Homosexuality
-
'లావెండర్ వివాహం' అంటే..? చాలామంది దీన్నే ఎంచుకోవడానికి రీజన్..?
ఇటీవల ట్రాన్స్ జెండర్లు, స్వలింగ సంపర్కులు తమ కంటూ ఓ గుర్తింపు, గౌరవంతో సమాజంలో మెలగాలని గట్టిగా ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగా పోరాటాలు చేస్తున్నారు, ప్రభుత్వంపై దృష్టికి తీసుకొస్తున్నారు. ఆ క్రమంలో వచ్చిందే ఈ ఈ లావెండర్ వివాహం. సామాజిక అంచనాలకు అనుగుణంగా లేదా ఆయా వ్యక్తిగత లైంగిక సామర్థ్యాన్ని దాచిపెడతాయి ఈ వివాహాలు. వారికి సమాజం నుంచి వచ్చే కళంకం నివారించేందుకు వచ్చిన ఓ గొప్ప మార్గం ఇది.ఇక్కడ లావెండర్ అనే పదం. చారిత్రాత్మకంగా స్వలింగ సంపర్కానికి సంబంధించిన రంగును సూచిస్తుంది. స్వలింగ సంపర్కులకు సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గకుండా నావిగేట్ చేసేలా భిన్న లింగ వివాహంలోకి ప్రవేశించేలా మార్గాన్ని సులభతరం చేసేదే ఈ 'లావెండర్ వివాహం'. దీన్నే యువత ఎంచుకోవడానికి గల కారణాలేంటంటే..?సామాజిక అంగీకారం, అంచనాలు..స్వలింగ సంపర్కుల హక్కులకు గుర్తింపులేని సమాజం నుంచి సానుకూల స్పందన లభించేలా ఈ వివాహాలను ఎంచుకుంటున్నారు. ఈ విధానం వల్ల కుటుంబ అంచనాలను, వారి వృత్తిని, సామాజిక స్థితిని కాపాడుకునేందుకు వచ్చినవే ఈ లావెంబర్ వివాహాలు.చట్టపరమైన ఆర్థిక ప్రయోజనాలు.. సాధారణంగా వివాహంలో ఉండే పన్ను మినహాయింపులు, వారసత్వ హక్కులు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు వంటివి ఈ లావెండర్ వివాహలో కూడా లభిస్తాయి. అయితే ఇక్కడ జంటలు తమ భాగస్వామి లైంగిక ధోరణని రహస్యంగా ఉంచడం వల్లే ఈ బెనిఫిట్స్‌ని క్లైయిమ్ చేసుకోగలుగుతారు. సాంస్కృతిక, మతపరమైన ఒత్తిళ్లుసాధారణంగా సాంస్కృతిక లేదా మతపరమైన నిబంధనలు కారణంగా సమాజం నుంచి ఎదురయ్యే బహిష్కరణ తదితరాల నుంచి బయటపడేలా భిన్న లింగ సంబంధాలకు ప్రాధాన్యతనిచ్చే లావెండర్ వివాహాల్లోకి ప్రవేశిస్తున్నారు పలువురు.వ్యక్తిగత భద్రతస్వలింగ సంపర్కులు వివక్ష, హింస లేదా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికి ఈ లావెండర్ వివాహాల్లో వారి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దీని వల్ల ఆయా జంటలకు గట్టి భద్రత లభించినట్లు అవుతుంది. చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులకు సంబంధించి..వారి నిజమైన లైంగిక గుర్తింపును కప్పిపుచ్చడం ద్వారా వారు వ్యక్తిగత భద్రతతో ఉన్నట్లు భావించగలుగుతారు. వారు ఇతర జంటల మాదిరిగా స్వేచ్ఛగా మనగలుగుతారు. అందుకే ఇటీవల ఈ వివాహాలకు ప్రాధాన్యత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: బొప్పాయి ఆకులతో గుండె,కాలేయం,కిడ్నీలు పదిలం! అదెలాగంటే..) -
నా భర్త సంసారానికి పనికిరాడు.. పెళ్లయి రెండేళ్లయినా..
కర్ణాటక: స్వలింగ సంపర్కానికి అలవాటుపడిన భర్తతో వేగలేనంటూ అతని భార్య పోలీస్‌స్టేషన్ మెట్లెక్కింది. బాధితురాలు నగరంలోని జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు... 2020 ఆగస్టు 30 తేదీన మల్లత్తహళ్లి బాలాజీ లేఔట్‌కి చెందిన ఐటీ ఇంజినీరుతో ఆమెకు పెళ్లయింది. ఎంబీఏ చదివి న ఆమె పెళ్లికి ముందు, తరువాత రెండేళ్లు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసింది. ఉద్యోగానికి వెళ్లరాదని అత్తమామ ఒత్తిడి చేయడంతో రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంది. పెళ్లయి రెండేళ్లయినా ఇద్దరి మధ్య లైంగిక సంబంధం లేదు. సంతానం లేకపోవడం పట్ల ఇరుగుపొరుగు, బంధువులు ఆమెను ప్రశ్నించారు. భర్త తమ్మునికి పెళ్లయి ఏడాదిలో పిల్లలు పుట్టారు, మీకేమిటి సమస్య అని అడిగేవారు. దీనిపట్ల మహిళ భర్తతో చర్చించగా అతడు పట్టించుకోలేదు, కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించగా అది విఫలమైంది. మొబైల్లో గుట్టు రట్టు భర్త మొబైల్‌ను పరిశీలించగా అందులో పురుషునితో శారీరక సంబంధం ఉన్న ఫోటోలు, వీడియోలు కనబడ్డాయి. దీనిపై ప్రశ్నించగా భర్త వేధింపులు మొదలుపెట్టాడు. భర్త స్వలింగ సంపర్కంతో విరక్తి చెందిన భార్య పుట్టింటికి చేరుకుంది. భర్త ఆమెకు నిత్యం ఫోన్ చేసి ఇలాంటి తప్పు చేయనని, ఇంటికి రావాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. పెద్దలు కూడా రాజీ యత్నాలు చేసినా గే తో సంసారం చేయలేనని ఆమె తేల్చిచెప్పింది. దీంతో వేధింపులు పెరిగిపోవడంతో బాధితురాలు భర్త, అత్తమామలపై జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. -
అందరి కళ్లూ సుప్రీం పైనే!
దేశంలో సంప్రదాయం ఒకటి ఉండవచ్చు. రాజ్యాంగమిచ్చే హక్కు వేరొకటి కావచ్చు. రెంటి మధ్య ఘర్షణలో త్రాసు ఎటు మొగ్గాలి? ధర్మసందేహమే! విభిన్న ప్రకృతులైన స్త్రీ పురుషుల సంపర్కం, వివాహమే భారతీయ సమాజ సంప్రదాయం, చట్టబద్ధం. సంప్రదాయం కాకపోగా, బ్రిటీషు కాలపు చట్టం కింద నిన్నటి దాకా శిక్షార్హమైన స్వలింగ సంపర్కం మారుతున్న కాలానుగుణంగా శిక్షార్హం కాదని కొన్నేళ్ళ క్రితమే తీర్పిచ్చిన మన సుప్రీమ్ కోర్ట్ ఇక స్వలింగ వివాహమూ చట్టబద్ధమేనని తేలుస్తుందా అన్నది చర్చనీయాంశం. భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కేంద్రం తన అఫిడవిట్లో మార్చి 13న వ్యతిరేకించింది. ‘ఎంతో ప్రభావశీలమైన’ ఈ కేసులో తుది వాదనలు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విని, నిర్ణయిస్తుందని సుప్రీమ్ తేల్చింది. ఈ కేసు, ఏప్రిల్18 నుంచి ప్రత్యక్షప్రసారంలో జరగనున్న వాదనలు భారత సమాజంలో కీలకం కానున్నాయి. పౌరులందరూ సమానులేనన్నది రాజ్యాంగ మౌలిక సూత్రం. వ్యక్తిగత ఇష్టానిష్టాలు, అభిప్రా యాలు, అలవాట్లు, నమ్మకాలను బట్టి దాన్ని మార్చలేం. మార్చకూడదు. కాబట్టి స్వలింగ సంపర్కు లకూ అందరితో సమానంగా హక్కులు రాజ్యాంగ విహితమే. అయితే, సంప్రదాయవాద భారతీయ సమాజంలో స్వలింగ వివాహం సున్నిత అంశం. అన్ని వర్గాల నుంచి అన్ని రకాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోకుండా చటుక్కున తేల్చే వ్యవహారం కాదు. ఆధునిక అమెరికాలోనూ దీర్ఘ కాలం దీనిపై చర్చోపచర్చలు నడిచాయి. అక్కడ డజనుకు పైగా రాష్ట్రాల్లో ఈ పెళ్ళిళ్ళు నిషిద్ధం. 2008లో తొలిసారి అధ్యక్షపదవికి పోటీకి దిగినప్పుడు ఒబామా సైతం ఈ వివాహాల్ని వ్యతిరేకించారు. దీర్ఘపోరు తర్వాత 2015లో అమెరికా సుప్రీమ్ తీర్పుతో 50 రాష్ట్రాల్లోనూ పరిస్థితి మారింది. నిజానికి, 2018 సెప్టెంబర్‌లో భారత సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కం శిక్షార్హం కాదని తేల్చింది. పాతకాలపు చట్టాన్ని పక్కనపెట్టి ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే గగ్గోలు పుట్టింది. సాంస్కృతిక విలువలకు తిలోదకాలిచ్చి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటున్నామంటూ విమర్శలు రేగాయి. తీరా స్వలింగ సంపర్కం తప్పు కాదని కోర్టు చెప్పినా తమకు సామాజిక అంగీకారం లభించడం లేదనీ, తమపై దుర్విచక్షణ సాగుతూనే ఉందనీ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ల (ఎల్జీబీటీక్యూ) వర్గం ఫిర్యాదు చేస్తోంది. కథ చకచకా ముందుకు సాగి, స్వలింగ సంపర్కం నేరం కాదనే దశ నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరడం దాకా ఇప్పుడు వచ్చింది. హోమో సెక్సువల్ పెళ్ళిళ్ళను చట్టబద్ధమైనవని గుర్తించాలని కోరుతూ, 2020లోనే ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తర్వాత సుప్రీమ్‌కు పిటిషన్లు చేరాయి. కోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. కేంద్రం మార్చి 13న సుప్రీమ్‌లో తన అఫిడవిట్ దాఖలు చేస్తూ, స్వలింగ వివాహాల చట్టబద్ధతకు ససేమిరా అంది. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలు శిక్షార్హమని భారత శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్ మాట. ఆ సెక్షన్ కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని అయిదేళ్ళ క్రితం తీర్పునిచ్చినంత మాత్రాన ఏకంగా స్వలింగ వివాహాన్ని వివిధ చట్టాల కింద తమ ప్రాథమిక హక్కని పిటిషనర్లు అనుకోరాదన్నది ప్రభుత్వ వాదన. భారతీయ కుటుంబ వ్యవస్థకూ, ఈ స్వలింగ వివాహాలకూ పొంతన కుదరదని సర్కారీ అఫిడవిట్. 2018లో కోర్ట్ వల్ల రాజ్యాంగ హక్కులు లభించాయి కానీ, స్వలింగ వివాహాల్ని చట్టప్రకారం గుర్తించనిదే వైద్యచికిత్సకు సమ్మతి పత్రంపై సంతకాలు, పింఛన్లు, దత్తత స్వీకారాలు, చివరకు స్వలింగ దంపతులకు క్లబ్ సభ్యత్వాల లాంటి ప్రాథమిక హక్కులూ కరవేనని ఎల్జీబీటీ ఉద్యమకారుల వేదన. ఈ పరిస్థితుల్లో మార్చి 18 నుంచి రాజ్యాంగ ధర్మాసనం జరిపే విచారణకై వేచిచూడాలి. 1989లో ప్రపంచంలోనే తొలిసారిగా డెన్మార్క్ స్వలింగ భాగస్వామ్యాన్ని అనుమతిస్తూ చట్టం చేసింది. ఇక బ్రిటన్‌లో ఈ పెళ్ళిళ్ళను అంగీకరించడానికి 32 ఏళ్ళు పట్టింది. అమెరికాలో పుష్కర కాలమైంది. ఫ్రాన్స్‌లో ఏకంగా 220 ఏళ్ళు పట్టింది. స్వలింగ సంపర్కం ఎన్నడూ నేరమే కాని తైవాన్‌లో సైతం మొన్న 2019లో కానీ వీటికి ప్రభుత్వ గుర్తింపు దక్కలేదు. భారత్ మరి గత అయిదేళ్ళలోనే ఈ సంప్రదాయ విరుద్ధ, సాహసోపేత నిర్ణయం తీసుకొనే దశకు చేరుకుందా? ఆధునిక సమాజంలో ఎల్జీబీటీ హక్కుల్ని కాదనలేం. కానీ ఇప్పటికీ పెళ్ళంటే ఒకే కులం, మతం, సంప్రదాయాలకే మొగ్గే మెజారిటీ జనమున్న దేశంలో ఈ మార్పు భావోద్వేగభరిత అంశం. ధార్మిక, అంగీకృత సామాజిక విలువలు ముడిపడ్డ ఈ అంశంలో తొందరపడితే పర్సనల్ చట్టాల తేనెతుట్టె కదులుతుంది. పర్యవసానాలు సామాజికంగా, రాజకీయంగా తప్పవు. మెజారిటీ మనోభీ ష్టానికి వ్యతిరేకంగా లైంగిక సంబంధాలు, పెళ్ళి, లైంగిక సమ్మతి వయసు, దత్తత, వారసత్వహక్కు లాంటివి పాలకులు ముట్టనిదీ అందుకే. కడకు ఇలాంటివి కోర్టు గుమ్మం తొక్కడమూ సహజమే. ప్రస్తుతం ఆస్ట్రేలియా, జర్మనీ సహా 32 దేశాల్లో ఈ పెళ్ళిళ్ళు చట్టబద్ధమే. కానీ, లైంగిక మైనారిటీ దంపతుల పెంపకంలోని పిల్లల చదువు, ఆరోగ్యం, సామాజిక – ఆర్థిక పురోగతిపై వివిధ పరిశోధ నలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అది అటుంచినా, ఆ భావిపౌరులపై సమాజంలో పడే ముద్రకూ, ఎదురయ్యే సహాయ నిరాకరణకూ పరిష్కారమేంటి? స్వలింగ వివాహాలకు చట్టబద్ధత నిస్తే, అనేక చట్టాలను పునర్నిర్వచించక తప్పదు. అది మరో సవాలు. అన్నిటికీ సిద్ధమై, సమాజంలో అందరినీ సిద్ధం చేయకుండా తొందరపడితే కష్టం. అందుకే, ఇప్పుడు అందరి కళ్ళూ సుప్రీమ్ పైనే! -
స్వలింగ సంపర్కం నేరం కాదు: పోప్
వాటికన్ సిటీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఆ చట్టాలు పూర్తిగా అనైతికమైనవి. స్వలింగ సంపర్కం నేరం కాదు. దేవుడు తన పిల్లలందరినీ సమానంగా, బేషరతుగా ప్రేమిస్తాడు’’ అని అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘‘స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను కొందరు క్యాథలిక్ బిషప్‌లు కూడా సమర్థిస్తున్నారని నాకు తెలుసు. కానీ నా విజ్ఞప్తల్లా ఒక్కటే. స్వలింగ సంపర్కుల పట్ల కాస్త మృదువుగా వ్యవహరించాలి. వారిని కూడా చర్చిల్లోకి అనుమతించాలి. వారిని స్వాగతించి గౌరవించాలి తప్ప వివక్ష చూపి అవమానించరాదు’’ అని ఆయన సూచించారు. అయితే, స్వలింగ సంపర్కం పాపమేనని పోప్ పేర్కొనడం విశేషం. ‘‘ఇది ఒక దృక్కోణం. కాకపోతే ఈ విషయంలో సాంస్కృతిక నేపథ్యాలు తదితరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే ఇతరులపై జాలి, దయ చూపకపోవడమూ పాపమే. కాబట్టి నేరాన్ని, పాపాన్ని విడిగానే చూడటం అలవాటు చేసుకుందాం’’ అన్నారు. క్యాథలిక్ బోధనలు స్వలింగ సంపర్కాన్ని తప్పుడు చర్యగానే పేర్కొంటున్నా స్వలింగ సంపర్కులను కూడా ఇతరులతో సమానంగా గౌరవించాలని చెబుతాయి. క్యాథలిక్ చర్చి ప్రకారం స్వలింగ వివాహాలు నిషిద్ధం. దాదాపు 67 దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. వీటిలోనూ 11 దేశాల్లో ఇందుకు మరణశిక్ష కూడా విధించే ఆస్కారముందని ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ఉద్యమిస్తున్న హ్యూమన్ డిగ్నిటీ ట్రస్ట్ పేర్కొంది. అమెరికాలో కూడా 12కు పైగా రాష్ట్రాలు దీన్ని నేరంగానే పరిగణిస్తున్నాయి. ఇలాంటి చట్టాలను రద్దు చేయాలని ఐక్యరాజ్యసమితి కూడా ప్రపంచ దేశాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. -
LGBTQI: అసహజమేనా!.. స్వలింగ సంపర్కంపై మారుతున్న దృక్కోణం
స్వలింగ సంపర్కం. అసహజ లైంగిక ప్రవృత్తి. ఇది కొత్తదేమీ కాదు. ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే అన్ని సమాజాల్లోనూ, అన్ని కాలాల్లోలోనూ అనివార్యంగా కన్పించే ధోరణే. కానీ కొన్ని దశాబ్దాల క్రితం దాకా దీనికి సమాజం ఆమోదం లేదు. సరికదా, ఇందుకు పాల్పడే వారిని దోషుల్లా పరిగణిస్తూ హీనంగా చూసే ధోరణే చాలా సమాజాల్లో ఉండేది. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్‌ను కూడా గే సెక్స్‌కు పాల్పడ్డారంటూ జైల్లో పెట్టారు! అత్యంత ప్రగతిశీల దేశంగా చెప్పుకునే ఇంగ్లండ్‌లో కూడా వందేళ్ల క్రితం ఇదీ పరిస్థితి! ఇప్పటికీ ఐరాస సభ్య దేశాల్లో 76కు పైగా స్వలింగ సంపర్కులపై వివక్షపూరితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. అయితే గత పాతికేళ్లుగా ఈ విషయంలో పౌర సమాజం దృక్కోణంలో చెప్పుకోదగ్గ మార్పు కన్పిస్తోంది. లైంగిక ప్రవృత్తి విషయంలో స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కు వంటిదేనన్న వాదనలూ బయల్దేరాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ సంబంధాలకు సమర్థన 1990ల్లో 20 శాతం లోపే ఉండగా 2020 నాటికి 70 శాతానికి పైగా పెరిగింది! తాజాగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అధ్యక్షుడు బైడెన్ సంతకం కూడా చేశారు. ఐక్యరాజ్యసమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు, హక్కుల సంఘాలు కూడా స్వలింగ సంపర్కానికి, ఆ వివాహాలకు కొన్నేళ్లుగా ఎంతగానో మద్దతిస్తున్నాయి. స్వలింగ వివాహాలను తొలిసారిగా 2000లో నెదర్లాండ్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత ఇప్పటిదాకా 34 దేశాల్లో చట్టపరంగానో, కోర్టు ఆదేశాల రూపేణో అందుకు ఆమోదం లభించింది. ఐరాస సభ్య దేశాల్లో భారత్‌తో పాటు మొత్తం 71 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాయి. ఆసియా దేశాల్లో... దక్షిణ, మధ్య ఆసియాతో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో స్వలింగ సంపర్కం, వివాహాలపై తీవ్ర వ్యతిరేకత, నిషేధం అమల్లో ఉన్నాయి. ఆసియాలో ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా తైవాన్ నిలిచింది. అలాగే చైనా కూడా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదు. అయితే వారి వివాహాన్ని మాత్రం నేరంగానే చూస్తోంది. వియత్నాం కూడా ఇవి నేరం కాదని పేర్కొన్నా ఇంకా పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించలేదు. ఆ దేశాల్లో మరణశిక్షే... సౌదీ అరేబియా, సుడాన్, యెమన్, ఇరాన్‌ల్లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే! నైజీరియా, సోమాలియాల్లోనూ కొన్ని ప్రావిన్సుల్లో ఇదే పరిస్థితి! అసహజ రతి, వివాహేతర సంబంధాలతో పాటు స్వలింగ సంపర్కులను కూడా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు అరబ్ దేశాలతో పాటు పలు ఇరత దేశాల్లో అమల్లో ఉన్నాయి. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ, ఖతార్ వంటి దేశాల్లోనూ ఇందుకు మరణశిక్ష విధించే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రూనై మాత్రం స్వలింగ సంపర్కాలకు మరణశిక్ష అమలు చేయబోమని ప్రకటించడం విశేషం. భారత్‌లో పరిస్థితి? మన దేశంలో ఆది నుంచీ స్వలింగ సంపర్కంపై చిన్నచూపే ఉంటూ వచ్చింది. బ్రిటిష్ వారి హయాంలో దీనిపై నిషేధం విధించారు. సుప్రీంకోర్టు కూడా ఇది ప్రకృతి విరుద్ధమని, శిక్షార్హమైన నేరమేనని 2013లో తీర్పు చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నాన్ బెయిలబుల్ నేరం. దీనికి పదేళ్ల దాకా జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ఎంతమాత్రమూ నేరం కాదని పేర్కొంటూ 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఉన్న దేశాలు చిలీ, స్విట్జర్లాండ్, కోస్టారికా, ఈక్వెడార్, తైవాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, మాల్టా, జర్మనీ, కొలంబియా, అమెరికా, గ్రీన్లాండ్, ఐర్లండ్, ఫిన్లండ్, లగ్జెంబర్గ్, స్కాట్లండ్, ఇంగ్లండ్, బ్రెజిల్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఉరుగ్వే, డెన్మార్క్, అర్జెంటీనా, పోర్చుగల్, ఐస్లాండ్, స్వీడన్, మెక్సికో, నార్వే, దక్షిణాఫ్రికా, స్పెయిన్, కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, తైవాన్ ఏమిటీ ఎల్జీబీటీక్యూఐ? ► రకరకాల అసహజ లైంగిక ప్రవృత్తులున్న వారందరినీ కలిపి ఎల్జీబీటీక్యూఐ అని వ్యవహరిస్తుంటారు. ► ఇది లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, ఇంటర్ సెక్స్‌కు సంక్షిప్త నామం. ► ఇద్దరు మహిళల మధ్య ఉండే లైంగికాసక్తి లెస్బియనిజం. ఇలాంటివారిని లెస్బియన్‌గా పిలుస్తారు. అదే పురుషుల మధ్య ఉంటే వారిని గే అంటారు. ► సందర్భాన్ని బట్టి ఎవరి మీదనైనా ఆకర్షణ చూపేవారు బై సెక్సువల్. ► ఇక పుట్టినప్పుడు ఆడ/మగగా ఉండి, పెరిగి పెద్దయ్యాక అందుకు భిన్నంగా మారేవారిని/మారేందుకు ఆసక్తి చూపేవారిని ట్రాన్స్‌జెండర్/ట్రాన్స్ సెక్సువల్ అంటారు. అంటే తృతీయ ప్రకృతులన్నమాట. మన దగ్గర హిజ్రాలుగా పిలిచేది వీరినే. దేశవ్యాప్తంగా వీరికి రకరకాల పేర్లున్నాయి. మళ్లీ వీరిలో చాలా రకాల వారుంటారు. ఉదాహరణకు మగ పిల్లాడిగా పుట్టి కూడా తనను తాను అమ్మాయిగా భావించుకుంటూ మరో అబ్బాయిని ఇష్టపడేవాళ్లు ఈ కోవలోకే వస్తారు. ఇలాంటివారిని హెటిరో సెక్సువల్ ట్రాన్స్‌జెండర్ అంటారు. ► క్యూ అంటే క్వీర్. వీరికి తాము ఆడా, మగా, ట్రాన్స్‌జెండరా, మరోటా అన్నదానిపై వాళ్లకే స్పష్టత ఉండదు. అందుకే వీరిని క్వశ్చనింగ్ అని కూడా అంటూంటారు. ► చివరగా ఇంటర్‌సెక్స్. అంటే పుట్టినప్పుడు జననాంగాల స్థితిగతులను బట్టి ఆడో, మగో చెప్పలేనివారు. మళ్లీ వీరిలోనే క్రాస్డ్రెస్సర్స్ అనీ, మరోటనీ పలు రకాలున్నాయి. ► ఎల్జీబీటీక్యూఐ మొత్తాన్నీ కలిపి ఇటీవల కామన్‌గా గే గా వ్యవహరిస్తున్నారు. ► వీరు తమ ఆకాంక్షలకు ప్రతీకగా తరచూ ఆరు రంగులతో కూడిన జెండాను ప్రదర్శిస్తుంటారు. కొన్నేళ్లుగా ఈ జెండా ఒకరకంగా ఎల్జీబీటీక్యూఐ హక్కుల ఉద్యమానికి ప్రతీకగా మారిపోయింది. అమెరికాలో స్వలింగ వివాహాలు ఇక చట్టబద్ధం బిల్లుపై సంతకం చేసిన అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం మధ్యాహ్నం వేలాది మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. స్వలింగ వివాహాలకు వీలు కల్పించే బిల్లు చట్టరూపం దాల్చడమే వారి ఆనందానికి కారణం. అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ఉభయ సభల్లో ఇప్పటికే ఆమోదం పొందిన స్వలింగ వివాహాల(గే, లెస్బియన్ మ్యారేజెస్) బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో బిల్లు ఇక చట్టంగా మారింది. ఈ చట్టం సమాజంలో పలు రూపాల్లో ఉన్న ద్వేషాలకు ఒక ఎదురుదెబ్బ అని బైడెన్ అభివర్ణించారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు ఇది చాలా ప్రాధాన్యం అంశమని అన్నారు. బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేసే కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేసిన వారికి ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కృతజ్ఞతలు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'నేనొక లెస్బియన్'.. రష్యన్ టెన్నిస్ స్టార్ సంచలన వ్యాఖ్యలు
రష్యన్ మహిళా టెన్నిస్ స్టార్.. ప్రపంచ నెంబర్ 12.. డారియా కసత్కినా స్వలింగ సంపర్కంపై సంచలన ఆరోపణలు చేసింది. తాను లెస్బియన్ అని సగర్వంగా చెప్పుకుంటున్నాని.. ఎల్జీబీటీక్యూ(LGBTQ), హోమో సెక్సువల్పై రష్యా అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక 1993లోనే మాస్కో అధికారికంగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించింది. 2013 నుంచి స్వలింగ సంపర్కం అనే పదం వినిపించడానికి వీల్లేదని.. ఎక్కడా కూడా ఆ పదం వాడకూడదంటూ నిషేధం విధించింది. ఇటీవలే రష్యా ప్రజా సముదాయాల్లో సాంప్రదాయేతర లైంగిక సంబంధాలపై సమాచారాన్ని నిషేధించే మరిన్ని ప్రతిపాదనలను తీసుకొచ్చింది. దీంతో దేశంలో స్వలింగ సంపర్కులు కన్నెర్రజేశారు. తాను లెస్బియన్ అన్న విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించిన కసత్కినా.. రష్యన్ స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియా జబైకో తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ ‘మై క్యూటీ పై’ అని షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘రష్యాలో ఇంతకంటే ముఖ్యమైన అంశాలెన్నో నిషేధించడానికి ఉన్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమేమీ షాకింగ్ గా అనిపించలేదు..ప్రభుత్వం చెప్పినట్టు మీ భాగస్వామితో గదిలోనే జీవించడం, బయట మాట్లాడకపోవడం అనే దాంట్లో అర్థం లేదు. మీరు దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది మీ ఇష్టం. ఏం చెప్పాలి..? ఏం చెప్పకూడదు అనేది వ్యక్తులకు సంబంధించిన విషయం.’అని తెలిపింది. కాగా గతవారం రష్యన్ మహిళా ఫుట్‌బాలర్ నడ్య కరపోవా కూడా స్వలింగ సంపర్కంపై తనదైన శైలిలో స్పందించింది. కసత్కినా స్పందిస్తూ.. ‘కరపోవా ఈ విషయంలో మాట్లాడినందుకు చాలా సంతోషం. కానీ ఇంకా చాలా మంది మాట్లాడాలి. ముఖ్యంగా అమ్మాయిలు దీని మీద గళం వినిపించాలి. ఇలాంటి సందర్భాల్లో యువతకు మద్దతు కావాలి.మరీ ముఖ్యంగా క్రీడలలో ఉండే వ్యక్తులు చాలామందిని ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ల ఈ సమస్య గురించి విరివిగా మాట్లాడాలి.’ అని పేర్కొంది. @DKasatkina mama I’m a criminal pic.twitter.com/cCU05hr9tv — Natalia Zabiiako (@NataliaZabiiako) July 19, 2022 చదవండి: World Athletics Championships 2022: షెల్లీ... జగజ్జేత మళ్లీ -
హైదరాబాద్: ఇద్దరు యువకుల మధ్య అనైతిక సంబంధం
-
హైదరాబాద్ యువకుల అనైతిక సంబంధం.. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే..!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో కొత్త కల్చర్ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకుల మధ్య అనైతిక సంబంధం స్వలింగ సంపర్కానికి దారితీసింది. అయితే వీరిద్దరిలో ఒకరు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తనతో నగ్నంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో బాధిత యువకుడు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. శాలిబండకు చెందిన ఓ యువకుని భార్య 2017లో మృతిచెందింది. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పేవాడు. 2018లో అతనికి మొఘల్‌పురాకు చెందిన మరో యువకుడు పరిచయమయ్యాడు. శాలిబండ యువకుడు ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో మహిళల వస్త్రాలు ధరించేవాడు. దీంతో యువకులు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరు స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. 10 లక్షల ఆర్థిక సాయం అనంతరం శాలింబండ యువకునికి మరో యువతితో రెండో పెళ్లి జరిగింది. అయితే విషయాన్ని పసిగట్టిన రెండవ భార్య కొన్నాళ్ళకే అతన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో మళ్ళీ వీరిద్దరు పీకల్లోడుతు ప్రేమలో మునిగిపోయి సహజీవనం సాగిస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో మొఘల్‌పురాకు చెందిన యువకుడికి ఓ యువతితో వివాహం జరిగే సమయంలో శాలిబండకు చెందిన యువకుడు 10 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఇదే అదనుగా భావించిన మొఘల్‌పురా వాసి అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తనతో కలిసి ఉన్న సమయంలో సీక్రెట్‌గా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిపులకు గురిచేశాడు. చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. 17 బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం అప్పట్లో మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదయ్యింది. ఆ తర్వాత కూడా తనను దగ్గరికి రానివ్వకపోవడంతో మొఘల్‌పురా వ్యక్తి నుంచి రోజు రోజుకు బెదిరింపులు అధికమయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శాలింబండ యువకుడు మంగళవారం అర్థరాత్రి 40 గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతేగాక అతనే 100 కంట్రోల్ రూమ్, 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరుకున్న యువకున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలునిపై అమానుషం
సాక్షి, మండ్య(కర్ణాటక) : 17 సంవత్సరాల మైనర్ బాలునితో స్వలింగ సంపర్కం పెట్టుకుని, బాలుడు మర్మాంగం కోసుకునేలా చేసిన కిరాతకున్ని శ్రీరంగపట్టణం పోలీసులు అరెస్టు చేశారు. దుండగుడు మండ్య జిల్లాలోని పాండవపుర తాలుకాలోని సీతాపుర గ్రామానికి చెందిన సునీల్‌కుమార్ (28). బాలునికి మాయమాటలు చెప్పి ఇతడు అసహజ వాంఛలు తీర్చుకుంటూ ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే వివరాలు.. సీతాపురకు చెందిన సునీల్‌కుమార్ ఏడాదిన్నరగా బాలున్ని లొంగదీసుకున్నాడు. అతనితో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడటం, గ్రామంలో ఉన్న దేవాలయంలో ప్రతి శుక్రవారం కలవడం చేసేవారు. తనకు దేవుడు పూనుతాడని, చెప్పినట్లు చేయాలని బాలున్ని తన వశంలోకి తెచ్చుకున్నాడు. తాను చేసేది ఎవరికీ చెప్పవద్దని, చెబితే దేవుడు చంపేస్తాడని బెదిరించాడు. నేను దేవుడని నిన్ను ఇష్టపడుతున్నానని, నాతో ఉండు, నిన్ను నేను పెళ్ళి చేసుకుంటానని చెప్పి చివరికి మర్మాంగం కోసుకునేలా ప్రేరేపించాడు. ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం రోజున తాలూకాలోని హరవు ఎల్లెకెరె రోడ్డులో ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి కత్తిరించుకునేలా చేశాడు. అనంతరం గాయపడిన బాలుడిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. అస్పత్రిలో డాక్టర్లకు విషయం చెప్పవద్దని, కారులో డ్రాప్ అడిగి వస్తుంటే ఎవరో దుండగులు ఇలా చేసి పారిపోయారని చెప్పాలని సూచించాడు. అనుమానంతో ఫిర్యాదు ఆస్పత్రిలో చేర్చగా, అనుమానం వచ్చిన వైద్యులు శ్రీరంగపట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బాలున్ని విచారించగా, విషయం మొత్తం బాలుడు వివరించాడు. దీంతో పోలీసులే నివ్వెరపోయారు. చివరకు కామాంధుడు సునీల్‌కుమార్‌ను అరెస్టు చేసి కేసు నమోదు -
ప్రాణం తీసిన అసహజ సంబంధం
సాక్షి, వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం) : స్వలింగ సంపర్కమే నిండు ప్రాణం బలిగొంది. పెద్దలు హెచ్చరించినా... తోటి మిత్రులు వారించినా కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య సంబంధం కొనసాగింది. స్వలింగ సంపర్కుని నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ఆశించడం... ఆపై గొడవలకు దారి తీసిన నేపథ్యంలో పక్కాగా ప్రణాళికతో హత్య చేసిన సంఘటన వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట సముద్ర తీరంలో చోటు చేసుకుంది. అమలపాడు గ్రామానికి చెందిన యువకుడు దున్న శాంతా రావు అదే గ్రామానికి చెందిన స్నేహితుడు దాసరి ఉమాపతి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ అసహజ సంబంధం కోసమే మృతుడు ఆర్మీ ఉద్యోగాన్ని సైతం మధ్యలోనే వదిలేయడం గమనార్హం. ఈ ఘటన చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం రేపింది. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎన్. శేషు, వజ్రపుకొత్తూరు ఎస్ఐ ఎం గోవింద వెల్లడించిన వివరాల ప్రకారం... అమలపాడు గ్రామానికి చెందిన దున్న భాస్కరరావు, కస్తూరి పెద్ద కుమారుడు దేవరాజు ఇండియన్ ఆర్మీలో విధుల్లో ఉన్నాడు. రెండో కుమారుడు శాంతారావు ఏడాదిన్నర క్రితం ఇండియన్ ఆర్మీలో ఉద్యోగంలో చేరాడు. అనంతరం నిందితుడు దాసరి ఉమాపతి, మృతుడు శాంతారావుకు మధ్య స్వలింగ సంపర్కం కారణంగా ఉద్యోగం మధ్యలోనే వదిలేసి గ్రామంలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. స్వలింగ సంపర్కాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు ఉమాపతి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు పోలీసు స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించారు. పెద్దలు వారించినా వినలేదు.. నిందితుడు, మృతుడు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఇక నుంచి సంబంధాలు కొనసాగరాదని గ్రామ పెద్దలు హెచ్చరించారు. అయినప్పటికీ మళ్లీ ఏడాదిన్నరగా స్వలింగ సంపర్కాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు దాసరి ఉమాపతి గురువారం మధ్యాహ్నం కొత్తపేట సముద్ర తీరానికి మృతుని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. అప్పటికే తనతో తెచ్చుకున్న మారణాయుధంతో హతుని తల వెనుక భాగంలో నాలుగు చోట్ల బలంగా దాడి చేయడంతో శాంతారావు మృతి చెందాడు. వెంటనే మృతదేహాన్ని సముద్రంలో వదిలేసి తనకు తెలియనట్లు గ్రామానికి చేరుకున్నాడు. శుక్రవారం తోటూరు– గుణుపల్లి తీరంలో మృతదేహం కనిపించడంతో స్థానిక మత్స్యకారుల సమాచారం మేరకు వజ్రపుకొత్తూరు ఎస్ఐ ఎం గోవింద సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు ఉమాపతిని కాశీబుగ్గ రూరల్ సీఐ ఎన్ శేషు, ఎస్ఐ గోవింద అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేశానని అంగీకరించాడు. ఈయనతోపాటు హత్యలో ఇంకా ఎవరి ప్రాత ఉందేమోన్న కోణంలో విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలో జాగిలాలతో తనిఖీ చేశారు. మృతుని బైక్, సెల్‌ఫోన్, మెమరీ కార్డు దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. పంచనామా చేపట్టి పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భర్తను వదలి స్నేహితురాలితో ఉడాయించింది..
సాక్షి, చెన్నై: స్వలింగసంపర్కానికి అలవాటు పడ్డ ఓ యువతి పెళ్లయిన వారం రోజుల్లో భర్తను వదలి పెట్టి స్నేహితురాలితో ఉడాయించింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌కు చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ ఉద్యోగితో వారం రోజుల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఆ యువతి హఠాత్తుగా అదృశ్యమైంది. దీంతో భర్తపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ యువతి తల్లిదండ్రులతో పాటు, భర్త కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త వద్ద జరిపిన విచారణలో పెళ్లైన నాటి నుంచి తనను దగ్గరకు రానివ్వలేదని, అయిష్టంగా తనతో మాట్లాడేదని పోలీసులకు ఆ భర్త వివరించాడు. దీంతో ఏదేని ప్రేమ వ్యవహారం కారణం ఉండవచ్చని భావించారు. అయితే, ఆ యువతి స్నేహితుల వద్ద జరిపిన విచారణ కేసును మలుపు తిప్పింది. తిరునల్వేలి జిల్లా పనకుడికి చెందిన స్నేహితురాలితో ఆ యువతి అత్యంత సన్నిహితంగా ఉండేదని, ఆ ఇద్దరు హాస్టల్లో ఉన్నప్పుడు స్వలింగ సంపర్కానికి అలవాటు పడి, అందరి కంట పడ్డారని ఆ స్నేహితులు ఇచ్చిన సమాచారంతో విచారణను వేగవంతం చేశారు. పనకుడిలో విచారణ జరపగా, అక్కడున్న ఆ స్నేహితురాలు కూడా అదృశ్యం కావడంతో ఆ ఇద్దరు పరారైనట్టుగా పోలీసులు నిర్ధారించారు. తిరునల్వేలి నుంచి అదృశ్యమైన రోజున చెన్నైకు రైలులో ఆ ఇద్దరు బయలు దేరినట్టు గుర్తించారు. దీంతో చెన్నైలో వారు ఎక్కడున్నారో ఇక్కడి పోలీసుల సాయంతో నాగర్‌కోయిల్ పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. -
ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం
సేలం: స్వలింగ సంపర్కానికి నిరాకరించిన అత్తకొడుకును యువకుడు హత్య చేసిన సంఘటన ఆదివారం సేలంలో చోటుచేసుకుంది. వివరాలు.. సేలం సమీపంలోని అమ్మాపేట ప్రాంతానికి చెందిన రమేష్ (40) ఆటోడ్రైవర్. ఇతని భార్య విజయలక్ష్మి. వీరి కుమార్తె ప్రియంకా, కుమారుడు ఆర్ముగం (15) ఉన్నారు. కాగా, ఆర్ముగం స్వల్ప మానసిక బాధితుడు కావడంతో ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆర్ముగం ఆదివారం సాయంత్రం అమ్మా పేట పోలీసు స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో గొంతు కోసిన స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన విద్యార్థులు సమాచారాన్ని ఆర్ముగం తల్లిదండ్రులకు, అమ్మాపేట పోలీసు స్టేషన్‌కు తెలిపారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వారు ఆర్ముగంను సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్ముగంను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. అమ్మాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని సోమవారం జరిపిన విచారణలో విస్తుపోయే విషయం వెల్లడైంది. ఆర్ముగం అత్త కొడుకు భరత్ (19) సేలంలో ఉన్న ఒక ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాడు. భరత్‌కు ఆర్ముగం స్వలింగ సంపర్క సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఇటీవల ఈ సంబంధానికి ఆర్ముగం నిరాకరిస్తూ వచ్చాడు. దీంతో భరత్ ఆదివారం ఆర్ముగంని సంఘటన స్థలానికి రప్పించాడు. అక్కడ భరత్ బలవంత చేయగా ఆర్ముగం నిరాకరించడాని, దీంతో ఆగ్రహం చెందిన భరత్ తన వద్ద ఉన్న కత్తితో భరత్ గొంతు కోసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు భరత్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు యువతులు
భువనేశ్వర్: స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు గతేడాది వెలువరించిన తీర్పు ఆ ఇద్దరు యువతుల పాలిట వరంగా మారింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. ఈ తీర్పును అనుసరించి ఒడిశాలోని కేంద్రపారాజిల్లాకు చెందిన ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటి కావడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళ్తే.. మహాకాపరాకు చెందిన ఓ యువతి, పట్టముండైకు చెందిన మరో యువతి కటక్‌లోని స్కూల్లో చదువుకున్నారు. ఆ సమయంలో వారు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారు తమ బంధాన్ని అలాగే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని ఇంట్లో పెద్దలకు తెలుపగా.. వారు అంగీకరిచలేదు. పైగా వారికి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని భావించి కోర్టును ఆశ్రయించారు. ఇద్దరు యువతులు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి.. తాము పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపారు. తమ మిగిలిన జీవితం కలిసి కొనసాగిస్తామని.. భవిష్యత్తులో ఎటువంటి గొడవలు జరిగిన వాటిపై ఫిర్యాదు చేయబోమని వారు అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా, ఈ పెళ్లి తన కూతురికి ఇష్టం లేదని ఓ యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. మరో యువతి బలవంతంతోనే తన కూతురు ఈ పెళ్లికి అంగీకరించిందని ఆయన ఆరోపించారు. -
స్వలింగ సంపర్కానికి ఒప్పుకోలేదని..
సాక్షి ప్రతినిధి, చెన్నై: స్వలింగ సంపర్కానికి అంగీకరించలేదని స్నేహితుడిని దారుణంగా హత్యచేసి శవాన్ని ఇంటిలోనూ పూడ్చిపెట్టిన సంఘటనలో ఇంజినీరైన దినేష్ అనే యువకుడికి కడలూరు కోర్టు యావజ్జీవశిక్ష విధించింది. కడలూరు జిల్లా కోండూరుకు చెందిన సత్యమూర్తి తమిళనాడు వినియోగదారుల ఫోరంలో రిజిష్ట్రారుగా పనిచేస్తున్నాడు. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన ఇతని కుమారుడు సతీష్‌కుమార్ (29) కడూరులోని ఒక కారు అమ్మకాల షోరూంలో పనిచేస్తున్నాడు. 2016 ఏప్రిల్ 1వ తేదీన ఉద్యోగానికని వెళ్లిన అతడు తిరిగి రాకపోవడంతో నెల్లికుప్పం పోలీసు స్టేషన్లో తండ్రి ఫిర్యాదు చేశాడు.కడలూరు అన్నానగర్‌కు చెందిన దినేష్ అనే ఇంజినీర్‌ను పోలీసులు అనుమానించారు. ఈ విషయం తెలుసుకున్న దినేష్ వీఏఓ వద్ద లొంగిపోయి సతీష్‌కుమార్‌ను తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. సంఘటన జరిగిన రోజున దినేష్ ఇంటిలో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో స్వలింగ సంపర్కానికి సతీష్‌కుమార్‌ను దినేష్ ఒత్తిడిచేశాడు. ఇందుకు తీవ్రంగా అభ్యంతరం పలకడంతోపాటు ఇతర స్నేహితులకు చెబుతానని సతీష్‌కుమార్ బెదిరించాడు. దీంతో ఆవేశానికి లోనైన దినేష్ సిగిరెట్ తాగుదామనే నెపంతో ఇంటి వెనుకవైపునకు తీసుకెళ్లి కత్తితోపొడిచి చంపేశాడు. ఆ తరువాత శవాన్ని తన ఇంటిలోనే పూడ్చిపెట్టినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ కేసు కడలూరు జిల్లా ఫస్ట్‌క్లాస్‌మేజిస్ట్రేటు కోర్టులో న్యాయమూర్తులు గోవిందరాజన్, తిలకవతి సమక్షంలో విచారణ ముగిసింది. నిందితుడు దినేష్‌కు యావజ్జీవశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తులు మంగళవారం తీర్పు చెప్పారు. -
స్వలింగ సంపర్కానికి ఒప్పుకోలేదని..
ఖమ్మం క్రైం: ఖమ్మం నెహ్రూనగర్‌లో గల గిరిజన సంక్షేమ పాఠశాలలో పాశవికంగా హత్యకు గురైన విద్యార్థి జోసఫ్(10) హత్య కేసు మిస్టరీ వీడింది. అదేరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్న పదో తరగతి విద్యార్థే ఈ బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం నిర్ధారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన తలారి వెంకటేశ్వర్లు, వినోదల కుమారుడు ఖమ్మంలో పదో తరగతి చదువుతూ.. గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఉంటున్నాడు. ఇతడికి స్వలింగ సంపర్కం అలవాటైంది. ఈ క్రమంలో ఈనెల 23న జోసఫ్‌ను సైకిల్‌పై తిప్పి.. వసృతి గృహానికి తీసుకొచ్చాడు. ఎవరూ లేనిది చూసి జోసఫ్‌పై స్వలింగ సంపర్కానికి ఉపక్రమించగా.. అతడు ఒప్పుకోలేదు. దీంతో జోసఫ్‌పై దుప్పటి కప్పి రాళ్లతో కొట్టి చంపాడు. అలాగే దాదాపు రెండేళ్ల క్రితం పాల్వంచలో ఓ మూగ బాలుడైన సంతోష్‌ను ఆడుకుందామని తీసుకెళ్లి ఇదే తరహాలో స్వలింగ సంపర్కానికి ప్రేరేపించగా.. అతడు ఒప్పుకోకపోవడంతో దారుణంగా హత్య చేసి.. రెండు రోజులపాటు మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దాచి ఉంచాడు. -
ఆప్ నేత ప్రాణం తీసిన అసహజ బంధం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆప్ నేత నవీన్ సజీవ దహనం కేసులో మిస్టరీ వీడింది. బాధితుడిని తన స్నేహితుడే కిడ్నాప్ చేసి డ్రగ్స్ తీసుకునేలా ప్రేరేపించి దారుణంగా హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బాధితుడితో స్వలింగ సంపర్కం చేసేవాడని ఘజియాబాద్ పోలీసులు వెల్లడించారు. బాధితుడికి ప్రధాన నిందితుడు తయ్యాబ్‌తో హోమో సెక్సువల్ సంబంధం ఉందని, దీన్ని కొనసాగించేందుకు తనతో ఫ్లాట్‌లో కలిసి ఉండాలని కోరాడని పోలీసులు చెప్పారు. తయ్యాబ్ ఇందుకు నిరాకరించడంతో గతంలో తాము కలిసిఉన్న వీడియోను బహిర్గతం చేస్తానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడన్నారు. ఆప్ నేతను వదిలించుకునేందుకు ఘటన జరిగిన రోజు రాత్రి లోని ప్రాంతానికి అతడిని పిలిపించిన తయ్యాబ్ నిద్ర మాత్రలు కలిపిన హల్వాను తినిపించారు.బాధితుడు మత్తులోకి జారుకున్న వెంటనే అతడి వద్ద నుంచి రూ 7.85 లక్షల నగదును దోచుకున్నారని పోలీసులు తెలిపారు. బాధితుడు నవీన్ కుమార్ దగ్ధమైన మృతదేహాన్ని ఆయన కారులో లోని-బోప్రా రోడ్డులో గుర్తించిన కుటుం సభ్యులు ఘజియాబాద్‌లోని సహిదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆమెకు 40, ఈమెకు 24.. సహజీవనం చేయొచ్చు
తిరువనంతపురం : స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు చట్టబద్దం చేయడంతో కేరళ హైకోర్టు మంగళవారం మరో సంచలన తీర్పును వెలువరించింది. ఓ 40 ఏళ్ల మహిళ, 24 యువతితో కలిసి జీవించవచ్చని అనుమతినిచ్చింది. సీకే అబ్దుల్ రహీమ్, నారయణలతో కూడిన డివిజన్ బెంచ్ ఇద్దరు మహిళలు సహజీవనం చేయవచ్చని తీర్పునిచ్చింది. కొల్లామ్‌లోని వెస్ట్ కల్లాడకు చెందిన శ్రీజ(40) తన పార్టనర్ అరుణ(24)ను కోర్టు ముందు హాజరుపరచాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు అరుణతో కలిసి జీవించాలని ఉందని, దీనికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, బలవంతంగా తన నుంచి ఆమెను దూరం చేశారని పేర్కొన్నారు. గత ఆగస్టు నుంచి తామిద్దరం కలిసే ఉంటున్నామని, అరుణ పేరేంట్స్ మాత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసి తన నుంచి దూరం చేశారని తెలిపారు. అరుణను బలవంతంగా పిచ్చాసుపత్రిలో చేర్పించారని, ఎలాగోలా ఆమెను అక్కడ కలిసానని, కానీ ఆసుపత్రి వారు తనతో తీసుకెళ్లడానికి అనుమతినివ్వలేదన్నారు. దీంతో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశానన్నారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు అరుణను తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో వారు అరుణను మంగళవారం కోర్టు ముందు హాజరుపరిచారు. శ్రీజతో కలిసుండటంలో తన ఉద్దేశం ఏమిటో కోర్టుకు అరుణ వివరించింది. అలాగే పిటిషనర్ శ్రీజ ఇటీవల స్వలింగ సంపర్కం నేరం కాదంటూ.. సెక్షన్ 377ను సవరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. దీంతో ఈ ఇద్దరు సహజీవనం చేయవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. -
6 రోజుల్లో 8 తీర్పులు
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ–చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)గా ఉన్న జస్టిస్ దీపక్ మిశ్రాకు సుప్రీంకోర్టులో మరో ఆరు పనిదినాలే మిగిలున్నాయి. వచ్చే నెల 2న ఆయన పదవీ విరమణ పొందనున్నారు. అత్యధిక రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించిన సీజేఐగా జస్టిస్ మిశ్రా ఘనత వహించారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేస్తూ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇప్పటికే ఓ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే మిగిలున్న ఆరు పనిదినాల్లో జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని వివిధ ధర్మాసనాలు ఎనిమిది కీలక కేసుల్లో తీర్పులు వెలువరించనున్నాయి. ఆధార్ చెల్లుబాటు నుంచి అయోధ్య కేసు వరకు.. దేశ గతిని మార్చగల ఈ తీర్పులు చెప్పే వివిధ ధర్మాసనాల్లో మొత్తం కలిపి పది మంది న్యాయమూర్తులు పాలుపంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనాలు వెలువరించే ఎనిమిది కీలక కేసులేంటో ఓ సారి పరిశీలిద్దాం.. 1. ఆధార్ కేసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి చిన్న పనికీ ఆధార్ కావాలంటున్న ఈ రోజుల్లో అసలు ఆధార్ కార్డే చెల్లుబాటు కాదనీ, దానికి రాజ్యాం గబద్ధత లేదనీ, వ్యక్తిగత గోప్యత హక్కును ఆధార్ ఉల్లంఘిస్తోందంటూ అనేక పిటిషన్లు వచ్చాయి. హైకోర్టు మాజీ జస్టిస్ కె.పుట్టస్వామి కూడా ఈ పిటిషన్లు వేసిన వారిలో ఉన్నారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి ఐదుగురు సభ్యుల ధర్మాసనం 40 రోజులపాటు ఏకధాటిగా విచారించి నాలుగున్నర నెలల ముందే తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆ తీర్పు ఈ ఆరు రోజుల్లో వెలువడనుంది. 2. అయోధ్య కేసు వివాదాస్పద రామ జన్మభూమి–బాబ్రీ మసీదుకు చెందిన 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడాల మధ్య సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయలా? వద్దా? అన్న విషయంపై ప్రస్తుత త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం ప్రకటించనుంది. 3. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కేసు ప్రభ్యుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ 2006లో ఎం.నాగరాజ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుత సీజేఐ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమీక్షించనుంది. పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లను తొలగించేం దుకు మోదీ ప్రభుత్వం విముఖంగా ఉండగా, తరతరాల నుంచి ఐఏఎస్ అధికారులుగా ఉంటున్నవారి కుటుంబీకులు కూడా రిజర్వేషన్లను ఉపయోగించుకుంటున్నారనీ, అదేమీ వారసత్వ హక్కు కాదని సుప్రీంకోర్టు అంటోంది. 4. శబరిమల ఆలయ ప్రవేశం కేసు 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న బాలికలు, మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమ తించాలా? వద్దా? అన్న విషయంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పనుంది. పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా కార్యకర్తలు స్త్రీలకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తుండగా సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. 5. వ్యభిచారం కేసు వ్యభిచారం, వివాహేతర సంబంధం కేసుల్లో మహిళ తప్పు ఉన్నా కూడా ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ పురుషుడిపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్న అంశంపై కూడా సీజేఐ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెలువరించనుంది. ఐపీసీ సెక్షన్ 497కు సవరణలు చేసి మహిళపై కూడా కేసులు నమోదు చేసేందుకు కోర్టు అనుమతించే అవకాశం ఉంది. 6. విచారణల ప్రత్యక్ష ప్రసారాల కేసు కోర్టుల్లో జడ్జీలు కేసులను విచారిస్తుండగా ఆ దృశ్యాలను ప్రత్యక్షప్రసారం చేయాలన్న కేసుకు సంబంధించి సీజేఐ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పనుంది. న్యాయమూర్తులు సానుకూలంగా స్పందిస్తే ముందుగా సీజేఐ విచారించే కేసులను ప్రయోగాత్మకంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 7. నేర ప్రజా ప్రతినిధులపై నిషేధం కేసు రాజకీయ నేతలపై ఏదైనా కోర్టు నేరాలు, అభియోగాలు మోపితే.. వారిని ఇకపై రాజకీయాల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ వచ్చిన ఓ ప్రజాహిత వ్యాజ్యంపై జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం రాజకీయ నేతలు దోషులుగా తేలితేనే నిషేధం వర్తిస్తుండగా తుది తీర్పులు రావడానికి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. 8. లాయర్లుగా ప్రజాప్రతినిధులు.. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో చాలా మంది న్యాయవాదులై ఉండి కోర్టుల్లో కేసులు కూడా వాదిస్తున్నారు. న్యాయవాదులుగా ఉన్నవారు పార్లమెంటుకు లేదా శాసనసభలకు ఎన్నికైతే వారికి ప్రభుత్వం వేతనం చెల్లిస్తోందనీ, వారు మళ్లీ సొంత సంపాదన కోసం కోర్టుల్లో కేసులు వాదిస్తూ ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలు నెరవేర్చడం లేదు కాబట్టి వారు కోర్టులకు వెళ్లకుండా నిలువరించాలంటూ వచ్చిన పిటిషన్‌పై కూడా తీర్పు రానుంది. -
బొట్టు, దుప్పట్టతో ట్రాన్స్‌జెండర్‌లా గంభీర్.!
న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ పెద్దబొట్టు, దుప్పట్ట కొంగుతో ట్రాన్స్‌జెండర్‌లా కనిపించాడు. గతకొంత కాలంగా అతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఈ ఢిల్లీ ఆటగాడు.. దేశంలో జరిగే ప్రతిఘటనపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతవారం స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్స్ కమిటీ నిర్వహించిన హిజ్రా హబ్బా వేడుకలకు గంభీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మగవారు బొట్టు, దుప్పట్ట, ఆడవారు మీసాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే గంభీర్ దుప్పట్ట, బొట్టు ధరించాడు. అతనికి ట్రాన్స్‌జెండర్స్ సాయం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక గంభీర్ ట్రాన్స్‌జెండర్స్‌కు మద్దతుగా ఉండటం ఇదే తొలిసారేం కాదు. రక్షాబంధన్ సందర్భంగా వారితో రాఖీ కట్టించుకుని వారిని గౌరవించాలని పిలుపునిచ్చాడు. “It’s not about being a man or a woman. It’s about being a HUMAN.” With proud transgenders Abhina Aher and Simran Shaikh and their Rakhi love on my hand. I’ve accepted them as they are. Will you? #respecttransgenders pic.twitter.com/6gBOqXu6nj — Gautam Gambhir (@GautamGambhir) August 25, 2018 -
కేంద్రంపై జస్టిస్ చంద్రచూడ్ అసంతృప్తి
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం సహా పలు సున్నితమైన కేసుల్లో తుది నిర్ణయాన్ని కేంద్రం కోర్టుల విచక్షణకు వదిలేస్తుండటంపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని నేషనల్ లా వర్సిటీలో 19వ బోధ్‌రాజ్ సావ్నీ స్మారక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఈ రాజకీయ నాయకులు కొన్నిసార్లు తమ అధికారాలను న్యాయమూర్తులకు ఎందుకు అప్పగిస్తున్నారు? ఈ తరహా వ్యవహారాలు సుప్రీంకోర్టులో నిత్యకృత్యంగా మారిపోయాయి. ‘ఐపీసీ సెక్షన్ 377(స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటోంది)పై నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నాం’ అనడం జడ్జీలకు చాలా సమ్మోహనపరిచే మాట. పొగడ్తలు ఎన్నటికైనా చేటు తెస్తాయనీ, వాటి కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని జడ్జీలు గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. స్వలింగ సంపర్కం నేరంకాదని ప్రకటించిన ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. ఇతరులు, సమాజంతో మన కలివిడి కారణంగానే వ్యక్తిత్వం ఏర్పడుతుందనీ, లైంగికత అలా ఏర్పడదని ఆయన అన్నారు. సెక్షన్ 377లోని కొన్ని నిబంధనలు ‘పురుషులంటే ఇలానే ఉండాలి, స్త్రీలంటే ఇలాగే ఉండాలి’ అంటూ ఉందనీ వెల్లడించారు. దీని కారణంగా స్వలింగ సంపర్కులపై కొందరు చాదస్తపు మనుషులు వివక్ష చూపారన్నారు. ప్రజలపై జాతి, లైంగికత, మతం, ప్రాంతం, రంగు ఆధారంగా వివక్ష చూపరాదని రాజ్యాంగంలోని 15వ అధికరణ చెబుతోందనీ, సెక్షన్ 377 దీన్ని స్పష్టంగా ఉల్లంఘించిందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. -
పెళ్లి, వారసత్వ హక్కుల కోసం....
సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్సాహం పొందిన ఎల్‌జీబీటీక్యూలు ఇప్పుడు ఇతర హక్కుల సాధనపై దృష్టి సారిస్తున్నారు. ఇతరుల్లా తమకు కూడా వివాహం, వారసత్వం, సరోగసి,దత్తత వంటి విషయాల్లో హక్కులు కల్పించాలని వారు ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు.అయితే, ధర్మాసం స్వలింగ సంపరాన్ని నేరం కాదన్న అంశం వరకే పరిమితం కావాలని ఇతర హక్కుల జోలికి వెళ్లరాదని అదనపు సొలిసిటర్ జనరల్ సెక్షన్ 377 కేసు విచారణలో సుప్రీం కోర్టుకు స్పష్టం చేశారు. దీన్ని బట్టి గేలకు ఇతర హక్కులు కల్పించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదని అర్థమవుతోందని న్యాయ నిపుణులు అంటున్నారు.వివాహం, సరోగసి, దత్తత, వారసత్వం వంటి హక్కుల కోసం గేలు పోరాడాల్సి వస్తే తప్పకుండా పోరాడుతామని గే హక్కుల ఉద్యమకారుడు, సుప్రీం కోర్టు న్యాయవాది అదిత్య బందోపాధ్యాయ స్పష్టం చేశారు. 377 సెక్షన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గేల ఇతర హక్కులపై చర్చకు అవకాశం కల్పిస్తుందని సీనియర్ జర్నలిస్టు, ఎల్జీబీటీ హక్కుల కార్యకర్త ప్రసాద్ రామమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదన్న సుప్రీం కోర్టు తీర్పుతో గేలకు ప్రాథమిక హక్కు లభించింది కాబట్టి వివాహం, వారసత్వం, బీమా వంటి హక్కులు కూడా దీనిలో భాగమవుతాయని,ఈ హక్కుల్ని నిరాకరించడం రాజ్యాంగవిరుద్ధమని 377 కేసు పిటీషనర్లలో ఒకరైన సునీల్ మెహ్రా అన్నారు. 377 సెక్షన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మా విజయంలో మొదటి అడుగు. వివాహం ఇతర హక్కుల సాధన రెండో అడుగు వేస్తాం అని మరో పిటిషనర్ గౌతమ్ యాదవ్ వ్యాఖ్యానించారు. న్యాయపరమైన అంశాలపై అంతగా అవగాహన లేనప్పటికీ గోద్రేజ్ వంటి కార్పొరేట్ సంస్థలు చాలా ఏళ్ల క్రితమే గేలకు ఇతరులతో పాటు సమాన హక్కులు కల్పించాయి.‘ ఎల్జీబీటీ ఉద్యోగుల పట్ల వివక్ష చూపకపోవడం, ఇతర ఉద్యోగుల్లాగే ఆరోగ్య బీమా వంటి అన్ని సదుపాయాలు అందించడం ద్వారా వారిని మాలో కలుపుకోవడమే మా విధానం’అన్నారు గోద్రేజ్ ఇండియా కల్చరల్ ల్యాబ్ అధిపతి పరమేశ్ సహాని. గేల వివాహాన్ని ఆమోదించదు స్వలింగ సంపర్కం నేరం కాదన్నంత వరకు బాగానే ఉందని, అయితే వారి వివాహాన్ని కూడా చట్టబద్దం చేయాలన్న డిమాండును మాత్రం ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.‘ఇద్దరు మహిళలు లేదా ఇద్దరు పురుషులు పెళ్లాడటమన్నది ప్రకృతి విరుద్ధం.దీన్ని మేమెంత మాత్రం సమర్థించం.ఇలాంటి సంబంధాలను గుర్తించే సంప్రదాయం భారతీయ సమాజంలో లేనేలేదు’అని స్పష్టం చేశారు ఆరెస్సెస్ ప్రతినిధి ఆరుణ్ కుమార్. సెక్షన్ 377 రద్దును స్వాగతించిన కాంగ్రెస్ గేలకు ఇతర హక్కుల కల్పన విషయంలో తన వైఖరి స్పష్టం చేయలేదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమేనని తర్వాతే దానిపై స్పందిస్తామన్నారు కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా. ఇతర హక్కుల జోలికెళ్లని ధర్మాసనం స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు వారి ఇతర హక్కుల జోలికి వెళ్లలేదు. సామాజిక నిబంధనలు గేల రాజ్యాంగ హక్కులను ఎలా నియంత్రించజాలవో తన తీర్పులో వివరించిన ధర్మాసనం వివాహం, వారసత్వం వంటి ఇతర హక్కుల గురించి ఏమీ ప్రస్తావించలేదు. అలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి మన దేశంలో స్వలింగ వివాహాలు(సేమ్ సెక్స్ మ్యారేజ్) చట్టబద్ధం కానప్పటికీ గత పదేళ్లుగాజరుగుతూనే ఉన్నాయి. చట్టానికి భయపడే కొందరు అలాంటి వివాహాల్ని ఆమోదించే ఇతర దేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు.377 కేసు పిటిషనర్ ఒకరు ఇలాగే విదేశానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. -
చరిత్రాత్మకమైన తీర్పు
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377లో స్వలింగ సంపర్కులను నేరస్తులుగా పేర్కొనే నిబంధన ఎట్టకేలకు బుట్టదాఖలా అయింది. అది చెల్లుబాటు కాదంటూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఏకగ్రీవ తీర్పు సమానత్వ సాధనలో, మానవ హక్కుల ప్రస్థానంలో మేలి మలుపుగా నిలుస్తుంది. సృష్టి ఒక గీత గీసిందని... అందరూ ఆ గీతకు అటో ఇటో ఉంటారని, ఉండాలని శతా బ్దాల తరబడి పాతుకుపోయిన భావనను ఈ తీర్పు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం యుక్త వయసున్న ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో తమ లైంగిక భావనలకు అనుగుణంగా శృంగా రంలో పాల్గొనవచ్చునని, దాన్ని నేరంగా పరిగణించటం సరికాదని తేల్చిచెప్పింది. ఆడ మగ మధ్య లైంగిక సంబంధాలే సహజమైనవనీ, మిగిలినవన్నీ అసహజమని అనడం కాలం చెల్లిన భావనగా తెలిపింది. ‘ప్రకృతి ఇచ్చింది ఏదైనా సహజమైనదే’ అని స్పష్టం చేసింది. అసహజ లైంగిక నేరాలను ఏకరువుపెట్టే సెక్షన్ 377లో స్వలింగ సంపర్కం చేర్చటం సరికాదంటూ మన దేశంలో సాగుతున్న పోరాటం సుదీర్ఘమైనది. పదిహేడేళ్లుగా న్యాయస్థానాలే వేదికగా ఆ పోరాటం సాగుతోంది. బ్రిటిష్ వలసపాలకుల ఏలుబడిలో దాదాపు 160 ఏళ్లక్రితం భారతీయ శిక్షాస్మృతిలో స్వలింగ సంపర్కం నేరంగా మారింది. అప్పటినుంచి అనేకమంది పౌరులు వేధింపులకు గురవుతున్నారు. భయంతో బతుకీడుస్తున్నారు. 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ స్వలింగ సంపర్కం నేరంగా భావించలేమని, దీన్ని శిక్షాస్మృతి నుంచి తొలగించి ఇతర అసహజ నేరాలను కొత్తగా 376–ఎఫ్ కిందకు తీసుకురావాలని సిఫార్సు చేసింది. అయినా ఏ ప్రభుత్వమూ కదల్లేదు. 2009లో అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా, న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్‌లతో కూడిన ధర్మాసనం మొదటిసారి ఈ సెక్షన్ రాజ్యాంగంలోని 21, 14, 15 అధికరణలను ఉల్లంఘిస్తున్నదని నిర్ధారించింది. ఆ సెక్షన్‌లోని అస హజ నేరాల జాబితా నుంచి దీన్ని తొలగించాలని తీర్పునిచ్చింది. అయితే మరో నాలుగేళ్లకు సుప్రీం కోర్టులో జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం అది రాజ్యాం గబద్ధమైనదేనని చెప్పి స్వలింగసంపర్కుల ఉత్సాహంపై నీళ్లు జల్లింది. దాన్ని కొట్టేసే అధికారం న్యాయస్థానాలకు లేదని, పార్లమెంటు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఏదైనా కీలక సమస్య వచ్చిపడినప్పుడు దానికొక ప్రజాస్వామిక పరిష్కారాన్ని చూపడం రాజ్యం బాధ్యత. పాలకులుగా ఉంటున్నవారు ఈ బాధ్యతను స్వీకరించటం సబబు. వారు దాన్ని సక్రమంగా నెరవేర్చనప్పుడు న్యాయవ్యవస్థ అయినా జోక్యం చేసుకొని సరిదిద్దాలి. కానీ సెక్షన్ 377 విషయంలో రెండుచోట్లా ఇన్నాళ్లూ నిరాదరణే ఎదురైంది. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘స్వలింగ సంపర్కాన్ని సహజమైన ప్రక్రియగా పరిగణించలేనందుకూ, పర్యవసానంగా శతాబ్దాలుగా వీరు పడుతున్న అవమానాలకూ చరిత్ర క్షమాపణ చెప్పాల్సి ఉన్నద’ని వ్యాఖ్యానించారు. ఏ సమాజంలోనైనా అత్యధిక సంఖ్యాకుల మనోభావాలకు అనుగుణంగానే అన్ని రకాల విలువలూ ఏర్పడతాయి. వాటి ఆధారంగానే చట్టాలు రూపొందుతాయి. సమాజంలో ఆడ మగ కలిసి ఉండటమే సహజమని, ఇతరమైనవన్నీ అసహ జమని అత్యధికులు భావించబట్టి ఇతరత్రా లైంగిక భావనలున్నవారందరూ అపరాధ భావనతో కుమిలిపోతుంటారు. తమ లైంగిక వాంఛలు వెల్లడైతే వెలివేస్తారని భీతిల్లుతారు. జస్టిస్ దీపక్ మిశ్రా అన్నట్టు స్వీయ వ్యక్తీకరణకు అవకాశం లేకపోవటం చావుతో సమానం. ఈ స్వలింగసంపర్కులంతా ఇన్నేళ్లుగా జీవచ్ఛవాలుగా మనుగడ సాగిస్తున్నారు. దేశంలోని ఇతర పౌరులు అనుభవిస్తున్న హక్కులు వీరికి లేకుండా పోయాయి. బడిలో తోటి పిల్లల హేళనలతో మొదలై కుటుంబంలోనూ, బంధువుల్లోనూ వెలివేసినట్టు చూడటం, సమాజంలో నిరాదరణ ఎదురుకావటం ఈ స్వలింగç Üంపర్కులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్య. ఎవరైనా ఫిర్యాదు చేయటం వల్ల పట్టుబడితే 377 సెక్షన్ ప్రకారం దోషులకు యావజ్జీవ శిక్ష లేదా పదేళ్లవరకూ శిక్ష, జరిమానా విధిస్తారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తత్తరపడింది. స్వలింగ సంపర్కం సామాజిక కట్టుబాట్లకు విరుద్ధమని, దానివల్ల ఎయిడ్స్‌లాంటి జబ్బులు వ్యాపిస్తాయని సర్వోన్నత న్యాయస్థానంలో అప్పటి అదనపు సొలిసిటర్ జనరల్ పి.పి. మల్హోత్రా వాదించారు. అదంతా చానెళ్లలో ప్రసారమయ్యేసరికల్లా ఆదరా బాదరాగా మరో అదనపు సొలిసిటర్ జనరల్ మోహ న్జైన్ను పంపి దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని అనిపించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వమైతే తన వైఖరేమిటో నిర్ధారించుకోలేకపోయింది. దీన్ని న్యాయస్థానం ‘విజ్ఞత’కే వదిలేస్తున్నామని చెప్పింది. ప్రజామోదంతో గద్దెనెక్కి, వారిని ఒప్పించగలిగిన స్థితిలో ఉండే పాలకులు ఇలాంటి సంక్లిష్ట అంశాల విషయంలో దాటవేత ధోరణి అవలంబించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. లెనిన్ ఆధ్వర్యంలో ఏర్పడిన సోవియెట్ ప్రభుత్వం 1920లో ప్రపంచంలోనే తొలిసారి స్వలింగ సంపర్కాన్ని సామాజిక, సాంస్కృతిక అంశంగా పరిగణించింది. స్వలింగసంపర్కులను కూడా పౌరులుగా గుర్తించి వారికి హక్కులు కల్పించింది. ఆ తర్వాతే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంది. ఆధిపత్య భావజాలం ఏ రూపంలో ఉన్నా అది సమాజాన్ని ఎదగ నీయదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినంత మాత్రాన స్వలింగ సంపర్కులకు స్వేచ్ఛ లభిం చిందని భావించలేం. వారికి చట్టపరమైన అవరోధాలు తొలగినా సమాజంలో అలుముకున్న సంకు చిత భావాలు వెనువెంటనే మాయం కావు. కనీసం ఆ విషయంలోనైనా ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని వారిపట్ల వివక్ష ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలిస్తే మేలు. -
ఒక్క తీర్పులో ఎన్ని తీర్పులో!
సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో లెస్బీయన్లు, గేలు, బైసెక్సువల్స్, ట్రన్స్‌జెండర్లు (ఎస్‌జీబీటీలు) కూడా వ్యక్తులేనని, వారికి కూడా వ్యక్తిత్వం, మానవత్వం ఉంటాయని, వారికి ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని, వారి మధ్య లైంగిక సంబంధాలను నిషేధిస్తున్న 377వ సెక్షన్ చెల్లదంటూ సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. ఈ తీర్పు ఒక్క ఎస్‌జీబీటీల విజయమే కాదు, భారత పౌరులందరి విజయంగా పేర్కొనవచ్చు. అన్ని హక్కులకన్నా ప్రాథమిక హక్కులు ముఖ్యమని ఈ తీర్పు చెప్పడమే కాకుండా సమాజంలో మెజారిటీ, మైనారిటీ అని తేడా లేకుండా అందరికి సమానంగా ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తద్వారా భిన్నత్వంలో ఏకత్వానికున్న ప్రాధాన్యతను తెలియజేసింది. దేశంలో అతి తక్కువగా ఉన్న ఎస్‌జీబీటీల కోసం ఎప్పటి నుంచో చట్టంలో కొనసాగుతున్న 377వ సెక్షన్‌ను కొట్టివేయలేమని 2013లో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. స్ఫూర్తిదాయకమైన సుప్రీం కోర్టు తీర్పునకు కారణమైంది భారత రాజ్యాంగంలోని 32వ అధికరణం. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లే అధికారాన్ని ఈ అధికరణ కల్పిస్తోంది. అందుకనే ఈ అధికరణ కిందనే ఎస్‌జీబీటీలు తమ వాదనను కోర్టుకు నేరుగా వినిపించగలిగారు. ఈ ‘32వ అధికరణ’నే మొత్తం రాజ్యాంగానికి ఆత్మ, హృదయమని నాటి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ స్వయంగా నాటి రాజ్యాంగ పరిషద్‌లో నొక్కి చెప్పారు. భారత రాజ్యాంగం ఓ బండరాయి కాదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే వీలున్న ‘పరివర్తనా రాజ్యాంగం’ అని కూడా సుప్రీం తాజా తీర్పు సూచిస్తోంది. తీర్పు చెప్పిన జడ్జీల్లో ఒకరు ‘పరివర్తనా రాజ్యాంగం’ అని వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం కూడా. 2013లో ఎస్‌జీబీటీల వాదనను తిరస్కరించిన సుప్రీం కోర్టు 2018 నాటికి వారి వాదనకు సానుకూలంగా స్పందించడమే అందుకు నిదర్శనం. -
‘గే’లుపు సంబరాలు
-
తీర్పులో ఏం చెప్పారు?
జస్టిస్ దీపక్ మిశ్రా ‘భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377 ప్రస్తుత రూపం పౌరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను నిర్వచించే రాజ్యాంగంలోని ఆరిక్టల్ 19(1)(ఏ)ను ఉల్లంఘిస్తోంది. మేజర్లయిన ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషులు లేదా స్త్రీ, పురుషుల మధ్య శృంగారాన్ని రాజ్యాంగవిరుద్ధంగా పరిగణించలేం. ఎవరైనా స్త్రీ, పురుషులు జంతువులతో అసహజ శృంగారానికి పాల్పడితే సెక్షన్ 377 కింద వారిని శిక్షించవచ్చు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు రెండో వ్యక్తి సమ్మతి లేకుండా శృంగారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 377 కింద నేరమవుతుంది. సమాజంలోని ఓ వర్గం లేదా మైనారిటీ ప్రజల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు న్యాయస్థానాల పాత్రకు మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది. సమాజంలోని వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ, అల్పసంఖ్యాకుల హక్కులను హరించేందుకు చేపట్టే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవాలని రాజ్యాంగ నైతికత అనే భావన న్యాయశాఖ సహా అన్ని ప్రభుత్వ విభాగాలను కోరుతుంది’. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ‘స్వలింగ సంపర్కులకు సమాజంలో గౌరవంగా బతికే ప్రాథమిక హక్కు ఉంది. వాళ్లు ఎలాంటి మానసిక సమస్యలతో బాధపడటం లేదు. సెక్షన్ 377 అన్నది బ్రిటిష్ హాయాంలో నైతికతను వివరిస్తూ తెచ్చింది. కాలం చెల్లిన ఈ చట్టాన్ని కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదు. స్వలింగ సంపర్కుల విషయంలో సెక్షన్ 377 వైఖరి ఏకపక్షంగా ఉంది. ఇటీవల జరిగిన సైకియాట్రిక్ అధ్యయనాలు గే, ట్రాన్స్జెండర్లు మానసిక రోగులు కాదని, కాబట్టి వారిని శిక్షించరాదని చెబుతున్నాయి. ప్రాథమిక హక్కులన్నవి రాజ్యాంగం అనే విశ్వంలో ధ్రువ నక్షత్రం లాంటివి. ప్రభుత్వాల పరిధికి దూరంగా ఉన్న ప్రాథమిక హక్కులకు కస్టోడియన్ సుప్రీంకోర్టే. ఈ హక్కులు ఎన్నికలను బట్టి, ప్రభుత్వాలను బట్టి మారవు. స్వలింగ సంపర్కులకు ఈ సమాజంలో గౌరవంగా బతికే హక్కుంది. చట్టాల ప్రకారం వీరికి రక్షణ కల్పించడంతో పాటు ఎలాంటి వివక్ష లేకుండా మనుషులుగానే చూడాలి. ఈ తీర్పుపై కేంద్రం విస్తృత ప్రచారం కల్పించాలి’. జస్టిస్ చంద్రచూడ్ ‘స్వలింగసంపర్కులు భయంతో బతకడానికి వీల్లేదు. 158 ఏళ్లు ఈ వర్గం అవమానాలను సహిస్తూ బతికింది. స్వాతంత్య్రం తరువాత కూడా ఇది కొనసాగింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా చెబుతున్న సెక్షన్ 377 రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం వంటి భావనలను ఉల్లంఘించింది. లైంగిక భాగస్వామిని ఎన్నుకునే హక్కును నిరాకరించడం గోప్యత హక్కును నిరాకరించడమే. రాజ్యాంగంలో రాసిన రాతలకు ఏమాత్రం అర్థం ఉన్నా స్వలింగ సంపర్కులు భయంతో బతకటానికి వీల్లేదు. ఈ డిజిటల్ యుగంలోనూ లైంగికత అన్నది దోపిడీకి అస్త్రంగా మారిపోయింది. ఈ సెక్షన్‌ను కొనసాగించడం ద్వారా మూస ఆలోచనలను, వివక్షను ప్రభుత్వం ప్రోత్సహించింది. భారత రాజ్యాంగం సమాజంలో వివక్షతను నిషేధించింది. తమ లైంగికత ఆసక్తుల ఆధారంగా ఎల్జీబీటీ వర్గంపై వివక్ష చూపరాదు’. -
స్వలింగ సంపర్కం నేరం కాదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సెక్షన్ 377పై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. సమానత్వపు హక్కును హరిస్తున్న ఈ సెక్షన్‌లోని పలు వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మైనార్టీ తీరిన ఇద్దరు పరస్పర అంగీకారంతో ప్రైవేటు ప్రదేశంలో స్వలింగ శృంగారంలో పాల్గొనడం ఇకపై ఏమాత్రం నేరం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గురువారం పేర్కొంది. ‘స్వలింగ సంపర్కం హేతుబద్ధం కాదని, సమర్థించలేమని, నిరంకుశమని ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు చెబుతున్నాయి. అయితే బ్రిటీష్ కాలంనాటి 158 ఏళ్ల నాటి ఈ నిబంధన సరికాదు. సమాజంలో ఎల్జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 సమాజంలో వేళ్లూనుకుపోయిన పాతతరం ఆలోచనలకు ప్రతిరూపమని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులంతా స్వలింగ సంపర్కులకు హక్కులు కల్పించడంలో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వర్గానికి ఇన్నాళ్లుగా సరైన న్యాయం జరగలేదని పేర్కొన్నారు. 2013లో సురేశ్ కౌశల్ కేసులో ‘అంగీకారం ఉన్నప్పటికీ.. అసహజ శృంగారం నేరమంటూ’ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేశారు. జంతువులు, చిన్న పిల్లలు, మైనర్లతో, అలాగే మేజర్లతోనూ పరస్పర అంగీకారం లేకుండా జరిగే లైంగిక కేసుల విషయంలో 377 సెక్షన్‌లోని నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘నవభారతంలో మరింత సమగ్రమైన సమాజాన్ని నిర్మించేందుకు చీకటి నుంచి వెలుగులోకి వచ్చే సమయమిది’ అని చెప్పి తీర్పును సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ముగించారు. తాజా తీర్పు ద్వారా ప్రపంచంలో స్వలింగ సంపర్కాన్నీ చట్టబద్ధం చేసిన 26వ దేశంగా భారత్ నిలిచింది. ఎల్జీబీటీక్యూ కార్యకర్తలు, న్యాయ నిపుణులు, హక్కుల కార్యకర్తలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు సుప్రీం తీర్పును స్వాగతించాయి. అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే లైంగికవాంఛ సహజమైన జీవసంబంధమైన ప్రక్రియని.. దీన్ని సాకుగా చూపి వివక్ష కనబరచడం స్వలింగ సంపర్కుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని కోర్టు పేర్కొంది. ‘18 ఏళ్లు నిండిన వారి స్వలింగ సంపర్కాన్ని సెక్షన్ 377 నేరంగా పరిగణిస్తోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 21లకు విఘాతం కల్గించడమే. అయితే వీరి మధ్య శృంగారం పరస్పర అంగీకారంతోనే, నిర్బంధ రహితంగానే జరగాలి’ అని 493 పేజీల తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 కారణంగానే ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా దేశంలో ద్వితీయశ్రేణి పౌరుల్లా బతకాల్సి వచ్చిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377.. మైనారిటీ తీరిన హోమోసెక్సువల్స్ (ఇద్దరు పురుషులు), హెటిరో సెక్సువల్స్ (ఓ ఆడ, ఓ మగ), లెస్బియన్స్ (ఇద్దరు ఆడవాళ్లు) మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాన్ని ఏర్పర్చుకోవడం నేరం, రాజ్యాంగ వ్యతిరేకం అని చెబుతోంది. ఇదే సెక్షన్ ఓ మగాడైనా, ఆడదైనా.. జంతువుతో శృంగారంలో పాల్గొనటాన్నీ తప్పుబట్టింది. అంతేకాదు, పరస్పర అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య బలవంతంగా లైంగిక చర్య జరగటాన్నీ నేరంగానే పరిగణిస్తోంది. ఇలాంటి కేసులకు సెక్షన్ 377 గరిష్టంగా జీవిత ఖైదు, కనీసం పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తోంది’ అని ధర్మాసనం గుర్తుచేసింది. శృంగార వాంఛ నేరం కాదు: నవ్‌తేజ్ జౌహార్, జర్నలిస్ట్ సునీల్ మెహ్రా, చెఫ్ రితూ దాల్మియా, హోటల్ యజమానులు అమన్నాథ్, కేశవ్ సూరీ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయేషా కపూర్ సహా 20 మంది ఐఐటీ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పునిచ్చింది. ‘శృంగారమనేది జీవసంబంధమైన ప్రక్రియ. ఇది సహజం, ప్రతి ఒక్కరిలోనూ న్యూరోలాజికల్, బయాలాజికల్‌గా అంతర్గతంగా కలిగే మార్పు. పరస్పర ఆకర్షణ కలిగినపుడు శృంగార భావన ఏర్పడటం సహజం. ఇలాంటి వారిని నేరస్తులుగా చూడడం ఎల్జీబీటీక్యూల భావప్రకటన హక్కుకు విఘాతం కల్గించినట్లే’ అని కోర్టు తీర్పు పేర్కొంది. ఎల్జీబీటీక్యూల హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలపై భారత్ కూడా సంతకాలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఇక మేమూ సమాజంలో భాగమే! 17 ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించినందుకు ఢిల్లీ సహా దేశంలోని పలుచోట్ల ఎల్జీబీటీక్యూ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కేక్‌లు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వరా>్గన్ని ప్రతిబింబించే ఇంద్రధనస్సు రంగుల జెండాలను ఊపుతూ తీర్పును స్వాగతించారు. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కాన్ని ఈ సమాజం అడ్డుకోలేదంటూ నినాదాలు చేశారు. ‘మా ఆవేదనను అర్థం చేసుకుని భారత న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచేలా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. మొత్తానికి మేం కూడా సమాజంలో భాగస్వాములమయ్యాం’ అని ఎల్జీబీటీక్యూల కోసం డెల్టా యాప్‌ను రూపొందించిన ఇషాన్ సేథీ పేర్కొన్నారు. స్వాగతించిన న్యాయనిపుణులు: సుప్రీం తీర్పును సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణులు స్వాగతించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ మిగిలిన వారితో సమానంగా, హుందాగా బతికే హక్కు ఉందన్నారు. ఇది సంబరాలు జరుపుకునే తీర్పు అని మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ పేర్కొన్నారు. ఈ తీర్పు రాజకీయాలను, మానవ విలువలను మారుస్తుందని సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ అభిప్రాయపడ్డారు. ప్రముఖుల మద్దతు బాలీవుడ్ ప్రముఖులు, రచయితలు, టీచర్లు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లోని వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్గానికి ప్రాథమిక మానవ హక్కులు కల్పించేలా సుప్రీం తీర్పు ఉందన్నారు. గే అయినందుకు తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న చిత్ర దర్శకుడు హన్సల్ మెహతా ఈ తీర్పు కొత్త ఆరంభానికి సూచకమన్నారు. బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహార్ ‘దేశానికి మళ్లీ ఆక్సీజన్ అందింది’ అని ట్వీట్ చేశారు. ‘భవిష్యత్తులో ఒకరోజు ఎవరు ఏంటి అనే ముద్ర వేయడం ఉండదు. అలాంటప్పుడు దేశం స్వర్గం అవుతుంది’ అని నటి సోనమ్ కపూర్ పేర్కొన్నారు. నైతికత పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాయడం ఎవరి తరం కాదని నటి స్వరా భాస్కర్ అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కుల హక్కులపై మాట్లాడినందుకు తనను లోక్‌సభలో అడ్డుకున్న బీజేపీ ఎంపీలంతా సిగ్గుపడాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. కోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చరిత్ర వీరికి క్షమాపణ చెప్పాలి: జస్టిస్ ఇందు మల్హోత్రా ‘తోటి సమాజమంతా స్వలింగ సంపర్కం పూర్తిగా సహజమైన ప్రక్రియ అని గుర్తించలేకపోవడంతో ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా భయం భయంగా బతుకుతున్నారు. ఏదో మహాపరాధం చేశామన్న భావనలో పడిపోయారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులకు న్యాయం జరగడంలో, హక్కులు కల్పించడంలో ఆలస్యమైనందుకు చరిత్ర వీరికి క్షమాపణలు చెప్పాలి. శతాబ్దాలుగా వీరు అవమానాలకు గురయ్యారు. సమాజానికి వీరి గురించి సరైన అవగాహన లేకపోవడమే కారణం. అందువల్ల ఆర్టికల్ 14 కల్పించిన ప్రాథమిక హక్కులను ఎల్‌జీబీటీక్యూలు కోల్పోయారు’ అని తన తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 377 నేపథ్యమిదీ.. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 16వ అధ్యాయంలో 377వ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ ముసాయిదాను బ్రిటిష్ పాలనలో 1838లో థామస్ మెకాలే రూపొందించగా 1861లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం బ్రిటిష్ సొడొమీ చట్టం(బగ్గరీయాక్ట్ 1533) ఆధారంగా రూపొందింది. సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరమేనని ఈ చట్టం చెబుతోంది. నేరస్తులకు పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేందుకు వీలు కల్పించింది. ఢిల్లీలో సెక్షన్377 రాసి ఉన్న కేక్ కట్ చేస్తున్న దృశ్యం -
ఓ స్వలింగ సంపర్కుడి ఆత్మనివేదన!
భారతీయ స్వలింగ సంపర్కుడిగా నన్ను నేను తొలుచుకుని ప్రపంచం ముందుకొస్తున్నాను! నా యవ్వనమంతా అనుమానం, అనిశ్చితితో కూడుకున్న సందేహాలతో నిండిఉంది. అందరిలా కాకుండా నేను ‘వేరే’ అని నాకు తెలుసు కానీ తెలియందల్లా ఎందుకిలా? అన్నదే. నా చుట్టూ ఉన్న వాళ్ళు ‘ఒరేయ్ హిజ్రా’ అంటూ గేలిచేసినప్పుడు నా సందేహం బద్దలైంది. నా సహ విద్యార్థుల నుంచి, నా ఆటల నుంచి, పాటల నుంచి మొత్తంగా నన్నది వేరు చేసింది. క్రమంగా నాకిష్టమైన అన్నింటినుంచీ నన్ను దూరం చేసి, నన్నొంటరిని మిగిల్చింది. నేనెందుకిలా ఒంటరినయ్యాను. నేనందరిలా ఎందుకు లేను? నాకెందుకీ శిక్ష? ఆ మానసిక స్థితిలోంచి బయటపడేందుకు కఠోరతపస్సు చేయాలి. నాలాంటి వారే నా చుట్టూ ఉన్నవారు నాలాగే వేరుగా ఉన్నవారు వారెందుకిలా ఉన్నారో అర్థం కాక, చెప్పేవారు లేక కనీస లైంగికపరిజ్ఞానం కరువై తమలో తామే నలిగిపోయి మృత్యువును కోరితెచ్చుకుంటుంటే నిశ్చేష్టుడిలా మిగిలిపోయాను. నా సందేహాలకు ఇంటర్నెట్‌ని శరణుకోరాను. అప్పుడర్థం అయ్యింది వేనవేల గేల బేల చూపులతో ఈ ప్రపంచం నిశ్శబ్దంగా నిండిఉన్నదని. అలాంటి విశాల ప్రపంచంలో మన దేశం ఆచూకీ నాకేదీ దొరకలేదు. బహుశా అది ‘మన’ సంస్కృతి కాదేమోనని నాకు నేను చెప్పుకున్నాను. ఆ రోజు నుంచి నేనుగా ఉండడం మానేసాను. సహజంగా నాకిష్టమైనవన్నీ చేయడం ఆపేసాను. గత చాలా కాలంగా నా పని ఒక్కటే. అదే అవమానాలనుంచి, అసహ్యపు చూపులనుంచి, వెలివేతల నుంచి నన్ను నేను కాపాడుకుంటూ ఉండడం. మేమంతా ఓ ఆత్మన్యూనతా భావంలో, అభద్రతా భావంలో కూరుకుపోయాం. ఆత్మగౌరవం కోసం స్వలింగ సంపర్కుల పోరాటం మాకు కొత్తసవాళ్ళను ఎదుర్కొనే శక్తినిచ్చిందే తప్ప పరిస్థితుల్లో పెద్దగా మార్పుతీసుకురాలేదు. తీర్పులూ మమ్మల్ని సేదతీర్చలేదు. అదే వేధింపులు, అవే భయాలూ మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు మాకెంతో ప్రత్యేకం. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టిన రోజు. మా దేహాల గాయాల నుంచి తొలుచుకుని మేం మేముగా నిలిచిన రోజు. సుప్రీంకోర్టు తీర్పుతో గొంగళిపురుగు దశనుంచి రెక్కలువిప్పుకున్న సీతాకోక చిలుకల్లా మేం మా రంగుల ప్రపంచంలోకి సగర్వంగా రెక్కలల్లార్చుకుని ఎగిరిపోయే రోజు. అయినా మాముందు ఇంకా అవమానాల మూకలు నిలిచే ఉన్నాయి. ఎన్నెన్నో సవాళ్ళు మిగిలేవున్నాయి. రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పినట్టు ‘‘నేను ప్రశాంతంగా నిద్రపోయే ముందు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’. ‘‘నన్ను నమ్మండి. మీరిక ఒంటరి కాదు’’. దేశంలోని స్వలింగ సంపర్కులందరికీ ఈ సందేశం అందాలి. ఇంకా మమ్మల్ని అంగీకరించలేని వారికి ఓ చిన్న మాట.... ‘‘అవును మేం స్వలింగ సంపర్కులం. మేమిక్కడే ఉన్నాం. మేం అదృశ్యం కాము.’’ ఇట్లు సంజయ్ దేశ్‌పాండే, వయస్సు 26 న్యూఢిల్లీ వాస్తవ్యుడు -
ఆ ఆరుగురు..
పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్మ్రక తీర్పు వెనుక ఆరుగురి కృషి ఉంది. సెక్షన్ 377ని నాజ్ ఫౌండేషన్ ప్రధానంగా సవాల్ చేసినప్పటికీ ఒక డ్యాన్సర్, ఒక జర్నలిస్టు, ఒక చెఫ్, ఒక హోటల్ యజమాని, ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ చేసిన పోరాటంతో దేశంలో గే చట్టాల్లో సమూల మార్పులు వచ్చాయి. గే హక్కుల కోసం పోరాడుతూ ఎల్జీబీటీక్యూఐ కమ్యూనిటీకి చెందిన ఆ ఆరుగురు ఎవరంటే... నవతేజ్ సింగ్ జౌహర్ నవతేజ్ జౌహర్ భరతనాట్యం డ్యాన్సర్. కొరియోగ్రాఫర్ కూడా. ఢిల్లీ, చెన్నైలలో ఆయన నృత్యపాఠశాలల్ని నడుపుతున్నారు. నాటక అకాడమీ అవార్డు కూడా గెలుచుకున్నారు. చాలా ఏళ్లుగా ఆయన స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. తన సహచరుడు, జర్నలిస్టు సునీల్ మెహ్రా ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సునీల్ మెహ్రా ప్రముఖ జర్నలిస్టు, మాగ్జిమ్ మ్యాగజైన్ మాజీ సంపాదకులు. టెలివిజన్ ప్రొడక్షన్స్లలో కూడా పని చేశారు. 20 ఏళ్లకు పైగా నవతేజ్ జౌహర్తో ఆయనకు అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి స్టూడియో అభ్యాస్‌ని నడిపారు. మొదట్లో న్యాయపోరాటం చేయాలని సునీల్ గట్టిగా అనుకోలేదు. కానీ ఆయన స్నేహితురాలు, లాయర్ అయిన మేనక గురుస్వామి గే హక్కుల కోసం న్యాయస్థానంలోనే పోరాటం చేయాలని చెప్పడంతో పిటిషన్ దాఖలు చేయడానికి ముందుకొచ్చారు. రీతూ దాల్మాయి ప్రముఖ చెఫ్. ఢిల్లీలో ఒక ఇటలియన్ రెస్టారెంట్ దివాని ఆమె నడుపుతున్నారు. ఇండియన్ టీవీలో కుకరీ షోని హోస్ట్ చేస్తున్నారు. కోల్‌కతాలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన రీతూ పదహారేళ్ల వయసులోనే మార్బుల్ బిజినెస్ చేశారు. ఆతర్వాత ఒక చెఫ్‌గా పేరు తెచ్చుకున్నారు. అమన్ నాథ్ 67 ఏళ్ల వయసున్న అమన్ నాథ్ ప్రముఖ రచయిత, ఆర్కిటెక్టర్. హెరిటేజ్ హోటల్స్ నీమ్రానా గ్రూపు వ్యవస్థాపకుడు తన భాగస్వామి ఫ్రాన్సిస్‌తో కలిసి అత్యంత పురాతనమైన భవనాలను హోటల్స్‌గా మార్చారు. వారసత్వ కట్టడాలను పరిరక్షించడమే ఆయన ఆశయంగా ఉండేది. ఆ తర్వాత గే హక్కుల కోసం పోరాటం చేశారు. కేశవ్ సూరి 33 ఏళ్ల వయసున్న కేశవ్సూరి లలిత్ సూరి హాస్పటాలిటీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ . భరత్ హోటల్స్ వ్యవస్థాపకుడు లలిత్ సూరి కుమారుడు. కేశవ్సూరి బహిరంగంగానే తాను గే అని చెప్పుకున్నారు. ఇటీవల తన జీవిత భాగస్వామి అయిన మరో పురుషుడిని పెళ్లి కూడా చేసుకున్నారు. అయేషా కపూర్ అయేషా ఇప్పడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న వ్యాపారవేత్త. ఇకామర్స్ మార్కెట్లో తన సత్తా చాటుతున్నారు. -
అప్పుడు తప్పన్న సుప్రీం కోర్టే..
పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 2013లో స్వలింగ సంపర్కం నేరమని ఉద్ఘాటించిన సుప్రీం కోర్టు ఇప్పుడది నేరం కాదని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో సుదీర్ఘ కాలం పాటు ప్రపంచ దేశాల్లో ఉద్యమాలు, చర్చోపచర్చలు సాగడం, అంతర్జాతీయ సమాజం సానుకూలత వ్యక్తం చేస్తుండటం, మన ప్రభుత్వాల వైఖరిలో కూడా మార్పు రావడం వంటివి సుప్రీంపై ప్రభావం చూపి ఉండవచ్చని భావిస్తున్నారు. చట్టంలో ఏముంది? భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 377వ సెక్షన్ అసహజ నేరాలను నిర్వచించింది.1862 నుంచి అమల్లో ఉన్న ఈ సెక్షన్ ప్రకారం ప్రకృతికి విరుద్ధంగా స్త్రీ, పురుషులు లేదా జంతువులతో లైంగిక చర్య జరపడం శిక్షార్హమైన నేరం. అలాంటి వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష తో పాటు జరిమానా కూడా విధింవచ్చని సెక్షన్ 377 స్పష్టం చేస్తోంది. చట్టబద్ధం చేసిన ఢిల్లీ హైకోర్టు పరస్పర సమ్మతితో కూడిన స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు 2009 జులైలో తీర్పు ఇచ్చింది. సెక్షన్ 377 స్వలింగ సంపర్కుల ‘పరిపూర్ణ వ్యక్తిత్వ హక్కు’ను నిరారిస్తోందని,అందువల్ల ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని ఆ సందర్భంగా హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును 2013, డిసెంబర్లో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమేనని జస్టిస్ జీఎస్ సంఘ్వి నాయకత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.వివాదాస్పదమైన ఈ అంశంపై చర్చించాల్సింది పార్లమెంటేనని పేర్కొంది. భారతీయ సమాజంలో స్వలింగ సంపర్కం నిషేధమన్న భావన చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని ఎల్జీబీటీ లే కాకుండా పలువురు స్వేచ్ఛాకాముకులు కూడా వాదిస్తున్నారు.అయితే, దీనిని ‘విపరీత ప్రవర్తన’గా చాలా మంది ఇప్పటికీ భావిస్తున్నారు. రాజకీయ ఏకాభిప్రాయం మొదట్లో ప్రభుత్వాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ, 377 వ సెక్షన్‌ను సమర్థిస్తూ వచ్చాయి.అయితే ఈ అంశంపై సీరియస్‌గా జరిగిన చర్చలు, మీడియా కథనాల ఫలితంగా రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవలసి వచ్చింది.గతంలో సెక్షన్ 377ను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతునిచ్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్టు కనిపిస్తోంది.గత నవంబర్‌లో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈ అంశంపై మాట్లాడుతూ‘ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది స్వలింగ సంపర్కాన్ని ప్రత్యామ్నాయ లైంగిక ప్రాధాన్యంగా పరిగణిస్తోంటే మనం ఇప్పటికీ వారిని జైల్లో పెట్టాలన్న అభిప్రాయంతో ఉండటం సరికాదు.ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఆమోదయోగ్యమనిపిస్తోంది’అన్నారు.కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎంలు కూడా సెక్షన్ 377 రాజ్యాంగవిరుద్ధమన్న భావననే వ్యక్తం చేశాయి. ట్రాన్స్‌జండర్లపై తీర్పు ట్రాన్స్ జండర్లను(లింగ మార్పిడి చేసుకున్న వారు) థర్డ్ జండర్‌గా ప్రకటించాలని, ఓబీసీ కోటాలో వారిని కూడా చేర్చాలని సుప్రీం కోర్టు 2014 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.వారికి కూడా ఇతరులలాగే వివాహం, దత్తత, విడాకులు, వారసత్వం తదితర హక్కుల్ని కల్పించాల్సి ఉందని స్పష్టం చేసింది. భారతీయ సమాజంలో ట్రాన్స్జండర్ల పరిస్థితి దయనీయంగా ఉందంటూ ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి విషయంలో ప్రభుత్వాల ధృక్కోణం మారాల్సి ఉందని 2015, నవంబర్‌లో జాతీయ న్యాయ సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవ సభలో ఆయన ఉద్ఘాటించారు.ట్రాన్స్ జండర్ల కోసం చట్టాలను సవరించాలని, కొత్త చట్టాలు తేవాలని ఆయన అన్నారు.ట్రాన్స్ జండర్ల హక్కులను గుర్తిస్తూ ఎన్డీఏ సర్కారు ముసాయిదా చట్టాన్ని కూడా తయారు చేసింది. ఈ పరిణామాలన్నీ సెక్షన్377 విషయంలో సుప్రీం కోర్టు అభిప్రాయం మారడానికి దారి తీశాయి. నైతికత సమస్య స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును బాలల హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు తప్పుపట్టాయి. బాలలపై అకృత్యాల నివారణకు ఈ సెక్షను అవసరం ఎంతైనా ఉందని వాదిస్తున్నాయి. అంతే కాకుండా స్వలింగ సంపర్కమన్నది సమాజపు నైతిక విలువలకు విరుద్ధమని పలువురు వాదిస్తున్నారు.అయితే,2012లో తెచ్చిన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోస్కో) చట్టం సెక్షన్ 377 కంటే సమర్థంగా, పటిష్టంగా ఉందని ఈ చట్టంతో బాలల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని మరో వర్గం వాదిస్తోంది. నైతికత పేరుతో ప్రాథమిక హక్కుల్ని హరించడం సరికాదని అంటోంది. చట్టపరంగా తప్పయినది నైతికంగానూ తప్పే అవుతుందని,అయితే నైతికంగా తప్పయినదంతా చట్టపరంగానూ తప్పేననడం సరికాదని వారంటున్నారు. ఏ నైతిక నేరమైనా సమాజంపై దుష్ప్రభావం చూపినప్పుడే అది చట్టపరంగా నేరమవుతుందేకాని వ్యక్తిగతంగా నష్టం జరిగితే చట్టపరంగా తప్పు కాదని తాజా తీర్పును సమర్థించేవారు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయంగా సానుకూలత స్వలింగ సంపర్కం నేరం కాదన్న అభిప్రాయం అంతర్జాతీయంగా బలపడుతోంది. వివిధ దేశాలు స్వలింగసంపర్కాన్ని ఆమోదిస్తూ చట్టాలు కూడా చేశాయి.ప్రస్తుతం 120 దేశాలు హోమోసెక్సువాలిటీని చట్టబద్ధంగా పరిగణిస్తున్నాయి. 2000లో నెదర్లాండ్స్ హోమో సెక్సువాలిటీని చట్టబద్ధం చేసింది. ఈ పరంపరను బెల్జియం, కెనడా,స్పెయిన్, దక్షిణాఫ్రికా, నార్వే, స్వీడెన్, ఐస్లాండ్, పోర్చుగల్, అర్జెంటీనా, డెన్మార్క్, ఉరుగ్వే. న్యూజిలాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్,ఇంగ్లండ్ అండ్ వేల్స్, ఫిన్లాండ్, మాల్టా కొనసాగించాయి. అమెరికా వ్యాప్తంగా గే వివాహాలు చట్టబద్ధమంటూ 2015 జూన్ 27న యూఎస్ సుప్రీంకోర్టు ప్రకటించింది. 25 దేశాల్లో వీరి మధ్య పెళ్లిళ్లకు కూడా అనుమతి ఉంది. 2003లో తొలిసారిగా నెథర్లాండ్స్ ఈ వివాహాలకు ఆమోదం తెలపగా, జర్మనీ, తాజాగా ఆస్ట్రేలియా ఆ జాబితాలో చేరాయి. ఈ దంపతులు పిల్లలను దత్తత తీసుకునే అవకాశాన్ని 26 దేశాలు కల్పించాయి. 72 దేశాల్లో నేరమే..! భారత్ సహా 72 దేశాలు ఇప్పటికీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. షరియా చట్టంలో భాగంగా ఇరాన్, సుడాన్, సౌదీ అరేబియా, యెమన్, సోమాలియా, ఉత్తర నైజీరియా స్వలింగ సంబంధాలను తీవ్రమైన నేరాలుగా శిక్షిస్తున్నాయి. ఖతర్‌లో ముస్లింలను మాత్రమే శిక్షిస్తుండగా, సౌదీ అరేబియాలో ముస్లింతో ఇలాంటి సంబంధం కలిగిన ముస్లిమేతరుడికి కూడా మరణశిక్ష విధించవచ్చు. ఇస్లామిక్‌స్టేట్ (ఐఎస్) అయితే ఏకంగా బహిరంగ హత్యలకు పాల్పడుతోంది.పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ. ఖతర్, మౌరిటానియా చట్టాల ప్రకారం మరణశిక్షను విధించవచ్చు. -
సుప్రీం తీర్పు : డ్యాన్స్‌తో అదరగొట్టిన హోటల్ స్టాఫ్
-
సుప్రీం తీర్పు : డ్యాన్స్‌తో అదరగొట్టిన హోటల్ స్టాఫ్
సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదని, గే సెక్స్‌కు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీం కోర్టు వెల్లడించిన సంచలన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని కొనియాడుతున్నారు. సుప్రీం తీర్పు వెల్లడయ్యాక ఎంతో ఉద్వేగమవుతున్న ఎల్జీబీటీ కమ్యూనిటీ కలర్‌ఫుల్ సెలబ్రేషన్స్ నిమగ్నమైంది. వారి సెలబ్రేషన్స్‌లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటున్నారు. ఈ తీర్పు ఢిల్లీలోని లలిత్ హోటల్‌కు కూడా కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. అక్కడి స్టాఫ్ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఎందుకంటే, లలిత్ గ్రూప్ హోటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశవ్ సురి, ప్రముఖ ఎల్జీబీటీ కార్యకర్త. ఇంధ్రదనస్సు రంగుల్లో ఉన్న స్కార్ఫ్‌ను మెడలో, చేతికి ధరించి, హోటల్ స్టాఫ్ డ్యాన్స్‌తో హోరెత్తించారు. ఈ సెలబ్రేషన్స్‌లో ఇతరులను కూడా భాగస్వాములు కావాలని, హోటల్ స్టాఫ్ కోరారు. దీనిపై పనిచేసిన న్యాయవాదులందరికీ, జడ్జీలకు కృతజ్ఞతలని కేశవ్ సురి అన్నారు. పండుగ చేసుకోవడానికి ఇది చాలా పెద్ద సమయమని ఆనందం వ్యక్తం చేశారు. సెక్షన్ 377 కేసులో కేశవ్ సురి కూడా ఫిర్యాదుదారు. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించిన సుప్రీంకోర్టు, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 377పై కీలక వ్యాఖ్యలు చేసింది. చరిత్ర వారికి క్షమాపణ చెప్పాలంటూ వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. తద్వారా సెక్షన్ 377పై సుదీర్ఘ కాలంగా (సుమారు 157 ఏళ్లుగా) సాగుతున్న వివాదానికి స్వస్తి పలికింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. -
బాగా పరిశీలించాకే నిర్ణయం
న్యూఢిల్లీ: భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377కు సంబంధించి చట్టబద్ధమైన ప్రామాణికతను అన్ని రకాలుగా పరిశీలించాకే రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. భారత్‌లో స్వలింగ సంపర్కులపై తీవ్ర వివక్షకారణంగా అది వారి మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపిందని అభిప్రాయపడింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే 158 ఏళ్ల నాటి సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ధర్మాసనం సెక్షన్ 377 రద్దుపై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తమకే వదిలేసినప్పటికీ రాజ్యాంగపరంగా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా సెక్షన్ 377ను కొనసాగించాలని, దీనిపై ప్రజాభిప్రాయం సేకరించాలని న్యాయవాదులు చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని దానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనేది చూడాలని అభిప్రాయపడింది. కేంద్రం యూ టర్న్ తీసుకుందనడం సబబు కాదు కేంద్రం ఈ కేసులో ‘యూ టర్న్’ తీసుకుందన్న న్యాయవాదుల ఆరోపణను, వారి వ్యతిరేకతను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అయితే గోప్యతా హక్కుతో పాటు పలు తీర్పులను పరిగణనలోకి తీసుకుని చూస్తే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ‘యూ టర్న్’గా అభివర్ణించడం సబబు కాదని పేర్కొంది. -
బంతి సుప్రీంకోర్టులో..
న్యూఢిల్లీ: వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న నిబంధన రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టే తేల్చాలని కేంద్రం పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 377లోని ఈ ఒక్క అంశంపైనే రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, దత్తతలు, హక్కులు తదితరాల జోలికిపోవొద్దని కోరింది. ఇందుకు సంబంధించి కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరమని పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 377ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నుంచి చేపట్టిన సంగతి తెలిసిందే. సెక్షన్ 377 పరిధి దాటి మరేదైనా విషయాన్ని కోర్టు పరిశీలించదలచుకుంటే, దాని ప్రభావం ఇతర చట్టాలపై తప్పక ఉంటుందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. ‘వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 377పై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విచక్షణకే వదిలేస్తోంది. సెక్షన్ 377 పరిధి దాటి ఇతర విషయాల్ని కోర్టు పరిశీలించదలచుకున్నా, ఎల్జీబీటీ వర్గాల హక్కులకు సంబంధించి ఏదైనా తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నా, బదులుగా మరో సవివర అఫిడవిట్ దాఖలు చేస్తాం’ అని కేంద్రం తెలిపింది. అదో ఏవగింపు చట్టం.. ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని మాత్రమే పరిశీలిస్తామని, ఒకవేళ తాము అందులోని శిక్షార్హమైన నిబంధనలను తొలగిస్తే ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గంపై ఉన్న అనర్హత తొలగిపోయి వారు కూడా త్రివిధ దళాల్లో చేరడంతో పాటు ఎన్నికల్లో పోటీచేస్తారని ధర్మాసనం తెలిపింది. ఇదే జరిగితే అలాంటి సంబంధాలను సమాజంలో హీనంగా చూసే రోజులు పోతాయంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఇలాంటి చట్టం ‘సామాజిక ఏవగింపు’నకు ఉదాహరణ అని పేర్కొంది. ఇలాంటి వాటిని చెల్లవని ప్రకటించడం సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు, ఎల్జీబీటీ వర్గీయులు గౌరవంగా జీవించేందుకు సాయపడుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్వలింగ సంపర్కుల ఉపాధికి ఈ చట్టంలోని శిక్షార్హమైన నిబంధనలు తీవ్ర విఘాతంగా మారాయని తెలిపింది. అయినా, స్వలింగ సంపర్కం నేరమా? కాదా? అన్నదానిపైనే విచారణ జరుపుతామని, ఎల్జీబీటీ హక్కుల అంశం తమ ముందుకు రాలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 377ను సవాలు చేస్తూనే ఎక్కువ పిటిషన్లు దాఖలయ్యాయని కేంద్రం తెలపింది. ఆ పరిధిని దాటి విచారణ కోర్టు జరపాలనుకుంటే చట్టబద్ధ దేశ ప్రయోజనాలను ఉటంకిస్తూ కౌంటర్ అఫిడవిట్ వేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రానికి కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేసే అవకాశం ఇవ్వకుండా, సెక్షన్ 377 కాకుండా ఇతర విషయాలపై విచారణ జరిపి, తీర్పు వెలువరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. వివాదం లేకుంటే విచారణ వద్దు.. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ..వివాదంలో లేని వ్యవహారాలపై విచారణ అక్కర్లేదని అన్నారు. తొలిరోజు విచారణ సందర్భంగా..‘జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రాథమిక హక్కు’ అన్న జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అందుకు జస్టిస్ చంద్రచూడ్ బదులిస్తూ సంక్లిష్ట విషయాల్లో తాము జోక్యం చేసుకోమని, ఇద్దరు వయోజనుల మధ్య సంబంధం ఆర్టికల్ 21కి సంబంధించిందా? కాదా? అనే విషయంపైనే దృష్టిపెడుతున్నామని స్పష్టతనిచ్చారు. -
సెక్షన్-377.. కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యాయ చరిత్రలో మరో చారిత్రక అధ్యయం చోటుచేసుకుంది. ఐపీసీలోని వివాదాస్పద సెక్షన్-377పై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ గతంలో(2013) అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వగా.. ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించేందుకే మొగ్గు చూపింది. ఈ మేరకు విచారణను వాయిదా వేయాలన్న కేంద్రం వినతిని ధర్మాసనం సున్నితంగా తోసిపుచ్చింది. దీంతో ఎల్జీబీటీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. సాక్షి, న్యూఢిల్లీ: సెక్షన్-377 తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను విచారణను వాయిదా వేయాలంటూ కేంద్రం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ‘సామాజిక నైతికతలో మార్పులు వస్తున్నాయి. అందుకే తీర్పులోని తప్పుఒప్పులను పునఃసమీక్షించాలని నిర్ణయించాం’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఆర్ఎఫ్ నారీమన్, వైవీ చంద్రచూడ్, ఎఎమ్ కన్వీల్కర్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన విస్తృత ధర్మాసనం రిప్యూ పిటిషన్‌ను విచారణ చేపట్టింది. ‘సమాజంలో మార్పులు వస్తున్నాకొద్దీ.. విలువలు కూడా మారుతున్నాయి. కాబట్టి స్వలింగ సంపర్కం నేరం కాదు’ అని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి(మాజీ అటార్నీ జనరల్) వాదనలు వినిపించారు. లంచ్ విరామం అనంతరం తిరిగి విచారణ కొనసాగనుంది. ఐపీసీ సెక్షన్ 377... ఈ సెక్షన్ కింద ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. మగవాళ్ళు మగవాళ్లతో.. లేదా మహిళలు మహిళలతో శృంగారంలో పాల్గొనడం అనైతిక చర్యగా పరిగణిస్తారు. ఐపిసి 377 సెక్షన్ కింద 'అసహజమైన నేరాల' (ఎవరైనా పురుషుడు, లేదా స్త్రీ, లేదా జంతువుతో అసహజ సంపర్కానికి) పాల్పడేందుకు ప్రయత్నించినా, పాల్పడినా వారికి యావజ్జీవిత జైలు శిక్ష, లేదా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం వుంది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించొచ్చు. 150 ఏళ్లకు పైగా.. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే గే సెక్స్ ‘నేరం కాదని’ తేల్చింది. రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. చివరకు డిసెంబర్ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదని, నేరమని తేల్చి చెప్పిది. అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది. దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయన్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు న్యాయనిపుణులు లేవనెత్తుతున్నారు. -
స్వలింగ సంపర్కం నేరమా?
సాక్షి, న్యూఢిల్లీ : మరో చారిత్రక తీర్పుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సిద్ధమైంది. ఎన్నో ఏళ్లుగా వివాదంగా మారిన భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) 377పై దాఖలైన రిప్యూ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఐపీసీ 377 దేశంలో స్వలింగ సంపర్కం నేరం అనే భావాన్ని వ్యక్తం చేస్తోంది. దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. హోమో సెక్సువల్ను చట్టబద్దం చేయాలని కొందరు, సెక్షన్ 377ను ఐపీసీ నుంచి తొలగించాలని కొందరు పలు కేసులను దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఆర్ఎఫ్ నారీమన్, వైవీ చంద్రచూడ్, ఎఎమ్ కన్వీల్కర్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన విస్తృత ధర్మాసనం రిప్యూ పిటిషన్‌ను విచారించనుంది. ఢిల్లీ హైకోర్టు తీర్పు స్వలింగ సంపర్క నేరంగా భావించే సెక్షన్ 377పై 2009లో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు ఇది విరుద్ధంగా ఉందని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుతో హోమో సెక్సువల్స్ దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు తమకు కూడా వర్తిస్తాయని, స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును లెస్బియన్, గే, బైసెక్సువల్,లింగమార్పిడి (ఎల్జీబీటీ) చెందిన వ్యక్తులు 2013లో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సెక్షన్ 377 ఇద్దరు వ్యక్తుల లైంగిక ధోరణిని నాశనం చేస్తోందని, చట్టంపై సహేతుకమైన పరిమితులు విధించకూడదని ఎల్జీబీటీలు పిటిషన్లో పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఇటీవల సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించడంతో.. మరోసారి సెక్షన్ 377 తెరమీదకు వచ్చింది. 149 సంవత్సరాల చరిత్ర గల ఈ సెక్షన్ అసహజ లైంగిక చర్యలకు పాల్పడే స్త్రీ, పురుషులకు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు పెనాల్టీ కూడా విధిస్తారు. స్వలింగ సంపర్కం రుగ్మత కాదు స్వలింగ సంపర్కం రుగ్మత కాదని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ గతంలో ప్రకటించింది. హోమో సెక్సువల్ను మానవ లైంగిక వైవిద్యంగా పేర్కొంటూ.. దానిని ద్విలింగ సంపర్కమని తెలిపింది. సైకియాట్రిక్ సోసైటీ ప్రకటన ఎల్జీబీటీకి కొంత ఊరటనిచ్చింది. కొన్ని దేశాల్లో స్వలింగ సంపర్కం చట్టబద్దంగా ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పును వెలువరిస్తుందో వేచి చూడాలి. -
‘మీ అబ్బాయికి సెల్‌ఫోన్ ఇచ్చారా..?’
-
‘మీ అబ్బాయి ఫోన్ వాడుతున్నాడా...?’
గురుగ్రామ్, హర్యానా : స్వలింగ సంపర్కం గురించి ఈ మధ్యకాలంలో మనదేశంలో బహిరంగంగా చర్చిస్తున్నారు. భారతీయ న్యాయస్మృతిలోని ‘సెక్షన్ 377’తో పాటు మరికొన్ని సెక్షన్లు స్వలింగ సంపర్కం నేరమని చెబుతున్నాయి. దీంతో సంబంధిత సెక్షన్లలో మార్పులు చేయాలని ఏళ్ల తరబడి న్యాయపోరాటాలు జరగుతున్నాయి. ‘హోమోసెక్సువల్’/‘గే’/‘లెస్బియన్’గా మారడానికి కారణం హర్మోన్ల ప్రభావమని డాక్టర్లు చెప్తున్న తరుణంలో ఒక ప్రముఖ వార్త పత్రికలో వచ్చిన ప్రకటన ఇప్పుడు అందర్నీఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ ప్రకటనలో ‘పెళ్లికి ముందే మీ కుమారుడు లేదా కూతురు ‘గే’ లేదా ‘లెస్బియనా’ అనే విషయం తెలుసుకొండి’ అంటూ ఫోన్ నంబరు కూడా ఇచ్చాడు గుర్గావ్కు చెందిన ఓ నకిలీ వైద్యుడు. ఈ ప్రకటనను కాస్తా ఎవరో ఫేస్బుక్లో పోస్టు చేశారు. దాంతో ఈ డాక్టరు గారి కథేంటో తెలుసుకుందామని ఓ యువతి ప్రకటనలో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో సదరు యువతి తనకు 40 ఏళ్లని, తన కుమారుడికి 17 ఏళ్లని పరిచయం చేసుకుంది. అవతలి వ్యక్తి తనను తాను ‘వైద్యుడి’గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం సదరు ‘డాక్టరు’ ఆ మహిళను ఎక్కువ ప్రశ్నలేమి వేయకుండానే ఆమె కొడుకును ‘గే’ అని తెల్చేశాడు. ‘గే అంటే అర్ధం తెలుసు కదా...!’అని సదరు మహిళను ప్రశ్నించాడు. అంతేకాక ‘నీ కుమారుడికి బాగా కోపం వస్తుందా’ అని అడగ్గా దానికి ఆ మహిళ ‘లేదు, చాలా ప్రశాంతంగా ఉంటాడు’ అని సమాధానమిచ్చింది. అందుకు ఆ వైద్యుడు ‘అతడు లోపల బాధపడుతున్నాడు. మీ అబ్బాయి గే అనే విషయం అతనికే తెలియదు. అందుకే ఆ విషయం గురించి మీతో చెప్పడం లేదు అన్నాడు.’ అంతేగాక ‘అమెరికాలో దాదాపు 40 శాతం పురుషులు ‘గే’లే’ అంటూ చాలా నమ్మకంగా చెప్పాడు. ఒక వ్యక్తి ‘గే’గా మారాడానికి ఈ వైద్యుడు చెప్పిన కారణం వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఫోన్ సంభాషణలో భాగంగా సదరు వైద్యుడు ‘మీ అబ్బాయికి సెల్‌ఫోన్ ఇచ్చారా..?’ అని అడగ్గా దానికి ఆ మహిళ ‘అవున’ అన్నారు. ఇంకేముంది ఆ వైద్యుడు ‘నీ కొడుకు ‘గే’గా మారడానికి కారణం సెల్‌ఫోనే’ అని తెల్చేశాడు. అందుకు ఆ మహిళ ముందు ఆశ్చర్యపోయినా తరువాత అమాయకంగా ‘ఫోన్ వాడకుండా ఉంటే నా కొడుకు మాములుగా మారతాడా...?’ అని ప్రశ్నించింది. అందుకు ఆ డాక్టర్ మీరు హౌస్‌వైఫ్ అయ్యుంటారన్నాడు. తర్వాత ఫోన్ నుంచి విడుదలయ్యే ‘అతినీలలోహిత’ కిరణాల వల్ల పురుషులు ‘గే’ గా మారతారని చెప్పాడు. అందుకు ఆ మహిళ ‘నేనూ ఫోన్లో మాట్లాడుతున్నాను కదా...నేను ‘గే’గా మారతానా అని ప్రశ్నించగా అందుకు ఆ డాక్టర్ అలా ఏం ఉండదు ఎందుకంటే స్త్రీలలో ‘టెస్టోస్టిరాన్ లెవల్స్’ ఎక్కువగా ఉంటాయని తెలిపాడు. అంతేకాకుండా ఒక వేళ పురుషుల్లో కూడా ఈ ‘టెస్టోస్టిరాన్ లెవల్స్’ ఎక్కువగా ఉన్నట్లయితే వారు ‘గే’గా మారే అవకాశం చాలా తక్కువని వారికి పుట్టే పిల్లలు కూడా ‘గే’గా మారే అవకాశం తక్కువని తెల్చేశాడు. అంతేకాక తాను వైద్యం చేసి సదరు మహిళ కొడుకుకు నయం చేస్తానని అందుకు అతని ఫోటో కావాలని అడిగాడు. ‘గే’ నుంచి మాములు మనిషిగా మార్చడానికి కొన్ని ‘శక్తుల కషాయాల’ను ఆ మహిళ కొడుకు శరీరంలోకి పంపించాలని అందుకు ఖర్చవుతుందని తెలిపాడు.ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
పాఠశాలలో ‘లెస్బియన్’ కలకలం
కోల్‌కతా: స్వలింగసంపర్కానికి పాల్పడినట్లు విద్యార్థినులతో ఓ పాఠశాల యాజమాన్యం లేఖలు రాయించుకున్న ఘటన పశ్చిమబెంగాల్లో కలకలం రేపింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలోని కమల గర్ల్స్ హైస్కూల్‌కి చెందిన 10 మంది బాలికలు స్వలింగసంపర్కానికి పాల్పడినట్లు ఇతర విద్యార్థులు ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం బాలికలను పిలిచి విచారించింది. తాము స్వలింగ సంపర్కానికి పాల్పడ్డామని వారు విచారణలో ఒప్పుకున్నట్టు పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. పాఠశాల యాజమాన్యం వారిచే లేఖలు రాయించుకుని విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. తమ పిల్లలు స్వలింగ సంపర్కానికి పాల్పడలేదని, బలవంతంగా వారిచే లేఖలు రాయించారని ఘర్షణకు దిగారు. తమ పిల్లలపై అనవనరంగా నిందలు మోపారని, చేతులు పట్టుకోవడం లేదా ఒకరి భుజాల మీద ఒకరు చేయి వేయడం స్వలింగ సంపర్కం కాదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. బాలికల ఉదంతాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వారిని సరైన మార్గంలోకి తీసుకురావడానికే లేఖలు రాయించామని స్కూల్ యాజమాన్యం తెలిపింది. -
‘సుప్రీం’ నిర్ణయం భేష్
