paripurnananda swamy
-
త్వరలో పాదయాత్ర: పరిపూర్ణానంద స్వామి
సాక్షి, తిరుమల: సంక్రాంతి తర్వాత ‘సేవ్ టెంపుల్స్’ పేరుతో పాదయాత్ర చేపడుతున్నట్లు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని.. ఇలాంటి దేవస్థానంలో హిందూయేతరులు ఉండటం మంచి పద్ధతి కాదని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హిందూ ఆలయాల్లో సమస్యలను తెలియజేస్తామని పరిపూర్ణానంద పేర్కొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న సీఎం రమేష్ తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి అనుగుణంగా తాను కూడా సీఏఏకి మద్దతు తెలుపుతున్నానని వెల్లడించారు. సీఏఏపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇతర దేశాలలో ఉన్న హిందువులు వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. ఇతర దేశాలలో ఉన్న హిందువులు భారత దేశానికి వస్తే..వారికి పౌరసత్వం ఇవ్వడం సిఏఏ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. -
కాంగ్రెస్ మోసం చేస్తే.. టీఆర్ఎస్ అణచివేసింది
యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే.. టీఆర్ఎస్ అణచివేసిందని బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామీజీ విమర్శించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి తరఫున నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సిద్ధపడితే కేసీఆర్ అడ్డుకున్నారని దుయ్యబట్టారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నిరుద్యోగులందరికీ 2 లక్షల ఉద్యోగాలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రచార హోరు.. అధినేతల జోరు..
అగ్రనేతల ప్రచారాలతో ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేడెక్కగా.. మరిన్ని సభలు నిర్వహించేందుకు అన్ని పార్టీలు వేదికలు సిద్ధం చేసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్–ప్రజాకూటమి, బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఆరు రోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు వేగం పెంచాయి. రోజురోజుకూ అభ్యర్థులు దూకుడు పెంచుతున్నారు. తాము గెలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారపర్వాన్ని తారాస్థాయికి చేర్చడానికి రానున్న రెండు రోజుల్లో టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీ అగ్రనేతలు మరోమారు ఉమ్మడి జిల్లాను చుట్టుముట్టనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పరిపూర్ణానంద స్వామి, మల్లు భట్టి విక్రమార్క, విజయశాంతి, రేవంత్‌రెడ్డి తదితరులు తమ అభ్యర్థులను గెలిపించాలని సభలు, రోడ్‌షోల ద్వారా ప్రచారం చేశారు. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మారోమారు సభలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్, ప్రజాకూటమిలు సైతం రాహుల్‌గాంధీ సభను ఉమ్మడి కరీంనగర్లో నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, లేదంటే టీపీసీసీ, టీటీడీపీ, టీజేఎస్, సీపీఐ రాష్ట్ర నేతలతో ఓ భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ కంచుకోటలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 స్థానాలకు 12 స్థానాలను గెలుచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి కరీంనగర్‌ను కంచుకోట మలచుకుంది. జగిత్యాల మినహా అన్ని స్థానాల్లో పాగా వేసిన టీఆర్ఎస్.. ఈసారి మొత్తంగా 13 స్థానాలను గెలవాలని భావిస్తోంది. అయితే.. గత ఎన్నికల్లో ఒకటితో సరిపెట్టుకోవాల్సి రాగా, ఈసారి జగిత్యాలతోపాటు ఓడిన ప్రతిచోటా గెలవాలని కోరుకుంటోంది. ప్రజాకూటమిలో భాగంగా మొత్తం 13 స్థానాల్లో ఒకటి మాత్రమే సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ, మిగిలిన 12 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులనే బరిలోకి దింపింది. 2014లో కరీంనగర్లో ద్వితీయ స్థానంలో నిలిచి బీజేపీ సైతం ఈసారి కనీసం మూడు స్థానాలనైనా సాధించుకుంటామని భావిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్–ప్రజా కూటమి, బీజేపీలు పోటీపోటీగా అగ్రనేతలతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాగా.. ఈసారి గత ఎన్నికల్లో కోల్పోయిన జగిత్యాల నియోజకవర్గంపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిని ఓడించాలని పావులు కదుపుతోంది. ఇదే సమయంలో తమ గెలుపు నల్లేరు మీద నడకే అంటూ కాంగ్రెస్ అభ్యర్థి ముందుకెళ్తున్నారు. చొప్పదండిలో ముక్కోణపు పోటీ జరుగుతుండగా సుంకె రవిశంకర్ (టీఆర్ఎస్), బొడిగె శోభ (బీజేపీ), మేడిపల్లి సత్యం(కాంగ్రెస్) నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇక్కడి బీజేపీ, కూటమి పోటాపోటీగా సభలు పెడుతున్నాయి. ఇదే తరహాలో రామగుండం, పెద్దపల్లి, వేములవాడ, కోరుట్ల, మంథని, మానకొండూరు, హుస్నాబాద్, కరీంనగర్‌లలో సైతం అన్ని పార్టీల అగ్రనేతల అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. నేటి నుంచి వచ్చే నెల 5 వరకు ఉమ్మడి కరీంనగర్లో ఆయా పార్టీల అగ్రనేతల రాకతో ప్రచారం మరింత హోరెత్తనుంది. -
కమలం గుమ్మంగా మారుద్దాం
ఖమ్మంమామిళ్లగూడెం: ‘మొన్నటి వరకు ఖమ్మం కమ్యూనిస్టుల గుమ్మం.. ఇకనుంచి కమలం గుమ్మంగా మారనుంది.. 2018 డిసెంబర్ నుంచి కాషాయానికి పట్టుగొమ్మగా నిలవనుంది’ అని బీజేపీ స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఖమ్మం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద గెలుపును ఆకాంక్షిస్తూ నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో బుధవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖమ్మంలో అడుగు పెట్టగానే తనకు కమల వికాసం కనిపించిందన్నారు. ఖమ్మంలో వ్యాపారులు, మహిళలు, ఉద్యోగులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. వచ్చే నెల 7వ తేదీన అందరూ తమ బద్ధకాన్ని వీడి.. ఓటు వేసి.. రౌడీ రాజకీయాలను పారదోలాలన్నారు. ఒక్కరోజు ఓటు వేస్తే ఐదేళ్లు తమను తాము కాపాడుకోగలుగుతామని వివరించారు. మోసం, దగా చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 6లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. కచ్చితంగా రాష్ట్రంలో కమలం వికసిస్తుందని, ‘కారు’ చీకట్లు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో రైతులను టీఆర్ఎస్ మోసం చేసిందని, గత ప్రభుత్వాల పరిస్థితి కూడా అదేనని అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని, బీజేపీ అధికారంలోకి రాగానే రైతులకు భారంగా మారిన రుణాలను మాఫీ చేస్తుందన్నారు. విద్యార్థులకు చదువు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థిపై లక్షల రూపాయల అప్పులను టీఆర్ఎస్ ప్రభుత్వం మిగిల్చిందన్నారు. బీజేపీ.. విద్యార్థులపై ఉన్న రూ.6,850కోట్ల అప్పులను మాఫీ చేసి.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే లక్ష గోవులను పంపిణీ చేసి సంప్రదాయాలను కాపాడుతుందని చెప్పారు. పూజించే గోవులపై, సంస్కృతిపై దాడి చేసే వారికి గుణపాఠం చెబుతుందన్నారు. త్రిబుల్ తలాక్‌ను రద్దు చేసి.. ముస్లిం మహిళలకు ప్రధాని మోదీ పెద్దన్నగా నిలిచారన్నారు. మహిళలను కాపాడేందుకే బేటీ బచావో.. బేటీ పడావో పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ముస్లింలు.. ముస్లింలని పాకులాడుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు.. ముస్లింల సంక్షేమానికి ఏం చేశాయో చెప్పాలన్నారు. ఖమ్మంలోని ముస్లింలంతా బీజేపీకి ఓటు వేసి ఉప్పల శారదను గెలిపించాలన్నారు. కార్యకర్తలు రేయింబవళ్లు పనిచేసి ఖమ్మంలో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నగరంలో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. కారు గుర్తు.. హస్తం గుర్తు పెద్ద కాలుష్యంగా మారాయన్నారు. ప్రజాకూటమికి ఓటు వేస్తే ఇరిటేషన్‌కు ఓటు వేసినట్లేనన్నారు. ఈ ఎన్నికల్లో తల్లి కావాలో.. లొల్లి కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. బీజేపీ అంటేనే బీసీల పార్టీ అని.. బడుగు, బలహీన వర్గాల హక్కులను కాపాడే పార్టీ అని అన్నారు. బీజేపీ ఖమ్మం అభ్యర్థి ఉప్పల శారద మాట్లాడుతూ ధన రాజకీయాలకు స్వస్తి పలకాలని, అభివృద్ధి చేసే పార్టీలను అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపిస్తే ఖమ్మంను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానన్నారు. సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గంటెల విద్యాసాగర్, దొంగరి సత్యనారాయణ, కోకిల మంజుశ్రీ, దుద్దూకూరి వెంకటేశ్వర్లు, యాదగిరిరెడ్డి, తాడం మురళి, బాల్దూరి శివ తదితరులు పాల్గొన్నారు. -
నేతలొస్తున్నారు..
సాక్షి, పెద్దపల్లి : ప్రచారపర్వానికి గడువు సమీపించడంతో అన్నిపార్టీల అధినేతలు జిల్లాబాట పట్టారు. ఇప్పటివరకు ఆయా పార్టీలకు సంబంధించిన నేతల సభలు జరగకపోగా, వరుసగా అన్ని పార్టీల నేతలు ఒకేసారిగా ప్రచారం రానుండడంతో రాజకీయం వేడెక్కనుంది. పోలింగ్‌కు పదిరోజుల ముందు భారీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా జోష్ నింపేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ జాతీయ రథసారథి అమిత్‌షా, పరిపూర్ణానంద స్వామి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 29, 30న జిల్లాలో పర్యటించనున్నారు. 29న సాయంత్రం 4 గంటలకు గోదావరిఖనిలోని జూనియర్‌కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. 30న మధ్యాహ్నం 3.15 గంటలకు మంథనిలో, సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లిలో నిర్వహించే బహిరంగసభల్లో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈమేరకు మంగళవారం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. కాగా వరుసగా రెండు రోజులు జిల్లాలో కేసీఆర్ పర్యటించనుండడంతో పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. రామగుండం, మంథని, పెద్దపల్లి అభ్యర్థులు సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి బహిరంగసభల ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో రెండు, మూడు నియోజకవర్గాలు కలిపి ఒక నియోజకవర్గంలో కేసీఆర్ బహిరంగసభలు నిర్వహించారు. కానీ.. పెద్దపల్లి జిల్లాలో మాత్రం వరుసగా రెండు రోజులపాటు ప్రచార సభలు నిర్వహిస్తుండడం, అందునా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగసభలు నిర్వహిస్తుండడం ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోంది. రేవంత్‌రెడ్డి...అమిత్‌షా...పరిపూర్ణానంద... పార్టీ అధినేతలు, స్టార్కంపెయినర్లతో ప్రచార సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్, బీజేపీ లు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచార సభ ఈ నెల 30 లేదా డిసెంబర్ ఒకటిన జిల్లా కేంద్రంలో నిర్వహించడానికి పార్టీ సన్నహాలు చేస్తోంది. తనతో పాటు టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన చింతకుంట విజయ రమణారావుకు మద్దతుగా రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. రామగుండం అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌కు మద్దతుగా గోదావరిఖనిలోనూ పర్యటించనున్నారు. రేవంత్‌రెడ్డి రావడంఖాయమే అయినా... తేదీలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు సినీనటి విజయశాంతి, ప్రజాకవి గద్దర్లు మంథని నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. మంథని పట్టణంలో విజయశాంతి, కాటారం మండల కేంద్రంలో గద్దర్ల సభలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సన్నహాలు చేస్తున్నారు. అధికారికంగా తేదీలు ఖరారు కావాల్సి ఉంది. ఇక బీజేపీ జాతీయ రథసారథి అమిత్‌షా, స్వామి పరిపూర్ణానందస్వామి ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి పార్టీ రథసారథులను రప్పించేందుకు సన్నహాలు చేస్తున్నారు. పెద్దపల్లిలో అమిత్‌షా, పరిపూర్ణానందస్వామిల ప్రచార సభలు ఉండే అవకాశం ఉంది. అయితే తేదీలు ఖరారు కావాల్సి ఉంది. వచ్చేనెల 4న కేంద్ర మంత్రి స్మృతిఇరానీ గోదావరిఖనిలో ప్రచార సభ నిర్వహించనున్నారు. ఆయా పార్టీల అధినేతల పర్యటనలు వరుసగా జరగనుండడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయం వేడెక్కింది. -
సొంతింటి కల మోదీతోనే సాధ్యం
పటాన్చెరు టౌన్: దేశ ప్రధాని నరేంద్రమోదీ మన రాష్ట్రానికి లక్షా 60 వేల ఇళ్లను మంజూరు చేయనున్నారని బీజేపీ నాయకుడు పరిపూర్ణానంద స్వామి అన్నారు. పటాన్చెరులో తమ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిని గెలిపిస్తే పారిశ్రామికవాడలో పేదలందరి సొంతింటి కల నెరవేర్చుతారని తెలిపారు. మంగళవారం ఆయన పటాన్చెరులో రోడ్ షోలో పాల్గొన్నారు. తొలుత గణేష్‌గడ్డలోని వినాయకుడి గుడిలో పూజలు చేశారు. అక్కడ ఆయనకు పటాన్చెరు బీజేపీ అభ్యర్థి పి.కరుణాకర్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తరువాత రోడ్‌షో లింగంపల్లి వరకు చేరింది. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్లు పందికొక్కుల్లా అవినీతితో డబ్బును మేశారని ఆరోపించారు. అవినీతి రహిత పాలనకు బీజేపీని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పటాన్చెరులో విద్యావేత్త, మాజీ సైనికుడు పి.కరుణాకర్‌రెడ్డిని బీజేపీ తమ అభ్యర్థిగా పోటీలో పెట్టిందన్నారు. ఈ ప్రాంతం ప్రజల కష్టాలు తీర్చగలిగే కరుణాకర్‌రెడ్డిని ఎన్నుకోవాలన్నారు. పటాన్చెరులో బైపాస్ రోడ్డు లేదని, పేదలెవరికీ పక్కా ఇళ్లు లేవని, విపరీతమైన కాలుష్యం ఉందని, పార్కులు లేవని అన్నారు. తమ అభ్యర్థి అధికారంలోకి రాగానే ఆ సమస్యలన్నింటిని పరిష్కరిస్తారని చెప్పారు. కేంద్రం సాయంతో పక్కా ఇళ్లు పేదలందరికీ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరుణాకర్‌రెడ్డి ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా ప్రజా సేవకు అంకితమవుతారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పరిపూర్ణానంద బీజేపీ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిని ఆశీర్వదించారు. టీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదెల్లి రవీందర్, గిద్దెరాజు, నరేందర్‌రెడ్డి, నాగరాజు, బైండ్ల కుమార్, రాంబాబు గౌడ్ పాల్గొన్నారు. రోడ్ షో కారణంగా జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. రోడ్‌షోలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓపెన్ టాప్ జీప్ వెనుకాల బీజేపీ అభిమానులు ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా సాగారు. జాతీయ రహదారి మీదుగా నిర్వహించిన రోడ్‌షో స్థానికులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా బీజేపీ నేత కరుణాకర్‌రెడ్డి మంగళవారం పటాన్చెరు, బొల్లారం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ పటాన్చెరు వరకు ఎంఎంటీఎస్, మెట్రో రైలు సౌకర్యం కల్పిస్తామన్నారు. కిష్టారెడ్డిపేట బీరంగూడ రోడ్డును బాగు చేస్తామన్నారు. ప్రణాళికబద్దంగా, నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు. సదాశివపేటలో.. సదాశివపేట పట్టణంలోని పంచాచార్య బసవ సేవాసదన్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పరిపూర్ణానంద ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామరాజ్యం కావాలంటే బీజేపీ అభ్యర్థి దేశ్‌పాండెను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేశ్వర్‌రావు దేశ్పాండె, అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బాబూమోహన్, దేశ్పాండె, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోవూరి సంగమేశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెమలికొండ వేణుమాధవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్రీశైలంయాదవ్, మహిళా నాయకురాలు అనురాధారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్‌రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘అధికారంలోకి వస్తాం.. అక్బరుద్దీన్ మెడలు వంచుతాం’
సాక్షి, మెదక్ : తెలంగాణలో 70 సీట్లు గెల్చి.. మెదక్‌లో అక్బరుద్దీన్ మెడలు వంచేది తమ పార్టీయే అని బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముస్లిం మహిళలు మోదీ దగ్గరకు వచ్చి ట్రిపుల్ తలాక్‌పై నిర్ణయం తీసుకోమని కోరారని తెలిపారు. అప్పుడు మోదీ తలాక్‌ను తీసి వేయించి.. ముస్లిం మహిళలు తల ఎత్తుకునేలా చేసి.. అక్బరుద్దీన్ ఓవైసీకి ఝలక్ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే అక్బరుద్దీన్ ఓవైసీనీ హైదరాబాద్‌లో తల దించుకుని తిరిగే రోజులోస్తాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదవారికి రూ. 5 లక్షల రూపాలయతో వైద్యం, రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. సింగూరు మెదక్ ప్రజల హక్కని కానీ.. దాదాపు 15 టీఎంసీల నీటిని ఆక్రమంగా తరలించుకుపోయారని పరిపూర్ణానందా ఆరోపించారు. ఈ నీటిని పూర్తిగా మెదక్ ప్రజల తాగు, సాగు నీటి అవసరాల కోసం అందిస్తామన్నారు. కుంభకర్ణుడు కూడా 6 నెలలే పడుకుంటాడు.. కానీ కేసీఆర్ మాత్రం ఎప్పటికి నిద్ర పోతూనే ఉంటాడని ఎద్దేవా చేశారు. రామయం పేటను డివిజన్ కేంద్రంగా మారుస్తామనే మాట మరిచిపోయారని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే ఇక్కడ పీజీ కాలేజీ, పాలిటెక్నికల్ కాలేజ్‌లు తీసుకోస్తామని పరిపూర్ణానందా హామీ ఇచ్చారు. ఆడపడుచుల కళ్లల్లో కన్నీరు చూడొద్దనే ఉద్దేశంతోనే.. ఉజ్వల పథకం ద్వారా మోదీ ఇంటింటికి గ్యాస్ పొయ్యి అందించారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు కల్పించే బాధ్యత బీజేపీదని పరిపూర్ణానంద తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో 1,60,000 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. మోదీ ఇచ్చే 800 రూపాయలకు, రూ. 200 కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిందని.. వాస్తవానికి కేసీఆర్ ఇచ్చేది రూ. 200 రూపాయలే అంటూ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే మూసివేసిన ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు పది మంది పొట్టగొట్టే పార్టీలని ఆయన విమర్శించారు. -
కమల వికాసంతోనే... తెలంగాణ వికాసం
కరీంనగర్‌సిటీ: కరీంనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపుతోనే నీతివంతమైన పరిపాలనాభివృద్ధి సాధ్యమవుతుందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. కరీంనగర్ శివారులోని కొండ సత్యలక్ష్మి గార్డెన్లో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛమైన, నీతివంతమైన నాయకుడు బండి సంజయ్ అని అన్నారు. బండి సంజయ్ గెలుపు కోసం కరీంనగర్ మాత్రమే కాకుండా యావత్తు తెలంగాణ ఎదురు చూస్తోందన్నారు. హిందువులందరూ ఒక్కసారి ఏకమై కళ్లు తెరిస్తే ఎలా ఉంటుందో చూపెట్టాలన్నారు. తెలంగాణలో కరీంనగర్‌లోనే బీజేపీకి అత్యధిక మెజార్టీ ఓట్లు వస్తాయన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే యువతకు లక్ష ఉద్యోగాలు ఇచ్చే మాట నిలబెట్టుకునేది బీజేపీ మాత్రమేనన్నారు. కరీంనగర్ పేరును కూడా మారుస్తామన్నారు. అధికారం రాగానే అమరులైన 1265 మంది ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. కమల వికాసంతోనే తెలంగాణ వికాసం కావాలని ఆకాంక్షించారు. బండి సంజయ్‌ను ఖతం చేస్తామంటూ ఒక నాయకుడు బెదిరించాడని, సంజయ్ మీద చేయి వేయాలంటే కాషాయం దాటి వెళ్లాలన్నారు. సంజయ్‌ను కాపాడుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నన్ను బహిష్కరిస్తే అమిత్‌షా, బీజేపీ నన్ను తెలంగాణలో ఆవిష్కరించారన్నారు. తెలంగాణ వచ్చాక విద్యార్థుల రీఎంబర్స్మెంట్ బకాయిలు లేకుండా విడుదల చేస్తామన్నారు. అమిత్‌షా అడుగు ప్రతీది విజయమేనన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ విజయం వైపు చూస్తున్నారన్నారు. సమావేశంలో బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాస సత్యనారాయణరావు, కన్నెబోయిన ఓదెలు, జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ, తాళ్లపల్లి హరికుమార్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ సతీశ్, జిల్లా కార్యదర్శి మెరుగు పర్శరాం, నాయకులు జవ్వాజి రమేశ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, బోయినిపల్లి ప్రవీణ్‌రావు, బేతి మహేందర్‌రెడ్డి, దాసరి రమణారెడ్డి, కడార్ల రతన్‌కుమార్, సుజాతరెడ్డి, కోమళ్ల రాజేందర్‌రెడ్డి, కటుకం లోకేశ్ పాల్గొన్నారు. పద్మనగర్‌లో బండి సంజయ్ ఇంటింటా ప్రచారం: అవినీతిరహిత పాలన కోసం బీజేపీని గెలిపించాలని కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కొత్తపల్లి మండలం పద్మనగర్‌లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించిన సంజయ్ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారాలను కాపాడుకునేందుకే టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రాజకీయాల్లో కొనసాగుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ రాచరిక పాలన సాగుతోందని, ఆ పాలనకు చరమగీతం పాడితేనే ప్రజాపాలన సాధ్యమవుతుందని చెప్పారు. పద్మనగర్ ఎంపీటీసీ గుజ్జేటి శివకుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వార్డుసభ్యుడు దూస సుధాకర్, బోగ అనిల్, రాజు, ప్రశాంత్, కార్తీక్, శ్రావణ్, అజయ్‌లు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ నాయకులు కడార్ల రతన్‌కుమార్, బండారి పాపయ్య, రాచకొండ కొమురయ్య, మాజీ వార్డు సభ్యులు మల్లేషం, అనిల్, శ్రీదర్, సంతోష్, రాజు, సాయి పాల్గొన్నారు. -
నేను సీఎంనే.. కామన్ మ్యాన్‌ను
సాక్షి, హైదరాబాద్: ‘నేను సీఎంనే. సీఎం అంటే కామన్ మ్యాన్ ఆఫ్ ది స్టేట్’అని బీజేపీ నేత, స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పరిపూర్ణానంద విలేకరులతో మాట్లాడుతూ తాను బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారంపై పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో ఎంఐఎంతో కలసి పనిచేస్తున్న టీఆర్ఎస్ కూటమి ఒకటైతే, టీడీపీతో కలసిన కాంగ్రెస్ కూటమి రెండోవైపు ఎన్నికల్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీసస్ పాలన తెస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని పరిపూర్ణానంద ఆరోపించారు. హిందుస్తాన్‌లో హిందువులకు స్థానం, రక్షణ లేకుండా పోయిందని, వరంగల్‌లోని ఒక ఆలయంలో పూజలో ఉన్న పూజారిని పట్టపగలే చంపేసినా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ఈ రెండు కూటములు పట్టించుకోలేదని పరిపూర్ణానంద ఆరోపించారు. పూజారిని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. హిందువుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దారుస్సలేం ఆజ్ఞల ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకాలం నడిచిందని ఆరోపించిన పరిపూర్ణానంద... లాల్‌దర్వాజ ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామనడం ద్వారా బీసీల పొట్టకొడతారా? అని ప్రశ్నించారు. హిందువులను కాపాడుకోవడానికే తాను బీజేపీలో చేరానన్నారు. తనపై నిఘా కోసం ప్రభుత్వం 500 మంది పోలీసులు, 30 పెట్రోలింగ్ వాహనాలను పెట్టిందని, తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నదనే అనుమానం ఉందని పరిపూర్ణానంద పేర్కొ న్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. మోదీకి భయపడే కేసీఆర్ ‘ముందస్తు’కు...: ఇంద్రసేనారెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి భయపడే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే బీజేపీకి అనుకూలంగా ఉంటుందనే భయంతోనే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారన్నారు. ఎల్లో ట్రావెల్స్ అధినేత శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో శనివారం చేరారు. ఈ సందర్బంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎన్నికల హామీల్లో ఒక్కటీ నెరవేర్చకుండా మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ వచ్చిందన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సర్వేలన్నీ మోదీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. -
తెలంగాణలో కాషాయ జెండా
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో కాషాయజెండా ఎగురవేయడానికి ప్రజలంతా సిద్ధం కావాలని పరిపూర్ణానంద స్వామి పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వం మిషన్–70తో ముందుకు సాగుతోందని, కచ్చితంగా రాష్ట్రంలో ‘కమలం’వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం రాత్రి కామారెడ్డిలో నిర్వహించిన విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, మహాకూటమిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వయం పాలన కోసం తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించమని టీఆర్ఎస్కు అధికారం ఇస్తే కుటుంబ పాలన సాగించారని ఆరోపించారు. పాలన చేతగాక కుంటిసాకులు చెప్పి ముందుగానే ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. కేసీఆర్‌ను ఇంటికి పంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి గుండెలపై చేయి వేసుకుని తన నిజాయితీ గురించి చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ కుటుంబసభ్యులంతా సామాన్య జీవనం సాగిస్తున్నారని, యూపీ ముఖ్యమంత్రి యోగి కుటుంబ సభ్యులు అలాగే జీవిస్తున్నారని తెలిపారు. బీజేపీ అంటేనే నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. అవినీతిలో మునిగిపోయిన మహాకూటమి నేతలు మాయమాటలతో వస్తున్నారని, వారిని మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. ఇక బీజేపీ ఖాతాలో తెలంగాణ కూడా.. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక బాంబు పేలుళ్లు లేవని, మోదీయే బోర్డర్ అవతల బాంబులు పేలుస్తున్నారని స్వామి పేర్కొన్నారు. దేశంలో 15 రాష్ట్రాలో బీజేపీ సుస్థిర పాలన సాగిస్తోందని, మరో ఆరు రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలసి నడుస్తోందని, తెలంగాణ రాష్ట్రం కూడా త్వరలోనే బీజేపీ ఖాతాలో చేరుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ వెనుక ఉన్న శక్తి ఆరెస్సెస్ అని, హెగ్డేవార్ కలలుగన్న పాలన బీజేపీ నాయకత్వంలోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జీసస్ పాలన అంటాడని, హిందువులంతా చేతులు కట్టుకుని కూర్చోరన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ధర్మం కోసం బీజేపీ పోరాడుతుందని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, తనను అకారణంగా బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తెలంగాణ ప్రభుత్వం బహిష్కరిస్తే, అమిత్‌షా అక్కున చేర్చుకున్నారని తెలిపారు. హన్మకొండలో పూజారిపై కొందరు ముష్కరులు దాడి చేస్తే ఆయన చనిపోయాడని, ఏ నాయకుడూ ఆ పూజారి కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. తాను రేపే అక్కడికి వెళుతున్నట్టు పరిపూర్ణానంద పేర్కొన్నారు. నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా బీజేపీని గెలిపించాలని కోరారు. సభలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాకు అన్నంపెట్టి కాపాడుకున్న గడ్డ ఇది తాను కామారెడ్డిలోనే అక్షరాభ్యాసం చేశానని పరిపూర్ణానంద తెలిపారు, ఇక్కడి ప్రజలు అన్నం పెట్టారని, బట్ట ఇచ్చి కాపాడుకున్నారని, తాను కూడా అంతే నిజాయితీగా వ్యక్తిత్వంతో నిలబడ్డానని చెప్పారు. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో కామారెడ్డి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే తన తొలి సభ ఇక్కడే ఏర్పాటు చేశానన్నారు. రాజకీయ అరంగ్రేటానికి ముందు అమ్మా, నాన్న, గురువులను అడిగానని, వారందరూ ముందుకు సాగమన్నారని తెలిపారు. అందరూ రాజకీయాల్లో దోచుకోవడానికి, దాచుకోవడానికి వస్తారని, తనకు బంధాలు లేవని, దందాలు అసలే లేవని, నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ప్రవేశించానని పరిపూర్ణానంద పేర్కొన్నారు. -
బీజేపీలో చేరిన పరిపూర్ణానంద
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయనకు ప్రాథమిక సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. స్వామి పరిపూర్ణానంద చేరికతో దక్షిణాదిన బీజేపీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆయన సేవలను విస్తృతంగా ఉపయోగించుకుంటామన్నారు. ఇన్నాళ్లు ఆయన ఆశీస్సులు బీజేపీకి ఉన్నాయని, ఇప్పుడు ఆయనే స్వయంగా పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. ఆయన చేరికతో తెలంగాణ ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించేందుకు వీలవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనతోపాటు ప్రచారం నిర్వహిస్తామన్నారు. సామాన్య కార్యకర్తలా చేరుతున్నా.. బీజేపీలో తన చేరికపై ఎలాంటి ముందస్తు షరతులు లేవని, సామాన్య కార్యకర్తలాగే పార్టీలో చేరానని స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. నవరాత్రి దీక్ష అనంతరం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’అనే హిందూ సంస్కృతిని రాజకీయ కోణంలో ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నినాదమైన ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’కల సాకారం చేసేందుకు బీజేపీ చేస్తోన్న కృషి తనను ఆలోచింపజేసిం దన్నారు. ధర్మాన్ని నిలుపుకోకపోతే ఈ దేశానికి ఉనికేలేదని, దాన్ని కాపాడేందుకే పార్టీలో చేరానని చెప్పారు. మోదీ, అమిత్ షా, రాం మాధవ్ నిర్ణయమే తనకు శిరోధార్యమని, వారు నిర్ణయిస్తే ఎక్కడిౖMðనా వెళ్లి సేవ చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల కోణంలో చూడాల్సిన అవసరం లేదు: రాం మాధవ్ స్వామి పరిపూర్ణానంద చేరికను ఎన్నికల కోణంలో చూడాల్సిన అవసరం లేదని రాం మాధవ్ అన్నారు. ఆయన సేవలను దేశవ్యాప్తంగా ఉపయోగించుకుంటామని తెలిపారు. స్వామీజీలను పార్టీలో చేర్చుకోవడం వల్ల బీజేపీపై ఉన్న మతోన్మాద పార్టీ ముద్ర మరింత బలపడే అవకాశం ఉంది కదా? అని మీడియా ప్రశ్నించగా.. దేశ సేవ కోసం ఎవరైనా తమ పార్టీలో చేరవచ్చని, గతంలో అనేక మంది బీజేపీలో చేరి సేవ చేస్తున్నారని రాం మాధవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే టీడీపీ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకే బీజేపీపై టీడీపీ విమర్శలు చేస్తోందని రాంమాధవ్ అన్నారు. ఐటీ దాడుల విషయంలో ఆదాయపన్ను శాఖ ప్రాథమిక ఆధారాలతోనే సోదాలు జరుపుతోందని, ఈ విషయంలో బీజేపీ ప్రమేయం లేదన్నారు. ఐటీ దాడుల్లో టీడీపీ నేతల లొసుగులు బయటపడుతుండటంతో బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు రావడంతోనే ఈ దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలను రాం మాధవ్ తీవ్రంగా ఖండించారు. ఏపీలో బీజేపీ ఒంటరిగా బలపడేందుకు కృషి చేస్తోందని, రాష్ట్రంలో మరే ఇతర పార్టీతోనూ తమకు లోపాయికారీ ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు. -
అమిత్ షాతో స్వామి పరిపూర్ణానంద భేటీ
-
అమిత్ షాతో భేటీ.. రంగంలోకి పరిపూర్ణానంద!
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద క్రమంగా రాజకీయాల దిశగా అడుగులేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన పరిపూర్ణానంద.. బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకు తన ప్రచారం ఉంటుందని భేటీ అనంతరం వెల్లడించారు. ‘నా భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. నా ఆసక్తి ప్రధానం కాదు. అమిత్ షా ఆలోచనలు, నిర్ణయాలు, అభిప్రాయాల మేరకు ప్రచారం ఉంటుంది. నవరాత్రులు అయిపోయాక దీనిపై పూర్తిగా చర్చిస్తాం. ఆధ్యాత్మికం, రాజకీయం వేరు కాదు’ అని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తోనూ పరిపూర్ణానందన భేటీ అయి చర్చించారు. సెంటిమెంట్ కలిసి వస్తుందా? శ్రీరాముడి విషయంలో కత్తి మహేశ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా యాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. అయితే, ఈ బహిష్కరణపై హైకోర్టు స్టే విధించడంతో పరిపూర్ణానంద తిరిగి నగరంలో అడుగుపెట్టారు. ఈ వ్యవహారంలో హిందూ సెంటిమెంట్‌కు అనుకూలంగా పరిపూర్ణానంద వ్యవహరించారని, బీజేపీ తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తే.. హిందూ సెంటిమెంట్‌తో మరింత లాభపడవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ తరహాలో తెలంగాణలో స్వామి పరిపూర్ణానంద ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద సోమవారం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పరిపూర్ణానంద స్వామి బీజేపీలోకి వస్తే స్వాగతమిస్తామని బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ముందుగా తెచ్చిన టీఆర్ఎస్, బతుకమ్మ చీరలను ముందుగా ఎందుకు పంచ లేదని అరవింద్ ప్రశ్నించారు. చీరలన్నీ ముందుగానే రెడీ అయినా.. వాటిని ఎందుకు పంచలేదన్నారు. గత ఏడాది బతుకమ్మ చీరల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. డీ ఫ్యాక్టో సీఎం అయిన కవిత బతుకమ్మ జరుపుకోకుంటే మిగతావారూ జరుపుకోవద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్, కాంగ్రెస్ నాయకులు దిగజారి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. -
హైదరాబాద్‌లో హిందూ మహాసముద్రం చూపిస్తా
-
హైదరాబాద్‌లో హిందూ మహాసముద్రం చూపిస్తా
హైదరాబాద్: హిందువుల ఐక్యత కోసం ప్రాణాలర్పిం చేందుకు సిద్ధమని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఏభై రోజుల క్రితం నగర బహిష్కరణకు గురైన ఆయన న్యాయస్థానం అనుమతితో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఉదయం 10 గంటలకు బెజవాడలోని దుర్గమ్మను దర్శించుకుని అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరారు. నగరానికి చేరుకున్న ఆయనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, ఏబీవీపీ, బజరంగ్ దళ్, ఏసీపీఎస్, అభిమానులు మంగళ వాయిద్యాలు, హారతులు, పూర్ణకుంభంతో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద పెద్దఎత్తున స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణలో అడుగుపెట్టే అవకాశం తనకు దుర్గమ్మ అమ్మవారు కల్పించారని అన్నారు. పోలీసులు, ప్రభుత్వంపై కోపం లేదని, ప్రజల మనోభావాలు కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదన్నారు. ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ హిందూసమాజాన్ని అణచివేయాలని చూస్తోందని, వారి ఆటలు చెల్లవని స్పష్టం చేశారు. తాను వచ్చేది ఎవరికీ తెలియదనీ, అయినా లక్షలాది హిందూ జనం స్వాగతించటం హిందూ సమాజానికి గర్వకారణమన్నారు. 15 నిమిషాల్లో హిందువులను నరికివేస్తామన్న వారికి ప్రభుత్వం భద్రత కల్పిస్తూ, పోలీసుల కుటుంబాలు బాగుండాలని కోరుకునే తన లాంటి సన్యాసులపై పీడీ యాక్ట్ ప్రయోగించి బహిష్కరించారని, హిందూ సమాజానికి చేసే న్యాయం ఇదేనా.. అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పాకిస్తాన్‌లోనూ ఇలాంటి సాహసం చేయరని, 19 గంటలపాటు పలు గ్రామాల్లో తిప్పుకుంటూ ఆహారం ఇవ్వకుండా తనను ఇబ్బంది పెట్టిన పోలీసులకే తాను భోజనం పెట్టించానన్నారు. హిందూ సంఘాలన్నీ ఏకమై హిందువుల ఐక్యత కోసం సంఘటితం కావాలని, ఇందుకు తన ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. హిందువులు చేతగానివారనే భావనను విడనాడాలని, హైదరాబాద్ లో హిందూ మహా సముద్రాన్ని చూపిస్తానని అన్నారు. ఆదిలాబాద్ నుంచి యాత్ర చేపట్టి రాష్రాన్ని చుట్టి వస్తానని, ప్రతి హిందువు గుండెను తట్టి లేవుతానని చెప్పారు. అనంతరం ట్యాంక్‌బండ్ చేరుకొని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. -
పరిపూర్ణనందను కలిసిన హిందూ ధార్మిక సంస్థల నేతలు
సాక్షి, తూర్పుగోదారి: మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై పరిపూర్ణనాధ స్వామి నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. శనివారం కాకినాడలోని శ్రీపీఠంలో ఉన్న స్వామీజీని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ, గోరక్షక దళం, ఏబీవీపీ, ఆర్హెచ్ఎస్, హిందూ ధార్మిక సంస్థల నేతలతో పాటు, ఉప్పల్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ స్వామీజీని మర్యాద పూర్వకంగా కలిశారు . వారు స్వామీజీతో సుమారు గంటపాటు సమావేశమైయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...విశ్వహిందూ సమాజం తరుపున పరిపూర్ణనంద స్వామిని హైదరాబాద్‌కు రమ్మని సాదరంగా ఆహ్వానించామని తెలిపారు. దీనికి స్వామీజీ కూడా సానుకూలంగా స్సందించారు అన్నారు. హైదరాబాద్‌లో స్వామీజీపై ఉన్ననగర బహిష్కరణపై హైకోర్టు స్టే ఇచ్చిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం ఆయనకు ఘన స్వాఘతం పలుకుతుందని భావిస్తున్నామని ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. -
పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టులో పరిపూర్ణానంద స్వామికి ఊరట లభించింది. హైదరాబాద్ నగర పోలీసులు పరిపూర్ణానంద స్వామికి జారీ చేసిన నగర బహిష్కరణ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు ఆయనపై ఆరునెలల పాటు విధించిన నగర బహిష్కరణను కోర్టు నిలిపివేసింది. తనపై విధించిన నగర బహిష్కరణను సవాల్ చేస్తూ పరిపూర్ణానంద స్వామి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్ శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ యాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించడంతో ఆయనను నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నిర్ణయించారు. ఈ మేరకు జులై 10న పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో అడుగుపెట్టొద్దని, నోటీసులు అందుకున్న 24 గంటల్లో నగరాన్ని విడిచిపెట్టాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు పరిపూర్ణానంద నగర బహిష్కరణకు ముందే కత్తి మహేష్‌ను కూడా ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. -
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి
హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామిపై డీజీపీ విధించిన నగర బహిష్కరణను ఎత్తి వేయాలంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ కలెక్టరేట్ ముందు వీహెచ్‌పీ,బీజేపీ, ఏబీవీపీ నేతలు ధర్నా చేశారు. అనంతరం సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నేతలు. కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. పరిపూర్ణానంద స్వామిపై డీజీపీ మహేందర్ రెడ్డి నగర బహిష్కరణను విధించడం అమానుషమన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వ్యవహరించడం తగదన్నారు. సీఎం కేసీఆర్ పాలన నిజాం నిరంకుశ పాలనను గుర్తుచేస్తోందన్నారు. ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా ఇవ్వడం లేదని ఇదేమి ప్రజాస్వామ్యమని అన్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ,ఎమ్మెల్సీ రాంచందర్ రావు తదితర నేతలను, వీహెచ్‌పీ, బీజేపీలకు చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించి, అనంతరం విడిచి పెట్టారు. -
పరిపూర్ణానంద బహిష్కరణ రికార్డులు సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నగర బహిష్కరణకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తనను నగర బహిష్కరణ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ స్వామి పరిపూర్ణానంద హైకోర్టులో వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జస్టిస్ రాజశేఖరరెడ్డి సోమవారం విచారణ జరిపారు. పరిపూర్ణానంద తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసే అధికారం ఈ ముగ్గురు పోలీసు కమిషనర్లకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సంఘ వ్యతిరేక, ప్రమాదకర కార్యకలాపాల చట్టం కింద పరిపూర్ణానందపై నగర బహిష్కరణ వేటు వేశారని, ఈ చట్టాన్ని కేవలం గూండాలపై, తరచూ నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగిస్తారని కోర్టుకు నివేదించారు. అటువంటి చట్టం కింద పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవడమంటే అతని హక్కులను హరించడమే అవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ పరిపూర్ణానంద విషయంలో నిబంధనల మేరకే నడుచుకున్నామని చెప్పారు. పరిపూర్ణానంద కోరిక మేరకే ఆయనను కాకినాడ తీసుకెళ్లామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి బహిష్కరణకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. -
