కర్ణాటక: స్వలింగ సంపర్కానికి అలవాటుపడిన భర్తతో వేగలేనంటూ అతని భార్య పోలీస్‌స్టేషన్ మెట్లెక్కింది. బాధితురాలు నగరంలోని జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు... 2020 ఆగస్టు 30 తేదీన మల్లత్తహళ్లి బాలాజీ లేఔట్‌కి చెందిన ఐటీ ఇంజినీరుతో ఆమెకు పెళ్లయింది. ఎంబీఏ చదివి న ఆమె పెళ్లికి ముందు, తరువాత రెండేళ్లు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసింది.
ఉద్యోగానికి వెళ్లరాదని అత్తమామ ఒత్తిడి చేయడంతో రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంది. పెళ్లయి రెండేళ్లయినా ఇద్దరి మధ్య లైంగిక సంబంధం లేదు. సంతానం లేకపోవడం పట్ల ఇరుగుపొరుగు, బంధువులు ఆమెను ప్రశ్నించారు. భర్త తమ్మునికి పెళ్లయి ఏడాదిలో పిల్లలు పుట్టారు, మీకేమిటి సమస్య అని అడిగేవారు. దీనిపట్ల మహిళ భర్తతో చర్చించగా అతడు పట్టించుకోలేదు, కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించగా అది విఫలమైంది.
మొబైల్‌లో గుట్టు రట్టు
భర్త మొబైల్‌ను పరిశీలించగా అందులో పురుషునితో శారీరక సంబంధం ఉన్న ఫోటోలు, వీడియోలు కనబడ్డాయి. దీనిపై ప్రశ్నించగా భర్త వేధింపులు మొదలుపెట్టాడు. భర్త స్వలింగ సంపర్కంతో విరక్తి చెందిన భార్య పుట్టింటికి చేరుకుంది.
భర్త ఆమెకు నిత్యం ఫోన్ చేసి ఇలాంటి తప్పు చేయనని, ఇంటికి రావాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. పెద్దలు కూడా రాజీ యత్నాలు చేసినా గే తో సంసారం చేయలేనని ఆమె తేల్చిచెప్పింది. దీంతో వేధింపులు పెరిగిపోవడంతో బాధితురాలు భర్త, అత్తమామలపై జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment