Karnataka News
-
● రూ.7,178 కోట్ల వంచన, రూ.1,009 కోట్ల జప్తు ● నిత్యం సగటున 770కు పైగా కేసుల నమోదు
సమాచార సాంకేతిక రంగంలో ముందంజలో ఉన్న కర్ణాటక సైబర్ వంచకులకు టార్గెట్‌గా నిలిచింది. సైబర్ నేరాల్లో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. బనశంకరి: గత 6 ఏళ్ల నాలుగు నెలల్లో కర్ణాటకలో రూ.7,178.62 కోట్లు సైబర్ వంచకుల పాలయ్యాయి. ఇందులో రూ.1,009 కోట్లను జప్తు చేయడంలో పోలీసులు సఫలీకృతులయ్యారు. 2020 నుంచి 2026 ఏప్రిల్ చివరి వరకు రాష్ట్రంలో మొత్తం 6.89 లక్షల కేసులు నమోదయ్యాయి. కానీ దర్యాప్తు సంస్థల చర్యలతో ఫ్రీజ్ చేసింది మాత్రం రూ.1,009 కోట్లు మాత్రమే. గత నాలుగు నెలల్లో రూ.791 కోట్ల వంచన 2026 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు 93,438 కేసులు నమోదు కాగా ప్రజల నుంచి రూ.791 కోట్లు దోచేశారు. సగటున రోజుకు 770కు పైగా కేసులు నమోదు కావడం సైబర్ నేరాల తీవ్రతను తెలియజేస్తోంది. గతంలో బ్యాంక్ కాల్స్, ఓటీపీ వంచనకు పరిమితమైన నేరాలు ప్రస్తుతం విభిన్న కోణాల్లో సంతరించుకున్నాయి. ఫేక్ పెట్టుబడి యాప్‌లు, డిజిటల్ అరెస్ట్‌ల బెదిరింపు, పార్శిల్ స్క్యామ్, ఈ–కేవైసీ రెన్యువల్ లింక్, సోషల్ మీడియాలో స్నేహం పెంచుకుని వంచన, ఉద్యోగం, లాభదాయక పెట్టుబడి ప్రలోభం, క్రిప్టో కరెన్సీ వంచన లాంటి కొత్త తరహా వంచనల ద్వారా ప్రజలను వంచనకు పాల్పడుతున్నారు. బెంగళూరులో అధిక మోసాలు బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగదారులు, డిజిటల్ వ్యవహారాలు పెరగడంతో సైబర్ వంచకుల దృష్టి పడింది. త్వరితగతిన ఆన్లైన్ వ్యవహారాలు, యూపీఐ వినియోగం, మొబైల్ ఆధారిత బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరగడం సైబర్ నేరగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. వంచనకు పాల్పడిన కొద్ది నిమిషాల్లో నగదు వేరే అకౌంట్లకు జమ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో క్రిప్టో కరెన్సీ, విదేశీ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తుండటంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారింది. ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే నగదు ఫ్రీజ్ చేసే అవకాశం చాలా తక్కువ. కర్ణాటకకు ద్వితీయ స్థానం.. 2023 నుంచి కర్ణాటక సైబర్ నేరాల్లో వరుసగా మూడో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2024లో 1,65,830 కేసులు నమోదు కాగా 2025లో 2,52,015 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కర్ణాటక సైబర్ నేరాల్లో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. డబ్బు కోల్పోయిన వారి సమాచారం ఎన్సీఆర్పీ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బు తక్షణం ఫ్రీజ్ చేసి చర్యలు చేపడతామని సైబర్ కమాండ్ డీఐజీపీ ఆనంద్‌కుమార్ తెలిపారు. పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్రంలో సైబర్ కమాండ్ సెంటర్, సైబర్ క్రైం పోలీస్స్టేషన్లు, సీసీబీ ఉన్నప్పటికీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిపుణుల కొరత, సాంకేతిక సవాళ్లు, అంతర్జాతీయ ముఠా సంబంధాలు దర్యాప్తునకు అడ్డంకిగా మారాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే ప్రజల కంటే వంచకుల కొత్త విధానాలు చట్టాలు అమలు చేసే సంస్థలకు సవాల్‌గా మారాయి. ప్రభుత్వం, బ్యాంకులు, ప్రజలు జాగృతంగా వ్యవహరించినప్పుడు మాత్రమే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. -
రైతుల భూములు లాక్కోవడం తగదు
బళ్లారి అర్బన్: బెంగళూరు వద్ద బిడది ఆరోహళ్లి ఓబ్లిలో సారవంతమైన వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మీనాళ్లి తాయణ్ణ తెలిపారు. జేడీఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి గడిగి చెన్నప్ప సర్కిల్ మీదుగా జిల్లా అధికారి కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మీనాళ్లి తాయణ్ణ మాట్లాడుతూ.. మొదటి దశలో సుమారు 500 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం వల్ల 755 రైతు కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. ఇందులో ఒక ఎకరా కన్న తక్కువ భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారని తెలిపారు. ఇక రానున్న దశలో భారీగా భూమిని స్వాధీనం చేసుకునే ఆలోచనను రద్దు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఇంటర్ గ్రేడింట్ టౌన్ షిప్ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తోందన్నారు. దీంతో వేలాది కోట్ల రూపాయల విలువ గల భూమిని రైతులు కోల్పోతున్నారని తెలిపారు. అంతేగాక 10 లక్షలకు పైగా చెట్లు నేలమట్టం అవుతాయన్నారు. సమావేశంలో పార్టీ నేతలు యల్లన్నగౌడ, లక్ష్మీకాంత్‌రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో సీఎం డీకే శివకుమార్
యశవంతపుర: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారిగా ఆయన తిరుమలకు వెళ్లారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రివర్గ విస్తరణ తరువాత డీకే శివకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. గురువారం జరిగిన విధాన పరిషత్ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ బలం పెరిగిన సంతోషంలో కుటుంబంతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ ఫొటోలను సీఎం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అది మా పార్టీ అంతర్గతం● ఎవరికీ మాట్లాడే అధికారం లేదు ● బీజేపీ నేత ఆర్.అశోక్ మండిపాటు శివాజీనగర: రాజ్యసభ టికెట్ విషయంపై మాట్లాడిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్.డీ.రేవణ్ణ, మండ్య మేడంకు కూడా టోపీ వేశారు. ఆమైకె నా టికెట్ ఇచ్చి ఉంటే తామేం వద్దు అనేవారమా? అని తెలిపారు. ఇదే విషయమై రేవణ్ణ వ్యాఖ్యలపై స్పందించిన విపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవణ్ణ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ చర్చకు దారి తీస్తాయన్న అశోక్, అది తమ పార్టీ అంతర్గత విషయం. రేవణ్ణకు కాని, మరొకరికి కాని మాట్లాడే అధికారం లేదు. ఎవరికీ కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు హక్కు లేదని విరుచుకుపడ్డారు. బీజేపీ ఎవరికీ రాజ్యసభ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వలేదు. పార్టీ నియమాల ప్రకారం తాము తమ నిజాయితీ కలిగిన కార్యకర్తలకు మాత్రమే రాజ్యసభ టికెట్ ఇచ్చాం. ఈ నిర్ణయం పూర్తిగా తమ పార్టీ అంతర్గత విషయాల్లో భాగమన్నారు. కాగా రాజ్యసభ స్థానానికి ముందుగా దేవెగౌడ, సదానందగౌడల పేర్లు వినిపించాయి. ఆ తరువాత మధ్యలో మేడం సుమలత పేరు వినిపించింది. మండ్య మేడంకు కూడా వారు టోపీ వేశారు. ఆమెకు ఇచ్చినా తామేం వద్దనేవారమా ? అని రేవణ్ణ తెలిపారు. మేకెదాటుకు తమిళనాడు నో యశవంతపుర: మేకెదాటు పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. శుక్రవారం జరిగిన శాసనసభలో సీఎం జోసెఫ్ సీ.విజయ్ పథకాన్ని ప్రస్తావించి మేకెదాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. మేకెదాటు పథకానికి సాంకేతిక, పర్యావరణ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని శాసనసభలో చర్చించి పథకానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు సభలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తల్వార్‌తో కేక్ కటింగ్ యశవంతపుర: చిక్కమగళూరు పట్టణంలోని వాజపేయి లేఔట్లో యువకులు నడిరోడ్డుపై తల్వార్‌తో పుట్టిన రోజు కేక్ కట్ చేయటం వివాదంగా మారింది. మహమ్మద్ సమీర్ అనే యువకుడు గురువారం రాత్రి లాంగ్ పట్టుకొని కేక్‌ను కత్తరించారు. ఐదు కేజీల కేక్‌ను లాంగ్‌తో కత్తిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘటనపై చిక్కమగళూరు గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
మౌలిక సౌలభ్యాల కల్పనకు ప్రాధాన్యత
రాయచూరు రూరల్: దేవదుర్గలో మౌలిక సౌలభ్యాల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని జిల్లా అధికారి పూవిత సూచించారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం నగర సభ కార్యాలయంలో జరిగిన సభలో అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తాగునీటి జలాశయం, వివిధ ప్రాంతాల్లోని మురికి కాలువల్లో పూడిక, చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాస్పత్రి, ఇందిరా క్యాంటీన్లను సందర్శించారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఎరువులు, క్రిమి సంహరక మందుల దుకాణాలను తనిఖీ చేశారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తాలూకా విద్యాశాఖ అధికారి రాధా దేవి, సీడీపీఓ మహేష్ నాయక్ పాల్గొన్నారు. -
మురుగు శుద్ధి కేంద్రంలో ఇద్దరు కార్మికుల గల్లంతు
ఎస్టీపీని పరిశీలిస్తున్న డాక్టర్ మంజుల, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు ఎస్టీపీ నమూనాను మ్యాప్‌పై పరిశీలిస్తున్న అధికారులు బనశంకరి: వర్తూరు బెళగెరెలోని జలమండలి మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం(ఎస్టీపీ)లో గురువారం సాయంత్రం కాంట్రాక్టు కార్మికులు పని చేస్తుండగా ముగ్గురు కార్మికులు అదుపుతప్పి ట్యాంక్‌లోకి పడిపోయారు. వెంటనే తోటి కార్మికులు ఒక కార్మికుడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన బిహార్‌కు చెందిన బ్రిజేశ్(29), తమిళనాడుకు చెందిన అఖిలేశ్(30) కోసం గాలింపు కొనసాగుతోంది. రాత్రి కావడంతో గాలింపు నిలిపివేసి శుక్రవారం తెల్లవారు జాము నుంచి మళ్లీ గాలింపు కొనసాగించారు. ఇప్పటివరకు వారి జాడ లభించలేదు. 40 అడుగుల లోతు ఉన్న మురుగునీటి శుద్ధీకరణ కేంద్రంలో సేకరించిన 30 అడుగుల లోతు నీటిని సిబ్బంది ఖాళీ చేసి గాలింపు కొనసాగిస్తున్నారు. కేంద్రంలోకి అదుపుతప్పి పడిపోయిన ఇద్దరు కార్మికుల కోసం వర్తూరు పోలీసులు, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. కాగా ఈ ఘటనపై సమ్రగ్ర దర్యాప్తు జరిపించి నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు జలమండలి అధ్యక్షురాలు డాక్టర్ మంజుల తెలిపారు. శుక్రవారం ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. ఈ దురదృష్టకర ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎస్టీపీ కేంద్రం వద్ద రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓ కార్మికుడిని వెంటనే కాపాడి ఆసుపత్రికి తరలించారని, గల్లంతైన ఇద్దరు కార్మికులు బ్రిజేశ్, అఖిలేశ్‌ల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. డ్రైనేజీ ట్యాంక్‌లో విషకారక అంశాలు కలిగి ఉండటం, నీటి ఉధృతి అధికంగా ఉండటంతో రక్షణ కార్యాచరణకు తీవ్ర అడ్డంకిగా మారిందన్నారు. ట్యాంక్ వద్దకు అగ్నిమాపక సిబ్బందితో పాటు జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ బృందం నిపుణులను పిలిపించామన్నారు. రక్షణా సిబ్బంది ట్యాంక్‌లోకి దిగడానికి ముందు లోపల ఉన్న విషకారక అంశాలు బయటికి తీసి ట్యాంక్‌లో ఆమ్లజనకాన్ని నింపడానికి చర్యలు తీసుకున్నామన్నారు. గాలిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పరిశీలించిన జలమండలి అధ్యక్షురాలు -
కన్నడ పాఠశాలల సంరక్షణకు పోరాటం
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలల సంరక్షణకు పోరాటం చేస్తాం. అవసరమైతే గోకాక్ ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కన్నడ సినీ నటుడు టెన్నిస్ కృష్ణన్ తెలిపారు. గురువారం ఆర్టీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాయచూరు, బళ్లారి, బీదర్, కలబుర్గి, కోలార్, చింతామణి, బాగేపల్లి, కాసరగోడు వంటి ప్రాంతాల్లో కన్నడ భాషకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ భాషను రక్షించడంతో పాటు కన్నడిగులకు ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలపై ప్రజలను చైతన్య పరిచి గోకాక్ తరహా ఉద్యమానికి ముందుకు వస్తామని పేర్కొన్నారు. కుమార్, బసవరాజ్, హనుమేష్ నాయక్, నాగప్ప, గోవిందు, శరణ బసవ, అమరేష్, మంజునాథ్, నాగనలింగ గౌడ పాల్గొన్నారు. -
అర్హులకు ఇబ్బంది కల్గించొద్దు
బనశంకరి: సీఎం నేతృత్వంలో శుక్రవారం విధానసౌధలో గృహలక్ష్మి పథకంపై ప్రగతి పరిశీలన సమావేశం నిర్వహించారు. అర్హులకు పథకాలు అందించడంలో ఇబ్బంది కలగరాదని, అనర్హులు, పథకం దుర్వినియోగానికి మాత్రమే అడ్డుకట్ట వేయాలని అధికారులకు ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ సూచించారు. అనేక మంది అర్హులు బ్యాంక్ రుణం తీసుకున్నారని, రుణం అకౌంట్‌కు గృహలక్ష్మిద డబ్బు జమ కాగానే రుణం మొత్తానికి జమ అవుతోంది. దీంతో అలాంటి అర్హులు అకౌంట్ మార్చాలని, ఇలాంటి అర్హులకు ఎలాంటి ఇబ్బంది కలగరాదని తెలిపారు. గృహజ్యోతి గ్యారంటీ పథకం అమల్లోకి వచ్చినప్పుడు దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇదే విధంగా మిగిలిన పథకాల్లో కూడా వ్యవహరిస్తే దుర్వినియోగం తగ్గుతుందన్నారు. మృతుల అకౌంట్లకు నగదు జమ మరణించిన వారి అకౌంట్లకు గృహలక్ష్మిద పథకం నగదు జమ అవుతున్నట్లు వెలుగుచూసింది. ఇలా దుర్వినియోగం కారాదన్నారు. గృహలక్ష్మి నగదు అర్హుల అకౌంట్లకు జమ కాగానే వారి మొబైల్‌కు వాయ్స్ మెసేజ్ ద్వారా ధృవీకరణ కావాలని తెలిపారు. బ్యాంకు అకౌంట్లు కర్ణాటకలో మాత్రమే ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో బ్యాంకు అకౌంట్లకు నగదు జమ అవుతున్నట్లు తెలిసిందని, దీనిని నిలిపివేయాలన్నారు. తమ రాష్ట్ర పథకాలు మన రాష్ట్ర అర్హులకు మాత్రమే అందాలి. ఇతర రాష్ట్రాల ఓటర్లకు అందుతున్న పథకాలకు చెక్‌పెట్టాలి. మృతి చెందిన వారి సంఖ్య సకాలంలో లభించక పోవడం, ఈ–కేవైసీ, బ్యాంక్ అకౌంట్, ఎన్పీసీఐ అర్హుల గురించి సమావేశంలో చర్చించారు. ఒకే అకౌంట్లో అనేక మంది అర్హులు గృహలక్ష్మి సొమ్ము పొందుతున్నారన్నారు. మూడు లక్షల ఖాతాల్లోకి మొత్తం రూ.60 కోట్ల నగదు వెళ్లిందని ఏజీ నివేదికలో తెలిసింది. దుర్వినియోగానికి మాత్రమే చెక్ పెట్టాలి గ్యారంటీ పథకాలపై ప్రగతి పరిశీలనలో సీఎం -
వాహనం ఢీకొని నక్కకు గాయాలు
హొసపేటె: కూడ్లిగి తాలూకాలోని కనహోసహళ్లి, హులికెరె మధ్య విజయనగర దాబా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ నక్క గాయపడింది. హైవే ట్రూపర్ల బృందం, హైవే పెట్రోల్, అటవీ వాఖ అధికారులు, స్థానిక పోలీసులు, స్థానికుల సహయంతో ఆ నక్కను రక్షించారు. పశు వైద్యులతో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కమలాపూర్ జూకు తీసుకువెళ్లారు. గాయపడిన నక్క పొదల్లో దాక్కోవడంతో అటుగా వెళ్తున్న హైవే ట్రూపర్లు మహేష్, దయానంద్ సజ్జన్, పోలీస్ శాఖకు చెందిన కొట్రేష్, అటవీ శాఖకు చెందిన జడియప్ప రక్షించారు. అటవీ శాఖకు చెందిన ఏఎస్ఐ మల్లేశప్ప, శ్రీకాంత్ బాబు, శివాండి హొన్నూరప్ప, దాసప్ప, కృష్ణ టోల్ శివాండి సింహాద్రి, సంగయ్య స్వామి, బీరప్ప, పశు సంవర్ధక శాఖకు చెందిన స్థానికులు దనేష్, హులికెరె బాబు, దుర్గేష్, కుమార్ సహాయ సహకారాలు అందించారు. -
క్రాస్ ఓటింగ్ కుదుపు
● బీజేపీ నాయకులు విజయేంద్ర, అశోక్, రాధామోహన్దాస్లకు హైకమాండ్ పిలుపుశివాజీనగర: కర్ణాటక విధాన పరిషత్‌లో 7 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, బీజేపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కుదుపునకు దారి తీశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యత ప్రదర్శించాల్సిన బీజేపీ, జేడీఎస్‌లకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ అధినాయకత్వాలకు షాకిచ్చి కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రస్తుతం మిత్రుల మధ్య క్రాస్ ఓటింగ్ నెంబర్ వివాదానికి దారి తీసింది. మరోవైపు క్రాస్ ఓటింగ్‌ను తీవ్రంగా పరిగణించిన బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నాయకులకు ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. ఈ విషయంపై చర్చించేందుకు రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్ష నేత ఆర్.అశోక్, రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి రాధామోహన్దాస్లకు వెంటనే ఢిల్లీకి రావాలని కబురంపింది. నాయకులను కలుస్తున్న ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ నాయకులను భేటీ చేస్తున్నారు. భైరతి బసవరాజ్, చంద్రు లమాణి, కృష్ణ నాయక్‌లపై క్రాస్ ఓటింగ్ ఆరోపణ వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్యేలందరూ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకులను కలిసి వివరణ ఇచ్చారు. పరిషత్ ప్రతిపక్ష నాయకుడు చలవాది నారాయణస్వామి స్పందిస్తూ తాము నిర్ధారించిన నాలుగు ఓట్లు జేడీఎస్‌కు పడ్డాయి. తమ నివేదిక వచ్చేవరకు ఎవరిపై అనుమానం వ్యక్తం చేయం. ఆ తరువాత తామే క్రాస్ ఓటింగ్ చేసినవారిపై చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు. మొత్తం మీద పరిషత్ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ మిత్ర పక్షాలైన బీజేపీ, జేడీఎస్‌ల్లో వణుకు పుట్టించింది. క్రాస్ ఓటింగ్‌పై సత్యశోధన విధాన పరిషత్ ఎన్నికల్లో భారీ క్రాస్ ఓటింగ్ జరిగినందున అతి తక్కువ తేడాలో పరాజయం తప్పించుకున్న కర్ణాటక బీజేపీ క్రాస్ ఓటింగ్ విషయంపై సత్యశోధన కమిటీని నియమించింది. విధాన పరిషత్ సభ్యుడు సీ.టీ.రవి నేతృత్వంలో కమిటీని నియమించారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్.మహేశ్, ఎమ్మెల్యే మహేశ్ టెంగినకాయిలతో కూడిన త్రిసభ్య కమిటీకి జూన్ 25లోగా నివేదిక ఇవ్వాలని అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర సూచించారు. ఈ పరిణామాలతో అసంతృప్తికి గురై పారిపోయేవాడని కాదు. దీనిని ఓర్చుకునే శక్తి తనకుందన్నారు. తాను యడియూరప్ప కుమారుడిని. క్రాస్ ఓటింగ్ గురించి ఎవరితో చెప్పాలో వారికి చెబుతానన్నారు. భగవంత్ ఖూబా లేఖ బీజేపీ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై.విజయేంద్రకు కేంద్ర మాజీ మంత్రి భగవంత ఖూబా లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. దీంతో పరిషత్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎన్నో చోట్ల ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ముందు సూచన చేసినా కార్యకర్తలు పార్టీ తరఫున పని చేయకుండా దూరంగా ఉంటున్నారు. సొమ్ము ఇచ్చి ప్రజలను తీసుకొచ్చి కార్యకర్తలుగా ప్రతిబింబించే పని జరుగుతున్నా కూడా ఇలాంటిదేమీ ప్రశ్నించటం లేదని లేఖలో ఉల్లేఖించారు. 2028లో పార్టీ అధికారంలోకి రావాలంటే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఖూబా తన రహస్య లేఖలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులకు కూడా ఈ విషయమై విన్నవించారు. గుండెపోటుతో ఏఆర్ ఎస్ఐ మృతితుమకూరు: ఏఆర్ ఎస్ఐ గుండెపోటుతో మృతి చెందిన ఘటన కొరటగెరె తాలూకా తుంబుగనహళ్లి సమీపంలో 12వ కె.ఎస్.ఆర్.పి యూనిట్లో జరిగింది. బాగలకోటె జిల్లా బీళగికి చెందిన ఎన్జీ పవార్ ఇక్కడి బెటాలియన్‌లో నాలుగేళ్లుగా ఎఆర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. హాస్టల్లో నివసిస్తున్న ఆయనకు గురువారం అర్ధరాత్రి తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. కొరటగెరె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. బెటాలియన్ కమాండర్ హమ్జా హుస్సేన్, డిప్యూటీ కమాండర్ నిసార్ అహ్మద్ తుది నివాళులర్పించారు. -
పరిసరాల పరిరక్షణ అందరి బాధ్యత
రాయచూరు రూరల్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని రాయచూరు వాకింగ్ క్లబ్ సంచాలకుడు సిద్ధేష్ విరక్తిమఠ్ సూచించారు. శుక్రవారం అంబేడ్కర్ గార్డెన్లో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొత్త వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో పరిసరాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు. యోగా, ధ్యానం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రామణ్ణ, ముత్తురాజ్, చంద్రశేఖర్, నరసింహులు, అఫ్రోజ్ ఖాన్, శరణ బసవ, మునిరెడ్డి, రహీం, జాకీర్, మహదేవ్, బసవరాజ్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. పార్వతమ్మ సేవలు అమూల్యం రాయచూరు రూరల్: నగర మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి భార్య పార్వతమ్మ సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప తెలిపారు. శుక్రవారం నగరంలోని వీరాంజనేయ కళ్యాణ మంటపంలో పార్వతమ్మ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శంకరప్ప మాట్లాడుతూ.. పాపారెడ్డి నగర సభ అధ్యక్షుడిగా, శాసన సభ్యుడిగా పని చేసేందుకు పార్వతమ్మ సహకారం అందించారన్నారు. ఏటా జరిగే ముంగారు మూన్నూరు కాపు ఉత్సవాల నిర్వహణకు సహకారం అందించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో శాంతప్ప, శాలం, చంద్రశేఖర్, రాఘవేంద్ర, నరస రెడ్డి, ఆంజనేయ, శ్రీనివాసులు నరసింహులు తదితరలు పాల్గొన్నారు. కట్టుకున్న భర్తే కాలయముడు ● యర్రగుడిలో మహిళ దారుణ హత్య సాక్షి బళ్లారి: జీవితాంతం తోడు, నీడలా ఉంటానని ప్రమాణం చేసి అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తే భార్యను దారుణంగా హత్య చేశాడు. తాలూకాలోని మోకా సమీపంలోని యర్రగుడి గ్రామానికి చెందిన సుజాతమ్మ (45) అనే మహిళను భర్త ఆంజనేయులు దారుణంగా హతమార్చాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య సుజాతమ్మను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపడంతో యర్రగుడి గ్రామం ఉలికిపడింది. స్థానిక మోకా పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. నామఫలకాలు కన్నడ భాషలో ఉండాలికేజీఎఫ్: రాబోయే 10 రోజుల్లో నగరసభ వ్యాప్తిలో దుకాణాలు, వ్యాపార కేంద్రాల ముందు నామఫలకాల్లో 60 శాతం కన్నడ భాషను తప్పనిసరిగా ఉపయోగించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్. రవి ఆదేశించారు. శుక్రవారం నగరసభ సభాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కెజీఎఫ్ తాలూకాలో కన్నడ భాష అమలు సరిగా లేదన్నారు. కన్నడ భాష అమలుకు ఇప్పటికే రెండు సార్లు సమావేశం నిర్వహించి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అయినా స్పందన లేదన్నారు. బెమెల్, ఇతర సంస్థలు, శాఖల్లో కన్నడిగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి సంబంధించి ఇప్పటికే బెమెల్ అధికారితో చర్చించినట్లు తెలిపారు. కోలారులో త్వరలో సమావేశం నిర్వహించి కన్నడ పర సంఘటనలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కన్నడ సంఘం తాలూకా అధ్యక్షుడు ప్రసన్న రెడ్డి, నవ కరవే రాష్ట్ర అధ్యక్షుడు రాజగోపాలగౌడ, తహసీల్దార్ భరత్, కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు
దొడ్డబళ్లాపురం/కోలారు/హుబ్లీ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. చిత్రదుర్గ, బాగల్‌కోట, దావణగెరె, ధారవాడ, కోలారు జిల్లా కోర్టులకు శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఐడీ నుంచి నేరుగా జడ్జీలకు ఈమెయిల్‌లు పంపించారు. అప్రమత్తమైన అధికారులు న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బందిని బయటకు పంపించారు. పోలీసులు ఆయా స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. ఎటువంటి బాంబులు లభించలేదు. ఈ ఈమెయిల్స్ కేరళ వయనాడ్ నుండి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కోలారు జిల్లా వచ్చిన మెయిల్‌ను పరిశీలించగా అందులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జై కనిమోళి అని రాసి ఉన్నట్లు గుర్తించారు. ధార్వాడ జిల్లా కోర్టుకు వచ్చిన ఇ–మెయిల్లో ‘నిన్న మధ్యాహ్నం 2 గంటలకు 23 సైనేడ్ వాయు తుటాలు పేలాయి, అది ట్రయల్ మాత్రమే, ఈ రోజు జరిగేది నిజం’ అంటూ సందేశాన్ని పంపారు. బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు లభించని పేలుడు ఆనవాళ్లు ఉత్తుత్తి బెదిరింపులుగా నిర్ధారణ -
పాఠశాలల్లో ప్రమాదాలు జరిగితే ఉపేక్షించం
కోలారు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల సురక్షత విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే సహించేది లేదు. భవిష్యత్తులో ఏవైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత తాలూకా బీఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులనే బాధ్యులను చేయడం జరుగుతుందని జిల్లా పంచాయతీ సీఈఓ ప్రవీణ్ పి బాగేవాడి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పాఠశాల గదుల మరమ్మతులపై ప్రగతి పరిశీలన సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడి ఉపాధ్యాయురాలు గాయపడిన నేపథ్యంలో సీఈఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న మరమ్మతులు చేయాల్సిన పాఠశాల గదులు, అంగనవాడీ కేంద్రాల కచ్చితమైన సమాచారాన్ని వచ్చే మూడు రోజులల్లో సమర్పించాలని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న గదులలో విద్యార్థులను కూర్చోపెట్టొదని తెలిపారు. జిల్లా పంచాయతీలో వివిధ హెడ్ల కింద ఉన్న నిధులతో పాఠశాలలో గదులకు మరమ్మతులు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ సహకారంతో అంగనవాడీలకు మరమ్మతులు చేయాలని సీడీపీఓలకు తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి టి.కె.రమేష్, పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థిపై వీధి కుక్క దాడి
హొసపేటె: విజయనగర జిల్లా మరియమ్మహళ్లి పట్టణంలో ఒక హాస్టల్ విద్యార్థిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం జరిగింది. కొండనాయకనహళ్లి గ్రామానికి చెందిన మైలారీ అనే హాస్టల్ విద్యార్థి బట్టలు తెచ్చుకోవడానికి వెళ్తుండగా.. అకస్మాత్తుగా వీధి కుక్క దూకి కరచింది. గమనించిన స్థానికులు మైలారీని ఆ మొద్దుబారిన కుక్క నుంచి కాపాడారు. చికిత్స నిమిత్తం బాలుడిని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలురాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసనగౌడ అన్నారు. శుక్రవారం రాయచూరు తాలూకాలోని గారలదిన్నె, అశాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నూతన తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 13 పాఠశాలలు, 8 కర్ణాటక పబ్లిక్ పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యా సౌకర్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ కోస్గి తదితరులు పాల్గొన్నారు. బస్సు సౌకర్యం కల్పించాలిరాయచూరు రూరల్: రాయచూరు తాలూకా కడగం దొడ్డి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్టీసీ డివిజన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భాస్కర్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రజలు, రైతులు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా బస్సులు నడపాలని సూచించారు. యాపలదిన్ని, చంద్ర బండ తదితర ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా బస్సులు నడపాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం డివిజన్ కంట్రోల్ అధికారి చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రంగనాథ్, వీరేష్, తిమ్మన గౌడ, నరసప్ప, ఆంజనేయ, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 29 వరకూ ఇంటింటి సర్వే రాయచూరు రూరల్: ఓటర్ల జాబితాలో సవరణలపై అధికారులు చర్యలు చేపట్టి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ సజ్జన్ సూచించారు. జిల్లా అధికారి కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రచార జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఓటర్ల జాబితా సమీక్షలో సుమారు 2.50 లక్షల మంది వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జూన్ 29 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి సర్వేలు నిర్వహించాలని తెలిపారు. ముద్రిత ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు, లోపాలను గమనించి ఇంటి యజమానులు సవరణలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, అధికారులు శంకర గౌడ, చంద్రశేఖర్ పవార్, వీరేష్ నాయక్, దండప్ప బిరదార్ తదితరులు పాల్గొన్నారు. ఈతకెళ్లి యువకుడు మృతిహుబ్లీ: ఈత కొట్టేందుకు క్వారీలోకి దిగిన యువకుడు నీట మునిగి మృతి చెందిన ఘటన ధార్వాడ తాలూకా అమ్మినబావి వద్ద చోటు చేసుకుంది. మరెవాడ గ్రామ రాజు కడిదాళ (23) మృతుడు. ఈనెల 16వ తేదీన రాజు.. ఈత కొట్టేందుకు క్వారీ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో నీటి మునిగి చనిపోయాడు. ఈ విషయం ఎవరికి తెలియలేదు. రెండు రోజుల నుంచి అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం క్వారీలో మృతదేహం తేలడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి చూడగా.. మృతుడు రాజు కడిదాళ అని నిర్ధారించారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
యోగాతో మానసిక ఒత్తిడి దూరం
రాయచూరు రూరల్: ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా చేయాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆయుర్వేద, యూనానీ శాఖల ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగా చేస్తే మానసిక ఒత్తిడి దూరం అవుతుందని పేర్కొన్నారు. యోగాసనాలతో ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ సజ్జన్, శంకర్ గౌడ పాటిల్, శంకర్ గౌడ, పూజ, చంద్రశేఖర్ పవార్, వీరేష్ నాయక, దండప్ప బిరదార్, ఉపాధ్యాయుడు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. బళ్లారి టౌన్: యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక నెమ్మది లభిస్తుందని జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్.టి.పనేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, ఆయుష్ శాఖ వివిధ యోగా సంస్థల ఆధ్వర్యంలో బృహత్ జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతుఊ.. ఇటీవల రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్న డయాబెటిస్, బీపీ తదితర ఆరోగ్య సమస్యలను నియంత్రించేందుకు యోగా ఉత్తమ మార్గం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు యోగా ఉత్తమ ఔషధం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, యోగా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
లోకాయుక్త వలలో బుడా సర్వేయర్
సాక్షి బళ్లారి: బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (బుడా) సర్వేయర్ లోకాయుక్తకు చిక్కారు. స్థలాల లేఅవుట్ ఫైళ్ల అనుమతుల మంజూరుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో లోకాయుక్త అధికారులు మెరుపు దాడి చేశారు. బాధితుడి నుంచి రూ.3.50 లక్షల లంచం తీసుకుంటుండగా సర్వేయర్ శాంతమూర్తి, ఆయన సహాయకుడు మహమ్మద్ సాజిద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రవీణ్ కుమార్, కుమార స్వామి, రఘనాథ్ బృందానికి చెందిన సింగిల్ లేఅవుట్, మల్టీ లేఅవుట్ ఫైళ్లకు అనుమతులు పొందడం, సంబంధిత పనులు చేయించేందుకు వీరేష్ అనే వ్యక్తి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తీసుకున్నాడు. ఇందులో భాగంగా లేఅవుట్ అనుమతి కోసం వీరేష్ దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత సర్వేయర్ శాంతమూర్తి ఇందుకోసం రూ.3.50 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే లంచం ఇచ్చేందుకు వీరేష్‌కు ఇష్టం లేకపోవడంతో నేరుగా లోకాయుక్త అధికారులను కలిసి సమస్యను చెప్పుకున్నాడు. వీరేష్ ఫిర్యాదు మేరకు లోకాయుక్త అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయంలో సర్వేయర్ శాంతమూర్తి తన సహాయకుడు మహమ్మద్ సాజిద్ సహాయంతో వీరేష్ నుంచి రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటుండగా దాడి చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో లోకాయుక్త పోలీస్ సూపరింటెండెంట్ ఎన్.వాసుదేవ రామ, డిప్యూటీ సూపరింటెండెంట్లు సిద్దప్ప, ఎస్.బీలగి, సచిన్, ఎస్.చలవాది, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్, ఎం.భావిమని తదితరులు పాల్గొన్నారు. అవినీతి కేంద్రంగా ‘బుడా’ బళ్లారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (బుడా) కార్యాలయంపై అవినీతి ఆరోపణలు పెరిగిపోతుండటం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నగరంలో ఏటేటా పెరుగుతున్న జనాభాకు తోడు కొత్త లేఔట్లు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు పెరిగిపోతున్నాయి. లేఅవుట్ల అనుమతుల ప్రక్రియలో కీలక భూమిక పోషిస్తున్న బుడా కార్యాలయ సిబ్బంది లేఅవుట్ల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధికారులు, పాలకులు నేరుగా లంచాలు తీసుకుంటున్నారని లేఅవుట్ల యజమానులు బహిరంగంగానే చెబుతున్నారు. నూతన లేఔట్ల అనుమతులు, ఫైళ్లు క్లియరెన్స్ చేయడానికి చిన్న చిన్న అభ్యంతరాలు చూపిస్తూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడుతున్నారు. లోకాయుక్తకు చిక్కిన సర్వేయర్ శాంతమూర్తి, ఆయను సహాయకుడు మహమ్మద్ సాజిద్ స్థలాల లేఅవుట్ ఫైళ్ల అనుమతులకు లంచం డిమాండ్ బాధితుడి ఫిర్యాదుతో ఆకస్మికంగా దాడి సర్వేయర్, ఆయన సహాయకుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు -
రక్తదానం సామాజిక సేవకు ప్రతీక
హొసపేటె: ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని బీఎంఎం (బీఎంఎం) ముఖ్య కార్యనిర్వహణ అధికారి మంజునాథ్ ప్రభు అభిప్రాయపడ్డారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో భాగంగా బీఎంఎం ఇస్పాత్, ప్రభుత్వ ఆస్పత్రి, బళ్లారిలోని విమ్స్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో గురువారం వృత్తి విద్యా ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛంధ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి రక్తదానం చేయడం వల్ల ముగ్గురు వేర్వేరు వ్యక్తులకు సహాయం అందుతుందన్నారు. ఇది మానవతా దృక్పథంతో కూడిన ఒక మంచి పని. రక్తదానం చేయడం ఆరోగ్యానికి నిజంగా ప్రమాదకరం కాదు.. ఇది ఒక సేవ, నిస్పార్థమైన చర్య అని తెలిపారు. మానవ ప్రాణాలను కాపాడే శక్తి రక్తానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తి అయిన ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానం సామాజిక సేవకు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యనిర్వహణ అధికారి విమల్ సింగ్, ఆర్థిక వాణిజ్య శాఖ అధిపతి రాజేంద్ర ముంద్రా, సంస్థ ఉపాధ్యక్షుడు మనీష్.డి.వర్ణేకర్, వృత్తిపర ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్. పీ.విజయ వెంకటేష్, డాక్టర్.అంజని, డాక్టర్ అనూష, విజయనగర్ జిల్లా రక్త సేకరణ అధికారి డి.జగదీష్, విమ్స్ బ్లడ్ బ్యాంక్ కన్సల్టెంట్లు సిద్దేశ్వర, మల్లికార్జున కపాలి, సంతోష్, వృత్తిపర ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కప్పల కూరకు లొట్టలు
యశవంతపుర: పర్యాటకుల కేంద్రమైన గోవాలో వానాకాలం ప్రారంభం అవుతుండగానే జంపింగ్ చికన్కు డిమాండ్ పెరుగుతుంది. అంటే కప్పల మాంసం అన్నమాట. అవి గంతులేస్తూ వెళ్తాయి కాబట్టి అలా పిలుచుకుంటారు. గోవాలో కప్పల వేటను నిషేధించగా, పొరుగున కార్వార నుంచి కప్పలు సరఫరా అవుతుంటాయి. ఒక్కోటి 6 కేజీల పైనే వాన చినుకులు పడగానే పశ్చిమ ఘాట్లలో కప్పలు బెకబెకమంటూ సంతానోత్పత్తికి బయటకు వస్తాయి. ఇవి మామూలు కప్పలైతే కాదు, ఒక్కోటి 6 నుంచి 8 కేజీల వరకు బరువుండే జంబో మండూకాలు. ఒక ఫారం కోడికి సమానంగా పెరుగుతాయి. వాటిని కొందరు స్థానికులు పట్టుకుని గోవాలో విక్రయిస్తారు. ప్రాణాలతో ఉన్న కప్పలను గోవాలో పెద్దపెద్ద హోటల్స్‌కు సరఫరా చేస్తారు. కేజీ వెయ్యి రూపాయలకు పైగా పలుకుతుంది. కప్ప కాళ్లతో రుచికరమైన కబాబ్స్, ఫ్రైస్ చేస్తారు. కోడి కూర కంటే చాలా రుచిగా ఉంటుందని గోవా ప్రజలు చెబుతారు. ఇప్పుడు కార్వారలో కప్పల వేట ఊపందుకుంది. గోవాకు కార్వార నుంచి మండూకాల ఎగుమతి -
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు
రాయచూరు రూరల్: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు అగ్ని దివ్య గోపి డిమాండ్ చేశారు. గురువారం కొప్పళ జెస్కాం కార్యాలయం వద్ద 30 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యుత్ సరఫరా బాధ్యతలను టాటా పవర్ కంపెనీకి అప్పగించే ముందు కేపీటీసీఎల్ అధికారులతో చర్చించి, తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఒత్తిడి చేశారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. -
మళ్లీ చర్చకు మేకెదాటు ప్రాజెక్టు
శివాజీనగర: బెంగళూరు దక్షిణ (రామనగర) జిల్లాలో మిగులు జలాల కోసం కావేరి నదిపై నిర్మించతలపెట్టిన మేకెదాటు ప్రాజెక్ట్ మీద తమిళనాడు పదేపదే అభ్యంతరం తెలియజేయడం తెలిసిందే. ఈదఫా ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కూడా ఈ పథకాన్ని వ్యతిరేకించేలా అసెంబ్లీలో మాట్లాడారు. కావేరి జలాలను పొందడం తమిళనాడు రైతుల హక్కు, అందుచేత తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవటానికి న్యాయ పోరాటం చేపట్టాలని గవర్నర్ అన్నారు. కావేరి నీటిని ఇస్తాం: సీఎం శివ మేకెదాటు ప్రాజెక్ట్ విషయమై స్పందించిన సీఎం డీ.కే.శివకుమార్.. తమిళనాడు సీఎంతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నాను, మనందరం కూడా భారతీయులు, తమిళనాడుకు ఇవ్వాల్సిన నీటిని తాము ఇస్తాం, ముందుగా నీటిని నిల్వ చేసుకుని, వారికి నీరు ఇస్తాం. మేం బతకాలి. వారు కూడా బతకాలి అని అన్నారు. అన్ని అనుకూలతలను పరిగణించి తమిళనాడుకు చట్ట ప్రకారం కావేరి జలాలను ఇస్తామని తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్‌కు ఏం చెప్పాలో అది చెబుతామని, ఇందులో రాజకీయం ఏమి లేదన్నారు. కావేరి నదిపై మేకెదాటు ఆనకట్ట నిర్మాణంపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సమర్పించిన పిటిషన్‌ను సుఫ్రీంకోర్టు 2025 నవంబర్‌లో కొట్టివేసిందని తెలిపారు. అడ్డుకోవాలన్న తమిళనాడు గవర్నరు ఆ రాష్ట్ర సీఎంతో చర్చిస్తా: డీకే శివ -
బాలునిపై కుక్కల దాడి
● తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు తుమకూరు: నిత్యం ఎక్కడో ఓ చోట పిల్లలను కుక్కలు కరుస్తున్నాయి. జిల్లాలోని చిక్కనాయకనహళ్లి పట్టణం, జోగిహళ్లిలోని ఆది ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో గురువారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న ఒడిశాకు చెందిన 5 ఏళ్ల బాలుడు అరుణ్‌పై వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలున్ని కరిచి ఈడ్చుకెళ్లాయి. బాలుని కేకలు విన్న స్థానికులు వెంటనే కుక్కలను తరిమికొట్టి అతడిని రక్షించారు. తాలూకా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానిక గృహిణి నిర్మల మాట్లాడుతూ, పిల్లలను ఒంటరిగా దుకాణానికి పంపడానికే భయంగా ఉందని తెలిపింది. పిల్లల చేతుల్లో తినుబండారాలు చూడగానే కుక్కలు కరవడానికి దూసుకొస్తాయని ఆమె వాపోయింది. మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని, ఇప్పటికై నా చర్యలు తీసుకోకుంటే ధర్నాలు చేస్తామని తెలిపింది. తహసీల్దార్ ఎం.మమతా ఆస్పత్రిలో బాలున్ని పరామర్శించారు. తీవ్ర గాయాల పాలైన బాలున్ని చూసి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పొట్టకూటి కోసం వస్తే ఇలా జరిగిందని వాపోయారు. మఠంలో బంగారం దొంగ అరెస్టు శివమొగ్గ: తీర్థహళ్లి తాలూకాలోని మాలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిషి గ్రామంలో ఉన్న సత్యసంధ గురు ఉత్తరాది మఠంలో జరిగిన కోట్ల రూపాయల విలువైన బంగారం దొంగతనం కేసులో నిందితుడు దొరికాడు. శివమొగ్గలోని గాంధీనగరకు చెందిన రాఘవేంద్ర ఆచార్య (25)ను అరెస్టు చేసి 780 గ్రాముల బరువున్న 16 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు తీర్థహళ్లి డీఎస్పీ అరవింద్ కలగంజి తెలిపారు. బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా మఠంలో ఎంతమొత్తంలో బంగారం పోయిందన్నది బయటకు చెప్పడం లేదు. -
జాడ లేని వర్షాలు.. ఆందోళనలో రైతులు
హొసపేటె: ప్రస్తుత వర్షాకాలంలో, రోహిణి వర్షాలకు నేల తడిసి పోవడంతో రైతులు పత్తి, అలసంద, జొన్న వంటి వర్షాకాలపు పంటలను విత్తారు. కానీ ఇప్పుడు గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తాము నాటిన విత్తనాలు ఎక్కడ ఎండిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికార వర్గాల సమాచారం ప్రకారం గతేడాది అంటే 2025 జూన్ నెలలో 133.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ప్రస్తుత 2026లో కేవలం 52.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే 81.7 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు ఉంది. దీంతో నీటిపారుదల సౌకర్యం ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా వేసిన పంటలను కాపాడుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల పాటు వర్షాలు కురవకపోతే రుతుపవనాల ప్రభావం మొక్కజొన్న, పత్తి పంటలపై పడుతుంది. పాఠశాల రెండో అంతస్తు నుంచి పడి విద్యార్థి మృతి హుబ్లీ: పాఠశాల రెండో అంతస్తు నుంచి అదుపు తప్పి పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లాలోని నవలగుంద పట్టణంలో జరిగింది. మృతి చెందిన బాలుడిని అక్కడి అణ్ణిగేరి రోడ్డులోని విద్యాజ్యోతి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఆకాశ్ నీలన్నవర్ (10)గా గుర్తించారు. ఈ బాలుడు 4వ తరగతి చదువుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని హుబ్లీ కిమ్స్‌కు తరలించారు. ఘటన స్థలాన్ని నవలగుంద పోలీసులు పరిశీలించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. -
పిల్లలపై కూలిన కాంపౌండ్
● ఒకరు మృత్యువాత దొడ్డబళ్లాపురం: ఆడుకుంటున్న పిల్లల మీద కాంపౌండ్ గోడ కూలి ఒకరు మరణించిన సంఘటన బెంగళూరులోని బాగలూరులో జరిగింది. బండికొడిగేహళ్లిలో బుధవారం సాయంత్రం ముగ్గురు పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా హఠాత్తుగా ఓ ఇంటి కాంపౌండ్ గోడ హఠాత్తుగా కూలి పిల్లల మీద పడింది. ఆసిఫ్ (5) అనే బాలునిపై పెద్ద పెద్ద శిథిలాలు పడడంతో అక్కడే చనిపోయాడు. సమన్వి అనే బాలిక గాయపడగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మేడ మీద నుంచి పడి... బంధువుల ఇంట్లో ఆడుకుంటూ మేడ మీద నుంచి కిందపడి బాలుడు మృతి చెందాడు. నెలమంగల తాలూకా తోటగుడ్డదహళ్లిలో మొదటి అంతస్తులో ఆడుకుంటున్న దీక్షిత్ (2) అనే బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు అతన్ని ఆస్పత్రికి తరలించగా 24 గంటలపాటు కోమాలో ఉండి గురువారం కన్నుమూశాడు. దాసరహళ్లికి చెందిపన నవీన్ కుమార్, కావ్య దంపతులు కుమారుడు దీక్షిత్‌తో కలిసి బంధువుల ఇంటికి రాగా ఈ దుర్ఘటన జరిగింది. 27 రోజుల్లో రూ.2.73 కోట్ల కానుకలు మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రసిద్ధ మలే మహదేశ్వర బెట్ట మాదప్ప దేవస్థానం హుండీలో కోట్లాది రూపాయల కానుకలు వచ్చాయి. బుధవారం హుండీలను లెక్కించారు. ఈ నెలలో ఎక్కువ సెలవులు, అమావాస్య నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగింది. 27 రోజుల్లో రూ. 2.73 కోట్ల నగదు భక్తుల నుంచి కానుకల రూపంలో వచ్చింది. 44 గ్రాముల బంగారం, 977 గ్రాముల వెండి సొత్తు లభ్యమైంది. పలు దేశాల కరెన్సీతో పాటు నిషేధిత రూ. 2 వేల నోట్లు కూడా లభించాయి. భక్తులు సగటున రోజుకు రూ.10 లక్షల డబ్బును హుండీలలో వేశారు. భార్యను హత్య చేసి.. ఆత్మహత్య నాటకం ● కోలారు తాలూకాలో ఘోరం కోలారు: పుట్టింటి నుంచి మరింత డబ్బు, బంగారం తేవాలని భర్త భార్యను వేధిస్తూ, కుక్కర్‌తో కొట్టి చంపి ఆపై ఉరివేసుకున్నట్లు చూపించిన ఘటన తాలూకాలోని దొడ్డహసాళ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సహన (24) కట్న దాహానికి బలైన వివాహిత యువతి. వివరాలు.. భర్త మంజునాథ్‌తో పొరుగూరికి చెందిన సహనకు ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరింత కట్నం తీసుకు రావాలని భర్త ఆమెను సతాయించేవాడు. గురువారం కూడా ఇదే విషయమై ఘర్షణకు దిగాడు, కుక్కర్‌తో తలపై గట్టిగా కొటి స్పృహ కోల్పోయిన తరువాత బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసి, ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశాడు. ఇది తెలిసిన సహన తల్లిదండ్రులు హుటాహుటిన దొడ్డహసాళ గ్రామానికి చేరుకుని బోరున విలపించారు. ఉరివేసుకున్న దృశ్యాన్ని చూస్తే ఇది ఆత్మహత్య అని ఎవరూ నమ్మరని తెలిపారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కోలారు రూరల్ పోలీసులు భర్త మంజునాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వలస కూలీపై ఏనుగు దాడి కెలమంగలం: వలస కూలీ మహిళపై ఏనుగు దాడి చేయడంతో ఆమె కాలు విరిగిన ఘటన డెంకణీకోట సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకొంది. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని ఆలహళ్లి వద్ద గులాబీ తోటలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కూలీ కుటుంబం పనిచేస్తోంది. మహిళా కూలీ రీమా (30) ఇంటి నుంచి బయటకెళ్లే సరికి పొదల్లో దాగి ఉన్న ఏనుగు ఆమైపె తొండంతో దాడి చేసింది. రీమా హాహాకారాలు చేయడంతో స్థానికులు వచ్చి ఏనుగును తరిమివేసి ఆమెను డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు కాలు విరిగి, గాయాలు తగిలాయి. అటవీశాఖాధికార్లు ఘటనా స్థలిని పరిశీలించారు. -
బడిలోనే హెచ్ఎం ఆత్మహత్య
యశవంతపుర: పాఠశాలలో మితిమీరిన రాజకీయాలు, ఉపాధ్యాయుల వేధింపులను తట్టుకోలేక ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దావణగెరె జిల్లా హరిహర వద్ద కుక్కనూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. హెచ్ఎం జయప్ప (54) పాఠశాల మరుగుదొడ్డికి వెళ్లి పురుగుల మందు తాగి చనిపోయాడు. జయప్ప భార్య అంజనమ్మ ఫిర్యాదు మేరకు ఐదుమంది ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది, సీఆర్పీ, బీఆర్పితో పాటు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవినీతికి సహకరించలేదని, తమ మాట వినడం లేదని నిత్యం కులం పేరుతో దూషించేవారని ఆమె తెలిపింది. టీచర్లు శ్రీకాంతాచారి, వెంకటేశ్, రంజని, చేతన, మహంతేశ్ గౌళి, వంట సహయకురాలు సుమా, చెన్నమ్మ, రూపా, విజయ నిందితుల్లో ఉన్నారు. ఆయన గత 10 నెలల నుంచి ఇక్కడ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. దావణగెరె జిల్లాలో విషాదం -
ఓటు హక్కు ఉంటేనే గ్యారంటీ లబ్ధి
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పంచ గ్యారంటీ పథకాలు పొందడానికి రాష్ట్రంలో ఓటుహక్కు తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తెలిపారు. గురువారం విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఓటుహక్కు కలిగిన ప్రజలకు మాత్రమే ప్రభుత్వ సౌలభ్యాలు అందించాలనేది నా నిర్ణయం. ఓటుహక్కు లేదంటే ఎందుకు గ్యారంటీ పథకాలు ఇవ్వాలి?, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలి. ప్రభుత్వ సౌలభ్యాలు పొందేవారికి ఓటు హక్కు మరీ ముఖ్యం’ అని చెప్పారు. ఉచిత బస్సుకు ఐడీ కార్డు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కోసం సరైన గుర్తింపు కార్డు అందిస్తామని సీఎం చెప్పారు. గ్యారంటీ పథకాల అర్హుల గురించి ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. అర్హులకు మాత్రమే పథకాలు అందించడం, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ పరిశీలన సహాయపడుతుందన్నారు. ప్రజలు తమ ఓటుహక్కును కాపాడుకునే ప్రయత్నం చేయాలని మరోసారి సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది అక్రమంగా పంచ గ్యారంటీలను పొందుతున్నారని ఆరోపణలున్న నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. లేనివారికి ఎందుకివ్వాలి: సీఎం శివ -
ఓటరు జాబితా సవరణ చేపట్టాలి
రాయచూరు రూరల్: ఓటరు జాబితా సవరణకు చర్యలు చేపట్టాలని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి పేర్కొన్నారు. గురువారం ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో ఓటు హక్కు పరిరక్షణలో అర్హులైన ఎవరి ఓటు కూడా తొలగించకుండా చూసుకోవాలన్నారు. అధికార పార్టీలు అక్రమాలకు పాల్పడితే సమష్టిగా అడ్డుకోవాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత కనబడుతోందన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఓటర్ల పేర్ల తొలగింపు వివాదాస్పదమైన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో శివశంకర్, నరసింహ నాయక్, లక్ష్మిపతి, అమరేష్ పాటిల్, నరసప్ప, జంబునాథ్, తిమ్మారెడ్డి, గోవిందరెడ్డి, విజయ కుమార్, యల్లారెడ్డి, రఫీలున్నారు. -
జెడ్పీ సీఈఓ పరిశీలన
రాయచూరు రూరల్: గత ఐదు రోజుల నుంచి బావి నీరు తాగి 50 మంది అస్వస్థతకు గురైన ఘటన యాదగిరి జిల్లా శహాపుర తాలూకా బీరనూరులో చోటు చేసుకున్న సంగతి విదితమే. కొళాయిల నుంచి తాగునీరు సరఫరా నిలిచి పోవడంతో జల జీవన్ మిషన్ పథకం కింద తవ్విన బోరుబావి నీటిని సరఫరా చేశారు. ఆ నీటిని తాగడంతో అతిసార ప్రబలింది. గతంలో గ్రామస్తులు బోరుబావి నీటిని తాగేవారు. బోరుబావి మరమ్మతులకు గురి కావడంతో కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేశామని గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు. గురువారం జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి లవీష్ ఒడెయర్ గ్రామంలో పర్యటించి నీటి సరఫరాపై పరిశీలన చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలిరాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దళితులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చలువాది మహాసభ డిమాండ్ చేసింది. గురువారం ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సంచాలకుడు భీమన్న, కుమార్ మాట్లాడారు. 15 రోజుల క్రితం నగరంలో ఐపీఎల్ మ్యాచ్ విషయంలో మడ్డిపేటలో జరిగిన ఘర్షణలో కట్టపై కూర్చొన్న దళితుడు రాఘవేంద్రను రాడ్లతో కొట్టారన్నారు. మాజీ నగరసభ సభ్యురాలి భర్త తిమ్మారెడ్డి కుమారుడు మహాలింగరెడ్డి కుటుంబ సభ్యులు ఆదర్శ్, తరుణ్‌లు కలిసి దాడి చేశారని, వారిపై చర్యలు చేపట్టాలన్నారు. మాజీ నగరసభ సభ్యురాలి భర్త తిమ్మారెడ్డిపై ఐదు కేసులున్నాయని, రౌడీషీటర్‌పై కేసును నమోదు చేయకుండా ప్రముఖ రాజకీయ నాయకులు పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నారు. 14 మందిలో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. నేడు పాండురంగ స్వామి ఆలయ వార్షికోత్సవం బళ్లారిఅర్బన్: గుగ్గరహట్టిలో వెలసిన పాండురంగ స్వామి ఆలయంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆలయం అభివృద్ధి కోసం పాటు పడుతున్న దేవస్థాన సేవా సమితి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను ఘనంగా సన్మానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
పరిషత్ ఎన్నికల్లో హస్తం హవా
బనశంకరి: విధానసభ నుంచి విధాన పరిషత్‌లో 7 స్థానాలకు నిర్వహించిన ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఓ సీటును అదనంగా గెల్చుకుంది. అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ నుంచి ఐదుమంది, బీజేపీ నుంచి ఇద్దరు కూడా ఎన్నికయ్యారు. విజేతలు వీరే కాంగ్రెస్ అభ్యర్థులు బీకే.హరిప్రసాద్, తిప్పణ్ణప్ప కమకనూరు, పీవీ.మోహన్, శివణ్ణ బీఎస్, వినయ్ కార్తీక్ గెలుపొందారు. ● బీజేపీ నుంచి రఘు కౌటిల్య, లింగరాజ పాటిల్ ఎన్నిక కాగా, జేడీఎస్ అభ్యర్థి గోవిందరాజు ఓడిపోయారు. ప్రతిపక్ష ఓట్లకు గండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌ను క్రాస్ ఓటింగ్ వెంటాడింది. బీజేపీ నుంచి ముగ్గురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడగా, జేడీఎస్ నుంచి ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసినట్లు వెల్లడైంది. దీనివల్లే కాంగ్రెస్ ఐదో అభ్యర్థి వినయ్ కార్తీక్ 32 ఓట్లతో ఎన్నికయ్యారు. ఇద్దరు అభ్యర్థులకు తలా 30 ఓట్లు వేయాలని తమ ఎమ్మెల్యేలకు బీజేపీ పెద్దలు సూచించారు. కానీ రఘు కౌటిల్య కు 29 ఓట్లు పడగా, ఒక ఓటు చెల్లలేదు. లింగరాజ్ పాటిల్‌కు 27 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి, 3 ఓట్లు క్రాస్ అయ్యాయి. రిసార్టుల నుంచి అసెంబ్లీకి శివాజీనగర: ముందునుంచీ 7వ అభ్యర్థి గెలుపు ఎవరిదని కుతూహలం ఏర్పడింది. ఆ స్థానం కోసం కాంగ్రెస్ వినయ్ కార్తీక్, బీజేపీ మద్దతుతో జేడీఎస్ అభ్యర్థి గోవిందరాజు మధ్య పోటీ నెలకొంది. మూడు పక్షాలూ తమ ఓట్ల ఐక్యతను కాపాడుకునే ప్రయత్నం చేశాయి. ఇందుకోసం కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తీసుకెళ్లాయి. అక్కడి నుంచి గురువారం ఉదయం విధానసౌధకు చేరుకుని ఓటేశారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలైంది. తొలి అంతస్తులో ఉన్న 106వ గది పోలింగ్ కేంద్రమైంది. పార్టీ పక్ష నేతలు ముందే ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటేయాలనేది నిర్దేశించారు. ముందుజాగ్రత్తగా ఓటింగ్ ముగిసేవరకూ పరిశీలిస్తూ ఉన్నారు. సీఎం, సీనియర్ల సమీక్ష విధానసౌధ 3వ అంతస్తుఽలోని సభామందిరంలో సీఎం డీ.కే.శివకుమార్, ఏఐసీసీ కార్యదర్శి రణదీప్‌సింగ్ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్, మాజీ సీఎం సిద్దరామయ్య తమ ఎమ్మెల్యేలకు మార్గదర్శనం చేశారు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఎస్.టీ.సోమశేఖర్ మాట్లాడుతూ సీఎం బుధవారం పిలిచి, తమకు ఓటేయాలని కోరినట్లు తెలిపారు. తమ నియోజకవర్గ సమస్యలకు స్పందించేవారికి ఓటు వేశానన్నారు. శివరామ్ హెబ్బార్ మాట్లాడుతూ తనను కాంగ్రెస్‌వారు మాత్రమే మద్దతు కోరారు, ఇంకెవరూ సంప్రదించలేదన్నారు. ఎవరెవరు ఓటేశారు.. కాంగ్రెస్ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 62 మంది, జేడీఎస్ నుంచి 18, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు, సర్వోదయ కర్ణాటక పార్టీ ఎమ్మెల్యే దర్శన్ పుట్టణ్ణయ్య, కర్ణాటక రైతు ప్రగతి పార్టీ గాలి జనార్ధనరెడ్డి, స్వతంత్రులు గౌరిబిదనూరు పుట్టస్వామి, హరపనహళ్ళి లతా మల్లికార్జున ఓటు హక్కు వినియోగించుకున్నారు. హోం మంత్రి పరమేశ్వర్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ వచ్చి ఓటేశారు. యత్నాల్ వివాదం, ఊరట శివాజీనగర: పరిషత్ ఎన్నికలతో విధానసౌధలో కోలాహలం నెలకొంది. 220 మందికిపైగా ఎమ్మెల్యేలు ఓటు వేశారు. పోలింగ్ ప్రక్రియ మధ్యలో పార్టీల నేతలు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకున్నారు. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ బీజేపీకే మద్దతుగా నిలిచారు. బీజేపీకి ఓటు వేస్తానని లేఖ విడుదల చేశారు. ఇది సరికాదంటూ ఆయనపై కాంగ్రెస్ నాయకులు, తక్షణమే ఎన్నికల అధికారి విశాలాక్షికి ఫిర్యాదు చేశారు. ఇది నియమాల ఉల్లంఘన అని, యత్నాళ్ ఓటును రద్దు చేయాలని కోరారు. కానీ యత్నాల్ బూత్‌లో రహస్యంగా ఓటు వేశారని, ఇందులో నియమ ఉల్లంఘన జరగలేదని కాంగ్రెస్ నేతల ఫిర్యాదును విశాలాక్షి తిరస్కరించడంతో వివాదం ముగిసింది. ఇక బీజేపీ నుంచి సస్పెండైన ఎస్.టీ.సోమశేఖర్, శివరామ హెబ్బార్, జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే జీ.టీ.దేవేగౌడ ఆత్మసాక్షికి బద్ధులమంటూ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేశారు. మరికొందరు రహస్యంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. నాలుగే కాదు, 5వ సీటూ కాంగ్రెస్ పరం బీజేపీకి దక్కిన 2 సీట్లు జేడీఎస్ అభ్యర్థి పరాజయం ప్రతిపక్షాల నుంచి 7 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ విధానసౌధలో పోలింగ్ కోలాహలంజిమ్మిక్కులు చేయలేదు: సీఎం దొడ్డబళ్లాపురం: విధానపరిషత్ ఎన్నికలు ముగిశాయి, తాము ఎలాంటి జిమ్మిక్లకు పాల్పడలేదని సీఎం డీకే శివకుమార్ చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో ఓటు వేశాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు ఎవరూ ఒత్తిడికి గురికాలేదని, ఇష్టానుగుణంగానే ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో ఉంచడం ద్వారా రిసార్ట్ రాజకీయాలకు పాల్పడ్డారా అని ప్రశ్నించగా, అది రిసార్ట్ రాజకీయం కాదని, ఎమ్మెల్యేలపై నమ్మకం లేక కాదని, ఎన్నికల ప్రక్రియపై శిక్షణ కోసమని వివరించారు. క్రాస్ ఓటింగ్ అంటే తనకు తెలియదని, అలా చేయించాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. అసెంబ్లీలో ఉన్న 224 మంది ఎమ్మెల్యేలూ తనకు కావాల్సిన వారేనని, తాను అందరికీ ముఖ్యమంత్రినని అన్నారు. మన ఓట్లు మనకే.. బీజేపీ వ్యూహం శివాజీనగర: తమ ఎమ్మెల్యే ఒకరు క్రాస్ ఓటింగ్ చేసిఉండవచ్చనే అనుమానంతో బీజేపీ మధ్యలోనే వ్యూహాన్ని మార్చింది. తన అభ్యర్థులకు ఒకరికి 29 ఓట్లు చొప్పున వేయాలని ఎమ్మెల్యేలకు నిర్దేశించింది. మిగిలే ఓట్లను జేడీఎస్ అభ్యర్థికి వేయాలని తెలిపింది. అయితే పోలింగ్ ఆరంభం కాగానే జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే బీజేపీకి ఓటేసినట్లు తేటతెల్లమైంది. నియమాల ప్రకారం ఇది రహస్య ఓటింగ్ కావడంతో ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటు వేశారనేది తెలుసుకోవడానికి సాధ్యపడదు. అయితే ఎమ్మెల్యేల ప్రవర్తన క్లూ ఇస్తుంది. ఒక ఓటు పోయిందని ప్రచారం జరగ్గానే బీజేపీ నాయకులు.. జేడీఎస్ సంగతిని పక్కన పెట్టేశారు. మొత్తం ఓట్లు మన అభ్యర్థులకే వేయాలని ఆదేశించారు. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్, రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తమ చాంబర్లలో ఎమ్మెల్యేలతో చర్చించి ఒక్కో అభ్యర్థికి 30 ఓట్లు పడాలని సూచించారు. దీని వల్ల మిత్రపక్షం జేడీఎస్‌కు ఓట్లు తగ్గాయి. గత వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠగా సాగిన పరిషత్ ఎన్నికల వ్యూహ ప్రతి వ్యూహాల్లో అధికార పార్టీదే పైచేయి అయ్యింది. హోరాహోరీ పోరాటంలో ప్రతిపక్షాలను వెనక్కు నెట్టి 5వ సీటును కూడా గెల్చుకుంది. క్రాస్ ఓటింగ్ వల్ల జేడీఎస్‌కు నిరాశే మిగిలింది. తాము నష్టపోతామనే భయంతో బీజేపీ మిగులు ఓట్లను జేడీఎస్‌కు కేటాయించలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లు బీకే.హరిప్రసాద్ – 30 ఓట్లు పీవీ.మోహన్ – 29 బీఎస్.శివణ్ణ – 30 తిప్పణ్ణప్ప కమకనూర– 30 ఐదో అభ్యర్థి వినయ్ కార్తీక్ – 32 బీజేపీ అభ్యర్థులకు రఘు కౌటిల్య – 29 ఓట్లు లింగరాజు పాటిల్ – 27 -
కేబినెట్లో రహీంఖాన్‌కు చోటు ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్‌లో మంత్రిగా రహీంఖాన్ని నియమించాలని అఖిల భారత మైనార్టీ సేవా సంఘం ఒత్తిడి చేసింది. అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు సాధిక్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిని మార్పు చేసిన సమయంలో ఆ పదవిని మైనార్టీలకు కేటాయించాలన్నారు. 2023 ఎన్నికల సమయంలో కళ్యాణ కర్ణాటక భాగంలో మైనార్టీల ఓట్లు కావాలని ప్రధాన పదవులు మాత్రం అగ్రనాయకులకు కేటాయించడం తగదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవిని రహీంఖాన్కి తిరిగి కేటాయించాలని డిమాండ్ చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి హొసపేటె: ఆహారం కోసం వెతుకుతున్న ఒక చిరుత జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన ఘటన బుధవారం రాత్రి సుమారు 10:30 గంటలకు విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా సరిహద్దులోని హులికుంటె క్రాస్ సమీపంలో జాతీయ రహదారి– 50పై జరిగింది. సుమారు రెండున్నర సంవత్సరాల వయస్సుగల మగ చిరుత చనిపోయింది. ప్రమాదంలో చిరుత నోరు, ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో చిరుత అక్కడికక్కడే మరణించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. విషయం తెలియగానే హొసపేటె ఫారెస్ట్ జోన్ ఆఫీసర్ కౌశిక్, కూడ్లిగి ఎస్ఐ ప్రకాష్, ఇతర సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. మహిళ అదృశ్యంహొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని ఆలూరు గ్రామానికి చెందిన సుమారు 25 ఏళ్ల వయస్సున్న శృతి అనే మహిళ అదృశ్యమయ్యారు. ఈ విషయంపై హొసహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదృశ్యమైన మహిళ సుమారు 5 అడుగుల ఎత్తు, పలుచని శరీరాకృతి, నలుపు రంగు శరీర ఛాయ, గుండ్రని ముఖం కలిగి కన్నడలో మాట్లాడుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆమె ఆకుపచ్చ రంగు నైటీ ధరించింది. ఆమె ఆచూకీపై ఏమైనా సమాచారం తెలిస్తే హొసహళ్లి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని స్టేషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్ ఢీకొని గొర్రెల కాపరి దుర్మరణం● మూడు గొర్రెలూ మృతి ● సింధనూరు వద్ద దుర్ఘటన రాయచూరు రూరల్ : కేకేఆర్టీసీ బస్సు ఢీకొని గొర్రెలు కాపరితో పాటు మూడు గొర్రెలు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లాలో సంభవించింది. బుధవారం తెల్లవారు జామున సింధనూరు వద్ద గంగావతి రోడ్డులో ఈ ఘటన జరిగింది. మృతుడిని మస్కి తాలూకా హాలాపూర్కు చెందిన గొర్రెల కాపరి శరణప్ప(36)గా గుర్తించారు. సింధనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. లోకాయుక్త వలలో విద్యాశాఖ క్లర్క్రాయచూరు రూరల్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న క్లర్క్ మహాబళేఽశ్వర్ లోకాయుక్త వలలో చిక్కారు. గురువారం లోకాయుక్త ఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో దాడి చేశారు. పాఠశాలను రెన్యూవల్ చేయడానికి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నగర పరిధిలోని రాంపూర్ ప్రైవేట్ పాఠశాల లైసెన్స్ రెన్యూవల్ కోసం యజమాని సిద్దణ్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేయగా మహాబళేశ్వర్ లోకాయుక్త అధికారుల చేతికి దొరికారు. -
తుంగభద్ర వెలవెల.. రైతన్న విలవిల..
సాక్షి,బళ్లారి: దక్షిణ భారత దేశంలో అత్యంత ముఖ్యమైన జలాశయాల్లో ఒకటైన తుంగభద్ర డ్యాం నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు తాగు, సాగునీరందించే ఉమ్మడి జలాశయమైన తుంగభద్ర డ్యాంకు ఎగువన వరణుడు ముఖం చాటేయడంతో డ్యాంలోకి నీరు చేరకపోవడంతో గత ఏడాది డ్యాంలో ఉంచిన 9.5 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ రెండవ వారం లోపు డ్యాంలో నీరు చేరడం ఆనవాయితీగా ఉండేది. నదీ పరివాహకంలో కురవని వర్షాలు తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాలైన ఆగుంబె, మొరాళ, తీర్థహళ్లి, శివమొగ్గ తదితర పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు పడటం, ఎగువన ఉన్న భద్ర డ్యాం పూర్తిగా నిండిన తర్వాత దిగువన ఉన్న తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరిగేది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి బళ్లారి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తున్నప్పటికీ, ఎగువన వర్షాలు కురవక పోవడంతో డ్యాంలోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో తుంగభద్ర డ్యాం వెలవెలపోతోంది. గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యాంలో దాదాపు 30 టీఎంసీలు నీరు ఉండటంతో పాటు ఇన్‌ఫ్లో కూడా భారీగా ఉండటంతో రోజు రోజుకు డ్యాంలో నీటి నిల్వ పెరిగి జూలై రెండవ వారంలోపు డ్యాం గేట్లు ఎత్తే పరిస్థితి ఏర్పడింది. ఎల్‌నినో ప్రభావంతో దుష్పరిణామం ప్రస్తుత ఏడాది వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు ఎల్‌నినో ప్రభావం వల్ల కూడా వరుణుడి రాకపై దుష్పరిణామం చూపడంతో డ్యాంలోకి తగినంత నీటి నిల్వ చేరుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ దయనీయంగా కనిపిస్తుండటంతో ఆయకట్టులో పంటలు సాగు చేసే రైతులు ప్రతి రోజు డ్యాం వైపు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తుంగభద్ర ఆయకట్టులో నీటి నిల్వ పెరగకపోతే బళ్లారి జిల్లాతో పాటు మూడు రాష్ట్రాల పరిధిలో 8 జిల్లాలకు చెందిన రైతులు ఆందోళనకరంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో కూడా ఎన్నో ఏళ్లు జూలై నెలలో డ్యాంలోకి నీరు వచ్చి చేరిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కనిపించడంతో వర్షాలు ఏమేరకు కురుస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సాగుకు రైతన్న సమాయత్తం మే, జూన్ ప్రారంభం నుంచి కురిసిన వర్షాలకు చాలా మంది ఆయకట్టు రైతులు దుక్కి కూడా దున్ని ఖరీఫ్‌కు సిద్ధమయ్యారు. పొలాలను దుక్కి దున్నడంతో విత్తనాలు, ఎరువులను కూడా రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవించే ఈ ప్రాంత రైతులు డ్యాంలో నీటి నిల్వ ఎప్పుడెప్పుడు పెరుగుతుందా? అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. కాగా డ్యాంలో 33 గేట్లు పూర్తిగా మార్చివేశారు. డ్యాంలో గేట్లు అధ్వాన్నంగా ఉండటంతో నిపుణుల సూచనలతో డ్యాం గేట్లు, చైన్లు మార్చి, కొత్త గేట్లను ప్రారంభించేందుకు తేదీ కూడా ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పొరుగున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులను కూడా నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తారనే వార్తలు వస్తున్నాయి. డ్యాం గేట్లను అధికారికంగా ప్రారంభించేందుకు ఈనెల 25వ తేదీని ప్రకటించారు. డ్యాం గేట్లను అన్నింటినీ సిద్ధం చేసినందుకు రైతుల్లో సంతోషం నెలకొన్నప్పటికీ వరుణుడు ముఖం చాటేసి డ్యాంలోకి నీటి నిల్వ పెరగకపోవడంతో ఖరీఫ్‌లో సకాలంలో పంటలు పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుందా, లేదా? అని అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. డ్యాంకు ఎగువన నదీ పరివాహకంలో ముఖం చాటేసిన వరుణుడు వర్షాల కోసం ఆయకట్టు రైతన్నల ఎదురు చూపులు డ్యాంలో పెరగని నీటి నిల్వ, రైతుల్లో ఆందోళన డ్యాంకు కొత్త 33 క్రస్ట్‌గేట్లు, చైన్ల ఏర్పాటు పనులు పూర్తి -
రైతులకు న్యాయం కోసం బళ్లారి బంద్
సాక్షి బళ్లారి: కుడితిని ప్రాంత రైతుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాను తక్షణం ఆపేసి భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని నిరసిస్తూ వివిధ ప్రజా సంఘాలు, రైతుల ఆధ్వర్యంలో బళ్లారి బంద్ నిర్వహించారు. గురువారం రైతు సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో కర్ణాటక ప్రాంత రైతు సంఘం, కుడితిని భూపోరాట సమితి, వివిధ కన్నడ సంఘాలు, రైతు కార్మికులు, సీఐటీయూ, ఏఐకేఎంఎస్ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన, ఆందోళన, ర్యాలీలు చేపట్టారు. గడిగి చెన్నప్ప సర్కిల్లో మానవహారం ఉదయం 6 గంటల నుంచి గడిగి చెన్నప్ప సర్కిల్ వద్దకు రైతు సంఘాల నాయకులు, కార్మికులు చేరుకొని మానవహారం నిర్వహించి, బైటాయించి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. 10 ఏళ్ల క్రితం కుడితిని ప్రాంతంలో 12,500 ఎకరాల భూములను వేలాది మంది రైతులతో తక్కువ ధరకే కొనుగోలు చేశారన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పుతామని భూములను కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశలు చూపించి భూములను ప్రభుత్వం లాక్కొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్దేశించిన, నిర్ణయించిన ప్రకారం ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పకపోవడంతో పాటు రైతులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. పరిశ్రమల ముసుగులో రియల్ ఎస్టేట్ దందా పలు స్టీల్ ప్లాంట్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చి ప్రస్తుతం ప్రభుత్వం కేఐఏడీబీ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందన్నారు. జిందాల్ సంస్థకు తమ భూములను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తక్షణం ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కుడితిని, వేణివీరాపురం, హరగినడోణి, కొళగల్లు, ఎర్రంగళి, సిద్ధమనహళ్లి తదితర గ్రామాలకు చెందిన రైతులచే స్వాధీనం చేసుకొన్న భూములను దశాబ్ధాలు గడిచినా అటు పరిశ్రమలను నెలకొల్పకుండా ఉండటమే కాకుండా రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపడం రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. జిందాల్ సంస్థకు భూములను కట్టబెడితే తాము సహించేది లేదన్నారు. న్యాయం చేయకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు రైతులకు ఎక్కువ పరిహారం అందించి తగిన న్యాయం చేయకపోతే పాలకులకు ప్రజలు, రైతులు బుద్ధి చెబుతారన్నారు. దశాబ్దాలు గడిచినా రైతులకు అన్యాయం చేస్తున్న పాలకులను ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. ఈసందర్భంగా బళ్లారిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సంఘాలు, ప్రజా సంఘాల నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తించారు. స్వచ్ఛందంగా పలు వ్యాపార సంస్థలు, అంగళ్లు, హోటళ్లు, మూసివేసి రైతులకు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తీవ్ర స్థాయిలో ఆక్రోశం వెళ్లగక్కారు. కార్యక్రమంలో కుడితిని భూపోరాట సమితి ప్రముఖులు యూ.బసవరాజు, జే.సత్యబాబు, గురుశాంత, కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన రైతు సంఘాల నాయకులు -
అభివృద్ధి పనులకు పెద్దపీట
రాయచూరు రూరల్: జిల్లాలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పిస్తామని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. గురువారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన యునైటెడ్ వే ఆఫ్ బెంగళూరు కార్పొరెట్ భాగస్వామ్యంతో రూ.20 కోట్లతో విద్య, ఆరోగ్య, తాగునీరు, మహిళా శిశు సంక్షేమ శాఖల అభివృద్ధి విషయంలో ఒప్పందాలను కుదుర్చుకున్నామన్నారు. జిల్లాలో 250 అంగన్వాడీ కేంద్రాల నవీకరణ, 1500 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఈసీసీఈ పథకం శిక్షణ శిబిరాలు, 24 సర్కారీ పాఠశాలల్లో స్పార్క్ సౌకర్యం, 13 చోట్ల ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, సర్కారీ పాలిటెక్నిక్ కళాశాల నవీకరణకు ప్రాధాన్యత కల్పిస్తారన్నారు. ప్రభుత్వం ప్రైవేట్, సముదాయ సంస్థల సహకారంతో పనులు చేపడతామన్నారు. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా హొసపేటె: దొంగతనాలు, ఇతర నేరాలను నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా కూడ్లిగి పోలీస్ సబ్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది కొత్త వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. రోడ్డుపై వెళ్లే ప్రజల కదలికలను గమనించేందుకు వీలుగా దుకాణాల ముందు అమర్చిన సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. జిల్లా ఎస్పీ మౌఖిక ఆదేశాల మేరకు కూడ్లిగి పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ నేతృత్వంలో ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారులు ప్రధాన రహదారిపై రాత్రి గస్తీ చేపట్టారు. వాహనాల నంబరు, రిజిస్ట్రేషన్ వివరాలను తనిఖీ చేయడం ద్వారా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనబడితే పోలీసులు వారిని విచారిస్తున్నారు. -
శాశ్వత కూరగాయల మార్కెట్‌కు వినతి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలను విక్రయించే వారికి శాశ్వత కూరగాయల మార్కెట్‌ను కల్పించాలని ఎం.ఈరణ్ణ కూరగాయల మార్కెట్ సంఘం డిమాండ్ చేసింది. బుధవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు వసీం మాట్లాడారు. కరోనా సమయంలో ప్రజలు, వినియోగదారుల అనుకూలం కోసం ఏర్పాటు చేసిన మార్కెట్‌ను కాదని నగరసభ ఆధ్వర్యంలో నడిచే మార్కెట్లో వ్యాపారాలు జరపడం కష్టమన్నారు. నూతనంగా జహీరాబాద్ మురికి వాడల ప్రాంతంలో శాశ్వత కూరగాయల మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ నగరసభ అదనపు కమిషనర్ సంతోష్రాణికి వినతిపత్రం సమర్పించారు. చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి హుబ్లీ: జిల్లాలోని కలఘటికి తాలూకా నీలసాగర చెరువులో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని హుబ్లీ సిద్ధారూఢ మఠం క్రాస్‌లోని శివశంకర కాలనీ నివాసి సుమీత్ బసవరాజ కోతంబరి(22) గా గుర్తించారు. మధ్యాహ్నం సుమారు 2 నుంచి 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది. కలఘటికి స్టేషన్లో మృతుడి తండ్రి బసవరాజ్ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. రైలు నుంచి పడి వ్యక్తి మృతి మరో ఘటనలో రైలు నుంచి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వేగంగా వెళుతున్న రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన సవణూరు రైల్వే స్టేషన్ దగ్గర చోటు చేసుకుంది. సుమారు 70 నుంచి 75 ఏళ్ల వయస్సుగల వ్యక్తి ఈ ఘటనలో మృతి చెందారు. అతడి ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే హుబ్లీ రైల్వే స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. కేపీఎస్‌లో పాఠశాలల విలీనం తగదు రాయచూరు రూరల్: రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కర్ణాటక పబ్లిక్ పాఠశాల(కేపీఎస్)ల్లో విలీనం చేయడం తగదని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు చెన్న బసవ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలను కేపీఎస్ల్లో చేర్చడాన్ని విరమించుకోవాలని ఒత్తిడి చేశారు. గ్రామీణ, నగర ప్రాంతాల్లో పాఠశాలలను విలీనం చేయడం సరికాదంటూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. విత్తనాలు, ఎరువుల పంపిణీకి డిమాండ్ రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని, వాటిని సక్రమంగా పంపిణీ చేయాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు. ఖరీఫ్‌లో ముందుగానే వానలు కురువడం జరిగిందని, రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండ చూడాలన్నారు. నకిలీ విత్తనాల బెడద నియంత్రణకు ముందుకు రావాలన్నారు. పెరిగిన ఎరువులు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, క్రిమి సంహారక మందుల ధరలు నింగినంటాయన్నారు. తుంగభద్ర ఎడమ కాలువలో పేరుకున్న పూడికను తొలగించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. అప్పు చెల్లించమన్నందుకు వ్యక్తి హత్య కోలారు: అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం రాత్రి నగరంలోని నిసార్ నగర్లో చోటు చేసుకుంది. బీడీ కాలనీ నివాసి అల్తాఫ్ (45) హత్యకు గురైన వ్యక్తి. ఇమ్రాన్ అనే వ్యక్తి అల్తాఫ్ నుంచి వడ్డీకి డబ్బును అప్పుగా తీసుకున్నాడు. ఈమధ్య తన డబ్బు వాపసు ఇవ్వాలని పదే పదే ఇమ్రాన్‌ను అల్తాఫ్ డిమాండ్ చేస్తుండడంతో విసిగిన ఇమ్రాన్ కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయాడు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం సంబంధీకులకు అప్పగించారు. -
మైసూరు జయదేవలో మృత్యుఘోష
మైసూరు: మైసూరు నగరంలోని మెటగళ్లిలో ఉన్న ప్రభుత్వ జయదేవ ఆస్పత్రిలో గత 24 గంటల్లో 11 మంది రోగులు మరణించినట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.సదానంద తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మృతుల పేర్లను వెల్లడించారు. సయ్యద్ ఆరీఫ్ పాషా (80), హరీష్ బీఆర్ (40), బాలశంకర్ (65), షంశున్నీసా(70), రాజు (54), నింగేగౌడ (70), హసీనాబాను (58), గోపాలరాజు (55), బైరోజీ రావ్ (80), సుహైల్ఖాన్ (43), నీలి (79) మృతులు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు చికిత్స పొందుతూ మరణించారు, వైద్యుల కొరత, నిర్లక్ష్యం లేదన్నారు. తమవారు ఆకస్మికంగా చనిపోయారని, ఇక్కడ వైద్య సౌకర్యాలు బాగాలేవని మృతుల బంధువులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఆస్పత్రిపై అందరి దృష్టి పడింది. చికిత్స అందించాం: డైరెక్టర్ రోగుల మరణం కేసుల్లో ఆస్పత్రికి మసి పూసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దినేశ్ అన్నారు. ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ 11 మంది రోగులు గోల్డెన్ అవర్ ముగిసిన తర్వాత వచ్చారని, అయినా ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు తెలిపారు. 11 మందీ గుండెపోటుతో వచ్చిన వారే, అందులోనూ బాగా వయసైనవారని అన్నారు. జీవన్మరణ పరిస్థితుల్లో ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. వైద్యుల కొరత లేదని, కొంతమంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తమ ఆస్పత్రికి ప్రతిరోజూ 600 నుంచి 800 మంది రోగులు వస్తారని, 20 శాతం మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారని ఆయన తెలిపారు. తమ వద్ద మొత్తం 40 మంది వైద్యులు ఉన్నారని చెప్పారు. 24 గంటల్లో 11 మంది మృతి బంధువుల ఆరోపణలు -
వజ్రాభరణాలు చోరీ
మైసూరు: ఇంటి కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలకు జొరబడిన దొంగలు రూ.24 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకుని పరారైన ఘటన మైసూరులోని దట్టగళ్లి నివాసి కోమల అనే వారి ఇంటిలో జరిగింది. కోమల రెండు నెలల క్రితం ఇంటికి తాళం వేసుకుని బెంగళూరులోని తన కుమార్తె ఇంటికి వెళ్లారు. మంగళవారం ఇంటికి వాపసు వచ్చి చూడగా కిటికీ అద్దం పగులగొట్టి ఉంది, అల్మారాలో పెట్టిన వజ్రం, ముత్యాల చైన్, బంగారు, వెండి ఆభరణాలు లేవు. కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
జయ జయ హనుమా..
కోలారు: ముళబాగిలు నగరంలోని పాళ్యలో ఉన్న పురాణ ప్రసిద్ద శ్రీ ఆది హనుమంతరాయ దేవాలయంలో నూతనంగా నిర్మించిన రాజగోపుర మహా సంప్రోక్షణ సందర్భంగా బుధవారం దేవాలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. సుప్రభాతసేవ, గోపురంపై రత్న న్యాసపూర్వక కళశస్థాపన, విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యాహం, కుంభారాధన, విశేష హోమాలు సాగాయి. హనుమంతరాయుని మూలవిరాట్టుకు పంచామృత అభిషేకం, విశేష పూల అలంకరణ చేశారు. భజన గీతాలు భక్తులను అలరించాయి. స్నేహితులకు చెప్పి.. ఎస్ఐ ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా పోలీస్ కార్యాలయంలోని డీసీఆర్బీ విభాగంలో ఎస్సైగా పని చేస్తున్న బసవరాజు హేరూర్ (35) ఆత్మహత్య చేసుకున్నారు. 2014 బ్యాచ్ ఎస్సై అయిన బసవరాజు కలబుర్గిలోని గంగా నగరలో ఉన్న తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకున్నాడు. ఘటనకు ముందు బసవరాజు తన స్నేహితులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. వారు వెంటనే బసవరాజు తండ్రికి కాల్ చేసి తెలిపారు. తండ్రి గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే మరణించాడు. బసవరాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలిసిరాలేదు. రాఘవేంద్రనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ సమస్యలా, ఉద్యోగంలో ఇబ్బందులా అనేది తేలాల్సి ఉంది. డెత్‌నోట్ ఏదీ దొరకలేదని తెలిసింది. సహజీవన ప్రియురాలి హతం ● బెంగళూరులో ఘోరం యశవంతపుర: యువతీ యువకుడు సహజీవనం చేస్తుండగా, యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్డీ అనుషా (20)ను ఆమె ప్రియుడు శరత్ (25) హత్య చేశాడు. ఇద్దరూ కూడా హాజన్ జిల్లాలోని సకలేశపురకు చెందినవారు. శరత్ వాటర్ ట్యాంక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు, ఆమె ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేదని సమాచారం. ఇన్‌స్టాలో పరిచయం పెరిగి 6 నెలల నుంచి ఒకే గదిలో సహజీవనం ప్రారంభించారు. అయితే 13వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆమెను తీవ్రంగా కొట్టి గొంతు పిసికి చంపి పారిపోయాడు. తరువాత మరుసటి రోజున తనకు తెలిసిన న్యాయవాదికి చెప్పాడు. పోలీసులు వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉండడం బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. అనుషా నేలపై విగతజీవిగా పడి ఉంది. ఇంటి నిర్వహణ, పనుల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని యజమాని మహాదేవ తెలిపాడు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. -
కొంపముంచిన అత్యాశ
రాయచూరు రూరల్ : జీవితంలో త్వరగా కోటీశ్వరులు కావాలనే అత్యాశతో నిరుద్యోగ యువకులు, మహిళలు ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పాస్తామంటూ మహిళలకు ఇంటి వద్దే ఉండి వర్క్ ఫ్రం హోం పేరుతో నెలకు రూ.25 వేలు సంపాదించవచ్చంటూ మోసం చేసి రూ.10 కోట్ల మేర నిధులు కాజేసి వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టి పరారైన దంపతుల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుమకూరు, మైసూరు, రాయచూరుల్లో ఏకకాలంలో ఎస్ఎల్వీ మహిళా మార్ట్ మార్కెటింగ్ పేరుతో జైలు వద్ద కార్యాలయం ప్రారంభించి టోపీ వేయడంతో మహిళలు, నిరుద్యోగ యువకులు వీధిన పడ్డారు. కొంత మంది బంగారు నగలు విక్రయించి మరీ పెట్టుబడి పెట్టారు. జిల్లాలో 250 మందికి పైగా మోసపోయారు. కమల, బొమ్మల రాజేష్ కోట్లాది రూపాయలను దండుకొని పరారయ్యారు. కమల, బొమ్మల రాజేష్‌ల ఆచూకీ కోసం పెట్టుబడి పెట్టిన వారంతా గాలిస్తున్నారు. మహిళా మార్ట్‌లో రూ.కోట్లలో లావాదేవీలు మహిళలు, నిరుద్యోగ యువతకు కుచ్చుటోపీ తుమకూరు, మైసూరుల్లోనూ నయవంచన -
25న టీబీ డ్యాం కొత్త గేట్ల ప్రారంభం
హొసపేటె: తుంగభద్ర డ్యాంకు సుమారు రూ.50.6 కోట్లు ఖర్చు చేసి 33 కొత్త క్రస్ట్‌గేట్ల అమరిక, గొలుసుల బిగింపు పనులు తుది దశకు చేరుకున్నాయి. కర్ణాటక, ఆంఽధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమక్షంలో ఈనెల 25న కొత్త గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. ఈ జలాశయాన్ని పెళ్లికూతురిలా అలంకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పటేల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కొందరు మంత్రులు, సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం వద్ద క్రస్ట్‌గేట్లకు గొలుసులను బిగిస్తున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. గొలుసుల అమరిక పనులు దాదాపు పూర్తి తుంగభద్ర డ్యాంలోని కొత్త 33 క్రస్గేట్లకు కొత్త గొలుసులను అమర్చే పని దాదాపుగా పూర్తయింది. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా డ్యాం కొత్త క్రస్ట్‌గేట్లు ప్రారంభిస్తారు. జలాశయం వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖుల రాక కోసం హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం సీనియర్ అధికారులు, వీవీఐపీలు, వివిధ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఒకేసారి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విజయనగర, కొప్పళ జిల్లా అధికారులు భారీ ప్లాట్‌ఫాం నిర్మాణంతో పాటు ఇతర పనులతో బిజీగా ఉన్నారు. హొసపేటె, కొప్పళ నుంచి టీబీడ్యాంకు వెళ్లే అన్ని రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి రానున్న కేంద్రమంత్రి హాజరు కానున్న మూడు రాష్ట్రాల సీఎంలు -
ఇక రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా
హుబ్లీ: జంట నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. చెత్త నిర్వహణ పాలికెకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా బహిరంగ స్థలాల్లో చెత్త పారవేయడం ఆగడం లేదు. దీంతో చెత్త వేసే వారికి బుద్ధి చెప్పడానికి పాలికె అధికారులు ముందుకు వచ్చారు. ఎవరు చెత్త పారవేస్తారో వారి ఇంటి ముందే చెత్తను పారవేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలే ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ధార్వాడలో నలుగురు నివాసుల ఇళ్ల ఎదుట చెత్తను పారవేసి బుద్ధి చెప్పారు. అంతేగాక వారి నుంచి రూ.16 వేల జరిమానా చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. హుబ్లీలో కూడా చెత్త పారవేసే వారిపై క్షుణ్ణంగా పహారా కాస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి వారి ఇంటి ఎదుటే చెత్త పారబోసి జరిమానా కూడా విధిస్తున్నారు. మొబైల్లో ఫొటో తీసి హెల్త్ ఇన్స్పెక్టర్కు షేర్ మొబైల్లో ఫోటో తీసి హెల్త్ ఇన్స్పెక్టర్కు పంపిస్తారు. ఈ సందర్భంగా చెత్తలో నివాసుల పేరున కాగితాలు, బిల్లులు కనిపిస్తాయి. వాటి ఆధారంగానే అడ్రస్‌ను కనుగొని వారి ఇంటి ఎదుటనే చెత్తను పారవేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి బాధ్యులను గుర్తించి జరిమానా విధిస్తున్నట్లు చెత్త నిర్వహణ విభాగం ఈఈ సంతోష్ యరంగళి తెలిపారు. స్థానికుల్లో జాగృతి కోసం ప్రయత్నిస్తున్నాము. తడి, పొడి చెత్త విభజనపై చైతన్యం కల్పిస్తున్నాం. చెత్తను వేరు పరచకపోతే అలాంటి వారిపై కూడా జరిమానా విధించడం, చెత్తను వారి ఇంటి ముందు పారవేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. రెండు సార్లు జరిమానా విధించి మూడో సారి బాధ్యుల వాహనాలు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. తొలిదశలో రూ.5 వేల జరిమానా విధింపు కుసుగల్ రోడ్డు, గదగ్ రోడ్డు, కార్వాడ రోడ్డు, కెళగేరి రోడ్లలో చెత్త రోడ్డుపై పారవేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి ముఖ్యంగా ఇంటి నిర్మాణ వ్యర్థాలను రోడ్డుపై పారవేసే వారికి తొలిదశలో రూ.5 వేలు, రెండో సారి రూ.10 వేలు జరిమానా విధిస్తాం. మూడో సారి మాత్రం వాహనాన్ని సీజ్ చేయడమే కాకుండా అలాంటి వారిపై కేసు కూడా నమోదు చేస్తామని సమగ్ర వివరాలను ఆయన ఏకరువు పెట్టారు. నాలుగు కేసుల్లో రూ.13 వేలు జరిమానా వసూలు చేశారు. 114 సీసీ టీవీ కెమెరాలు చెత్త పారవేసే వారిని డేగ కళ్లతో పసిగడుతున్నాయన్నారు. అంతేగాక హెల్త్ ఇన్స్పెక్టర్లు, పర్యావరణ శాఖ ఇంజనీర్లు, సూపర్వైజర్లు, కమ్యూనిటీ మొబిలైజర్లు వార్డుల్లో తిరుగుతూ ఉంటారని, చెత్త పారవేసే వారు కనిపించగానే జరిమానా విధిస్తారన్నారు. బహిరంగ స్థలాల్లో ఆగని చెత్త పారవేత పాలికెకు తలనొప్పిగా మారిన నిర్వహణ -
నేడే పరిషత్ ఫైట్
శివాజీనగర: విధానసభ కోటాలో జరగనున్న 7 విధానపరిషత్ స్థానాల ఎన్నికలకు అంతా సిద్ధమైంది. కాంగ్రెస్ నుంచి 5 మంది, బీజేపీ, జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. విజయం కోసం భారీ లెక్కాచారాలు సాగుతున్నాయి. హస్తం పార్టీ 5వ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కొన్ని ఓట్లు కావాలి, దీంతో జేడీఎస్ మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే క్రాస్ ఓటింగ్ భయంతో కాంగ్రెస్ నాయకులు తమ ఎమ్మెల్యేలను బిడదిలోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో ఉంచారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా దేవనహళ్ళి రిసార్టులో మకాం వేసినట్లు తెలిసింది. రిసార్టులో మాక్ పోలింగ్ రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. 5వ అభ్యర్థిని కూడా ఎగువసభకు పంపాలని పట్టుదలతో ఉంది. అదనపు సీటు కోసం కాంగ్రెస్ నుంచి వినయ్ కార్తీక్, జేడీఎస్ పార్టీ నుంచి గోవింద పోటీ పడుతున్నారు. చెల్లని ఓటు అనే సమస్య లేకుండా, ఎలా ఓటు వేయాలనే అంశంపై ఎమ్మెల్యేలకు సీనియర్లు బోధించారు. ఎమ్మెల్యేలకు విప్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కుతూహలం కలిగిస్తున్న ఎగువసభ ఎన్నికల పోలింగ్ గురువారం విధానసభలో జరుగుతుంది. అందరికీ ప్రతిష్టగా మారాయి. విధానసౌధ ప్రధాన కమిటీల గదులను తాత్కాలిక పోలింగ్ బూత్‌లుగా మార్చారు. ఎన్నికల కమిషన్ అధికారులు పరిశీలించారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. తప్పనిసరిగా ఓటేయాలని విప్‌ను కూడా జారీ చేశాయి. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన తక్షణమే ఓట్ల లెక్కింపు ఆరంభమవుతుంది. విధానసౌధ ఆవరణలో కోలాహలం మూడు పక్షాలు ఆధిక్యం కోసం పోరాటం భారీ భద్రత పోలింగ్‌కు పోలీసులు, ఎన్నికల కమిషన్ భారీ భద్రతను చేపట్టారు. పోలింగ్ గదుల పరిసరాల్లో ప్రత్యేక సీసీ కెమెరాలను అమర్చారు. ఎన్నికల ప్రక్రియను వీడియో రికార్డింగ్ తీస్తారు. ఎమ్మెల్యేలకు రహస్య ఓటింగ్ సదుసాయం కోసం రెండు పోలింగ్ బూత్‌లు ఏర్పాటయ్యాయి. పార్టీల తరఫున ఏజెంట్లు బూత్‌లలో ఉంటారు. పోలింగ్ వేళకు రిసార్టుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సౌధకు చేరుకొంటారు.7 స్థానాలకు 8 మంది పోటీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ విధానసౌధలో ఏర్పాట్లు పూర్తి రిసార్టుల నుంచి రానున్న హస్తం ఎమ్మెల్యేలు అదనపు సీటు ఎవరిదోననే ఉత్కంఠ -
ప్రమాదాల కట్టడికి కృషి చేయండి
హొసపేటె: జిల్లాలో ప్రమాదాల సంఖ్యను సున్నాకు తగ్గించడానికి అధికారులు తీవ్రంగా కృషి చేయాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి అన్నారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ పురోగతి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి ఆమె మాట్లాడారు. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై వరుస ప్రమాదాలు జరిగే ప్రమాదకర ప్రాంతాలను పోలీసులు, ప్రజా పనుల శాఖ సంయుక్తంగా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాహన రహిత రాకపోకలను సులభతరం చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని నివారించాలని ఆమె సూచించారు. యువతర భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌పై అధికారులు చాలా అప్రమత్తంగా, చురుకుగా వ్యవహరించాలన్నారు. జిల్లా సైబర్ క్రైం పోలీసు విభాగం సోషల్ మీడియాపై నిశితంగా నిఘా ఉంచాలన్నారు. జిల్లాకు వచ్చే ప్రధాన కొరియర్, పోస్ట్ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే, వాటిని తనిఖీ చేసి నిర్ధారించుకోవాలి. అకృత్యాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్చరించారు. జిల్లా ఎస్పీ జాహ్నవి, అదనపు జిల్లా కమిషనర్ ఈ.బాలకృష్ణ, అదనపు ఎస్పీ మంజునాథ్, డీఎస్పీ పీ.మురళీధర్, డిప్యూటీ డివిజనల్ ఆఫీసర్ వివేకానంద, ఆర్టీఓ దామోదర్, కాంట్రాక్టర్లతో సహా జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో అధికారులకు కలెక్టర్ సూచన -
హీటెక్కిన బిడది టౌన్షిప్
శివాజీనగర: బిడది టౌన్షిప్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టౌన్షిప్ అవసరమని డీకే సర్కారు చెబుతోంటే, రైతుల భూములు తీసుకోవద్దని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులపై ప్రభుత్వం రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర అన్నారు. బుధవారం బీజేపీ నాయకులు బిడదిలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఇక్కడి సర్కారు ఏర్పాటు చేస్తున్న టౌన్‌షిప్‌కు తమ భూములు ఇవ్వబోమని రైతులు వ్యతిరేకించడం తెలిసిందే. కాషాయ నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. విజయేంద్ర స్పందిస్తూ ‘ప్రభుత్వం 80 శాతం మంది రైతులు భూస్వాధీనానికి ఆమోదించారని చెబుతోంది. ఇక్కడ భూమి బీడు భూమి అంటున్నారు, బిడది టౌన్‌షిప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించారని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ప్రధాని ఆమోదించలేదు. రాష్ట్ర ప్రభుత్వం పిల్ల చేష్టలు చేస్తోంది’ అని ఆరోపించారు. అనేక పల్లెలకు వెళ్లి రైతులను మాట్లాడాము, వాస్తవాలు తెలియజేసేందుకు సిద్ధమయ్యామే గాని రాజకీయం చేయడం లేదన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులకు అండగా ఉంటాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానిది రైతు వ్యతిరేక ధోరణి అని ఆరోపించారు. ఇక్కడి ఎంతోమంది రైతులు టెంకాయ, వక్క, మల్బరీ తోటలు సాగు చేస్తున్నారు, ఇలాంటి సారవంతమైన భూమిని రైతులతో బలవంతంగా లాక్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. బెదిరిస్తున్నారు రాత్రివేళ గూండాలు ఇళ్లకు వచ్చి బెదిరిస్తున్నారని కొందరు రైతులు నేతలకు చెప్పారు. తమ ప్రాణాలైనా ఇస్తాం, భూమిని విడిచిపెట్టబోమని తెలిపారు. విజయేంద్ర మాట్లాడుతూ సీఎం డీ.కే.శివకుమార్‌కు రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే చాలా చోట్ల స్థలముంది. ఇక్కడ చిన్నరైతులు బతకాలి. ఇందులోకి మోదీ పేరును ఇక్కడ లాగడం డీకే శివకుమార్‌కు సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సీనియర్లు ఆర్.అశోక్, చలవాది నారాయణస్వామి పాల్గొన్నారు. ఆ గ్రామాల్లో బీజేపీ నేతల పర్యటన రైతుల భూములను లాక్కోవద్దని డిమాండ్ -
ఇళ్ల పట్టాలు అందించాలి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు భూమి, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం డిమాండ్ చేసింది. అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు వీరేష్ మాట్లాడారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు కేటాయించి, భూమి లేని పేదలకు పట్టాల పంపిణీతోపాటు భూములు కేటాయించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతూ అదనపు జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
బాలునిపై శునకం దాడి
● యజమానిపై ఫిర్యాదు బనశంకరి: బాలునిపై రాట్‌వీలర్ శునకం దాడిచేసిన ఘటన బెంగళూరు మహదేవపురలో జరిగింది. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 12 ఏళ్ల బాలుడు సైకిల్‌పై వెళుతుండగా, శ్యామ్ అనే వ్యక్తికి చెందిన రాట్‌వీలర్ జాతి కుక్క బాలున్ని వెంటాడి తొడ భాగంపై కరిచింది. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్దానికులు చేరుకుని కుక్కను దూరంగా తరిమి బాలుడిని కాపాడారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్ప అందిస్తున్నారు. బాలుని తండ్రి విపిన్, కుక్క యజమాని శ్యామ్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడే కుక్కను రెచ్చగొట్టాడని యజమాని దబాయించాడన్నారు. కాగా, రాట్‌వీలర్ కుక్క దుందుడుకుగా దాడులు చేస్తుందని అనేక దేశాలలో దానిని పెంచుకోవడాన్ని నిషేధించారు. బెడ్‌పై బొమ్మకు దుప్పటి కప్పి..బనశంకరి: సినిమాలలో హీరోయిన్లు చేసిన మాదిరిగా, బెడ్‌పై బొమ్మను నిద్రపోయినట్లు అమర్చి యువతి ఇంట్లో నుంచి పరారైంది. ఈ ఘటన చిక్కమగళూరు కొప్ప తాలూకా కుంచూరు గ్రామంలో జరిగింది. విద్యుత్‌శాఖలో జూనియర్ ఇంజనీర్ జగదీశ్ కుమార్తె జలన్య ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ క్లాస్‌కు వెళుతోంది. ఇటీవల తండ్రి తో కలిసి శృంగేరి దేవస్థానానికి వెళ్లి వచ్చింది. కానీ మరుసటి రోజున బెడ్ మీద బొమ్మకు దుప్పటి కప్పి, అక్కడ తాను ఉన్నట్లుగా సీన్ రూపొందించి, వెళ్లిపోయిందని తండ్రి హరిహరపుర ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కుమార్తె నిద్రపోతోందని, మధ్యాహ్నమైనా నిద్ర లేవలేదని వెళ్లి చూస్తే బొమ్మను చూసి షాక్ తిన్నట్లు తెలిపాడు. యువతి రహస్యంగా మొబైల్‌ఫోన్ వాడుతున్నట్లు తెలిసింది. సోషల్ మీడియా పరిచయాలతోనే వెళ్లిపోయినట్లు అనుమానాలున్నాయి. మహిళ పేరుతో రూ.15 లక్షల రుణం ● కొత్త రకం సైబర్ మోసం యశవంతపుర: స్మార్ట్‌ఫోన్ సిమ్‌ని 4జి నుంచి 5జికి ఉచితంగా అప్‌గ్రేడ్ చేసిస్తానని నమ్మించి సైబర్ నేరగాడు మహిళ మీద రూ.15 లక్షల అప్పు వేసేసిన ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. విక్టోరియా లేఔట్‌కు చెందిన 50 ఏళ్ల మహిళకు ఈ నెల 13న మధ్యాహ్నం 3గంటలకు అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. తాను టెలికాం కంపెనీ ఉద్యోగినని చెప్పాడు. మీ మొబైల్ సిమ్‌ను 4జి నుంచి 5జి కి అప్‌గ్రేడ్ చేయాలని చెప్పి పేరు, ఆధార్, బ్యాంకు ఖాతా తదితరాల వివరాలను తీసుకున్నాడు. చివరగా ఓటీపీ వస్తుందని చెప్పి అది తెలుసుకున్నాడు. ఇలా 30 నిముషాలలో ఆమె పేరుతో రూ.15 లక్షల ఆన్లైన్ రుణాన్ని మోసగాడు తీసుకున్నాడు. కొంతసేపటికి రుణం వివరాలు ఆమె ఫోన్‌కు వచ్చాయి, దీంతో లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.గుండెపోటుతో బాలుడు మృత్యువాత దొడ్డబళ్లాపురం: గుండెపోటుతో బాలుడు మృతిచెందిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణంలో బుధవారం జరిగింది. గుండె నొప్పి వచ్చిందని చెప్పి విలవిలలాడుతుండగా ఆస్పత్రికి తరలించేలోగానే చిన్నారి మరణించాడు. హిరియూరు బీజేపీ తాలూకా అధ్యక్షుడు అభినందన్ కుమారుడు వైష్ణవ్ (4), తనకు గుండెల్లో మంటగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తీసికెళ్లారు. పిల్లాడు అల్లాడిపోవడం చూసి వారు భయపడిపోయారు. దారిలోనే బాలుడు తుదిశ్వాస విడిచాడు. ఒకటో తరగతి చిన్నారి ఇక శివమొగ్గ జిల్లాలో సాగర తాలూకా హలసి గ్రామంలో మరో ఘోరం జరిగింది. సాయంత్రం ప్రభుత్వ పాఠశాల వదిలిన తరువాత ఒకటో తరగతి బాలుడు త్రిలోక్ జైన్ (6) ఇంటికి వెళ్లాలని బయట నిలబడి ఉన్నాడు. అయితే కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికులు, ఉపాధ్యాయులు అతని ముఖం మీద నీళ్లు చల్లగా స్పృహలోకి వచ్చాడు. తరువాత నీరు తాగించి కూర్చోబెట్టగా, టాయ్‌లెట్‌కు వెళ్తానని పాఠశాలలోని మరుగుదొడ్డికి వెళ్లాడు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు తీసి చూడగా బాలుడు చనిపోయి ఉన్నాడు. బాలునికి చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉన్నట్లు తల్లిదండ్రులు గౌతం జైన్, శిల్ప తెలిపారు. ఈ ఘటన గత శనివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసిపిల్లల గుండెపోటు మరణాలపై ఆందోళన నెలకొంది. -
ఆభరణాలు స్వాధీనం .. నిందితుడి అరెస్ట్
రాయచూరు రూరల్ : నగరంలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 40 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ఏప్రిల్‌లో ప్రశాంత్ కాలనీకి చెందిన వీరేష్ ఇంట్లో 25 గ్రాములు, శ్రీరామనగర్ కాలనీలో 15 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారని తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన దొమ్మర గోవిందరాజును అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు నగలు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.7.20 లక్షలుంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏడీఎస్పీ హరీష్, సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్ఐ మంజునాథ్, శారదలున్నారు. -
రక్తదానంపై జాగృతి జాతా
రాయచూరు రూరల్: జిల్లాలో రక్తదానంపై ప్రజల్లో జాగృతి పెంపొందించాలని రిమ్స్ అధికారి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం ఆరోగ్యాధికారి కార్యాలయం వద్ద జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, రాష్ట్ర ఎయిడ్స్ సంస్థ, ఆరోగ్య శాఖ, రిమ్స్, నవోదయ, రక్త నిధి కేంద్రాలు, లయన్స్ క్లబ్, ఏఎం దంత కళాశాల, రెడ్ క్రాస్, రోటరీ సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాల జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు వివరించాలన్నారు. ఇంటింటికెళ్లి అత్యవసర సమయంలో యువకులు రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రక్తదానం చేయాలని సూచించారు. జాతాలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, జిల్లా ఆరోగ్య శాఖాధికారి సురేంద్ర బాబు, వైద్యులు గణేష్, శాకీర్, నందిత, బసయ్య, సంధ్య, సరోజలున్నారు. -
ఇంకా వీడని అస్పృశ్యత
బొమ్మనహళ్లి: సమాజంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, కుల వ్యవస్థ, బానిసత్వం, అంటరాని తనం వంటివి ఇంకా కొనసాగుతున్నాయని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మనవరాలు రమ అంబేడ్కర్ విచారం వ్యక్తం చేశారు. చన్నపట్టణ నగరంలోని అంబేడ్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాలు నిర్వహించిన భీమోత్సవ్, ప్రతిభా పురస్కార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విద్య, రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని బోధించారు. కానీ రాజ్యాంగ ఆకాంక్షలు కొద్దిమందికే పరిమితమయ్యాయి. అంబేడ్కర్ సూత్రాలు, సిద్ధాంతాలు నిరుపయోగంగా మారాయి. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు సరైన విద్య అందడం లేదు అని పేర్కొన్నారు. ఇటువంటి లోపాలను సరిదిద్దడానికి ఓటు హక్కు అనే గొప్ప ఆయుధం ఉంది, ఓటు హక్కు, పోరాటం ద్వారా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ మనవరాలు రమ అంబేడ్కర్ -
విశ్వనగరికి చేయూత
బనశంకరి: సీఎం డీకే శివకుమార్‌తో బెంగళూరులోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భేటీ అయ్యారు. మంగళవారం విధానసౌధలో ఈ సమావేశం జరిగింది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ బెంగళూరును విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి మద్దతుగా ఉంటామని తెలిపారు. సీఎంతో సమావేశం సంతోషకరమన్నారు. బెంగళూరు నగర ప్రజలకు అవసరమైన సౌలభ్యాల గురించి చర్చించామన్నారు. సొరంగ మార్గాలు, ఫ్లై ఓవర్లు, రహదారులు, కారిడార్లు, పెరిఫెరల్ రింగ్‌రోడ్లు వంటి పథకాలు ఇందులో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో సురేశ్, గీతాంజలి కిర్లోస్కర్, విక్రం విశ్వనాథ్, మోహన్ సురేశ్ తదితరులు ఉన్నారు. -
వృద్ధాప్యంలోనూ మనశ్శాంతి కరువే
సాక్షి, బెంగళూరు: జీవితంలో శక్తి ఉన్నంత కాలం కష్టపడ్డారు, మలిసంధ్యలోనైనా నెమ్మదిగా, ప్రేమతో, గౌరవంగా బతకాలని వయోవృద్ధులు కోరుకుంటారు. కానీ చాలామందికి అది దురాశే అవుతోంది. పిల్లలు, ఇతర కుటుంబీకుల నుంచి నిర్లక్ష్యం, అవమానభారం, పైగా దాడుల వల్ల వయోవృద్ధులు కుంగిపోతున్నారు. 3 ఏళ్లలో 2,600 కేసులు బెంగళూరు నగర పోలీసు శాఖ, వయోవృద్ధుల సాధికారత డైరెక్టరేట్ భాగస్వామ్యంతో సీనియర్ సిటిజెన్స్ సంక్షేమాన్ని పర్యవేక్షించే ప్రభుత్వేతర సంస్థ ‘నైటింగేల్స్ మెడికల్ ట్రస్టు’ నిర్వహించిన సర్వేలో వృద్ధులపై జరుగుతున్న దాడులు, వేధింపులు బహిర్గతం అయ్యాయి. ఈ నివేదిక ప్రకారం 2023 నుంచి 2026 వరకు మూడేళ్లలో బెంగళూరులో 2,680 మౌఖిక, లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయి. ఫించన్ డబ్బులు, పదవీ విరమణ డబ్బులు, ఆస్తి పంపకాల కోసం సంతానం, ఇతర బంధువులే హింసకు, అవమానానికి పాల్పడినట్లు తెలిపారు. ఏటా కేసులు అధికం కుటుంబ సభ్యులే దాడులు చేశారని 2023–26 వరకు మొత్తం 1,847 ఫిర్యాదులు అందాయి. పొరుగువారు, అద్దె ఇంటి వారి నుంచి 669 వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. ప్రైవేటు సంస్థలు, సంఘాలు మోసం చేయడంపై 164 ఫిర్యాదులు అందాయి. ఇలా ఇంటా బయటా వృద్ధులకు రక్షణ, గౌరవం కరువైంది. ఏటా కేసులు పెరిగాయి. పెరుగుతోన్న వృద్ధులు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 60 ఏళ్ల పైబడిన వృద్ధులు 68 లక్షల మంది ఉన్నారు. ఇందులో బెంగళూరులోనే 9.11 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మరింత అధికమై ఉంటారు. ఇందులో సుమారు 30,459 మంది వృద్ధులు ఏకాకులుగా జీవిస్తున్నారు. నైటింగేల్స్ మెడికల్ ట్రస్టు సహాయవాణి–1090కి గత మూడేళ్లలో సహాయం కోసం 43,626 కాల్స్ వచ్చాయి. సంతానం, ఇరుగుపొరుగు దాడులు వృద్ధులకు దక్కని గౌరవం, భద్రత బెంగళూరులోనూ ఇదే ధోరణి -
సిట్ ఎస్పీ కారు పల్టీలు
● నలుగురికి గాయాలు యశవంతపుర: ధర్మస్థలలో అస్థిపంజరాల కేసును విచారిస్తున్న సిట్ ఎస్పీ ప్రయాణిస్తున్న కారు చార్మాడి ఘాట్‌లో ప్రమాదానికి గురైంది. ఎస్పీ సైమన్, సీఐ కుసుమధర్, డ్రైవర్, మరో కానిస్టేబుల్లు ఇన్నోవాలో వెళ్తున్నారు. చిక్కమగళూరు ఎస్పీ, సిట్ అధికారైన జితేంద్రకుమార్ దయామ ను కలవడానికి వెళుతుండగా బెళ్తంగడి మార్గంలో కారు పల్టీలు కొట్టి నుజ్జయింది. ఎస్పీ సహా నలుగురూ స్వల్ప గాయాల పాలయ్యారు. స్థానికులు వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఎస్పీ సైమన్ బెళ్తంగడి ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
కణేకల్లు: మండలంలోని ఆలూరు గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు గాయపడ్డారు. వివరాల్లోకెళితే... హైదరాబాద్‌లో నివాసముంటున్న భార్యాభర్తలు శోభ (43), తిప్పేస్వామి (48) వచ్చే నెలలో జరుగనున్న తమ కూతురు చందన పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు సోమవారం బళ్లారికొచ్చారు. బళ్లారిలో పెళ్లిపత్రికలు పంచాక మంగళవారం కారులో మాల్యం గ్రామానికొచ్చారు. కణేకల్లు, మాల్యంలలో పెళ్లి పత్రికలు పంచి కారులో బళ్లారికి తిరుగు ప్రయాణమవుతూ ఆలూరు వద్ద పైప్‌లైన్ పనులు చేస్తున్న హైడ్రాలిక్ క్రేన్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు శోభ, తిప్పేస్వామిలకు గాయాలయ్యాయి. శోభకు కాలు, చేయి ఫ్రాక్చరైంది. తిప్పేస్వామి స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు 108 సాయంతో వారిని కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స చేసిన అనంతరం వారిని అనంతపురం ఆస్పత్రికి రెఫర్ చేశారు. -
లోక కళ్యాణార్థం ఉపవాస దీక్షలు
రాయచూరు రూరల్: గాలి, వెలుతురు లేకుండా అన్న పానీయాలు లేకుండా లోక కళ్యాణార్థం 33 రోజులు ఉపవాస దీక్షలు చేపట్టిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. విజయపుర జిల్లా సింధగి తాలూకా అంతూర బెంతూరలో ఓ స్వామీజీ 33 రోజుల క్రితం మౌనదీక్షలు చేపట్టారు. రాచోటేశ్వర స్వామీజీ 33 రోజుల పాటు తాను కూర్చొన్న స్థలంలో ఇటుకలతో వాకిళ్లని మూసివేసి సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసి దానిపై ఆవు పేడతో అలికి ముగ్గులు, రంగులు వేయించారు. సోమవారం సాయంత్రం మౌన దీక్షకు తెరదించారు. గుహలో ఉన్న స్వామీజీని భక్తులు గుహను తొలగించి చూడగా స్వామీజీ మౌన దీక్షలో ఉండడం విజ్ఞానానికి సవాల్‌గా మారింది. ఈనేపథ్యంలో కుతూహలంతో స్వామీజీని చూడడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. -
ప్రసాద్ అబ్బయ్యకు కేబినెట్లో చోటు ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్‌లో రెండో సారి మంత్రివర్గ విస్తరణలో హుబ్లీ–ధారవాడ శాసన సభ్యుడు, దళిత నేత ప్రసాద్ అబ్బయ్యకు రాష్ట్ర మంత్రిగా చోటు కల్పించాలని చలువాది మహాసభ డిమాండ్ చేసింది. మంగళవారం ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సంచాలకుడు భీమన్న, కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా డీ.కే.శివకుమార్‌ను నియమించిన నేపథ్యంలో మంత్రి పదవిని దళితులకు కేటాయించాలన్నారు. 2023 ఎన్నికల సమయంలో ఉత్తర కర్ణాటకలో దళితుల ఓట్లు కావాలని అభ్యర్థించి ప్రధాన పదవులను మాత్రం అగ్రకుల నాయకులకు కేటాయించడం తగదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సన్నివేశంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శివకుమార్ మంత్రివర్గంలో 30 ఏళ్లుగా పార్టీకి సేవలు అందించిన ప్రసాద్ అబ్బయ్యను రాష్ట్ర మంత్రి పదవిని కేటాయించాలన్నారు. క్యాంటర్, ఆర్టీసీ బస్సు ఢీ ● ముగ్గురు దుర్మరణం ● విజయపురలో దుర్ఘటన రాయచూరు రూరల్ : కేఎస్ఆర్టీసీ బస్సు, క్యాంటర్ ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన విజయపురలో సంభవించింది. మంగళవారం సిమెంట్ బస్తాలతో వెళుతున్న కేఏ– 28 ఏఏ– 6792 నంబరుగల క్యాంటర్ వాహనం టైర్ ఆకస్మికంగా పేలింది. దీంతో అదుపు తప్పి చడచణ తాలూకా లోణ క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన కేఏ– 28 ఎఫ్– 2468 నంబరుగల బస్సును ఢీకొంది. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మరణించారు. క్యాంటర్ సిమెంట్ లోడుతో చడచణ వైపు వెళుతుండగా, ఆర్టీసీ బస్సు చడచణ నుంచి విజయపురకు వెళుతోంది. మార్గం మధ్యలో జరిగిన ఈ ఘటనలో బస్ డ్రైవర్ హనుమంత చలువాది(30), క్యాంటర్ డ్రైవర్ అశోక్ ఉటగి(25), భార్య రాధ(22) మరణించారు. బస్సులోని 10 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారిని విజయపుర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సోమేష్ వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అసత్య అట్రాసిటీ కేసులతో వేధింపులురాయచూరు రూరల్: జిల్లాలో అసత్యపు అట్రాసిటీ కేసులతో అగ్ర వర్ణాల వారిని దళిత నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని సింధనూరుకు చెందిన చెన్నబసప్ప ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో వీరప్ప, జాకోబ్, హనుమంతులు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా చెక్ బౌన్స్ కేసు విషయంలో నానారకాలుగా చిత్రహింసలు పెడుతూ అట్రాసిటీ కేసులను పెడతామని బెదిరిస్తున్నా సింధనూరు డివిజన్ పోలీసులు వారిపై చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కులం పేరుతో దూషిస్తూ భయపెడుతున్నా సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్‌కు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. విద్యార్థులు పాఠ్యేతర అంశాల్లో పాల్గొనాలిరాయచూరు రూరల్: సమాజంలో విద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర అంశాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని సమృద్ధ భారత చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు హిరేమట్ పేర్కొన్నారు. మంగళవారం బీసీఎం హాస్టల్లో దామోదర వీర సావర్కర్ జయంతి కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఆయన బాటలో ఉత్తమ నాయకుడుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ వీరేష్ నాయక్, భారత సేవా దళ అధికారి విద్యాసాగర్, రామయ్య నాయక్, నాగరాజ్, నరసణ్ణలున్నారు. -
హంపీ గత వైభవాన్ని చాటండి
హొసపేటె: పర్యాటక శాఖ ఎల్లప్పుడూ గైడ్ల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, విదేశీ భాషా శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని విజయనగర సామ్రాజ్యం, హంపీ కీర్తిని ప్రపంచ వేదికపై మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి సూచించారు. పర్యాటక శాఖ, హంపీ కన్నడ విశ్వవిద్యాలయం సహకారంతో మంగళవారం హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం భువన విజయ ఆడిటోరియంలో టూరిస్ట్ గైడ్ల కోసం నిర్వహించిన విదేశీ భాషా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. విదేశీ పర్యాటకులకు పరిశోధన ఆధారిత, ప్రామాణికమైన చరిత్రను మాత్రమే తెలియజేయాలన్నారు. మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా గైడ్లు భాష పైనే కాకుండా డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ బుకింగ్‌లు, టూరిస్ట్ యాప్‌ల వాడకంపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. పర్యాటక శాఖ ఎల్లప్పుడూ గైడ్ల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు. కలబుర్గి డివిజన్ పర్యాటక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్.తిప్పేస్వామి, కన్నడ హంపీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ పరమశివమూర్తి, హైదరాబాద్ ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తారకేశ్వర్, పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రభులింగ తళకేరి, హంపీ కన్నడ వర్సిటీ రిజిస్ట్రార్ విరుపాక్ష పూజారహళ్లి, విదేశీ భాషల కో–ఆర్డినేటర్ ఎస్.వై సోమశేఖర్, వివిధ జిల్లాల టూరిస్ట్ గైడ్లు హాజరయ్యారు. జిల్లాధికారిణి కవిత మన్నికేరి -
నృసింహునికి పానకాభిషేకం
కోలారు: ముళబాగిలు తాలూకాలోని కదరిపుర గ్రామంలో సుప్రసిద్ద కంబద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో నిజ జేష్ట మాసం మొదటి మంగళవారం సందర్భంగా విశేష పూజలు జరిపించారు. మూల విరాట్టుకు పానక అభిషేకం, పంచామృత అభిషేకం, అలంకారం, పూజలు సాగించారు. పెద్దసంఖ్యలో భక్తులు నృసింహున్ని దర్శించుకుని పావనులయ్యారు. గాయకుల భక్తి గాన కచేరీ ముగ్ధుల్ని చేసింది. బిడది టౌన్షిప్ అవసరం: మంత్రి మైసూరు: బిడది టౌన్షిప్ ఏర్పాటుపై జేడీఎస్ రాజకీయాలు చేస్తోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య ఆరోపించారు. మంగళవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ, బిడది టౌన్‌షిప్‌కు 80 శాతం మంది రైతులు భూమి ఇవ్వడానికి అంగీకరించారని, మరికొందరు ఎక్కువ పరిహారానికి ఒప్పుకున్నారని తెలిపారు. కొంతమంది మాత్రమే వ్యతిరేకించారన్నారు. వారి కోసం ప్రాజెక్టును వదులుకోలేమని ఆయన చెప్పారు. ‘బెంగళూరులో జనాభా పెరిగింది. చాలా మందికి స్థలాలు అవసరం. బెంగళూరు జనాభాను వికేంద్రీకరించాలి. బెంగళూరును విస్తరించడం కోసం టౌన్షిప్ కావాలి. మేము రైతులతో మాట్లాడి ఒక ప్రణాళికను రూపొందిస్తాము’ అని తెలిపారు. బిడది రిసార్ట్‌లో సీఎల్పీ భేటీ, ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహనకు హాజరవుతానని తెలిపారు. బాలలకు పాదరక్షల పంపిణీ మండ్య: తాలూకాలోని తుంబకెరెలోని సంచార జాతుల బడి పిల్లలకు తుమకూరుకు చెందిన త్రివర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షూ, చెప్పులను పంపిణీ చేశారు. ధనవంతులందరికీ పేదలకు సాయం చేయాలనే గుణం ఉండదన్నారు. అయితే దాతలు పీ.గోపాల్, కుమార్ల దానగుణం ప్రశంసనీయమని అందరూ అభినందించారు. లెక్చరర్ కల్లహళ్లి కేసీ లోకేష్, రిటైర్డ్ హెచ్ఎం మంచశెట్టరు, దేవరాజ్ కొప్ప , శృతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ సారథిగా ప్రహ్లాద్ జోషి?దొడ్డబళ్లాపురం: రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షున్ని ఎంపిక చేసేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. కొత్త అధ్యక్షునిగా సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని నియమించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. జోషి 2014 నుంచి రెండేళ్ల పాటు రాష్ట్ర బీజేపీ సారథిగా పనిచేశారు. నూతన సీఎంగా డీకే శివకుమార్ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ రాజకీయ లెక్కలు మారాయి. కేంద్ర మంత్రివర్గంలో త్వరలో మార్పులు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. కొందరిని తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. జోషిని కూడా తప్పించి రాష్ట్ర పగ్గాలు ఇవ్వవచ్చని ప్రచారం సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు విజయేంద్ర రెండేళ్లుగా తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతున్నారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నేతగా జోషి పేరును ప్రకటించే చాన్సుంది. బయటపడ్డ బసవేశ్వరాలయం ● అడుగంటిన కబిని మైసూరు: వర్షాలు లేక కబిని (కపిలా) నది ప్రవాహం క్షీణించింది. జిల్లాలోని హెచ్డీ కోటె తాలూకా బీచనహళ్లి సమీపంలోని కబిని జలాశయంలో నీరు అడుగంటి పోవడంతో ప్రాచీన బసవేశ్వరాలయం బయట పడింది. 2013, 2016లో కూడా ఇలానే ఎండిపోవడంతో ఆలయం గోచరించింది. ఈసారి రాష్ట్రంలో తీవ్ర కరువు, కాటకాలు సంభవించవచ్చన్న చర్చల నడుమ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఆయకట్టు రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. డ్యాం అడుగంటడంతో బ్యాక్‌వాటర్‌లోని ఆలయ రాతి మంటపాలు కనిపిస్తున్నాయి. స్థానికుల కథనం మేరకు 10 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. 2013లో కూడా మాంకాళమ్మ, భవానీ శంకర్ ఆలయాలు బయటపడ్డాయన్నారు. ఈ రెండు ఆలయాలు ఉన్న ఊరు కిత్తూరు, జలాశయం పోటు జలాల్లో మునిగిందన్న చారిత్రక అంశం వెలుగులోకి వచ్చిందన్నారు. బసవేశ్వరాలయంలో భక్తులు పూజలు చేసి కరువు కాటకాలు రాకుండా చూడాలని మొక్కుతున్నారు. -
వర్షాభావంపై సీఎం సమీక్ష
మేం డాక్టర్స్శివాజీనగర: కన్నడనాట నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంకా బలపడలేదు, చిన్నా చితకా వర్షాలు తప్ప ఆశించిన స్థాయిలో వానలు లేకపోవడంతో అటు రైతుల్లో, ఇటు ప్రభుత్వంలో గుబులు నెలకొంది. జలాశయాల్లో నీటి స్థాయి తగ్గిపోయింది. మునుముందు రోజుల్లో వర్షాలు పుంజుకోకపోతే తాగునీటికి కూడా అవస్థలు పడాల్సిన వస్తుంది. జూన్ తొలి వారంలో సాధారణం కంటే 21 శాతం తక్కువ వర్షమే కురిసింది. వర్షాభావం నేపథ్యంలో నూతన ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సోమవారం బెంగళూరులో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. వర్షం కొరత కొనసాగితే కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. బెంగళూరుతో పాటుగా రాష్ట్రంలో దక్షిణ భాగాలకు సాగు తాగునీరు అందించే కావేరి నది పరీవాహక ప్రాంతాలలోనూ 36 శాతం లోటు వర్షమే కురిసింది. అంతేకాకుండగా కోస్తా ప్రాంతంలో 41 శాతం వర్షం తక్కువగా ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 23 వరకు వర్షాభావం కొనసాగవచ్చు. ఆ తరువాతే వానలు వేగం పుంజుకునే అవకాశముంది. తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. -
దశాబ్దం గడిచినా ప్రజలకందని ఇళ్లు
