relationship
-
సందేహాలను నివృత్తి చేసే.. దుల్హా–దుల్హన్
గతంలో పెళ్లి జరగాలంటే వధూవరులను పెద్ద నాన్నలు, బాబాయ్‌లు, మామలు, పెద్దమ్మలు, మేనత్తలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి అబ్బాయి లేదా అమ్మాయి నచి్చతే వారి గుణగణాలు తెలుసుకొని కుటుంబ పరిస్థితి తెలుసుకొని పెళ్లి జరిపించేవారు. వివాహం జరిగిన తర్వాత భర్తతో ఎలా మసలుకోవాలి?, అత్తగారింట్లో ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు కొత్తగా పెళ్లయిన వారికి చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై యాంత్రిక జీవనం కొత్తగా పెళ్లయిన వారినే కాకుండా పెళ్లికి ముందు కూడా వధూవరులను, పెళ్లి తర్వాత భార్యా, భర్తలను మనస్పర్థలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోలిచౌకిలో నివసించే ఇలియాస్ షంషి అనే వ్యక్తి ‘దుల్హా–దుల్హన్’ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీని గురించిన మరిన్ని విశేషాలు..! టోలిచౌకి బాల్‌రెడ్డినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుల్హా–దుల్హన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారు ఎలా ఉండాలి అనే దానిపై 15 అంశాల్లో నిర్వాహకుడు ఇలియాస్ షంషి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కోల్‌కతాతో పాటు దుబాయ్, కెనడా, అమెరికాలో కూడా షంషి ప్రారంభించిన ఆన్లైన్ క్లాస్‌లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పెళ్లంటే ఏంటి?, పెళ్లిలో మంత్రాల అర్థం ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి?, పెళ్లి ఎందుకు?, బాధ్యతలు, భర్తతో మనస్పర్థలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?, భార్య అంటే ఎలా ఉండాలి?, భర్త చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి?, మీరు మంచి భర్తగా ఎలా ఉండొచ్చు తదితర అంశాలపై షంషి శిక్షణ ఇస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తూ.. హోమ్ మేనేజ్మెంట్, భర్త మనసును ఎలా గెలుచుకోవాలి, భార్య మనసును ఎలా గెలుచుకోవాలి ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్‌లో భాగమయ్యాయి. పెళ్ళికి ముందు వధూవరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సందేహాలను నివృత్తి చేస్తూనే పెళ్లి తర్వాత మంచి భర్తగా, లేదా మంచి భార్యగా ఎలా ఉండాలి అన్న అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతున్నది.మంచి స్పందన మేం ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ మా సంస్థకు రెస్పాన్స్ పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, కెనడా తదితర ప్రాంతాల నుంచి కూడా మేం నిర్వహించే ఆన్లైన్ క్లాస్‌లకు అభ్యర్థులు హాజరవుతున్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భార్యా, భర్తల బంధం ఎంత బలంగా ఉండాలో ఈ శిక్షణ ద్వారా సూచిస్తున్నాం. ఇప్పటి వరకూ వేలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడు నెలల పాటు ఈ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. అంతే కాదు బెస్ట్ మదర్ అనిపించుకోవడం ఎలా అన్నదానిపై కూడా మా శిక్షణ కొనసాగుతున్నది. ఇటీవల పెళ్లికి ముందే చిన్న చిన్న విషయాల్లో వధూవరులకు మనస్పర్థలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలూ చూస్తున్నాం. దుల్హన్ కోర్సులో ఈ విషయాలన్నింటికీ సమాధానాలు లభిస్తున్నాయి. యువతీ, యువకులకు వేర్వేరుగా ఈ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాం. – ఇలియాస్, షంషీ, ట్రైనర్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటు.. ప్రతిరోజూ పాతిక మంది వరకూ ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే ఈ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటైంది. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో యువతీ, యువకులకు శిక్షణతో పాటు తగిన సూచనలు జారీ చేశారు షంషి. భార్యా, భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వాటిని పరిష్కరించే దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి సలహాలు, సంప్రదింపులు కావాలంటే తమ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావొచ్చు అని కూడా పేర్కొంటునారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మేం చెప్పబోయే అంశాలు ఏమిటి అన్న దానిపై వివరిస్తూ స్పష్టంగా వెబ్సైట్లో పొందుపరిచారు. -
విడిపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం విచ్ఛిన్నమై వారిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే.. ఆ బంధం విడిపోవడమే ఆ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇద్దరి మధ్య సంబంధం తెగిపోవడం అనేది నేరం కాదని, అందుకు శిక్ష విధించలేమని స్పష్టంచేసింది. సెక్షన్ ప్రకారం 306 ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ అయితేనే శిక్ష విధించగలమని వెల్లడించింది. ఒక వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటకకు చెందిన కమ్రుద్దీన్ దస్తగిర్ సనాదీ, మరో మహిళ ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేశారు. 2007 ఆగస్టులో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమ్రుద్దీన్ అరెస్టయ్యాడు. అతడిౖపై ఐపీసీ సెక్షన్ 417(మోసం), సెక్షన్ 306(ఆత్మహత్యకు పురికొల్పడం), సెక్షన్ 376(అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. కమ్రుద్దీన్ నిర్దోషి అని గుర్తిస్తూ కింది కోర్టు తీర్పు ఇచ్చింది. సవాల్ చేస్తూ పోలీసులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కమ్రుద్దీన్‌ను దోషిగా తేల్చింది. ఐదేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. రూ.25 వేల జరిమానా సైతం విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇది బంధం విడిపోయిన కేసు తప్ప నేరం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
లవ్ లో ఉన్న మాట నిజమే.. ఓపనైపోయిన రౌడీస్టార్.. విజయ్
-
అతని కోసం చాలా విషయాల్లో రాజీపడ్డాను : అనన్యా పాండే!
‘మనం ఇష్టపడే వారి కోసం ఎంత మారినా పర్వాలేదనిపిస్తుంది’ అంటున్నారు హీరోయిన్ అనన్యా పాండే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారీ నార్త్ బ్యూటీ. 2022 ఆగస్టు 25న ఈ చిత్రం విడుదలైంది. ‘లైగర్’ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదామె. అయితే హిందీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో నేను రిలేషన్షిప్లో ఉన్నాను. ఎదుటి వ్యక్తి కోసం నేనెంతగానో మారాను. చాలా విషయాల్లో రాజీపడ్డాను. రిలేషన్షిప్ ప్రారంభమైనప్పుడు ఎదుటి వ్యక్తి మెప్పు పొందడం, వారి దృష్టిని ఆకర్షించడం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. మనం ఎంత మారినా ఫర్వాలేదనిపిస్తుంది. అయితే మనం మారుతున్నామనే విషయం ఆరంభంలో మనకు అర్థం కాదు. ఇది సహజంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలు తెలియవు. ఏదీ మనకు సమస్యగా అనిపించదు. ఆ బంధం నుంచి మనం బయటకు వచ్చినప్పుడే అన్నీ అర్థం అవుతాయి. రిలేషన్షిప్లో నేను నిజాయతీగా ఉంటాను. ఎదుటి వ్యక్తి నుంచీ అంతే నిజాయతీ లభిస్తే బాగుంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటేనే ఏ బంధమైనా బలపడుతుంది. నాకు కాబోయే వ్యక్తి సింప్లిసిటీగా, నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి’’ అని తెలిపారు అనన్యా పాండే. ఇదిలా ఉంటే నటుడు ఆదిత్యరాయ్ కపూర్‌తో అనన్య ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలేషన్ షిప్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం ‘శంకరా’ అనే సినిమాలో నటి స్తున్నారు అనన్యా పాండే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. -
ఇంట్లో ఇల్లాలు.. పీజీలో ప్రియురాలు
మైసూరు: వివాహమై భార్యతో కాపురం చేస్తున్నా మరొక మహిళతో ప్రేమాయణం నడిపి గర్భవతిని చేయడమే కాకుండా రూ.9 లక్షలను తీసుకుని మోసగించిన ఘటన మైసూరులోని వీవీ మొహల్లాలో వెలుగుచూసింది. మోసపోయిన మహిళ జయలక్ష్మిపురం పోలీసు స్టేషన్లో బెంగళూరు నివాసి భరత్‌గౌడ, అతని తల్లిదండ్రులు సురే‹Ù, అంకితలపై ఫిర్యాదు చేసింది. వయసులో పెద్దయినా.. వివరాలు..బాధితురాలు భాగ్యలక్ష్మి (32) గోకులంలో ప్రైవేటు హాస్టల్ (పీజీ) నడుపుతున్నారు. 2022లో భరత్‌గౌడ (29)తో ఇన్‌స్టా లో పరిచయం ఏర్పడింది. తనకన్నా ఆమె పెద్దదైనప్పటికీ, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అప్పటికే అతనికి పెళ్లయింది. కానీ విడాకులు ఇచ్చానని బాధితురాలికి నమ్మబలికాడు. మోసగానికి అతని తల్లిదండ్రులు కూడా వంతపాడుతూ బాధిత మహిళను వలలోకి లాగారు. నమ్మిన మహిళ పెళ్లికి ఒప్పుకుంది. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రుల సమక్షంలో 2023లో ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో వ్యాపారం కోసమంటూ రూ.10 లక్షలు, 100 గ్రాముల బంగారు ఆభరణాలను భరత్‌గౌడ వరకట్నంగా తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.8 లక్షలు ఇచ్చి కార్ వాషింగ్ సెంటర్‌ని పెట్టించింది. అంతేగాకుండా ఆమె క్రెడిట్ కార్డు నుంచి భరత్‌గౌడ రూ.1.25 లక్షలను డ్రా చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలిసి ఇలా ఉండగా మొదటి భార్య మోనిక ఈ విషయాన్ని తెలుసుకుని భాగ్యలక్ష్మికి భరత్‌గౌడ మోసగాడు, జాగ్రత్తగా ఉండాలని మెసేజ్ చేసింది. దీనిపై భాగ్యలక్ష్మి నిలదీయగా, ఆమె మాటలు నమ్మవద్దని చెప్పాడు. మొదటి భార్యతో కాపురం చేస్తూనే నాటకమాడి తనను మోసగించినట్లు అర్థమైంది. దీంతో నిలదీయగా చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ నేపథ్యంలో అతని మోసాల గురించి భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఏఆర్ రెహమాన్, ధనుష్ సహా రీసెంట్గా విడాకులు తీసుకున్న స్టార్స్ (ఫొటోలు)
-
‘పెళ్లాం చెబితే వినాలి'.. ఇది పుష్పగాడి మాటే కాదు..
‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో పెపంచకానికి చూపిస్తా’ అని తాజాగా విడుదలైన ‘పుష్ప2’ ట్రైలర్లో హీరో అంటాడు. సానుకూల వివాహ అనుబంధంలో భార్య మాటకు విలువ ఇవ్వడం కుటుంబానికి మంచిది అంటారు నిపుణులు. ‘భార్య మాట వినే భర్త’ను లొంగుబాటుగా చెప్పే పితృస్వామ్య పరంపర ఉన్నా దాని వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు.కుటుంబ జీవనంలో కీలక నిర్ణయాలే కాదు మంచీ చెడూల్లో భార్య సలహా వినదగ్గది. కొన్ని పరిశీలనలు. ఒక వివాహబంధం విజయవంతం కావాలంటే ముందు వినడం నేర్చుకోవాలి’ అంటున్నారు ప్రవర్తనా నిపుణులు. ‘భార్యాభర్తలు మొదట ఎదుటి వారు ఏం చెప్తున్నారనేది ఓపిగ్గా వింటే చాలు ఆ బంధం సగం సఫలమైనట్టే’ అని వారు అంటున్నారు. మన సమాజంలో భార్య మాట వినే భర్త గురించి పరిహాసం ఆడటం ఉంది. ‘భార్యా విధేయుడు’ అంటూ గేలి చేసేవారు కూడా ఉంటారు. సమాజం ఇంత ముందడుగు వేసినా ‘భార్య మాట వినడంలో తప్పు ఏముంది’ అని ఆలోచించే పరిస్థితి లేదు. అమెరికాలో కొత్తగా పెళ్లయిన దాదాపు 130 జంటలను పరిశీలించిన ఒక జాన్ గోట్‌మ్యాన్ అనే సైకాలజిస్ట్ ‘భార్య చెప్పేది సానుకూలంగా వినే భర్త ఉన్న జంటలు సంతోషంగా గడపడం’ గమనించాడు. ‘అలాగని ఈ జంటల్లో భర్త మాట భార్య వినకపోవడం అంటూ లేదు. వారు ఎలాగూ వింటారు’ అంటాడు గోట్ మ్యాన్. భారతీయ సమాజంలో భర్తకు ఎదురు నిలవడం అందరు భార్యలు చేయరు. అయితే జోక్గానో, గొణుగుతున్నట్టుగానో, అనునయంగానో చెప్పే భార్యలు ఉంటారు. ‘అలాంటి భార్యలు చెప్పింది విని ముందుకు సాగే భర్త ఉన్న జంటలు కూడా ఇంచుమించు గొడవలు లేకుండా ఉంటున్నాయి’ అంటాడు గోట్‌మ్యాన్. భార్యాభర్తల్లో ‘అతను చెప్పేది ఏముందిలే’ అని భార్య అనుకున్నా ‘ఆమెకేం తెలుసు ఆమె ముఖం’ అని భర్త అనుకున్నా ఆ వివాహబంధం ప్రమాదంలో పడుతుంది. ఏ వివాహ బంధమైనా ఒకరి దృష్టికోణం నుంచి నడవదు. కాపురంలో తల్లి తరపు వాళ్లు, తండ్రి తరుపు వారు ఉంటారు. స్నేహితులు ఉంటారు. ఇద్దరి వేరు వేరు కెరీర్లు ఉంటాయి. అంటే ఒక సమస్యకు కచ్చితంగా కనీసం రెండు దృష్టికోణాలుంటాయి. భర్తలు కేవలం తమ దృష్టికోణమే సరైనది అనుకోకూడదు. ‘స్త్రీలు జాగ్రత్తగా అన్నీ గమనించి భర్తకు సూచనలు చేస్తారు. ఆ సూచనలను భర్త ఆమెతో చర్చించాలి. నా మాటే నెగ్గాలి అని తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం ఇద్దరికీ వస్తుంది’ అంటాడు గోట్‌మ్యాన్.భర్త తన స్పందన, అప్పులు, ఇచ్చిన హామీలు, కొన్న/కొనబోయే ఆస్తులు, పిల్లల కోసం పొదుపు, ఆరోగ్య విషయాలు... ఇవన్నీ భార్యకు తెలియచేస్తూ ఆమె సలహాను వినాల్సి ఉంటుంది. అలాగే భర్త ఇంట్లో లేనప్పుడు పిల్లల ప్రవర్తన, వారి కదలికలు, బంధువుల రాకపోకలు వచ్చే డిమాండ్లు ఇవన్నీ భార్య తప్పకుండా భర్తకు చేరవేయాలి. ముఖ్యంగా పిల్లలను కరెక్ట్ చేయాల్సిన అంశాలు భార్య లేవనెత్తినప్పుడు భర్త నిర్లక్ష్యం చేయరాదు.అవి సమస్యలు తెస్తాయి. అందుకే గతంలో స్త్రీల మాట చెల్లుబాటయ్యే సందేశం ఇస్తూ ‘పెళ్లాం చెబితే వినాలి’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ‘ఫైర్’లాంటి పుష్ప కూడా ‘పెళ్లాం మాట వినాలి’ అంటున్నాడు. భార్య సరైన సలహా ఇస్తే దానిని ఎందుకు వినకూడదు చెప్పండి? (చదవండి: హృతిక్ రోషన్ సోదరి సునైనా వెయిట్ లాస్ స్టోరీ: ఏకంగా 50 కిలోలు..!) -
‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’
బాలీవుడ్లో కరీనా కపూర్ ఖాన్‌కి గాసిప్ క్వీన్ అనే పేరుంది. అక్క కరిశ్మా కపూర్‌తో ఫోన్లో గంటలు గంటలు కబుర్లు చెబుతూ ఉంటుందట. అందులో సగం గాసిప్సే ఉంటాయని ఆ ఇద్దరి సన్నిహితుల కామెంట్! అదటుంచితే.. ఈ అక్కాచెల్లెళ్ల ఎడతెగని ఫోన్ సంభాషణలతో కరీనా కపూర్ ఖాన్ హజ్బెండ్, నటుడు.. సైఫ్ అలీ ఖాన్ తెగ ఉడుక్కుంటాడట. ‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’ అంటూ ఆ ఉడుకుమోత్తనాన్ని చూపిస్తాడట కూడా! -
పేరెంట్స్ కన్నా, ఫ్రెండ్స్ మాటలే ముఖ్యం
‘మావాడు మేం చెప్పేది అస్సలు వినడండీ. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటుంటాడు. వాళ్లందరూ ఒక గ్యాంగయ్యారు. బైక్‌తో రిస్కీ ఫీట్స్ చేస్తుంటారు. ఎప్పుడేం తెచ్చుకుంటారోనని గుండె అదురుతుంటుంది..’‘మా పాప మేమేం చెప్పినా పట్టించుకోదండీ. ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వెంటనే చేసేస్తుంది. తనకు నచ్చేలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.’‘మా అబ్బాయి ఒకరోజు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడు, మరుసటి రోజే డల్‌గా కనిపిస్తాడు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు.’కౌన్సెలింగ్‌కు వచ్చే చాలామంది పేరెంట్స్ తమ టీనేజ్ పిల్లల గురించి చెప్పే మాటలవి. చిన్నప్పటి నుంచీ అమ్మ కూచిలా లేదా నాన్న బిడ్డలా ఉన్న పిల్లలు, అప్పటివరకు తమ అభిప్రాయలను గౌరవించి, తాము చెప్పే సూచనలు పాటించే పిల్లలు ఒక్కసారిగా మారేసరికి పేరెంట్స్ తట్టుకోలేరు. వారెక్కడ చేజారిపోతారోనని బాధపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆ వయసుకు అది సహజం. టీనేజ్‌కు వచ్చేసరికి వారి ప్రపంచం కుటుంబాన్ని దాటి విస్తృతమవుతుంది. ఈ దశలో స్నేహితులు, ఆన్లైన్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ మాటలకే ఎక్కువ విలువిస్తారు. స్నేహితుల ఆమోదం, గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పును అర్థం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు.. సున్నితమైన ఈ దశలో పిల్లలకు సరైన మద్దతు అందించగలుగుతారు. పీర్ ప్రెజర్.. స్నేహితుల ఆమోదం పొందాలనే ఒత్తిడి అందరిపైనా ఉంటుంది. కానీ టీనేజ్‌లో ఎక్కువగా ఉంటుంది. టీనేజర్లు ఒక గ్యాంగ్‌లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఆ వయసులో అది అత్యవసరమనిపిస్తుంది. ఆ స్నేహితుల ఒత్తిడికి లోనైనప్పుడు తప్పులు చేసే అవకాశాలు పెరుగుతాయి. కొందరు టీనేజర్లు మితిమీరి ప్రవర్తించవచ్చు. మద్యం సేవించడం, ప్రమాదకరమైన ఫీట్స్ చేయడం, విచిత్రమైన వేషధారణలోనూ కనిపించవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, తల్లిదండ్రులు సంయమనంతో ఉండటం ముఖ్యం. పీర్ ప్రెజర్ గురించి పెద్దలతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలతో చర్చించి, వారి నిర్ణయాలపై గల ప్రభావాన్ని అర్థంచేయించేందుకు ప్రయత్నించాలి. స్నేహితులకు ‘నో’ చెప్పగలిగే ధైర్యాన్ని నేర్పాలి. సోషల్ మీడియా ప్రభావం.. స్నేహితుల ఒత్తిడి కేవలం పాఠశాల సమయంతో ఆగిపోదు. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ద్వారా 24/7 కొనసాగుతుంది. ఇవి తమ వ్యక్తీకరణకు ఎంత ఉపయోగపడతాయో, అంతే నెగటివ్ ప్రభావాన్నీ చూపించే సామర్థ్యం గలవి. సోషల్ మీడియాలో ఇతరులను చూస్తూ, పోల్చుకోవడం వల్ల కొందరు టీనేజర్లు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. పోస్టులకు లైకులు, కామెంట్ల ద్వారా వెంటనే గౌరవాన్ని పొందాలనుకునే తీరు కూడా వారిని కుంగిపోయేలా చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఈ ఒత్తిడిని తల్లిదండ్రులు గ్రహించి, వారితో మాట్లాడాలి. వారు చూస్తున్న కంటెంట్ గురించి చర్చించాలి. అది నిజ జీవితాన్ని ప్రతిబింబించదని వారికి అర్థమయ్యేలా వివరించాలి. నిర్ణయాలు, ఆత్మగౌరవంస్నేహితులు, సోషల్ మీడియా ఒత్తిడికి లోనైనప్పుడు టీనేజర్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఎమోషన్‌తో నిర్ణయాలు తీసుకుంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో ఉంటే వారు మరింతగా స్నేహితుల ఒత్తిడికి లోనవుతారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం అత్యంత కీలకం. తల్లిదండ్రులు ఆ బాధ్యతను తీసుకోవాలి. పిల్లలు తమ ప్రతిభను గుర్తించేలా చేయాలి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ప్రతిరోజూ వారి అభిరుచులు, కష్టాలను గుర్తిస్తూ విజయం దిశగా వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు చేయాల్సింది..యవ్వనంలో, స్నేహితుల ఒత్తిడి సహజమే. కానీ, మీరు సున్నితంగా, ప్రేమతో పిల్లలకు మార్గనిర్దేశం చేస్తే, వారు సంయమనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అందుకు మీరు చేయాల్సింది.. పిల్లలకు మీరెప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పాలి. వారు తమ సమస్యలు మీతో పంచుకునేలా నమ్మకాన్ని కలిగించాలి.ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం, స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పాలి.సోషల్ మీడియా కంటెంట్ గురించి ఓపికగా చర్చించాలి.వారి కృషి, కష్టాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రశంసించాలి.వారు తీసుకునే నిర్ణయాల ఫలితాలను అర్థంచేసుకోవడంలో వారికి సహాయం చేయాలి. -
భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి?
అల్లాహ్ స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యత ప్రసాదించడం వల్ల, పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చు పెడుతున్నందువల్ల పురుషులు స్త్రీలపై వ్యవహార కర్తలవుతారు. కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భర్తకు విధేయత చూపుతూ వారి కనుసన్నలలో నడుచుకుంటారు. పురుషులు (ఇంటిపట్టున) లేనప్పుడు దేవుని రక్షణలో వారి హక్కులు కాపాడుతుంటారు. మీ మాటలకు ఎదురు చెప్పి తిరగబడతారని భయం ఉన్న స్త్రీలకు (నయానా భయానా) నచ్చజెప్పండి. (అలా దారికి రాకపోతే) వారిని మీ పడకల నుండి వేరు చేయండి. ఆ తరువాత వారు మీకు విధేయులయిపోతే ఇక వారిని అనవసరంగా వేధించడానికి సాకులు వెతకకండి. పైన అందరికంటే అధికుడు, అత్యున్నతుడైన అల్లాహ్ ఉన్నాడని గుర్తుంచుకోండి.భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయని భయం ఉంటే భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని పెట్టుకోండి. వారిద్దరు కలిసి పరిస్థితిని చక్కదిద్దదలచుకుంటే అల్లాహ్ దంపతుల మధ్య సానుకూలత కలిగిస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞాని. సమస్తమూ ఎరిగినవాడు. (దివ్య ఖుర్ఆన్: 4:34–35)వివరణ: భార్య విననప్పుడు నచ్చజెప్పడం, పడకగదికి దూరంగా ఉండటం, విధేయత కనబరిస్తే ఆమెను మనసారా స్వీకరించడం ఎంత దానశీలి అయినా, ఎన్నిసార్లు దైవపూజలు చేసే వారయినా, భార్యని కొట్టే వారిని ప్రవక్త అభిమానించేవారు కాదు. 35 ఆయత్ (వాక్యం)లో అల్లాహ్ ఎంతోమంచి పరిష్కారం చూపాడు. భార్యాభర్తల మధ్య పొసగనపుడు అటువైపు నుండి ఒక మధ్యవర్తి ఇటువైపు నుండి ఒకరు మధ్యవర్తిత్వం వహించి వారిద్దరి మధ్య సమాధానం కుదిరిస్తే ఆ దంపతులు కూడా సమాధాన పడితే ఇద్దరి మధ్య అల్లాహ్ సానుకూలత కలిగిస్తాడు. మనిషికి దేవుడు మంచి చెడుల విచక్షణ జ్ఞానం, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇచ్చాడు. కాబట్టి వాటిని ఆయన అడ్డుకోకుండా స్వయంగా మనిషి సంకల్పించుకుంటే అల్లాహ్ దానిని పరిపూర్ణం చేస్తాడు. ఏ విషయంలోనూ ఎవరికీ బలవంతం పెట్టాడు. మనిషి విచక్షణను బట్టి అల్లాహ్ ఆ మనిషితో వ్యవహరిస్తాడు. కాబట్టి మనుషులమైన మనం మంచిని ఆలోచిస్తూ మంచినే కాంక్షిస్తూ మంచి చేస్తుంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అంతా మంచే జరుగుతుంది. అల్లాహ్ మనందరికీ మంచి చేసే భాగ్యాన్ని కలుగజేయుగాక ఆమీన్ (తథాస్తు)ఆధారం: అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ భావామృతం– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
ఆకాశంలో సగానికి అన్యాయమా!
దేశం మొత్తాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉదంతం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వైవాహిక బంధంలో జరిగే అత్యాచారం (మారిటల్ రేప్) గురించి ప్రస్తావించి దాన్ని నేరంగా గుర్తించాలని సిఫార్సు చేసినప్పుడు ‘మర్యాదస్తులు’ నొచ్చుకున్నారు. ఆ చర్య వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయదా... వారి పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చదా అని చాలామంది ప్రశ్నించారు. ఈ అంశంపై అంతకు చాన్నాళ్ల ముందే వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ మళ్లీ దాన్ని ఎజెండాలో తెచ్చింది. దాంపత్య జీవితంలో ఉండే లైంగిక సంబంధం పరస్పర అన్యోన్యత ఆధారంగా ఏర్పడుతుందనీ, దాన్ని కేవలం ‘సమ్మతి’ అనే పదంలో కుదించటం అసాధ్యమనీ అఫిడవిట్ అంటున్నది. గతంలోని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) అయినా, దాని స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అయినా దాంపత్య జీవితంలో జరిగే అత్యాచారానికి మినహాయింపునిచ్చాయి. అత్యాచారానికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ సెక్షన్ 375 నిర్దేశిస్తూ ఈ నేరానికి పాల్పడే భర్తకు మినహాయింపునిచ్చింది. బీఎన్ఎస్ఎస్లో ఈ సెక్షన్ 63గా మారింది. మినహాయింపు కూడా యధాతథంగా కొనసాగింది. భార్య వయస్సు 18 యేళ్లు దాటిన పక్షంలో భర్త జరిపే అత్యాచారానికి మినహాయింపు ఉంటుందని చట్టం చెబుతోంది. ఈ మినహాయింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తే మొత్తం వివాహ వ్యవస్థపైనే అది తీవ్ర ప్రభావం చూపగలదని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ హెచ్చరిస్తోంది. చట్టంలో ఉన్న మినహాయింపు అత్యాచారం చేయటానికి భర్తకిచ్చే లైసెన్సు కాదంటూనే ఆ అంశాన్ని చట్టంవైపుగా కాక సామాజిక కోణం నుంచి చూడాలని అభిప్రాయపడింది. సంబంధిత పక్షాలన్నిటితో, రాష్ట్రాలతో చర్చించాక చట్టసభ తీసుకోవాల్సిన నిర్ణయం గనుక న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని తెలిపింది. భార్య సమ్మతికి రక్షణ కల్పించేందుకు ఇప్పుడున్న చట్టాల్లో ఏర్పాట్లున్నాయనీ, గృహ హింస చట్టంవంటివి రక్షణగా నిలుస్తాయనీ చెప్పింది. నేరం ఒకటే అయినప్పుడు దాన్ని వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఎలా పరిగణిస్తారు? హత్య జరిగితే అది చోటుచేసుకున్న ప్రాంతాన్ని బట్టి దాన్ని హత్యాయత్నంగా అనుకోగలమా? పరిచితుడో, అపరిచితుడో మహిళపై అత్యాచారం చేస్తే దానికి శిక్ష ఉన్నప్పుడు... భర్త అదే పనిచేసినప్పుడు మినహాయింపు ఇవ్వటం ఏ రకంగా న్యాయం? 2022లో ఢిల్లీ హైకోర్టులో మారిటల్ రేప్‌పై పిటిషన్ దాఖలైనప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని అభిప్రాయపడితే, అది సరికాదని మరో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు రెండూ మారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాల్సిందేనని తీర్పులు వెలువరించాయి. మన పౌరులైనా, విదేశీ పౌరులైనా చట్టం ముందు అందరూ సమానులనీ, అందరికీ సమానమైన రక్షణ లభిస్తుందనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. భర్త చేసే అత్యాచారం నేరంగా పరిగణించకూడదని మినహాయింపునివ్వటం వివాహ బంధంలోని మహిళకు ఈ అధికరణ వర్తించబోదని చెప్పటం కాదా? కానీ కేంద్రం అలా అనుకోవటం లేదు. ఇది పెళ్లయితే స్త్రీ తన హక్కును కోల్పోతుందని పరోక్షంగా చెప్పటం కాదా? మన దేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారన్న అఫిడవిట్ అభిప్రాయంతో విభేదించనవసరం లేదు. అలాగే వివాహ వ్యవస్థకుండే బహుముఖ పార్శా్వల్లో భార్యాభర్తల లైంగిక సంబంధం ఒకటి మాత్రమేనని చేసిన వాదననూ తప్పుబట్టనవసరం లేదు. కానీ సామాజిక విశ్వాసాలకూ, రాజ్యాంగ విలువలకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడినప్పుడు ఒక గణతంత్ర రాజ్యం రాజ్యాంగ విలువలకు మాత్రమే ప్రాధా న్యమివ్వాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని సమాజాల్లోనూ భిన్న ఆధిపత్య ధోరణులు అల్లుకుపోయి వుంటాయి. పితృస్వామిక సమాజాల్లో స్త్రీలపై ఆధిపత్యం సాధించటానికి పురుషుడి చేతిలో అత్యాచారం ఒక ఆయుధం. దీన్ని చాలా ముందుగా గుర్తించబట్టే సోవియెట్ యూనియన్ 1926లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1950లో జెకోస్లోవేకియా, 1969లో పోలెండ్ ఈ మాదిరి చట్టాలు చేశాయి. ఇవన్నీ అప్పటికి సోషలిస్టు రాజ్యాలు. ప్రస్తుతం దాదాపు 150 దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయి. భార్య లైంగిక స్వయంప్రతిపత్తిని భర్త అయినా సరే దెబ్బతీయరాదనీ, అది నేరపూరిత చర్య అవుతుందనీ ఈ చట్టాలు భావిస్తున్నాయి. సకల ప్రజాస్వామ్య దేశాలకూ భారత్ తల్లిలాంటిదని చెప్పుకుంటున్న మనం మాత్రం మారిటల్ రేప్ విషయంలో ఇంకా తడబాటు ప్రదర్శించటం సబబేనా?దాంపత్య జీవనంలో భర్తలు సాగించే హింసను మన దగ్గర మహిళలు మౌనంగా భరిస్తున్నారు. భరించ శక్యం కాని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బయటికొస్తున్నారు. భర్త లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని వారిలో అతి కొద్దిమంది మాత్రమే వెల్లడిస్తున్నారు. స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం ముంబైలోని ధారవిలో ఈ సంస్థ ముందు 3,878 ఫిర్యాదులు దాఖలుకాగా అందులో 52.11 శాతం లైంగిక హింసకు సంబంధించినవే. 19.33 శాతంమంది తమ భర్త తమపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారని ఆ సంస్థ అంటున్నది. భార్య అభీష్టాన్ని బేఖాతరు చేయటం నేరమన్న స్పృహ పురుషుడిలో కలగాలంటే మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించటం ఒక్కటే మార్గం. ఇందుకు భిన్నంగా ఆలోచించటం జనాభాలో సగానికి అన్యాయం చేయటమే. -
నటితో ప్రేమ.. బ్రేకప్ చెప్పేసి రోమితో పెళ్లి! కపిల్ దేవ్ సీక్రెట్ లవ్‌స్టోరీ! (ఫొటోలు)
-
అన్ని స్నేహాలూ గొప్పవి కావు
సారిక 28 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్. లీల తన చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చదువుకున్నారు. లీలపై సారికకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇటీవలి కాలంలో లీలతో మాట్లాడిన ప్రతిసారీ సారిక తీవ్ర ఎమోషనల్ స్ట్రెస్ ను అనుభవిస్తోంది. ఆ విషయం లీలతో చెప్పలేక, తన స్నేహాన్ని వదల్లేక, తనలో తానే బాధపడుతోంది.సారిక తన ఆఫీసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పుడు లీల ఆమెపై అసూయను వ్యక్తం చేసింది. ‘‘నువ్వెలా సక్సెసవుతున్నావో నాకు తెలియదా ఏంటి’’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ తన సమస్యల గురించే మాట్లాడుతూ ఉంటుంది. వాటిని పరిష్కరించుకునేందుకు సారికను ఉపయోగించుకుంటోంది. ఎప్పుడైనా పని ఒత్తిడిలో ఉంటి పట్టించుకోకపోతే ‘‘కాస్త సక్సెస్ రాగానే నీకు కళ్లు నెత్తికెక్కాయే. నన్నసలు పట్టించుకోవడం లేదు, నా మాటే వినడం లేదు’’ అంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతోంది. తాను ఎంత చేసినా లీల అలా మాట్లాడుతుండటంతో సారిక బాధపడుతోంది. లీలతో స్నేహం కొనసాగించాలా, వదిలేసుకోవాలో అర్థం కావడంలేదు.ఈ నేపథ్యంలో ‘కనెక్షన్ కార్నర్’ కాలమ్ తన దృష్టికి వచ్చింది. అన్ని ఆర్టికల్స్ చదివాక, తన సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీసుకు వచ్చి, తన సమస్య మొత్తం వివరించింది.‘‘నేనెంత పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నించినా నావల్ల కావడంలేదు సర్. లీలతో ఫ్రెండ్షిప్ టాక్సిక్ గా మారింది. నేను నిజంగానే తనతో సరిగా ఉండటంలేదేమోనని గిల్టీ ఫీలింగ్ వస్తోంది. నా మెంటల్ హెల్త్ దెబ్బతింటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.సారిక కష్టాలివీ... ⇒ లీలను కలిసిన ప్రతిసారీ తన సమస్యల చిట్టా విప్పుతుంది. వాటిని వినీవినీ సారిక మానసికంగా అలసిపోతుంది.⇒ సారిక సలహాలు పాటించకపోగా అవసరానికి తనకు సహాయపడటంలేదంటూ లీల పదే పదే మాట్లాడటం వల్ల సారిక అపరాధభావానికి లోనవుతోంది. అందువల్ల ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ⇒ సారిక తన ఆఫీసు విషయాలు లేదా తన సక్సెస్ గురించి చెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోకపోగా, అది ఎవరైనా సాధిస్తారంటూ తక్కువ చేసి మాట్లాడుతోంది. ⇒ సారిక సక్సెస్ పట్ల లీల ఆనందపడకపోగా అసూయను వ్యక్తం చేస్తోంది. అది సారికను నిరుత్సాహపరుస్తోంది. మొత్తంగా చెప్పాలంటే లీల టాక్సిక్ ఫ్రెండ్షిప్ వల్ల సారిక మానసికంగా బాధపడుతోంది. అందుకే లీలతో స్నేహాన్ని కొనసాగించాలా, వద్దా అనే ఆలోచనలో పడింది.టాక్సిక్ స్నేహాలను వదిలించుకోవాలి... ఒక వ్యక్తి సంతోషంగా జీవించడంలో స్నేహాలది ప్రధాన పాత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని స్నేహాలు విషపూరితంగా ఉంటాయి. వాటివల్ల లాభం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాంటి స్నేహాలను వీలైనంత దూరంగా ఉండటం లేదా త్వరగా వదిలించుకోవడం మంచిది. కొనసాగించక తప్పనిసరి పరిస్థితులుంటే ఆ మేరకు మనసును సిద్ధం చేసుకోవాలి. సారిక సమస్యను అర్థం చేసుకున్నాక ఆమెకు కౌన్సెలింగ్ ప్రారంభించాను. ⇒ ఏరోజుకారోజు తన ఫీలింగ్స్ ను డైరీలో రాయడం ద్వారా తన స్నేహాల్లో ఏవి సంతోషాన్నిస్తున్నాయో, ఏవి బాధపెడుతున్నాయో సారిక తెలుసుకుంది. ⇒ లీల కాల్ చేసిన ప్రతిసారీ పనులు పక్కన పెట్టి మరీ వెళ్లాల్సిన అవసరం లేదని సారిక తెలుసుకుంది. వారానికి ఒకసారి, 15 నిమిషాలు మాత్రమే కలవాలని నిర్ణయించుకుంది. ⇒ తన గిల్టీ ఫీలింగ్ ను అధిగమించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు నిర్దేశించిన ఎక్సర్సైజ్ లను ప్రాక్టీస్ చేసింది. ⇒ మెడిటేషన్ ద్వారా తన మానసిక స్థితిని అదుపులో ఉంచుకొనడం ప్రారంభించింది. ⇒ రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా ఆందోళనకు పగ్గాలు వేయగలిగింది. ⇒ తనను సమర్థించే, ప్రోత్సహించే స్నేహితుల సంఖ్యను పెంచుకుంది. ⇒ లీల మాటల్లోని నెగెటివిటీని అధిగమించడం నేర్చుకుంది. ⇒ రోజూ పాజిటివ్ అఫర్మేషన్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా భావోద్వేగాలపై అదుపు సాధించగలిగింది. అలా సారిక కేవలం నాలుగు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది. లీలతో స్నేహం తెంపేసుకోకుండానే, ఆమె మాటల్లోని నెగెటివిటీని పక్కన పెట్టేయడం నేర్చుకుంది. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉండి, తన కెరీర్ పై మరింత దృష్టి సారించి, మరింత సక్సెస్ సాధించగలిగింది. మీకూ అలాంటి స్నేహాలుంటే వీలైనంత వరకూ తగ్గించుకోండి. అది మీ మానసిక ఆరోగ్యానికి ముఖ్యం.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
Allahabad High Court: సమ్మతి ఉన్నా, భయపెడితే అత్యాచారమే
ప్రయాగ్‌రాజ్: సమ్మతితో లైంగిక సంబంధం పెట్టుకున్నాసరే ఆ సంబంధం భయంతో కొనసాగితే అత్యాచారంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళ వేసిన కేసు విచారణ సందర్భగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణ ఆపాలంటూ తమను ఆశ్రయించిన రాఘవ్ కుమార్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలు సివిల్ సరీ్వసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో రాఘవ్ పరిచయమయ్యాడు. ఆమెను అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత పెళ్లిచేసుకుంటానని నమ్మించి బలవంతంగా ఆ బంధాన్ని కొనసాగించాడంటూ బాధితురాలు ఆగ్రా జిల్లా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు ఆగ్రా జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీన్ని సవాలు చేస్తూ రాఘవ్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ అనీస్ కుమార్ గుప్తా సారథ్యంలోని అలహాబాద్ హైకోర్టు బెంచ్ కొట్టేసింది. -
ఛీ.. ఇంట్లో రోజూ గొడవలే
ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. రెండు వేర్వేరు కుటుంబాల్లో, నేపథ్యాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వారి మధ్య విభేదాలు సహజం. అయితే వాటిని ఎలా, ఎంత త్వరగా పరిష్కరించుకున్నానేదే వారి బంధంలోని సంతోషాన్ని నిర్ణయిస్తుంది. విభేదాలను పరిష్కరించుకోకుండా చిన్న చిన్న వాదనలను కూడా పెద్ద పెద్ద గొడవలుగా మార్చుకుంటే కుటుంబ జీవితాన్ని నరకంగా మారుతుంది. అలాంటి ఒక జంట గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రవి (32) ప్రియ (30)లకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. రవి ఐటీ కన్సల్టెంట్, ప్రియ హెచ్ ఆర్ మేనేజర్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. తమ బిడ్డ కీర్తన అంటే ప్రాణం. ఇంటి పనులతో సహా బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. వారాంతాల్లో సినిమాలు, షికార్లు. అప్పుడప్పుడూ విహారయాత్రలు. సుఖంగా సంతోషంగా జరుగుతున్న కాపురం.కానీ గత కొద్ది నెలలుగా మారి మధ్య తరచూ గొడవలవుతున్నాయి. గత నెల జరిగిన గొడవ ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది. ఆ తర్వాత తమ ప్రవర్తనకు ఇద్దరూ సిగ్గుపడ్డారు. ఎలాంటి విభేదాలున్నా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప గొడవ పడకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ పెద్ద గొడవలయ్యాయి. ఇక తమ వల్ల కాదనుకుని కౌన్సెలింగ్ కు వచ్చారు. ఇద్దరితో విడివిడిగా, కలివిడిగా మాట్లాడాను.చిన్న చిన్న అసమ్మతులు, ఇంటి పనులు, బిడ్డ సంరక్షణ లేదా ఆర్థిక విషయాలు అతి త్వరగా తీవ్రమైన గొడవలుగా మారుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, మళ్లీ గొడవలు ఆపలేకపోతున్నామన్నారు. దీంతో ఎమోషనల్ గా దూరమవుతున్నామని, ఇంటిమసీ కోల్పోతున్నామని చెప్పారు. ఇలా జరగడం చాలా బాధగా ఉందన్నారు.ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఒత్తిడి పెరిగిందని, మళ్లీ ఇంటికి వచ్చి పనిచేయాలంటే కష్టంగా ఉందని రవి చెప్పాడు. తనకు కూడా ఆఫీసులో చాలా వర్క్ ఉంటోందని, ఇంటికి వచ్చాక పాపతో సరిపోతుందని, మళ్లీ ఇంటి పని చేయాలంటే తన వల్ల కావట్లేదని ప్రియ చెప్పింది. అయినప్పటికీ తాను చేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేకపోగా, కూరలో ఉప్పు ఎక్కువైనా గొడవ పడుతున్నాడని చెప్పింది.ఇలాంటి విషయాలన్నీ కలిసి కుటుంబం కోసం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారనే వాదనలుగా మారాయి. అవి వ్యక్తిగత దూషణలుగా మారాయి. పెళ్లికి ముందు జరిగిన విషయాలనుంచి, పెళ్లి రోజు జరిగిన గొడవల వరకూ తవ్విపోసుకున్నారు. ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించారు. వాదనల తర్వాత రవి ఇంటినుంచి బయటకు వెళ్లిపోగా, ప్రియ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటుంది.వాదనలు వర్సెస్ తగాదాలుమనం మొదట్లో చెప్పినట్లు ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. ఆరోగ్యకరమైన వాదనలు పరిష్కారానికి దారితీస్తే, తగాదాలు భావోద్వేగ గాయాలను మిగుల్చుతాయి. అందుకే వాదనలకు, తగాదాలకు మధ్య తేడా తెలుసుకోవడం అవసరం. 👉 ఒక సమస్యను చర్చించడం, భావాలు, పరిష్కారాలను చర్చించడం, ఆరోపణలు చేయకపోవడం ఆరోగ్యకరమైన వాదనల లక్షణం. ఉదాహరణకు, రవి ఇంటి పనుల కారణంగా ఒత్తిడిగా అనిపిస్తే, ప్రియ వ్యక్తిత్వంపై దాడి చేయకుండా తన అభిప్రాయం చెప్తాడు. ఆరోగ్యకరమైన వాదనలు 👉 విభేదాల సమయంలో కూడా భాగస్వామి పట్ల గౌరవం తొలగిపోదు. భాగస్వామి వాదన వినడం, అది భిన్నమైనదైనా అంగీకరిస్తారు. 👉 ఇద్దరూ ఎమోషనల్ గా ఉన్నప్పుడు అది మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 👉 విధ్వంసకరమైన తగాదాల్లో సమస్యను గాలికి వదిలి వ్యక్తిగతంగా విమర్శిస్తారు. రవి, ప్రియల మధ్య జరుగుతున్నది ఇదే. 👉 తగాదాల్లో తరచుగా గతం నుండి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తారు. 👉 ఇద్దరూ గొంతు పెంచి అరచుకోవడం, ఒకరినొకరు అడ్డుకోవడం జరుగుతుంది. రవి తరచుగా వాదన మధ్యలో బయటకు వెళ్లిపోవడం ప్రియకు తనను పట్టించుకోవడం లేదనే అనుభూతిని కలిగించింది. కౌన్సెలింగ్ తో పరిష్కారం... రవి, ప్రియల సమస్య వాదనలు తగాదాలుగా మారడమే. అందుకే వారి మధ్య హెల్తీ కమ్యూనికేషన్ పెంపొందించేలా కౌన్సెలింగ్ సెషన్లు ప్లాన్ చేశాను. 👉 ఏ బంధంలోనైనా యాక్టివ్ లిజనింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌన్సెలింగ్ సమయంలో వారు ఒకరినొకరు అడ్డుకోవడం లేదా వ్యక్తిగత దాడులు చేయకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేర్చుకున్నారు.👉 ఉద్రిక్తత పెరిగినప్పుడు ఒక చిన్న విరామం తీసుకోవడానికి అంగీకరించారు. దీనివల్ల భావోద్వేగ నష్టం తగ్గుతుంది. వారి వాదనలు నిర్మాణాత్మకంగా మారాయి.👉 వాదనల్లో ఒకే సమస్యపై కేంద్రీకరించాలని, అనవసర విషయాలు తీసుకురాకూడదని తీర్మానించుకున్నారు. 👉 ఒకరి లవ్ లాంగ్వేజ్ ను మరొకరు అర్థం చేసుకున్నారు. తగాదా సమయంలో కూడా పరస్పర గౌరవంతో, ప్రేమతో వ్యవహరించడం నేర్చుకున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
