Anchor Ravi
-
ఫ్యామిలీ వేకేషన్లో చిల్ అవుతోన్న టాలీవుడ్ యాంకర్ రవి (ఫోటోలు)
-
తాళి కళ్లకద్దుకుని, అత్తామామల ఆశీర్వాదం తీసుకుని.. (ఫోటోలు)
-
న్యూ బిగినింగ్.. యాంకర్ రవి గృహప్రవేశ వేడుక (ఫోటోలు)
-
పెళ్లయి తొమ్మిదేళ్లు.. యాంకర్ రవి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
-
యాంకర్ రవి బర్త్ డే పార్టీ.. సందడి చేసిన అనసూయ (ఫొటోలు)
-
అమెరికాలో ఫ్యామిలీతో చిల్ అవుతున్న యాంకర్ రవి (ఫొటోలు)
-
జీవితాలు ఖరాబ్.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
యాంకర్ రవి.. ఒకప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ ఉండేవాడు. గతంలో అతడు యాంకర్ లాస్యతో జోడీగా షోలు చేయడంతో జనాలు వీరిద్దరినీ జంటగా ఊహించుకునేవారు. ఎంతో క్రేజ్ ఉన్న ఈ జంట మధ్య సడన్‌గా ఏదో గొడవలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారు, కలిసి షోలు చేయడం కూడా ఆపేశారు. నిత్యతో పెళ్లితర్వాత ఎన్నో ఏండ్లకు కలిసిపోయారు. కానీ అప్పటికే ఇద్దరూ చెరో దారి చూసుకున్నారు. లాస్య.. మంజునాథ్‌ను పెళ్లి చేసుకోగా యాంకర్ రవి.. నిత్య మెడలో తాళి కట్టాడు. తమకు పెళ్లైన విషయాలను ఇద్దరూ ఆలస్యంగానే బయటపెట్టారు. తాజాగా ఓ షోకి హాజరైన రవి తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. డబ్బు కోసమే పని'నేను పక్కా కమర్షియల్.. నేను డబ్బు కోసమే పని చేస్తున్నాను. నేనసలు కొరియోగ్రాఫర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కొంతమంది హీరోల దగ్గరికి వెళ్లి నా ఆసక్తిని బయటపెట్టాను. నాగార్జున గారు ముందు పని నేర్చుకుని తర్వాత ప్రయత్నించమన్నారు. ఓ ఛానల్లో కూడా పెట్టించాడు. అక్కడ సమ్‌థింగ్ స్పెషల్ అనే షో చేశాను. అలా నా జర్నీ మొదలైంది.కో యాంకర్‌తో కనెక్షన్నాకు పెళ్లయిందన్న విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదంటే.. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు అక్కడున్నవారు నిత్యతో.. నన్ను చూపిస్తూ ఫలానా తెలుగు యాంకర్ హజ్బెండ్ కదా అనేవారు. నన్ను నా కో యాంకర్‌తో ముడిపెట్టేవారు. కాదని చెప్తే.. ఆమె భర్తను పట్టుకుని నీ భర్త అంటావేంటి? అని నిత్యనే నిలదీశారు. పాపం.. తను ఎలా ఫీలవుతుందోనని నేను తల దించుకునేవాడిని. అందుకే తనను లేటుగా పరిచయం చేశాను.నా కూతుర్ని మర్చిపోయాబిగ్బాస్ షో విషయానికి వస్తే.. ఈ రియాలిటీ షో వల్ల చాలామంది జీవితాలు ఖరాబయ్యాయి. అక్కడ జరిగేవాటిని జడ్జ్ చేయొద్దు. నేను బిగ్‌బాస్‌కు వెళ్లిన 15 రోజులకు నా కూతురి ముఖం ఎలా ఉంటుందో మర్చిపోయాను. తనెలా ఉంటుందో గుర్తురాలేదు.. బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేదంతా మీకు చూపించరు' అని రవి చెప్పుకొచ్చాడు.చదవండి: 'చివరి స్టేజీలో ఉన్నా.. నా భర్త ముఖం మాడిపోయింది' -
హైదర్‌నగర్‌లో ఫ్యాబ్రిక్ స్టూడియో ప్రారంభించిన రాకింగ్ రాకేష్,సుజాత (ఫొటోలు)
-
యాంకర్ రవికి ఎందుకు సారీ చెప్పానంటే?: బిగ్‌బాస్ ఆదిరెడ్డి
బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్న మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి. తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. అయితే తాను ప్రస్తుతం యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. గతేడాది జరిగిన బిగ్‌బాస్ సీజన్-7 షోపై కూడా చాలా వీడియోలు చేశాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్‌గా చాలా సార్లు మాట్లాడారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆది రెడ్డి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో యాంకర్ రవిపై చేసిన వీడియో పట్ల సారీ చెప్పడంపై ఆయన స్పందించారు. ఆదిరెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'యాంకర్ రవి అంటే నాకు భయం లేదు. కానీ నేను అతనికి సారీ చెప్పా. ఎందుకంటే నేను ఫ్యామిలీ రిలేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. నా వల్ల వాళ్లు బాధ పడ్డప్పుడు నేను సారీ చెప్తే తప్పేముంది? మనకు ఫ్యామిలీ రిలేషన్స్ ముఖ్యం కదా?. అసలు ఏం జరిగిందంటే.. బిగ్‌బాస్ టాస్క్‌లో యాంకర్ రవి అన్న సంచాలక్. ఆయనకు బిగ్‌బాస్ కొన్ని రూల్స్ చెప్పాడంట. ఆ విషయం బయట ఉన్న మనకు తెలియదు. కానీ.. నేను రవి అన్న కావాలనే సన్నీని ఓడించాడని నెగెటివ్‌గా వీడియోలో చెప్పా. కానీ హౌస్ లోపల జరిగేవి కొన్ని మనకు చూపించరు కదా. ఆ విషయం నాకు బిగ్‌బాస్ వెళ్లి వచ్చాక అర్థమైంది. మనమే రవిని తప్పుగా అనుకున్నామని నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సారీగా ఫీలయ్యాను. ' అంటూ క్లారిటీ ఇచ్చారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
Anchor Ravi Latest Photos: గోవాలో భార్యతో యాంకర్ రవి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Anchor Ravi Daughter Viya Birthday Celebrations: పడవలో యాంకర్ రవి కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
తెలుగు షోలో సన్నీ లియోన్.. ఇదెక్కడి ట్విస్టురా మావ!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు టాలీవుడ్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆమె తొలిసారిగా తెలుగు బుల్లితెరపై కనిపించబోతోంది. ఆమె జీ తెలుగు కోసం 'తెలుగు మీడియం స్కూల్' అనే కొత్త రియాల్టీ షోకి గెస్టుగా వచ్చింది. దీంతో ఈ షో పై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోను ఛానెల్ విడుదల చేసింది. జీ తెలుగు మునుపెన్నడూ చూడని రియాల్టీ షోగా 'తెలుగు మీడియం స్కూల్'ని పరిచయం చేసింది. ఈ ప్రోమోలో సన్నీ లియోన్‌తో పాటు ప్రముఖ గాయకుడు మనో, యాంకర్ రవి కూడా ఉన్నారు. (ఇదీ చదవండి: దు:ఖంలోనూ చిన్న కూతురితో ప్రమోషన్లకు వచ్చిన విజయ్ ఆంటోనీ) ఇందులో టీవీ, టాలీవుడ్ హాస్యనటులు కూడా ఉన్నారు. ఈ ప్రోమో విడుదల అయిన వెంటనే సూపర్, అద్భుతం అంటూ సన్నీ లియోన్‌పై కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో కనకాల సుమ,రష్మి,అనసూయ,శ్రీముఖి వంటి వారు యాంకరింగ్‌లో తనదైన ముద్ర వేశారు. మరీ గెస్టుగా వచ్చిన ఈ బ్యూటీ వీరిలో ఎవరినైనా మెప్పించేలా యాంకరింగ్ చేస్తుందా అనేది చూడాలి? ఈ షో కాన్సెప్ట్ ఏంటి అనేది ఇంకా నిర్వహకాలు వెల్లడించలేదు. ఈ ప్రోమోలో సన్నీ తెలుగులో మాట్లాడుతూ తనకు ప్రాణం పోసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ మాట్లాడింది. అలాగే, ప్రోమో చాక్బోర్డ్పై షో టైటిల్ కనిపించడంతో ముగుస్తుంది, ఆ తర్వాత చీరలో సన్నీ లియోన్ ఉల్లాసమైన చిరునవ్వుతో ఉంటుంది. సన్నీలియోన్ 11 ఏళ్ల కిందటే 'జిస్మ్ 2'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆమె 'కరెంట్ తేగ, గరుడ వేగ,జిన్నా' వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. -
యాంకర్ రవి కూతురు వియాను చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో (ఫొటోలు)
-
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎంగేజ్మెంట్.. పిక్స్ వైరల్
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నారు. బుల్లితెరపై పలు షోస్‌లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటవ్వనుంది. ఈ వేడుకకు జబర్దస్త్ నటులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, యాంకర్ రవి, అనసూయ, గెటప్ శ్రీను తదితరులు పాల్గొని జంటను ఆశీర్వదించారు. ఇటీవలే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది సుజాత. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది. రాకేశ్‌తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలకో ఓ వీడియోలో షేర్ చేసింది సుజాత. త్వరలోనే పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంటకు పలువురు సినీతారలు శుభాంకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
యాంకర్ రవి యాడ్ షూటింగ్ కోసం భారీ సెట్టింగ్!
బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయ్యాడు యాంకర్ రవి. ప్రస్తుతం ఈ స్టైలీష్ యాంకర్ ఓ కమర్షియల్ యాడ్‌లో నటించబోతున్నాడు. ‘జబర్దస్త్’ రాకింగ్ రాకేష్‌తో కలిసి నటించబోయే ఈ యాడ్ .. ఓ వస్త్ర వ్యాపారానికి సంబంధించినది. దీని కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ని వేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఓ సినిమా కోసం వేసేంత సెట్లో ఈ కమర్షియల్ యాడ్ షూటింగ్ జరగనుందట. ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్ డైరెక్ట్ చేశారు. అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషం. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్ కు సంబందించిన బ్రాంచెస్ ఓపెన్ అవుతుండడం విశేషం. -
ఈ స్టార్ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే!
బుల్లితెరపై తమ మాటలతో, పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్స్ ఎంతోమంది ఉన్నారు. వీరికి కూడా స్టార్ నటీనటులకు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందులో ఎక్కువగా ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న టాప్ ఫీమేల్, మేల్ యాంకర్లలో సుమ కనకాల, ప్రదీప్ మాచీరాజుల మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత అనసూయ భరద్వాజ్, యాంకర్ రవి, రష్మీ గౌతమ్, శ్రీముఖి, శ్యామల, మంజూషలు ఉన్నారు. ఇందులో కొందరు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై సందడి చేస్తుంటారు. అలా రోజురోజు తమ క్రేజ్‌ను పెంచుకుంటున్న వారి రెమ్యునరేషన్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. మరి ఈ స్టార్ యాంకర్ల పారితోషికం ఎలా ఉందో ఓసారి చూద్దాం! చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం యాంకర్లలో మొదట చెప్పుకోవాల్సింది సుమ కనకాల గురించి. ఎంతోకాలంగా తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నారామె. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా ఇప్పటికీ సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తనదైన పంచ్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు ఫుల్ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోహీరోయిన్లు సైతం సుమకు ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇటూ టీవీ షోలతో అటూ మూవీ ప్రీరిలీజ్, ఆవార్డ్ ఫంక్షన్స్‌కు సుమ యాంకర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అలా ఆమె ఒక్కో ఈవెంట్‌కు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకుంటందని సమాచారం. ఇక ఒక్కొఎపిసోడ్కు అయితే రూ. 2 నుంచి రూ. 3 లక్షలు తీసుకుందట. ఈ లెక్కన సుమ నెలకు దాదాపు రూ. 20 లక్షలపైనే సంపాదిస్తుంది. ఇక ప్రదీప్ మాచీరాజు కూడా ఇంచుమించు సుమ రెంజ్లోనే పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది. మూవీ ఈవెంట్స్ అయితే రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు తీసుకోగా ఒక్కొక్క ఎపిసోడ్‌కు రూ. 2 లక్షల వరకు అందుకుంటాడట. ఇక రంగమ్మత్తగా ఎనలేని క్రేజ్ సొంతంగా చేసుకున్న అనసూయ యాంకర్‌గానే కాదు వెండితెరపై నటిగానూ రాణిస్తోంది. చదవండి: ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్లలో గ్లామరస్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఆమె ఒక్కో ఈవెంట్‌కు రూ.2 నుంచి రూ. 3 లక్షలు వరకు తీసుకుంటుందట. ఇక యాంకర్ రష్మీ గౌతమ్ రూ. 1.5 నుంచి రూ. 2 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట. ఇక యాంకర్ రవి దాదాపు రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. ఇక మంజుషా కూడా రూ. 50 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. యాంకర్ వర్షిణీ 30వేలు, యాంకర్ శ్యామల రూ. 50వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో అందరికంటే సుమ పారితోషికమే ఎక్కువ ఉండటం విశేషం. -
బెంజ్ కారు కొన్న బిగ్‌బాస్ బ్యూటీ
సాహసం సేయరా డింభకా సినిమాతో ప్రేక్షకులను అలరించింది హమీదా. అందచందాలు ఉన్నప్పటికీ పెద్దగా ఆఫర్లు రాలేదీ ముద్దుగుమ్మకీ. అయితే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌తో కావాల్సినంత పాపులారిటీ అందుకుంది హమీదా. సింగర్ శ్రీరామ్‌తో లవ్ ట్రాక్ నడిపి బాగా ఫేమస్ అయింది. తర్వాత బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోనూ సందడి చేసింది. ఇదిలా ఉంటే హమీదా ఈ దీపావళికి కొత్త కారు కొనుక్కుంది. మెర్సిడిస్ బెంజ్ కారును తన ఇంటికి తెచ్చుకుంది. ఈ మేరకు ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తన కుటుంబంతో పాటు యాంకర్ రవి, అతడి భార్య నిత్య సక్సేనా కూడా ఉన్నారు. అలాగే యాంకర్ రవితో కొత్త కారులో డ్రైవ్‌కు వెళ్లిన వీడియోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్... కొత్త కారు కొన్న హమీదాకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మరి శ్రీరామ్‌తో ఎప్పుడు డ్రైవ్‌కు వెళ్తావ్? అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Hamida Khatoon (@hamida_khatoon_official) చదవండి: ఆదిరెడ్డికి సర్ప్రైజ్.. కెప్టెన్‌గా తప్పు చేసిన శ్రీహాన్ -
టాలీవుడ్ యాంకర్లు.. అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?
టాలీవుడ్లో ఫేమస్ యాంకర్లు ఎంతమంది ఉంటారని అడిగేతే.. ఠక్కున గుర్తొచ్చే పేర్లు సుమ, అనసూయ, రష్మీ, ప్రదీప్, రవి వేళ్లపై చెప్పేస్తారు. తెలుగులో అంతలా క్రేజ్ సంపాందించారు వీరు. టాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా యాంకర్ల పాత్ర చాలా కీలకం. వారు లేకుండా ఏ ఫంక్షన్ ఊహించుకోవడం కష్టమే. మరీ అంత ప్రాముఖ్యత ఉన్న యాంకర్స్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరీ వారు ఒక్క ఈవెంట్‌కు తీసుకుంటారు. వారిలో ఎవరికీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం. సుమ కనకాల: ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ సుమ కనకాల. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పటి వరకు ఆమె దిగ్విజయంగా కొనసాగిస్తోంది. సుమ కనకాల హాజరయ్యే ఒక్క ఈవెంట్‌కు దాదాపు రూ.3.5 నుంచి 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రదీప్ మాచిరాజు: మేల్ యాంకర్స్‌లో ముందు వరుసలో వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రదీప్ ఒక్క ఈవెంట్‌కు రూ.2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్: జబర్దస్త్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్. కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్ కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోంది. దాదాపు రూ.2-3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. రష్మీ గౌతమ్: జబర్దస్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన మరో యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం రూ 2 లక్షల నుంచి నుండి రూ 3 లక్షల వరకు పారితోషికం అందుకుంటోంది. రవి: ప్రదీప్ తర్వాత అంతలా పేరు సంపాదించిన మరో మేల్ యాంకర్ రవి. పటాస్ షోతో క్రేజ్ సంపాదించిన రవి కేరీర్ పరంగా ఇప్పుడు కాస్త వెనుకబడ్డారు. అయినప్పటికీ ఒక్కో ఈవెంట్‌కు రూ.లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. శ్యామల: టాలీవుడ్లో ఫేమస్ అయిన మరో యాంకర్ శ్యామల. ఆమె కూడా ప్రస్తుతం రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటూ.. సినిమాల్లోనూ నటిస్తోంది. మంజూష: టాలీవుడ్ మరో యాంకర్ మంజూష. ఆమె కూడా రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇంటర్వ్యూల్లో ఎక్కువగా కనిపించే మంజూష యాంకర్‌గా తెలుగులో ఫేమస్ అయింది. వర్షిని: టాలీవుడ్ మరో యాంకర్ వర్షిని. ప్రస్తుతం ఆమె రూ.50వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. వర్షినికి జబర్దస్త్ ద్వారా తెలుగులో గుర్తింపు వచ్చింది. -
Sakala Gunabhi Rama: ఈ శుక్రవారం సన్నిదే .. యాంకర్ రవి
‘సినిమా వాళ్లు ఏదో ఒక శుక్రవారం మాది కావాలని కోరుకుంటారు. ఈ శుక్రవారం మాత్రం మా సన్నిదే. సకల గుణాభి రామ చిత్రం నేను చూసాను, చాలా బాగుంది. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది’అని యాంకర్ రవి అన్నారు. బిగ్ బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16 న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అది నారాయణ ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బిగ్ బాస్ ఫేమ్ నటులు సోహైల్, మానస్, జెస్సి, హమీద, యాంకర్ రవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ రవి మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. పాటలు చాలా బాగున్నాయి. సన్నీ కి ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’ అని కోరుకున్నారు. సోహైల్ మాట్లాడుతూ ..మేమంతా బిగ్ బాస్ తర్వాత ఫేమస్ అయ్యాము కానీ మా అందరి గోల్ మాత్రం సినిమాల్లో నటించడమే. మేము అందరం చాలా కష్టపడి మా కెరీర్ ని నిలబెట్టుకుంటున్నాం. అలాగే సన్నీ కూడా చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులు అందరూ ఈ చిత్రం చూడండి. ఇలాంటి చిన్న చిత్రాలు విజయవంతం అయితే మరిన్ని మంచి చిత్రాలు మీ ముందుకు వస్తాయి. అందరూ మా సన్నీ నటించిన సకల గుణాభి రామ చిత్రాన్ని చూసి విజయవంతం చేయండి’ అని కోరుకున్నారు. ‘లాక్ డౌన్ టైం లో చిన్న సినిమా గా ప్రారంభం అయిన సకల గుణాభి రామ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కొత్త టెక్నిషన్స్ చాలా కష్టపడి పని చేసాం. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ బాగా నచ్చుతుంది’అని దర్శకుడు శ్రీనివాస్ వెలిగండ అన్నారు. హీరో సన్నీ మాట్లాడుతూ .. నేను బిగ్ బాస్ లో రాక ముందే నాకు హీరో గా అవకాశం ఇచ్చిన మా నిర్మాత సంజీవ్ గారికి నా కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేసాం, ప్రేక్షకులు అందరూ మా సినిమా ని చూసి హిట్ చేస్తారు’ అని కోరుకున్నారు. -
ప్రియాంక పెళ్లి వార్తలపై స్పందించిన యాంకర్ రవి
బిగ్‌బాస్ బ్యూటీ, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోనుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఓ హల్దీ ఫంక్షన్లో ఎల్లో కలర్ సారీలో అదిరిపోయింది పింకీ. పెళ్లికూతురులా ముస్తాబైన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్వరలోనే ప్రియాంక పెళ్లి చేసుకోబోతుందేమోనని అనుకున్నారు. తాజాగా దీనిపై యాంకర్ రవి స్పందించాడు. ఓ ఫన్ వీడియోను షేర్ చేస్తూ.. 'నా చెల్లి పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే మధ్యలో ఒక పన్ను ఊడిపోయింది. ముందు దాన్ని సెట్ చేయాలి. ప్రియాంక నా బంగారం..' అని రాసుకొచ్చాడు. యాంకర్ రవి మాటలను బట్టి చూస్తుంటే ప్రియాంక ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేట్లు లేదని తెలుస్తోంది. ఇకపోతే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ప్రియాంక, రవి ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. హౌస్‌లో ఉన్నప్పుడే వీరు బాగా కలిసిపోయారు. షో అయిపోయాక కూడా వారు తమ మధ్య ఉన్న అన్నాచెల్లెలి బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) చదవండి: నటికి చేదు అనుభవం, అమెరికా ఎయిర్‌లైన్‌పై బాలీవుడ్ బ్యూటీ ఫైర్! ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్ -
ఆ కంటెస్టెంట్ వల్లే నాకు టైటిల్ దక్కింది: బిందు మాధవి
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా బిందు మాధవి రికార్డు సృష్టించింది.టైటిల్ రేసులో ఉన్న అఖిల్ సార్థక్ నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరికి బిందు మాధవి టైటిల్ విన్నర్‌గా నిలిచింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలి లేడీ విన్నర్‌గా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ట్రోఫీతో పాటు రూ. 40లక్షల క్యాష్ ప్రైజ్‌ను సైతం సొంతం చేసుకుంది. 'మస్తీ' హ్యాష్ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చి 'ఆడపులి' అనే హ్యాష్ ట్యాగ్‌తో బయటికొచ్చింది. అనంతరం బిగ్‌బాస్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిందు మాధవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. బిగ్‌బాస్ టైటిల్ గెలవడం తన మొదటి విజయంగా భావిస్తున్నానని, ఇప్పటి నుంచి ఇక విజయవంతంగా ముందుకు వెళ్తానని అనుకుంటున్నట్లు పేర్కొంది. ఇప్పుడు విన్నర్ అయ్యావ్ కానీ, ఒకసారి కూడా కెప్టెన్ ఎందుకు అవ్వలేదు అని యాంకర్ అడగ్గా అది తనకు కూడా తెలియదని చెప్పింది. హౌస్‌లో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ ఎవరు అని అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా వెంటనే నటరాజ్ మాస్టర్ అని తెలిపింది. ఈ సీజన్లో పలానా కంటెస్టెంట్ ఉన్నపపుడు నేను ఈ సీజన్‌కి రావాల్సింది లేకుండే అని ఎవరిని చూస్తే అనిపించింది?అని అడగ్గా వారి వళ్లే తనకీ టైటిల్ దక్కిందంటూ చెప్పుకొచ్చింది. చివరగా విన్నింగ్ మూమెంట్లో గెలుస్తానో, లేదో అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానని బిందు పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
బిగ్‌బాస్ ఓటీటీ: రవిపై ఫైర్ అయిన నటరాజ్ మాస్టర్?
Nataraj Master Bigg Boss Buzz Interview After Elimination: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ చివరి దశకు చేరుకుంది. టైటిల్‌ను గెలిచేందుకు హౌజ్‌మేట్స్ గట్టిగా పోటీ పడుతున్నారు. ఇక గతవారం హౌస్మేట్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు. బిందు, అఖిల్, బాబా బాస్కర్, నటరాజ్ మాస్టర్, ఆరియాన గ్లోరీ, మిత్ర, అనిల్, యాంకర్ శివ నామినేషన్‌ల్లో ఉండగా ఇందులో తక్కువ ఒట్స్ వచ్చిన నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి హౌజ్న వీడాడు. ఎలిమినేషన్ అనంతరం నటరాజ్ మాస్టర్ బిగ్‌బాస్ బజ్ ఎపిసోడ్లో యాంకర్ రవితో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా డిస్ని ప్లస్ హాట్‌స్టార్ రిలీజ్ చేసింది. చదవండి: చిక్కుల్లో కరాటే కల్యాణి, చిన్నారి దత్తతపై నోటీసులు ఇక వచ్చి రాగానే ‘నా రాక కోసం ఎదురు చూస్తున్నావా?’ అని రవికి కౌంటర్ ఇచ్చాడు మాస్టర్. తాను ఒక్కడినే అనుకుంటే మీ తప్పు అంటూ రవి రీకౌంటర్ ఇచ్చాడు. అనంతరం ఒకరి వల్ల మధ్యలోనే ఇంటి నుంచి బయటకు వచ్చాననడంతో అంతా నెగిటివి ఎందుకు మాస్టర్ అని రవి అంటాడు. ఆ తర్వాత చెన్నై.. తమిళ్.. చేసుకుని వెళ్లిపోతారు అనే నటరాజ్ వ్యాఖ్యలను రవి తప్పబట్టినట్లు కనిపించాడు. దీనికి మాస్టర్ దానికి కూడా క్లారిటీ ఇస్తా అంటాడు. ఆ తర్వాత మాస్టర్ తనకు ఒక సక్సెస్ అనేది రాలేదడంతో.. టాలెంట్‌కి బౌండరీస్ లేవు అంటాడు రవి. అనంతరం ‘నువ్వు ఏదో లోపల పెట్టుకుని ఒక పాయింట్స్ రాసుకుని నా మీద అటాక్ చేస్తున్నావ్ ప్రతి పాయింట్ అర్థమవుతుంది’ అని రవిపై ఫైర్ అయ్యాడు మాస్టర్. ఇలా ఇద్దరి మధ్య సంభాషణ కాస్తా ఘాటూగానే సాగింది. ఆ తర్వాత ఇంత క్రుయల్గా ఏ అమ్మాయిని చూడలేదని, ఆమె తీసే పాయింట్స్ అంటూ నటరాజ్ మాస్టర్ అంటుండగా ఈ రోజు బిందు పాయింట్స్ తీసింది కాబట్టే తనకు.. ఆడియాన్స్‌కి బిందు లోపట ఉండాలని ఓట్ వేశారు అంటాడు రవి. ఆ వెంటనే శకుని అనే ఓ నెగిటివ్ క్యారెక్టర్ ఒక అమ్మాయికి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడగ్గా.. ఆడించేది ఎవరు మహా భారతంలో శకుని.. బిగ్‌బాస్‌లో ఆ ఇద్దరి ఆడిస్తున్నావంటే నువ్వు శకునే కదా అని సమాధానం ఇస్తాడు మాస్టర్. చదవండి: త్వరలో పెళ్లి.. అంతలోనే బ్యాడ్‌న్యూస్ చెప్పిన పాప్ సింగర్ ఇక ఆరియానకు ఇంటి డబ్బులు వచ్చాయి ఇంటికి పంపించేయండనం ఏంటని అన్నదానికి.. బిడ్డ మీద ఒట్టు వేయమంటే గేమ్ అయిన వదిలేస్తాను కానీ ఒట్టు వేయను అంటాడు నటరాజ్ మాస్టర్. ఇక నువ్వు బాగానే ప్రిపేర్ అయ్యిన్నావ్ అర్థమైందంటూ రవిపై మాస్టర్ సటైరికల్ కామెంట్స్ చేస్తాడు. దీనికి రవి తాను చాలా బెటర్‌గా మాట్లాడుతున్నానని, బయటకు వెళ్లి చూస్తే మీరు చాలా బాధపడతారని సమాధానం ఇవ్వడం ఆసక్తి నెలకొంది. ఈ ఇంటర్య్వూలో రవి నటరాజ్ మాస్టర్రను ఎలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు.. నటరాజ్ మాస్టర్ ఎందుకు ఇంత అసహనానికి లోనయ్యాడనేది తెలియాంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది: శ్రీహాన్
బిగ్‌బాస్ షోతో లాభపడేవాళ్లతోపాటు నష్టపోయేవాళ్లు కూడా ఉన్నారు. ఈ షోలో అడుగుపెట్టిన కొందరికి సినిమా అవకాశాలు వస్తే మరికొందరు మాత్రం నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వచ్చారు. అలాంటివారిలో సిరి హన్మంత్ ఒకరు. సీరియల్స్, యూట్యూబ్ వెబ్‌సిరీస్‌తో పాపులర్ అయిన ఆమె హౌస్‌లో షణ్ముఖ్ జశ్వంత్‌తో క్లోజ్‌గా ఉండటంతో ఆమెపై ఎక్కడలేని నెగెటివిటీ వచ్చింది. బయట తనకోసం ప్రియుడు శ్రీహాన్ ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్లు ప్రవర్తిస్తుందని విమర్శలు వచ్చాయి. అంతేకాదు బిగ్‌బాస్ దెబ్బతో షణ్ముఖ్- దీప్తి సునయన విడిపోయినట్లుగానే సిరి, శ్రీహాన్ కూడా విడిపోనున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ బిగ్‌బాస్ తర్వాత ఇద్దరూ కలిసి పార్టీలకు హాజరవుతూ రూమర్లకు చెక్ పెట్టేశారు. తాజాగా తన ప్రేయసిపై పొగడ్తలు కురిపించాడు శ్రీహాన్. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లతో ఓ సరదా ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ రవి. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా అందులో శ్రీహాన్ ఓ వీడియో సందేశం పంపాడు. అందులో సిరి గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. 'సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకిప్పటికీ పడుతూనే ఉంది. సిరి ఏదైనా సాధించాలనుకుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా దేన్నీ పట్టించుకోదు. తను వైజాగ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి కొన్ని సాధించాలనుకుంది. యాంకరింగ్ చేసుకుంటూ సీరియల్స్, సీరియల్స్ నుంచి సినిమాలు, సినిమాల నుంచి మొన్నటి బిగ్‌బాస్ వరకు.. మొత్తం తన కష్టమే. ఎవ్వరూ సాయం చేసింది లేదు. ఎవరి సపోర్ట్ తను తీసుకుందీ లేదు. కానీ ఎంత మాట్లాడినా సిరిని అర్థం చేసుకోవడం మాత్రం కష్టం' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రముఖ సీరియల్ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో! -
బిగ్‌బాస్ హౌస్‌లో యాంకర్ రవి రచ్చ
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముగింపుకు చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో ఈసారి ఐదుగురు కాకుండా ఆరుగురు ఫినాలేకు చేరుకోనున్నారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్లు వరుసగా హౌస్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. హౌస్‌మేట్స్‌తో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం గేమ్ ఆడిస్తున్నారు. ఇప్పటికే సిరి, మానస్ హౌస్‌లోకి రాగా తాజాగా యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్న హౌస్‌మేట్స్‌తో మరో టాస్క్ ఆడించాడు. అయితే దీనికంటే ముందు వాళ్లతో ఫన్నీ స్కిట్స్ వేయిస్తూ ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేశాడు. మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరి సొంతం కానుంది? ఈ పాస్‌తో ఎవరు గేమ్‌ను మలుపు తిప్పనున్నారు అనేది తెలియాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ.. -
బిందుకు దగ్గరయ్యావని అఖిల్ దూరం పెట్టాడా? అజయ్ ఏమన్నాడంటే?
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్ విట్టా వరుసగా ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా ఎనిమిదో వారం అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ బజ్‌లో యాంకర్ రవికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా యాంకర్ రవి.. నువ్వు బిందుకు దగ్గరయ్యావని అఖిల్ దూరమయ్యాడా? అని సూటిగా ప్రశ్నించాడు. దీనికి అజయ్.. ఈ మధ్యే ఆ చర్చ కూడా మొదలైందని, ఎందుకు ఆమెతో క్లోజ్ ఉంటున్నావని అఖిల్ తనను అడుగుతూ ఉండేవాడని బదులిచ్చాడు. అఖిల్ వల్లే అజయ్ ఇన్నాళ్లు హౌస్‌లో ఉండగలిగాడని ఇంతకుముందు ఎలిమినేట్ అయినవాళ్లు చెప్పారు. ఎప్పుడైతే అఖిల్‌కు కొద్దికొద్దిగా దూరమవుతూ వచ్చావో అప్పటినుంచి అజయ్ వీక్ అవుతూ వచ్చాడని రవి పేర్కొనడంతో అజయ్ అలాంటిదేం లేదని ఆన్సరిచ్చాడు. ఇక ఇంటిసభ్యుల గురించి చెప్తూ.. నటరాజ్ మాస్టర్ కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుందన్నాడు. శివ స్మార్ట్ కానీ గేమ్‌లో విలువలు, ఎమోషన్స్ కూడా పక్కన పెట్టేస్తాడని అభిప్రాయపడ్డాడు. బిందుమాధవి చాలా స్ట్రాంగ్ ప్లేయర్, కాకపోతే కొంచెం ఓవర్ థింకింగ్ ఆపేస్తే బాగుంటుందని చెప్పాడు. అరియానా ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసిందన్నాడు. అఖిల్ కప్పు తీసుకుని రావాలని ఆశపడ్డాడు. చదవండి: బిగ్‌బాస్ షో నుంచి అజయ్ ఎలిమినేట్ మూడో సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తెలుగువాడే! -
ముమైత్ ఎలిమినేట్.. బిందు మాధవిపై షాకింగ్ కామెంట్స్
Bigg Boss Non-Stop Buzz: బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. తొలివారం పూర్తి చేసుకుంది. నో కామా నో ఫుల్ స్టాప్ అంటూ నాగార్జున మొదలుపెట్టిన ఈ షో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ముందుకి సాగుతుంది. ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా 17మందితో మొదలైన బిగ్‌బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. మాజీ కంటెస్టెంట్లతో పోటీపడి మరీ కొత్త కంటెస్టెంట్లు తమదైన ఆట కొనసాగిస్తున్నారు. ఇక బిగ్‌బాస్ ఓటీటీలో తొలి ఎలిమినేషన్ చోటుచేసుకుంది. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు ఈ వారం వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యి బిగ్‌బాస్ హౌజ్‌ను వీడింది. 24/7 డిస్నీ హాట్ స్టార్‌లో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్న బిగ్‌బాస్ అన్ని సీజన్ల మాదిరిగానే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ బజ్‌ను షోను కూడా నిర్వహిస్తోంది. ఈ షో ద్వారా ఎలిమినేట్ అయిన సభ్యులు మిగతా కంటెస్టెంట్స్‌పై ఉన్న తమ అభిప్రాయాన్ని చెప్పుకొవచ్చు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో యాంకర్ రవి ఈ షోకు హోస్ట్‌గా కనిపించాడు. ఈ సందర్భంగా రవితో కలిసి బిగ్‌బాస్ హౌజ్ ముచ్చట్లు చెప్పిన ముమైత్ మిగతా కంటెస్టెంట్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ఎల్లలు దాటిన అభిమానం, ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఏకంగా థియేటర్‌నే కొనేశారు! బిందు మాధవిని నాగినితో పోల్చింది. ఇక తన తర్వాత హౌజ్‌ను వీడేది ఎవరని అడగ్గా.. ఆర్జే చైతూ అంటూ ధీమాగా సమాధానం ఇచ్చింది. ఇలా రవి.. ముమైత్ మనసులోని మాటలను ఎలా బయట పెట్టించాడో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో యాంకర్ రవి సందడి చేయనున్నాడంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో మొదలయ్యాక రవి కనిపించకపోవడంతో అతడి ఫ్యాన్స్ నిరాశ చెందారు. చివరికి కంటెస్టెంట్‌గా కాకుండా హోస్ట్‌గా రవికి బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చిందని తెలిసి అతడి ఫాలోవర్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మై లవ్ ఈజ్ గాన్, అయినా పోతే పోనీ అంటున్న షణ్ముక్
Anchor Ravi Comments On Shannu Break Up Song: బిగ్‌బాస్ సీజన్-5 రేపిన చిచ్చు ఈ షో తర్వాత కూడా కొనసాగింది. అప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న రెండు జంటల మధ్య బిగ్‌బాస్ అగాధం సృష్టించింది. అయితే దాన్నుంచి సిరి-శ్రీహాన్ బయటపడితే, దీప్తి సునయన- షణ్నూల మధ్య మాత్రం బ్రేకప్ వ్యవహారం కొనసాగింది. ఈ షో అయిన వెంటనే న్యూ ఇయర్‌కి ఒకరోజు ముందుగా షణ్నూతో దీప్తి తెగదెంపులు చేసుకుంది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా స్టార్‌మాలో వాలెంటైన్స్ డే స్పెషల్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో కలిసి ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనిలో షణ్నూ అదిరిపోయే పర్ఫామెన్స్తో అలరించాడు. ప్రస్తుతం తను ఉన్న సిచ్చువేషన్కి తగ్గట్లుగానే మై లవ్ ఈజ్ గాన్ అంటూ ఎమోషన్‌తో డ్యాన్సులేశాడు. అనంతరం హోస్ట్ యాంకర్ రవి మాట్లాడుతూ.. మై లవ్ ఈజ్ గాన్ అంటున్నావ్ నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా? ఒక వేళ ప్రేమలో సారీ, థ్యాంక్స్, బాయ్ అని ఎవరికి చెబుతావ్ అంటూ అందరి ముందు ఇరికించేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మరి రవి అడిగిన ఈ ప్రశ్నలకు షణ్నూ ఎలాంటి ఆన్సర్లు ఇచ్చాడన్నది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
బ్రేకప్‌కు ఎండ్ కార్డ్.. మళ్లీ కలిసిపోయిన సిరి-శ్రీహాన్
Siri Hanmanth And Shrihan Patchup After Bigg Boss: బిగ్‌బాస్ సీజన్-5 ఎఫెక్ట్ రెండు జంటల మధ్య చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కి బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. అటు శ్రీహాన్ కూడా సిరి ఫోటోలు డిలీట్ చేయడంతో అతను కూడా దీప్తి సునయనను ఫాలో అయినట్లు అందరూ అనుకున్నారు. దీంతో అతడు కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెప్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనంతటిని పటాపంచలు చేస్తూ సిరి-శ్రీహాన్‌లు కలిసిపోయారు. రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన వీరిద్దరు యాంకర్ రవి ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు. అనంతరం వాళ్ల ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. మీ ఇద్దరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది. దీంతో సిరి-శ్రీహాన్‌ల బ్రేకప్‌కు ఎండ్ కార్డ్ పడినట్లయ్యింది. ఏది ఏమైనా ఎన్ని కలతలు వచ్చినా బిగ్‌బాస్ తర్వాత మీరిద్దరు కలవడం సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీప్తి సునయన- షణ్నూలు కూడా కలిసిపోతే బావుండు అని కోరుకుంటున్నారు. -
రెండేళ్ల తర్వాత మళ్లీ కలిసిన రవి-శ్రీముఖి.. ఫోటోలు లీక్
Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pics Goes Viral: యాంకర్ రవి.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్‌గా సత్తా చాటుతున్నాడు. 'సమ్‌థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రవి ఆ తర్వాత శ్రీముఖితో కలిసి చేసిన పటాస్ షోతో మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. స్టేజ్‌పై వీరిద్దరి టైమింగ్, కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందేమో కానీ వీరిద్దరి జోడీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో విబేధాల కారణంగానే వీరు కలిసి యాంకరింగ్ చేయడం లేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇంతవరకు ఈ జోడీ స్పందించలేదు. అయితే తాజాగా దాదాపు రెండేళ్ల అనంతరం వీరిద్దరు మళ్లీ కలిసినట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరు కలిసి యాంకరింగ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రవి-శ్రీముఖి మళ్లీ కలిసిపోయారంటూ ప్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సిరిని ఏమనకండి, అస్సలు బాగోదు: యాంకర్ రవి సీరియస్!
Deepthi Sunaina & Shanmukh 'Breakup': ప్రేమ జంట షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన విడిపోవడానికి సిరి హన్మంత్ కారణమంటూ కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. తన వల్లే దీప్తి షణ్నును వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పరోక్షంగా స్పందించిన సిరి.. 'ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాంగ్ అని చిరునవ్వుతో సమాధానం చెప్పండి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అంటే ఎవరెంత ట్రోల్స్ చేసినా తానింకా స్ట్రాంగ్ అవుతూనే ఉంటానని చెప్పకనే చెప్పింది సిరి. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై జరిగే ఈ ట్రోల్స్‌ను ఆపాలంటూ యాంకర్ రవి ఆ మధ్య మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో రవి మాట్లాడుతూ.. 'ఎవరినీ ఏమనకండి. మరీ ముఖ్యంగా సిరిని ఏమనకండి. మంచిగా చెప్తున్నా, జాగ్రత్త! హెచ్చరికల వైపు కూడా పోవట్లేదు.. దయచేసి నెగెటివ్ కామెంట్లు చేయడం మానేయండి. షణ్ను బాగానే ఉన్నాడు. త్వరలోనే అతడితో మాట్లాడి వీడియో కూడా చేస్తాను' అని చెప్పుకొచ్చాడు. -
యాంకర్ రవి ఇంటికి పోలీసులు.. కారణం ఏంటంటే!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలపై ట్రోల్స్ సర్వసాధారణంగా మారిపోయింది. అయితే వాటిని కొంతమంది లైట్‌గా తీసుకోని పట్టికోకుండా వదిలేస్తే.. మరికొంతమంది మాత్రం సీరియస్‌గా తీసుకుంటారు. తమపై అతస్య ప్రచారాలు చేసేవారిపై పోలీసులకు ఫిర్యాలు చేసి, శిక్ష పడేలా చేస్తారు. తాజాగా యాంకర్ రవి కూడా అదే పని చేశాడు. తనపై, తన కుటుంబ సభ్యులపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక.. తనను, తన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్‌కు గురి చేస్తున్నారని రవి వాపోయాడు. తనపై బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న వారిని అస్సలు వదిలి పెట్టనని హెచ్చరించాడు. తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్న వారి వివరాలను సేకరించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసిన రవి.. ఈ సారి ఏకంగా పోలీసులను తన ఇంటికి పిలిపించుకొని ఆధారాలు, స్క్రీన్ షాట్స్ అందించాడు. దీనికి సంబంధించిన వీడియోని రవి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా. కానీ ఒకరికి ఒక నెగిటివ్ కామెంట్, రిప్లై పెట్టే ముందు 30 సెకన్లు ఆలోచించండి. ఇక సోషల్ మీడియాలో చెత్తను క్లీన్ చేద్ధాం.. సోషల్ మీడియాలో దుర్భాషకు వ్యతిరేకంగా పోరాడుదామనే హ్యాష్ ట్యాగులతో రవి ఈ వీడియోని పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి.. వారిపై ఫిర్యాదు!
బుల్లితెర యాంకర్, బిగ్‌బాస్-5 కంటెస్టెంట్ రవి పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తనపై, తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొందరిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనపై ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోని రవి.. కుటుంబ సభ్యులపై కూడా ట్రోల్స్ రావడంతో భరించలేక పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగ, బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొన్న రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. రవి బయటకు రావడం పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం కుటుంబంతో కలిసి హాలిడేకి వెళ్లిన రవి ఇటీవలే తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న టాప్ 5లో శ్రీరామ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. -
శ్రీరామ్ గెలుపు కోసం రంగంలోకి యాంకర్ రవి!
Bigg Boss 5 Telugu, Anchor Ravi Supports To Sreerama Chandra: బిగ్‌బాస్ జర్నీ.. 19 మందితో మొదలైన ప్రయాణంలో ఐదుగురు మాత్రమే మిగిలారు. వీళ్ల గురి ఇప్పుడు టైటిల్ మీదే ఉంది. వీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి అటు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా సాయం చేస్తున్నారు. అదెలాగంటారా? మరేం లేదు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వారికి నచ్చిన ఫైనలిస్టుల్లో ఒకరికి ఓట్లేయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా యాంకర్ రవి సింగర్ శ్రీరామ్ కోసం రంగంలోకి దిగాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఐదుగురూ డిజర్వింగ్ అంటూనే ఆ టైటిల్ మాత్రం శ్రీరామ్‌కే దక్కాలంటూ ప్రచారం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఆటోను సైతం నడిపాడు. 'అన్నపూర్ణ స్టూడియో హౌస్, బిగ్‌బాస్ హౌస్.. బిగ్‌బాస్ హౌస్..' అని అరుస్తూ ఆటోవాలాగా మారిపోయాడు. 'బిగ్‌బాస్ సీజన్ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి' అంటూ ఆటో నడిపాడు. ఈ ఆటో వెనకాల శ్రీరామ్‌ను గెలిపించాలంటూ పోస్టర్ కూడా ఉంది. ఇక ఈ వినూత్న ప్రచారం చూసి అభిమానులు యాంకర్ రవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'నువ్వు లోపలుండి ఆడు, నీకోసం నేను బయటనుంచి ఆడతా' అన్న మాటను రవి నిజం చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: షణ్ముఖ్‌లో ఆ విషయం నచ్చేది కాదు, అతడే పక్కా గెలుస్తాడు.. కాజల్) View this post on Instagram A post shared by Sreerama Chandra (@sreeramachandra5) -
ఎందుకింత గలీజ్ అయితున్నరు? పోలీసులకు రవి ఫిర్యాదు
Bigg Boss 5 Telugu, Anchor Ravi: బిగ్‌బాస్ షోకు వెళ్లి ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న కొద్దిమందిలో యాంకర్ రవి ఒకరు. టాప్ యాంకర్‌గా రాణిస్తున్న రవి బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పంతొమ్మిదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. హౌస్‌లోకి వచ్చీరావడంతోనే అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేశాడు. కానీ అది మిగతావాళ్లకు నెగెటివ్‌గా అనిపించింది. రవి కావాలని అన్నింట్లో తలదూర్చుతున్నాడని, ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నాడంటూ నానామాటలు అన్నారు. మరికొన్ని గొడవల్లో అతడే నిందితుడిగా చీవాట్లు తిన్నాడు. ఫ్యామిలీ ఎపిసోడ్లో మాత్రం రవి భార్య నిత్య, కూతురు వియా రావడంతో అతడిపై ఉన్న నెగెటివిటీ పోయి పాజిటివిటీ పెరిగింది. ఇక రవి టాప్ 3లో ఉంటాడనుకుంటున్న సమయంలో 12 వారంలో ఎలిమినేట్ అయ్యాడు. అయితే బయటకు వచ్చిన రవి తనమీద, తన కుటుంబం మీద జరుగుతున్న ట్రోలింగ్‌ను చూసి తట్టుకోలేకపోయాడు. 24 గంటల్లో మీకు గంట మాత్రమే చూపిస్తారు, అక్కడేం జరుగుతుందో మీకు తెలీదు, నన్ను నెగెటివ్‌గా చూపించారు అని మొత్తుకుంటున్నా కొందరు నెటిజన్లు అతడిని విమర్శించడం మానుకోలేదు. తను సిరికి సపోర్ట్ చేయడాన్ని సహించలేకపోయిన కొందరు రవి కూతుర్ని కూడా మధ్యలోకి లాగారు. దీంతో ఓపిక నశించిన రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. 'నువ్వు గర్వపడటానికి అది(సిరి) ఇండియాకి పతకం తీసుకురాలేదు. నానా పనులు చేసి టాప్ 5కి వచ్చింది. సిగ్గుందా? ఇంట్లో మా పిల్లలకు టీవీ చూపించాలంటేనే భయమేస్తోంది. నువ్వు ఉన్నప్పుడంతా అవతలోడికి ఎలా వెన్నుపోటు పొడవాలని ఉన్నావు.. బిగ్‌బాస్ హౌస్ బయటకు వచ్చాక ఈ రవినేనా చూసింది అనేలా నటిస్తున్నావు. ఆ షణ్ముఖ్‌ని తమ్ముడు అంటావ్.. సిగ్గుందా కొంచెమైనా? నువ్వు ఫ్రెండ్షిప్ పేరుతో ఇలానే చేస్తున్నవా? వియాకి ఇలాంటివి నేర్పిస్తావా? నిన్ను చూసి సిగ్గుపడుతున్నాను' అంటూ ప్రియా రెడ్డి అనే యూజర్ మెసేజ్ చేసింది. దీనిపై రవి కాస్త ఘాటుగానే స్పందించాడు. 'నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మేడమ్. నా కూతురు గురించి ప్రస్తావించినందుకు మీపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను' అని చెప్పాడు ఇక మరో యూజర్ పంపిన మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసి ఎందుకు ఇంత గలీజ్‌గా అయితున్నరు? అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నుంచి సోషల్ మీడియాలో వచ్చే ఏ నెగెటివ్ కామెంట్‌ను సహించనని, అలాగే ఫేక్ అకౌంట్స్‌తో ఇష్టారీతిన కామెంట్లు చేసేవారిని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు వదిలిపెట్టరని హెచ్చరించాడు. ఇప్పటిదాకా భరించింది చాలు.. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ అసభ్యంగా కామెంట్లు చేసేవారికి శిక్ష పడేవరకు నేను పోరాడుతూనే ఉంటాను అని రవి స్పష్టం చేశాడు. -
బిగ్‌బాస్‌పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్
Anchor Ravi Mother Shocking Comments On Bigg Boss: యాంకర్ రవి.. బిగ్‌బాస్ హౌస్ నుంచి అనుహ్యాంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. ఇప్పటికీ రవి ఎలిమినేషన్ షాకింగ్‌గానే ఉంది. టాప్ 3లో ఉండాల్సిన రవి ఎలిమినేట్ కావడంతో అతని అభిమానులు చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఈ క్రమంలో బిగ్‌బాస్ హౌజ్‌లోకి రవి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ఇటీవల ప్రచారం జరిగింది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ క్రమంలో రవి తల్లి కూడా కొడుకు ఎలిమినేషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. చదవండి: మంచు లక్ష్మిపై ఆర్జీవీ ప్రశంసలు, మురిసిపోతున్న నటి కాగా రవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన అనంతరం అతడి ఫ్యాన్స్ డ్యాన్స్, డిజేతో గ్రాండ్‌గా వెల్కం చెప్పారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మీడియాతో రవి తల్లి ఉమరాణి ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవి బయటకు రావడంపై మీ అభిప్రాయం ఏంటని ఆమెను అడగ్గా.. ప్రెషర్ కుక్కర్ నుంచి బయట పడినట్టు ఉందని చెప్పింది. అంతేగాక రవిని వాళ్లు ఎన్కౌంటర్ చేసినట్టు అనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నా కొడుకు టాప్ 5లో ఉండాల్సిన వాడు ఇలా ఎలిమినేట్ అవడం ఆశ్చర్యంగా ఉంది. అతడు గేమ్ ఆడాడు. పిచ్చి చేష్టలు చేసి రాలేదు. ఊరికే కూర్చోని తినలేదు. రవి గేమర్. తెలివిగా ఆడాడు. చదవండి: ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు మీకు ఆట ఆడేవాళ్లు, మంచివాళ్లు అవసరం లేదని అర్థమైంది. కావాలని పిలిచి తీసుకెళ్లారు. కానీ ఆ హోదా ఇవ్వలేదు. మీరు ఇచ్చేది ఏంటి వీళ్లు ఇస్తున్నారు చాలు. అది రెస్పెక్ట్ అంటే’ అంటూ అక్కడే ఉన్న ఫ్యాన్స్‌ను చూపించింది. అలాగే బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండే కంటెస్టెంట్ సాధారణ వ్యక్తులు కాదని, వారంతా సెలబ్రెటీలు అంది. ‘సెలబ్రెటీలను పట్టుకు తీసుకెళ్లి మేకల్లా, గొర్రెల్లా ఉంచారు. అదే ఇండస్ట్రీలో ఉంటూ సేమ్ ఇండస్ట్రీ వారిని అవమానిస్తున్నారు. రవి అనే కాదు ప్రతి కంటెస్టెంట్‌కు ఇది ఫేర్ కాదు. ఇది ఎప్పటికి సరైనది కాదు. ఇప్పటికైన కాన్సెప్ట్ మార్చండి. లేకపోతే బిగ్‌బాస్ ఎవరూ చూడరు’ అంటూ రవి తల్లి ఉమరాణి బిగ్‌బాస్‌పై మండిపడింది. -
నమ్మి రూ.45 లక్షలిచ్చి మోసపోయాను: రవి
Bigg Boss 5 Telugu, Anchor Ravi: స్ట్రాంగ్ కంటెస్టెంట్ యాంకర్ రవి టాప్ 5కి వెళ్లడం ఖాయం అనుకుంటున్న తరుణంలో అతడు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. నిజానికి బిగ్‌బాస్ హౌస్‌లో రవిని చాలావరకు నెగెటివ్‌గానే చూపించారు. ఒకరి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడటం, అందరికీ సలహాలు ఇవ్వడం లాంటి చేష్టలను నెగెటివ్‌గానే చూపించాడు బిగ్‌బాస్. దీంతో అతడికి గుంటనక్క, ఇన్ఫ్లూయెన్సర్, నారదుడు అని రకరకాల పేర్లు పెట్టారు. అయినప్పటికీ రవి తన సహనం కోల్పోకుండానే మాట్లాడుతూ గేమ్ ఆడాడు. లహరి విషయంలోనూ అతడి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నాడు. హౌస్మేట్స్ అతడిని నమ్మాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే స్థితికి చేరుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్లో భార్య నిత్య, కూతురు వియా రావడంతో అతడి మీదున్న నెగెటివిటీ ఒక్కసారిగా హుష్‌కాకి అయింది. రవి మీద పాజిటివిటీ పెరిగింది. కానీ అదే వారం బిగ్‌బాస్ అతడికి హౌస్‌లో ఆఖరి వారం చేసి పంపించేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలతో బిజీగా మారాడీ యాంకర్. తాజాగా అతడి ఇంటర్వ్యూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'నేను నచ్చలేకపోతే నన్ను తిట్టండి, ఏమైనా అనండి.. కానీ నా ఫ్యామిలీ జోలికి రావద్దు. సోషల్ మీడియాలో చెత్త నా మెసేజ్‌లు పెడుతున్నారు. ఇలాగైతే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తాను' 'గతంలో నాకో నమ్మకద్రోహం జరిగింది. అన్నా బిజినెస్ పెట్టాలి, మా పరిస్థితి అంత బాగోలేదు అని ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతడు రెండు సంవత్సరాల పాటు నాతోనే ఉన్నాడు. అతడికి మందు అలవాటు లేదు, రోజూ గుడికి వెళ్తాడు, నమ్మకస్తుడు.. అందుకని ఏం ఆలోచించకుండా వెంటనే రూ.45 లక్షలు ఇచ్చాను. 20 రోజుల్లో తిరిగిస్తా అన్నవాడు ఇప్పటికీ ఇవ్వలేదు. నా వల్ల ఒకడు బాగుడపతాడు కదా అని లెక్కపత్రం కూడా తీసుకోకుండా డబ్బిచ్చాను, కానీ అతడు మోసం చేశాడు. అది చాలా ఎక్కువ మొత్తం కావడంతో నా భార్య ఉపవాసాలు, పూజలు చేసింది. ఆ డబ్బు తిరిగి రావాలని ప్రతిరోజూ దేవుడికి మొక్కుకున్నాను' అని చెప్పుకొచ్చాడు రవి. -
ఆ కంటెస్టెంట్ జోలికొస్తే బాగోదు: లోబో వార్నింగ్
Bigg Boss Telugu 5, Lobo Supports Shannu: లోబో.. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎంటర్టైనర్ ఆఫ్ హౌస్ బిరుదు అందుకున్నాడీ హైదరాబాదీ. అయితే ఎంటర్టైన్మెంట్ ఒకటే సరిపోదని గేమ్ ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు ప్రేక్షకులు. అయితే బిగ్‌బాస్ మాత్రం లోబోకు ఒక ఛాన్సిద్దామని సీక్రెట్ రూమ్‌కు పంపించారు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా గేమ్‌లో పెద్దగా ఛేంజ్ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ఎనిమిదవ వారం అతడిని ఎలిమినేట్ చేశారు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు రవి కోసం గేమ్ ఆడాడని, అతడికి కుడిభుజంలా వ్యవహరించాడని లోబో గురించి అంతా అనుకున్నారు. బయటకు వచ్చాక కూడా తన స్నేహితుడు రవికి ఓట్లేయండంటూ అతడికి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. కానీ అనూహ్యంగా రవి కూడా షోలో నుంచి నిష్క్రమించడంతో ఇప్పుడు లోబో మరో కంటెస్టెంట్‌కు మద్దతు ప్రకటించాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌కు ఓటేయమని అభ్యర్థిస్తున్నాడు. అతడు ఈ వారం ఓటింగ్‌లో లేకపోయినా ఓట్లేయండంటూ వీడియో రిలీజ్ చేశాడు. View this post on Instagram A post shared by Lobo (@lobo__619) హౌస్‌లో ఉన్న అందరూ తనకు ఫ్రెండ్సే అని, కానీ షణ్ను అంటే కాస్త ఎక్కువ లవ్ అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఎంత బాగా ఆడుతున్నారు? ఎవరు బాగా ఆడట్లేదు? అనేది పక్కనపెడితే షణ్ను తన ఫ్రెండ్ అని, అతడి జోలికొస్తే బాగోదని హెచ్చరించాడు. షణ్నును తోపుగా అభివర్ణించిన లోబో అతడికి సపోర్ట్ చేసి సూపర్ స్టార్‌ను చేద్దామని పిలుపునిచ్చాడు. -
బిగ్‌బాస్‌లోకి యాంకర్ రవి రీఎంట్రీ!.. ఈ సీజన్లో ఇదే తొలిసారి
Is Anchor Ravi Re Entry In Bigg Boss House: బిగ్‌బాస్ సీజన్-5లో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు యాంకర్ రవి. టాప్-5లో కశ్చితంగా ఉంటాడనుకున్న రవి అనూహ్యంగా ఎలిమినేట్ కావడం ఆయన ఫ్యాన్స్‌కే కాకుండా, నెటిజన్లకు సైతం షాకిచ్చింది. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. గేమ్ పరంగానూ రవికి మంచి మార్కులే పడ్డాయి. అయితే అనూహ్యంగా 12వ వారంలోనే ఎలిమినేట్ అయి బయటకు రావడాన్ని రవి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: Bigg Boss Telugu 5: యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవేనా? కావాలనే రవినే ఎలిమినేట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కలు చూపించాలంటూ స్టార్‌మా పై ఒత్తిడి పెంచుతున్నారు రవి ఫాలోవర్స్. ఈ నేపథ్యంలో రవిని మళ్లీ బిగ్‌బాస్‌లోకి పంపాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీనిపై స్టార్‌మా కూడా ఆలోచనలో పడ్డట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వీకెండ్లో రవిని మళ్లీ బిగ్‌బాస్‌లోకి పంపనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో రీఎంట్రీ ఏంటంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఈ సీజన్లో ఇప్పటివరకు రీ ఎంట్రీ, వైల్డ్ కార్డ్ అన్న ముచ్చటే లేదు. దీంతో రీఎంట్రీ ద్వారా యాంకర్ రవిని మరోసారి హౌస్‌లోకి పంపేందుకు షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచిచూడాల్సిందే. చదవండి: Bigg Boss Telugu 5: సిరి- షణ్నూల రిలేషన్ గురించి రవి షాకింగ్ కామెంట్స్ -
నా బిడ్డను కూడా వదల్లేదు, ఇంత దారుణమా?: రవి ఫైర్
బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ రవి షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఇంటి విశేషాలను పంచుకోవడంతో పాటు తనపై వచ్చిన నెగెటివిటీపై కూడా స్పందించాడు. 'నేను వెళ్లేముందే చెప్పాను.. నన్ను ఆడుకోండి, వాడుకోండి, ట్రోల్ చేయండి, మీ ఇష్టమని చెప్పాను. కానీ చాలామంది నా ఫ్యామిలీని, నిత్యను ఇన్వాల్వ్ చేశారు. ఆఖరికి నా బిడ్డను కూడా వదల్లేదు. అంటే బయటొక బ్యాచ్ ఉంటుంది.. వాళ్లకు డబ్బులిస్తే వాళ్ల ఫ్యామిలీ గురించి కూడా చెత్తగా మాట్లాడతారు.' 'రెండు వేల రూపాయలిస్తామంటే వాళ్ల తల్లిదండ్రుల గురించి కూడా చెడ్డగా రాసేవాళ్లు కొందరున్నారు. ఇంత దారుణమా? డబ్బు కోసం ఇంత నీచాతినీచంగా ఈ లెవల్లో దిగిపోతున్నమా? అందరికీ ఒక్కటే చెప్తున్నా.. లోపల జరిగేది ఒకటి, బయటకు వచ్చేది ఇంకొకటి. బయట డబ్బు తీసుకుని గేమ్ ఆడుతున్నవారు లోపలి గేమ్‌ను డామినేట్ చేస్తున్నారు. 24 గంటల్లో ఒకే గంట మాత్రమే చూపిస్తున్నారు. బిగ్‌బాస్ అనేది మైండ్ గేమ్.. వాళ్లూవీళ్లూ చెప్పేది కాకుండా మీకు ఎవరు బాగా ఆడుతున్నారనిపిస్తే వారికే ఓటేయండి' అని చెప్పుకొచ్చాడు రవి. -
యాంకర్ రవి సహా బిగ్‌బాస్‌లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్ ఇవే..
Bigg Boss Telugu shocking Eliminations: బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్‌లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ మాత్రం యాంకర్ రవిదే అని చెప్పొచ్చు. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా రవి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులు ఎవరూ ఊహించలేదు. ఇది మోస్ట్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్లు రవికి సపోర్ట్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్స్లతో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్‌ను ఏంటో ఓసారి చూద్దాం. సీజన్-1 బిగ్‌బాస్ సీజన్-1లో నటుడు ప్రిన్సీ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. టైటిల్ రేసులో ఉంటాడనుకున్న ప్రిన్సీ ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సీజన్-2 బుల్లితెరపై పలు టీవీ షోలతో అలరించే యాంకర్ శ్యామల బిగ్‌బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శ్యామల అంత త్వరగా ఎలిమేట్ కావడం షాకింగ్‌గా అనిపించింది. దీంతో ఇది అన్‌ఫెయిర్ అంటూ ఫ్యాన్స్ బాగా ఓట్లు వేసి రీఎంట్రీతో మరోసారి హౌస్‌లోకి పంపించారు. సీజన్-3 అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని అలీ రెజా బిగ్‌బాస్ ఎంట్రీతో పాపులర్ అయ్యాడు. అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన అలీ టాప్-5లో ఉంటాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సీజన్-4 బిగ్‌బాస్ సీజన్-4లో యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ అందరినీ కంటతడి పెట్టించింది. హౌస్‌లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న దేవీ మూడో వారమే ఎలిమినేట్ అవ్వడం ప్రేక్షకులను షాకింగ్‌కి గురిచేసింది. దీంతో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో దేవికి మద్దతుగా ఎంతోమంది నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్-5 బిగ్‌బాస్ సీజన్-5లో యాంకర్ రవి ఎంట్రీ నుంచే ఆయన టాప్-5అని అంతా భావించారు. సెపరేట్ ఫ్యాన్ బేస్, ఆటతీరుతో వాడే స్ట్రాటజీస్‌తో మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పటికీ రవి ఎలిమినేషన్‌ను ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.మోస్ట్ డిసర్వింగ్ కంటెస్టెంట్‌ను బయటకు పంపించారంటూ ఫైర్ అవుతున్నారు. ఇది మోస్ట్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. చదవండి: షణ్నూని ఇష్టపడుతున్నట్లు సిరి నాతో చెప్పింది: యాంకర్ రవి కొత్త ఇంట్లోకి యాంకర్ శ్యామల గృహప్రవేశం.. వీడియో వైరల్ Bigg Boss Telugu 5: అలా అనుకోవడం వల్లే యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడా? -
రవి ఎలిమినేషన్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss Telugu 5, MLA Raja Singh Comments On Bigg Boss Show: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బిగ్‌బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలని, అసలు షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ఈ షో ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని నిర్వాహకులను ప్రశ్నించారు. రవిని ఎలిమినేట్ చేయడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన అనుమానించారు. తెలంగాణ వ్యక్తిని బయటకు పంపించి మరోసారి కొట్లాట పెట్టడానికి పథకం రచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు బిగ్‌బాస్‌తో పాటు హిందీ బిగ్‌బాస్‌ను సైతం బ్యాన్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని తెలిపారు. కాగా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. అతడు ఎంట్రీ ఇచ్చినప్పుడే టాప్ 5 పక్కా అని అంతా డిసైడ్ అయ్యారు. కానీ అనూహ్యంగా 12వ వారంలోనే అతడిని ఎలిమినేట్ చేసి పంపించేశారు. తనకంటే తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లను హౌస్‌లో ఉంచి రవిని అన్యాయంగా ఆటలో నుంచి తొలగించారు. దీన్ని రవి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో తమ ఆవేశం వెల్లగక్కుతున్నారు. ఎవరినో సేవ్ చేయడం కోసం రవిని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
షణ్నూని ఇష్టపడుతున్నట్లు సిరి నాతో చెప్పింది: యాంకర్ రవి
Bigg Boss Buzzz: Anchor Ravi Shocking Comments on Shannu and Siri Relationship: బిగ్‌బాస్ సీజన్-5లో యాంకర్ రవి ఎలిమినేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. టాప్ -5లో ఖశ్చితంగా ఉంటాడనుకున్న రవి అనూహ్య రీతిలో 12వ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా రవి ఎలిమినేట్ కావడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు. రవికి మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవి.. తాను ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదని, ఇప్పటికీ ఇది షాకింగ్‌గానే ఉందని తెలిపాడు. బిగ్‌బాస్ హౌస్‌లో చాలామంది తనను ‘గుంటనక్క’ అని ఏడిపించినా తానేమీ బాధపడలేదని, దాని గురించి పట్టించుకోలేదని తెలిపాడు. ఇక నటరాజ్ మాస్టర్ అయితే హౌస్‌లోకి ఏదో ఇంటెన్షన్‌తోనే లోపలికి వచ్చాడని అభిప్రాయపడ్డారు. తనకు తెలిసి ఎవరినీ ఇన్ఫ్లూయెన్స్ చేయలేదు అని, ఒకవేళ తన మాటలకు వాళ్లు ఇన్ఫ్లూయెన్స్ అయ్యారేమో అంటూ కామెంట్ చేశాడు. ఇక షణ్నూ-సిరిల రిలేషన్ గురించి మాట్లాడుతూ... 'షణ్ముఖ్ దీప్తిని ఎంత లవ్ చేస్తాడో.. సిరి చోటూని ఎంత లవ్ చేస్తుందో ఈ ఇద్దరికీ తెలుసు.. కానీ హౌస్‌లో సిరి షణ్నూని ఇష్టపడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా సిరినే చెప్పింది. అన్నా...ఐ లైక్ హిమ్ అని సిరి నాతో ఓపెన్అప్ అయ్యింది' అంటూ వివరించాడు. చదవండి: యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవేనా? -
Bigg Boss Telugu 5: అలా అనుకోవడం వల్లే యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడా?
Bigg Boss 5 Telugu Ravi Elimination Reason: బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో 12వ వారం ఎలిమినేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. నామినేషన్లలో ఉన్న మిగతా కంటెస్టంట్లతో పోలిస్తే రవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ వారికంటే రవి బయటకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ రవి ఫ్యాన్స్ సహా నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? నిజంగానే మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే తక్కువ ఓట్లు వచ్చాయా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అని ఓసారి పరిశీలిస్తే.. ఈ సీజన్లో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే యాంకర్ రవికే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై మాస్ మహారాజాగా ఎదిగిన రవి గ్రాఫ్ బిగ్‌బాస్ హౌస్‌లో మొదట్లో బాగానే ఉండేది. అయితే లహరి-ప్రియ ఎపిసోడ్లో అమ్మ మీద ఒట్టు అంటూ అబద్దాలు చెప్పడం రవికి అతిపెద్ద మైనస్ అని చెప్పొచ్చు. అప్పటివరకు గుంటనక్క, ఇన్ఫులెన్స్ స్టార్ అని ట్యాగ్ లైన్స్ వచ్చినా ఈ ఒక్క ఎపిసోడ్‌తో రవి గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఇక శ్వేత ఎలిమినేషన్‌కి కూడా పరోక్షంగా రవి కారణం అవ్వడంతో మరింత నెగిటివ్ అయ్యాడు. అయినప్పటికీ అతనికి ఉన్న ఫ్యాన్ బేస్‌తో నామినేట్ అయిన ప్రతీసారి సేవ్ అవుతూ వచ్చాడు. ఈసారి కూడా నామినేషన్స్ నుంచి ఈజీగా గట్టెక్కేస్తాడని అంతా భావించారు. టాప్-5కి రవి చాలా సులువుగా చేరుకుంటాడని అనుకున్నారంతా. దీంతో రవికి ఎలాగైనా భారీ ఓట్లు పడతాయని భావించి ఫ్యాన్ బేస్ తక్కువ ఉన్నవారిని సేవ్ చేయడం కోసం వారికి ఓట్లు వేశారు. ఇది రవికి చాలా పెద్ద మైనస్‌గా మారింది. ఎలాగో ఓట్లు పడతాయి అన్న ఉద్దేశంతో మిగతా వారికి ఓట్లు వేయడం కూడా రవి ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం అయి ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా టాప్-5లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఇలా అనూహ్యంగా బయటకు రావడం రవి బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. View this post on Instagram A post shared by Big Boss Telugu Season 5 (@bigbosstelugu5.adda) -
రవి పారితోషికం ఎంతో తెలుసా? కోటి కంటే కొంచెం తక్కువంతే!
Bigg Boss 5 Telugu, Anchor Ravi Remuneraion: బిగ్‌బాస్ షో.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. ఊహించిన కంటెస్టెంట్లు సేవ్ అవ్వచ్చు.. ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవనూ వచ్చు. ఎందుకంటే ఇది బిగ్‌బాస్. ఎవరి అంచనాలకు అందని రియాలిటీ షో. 12వ వారంలో యాంకర్ రవి ఎలిమినేషన్ ప్రేక్షక లోకాన్ని షాక్‌కు గురి చేసింది. టాప్ 5లో కాదు కాదు.. ఏకంగా టాప్ 3లో ఉంటాడనుకున్న అతడు సడన్‌గా ఎలిమినేట్ అవడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు. కాజల్, సిరి, ప్రియాంక కంటే రవికే తక్కువ ఓట్లు వచ్చాయంటే నమ్మలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు. అతడు బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అతడిని బిగ్‌బాస్ పంపించివేయడానికి భారీ రెమ్యునరేషన్ కూడా ఒక కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట! వారానికి రూ. 7 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట! ఈ లెక్కన రవి 12 వారాలకే 90 లక్షల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఇది బిగ్‌బాస్ విజేతకు అందించే 50 లక్షల ప్రైజ్‌మనీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం! బిగ్‌బాస్ షో ముగింపుకు వచ్చినందున రవికి అంత మొత్తంలో డబ్బులు వెచ్చించి హౌస్‌లో కొనసాగించడం అవసరం లేదని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఒక లేడీ కంటెస్టెంట్‌ను ఫినాలేకు పంపించాలని కూడా బలంగా ఫిక్సయినట్లు రవి ఎలిమినేషన్‌తో చెప్పకనే చెప్పారు. -
రూ.50 లక్షలు గెలిస్తే అమ్మనవుతా: ట్రాన్స్‌జెండర్ ప్రియాంక
Bigg Boss Telugu 5, Ravi Eliminated From BB Show: ఇప్పటివరకు బిగ్‌బాస్ షో విజేతలకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సీజన్లో మాత్రం దీనికి అదనంగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన భూమిని కూడా కానుకగా అందిస్తున్నారు. ఈ విషయాన్ని మన్మథుడు నాగార్జున అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాస్ విన్నర్ రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు నాగ్. మొదటగా ప్రియాంక మాట్లాడుతూ.. 'నేను రూ.50 లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉండేది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలన్నారు. కాబట్టి ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటా' అని చెప్పుకొచ్చింది. శ్రీరామ్ మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వడానికే షోకు వచ్చాను. పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్‌తో కలిసి ఉండాలన్నది నా కోరిక' అని చెప్పాడు. 'కొంత వియా చదువు కోసం పొదుపు చేస్తా. నిర్మాణసంస్థ నెలకొల్పాన్న కోరికను నెరవేర్చుకుంటా' అని చెప్పాడు రవి. కాజల్ తనకున్న 30 లక్షల రూపాయల అప్పు తీర్చుకుంటానంది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలనుకుంటున్నానని చెప్పింది. సువర్ణ కుటీర్‌లో ఇల్లు కట్టుకుంటానంది. సన్నీ వచ్చిందంతా అమ్మకిచ్చేస్తానని, కొంత డబ్బు తీసుకుని సెలూన్ పెడతానన్నాడు. మానస్ తనకు వచ్చిన డబ్బుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తానని చెప్పాడు. షణ్ముఖ్.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న అమ్మకు 25 లక్షలు ఇస్తానన్నాడు. తనకెన్నో సార్లు డబ్బు సాయం చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన దీప్తి సునయనకు మరో 25 లక్షలిస్తానన్నాడు. సిరి శ్రీహాన్ పేరెంట్స్‌కు ఉన్న 10 లక్షల అప్పు తీర్చేసి కొంత అమ్మకిస్తానని, అలాగే అంధులకు సాయం చేస్తానని పేర్కొంది. తర్వాత షణ్ముఖ్, ప్రియాంక సేఫ్ అవగా రవి, కాజల్ మాత్రమే నామినేషన్స్‌లో మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను నువ్వు వాడుకుంటావా? లేదా వీళ్లలో ఒకరిని సేవ్ చేస్తావా? అని నాగ్ సన్నీని అడిగాడు. ఆ పాస్ తనకు రావడం కోసం ఎంతగానో ఫైట్ చేసిన కాజల్‌కు వాడాడు. కానీ ఓటింగ్‌లో రవి చివరి స్థానంలో ఉండటంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని నాగ్ ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి ఉపయోగం లేకపోయింది. రవి కోసం వాడి ఉంటే కనీసం అతడైనా సేవ్ అయ్యేవాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న రవి ఎలిమినేట్ అవడంతో ఏడుపాపుకోలేకపోయిన సన్నీ తన దగ్గరున్న గిఫ్ట్ వోచర్‌ను అతడికి బహుమతిగా ఇచ్చాడు. సన్నీ మాత్రమే కాదు, ఇంటిసభ్యులెవరూ రవి ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోయారు. అందరూ కన్నీటితో భారంగా ఆయనకు వీడ్కోలు పలికారు. స్టేజీ మీదకు వచ్చిన రవి చాలా తొందరగా బయటకు వచ్చేశానని బాధపడ్డాడు. అనంతరం ఈ బిగ్‌బాస్ జర్నీలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్? అనే గేమ్ ఆడాడు. షణ్ను పాస్ అయ్యాడని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. లేట్‌గా కనెక్ట్ అయిన చందూలో అన్నీ పాజిటివ్సే ఉన్నాయన్నాడు రవి. నువ్వు లోపలి నుంచి ఆడు, నేను బయట నుంచి ఆడతానని చెప్తూ అతడిని పాస్ చేశాడు. ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు, తోపు అంటూ సన్నీని పాస్ చేశాడు. ప్రియాంక, సిరి, కాజల్‌కు ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. టాప్ 5లోకి రావాలని సిరిని ఎంకరేజ్ చేశాడు. మానస్‌ను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానంటూనే అతడికి ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. షణ్ను ఎంతకూ కన్నీళ్లను ఆపుకోలేకపోవడంతో రవి.. నేనెళ్తేనే నువ్వు గెలుస్తావంటూ ఆఖరి మాటగా చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. -
లెక్క తేలాల్సిందే, ఓట్లు చూపించండి: రవి ఫ్యాన్స్ డిమాండ్
Bigg Boss 5 Telugu, Anchor Ravi Eliminated!: 'ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు' సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎలాగో సండే ఎపిసోడ్ షూటింగ్ శనివారమే పూర్తవుతుండటంతో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం ఒకరోజు ముందుగానే లీకవుతూ వస్తోంది. చివరకు అదే నిజమవుతోంది కూడా! ఈసారి రవి బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నాడన్న వార్త బయటకు రాగా అతడి ఫ్యాన్స్ షో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 3లో ఉంటాడనుకున్న కంటెస్టెంట్‌ను కనీసం టాప్ 5లోకి కూడా రాకముందే ఎలా ఎలిమినేట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రియాంక సింగ్, కాజల్, సిరి కంటే కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రవికే తక్కువ ఓట్లు ఎలా వస్తాయని నిలదీస్తున్నారు. నిజంగా ఆ ముగ్గురి కంటే రవికి తక్కువ ఓట్లు వచ్చినట్లైతే ఆ ఓట్ల లెక్క చూపించమని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రవిని కావాలని ఎలిమినేట్ చేశారన్న విషయాన్ని అంగీకరించమని సవాలు విసురుతున్నారు. లేడీ కంటెస్టెంట్లను కాపాడటం కోసం రవిని అన్యాయంగా బయటకు పంపించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న రవి ఇంత సడన్‌గా ఎలా ఎలిమినేట్ అవడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు. రవి లేని బిగ్‌బాస్ షోను తాము చూడలేమంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకులు ఏమని స్పందిస్తారో చూడాలి! -
శ్రీరామ్‌కు దగ్గరైతే ఎలిమినేషన్ గండం తప్పదా!
Bigg Boss Telugu 5: తన గాత్రంతో ఇండియన్ ఐడల్ షోనే కాదు కోట్లాది మంది ప్రేక్షకుల మనసులనూ గెలిచాడు సింగర్ శ్రీరామచంద్ర. అయితే ఆయనకు టాలీవుడ్లో కన్నా బాలీవుడ్లో ఎక్కువ పాపులారిటీ ఉంది. తను పుట్టిపెరిగింది తెలుగు నేలపైనే కాబట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని బిగ్‌బాస్ షోను ఎంచుకున్నాడు. ఆటతో, మాటలతో, పాటలతో ఆడియన్స్‌ను మెప్పిస్తూ షోలో కొనసాగుతున్నాడు. అయితే ఎలిమినేషన్ వస్తుందంటే చాలు తను నామినేషన్స్‌లో ఉన్నా లేకపోయినా శ్రీరామ్ భయంతో వణికిపోతున్నాడు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. శ్రీరామ్ సరదా మనిషి. కానీ అందరితో అంత ఈజీగా కలిసిపోలేడు. మనసు విప్పి మాట్లాడటానికి అతడికి కొంత టైం పడుతుంది. కానీ ఒక్కసారి క్లోజ్ అయితే మాత్రం వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఎంతవరకైనా పోరాడతాడు. విచిత్రంగా శ్రీరామ్‌కు దగ్గరవుతున్న వాళ్లందరూ ఎలిమినేట్ అవుతున్నారు. దీంతో తనకంటూ ఒకరున్నారనుకులోపే వాళ్లు హౌస్‌ను వీడటంతో ఒంటరివాడవుతున్నాడు. మొదట్లో హమీదాతో శ్రీరామ్ ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. ఆమెకు ఏ కష్టం వచ్చినా చిటికెలో ఆమె ముందుండేవాడు. కన్నీళ్లు పెట్టుకుంటే చేరదీసి ఓదార్చేవాడు. ఆమెను ఫ్రెండ్ కన్నా ఎక్కువ అనుకున్న అతడికి బిగ్బాగ్ షాకిస్తూ హమీదాను ఐదో వారంలో ఎలిమినేట్ చేశారు. అప్పటి నుంచి శ్రీరామ్ బాగా డల్ అయ్యాడు. ఆ బాధ నుంచి కోలుకుంటూ విశ్వకు దగ్గరవగా అతడిని కూడా పంపించేశారు. ఆ తర్వాత యానీ మాస్టర్‌కు సపోర్ట్ చేస్తూ ఆమెతో అప్పుడప్పుడే క్లోజ్ అవుతుండగా తనను కూడా ఎలిమినేట్ చేశారు. నాకు దగ్గరవుతున్నారనుకునేలోపు దూరమవుతున్నారంటూ ఎంతగానో బాధపడిపోయాడు శ్రీరామ్. ఇప్పుడు హౌస్‌లో ఉన్నవాళ్లలో శ్రీరామ్‌కు నచ్చిన వ్యక్తి, మనసుకు దగ్గరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది యాంకర్ రవియే! మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌లోనూ రవికి ఇంటిసభ్యులెవరూ సపోర్ట్ చేయకపోయినా శ్రీరామ్ ఒక్కడే అతడికే ఓటేశాడు. దీన్ని బట్టి శ్రీరామ్‌కు రవి అంటే ఎంత అభిమానమో ఊహించవచ్చు. అలాంటిది రవి కూడా ఎలిమినేట్ అయిపోతే హౌస్‌లో శ్రీరామ్ నిజంగానే ఒంటరివాడవడం ఖాయం. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న సన్నీ, మానస్, కాజల్, ప్రియాంక ఒక గ్రూపు కాగా షణ్ముఖ్, సిరి మరో గ్రూపు. మరి శ్రీరామ్ ఈ రెండింటిలో ఏదో ఒక గ్రూపులో చేరతాడా? లేదా ఒంటరిగా గేమ్ ఆడతాడా? అన్నది చూడాలి! -
ఎలిమినేషన్‌ను మార్చే అధికారం సన్నీ చేతుల్లో!
Bigg Boss Telugu 5 Promo: సండే అంటే ఫన్డే మాత్రమే కాదు ఎలిమినేషన్డే కూడా! ఈ వారం నామినేషన్స్‌లో రవి, సన్నీ, శ్రీరామ్, ప్రియాంక, షణ్ముఖ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో సిరి, శ్రీరామ్, సన్నీ నిన్నటి ఎపిసోడ్‌లోనే సేవ్ అయ్యారు. మిగతావారిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారన్నది నేడు అధికారికంగా వెల్లడి కానుంది. ఈ ఎలిమినేషన్ ఘట్టంపై తాజాగా ప్రోమో వదిలాడు బిగ్‌బాస్. రవి, కాజల్ ఇద్దరూ ఎలిమినేషన్ అంచుల్లో ఉన్నట్లు చూపించారు. వీరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం మీలో ఒక్కరికే ఉందని నాగ్ వెల్లడించాడు. దీంతో సన్నీ తనకు దక్కిన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గార్డెన్ ఏరియాలోకి పట్టుకొచ్చాడు. మరి సన్నీ ఆ పాస్‌ను ఉపయోగించి ఆ ఇద్దరిలో ఎవరినైనా సేవ్ చేశాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకైతే సన్నీ ఆ పాస్‌ను వాడలేదట! రవి ఎలిమినేట్ అయ్యాడట! అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా నేటితో ఎక్స్పైర్ అయినట్లు ప్రకటించి షాకిచ్చాడట నాగ్.. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
పింకీ కోసం యాంకర్ రవిని ఎలిమినేట్ చేశారా?
Bigg Boss Telugu 5: Is Anchor Ravi Eliminated : బిగ్‌బాస్ సీజన్-5లో ఈవారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తుంది.ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రవి ఎలిమినేట్ అవ్వడం ఏంటని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బ్రింగ్ బ్యాక్ రవి అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా టాప్5లో ఉండాల్సిన రవిని బయటకు పంపించేయడం అన్యాయమని భావిస్తున్నారు. అయితే మరికొందరేమో పింకీని కాపాడటానికి రవిని కావాలనే ఎలిమినేట్ చేశారనే ప్రచారమూ జరుగుతుంది. మానస్‌తో కంటెంట్ ఇవ్వడం తప్పా కొన్ని వారాలుగా పింకీ ఆట కూడా యాక్టివ్‌గా లేదనే వాదన కూడా వినిపిస్తుంది. ఫ్యాన్ బేస్ విషయంలోనూ రవితో పోలిస్తే పింకీకి తక్కువగానే ఉందని, మరి అలాంటప్పుడు పింకీ ఎలా సేవ్ అయిందనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. సన్నీ దగ్గరున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ కాజల్ కోసం వాడటం వల్ల రవి బలయ్యాడనే వార్త కూడా బయటకు వచ్చింది. మరి లీకు వీరులు చెప్పినట్లుగా నిజంగానే ఈవారం రవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడా లేదా ఇందులో మరేదైనా ట్విస్ట్ ఉందా అన్నది చూడాల్సి ఉంది. -
అంతా కలిసి సన్నీని విన్నర్‌గా తేల్చారు! టాప్ 5లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 5, Episode 84: కింగ్ నాగార్జున హౌస్మేట్స్ కోసం సర్ప్రైజ్ పట్టుకొచ్చాడు. కంటెస్టెంట్ల కోసం మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ స్టేజీపైకి వస్తారని చెప్పాడు. కానీ వాళ్లు మిమ్మల్ని కలవాలంటే మీకు బాగా నచ్చిన వస్తువులను త్యాగం చేయాలని మెలిక పెట్టాడు. అయినవాళ్లను చూడటం కన్నా విలువైనది ఏముంటుందనుకున్న హౌస్మేట్స్ అందుకు ఓకే అనేశారు. మొదటగా యాంకర్ రవి పాప బొమ్మను త్యాగం చేయడంతో అతడి తల్లి ఉమాదేవి స్టేజీపైకి వచ్చింది. ఫ్యామిలీ అంతా నిన్ను చూసి గర్వపడుతుందని నువ్వు బిగ్‌బాస్ హౌస్‌కు రాజువని మెచ్చుకుంది. రవి కోసం బిగ్‌బాస్ తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ కూడా షోకి విచ్చేశాడు. హౌస్‌లో ఎవరికి సపోర్ట్ చేయొద్దని, నీకు చెప్పాలనిపించిన పాయింట్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. అనంతరం ఉమావేవి.. రవి, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని చెప్పుకొచ్చింది. తర్వాత పింకీ మేకప్ కిట్ త్యాగం చేయగా ఆమెకోసం హాస్యనటులు సాయి, అప్పారావు వచ్చారు. వీరు ప్రియాంకను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, శ్రీరామ్, రవి, మానస్‌లను టాప్ 5లో ఉంచారు. ఈ సందర్భంగా పింకీ మాట్లాడుతూ.. 'నన్ను కన్నడ నుంచి తెలుగుకి తీసుకువచ్చి కామెడీ షో చేయించారు.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం' అంటూ అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపింది. సన్నీ తనకు ఫ్రెండ్స్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌ను త్యాగం చేయగా ఇద్దరు ఫ్రెండ్స్ నిఖిల్, వెంకట్ స్టేజీపై సందడి చేశారు. కప్పు ముఖ్యం బిగిలూ అంటూనే బోర్డు మీద సన్నీని విన్నర్ స్థానంలో ఉంచారు. షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు. మానస్.. తల్లి పంపిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేయగా అతడి కంటే ఎక్కువగా పింకీ బాధపడిపోయింది. తర్వాత మానస్ తండ్రి వెంకట్రావు, ఫ్రెండ్ అమర్దీప్ వచ్చాడు. ఏమీ లేనివాడిని తీసుకొచ్చి అన్నీ ఉన్నవాడిలా చేశాడు, నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే మానస్ వల్లేనంటూ అతడిని పొగిడేశాడు. అనంతరం మానస్‌ను ఫస్ట్ ప్లేస్‌లో సన్నీ, కాజల్, శ్రీరామ్, షణ్ముఖ్‌ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు. కాజల్ ఎంతగానో ఇష్టపడే బొమ్మను త్యాగాల పెట్టెలో పడేసింది. ఆమెను కలవడానికి సోదరితో పాటు, సింగర్ లిప్సిక కూడా వచ్చారు. వీళ్లు కాజల్‌ను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, షణ్ను, శ్రీరామచంద్ర, మానస్‌ను తర్వాతి స్థానాల్లో పెట్టారు. అనంతరం శ్రీరామ్.. హమీదా ఇచ్చిన కానుకను త్యాగం చేయగా అతడి కోసం తల్లి, స్నేహితురాలు వచ్చారు. వీళ్లు శ్రీరామ్, రవి, ప్రియాంక సింగ్, సన్నీ, షణ్ముఖ్‌లు వరుసగా టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. సిరి కోసం వచ్చిన శ్రీహాన్.. సన్నీ, షణ్ముఖ్, రవి, శ్రీరామ్, సిరిలు వరుసగా టాప్ 5లో ఉంటారన్నాడు. చివరగా షణ్ముఖ్.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ను భారంగా త్యాగం చేశాడు. అతడి కోసం మొదట అన్నయ్య సంపత్ రాగా తర్వాత దీప్తి సునయన స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో షణ్ను ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని దీప్తి సూచించింది. నాకు నువ్వేంటో తెలుసంటూ అతడికి ముద్దులు పంపించింది. షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు. ఫినాలేలో కలుద్దామంటూ వీడ్కోలు తీసుకుంది. ఈరోజు వచ్చిన మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్ సన్నీని టాప్ 5లోని మొదటి రెండు స్థానాల్లో పెడుతూ అతడే విన్నర్ అని చెప్పకనే చెప్పారు. -
ఎలిమినేషన్లో ట్విస్ట్, యాంకర్ రవి అవుట్!
Bigg Boss 5 Telugu, 12th Week Elimination: రోజులు వారాలయ్యాయి.. వారాలు నెలలయ్యాయి.. బిగ్‌బాస్ ప్రయాణం ముగింపునకు చేరుకుంటోంది. చివరి మజిలీకి చేరుకున్న హౌస్మేట్స్ ఎవరికి వారు టాప్ 5పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కొందరైతే ఏకంగా కప్పు కొట్టాలని ఫిక్సయ్యారు. కానీ మరికొందరు మాత్రం ఈ వారమే వెళ్లిపోతామేమోనన్న భయంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈ 12వ వారం మానస్ మినహా మిగతా ఏడుగురు ఇంటిసభ్యులు నామినేషన్స్‌లో ఉన్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా షణ్ను, సన్నీ, శ్రీరామ్, రవి ఈజీగా ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కుతారని అంతా అనుకున్నారు. మిగిలిన కాజల్, ప్రియాంక, సిరిలలో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదని అంచనా వేశారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ వారం అమ్మాయిల్లోనుంచి ఒకరు కాకుండా టాప్ 5లో ఉంటాడనుకున్న కంటెస్టెంట్‌ను పంపించివేశారట! యాంకర్ రవిని ఎలిమినేట్ చేసినట్లు లీకువీరులు నెట్టింట టముకేసి మరీ చెప్తున్నారు. ఈ వార్త విని రవి ఫ్యాన్స్ షాకవుతున్నారు. రవి కంటే సిరి, ప్రియాంక, కాజల్‌కు ఎక్కువ ఓట్లు రావడం నమ్మశక్యంగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే రవి ఎలిమినేట్ అయ్యాడా? లేదా కావాలని పని గట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారా? అన్నది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. -
బిగ్‌బాస్‌లో సిరి బాయ్‌ఫ్రెండ్.. 'వదిలేస్తున్నావా సిరి' అంటూ సూటి ప్రశ్న
బిగ్‌బాస్‌లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో సరదాగా సాగింది. ఫ్యామిలీ మెంబర్స్ బిగ్‌బాస్‌లోకి ఎంటర్ కావడంతో రియల్ ఎమోషన్స్ బయటకొచ్చాయి.దాదాపు 80 రోజుల తర్వాత కుటుంబసభ్యులను చూసే అవకాశం రావడంతో హౌస్మేట్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. అయితే యాంకర్ రవి, కాజల్ కుటుంబసభ్యులు మినహాయించి మిగతా కంటెస్టెంట్ల కోసం కేవలం ఫ్యామిలీలోనే ఒకరిని మాత్రమే బిగ్‌బాస్‌లోకి అనుమతించారు. తాజాగా హౌస్మేట్స్ ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడానికి డబుల్ ఎమోషన్స్‌ని బయటకు రప్పించడానికి మిగతా కుటుంబసభ్యులను కూడా బిగ్‌బాస్ ఆహ్వానించారు. ఇందులో భాగంగానే రవికోసం ఆయన తల్లి, కాజల్ ఫ్రెండ్ సహా సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ సైతం బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. శ్రీహాన్‌ను చూడగానే సిరి తలదించుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ 'వదిలేస్తున్నావా సిరి'.. అంటూ శ్రీహాన్ అడగ్గానే ఏం చెప్పాలో తెలియక బాగా ఎమోషనల్ అయ్యింది సిరి. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్ చేసింది. ఇప్పటివరకు సిరిని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న శ్రీహాన్..అలా 'వదిలేస్తున్నావా సిరి'.. అని ఎందుకు అడిగాడు అన్నది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. Weekend is here...More family members on the stage #BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Wp3ayU5TV8 — starmaa (@StarMaa) November 27, 2021 -
తండ్రి లేని అమ్మాయివని దగ్గరవలేదు, ఇకనైనా జాగ్రత్తగా..
Bigg Boss Telugu 5, Episode 83: బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినందుకు సన్నీ తల్లి కళావతి తెగ సంబరపడిపోయింది. బిగ్‌బాస్ నీకు చెల్లెలిని ఇచ్చిందంటూ కాజల్ వంక చూడటంతో ఆమె సంతోషంతో గెంతులు వేసింది. ఇంటికి వచ్చిన అమ్మకు గోరుముద్దలు తినిపించాడు సన్నీ. ఈ సందర్భంగా ఆమె ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్న బాక్స్‌ను కొడుక్కు అందించడంతో అతడు ఫుల్ ఖుషీ అయ్యాడు. తర్వాత తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేయగా నీకు నా గెలుపును బహుమతిగా ఇస్తానని కళావతికి మాటిచ్చాడు. సన్నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటం వల్లే పింకీ అతడికి క్లోజ్ అవుతుందేమోనని అనుమానపడ్డాడు మానస్. 'పింకీ తనను వదిలి వెళ్లిపోయిన బాయ్‌ఫ్రెండ్ ప్లేస్‌లో నన్ను రీప్లేస్ చేద్దామని చూస్తోంది. అయితే అది కుదరదని, నేను అలాంటివాడిని కాదని చెప్పాను. మనం ఫ్రెండ్స్ మాత్రమే అని స్పష్టం చేశాను' అని కాజల్‌తో చెప్పుకొచ్చాడు. అంతేకాక ఆమె చాలా అబద్ధాలు ఆడుతుందని, అది తనకు నచ్చదన్నాడు. ఇక హగ్గులు ఇచ్చుకోవడం నచ్చలేదని సిరి తల్లి చెప్పిన మాటలకు బాగా హర్టయ్యాడు షణ్ను. ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉందామని, ఇంట్లో వాళ్లను బాధపెట్టడం వద్దని హితవు పలికాడు. తండ్రి లేని కూతురని నీకు దగ్గరై అడ్వాంటేజ్ తీసుకోలేదని ఈ మాట మీ అమ్మకు చెప్పని సిరికి సూచించాడు. అనంతరం ప్రియాంక సింగ్ వాళ్ల సోదరి మధు ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే నాన్న ఎందుకు రాలేదని నిలదీసింది పింకీ. నాన్నకు కళ్ల ప్రాబ్లమ్ ఉంది కాబట్టి రాలేదని బదులిచ్చింది మధు. నాన్న తల దించుకునే పని చేయనన్నావు, ఆ మాట నిలెబట్టుకోమని ఆయన మరీమరీ చెప్పాడు, గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేయ్.. అని హెచ్చరించింది. అయితే మధు తాను సన్నీకి ఫ్యాన్ అని చెప్పింది. తర్వాత రవి భార్య నిత్య హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమెను చూసిన రవి కొంత సంతోషిస్తూనే మరికొంత బాధకు లోనయ్యాడు. కూతురు వియా రాలేదేంటని నిరుత్సాహపడ్డాడు. ఇంతలో వియా హౌస్‌లోకి సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వడంతో అతడి ఆనందం కట్టలు తెంచుకుంది. సుమారు 80 రోజుల తర్వాత కూతురు స్పర్శ తగిలినందుకు ఎమోషనల్ అయ్యాడు. నిన్ను చూసి అమ్మ రోజూ ఏడుస్తుందని రవికి ఫిర్యాదు చేసింది వియా. తర్వాత బిగ్‌బాస్ అంకుల్ ఎక్కడ? అంటూ అతడికోసం ఇల్లంతా వెతికి హంగామా చేసింది. రవి.. తన భార్యకు షణ్నును పరిచయం చేస్తూ ఇతడు లైఫ్‌లాంగ్ తమ్ముడని చెప్పాడు. అతడితో నిత్య మాట్లాడుతూ.. రవి ఇన్ఫ్లూయెన్స్ చేస్తాడంటారు, కానీ ఆయనకంత సీన్ లేదని తెలిపింది. చాన్నాళ్ల తర్వాత కూతురు కనిపించడంతో ఆమెతో సరదాగా ఆడుకున్నాడు రవి. వీళ్ల కోసం బిగ్‌బాస్ గుమ్మాడి గుమ్మాడి సాంగ్ప్లే చేయడంతో తండ్రీకూతుళ్లు డ్యాన్స్ చేశారు. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌ను వదిలి వెళ్లాల్సిన టైం రావడంతో వియా గుక్కపెట్టి ఏడ్చింది. అనంతరం షణ్ను తల్లి ఇంట్లో అడుగు పెట్టడంతో ఆమెను పట్టుకుని ఏడ్చేశాడు. తన ప్రేయసి దీప్తి సునయన ఎలాగుంది అని అడిగి తెలుసుకున్నాడు. సిరి వాళ్ల మమ్మీ కొన్ని నచ్చట్లేదని బాధపడ్డారు అంటూ హగ్గుల గురించి మాట్లాడినదాన్ని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అవేమీ పట్టించుకోని షణ్ను మదర్.. దేని గురించి ఆలోచించకు, ఫ్రెండ్షిప్ కదా అంటూ కొడుక్కు సపోర్ట్ చేసింది. ఎక్కువ ఎమోషనల్ అయి గేమ్ పాడు చేసుకోకని హెచ్చరించింది. అందరితో కలిసి ఉండమని షణ్నుకు నొక్కి చెప్పింది. గేమ్గేమ్లా చూడండి, ఎక్కువ ఎమోషనల్ అవద్దని షణ్ను, సిరిలకు సూచించి వీడ్కోలు తీసుకుంది. మొత్తానికి భారంగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ మీటింగ్ ముగిసింది. -
కూతుర్ని చూడగానే ఎమోషనల్ అయిన యాంకర్ రవి
Bigg Boss 5 Telugu Today Promo, Anchor Ravi Gets Emotional: బిగ్‌బాస్ హౌస్ ఎమోషన్స్‌తో నిండిపోయింది. ప్రతి సీజన్లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ బిగ్‌బాస్‌లోకి ఎంటర్ కావడంతో రియల్ ఎమోషన్స్ బయటకొచ్చాయి. ఇప్పటికే కాజల్, శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, మానస్‌ల కుటుంబసభ్యులు ఎంటర్ అవగా, నేటి ఎపిసోడ్లో యాంకర్ రవి కోసం భార్య నిత్య, కూతురు వియా వచ్చారు. దీంతో రవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రతిరోజూ వియా ఫోటో చూడనిదే నిద్ర లేవని రవి నేరుగా కూతుర్ని చూడటంతో సంతోషంలో మునిగిపోయాడు. ప్రేమగా హత్తుకొని కాసేపు కబర్లు చెప్పడంతో పాటు సరదాగా ఆడిస్తాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్ చేసింది. ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. రవి కూతురు వియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Daughter ni chusaka #Ravi emotions are priceless ❤️ #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/RZLbVj0sIT — starmaa (@StarMaa) November 26, 2021 -
బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై విశ్వక్ సేన్ సెటైర్లు!
Bigg Boss 5 Telugu, Vshwak Sen Supports VJ Sunny: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో సన్నీని సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు, అతడిని ఎవరైనా ఏమైనా అంటే వారికి గట్టి కౌంటర్లు విసురుతున్నాడు. హౌస్‌లో సన్నీ ఎవిక్షన్ ఫ్రీపాస్ గెలుచుకుంటే ఎవరూ దాన్ని సెలబ్రేట్ చేయలేదని సెటైర్ విసిరాడు షణ్ను. దీనిపై విశ్వక్ రియాక్ట్ అవుతూ.. మేము చేసుకుంటున్నాంలే.. అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. తాజాగా నామినేషన్స్ జరిగిన తీరుపై కూడా రియాక్ట్ అయ్యాడు. నిన్నటి నామినేషన్స్‌లో సన్నీకి శ్రీరామచంద్ర, రవిలతో ఫైట్ జరిగింది. ఈ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది పక్కన పెడితే విశ్వక్ ఎప్పటిలాగే సన్నీకి సపోర్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా రవి, శ్రీరామచంద్రలపై సెటైర్లు విసిరాడు. శ్రీరామచంద్ర అటూఇటూ తిరుగుతుంటే షుగర్ వచ్చిందేమోనని కౌంటర్ వేయగా రవికి ఓవర్ స్మార్ట్ షుగర్ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. అయితే సపోర్ట్ చేయడం ఓకే కానీ మధ్యలో మా వాళ్లను ఎందుకు తిడుతున్నారని అటు శ్రీరామ్, ఇటు రవి ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వాళ్లకన్నా ముందు నీకు షుగర్ వచ్చినట్లుందంటూ పరుష పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు. -
Bigg Boss 5 Telugu: ఫేక్ అకౌంట్లతో ట్రోలింగ్.. రవి భార్య ఆవేదన!
Netizens Troll Bigg Boss Contestant Anchor Ravi Family With Fake Accounts: బిగ్ బాస్ ఇంట్లో యాంకర్ రవి మంచి స్ట్రాటజీలను ప్లే చేస్తూ స్ట్రాంగ్ కంటెంస్టెంట్ మారాడు. టాప్ 5లో రవి పక్కా ఉంటాడని షో ఫాలో అవుతున్నవారందనికి అర్థమవుతుంది. ముందు నుంచే యాంకర్ రవికి బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, హౌస్‌లోకి వెళ్లాక..తనదైన ఆటతీరుతో మరింతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతివారం ఎలిమినేషన్లో ఉండడం కూడా రవికి కలిసొచ్చిందనే చెప్పాలి. నామినేషన్ ఒత్తిడిని దిగమింగుకొని గేమ్‌ను గేమ్‌లా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఇప్పటికే ఆయన హౌస్‌లో ఉన్నాడు. ఇక ఇలాంటి రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌పై ట్రోలింగ్ అనేది సహజమే. కొంతమంది తమకు నచ్చిన కంటెస్టెంట్‌ని పొగుడుతూ.. ప్రత్యర్థులను తిడుతుంటారు. అయితే దానికి ఓ కారణం, సందర్భం ఉంటేనే ఫ్యాన్స్ ఇతరులను ట్రోలింగ్ చేస్తుంటారు. కానీ యాంకర్ రవి విషయంలో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతుంది. కొంతమంది రవిని అకారణంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ అకౌంట్లు సృష్టించి, రవిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని రవి సన్నిహితులు చెబుతున్నారు. రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్నాడు కాబట్టి..అతన్ని తిట్టినా, పొగిడినా పర్లేదు.. కానీ అతని కుటుంబ సభ్యులను కూడా ట్రోల్స్ చేయడం దారుణమనే చెప్పాలి. ‘కావాలనే కొంతమంది నా పేరును, నా కూతురిను ఈ ట్రోల్స్‌లోకి తీసుకొస్తున్నారు’అని రవి భార్య నిత్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇది గేమ్ స్పిరిట్ కాదని, తమకు ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదని సన్నిహితుల దగ్గర వాపోయింది. వాస్తవానికి బిగ్‌బాస్ లాంటి రియాల్టీ షోలోకి వెళ్లే కంటెస్టెంట్స్ ముందే ఓ గట్టి పీఆర్ టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటుంది. వాళ్లు హౌస్‌లో ఉంటే బయట పీఆర్ టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుంది. అయితే తమ కంటెస్టెంట్స్‌ని పొగుడుతూ ప్రచారం చేస్తే బాగుంటుంది కానీ...తమవారిని హైలెట్ చేయడం కోసం ఇతరులను ట్రోల్ చేయడం సరికాదు. దాని వల్ల తమ సభ్యుడు ఎలివేట్ అవుతామనుకోవడం పొరపాటు. -
సన్నీ మీద పగ తీర్చుకున్నావా?: రవికి నాగ్ సూటి ప్రశ్న
Bigg Boss Telugu 5 Promo, Gold Evariki? Coal Evariki?: కంటెస్టెంట్ల తప్పొప్పులను సరిదిద్దేందుకు రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. ఈ క్రమంలో యాంకర్ రవికి స్ట్రాంగ్ కోటింగ్ పడినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. బాగా ఆడిన వాళ్లకు గోల్డ్, వరస్ట్ పర్ఫామర్స్కు కోల్(బొగ్గు) ఇవ్వాలని చెప్పాడు నాగ్. రవి వరస్ట్‌గా ఆడింది సన్నీ అంటూ అతడి చేతికి బొగ్గందించాడు. దీంతో నాగ్.. స్విమ్మింగ్ టాస్క్‌లో సన్నీ మీద పగ తీర్చుకున్నావా? అని రవిని సూటిగా ప్రశ్నించాడు. దీనికతడు అలాంటిదేం లేదని బుకాయించాడు. టీషర్ట్స్ సరిగ్గా వేసుకోవాలని చెప్తూ ఉన్నా అతడు వినిపించుకోలేదని తప్పు సన్నీమీదకు తోసేశాడు. అయితే సన్నీ.. రూల్ బుక్‌లో టీ షర్ట్ పూర్తిగా ధరించాలని ఉందే తప్ప సరిగ్గా ధరించాలని రాసి లేదని చెప్పుకొచ్చాడు. ఇతడి వాదనతో ఏకీభవించని నాగ్.. మరి మానస్ మొదటి నుంచే ఎలా సరిగ్గా వేసుకున్నాడని తిరిగి ప్రశ్నించాడు. దొరికితే దొంగ అంటూ కాజల్ గేమ్‌పైనా సెటైర్లు వేశాడు. ఇక శ్రీరామ్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో తనకొచ్చిన పవర్‌ను రవికిచ్చిన విషయం తెలిసిందేగా. అది నెగెటివ్ పవర్ అని తెలియగానే రవి ముఖం మాడిపోయింది. దీన్ని ప్రస్తావించిన నాగ్.. అతడికి బకరా రవి అన్న పేరు సరిగ్గా సెట్టవుతుందన్నాడు. ఇదిలా వుంటే హౌస్మేట్స్ ఎవరిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకోనున్నారనేది నేటి ఎపిసోడ్లో తెలియనుంది. -
'ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడు!'
Bigg Boss 5 Telugu, Task For Eviction Free Pass: బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, ప్రియాంక సింగ్, యానీ, మానస్ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. రింగ్ ఈజ్ కింగ్ టాస్క్‌లో ఎవరు రింగ్‌ను చివరి వరకు పట్టుకుంటారో వాళ్లే కెప్టెన్‌గా నిలుస్తారు. ఈ గేమ్‌లో మానస్ గెలిచి విజేతగా అవతరించాడు. కెప్టెన్ మానస్ కాజల్‌కు సారీ చెప్పి ఆమెతో గొడవలకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టాడు. 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా' టాస్క్‌లో మీ ఫొటో కాలకుండా చూసుకోవాలని, చివరి వరకు ఎవరి ఫొటో కాలకుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు ఈ పాస్ దక్కుతుందని ప్రకటించాడు. అయితే తనకెందుకో ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడనిపిస్తోందని రవి జోస్యం చెప్పాడు. ఒకవేళ ఎవిక్షన్ పాస్ గెలిచినా కూడా సన్నీ దాన్ని వాడుకోడని అభిప్రాయపడ్డాడు. తర్వాత టాస్క్‌లో భాగంగా ఫైర్ ఇంజన్ అలారమ్ మోగగా రవి, షణ్ముఖ్ మొదట ట్రక్ ఎక్కారు. వీరికి మానస్, శ్రీరామ్ ఫొటోలు వచ్చాయి. షణ్ను సేవ్ చేసే అవకాశం మానస్కిద్దామంటే రవి మాత్రం శ్రీరామ్‌కే ఇద్దామని ఒప్పించాడు. అలా మానస్ ఫొటో మంటల్లో కాలిపోయింది. నెక్స్ట్ రౌండ్లో సన్నీ, మానస్ ట్రక్ ఎక్కారు. వీరి ఎదుట రవి, యానీ మాస్టర్ ఫొటోలు రాగా.. ఏకాభిప్రాయంతో రవి ఫొటోను కాల్చేశారు. షణ్ను, సిరిలు ట్రక్ ఎక్కగా వారు పింకీని కాకుండా సన్నీని సేవ్ చేశారు. తర్వాత యానీ, శ్రీరామ్‌ల వంతు రాగా జనాల ఓటింగే నాకు ముఖ్యం, ఈ పాస్ అవసరం లేదన్నాడు షణ్ను. ఆడియన్స్ సపోర్ట్‌తోనే ఇక్కడిదాకా వచ్చాను, వారి డెసిషన్‌తోనే వెళ్లిపోవాలని ఉందని చెప్పుకొచ్చింది సిరి. వీళ్లిద్దరూ తమకీ పాస్ అవసరం లేదని చెప్పినప్పటికీ యానీ, శ్రీరామ్ ఆలోచించుకుని సిరిని సేవ్ చేశారు. దీంతో ఆమె సంతోషంతో షణ్నును హత్తుకుని అతడికి ఐ లవ్యూ చెప్పింది. ప్రియాంక, కాజల్.. శ్రీరామ్, సిరిలలో నుంచి సిరిని సేవ్ చేశారు. యానీ, ప్రియాంకలకు సన్నీ, కాజల్ ఫొటోలు వచ్చాయి. యానీ.. ఆ రెండు ఫొటోలు కాల్చేద్దామని చెప్పింది. కానీ పింకీ అది తప్పని వారించడంతో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి కాజల్ ఫొటోను కాల్చేసి సన్నీని సేవ్ చేశారు. తర్వాత అలారమ్ మోగినప్పుడు ట్రక్‌లో కూర్చున్న మానస్, కాజల్‌లకు యానీ, సిరి ఫొటోలు వచ్చాయి. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇద్దరూ కాలిపోతే సన్నీ గేమ్‌లో ఉంటాడని కాజల్ అభిప్రాయపడింది. తన ఫొటోను కాల్చేస్తారని భయపడిపోయిన యానీకి కోపం కట్టలు తెంచుకుంది. తనకు పాస్ దక్కుండా చేస్తున్నారని మండిపడిపోయింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకైతే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సన్నీకి దక్కినట్లు సమాచారం! -
తొలిసారి కెప్టెన్ అయిన మానస్, కుంగిపోతున్న సన్నీ!
Bigg Boss 5 Telugu Promo, Maanas Is New Captain!: గత ఆదివారం యాంకర్ రవి అందరి ముందు తనది బ్యాడ్ బిహేవియర్ అంటూ మాట్లాడటం తట్టుకోలేకపోయాడు సన్నీ. అందుకే అతడు ఏం చేసినా, ఏం మాట్లాడినా తీసుకోలేకపోతున్నాడు. ఎప్పటిలా సరదాగా ఉండలేకపోతున్నాడు. తాజాగా అతడు సంచాలకుడిగా ఉన్న గేమ్‌లోనూ కొట్లాటకు దిగాడు. అయితే రవి.. ఈ దూరాన్ని తగ్గిద్దామనుకున్నాడో? మరింకేదో కానీ తనకు వచ్చిన పవర్‌ను సన్నీకి త్యాగం చేయడానికి రెడీ అయ్యాడు. అదేమాట బిగ్‌బాస్‌కు చెప్పాడు. కానీ సన్నీ మాత్రం అతడిస్తానంటున్న పవర్‌ను తీసుకోవడానికి రెడీగా లేనని తేల్చి చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ అతడికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించగా చివరాఖరకు అయిష్టంగానే సరేనంటూ తలూపాడు. ఆ పవర్ ద్వారా సన్నీ తదుపరి సైరన్ వచ్చినప్పుడు ఒకరిని తొలగించి వారి స్థానంలో మైన్‌లో దిగి బంగారం వెతికే అవకాశాన్ని కొట్టేశాడు. ఇదిలా ఉంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌తో పాటు కెప్టెన్సీ టాస్క్ కూడా ముగిసిందని, మానస్ కొత్త కెప్టెన్‌గా అవతరించాడని లీకువీరులు సోషల్ మీడియాలో చాటింపు చేశారు. మానస్ తొలిసారి కెప్టెన్ అయినందుకు కొందరు నెటిజన్లు సంతోషిస్తూనే మరోపక్క సన్నీ బాధతో కుమిలిపోతున్నాడని విచారం వ్యక్తం చేస్తున్నారు. -
ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం, అందుకే షణ్ను అలా..: రవితో చెప్పేసిన సిరి
Bigg Boss Telugu, Episode 74: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో మానస్ తనకు దక్కిన గొడ్డలిని సన్నీకిచ్చిన విషయం తెలిసిందే!దీంతో సన్నీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికో స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఒకరి నుంచి సగం బంగారు ముత్యాలను తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలని చెప్పాడు. దీంతో సన్నీ.. సిరి దగ్గర నుంచి గోల్డ్‌ను షణ్ముఖ్‌కు ఇచ్చాడు. మొదటి రౌండ్లో ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక, మానస్‌లకు బెలూన్ టాస్క్ ఇవ్వగా అందులో పింకీ గెలిచింది. ఇద్దరం ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యామని, అందుకే షణ్ను ట్రిప్ అవుతున్నాడని పేర్కొంది సిరి. మీరిద్దరూ ఒకరినొకరు బాగా సీరియస్‌గా తీసుకుంటున్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రవి. 'కానీ నీ విషయంలో అతడు ఎందుకంత ట్రిప్ అవుతున్నాడు? నీ విషయంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో ఆలోచించు, నీకు అర్థమవుతుందనుకుంటా, మీరే ఆలోచించుకోండి' అని హితవు పలికాడు. తర్వాత శ్రీరామచంద్రకు ఓ పవర్ వచ్చింది. అయితే అది అతడికి అనుకూలంగా రాలేదు. 30 బంగారు ముత్యాలను ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. తన దగ్గర ఒక్క ముత్యం కూడా లేకపోవడంతో పథకం రచించిన శ్రీరామ్ తనకో పవర్ వచ్చిందంటూ రవి ముత్యాలను సొంతం చేసుకున్నాడు. చివర్లో మాత్రం ఈ స్పెషల్ పవర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చడం గమనార్హం. రెండో రౌండ్లో సన్నీ, సిరి బంగారం వెతుకులాటలో టాప్‌లో ఉన్నారు. వీళ్లిద్దరిలో ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు బిగ్‌బాస్. అయితే సిరి తరపున వేరొకరు ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సిరి తనకోసం మానస్ పోటీపడతాడని చెప్పింది. అలా సన్నీని ఓడించేందుకు రంగంలోకి దిగాడు మానస్. తాను గెలిచి సిరిని కెప్టెన్సీ కంటెండర్‌ను చేశాడు. అయితే ఈ గేమ్ నియమనిబంధనలు తనకు ముందే సరిగా చెప్పలేదంటూ సంచాలకుడైన రవి మీద ఫైర్ అయ్యాడు సన్నీ. అలాగే తన స్నేహితులు మానస్, కాజల్ మీద కూడా చిందులు తొక్కాడు. ఉప్పొంగుకొస్తున్న తన కోపాన్ని తగ్గించుకునేందుకు సన్నీ స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు. ఇది హౌస్‌లో నుంచి యానీ మాస్టర్ చూడగా సన్నీ మూగబాషలో సంభాషించాడు. ఈ ఒత్తిడి నా వల్ల కాదన్నట్లు ఫేస్ పెడుతూ సూసైడ్ చేసుకుంటున్నట్లుగా చేతితో గన్ పేల్చుకుని నీళ్లలో పడిపోయాడు. -
రవి ఫేక్, సిరి డబుల్ ఫేస్.. 'అరె, కరెక్ట్‌గా సెట్టయ్యిందే!'
Bigg Boss Telugu 5 Promo: సండేను ఫండే చేస్తానంటూ కంటెస్టెంట్లతో టాస్క్‌లు ఆడిస్తుంటాడు నాగ్. అయితే కొన్ని ఫన్నీగా ఉన్నా, మరికొన్ని మాత్రం హౌస్మేట్స్ మధ్య చిచ్చు రాజేసేలా ఉంటాయి. తాజగా అలాంటి టాస్కే హౌస్‌మేట్స్‌కు ఇచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో.. నాగ్ కొన్ని పదాలు ఇచ్చి అది ఎవరికి సెట్ అవుతాయో చెప్పాలన్నాడు. దీంతో శ్రీరామ్.. గేమ్‌లో కాజల్ కన్నింగ్ అని చెప్పుకొచ్చాడు. కాజల్.. సిరి గురించి చెప్తూ ఆమెకు రెండు ముఖాలున్నాయని, టాస్క్‌లో ఒక ఫేస్, సాధారణంగా ఒక ఫేస్ ఉంటుందని తెలిపింది. ఇవి కాకుండా సిరి తనకు మూడో ఫేస్ కూడా ఉందని చెప్తూ ఉంటుందని, అది హౌస్ బయటకెళ్లాక చూపిస్తానందని పేర్కొంది. తర్వాత సన్నీ.. రవి మాట మార్చుతాడంటూ అతడు ఫేక్ అని చెప్పాడు. దీంతో చిర్రెత్తిపోయిన రవి.. ఎంత చెప్పినా వినకుండా నాకు నచ్చింది చేస్తా, ఎవ్వడు చెప్పినా నేను వినను అంటే అది యారోగెంటే కదా అంటూ ఆ ట్యాగును సన్నీ మెడలో వేశాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అందరూ కరెక్ట్ ట్యాగులిచ్చుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. -
బ్యాడ్ బిహేవియర్, సన్నీని దోషిగా తేల్చిన నాగ్
Bigg Boss Telugu 5, Episode 70: సన్నీ నోటికొచ్చినట్లు వాగాడంటూ సిరి.. షణ్నును పట్టుకుని ఏడ్చేసింది. ఓ పక్క అతడి మీదున్న కోపాన్ని బయటకు కక్కుతూనే మరోపక్క షణ్నుకు హగ్గులిస్తూ ఐ లవ్యూ చెప్పింది. కాజల్ పేరు తీస్తేనే బుసలు కొడుతున్న యానీ బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నంతవరకు ఆమెతో మాట్లాడనని, ముఖం కూడా చూడనని భీష్మించుకు కూర్చుంది. అటు మానస్ కూడా పింకీ ప్రవర్తనలో ఏదో తేడా కొడుతోందని ఆమెను కట్ చేయాలని చూస్తున్నాడు. కంటెస్టెంట్లు పలుచబడే కొద్దీ కంటెస్టెంట్ల మధ్య వైరాలు పెరుగుతున్నాయి. తర్వాత ఓ టాస్క్‌లో ప్రియాంక గెలిచి రామ్‌చరణ్ ఆటోగ్రాఫ్ అందుకుని మురిసిపోయింది. సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ తన శరీరం లావైతున్నట్లుగా, ఎవరో బాడీని పట్టుకున్నట్లుగా ఉందని, చూపు షేక్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు జెస్సీకి మరింత మెరుగైన చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు. భీమ్లా నాయక్ పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటిసభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొదటగా యానీ.. కాజల్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. నాగ్ ముందే నాగిణి డ్యాన్స్ చేస్తూ ఆమెను వెక్కిరించింది. అయినప్పటికీ మెజారిటీ కంటెస్టెంట్లు యానీకే సపోర్ట్ చేశారు. తర్వాత రవి.. వెరీ బ్యాడ్ బిహేవియర్, లూజ్ టంగ్ అంటూ సన్నీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. తంతా, అప్పడం చేసి అమ్మేస్తా అన్నాడని రవి చెప్పడంతో తాను అనలేదని బుకాయించాడు సన్నీ. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. సన్నీ మొదట తంతానన్నాడని, కానీ ఎవరిని అనడంతో టవర్‌ను తంతానని కవర్ చేశాడని నాగ్ చెప్పడంతో అతడి పరువు పోయినట్లైంది. అయితే సన్నీ మాత్రం తాను బ్రిక్స్నే తంతానన్నానని మరీమరీ చెప్పాడు. అమ్ముతానని సిరిని అన్నావంటూ మరో వీడియో చూపించాడు నాగ్. సన్నీ తరపున వాదించిన కాజల్ అతడు సిరిని అమ్ముతానని అనలేదని బల్లగుద్ది చెప్పింది. తర్వాత సన్నీ.. సిరిని బోనులో నిలబెట్టి ఎఫైఆర్ ఫైల్ చేశాడు. కానీ మానస్, కాజల్ తప్ప అందరూ సిరిని నిర్దోషి అని పేర్కొన్నారు. మానస్.. యానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అది వీగిపోయింది. శ్రీరామచంద్ర.. ప్రియాంకను బోనులో పెట్టాడు. ఎన్ని పాటలు పాడినా 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేదని ఆరోపించాడు. శ్రీరామ్ ముందుగానే ఫ్లాట్ అయిపోయి పాట పాడితే నాది తప్పా? అని రాగాలు తీసింది. హౌస్మేట్స్ సగం మంది తనను గిల్టీ, మిగతావాళ్లు గిల్టీ కాదని చెప్పారు. మానస్ గట్టిగా అరవడం నచ్చలేదని అతడిని ప్రియాంక బోనులో పెట్టింది. అయితే హౌస్మేట్స్ మానస్‌ను నిర్దోషిగా తేల్చారు. తర్వాత కాజల్.. యానీ తనను వెక్కిరిస్తుందంటూ బోనులో నిలబెట్టింది. అయితే ఆమె వెక్కిరించలేదని, అది తన బాడీ లాంగ్వేజ్ అని సిరి వాదించింది. మెజారిటీ కంటెస్టెంట్లు సిరి వాదనతో ఏకీభవించడం విశేషం. తర్వాత షణ్ను.. నేను ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడతాననడం, నన్ను యూట్యూబ్ వరకే అని చెప్పడం నచ్చలేదంటూ సన్నీని బోనులో నిలబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్లే చేసి చూపించగా రవి, శ్రీరామ్, సిరి, యానీ.. అతడు షణ్నును యూట్యూబ్ వరకే అన్నాడని చెప్పగా మిగిలిన ముగ్గురు షణ్నును అనలేదని, కామెంట్లు యూట్యూబ్ వరకే అని చెప్పాడని వివరించే ప్రయత్నం చేశారు. కానీ మెజారిటీ కంటెస్టెంట్లు షణ్నును సమర్థించారు. అందరూ మధ్యలో రావడం వల్లే గొడవలు వస్తున్నాయని కాజల్ ఉన్నమాట చెప్పింది. సిరి సన్నీ గొడవ పడుతుంటే షణ్ను మధ్యలోకి రావడం వల్లే గొడవ పెద్దదైందని తెలిపింది. అయితే నాగ్ మాత్రం కాజల్.. యానీకి గిలిగింతలు పెట్టడం వల్లే అసలు గొడవ మొదలైందన్నాడు నాగ్. మొత్తంగా సన్నీ మెడలో గిల్టీ బోర్డు వేలాడదీశారు. తర్వాత సన్నీ సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్. -
కళ్లు లేవా? కామన్ సెన్స్ లేదా? ఫాల్తూ, తంతా: కంటెస్టెంట్ల తిట్ల దండకాలు
Bigg Boss Telugu 5, Episode 69: బీబీ హోటల్ టాస్క్‌లో కాజల్ డబ్బులు దొంగిలించిన రవి వాటిని ఆమెకు తిరిగిచ్చేశాడు. మరోవైపు టిప్పు కోసం యానీ సన్నీనెత్తుకుని తిప్పింది. తర్వాత బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ముగిసిందని ప్రకటించాడు. టాస్క్ ముగిసే సమయానికి హోటల్ సిబ్బంది దగ్గర రూ.9,500 మాత్రమే ఉన్నాయి. అతిథులు దగ్గర నుంచి 15 వేల రూపాయలు రాబట్టనందున హోటల్ సిబ్బంది ఓడిపోయిందని, అతిథుల టీమ్ గెలిచిందని ప్రకటించాడు బిగ్‌బాస్. ఇక రాత్రిపూట ముచ్చట్లు పెట్టిన రవి, షణ్ను, సిరి.. మానస్ ఎక్కువ పని చేస్తాడు కానీ సన్నీ మాత్రం ఏ పనీ చేయడని గుసగుసలాడారు. ఎప్పుడూ తప్పించుకు తిరుగుతాడని అభిప్రాయపడ్డారు. షణ్ముఖ్ ప్రెస్టీజ్ చాంపియన్ ఆఫ్ ది వీక్‌గా ఎంపికై రూ.25,000 గిఫ్ట్ వోచర్ అందుకోవడం విశేషం. ఇదిలా వుంటే సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసిన రవిని కెప్టెన్సీ పోటీదారుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్. అతిథుల టీమ్‌లో నుంచి ఇద్దరిని అనర్హులుగా ప్రకటించాలని హోటల్ సిబ్బందిని ఆదేశించగా వారు ఏకాభిప్రాయంతో మానస్, పింకీలపై వేటు వేశారు. దీంతో వారు కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని కోల్పోయారు. మిగిలిన సిరి, కాజల్, సన్నీ, రవి కెప్టెన్సీకి పోటీ పడ్డారు. వీరికి 'టవర్‌లో ఉంది పవర్' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో పోటీదారులు టవర్ కట్టి అది కూలిపోకుండా చూసుకోవాలి. మొదటి లెవల్లో ఓడిపోయిన కాజల్.. రవికి సపోర్ట్ చేస్తున్న యానీకి గిలిగింతలు పెట్టింది. దీంతో మండిపోయిన యానీ.. ఓవరాక్షన్ చేయకని హెచ్చరించింది. మరోపక్క తనను గేమ్ ఆడనీయకుండా అడ్డుకున్న సిరిపై మండిపడ్డాడు సన్నీ. నీ టవర్‌ను తంతానని చెప్పాడు. నన్ను పట్టుకున్నప్పుడు తోసేస్తే అప్పడం అయిపోయేదానివన్నాడు. దీంతో మధ్యలో కలగజేసుకున్న షణ్ను ఏదీ, తన్ను చూద్దామంటూ మరింత రెచ్చగొట్టాడు. అలా వీరిద్దరి మధ్య పెద్ద వారే జరిగింది. సిరి, షణ్ను ఒకరి కోసం ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరూ కలిసి సన్నీ మీదకు దూసుకెళ్లారు. కళ్లు లేవా? కామన్సెన్స్ లేదా? ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతున్నావ్ అని ఎలా అంటావ్? అని సిరి సన్నీని ఏకిపారేసింది. సన్నీ కూడా ఆవేశంలో మాటలు తూలాడు కానీ నాగ్‌కు ఇచ్చిన మాట కోసం ఎవరికీ వేలు చూపించలేదు. ఇక యానీ.. ఈ గేమ్‌లో ఎవరికి సపోర్ట్ చేశావని కాజల్‌ను ప్రశ్నించగా ఆమె తెలివిగా సన్నీకి అని కాకుండా రవికి అని చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. అన్ని ఫాల్తూ గేమ్ ఆడతావ్, నువ్వు గేమ్‌లో నన్ను టచ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది. ఒక్క గేమ్ నిజాయితీగా ఆడలేదంటూ ఆమె ముందుకెళ్లి నాగిణి డ్యాన్స్ చేసింది. ఆమెను వెక్కిరిస్తూ మరింత రెచ్చగొట్టింది. ఇదిలా వుంటే పింకీ చీర తగిలి టవర్ కూలిపోవడం సన్నీ గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. అయితే పింకీ కావాలనే టవర్‌ను కూల్చిందని సన్నీ, మానస్ అభిప్రాయపడ్డారు. నమ్మినవాళ్లే మోసం చేస్తే ఇంకేం చేయాలని తెగ ఫీలయ్యారు. మొత్తానికి ఈ టవర్‌లో ఉంది పవర్ టాస్క్‌లో రవి గెలిచి కెప్టెన్‌గా అవతరించాడు. -
ఎట్టకేలకు నామినేషన్ నుంచి తప్పించుకున్న రవి!
Bigg Boss Telugu 5, Ravi New Captain!: బుల్లితెర మీద హీరో అయిన యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌లో హీరో కాలేకపోతున్నాడు. బోలెడంత పాపులారిటీ, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మొదట్లో ఆడవాళ్ల గొడవల్లో ఇరుక్కుని, మాటలు మార్చుతూ, అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పుతూ జాతీయ ఛానల్లో తన పరువు తానే తీసుకున్నాడు. ఇలా చాలాసార్లు అబద్ధం చెప్తూ అడ్డంగా దొరికిపోయిన రవిపై హౌస్మేట్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నారు. తాజాగా హౌస్‌లో జరిగిన బీబీ హోటల్ టాస్క్‌లో హోటల్ సిబ్బంది సేవలను చెడగొట్టాలని రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందుకోసం అతడు కావాలని సన్నీ బెడ్ మీద నీళ్లు పోయడం, కాజల్ డబ్బులు దొంగిలించడం, కాజల్ వాటర్ బాటిల్లో కారం కలపడం వంటి పనులు చేశాడు. అయితే ఇవన్నీ రవియే చేశాడని అందరూ అనుమానపడ్డారు. పైగా అతడికి పైసా టిప్పు ఇవ్వద్దని ఓ నిర్ణయానికి వచ్చారు, కానీ ఈ మాట మీద ఎవరూ నిలబడలేదు అది వేరే విషయం. సీక్రెట్ టాస్క్ అంటేనే ఎవరికీ అనుమానం రాకుండా అప్పగించిన పనిని పూర్తి చేయడం. కానీ ఇక్కడ అందరికీ రవి సీక్రెట్ టాస్క్ చేస్తున్నాడని తెలిసిపోయింది. అయినప్పటికీ అతడు కెప్టెన్సీ పోటీదారుడిగా సెలక్ట్ అవడం, తర్వాతి గేమ్‌లో కెప్టెన్ అవడం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. ఏదేమైనా ప్రతివారం నామినేషన్లో ఉంటున్న రవి ఎట్టకేలకు కెప్టెన్ అయి ఇమ్యూనిటీ సాధించాడు. దీంతో వచ్చేవారం రవి నామినేషన్ టెన్షన్ లేకుండా హాయిగా గుండెల మీద చేతులేసి నిద్రపోవచ్చు. -
జెస్సీకి తిరగబెట్టిన రోగం, కొత్త లక్షణాలతో సతమతం!
Bigg Boss 5 Telugu, Episode 68: బిగ్‌బాస్ షోలో బీబీ హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో హోటల్‌కు విచ్చేసిన అతిథులు సన్నీ, సిరి, కాజల్, ప్రియాంక, మానస్.. అక్కడి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటూ టిప్పులివ్వకుండా విసిగించారు. వీరి ప్రవర్తనతో చిర్రెత్తిపోయిన హోటల్ స్టాఫ్ ముందు పైసలు తీయండి, కావాల్సినంత సేవలు చేయించుకోండి అని అభ్యర్థించినప్పటికీ వారు వినిపించుకోలేదు. రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని తెలిసిపోయింది! చేసేదేం లేక సిబ్బంది అతిథుల సేవల్లో తరించారు. హనీమూన్ కపుల్ ప్రియాంక- మానస్‌ల కోసం యానీ మాస్టర్ పూలతో బెడ్ అలంకరించింది. మీ శోభనం కోసం అన్నీ సిద్ధం చేశానని చెప్తుండగా సన్నీ వెళ్లి ఆ బెడ్‌మీద పడి దొర్లి దాన్ని నాశనం చేశాడు. మరోపక్క షణ్ముఖ్.. నువ్వు దొంగతనం చేశావన్న విషయం తనకు తెలుసంటూ రవితో నేరుగా చెప్పాడు. అడ్డంగా దొరికిపోయినప్పటికీ రవి మాత్రం తాను తీయలేదని బుకాయించాడు. టాస్క్ చెడగొట్టే పనిలో భాగంగా కాజల్ వాటర్ బాటిల్లో కారం పోశాడు. అయితే హౌస్మేట్స్ ఇది చేసింది రవే అని పసిగట్టారు. అతడికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని, ఇక నుంచి రవికి డబ్బులు ఇవ్వకూడదని ఓ నిర్ణయానికి వచ్చారు. డబ్బులివ్వడం లేదని ఏడ్చేసిన యానీ మరోపక్క సన్నీ.. పింకీ-మానస్‌ల క్యాండిల్ లైట్ డిన్నర్‌ను సర్వనాశనం చేశాడు. దీంతో అలకమంచం ఎక్కిన పింకీని బుజ్జగించి కూల్ చేశాడు మానస్. ఇదిలా వుంటే తన డబ్బులు కొట్టేశారన్న బాధలో ఉన్న కాజల్ ఎలాగైనా వాటిని సంపాదించుకోవాలనుకుంది. ఇందుకోసం యానీ బ్యాగులో నుంచి డబ్బులు దొంగిలించింది. కానీ హౌస్మేట్స్ మాత్రం ఇది కచ్చితంగా రవి పనే అయ్యుంటుందని అతడి మీద అనుమానం వ్యక్తం చేశారు. బండెడు పనులు చేయించుకుని చారానా వంతు టిప్పు ఇస్తున్నారని అసహనానికి లోనైన యానీ ఇన్ని పనులు చేయిస్తున్నారు.. నేను మనిషినా? పశువునా? అని ఆవేశపడింది. కుక్కల్లా పనులు చేయిస్తున్నారు, కానీ డబ్బులు ఇవ్వరు అంటూ ఏడ్చేసింది. జెస్సీకి తిరగబెట్టిన రోగం ఇలాగైతే తమకు డబ్బులు రావని అర్థమైన సిబ్బంది మాకు 10 వేల రూపాయలు ఇచ్చేవరకు అతిథులెవరికీ ఫుడ్ పెట్టమని తేల్చి చెప్పారు. దీంతో అతిథులు ఓ మెట్టు దిగి వచ్చి డబ్బులు ఇచ్చి ఆహారం అందుకున్నారు. ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ తను సరిగా చూడలేకపోతున్నానని, ఒక వైపుకు నెట్టేసినట్లు పడిపోతున్నానని బిగ్‌బాస్‌కు చెప్పుకున్నాడు. పడుకున్నప్పుడు స్నేక్ ఉన్నట్లుగా అనిపిస్తుందన్నాడు. దీంతో అతడిని చెకప్ చేసేందుకు డాక్టర్ రాగా.. జెస్సీ తన చేతులు లావైనట్లు అనిపిస్తోందని ఇలా ఇంతకుముందెన్నడూ అనిపించలేదని తెలిపాడు. నీకు మెరుగైన వైద్యం అవరసరమన్న డాక్టర్, అందుకు తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ ఇస్తామని, ధైర్యంగా ఉండమని జెస్సీకి భరోసా ఇచ్చాడు. -
కాజల్‌కు షాకిచ్చిన రవి, మేడమ్ మేడమ్ అంటూనే..
Bigg Boss 5 Telugu, Episode 67: కేక్ తినే అర్హత ఎవరికి ఉందని కంటెస్టెంట్లు చర్చోపచర్చలు పెట్టారు. ఈ తొక్కలో మీటింగ్ ఏంటో అర్థం కాని సన్నీ తినేస్తే పోలా అని కేక్ తీసుకుని లాగించాడు. ఖరాబవుతుందని తిన్నానంటూనే ఇప్పుడు ఏం పంచాయితీ అవుతుందోనని మథనపడ్డాడు. అన్నట్లుగానే యానీ మాస్టర్ వచ్చి సన్నీ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడని, నువ్వెలా తింటావని తిట్టుకుంటూ వెళ్లి ఏడ్చేసింది. బిగ్‌బాస్ బీబీ హోటల్ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్ కీపింగ్ స్టాఫ్‌లో ఉంటూనే అతిథులకిచ్చే సర్వీసులను చెడగొట్టమని రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. బీబీ హోటల్లో శ్రీరామ్, షణ్ముఖ్ చెఫ్స్, వెయిటర్లుగా, యానీ మాస్టర్ మేనేజర్, రిసెప్షనిస్ట్‌గా, రవి ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న హౌస్ కీపింగ్, మానస్- ప్రియాంక హనీమూన్‌కు వచ్చిన జంట, కాజల్.. హోటల్ ఓనర్‌కు స్నేహితురాలు, సన్నీ తొలిసారి 5 స్టార్ హోటల్‌కు వచ్చిన అతిథిగా, సిరి.. ఎంతో గారాబంగా పెరిగిన డాన్ కూతురుగా నటించాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో హోటల్ సిబ్బంది అతిథుల నుంచి రూ.15 వేల రూపాయలు గెలిస్తే వారు గెలిచినట్లు లెక్క! టాస్క్ మొదలవగానే ఇంటిసభ్యులు రెచ్చిపోయి మరీ ఆడారు. సన్నీ, సిరి అయితే పాత్రలో జీవించారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న సిరి షణ్ముఖ్‌ను ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించింది. సిరితో ఈజీ కాదు అని పాట పాడుతూ స్విమ్మింగ్ పూల్‌లోని నీటిని స్పూన్‌తో తీస్తూ కాఫీ కప్పు నింపాడు షణ్ను. దీంతో అతడికి టిప్పిచ్చింది సిరి. సన్నీ తనను టచ్ చేస్తుంటే సైలెంట్‌గా ఉన్నావేంటని మానస్ మీద చిర్రుబుర్రులాడింది పింకీ. మరోపక్క రవి.. కాజల్ బ్యాగులోంచి డబ్బులు కొట్టేసి ఏమీ ఎరగనట్లున్నాడు. దీంతో కాజల్ డబ్బులు పోయాయంటూ మొత్తుకుంది. మరి రేపటి ఎపిసోడ్లో అతిథులు హోటల్ సిబ్బందిని ఇంకెన్ని తిప్పలు పెడతారో చూడాలి! చదవండి: బిగ్‌బాస్ షోలో షాకింగ్ ఘటన, కంటెస్టెంట్ సూసైడ్ అటెంప్ట్! -
రవికి సీక్రెట్ టాస్క్, షణ్నును ఆడేసుకున్న సిరి
Bigg Boss Telugu 5 Today Promo: మరీ ఎక్కువగా ఆలోచిస్తే అన్నీ అనుమానాలే పుట్టుకొస్తాయి. బిగ్‌బాస్ కేక్ పంపించి ఇది తినే అర్హత మీలో ఎవరికి ఉంది? అని అడిగితే ఏ ఒక్కరూ టచ్ చేయలేకపోయారు. దీనివల్ల నామినేషన్లో పడతామేమో, లేదంటే నేరుగా ఎలిమినేట్ చేస్తారేమో అని రకరకాలుగా ఆలోచించారు. అయితే సన్నీ మాత్రం ఏదైతే అది అవుతుందని ఆ కేక్‌ను చటుక్కుమని తీసి లటుక్కున తినేశాడు. ఖరాబైతదని తింటున్నానంటూ కవరింగ్ ఇచ్చాడు. మరో ప్రోమోలో గత సీజన్‌లోని బీబీ హోటల్ టాస్క్ మరోసారి ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్‌లో శ్రీరామచంద్ర, షణ్ముఖ్ చెఫ్స్ అండ్ వెయిటర్లుగా, మానస్- ప్రియాంక హనీమూన్ జంటగా, సన్నీ మొదటిసారి ఫైవ్‌స్టార్ హోటల్‌కు వచ్చిన గెస్ట్‌గా నటించాల్సి ఉంటుంది. దొరికిందే ఛాన్స్ అని రెచ్చిపోయిన సిరి.. షణ్నుతో సపర్యలు చేయించుకుంది. దీంతో అతడు సిరితో అంత ఈజీ కాదు అని ఉన్నమాటనే పాట రూపంలో పాడుకున్నాడు. మరోవైపు బిగ్‌బాస్ యాంకర్ రవికి మరోసారి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. మరి రవి ఆ సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాడా? లేదా? బీబీ హోటల్లో కంటెస్టెంట్లు ఏ రేంజ్లో రచ్చ చేసారో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
Bigg Boss: చివరి క్షణంలో బిగ్‌బాస్ ట్విస్ట్.. నామినేషన్స్‌లో ఐదుగురు
Bigg Boss 5 Telugu,10th Week Nomination List: బిగ్‌బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే నామినేషన్స్‌తో హోరెత్తిపోతుంది. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇంటి సభ్యులు చేయని ప్రయత్నాలు, కుట్రలు ఉండవు. అయితే పదోవారం మాత్రం నామినేషన్ ప్రక్రియని కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. కాజల్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నించిన సిరి, రవిలో చివరకు బకరాలయ్యారు. యానీ మాస్టర్‌పై ప్రేమను పెంచుకున్న బిగ్‌బాస్.. ఆమెకు వరుసగా స్పెషల్ పవర్ ఇస్తూ ఇంటి సభ్యులకు షాకిచ్చాడు. దీంతో పదోవారం నామినేషన్స్‌లో ఐదుగురు ఉన్నారు. ఆ ఐదుగురు ఎవరు? వారు ఎలా నామినేట్ అయ్యారు? సిరి, రవిలు వేసిన ప్లాన్ ఏంటి? బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టులేంటి? చదివేయండి. ప్రస్తుతం హౌజ్‌కి కెప్టెన్‌గా ఉన్నయానీ మాస్టర్ని ఎవరైన నలుగురు కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేసి జైలులో కూడా పెట్టాలని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో యానీ.. మానస్, కాజల్, సన్నీ, షణ్ముఖ్‌లను నామినేట్ చేసి జైలులో పెట్టింది.యానీ మాస్టర్ చేసిన నామినేషన్‌ని మార్చే అవకాశాన్ని మిగిలిన ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్. దీనిలో భాగంగా.. బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న తాళాలను పట్టుకుని వాటి ద్వారా తమకి ఇష్టమైన వ్యక్తిని బయటకు తీసుకురావొచ్చు. అలా బయటకు వచ్చిన వ్యక్తి మరో ఇద్దరిని నామినేట్ చేస్తే.. వారిలో ఒకరి నామినేట్ అయి జైలుకు వెళ్లాలి. అయితే మొదట బజర్ మోగేసరికి పింకీ పరుగున వెళ్లి సంకెళ్లను చేజిక్కించుకుంది. వెంటనే మానస్‌ని జైలు నుంచి విముక్తి కల్పించింది. అయితే మానస్.. రవి, జెస్సీలను నామినేట్ చేయగా.. చివరికి ప్రియాంక, మానస్లు చర్చించి జెస్సీని జైలుకి పంపి నామినేట్ చేశారు. ఆ తర్వాతి బజర్‌కి సిరి తాళాలను దక్కించుకొని షణ్ముఖ్‌ని కాదని జెస్సీని బయటకు తీసుకొచ్చింది. అయితే తనను బయటకు తీసుకురావొద్దని ముందు సిరికి చెప్పాడు షణ్ముఖ్. అందుకే అతన్ని కాదని జెస్సీని విడిపించింది. బయటకు వచ్చిన జెస్సీ.. తిరిగి మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఫైనల్‌గా ఆ ఇద్దరిలో సిరి అందరూ ఊహించినట్టే సిరి మానస్‌ని నామినేట్ చేసింది. ఆ తరువాత జెస్సీ సంకెళ్లను చేజిక్కించుకుని షణ్ముఖ్ జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. షణ్ముఖ్‌కి నామినేట్ చేసే చాన్స్ రావడంతో.. పింకీ, సిరిలను నామినేట్ చేశాడు. వారిలో ప్రియాంక జైలుకు వెళ్లింది. ఇక్కడ పింకీ, షణ్ముఖ్‌ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కాబట్టి ఆమెను ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తున్నానని చెప్పడం పట్ల బాగా హర్ట్ అయిన పింకీ.. ‘ఉన్న నలుగురిలో వేరే ఆప్షన్ లేదని నన్ను నామినేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నా పాయింట్లో నువ్వు కరెక్ట్ కాదు. తరువాత ఎప్పుడైనా నన్ను నామినేట్ చేయాలనుకుంటే సరైన కారణం ఇవ్వు’అంటూ అసహనం వ్యక్తం చేయగా.. ‘నా పాయింట్లో ఇదే కరెక్ట్.. నేను ఇలానే నామినేట్ చేస్తా. అది నా ఇష్టం’అంటూ షణ్ముఖ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక కాజల్‌పై పగ పెంచుకున్న సిరి ఈ సారి ఎలాగైనా ఆమెను నామినేషన్స్‌కి పంపాలని కుట్రపన్నింది. కాజల్‌ని నామినేషన్స్‌లో ఉంచాలంటే ఇలా గేమ్ ఆడాలంటూ.. రవి, శ్రీరామ్, షణ్ముఖలకు ట్రైనింగ్ ఇచ్చింది. సిరికి మద్దతుగా నిలిచాడు రవి. బజర్ మోగగానే తాళాలను దక్కించుకొని ప్లాన్ ప్రకారం.. పింకీని బయటకు తీసుకొచ్చాడు. ఆమె షణ్ముఖ్, జెస్సీలను నామినేట్ చేయడంతో ఫైనల్‌గా రవి జెస్సీని సేవ్ చేసి షణ్ముఖ్‌ని మళ్లీ జైలు లోపలికి పంపాడు. రవి ఇచ్చిన ప్లాన్ ప్రకారం.. శ్రీరామ్ తాళలను దక్కించుకొని కాజల్‌ని సేవ్ చేశాడు. దీంతో బయటకు వచ్చిన కాజల్.. సిరి, రవిలను నామినేట్ చేయగా.. శ్రీరామ్ సిరిని ఫైనల్ చేసి జైలుకు పంపాడు. ఇలా కాజల్‌ని జైలులో ఉంచాలని కుట్ర పన్నిన సిరి... చివరకు ఆమె వల్లే జైలుపాలై నామినేషన్స్‌లో నిలిచింది. మరోవైపు ఎలాంటి ఒప్పందం లేకుండా నిన్ను బయటకు తెచ్చానని.. నీకు చాన్స్ వస్తే సిరిని సేవ్ చేయాలని కాజల్‌పై ఒత్తిడి తెచ్చాడు శ్రీరామ్. దీనికి కాజల్ ఒప్పుకోలేదు. తన స్నేహితులైన మానస్, సన్నీలలో ఒకరిని బయటకు తెస్తానని చెప్పింది. అలా చెయ్యొద్దని, గతంలో లెటర్ త్యాగం చేసిన షణ్ముఖ్‌ని అయినా బయటకు తీసుకురా అని శ్రీరామ్ చెప్పడంతో.. కాజల్ అదే పని చేసింది. బయటకు వచ్చిన షణ్ముఖ్.. ట్విస్ట్ ఇస్తూ రవి, శ్రీరామ్‌లను నామినేట్ చేశాడు. ఈ ఇద్దర్లో కాజల్ చివరికి రవిని నామినేట్ చేసి జైలుకు పంపింది. చివరికి జైలులో మిగిలిన మానస్, సిరి, సన్నీ, రవిలు నామినేట్ కాగా.. అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది అన్నట్టు చివరిలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. కెప్టెన్ అయిన యానికి మరో పవర్ ఇచ్చాడు. నామినేట్ అయిన సభ్యులు కాకుండా మిగిలిన వారిలో ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయమని ఆదేశించాడు. దీంతో యానీ అంతా ఊహించినట్లే కాజల్‌ని నామినేట్ చేసింది. దంతో పదోవారం నామినేషన్స్‌లో మానస్, సిరి, కాజల్, రవి, సన్నీ ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించారు. మరి ఈ ఐదురురిలో ఎవరు పదోవారం బయటకు వెళ్లారో చూడాలి. -
విన్నర్, టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పేసిన విశ్వ
Bigg Boss 5 Telugu, 9th Week Vishwa Eliminated: విశ్వ ఎలిమినేషన్‌తో ఇంటిసభ్యులు డల్ అయిపోయారు. బెస్ట్ సంచాలకుడు, బెస్ట్ రేషన్ మేనేజర్, బెస్ట్ కెప్టెన్, బిగ్‌బాస్ హౌస్‌కు సూపర్ హీరో విశ్వ అని అతడిని ఆకాశానికెత్తారు. ఎంతో బాగా గేమ్ ఆడే విశ్వ వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఇక విశ్వ వెళ్లిపోతూ కంటెస్టెంట్లకు ర్యాంకులివ్వడంతో పాటు వారికి సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇంట్లోకి వెళ్లాక నా మనసుకు కనెక్ట్ అయిన మొదటి వ్యక్తి ప్రియాంక అంటూ ఆమెకు 10వ ర్యాంక్ ఇచ్చాడు. కాజల్ బాగా ఆడుతుందని, కానీ తను ధైర్యాన్ని కోల్పోతుందంటూ 9వ ర్యాంకిచ్చాడు. నువ్వు స్ట్రాంగ్, కానీ గేమ్‌లో గివప్ ఇవ్వకూడదని జెస్సీకి సలహా ఇస్తూ అతడిని 8వ స్థానంలో ఉంచాడు. యానీ ఫైటర్ అని మెచ్చుకుంటూ ఆమెకు 7వ ర్యాంకిచ్చాడు. గెలుపోటములు సహజమని, ఓడిపోయినప్పుడు అతిగా బాధపడొద్దని మానస్‌కు సూచిస్తూ 6వ ర్యాంక్ ఇచ్చాడు. తర్వాత టాప్ 5 కంటెస్టెంట్లను వెల్లడించాడు. సిరి టాప్ 5లో ఉండాలన్నాడు. సన్నీ ఇలా కూల్‌గా ఉంటే బాగోలేడని, నువ్వు నీలాగే ఉండంటూ అతడికి నాల్గో ర్యాంకిచ్చాడు. గెలిస్తే చిల్ అవుతూ ఓడిపోతే కింద కుంపటి పెట్టినట్లు ఫీల్ అయ్యే షణ్ముఖ్‌కు 3వ స్థానం ఇచ్చాడు. రవిని అందరూ గుంటనక్క అనుకుంటారు, కానీ అతడు అలాంటివాడు కాదంటూ రవిని 2వ స్థానంలో నిలబెట్టాడు. ఇక శ్రీరామ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు విశ్వ. తాను కోల్పోయిన తమ్ముడిని శ్రీరామ్‌లో చూసుకుంటున్నాననంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఈ సీజన్‌కు విన్నర్‌గా మొదటి స్థానంలో నిలబెట్టాడు. -
షణ్ను మీద ప్రతీకారం తీర్చుకున్న రవి!
ప్రతివారం యాంకర్ రవి మీద విరుచుకుపడే నాగార్జున ఈసారి మాత్రం అతడిని మెచ్చుకున్నాడు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో రవి కష్టాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టాడు. నీకు నరకం అంటే ఏంటో చూపించారు కదా! ఇప్పుడు నువ్వు ప్రతీకారం తీర్చుకోవచ్చు అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు నాగ్. ఇంకేముందీ.. ఏది దొరికితే అది కలిపి వరుసగా నాలుగైదు గ్లాసుల డ్రింక్ తాగిపించి తనను అష్టకష్టాలు పెట్టిన షణ్ముఖ్‌ను ఓ ఆటాడుకున్నాడు రవి. నచ్చినవి, నచ్చనవి అన్నీ కలిపి జ్యూస్ తయారు చేశాడు. ఆ జ్యూస్‌ను షణ్ను కళ్లు మూసుకుని తాగి అవస్థలు పడ్డాడు. తర్వాత శ్రీరామ్ తను ప్రతీకారం తీర్చుకోవడానికి సన్నీని ఎంచుకున్నాడు. ఉల్లిపాయ తింటూ జ్యూస్ తాగమని శ్రీరామ్ చెప్పగా ఏదో జన్మలో నువ్వు నాకు మొగుడివయ్యుంటావన్నాడు సన్నీ. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఇంకా ఎవరెవరు ఎలా పగ తీర్చుకున్నారో చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. -
రవిని టార్గెట్ చేసి టార్చర్ పెట్టారు: మండిపడ్డ అషూ రెడ్డి
ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఎలాగైనా కెప్టెన్ అయి ఇమ్యూనిటీ సాధించాలని గట్టి పట్టుదల మీదున్నారు కంటెస్టెంట్లు. వీరిని రెండు టీమ్‌లుగా విభజించిన బిగ్‌బాస్.. టాస్క్ ముగిసే సమయానికి ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తే ఆ టీమ్ గెలిచినట్లని ప్రకటించాడు. గెలిచిన టీమ్‌లోని సభ్యులు కెప్టెన్సీ కంటెండర్లు అవుతారని తెలిపాడు. సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో శ్రీరామ్, షణ్ముఖ్, ప్రియాంక, కాజల్, మానస్ సూపర్ హీరోల టీమ్ కాగా మిగిలిన వారంతా విలన్స్ టీమ్‌లో ఉంటారు. సమయానుకూలంగా ఒక్కో టీమ్ అవతలి టీమ్‌లోని ఇంటిసభ్యుడిని టార్గెట్ చేస్తుంది. వారికి చిత్ర విచిత్ర టాస్కులిచ్చి వాటిలో ఓడిపోయేట్లుగా చేసి ఐ క్విట్ అనిపిస్తేనే పాయింట్ దక్కుతుంది. ఈ క్రమంలో సూపర్ హీరోస్ టీమ్ రవిని టార్గెట్ చేసింది. అతడిని ఓడిస్తే ఆట సులువు అవుతుందని ప్లాన్ రచించాడు షణ్ముఖ్. ఇందుకోసం అతడితో ఎలాగైనా ఐ క్విట్ అనిపించాలని ఎన్నో కష్టతరమైన టాస్కులిచ్చారు. ఒంటి మీదున్న దుస్తులతో సహా తనకు చెందిన అన్ని బట్టలకు పేడ అంటించాలని చెప్పారు. ఇది విన్న రవి ఏమాత్రం తటపటాయించకుండా రెడీ అంటూ టాస్క్ మొదలుపెట్టాడు. అతడి ధైర్యాన్ని చూసి వెనకడుగు వేసిన అవతలి టీమ్ సభ్యులు అన్ని బట్టలకు పేడ అంటించడం వద్దనేశారు. తర్వాత ఏవేవో పదార్థాలు కలిపి తయారు చేసిన జ్యూస్‌ను తాగాలని చెప్పగా రవి గుటగుటా తాగేశాడు. డ్రింక్ తాగిన వెంటనే స్క్వాడ్స్ చేయమన్నారు. రవికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంది, కాబట్టి ఆ టాస్క్ చేయనని చేతులెత్తేస్తాడనుకున్నారు, కానీ రవి వెనకడుగు వేయలేదు. దాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) ఆ తర్వాత రవితో మరో జ్యూస్ తాగించి గుండ్రంగా తిరగమని చెప్పి మళ్లీ మరో జ్యూస్‌ను చేతికందించారు. ఇవన్నీ పూర్తి చేసినప్పటికీ హీరోస్ టీమ్ ఊరుకోలేదు. ఏదేమైనా అతడితో క్విట్ అనిపించాలని డిసైడ్ అయింది. మరోసారి తాగడానికి వీలు లేని విచిత్ర జ్యూస్‌ను రవితో తాగిపించారు. ఇదంతా చూసి రవి అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు సైతం ఫీలవుతున్నారు. బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి అయితే హౌస్మేట్స్ మీద ఓ రేంజ్లో ఫైర్ అయింది. 'వాళ్లు అతడిని టార్గెట్ చేస్తున్నారు. అది అక్కడ క్లియర్‌గా కనిపిస్తోంది. దీన్ని టార్చర్ అంటారు, కానీ గేమ్ అనరు' అని మండిపడింది. పలువురు రవి ఫ్యాన్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రవికి వెన్ను నొప్పి ఉందని తెలిసీ అతడిని చిత్రహింసలకు గురి చేశారని అంటున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
మీరు నా బేబీలు.. ఇద్దరూ చెరో ముద్దివ్వొచ్చుగా: జెస్సీ
Bigg Boss Telugu 5, Episode 60: పింకీ గురించి అందరి నోటా ఒకటే మాట.. ఆమె మానస్ ధ్యాసలో పడి గేమ్ ఆడటం లేదని! తాజాగా ఇదే మాటను సన్నీ కూడా అన్నాడు. పింకీ.. నీ జోన్లో ఉందని మానస్‌తో చెప్పుకొచ్చాడు సన్నీ. నీ ఆట నువ్వాడని ఆమెకు సలహా ఇచ్చానన్నాడు. దీనిపై మానస్ స్పందిస్తూ.. 'ఆమె ఎవరి మాటా వినదు, తాను చేయాలనుకుందే చేస్తుంది. నువ్వు చెప్పినప్పుడు కూడా సరే అన్నయ్య అంటుంది కానీ ఆ వెంటనే పోరా బచ్చాగా అని లైట్ తీసుకుంటుంది' అని చెప్పుకొచ్చాడు. అయితే పింకీ గేమ్‌ను తాను డిస్టర్బ్ చేయడం లేదన్నాడు మానస్. ఇక మెడలు పట్టేసిన జెస్సీ హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఓవైపు సిరి, మరోవైపు ప్రియాంకను కూర్చోబెట్టుకుని పులిహోర కలపడం మొదలుపెట్టాడు. 'బుగ్గలు రెండు ఒకలా మాసిపోతున్నాయి. ఇద్దరూ కలిపి ఒక ముద్దు పెడితే బాగుంటుంది' అని కోరిక వెలిబుచ్చాడు. ఇది విని షాకైన సిరి కెమెరా నుంచి కాలి వచ్చి తంతుందని సెటైర్ వేసింది. ఏంటీ ముద్దులు పెట్టరా? అని మరోసారి అడగ్గా ఇద్దరూ ససేమీరా అనడంతో వాళ్లిద్దరినీ తన బేబీలని చెప్పాడు. అనంతరం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్. ఇందులో ఇంటిసభ్యులు రెండు టీములుగా విడిపోయారు. రవి, జెస్సీ, యానీ, విశ్వ, సిరి, సన్నీ నల్ల గులాబీలను ఎంచుకుని సూపర్ విలన్స్ టీమ్‌గా, ఎర్ర గులాబీలను ఎంచుకున్న మిగిలిన వారంతా సూపర్ హీరోస్ టీమ్‌గా విడిపోయారు. ఇతర టీమ్‌లోని సభ్యులతో ఐ క్విట్ అని చెప్పేలా చేయడమే గేమ్. అలా చెప్పించడం కోసం ఏమైనా చేయవచ్చు! గేమ్ స్టార్ట్ అయ్యాక హీరోస్ టీమ్‌లోని కాజల్ గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ తాళాలన్నీ ఓపెన్ చేసింది. ఇది చూసిన విలన్స్ టీమ్‌లోని విశ్వ వెంటనే వచ్చి తన టీమ్‌వైపు ఉన్న డోర్ తాళాలను తెరిచి హౌస్‌లోకి పరిగెత్తాడు. దీంతో ప్రియాంక అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ విశ్వ మొదటగా స్టోర్ రూమ్‌లో అడుగుపెట్టి తాళాలు అక్కడ పెట్టేశాడు. ఈ క్రమంలో తనను నెట్టేశాడని, గట్టిగా పట్టుకున్నారంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. మీరు ఫిజికల్ అయితే నేను దాని అమ్మ మొగుడినవుతానని విలన్స్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చింది. మొదటి రౌండ్లో విలన్స్‌కు ఛాన్స్ రాగా వాళ్లు హీరోల టీమ్ నుంచి శ్రీరామ్‌ను సెలక్ట్ చేశారు. అతడికి పెయింట్ నెత్తిన పూసుకోవడం, విచిత్ర జ్యూస్‌లు తాగడం వంటి టాస్క్లిచ్చారు. అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయడంతో హీరోల టీమ్‌కు ఒక పాయింట్ లభించినట్లైంది. తర్వాతి రౌండ్లో పింకీ తనను తోసిందని సిరి ఆరోపించింది. తనను అందరూ చుట్టుముట్టేస్తే తోయకుండా ఏం చేయాలంది పింకీ. ఈ ఇద్దరి వాదనలు విన్న షణ్ను.. పింకీ, సిరి ఇద్దరిదీ తప్పేనంటూ పెదరాయుడిలా తీర్పునిచ్చాడు. తర్వాతి రౌండ్లో హీరోలు.. విలన్స్ టీమ్‌లోని రవిని టార్గెట్ చేశారు. రవి తన బట్టలన్నింటికీ పేడ అంటించాలని చెప్పాడు షణ్ను. కానీ జాలేసి కేవలం ధరించిన బట్టలకు మాత్రమే పేడ అంటిస్తే సరిపోతుందన్నారు. తర్వాత అన్ని మిక్స్ చేసిన జ్యూస్‌ను తాగాలని చెప్పారు. ఆ వెంటనే స్క్వాడ్స్ చేయాలన్నారు. అయితే రవి దేనికీ జంకకుండా, వెనకడుగు వేయకుండా, తన వెన్నునొప్పిని సైతం పక్కనపెట్టి వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు రవి. మరోసారి జ్యూస్ ఇవ్వగా దాన్ని కూడా గడగడా తాగేశాడు. అయితే అతడికి బ్యాక్ ప్రాబ్లమ్ ఉందని తెలిసినా కూడా అలాంటి కష్టమైన టాస్కులు ఎలా ఇస్తారని ఫైర్ అయింది యానీ. ఇవన్నీ గుర్తుపెట్టుకుని తిరిగి మీకే ఇస్తానని చెప్పింది. అయినప్పటికీ లెక్క చేయని విలన్లు అతడితో గుండ్రంగా తిరగమని చెప్పారు. ఆ వెంటనే మరో జ్యూస్ గ్లాస్‌ను సైతం గడగడా తాగాడు. అయినప్పటికీ వారూ మరో డ్రింక్‌ను తాగమని పురమాయించగా అతడు బాగోలేదంటూనే కళ్లు మూసుకుని తాగాడు. తన టీమ్‌ను గెలిపించడం కోసం సాయశక్తులా పోరాడి అందరి మన్ననలు పొందాడు -
Bigg Boss 5 Telugu: దుస్తులిప్పి నిలబడటానికైనా రెడీ: రవి
Bigg Boss 5 Telugu Latest Promo: బిగ్‌బాస్ హౌస్‌లో తొమ్మిదోవారం ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కెప్టెన్ మినహా ఇంటి సభ్యులందరిని నామినేషన్స్‌కి పంపిన బిగ్‌బాస్.. టాస్క్పేరుతో ఇద్దరిని సేఫ్ జోన్లోకి పంపాడు. దీంతో ఈ వారం నామినేషన్లో ఎనిమిదిమంది ఉన్నారు. ఇలా నామినేషన్ ప్రక్రియ ముగిసిందో లేదో.. ఇంటి సభ్యులకు మరో గండం వచ్చిపడింది. అదే కెప్టెన్సీ టాస్క్. ఇందులో భాగంగా ఈ వారం ‘సూపర్ హీరోస్ vs సూపర్ విలన్స్’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనికోసం ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీశాడు. విలన్స్ టీమ్‌లో రవి, యానీ, సన్నీ, విశ్వ, జెస్సీ ఉన్నారు. టీమ్‌ని రవి లీడ్ చేస్తున్నాడని, అతన్ని పడగొడితే టీమ్ మొత్తం సెట్ అయిపోతుందని షణ్ముఖ్ తన టీమ్ సభ్యులకు చెబుతున్నారు. మరోవైపు యాంకర్ రవి టాస్క్ కోసం దుస్తులిప్పి నిలబడమన్నా నిలబడతా’అని తన సభ్యుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు. రవిని టార్గెట్ చేసిన హీరోస్ టీమ్.. అతనికి ప్రత్యేక టాస్క్‌లు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అయితే రవి మాత్రం అన్నింటికీ తెగించి టాస్క్‌లు ఆడుతున్నాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి కెప్టెన్ అయ్యారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
డబ్బుల కోసం రాలేదు, నన్ను బయటకు పంపండి: రవి ఆవేదన
Bigg Boss Telugu, Episode 53: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో అందరూ పాల్గొనడానికి వీల్లేనందున ఎవరు డ్రాప్ అవుతారన్న దానిపై హౌస్మేట్స్ చర్చించారు. ఈ సందర్భంగా కెప్టెన్ సన్నీ మాట్లాడుతూ.. టాస్క్‌లో డ్రాప్ అవుతానన్న జెస్సీ.. మళ్లీ వచ్చి ఆడతానన్నాడంటూ ఇంటిసభ్యుల దగ్గర ప్రస్తావించాడు. జెస్సీకి ఆడాలని ఉన్నందున అతడి కోసం టాస్క్‌లో నుంచి వైదొలగడానికి యానీ, సన్నీ సిద్ధమయ్యారు. కానీ జెస్సీ మాత్రం తను అన్‌ఫిట్ అని, తనే డ్రాప్ అవుతానని చెప్పాడు. తనకోసం యానీ టాస్క్ నుంచి తప్పుకోవడం ఇష్టం లేదన్నాడు. ఆమె గేమ్ ఆడి గెలవాలని, ఎందుకంటే ఆమె అందరికీ వండి పెడుతుందని, ఒకవేళ కెప్టెన్ అయితే మరిన్నివారాలు ఆమె హౌస్‌లో ఉన్నవాళ్లకు వంట చేస్తుందని చెప్పుకొచ్చాడు. రంగు పడుద్ది.. 'అభయహస్తం' అనే కెప్టెన్సీ టాస్క్‌లో 'రంగు పడుద్ది' అనే నాలుగో ఛాలెంజ్ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ ఛాలెంజ్‌లో కాన్వాస్‌పై ఎవరి రంగు ఎక్కువగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు. ఈ టాస్క్‌లో ప్రియాంకపై యానీ గెలవడంతో పాటు హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాన్ని పొందింది. మరోపక్క షణ్ను మీద ఉన్న చనువుతో మనిద్దరం కలిసి ఓ సాంగ్ చేద్దాంరా అని తన మనసులోని మాటను బయటపెట్టింది సిరి. దీంతో చికాకుపడ్డ షణ్ను.. 'హమీదా కూడా ఇంతే.. వర్క్ అనేసరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు చేద్దాం అనేసరికి నేను గుర్తొస్తాను' అని అసహనం ప్రదర్శించాడు. దీంతో హర్ట్ అయిన సిరి 'నీతో సాంగ్ చేయడానికే నేనిదంతా చేస్తున్నానా?' అని చిర్రుబుర్రులాడింది. ఆమె అలకబూనిందని అర్థమైన షణ్ను వెంటనే సారీ చెప్పాడు. కానీ అప్పటికే పీకల్లోతు కోపంలో ఉన్న సిరి.. 'ఎవడిక్కావాల్రా సారీ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి.. నాకు ఒళ్లు మండిపోతుంది' అని ఫైర్ అయింది. ఇక ఎప్పటిలాగే కాసేపటికే ఇద్దరూ తిరిగి మామూలైపోయారు. నేను డబ్బుల కోసం రాలేదు: రవి బిగ్‌బాస్ ఇచ్చిన 5వ చాలెంజ్ 'కారులో హుషారుగా' టాస్క్‌లో భాగంగా పోటీదారులు బొమ్మ కారును నడిపిస్తూ పూల కుండీలను వారి బాక్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో కాజల్‌పై సన్నీ విజయం సాధించాడు. అయితే కాజల్ గేమ్ లైట్ తీసుకుందని షణ్ను, సిరితో చెప్పుకొచ్చాడు రవి. ఈ క్రమంలో హౌస్‌లో కొద్దివారాలుగా ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను వారిముందుంచాడు. 'నేను డబ్బుల కోసం రాలేదు. నా భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పండి, లేదంటే నన్నైనా బయటకు పంపండి. దానిక్కూడా నేను సిద్ధమే, కానీ ఈ ఒత్తిడి నా వల్ల కావడం లేదు' అని వాపోయాడు. మరోపక్క మానస్.. రవి గేమర్ అని అభిప్రాయపడ్డాడు. అతడు ఎప్పుడు? ఎవరిని ఎలిమినేట్ చేయాలి? అని ప్లాన్ చేస్తుంటాడని కాజల్‌తో చెప్పుకొచ్చాడు. మానస్ అడుగుపెట్టాక వార్ వన్‌సైడ్ 'బంతిలో ఉంది భాగ్యం' అనే స్పెషల్ టాస్క్‌తో కెప్టెన్సీ పోటీదారులయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో బజర్ మోగినప్పుడు సర్కిల్లో ఉన్న బంతి సాధించిన ప్రతిసారి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయవచ్చు. ఈ గేమ్‌లో వరుసగా బంతి సాధించిన మానస్.. విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్, పింకీలను ఎలిమినేట్ చేసి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఫైనల్‌గా ఈ వారం కెప్టెన్సీ కోసం షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ, మానస్ పోటీపడుతున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు తెలిపాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ హౌస్‌లో లాక్డౌన్ ఎత్తేస్తున్నట్లు వెల్లడించాడు. -
బిగ్‌బాస్: ఎట్టకేలకు గెలిచిన షణ్ముఖ్.. చెమటలు కక్కిన శ్రీరామ్.
Bigg Boss Telugu 5, Episode 52: బిగ్‌బాస్ ఇంట్లో ఎనిమిదోవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తోంది. కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ నానా కష్టాలు పడుతున్నారు. లోబో, షణ్ముఖ్ ఆవుపేడతో ఆటలాడగా.. సిరి, రవి స్విమ్మింగ్‌ఫూల్‌లో సీసాలు ఏరారు. మరోవైపు మానస్, శ్రీరామచంద్రలు చమటలు పట్టేలా తాళ్లను ఊపారు. మరి ఈ టాస్కుల్లో ఎవరుగెలిచారు. హౌస్‌ని లాక్డౌన్ చేస్తున్నట్లు బిగ్‌బాస్ ఎందుకు ప్రకటించారు. ఇంట్లోకి వెళ్లేందుకు కంటెస్టెంట్స్ పడ్డ కష్టాలేంటో నేటి ఎపిసోడ్ చదివేద్దాం. సిరికి షణ్ముఖ్ గోరు ముద్దలు నామినేషన్ ప్రక్రియలో విశ్వ ప్రవర్తన తనకు నచ్చలేదని సిరికి చెప్పాడు షణ్మఖ్. ఆమెకు గోరుముద్దలు తినిపిస్తూ.. తన గోడునంతా చెప్పుకున్నాడు. అందరిలాగే తనకు కూడా అమ్మ మొదటిసారే లెటర్ రాసిందని.. అందరు చెపుకుంటారు, మనం చెప్పుకోము అంతే తేడా అన్నాడు. అలాగే విశ్వ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, నామినేషన్ అంటే ఆయన భయమని చెప్పాడు. టాప్ 5లో నేను, మానస్ ఉంటాం : ప్రియాంక బెడ్రూమ్ ఏరియాలో పింపీ, సిరి, మానస్ ముచ్చట్లు పెట్టారు. ఈ సారి నామినేషన్లో ఆరుగురు ఉన్నారు కదా అని మానస్ అడగ్గా.. అవును ఒక గర్ల్, ఐదుగురు బాయ్స్ ఉన్నారని సిరి చెప్పింది. పింకి ఈ సారి కూడా నామినేషన్లో లేరని సిరి అనగా.. నేను మానస్ టాప్ 5లో ఉంటామని ప్రియాంక చెప్పింది. దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించించగా.. మా పక్కన మీ ముగ్గురు కూడా ఉంటారులేని కౌంటర్ ఇచ్చింది పింకి. ఇక మానస్ అయితే.. అంకుల్స్ అంతా బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని మాసన్ కోరుకోగా.. ఒకవేళ ఆంటీలను బయటకు పోవాలని చెబితే.. పింకీ వెళ్తుందని సిరి నవ్వుతూ కౌంటర్ వేయగా.. మొహం పగిలిపోద్దని ప్రియాంక ఫన్నీ వార్నింగ్ ఇచ్చింది. షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ: యాంకర్ రవి ఇక రవి ఏమో ఎప్పటిమాదిరే.. ఇతరులను ఇన్ఫ్లూయన్స్ చేసే పనిలో పడ్డాడు. షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి.. 'నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ.. ఆన్ బెడ్ విత్ త్రీ..' అంటూ షన్ను పరువు తీశాడు రవి. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్..‘అభయహస్తం’ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఇంటిని లాక్డౌన్ చేసినట్లుగా ప్రకటించారు బిగ్ బాస్. ఇందులో భాగంగా అభయహస్తం టాస్కులో గెలిచి కెప్టెన్సీ కంటెస్టెంట్ గా సెలక్ట్ అయిన సభ్యులు మాత్రమే ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో కెప్టెన్సీ టాస్క్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి, అలాగే ఇంట్లోకి వెళ్లడానికి ఐదు చాలెంజ్‌లు ఎదుర్కొవాల్సి ఉంటుందని చెప్పారు బిగ్‌బాస్. ఈ చాలెంజ్‌లో భాగంగా ఎవరెవరు పోటీ పడతారనేది ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో చెప్పాలి. అలాగే ఒక చాలెంజ్‌లో ఓడినవారు ఇంటి సభ్యులను ఒప్పించి మిగతా చాలెంజ్‌లలో కూడా పోటీపడొచ్చు. మొదటి చాలెంజ్..మట్టిలో ముత్యాలు ఈ చాలెంజ్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో బాత్‌టబ్‌లో మట్టి, పేడ, ముత్యాలు కలిపి ఉన్నాయి. దాని నుంచి ఎవర ఎక్కువ ముత్యాలు తీస్తారో వారే విజేతలు. ఒక్కోసారి ఒక్కో ముత్యాన్ని మాత్రమే వేయాలి. ఈ టాస్క్‌కి ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఇప్పటివరకూ కెప్టెన్ పోటీదారులుగా అర్హత సాధించలేకపోయిన షణ్ముఖ్, లోబోలు వెళ్లారు. ఇందులో టాస్క్‌లో షన్నూ 101 ముత్యాలను ఏరి లోబో(74)పై విజయం సాధించాడు. అయితే షణ్ముఖ్ తీసిన ముత్యాలు సరిగా లేవని విశ్వ, శ్రీరామచంద్ర, రవి అనగా.. నీట్‌గా ఉండటం మ్యాటర్ కాదు.. ఎక్కువ తీయాలంతే అంటూ అడ్డంగా వాదించింది సిరి. చివరకు సంచాలకులుగా ఉన్న సన్నీ.. షణ్ముఖ్‌ని విన్నర్‌గా ప్రకటించడంతో సిరి ఎగిరిగంతేసి షణ్ముఖ్‌ని గట్టిగా కౌగిలించుకుంది. రెండో చాలెంజ్ గాలం మార్చే మీ కాలం రెండో చాలెంజ్‌గా ‘గాలం మార్చే మీ కాలం’టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్ ఫూల్ అడుగున ఉన్న బాటిల్స్‌ని ఫిషింగ్ రాడ్‌తో బయటకు తీయాలి. ఎండ్ బజర్ మోగేలోపు ఎవరు ఎక్కువ బాటిల్స్‌ని బయటకు తీస్తారు వారే విజయం సాధించినట్లు. దీని కోసం రవి, సిరి హోరా హోరిగా పోటీపడ్డారు. చివరకు సిరి 15 బాటిల్స్‌ని బయటకు తీసి రవి(12)పై విజయం సాధించింది. మూడో చాలెంజ్.. తాడులు తకదిమి మూడో చాలెంజ్‌గా తాడుల తకదిమి టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఎవరైతే రోప్‌లను ఎక్కువగా వేగంగా కదుపుతూ ఆపకుండా ఉంటారో వారే గెలుస్తారు. ఆపేసిన వారు ఓడిపోతారు. దీని కోసం శ్రీరామచంద్ర, మానస్ పోటీ పడ్డారు. ఇద్దరు చెమటలు వచ్చేలా తాడులను ఊపారు. చివరకు మానస్ భరించలేక తాడులను వదిలేయడంతో శ్రీరామ్ విజయం సాధించాడు. అయితే మిగిలిన టాస్క్‌లతో పోల్చితే ఈ టాస్క్ కోసం శ్రీరామచంద్ర చాలా కష్టపడ్డాడు. చెమటలు వచ్చినప్పటికీ.. తాడులను ఊపడం ఆపలేదు. దీంతో మూడో విజేతగా నిలిచి ఇంట్లోకి ప్రవేశించాడు. మొత్తంగా ఇప్పటివరకు కెప్టెన్సీ దారులుగా షణ్ముఖ్, సిరి, శ్రీరామచంద్రలు గెలిచి, బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. మిగిలి సభ్యులంతా బయటే ఉన్నారు. మరి వారిలో ఏ ఇద్దరు చాలెంజ్‌లు గెలిచి కెప్టెన్సీ పోటీదారులైన షన్నూ, సిరి, శ్రీరామ్‌లతో పోటీపడ్డారు? ఈ వారం కెప్టెన్‌గా ఎవరు ఎంపికయ్యారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
నా కొడుకు నాకు పుట్టలేదు, నీ బాధ అర్థం చేసుకోగలను: సిరి
Bigg Boss Telugu 5, Episode 51: రవి లోబోకు చాలా సపోర్ట్ చేస్తాడు, కానీ అతడు మాత్రం రవికి సపోర్ట్ చేయడు, ఫ్రెండంటాడు, కానీ పదేపదే నామినేట్ చేస్తాడు అని పింకీతో చెప్పుకొచ్చింది యానీ మాస్టర్. ఇంతలో లోబో నమాజ్ చేసుకుంటూ ఏడ్చేశాడు. దీంతో రవి అతడిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అడుగుపెట్టి 50 రోజులు పూర్తయిందన్న బిగ్‌బాస్.. మీకు ఎంతో ప్రియమైనవారి నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని ఊరించాడు. కానీ.. ఏదైనా దక్కించుకోవాలంటే ఇంకేదైనా వదులుకోవాల్సి వస్తుందని నామినేషన్ గురించి హింటిచ్చాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా పోస్ట్ మ్యాన్ ఇద్దరు ఇంటిసభ్యులను పవర్ రూమ్‌కు పిలుస్తుంటాడు. వారి ముందున్న బ్యాగ్‌లోని రెండు లేఖల్లో ఒక్కరికి మాత్రమే లేఖ ఇచ్చి మిగతాది చింపివేయాల్సి ఉంటుంది. లెటర్ అందుకోలేనివాళ్లు నామినేట్ అయినట్లు లెక్క! నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు మొదటగా పవర్ రూమ్‌లోకి వెళ్లిన మానస్, శ్రీరామ్‌లకు లోబో, ప్రియాంక లేఖలు అందాయి. దీంతో లోబో మాట్లాడుతూ.. తన భార్య గర్భవతి అని, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందంటూనే పింకీ కోసం తన లేఖను త్యాగం చేశాడు. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయాడు. తర్వాత షణ్ను- రవిలకు విశ్వ, సిరి లేఖలు అందాయి. అయితే విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి. 'నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు, కాబట్టి నీకు పుట్టిన పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను' అంటూ విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్ అయింది. ఏడ్చేసిన శ్రీరామ్, ఓదార్చుతూ ముద్దులు పెట్టిన పింకీ తర్వాత పింకీ- కాజల్‌కు యానీ మాస్టర్, మానస్‌ల లేఖలు అందాయి. యానీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు. కానీ పింకీ మాత్రం మానస్ లెటర్ ముక్కలవుతున్నందుకు ఎంతగానో బాధపడిపోయింది. విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్ లెటర్స్ వచ్చాయి. అయితే పెద్ద మనసు చేసుకున్న శ్రీరామ్.. రవి కోసం తన లెటర్‌ను వదులుకునేందుకు సిద్ధపడిపోయాడు. కానీ లోబో మాత్రం రవి తన ఫ్యామిలీని గుర్తు చేసుకునేందుకు బొమ్మ, టీ షర్ట్, లెటర్ ఉన్నాయి కాబట్టి శ్రీరామ్‌కే లెటర్ ఇవ్వాలన్నాడు, ఇందుకోసం రవిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. దీంతో రవి తన లెటర్‌ను చింపివేసి శ్రీరామ్‌కు వచ్చిన లేఖను చదివి వినిపించాడు. తర్వాత కాసేపటికి ఆ లేఖను పట్టుకుని ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ ఇల్లు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన పింకీ అతడి కన్నీళ్లు తుడిచి, హగ్గిచ్చి, బుగ్గపై ముద్దులు పెట్టింది. అమ్మా, నువ్వే నా ఇన్స్పిరేషన్: షణ్ముఖ్ తర్వాత యానీ- సిరిలకు షణ్ముఖ్, కాజల్ లెటర్స్ వచ్చాయి. దీంతో మొదటిసారి కాజల్ తన కన్నీళ్లు ఆపుకోలేక గక్క్క పెట్టి ఏడ్చేసింది. ఇది చూసి కరిగిపోయిన షణ్ను కాజల్‌ను లెటర్ తీసుకోమన్నాడు. అయితే సిరి మాత్రం 'నేనెలాగో అందుకోలేకపోయాను, కనీసం నువ్వైనా తీసుకో' అంటూ ఏడ్చేసింది. కానీ షణ్ను అందుకు ఒప్పుకోకపోవడంతో అతడి లేఖ తునాతునకలైంది. ఇది చూసి దుఃఖాన్ని దిగమింగుకున్న షణ్ను.. 'అమ్మా, క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నావు, నువ్వే నా ఇన్స్పిరేషన్, నేను ఈ బాధలో నుంచి బయటపడతాను' అని చెప్పుకొచ్చాడు. కానీ లోపలకు వెళ్లి గుండెలోని భారాన్ని దించుకుంటూ గట్టిగా ఏడ్చేశాడు. జెస్సీ కోసం త్యాగానికి పూనుకున్న శ్రీరామ్.. ఇక కెప్టెన్ సన్నీకి స్పెషల్ పవర్ లభించింది. దీని ద్వారా జెస్సీ లెటర్‌ను సన్నీ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. జెస్సీకి లెటర్ ఇచ్చి సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ అయినవాళ్ల దగ్గరి నుంచి లేఖ అందుకోవాలని చెప్పాడు. దీంతో శ్రీరామ్.. జెస్సీ కోసం తన లేఖను త్యాగం చేసి నామినేట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. కానీ షణ్ను, సిరి, జెస్సీ.. శ్రీరామ్‌కు హగ్గిచ్చి దూరాన్ని చెరిపేసుకోవాలని రవి కండీషన్ పెట్టాడు. ఈ కండీషన్‌కు త్రిమూర్తులు ఒప్పుకోకపోగా మా మధ్య డిస్టబెన్స్ అంతా క్లియర్ అయిపోయిందని చెప్పడంతో రవి వెనక్కు తగ్గాడు. అలా శ్రీరామ్ నామినేషన్లోకి వెళ్లి జెస్సీని సేవ్ చేశాడు. తర్వాత కెప్టెన్ సన్నీకి లేఖ అందడంతో ఆనందంలో మునిగి తేలాడు. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ పూర్తవగా రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్ నామినేట్ అయ్యారు. -
'రవి కన్నింగ్, స్ట్రాంగ్ కంటెస్టెంట్లను పంపించేస్తున్నాడు'
Bigg Boss 5 Telugu, Priya Elimination Interview: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాపులర్ కంటెస్టెంట్ ప్రియ. అదరకుండా, బెదరకుండా గేమ్ ఆడే ప్రియ ఒకే ఒక్క గొడవతో ఎలిమినేట్ అయిపోయింది. ఒక టాస్కులో సన్నీని రెచ్చగొట్టడం, చెంప పగలగొడతానంటూ నోరు జారడం, అనవసరంగా కయ్యం పెట్టుకోవడం లాంటి వింత ప్రవర్తనను బిగ్‌బాస్ ప్రేక్షకులు సమ్మతించలేకపోయారు. ఫలితంగా అప్పటిదాకా ఓటింగ్‌లో టాప్‌లో దూసుకెళ్లిన ప్రియ ఆ ఒక్క ఎపిసోడ్‌తో కిందకు పడిపోయింది. వెరసి.. ఏడోవారం బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పేసింది. తాజాగా ఆమె అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. యాంకర్ రవి గురించి చెప్తూ.. అతడు ఎత్తుకు పై ఎత్తులు వేయగలడని తెలిపింది. 'రవితో కలిసి గేమ్ ఆడినవాళ్లు ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నారో, మరేంటో తెలీదు కానీ నెక్స్ట్ వీక్ వాళ్లు పక్కా ఎలిమినేట్ అవుతున్నారు, ఎందుకు?' అని ప్రశ్నించింది అరియానా. దీనికి ప్రియ బదులిస్తూ.. అందుకే అతడిని వెరీ కన్నింగ్, వెరీ స్మార్ట్ అంటుంటాను. 'ఎవరెవరు స్ట్రాంగో, వాళ్లను పంపించే ప్లాన్‌లో ఉన్నాడు రవి' అని అతడి గేమ్‌ను బయటపెట్టింది. కాజల్ గేమ్‌ప్లాన్‌కు అందరూ భయపడాల్సిందేనన్న ప్రియ ఆమె టాప్ 5లో ఉండకూడదని కోరుకోవడం గమనార్హం. 'ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలనుకుంటే వారి అంతు చూసేంతవరకు వదలరా?' అని అరియానా సూటిగా ప్రశ్నించగా 'అది నా గేమ్ ప్లాన్' అంటూ తెలివిగా బదులిచ్చింది ప్రియ. స్టేజీమీద షణ్ముఖ్‌ను ఆకాశానికెత్తేసిన ప్రియ ఇంటర్వ్యూలో మాత్రం అతడు భయంకరమైన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. అతడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదని పేర్కొంది. సిరి మాట్లాడేదంతా ఫేకే అని, ఆమె మాటలేవీ తనకు నచ్చవని చెప్పింది. సిరి గేమ్ కోసం ఏదైనా చేస్తుందని చెప్పుకొచ్చింది. ప్రియాంకను దూరం పెడితే ప్రేక్షకులు ఏం అనుకుంటారోనని మానస్ ఆమెను భరిస్తున్నాడా? అని అరియానా క్వశ్చన్ చేయగా.. అదంతా ఫేక్ అని తేల్చే పారేసింది ప్రియ. మొత్తానికి ఈ ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే ప్రియ బిగ్‌బాస్ స్టేజీపై మాట్లాడినదానికి, బజ్ ఇంటర్వ్యూలో మాట్లాడినదానికి పొంతనే లేదంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు. -
ప్రియాంకతో మానస్ పెళ్లి, టెన్షన్లో యానీ!
Bigg Boss Telugu 5, Episode 49: వీజే సన్నీ.. కాజల్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకున్నాడు. తన కెప్టెన్సీని గతవారం ఎలిమినేట్ అయిన సెట్ శ్వేతకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'సరైన మ్యాచ్‌ను వెతకండి' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా హౌస్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాల్సి ఉంటుంది. ముందుగా శ్రీరామ్.. తనను పెళ్లాడే అమ్మాయి బబ్లీగా, దేన్నైనా అల్లుకుపోయేలా ఉండాలన్నాడు. సన్నీ.. నమ్మకం, నిజాయితీ, అర్థం చేసుకునే స్వభావం తనకు కాబోయే అమ్మాయిలో తప్పకుండా ఉండాలన్నాడు. ఎంతో కేరింగ్ చూపించే పింకీలాంటి అమ్మాయిని ఎవరు చేసుకున్నా అదృష్టవంతులేనని చెప్పుకొచ్చాడు. నా గర్ల్‌ఫ్రెండ్ నన్నే చూడాలి: షణ్ముఖ్ మానస్ తను చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తూ.. 'నేను ఎక్కువ అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి. ఇద్దరి కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి' అని తెలిపాడు. అతడు మాట్లాడుతున్నంత సేపు ప్రియాంక తెగ సిగ్గుపడిపోవడం గమనార్హం. పింకీ వంతు వచ్చేసరికి.. 'అబ్బాయి నాకంటే ఎక్కువ హైట్ ఉండాలి. మంచివాడై ఉండాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ల ఫ్యామిలీని నా ఫ్యామిలీలా చూసుకుంటాను, నా దగ్గర బోలెడంత ప్రేమ ఉంది, అది అతడికి ఇచ్చేస్తాను' అని చెప్పుకొచ్చింది. నా గర్ల్‌ఫ్రెండ్ నన్నే చూడాలి, ఇంకెవర్నీ చూడొద్దని షణ్ముఖ్. నా దగ్గర పొగరు చూపించొద్దని సిరి వారి అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. జెస్సీ మినహా మిగతా అందరూ పింకీ-మానస్‌ను బెస్ట్ కపుల్‌గా పేర్కొన్నారు. దీంతో బిగ్‌బాస్ వారిద్దరూ పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి జరిపించేశాడు. అనంతరం వీళ్లిద్దరూ 'గువ్వా గోరికంతో..' పాటకు జంటగా స్టెప్పులేశారు. రవి గేమ్ ఆడట్లేదు, మనతో ఆడుతున్నాడు అయితే పింకీ మానస్ ధ్యాసలో పడి తన గేమ్ కూడా పట్టించుకోవట్లేదని భయపడిపోయింది యానీ. దీంతో రవి.. నాకు మానస్ మదర్ కూడా తెలుసు. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో 'బంగారు కోడిపెట్ట' టాస్క్‌లో సిరి స్టిక్కర్లు తానే తీశానని సీక్రెట్ బయటపెట్టాడు. దీంతో ప్రియ ఈ విషయాన్ని సిరి చెవిలో ఊదింది. కానీ తాను చెప్పానని మాత్రం ఎవరికీ చెప్పొద్దని సిరితో ఒట్టేయించుకుంది. ఇదిలా వుంటే రవి గేమ్ ఆడటానికి ప్రయత్నించట్లేదని, మనతో ఆడటానికి ట్రై చేస్తున్నాడని కాజల్‌తో గుసగుసలాడాడు షణ్ను. శ్రీరామ్ కూడా రవికి లొంగిపోయాడని, లోబో, విశ్వ రవి కోసమే ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. మరోపక్క రవి.. తానే స్టిక్కర్లు తీశానని నేరుగా సిరితో చెప్పేశాడు. అడ్డంగా దొరికిపోయిన రవి, ఏకిపారేసిన నాగ్ నాగార్జున.. ఈవారం వరస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పమని ఇంటిసభ్యులను ఆదేశించాడు. రేషన్ మేనేజర్‌గా ప్రియాంక సింగ్ ఫెయిలైందని రవి ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నాగ్.. సిరి స్టిక్కర్లు దొంగతనం చేయడం సరైందే కానీ అమ్మతోడు ఎందుకు వేశావని రవిని నిలదీశాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన రవి.. అది తప్పేనని ఒప్పుకుంటూనే కావాలని చేయలేదని బుకాయించాడు. తర్వాత షణ్ముఖ్.. సిరిని వరస్ట్ పర్ఫామర్ అని తెలిపాడు. సిరి.. కాజల్‌ను, విశ్వ.. టాస్క్‌ల్లో జీరో అంటూ ప్రియాంకను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు. ప్రియాంక, జెస్సీ, ప్రియ.. విశ్వను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నారు. ఎన్నిసార్లు చెంప పగలగొడతావు?: నాగ్ చెంప పగలగొడతాను అని ఎన్నిసార్లు అంటావని ప్రియను నిలదీశాడు నాగ్. దీనికి వివరణ ఇచ్చేందుకు ప్రియ ప్రయత్నిస్తూ.. 'బుట్టలో ఎగ్స్ తీయబోతుంటే సన్నీ నన్ను నెట్టేయగా ముందుకు పడిపోయాను. అతడు నానా మాటలు అనడంతో నాతో ఫిజికల్ అయితే మాత్రం చెంప పగలగొడతాను అని తిట్టాను' అని ఒప్పుకుంది. మరీ అన్నిసార్లు తిట్టకని సుతిమెత్తగా హెచ్చరించాడు నాగ్. తర్వాత యానీ మాస్టర్.. జెస్సీని, శ్రీరామ్.. మానస్‌ను, కాజల్.. ప్రియను, మానస్.. షణ్ముఖ్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా చెప్పుకొచ్చారు. చెత్త ఆటగాడిగా ఎంపికైన విశ్వ ఇక బంగారు కోడిపెట్ట టాస్క్‌లో సన్నీ గ్రూప్ సహాయం తీసుకుని ఆడినందుకు కెప్టెన్సీ రద్దైందని ప్రకటించి చిన్న ఝలుక్ ఇచ్చాడు నాగ్. ఇండివిడ్యువల్ టాస్క్ అని రాసి ఉన్నా కూడా సన్నీ- కాజల్, మానస్- ప్రియాంక కలిసి ఆడారని, దానివల్ల తాను కెప్టెన్ కాలేకపోయానని ఎమోషనల్ అయింది యానీ..సన్నీ ధైర్యం చేసుకుని ప్రియను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పాడు. దీంతో ప్రియ, సన్నీ ఒకరికొకరు గాల్లో ముద్దులు పంపుకున్నారు. ఇక మెజారిటీ సభ్యులు విశ్వను చెత్త ఆటగాడిగా పేర్కొనడంతో సోమవారం అతడిని జైల్లోకి పంపిస్తారని చెప్పాడు నాగ్. తర్వాత శ్రీరామ్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. కాజల్ లాంటి వాళ్లు నాకు నచ్చరు: లోబో బిగ్‌బాస్ హౌస్‌ను శుభ్రంగా ఉంచుకోలేదని తిట్టిపోశాడు నాగ్. హౌస్‌ను ఎంత గలీజ్ చేశారో చూడండి అంటూ కంటెస్టెంట్లకు హౌస్‌నంతా వీడియోలో చూపించాడు. తర్వాత లోబోను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగ్.. 'తోపు, డూపు' గేమ్ ఆడించాడు. లోబో ముందుగా ఆరుగురు డూపుల గురించి చెప్తూ.. కాజల్ లాంటి జనాలు నాకు నచ్చరు, ఆమె ఊసరవెళ్లి అన్నాడు. ప్రియ.. వేరేవాళ్లతో అంతా చేపిస్తూ సైలెంట్‌గా కూర్చుంటది, వెనకాల ఒకమాట, ముందొకమాట మాట్లాడుతుందని చీదరించుకున్నాడు. రవికి అవసరమున్నప్పుడే ఈ లోబో గుర్తొస్తాడని బాధపడ్డాడు. యానీ.. స్మార్ట్ అని, షణ్ముఖ్ యాటిట్యూడ్ నచ్చదని, అతడు యాక్టింగ్ చేస్తున్నాడని తెలిపాడు. వీళ్లు కాకుండా మిగిలిన ఆరుగురు తోపులని చెప్పాడు. అనంతరం నాగార్జున కాజల్ సేఫ్ అని వెల్లడించాడు. ఇక ఈ వారం ప్రియ వెళ్లిపోతుందని నాగ్ కన్నా ముందే లీకువీరులు నెట్టింట ప్రచారం మొదలెట్టిన విషయం తెలిసిందే! -
బిగ్‌బాస్-5: లోబోకి స్పెషల్ పవర్.. పాపం ఆ దురదృష్టవంతులు ఎవరు?
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కంటెస్టెంట్స్ అంతా ఒకటి ఆలోచిస్తే.. బిగ్‌బాస్ మరోకటి ఆలోచిస్తాడు. తాజాగా కెప్టెన్సీ పోటీదారుల కోసం పెట్టిన‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఇంటి సభ్యులకు షాకిచ్చాడు బిగ్‌బాస్. ‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో భాగంగా రెండు రోజుల నుంచి ఇంటి సభ్యులు గుడ్లను సంపాదించి, దాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా సన్నీ, ప్రియలు అయితే ఫిజికల్ అటాక్ వరకు వెళ్లారు. ఎలాగైన కెప్టెన్ కావాలనే కసితో టాస్క్ ఆడుతున్నారు కంటెస్టెంట్స్. అయితే టాస్క్‌ల్లో గెలవడం అనేది కేవలం కష్టం మీదనే ఆధారపడి లేదని, కొంచెం అదృష్టం కూడా ఉండాలని నిరూపిస్తున్నాడు బిగ్‌బాస్. మధ్య మధ్యలో స్పెషల్ పవర్ ఉన్న ఎగ్స్ ఇస్తూ.. అదృష్ట పరీక్షలు పెడుతున్నాడు. (చదవండి: బిగ్‌బాస్: ఆడు, ఈడు అంటూ రెచ్చిపోయిన ప్రియ..ఏయ్ అంటూ సన్నీ ఫైర్) ఇదిలా ఉంటే.. తాజాగా ఈ గేమ్‌లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం రీఎంట్రీ ఇచ్చిన లోబో చేతికి ఇచ్చాడు బిగ్‌బాస్. అతని చేతిలో బ్లాక్, గొల్డెన్ కలర్ ఎగ్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఒకరిని గేమ్ నుంచి తొలగించొచ్చు, మరొకరిని నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక చేయ్యొచ్చు. బ్లాక్ ఎగ్ ఎవరికిస్తే వారు ఈ టాస్క్ నుంచి ఔట్ అయినట్లు. గొల్డెన్ ఎగ్ పొందిన వారు డెరెక్ట్‌గా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికైతారు. మరి లోబో ఈ రెండు గుడ్లను ఎవరెవరికి ఇచ్చారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
రవి అలాంటి వాడు..విశ్వ పైకి అలా కనిపిస్తాడు కానీ!: అలీ రెజా
Bigg Boss Fame Ali Reza About Anchor Ravi: టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ చాలామందికి ఫేమ్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటివరకు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా బిగ్‌బాస్ షోతో ఓవర్ నైట్ స్టార్డం వస్తుంది. అదే స్థాయిలో కొందరి పాపులారిటీ అమాంతం తగ్గిపోతుంది. షోలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కొందరు డీఫేమ్తో బయటకు రావడం చూస్తుంటాం. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో అందరి కన్నా ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లలో యాంకర్ రవి ఒకరు. అయితే ప్రియ-లహరి ఎపిసోడ్ తర్వాత రవిపై నెగిటివిటి సైతం పెరిగిపోయింది. మొన్నటికి మొన్న శ్వేత సైతం రవికి దూరంగా ఉండాలంటూ హౌస్ మేట్స్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. చేసిన తప్పులు ఒప్పుకోకపోవడం సహా ఇతరులపై నిందలు వేస్తాడంటూ రవిని సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. దీనిపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, రవి స్నేహితుడు అలీ రెజా స్పందించాడు. షోకు వెళ్లేముందే ఈ విషయాల గురించి మాట్లాడుకున్నామని, ఇలా అవుతుందని తనకు ముందే తెలుసని అలీ పేర్కొన్నాడు. ఎవరితోనైనా గొడవలు వస్తే అది పరిష్కరించుకోవాలని రవి భావిస్తాడని, అయితే కొందరు అపార్థం చేసుకుంటున్నారన్నాడు. రవి తనకు వ్యక్తిగతంలో తెలుసని, కాబట్టి షో చూసి జడ్జ్ చేయనని రవికి కితాబిచ్చాడు. ఇక మరో కంటెస్టెంట్ విశ్వ పైకి చాలా పహిల్వాన్లా కనిపించినా తను చాలా ఎమోషనల్ పర్సన్ అని, బయట కూడా అతను అలాగే ఉంటాడని చెప్పుకొచ్చాడు. -
కోతుల ఆట కట్టించిన సన్నీ! 8 మంది నామినేట్!
Bigg Boss 5 Telugu, Episode 44: శ్వేత నామినేషన్స్‌లో లేకపోయుంటే తాను ఎలిమినేట్ అయ్యేదాన్నంటూ భయపడిపోయింది సిరి. ఎలిమినేట్ అయ్యాడుకున్న లోబో గురించి కంటెస్టెంట్లు జోకులు పేల్చారు. లోబో తన కడుపు మాత్రమే చూసుకుంటాడని, అందరి దగ్గరా ఫుడ్ లాక్కునేవాడంటూ లోబో మీద జోకులేసింది యానీ మాస్టర్. మరోవైపు రవి, కాజల్ ఇద్దరూ ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నారని జెస్సీతో చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఇక మోజ్ రూమ్‌లో ఉన్న జెస్సీ, షణ్ను, సిరి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు రవి. అయితే ఇది కూడా ఇన్ఫ్లూయెన్స్ అని సెటైర్ వేశాడు షణ్ను. నిరంతం మానస్ జపం చేసే పింకీ. అతడు తనకెందుకు తినిపించడని లోలోపలే మథనపడిపోయింది. అతడికేం మాయరోగం, ఊరందరికీ తినిపిస్తాడు కదా! అంటూ మానస్ తనకు ఒక్కసారి కూడా తినిపించలేదని తెగ ఫీలైంది పింకీ. గార్డెన్ ఏరియాలో ఉన్న చెట్టుకు కంటెస్టెంట్ల ఫొటోలు ఉన్న కోతి బొమ్మలు వేలాడుతుంటాయి. డేరాలో ఉన్న ముగ్గురు వేటగాళ్లు శ్రీరామ్, సన్నీ, జెస్సీ కోతులను చంపి వారిని నామినేట్ చేయాలి. వేటగాళ్లను ఒప్పించి వేరేవాళ్లను నామినేట్ చేయడం కోతుల లక్ష్యం. ఎక్కువ కోతులను నామినేట్ చేసిన వేటగాడు సేఫ్ అవగా మిగిలిన ఇద్దరు నామినేట్ అవుతారు. జంగిల్ సౌండ్ వినిపించినప్పుడు రెండు అరటిపండ్లను పట్టుకోవాలి. అలా పట్టుకున్నవారు ఒక కోతిని చంపేందుకు వేటగాడిని ఒప్పించవచ్చు. మొదటగా జంగిల్ గౌండ్ వచ్చినప్పుడు సిరి, షణ్ముఖ్ చెరో అరటిపండును సంపాదించారు. ఈ సందర్భంగా షణ్ముఖ్, సిరి.. ఇద్దరూ యానీ మాస్టర్‌ను నామినేట్ చేయాలనుకున్నారు. ఇందుకు వేటగాడు సన్నీ అంగీకరించడంతో ఆమె నామినేట్ అయింది. అయితే సిరిని నామినేట్ చేస్తాను కానీ ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకోను అని చెప్పింది యానీ. తర్వాత అరటిపండు సంపాదించిన యానీ.. సిరిని, సిరి.. మానస్‌ను నామినేట్ చేయాలనుకున్నారు. కానీ సన్నీ.. యానీకి సపోర్ట్ చేస్తూ సిరిని నామినేట్ చేశాడు. అనంతరం సిరి, కాజల్‌కు అరటిపండు దక్కగా సిరి మరోసారి మానస్ పేరు సూచించగా, కాజల్.. ప్రియ పేరు చెప్పింది. సన్నీ.. కాజల్ చెప్పిన కారణానికి మద్దతు తెలుపుతూ ప్రియను నామినేట్ చేశాడు. ఇక రవి.. యానీ మాస్టర్ కోసం ఓ కవిత పాడి అక్కడున్న అందరినీ నవ్వించాడు. తర్వాత ప్రియ, సిరి అరటిపండ్లు సంపాదించారు. కానీ సిరి తను చెప్పిన వ్యక్తిని నామినేట్ చేయడం లేదని తన పవర్‌ను ప్రియాంకకు ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ప్రియాంక.. కాజల్‌ను నామినేట్ చేయాలనుకుంది. ప్రియ.. రవి సోఫా మీద టవల్ ఆరేయడం నచ్చలేదంది. అయితే సన్నీ.. శ్వేతను గుర్తు చేస్తూ ఆమె ఎంతో బాధతో వెళ్లిపోయిందని, తనకోసం ఈ పని చేస్తున్నానంటూ రవిని నామినేట్ చేశాడు. సన్నీ నిజస్వరూపం బయటపెట్టడానికే ఈ రీజన్ చెప్పానంటూ వ్యంగ్యంగా నవ్వింది ప్రియ. అయితే దీనివల్ల తనకు ఎఫెక్ట్ అవుతుందని ఆవేశపడిపోయాడు రవి. ఆరు వారాల నుంచి నామినేట్ అవుతూ వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. శ్వేత నా వల్ల వెళ్లిపోయిందా? అని ప్రశ్నిస్తూనే సన్నీని బుజ్జగించే ప్రయత్నం చేశాడు,. అటు పింకీ మాత్రం తను చెప్పిన కారణాన్ని పట్టించుకోలేదని నిప్పులు చెరిగింది. ఫేక్ పీపుల్స్‌తో ఉండలేను అంటూ ఏడ్చేసింది. కానీ తన డెసిషనే ఫైనల్ అంటూ రవిని నామినేట్ చేశాడు సన్నీ. సిల్లీ రీజన్స్ చెప్తూ నీతో ఆడుకుంటున్నారంటూ కాజల్ సన్నీకి క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో తన గేమ్ ఏంటో చూపిస్తానని సవాలు విసిరాడు సన్నీ. అనంతరం సిరి, రవి అరటిపండు సాధించారు. కానీ సిరి మరోసారి ఆ పండును పింకీకి ఇచ్చేసింది. కాజల్ నామినేషన్స్‌లోకి రావాలనుకుంటోందని రవిచెప్పగా ఆమెను నామినేషన్స్‌లోకి పంపించాడు సన్నీ. ఈ టాస్కులో సన్నీ ప్రొవోక్ అయిపోయాడని హౌస్‌మేట్స్‌తో ముచ్చట్లు పెట్టాడు షణ్ముఖ్. సన్నీ ఒంటరిగా గేమ్ ఆడితే చూడాలనుందన్నాడు. మరోవైపు నామినేషన్స్ ప్రక్రియ పూర్తవగా... ఈ వారం కాజల్, సిరి, రవి, యానీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. వీరితో పాటు సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో కూడా నామినేట్ అయ్యాడు. -
శ్వేత నా వల్ల వెళ్లిపోయిందా?: రవి ఆవేదన
నామినేషన్స్ అంటేనే రగడ. కంటెస్టెంట్ల మధ్య మంట పెట్టే ఈ నామినేషన్స్ నేడు వెరైటీగా నిర్వహించనున్నాడు బిగ్‌బాస్. నామినేషన్స్ బాధ్యతను ముగ్గురు హంటర్స్ అయిన జెస్సీ, శ్రీరామ్, సన్నీకి అప్పగించాడు. దీంతో గేమ్‌లో ఊహించని ట్విస్టులు ఇస్తూ హౌస్‌మేట్స్‌కు షాకుల మీద షాకులిస్తున్నారు హంటర్స్. తాజాగా రిలీజైన ప్రోమోలో అనీ మాస్టర్‌పై కవిత విసిరాడు రవి. 'అనీ, ఓ అనీ... చేస్తావు మమ్మల్ని నామినేషన్స్ స్ట్రాంగ్ అని! శ్వేత పోయింది.. ఎవర్నంటావు కూతురని!' అని చదవడంతో మాస్టర్ వహ్వా వహ్వా అంటూ చప్పట్లు కొట్టింది. ఇక నామినేషన్స్‌లో ప్రియ మరోసారి సిల్లీ రీజన్‌తో రవిని నామినేట్ చేసింది. సోఫా మీద టవల్ ఆరేయడం నచ్చలేదని చెప్పుకొచ్చింది.. ఆమె చెప్పిన కారణం విని ఖంగు తిన్న రవికి నోట మాట రాలేదు. ఇక ఈ టాస్క్‌లో సన్నీ, ప్రియ, పింకీలకు మధ్య పెద్ద ఫైటే జరిగినట్లు కనిపిస్తోంది. సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఫేక్ జనాలతో నేనుండలేను అంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. ఇక సన్నీ.. రవిని నామినేట్ చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. శ్వేత ఉంటే నిన్ను కచ్చితంగా నామినేట్ చేసేదని రవికి చెప్పడంతో షాకైన అతడు శ్వేత నావల్ల వెళ్లిపోయిందా? అని ప్రశ్నించాడు. శ్వేత గురించి మాట్లాడొద్దంటూ సన్నీకి సూచించింది యానీ. అందరితో విసిగి వేసారిన సన్నీ.. ''గేమ్ మీరాడొద్దు, నేనాడుతా.. నామినేషన్స్ అంటే మజాక్ అయితుందా?'' అని ఫైర్ అయ్యాడు. -
రవికి దూరంగా ఉండండి, అతడు డేంజర్!: శ్వేత వార్నింగ్
Bigg Boss 5 Telugu, Episode 43: లోబో తండ్రి చనిపోయినప్పుడు వాడితో నేనున్నాను, ఆ టైంలో ఎవరూ లేకపోయినా మూడు రోజులు వాడితో ఉన్నాను. అతడు అమాయకుడు అంటూ హౌస్ నుంచి వెళ్లిపోయిన తన జిగిరీ దోస్త్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు రవి. ఇక నాగ్.. ఇంటిసభ్యులతో ఫన్ టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా సన్నీ, మానస్, జెస్సీ, యానీ, ప్రియ, శ్వేతలను బి టీమ్‌గా మిగిలిన వారిని ఏ టీమ్‌గా విభజించాడు. టాస్క్‌లో భాగంగా చీటీలో ఉండే పాట పేరును పీకతో వాయించగా మిగిలిన వారు గుర్తుపట్టాలి. బిగ్ బ్రదర్‌గా చెప్తున్నా.. ఈ అవకాశాన్ని వాడుకో: నాగ్ మొదటగా షణ్ను పీకతో మ్యూజిక్ వాయించగా సిరి.. అది రింగరింగ పాట అని ఇట్టే గుర్తుపట్టింది. తర్వాత సన్నీ వాయించిన పాటను శ్రీరామ్.. సారంగదరియా అని పసిగట్టాడు. ఇలా ప్రతి ఒక్కరు చిట్టీ తీయడం, దాన్ని కరెక్ట్‌గా గెస్ చేసిన టీమ్ డ్యాన్స్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ టాస్క్‌లో టీమ్ ఏ గెలిచింది. అనంతరం నాగ్.. షణ్ముఖ్, ప్రియాంక, శ్రీరామ్, సన్నీ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. మరోపక్క సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబోను పలకరించాడు నాగ్. నీకో బిగ్ బ్రదర్‌గా చెప్తున్నా.. ఈ అవకాశాన్ని బాగా వాడుకో.. అని సలహా ఇచ్చాడు. కానీ లోబో మాత్రం సీక్రెట్ రూమ్‌లో ఉన్నందుకు సంతోషించాల్సింది పోయి నిరుత్సాహపడ్డాడు. శ్వేత ఎలిమినేట్, ఏడుపందుకున్న కంటెస్టెంట్లు తర్వాత ఇంటిసభ్యుల కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు. ఇందులో కళ్లకు గంతలు కట్టుకున్న వారు బోనును కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో కూడా టీమ్ ఏ విజయం సాధించింది. అనంతరం జెస్సీ సేఫ్ అయినట్లు నాగ్ వెల్లడించాడు. మిగిలిన సిరి, శ్వేతను గార్డెన్ ఏరియాకు రమ్మన్న నాగ్.. వారితో ఓ బాక్సు బద్దలు చేయించాడు. అందులోని బాక్సులో ఎవరి ఫోటో ఉందో వాళ్లు సేఫ్ అని తెలిపాడు. ఆ బాక్సు తెరిచి చూడగా అందులో సిరి ఫొటో ఉండటంతో ఆమె హౌస్‌లో కంటిన్యూ కాగా శ్వేత ఎలిమినేట్ అయింది. దీంతో షాక్‌కు గురైన యానీ, సన్నీ, ప్రియాంక, విశ్వ ఏడుపందుకున్నారు. వాళ్లను టాప్ 5లో చూడాలనుకుంటున్నా: శ్వేత ఇక స్టేజీ మీదకు వచ్చిన శ్వేతతో సైన్ గేమ్ ఆడించాడు నాగ్. రవి వెరీ స్మార్ట్ అని, అతడికి దూరంగా ఉండాలని కంటెస్టెంట్లను హెచ్చరించింది శ్వేత. హౌస్‌లో మానస్ డేంజర్ అని అభిప్రాయపడింది, తక్కువ మాట్లాడి ఎక్కువ ఆడాలని యానీ మాస్టర్‌కు సలహా ఇచ్చింది. నిన్ను టాప్ 5లో చూడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. శ్రీరామ్‌కు త్వరగా రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అతడిని టాప్ 5లో చూడాలనుకుంటున్నానంది. విశ్వ ఒలంపిక్స్‌కు కూడా వెళ్తాడనిపిస్తోంది విశ్వ గేమ్‌లో దారి తప్పుతున్నాడంది. కాకపోతే టాస్కుల్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడని, అతడిని చూస్తుంటే విశ్వ ఒలంపిక్స్‌కు కూడా వెళ్లిపోవచ్చనిపిస్తుందని చెప్పుకొచ్చింది శ్వేత. కాజల్ డెడ్ ఎండ్ అని, మాట మార్చి యూటర్న్ తీసుకుంటుందని అభిప్రాయపడింది. శ్రీరామ్.. శ్వేత కోసం ముస్తఫా ముస్తఫా పాట పాడి అక్కడున్నవాళ్లను ఏడిపించాడు. అనంతరం భారమైన హ00దయంతో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది శ్వేతా వర్మ. -
లోబోను ఎలిమినేట్ చేసిన నాగ్, షాక్‌లో రవి!