రాయచూరు రూరల్: కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి మండలి(కేఐఏడీబీ) ఆధ్వర్యంలో యరమరస్ వద్ద 2013–14లో నిర్మించిన ఇళ్లు నేడు వికారంగా మారాయి. దశాబ్దం క్రితం 253 ఎకరాల్లో రూ.150 కోట్లతో 3,342 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన కేఐఏడీబీ అధికారులు వాటి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో నేడు ఆ నివాసాలు పాడుబడిన ఇళ్లుగా మారాయి. 255 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా కేవలం 60 మందికి మాత్ర మే ఇళ్లు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. వాటి నిర్వహణలో బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. 3,087 ప్లాట్లు ఖాళీ స్థలాలుగా మిగిలాయి. 255 ఇళ్లలో 60 ఇళ్లను పంచగా, మిగిలిన 195 ఇళ్లు భూత్ బంగ్లాలుగా మారాయి. ఎక్కడ చూసినా ముళ్ల కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగాయి. అధికారుల నిరక్ష్యంతో వేలాది ఇళ్ల స్థలాలు ఖాళీగానే మిగిలి పోయాయి. ఇళ్లు లేని, మధ్య తరగతి వర్గాలకు, బీపీఎల్ కార్డుదారులకు 50 ఽఽశాతం రాయితీతో స్థలాలు కేటాయించి అప్పగించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కేఐఏడీబీ అధికారుల దివ్య నిర్లక్ష్యం రూ.150 కోట్ల నిధులు బూడిద పాలు నాడు 253 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం -
బాలికలపై లైంగిక దాడి నిందితుని అరెస్ట్
రాయచూరు రూరల్ : మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని సింధనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సింధనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పీడబ్ల్యూడీ క్యాంప్‌లో నివాసం ఉంటూ 8, 9వ తరగతులు చదువుతున్న బాలికలపై బాబు(29) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. ఘటనపై సోమవారం బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన సీఐ వీరారెడ్డి మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. బేకరీ యజమానిపై దాడి ● పరారీలో ముగ్గురు నిందితులు హుబ్లీ: బేకరీకి వచ్చిన సందర్భంలో సదరు వినియోగదారుడికి వేగంగా సామాన్లను ఇవ్వక పోవడంతో ఆగ్రహించిన ముగ్గురు యువకులు బేకరీ యజమానిపై దాడి చేసిన ఘటన హెగ్గేరి బేకరీలో చోటు చేసుకుంది. శంకర దొడ్డమని దాడికి గురైన వ్యక్తి. నిందితులు అతడిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనా స్థలానికి పాత హుబ్లీ పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 20న మురికివాడ వాసుల సమస్యలపై సమావేశంహొసపేటె: గదగ్‌లో ఈ నెల 20న రాష్ట్ర స్థాయి మురికివాడ వాసుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తున్నట్లు విజయనగర జిల్లా స్లం విభాగం కో– ఆర్డినేటర్ యంకమ్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గదగ్‌లోని లయన్స్ క్లబ్లో రాష్ట్ర స్థాయి స్లం సమావేశం జరుగనుందని, ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సంబంధిత స్లం విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా మురికివాడల ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదన్నారు. ఈ మూడేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ పథకం అమలు కోసం రూ.6200 కోట్లు ప్రకటించగా, విడుదల చేసిన మొత్తం రూ.1000 కోట్లకు కూడా మించలేదన్నారు. మొత్తం 1.80 లక్షల ఇళ్లకు గాను కేవలం 81 వేల ఇళ్లు మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయని తెలిపారు. ఈ గృహ నిర్మాణ ప్రాజెక్ట్ నామమాత్రంగా మిగిలిపోయిందన్నారు. గదగ్‌లో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశానికి స్లం విభాగం రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేటర్ నరసింహమూర్తి, డివిజనల్ కో–ఆర్డినేటర్ జనార్ధన్, ఇంతియాజ్ తదితరులు హాజరవుతారని ఆమె తెలిపారు. టీచర్‌కు దేహశుద్ధి, సస్పెన్షన్● విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఫలితం సాక్షి, బళ్లారి: బెళగావి జిల్లాలోని చిక్కోడి తాలూకాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సింది పోయి నిత్యం లైంగికంగా వేధించడంతో పాఠశాల విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై విద్యార్థినుల తల్లిదండ్రులు దాడి చేశారు. తమపై ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అనుచితంగా తాకుతున్నాడని తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులతో విద్యార్థినులు వాపోయారు. దీంతో పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. డీడీపీఐ కూడా అక్కడి చేరుకుని వాస్తవాలను పరిశీలించిన తర్వాత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఓటరు జాబితాలను సవరించాలిరాయచూరు రూరల్: ఓటరు జాబితాలో సవరణలకు చర్యలు చేపట్టాలని రైతు సంఘం నేత వీరసంగయ్య పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమన మాట్లాడారు. ఓటరు జాబితాలో ఓటు హక్కు పరిరక్షణలో అర్హులైన వావరి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలన్నారు. అధికార పార్టీలు అక్రమాలకు పాల్పడితే సమష్టిగా అడ్డుకోవాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఓటర్లు పేర్ల తొలగింపు వివాదాస్పదంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. 15 మోటార్ సైకిళ్లు స్వాధీనం ● ముగ్గురు నిందితుల అరెస్ట్ రాయచూరు రూరల్ : నగరంలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ హాస్టల్ ముందు నిలిపిన వాహనాలను బిజినగేర ఆంజనేయ, కమలాపుర ఆకాష్, కార్తీక్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.11.29 లక్షలు ఉంటుందని అంచనా వేశారన్నారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్ఐ బసవరాజ్ నాయక్, శారదలున్నారు. -
ఆ రౌడీషీట్ల తొలగింపునకు బ్రేక్: హోంమంత్రి
శివాజీనగర: రాష్ట్రంలో 66 మంది రౌడీషీటర్లపై షీట్‌ను తొలగించే ప్రతిపాదనను నిలిపివేసినట్లు కొత్త హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, రౌడీషీట్లు తొలగించాలని సిఫార్సు వచ్చినవారిలో 12 మంది పేరుమోసిన రౌడీలు ఉన్నారని తెలిపారు. అలాంటివారిపై షీట్‌ను ఎలా తొలగిస్తారని బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను అడిగానన్నారు. ఈ జాబితాలో కొందరు బీజేపీ కార్యకర్తల పేర్లు ఉన్నాయని చెప్పారు. ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తూ ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్‌కు తాను రాసిన లేఖను ఖర్గే సమర్థించుకొన్నారు. కర్ణాటక మంత్రిగా తాను లేఖ రాశాను, సమాధానం ఇవ్వాల్సిందే అన్నారు. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్కు 127 శాఖలు ఉన్నాయని తెలిపారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు కోపగించుకుంటున్నారని అన్నారు. -
లైంగిక వేధింపుల నివారణ సమితి ఏర్పాటుకు సూచన
బళ్లారిటౌన్: పని చేసే స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నియంత్రణ, సురక్షిత వాతావరణం కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు సమితిని ఏర్పాటు చేయాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ ఆదేశించారు. ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ మహిళలు ఉద్యోగ వేళల్లో లైంగిక వేధింపుల నియంత్రణ నిషేధ, పరిహార చట్టం–2013 ప్రకారం పది మంది కన్నా ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, మండలి, నిగమ, స్థానిక సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఈ సమితులను తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పలు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఫ్యాక్టరీలు, వ్యాపార కాంప్లెక్స్‌లు, గార్మెంట్ సంస్థలు, బ్యాంకుల్లో కూడా తప్పనిసరి అన్నారు. 12 రోజుల్లోగా అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో అంతర్గత ఫిర్యాదు సమితిని ఏర్పాటు చేయాలన్నారు. అందులో సభ్యుల వివరాలను వార్షిక నివేదికను భర్తీ చేసి జిల్లా మహిళ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ డీడీ కార్యాలయానికి సమర్పించాలన్నారు. ఒక వేళ ఈ ఆదేశాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళా సిబ్బంది ఫిర్యాదు సమర్పించేందుకు తగిన వేదిక లేని కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, మహిళలకు సమస్యలు ఉద్భవిస్తే ఆయా కార్యాలయ బాధ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. -
కూలిన పైకప్పు పెచ్చులు, టీచర్‌కు గాయాలు
కోలారు: రాష్ట్రంలో పాఠశాలల భవనాలు అనేకం శిథిలావస్థకు చేరాయి. ఏటా ఖర్చు చేస్తున్న వేలాది కోట్ల రూపాయలు సద్వినియోగం అవుతున్నాయా, లేదా అన్నది సామాన్య ప్రజలకు తెలియడం లేదు. కోలారు నగరంలోని పాత మాధ్యమిక ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి ఉపాధ్యాయురాలు యశోద గాయపడింది. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పైకప్పు నుంచి పెద్ద మొత్తంలో పెచ్చలు ఊడి టీచర్ మీద పడడంతో ఆమె గాయపడింది. ఇతర టీచర్లు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. ఈ మధ్యనే రూ. 25 లక్షల వ్యయంతో పాఠశాలలో మరమ్మత్తులు చేశారు. ఇంతలోనే కూలిపోవడంపై ఉపాధ్యాయులు సహా స్థానిక ప్రజలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఏమాత్రం నాణ్యత లేకుండా, తూతూ మంత్రంగా పనులు చేసి, నిధులను స్వాహా చేశారని ఆరోపణలున్నాయి.అవినీతిని తుడిచి, అభివృద్ధి చేయండిదొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అవినీతి నిర్మూలన, బెంగళూరు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ ఐటీ పారిశ్రామికవేత్త మోహన్‌దాస్ పాయ్.. సీఎం డీకే శివకుమార్‌కి సలహా ఇచ్చారు. డీకే శివకుమార్ తమ మార్గదర్శకుడైన మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కంటే మెరుగ్గా పాలన అందిస్తారని ఆశిస్తున్నానన్నారు. బెంగళూరు కీర్తిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని కోరారు. అవినీతి కారణంగా బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి, ఫుట్‌పాత్‌లు కనుమరుగయ్యాయి, డబ్బులు తింటేనే పని జరుగుతోంది అని ఎక్స్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగారం కోసం.. చెవి కోసేశారు..మండ్య: మండ్య జిల్లాలోని హలగూరు వద్ద సాగ్య గ్రామంలోని పొలంలో పనిచేస్తున్న కూలీ శాంతమ్మను మంగళవారం ఉదయం ఇద్దరు దొంగలు కత్తితో బెదిరించి, బంగారు చెవిపోగులను లాక్కొని పారిపోయారు. ఆ దొంగలను సాగ్య–అంకనహళ్లి గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒక బాలుడు ఉన్నాడు. చెవి పోగులను లాక్కునేందుకు వీలుకాకపోవడంతో కత్తితో ఎడమ చెవిని కోయడంతో గాయమై ఆమె విలవిలలాడింది. పోలీసులు నిందితుల నుంచి చెవిపోగులు, 2 స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతమ్మను మలవళ్లి ఆసుపత్రికి తరలించారు. దొంగలు సమీప గ్రామవాసులేనని తెలిసింది. చిన్నారిపై వీధికుక్కల దాడి ● బెంగళూరులో దారుణం యశవంతపుర: బెంగళూరులో మరోసారి వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన ఘటన సహకారనగరలో జరిగింది. ఆదివారం సాయంత్రం సీక్యూఎల్ లేఔట్లో బాలిక సంగీత (4) అంగడిలో బిస్కెట్లు కొనుక్కోవడానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. పాప తల్లిదండ్రులు యాదగిరి జిల్లా చెందిన కట్టడ కూలీ కార్మికులు. ఇంతలో నాలుగైదు కుక్కలు బాలిక మీద పడి తీవ్రంగా కరిచాయి. బాలిక ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు కుక్కను తరిమివేసి చిన్నారిని కాపాడారు. లేకుంటే పెద్ద ఘోరమే జరిగేది. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు కాగా వైరల్ అయ్యాయి. ఆమె కాలు, చేతికీ, ముఖానికీ గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బెంగళూరు ఉత్తర పాలికె అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.భారీగా తూటాలు లభ్యం హుబ్లీ: బెళగావి పారిశ్రమికవాడలో పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగిస్తున్న వేళ ఆ చెత్తకుప్పలో 59 తుపాకీ గుండ్లు లభించాయి. కార్మికులు ఆ ప్రాంత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి సీఐ మహంతేష్, పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఇందులో 41 గుళ్లు ఒకే రకంగా ఉండగా, మరో 18 వేరేగా ఉన్నాయి. ఘటనతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి. వాటిని పారవేసింది ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు. -
తుంగభద్రలో యథేచ్ఛగా బోటింగ్
హొసపేటె: తాలూకాలోని పర్యాటక ప్రాంతం హంపీలో రుష్యమూక పర్వత సమీపంలో తుంగభద్ర నదిపై యథేచ్ఛగా తెప్ప(నాటు పడవ) ప్రయాణాలు కొనసాగించడం వల్ల గత ఏడాదిగా సణాపుర గ్రామ పంచాయతీ ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. అవసరమైన భద్రతా చర్యలతో పాటు, గ్రామ పంచాయతీ ఈ–టెండర్ ద్వారా బోటు యజమానుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, నిర్దిష్ట డిపాజిట్‌తో వేలం ద్వారా బోటింగ్ కోసం అనుమతిని జారీ చేయాలి. సణాపుర గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమనహళ్లి సమీపంలో ఉన్న రుష్యమూక పర్వతం వద్ద తుంగభద్ర నదిలో, హంపీలోని కోదండరామ ఆలయానికి పర్యాటకులను తరలించడానికి తెప్పలను ఉపయోగిస్తున్నారు. గత ఏడాదిగా గ్రామ పంచాయతీ నుంచి టెండర్ లేకుండానే ఒక వ్యక్తిని బోటింగ్ చేయడానికి అనుమతిస్తున్నారు. టెండర్ పిలవాలని, తెప్పను ఏర్పాటు చేసే పనిని అర్హత గల వ్యక్తికి అప్పగించాలని కోరుతూ చాలా మంది గ్రామ పంచాయతీకి లేఖలు రాశారు. టెండర్ సాకుతో అనధికారిక అనుమతి అయినప్పటికీ ఈ టెండర్ నెపంతో గత ఏడాదిగా అనధికారిక బోటింగ్‌కు అనుమతి ఇస్తున్నారు. దీని వల్ల గ్రామ పంచాయతీ లక్షల రూపాయలు నష్టపోయింది. తక్షణమే నిబంధనల ప్రకారం టెండర్ పిలిచి, ఈ–టెండర్ ద్వారా నిర్దిష్ట డిపాజిట్‌తో అర్హత గల వ్యక్తులను బోటింగ్ చేయడానికి అనుమతించాలి. అంతేకాకుండా సణాపుర గ్రామం వద్ద జలపాతాల సమీపంలో చట్టవిరుద్ధంగా బోటింగ్ నిర్వహిస్తూ పర్యాటకుల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతేకాక అవసరమైన భద్రతా చర్యలు లేకుండా అధిక ధరలు వసూలు చేస్తూ, పర్యాటకుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు. అందువల్ల గ్రామ పంచాయతీ పీడీఓ, తాలూకా పంచాయతీలు నిబంధనలకు అనుగుణంగా హనుమనహళ్లి, సణాపుర సమీపంలో బోటింగ్‌కు తక్షణమే అనుమతి ఇవ్వాలి. అదనంగా గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరేలా టెండర్ పిలవాలని స్థానికులు డిమాండ్ చేశారు. హంపీ వద్ద తెప్పలో విహరిస్తున్న పర్యాటకులు తుంగభద్ర నదిలో విహారానికి సిద్ధంగా ఉన్న తెప్పలు హంపీలో రుష్యమూక పర్వతం వద్ద జలవిహారం టెండర్ పిలవకుండానే సొమ్ము చేసుకుంటున్న వైనం సణాపుర గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి -
రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయండి
రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు విక్రయించిన జొన్నల డబ్బుల బకాయిలను వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఎమ్మెల్సీ బాదర్లి బసవనగౌడ డిమాండ్ చేశారు. సోమవారం బెంగళూరులోని ఆహార పౌర సరఫరాల శాఖాధికారితో చర్చించారు. ఆరు నెలల క్రితం రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా జొన్నలు విక్రయించిన రైతులకు ఇంత వరకు రైతుల బ్యాంక్‌ల ఖాతాలోకి డబ్బులు వేయలేదన్నారు. ఇప్పటికై నా నిర్లక్ష్యం చేయకుండా త్వరిత గతిన డబ్బులు చెల్లించాలని అధికారులను కోరారు. రైతుల బకాయి సొమ్ము చెల్లించాలని రాస్తారోకో రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు విక్రయించిన జొన్నల డబ్బులు ఖాతాలోకి జమ చేయాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. సోమవారం సింధనూరు తాలూకా యాపలపర్వి వద్ద రాయచూరు–సింధనూరు రహదారిని బంద్ చేసి చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అమీన్‌పాషా దిద్దిగి మాట్లాడారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యల నియంత్రణకు స్వామినాథన్ నివేదికను అమలు చేయాలన్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరలను ప్రకటించాలన్నారు. నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు అవకాశం కల్పించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్ ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయాలు జరిపేలా చూడాలన్నారు. ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. రామయ్య, తిమ్మన్న, చెన్నప్ప, వెంకటేష్, ఖాసీం, నరసింగ్రావ్లున్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలని కర్ణాటక విద్యుత్ ప్రసార మండలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బసవణ్ణ ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను డిమాండ్ చేశారు. సోమవారం బెంగళూరులోని కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యుత్ సరఫరా, పంపిణీ బాధ్యతలను టాటా పవర్ కంపెనీకి అప్పగించే ముందు కేపీటీసీఎల్ అధికారులతో చర్చించి, తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలన్నారు. బలరాం, చంద్రశేఖర్ దేశాయిలున్నారు. బాలల రక్షణ కమిటీని రద్దు చేయండి రాయచూరు రూరల్: జిల్లాలో నియమించిన బాలల హక్కుల రక్షణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని జనపర సంఘటన వేదిక డిమాండ్ చేసింది. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో వేదిక అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడారు. జిల్లాలో బాలల హక్కుల రక్షణ కమిటీ అధ్యక్షుడిగా సింధనూరు సత్యనారాయణ శెట్టి, సభ్యునిగా బీదర్ జగన్నాథ్‌లను నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. జయశ్రీ, శరణ బసవ, మారెమ్మ, తాయప్ప, మల్లేష్, రామణ్ణ, కిరణ్ కుమార్, నీలమ్మ, అమరమ్మలున్నారు. పెద్దలను గౌరవించాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో పెద్దలను గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ సిద్రామప్ప పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార, దివ్యాంగుల శాఖ, సీనియర్ సిటిజన్, రోటరీ క్లబ్, కృష్ణా తుంగ సంయుక్త ఆధ్వర్వంలో ప్రపంచ సీనియర్ సిటిజన్లపై వివక్ష అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. సీనియర్ సిటిజన్లపై దాడి చేసినట్లు కేసులు నమోదైన 60 నుంచి 90 రోజుల్లో వాటిని పరిష్కరించాలన్నారు. పెద్దల ఆస్తులను తీసుకుని వారిని క్షేమంగా చూడకపోతే వారి ఆస్తులను తిరిగి పొందడానికి వీలుగా చట్టం జారీ చేశారన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ, శరణమ్మ, సరస్వతి, పవన్ పాటిల్, లక్ష్మికాంతరెడ్డి, వీరభద్రప్ప, భాస్కర్, శ్రీదేవిలున్నారు. -
వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం ఖండిస్తూ నిరసన
హొసపేటె: వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణాన్ని ఖండిస్తూ కొప్పళ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యకర్తలు టైర్లకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆగస్టు 19న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విచారణకు అనుమతించాలన్న రాష్ట్ర గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని టైర్లకు నిప్పు పెట్టారు. టైర్లకు నిప్పు పెట్టి నిరసన ప్రకటిస్తున్న దృశ్యం -
గుండెపోటుతో ప్రముఖ కళాకారుడు మృతి
బళ్లారిటౌన్: నగరానికి చెందిన ప్రముఖ చిత్రలేఖన కళాకారుడు, ప్రముఖ హిందుస్తానీ గాయకుడు జాలిబెంచి దొడ్డబసవాచార్య గవాయి మనవడు మంజునాథ్ గోవిందవాడ(52) సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మంజునాథ్ లలితకళా అకాడమి అవార్డును పొందారు. ఆయన సైకత, తైల, జలవర్ణంలో చిత్రకళను ప్రదర్శించేవారు. హంపీ ఉత్సవాలతో పాటు వివిధ సభలు, సమావేశ వేదికల్లో స్వాగత బ్యానర్లను రూపొందించి ఆకట్టుకున్నారు. ఆయన మృతికి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, ప్రముఖులు ఎన్.ప్రతాప్‌రెడ్డి, టీహెచ్ఎం బసవరాజు, నిష్టిరుద్రప్ప, వీరభద్రగౌడ, అధికారులు చోరనూరు కొట్రప్ప, బీ.నాగరాజు, కళాకారులు హంద్యాళ్ పురుషోత్తం, శంకరబండె యల్లనగౌడ, ఆదోని వీణా, తిప్పేస్వామి, రమణప్ప తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 21న బోవి సమావేశం హోసూరు: హోసూరులో జూన్ 21వ తేదీ జరగనున్న క్రిష్ణగిరి జిల్లా బోవి సముదాయ సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యవర్గ కమిటీ నిర్వాహకులు కోరారు. హోసూరు చెరువు వీధి సమీపంలోని అమ్మన్ సెలబ్రేషన్ హాలులో జరుగుతుందని, పెద్దఎత్తున సముదాయ ప్రజలు పాల్గొని, తమ వర్గం అభివృద్ధిపై చర్చించాలని కోరారు. -
ఎలుగుబంటి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని హులికట్టి గ్రామంలో పంట పొలానికి వెళ్లిన ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. యంకప్ప(60) ఎలుగుబంటి దాడికి గురయ్యాడు. అడవి జంతువుల బారి నుంచి తన పంటను కాపాడుకోడానికి అతను పొలానికి వెళ్లినప్పుడు, అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తల, ముఖం, చేతులపై కరిచి తీవ్రంగా గాయపరిచింది. బావిలో పడి బాలుడు మృతి క్రిష్ణగిరి: బావిలో నంచి నీరు తేవడానికి తల్లితో కలిసి వెళ్లిన మూడేళ్ల బాలుడు బావిలో పడి చనిపోయిన ఘటన బేరికె వద్ద జరిగింది. వివరాల మేరకు.. సూళగిరి తాలూకా కడతూరుకు చెందిన వెంకటేష్ (25), భార్య చిత్ర. వీరికి లోకేష్ (3) అనే కుమారుడు, ఏడాదిన్నర కూతురు ఉన్నారు. వెంకటేష్ ఓ రైతు పొలంలో కుటుంబంతో కలిసి ఉంటూ కూలి పనులు చేసేవాడు. ఆదివారం సాయంత్రం చిత్ర బావి నుంచి నీరు తీసుకొచ్చేందుకు కొడుకుతో కలిసి వెళ్లింది. ఈ సమయంలో బాలుడు లోకేష్ ఆకస్మాత్తుగా కాలు జారి బావిలో పడిపోయాడు. ఎవరూ కాపాడలేకపోవడంతో అతడు చనిపోయాడు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
మరో చోట పెచ్చులూడిన పాఠశాల పైకప్పు
●కలబుర్గి జిల్లా ఆళంద తాలూకాలో ఘటన రాయచూరు రూరల్: ప్రభుత్వ కళాశాల పైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలైన ఘటన కలబుర్గిలో జరిగిన మూడు రోజులు గడవక ముందే మరోసారి జిల్లాలో పాఠశాల పైకప్పు ఊడిన ఘటన కలబుర్గి ఆళంద తాలూకా సంగొళిగిలో చోటు చేసుకుంది. ఆదివారం ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో ఉన్నఫళంగా సిమెంట్ కాంక్రీట్‌తో కూడిన పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆదివారం సెలవు కావడంతో విద్యార్థులకు గండం తప్పింది. గదుల నిర్మాణం నాసిరకంగా చేసినందువల్లే పైకప్పు పెచ్చులు ఊడిపతున్నట్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందనే ఆరోపణలున్నాయి. బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్ హుబ్లీ: 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఇక్కడి పాత హుబ్లీ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు బాలికను బలవంతంగా ఆటోలో కూర్చొబెట్టుకొని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి శవం మరో ఘటనలో ఓ వ్యక్తి శవం లభించింది. పాత హుబ్లీ గోకులధామ ఖాళీ స్థలంలో వ్యక్తి శవం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సుమారు 50, 55 ఏళ్ల వయస్సుగల వ్యక్తి శవం చెత్తచెదారం, ముళ్ల కంపల మధ్య దొరికింది. ఇతడి ఆచూకీ తెలిసిన వారు పాత హుబ్లీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసులు ఈ వ్యక్తి శవం పూర్వాపరాలపై దర్యాప్తు చేపట్టారు. యోగాతో ఆరోగ్య రక్షణ రాయచూరు రూరల్: మనిషి ఆరోగ్య రక్షణకు యోగాపై శ్రద్ధ అవసరమని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. సోమవారం ప్రజాిపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా జరిగే మూడు రోజుల శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. కార్యక్రమంలో శారద, తిమ్మప్ప, అయ్యప్ప, డాక్టర్ నవీన్, పూజాలున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం రాయచూరు రూరల్: కారు లారీని ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సాయంత్రం తెలంగాణలోని గుడేబల్లూరు వద్ద జరిగింది. ప్రమాదంలో జ్యోతి కాలనీలో నివాసముంటున్న శేఖరప్ప గౌడ(68) మరణించారు. కలబుర్గి శరణ బసవేశ్వర దేవస్థానాన్ని దర్శించుకుని తిరిగి రాయచూరుకు వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమస్యలు తీర్చాలని ధర్నారాయచూరు రూరల్: దేశానికి బంగారాన్ని ఉత్పత్తి చేసే హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం హట్టి బంగారు గనుల కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నానుద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి శఫీ మాట్లాడారు. వైద్యకీయ అనర్హత పథకాన్ని రద్దు పరచాలన్నారు. నూతన వేతనాల ఒప్పందం, ఆహార కిట్ల పంపిణీ, హెచ్ఆర్ఏ, ఎక్స్‌గ్రేషియా, 2025–26వ సంవత్సరానికి బకాయిలున్న వేతనాలు చెల్లించాలని, రిటైర్డ్ పథకాన్ని జారీ చేయాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ద్వి చక్రవాహనాలతో ర్యాలీ చేపట్టారు. అరగంటసేపు రాస్తారోకో చేశారు. వెంకోబ గౌస్, జమదగ్ని, రమేష్, బాబు, హనుమంతు, మునీర్, సాగర్, సంగయ్య రాజేశ్వరి, వెంకటేష్‌లున్నారు. -
మోదీ పాలనలో దేశాభివృద్ధి అమోఘం
బళ్లారి టౌన్: అభివృద్ధిలో తిరోగమనంలో ఉన్న భారతదేశాన్ని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలోకి తీసుకెళ్లారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటీ రవి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని మోకా రోడ్డులోని వాజ్‌పేయి లేఔట్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, విధాన పరిషత్ సభ్యుడు వైఎం.సతీష్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్ల పాలనలో భారత దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిందని, ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రత వంటి కీలక రంగాల్లో దేశం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధాన మంత్రుల్లో మోదీ మొదటి స్థానంలో నిలిచారన్నారు. ప్రజల వి శ్వాసాన్ని పొందుతూ పాలనలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఆ ర్థిక సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర ప్ర భుత్వం నిరంతరంగా కృషి చేస్తోందని కొనియాడారు. ఉగ్రవాదం, నక్సలిజంపై కఠిన వైఖరి ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని అణచివేసేందుకు మోదీ తీసుకుంటున్న చర్యలు యావత్ దేశ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు గత యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొన్న నిర్ణయాలే ప్రధాన కారణమన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగాలని, పరిశుభ్రమైన ఓటరు జాబితా రూపకల్పన ప్రజాస్వామ్యానికి అత్యవసరమన్నారు. కొన్ని సంస్థలు, పార్టీలు అశాంతిని సృష్టించేందుకు ఉద్యమాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉందా? లేదా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, బీజేపీ ప్రముఖులు కేఎస్ దివాకర్, హనుమంతప్ప పాల్గొన్నారు. ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతలో పురోగతి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి -
పొలంలో శివలింగం ప్రత్యక్షం
హుబ్లీ: కొప్పళ జిల్లాలో కుతూహలకరమైన, చమత్కారం కలిగించే ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారి పొలంలో శివలింగం లభించింది. అందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ శివలింగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌కు ఓ అపూర్వమైన, అరుదైన అవినాభావ సంబంధం ఉందన్న విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. కలలో కనిపించినట్లుగా పొలంలో శివలింగం లభించడంతో కొప్పళ జిల్లా ప్రజల క్షేమం కోసం ఈ అరుదైన లింగాన్ని సీఎం డీకే.శివకుమార్‌కు అప్పగించాలని సదరు వ్యాపారి సిద్ధమవుతున్నారు. అంతేగాక శివలింగం ప్రత్యక్షం అయిన స్థలంలో నాగుపాము కూడా ప్రత్యక్షం కావడం గమనార్హం. కలలో కనిపించిన మరుసటి రోజే కొప్పళ తాలూకా బసాపుర వద్ద ఉన్న వ్యాపారి వితీన్కుమార్కు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో తనకు దొరికే శివలింగాన్ని పరమ శివభక్తుడైన డీకే.శివకుమార్‌కు అప్పగించాలనే సదుద్దేశం కనిపించిందని చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కల వచ్చిన మరుసటి రోజు పొలంలో పని చేస్తున్న జడియప్ప అనే రైతుకు ఈ పవిత్ర శివలింగం ప్రత్యక్షం అయింది. శివలింగాన్ని సీఎంకు అప్పగించే యోచన అప్పటి నుంచి ఆ శివలింగాన్ని వ్యాపారి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. కలలో చెప్పినట్లుగానే వ్యాపారి వితీన్కుమార్ ఆ శివలింగాన్ని డీకే.శివకుమార్ ఇవ్వడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయంలో భక్తి కంటే కొప్పళ జిల్లా ప్రజలు, రైతుల శ్రేయస్సు ఉందని చెబుతున్నారు. బసాపుర ప్రాంతంలో బల్డోటా ఫ్యాక్టరీ విస్తరణ పనులను అడ్డుకోవాలన్నది జిల్లా ప్రజల డిమాండ్. ఈ నేపథ్యంలో పర్యావరణం, రైతుల శ్రేయస్సు కోసం శివలింగాన్ని అడ్డుగా పెట్టుకొని సీఎంకు విజ్ఞప్తి చేయడానికి వితీన్కుమార్ సిద్ధమవుతున్నారు. మొత్తానికి కొత్త సీఎం చేతుల్లోకి చర్చనీయాంశమైన శివలింగం త్వరలో చేరనుందని, ఫలితంగా పర్యావరణం నుంచి కొప్పళ జిల్లా ప్రజలకు కాస్తయినా ఉపశమనం లభిస్తుందని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదే చోట కనిపించిన నాగుపాము కొప్పళ జిల్లాలో కుతూహలకర ఘటన -
పారిశుధ్య లోపం.. నగరానికి శాపం
సాక్షి బళ్లారి: పేరుగొప్ప ఊరుదిబ్బ అంటే ఇదేనేమో. స్టీల్ సిటీగా పేరుగాంచిన బళ్లారి నగరంలో పలు రోడ్లలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగునీరు సర్వసాధారణంగా కనిపిస్తోంది. అసలే ఇటీవల వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మురుగునీరు డ్రైనేజీల్లో నుంచి రోడ్లపైకి వస్తున్నాయి. చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇంటింటికీ చెత్తసేకరణ వాహనాలు వెళ్తున్నప్పటికీ పలువురు రోడ్లలోనే చెత్తాచెదారం వేస్తున్నారని పాలికె అధికారులు పేర్కొంటున్నారు. అయితే వారానికి ఒక్కసారి కూడా చెత్తసేకరణ వాహనాలు రాకపోవడంతో రోడ్ల పక్కనే చెత్తాచెదారం పారవేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయా కాలనీల్లో జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లలో చెత్తాచెదారం విపరీతంగా వేయడం వల్ల పాదచారులకు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారికి, ఆయా కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డ్రైనేజీల్లో మురుగు నీటితో పాటు చెత్తాచెదారం చేరడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. రోడ్ల పక్కనే చెత్తాచెదారం నగరంలోని కణేకల్లు బస్టాండు నుంచి పెద్ద మార్కెట్‌కు వెళ్లే దారిలో నిత్యం రోడ్లలో చెత్తాచెదారం వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహానగర పాలికె సిబ్బంది, నగర పరిశుభ్రతపై దృష్టి సారించేందుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో నగరంలోని పలు వీధుల్లో చెత్తాచెదారం వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది కొరత సగానికి సగం తక్కువగా ఉన్నప్పటికీ నగర స్వచ్ఛతకు కృషి చేస్తున్నామని పాలికె అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో చెత్త సేకరణ వాహనాలు కాలనీల్లోకి రాకపోతే తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నగరంలోని ప్రధాన రోడ్లు మినహా పలు మురికి వాడల కాలనీల్లో చెత్తాచెదారంతో పాటు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండటంతో దోమల బెడద మరింతగా ఎక్కువ అవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు నగరంలోని రోడ్లలో వేస్తున్న చెత్తాచెదారాన్ని అరికట్టి డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు నీటిని ఎప్పటికప్పుడు పారేలా శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్ల పక్కనే చెత్తాచెదారం డ్రైనేజీల్లో నిలిచిన మురుగు -
బస్సు, బైక్ ఢీ.. బైకిస్టు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని చిలుమెహళ్లి తాండా సమీపంలో బస్సు, బైక్ మధ్య జరిగిన ప్రమాదంలో బైక్ చోదకుడు కరిబసప్ప (65) మృతి చెందగా, వెనుక కూర్చొన్న సదాశివకు తీవ్ర గాయాలయ్యాయి. సండూరు తాలూకాలోని మట్టజనహళ్లికి చెందిన కరిబసప్ప, సదాశివ వ్యక్తిగత పనిపై కూడ్లిగి తాలూకాలోని అప్పేనహళ్లి తాండాకు వచ్చి తమ గ్రామానికి తిరిగి వెళ్తుండగా స్వాగత కమాను సమీపంలో మట్టజనహళ్లి వైపు నుంచి సండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. బైక్ నడుపుతున్న కరిబసప్ప అక్కడికక్కడే మరణించగా, వెనుక కూర్చొన్న సదాశివ గాయపడ్డాడు. మృతుడు కరిబసప్ప కుమారుడు ఉపేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుడేకోటె పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుబ్రహ్మణ్య తెలిపారు. -
అడవి పందుల తరలింపుదారు అరెస్ట్
హొసపేటె: అడవి పందులను అక్రమంగా పట్టుకుని, తరలిస్తున్న వేటగాళ్లను గుర్తించి, ఇక్కడి ప్రాంతీయ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిందితులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా నుంచి గంగావతి వైపు పందులను తరలిస్తున్న వాహనం గురించి అందిన నిర్ధిష్ట సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సోమవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో ఒక వాహనాన్ని పట్టుకుని 24 అడవి పందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడు అర్జున్ రామ్‌సింగ్ షెనూరాను అరెస్టు చేశారు. ఏసీఎఫ్ ఏహెచ్.ముల్లా నేతృత్వంలో అటవీ అధికారి శివరాజ్ మేటి, డిప్యూటీ అటవీ అధికారి అబ్బుసామి గుట్టూరు, పరశురాం చక్రసాలి, సిబ్బంది రాఘవేంద్ర రాథోడ్, శివానంద తళవార, నీలప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో పాల్గొన్నారు. -
మంత్రముగ్ధం.. నాట్య ప్రదర్శన
బనశంకరి: ఉద్యాననగరిలో భరతనాట్యం, కథక్ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మైమరిపించాయి. ఆదివారం సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రలో భరతనాట్య ప్రదర్శనను దివ్య ప్రభాత్, దీక్షా జోషి, పాయల్, తాన్యా రక్తి కట్టించారు. దుర్గా వర్ణం, దుర్గా స్తుతి రూపకాలను ప్రదర్శించారు. ఆద్యా, అనన్య, స్వపాంతి కథక్ నృత్యంతో అలరించారు. లంచం... క్లర్కు అరెస్టుయశవంతపుర: గ్రూప్ ఇన్సూరెన్స్ చేయడానికి లంచం తీసుకుంటూ హావేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహకార సంఘాల ఉప రిజిస్ట్రార్ ఆఫీసులో సీనియర్ క్లర్కు అక్కమ్మ బిరాదార్ లోకాయుక్తకు చిక్కింది. రైతులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పి ఆమె రూ.3 వేల లంచం తీసుకొంటుండగా లోకాయుక్త అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. డీఎస్పీ మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మొక్కలే ఆధారం గౌరిబిదనూరు: ప్రకృతి సమతుల్యానికి మనం విరివిగా మొక్కలు నాటి చెట్లయ్యే వరకూ పెంచి పోషించాలని వక్తలు తెలిపారు. సోమవారం తాలూకాలోని కాటనకల్లు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పండ్ల నిచ్చే మొక్కలు, నీడనిచ్చే మొక్కలను వందకు పైగా నాటారు. దూరమవుతున్న మేఘాలను ఆకరించడానికి చెట్లు అవసరమన్నారు. విద్యార్థులు నిత్యం మొక్కలకు నీళ్ళు పోసి కాపాడాలని తెలిపారు. బ్యాంకు ఉద్యోగిని దుర్మరణం దొడ్డబళ్లాపురం: ట్రావెలర్ టెంపో వాహనం స్కూటర్‌ను ఢీకొన్న ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగిని చనిపోగా, మరో అమ్మాయి తీవ్రంగా గాయపడ్డ సంఘటన దొడ్డబళ్లాపురం అపెరల్ పార్కులో జరిగింది. కంటనకుంటకు చెందిన, తూబుగెరె గ్రామంలోని యూనియన్ బ్యాంక్‌లో పని చేసే అశ్విని (31) అక్కడే మృతి చెందగా సహన అనే యువతి తీవ్రంగా గాయపడింది. వీరిద్దరూ సోమవారం ఉదయం స్కూటర్‌పై అపెరల్ పార్కులోని శాంతి స్వీట్స్ ఫ్యాక్టరీ ముందు వెళ్తుండగా టీటీ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. దొడ్డ గ్రామీణ పోలీసులు టీటీ డ్రైవరుపై కేసు నమోదు చేశారు. అతి వేగం వల్ల ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
మైషుగర్లో అక్రమాల పర్వం
మండ్య: మైషుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆగడాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, టన్ను చెరకుకు రూ. 5 వేలు చెల్లించాలని రైతులు, సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సేవ్ మైషుగర్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల రైతు ప్రజా ఉద్యమం మొదటి దశ సోమవారం ప్రారంభమైంది. చిక్కమండ్యలో జరిగిన ర్యాలీలో కమిటీ నాయకులు మాట్లాడుతూ, మైషుగర్ ఫ్యాక్టరీని దొడ్డిదారిన ప్రైవేటీకరించారని ఆరోపించారు. ఫ్యాక్టరీ ఆదాయం ఆధారంగా టన్ను చెరకుకు రూ. 5,000 అందించడం సాధ్యమే. అయినప్పటికీ, అసమర్థ పరిపాలన, అవినీతి కారణంగా ఫ్యాక్టరీ యాజమాన్యం సకాలంలో చెరకును క్రషింగ్ చేయలేకపోయిందని దుయ్యబట్టారు. ప్రైవేట్ చక్కెర కర్మాగారాలు చెరకు రైతులను దోచుకుంటున్నాయన్నారు. స్థలాలు, వాహనాలతో పాటు ఫ్యాక్టరీలో అనేక రకాల అక్రమాలు జరుగుతున్నయని ఆరోపించారు. జిల్లా ప్రజాప్రతినిధుల మౌనం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. రైతులు పాటలు పాడుతూ నిరసన తెలిపారు. ప్రముఖ రైతు నేతలు, అన్నదాతలు పాల్గొన్నారు. చెరకు రైతులను ఆదుకోవాలని ధర్నా -
బూడిదైన బార్– రెస్టారెంటు
ఎలా జరిగింది? ఇది ఆకస్మికంగా చెలరేగిన అగ్ని ప్రమాదం. కరెంటు వైర్ల నుంచి మంటలు పుట్టి వ్యాపించగా, గ్యాస్ సిలిండర్ పేలడంతో పరిస్థితి అదుపు తప్పింది. పైగా బార్ రెస్టారెంటులో మండే పదార్థాలతో తయారైన సోఫాలు, కుర్చీలు, చెక్క సామగ్రి ఉండడంతో మంటల ధాటికి అద్దు లేకుండా పోయింది. ఆ సమయంలో సుమారు 30 మంది కస్టమర్లు, 15 మంది దాకా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మహిళా సిబ్బంది పై అంతస్తు నుంచి కిందికి రాలేక హాహాకారాలు చేయసాగారు. ఈ దుర్ఘటనలో ప్రకాష్, షాహిన్ అనే వలస కార్మికులు దుర్మరణం చెందగా, బార్ యజమాని ప్రీతంతో సహా 10 మంది వరకూ సిబ్బంది, వినియోగదారులు గాయాల పాలయ్యారు. స్థానికులు పలువురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. బార్ బయట భారీగా జనం గుమిగూడారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పిన తరువాత మృతదేహాలను వెలికితీశారు. లోపల మొత్తం సామగ్రి బొగ్గుల మాదిరిగా మారింది. పెద్దమొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. పోలీసు, ఫైర్ ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘోర అగ్ని ప్రమాదం మైసూరుతో పాటు ఇతర నగరాల్లోని బార్– రెస్టారెంట్లు, పబ్బుల్లో సురక్షిత చర్యలపై అనుమానాలను రేకెత్తిస్తోంది.మైసూరు: అది మైసూరులోని దత్త గల్లిలోని ఫాక్స్ డెన్ లిక్కర్ గ్యారేజ్ పేరు గల బార్ అండ్ రెస్టారెంట్, పబ్ సముదాయం. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయం.. కస్టమర్లు మద్యం తాగుతూ మజాగా ఉన్నారు. సీ్త్ర, పురుష వెయిటర్లు సప్లై చేస్తూ ఉండగా సంగీతంతో వాతావరణం హుషారుగా ఉంది. ఇంతలోనే హఠాత్తుగా మంటలు, పొగ చుట్టుముట్టాయి. ఏమి జరుగుతోందో అర్థం కాక కస్టమర్లు, సిబ్బంది ప్రాణభయంతో తలో దిక్కుకు పరుగులు తీశారు. అయితే ఒకటి, రెండు అంతస్తుల్లోని వారు కిందకు రావడానికి మెట్ల వద్దకు వెళ్తే అక్కడ మంటలు చెలరేగుతున్నాయి. దీంతో పై నుంచి ఆర్తనాదాలు చేయసాగారు. మరికొందరు మొండిధైర్యంతో కిందకు దూకేశారు. మైసూరులో భారీ అగ్ని ప్రమాదం ఇద్దరు సిబ్బంది మృతి 10 మందికి గాయాలు -
క్యాన్లకు డీజిల్ ఎందుకివ్వరు?
● రైతుల నిరసన చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురంలో కలెక్టర్ కార్యాలయం వద్ద భారత్ పెట్రోల్ బంక్‌లో రైతులు, డ్రైవర్లు నిరసనకు దిగారు. ట్రాక్టర్లు, టిల్లర్లను తీసుకువచ్చి బంక్ ముందు నిలబెట్టి ధర్నా చేశారు. వ్యవసాయ అవసరాల కోసం క్యాన్లను తీసుకువచ్చి డీజిల్ అడిగితే ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. రహదారి– 234 లో వాహనాలను అడ్డగించడంతో ఉద్రిక్తత నెలకొంది. బంక్ యజమాని సందీప్‌తో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి వాహనాలను అడ్డు తీయాలని కోరినా రైతులు వినలేదు. పొలం పనుల్లో ఉండగా ట్రాక్టర్లకు డీజిల్ అయిపోతే క్యాన్లు తీసుకుని వస్తామని, కానీ డీజిల్ పోసేది లేదని చెబుతున్నారని ఆరోపించారు. చివరకు పోలీసులు రైతులకు నచ్చచెప్పి రోడ్డును ఖాళీ చేయించారు.బెళగావిలో హెల్మెట్ అభియాన్ దొడ్డబళ్లాపురం: హెల్మెట్ ధరించని బైకిస్టులకు పెట్రోల్ విక్రయించరాదని కోరుతూ బెళగావి సిటీ పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే పెట్రోల్ బంకు యజమానులను లేఖ రాశారు. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఎన్ని రూల్స్ పెట్టినా బైకిస్టులు పట్టించుకోవడం లేదని కమిషనర్ ఈ నిర్ణయానికి వచ్చారు. పోలీసుల సమాచారం ప్రకారం బెళగావిలో గత 10ఏళ్లలో హెల్మెట్ ధరించని కారణంగా 2,282 రోడ్డు ప్రమాదాలు జరగగా 358 మంది మృతిచెందారు. 1,492 మంది గాయపడ్డారు. సిటీలో వారం రోజులపాటు హెల్మెట్ జాగృతి అభియాన్ చేపట్టనున్నారు. సోమవారంనాడు ఈ అభియాన్‌లో ఐజీపీ సందీప్ పాటిల్ హెల్మెట్ ధరించి బైక్ నడిపారు. హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు.వెనక్కి తగ్గిన అటవీ శాఖ● ఫుట్‌పాత్‌కు విముక్తి శివమొగ్గ: అటవీ శాఖ కార్యాలయ సిబ్బంది ఫుట్‌పాత్‌ని ఆక్రమించడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కొంత దూరంలో, ఆర్టీఓ కార్యాలయం పక్కనే ఉన్న కర్ణాటక అటవీ అభివృద్ధి సంస్థ ఫుట్‌పాత్‌ను ఆక్రమించింది. దానిపై పెద్ద బోర్డును పాతింది. దీని కారణంగా, పాదచారులు ఆ ప్రాంతంలో నడవలేకపోతున్నారు. ఈ సమస్యపై ప్రముఖ జర్నలిస్ట్ బి. రేణుకేష్ రాసిన వార్తలు ప్రజల్లో చర్చను రేకెత్తించాయి. ఆక్రమణను తొలగించాలని డిమాండ్ వచ్చింది. ట్రాఫిక్ పోలీసుల చర్యతో.. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దేవరాజ్, సిబ్బంది కలిసి ఆక్రమణ స్థలంలోని అటవీశాఖ బోర్డును తొలగించాలని నిర్ణయించారు. ఇది తెలిసి అటవీ సిబ్బందే ఆదివారం దానిని తొలగించినట్లు తెలిసింది. అటవీ సిబ్బందే కబ్జాలకు పాల్పడితే ఎలా అని జనం ప్రశ్నించారు. మంటల్లో గ్యాస్ గిడ్డంగి దొడ్డబళ్లాపురం: సిలిండర్ల గోడౌన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా సిలిండర్లు పేలిపోయి ఉవ్వెత్తున మంటలు లేచాయి. దావణగెరె తాలూకా హెచ్ కల్లహళ్లిలో శివారులో వక్క తోటలో శివకుమార్ అనే వ్యక్తి గోదాము ఉంది. మంటలు అంటుకుని 8 సిలిండర్లు పేలడంతో తీవ్రత అధికమైంది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిని దావణగెరె ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రక్తదాతలకు సన్మానంచిక్కబళ్లాపురం: భారతీయ రెడ్ క్రాస్ సంస్థ సేవలు శ్లాఘనీయం అని జిల్లా కలెక్టర్ జి.ప్రభు అన్నారు. నగరంలోని అంబేడ్కర్ భవనంలో రెడ్ క్రాస్ ఏర్పాటు చేసిన విశ్వరక్తదాన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.06 లక్షల మంది నుంచి రక్తదానం చేయించడం గొప్ప విషయమని అభినందించారు. ప్రతి ప్రభుత్వ శాఖ సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించాలని తాను సూచిస్తానన్నారు. ఎస్పీ కుశాల్ చౌక్సె మాట్లాడుతూ రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ రక్తదాతలను సన్మానించారు. -
శ్రీశంకరులే స్ఫూర్తిప్రదాత
మైసూరు: శంకరాచార్యులు ఒక దైవ స్వరూపులు, ఆయన హిందూమతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు, అని ఎమ్మెల్సీ సి.ఎన్. మంజగౌడ అన్నారు. శ్రీ శంకరాచార్యుల జయంతిని ఆదివారం సందర్భంగా కర్ణాటక సేనా ఆధ్వర్యంలో నగరంలోని శృంగేరి శ్రీ శంకర మఠంలో ఘనంగా నిర్వహించారు. శంకరాచార్యులు హిందూమతానికి పునరుజ్జీవం పోసిన ఆచార్యులని అన్నారు. ఆయన చాలా చిన్న వయసులోనే దేశమంతటా పర్యటించారు. నేటి విద్యార్థులు ఆయనలాగే మేధావులైన తత్వవేత్తలుగా ఎదగాలి. వారు బాగా చదువుకుని, పురోగమించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభావంత విద్యార్థులను సన్మానించారు. పెద్దసంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. పిడుగు పడి రైతు బలి మైసూరు: జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా, సంగరశెట్టహళ్లి గ్రామ శివార్లలో పిడుగుపాటుకు గురై ఒక రైతు మరణించాడు. ఎస్.టి.ఆనంద్ (60), పొలంలో పొగాకు పంటకు నీరు పెడుతుండగా, ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. ఆయన ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు. వెంటనే పెద్ద శబ్ధంతో చెట్టు మీద పిడుగు పడడంతో ఆనంద్ స్పృహ తప్పి పడిపోయాడు. గ్రామస్తులు అతడిని కె.ఆర్. నగర్‌లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడు. ఆనంద్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. శివమొగ్గలో రౌడీపై బుల్లెట్శివమొగ్గ: రౌడీషీటర్ నరసింహ హత్య కేసులో నిందితునిపై పోలీసులు కాల్పులు జరిపారు. హనుమంత్ అలియాస్ మధు (27), రౌడీషీటర్ నరసింహ హత్య కేసులో నిందితుడు. ఇటీవల అరెస్టు చేశారు, ఆదివారం తెల్లవారుజామున ఇన్స్పెక్టర్ హరీష్ పాటిల్ నేతృత్వంలో పోలీసులు శివమొగ్గ శివార్లలోని సుబ్బయ్య మెడికల్ కాలేజీ వెనుక ఉన్న డబుల్ రోడ్‌లోని హత్యాస్థలి పరిశీలనకు తీసుకువచ్చారు. ఈ సమయంలో అతడు బేడీలతో పోలీసులపై దాడి చేసి పరుగులు తీశాడు. దీంతో సీఐ కాల్పులు జరపగా మధు కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే పట్టుకుని ఆస్పత్రిలో చేర్చారు. భద్రావతి, శివమొగ్గ ప్రాంతాల్లో నేరాలు పెరగడంతో కఠిన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
బన్నేరుఘట్టలో గున్నల సందడి
బొమ్మనహళ్లి: బెంగళూరు బన్నేరుఘట్ట జూ పార్క్‌లో ఓ జీబ్రా, ఓ నీటి ఏనుగు పిల్లలకు జన్మనిచ్చాయి. కబిని అనే జీబ్రా ఆడ జీబ్రాకు జన్మనిచ్చింది. అలాగే దృశ్య అనే హిప్పో ఆడ పిల్లకు జన్మనిచ్చింది. రెండు పిల్లలూ ఆరోగ్యంగా ఉన్నాయని జూ సిబ్బంది తెలిపారు. ఇప్పుడు పార్కులోని జీబ్రాల సంఖ్య 11కి పెరిగిందని డైరెక్టర్ ఎ.వి.సూర్యసేన్ తెలిపారు. చీతాలు రెడీ అలాగే దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాలు బన్నేరుఘట్ట వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. గత వారం క్వారంటైన్ ముగియడంతో వాటిని ప్రజలు చూసేందుకు అందుబాటులో ఉంచారు. చీతాలు మన దేశంలో అంతరించిపోయాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని కూనో అడవిలో, ఇక్కడ బన్నేరుఘట్టలో మాత్రమే ఉన్నాయి. జీబ్రా, హిప్పోకు పిల్లల జననం -
కుక్కను తప్పించబోయి.. పోలీస్ దుర్మరణం
మైసూరు: వీధి కుక్క పోలీసు ప్రాణాలను బలిగొంది. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట పట్టణ శివార్లలో రోడ్డుపై ఉన్న కుక్కను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో బైక్ కిందపడిపోగా కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాలు.. కానిస్టేబుల్ గణేష్ (31) స్వస్థలం నంజనగూడు తాలూకాలోని సిద్దయ్యనహుండి కాగా, గుండ్లుపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. సిద్దయ్యనహుండి నుంచి గుండ్లుపేటకు డ్యూటీకి బైక్‌లో వెళ్తున్నాడు. గుండ్లుపేట పట్టణ శివార్లలో ఒక కుక్కను ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో కిందపడి స్పహ కోల్పోయాడు. స్థానికులు అతడిని మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కానీ కొంతసేపటికే మరణించాడు.ఆరోగ్య యోగం మైసూరు: మైసూరులో యోగా ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందిందని గణపతి సచ్చిదానంద ఆశ్రమం దత్త విజయానంద తీర్థ స్వామి అన్నారు. త్వరలో రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాల సన్నాహాల్లో ఊటీ రోడ్డులో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఆదివారం యోగా సాధనను నిర్వహించారు. ఈసారి యోగా దినోత్సవం రాష్ట్ర స్థాయిలో విజయవంతంగా జరగాలి, కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగా సాధనలో పాల్గొనాలని అన్నారు. సామూహిక యోగాభ్యాసం అందరి మధ్య సత్సంబంధాలను వృద్ధి చేస్తుందన్నారు. వయోభేదం లేకుండా ఆరోగ్యం, శారీరక చురుకుదనం కోసం ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలని తెలిపారు. ఈ సందర్భంగా వందలాది మంది యోగాసనాలను ఆచరించారు. వేకువనే ప్రమాదం ● చింతామణి వద్ద లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీ ● 10 మందికి గాయాలు చింతామణి: రోడ్డు పక్కన టైర్ పంక్చరై నిలిపి ఉన్న లారీని నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపోకు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున బెంగళూరుకు వెళ్తున్న బస్సుకు కర్ణాటకలో చింతామణి పట్టణం వద్ద మాడికెరె క్రాస్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 23 మంది ప్రయాణికులతో బస్సు బెంగళూరుకు వెళ్తోంది. అయితే డ్రైవర్ నిద్రమత్తుకు గురికావడంతో నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. పెద్ద శబ్ధం, కుదుపు రావడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం ఘోరం జరిగిందోనని ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్‌కు చిన్నపాటి గాయాలు తగిలాయి. ముగ్గురికి తీవ్రంగా, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరు కెఆర్ పురంవాసి చెన్నకేశవ (45), నెల్లూరువాసి యాబు (42), నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలవాసి సునీల్ (29) అనేవారికి తీవ్రగాయాలయ్యాయి. చెన్నకేశవ, యాబు పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. సునీల్ చింతామణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రయాణికులను అదే మార్గంలో వెళ్తున్న కడప ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు పంపించారు. చింతామణి రూరల్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
ఉచిత తాగునీటి కేంద్రం ప్రారంభం
కోలారు: నగరంలోని కేఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాష్ట్ర త్రిచక్ర వాహన సంఘం ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి కేంద్రం, ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నగర సభ నోడల్ అధికారి నవీన్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ యుద్ధం పరిణామంగా ఇంధన ధరలు పెరిగి ఆటో డ్రైవర్ల జీవనం కష్టంగా మారిందన్నారు. వంట గ్యాస్ ధరలు పెరగడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడకుండా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆటోడ్రైవర్లు స్వయం ప్రేరితంగా తాగునీటి యూనిట్‌ను ప్రారంభించి ఉచితంగా తాగునీటి వ్యవస్థ కల్పించడం సంతోషకరమన్నారు. అసంఘటిత కార్మిక పరిషత్ అధ్యక్షుడు కె.వి.సురేష్ కుమార్ మాట్లాడుతూ.. సుమారు 40 సంవత్సరాల పోరాట ఫలితంగా ప్రభుత్వ స్థాయిలో కర్ణాటక రాష్ట్ర వాణిజ్య వాహన డ్రైవర్ల సంక్షేమ మండలి ఏర్పాటైనట్లు వెల్లడించారు. రిజిష్టర్ అయిన ఆటో డ్రైవర్లకు సామాజిక భదతా పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డు పొందిన డ్రైవర్ల పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సౌలభ్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నగరసభ మాజీ సభ్యుడు డెకోరేషన్ కృష్ణ, ఎన్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
బిడది టౌన్‌షిప్‌తో రైతులకు మోసం
మండ్య: బిడది టౌన్షిప్ పథకం ఒక ప్రభుత్వ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. ఇది పూర్తిగా డబ్బు దోచుకోవడానికి వేసిన పథకం అని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆదివారం మండ్యలో విలేకరులతో మాట్లాడుతూ, బిడది టౌన్షిప్ దేశ ప్రయోజనాలకు మంచిది కాదు, దీనిని భూ మాఫియా, భూ దోపిడీదారులకు లబ్ధి చేకూర్చేలా రూపొందించారని అన్నారు. బ్రాండ్ బెంగళూరు అంటున్నారు, రోడ్లపై గుంతలు ఉన్నాయి, ట్రాఫిక్ కష్టంగా ఉంది, వాటిని సరిచేయకుండా బిడది రైతుల జీవితాలను తగలబెట్టడానికి వెళుతోందని సర్కారుపై మండిపడ్డారు. రైతుల భూములను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రైతులకు తాను అండగా నిలబడి న్యాయపోరాటం చేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఆర్కావతి సెటిల్మెంట్ కోసం సుమారు మూడు వేల ఎకరాల భూమిని నోటిఫై చేసిందని, ఆ తర్వాత వెయ్యి ఎకరాల భూమిని వదిలేసిందని విమర్శించారు. ప్రధాని, సీఎం ఏం మాట్లాడారో? బిడదిలో తోటలు ఉన్నాయి, పాడి పరిశ్రమ ఉంది, అలాంటి చోట టౌన్షిప్ వద్దని కుమార అన్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వారు ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు, అయితే, రాష్ట్ర రైతుల ప్రయోజనాలను బలిపెట్టడానికి సీఎం ప్రధానమంత్రి పేరును దుర్వినియోగం చేయకూడదు అని చెప్పారు. అదో పెద్ద కుంభకోణం కేంద్రమంత్రి కుమారస్వామి -
కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోండి
కోలారు: తాలూకాలోని నరసాపురం ఫిర్కా లక్ష్మీసాగర చెరువు మరువకు అడ్డంగా నిర్మించిన బ్రిడ్జి భారీ వర్షానికి కొట్టుకుని పోయింది. ఆదివారం ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మల్సీ ఎం.ఎల్.అనిల్ కుమార్ మరువ ప్రదేశాన్ని పరిశీలించారు. పనులు నాసిరకంగా చేయడం వల్ల ఇలా జరిగిందని ఇంజినీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి పక్కన రిటైనింగ్ వాల్ కూలి పోవడంపై మండిపడ్డారు. మరువ నీటికి మట్టి పూర్తిగా కొట్టుకు పోవడంతో కూలిందని అధికారులు చెప్పగా.. ఇంజినీర్ సమర్థనను ఎమ్మెల్యే మంజునాథ్ తోసిపుచ్చారు. ఇంత పెద్ద ప్రమాణంలో మట్టి కొట్టుకు పోతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. బ్రిడ్జి నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధ్యతా రహితంగా పనులు చేసిన కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. ఇకపై ఇలా జరిగితే అధికారులనే బాధ్యులను చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా త్వరగా మరమ్మత్తులు చేయాలన్నారు. కార్యక్రమంలో కోముల్ డైరెక్టర్ చంజిమలై రమేష్, డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఖాజికల్లహళ్లి మునిరాజు పాల్గొన్నారు. -
గ్యారంటీలతో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది
బనశంకరి: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదివారం బెంగళూరు జయనగరలో వికసిత భారత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు. నరేంద్రమోదీ పాలనలో దేశం అన్ని విధాలా పురోగమిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ ఆ ఆరోపణలు సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఇష్టానుసారం గ్యారంటీ పథకాలను అందించడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. దేశంలో ఆర్థిక వినాశనం జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు. హార్ముజ్ జలసంధిలో నౌకల సంచారానికి సమస్య ఉంది. అధిక డబ్బు చెల్లించే దేశాలకు చమురు సరఫరా అవుతోందని, నౌకలకు బీమా ఉన్నప్పటికీ యుద్ధకాలంలో ఉపయోగం లేదని ఆమె తెలిపారు. ఇన్ని సవాళ్లు నెలకొన్నా, దేశంలో ఎల్పీజీ గ్యాస్‌కు కొరత లేదని, రాహుల్‌గాంధీకి ఇది తెలియడంలేదని మండిపడ్డారు. భారత జీడీపీ 7.7 శాతానికి చేరడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు విజయేంద్ర, తేజస్వి సూర్య తదితరులు ఉన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ -
దాసర నాగేనహళ్లి..నేరేడు తోటలకు కేరాఫ్
బళ్లారి తాలూకాలోని దాసర నాగేనహళ్లి నేరేడు పండ్ల తోటలకు పెట్టింది పేరు. ఈ గ్రామంలోని రైతుల తోటల్లో నేరేడు చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం నేరేడు పండ్ల సీజన్ ప్రారంభం కావడంతో బాగా దిగుబడి వచ్చింది. వ్యాపారులు తక్కువ ధరకు నేరేడు కాయలను అడుగుతుండటంతో రైతులే నేరుగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. కిలో నేరేడు పండ్లను రూ.100 నుంచి రూ.150 చొప్పున బహిరంగ మార్కెట్లో విక్రయించి ఆదాయం గడిస్తున్నారు. నేరేడు పండ్లలో విటమిన్లు సి, ఏ, ఐరన్, కాల్షియం, పొటాషియం, యూంటి ఆక్సిడెంట్లు, సమృద్ధిగా ఉంటాయి. మధుమేహం (షుగర్) వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు దివ్య ఔపధంగా ఉపయోగపడుతుంది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో ప్రజలు కూడా తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. – సాక్షి, బళ్లారి: -
కమనీయం.. రామ పట్టాభిషేకం
కోలారు: కోలారు నగరంలోని శృంగేరి శారదా మఠంలో శ్రీరామ పట్టాభిషేకం, రామ తారక హోమం ఆదివారం భక్తిశ్రద్ధలతో, రమణీయంగా జరిగాయి. గోపూజతో సీతారామ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీరామచంద్రుల ఊరేగింపు, మహిళల కోలాట నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం నిర్వహించిన సీతారామ కళ్యాణోత్సవంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకను కనులారా వీక్షించి తరించారు. మహా నీరాజనం అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగింది. సునీల్ శర్మ, అప్పణ్ణశాస్త్రి, సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ వైద్య సేవలందించాలి
రాయచూరు రూరల్: నగరంలోని రాగిమానుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ప్రత్యేక ఆరోగ్య చికిత్స శిబిరాలను జాతీయ ఆరోగ్య అభియాన అధికారిణి నందిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో తరుచుగా వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. వైద్య శిబిరానికి దాదాపు 250 మంది హాజరయ్యారు. బీపీ, షుగర్, క్యాన్సర్, చికెన్‌గున్యా, మలేరియా, డెంగ్యూ, క్షయ తదితర వ్యాధులకు వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు పుష్పలత, సరోజ, నితీష్, తాలూకా ఆరోగ్య అధికారి పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సేవలు అనన్యం రాయచూరు రూరల్: ఉద్యోగ విరమణ సహజమే. అయితే ఉద్యోగులు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అభిప్రాయపడ్డారు. ఆదివారం నగరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన వెంకోబ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు వెంకోబ విద్యార్థుల భవిష్యత్తుకు నిరంతరం శ్రమించారని తెలిపారు. కార్యక్రమంలో సిద్దరూడ మఠాధిపతి నిజానంద స్వామిజీ, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, వెంకోబ, అమరేష్, పాగుంటప్ప తదితరులు పాల్గొన్నారు. మొక్కలతో పర్యావరణ పరిరక్షణరాయచూరు రూరల్: నగరంలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చి విరివిరిగా మొక్కలు నాటాలని నవోదయ కళాశాల ప్రిన్సిపాల్ రాజాశంకర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీరామలింగేశ్వర దేవాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో విధిగా మొక్కలు నాటి పరిరక్షించాలని సూచించారు. పచ్చదనం పెంపొందిస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. రక్తదాన శిబిరంరాయచూరు రూరల్: రక్తదాన శిబిరాలు, రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత సూచించారు. ఆదివారం ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. రక్తదానంతో మరొకరి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అయ్యప్ప, దండెప్ప బిరదార్, తిమ్మప్ప, శారద తదితరులు పాల్గొన్నారు. గుట్కా సీజ్, ఇద్దరి అరెస్టు హోసూరు: బెంగళూరు నుంచి కోయంబత్తూరుకు ద్విచక్రవాహనంలో గుట్కా తరలిస్తున్న ఇద్దరిని సిఫ్‌కాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూజువాడి చెక్‌పోస్ట్ వద్ద బైక్‌ను అడ్డగించి తనిఖీ చేయగా రూ. 24 వేలు విలువ చేసే 36 కేజీల గుట్కా పట్టుబడింది. ద్విచక్రవాహనంతో పాటు, కోయంబత్తూరు సమీపంలోని నల్లంపాళ్యంకు చెందిన శివకుమార్ (33), లింగరాజ్ (26)ను అరెస్టు చేశారు. కూలీపై దుండగుల దాడి హోసూరు: బేరికె సమీపంలో భవన నిర్మాణ కార్మికునిపై కొందరు దాడి చేశారు. హోసూరు తాలూకా బేరికె మసీపంలోని తట్టనపల్లి గ్రామానికి చెందిన ఆర్ముగం (50) బేల్దారీ పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కురుబరపల్లిలో పనికి వెళ్లాడు, మరుసటి రోజు ఓ మామిడి తోటలో తీవ్ర గాయాలతో పడి ఉండగా, స్థానిక ప్రజలు చూసి అతని భార్య పూంగొడికి తెలిపారు. ఆమె ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన భర్తను చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. పూంగొడి ఫిర్యాదు మేరకు బేరికె పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. -
అంగన్వాడీలకు పెరుగుతున్న ఆదరణ
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో అంగన్వాడీలకు ఆదరణ పెరుగుతోంది. ఎల్కేజీ, యూకేజీలో చిన్నారులను చేర్పించేందుకు తలిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 200 అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. గ్రామీణ ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, డొనేషన్లు చెల్లించే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో రాయచూరులో 96, లింగసుగూరు 232, మాన్వి 181, సిరవార 164, సింధనూరు 211, తుర్విహాళ్ 183, లింగసుగూరు–మస్కి పరిధిలో 441, దేవదుర్గలో 419 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సొంత భవనాలు ఉండి ఎంపిక చేసిన 200 కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. అందుబాటులో బోధన సామగ్రి ప్రస్తుతం రాయచూరు పరిధిలోని 32 కేంద్రాల్లో 313 మంది, లింగసుగూరు తాలూకాలోని 8 కేంద్రాల్లో 195 మంది, మాన్వి తాలూకాలోని 20 కేంద్రాల్లో 556 మంది, సిరవార తాలూకాలోని 15 కేంద్రాల్లో 395 మంది, సింధనూరు తాలూకాలోని 20 కేంద్రాల్లో 592 మంది, తుర్విహాళ్ తాలూకాలోని 25 కేంద్రాల్లో 457 మంది, లింగసుగూరు–మస్కి తాలూకాలోని 40 కేంద్రాల్లో 792 మంది, దేవదుర్గ తాలూకాలోని 40 కేంద్రాల్లో 753 మంది చిన్నారులు ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా పరికరాలు, ఆట బొమ్మలు, బోధన సామగ్రి అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలు పంపాం.. రాబోవు విద్యా సంవత్సరం (2027–28) నుంచి మరో 300 అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం స్పందించి తరగతుల ప్రారంభానికి అనుమతి లభిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత మంది చిన్నారులకు ప్రాథమిక విద్య అందుబాటులోకి రానుంది. – శరణమ్మ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి ఎల్కేజీ, యూకేజీలో చిన్నారులను చేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తి గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య -
వీధి కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి గ్రామంలో వీధి కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. హగరిబొమ్మనహళ్లికి చెందిన రాజప్ప గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి పొలంలో ఏర్పాటు చేసిన కంచెలోకి గొర్రెలను తోలి, అక్కడే నిద్రించాడు. అయితే అర్ధరాత్రి తరువాత వీధి కుక్కలు కంచెలోకి చొరబడ్డాయి. గొర్రెలపై దాడి చేయడంతో సుమారు 30 వరకూ మృతి చెందాయి. కష్టపడి పెంచిన గొర్రెలు మృతి చెందడంతో రూ.లక్షల్లో నష్టం వాటిలినట్లు రాజప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరాడు. వీధి కుక్కలను దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు. అదృశ్యం కేసుల ఛేదింపుబళ్లారి అర్బన్: గత ఏడాది నమోదైన వివాహిత, బాలిక అదృశ్యం కేసులను పోలీసులు చేధించారు. తాలూకాలో కొళగల్లు గ్రామానికి చెందిన 21 సంవత్సరాల వివాహిత గత ఏడాది ఏప్రిల్ 24న అదృశ్యమైనట్లు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన బళ్లారి మహిళా పోలీసులు.. వివాహిత బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. వివాహితను తీసుకొచ్చి భర్తకు అప్పగించారు. మరో కేసులో బళ్లారి నగరంలోని రామాంజినేయ నగర్‌కు చెందిన ఓ మైనర్ బాలిక అపహరణకు గురైనట్లు గత ఏడాది నవంబర్ 4న మహిళా పోలీసు స్టేషన్లో నమోదైంది. ఈ కేసును కూడా చేధించిన పోలీసులు బాలికను రక్షించారు. 17న ప్రజా చైతన్య ర్యాలీబళ్లారి అర్బన్: ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా కర్ణాటక లౌకిక పార్టీలు, ప్రజా సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 17న నగరంలో ప్రజాచైతన్య ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎద్దేళ్లు కర్ణాటక నాయకుడు సిద్దన్న తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక పత్రికా భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 17న సాయంత్రం 6 గంటలకు స్థానిక మోతీ సర్కిల్ వద్ద బసవన్న విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మోతీ సర్కిల్, రాయల్ సర్కిల్ వద్దకు చేరుకుని గాంధీ భవన్లో బహిరంగ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఓట్లు తొలగించే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గాదెప్ప, మాజీ బుడా అధ్యక్షుడు హుమయూన్ ఖాన్, సంగనకల్లు విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నియామకం కోలారు: అఖిల భారత వీర శైవ లింగాయత మహాసభ జాతీయ యువ విభాగం కార్యదర్శిగా కోలారుకు చెందిన స్పందనా సురేష్ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు ఈశ్వర ఖండ్రే ఆదేశాల ప్రకారం 14 మంది పదాదికారుల జాబితాను మహాసభ విడుదల చేసింది. కోలారులో డిజిటల్ మీడియా సంస్థ నిర్వహిస్తున్న స్పందన సురేష్ నియమితులు కావడంపై పలువురు హర్షం వ్యక్తంచేశారు. డీఐజీపీ పుట్టిన రోజు కోలారు: తాలూకాలోని కరోరగండనహళ్లి కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయలో డీఐజీపీ దేవరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు విశేష పూజలు జరిపారు. తరువాత బృహత్ కేక్‌ను కత్తిరించారు. ఈ కార్యక్రమంలో డిఐజిసి దేవరాజ్ పాల్గొన్నారు. వందలాది అభిమానులు ఆయనకు అభినందలు తెలిపారు. మాజీ ఎంపీ ఎస్ మునిస్వామి, కోముల్ డైరెక్టర్ చలువనహళ్లి నాగరాజ్, జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు జి సురేష్‌బాబు, కెయస్ గణేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. గంగమ్మ ఆలయంలో పూజలు కెజీఎఫ్: నగరంలోని గణేష పురంలో ఉన్న గంగమ్మ, దుర్గా దేవి దేవాలయంలో ఎంపీ ఎం.మల్లేష్ బాబు ఆదివారం విశేష పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అమ్మవార్లను దర్శించుకుంటే పశ్రాంతంగా ఉంటుందని తెలిపారు. 25 సంవత్సరాలుగా గంగమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకోవడం సంతోషించదగిన విషయమని కొనియాడారు. దేవాలయ అభివృద్ధికి సమితి సభ్యులు, ధర్మకర్తలు శ్రమిస్తున్నారని తెలిపారు. సర్వీస్ రోడ్డును తెరవాలి కెజీఎఫ్: రైతుల బండిదోవను (సర్వీస్ రోడ్డు) మూసివేసిన చైన్నె ఎక్స్‌ప్రెస్ హేవే ప్రాధికార అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాలూకాలోని క్యాసంబళ్లి ఫిర్కా వెంగసంద్ర గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని ఎక్స్‌ప్రెస్ హైవే పై ఉన్న సుందరపాళ్య టోల్గేట్ వద్ద ప్రతిఘటన నిర్వహించారు. బేతమంగల సిఐ జగదీష్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు వెంకటాచలపతి మాట్లాడుతూ.. జాతీయ యోజనా ప్రాధికార అధికారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి తక్షణమే మధ్య ప్రవేశం చేసి పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలన్నారు. రైతుల హితవును దృష్టిలో ఉంచుకుని మూసి వేసిన సర్వీస్ రోడ్డును తెరవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సుందరపాళ్య టోల్గేట్ వద్ద నిరంతరం ప్రతిఘటన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ త్యాగరాజ్, రైతులు అప్పాజిగౌడ, న్యాయవాది సుబ్రమణి తదితరులు పాల్గొన్నారు. -
మామిడికి మద్దతు ధర ప్రకటించాలి
శ్రీనివాసపురం: ధరలు తగ్గి తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రూ.10 మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం పదాదికారులు డిమాండ్ చేశారు. ఆదివారం ఏపీఎంసీ మార్కెట్లో సమావేశం నిర్వహించారు. సోమవారం శ్రీనివాసపురం మామిడి కాయల సమేతంగా రాష్ట్ర రహదారి రోజర్ పల్లి గేట్ వద్ద నుంచి రైతులు పెద్ద సంఖ్యలో కాలి నడకన బయలుదేరి కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతిఘటన నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణగౌడ మాట్లాడుతూ.. మామిడి పండ్లను అత్యధికంగా పండించే శ్రీనివాసపురంలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. దిగుబడి బాగున్నా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని తెలిపారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మామిడి ఉత్పాదనలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండగా.. మామిడి రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టనున్న ప్రతిఘటనకు మామిడి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర రైతు సంఘం నాయకుడు బంగావాది నాగరాజగౌడ, జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్ పాల్గొన్నారు. -
భర్తకు విషం ఎక్కించి... భార్య ఘాతుకం
దొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లా చిక్కోడి పట్టణంలో కలకలం రేపిన మాజీ జవాన్ సందీప్ మంజరగి (45) హత్య కేసులో నిందితుడు పుండలీక దొంబర్ సెల్ఫీ వీడియోలో నిజం ఒప్పుకున్నాడు. రిటైర్డు ఆర్మీ జవాన్ సందీప్ మంజరగి పేరున రూ.2 కోట్లు ఇన్సూరెన్స్ ఉండగా, భర్తను అడ్డు తొలగించి ఆ డబ్బును కొట్టేయడంతో పాటు ప్రియునిగా ఉండిపోవచ్చని సందీప్ భార్య కథ నడిపించినట్లు తెలిసి బంధుమిత్రులు, స్థానికులు నిర్ఘాంతపోయారు. సందీప్ భార్య సుమ (40), ప్రియుడు పుండలీక (26)ను యమకనమరడి, చిక్కోడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనైతిక సంబంధాల కారణంగా జరుగుతున్న జీవిత భాగస్వాముల హత్యలకు ఈ ఘటన మరోసారి దారుణ ఉదాహరణగా నిలిచింది. వివరాలు.. మార్చి 13న సందీప్, తన వద్ద పనిచేసే పుండలీకతో కలిసి బైక్‌పై జాతరకు వెళ్లి వస్తుండగా యమకనమరడి ఠాణా పరిధిలో ఘటప్రభ వద్ద ప్రమాదం జరిగి, సందీప్ ఓ మోస్తరుగా గాయపడ్డాడు. పుండలీక్కు చిన్న చిన్న గాయాలయ్యాయి. సందీప్ చిక్కోడిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 15న చనిపోయాడు. పెద్ద గాయాలేవీ లేకున్నా ఎలా చనిపోయాడని బంధువులు అనుమానపడ్డారు. సుమ ప్రవర్తనపై అనుమానం వచ్చిన సందీప్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి, సుమపై నిఘా పెట్టారు. అనుమానం బలపడడంతో సుమను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడు పుండలీక శనివారం సెల్ఫీని విడుదల చేశాడు. సుమ, తాను ఈ హత్యకు కారణమని పేర్కొన్నాడు.ప్రియుడు పుండలీక సెల్ఫీ వీడియోసైలెన్లోకి విషపు సూది గుచ్చి... బెళగావిలో మిస్టరీ వీడిన రిటైర్డు ఆర్మీ జవాన్ హత్య కేసు మహిళ, ఆమె ప్రియుని అరెస్టు నిందితుడు ఏం చెప్పాడు? సుమ తనను ప్రేమిస్తున్నానని చెప్పి ట్రాప్ చేసిందని, సందీప్‌ని సాగనంపి నీ ఇద్దరు పిల్లలు, నా ఇద్దరు పిల్లలు సంతోషంగా జీవిద్దామని చెప్పిందని, ఆ తరువాత ఆమె ప్లాన్ చేసి సందీప్‌ని చంపిందని పుండలీక సెల్ఫీలో చెప్పాడు. మరోవైపు పోలీసులు పూడ్చిపెట్టిన సందీప్ శవాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం జరపడంతో పాటు ఫోరెన్సిక్ పరీక్షల కోసం నమూనాలను సేకరించే పనిలో ఉన్నారు. భర్తను పాశవికంగా చంపిన సుమను, ఆమె ప్రియున్ని కఠినంగా శిక్షించాలని సందీప్ కుటుంబీకులు, బంధుమిత్రులు డిమాండ్ చేశారు.అనైతిక బంధం ఏర్పడి... సందీప్ ఆర్మీ నుంచి రిటైరయ్యాక ఓ హోటల్‌ను పెట్టాడు, అందులో పనికి పుండలీకను నియమించుకున్నాడు. ఈ సమయంలో సుమతో పుండలీకకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమకు అడ్డుగా ఉన్న సందీప్‌ను హతమార్చాలని అనుకునేవారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా జరిగిన బైక్ ప్రమాదంలో సందీప్ గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతని మీద రూ.2 కోట్ల బీమా పాలసీ ఉండడం, తమ ఆనందానికి అడ్డుగా నిలిచాడని భార్య సుమ కుట్రను రచించింది. మార్చి 15న సిరెంజిలో పురుగుల మందును తీసుకుని దానిని భర్తకు ఎక్కిస్తున్న గ్లూకోజ్ సీసాలోకి నింపింది. కొంతసేపటికి చనిపోయాడు. తరువాత అంత్యక్రియలను పూర్తి చేశారు. -
పిల్ల పులి కోసం గాలింపు
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా ముళ్లయ్యనగిరి ప్రాంతంలో వల చుట్టుకున్న ఓ పులి పిల్ల తిరుగాడుతోంది. పరిసర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండగా అటవీశాఖ అధికారులు తెలిపారు. అడవిలోని సీసీ కెమెరాల ద్వారా పులి చిత్రాలు లభించాయి. పులి నడుం వరకు వల చిక్కుకుంది. గాయాలైన ఆ పులిని నాలుగైదు రోజుల కింద అటవీ సిబ్బంది గుర్తించారు. అది జింకను కూడా వేటాడి తిన్నది. దానిని బంధించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. పండరవళ్లి, కొళగామె, ఏళునూరుఖాన్ గ్రామాల్లో గుబులు నెలకొంది. -
బిడది టౌన్షిప్ అవసరం
ఎరువుల కొరత రానీయొద్దు రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ మొదలైందని, రసాయనిక ఎరువులు, విత్తనాల కొరత రాకుండా జాగ్రత్తలు వహించాలని సీఎం శివ తెలిపారు. ఎరువుల విషయంలో శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండగా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. రాష్ట్రంలో కొన్ని జలాశయాల్లో నీటి కొరత నెలకొంది. అందుచేత తాగునీరు సమస్య కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బనశంకరి: కేంద్రమంత్రి హెచ్డీ.కుమారస్వామి మార్గదర్శనం ప్రకారం బిడది టౌన్షిప్ పథకాన్ని కొనసాగిస్తామని సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. బిడది టౌన్షిప్ గురించి ఢిల్లీలో ప్రధాని మోదీకి వివరించానని, ఆయన సమ్మతం తెలిపారని అన్నారు. బెంగళూరుపై జనం ఒత్తిడి అధికంగా ఉందని, అందుకే టౌన్షిప్ కావాలన్నారు. అవినీతి ఉండకూడదు కర్ణాటక అవినీతి రహితం కావాలని, ఎవరూ రూపాయి కూడా లంచం ఇవ్వకూడదనేది తన ఆశయమని తెలిపారు. మేము తప్పుగా చెప్పినప్పటికీ, మీరు అలా చేయరాదని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకురాకూడని తెలిపారు. ప్రతికార్యాలయంలో అధికారుల పేరు, ఫోన్ నంబరుతో బోర్డు ఏర్పాటుచేయాలన్నారు. లంచం అడిగితే ఈ నంబరుకు ఫిర్యాదు చేయాలనే వ్యవస్థను తీసుకు వస్తానన్నారు. ఒకేసారి అవినీతి నిర్మూలన సాధ్యం కాదని, ప్రయత్నిస్తూ ఉండాలని తెలిపారు. ఆ లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాలి గృహ లక్ష్మీ, గృహ జ్యోతి పథకాల అర్హులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. సమీప కార్యాలయాల్లో దరఖాస్తులను అందించాలన్నారు. ఉదయం 10 గంటలకు అధికారులు ఆఫీసులకు హాజరు కావాలన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభమౌతుందని, ఓటు కాపాడుకోవడానికి దరఖాస్తు నింపి, బీఎల్ఓలకు ఇవ్వాలని చెప్పారు. -
ఫీజు గొడవ.. విద్యార్థిని బలవన్మరణం
యశవంతపుర: కాలేజీలో ఫీజు కట్టడానికి తండ్రి ఇచ్చిన డబ్బులను తెలిసిన వ్యక్తికి ఇచ్చింది, తరువాత అతడు ఇవ్వకపోవడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరకన్నడ జిల్లా భట్కళ తాలూకా బెళకె గ్రామంలో జరిగింది. భట్కళలో బీసీఎ చదువుతున్న గాయత్రి (20)కి ఫీజు కట్టడానికి తండ్రి నాగరాజు నాయక రూ.10 వేలు ఇచ్చాడు. ఆమె తన స్నేహితుడు సంతోష నాయకకు ఆ డబ్బు ఇచ్చింది. ఫీజు కట్టే సమయం వచ్చింది, తిరిగి ఇవ్వాలని కోరగా సంతోష తన వద్ద లేవని చెప్పాడు. ఫీజు కట్టలేకపోవడంతో హాల్ టికెట్ మంజూరు కాలేదు. ఇది ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందని భయపడిన ఆమె బావిలోకి దూకి ప్రాణాలు తీసుకుంది. భట్కళ గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేశారు. -
బాలలకు బ్యాగుల పంపిణీ
బనశంకరి: బెంగళూరులో తెలుగు పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని పలువురు కోరారు. యలహంకలోని శ్రీ నీలకంఠేశ్వర ప్రాథమికోన్నత పాఠశాలలో శంకర్, సుష్మ దంపతులు, విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, మిఠాయిలు అందజేశారు. జీ.సుబ్రమణ్యం, వరదరాజు, హెచ్ఎం రెడ్డి రాణి పాల్గొన్నారు.బిడది రైతులతో కలిసి పోరాడుతా: కుమార దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకా బిడదిలో టౌన్షిప్ నిర్మాణం కోసం కాంగ్రెస్ సర్కారు పట్టుదలతో ఉండగా, ప్రతిపక్షాలు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. టౌన్‌షిప్‌కు తమ భూములు తీసుకోరాదంటూ పోరాటం చేస్తున్న రైతులకు కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి మద్దతు పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన బిడది టౌన్షిప్ కాంగ్రెస్ వారి పాలిట లూటీ స్కామ్‌గా మారిందన్నారు. బిడది టౌన్షిప్ డీకే శివకుమార్ కల కాదని, అది నా కల అని చెప్పారు. అయితే నా ఉద్దేశంలో టౌన్షిప్ నిర్మాణం వేరేగా ఉందని, కాంగ్రెస్ వారికి మాత్రం రియల్ ఎస్టేట్ దందా అన్నారు. డీకే శివకుమార్‌కి రైతులపై ఏ మాత్రం కనికరం లేదన్నారు. ప్రతీ పనికి ముందు సీఎం డీకే శివకుమార్ అజ్జయ్య స్వామి వద్ద కు వెళ్తారని, రైతులకు అన్యాయం చేయమని అజ్జయ్య చెప్పాడా అని ప్రశ్నించారు. టౌన్‌షిప్‌కి వ్యతిరేకంగా రైతులతో కలిసి తాను, జేడీఎస్ పోరాటం చేస్తామని తెలిపారు. చిన్నారి కూతుళ్లను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం మైసూరు: ఎంత కష్టం వచ్చిందో కానీ ఆ తల్లి కిరాతకురాలిగా మారింది. మైసూరు జిల్లాలోని సాలిగ్రామ తాలూకా, జవరేగౌడ కొప్పలు గ్రామంలో ఒక మహిళ ఇద్దరు చిన్నారి కుమార్తెలకు ఉరి వేసి హత్య చేసి, తాను ఆత్మహత్యాయత్నం చేసింది. అనిల్ కుమార్ భార్య ప్రియాంక (26), కూతుళ్లు ద్యుతి (3), దిశ (18 నెలలు). అనిల్, ప్రియాంకకు ఆరేళ్ల కిందట పెళ్లయింది. భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె పిల్లల గొంతుకు తాడు బిగించి ప్రాణాలు తీసింది. ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కొంతసేపటికి స్థానికులు గమనించి ఆమెను మైసూరులోని ఒక ఆసుపత్రిలో చేర్చారు, ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. పిల్లల మృతదేహాలను కృష్ణరాజ నగర ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఇంట్లో గొడవలే కారణం కావచ్చని అనుమానాలున్నాయి. సాలిగ్రామ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. రెండు ప్రమాదాల్లో ముగ్గురి మృతి బనశంకరి: బెంగళూరులోని మైసూరు రోడ్డులో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి , శనివారం తెల్లవారుజామున ప్రమాదాలు జరిగాయి. కెంగేరి ఆర్ఆర్.డెంటల్ కాలేజీ వద్ద అతుల్, గౌరీశంకర్ అనేవారు బైక్‌లో మైసూరు నుంచి బెంగళూరుకు వస్తూ ఘటనాస్థలిలో రోడ్డు డివైడరును ఢీకొనడంతో తీవ్ర గాయాలై చనిపోయారు. వీరిద్దరూ నర్సింగ్ విద్యార్థులని తెలిసింది. కెంగేరి వద్ద రెండు ద్విచక్రవాహనాలను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని సుఖదేవ్ (45) అనే వ్యక్తి చనిపోగా, ద్విచక్రవాహనాలలోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కెంగేరి ట్రాపిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఊపిరి వదిలి.. ప్రాణాలు నిలిపి
