పరిపూర్ణనంద స్వామి
సాక్షి, తూర్పుగోదారి: మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై పరిపూర్ణనాధ స్వామి నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. శనివారం కాకినాడలోని శ్రీపీఠంలో ఉన్న స్వామీజీని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, వీహెచ్పీ, గోరక్షక దళం, ఏబీవీపీ, ఆర్‌హెచ్‌ఎస్, హిందూ ధార్మిక సంస్థల నేతలతో పాటు, ఉప్పల్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ స్వామీజీని మర్యాద పూర్వకంగా కలిశారు . వారు స్వామీజీతో సుమారు గంటపాటు సమావేశమైయ్యారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...విశ్వహిందూ సమాజం తరుపున పరిపూర్ణనంద స్వామిని హైదరాబాద్‌కు రమ్మని సాదరంగా ఆహ్వానించామని తెలిపారు. దీనికి స్వామీజీ కూడా సానుకూలంగా స్సందించారు అన్నారు. హైదరాబాద్‌లో స్వామీజీపై ఉన్ననగర బహిష్కరణపై హైకోర్టు స్టే ఇచ్చిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం ఆయనకు ఘన స్వాఘతం పలుకుతుందని భావిస్తున్నామని ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment