ ఏడాది ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో రోజుకు అనుమతించాల్సిన యాత్రికుల సంఖ్యపై పరిమితిని ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం ఏ రకంగా సమర్థనీయం! నిజానికి ‘జాతీయ విపత్తు నివారణ సంస్థ’ (ఎన్డీఎంఏ) 2020 నాటి నివేదికలోనే భారత హిమా లయ ప్రాంతం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్ళను ఏకరవు పెట్టింది. పర్యాటకం, పట్టణ ప్రాంతాలకు వలసల వల్ల పట్నాల మొదలు గ్రామాల వరకు తమ శక్తికి మించి రద్దీని మోయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్పింది. బఫర్ జోన్‌ను సృష్టించడం సహా అనేక నియంత్రణ చర్యలను సిఫార్సు చేసింది. మంచుదిబ్బలు విరిగిపడి, వరదలకు కారణమయ్యే ప్రాంతాల్లో పర్యాటకాన్ని నియంత్రించాలనీ, తద్వారా కాలుష్యస్థాయిని తగ్గించాలనీ సూచించింది. పాలకులు వాటిని వినకపోగా, ఏటేటా ఇంకా ఇంకా ఎక్కువ మందిని యాత్రకు అనుమతిస్తూ ఉండడం విడ్డూరం. జోషీమఠ్‌లో విషాదం ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. బీటలు వారిన అనేక ఇళ్ళు కూల్చివేయక తప్పలేదు. గూడు చెదిరి, ఉపాధి పోయి వీధినపడ్డ వారికి ఇంకా పరిహారం అందనే లేదు. తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచుకుంటున్న దుఃస్థితి. ఈ పరిస్థితుల్లో గత వారం కూడా కొత్తగా కొన్ని ఇళ్ళు బీటలు వారాయన్న వార్త ప్రకృతి ప్రకోపాన్ని చెబుతోంది. సిక్కు పర్యాటక కేంద్రం హేమ్‌కుండ్ సాహిబ్కూ, చార్ధామ్ యాత్రలో బదరీనాథ్కూ సింహద్వారం ఈ జోషీమఠే. పరిస్థితి తెలిసీ ఈసారి పర్యాటకుల సంఖ్య రికార్డులన్నీ తిరగరాసేలా ఉంటుందని రాష్ట్ర సీఎం ప్రకటిస్తున్నారు. జోషీమఠ్, ఔలీ ప్రాంతాలు అన్ని రకాలుగా సురక్షిత ప్రాంతాలని ప్రచారం చేసేందుకు తపిస్తున్నారు. ప్రమాదభరితంగా మారిన ఆ కొండవాలు ప్రాంతాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేసి, విపరీతంగా వాహనాలను అనుమతించడం చెలగాటమే. కనుక తొందరపాటు వదిలి, తగిన జాగ్రత్తలు చేపట్టాలి. హిందువులకు జీవితకాల వాంఛల్లో ఒకటైన ఈ యాత్ర ప్రభుత్వానికీ, స్థానిక ఆర్థిక వ్యవస్థకూ బోలెడంత డబ్బు తెచ్చిపెట్టవచ్చు గాక. ధర్మవ్యాప్తిలో ముందున్నామని పాలక పార్టీలు జబ్బలు చరుచుకొనేందుకూ ఇది భలేఛాన్స్ కావచ్చు గాక. జలవిద్యుత్కేంద్రాలు సహా విధ్వంసకర అభివృద్ధితో ఇప్పటికే కుప్పకూలేలా ఉన్న పర్యావరణ వ్యవస్థపై అతిగా ఒత్తిడి తెస్తే మాత్రం ఉత్పాతాలు తప్పవు. మొన్నటికి మొన్న 2013లో 5 వేల మరణాలకు కారణమైన కేదారనాథ్ వరదల్ని విస్మరిస్తే ఎలా? పర్యావరణం పట్ల మనం చేస్తున్న ఈ పాపం పెను శాపంగా మారక ముందే కళ్ళు తెరిస్తే మంచిది. హిమాలయ పర్వత సానువులు అనేకులకు అతి పవిత్రమైనవీ, అమూల్యమైనవీ గనక వాటిని పరిరక్షించడం మరింత ఎక్కువ అవసరం. అందుకు దీర్ఘకాలిక ప్రణాళికా రచన తక్షణ కర్తవ్యం. -
బ్రిటన్ హిందువుల ఆరోగ్యం భేష్ !
లండన్: ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు అంటారు. దానికి తగ్గట్టుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హిందువులకి మించిన వారు లేరని బ్రిటన్‌లోని ఒక సర్వేలో తేలింది. బ్రిటన్‌లో నివసించే హిందువులు అత్యంత ఆరోగ్యవంతులు , విద్యాధికులని తేలితే, సిక్కులందరికీ దాదాపుగా సొంతిల్లు ఉందని వెల్లడైంది. ఇంగ్లండ్, వేల్స్‌లోని జనగణన సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూకేలో ఆఫీస్ ఫర్ నేషనల్ స్టేటస్టిక్స్ (ఒఎన్ఎస్) ఈ జనగణన వివరాలను విడుదల చేసింది. ‘‘2021లో మార్చిలో జరిపిన ఈ సర్వేలో హిందువుల్లో ఆరోగ్యంగా ఉన్నవారు 87.8% ఉంటే, మొత్తంగా జనాభాలో 82%మంది ఆరోగ్యంతో ఉన్నారు. ఇక ఉన్నత విద్యనభ్యసించిన హిందువులు 54.8% ఉంటే, మొత్తం బ్రిటన్ జనాభాలో 33.8% ఉన్నారు. ఇక సిక్కుల్లో 77.7% మంది సొంతిళ్లలో నివసిస్తున్నారు.ఉద్యోగాల్లేక అవస్తలు పడుతున్న వారిలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. బ్రిటన్‌లో నివసిస్తున్న 16–64 ఏళ్ల మధ్య వయసున్న ముస్లింలలో 51% మందే ఉద్యోగాలు చేస్తున్నారు’’ అని సర్వే నివేదిక వివరించింది. -
Rajouri: హిందువులపై దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం
శ్రీనగర్: రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్రదాడులు.. ఆరుగురి దుర్మరణం.. ఇందులో ఇద్దరు చిన్నారులు.. పదుల సంఖ్యలో గాయపడడంతో సరిహద్దు జిల్లా రాజౌరిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. హిందూ కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చెలరేగిపోతుండడంతో.. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజౌరి జిల్లాలో భారీగా పారామిలిటరీ ట్రూప్స్‌ను మోహరిస్తోంది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే సీఆర్పీఎఫ్ తరపున 18వేల సిబ్బంది రంగంలోకి దిగారు. గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బలగాలు రాజౌరీలో మోహరించగా.. మరికొన్ని కంపెనీలు జమ్ముకి బయల్దేరాయి. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా సైన్యం, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్తో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్ము కశ్మీర్లో ఇప్పటికే సీఆర్ఎఫ్ బలగాలు ఉనికి భారీగా ఉంది. డెబ్భైకి పైగా బెటాలియన్లు(మొత్తం సీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యంలో 3వ వంతు) జమ్ము కశ్మీర్‌లోనే భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇక రాజౌరి జిల్లా ఉప్పర్ డాంగ్రీ గ్రామంలో.. ఆదివారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఆ మరుసటి రోజే ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు పాతిన ఐఈడీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులను చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నెల వ్యవధిలో ఇది మూడో ఉగ్రదాడి ఘటన. గత నెలలో ఆర్మీ క్యాంప్ సమీపంలోనే ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. హిందూ కుటుంబాల నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో.. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారులు భద్రతకు తమది హామీ అని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. -
రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక..
‘మనము నేర్చు కోవాల్సిన పాఠం’ అంటూ అక్టోబర్ 31వ తేదీన కరణ్ థాపర్ వ్యాసంలోని అంశాలు అసంబద్ధంగా, తర్క విరుద్ధంగా ఉన్నాయి. బ్రిటన్ దేశ ప్రధాన మంత్రిగా హిందూ భక్తుడైన రిషి సునాక్ ఎన్నిక కావడానికీ, బ్రిటన్ నుంచి మనము పాఠం నేర్చుకోవడానికీ సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. రిషి సునాక్‌ను ఎన్ను కోవడానికి ముందు లిజ్ ట్రస్ అనే మహిళను కన్జర్వేటివ్ పార్టీ ఎన్నుకున్నది కదా. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టె క్కించడానికి బ్రిటన్ దేశానికి, ముఖ్యంగా కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి రిషి సునాక్ లాంటి ఆర్థిక వ్యవహారాల నిపుణుడి అవసరం వచ్చింది. కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్‌ను ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి, ఎన్నికలలో గెలిచి ఉంటే – అప్పుడు భారతీయులు బ్రిటన్ ప్రజల నుంచి ఆదర్శాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉండేది. 190 సంవత్సరాలు భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసింది బ్రిటన్. ఇప్పటికీ 14 దేశాలపై తన రాజరికపు ముద్రను కొనసాగిస్తూనే ఉన్నది. తమను దోచుకున్న దేశాన్ని బ్రిటిషర్స్ శత్రువులుగా భావిస్తారు. వ్యాసకర్త చెప్పిన దానికి విరుద్ధంగా ఆ దేశం నుండి చాలా విషయాలను స్వయం ప్రకటిత మేధావులైన కొందరు భారతీయులు నేర్చుకోవాలి. ఇక రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సందర్భాన్ని నేపథ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే భారతీయ జనతా పార్టీ హిందూ మతానికి చెందినదనీ, ఆ పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్పడానికీ వ్యాసకర్త సంఖ్యాపరమైన విశ్లేషణలు చక్కగా చేశారు. ఈ దేశంలో సంఖ్యాపరంగా ముస్లింలు 14.3 శాతం ఉన్నది నిజమే. పార్లమెంట్లో వారి స్థానాలు కూడా తక్కువనేది వాస్తవమే. సివిల్ సర్వెంట్లుగా, సైనికులుగా ఆ మతం వారి సంఖ్య దేశంలోని ఇతర మతాల వారితో పోలిస్తే తక్కువే. ఇందుకు భారతీయ జనతా పార్టీ కారణం కాదే! హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో ముస్లిం వర్గం నుండి నలుగురు రాష్ట్రపతులుగా ఎన్నిక చేయబడ్డారు. మరి ముస్లింలు మెజా రిటీగా ఉండే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మైనార్టీ వర్గాలైన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవుల పరిస్థితి ఏమిటి? 20 కోట్ల మంది ముస్లింల నుండి ఒక ప్రధాని ఆశించడానికి వీలు లేదా? అని ఒక మంచి ప్రశ్న వేశారు వ్యాసకర్త. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, క్రైస్తవ మతానికి చెందిన సోనియా గాంధీ 2004 నుండి 2014 వరకు ఈ దేశంపై సర్వాధికారాలను అనుభవించిన విషయం అందరికీ తెలిసిందే. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో 28 శాతం హిందువులు ఉంటారు. ఆ రాష్ట్రం భారతదేశంలో విలీనమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క హిందువూ సీఎం కాలేదనే విషయం వ్యాసకర్తకు తెలియదా? ముస్లింలను చెద పురుగులుగా, బాబర్ వారసులుగా అవహేళన చేస్తూ, మానసికంగా వేధిస్తున్నారనే విషయం వాస్తవమేనా? కశ్మీర్ లోయనుండి 3 లక్షల మంది హిందువులను తరిమికొట్టింది ఎవరు? ఇక చివరిగా రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక ఆ దేశ అవసరం ఉంది. ఈ విషయంలో ఆయన భారతీయ మూలాల శ్రేష్ఠత గానీ, రంగు గానీ, జాతి గానీ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలకు కనబడ లేదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం రిషీ సునాక్ ఎంపిక చూసి గర్వపడాల్సింది ఏమీలేదు. బ్రిటిష్‌వారి ఔదా ర్యమూ అంతకన్నా ఏమీలేదు. - ఉల్లి బాలరంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
పంజాబ్‌లోనూ మందిర్–మసీదు వివాదం
పటియాలా: మందిర్–మసీదు వివాదం పంజాబ్‌నూ తాకింది. పటియాలా సమీపంలో రాజ్‌పురాలోని గుజ్రన్‌వాలా మొహల్లాలో ఉన్న మసీదు నిజానికి సిక్కులకు చెందిన సరాయి అని స్థానిక హిందూ, సిక్కు సమూహాలు బుధవారం ఆరోపించాయి. ‘‘రెండేళ్ల క్రితం అందులో ఉంటున్న రెండు సిక్కు కుటుంబాలను తరిమేసి ఆక్రమించుకున్నారు. సిక్కు మత, ఆరాధన చిహ్నాలను తొలగించారు. గుమ్మటం నిర్మించి ఆకుపచ్చ రంగు వేసి మసీదుగా మార్చారు’’ అని పేర్కొన్నాయి. దీన్ని ముస్లిం సమూహం ఖండించింది. అది స్వాతంత్య్రానికి ముందునుంచీ మసీదుగానే కొనసాగుతూ వస్తోందని వాదించింది. ఇరు వర్గాలూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హిమాన్షు గుప్తాకు ఫిర్యాదు చేశాయి. రెండు రోజుల్లోగా సాక్ష్యాలు సమర్పించాలని వారికి ఆయన సూచించారు. హర్యానా, యూపీకి చెందిన వాళ్లు ఇబ్బంది పెడుతున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో కట్టడం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి -
‘విల్లు, బాణాలతో జిహాదీలను ఎదుర్కొందాం’
లక్నో: జిహాదీలు దాడి చేస్తే ఎదిరించడానికి హిందువులు ఇళ్లల్లో విల్లు బాణాలు సిద్ధంగా ఉంచుకోవాలని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ పిలుపునిచ్చారు. తలపై టోపీలు, చేతిలో కర్రలతో ఉన్న ఓ గుంపు ఫొటోను ఆదివారం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ‘‘ఈ మూక మీ వీధికి, మీ ఇంటికి అకస్మాత్తుగా వస్తే రక్షించుకోవడానికి మీకేదైనా మార్గం ఉందా? లేకపోతే ఏర్పాటు చేసుకోవాలి. మిమ్మల్ని కాపాడడానికి పోలీసులు రారు. ప్రాణాలను కాపాడుకోవడానికి ఎక్కడో దాక్కుంటారు. జిహాద్ ముగిసి, మూక వెళ్లిపోయిన తర్వాతే వస్తారు. అలాంటి ‘అతిథుల’ కోసం రెండు బాక్సుల కూల్‌డ్రింక్ సీసాలను, విల్లులు, బాణాలను ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి’’ అని పోస్టు చేశారు. జైశ్రీరామ్ అంటూ ముగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ఫేసుబుక్ పోస్టును సమర్థించుకున్నారు. సాక్షి మహారాజ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. -
హిందూయేతరులు ఘాట్‌కు రావద్దు
వారణాసి: హిందువులు కాని వారు గంగా నది ఘాట్లకు, నది ఒడ్డున ఉండే గుడులకు దూరంగా ఉండాలని హెచ్చరించే పోస్టర్లు కాశీ పుర వీధుల్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని తొలగించిన పోలీసులు ఇవి ఎలా వచ్చాయన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. జాతీయవాద సంస్థలు వీటి వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘గంగా ఘాట్లు, కాశీ దేవాలయాలు సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి, విశ్వాసానికి, నమ్మకానికి చిహ్నాలు, వీటిపై నమ్మకమున్నవారికి స్వాగతం, లేదన్న వారు ఇది పిక్నిక్ స్పాట్ కాదని గుర్తుపెట్టుకోండి’ అని ఈ పోస్టర్లలో రాశారు. వీటిపై హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం అనే శీర్షికనుంచారు. ఇది విజ్ఞప్తి కాదు, హెచ్చరిక అనే బెదిరింపులు కూడా వీటిపై ఉన్నాయి. ఈ పోస్టర్ల ఫొటోలు, వీడియోలను వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దర్శనమిచ్చాయి. భేల్‌పూర్ పోలీసులు వీటిపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియోల్లో, ఫొటోల్లోని కొందరిని గుర్తించామన్నారు. హిందూయేతరులు ఘాట్ల పవిత్రతను దెబ్బతీస్తారని, అందుకే వీరికి ఈ వార్నింగ్ ఇచ్చారని బజరంగ్దళ్ నేత నిఖిల్ త్రిపాఠీ అభిప్రాయపడ్డారు. వీరంతా ఘాట్లలో మద్యం తాగడం, మాంసం తినటం చేస్తారని ఆరోపించారు. ఇటీవలే కొందరు బాలికలు ఘాట్లలో బీర్లు తాగుతున్న ఫొటోలు బయటపడ్డాయని, ఇలాంటి వారు తమకు పట్టుబడితే పోలీసులకు అప్పజెబుతామని హెచ్చరించారు. -
నేను నికార్సైన హిందువును.. హిందూత్వవాదిని కాదు: రాహుల్
జైపూర్: భారత్ హిందువుల దేశమని, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడే హిందూత్వవాదులది కాదని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణానికి, ప్రజల కష్టాలకు హిందూత్వవాదులే కారణమని దుయ్యబట్టారు. వారికి అధికారమే పరమావధి అని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ప్రధానిమోదీపై విరుచుకుపడ్డారు. మోదీ, ఆయన సంపన్న మిత్రులు కలిసి గత ఏడేళ్లలో దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. హిందూ, హిందూత్వ వేర్వేరు పదాలు అని చెప్పారు. రెండు ప్రాణుల్లో ఒకే ఆత్మ ఉండనట్లుగానే, రెండు పదాలకు ఒకే అర్థం ఉండదని వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ హిందువు, గాడ్సే హిందూత్వవాది అని అన్నారు. 2014 నుంచి భారత్‌లోని హిందూత్వవాదులు ఇదే సిద్ధాంతం పాటిస్తున్నారని విమర్శించారు. తాను నికార్సైన హిందువునని, హిందూత్వవాదిని కాదని తేల్చిచెప్పారు. హిందూత్వవాదులు నిక్షేపంగా ఉన్నారు హిందూత్వవాదులను మరోసారి తరిమికొట్టాలని, దేశంలో హిందువుల పరిపాలనను పునఃప్రతిష్టించాలని ప్రజలకు రాహుల్ పిలుపునిచ్చారు. õ దేశంలో 20 కంపెనీలే 90 శాతం కార్పొరేట్ లాభాలను కొల్లగొడుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ ర్యాలీని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులు కూడా కార్పొరేట్ల బానిసలేనని అన్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతుల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు రద్దు చేశాయని, మోదీ ప్రభుత్వం మాత్రం రైతులకు హిందూత్వవాది కాబట్టే మోదీ రైతులను వెనుక నుంచి పొడిచాడని చెప్పారు. రైతన్నలు ఎదురుతిరిగితే హిందూత్వవాది తోకముడిచి, క్షమాపణ చెప్పడం ఖాయమన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా మాట్లాడుతూ..70 ఏళ్లలో కాంగ్రెస్ కష్టపడి నిర్మించిన దేశాన్ని కార్పొరేట్ మిత్రులకు అమ్మేసేందుకు మోదీ సర్కారు కుతంత్రాలు సాగిస్తోందని ఆరోపించారు. ర్యాలీలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. కానీ, ప్రసంగించలేదు. రాజస్తాన్ Ðసీఎం గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ హాజరయ్యారు. కాగా, ఈ ర్యాలీ వద్దకు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆలస్యంగా చేరుకున్నారు అదానీ, అంబానీకే అచ్ఛే దిన్ మంచి రోజులు(అచ్ఛే దిన్) వస్తాయంటూ దేశ ప్రజలకు మోదీ హామీ ఇచ్చారని, కానీ ఆ మంచి రోజులు అదానీకి, అంబానీకి మాత్రమే వచ్చాయని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయినా ఆ తప్పు అదానీ, అంబానీది కాదని, వారికి దోచిపెట్టే ప్రధానిది అని అన్నారు. మోదీ నిర్వాకాలతో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. కేవలం ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించలేరని అన్నారు. లక్షలాది చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలు, రైతులే ఆ పని చేయగలరని చెప్పారు. మోదీ పాలనలో అసంఘటిత రంగం పూర్తిగా కునారిల్లిందన్నారు. లద్దాఖ్, అరుణాచల్‌లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తే, అలాంటిదేమీ లేదని ప్రధాని బుకాయిస్తున్నారని చెప్పారు. -
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే బరాబర్ అడ్డుకుంటాం
చేవెళ్ల: హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని, బరాబర్ అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఐదోరోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కొనసాగిన సంజయ్ పాదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. చేవెళ్ల మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. సంజయ్ మాట్లాడుతూ 12 శాతం ఉన్న ఓట్ల కోసం 80 శాతం ఉన్న హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఓట్ల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నపుంసక రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ గడీల పాలనలో తెలంగాణ తల్లి బందీ అయిందన్నారు. గడీలు బద్దలు కొట్టి కేసీఆర్‌ను గద్దె దించి, తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నావ్.. చేవెళ్లలో ఐదు మందికైనా ఉద్యోగాలు ఇచ్చావా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాకు మౌలిక సదుపాయలు, ఉపాధి హామీ, మరుగుదొడ్లు వంటి వాటి కోసం కేంద్రం రూ.1,040 కోట్లు ఇచ్చిందని, చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి రూ.240 కోట్లు ఇచ్చిందని, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిచ్చిందని ప్రశ్నించారు. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు పేరుతో ఈ ప్రాంతానికి అన్యాయం చేశారన్నారు. కేసీఆర్ చేతిలో రాష్ట్రం బందీ... ఎంతో మంది ప్రాణత్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకుంటే కేసీఆర్ అనే మూర్ఖుడి చేతిలో రాష్ట్రం బందీ అయిందని బండి సంజయ్ విమర్శించారు. పేదలకు, దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నీ కేంద్రమే ఇస్తోందని చెప్పారు. హిందూ దేవుళ్లను అవమానిస్తే, గోమాతలను నరికితే, హిందువులను నరికి చంపుతామంటే సహించాలా అని సంజయ్ ప్రశ్నించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే రౌడీలుగా కేసులు పెడుతున్నారని, బీజేపీని మతతత్వ పార్టీగా ముద్ర వేస్తున్నారని బండి ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. చేవెళ్లలో ఇంత పెద్దఎత్తున తరలివచ్చిన జన సందోహానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు సంజయ్ చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి రవీంద్రనాయక్, మనోహర్‌రెడ్డి తదితరులు బండి పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. -
నిజాం ఆస్తులు ప్రజలకే..
సాక్షి, హైదరాబాద్/లంగర్‌హౌస్: ‘బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వా ధీనం చేసుకుంటాం’అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. పరాధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని తిరిగి ప్రజలకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ‘ప్రజా సంగ్రామ యాత్ర మూడోరోజైన సోమవారం సాయంత్రం ఆరెమైసమ్మ ఆలయం వద్ద నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ‘భాగ్యలక్ష్మీ అమ్మ వారి సాక్షిగా ఎంఐఎం అడ్డాను బద్దలు కొట్టిన సత్తా బీజేపీ కార్యకర్తలదే. పాతబస్తీనే కాదు.. వాళ్లు సవాల్ చేస్తే ఏ బస్తీకైనా వచ్చి కాషాయ జెండా ఎగరేస్తాం. టీఆర్ఎస్కు ఆ దమ్ము ఉందా? దేశద్రోహుల పార్టీ ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నా రు. కేసీఆర్ పాతబస్తీకి రావాలంటే ఎంఐఎం పర్మిషన్ తీసుకోవాలి. రాబోయే ఎన్నికల తరువాత దేశద్రోహుల పార్టీని తరిమికొడతాం. భాగ్యనగర్ అమ్మవారి పేరుతోనే భాగ్యనగర్ పేరొచ్చింది. గొల్ల కురుమల కొండ గొల్లకొండనే... అది గోల్కొండ కాదు. నిజాం స్థలాలు, ఆస్తులన్నీ కూడా మావే. హిందువుల స్థలాలను ఆక్రమించుకుని నిజాం ఆస్తులుగా చెప్పుకుంటున్నారు’అని అన్నారు. కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ తెలంగాణ ఇచ్చిన వీరుడు సర్దార్ పటేల్ ముందు మోకరిల్లిన పార్టీ బీజేపీ అని, తెలంగాణ ప్రజల మానప్రాణాలను దోచుకుని హింసించిన నిజాం రాజు ముందు మోకరిల్లిన పార్టీ టీఆర్ఎస్దని బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏనాడూ ఎంఐఎం సమర్థించలేదన్నారు. తెలంగాణ తల్లి ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని, విముక్తి చేసేందుకు బీజేపీ పోరాడుతుందని చెప్పారు. 111 జీవో పరిధిలోనే కేసీఆర్‌కు, ఆయన కొడుకు, కూతురుకు సామ్రాజ్యాలున్నాయని ఆరోపించారు. బీజేపీ ఏ మతానికీ, వర్గానికీ వ్యతిరేకం కాదని, కానీ హిందూ మతాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకోదన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ మాట్లాడుతూ.. ఒవైసీ సోదరులపై మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం నేతలను పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లు పట్టుకోవటం ఎంఐఎంకు అలవాటైందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, కర్ణాటక ఎంపీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్చార్జి మునుస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ ఇన్చార్జి లాల్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలికి గాయం: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రాత్రి లంగర్ హౌస్ వద్ద బండి సంజయ్‌ను కలిసేందుకు కార్యకర్తలు పోటీపడటంతో తోపులాట జరిగింది. ఈక్రమంలో ఆయన కిందపడిపోవడంతో కాలికి గాయమైంది. కాలికి కట్టుకట్టుకుని సోమవారం బాపూఘాట్ నుంచి యాత్రను కొనసాగించారు. టిప్పుఖాన్ బ్రిడ్జ్ మీదుగా.. ఆరె మైసమ్మ, అప్పా జంక్షన్, అజీజ్ నగర్ క్రాస్‌రోడ్డు మీదుగా హిమాయత్ సాగర్‌కు చేరుకున్నారు. యాత్ర రాజేందర్‌నగర్ నియోజకవర్గంలోకి చేరుకోగా మైలార్దేవరపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గుర్రాలు, ఒంటెలతో ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా బోనాలు, మంగళహారతులతో నీరాజనం పలికారు. ‘డబుల్’ ఇళ్ల లెక్క చెప్పండి: బండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామన్నారు.. ఎన్ని పూర్తి చేశారు.. లబ్ధిదారుల జాబితాతో సహా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. తాను పాల్గొన్న పట్టణాభివృద్ధి కమిటీ భేటీలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి వెల్లడించిన వివరాల ప్రకారం.. 8,000 ఇళ్లు మాత్రమే కట్టినట్లు స్పష్టమౌతోందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం పేరును టీఆర్ఎస్ సర్కార్ మార్చేసిందని, కేంద్రం ఇచ్చిన నిధులతోనే డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే పథకం పేరును మార్చేశారన్నారు. సోమవారం మూడో రోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించి, హైదరాబాద్ బాపూఘాట్ సమీపంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల కమీషన్ కోసమే డబుల్బెడ్రూం ఇళ్లు కడుతున్నారని, వాటి నాణ్యతను ఇప్పటివరకు సీఎం కేసీఆర్ పరిశీలించలేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు 2 లక్షలకు పైగా, జీహెచ్ఎంసీలో 1.40 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని ఈ ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. వీటి నిర్మాణానికి కేంద్రం ఇప్పటివరకు రూ.3,500 కోట్లు విడుదల చేయగా, కేసీఆర్ సర్కార్ రూ.2,285 కోట్లు ఉపయోగించుకుందని చెప్పారు. ఇవిగాక జీహెచ్ఎంసీలో వివిధ పథకాల అమలుకు మోదీ ప్రభుత్వం రూ.1,287 కోట్లు మంజూరు చేసిందని సంజయ్ వివరించారు. ఆయుష్మాన్ భారత్ అమలేదీ.. హైదరాబాద్ శివారు భోజగుట్టలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఆక్రమించుకున్న 40 ఎకరాల స్థలంతో పాటు ఇతర చోట్ల పీఎంఏవై కింద ఇళ్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. కోవిడ్ కష్టకాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే వైద్యచికిత్స ఖర్చుల నుంచి పేదలకు ఉపశమనం లభించి ఉండేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నాయకులు మోకాళ్ల యాత్ర చేయకతప్పదని బండి హెచ్చరించారు. -
Kabul Airport Blast: అదృష్టమంటే వీళ్లదే!