● యువ రైతు అవయవదానం మండ్య: బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స ఫలించక కోమాలోకి వెళ్లిన యువ రైతు అవయవాలను దానం చేయడం ద్వారా మృతుని తల్లిదండ్రులు మానవత్వం ప్రదర్శించారు. వివరాలు.. తాలూకాలోని క్యాతఘట్ట గ్రామానికి చెందిన గిరి గౌడ అలియాస్ రంజిత్ (32) ఈ నెల 11న బైక్‌పై వెళుతుండగా ఆలభోజనహళ్లి వద్ద మరో స్కూటరిస్టు వేగంగా ఢీకొన్నాడు. గిరి గౌడ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని మైసూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే బ్రెయిన్డెడ్లోకి చేరుకున్న గిరి గౌడ చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తేల్చారు. అవయవాలను దానం చేయాలని వైద్యులు కోరగా, అంత దుఃఖంలోనూ తల్లిదండ్రులు అంగీకరించారు. విధివిధానాలను పూర్తి చేసి అతని అవయవాలను తీసుకున్న తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం మధ్యాహ్నం గ్రామంలో గిరి గౌడ అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా కుటుంబ సభ్యుల మానవతను గ్రామస్తులు ప్రశంసించారు. రైతన్న ఉగ్రరూపం ● పరిహారం ఇవ్వలేదని దాడి దొడ్డబళ్లాపురం: ముంపునకు గురైన భూమికి పరిహారం ఇవ్వకుండా సతాయిస్తుండడంతో అన్నదాత ఉగ్రరూపం దాల్చాడు. విసిగిపోయిన బాధితుడు బీటీడీఏ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన సంఘటన బాగలకోటలోని నవనగరలో ఉన్న బాగలకోట టౌన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో జరిగింది. సఫాయి కర్మచారులకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలని దళిత సంఘర్ష సమితి ఆధ్వర్యంలో బీటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సమయంలో వారితో పాటు లోపలకు వెళ్లిన రైతు బసప్ప దొడ్డమని తనకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదంటూ హఠాత్తుగా చెప్పు తీసుకుని ఓ ఉద్యోగిని చితకబాదాడు. ఈ చర్యతో అందరూ అవాక్కయ్యారు. తరువాత మాట్లాడిన రైతు బసప్ప గత నాలుగేళ్లుగా ముంపునకు గురైన తన భూమికి కావాలనే పరిహారం ఇవ్వడం లేదని వాపోయాడు. గుంతను తప్పించబోయి.. మహిళ దుర్మరణం బనశంకరి: బెంగళూరులో గుంతల రోడ్ల సమస్య వర్షాలకు మరింత తీవ్రరూపం దాల్చింది. నీళ్లు నిలిచి గుంతలు కనబడక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. శనివారం ఉదయం మారతహళ్లిలో స్కూటర్లో కుమార్తెను కాలేజీకి తీసుకెళుతుండగా జరిగిన ప్రమాదంలో నల్లూరహళ్లి నివాసి కాంత (42) అనే మహిళ దుర్మరణం చెందింది. వివరాలు.. ఉదయం 7:45 సమయంలో కాంత, కూతురు నేహను కాలేజీలో వదిలిపెట్టడానికి స్కూటర్లో వర్తూరు నుంచి మారతహళ్లికి బయలుదేరింది. సిద్దాపుర మీనాక్షీ లేఔట్ వద్ద రోడ్డు గుంత ఉండగా, కాంతా స్కూటర్ ను పక్కకు తిప్పడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన పాఠశాల బస్ ఢీకొట్టి ఆమె మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాంత అక్కడే మరణించింది, నేహకు స్వల్ప గాయాలయ్యాయి. వైట్‌ఫీల్డ్ ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వానికి తరలించారు. కళ్ల ముందే కన్న తల్లి చనిపోవడంతో కుమార్తె బోరున విలపించింది. -
పొంచి ఉన్న డెంగీ ముప్పు
బనశంకరి: వర్షాకాలంలో డెంగీ జ్వరం పొంచి ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జీబీఏ ప్రధాన ఆరోగ్యాధికారి డాక్టర్ మదని తెలిపారు. ప్రతి వర్షాకాలంలో బెంగళూరు, చుట్టుపక్కల ప్రాణాంతక డెంగీ జ్వరాలు విస్తరిస్తాయి. ఈడీస్ ఈజిప్టె అనే దోమలు కుట్టడంతో డెంగీ జ్వరం సోకుతుంది. ఈ దోమలు నిలిచి ఉన్న నీటిలో జీవిస్తూ, పగటి సమయంలో కుట్టడం వల్ల డెంగీ సోకుతుందని తెలిపారు. డెంగీ లక్షణాలు ఇలా తీవ్రమైన జ్వరం, విపరీతమైన తలనొప్పి, కంటినొప్పి, కండరాలు నొప్పులు డెంగీ ప్రధాన లక్షణాలు. వాంతులు, విరేచనాలు కూడా కనిపిస్తాయి. డెంగీ తీవ్రస్థాయిలోకి చేరుకున్న సమయంలో నోరు, ముక్కు నుంచి రక్తస్రావమయ్యే ప్రమాదం ఉంది. పరిశుభ్రత ప్రధానం డెంగీ నియంత్రణకు ఇంటి చుట్టుపక్కల ప్రదేశాల్లో నీరునిల్వకుండా చూసుకోవాలి. సిమెంటు తొట్టెలు, డ్రమ్ములు, గొట్టాలు, టైర్లు, చిప్పలు పూలకుండీలు, తట్టలు, గుంతలు తదితరాలలో నీరు నిలవకుండా, దోమలు పెరగకుండా చూసుకోవాలి. అటువంటి స్థలాలను శుభ్రం చేయాలని సూచించారు. ఇళ్లలో దోమతెరలు, కాయిల్స్ తదితరాల ద్వారా దోమ కాటు నుంచి రక్షించుకోవాలని సూచించారు. ఎలాంటి జ్వరలక్షణాలు కనబడిన తక్షణం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి , పాలికే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాలని తెలిపారు. ప్రతి వర్షాకాలంలో బెంగళూరుకు తలనొప్పి -
భగవాన్‌పై కేసుల పరంపర
సాక్షి,బళ్లారి: ప్రముఖ రచయిత, హేతువాది, ఆలోచనాకారుడు కే.ఎస్.భగవాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హరిహర పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన శ్రీరాముడి పుట్టుకకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భగవాన్ మాట్లాడుతూ శ్రీరాముడు దశరథ మహారాజు పుత్రుడు కాదని, వాల్మీకి రామాయణంలో కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పుత్రకామేష్టి యాగానికి సంబంధించిన విషయాలను ఉదహరిస్తూ తన వాదనను సమర్ధించుకున్నారు. అంతేకాకుండా రామాయణంలో కొన్ని సంఘటనలు ప్రస్తావిస్తూ రాముడి పాత్రపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖలు చేయడంతో భక్తులు మండిపడుతున్నారు. భగవాన్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, రామ భక్తులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. వార్లల్లో నిలవడానికి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కే.ఎస్.భగవాన్పైఽ ధార్వాడ, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కేసులు కూడా నమోదు చేశారు. శ్రీరామసేవ వ్యవస్థాపకులు ప్రమోద్ ముతాలిక్ తదితర ప్రముఖులు ఆయనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దశరథ మహారాజు పుత్రుడు శ్రీరాముడు కాదు శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగా రచయితపై ఆగ్రహ జ్వాలలు భక్తుల మండిపాటు, పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు -
సమస్యలు తీర్చాలని ధర్నా
రాయచూరు రూరల్: దేశానికి బంగారాన్ని ఉత్పత్తి చేసే హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. శనివారం హట్టి బంగారు గనుల కంపెనీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు చంద్రశేఖర్ మాట్లాడారు. వేతన ఒప్పందం, ఆహార కిట్ల పంపిణీ, హెచ్ఆర్ఏ, ఎక్స్‌గ్రేషియా, 2025–26వ సంవత్సర బకాయి వేతనాలు చెల్లించాలని, రిటైర్డ్ పథకాన్ని జారీ చేయాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. అర గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. వెంకోబ గౌస్, జమదగ్ని, రమేష్, బాబు, హనుమంతు, మునీర్, సాగర్, సంగయ్య, రాజేశ్వరి, వెంకటేష్‌లున్నారు. -
జైలు క్వార్టర్స్‌లో జైలర్ ఆత్మహత్య
హుబ్లీ: సస్పెండ్‌కు గురైన జైలర్ జైలు క్వార్టర్లలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ధార్వాడ కొత్త బస్టాండ్ సమీపంలోని జైలు క్వార్టర్స్‌లో శుక్రవారం సిద్దరామప్ప వడ్డర్(37) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన గత రెండు నెలల నుంచి సస్పెన్షన్‌కు గురై మైసూరు జైలుకు బదిలీ అయ్యారు. అయితే ఇప్పటి వరకు డ్యూటీకి రిపోర్టు చేసుకోలేదు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు నెలల క్రితం విధి నిర్వహణలో లోపం కారణంగా ఆయనను సస్పెండ్ చేశారు. భార్య, ఇద్దరు పిల్లలు పొరుగూరికి వెళ్లిన సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరిగి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు. ధార్వాడ ఉపనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భయంతోనే బలవన్మరణం ఉన్నతాధికారులు తనపై చర్య తీసుకుని జైలుకు పంపుతారన్న భయంతో తన భర్త సిద్దరామప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య లక్ష్మి తెలిపింది. సస్పెండ్ చేసి మైసూరుకు బదిలీ చేయడంతో మైసూరుకు డ్యూటీకి హాజరు కావడానికి వెళ్లారు. అయితే తల్లిదండ్రుల ముఖాలను చూసి వెళతానని చెప్పి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె వాపోయారు. తరచూ తనను జైలుకు పంపుతారనే భయంతోనే ఆయన ఉండేవారని ఆమె తెలిపారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ శాఖా పరమైన చర్యల కారణంగా రెండు నెలల క్రితం సస్పెండ్ చేశాం. పాలనాత్మక కారణాలతో ఆయన్ను మైసూరుకు బదిలీ చేశాం. ఆయన స్వస్థలం గదగ్ జిల్లా అని, కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఘటనా స్థలాన్ని పోలీసులు కుటుంబ సభ్యుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించారు. -
ఎన్‌వైకి మంత్రి పదవి ఇవ్వాలి
హొసపేటె: గతసారి కూడ్లిగి నియోజకవర్గం నుంచి, ఈసారి మొళకాల్మూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్వై గోపాలకృష్ణ ఇప్పటి వరకు మొత్తం 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్లో ఎన్వై గోపాలకృష్ణకు చోటు కల్పించాలని కూడ్లిగి తాలూకాకు చెందిన ఎన్వైజీ అభిమాన సంఘం కేపీసీసీని, ఏఐసీసీని డిమాండ్ చేసింది. ఆయన కూడ్లిగి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండి తాలూకా పరిపాలన భవనంతో పాటు అనేక రోడ్లు, పాఠశాలలను నిర్మించారు. కూడ్లిగి నియోజకవర్గంలో రూ.680 కోట్ల గ్రాంటుతో 74 చెరువులకు శాశ్వత పరిష్కారం చూపిన గోపాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని కూడ్లిగి ఎన్వైజీ అభిమానుల సంఘం ఒత్తిడి చేసింది. పార్టీ నేతలు ప్రకాష్, బళ్లారి జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు గుండుముణుగు తిప్పేస్వామి, జేడీఎస్ కొట్టూరు ఎంఎంజే హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గైర్హాజరు పీడీఓలకు నోటీసులు జారీ రాయచూరు రూరల్: ప్రభుత్వ విధులు నిర్వహించాల్సిన అధికారులు ఇళ్లలో కూర్చొని బయోమెట్రిక్‌లో హాజరు వేస్తున్న అంశం జిల్లా స్థాయి అధికారుల దృష్టికి వచ్చింది. ఏకంగా 105 మంది గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓలు) విధులకు గైర్హాజరైన విషయం యాదగిరి జెడ్పీ సీఈఓ లవీష్ ఒడెయర్ పరిశీలనలో వెలుగు చూసింది. ఈనేపథ్యంలో వారందరికీ నోటీసులు జారీ చేశారు. గత ఏడాది రాయచూరు జిల్లాలో పంచాయతీ నిధులు దుర్వినియోగపరిచిన పీడీఓలను విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు విదితమే. 50 మోటార్ సైకిళ్లు స్వాధీనం ● ఐదుగురు నిందితుల అరెస్ట్ రాయచూరు రూరల్ : జిల్లాలోని బళగానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 50 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మస్కికి చెందిన చెన్నబసవ, రాఘవేంద్ర, గిండి రఘు, మెహబూబ్, మహ్మద్లాల్, రఫీక్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.35.20 లక్షల విలువైన బైక్‌లను జప్తు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్, ఎస్ఐ ఎరియప్ప తదితరులు పాల్గొన్నారు. 16 నుంచి కృత్రిమ అవయవాల శిబిరం హొసపేటె: కొప్పళ నగరంలోని ముస్లిం షాదీ మహాల్లో ఈనెల 16 నుంచి 18 వరకు ఉచిత జైపూర్ కృత్రిమ కాళ్ల జోడింపు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఎంఎస్‌పీఎల్ సంస్థ సామాజిక సేవా విభాగం ఉపాధ్యక్షుడు హెచ్‌కే.రమేష్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయనగర, బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిబిరంలో శిబిరార్థులకు ఉచిత భోజనం, వసతి, కృత్రిమ అవయవాలు అందిస్తారని ఆయన అన్నారు. ఆ శిబిరం లబ్ధి పొందాలని ఆయన కోరారు. కంపెనీ సీఎస్ఆర్ విభాగం సీఈఓ అశ్విన్‌కుమార్, కంపెనీ ఎండీ బీఎం నాగరాజ్, కృష్ణ పాల్గొన్నారు. బాల కార్మికత పారదోలదాంరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో బాల కార్మికతను పారదోలదామని కన్నడ సాహిత్య ప్రాధికార కార్యదర్శి దండెప్ప బిరాదార్ పిలుపునిచ్చారు. శనివారం తాలూకాలోని ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాల కార్మిక నియంత్రణపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలలపై అధికంగా పని ఒత్తిడి పడుతుందని, దాని నివారణకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. వీరేష్, సన్నిధి, సుశ్మిత, శ్రేయ, అఖిల్లున్నారు. వీధి కుక్కల బెడద అరికట్టండిరాయచూరు రూరల్: నగరంలో వీధి కుక్కల బెడద అరికట్టాలని కరవే డిమాండ్ చేసింది. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఖలీల్‌పాషా మాట్లాడారు. ఇటీవల పలు కాలనీల్లో వీధుల్లో సంచరించే కుక్కలు కరిచి పలువురు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారన్నారు. వీధి కుక్కలకు సంతాన హరణ చికిత్సలు చేయాలన్నారు. గంగా నివాస్ వద్ద ఐదుగురు బాలలను కుక్కలు కరిచాయని గుర్తు చేశారు. వాటిని పట్టి నగరం నుంచి వెలుపలకు దూరంగా తరలించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. నెట్టికంటుడికి బళ్లారి భక్తుడు రూ.1.50 లక్షల విరాళంగుంతకల్లు రూరల్: తన తండ్రి హనుమప్ప జ్ఞాపకార్థం కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన గుర్రప్ప కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి రూ.1.50 లక్షల విరాళాన్ని శనివారం అందజేశారు. దాత కుటుంబ సభ్యుల పేరిట ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
వస్తున్నాయ్.. భారీ వర్షాలు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో పలు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో తీవ్రంగా, బెంగళూరు– రూరల్, మండ్య, మైసూరు, చామరాజనగర ,రామనగర, కోలారు, చిక్కబళ్లాపుర, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, విజయనగర తదితర జిల్లాల్లోనూ వర్షాలు కురవవచ్చు. ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. బెంగళూరులో వానలతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. యాణ పర్యాటక కేంద్రం బంద్ యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లాలో జోరువానలు కురుస్తున్నాయి. దీనితో యాణ పర్యాటక కేంద్రానికి టూరిస్టులు వెళ్లకుండా కట్టడి చేశారు. కారవారలో ఉరుములు–మెరుపులతో వానలు పడుతున్నాయి. కుమటా తాలూకాలో ప్రసిద్ధ టూరిస్టు స్పాట్ యాణకు రోడ్లను బంద్ చేశారు. భూమి కంపించవచ్చని, కొండచరియలు విరిగిపడవచ్చని చెబుతున్నారు. చండికా నది కాలువ పోటెత్తింది. వాతావరణ శాఖ హెచ్చరిక -
చినుకు పడితే చిత్తడే.!
నీరు నిలిచిన రోడ్డు ముందు కేవీటీనగర్ వాసులు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చేరిన వాన నీరు ఏపీఎంసీలో బురదలోనే ఆకుకూరల విక్రయం సాక్షి,బళ్లారి: నగర వాసులకు కూరగాయలు, ఆకుకూరలు తదితర నిత్యావసరాలు అందించే, నిత్యం పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు జరిగే ఏపీఎంసీ యార్డు మరింత అధ్వాన్నంగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ రైతులు, వ్యాపారులు, వినియోగదారులు నరకయాతన అనుభవిస్తారు. బళ్లారి జిల్లాతో పాటు చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున కూరగాయలను ఇక్కడ తీసుకుని వచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు. కూరగాయలతో పాటు ఆయా సీజన్లలో పండే పండ్లను కూడా ఇక్కడకు తీసుకు వచ్చి రైతులు నేరుగా విక్రయిస్తారు. జిల్లాతో పాటు పొరుగున ఉన్న చిత్రదుర్గ, విజయనగర, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి కూరగాయలను విక్రయిస్తుంటారు. బురదలోనే కూరగాయల అమ్మకాలు పెద్ద స్థాయిలో వ్యాపార లావాదేవీలు జరిగే ఏపీఎంసీ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో పలు రోడ్లు బురదమయంగా మారాయి. వర్షాకాలంలో రైతులు, వ్యాపారులు బురదలోనే కూరగాయలను విక్రయిస్తుండటం సర్వసాధారణంగా మారింది. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి శనివారం ఉదయం బురదనీటిలోనే కూరగాయలు, పండ్లు విక్రయించడం కనిపించింది. దీంతో వినియోగదారులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు తమ సమస్యలను చెప్పినా పట్టించుకోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే నగరంలో పలు కాలనీలు నీటి గుంటలు, చెరువుల్లా మారడం పరిపాటి అయింది. దీంతో ఆయా కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో రోడ్లు జలమయం ఈ ఏడాది వర్షాకాలం మొదలైనప్పటి నుంచి వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నగరంలో బీభత్సంగా వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. అనంతపురం రోడ్డులోని కేవీటీ నగర్ సెకండ్ క్రాస్ మళ్లీ జలమయంగా మారింది. గత 15 రోజుల నుంచి ఈ కాలనీ వాసులు వాననీటిలోనే తిరుగుతున్నారు. ఇలా ఈ ఒక్క కాలనీ బురద, వాన నీటిలో ఉందనుకుంటే పొరపాటు. నగరంలో ఎన్నో రోడ్లు, లోతట్లు ప్రాంతాలు నీట మునుగుతాయి. చివరకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా చెరువులను తలపిస్తున్నాయంటే అధికారులు, పాలకులు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కురిసిన భారీ వర్షం వల్ల తహసీల్దార్ కార్యాలయం ఆవరణ చెరువును తలపిస్తోంది. ఈ కార్యాలయం ఆవరణలో పోలీసు స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు వీఏఓ, ఆర్ఐ తదితర అధికారుల కార్యాలయాల ఆవరణలు కూడా వర్షం వస్తే చెరువులను తలపిస్తున్నాయి. వర్షాకాలంలో జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా ఏపీఎంసీ యార్డు వినియోగదారులకు నరకయాతన -
ఛాయారత్న అవార్డు ప్రదానం
బళ్లారిటౌన్: నగరానికి చెందిన ఫోటోగ్రాఫర్ బీఎం రుద్రముని స్వామికి కర్ణాటక ఛాయారత్న అవార్డు లభించింది. కర్ణాటక వీడియో, ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్, రాష్ట్ర పత్రికా ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ స్థాయి ఫోటో, వీడియో ప్రదర్శనలో తనను అవార్డుతో సన్మానించినట్లు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్వీ.కృష్ణప్ప, కార్యదర్శి జగదీష్, కే.దేవరాజు పాల్గొన్నట్లు తెలిపారు. విద్యుదాఘాతంతో ఆవు, దూడ బలి బళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో తెగి పడిన విద్యుత్ తీగలను ఆవు, దూడ తాకడంతో ఉన్న ఫళంగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుడు పోతురాజుకు చెందిన ఓ ఆవు, దూడ ఆ పరిసరాల్లో మేత మేయడానికి వెళ్లి తెగి పడిన విద్యుత్ తీగలను తాకి అక్కడే విలవిలా కొట్టుకొని చనిపోయాయి. కాగా తెగి పడిన విద్యుత్ వైర్ల మరమ్మతులపై కేపీటీసీఎల్ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. శనివారం గ్రామ ప్రముఖులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దృష్టికి తేవడంతో అధికారులు హుటాహుటిన వచ్చి పరిశీలించారు. ఈ ప్రాంతంలో బ్రాందీ షాపుతో పాటు వివిధ పాఠశాలలకు వెళ్లే వాహనాలు నిత్యం భారీ సంఖ్యలో తిరుగుతుంటాయని, అధికారులు ఈవైపు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. అతిగా ఎనర్జీ డ్రింక్ తాగి యువకుడు మృతిరాయచూరు రూరల్: ఇటీవలి రోజుల్లో యువకులు ఎనర్జీ, కూల్‌డ్రింక్‌లను తాగడం అధికమైంది. రసాయన పదార్థాలతో తయారు చేసిన కిరాణ దుకాణాల్లో విక్రయిస్తున్న ఓ ఎనర్జీ డ్రింక్‌ను అతిగా తాగిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఎనర్జీ డ్రింక్‌ను అతిగా తాగడం అలవాటు చేసుకున్న యాదగిరి జిల్లా సురపుర తాలూకా నారాయణపురకు చెందిన బాలప్ప(18) అనే యువకుడు కిడ్నీ వ్యాధికి గురయ్యాడు. అనారోగ్యం బారిన పడిన అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించాడు. దీనిని సహించలేక కుటుంబ సభ్యులు దుకాణాల్లో ఉన్న ఆ ఎనర్జీ డ్రింక్ సీసాలను ధ్వంసం చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ బళ్లారిటౌన్: నగర శివార్లలోని 34వ వార్డు పరిధిలోని బత్రి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాజీ మేయర్ ఎం.రాజేశ్వరి ఉచిత పాఠ్యపుస్తకాలు, లేఖన సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఎం.సుబ్బరాయుడు, యోగానందరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు తదితరులు పాల్గొన్నారు. హాస్టళ్లను కొనసాగించరూరాయచూరు రూరల్: నగరంలో వెనుక బడిన వర్గాల సంక్షేమ(బీసీఎం) శాఖ ఆధీనంలోని హాస్టళ్లను యథాప్రకారం కొనసాగించాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. శనివారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడారు. గతంలో ఉన్న విద్యార్థులను వేరే చోటికి బదిలీ చేయడం వల్ల అడ్డంకులు ఎదురవుతాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి విద్యాభ్యాసానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హాస్టళ్లను కొనసాగించేలా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
ప్రభుత్వ స్థలాల కబ్జాపై ఉక్కుపాదం
సాక్షి,బళ్లారి: నగరంలో గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన బడా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసిన నేపథ్యంలో ఆక్రమణల తొలగింపుపై అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ రెండూ దొందూ దొందే అన్న చందంగా రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు తాము అఽధికారంలో ఉన్నాం కదా, తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ప్రభుత్వ స్థలాలను ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేసి, ఏకంగా ఇళ్ల స్థలాలను కూడా విక్రయించిన మహానుభావులు ఉండటంతో అలాంటి వాటిని గుర్తించి అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కబ్జాల ఖాళీపై జనం ప్రశంసలు కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలను గుర్తించి రెవెన్యూ, పోలీసు, సర్వే శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం మూకుమ్మడిగా దాడి చేసి కబ్జాలను తొలగిస్తుండటంతో అధికారులపై జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆక్రమణలను తొలగించిన జిల్లా యంత్రాంగం తాజాగా శనివారం నగర శివార్లలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రభుత్వ పొరంబోకు భూమిని ఆక్రమించుకుని కాంపౌండ్ వాల్ నిర్మించుకుని, ఫాం హౌస్ కట్టించుకుని దర్జాగా కాలం గడుపుతున్న తరుణంలో అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. రెవెన్యూ, పోలీసు, సర్వే అధికారులు జేసీబీలు, ట్రాక్టర్లతో వెళ్లి ఆక్రమణలు ఖాళీ చేశారు. కబ్జాలపై మెరుపు దాడులు నగర శివార్లలోని ఆలదహళ్లి సర్వే నంబర్ 38–ఏ లో 3.28 ఎకరాల స్థలం ఆక్రమించుకుని అందులో కాంపౌండ్ వాల్ నిర్మించుకుని తన స్వాధీనంలో ఉంచుకుని అనుభవిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో అధికారులు సమగ్ర తనిఖీ చేపట్టి ఆక్రమణలు తొలగించారు. ఏడీసీ మహమ్మద్ జుబేర, డీడీఎల్ఆర్ ప్రమోద్, ఏడీఎల్ఆర్ బళ్లారప్ప, తహసీల్దార్, ఆర్ఐలు, వీఏఓ నరేంద్ర తదితరులు మెరుపుదాడి చేసి ఆక్రమణలు తొలగించి ఆ స్థలంలో ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టారు. ఈ భూమిని ఎవరూ ఆక్రమించుకునేందుకు వీలు లేదంటూ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసు కూడా పెట్టారు. ఈ ఘటనతో నగరంలో ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టింది. కొనసాగుతున్న పకడ్బందీ చర్యలు కార్యాచరణలో పాల్గొన్న అధికారులు -
ట్రాఫిక్ కట్టడికి కెమెరా కళ్లు
సాక్షి, బెంగళూరు: బెంగళూరు ట్రాఫిక్ సమస్య అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. విపరీతమైన వాహన రద్దీ, గందరగోళంపై తరచూ విమర్శలు వస్తుంటాయి. అదే రీతిలో కొందరు వాహనదారులు ఇష్టానుసారం వెళ్తుంటారు. ఇలాంటి వారిని కట్టడి చేయడానికి నగర ట్రాఫిక్ పోలీసులు ఆధునిక టెక్నాలజీ సాయం తీసుకున్నారు. బైక్‌పై హెల్మెట్ లేకుండా వెళ్లినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, సిగ్నల్ జంప్, కారులో సీటు బెల్టు పెట్టుకోకున్నా.. ఇలాంటి అతిక్రమణలకు పాల్పడితే కెమెరాలు గుర్తించి చలాన్లు నమోదు చేస్తున్నాయి. కోటికి పైగా వాహనాలు బెంగళూరులో కోటికి పైగా వాహనాలున్నాయి. రోడ్ల విస్తీర్ణం ఆ స్థాయిలో లేదు. దీంతో రోజూ వందలాది ఉల్లంఘనలు జరుగుతుంటాయి. దీనివల్ల ప్రమాదాలూ తప్పడం లేదు. వాటి నియంత్రణకు ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుండగా, ఉల్లంఘనుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతోందని తెలిసింది. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల వార్షిక గణాంకాలు ఇదే చెబుతున్నాయి. ముఖ్యంగా త్రిబుల్ రైడింగ్ కేసులు 2024లో గరిష్ట స్థాయిలో ఉండగా, ఇప్పుడు చాలావరకు తగ్గిపోయాయి. సగానికి నియంత్రణ 18 నుంచి 35 ఏళ్లలోపు యువకులు అధికంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ ఉల్లంఘనలు దాదాపు ఇప్పుడు సగానికి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఏఐ ఆధారిత కెమెరాల ఏర్పాటు, అవగాహన ర్యాలీలు, తనిఖీల వల్ల ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. అధికంగా కాలేజీలు, పీజీ హాస్టళ్లు, పబ్‌లు ఉండే ప్రాంతాల్లో యువకులు ఎక్కువగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో తగ్గాలి బీటీఏం లేఔట్, కోరమంగళ తదితర హాట్ స్పాట్లలో అర్ధరాత్రిల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం పోలీసులకు పెద్ద సవాలుగా ఉండేది. పోకిరీలు ప్రమాదకర త్రిబుల్‌రైడింగ్, బైక్ స్టంట్లు చేస్తారు. మద్యం తాగి డ్రైవింగ్ సరేసరి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల మధ్య రోడ్డు నిబంధనలు ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. బీటీఎం లేఔట్, హెచ్ఎస్ఆర్ లేఔట్, కోరమంగళ, ఇందిరానగర, ఎంజీ రోడ్లపై నిబంధనల బేఖాతరు ఎక్కువగా సాగుతోంది. ఎంజీ రోడ్డులో కెమెరాల బిగింపు బెంగళూరులో సత్ఫలితాలు తగ్గిన సిగ్నల్ ఉల్లంఘనలు -
టీబీ డ్యాంకు కొత్త జల కళ
హొసపేటె: కళ్యాణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని లక్షలాది రైతులకు జీవనాధారమైన తుంగభద్ర డ్యాం రుతుపవన వర్షాల ప్రారంభంతో కొత్త వరదను సంతరించుకుంది. తీవ్రమైన వేసవి కారణంగా ఎండిపోయి డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరిన ఈ జలాశయం ఇప్పుడు పరివాహక ప్రాంతాలైన శివమొగ్గ, శృంగేరి, మొరాళు, ఆగుంబె, తీర్థహళ్లి తదితర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. టీబీ డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 101 టీఎంసీలు కాగా, ప్రస్తుతం డ్యాంలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రుతుపవన వర్షాలు ఇదే విధంగా కొనసాగితే, ఈ ఏడాది నిర్ణీత సమయానికంటే ముందే జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉంది. గత ఏడాది తీవ్ర కరువు కారణంగా డ్యాం నిండకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈసారి రుతుపవనాల ప్రారంభంలో జలాశయం నీటితో నిండడం కళ్యాణ కర్ణాటకలోని కొప్పళ, బళ్లారి, రాయచూరు, విజయనగర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంత రైతులకు హర్షం కల్గించింది. తుంగభద్ర డ్యాం నీరే జీవనాధారం కళ్యాణ కర్ణాటక రైతుల్లో ఆనందం -
రౌడీషీటర్‌పై కాల్పులు
బనశంకరి: దోపిడీ, హత్యాయత్నం తదితర తీవ్రమైన నేరాలతో సంబంధమున్న రౌడీషీటర్ జీవా (19)పై గురువారం బెంగళూరు హెబ్బగోడి పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్‌చేశారు. పలు దోపిడీలకి పాల్పడి పరారీలో ఉన్న జీవా కోసం పోలీసులు కొన్నిరోజులుగా వెతుకున్నారు. గురువారం తెల్లవారుజామున సింగేన అగ్రహార తోపులో దాగి ఉన్నట్లు తెలిసి వెళ్లారు. పోలీసులను చూసి పారిపోతుండగా అతని వెంటపడ్డారు. అతడు కత్తితో పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఎస్ఐ అయ్యప్ప తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటా తగిలి జీవా కాలికి గాయం కావడంతో పడిపోగా, పోలీసులు పట్టుకుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. హెబ్బగోడి ఠాణాలో రౌడీషీటర్ అయిన ఇతడు తిరుపాళ్యలో నివాసం ఉంటున్నారు. తరచూ నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారాడు. -
పొట్టకూటి కోసం పడిగాపులు
సాక్షి బళ్లారి: సూర్యోదయానికి ముందుగానే కొప్పళలోని లాల్బహుదూర్శాస్త్రిభి సర్కిల్‌ను ఒకసారి చూస్తే అక్కడ కనిపించే దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. వందలాది మంది కూలీలు పల్లెటూళ్లు, పట్టణాల నుంచి వచ్చిన వారు లుంగీలు, చొక్కాలు ధరించి చేతిలో పనిముట్లను పట్టుకొని పని కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. వారి కళ్లల్లో కనిపించే ఆశ, దాని వెనుక ఉన్న బాధలు, ఆరోజు పని దొరికితే కుటుంబానికి అన్నం పెట్టగలమనే ఆరాటం ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తుంది. మామూలుగా నగరాల్లో, పల్లెటూళ్లలో ఏదైనా పనికి వ్యవసాయ కూలీలు దొరకాలంటే వెతకాల్సిన పరిస్థితులుంటాయి. అయితే కొప్పళ నగరంలో లేబర్ సర్కిల్‌కు వస్తే ఎలాంటి పనికై నా కూలీలు ఇట్టే దొరికిపోతారు. ఇంటి పనులకు సంబంధించి ప్లంబింగ్, పెయింటింగ్, భవనాలు, ఇళ్ల క్లీనింగ్, వ్యవసాయ పనులకు కానీ ఆ సర్కిల్‌కు వస్తే కూలీలు దొరకడం గమనార్హం. లేబర్ సర్కిల్‌గా గుర్తింపు కొప్పళలో కూలీలంతా ఐకమత్యంగా ఒక చోట చేరుతారు. లాల్‌బహుదూర్ శాస్త్రి సర్కిల్‌ను లేబర్ సర్కిల్‌గా పిలుస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున కూలీలు అక్కడికి వస్తుంటారో అర్థం చేసుకోవచ్చు. గడియార స్తంభం, భాగ్యనగర పట్టణ పంచాయతీ కార్యాలయం ముందు కూడా అవే దృశ్యాలు కనిపిస్తుంటాయి. వీరికి ఎలాంటి చదువు కూడా ఉండదు. అయితే టెక్నాలజీ సంబంధించి పనులను కూడా వీరు నిర్వహిస్తుంటారు. స్వంత ఊళ్లలో పని దొరకకపోవడంతో ఇక్కడికి వచ్చి తమ పిల్లలను చదివించుకునేందుకు రోజు వారి పనులు దొరికితే చాలన్న సంతోషంతో ఎదురు చూస్తుంటారు. గోడలు కట్టడం, ఇనుప కడ్డీలను అమర్చడం, కాంక్రీట్ పనులు చేయడం, విద్యుత్ వైరింగ్, పరికరాల అమరిక, నీటి ట్యాంక్‌లను శుభ్రపరచడం వంటి పనులు, డ్రైనేజీలను శుభ్రంచేయడం వంటి అనే పనులను చేస్తూ పొట్టనింపుకునే వారు ఇక్కడ వందలాది మంది కనిపిస్తుండటం విశేషం. అక్కడ అందుబాటులో కూలీకార్మికులు గత 30 ఏళ్లుగా లాల్‌బహుదూర్‌శాస్త్రి సర్కిల్ లేబర్ సర్కిల్‌గా మారింది. అక్కడికి వస్తే ఎలాంటి పనులకై నా కార్మికులు దొరుకుతారనేది ప్రజల నమ్మకం. తమ పిల్లల చదువుకు, వారి ఆశలను తీర్చేందుకు తాము నిత్యం ఇక్కడికి వచ్చి తమకు నైపుణ్యం ఉన్న పనులను చేస్తూ పొట్టనింపుకుంటున్నామని పలువురు పేర్కొంటున్నారు. చదువు లేకపోయినా తమ అనుభవాన్నే తెలివిగా మార్చుకొని యజమానులను మెప్పించి ఉపాధి పొందుతున్నామన్నారు. లేబర్ సర్కిల్ వద్ద ఉదయం వేళ కారు, బైక్ వస్తే సార్.. రండి..సార్.. ఏ పనైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారితో మాటలు కలుపుతారు. రోజు వారి కూలీలు ఈ జీవితం కేవలం ఉపాధి కోసం చేసే పోరాటం మాత్రమే కాదు, కుటుంబాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం జీవితంలో సాగించే నిరంతర యుద్ధమని పలువురు అంటున్నారు. పాలకుల నుంచి అందని సహకారం దశాబ్దాల తరబడి ఇక్కడ వందలాది మంది కూలీలు పొట్టకూటి కోసం ఆరాటపడుతున్నా పాలకులు, అధికారులు తమకు ఎలాంటి సహకారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ భవన నిర్మాణానికి సంబంధించి కార్మికులే పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు చేయింకోవడానికి ప్రయత్నించే వారు ఈ సర్కిల్‌కు వస్తే సునాయాసంగా ఇళ్లు పూర్తయ్యే వరకు అన్ని విధాలా పని చేసే కార్మికులు దొరుకుతారు. పని కోసం ఎదురు చూసే కార్మికులకు పని దొరకడం ఎంత కష్టమో ఒక్కొక్క సారి పనులు చేయించుకునేందుకు కార్మికులు దొరకక పోవడంతో ఎన్నో ఇబ్బందులు పడి లేబర్ సర్కిల్‌కు వస్తే కార్మికులు దొరుకుతుండటంపై స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు కాయకష్టం చేసే కార్మికులు మంగళ, శుక్రవారాల్లో సమీపంలోని హులిగి వద్ద తుంగభద్ర నదిలో స్నానం చేసి హులిగమ్మ దేవిని దర్శించుకొని తమకు ఇష్టమైన ఆహారం వండుకొని అక్కడ బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కూలీలు వారానికి రెండు రోజులు సెలవు తీసుకొని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో గడపడానికి సమయాన్ని కేటాయిస్తారు. లేబర్ సర్కిల్ వద్ద పనుల కోసం గుమిగూడిన కార్మికులు సర్కిల్లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువకులు రెక్కాడితే కాని డొక్కాడని పేదలు కూలికార్మికుల జీవన్మరణ పోరాటం పట్టెడన్నం కోసం అన్ని రకాల పనులు ఏ పనికి కార్మికులు అవసరమైనా లేబర్ సర్కిలే శరణ్యం -
రోడ్డు నాసిరకం.. రవాణా కష్టతరం
హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి సమీపంలోని డణాపుర వద్ద నిర్మించిన జాతీయ రహదారి–50లో సర్వీస్ రోడ్డు 8–10 రోజులకే దుస్థితికి చేరడంతో ఒక లోడ్ లారీ రోడ్డులోని గోతిలో చిక్కుకుపోయింది. నాసిరకంగా నిర్మించిన పనుల కారణంగా రోడ్డు కుంగిపోయింది. రెండు నెలల క్రితం బళ్లారి ఎంపీ ఈ.తుకారాం సర్వీస్ రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన నిర్మించిన సర్వీస్ రోడ్డు దుస్థితిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. డణాపుర నుంచి మరియమ్మనహళ్లి వరకు ఉన్న ఈ రహదారిని మొత్తం రూ.33 కోట్ల వ్యయంతో నిర్మించారు. మరియమ్మనహళ్లి వరకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డుపై జాతీయ రహదారి వెంట పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంట్రాక్టు కంపెనీపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. నాణ్యమైన పనులు చేయకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ కంపెనీపై తగిన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. -
ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ కోస్గి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం గంగా పరమేశ్వరి కాలనీలో అభిజ్ఞాన అంగ్ల గ్ల భాషా పాఠశాలల్లో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. నేడు విద్యకున్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు. ప్రయత్న వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు రమేష్, సాహితీవేత్త ఈరణ్ణ బెంగాలి, రవి, చంద్ర గిరీష్లున్నారు. -
కలబుర్గి– బెంగళూరు విమాన సంచారం షురూ
రాయచూరు రూరల్: ఏడాది పాటు స్తంభించిన విమాన ప్రయాణాలను కలబుర్గిలో పునరుద్ధరించారు. కలబుర్గి నుంచి బెంగళూరుకు బుధవారం సాయంత్రం కలబుర్గి– బెంగళూరు విమాన సేవలను కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి సహకారంతో కర్ణాటక పట్టు పరిశ్రమ అభివృద్ధి మండలి అధ్యక్షురాలు ఖనీజా ఫాతిమా ప్రారంభించారు. బెంగళూరు నుంచి 76 సీట్లున్న ఈ స్టార్ ఎయిర్ విమానం కలబుర్గికి ప్రయాణిస్తుందని అధికారి బోపణ్ణ తెలిపారు. శాసన సభ్యుడు ఎం.వై.పాటిల్, జిల్లాధికారి ఇక్రంపాషా, ఎస్పీ శ్రీనివాసులు, అధికారులున్నారు. -
రాజ్యసభకు నలుగురి ఎన్నిక
శివాజీనగర: రాష్ట్రంలో ఉత్కంఠ కలిగించిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 3 కాంగ్రెస్‌కు, 1 బీజేపీకి దక్కాయి. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, మన్సూర్ అలీఖాన్, పవన్ ఖేరా, బీజేపీ నుంచి ఎం.నాగరాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులు పోటీలో లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విధానసౌధలో గురువారమే ఇద్దరు అభ్యర్థులకు విధానసభా కార్యదర్శి విశాలాక్షి ధృవీకరణ పత్రం అందజేశారు. శుక్రవారం మల్లికార్జున ఖర్గే స్వీకరిస్తారు. పవన్ ఖేరా మాట్లాడుతూ, కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కన్నడ సుందరమైన భాష, కన్నడ నేర్చుకొంటానని తెలిపారు. రాఘవ మఠంలో పూజలు బనశంకరి: నగరంలోని జయనగర ఐదోబ్లాక్‌లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఏకాదశి సందర్భంగా గురువేంద్రస్వామికి అర్చకులు అలంకరణ, పూజలు చేపట్టారు. ప్రియాగణేశ్ బృందంచే భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సముద్ర తీరంలో అలర్ట్ యశవంతపుర: సముద్ర తీరంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతు పవనాల వల్ల సముద్ర తీరంలో పెద్ద పెద్ద అలలు ఎగసిపడుతున్నాయి. టూరిస్టులు సురక్షతా చర్యలను పాటించాలని తెలిపారు. మంగళూరు చుట్టుపక్కల ఉన్న ప్రముఖ బీచ్‌లలో జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ అధికారులు హై అలర్ట్‌ను ప్రకటించారు. నీటిపై తేలే వంతెనలు, బోటింగ్ లాంటి క్రీడలను బంద్ చేశారు. 9, 10 తరగతులకు ఆర్టీఈపై స్టే దొడ్డబళ్లాపురం: 9, 10వ తరగతులకు కూడా ఆర్టీఈని విస్తరించాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 9, 10వ తరగతుల్లో ఉచితంగా సీట్లు ఇవ్వాలని సర్కారు ఆదేశించడం సరికాదంటూ ప్రైవేటు పాఠశాలల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఆర్టీఈ చట్టం పరిధిని దాటి ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు.. కేసు పూర్తయ్యే వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయరాదని ఆదేశించింది. -
ఒక్క అడుగుతో అథఃపాతాళానికి...
సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుని హత్య శాండల్‌వుడ్‌లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రమే కాదు, దేశమంతటా వార్తలకెక్కింది. చాలెజింగ్ స్టార్‌గా లక్షలాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు దర్శన్ ఈ హత్య కేసులో జైలు పాలయి గురువారంతో రెండేళ్లు పూర్తి అయింది. ఆయన కెరీర్ అగమ్యగోచరమైంది. 2024, జూన్ 11న మైసూరులోని ఒక హోటల్లో ఉండగా దర్శన్‌ను, ఆయన సన్నిహితులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో అనేకానేక మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యలోనే ఒక్కసారి బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దు చేయడంతో మళ్లీ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అన్నీ మిస్.. మిస్ బెయిలు మధ్యలో దర్శన్ తన ప్రతిష్టాత్మక ‘ది డెవిల్’ సినిమా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ఆ సినిమా విడుదల సమయంలో కటకటాల్లోనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది తన 49వ పుట్టినరోజు, 23వ పెళ్లి రోజును కూడా అభిమానులు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోయారు. దర్శన్ జీవితంలో చీకటిదినం 2024, జూన్ 9 నటుడు దర్శన్ పాలిట ఒక చీకటి రోజు.. బెంగళూరు సుమ్మనహళ్లి రాజకాలువలో రేణుకాస్వామి శవం లభ్యం అయింది. ఈ కేసులో దర్శన్ పేరు వినిపించడంతో పోలీసులు జూన్ 11న అరెస్టు చేశారు. జూన్ 7న కిడ్నాప్ అయిన రేణుకాస్వామి రెండు రోజుల తర్వాత రాజకాలువలో శవమై కనిపించాడు. దర్శన్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యంగా సందేశాలు పంపించాడనే కారణంతో దర్శన్ అనుచరులు చిత్రదుర్గ నుంచి అతన్ని బెంగళూరుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్య చేశారన్నది అభియోగం. తరచూ మలుపులు ఈ కేసు నిరంతరం మలుపులు తిరుగుతూనే ఉంది. బెంగళూరు జైలులో దర్శన్‌కు రాచమర్యాదలు కల్పిస్తున్నారని కొన్నాళ్లు బళ్లారి జైలుకు తరలించారు. కొన్ని నెలల తర్వాత వైద్య సేవల కారణంతో బెయిల్ పొందారు. దర్శన్ బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిలు రద్దయింది. గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ దర్శన్ జైలు పక్షి అయ్యారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దర్శన్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. దర్శన్, పవిత్రతో పాటు 7 మంది నిందితులు కారాగారంలోనే ఉండగా, అభిమానులు విచారంలో మునిగారు. ప్రముఖ నటుడు దర్శన్ జైలుపాలై ఇప్పటికి రెండేళ్లు ప్రకంపనలు సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసు -
ప్రధానితో సీఎం డీకే భేటీ
బనశంకరి: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ పాల్గొన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గురించి ప్రధాని, సీఎంలు చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని సీఎం డీకే తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని సీఎం డీకే కలిసి, బసవేశ్వరుని ప్రతిమను బహూకరించారు. శుక్రవారం ప్రధానితో భేటీకి సమయం కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ నీటి ప్రాజెక్టులు, ఆర్థిక పథకాల గురించి చర్చిస్తాని చెప్పారు. నీతి ఆయోగ్ భేటీలో కర్ణాటక సమస్యలు, అవసరాలను ప్రస్తావించి సహాయం కోరినట్లు తెలిపారు. ఇస్పేటు ఖాకీల సస్పెండ్ మైసూరు: ఇస్పేటు ఆడుతూ పట్టుబడిన ఇద్దరు పోలీసులను చామరాజనగర ఎస్పీ ముత్తురాజు సస్పెండ్ చేశారు. చామరాజనగర మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీసు మల్లికార్జున, రిజర్వ్ పోలీసు నాగేశ్ బుధవారం రాత్రి పెద్ద గుంపులో ఇస్పేటు ఆడుతుండగా పోలీసులు దాడి చేయడంతో దొరికిపోయారు. ఈ నేపథ్యంలో ఎస్పీ చర్య తీసుకున్నారు. గతంలో, ఎస్పీ దివ్య థామస్ హయాంలో సాయుధ రిజర్వ్ దళానికి చెందిన కొందరు సిబ్బంది పట్టుబడి సస్పెండ్ అయ్యారు. నేడు మూకాంబిక దర్శనానికి తమిళనాడు సీఎం దొడ్డబళ్లాపురం: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేడు శుక్రవారం ఉడుపి జిల్లాలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబికా దేవాలయాన్ని సందర్శించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో చుట్టుపక్కల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ భక్తులు దర్శనానికి రాకపోవడం మంచిదని అధికారులు సూచించారు. సీఎం వస్తుండడం వల్ల భద్రతా తనిఖీల వల్ల భక్తులకు ఇబ్బంది కలగవచ్చని, అందువల్ల దర్శనం సమయాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు తెలిపారు. సాంబార్లో బల్లి, విద్యార్థినులకు అస్వస్థత యశవంతపుర: బల్లి పడిన సాంబారును సేవించి 15 మంది యువతులు అస్వస్థతకు గురైన ఘటన హాసన్ తాలూకా సారాపురలోని అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్లో జరిగింది. బుధవారం రాత్రి వండిన సాంబార్లో బల్లి పడింది. అది తెలియక సాంబార్‌ను ఆరగించారు. కొంతసేపటికే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి తదితరాలతో విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. వారిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. సిలిండర్లు లేకపోవడంతో బయట కట్టెల పొయ్యిపై వంట చేశారు, ఆ సమయంలో బల్లి పడినట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. నాలుగు వందల మంది విద్యార్థినులున్న హాస్టల్ గ్యాస్ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటోంది. వంట గదిలో పరిశుభ్రత లేక బల్లులు తిరుగుతున్నాయని విద్యార్థినులు ఆరోపించారు. ఘనంగా కరియమ్మ జాతర బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని అరసికెరె గ్రామ దేవత అయిన శ్రీకరియమ్మ శ్రీ మల్లిగమ్మ దేవి జాతర బుధవారం రాత్రి భక్తిశ్రద్ధలతో జరిగింది. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరిగింది. బుధవారం, మూలస్థానంలోని పంచమాతలు కరియమ్మ దేవి, మల్లిగమ్మ దేవి, చెలువరాయ స్వామి, దూతరాయ స్వామి, కెంచరాయ స్వామిల ఉత్సవ విగ్రహాలకు విశేషంగా అలంకరించి పూజలు చేశారు. శ్రీకరియమ్మ అమ్మవారిని వెండి రథంలో ఊరేగించారు. ఆలయంలో భక్తులు పూజలు చేసి పండ్లు, కూరగాయలను సమర్పించారు. -
బురదగా దారి.. ఇబ్బందిగా మారి..
హొసపేటె: తాలూకాలో మరియమ్మనహళ్లి గుండా తండాకు చెందిన రైతుల భూములను కలిపే దారి పాడై పోవడంతో రాకపోకలు కష్టకరంగా మారాయి. ఈ దారిపై నరకయాతన పడుతూ వెళ్లాల్సి వస్తోందని, అధికారులు, ప్రజాప్రతినిధులు నిద్రావస్థలో ఉన్నారని గ్రామస్తులు ఆరోపించారు. జీ.నాగలాపుర జీపీ పరిధిలోకి వచ్చే గుండా తండాలోని రైతుల పొలాలకు చేరుకోవడానికి ఉన్న ఏకై క మార్గం ఈ దారి. దీనిపై చాలా గుంతలు ఉన్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. దారి బురదమయంగా మారడంతో పొలాలకు వెళ్లడం సాధ్యం కావడం లేదు. విత్తనాలు నాటే, పంట కోసే సమయాల్లో వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోంది. ఈ దారిలో వాహనదారుల తిప్పలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికై నా దారిని వెంటనే మరమ్మతు చేయాలని గ్రామస్తులు కోరారు. యాతన పడుతున్న వాహన చోదకులు -
పోలీసులూ.. నేరగాళ్లతో కలవద్దు
బనశంకరి: రౌడీలు, నేరగాళ్లతో, నేరాల చరిత్ర కలిగినవారితో సంబంధాలు కలిగి ఉండటం, సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నట్లు కనబడితే అలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని నూతన హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే హెచ్చరించారు. గురువారం బెంగళూరు పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ సమస్యల నివారణ గురించి తీసుకుంటున్న చర్యలుపై చర్చించారు. పార్టీలు, సెల్ఫీలు ఏమిటి? సమావేశం తరువాత విలేకరులతో ప్రియాంక్‌ఖర్గే మాట్లాడారు. ప్రతి పోలీస్ స్టేషన్లో రౌడీ నియంత్రణ దళం ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. కిందిస్థాయి పోలీసులు రౌడీల బర్త్ డేలలో పాల్గొనడం, పార్టీలు, విందులు చేసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం లాంటివి చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని సౌకర్యాల కల్పన, లోపాల పరిష్కారం ద్వారా సరిదిద్దాలని తీర్మానించామని తెలిపారు. దీని కోసం పలు సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై బెంగళూరు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఐటీ కేంద్రం కావడంతో ఇక్కడ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు హోంశాఖ, ఐటీ బీటీ, ఈ–పాలన శాఖలతో కలిపి సమగ్ర విధానం తీసుకువస్తామని తెలిపారు. డ్రగ్స్ ముఠాలపై హోంశాఖ ఉక్కుపాదం మోపుతుందని, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అయ్యే డ్రగ్స్, మత్తు పదార్థాలను కనిపెట్టడానికి సరిహద్దుల్లో టెస్టింగ్‌లను పెంచుతామని తెలిపారు. నగరంలో విదేశీ పౌరులు చట్టవ్యతిరేకంగా నివసిస్తుంటే బహిష్కరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని, కేంద్ర విదేశాంగ శాఖతో చర్చిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు చేస్తే కేసు నమోదు చేయకపోవడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించే పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే సూచన హెచ్చరిక పోలీసు అధికారులతో సమీక్ష -
బాబోయ్.. చిరుత
మండ్య: మండ్య జిల్లాలోని మలవల్లి తాలూకాలోని తలగవాడి గ్రామం సమీపంలో చిరుతపులి కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని రాకరి గ్రాడ్యుయేట్ స్కూల్ సమీపంలో, నిర్మానుష్య ప్రదేశంలో అది తిరుగుతోంది. బుధవారం రాత్రి, గ్రామానికి చెందిన టి.కె.మను, టి.ఎస్.అభిషేక్ గౌడ కారులో వెళ్తుండగా రోడ్డు దాటుతున్న చిరుతని చూసి భయపడ్డారు. ఫోన్లో దానిని రికార్డు చేశారు. గత వారం కూడా అదే రోడ్డుపై చిరుతపులి కనిపించింది. గత కొన్ని నెలలుగా, ఐదు లేదా ఆరు చిరుత పులులు గ్రామం చుట్టూ తిరుగుతూ, 10కి పైగా పెంపుడు జంతువులను చంపాయి. చిరుతల భయంతో ఒంటరిగా మహిళలు, పిల్లలు బయటకు వెళ్లలేకపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. అటవీ సిబ్బంది వెంటనే చిరుతలను బంధించి భద్రత కల్పించాలని కోరారు. -
అప్పు తిరిగి చెల్లించమన్నందుకు మహిళ దారుణ హత్య
శ్రీనివాసపురం: ఇచ్చిన అప్పు తిరిగి వాపసు ఇవ్వాలని అడిగి నందుకు మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన శ్రీనివాసపురం తాలూకా లక్ష్మీపుర గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెడ్డెమ్మ (70) హత్యకు గురైన మహిళ. చింతామణికి చెందిన తిమ్మరాజు, మునిరాజు హంతకులు. గత నెల 17వ తేదీన ఘటన జరగగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇద్దరు అన్నదమ్ములు. వీరు రెడ్డెమ్మ వద్ద వడ్డీకి అప్పు తీసుకుని నెలనెల వడ్డీ కడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల వీరు వడ్డీ సరిగా కట్టకపోవడంతో ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని రెడ్డెమ్మ అడిగింది. నిందితులు ఇద్దరు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేక రెడ్డెమ్మను కడతేర్చాలని ప్లాన్ వేశారు. డబ్బు వాపసు ఇస్తామని చెప్పి చింతామణిలోని తమ ఇంటికి రెడ్డెమ్మను పిలిపించుకున్నారు. రెడ్డెమ్మను నిందితులు ఇద్దరు గొంతు నులిమి చంపి మృతదేహాన్ని కెంచార్లహళ్లి వద్దకు తీసుకు వెళ్లి అక్కడ అటవీ ప్రాంతంలో పడేశారు. రెడ్డెమ్మ కనిపించకపోవడంలో కటుంబీకులు మే నెల 26వ తేదీన రాయల్పాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు తిమ్మరాజు, మునిరాజును అరెస్టు చేశారు. -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుందలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.5,12,000 విలువ చేసే 46 గ్రాముల బంగారు ఆభరణాలు, చోరీకి వాడిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 31న నవలగుందలో ఇంటి చోరీ జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన నవలగుంద సీఐ రవికుమార్ నేతృత్వంలో ఎస్ఐ జనార్ధన్, ఉమాదేవి తదితర సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలు నవలగుంద పట్టణం, అలాగే శివారులోని వివిధ సీసీ టీవీ కెమెరాలను వివిధ కోణాల్లో పరిశీలించి కెమెరాల ద్వారా లభించిన దృశ్యాలు, అలాగే టెక్నికల్ ఆధారాలతో నిందితుల జాడ పట్టుకొని వారి అసలైన అడ్రస్‌లను గుర్తించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణ వేళ చోరీ చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. వీరు బెళగావి జిల్లాకు చెందిన వారని, ప్రస్తుతం వీరిని జుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. గృహలక్ష్మి లబ్ధిదారులకు ఆందోళన వద్దు హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చే వరకు గృహలక్ష్మి పథకం మహిళా లబ్ధిదారులు కేవైసీ చేయించరాదని హుబ్లీ ధార్వాడ పడమటి విధానసభ గ్యారెంటీ అమలు కమిటీ అధ్యక్షుడు ఆనంద మూశన్నవర తెలిపారు. ఈ పథకం లబ్ధి పొందడానికి కేవైసీ చేయించాలని వదంతులు వ్యాపించడంతో మహిళలు గ్రామ వన్, కర్ణాటక వన్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ప్రభుత్వ ఆదేశం లేకపోయినా అనవసరంగా మహిళలు గ్రామ వన్, కర్ణాటక వన్ కేంద్రాల్లో అడిగినంత డబ్బులు చెల్లించి కేవైసీ చేయిస్తున్నారు. సదరు కేంద్రాల సిబ్బంది సామాన్య మహిళలకు తగిన సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆదేశం వచ్చే వరకు మహిళలు కేవైసీ చేయించాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. రౌడీషీటర్ల ఇళ్లపై పోలీసు దాడులు హుబ్లీ: శాంతి భద్రతల రక్షణే లక్ష్యంగా బెళగావి నార్త్ రేంజ్‌లోని బెళగావి, విజయపుర, బాగలకోటె, ధార్వాడ, గదగ్ జిల్లాల్లో ఆయా జిల్లా ఎస్పీల నేతృత్వంలో అధికారుల బృందాలు రౌడీషీటర్ల ఇళ్లపై దాడి చేసి కొరడా ఝళిపించాయి. రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో 456 మంది రౌడీషీటర్ల ఇళ్లపై దాడి చేసి రూ.8.5 లక్షల నగదు, నెంబర్ ప్లేట్, రికార్డులు లేని 10 వాహనాలు, రెండు మచ్చుకత్తులను జప్తు చేశారు. కోర్టు నుంచి పరారైన ఇద్దరు రౌడీలను అరెస్ట్ చేశారు. వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కేసులు నమోదైనట్లు బెళగావి నార్త్ రేంజ్ ఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌ల సదస్సు బళ్లారిఅర్బన్: నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు నూతన ఆవిష్కరణలు, ఆధునిక నిర్మాణ విధానాలపై నిరంతరం అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఆర్కిటెక్ట్స్ మీట్–2026 కార్యక్రమం బుధవారం సాయంత్రం నగరంలోని హోటల్ రాయల్ ఫోర్ట్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాణ రంగానికి సంబంధించిన నూతన సాంకేతికతలు, ఆధునిక భద్రతా ప్రమాణాలు, స్మార్ట్ లాకింగ్ వ్యవస్థలు, భవన నిర్మాణంలో వినియోగిస్తున్న అత్యాధునిక ఆర్కిటెక్చరల్ విధానాలపై నిపుణులు సమగ్రంగా వివరించారు. భవనాల భద్రత, నాణ్యత, సౌందర్యాన్ని పెంపొందించడంలో ఆధునిక సాంకేతికతల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఏసీసీఈఏ అధ్యక్షుడు సత్యనారాయణ, శశిధర్, రాకేష్, సుభాష్ చంద్ర, సునీల్ పాల్గోన్నారు. చుక్కి ఫౌండేషన్ అవార్డుల పంపిణీరాయచూరు రూరల్: ఉమాపతి చుక్కి 50వ పుణ్యారాధనను పురస్కరించుకుని గురువారం జిల్లాలోని సిరవారలో చుక్కి ఫౌండేషన్ అవార్డులను అందచేశారు. ఈసందర్భంగా మాజీ మంత్రి బోసురాజు మాట్లాడుతూ చుక్కి ప్రతిష్టాన చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు, చర్చాగోష్టులు జరగాలన్నారు. సమావేశంలో ఆళంద విశ్వనాథ్ కూరేణేశ్వర శివాచార్య స్వామీజీ, శాసన సభ్యుడు హంపయ్య నాయక్, చుక్కి ప్రతిష్టాన అధ్యక్షులు శివానంద, సభ్యులు శివకుమార్, రంగణ్ణ పాటిల్, మల్లికార్జున, జ్యోతి, సిద్దలింగప్ప, హాజీ చౌద్రిలున్నారు. మౌలిక సౌకర్యాలు కల్పించరూ రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కేఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాలోని సింధనూరు తాలూకా గోమర్సి ప్రభుత్వ పాఠశాల వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు నిరుపాది మాట్లాడారు. పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీరు, పార్కింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, క్రీడా మైదానం నిర్మించాలని కోరుతూ జీపీ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో అప్పయ్య, ఉమేష్, విరుపణ్ణ, వీరేష్, నాగప్ప, అజ్మీర్ శంశుద్దీన్లున్నారు. -
ఎరువుల కోసం రైతులు బారులు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పొలాల్లో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఖరీఫ్‌లో ముందుగానే వానలు కురిశాయి. రైతులు కూడా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది 3.44 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయడానికి రంగం సిద్ధమైంది. 84 వేల హెక్టార్లలో నీటి పారుదల, మిగిలిన హెక్టార్లలో ఏకదళ, ద్విదళ ధాన్య, వాణిజ్య పంటలు పండించడానికి అవకాశం ఉంది. జిల్లాలో 1.71 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంది. కేఎస్‌ఎంఎఫ్‌లో 7,393 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ దుకాణాల్లో 738.10 మెట్రిక్ టన్నులు, 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉంది. ఖరీఫ్‌కు సరిపడా ఎరువులు నిల్వ ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మహ్మద్ హుసేన్ వెల్లడించారు. రైతు కేంద్రాల్లో రైతులకు ఎరువులు, క్రిమి సంహారక మందులు నిల్వ ఉన్నాయని తెలిపారు. మరో వైపు రైతులు ఎరువులు, క్రిమి సంహారక మందుల కోసం దుకాణాల ముందు బారులు తీరి నిలబడి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభం ముందుగానే కురిసిన వానలు -
ఏటీఎంల వద్ద పటిష్ట భద్రత కల్పించాలి
హొసపేటె: విజయనగర జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది, ఏటీఎం యాజమాన్యం, ఏటీఎంల్లో డబ్బు నింపే ఏజెన్సీల అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు, పోలీసు అధికారులతో బుధవారం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జాహ్నవి మాట్లాడుతూ నగరంలో అనేక ఏటీఎంల వద్ద సరిగా సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో ఇటీవల రైల్వే స్టేషన్ రహదారిలోని కనకదాసు సర్కిల్ వద్ద ఏటీఎంలో దుండగులు చోరీ యత్నానికి పాల్పడ్డారన్నారు. బ్యాంక్ ఏటీఎంల్లో డబ్బులు నింపే ఏజెన్సీల అధికారులు, బ్యాంక్ లావాదేవీల విషయంలో తప్పనిసరిగా నియమాలను పాటించాలన్నారు. బ్యాంకు ఏటీఎంల్లో డబ్బు నింపడం, తరలించడంపై వివరాలు తెలుసుకున్నారు. అందరూ ఎలా పని చేస్తున్నారో పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో 30 బ్యాంకుల అధికారులు, లీడ్ బ్యాంక్ జిల్లా స్థాయి అధికారి వీరేంద్రకుమార్, ఏఎస్పీ మంజునాథ్, డీఎస్పీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
డీసీఎంతో ఎమ్మెల్యేల భేటీ
● జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలని వినతి సాక్షి,బళ్లారి: జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్‌ను కలిశారు. గురువారం నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే గణేష్ తదితరులు డీసీఎంను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు చెందిన పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. రోడ్లు, వంతెనలు, మంచినీటి సమస్య తదితరాలపై సమగ్రంగా చర్చించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. ఎమ్మెల్యేల అభ్యర్థనలపై స్పందించిన డీసీఎం కంప్లి, బళ్లారి నగరాభివృద్ధికి సంపూర్ణంగా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. అవసరమైన చర్యలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని తెలిపారు. పాము కాటుకు రైతు బలి రాయచూరు రూరల్: పాము కరిచి ఓ రైతు మృతి చెందిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం అరకెర తాలూకా కరడిగుడ్డలో పొలం పనులు చేస్తుండగా బసవరాజ్(54)ను పాము కరవడంతో దేవదుర్గ తాలూకాస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ రైతు గురువారం ఆస్పత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. మౌలిక సౌకర్యాలకు పెద్దపీట రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరులో మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత కల్పించాలని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. గురువారం సింధనూరు నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తాగునీటి జలాశయం, వివిధ ప్రాంతాల్లో వర్షాకాలంలో మురుగు కాలువల్లో పూడిపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తుర్విహాళ్ ప్రభుత్వాస్పత్రిని, ఇందిరా క్యాంటీన్లను సందర్శిచి రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. రైతులకు ఎరువుల, పురుగు మందుల కొరత రాకుండా దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. చెరువులను సంరక్షించండి రాయచూరు రూరల్: నగరంలో పురాతన కాలం నాటి చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి బోసురాజు వెల్లడించారు. గురువారం నగరంలోని నీరుబావికుంటలో చెరువుల సంరక్షణకు శ్రీకారం చుట్టి ఆయన మాట్లాడారు. పట్టణాలకు తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పైపులైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పురాతన కాలం నాటి చెరువులకు మహర్దశ కల్పించాలనే సదాశయంతో పనులను త్వరిగతిన చేపట్టాలన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, ఎంపీ కుమార నాయక్, నేతలు లక్ష్మిరెడ్డి, బసవరాజ్ పాటిల్, రుద్రప్ప, జయంత్ రావ్, శేఖర్‌రెడ్డి, శివమూర్తి శాంతప్ప, గోవింద రెడ్డి, నరసింహులు, సుభాష్‌లున్నారు. రూ.వెయ్యి లంచం.. నాలుగేళ్ల జైలుహోసూరు: తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెళ్లి సహాయ నిధి పథకం ద్వారా అర్హులకు నిధి సహాయం అందజేసేందుకు రూ. వెయ్యి లంచం పుచ్చుకొన్న మహిళా ఉద్యోగినికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ క్రిష్ణగిరి కోర్టు తీర్పునిచ్చింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా మత్తూరు దగ్గర కణ్ణండహళ్లి గ్రామానికి చెందిన రంగస్వామి కూతురికి ప్రభుత్వ పెళ్లి సహాయ నిధి పథకానికి గత 2008లో దరఖాస్తు చేసుకొన్నాడు. ఆ సమయంలో బీడీవో ఆఫీసు ఉద్యోగిని ఇంద్రాణి (45), వెయ్యి రూపాయల లంచం డిమాండ్ చేసింది. రంగస్వామి క్రిష్ణగిరి ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకుంటూ ఉండగా పోలీసులు ఇంద్రాణిని అరెస్ట్ చేశారు. ఈ కేసు క్రిష్ణగిరి కోర్టులో జరుగుతూ వచ్చింది. గురువారం ఉదయం కేసును విచారణ జరిపిన న్యాయమూర్తి లత.. ముద్దాయికి నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
మైసూరులో బీజేపీ సంబరాలు
మైసూరు: ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసిన నేపథ్యంలో బుధవారం మైసూరులో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేఆర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీవత్స, కార్యకర్తలు అగ్రహార సర్కిల్ నుంచి గణపతి దేవస్థానం వరకు జాతా నిర్వహించారు. మోదీ పేరిట ఆలయంలో అర్చనలు చేయించారు. చంద్రమౌళేశ్వరి దేవస్థానంలో ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని సుదీర్ఘ పాలనలో దేశం మరింత ప్రగతి సాధించాలని ప్రార్థించారు. పార్టీ నేతలు ఎల్.నాగేంద్ర, సినీ నటుడు ఎస్.జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఊరికి వెళ్తే.. రూ.30 లక్షల నగలు మాయం దొడ్డబళ్లాపురం: ఇంటి తాళం పగలగొట్టిన దొంగలు లోపలకు జొరబడి బీరువాలో ఉన్న రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, వెండి సొత్తును దోచుకున్నారు. బెంగళూరు కదిరేనహళ్లిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు అరుణ్‌కుమార్ రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసుకుని కుటుంబ సమేతంగా బంధువుల ఊరికి వెళ్లాడు. గమనించిన దొంగలు చొరబడి బీరువాను పగలగొట్టి అందులోని బంగారు నగలు, వెండి వస్తువులు, పట్టుచీరలు మూటగట్టుకుని పరారయ్యారు. బుధవారంనాడు ఇంటికి తిరిగి వచ్చిన అరుణ్ లబోదిబోమంటూ మాదనాయకనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైషుగర్ను విస్తరించాలి మండ్య: మైషుగర్ కర్మాగారం పునశ్చేతనానికి అవసరమైన బాయ్లింగ్ హౌస్, డిస్టిలరీ, విద్యుత్ యూనిట్లు సంపూర్ణ సామర్థ్యంతో పనిచేయాలని, రాష్ట్రంలో ఆదర్శ చక్కెర కర్మాగారంగా మైషుగర్ను ప్రకటించాలని పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని రైతు సభాంగణం ఆవరణలో జాతీయ కవి కువెంపు ప్రతిమ ఎదుట నిరసన తెలిపారు. ఈ నెల 15 నుంచి చేపట్టిన రైతు జనాందోళన పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తే ఎంతో మంది రైతులకు అనుకూలం కావడంతో పాటు సుమారు వెయ్యి మందికి పైగా స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. రైతు జనాందోళన జాతా ఈనెల 15 నుంచి మైషుగర్ పరిధిలోని 110 గ్రామాల్లో సంచరించి చైతన్యపరుస్తుందన్నారు. రైతు సంఘం ఉపాధ్యక్షుడు శివళ్లి చంద్రు, కొమ్మేరహళ్లి ఆనంద్, హెచ్డీ జయరాం పాల్గొన్నారు. పెద్ద పులి పట్టివేత మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకాలోని తట్టెకెరె వద్ద ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హెచ్‌పీ మంజునాథ్‌కు చెందిన తోటలో బోనులో పులి పట్టుబడింది. గత నెల రోజులుగా తట్టెకెరె గ్రామంతో పాటు చుట్టుపక్కల పల్లెల ప్రజలు పులి సంచారంతో బిక్కుబిక్కుమంటున్నారు. తరచూ ఆవులు, ఎద్దులను వేటాడి చంపుతోంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు 10 సీసీ కెమెరాలను అమర్చి, దాని కదలికలపై నిఘా పెట్టి బోనులను కూడా ఏర్పాటు చేశారు. తోటలోని బోనులో పులి బందీ అయింది. పులిని అక్కడి నుంచి తరలించారు. కాగా రెండు పులులు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. మరొక పులి ఉంటే దానిని కూడా పట్టుకుంటామని అటవీ అధికారులు తెలిపారు. ప్రైవేటు స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన హెడ్మాస్టర్ కిరాతకునిలా వేధించడంతో ఓ విద్యార్థి ప్రాణం గాల్లో కలిసింది. ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీదర్ నగరంలోని ప్రతాప్ నగరలో చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న సమీర్ (16) బుధవారం ఉదయం స్కూల్‌కి వెళ్లిన కొంతసేపటికే పాఠశాల 4వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హెచ్ఎం, సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు, తల్లిదండ్రులకు చెప్పకుండా మృతదేహాన్ని బ్రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పలు కారణాలతో స్కూల్ హెడ్ మాస్టర్ వేధిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. బీదర్ న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య
యశవంతపుర: ఇంట్లో రివాల్వర్‌తో కాల్చుకుని మహిళ అనుమానాస్పద రీతిలో చనిపోయిన ఘటన చిక్కమగళూరు నగరంలోని హాళేనహళ్లిలో జరిగింది. వ్యాపారవేత్త రాజేంద్ర భార్య సుమ (55) గృహిణి. బుధవారం ఇంట్లో లైసెన్స్డ్ రివాల్వర్‌తో ఆమె కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు ముందు డెత్‌నోట్ రాసి పెట్టారు. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త బయటకు వెళ్లాడు, కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. తుపాకీ కాల్పుల శబ్ధాలు విని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.బెయిలు రద్దు అర్జీ తిరస్కృతి యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో విడుదలైన ఐదుమంది నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసుల న్యాయవాది దాఖలు చేసిన అర్జీని హైకోర్టు తిరస్కరించింది. పవన్, ధనరాజు, రాఘవేంద్ర, వినయ్, నందీశ్‌లకు పెద్ద ఊరట కలిగింది. ఐదుగురికీ గతంలో కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రాసిక్యూషన్ కోరింది. న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రాచయ్య విచారించి రద్దు చేశారు. దర్శన్ భార్యకు వేధింపులు దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మిని సోషల్ మీడియా ద్వారా ఆకతాయిలు వేధిస్తున్నారు. ఆమెను కించపరుస్తూ అశ్లీల మెసేజ్‌లు పెడుతున్నారు. భర్త జైల్లో ఉంటే ఈమె మాత్రం కార్లలో షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తోందని నానా రకాలుగా నిందిస్తున్నారు. దీంతో విసిగిపోయిన విజయలక్ష్మి బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళ ఉత్సవాలకు రండి ప్లీజ్ ● కన్నడిగులకు కేరళ డీఐజీ వేడుకోలు యశవంతపుర: కేరళలో కణ్ణూరు జిల్లాలోని కొట్టియూరు దేవస్థానంలో జరిగే వైశాఖ మహోత్సవంలో పాల్గొనాలని కన్నడ భక్తులకు కణ్ణూరు డీఐజీ కన్నడంలో విన్నవించారు. ఇన్‌స్టాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. గత సంవత్సరం కణ్ణూరులో వైశాఖ మహోత్సవం రోజున గొడవలు జరిగాయి. దీనివల్ల కన్నడ భక్తులు ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఈ ఏడాది వెళ్లాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. దీనివల్ల అక్కడ పర్యాటకానికి గండి పడే ప్రమాదం ఉన్నందున డీఐజీ యతీశ్ చంద్ర మాట్లాడుతూ ఈసారి అలాంటి ఘటనలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. దేవస్థానం చుట్టుపక్కల భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మీ జతలో పోలీసులం ఉంటాం, ఎవరూ భయపడవలసిన పని లేదంటూ భరోసా ఇచ్చారు. ఆలయ సిబ్బంది దౌర్జన్యం గతేడాది వైశాఖ మహోత్సవంలో పాల్గొన్న భక్తులపై దేవస్థానం సిబ్బంది దౌర్జన్యంగా ప్రవర్తించారు. దీనికి నిరసనగా కొందరు కన్నడ భక్తులు ఈసారి వైశాఖ మహోత్సవాలకు రాబోమంటూ వీడియోలు తీసి నెట్లో పోస్ట్ చేశారు. దీంతో డీఐజీ కన్నడిగులను వేడుకోవాల్సి వచ్చింది. దుస్థితిలో శివమొగ్గ ఎయిర్‌పోర్టు శివమొగ్గ: ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన శివమొగ్గ విమానాశ్రయం రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం కారణంగా విమానాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. శివమొగ్గ విమానాశ్రయంలో రాత్రివేళ ల్యాండింగ్ కావడానికి సమస్య ఉందని, అదనపు స్థలం కావాలని అటవీశాఖను కోరినట్లు తెలిపారు. నైట్ ల్యాండింగ్ సౌకర్యానికి కావాల్సింది రూ. 7 కోట్లేనని, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. అందుకే మూడు నెలలుగా స్పైస్‌జెట్ విమానాలను నిలిపివేసిందన్నారు. మరోవైపు 4,399 రోజుల పాటు ప్రధాని హోదాలో రికార్డు సృష్టించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నేతగా మారారని కొనియాడారు. -
చువ్వలు తేలి.. పైకప్పు పెచ్చులూడి..
రాయచూరు రూరల్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే పాఠశాల విద్యా శాఖ తాలూకా అధికారి(బీఈఓ) కార్యాలయం నగరంలో శిథిలావస్థకు చేరుకుంది. ఈ కార్యాలయం నిర్మించి 50 ఏళ్లు దాటినా మరమ్మతులకు మాత్రం నోచుకోవడం లేదు. కార్యాలయం పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. ఈ విషయంలో చొరవ చూపాల్సిన ప్రజా ప్రతినిధులు ఏరోజు కూడా ఈ కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. జిల్లాధికారి, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి(డీడీపీఐ) కూడా కార్యాలయం స్థితిగతుల గురించి ఏనాడూ పరిశీలించిన, పట్టించుకున్న సందర్బాలు లేవు. ఇటీవల కురిసిన వానలకు భవనంపై కప్పుపై నీరు నిలిచి కారడంతో పాటు పెచ్చులూడి కింద పడడంతో సిబ్బంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అధికారులు, సిబ్బంది, పనిపై కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయులు ఏ సమయంలో పెచ్చులూడి తమపై పడతాయోననే భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. తాలూకా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు భాగంలో పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. నూతన జిల్లాధికారి కార్యాలయం మినీ విధానసౌధకు తరలి పోగా, నగరసభ కార్యాలయాన్ని పాత జిల్లాధికారి కార్యాలయానికి తరలించారు. కానీ బీఈఓ కార్యాలయాన్ని మాత్రం వేరే చోటకు తరలించడం లేదు. ఈనేపథ్యంలో ఈ సమస్యపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శిథిలావస్థకు చేరిన బీఈఓ కార్యాలయం 50 ఏళ్లు దాటినా మరమ్మతులు శూన్యం -
కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
రాయచూరు రూరల్: కలబుర్గి డివిజన్ పరిధిలోని ఆరు జిల్లాల్లో విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం కలబుర్గి డివిజన్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవ ప్రభు మాట్లాడారు. విశ్వ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న 281 మందిని పర్మినెంట్ చేయడానికి రాష్ట్ర సర్కార్ ముందుకు రావాలన్నారు. 45 రోజులుగా ఆందోళన చేస్తున్నా ఫలితం లేకపోవడంతో కార్యాలయాన్ని ముట్టడించారు. మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో కొంత మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలను పెంచి ఆదుకోవాలని కోరుతూ వైస్ చాన్సలర్ రమేష్‌కు వినతిపత్రం సమర్పించారు. -
ఏటీఎంల్లో నగదు చోరీకి యత్నం
సాక్షి,బళ్లారి/హొసపేటె: వేర్వేరు చోట్ల ఏటీఎంల్లో నగదు చోరీలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొప్పళలో ఏటీఎంలో డబ్బులు దోచుకోడానికి యత్నించిన దుండగులు, ఆ ప్రయత్నం విఫలం కావడంతో చివరకు ఏటీఎంకు నిప్పు పెట్టిన ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. కొప్పళ నగరంలోని హొసపేటె రోడ్డులో ఉన్న ఏటీఎంలో కొందరు దుండగులు దోపిడీ చేయడానికి విఫలయత్నం చేశారు. ఏటీఎంలోని డబ్బులు దోచుకోవడానికి వీలు కాకపోవడంతో ఏటీఎం యంత్రానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఏటీఎంకు నిప్పు పెట్టిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఏటీఎంకు నిప్పు అంటుకుందని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరిన పోలీసులు సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అక్కడి పోలీసు అధికారి తెలిపారు. హొసపేటెలో... హొసపేటె: నగరంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న కనకదాస సర్కిల్లోని బోడ రంగప్ప ఇంటి సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులను దొంగలించేందుకు దొంగల ముఠా ముమ్మరంగా ప్రయత్నించిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. జనసంచారం లేని సమయాన్ని గమనించి అర్ధరాత్రి వేళ నలుగురు వ్యక్తుల బృందం ఏటీఎంను దోచుకోవడానికి యత్నం చేశారు. దొంగలు ఏటీఎం మిషన్‌లో ఉన్న డబ్బులు దొంగలించేందుకు ప్రయత్నిస్తు సమయంలో సీసీటీవీపై స్ప్రే చేయడంతో సైరన్ మోగింది. దీంతో విజయనగర పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందింది. పోలీస్ కంట్రోల్ రూం నుంచి నైట్ బీట్ పోలీసులకు సమాచారం చేరింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేలోపు అప్రమత్తమైన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై హొసపేటె టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. విఫలమై నిప్పు పెట్టిన దుండగులు కొప్పళ నగరంలో ఘటన కలకలం -
మేలుకోటె ఆలయంలో ఇంటి దొంగలు
మండ్య: జిల్లాలోని ప్రఖ్యాత మేలుకోటె యోగ నరసింహస్వామి దేవస్థానంలో ఇంటి దొంగల నిర్వాకం బయటపడింది. అర్చకుడు నారాయణభట్టతో పాటు ఆరుమందిపై మేలుకోటె పోలీసు స్టేషన్లో దొంగతనం కేసు దాఖలైంది. చెలువనారాయణ స్వామి దేవాలయ ఈఓ శీలా మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆలయ రక్షకుడు శ్రీధర్, అర్చకుడు నారాయణ భట్ట, పరిచారకుడు తిరువేంగడాచార్, కాపలాదారులు ఎంబీ గంగాధర, బసవరాజు, కోశాధికారి కస్తూరి శ్రీనివాసన్‌పై ఐపీసీ సెక్షన్ 306 కింద ఎఫ్ఐఆర్ దాఖలు అయింది. ఆలయ హుండీలోని బంగారం, వెండి, కానుక డబ్బులు, సీసీ కెమెరాల ధ్వంసం జరిగినట్లు శీలా ఫిర్యాదు చేశారు. పోలీసులు యోగానరసింహస్వామి బెట్టకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రహస్య కెమెరాలలో.. చాలాకాలంగా హుండీలో భక్తులు వేసిన బంగారం, వెండి, నగదు చోరీ అవుతున్నట్లు తనకు అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దొంగలను గుర్తించేందుకు గర్భగుడి, ఇతర చోట్ల రహస్య కెమెరాలను ఏర్పాటు చేసినట్లు శీలా తెలిపారు. అయితే జనవరి 5న మధ్యాహ్నం ఆ కెమెరాలను నాశనం చేసి డీవీఆర్‌ను కాల్చివేసినట్లు తెలిసిందన్నారు. ఆ రోజు విధుల్లో ఉన్న అందరికి నోటీసులు జారీ చేసినట్లు, ఆ ఆరు మందిపై ఫిర్యాదు చేసినట్లు శీలా తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తజనంలో తీవ్ర ఆదుర్దా నెలకొంది. హుండీలలో డబ్బు, బంగారం చోరీ ఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు -
మామిడి.. మద్దతు ధర కొరవడి..
హొసపేటె: తన మామిడి పండ్లకు సరైన మద్దతు ధర లభించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఒక రైతు కలకేరి–వడకి రహదారిపై సుమారు 3 క్వింటాళ్ల మామిడి పండ్లను రోడ్డు పక్కన కుమ్మరించి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాకు చెందిన రైతు ఈశప్ప పండించిన మామిడి పండ్లకు మార్కెట్ ధర పడిపోవడంతో, అతనికి కూలీ సొమ్ము కూడా అందడం లేదు. మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్న ఆ రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో అతను తన ఆటోలో తెచ్చుకున్న మామిడి పండ్లను రోడ్డు పక్కన పారబోశాడు. పంట పండించడానికి పెట్టిన పెట్టుబడి డబ్బు కూడా తిరిగి రావడం లేదు. పంట కోతకు, రవాణాకు అయ్యే కూలీ సొమ్ములు కూడా చెల్లించడానికి కావడం లేదు. ఏం చేయాలో తెలియక విసిగి పోయి, వాటినంతా రోడ్డు పక్కన పారవేశాను అని రైతు ఈశప్ప తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పెట్టుబడి దక్కక 3 క్వింటాళ్ల పండ్లను రోడ్డు పక్కన పారబోసిన రైతు -
విధానసౌధ ఆవరణలో రైతన్న ఘోష
శివాజీనగర: విధానసౌధ ఆవరణలో ఉన్న చెట్టుకు ఓ రైతు మంగళవారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర సంచలనం కలిగించింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన అద్దం పట్టింది. వివరాల ప్రకారం.. చిక్కమగళూరు జిల్లా హుళియూరు గ్రామానికి చెందిన విశుకుమార్ (52) అనే రైతు విధానసౌధ ఆవరణలోని చెట్టుకు ఎక్కి ఉరి వేసుకోవడానికి ప్రయత్నించారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం తన గంధపు తోటను స్వాధీనం చేసుకొని, పరిహారం చెల్లించలేదని రైతు తెలిపాడు. గతంలోనూ ఇదే సమస్యలో 2025లో ఆయన విధానసౌధకు వచ్చి చెట్టును నరికి నిరసన తెలిపాడు. ఇప్పుడు అదే చెట్టు వద్దకు చేరుకొని ఆకుపచ్చ టవల్‌తో ఉరి బిగించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆయనను గమనించి కిందకు రప్పించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. జిల్లాధికారికి కోర్టు ఆదేశించినా.. ఆ తరువాత రైతు మీడియాతో మాట్లాడుతూ నా భూమిని స్వాధీనం చేసుకుని ఇంతవరకూ పరిహారాన్ని ఇవ్వలేదని ఆరోపించారు. నాలుగు వారాల్లో పరిష్కరించి పరిహారాన్ని చెల్లించాలని చిక్కమగళూరు జిల్లాధికారికి న్యాయస్థానం ఆదేశించింది, అయితే 3 నెలలు గడచినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తోటలో శ్రీగంధపు చెట్లను పెంచాను, నోటీస్ ఇవ్వకుండానే చెట్లను కట్ చేయడానికి వచ్చారు అని అధికారుల ఆగడాలను వివరించారు. చెట్టుకు ఉరివేసుకునే యత్నం భూమికి పరిహారం ఇవ్వలేదని వెల్లడి -
చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టండి
రాయచూరు రూరల్: నగరంలో చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బోసురాజు సూచించారు. మంగళవారం నగరంలోని రాంపుర తాగునీటి చెరువు సంరక్షణపై అధికారులతో మాట్లాడారు. పట్టణాలకు తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని పైపులైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు. శాంతప్ప, తాయన్న నాయక్, జయన్న, శివమూర్తి, రుద్రప్ప అంగడి, అమరేగౌడ, శాలంలున్నారు. అంబేడ్కర్ ప్రతిమ ఏర్పాటుకు వినతి రాయచూరు రూరల్: నగరంలో అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని చలువాది మహాసభ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు విశ్వనాథ్ పట్టి మాట్లాడారు. ఏడాది క్రితం కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యం కాకుండా త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లాధికారిణి పూవితకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో వసంత్‌కుమార్, రవీంద్రనాథ్, తమ్మణ్ణ, బాబు, పుష్పరాజ్, దొడ్డమని, యల్లప్ప, విజయ్ ప్రసాద్, శరణప్ప, చెన్నరాయుడులున్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం రాయచూరు రూరల్: మనిషి సంపూర్ణ ఆరోగ్య రక్షణకు యోగాపై శ్రద్ధ చూపాలని యోగా శిక్షకుడు తిమ్మప్ప పేర్కొన్నారు. బుధవారం ఆయుర్వేద ఆస్పత్రిలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆయుర్వేద, యునాని శాఖల ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా 11 రోజుల పాటు జరిగే యోగా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. యోగాసనాలతో ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అధికారులు శంకర్‌గౌడ ఐ పాటిల్, శంకర్ గౌడ, పూజాలున్నారు. పచ్చదనం వృద్ధికి పెద్దపీట రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి పట్టణంలో పచ్చదనం వృద్ధికి పరిసరాలను సంరక్షించాలని మాజీ నగరసభ అధ్యక్షురాలు లక్ష్మిదేవి పేర్కొన్నారు. బుధవారం మాన్వి తాలూకా పంచాయతీ కార్యాలయం వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాజా వసంత నాయక్ జ్ఞాపకార్థం మొక్కలు నాటి మాట్లాడారు. భవిష్యత్తులో ఎండల వేడిమి నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. భూగర్భ జలాల పెంపుదలకు ప్రాముఖ్యతనివ్వాలని అన్నారు. -
అంతర్రాష్ట్ర జల వివాదాలు కొలిక్కి
రాయచూరు రూరల్: తెలంగాణ, కర్ణాటక అంతర్రాష్ట్ర జల వివాదాలకు తెరదించడానికి ఇరు రాష్ట్రాల నాయకులతో చర్చలు కొలిక్కి వచ్చే దశలో ఉన్నాయని మాజీ మంత్రి, విధాన పరిషత్ సభ్యుడు ఎన్ఎస్ బోసురాజు పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతం యాదగిరి, నారాయణపేట మధ్య గుడ్డందొడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మక్తల్, నారాయణపేటె, కోడంగల్లకు భీమా, కృష్ణా నదుల నుంచి నీటిని పొందుతున్నారన్నారు. నీటి వినియోగం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సుముఖంగా ఉన్నారన్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండడం వల్ల నారాయణపుర డ్యాం నుంచి కింది భాగంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర రైతుల శ్రేయస్సు కాపాడగలమన్నారు. నారాయణపుర డ్యాం నుంచి కింది భాగంలో బ్యారేజీ కం, బ్రిడ్జిల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ సానుకూలంగా ఉందన్నారు. నూతన మంత్రివర్గంలో పదవి కోసం పాకులాడటం లేదన్నారు. ఆల్మట్టి ఎత్తును పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలన్నారు. చిక్క మంచాల, చీకలపర్విల వద్ద బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. నూతనంగా మటమారి వీరభద్రేశ్వర ఎత్తిపోతల పథకానికి అనుమతి లభించిందన్నారు. ఎంపీ కుమార నాయక్, రుద్రప్ప అంగడి, అమరేగౌడ, శాంతప్ప, జయన్న, తాయన్న నాయక్, సమీర్, నరసింహులు, శాలం, శివమూర్తిలున్నారు. -
ఢిల్లీ యాత్రలో సీఎం బిజీ బిజీ
శివాజీనగర: రాష్ట్ర మంత్రిమండలిలో నెలకొన్న లుకలుకలకు పరిష్కార మార్గం కనిపెట్టేందుకు ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ ఢిల్లీ యాత్రలో ఉన్నారు. బుధవారం కాంగ్రెస్ హైకమాండ్‌తో సమాలోచనలు జరిపారు. ఢిల్లీలో బుధ, గురువారం జరగనున్న కేంద్ర ప్రభుత్వ అధికారిక సమావేశాలు, నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. పనిలో పనిగా కేబినెట్లో మంత్రుల అలకలు, ముఖ్యమైన శాఖలు ఇవ్వలేదని మంకుపట్లను ఎలా తీర్చాలనేది పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. బెంగళూరు నగరాభివృద్ధి శాఖలోని బీడీఏ, బీఎంఆర్డీఏ విభాగాలను తనకు ఇవ్వనందుకు కృష్ణబైరేగౌడ కినుక వహించి, ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు విన్నవించుకొన్నారు. బీఎంఆర్డీఏను ముఖ్యమంత్రి శివకుమార్ తన వద్దే ఉంచుకొన్నారు. ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప కూడా అసంతృప్తితో ఉన్నారు. అలకబూనినవారికి నచ్చజెప్పాలని ఆయన పార్టీ పెద్దలను కోరనున్నారు. 20 మంత్రి బెర్తులు ఖాళీ హైకమాండ్ నేతలతో సీఎం డీకే సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశముంది. ఇంకా 20 మంత్రి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను 30 మందికి పైగా బలమైన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. పరిపాలన వేగంగా సాగాలంటే పూర్తిస్థాయిలో కేబినెట్ ఏర్పడాలని, కాబట్టి త్వరగా మంత్రివర్గంలోని ఖాళీలను భర్తీ చేయాలని డీకే కోరనున్నారు. ఈ నెల ఆఖరికి మంత్రివర్గ విస్తరణ నెరవేర్చే అవకాశముంది. మళ్లీ 21వ తేదీ తరువాత సిద్దరామయ్యతో కలసి ఢిల్లీకి వెళ్లి నూతన మంత్రులు ఎవరెవరనేది హైకమాండ్‌తో చర్చించి ఫైనల్ చేస్తారని తెలిసింది. ఎమ్మెల్యేల మకాం సీఎం ఢిల్లీలో ఉండగా, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హస్తినకు వెళ్లారు. సుమారు 15 మందికి పైగా ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రే వెళ్లారు. మంత్రి పదవి కావాలని, తమ అర్హతలను వివరిస్తూ పార్టీ పెద్దలకు దరఖాస్తులు ఇచ్చారని తెలిసింది. కుర్చీ కోసం తమకు తెలిసిన మార్గాల్లో తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. కొందరు ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కే.సీ.వేణుగోపాల్, సుర్జేవాలాలను భేటీ చేసి మంత్రి గిరీ కోసం విన్నవించారు. హైకమాండ్ కూడా ఎమ్మెల్యేల జాబితా తీసుకుని వారి గుణగణాలు, ప్రాంతం, తదితరాలను పరిశీలించి ఓ జాబితాను రూపొందిస్తుంది, డీకే, సిద్దు కలిసి పలు దఫాల చర్చల తరువాత ఖరారు చేయవచ్చని సమాచారం. ఢిల్లీలో సోనియాగాంధీని కలిసిన సీఎం డీకే శివకుమార్, చిత్రంలో రాహుల్, ప్రియాంకగాంధీమంత్రి పదవుల ఎంపికలు హైకమాండ్‌కు సవాలే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో డీకే శివకుమార్ సమావేశం కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలతో చర్చలు నేడు పలు భేటీలకు హాజరు సోనియాగాంధీతో భేటీ ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని సీఎం డీకే కలిశారు. సోనియాగాంధీని ఆమె నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. రాత్రికి సీఎం ఢిల్లీలో మకాం వేశారు. కర్ణాటక సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో విందులో పాల్గొన్నారు. గురువారం ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల అనుమతుల గురించి చర్చిస్తారని తెలిసింది. -
హిందువుల అడ్డగింత తగదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో హిందువులను అడ్డుకోవడం తగదని హిందూ సంఘాల కార్యకర్త పునీత్ కెరెనళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మైసూరు నుంచి రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా హట్టిలో జరిగే హిందూ సమావేశానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడంతో పాటు జిల్లాలోకి ప్రవేశాన్ని నిర్బంధిస్తూ జిల్లాధికారిణి పూవిత, ఎస్పీ అరుణాంగ్శు గిరి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తాను మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చానని, నోటీసులు స్వీకరించడం వీలు కాదని పోలీసులతో వాగ్వాదం చేశారు. హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని, హిందూ సమావేశానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడం తగదని పునీత్ ఆరోపించారు. రాయచూరు జిల్లాలో ప్రవేశించే సమయంలో నోటీసులు జారీ చేయాలని, అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయొద్దు
బళ్లారిటౌన్: బళ్లారిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయరాదని కన్నడనాడు రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సంఘం నేతలు జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. బళ్లారి జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయని, హెల్మెట్ ధరించడం వల్ల దీని ప్రభావం ఆరోగ్యంపై చూపుతుందన్నారు. బళ్లారి జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్నందున కూలీ కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర అనారోగ్యం పాలవుతారన్నారు. రోడ్డు ప్రమాదాలకు హెల్మెట్ ఒక్కటే కారణం కాదన్నారు. నగరంలో గోతులు పడ్డ అనేక రోడ్లు, జాతీయ రహదారిలో మద్యం అమ్మకాలు, నగరంలో భారీ ట్రాఫిక్ సంచారం ఉన్నందునే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల ట్రాఫిక్ పరిశీలన వేళలో జోళదరాశి గ్రామానికి చెందిన వీరేష్ అనే వ్యక్తి పోలీసులు పట్టుకుంటారని తప్పించుకోబోయి లారీ కింద పడ్డారని, దీంతో ఆ కుటుంబం వీధి పాలైందన్నారు. ఆ కుటుంబానికి పరిహారం కూడా అందజేయాలని డిమాండ్ చేశారు. కన్నడనాడు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప, పదాధికారులు ప్రహ్లాద్, శివమూర్తి, విజయ్‌కుమార్, యువరాజు, విరుపాక్షిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మస్తాన్, హుస్సేన్, శివకుమార్, పాల్గొన్నారు. -
మోదీతో మంచి అనుబంధం
బనశంకరి: నాకు ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక అనుబంధం ఉంది. అది రాజ్యసభ స్థానం కంటే ఎక్కువ అని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ అన్నారు. జేడీఎస్– బీజేపీ సంకీర్ణం నుంచి ఆయనకు రెండవసారి రాజ్యసభ సీటు దక్కలేదని కాంగ్రెస్ నాయకులు పలు రకాల విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవేగౌడ బుధవారం బెంగళూరులో పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం కంటే ప్రజాసేవ ముఖ్యమని అన్నారు. సీటు ఇవ్వకుండా అవమానం చేశారని కొందరు చెప్పడంలో అర్థం లేదన్నారు. నాకు, మోదీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, రాజ్యసభ సీటు దీనిని చెడగొడుతుందని ఎవరైనా భావిస్తే అది వారి మూర్ఖత్వమని దళపతి అన్నారు. తాను ఒకానొక సమయంలో మోదీని కటువుగా విమర్శించింది నిజమని, కానీ కొన్నేళ్లుగా నేను ఆయనను అర్థం చేసుకున్నానని తెలిపారు. మంచి పనులను మనస్ఫూర్తిగా కొనియాడానని అన్నారు. తాను ఊరికే కూర్చోనని, జేడీఎస్ బలోపేతానికి శక్తిమీరి పనిచేస్తానని, రాష్ట్ర కేంద్ర విషయాలపై మాట్లాడతానని కాంగ్రెస్‌ను ఉద్దేశించి తెలిపారు. రాజ్యసభ సీటు రాలేదని అపోహలు వద్దు దళపతి దేవేగౌడ వ్యాఖ్యలు -
ఘనంగా గాలి అరుణ బర్త్ డే
సాక్షి,బళ్లారి: గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. నగరంలోని బీజేపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలకు గోరింటాకు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ అరుణ తన చేతిపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని వేసుకుని ప్రధానిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కర్ణాటక రెడ్డి జన సంఽఘం ప్రముఖులు గణపాల్ ఐనాథరెడ్డి, ఓఎంసీ డైరెక్టర్ బీ.వీ.శ్రీనివాసరెడ్డి, అభిమానులు అరుణకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో పోటీకి సిద్ధం వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను బళ్లారి సిటీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని గాలి లక్ష్మీ అరుణ చెప్పారు. బళ్లారి సిటీ నియోజకవర్గం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే కచ్చితంగా తాను పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. ఒకవేళ తమ బావ గాలి సోమశేఖరరెడ్డికి పార్టీ టికెట్ కేటాయిస్తే ఐకమత్యంగా గెలిపించుకుంటామన్నారు. కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని చెప్పారు. -
మోదీ పేరిట ప్రత్యేక పూజలు
హొసపేటె: భారతదేశం గర్వించదగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని బుధవారం నగరంలోని నెహ్రూ కాలనీలో ఉన్న సన్నక్కి వీరభద్రేశ్వర ఆలయంలో బీజేపీ ఆధ్వర్యంలో సన్నక్కి వీరభద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్వాన్ అశోక్ జీరె, సాలి సిద్దయ్య స్వామి, ఆర్.కొట్రేష్, వీ.రాధ, గొగ్గ చెన్నబసవరాజు, శశిధర స్వామి తదితరులు పాల్గొన్నారు. లారీ దూసుకెళ్లి బైకిస్టు మృతిహుబ్లీ: జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ చోదకుడు మృతి చెందాడు. భరత్ నాగరాజ్(21) మృతుడు. భరత్ బైక్‌లో బమ్మిగట్టి క్రాస్ నుంచి ఏపీఎంసీ సమీపంలోని కాంప్లెక్స్‌కు వెళుతుండగా బైక్ ఆవును ఢీకొన్న తర్వాత లారీని ఢీకొంది. గాయపడి రోడ్డు మీద పడ్డ భరత్ భుజం మీదుగా మరో లారీ వెళ్లింది. భరత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడని కలఘటిగి పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మహిళ బలవన్మరణం మరో ఘటనలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక కొత్త మేదారవీధికి చెందిన వాసంతి కదం (32) అనే మహిళ కొన్నేళ్ల నుంచి ట్రేడ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు. అయితే ఇటీవల తీవ్రంగా నష్టం రావడంతో తమ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె తల్లి హుబ్లీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రక్కు బోల్తా.. డ్రైవర్ సురక్షితం హొసపేటె: కొప్పళ తాలూకా మునిరాబాద్ సమీపంలో జాతీయ రహదారి– 63పై లోడ్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చేతన్(25)కు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న జాతీయ రహదారుల శాఖ, 112 పోలీసు సిబ్బంది భీమన్న, హనుమంత సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను కొంతసేపటికి పరిష్కరించారు. నాగేంద్రకు మంత్రి పదవి కోసం ర్యాలీ బళ్లారిఅర్బన్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీ.నాగేంద్రకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కాగె పార్క్ నుంచి గడిగి చెన్నప్ప సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం నాగేంద్రకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సంగనకల్లు విజయకుమార్, వై.శివకుమార్, నాగలకెరె గోవింద్, నాగభూషణ గౌడ, బీఎం.పాటిల్, మల్లికార్జున, మల్లేశ్వరి తదితర అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటరు జాబితా సర్వే చేయండి రాయచూరు రూరల్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు చర్యలు చేపట్టాలని తహసీల్దార్ సురేష్ వర్మ బీఎల్ఓలకు సూచించారు. బుధవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఎల్ఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2.50 లక్షల మందిపై ఓటరు జాబితాల్లో సమీక్షలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లేకుంటే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 29 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టాలన్నారు. ముద్రితమైన ఓటరు జాబితాలో ఉన్న లోపాలను ఇంటి యజమానులతో సమీక్షించి సవరించాలన్నారు. సమావేశంలో విద్యాశాఖాధికారులు మల్లికార్జున, ఈరణ్ణ కోస్గి, శరణప్ప, అిసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ సజ్జన్లున్నారు. -
రాజ కాలువలు శుభ్రం చేయాలని ధర్నా
● మూడు గంటల పాటు మురుగు నీటిలో ఆందోళన రాయచూరు రూరల్: రాజ కాలువలను శుభ్రం చేయాలంటూ ఓ వ్యక్తి మూడు గంటల పాటు మురుగు నీటిలో ఆందోళన చేపట్టిన ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం బెళగావి జిల్లా బైలహొంగలలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కులకర్ణి వీధి, కూలికార్ కాలనీ, పాటిల్ వీధుల్లో మురుగు కాలువల్లో పేరుకు పోయిన చెత్తా చెదారాలు తొలగించకుండా వదిలి వేయడంతో ఈశ్వర్ అనే వ్యక్తి వర్షపు నీటిలో మూడు గంటల పాటు నిలబడి ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న బైలహొంగల మున్సిపల్ కమిషనర్ భాగ్యశ్రీ ధర్నా స్థలానికి వచ్చి కాలువల శుభ్రతకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఈశ్వర్ ధర్నాను విరమించారు. మరణంలోనూ వీడని బంధం● ఒకే రోజు తల్లీ, కుమారుడు మృతి హుబ్లీ: శతాయుష్కురాలైన తల్లి, ఆమె కుమారుడు ఇద్దరూ ఒకే రోజు మరణించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. అణ్ణిగేరిలోని కురుబ వీధికి చెందిన శతాయుషి గంగమ్మ(102), ఆమె కుమారుడు శంక్రప్ప(60) మృతులు. ముందుగా గంగమ్మ వయోసహజ మరణం చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు. ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్లగా ఇంట్లో ఉన్న ఆమె కుమారుడు శంక్రప్ప కూడా మృతి చెందాడని సమాచారం అందింది. వెంటనే శ్మశానంలో తల్లి అంత్యక్రియలను నిలిపి వేసి కుమారుడి మృతదేహాన్ని కూడా అంతిమయాత్ర ద్వారా తీసుకొచ్చి ఇద్దరికీ అంత్యసంస్కారాలు నెరవేర్చారు. తల్లీ, కుమారుడు చావులోను ఒక్కటయ్యారని, ఎంతో పుణ్యాత్ములు అని బంధువులు మాట్లాడుకున్నారు. కాగా శంక్రప్పకు భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెట్రో ధరలు తగ్గించండి రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ మాట్లాడారు. కేంద్ర సర్కార్ ఇటీవల ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డివిరుస్తోందన్నారు. మే 15 నుంచి 25 వరకు పెట్రోల్‌పై రూ.7.38, డీజిల్‌పై రూ.7.52, గ్యాస్ సిలిండర్‌పై రూ.100 చొప్పున పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రో ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఆందోళనలో జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, శాంతప్ప, శివమూర్తి, జాగీర్దార్, అస్లాం పాషా, పవన్, మర్రిస్వామి, శ్రీదేవి, శశికళ, సురేఖ, రజాక్ ఉస్తాద్‌లున్నారు. రైతుల సంక్షేమానికి ఎత్తిపోతల అవసరంరాయచూరు రూరల్: రైతుల సంక్షేమానికి ఎత్తిపోతల పథకాలు అవసరమని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసిందని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ పేర్కొన్నారు. మంగళవారం గ్రామీణ శాసన సభ్యుడి కార్యాలయంలో రైతులు ఆయనను సత్కరించిన సందర్భంగా మాట్లాడుతూ మటమారి వీరభద్రేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రూ.182 కోట్లతో 16 వేల ఎకరాలకు నీరందించే పథకానికి అనుమతి లభించిందన్నారు. విద్యార్థుల హాస్టళ్లను ప్రారంభించాలి రాయచూరు రూరల్: 2026–27వ విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైనందున హాస్టళ్ల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. మంగళవారం దేవదుర్గ తాలూకా సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు సంతోష్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా హాస్టళ్లను ప్రారంభించాలన్నారు. బయో మెట్రిక్ పద్ధతిని రద్దు చేయాలని కోరుతూ తాలూకా విద్యాశాఖాధికారి రాధాదేవికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో గిరియప్ప, అభిషేక్, రియాజ్, రాజు, మౌనేష్, బసవరాజ్, రామన్న, బాలు, హనుమంతులున్నారు. -
సండూరు రాజవంశీకుడు కన్నుమూత
బళ్లారిఅర్బన్: బళ్లారి జిల్లా సండూరు సంస్థాన రాజవంశానికి చెందిన ప్రముఖుడు, బీజేపీ నాయకుడు కార్తికేయ ఘోర్పడే (63) మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 6 గంటల సమయంలో తీవ్ర గుండెపోటుకు గురైన కార్తికేయ ఘోర్పడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్తికేయ ఘోర్పడే మాజీ మంత్రి ఎంవై ఘోర్పడే కుమారుడు. సండూరు రాజవంశ వారసుడిగా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. బీజేపీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తూ బళ్లారి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. సాధారణ జీవనశైలి, ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఆకస్మిక మరణంతో సండూరుతో పాటు బళ్లారి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తికేయ ఘోర్పడే పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి సండూరుకు తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం సండూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండెపోటుతో బెంగళూరులో తుదిశ్వాస -
త్వరలో అభివృద్ధి పనుల ప్రారంభం
బళ్లారిఅర్బన్: నగరంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనులను త్వరలో ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం 14వ వార్డులో నిర్వహించిన సలాం బళ్లారి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గడిగి చెన్నప్ప సర్కిల్, మహర్షి వాల్మీకి విగ్రహం, రహదారి పనులను ప్రజలకు అంకితం చేయనున్నట్లు చెప్పారు. అలాగే రూ.270 కోట్ల శాశ్వత తాగునీటి పథకానికి భూమిపూజ నిర్వహిస్తామన్నారు. భారీ వర్షాల సమయంలో అధికారులు, జెస్కాం సిబ్బంది సమర్థంగా పని చేశారని ప్రశంసించారు. పాత విద్యుత్ లైన్లు, స్తంభాల మార్పునకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేటర్ నూర్ మహమ్మద్, బీఆర్ఎల్ శీనా, మంజుల, పద్మ, థియేటర్ శివు, రాకీ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుకు నామకరణం నగర అభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖుల జ్ఞాపకార్థం రోడ్లకు పేరు పెట్టే కార్యక్రమంలో భాగంగా బళ్లారి మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఓ రోడ్డుకు ముండ్లూరు నరసింహప్ప రోడ్డుగా నామకరణం చేశారు. మంగళవారం నగరంలోని అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి నామఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సమాజ సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, బళ్లారి నగర అభివృద్ధికి విశేష కృషి చేసిన ముండ్లూరు నరసింహప్ప పేరిట రోడ్డుకు నామకరణం చేయడం గర్వకారణమన్నారు. ముండ్లూరు కుటుంబ సభ్యులు, మహానగర పాలికె కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి -
విత్తనాలు, ఎరువుల కొరత రానీయొద్దు
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ సూచించారు. తన కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాల పంపిణీపై జాగృతి జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో ముందుగానే వానలు కురిసినందున, రైతులకు ఎలాంటి విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే సబ్సిడీ పథకాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖాధికారిణి దీపా, నేతలు శ్రీనివాస్‌రెడ్డి, మల్లికార్జునగౌడ, బసవరాజ్, నాగేంద్రప్ప, బషీరుద్దీన్లున్నారు. -
జన జాతరగా చేప మందు పంపిణీ
రాయచూరు రూరల్: ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైనా పర్యటనకు వచ్చారా? లేక ఏదైనా జాతర, రథోత్సవానికి వచ్చారా? అనే విధంగా చేప మందు కోసం వేలాదిగా జనం తరలి వచ్చారు. సోమవారం సాయంత్రం కొప్పళ తాలూకా కుటుగానహళ్లిలో అశోక్‌రావ్ కులకర్ణి చేప మందును తమలపాకులో పంపిణీ చేశారు. మృగశిర కార్తెలో ఆయాసం, ఉబ్బసం ఇతర వ్యాధులు సోకిన వారికి చేప మందు వాడడం వల్ల వ్యాధి నయమవుతుందనే నమ్మకంతో గత 70 ఏళ్ల నుంచి చేప మందును పంపిణీ చేస్తున్నారు. ఈనేపథ్యంలో వందలాది కి.మీ.ల దూరం నుంచి ప్రజలు చేప మందు కోసం ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చి రాత్రి ఇక్కడే బస చేసి మందును తీసుకున్నారు. భారీగా కొప్పళకు తరలి వచ్చిన ప్రజలు -
ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీ
రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను సక్రమంగా అమలు చేసి, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వ మహత్వాకాంక్ష పథకం సంయుక్త కార్యదర్శి ఉజ్వల్ కుమార్ ఘోష్ సూచించారు. మంగళవారం రాయచూరు, గబ్బూరు, మసరకల్లోని ప్రభుత్వ ఆదర్శ విద్యాలయం, యరమరస్ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల చుట్టు పక్కల పరిశుభ్రతను పాటించి, వంట గది, తరగతి గదులు, గోదాములను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. వానా కాలంలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఒపెక్ ఆస్పత్రిని పరిశీలించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ ఈశ్వర్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఐసీడీఎస్ అధికారిణి శరణమ్మ, జిల్లా విద్యా శాఖాధికారి మల్లికార్జున, నందిత, ఒపెక్ ఆస్పత్రి అధికారి రమేష్‌లున్నారు. -
కేకేఆర్టీసీ బస్సు బోల్తా
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా మోరిగేరి క్రాస్ సమీపంలో కేకేఆర్టీసీ బస్సు యాక్సిల్ విరగడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. అయితే డ్రైవర్ చాకచక్యంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.45 గంటలకు హడగలి నుంచి హగరిబొమ్మనహళ్లి వైపు వెళుతున్న కేకేఆర్టీసీ బస్సు యాక్సిల్ పూర్తిగా విరగడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా, కొందరికి మాత్ర ం స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి తాలూకా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. నియామకం బళ్లారిటౌన్: జాతీయ మానవ హక్కుల పురుషుల హితరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడుగా ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి రామకృష్ణను నియమించినట్లు కమిటీ సంస్థాపక అధ్యక్షురాలు రజినీ రాజ్ వెల్లడించారు. మంగళవారం పత్రికా భవనంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమితిని కొద్ది రోజుల క్రితం మండ్య జిల్లాలో ప్రారంభించామన్నారు. ప్రతి జిల్లాలోను సమితిని ఏర్పాటు చేసి పురుషుల హక్కుల కోసం ఈ సమితిని ఏర్పాటు చేశామన్నారు. ఇంత వరకు మహిళలకు జరిగే అన్యాయాలు, హక్కులపై పోరాడుతూనే ఉన్నారన్నారు. కానీ ఇటీవల పురుషులపై కూడా పలువురు మహిళల నుంచి దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయన్నారు. మహిళల మేలు కోసం ఏర్పాటు చేసిన చట్టాల దుర్వినియోగంతో పురుషులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమాజంలో పురుషుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. తాము సమితి రచించినప్పటి నుంచి పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. తాము వెంటనే స్పందించి కౌన్సిలింగ్ ఇచ్చి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. బళ్లారి జిల్లాలోను పురుషులు వేధింపులకు గురవుతున్న వెంటనే స్థానిక అధ్యక్షుడిని సంప్రదించవచ్చని వివరించారు. కోశాధికారి వేదవల్లి, మేనేజింగ్ ట్రస్టీ శకుంతల, రామకృష్ణ పాల్గొన్నారు. కనకగిరిలో దారుణం● అత్యాచారం చేసి మహిళ హత్య ● ఆపై మృతదేహాన్ని కాల్చిన వైనం హుబ్లీ: నిర్మాణ దశలోని భవనంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం మంటల్లో కాలుతున్న స్థితిలో లభించిన ఘటన కొప్పళ జిల్లా కనకగిరిలో చోటు చేసుకుంది. కనకగిరి 5వ వార్డులో సంగప్పకు చెందిన సదరు నిర్మాణ దశలోని భవనం 3వ అంతస్తులో కాల్చి వేసిన స్థితిలో మృతదేహం లభించింది. దుండగులు మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి నిప్పు పెట్టి కాల్చినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కనకగిరి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. హితవు పలికాడని తండ్రి హత్యహుబ్లీ: హితవు పలికినందుకు తండ్రిపై కోపంతో కట్టెతో దాడి చేసి చంపిన ఘటన నగరంలోని గోపనకొప్ప సిద్దేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. కల్లప్ప మూలిమని(50) మృతుడు. ఈయన కుమారుడు మహేష్ నిందితుడు. కల్లప్ప కుమారుడు మహేష్‌కు తరచు బుద్ధిమాటలు చెప్పేవాడు. దీంతో ఆగ్రహం చెందిన కుమారుడు కట్టెతో ముందుగా ముఖం, ఆ తర్వాత తలపై బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కల్లప్ప మృతి చెందాడు. అశోక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డిమాండ్లు తీర్చాలని నిరసనహొసపేటె: వేతన బకాయిల చెల్లింపుతో సహా పలు డిమాండ్లను తీర్చాలని ఒత్తిడి చేస్తూ ఆశా కార్యకర్తలు నగరంలో నిరసన చేపట్టారు. ఏఐయూటీయూసీ అనుబంధ కర్ణాటక రాష్ట్ర యునైటెడ్ ఆశా వర్కర్స్ అసోసియేషన్ నేతృత్వంలో జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయం ముందు నిరసన తెలిపిన ఆశా కార్యకర్తలు, అనంతరం జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ శంకర్ నాయక్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకూ గత ఐదు నెలలుగా జీతాలు లేవన్నారు. స్కూళ్లు ఇప్పటికే తెరిచారు. నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆశాల జీవితాలతో చెలగాటం ఆడటం ఖండనీయమన్నారు. ఆశా కార్యకర్తలు మంగళ, మహేశ్వరి, చెన్నమ్మ, నాగమ్మ, సుప్రియ, గౌరి, రుక్కిణి, లక్ష్మీదేవి పాల్గొన్నారు. -
11న చరంతప్పజ్జ స్వాముల స్మరణోత్సవం
బళ్లారిటౌన్: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా గద్దికేరికి చెందిన మహిమాన్విహితుడు చరంతప్పజ్జ స్వాముల 22వ పుణ్య స్మరణ ఉత్సవాన్ని ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు పార్వతి నగర్‌లోని బసవ భవన్లో ఏర్పాటు చేసినట్లు నందిపుర పుణ్యక్షేత్రం డాక్టర్ మహేశ్వర స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అవార్డు ప్రదానం, వివిధ గ్రంథాల విడుదల, గ్రంథ ప్రదర్శన, ఉచిత కంటి చికిత్స శిబిరం, రక్తదానం శిబిరం, గుండె, ఎముకలు, కీళ్లు, యోగా థెరపీ వంటి శిబిరాలతో పాటు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. తొలి రెండు రోజులు సాయంత్రం 6.30 గంటల నుంచి కార్యక్రమాలు ఉంటాయని, 13వ తేదీ చివరి రోజున వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి సండూరు విరక్త మఠం ప్రభుస్వామీజీ సానిధ్యం వహిస్తారన్నారు. కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో నేతలు పంచాక్షరప్ప, శివానంద, తిమ్మప్ప, బసవరాజు, వామన్న, రేణుకమ్మ, నటరాజు, చెన్నబసవ పాల్గొన్నారు. -
ఆశల పల్లకీలో ఆశావహులు
హుబ్లీ: దళిత కోటాలో తనకు నూటికి నూరు శాతం మంత్రి పదవి లభించే విశ్వాసం ఉందని, తనకు తప్పకుండా ఈ అవకాశం లభిస్తుందని స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ తర్వాత రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా గత 30 ఏళ్ల నుంచి కిత్తూరు కర్ణాటక భాగంలోని దళిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వలేదని, దీంతో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఈ ప్రాంతంలో శంకరానంద కుమారుడు ఓం ప్రకాష్ తర్వాత ఇప్పటి వరకు సుమారు 30–32 ఏళ్ల నుంచి ఎవరూ కూడా తమ సమాజానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. దీంతో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని ముఖ్యంగా తాను ఇక్కడి స్థానికుడు అయినందు వల్ల తనకు అవకాశం ఇస్తే ఎక్కువగా పని చేయడానికి అనుకూలం అవుతుందన్న కారణంగా మంత్రి పదవి ఇవ్వాలని అగ్రనేతలకు, పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశానన్నారు. స్థానికులకు మంత్రి పదవి ఇస్తే జిల్లా అభివృద్ధికి అనుకూలం అవుతుందన్నారు. ఉత్తర కర్ణాటకకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కేవలం దక్షిణ భాగానికి ప్రాధాన్యత ఇస్తే చాలదు. ఉత్తర కర్ణాటకకు కూడా అవకాశం కల్పించాలి. ఈ భాగానికి రాజకీయ శక్తి నింపాలంటే మనం కూడా ఆర్గనైజ్డ్గా జాతీయ స్థాయిలో పార్టీని సంఘటితం చేయాలంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఇంకా మరింత గట్టిగా ఎగరాలని, తనలాంటి వారికి అవకాశం కల్పించాలని హైకమాండ్‌కు విన్నవించాను. దీని వల్ల కాంగ్రెస్ బలోపేతానికి దోహదపడుతుందన్నారు. బెంగళూరు మినహా హుబ్లీ రెండో ప్రముఖ కేంద్రం. ఇది కేవలం నోటి మాటలతో చెబితే చాలదు. దీంతో ఈ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, తమ సమాజం కాంగ్రెస్ పరంగా ఓటు వేస్తుంది. అందుకని తమ సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో ఎటువంటి భేద అభిప్రాయాలు లేవు. సాధారణంగా చిన్నా చితకా అభిప్రాయ భేదాలు ఉంటాయి. తమది పెద్ద పార్టీ. వారి వారి అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఈ విషయమై ఇప్పటికే హైకమాండ్‌లో చర్చ జరిగింది. ఏ ఇబ్బంది లేదు, సరిపోతాయి. కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీ పేర్కొంది. 60 ఏళ్ల లోపు వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనపై మంతనాలు జరుగుతున్నాయన్నారు. మంత్రిగిరీ కోసం బసనగౌడ పావులు రాయచూరు రూరల్: రాష్ట్రంలోని డీకే శివకుమార్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలో మతివిడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వదంతుల నేపథ్యంలో జిల్లాలోని శాసన సభ్యులు మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తున్నారు. సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, రాయచూరు గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, విధాన పరిషత్ సభ్యులు బసనగౌడ బాదర్లి, శరణేగౌడ, వసంత్ కుమార్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఈనెల 20 తరువాత న్యూఢిల్లీకి రావాలని ఆదేశించిన నేపథ్యంలో పాత వారిని వదిలి కొత్త వారికి అవకాశాలకు తోడు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చి చెప్పడంతో డీ.కే. శివకుమార్ కేబినెట్లో ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి పేరు రేసులో ముందంజలో వినబడుతోంది. దళిత కోటాలో మంత్రి పదవి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం కేబినెట్లో యువతకు చోటు కల్పిస్తారని ఎమ్మెల్సీ ఎదురు చూపు -
ఎల్ఎల్సీ వద్ద యువకుడి దారుణ హత్య
బళ్లారిఅర్బన్: తాలూకాలోని తంబ్రళ్లి గ్రామ సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్ద ఓ యువకుడి మృతదేహం సగం కాలిన స్థితిలో మంగళవారం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. కాలువ వద్దకు వెళ్లినవారు మృతదేహాన్ని గమనించి మోకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన బసవనగౌడ(27)గా పోలీసులు గుర్తించారు. మృతుడు బళ్లారిలోని ఓ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో యువకుడిపై దాడి చేసి హత్య చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు అనంతరం మృతదేహాన్ని సుమారు 13 కిలోమీటర్ల దూరంలోని తంబ్రళ్లి గ్రామ సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్దకు తరలించి పెట్రోల్ పోసి నిప్పటించినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మంటలు పూర్తిగా వ్యాపించక పోవడంతో మృతదేహం సగం కాలిన స్థితిలో బయటపడింది. మృతదేహం లభించిన ప్రదేశానికి సుమారు 13 కిలో మీటర్ల దూరంలో మృతుడికి చెందిన పల్సర్ మోటార్ సైకిల్, చెప్పులు లభ్యమైనట్లు తెలిసింది. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, హత్య జరిగిన తీరు పరిశీలిస్తే ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కోణంలో హత్య జరిగిందా? అని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. సగం కాలిన స్థితిలో యువకుడి మృతదేహం మృతుడికి చెందిన పల్సర్ మోటార్ సైకిల్ సగం కాలిన స్థితిలో మృతదేహం ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానం -
రాజ్యసభకు నలుగురూ ఏకగ్రీవమే
శివాజీనగర: కన్నడనాట మరోసారి రిసార్ట్ రాజకీయం మొదలైనట్లే మొదలై చివరి ఘడియల్లో రద్దయింది. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో, ఇటు బెంగళూరులో పెద్ద తతంగమే సాగింది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్, ఆపరేషన్ కమలం ఆందోళనల నడుమ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించాలని సాయంత్రం విమానంలో బయల్దేరారు. కొందరు ఎమ్మెల్యేలు అక్కడి అధికార పార్టీ బీజేపీ వలలో పడతారనే భయాలున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకు మొత్తం ఎమ్మెల్యేలను ఉద్యాననగరికి పంపించాలని నిర్ణయించారు. వారి కోసం బిడదిలోని వండల్ లాలో స్థానిక కాంగ్రెస్ నాయకులు వారి అతిథ్యం, పర్యవేక్షణ చేపట్టారు. పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు కూడా ఎమ్మెల్యేలు ఇక్కడే బస చేయాలని, పోలింగ్ రోజున బెంగళూరు నుంచి నేరుగా మధ్యప్రదేశ్‌కు తీసుకు వెళ్లాలని తీర్మానించారు. భోపాల్ నుంచి బయల్దేరిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల విమానం వెనక్కి రాజ్యసభ ఎన్నికల్లో జాగ్రత్త చర్యలు అనూహ్యంగా అభ్యర్థి నామినేషన్ రద్దుతో రిసార్టు బస క్యాన్సిల్ మొత్తం తారుమారు భోపాల్ నుంచి చార్టర్డ్ విమానంలో 63 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రికి దేవనహళ్ళి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు వారికి స్వాగతం పలికి రిసార్టుకు తరలించడానికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాల కూడా వచ్చారు. కానీ అంతలోనే ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మధ్యప్రదేశ్ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరిస్తున్నట్లు సాయంత్రం ప్రకటించింది. ఆమె నామినేషన్లో పలు వివరాలను పొందుపరచలేదని ఈసీ అభ్యంతరం తెలిపింది. దీంతో మధ్యప్రదేశ్‌లో ఓ అభ్యర్థి తగ్గడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు నిర్ణయమైంది. ఈ ఆకస్మిక పరిణామంతో ఎమ్మెల్యేల బెంగళూరు క్యాంపును కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకుంది. బెంగళూరుకు బయల్దేరిన విమానాలు మళ్లీ భోపాల్‌కు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల 10 రోజుల విలాసవంత యాత్ర ఇలా రద్దయింది. నామినేషన్ల ఆమోదం శివాజీనగర: కర్ణాటక నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగేనా?, ఏకగ్రీవమయ్యేనా అనే కుతూహలానికి తెరపడింది. ఈ స్థానాలకు అభ్యర్థులు సమర్పించిన నాలుగు నామినేషన్లు ఆమోదం పొందడంతో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖరారైంది. అదనపు అభ్యర్థులు పోటీలో లేకపోవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు మన్సూర్ అలీఖాన్, పవర్ ఖేరా, అలాగే బీజేపీ నుంచి నాగరాజు నామినేషన్ దాఖలు చేయడం తెలిసిందే. విధానసౌధలో ఎన్నికలాధికారి కే.ఎం.విశాలాక్షి నామినేషన్ పత్రాలను పరిశీలించి సక్రమంగా ఉన్నాయని ఆమోదం తెలిపారు. తప్పిన పోలింగ్ ప్రక్రియ అదనంగా అభ్యర్థులు రంగంలో ఉంటే ఎమ్మెల్యేలచే రహస్య ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ దఫా పార్టీలు సామరస్యంగా స్థానాలను పంచుకొన్నాయి. దీంతో ఏ విధమైన బేరాలకు ఆస్కారం లేకుండా పోయింది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11న ఆఖరు రోజు. ఆ రోజు సాయంత్రం గడువు తీరగానే ఏకగ్రీవ ఫలితాలను ప్రకటిస్తారు. -
బిట్కాయిన్ల లూటీలో మళ్లీ ఆ ఇద్దరే
బనశంకరి: సంచలనాత్మక బిట్కాయిన్ల కేసులో ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నలపాడ్‌పై సిట్ అధికారులు చార్జిషీట్ వేశారు. ఇదే కేసుల్లో ఈడీ కూడా ఆయనపై దర్యాప్తు చేస్తోంది. తుమకూరు కంపెనీలో బిట్కాయిన్ల చోరీల్లో ప్రధాన నిందితుడు హ్యాకర్ శ్రీకృష్ణ నుంచి నలపాడ్‌కు, ఆప్త మిత్రులకు వాటా దక్కిందని సిట్ చార్జిషీటులో పేర్కొంది. ఏమిటీ కేసు? 2017లో తుమకూరుకు చెందిన యూనికాయిన్ బిట్‌కాయిన్ ట్రేడింగ్ కంపెనీ వెబ్‌సైట్‌ను శ్రీకృష్ణ హ్యాక్ చేసి 60 కాయిన్లు (అప్పటి మార్కెట్ విలువ రూ.1.14 కోట్లు) దోచేశాడు. దీనిపై బాధితులు తుమకూరు కొత్త లేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సిట్ అధికారులు విచారించి శ్రీకృష్ణ, స్నేహితులు రాబిన్ ఖండేవాలా, మహమ్మద్ నలపాడ్‌తో పాటు మరికొందరిపై కోర్టులో ఇప్పుడు చార్జిషీట్ సమర్పించారు. దోచేసిన బిట్కాయిన్లను నలపాడ్ సాయంతో నగదుగా మార్చారు. ఇందులో నలపాడ్‌కు భాగం దక్కింది. ఆ డబ్బులతో నలపాడ్, రిటైర్డు ఐపీఎస్ కుమారుడు లగ్జరీ కారును కొనుగోలు చేశారు. మరోవైపు విచారణకు రావాలని నలపాడ్ కు ఈడీ 3వ సారి నోటీస్ పంపింది. ఇటీవల రెండుసార్లు జారీచేసినా హాజరు కాలేదు. హ్యాకర్ శ్రీకృష్ణ, మహమ్మద్ నలపాడ్ పేర్లు సిట్ చార్జిషీటు దాఖలు -
లక్ష్మీ నరసింహా నమోస్తుతే
కోలారు: ముళబాగిలు తాలూకాలోని కదరిపుర గ్రామంలోని పురాణ ప్రసిద్ధ కంబద శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయంలో అధిక జేష్ట మాసం సందర్భంగా మంగళవారం స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. గణపతి ప్రార్థన, స్వస్తి వచనం, పుణ్యావహం, మూల లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం తదితర ధార్మిక కార్యక్రమాలను నెరవేర్చారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. విద్యార్థులపై తేనెటీగల దాడి బనశంకరి: తేనెటీగలు కుట్టడంతో 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా ముండగోడు తాలూకా మొరార్జీ దేశాయ్ వసతి పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం భోజన వేళలో విద్యార్థులు తరగతి నుంచి బయటికి వచ్చారు. ఈ సమయంలో పాఠశాల రెండో అంతస్తులో ఉన్న తేనెగూడును ఎవరో విద్యార్థి రాయితో కొట్టడంతో తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. 21 మందిని కుట్టడంతో నొప్పితో విలపించసాగారు. బాధితులను ముండగోడు తాలూకా ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. 20 రోజుల్లో పెళ్లి.. అంతలోనే బ్రెయిన్‌డెడ్ ● అవయవ దానంతో ఘనత విజయపుర: బెంగళూరు రూరల్ విజయపుర పట్టణానికి సమీపంలో ఉన్న ఐబసాపుర గ్రామానికి చెందిన శామణ్ణ కుమారుడు దీపక్ కుమార్ (32) జూన్ 4న సహకార నగర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. యలహంక స్పర్శ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విషమించగా, మంగళవారం బ్రెయిన్‌డెడ్ అని వైద్యులు తెలిపారు. దీపక్ కుమార్‌కు 20 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. వైద్యుల వినతి మేరకు ఆయన కుటుంబ సభ్యులు దీపక్ అవయవాలను దానం చేశారు. గుండె, మూత్రపిండాలు, కళ్లు, కాలేయం తదితర అవయవాలను వైద్యులు సేకరించి అవసరమైన రోగుల కోసం పంపించారు. రౌడీల కట్టడికి ప్రత్యేక దళం ● వారంరోజుల్లో ఏర్పాటుకు సర్కారు ఆదేశం బనశంకరి: రాష్ట్రంలో పెచ్చుమీరిన రౌడీయిజం, అసాంఘిక శక్తుల అణచివేతకు ప్రత్యేక పోలీసు బలగం ఏర్పాటు కానుంది. సీఎం డీకే.శివకుమార్ నిర్వహించిన పోలీసు అధికారుల సమావేశంలో దీనిపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్కిల్, పోలీస్‌స్టేషన్ స్థాయిలో యాంటీ రౌడీ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ ఎంఏ.సలీం ఆదేశించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటం, ప్రజలు నిర్భయంగా జీవించడానికి రౌడీయిజం, గూండాయిజం రహిత సమాజం అవసరమని ప్రభుత్వ ఆదేశాల్లో తెలిపింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీఐ నేతృత్వంలో రౌడీ నియంత్రణ దళం ఉంటుంది. నిఘా.. నియంత్రణ క్రిమినల్ కేసుల్లో ఉన్న వ్యక్తుల చరిత్రను పరిశీలించి కొత్తగా రౌడీషీట్ తెరవడం, రౌడీల కౌన్సెలింగ్, నిఘా వంటి పనులను నిర్వహిస్తారు. రౌడీషీటర్ల ఇళ్లు, అడ్డాలపై తరచూ దాడులు చేస్తారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే రౌడీలపై గూండాయాక్ట్, కోకా యాక్ట్, నగర బహిష్కరణ లాంటి కఠిన చర్యలు తీసుకుంటారు. 15 రోజులకు ఒకసారి రౌడీల వ్యవహారాలపై సమీక్ష చేస్తారు. ప్రజలను బెదిరించడం, వసూళ్లు, దోపిడీలు, ముఠా కలహాలు వంటి వాటికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. వారంరోజుల్లోగా దళాలను ఏర్పాటుచేసి తమ ఆఫీసుకు నివేదిక పంపాలని అన్ని నగరాల పోలీస్ కమిషనర్లు, ఐజీపీలు, జిల్లా ఎస్పీలకు ఆదేశించారు.