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమైనదేనంటూ నాలుగేళ్లక్రితం తానిచ్చిన తీర్పును పునఃసమీక్షించడా నికి అంగీకరించడం ద్వారా సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక నిర్ణయం తీసు కుంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన నేతృత్వంలోని ముగ్గురు న్యాయ మూర్తుల బెంచ్ తరఫున ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు స్వలింగ సంపర్కుల్లో ఆశలు రేకెత్తించకమానవు. జస్టిస్ దీపక్ మిశ్రా అన్నట్టు ప్రకృతి నియమాలు స్థిరంగా ఉండేవి కాదు. నిరంతర మార్పే వాటి సహజ స్వభావం. సమాజమైనా అంతే. తమ తమ వ్యక్తిగత లైంగిక భావనల కారణంగా ఏ వ్యక్తీ లేదా కొంతమంది వ్యక్తుల సమూహం వేధింపులూ, బెదిరింపులూ ఎదుర్కొనకూడ దని... భయంతో బతుకీడ్చే పరిస్థితి ఉండరాదని ఆయన చెప్పడం స్వలింగ సంప ర్కులకు ధైర్యాన్నిస్తుంది. వాస్తవానికి నిరుడు ఆగస్టులో వ్యక్తిగత గోప్యతపై తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనే ఇందుకు సంబంధించిన మూలాలున్నాయి. దేన్ని ఎంపిక చేసుకోవాలో, దేనికి ప్రాధాన్యమివ్వాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ పౌరుల కుంటుందని ఆ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు సెక్షన్ 377పై ఇచ్చిన తీర్పును పునస్సమీక్షిస్తామనడం దానికి కొనసాగింపే. 2009లో అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా, న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీ ధర్ల ధర్మాసనం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించలేమని తీర్పునిచ్చింది. దీన్ని నేరంగా నిర్ధారిస్తున్న సెక్షన్ 377 రాజ్యాంగంలోని 21, 14, 15 అధికరణలను ఉల్లంఘిస్తున్నదని చెప్పింది. ఆ సెక్షన్‌లోని ‘అసహజ నేరాల’ జాబితా నుంచి దీన్ని తొలగించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధతను ధ్రువీకరించింది. ఈ చట్టంలో మార్పు అవసరమో కాదో పార్లమెంటే చెప్పాలి తప్ప న్యాయస్థానాలు కాదని తెలిపింది. కాలచక్రం ఎప్పుడూ ముందుకే తిరుగుతుంటుంది. అదే సమయంలో దాన్ని తాత్కాలికంగా ఆపడానికి లేదా వెనక్కి తిప్పడానికి ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. బ్రిటన్ను క్వీన్ విక్టోరియా పాలించినప్పుడు అమలులో ఉన్న సంకుచిత నైతిక విలువలకు అనుగుణంగా 1861లో బ్రిటిష్ వలసవాదులు మన దేశంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దోషులకు యావజ్జీవశిక్ష లేదా పదేళ్ల వరకూ శిక్ష, జరిమానా విధించవచ్చునని చట్టం చెబుతోంది. ఇక్కడి మత, ఛాందసవాద సంస్థలు ఆదినుంచీ ఈ సెక్షన్ ఉండాల్సిందేనని గట్టిగా వాదిస్తున్నాయి. ఏ తరహా సమాజంలోనైనా వ్యక్తి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకూ, సామాజిక, సంప్రదాయిక కట్టుబాట్లకూ మధ్య ఇలాంటి వైరుధ్యం తప్పదు. అటువంటప్పుడు ప్రభుత్వమూ లేదా న్యాయస్థానాలూ క్రియాశీలంగా వ్యవ హరించి ఆ వైరుధ్యాన్ని పరిష్కరించాల్సివస్తుంది. స్వలింగ సంపర్కం నేరంగా భావించలేమని, భారతీయ శిక్షాస్మృతి నుంచి దీన్ని తొలగించాలని 2000 సంవత్సరంలో జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ 172వ నివేదిక సిఫార్సు చేసింది. ఆ సెక్షన్లో ఉన్న ఇతర అసహజ నేరాలను కొత్తగా సెక్షన్ 376 ఎఫ్ తీసుకొచ్చి దాని కిందకు చేర్చవచ్చునని సూచించింది. కానీ ఇంతవరకూ ఏ ప్రభుత్వాలూ ఆ సిఫార్సు విషయంలో శ్రద్ధ పెట్టలేదు. అయితే పార్టీలకతీతంగా చాలామంది రాజకీయ నాయకులు ఈ సెక్షన్‌పై అడపా దడపా వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 2009లో అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ దీన్ని కాలం చెల్లిన చట్టంగా అభివర్ణించారు. అప్పటి కేంద్ర ఆరోగ్యమంత్రి అన్బుమణి రామదాస్ ఇది రద్దు చేయదగిన చట్టమని చెప్పారు. ఇలాంటి అభిప్రాయాలే కొందరు బీజేపీ నాయకులు సైతం వ్యక్తం చేశారు. పక్కవారికి ఇబ్బంది కలిగించనంతవరకూ స్వలింగ సంపర్కం నేరం కాదని రెండేళ్లక్రితం ఆరెస్సెస్ సహ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె ప్రకటించి, ఆ తర్వాత నాలిక కరుచుకున్నారు. అది సామాజిక అనైతికమని స్వరం మార్చారు. నైతిక విలువల భావనకూ, వాస్తవానికీ మధ్య ఊగిసలాటలు మనలాంటి సమాజంలో సహజమే. పురుషాధిక్యత ఇతర జెండర్లను తక్కువ చేసి చూస్తుంది. స్త్రీ పురుష శృంగారం మాత్రమే సహజమైనదని, పునరుత్పత్తితో ముడిపడని శృంగారం అసహజమైనదని అంటుంది. మనుషుల్లో మాత్రమే కాదు... సమస్త జీవుల్లో కూడా ఇందుకు సంబంధించి వైవిధ్యతలున్నాయన్న సంగతిని ఒప్పుకోదు. పర్యవసానంగా భిన్న లైంగిక భావనలున్నవారిని రోగులుగా పరిగణించడమేకాక... వారికి చికిత్స జరిపిస్తే ‘అందరిలా’ ఉండగలరనే అభిప్రాయం చాలామందిలో ఇప్పటికీ ఉంది. ఇటీవల తెలంగాణలో ఇద్దరు యువతులు ఆలుమగల్లా కలిసి ఉంటామని పటు బట్టడం, వారి తల్లిదండ్రులు అందుకు అంగీకరించకపోవడంతో వివాదం తలె త్తడం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. స్వలింగ సంపర్కులను ఈ చట్టం కింద అరెస్టు చేసి శిక్షించిన సందర్భాలు స్వల్పమే అయినా, అది అమల్లో ఉండటం వల్ల తలెత్తే ఇతర సమస్యలు తక్కువేం కాదు. సమాజం వెలివేసినట్టు చూడటం, వేధింపులకు దిగడం వల్ల స్వలింగ సంపర్కులు బాహాటంగా బయటపడరు. ఇది ఇతరత్రా అనేక సమస్యలకు దారితీస్తుంది. అసలు ప్రేమించడమే సామాజిక నియమాల అతిక్రమణగా పరిగణించే మన సమాజంలో కులాంతర, మతాంతర ప్రేమలూ, పెళ్లిళ్లను ఆహ్వానించలేని సంకుచిత స్థితి ఉంది. ఇక స్వలింగ సంపర్కం లాంటి లైంగిక భావనల విషయంలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంటుందో ఊహించు కోవచ్చు. కానీ మన రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛకూ, సమానత్వ భావనకూ, మైనారిటీల హక్కులకూ రక్షణ కల్పిస్తోంది. సెక్షన్ 377 చెల్లుబాటుపై గతంలో ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం పునఃపరిశీలించాలన్న సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైనదే. ఇందుకు న్యాయమూర్తులను అభినందించాలి. -
‘స్వలింగ సంపర్కం’ నేరమా?
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటోన్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై అభ్యంతరాల్ని విస్తృత ధర్మాసనం చర్చించాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కంలో పాల్గొనే వయోధికుల్ని శిక్షించేందుకు అనుమతిస్తున్న సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసహజ నేరాల్ని పేర్కొంటున్న సెక్షన్ 377 ప్రకారం ‘ప్రకృతికి విరుద్ధంగా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా లైంగిక చర్యకు పాల్పడితే వారు శిక్షార్హులు. నేరం రుజువైతే వారికి జీవిత ఖైదు, జరిమానాతో పాటు అవసరమైతే శిక్షను గరిష్టంగా పదేళ్ల వరకూ పొడిగించవచ్చు.’ ఐపీసీ 377 సెక్షన్‌ను సవాలు చేస్తూ నవ్‌తేజ్ సింగ్ జోహర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తూ ‘377 సెక్షన్‌ను సమర్ధిస్తూ 2013 నాటి సుప్రీం తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్‌ను అదే ధర్మాసనం విచారిస్తుంది’ అని స్పష్టం చేసింది. జోహర్ తరఫున సీనియర్ న్యాయవాది అర్వింద్ దతర్ వాదిస్తూ.. ఈ నేర నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, పరస్పర అంగీకారంతో వయోధికులు స్వలింగ సంపర్కంలో పాల్గొంటే వారిని నేరస్తులుగా పరిగణించడంతో పాటు జైలు శిక్ష విధించేందుకు ఈ సెక్షన్ అవకాశం కల్పిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత గోప్యత అంశంపై ఇటీవల బెంచ్ ఇచ్చిన తీర్పును దతర్ ఉటంకించారు. ‘లైంగిక భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రాథమిక హక్కే’నన్న కోర్టు గత తీర్పుతో పాటు, 2009లో నాజ్ ఫౌండేషన్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన సభ్యులు వేసిన∙పిటిషన్ కాపీని న్యాయశాఖకు అందచేయాలని కోర్టు సూచించింది. 1861నుంచి నేరంగా... ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చింది. రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈతీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రా న్ని సుప్రీం ఆదేశించింది. డిసెంబర్ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదంది. అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది. దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయి. ఒకరికి సహజం.. మరొకరికి కాదు: కోర్టు ‘ప్రకృతి నియమాలు స్థిరంగా ఉండవు. సామాజిక నైతిక విలువలు మారుతాయి. ఒకరికి సహజం అనిపించేది మరొకరికి కాకపోవచ్చు. ఒక వర్గం ప్రజలు లేక వ్యక్తులు తమ స్వేచ్ఛను ఎన్నుకునే క్రమంలో ఎప్పుడూ భయంతో కూడిన స్థితిలో ఉండకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తికి సంక్రమించే హక్కుల్లో చట్టపరంగా ఉన్న పరిధులు జోక్యం చేసుకోలేవు. రాజ్యాంగ పరిమితులకు లోబడి చట్టం వ్యవహరించాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. -
‘స్వలింగ సంపర్కం’ నేరమా? కాదా?
న్యూఢిల్లీ : భారతదేశంలో స్వలింగ సంపర్కం నేరమా? కాదా? అనే విషయంపై సుప్రీంకోర్టు త్వరలో తీర్పు చెప్పనుంది. స్వలింగ సంపర్కంపై భారత్‌లో బ్రిటిష్ పరిపాలన కాలం నుంచి నిషేధం ఉంది. బ్రిటిష్ వారు 1861లో రూపొందించిన క్రిమినల్ ప్రొసిజర్ కోడ్(సీఆర్పీసీ) సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడొచ్చు. అయితే, 2013లో స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ సందర్భంగా కొత్త చట్టాలు రూపొందించడం పార్లమెంటు పని అని పేర్కొంది. అప్పటివరకూ స్వలింగ సంపర్కం నేరమేనంటూ తీర్పునిచ్చింది. 2013లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని భావిస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ సోమవారం పేర్కొంది. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ.. ప్రకృతికి విరుద్ధంగా సంపర్కం జరపడాన్ని నేరంగా పరిగణిస్తున్న సీఆర్పీసీలోని సెక్షన్ 377ను సమీక్షించాలని విస్తృత ధర్మాసనంలోని జడ్జిలను కోరింది. కేవలం లింగ పరమైన కారణాలతో ఓ వ్యక్తి తన జీవితాన్ని భయంతో గడపాలా? అనే ప్రశ్నను బెంచ్ లేవనెత్తింది. ‘ఒకరికి సహజంగా అనిపించింది మరొకరికి అనిపించకపోవచ్చ’ని ఈ సందర్భంగా ముగ్గురు జడ్జిల బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కం పట్ల ధోరణి మారుతుండటంతో గే సెక్స్‌ను నేరంగా పరిగణించాలని ప్రభుత్వం కూడా భావించడం లేదని సమాచారం. -
హోమో సెక్సువల్ కామెంట్లు.. హీరోయిన్లు ఫైర్
సాక్షి, సినిమా : ప్రముఖ ధ్యాన గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌కు బాలీవుడ్ బ్యూటీలు సోనమ్ కపూర్, అలియా భట్లు హోమో సెక్సువాలిటీ గురించి క్లాసులు పీకుతున్నారు. సోమవారం ఢిల్లీలోని జేఎన్‌యూలో ఓ కార్యక్రమానికి హాజరైన రవిశంకర్ అక్కడ హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో ఓ విద్యార్థి తనకు స్వలింగ సంపర్క సమస్య ఉందని.. దాని ద్వారా సంఘం, తన కుటుంబంతో సమస్యలు ఎదుర్కుంటున్నాని తెలిపాడు. దీనికి వివరణ ఇచ్చే క్రమంలో రవిశంకర్ పెద్ద ఉపన్యాసమే దంచారు. అది పుట్టుకతో వచ్చే ఓ ధోరణి మాత్రమేనని.. ప్రయత్నిస్తే ఖచ్ఛితంగా మార్పు వచ్చి తీరుతుందని ఆ విద్యార్థికి సలహా ఇచ్చారు. అంతే రవిశంకర్ వ్యాఖ్యలపై పలువురు మండిపడగా.. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అయితే కాస్త ఘాటు పదజాలంతోనే తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసింది. అది ధోరణి కాదని... ముందు హిందూయిజం, సాంప్రదాయల గురించి తెలుసుకోవాలంటూ రవిశంకర్‌కు సూచిస్తూ హిందోళ్‌సేన్‌గుప్తా, దైవదూత్మైత్ యాష్ ట్యాగ్‌లను ఫాలో కావాలంటూ ఆమె ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌ను నటి అలియా భట్ మళ్లీ రీట్వీట్ చేయటం విశేషం. WTF is wrong with god men, if you want to learn something about Hinduism and culture it’s better to follow @HindolSengupta & @devduttmyth — Sonam Kapoor (@sonamakapoor) November 14, 2017 Homosexuality is not a ‘tendency’ it’s something you are born as and is absolutely NORMAL. To tell someone you can change is irresponsible. — Sonam Kapoor (@sonamakapoor) November 14, 2017 -
చీఫ్ జస్టిస్ చేతుల్లో '377 సెక్షన్'
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీలోని 377 సెక్షన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ థాకూర్ నిర్ణయం తీసుకోనున్నారు. 377 సెక్షన్ ను కొట్టేయాలంటూ కొందరు ప్రముఖులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ఇదే అంశంపై దాఖలైన క్యురేటివ్ పిటిషన్ ఐదుగురు జడ్జిల బెంచ్ ముందు పెండింగ్ లో ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ టీఎస్ థాకూర్ నేతృత్వంలోని బెంచ్ దీనిపై బహిరంగ విచారణకు అంగీకరించిందని గుర్తు చేసింది. లైంగిక హక్కులు ప్రాథమిక హక్కుల్లో భాగమని, తమ హక్కులకు రక్షణ కల్పించాలని ఎల్జీబీటీ వర్గానికి చెందిన చెఫ్ రితూ దాల్మియా, హోటలియర్ అమన్ నాథ్, డ్యాన్సర్ ఎన్ఎస్ జోహర్ రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. వివిధ రంగాల్లో దేశానికి ఎంతో సేవ చేశామని, తమ లైంగిక హక్కును కాలరాస్తున్నారని, 377 సెక్షన్ తమని నేరస్తులుగా పేర్కొంటోందన్నారు. -
‘స్వలింగసంపర్కం’ రాజ్యాంగ ధర్మాసనానికి
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం క్యురేటివ్ పిటిషన్‌ను ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందులో మానవ సంబంధాలకు సంబంధించిన ముఖ్య, అమూల్య అంశాలెన్నో ముడిపడివున్న దృష్ట్యా విస్తృత బెంచ్‌కు నివేదిస్తున్నట్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ జేఎస్ ఖేహార్‌ల బెంచ్ వ్యాఖ్యానించింది. త్వరలోనే బెంచ్ ఏర్పాటవుతుందని వెల్లడించింది. ప్రకృతి విరుద్ధమైన స్వలింగ సంపర్కం నేరమంటూ 1860లో బ్రిటిష్ రాజ్ వే సెక్షన్ 377ను అమల్లోకి తెచ్చింది. దీనికి విరుద్ధంగా ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పునిచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఈ తీర్పును నిలుపుదల చేసింది. తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ నాజ్ ఫౌండేషన్‌తో పాటు మరికొంతమంది సుప్రీమ్ కోర్టులో రివ్యూ పిటిషన్లు వేశారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని గే ఉద్యమకారులు స్వాగతించారు. కోర్టు నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్వాగతించారు. స్వలింగ సంపర్క చట్టబద్ధతపై కేంద్రం ఎలాంటి అభిప్రాయానికీ రాలేదని మంత్రి వెంకయ్య చెప్పారు. -
మరోసారి తెరపైకి ఎల్జీబీటీ
న్యూఢిల్లీ: మరోసారి ఎల్జీబీటీ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్స్) వివాదం తెరపైకి వచ్చింది. భారత పీనల్ కోడ్ చట్టం 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరంకిందికి వస్తుందని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ ఓ ఎన్జీవో వేసిన పిటిషన్‌ను మంగళవారం అత్యున్నత న్యాయస్థానం పరిశీలించింది. స్వలింగ సంపర్కం అంశంపై నిషేధం విధించాలా లేక కొనసాగించాలా అనే విషయాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిశీలిస్తుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పిటిషన్ దారుకు తెలియజేశారు. దీంతో అసలు విచారణకే రాదనకున్న తమ పిటిషన్‌పై చాలాకాలం తర్వాత కదలిక రావడంతో స్వలింగ సంపర్కుల్లో ఆనందం వెల్లివిరిసి సంబరాలకు సిద్ధమయ్యారు. -
ఆర్ఎస్ఎస్ వాళ్లు హోమోలు: ఆజంఖాన్
ఉత్తరప్రదేశ్ కేబినెట్లో సీనియర్ మంత్రి ఆజంఖాన్ మరోసారి నోరు పారేసుకున్నారు. ''ఆర్ఎస్ఎస్ నేతల్లో చాలామంది ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే.. వాళ్లు హోమో సెక్సువల్స్'' అని వ్యాఖ్యానించారు. స్వలింగ శృంగారంపై 2014 నాటి తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనీ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. రాంపూర్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమం నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులను ఉద్దేశించి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆజంఖాన్‌కు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. దీనిపై ఆజంఖాన్ స్థానిక మీడియా ప్రతినిధి ఫసాహత్ అలీఖాన్ షాను మరింత వివరణ ఇచ్చారు. మంత్రి వ్యాఖ్యలను అనవసరంగా పెద్దవి చేస్తున్నారని ఆయన అన్నారు. భారతదేశంలో స్వలింగ శృంగారాన్ని నేరం కాదని చెప్పించేందుకు ప్రయత్నిస్తున్న వాల్ల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని మాత్రమే చెప్పారన్నారు. భారత సంస్కృతిలో అలాంటి విషయాలకు తావు లేదని స్పష్టం చేశారు. స్వలింగ శృంగారాన్ని చట్టబద్ధం చేసేందుకు ఆర్ఎస్ఎస్ వాళ్లు ప్రయత్నిస్తున్నారంటే, వాళ్లు దాన్ని ప్రోత్సహిస్తున్నట్లేనని, బహుశా అందుకే వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవట్లేదని అన్నారు. -
'గే'లకు షాకులిచ్చి సరిచేస్తారట!
స్వలింగ సంపర్కాన్ని మానుకునేందుకు యువకులకు షాక్ ట్రీట్మెంట్ థెరపీని చైనా ఆస్పత్రులు రహస్యంగా నిర్వహిస్తున్నాయి. ఈ అనాగరిక చికిత్సలో భాగంగా యువకుల జననాంగాలు, తలకు విద్యుత్ తీగలను అమర్చి.. పెద్దమొత్తంలో విద్యుత్ షాక్ తరంగాలను ప్రసరింపజేసి.. దీనిని మాన్పించవచ్చునని అవి నమ్మబలుకుతున్నాయి. అత్యంత క్రూరంగా సాగుతున్న ఈ రహస్య చికిత్స పద్ధతుల బండారాన్ని తాజాగా డేట్ లైన్ ప్రొగ్రామ్ అనే సంస్థ బట్టబయలు చేసింది. స్వలింగ సంపర్కాన్ని 'మనో వ్యాధి'గా పేర్కొంటూ చైనాలో గతంలో నిషేధం విధించారు. 15 ఏళ్ల కిందట ఈ చట్టంలో మార్పులు చేసినా.. ఇప్పటికే స్వలింగ సంపర్కాన్ని మానేలా చేస్తామని చైనావ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులు రహస్యంగా క్రూరమైన చికిత్సలను కొనసాగిస్తున్నాయి. ఈ బండారాన్ని వెలుగులోకి తేవడానికి స్వచ్ఛంద కార్యకర్తలు 'గే' రోగులుగా చైనాలోని పలు మానసిక ఆస్పత్రులను సందర్శించారు. జాన్ షెన్ అనే కార్యకర్త తియాన్జిన్ మానసిక చికిత్స ఆస్పత్రిని సందర్శించాడు. అక్కడ తాను స్వలింగ సంపర్కానికి ఆకర్షితుడవుతున్నట్టు తెలుపగా.. అలాంటి ఆలోచనలు కలిగినప్పుడు చిన్నపాటి ఎలక్ట్రిక్ రాడ్ తో తానుకు తానుగా షాకులిచ్చి.. ఆ ఆలోచనలను మానుకోవచ్చునని సైక్రియాట్రిస్ట్ సూచించాడు. అదేవిధంగా తలకు, జననాంగాలకు షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వడంతో ఇలాంటి కోరికలను అణుచుకోవచ్చునని, తనకు ఇష్టమైతే ఈ చికిత్సను కొనసాగిస్తామని వైద్యుడు తెలిపాడు. ఈ క్రూరమైన చికిత్సల వల్ల బాధితులపై దీర్ఘకాలంలో చాలా ప్రతికూల ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో ఆస్పత్రులపై చర్య తీసుకోవడానికి బదులు ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన కార్యకర్తలపై చైనా పోలీసులు కారాలు మిరియాలు నూరుతున్నారు. వారికి జైలుశిక్ష పడే అవకాశముందని స్థానిక మీడియా పేర్కొంది. -
స్వలింగ సంపర్కులని.. పదిమంది కాల్చివేత
ఇస్లామిక్ స్టేట్ మరో దారుణానికి తెగబడింది. సిరియాలో 'గే'లు అన్న పేరుతో తొమ్మిది మంది పురుషులను, ఒక బాలుడిని హతమార్చింది. వీళ్లందరినీ హోమ్స్ రాష్ట్రంలోని రస్తాన్ అనే పట్టణంలో హోమోసెక్సువల్స్ అనే పేరుతో వీరిని కాల్చి చంపినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. మరో ఇద్దరు పురుషులు, ఒక బాలుడిని హ్రైటన్ అనే పట్టణంలో ఇదే కారణంతో చంపేశారని చెప్పింది. ఈ అందరినీ బహిరంగంగానే చంపేశారని, అయితే ఎక్కడా ఎవరూ వీటిని చిత్రీకరించకుండా ముందే అక్కడున్న కెమెరాలను ధ్వంసం చేశారని అంటున్నారు. స్వలింగ సంపర్కం, చేతబడి, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు విశ్వాసులుగా ఉండటం.. ఇవన్నీ ఇస్లామిక్ స్టేట్ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో మరణశిక్షకు అర్హమైన నేరాలు. గతంలో కొంతమంది స్వలింగ సంపర్కులను మేడ మీద నుంచి కిందకు తోసేసి చంపేశారు. -
సైకియాట్రీ కౌన్సెలింగ్
ఆ సమస్యకు బిహేవియర్ థెరపీ బెస్ట్ మాకు ఒక్కగానొక్క కూతురు. ఇటీవలే ఆమెకు పెళ్లి చేశాము. మా అల్లుడు అందగాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు, దురలవాట్లేమీ లేవని నిర్థారించుకున్న తర్వాతనే సంబంధం కుదుర్చుకున్నాము. అయితే మా అమ్మాయి ఒక భయంకరమైన విషయం చెప్పింది. భర్త తనతో ఇంతవరకు శారీరకంగా కలవలేదట. ఫోన్లో ఎవరితోనో విపరీతంగా మాట్లాడటం, మెసేజిలివ్వటం చేస్తుంటాడట. అదేమని నిలదీస్తే తనకు స్వలింగసంపర్కం అలవాటుందని (గే) అని, ఆ అలవాటునుంచి బయట పడాలని నిర్ణయించుకున్న తర్వాతనే ఈ పెళ్లి చేసుకున్నాడని, అయితే ఎంత ప్రయత్నించినా ఆ అలవాటునుంచి బయటకు రాలేకపోతున్నానని, తనని క్షమించమని అడిగాడని చెప్పింది. మేము ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. దయచేసి తగిన సలహా చెప్పగలరు. - ఒక తండ్రి, హైదరాబాద్ ఒక తండ్రిగా మీరు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకున్నాను. అయితే ఈ విషయంలో మీరేమీ ఆందోళన పడవద్దు. ఇటీవలకాలంలో పాశ్చాత్య నాగరికతా ప్రభావం వల్ల ఇటువంటి అలవాట్లు పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఇటువంటి వారికి బాల్యంలో జరిగే కొన్ని సంఘటనలు, అనుభవాల వల్ల వారు ఈ విధంగా తయారవుతారు. కొందరి విషయంలో కొన్ని జన్యు సమస్యల వల్ల ఇలా జరుగుతుంటుంది. నా దగ్గరకు ఇలాంటి కేసులు చాలా వ స్తున్నాయి. అయితే మీ విషయంలో కొంతలో కొంత మెరుగు ఏమిటంటే మీ అల్లుడికి తను చేసేది తప్పని తెలుసు, పైగా చేస్తున్న పనికి పశ్చాత్తాప పడటం, దానినుంచి బయటకు రావాలని ప్రయత్నించటం. ఇటువంటి అలవాట్లు ఉన్న వారు చాలా మంది ముందు అసలు బయట పడరు. ఒకవేళ బయటపడినా తమ జీవిత భాగస్వామి మీదనే ఏవో ఒక నిందలు మోపి, అటు తమ జీవితాన్ని, ఇటు భాగస్వామి జీవితాన్ని కూడా దుర్భరం చేస్తారు. మీరు ఈ విషయాన్ని అందరికీ చెప్పి, పదిమంది చేతా అతనికి హితబోధలు, నీతులు చెప్పించి, సమస్యను మరింత జటిలం చేసుకోవద్దు. మీ అమ్మాయికి కూడా ఇదే విషయం చెప్పండి. ముందు అతనికి ఆపోజిట్ సెక్స్ అంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోండి. ఏదోవిధంగా అతని ఫోన్ కాంటాక్ట్స్ కట్ చేయండి. కొత్తవారిని కలవకుండా మీ అమ్మాయి భర్తతో బాగా ప్రేమగా ఉంటూ మంచిగా దారిలోకి తెచ్చుకోవాలి. మీ అల్లుడికి బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా చాలావరకు ప్రయోజనం ఉంటుంది. అందువల్ల ఆందోళన పడకుండా, సంయమనం కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. డాక్టర్ కల్యాణచక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మెడిసిటీ హాస్పిటల్, సెక్రటేరియట్ దగ్గర, హైదరాబాద్ -
అది ప్రకృతికి విరుద్ధం.. మేం ఒప్పుకోం
నైరోబీ: తాము స్వలింగ సంపర్కానికి వ్యతిరేకం అని కెన్యా ఉపాధ్యక్షుడు విలియమ్ రూటో స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు తాము ఏమాత్రం అనుమతించబోమని చెప్పారు. అది మానవ నైజానికి పూర్తిగా విరుద్ధమైన చర్య అని, క్రిస్టియానిటికి కూడా వ్యతిరేకమని చెప్పారు. మేం మతపెద్దలు చెప్పిన అంశాలకు కట్టుబడి ఉంటాం. మా నమ్మకాలు, విశ్వాసాలు కాపాడుకుంటాం. మా సమాజంలో స్వలింగ సంపర్కానికి అనుమతించం. అది మా సంస్కృతిని, సంప్రదాయాలను, మతాన్ని దెబ్బతీస్తుంది' అని ఆయన తెలిపారు. ఇలాంటి చర్యలను వ్యతిరేకించే ఎలాంటి మతసంస్థకైనా.. ఇతర సంస్థలకైనా ప్రభుత్వం తరుపునా పూర్తి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా గత వారంలో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం తరుఫున అటార్నీ జనరల్, గేలు, లెస్బియన్ల తరుపున మరికొందరు కోర్టులో వాదనలు జరిపారు. అందరి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. -
'స్వలింగ సంపర్కం'పై అమీర్ ఖాన్ కు నోటీసులు
చండీగఢ్: సత్యమేవ జయతే టీవీ కార్యక్రమం ద్వారా బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించారంటూ దాఖలైన పిటిషన్ మేరకు చండీగఢ్‌లోని ఓ కోర్టు అతడికి నోటీసులు జారీ చేసింది. దీనిపై డిసెంబర్ 19లోపు స్పందన తెలియజేయాలని అమీర్‌ఖాన్‌ను శుక్రవారం ఆదేశించింది. అమీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సత్యమేవ జయతే కార్యక్రమం ఇటీవల ఎంతో ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో స్వలింగ సంపర్కంపై అమీర్ ఖాన్ చర్చించిన నేపథ్యంలో దాఖలైన పిటీషన్ పై కోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించేలా ఉందని మహిళా న్యాయవాది మణిదీప్ కౌర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అమీర్‌ఖాన్ ప్రవర్తనను కోర్టు ధిక్కారంగా ఉందని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. అక్టోబర్ 19న ఓ ప్రైవేట్ టీవీ చానల్లో ప్రసారమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో... నపుంసకులు, స్వలింగ సంపర్కుల జీవన విధానం, వారి హక్కులపై చర్చ జరిగిందని కౌర్ కోర్టుకు వివరించారు. -
వైద్యుడితో స్వలింగ సంపర్కం
మొబైల్లో చిత్రీకరించి నిందితులు బ్లాక్ మెయిల్ బెంగళూరు : స్వలింగ సంపర్కంతో పరిచయం పెంచుకుని వైద్యుడిని బ్లాక్మెయిల్ చేసిన ఏడుగురు యువకులను బెంగళూరు సీసీబీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. ఓ వైద్యుడు, తన భార్యాపిల్లలతో కలిసి తిలక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. టాటా స్కై డిష్ యాంటెనాలు ఏర్పాటు చేసే ఆవులహళ్లి నివాసి సుహాన్(20) ఓ సారి ఆ డాక్టర్ ఇంటికి వెళ్లాడు. సిగరెట్లు మానడానికి తగిన మందులు ఇస్తానని నమ్మించిన ఆ వైద్యుడు సుహాన్‌ను నగ్నంగా మార్చి స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పరాదంటూ ఆ వైద్యుడు సుహాన్‌కు వేలాది రూపాయలు ఇచ్చి పంపాడు. అయితే విషయాన్ని తన స్నేహితులు మధు, వికాస్, దివాకర్‌కు సుహాన్ చెప్పాడు. రెండు నెలల క్రితం వీరంతా డాక్టర్ ఇంటికి వెళ్లి అతని కోర్కె తీర్చి డబ్బు తీసుకొచ్చారు. అలా నిరంతరం వారు డాక్టర్ ఇంటికి వారు వెళ్లేవారు. ఒకసారి సుహాన్, వికాస్ ఆ వైద్యుడితో స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారు. దాన్ని వైద్యుడికి తెలీకుండా మొబైల్లో చిత్రీకరించారు. అనంతరం వైద్యుడ్ని కలిసి ఆ క్లిప్పింగులు చూపారు. తమకు రూ. ఐదు లక్షలు ఇవ్వాలని, లేకుంటే క్లిప్పింగులను విడుదల చేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ ఆ వైద్యుడు వారికి రూ. 5 లక్షలు ఇచ్చాడు. నెల క్రితం తమ స్నేహితులైన నితీష్, మహేష్, విశ్వలను ఆ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. వారంత సీసీబీ పోలీసులు, మీడియా ప్రతినిధులు అంటూ భయపెట్టి రూ. 11 లక్షలు వసూలు చేసుకున్నారు. ఎలాంటి సంపాదన లేని తన కుమారుడు విలాసవంతంగా తిరుగాడుతుండడంతో అనుమానం వచ్చిన ఓ నిందితుడి తండ్రి తనకు తెలిసిన సీసీబీ కానిస్టేబుల్‌కు విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులు నిఘా వేశారు. అసలు విషయం బయటపడడంతో నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. ఆరు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు ఎంబీఎ, బికాం విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిపై తిలక్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యుడిపై చర్యలు తీసుకునే విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు నేర విభాగం డీసీపీ అభిషేక్ గోయల్ తెలిపారు. -
స్వలింగ సంపర్కం, సహజీవనం మానవాళికే ముప్పు
ముంబై: సహ జీవనం , స్వలింగ సంపర్కం వంటి చర్యలు మనిషి మనుగడకే ప్రమాదమని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. సమాజానికి చేటు చేసే ఈ తరహా ఘటనలకు తాము ఎప్పటికీ వ్యతిరేకమని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి జోషి తెలిపారు. స్వలింగ సంపర్కం, సహన జీవనం వంటి చర్యలతో ఒక్క భారతదేశమే కాకుండా యావత్తు మానవ జాతికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఆమోదయోగ్యం కాదన్న సంగతి ప్రతి ఒక్కరూ తమకు తాముగా తెలుసుకోవాలని జోషి తెలిపారు. దీనికి సంబంధించిన చట్టాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాల్సి ఉందన్నారు. నచ్చిన వారితో సహజీవనం చేయడానికి, స్వలింగ సంపర్కం వ్యసనపరులకు టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా మద్దతు తెలపడాన్ని ప్రశ్నించగా..అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా జోషి కొట్టిపారేశారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా అభిప్రాయాలను చెప్పే క్రమంలోనే ఈ తరహా చర్యలను సమర్ధించారన్నారు. భారతీయ సంస్కృతి -సంప్రదాయాల గురించి పిల్లలకు చెప్పే బాధ్యతను ఆయా కుటుంబాలే స్వీకరించాలన్నారు. -
స్వలింగ సంపర్కం నేరమే: సుప్రీంకోర్టు
ఇలాంటి అసహజమైన లైంగిక చర్యలు చట్టవిరుద్ధం ఐపీసీ సెక్షన్ 377కి సమర్థన ఢిల్లీ హైకోర్టు తీర్పు కొట్టివేత స్వలింగ సంపర్కులకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్వలింగ సంపర్కం నేరమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లో ఉన్న సెక్షన్ 377ను సమర్థిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 377ను తొలగించే అధికారం పార్లమెంటుదేనని, అప్పటివరకు దానికి చట్టబద్ధత ఉంటుందని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అసహజ లైంగిక కార్యకలాపాలను ఈ న్యాయస్థానం చట్టబద్ధం చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాదాస్పద అంశాలపై విదేశీ కోర్టుల తీర్పులను దేశంలో గుడ్డిగా అమలు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ జనాభాలో నామమాత్రంగా ఉన్న స్వలింగ సంపర్కుల హక్కులను కాపాడాలన్న ఆతృతతోపాటు ఐపీసీ సెక్షన్ 377 వారి గోప్యత , స్వేచ్ఛా హక్కులను అతిక్రమిస్తుందని ప్రకటించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ హైకోర్టు విదేశీ కోర్టుల తీర్పులపై ఎక్కువగా ఆధారపడిందని సుప్రీంకోర్టు పేర్కొంది. విదేశీ కోర్టుల తీర్పులు స్వలింగ సంపర్కుల హక్కులకు సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించినప్పటికీ భారత పార్లమెంటు రూపొందించిన చట్టాల రాజ్యాంగబద్ధతను నిర్ణయించడంలో విదేశీ తీర్పులను తాము గుడ్డిగా అమలు చేయజాలమని స్పష్టం చేసింది. గత 150 ఏళ్లలో కేవలం 200 మందిలోపు వ్యక్తులనే ఐపీసీ సెక్షన్ 377లోని నేరాల కింద విచారించిన విషయాన్ని ఢిల్లీ హైకోర్టు మరచిపోయి ఈ సెక్షన్ రాజ్యాంగంలోని సెక్షన్ 14, 15, 21 నిబంధనలకు విరుద్ధంగా ఉందని తీర్పిచిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 377ను తొలగించాలని 172వ న్యాయ కమిషన్ నివేదిక సిఫార్సు చేసినా పార్లమెంటు ఆ పని చేయలేదని సుప్రీంకోర్టు తన తీర్పులో గుర్తుచేసింది. సెక్షన్ 377 సవాల్‌తో మొదలు... అసహజ శృంగార చర్యలు, స్వలింగ సంపర్కం నేరమని, అందుకు జీవితఖైదు వరకు శిక్ష విధించవచ్చని ఐపీసీ సెక్షన్ 377 చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్‌ను సవాల్ చేస్తూ, స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతూ నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇద్దరు వయోజనులు పరస్పర సమ్మతితో ఏకాంతంలో చేసుకునే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ జూలై 2, 2009న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత బి.పి.సింఘాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి అసహజ లైంగిక చర్యలు అనైతికం, చట్టవిరుద్ధం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అఖిల భారత ముస్లిం లా బోర్డు, ఉత్కల్ క్రైస్తవ మండలి, అపోస్టోలిక్ చర్చిల కూటమి వంటి మతపరమైన సంస్థలు కూడా ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశాయి. ఈ వ్యాజ్యాలపై గతేడాది ఫిబ్రవరి 15 నుంచి రోజువారీ పద్ధతిలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ అంశంపై అభిప్రాయం తెలియజేయాలని విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి ముఖ్యమైన అంశాలను పార్లమెంటులో చర్చించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేసింది. బ్రిటిష్ వలస పాలన ఫలితంగా స్వలింగ సంపర్కుల వ్యతిరేక చట్టం వచ్చిందని, కానీ భారతీయ సమాజం స్వలింగ సంపర్కాన్ని భరిస్తూ వచ్చిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేయడానికి తాము సానుకూలమేనని పేర్కొంది. దేశంలో 25 లక్షల మంది స్వలింగ సంపర్కులు ఉన్నట్టు అంచనా అని, వారిలో ఏడు శాతం మందికి(దాదాపు 1.75 లక్షలు) హెచ్ఐవీకి సోకిందని నివేదించింది. ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగినప్పుడు హోంశాఖ, ఆరోగ్యశాఖలు సెక్షన్ 377పై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తంచేశాయి. సెక్షన్ 377 కొనసాగించాలని హోంశాఖ పేర్కొనగా, దానిని తొలగించాలని ఆరోగ్యశాఖ కోరింది. అయితే సుప్రీంకోర్టులో మాత్రం కేంద్రం దీనిపై ఒకే వైఖరికి కట్టుబడింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. గతేడాది మార్చిలో తన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా కిక్కిరిసిన కోర్టు హాలులో దీనిపై తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో స్వలింగ సంపర్కులు నిరాశలో మునిగిపోయారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు వెల్లడించారు. చారిత్రక అవకాశం పోయింది: ఏఎస్జీ రాజ్యాంగ విలువల్ని విస్తృతం చేయడానికి లభించిన చారిత్రక అవకాశం పోయిందని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఇందిరా జైసింగ్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆమె స్పందిస్తూ.. స్వలింగ సంపర్కులకు మద్దతు ప్రకటించారు. స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా ఐపీసీలో ఉన్న నిబంధన, మధ్యయుగం నాటి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఎన్నో అంశాలు, విధానాలపై సమీక్ష జరిపిన సుప్రీంకోర్టు.. స్వలింగ సంప్కరంపై నిర్ణయాన్ని పార్లమెంటుకు వదలిపెట్టడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. -
స్వలింగ సంపర్కంపై సుప్రీం తీర్పు వివక్ష, హింసలకు దారితీస్తుంది
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును ఎల్జీబీటీ బృందం వ్యతిరేకించింది. ఈ తీర్పు వివక్షకు, హింసకు కారణమౌతుందని విమర్శించారు. భారత శిక్షా స్మృతిలో సెక్షన్ 377లో మార్పు చేయడానికి రాజ్యాంగబద్ధమైన అవకాశాలు లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కులైన స్త్రీ, పురుషుల మధ్య శారీరక సంబంధాల నిషేధం సమర్థనీయమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ తీర్పును ఎల్బీబీటీ బృందాలు తీవ్రంగా నిరసించాయి.‘‘మాకు ఈ రోజు బ్లాక్ డే. సుప్రీం ప్రకటించిన తీర్పు మనలను మరో 100 ఏళ్లు వెనుకకు తోసింది. మన సంస్కృతి, ప్రజల మీద దీని ప్రభావం ఎలా ఉండనుంది. నిజంగా ఇది వికారపు నిర్ణయం. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడం దురదృష్టకరం’’ అని నాజ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అంజలీ గోపాలన్ తెలిపారు. ప్రత్యామ్నాయ న్యాయ వేదిక న్యాయవాది అరవింద్ నారాయణ్ మాట్లాడుతూ‘‘ఢిల్లీ కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడం మమ్మల్ని విషాదంలో ముంచింది. ఈ తీర్పు ప్రాథమిక హక్కులకు భంగకరం. రాజ్యాంగం ప్రతి పౌరుని ఆత్మగౌరవాన్ని గుర్తించాలి’’ అన్నారు. తీర్పుపట్ల అసంతృప్తిని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పురుష స్వలింగ సంపర్కుల బృందం కార్యకర్త అశోక్ రౌ కవి మాట్లాడుతూ‘‘ ఇది దిగ్భ్రమకు గురిచేసే తీర్పు. ఇది మనల్ని తరాల వెనుకకు తోసేస్తుంది. మేము దీనికి వ్యతిరేకంగా పోరాడుతాం’’ అని ప్రకటించారు.