ఏ బంధంలోనైనా గౌరవం ముఖ్యం
కనెక్షన్ లేదా రిలేషన్షిప్ అనగానే అందరికీ లవర్స్ లేదా కపుల్స్ గుర్తొస్తారు. వారి మధ్య వచ్చే సమస్యలే గుర్తొస్తాయి. కానీ స్నేహితులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో సంబంధం కూడా ముఖ్యం. అందుకే మన ‘కనెక్షన్ కార్నర్’లో ఇవన్నీ చర్చించుకుందాం.అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ మూవీ చూశారా? అందులో అన్నాదమ్ములిద్దరూ రోజూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ అన్నకు సమస్య వచ్చినప్పుడు తమ్ముడు అండగా నిలబడతాడు. అదే బంధాలకు ఉండే ప్రాధాన్యం. అయితే అన్ని సందర్భాల్లోనూ అలా సర్దుకుపోరు. కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య గొడవలు పెరిగి పెద్దవై పోలీస్ కేసుల వరకూ వెళ్లిన సందర్భాలు కూడా మనం వార్తల్లో చూస్తుంటాం. అలాంటి ఒక కేస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రోహిత్, సిద్ధార్థ్ అన్నదమ్ములు. 32 ఏళ్ల రోహిత్ స్వంత వ్యాపారం పెట్టి సక్సెస్ అయ్యాడు. 28 ఏళ్ల సిద్ధార్థ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా వారి రిలేషన్షిప్ బాగా దెబ్బతింది. తరచుగా వాదనలు, అపార్థాలు, సెటైర్లు.తానెంతో కష్టపడి వ్యాపారం మొదలుపెట్టి 32 ఏళ్లకే సక్సెస్ సాధించినా, తనను ‘డబ్బు మనిషి’ అంటున్నాడని సిద్ధార్థ్ పై రోహిత్ కు కోపం. మరోవైపు తక్కువ సంపాదిస్తున్నాడని రోహిత్ కు తానంటే చిన్నచూపని సిద్ధార్థ్ కు బాధ. అలా ఇద్దరూ తరచూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. అవి చిలికిచిలికి గాలివానగా మారి ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది.ఆ వయసుకొచ్చిన పిల్లలు కొట్టుకోవడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏం చేయాలో అర్థంకాక వారిద్దరినీ కౌన్సెలింగ్ కు వెళ్లమని అడిగారు. వాళ్లిద్దరూ అయిష్టంగానే వచ్చారు.పరస్పర గౌరవం లేకపోవడమే సమస్య... మొదటి సెషన్ లో వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడాను. పరస్పర గౌరవం లేకపోవడమే వారి సంఘర్షణకు మూలమని అర్థమైంది. అందుకే వారి విభేదాలు నిర్మాణాత్మకంగా కాకుండా వ్యక్తిగత దాడులుగా మారాయి. 👉 సోదరులిద్దరూ వారి కెరీర్ ఛాయిస్, వ్యక్తిగత నిర్ణయాలను తప్పుగా అంచనా వేసుకుంటూ, వారి పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు.👉 ఏ ఒక్కరూ మరొకరి దృక్పథాన్ని వినకపోగా ఒకరి ఐడియాకు మరొకరు అంతరాయం కలిగిస్తున్నారు లేదా తిరస్కరిస్తున్నారు. 👉వారి సంభాషణలు తరచుగా సర్కాస్టిక్ కామెంట్స్ (వ్యంగ్య వ్యాఖ్యలు), నెగెటివ్ జడ్జ్ మెంట్స్ (ప్రతికూల తీర్పులు) గా మారి విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.👉దీంతో వారిద్దరూ సరిగా కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. తన సోదరుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని అపార్థం చేసుకుంటున్నాడు. అతని వైఖరిని అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.శ్రద్ధగా వినడమే తొలి అడుగు... ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఎడమొహం పెడమొహంగా మారి విభేదాలను ఇంకా పెద్దవి చేసుకుంటారు. కానీ సోదరులిద్దరూ ఒకరి కెరీర్ ఛాయిస్, లైఫ్ స్టైల్, వాల్యూస్ ను అర్థం చేసుకోవడం, అభినందించడం అవసరం. ఆ మేరకు సెషన్స్ ప్లాన్ చేశాను. 👉ప్రారంభ సెషన్లలో ‘యాక్టివ్ లిజనింగ్’ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసాను. అంటే సోదరుడు మాట్లాడేటప్పుడు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా వినాలి. అతని దృక్పథంతో విభేదించినప్పటికీ, అతని భావోద్వేగాలను అంగీకరించాలి. విమర్శలకు బదులుగా నిర్మాణాత్మక సూచనలివ్వాలి. 👉తర్వాత ‘ఐ ఫీల్‘ స్టేట్మెంట్ టెక్నిక్‌ని ఇచ్చాను. అంటే సోదరుడిని నిందించడానికి బదులుగా ‘నాకిలా అనిపించింది’, ‘నేను బాధపడ్డాను’ అని తన అభిప్రాయాన్ని, భావోద్వేగాన్ని మాత్రమే వ్యక్తపరచాలి. ఈ టెక్నిక్ వారు వాదించుకోకుండా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడింది. 👉 ఫైనాన్షియల్ సక్సెస్ సాధించడమే రోహిత్ లక్ష్యమైతే, అకడమిక్ గా టాప్ లో ఉండటమే సిద్ధార్థ్ లక్ష్యం. ఒకరి ఎంపికను మరొకరు అర్థం చేసుకునేలా చర్చించుకునేలా ప్రోత్సహించాను. 👉 వారిద్దరూ ఒకరి ఛాయిస్ ను మరొకరు ఎలా చూశారో వివరిస్తూ మనసువిప్పి లెటర్లు రాసుకోమన్నాను. ఇది వారి అభిప్రాయాలను రీఫ్రేమ్ చేసి, ఒకరినొకరు అభినందించుకునేలా చేసింది.అలా పది సెషన్లలో రోహిత్, సిద్ధార్థ్ ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకున్నారు. సర్కాజం, క్రిటిసిజం లేకుండా ఎలా కమ్యూనికేట్ చేయవచ్చో నేర్చుకున్నారు. ఒకరి ఛాయిస్ ఏదైనా దాన్ని గౌరవించాలని, నచ్చకపోతే తన అభిప్రాయాన్ని నిర్మాణాత్మంగా వివరించాలని అర్థం చేసుకున్నారు. చక్కగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమ కెరీర్ ఛాయిస్ ఏదైనా కుటుంబానికి అండగా నిలబడటం, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం ముఖ్యమని అర్థం చేసుకుని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అది చూసి వారి తల్లిదండ్రులు సంతోషించారు.సోదరులనే కాదు, టీనేజ్, కపుల్, వర్క్ రిలేషన్షిప్స్ లో పరస్పర గౌరవానికి కీలక పాత్ర. గౌరవం ఉండటమే కాదు, ఉన్నట్లు కనిపించాలి. లేదంటే రోహిత్, సిద్ధార్థ్ లా అపార్థాలు, గొడవలు తప్పవు. అందుకే తీర్పులివ్వకుండా వినడం, కమ్యూనికేషన్ ను మెరుగుపరచుకోవడం, గౌరవప్రదమైన సరిహద్దులను సెట్ చేసుకోవడం, తీర్పులను రీఫ్రేమ్ చేసుకోవడం అవసరం.సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
ది మానిప్యులేటివ్ పార్టనర్
ప్రచారం పిచ్చో... డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆశనో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో చాలామందికి రీల్స్ పిచ్చి పట్టుకుంది. కొన్నిసార్లు ఇది కాస్తా శ్రుతిమించి పోయి వ్యవసనంగానూ మారిపోతోంది. ఆఖరుకు ఇది దాంపత్య జీవితంలోనూ చిచ్చు పెట్టే స్థితికి చేరుకుంది. అయితే కర్ణాటకలోని ఉడుపికి సమీపంలోని కార్కడలో ఈ రీల్స్ పిచ్చి కాస్తా ఓ నిండుప్రాణం పోయేందుకు కారణమైంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...బీదర్‌లోని దోణగాపురకు చెందిన జయశ్రీ (31)కి రీల్స్ అంటే తెగ పిచ్చి. ఈమెకు కార్కడ సమీపంలోని గుండ్మిలో నివసించే కిరణ్ ఉపాధ్య (44)తో పెళ్లి అయ్యింది. కొంత కాలం సంసారం బాగానే నడిచింది కానీ.. జయశ్రీ నిత్యం రీల్స్ చేస్తూండటం కిరణ్‌కు ఏ మాత్రం నచ్చలేదు. అంతేకాదు... జయశ్రీ ఆన్లైన్ షాపింగ్ వ్యసనం విషయంలోనూ భార్య భర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతూండేవి. తనకు పెద్ద ఇల్లు కావాలని... లగ్జరీ కారు.. నగదు కావాలని... గుడులలో వంటలకు సాయంగా పనిచేస్తున్న భర్త కిరణ్‌ను వేధించేది. ఇది కాస్తా వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేందుకు కారణమైంది. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య రీల్స్ విషయమై వాదులాట మొదలైంది. ఈ క్రమంలోనే కిరణ్ కొడవలితో దాడి చేయడంతో జయశ్రీ మరణించింది. ఆ తరువాత బంధు మిత్రులకు ఫోన్ చేసి జయశ్రీ మొదటి అంతస్తులోంచి కిందకు పడిపోయిందని... స్పందన లేదని చెప్పాడు. వారి సలహాతో ఆంబులెన్స్‌కు ఫోన్ చేశాడు కూడా. అయితే జయశ్రీ ఆసుపత్రికి చేరే సమయానికి ప్రాణాలతో లేదని డాక్టర్లు ప్రకటించారు. అయితే... ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత కిరణ్ ప్రవర్తన తేడాగా ఉండటాన్ని చుట్టుపక్కల వాళ్లు గమనించారు. ఇంట్లో రక్తపు మరకల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. అనుమానం కొద్దీ ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కిరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. కిరణ్ ముందస్తు ప్రణాళికతోనే జయశ్రీని హత్య చేశాడని, గత గురువారమే మార్కెట్లో కొత్త కొడవలిని కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు. రజని హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్థగా పనిచేస్తోంది. గత కొద్దికాలంగా ఆమెకు అంతా గందరగోళంగా అనిపిస్తోంది. తాను చేస్తున్నది రైటా, తప్పా అనే సందేహం తరచూ వేధిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింది. నిరంతరం ఒత్తిడి, ఆందోళన ఫీలవుతోంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. ఒంటరితనం, భయం, నిస్సహాయత. దాంతో పేషంట్లను ట్రీట్ చేయడంలో కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా సారీ చెప్తోంది. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ కాబట్టి తనకు తానే వైద్యం చేసుకుంది. కానీ తగ్గడంలేదు. దాంతో ఇది శారీరకం కాదని, మానసికమని అర్థమై కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన సమస్య చెప్పింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పమని అడిగాను.అపనమ్మకం...రజనికి పెళ్లయి ఐదేళ్లయ్యింది. తన కొలీగ్ డాక్టర్ ఆనంద్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. రజని కొంచెం కలుపుగోలు మనిషి. అది ఆనంద్ కు నచ్చదు. ‘‘నీ పని నువ్వు చూసుకోక అందరితో అలా మాట్లాడతావెందుకు?’’ అని అడిగేవాడు. తరచూ రజనిపై కోప్పడేవాడు. ‘‘అందరితో బాగా నవ్వుతూ మాట్లాడతావ్. నాతో మాట్లాడాలంటే మాత్రం మొహం ముడుచుకుంటావ్. నీకంటికి నేను చేతకాని వాడిలా కనిపిస్తున్నా’’ అని దెప్పేవాడు. ‘‘అలాంటిదేం లేదు’’ అని చెప్పినా వినేవాడు కాదు. ‘‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్ ను కలువు’’ అని తరచూ అనేవాడు. కొన్నాళ్లకు రజని కూడా తన మానసిక స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ‘‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే ఆనంద్ ఎందుకలా అంటాడు’’ అని అనుకునేది.గ్యాస్ లైటింగ్... డాక్టర్ రజని చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్ కు గురవుతుందని అర్థమైంది. గ్యాస్ గురించి అందరికీ తెలుసు. కానీ గ్యాస్ లైటింగ్ అంటే ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ ను వెలిగించేది కాదు. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్ లో పెట్టుకోవడానికి కొందరు చేసే మేనిప్యులేషన్ ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక నుండి పుడుతుంది. తమ మాటే నెగ్గేలా, తమ దారికి అడ్డులేకుండా చేసుకోవడానికి అబద్ధాలు చెప్తారు, నిందలు వేస్తారు. తమ తప్పును కూడా భాగస్వామిపై తోసేసి తమ ప్రయోజనాలను కాపాడుకుంటారు. తనపై తనకు నమ్మకం కోల్పోయేలా చేస్తారు, చివరకు భాగస్వామి ఎమోషన్స్ పై కంట్రోల్ సాధిస్తారు. ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ ఆనంద్ అందులో మాస్టర్స్ డిగ్రీ సాధించాడని అర్థమైంది. కానీ తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్న విషయాన్ని రజని గుర్తించలేకపోతోంది. అదే ఈ సమస్యలో ఉండే అసలు సమస్య. తనను మేనిప్యులేట్ చేస్తున్నారనే విషయం బాధితులకు తెలియదు, అసలా దిశగా ఆలోచించలేరు. ఎవరైనా చెప్పినా నమ్మరు.థెరపీతో పరిష్కారం... అందుకే మొదట రజనికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆలోచనల్లోని లోపాలు గుర్తించేలా, వాటిని సవాల్ చేసేలా చేశాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. ఆనంద్ అలాగే చేస్తాడని చెప్పింది. తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్నానని అర్థం చేసుకుంది. ఆ తర్వాత తన భద్రతకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాను. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్ సైజ్ లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్ ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ రజని తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆనంద్ మాటలను పట్టించుకోవడం మానేసింది. రజని ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న ఆనంద్ కూడా తన ప్రవర్తను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది.గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు⇒నువ్వు ప్రతిదానికీ ఓవర్ రియాక్ట్ అవుతున్నావ్. ⇒అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. ⇒నీకోసమే అలా చేశాను. ⇒నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?⇒నేను నీకు చెప్పాను, గుర్తులేదా? ⇒అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్. ⇒ నీపట్ల నాకెప్పుడూ నెగెటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగెటివ్ గా చూస్తున్నావ్.వాళ్ల మాటలు నమ్మొద్దు⇒గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు. ⇒గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా చేసే పనులపై దృష్టి పెట్టాలి. ⇒‘‘నీకు పిచ్చి’’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు. ⇒‘‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకూ గుర్తుందే అదే నిజమని గుర్తించాలి. ⇒గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్ కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు. ⇒గ్యాస్ లైటర్ తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి. ⇒మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి.సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
ఆయనకు విపరీతమైన అనుమానం!
మా పెళ్ళయి పదేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. మొదట్లో కొంతకాలం బాగున్నాం కానీ, తర్వాత నుంచి నా భర్తకు అనుమానం జబ్బు పట్టుకుని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. ప్రతివాళ్లతోనూ నాకు సంబంధం అంటగట్టి అనరాని మాటలతో చిత్రవధ చేస్తున్నాడు. సినిమాలకు, ఫంక్షన్లకు వెళ్ళినపుడు ఈ బాధ మరీ ఎక్కువవుతోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. – ఒక సోదరి, తెనాలిమీరనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకోగలను. వాస్తవం గాకున్నా... ఎలాంటి ఆధారం లేకున్నా ఇలా భార్యాభర్తలు ఒకరినొకరి శీలాన్ని శంకించే మానసిక రుగ్మతను ‘డెల్యూజనల్ డిజాస్ట్టర్ లేదా కాంజుగల్ ΄ారనోయియా’ అంటారు. మిగతా అన్ని విషయాల్లో వీరు మామూలుగానే ఉంటారు. ఏవేవో ఊహించుకుని ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనవుతూ, కేవలం జీవిత భాగస్వామిని మాత్రమే ఇలా అనుమానిస్తూ, వేధిస్తూ ఉంటారు. మానసిక రుగ్మత ఉందంటే ఒప్పుకోరు. మీరు మీ బంధువులు, ఇతర పెద్దల సహకారంతో ఆయన్ని ఏదో ఒక విధంగా ఒప్పించి, వైద్యుల దగ్గరకు వెళ్లగలిగితే, ‘యాంటీ సైకోటిక్స్’అనే మందులు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స చేసి, ఈ అనుమానాల ఊబి నుంచి పూర్తిగా బయటపడేస్తారు. మళ్ళీ మీరు ప్రశాంతంగా, సంతోషంగా జీవితాన్ని గడపగలరు. మా చుట్టాలబ్బాయి చిన్నప్పటినుంచి చదువులో టాప్! రెండు పీహెచ్‌డీలు చేశాడు. ఒక పెద్ద కంపెనీలో మంచి జీతంతో ఆఫర్ కూడా వచ్చింది. అయితే ఇటీవల ఉన్నట్టుండి అతని ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. ఎవ్వరితోనూ మాట్లాడడు. ఒక్కడూ గదిలో తలుపులు వేసుకుని కూచుంటాడు. రోజుల తరబడి స్నానం చేయడు. తన లో తాను నవ్వుకోవడం... మాట్లాడుకోవడం. మా బంధువులందరూ చదువు ఎక్కువ అవడం వల్ల ఈ పిచ్చి వచ్చిందంటున్నారు. నిజమేనా?– కుమార్, కర్నూలుచదువుకు, తెలివితేటలకు, మానసిక జబ్బు రావడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. ఎక్కువ చదివిన వారందరికీ మెంటల్ రావాలని లేదు. అలాగే తెలివితేటలు లేనివారికి, ఎక్కువ చదువుకోనివారికీ మానసిక జబ్బులు రావని ఏమీ లేదు. మానసిక వ్యాధులకు వారసత్వ కారణాలు కొన్నయితే, పరిస్థితుల ప్రభావం, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరగడం, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం, తీవ్రమైన ఒత్తిడులకు గురికావడం వంటివి ఇతర కారణాలు. ఆలస్యం చేయకుండా అతణ్ణి ఒకసారి సైకియాట్రిస్ట్‌కు చూపించమని చెప్పండి. స్కిజోఫ్రినియా అనే మానసిక జబ్బుకు లోను కావడం వల్ల వారికి మీరు పేర్కొన్న లక్షణాలుండే అవకాశం ఉంది. తొలిదశలోనే గుర్తించి, సరయిన చికిత్స చేయిస్తే, తొందరగా కోలుకుని తిరిగి మంచి జీవితాన్ని గడపగలడు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
‘డిజిటల్ డివైడ్’.. కాపురాలు కూలుతున్నాయి
రిషి, ప్రియ అందమైన జంట. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా పని చేయడం, సాయంత్రాలు కలిసి చాలా చాలా కబుర్లు చెప్పుకోవడం, వారాంతాల్లో సినిమాకో, షికారుకో వెళ్లడం, అక్కడే డిన్నర్ చేసి ఇంటికి రావడం.. ఎలాంటి సమస్యలూ లేకుండా పర్ఫెక్ట్ కపుల్ లా ఉండేవారు. అలాంటిది.. అనూహ్యంగా వాళ్ల కాపురంలో చిచ్చు రగిలింది. ఎలా అంటే..ప్రియ చురుకైన వ్యక్తి, ఫ్రెండ్స్ తో చాలా సరదాగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వారితో నిత్యం కనెక్ట్ అవుతుంది. వాళ్ల జీవితంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. తన విషయాలన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ వాళ్లతో చాట్ చేస్తుంది. రిషికి సోషల్ మీడియా అంటే కొంచెం చిరాకు. అన్ని విషయాలూ సోషల్ మీడియాలో అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదంటాడు. ఈ విషయం తరచూ ప్రియకు చెప్తుంటాడు. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో, ఆమెపై చిరాకు పడుతుంటాడు.కాలంతో పాటు అప్ డేట్ కావాలని, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంలో తప్పేమీ లేదని ప్రియ వాదిస్తుంటుంది. ఈ విషయమై అప్పుడప్పుడూ ఇద్దరిమధ్యా వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ విధంగా వారి మధ్య "డిజిటల్ డివైడ్" ఏర్పడింది. వారి ఆన్ లైన్ అలవాట్లు, ఆఫ్ లైన్ జీవితంపై ప్రభావం చూపించడం మొదలైంది.అందమైన సినిమా...సోషల్ మీడియా అందమైన సినిమాలాంటిది. అందరూ తమ జీవితంలోని అందమైన, ఆకర్షణీయమైన భాగాన్ని మాత్రమే అక్కడ ప్రదర్శిస్తుంటారు. ప్రియ కూడా అంతే. తమ మధ్య ఎన్ని గొడవలున్నా, తాము సంతోషంగా గడిపిన ఫొటోలను చక్కగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడూ రీల్స్ కూడా. అయితే విషయం అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ పోస్టులు, ఫొటోలు చూసి, వారి జీవితంతో పోల్చుకుంటుంది. తాను వాళ్లంత ఆనందంగా లేనని బాధపడుతుంది. వారిపై అసూయ పడుతుంది. అది ఆమె జీవితంలో అసంతృప్తికి దారితీసింది. ఇవన్నీ అప్పుడప్పుడూ ఆన్ లైన్లో తన పాత స్నేహితుడితో పంచుకుంటోంది.విశ్వాస ఉల్లంఘనప్రియ తన స్నేహితుడితో సుదీర్ఘంగా చాట్ చేస్తున్న విషయం రిషికి తెలిసింది. ఇదేంటని అడిగాడు. సరదాగా చాట్ చేస్తున్నానే తప్ప మరేమీ లేదని ప్రియ చెప్పింది. ‘‘నీ జీవితం ఆనందంగా లేదని అతనితో చెప్తున్నావ్ కదా. నాతో జీవితం అంత బాధాకరంగా ఉందా?’’ అని నిలదీశాడు. అలాంటిదేం లేదని, అవన్నీ కాజువల్ కాన్వర్జేషన్స్ అని ప్రియ చెప్పినా సంతృప్తి చెందలేదు. అతనితో చాటింగ్ మానేయమన్నాడు. తమ మధ్య ఏమీ లేనప్పుడు మానేయాల్సిన అవసరమేముందని ప్రియ వాదించింది. ‘‘నన్ను అనుమానిస్తున్నావా?’’ అని ప్రశ్నించింది. అలాంటిదేం లేదని, అయినా సరే మానేయమని రిషి కోరాడు. అలా అలా ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. విడాకులు తీసుకోవాలని అనుకునేంతవరకూ వెళ్లారు. ఈ విషయం ఒక క్లోజ్ ఫ్రెండ్ దృష్టికి వచ్చింది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్నారంటూ ఆమె వారిద్దరికీ చీవాట్లు పెట్టింది. ఆమె సలహా మేరకు వారిద్దరూ కౌన్సెలింగ్ కు వచ్చారు.రెండువైపులా పదునున్న కత్తిసోషల్ మీడియా అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో ప్లస్, మైనస్ రెండూ ఉంటాయి. సోషల్ మీడియా రాకతో మనం దేశ విదేశాల్లోని బంధువులతో, స్నేహితులతో కనెక్షన్ ను కొనసాగించడం సులువైంది. పాత స్నేహితులు, కొలీగ్స్ తో మళ్లీ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మనం సాధించిన విజయాలను, అనుభవాలను అందరితో పంచుకోవచ్చు. జంటలు తమ జ్ఞాపకాలను పదిలపరచుకోవడం ద్వారా వారి బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.ఆన్లైన్ కమ్యూనిటీలు, సపోర్ట్ గ్రూప్‌ల ద్వారా మన జీవితంలో ఎదురైన ఛాలెంజ్ లను ఎదుర్కునేందుకు సహాయం, సలహాలు పొందవచ్చు. పార్టనర్ పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రశంలను వ్యక్తం చేయడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.మరోవైపు సోషల్ మీడియా వల్ల రిషి, ప్రియ జీవితాల్లో ఏర్పడినట్లే సవాళ్లు కూడా ఏర్పడవచ్చు. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ జీవితాలను మాత్రమే తరచూ చూడటం వల్ల అసూయ ఏర్పడుతుంది. తమ బంధం పట్ల అభద్రత, అసమర్థ భావాలకు దారితీస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అతిగా పోస్ట్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. తరచూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల అవాస్తవిక అంచనాలకు దారితీస్తుంది. సున్నితమైన విషయాలను చర్చించేటప్పుడు మనం పంపే మెజేజెస్ ను తప్పుగా అర్థం చేసుకుంటే అపార్థాలకు దారితీస్తుంది. ఒక వ్యక్తితో రోజూ చాట్ చేయడం వల్ల, మీకు తెలియకుండానే వారితో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది ఆఫ్ లైన్ జీవితంలోని భాగస్వామితో ఎమోషనల్ కనెక్షన్ ను తగ్గించవచ్చు.ఆన్ లైన్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిన వ్యక్తితో తరచూ మాట్లాడటం ఎక్కడికైనా దారితీసే ప్రమాదం ఉంది.సోషల్ మీడియా బ్యాలెన్స్...రిషి, ప్రియలకు సోషల్ మీడియా వల్ల వచ్చే లాభనష్టాలను వివరించాక, దాన్నెలా బ్యాలెన్ చేసుకోవాలో నేర్పించాను. సోషల్ మీడియా అలవాట్లు, బౌండరీస్, భయాల గురించి ఒకరితో ఒకరి ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడుకునేలా ప్రోత్సహించాను. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఏది పోస్ట్ చేయాలి, ఏది చేయకూడదనే విషయంపై ఒక అంగీకారానికి వచ్చేలా ఫెసిలిటేట్ చేశాను. తన ప్రయాణాలు లేదా అనుభవాల గురించి పోస్ట్ చేసేటప్పుడు రిషి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అదెందుకు అవసరమో ప్రియకు అర్థమయ్యేలా వివరించాను. ఆన్లైన్ లో కనపడేదంతా నిజం కాదని, అందువల్ల పోల్చుకోవడం మానేసి, తమ బంధాన్ని బలపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాను. అందుకు కావాల్సిన ఎక్సర్ సైజ్ లు చేయించాను. అప్పడప్పుడూ సోషల్ మీడియానుంచి పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యి పార్టనర్ తో గడపడం అవసరమని ప్రియకు అర్థమయ్యేలా చెప్పాను. అలా ఐదు సెషన్లలో రిషి ప్రియల మధ్య ఉన్న డిజిటల్ డివైడ్ ను పూడ్చేసి, వారిద్దరూ తమ జీవితాలను సంతోషంగా సాగించేందుకు అవసరమైన స్ట్రాటజీలను అందించాను.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
ఏ బంధంలోనైనా హద్దులు అవసరం
ప్రియకు 28 ఏళ్లు. ఒక అంతర్జాతీయ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తుంది. రోహిత్‌తో రెండేళ్ల కిందట పెళ్లయ్యింది. మొదట్లో అంతా బానే ఉంది. కాలం గడిచేకొద్దీ వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. తన డ్రెస్సింగ్ నుంచి ఫ్రెండ్స్ వరకూ అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. తన ప్రవర్తనను, స్నేహాలను కూడా నియంత్రించడం ప్రియకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు రోహిత్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. తానేం చేయాలో ప్రియకు అర్థంకాక కౌన్సెలింగ్ కు వచ్చింది.స్వేచ్ఛ వర్సెస్ సంప్రదాయంప్రేమంటే రెండు మనసుల కలయిక, పెళ్లంటే రెండు జీవితాల కలయిక. మనదేశంలో మాత్రం పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి పరిచయం లేకపోయినా, ప్రేమ లేకపోయినా, కనీస అవగాహన లేకపోయినా... కులం, మతం, జాతకం, ఆర్థిక స్థాయిలు కలిస్తే చాలు, పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ జంటపై ఉంటుంది. ఇప్పుడదే భారం ప్రియపై ఉంది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి.. కుటుంబ గౌరవానికి, సంప్రదాయానికి మధ్య పోరాటం నడుస్తోంది.కాలంతో పాటు మారని మనుషులు... సాంప్రదాయ పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన వివాహంలో.. భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్న రోజులొచ్చినా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే నడవాలనే భావజాలంలోనే ఉంటారు, ఉంటున్నారు. రోహిత్ ది కూడా అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్యా దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రియ తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్ కు వచ్చింది. ఆమె చెప్పినదంతా విన్నాక, వారికి ‘హెల్తీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని అర్థమైంది.టాక్సిక్ రిలేషన్స్ లక్షణాలు...• జంటలో ఒకరి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం• తరచుగా వ్యంగ్యం, నిందలు, అవమానాలు• ఫోన్ చెక్ చేయడం, ఫ్రెండ్స్, పేరెంట్స్‌కు దూరం చేయడం• పార్టనర్ ను సంప్రదించకుండానే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం• పార్టనర్ ను కంట్రోల్ చేయడానికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం• పార్టనర్ తెలివిని, నిర్ణయాలనూ చులకన చేయడం• ఎవరితో క్లోజ్‌గా ఉన్నా అసూయ పడటం, దూరం చేయడానికి ప్రయత్నించడం• ప్రతీ చిన్న విషయానికీ గొడవపడుతుండటంసరిహద్దుల అవసరం... ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలనీ, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలనీ అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్ ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు, మీ అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతీ జంటకూ హెల్తీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. • ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. • ‘‘నువ్వలా చేస్తున్నావు’’, ‘‘నువ్విలా అంటున్నావు’’ అని కాకుండా... ‘‘నేనిలా అనుకుంటున్నాను’’, ‘‘నేనిలా ఫీలవుతున్నాను’’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉదాహరణకు, ‘‘నేనే డ్రెస్ వేసుకోవాలో నువ్వు చెప్పినప్పుడు నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఇద్దరికీ నచ్చేదాని గురించి మాట్లాడుకుందామా?’’ అని చెప్పడం, ఇష్టంలేకుండా ఒప్పుకోవడం నుంచి మాట్లాడి పరిష్కరించుకోవడానికి దారితీస్తుంది. • ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. వారి స్వేచ్ఛకు, స్నేహాలకు విలువనివ్వడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. అది వారిని నచ్చిన పాటలు వినడం కావచ్చు, తన ఫ్రెండ్స్ తో మాట్లాడటం కావచ్చు. • మారుతున్న కాలంతో పాటు సంప్రదాయాల్లోనూ మార్పు వస్తుందని గుర్తించాలి. సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతుల్యత సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. • సరిహద్దులను సెట్ చేయడం సవాలే. మీ భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. • మీ హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి.ప్రియ, రోహిత్ లకు మూడు సెషన్లలో వీటిని వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్ సైజ్ లు చేయించాను. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా జీవిస్తున్నారు. అప్పుడప్పుడూ వాట్సప్ లో పలకరిస్తుంటారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
సహజీవనంలో ఆమెకు ఆ హక్కుందా?
ప్రియ, భార్గవ్.. మూడేళ్లుగా లివ్ ఇన్ టుగెదర్ రిలేషన్ లో ఉంటున్నారు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవాళ్లు. ఆరు నెలల కిందట ప్రియకు ఉద్యోగం పోయింది. దాంతో ఇంటి బాధ్యత అంతా భార్గవ్దే. అయితే ప్రియ ఇటీవల భార్గవ్ ఏం చేసినా తప్పు పడుతోంది. ఎవరితో మాట్లాడనివ్వకుండా.. తనతో తప్ప ఎవరితో ఎక్కడికీ వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తోంది. ఆఫీస్ అవసరాల రీత్యా భార్గవ్ కొలీగ్స్‌కి ఫోన్ చేసినా, ఫోన్ ని అతను అటెండ్ అయినా పెద్ద యుద్ధమే! గొడవలే! భరించలేక భార్గవ్ ఒకరోజు ‘ఈ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాదు.. నీతో కలసి ఉండలేను’ అన్నాడు. దాంతో ప్రియ ‘నాతో బ్రేకప్ చేసుకుంటే నీ మీద రేప్ కేసు పెడతా’ అని బెదిరించింది. హడలిపోయాడు భార్గవ్. నిజంగానే ప్రియకు ఆ హక్కు ఉందా?కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం.. ఏ వ్యక్తి అయినా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా.. మోసపూరితంగా, ఓ పథకం ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ స్త్రీతో శారీరక సంబంధం నెరపితే.. సదరు పురుషుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రేప్ అయితే యావజ్జీవం కూడా పడవచ్చు. జూన్ 30 వరకు అమల్లో ఉన్న పాత శిక్షాస్మృతి ప్రకారం కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసపూరితంగా స్త్రీతో శారీరకసంబంధం నెరపిన పురుషుడిపై ఐపీసీ 376, ఐపీసీ 420 సెక్షన్ లను కలిపి కేసు నమోదు చేసేవారు. అయితే, ఆ పురుషుడు మొదటినుంచీ మోసం చేసే ఉద్దేశంతోనే ఉన్నాడు అని రుజువుకాకపోతే మాత్రం దాన్ని రేప్‌గా పరిగణించలేమని హైకోర్ట్, సుప్రీంకోర్టు పేర్కొన్న సందర్భాలు, తీర్పులూ ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా చూడాల్సినదేంటంటే.. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా చేసుకుంటానని నమ్మించి కేవలం శారీరక సంబంధం కోసమే అతను లివ్ ఇన్‌లో ఉన్నాడా అనే అంశం. మొదట బాగానే ఉన్నాడు.. పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు.. కానీ తర్వాత మనస్పర్థలు, భేదాభి్రపాయాలు వచ్చి విడి΄ోవాలనుకుంటున్నాడు అని రుజువైతే శిక్ష పడదు. భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం కూడా లివ్ ఇన్ రిలేషన్ లోని పురుషుడు ‘మోసపూరితమైన ఆలోచనతోనే రిలేషన్ మొదలు పెట్టాడు’ అని రుజువు చేయాలి. అయితే ఈ కేస్ స్టడీలో భార్గవ్ మీద ప్రియ కేసు పెట్టే అవకాశం కచ్చితంగా ఉంది. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇన్నాళ్లు లివ్ ఇన్ లో ఉండి ఇప్పుడు వద్దు అంటున్నాడని ప్రియ రుజువు చేయగలిగితే భార్గవ్‌కి పదేళ్లవరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే సెక్షన్ 69 వలన సహజీవనం, ప్రేమ అనే అంశాలు ఆది నుంచీ అనుమానంతో మొదలయ్యే ప్రమాదం ఉంది. సహజీవనానికి ముందు లేదా కలసి ఉంటున్న క్రమంలో ఒకరిపై ఒకరు స్పష్టత తెచ్చుకోవడం అవసరం. ఇలాంటి రిలేషన్స్ వ్యక్తిగతమైనప్పటికీ, వీలైనంత మేర అందరికీ తెలిసేలా ఉండడం లేదా కనీసం సన్నిహితులకైనా తెలిసుండటం వల్ల కొంతవరకు రక్షణ కలగవచ్చు. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వొకేట్ -
అన్ని బంధాలకూ మూలం బాల్యంలోనే!
హలో ఫ్రెండ్స్,గతవారం సారా గురించి మాట్లాడుకున్నాం కదా. బాల్యంలో పేరెంట్స్, గార్డియన్స్, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం జీవితానికి ఒక పునాదిలా పనిచేస్తుంది. ఆ తర్వాత వివిధ వ్యక్తులతో సాన్నిహిత్యం, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం, సంఘర్షణలను పరిష్కరించుకునే సామర్థ్యాకు బ్లూప్రింట్ లా ఉంటుంది. వీటినే అటాచ్మెంట్ స్టైల్స్ అంటారు. జీవితంలో బలమైన కనెక్షన్ లను నిర్మించుకోవాలంటే వీటిని అర్థం చేసుకోవడం అవసరం.నాలుగు రకాలు... Secure Attachment: బాల్యంలో అనేక అవసరాలు ఉంటాయి. అన్నీ పిల్లలు చేసుకోలేరు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అవసరం ఉంటుంది. ఆ అవసరాలను వెంటనే గుర్తించి, స్పందించి, సంరక్షించే పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లల్లో భద్రంగా ఉన్నామనే ఫీలింగ్ ఏర్పడుతుంది. అలా సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఏర్పడుతుంది. వయసుతో పాటు అదీ పెరుగుతూ ఇతరులతో బంధాలను ఏర్పరచుకోవడంలో దిక్సూచిలా పనిచేస్తుంది. ఈ అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు తమకు ఏ కష్టం వచ్చినా తన జీవిత భాగస్వామి అందుబాటులో ఉంటారని నమ్ముతారు. తమ మనసులోని భావాలు ఎలాంటివైనా నేరుగా కమ్యూనికేట్ చేస్తారు. తన లైఫ్ పార్టనర్ తో సాన్నిహిత్యంగా, సుఖంగా ఉంటారు. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు.Anxious Attachment: బాల్యంలో పేరెంట్స్ లేదా గార్డియన్స్ అందుబాటులో లేకపోవడం, ఉన్నా పట్టించుకోకపోవడం, అవసరాలను గుర్తించకపోవడంతో... తనను ఎవరూ పట్టించుకోవడంలేదు, వదిలేస్తారనే భయం, ఆతృత ఏర్పడుతుంది. ఆ భయం వారి జీవితాంతం ఉంటుంది. అందుకే మనసులోని భావాలను నేరుగా చెప్పలేరు. చెప్తే తమను వదిలివేస్తారనే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. పార్టనర్ మౌనంగా ఉంటే అది తిరస్కారంగా భావిస్తారు. ‘నేనంటే ఇష్టంలేదా?’ అని పదే పదే అడుగుతారు. చాలా ఇష్టమని చెప్పినా సంతృప్తి చెందరు. వదిలేస్తారేమోనని భయపడుతుంటారు. దాంతో మరింత దగ్గరగా అతుక్కుపోతారు. మరోవైపు పార్టనర్ చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. అసూయ, అభద్రత వంటి వారిని కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడుతుంటారు. ఇలాంటివారికి భరోసా ఇవ్వడం పార్టనర్ కు తలకు మించిని భారమవుతుంది. సారా సమస్య ఇదేనని గుర్తొచ్చిందా?Avoidant Attachment: కొందరు పేరెంట్స్ పిల్లలను పట్టించుకోరు, దూరంగా పెడుతుంటారు. వాళ్లేం చేసినా నిరుత్సాహపరుస్తుంటారు. అందువల్ల పిల్లలు వారితో సాన్నిహిత్యంగా ఉండలేరు. ఎమోషన్స్ ను వ్యక్తం చేయలేరు. అలా వ్యక్తంచేయడం అసౌకర్యంగా భావిస్తారు. స్వతంత్రంగా ఉండలేరు. ఒంటరిగా ఫీలవుతుంటారు. అలా ఈ అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు ఏదీ ఓపెన్ గా మాట్లాడలేరు. మానసికంగా దూరంగా ఉంటారు. తరచూ పోట్లాడుతుంటారు. ఒంటరిగా ఫీలవుతుంటారు. వీరితో ఎలా వ్యవహరిస్తే ఏమవుతుందోనని పార్టనర్ గందరగోళానికి గురవుతారు.Disorganized Attachment: కొందరు పేరెంట్స్ లో తెలియని భయాలు ఉంటాయి. దాంతో వారి ప్రవర్తన ఎప్పడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లల్లో ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. వీరు ఇతరులతో సాన్నిహిత్యం కోరుకుంటారు. కానీ వాళ్లను విశ్వసించాలంటే తీవ్రమైన భయం. దాంతో వారి బంధాలు, అనుబంధాలు అస్థిరంగా ఉంటాయి. వారి భావోద్వేగ ప్రతిస్పందనలు అనూహ్యంగా ఉంటాయి. వీరికి ఎమోషనల్ సెక్యూరిటీ అందించడంలో పార్టనర్స్ ఇబ్బందులు పడుతుంటారు.మరేం చెయ్యాలి?సరే సర్. అటాచ్మెంట్ స్టైల్స్ రిలేషన్ షిప్ డైనమిక్స్ ను ప్రభావితం చేస్తాయంటున్నారు సరే, ఇప్పుడేం చెయ్యాలి? అని మీరు అనిపించవచ్చు. బాల్యంలో ఏర్పడిని అటాచ్మెంట్ స్టైల్స్ అలాగే శిలేసుకుని కూర్చోవు. వాటిపట్ల అవగాహన పెంచుకుని, మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తే మారతాయి. సైకాలజిస్ట్ సహాయంతో సురక్షితమైన అటాచ్మెంట్ స్టైల్ ను అభివృద్ధి చేసుకోవచ్చు. గతవారం సారా కేసులో జరిగింది ఇదే. అందుకోసం ముందుగా మీరేం చేయాలో చెప్తా.• మీ అటాచ్మెంట్ శైలిని గుర్తించడం అనేది హెల్తీ కనెక్షన్లను నిర్మించుకోవడంలో తొలి అడుగు. మీ శైలిని అర్థం చేసుకోవడం వల్ల మీ ప్రవర్తనకు మూల కారణాలను గుర్తించవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు సైకాలజిస్ట్ సహాయపడతారు. • మనం మొదటివారం చెప్పుకున్నట్లు అన్ని బంధాలూ మీ సెల్ఫ్ ఎస్టీమ్ పైనే ఆధారపడి ఉంటాయి. మీపై మీకు గౌరవం, విశ్వాసం ఉంటే ఇతరులపై ఆధారపడటం తగ్గిస్తుంది. సురక్షితమైన అనుబంధాన్ని సులభతరం చేస్తుంది• నిజాయితీతో కూడిన ఓపెన్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రిలేషన్స్ లో వచ్చే సంఘర్షణలను సమర్థంగా పరిష్కరించుకునేందుకు, మీ అవసరాలను నేరుగా వ్యక్తీకరించేందుకు ఉపయోగపడుతుంది. • బంధాలలో ఏది ఓకేనో, ఏది నాట్ ఓకేనో స్పష్టమైన సరిహద్దులను సెట్ చేయడం మీ ఎమోషనల్ వెల్ బీయింగ్ ను కాపాడుతుంది. పరస్పరం గౌరవప్రదంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. • రిలాక్సేషన్ టెక్నిక్స్, మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్ వంటివి మీ భావోద్వేగ నియంత్రణను మెరుగుపరుస్తాయి. నెగెటివ్ ఎమోషన్స్ మీ సంబంధాలను దెబ్బతీయకుండా కాపాడతాయి. • బంధాలకు సంబంధించిన నెగెటివ్ ఆలోచనా విధానాలకు గుర్తించడానికి, వాటిని మార్చుకోవడానికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT) ఉపయోగపడుతుంది. మీ ఎమోషనల్ రెగ్యులేషన్ కు, సెల్ఫ్ కంపాషన్ పెంపొందించడానికి కోపింగ్ మెకానిజమ్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
‘డిజైన్డ్’ సంసారం! సిటీలో స్థిరపడుతున్న సహజీవన సంస్కృతి!!
