breaking news
Karnataka Latest News
-
కమనీయం.. శ్రీనివాస కల్యాణం
కోలారు: నగరంలోని టీకల్ రోడ్డులో ఉన్న వాసవీ భవనంలో శుక్రవారం శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.. లోక కళ్యాణం కోసం జిల్లాలో వర్షాలు బాగా పడి పంటలు సమృధ్దిగా పండాలని శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ, అన్న సంతర్పణ జరిగింది. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి కోలారు: పాలక ప్రభుత్వాలు విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు చలవాది నారాయణస్వామి విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం నగర సమీపంలోని మూరాండహళ్లి క్రాస్ వద్ద కోలారు ఇంటర్ నేషనల్ స్కూల్, ఇంటర్ కళాశాల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య మానవుడికి అత్యంత అవసరం అని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ ఎం.మల్లేష్ బాబు, విద్యా సంస్థల అధ్యక్షుడు ఎస్.బి.మునివెంకటప్ప, జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షురాలు రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు. బైక్ చోరీపై ఫిర్యాదు హోసూరు: ఇంటి ముందు నిలిపిన బైక్‌ను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. వివరాల మేరకు.. హోసూరు కార్పొరేషన్ పరిధిలోని అణ్ణానగర్‌కు చెందిన హరి. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి బైక్‌ను ఇంటి ముందు నిలిపి నిద్రించాడు. ఉదయం లేచి చూసే సరికి బైక్ కనిపించక లేదు. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు. పీడీపీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి శ్రీనివాసపురం: పీడీపీఎస్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎం.ఆర్.రవి తెలిపారు. శుక్రవారం శ్రీనివాసపురం పట్టణంలోని ఏపీఎంసీ మార్కెట్ సభాంగణంలో మామిడి రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండ్లు కాకముందే మామిడి కాయలను మార్కెట్‌కు తీసుకుని రావాలన్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం నుంచే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కోలారు, శ్రీనివాసపురం, ముళబాగిలు, కెజీఎఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. జిల్లా మామిడి ఉత్పత్తిదారుల క్షేమాభివృద్ధి సంఽఘం అధ్యక్షుడు నీలటూరు చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలన్నారు. అనంతరం కలెక్టర్ రోణూరు రైతు సంపర్క కేంద్రాన్ని సందర్శించారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
హుబ్లీ: నగరంలోని నవలూరు రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. 5.6 అడుగుల ఎత్తు గోధుమ రంగు ఛాయ, సాధారణ శరీరం కుడి అరచేతిపై ఓం అకారంలో త్రిశూలం పచ్చబొట్టు అలాగే ఎడమ చేతిపై కృష్ణుడి బొమ్మతో పాటు ఓం అని పచ్చ వేయించుకున్నాడు. ఈ వ్యక్తి వివరాలు ఎవరికై నా తెలిస్తే హుబ్లీ పోలీసులను సంప్రదించాలి. వివరాలకు 0836–2364751 నంబర్‌కు ఫోన్ చేయాలని రైల్వే పోలీసులు ఓ ప్రకటనలో కోరారు. మహిళకు బెదిరింపులు హుబ్లీ: పాత పగల నేపథ్యంలో ఓ మహిళ ఇంట్లోకి చొరబడి, ప్రాణాలు తీస్తామని బెదిరించడమే కాకుండా దేవుడి గదిలో ఉంచిన సుమారు రూ.8 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు గాజులను దోచుకెళ్లినట్లు వచ్చిన ఫిర్యాదుపై బి.రోహన్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు రూప బెండిగేరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. రోహన్ ఆమె ఇంటికి వెళ్లాడు. ‘నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతావా? నీ అంతు చూస్తా. కోర్టు కేసుల కోసం నాకు చాలా డబ్బు ఖర్చయింది. డబ్బులు ఇవ్వు, లేకపోతే బంగారం ఇవ్వు’ అంటూ బెదిరించినట్లు పేర్కొన్నారు. అనంతరం దేవుడి గదిలో ఉన్న 80 గ్రాముల బంగారు గాజులను తీసుకుని వెళ్లినట్లు మహిళ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ రోడ్డుకు మరమ్మతులు చేయరా? హుబ్లీ: హుబ్లీ ధార్వాడలో స్మార్ట్ సిటీ పథకం కింద కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని మంగళ వీధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం సీసీ రోడ్డు తవ్వి, పనులు పూర్తయిన తర్వాత కూడా రోడ్డును పునరుద్ధరించ లేదు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో స్థానికులు మంగళ వీధి నుంచి కార్వార్కు వెళ్లే ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనను విరమింపజేయడానికి వచ్చిన పోలీసుల సమక్షంలోనూ స్థానికులు పాలికె అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా డ్రైనేజీ పనుల కోసం తవ్వి దెబ్బతిన్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మాన్విలో నగదు చోరీ రాయచూరు రూరల్: మాన్వి పట్టణంలో మహిళ దృష్టిని మళ్లించిన దుండగులు రూ.16 లక్షల నగదు చోరీ చేశారు. వివరాలు.. అమరమ్మ అనే మహిళ బ్యాంకు నుంచి రూ.16 లక్షలు డ్రా చేసి నగదును సంచిలో పెట్టుకుంది. మార్గమధ్యంలో ఓ కిరాణా దుకాణం వద్ద ఆగింది. దుండగులు పథకం ప్రకారం ఓ చిన్నారిని ఆమెకు అడ్డంగా నిలబెట్టి, ఆమె దృష్టి మరల్చారు. సంచిలో ఉన్న రూ.16 లక్షల నగదును తీసుకుని పారిపోయారు. కొంత సమయం తరువాత అమరమ్మ సంచిలో చూడగా నగదు కనిపించక పోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కెంచరెడ్డి తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బస్సుపాసుల జారీ నిలిపివేత హుబ్లీ: వాయువ్య కేఎస్ఆర్టీసీ పరిధిలో విద్యార్థుల బస్సుపాస్ దరఖాస్తుల స్వీకరణ, కార్డుల పంపిణీ సేవలను ఈనెల 25 నుంచి రెండు రోజుల పాటు నిలిపి వేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సేవ సింధు పోర్టల్ ద్వారా బస్సుపాసులు జారీ చేయడం జరుగుతోందన్నారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయినట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీ రాత్రి 10 గంటల తరువాత యథావిధిగా సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు. గిరీష్ గదిగప్ప గౌడరపై వేటు ● ఆరేళ ్లపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ హుబ్లీ: పార్టీ నిబంధనలు ఉల్లఘించిన కారణంతో హుబ్లీ ధార్వాడ నగర జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గిరీష్ గదిగప్ప గౌడరను 6 ఏళ్ల పాటు కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సమగ్ర పరిశీలన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ పేర్కొంది. బహిరంగంగా గిరీష్ కాంగ్రెస్ చూపిన తీరు.. అలాగే పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకున్న అంశాలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పార్టీ పెద్దల సూచనల మేరకు గిరీష్‌ను పార్టీ నుంచి తప్పించారు. ఈ నిర్ణయాన్ని కేపీసీసీ అధ్యక్షుడు హరి ప్రసాద్ ఆమోదించారని మహానగర జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అల్తాఫ్ అల్లూరా ఓ ప్రకటనలో తెలిపారు. -
నాటుబాంబు పేలి లాయర్‌కు గాయాలు
దొడ్డబళ్లాపురం: నాటుబాంబు పేలి లాయర్ తీవ్రంగా గాయపడ్డ ఘటన హారోహళ్లి తాలూకా సుండగట్ట గ్రామంలో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన లాయర్ మోహన్‌కు సుండగట్ట గ్రామం వద్ద ఫాంహౌస్ ఉంది. గురువారం రాత్రి ఫాంహౌస్‌కి వెళ్లిన సమయంలో దుండగులు గేట్ వద్ద నాటుబాంబు ఉంచి వెళ్లారు. శుక్రవారం ఉదయం మోహన్ బయటకు వెళ్తూ నాటుబాంబుపై కాలు పెట్టడంతో పెద్ద శబ్దంతో పేలింది. పేలుడు తీవ్రతకు మోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు ఆయనను బెంగళూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కోడిహళ్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. దర్శన్ కొడుకు వివాదం యశవంతపుర: నటుడు దర్శన్ కొడుకు వినీశ్ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వినీశ్ ఇతరులతో గొడవ పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై దర్శన్ భార్య విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. చిన్న ఘటన జరిగింది నిజం. అయితే కారును వినీశ్ నడపలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారో లేదో కారు దిగి చూడగా అందరూ సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. వినీత్ గాయపడి ఆస్పత్రిలో ఉన్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చింది. ఇది అబద్ధం. ప్రమాదానికి గురైనవారు కూడా తప్పు తమదేనని ఒప్పుకున్నారు. వినీశ్ సురక్షితంగా ఉన్నారు. వాహనాన్ని వినీశ్ నడపలేదని స్పష్టం చేశారు. తమ డ్రైవరే కారును నడిపినట్లు విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. బెంగళూరులోని ట్రాఫిక్‌కు ఇలాంటి చిన్న ఘటనలు సామాన్యమన్నారు. త్రిబుల్ మర్డర్ కేసులో కెన్నెత్ అరెస్ట్ బనశంకరి: కృష్ణరాజపురం పరిధిలో చోటు చేసుకున్న త్రిబుల్ మర్డర్ కేసులో కెన్నెత్‌ను గురువారం రాత్రి తమిళనాడు, బెంగళూరు పోలీసులు పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు. ప్రియురాలితో కలిసి తల్లిదండ్రులు, చెల్లి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితురాలు శ్వేత పట్టుబడింది. గురువారం నగర 47వ ఏసీజేఎం కోర్టులో శ్వేతను పోలీసులు హాజరుపరిచి మరింత సమాచారం కోసం 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. మరోపక్క పరారీలో ఉన్న ప్రియుడు కెన్నెత్ కూడా పోలీసులకు పట్టుబడ్డారు. త్రిబల్ మర్డర్ కేసులో శ్వేత, కెన్నెత్‌ల అరెస్ట్ కోసం 6 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడంతో తీవ్రంగా గాలించి 23వ తేదీన పుదుచ్చేరి రైల్వేస్టేషన్లో శ్వేతను పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరిలో పట్టివేత కానీ ప్రియుడు కెన్నెత్ పరారీలో ఉండగా గురువారం రాత్రి పుదుచ్చేరి అణ్ణాసలై ప్రదేశంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఒర్లియన్ పేట పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. కెన్నెత్ హత్య చేయలేదని శ్వేత తెలిపినప్పటికీ సోమసుందర్ చనిపోయే కొద్ది నిమిషాల ముందు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కేసు కీలక మలుపు తిరిగింది. కెన్నెత్ తమపై దాడి చేశాడని వాంగ్మూలం ఇచ్చారు. ఇదే ఆధారంగా కెన్నెత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఇది చాలా కీలక కేసు కావడంతో సోషల్ మీడియా లేదా ఎలాంటి మీడియాలో తప్పుడు సమాచారం వైరల్ చేయరాదని దర్యాప్తు అనంతరం ఈ ఘటనకు కారణాలు, పూర్తి సమాచారం మేం తెలియజేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. ఈసారి మైసూరు దసరాలో కంబళ వేడుకలు మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ నాడ ఉత్సవం మైసూరు దసరా సమయంలో ఈసారి కంబళ పోటీలు నిర్వహించాలని సీఎం డీకే శివకుమార్ ఆదేశించారు. అందువల్ల ఈసారి దసరా సమయంలో కంబళ ఉత్సవాన్ని నిర్వహిస్తామని పుత్తూరు ఎమ్మెల్యే అశోక్ రాయ్ తెలిపారు. ఆయన శుక్రవారం మైసూరుకు చేరుకుని కంబళ నిర్వహణకు అనుకూలంగా ఉన్న సాత్గల్లి, విజయనగర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సాత్గల్లి దగ్గర విశాలమైన ప్రాంతం ఉంది. ఈ స్థలం అనువైందని జిల్లా యంత్రాంగం కూడా చెప్పింది. కానీ ఇంకా ఏ స్థలాన్నీ ఖరారు చేయలేదు. స్థలం గురించి సీఎంకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. -
ముగిసిన మొహర్రం
సాక్షి, బళ్లారి: కుల, మతాలకు అతీతంగా జరుపుకునే మొహర్రం (పీర్ల పండుగ)ను జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని కౌల్ బజార్, రూపనగుడి రోడ్డు, మిల్లార్ పేట, కణేకల్లు బస్టాండ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పీర్లను ఉరేగించారు. యువత అలావ్ (నృత్యాలు) తొక్కుతూ సందడి చేశారు. పీర్లను ఎత్తుకుని అగ్నిగుండాల చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సిరుగుప్ప తాలూకాలోని భుజంగ నగర్, జాలిహాల్, జాలిబెంచి, ఏళుబెంచి తదితర గ్రామాల్లోనూ మొహర్రం వేడుకలు వైభవంగా జరిగాయి. కొన్ని గ్రామాల్లో ముస్లింలు లేకపోయినా హిందువులే సంప్రదాయబద్ధంగా పీర్ల పండుగను నిర్వహించడం విశేషం. సంప్రదాయం ప్రకారం పూజారి ముందుగా అగ్నిగుండంలోకి ప్రవేశించగా.. భక్తులు కూడా అగ్నిగుండంలో నడిచి భక్తిని చాటుకున్నారు. మొహర్రం పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ పీర్ల చావడులు, సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. యాదగిరి జిల్లాలో.. రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని యాదగిరి జిల్లా సురుపుర తాలుకా తళవారలో ముస్లింలు లేకపోయినా మొహర్రం వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. హిందువులు మతసామరస్యంతో పండుగను జరుపుకోవడం విశేషం. ఆరు రోజల పాటు జరిగే మొహర్రంలో వేడుకల్లో హసేని, హుసేనీ, సయ్యద్ కాశీం, లాలసాబ్, మౌలాలీ పీర్లను అలకరించి కొలువుదీరుస్తారు. పక్క గ్రామం వాగిణి గేరి ముస్తఫా రోజూ పీర్లకు చదివింపులు చేస్తారు. చివరి రోజు భక్తి గీతాలు పాడుతూ పీర్లను జలధికి తరలిస్తారు. విజయ నగర జిల్లాలో.. హొసపేటె: మత సామరస్యానికి ప్రతీకగా జరిగే మొహర్రం వేడుకలను విజయనగర జిల్లాలో గురువారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. భక్తులంతా కుడుక బెల్లం, అగరబత్తీలతో పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. యువకులు అగ్నిగుండం చుట్టూ అలావ్ ఆడుతూ హోరెత్తించారు. హొసపేటె నగరంలో రామ టాకీస్ వద్ద వెలసిన ప్రసిద్ధ రామాలి మసీదు, చిత్తవాడిగి ప్రాంతంలో కొలువుదీర్చిన పీర్లను భక్తులు దర్శించుకున్నారు. నియోజక వర్గ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు హొసపేటె: సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ విజయనగర జిల్లా కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ శుక్రవారం పీర్ల దేవుళ్లను ప్రార్థించారు. పట్టణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మొహర్రం పండుగను శాంతియుతంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కూడ్లిగి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గురుసిద్దన్, అధ్యక్షుడు కావల్లి శివ ప్రనాయక, రిటైర్డ్ తాలూకా కార్యనిర్వహణాధికారి బసన్న, డాని రాఘవేంద్ర, ఇతర నాయకులు పాల్గొన్నారు. పీర్లకు భక్తిశ్రద్ధలతో చక్కెర చదివింపులు అగ్ని గుండంలో దిగి మొక్కులు చెల్లించుకున్న భక్తులు అలావ్ తొక్కుతూ యువత సందడి -
రథంపై ఊరేగిన మారెమ్మ
రాయచూరు రూరల్: రాయచూరు నగరం హరిజన వాడలో మారెమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం రాత్రి కంచు గడ్డ మారెమ్మకు పాదుకాపట్టాబిషేకం, పుష్పాలంకరణ చేశారు. అంతకుముందు భక్తులు భారీగా తరలివచ్చి ఆలయంలో విశేష పూజలు చేశారు. భక్తులు తెల్లవారుజామున తొట్టెల సేవ చేశారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్, మాజీ నగర సభ సభ్యులు పవన్ కుమార్, యల్లప్ప, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర జాలదార్, భరత్ తదితరులు పూజలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు. -
అత్యవసర సేవలు తాత్కాలికంగా బంద్
శివాజీనగర: రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో కొన్ని అత్యవసర సేవలు తాత్కాలికంగా బంద్ అయ్యాయి. ముఖ్యంగా 108 అంబులెన్స్ సేవ, 104 ఆరోగ్య సహాయవాణి సేవా కేంద్రాల కమాండ్ సెంటర్ గురువారం రాత్రి నుంచి బంద్ అయింది. అంబులెన్స్, ఆరోగ్య సహాయవాణి సేవల్లో ఆటంకం ఏర్పడింది. కర్ణాటక డేటా సెంటర్లో విద్యుత్ నిర్వహణా కార్యం నేపథ్యంలో సేవలు తాత్కాలికంగా స్తంభించాయి. దీంతో సర్వర్ కనెక్షన్ కట్ అయింది. సిడాక్ తయారీ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కర్ణాటకలోని ఆరోగ్య శాఖ అత్యవసర సేవల విభాగం డేటా, సర్వర్ కేంద్రాల్లో తిరువంతపురం సిడాక్ తయారు చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. మరమ్మతుల నేపథ్యంలో సర్వర్ పూర్తిగా బంద్ అయింది. అందువల్ల సేవలు అందుబాటులో లేవు. సర్వర్ కనెక్షన్ కట్ అయింది. త్వరలో మరమ్మతు పనులు పూర్తికానున్నాయి. ఆ తరువాత సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు ప్రత్యామ్నాయ సదుపాయం సర్వర్ సమస్యతో ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఫోన్ స్వీకరించేందుకు ప్రత్యామ్నాయ కంట్రోల్ రూమ్ తెరిచారు. ప్రజలు ఎప్పటిలానే అత్యవసర సేవలకు 108 ఉచిత నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆరోగ్య శాఖ సహాయవాణి 24 గంటలు కూడా పని చేస్తుంది. రాష్ట్రంలో మారుమూలల నుంచి వస్తున్న ఫోన్‌కాల్స్‌కు స్పందిస్తూ రోగులకు సేవలందిస్తుంది. దీని ద్వారా కర్ణాటకలో అత్యవసర సేవలు తగిన సమయానికి లభ్యమయ్యేలా చేయటంలో అత్యవసర సేవలు విజయవంతమయ్యాయి. ప్రస్తుతం అత్యవసర సహాయవాణి ఫోన్, కనెక్షన్ మరింత సులభతరం చేసేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి పరిచారు. 108 అంబులెన్స్, 104 ఆరోగ్య సహాయవాణి కమాండ్ సెంటర్ కూడా -
భక్తిశ్రద్ధలతో మొహర్రం
చిక్కమగళూరులో పీర్ల ఊరేగింపు కలబుర్గిలో మొహర్రం ఊరేగింపులో అశేష సంఖ్యలో పాల్గొన్న ముస్లింలుధార్వాడలో మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న ముస్లిం యువకులుగుండెల నిండా త్యాగనిరతి.. కనుల నిండా భక్తిప్రపత్తి.. యుద్ధంలో పోరాడి ధర్మాన్ని గెలిపించిన హజ్రత్ హుసేన్ ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు శుక్రవారం పీర్ల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హుసేన్, హసేన్ పీర్లనువెండి గొడుగులు, వివిధ పూలతో అలంకరించి ఊరేగించారు. పీర్లను నిప్పుల గుండంలో దాటించి అనంతరం జలధికి తరలించారు. డప్పుల దరువుకు యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తులు పీర్ల మకాన్ల వద్ద చక్కెర చదివించి మొక్కులు తీర్చుకున్నారు. -
మాదక ద్రవ్యాల సేవనంతో అనర్థాలు
హోసూరు: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం క్రిష్ణగిరి జిల్లా వ్యాప్తంగా వివిధ స్వచ్ఛంధ సంస్థలు, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, సామాజిక సేవాకర్తలతో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో నిర్వహించిన చైతన్య ర్యాలీని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కొత్త బస్టాండు వద్ద ప్రారంభమైన ర్యాలీ.. లండన్పేట, రాయకోట కూడలి రోడ్డు మీదుగా ప్రభుత్వ మహిళా కళాశాలలో ముగిసింది. కలెక్టర్ మాట్లాడుతూ క్రిష్ణగిరి జిల్లాను సంపూర్ణ మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు పళమి, రామచంద్రన్, సెంధిల్ కుమార్, గోవింద స్వామి, రమేష్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకే పంచ గ్యారెంటీలు
రాయచూరు రూరల్: అర్హులకే పంచ గ్యారెంటీలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచ గ్యారెంటీల సమితి అధ్యక్షుడు హెచ్.ఎం.రేవణ్ణ ఆదేశించారు. శుక్రవారం పాత్రికేయల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకాల దుర్వినియోగానికి సంబంధించి ఇప్పటికే రూ.15 కోట్లు వసూలు చేశామన్నారు. మిగిలిన రూ.100 కోట్ల విషయంలో బ్యాంక్ అధికారులతో చర్చిస్తామన్నారు. మరణించిన వారి ఖాతాలో పడిన డబ్బు రికవరీలో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు వివరించారు. అన్నభాగ్య పథకంలో నియమాలు ఉల్లంఘించిన 14 మంది డీలర్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 6,847 రేషన్ కార్డులను రద్దు చేసి, 9,631 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అన్నభాగ్య పథకంలో డీబీటీ ద్వారా రూ.508.72 కోట్లు, శక్తి పథకంలో రూ.608 కోట్లు నిధులు విడుదల చేశామని వెల్లడించారు. పంచ గ్యారెంటీలను నిరాటంకంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కనకదాస జీవితం ఆదర్శం.. రాయచూరు రూరల్: ప్రస్తుత సమాజంలో యువత చెడువ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. శరణుల తత్వాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను యువతకు నేర్పించాలని రాష్ట్ర పంచ గ్యారెంటీల సమితి అధ్యక్షుడు హెచ్.ఎం.రేవణ్ణ పేర్కొన్నారు. గురువారం రాత్రి పండిత ిసిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో కనకదాస అధ్యయన కేంద్రం, కురుబ సంఘం ఆధ్వర్యంలో ముత్త బందిదె కేరిగె కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనకదాస వచనాల ద్వారా యువకుల్లో మార్పులు తేవాలన్నారు. కనకదాస జీవిత విశేషాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, సాయి కిరణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఐడీసీఏ టీ20 టోర్నీ చాంపియన్‌గా కర్ణాటక
అనంతపురం: ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ (ఐడీసీఏ) ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఐడీసీఐ–19 టీ–20 చాంపియన్ షిప్ టోర్నీ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. శుక్రవారం జరిగిన రెండు సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లూ ఉత్కంఠ భరితంగా సాగాయి. హర్యానా, ఒడిశా జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఒడిశా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు సాధించింది. 128 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన హర్యానా జట్టు కూడా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్లో తలపడాల్సి వచ్చింది. ఈ దశలో హర్యానా జట్టు వికెట్ నష్టపోకుండా 9 పరుగులు సాధించగా, ఒడిశా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 6 పరుగులకే పరిమితమైంది. దీంతో హర్యానా జట్టును విజేతగా ప్రకటించారు. ● రెండో సెమీఫైనల్లో ఢిల్లీ జట్టుపై తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు సాధించింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగుల వద్ద చతికిలబడింది. 47 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. సనిత్ శెట్టి అద్భుతమైన నాటౌట్ ఇన్నింగ్స్ (87 పరుగులు)తో కర్ణాటకను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో రాణించిన కర్ణాటక బౌలర్లు ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక బౌలర్లు రాణించారు. హర్యానా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి 15.5 ఓవర్ల వద్ద 74 పరుగులకే పరిమితం చేశారు. కర్ణాటక బౌలర్ సాగర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో 5 వికెట్లు పడగొట్టి, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక జట్టు 13.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 78 పరుగులతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్)గా ఎం.యు.సాగర్ (కర్ణాటక) ఉత్తమ బౌలర్‌గా సాగర్ (కర్ణాటక), ఉత్తమ బ్యాటర్‌గా సతీష్ శెట్టి (కర్ణాటక), ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా సతీష్ శెట్టి (కర్ణాటక) నిలిచారు. ● ముగింపు వేడుకలో డీఆర్వో మలోల ముఖ్యఅతిథిగా హాజరై విజేతలను అభినందిస్తూ ట్రోఫీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రోహిత్ సైని, ఆంధ్రప్రదేశ్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘు, అధికారులు, కోచ్‌లు, ఆటగాళ్లు పాల్గొన్నారు. -
నిండు జీవితానికి పోలియో చుక్కలు
హొసపేటె: ఈనెల 28 నుంచి జూలై 2వ తేదీ వరకు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించున్నారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్, ఆరోగ్య శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల సహకారంతో అవగాహన ర్యాలీ చేపట్టారు. నగర మున్సిపల్ కౌన్సిల్ ప్రాంగణంలో పౌర యుక్త గంగాధర్ అవగాహన యాత్రను ప్రారంభించి మాట్లాడారు. పిల్లల నిండు జీవితానికి రెండు చుక్కల పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో బీఎస్కే మెడికల్ ఆఫీసర్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున తాలూకా హెల్త్ ఇన్స్పెక్టర్ భీమరాజ రెడ్డి, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ హిమంత్ రాజ్ బాగ్ని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకోబ, ప్రోగ్రామ్ మేనేజర్ మలేష్, కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు, స్వచ్ఛత, ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్త రూయి పాల్గొన్నారు. -
ధార్వాడ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
హుబ్లీ: వారంలో రెండో సారి ధార్వాడ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. కోర్టు పాలన కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా ఈ సందేశం అందింది. దీంతో కొన్ని గంటల పాటు కోర్టు ఆవరణలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. కోర్టుతో పాటు కాంప్లెక్సులో బాంబు పెట్టినట్లు బెదిరింపు సందేశ సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై తక్షణమే క్షుణ్ణంగా అణువణువు గాలింపు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది వచ్చిన ప్రజానీకాన్ని బయటకు పంపించారు. ఈ నెల 19న ధార్వాడ కోర్టు పాలనా కార్యాలయానికి ఈ–మెయిల్లో బెదిరింపు సందేశం వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో మధ్యాహ్నం 2 గంటలకు మీ కోర్టులో 23 ౖసైనెడ్ వాయు తూటాలు పేలతాయని ఈ–మెయిల్ బెదిరింపు సందేశం అందింది. దీంతో కోర్టు చుట్టు పక్కల ఆందోళనకర వాతావరణం నెలకొనగా బాంబు స్క్వాడ్ కోర్టులో అణువణువు గాలించింది. మొత్తానికి వారంలోనే రెండో సారి కోర్టుకు బెదిరింపు సందేశం రావడంతో పోలీసులతో పాటు కోర్టు సిబ్బందికి తలనొప్పిగా మారింది. -
నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య
బనశంకరి: పారిశ్రామికవేత్తకు బెదిరింపులకు పాల్పడిన కేసులో జైలుకెళ్లి, బెయిల్‌పై విడుదలైన వ్యాపారవేత్త వైశాక్ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు రాజరాజేశ్వరినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరగ్గా గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గిరి నగరవాసి, వ్యాపారవేత్త వైశాక్ గత కొన్నినెలల క్రితం పారిశ్రామికవేత్త అరవిందరెడ్డిని బెదిరించిన కేసులో అరెస్టయి కొన్నాళ్లు జైల్లో ఉండి విడుదలయ్యాడు. ఆర్ఆర్ నగరలో నటి, స్నేహితురాలు కృషి తాపండ నివాసంలో కొన్నిరోజులుగా ఉంటున్నట్లు సమాచారం. అక్కడే ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలాడు. ఫోన్ చేసి చెప్పగా.. వైశాఖ్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా ఓ కుమారుడు ఉన్నాడు. కారు గ్యారేజ్, ఆటోమొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆర్ఆర్ నగరలోని ఎలిగెంట్ రేస్ అపార్టుమెంట్‌లోని 4వ ఫ్లోర్లో నటి కృషి తాపండ ఫ్లాట్‌లో బస చేశాడు. ఆమె బయటకు వెళ్లింది, రాత్రి 8:30 గంటలకు ఆమెకు కాల్ చేసి తాను చనిపోతున్నానని వైశాఖ్ చెప్పగా, ఆమె అతనికి నచ్చచెప్పింది. అర్ధరాత్రి తిరిగి వచ్చేటప్పటికి చనిపోయి ఉన్నాడు. గతంలో బెదిరింపుల కేసు గత ఫిబ్రవరిలో బెంగళూరు పారిశ్రామికవేత్త అరవిందరెడ్డి కి గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొరియల్‌లో లేఖ వచ్చింది. గతంలో కృషి తాపండతో అరవిందరెడ్డికి గొడవలు జరిగాయి. ఆమెతో ఉన్న గొడవలను పరిష్కరించుకోవాలి, అలాగే క్షమాపణ చెప్పి రూ.6 – 7 కోట్లు డబ్బు పంపాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లేఖలో బెదిరించారు. దీనిపై అరవిందరెడ్డి హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వైశాఖ్‌ను అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇతడు, నటి కృషి సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. గురువారమే కుక్కె పుణ్యక్షేత్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నామని కృషి తెలిపింది. ఫ్లాటులో ఎలాంటి డెత్‌నోట్ లభించలేదు. ఆర్ఆర్ నగర పోలీసులు విచారణ చేపట్టారు. చివరి చూపునకు నో వైశాఖ్ కుటుంబీకులు మృతదేహాన్ని తీసుకెళ్లారు. చామరాజపేటే శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిపారు. కృషి తాపండ వచ్చేటప్పటికి పూర్తయ్యాయి. ఆమెను చూసి వైశాక్ కుటుంబసభ్యులు గొడవకు దిగారు. నువ్వు రావద్దని, వెళ్లిపోవచ్చని చెప్పడంతో కృషి బోరున విలపించింది. బెంగళూరులో ఘటన కృషి తాపండ ఫ్లాటులో వైశాఖ్ మృతి గతంలో బెదిరింపుల కేసులో అరెస్టయిన వైశాఖ్ -
పురస్కారాలు బాధ్యతలను పెంచుతాయి
హొసపేటె: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా శాఖ ఆధ్వర్యంలో రేణుకా సభా భవన్లో అఖిల సభ్యుల మహా సమావేశం, ప్రతిభా ప్రోత్సాహ పురస్కార, సేవా రత్న పురస్కారాల ప్రదానోత్సవం–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఫీల్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మైలేశ్ బేవూరు స్పూర్తిదాయక ప్రసంగం చేశారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిడిలోనూ, ప్రజా సేవలోనూ విశ్వాసంగా, నిజాయితీ పని చేయాలని అన్నారు. పోటీ రోజున తప్పనిసరిగా చదవాల్సిన అవసరం ఉందన్నారు. మనం తదుపరి దశకు సిద్ధం కావాలన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు, అంకితభావంతో పని చేసిన ఉద్యోగులకు ఇచ్చే పురస్కారాలు ఆ వ్యక్తి బాధ్యతను, గౌరవాన్ని పెంచుతాయని ఆయన అన్నారు. తహసీల్దార్ అమరేష్, ఈఓ డాక్టర్ బీ.ఆనంద్‌కుమార్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్సీ, పీయూసీ పరీక్షల్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ ఉద్యోగుల 28 మంది పిల్లలకు ప్రోత్సాహక పురస్కారాలు అందజేశారు. వివిధ శాఖలకు చెందిన 32 మంది అధికారులు, ఉద్యోగులకు సేవా రత్న పురస్కారాలు–2026ను ప్రదానం చేశారు. -
మంగళూరులో షారుఖ్ సందడి
యశవంతపుర: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కరావళి నగరి మంగళూరులో పర్యటించారు. ఆయనను చూడాలని అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. గురువారం ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో మంగళూరు విమానాశ్రయంలో దిగారు. ఎయిర్‌పోర్టు బయట అభిమానులు చేరుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య షారూక్ బయటకు వచ్చి అభివాదం చేయడంతో అందరూ కేరింతలు కొట్టారు. కొంతదూరం రూఫ్ టాప్‌లో కనిపించి అలరించారు. అడ్యార్ గార్డెన్లో ఓ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ పాల్గొన్నారు. మంగళూరు ప్రముఖులు ఆయనను కలిశారు. కరువును ఎదుర్కోవాలి: డీసీఎం బనశంకరి: రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, సూపర్ ఎల్ నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం పరమేశ్వర్ సూచించారు. గురువారం విధానసౌధలో ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనావృష్టి, తాగునీరు, పశువులకు మేత కొరత తదితరాల గురించి చర్చించారు. ప్రపంచస్థాయి ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తలెత్తే పరిణామాలు, వర్షం కొరత వల్ల కరువు, ఇతర సమస్యల పరిష్కారానికి ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా, పశువుల మేతకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. జిల్లాల కలెక్టర్లకు సకాలంలో సూచనలు చేయాలన్నారు. తాగునీటి కోసం బోర్ల తవ్వడానికి వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. 122 తాలూకాల్లో తాగునీటి కొరత ఉందని 139 పల్లెలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. -
జిల్లా ఇంచార్జి మంత్రిగా పాటిల్
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గత మూడేళ్లలో రాయచూరు, కొప్పళ జిల్లాలకు ఇంచార్జి మంత్రిగా వైద్య విద్యా శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్‌ను నియమితులయ్యారు. తాజాగా మరోసారి మంత్రి పదవిని దక్కించుకున్న పాటిల్‌ను తిరిగి జిల్లాకు ఇంచార్జి మంత్రిగా కేటాయించారు. కళ్యాణ కర్ణాటకలో కలబుర్గి, యాదగిరి జిల్లాలకు ఇంచార్జి మంత్రిగా ప్రియాంక్ ఖర్గేను, బీదర్, గదగ్ జిల్లాలకు ఈశ్వర్ ఖండ్రె, విజయపుర, బాగల్కోటెలకు ఎం.బీ.పాటిల్‌ను ఇంచార్జి మంత్రులుగా నియమించారు. సేవా మూర్తికి సత్కారంహుబ్లీ: విక్రమ్ భాయి ఫౌండేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా జంట నగరాల్లోని వివేకానంద, మైత్రి వృద్ధాశ్రమాల్లో ప్రతి నెలా భోజన వసతితో పాటు కావాల్సిన నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా మందులను తన దాతృత్వ గుణంతో అందించే ఆ ఫౌండేషన్ అధ్యక్షుడు విక్రమ్ భాయి బూరట్ 50వ జన్మదిన వేడుకను నిరాశ్రయులు, నిర్భాగ్యులు, ఆపన్నుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. వృద్ధాశ్రమంలోని అవ్వ, తాతలకు తనదైన శైలిలో ఆత్మీయత, అనురాగాలను పంచి వారి ఆశీస్సులు అందుకున్నారు. ముఖ్యంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్నేహ వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు ప్రముఖులు సేవా మూర్తి విక్రమ్ బూరట్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ సింఘి పరివార్ విక్రమ్ బాయికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సారాయి అడ్డాపై దాడి.. ఇద్దరు అరెస్ట్హుబ్లీ: జిల్లాలోని అణ్ణిగేరి సమీపంలోని వాగులో అక్రమంగా దొంగ సారాయి తయారు చేస్తున్న అడ్డాపై ఎకై ్సజ్ పోలీసులు దాడి చేశారు. శేఖర్ విరుపాక్షి(26), సాగర(31)లను అరెస్ట్ చేసి అక్కడ ఉన్న వాహన యజమాని కోసం గాలింపు చేపట్టారు. అణ్ణిగేరి సరిహద్దులోని కనగల్ల వాగులో అక్రమంగా సారాయి కాస్తుండగా ఎకై ్సజ్ సీఐ రాము, ఏఎస్ఐ అనురాధ హొలేకార్, వాహన డ్రైవర్ మల్లికార్జున, హోంగార్డ్ కల్లయ్య, శరీఫ్ తదితరులు అణ్ణిగేరి పట్టణ పంచాయతీ సిబ్బందితో కలిసి దాడి చేశారు. 2 లీటర్ల దొంగ సారాయి, ఇతర సంబంధిత వస్తువులు, ప్లాస్టిక్ బ్యారళ్లు, బెల్లం రసాయనాలు తదితరాలతో పాటు ద్విచక్ర వాహనం, ఓ మొబైల్ ఫోన్, ఓ స్మార్ట్ ఫోన్‌ను కూడా జప్తు చేసినట్లు ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. బస్సు, బైక్ ఢీ.. ముగ్గురు యువకుల దుర్మరణంరాయచూరు రూరల్: బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన ఘటన కలబుర్గి జిల్లాలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. మృతులను కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా కరదాళ వద్ద బమ్మనహళ్లి నివాసి దేవరాజ్ అయ్యప్ప(19), ముడ్బాళ లక్ష్మికాంత్(24), సేడం తాలూకా బిజనళ్లి నివాసి ప్రకాష్ బసప్ప(22)గా పోలీసులు గుర్తించారు. చిత్తాపుర నుంచి సన్నతికి వెళుతున్న ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. చిత్తాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శంకర్‌గౌడ తెలిపారు. ఘటన స్థలాన్ని సీఐ ఎస్సీ పాటిల్, ఎస్ఐ మంజునాథ్ రెడ్డి పరిశీలించారు. మైనర్ల బైక్ రైడింగ్.. తండ్రులకు జరిమానా హుబ్లీ: ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి ముగ్గురు మైనర్లు బైక్ నడుపుతూ పట్టుబడిన ఆరోపణలపై నగర తూర్పు ట్రాఫిక్ పోలీసులు సదరు బాలుర తండ్రులకు కోర్టు నోటీసులు ఇచ్చి జరిమానా విధించారు. వివరాలు.. సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మైనర్ బాలురు బైక్ నడుపుతూ పట్టుబడ్డారు. వారిని విచారించగా వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఇంకా 18 ఏళ్ల వయస్సు నిండలేదని తేలింది. దీంతో పోలీసులు బాలల తండ్రులకు నోటీసులిచ్చి 3వ సెషన్స్ కోర్టులో ఒక్కో బాలుడి తండ్రికి రూ.25 వేల చొప్పున జరిమానా విధించి వసూలు చేశారు. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి రాయచూరు రూరల్: విధి నిర్వహణలో గుండెపోటుతో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జిల్లాలో జరిగింది. మృతుడిని దేవదుర్గ సీఐ వాహనం డ్రైవర్, 2008 పోలీస్ బ్యాచ్‌కు చెందిన లింగసూగూరు తాలూకా అమదిహాళ్కు చెందిన రేణుకా రాజ్(38)గా గుర్తించినట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు. దేవదుర్గ తాలూకా మదరకల్ పంచాయతీ పరిధిలో మొహర్రం సందర్భంగా రేణుకా రాజ్ విధులు నిర్వహిస్తున్నారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడని తెలిపారు. ప్రైవేటీకరణ చేయరాదు కోలారు: విద్యుత్ రంగ ప్రైవేటీకరణను ఖండిస్తూ దళిత సంఘటనల సమన్వయ సమితి సభ్యులు గురువారం వేమగల్ బస్టాండు వద్ద ఆందోళన చేశారు. జిల్లా అధ్యక్షుడు పురహళ్లి జి యల్లప్ప మాట్లాడుతూ విద్యుత్ శాఖను 19 జిల్లాలలో టాటా కంపెనీకి అప్పజెప్పడం వల్ల రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ంగా నష్టపోతారని అన్నారు. రైతుల హితవు కోసం ప్రైవేటీకరణను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. ఎస్ నారాయణస్వామి, బి మునిరాజు, నాగనాళ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
సర్ ప్రక్రియపై అవగాహన సమావేశం
బళ్లారిఅర్బన్: నగరంలోని కౌల్‌బజార్ ప్రాంతంలోని ఆంఽథోని హాల్లో గురువారం ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అవగాహన సమావేశం జరిగింది. కర్ణాటక శాసన మండలి సభ్యులు ఇవాస్ డిసౌజా, చంద్రశేఖర్ పాటిల్, మాజీ ఎమ్మెల్సీ శరణప్ప మట్టూర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కార్యకర్తలకు సర్ గురించి అవగాహన కల్గించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజా చైతన్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై కూడా చర్చించారు. సమావేశంలో నగర మేయర్ పీ.గాదెప్ప, నగర, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోయపాటి విష్ణువర్ధన్, కర్ణాటక క్రిస్టియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జీజే రవికుమార్, బోర్డు మాజీ అధ్యక్షుడు మానయ్య, మాజీ డిప్యూటీ మేయర్ బెణకల్ బసవరాజ్, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు సరగు నాగరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు మంజుల, సీనియర్ నాయకులు ఎల్.మారెణ్ణ, చానాళ్ శేఖర్, కణేకల్ మాబుసాబ్, అలివేలు సురేష్, అతావుల్లా, మల్లీశ్వరి, కార్పొరేటర్లు ముండ్లూరు ప్రభంజన్‌కుమార్, గోవింద శ్రీనివాస్ ఉమాపతి, పర్వీన్ భాను తదితరులు పాల్గొన్నారు. -
లంచగొండి పీడీఓ అరెస్టు
రాయచూరు రూరల్: లేఔట్ నిర్మాణం కోసం రెండు ఎకరాల భూమికి అనుమతి ఇవ్వడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటున్న పీడీఓ లక్ష్మి ప్యాటీని లోకాయుక్త అధికారులు అరెస్ట్ చేశారు. రాయచూరు తాలూకా బిజి నగర పంచాయతీ పరిధిలోని ఉండ్రాళ దొడ్డిలో జరిగింది. ఫిర్యాదిదారు మహబూబ్ నుంచి రూ.1.50 లక్షలను ఆమె తన భర్తకు ఫోన్ పే చేయించింది. మిగిలిన రూ.50 వేలను తీసుకుంటూ ఉండగా లోకాయుక్త అధికారులు దాడి చేసి అరెస్టు చేశారు. విమానం రద్దుపై ఆగ్రహంశివమొగ్గ: శివమొగ్గలోని కువెంపు విమానాశ్రయం నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం సోమవారం చివరి నిమిషంలో అకస్మాత్తుగా రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు స్పైస్‌జెట్ విమానంలో 60 మంది ప్రయాణికులు తిరుపతికి బయలుదేరాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 1:30 గంటలకు.. సర్వీసు రద్దయినట్లు సిబ్బంది ప్రకటించారు. మరో ఫ్లైటు లేకపోవడంతో ప్రయాణికులు దిక్కులు చూశారు. ఎయిర్‌లైన్స్ తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో గురువారం స్పైస్‌జెట్ యాజమాన్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డ్రగ్స్ కాల్చివేత
మైసూరు: జిల్లాలో దాడులు జరిపి స్వాధీనపరచుకున్న సుమారు రూ.10.55 లక్షల విలువైన మత్తు పదార్థాలను కోర్టు ఆదేశాల మేరకు గురువారం జిప్స్ బయోటెక్ పరిశ్రమలోని కొలిమిలో కాల్చివేశారు. ఎస్పీ మల్లికార్జున బాలదండి ఆదేశాలతో పోలీసులు మత్తు పదార్థాలను తరలించి దహనం చేశారు. 19 కేజీల గంజాయి, ఎండీఎంఏ పొడితో సహా పలు రకాల మత్తు పదార్థాలున్నాయి. పోలీసు కస్టడీకి అనుమానిత ఉగ్రవాది బనశంకరి: పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టయిన యూపీ వలస కూలీ, అనుమానిత ఉగ్రవాది సొహైల్‌కు దావణగెరె జిల్లా హరిహర జేఎంఎఫ్‌సీ కోర్టు 10 రోజుల కస్టడీకి ఆదేశించింది. గురువారం హరిహర గ్రామాంతర పోలీసులు అతనిని కోర్టులో హాజరు పరిచి మరింత విచారణకు తమ కస్టడీకి అప్పగించాలని కోరగా, జడ్జి ఆమోదించారు. అతనిని పోలీసులతో పాటు ఏటీయు, ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఉగ్ర కార్యకలాపాలపై మరింత సమాచారం రాబట్టనున్నారు. సొహైల్ మొబైల్‌ను డేటా రికవరీ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కట్న పిశాచికి కారాగారం శివమొగ్గ: అధిక కట్నం తేవాలంటూ కోసం భార్యను హింసించిన భర్తకు శివమొగ్గలోని 2వ జేఎంఎఫ్సి కోర్టు మూడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. కొత్తూరు నివాసి, ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న మంజునాథ్ ముద్దాయి. డబ్బు తేవాలని, స్థలం రాసివ్వాలని భర్త వేధిస్తున్నాడంటూ అతని భార్య 2017లో శివమొగ్గ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించి చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సిద్దరాజు ఎన్‌కె ఈ తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూటర్ జి కె కిరణ్‌కుమార్ వాదించారు. వెండి దొంగకు సంకెళ్లుశివాజీనగర: వెండి వస్తువులను విక్రయించే షాపు గోడ పగలకొట్టి 10 కేజీల వెండి సామగ్రి దొంగిలించిన దొంగను బెంగళూరులోని హలసూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు శంకరపురానికి చెందిన తేజ (19) నిందితుడు. హలసూరు కార్ స్ట్రీట్‌లో ఏప్రిల్ 29న ఓ షాపు గోడకు రంధ్రం వేసి చొరబడిన తేజ.. 10 కేజీల వెండి సొత్తుతో ఉడాయించాడు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలతో గుర్తించి స్వస్థలానికి వెళ్లి అతనిని నిర్బంధించారు. 5 కేజీల వెండి సామగ్రిని రికవరీ చేశారు. ఒక్కో మంత్రికి 2, 3 జిల్లాలు ● ఇన్చార్జిలుగా నియామకం శివాజీనగర: సీఎం డీకే శివకుమార్ తమ మంత్రులకు జిల్లాల ఇన్చార్జిల బాధ్యతలను కేటాయించారు. కేబినెట్లో 13 మంది మంత్రులు ఉన్నారు. చాలావరకు మంత్రుల సొంత జిల్లాలనే కాకుండా మరికొన్ని జిల్లాలకు ఎంపిక చేశారు. డీసీఎం జీ.పరమేశ్వర్‌ను తుమకూరు, చిత్రదుర్గ జిల్లాల ఇన్చార్జిగా నియమించారు. మంత్రి కే.హెచ్.మునియప్పను బెంగళూరు గ్రామీణ, ఉమ్మడి బళ్లారి జిల్లాలు, మంత్రి రామలింగారెడ్డిని బెంగళూరు దక్షిణ, మండ్య జిల్లాలు, ఎం.బీ.పాటిల్– విజయపుర, బాగలకోట, కే.జే.జార్జ్– శివమొగ్గ, చిక్కమగళూరు, దావణగెరెలు, కృష్ణభైరేగౌడ– బెంగళూరు నగర, హాసన్ జిల్లాలు, ఈశ్వర్ ఖండ్రె బీదర్, గదగ్ జిల్లాలు, సతీశ్ జార్కిహొళి– బెళగావి, ధార్వాడ, హావేరి జిల్లాలు, ప్రియాంక్ ఖర్గే– కల్బుర్గి, యాదగిరి జిల్లాలు, మంత్రి శరణప్రకాశ్ పాటిల్ రాయచూరు, కొప్పళ, యూటీ ఖాదర్ – ఉడుపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, కొడగు జిల్లాలు, భైరతి సురేశ్– కోలారు, చిక్కబళ్లాపుర, యతీంద్రను మైసూరు, చామరాజనగర జిల్లాల ఇన్చార్జులుగా నియమించారు. దోపిడీ ముఠా ఆటకట్టు యశవంతపుర: చవగ్గా హోటల్ సామగ్రి, క్రిప్టో కరెన్సీ పేరిట వ్యాపారిని దోచుకున్న ఘటనలో బెంగళూరు సంజయనగర పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.13.90 లక్షల నగదు, 6 బైకులు, ఒక కారు, 13 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. సంజయనగర కొడిగేహళ్లిలోని దేవినగరలో ఉంటున్న వ్యాపారి కేఫ్ పెట్టాలని వస్తు సామగ్రి కోసం నెట్లో వెతికారు. ఇంతలో నిందితులు ఆయనకు కాల్ చేసి ఈ పరికరాలు చవగ్గా దొరుకుతాయని చెప్పారు. తమ వాట్సాప్ గ్రూపులో ఇతని నంబర్‌ను చేర్చారు. రూ.17.64 లక్షలకు సామగ్రి ఇప్పిస్తామని, కానీ ఈ డబ్బును క్రిప్టో ద్వారా ఇస్తే భద్రంగా ఉంటుందని నమ్మించారు. ఫలానా చోటుకు డబ్బుతో రమ్మనగా వెళ్లాడు, దుండగులు అతని నుంచి డబ్బులు లాక్కుని పారిపోయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్ చేశారు. -
కావేరమ్మ ఒడిలో పెను విషాదం
మండ్య: ఎప్పుడూ ఇంటిపనులే. తీరిక చేసుకుని టూర్‌కు వచ్చామని అందరూ సంతోషంగా నదిలో ఆడుకుంటున్నారు, కానీ కొన్నిక్షణాల్లోనే మృత్యువు కాటేసింది. మండ్య జిల్లాలోని మళవల్లి తాలూకాలోని ముత్తత్తి సమీపంలో కావేరి నది ఒడ్డున నీటిలో దిగి ఆడుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు లోతైన చోట జారిపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలతో సహా ఐదుమంది జలసమాధి కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులు విజయమ్మ (52), ఆమె కుమార్తెలు ప్రియాంక (28), శ్వేత (38), శ్వేత కుమార్తె చైత్ర (19), బెంగళూరుకు చెందిన కారు డ్రైవర్ మహేష్. వీరు చన్నపట్టణ వద్ద బ్యాడరహళ్లి వాసులు కాగా, కొందరు బెంగళూరులో నివసించేవారు. ఒకరి తరువాత ఒకరు.. అందరూ కూడా బెంగళూరు నుంచి బాడుగ కారులో చన్నపట్టణ తాలూకాలోని కబ్బాలు ఆలయానికి ఒక విందు కోసం వచ్చి, ఆపై మళవల్లి తాలూకాలోని ముత్తత్తి పర్యాటక ప్రదేశాన్ని సందర్శించి ఆలయంలో దర్శనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం 4:45 సమయంలో కావేరి నదిలోకి దిగి ఆడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో విజయమ్మ లోతైన చోట మునిగిపోతూ కేకలు వేయసాగింది. ఆమెను కాపాడాలని వెళ్లిన కూతుర్లు, ఇతరులు ఒకరి వెంబడి మరొకరు పట్టుకుని మునిగిపోసాగారు. వారిని రక్షించడానికి వెళ్లిన కారు డ్రైవర్ మహేష్ కూడా గల్లంతయ్యాడు. వీడియోలు వైరల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది కొన్ని గంటల పాటు నదిలో గాలించి మృతదేహాలకు బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం హలగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మండ్య జిల్లా కలెక్టర్ కుమార్, ఎస్పీ విజె. శోభారాణి, డీఎస్పీ యశ్వంత్ కుమార్, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. బంధువులకు తెలిసి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఘటనకు కొంతసేపటి ముందు అందరూ నదిలో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తల్లి, ఇద్దరు కూతుళ్లు, వారి కుమార్తె.. కుటుంబమే జలసమాధి మండ్య జిల్లా ముత్తత్తి వద్ద దుర్ఘటన -
మామిడి రైతుకు కేంద్రం చేయూత
శివాజీనగర: ధరలు తగ్గడంతో తీవ్ర దిగులుతో ఉన్న మామిడి రైతులను ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్లో జోక్యం పథకం (ఎంఐఎస్) కింద 1.30 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి రకం మామిడిని ప్రతి క్వింటాల్‌కు రూ.1,750 మద్దతు ధరను ప్రకటించింది. ఈ ఏడాది మామిడి దిగుబడి బాగానే ఉన్నా, మార్కెట్లో ధరలు లేవని రైతులు ఆందోళనతో ఉన్నారు. దేశాల మధ్య యుద్ధాల వల్ల ఎగుమతులు కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్లలో గిరాకీ ఉన్నప్పటికీ అది దళారులు, వ్యాపారులకే పరిమితమైంది. అహోరాత్రులు కష్టించిన సాగుదారులకు తీవ్ర నష్టం తలెత్తింది. ఇటీవల కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హెచ్డీ కుమారస్వామిలు రాష్ట్ర మామిడి రైతుల ఇబ్బందిపై వ్యవసాయ మంత్రి శివరాజసింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. అదనపు ధర చెల్లింపు కింద సహాయం చేయాలని కోరారు. ధర ప్రక్రియ ఇలా... ఏపీఎంసీ మార్కెట్లలో మద్దతు ధర ప్రకారం రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేయాలి. సుమారు నెల రోజుల పాటు ఇది అమలులో ఉంటుంది. ఈ ధరతో గరిష్టంగా 1.30 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కొంటారు. ఆ పరిమాణం దాటిన తరువాత పొడిగిస్తారా, లేదా? అనేది ఇంకా ప్రకటించలేదు. క్వింటాలు రూ.1,750 తో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. ధర ఇది వర్తించాలంటే రైతులు కర్ణాటకకు చెందిన ఏసీఎంసీ మండీలలో మామిడిని విక్రయించాలి. రాష్ట్ర ప్రభుత్వం 2026–27 మార్కెటింగ్ సీజన్‌కు తోతాపురి మామిడి వ్యాపారుల జాబితా ప్రకటించాలి. రైతుకు దక్కిన ధరను పరిశీలించి మిగతా సొమ్మును బ్యాంకు ఖాతాకు అందిస్తారు. ఇప్పుడు ఎంత ధర? ప్రస్తుతం తోతాపురి మామిడిని పండ్ల రసాల కంపెనీలు కేజీ రూ.5 లేదా 6 రూపాయలతో కొంటున్నాయని, ఇది ఎంతమాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇటీవల కోలారు జిల్లాలో రోడ్లపై పారబోసి ఆందోళనలు చేయడం తెలిసిందే. బజార్లలో వ్యాపారులు గిరాకీని బట్టి ఇష్టానుసారం అమ్ముతున్నారు. మామిడి ఉత్పత్తిలో అగ్రస్థానం మామిడి ఉత్పత్తిచేసే ప్రముఖ రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. కోలారు, చిక్కబళ్లాపుర, రామనగర, బళ్లారి, ధార్వాడ, బెళగావి, విజయపుర, బాగలకోట, తుమకూరు, మండ్య, చన్నరాయపట్టణ తదితర జిల్లాల్లో వేలాది హెక్టార్లలో తోతాపురి సహా పలురకాల మామిడి తోటలు సాగవుతున్నాయి. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశముంది. కేంద్రం సాయం: కుమార రాష్ట్రంలోని మామిడి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పిందని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి ఎక్స్‌లో తెలిపారు. కేంద్రం ఎంఐఎస్ స్కీమ్ కింద 1.30 లక్షల టన్నుల తోతాపురి మామిడికి క్వింటాల్‌కి రూ.1,750 ఆర్థిక సాయం ఇచ్చేలా ఆదేశించిందని తెలిపారు. తోతాపురి క్వింటాలు రూ.1,750 మద్దతు ధర ప్రకటన ఏపీఎంసీలలో కొనుగోలుకు ఆదేశం -
వర్షం కోసం గాడిదలకు పెళ్లి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతులు పొలంలో వేసుకున్న పైర్లు వాడుముఖం పడుతున్న నేపథ్యంలో రైతులు దేవుళ్లకు మొర పెట్టుకుంటున్నారు. దేవదుర్గ తాలూకా రామదుర్గలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా బుధవారం సాయంత్రం గాడిదలకు పూజలు జరిపి పెళ్లి చేశారు. వాటిని గ్రామంలో తిప్పుతూ వానలు కురువాలని ప్రార్థించారు. అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడిరాయచూరు రూరల్: ప్రజలకు అధిక ధరతో వడ్డీ వసూలు చేస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై గదగ్ పోలీసులు దాడి చేశారు. గురువారం గదగ్ నగరంలో అక్రమంగా అధిక రేట్లకు వడ్డీలు ఇచ్చే వ్యాపారుల ఇళ్లపై జిల్లా ఎస్పీ ఆర్.జగదీష్ ఆధ్వర్యంలో దాడులు జరిపారు. వడ్డీలకు చక్ర వడ్డీలు వేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో దాడులు చేశామని ఎస్పీ తెలిపారు. మనోహర్ కట్టిమని నుంచి 150 చెక్‌లు, 65 ఖాళీ బాండ్లు, 9 బ్యాంక్ పాస్ బుక్‌లు, 5 ఏటీఎం కార్డులు, మూడు పాన్ కార్డులు, రూ.60 లక్షల విలువ చేసే బంగారు నగలు, రూ.5.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రోడ్ల అభివృద్ధికి పెద్దపీట రాయచూరు రూరల్: రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించినట్లు రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్ పేర్కొన్నారు. రాయచూరు తాలూకా మామిడిదొడ్డి, కొర్విహాళ్, శివ విలాస్ నగర్, సగమకుంట, మాడుమాన్దొడ్డి, గంజహళ్లి వరకు కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి మంజూరైన రూ.3 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి ఆయన మాట్లాడారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య క్రిష్ణగిరి: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన క్రిష్ణగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. క్రిష్ణగిరి జిల్లా ఆర్.ఎస్.లక్ష్మీపురం గ్రామానికి చెందిన స్టీఫన్ రాజ్ (34). డిజిటల్ బ్యానర్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. వ్యాపారం మందకొడిగా సాగడంతో సరైన రాబడి లేక అప్పల పాలయ్యాడు. వ్యాపారం కోసం తీసుకొన్న అప్పు కూడా తీర్చలేకపోయాడు. అప్పు ఇచ్చిన వారు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో జీవితంపై విరక్తి చెందిన స్టీఫన్ రాజ్.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకొన్న క్రిష్ణగిరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వార్త ప్రచార శాఖ కమిషనర్‌గా అనుచేత్రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారుల బదిలీల్లో భాగంగా వార్త, ప్రచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా డీఐజీ ఎంఎన్ అనుచేత్ను నియమించారు. గురువారం బెంగళూరులోని ప్రధాన కేంద్ర కార్యాలయంలో కమిషనర్‌కు ఏడీజీపీ హేమంత్ నింబాళ్కర్ బాధ్యతలు అప్పగించారు. అనుచేత్ కోలారు జిల్లా వాసి కావడం విశేషం. ఈసందర్భంగా అధికారులు మంజునాథ్ డొళ్లిన్, సిద్దేశ్వరప్ప, నవీన్, రామలింగప్ప, శఫీ సాదుద్దీన్లు అభినందించారు. ట్రాఫిక్ సమస్యను తీర్చండి హోసూరు: డెంకణీకోట మార్గంలోని రింగ్‌రోడ్డు ఆర్సీ చర్చి వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని గురువారం ఉదయం ఆ ప్రాంతంలో పర్యటించిన హోసూరు మేయర్ ఎస్.ఏ.సత్య ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. పట్టణంలోని పలు ప్రాంతాలకు వెళ్లి ప్రజల సమస్యలను పరిశీలించారు. డెంకణీకోట రోడ్డులోని ఆర్సీ చర్చి వద్ద రింగ్ రోడ్డుపై నాలుగు వైపులా వాహనాలు నిలిచిపోతున్నాయని, దీని వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో వాహనాలు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మేయర్ సూచించారు. -
విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యం
కోలారు: ఉపాధ్యాయులు విద్యార్థులకు మౌల్యాధారిత విద్యను బోధించాలని తాపం మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఎం.ఎస్.శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం ముళబాగిలు ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో సద్భావన ఉపాధ్యాయ స్నేహి బళగ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సంస్కారం, ఉత్తమ నడవడిక, క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం నేర్పించాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు విజయం సాధించాలంటే అన్ని విషయాలపై అధిక జ్ఞానం, నిరంతర కృషి అవసరమని పేర్కొన్నారు. సద్భావన ఉపాధ్యాయ స్నేహి బళగ వారు ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సాహకాలు అందజేయడం హర్షణీయమన్నారు. దీనికి తోడు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల సంఘం కోశాధికారి సుబ్రమణ్య, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల బస్తాల్లో మద్యం బాటిళ్ల రవాణా
రాయచూరు రూరల్: ఎరువుల బస్తాల మధ్య మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న వాహనాన్ని విజయపుర పోలీసులు అడ్డుకున్న ఘటన జిల్లా సరిహద్దులో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి గోవా నుంచి మహారాష్ట్రకు లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.కోట్లాది విలువ చేసే మద్యం బాటిళ్ల వాహనాన్ని కోల్హార టోల్ వద్ద విజయపుర పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. తనిఖీ సమయంలో పోలీసులకు అనుమానం రాగా ఎరువుల బస్తాలను దించి చూడగా వాటిలో మద్యం బాటిళ్లు కనబడ్డాయి. లారీ డ్రైవర్లకు జీపీఎస్‌తో కూడిన మొబైల్ ఫోన్లను అందించారు. బెళగావి, బాగల్కోటె, ధార్వాడ జిల్లాల తర్వాత విజయపురను దాటుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి 12,952 లీటర్ల మద్యం, 290 బాక్సుల మ్యాన్షన్ హౌస్, 397 రాయల్ బ్లూ బాక్స్, 800 రాయల్ సెలెక్ట్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లారీతో పాటు రూ.1.65 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. గదగ్‌కు చెందిన శ్రీనివాస్ మీసె, విజయపుర హుసేన్ సాబ్ ముల్లా, బసవరాజ్ భజంత్రి, మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన సిద్దరామలను అరెస్ట్ చేశామని ఎస్పీ లక్ష్మణ్ నింబరిగి తెలిపారు. గోవా నుంచి లారీలో సరుకు సరఫరా పట్టుకున్న విజయపుర పోలీసులు -
జాడ లేని వర్షాలు .. ఎండుతున్న పంటలు
హొసపేటె: విజయనగర జిల్లాలో వర్షాభావం నెలకొనడంతో మెట్ట పొలాల్లో రైతులు పండించిన ఆరు తడి పంటలకు సరిగా నీరు అందక ఎండిపోతున్నాయి. వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, కందులు, రాగులు, ఉలవలు, సజ్జలు, గోధుమ తదితర పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో కరువు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. హొసపేటె తాలూకాలో వరి ప్రధాన పంట. ఉప పంటల్లో జొన్నలు, సజ్జలు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వేరుశెనగ పంటలకు సరైన వర్షపాతం లేక పోవడం పంటలనూ ప్రభావితం చేసింది. వ్యవసాయంపై వేలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాడి పరిశ్రమకు పశుగ్రాసం కొరతతో ఆందోళన చెందుతున్నారు. సాధారణం కంటే లోటు వర్షపాతం ఈ ఏడాది రుతుపవనాల ప్రారంభం నుంచి 230.76 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 34 శాతం లోటు వర్షపాతంగా ఉంది. గత సంవత్సరం కూడా వర్షాల కొరత ఏర్పడింది. 17,742 హెక్టార్లలో 98 శాతం మేర వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న పంటలు వేశారు. ఈ సంవత్సరం మొత్తం సాగు విస్తీర్ణంలో కేవలం 17 శాతం అంటే 7,155 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. మొత్తం మీద గత ఏడాదితో పోల్చితే సాగు విస్తీర్ణం 80 శాతం మేర తగ్గింది. తాలూకాలో వర్షాలు కురవకపోవడం ఇలాగే కొనసాగితే, అన్ని పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. 40 శాతం మేర పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలకు వర్షం చాలా అవసరమని వ్యవసాయ సహాయ సంచాలకులు అన్నారు. వర్షాభావం ఇలాగే కొనసాగితే భారీగా పంట నష్టం వాటిల్లవచ్చని అంచనా వేస్తున్నారు. తీవ్ర ఆందోళనలో రైతులు -
అర్హులకే పంచ గ్యారెంటీలు
రాయచూరు రూరల్: పంచ గ్యారంటీలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర పంచ గ్యారెంటీ కమిటీ అధ్యక్షుడు హెచ్ఎం రేవణ్ణ అధికారులను ఆదేశించారు. కలబుర్గి డివిజన్ కార్యాలయంలో కళ్యాణ కర్ణాటక అధికారులతో సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దుర్వినియోగానికి పాల్పడిన రూ.15 కోట్లు వసూలు చేశామని, మిగిలిన రూ.100 కోట్ల విషయంలో బ్యాంక్ అధికారులతో చర్చిస్తామన్నారు. మరణించిన వారి ఖాతాలో పడిన డబ్బుల వసూలు విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నట్లు తెలిపారు. అన్న భాగ్య పథకంలో నియమాలను ఉల్లంఘించిన 14 మంది డీలర్ల లైసెన్స్, 6,847 కార్డులను రద్దు చేశామన్నారు. 9,631 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అన్న భాగ్య పథకంలో డీబీటీ ద్వారా రూ.508.72 కోట్లు, శక్తి పథకంలో రూ.608 కోట్లను విడుదల చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పంచ గ్యారెంటీలను కొనసాగిస్తామన్నారు. -
భోజన కార్యకర్తల పర్మినెంట్‌కు వినతి
రాయచూరు రూరల్: జిల్లాలో వివిధ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర హాస్టల్ భోజన కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా సాంఘీక సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అడవిరావ్ మాట్లాడారు. సాంఘీక సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం నిష్పత్తిలో వేతనాలను పెంచి ఆదుకోవాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో గంగాధర్, నాగమ్మ, సంతోష్, నిరంజన్ కుమార్, బసవరాజ్, తిప్పరాజ్, మేరీ, దేవణ్ణ, రేణుకమ్మలున్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి రాయచూరు రూరల్: నగరంలో సరళంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని బీజేపీ నేతలు ఆచరించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జిల్లాధ్యక్షుడు వీరనగౌడ ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ముఖర్జీ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప, మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్, జిల్లాధ్యక్షురాలు విజయ రాజేశ్వరి, నగర అధ్యక్షుడు ఊట్కూరు రాఘవేంద్ర, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర జాలదార్లున్నారు. వైభవంగా మారెమ్మ ఉత్సవాలు రాయచూరు రూరల్: రాయచూరులో మారెమ్మ దేవి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి నగరంలోని హరిజనవాడలో వెలసిన కంచుగడ్డ మారెమ్మ దేవాలయంలో అభిషేకం, పాదుకాపట్టాభిషేకం, జలాభిషేకం, పుష్పాలంకరణ చేశారు. భక్తులు ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. భక్తులు తెల్లవారు జామున ఊయల సేవను చేపట్టారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్, మాజీ నగరసభ సభ్యులు పవన్ కుమార్, యల్లప్ప, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర జాలదార్, భరత్ పాల్గొన్నారు. బోసురాజుకు మంత్రి పదవి ఇవ్వండిరాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రివర్గ మలి విస్తరణలో మాజీ మంత్రి, విధాన పరిషత్ సభ్యుడు, సీనియర్ నాయకుడు ఎన్.ఎస్.బోసురాజుకు మరో సారి మంత్రి పదవిని కల్పించాలని కన్నడ సంఘాలు, మైనార్టీ సంస్థలు డిమాండ్ చేశాయి. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు రాము మాట్లాడారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిగా డీ.కే.శివకుమార్‌ను నియమించిన నేపథ్యంలో బోసురాజుకు మంత్రి పదవిని కల్పించాలన్నారు. సీఎం పదవిని చేపట్టిన శివకుమార్ కూడా 50 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించిన బోసురాజుకు కేబినెట్లో చోటు ఇవ్వాలని సీఎంకు రాసిన లేఖను స్థానికాధికారికి అందించారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె రోటరీ క్లబ్ ఆఫ్ హంపీ పెర్ల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హొసపేటె తాలూకాలోని టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్లు, పెన్నులను పంపిణీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని లలితమ్మ, తాలూకా మధ్యాహ్న వేడి భోజన అధికారి అయ్యప్ప, ఆర్గనైజేషన్ హెడ్ కమల్ గుమాస్తే, అన్నపూర్ణ, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, నిర్మల, హేమలత, ఈరప్ప, రవికుమార్, మంజుల, శారద విద్యార్థులు పాల్గొన్నారు. -
చదువులో టాపర్లు.. లైఫ్‌లో ఫెయిల్
బనశంకరి: సిలికాన్ సిటీలో జల్సాలు, సహజీవనం, జీవితమంటే లెక్కలేకపోవడం వంటి పాశ్చాత్య జీవనశైలి యువతను పెడతోవ పట్టిస్తోంది. అది అనేక విషాదాలకు కారణమవుతోంది. తమ ప్రేమ, సహజీవనాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారనే కసితో వారితో పాటు చెల్లెలిని కత్తులతో నరికి చంపిన టెక్కీలు శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ కేసులో కొత్త సంగతులు బయటపడుతున్నాయి. హత్యల తరువాత పరారైన శ్వేతను కృష్ణరాజపురం పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆమె పాండిచ్చేరి రైల్వేస్టేషన్లో పట్టుబడిందని, ప్రియుడు కెన్నెత్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. తండ్రి సోమసుందర్(55), తల్లి ముత్తులక్ష్మీ (48), సోదరి సుప్రియా(20)ను శ్వేత, ప్రియుడు అతికిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. 6 ప్రత్యేక పోలీస్ బృందాలు పలు రాష్ట్రాల్లో గాలించి శ్వేతను అరెస్టు చేసినట్లు డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. నిందితురాలి నుంచి సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. డైరీలో ఏముంది డొమినిక్ లేఔట్లో హత్య జరిగిన అపార్టుమెంటు ఫ్లాటులో పోలీసులు గాలించి శ్వేత, కెన్నెత్లకు చెందిన సామగ్రిని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. శ్వేత రాసిన డైరీలో.. ఐయామ్ శాడ్, ఐయామ్ లోన్లీ, ఫీలింగ్ లవ్, ఐయామ్ డిప్రెస్డ్, ఐయామ్ సుపీరియర్ అని రాసుకుంది. చదువులో ప్రతిభావంతులు... శ్వేతా, కెన్నెత్ ఇద్దరూ న్యూ హొరైజాన్ కాలేజీలో బీటెక్ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. బీటెక్‌లో ఇద్దరూ కాలేజీ టాపర్‌గా నిలిచారు. తరువాత ఐటీ కంపెనీల్లో ఉద్యోగంలో చేరి లక్షలాది రూపాయల వేతనం గడించేవారు. అప్పటినుంచి సహజీవనంలో ఉంటున్నారు. పలు కారణాలతో ఏడాది నుంచి ఇద్దరు ఉద్యోగం వదిలివేశారు. ఉన్న డబ్బుతో మజా చేయసాగారు. సొంతంగా బిజినెస్ చేయాలని శ్వేత తల్లిదండ్రుల పేరుతో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.30 లక్షలు అప్పు చేసింది. కానీ ఏ వ్యాపారమూ చేయలేదు. ఆ డబ్బుతో షికార్లు కొట్టారు. కంతులు కట్టకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు బ్యాంకు నోటీసులు వెళ్లడంతో కంగుతిన్నారు. కెన్నెత్ తండ్రి హెచ్ఏఎల్లో పనిచేస్తూ మారతహళ్లిలో నివాసం ఉంటున్నారు. అతని ధోరణి చూసి తల్లిదండ్రులు పట్టించుకునేవారు కాదని తెలిసింది. ఇలా ఇద్దరూ వికల మనస్కులయ్యారు. తండ్రి సోమసుందర్ తల్లిదండ్రులు, సోదరి హత్య కేసు... టెక్కీ శ్వేత, ప్రియుడు కెన్నెత్ పెడదారి పాండిచ్చేరిలో శ్వేత అరెస్టు 30 కత్తిపోట్లతో ఊచకోత హత్య సమయంలో ముగ్గురినీ 30 సార్లు చాకులతో పొడిచారని తేలింది. బ్యాంక్ నోటీసులు రావడంతో కంగారుపడిన తల్లిదండ్రులు శ్వేతతో మాట్లాడాలని వెళ్లారు. అక్కడ కెన్నెత్‌ను చూసిన ముత్తులక్ష్మి.. నా కూతురిని చెడగొట్టావని మండిపడడంతో ఘర్షణ ఆరంభమైంది. సహనం కోల్పోయిన శ్వేతా చాకుతో తల్లిని పొడిచింది. ఇంతలో తండ్రి సోమసుందర్ , చెల్లి సుప్రియా రావడంతో వారినీ అదే మాదిరిగా హతమార్చారు. తరువాత టెర్రెస్పైకి వెళ్లి అక్కడి నుంచి పక్క అపార్టుమెంటులోకి దూకి పారిపోయారు. -
మంత్రి బావ.. అబ్కారీ అధికారిపై ఈడీ దాడులు
బనశంకరి: బెళగావి జిల్లా ఎకై ్సజ్ శాఖ అదనపు కమిషనర్, మంత్రి సతీశ్ జార్కిహొళి బావ డాక్టర్ వై.మంజునాథ్ ఇంటితో పాటు 10కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర అధికారి మీద కేంద్ర అధికారుల దాడి ఇటీవలికాలంలో ఎన్నడూ జరగలేదు. బుధవారం ఉదయం బెళగావి సిటీలో దూరదర్శన్ కేంద్రం వద్దనున్న మంజునాథ్ నివాసం, అలాగే గోవా, బెంగళూరుతో పాటు పలు నగరాలలో సోదాలను ప్రారంభించారు. ఎవరీ మంజునాథ్? బళ్లారి మాజీ ఎంపీ వై .దేవేంద్రప్ప కుమారుడే మంజునాథ్, ఆయన మంత్రి సతీశ్ సోదరిని పెళ్లాడారు. ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారిగా మంజునాథ్ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల సహాయంతో ఈడీ అధికారులు ఆయన ఇళ్లకు వచ్చారు. గేట్లు మూసివేసి లోపల కంప్యూటర్లు, మొబైల్ఫోన్లు, ఫైళ్ల పరిశీలన చేపట్టారు. బ్యాంకుల లావాదేవీలు, స్థిర చరాస్తుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. మైసూరులో స్నేహితుని ఇంటిలో తనిఖీలు సాగుతున్నాయి. బెంగళూరులోని మంజునాథ్ అపార్టుమెంట్, అథణి తాలూకా ఐనాపుర గ్రామంలో స్నేహితుని ఇంటిపై దాడిచేశారు. బినామీల పేరుతో భూముల కొనుగోలు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణతో పాటు అక్రమంగా పెద్దమొత్తంలో ఆస్తులను సంపాదించారని కొందరు ఈడీకి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. దాడి సమయంలో ఆయన బెంగళూరులోని అపార్టుమెంట్లో ఉన్నారు. మంజునాథ్ ఆప్తులపై మంజునాథ్ ఆప్తులకు కూడా ఈడీ షాక్ ఇచ్చింది. తుమకూరు ఎకై ్సజ్‌శాఖ ఎస్పీ సతీశ్ కాగలికి చెందిన బెళగావి జిల్లా కాగవాడ తాలూకా ఐనాపుర పట్టణంలోని నివాసంలో సోదాలు జరిగాయి. అలాగే బెళగావి శ్రీనగరలోని ఇంట్లోనూ చేపట్టారు. జిల్లాలోని చిక్కోడి అబ్కారీ డీఎస్పీ విశ్వనాథ్ గాణిగెరకు చెందిన బెళగావి సిటీ బసవ కాలనీలో ఇంటిపైనా దాడులు చేపట్టారు. ఈ పరిణామాలతో మంజునాథ్ బంధుమిత్రులతో పాటు అబ్కారీ శాఖ అధికారుల్లో గుబులు నెలకొంది. ఎందుకు దాడులు... మంజునాథ్, అతని ఆప్తులపై ఈడీ.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. అబ్కారీ శాఖలో అవకతవకలపై గతంలో ఆయనపై లోకాయుక్త దాఖలు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగినట్లు సమాచారం. మొత్తం 18 చోట్ల దాడులు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. బెళగావిలోని నివాసాల్లో కేంద్ర బలగాల భద్రత మధ్య తనిఖీలు ఎకై ్సజ్ అదనపు డీసీ వై.మంజునాథ్ లక్ష్యం.. బెంగళూరు, బెళగావి, మైసూరు సహా 10కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు ఆయన మంత్రి సతీశ్ జార్కిహొళికి స్వయానా బావ అక్రమాస్తులు, స్కాం ఆరోపణలే కారణంవిజయనగర జిల్లాలోహొసపేటె: మాజీ ఎంపీ వై.దేవేంద్రప్ప కుమారుడు, బెళగావి అబ్కారీ అధికారి వై.మంజునాథ్‌కు విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని అరసికెరె గ్రామంలోని ఉన్న నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడి చేశారు. తెల్లవారుజామున 5:30 గంటలకు రెండు కార్లలో వచ్చిన అధికారులు నివాసాలకు వెళ్లారు. అక్కడి వారు ఎవరని ప్రశ్నించగా, ఈడీ అధికారులని చెప్పి సోదాలు ప్రారంభించారు. -
బిర్యానీలో బల్లి.. ముగ్గురు ఆస్పత్రికి
కోలారు: బల్లి పడిన బిర్యానీ తిని ఆస్పత్రి పాలైన ఘటన బుధవారం బంగారుపేట పట్టణంలో జరిగింది. వివరాలు.. పట్టణంలోని ఓ హోటల్‌కు వెళ్లిన స్థానిక నివాసి లలిత బిర్యానీ అడిగింది. బిర్యానీ, పెరుగు పచ్చడిని అందించారు. ఆమె ఆరగిస్తుండగా, కొంతసేవటికి బిర్యానీలో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. దీంతో అవాక్కయిన లలిత హోటల్ సిబ్బందిని పిలిచి ప్రశ్నించింది. బల్లి బిర్యానీలో కాదు, పెరుగు పచ్చడిలో పడిందని, వేరే బిర్యానీ తెచ్చిస్తామని సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే లలిత కుటుంబీకులు గొడవకు దిగారు. ఇంతలోనే లలిత కళ్లుతిరిగి అస్వస్థకు గురైంది. ఆమెను ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు వాంతులు, విరేచనాలు కాగా, చికిత్స అందించడంతో కోలుకుంటోంది. అక్కడే తిన్న మరో ఇద్దరు కస్టమర్లు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, నగరసభ అధికారులు హోటల్లో తనిఖీలు చేసి నమూనాలను సేకరించారు. హోటల్‌ను మూసివేయాలని ఆదేశించారు. బంగారుపేటలో కలకలం -
కబ్బన్ స్టేషన్లో మెట్రో పునరుద్ధరణ
టిప్పర్లు, లారీల్లో ఎక్కుతున్న ప్రయాణికులు స్టేషన్ బయట ప్రయాణికుల రద్దీ శివాజీనగర: నమ్మ మెట్రో పర్పుల్ లేన్‌లో కబ్బన్ పార్కు మెట్రో స్టేషన్లో యాంత్రిక లోపంతో నిలిచిపోయిన రైళ్లు అటు అధికారులకు, ఇటు ప్రయాణికులకు నానా ఇబ్బందులు కలిగించాయి. చివరకు బుధవారం ఉదయం 5 గంటల నుంచి రైలు సర్వీసులను పునరుద్ధరించారు. వివరాలు.. మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో కబ్బన్ పార్కు స్టేషన్లో విద్యుత్ వ్యవస్థలో లోపం ఏర్పడింది. దీంతో నాడప్రభు కెంపేగౌడ స్టేషన్ మెజిస్టిక్ నుంచి ఎం.జీ.రోడ్డు మధ్య ప్రధాన స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పీక్ అవర్‌లో రైళ్లు కదలక వేలాది మంది ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. ఉసూరంటూ సిటీ బస్సులు, ఆటోల్లో గమ్యస్థానాలకు వెళాల్సి వచ్చింది. బస్సులు, ఆటోలు దొరకని వారు లారీల్లో, ట్రక్కుల్లో గుంపులుగా ఎక్కి వెళ్లే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టెక్కీలు, మహిళలు కష్టపడి లారీలు, టిప్పర్లలో ఇళ్లకు బయల్దేరారు. ముమ్మరంగా మరమ్మతులు ఓ రైలు అక్కడే నిలిచిపోగా లోపల చిక్కుకొన్న ప్రయాణికులను అర్ధగంట తరువాత క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి వరకూ మరమ్మతులు చేపట్టినా పరిష్కారం కాలేదు. బీఎంఆర్సీఎల్ ఇంజనీర్లు, సిబ్బంది తెల్లవారుజాము వరకు పనిచేసి కొలిక్కితెచ్చారు. ఈ ఇబ్బంది సమయంలో ఓర్పు, సహకారంతో ఉన్నందుకు ప్రయాణికులకు ధన్యావాదాలని బీఎంఆర్సీఎల్ తెలిపింది. మెట్రోలో లోపాలు, ప్రయాణికుల అవస్థలపై ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. పరిష్కారమైన యాంత్రిక సమస్య ప్రయాణికులకు తప్పిన అవస్థలు -
వర్షాల కోసం విశేష పూజలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా రైతులు పొలంలో వేసుకున్న పైర్లు వాడుముఖం పడుతున్నాయి. యాదగిరి, దేవదుర్గల్లో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే గుర్జి జోకుమార అంటూ జానపద శైలిలో పాటలు పాడుతూ ఇంటింటా తిరుగుతూ వానల కోసం యాతన పడుతున్నారు. మరోవైపు జోకుమారుడికి పూజలు జరిపి గ్రామాల్లో తిప్పుతూ వానలు కురువాలంటూ కేకలు పెడుతూ పాటలతో దేవుడికి మొర పేట్టుకున్నారు. దేవదుర్గ తాలూకా జాలహళ్లిలో మొహర్రం పండుగ సందర్భంగా పీర్ల దేవుడిని మోసుకుని మంగళవారం రాత్రి సవారీ చేశారు. వర్షం కోసం కప్పలకు పెళ్లి హుబ్లీ: సమృద్ధిగా వానలు పడాలని స్థానిక బెంగేరి నివాసులు ద్యామవ్వ దేవి దేవస్థానం వద్ద కప్పలకు పెళ్లి చేసి సంప్రదాయం ప్రకారం విధి విధానాలను పాటించారు. కప్పలను చక్కగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఆ తర్వాత మహిళలు ఓ ఆట ఆడి దేవుడిని ప్రార్థించి ఆలయం చుట్టు ప్రదక్షణలు చేశారు. ఇప్పటికీ గ్రామాల్లో ఇలాంటి ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. సమాజ సేవకుడు రమేష్, కార్పొరేటర్లు నరగుంద, పీరప్ప కండేకర, ప్రముఖులు ఉవ్వప్ప, రాజు కాళె, బసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కంప్లి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని ధర్నా
బళ్లారి అర్బన్: కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేష్‌కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బళ్లారిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని ఏళుమక్కళ తాయమ్మ దేవస్థానం నుంచి ప్రారంభమైన ర్యాలీ గవియప్ప సర్కిల్ మీదుగా గడిగి చెన్నప్ప సర్కిల్ వరకు సాగింది. అనంతపురం రోడ్డు బీడీఏఏ సభాంగణానికి చేరుకొని పాల్గొన్న వారికి అన్నదానం నిర్వహించారు. ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జేఎన్ గణేష్ కంప్లి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. రోడ్లు, తాగునీరు, విద్య, గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడంతో పాటు రైతుల సమస్యలను శాసన సభలో సమర్థవంతంగా ప్రస్తావించారన్నారు. సండూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అన్నపూర్ణ విజయం కోసం కీలకంగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. బళ్లారి జిల్లాకు చెందిన ప్రజాదరణ కలిగి యువ నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జేఎన్ గణేష్‌కు మంత్రి పదవి ఇస్తే బళ్లారి, విజయనగర జిల్లాల అభివృద్ధికి తోడ్పాటును అందించినట్లు అవుతుందన్నారు. -
ఎందుకో తెలియదు: మంత్రి
తన బావ మంజునాథ్‌పై ఈడీ దాడులపై బెళగావిలోని హరుగేరిలో పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్ జార్కిహొళి మాట్లాడుతూ ఆచితూచి స్పందించారు. ఈడీ దాడి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, తెలిసిన తరువాత మాట్లాడతానని అన్నారు. ఈడీ దాడి సాధారణ ప్రక్రియ కావచ్చునని, కానీ ఏ కారణంతో సోదాలు చేశారు అనేది తనకు తెలియదన్నారు. ఎలాంటి రికార్డులు అడిగారు, ఎన్ని చోట్ల సోదాలు చేశారు అనేది కూడా తెలియదని ఆయన అన్నారు. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయన్నారు. మంత్రివర్గ విస్తరణ జూలైలో జరగవచ్చునని, ఎవరికి పదవులు ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయమన్నారు. జిల్లాలో అనావృష్టిపై స్పందిస్తూ, వానలు రాకపోతే ఇబ్బందేనని, హిడకల్ డ్యాంలో 15 రోజులకు సరిపడా తాగునీరు ఉందని అన్నారు. -
హంపీ అభివృద్ధికి కృషి చేస్తా
● బళ్లారి ఎంపీ తుకారాం హామీ హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన హంపీలోని స్మారకాలు, కట్టడాల పరిరక్షణ, పర్యాటక మౌలిక సదుపాయాలు, కన్నడ విశ్వవిద్యాలయం సర్వతోముఖాభివృద్ధిలో తాను పాలు పంచుకుంటానని బళ్లారి ఎంపీ ఈ.తుకారాం హామీ ఇచ్చారు. బుధవారం ఆయన తాలూకాలోని కమలాపుర పురావస్తు మ్యూజియాన్ని సందర్శించి హంపీ సర్కిల్లోని వివిధ ప్రాంతాలను తనిఖీ చేశారు. ఆయన కమలాపుర పురావస్తు మ్యూజియం, మహానవమి దిబ్బ, హజారరామ ఆలయం, దానాయక ప్రాంగణం, విరుపాక్ష ఆలయాన్ని సందర్శించి, పర్యాటకుల కోసం సౌకర్యాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. మూడు కొత్త అంబారీ బస్సులు హంపీలో పర్యాటకుల సందర్శన కోసం ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క ఓపెన్ అంబారీ బస్సు వ్యవస్థకు అదనంగా, పర్యాటకుల రద్దీని తట్టుకునేందుకు మరో మూడు కొత్త అంబారీ బస్సులను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహానవమి దిబ్బ ప్రాంతంలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి, మరుగుదొడ్ల సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హంపీ ఏఎస్ఐ, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. హంపీ వర్సిటీ సందర్శన హంపీ సమీపంలోని కన్నడ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఎంపీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌తో చర్చించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, బోధన సిబ్బంది కొరత వంటి విషయాలను వైస్ ఛాన్సలర్ ఎంపీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ, కన్నడ విశ్వవిద్యాలయం దేశానికి గర్వకారణమైన సంస్థ అని అన్నారు. ఇక్కడ విద్యా ప్రయోజనాల దృష్ట్యా, ఉపాధ్యాయుల నియామకానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయానికి అవసరమైన ప్రత్యేక గ్రాంటును త్వరలో విడుదల చేయడంపై తాను ముఖ్యమంత్రితో వ్యక్తిగతంగా చర్చిస్తానని, తగిన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. -
