RSS leaders
-
యోగి, ఆర్ఎస్ఎస్ పేరు చెప్పమని ఏటీఎస్ బెదిరించింది
ముంబై: పేలుడు కేసులో నలుగురు ఆర్ఎస్ఎస్ నేతలు, యూపీ సీఎం ఆదిత్యనాథ్ పేర్లను చెప్పమని ముంబై ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) తనను బెదిరించిందని 2008 మాలేగాం పేలుడు కేసులో సాక్షి మంగళవారం కోర్టుకు చెప్పారు. నాడు ఆ కేసును ప్రస్తుతం పలు కేసులు ఎదుర్కొంటున్న పరమ్‌బీర్ సింగ్ పర్యవేక్షించారు. నాడు సదరు సాక్షి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అయితే హఠాత్తుగా తనను బెదిరించి పేర్లు చెప్పించారని సాక్షి కోర్టుకు చెప్పడం కలకలం రేపింది. కేసుపై ఎన్ఐఏ కోర్టు విచారణ జరుపుతోంది. పరమ్‌బీర్ సహా మరో అధికారి యోగి, ఆర్ఎస్ఎస్ నేతల పేర్లను చెప్పమని బెదిరించారని తాజా విచారణలో సాక్షి కోర్టుకు విన్నవించారు. తనను ఏటీఎస్ హింసిందన్నారు. దీంతో సాక్షి ఏటీఎస్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ను అంగీకరించమని కోర్టు ప్రకటించింది. ఇంతవరకు ఈ కేసులో 220 సాక్షులను విచారించారు. వీరిలో 15మంది అడ్డం తిరిగారు. ఈ నేపథ్యంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మన్మోహన్, సోనియా గాంధీ, రాహుల్, సల్మాన్‌ఖుర్షిద్, ప్రియాంక క్షమాపణలు చెప్పాలని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో రాజకీయ కుట్రతో ఈ కేసును రిజిస్టర్ చేశారన్నారు. కాంగ్రెస్ కుట్రలను తనను బెదిరించారన్న సాక్షి స్టేట్మెంట్ బహిర్గతం చేసిందన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇతర ప్రతిపక్షాలు సైతం కాంగ్రెస్‌కు వత్తాసు పలికాయని విమర్శించారు. -
ఇంజనీరింగ్ కోర్సుల్లో రామాయణ, మహాభారతాలు....!
న్యూఢిల్లీ: తులసీదాస్ రచించన రామాయణాన్ని గ్రాడ్యుయేషన్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని మధ్య ప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాశ్ సారంగ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భవిష్యత్తరాలలో వైద్య విద్యను హిందీ మాధ్యమంలో చదువుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. దీని కోసం ఒక కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిలబస్ కమిటీ ఉన్నత విద్యా విధానంలో భాగంగా 2021-22 విద్యా సంవత్సారానికి గానూ రామచరిత మానస్ కీ వ్యవహార దర్శన్ (అప్లైడ్ ఫిలాసఫీ ఆఫ్ రామచరిత మానస్)ని ప్రవేశ పెట్టేలా చేశానని చెప్పారు. (చదవండి: మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్: ముంబై ) ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్సులో మహాభారతం లాంటి పురాణాలను ప్రవేశపెడితే.. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాశానికి, నాయకత్వ లక్షణాల అభివృద్ధి తోపాటు మానవతా దృక్పథాన్ని పెంపొందించేలా దోహదపడుతుందన్నారు. ఈ మేరకు భారతదేశ సంస్కృతి ఆధ్యాత్మికతకు సంబంధించి 100 మార్కుల ప్రశ్నా పత్రం ఒకటి ఉంటుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ నాయకుల బయోగ్రఫి కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలనే ప్రతిపాదన ఉందన్నారు. దీంతో విద్యార్థులు సామాజికంగా, వైద్య పరంగానూ నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించగలిగే అవకాశం ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ...." విద్యా వ్యవస్థను కాషాయికరణం చేస్తున్నాంటు వస్తోన్న ప్రతి పక్షాల విమర్శలను ఖండించారు. ఈ క్రమంలో నాసా సైతం 'రామసేతు' నిర్మాణాన్ని ప్రాచీన మానవ నిర్మిత నిర్మాణంగా అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యావ్యవస్థలో కాలనుగుణంగా మార్పులు చోటు చేసుకుంటాయి." అని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు గురుగ్రంథ సాహెబ్, ఖురాన్, బైబిల్ కూడా చేరిస్తే విద్యార్థులు మరిన్ని నేర్చుకునే అవకాశంతో పాటు రాజ్యంగ స్ఫూర్తి కూడా నెరవేరుతుందంటూ వ్యంగ్యాస్తాలు కురిపించారు. (చదవండి: పర్యాటకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఇక అంతే !: రాజస్తాన్) -
పరిపూర్ణనందను కలిసిన హిందూ ధార్మిక సంస్థల నేతలు
సాక్షి, తూర్పుగోదారి: మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై పరిపూర్ణనాధ స్వామి నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. శనివారం కాకినాడలోని శ్రీపీఠంలో ఉన్న స్వామీజీని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ, గోరక్షక దళం, ఏబీవీపీ, ఆర్హెచ్ఎస్, హిందూ ధార్మిక సంస్థల నేతలతో పాటు, ఉప్పల్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ స్వామీజీని మర్యాద పూర్వకంగా కలిశారు . వారు స్వామీజీతో సుమారు గంటపాటు సమావేశమైయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...విశ్వహిందూ సమాజం తరుపున పరిపూర్ణనంద స్వామిని హైదరాబాద్‌కు రమ్మని సాదరంగా ఆహ్వానించామని తెలిపారు. దీనికి స్వామీజీ కూడా సానుకూలంగా స్సందించారు అన్నారు. హైదరాబాద్‌లో స్వామీజీపై ఉన్ననగర బహిష్కరణపై హైకోర్టు స్టే ఇచ్చిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం ఆయనకు ఘన స్వాఘతం పలుకుతుందని భావిస్తున్నామని ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. -
ఆర్ఎస్ఎస్ వాళ్లు హోమోలు: ఆజంఖాన్
ఉత్తరప్రదేశ్ కేబినెట్లో సీనియర్ మంత్రి ఆజంఖాన్ మరోసారి నోరు పారేసుకున్నారు. ''ఆర్ఎస్ఎస్ నేతల్లో చాలామంది ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే.. వాళ్లు హోమో సెక్సువల్స్'' అని వ్యాఖ్యానించారు. స్వలింగ శృంగారంపై 2014 నాటి తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనీ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. రాంపూర్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమం నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులను ఉద్దేశించి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆజంఖాన్‌కు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. దీనిపై ఆజంఖాన్ స్థానిక మీడియా ప్రతినిధి ఫసాహత్ అలీఖాన్ షాను మరింత వివరణ ఇచ్చారు. మంత్రి వ్యాఖ్యలను అనవసరంగా పెద్దవి చేస్తున్నారని ఆయన అన్నారు. భారతదేశంలో స్వలింగ శృంగారాన్ని నేరం కాదని చెప్పించేందుకు ప్రయత్నిస్తున్న వాల్ల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని మాత్రమే చెప్పారన్నారు. భారత సంస్కృతిలో అలాంటి విషయాలకు తావు లేదని స్పష్టం చేశారు. స్వలింగ శృంగారాన్ని చట్టబద్ధం చేసేందుకు ఆర్ఎస్ఎస్ వాళ్లు ప్రయత్నిస్తున్నారంటే, వాళ్లు దాన్ని ప్రోత్సహిస్తున్నట్లేనని, బహుశా అందుకే వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవట్లేదని అన్నారు. -
రాయలసీమపై ప్రభుత్వం నిర్లక్ష్యం
♦ చంద్రబాబు సర్కార్‌పై మిత్రపక్షం బీజేపీ ఆగ్రహావేశాలు ♦ సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తేవాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కరువుతో అల్లాడే రాయలసీమపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మిత్రపక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రతీ విషయంలోనూ సీమకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయానికొచ్చింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో పార్టీ సీమ నేతలతో సమావేశం నిర్వహించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఇందులో సీమకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించినట్లు సమాచారం. శ్రీశైలంలో 100 టీఎంసీల మేర నీరున్నా సీమకు సాగునీరు ఇవ్వకుండా, తాగు నీటి అవసరాల పేరిట నీటి విడుదలకు ప్రభుత్వం పూనుకోవడాన్ని నేతలు తప్పుబట్టారు. నిబంధలను పక్కనబెట్టి పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం, సీమ ప్రాజెక్టుల విషయానికొచ్చేసరికి నిబంధనల పేరు చెప్పి మూలన పడేస్తున్నారని నేతలు అభిప్రాయానికొచ్చారు. సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. సీమకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టే చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఇక్కడి ప్రధాన సమస్యలపై ఒక నివేదిక రూపొందించి, కేంద్రం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక ప్యాకేజీ అడగాలని నిర్ణయించారు. సీమ మేధావుల ఉద్యమానికి దూరంగా.. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై ఆ ప్రాంత మేధావులు చేపట్టిన ఉద్యమానికి పార్టీ నేతలు దూరంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీనే కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. -
ఇఫ్తార్ విందులకు ఆర్ఎస్ఎస్ నేతలు!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. నూటికి నూరుశాతం హిందూ సంస్థ. అందులోనూ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎంత ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అలాంటిది, గుజరాత్లో నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు!! ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలకు ఆర్ఎస్ఎస్ నేతలు వెళ్తున్నారు. 2002 సంవత్సరంలో నాటి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ కేఎస్ సుదర్శన్ సూచనల మేరకు ఎంఆర్ఎం సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది గుజరాత్లో ఇప్పటివరకు ఏడు ఇఫ్తార్ పార్టీలు నిర్వహించారు. వడోదరలో ఈనెల 21న నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి బీజేపీ సీనియర్ నాయకుడు జయంతి బారోత్, ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ హాజరయ్యారు. వడోదరలోని పురుషోత్తం హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు దాదాపు 800 మంది హాజరయ్యారని, ఇలాంటి వాటి వల్ల రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని ఎంఆర్ఎం రాష్ట్ర సమన్వయకర్తల గనీ ఖురేషీ అన్నారు. ఆగస్టు మూడో తేదీన మెగా ఈద్ మిలన్ సంబరాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ అధికారులు మాత్రం తమంతట తాముగా ఈ విందులకు వెళ్లడంలేదు. ఆర్ఎస్ఎస్ తనంతట తానుగా ఎలాంటి ఇఫ్తార్ విందులు నిర్వహించడంలేదని గుజరాత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ జయంతి భదేషియా తెలిపారు. ఎంఆర్‌ఎంతో తమకు సంబంధం లేదని కూడా అన్నారు. -
ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్‌నాథ్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ నేతలతో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమావేశమైన మరుసటి రోజే ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వారితో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి రాజ్‌నాథ్ మంతనాలు జరిపారు. సోమవారం జరిగే తుది విడత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, ఈ నెల 16న జరిగే కౌంటింగ్ గురించి రాజ్‌నాథ్ ఆర్ఎస్ఎస్ పెద్దలతో చర్చించినట్టు భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేతలు భయ్యాజీ జోషీ, సురేష్ సోనీ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో మోడీ శనివారం సమావేశమయ్యారు.