కలిసి జీవనం ప్రారంభించడం, బాధ్యతలు, వ్యయాలు సమానంగా పంచుకోవడం, పరస్పర వ్యక్తిగత ఇష్టాయిష్టాలను గౌరవించుకోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించకపోవడం, ఇష్టమున్నంత కాలం కలిసి ఉండడం, ఇద్దరిలో ఎవరు వద్దనుకున్నా సింపుల్‌గా ‘బై..బై’ చెప్పేయడం.. ఇదే ‘లివిన్’. సహజీవనంతో మరింత బలపడిన అనుబంధాన్ని పెళ్లితో చట్టబద్దం చేసుకుంటున్నవారూ లేకపోలే దు.. అయితే కొంతకాలం అనుబంధం తర్వాత విడిపోయి కూడా ఫ్రెండ్స్‌గా కొనసాగే వారూ ఉన్నారు.ఇటీవల యువ అనుబంధాలపై లయన్స్ గేట్ ప్లే అనే సంస్థ స్వతంత్ర అధ్యయనం నిర్వహించింది. ‘లయన్స్‌గేట్ ప్లే రిలేషన్ షిప్ మీటర్’ పేరిట విడుదల చేసిన అధ్యయన ఫలితాల్లో అత్యధికులు లివిన్ రిలేషన్ షిప్స్‌కి జై కొడుతున్నారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, సిటీబ్యూరోశాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడానికి బదులు వారు లివిన్ రిలేషన్ షిప్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలనే ఆధునికులు ఎంచుకుంటున్నారు. భాగస్వామిని అర్థం చేసుకోవడానికి పెళ్లికన్నా లివిన్ రిలేషన్ షిప్లో ఉండటం మేలని 50 శాతం మంది అంటున్నారు. ఈ రిలేషన్ షిప్లో ఉండటానికి తల్లిదండ్రులు అంగీకరిస్తారని 34% మంది భావిస్తున్నారు.భార్య, భర్త కాదు.. ఓన్లీ ఫ్రెండ్స్..ప్రేమను కొనసాగించడానికి స్నేహమే మూలమని నవతరం నమ్ముతున్నారు. ఆ మధ్య ప్రేమ అంటే స్నేహం అని అర్థం చెప్పిన బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ అభిప్రాయం సరైనదేనని 87 శాతం మంది పురుషులు 92 శాతం మహిళలు భావిస్తున్నారు. విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగొచ్చు అంటూ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ మాజీ ప్రియుడితో స్నేహం చేయడం మంచిదంటున్నారు. కేవలం 30% మంది భారతీయులు మాత్రమే తమ భాగస్వామి అపోజిట్ సెక్స్‌కి చెందిన క్లోజ్ ఫ్రెండ్‌ని కలిగి ఉండటం పట్ల అసౌకర్యంగా ఉన్నారు.ఎంపికలో కీలకం ఇవే..భాగస్వామి ఎంపికలో భావోద్వేగ సంబంధం కన్నా అందానికే 50 శాతం మంది పురుషులు ప్రాధాన్యత ఇస్తుండగా మహిళలు 35 శాతం మంది మాత్రమే లుక్స్‌కి విలువ ఇస్తున్నారు. ఆర్థికంగా సురక్షితంగా ఉండే రిలేషన్ షిప్‌లోకి మాత్రమే ప్రవేశించాలని 72 శాతం మంది భావిస్తున్నారు. ఇంటి ఖర్చులను జంటగా పంచుకోవాలని 50 శాతం మంది మహిళలు అంటుంటే 37 మంది పురుషులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు.బ్రేకప్.. వాట్ నెక్ట్స్?అనుబంధాలు ముక్కలయ్యాక ఏమిటి పరిస్థితి? హృదయం ముక్కలైపోతుందేమోనని, ఒంటరిగా ఉండడం కష్టమని, మళ్లీ ప్రేమ దొరకదేమోననే భయాల్లో 60 శాతం మంది ఉన్నారు. అయితే ఈ విషయంలో పురుషులు ఎమోషనల్‌గా కనిపిస్తుండగా, మహిళలు ఆచరణాత్మకమైన విధానాన్ని ఎంచుకుంటున్నారు. 53% మంది మహిళలు ‘మాజీని మరచిపోయి ముందుకు సాగుదాం’ అనే వైఖరిని కలిగి ఉన్నారు. కానీ 66% మంది పురుషులు తమ మొదటి ప్రేమకు తిరిగి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.అలాగే 37% మంది విడిపోయిన తర్వాత కూడా భాగస్వామితో కలిసి ఒకే ఇంట్లో నివసించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. అయితే రిలేషన్‌ను తిరిగి నిర్మించుకోవడం కంటే ముగించుకోవడమే సులభమని 33 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల వారిలో 72% మంది 27 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల వారిలో 67% మంది అంగీకరిస్తున్నారు. అలాగే అనుబంధం ముగిశాక ముందుకు సాగడానికి కొత్త బంధాన్ని ప్రారంభించడం ఉత్తమమని 48% మంది భావిస్తున్నారు.తారా పథంలో..ఫ్యాషన్ల నుంచి ఎమోషన్ల వరకూ దేనికైనా సరే అపరిమితమైన ఫాలోయింగ్ రావాలంటే.. దాన్ని సెలబ్రిటీ ఆదరించాలి. ఈ లివిన్ రిలేషన్íÙప్ విషయంలో కూడా అదే జరిగింది. చాలామంది నటీనటులు ఇలా ‘కలిసి జీవించడం’ కనిపిస్తోంది. దాన్ని అనుసరిస్తూ కార్పొరేట్, ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పెళ్లికి ప్రత్యామ్నాయంగా యువత ఈ అనుబంధం ఏర్పరచుకుంటున్నారు. అప్పట్లో హాలీవుడ్లో బ్రాడ్‌పిట్, ఏంజెలినా జోలి నుంచీ ప్రీతిజింతా, సుస్మితాసేన్, సంజయ్‌దత్‌లతో పాటు కరీనా–సైఫ్ అలీఖాన్ ఇంకా ఎందరెందరో ఈ కల్చర్‌ని కలర్ఫుల్గా మార్చారు.నగరంలో స్థిరపడిన సంస్కృతి..వుయ్ ఆర్ మ్యారీడ్ అన్నంత సహజంగా వుయ్ ఆర్ ఇన్ రిలేషన్ షిప్ అంటున్నాయి జంటలు. ఆ అనుబంధం పేరే లివిన్. ‘లివింగ్ టు గెదర్’ తెలుగీకరిస్తే ‘సహజీవనం’. వివాహంతో పనిలేకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా, స్త్రీ–పురుషుడు కలిసి ఉండడమే ‘లివిన్ రిలేషన్íÙప్’. భిన్న సంస్కృతుల నిలయమైన నగర జీవనంలో వైవాహిక బంధానికి ప్రత్యామ్నాయంగా ఈ సరికొత్త సంస్కృతి స్థిరపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.పెరుగుతున్న మోసాలు.. గతంలో మహిళా కమిషన్ వర్గాలు వెల్లడించిన డేటా ప్రకారం.. లివ్ ఇన్‌కు సంబంధించిన మోసాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, తెలంగాణలోని రంగారెడ్డి ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో అగ్రగామిగా హైదరాబాద్ నిలిచింది. లివిన్ చీటింగ్ కేసుల్లో 47 శాతం ఒక్క హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా కౌన్సిలింగ్ కేంద్రాలకు ఒక్క ఏడాదిలోనే 2వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు.జాగ్రత్తలు తప్పనిసరి..ఏదేమైనా తప్పుకాదనుకునో, తప్పనిసరిగానో ఈ అనుబంధంలోకి అడుగుపెడుతున్నవారు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. భాగస్వామి మరణించినా, మరే కారణం చేత దూరమైనా చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ‘లివిన్’ కొనసాగుతున్నప్పుడు అర్జించిన ఉమ్మడి ఆదాయాలకి సంబంధించిన ఒప్పందాలు, స్థిర, చరాస్తుల పంపకాలకు సంబంధించిన ఒప్పందాలను ముందుగానే రాసుకోవడం మంచిదని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.పుట్టిన పిల్లలకు కూడా మున్ముందు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. అనూహ్యమైన ప్రమాదాలతో భాగస్వామి ఆస్పత్రి పాలైతే అవసరమైన సేవలు అందించడానికి, చికిత్సకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి బాధితవ్యక్తి తల్లిదండ్రులు, బంధువుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. మెడికల్ పవర్ ఆఫ్ అటారీ్నని ముందుగా రాయడం ద్వారా అధిగమించవచ్చు.‘లివిన్’కు కారణాలెన్నో..నగరం ఈ తరహా బంధాలకు నెలవుగా మారుతోంది. సినిమా, మోడలింగ్, ఎంటర్టైన్మెంట్, టీవీ, మీడియా, ఐటీ, సాఫ్ట్వేర్.. రంగాలకు చెందిన యువతీ యువకులు ఈ అనుబంధంవైపు తేలికగా ఆకర్షితులవుతున్నారు.మహిళలు, పురుషులు ఎవరికి వారు వ్యక్తిగత కెరీర్‌ను, విజయాలను కోరుకోవడం, కెరీర్‌ను కొనసాగిస్తూనే భావోద్వేగపూరిత బలమైన అనుబంధాన్ని కోరుకుంటున్నారు.వ్యక్తిగత ఖర్చులు భరించలేక రూమ్ షేర్ చేసుకోవడంతో మొదలై ‘లివిన్’గా మారుతోంది.పబ్స్ నుంచి క్లబ్స్ వరకూ ‘స్టాగ్స్ నాట్ అలవ్డ్’ అని బోర్డు పెడతారు. దీంతో రోజుకొకర్ని వెంటేసుకుని వెళ్లేకన్నా.. స్థిరంగా ఉండే బాయ్‌ఫ్రెండ్/గరల్ ఫ్రెండ్ మిన్న అని భావించడం.పెళ్లిద్వారా పరస్పరం సంక్రమించే హక్కుల పట్ల భయం.చట్టబద్దమైన బంధంలోకి వెళ్లే ముందుగా తమ భాగస్వామిని అర్థం చేసుకోవాలనుకోవడం.ఈ కొత్త తరహా జీవనశైలి మానసిక సంఘర్షణకు, తీవ్ర ఒత్తిడికీ దారి తీస్తాయి. అద్దె ఇంటి దగ్గర్నుంచి ఆఫీసు వ్యవహారాల వరకూ పెళ్లికాని కాపురం చేయాలనుకునే యువత చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘వివాహం కంటే బలమైన అనుబంధం తమ మధ్య ఉందనుకున్నప్పుడు మిగిలిన విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అలాగే ఆవేశంలోనో, ఫ్యాషన్‌గానో, సహజీవనంలోని లోతుపాతులు తెలియకుండా అడుగుపెట్టడం సహజీవనంలోకి అడుగుపెట్టడం మంచిది కాదు’ అంటారు రచయిత్రి ఓల్గా. ఫిర్యాదులు ఇలా..నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఫిబ్రవరి 18న ఈవెంట్ ఆర్గనైజర్ సేవలు అందించే 30ఏళ్ల మహిళ తన భాగస్వామి ఖాలిద్ చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.గత ఏప్రిల్ 1న గచ్చి»ౌలిలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న లివ్ ఇన్ కపుల్ మధ్య వ్యక్తిగత విబేధాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఆ అమ్మాయిది చత్తీస్‌గఢ్ కాగా అబ్బాయిది బీహార్ కావడం గమనార్హం.అనురాథారెడ్డి అనే మహిళ తనకన్నా వయసులో చిన్నవాడైన చంద్రమోహన్ అనే వ్యాపారితో రిలేషన్ షిప్లో ఉంటూ హత్యకు గురయ్యారు. ముక్కలైన ఈమె మృతదేహాన్ని గతేడాది మే 25న పోలీసులు కనుగొన్నారు.లివిన్ రిలేషన్ షిప్లో ఉంటూ తమ జల్సాలు తీర్చుకోవడం కోసం మ్యాట్రిమోనియల్ పేరిట అబ్బాయిలకు వలవేస్తున్న యువతిని, ఆమె లివిన్ పార్ట్నర్ని రాచకొండ పోలీసులు 2022 డిసెంబరు 18న అరెస్ట్ చేశారు.గతేడాది జూలై 23న ఫిలింనగర్‌కు చెందిన సెక్యూరిటీ గార్డ్ శివకుమార్ తన లివిన్ పార్ట్నర్తో వచి్చన విబేధాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మహిళల పక్షపాతిగా మారిన కొన్ని చట్టాలు అబ్బాయిల్ని పెళ్లికి విముఖులుగా మార్చి, ఈ బంధం వైపు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది.ఆడవాళ్లకే నష్టం ఎక్కువ..ఏదేమైనా, ఇందులో పార్ట్నర్స్ ఇద్దరికీ ఎటువంటి హక్కులూ ఉండవు. ‘సహజీవనం’ విఫలమై మా వద్దకు వస్తున్న మహిళలు కొంత కాలం కలిసి జీవించాక విడిపోతే మనోవర్తి వస్తుందా? అని అడుగుతున్నారు. ఈ బంధానికి చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల ఆడవాళ్లకే నష్టం ఎక్కువ జరుగుతోంది. – నిశ్చలసిద్ధారెడ్డి, హైకోర్టు అడ్వకేట్ఇవి చదవండి: స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం.. -
వదిలేస్తారనే భయంతో పెళ్లికి దూరం..