టీచర్లుగా బాధ్యత తగదు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కళాశాల అధ్యాపకులను హైస్కూలు ఉపాధ్యాయులుగా నియమించి పాఠాలు బోధించాలని జారీ చేసిన ఆదేశాలను పునః పరిశీలించాలని కర్ణాటక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల సమితి సంచాలకుడు నరసప్ప భండారి డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులను హైస్కూలు విద్యార్థులకు పాఠాలు బోధించడానికి వీలుగా ఉపాధ్యాయులుగా నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలన్నారు. రాయచూరు జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. పథకాలు లబ్ధిదారుల దరి చేర్చాలి రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతులు, కూలీలకు నరేగ తదితర ప్రభుత్వ పథకాలు సక్రమంగా దరి చేర్చాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ సభాభవనంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో మాట్లాడారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి గ్రామ పంచాయతీ అధికారులు ముందుండాలన్నారు. మందకొడిగా కొనసాగుతున్న పథకాలను, అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. జిల్లాలో అపౌష్టికత నివారణ, పిల్లలను పొలం పనులకు పంపకుండా వారిని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శరణ బసవ, విజయ్ కుమార్, నందిని, శరణమ్మలున్నారు. వ్యక్తిపై దాడి .. ముగ్గురిపై కేసుహుబ్లీ: ఉణకల్ వాయుపుత్ర లేఔట్లో పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రాణాలు తీస్తామని బెదిరించిన ముగ్గురిపై విద్యానగర పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కమహాదేవి, గురునాథ, మహాదేవ అనే వారు గంగాధర హుబ్బళ్లిపై దాడి చేసి ప్రాణాలు తీస్తామని బెదిరించినట్లు కేసు నమోదైంది. డివైడర్‌కు కారు ఢీ.. నలుగురికి గాయాలు మరో ఘటనలో డివైడర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. నుల్వి క్రాస్ వద్ద పుణె, బెంగళూరు రోడ్డులో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులతో పాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన సచిన్ కదం, స్వప్నాలితో పాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయని హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
నేడు టీబీ డ్యాం కొత్త గేట్ల ప్రారంభం
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగు నీరందించే తుంగభద్ర (టీబీ) జలాశయం నూతన గేట్ల అమరిక పూర్తయింది. రూ. 51 కోట్ల నిధులతో 33 కొత్త గేట్లు అమర్చారు. గురువారం జరిగే కార్యక్రమంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొని కొత్త గేట్లను ప్రారంభిస్తారు. డ్యాం వద్ద కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతన గేట్ల వల్ల డ్యామ్ ఆయుష్షు మరో 50 ఏళ్లు పెరిగినట్లు ఇంజనీర్లు తెలిపారు. 2024 ఆగస్టులో డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడం తెలిసిందే. దీంతో డ్యాం భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అప్పటినుంచి మరమ్మతులు చేపట్టి అన్నీ కొత్తవి అమర్చారు.పాము కాటుకు బాలుడు బలి యశవంతపుర: పాము కరిచి ఒకే ఇంట్లో బాలుడు చనిపోగా, అతని సోదరి తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఉత్తరకన్నడ జిల్లా శిరసి తాలూకా బనవాసి సమీపంలోని సహస్రళ్లిలో జరిగింది. పుట్టప్ప నాయక కుమారుడు మిథున్ (12), కుమార్తె దీక్ష (9) ఇంట్లో నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున బాలలు ఇద్దరూ హఠాత్తుగా నిద్రలేచి వాంతులు చేసుకున్నారు. తల్లిదండ్రులు లేచి చూడగా ఇంట్లో నుంచి పాము బయటకు వెళ్లింది. వెంటనే పిల్లలను పట్టణంలోని మహాలక్ష్మి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మిథున్ చనిపోయాడు. బాలిక చికిత్స పొందుతోంది. మిథున్ 6వ తరగతి, దీక్ష 3వ తరగతి చదివేవారు. యువతిపై ఖాకీ కన్ను ● ప్రేమ, పెళ్లి పేరుతో అత్యాచారం, అబార్షన్లు శివమొగ్గ: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ పోలీసు కానిస్టేబుల్ తనపై అత్యాచారానికి పాల్పడి, గర్భం దాలిస్తే అబార్షన్ చేయించాడని ఓ యువతి ఆరోపించింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమై తర్వాత ప్రైవేట్ వీడియోలను అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక దాడులకు పాల్పడినట్లు తెలిపింది. ఓ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్‌తో ఫేస్బుక్ ద్వారా ఏడాది క్రితం తనకు పరిచయమైనట్లు తెలిపింది. తాను పోలీసును కావడంతో బహిరంగ స్థలాల్లో మాట్లాడటం కష్టమని చెప్పి లాడ్జిలకు పిలుచుకెళ్లి అత్యాచారం చేశాడంది. గర్భం దాల్చడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి అబార్షన్ చేయించాడనని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని, ఇప్పుడు ఎవరో తెలియదని బెదిరిస్తున్నాడని వాపోయింది. ఎస్పీకి ఫిర్యాదు చేసినా అంతే ఓసారి 112 సహాయవాణికి ఫిర్యాదు చేయగా అక్కడ రాజీ చేసుకుని, అప్పులు తీరగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, మళ్లీ ఆ ప్రస్తావన తెచ్చినందుకు తీవ్రంగా కొట్టాడని వాపోయింది. ఇప్పుడు వేరే యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడని, అడ్డొస్తే ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. జిల్లా ఎస్పీ, డీఐజీలకు ఫిర్యాదు చేశానని, నిందితుడు దర్జాగా తిరుగుతున్నాడని ఆరోపించింది. -
వీడిన వరుస బైక్ చోరీల మిస్టరీ
బళ్లారిఅర్బన్: బళ్లారి, విజయనగర, చిత్రదుర్గ, అనంతపురం జిల్లాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడిన ఓ ఘరానా దొంగను బళ్లారి పోలీసులు అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 41 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి ఎస్పీ సుమన్ డీ.పన్నేకర్ బుధవారం డీఏఆర్ పోలీస్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరుగుప్ప పోలీస్ స్టేషన్లో నమోదైన బైక్ దొంగతనం కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా హవంబావి ప్రాంతంలో నిందితుడు సిద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కుడితినిలో ఆటో డ్రైవర్ అయిన సిద్దారెడ్డి బస్సులో ప్రయాణిస్తూ బస్టాండ్, మార్కెట్లు, ఆస్పత్రుల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసింది. దొంగిలించిన వాహనాలను నకిలీ పత్రాలు, నెంబర్ ప్లేట్ సహాయంతో తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏయే జిల్లాల బైక్‌లు ఎన్నెన్ని? నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న 41 బైక్‌ల్లో బళ్లారికి చెందినవి 15, చిత్రదుర్గకు చెందినవి 21, విజయనగర జిల్లావి 4, అనంతపురం జిల్లాకు చెందిన 1 బైక్ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అవసరమైతే మరింత మందిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. కేసును చేధించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి బహుమతిని అందించారు. ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రాంతంలో పార్కింగ్ చేయాలని, అదనంగా లాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏఎస్పీ నవీన్ కుమార్, డీఎస్పీ మాలతేష్, సిరుగుప్ప సీఐ హనుమంతప్ప, ఎస్ఐ పరశురాం పాల్గొన్నారు. ఘరానా నిందితుని అరెస్టు 41 ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
కృష్ణాలోకి సీఎం శివ షిఫ్టు
● ఇక్కడి నుంచే పరిపాలన: సీఎం శివాజీనగర: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధికారిక నివాస బంగ్లా కృష్ణాలో అడుగుపెట్టారు. బుధవారం కుమార పార్కులో ఉన్న కృష్ణాలో అజ్జయ్య స్వామి చిత్రంతో ప్రత్యేక పూజలు చేసి ప్రవేశించారు. కృష్ణాలో సీనియర్ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ఇకపై కృష్ణా నివాసం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు సాగిస్తానని, ప్రజల విజ్ఞప్తులు ఇచ్చేందుకు ఇక్కడికే రావాలని డీకే తెలిపారు. ప్రజల సంక్షేమం, పాలనలో వేగం కోసం కృష్ణా నుంచి పాలన సాగిస్తానన్నారు. కేబినెట్ విస్తరణపై సూచన బనశంకరి: సీఎం డీకే మంత్రివర్గ విస్తరణపై 27న ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. మంత్రి పదవుల కోసం లాబీయింగ్‌కు అవకాశం ఇవ్వరాదని డీకేకు హైకమాండ్ నేతలు ఫోన్ చేసి సూచించారని తెలిసింది. కుర్చీల కోసం అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి పైరవీలు సాగిస్తున్నారు. నియోజకవర్గాల్లో అభిమానులతో ర్యాలీలు చేయిస్తున్నారు. తమ వర్గం స్వాములు, మఠాధిపతుల ద్వారా ప్రకటనలు చేయిస్తూ ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు. ఇవి సరికాదని, అన్నీ పరిశీలించి విస్తరణ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది.శివమొగ్గ కోర్టుకు బాంబు బెదిరింపుశివమొగ్గ: రాష్ట్రంలో న్యాయస్థానాలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ కొనసాగుతున్నాయి. బుధవారం శివమొగ్గ కోర్టుకు ఇలాంటి మెయిల్ వచ్చింది. జయనగర స్టేషన్ పోలీసులు కోర్టు ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. బెదిరింపు ఈ–మెయిల్ ఒకటి శివమొగ్గ ప్రధాన జిల్లా సెషన్స్ జడ్జి (పీడీజీ)కు వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా జాగిలాలతో క్షుణ్ణంగా సోదాలు చేయగా ఎలాంటి పేలుడు వస్తువులు దొరకలేదు. ముందు జాగ్రత్త గా కోర్టు చుట్టుపక్కల ప్రాంతాలను బంద్ చేసి పరీక్షించారు. కోర్టుకు వచ్చిన వ్యక్తులను సోదాలు చేశారు. చివరికి ఉత్తుత్తి బెదిరింపుగా తేల్చారు. దీనివల్ల గంటలకొద్దీ కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. 28 నుంచి పల్స్ పోలియో మైసూరు: ఐదేళ్ల లోపు బాలలకు పల్స్ పోలియో ద్వారా చుక్కల మందు వేయించాలని జిల్లాధికారి జీ.లక్ష్మీకాంతరెడ్డి సూచించారు. బుధవారం నగరంలోని జెడ్పీ సభాంగణంలో పల్స్ పోలియో ఏర్పాట్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పల్స్ పోలియోను నూటికి నూరుశాతం విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 28న ఆదివారం పల్స్‌పోలియో కేంద్రాల్లో చుక్కలు వేస్తారన్నారు. 29 నుంచి జూలై 1 వరకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఐదేళ్ల లోపు ప్రతి ఒక్క శిశువుకూ పోలియో చుక్కలను వేస్తారని తెలిపారు. జిల్లాలో మొత్తం 7,78,059 ఇళ్లకు వెళ్లి చుక్కలు వేయాలని సూచించారు. ఎస్పీ మల్లికార్జున బాలదండి, పల్స్ పోలియో అమలు అధికారి డాక్టర్ సిరాజ్ అహ్మద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్తంభాల వ్యాన్ బోల్తా ● ముగ్గురు కూలీల మృతి దొడ్డబళ్లాపురం: టెంపో బోల్తా పడ్డ ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన సంఘటన బుధవారం తెల్లవారుజామున బెళగావి సిటీ కిత్తూరు వద్ద పూణె–బెంగళూరు హైవేలో జరిగింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వలస కూలీలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆదిల్‌ఖాన్ (26), పవన్ (26), నజీర్ ఖాన్ (25) స్తంభాల కింద చిక్కి ప్రాణాలు విడిచారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. అందరూ కూడా యూపీలోని ఉన్నావ్ జిల్లాకు చెందినవారు. ఓ కాంట్రాక్టరు వద్ద పనిచేసేవారు. వ్యాన్‌లో స్తంభాలను తీసుకెళ్తుండగా డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కబ్జారాయుళ్లపై కొరడా
సాక్షి బళ్లారి: అధికారం చేతిలో ఉందని, పార్టీ బేధం లేకుండా అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూములపై కన్నేసి యథేచ్ఛగా అధికారంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయల భూములను కబ్జా చేసినవి ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. రెండు నెలల్లో జిల్లా యంత్రాంగం, సిటీ కార్పొరేషన్, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో కబ్జాకు గురైన భూములను ఒక్కొక్కటి స్వాధీనం చేసుకుంటుండటం నగరంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఏకంగా పలువురు తమదే భూమి అన్న చందంగా ఇళ్ల స్థలాలుగా ప్లాట్లు వేసి పేద వారికి అమ్మిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. కొందరు ప్రభుత్వ స్థలాన్ని బాడుగకు ఇచ్చి లక్షలాది రూపాయల మేర నెల నెలా ఆదాయం పొందుతున్న వారూ ఉన్నారు. రెండు నెలలుగా అధికారుల ప్రత్యేక డ్రైవ్ ఈనేపథ్యంలో గత రెండు నెలలుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన అధికారులు, పోలీసులు వివిధ ప్రాంతాల్లో నగరంలో దాదాపు రూ.510 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేసుకొన్న వాటిని స్వాధీనం చేసుకొన్నారు. దాదాపు 110 ఎకరాల భూమిని ఆయా వార్డులు, నగర శివార్లలో మహానగర పాలికె, స్థానిక సంస్థలకు చెందిన భూములను కబ్జాదారుల నుంచి రక్షించి ప్రభుత్వ స్థలం అని నామఫలకాలను ఏర్పాటు చేశారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీలను పీకిపారేశారు. నగరంలోని హవంబావి, నల్లచెరువు, బండిహట్టి, శాంతినగర్, రూపనగుడి రోడ్డు, కాకర్లతోట, ఆంధ్రాళ్ తదితర ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకొన్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న నేతలకు చెందిన వాటిని కూడా నిర్ధాక్షిణ్యంగా జేసీబీలతో తొలగించి అధికారులు తమ నిజాయితీని నిరూపించుకున్నారు. జప్తు చేసిన విలువైన భూముల చిట్టా ఇదే.. ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు కబ్జా చేసిన వాటిలో ఇప్పటి వరకు అధికారులు స్వాధీనం చేసుకొన్న వాటిలో ప్రముఖంగా బండిహట్టి ప్రాంతంలో 3.13 ఎకరాలు, హవంబావిలో 25 సెంట్లు, నల్లచెరువు ప్రాంతంలో 3 ఎకరాలు, బత్రి ప్రాంతంలో ఒకటిన్నర ఎకరా, శాంతినగర్‌లో 14 ఎకరాలు, కోట ప్రాంతంలో 40 సెంట్లు, ఆంధ్రాళ్లో 49 ఎకరాలు, హవంబావిలో 12 ఎకరాలు, కాకర్లతోటలో మూడున్నర ఎకరాలు తదితర దాదాపు 110 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని దాదాపు 50 మందికిపైగా పలుకుబడి ఉన్న వారు కబ్జా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. నగర ప్రజల నుంచి హర్షాతిరేకాలు ఈనేపథ్యంలో రెండు నెలలుగా జిల్లా యంత్రాంగం మెరుపు దాడులు చేసి మహానగర పాలికె పరిధిలోని భూములను స్వాధీనం చేసుకోవడంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ మహానగర పాలికె పరిధిలో బళ్లారి సిటీ, గ్రామీణ నియోజక వర్గాల్లో చాలా మంది భూములను కబ్జా చేసిన వాటిని స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ఇందులో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నా కచ్చితంగా స్వాధీనం చేసుకోవడంలో వెనుకంజ వేయబోమన్నారు. ఇంకా ఎక్కడెక్కడ కబ్జాకు గురైనవి ఉన్నాయో గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. స్వచ్ఛందంగా అప్పగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నగరంలో ఆక్రమణలను తొలగిస్తున్న దృశ్యం(ఫైల్) అక్రమంగా నిర్మించిన ప్రహరీని కూల్చిన దృశ్యం(ఫైల్) రూ.510 కోట్ల విలువైన భూములు స్వాధీనం ఇప్పటి వరకు చెర వీడిన 110 ఎకరాల భూమి ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైనం -
గదగ్ ఆస్పత్రి గాలికి
దొడ్డబళ్లాపురం: గదగ్ నగరంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో నెలరోజుల్లో రెండుసార్లు ఆక్సిజన్ పైపులు చోరీకి గురయ్యాయి. పర్యవసానంగా ఆపరేషన్ థియేటర్‌ను వైద్యులు మూసివేశారు. నగరంలోని కేసీ రాణి రోడ్డులో ఉన్న ప్రభుత్వ మహిళా–శిశు ఆస్పత్రిలో గత వారం దొంగలు ఆక్సిజన్ పైపులను ఎత్తుకెళ్లారు. మళ్లీ సెంట్రలైజ్డ్ ఏసీకి సంబంధించిన 8 ఔట్‌డోర్ యూనిట్లను పగలగొట్టి రాగి వస్తువులను దొంగిలించారు. దీంతో ఆస్పత్రిలో ఏసీలు మొత్తం ఆగిపోయాయి. ఏసీ, ఆక్సిజన్ వసతి లేక ఆపరేషన్ థియేటర్‌ను బంద్ చేశారు. వార్డుల్లో ఎండవేమిడి, ఏసీలు పనిచేయక బాలింతలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతకు తట్టుకోలేని వారు ఇళ్ల నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. ఇంత పెద్ద ఆస్పత్రికి సెక్యూరిటీ సిబ్బంది ఒకరో ఇద్దరో ఉన్నారు. వారు కూడా సరిగా విధులకు రావడం లేదు. వైద్య సిబ్బంది పట్టించుకునేలా లేరు. దీంతో దొంగలు, పోకిరీలు దొరికిన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఆస్పత్రి దుస్థితిపై రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వస్తుసామగ్రి దోచేస్తున్న దొంగలు -
పంటకు ట్యాంకర్ నీరే శరణ్యం
హొసపేటె: వర్షాలు లేక పోవడంతో మరియమ్మనహళ్లి సమీపంలోని హంపినకట్టె–వెంకటాపుర గ్రామానికి చెందిన రైతు లక్ష్మవ్వ తన నాలుగున్నర ఎకరాల్లో పండించిన జొన్న పంటను కాపాడుకోడానికి ట్యాంకర్ నీటిని ఆశ్రయించడం కనిపించింది. హంపినకట్టె–వెంకటాపుర గ్రామానికి చెందిన రైతు లక్ష్మవ్వ, మొదట్లో బాగా కురిసిన రోహిణి వర్షాలకు మొక్కజొన్న, జొన్న రకాలను విత్తారు. ప్రస్తుతం ఆమె పంట కోతకు వచ్చి ఒకటిన్నర నెలలైంది. గత 20 రోజులుగా వర్షాలు లేక పోవడంతో, తేమ లేక పోవడం వల్ల పంటలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. పంటలను కాపాడుకోడానికి మరో మార్గం లేక ఆమె నీటిని అద్దెకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. సుమారు రూ.40 వేలు ఖర్చు చేసి, నాలుగున్నర ఎకరాలలో ఒక ఎకరంలో మొక్కజొన్న, మూడున్నర ఎకరాల్లో జొన్న విత్తనాలు వేశారు. ఇప్పుడు నెల రోజులుగా పెరుగుతున్న పంటలు వర్షాలు ఆగిపోవడంతో ఎదుగుదల నిలిచిపోయి వాడిపోయే దశకు చేరుకున్నాయి. -
త్వరలోనే బెంగళూరు పాలికేలకు ఎన్నికలు?
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని ఐదు నగర పాలికేలకు ఆగష్టు 31 లోగా కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేపట్టింది. జూలై మొదటి లేదా రెండోవారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించి ఆగష్టు 3వ వారంలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. నోటిఫికేషన్ రాగానే నగరంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. చివరి గడువు ఓటరు జాబితా తయారీ, ఇతరత్రా పనుల కోసమని ప్రభుత్వం, ఈసీ అనేకసార్లు గడువు పొడిగించాలని సుప్రీంను మొరపెట్టుకున్నాయి. ఇదే చివరి అవకాశమని స్పష్టంచేసిన కోర్టు, ఇకపై గడువు పొడిగించేది లేదని హెచ్చరించింది. సెప్టెంబరు ఆఖరు వరకు అవధి కోరగా తిరస్కరించింది. దీంతో ఈసీ ఓటర్ల తుది జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది, ఇతరత్రా కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇకపై అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, జేడీఎస్‌లు ఎన్నికల కోలాహలం ఆరంభం కానుంది. జూలైలో నోటిఫికేషన్, ఆగస్టులో పోలింగ్ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈసీ చర్యలు -
రాష్ట్ర ప్రగతికి నాల్వడి బాటలు
మైసూరు: మైసూరు సంస్థానాన్ని పాలించిన మహారాజ నాల్వడి కృష్ణరాజ ఒడెయర్ చేసిన శాశ్వత అభివృద్ధి పనులతో కన్నడనాడులో అభివృద్ధి ఇనుమడించిందని ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్స అన్నారు. నగరంలోని జేఎల్బీ రోడ్డులోని నాదబ్రహ్మ సభాంగణంలో పాతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాల్వడి 142వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. నాల్వడి మహారాజుగా ఉన్న కాలంలో నిర్మించిన పాఠశాలలు, కాలేజీలు, ఆస్పత్రులు, ఆనకట్టలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సాధకులు డాక్టర్ చంద్రశేఖర్(యోగా, వైద్య రంగం), యోగా ప్రకాష్ (యోగా), సీమా(యోగా), డాక్టర్ పీఎం గణేష్ కుమార్ (క్రీడలు), ఎస్వీ వెంకటేశయ్య (యోగా), డాక్టర్ కావ్య ఎస్(వైద్య), లయన్ కేఎన్ సురేష్ (ధార్మిక రంగం), సుమ రాజ్‌కుమార్‌లను సన్మానించారు. బాలలనూ వదలరా? ● హైకోర్టు విస్మయం దొడ్డబళ్లాపురం: ఏమిటీ.. బాలలకూ రక్షణ లేదా? వారినీ వదలడం లేదా? అంటూ హైకోర్టు ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలలను వేధించిన పోక్సో కేసులో వచనానందస్వామికి దావణగెరె జిల్లా కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని ప్రశ్నిస్తూ పోలీసులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. స్వామీజీ తమ మఠంలోని బాలలను లైంగికంగా వేధించారనే అభియోగాలపై జడ్జి విస్మయం వ్యక్తం చేస్తూ బాలలకు భద్రత కరువైందా? అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులో ముందస్తు బెయిలు ఇవ్వడం ఏ మాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. సాధారణ బెయిలు కోసం ప్రయత్నించవచ్చని సూచిస్తూ విచారణను వాయిదా వేశారు. పరమేశ్వరా.. వర్షించు శివమొగ్గ: శివమొగ్గ జిల్లా అంటే వానలకు కొదవ ఉండదు. కానీ ఈసారి తొలకరి వర్షాలు ఆలస్యమయ్యాయి. వేసవి ఎండలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడక్కడ కరువు ఛాయలు సైతం అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం కోసం దేవునిపై భారం వేస్తున్నారు. సోమవారం సాయంత్రం శివమొగ్గలోని ఓంశక్తి బడావణె సమీపంలోని పురాతన శివాలయంలో వీరశైవ సమాజ సీనియర్ నాయకుడు ఉమేష్ హిరేమఠ నేతృత్వంలో పూజలు నిర్వహించారు. తొలకరి వర్షాలు రావడం లేదని, జీవకోటి ఇబ్బందులు పడుతోందని తెలిపారు. అందువల్ల మంచి వర్షాల కోసం పరమేశ్వరున్ని ప్రార్థించామన్నారు. నాన్‌వెజ్ కోతిపై ఫిర్యాదుయశవంతపుర: సాధారణంగా కోతులు పండ్లు, కూరగాయలు వంటి శాకాహారాన్ని భుజిస్తాయి. కానీ ఓ వానరానికి మాంసంపై మనసు పడింది. ఇంట్లోకి దూరి చికెన్, మటన్ వంటకాలను ఎత్తుకెళ్తోంది. రేవునగరి మంగళూరులో మణ్ణగుడ్డె ప్రాంతంలో ఇది జరుగుతోంది. ఓ ఇంటివారు వండుకున్న మాంసం, చేపల కూరను దొంగిలిస్తోంది. నాన్ వెజ్‌ను ఇష్టపడే ఈ కోతి చేష్టలను తట్టుకోలేక బాధితుడు కాంత్రాజ్ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెండేళ్ల నుంచి ఈ కోతి తమ ఇంటిలోకి దూరి మాంసం వంటకాలను దొంగిలించి తింటోందంటూ, దాని బారి నుంచి కాపాడాలని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. -
భద్రమ్మ వెలవెల
● ఆట మైదానంగా నది యశవంతపుర: కాఫీనాడు చిక్కమగళూరులో ఈసారి ముంగారు వానలు అంతంత మాత్రంగా పడుతున్నాయి. 30 ఏళ్ల తరువాత మొదటిసారిగా భద్రా నదీ వానలు లేక ఎండిపోవటం జిల్లావాసులకు దిగులు కలిగిస్తోంది. జూన్ నెలలో మంచి వానలు పడి నదీ ప్రవాహం జోరుగా ఉంటుంది, అందుకు భిన్నంగా ఎక్కడ చూసినా ఎండిపోయి ఇసుక కనిపిస్తోంది. కళస తాలూకా కుదురేముఖ్ పర్వతశ్రేణిలో పుట్టి జిల్లాను సస్యశ్యామలం చేసే నదుల్లో భద్రా ఒకటి. ప్రకృతి ఆగ్రహమో, ఏమోకానీ వర్షాలు లేక నది బోసిపోతోంది. బాళెహొన్నూరు వద్ద బీడుగా మారింది. గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిండుగా పారేటప్పుడు నది లోతు ఎంతో తెలియని వ్యక్తులు ఇప్పుడు లోతును లెక్కిస్తున్నారు. నదిలో ఉంటున్న రాళ్లు, గుండ్లు బయటపడుతున్నాయి. వాలీబాల్, క్రికెట్ ఆడే పిల్లలకు ఆట మైదానంలా మారింది. -
కూతురి మారణహోమం
బనశంకరి: ఆమె టెక్కీగా ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది, ఇంతలో ప్రేమలో పడి సహజీవనం చేయసాగింది. ఇంటికి కూడా రావడం మానేసింది. అమ్మా.. ఇది సరికాదు, నువ్వు ఇంటికి రా అని తల్లిదండ్రులు ఎంతగానో నచ్చజెప్పేవారు. కానీ పెడదారిన పడిన కుమార్తె ససేమిరా అనేది. ఆమెతో మాట్లాడదామని వెళ్లి తల్లిదండ్రులు, చెల్లెలికి అదే చివరిరోజు అయ్యింది. కృష్ణరాజపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో నల్లూరహళ్లి నివాసులైన సోమసుందర్ (55), ముత్తులక్ష్మీ (49), సుప్రియా (20)ను వారి పెద్ద కుమార్తె శ్వేత (26), ఆమె ప్రియుడు కెన్నెత్ (29) నరికి చంపారు. నచ్చజెప్పాలని వెళ్తే శ్వేత కుటుంబాన్ని వదిలేసి శీగేహళ్లిలోని డొమినిక్ లేఔట్ సాయిగ్రీన్ హోమ్స్ అపార్టుమెంట్లో ఫ్లాటు తీసుకుని ప్రియునితో జీవిస్తోంది. ఆమెకు నచ్చజెప్పాలని తల్లిదండ్రులు సోమవారం రాత్రి శ్వేత ఫ్లాటుకు వచ్చారు. ఈ సమయంలో శ్వేత, కెన్నెత్ వారిని దూషించి గొడవ పడ్డారు. ఇంట్లో ఉన్న పెద్ద కత్తులను తీసుకుని కిరాతకుల్లా విరుచుకుపడ్డారు. ముత్తులక్ష్మి, సుప్రియా ఈ హత్యాకాండలో ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలైన తండ్రి సోమసుందర్ ఫ్లాటు బయటకు పరిగెడుతూ మెట్ల వద్ద కుప్పకూలాడు. అరుపులు కేకలు విని భయపడిన ఇతర ఫ్లాట్లవారు పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు చేరుకుని ప్రాణాపాయంలో ఉన్న సోమసుందర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. అంతకుముందు అతడు కూతురి ఘోరం గురించి పోలీసలుకు వివరించాడు. పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి మృతదేహాలను ఈస్ట్‌పాయింట్ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి, ఆస్తి పేరిట గొడవలు గత కొన్నిరోజులుగా శ్వేత తాను కెన్నెత్‌ను పెళ్లి చేసుకుంటానని, ఆస్తిలో భాగం ఇవ్వాలని తల్లిదండ్రులను సతాయిస్తోంది. ఇందుకు తల్లిదండ్రులు వ్యతిరేకించేవారు. శ్వేత సుమారు రూ.30 లక్షలు అప్పులు చేసింది. అప్పు తీర్చాలి, లేదా ఆస్తి ఇవ్వాలని కుటుంబాన్ని వేధించేది. ఆస్తి ఇవ్వలేమని తల్లిదండ్రులు చెప్పడంతో కసి పెంచుకుంది. హంతకులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ మారణహోమంతో అపార్టుమెంటువాసుల్లో భయాందోళన నెలకొంది. సిలికాన్ సిటీలో వెర్రితలలు వేస్తోన్న సహజీవన సంస్కృతిలో ఎన్నో విషాదాలు ఇప్పటికే బయటపడ్డాయి, అంతకుమించిన ఘోరం మరొకటి సంభవించింది. లివ్ ఇన్ మత్తులో కూరుకుపోయిన ఓ యువతి ఏకంగా తల్లిదండ్రులు, సోదరినే హతమార్చింది. ఇందుకు ఆమె ప్రియుడు కూడా సహకరించాడు. తల్లిదండ్రులు, సోదరి నరికివేత దాడికి సహకరించిన ప్రియుడు బెంగళూరులో కిరాతక ఘటన సహజీవనం వ్యతిరేకించారని పగ -
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు
చింతామణిలో రైతుల ధర్నా ఆనేకల్ తాలూకా చందాపురలో ఆందోళన బొమ్మనహళ్లి: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని సోమవారం బెంగళూరు వద్ద ఆనేకల్ తాలూకాలోని చందాపురలో బెస్కాం ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది, రైతులు నిరసన తెలిపారు. ‘విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ధిక్కారం’, ‘టాటా పవర్ కంపెనీ లైసెన్సును నిలిపివేయండి’ అని నినాదాలు చేశారు. బెస్కాం ఒక కంపెనీ కాదు, అది రైతులతో సహా కోట్లాది మంది ప్రజల జీవనాధారం అని కేఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ధనంజయ అన్నారు. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది లైసెన్స్డ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు ఉన్నారు. 3–4 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయన్నారు. ప్రైవేటీకరణతో ఎంతోమందికి ఉపాధి పోతుందన్నారు. ఆత్మహత్యలే దిక్కు చింతామణి: ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ప్రవేటీకరిస్తామనడం, పంపుసెట్లకు మీటర్ బిగిస్తామనడం సరికాదని రాష్ట్ర రైతుసంఘం, హసిరు సేనా, బెస్కాం లైసెన్సుడ్ కాంట్రాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం భారీ ఊరేగింపుగా వచ్చి తాలూకా కార్యాలయాన్ని ముట్టడించారు. రైతు సంఘం నాయకులు రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కరువు ఉందని, రైతుల పంటలకు ధర లభించడం లేదన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చితే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటారన్నారు. తహశీల్దార్ సుదర్శన్ యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. పలుచోట్ల ఉద్యోగులు, రైతుల నిరసనలు -
కారు టైరు పేలి.. లారీని ఢీ
● డ్రైవరు మృతి, బీఈఓలకు గాయాలు దొడ్డబళ్లాపురం: ఐదుమంది విద్యాశాఖ అధికారులు ప్రయాణిస్తున్న కారు టైరు పేలి ప్రమాదం జరిగింది, ఇందులో కారు డ్రైవర్ చనిపోయాడు, ఈ సంఘటన చన్నపట్టణ తాలూకా ముదుగెరె వద్ద బెంగళూరు–మైసూరు హైవేలో జరిగింది. వివరాలు.. ఐదుమంది బీఈఓలు మైసూరు నుండి బెంగళూరుకు కారులో వెళ్తుండగా ఘటనాస్థలంలో టైరు పేలింది. అదుపుతప్పిన కారు హైవేలో పక్కరోడ్డులోకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. కారు డ్రైవర్ ఆనంద్ అక్కడే మృతిచెందాడు. బీఈఓలు మహేశ్, రేవణ్ణ, ప్రకాశ్, కృష్ణరాజు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు బయటకు తీసి సమీపంలోని చాముండేశ్వరి మెడికల్ కాలే జీ ఆస్పత్రిలో చేర్పించారు -
రోడ్లపై మామిడి రాశులు
శ్రీనివాసపురం: మామిడి పండ్లు ఎంత మధురమో, పండించేవారికి అంత కఠినంగా ఉన్నాయి. మామిడిపండ్లను రోడ్లపై రాశులుగా పోసి రైతన్నలు గోడు వెళ్లబోసుకున్నారు. మామిడి పండ్లకు ధర లేకపోవడంతో ఆవేదన పట్టలేక రోడ్డెక్కారు. మామిడి ఉత్పత్తిదారుల క్షేమాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సోమవారం కోలారు జిల్లాలో శ్రీనివాసపురంలో బంద్ నిర్వహించారు. ఉదయం నుంచి దుకాణాలను, ఆఫీసులను మూసివేయించిన ఆందోళనకారులు ట్రాక్టర్లలో మామిడికాయలు, పండ్లను తీసుకువచ్చి రోడ్డు మధ్యలో కుప్పగా పోసి నిరసన తెలిపారు.కేజీకి రూ.10 ఇవ్వాలి సంఘం జిల్లా అధ్యక్షుడు నీలటూరు చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ మామిడి రైతులు ప్రతి యేటా ఏదో ఒక రకంగా నష్టపోతున్నారని, ఏసారి పంట బాగున్నా, ధర లేదని తెలిపారు. మామిడి రైతులకు ప్రభుత్వం కేజీ రూ.10 మద్దతు ధరను అందించి ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యే జికె వెంకట శివారెడ్డి మాట్లాడుతూ సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు, ప్రభుత్వం చేయూతనివ్వాలన్నారు. అదే మాదిరిగా కోలారు నగరంలోనూ రైతులు నిరసన తెలిపారు. జేసీబీలతో మామిడిపండ్లను రోడ్డుపై పోసి నినాదాలు చేశారు. ధర కరువై కోలారు జిల్లా రైతుల ఆగ్రహం -
మూకాంబిక మాతకు 106 కేజీల వెండి తేరు
బొమ్మనహళ్లి: బెంగళూరుకు చెందిన భక్తులు ఉడుపి జిల్లా కుందాపురలో వెలసిన ప్రసిద్ధ కొల్లూరు మూకాంబికా దేవి అమ్మవారికి వెండి రథం బహూకరించారు. ఆ రథంతో ఆదివారం రాత్రి తేరు వేడుకను నిర్వహించారు. వేద పండితులు రథానికి విశేష పూజలు జరిపారు. ఈ రథాన్ని 106 కిలోల వెండితో తయారు చేశారు. అంచనా వ్యయం రూ 3 కోట్లు. విస్ఫోటంలో కుక్క మృతి దొడ్డబళ్లాపురం: రోడ్డుమీద పడిఉన్న కవర్‌ను కొరికిన పెంపుడు కుక్క పేలుడు సంభవించి మృత్యువాత పడింది. ఈ ఘటన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా నల్కుదరె గ్రామంలో జరిగింది. రుద్రేశ్ పెంపుడు కుక్కతో కలిసి పశువులు మేపడానికి వెళుతుండగా కుక్క రోడ్డుపక్కన పడి ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను కొరికింది. వెంటనే పేలుడు జరిగి కుక్క చనిపోయింది. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం ఉన్న గ్రామానికి వినబడింది. సంతెబెన్నూరు పోలీసులు పరిశీలించి పేలుడు అవశేషాలను ల్యాబ్‌కు తరలించారు. ఎవరైనా అడవి పందులను వేటాడేందుకు తీసుకొచ్చిన పేలుడు సామగ్రిని పారేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రూ.2 కోట్ల గంజాయి సీజ్ దొడ్డబళ్లాపురం: బెంగళూరులో కెంపేగౌడ విమానాశ్రయంలో రూ.2.09 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుని కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అతని లగేజీని చెక్ చేయగా 5.9 కేజీల హై.గంజాయి దొరికింది. దీని విలువ రూ.2.09 కోట్లుగా తెలిపారు. అతనిపై డ్రగ్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పాలపై దుష్ప్రచారం చేస్తారా, కేసు తప్పదు● వైద్యురాలికి హైకోర్టు మందలింపు యశవంతపుర: ‘నీకు పాలు ఇష్టం లేకుంటే తాగడం మానేయాలి. కానీ ఇలా రీల్స్ చేసి పోస్టు చేయడం తప్పు’ అని ఓ మహిళా వైద్యురాలికి హైకోర్టు అక్షింతలు వేసింది. వివరాలు కేఎంఎఫ్ నందిని పాలు విషపూరితమంటూ వైద్యురాలు డాక్టర్ శరణ్య పద్మాపై బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం కేసు విచారణ సాగింది. ఆ పాలు విషపూరితం అంటూ ఎలా చెప్పగలరని హైకోర్టు జడ్జి ప్రశ్నించారు. ఇలా రీల్స్ చేసి ప్రజలు, వినియోగదారులను గాభరా పెట్టడం సబబేనా? అని అడిగారు. పాలను పరీక్షించి ధృవీకరించుకున్నారా అని ప్రశ్నలు వేశారు. పాలు బాగా లేకుంటే తాగవద్దు, ఇన్‌స్టాలో ఇలాంటి రీల్స్ పోస్టు చేస్తారా? అని జడ్జి మందలించారు. నీపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఏమిటీ గొడవ? డాక్టర్ శరణ్య పద్మా ఫిబ్రవరి 8న సోషల్ మీడియాలో వీడియో, రీల్స్‌ను పోస్టు చేశారు. నందిని బ్రాండ్ క్రీమ్ బన్, స్ట్రాబెర్రి ఫ్లేవర్ పాలు, పనీర్, ఇతర పదార్థాలు కల్తీగా ఉన్నట్లు చెప్పారు. శరీరానికీ హాని కలిగించే రసాయనాలున్నట్లు ఆమె ఆరోపిస్తూ, వీటిని సేవిస్తే ఆటో–ఇమ్యూన్ వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. దీంతో ఆమైపె కేఎంఎఫ్ అధికారులు కేసు వేశారు. రైల్వే పరీక్షను కన్నడలో జరపాలి తుమకూరు: రైల్వే శాఖలో కన్నడను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు, ఈ నెల 25వ తేదీన కర్ణాటకలో జరగనున్న నైరుతి రైల్వే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ప్రమోషన్ పరీక్షలో కన్నడకు అవకాశం ఇవ్వకుండా, హిందీ, ఇంగ్లిషులో మాత్రమే ప్రశ్నాపత్రాలు ఇస్తారా, రైల్వే శాఖ కన్నడ ప్రజలకు ద్రోహం చేస్తోంది అని కర్ణాటక రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణ్ కృష్ణయ్య అన్నారు. సోమవారం నగరంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయాన్ని రైల్వే శాఖ సహాయ మంత్రి, తుమకూరు ఎంపీ వి.సోమన్న దృష్టికి తీసుకువచ్చినప్పటికీ, ఆయన సమర్థించుకోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఎంతమంది ఎంపీలు, మంత్రులు అభ్యంతరం చెప్పినా కన్నడ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. ఇది కన్నడిగుల ఉద్యోగ హక్కులు, పదోన్నతి హక్కులు, భాషా ఆత్మగౌరవంపై జరుగుతున్న బహిరంగ దాడి అని ఆరోపించారు. నైరుతి రైల్వేలోని హుబ్బళ్లి, బెంగళూరు, మైసూరు డివిజన్లలో గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టుల కోసం 25వ తేదీన కంప్యూటర్ ఆధారిత ప్రమోషన్ పరీక్షను కన్నడలోనూ నిర్వహించాలన్నారు. -
20, 30 ఏళ్లు ఉండేలా వైట్‌ట్యాపింగ్ రోడ్లు
బనశంకరి: బెంగళూరులో బీ–స్మైల్ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు వేగిరం చేయాలని నగరాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. సోమవారం జీబీఏ పరిధిలో పనులపై సమీక్ష జరిపారు. బెంగళూరు దీర్ఘకాలిక ట్రాపిక్ సమస్యలకు పరిష్కారం గురించి మాట్లాడారు. నగరంలో రోడ్లు సుస్థిరంగా ఉండాలి, 20–30 ఏళ్లు నాణ్యతగా ఉండే రోడ్లు నిర్మించడానికి ఈ పనులు దోహదం అవుతాయని తెలిపారు. ఒక కిలోమీటరు వైట్‌టాపింగ్ పనులకు సుమారు రూ.10 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అదే అవధిలో ఐదారు సార్లు తారు రోడ్డు వేస్తే ఎక్కువ వ్యయం అవుతుందని చెప్పారు. ఇప్పటికి 196 కిలోమీటర్లు వైట్‌టాపింగ్ పనులు పూర్తిచేయగా కొత్తగా 126 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. పాత మద్రాస్ రోడ్డు నుంచి మైసూరు రోడ్డు వరకు 22 కిలోమీటర్ల పొడవుతో తూర్పు–పశ్చిమ సొరంగ మార్గం పథకం నిర్మాణానికి టెండర్ ఆహ్వానిస్తామని తెలిపారు. నగరంలో 150 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలనేది లక్ష్యమన్నారు. 275 కిలోమీటర్లు పొడవైన మెట్రోమార్గం నిర్మించాలని, దీంతో పాటు ప్రజారవాణాకు పెద్దపీట వేస్తామని తెలిపారు. జీబీఏ కమిషనర్ మహేశ్వర్రావ్, డైరెక్టర్ ప్రహ్లాద్ పాల్గొన్నారు. 150 కి.మీ. పొడవుతో ఎలివేటెడ్ కారిడార్ నగరాభివృద్ధి మంత్రి కృష్ణబైరేగౌడ -
అన్ని రంగాల కృషితోనే రోగాలకు చెక్
మండ్య: ఆధునిక ఆరోగ్య సంరక్షణ రంగంలోని సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి వివిధ రంగాల సహకారం, పరిశోధనలు ఆవశ్యకమని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. మండ్య జిల్లాలోని నాగమంగళలో ఉన్న ఆదిచుంచనగిరి విశ్వవిద్యాలయం, ఆదిచుంచనగిరి ఇన్స్టిట్యూట్ ఫర్ మాలిక్యులర్ మెడిసిన్ (ఎయిమ్స్) ఆధ్వర్యంలో జరిగిన ‘అనువర్తిత పరిశోధనల కోసం ఆరోగ్య శాస్త్రాలలో అంతర్విభాగ విధానాలు‘ అనే అంతర్జాతీయ సదస్సును గవర్నర్ ప్రారంభించి ప్రసంగించారు. సుమారు 1800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలు గణనీయమని అభినందించారు. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఒకే రంగం ద్వారా పరిష్కారాలను కనుగొనలేమని ఆయన అభిప్రాయపడ్డారు. వైద్య శాస్త్రం, బయో టెక్నాలజీ, ఏఐ, బయో ఇన్ఫర్మేటిక్స్, ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ వంటి వేర్వేరు రంగాలలోని నిపుణుల మధ్య సహకారం ద్వారా సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనగలమని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో శాస్త్రవేత్తలు, వైద్యులు, బయో టెక్నాలజిస్టులు, గణాంకవేత్తలు, పాలకుల కృషితో వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మలానందనాథ స్వామి, మంత్రి శరణప్రకాష్ పాటిల్, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నరు గెహ్లాట్ -
వర్షాలు దూరమై.. ఖర్చులు భారమై..
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో గత 20 రోజుల నుంచి వానలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుబ్లీ తాలూకా బండివాడ గ్రామంలో సాగు పనుల్లో భాగంగా విత్తనం వేసిన రైతులు ప్రస్తుతం వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నిరంతరం కరువు కాటకాలతో విత్తిన విత్తనం మొక్కగా మారక పోవడంతో నష్టాలతో బాధ పడుతున్నారు. సాగు పనుల కోసం ఎద్దులను కొనుగోలు చేయడం చాలా కష్టతరంగా మారింది. ఓ జత ఎద్దులకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పోనీ ట్రాక్టర్‌తో దుక్కి దున్ని సాగు చేద్దాం అంటే ప్రతి ఎకరాకు రూ.1500 నుంచి రూ. 2000 వరకు బాడుగ ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులకు డబ్బులు లేక వానలు కురవక రైతులు ఆర్థికంగా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఖరీఫ్ సీజన్ అదును దాటుతుందన్న కారణంతో కుటుంబ సభ్యులే దుక్కి దున్నడానికి ఎద్దులుగా మారి తమ పొలాన్ని దున్నుతున్నారు. వర్షాలు లేక పంట నాశనం కారాదని ఇలా చేస్తున్నారు. ప్రతి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. ధార్వాడ జిల్లాలో సేద్యానికి రైతన్నల పాట్లు -
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం
సాక్షి,బళ్లారి: జిల్లాలో రౌడీషీటర్ల అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ఉక్కుపాదం మోపి గట్టి చర్యలు తీసుకున్నామని, జిల్లాలో అనుమానితులైన 104 మంది రౌడీషీటర్ల ఇళ్లలో సోదాలు చేసినట్లు బళ్లారి రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) హర్ష పేర్కొన్నారు. ఆయన సోమవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 17 పోలీసు స్టేషన్ల పరిధిలో ఒకేసారి విస్తృతంగా సోదాలు జరిపామన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో 6 మంది దాకా రౌడీషీటర్ల ఇళ్లను సోదా చేశామన్నారు. తనిఖీల్లో ఏపీఎంసీ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక రౌడీ షీటర్ ఇంట్లో ఎయిర్‌గన్, స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోటీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర జిల్లాల్లో ఏకకాలంలో 22 బృందాలను ఏర్పాటు చేసి 381 మంది రౌడీల ఇళ్లలో సోదాలు చేశారన్నారు. ఆంధ్రాళ్లో సీతారాం ఇంట్లో ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. బళ్లారి జిల్లాలో 104, విజయనగరలో 106, రాయచూరులో 103, కొప్పళ జిల్లాలో 68తో కలిని మొత్తం 381 మంది రౌడీల ఇళ్లలో సోదాలు చేపట్టామన్నారు. ఆయా ఇళ్లలో వాహనాలు, ఇతరత్రా వాటిని పరిశీలించారన్నారు. కొందరు రౌడీషీటర్లు మృతి చెందారన్నారు. నాలుగు జిల్లాల్లో ప్రత్యేక నిఘా నాలుగు జిల్లాల్లో 3,814 మందిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బళ్లారి జిల్లాలో 53 మందిని సరిహద్దులు దాటించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీరిలో 10 మందిని ఇప్పటికే సరిహద్దులు దాటించారన్నారు. ప్రముఖంగా హత్యారోపణలు ఎదుర్కొంటున్న 377 మందిలో బళ్లారి జిల్లాలో 126 మంది, విజయనగర జిల్లాలో 71 మంది, రాయచూరు జిల్లాలో 100 మంది, కొప్పళ జిల్లాలో 80 మంది ఉన్నారన్నారు. ఆయా జిల్లాల్లో రౌడీషీటర్లు, హత్యారోపణలు ఎదుర్కొంటున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సమాజంలో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా రౌడీషీటర్లు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో మెరుపుదాడులు చేయడంతో రౌడీషీటర్లు ఉలిక్కిపడ్డారు. రౌడీషీటర్ల ఇళ్లలో పోలీసులు జల్లెడ పట్టారన్నారు. ఎస్పీ సుమన్ పన్నేకర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రాస్ ఓటింగ్‌పై ప్రమాణం అవసరం లేదు
హొసపేటె: ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంపై ధర్మస్థలంలో ప్రమాణం చేయాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి బీ.శ్రీరాములు తెలిపారు. నగరంలోని సహకార కళ్యాణ మంటపంలో సోమవారం నిర్వహించిన ఎస్టీ మోర్చా సామాజిక న్యాయ అవగాహన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మా నాయకుడు ప్రహ్లాద్ జోషి క్రాస్ ఓటింగ్ విషయంలో ప్రమాణం చేశారని ఆయన అన్నారు. సురేష్‌కుమార్ ఒక ప్రకటన ఇచ్చారు. నేను కూడా ఆయన ప్రకటనకు కట్టుబడి ఉన్నాను. ధర్మస్థలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ధరస్థలానికంటూ ఒక పవిత్రత ఉంది. వ్యతిరేక ఓటు ఎవరు వేశారో నాకు కూడా తెలుసు. దీనిని పార్టీ వేదికపై పరిష్కరించుకోవడం సముచితం అని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర బాగా పని చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ఆ విషయంలో తమకు ఎలాంటి విభేదం లేదన్నారు. అసమ్మతి బట్టబయలు కాగా ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరిగిన కేపీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం డీకే.శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు బీకే.హరిప్రసాద్‌ల మధ్య ఉన్న అసమ్మతి బయట పడిందన్నారు. గాంధీ కుటుంబ తరంతో తాను కలిసి పని చేశానని చెప్పడం ద్వారా బీకే.హరిప్రసాద్ సీఎం డీకే.శివకుమార్‌కు హెచ్చరిక చేసినట్లు కనిపిస్తోందన్నారు. ఆర్ఎఎస్ గురించి మాట్లాడే హక్కు కేపీసీసీ అధ్యక్షుడు హరిప్రసాద్‌కు లేదని అన్నారు. ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ గెలవకుండా హరిప్రసాద్ దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మున్ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి శ్రీరాములు -
పెన్షన్ కోసం పండుటాకుల క్యూ
బళ్లారిటౌన్: గత నాలుగు నెలల నుంచి వృద్ధులకు పెన్షన్లు రాకపోవడంతో మళ్లీ వెరిఫికేషన్ కోసం వృద్ధులు, రిజర్వేషన్ కలిగిన మహిళలు నగరంలోని నూతన జిల్లాధికారి కార్యాలయ భవనంలోని తాలూకా కార్యాలయంలో సోమవారం బారులు తీరారు. దాదాపు 100 మందికి పైగా ఒక్కసారిగా రావడంతో కార్యాలయం కిక్కిరిపోయింది. దరఖాస్తుల సమర్పణకు వృద్ధులు భారీగా వస్తున్నా కార్యాలయంలోని కౌంటర్ వద్ద కంప్యూటర్లో ఒక్కరే సిబ్బంది పని చేస్తుండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వృద్ధులు అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చింది. -
శాంతియుత మొహర్రం ఆచరణకు పిలుపు
రాయచూరు రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో మొహర్రం పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని రాయచూరు రూరల్ ఎస్ఐ ప్రకాష్ డంబళ్ పిలుపునిచ్చారు. ఆదివారం రాయచూరు తాలూకా కూడ్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మొహర్రం పండుగను శాంతియుతంగా జరుపుకునేందుకు గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. హిందూ, ముస్లిం సోదరులు కలిసి చేసుకునే పండుగల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. రైల్వే బోర్డు పరీక్షలు కన్నడలో జరపాలి రాయచూరు రూరల్: రాష్ట్రంలోని నైరుతి రైల్వే డివిజన్ పరిధిలో ఈనెల 25న నిర్వహించనున్న రైల్వే బోర్డు పరీక్షలు కన్నడలో నిర్వహించాలని కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు వినోద్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినందున నైరుతి రైల్వే డివిజన్లో రైల్వే బోర్డు పరీక్షలు కన్నడలో కాకుండా ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థులకు అనుకూలమయ్యేలా కన్నడ భాషలో పరీక్షలు జరపాలని ఒత్తిడి చేశారు. తుర్విహాళ్ ఎస్ఐపై చర్యలకు డిమాండ్ రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకా తుర్విహాళ్ ఎ్స్ఐపై చర్యలు చేపట్టాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సోమవారం సింధనూరు డీఎస్పీ కార్యాలయం వద్ద న్యాయవాదులు చేపట్టిన ఆందోళనలో వారు మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు పరేడ్‌లో తీసుకుంటున్న జాగ్రత్తలో భాగంగా రౌడీ షీటర్ సోమనాథ్ నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్న అంశంపై ప్రశ్నించిన న్యాయవాది అరళయ్యని అవాచ్య పదజాలంతో దూషించారు. కోపోద్రీక్తుడైన న్యాయవాది తాలూకా న్యాయవాదుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు డీఎస్పీ కార్యాలయం వద్ద ఆకస్మిక ఆందోళన జరిపి తుర్విహాళ్ ఎ్‌స్‌ఐ సుజాత డీ.నాయక్‌పై చర్యలు చేపట్టాలని కోరుతూ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు వీరారెడ్డి, వినాయక్‌లకు వినతిపత్రం సమర్పించారు. కోర్టు కార్యకలాపాలను బహిష్కరించి నినాదాలు చేశారు. మత్తు పదార్థాల కట్టడికి సహకరించండి రాయచూరు రూరల్ : జిల్లాలో మాదక వస్తువుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పిలుపు ఇచ్చారు. సోమవారం నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో జరిగిన మాదక వ్యసనాల నుంచి విముక్తిపై చేపట్టిన ప్రచారాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. నేటితరం యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారన్నారు. యువత దురలవాట్లకు గురై ఉజ్జ్వల భభవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక వస్తువుల సేవనంతో ఆరోగ్యానికి తోడు మానసికంగా కుంగిపోతారన్నారు. సమావేశంలో వడవాటి నరసింహులు, శరణప్ప, ప్రతిభ, వెంకట సింగ్‌లున్నారు. 24న లక్ష్మీ నృసింహునికి పూజలు కేజీఎఫ్ : నగరంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈనెల 24వ తేదీ బుధవారం స్వాతి నక్షత్ర విశేష పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 9 గంటలకు లక్ష్మీనారాయణ హోమం, మహా అభిషేకం, వేదఘోష, మహా మంగళారతి తదితర పూజలను చేస్తున్నారు. పూజల్లో పాల్గొనే భక్తుల కోసం అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. దేవాలయ ధర్మాధికారి మహేంద్రన్ నేతృత్వంలో పూజల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకు పాత్రులు కావాలని దేవాలయ ధర్మాధికారి కోరారు. -
తేలని అంజన్న జన్మస్థల వివాదం
సాక్షి,బళ్లారి: దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన భగవాన్ హనుమంతుడి నిజమైన జన్మస్థలం ఎక్కడ అనే విషయాన్ని తేల్చడానికి సంబంధించిన అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు సోమవారం ఈ కేసులో అత్యవసర విచారణ చేయడానికి నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత కేసును పునర్విచారణ చేపట్టే నిర్ణయంపై పిటిషన్‌దారుడు ఆవేదన వ్యక్తం చేసి దాఖలు చేసిన రిట్‌పై విచారణకు అత్యున్నత న్యాయస్థానం మొగ్గు చూపలేదు. న్యాయమూర్తి బీ.వీ.నాగరత్న, న్యాయమూర్తి జే.ఎం.బాగ్చితో కూడిన ద్విసభ్య పీఠం ఎదుట ఈ విషయాన్ని సాధారణ కారణ జాబితా బయట మౌఖికంగా ప్రతిపాదించారు. అయితే ఈ దశలో అభ్యంతరం వ్యక్తం చేయడానికి నిరాకరించిన ధర్మాసనం కర్ణాటక హైకోర్టు తన నిర్ణయాన్ని స్పష్టం చేయడానికి సమర్ధవంతంగా ఉందని పేర్కొంటూ సదరు రిట్‌ను తిరస్కరించారు. సుప్రీంకోర్టు ఎదుట హాజరైన రిట్దారుడి తరుపు న్యాయవాది కర్ణాటక హైకోర్టు ముందు అత్యంత అసాధారణంతో పాటు విచిత్ర కార్య విధాన పరిస్థితి నెలకొందని వాదించారు. న్యాయవాదుల ప్రముఖ వాదనల్లో హైకోర్టు ఇప్పటికే ఈ వివాదాన్ని సుదీర్ఘ విచారణ జరిపి తన తీర్పును రిజర్వ్ చేసిందని తెలిపారు. ఇలా తీర్పు.. అలా పునర్విచారణ.. అనంతరం ఓపెన్ కోర్టులో తీర్పును ప్రకటించి, ఆదేశ ప్రతులను ప్రకటించి సంతకాలు కూడా జరిగాయి. అయితే తీర్పు ప్రకటించిన తక్షణమే ఈ కేసును ఉన్నఫళంగా మరుసటి రోజే తిరిగి విచారణ జాబితాలో చేర్చారు. చట్టప్రకారం ఒకసారి కోర్టు తీర్పు ప్రకటించి సంతకం చేసిన తర్వాత ఆ విషయంపై కోర్టు న్యాయ పరిధి ముగిిసిపోతుంది. దీన్ని న్యాయ పరిభాషలో ఫంక్టస్ అఫిిషియో అంటారు. నిర్ధిష్ట చట్ట రాయితీలను మినహాయించి, అదే కేసును తిరిగి విచారణ చేపట్టడం సాధ్యం కాదు. తీర్పు వచ్చిన తర్వాత పునఃపరిశీలనకు ఎంపిక చేసుకోవడం తీవ్రమైన కార్యవిధాన లోపమని న్యాయవాది తక్షణమే అభ్యంతరం వ్యక్తం చేశారు. రిట్ దారుల వాదనలను ఆలకించిన న్యాయమూర్తి బీ.వీ.నాగరత్న కర్ణాటక హైకోర్టు కార్యవైఖరిని, పద్ధతిని సమర్ధించారు. కర్ణాటక హైకోర్టు తనదైన కార్యవైఖరిని కలిగి ఉందని, అవసరమైతే ఆదేశంలోని కొన్ని అంశాలను స్పష్టీకరించే, అలాగే సవరణ లేదా సరిదిద్దే ప్రక్రియను హైకోర్టు చేపట్టవచ్చు. హైకోర్టు ఈ సమస్యను స్వయంగా నిర్వహించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. సాంకేతికత లేదా చట్టపరమైన అభ్యంతరాలు ఉంటే హైకోర్టు ముందుగా వాటిని పరిగణించాలని పేర్కొనడం ద్వారా సుప్రీంకోర్టు ఎటువంటి తక్షణ పరిష్కారం ఇవ్వడానికి నిరాకరించింది. హిందూ ధార్మిక సంస్థల మధ్య వివాదం విశేషమేమిటంటే ఈ హనుమాన్ జన్మభూమి వివాదం రెండు విభిన్న మతాల మధ్య సంక్లిష్టమైన విషయం కాదని, బదులుగా రెండు హిందూ ధార్మిక సంస్థల మధ్య జరుగుతున్న చారిత్రాత్మకమైన, ధార్మిక హక్కుల పోటాపోటీ అని చెప్పవచ్చు. 2021లో ప్రారంభమైన ఈ వివాదంలో ప్రముఖంగా మూడు వాదాలు తెరపైకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తన పరిధిలో తిరుమల గుట్టలు, పర్వతాలలోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి నిజమైన జన్మస్థానం అని ప్రతిపాదించింది. తన ప్రతిపాదనకు మద్దతు కోసం టీడీడీ ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. పురాణ సాహిత్యం, ప్రాచీన తామ్ర ఫలకాలు, శాసనాలు, అలాగే భౌగోళిక ఆధారాల ప్రాతిపదికన కమిటీ నివేదిక సమర్పించింది. ఆ మేరకు టీటీడీ ఓ చిరు పుస్తకాన్ని ప్రకటించింది. అంతేకాకుండా రామ నవమి రోజున ఆ స్థలాన్ని హనుమంతుడి జన్మస్థలంగా పవిత్రీకరించి అక్కడ పర్యాటక వసతుల అభివృద్ధి చేపట్టింది. కర్ణాటకలో యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రాత్మక, పారంపరికమైన హంపీ దగ్గరలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలో వెలసిన అంజనాద్రి కొండ హనుమంతుడి నిజమైన జన్మస్థలం అని శ్రీ హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు, అలాగే సంస్థాపక స్వామి గోవిందానంద స్వామి సరస్వతి ప్రతిపాదించారు. ఆధారాలు ఉన్నా ఏకాభిప్రాయం కరువు వాల్మీకి రామాయణం, స్కంధ పురాణం, వరాహ పురాణం, బ్రహ్మాండ పురాణం వంటి గ్రంథాల ఆధారంగా వైదిక విద్వాంసులు, చరిత్రకారుల కమిటీ ఈ తీర్మానానికి వచ్చింది. నేటి హంపీ, తుంగభద్ర నది చుట్టుపక్కల కిష్కింధ ప్రాంతంలోని అంజనహళ్లే హనుమంతుడి జన్మభూమి అన్నది వీరి వాదం. కొప్పళ జిల్లా అంజనాద్రిలో జన్మించారని ఈ ప్రాంత ప్రజలతో పాటు, దేశ వ్యాప్తంగా ఎందరో భక్తుల నమ్మకంతో పాటు విశ్వాసం. అందుకు సంబంధించి ఎన్నో ఆనవాళ్లు, చరిత్రను తెలియజేసే విషయాలు ఉన్నాయని, రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు ఆమె కోసం వెతికేందుకు శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గంగావతి సమీపంలోని కిష్కింధ సమీపంలో హనుమంతుడిని, సుగ్రీవుడిని తొలిసారిగా కలిశారని కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే ఇటీవల తిరుమల అంజనాద్రిలో ఆంజనేయ స్వామి జన్మించారని వివాదం తలెత్తడంతో హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై విధ్వాంసుల మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. తెరపైకి ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ కూడా.. ఈ రెండింటి మధ్య కర్ణాటక తీర ప్రాంత జిల్లా ఉత్తర కన్నడలోని గోకర్ణ హనుమంతుడి నిజమైన జన్మస్థలం అని జగద్గురు శంకరాచార్య, శ్రీరామచంద్రాపురం మఠం మూడో వాదాన్ని తెరపైకి తెచ్చింది. వాల్మీకి రామాయణంలో ఉల్లేఖించిన ప్రకారం హనుమంతుడు గోకర్ణలో జన్మించారని, అయితే కిష్కింధ అంజనాద్రి ఆయన ఆ తర్వాత కార్యకలాపాలకు కేంద్రమైనందువల్ల అది హనుమంతుడి కర్మభూమి అని, జన్మభూమి కాదని ఆ మఠం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రస్తుతానికి జోక్యం చేసుకోవడానికి నిరాకరించినందు వల్ల ఈ జటిల ధార్మిక వివాదం న్యాయపోరాటం మళ్లీ తిరిగి కర్ణాటక హైకోర్టులోనే కొనసాగనుంది. హైకోర్టు తన పునర్విచారణ సందర్భంగా ఎటువంటి తీర్మానం చేపట్టనుందో, అలాగే తీర్పు గందరగోళ విషయాలను ఎలా పరిష్కరించనుందో ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, ఈ ప్రాంత ప్రజల దృష్టి కేంద్రీకృతమైంది. మొత్తానికి హనుమంతుడి జన్మస్థలం గురించిన చర్చ రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం కానుందని చెప్పవచ్చు. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచన -
యువకుడి హత్య కేసు.. నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: నగరంలో యువకుడు దారుణ హత్యకు గురైన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల్సుంబీ కాలనీలో తిరుపతి అనే యువకుడి తల, మొండెంను తీసుకుని దుండగులు పరారైన కేసును పశ్చిమ స్టేషన్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. తిరుపతి ఇంటిలో మూడు రోజుల క్రితం అవేశ్(26), రాజు(26) అనే ఇద్దరు మిత్రులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడని, ఆ సమయంలో వాగ్వాదం జరిగి తిరుపతిని పాత కక్షలతో దారుణంగా హత్య చేశారని తెలిపారు. డీఎస్పీ శాంతవీర, సీఐ మహేష్ పాటిల్‌లున్నారు. -
కుంటలో పడి ఇద్దరు జల సమాధి
● మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు రాయచూరు రూరల్: వ్యవసాయ పొలంలోని నీటి కుంటలో పడి ఇద్దరు నీటి పాలైన ఘటన కలబుర్గి జిల్లా సేడం తాలూకా మూగనూరులో చోటు చేసుకుంది. ఆదివారం గేదెలను మేపడానికి వెళ్లిన భద్రస్వామి(32), అతని అన్న కుమారుడు సదాశివస్వామి(10) అనే ఇద్దరూ స్నానం చేయడానికి నీటి కుంట వద్దకు వెళ్లారు. అయితే ఈత రాకపోవడంతో ఒకరిని రక్షించబోయి మరొకరుగా దిగి బురదలో కూరుకుపోయి మరణించారు. ఘటనతో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సేడం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 7 శాతం రిజర్వేషన్ అమలు చేయండి హొసపేటె: రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన 7 శాతం ఎస్టీ రిజర్వేషన్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. సోమవారం సహకార సంక్షేమ హాలులో బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక న్యాయ అవగాహన సదస్సులో బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బీ.శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్టీ వర్గానికి 7 శాతం రిజర్వేషను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. ఎస్టీ రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. సదస్సులో బీజేపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు రమేష్ జార్కిహొళి, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బంగారు హనుమంతు, శాసన మండలి సభ్యురాలు హేమలత నాయక్, మాజీ ఎంపీలు బీవీ నాయక్, సన్న పక్కీరప్ప, మాజీ ఎమ్మెల్యేలు రాజు గౌడ, ఎంఎస్. సోమలింగప్ప, ప్రతాప్ గౌడ పాటిల్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, బీజేపీ ఎస్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినికి దక్కని అనుమతి● నీట్ పరీక్ష ప్రారంభానికి 5 నిమిషాల ముందు వచ్చినా కేంద్రంలోకి అనుమతించని అధికారుల వైనం హొసపేటె: నీట్ పరీక్ష ప్రారంభం కావడానికి కేవలం ఐదు నిమిషాల ముందు వచ్చిన ఒక విద్యార్థినిని పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించలేదు. కొప్పళలోని ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్ కళాశాల పరీక్ష కేంద్రంలో జరిగిన ఈ ఘటనలో బీబీ ఫాతిమా అనే విద్యార్థినికి పరీక్ష గదిలోకి అనుమతి లభించలేదు. పరీక్ష రాయడానికి విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రం వద్దకు హాజరు కావాల్సి ఉంది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సి ఉంది. కొప్పళలోని పరీక్ష కేంద్రానికి చేరుకుంటుడగా వాహనం పాడవడంతో విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేరుకునేసరికి మధ్యాహ్నం 1.55 గంటలు అయింది. పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థినిని పోలీసులు గేటు ద్వారా లోపలికి పంపించారు. కానీ పరీక్ష కేంద్రం అధికారులు ఆమెను పరీక్ష రాయడానికి అనుమతించలేదు. పదేపదే అభ్యర్థించినా ఆ విద్యార్థినికి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదు. -
ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్ట్
రాయచూరు రూరల్ : గంజాయి విక్రయం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఆదివారం జిల్లాలోని సింధనూరు తాలూకా ఆర్.హెచ్.క్యాంప్‌లో హనుమేష్ సర్కార్(43), స్వాగత్ సర్కార్(34), మణిశంకర్ సర్కార్(37)లను పట్టుకుని, వారి నుంచి 5.210 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.5.12 లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు. జిల్లాలో శాంతియుతంగా మొహర్రం ఆచరణకు గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 1,561 మంది రౌడీషీటర్లకు పరేడ్ నిర్వహించామన్నారు. డీఎస్పీ శాంతవీర, సీఐ మహేష్ పాటిల్‌లున్నారు. -
‘క్రాస్ ఓటింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తాం’
హుబ్లీ: బీజేపీ అన్ని ఆటుపోట్లను అధిగమించి గట్టిగా నిలబడింది. క్రాస్ ఓటింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నాం. 2028లో బీజేపీని అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఆదివారం బెళగావిలో యోగా దినోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో నాయకత్వ కొరతపై స్పందిస్తూ ఏదైనా ఓ ఘటన ఆధారంగా నాయకత్వాన్ని తీర్మానించడానికి సాధ్యపడదని తెలిపారు. జాతీయ నాయకులు తనను రాష్ట్ర అధ్యక్షుడు అని ఎక్కడా చెప్పలేదు. ఈ విషయం తాను చెప్పలేదు అని వెల్లడించారు. అలాంటి ప్రతిపాదన ఎక్కడ చర్చకు రాలేదని పేర్కొన్నారు. ఈసారి సూపర్ ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. కేంద్ర సర్కార్ నుంచి అవసరమైన నిత్యావసరాల సరఫరాకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా పాలన దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ఎన్నికలు, ప్రమాణ స్వీకారం తదితర కార్యక్రమాలు ముగిసినా.. పంట నష్టం పరిహార చర్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే నీటి సమస్య తలెత్తినా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారో తెలియదన్నారు. -
డీకేశీ అభిమాని పాదయాత్ర
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డి.కే.శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే యాదగిరి జిల్లా సురుపుర తాలూకా హలికెర నుంచి బెంగళూరు విధాన సౌధ వరకు పాదయాత్ర చేస్తానని ఆయన అభిమాని రామనగౌడ మాలి పాటిల్ గతంలో మారెమ్మ దేవికి మొక్కుకున్నాడు. ఇటీవల డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. రామనగౌడ మాలి పాటిల్ మొక్కు నెరవేరడంతో ఆదివారం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మూడు లేదా నాలుగు రోజుల్లో బెంగళూరులోని విధానసౌధకు చేరుకుంటానని ఆయన తెలిపారు. నాణ్యమైన విద్యనందించాలి రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా రంగం అబివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసన గౌడ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్‌లో సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు పాఠశాల, కళాశాలలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డి.కే.శివ కుమార్ అమలు చేసిన ఉచిత బస్సుపాసు పథకాన్ని విద్యార్థులు సద్వినియెగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, డీఎస్పీ శాంతవీర, ఆర్టీసీ డీసీ కందగల్, డీటీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వైటీపీఎస్ ఈడీగా జ్యోతిలక్ష్మిరాయచూరు రూరల్: రాష్ట్రంలో సుమారు 40 శాతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న యరమరాస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (వైటీపీఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా జ్యోతి లక్ష్మి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వివిధ స్థాయిల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై చర్చించారు. మంత్రి పదవి కేటాయించాలి రాయచూరు రూరల్: మంత్రివర్గ విస్తరణలో విధాన పరిషత్ సభ్యుడు, సీనియర్ నాయకుడు వసంత్ కుమార్‌కు చోటు కల్పించి, కె.హెచ్.మునియప్పను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని మాదిగ సమాజం మహాసభ డిమాండ్ చేసింది. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సంచాలకుడు యల్లప్ప మాట్లాడారు. 2023 ఎన్నికల సమయంలో, ఇతర రాష్ట్రాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేశారన్నారు. 30 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న వసంత్ కుమార్‌కు ఈసారి మంత్రి పదవి కేటాయించాలని సూచించారు.సమావేశంలో అనిల్ కుమార్, చెన్నప్ప, కట్టముని, తిమ్మారెడ్డి, నాగరాజ, పరుశురామ్, జనార్దన పాల్గొన్నారు. దొంగిలించబడిన మొబైల్స్ రికవరీ కెజీఎఫ్: కెజీఎఫ్ జిల్లా వ్యాప్తిలో దొంగతనానికి గురైన 23 మొబైల్స్‌ను సైబర్ క్రైం పోలీసులు కనుక్కుని బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ శివాంశు రాజ్‌పూత్ మాట్లాడుతూ.. దొంగిలించబడిన మొత్తం 23 మొబైల్ ఫోన్లను వాటి యజమానులను హస్తాంతరం చేశామని తెలిపారు. ఎవరైనా మొబైల్ ఫోన్లను పొగొట్టుకుంటే వెంటనే సీఇఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా మొబైల్ ఫోన్లను కనుగొనడానికి సాధ్యమవుతుందని వెల్లడించారు. దొంగలించబడిన మొబైల్ ఫోన్లను కనుగొనడంలో శ్రమించిన పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. -
నిరుపయోగంగా ఈత కొలను
పాచి పట్టిన కొలను నీరు, పేరుకున్న వ్యర్థాలుఅధ్వాన్నంగా మారిన ఈత కొలను పిచ్చి మొక్కలతో నిండిన కొలను పరిసరాలు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించాలనే సదాశయంతో నిర్మించిన పథకాలు నీరుగారి పోతున్నాయి. కోట్లాది రూపాయలు వ్యయం చేసి నిర్మించిన ఈత కొలను పనికి రాకుండా పాచి పట్టిన ఉదంతం బెళగావిలో చోటు చేసుకుంది. దీంతో ఈత క్రీడాకారుల ఆశలు ఆవిరవుతున్నాయి. బెళగావి సిటీ కార్పొరేషన్ అధికారులు 2019లో రూ.5 కోట్లతో ఒలింపిక్ క్రీడల్లో వినియోగించే విధంగా హనుమాన్ నగర్లో అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన ఈత కొలను నిర్మాణానికి మాజీ శాసన సభ్యుడు ఫిరోజ్ సేట్్ భూమిపూజ చేశారు. ఈత నేర్చుకునే క్రీడాకారులకు ఉపయోగపడాలనే సదాశయంతో నిర్మించిన ఈతకొలను నాణ్యతకు అధికారులు తూట్లు పొడిచారు. అంతర్జాతీయ స్థాయి ఈత కొలనులో 500, 100 మీటర్ల పోటీలకు మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా నిర్మించారు. దుస్తులు మార్చుకోడానికి గదులు, అండర్‌గ్రౌండ్ ట్యాంక్‌లు, పంపింగ్ హౌస్‌లు, ఫిల్టర్ యూనిట్లు పాడై పోయాయి. ముగ్గురు కమిషనర్లు మారినా.. ఇప్పటి వరకు బెళగావి సిటీ కార్పొరేషన్‌కు ముగ్గురు కమిషనర్లు మారినా గత ఏడేళ్ల నుంచి ఈత కొలను అభివృద్ధి విషయంపై శ్రద్ధ కనబరచలేక పోతున్నారని ప్రజలు, క్రీడాకారులు శాపనార్థాలు పెడుతున్నారు. ఈత కొలను చుట్టు పిచ్చి మొుుక్కలు మొలిచి, నీరు పాచి పట్టి కనిపిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో ఈత నేర్చుకొనే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మరో వైపు అధికారులు ఈత కొలను అభివృద్ధి విషయంలో అశ్రద్ధ కనబరచడంతో అధ్వాన్నంగా మారింది. ఇప్పటికై నా కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించి ఈత కొలనును అభివృద్ధి పరిచి క్రీడాకారులకు ఈత నేర్చుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఏడేళ్లుగా పోటీలకు ఎంపిక కాని క్రీడాకారులు కోట్లాది రూపాయల నిధుల వ్యయం వృథా -
బళ్లారిలో నీట్ పరీక్ష
సాక్షి, బళ్లారి: నీట్–యూజీ 2026 పరీక్ష ఆదివారం విజయవంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 గంటల వరకూ పరీక్ష జరిగింది. నగరంలోని సతీష్ చంద్ర అగర్వాల్ సరళాదేవి కళాశాలతో సహా 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలో 4,127 మంది నీట్ యూజీ పరీక్ష రాయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 692 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. గతంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్ ధ్రువీకరణ మధ్య నీట్ పరీక్షలు నిర్వహించారు. రాయచూరు రూరల్: జిల్లాలోని 12 కేంద్రాల్లో 3,979 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. రాయచూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. -
చేద్దాం యోగా.. సంతోషంగా
మైసూరు: భారతదేశంలో యోగా అనేది ప్రాచీన సంప్రదాయం, షట్ దర్శనాలలో ఒకటి. ఇది వ్యాయామమే కాదు, సంపూర్ణ జీవితాన్ని ఎలా గడపాలో బోధించే ఒక తత్వశాస్త్రం అని మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త ఒడెయార్ అన్నారు. ఆదివారం ఉదయం ప్యాలెస్ మైదానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా‘ అనే నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆచరించారు. యోగా సాధన శారీరక కదలికలకు మాత్రమే పరిమితం కాదని, అది ఓర్పును, బలాన్ని కూడా పెంచుతుందని, ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. మైసూరు ఆధునిక యోగాకు కేంద్రంగా ఆవిర్భవించింది, యోగాకు మరింత ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యకరమైన, ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి మనమందరం కృషి చేయాలని చెప్పారు. మైసూరులోని వందలాది ప్రాంతాలలో యోగా ఉత్సవాలు జరిగాయి. నేటి హడావుడి, తీరికలేని జీవితంలో ప్రతి ఒక్కరికీ శాంతిని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి యోగాకు ఉందని యోగా గురువులు బోధించారు. ప్యాలెస్ ఆవరణలో వేలాది మంది ప్రజలు, యువత యోగాసనాలను ఆచరించారు. అలాగే రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలలో ఉత్సాహంగా యోగా వేడుకలు జరిగాయి. పిల్లలూ, పెద్దలూ వయోభేదం లేకుండా పాల్గొని ఆసనాలు వేశారు. విధానసౌధలో వేడుకలు యశవంతపుర: ప్రపంచానికి మన రుషులు, మునులు ఇచ్చిన పెద్ద బహుమతి యోగా అని అరోగ్యశాఖ మంత్రి యుటీ ఖాదర్ అన్నారు. బెంగళూరు విధానసౌధ ముందు యోగా వేడుకలు జరిగాయి. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, మంత్రి యుటీ ఖాదర్, వందలాది యోగాభ్యాసకులు పాల్గొన్నారు. మన రుషులు ఇచ్చిన ప్రాచీన బహుమతితో అందరూ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ యోగా గురువులను నియమిస్తామని చెప్పారు. యోగా చేసేవారు తమ ఇరుగు పొరుగు ఇళ్లవారితో కూడా యోగా చేయించాలని సూచించారు.ఎలాంటి ఖర్చు అవసరం లేని వ్యాయామం, జీవన ఆరోగ్య సూత్రాలను కలిగిన యోగా, ఇది నేటి డిజిటల్ యుగంలో ఆవశ్యకంగా మారింది. ఉరుకుల పరుగులతో కూడిన జీవనంలో యోగాభ్యాసం నెమ్మది, ఆనందాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. నిత్యం యోగా చేయడం ద్వారా మంచి ఆరోగ్యంగా ఉండవచ్చని యోగా గురువులే కాదు, వైద్యులూ చెబుతున్నారు. అందుకే యోగా శిబిరాలు కళకళలాడుతూ ఉంటాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన రెట్టించిన ఉత్సాహంతో అభ్యాసకులు, ప్రజలు పాల్గొన్నారు. బెంగళూరు, మైసూరు సహా అనేక నగరాలలో యోగా వైభవం అంబరాన్ని తాకింది. రాష్ట్రంలో ఆనందోత్సాహాలతో యోగా దినోత్సవం వేలాది మందితో సామూహిక యోగా ఆచరణలు -
గాలి సోమశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు
సాక్షి, బళ్లారి: నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి బర్త్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయా కాలనీల్లో కేక్‌లు కట్ చేశారు. అన్నదాన శిబిరాలు నిర్వహించి అభిమానం చాటుకున్నారు. గాలి సోమశేఖర రెడ్డి నగరంలోని శ్రీకోట మల్లేశ్వర స్వామి ఆలయం, కనక దుర్గమ్మ ఆలయం, బాలంజనేయ స్వామి ఆలయం, నగరేశ్వర, కాశీవిశ్వేశ్వర ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తల్లిదండ్రులు రుక్మిణమ్మ, చెంగారెడ్డి సమాధులను దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు గాలి సోమశేఖర రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ.. అఽధికారంలో ఉన్నా, లేకున్నా తనపై జనం చూపుతున్న అభిమానాన్ని ఎన్నటికీ మరవలేనిదన్నారు. నగర వార్డు కౌన్సిలర్ నుంచి ఉప మేయర్, మేయర్, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగర ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ధర్మస్థలలో బీజేపీ ఎమ్మెల్యేల సత్యప్రమాణం
బనశంకరి: విధానపరిషత్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన పార్టీ ఎమ్మెల్యేలను కనిపెట్టడానికి బీజేపీ నేతలు ధర్మస్థల శ్రీ మంజునాథస్వామిని ఆశ్రయించనున్నారు. మంజునాథుని సన్నిధిలో అనుమానిత ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. దేవునిపై భయం వల్ల ఎవరైనా నిజం చెబుతారని నాయకులు భావిస్తున్నారు. ఆదివారం బెంగళూరులో విలేకరులతో బీజేపీ రాష్ట్రాద్యక్షుడు బీవై.విజయేంద్ర మాట్లాడుతూ క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో అతి త్వరలో ధర్మస్థల మంజునాథస్వామి ఆలయంలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరపాలని నిర్ణయించామని తెలిపారు. తల్లి వంటి పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేల వ్యవహారం సత్యప్రమాణంతో తెలుస్తుందన్నారు. తాము క్రాస్‌ఓటింగ్ చేయలేదని అందరూ చెబుతున్నారన్నారు. పార్టీ కార్యకర్తలు తమ ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల విచారంతో ఉన్నారన్నారు. బీజేపీలో మొత్తం 63 మంది ఎమ్మెల్యేల పట్ల అనుమానం ఏర్పడిందని, ఇది తనకు చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో మాట్లాడానని, తాను, అశోక్ మంగళవారం ఢిల్లీకి వెళ్లి ఈ పరిణామాలపై చర్చిస్తామని చెప్పారు. 11 మంది క్రాస్ ఓటింగ్: అశోక్ పొత్తు పక్షాలైన జేడీఎస్, బీజేపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు, వారిని కనిపెట్టేందుకు నిజ నిర్ధారణ కమిటీ వేసినట్లు బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ తెలిపారు. నగరంలో మాట్లాడుతూ క్రాస్‌ఓటింగ్ కు పాల్పడినవారిని వదిలేది లేదన్నారు. కానీ వారెవరో గుర్తించడం సవాల్‌గా మారిందన్నారు. ఎవరినీ అడిగినా మేము దేవునిపై ప్రమాణం చేస్తాం అంటున్నారని, అదే ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. దీంతో ధర్మస్థల మంజునాథస్వామి సన్నిధిలో ప్రమాణం చేయించి కనిపెడతామన్నారు. హైకమాండ్‌తో చర్చించి కఠినమైన గుణపాఠం చెబుతామన్నారు. క్రాస్ ఓటింగ్ చేసిన వారిని కనుగొంటాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర -
మెట్రో స్టేషన్లో మంటలు
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని నాగసంద్ర మెట్రోస్టేషన్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. మాదావర –సిల్క్‌బోర్డు మార్గంలోని నాగసంద్ర స్టేషన్లో అత్యవసర ద్వారం వద్ద ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో హఠాత్తుగా పెద్దగా పొగ, మంటలు లేచాయి. బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు. ఈ ఘటనతో అందరూ గాభరాపడ్డారు. ప్రయాణికులకు, సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు. బాల్య వివాహం కేసులో నలుగురికి 20 ఏళ్ల జైలు శివమొగ్గ: ఒక బాలికను పెళ్లాడి, లైంగిక దాడికి పాల్పడిన యువకుడు, అతనికి సహకరించిన ముగ్గురు బంధువులకు శివమొగ్గ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు (ఎఫ్‌టిఎస్‌సి–1) 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తలా రూ. 1.85 లక్షల జరిమానా కూడా విధించింది. బాధితురాలైన బాలికకు రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జడ్జి నింగనగౌడ పాటిల్ ఈ తీర్పును ఇచ్చారు. ప్రాసిక్యూటర్ శ్రీధర్ హెచ్. ఆర్. వాదనలు వినిపించారు. శివమొగ్గ తాలూకాలోని కుంసిలో 2024లో 27 ఏళ్ల యువకుడు 17 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కొందరు ఫిర్యాదు చేయగా అతనిపై, బంధువులపై పోక్సో కేసు దాఖలైంది. విచారణలో నేరం రుజువు కావడంతో కఠిన శిక్ష విధించారు. అట్టహాసంగా సారథ్య స్వీకారంబనశంకరి: కేపీసీసీ నూతన అధ్యక్షునిగా పార్టీ సీనియర్ నేత బీకే.హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం డీకే.శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పదవిని డీకే శివకుమార్ నిర్వహిస్తుండగా, ఆయన సీఎం కావడంతో రాజీనామా చేయడం తెలిసిందే. తదుపరి హరిప్రసాద్ ఈ నెల 4 నుంచే నియమితులయ్యారు. డీకే పార్టీ జెండాను బీకేకు అప్పగించారు. బిడదిలో జేడీఎస్ పాదయాత్ర ● గొడవతో ఉద్రిక్తత దొడ్డబళ్లాపురం: జేడీఎస్ పార్టీ రైతుల కోసమే బిడది పాదయాత్ర చేస్తోందని జేడీఎస్ రాష్ట్ర యువ అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి అన్నారు. ఆదివారంనాడు బిడది వద్ద అంచిపుర నుంచి పాదయాత్ర ప్రారంభానికి ముందు శక్తి దేవత మారెమ్మ దేవాలయంలో పూజలు చేసి మాట్లాడారు. రైతులు 16 నెలలుగా టౌన్షిప్ వద్దని పోరాటం చేస్తుంటే ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. తాము రైతులతో చర్చించామని,చాలామంది రైతులు టౌన్ షిప్‌కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. రైతులతో కలిసి జేడీఎస్ చివరి వరకూ పోరాడుతుందన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రైతులను మోసగించి భూములు స్వాహా చేస్తున్నారన్నారు. కాగా, కొందరు జేడీఎస్ ఫ్లెక్సీలను చించేయడంతో వారితో కార్యకర్తలు గొడవ పడ్డారు. ఉద్రిక్తత ఏర్పడడంతో నిఖిల్ కారు ఎక్కి వెళ్లిపోయారు. టౌన్షిప్ ఏర్పాటైతే తమ జీవితాలు బాగుపడతాయని, మా భూమి–మా హక్కు అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. కూలిన కాంక్రీటు బకెట్.. ఇద్దరు కూలీల బలిసాక్షి, బళ్లారి: సండూరు తాలూకా కుడితిని పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం పట్టణంలోని హెచ్ఎల్సీ కాలువ సమీపంలో నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంకు వద్ద 60 అడుగుల ఎత్తు నుంచి కాంక్రీట్ లిఫ్ట్ బకెట్ మీద పడిపోవడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. రోజూ మాదిరిగా ట్యాంకు పనుల్లో కార్మికులు నిమగ్నమయ్యారు. ఆ సమయంలో కాంక్రీటును పైకి తరలిస్తున్న లిఫ్ట్ బకెట్ వైరు తెగి పడిపోయింది. కింద పనిచేస్తున్న తిమ్లాపుర గ్రామానికి చెందిన మల్లప్ప (52), గణికాల్ వాసి నీలప్ప (35) అనే కూలీల మీద పడగా, తీవ్రగాయాలో చనిపోయారు. అధికారులు, కాంట్రాక్టర్ కనీస రక్షన చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు, మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుడితిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
యోగాతో ఆరోగ్య భాగ్యం
సాక్షి, బళ్లారి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం బళ్లారి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. నగరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి చిన్నారులు, వృద్ధులు, మహిళలు, యువతీ యువకులు భారీగా తరలివచ్చారు. ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాలు వేస్తూ వాటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తన స్వగృహం వద్ద యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ మందుకు రావాలని సూచించారు. మన పూర్వీకులు కూడా యోగా, ధ్యానం వంటి ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల శారీరకంగా ఎంతో ధృడంగా ఉండేవారని తెలిపారు. నగరంలో పార్కులు, క్రీడా మైదానాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా సాధనపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి, బళ్లారి: పూర్వకాలం నుంచి ప్రసిద్ధి చెందిన యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికి పరిచయం చేశారని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు గాలి లక్ష్మీ అరుణ పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రుక్మిణమ్మ చెంగారెడ్డి వృద్ధాశ్రమ ఆవరణలో చెంగారెడ్డి మానసిక దివ్యాంగుల విశేష పాఠశాలలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మానసిక దివ్యాంగులతో కలసి యోగా చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారెడ్డి, గురుమూర్తి, యోగా గురువులు మీనాక్షి, సరోజిని తదితరులు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం చేయాలని కలబుర్గి డివిజన్ సమాచార కమిషనర్ వెంకటసింగ్ సూచించారు. ఆదివారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, ఏసీ హంపణ్ణ, జిల్లా ఆయుష్ అధికారి శంకర గౌడ పాటిల్, విద్యాశాఖ అధికారులు మల్లికార్జున, ఈరణ్ణ, కృష్ణ, వీరేష్ నాయక్, సునీత, స్మిత, పూజా, తిమ్మప్ప పాల్గొన్నారు. ఆరోగ్యమే నిజమైన సంపద హొసపేటె: నేటి ఆధునిక యుగంలో ఒక వ్యక్తి ఎంత సంపద, డబ్బు సంపాదించినా వృద్ధాప్యంలో అండగా నిలిచేది ఆరోగ్యమే. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ బాలకృష్ణ సూచించారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆయుష్ శాఖ, పురపాలక మండలి, వివిధ ప్రముఖ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.రూపేష్ కుమార్ మాట్లాడుతూ.. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. అది మన జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే విషయం మరచి పోకూడదన్నారు. అనంతరం యోగా గురువు బాలచంద్ర శర్మ యోగా శిక్షణ ఇచ్చారు. 2000 మందికి పైగా యోగా ఔత్సాహికులు, యోగా సాధకులు, సాధారణ ప్రజలు యోగాసనాలు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మంజునాథ్, ఆయుష్ డాక్టర్ కె.హెచ్ గురుసవరాజ్, డాక్టర్ ముని వాసుదేవ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఎరగుడి శివకుమార్, డీపీఐ రామచంద్ర, బీఈఓ ఉమాపతి, ఫిజికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అశ్విన్ కొతంబరి, మానస బ్రహ్మకుమారి అసోసియేషన్ జిల్లా స్థాయి అధికారులు కాసట్టి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పార్కులు, క్రీడా మైదానాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా సాధన -
ప్రశాంతంగా నీట్
బనశంకరి: ఎంబీబీఎస్ ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ పరీక్ష మళ్లీ జరిగింది. రాష్ట్రంలో బెంగళూరు సహా పలు నగరాలలోని కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య నీట్ పరీక్ష సాగింది. సుమారు 1.50 లక్షల మంది హాజరైనట్లు అంచనా. మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ప్రక్రియ మొదలై సాయంత్రం 5:15 వరకు కొనసాగింది. తల్లిదండ్రులు పిల్లలను దీవించి పంపడం కనిపించింది. ఈసారి కూడా దుస్తులు, అలంకారాల విషయంలో కఠినంగా వ్యవహరించారు. జీన్స్ ధరించిన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. వేరే దుస్తులు ధరించి రావాలని సిబ్బంది వెనక్కి పంపించారు. పలు కారణాలతో గైర్హాజరైన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సెంటర్ల వద్ద పెద్ద తుపాకులతో సాయుధ బలగాల బందోబస్తు ఏర్పాటైంది. ఆలస్యంగా వచ్చి.. పరీక్ష మిస్ బెంగళూరు ఆర్సీ కాలేజీ పరీక్షా కేంద్రంలో ముగ్గురు విద్యార్థినులు ఆలస్యంగా రావడంతో వారిని అనుమతించలేదు. నగరంలో విపరీతమైన ట్రాఫిక్ వల్ల ఆలస్యమైందని వేడుకున్నా ఒప్పుకోలేదు, దీంతో విద్యార్థినులు విలపించారు. ఓ విద్యార్థిని 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చి గేటు ఎక్కి వెళ్లడానికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీస్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. రెండు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినవారిని బయటి గేట్లో తనిఖీలుచేసి లోపలికి వదిలారు, అయితే పరీక్షా హాల్ల వద్ద సిబ్బంది అడ్డుకుని వెనక్కి పంపడం గమనార్హం. మధ్యాహ్నం 1:30 గంటలకు పరీక్షాకేంద్రం గేట్లు బంద్ చేశారు. 2 నిమిషాలు లేటుగా వచ్చినవారందరూ బయటే ఉండిపోయారు. సంవత్సరం సమయాన్ని కోల్పోయామని వారు బాధపడ్డారు. నెలమంగల వద్ద నిలిచిన రైలు దొడ్డబళ్లాపురం: నెలమంగల వద్ద రైలు చెడిపోయి నిలిచిపోవడంతో నీట్ పరీక్షలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఆందోళన చెందారు. నెలమంగల తాలూకా సోంపుర వద్ద షోలాపూర్ వైపు వెళ్తున్న రైలు చెడిపోయి నిలిచిపోయింది. ఇదే రైలులో నీట్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు ఆలస్యమవుతుందని బెంబేలు పడ్డారు. ఈ రైలు నిలిచిపోవడం వల్ల హాసన్ నుంచి యశ్వంతపుర వస్తున్న రైలు ఆలస్యంగా నడిచింది. రెండు రైళ్లలోని నీట్ విద్యార్థులు చాలా మంది పరీక్షలు మిస్సయినట్లు తెలుస్తోంది. యోగా డే, కేపీసీసీ కార్యక్రమం, నీట్ పరీక్షలు వంటి చాలా కార్యక్రమాల వల్ల బెంగళూరులో ఉదయం నుంచి విపరీతమైన వాహన రద్దీ ఏర్పడింది. అనేక కూడళ్లలో ట్రాఫిక్ జాం అయ్యింది.మైసూరులో హాల్ టికెట్ల తనిఖీబెంగళూరులోని ఓ సెంటర్లో..బెంగళూరులోని ఓ కేంద్రంలో భారీ భద్రత బెంగళూరు సహా పలు నగరాల్లో పరీక్షలు ఆలస్యం కారణంగా అనేకమందికి నో -
నాగేంద్రకు సీబీఐ షాక్
సాక్షి,బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి జరిగిందని ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్ర తన మంత్రి పదవిని పోగొట్టుకోవడంతో పాటు ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు చేయడంతో పాటు సీబీఐ, ఈడీ కూడా రంగంలోకి దిగి పూర్తి విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల అవినీతిలో కూరుకుపోయిన మాజీ మంత్రి నాగేంద్ర బెయిల్‌పై విడుదలయ్యారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా, బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కూడా పని చేసిన నాగేంద్ర అనతి కాలంలోనే తన పదవిని కాపాడుకోలేకపోయారు. నిధుల మళ్లింపు ఆరోపణలు ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థుల సంక్షేమం కోసం కేటాయించిన కోట్లాది రూపాయల నిధులను స్వాహా చేసి వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సీబీఐ, ఈడీ అందుకు సంబంధించి విచారణ చేయడంతో నాగేంద్ర పాత్ర స్పష్టంగా కనిపించడంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. కోట్లాది రూపాయల నిధులను ఆర్టీజీఎస్, చెక్కులు, వివిధ లావాదేవీల ద్వారా మళ్లించుకుని స్వాహా చేశారని తేలింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ మంత్రి పదవి దక్కించుకునేందుకు సిద్దరామయ్య మంత్రివర్గంలోనే తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పట్లో సీఎం సిద్దరామయ్య కూడా నాగేంద్రకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వడానికి సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే వివిధ కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ చేయకపోవడంతో నాగేంద్రకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవి కోసం నానాపాట్లు ఈనేపథ్యంలో బెంగళూరులోనే మకాం వేసి, కాంగ్రెస్ పెద్దలను కలుసుకుంటూ తిరిగి మంత్రి పదవి పొందేందుకు నాగేంద్ర పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో నాగేంద్రకు మంత్రి పదవి దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతున్న తరుణంలో సీబీఐ నాగేంద్రకు పెద్ద షాక్ ఇచ్చింది.వాల్మీకి అభివృద్ధి మండలి అవినీతి ఆరోపణలకు సంబంధించి జైలుకు వెళ్లి బెయిల్‌పై ఉన్న నాగేంద్ర మళ్లీ ఈ కేసు మలుపు ఎటు వైపు తిరుగుతుందోనని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నాగేంద్ర బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును సీబీఐ ఆశ్రయించిన తరుణంలో నాగేంద్ర తరుపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. దీంతో మంత్రి పదవిని ఆశిస్తున్న నాగేంద్ర పరిస్థితి డోలాయానంలో పడింది. బెయిల్ రద్దు కోరిన వైనం హైకోర్టులో పిటిషన్ దాఖలు మళ్లీ ఇబ్బందుల్లో మాజీ మంత్రి మలి విడత విస్తరణలో చోటు దక్కేనా? -
చిన్న విషయానికి ఘర్షణ
హుబ్లీ: చిన్న కారణంగా రెండు కుటుంబాలు పరస్పరం కొట్లాడుకొని హత్యాయత్నంతో పాటు చంపుతామని బెదిరించిన ఘటన హుబ్లీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గదగ్ రోడ్డు గూడ్స్‌షెడ్ సమీప నివాసి శివానందపై పాత ద్వేషంతో అదే వీధికి చెందిన గురునాథ్ అనే వ్యక్తి ఆనంద్ అనే మరో వ్యక్తితో కలిసి చాకుతో ఛాతీపై పొడిచి హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బానివీధిలో మాట్లాడుకుంటూ నిలబడిన వేళ కొంచెం పక్కకు జరగండి అన్నందుకు శివానంద, శ్రీకాంత్ కర్రలతో దాడి చేసి చంపుతామని బెదిరించినట్లు గురునాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బైక్ అదుపు తప్పి చోదకుడు మృతిహుబ్లీ: ౖబెక్ అదుపు తప్పడంతో చోదకుడు మృతి చెందిన ఘటన ధార్వాడ జిల్లా కురుడకేరి గ్రామం వద్ద చోటు చేసుకుంది. శబ్బి గ్రామానికి చెందిన మంజునాథ(30) మృతుడు. కంప్లికొప్ప నుంచి కురుడకేరి వైపునకు వేగంగా వెళుతుండగా బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. దీంతో తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తక్షణమే కేఎంసీ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం కలగలేదు. అతడు మృతి చెందాడని హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్లో గంజాయి జప్తు హుబీ: హుబ్లీ నగర రైల్వే స్టేషన్ నాలుగో ప్లాట్‌ఫాంలో గదగ్ వైపునకు వెళ్లే మార్గంలో ఎకై ్సజ్ అధికారులు దాడి చేసి 5 కేజీల గంజాయిని జప్తు చేశారు. హుబ్లీ ఎకై ్సజ్ డిప్యూటీ సూపరిండెంటెండ్ నేపథ్యంలో బందోబస్తు చేస్తున్న వేళ ఆ ప్లాట్‌ఫాంలో ప్రయాణికులు కూర్చొనే కట్టపై పెట్టిన సంచిలో 5.56 కేజీల గంజాయి దొరికింది. పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. మహిళ అరెస్టు మరో ఘటనలో 815 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఓ మహిళను అరెస్ట్ చేశారు. కోళివాడ ఈద్గా దగ్గర గంజాయిని విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రూ.40 వేలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కే.మంజవ్వ అనే మహిళ ఆకులు, పూలు, విత్తనాల మిశ్రమంతో ఉన్న గంజాయి అమ్ముతుండగా హుబ్లీ గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కొనసాగుతున్న అక్రమణల తొలగింపు● కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు ● 1.33 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జా ● జేసీబీలతో ఖాళీ చేసిన అధికారులు సాక్షి,బళ్లారి: నగరంలో ఆక్రమణల తొలగింపు కొనసాగుతూనే ఉంది. శనివారం నగరంలోని హవంబావి ప్రాంతంలో సిరుగుప్ప రహదారి కాలువ సమీపంలో కొందరు వ్యక్తులు దర్జాగా కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, ఇళ్లు కట్టుకుని బాడుగలకు ఇచ్చుకుని, నెలనెలా వేలాది రూపాయలు బాడుగలు తీసుకుని కాజేసిన ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారు. రెవెన్యూ, పోలీసులు, తహసీల్దార్ తదితరులు పెద్ద సంఖ్యలో మోహరించి 1.33 ఎకరాల్లో నిర్మించిన వివిధ కట్టడాలను జేసీబీలతో తొలగించారు. సర్వే నంబర్–275లో ఉన్న ఈ ప్రభుత్వ భూమిని స్థానికంగా ఉన్న ఓ నాయకుడు ఆక్రమించుకుని యథేచ్చగా స్వాధీనం చేసుకున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని తప్పుడు రికార్డులు సృష్టించుకుని తమదే భూమి అనే విధంగా కట్టడాలు నిర్మించి బాడుగకు ఇవ్వడం వెలుగు చూసింది. ఎట్టకేలకు ఆక్రమణలు తొలగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందించండిరాయచూరు రూరల్: అధికారులు ప్రజా సమస్యలపై స్పందించాలని సమాచార హక్కు కమిషన్ కలబుర్గి డివిజన్ కమిషనర్ వెంకటసింగ్ సూచించారు. శనివారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జగజ్యోతి బసవేశ్వర అంబేడ్కర్ భవన్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 2 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వివిధ చట్టాలు, ఇతర అంశాలపై అధికారులకు హెచ్చరికలు చేశారు. ప్రజలకు సరైన సమాచారం కల్పించక పోవడంపై అధికారులపై చిందులు తొక్కారు. సమావేశంలో జిల్లాధికారి పూవిత, ఎస్పీ అరుణాంగ్షు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగరసభ అదనపు కమిషనర్ శివకుమార్, సురేంద్రబాబు, నందిత, శరణమ్మలున్నారు. చౌకడిపోలో ఆకస్మిక తనిఖీరాయచూరు రూరల్: పేదలకు చౌకడిపోల నుంచి ఆహార ధాన్యాలను సక్రమంగా పంపిణీ చేయాలని ఆహార పౌర సరఫరాల శాఖాధికారి నాసీర్ అహ్మద్ పేర్కొన్నారు. శనివారం బైరూన్ కిల్లాలోని ప్రియదర్శిని చౌకధర దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి డీలర్ శివలింగకు సూచనలు చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా ప్రతి నెల ధాన్యాలను పంపిణీ చేయాలన్నారు. 50 అంతోద్యయ, 500 బీపీఎల్ కార్డుదారులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. -
శరణతత్వ ఆచారాలను నేర్పాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో పిల్లలు దారి మళ్లుతున్నారని, అలాంటి వారికి శరణుల గురించి వారి తత్వాలను, ఆచార, విచారాలను, సంస్కృతి పట్ల విద్యార్థులకు నేర్పాలని బెంగళూరు మహారాణి క్లస్టర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆశాదేవి పిలుపునిచ్చారు. శనివారం పండిత ిసిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో అఖిల భారత శరణ సాహిత్య పరిషత్ మైసూరు, రాయచూరు ఆధ్వర్యంలో శరణ సాహిత్య పరిషత్, కదళి మహిళా వేదిక ప్రథమ సమ్మేళనాన్ని ప్రారంభించి ప్రసంగించారు. 12వ శతాబ్ధంలో 720 వచనాలను పలికిన బసవణ్ణను ఆదర్శంగా తీసుకుని వచనాల ద్వారా విద్యార్థులు, యువకుల్లో మార్పులు తేవాలన్నారు. పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు జీవిత విలువలను గురించి వివరించాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకొస్తున్న తరుణంలో కదళి వేదిక చేపట్టిన సమ్మేళనం సాక్షిగా పేర్కొన్నారు. కార్యక్రమంలో శరణ సాహితీవేత్తలు గంగమ్మ, సుశీల, లలిత, హంపణ్ణ, శరణమ్మ, నాగరాజ్ మస్కి, దానమ్మ, సుమంగళ, రేఖ, పార్వతి, అధికారి ఉత్తరాదేవి మఠపతి, అంబాపతి పాటిల్‌లున్నారు. -
విద్యార్థులకు యోగాతో చక్కటి ఆరోగ్యం
హొసపేటె: విద్యార్థులకు మానసిక ఒత్తిడిని తొలగించటంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుందని టీబీ డ్యాం ప్రభుత్వ పీఎల్సీ పాఠశాల హెచ్ఎం లలితమ్మ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన యోగాభ్యాస కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ధ్యానం విద్యార్థులకు మనో నిబ్బరం కలిగిస్తుందన్నారు. యోగాతో శారీరంగా బలంగా ఉండటమే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. యోగాపై విద్యార్థులకు అవగాహన ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, హేమలత, నిర్మల, రవికుమార్, ఈరప్ప, మంజుల, శారద, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
యోగ ప్రాభవం
మైసూరు: రాజభవనాలు, చారిత్రక కట్టడాలతో రాజసం ఉట్టిపడే మైసూరు మహానగరం అంతర్జాతీయ యోగా ఉత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం యోగా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విభిన్నంగా, వినూత్నంగా జరపడానికి ప్రణాళికలు రూపొందించారు. చారిత్రక ప్యాలెస్ మైదానం ముస్తాబైంది. మొదటిసారి 10 మందితో... ఈసారి జూన్ 21 ఆదివారం రావడంతో విద్యార్థులు, ఉద్యోగులే కాక చాలామంది ప్రజలు సెలవులో ఉంటారు. అయినప్పటికీ ఉత్సాహంగా యోగా డే ఆచరిస్తామని, వీలును బట్టి, సోమవారం కూడా ఆచరించవచ్చని మైసూరు యోగా ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీహరి ద్వారకనాథ్ తెలిపారు. 2015లో ప్రధాని ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రకటించినప్పుడు, మొదటిసారి వర్షం పడుతున్నప్పటికీ 10 మందితో యోగా డే నిర్వహించినట్లు పేర్కొన్నారు. 2017లో, 55,000 మందిని ఇందులో భాగస్వాములను చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాము, ఆ తర్వాతి సంవత్సరాలలో, 65,000, ఆపై 75,000 వేల మందితో బృహత్ స్థాయిలో జరిగినట్లు తెలిపారు. 2022లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మైసూరు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. కోవిడ్ కాలంలో కూడా లక్షలాది మంది ప్రజలు ఇళ్లలోనే యోగా చేశారు. పాల్గొననున్న వేల మంది మైసూరులో ఈసారి యోగా డేలో 120 సంస్థలు, 1.20 లక్షల మంది మంది సాధకులు పాల్గొంటారని ఆశిస్తున్నారు. 1,200 మంది యోగా గురువులు నాయకత్వం వహిస్తారు. ప్యాలెస్ మైదానంలోనే కాకుండా నగరంలోని ప్రముఖ ప్రాంతాలలోనూ యోగా డే ఉత్సవాలు జరుగుతాయి. అధికారులు, ప్రజలతో పాటు ప్రముఖ స్వాములకు ఆహ్వానం పలికారు. ఒక్క మైసూరే కాదు, చారిత్రక స్థలాలైన హంపీ, బాదామి, పట్టదకల్, అలాగే బెంగళూరు విధానసౌధ ఆవరణ తదితర ప్రాంతాల్లో సామూహిక యోగా వేడుకలు జరగనున్నాయి. నేడు మైసూరు సహా పలు చారిత్రక ప్రాంతాల్లో యోగా దినోత్సవ వేడుకలు -
గృహలక్ష్మీ లబ్ధిదారుల తనిఖీ
బనశంకరి: గ్యారంటీ పథకాల్లో గృహలక్ష్మీ, గృహజ్యోతి లబ్ధిదారుల పునఃపరిశీలనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అనర్హులను గుర్తించి దుర్వినియోగానికి అరికట్టడానికి అధికారులు ఇంటింటికెళ్లి కేవైసీ, సర్వే చేయాలని ప్రభుత్వం తీర్మానించింది. లబ్ధిదారుతో మాట్లాడడం, ఆధార్, ఓటరు, రేషన్ కార్డుల వివరాలను తప్పనిసరిగా తీసుకుంటారు. బయటి రాష్ట్రాలవారు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అనర్హులు లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు రావడంతో సర్కారు ఏరివేతకు సై అంది. కాగా, గృహలక్ష్మీ డబ్బులను అప్పుల వసూళ్లకు కట్ చేయరాదని బ్యాంకులను ఆదేశించారు. 1.65 కోట్ల మంది మహిళలకు ఈ డబ్బు జమవుతోంది. అలాగే ఇతర గ్యారంటీ పథకాల అనర్హులను గుర్తించి తొలగిస్తారు. -
తిమ్మప్ప.. యోగా సాధన భేషప్ప
రాయచూరు రూరల్: పేదరికంలో పుట్టి కష్టాలను అనుభవించినా యోగా ద్వారా పేరు ప్రఖ్యాతులు సాధించిన డాక్టర్ వడ్డేపల్లి తిమ్మప్ప పలువురికి యోగాసనాలు నేర్పిస్తూ ఆరోగ్యకర జీవితానికి దిశానిర్దేశం చేస్తున్నారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో తిమ్మప్ప యోగా సాధకుడిగా మంచి పేరు సాధించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని, యోగా ద్వారా నలుగురికి సహాయ పడాలనే ఉద్దేశ్యంతో యోగా శిక్షణను ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు, జైళ్లలోని ఖైదీలకు, అనాథఽ బాలలకు, సామాన్య ప్రజలకు ఉచితంగా యోగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ వడ్డేపల్లి తిమ్మప్ప జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు యోగాభ్యాస పోటీల్లో పాల్గొని పలు అవార్డులు పొందారు. కర్ణాటక విశ్వ విద్యాలయం నుంచి 2007లో బంగారు అవార్డు, 2009 ఫిబ్రవరిలో సన్మానం, 2008 జనవరిలో పాండిచ్చేరీలో జరిగిన జాతీయ యోగా చాంపియన్‌షిప్ పోటీల్లో 4వ స్థానాన్ని పొందారు. తిమ్మప్పకు అవార్డుల పంట 15 సార్లు రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని 5 బంగారు, 8 వెండి పతకాలు సాధించారు. 2010లో భారత వాహనాల డ్రైవర్ ట్రేడ్ యూనియన్ నుంచి అత్యుత్తమ యోగా ప్రదర్శన అవార్డును అందుకున్నారు. మారుమూల గ్రామంలో పుట్టి..రాయచూరు తాలూకాలోని మారు మూల వడ్డేపల్లిలో బసమ్మ, పెద్ద నరసప్పల జ్యేష్ట పుత్రుడిగా జన్మించిన తిమ్మప్ప చదువుకోవడానికి పేదరికం అడ్డు వచ్చింది. ప్రాథమిక పాఠశాలలో మాస్టారు కై లాసచంద్ర చేర్పించగా ఐదవ తరగతి వరకు చదివారు. 10వ తరగతి వరకు 5 కి.మీ.ల దూరంలోని యాపలదిన్నికి ప్రతి నిత్యం నడుచుకుంటూ వెళ్లేవారు. రాయచూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1995లో పీయూసీ పూర్తి చేశారు. కళాశాల చదువుకు శ్రీనివాస్ రాయచూరకర్, హన్మంతప్ప, నాగరాజ్, మల్లికార్జునలు సహకరించారు. 1998లో డిగ్రీని పూర్తి చేశారు. నగరంలో హార్డ్‌వేర్, ప్లైవుడ్ షాపుల్లో బియ్యం, ఆయిల్, పత్తి మిల్లులో పనులు చేయగా వచ్చిన డబ్బుతో 2000లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ను, 2004లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ)ని పూర్తి చేశారు. విద్యార్థులు, ఖైదీలు, అనాథలకు ఉచితంగా యోగా శిక్షణ సందర్భం: -
దక్షిణామూర్తికి మామిడి అభిషేకం
కోలారు: నగరంలోని ముళబాగిలు రోడ్డు చెరువుకట్టపై వెలసిన శ్రీ దక్షిణామూర్తి దేవాలయంలో మామిడి రైతులు పడిన కష్టానికి మంచి ధరలతో ఫలితం దక్కాలని ప్రార్థిస్తూ శనివారం స్వామివారికి 10001 మామిడి కాయలతో విశేష అలంకరణ చేసి పూజలను నిర్వహించారు. 108 టెంకాయలు కొట్టి కొబ్బరినీళ్ల అభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బిడది రైతులూ.. భూములివ్వద్దు ● కేంద్ర మంత్రి కుమారస్వామి బనశంకరి: బిడది టౌన్షిప్ గురించి స్పష్టంగా చెప్పాను. రైతుల నుంచి సారవంతమైన భూములను స్వాదీనం చేసుకోవడానికి ఒప్పుకోను అని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. శనివారం బెంగళూరులతో విలేకరులతో మాట్లాడుతూ సోమవారం అన్ని ఆధారాలను విడుదల చేస్తానని తెలిపారు. రైతులకు ఎమ్మెల్యేల ద్వారా చెక్కులు పంపిస్తున్నారు, రూ.2.30 కోట్ల చెక్కులను ఇచ్చి రైతులను ప్రలోభపెడుతున్నారు, ఈ డబ్బును 20 ఏళ్ల వరకు బ్యాంకులో ఎఫ్డీ పెడితే వచ్చేది రూ.40 లక్షల వడ్డీ, కానీ అదే భూమిని కాపాడుకుంటే దీని విలువ రూ.20 కోట్లు అవుతుంది. రైతులు, ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి అని ఆయన అన్నారు. రూ.100 కోట్లు ఇస్తారని... క్రాస్ ఓటింగ్‌పై స్పందిస్తూ నియోజకవర్గంలో పనులకు రూ.50 కోట్ల నుంచి 100 కోట్ల నిధులు లభిస్తాయని కొందరు ఎమ్మెల్యేలు వెళ్లి ఉండవచ్చు అని అన్నారు. బీజేపీ, జేడీఎస్ మధ్య చిచ్చుపెట్టడం కాంగ్రెస్ ప్రధాన అజెండా అని, కానీ తమ మధ్య ఇబ్బంది లేదని అన్నారు.చిక్క వద్ద ప్రమాదం.. ఇద్దరు దుర్మరణందొడ్డబళ్లాపురం: హిట్ అండ్ రన్ ఘటనలో ఇద్దరు యువకులు బలైన సంఘటన చిక్కబళ్లాపురం తాలూకాలో బెంగళూరు– హైదరాబాద్ 44వ హైవేలో హొన్నేనహళ్లి గేట్ వద్ద జరిగింది. చిక్కబళ్లాపురం తాలూకా బాదగానహళ్లికి చెందిన వరుణ్ (22), జీవన్ (22) అనే యువకులు మరణించారు. అక్కడే ఓ లాజిస్టిక్ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరూ అర్ధరాత్రి పని ముగించుకుని బైక్‌పై గ్రామానికి వస్తుండగా దారిలో ఏదో వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రగాయాలతో యువకులు దుర్మరణం చెందారు. చిక్క పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామని చెప్పిన పిల్లలు కానరాని లోకాలకు వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు విలపించారు. -
నటి చిత్రాల మార్ఫింగ్.. కిలాడీల అరెస్టు
శివాజీనగర: ఏఐ, డీప్‌ఫేక్ ద్వారా ప్రముఖ నటి రుక్మిణి వసంత్ అశ్లీల చిత్రాలను రూపొందించి వ్యాప్తి చేసిన కేసులో నిందితులు బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా సంచలన అంశాలు బయటపడ్డాయి. వ్యూస్, వికృతానందం కోసం నటీమణుల నగ్న, అర్దనగ్న చిత్రాలను రూపొందించినట్లు తెలిపారు. ఎవరెవరు? ఐటీ సిటీలో నివసిస్తున్న బాగకోటకు చెందిన రవికుమార్ (24), శివమొగ్గ జిల్లావాసి, టెక్కీ రంజిత్ కుమార్ (25), బెంగళూరువాసి చంద్రకాంత్ (33) నిందితులు. రవికుమార్ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల యూట్యుబ్ ద్వారా తొలి సంపాదన పొందిన ఇతనికి మరింత సొమ్ము సంపాదించే ఆశ పుట్టింది. అప్పటి నుంచి వ్యూస్‌ని పెంచుకునేందుకు నటిల డీప్‌ఫేక్ వీడియోలను తయారు చేసి చేసి అప్లోడ్ చేయసాగాడు. రెండో నిందితుడు, ఐటీ ఇంజనీరు రంజిత్‌కుమార్‌కు ఏడాదికి రూ.20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగముంది. ప్రముఖ నటీమణుల ఏఐ, డీప్‌ఫేక్ అశ్లీల వీడియోలను తయారు చేస్తున్నట్లు విచారణలో చెప్పాడు. మరో నిందితుడు చంద్రకాంత్ ఇతను బెంగళూరులో ప్రముఖ చార్టర్డ్ అంకౌంటెంట్ కంపెనీలో పని చేస్తుండేవాడు. మంచి జీతం లభిస్తోంది. కానీ వికృతానందం కోసం నటీమణుల ఫోటోలను డీప్‌ఫేక్ చేస్తున్నట్లు తెలిపాడు. వారి నుంచి 3 హైటెక్ మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏఐ యాప్‌లు, సాఫ్ట్వేర్లను వినియోగించి నగ్న, అర్ధనగ్న శరీరాలకు కోరుకున్న నటీమణుల ముఖాలను పేస్ట్ చేసి చిత్రాలను తయారు చేసేవారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. నటి రుక్మిణి వసంత్ అశ్లీల చిత్రాలు.. బెంగళూరులో టెక్కీ, యూట్యూబర్, ప్రైవేటు ఉద్యోగి అరెస్టు -
కూతురి నిర్వాకం.. తల్లి ఆత్మహత్య
● బెళగావి హత్య కేసులో మరో విషాదం దొడ్డబళ్లాపురం: ఉన్నంతలో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆమె కాపురం బాగుండాలని దేవుళ్లను ప్రార్థించారు. కానీ కూతురు మాత్రం ఖతర్నాక్‌గా మారింది. భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే పరలోకానికి పంపింది. ఈ సంఘటనతో ఆమె, ప్రియుడు కటకటాల్లో ఉన్నారు. బెళగావి జిల్లా హుక్కేరి వద్ద అనైతిక బంధం, రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, రిటైర్డు జవాన్ సందీప్ మంజరగి (46) ని సైలెన్లో విషం ఎక్కించి హతమార్చిన భార్య సుమ కేసులో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ పరిణామాలతో సమాజంలో పరువు పోయిందని తీవ్ర మనోవేదనకు గురైన సుమ తల్లి మహాదేవి (57) ఆత్మహత్య చేసుకుంది. కూతురి నిర్వాకం గురించి ముమ్మరంగా ప్రచారం సాగుతుండడం చూసిన తల్లి ఆ రోజు ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. తలెత్తుకోలేకపోతున్నామని కుంగిపోయింది. శనివారంనాడు హుక్కేరి తాలూకా ఘోడ గేరి గ్రామంలోని ఇంట్లో మహాదేవి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.గజ దాడి.. ఇద్దరు అటవీ సిబ్బందికి తీవ్రగాయాలు శివాజీనగర: భద్రా పులి అభయారణ్యంలో గస్తీ తిరుగున్న అటవీ వాచర్స్పై ఏనుగు దాడిచేయడంతో గాయపడ్డారు. చిక్కమగళూరు జిల్లా ఎన్.ఆర్.పుర తాలూకాలోని హెబ్బె వన్యజీవి ప్రాంతంలో ఇది జరిగింది. భద్రా హిన్నీరు ప్రదేశంలో ఉంటున్న 10కి పైగా అడవి ఏనుగులు తిరుగుతుంటాయి. ఎన్ఆర్ పుర పట్టణానికి దగ్గరలోనే ఉంటాయి. దీంతో వాచర్స్ హరీశ్, బసవరాజ్ ఏనుగుల సంచారంపై నిఘా పెట్టారు. శుక్రవారం సాయంత్రం ఎన్ఆర్ పురం తాలూకా కల్లుకువె వద్ద అడవిలో తిరుగుతుండగా ఏనుగు దాడి చేసింది. ఇద్దరినీ తొండంతో కొట్టి కాళ్లతో తొక్కింది. హరీశ్ వెన్నెముక విరిగింది. బసవరాజ్ చేయి కాలు విరిగాయి. వెనుక వస్తున్న వాచర్స్ ఏనుగును అదిలించి బాధితులను శివమొగ్గ మెగ్గాన్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకై మంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నా మండ్య: రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థలో ప్రైవేటు కంపెనీలకు చోటివ్వరాదంటూ, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్‌కు అనుమతి ఇవ్వరాదని కోరుతూ విద్యుత్ ప్రసార మండలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం నగరంలో ధర్నా చేశారు. డివిజన్ కార్యాలయం ఎదుట గుమికూడిన ఉద్యోగులు నినాదాలు చేస్తూ బందీగౌడ బడావణెలోని ఎమ్మెల్యే రవికుమార్ నివాసానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. కార్యనిర్వాహక ఇంజినీర్ అనితాబాయి, పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రెండు లారీలు ఢీ, దగ్ధం శివాజీనగర: ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన పాల ట్యాంకర్ ఢీకొంది, ఈ ప్రమాదంలో రెండు లారీలు మంటల్లో చిక్కుకోవడంతో అటు ఇటు ట్రాపిక్ నిలిచిపోయింది. ఈ ఘటన బెళగావి జిల్లాలోని ఎం.కే.హుబ్లీ పట్టణం వద్ద పూణె–బెంగళూరు రహదారిపై జరిగింది. శనివారం తెల్లవారుజామున మొక్కజొన్నల లారీ, పాల ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. వెంటనే రెండు లారీల్లో నిప్పంటుకొని మంటల ఉవ్వెత్తున రేగాయి. రెండు వాహనాల్లోని డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిరంతరం రద్దీగా ఉండే ఈ హైవేలో వాహన సంచారం బందయింది. స్థానిక ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో లక్షలాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. కిత్తూరు పోలీసులు విచారణ చేపట్టారు. మీటర్ వడ్డీ.. తీసింది ఊపిరి తుమకూరు: తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా, భక్తరహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొడ్డమాలవాడి గొల్లరహట్టి గ్రామంలో హరికథ దాసప్పగా పనిచేస్తున్న చిక్కన్న (38) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డమాలవాడి ప్రభుత్వ మోడల్ ఉన్నత ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు మమత వద్ద ఆయన రూ.3 లక్షలు మీటర్ వడ్డీకి రుణం తీసుకున్నాడు. 10 నుంచి 30 శాతం వడ్డీతో కంతులు కడుతున్నాడు. అయితే తనను మూడేళ్లుగా ఆధిక వడ్డీ కోసం వేధిస్తున్నారని, తన మరణానికి వారి వేదింపులు కారణమని బంధువులు, స్నేహితులకు వాట్సాప్‌లో సందేశం పంపి, శనివారం ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. కుణిగల్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
బాలికల కిశోరి కేంద్రం ప్రారంభం
రాయచూరు రూరల్: జిల్లాలో 2026–27వ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆడ పిల్లలకు కిశోరి కేంద్రం ప్రారంభించినట్లు బాలల హక్కుల రక్షణ సభ్యుడు సత్య నారాయణ పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను చూసి బాల్య వివాహాల నిర్మూలన, రక్తహీనత, ఆప్త సమాలోచనలు, మహిళల సమస్యల పరిష్కారానికి అవకాశాలను కల్పించారు. పరిశీలనలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లాధికారిణి శరణమ్మ, గోకార్ సాబ్, మన్సూర్ అహ్మద్‌లున్నారు. ఎయిమ్స్ మంజూరు చేయండి రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు చేపట్టాలని కొప్పళ జిల్లా నేతలు ఆందోళనకు మద్దతు పలికారు. శనివారం కొప్పళ తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సమితి అధ్యక్షుడు మంజునాథ గొండబాళ మాట్లాడుతూ ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాయచూరు, కొప్పళ జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించి రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా గళం విప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలన్నారు. శంభులింగప్ప, విజయ మహంతేష్, మహదేవప్ప, మల్లికార్జున, శివప్ప, రాజశేఖర్‌లున్నారు. కేపీసీసీ అధ్యక్షుడితో భేటీసాక్షి,బళ్లారి: నూతనంగా నియమితులైన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు బీ.కే హరిప్రసాద్‌ను పలువురు బళ్లారి కాంగ్రెస్ ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. శనివారం బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బోయపాటి విష్ణు తదితరులు ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, పార్టీ పురోభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. బళ్లారి జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. మైనార్టీల సంక్షేమానికి కృషి రాయచూరు రూరల్: మైనార్టీల సంక్షేమానికి పాటు పడతానని ఎమ్మెల్సీ వసంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని హరిజనవాడలో మైనార్టీ నేతల నుంచి సన్మానాన్ని స్వీకరించి ఆయన మాట్లాడారు. జ్యోతి కాలనీలో మదరసా, మహిళా మదరసాలకు రూ.50 లక్షల చొప్పున కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా రజాక్ ఉస్తాద్, షెక్షావలి, హఫీజ్, కమరలి, ఖలీల్, నిసార్, అజరుద్దీన్, జిలానీ, అశ్రఫ్లున్నారు. పైకప్పు కూలిన ఘటనలపై నివేదిక ఇవ్వండి రాయచూరు రూరల్: కలబుర్గిలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల పైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలైన ఘటనపై వివరాలను సేకరించి నివేదిక పంపాలని కలబుర్గి జెడ్పీ సీఈఓ రాహుల్ సంకనూరు అధికారులను ఆదేశించారు. వారం రోజుల వ్యవధిలో కలబుర్గి బాలికల జూనియర్ కళాశాల, ఆళంద ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో ఉన్నఫళంగా సిమెంట్, కాంక్రీట్‌తో కూడిన పైకప్పులు కింద పడ్డాయి. సెలవు రోజు కావడంతో విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. గదుల నిర్మాణాలు నాసిరకంతో చేశారని, అందువల్లే పైకప్పులు ఊడిపడుతున్నాయని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా ఉంచాలని ఆయన సూచించారు. -
యోగా దినోత్సవంపై బైక్ జాగృతి ర్యాలీ
హొసపేటె: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా ఆయుష్ శాఖ, జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, పతంజలి యోగా సమితి, ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, కన్నడ విశ్వవిద్యాలయం, ఏఎఫ్ఐ వంటి జిల్లాలోని వివిధ విభాగాలు, సంస్థల సహకారంతో శుక్రవారం నిర్వహించిన భారీ బైక్ జాగృతి ర్యాలీని అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ.బాలకృష్ణ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. యోగా ప్రాముఖ్యతను తెయజేసే నినాదాలు, పోస్టర్లను ప్రదర్శిస్తూ ఈ భారీ బైక్ ర్యాలీ ఫ్రీడం పార్క్ నుంచి ప్రారంభమై బస్టాండ్, మూరంగడి సర్కిల్, మీర్ ఆలం టాకీస్, బస్ డిపో, వడకరాయన రోడ్డు, మెయిన్ బజార్, పాదగట్టె ఆంజనేయ దేవాలయం, రామా టాకీస్, వాల్మీకి సర్కిల్, మార్కండేశ్వర దేవాలయం, 100 పడకల ఆస్పత్రి రోడ్డు, విజయనగర కళాశాల, అంబేడ్కర్ సర్కిల్, షాన్‌బాగ్ సర్కిల్ వంటి నగరంలోని ప్రధాన రహదారుల గుండా ప్రయాణించి, తిరిగి ఫ్రీడం పార్క్‌కు చేరుకుని ముగిసింది. ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ కేహెచ్.గురుబసవరాజ్తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
సాక్షి,బళ్లారి: డ్రగ్స్ రహిత బళ్లారిని చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ పిలుపునిచ్చారు. ఆమె శనివారం మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ చేపట్టారు. ఎస్సీసీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాలు, పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. డ్రగ్స్ విక్రేతలపై కఠిన చర్యలు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా అమ్మినా, కొనుగోలు చేసినా అలాంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించి, బళ్లారిలో డ్రగ్స్ రహిత సమాజం నిర్మించేందుకు సహకారం అందించాలన్నారు. కళాశాల విద్యార్థుల్లో ఏమైనా మార్పులు వస్తున్నాయంటే వారి వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి గుర్తించాలన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. పెడదోవ పట్టకుండా చూడాలి తెలిసీ తెలియని వయస్సులో విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేయాలన్నారు. కొందరు ఇలాంటి వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై డేగ కన్ను వేశామన్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశామని, ఇంకా ఎక్కడైనా అమ్మకాలు చేస్తున్నారని తెలిసినా తమకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మత్తుకు దూరంగా ఉండాలని సూచన విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన వైనం -
మౌలిక సౌలభ్యాల కల్పనకు ప్రాధాన్యత
రాయచూరు రూరల్: దేవదుర్గలో మౌలిక సౌలభ్యాల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని జిల్లా అధికారి పూవిత సూచించారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం నగర సభ కార్యాలయంలో జరిగిన సభలో అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తాగునీటి జలాశయం, వివిధ ప్రాంతాల్లోని మురికి కాలువల్లో పూడిక, చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాస్పత్రి, ఇందిరా క్యాంటీన్లను సందర్శించారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఎరువులు, క్రిమి సంహరక మందుల దుకాణాలను తనిఖీ చేశారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తాలూకా విద్యాశాఖ అధికారి రాధా దేవి, సీడీపీఓ మహేష్ నాయక్ పాల్గొన్నారు. -
పరిసరాల పరిరక్షణ అందరి బాధ్యత
రాయచూరు రూరల్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని రాయచూరు వాకింగ్ క్లబ్ సంచాలకుడు సిద్ధేష్ విరక్తిమఠ్ సూచించారు. శుక్రవారం అంబేడ్కర్ గార్డెన్లో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొత్త వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో పరిసరాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు. యోగా, ధ్యానం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రామణ్ణ, ముత్తురాజ్, చంద్రశేఖర్, నరసింహులు, అఫ్రోజ్ ఖాన్, శరణ బసవ, మునిరెడ్డి, రహీం, జాకీర్, మహదేవ్, బసవరాజ్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. పార్వతమ్మ సేవలు అమూల్యం రాయచూరు రూరల్: నగర మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి భార్య పార్వతమ్మ సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప తెలిపారు. శుక్రవారం నగరంలోని వీరాంజనేయ కళ్యాణ మంటపంలో పార్వతమ్మ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శంకరప్ప మాట్లాడుతూ.. పాపారెడ్డి నగర సభ అధ్యక్షుడిగా, శాసన సభ్యుడిగా పని చేసేందుకు పార్వతమ్మ సహకారం అందించారన్నారు. ఏటా జరిగే ముంగారు మూన్నూరు కాపు ఉత్సవాల నిర్వహణకు సహకారం అందించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో శాంతప్ప, శాలం, చంద్రశేఖర్, రాఘవేంద్ర, నరస రెడ్డి, ఆంజనేయ, శ్రీనివాసులు నరసింహులు తదితరలు పాల్గొన్నారు. కట్టుకున్న భర్తే కాలయముడు ● యర్రగుడిలో మహిళ దారుణ హత్య సాక్షి బళ్లారి: జీవితాంతం తోడు, నీడలా ఉంటానని ప్రమాణం చేసి అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తే భార్యను దారుణంగా హత్య చేశాడు. తాలూకాలోని మోకా సమీపంలోని యర్రగుడి గ్రామానికి చెందిన సుజాతమ్మ (45) అనే మహిళను భర్త ఆంజనేయులు దారుణంగా హతమార్చాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య సుజాతమ్మను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపడంతో యర్రగుడి గ్రామం ఉలికిపడింది. స్థానిక మోకా పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. నామఫలకాలు కన్నడ భాషలో ఉండాలికేజీఎఫ్: రాబోయే 10 రోజుల్లో నగరసభ వ్యాప్తిలో దుకాణాలు, వ్యాపార కేంద్రాల ముందు నామఫలకాల్లో 60 శాతం కన్నడ భాషను తప్పనిసరిగా ఉపయోగించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్. రవి ఆదేశించారు. శుక్రవారం నగరసభ సభాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కెజీఎఫ్ తాలూకాలో కన్నడ భాష అమలు సరిగా లేదన్నారు. కన్నడ భాష అమలుకు ఇప్పటికే రెండు సార్లు సమావేశం నిర్వహించి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అయినా స్పందన లేదన్నారు. బెమెల్, ఇతర సంస్థలు, శాఖల్లో కన్నడిగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి సంబంధించి ఇప్పటికే బెమెల్ అధికారితో చర్చించినట్లు తెలిపారు. కోలారులో త్వరలో సమావేశం నిర్వహించి కన్నడ పర సంఘటనలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కన్నడ సంఘం తాలూకా అధ్యక్షుడు ప్రసన్న రెడ్డి, నవ కరవే రాష్ట్ర అధ్యక్షుడు రాజగోపాలగౌడ, తహసీల్దార్ భరత్, కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
క్రాస్ ఓటింగ్ కుదుపు
● బీజేపీ నాయకులు విజయేంద్ర, అశోక్, రాధామోహన్దాస్లకు హైకమాండ్ పిలుపుశివాజీనగర: కర్ణాటక విధాన పరిషత్‌లో 7 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, బీజేపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కుదుపునకు దారి తీశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యత ప్రదర్శించాల్సిన బీజేపీ, జేడీఎస్‌లకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ అధినాయకత్వాలకు షాకిచ్చి కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రస్తుతం మిత్రుల మధ్య క్రాస్ ఓటింగ్ నెంబర్ వివాదానికి దారి తీసింది. మరోవైపు క్రాస్ ఓటింగ్‌ను తీవ్రంగా పరిగణించిన బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నాయకులకు ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. ఈ విషయంపై చర్చించేందుకు రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్ష నేత ఆర్.అశోక్, రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి రాధామోహన్దాస్లకు వెంటనే ఢిల్లీకి రావాలని కబురంపింది. నాయకులను కలుస్తున్న ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ నాయకులను భేటీ చేస్తున్నారు. భైరతి బసవరాజ్, చంద్రు లమాణి, కృష్ణ నాయక్‌లపై క్రాస్ ఓటింగ్ ఆరోపణ వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్యేలందరూ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకులను కలిసి వివరణ ఇచ్చారు. పరిషత్ ప్రతిపక్ష నాయకుడు చలవాది నారాయణస్వామి స్పందిస్తూ తాము నిర్ధారించిన నాలుగు ఓట్లు జేడీఎస్‌కు పడ్డాయి. తమ నివేదిక వచ్చేవరకు ఎవరిపై అనుమానం వ్యక్తం చేయం. ఆ తరువాత తామే క్రాస్ ఓటింగ్ చేసినవారిపై చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు. మొత్తం మీద పరిషత్ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ మిత్ర పక్షాలైన బీజేపీ, జేడీఎస్‌ల్లో వణుకు పుట్టించింది. క్రాస్ ఓటింగ్‌పై సత్యశోధన విధాన పరిషత్ ఎన్నికల్లో భారీ క్రాస్ ఓటింగ్ జరిగినందున అతి తక్కువ తేడాలో పరాజయం తప్పించుకున్న కర్ణాటక బీజేపీ క్రాస్ ఓటింగ్ విషయంపై సత్యశోధన కమిటీని నియమించింది. విధాన పరిషత్ సభ్యుడు సీ.టీ.రవి నేతృత్వంలో కమిటీని నియమించారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్.మహేశ్, ఎమ్మెల్యే మహేశ్ టెంగినకాయిలతో కూడిన త్రిసభ్య కమిటీకి జూన్ 25లోగా నివేదిక ఇవ్వాలని అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర సూచించారు. ఈ పరిణామాలతో అసంతృప్తికి గురై పారిపోయేవాడని కాదు. దీనిని ఓర్చుకునే శక్తి తనకుందన్నారు. తాను యడియూరప్ప కుమారుడిని. క్రాస్ ఓటింగ్ గురించి ఎవరితో చెప్పాలో వారికి చెబుతానన్నారు. భగవంత్ ఖూబా లేఖ బీజేపీ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై.విజయేంద్రకు కేంద్ర మాజీ మంత్రి భగవంత ఖూబా లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. దీంతో పరిషత్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎన్నో చోట్ల ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ముందు సూచన చేసినా కార్యకర్తలు పార్టీ తరఫున పని చేయకుండా దూరంగా ఉంటున్నారు. సొమ్ము ఇచ్చి ప్రజలను తీసుకొచ్చి కార్యకర్తలుగా ప్రతిబింబించే పని జరుగుతున్నా కూడా ఇలాంటిదేమీ ప్రశ్నించటం లేదని లేఖలో ఉల్లేఖించారు. 2028లో పార్టీ అధికారంలోకి రావాలంటే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఖూబా తన రహస్య లేఖలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులకు కూడా ఈ విషయమై విన్నవించారు. గుండెపోటుతో ఏఆర్ ఎస్ఐ మృతితుమకూరు: ఏఆర్ ఎస్ఐ గుండెపోటుతో మృతి చెందిన ఘటన కొరటగెరె తాలూకా తుంబుగనహళ్లి సమీపంలో 12వ కె.ఎస్.ఆర్.పి యూనిట్లో జరిగింది. బాగలకోటె జిల్లా బీళగికి చెందిన ఎన్జీ పవార్ ఇక్కడి బెటాలియన్‌లో నాలుగేళ్లుగా ఎఆర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. హాస్టల్లో నివసిస్తున్న ఆయనకు గురువారం అర్ధరాత్రి తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. కొరటగెరె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. బెటాలియన్ కమాండర్ హమ్జా హుస్సేన్, డిప్యూటీ కమాండర్ నిసార్ అహ్మద్ తుది నివాళులర్పించారు. -
కన్నడ పాఠశాలల సంరక్షణకు పోరాటం
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలల సంరక్షణకు పోరాటం చేస్తాం. అవసరమైతే గోకాక్ ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కన్నడ సినీ నటుడు టెన్నిస్ కృష్ణన్ తెలిపారు. గురువారం ఆర్టీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాయచూరు, బళ్లారి, బీదర్, కలబుర్గి, కోలార్, చింతామణి, బాగేపల్లి, కాసరగోడు వంటి ప్రాంతాల్లో కన్నడ భాషకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ భాషను రక్షించడంతో పాటు కన్నడిగులకు ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలపై ప్రజలను చైతన్య పరిచి గోకాక్ తరహా ఉద్యమానికి ముందుకు వస్తామని పేర్కొన్నారు. కుమార్, బసవరాజ్, హనుమేష్ నాయక్, నాగప్ప, గోవిందు, శరణ బసవ, అమరేష్, మంజునాథ్, నాగనలింగ గౌడ పాల్గొన్నారు. -
అర్హులకు ఇబ్బంది కల్గించొద్దు
బనశంకరి: సీఎం నేతృత్వంలో శుక్రవారం విధానసౌధలో గృహలక్ష్మి పథకంపై ప్రగతి పరిశీలన సమావేశం నిర్వహించారు. అర్హులకు పథకాలు అందించడంలో ఇబ్బంది కలగరాదని, అనర్హులు, పథకం దుర్వినియోగానికి మాత్రమే అడ్డుకట్ట వేయాలని అధికారులకు ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ సూచించారు. అనేక మంది అర్హులు బ్యాంక్ రుణం తీసుకున్నారని, రుణం అకౌంట్‌కు గృహలక్ష్మిద డబ్బు జమ కాగానే రుణం మొత్తానికి జమ అవుతోంది. దీంతో అలాంటి అర్హులు అకౌంట్ మార్చాలని, ఇలాంటి అర్హులకు ఎలాంటి ఇబ్బంది కలగరాదని తెలిపారు. గృహజ్యోతి గ్యారంటీ పథకం అమల్లోకి వచ్చినప్పుడు దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇదే విధంగా మిగిలిన పథకాల్లో కూడా వ్యవహరిస్తే దుర్వినియోగం తగ్గుతుందన్నారు. మృతుల అకౌంట్లకు నగదు జమ మరణించిన వారి అకౌంట్లకు గృహలక్ష్మిద పథకం నగదు జమ అవుతున్నట్లు వెలుగుచూసింది. ఇలా దుర్వినియోగం కారాదన్నారు. గృహలక్ష్మి నగదు అర్హుల అకౌంట్లకు జమ కాగానే వారి మొబైల్‌కు వాయ్స్ మెసేజ్ ద్వారా ధృవీకరణ కావాలని తెలిపారు. బ్యాంకు అకౌంట్లు కర్ణాటకలో మాత్రమే ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో బ్యాంకు అకౌంట్లకు నగదు జమ అవుతున్నట్లు తెలిసిందని, దీనిని నిలిపివేయాలన్నారు. తమ రాష్ట్ర పథకాలు మన రాష్ట్ర అర్హులకు మాత్రమే అందాలి. ఇతర రాష్ట్రాల ఓటర్లకు అందుతున్న పథకాలకు చెక్‌పెట్టాలి. మృతి చెందిన వారి సంఖ్య సకాలంలో లభించక పోవడం, ఈ–కేవైసీ, బ్యాంక్ అకౌంట్, ఎన్పీసీఐ అర్హుల గురించి సమావేశంలో చర్చించారు. ఒకే అకౌంట్లో అనేక మంది అర్హులు గృహలక్ష్మి సొమ్ము పొందుతున్నారన్నారు. మూడు లక్షల ఖాతాల్లోకి మొత్తం రూ.60 కోట్ల నగదు వెళ్లిందని ఏజీ నివేదికలో తెలిసింది. దుర్వినియోగానికి మాత్రమే చెక్ పెట్టాలి గ్యారంటీ పథకాలపై ప్రగతి పరిశీలనలో సీఎం -
రైతుల భూములు లాక్కోవడం తగదు
బళ్లారి అర్బన్: బెంగళూరు వద్ద బిడది ఆరోహళ్లి ఓబ్లిలో సారవంతమైన వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మీనాళ్లి తాయణ్ణ తెలిపారు. జేడీఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి గడిగి చెన్నప్ప సర్కిల్ మీదుగా జిల్లా అధికారి కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మీనాళ్లి తాయణ్ణ మాట్లాడుతూ.. మొదటి దశలో సుమారు 500 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం వల్ల 755 రైతు కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. ఇందులో ఒక ఎకరా కన్న తక్కువ భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారని తెలిపారు. ఇక రానున్న దశలో భారీగా భూమిని స్వాధీనం చేసుకునే ఆలోచనను రద్దు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఇంటర్ గ్రేడింట్ టౌన్ షిప్ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తోందన్నారు. దీంతో వేలాది కోట్ల రూపాయల విలువ గల భూమిని రైతులు కోల్పోతున్నారని తెలిపారు. అంతేగాక 10 లక్షలకు పైగా చెట్లు నేలమట్టం అవుతాయన్నారు. సమావేశంలో పార్టీ నేతలు యల్లన్నగౌడ, లక్ష్మీకాంత్‌రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని నక్కకు గాయాలు
హొసపేటె: కూడ్లిగి తాలూకాలోని కనహోసహళ్లి, హులికెరె మధ్య విజయనగర దాబా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ నక్క గాయపడింది. హైవే ట్రూపర్ల బృందం, హైవే పెట్రోల్, అటవీ వాఖ అధికారులు, స్థానిక పోలీసులు, స్థానికుల సహయంతో ఆ నక్కను రక్షించారు. పశు వైద్యులతో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కమలాపూర్ జూకు తీసుకువెళ్లారు. గాయపడిన నక్క పొదల్లో దాక్కోవడంతో అటుగా వెళ్తున్న హైవే ట్రూపర్లు మహేష్, దయానంద్ సజ్జన్, పోలీస్ శాఖకు చెందిన కొట్రేష్, అటవీ శాఖకు చెందిన జడియప్ప రక్షించారు. అటవీ శాఖకు చెందిన ఏఎస్ఐ మల్లేశప్ప, శ్రీకాంత్ బాబు, శివాండి హొన్నూరప్ప, దాసప్ప, కృష్ణ టోల్ శివాండి సింహాద్రి, సంగయ్య స్వామి, బీరప్ప, పశు సంవర్ధక శాఖకు చెందిన స్థానికులు దనేష్, హులికెరె బాబు, దుర్గేష్, కుమార్ సహాయ సహకారాలు అందించారు. -
పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు
దొడ్డబళ్లాపురం/కోలారు/హుబ్లీ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. చిత్రదుర్గ, బాగల్‌కోట, దావణగెరె, ధారవాడ, కోలారు జిల్లా కోర్టులకు శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఐడీ నుంచి నేరుగా జడ్జీలకు ఈమెయిల్‌లు పంపించారు. అప్రమత్తమైన అధికారులు న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బందిని బయటకు పంపించారు. పోలీసులు ఆయా స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. ఎటువంటి బాంబులు లభించలేదు. ఈ ఈమెయిల్స్ కేరళ వయనాడ్ నుండి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కోలారు జిల్లా వచ్చిన మెయిల్‌ను పరిశీలించగా అందులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జై కనిమోళి అని రాసి ఉన్నట్లు గుర్తించారు. ధార్వాడ జిల్లా కోర్టుకు వచ్చిన ఇ–మెయిల్లో ‘నిన్న మధ్యాహ్నం 2 గంటలకు 23 సైనేడ్ వాయు తుటాలు పేలాయి, అది ట్రయల్ మాత్రమే, ఈ రోజు జరిగేది నిజం’ అంటూ సందేశాన్ని పంపారు. బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు లభించని పేలుడు ఆనవాళ్లు ఉత్తుత్తి బెదిరింపులుగా నిర్ధారణ -
మురుగు శుద్ధి కేంద్రంలో ఇద్దరు కార్మికుల గల్లంతు
ఎస్టీపీని పరిశీలిస్తున్న డాక్టర్ మంజుల, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు ఎస్టీపీ నమూనాను మ్యాప్‌పై పరిశీలిస్తున్న అధికారులు బనశంకరి: వర్తూరు బెళగెరెలోని జలమండలి మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం(ఎస్టీపీ)లో గురువారం సాయంత్రం కాంట్రాక్టు కార్మికులు పని చేస్తుండగా ముగ్గురు కార్మికులు అదుపుతప్పి ట్యాంక్‌లోకి పడిపోయారు. వెంటనే తోటి కార్మికులు ఒక కార్మికుడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన బిహార్‌కు చెందిన బ్రిజేశ్(29), తమిళనాడుకు చెందిన అఖిలేశ్(30) కోసం గాలింపు కొనసాగుతోంది. రాత్రి కావడంతో గాలింపు నిలిపివేసి శుక్రవారం తెల్లవారు జాము నుంచి మళ్లీ గాలింపు కొనసాగించారు. ఇప్పటివరకు వారి జాడ లభించలేదు. 40 అడుగుల లోతు ఉన్న మురుగునీటి శుద్ధీకరణ కేంద్రంలో సేకరించిన 30 అడుగుల లోతు నీటిని సిబ్బంది ఖాళీ చేసి గాలింపు కొనసాగిస్తున్నారు. కేంద్రంలోకి అదుపుతప్పి పడిపోయిన ఇద్దరు కార్మికుల కోసం వర్తూరు పోలీసులు, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. కాగా ఈ ఘటనపై సమ్రగ్ర దర్యాప్తు జరిపించి నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు జలమండలి అధ్యక్షురాలు డాక్టర్ మంజుల తెలిపారు. శుక్రవారం ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. ఈ దురదృష్టకర ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎస్టీపీ కేంద్రం వద్ద రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓ కార్మికుడిని వెంటనే కాపాడి ఆసుపత్రికి తరలించారని, గల్లంతైన ఇద్దరు కార్మికులు బ్రిజేశ్, అఖిలేశ్‌ల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. డ్రైనేజీ ట్యాంక్‌లో విషకారక అంశాలు కలిగి ఉండటం, నీటి ఉధృతి అధికంగా ఉండటంతో రక్షణ కార్యాచరణకు తీవ్ర అడ్డంకిగా మారిందన్నారు. ట్యాంక్ వద్దకు అగ్నిమాపక సిబ్బందితో పాటు జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ బృందం నిపుణులను పిలిపించామన్నారు. రక్షణా సిబ్బంది ట్యాంక్‌లోకి దిగడానికి ముందు లోపల ఉన్న విషకారక అంశాలు బయటికి తీసి ట్యాంక్‌లో ఆమ్లజనకాన్ని నింపడానికి చర్యలు తీసుకున్నామన్నారు. గాలిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పరిశీలించిన జలమండలి అధ్యక్షురాలు -
● రూ.7,178 కోట్ల వంచన, రూ.1,009 కోట్ల జప్తు ● నిత్యం సగటున 770కు పైగా కేసుల నమోదు
సమాచార సాంకేతిక రంగంలో ముందంజలో ఉన్న కర్ణాటక సైబర్ వంచకులకు టార్గెట్‌గా నిలిచింది. సైబర్ నేరాల్లో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. బనశంకరి: గత 6 ఏళ్ల నాలుగు నెలల్లో కర్ణాటకలో రూ.7,178.62 కోట్లు సైబర్ వంచకుల పాలయ్యాయి. ఇందులో రూ.1,009 కోట్లను జప్తు చేయడంలో పోలీసులు సఫలీకృతులయ్యారు. 2020 నుంచి 2026 ఏప్రిల్ చివరి వరకు రాష్ట్రంలో మొత్తం 6.89 లక్షల కేసులు నమోదయ్యాయి. కానీ దర్యాప్తు సంస్థల చర్యలతో ఫ్రీజ్ చేసింది మాత్రం రూ.1,009 కోట్లు మాత్రమే. గత నాలుగు నెలల్లో రూ.791 కోట్ల వంచన 2026 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు 93,438 కేసులు నమోదు కాగా ప్రజల నుంచి రూ.791 కోట్లు దోచేశారు. సగటున రోజుకు 770కు పైగా కేసులు నమోదు కావడం సైబర్ నేరాల తీవ్రతను తెలియజేస్తోంది. గతంలో బ్యాంక్ కాల్స్, ఓటీపీ వంచనకు పరిమితమైన నేరాలు ప్రస్తుతం విభిన్న కోణాల్లో సంతరించుకున్నాయి. ఫేక్ పెట్టుబడి యాప్‌లు, డిజిటల్ అరెస్ట్‌ల బెదిరింపు, పార్శిల్ స్క్యామ్, ఈ–కేవైసీ రెన్యువల్ లింక్, సోషల్ మీడియాలో స్నేహం పెంచుకుని వంచన, ఉద్యోగం, లాభదాయక పెట్టుబడి ప్రలోభం, క్రిప్టో కరెన్సీ వంచన లాంటి కొత్త తరహా వంచనల ద్వారా ప్రజలను వంచనకు పాల్పడుతున్నారు. బెంగళూరులో అధిక మోసాలు బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగదారులు, డిజిటల్ వ్యవహారాలు పెరగడంతో సైబర్ వంచకుల దృష్టి పడింది. త్వరితగతిన ఆన్లైన్ వ్యవహారాలు, యూపీఐ వినియోగం, మొబైల్ ఆధారిత బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరగడం సైబర్ నేరగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. వంచనకు పాల్పడిన కొద్ది నిమిషాల్లో నగదు వేరే అకౌంట్లకు జమ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో క్రిప్టో కరెన్సీ, విదేశీ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తుండటంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారింది. ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే నగదు ఫ్రీజ్ చేసే అవకాశం చాలా తక్కువ. కర్ణాటకకు ద్వితీయ స్థానం.. 2023 నుంచి కర్ణాటక సైబర్ నేరాల్లో వరుసగా మూడో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2024లో 1,65,830 కేసులు నమోదు కాగా 2025లో 2,52,015 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కర్ణాటక సైబర్ నేరాల్లో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. డబ్బు కోల్పోయిన వారి సమాచారం ఎన్సీఆర్పీ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బు తక్షణం ఫ్రీజ్ చేసి చర్యలు చేపడతామని సైబర్ కమాండ్ డీఐజీపీ ఆనంద్‌కుమార్ తెలిపారు. పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్రంలో సైబర్ కమాండ్ సెంటర్, సైబర్ క్రైం పోలీస్స్టేషన్లు, సీసీబీ ఉన్నప్పటికీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిపుణుల కొరత, సాంకేతిక సవాళ్లు, అంతర్జాతీయ ముఠా సంబంధాలు దర్యాప్తునకు అడ్డంకిగా మారాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే ప్రజల కంటే వంచకుల కొత్త విధానాలు చట్టాలు అమలు చేసే సంస్థలకు సవాల్‌గా మారాయి. ప్రభుత్వం, బ్యాంకులు, ప్రజలు జాగృతంగా వ్యవహరించినప్పుడు మాత్రమే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. -
శ్రీవారి సేవలో సీఎం డీకే శివకుమార్
యశవంతపుర: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారిగా ఆయన తిరుమలకు వెళ్లారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రివర్గ విస్తరణ తరువాత డీకే శివకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. గురువారం జరిగిన విధాన పరిషత్ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ బలం పెరిగిన సంతోషంలో కుటుంబంతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ ఫొటోలను సీఎం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అది మా పార్టీ అంతర్గతం● ఎవరికీ మాట్లాడే అధికారం లేదు ● బీజేపీ నేత ఆర్.అశోక్ మండిపాటు శివాజీనగర: రాజ్యసభ టికెట్ విషయంపై మాట్లాడిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్.డీ.రేవణ్ణ, మండ్య మేడంకు కూడా టోపీ వేశారు. ఆమైకె నా టికెట్ ఇచ్చి ఉంటే తామేం వద్దు అనేవారమా? అని తెలిపారు. ఇదే విషయమై రేవణ్ణ వ్యాఖ్యలపై స్పందించిన విపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవణ్ణ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ చర్చకు దారి తీస్తాయన్న అశోక్, అది తమ పార్టీ అంతర్గత విషయం. రేవణ్ణకు కాని, మరొకరికి కాని మాట్లాడే అధికారం లేదు. ఎవరికీ కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు హక్కు లేదని విరుచుకుపడ్డారు. బీజేపీ ఎవరికీ రాజ్యసభ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వలేదు. పార్టీ నియమాల ప్రకారం తాము తమ నిజాయితీ కలిగిన కార్యకర్తలకు మాత్రమే రాజ్యసభ టికెట్ ఇచ్చాం. ఈ నిర్ణయం పూర్తిగా తమ పార్టీ అంతర్గత విషయాల్లో భాగమన్నారు. కాగా రాజ్యసభ స్థానానికి ముందుగా దేవెగౌడ, సదానందగౌడల పేర్లు వినిపించాయి. ఆ తరువాత మధ్యలో మేడం సుమలత పేరు వినిపించింది. మండ్య మేడంకు కూడా వారు టోపీ వేశారు. ఆమెకు ఇచ్చినా తామేం వద్దనేవారమా ? అని రేవణ్ణ తెలిపారు. మేకెదాటుకు తమిళనాడు నో యశవంతపుర: మేకెదాటు పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. శుక్రవారం జరిగిన శాసనసభలో సీఎం జోసెఫ్ సీ.విజయ్ పథకాన్ని ప్రస్తావించి మేకెదాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. మేకెదాటు పథకానికి సాంకేతిక, పర్యావరణ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని శాసనసభలో చర్చించి పథకానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు సభలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తల్వార్‌తో కేక్ కటింగ్ యశవంతపుర: చిక్కమగళూరు పట్టణంలోని వాజపేయి లేఔట్లో యువకులు నడిరోడ్డుపై తల్వార్‌తో పుట్టిన రోజు కేక్ కట్ చేయటం వివాదంగా మారింది. మహమ్మద్ సమీర్ అనే యువకుడు గురువారం రాత్రి లాంగ్ పట్టుకొని కేక్‌ను కత్తరించారు. ఐదు కేజీల కేక్‌ను లాంగ్‌తో కత్తిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘటనపై చిక్కమగళూరు గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
లోకాయుక్త వలలో బుడా సర్వేయర్
సాక్షి బళ్లారి: బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (బుడా) సర్వేయర్ లోకాయుక్తకు చిక్కారు. స్థలాల లేఅవుట్ ఫైళ్ల అనుమతుల మంజూరుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో లోకాయుక్త అధికారులు మెరుపు దాడి చేశారు. బాధితుడి నుంచి రూ.3.50 లక్షల లంచం తీసుకుంటుండగా సర్వేయర్ శాంతమూర్తి, ఆయన సహాయకుడు మహమ్మద్ సాజిద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రవీణ్ కుమార్, కుమార స్వామి, రఘనాథ్ బృందానికి చెందిన సింగిల్ లేఅవుట్, మల్టీ లేఅవుట్ ఫైళ్లకు అనుమతులు పొందడం, సంబంధిత పనులు చేయించేందుకు వీరేష్ అనే వ్యక్తి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తీసుకున్నాడు. ఇందులో భాగంగా లేఅవుట్ అనుమతి కోసం వీరేష్ దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత సర్వేయర్ శాంతమూర్తి ఇందుకోసం రూ.3.50 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే లంచం ఇచ్చేందుకు వీరేష్‌కు ఇష్టం లేకపోవడంతో నేరుగా లోకాయుక్త అధికారులను కలిసి సమస్యను చెప్పుకున్నాడు. వీరేష్ ఫిర్యాదు మేరకు లోకాయుక్త అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయంలో సర్వేయర్ శాంతమూర్తి తన సహాయకుడు మహమ్మద్ సాజిద్ సహాయంతో వీరేష్ నుంచి రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటుండగా దాడి చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో లోకాయుక్త పోలీస్ సూపరింటెండెంట్ ఎన్.వాసుదేవ రామ, డిప్యూటీ సూపరింటెండెంట్లు సిద్దప్ప, ఎస్.బీలగి, సచిన్, ఎస్.చలవాది, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్, ఎం.భావిమని తదితరులు పాల్గొన్నారు. అవినీతి కేంద్రంగా ‘బుడా’ బళ్లారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (బుడా) కార్యాలయంపై అవినీతి ఆరోపణలు పెరిగిపోతుండటం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నగరంలో ఏటేటా పెరుగుతున్న జనాభాకు తోడు కొత్త లేఔట్లు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు పెరిగిపోతున్నాయి. లేఅవుట్ల అనుమతుల ప్రక్రియలో కీలక భూమిక పోషిస్తున్న బుడా కార్యాలయ సిబ్బంది లేఅవుట్ల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధికారులు, పాలకులు నేరుగా లంచాలు తీసుకుంటున్నారని లేఅవుట్ల యజమానులు బహిరంగంగానే చెబుతున్నారు. నూతన లేఔట్ల అనుమతులు, ఫైళ్లు క్లియరెన్స్ చేయడానికి చిన్న చిన్న అభ్యంతరాలు చూపిస్తూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడుతున్నారు. లోకాయుక్తకు చిక్కిన సర్వేయర్ శాంతమూర్తి, ఆయను సహాయకుడు మహమ్మద్ సాజిద్ స్థలాల లేఅవుట్ ఫైళ్ల అనుమతులకు లంచం డిమాండ్ బాధితుడి ఫిర్యాదుతో ఆకస్మికంగా దాడి సర్వేయర్, ఆయన సహాయకుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు -
యోగాతో మానసిక ఒత్తిడి దూరం
రాయచూరు రూరల్: ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా చేయాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆయుర్వేద, యూనానీ శాఖల ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగా చేస్తే మానసిక ఒత్తిడి దూరం అవుతుందని పేర్కొన్నారు. యోగాసనాలతో ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ సజ్జన్, శంకర్ గౌడ పాటిల్, శంకర్ గౌడ, పూజ, చంద్రశేఖర్ పవార్, వీరేష్ నాయక, దండప్ప బిరదార్, ఉపాధ్యాయుడు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. బళ్లారి టౌన్: యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక నెమ్మది లభిస్తుందని జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్.టి.పనేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, ఆయుష్ శాఖ వివిధ యోగా సంస్థల ఆధ్వర్యంలో బృహత్ జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతుఊ.. ఇటీవల రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్న డయాబెటిస్, బీపీ తదితర ఆరోగ్య సమస్యలను నియంత్రించేందుకు యోగా ఉత్తమ మార్గం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు యోగా ఉత్తమ ఔషధం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, యోగా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రక్తదానం సామాజిక సేవకు ప్రతీక
హొసపేటె: ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని బీఎంఎం (బీఎంఎం) ముఖ్య కార్యనిర్వహణ అధికారి మంజునాథ్ ప్రభు అభిప్రాయపడ్డారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో భాగంగా బీఎంఎం ఇస్పాత్, ప్రభుత్వ ఆస్పత్రి, బళ్లారిలోని విమ్స్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో గురువారం వృత్తి విద్యా ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛంధ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి రక్తదానం చేయడం వల్ల ముగ్గురు వేర్వేరు వ్యక్తులకు సహాయం అందుతుందన్నారు. ఇది మానవతా దృక్పథంతో కూడిన ఒక మంచి పని. రక్తదానం చేయడం ఆరోగ్యానికి నిజంగా ప్రమాదకరం కాదు.. ఇది ఒక సేవ, నిస్పార్థమైన చర్య అని తెలిపారు. మానవ ప్రాణాలను కాపాడే శక్తి రక్తానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తి అయిన ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానం సామాజిక సేవకు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యనిర్వహణ అధికారి విమల్ సింగ్, ఆర్థిక వాణిజ్య శాఖ అధిపతి రాజేంద్ర ముంద్రా, సంస్థ ఉపాధ్యక్షుడు మనీష్.డి.వర్ణేకర్, వృత్తిపర ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్. పీ.విజయ వెంకటేష్, డాక్టర్.అంజని, డాక్టర్ అనూష, విజయనగర్ జిల్లా రక్త సేకరణ అధికారి డి.జగదీష్, విమ్స్ బ్లడ్ బ్యాంక్ కన్సల్టెంట్లు సిద్దేశ్వర, మల్లికార్జున కపాలి, సంతోష్, వృత్తిపర ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో ప్రమాదాలు జరిగితే ఉపేక్షించం
కోలారు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల సురక్షత విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే సహించేది లేదు. భవిష్యత్తులో ఏవైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత తాలూకా బీఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులనే బాధ్యులను చేయడం జరుగుతుందని జిల్లా పంచాయతీ సీఈఓ ప్రవీణ్ పి బాగేవాడి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పాఠశాల గదుల మరమ్మతులపై ప్రగతి పరిశీలన సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడి ఉపాధ్యాయురాలు గాయపడిన నేపథ్యంలో సీఈఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న మరమ్మతులు చేయాల్సిన పాఠశాల గదులు, అంగనవాడీ కేంద్రాల కచ్చితమైన సమాచారాన్ని వచ్చే మూడు రోజులల్లో సమర్పించాలని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న గదులలో విద్యార్థులను కూర్చోపెట్టొదని తెలిపారు. జిల్లా పంచాయతీలో వివిధ హెడ్ల కింద ఉన్న నిధులతో పాఠశాలలో గదులకు మరమ్మతులు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ సహకారంతో అంగనవాడీలకు మరమ్మతులు చేయాలని సీడీపీఓలకు తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి టి.కె.రమేష్, పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థిపై వీధి కుక్క దాడి
హొసపేటె: విజయనగర జిల్లా మరియమ్మహళ్లి పట్టణంలో ఒక హాస్టల్ విద్యార్థిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం జరిగింది. కొండనాయకనహళ్లి గ్రామానికి చెందిన మైలారీ అనే హాస్టల్ విద్యార్థి బట్టలు తెచ్చుకోవడానికి వెళ్తుండగా.. అకస్మాత్తుగా వీధి కుక్క దూకి కరచింది. గమనించిన స్థానికులు మైలారీని ఆ మొద్దుబారిన కుక్క నుంచి కాపాడారు. చికిత్స నిమిత్తం బాలుడిని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలురాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసనగౌడ అన్నారు. శుక్రవారం రాయచూరు తాలూకాలోని గారలదిన్నె, అశాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నూతన తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 13 పాఠశాలలు, 8 కర్ణాటక పబ్లిక్ పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యా సౌకర్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ కోస్గి తదితరులు పాల్గొన్నారు. బస్సు సౌకర్యం కల్పించాలిరాయచూరు రూరల్: రాయచూరు తాలూకా కడగం దొడ్డి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్టీసీ డివిజన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భాస్కర్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రజలు, రైతులు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా బస్సులు నడపాలని సూచించారు. యాపలదిన్ని, చంద్ర బండ తదితర ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా బస్సులు నడపాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం డివిజన్ కంట్రోల్ అధికారి చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రంగనాథ్, వీరేష్, తిమ్మన గౌడ, నరసప్ప, ఆంజనేయ, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 29 వరకూ ఇంటింటి సర్వే రాయచూరు రూరల్: ఓటర్ల జాబితాలో సవరణలపై అధికారులు చర్యలు చేపట్టి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ సజ్జన్ సూచించారు. జిల్లా అధికారి కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రచార జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఓటర్ల జాబితా సమీక్షలో సుమారు 2.50 లక్షల మంది వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జూన్ 29 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి సర్వేలు నిర్వహించాలని తెలిపారు. ముద్రిత ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు, లోపాలను గమనించి ఇంటి యజమానులు సవరణలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, అధికారులు శంకర గౌడ, చంద్రశేఖర్ పవార్, వీరేష్ నాయక్, దండప్ప బిరదార్ తదితరులు పాల్గొన్నారు. ఈతకెళ్లి యువకుడు మృతిహుబ్లీ: ఈత కొట్టేందుకు క్వారీలోకి దిగిన యువకుడు నీట మునిగి మృతి చెందిన ఘటన ధార్వాడ తాలూకా అమ్మినబావి వద్ద చోటు చేసుకుంది. మరెవాడ గ్రామ రాజు కడిదాళ (23) మృతుడు. ఈనెల 16వ తేదీన రాజు.. ఈత కొట్టేందుకు క్వారీ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో నీటి మునిగి చనిపోయాడు. ఈ విషయం ఎవరికి తెలియలేదు. రెండు రోజుల నుంచి అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం క్వారీలో మృతదేహం తేలడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి చూడగా.. మృతుడు రాజు కడిదాళ అని నిర్ధారించారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బడిలోనే హెచ్ఎం ఆత్మహత్య
యశవంతపుర: పాఠశాలలో మితిమీరిన రాజకీయాలు, ఉపాధ్యాయుల వేధింపులను తట్టుకోలేక ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దావణగెరె జిల్లా హరిహర వద్ద కుక్కనూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. హెచ్ఎం జయప్ప (54) పాఠశాల మరుగుదొడ్డికి వెళ్లి పురుగుల మందు తాగి చనిపోయాడు. జయప్ప భార్య అంజనమ్మ ఫిర్యాదు మేరకు ఐదుమంది ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది, సీఆర్పీ, బీఆర్పితో పాటు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవినీతికి సహకరించలేదని, తమ మాట వినడం లేదని నిత్యం కులం పేరుతో దూషించేవారని ఆమె తెలిపింది. టీచర్లు శ్రీకాంతాచారి, వెంకటేశ్, రంజని, చేతన, మహంతేశ్ గౌళి, వంట సహయకురాలు సుమా, చెన్నమ్మ, రూపా, విజయ నిందితుల్లో ఉన్నారు. ఆయన గత 10 నెలల నుంచి ఇక్కడ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. దావణగెరె జిల్లాలో విషాదం -
కేబినెట్లో రహీంఖాన్‌కు చోటు ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్‌లో మంత్రిగా రహీంఖాన్ని నియమించాలని అఖిల భారత మైనార్టీ సేవా సంఘం ఒత్తిడి చేసింది. అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు సాధిక్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిని మార్పు చేసిన సమయంలో ఆ పదవిని మైనార్టీలకు కేటాయించాలన్నారు. 2023 ఎన్నికల సమయంలో కళ్యాణ కర్ణాటక భాగంలో మైనార్టీల ఓట్లు కావాలని ప్రధాన పదవులు మాత్రం అగ్రనాయకులకు కేటాయించడం తగదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవిని రహీంఖాన్కి తిరిగి కేటాయించాలని డిమాండ్ చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి హొసపేటె: ఆహారం కోసం వెతుకుతున్న ఒక చిరుత జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన ఘటన బుధవారం రాత్రి సుమారు 10:30 గంటలకు విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా సరిహద్దులోని హులికుంటె క్రాస్ సమీపంలో జాతీయ రహదారి– 50పై జరిగింది. సుమారు రెండున్నర సంవత్సరాల వయస్సుగల మగ చిరుత చనిపోయింది. ప్రమాదంలో చిరుత నోరు, ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో చిరుత అక్కడికక్కడే మరణించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. విషయం తెలియగానే హొసపేటె ఫారెస్ట్ జోన్ ఆఫీసర్ కౌశిక్, కూడ్లిగి ఎస్ఐ ప్రకాష్, ఇతర సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. మహిళ అదృశ్యంహొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని ఆలూరు గ్రామానికి చెందిన సుమారు 25 ఏళ్ల వయస్సున్న శృతి అనే మహిళ అదృశ్యమయ్యారు. ఈ విషయంపై హొసహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదృశ్యమైన మహిళ సుమారు 5 అడుగుల ఎత్తు, పలుచని శరీరాకృతి, నలుపు రంగు శరీర ఛాయ, గుండ్రని ముఖం కలిగి కన్నడలో మాట్లాడుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆమె ఆకుపచ్చ రంగు నైటీ ధరించింది. ఆమె ఆచూకీపై ఏమైనా సమాచారం తెలిస్తే హొసహళ్లి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని స్టేషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్ ఢీకొని గొర్రెల కాపరి దుర్మరణం● మూడు గొర్రెలూ మృతి ● సింధనూరు వద్ద దుర్ఘటన రాయచూరు రూరల్ : కేకేఆర్టీసీ బస్సు ఢీకొని గొర్రెలు కాపరితో పాటు మూడు గొర్రెలు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లాలో సంభవించింది. బుధవారం తెల్లవారు జామున సింధనూరు వద్ద గంగావతి రోడ్డులో ఈ ఘటన జరిగింది. మృతుడిని మస్కి తాలూకా హాలాపూర్కు చెందిన గొర్రెల కాపరి శరణప్ప(36)గా గుర్తించారు. సింధనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. లోకాయుక్త వలలో విద్యాశాఖ క్లర్క్రాయచూరు రూరల్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న క్లర్క్ మహాబళేఽశ్వర్ లోకాయుక్త వలలో చిక్కారు. గురువారం లోకాయుక్త ఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో దాడి చేశారు. పాఠశాలను రెన్యూవల్ చేయడానికి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నగర పరిధిలోని రాంపూర్ ప్రైవేట్ పాఠశాల లైసెన్స్ రెన్యూవల్ కోసం యజమాని సిద్దణ్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేయగా మహాబళేశ్వర్ లోకాయుక్త అధికారుల చేతికి దొరికారు. -
రైతులకు న్యాయం కోసం బళ్లారి బంద్
సాక్షి బళ్లారి: కుడితిని ప్రాంత రైతుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాను తక్షణం ఆపేసి భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని నిరసిస్తూ వివిధ ప్రజా సంఘాలు, రైతుల ఆధ్వర్యంలో బళ్లారి బంద్ నిర్వహించారు. గురువారం రైతు సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో కర్ణాటక ప్రాంత రైతు సంఘం, కుడితిని భూపోరాట సమితి, వివిధ కన్నడ సంఘాలు, రైతు కార్మికులు, సీఐటీయూ, ఏఐకేఎంఎస్ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన, ఆందోళన, ర్యాలీలు చేపట్టారు. గడిగి చెన్నప్ప సర్కిల్లో మానవహారం ఉదయం 6 గంటల నుంచి గడిగి చెన్నప్ప సర్కిల్ వద్దకు రైతు సంఘాల నాయకులు, కార్మికులు చేరుకొని మానవహారం నిర్వహించి, బైటాయించి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. 10 ఏళ్ల క్రితం కుడితిని ప్రాంతంలో 12,500 ఎకరాల భూములను వేలాది మంది రైతులతో తక్కువ ధరకే కొనుగోలు చేశారన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పుతామని భూములను కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశలు చూపించి భూములను ప్రభుత్వం లాక్కొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్దేశించిన, నిర్ణయించిన ప్రకారం ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పకపోవడంతో పాటు రైతులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. పరిశ్రమల ముసుగులో రియల్ ఎస్టేట్ దందా పలు స్టీల్ ప్లాంట్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చి ప్రస్తుతం ప్రభుత్వం కేఐఏడీబీ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందన్నారు. జిందాల్ సంస్థకు తమ భూములను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తక్షణం ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కుడితిని, వేణివీరాపురం, హరగినడోణి, కొళగల్లు, ఎర్రంగళి, సిద్ధమనహళ్లి తదితర గ్రామాలకు చెందిన రైతులచే స్వాధీనం చేసుకొన్న భూములను దశాబ్ధాలు గడిచినా అటు పరిశ్రమలను నెలకొల్పకుండా ఉండటమే కాకుండా రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపడం రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. జిందాల్ సంస్థకు భూములను కట్టబెడితే తాము సహించేది లేదన్నారు. న్యాయం చేయకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు రైతులకు ఎక్కువ పరిహారం అందించి తగిన న్యాయం చేయకపోతే పాలకులకు ప్రజలు, రైతులు బుద్ధి చెబుతారన్నారు. దశాబ్దాలు గడిచినా రైతులకు అన్యాయం చేస్తున్న పాలకులను ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. ఈసందర్భంగా బళ్లారిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సంఘాలు, ప్రజా సంఘాల నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తించారు. స్వచ్ఛందంగా పలు వ్యాపార సంస్థలు, అంగళ్లు, హోటళ్లు, మూసివేసి రైతులకు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తీవ్ర స్థాయిలో ఆక్రోశం వెళ్లగక్కారు. కార్యక్రమంలో కుడితిని భూపోరాట సమితి ప్రముఖులు యూ.బసవరాజు, జే.సత్యబాబు, గురుశాంత, కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన రైతు సంఘాల నాయకులు -
పిల్లలపై కూలిన కాంపౌండ్
● ఒకరు మృత్యువాత దొడ్డబళ్లాపురం: ఆడుకుంటున్న పిల్లల మీద కాంపౌండ్ గోడ కూలి ఒకరు మరణించిన సంఘటన బెంగళూరులోని బాగలూరులో జరిగింది. బండికొడిగేహళ్లిలో బుధవారం సాయంత్రం ముగ్గురు పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా హఠాత్తుగా ఓ ఇంటి కాంపౌండ్ గోడ హఠాత్తుగా కూలి పిల్లల మీద పడింది. ఆసిఫ్ (5) అనే బాలునిపై పెద్ద పెద్ద శిథిలాలు పడడంతో అక్కడే చనిపోయాడు. సమన్వి అనే బాలిక గాయపడగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మేడ మీద నుంచి పడి... బంధువుల ఇంట్లో ఆడుకుంటూ మేడ మీద నుంచి కిందపడి బాలుడు మృతి చెందాడు. నెలమంగల తాలూకా తోటగుడ్డదహళ్లిలో మొదటి అంతస్తులో ఆడుకుంటున్న దీక్షిత్ (2) అనే బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు అతన్ని ఆస్పత్రికి తరలించగా 24 గంటలపాటు కోమాలో ఉండి గురువారం కన్నుమూశాడు. దాసరహళ్లికి చెందిపన నవీన్ కుమార్, కావ్య దంపతులు కుమారుడు దీక్షిత్‌తో కలిసి బంధువుల ఇంటికి రాగా ఈ దుర్ఘటన జరిగింది. 27 రోజుల్లో రూ.2.73 కోట్ల కానుకలు మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రసిద్ధ మలే మహదేశ్వర బెట్ట మాదప్ప దేవస్థానం హుండీలో కోట్లాది రూపాయల కానుకలు వచ్చాయి. బుధవారం హుండీలను లెక్కించారు. ఈ నెలలో ఎక్కువ సెలవులు, అమావాస్య నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగింది. 27 రోజుల్లో రూ. 2.73 కోట్ల నగదు భక్తుల నుంచి కానుకల రూపంలో వచ్చింది. 44 గ్రాముల బంగారం, 977 గ్రాముల వెండి సొత్తు లభ్యమైంది. పలు దేశాల కరెన్సీతో పాటు నిషేధిత రూ. 2 వేల నోట్లు కూడా లభించాయి. భక్తులు సగటున రోజుకు రూ.10 లక్షల డబ్బును హుండీలలో వేశారు. భార్యను హత్య చేసి.. ఆత్మహత్య నాటకం ● కోలారు తాలూకాలో ఘోరం కోలారు: పుట్టింటి నుంచి మరింత డబ్బు, బంగారం తేవాలని భర్త భార్యను వేధిస్తూ, కుక్కర్‌తో కొట్టి చంపి ఆపై ఉరివేసుకున్నట్లు చూపించిన ఘటన తాలూకాలోని దొడ్డహసాళ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సహన (24) కట్న దాహానికి బలైన వివాహిత యువతి. వివరాలు.. భర్త మంజునాథ్‌తో పొరుగూరికి చెందిన సహనకు ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరింత కట్నం తీసుకు రావాలని భర్త ఆమెను సతాయించేవాడు. గురువారం కూడా ఇదే విషయమై ఘర్షణకు దిగాడు, కుక్కర్‌తో తలపై గట్టిగా కొటి స్పృహ కోల్పోయిన తరువాత బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసి, ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశాడు. ఇది తెలిసిన సహన తల్లిదండ్రులు హుటాహుటిన దొడ్డహసాళ గ్రామానికి చేరుకుని బోరున విలపించారు. ఉరివేసుకున్న దృశ్యాన్ని చూస్తే ఇది ఆత్మహత్య అని ఎవరూ నమ్మరని తెలిపారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కోలారు రూరల్ పోలీసులు భర్త మంజునాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వలస కూలీపై ఏనుగు దాడి కెలమంగలం: వలస కూలీ మహిళపై ఏనుగు దాడి చేయడంతో ఆమె కాలు విరిగిన ఘటన డెంకణీకోట సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకొంది. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని ఆలహళ్లి వద్ద గులాబీ తోటలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కూలీ కుటుంబం పనిచేస్తోంది. మహిళా కూలీ రీమా (30) ఇంటి నుంచి బయటకెళ్లే సరికి పొదల్లో దాగి ఉన్న ఏనుగు ఆమైపె తొండంతో దాడి చేసింది. రీమా హాహాకారాలు చేయడంతో స్థానికులు వచ్చి ఏనుగును తరిమివేసి ఆమెను డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు కాలు విరిగి, గాయాలు తగిలాయి. అటవీశాఖాధికార్లు ఘటనా స్థలిని పరిశీలించారు. -
బాలునిపై కుక్కల దాడి
● తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు తుమకూరు: నిత్యం ఎక్కడో ఓ చోట పిల్లలను కుక్కలు కరుస్తున్నాయి. జిల్లాలోని చిక్కనాయకనహళ్లి పట్టణం, జోగిహళ్లిలోని ఆది ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో గురువారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న ఒడిశాకు చెందిన 5 ఏళ్ల బాలుడు అరుణ్‌పై వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలున్ని కరిచి ఈడ్చుకెళ్లాయి. బాలుని కేకలు విన్న స్థానికులు వెంటనే కుక్కలను తరిమికొట్టి అతడిని రక్షించారు. తాలూకా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానిక గృహిణి నిర్మల మాట్లాడుతూ, పిల్లలను ఒంటరిగా దుకాణానికి పంపడానికే భయంగా ఉందని తెలిపింది. పిల్లల చేతుల్లో తినుబండారాలు చూడగానే కుక్కలు కరవడానికి దూసుకొస్తాయని ఆమె వాపోయింది. మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని, ఇప్పటికై నా చర్యలు తీసుకోకుంటే ధర్నాలు చేస్తామని తెలిపింది. తహసీల్దార్ ఎం.మమతా ఆస్పత్రిలో బాలున్ని పరామర్శించారు. తీవ్ర గాయాల పాలైన బాలున్ని చూసి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పొట్టకూటి కోసం వస్తే ఇలా జరిగిందని వాపోయారు. మఠంలో బంగారం దొంగ అరెస్టు శివమొగ్గ: తీర్థహళ్లి తాలూకాలోని మాలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిషి గ్రామంలో ఉన్న సత్యసంధ గురు ఉత్తరాది మఠంలో జరిగిన కోట్ల రూపాయల విలువైన బంగారం దొంగతనం కేసులో నిందితుడు దొరికాడు. శివమొగ్గలోని గాంధీనగరకు చెందిన రాఘవేంద్ర ఆచార్య (25)ను అరెస్టు చేసి 780 గ్రాముల బరువున్న 16 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు తీర్థహళ్లి డీఎస్పీ అరవింద్ కలగంజి తెలిపారు. బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా మఠంలో ఎంతమొత్తంలో బంగారం పోయిందన్నది బయటకు చెప్పడం లేదు. -
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు
రాయచూరు రూరల్: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు అగ్ని దివ్య గోపి డిమాండ్ చేశారు. గురువారం కొప్పళ జెస్కాం కార్యాలయం వద్ద 30 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యుత్ సరఫరా బాధ్యతలను టాటా పవర్ కంపెనీకి అప్పగించే ముందు కేపీటీసీఎల్ అధికారులతో చర్చించి, తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఒత్తిడి చేశారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. -
మళ్లీ చర్చకు మేకెదాటు ప్రాజెక్టు
శివాజీనగర: బెంగళూరు దక్షిణ (రామనగర) జిల్లాలో మిగులు జలాల కోసం కావేరి నదిపై నిర్మించతలపెట్టిన మేకెదాటు ప్రాజెక్ట్ మీద తమిళనాడు పదేపదే అభ్యంతరం తెలియజేయడం తెలిసిందే. ఈదఫా ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కూడా ఈ పథకాన్ని వ్యతిరేకించేలా అసెంబ్లీలో మాట్లాడారు. కావేరి జలాలను పొందడం తమిళనాడు రైతుల హక్కు, అందుచేత తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవటానికి న్యాయ పోరాటం చేపట్టాలని గవర్నర్ అన్నారు. కావేరి నీటిని ఇస్తాం: సీఎం శివ మేకెదాటు ప్రాజెక్ట్ విషయమై స్పందించిన సీఎం డీ.కే.శివకుమార్.. తమిళనాడు సీఎంతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నాను, మనందరం కూడా భారతీయులు, తమిళనాడుకు ఇవ్వాల్సిన నీటిని తాము ఇస్తాం, ముందుగా నీటిని నిల్వ చేసుకుని, వారికి నీరు ఇస్తాం. మేం బతకాలి. వారు కూడా బతకాలి అని అన్నారు. అన్ని అనుకూలతలను పరిగణించి తమిళనాడుకు చట్ట ప్రకారం కావేరి జలాలను ఇస్తామని తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్‌కు ఏం చెప్పాలో అది చెబుతామని, ఇందులో రాజకీయం ఏమి లేదన్నారు. కావేరి నదిపై మేకెదాటు ఆనకట్ట నిర్మాణంపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సమర్పించిన పిటిషన్‌ను సుఫ్రీంకోర్టు 2025 నవంబర్‌లో కొట్టివేసిందని తెలిపారు. అడ్డుకోవాలన్న తమిళనాడు గవర్నరు ఆ రాష్ట్ర సీఎంతో చర్చిస్తా: డీకే శివ -
కప్పల కూరకు లొట్టలు
యశవంతపుర: పర్యాటకుల కేంద్రమైన గోవాలో వానాకాలం ప్రారంభం అవుతుండగానే జంపింగ్ చికన్కు డిమాండ్ పెరుగుతుంది. అంటే కప్పల మాంసం అన్నమాట. అవి గంతులేస్తూ వెళ్తాయి కాబట్టి అలా పిలుచుకుంటారు. గోవాలో కప్పల వేటను నిషేధించగా, పొరుగున కార్వార నుంచి కప్పలు సరఫరా అవుతుంటాయి. ఒక్కోటి 6 కేజీల పైనే వాన చినుకులు పడగానే పశ్చిమ ఘాట్లలో కప్పలు బెకబెకమంటూ సంతానోత్పత్తికి బయటకు వస్తాయి. ఇవి మామూలు కప్పలైతే కాదు, ఒక్కోటి 6 నుంచి 8 కేజీల వరకు బరువుండే జంబో మండూకాలు. ఒక ఫారం కోడికి సమానంగా పెరుగుతాయి. వాటిని కొందరు స్థానికులు పట్టుకుని గోవాలో విక్రయిస్తారు. ప్రాణాలతో ఉన్న కప్పలను గోవాలో పెద్దపెద్ద హోటల్స్‌కు సరఫరా చేస్తారు. కేజీ వెయ్యి రూపాయలకు పైగా పలుకుతుంది. కప్ప కాళ్లతో రుచికరమైన కబాబ్స్, ఫ్రైస్ చేస్తారు. కోడి కూర కంటే చాలా రుచిగా ఉంటుందని గోవా ప్రజలు చెబుతారు. ఇప్పుడు కార్వారలో కప్పల వేట ఊపందుకుంది. గోవాకు కార్వార నుంచి మండూకాల ఎగుమతి -
జెడ్పీ సీఈఓ పరిశీలన
రాయచూరు రూరల్: గత ఐదు రోజుల నుంచి బావి నీరు తాగి 50 మంది అస్వస్థతకు గురైన ఘటన యాదగిరి జిల్లా శహాపుర తాలూకా బీరనూరులో చోటు చేసుకున్న సంగతి విదితమే. కొళాయిల నుంచి తాగునీరు సరఫరా నిలిచి పోవడంతో జల జీవన్ మిషన్ పథకం కింద తవ్విన బోరుబావి నీటిని సరఫరా చేశారు. ఆ నీటిని తాగడంతో అతిసార ప్రబలింది. గతంలో గ్రామస్తులు బోరుబావి నీటిని తాగేవారు. బోరుబావి మరమ్మతులకు గురి కావడంతో కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేశామని గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు. గురువారం జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి లవీష్ ఒడెయర్ గ్రామంలో పర్యటించి నీటి సరఫరాపై పరిశీలన చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలిరాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దళితులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చలువాది మహాసభ డిమాండ్ చేసింది. గురువారం ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సంచాలకుడు భీమన్న, కుమార్ మాట్లాడారు. 15 రోజుల క్రితం నగరంలో ఐపీఎల్ మ్యాచ్ విషయంలో మడ్డిపేటలో జరిగిన ఘర్షణలో కట్టపై కూర్చొన్న దళితుడు రాఘవేంద్రను రాడ్లతో కొట్టారన్నారు. మాజీ నగరసభ సభ్యురాలి భర్త తిమ్మారెడ్డి కుమారుడు మహాలింగరెడ్డి కుటుంబ సభ్యులు ఆదర్శ్, తరుణ్‌లు కలిసి దాడి చేశారని, వారిపై చర్యలు చేపట్టాలన్నారు. మాజీ నగరసభ సభ్యురాలి భర్త తిమ్మారెడ్డిపై ఐదు కేసులున్నాయని, రౌడీషీటర్‌పై కేసును నమోదు చేయకుండా ప్రముఖ రాజకీయ నాయకులు పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నారు. 14 మందిలో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. నేడు పాండురంగ స్వామి ఆలయ వార్షికోత్సవం బళ్లారిఅర్బన్: గుగ్గరహట్టిలో వెలసిన పాండురంగ స్వామి ఆలయంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆలయం అభివృద్ధి కోసం పాటు పడుతున్న దేవస్థాన సేవా సమితి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను ఘనంగా సన్మానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అభివృద్ధి పనులకు పెద్దపీట
రాయచూరు రూరల్: జిల్లాలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పిస్తామని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. గురువారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన యునైటెడ్ వే ఆఫ్ బెంగళూరు కార్పొరెట్ భాగస్వామ్యంతో రూ.20 కోట్లతో విద్య, ఆరోగ్య, తాగునీరు, మహిళా శిశు సంక్షేమ శాఖల అభివృద్ధి విషయంలో ఒప్పందాలను కుదుర్చుకున్నామన్నారు. జిల్లాలో 250 అంగన్వాడీ కేంద్రాల నవీకరణ, 1500 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఈసీసీఈ పథకం శిక్షణ శిబిరాలు, 24 సర్కారీ పాఠశాలల్లో స్పార్క్ సౌకర్యం, 13 చోట్ల ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, సర్కారీ పాలిటెక్నిక్ కళాశాల నవీకరణకు ప్రాధాన్యత కల్పిస్తారన్నారు. ప్రభుత్వం ప్రైవేట్, సముదాయ సంస్థల సహకారంతో పనులు చేపడతామన్నారు. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా హొసపేటె: దొంగతనాలు, ఇతర నేరాలను నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా కూడ్లిగి పోలీస్ సబ్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది కొత్త వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. రోడ్డుపై వెళ్లే ప్రజల కదలికలను గమనించేందుకు వీలుగా దుకాణాల ముందు అమర్చిన సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. జిల్లా ఎస్పీ మౌఖిక ఆదేశాల మేరకు కూడ్లిగి పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ నేతృత్వంలో ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారులు ప్రధాన రహదారిపై రాత్రి గస్తీ చేపట్టారు. వాహనాల నంబరు, రిజిస్ట్రేషన్ వివరాలను తనిఖీ చేయడం ద్వారా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనబడితే పోలీసులు వారిని విచారిస్తున్నారు. -
ఓటరు జాబితా సవరణ చేపట్టాలి
రాయచూరు రూరల్: ఓటరు జాబితా సవరణకు చర్యలు చేపట్టాలని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి పేర్కొన్నారు. గురువారం ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో ఓటు హక్కు పరిరక్షణలో అర్హులైన ఎవరి ఓటు కూడా తొలగించకుండా చూసుకోవాలన్నారు. అధికార పార్టీలు అక్రమాలకు పాల్పడితే సమష్టిగా అడ్డుకోవాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత కనబడుతోందన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఓటర్ల పేర్ల తొలగింపు వివాదాస్పదమైన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో శివశంకర్, నరసింహ నాయక్, లక్ష్మిపతి, అమరేష్ పాటిల్, నరసప్ప, జంబునాథ్, తిమ్మారెడ్డి, గోవిందరెడ్డి, విజయ కుమార్, యల్లారెడ్డి, రఫీలున్నారు. -
జాడ లేని వర్షాలు.. ఆందోళనలో రైతులు
హొసపేటె: ప్రస్తుత వర్షాకాలంలో, రోహిణి వర్షాలకు నేల తడిసి పోవడంతో రైతులు పత్తి, అలసంద, జొన్న వంటి వర్షాకాలపు పంటలను విత్తారు. కానీ ఇప్పుడు గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తాము నాటిన విత్తనాలు ఎక్కడ ఎండిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికార వర్గాల సమాచారం ప్రకారం గతేడాది అంటే 2025 జూన్ నెలలో 133.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ప్రస్తుత 2026లో కేవలం 52.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే 81.7 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు ఉంది. దీంతో నీటిపారుదల సౌకర్యం ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా వేసిన పంటలను కాపాడుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల పాటు వర్షాలు కురవకపోతే రుతుపవనాల ప్రభావం మొక్కజొన్న, పత్తి పంటలపై పడుతుంది. పాఠశాల రెండో అంతస్తు నుంచి పడి విద్యార్థి మృతి హుబ్లీ: పాఠశాల రెండో అంతస్తు నుంచి అదుపు తప్పి పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లాలోని నవలగుంద పట్టణంలో జరిగింది. మృతి చెందిన బాలుడిని అక్కడి అణ్ణిగేరి రోడ్డులోని విద్యాజ్యోతి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఆకాశ్ నీలన్నవర్ (10)గా గుర్తించారు. ఈ బాలుడు 4వ తరగతి చదువుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని హుబ్లీ కిమ్స్‌కు తరలించారు. ఘటన స్థలాన్ని నవలగుంద పోలీసులు పరిశీలించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. -
పరిషత్ ఎన్నికల్లో హస్తం హవా
బనశంకరి: విధానసభ నుంచి విధాన పరిషత్‌లో 7 స్థానాలకు నిర్వహించిన ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఓ సీటును అదనంగా గెల్చుకుంది. అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ నుంచి ఐదుమంది, బీజేపీ నుంచి ఇద్దరు కూడా ఎన్నికయ్యారు. విజేతలు వీరే కాంగ్రెస్ అభ్యర్థులు బీకే.హరిప్రసాద్, తిప్పణ్ణప్ప కమకనూరు, పీవీ.మోహన్, శివణ్ణ బీఎస్, వినయ్ కార్తీక్ గెలుపొందారు. ● బీజేపీ నుంచి రఘు కౌటిల్య, లింగరాజ పాటిల్ ఎన్నిక కాగా, జేడీఎస్ అభ్యర్థి గోవిందరాజు ఓడిపోయారు. ప్రతిపక్ష ఓట్లకు గండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌ను క్రాస్ ఓటింగ్ వెంటాడింది. బీజేపీ నుంచి ముగ్గురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడగా, జేడీఎస్ నుంచి ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసినట్లు వెల్లడైంది. దీనివల్లే కాంగ్రెస్ ఐదో అభ్యర్థి వినయ్ కార్తీక్ 32 ఓట్లతో ఎన్నికయ్యారు. ఇద్దరు అభ్యర్థులకు తలా 30 ఓట్లు వేయాలని తమ ఎమ్మెల్యేలకు బీజేపీ పెద్దలు సూచించారు. కానీ రఘు కౌటిల్య కు 29 ఓట్లు పడగా, ఒక ఓటు చెల్లలేదు. లింగరాజ్ పాటిల్‌కు 27 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి, 3 ఓట్లు క్రాస్ అయ్యాయి. రిసార్టుల నుంచి అసెంబ్లీకి శివాజీనగర: ముందునుంచీ 7వ అభ్యర్థి గెలుపు ఎవరిదని కుతూహలం ఏర్పడింది. ఆ స్థానం కోసం కాంగ్రెస్ వినయ్ కార్తీక్, బీజేపీ మద్దతుతో జేడీఎస్ అభ్యర్థి గోవిందరాజు మధ్య పోటీ నెలకొంది. మూడు పక్షాలూ తమ ఓట్ల ఐక్యతను కాపాడుకునే ప్రయత్నం చేశాయి. ఇందుకోసం కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తీసుకెళ్లాయి. అక్కడి నుంచి గురువారం ఉదయం విధానసౌధకు చేరుకుని ఓటేశారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలైంది. తొలి అంతస్తులో ఉన్న 106వ గది పోలింగ్ కేంద్రమైంది. పార్టీ పక్ష నేతలు ముందే ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటేయాలనేది నిర్దేశించారు. ముందుజాగ్రత్తగా ఓటింగ్ ముగిసేవరకూ పరిశీలిస్తూ ఉన్నారు. సీఎం, సీనియర్ల సమీక్ష విధానసౌధ 3వ అంతస్తుఽలోని సభామందిరంలో సీఎం డీ.కే.శివకుమార్, ఏఐసీసీ కార్యదర్శి రణదీప్‌సింగ్ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్, మాజీ సీఎం సిద్దరామయ్య తమ ఎమ్మెల్యేలకు మార్గదర్శనం చేశారు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఎస్.టీ.సోమశేఖర్ మాట్లాడుతూ సీఎం బుధవారం పిలిచి, తమకు ఓటేయాలని కోరినట్లు తెలిపారు. తమ నియోజకవర్గ సమస్యలకు స్పందించేవారికి ఓటు వేశానన్నారు. శివరామ్ హెబ్బార్ మాట్లాడుతూ తనను కాంగ్రెస్‌వారు మాత్రమే మద్దతు కోరారు, ఇంకెవరూ సంప్రదించలేదన్నారు. ఎవరెవరు ఓటేశారు.. కాంగ్రెస్ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 62 మంది, జేడీఎస్ నుంచి 18, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు, సర్వోదయ కర్ణాటక పార్టీ ఎమ్మెల్యే దర్శన్ పుట్టణ్ణయ్య, కర్ణాటక రైతు ప్రగతి పార్టీ గాలి జనార్ధనరెడ్డి, స్వతంత్రులు గౌరిబిదనూరు పుట్టస్వామి, హరపనహళ్ళి లతా మల్లికార్జున ఓటు హక్కు వినియోగించుకున్నారు. హోం మంత్రి పరమేశ్వర్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ వచ్చి ఓటేశారు. యత్నాల్ వివాదం, ఊరట శివాజీనగర: పరిషత్ ఎన్నికలతో విధానసౌధలో కోలాహలం నెలకొంది. 220 మందికిపైగా ఎమ్మెల్యేలు ఓటు వేశారు. పోలింగ్ ప్రక్రియ మధ్యలో పార్టీల నేతలు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకున్నారు. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ బీజేపీకే మద్దతుగా నిలిచారు. బీజేపీకి ఓటు వేస్తానని లేఖ విడుదల చేశారు. ఇది సరికాదంటూ ఆయనపై కాంగ్రెస్ నాయకులు, తక్షణమే ఎన్నికల అధికారి విశాలాక్షికి ఫిర్యాదు చేశారు. ఇది నియమాల ఉల్లంఘన అని, యత్నాళ్ ఓటును రద్దు చేయాలని కోరారు. కానీ యత్నాల్ బూత్‌లో రహస్యంగా ఓటు వేశారని, ఇందులో నియమ ఉల్లంఘన జరగలేదని కాంగ్రెస్ నేతల ఫిర్యాదును విశాలాక్షి తిరస్కరించడంతో వివాదం ముగిసింది. ఇక బీజేపీ నుంచి సస్పెండైన ఎస్.టీ.సోమశేఖర్, శివరామ హెబ్బార్, జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే జీ.టీ.దేవేగౌడ ఆత్మసాక్షికి బద్ధులమంటూ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేశారు. మరికొందరు రహస్యంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. నాలుగే కాదు, 5వ సీటూ కాంగ్రెస్ పరం బీజేపీకి దక్కిన 2 సీట్లు జేడీఎస్ అభ్యర్థి పరాజయం ప్రతిపక్షాల నుంచి 7 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ విధానసౌధలో పోలింగ్ కోలాహలంజిమ్మిక్కులు చేయలేదు: సీఎం దొడ్డబళ్లాపురం: విధానపరిషత్ ఎన్నికలు ముగిశాయి, తాము ఎలాంటి జిమ్మిక్లకు పాల్పడలేదని సీఎం డీకే శివకుమార్ చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో ఓటు వేశాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు ఎవరూ ఒత్తిడికి గురికాలేదని, ఇష్టానుగుణంగానే ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో ఉంచడం ద్వారా రిసార్ట్ రాజకీయాలకు పాల్పడ్డారా అని ప్రశ్నించగా, అది రిసార్ట్ రాజకీయం కాదని, ఎమ్మెల్యేలపై నమ్మకం లేక కాదని, ఎన్నికల ప్రక్రియపై శిక్షణ కోసమని వివరించారు. క్రాస్ ఓటింగ్ అంటే తనకు తెలియదని, అలా చేయించాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. అసెంబ్లీలో ఉన్న 224 మంది ఎమ్మెల్యేలూ తనకు కావాల్సిన వారేనని, తాను అందరికీ ముఖ్యమంత్రినని అన్నారు. మన ఓట్లు మనకే.. బీజేపీ వ్యూహం శివాజీనగర: తమ ఎమ్మెల్యే ఒకరు క్రాస్ ఓటింగ్ చేసిఉండవచ్చనే అనుమానంతో బీజేపీ మధ్యలోనే వ్యూహాన్ని మార్చింది. తన అభ్యర్థులకు ఒకరికి 29 ఓట్లు చొప్పున వేయాలని ఎమ్మెల్యేలకు నిర్దేశించింది. మిగిలే ఓట్లను జేడీఎస్ అభ్యర్థికి వేయాలని తెలిపింది. అయితే పోలింగ్ ఆరంభం కాగానే జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే బీజేపీకి ఓటేసినట్లు తేటతెల్లమైంది. నియమాల ప్రకారం ఇది రహస్య ఓటింగ్ కావడంతో ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటు వేశారనేది తెలుసుకోవడానికి సాధ్యపడదు. అయితే ఎమ్మెల్యేల ప్రవర్తన క్లూ ఇస్తుంది. ఒక ఓటు పోయిందని ప్రచారం జరగ్గానే బీజేపీ నాయకులు.. జేడీఎస్ సంగతిని పక్కన పెట్టేశారు. మొత్తం ఓట్లు మన అభ్యర్థులకే వేయాలని ఆదేశించారు. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్, రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తమ చాంబర్లలో ఎమ్మెల్యేలతో చర్చించి ఒక్కో అభ్యర్థికి 30 ఓట్లు పడాలని సూచించారు. దీని వల్ల మిత్రపక్షం జేడీఎస్‌కు ఓట్లు తగ్గాయి. గత వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠగా సాగిన పరిషత్ ఎన్నికల వ్యూహ ప్రతి వ్యూహాల్లో అధికార పార్టీదే పైచేయి అయ్యింది. హోరాహోరీ పోరాటంలో ప్రతిపక్షాలను వెనక్కు నెట్టి 5వ సీటును కూడా గెల్చుకుంది. క్రాస్ ఓటింగ్ వల్ల జేడీఎస్‌కు నిరాశే మిగిలింది. తాము నష్టపోతామనే భయంతో బీజేపీ మిగులు ఓట్లను జేడీఎస్‌కు కేటాయించలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లు బీకే.హరిప్రసాద్ – 30 ఓట్లు పీవీ.మోహన్ – 29 బీఎస్.శివణ్ణ – 30 తిప్పణ్ణప్ప కమకనూర– 30 ఐదో అభ్యర్థి వినయ్ కార్తీక్ – 32 బీజేపీ అభ్యర్థులకు రఘు కౌటిల్య – 29 ఓట్లు లింగరాజు పాటిల్ – 27 -
ఓటు హక్కు ఉంటేనే గ్యారంటీ లబ్ధి
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పంచ గ్యారంటీ పథకాలు పొందడానికి రాష్ట్రంలో ఓటుహక్కు తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తెలిపారు. గురువారం విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఓటుహక్కు కలిగిన ప్రజలకు మాత్రమే ప్రభుత్వ సౌలభ్యాలు అందించాలనేది నా నిర్ణయం. ఓటుహక్కు లేదంటే ఎందుకు గ్యారంటీ పథకాలు ఇవ్వాలి?, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలి. ప్రభుత్వ సౌలభ్యాలు పొందేవారికి ఓటు హక్కు మరీ ముఖ్యం’ అని చెప్పారు. ఉచిత బస్సుకు ఐడీ కార్డు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కోసం సరైన గుర్తింపు కార్డు అందిస్తామని సీఎం చెప్పారు. గ్యారంటీ పథకాల అర్హుల గురించి ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. అర్హులకు మాత్రమే పథకాలు అందించడం, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ పరిశీలన సహాయపడుతుందన్నారు. ప్రజలు తమ ఓటుహక్కును కాపాడుకునే ప్రయత్నం చేయాలని మరోసారి సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది అక్రమంగా పంచ గ్యారంటీలను పొందుతున్నారని ఆరోపణలున్న నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. లేనివారికి ఎందుకివ్వాలి: సీఎం శివ -
తుంగభద్ర వెలవెల.. రైతన్న విలవిల..
సాక్షి,బళ్లారి: దక్షిణ భారత దేశంలో అత్యంత ముఖ్యమైన జలాశయాల్లో ఒకటైన తుంగభద్ర డ్యాం నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు తాగు, సాగునీరందించే ఉమ్మడి జలాశయమైన తుంగభద్ర డ్యాంకు ఎగువన వరణుడు ముఖం చాటేయడంతో డ్యాంలోకి నీరు చేరకపోవడంతో గత ఏడాది డ్యాంలో ఉంచిన 9.5 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ రెండవ వారం లోపు డ్యాంలో నీరు చేరడం ఆనవాయితీగా ఉండేది. నదీ పరివాహకంలో కురవని వర్షాలు తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాలైన ఆగుంబె, మొరాళ, తీర్థహళ్లి, శివమొగ్గ తదితర పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు పడటం, ఎగువన ఉన్న భద్ర డ్యాం పూర్తిగా నిండిన తర్వాత దిగువన ఉన్న తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరిగేది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి బళ్లారి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తున్నప్పటికీ, ఎగువన వర్షాలు కురవక పోవడంతో డ్యాంలోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో తుంగభద్ర డ్యాం వెలవెలపోతోంది. గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యాంలో దాదాపు 30 టీఎంసీలు నీరు ఉండటంతో పాటు ఇన్‌ఫ్లో కూడా భారీగా ఉండటంతో రోజు రోజుకు డ్యాంలో నీటి నిల్వ పెరిగి జూలై రెండవ వారంలోపు డ్యాం గేట్లు ఎత్తే పరిస్థితి ఏర్పడింది. ఎల్‌నినో ప్రభావంతో దుష్పరిణామం ప్రస్తుత ఏడాది వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు ఎల్‌నినో ప్రభావం వల్ల కూడా వరుణుడి రాకపై దుష్పరిణామం చూపడంతో డ్యాంలోకి తగినంత నీటి నిల్వ చేరుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ దయనీయంగా కనిపిస్తుండటంతో ఆయకట్టులో పంటలు సాగు చేసే రైతులు ప్రతి రోజు డ్యాం వైపు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తుంగభద్ర ఆయకట్టులో నీటి నిల్వ పెరగకపోతే బళ్లారి జిల్లాతో పాటు మూడు రాష్ట్రాల పరిధిలో 8 జిల్లాలకు చెందిన రైతులు ఆందోళనకరంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో కూడా ఎన్నో ఏళ్లు జూలై నెలలో డ్యాంలోకి నీరు వచ్చి చేరిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కనిపించడంతో వర్షాలు ఏమేరకు కురుస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సాగుకు రైతన్న సమాయత్తం మే, జూన్ ప్రారంభం నుంచి కురిసిన వర్షాలకు చాలా మంది ఆయకట్టు రైతులు దుక్కి కూడా దున్ని ఖరీఫ్‌కు సిద్ధమయ్యారు. పొలాలను దుక్కి దున్నడంతో విత్తనాలు, ఎరువులను కూడా రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవించే ఈ ప్రాంత రైతులు డ్యాంలో నీటి నిల్వ ఎప్పుడెప్పుడు పెరుగుతుందా? అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. కాగా డ్యాంలో 33 గేట్లు పూర్తిగా మార్చివేశారు. డ్యాంలో గేట్లు అధ్వాన్నంగా ఉండటంతో నిపుణుల సూచనలతో డ్యాం గేట్లు, చైన్లు మార్చి, కొత్త గేట్లను ప్రారంభించేందుకు తేదీ కూడా ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పొరుగున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులను కూడా నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తారనే వార్తలు వస్తున్నాయి. డ్యాం గేట్లను అధికారికంగా ప్రారంభించేందుకు ఈనెల 25వ తేదీని ప్రకటించారు. డ్యాం గేట్లను అన్నింటినీ సిద్ధం చేసినందుకు రైతుల్లో సంతోషం నెలకొన్నప్పటికీ వరుణుడు ముఖం చాటేసి డ్యాంలోకి నీటి నిల్వ పెరగకపోవడంతో ఖరీఫ్‌లో సకాలంలో పంటలు పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుందా, లేదా? అని అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. డ్యాంకు ఎగువన నదీ పరివాహకంలో ముఖం చాటేసిన వరుణుడు వర్షాల కోసం ఆయకట్టు రైతన్నల ఎదురు చూపులు డ్యాంలో పెరగని నీటి నిల్వ, రైతుల్లో ఆందోళన డ్యాంకు కొత్త 33 క్రస్ట్‌గేట్లు, చైన్ల ఏర్పాటు పనులు పూర్తి -
శాశ్వత కూరగాయల మార్కెట్‌కు వినతి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలను విక్రయించే వారికి శాశ్వత కూరగాయల మార్కెట్‌ను కల్పించాలని ఎం.ఈరణ్ణ కూరగాయల మార్కెట్ సంఘం డిమాండ్ చేసింది. బుధవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు వసీం మాట్లాడారు. కరోనా సమయంలో ప్రజలు, వినియోగదారుల అనుకూలం కోసం ఏర్పాటు చేసిన మార్కెట్‌ను కాదని నగరసభ ఆధ్వర్యంలో నడిచే మార్కెట్లో వ్యాపారాలు జరపడం కష్టమన్నారు. నూతనంగా జహీరాబాద్ మురికి వాడల ప్రాంతంలో శాశ్వత కూరగాయల మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ నగరసభ అదనపు కమిషనర్ సంతోష్రాణికి వినతిపత్రం సమర్పించారు. చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి హుబ్లీ: జిల్లాలోని కలఘటికి తాలూకా నీలసాగర చెరువులో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని హుబ్లీ సిద్ధారూఢ మఠం క్రాస్‌లోని శివశంకర కాలనీ నివాసి సుమీత్ బసవరాజ కోతంబరి(22) గా గుర్తించారు. మధ్యాహ్నం సుమారు 2 నుంచి 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది. కలఘటికి స్టేషన్లో మృతుడి తండ్రి బసవరాజ్ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. రైలు నుంచి పడి వ్యక్తి మృతి మరో ఘటనలో రైలు నుంచి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వేగంగా వెళుతున్న రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన సవణూరు రైల్వే స్టేషన్ దగ్గర చోటు చేసుకుంది. సుమారు 70 నుంచి 75 ఏళ్ల వయస్సుగల వ్యక్తి ఈ ఘటనలో మృతి చెందారు. అతడి ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే హుబ్లీ రైల్వే స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. కేపీఎస్‌లో పాఠశాలల విలీనం తగదు రాయచూరు రూరల్: రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కర్ణాటక పబ్లిక్ పాఠశాల(కేపీఎస్)ల్లో విలీనం చేయడం తగదని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు చెన్న బసవ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలను కేపీఎస్ల్లో చేర్చడాన్ని విరమించుకోవాలని ఒత్తిడి చేశారు. గ్రామీణ, నగర ప్రాంతాల్లో పాఠశాలలను విలీనం చేయడం సరికాదంటూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. విత్తనాలు, ఎరువుల పంపిణీకి డిమాండ్ రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని, వాటిని సక్రమంగా పంపిణీ చేయాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు. ఖరీఫ్‌లో ముందుగానే వానలు కురువడం జరిగిందని, రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండ చూడాలన్నారు. నకిలీ విత్తనాల బెడద నియంత్రణకు ముందుకు రావాలన్నారు. పెరిగిన ఎరువులు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, క్రిమి సంహారక మందుల ధరలు నింగినంటాయన్నారు. తుంగభద్ర ఎడమ కాలువలో పేరుకున్న పూడికను తొలగించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. అప్పు చెల్లించమన్నందుకు వ్యక్తి హత్య కోలారు: అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం రాత్రి నగరంలోని నిసార్ నగర్లో చోటు చేసుకుంది. బీడీ కాలనీ నివాసి అల్తాఫ్ (45) హత్యకు గురైన వ్యక్తి. ఇమ్రాన్ అనే వ్యక్తి అల్తాఫ్ నుంచి వడ్డీకి డబ్బును అప్పుగా తీసుకున్నాడు. ఈమధ్య తన డబ్బు వాపసు ఇవ్వాలని పదే పదే ఇమ్రాన్‌ను అల్తాఫ్ డిమాండ్ చేస్తుండడంతో విసిగిన ఇమ్రాన్ కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయాడు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం సంబంధీకులకు అప్పగించారు. -
హీటెక్కిన బిడది టౌన్షిప్
శివాజీనగర: బిడది టౌన్షిప్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టౌన్షిప్ అవసరమని డీకే సర్కారు చెబుతోంటే, రైతుల భూములు తీసుకోవద్దని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులపై ప్రభుత్వం రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర అన్నారు. బుధవారం బీజేపీ నాయకులు బిడదిలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఇక్కడి సర్కారు ఏర్పాటు చేస్తున్న టౌన్‌షిప్‌కు తమ భూములు ఇవ్వబోమని రైతులు వ్యతిరేకించడం తెలిసిందే. కాషాయ నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. విజయేంద్ర స్పందిస్తూ ‘ప్రభుత్వం 80 శాతం మంది రైతులు భూస్వాధీనానికి ఆమోదించారని చెబుతోంది. ఇక్కడ భూమి బీడు భూమి అంటున్నారు, బిడది టౌన్‌షిప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించారని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ప్రధాని ఆమోదించలేదు. రాష్ట్ర ప్రభుత్వం పిల్ల చేష్టలు చేస్తోంది’ అని ఆరోపించారు. అనేక పల్లెలకు వెళ్లి రైతులను మాట్లాడాము, వాస్తవాలు తెలియజేసేందుకు సిద్ధమయ్యామే గాని రాజకీయం చేయడం లేదన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులకు అండగా ఉంటాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానిది రైతు వ్యతిరేక ధోరణి అని ఆరోపించారు. ఇక్కడి ఎంతోమంది రైతులు టెంకాయ, వక్క, మల్బరీ తోటలు సాగు చేస్తున్నారు, ఇలాంటి సారవంతమైన భూమిని రైతులతో బలవంతంగా లాక్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. బెదిరిస్తున్నారు రాత్రివేళ గూండాలు ఇళ్లకు వచ్చి బెదిరిస్తున్నారని కొందరు రైతులు నేతలకు చెప్పారు. తమ ప్రాణాలైనా ఇస్తాం, భూమిని విడిచిపెట్టబోమని తెలిపారు. విజయేంద్ర మాట్లాడుతూ సీఎం డీ.కే.శివకుమార్‌కు రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే చాలా చోట్ల స్థలముంది. ఇక్కడ చిన్నరైతులు బతకాలి. ఇందులోకి మోదీ పేరును ఇక్కడ లాగడం డీకే శివకుమార్‌కు సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సీనియర్లు ఆర్.అశోక్, చలవాది నారాయణస్వామి పాల్గొన్నారు. ఆ గ్రామాల్లో బీజేపీ నేతల పర్యటన రైతుల భూములను లాక్కోవద్దని డిమాండ్ -
నేడే పరిషత్ ఫైట్
శివాజీనగర: విధానసభ కోటాలో జరగనున్న 7 విధానపరిషత్ స్థానాల ఎన్నికలకు అంతా సిద్ధమైంది. కాంగ్రెస్ నుంచి 5 మంది, బీజేపీ, జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. విజయం కోసం భారీ లెక్కాచారాలు సాగుతున్నాయి. హస్తం పార్టీ 5వ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కొన్ని ఓట్లు కావాలి, దీంతో జేడీఎస్ మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే క్రాస్ ఓటింగ్ భయంతో కాంగ్రెస్ నాయకులు తమ ఎమ్మెల్యేలను బిడదిలోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో ఉంచారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా దేవనహళ్ళి రిసార్టులో మకాం వేసినట్లు తెలిసింది. రిసార్టులో మాక్ పోలింగ్ రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. 5వ అభ్యర్థిని కూడా ఎగువసభకు పంపాలని పట్టుదలతో ఉంది. అదనపు సీటు కోసం కాంగ్రెస్ నుంచి వినయ్ కార్తీక్, జేడీఎస్ పార్టీ నుంచి గోవింద పోటీ పడుతున్నారు. చెల్లని ఓటు అనే సమస్య లేకుండా, ఎలా ఓటు వేయాలనే అంశంపై ఎమ్మెల్యేలకు సీనియర్లు బోధించారు. ఎమ్మెల్యేలకు విప్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కుతూహలం కలిగిస్తున్న ఎగువసభ ఎన్నికల పోలింగ్ గురువారం విధానసభలో జరుగుతుంది. అందరికీ ప్రతిష్టగా మారాయి. విధానసౌధ ప్రధాన కమిటీల గదులను తాత్కాలిక పోలింగ్ బూత్‌లుగా మార్చారు. ఎన్నికల కమిషన్ అధికారులు పరిశీలించారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. తప్పనిసరిగా ఓటేయాలని విప్‌ను కూడా జారీ చేశాయి. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన తక్షణమే ఓట్ల లెక్కింపు ఆరంభమవుతుంది. విధానసౌధ ఆవరణలో కోలాహలం మూడు పక్షాలు ఆధిక్యం కోసం పోరాటం భారీ భద్రత పోలింగ్‌కు పోలీసులు, ఎన్నికల కమిషన్ భారీ భద్రతను చేపట్టారు. పోలింగ్ గదుల పరిసరాల్లో ప్రత్యేక సీసీ కెమెరాలను అమర్చారు. ఎన్నికల ప్రక్రియను వీడియో రికార్డింగ్ తీస్తారు. ఎమ్మెల్యేలకు రహస్య ఓటింగ్ సదుసాయం కోసం రెండు పోలింగ్ బూత్‌లు ఏర్పాటయ్యాయి. పార్టీల తరఫున ఏజెంట్లు బూత్‌లలో ఉంటారు. పోలింగ్ వేళకు రిసార్టుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సౌధకు చేరుకొంటారు.7 స్థానాలకు 8 మంది పోటీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ విధానసౌధలో ఏర్పాట్లు పూర్తి రిసార్టుల నుంచి రానున్న హస్తం ఎమ్మెల్యేలు అదనపు సీటు ఎవరిదోననే ఉత్కంఠ -
ఆభరణాలు స్వాధీనం .. నిందితుడి అరెస్ట్
రాయచూరు రూరల్ : నగరంలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 40 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ఏప్రిల్‌లో ప్రశాంత్ కాలనీకి చెందిన వీరేష్ ఇంట్లో 25 గ్రాములు, శ్రీరామనగర్ కాలనీలో 15 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారని తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన దొమ్మర గోవిందరాజును అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు నగలు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.7.20 లక్షలుంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏడీఎస్పీ హరీష్, సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్ఐ మంజునాథ్, శారదలున్నారు. -
ప్రమాదాల కట్టడికి కృషి చేయండి
హొసపేటె: జిల్లాలో ప్రమాదాల సంఖ్యను సున్నాకు తగ్గించడానికి అధికారులు తీవ్రంగా కృషి చేయాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి అన్నారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ పురోగతి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి ఆమె మాట్లాడారు. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై వరుస ప్రమాదాలు జరిగే ప్రమాదకర ప్రాంతాలను పోలీసులు, ప్రజా పనుల శాఖ సంయుక్తంగా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాహన రహిత రాకపోకలను సులభతరం చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని నివారించాలని ఆమె సూచించారు. యువతర భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌పై అధికారులు చాలా అప్రమత్తంగా, చురుకుగా వ్యవహరించాలన్నారు. జిల్లా సైబర్ క్రైం పోలీసు విభాగం సోషల్ మీడియాపై నిశితంగా నిఘా ఉంచాలన్నారు. జిల్లాకు వచ్చే ప్రధాన కొరియర్, పోస్ట్ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే, వాటిని తనిఖీ చేసి నిర్ధారించుకోవాలి. అకృత్యాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్చరించారు. జిల్లా ఎస్పీ జాహ్నవి, అదనపు జిల్లా కమిషనర్ ఈ.బాలకృష్ణ, అదనపు ఎస్పీ మంజునాథ్, డీఎస్పీ పీ.మురళీధర్, డిప్యూటీ డివిజనల్ ఆఫీసర్ వివేకానంద, ఆర్టీఓ దామోదర్, కాంట్రాక్టర్లతో సహా జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో అధికారులకు కలెక్టర్ సూచన -
ఇళ్ల పట్టాలు అందించాలి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు భూమి, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం డిమాండ్ చేసింది. అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు వీరేష్ మాట్లాడారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు కేటాయించి, భూమి లేని పేదలకు పట్టాల పంపిణీతోపాటు భూములు కేటాయించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతూ అదనపు జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
వజ్రాభరణాలు చోరీ
మైసూరు: ఇంటి కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలకు జొరబడిన దొంగలు రూ.24 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకుని పరారైన ఘటన మైసూరులోని దట్టగళ్లి నివాసి కోమల అనే వారి ఇంటిలో జరిగింది. కోమల రెండు నెలల క్రితం ఇంటికి తాళం వేసుకుని బెంగళూరులోని తన కుమార్తె ఇంటికి వెళ్లారు. మంగళవారం ఇంటికి వాపసు వచ్చి చూడగా కిటికీ అద్దం పగులగొట్టి ఉంది, అల్మారాలో పెట్టిన వజ్రం, ముత్యాల చైన్, బంగారు, వెండి ఆభరణాలు లేవు. కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
25న టీబీ డ్యాం కొత్త గేట్ల ప్రారంభం
హొసపేటె: తుంగభద్ర డ్యాంకు సుమారు రూ.50.6 కోట్లు ఖర్చు చేసి 33 కొత్త క్రస్ట్‌గేట్ల అమరిక, గొలుసుల బిగింపు పనులు తుది దశకు చేరుకున్నాయి. కర్ణాటక, ఆంఽధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమక్షంలో ఈనెల 25న కొత్త గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. ఈ జలాశయాన్ని పెళ్లికూతురిలా అలంకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పటేల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కొందరు మంత్రులు, సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం వద్ద క్రస్ట్‌గేట్లకు గొలుసులను బిగిస్తున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. గొలుసుల అమరిక పనులు దాదాపు పూర్తి తుంగభద్ర డ్యాంలోని కొత్త 33 క్రస్గేట్లకు కొత్త గొలుసులను అమర్చే పని దాదాపుగా పూర్తయింది. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా డ్యాం కొత్త క్రస్ట్‌గేట్లు ప్రారంభిస్తారు. జలాశయం వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖుల రాక కోసం హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం సీనియర్ అధికారులు, వీవీఐపీలు, వివిధ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఒకేసారి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విజయనగర, కొప్పళ జిల్లా అధికారులు భారీ ప్లాట్‌ఫాం నిర్మాణంతో పాటు ఇతర పనులతో బిజీగా ఉన్నారు. హొసపేటె, కొప్పళ నుంచి టీబీడ్యాంకు వెళ్లే అన్ని రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి రానున్న కేంద్రమంత్రి హాజరు కానున్న మూడు రాష్ట్రాల సీఎంలు -
కొంపముంచిన అత్యాశ
రాయచూరు రూరల్ : జీవితంలో త్వరగా కోటీశ్వరులు కావాలనే అత్యాశతో నిరుద్యోగ యువకులు, మహిళలు ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పాస్తామంటూ మహిళలకు ఇంటి వద్దే ఉండి వర్క్ ఫ్రం హోం పేరుతో నెలకు రూ.25 వేలు సంపాదించవచ్చంటూ మోసం చేసి రూ.10 కోట్ల మేర నిధులు కాజేసి వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టి పరారైన దంపతుల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుమకూరు, మైసూరు, రాయచూరుల్లో ఏకకాలంలో ఎస్ఎల్వీ మహిళా మార్ట్ మార్కెటింగ్ పేరుతో జైలు వద్ద కార్యాలయం ప్రారంభించి టోపీ వేయడంతో మహిళలు, నిరుద్యోగ యువకులు వీధిన పడ్డారు. కొంత మంది బంగారు నగలు విక్రయించి మరీ పెట్టుబడి పెట్టారు. జిల్లాలో 250 మందికి పైగా మోసపోయారు. కమల, బొమ్మల రాజేష్ కోట్లాది రూపాయలను దండుకొని పరారయ్యారు. కమల, బొమ్మల రాజేష్‌ల ఆచూకీ కోసం పెట్టుబడి పెట్టిన వారంతా గాలిస్తున్నారు. మహిళా మార్ట్‌లో రూ.కోట్లలో లావాదేవీలు మహిళలు, నిరుద్యోగ యువతకు కుచ్చుటోపీ తుమకూరు, మైసూరుల్లోనూ నయవంచన -
జయ జయ హనుమా..