జంట పేలుళ్లతో కాబూల్ ఎయిర్పోర్ట్ రక్తసిక్తంగా మారింది. అమెరికా భద్రతా దళాలను టార్గెట్‌గా చేసుకుని ఐసిస్ ఖోరసాన్(కె) సంస్థ చేపట్టిన నరమేధంలో అఫ్గన్ పౌరులు సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి నుంచి 160 మంది అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. తాలిబన్ల దురాక్రమణ తర్వాత పెద్ద ఎత్తున్న పౌరులు పారిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మైనార్టీలు, మహిళలు భద్రత విషయంలో భయాందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో అఫ్గన్ సంతతికి చెందిన సుమారు 160 మంది మైనార్టీలు బుధవారం సాయంత్రం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వీళ్లలో 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు ఉన్నారు. అక్కడి నుంచి బయటి దేశాలకు వెళ్లాలన్నది వాళ్ల ఉద్దేశం. అయితే తాలిబన్లు గార్డులు వీళ్లను అడ్డుకున్నారు. సరైన పేపర్లు ఉన్నా.. తమను అడ్డుకున్నారంటూ వాళ్లంతా కాసేపు ధర్నా దిగారు కూడా. ఎంతసేపు ఎదురుచూసినా అనుమతించబోమని తాలిబన్లు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి వాళ్లంతా వెనుదిరిగారు. అయితే వాళ్లు ఏ ప్రదేశంలో అయితే కొద్దిగంటలపాటు ఎదురుచూశారో.. సరిగ్గా అదే ప్రదేశంలో(అబ్బే ఎంట్రన్స్ దగ్గర) ఆత్మాహుతి దాడి జరిగింది. I just had a phone call conversation with S Gurnam Singh, president of Kabul Gurdwara committee who apprised me that today’s #Kabulairport explosion has happened at exactly same place where they were standing yesterday We thank Almighty that such thing didn’t happen yesterday pic.twitter.com/sbCiHaMZGP — Manjinder Singh Sirsa (@mssirsa) August 26, 2021 ‘‘ముందురోజు ఎక్కడైతే మేం ఎదురుచూశామో.. అక్కడే ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని తెలిసి వణికిపోయాం. అదృష్టం బావుండి అక్కడి నుంచి మేం వెళ్లిపోయాం. దాడిని తల్చుకుంటే బాధగా ఉంది. ప్రస్తుతం మా బృందం సురక్షితంగా ఉన్నాం. కార్టే పార్వాన్‌లోని గురుద్వారలో ఆశ్రయం పొందుతున్నాం’’ అని కాబూల్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ గుర్మాన్ సింగ్ తెలిపారు. వాళ్లు సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిస్రా సైతం దృవీకరించారు. వీళ్లను సురక్షితంగా దేశం దాటించే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నట్లు బ్రిటన్ విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: అఫ్గన్ ఎకానమీ.. ఘోరమైన సమస్యలు హాట్ న్యూస్: కాబూల్ దాడి.. మూల్యం చెల్లించకతప్పదు -
హిందువులు చర్చికెళ్తే ఖబడ్దార్..
డిస్పూర్: ప్రేమికుల రోజు మన సంస్కృతి కాదు.. యువతీయువకులు బయట జంటగా కనిపిస్తే.. పెళ్లి చేస్తాం అని బెదిరించే బజరంగ్ దళ్ కార్యకర్తలు తాజాగా క్రైస్తవుల పవిత్ర పర్వదినం క్రిస్టమస్ మీద పడ్డారు. హిందువులు ఎవరైనా క్రిస్టమస్ నాడు చర్చికి వెళ్తే చితకబాదుతాం జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ మిథు నాథ్ అస్సాం కాచర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథ్ ఇలా మాట్లాడటానికి ప్రధాన కారణం.. కొన్ని రోజుల క్రితం క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న మేఘలయాలో వివేకానంద సెంటర్‌ని మూసి వేశారు. ఆ కోపంతో నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రైస్తవులు మన పవిత్ర పుణ్యక్షేత్రాలను మూసి వేశారు. ఈ స్థితిలో ఎవరైనా హిందువులు, చర్చికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విషయంలో మేం చాలా సీరియస్‌గా ఉన్నాం’ అన్నారు. ( సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!) అంతేకాక ‘మా మాటలు కాదని ఎవరైనా చర్చికెళితే.. మేం వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత రోజు పేపర్లో మేం హెడ్‌లైన్స్‌లో నిలుస్తాం. "గుండాదళ్" ఓరియంటల్ పాఠశాలను ధ్వంసం చేసింది.. అని పేపర్లో వస్తుంది. కాని అది మా ప్రాధాన్యత కాదు. షిల్లాంగ్‌లోని క్రైస్తవులు మన దేవాలయాల ద్వారాలను లాక్ చేస్తున్నప్పుడు హిందువులు వారి కార్యక్రమాలలో పాల్గొనడాన్ని మేం అనుమతించము’ అని మిథు నాథ్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ఖాసీ విద్యార్థి సంఘం రామకృష్ణ మిషన్ ఆలయాన్ని మూసివేసింది అని తెలిపారు. అయితే, ఈ వాదనను మేఘాలయ ప్రభుత్వ ఉన్నతాధికారి ఖండించినట్లు సమాచారం. డిస్ట్రిక్ హాలీడే కావడంతో సాంస్కృతిక కేంద్రం మూసివేశారని.. లాక్ చేయలేదని సదరు అధికారి తెలిపారు. -
దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తన దేశంలోని మైనార్టీలైన హిందువులకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియా వేడుకగా శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశంలోని హిందు సోదరులందరికి దీపావళి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. కాగా, దీపావళి పండగను పాకిస్తాన్ హిందూవులు ఘనంగా జరుపుకుంటారు. భారత్‌లో మాదిరే దీపాలు వెలిగించి మిఠాయిలు పంచుకుంటారు. ఆలయాలు, గృహాలను అందంగా అలంకరించుకుని సంబరాలు జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కరాచీ, లాహోర్ లాంటి ప్రధాన నగరాలతో పాటు, మాటియారి, టాండో అల్లాహార్, టాండో ముహమ్మద్ ఖాన్, జంషోరో, బాడిన్, సంఘర్, హాలా, టాండో ఆడమ్, షాదాద్‌పూర్‌లలో కూడా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతాయి. పాకిస్తాన్ మైనారిటీ వర్గాల్లో హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్లో 75 లక్షల మంది హిందువులు ఉన్నట్లు అధికార ఘణాంకాలు చెబుతున్నాయి. -
అమెరికాలో 'అయోధ్య' సంబరాలు
సాక్షి, న్యూయార్క్ : అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి చేపట్టిన భూమిపూజను పురస్కరించుకొని అమెరికాలోని హిందువులు సంబరాలు జరుపుకున్నారు. శంకుస్థాపనకు మద్దతుగా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. 500 ఏళ్లనాటి హిందువుల పోరాటం సాకారం అయిందని, కోట్లాది హిందువుల కల నిజమయ్యిందని భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చాలా గొప్ప నిర్ణయమని, ప్రతీ హిందువూ గర్వించదగ్గ విషయమని ఆనందం వ్యక్తం చేశారు. టైమ్స్ స్కెవ్లో భారతీయ హిందువుల సంబరాలపై సాక్షి టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ -
అమెరికా, బ్రిటన్‌లో జైశ్రీరామ్
వాషింగ్టన్/లండన్: అయోధ్యలో రామాలయ మందిర నిర్మాణానికి చేసిన భూమి పూజను పురస్కరించుకొని అమెరికా, బ్రిటన్‌లలోని భారతీయ హిందువులు సంబరాలు చేసుకున్నారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్ ప్రాంతంలో రాముడి చిత్రాలు కలిగిన డిజిటల్ స్క్రీన్ ట్రక్కు తిరుగుతూ జైశ్రీరామ్ అనే నినాదాలను వినిపించింది. వాషింగ్టన్ లోనూ విశ్వహిందూ పరిషద్ సభ్యులు రాముడి చిత్రాలు, నినాదాలతో కూడిన ఓ ట్రక్కును నడిపారు. భారతీయ హిందువులు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి తమ ఆనందాన్ని తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన హిందూ నాయకుడు అజయ్ జైన్ మాట్లాడుతూ రామున్ని ఆరాధించే హిందువులు, జైనులకు ఇది ఓ మరపురాని రోజు అని చెప్పారు. ప్రముఖ టైమ్ స్క్వేర్ వద్ద రాముడి చిత్రాలను, రామాలయ నమూనా త్రీడీ చిత్రాలను ప్రదర్శించారు. మరోవైపు యూకేలో భారతీయ హిందువులు ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనల ద్వారా అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా వర్చువల్‌గా పూజలు జరిపి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. యూకేలో ఉన్న 150 దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపినట్లు వెల్లడించారు. భూమి పూజ జరిగిన కార్యక్రమం హిందువుల మనసుల్లో చిరకాలం నిలిచిపోతుందని యూకే హిందూ కౌన్సిల్ చెప్పింది. -
కొద్దిసేపట్లో పెళ్లి..వధువు కిడ్నాప్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో హిందు మహిళలకు రక్షణ కరువైంది. పెళ్లి పందిట్లో నుంచి ఓ హిందూ వధువును అపహరించుకుని వెళ్లి, మత మార్పిడి చేసి, ముస్లిం యువకుడు పెళ్లి చేసుకున్న సంఘటన సంచలనం రేపుతోంది. పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి వివాహ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మాటియారి జిల్లాలోని హాలా పట్టణంలో 24 ఏళ్ల హిందు యువతి భారతి బాయ్‌ను ముస్లిం యువకుడు, కొందరు రౌడీలతో కలిసి పోలీసుల సహకారంతో పెళ్లి మండపం నుంచి ఎత్తికెళ్లాడు. అనంతరం ఆమెకు బలవంతంగా ఇస్లాం మతాన్ని స్వీకరింపచేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటనపై భారతి తండ్రి కిషోర్ దాస్ మాట్లాడుతూ..తమ కుమార్తెకి మతియారా జిల్లా చెందిన వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించామని..కానీ అంతలోనే తమ కూతురిని షారుఖ్ గుల్ అనే ముస్లిం యువకుడు పోలీసుల సహకారంతో కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భారతిని బుష్రాగా పేరు మార్చిన సర్టిఫికేట్‌ను ముఫ్తీ అబూబకర్ సయీద్ఉర్ రెహమాన్ అందజేసినట్లు తెలిసింది. కాగా జాతీయ గుర్తింపు కార్డులో భారతి హాలా నగరానికి చెందిన వ్యక్తిగా పేర్కొంటుండగా..కానీ తాత్కాలిక చిరునామాలో మాత్రం కరాచీ నగరం గుల్షాన్ ఇక్బాల్‌లో ఉంటున్నట్లు ఉంది. తమ కుమార్తెని నెల ముందే షారుక్ గుల్ మత మార్పిడి చేశాడని భారతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ షారుక్ గుల్ మాత్రం తనకు బుష్రాతో వివాహం అయిందని..హిందు వ్యక్తితో తన భార్య భారతికి ఆమె తల్లి దండ్రులు వివాహం జరిపిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సింధు ప్రావిన్స్‌లోని హలాలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా హిందు మైనారిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో మైనారిటీలైన హిందువులకు రక్షణ కల్పిస్తానన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
మూడు భాగాలు.. రాముడివే ఇపుడు!!
‘మసీదు నిర్మాణానికి ఆలయాన్ని కూల్చివేయలేదు. పురాతన గుడి శిథిలాలపైనే దాన్ని నిర్మించారు. ఆలయ శిథిలాల్లో కొన్నిటిని మసీదు నిర్మాణానికి వినియోగించారు. వివాదాస్పద ప్రాంతంలోని చిన్నభాగంలో రాముడి జన్మస్థలం ఉన్నట్లు హిందువులు విశ్వసిస్తూ వచ్చారు. 1855కి పూర్వమే రామ్‌ఛబుత్ర, సీతారసోయి అస్తిత్వంలో ఉండగా హిందువులు అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. దీనివల్లే భూమిపై కక్షిదారులకు ఉమ్మడిహక్కు కల్పిస్తున్నాం’’ అని జస్టిస్ ఎస్‌యూ ఖాన్ పేర్కొన్నారు. ‘‘ఏఎస్ఐ తవ్వకాల్లో దీనికి సంబంధించి 265 ఆధారాలు లభించాయి. ఏఎస్ఐ మాజీ డీజీ రాకేశ్ తివారీ నివేదికలోనూ పాత ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించినట్లు స్పష్టంచేశారు’’ అని జస్టిస్ శర్మ పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి. న్యూఢిల్లీ: అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల మధ్య దశాబ్దాలుగా వివాదం నెలకొంది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు ప్రాంతం ఉన్న 2.77 ఎకరాల స్థలాన్ని నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లా, సున్నీ వక్ఫ్‌బోర్డుకు మూడు సమాన భాగాలుగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. బాబ్రీ మసీదును కూల్చి విగ్రహాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక మందిరాన్ని శ్రీరాముడి జన్మస్థలంగానే పరిగణించిన హైకోర్టు దీన్ని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు అప్పగించాలని పేర్కొంది. రామ్ ఛబుత్ర, సీతారసోయిని నిర్మోహీ అఖాడాకు ఇవ్వాలని, మిగతా భాగాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డుకు అప్పగించాలని సూచించింది. నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా, సున్నీవక్ఫ్ బోర్డు తరఫున దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డి.వి.శర్మ, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ ఎస్.యు.ఖాన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 2 – 1 మెజార్టీతో నాడు తీర్పు వెలువరించింది. బాల రాముడిదే భూమి... న్యాయసూత్రాల ప్రకారం హిందూ దేవుళ్లను చట్టబద్ధులైన వ్యక్తులుగా గుర్తించవచ్చు. దావా వేసే హక్కుతోపాటు వారిని దావా పరిధిలోకి చేర్చవచ్చు. ఆరాధించే భక్తుల దైవభక్తే దీనికి ప్రాతిపదిక. రామ్‌లల్లా (బాల రాముడు) విరాజ్‌మాన్‌ను దావా వేసిన వ్యక్తిగా భావిస్తూ సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను చేపట్టింది. అయోధ్యలోని బాల రాముడిని చట్ట ప్రకారం శాశ్వత మైనర్‌గా గుర్తిస్తూ విచారణ ప్రారంభించింది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో బాలరాముడి తరపున ఆయన స్నేహితుడిగా భావించే వీహెచ్‌పీ నేత త్రిలోక్‌నాథ్ పాండే ప్రాతినిథ్యం వహించారు. 1989లో తొలిసారిగా బాల రాముడిని ఈ కేసులో దావాదారుడిగా చేర్చారు. రెండేళ్ల తరువాత ఈ వివాదం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఈ కేసులో భగవంతుడి స్నేహితుడిగా తనను కూడా భాగస్వామిగా చేర్చాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి దేవకి నందన్ అగర్వాల్ కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో ఆయన వీహెచ్‌పీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్‌లల్లాకు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంపై యాజమాన్య హక్కులు అప్పగిస్తూ తీర్పునిచ్చింది. సంపన్న అఖాడా! నిర్మోహీ అఖాడాను స్వామి రామానంద స్థాపించారు. దేశవ్యాప్తంగా పలు ఆలయాలు, మఠాలున్న సంపన్న అఖాడా ఇది. యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, బిహార్‌లోనూ దీని విభాగాలున్నాయి. వివాహం, లైంగిక సంబంధాలకు దూరంగా సాధారణ జీవితాన్ని గడిపే నిర్మోహీ అఖాడా సాధువులు కఠిన నియమాలు పాటిస్తారు. రాముడిని పూజిస్తారు. యుక్త వయసులో ఉండగానే కొత్తవారిని అఖాడా సభ్యులుగా చేర్చుకుంటారు. వేదాలు, ఉపనిషత్తులను ఔపోసన పట్టడంతోపాటు కొన్ని రకాల యుద్ధ క్రీడలనూ అభ్యసిస్తారు. అయోధ్య వివాదం తెరపైకి రావడంతో నిర్మోహీæ అఖాడా ప్రాధా న్యం పెరిగింది. రామ జన్మభూమిని తమకు అప్పగించాలంటూ నిర్మోహీ అఖాడా తరఫున న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. రామాలయం నిర్మాణాన్ని అడ్డుకోకుండా ఫైజాబాద్ యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ అఖాడా మహంత్ రఘువర్‌దాస్ 1885లో కేసు వేశారు. కోర్టు దీన్ని కొట్టివేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన వ్యాజ్యాన్ని 1950 జనవరిలో హిందూ మహాసభ నేత జీఎస్ విశారద్ దాఖలు చేశారు. 1960 నాటికి అఖాడా కూడా ఈ కేసులో భాగస్వామిగా మారింది. అమీనాబాద్ టు సుప్రీం రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదానికి సంబం ధించి ముస్లిం పక్షాల తరపున న్యాయపోరాటం 1857లో మౌజం మౌల్వీ మహ్మద్ అస్ఘర్‌తో మొదలైంది. హనుమాన్‌గఢ్ మహంత్ ఈ కట్టడాన్ని బలవంతంగా తన అధీనంలోకి తీసుకున్నారని ఆయన మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. బాబ్రీ మసీదు ప్రధాన గేటు తాళం తెరవాలని 1986 జనవరి 2న ఫైజాబాద్ జిల్లా జడ్జి ఆదేశించడంతో వివాదం రాజుకుంది. నాడు అత్యవసరంగా సమావేశమైన ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మసీదుకు అనుకూలంగా ప్రచారం నిర్వహించి మద్దతు కూడగట్టాలని నిర్ణ యించింది. న్యాయవాది అబ్దుల్ మన్నన్ నివాసంలో జనవరి 4న ముస్లిం నేతలు సమావేశమయ్యారు. యూపీ నేత అజంఖాన్ కూడా దీనికి హాజరయ్యారు. రెండు రోజుల తరువాత లక్నో అమీనాబాద్‌లోని ఓ ఇంట్లో 200 మందితో నిర్వహించిన సమావేశంలో బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. అజంఖాన్, జఫర్యాబ్ గిలానీలను కన్వీనర్లుగా, మౌలానా ముజఫర్ హుస్సేన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏఐఎంపీఎల్బీ ఆధ్వర్యంలో బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ న్యాయపోరాటం ఆరంభించింది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐఎంపీఎల్‌బీపై ఒత్తిడి పెరిగింది. పోరాడే బాధ్యతను బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీకి అప్పగించారు. సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు తదితర ముస్లిం పక్షాల తరపున దాదాపు రెండు దశాబ్దాలుగా బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ వివిధ కోర్టుల్లో న్యాయ పోరాటం చేసింది. పురాతన అవశేషాలు ఉన్నాయా? భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు 1976–77 సంవత్సరాల్లో తిరిగి 2003లో వివాదాస్పద ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. మసీదు నిర్మాణం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ తవ్వకాల సందర్భంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (జీపీఆర్) వినియోగించుకుంది. ఇందుకోసం టోజో డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ సాయం తీసుకుంది. తవ్వకాల్లో కనుగొన్న ఆధారాలపై 2003లో కోర్టుకు సమర్పించిన నివేదికలోని వివరాలివీ.. - తవ్వకాల్లో క్రీస్తుపూర్వం 13వ శతాబ్దం నాటి ఆధారాలూ లభ్యమయ్యాయి. - కుషాణులు, శుంగ వంశ పాలకులు, గుప్తుల కాలం, మధ్యయుగాల నాటి ఆనవాళ్లు కనిపించాయి. - ఇక్కడ బయటపడిన 15్ఠ15 కొలతలతో ఉన్న వేదికకు చాలా ప్రాముఖ్యం ఉంది. - ఇక్కడున్న వలయాకార ఆలయాన్ని 7– 10 శతాబ్దాల మధ్యలో నిర్మించారు. - ఇక్కడే ఉన్న మరో భవనం కూడా 11, 12వ శతాబ్దాల్లో రూపుదిద్దుకుంది. - దీంతోపాటు మరో భారీ నిర్మాణం ఫ్లోర్ మూడు దఫాలుగా పూర్తయింది. - వీటిపైనే 16వ శతాబ్దంలో వివాదాస్పద కట్టడం(మసీదు) నిర్మితమైంది. - సరిగ్గా మసీదు గోపురం ఉన్న చోటే దిగు వన 50 రాతి స్తంభాలు బయటపడ్డాయి. వీటితోపాటు బౌద్ధ, జైన ఆలయాల ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. -
హిందువులపై అనుచిత వ్యాఖ్యలు.. ఇమ్రాన్ సీరియస్
ఇస్లామాబాద్ : హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని పాకిస్తాన్ అధికారపార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) తొలగించింది. అసలే భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక ఆందోళన పడుతున్నారు జనాలు. ఇలాంటి సమయంలో పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర సమాచార మంత్రి ఫయ్యాజుల్ హసన్ హిందువులను ఎగతాళి చేస్తూ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దాంతో ఇమ్రాన్ ఖాన్‌తో సహా పార్టీలోని సీనియర్ మంత్రులంతా సదరు మినిస్టర్‌పై సీరియస్ అయ్యారు. మంత్రి ఫయ్యాజుల్ హిందువులను ఉద్దేశిస్తూ.. ఆవు మూత్రం తాగే జనాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపై దుమారం రేగుతోంది. దీంతో ఫయాజుల్ హసన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించినట్లు పీటీఐ మంగళవారం ట్విటర్లో పేర్కొంది. ఫయ్యాజుల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ముస్లింలకు ప్రత్యేకంగా ఓ జెండా ఉంటుంది. ఇది మౌలా అలియా ధైర్యానికి, హజ్రాత్ ఉమారా శౌర్యానికి ప్రతీక. కానీ మీకంటూ ఎటువంటి ప్రత్యేక జెండా లేదు. మీ చేతుల్లో ఏమి లేదు’ అన్నారు. అంతేకాక ‘గో మూత్రం తాగే మీరు మాకంటే ఏడు రెట్లు ఉన్నతులమనే భ్రమలో ఉన్నారు. కానీ మాకు ఉన్నవి ఏవి కూడా మీకు లేవు. మీరు విగ్రహారాధకులు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడి - మెరుపు దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఫయ్యాజుల్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. మైనారిటీల పట్ల తప్పుగా వ్యవహరించేవారిని పీటీఐ పార్టీ ఎన్నటికి క్షమించదని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. PTI Punjab government has removed Fayyaz Chohan from the post of Punjab Information Minister following derogatory remarks about the Hindu community. Bashing someone’s faith should not b a part of any narrative.Tolerance is the first & foremost pillar on which #Pakistan was built. pic.twitter.com/uKJiReWc26 — PTI (@PTIofficial) March 5, 2019 -
‘గో మూత్రం తాగే మీరు మమ్మల్ని అంటారా’
ఇస్లామాబాద్ : అసలే భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక ఆందోళన పడుతున్నారు జనాలు. ఇలాంటి సమయంలో ఓ పాకిస్తాన్ మంత్రి హిందువులను ఎగతాళి చేస్తూ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దాంతో ఇమ్రాన్ ఖాన్‌తో సహా పార్టీలోని సీనియర్ మంత్రులంతా సదరు మినిస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ సమాచార మంత్రి ఫయ్యాజుల్ హసన్ చోహాన్ హిందువులను ఉద్దేశిస్తూ.. ఆవు మూత్రం తాగే జనాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపై దుమారం రేగుతోంది. వివరాలు.. ఫయ్యాజుల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ముస్లింలకు ప్రత్యేకంగా ఓ జెండా ఉంటుంది. ఇది మౌలా అలియా ధైర్యానికి, హజ్రాత్ ఉమారా శౌర్యానికి ప్రతీక. కానీ మీకంటూ ఎటువంటి ప్రత్యేక జెండా లేదు. మీ చేతుల్లో ఏమి లేదు’ అన్నారు. అంతేకాక ‘గో మూత్రం తాగే మీరు మాకంటే ఏడు రెట్లు ఉన్నతులమనే భ్రమలో ఉన్నారు. కానీ మాకు ఉన్నవి ఏవి కూడా మీకు లేవు. మీరు విగ్రహారాధకులు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడి - మెరుపు దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఫయ్యాజుల్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను పాక్ సీనియర్ మంత్రులతో పాటు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఖండించారు. మైనారిటీల పట్ల తప్పుగా వ్యవహరించేవారిని పీటీఐ పార్టీ ఎన్నటికి క్షమించదని.. ఫయ్యాజుల్ మీద తగిన చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్ తెలిపారు. -
ముస్లింలు రాముని వారసులే: రాందేవ్
అహ్మదాబాద్: హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు ముస్లింలకు కూడా పూర్వీకుడేనని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. శుక్రవారం ఖేడా జిల్లా నడియడ్‌లోని యోగ శిబిరంలో రాందేవ్ మాట్లాడారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మాణం నిర్మించాలని గట్టిగా కోరుతున్నా. అయోధ్యలో కాకుంటే మరెక్కడ నిర్మించాలి? దానిని మక్కా, మదీనా లేదా వాటికన్ సిటీలో నిర్మించలేము’ అని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ‘హిందువులకు మాత్రమే కాదు, శ్రీరాముడు ముస్లింలకూ పూర్వీకుడే. రామాలయ నిర్మాణం జాతికి గర్వ కారణమైన విషయం’ అని పేర్కొన్నారు. రాందేవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. -
‘హిందువులందరినీ ఏకం చేయడం చాలా కష్టం’
న్యూయార్క్ : ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మనం మన మూలాలని, ఆధ్యాత్మికతని మర్చిపోవడం వల్లే ఇంత వెనకబడి ఉన్నాం’ అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. శుక్రవారం చికాగోలో నిర్వహించిన రెండో ప్రపంచ హిందూ కాంగ్రెస్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మనకు తెలివి ఉంది.. జ్ఞానం ఉంది.. కానీ ఐకమత్యం లేదు. అందువల్లే మనం ఇంత వెనకబడి ఉన్నాం. మన హిందూ సమాజంలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. కానీ వారందరికి సరైన గుర్తింపు లేదు. సింహాలు కలిసి సంచరించవు.. కానీ అడవి కుక్కలు కలిసి దాడి చేస్తాయి.. నాశనం చేస్తాయి’ అని తెలిపారు. అంతేకాక హిందువుల్లో ఐకమత్యం లోపించిందని ఆయన వాపోయారు. హిందూవులందరిని ఒక్క తాటిపైకి తీసుకురావడం కూడా చాలా కష్టమన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 2500 మంది హాజరయ్యారు. వీరిలో బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. -
హైదరాబాద్‌లో హిందూ మహాసముద్రం చూపిస్తా
-
హైదరాబాద్‌లో హిందూ మహాసముద్రం చూపిస్తా