హైకోర్టును ఆశ్రయించిన పరిపూర్ణానంద స్వామి
హైదరాబాద్ : ఆరు నెలలపాటు నగర బహిష్కరణకు గురైన స్వామి పరిపూర్ణానంద స్వామి శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. తనపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పరిపూర్ణానంద దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. పిటిషన్లో ప్రతివాదిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ను చేర్చారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. కత్తి మహేశ్ వ్యాఖ్యలకు నిరసనగా ‘ధర్మాగ్రహ యాత్ర’చేపడతానని ప్రకటించిన ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జూలై 10న ఆయనకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో అడుగు పెట్టొద్దని, నోటీసులు అందుకున్న 24 గంటల్లో నగరాన్ని విడిచిపెట్టాలని అందులో పేర్కొన్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున స్వామిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీపీఠానికి తరలించాయి. పరిపూర్ణానంద స్వామి నగర బహిర్కణకు ముందే కత్తి మహేశ్‌ను కూడా ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన సంగతి విదితమే. -
ఆగ్రహించిన విశ్వహిందూ పరిషత్
సాక్షి, విజయవాడ : పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయటాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తున్నాయి. గురువారం విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద వీహెచ్‌పీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు, హిందుత్వ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామవరప్పాడు వరకు వారు ర్యాలీని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. రామవరప్పాడుకు ర్యాలీగా వస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ.. గురువారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌లు నగర దిగ్భందం చేశాయి. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. పెద్దపల్లి : తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విశ్వసిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను వారు తప్పు పట్టారు. గురువారం గోదావరిఖనిలో రాజీవ్ రహదారిపై వీహెచ్‌పీ రాస్తారోకో చేపట్టింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆయనపై ఉన్న బహిష్కరణను రద్దు చేయాలంటూ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు కూకట్పల్లి జాతీయ రహదారిపై బైఠాయించారు. -
పరిపూర్ణానంద బహిష్కరణ అప్రజాస్వామికం
సాక్షి, హైదరాబాద్: స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలవడానికి బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే నిర్బంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్ ప్రభాకర్‌ను పోలీసులు మంగళవారం అరె స్టు చేశారు. రాజాసింగ్‌ను గృహనిర్బంధం చేశారు. పరిపూర్ణానందపై పోలీసులు విధించిన బహిష్కరణను ఎత్తివేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడానికి బీజేపీ ఎమ్మెల్యేలు గతంలోనే సీఎం అపాయింట్మెంటు కోరారు. సీఎం కార్యాలయం నుంచి స్పంద న లేకపోవడంతో నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి, సీఎం కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అసెంబ్లీలోని బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో సమావేశమై, అక్కడి నుంచి బృందంగా వెళ్లాలని నిర్ణయించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకోకుండానే పోలీసులు, వారిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కె.లక్ష్మణ్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర అరెస్టుచేసిన పోలీసులు, తిరుమలగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కిషన్‌రెడ్డిని నగర పోలీసు కమిషనర్ కార్యాలయం దగ్గర అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్సీ రామచందర్రావును అరెస్టు చేసి, హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్‌కు, ఎమ్మెల్యే ప్రభాకర్‌ను అంబర్‌పేటలో అరెస్టు చేశారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డిని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో కార్యకర్తలు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్లకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అరెస్టులు అక్రమం: మురళీధర్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమైన విషయంలో కలవడానికి ప్రయత్నిస్తే అరెస్టు చేస్తారా అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పి.మురళీధర్‌రావు ట్విట్టర్లో మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రావణరాజ్యం నడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ కృష్ణదాస్ విమర్శించారు. కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి విమర్శించారు. -
‘వినతి పత్రం ఇవ్వబోతే అరెస్టులా?’
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కణ చేయడంపై బీజేపీ శ్రేణులు మంగళవారం చేపట్టిన ‘ఛలో ప్రగతిభవన్’ ఆందోళనలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు జి.కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సీనియర్ నాయకుడు బద్దం బాల్‌రెడ్డిని అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి వినతి పత్రం అందిద్దామని బయల్దేరిన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. అరెస్టులతో తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం ఇవ్వకపోగా ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణలో సాగుతున్నది ప్రజాస్వామ్య పాలనా లేక నిజాం నిరంకుశ పాలనా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణా లో బీజేపీ నాయకుల అక్రమ అరెస్ట్, మంటగలుస్తున్న ప్రజాస్వామ్య విలువలు, ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ సమయం ఇవ్వరు, కలుద్దామని వచ్చే వారిని అరెస్టు చేస్తారు.. తెలంగాణా లో సాగుతున్నది ప్రజాస్వామ్య పాలనా లేక నిజాం నిరంకుశ పరిపాలననా? — P Muralidhar Rao (@PMuralidharRao) July 17, 2018 -
బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గృహ నిర్బంధం
-
పరిపూర్ణానంద బహిష్కరణ.. ‘ఛలో ప్రగతిభవన్’కు పిలుపు!
సాక్షి, హైదరాబాద్ : శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కణ చేయడంపై బీజేపీ ఆందోళన తీవ్రతరం చేసింది. పరిపూర్ణానంద స్వామిపై విధించిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం ‘ఛలో ప్రగతిభవన్’కు బీజేపీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలంతా ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులను పోలీసులు వారి నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు. పోలీసుల చర్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చలో ప్రగతిభవన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన బీజేపీ శాసనపక్ష నేత కిషన్‌రెడ్డిని పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద అరెస్ట్ చేసి కిషన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అసెంబ్లీ వైపు వెళ్తున్నారన్న సమాచారం పోలీసులకు అందడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్ట్ చేసి రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బద్దం బాల్‌రెడ్డిని అసెంబ్లీ గేటు ముందు అరెస్ట్ చేసిన పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. -
ఎక్కడికక్కడ అడ్డగింత
అనంతగిరి: స్వామి పరిపూర్ణనంద బహిష్కరణకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) శనివారం వికారాబాద్‌లో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పరిషత్ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. వికారాబాద్‌లోని ఆలంపల్లి ఎంఐజీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వెళ్లేందుకు వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ర్యాలీగా వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శిరీష, సీఐ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నాయకులను అడ్డుకున్నారు. ఆలయం వెలుపల నుంచి వస్తున్న నాయకులను అడ్డగించి వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఎమ్మార్పీ చౌరస్తా వరకు వచ్చిన కొందరిని కూడా అడ్డుకున్నారు. ఈ సమయంలో నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బహిష్కరణ ఎత్తివేయాలి ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. స్వామి పరిపూర్ణనందాపై బహిష్కరణ సరికాదని, వెంటనే బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విభజించు పాలించు అనే ధోరణిని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. స్వామిజీ ధర్మం గురించి మాట్లాడిన్రు తప్పా మరేది కాదన్నారు. అనంతరం వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బందెప్ప