కోలారు: ముళబాగిలు నగరంలోని పాళ్యలో ఉన్న పురాణ ప్రసిద్ద శ్రీ ఆది హనుమంతరాయ దేవాలయంలో నూతనంగా నిర్మించిన రాజగోపుర మహా సంప్రోక్షణ సందర్భంగా బుధవారం దేవాలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. సుప్రభాతసేవ, గోపురంపై రత్న న్యాసపూర్వక కళశస్థాపన, విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యాహం, కుంభారాధన, విశేష హోమాలు సాగాయి. హనుమంతరాయుని మూలవిరాట్టుకు పంచామృత అభిషేకం, విశేష పూల అలంకరణ చేశారు. భజన గీతాలు భక్తులను అలరించాయి. స్నేహితులకు చెప్పి.. ఎస్ఐ ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా పోలీస్ కార్యాలయంలోని డీసీఆర్బీ విభాగంలో ఎస్సైగా పని చేస్తున్న బసవరాజు హేరూర్ (35) ఆత్మహత్య చేసుకున్నారు. 2014 బ్యాచ్ ఎస్సై అయిన బసవరాజు కలబుర్గిలోని గంగా నగరలో ఉన్న తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకున్నాడు. ఘటనకు ముందు బసవరాజు తన స్నేహితులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. వారు వెంటనే బసవరాజు తండ్రికి కాల్ చేసి తెలిపారు. తండ్రి గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే మరణించాడు. బసవరాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలిసిరాలేదు. రాఘవేంద్రనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ సమస్యలా, ఉద్యోగంలో ఇబ్బందులా అనేది తేలాల్సి ఉంది. డెత్‌నోట్ ఏదీ దొరకలేదని తెలిసింది. సహజీవన ప్రియురాలి హతం ● బెంగళూరులో ఘోరం యశవంతపుర: యువతీ యువకుడు సహజీవనం చేస్తుండగా, యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్డీ అనుషా (20)ను ఆమె ప్రియుడు శరత్ (25) హత్య చేశాడు. ఇద్దరూ కూడా హాజన్ జిల్లాలోని సకలేశపురకు చెందినవారు. శరత్ వాటర్ ట్యాంక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు, ఆమె ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేదని సమాచారం. ఇన్‌స్టాలో పరిచయం పెరిగి 6 నెలల నుంచి ఒకే గదిలో సహజీవనం ప్రారంభించారు. అయితే 13వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆమెను తీవ్రంగా కొట్టి గొంతు పిసికి చంపి పారిపోయాడు. తరువాత మరుసటి రోజున తనకు తెలిసిన న్యాయవాదికి చెప్పాడు. పోలీసులు వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉండడం బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. అనుషా నేలపై విగతజీవిగా పడి ఉంది. ఇంటి నిర్వహణ, పనుల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని యజమాని మహాదేవ తెలిపాడు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. -
ఇక రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా
హుబ్లీ: జంట నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. చెత్త నిర్వహణ పాలికెకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా బహిరంగ స్థలాల్లో చెత్త పారవేయడం ఆగడం లేదు. దీంతో చెత్త వేసే వారికి బుద్ధి చెప్పడానికి పాలికె అధికారులు ముందుకు వచ్చారు. ఎవరు చెత్త పారవేస్తారో వారి ఇంటి ముందే చెత్తను పారవేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలే ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ధార్వాడలో నలుగురు నివాసుల ఇళ్ల ఎదుట చెత్తను పారవేసి బుద్ధి చెప్పారు. అంతేగాక వారి నుంచి రూ.16 వేల జరిమానా చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. హుబ్లీలో కూడా చెత్త పారవేసే వారిపై క్షుణ్ణంగా పహారా కాస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి వారి ఇంటి ఎదుటే చెత్త పారబోసి జరిమానా కూడా విధిస్తున్నారు. మొబైల్లో ఫొటో తీసి హెల్త్ ఇన్స్పెక్టర్కు షేర్ మొబైల్లో ఫోటో తీసి హెల్త్ ఇన్స్పెక్టర్కు పంపిస్తారు. ఈ సందర్భంగా చెత్తలో నివాసుల పేరున కాగితాలు, బిల్లులు కనిపిస్తాయి. వాటి ఆధారంగానే అడ్రస్‌ను కనుగొని వారి ఇంటి ఎదుటనే చెత్తను పారవేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి బాధ్యులను గుర్తించి జరిమానా విధిస్తున్నట్లు చెత్త నిర్వహణ విభాగం ఈఈ సంతోష్ యరంగళి తెలిపారు. స్థానికుల్లో జాగృతి కోసం ప్రయత్నిస్తున్నాము. తడి, పొడి చెత్త విభజనపై చైతన్యం కల్పిస్తున్నాం. చెత్తను వేరు పరచకపోతే అలాంటి వారిపై కూడా జరిమానా విధించడం, చెత్తను వారి ఇంటి ముందు పారవేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. రెండు సార్లు జరిమానా విధించి మూడో సారి బాధ్యుల వాహనాలు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. తొలిదశలో రూ.5 వేల జరిమానా విధింపు కుసుగల్ రోడ్డు, గదగ్ రోడ్డు, కార్వాడ రోడ్డు, కెళగేరి రోడ్లలో చెత్త రోడ్డుపై పారవేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి ముఖ్యంగా ఇంటి నిర్మాణ వ్యర్థాలను రోడ్డుపై పారవేసే వారికి తొలిదశలో రూ.5 వేలు, రెండో సారి రూ.10 వేలు జరిమానా విధిస్తాం. మూడో సారి మాత్రం వాహనాన్ని సీజ్ చేయడమే కాకుండా అలాంటి వారిపై కేసు కూడా నమోదు చేస్తామని సమగ్ర వివరాలను ఆయన ఏకరువు పెట్టారు. నాలుగు కేసుల్లో రూ.13 వేలు జరిమానా వసూలు చేశారు. 114 సీసీ టీవీ కెమెరాలు చెత్త పారవేసే వారిని డేగ కళ్లతో పసిగడుతున్నాయన్నారు. అంతేగాక హెల్త్ ఇన్స్పెక్టర్లు, పర్యావరణ శాఖ ఇంజనీర్లు, సూపర్వైజర్లు, కమ్యూనిటీ మొబిలైజర్లు వార్డుల్లో తిరుగుతూ ఉంటారని, చెత్త పారవేసే వారు కనిపించగానే జరిమానా విధిస్తారన్నారు. బహిరంగ స్థలాల్లో ఆగని చెత్త పారవేత పాలికెకు తలనొప్పిగా మారిన నిర్వహణ -
బాలునిపై శునకం దాడి
● యజమానిపై ఫిర్యాదు బనశంకరి: బాలునిపై రాట్‌వీలర్ శునకం దాడిచేసిన ఘటన బెంగళూరు మహదేవపురలో జరిగింది. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 12 ఏళ్ల బాలుడు సైకిల్‌పై వెళుతుండగా, శ్యామ్ అనే వ్యక్తికి చెందిన రాట్‌వీలర్ జాతి కుక్క బాలున్ని వెంటాడి తొడ భాగంపై కరిచింది. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్దానికులు చేరుకుని కుక్కను దూరంగా తరిమి బాలుడిని కాపాడారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్ప అందిస్తున్నారు. బాలుని తండ్రి విపిన్, కుక్క యజమాని శ్యామ్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడే కుక్కను రెచ్చగొట్టాడని యజమాని దబాయించాడన్నారు. కాగా, రాట్‌వీలర్ కుక్క దుందుడుకుగా దాడులు చేస్తుందని అనేక దేశాలలో దానిని పెంచుకోవడాన్ని నిషేధించారు. బెడ్‌పై బొమ్మకు దుప్పటి కప్పి..బనశంకరి: సినిమాలలో హీరోయిన్లు చేసిన మాదిరిగా, బెడ్‌పై బొమ్మను నిద్రపోయినట్లు అమర్చి యువతి ఇంట్లో నుంచి పరారైంది. ఈ ఘటన చిక్కమగళూరు కొప్ప తాలూకా కుంచూరు గ్రామంలో జరిగింది. విద్యుత్‌శాఖలో జూనియర్ ఇంజనీర్ జగదీశ్ కుమార్తె జలన్య ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ క్లాస్‌కు వెళుతోంది. ఇటీవల తండ్రి తో కలిసి శృంగేరి దేవస్థానానికి వెళ్లి వచ్చింది. కానీ మరుసటి రోజున బెడ్ మీద బొమ్మకు దుప్పటి కప్పి, అక్కడ తాను ఉన్నట్లుగా సీన్ రూపొందించి, వెళ్లిపోయిందని తండ్రి హరిహరపుర ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కుమార్తె నిద్రపోతోందని, మధ్యాహ్నమైనా నిద్ర లేవలేదని వెళ్లి చూస్తే బొమ్మను చూసి షాక్ తిన్నట్లు తెలిపాడు. యువతి రహస్యంగా మొబైల్‌ఫోన్ వాడుతున్నట్లు తెలిసింది. సోషల్ మీడియా పరిచయాలతోనే వెళ్లిపోయినట్లు అనుమానాలున్నాయి. మహిళ పేరుతో రూ.15 లక్షల రుణం ● కొత్త రకం సైబర్ మోసం యశవంతపుర: స్మార్ట్‌ఫోన్ సిమ్‌ని 4జి నుంచి 5జికి ఉచితంగా అప్‌గ్రేడ్ చేసిస్తానని నమ్మించి సైబర్ నేరగాడు మహిళ మీద రూ.15 లక్షల అప్పు వేసేసిన ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. విక్టోరియా లేఔట్‌కు చెందిన 50 ఏళ్ల మహిళకు ఈ నెల 13న మధ్యాహ్నం 3గంటలకు అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. తాను టెలికాం కంపెనీ ఉద్యోగినని చెప్పాడు. మీ మొబైల్ సిమ్‌ను 4జి నుంచి 5జి కి అప్‌గ్రేడ్ చేయాలని చెప్పి పేరు, ఆధార్, బ్యాంకు ఖాతా తదితరాల వివరాలను తీసుకున్నాడు. చివరగా ఓటీపీ వస్తుందని చెప్పి అది తెలుసుకున్నాడు. ఇలా 30 నిముషాలలో ఆమె పేరుతో రూ.15 లక్షల ఆన్లైన్ రుణాన్ని మోసగాడు తీసుకున్నాడు. కొంతసేపటికి రుణం వివరాలు ఆమె ఫోన్‌కు వచ్చాయి, దీంతో లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.గుండెపోటుతో బాలుడు మృత్యువాత దొడ్డబళ్లాపురం: గుండెపోటుతో బాలుడు మృతిచెందిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణంలో బుధవారం జరిగింది. గుండె నొప్పి వచ్చిందని చెప్పి విలవిలలాడుతుండగా ఆస్పత్రికి తరలించేలోగానే చిన్నారి మరణించాడు. హిరియూరు బీజేపీ తాలూకా అధ్యక్షుడు అభినందన్ కుమారుడు వైష్ణవ్ (4), తనకు గుండెల్లో మంటగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తీసికెళ్లారు. పిల్లాడు అల్లాడిపోవడం చూసి వారు భయపడిపోయారు. దారిలోనే బాలుడు తుదిశ్వాస విడిచాడు. ఒకటో తరగతి చిన్నారి ఇక శివమొగ్గ జిల్లాలో సాగర తాలూకా హలసి గ్రామంలో మరో ఘోరం జరిగింది. సాయంత్రం ప్రభుత్వ పాఠశాల వదిలిన తరువాత ఒకటో తరగతి బాలుడు త్రిలోక్ జైన్ (6) ఇంటికి వెళ్లాలని బయట నిలబడి ఉన్నాడు. అయితే కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికులు, ఉపాధ్యాయులు అతని ముఖం మీద నీళ్లు చల్లగా స్పృహలోకి వచ్చాడు. తరువాత నీరు తాగించి కూర్చోబెట్టగా, టాయ్‌లెట్‌కు వెళ్తానని పాఠశాలలోని మరుగుదొడ్డికి వెళ్లాడు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు తీసి చూడగా బాలుడు చనిపోయి ఉన్నాడు. బాలునికి చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉన్నట్లు తల్లిదండ్రులు గౌతం జైన్, శిల్ప తెలిపారు. ఈ ఘటన గత శనివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసిపిల్లల గుండెపోటు మరణాలపై ఆందోళన నెలకొంది. -
మైసూరు జయదేవలో మృత్యుఘోష
మైసూరు: మైసూరు నగరంలోని మెటగళ్లిలో ఉన్న ప్రభుత్వ జయదేవ ఆస్పత్రిలో గత 24 గంటల్లో 11 మంది రోగులు మరణించినట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.సదానంద తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మృతుల పేర్లను వెల్లడించారు. సయ్యద్ ఆరీఫ్ పాషా (80), హరీష్ బీఆర్ (40), బాలశంకర్ (65), షంశున్నీసా(70), రాజు (54), నింగేగౌడ (70), హసీనాబాను (58), గోపాలరాజు (55), బైరోజీ రావ్ (80), సుహైల్ఖాన్ (43), నీలి (79) మృతులు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు చికిత్స పొందుతూ మరణించారు, వైద్యుల కొరత, నిర్లక్ష్యం లేదన్నారు. తమవారు ఆకస్మికంగా చనిపోయారని, ఇక్కడ వైద్య సౌకర్యాలు బాగాలేవని మృతుల బంధువులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఆస్పత్రిపై అందరి దృష్టి పడింది. చికిత్స అందించాం: డైరెక్టర్ రోగుల మరణం కేసుల్లో ఆస్పత్రికి మసి పూసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దినేశ్ అన్నారు. ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ 11 మంది రోగులు గోల్డెన్ అవర్ ముగిసిన తర్వాత వచ్చారని, అయినా ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు తెలిపారు. 11 మందీ గుండెపోటుతో వచ్చిన వారే, అందులోనూ బాగా వయసైనవారని అన్నారు. జీవన్మరణ పరిస్థితుల్లో ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. వైద్యుల కొరత లేదని, కొంతమంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తమ ఆస్పత్రికి ప్రతిరోజూ 600 నుంచి 800 మంది రోగులు వస్తారని, 20 శాతం మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారని ఆయన తెలిపారు. తమ వద్ద మొత్తం 40 మంది వైద్యులు ఉన్నారని చెప్పారు. 24 గంటల్లో 11 మంది మృతి బంధువుల ఆరోపణలు -
కూలిన పైకప్పు పెచ్చులు, టీచర్‌కు గాయాలు
కోలారు: రాష్ట్రంలో పాఠశాలల భవనాలు అనేకం శిథిలావస్థకు చేరాయి. ఏటా ఖర్చు చేస్తున్న వేలాది కోట్ల రూపాయలు సద్వినియోగం అవుతున్నాయా, లేదా అన్నది సామాన్య ప్రజలకు తెలియడం లేదు. కోలారు నగరంలోని పాత మాధ్యమిక ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి ఉపాధ్యాయురాలు యశోద గాయపడింది. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పైకప్పు నుంచి పెద్ద మొత్తంలో పెచ్చలు ఊడి టీచర్ మీద పడడంతో ఆమె గాయపడింది. ఇతర టీచర్లు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. ఈ మధ్యనే రూ. 25 లక్షల వ్యయంతో పాఠశాలలో మరమ్మత్తులు చేశారు. ఇంతలోనే కూలిపోవడంపై ఉపాధ్యాయులు సహా స్థానిక ప్రజలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఏమాత్రం నాణ్యత లేకుండా, తూతూ మంత్రంగా పనులు చేసి, నిధులను స్వాహా చేశారని ఆరోపణలున్నాయి.అవినీతిని తుడిచి, అభివృద్ధి చేయండిదొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అవినీతి నిర్మూలన, బెంగళూరు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ ఐటీ పారిశ్రామికవేత్త మోహన్‌దాస్ పాయ్.. సీఎం డీకే శివకుమార్‌కి సలహా ఇచ్చారు. డీకే శివకుమార్ తమ మార్గదర్శకుడైన మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కంటే మెరుగ్గా పాలన అందిస్తారని ఆశిస్తున్నానన్నారు. బెంగళూరు కీర్తిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని కోరారు. అవినీతి కారణంగా బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి, ఫుట్‌పాత్‌లు కనుమరుగయ్యాయి, డబ్బులు తింటేనే పని జరుగుతోంది అని ఎక్స్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగారం కోసం.. చెవి కోసేశారు..మండ్య: మండ్య జిల్లాలోని హలగూరు వద్ద సాగ్య గ్రామంలోని పొలంలో పనిచేస్తున్న కూలీ శాంతమ్మను మంగళవారం ఉదయం ఇద్దరు దొంగలు కత్తితో బెదిరించి, బంగారు చెవిపోగులను లాక్కొని పారిపోయారు. ఆ దొంగలను సాగ్య–అంకనహళ్లి గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒక బాలుడు ఉన్నాడు. చెవి పోగులను లాక్కునేందుకు వీలుకాకపోవడంతో కత్తితో ఎడమ చెవిని కోయడంతో గాయమై ఆమె విలవిలలాడింది. పోలీసులు నిందితుల నుంచి చెవిపోగులు, 2 స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతమ్మను మలవళ్లి ఆసుపత్రికి తరలించారు. దొంగలు సమీప గ్రామవాసులేనని తెలిసింది. చిన్నారిపై వీధికుక్కల దాడి ● బెంగళూరులో దారుణం యశవంతపుర: బెంగళూరులో మరోసారి వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన ఘటన సహకారనగరలో జరిగింది. ఆదివారం సాయంత్రం సీక్యూఎల్ లేఔట్లో బాలిక సంగీత (4) అంగడిలో బిస్కెట్లు కొనుక్కోవడానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. పాప తల్లిదండ్రులు యాదగిరి జిల్లా చెందిన కట్టడ కూలీ కార్మికులు. ఇంతలో నాలుగైదు కుక్కలు బాలిక మీద పడి తీవ్రంగా కరిచాయి. బాలిక ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు కుక్కను తరిమివేసి చిన్నారిని కాపాడారు. లేకుంటే పెద్ద ఘోరమే జరిగేది. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు కాగా వైరల్ అయ్యాయి. ఆమె కాలు, చేతికీ, ముఖానికీ గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బెంగళూరు ఉత్తర పాలికె అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.భారీగా తూటాలు లభ్యం హుబ్లీ: బెళగావి పారిశ్రమికవాడలో పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగిస్తున్న వేళ ఆ చెత్తకుప్పలో 59 తుపాకీ గుండ్లు లభించాయి. కార్మికులు ఆ ప్రాంత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి సీఐ మహంతేష్, పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఇందులో 41 గుళ్లు ఒకే రకంగా ఉండగా, మరో 18 వేరేగా ఉన్నాయి. ఘటనతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి. వాటిని పారవేసింది ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు. -
నృసింహునికి పానకాభిషేకం
కోలారు: ముళబాగిలు తాలూకాలోని కదరిపుర గ్రామంలో సుప్రసిద్ద కంబద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో నిజ జేష్ట మాసం మొదటి మంగళవారం సందర్భంగా విశేష పూజలు జరిపించారు. మూల విరాట్టుకు పానక అభిషేకం, పంచామృత అభిషేకం, అలంకారం, పూజలు సాగించారు. పెద్దసంఖ్యలో భక్తులు నృసింహున్ని దర్శించుకుని పావనులయ్యారు. గాయకుల భక్తి గాన కచేరీ ముగ్ధుల్ని చేసింది. బిడది టౌన్షిప్ అవసరం: మంత్రి మైసూరు: బిడది టౌన్షిప్ ఏర్పాటుపై జేడీఎస్ రాజకీయాలు చేస్తోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య ఆరోపించారు. మంగళవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ, బిడది టౌన్‌షిప్‌కు 80 శాతం మంది రైతులు భూమి ఇవ్వడానికి అంగీకరించారని, మరికొందరు ఎక్కువ పరిహారానికి ఒప్పుకున్నారని తెలిపారు. కొంతమంది మాత్రమే వ్యతిరేకించారన్నారు. వారి కోసం ప్రాజెక్టును వదులుకోలేమని ఆయన చెప్పారు. ‘బెంగళూరులో జనాభా పెరిగింది. చాలా మందికి స్థలాలు అవసరం. బెంగళూరు జనాభాను వికేంద్రీకరించాలి. బెంగళూరును విస్తరించడం కోసం టౌన్షిప్ కావాలి. మేము రైతులతో మాట్లాడి ఒక ప్రణాళికను రూపొందిస్తాము’ అని తెలిపారు. బిడది రిసార్ట్‌లో సీఎల్పీ భేటీ, ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహనకు హాజరవుతానని తెలిపారు. బాలలకు పాదరక్షల పంపిణీ మండ్య: తాలూకాలోని తుంబకెరెలోని సంచార జాతుల బడి పిల్లలకు తుమకూరుకు చెందిన త్రివర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షూ, చెప్పులను పంపిణీ చేశారు. ధనవంతులందరికీ పేదలకు సాయం చేయాలనే గుణం ఉండదన్నారు. అయితే దాతలు పీ.గోపాల్, కుమార్ల దానగుణం ప్రశంసనీయమని అందరూ అభినందించారు. లెక్చరర్ కల్లహళ్లి కేసీ లోకేష్, రిటైర్డ్ హెచ్ఎం మంచశెట్టరు, దేవరాజ్ కొప్ప , శృతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ సారథిగా ప్రహ్లాద్ జోషి?దొడ్డబళ్లాపురం: రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షున్ని ఎంపిక చేసేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. కొత్త అధ్యక్షునిగా సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని నియమించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. జోషి 2014 నుంచి రెండేళ్ల పాటు రాష్ట్ర బీజేపీ సారథిగా పనిచేశారు. నూతన సీఎంగా డీకే శివకుమార్ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ రాజకీయ లెక్కలు మారాయి. కేంద్ర మంత్రివర్గంలో త్వరలో మార్పులు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. కొందరిని తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. జోషిని కూడా తప్పించి రాష్ట్ర పగ్గాలు ఇవ్వవచ్చని ప్రచారం సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు విజయేంద్ర రెండేళ్లుగా తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతున్నారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నేతగా జోషి పేరును ప్రకటించే చాన్సుంది. బయటపడ్డ బసవేశ్వరాలయం ● అడుగంటిన కబిని మైసూరు: వర్షాలు లేక కబిని (కపిలా) నది ప్రవాహం క్షీణించింది. జిల్లాలోని హెచ్డీ కోటె తాలూకా బీచనహళ్లి సమీపంలోని కబిని జలాశయంలో నీరు అడుగంటి పోవడంతో ప్రాచీన బసవేశ్వరాలయం బయట పడింది. 2013, 2016లో కూడా ఇలానే ఎండిపోవడంతో ఆలయం గోచరించింది. ఈసారి రాష్ట్రంలో తీవ్ర కరువు, కాటకాలు సంభవించవచ్చన్న చర్చల నడుమ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఆయకట్టు రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. డ్యాం అడుగంటడంతో బ్యాక్‌వాటర్‌లోని ఆలయ రాతి మంటపాలు కనిపిస్తున్నాయి. స్థానికుల కథనం మేరకు 10 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. 2013లో కూడా మాంకాళమ్మ, భవానీ శంకర్ ఆలయాలు బయటపడ్డాయన్నారు. ఈ రెండు ఆలయాలు ఉన్న ఊరు కిత్తూరు, జలాశయం పోటు జలాల్లో మునిగిందన్న చారిత్రక అంశం వెలుగులోకి వచ్చిందన్నారు. బసవేశ్వరాలయంలో భక్తులు పూజలు చేసి కరువు కాటకాలు రాకుండా చూడాలని మొక్కుతున్నారు. -
ప్రసాద్ అబ్బయ్యకు కేబినెట్లో చోటు ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్‌లో రెండో సారి మంత్రివర్గ విస్తరణలో హుబ్లీ–ధారవాడ శాసన సభ్యుడు, దళిత నేత ప్రసాద్ అబ్బయ్యకు రాష్ట్ర మంత్రిగా చోటు కల్పించాలని చలువాది మహాసభ డిమాండ్ చేసింది. మంగళవారం ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సంచాలకుడు భీమన్న, కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా డీ.కే.శివకుమార్‌ను నియమించిన నేపథ్యంలో మంత్రి పదవిని దళితులకు కేటాయించాలన్నారు. 2023 ఎన్నికల సమయంలో ఉత్తర కర్ణాటకలో దళితుల ఓట్లు కావాలని అభ్యర్థించి ప్రధాన పదవులను మాత్రం అగ్రకుల నాయకులకు కేటాయించడం తగదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సన్నివేశంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శివకుమార్ మంత్రివర్గంలో 30 ఏళ్లుగా పార్టీకి సేవలు అందించిన ప్రసాద్ అబ్బయ్యను రాష్ట్ర మంత్రి పదవిని కేటాయించాలన్నారు. క్యాంటర్, ఆర్టీసీ బస్సు ఢీ ● ముగ్గురు దుర్మరణం ● విజయపురలో దుర్ఘటన రాయచూరు రూరల్ : కేఎస్ఆర్టీసీ బస్సు, క్యాంటర్ ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన విజయపురలో సంభవించింది. మంగళవారం సిమెంట్ బస్తాలతో వెళుతున్న కేఏ– 28 ఏఏ– 6792 నంబరుగల క్యాంటర్ వాహనం టైర్ ఆకస్మికంగా పేలింది. దీంతో అదుపు తప్పి చడచణ తాలూకా లోణ క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన కేఏ– 28 ఎఫ్– 2468 నంబరుగల బస్సును ఢీకొంది. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మరణించారు. క్యాంటర్ సిమెంట్ లోడుతో చడచణ వైపు వెళుతుండగా, ఆర్టీసీ బస్సు చడచణ నుంచి విజయపురకు వెళుతోంది. మార్గం మధ్యలో జరిగిన ఈ ఘటనలో బస్ డ్రైవర్ హనుమంత చలువాది(30), క్యాంటర్ డ్రైవర్ అశోక్ ఉటగి(25), భార్య రాధ(22) మరణించారు. బస్సులోని 10 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారిని విజయపుర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సోమేష్ వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అసత్య అట్రాసిటీ కేసులతో వేధింపులురాయచూరు రూరల్: జిల్లాలో అసత్యపు అట్రాసిటీ కేసులతో అగ్ర వర్ణాల వారిని దళిత నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని సింధనూరుకు చెందిన చెన్నబసప్ప ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో వీరప్ప, జాకోబ్, హనుమంతులు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా చెక్ బౌన్స్ కేసు విషయంలో నానారకాలుగా చిత్రహింసలు పెడుతూ అట్రాసిటీ కేసులను పెడతామని బెదిరిస్తున్నా సింధనూరు డివిజన్ పోలీసులు వారిపై చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కులం పేరుతో దూషిస్తూ భయపెడుతున్నా సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్‌కు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. విద్యార్థులు పాఠ్యేతర అంశాల్లో పాల్గొనాలిరాయచూరు రూరల్: సమాజంలో విద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర అంశాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని సమృద్ధ భారత చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు హిరేమట్ పేర్కొన్నారు. మంగళవారం బీసీఎం హాస్టల్లో దామోదర వీర సావర్కర్ జయంతి కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఆయన బాటలో ఉత్తమ నాయకుడుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ వీరేష్ నాయక్, భారత సేవా దళ అధికారి విద్యాసాగర్, రామయ్య నాయక్, నాగరాజ్, నరసణ్ణలున్నారు. -
ఇంకా వీడని అస్పృశ్యత
బొమ్మనహళ్లి: సమాజంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, కుల వ్యవస్థ, బానిసత్వం, అంటరాని తనం వంటివి ఇంకా కొనసాగుతున్నాయని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మనవరాలు రమ అంబేడ్కర్ విచారం వ్యక్తం చేశారు. చన్నపట్టణ నగరంలోని అంబేడ్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాలు నిర్వహించిన భీమోత్సవ్, ప్రతిభా పురస్కార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విద్య, రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని బోధించారు. కానీ రాజ్యాంగ ఆకాంక్షలు కొద్దిమందికే పరిమితమయ్యాయి. అంబేడ్కర్ సూత్రాలు, సిద్ధాంతాలు నిరుపయోగంగా మారాయి. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు సరైన విద్య అందడం లేదు అని పేర్కొన్నారు. ఇటువంటి లోపాలను సరిదిద్దడానికి ఓటు హక్కు అనే గొప్ప ఆయుధం ఉంది, ఓటు హక్కు, పోరాటం ద్వారా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ మనవరాలు రమ అంబేడ్కర్ -
వృద్ధాప్యంలోనూ మనశ్శాంతి కరువే
సాక్షి, బెంగళూరు: జీవితంలో శక్తి ఉన్నంత కాలం కష్టపడ్డారు, మలిసంధ్యలోనైనా నెమ్మదిగా, ప్రేమతో, గౌరవంగా బతకాలని వయోవృద్ధులు కోరుకుంటారు. కానీ చాలామందికి అది దురాశే అవుతోంది. పిల్లలు, ఇతర కుటుంబీకుల నుంచి నిర్లక్ష్యం, అవమానభారం, పైగా దాడుల వల్ల వయోవృద్ధులు కుంగిపోతున్నారు. 3 ఏళ్లలో 2,600 కేసులు బెంగళూరు నగర పోలీసు శాఖ, వయోవృద్ధుల సాధికారత డైరెక్టరేట్ భాగస్వామ్యంతో సీనియర్ సిటిజెన్స్ సంక్షేమాన్ని పర్యవేక్షించే ప్రభుత్వేతర సంస్థ ‘నైటింగేల్స్ మెడికల్ ట్రస్టు’ నిర్వహించిన సర్వేలో వృద్ధులపై జరుగుతున్న దాడులు, వేధింపులు బహిర్గతం అయ్యాయి. ఈ నివేదిక ప్రకారం 2023 నుంచి 2026 వరకు మూడేళ్లలో బెంగళూరులో 2,680 మౌఖిక, లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయి. ఫించన్ డబ్బులు, పదవీ విరమణ డబ్బులు, ఆస్తి పంపకాల కోసం సంతానం, ఇతర బంధువులే హింసకు, అవమానానికి పాల్పడినట్లు తెలిపారు. ఏటా కేసులు అధికం కుటుంబ సభ్యులే దాడులు చేశారని 2023–26 వరకు మొత్తం 1,847 ఫిర్యాదులు అందాయి. పొరుగువారు, అద్దె ఇంటి వారి నుంచి 669 వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. ప్రైవేటు సంస్థలు, సంఘాలు మోసం చేయడంపై 164 ఫిర్యాదులు అందాయి. ఇలా ఇంటా బయటా వృద్ధులకు రక్షణ, గౌరవం కరువైంది. ఏటా కేసులు పెరిగాయి. పెరుగుతోన్న వృద్ధులు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 60 ఏళ్ల పైబడిన వృద్ధులు 68 లక్షల మంది ఉన్నారు. ఇందులో బెంగళూరులోనే 9.11 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మరింత అధికమై ఉంటారు. ఇందులో సుమారు 30,459 మంది వృద్ధులు ఏకాకులుగా జీవిస్తున్నారు. నైటింగేల్స్ మెడికల్ ట్రస్టు సహాయవాణి–1090కి గత మూడేళ్లలో సహాయం కోసం 43,626 కాల్స్ వచ్చాయి. సంతానం, ఇరుగుపొరుగు దాడులు వృద్ధులకు దక్కని గౌరవం, భద్రత బెంగళూరులోనూ ఇదే ధోరణి -
హంపీ గత వైభవాన్ని చాటండి
హొసపేటె: పర్యాటక శాఖ ఎల్లప్పుడూ గైడ్ల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, విదేశీ భాషా శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని విజయనగర సామ్రాజ్యం, హంపీ కీర్తిని ప్రపంచ వేదికపై మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి సూచించారు. పర్యాటక శాఖ, హంపీ కన్నడ విశ్వవిద్యాలయం సహకారంతో మంగళవారం హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం భువన విజయ ఆడిటోరియంలో టూరిస్ట్ గైడ్ల కోసం నిర్వహించిన విదేశీ భాషా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. విదేశీ పర్యాటకులకు పరిశోధన ఆధారిత, ప్రామాణికమైన చరిత్రను మాత్రమే తెలియజేయాలన్నారు. మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా గైడ్లు భాష పైనే కాకుండా డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ బుకింగ్‌లు, టూరిస్ట్ యాప్‌ల వాడకంపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. పర్యాటక శాఖ ఎల్లప్పుడూ గైడ్ల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు. కలబుర్గి డివిజన్ పర్యాటక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్.తిప్పేస్వామి, కన్నడ హంపీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ పరమశివమూర్తి, హైదరాబాద్ ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తారకేశ్వర్, పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రభులింగ తళకేరి, హంపీ కన్నడ వర్సిటీ రిజిస్ట్రార్ విరుపాక్ష పూజారహళ్లి, విదేశీ భాషల కో–ఆర్డినేటర్ ఎస్.వై సోమశేఖర్, వివిధ జిల్లాల టూరిస్ట్ గైడ్లు హాజరయ్యారు. జిల్లాధికారిణి కవిత మన్నికేరి -
విశ్వనగరికి చేయూత
బనశంకరి: సీఎం డీకే శివకుమార్‌తో బెంగళూరులోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భేటీ అయ్యారు. మంగళవారం విధానసౌధలో ఈ సమావేశం జరిగింది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ బెంగళూరును విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి మద్దతుగా ఉంటామని తెలిపారు. సీఎంతో సమావేశం సంతోషకరమన్నారు. బెంగళూరు నగర ప్రజలకు అవసరమైన సౌలభ్యాల గురించి చర్చించామన్నారు. సొరంగ మార్గాలు, ఫ్లై ఓవర్లు, రహదారులు, కారిడార్లు, పెరిఫెరల్ రింగ్‌రోడ్లు వంటి పథకాలు ఇందులో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో సురేశ్, గీతాంజలి కిర్లోస్కర్, విక్రం విశ్వనాథ్, మోహన్ సురేశ్ తదితరులు ఉన్నారు. -
లైంగిక వేధింపుల నివారణ సమితి ఏర్పాటుకు సూచన
బళ్లారిటౌన్: పని చేసే స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నియంత్రణ, సురక్షిత వాతావరణం కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు సమితిని ఏర్పాటు చేయాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ ఆదేశించారు. ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ మహిళలు ఉద్యోగ వేళల్లో లైంగిక వేధింపుల నియంత్రణ నిషేధ, పరిహార చట్టం–2013 ప్రకారం పది మంది కన్నా ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, మండలి, నిగమ, స్థానిక సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఈ సమితులను తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పలు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఫ్యాక్టరీలు, వ్యాపార కాంప్లెక్స్‌లు, గార్మెంట్ సంస్థలు, బ్యాంకుల్లో కూడా తప్పనిసరి అన్నారు. 12 రోజుల్లోగా అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో అంతర్గత ఫిర్యాదు సమితిని ఏర్పాటు చేయాలన్నారు. అందులో సభ్యుల వివరాలను వార్షిక నివేదికను భర్తీ చేసి జిల్లా మహిళ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ డీడీ కార్యాలయానికి సమర్పించాలన్నారు. ఒక వేళ ఈ ఆదేశాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళా సిబ్బంది ఫిర్యాదు సమర్పించేందుకు తగిన వేదిక లేని కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, మహిళలకు సమస్యలు ఉద్భవిస్తే ఆయా కార్యాలయ బాధ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. -
దశాబ్దం గడిచినా ప్రజలకందని ఇళ్లు
రాయచూరు రూరల్: కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి మండలి(కేఐఏడీబీ) ఆధ్వర్యంలో యరమరస్ వద్ద 2013–14లో నిర్మించిన ఇళ్లు నేడు వికారంగా మారాయి. దశాబ్దం క్రితం 253 ఎకరాల్లో రూ.150 కోట్లతో 3,342 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన కేఐఏడీబీ అధికారులు వాటి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో నేడు ఆ నివాసాలు పాడుబడిన ఇళ్లుగా మారాయి. 255 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా కేవలం 60 మందికి మాత్ర మే ఇళ్లు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. వాటి నిర్వహణలో బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. 3,087 ప్లాట్లు ఖాళీ స్థలాలుగా మిగిలాయి. 255 ఇళ్లలో 60 ఇళ్లను పంచగా, మిగిలిన 195 ఇళ్లు భూత్ బంగ్లాలుగా మారాయి. ఎక్కడ చూసినా ముళ్ల కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగాయి. అధికారుల నిరక్ష్యంతో వేలాది ఇళ్ల స్థలాలు ఖాళీగానే మిగిలి పోయాయి. ఇళ్లు లేని, మధ్య తరగతి వర్గాలకు, బీపీఎల్ కార్డుదారులకు 50 ఽఽశాతం రాయితీతో స్థలాలు కేటాయించి అప్పగించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కేఐఏడీబీ అధికారుల దివ్య నిర్లక్ష్యం రూ.150 కోట్ల నిధులు బూడిద పాలు నాడు 253 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం -
ఆ రౌడీషీట్ల తొలగింపునకు బ్రేక్: హోంమంత్రి
శివాజీనగర: రాష్ట్రంలో 66 మంది రౌడీషీటర్లపై షీట్‌ను తొలగించే ప్రతిపాదనను నిలిపివేసినట్లు కొత్త హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, రౌడీషీట్లు తొలగించాలని సిఫార్సు వచ్చినవారిలో 12 మంది పేరుమోసిన రౌడీలు ఉన్నారని తెలిపారు. అలాంటివారిపై షీట్‌ను ఎలా తొలగిస్తారని బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను అడిగానన్నారు. ఈ జాబితాలో కొందరు బీజేపీ కార్యకర్తల పేర్లు ఉన్నాయని చెప్పారు. ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తూ ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్‌కు తాను రాసిన లేఖను ఖర్గే సమర్థించుకొన్నారు. కర్ణాటక మంత్రిగా తాను లేఖ రాశాను, సమాధానం ఇవ్వాల్సిందే అన్నారు. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్కు 127 శాఖలు ఉన్నాయని తెలిపారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు కోపగించుకుంటున్నారని అన్నారు. -
లోక కళ్యాణార్థం ఉపవాస దీక్షలు
రాయచూరు రూరల్: గాలి, వెలుతురు లేకుండా అన్న పానీయాలు లేకుండా లోక కళ్యాణార్థం 33 రోజులు ఉపవాస దీక్షలు చేపట్టిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. విజయపుర జిల్లా సింధగి తాలూకా అంతూర బెంతూరలో ఓ స్వామీజీ 33 రోజుల క్రితం మౌనదీక్షలు చేపట్టారు. రాచోటేశ్వర స్వామీజీ 33 రోజుల పాటు తాను కూర్చొన్న స్థలంలో ఇటుకలతో వాకిళ్లని మూసివేసి సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసి దానిపై ఆవు పేడతో అలికి ముగ్గులు, రంగులు వేయించారు. సోమవారం సాయంత్రం మౌన దీక్షకు తెరదించారు. గుహలో ఉన్న స్వామీజీని భక్తులు గుహను తొలగించి చూడగా స్వామీజీ మౌన దీక్షలో ఉండడం విజ్ఞానానికి సవాల్‌గా మారింది. ఈనేపథ్యంలో కుతూహలంతో స్వామీజీని చూడడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. -
బాలికలపై లైంగిక దాడి నిందితుని అరెస్ట్
రాయచూరు రూరల్ : మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని సింధనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సింధనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పీడబ్ల్యూడీ క్యాంప్‌లో నివాసం ఉంటూ 8, 9వ తరగతులు చదువుతున్న బాలికలపై బాబు(29) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. ఘటనపై సోమవారం బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన సీఐ వీరారెడ్డి మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. బేకరీ యజమానిపై దాడి ● పరారీలో ముగ్గురు నిందితులు హుబ్లీ: బేకరీకి వచ్చిన సందర్భంలో సదరు వినియోగదారుడికి వేగంగా సామాన్లను ఇవ్వక పోవడంతో ఆగ్రహించిన ముగ్గురు యువకులు బేకరీ యజమానిపై దాడి చేసిన ఘటన హెగ్గేరి బేకరీలో చోటు చేసుకుంది. శంకర దొడ్డమని దాడికి గురైన వ్యక్తి. నిందితులు అతడిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనా స్థలానికి పాత హుబ్లీ పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 20న మురికివాడ వాసుల సమస్యలపై సమావేశంహొసపేటె: గదగ్‌లో ఈ నెల 20న రాష్ట్ర స్థాయి మురికివాడ వాసుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తున్నట్లు విజయనగర జిల్లా స్లం విభాగం కో– ఆర్డినేటర్ యంకమ్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గదగ్‌లోని లయన్స్ క్లబ్లో రాష్ట్ర స్థాయి స్లం సమావేశం జరుగనుందని, ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సంబంధిత స్లం విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా మురికివాడల ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదన్నారు. ఈ మూడేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ పథకం అమలు కోసం రూ.6200 కోట్లు ప్రకటించగా, విడుదల చేసిన మొత్తం రూ.1000 కోట్లకు కూడా మించలేదన్నారు. మొత్తం 1.80 లక్షల ఇళ్లకు గాను కేవలం 81 వేల ఇళ్లు మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయని తెలిపారు. ఈ గృహ నిర్మాణ ప్రాజెక్ట్ నామమాత్రంగా మిగిలిపోయిందన్నారు. గదగ్‌లో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశానికి స్లం విభాగం రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేటర్ నరసింహమూర్తి, డివిజనల్ కో–ఆర్డినేటర్ జనార్ధన్, ఇంతియాజ్ తదితరులు హాజరవుతారని ఆమె తెలిపారు. టీచర్‌కు దేహశుద్ధి, సస్పెన్షన్● విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఫలితం సాక్షి, బళ్లారి: బెళగావి జిల్లాలోని చిక్కోడి తాలూకాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సింది పోయి నిత్యం లైంగికంగా వేధించడంతో పాఠశాల విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై విద్యార్థినుల తల్లిదండ్రులు దాడి చేశారు. తమపై ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అనుచితంగా తాకుతున్నాడని తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులతో విద్యార్థినులు వాపోయారు. దీంతో పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. డీడీపీఐ కూడా అక్కడి చేరుకుని వాస్తవాలను పరిశీలించిన తర్వాత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఓటరు జాబితాలను సవరించాలిరాయచూరు రూరల్: ఓటరు జాబితాలో సవరణలకు చర్యలు చేపట్టాలని రైతు సంఘం నేత వీరసంగయ్య పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమన మాట్లాడారు. ఓటరు జాబితాలో ఓటు హక్కు పరిరక్షణలో అర్హులైన వావరి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలన్నారు. అధికార పార్టీలు అక్రమాలకు పాల్పడితే సమష్టిగా అడ్డుకోవాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఓటర్లు పేర్ల తొలగింపు వివాదాస్పదంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. 15 మోటార్ సైకిళ్లు స్వాధీనం ● ముగ్గురు నిందితుల అరెస్ట్ రాయచూరు రూరల్ : నగరంలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ హాస్టల్ ముందు నిలిపిన వాహనాలను బిజినగేర ఆంజనేయ, కమలాపుర ఆకాష్, కార్తీక్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.11.29 లక్షలు ఉంటుందని అంచనా వేశారన్నారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్ఐ బసవరాజ్ నాయక్, శారదలున్నారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
కణేకల్లు: మండలంలోని ఆలూరు గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు గాయపడ్డారు. వివరాల్లోకెళితే... హైదరాబాద్‌లో నివాసముంటున్న భార్యాభర్తలు శోభ (43), తిప్పేస్వామి (48) వచ్చే నెలలో జరుగనున్న తమ కూతురు చందన పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు సోమవారం బళ్లారికొచ్చారు. బళ్లారిలో పెళ్లిపత్రికలు పంచాక మంగళవారం కారులో మాల్యం గ్రామానికొచ్చారు. కణేకల్లు, మాల్యంలలో పెళ్లి పత్రికలు పంచి కారులో బళ్లారికి తిరుగు ప్రయాణమవుతూ ఆలూరు వద్ద పైప్‌లైన్ పనులు చేస్తున్న హైడ్రాలిక్ క్రేన్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు శోభ, తిప్పేస్వామిలకు గాయాలయ్యాయి. శోభకు కాలు, చేయి ఫ్రాక్చరైంది. తిప్పేస్వామి స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు 108 సాయంతో వారిని కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స చేసిన అనంతరం వారిని అనంతపురం ఆస్పత్రికి రెఫర్ చేశారు. -
రక్తదానంపై జాగృతి జాతా
రాయచూరు రూరల్: జిల్లాలో రక్తదానంపై ప్రజల్లో జాగృతి పెంపొందించాలని రిమ్స్ అధికారి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం ఆరోగ్యాధికారి కార్యాలయం వద్ద జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, రాష్ట్ర ఎయిడ్స్ సంస్థ, ఆరోగ్య శాఖ, రిమ్స్, నవోదయ, రక్త నిధి కేంద్రాలు, లయన్స్ క్లబ్, ఏఎం దంత కళాశాల, రెడ్ క్రాస్, రోటరీ సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాల జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు వివరించాలన్నారు. ఇంటింటికెళ్లి అత్యవసర సమయంలో యువకులు రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రక్తదానం చేయాలని సూచించారు. జాతాలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, జిల్లా ఆరోగ్య శాఖాధికారి సురేంద్ర బాబు, వైద్యులు గణేష్, శాకీర్, నందిత, బసయ్య, సంధ్య, సరోజలున్నారు. -
సిట్ ఎస్పీ కారు పల్టీలు
● నలుగురికి గాయాలు యశవంతపుర: ధర్మస్థలలో అస్థిపంజరాల కేసును విచారిస్తున్న సిట్ ఎస్పీ ప్రయాణిస్తున్న కారు చార్మాడి ఘాట్‌లో ప్రమాదానికి గురైంది. ఎస్పీ సైమన్, సీఐ కుసుమధర్, డ్రైవర్, మరో కానిస్టేబుల్లు ఇన్నోవాలో వెళ్తున్నారు. చిక్కమగళూరు ఎస్పీ, సిట్ అధికారైన జితేంద్రకుమార్ దయామ ను కలవడానికి వెళుతుండగా బెళ్తంగడి మార్గంలో కారు పల్టీలు కొట్టి నుజ్జయింది. ఎస్పీ సహా నలుగురూ స్వల్ప గాయాల పాలయ్యారు. స్థానికులు వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఎస్పీ సైమన్ బెళ్తంగడి ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వర్షాభావంపై సీఎం సమీక్ష
మేం డాక్టర్స్శివాజీనగర: కన్నడనాట నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంకా బలపడలేదు, చిన్నా చితకా వర్షాలు తప్ప ఆశించిన స్థాయిలో వానలు లేకపోవడంతో అటు రైతుల్లో, ఇటు ప్రభుత్వంలో గుబులు నెలకొంది. జలాశయాల్లో నీటి స్థాయి తగ్గిపోయింది. మునుముందు రోజుల్లో వర్షాలు పుంజుకోకపోతే తాగునీటికి కూడా అవస్థలు పడాల్సిన వస్తుంది. జూన్ తొలి వారంలో సాధారణం కంటే 21 శాతం తక్కువ వర్షమే కురిసింది. వర్షాభావం నేపథ్యంలో నూతన ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సోమవారం బెంగళూరులో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. వర్షం కొరత కొనసాగితే కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. బెంగళూరుతో పాటుగా రాష్ట్రంలో దక్షిణ భాగాలకు సాగు తాగునీరు అందించే కావేరి నది పరీవాహక ప్రాంతాలలోనూ 36 శాతం లోటు వర్షమే కురిసింది. అంతేకాకుండగా కోస్తా ప్రాంతంలో 41 శాతం వర్షం తక్కువగా ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 23 వరకు వర్షాభావం కొనసాగవచ్చు. ఆ తరువాతే వానలు వేగం పుంజుకునే అవకాశముంది. తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. -
తుంగభద్రలో యథేచ్ఛగా బోటింగ్
హొసపేటె: తాలూకాలోని పర్యాటక ప్రాంతం హంపీలో రుష్యమూక పర్వత సమీపంలో తుంగభద్ర నదిపై యథేచ్ఛగా తెప్ప(నాటు పడవ) ప్రయాణాలు కొనసాగించడం వల్ల గత ఏడాదిగా సణాపుర గ్రామ పంచాయతీ ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. అవసరమైన భద్రతా చర్యలతో పాటు, గ్రామ పంచాయతీ ఈ–టెండర్ ద్వారా బోటు యజమానుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, నిర్దిష్ట డిపాజిట్‌తో వేలం ద్వారా బోటింగ్ కోసం అనుమతిని జారీ చేయాలి. సణాపుర గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమనహళ్లి సమీపంలో ఉన్న రుష్యమూక పర్వతం వద్ద తుంగభద్ర నదిలో, హంపీలోని కోదండరామ ఆలయానికి పర్యాటకులను తరలించడానికి తెప్పలను ఉపయోగిస్తున్నారు. గత ఏడాదిగా గ్రామ పంచాయతీ నుంచి టెండర్ లేకుండానే ఒక వ్యక్తిని బోటింగ్ చేయడానికి అనుమతిస్తున్నారు. టెండర్ పిలవాలని, తెప్పను ఏర్పాటు చేసే పనిని అర్హత గల వ్యక్తికి అప్పగించాలని కోరుతూ చాలా మంది గ్రామ పంచాయతీకి లేఖలు రాశారు. టెండర్ సాకుతో అనధికారిక అనుమతి అయినప్పటికీ ఈ టెండర్ నెపంతో గత ఏడాదిగా అనధికారిక బోటింగ్‌కు అనుమతి ఇస్తున్నారు. దీని వల్ల గ్రామ పంచాయతీ లక్షల రూపాయలు నష్టపోయింది. తక్షణమే నిబంధనల ప్రకారం టెండర్ పిలిచి, ఈ–టెండర్ ద్వారా నిర్దిష్ట డిపాజిట్‌తో అర్హత గల వ్యక్తులను బోటింగ్ చేయడానికి అనుమతించాలి. అంతేకాకుండా సణాపుర గ్రామం వద్ద జలపాతాల సమీపంలో చట్టవిరుద్ధంగా బోటింగ్ నిర్వహిస్తూ పర్యాటకుల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతేకాక అవసరమైన భద్రతా చర్యలు లేకుండా అధిక ధరలు వసూలు చేస్తూ, పర్యాటకుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు. అందువల్ల గ్రామ పంచాయతీ పీడీఓ, తాలూకా పంచాయతీలు నిబంధనలకు అనుగుణంగా హనుమనహళ్లి, సణాపుర సమీపంలో బోటింగ్‌కు తక్షణమే అనుమతి ఇవ్వాలి. అదనంగా గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరేలా టెండర్ పిలవాలని స్థానికులు డిమాండ్ చేశారు. హంపీ వద్ద తెప్పలో విహరిస్తున్న పర్యాటకులు తుంగభద్ర నదిలో విహారానికి సిద్ధంగా ఉన్న తెప్పలు హంపీలో రుష్యమూక పర్వతం వద్ద జలవిహారం టెండర్ పిలవకుండానే సొమ్ము చేసుకుంటున్న వైనం సణాపుర గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి -
రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయండి
రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు విక్రయించిన జొన్నల డబ్బుల బకాయిలను వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఎమ్మెల్సీ బాదర్లి బసవనగౌడ డిమాండ్ చేశారు. సోమవారం బెంగళూరులోని ఆహార పౌర సరఫరాల శాఖాధికారితో చర్చించారు. ఆరు నెలల క్రితం రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా జొన్నలు విక్రయించిన రైతులకు ఇంత వరకు రైతుల బ్యాంక్‌ల ఖాతాలోకి డబ్బులు వేయలేదన్నారు. ఇప్పటికై నా నిర్లక్ష్యం చేయకుండా త్వరిత గతిన డబ్బులు చెల్లించాలని అధికారులను కోరారు. రైతుల బకాయి సొమ్ము చెల్లించాలని రాస్తారోకో రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు విక్రయించిన జొన్నల డబ్బులు ఖాతాలోకి జమ చేయాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. సోమవారం సింధనూరు తాలూకా యాపలపర్వి వద్ద రాయచూరు–సింధనూరు రహదారిని బంద్ చేసి చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అమీన్‌పాషా దిద్దిగి మాట్లాడారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యల నియంత్రణకు స్వామినాథన్ నివేదికను అమలు చేయాలన్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరలను ప్రకటించాలన్నారు. నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు అవకాశం కల్పించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్ ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయాలు జరిపేలా చూడాలన్నారు. ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. రామయ్య, తిమ్మన్న, చెన్నప్ప, వెంకటేష్, ఖాసీం, నరసింగ్రావ్లున్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలని కర్ణాటక విద్యుత్ ప్రసార మండలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బసవణ్ణ ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను డిమాండ్ చేశారు. సోమవారం బెంగళూరులోని కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యుత్ సరఫరా, పంపిణీ బాధ్యతలను టాటా పవర్ కంపెనీకి అప్పగించే ముందు కేపీటీసీఎల్ అధికారులతో చర్చించి, తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలన్నారు. బలరాం, చంద్రశేఖర్ దేశాయిలున్నారు. బాలల రక్షణ కమిటీని రద్దు చేయండి రాయచూరు రూరల్: జిల్లాలో నియమించిన బాలల హక్కుల రక్షణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని జనపర సంఘటన వేదిక డిమాండ్ చేసింది. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో వేదిక అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడారు. జిల్లాలో బాలల హక్కుల రక్షణ కమిటీ అధ్యక్షుడిగా సింధనూరు సత్యనారాయణ శెట్టి, సభ్యునిగా బీదర్ జగన్నాథ్‌లను నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. జయశ్రీ, శరణ బసవ, మారెమ్మ, తాయప్ప, మల్లేష్, రామణ్ణ, కిరణ్ కుమార్, నీలమ్మ, అమరమ్మలున్నారు. పెద్దలను గౌరవించాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో పెద్దలను గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ సిద్రామప్ప పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార, దివ్యాంగుల శాఖ, సీనియర్ సిటిజన్, రోటరీ క్లబ్, కృష్ణా తుంగ సంయుక్త ఆధ్వర్వంలో ప్రపంచ సీనియర్ సిటిజన్లపై వివక్ష అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. సీనియర్ సిటిజన్లపై దాడి చేసినట్లు కేసులు నమోదైన 60 నుంచి 90 రోజుల్లో వాటిని పరిష్కరించాలన్నారు. పెద్దల ఆస్తులను తీసుకుని వారిని క్షేమంగా చూడకపోతే వారి ఆస్తులను తిరిగి పొందడానికి వీలుగా చట్టం జారీ చేశారన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ, శరణమ్మ, సరస్వతి, పవన్ పాటిల్, లక్ష్మికాంతరెడ్డి, వీరభద్రప్ప, భాస్కర్, శ్రీదేవిలున్నారు. -
ఎలుగుబంటి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని హులికట్టి గ్రామంలో పంట పొలానికి వెళ్లిన ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. యంకప్ప(60) ఎలుగుబంటి దాడికి గురయ్యాడు. అడవి జంతువుల బారి నుంచి తన పంటను కాపాడుకోడానికి అతను పొలానికి వెళ్లినప్పుడు, అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తల, ముఖం, చేతులపై కరిచి తీవ్రంగా గాయపరిచింది. బావిలో పడి బాలుడు మృతి క్రిష్ణగిరి: బావిలో నంచి నీరు తేవడానికి తల్లితో కలిసి వెళ్లిన మూడేళ్ల బాలుడు బావిలో పడి చనిపోయిన ఘటన బేరికె వద్ద జరిగింది. వివరాల మేరకు.. సూళగిరి తాలూకా కడతూరుకు చెందిన వెంకటేష్ (25), భార్య చిత్ర. వీరికి లోకేష్ (3) అనే కుమారుడు, ఏడాదిన్నర కూతురు ఉన్నారు. వెంకటేష్ ఓ రైతు పొలంలో కుటుంబంతో కలిసి ఉంటూ కూలి పనులు చేసేవాడు. ఆదివారం సాయంత్రం చిత్ర బావి నుంచి నీరు తీసుకొచ్చేందుకు కొడుకుతో కలిసి వెళ్లింది. ఈ సమయంలో బాలుడు లోకేష్ ఆకస్మాత్తుగా కాలు జారి బావిలో పడిపోయాడు. ఎవరూ కాపాడలేకపోవడంతో అతడు చనిపోయాడు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం ఖండిస్తూ నిరసన
హొసపేటె: వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణాన్ని ఖండిస్తూ కొప్పళ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యకర్తలు టైర్లకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆగస్టు 19న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విచారణకు అనుమతించాలన్న రాష్ట్ర గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని టైర్లకు నిప్పు పెట్టారు. టైర్లకు నిప్పు పెట్టి నిరసన ప్రకటిస్తున్న దృశ్యం -
గుండెపోటుతో ప్రముఖ కళాకారుడు మృతి
బళ్లారిటౌన్: నగరానికి చెందిన ప్రముఖ చిత్రలేఖన కళాకారుడు, ప్రముఖ హిందుస్తానీ గాయకుడు జాలిబెంచి దొడ్డబసవాచార్య గవాయి మనవడు మంజునాథ్ గోవిందవాడ(52) సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మంజునాథ్ లలితకళా అకాడమి అవార్డును పొందారు. ఆయన సైకత, తైల, జలవర్ణంలో చిత్రకళను ప్రదర్శించేవారు. హంపీ ఉత్సవాలతో పాటు వివిధ సభలు, సమావేశ వేదికల్లో స్వాగత బ్యానర్లను రూపొందించి ఆకట్టుకున్నారు. ఆయన మృతికి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, ప్రముఖులు ఎన్.ప్రతాప్‌రెడ్డి, టీహెచ్ఎం బసవరాజు, నిష్టిరుద్రప్ప, వీరభద్రగౌడ, అధికారులు చోరనూరు కొట్రప్ప, బీ.నాగరాజు, కళాకారులు హంద్యాళ్ పురుషోత్తం, శంకరబండె యల్లనగౌడ, ఆదోని వీణా, తిప్పేస్వామి, రమణప్ప తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 21న బోవి సమావేశం హోసూరు: హోసూరులో జూన్ 21వ తేదీ జరగనున్న క్రిష్ణగిరి జిల్లా బోవి సముదాయ సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యవర్గ కమిటీ నిర్వాహకులు కోరారు. హోసూరు చెరువు వీధి సమీపంలోని అమ్మన్ సెలబ్రేషన్ హాలులో జరుగుతుందని, పెద్దఎత్తున సముదాయ ప్రజలు పాల్గొని, తమ వర్గం అభివృద్ధిపై చర్చించాలని కోరారు. -
బస్సు, బైక్ ఢీ.. బైకిస్టు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని చిలుమెహళ్లి తాండా సమీపంలో బస్సు, బైక్ మధ్య జరిగిన ప్రమాదంలో బైక్ చోదకుడు కరిబసప్ప (65) మృతి చెందగా, వెనుక కూర్చొన్న సదాశివకు తీవ్ర గాయాలయ్యాయి. సండూరు తాలూకాలోని మట్టజనహళ్లికి చెందిన కరిబసప్ప, సదాశివ వ్యక్తిగత పనిపై కూడ్లిగి తాలూకాలోని అప్పేనహళ్లి తాండాకు వచ్చి తమ గ్రామానికి తిరిగి వెళ్తుండగా స్వాగత కమాను సమీపంలో మట్టజనహళ్లి వైపు నుంచి సండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. బైక్ నడుపుతున్న కరిబసప్ప అక్కడికక్కడే మరణించగా, వెనుక కూర్చొన్న సదాశివ గాయపడ్డాడు. మృతుడు కరిబసప్ప కుమారుడు ఉపేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుడేకోటె పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుబ్రహ్మణ్య తెలిపారు.