హైదరాబాద్: హిందువుల ఐక్యత కోసం ప్రాణాలర్పిం చేందుకు సిద్ధమని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఏభై రోజుల క్రితం నగర బహిష్కరణకు గురైన ఆయన న్యాయస్థానం అనుమతితో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఉదయం 10 గంటలకు బెజవాడలోని దుర్గమ్మను దర్శించుకుని అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరారు. నగరానికి చేరుకున్న ఆయనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, ఏబీవీపీ, బజరంగ్ దళ్, ఏసీపీఎస్, అభిమానులు మంగళ వాయిద్యాలు, హారతులు, పూర్ణకుంభంతో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద పెద్దఎత్తున స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణలో అడుగుపెట్టే అవకాశం తనకు దుర్గమ్మ అమ్మవారు కల్పించారని అన్నారు. పోలీసులు, ప్రభుత్వంపై కోపం లేదని, ప్రజల మనోభావాలు కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదన్నారు. ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ హిందూసమాజాన్ని అణచివేయాలని చూస్తోందని, వారి ఆటలు చెల్లవని స్పష్టం చేశారు. తాను వచ్చేది ఎవరికీ తెలియదనీ, అయినా లక్షలాది హిందూ జనం స్వాగతించటం హిందూ సమాజానికి గర్వకారణమన్నారు. 15 నిమిషాల్లో హిందువులను నరికివేస్తామన్న వారికి ప్రభుత్వం భద్రత కల్పిస్తూ, పోలీసుల కుటుంబాలు బాగుండాలని కోరుకునే తన లాంటి సన్యాసులపై పీడీ యాక్ట్ ప్రయోగించి బహిష్కరించారని, హిందూ సమాజానికి చేసే న్యాయం ఇదేనా.. అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పాకిస్తాన్‌లోనూ ఇలాంటి సాహసం చేయరని, 19 గంటలపాటు పలు గ్రామాల్లో తిప్పుకుంటూ ఆహారం ఇవ్వకుండా తనను ఇబ్బంది పెట్టిన పోలీసులకే తాను భోజనం పెట్టించానన్నారు. హిందూ సంఘాలన్నీ ఏకమై హిందువుల ఐక్యత కోసం సంఘటితం కావాలని, ఇందుకు తన ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. హిందువులు చేతగానివారనే భావనను విడనాడాలని, హైదరాబాద్ లో హిందూ మహా సముద్రాన్ని చూపిస్తానని అన్నారు. ఆదిలాబాద్ నుంచి యాత్ర చేపట్టి రాష్రాన్ని చుట్టి వస్తానని, ప్రతి హిందువు గుండెను తట్టి లేవుతానని చెప్పారు. అనంతరం ట్యాంక్‌బండ్ చేరుకొని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. -
ఎక్కడికక్కడ అడ్డగింత
అనంతగిరి: స్వామి పరిపూర్ణనంద బహిష్కరణకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) శనివారం వికారాబాద్‌లో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పరిషత్ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. వికారాబాద్‌లోని ఆలంపల్లి ఎంఐజీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వెళ్లేందుకు వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ర్యాలీగా వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శిరీష, సీఐ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నాయకులను అడ్డుకున్నారు. ఆలయం వెలుపల నుంచి వస్తున్న నాయకులను అడ్డగించి వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఎమ్మార్పీ చౌరస్తా వరకు వచ్చిన కొందరిని కూడా అడ్డుకున్నారు. ఈ సమయంలో నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బహిష్కరణ ఎత్తివేయాలి ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. స్వామి పరిపూర్ణనందాపై బహిష్కరణ సరికాదని, వెంటనే బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విభజించు పాలించు అనే ధోరణిని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. స్వామిజీ ధర్మం గురించి మాట్లాడిన్రు తప్పా మరేది కాదన్నారు. అనంతరం వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బందెప్ప గౌడ్ మాట్లాడుతూ.. హిందూవుల మనోభావాలకు దెబ్బతినేలా ఎవరూ మాట్లాడొద్దని కోరారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. హిందూవుల జోలికి ఎవరైన వస్తే సహించేది లేదన్నారు. సమాజ హితం కోసం కృషి చేసే పరిపూర్ణనందాను బహిష్కరించడం సరికాదని బీజేపీ రాష్ట్ర నాయకులు పటేల్ రవిశంకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కడిక్కడ ప్రజల గొంతును నొక్కేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు ప్రశాంత్‌కుమార్, గోవర్దన్‌రెడ్డి, ప్రభాకర్, కృష్ణ పంతులు, మ్యాడం దత్తు, బీజేపీ నాయకులు పాండుగౌడ్, సదానంద్‌రెడ్డి, సాయికృష్ణ, మాధవరెడ్డి, శివరాజు, వివేకనందారెడ్డి, పోకల సతీశ్, రాచ శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌కుమార్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, శంకర్, సాయి చరణ్‌రెడ్డి, రాజు, రాము, గిరీశ్ కొఠారి, పరుశరాం, కరుణాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వికారాబాద్‌లో న్యాయవాదుల లోక్ అదాలత్ బహిష్కరణ వికారాబాద్‌లో ర్యాలీకి మద్దతుగా వికారాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు శనివారం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ను బహిష్కరించారు. అనంతరం న్యాయవాదులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ప్ర«ధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, సీనియర్ న్యాయవాదులు గోవర్దన్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, బస్వరాజు, చౌదరి యాదవరెడ్డి, శ్రీనివాస్, రవి, రాజు, రాము, ఈశ్వర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బహిష్కరణను నిరసిస్తూ ఆందోళన
యైటింక్లయిన్‌కాలనీ: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ శుక్రవారం యైటింక్లయిన్‌కాలనీలో విశ్వహిందూ పరిషత్, హనుమాన్‌దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. హిందువులకు వ్యతిరేకంగా కొన్ని చానళ్లు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బీజేపీ, ఆలయ కమిటీ సభ్యులు గోవర్ధనగిరి మధుసూధనాచార్యులు, సౌమిత్రి హేమంతాచార్యులు, శుక్లాచారి, బండారి రాయమల్లు, శ్రీనివాస్, ముత్యాల బాలయ్య, పోతు శంకరయ్య, సత్యనారాయణరెడ్డి, మూకిరి రాజు, శశికుమార్, బెల్లంకొండ భాస్కర్‌రెడ్డి, పోతు రాకేశ్, కుమార్, మారెపల్లి శ్రీనివాస్, భగవాన్‌రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ గోదావరిఖనిటౌన్ : స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగర బహిష్కరణ చేసిందుకు నిరసగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు శుక్రవారం భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక స్వాతంత్య్ర చౌక్ నుంచి గణేశ్ చౌక్ వరకు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. హిందుత్వం, ఆలయాలు, పూజల కోసం తపించే కేసీఆర్ ప్రభుత్వం స్వామి పరిపూర్ణానందను ఎందుకు నగర బహిష్కరణ చేశారని ప్రశ్నించారు. హిందూ సమాజం కోసం నిరంతరం ఆకాంక్షించే స్వామిని నగర బహిష్కరణ చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్వామిజీని నగరంలోని తీసుకురావాలని వారు కోరారు. అంతకుముందు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు వేపూరి రాములు గౌడ్, అయోధ్య రవీందర్, అడిగొప్పల రాజు, గుడికందుల ఆకాశ్ కుమార్, ముష్కె సంపత్, సుధీర్, శశికాంత్, చక్రపాణి, జిమ్ సమ్మన్న, సతీశ్, అనిల్, నరేశ్, అనిరుద్, అజేయ్, పెండ్యా మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇక్కడ మేం బతకలేం’
కాబుల్ : వరుస ఉగ్రదాడులతో అప్ఘానిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు భయానికి లోనవుతున్నారు. దేశంలో జీవించలేమంటూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జలాలాబాద్‌లోని సిక్కులు, హిందువులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్ ఉగ్రవాదులు ఆదివారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది మృతిచెందగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 17 మంది హిందువులు, సిక్కులు కాగా.. మరో ఇద్దరు అఫ్గాన్ జాతీయులు ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆ దేశ హిందువులు, సిక్కులు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో మేం జీవించలేం అంటూ మృతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ‘ ఇక్కడ ఉంటే ఎక్కువ రోజులు బతకలేమని నాకు అర్థమయింది. ముస్లిం టెర్రరిస్టులు మమ్మల్ని బతకన్విరు’ అంటూ మృతుల బంధువు ఒకరు భయాన్ని వ్యక్తం చేశారు. మా మతాల వారిని ఉగ్రవాదులు వదలేలా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేం అప్ఘనిస్తానీయులమని ప్రభుత్వం గుర్తించింది. కానీ ఉగ్రవాదులు మమ్మల్ని టార్గెట్ చేశారు. ముస్లీం టెర్రరిస్టులు మాపై దాడికి పాల్పడుతున్నారు’ అని ఆఫ్ఘాన్ హిందూ, సిక్కుల ఫ్యానెల్ జాతీయ కార్యదర్శి పేర్కొన్నారు. ‘హిందూ, సిక్కులకు అప్ఘాన్లో రాజకీయ, ఇతర అంశాలల్లో సమానమైన అవకాశాలు ఉన్నప్పటికీ పక్షపాత ధోరణితో ముస్లీంలు మమ్మల్ని అణచివేస్తున్నారు. ఉగ్రవాదులు వేధింపులకు తాళలేక వేలాది మంది ఇండియాకు వలస వెళ్లారు. ఇప్పుడు మాకు రెండే దారులు ఉన్నాయి, ఇండియాకు వలస వెళ్లడం లేదా ముస్లిం మతం స్వీకరించడం.అలా చేస్తేనే ఈ దేశంలో మేం బతకగల్గుతాం’ అని మృతుల బంధువులు వాపోతున్నారు. కాగా అప్ఘాన్ హిందూ, సిక్కులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎన్ని రోజులైనా ఇండియాలో జీవించవచ్చని అప్ఘాన్ భారత రాయబారి విజయ్ కుమార్ వెల్లడించారు. వారికి మేం రక్షణగా ఉంటాం. అన్ని సౌకర్యాలు అందిస్తాం అని తెలిపారు. -
అఫ్గాన్‌లో సిక్కులు, హిందువులపై దాడి
జలాలాబాద్: అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్ పట్ణణంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మరణించారు. మృతుల్లో 12 మంది సిక్కులు కాగా, ఏడుగురు హిందువులున్నారు. మరో 20 మంది గాయపడ్డారు. నాన్‌ఘర్హర్ ప్రావిన్సు గవర్నర్ కార్యాలయానికి సమీపంలోని మార్కెట్లో దుండగుడు తనని తాను పేల్చేసుకున్నాడు. ఆ సమయంలో గవర్నర్ కార్యాలయంలో అధ్యక్షుడు అష్రాఫ్ గనీ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో మైనారిటీ వర్గాలైన సిక్కులు, హిందువులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందా? అన్నదానిపై స్పష్టత రాలేదు. -
100 మంది హిందువుల ఊచకోత
యాంగూన్, మయన్మార్ : వందలాది మంది హిందువుల(మయన్మార్‌లో హిందువులు కూడా మైనారిటీలే)ను రోహింగ్యా మిలిటెంట్లు గతేడాది ఊచకోత కోసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధ్రువీకరించింది. ఈ మేరకు ఆమ్నెస్టీ బుధవారం ఓ రిపోర్టును విడుదల చేసింది. మయన్మార్‌లో జాతుల(హిందువులు, రోహింగ్యాలు) మధ్య వైరాలను ఆమ్నెస్టీ రిపోర్టు తేటతెల్లం చేసింది. గతేడాది ఆగష్టు 25న పెద్ద ఎత్తున బౌద్ధులు, రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యాలపై విరుచుకుపడ్డారు. అదే రోజున రోహింగ్యా మిలిటెంట్లు సైతం హిందువుల ప్రాంతాలపై విరుచుకుపడి నరమేధం సృష్టించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. ఈ ఘటన వల్లే మయన్మార్ సైన్యం రంగంలోకి దిగిందని, దీంతో 7 లక్షల మంది రోహింగ్యాలు దిక్కతోచని స్థితిలో పొరుగుదేశాలకు వలస బాట పట్టారని వివరించింది. రోహింగ్యా జాతిని అంతమొందించేందుకు బర్మా సైన్యం వారిపై పౌరుల హత్య, గ్రామాలకు నిప్పుపెట్టడం వంటి ఆరోపణలు చేసిందని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, రోహింగ్యా మిలిటెంట్లపై సైతం పలు ఆరోపణలు ఉన్నట్లు ఆమ్నెస్టీ పేర్కొంది. హిందువుల కుటుంబాలపై దాడులు జరిపిన రోహింగ్యా మిలిటెంట్లు 53 మందిని ఉరి తీసినట్లు వెల్లడించింది. రఖైన్ రాష్ట్ర ఉత్తరభాగాన ఉన్న ఓ శ్మశానవాటికలో హిందువుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటితో తమకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ) పేర్కొంది. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టింది రోహింగ్యా మిలిటెంట్లేనని ఆమ్నెస్టీ పరిశోధనలో తేలింది. మరో గ్రామంలో కూడా 46 మంది హిందువులు మిస్సయ్యారని వారిని ఏఆర్ఎస్ఏ మిలిటెంట్లే హతమార్చి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చదవండి : 400 మంది ముస్లింలు ఊచకోత -
కన్నుల పండువగా శ్రీరామ శోభాయాత్ర
ఎదులాపురం(ఆదిలాబాద్) : శ్రీరామనవమి పురస్కరించుకుని హిందూవాహిని ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర ఆధ్యంతం కన్నుల పండువగా సాగింది. యువకుల నృత్యాలు, భజనలు, శ్రీరామ సంకీర్తనలతో పట్టణం మారుమోగింది. వినాయక్‌చౌక్‌లోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుంచి శోభాయాత్రను మఠాధిపతి యోగానంద సరస్వతి పూజలు నిర్వహించి ప్రారంభించారు. యాత్ర నేతాజీచౌక్, అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, దేవీచంద్ చౌక్ల మీదుగా అశోక్ రోడ్ నుంచి తిరిగి మఠానికి చేరుకుంది. అంతకు ముందు పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ నర్సింహారెడ్డి శోభాయాత్రను పర్యవేక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాయలశంకర్, సుహాసినీరెడ్డి, భార్గవ్‌దేశ్‌పాండే, అన్ని హిందూ సమాజ్ ప్రతినిధులు, సభ్యులు, యువకులు పాల్గొన్నారు. -
త్రివాణీ సంగమం
‘హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, పార్శీలు, ఇక్కడున్న ఇతర సంస్కృతుల వారు– వీరందిరికీ చెందినదే భారతదేశం. ఇందులో ఏ ఒక్క వర్గం కూడా మరో వర్గాన్ని అధిగమించలేదు. నీ చేతికి ఐదు వేళ్లు ఉన్నాయి. ఇందులో బొటనవేలు లేకపోతే చేతికి ఉండే వాస్తవిక బలంలో పదింట ఒక వంతుకు తగ్గిపోతుంది. కాబట్టి అంతా కలసి ఉండాలి. ఒకరిని ఒకరు విశ్వసించాలి.’స్వేచ్ఛావాయువులను ఆస్వాదించడానికి ఉద్యమించిన భారతీయుల ముందున్న కర్తవ్యం ఏమిటో ఇంత స్పష్టంగా చెప్పినవారు తక్కువే. భారత స్వాతంత్య్రోద్యమ ఆరంభ దశ, అందులోని వైవిధ్యం ఆయన చేత అలా పలికించాయి. భారత జాతీయ కాంగ్రెస్ అంకుర దశ ఆ వైవిధ్యానికి అద్దం పట్టింది. ఉమేశ్ చంద్ర బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్, లజపతిరాయ్, బిపిన్‌చంద్రపాల్, సరోజినీ నాయుడు వంటి హిందువులు; దాదాభాయ్ నౌరోజీ, ఫిరోజ్‌షా మెహతా వంటి పార్శీలు; మహ్మదలీ జిన్నా, అలీ సోదరులు వంటి మహ్మదీయులు, ఇతర వర్గాలు కలసిన ఐక్య సంఘటన శ్వేత పాలన మీద బిగించిన పిడికిలి వలె భాసించేది. పైన పేర్కొన్న ఆ మాటలు ఆ ఉద్యమ దృశ్యంలో ఆనాడు ప్రధాన పాత్రధారిగా ఉన్న ‘మహామన’ మదన్మోహన మాలవీయ పలికినవే. గాంధీజీ ప్రవేశించే వరకు స్వాతంత్య్రోద్యమ గమనం వేరు. అంతకు ముందు జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన ఉద్యమం తీరు వేరు. బెంగాల్ విభజన వరకు కాంగ్రెస్ పూర్తిగా మితవాదుల నాయకత్వంలో సాగింది. విజ్ఞాపనలు, వినతిపత్రాలతో మాత్రమే పరిపాలనలో భాగస్వాములం కాగలమన్న నమ్మకం వీరిది. ఆ మేరకు ఆంగ్లేయులను ప్రసన్నం చేసుకోగలిగితే చాలునన్నంత వరకే వారి వ్యూహం. ఈ ఆలోచనా ధార లోనివారే మాలవీయ కూడా. మదన్మోహన మాలవీయ (డిసెంబర్ 25, 1861– నవంబర్ 12, 1946) భారతదేశ తొలినాటి చట్టసభల తీరుతెన్నులను రూపొందించిన వారిలో ఒకరు. మాలవీయతో పాటు మోతీలాల్ నెహ్రూ, సర్ దిన్షావాచా, మహ్మదలీ జిన్నా, తేజ్ బహదూర్ సప్రూ వంటివారు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో తమవైన గొంతులు వినిపించి చట్టసభల సంప్రదాయాలకు రూపురేఖలు ఇచ్చారు. వైస్రాయ్ నాయకత్వంలో ఉన్న ఆనాటి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో (కేంద్ర చట్టసభ) అత్యధికులు బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన వారే. కులీన, ధనిక వర్గీయులే. ఒక్క ముక్కలో చెప్పాలంటే రబ్బర్ స్టాంపులు. అలాంటి సభలో, చాలా పరిమితులకు లోబడి మాలవీయ, జిన్నా తదితరులు భారతీయుల సమస్యలను ప్రస్తావించారు. చట్టబద్ధమైన పంథాలోనే కావచ్చు, హక్కుల గురించి గళమెత్తారు. బ్రిటిష్ ఆధిపత్యంలోనే భారతీయ సమాజం ఉన్నదన్న వాస్తవాన్ని గుర్తిస్తూనే, దేశాన్ని çపునర్నిర్మించుకోవాలన్న స్పృహను పెంచుకున్న ఆనాటి ద్రష్టలలో మాలవీయ అగ్రగణ్యులు. తనవైన విశ్వాసాలను కాపాడుకోవడం దగ్గర ఎలాంటి రాజీ లేకుండానే, రాజకీయోద్యమంలో ముస్లింలను కలుపుకుని వెళ్లవలసిన వాస్తవాన్ని గుర్తించినవారాయన.భారత జాతీయ కాంగ్రెస్ ప్రముఖునిగా, న్యాయవాదిగా, చట్టసభ ప్రతినిధిగా, పత్రికా రచయితగా, సంస్కర్తగా, విద్యావేత్తగా, మాలవీయ నిర్వహించిన పాత్ర అద్భుతమైనది. ఆయన రాజకీయ, సామాజిక పరిచయాలు ఇంకొక అద్భుతం. మాలవీయ హిందూ మహాసభ వ్యవస్థాపకులలో ఒకరని చెప్పుకోవచ్చు. కానీ వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆయన మహ్మదలీ జిన్నాతో కలసి పనిచేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపన కోసం అనీబిసెంట్‌తో కలసి నడిచారు. ఆయన వ్యక్తిగతంగా తిరుగులేని హిందూత్వ వాది. కానీ సామాజికంగా మంచి లౌకికవాది. దేశం, దేశ ప్రయోజనం, ఉద్యమమే మాలవీయ ప్రధానంగా భావించినట్టు కనిపిస్తుంది. ముండకోపనిషత్తులోని ఒక మహత్వ తాత్వికతను ఆయన లోకానికి పరిచయం చేశారు. అదే– సత్యమేవ జయతే– సత్యం ఒక్కటే నిలబడుతుంది. ఈ తాత్వికత కోసం ఆయన జీవితమంతా శ్రమించారు. మాలవీయ ప్రయాగ లేదా అలహాబాద్‌లో పుట్టారు. వారి కుటుంబం అంతా సంస్కృత పండితులే. కానీ కడు పేదరికం. తండ్రి బైజ్నాథ్. తల్లి మూనాదేవి. బైజ్నాథ్ కథావాచక్. అంటే పౌరాణికుడు. భాగవత కథలు చెప్పడమే ఆయన వృత్తి. కొడుకును కూడా అదే వృత్తిలోకి తీసుకురావాలని తండ్రి అనుకున్నారు. అందుకు అనుగుణంగా మాలవీయ మొదట సంస్కృత పాఠశాలల్లోనే చదువుకున్నారు కూడా. తరువాత అలహాబాద్ జిల్లా పాఠశాలలో చేరారు. అక్కడే ఆయన కవిత్వం రాయడం ఆరంభించారు. ‘మకరంద్’ పేరుతో అవి వెలువడేవి. మూయిర్ సెంట్రల్ కాలేజ్ (తరువాత ఇదే అలహాబాద్ విశ్వవిద్యాలయం) నుంచి మెట్రిక్యులేషన్ చేశారు. హ్యారిసన్ కళాశాల ప్రిన్సిపాల్ అక్కడ నుంచి విద్యార్థి వేతనం ఏర్పాటు చేయడంతో కలకత్తా విశ్వవిద్యాలయంలో బీఏ చదివారు. ఎంఏ సంస్కృతం చదవాలని అనుకున్నా కుటుంబ పరిస్థితులు అనుకూలించలేదు. కుటుంబ వృత్తి (కథావాచక్)ని స్వీకరించమని తండ్రి కోరినా, కాదని అలహాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది. ఆ మరుసటి సంవత్సరం వార్షిక సమావేశాలు కలకత్తాలోనే జరిగాయి. వాటికి మాలవీయ హాజరయ్యారు. గాంధీజీ కంటే రెండు దశాబ్దాల ముందు ఆయనకు కాంగ్రెస్‌తో అనుబంధం ఏర్పడింది. ఆ సభలకు అధ్యక్షుడు దాదాభాయ్ నౌరోజీ. చట్టసభలలో ప్రవేశించి భారతీయుల వాణిని వినిపించాలని మాలవీయ చేసిన వాదనతో నౌరోజీ కూడా ఏకీభవించారు. ఈ సభల తరువాత ఆయనను అలహాబాద్‌కు సమీపంలోనే ఉన్న కాళాకంకర్ సంస్థానాధీశుడు రాజా రామ్పాల్సింగ్ తన పత్రిక హిందుస్తాన్‌కు సంపాదకునిగా నియమించారు. ఆ తరువాత ఆ ఉద్యోగం వదిలి న్యాయశాస్త్రం చదివారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. చౌరీచౌరా ఉదంతం గుర్తుండే ఉంటుంది. 1922 ఫిబ్రవరిలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపు ఇచ్చినప్పుడు జరిగిన ఘోర ఉదంతమిది. ఆ సంవత్సరం ఫిబ్రవరి 5న జరిగింది. ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సమీపంగా ఉన్న చిన్న పట్టణం చౌరీచౌరా. గాంధీజీ పిలుపు మేరకు ఆ పట్టణంలో రెండువేల మంది కార్యకర్తలు మద్యం దుకాణం ఎదుట ధర్నా చేశారు. పోలీసులకీ, కార్యకర్తలకీ గొడవ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పులలో ముగ్గురు చనిపోయారు. దీనితో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. 23 మంది పోలీసులు సజీవ దహనమైనారు. ఇందుకు ఆగ్రహించి గాంధీజీ, ‘శాంతియుతంగా నిరసన తెలిపే సంస్కారం ఇంకా భారతీయులకు అబ్బలేదం’టూ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఆందోళనకారుల హింసకు పరిహారంగా ఐదు రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఇంతవరకే సాధారణంగా పుస్తకాలలో కనిపిస్తూ ఉంటుంది. తరువాత జరిగింది మరీ ఘోరం. ఆ ప్రాంతంలో సైనిక శాసనం విధించి వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. 228 మంది మీద కేసులు పెట్టారు. వారిలో 172 మందికి అలహాబాద్ హైకోర్టు మరణ దండన విధించింది. పోలీసు నిర్బంధంలో ఆరుగురు మరణించారు. కానీ మళ్లీ కేసును కోర్టు పునర్విచారణ జరిపి 19 మందికి మరణశిక్షను ఖరారు చేసింది. ఈ కేసులోనే 153 మంది తరఫున వాదించి మరణదండన నుంచి విముక్తి కల్పించినవారు మాలవీయ. అప్పుడు మోతీలాల్, తేజ్‌బహదూర్ సప్రూ కూడా అక్కడే న్యాయవాదులు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిజానికి మాలవీయ సమర్థించారు. కానీ అదే సమయంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని సహాయ నిరాకరణ ఉద్యమంతో లంకె పెట్టడాన్ని మాత్రం వ్యతిరేకించారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించడమంటే రాజకీయాలలోకి మతాన్ని అనుమతించడమని నాడు చాలామంది వాదించారు. అందులో మాలవీయ వంటి హిందూత్వ వాది, నాటికి పూర్తి లౌకికవాది జిన్నా కూడా ఉండడం విశేషం. జాతీయ కాంగ్రెస్ సభలకు నాలుగు పర్యాయాలు 1909 (లాహోర్), 1918 (ఢిల్లీ), 1939 (ఢిల్లీ) 1932 (కలకత్తా) మాలవీయ∙అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయన దీర్ఘకాలం చట్టసభలలో సభ్యుడు. 1912 –1919 మధ్య ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాలవీయ సభ్యునిగా ఉన్నారు. ఈ సభే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా మారిన తరువాత 1926 వరకు కూడా సభ్యుడు.రాజా రామ్‌పాల్ సింగ్ పత్రిక ‘హిందుస్తాని’ సంపాదకత్వం తరువాత మాలవీయ ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికకు సంపాదకత్వం వహించారు. ఆపై ‘అభ్యుదయ’ అనే పత్రికను నిర్వహించారు. ఇవన్నీ దేశీయ భాషా పత్రికలు. జాతీయ స్థాయిలో ఒక పత్రిక ఉండాలనీ, అది ఆంగ్లంలో ఉండాలనీ తరువాత మాలవీయ భావించారు. దాని ఫలితమే 1909లో వెలువడిన చరిత్రాత్మక పత్రిక ‘లీడర్’. మోతీలాల్ నెహ్రూతో కలసి ఆయన ఈ పత్రికను ప్రారంభించారు. మళ్లీ 1910లో ‘మర్యాద’ హిందీ పత్రికను కూడా స్థాపించారు. 1924లో మూత పడవలసిన సమయంలో ఆదుకుని హిందుస్తాన్ టైమ్స్‌కు పునర్జన్మను ప్రసాదించిన ఘనత కూడా మాలవీయకు దక్కుతుంది. లాలా లజపతిరాయ్, ఎం ఆర్ జయకర్ (హిందూ మహాసభ నాయకుడు), పారిశ్రామికవేత్త ఘనశ్యామ్‌దాస్ బిర్లాల సహకారంతో రూ. 50,000 నిధులు ఇచ్చి ఆ పత్రికను రక్షించారు. అప్పటి నుంచి మరణించే వరకు ఆ పత్రిక నిర్వహణ మండలి అ«ధ్యక్షునిగా ఆయన పనిచేశారు.‘సనాతన ధర్మ’ పేరుతో ఒక పత్రికను మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి వెలువరించేవారు. మాలవీయ భారతదేశానికీ, నిజానికి విద్యా ‘ప్రపంచా’నికీ అందించిన మహోన్నత కానుక ఒకటి ఉంది. అది –బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. ఇందుకోసం పని చేయాలని 1911లో అనీబిసెంట్, మాలవీయ అంగీకారానికి వచ్చారు. అనిబీసెంట్ 1898 నుంచే∙కాశీలో సెంట్రల్ హిందూ కళాశాలను నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలను కూడా విశ్వవిద్యాలయంలో అంతర్భాగం చేసే షరతు మీద ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసిన బీహెచ్‌యూ చట్టం–1915 మేరకు ఇదంతా సా«ద్య మైంది. 16.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో, 30,000 మంది విద్యార్థుల కోసం నిర్మించిన విద్యా సంస్థ ఇది. ఆసియాలోనే పెద్దది. దీనికి మాలవీయ చాలాకాలం కులపతిగా పనిచేశారు.గంగా ప్రక్షాళన కార్యక్రమం ఆరంభించిన ఘనత కూడా మాలవీయకే దక్కుతుంది. గంగా మహాసభ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఆ మహోన్నత నదిని కాలుష్యం నుంచి రక్షించాలని తన వంతు కృషి చేశారు. ఇందుకోసం కొన్ని సంస్థలు, వ్యక్తులు చేసుకున్నదే అవిరళ్ గంగా రక్ష సంఝౌతా ఒప్పందం. 1916లోనే ఆయన ఆ ప్రయత్నం ఆరంభించారు. హరిద్వార్ వద్ద గంగకు హారతి ఇచ్చే కార్యక్రమాన్ని మాలవీయ ఆరంభించారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అంటే పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి ఆద్యుడు ఆయనే. అంటరానితనం మీద కూడా ఆయన పోరాటం చేశారు. హరిజన సేవక్ సంఘ్ ద్వారా ఆలయ ప్రవేశం చేయించారు. వారికి ఆయన మంత్రదీక్షను ఇచ్చేవారు. మాలవీయ గొప్ప విద్యావేత్త, విద్యాదాత. గొప్ప స్వాతంత్య్ర పోరాటయోధుడు, రాజకీయవేత్త. సంస్కర్త, పార్లమెంటేరియన్. ఆయన పుట్టి పెరిగిన అలహాబాద్ లేదా ప్రయాగలోనే ఉంది త్రివేణీ సంగమం. మూడు స్రవంతుల ఆ సంగమంలో ఒకటి అంతఃస్రవంతి. కానీ మాలవీయ పైన చెప్పుకున్న మూడు లక్షణాలు కూడా స్పష్టంగా కనిపించే చారిత్రక, సామాజిక, రాజకీయ త్రివాణీ సంగమం. - డా. గోపరాజు నారాయణరావు -
భారతీయులందరూ హిందువులేనా?
ఉపఖండంలో ఒకానొక కాలంలో హిందూయిజమే ఏకైక, అసలు మతంగా ఉండేది కాబట్టి మనందరం హిందువులమే అనే వాదన నన్ను పెద్దగా ప్రభావితం చేయదు. ఎందుకంటే కాలంలో వెనక్కు వెళ్లి మనందరినీ కలిపి ఉంచుతున్న ఉమ్మడి లక్షణం ఏమిటని మనం నిజంగా తెలుసుకోదల్చినట్లయితే... మనందరం కోతులుగా, చింపాంజీలుగా, ఒరాంగుటాన్లుగా లేదా చార్లెస్ డార్విన్ చెప్పినదానికి సరిగ్గా సరిపోయేలా ఉండేవారిమన్నదే వాస్తవం. నిజానికి ఇంకా వెనక్కు వెళ్లినట్లయితే, నిస్సందేహంగా మనందరం ఏకకణ జీవులుగా మొదలై ఉంటాం. ఇంకా వెనక్కు వెళితే మనందరం ఒకే బిగ్ బ్యాంగ్ నుంచి ఆవిర్భవించి ఉంటాం. అయితే ఏమిటి? మనం ఎప్పుడు ఎక్కడినుంచి పుట్టుకొచ్చాం అనేదానికంటే మనం ఎలా మారాం.. మనల్ని గురించి మనం ఏమని భావిస్తున్నాం.. దేన్ని మన ఉనికిగా ఇష్టపడుతున్నాం.. అనేవి ఇప్పుడు ప్రధానం అయిపోయాయి. నిజానికి ఇది మన ఉనికి, గుణగణాలకు చెందిన కీలకాంశంగా ఉండవచ్చు కూడా. కాబట్టి మనం ఇవాళ ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, సర్వాత్మవాదులు లేదా నాస్తికులుగా ఉండటమే ప్రధానమైంది. అంతే తప్ప మనల్ని కలిపి ఉంచిన పురాతన బంధం హిందూ కాబట్టి మనందరం ఇప్పుడు హిందువులమే అని చెబితే అది మూర్ఖత్వం, తప్పిదం అవుతుంది. పైగా హిందూ అన్నదొకటే మన పురాతన బంధం కాదు. మన మానవ సంబంధ పురాతన బంధాన్ని మతం కంటే, ఇంకా చెప్పాలంటే మానవ ఉనికి కంటే ఇంకా వెనక్కు వెళ్లి చూడాల్సి ఉంటుంది. మన పురాతన గతంపై నేను చేస్తున్న చర్చకు కారణం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన సరసంఘచాలక్. భారతీయులందరూ హిందువులే అని తాను చేసిన ప్రకటన ఇతర మతస్తులను ఎంత గాయపరుస్తుందో ఆయనకు తెలియకపోవచ్చు. ఆయన గుర్తించకపోయినప్పటికీ, దీనికి భిన్నంగా ఆలోచించే, అనుభూతి చెందే వారి విలక్షణ వ్యక్తిత్వాన్ని ఆయన భావన తోసిపుచ్చుతోంది, తృణీకరిస్తోంది. ఆయన అభిప్రాయం అలాంటి వారిని అధిక్షేపిస్తుంది. పైగా అది అవమానం కూడా. మీరట్‌లో గత ఆదివారం ఆయన ఏం చెప్పారో జాగ్రత్తగా పరిశీలించండి. ఆయన మాటల్లో మొదటిది ‘ప్రతి భారతీయుడూ నా సోదరుడే’. మరి హిందువులు కాని భారతీయుల మాటేంటి? సరసంఘచాలక్ చెబుతున్న ఈ సోదరత్వం మత హద్దుల్లోనే ఆగి పోతుందా? అలాగైతే హిందువులు కానివారెవరు? ఆయన దృష్టిలో వారు శత్రువులు కారనే నేను భావిస్తున్నాను. తదుపరి ప్రకటన. ‘భారత్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్క భిన్నమైన ఆహార అలవాట్లను అనుసరించవచ్చు. విభిన్నమైన దేవుళ్లను పూజించవచ్చు. వివిధ తాత్విక ధోరణులను, భాషలను, సంస్కృతిని అనుసరించవచ్చు. కానీ వీళ్లందరూ హిందువులే’. ఆయన ఇంకా ఇలా అన్నారు. ‘దేశంలో ఇంకా చాలామంది హిందువులు ఉన్నారు కానీ వారు దాని గురించిన ఎరుకతో లేరు’. అంటే, ఇంతవరకు హిందూయేతరులుగా గుర్తింపు పొందిన వారు తమకిష్టం ఉన్నా లేకున్నా వాస్తవానికి వారు కూడా హిందువులే అన్నమాట. ప్రత్యేకించి ఈ భావనే చాలా ప్రమాదకరమైంది. ఇది ఒక అనూహ్యమైన అనివార్యతను వారిపై రుద్దుతోంది. రెండో అంశం. సరసంఘచాలక్ చెప్పిందే సరైందని, తమ భావన తప్పు అని ఇలాంటివారు భావించారనుకోండి. అలాంటప్పుడు వారు స్వతంత్రంగా తమగురించి ఆలోచించే హక్కును కోల్పోయినట్లే లెక్క. ఏదేమైనా, సరసంఘచాలక్ ప్రకటనలో తుది అంశం ప్రత్యేకించి కలవరానికి గురిచేస్తోంది. ఇక్కడ ఆయన ఎవరు హిందువు, ఎవరు హిందువు కాదు అనే అంశంపై సంకుచిత నిర్వచనం ఇచ్చారు. ‘భారతమాతను తమ మాతృమూర్తిగా భావించేవారు మాత్రమే నిజమైన హిందువులు’ అట. నావరకైతే భారత్‌ను నా మాతృభూమిగా పరిగణిస్తాను కాని దేశాన్ని నా తల్లిగా పరిగణించను. తమ తల్లి స్థానంలోకి ఎవరు కూడా మరొకరిని తీసుకురాలేరు. మరి అలాగైతే నేను నిజమైన హిందువును కానా? వాస్తవానికి సరసంఘచాలక్ హిందువు అయితే నేను కూడా హిందువునే! బహుశా ఎస్ఎస్ (ఇలా పొట్టిపేరుతో పిలవడాన్ని ఆయన అనుమతిస్తే) తల్లికి, మాతృభూమికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకపోయి ఉండవచ్చు. తల్లి అనే భావన విడదీయరాని, తృణీకరించలేని జీవసంబంధమైన అనుసంధానాన్ని తెలియపరుస్తుంది. ఇక రెండోది మీ మాతృదేశం మాత్రమే. అయితే దేశభక్తి భావన మిమ్మల్ని మాతృదేశానికి కట్టుబడేలా చేయవచ్చు కానీ తల్లిని ప్రేమించడం.. ఏరకంగా చూసినా పూర్తిగా భిన్నమైన అంశం. చివరగా, భారతీయ ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, సర్వాత్మవాదులు లేక నాస్తికులు అందరూ ఈ దేశాన్ని తమ మాతృదేశంగానే పరిగణిస్తున్నారు. అయినప్పటికీ వారు హిందువులు కారు. అలా వారు హిందువులుగా ఉండాల్సిన అవసరమూ లేదు. కానీ వీరందరూ భారతీయులే. ఇదే ప్రధానమైన అంశం. సరసంఘచాలక్ దీన్ని మాత్రమే అభినందించవచ్చు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కరణ్ థాపర్ ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
ముస్లింలు కూడా హిందువులే..!
అలీగఢ్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ మరోసారి ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిపురలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత దేశంలోని ముస్లింలందరూ హిందువులేనని అన్నారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, దేశంలోని ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కోరుకుంటున్నట్లు ఆయన సష్టం చేశారు. మోహన్ భగవత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కొందరు సమర్థించగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం తప్పులేదని మహంత్ షకున్పాండే అన్నారు. భారత్‌లో నివసించే వారంతా హిందువులేనని.. అందులో ఎటువటి సందేహం లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు ముస్లింలుగా చెప్పుకుంటున్న వారంతా తమ నేపథ్యాన్ని పరిశీలించుకోవాలని ఆయన అన్నారు. ఒక్కసారి నేపథ్య పరిశీలన చేసుకుంటే.. వారికి కూడా తామంతా హిందువులమేనన్న వాస్తవం తెలుస్తుందని చెప్పారు. మహంత్ ధర్మదాస్ మహారాజ్ మాత్రం మోహన్ భగవత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల.. హిందువులు, ముస్లింలకు ఎటువంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని భగవత్‌ను ధర్మదాస్ ఆగ్రహంగా ప్రశ్నించారు. -
మోదీ నోట పదే పదే ముస్లిం రాజుల పేర్లు
సాక్షి, గాంధీనగర్ : గుజరాత్ మోడల్ అభివృద్ధే దేశానికే ఆదర్శమని, ఆ అభివృద్ధే తమను గెలిపిస్తుందని నమ్మిన, అలా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు ఇప్పుడు హిందూ ఎజెండాను ఎత్తుకున్నారు. వారిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి వరకు ఉన్నారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అంటూ నినాదంతో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ముందుకు వచ్చిన నరేంద్ర మోదీ పదే పదే మోఘలులు, ఔరంగజేబు, బాబర్, ఖిల్జీ లాంటి పేర్లను తీసుకొచ్చి వారితో కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యంగా రాహుల్ గాంధీని పోలుస్తున్నారు. రాహుల్ గాంధీది మొఘల్ చక్రవర్తుల మనస్తత్వం అని, ఆయన ఔరంగా జేబ్ రాజ్యాన్ని తీసుకొస్తారని, ఆయన బాబర్ భక్తుడని, ఖిల్జీకి బంధువంటూ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో ముస్లింల పాలన తీసుకొస్తారని, బీజేపీని గెలిపిస్తే హిందువుల రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తామని చెప్పడమే మోదీ మాటల్లో ఉన్న పరామార్థం అని స్పష్టంగా తెలుస్తోంది. మతాల పేరిట ఓటర్లను చీల్చి హిందువుల ఓట్లను పార్టీకి సమీకరించడానికే మోదీ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఏమీ తక్కువేమి కాదు. ఎన్నికల్లో ఏ అంశాల గురించి మాట్లాడాలో తెలియని రాహుల్ గాంధీ గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారని, ఎలా కూర్చోవాలో, ఎలా పూజ చేయాలో తెలియని రాహుల్ గాంధీ, ఆలయాల్లో నమాజ్ చేసినట్లుగా కూర్చొని పూజలు చేస్తున్నారని విమర్శించారు. సాయాజిగంజ్ సభలో ఆయన చేసిన ఈ విమర్శల వెనకనున్న ఉద్దేశం ఏమిటో సులభంగానే గ్రహించవచ్చు. హిందూత్వ ఎజెండాతోనే ప్రచారం చేయడం వల్ల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజేపీ విజయం సాధించిందన్న విషయం ఆయనకు బాగానే తెలుసు. అందుకని ఆయన ఇక్కడ కూడా అదే కార్డును ఉపయోగిస్తున్నారు. బీహార్ అసంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ముందుగా అభివృద్ధినే ప్రధాన నినాదంగా బరిలోకి దిగిన బీజేపీ విజయావకాశాలు కనిపించకపోవడంతో చివరకు హిందూత్వ ఎజెండాను అందుకుంది. అయినప్పటికీ అక్కడ విజయం సాధించలేకపోయింది. మరి గుజరాత్లో ఏం జరుగుతుందో చూడాలి?! -
‘ప్రతి హిందువు.. నలుగురు పిల్లల్ని కనాలి’
సాక్షి, ఉడిపి : ప్రతి హిందువు నలుగురు పిల్లలను కనాలంటూ హరిద్వార్ పీఠాధిపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని ఉడిపి క్షేత్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్మ సన్సద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో కామన్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చే వరకు.. ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలని.. హరిద్వార్ పీఠాధిపతి స్వామీ గోవింద్‌దేవ్ గిరిరాజ్ మహరాజ్ శనివారం పిలుపునిచ్చారు. అలా చేయడం వల్లే జనాభాను సమతుల్యంగా ఉంచడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఇద్దరు పిల్లల విధానం వల్ల హిందువుల జనాభా దేశంలో తగ్గు ముఖం పడుతోందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఇద్దరు పిల్లల విధానాన్ని అందరికీ వర్తింపచేయాలని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడైతే హిందువుల జనాభా తగ్గిందో.. ఆ ప్రాంతాన్ని భారత్ కోల్పోయిందని, ఇందుకు జనాభా అసమతుల్యతే కారణమని ఆయన చెప్పారు. గోవులను రక్షించుకోవడం హిందువుల బాధ్యత అని ఆయన చెప్పారు. అదే సమయంలో గోవుల రక్షణ కోసం శ్రమిస్తున్న గో రక్షక్లను ఆయన కొనియాడారు. నేడు కొంతమంది గో రక్షక్లను నేరస్తులుగా చూస్తున్నారని.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గో రక్షక్‌లు అత్యంత శాంతి ప్రియులని చెప్పారు. -
‘హిందువుల వల్లే.. ప్రజాస్వామ్యం పదిలం’
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టించే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి అదే తరహా మాటల తూటాలు పేల్చారు. ‘భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం వల్ల.. ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంది’ అని అన్నారు. దేశంలో మెజారిటీ వర్గం సంఖ్య తగ్గితే.. సామాజిక అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని ఆయన చెప్పారు. మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గితే.. జాతీయతావాదం కూడా మరుగున పడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత సురక్షితంగా ఉందని, హిందువులు ఇంకా ఇక్కడ మెజారిటీ జనాభాగా ఉండడమే ఇందుకు కారణం అని గిరిరాజ్ స్పష్టం చేశారు. దేశంలో ఎప్పుడైతే మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గుముఖం పడుతుందో అప్పుడు ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సామాజిక సామరస్యం ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. దేశంలో సుమారు 54 జిల్లాల్లో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఇదీ మరీ ఎక్కువగా ఉంది. ముస్లింలు మెజారిటీ వర్గంగా అవతరిస్తే దేశసమగ్రత, ఐకమత్యానికి భంగం కలిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. -
అమెరికాలో హిందువుల విజయం
వాషింగ్టన్ : అమెరికాలోని హిందూ బృందాలు కాలిఫోర్నియా కేసులో కీలక విజయాన్ని సాధించాయి. అమెరికాలోని పాఠ్యాంశాల్లో భారతదేశం, హిందూమతం గురించి ఖచ్చితమైన, విశాల దృక్ఫథంతో, శాస్త్రీయంగా ఇవ్వాలని హిందూ వర్గాలు చేస్తున్న పదేళ్ల పోరాటం ఫలించింది. హిందుత్వం, భారతదేశం గురించి అమెరికా పాఠ్యాంశాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు కాలిఫోర్నియా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎస్‌బీఈ) అంగీకారం తెలిపింది. రెండు పాఠ్యాంశాల పద్దతిని సైతం కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తిరస్కరించింది. అంటే గ్రేడ్స్ కే6-గ్రేడ్స్ 6-8 వరకూ అన్ని పాఠ్యాంశాల్లోనూ హిందువులు, భారత దేశ చరిత్రను సమగ్రంగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని అమెరికా హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యక్షుడు శాంతారామ్ అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ నాగరికత, హిందుత్వం గురించిన నిజానిజాలు అమెరికన్లకు తెలుస్తాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. -
‘ఆయన లోకల్ నాయకుడిగా కూడా పనికిరారు’
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌పై శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదగడానికి హిందువులను దుయ్యబడితేనే నాయకులు అవుతారా అంటూ కమల్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ కమల్ లోకనాయకుడు కాదు...లోకల్ నాయకుడిగా కూడా పనికిరారు. మీరు కమల్‌హాసన్ కాదు. ఉగ్రవాది కమల్‌హాసన్. హిందువులను విమర్శిస్తే రాజకీయ నేతగా ఎదుగుతారా?. హిందువులను తీవ్రవాదులన్నవారు కచ్చితంగా ఉగ్రవాదులే. హిందు ధర్మాన్ని కించపరిచి కమల్ ధర్మద్రోహిగా మారారు. తీసిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో కమల్‌కు పిచ్చి పట్టింది. హిందుమతంపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సంహార ప్రక్రియను కమల్ చూస్తారు. కమల్ వేషం వెనుక విషం ఉంది.’ అని నిప్పులు చెరిగారు. సినిమాలు తీసేటప్పుడు హిందువులు కావాల్సి వచ్చిందని, ఇపుడు హిందూ మతాన్ని కించపరిచే కమల్ ధర్మద్రోహిగా ఎదిగాడని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కట్టిన బట్ట, నివాసం, సుఖభోగాలతో కూడుకున్న జీవన విధానం హిందూ సమాజానిది కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ లాంటి మహా నటుడు రాజకీయాల్లోకొచ్చినా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఇతర మతాలను గౌరవించారంటూ రాజకీయాల్లోకి రావాలనుకున్న నటులు ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. హిందూమతంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ఓటమిని చవిచూస్తారని పరిపూర్ణానందస్వామి హెచ్చరించారు. -
8 రాష్ట్రాల్లో మైనారిటీలుగా హిందువులు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఒక దాఖలైంది. ఆయా రాష్ట్రాల్లో నిత్యం హిందువులపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందులో న్యాయవాదులు పేర్కొన్నారు. మైనారిటీ చట్టం 1992ను అనుసరించి ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులును మైనారిటీలుగా గుర్తించాలని కోరుతూ బీజేపీ నేత, సీనియర్ అడ్వకేట్ అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. దేశంలో ప్రస్తుతం మెజారిటీ, మైనారిటీ ప్రాతిపదిక మత రాజకీయాలు పెరిగిపోయాయని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లకు ఆయన లేఖ రాశారు. అంతేకాక ప్రస్తుతం కొనసాగుతున్నర బలవంతవు లౌకిక వ్యవస్థ.. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని పేర్కొన్నారు. లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయా, జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్‌లలో హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని సుప్రీంకోర్టును అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ అభ్యర్థించారు. -
మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్య
సాక్షి, ఇండోర్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుస్తాన్ (భారత్) కేవలం హిందువుల కోసమేనని అయన స్పష్టం చేశారు. అయితే హిందుస్తాన్‌లో ఇతర మతస్తులు కూడా జీవించవచ్చని ఆయన చెప్పారు. ఇండోర్‌లో శనివారం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. జర్మన్ల కోసం జర్మనీ, బ్రిటీషర్ల కోసం బ్రిటన్, అమెరికన్ల కోసం అమెరికా.. అలాగే హిందువుల కోసం హిందుస్తాన్ అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందుస్తాన్‌లో హిందువులేకాక.. ఇతర మతస్తులు కూడా జీవించేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇక్కడ హిందువులు అంటే.. భారతమాత బిడ్డలని ఆయన విశ్లేషించారు. పురాతన భారతీయ వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించే వారసులంతా భారతీయులే.. అందులో సందేహపడాల్సిన అవసరం లేదని మోహన్ భగవత్ చెప్పారు. భారతదేశాన్ని ఏ ఒక్క పార్టీనో, లేక ఏ ఒక్క వ్యక్తో అభివృద్ధి చేయడం అసాధ్యమని.. సమాజం కూడా తమవంతు పాత్ర పోషిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. కేవలం ప్రభుత్వం వల్లే సమాజంలో మార్పు, అభివృద్ధి జరగదని.. ఇందుకోసం అందరూ కృషి చేయాలని అయన పిలుపునిచ్చారు. -
'దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే క్షమించం'
కరీంనగర్ : హిందువుల రక్షణ కోసం వీహెచ్‌పీ కట్టుబడి ఉందని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. భారతదేశం హిందురాజ్యమని, ఈ దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేవారిని క్షమించేది లేదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. దేశంలో ఎక్కడైనా మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని ప్రవీణ్ తొగాడియా పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. -
దాడులపై ట్రంప్ జోక్యం చేసుకోవాలి
వైట్ హౌస్ ఎదుట భారత–అమెరికన్ల ర్యాలీ వాషింగ్టన్: భారత సంతతికి చెందినవారు ముఖ్యంగా హిందువులు, సిక్కులు.. అమెరికాలో ఇస్లామోఫోబియా (ముస్లింలంటే భయం), గ్జినోఫో బియా (విదేశీయులంటే భయం) బాధితులవుతున్నారని, విద్వేషపు దాడు లకు బలవుతున్నారని అక్కడి భారత–అమెరికన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకో వాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైట్‌హౌస్ ఎదుట శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. వర్జీనియాకు చెందిన కార్పొరేట్ న్యాయవాది వింధ్య అడప మాట్లాడుతూ.. అమెరికాలో విద్వేషపు దాడులకు హిందువులు బలవుతున్నారని, అక్కడి భారత సమాజాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. ద్వేషపూరిత నేరాలపై భారత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. -
రంగుల రాగం.. తానం.. పల్లవి!