గౌడ్ మాట్లాడుతూ.. హిందూవుల మనోభావాలకు దెబ్బతినేలా ఎవరూ మాట్లాడొద్దని కోరారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. హిందూవుల జోలికి ఎవరైన వస్తే సహించేది లేదన్నారు. సమాజ హితం కోసం కృషి చేసే పరిపూర్ణనందాను బహిష్కరించడం సరికాదని బీజేపీ రాష్ట్ర నాయకులు పటేల్ రవిశంకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కడిక్కడ ప్రజల గొంతును నొక్కేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు ప్రశాంత్‌కుమార్, గోవర్దన్‌రెడ్డి, ప్రభాకర్, కృష్ణ పంతులు, మ్యాడం దత్తు, బీజేపీ నాయకులు పాండుగౌడ్, సదానంద్‌రెడ్డి, సాయికృష్ణ, మాధవరెడ్డి, శివరాజు, వివేకనందారెడ్డి, పోకల సతీశ్, రాచ శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌కుమార్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, శంకర్, సాయి చరణ్‌రెడ్డి, రాజు, రాము, గిరీశ్ కొఠారి, పరుశరాం, కరుణాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వికారాబాద్‌లో న్యాయవాదుల లోక్ అదాలత్ బహిష్కరణ వికారాబాద్‌లో ర్యాలీకి మద్దతుగా వికారాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు శనివారం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ను బహిష్కరించారు. అనంతరం న్యాయవాదులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ప్ర«ధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, సీనియర్ న్యాయవాదులు గోవర్దన్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, బస్వరాజు, చౌదరి యాదవరెడ్డి, శ్రీనివాస్, రవి, రాజు, రాము, ఈశ్వర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లను విధ్వంసకర శక్తులుగానే హైదరాబాద్ చూస్తుంది
రాముని మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అయితేనేమి, ‘ధర్మాగ్రహ యాత్ర’ పేరుతో మత వైషమ్యాలకు పురిగొల్పే ఆధ్యాత్మిక గురువు అయితేనేమి, వాళ్లను హైదరాబాద్ నగరం విధ్వంసకర శక్తులుగానే చూస్తుంది. విశ్వనగరంలో మతం చిచ్చుపెట్టే వాళ్లను ఉపేక్షించేది లేదని కేసీఆర్ మరోసారి రుజువు చేశారు. చట్టం తనపని తాను చేసుకుపోయింది. కేసీఆర్ ఆది నుంచి సనాతన ధార్మికుడు. ఆధ్యాత్మిక ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని, అవి తెలంగాణ సౌభాగ్యానికి పాటుపడాలని కోరుకునే నాయకుడు ఆయన. నేడు ప్రశాంత హైదరాబాద్ మహానగరంగా మరోసారి నిలబడింది. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాదులు, సమస్త శాస్త్రాలు మను షుల్ని చీకటి నుంచి వెలుతురు వైపు నడిపించాలి. శాస్త్ర విజ్ఞానం పెరిగి ఆకాశం ఆవలి దిక్కు గుట్టు విప్పుతున్న వేళ అంధ విశ్వాస్వాలు చెలరేగి మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తున్నాయి. మత విశ్వాసాల పేరుతో హత్యలకు, దాడు లకు, ధర్నాలకు, బంద్‌లకు పూనుకో వటం ఎంత దౌర్భాగ్యం.lభారత జను లది వైవిధ్యభరిత జీవన విధానం. ఆసేతు హిమాచల భారతావ నిలో భిన్న జాతులు, విభిన్న భాషలు, భావోద్వేగాలు, సంస్కృ తులు, ఆచారాలు, అవసరాలు ఉంటాయి. ఇంతటి జీవన వైవి« ద్యం ప్రపంచంలో మరే దేశంలో కన్పించదు. ఈ దేశంపై బయటి వారి దండయాత్రలు, అంతర్యుద్ధాలు శతాబ్దాల ఏలుబడిలో ఎక్కడి ఆచారాలు అక్కడ స్థిరపడిపోయాయి. అందుకే మతాలు, సంస్కృతులమధ్య అంతరాలు అనుబంధాలు ఏర్పడ్డాయి. భిన్న త్వంలో ఏకత్వమే లౌకిక భారత బలం. రోజు రోజుకు దేశంలో మత అసహనం పెరిగిపోతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో చూశాను.‘మీ ఇంట్లో మీ ఆడవాళ్ళ ముఖాన బొట్టు, మెడలో మంగళసూత్రం, నల్లపూసల గొలుసు, కాళ్లకు మెట్టెలు... ఇవి అన్ని ఓ మతంలో భాగమే... ఆ మతాన్ని గురించి మాట్లాడకపోతే మీరు ఇంట్లో మీ ఆడవాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రాలు, నల్లపూసలు, బొట్టు, మెట్టెలు తీసేయండి’ అని పోస్టులు పెట్టారు. మతం అనేది ఒక విశ్వాసం. ఎవరి విశ్వాసాలు వాళ్లకు, ఎవరి నమ్మకాలు వాళ్లకు ఉంటాయి. మతోన్మాద శక్తులు మతం అంటే జీవన విధానం అనే దగుల్భాజీ మాటలను తెర మీదకు తెచ్చారు. వీళ్లే దేశంలో ప్రజలు ఏం తినాలో, ఏం తాగా లనే ఆహారపు అలవాట్లను నిర్దేశిస్తున్నారు. కట్టు, బొట్టు లాంటి సంస్కృతి, సాంప్రదాయాలను, నియంత్రించేందుకు భౌతిక దాడులకు దిగుతున్నారు. గోరక్షణ పేరుతో మనుషులను పాశవి కంగా చంపేస్తున్నారు. అది తప్పు అన్న బుద్ధి జీవులను నిర్ధాక్షి ణ్యంగా చంపించేస్తున్నారు. 2015 ఫిబ్రవరి 16న మహారాష్ట్ర వామపక్షవాది గోవింద్ పన్సారేను హత్య చేశారు. అదే ఏడాది ఆగస్టు 30న కన్నడ సాహితీవేత్త ఎంఎం కాల్బుర్గి(77)ని, 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన ఇంటి ఆవరణలో సీనియర్ జర్నలిస్ట్ గౌరీలంకేశ్(55)ను దుండగులు కాల్చి చంపారు. ఈ ముఠా హిట్ లిస్ట్‌లో జ్ఞానపీఠ్ గ్రహీత గిరీశ్ కర్నాడ్, కన్నడ రచ యిత ప్రొఫెసర్ కెఎస్ భగవాన్, సాహితీవేత్త బిటి లలితా నాయక్, నిడు మామిడి మఠం స్వామీజీ వీరభద్ర చెన్నమళ్లస్వామి, హేతు వాది సీఎస్ ద్వారకానాథ్ ఉన్నట్టు బయటపడింది. తెలంగాణ సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరి త్రను కలిగిన ప్రాంతం.. ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన హిందూ రాజులు, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ రాజ వంశాలకు చెందిన ముస్లిం పాలకులు పాలించారు. భారత ఉప ఖండంలో మొట్టమొదటి సంస్కృతి కేంద్రంగా ఈ ప్రాంతం ఆవి ర్భవించింది. కళలు, సంస్కృతులపై ఆసక్తికలిగిన అప్పటి, ఇప్పటి పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక బహుళ సాంస్కృ తిక ప్రాంతంగా మార్చారు. ఇక్కడ రెండు వేర్వేరు సంస్కృతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. బోనాలు, బతుకమ్మ, దసరా, ఉగాది, సంక్రాంతి, మీలాద్–ఉన్–నబి, రంజాన్ వంటి మతపరమైన పండుగలు, డెక్కన్ ఫెస్టివల్ వంటి ఇతర వేడుక లను కూడా జరుపుకుంటారు. విభిన్న భాషలు, సంస్కృతులకు తెలంగాణ రాష్ట్రం చాలాకాలం నుండి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. ‘దక్షిణానికి ఉత్తరం. ఉత్తరానికి దక్షిణం’గా, ‘గంగా– యమున తెహజీబ్’గా పిలవబడుతున్న తెలంగాణ రాష్ట్ర రాజ ధాని హైదరాబాద్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన నగరం. హిందూ, ముస్లిం, సిక్కు, పార్శి, మరాఠి సర్వ జనుల సంగమ విశ్వనగరం ఇది. రాముని మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అయితేనేమి , ‘ధర్మాగ్రహ యాత్ర’ పేరుతో మత వైషమ్యా లకు పురిగొల్పేlఆధ్యాత్మిక గురువు అయితేనేమి, వాళ్లను హైదరా బాద్ నగరం విధ్వంసకర శక్తులుగానే చూస్తుంది. విశ్వనగరంలో మతం చిచ్చుపెట్టే వాళ్లను ఉపేక్షించేది లేదని కేసీఆర్ మరోసారి రుజువు చేశారు. చట్టం తనపని తాను చేసుకుపోయింది. కేసీఆర్ ఆది నుంచి సనాతన ధార్మికుడు. ఆధ్యాత్మిక ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని, అది తెలంగాణ సౌభాగ్యానికి పాటుపడాలని కోరు కునే నాయకుడు ఆయన. రాజ్యం బాగుండాల, రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలనే ఆకాంక్షతో దేశవ్యాప్తంగా ఉన్న 1221 మంది పండితులను పిలిచి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో అయుత చండీమహాయాగం చేశారు. ఈ క్రతువులో 20 లక్షల మందికి పైగా ప్రజలు భాగస్వాములు అయ్యారు. శిధిలావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను పునః నిర్మాణం చేసి పూర్వ వైభవం తెచ్చారు. సర్వ మతాల ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ఎన్నో మజీదులను, చర్చిలను పునః నిర్మాణం చేశారు. ఇక్కడో ఉదాహరణ. మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక సేనను తయారు చేసుకోవాల్సి వచ్చింది. అది తయారుచేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, అత్యాచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీయే ఐనా అందుకు తన పోలీసులతో, పాలనతో ప్రోత్సహించినవారు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆ బలమే లేకపోతే హైదరాబాద్ నగరంలో షోయ బుల్లాఖాన్ వంటి పత్రికా సంపాదకుణ్ని బర్కత్‌పురాలో రజాకార్లు చంపగలిగేవాళ్లు కాదు. రజాకార్లు విద్వేషాలు రెచ్చగొట్టారనేది స్పష్టం. నిజాం వాళ్ళను పెంచి పోషించాడన్నదీ çసుస్పష్టం. దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణలో భీంరెడ్డి నర్సింహారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి యువ నేతలు ఆయుధాలు పట్టాల్సి వచ్చింది. అదే తెలం గాణ సాయుధ పోరాటం అయింది. నిజాం చివరి రోజుల్లో తీసు కున్న ఈ నిర్ణయం 400 ఏళ్ల అద్భుత పరిపాలనకు మాయని మచ్చను తీసుకొచ్చింది. ‘రాజ్యాంగమెంత మంచిదైనా పాలకులు మంచివారు కాకపోతే అది చెడుగా మారుతుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా పాలకులు మంచివారైతే మంచిదిగా మారు తుంది’ అని రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడు డా‘‘ అంబేడ్కర్ చేసిన హెచ్చరిక ఎప్పటికీ పాలకులను అప్రమత్తులను చేస్తూనే ఉంది. ఆ అప్రమత్తత నుంచి పుట్టిన ఆలోచనే కేసీఆర్ తీసుకున్న కఠిన నిర్ణయం. నేడు ప్రశాంత హైదరాబాద్ మహానగరంగా మరోసారి నిలబడింది. వారం రోజులుగా నగరంలో జరుగుతున్న సంఘటనల పట్ల కేసీఆర్ నిర్ణయాన్ని సకల మతాలు, సబ్బండ జాతులు స్వాగతిస్తున్నాయి. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు మొబైల్ : 94403 80141 -
హైకోర్టులో స్వామీజీ బహిష్కరణ ప్రస్తావన
సాక్షి, హైదరాబాద్: శ్రీరాముడిని, సీతమ్మనీ కించపరిచిన వ్యాఖ్యలకు నిరసన చెప్పబోయిన శ్రీపీఠం అధి పతి స్వామి పరిపూర్ణానందని హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడం అన్యాయమంటూ హైకోర్టు లో ప్రస్తావనకు వచ్చింది. స్వామీజీని అకారణంగా, వ్యక్తిగత హక్కులకు ఉల్లంఘన కలిగించేలా నగర బహిష్కరణ చేశారని ధర్మాసనం ఎదుట ఒక న్యాయ వాది ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైకోర్టు ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట ఒక న్యాయవాది ఈ అంశాన్ని లేవనెత్తారు. పోలీసుల తీరు రాజ్యాం గం కల్పించినవ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉందని, స్వామీజీని అసాంఘికశక్తిగా ఎలా పరిగణిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి వరకూ నిరసన యాత్ర నిర్వహించేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారని, తర్వాత అనుమతిని రద్దు చేశారని చెప్పా రు. స్వామీజీ పట్ల పోలీసుల తీరుపై అభ్యంతరాలుం టే వ్యాజ్యాన్ని దాఖలు చేసుకోవచ్చని, ప్రజాప్రయోజనాలున్నాయని భావిస్తే∙లేఖ రాయాలని, దానిని న్యాయమూర్తులతో కూడిన కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని సలహా ఇచ్చింది. ‘హైజీన్ కిట్స్ టెండర్’పై హైకోర్టు స్టే సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు పంపిణీ చేయతలపెట్టిన ‘హెల్త్ అండ్ హైజీన్ కిట్స్’కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ కిట్ లోని వస్తువుల సరఫరా టెండర్‌ను మా యార్న్ అండ్ ఫైబర్స్‌కు కట్టబెడుతూ తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. పూర్తి వివరాలను తమ ముందుం చాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. మా యార్న్ అండ్ ఫైబర్స్‌కు కిట్ల సరఫరా కాంట్రాక్ట్‌ను అప్పగిస్తూ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణ యాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన లైట్‌హౌస్ ప్రమోషన్స్ ప్రతినిధి కల్యాణ్ చక్రవర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం విచారణ జరిపిన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు మధ్యం తర ఉత్తర్వులు జారీచేశారు. అర్హతలున్నా పిటిషనర్ సంస్థపై అధికారులు అనర్హత వేటు వేసి, తమకన్నా ఎక్కువ ధరకు టెండర్ వేసిన మా యార్న్ అండ్ ఫైబర్స్‌కు టెండర్ కట్టబెట్టారని పిటిషనర్ తరఫు న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించారు. -
బీజేపీ ఆందోళన ఉద్రిక్తం
కరీంనగర్‌సిటీ: ధర్మాగ్రహ యాత్ర పేరుతో హైద్రాబాద్ నుంచి యాదాద్రి వరకు నిర్వహించాలనుకున్న పరిపూర్ణానంద స్వామిని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు గృహ నిర్భంధంతోపాటు నగర బహిష్కరణ విధించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ అన్నారు. స్వామిపై రాష్ట్ర ప్రభుత్వం నగర బహిష్కరణ నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని పోలీస్హెడ్క్వార్టర్స్ ఎదుట ప్రధాన రహదారిపై బుధవారం భారీ రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాదాపు గంటసేపు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించి బండి సంజయ్‌తో సహా కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ పరిపూర్ణనందను నగర బహిష్కరణతో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న హిందూ వ్యతిరేక విధానం బహిర్గతమైందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువుల ఆరాద్యదైవమైన శ్రీరాముని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కత్తి మహేశ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి రిమాండ్ చేయకుండా కేవలం నగర బహిష్కరణ వేటుతో చేతులు దులుపుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర మతస్తుల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చట్టానికి లోబడి నిరసన వ్యక్తం చేస్తున్న పరిపూర్ణానందపై కూడా నగర బహిష్కరణ వేటు వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, జోనల్ ఇన్చార్జి తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, కొత్తపెల్లి రతన్‌కుమార్, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, బీజేపీ, బీజేవైఎం నాయకులు గాజె రమేశ్, ఎన్నం ప్రకాశ్, మామిడి రమేశ్, కందుకూరి ఆంజనేయులు, శశి, పొన్నం మొండయ్య, కాశెట్టి శేఖర్, బండ అనిత, జెల్లోజు చిట్టిబాబు, ఉప్పరపెల్లి శ్రీనివాస్, పర్వతం మల్లేశం, ముప్పిడి సునీల్, కందుకూరి వెంకట్, అక్షయ్, తిరుపతి, సాయి, మహేశ్, హరీశ్, ఓదెలు, రామురాయ్, అభిలాష్, ప్రణయ్, నిఖిల్, సుమన్, సుధాకర్, రంజిత్ తదితరు పాల్గొన్నారు. -
కాకినాడకు చేరిన పరిపూర్ణనంద
-
‘అనుమతిచ్చారు.. లేదు ఇవ్వలేదు’
సాక్షి, హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్బంధం చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మండిపడ్డారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రను పోలీసులు అడ్డుకుని ఆయనను గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. దీనిపై రామచంద్రరావు మంగళవారం మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామి యాత్రకు పోలీసులే అనుమతి ఇచ్చారని, తిరిగి పోలీసులే యాత్ర చేయకుండా గృహ నిర్బంధం చేశారని అన్నారు. కనీసం ఇతరులు కూడా ఆయనను కలవడానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, ఏం నేరం చేశారని నిర్బంధించారని ప్రశ్నించారు. పోలీసులే అనుమతినిచ్చి.. తిరిగి రద్దు చేయడమేంటన్నారు. స్వామిజీ వెంట వెళ్లే 400 మందికే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం నాలుగు కోట్ల మంది ప్రజలకు ఎలా రక్షణ ఇస్తుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే గృహ నిర్బంధం రద్దు చేసి.. స్వామిజీపై వేధింపులు ఆపాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. కాగా, పరిపూర్ణానందకి తాము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. -
పరిపూర్ణానంద గృహ నిర్బంధం
హైదరాబాద్: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో ఆయనను గృహ నిర్బం ధం చేశారు. ఉదయం ఆయన ఉంటున్న ప్రాంతా నికి భారీగా చేరుకున్న పోలీసులు.. పరిపూర్ణానంద స్వామిని బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పరిపూర్ణానంద ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం 8 నుంచే జూబ్లీహిల్స్ ఫిలింనగర్ రహదారులన్నీ పోలీ సు దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పరిపూర్ణానంద స్వామి భక్తులు జూబ్లీహిల్స్‌కు తరలి రావడంతో రహదారులన్నీ భక్త జనసందోహంతో కిటకిటలాడాయి. నినాదాలతో దద్దరిల్లాయి. భక్తులంతా పరిపూర్ణానందను విడుదల చేయాలంటూ గొడవకు దిగారు. పోలీసులతో పలువురు భక్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 20 మంది భక్తులను పోలీసులు అరెస్ట్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానందను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్ ప్రభాకర్ వచ్చారు. అయితే చింతలను మాత్రమే లోనికి అనుమతించారు. అలాగే పీఠాధిపతి విద్యా గణేశానంద సరస్వతి కూడా పరిపూర్ణానందను పరామర్శించారు. పెట్రోల్‌తో అర్చకుడి హల్చల్ పరిపూర్ణానంద స్వామిని గృహనిర్బంధం చేయడాన్ని జీర్ణించుకోలేని అర్చకుడు రాహుల్ దేశ్‌పాండే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆయన చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
సంచలనం కోసమే ‘కత్తి’ మాట్లాడుతున్నారు
హైదరాబాద్ : హిందువుల పట్ల జరిగిన సంఘటనకు దేశ విదేశాల్లో ఉన్న హిందువులు అందరూ ఆవేదనకు గురయ్యారని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆదివారం పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. హిందూ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రాముడు ఒక దగుల్భాజీ అని, సీత రాముని కన్నా రావణాసురుడి దగ్గర ఉంటేనే ఎక్కువ సుఖపడేదని కత్తి మహేశ్ ఆరోపణలు చేయడం చూస్తుంటే..ఆయన సంచలనం కోసమే ఇలా మాట్లాడుతున్నాడని తెలుస్తోందని అన్నారు. కత్తి వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సీతమ్మను దూషించడం అంటే యావత్ స్త్రీ జాతిని అనడమేనన్నారు. రాజ్యాంగంలో శ్రీరాముని చిత్రపటాన్ని పెట్టడానికి కారణం..రాముడు చర్రిత కారుడు అని చెప్పడానికేనని తెలిపారు. ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించడం కాదా అని ప్రశ్నించారు. పైశాచిక ఆనందం కోసమే ఇలా మాట్లాడుతున్నారని కత్తి మహేశ్‌ను ఉద్దేశించి అన్నారు. ఇది దేశద్రోహం..