సారా 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇంకా పెళ్లి కాలేదు. ఇప్సటికైనా పెళ్లి చేసుకోమని పేరెంట్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. పెళ్లంటే సారాకేం వ్యతిరేకత లేదు. కానీ భయం. ఎందుకంటే ఇప్పటివరకూ తాను ఐదుగురితో డేటింగ్ చేసింది. మొదట్లో అతను చూపించే కేర్, లవ్, అఫెక్షన్ అంతా బాగానే ఉంటుంది. అతని సాన్నిహిత్యంలో జీవితం భద్రంగా ఉంటుందని ఫీలవుతుంది. కానీ బంధం బలపడేకొద్దీ సారా ప్రవర్తన మారుతుంది. అతను తనను వదిలేస్తాడేమోననే భయం మొదలవుతుంది. దాంతో పొసెసివ్ గా మారుతుంది. అతని బిహేవియర్ మొత్తం తన కంట్రోల్ లో ఉండాలనుకుంటుంది. అలా లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా అతనికి దూరమవుతుంది. మళ్లీ అతను బ్రతిమలాడినా వెనక్కు వెళ్లదు. ఇలాగా ఐదుగురితో డేటింగ్ చేసి, పెళ్లి చేసుకుందామనుకుని, చివరకు వదిలేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెరగడంతో, అసలు తన బిహేవియర్ లో ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకునేందుకు కౌన్సెలింగ్ కు వచ్చింది.అప్పటి బాధ.. ఇప్పుడు భయం..సారా చెప్పింది విన్నాక, ఆమె బాల్యం, పెరిగిన వాతావరణం గురించి అడిగాను. పేరెంట్స్ ఇద్దరూ ఇంజినీర్లేనని, ఎప్పుడూ బిజీగా ఉంటేవారని, ముగ్గురం ఇంట్లోనే ఉన్నా ఒకరికొకరం దూరంగా ఉన్నట్లు ఉండేదని చెప్పింది. ఎమోషనల్ గా పేరెంట్స్ అందుబాటులో లేకపోవడం సారాలో అభద్రతా భావాన్ని కలిగించింది. ఆప్యాయత కోసం ఆమె మనసు ఆరాటపడేది. బాల్యంలో సారా తల్లిదండ్రులతో అనుభవించిన ఎమోషనల్ డిస్టెన్స్ ఆమెతో పెరిగి పెద్దదయ్యింది. ఇప్పుడు డేటింగ్ చేసినవాడు తనను వదిలివేస్తాడనే భయంగా మారింది. ఆ భయం పుష్-పుల్ డైనమిక్స్ గా వ్యక్తమవుతోంది. అంటే ఆప్యాయత కోసం దగ్గరవ్వడం, దూరమవుతారనే ఆందోళనతో దూరమవ్వడం. దీన్నే యాంగ్జయిటీ అటాచ్మెంట్ స్టైల్ అంటారు.బాల్యంలో పేరెంట్స్ వల్ల ఏర్పడే అటాచ్మెంట్ స్టైల్ కు ఆ తర్వాత జీవితంలో ఏర్పడే రిలేషన్షిప్స్ లో సంతృప్తికి సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది. సారా వంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్న వ్యక్తులు నమ్మకం, సాన్నిహిత్యం పోరాడతారు. వదిలివేస్తారనే భయం ఎమోషనల్ రోలర్ కోస్టర్ కు దారితీస్తుంది. చివరకు సారాలా ఏ బంధంలోనూ నిలబడలేరు. ఆరు నెలల్లో ఆందోళన దూరం... కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT): సారాతో మాట్లాడి ఆమె సమస్యను అర్థం చేసుకున్నాక థెరపీ ప్రారంభించాను. తనను వదిలివేస్తారనే నెగెటివ్ థాట్స్ ను గుర్తించడానికి, సవాలు చేయడానికి సీబీటీ పద్ధతులు ఆమెకు సహాయపడ్డాయి. ఉదాహరణకు ‘‘అతను నన్ను విడిచిపెడతాడు’’ అని ఆలోచించే బదులు, దాన్ని రీఫ్రేమ్ చేసి ‘‘ఈ రిలేషన్షిప్ పనిచేయకపోవచ్చు, అలాగని నేనేం ఒంటరిగా ఉండిపోను, హేండిల్ చేయగలను’’ అని ఆలోచించడం. ఎమోషనల్ రెగ్యులేషన్ స్కిల్స్: సారా తన ఎమోషన్స్ ను, ముఖ్యంగా వదిలివేస్తారనే యాంగ్జయిటీని మేనేజ్ చేసుకోవడానికి మైండ్‌ఫుల్‌నెస్ వంటి టెక్నిక్స్ నేర్పించాను. భయాన్ని హడావుడిగా డీల్ చేయకుండా, మాట్లాడి పరిష్కరించుకోవడం నేర్చుకుంది.ఆత్మగౌరవాన్ని పెంపొందించడం: సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ పెంపొందించే కార్యకలాపాలు ప్రోత్సహించాను. తన విలువ తాను తెలుసుకోవడం ద్వారా ఇతరుల అప్రూవల్ పై ఆధారపడటం తగ్గింది. సురక్షిత బంధానికి మార్గం: థెరపీ సాగేకొద్దీ సారా ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. తన అవసరాలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, ఆందోళనను సమర్థంగా నిర్వహించడం నేర్చుకుంది. సెల్ప్ అవేర్నెస్, ఎమెషనల్ కంట్రోల్ రావడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆరు నెలల తర్వాత సారా డేవిడ్‌ను కలుసుకుంది. క్రమక్రమంగా వారి బంధం బలపడింది. డేవిడ్ పర్సనల్ స్పేస్ ను గౌరవిస్తూ సారా తన అవసరాలను స్పష్టంగా చెప్పింది. తనను వదిలివేస్తాడనే యాంగ్జయిటీని అధిగమించగలిగింది. మూణ్నెళ్ల కిందట పెళ్లి కూడా చేసుకుంది. అఫ్కోర్స్, ఇద్దరూ వచ్చి పెళ్లికి పిలిచారు, వెళ్లి ఆశీర్వదించి వచ్చాను.సారా బాల్యంలో ఏర్పడిన అటాచ్మెంట్ స్టైల్, దానివల్లనే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అర్థం చేసుకోవడం ఈ కేసులో కీలకం. ఆ తర్వాతే థెరపీ. అందుకే వచ్చేవారం అటాచ్మెంట్ స్టైల్స్ గురించి, వాటి ప్రభావం గురించి మరితం వివరంగా తెలుసుకుందాం. అప్పటివరకూ హ్యాపీ వీకెండ్.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
బంధాలే నిజమైన బలం
హాయ్ ఫ్రెండ్స్.. వెల్కమ్ టూ "కనెక్షన్ కార్నర్". ఇది మనం కలిసి ఒక కప్పు కాఫీ తాగుతూ మనసువిప్పి మాట్లాడుకునే ప్రాంతం. కాఫీ తాగుతూ ఏం మాట్లాడుకుంటాం? లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. దాన్లోని కష్టసుఖాలను పంచుకుంటాం. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ, భావాలను పంచుకుంటూ అనుబంధాన్ని పెంచుకుంటాం. ఇక్కడ కూడా అదే పని చేద్దాం. మన జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే రకరకాల మానవ సంబంధాల గురించి మాట్లాడుకుందాం.మానవ సంబంధాలు మనం పీల్చే ఆక్సిజన్ లాంటివి. గాలి పీల్చుకోవడానికి మనం ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నమూ చేయం, కానీ ఆ గాలి మనం జీవించడానికి అత్యవసరం. బంధాలు కూడా అలాంటివే. మన శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం బాగుండాలంటే రిలేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది.బంధాలే జీవితం..జీవితాన్ని విశాలమైన సముద్రంలా ఊహించుకోండి. సవాళ్లు, సంతోషాల కెరటాల మధ్య మనల్ని నిలబెట్టే లైఫ్ బోట్లే మన బంధాలు, బాంధవ్యాలు. మనం పుట్టిన క్షణంలో ఏడ్చే మొదటి ఏడుపు కనెక్షన్ కోసం తొలి పిలుపు. వెంటనే అమ్మ పాలు ఇస్తుంది, మన కడుపు నింపుతుంది. ఆ తర్వాత నాన్న మన అవసరాలన్నీ కనిపెట్టి తీరుస్తాడు. వయసు పెరిగే కొద్దీ ఈ కనెక్షన్ అవసరం తగ్గదు, కేవలం పరిణామం చెందుతుంది. ఆహారం, భద్రత వంటి ప్రాథమిక అంశాల తర్వాత వచ్చే ఆకలి ప్రేమ. ఇక్కడే బంధాలు, అనుబంధాలు మన జీవితాన్ని వెచ్చదనంతో నింపుతాయి.మానసిక ఆరోగ్యానికి కూడా కీలకం..మీ ఫ్రెండ్ తో మనసువిప్పి మాట్లాడితే మీ మనసెంత తేలికవుతుందో, మీ గుండెల్లో భారం ఎలా తగ్గిపోతుందో ఎప్పుడైనా గమనించారా? నేనేదో కవిత్వం చెప్తున్నా అనుకోకండి. డబ్బు లేదా కీర్తికంటే సన్నిహిత సంబంధాలే ప్రజలను జీవితకాలం సంతోషంగా ఉంచుతాయని... ఒకటికాదు రెండు కాదు 75 సంవత్సరాల పాటు జరిపిన ‘హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్’లో కనుగొన్నారు. జీవితంలో అసంతృప్తుల నుంచి మానవ బంధాలే రక్షిస్తాయి.మనం స్నేహితులతో మాట్లాడినప్పుడు, మన మెదడు ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది, ఈ మాయా రసాయనం మన ఒత్తిడిని తగ్గించడమే కాదు, మనం ప్రేమించేలా చేస్తుంది. అందుకే దీన్ని "కడ్ల్ హార్మోన్" అని పిలుస్తారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, బలమైన సోషల్ నెట్‌వర్క్‌లు ఉన్న వ్యక్తులు నిరాశ, ఆందోళనతో బాధపడే అవకాశం తక్కువ. మన సంబంధాలు మానసిక ఆరోగ్యానికి విటమిన్ల లాంటివి, జీవితంలో ఎదురయ్యే తుఫానులను తట్టుకునేలా తయారుచేస్తాయి. ఆరోగ్యానికి బూస్టర్లు..మీ శరీరాన్ని తోటలా భావించండి. ఆ తోట పుష్పించడానికి సహాయపడే కాంతి, నీరే బంధాలు. బలమైన సామాజిక సంబంధాలు ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా మరియు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం, ఊబకాయంలానే ఒంటరితనం కూడా ప్రాణాంతకం కావచ్చని ఒక అధ్యయనం కనుగొంది. తోటలో రకరకాల మొక్కలు, పువ్వులు ఉన్నట్లే... జీవితంలోనూ వివిధ రకాల సంబంధాలతో వర్ధిల్లుతాయి. స్నేహితులు రంగురంగుల పువ్వుల్లా ఆనందాన్నిస్తారు. కుటుంబసభ్యులు మర్రిచెట్లులా చల్లని నీడను అందిస్తారు. వృత్తిపరమైన కనెక్షన్ లు పొద్దుతిరుగుడు పువ్వుల్లా దిశను అందిస్తాయి. శృంగార బంధాలు గులాబీల్లా జీవితానికి అందాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తాయి.బంధాల తోటను సాగుచేద్దాం.. జీవితంలో కనెక్షన్లు ఎంత ముఖ్యమైనవో అర్థమైంది కదా. వాటిని ఎలా పెంచుకోవాలి? తోటను పెంచడానికి సంరక్షణ ఎంత అవసరమో బంధాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే అవసరం. మట్టిని తేమగా ఉంచే నీరులాంటిది కమ్యూనికేషన్. సూర్యకాంతి లాంటిది సహానుభూతి. వివాదాలను పరిష్కరించుకోవడమంటే కలుపు మొక్కలను తీసివేయడం లాంటిది. ఆరోగ్యకరమైన తోటలాంటి బంధాలు పెరగాలంటే ఇవన్నీ అవసరం. కానీ బంధాలు, అనుబంధాలు కరువైన కుటుంబాల్లో పెరిగిన పిల్లలు బాల్యంలో బాధపడటమే కాదు, పెరిగి పెద్దయ్యాక కూడా ఆ సమస్యలను మోసుకెళ్తారు. విద్య, ఉద్యోగ, వైవాహిక జీవితాలను బాధామయం చేసుకుంటారు.అందుకే మనం "కనెక్షన్ కార్నర్"లో అన్ని రకాల బంధాల గురించి మాట్లాడుకుందాం. వాటిలో వచ్చే తప్పులను తెలుసుకుందాం, సరిదిద్దుకుందాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మీరు ఆనందమయమైన కనెక్షన్ లను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడే చిట్కాలు, సలహాలు, శాస్త్రీయ సమాచారం అందించేందుకు నేను ఎదురుచూస్తుంటాను. వచ్చేవారం కలుసుకుందాం.మీ.. సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com