ఆర్ఎస్ఎస్ వాళ్లు హోమోలు: ఆజంఖాన్
ఉత్తరప్రదేశ్ కేబినెట్‌లో సీనియర్ మంత్రి ఆజంఖాన్ మరోసారి నోరు పారేసుకున్నారు. ''ఆర్ఎస్ఎస్ నేతల్లో చాలామంది ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే.. వాళ్లు హోమో సెక్సువల్స్'' అని వ్యాఖ్యానించారు. స్వలింగ శృంగారంపై 2014 నాటి తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనీ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. రాంపూర్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమం నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ను, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులను ఉద్దేశించి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆజంఖాన్‌కు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.
దీనిపై ఆజంఖాన్ స్థానిక మీడియా ప్రతినిధి ఫసాహత్ అలీఖాన్ షాను మరింత వివరణ ఇచ్చారు. మంత్రి వ్యాఖ్యలను అనవసరంగా పెద్దవి చేస్తున్నారని ఆయన అన్నారు. భారతదేశంలో స్వలింగ శృంగారాన్ని నేరం కాదని చెప్పించేందుకు ప్రయత్నిస్తున్న వాల్ల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని మాత్రమే చెప్పారన్నారు. భారత సంస్కృతిలో అలాంటి విషయాలకు తావు లేదని స్పష్టం చేశారు. స్వలింగ శృంగారాన్ని చట్టబద్ధం చేసేందుకు ఆర్ఎస్ఎస్ వాళ్లు ప్రయత్నిస్తున్నారంటే, వాళ్లు దాన్ని ప్రోత్సహిస్తున్నట్లేనని, బహుశా అందుకే వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవట్లేదని అన్నారు.