బడుగు బలహీన వర్గాల ముసుగులో మహేశ్ ఈవిధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రామనామ స్మరణ చేస్తూ అన్ని వర్గాల వారు రేపు(సోమవారం) తనతో పాదయాత్ర చేస్తారని తెలిపారు. కత్తి మహేశ్ మాటల వెనక కుట్ర ఉందని, కులాల అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. . ‘ నీకు ఎలా సమాధానం చెప్పాలో మా వాళ్ల దగ్గర ఉపాయాలు ఉన్నాయ్. పోలీసులు, ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అదుపు తప్పి బరితెగించి వ్యాఖ్యలు చేస్తున్నారు. కత్తి మహేష్ వ్యాఖ్యలకు రెండు రాష్ట్రాల సీఎంలు సమాధానం చెప్పాలి. ప్రతి శ్రీరామ నవమికి ఇద్దరు సీఎంలు దగుల్బాజీల దగ్గరకు పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్నారో చెప్పాలి. ఎవరు ఏ మతం మీద దాడి చేసినా ప్రభుత్వం సెక్యులర్‌గా పని చేయాలి. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి. నీవు హిందువు కాదు, శ్రీరాముడిని దూషించిన వారు ఎవరూ హిందువులు కాదు. రేపు(సోమవారం) బషీర్ బాగ్ నుంచి యాదగిరిగుట్ట వరకు ధర్మాగ్రహా యాత్ర చేస్తాం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీరాముడికి పాలాభిషేకం చేస్తాం. సాధువులకు నిగ్రహం అవసరం అంటున్నారు. ధర్మ పరిరక్షణకు మేము సైనికులము అవుతా’ మని హెచ్చరించారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీ పీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి, కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగాలకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ..శక్తిని ప్రసాదించే తిరుమల క్షేత్రంలో అనేక అవకతవకలు, ఆరోపణలు రావడం చాలా బాధాకరమన్నారు. అధికారులు, అర్చకులు, పాలక వర్గాల మధ్య సమన్వయ లోపమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. వెంటనే టీటీడీపై వస్తోన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. లేకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగా మాట్లాడుతూ..హిందూమతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పర్యటన బాగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. తనకు సరైన ఆతిధ్యం ఇచ్చినందుకు భారతదేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. రైలా ఓడింగా 2008 నుంచి 2013 మధ్య కెన్యా ప్రధానిగా పనిచేశారు. -
ఐలయ్యను దేశ ద్రోహిగా గుర్తించాలి
-
ఐలయ్యను దేశ ద్రోహిగా గుర్తించాలి
సాక్షి, కాకినాడ రూరల్ : ఐలయ్య వ్యవహారం చూస్తే దేశ సమైక్యతకే ముప్పు తెచ్చేలా ఉందని, అటువంటి వ్యక్తిని దేశద్రోహిగా పరిగణించి ఆయన వ్యవహారాలపై విచారణ చేపట్టాలని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానందస్వామి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శ్రీపీఠంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐలయ్య వ్యవహారం హిందూ ధార్మిక వ్యవస్థనే ప్రశ్నించేలా మారిందన్నారు. రూ.లక్ష కోట్లిస్తే ఏదైనా చేస్తానంటూ ఐలయ్య టీవీ షోలో బహిరంగంగా మాట్లాడడం చూస్తే ఆయన దేశద్రోహిగా స్పష్టమవుతోందని చెప్పారు. మతం మారిన ఐలయ్యకు ఇంకో మతాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. దసరా నవరాత్రుల అనంతరం రాష్ట్రంలోని తమ గురువులు, అనుచరులతో చర్చించి ఒక కార్యాచరణను రూపొందించి ఆ దిశగా ఆందోళన చేపట్టనున్నట్లు వివరించారు. సమావేశంలో బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాస్త్రి ఉన్నారు. -
పెద్ద తుంబళం మరో అయోధ్య
ఆదోని రూరల్/అర్బన్: పెద్ద తుంబళంలోని పురాతన రామాలయాన్ని అభివృద్ధి చేస్తే మరో అయోధ్యగా ప్రఖ్యాతి చెందుతుందని కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేర్కొన్నారు. సోమవారం ఆయన పెద్ద తుంబళం గ్రామాన్ని సందర్శించి అక్కడి పురాతన రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఇక్కడ 800 ఏళ్ల క్రితం నాటి దేవాలయం ఇప్పటికి పటిష్టంగా ఉండటం విశేషమన్నారు. మాన్యం భూముల ద్వారా ఆదాయం వస్తున్నా ఆయలం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో ఇటీవలే మాట్లాడి రూ. కోటితో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను పూనుకున్నట్లు చెప్పారు. అనంతరం అదే గ్రామంలోని జైన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ౖజైన్ సంప్రదాయబద్దంగా స్వామికి శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త విట్టారమేష్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. రామరాజ్యం రావాలంటే గురువులే రావాలి రామరాజ్యం రావాలంటే రాజకీయ నాయకులచేత రాదని, గురువులొస్తేనే రామరాజ్యం వస్తుందని పరిపూర్ణానందస్వామి అన్నారు. సోమవారం పట్టణంలోని భవసాగర కల్యాణ మండపంలో పురప్రముఖుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశంపై ఎందరో దాడులు చేసినా దేశ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నది గురువులేన్నారు. రామమందిరం నిర్మాణం చేయాలంటే రామనామంతో పాటు, కార్యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖులు విట్టా కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, విట్టా రమేష్, శ్రీకాంత్‌రెడ్డి, మారుతీరావు, ప్రకాష్‌జైన్ తదితరులు పాల్గొన్నారు. -
హిందూ ధర్మంపై దాడి చేస్తే..
పరిపూర్ణానందస్వామి ఆదోని : హిందూ ధర్మంపై దాడులు చేస్తే వారికి నామరూపాలుండవని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానందస్వామి అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన ‘ఓ హిందు మేలుకో.. నీ ధర్మం తెలుసుకో’ అనే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. హిందుత్వం మతం కాదని మానవ ధర్మమని పేర్కొన్నారు. హిందూ ధర్మంపై 2200 ఏళ్లపాటు దాడులు జరిగాయన్నారు. అయితే దాడులు చేసిన మహ్మదీయులు, డచ్‌లు, మొగలాయిలు ఇలా ఎందరో.. తమ నామరూపాలు కోల్పోయినా హిందూ ధర్మం నేటికీ పటిష్టంగా ఉందని తెలిపారు. మానవ ధర్మాన్ని కాపాడేవారు దళితులైనా హిందూ ధర్మం దేవతగా పూజిస్తుందని, ఇందుకు మహాయోగి లక్ష్మమ్మవ్వే నిదర్శనమన్నారు. శ్రీ రాముడు దేవుడైతే, ఆంజనేయుడు ఆయన సేవకుడని, అయితే శ్రీరాముడి ఆలయాలు కొన్ని ప్రాంతాల్లో కనిపించకపోయినా ఆంజనేయుడి ఆలయాలు మాత్రం ప్రతి వీధిలోనూ దర్శనమిస్తాయన్నారు. సేవకుడిని దేవుడిగా పూజించే గొప్ప గుణం హిందూ ధర్మానికి ఉందని వివరించారు. నేటి పాలకులు సమాజాన్ని కులాలతో ముక్కలు చేసి హిందూ ధర్మాన్ని కాలరాస్తున్నారని, ఏదో ఒక రోజు ఇలాంటి వారంతా నామరూపాలు కోల్పోక తప్పదని హెచ్చరించారు. హిందూ ధర్మ పరిరక్షణకు వేదికలుగా ఉన్న ఆలయాలు మన రాష్ట్రంలో దాదాపు 13000 మూత పడ్డాయని, వాటికి పాలకులు పూర్వ వైభవం కల్పించాలని కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ క్రిష్ణరావు హిందూ ధర్మ పరిరక్షణపై మాట్లాడగా కార్యక్రమం ఆహ్వాన సమితి అధ్యక్ష, ఉపాధ్యక్షులు విట్టారమేష్, బసవన్న గౌడు, శ్రీకాంత్‌రెడ్డి, ప్రకాష్‌జైన్, టీజీ పాండురంగశెట్టి ఆర్గనైజింగ్ కార్యదర్శి రామాంజినేయులు, పట్టణ ప్రముఖులు బుగ్గారమేష్, మాలేకర్ శ్రీనివాసులు, హరియాదవ్, చెన్నబసప్ప, అశోక్, శ్రీనివాస ఆచారి, పీఎస్మూర్తి పాల్గొన్నారు. -
తెలంగాణ గడ్డ స్వర్ణభూమిగా మారాలి
కామారెడ్డి/కామారెడ్డిటౌన్: తెలంగాణ గడ్డ స్వర్ణభూమిగా మారాలని, గోదారమ్మ పరవళ్లతో ఇక్కడి నేలల్లో బంగారు పంటలు పండాలని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. కామారెడ్డిలో సోమవారం రాత్రి అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో ఈ నెల 31న జరగనున్న మహాస్వర్ణాభిషేకంతో ఈ ప్రాంతం పునీతం కానుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది నాలుగుకోట్ల రతనాల తెలంగాణ వజ్రాల తెలంగాణగా మారాలన్నారు. కోతి నుంచి మనిషి పుట్టాడని చాటిచెప్పిన డార్విన్ దార్శనికుడని కొనియాడారు. ఆయనకు మన పురాణాలు అంది ఉంటే తన భావనలను పూర్తిగా మార్చుకుని ఉండేవాడన్నారు. అనంతరం దశావతారాలను గురించి ప్రబోధించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ పాల్గొని, అసాంతం ఆసక్తిగా విన్నారు. ఆయనను పరిపూర్ణానంద అభినందిస్తూ శాలువతో సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతను ప్రబోధిస్తూ ఆదరాభిమానాలను చూరగొన్న పరిపూర్ణానంద కామారెడ్డికి వచ్చి ఐదురోజుల పాటు ప్రవచించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ అన్నారు. మహాపడిపూజ నిర్వాహకులను అభినందించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు కామారెడ్డి: లౌకికవాదమనే నినాదాన్ని తలకెత్తుకున్న పాలకులు మతం ముసుగు ధరించారని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి విమర్శించారు. సోమవారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులిద్దరూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల వారు క్రిస్మస్ వేడుకల సందర్భంగా చేసిన ప్రకటనలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. క్రైస్తవం తీసుకున్న దళితులకు దళిత రిజర్వేషన్ బిల్లు తెస్తామంటూ ఏపీ సీఎం అంటున్నారని, ఇది ఎంత మాత్రం ఆ మోదించతగినది కాదన్నారు. ఆదాయ వనరులు ఉండే హిందూ దేవాలయాలపై పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని వర్గాల వారు ఓట్లేస్తేనే వారు అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు మేధాసంపత్తి కలవారని, స్వలాభం, ఓట్ల కోసం మతాలను కలుషితం చేయొద్దని, మతాల అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దని కోరారు.