ఆర్ట్ దేవో భవ తల్లి డాక్టరు, కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరూ చిత్రకారిణులు.ఒకరిది భక్తి భావం, మరొకరిది మోక్షమార్గం. తల్లి ఆధ్యాత్మికతలో పరవశిస్తే, కూతురుఆధ్యాత్మిక చింతనకు కొనసాగింపైన సంగీతానికీ, కవిత్వానికీ, ప్రకృతికీ రంగులద్ది మైమరచిపోతారు.‘జగద్గురు, జగత్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ పేరిట మూడు రోజుల పాటు హైదరాబాద్.. మాసబ్ ట్యాంక్లోనిఫైన్ ఆర్ట్స్ కళాశాల, నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఈ తల్లీకూతుళ్ల పెయింటింగ్స్ ప్రదర్శన జరిగింది.నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా వీరిద్దరి రంగుల ప్రపంచంలోకి చిన్న ప్రయాణం. ‘నేను శాశ్వతం అనుకోవడం అజ్ఞానం. ఏదీ శాశ్వతం కాదు అనుకోవడమే జ్ఞానం’ అంటారు గాయత్రీదేవి. ఈ జీవిత సత్యం తెలుసుకునే సరికి కొందరి జీవితం ముగుస్తుంది. కానీ ఇది సత్యమని ముందుగానే తెలుసుకున్న వారి జీవితం ఆ క్షణం నుంచి మొదలవుతుంది. అప్పుడే మనస్సు అజ్ఞానాంధకారంలోంచి, చిమ్మచీకటిని పులుముకున్న చిక్కటి రంగుల్లోంచి విజ్ఞానమనే అనంతమైన వెలుతురులోనికి ప్రవహిస్తుంది. బ్రహ్మాండాన్ని చీల్చగలిగిన ఆ జ్ఞానజ్యోతి మనిషిని సున్నితంగా మారుస్తుంది. ఈ అంతర్లీనతను యోగాతో సమ్మిళితం చేస్తూ గాయత్రి గీసిన చిత్రం ‘మిస్టిక్’. వర్ణమయ భ్రమణం గాయత్రికి రంగులంటే ప్రాణం. ఆమె మనస్సులో అలుముకున్న రంగుల్లో భక్తిపారవశ్యం ఉంటుంది. గొప్ప తపస్సు ఉంటుంది. అన్నిటికీ మించి పసితనాన్ని ప్రేమించే సున్నితత్వం ఉంటుంది. అందుకే ఆమె వేసిన చిత్రాలు దేవకీదేవి ఒడిదాటిన చిన్నికృష్ణుడితో ప్రారంభమై, చెడుపై మంచి సాధించే విజయంగా హిందువులు భావించే నరకాసురుడి వధ వరకు పురాణాలు, ప్రబంధాల చుట్టూ పరిభ్రమిస్తాయి. దేహాత్మల మమేకం గాయత్రీదేవి వృత్తి, ప్రవృత్తి భిన్నమైన అంశాలుగా కనిపించినా, నిజానికి అవి రెండూ ప్రకృతితో ముడివడిన అంశాలే. దానికి తోడు యోగా గాయత్రీదేవి అభిరుచి. పై రెండింటితో పాటు యోగా సైతం ప్రకృతిలో మనిషిని, మనస్సుని నిమగ్నం చేసే ఓ కళే. అందుకే ఆమె ప్రతిచిత్రంలోని భంగిమలు ఆమెలోని మరో అభిరుచిని కూడా పట్టిస్తాయి. చెన్నైలో ఉన్నప్పుడు లక్ష్మిగారి దగ్గర ప్రత్యేకించి తంజావూరు ఆర్ట్ అలవర్చుకున్నానన్నారామె. చిత్ర కారిణి, యోగా, ఆయుర్వేదం ఇన్ని విద్యలు మీకెలా అబ్బాయన్న ప్రశ్నకు శరీరం, మనసు, ఆత్మలు మమేకం కావడమే యోగా అని ఆమె సమాధానమిచ్చారు. మొత్తం పాతిక పెయింటింగ్స్‌లో కాలీయ మర్దనం, కంస వధ, శమంతకమణి, సుధామమైత్రి, శిశుపాల వధ, నరకాసుర వధ, శ్రీకృష్ణ తులాభారం, ద్రౌపదీ వస్త్రాపహరణం, గీతోపదేశం నుంచి విశ్వరూపంతో గాయత్రీదేవి ప్రదర్శన ముగుస్తుంది. అమ్మ కుంచె.. అపరాజిత రెండేళ్ల వయసుకే అమ్మ కుంచెను అందిపుచ్చుకున్నారు అపరాజిత. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన అపరాజిత కాలిఫోర్నియాలోనే ఆపిల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ నుంచి కళను ఆస్తిగా పొందిన అపరాజిత ఐదేళ్ళప్పుడే చిత్రకళా ప్రదర్శనలో అవార్డుని అందుకున్నారు. ఈ ఎగ్జిబిషన్లో వసంతం మోసుకొచ్చే నిండుపున్నమిని తలపించే తెలుపు ఊదా రంగుపూల బరువుతో వొంగి, నేలను ముద్దాడినట్టున్న పూలచెట్టు చిత్రం వీక్షకులను కట్టిపడేసింది. ప్రతి దృశ్యం ఒక చిత్రకావ్యం సంగీతానికీ రంగులద్దగలదు అపరాజిత నీళ్ళు, నదులు, సముద్రాలు అపరాజిత చిత్రాల్లో అలలు అలలుగా మనస్సుని ఆనందంలో ఓలలాడిస్తాయి. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఫైన్ఆర్ట్లో ఆమె తనను తాను చిత్రకారిణిగా తీర్చిదిద్దుకున్నారు. తను బాల్యం నుంచి గడిపిన ప్రదేశాలు, మనస్సుని హత్తుకున్న ప్రాంతాలు, ఆకట్టుకున్న పరిసరాలు ఇలా.. అపరాజిత మనస్సులో పడిన ముద్రలెన్నో ఆమె కాన్వాస్‌పై చెట్లై విస్తరించాయి, పూవులుగా పూశాయి. నదులై ప్రవహించాయి. – అత్తలూరి అరుణ -
పాక్‌లోని హిందువులకు కొత్త ఏడాది కానుక
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని హిందువులకు నూతన సంవత్సరంలో కొత్త బహుమతి అందినట్లయింది. అక్కడి హిందువులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హిందూ వివాహాల చట్టానికి సంబంధించిన బిల్లును మానవ హక్కుల వ్యవహారాలు చూసుకునే సెనేట్ క్రియాశీల కమిటీ ఏకగ్రీంగా సోమవారం ఆమోదించింది. హిందూ వివాహాల బిల్లు-2016కు సెప్టెంబర్ నెలలో జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం, దీనిని సెనేట్ కమిటీకి పంపించగా అది తాజాగా ఆమోదించింది. ఈ బిల్లు చట్టంగా రూపొందితే ప్రతి హిందువు వివాహాన్ని నమోదు చేసుకునే వీలుంటుంది. అలాగే, పాక్‌లోని హిందువులు తమ వివాహ సమస్యలపైనా, అలాగే విడాకుల సమయంలో కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ బిల్లుకు తాజా ఆమోదం లభించిన నేపథ్యంలో నేషనల్ అసెంబ్లీలోని మైనారిటీ విభాగం సభ్యుడు రమేశ్ కుమార్ వాంక్వాని స్పందిస్తూ ఇది పాక్‌లోని హిందువులకు న్యూఇయర్ కానుక అని అభివర్ణించారు. -
'పదిమందిని కనండి.. దేవుడే చూసుకుంటాడు'
నాగ్‌పూర్: 'ప్రతి హిందువు పదిమందిని కనండి.. వారి భారం దేవుడు చూసుకుంటాడు' అని హిందూ ఆధ్యాత్మిక వేత్త వాసు దేవానంద సరస్వతీ అన్నారు. దేశంలో ఇంకా చాలా మంది హిందువులు కావాలని అభిప్రాయపడ్డారు. నాగ్‌పూర్‌లో ధర్మ సంస్కృతి మహాకుంభ పేరిట ఓ కార్యక్రమం జరుగుతోంది. దీనికి ఆరెస్సెస్ మద్దతిస్తోంది. ఈ కార్యక్రమంలో 'హిందువులను రక్షించండి' అనే నినాదంతో అక్కడికి వచ్చిన స్వామీజీలంతా హిందు కమ్యూనిటీ ఇప్పుడున్నదానికంటే రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేదికపై వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, జ్యోతిర్మట్కు చెందిన వాసు దేవానంద సరస్వతీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుదేవానంద మాట్లాడుతూ 'ఇద్దరు పిల్లల్నే కనాలనే నిబంధనను పక్కకు పడేయండి. దానికి బదులు పదిమందిని కనండి. వారి గురించి మీరేం భయపడకండి. వారి సంరక్షణను దేవుడు చూసుకుంటాడు. అలాగే, ప్రధాని నరేంద్రమోదీ గోహత్యల నిషేధంపై సత్వర నిర్ణయం తీసుకుంటే మంచిది' అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అసోం గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తదితరులు కూడా పాల్గొన్నారు. -
వైట్ హౌస్‌కు భారత్ బెస్ట్ ఫ్రెండ్
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇండియన్-అమెరిన్లకు కృతజ్ఞతలు చెప్పారు. తన విజయానికి కృషిచేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ఎన్నికల్లో అనూహ్య భరితంగా విజయం సాధించడంతో కీలక రాష్ట్రాలైన ఓర్లాండ్, ఫ్లోరిడాలో ట్రంప్ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హిందూ కమ్యూనిటీ హాజరైంది. తన విజయోత్సవ ప్రచారంలో పాల్గొనందుకు హిందూవులను గొప్పగా ట్రంప్ కొనియాడారు. మొదటిసారి ట్రంప్ తన విజయోత్సవంలో హిందూ కమ్యూనిటీ, ఇండియన్-అమెరికన్లు చేసిన కృషిని మెచ్చుకున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు ప్రకటించారు. ''వారందరూ ఎక్కడున్నారు. వారికి నేను థ్యాంక్సూ చెప్పాలి. మీరు నాకు ఓటు వేయడం అమేజింగ్'' అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ఆర్థికసంస్కరణలను కూడా ట్రంప్ మెచ్చుకున్నారు. భారత్-అమెరికా సంబంధాలను మంచిగా కొనసాగించేందుకు కృషిచేస్తానని ట్రంప్ ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. వైట్‌హౌస్‌కు భారత్ బెస్ట్ ఫ్రెండ్ కాబోతుందని పేర్కొన్నారు. ''పెద్ద, సాహసోపేతమైన కలను కనండి. మిమ్మల్ని మీరు నమ్మండి. అమెరికాను నమ్మండి.. అందరం కలిసి అమెరికాను మళ్లీ ఉన్నతంగా తీర్చిదిదుద్దాం... అంటూ ట్రంప్ ఇండియన్ అమెరికన్లకు పిలుపునిచ్చారు. సర్వే అంచనాల ప్రకారం 60 శాతం కంటే ఎక్కువమంది ఈ సారి ట్రంప్‌కు ఓటేసినట్టు రిపబ్లికన్ హిందూ కొలిషన్ చైర్మన్ చెప్పారు -
బాబా చిత్ర పటాలు పూజ గదిలో ఉంచుకోవద్దు
స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలు అనంతపురం కల్చరల్: ‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని ద్వారకా శారద పీఠం అధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి సూచించారు. శనివారం అనంతపుర వచ్చిన ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా షిరిడీ సాయిని ఆరాధించడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆయన్ను పూజించబోమని, హిందూ ధర్మంతోనే ఉంటామని భక్తులతో ప్రమాణం చేయించారు. దీన్ని బాబా భక్తులు వ్యతిరేకించడంతో వివాదానికి దారితీసింది. దీంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.