Bigg Boss 5 Buzz Ravi: Anchor Ravi Shocking Comments on Siri and Shanmukh Relationship - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: సిరి- షణ్నూల రిలేషన్‌ గురించి రవి షాకింగ్‌ కామెంట్స్‌

Published Mon, Nov 29 2021 4:14 PM | Last Updated on Mon, Nov 29 2021 5:13 PM

Bigg Boss 5 Buzzz: Anchor Ravi Elimination Interview With Ariyana - Sakshi

Bigg Boss Buzzz: Anchor Ravi Shocking Comments on Shannu and Siri Relationship: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో యాంకర్‌ రవి ఎలిమినేషన్‌ ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. టాప్‌ -5లో ఖశ్చితంగా ఉంటాడనుకున్న రవి అనూహ్య రీతిలో 12వ వారమే హౌస్‌ నుంచి బయటకు వచ్చాడు. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండి కూడా రవి ఎలిమినేట్‌ కావడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు. రవికి మద్దతిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవి.. తాను ఎలిమినేట్‌ అవుతానని అస్సలు ఊహించలేదని, ఇప్పటికీ ఇది షాకింగ్‌గానే ఉందని తెలిపాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో చాలామంది తనను ‘గుంటనక్క’ అని ఏడిపించినా తానేమీ బాధపడలేదని, దాని గురించి పట్టించుకోలేదని తెలిపాడు. ఇక నటరాజ్‌ మాస్టర్‌ అయితే హౌస్‌లోకి ఏదో ఇంటెన్షన్‌తోనే లోపలికి వచ్చాడని అభిప్రాయపడ్డారు. తనకు తెలిసి ఎవరినీ  ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయలేదు అని, ఒకవేళ తన మాటలకు వాళ్లు ఇన్‌ఫ్లూయెన్స్‌ అయ్యారేమో అంటూ కామెంట్‌ చేశాడు. 

ఇక షణ్నూ-సిరిల రిలేషన్‌ గురించి మాట్లాడుతూ... 'షణ్ముఖ్ దీప్తిని ఎంత లవ్ చేస్తాడో.. సిరి చోటూని ఎంత లవ్ చేస్తుందో ఈ ఇద్దరికీ తెలుసు.. కానీ హౌస్‌లో సిరి షణ్నూని ఇష్టపడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా సిరినే చెప్పింది. అన్నా...ఐ లైక్‌ హిమ్‌ అని సిరి నాతో ఓపెన్‌అప్‌ అయ్యింది' అంటూ వివరించాడు. 

చదవండి: యాంకర్‌ రవి ఎలిమినేట్‌ అవ్వడానికి కారణాలు ఇవేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement