హిందువుల ఐక్యత కోసం ప్రాణాలర్పిం చేందుకు సిద్ధమని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఏభై రోజుల క్రితం నగర బహిష్కరణకు గురైన ఆయన న్యాయస్థానం అనుమతితో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఉదయం 10 గంటలకు బెజవాడలోని దుర్గమ్మను దర్శించుకుని అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరారు. నగరానికి చేరుకున్న ఆయనకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, ఏబీవీపీ, బజరంగ్ దళ్, ఏసీపీఎస్, అభిమానులు మంగళ వాయిద్యాలు, హారతులు, పూర్ణకుంభంతో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద పెద్దఎత్తున స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.