Bigg Boss 5 Telugu, Episode 42: వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైల్లో బందీ అయిన శ్వేత శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చింది. ఇంతలో రవి ఆమె దగ్గరకు వెళ్లి.. నా ఐడియా ఫాలో అవమని నీకు చెప్పలేదని పేర్కొన్నాడు. కానీ శ్వేత మాత్రం.. నువ్వు కుషన్స్ కట్ చేయమని నాకు కూడా చెప్పావని తెలిపింది. తర్వాత ఇంటిసభ్యులు వారికి పంపించిన కాస్ట్యూమ్స్ వేసుకుని రెడ్ కార్పెట్‌పై హొయలొలికిస్తూ నడిచారు. అనంతరం కాజల్, రవి ఫ్రెండ్షిప్ హగ్గిచ్చుకుని కలిసిపోయారు. రవి గడ్డి తినమంటే తింటావా? ఇక నాగార్జున వచ్చీరావడంతోనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులో కుషన్స్ పాడు చేసింది ఎవరని గరమయ్యాడు. దీంతో లోబో నీళ్లు నములుతూ మొదట తనే దూది తీశానని తెలిపాడు. హౌస్ ప్రాపర్టీ ధ్వంసం చేయకూడదని తెలీదా? అని నాగ్ నిలదీయగా అమాయకంగా ముఖం పెట్టి తెలీదంటూ అడ్డంగా తలూపాడు లోబో. కుషన్స్ కట్ చేయమని నీకు రవి చెప్తే గుడ్డిగా ఫాలో అయిపోయావు, రవి గడ్డి తినమంటే తింటావా? అని ఫైర్ అయ్యాడు. యాక్టర్స్ అంటే చిన్నచూపా? సంచాలకులుగా ఉన్నప్పుడు కంటెస్టెంట్లు చెప్పేది కూడా వినాలని సిరికి సలహా ఇచ్చాడు నాగ్. ఇక యానీ అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదని, అందరి మీదా ఒట్టేయాల్సిన పని లేదని చురకలంటించాడు. అయితే సిరి యాటిట్యూడ్ నచ్చకే అలా ప్రవర్తించాననింటూ ఆమెకు సారీ చెప్పింది యానీ. ఇక నువ్వు నీలా ఉంటేనే అందరికీ నచ్చుతావని శ్రీరామ్‌కు సూచించాడు నాగ్. అయితే నామినేషన్స్‌లో అంత దురుసుగా మాట్లాడావు, యాక్టర్స్ అంటే చిన్నచూపా? అని నిలదీశాడు. దీంతో తప్పు అంగీకరించిన శ్రీరామ్ తల దించుకుని సారీ చెప్పాడు. సన్నీకి ఎక్కడలేని ఎనర్జీ వచ్చిందన్న నాగ్ ఇదే ఆటను కంటిన్యూ చేయమని చెప్పాడు. అందరూ ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నా నువ్వు మాత్రం అవ్వడం లేదని షణ్నుని మెచ్చుకున్నాడు నాగ్. మరోసారి అడ్డంగా దొరికిపోయిన రవి ఇక శ్వేత.. తను రెండుసార్లు కుషన్స్ కట్ చేశానని చెప్తూ బోరుమని ఏడ్చేసింది. ఆ ఐడియా ఇచ్చిన మనిషి మాత్రం చేయలేదంటూ రవి మీద కౌంటరేశాడు నాగ్. ఇదంతా చూస్తుంటే నటరాజ్ చెప్పిందే కరెక్ట్(గుంటనక్క) అనిపిస్తోందని రవిని ఘోరంగా అవమానించాడు. తన మీద పడ్డ నిందను చెరిపేసుకునేందుకు ప్రయత్నించిన రవి.. లోబో, నేను మాత్రమే ఈ ఐడియా డిస్కషన్ చేశామన్నాడు. బిగ్‌బాస్ పంపిన కాటన్, కుషన్స్‌లో ఉన్న దూది సేమ్ ఉన్నాయన్నాడు. దీంతో సంచాలకులు ఆ రెండురకాల దూదిలను పరీక్షించి అవి ఒకేలా లేవని చెప్పడంతో మరోసారి రవి అడ్డంగా దొరికిపోయాడు. ఇక శ్వేత తీసిందని తనకు తెలీదని రవి పదేపదే చెప్పడంతో మధ్యలోనే అడ్డుపడ్డ శ్వేత.. రవికి ఈ విషయం ముందే తెలుసంటూ అందరి ముందే క్లారిటీ ఇచ్చింది. రవి ఇన్ఫ్లూయెన్స్ చేసి పక్కవారి గేమ్ చెడగొడుతున్నాడు తర్వాత నాగ్ ఇంటిసభ్యులను ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని వాళ్ల పేర్లను చెప్పమన్నాడు. ముందుగా మానస్.. వేరేవాళ్ల మాటలను పట్టించుకుంటూ శ్రీరామ్ అన్నింటా వెనకడుగు వేస్తున్నాడన్నాడు. సన్నీ మాట్లాడుతూ.. టాస్కుల్లో 100% ఇవ్వడం లేదంటూ ప్రియ పేరు చెప్పాడు. కాజల్.. ఇద్దరికి అర్హత లేదనిపిస్తూనే ప్రియ పేరు చెప్పింది. ఆమె కనిపించేంత స్వీట్‌గా ఉండరని పేర్కొంది. యానీ మాస్టర్, శ్వేత, సిరి, షణ్ముఖ్.. సొంతంగా ఆడలేకపోతున్నాడంటూ లోబో పేరు సూచించారు. శ్రీరామ్.. రవి పేరు చెప్పాడు. ప్రియ, ప్రియాంక.. ఎవరికి గొడవలవుతాయా అని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండే కాజల్ అన్‌ఫిట్ అని అభిప్రాయపడ్డారు. జెస్సీ.. పక్కవాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేస్తూ వారి గేమ్ చెడగొడుతున్న రవి వెళ్లిపోవాలని కోరుకున్నాడు. తెలీక తప్పు చేస్తే క్షమించండంటూ లోబో వీడ్కోలు రవి.. అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్తున్న కాజల్ హౌస్‌లో అనర్హురాలు అని చెప్పాడు. విశ్వ.. తప్పు చేస్తే ఒప్పుకోకుండా, సమర్థించుకునే ప్రియ అన్‌ఫిట్ అని అభిప్రాయపడ్డాడు. చివరగా వచ్చిన లోబో.. ప్రియ బిగ్‌బాస్ హౌస్‌కు అనర్హురాలు అని పేర్కొన్నాడు. మొత్తంగా ఈ ప్రక్రియలో లోబోకు, ప్రియకు సమానంగా 4 ఓట్లు పడటంతో నాగ్ ఓ పరీక్ష పెట్టాడు. హౌస్మేట్స్ ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తే వారు సేఫ్ అని చెప్పాడు. రవి, సన్నీ, విశ్వ.. ఈ ముగ్గురు మాత్రమే లోబో వైపు నిలబడగా మిగిలిన అందరూ ప్రియకు మద్దతిచ్చారు. దీంతో లోబో ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించడంతో రవి షాకయ్యాడు. ఇక విశ్వ అయితే చిన్నపిల్లాడిలా గుక్క పెట్టి మరీ ఏడ్చాడు. తెలీక తప్పు చేస్తే క్షమించండంటూ ఏడుస్తూ వీడ్కోలు తీసుకున్నాడు. వారం రోజులపాటు సీక్రెట్ రూమ్‌లో! స్టేజీ మీదకు వచ్చిన లోబోతో నాగ్ థంబ్స్ అప్, థంబ్స్ డౌన్ ఆడించాడు. సన్నీ బుర్ర, తన బుర్ర ఒకటేనన్న లోబో ఇకపై మారిపోమని సూచించాడు. కాజల్‌కు ఏ వేలూ చూపించలేదని మరోసారి స్పష్టం చేశాడు. కంటెస్టెంట్లు అందరికీ థంబ్స్ అప్ చూపించాడు. తర్వాత అతడిని పంపించినట్లే పంపించేసి తిరిగి రమ్మన్నాడు నాగ్. నిన్ను ఎలిమినేట్ చేసే అధికారం ప్రేక్షకులకు మాత్రమే ఉందని చెప్పడంతో లోబో నేలపై మోకరిల్లి ఏడ్చాడు. మెజారిటీ కంటెస్టెంట్లు నువ్వు వెళ్లాలని ఓటేసినందున వచ్చేవారం నేరుగా నామినేషన్స్‌లో ఉండబోతున్నావని చెప్పాడు. కాకపోతే నువ్వు హౌస్‌లోకి కాకుండా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్తున్నావని వెల్లడించాడు. -
రవి గడ్డి తినమంటే తింటావా?: లోబోపై నాగ్ ఫైర్
సంచాలకులు తప్పు చేస్తే బిగ్‌బాస్ అనర్హత వేటు వేస్తాడని ఇంటిసభ్యులకు క్లారిటీ ఇచ్చాడు కింగ్ నాగార్జున. కూతురు మీద, వాళ్ల మీద, వీళ్ల మీద ఒట్టు వేయడం ఎందుకని యానీ మాస్టర్ మీద ఫైర్ అయ్యాడు. నామినేషన్స్‌లో శ్రీరామ్ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగ్. యాక్టర్స్ అంటూ చిన్నచూపా? అని నిలదీశాడు. దీంతో శ్రీరామ్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లైంది. హౌస్ ప్రాపర్టీని ధ్వంసం చేయకూడదన్న నియమం తెలియదా? అని లోబోను ప్రశ్నించాడు నాగ్. రవి చెప్తేనే అలా చేశానని అతడు సమాధానమివ్వడంతో రవి గడ్డి తినమంటే తింటావా? అని నిందించాడు హోస్ట్. అసలు ఈ ఐడియా ఇచ్చిన రవిని నిలదీశాడు నాగ్. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. శ్వేత కూడా కుషన్స్ కట్ చేస్తుందన్న విషయం తనకు తెలియదని చెప్తుండగా మధ్యలోనే అడ్డుకుంది శ్వేత. నేను కూడా తన ఐడియానే ఫాలో అవుతున్నానన్న విషయం రవికి తెలుసు అని చెప్పింది. దీంతో నాగ్.. ఇవన్నీ వింటుంటే నటరాజ్ మాస్టర్ చెప్పిందే నిజమనిపిస్తుందని అతడిని పరోక్షంగా గుంటనక్క అని పిలిచాడు నాగ్. దీంతో రవి సిగ్గుతో తల దించుకున్నాడు. ఈ గొడవలో నుంచి రవి ఎలా బయటపడతాడు? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే! -
మా అమ్మ బతికుంటే బాగుండేది: ఏడ్చేసిన శ్వేత
Bigg Boss Telugu 5, Episode 41: అందరూ కలిసి తనను మరోసారి వరస్ట్ పర్ఫామర్ చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశాడు సన్నీ. అయితే మాట వరసకు కూడా ఆ మాట నచ్చని మానస్, కాజల్.. అదే కనక జరిగితే హౌస్‌మేట్స్‌తో తాము ఫైట్ చేస్తామని ముందుకొచ్చారు. ఏదేమైనా సిరి మాత్రం తనను వరస్ట్ పర్ఫామర్‌గా చెప్పడం గ్యారెంటీ అని బల్లగుద్ది చెప్పాడు సన్నీ. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు అని రజనీకాంత్ ఆనాడే చెప్పాడు.. అందుకే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. రాత్రివరకు మానస్‌తో మాట్లాడకూడదు తర్వాత కిచెన్‌లో ముసలం మొదలైంది. 'బియ్యం ఉడుకుతుంటే సగంలోనే దాన్ని పక్కన పెట్టేసి వేడినీళ్లు పెట్టుకున్నారు. మళ్లీ రైస్‌కుక్కర్ ఆన్ చేయనేలేదు' అని అసహనం వ్యక్తం చేసింది ప్రియ. దీంతో నాలుక్కరుచుకున్న శ్వేత.. ఆమె చెప్పే టోన్ నచ్చలేదని నిప్పులు చెరిగింది. అన్నింటికి రియాక్ట్ అయితే తాను కూడా రియాక్ట్ అవుతానని ఫైర్ అయింది. ప్రియాంక మైక్ వేసుకోవడం మర్చిపోవడంతో కెప్టెన్ విశ్వ ఆమె ఈ రోజు రాత్రివరకు మానస్‌తో మాట్లాడకూడదని శిక్ష విధించాడు. అయిష్టంగానే ఈ శిక్షను అంగీకరించిన పింకీ మానస్‌తో సైగల ద్వారా మాట్లాడింది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో సత్తా చాటిన కాజల్, లోబో, విశ్వ, రవి 'పగలగొట్టినవారిదే పండగ'; అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. లగ్జరీ బడ్జెట్ టాస్కులో భాగంగా పలు గేమ్స్ ఆడించాడు. అయితే షణ్ముఖ్.. ఆట మొదలవకముందే డ్రాప్ అవుతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. కానీ తర్వాత మాత్రం ఆట ఆడక తప్పలేదు. యాపిల్స్‌తో టవర్ కట్టే టాస్కులో శ్వేత ప్రియాంకను ఓడించగా ఆమె పగలగొట్టిన కుండలో మటన్ వచ్చింది. గోటీలను స్కేలుకు ఒకవైపు నుంచి మరోవైపుకు చేర్చే గేమ్‌లో కాజల్ ప్రియను ఓడించింది. ఆమె పగలగొట్టిన పిగ్గీ బ్యాంక్‌లో రవ్వ అనే ఐటమ్ ఉంది. చాప్‌స్టిక్స్‌తో బాల్స్ గీతకు అవతల వేయాలన్న గేమ్‌లో లోబో, యానీ పాల్గొనగా.. లోబో గెలిచి కుండ పగలగొట్టగా అందులో పన్నీర్ ఉన్నట్లు తేలింది. స్ట్రాతో జెమ్స్ ప్లేటులో వేయాల్సిన గేమ్‌లో రవి గెలవగా అతడు పగలగొట్టిన కుండలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నట్లు తేలింది. ముక్కుతో దూది తీయాల్సిన గేమ్‌లో షణ్నును ఓడించి విశ్వ గెలిచాడు. అతడు పగలగొట్టిన పిగ్గీబ్యాంక్లో కాఫీ వచ్చింది. అడిగి మరీ ప్రపోజ్ చేయించుకుంటున్న పింకీ నాకు క్యారెక్టర్ లేదుకదా, మరెందుకు ఫ్రెండ్షిప్ చేయడం? చేయకండి! అని అలకబూనింది సిరి. నిన్ను ఉడికిద్దామనే షణ్ను అలా అన్నాడు, అంతేనంటూ ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశాడు జెస్సీ. నా బ్రెయిన్‌ను డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నారా? అని హర్ట్ అయింది సిరి. వేరేవాళ్లతో పోల్చి మాట్లాడితే బాధగా ఉంటుందని చెప్పింది. ఇంతలో ప్రియాంక వచ్చి నాకు ప్రపోజ్ చేయాల్సివస్తే ఎలా చేస్తావు? అని జెస్సీని అడిగింది. అతడు నిర్మొహమాటంగా నేను చెయ్యను అని తేల్చి చెప్పాడు. ఒకవేళ చెయ్యాల్సి వస్తే సచ్చిపోతాడు, కానీ చెయ్యడు అని కౌంటరిచ్చాడు షణ్ను. దీంతో రూటు మార్చిన పింకీ.. తనను సిరి అనుకుని ప్రపోజ్ చేయమంది. చేస్తే సిరికే చేస్తానంటూ పంచ్ ఇచ్చాడు జెస్సీ. ఇది విన్న షణ్ను.. ఆమె నీకు ఏ యాంగిల్లో నచ్చిందిరా అంటూ జోకేయడంతో సిరి ఏడ్చేసింది. తప్పొకరిది, అందులో భాగమైనందుకు శిక్ష మరొకరిది ఈ వారం వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఎవరిని జైలుకు పంపాలనుకుంటున్నారో వారి టీ షర్ట్ మీద స్టాంప్ వేయాల్సి ఉంటుందన్నాడు. మొదటగా విశ్వ.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో రవి.. బిగ్‌బాస్ ప్రాపర్టీని ధ్వంసం చేయాలన్న ఐడియా నచ్చలేదంటూ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. ప్రియాంక సింగ్, ప్రియ, షణ్ముఖ్, లోబో.. బిగ్‌బాస్ ప్రాపర్టీని ధ్వంసం చేసిన శ్వేతను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. సన్నీ, మానస్.. సిరిని; శ్రీరామ్, సిరి.. యానీ మాస్టర్‌ను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పారు. ఇన్ఫ్లూయెన్స్ అయ్యాడంటూ లోబోను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకుంది యానీ. శ్వేత, జెస్సీ కూడా లోబోనే వరస్ట్ అని అభిప్రాయపడ్డారు. జెస్సీ ఈ వారం కనపడలేదంటూ మరోసారి అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు రవి. మెజారిటీ ఓట్లు శ్వేతకు పడటంతో ఆమెను జైలుకు పంపించారు. రవి ఫేస్ చూసి మోకపోకు: మానస్ రవిని క్షమించలేకపోతున్నానని మానస్‌తో చెప్పుకొచ్చింది కాజల్. ఫేస్ చూసి మోసపోకని, సింపతీగా ఫేస్ పెడితే నమ్మేయకని నొక్కి చెప్పాడు మానస్. రవి ఫేక్‌గా ఉంటున్నాడు కాబట్టే క్షమించలేకపోతున్నానంది కాజల్. మరోపక్క రవి ఐడియాకు తాను బలయ్యానని జైలులో ఏడ్చేసింది శ్వేత. దీంతో యానీ మాస్టర్ ఆమెను ఓదార్చింది. ఇక అర్ధరాత్రి అవుతున్నా శ్వేత నిద్రపోకపోవడంతో యానీ కూడా జాగారం చేసింది. రవి వల్లే నీకీ దుస్థితి: షణ్ముఖ్ తర్వాత షణ్ముఖ్ శ్వేతతో ఆమెకు ఈ పరిస్థితి రావడానికి గల కారణాన్ని చర్చించాడు. రవి మీతో చేయించాడు కానీ అతడు చేయలేదన్న విషయాన్ని స్పష్టం చేశాడు. తర్వాత శ్వేతకు, యానీ మాస్టర్‌కు జరిగిన గొడవ గురించి ప్రస్తావిస్తూ.. అందులో యానీ తప్పే ఉందన్నాడు. తనకు ఏ రిలేషన్స్ వద్దంటూ ఆమె నోరు జారిందని చెప్పడంతో శ్వేత కళ్లలో నీళ్లు తిరిగాయి. మా అమ్మ బతికుంటే బాగుండేదని వెక్కి వెక్కి ఏడ్చింది. -
ఈ వారం పరమ చెత్తగా ఆడింది ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలు, కొట్లాటలకు కొదవ లేకుండా పోయింది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయిన బొమ్మల కొలువులో తల్లీకూతుళ్లయిన యానీ మాస్టర్, శ్వేతలు బద్ధ శత్రువులుగా మారిపోయిన విషయం తెలిసిందే. సంచాలకులుగా వ్యవహరించిన కాజల్, సిరి కూడా మా మాటే ఫైనల్ అంటూ తమకు నచ్చిన కండీషన్స్ పెట్టడంతో హౌస్మేట్స్ రివర్స్ అయ్యారు. ఈ క్రమంలో సంచాలకులకు, ఇంటిసభ్యులకు మధ్య కూడా పెద్ద లొల్లి జరిగింది. ఇదిలా వుంటే ఈ టాస్క్‌లో బిగ్‌బాస్ పంపిచే దూదిని మాత్రమే వాడాల్సి ఉండగా శ్వేత, లోబో.. హౌస్‌లోని కుషన్స్‌ను చింపేసి అందులోని దూదిని వాడి బొమ్మలు తయారు చేశారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌కు సంబంధించిన ప్రాపర్టీని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరూ కుషన్స్‌ను పాడు చేయకుండా అడ్డుకోలేకపోయిన సంచాలకులు సిరి, కాజల్‌కు శిక్ష విధించాడు. సంచాలకులుగా విఫలమయ్యారంటూ వారిపై కెప్టెన్సీ అనర్హత వేటు వేశాడు. అయితే ఇక్కడో ట్విస్టుంది. నిజానికి కుషన్స్ పాడు చేసింది లోబో, శ్వేత అయినప్పటికీ ఆ ఐడియా మాత్రం యాంకర్ రవిది. దీంతో నీ వల్లే ఇదంతా జరిగిందంటూ రవిని కడిగిపారేసింది శ్వేత. తన ఐడియా తలకిందులు అవడమే కాక దానికి సిరి, కాజల్ అన్యాయంగా బలవడంతో వారికి అందరి ముందే సారీ చెప్పాడు రవి. కానీ హౌస్మేట్స్ చాలామంది రవిని వదిలేసి శ్వేత మీద గరమైనట్లు తెలుస్తోంది. నేడు(శుక్రవారం) వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోవాల్సి ఉండగా.. మెజారిటీ ఇంటిసభ్యులు శ్వేతను చెత్తగా ఆడినట్లు పేర్కొని ఆమెను జైలుకు పంపించినట్లు సమాచారం. ఇది తెలిసిన ఆమె అభిమానులు.. రవి వల్ల శ్వేత బలైందని కామెంట్లు పెడుతున్నారు. -
బిగ్‌బాస్ పత్తేపారం.. రవి, లోబో, శ్వేతలకు జాక్‌పాట్
Bigg Boss Telugu, Episode 38 Highlights : నిన్నటి నామినేషన్ ప్రక్రియతో బిగ్‌బాస్ హౌస్ అంతా గంభీరంగా మారిపోగా..నేడు ఆ గొడవల నుంచి బయటకు వచ్చి కాస్త రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నించారు ఇంటి సభ్యులు. ఇంతలోనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చి మళ్లీ హౌస్‌లో యుద్ధ వాతావరణం నెలకొల్పాడు బిగ్‌బాస్. ఈ పోటీలో భాగంగా ఇంటి సభ్యులంతా మళ్లీ టీమ్‌లుగా విడిపోయారు. గేమ్ కోసం ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. యానీ మాస్టర్ అయితే ఆవేశంతో ఊగిపోయారు. సిరి చిన్నబోయింది.. రవి, లోబో, శ్వేతలో ఆనందంతో చిందులేశారు. ఇంకా బిగ్‌బాస్ హౌస్‌లో నేడు ఏమేం జరిగిందో నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ గురించి ఇంటి సభ్యులంతా గుసగుసలు మొదలు పెట్టారు. యాక్టర్స్ అంటూ శ్రీరామ్ నోరు జారడంపై సిరి, షణ్ముఖ్, జెస్సీ మరోసారి సీరియస్ అయ్యారు. ఇక షణ్నూ అయితే గత వారం నామినేషన్ ప్రక్రియను ఇంకా మర్చిపోవడం లేదు. . సీక్రెట్ నామినేషన్స్ అంటే 8 మంది నామినేట్ చేశారు.. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్స్ అంటే ఇద్దరే నామినేట్ చేశారు అని ఇంటి సభ్యులందరిపై అసహనం వ్యక్తం చేశాడు. ప్రియ ఏమో సన్నీ గురించి ప్రియాంక దగ్గర చెబుతూ.. ‘ప్రతి వారం నామినేట్ చేస్తానని అంటున్నాడు. ఆయన నన్ను బెదిరిస్తున్నాడా? మానస్‌ని హెల్ప్ చేయమని తనే పంపానని చెప్పాడు.. సన్నీ చెబితేనే మాసన్ వింటాడా? ఆయనకు ఏం చేయాలిపిస్తే అదే చేస్తాడుగా’అంటూ సన్నీ మాటలకు కౌంటర్ ఇచ్చింది. మరోవైపు మాస్టర్ని ఎందుకు నామినేట్ చేశావని విశ్వని శ్రీరామ్ అడిగాడు. తను ప్రతిసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని నామినేట్ చేస్తాననడం తనకు నచ్చలేదని, అందుకే నామినేట్ చేశానని విశ్వ చెప్పుకొచ్చాడు. మన రాజుకు బుర్రలేదు : షణ్నూ నామినేషన్స్‌లో జరిగిన రచ్చపై త్రిమూర్తులు జెస్సీ, సిరి, షణ్ముఖ్ చర్చ పెట్టారు. లోబోని సన్నీ వెనుకేసుకొస్తున్నాడని జశ్వంత్ చెప్పగా.. మన రాజుకు బుర్రలేదని, ఉంటే ఆ టాస్క్ మనమే గెలిచేవామని షణ్ముఖ్ చెప్పాడు. ఐన్‌స్టీన్ E=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఎలిమినేషన్స్ అర్థంకావు’అని షణ్నూ చేసిన ఫన్నీ కామెంట్‌కి జెస్సీ, సిరి పగలబడి నవ్వారు. చర్రితలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి బ్రేకప్! సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో శ్రీరామ్, కాజల్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఇకపై తనను సిస్టర్ అని పిలవొద్దని శ్రీరామ్‌కు చెప్పింది కాజల్.నేడు కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. బెడ్రూమ్లో ఉన్న కాజల్ దగ్గరకు శ్రీరామ్ వెళ్లగా.. ‘బ్రేకప్ బ్రో.. చరిత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్ ఫస్ట్ టైమ్ కదా’అంటూ నవ్వుతూ చెప్పింది. దాన్ని కామెడీగానే స్వీకరించి శ్రీరామ్.. అవునవును అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్స్ అంతా నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. బ్లూ టీమ్‌లో సభ్యులు: మానస్, సన్నీ, యానీ మాస్టర్ ఎల్లో టీమ్ సభ్యులు షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ రెడ్ టీమ్ సభ్యులు : విశ్వ, శ్రీరామ్, ప్రియ గ్రీన్ టీమ్ సభ్యులు : రవి, లోబో, శ్వేత సిరి, కాజల్ ఫ్యాక్టరీ మేనేజర్, సంచాలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు బిగ్ బాస్. రెడ్ అండ్ గ్రీన్ టీంకి మేనేజర్స్‌గా సిరిని.. బ్లూ, ఎల్లో టీంకి కాజల్‌కి మేనేజర్స్‌గా నియమించారు. వీళ్లే బొమ్మల నాణ్యతని తనిఖీ చేసి ఎటువంటి లోపాలు లేకుండా చూస్తారు. కెప్టెన్సీ పోటీ దారులు అవ్వాలంటే.. ప్రతి టీమ్ ప్రత్యర్థుల కంటే ఎక్కువ బొమ్మలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌పై నుంచి బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్ వస్తుంది. వాటిని తీసుకొని బొమ్మలను తయారు చేయాల్సి ఉంటుంది. గెలిచిన టీంకి మేనేజర్‌గా ఉన్నవాళ్లకి కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే బొమ్మల్లో కాటన్ సరిగా పెట్టకపోవడంతో.. ఇదో పత్తేపారం.. బొమ్మల్లో పత్తి లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు అంటూ మానస్ పంచ్ వేశాడు యానీ మాస్టర్ ఉగ్రరూపం.. సిరిపై చిందులు ఈ టాస్క్‌లో భాగంగా యానీ మాస్టర్, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. సంచాలకులుగా ఉన్నవారు బొమ్మల కౌంటింగ్ సరిగా చేయాలని, బజర్ మోగిన తర్వాత బొమ్మలను తెస్తే నేను యాక్సెప్ట్ చేయను.. గొడవ చేస్తాని యానీ మాస్టర్ అనగా.. 'మాకెవరూ ఏం చెప్పొద్దూ.. సంచాలకురాలిగా మేం చూసుకుంటాం' అంటూ సిరి చెప్పింది. దీంతో యానీ మాస్టర్ ఉగ్రరూపం దాల్చింది. 'నేను అంత రూడ్ కాదు.. నువ్ నన్ను అలా బ్లేమ్ చేయలేవు.. నాకు డ్రామాలు ఆడడం రాదు.. నేను డ్రామా క్వీన్ కాదు' అంటూ మండిపడింది. దీంతో బాగా హర్ట్ అయిన సిరి.. గేమ్ ఫేర్‌గా అడినప్పటికీ.. నేను ఒక టీమ్(షణ్ను ఉన్న ఎల్లో టీమ్)కే సపోర్ట్ చేస్తున్నానని అంటున్నారు.. ఇకపై అలానే ఆడుతాను. 'ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతాను’అని సిరి అనగా.. గేమ్‌కి రెస్పెక్ట్ ఇచ్చి జన్యూన్‌గా ఆడాలని షణ్ముఖ్ సర్థి చెప్పాడు. రవి టీమ్‌కి జాక్‌పాట్ ఇక ఈ టాస్క్‌లో గ్రీన్ టీమ్ సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్ పవర్ లభించింది. స్పెషల్ బొమ్మ రావడంతో దాని ద్వారా వేరే టీం దగ్గర ఉన్న బొమ్మల్ని తీసుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఇక రేపటి ఎపిసోడ్లో యానీ మాస్టర్, శ్వేతల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్షిప్ నాకొద్దంటూ యానీ మాస్టర్ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. -
బిగ్‌బాస్ హౌస్‌కు నేనే హీరోయిన్: హమీదా
Bigg Boss Telugu 5: నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా నాగ్ సాంప్రదాయ పంచెకట్టులో మెరిసిపోయాడు. అటు కంటెస్టెంట్లు కూడా పోటీపడి మరీ అలంకరించుకున్నట్లు కనిపిస్తోంది. సండేను స్పెషల్‌డేగా మార్చేందుకు స్టేజీ మీదకు విచ్చేసిన నాగ్.. మగాళ్లందరూ బంగార్రాజులాగా, ఆడాళ్లందరూ సత్యభామల్లా ఉన్నారంటూ కంటెస్టెంట్ల మీద పొగడ్తల వర్షం కురిపించాడు. నవరాత్రి సందర్భంగా 9 గేమ్స్, 9 అవార్డులు ఇవ్వబోతున్నట్లు వెల్లడించాడు. గెలిచిన రవి టీమ్ ఇందులో భాగంగా A టీమ్‌లో రవి, హమీదా, శ్వేత, సన్నీ, షణ్ముఖ్, ప్రియాంక, లోబో, యానీ ఉండగా మిగిలినవారు B టీమ్‌లో ఉంటారు. మొదటగా వీరిద్దరికీ మధ్య రింగ్ ఫైట్ పెట్టారు. ఇందులో సన్నీ, సిరి గెలవడంతో వారికి ఫ్యామిలీ వీడియో చూపించారు. లోబో తన కూతురు మాట్లాడిన వీడియో చూడగానే వెక్కివెక్కి ఏడ్చాడు. తర్వాత జెస్సీ తల్లి అతడికి ధైర్యం నూరిపోసిన మాటలను చూపించగా అతడు తెగ సంతోషపడ్డాడు. తర్వాత రెండు టీమ్‌లు చెరో స్కిట్‌తో మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఈ గేమ్‌లో రవి టీమ్ గెలవగా అతడు మరోసారి పాలపిట్ట అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడి టీమ్‌లోని యానీ మాస్టర్‌కు ఆమె తల్లి మాట్లాడిన వీడియో చూపించారు. దీంతో కొరియోగ్రాఫర్.. ఉద్వేగానికి లోనైంది. అనంతరం హెబ్బా పటేల్.. నా తప్పు ఏమున్నదబ్బా అంటూ.. డ్యాన్స్‌తో హుషారెత్తించింది. కాజల్‌కు కాకరకాయ, ప్రియకు ఉల్లిపాయ తర్వాత కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ డబ్బాలు పంపించాడు. ఎవరికి ఎక్కువ స్వీట్లు వస్తే వారే గెలిచినట్లు అని చెప్పాడు. ఈ టాస్క్‌లో కాజల్‌కు కాకరకాయ, ప్రియకు ఉల్లిపాయ రావడం గమనార్హం. కానీ రవి టీమ్‌లోని హమీదాకు పూతరేకులు, పింకీ, షణ్ముఖ్‌లకు స్వీట్లు రావడంతో A టీమ్ గెలవగా మరోసారి వారు పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయారు. ఈ సందర్భంగా యాంకర్ రవి భార్య, కూతురు మాట్లాడిన వీడియో ప్లే చేయడంతో అతడు ఎమోషనల్ అయ్యాడు. స్పెషల్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న సంధ్యారాణి తర్వాత నాగార్జున రెండు టీములను చెరో 5 ప్రశ్నలు అడిగాడు. ఈ గేమ్‌లో ఎక్కువ సమాధానాలు చెప్పి ప్రియ టీమ్ గెలవడంతో ఆమె టీమ్‌లోని విశ్వకు అతడి ఫ్యామిలీ మాట్లాడిన వీడియో చూపించారు. అందులో విశ్వ భార్య మాట్లాడుతూ.. ఏదున్నా మసులో పెట్టుకోకని సూచించింది. నాట్యం సినిమా కథానాయిక సంధ్యారాణి తన స్పెషల్ పర్ఫామెన్స్తో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఉర్రూతలూగించిన మంగ్లీ అనంతరం కడవ మీద కడవ ఎత్తుకుని నడిచే టాస్కులో కాజల్ గెలిచింది. దీంతో ఆమె సభ్యురాలిగా ఉన్న B టీమ్‌కు పాలపిట్ట అవార్డు రాగా ప్రియకు ఆమె కుమారుడు మాట్లాడిన వీడియో చూపించారు. తర్వాత హౌస్మేట్స్ బతుకమ్మ పేర్చి ఆడారు. బతుకమ్మ అందంగా పేర్చి ప్రియ టీమ్ గెలిచి పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయింది. దీంతో కాజల్‌కు ఆమె కూతురు మాట్లాడిన వీడియో చూపించారు. అటు మంగ్లీ మాస్ పాటలు పాడి తన గాత్రంతో అందరినీ ఓ ఊపు ఊపేసింది. జెస్సీని, సిరిని కాపాడటానికే షణ్ముఖ్ పుట్టాడు.. తర్వాత వచ్చిన హైపర్ ఆది కంటెస్టెంట్లు అందరినీ చెడుగుడు ఆడేశాడు. హమీదా వాకిట్లో శ్రీరామ్ చెట్టు అనే ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారంటూ వాళ్లిద్దరి మీద జోకేశాడు ఆది. నాగ్ తాకిన షర్ట్‌ను అంత అపురూపంగా చూసుకున్నావు, మరి నన్ను హగ్ చేసుకున్నారు. నన్నేం చేస్తావంటూ పంచ్ వేశాడు. జెస్సీని, సిరిని కాపాడటానికే షణ్ముఖ్ పుట్టాడని కౌంటరిచ్చాడు. ఈ ముగ్గురు మిగతావాళ్లతో కూడా కలిసి ఆడితే బాగుంటుందని సెలవిచ్చాడు. స్విమ్మింగ్‌పూల్‌లో ఎక్కువ సేపు మునగాలన్న టాస్క్‌లో B టీమ్ నుంచి విశ్వ గెలిచింది. దీంతో అదే టీమ్‌లోని సిరికి ఆమె మాట్లాడిన వీడియో చూపించారు. ప్రియ గెలిచింది 6, రవి గెలిచింది 2 తర్వాత బొమ్మను అందంగా ముస్తాబు చేయాల్సిన టాస్క్‌లో ప్రియ టీమ్ గెలిచి మరోసారి పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయింది. దీంతో ఆ టీమ్‌లోని హమీదాకు ఆమె ఫ్యామిలీ మాట్లాడిన వీడియో చూపించారు. ట్రోఫీ తీసుకొచ్చేయ్ అక్కా.. అంటూ ఆమె తమ్ముడు మాట్లాడిన మాటలు విని హమీదా కంటతడి పెట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన 8 గేముల్లో ప్రియ 6 గెలవగా రవి 2 గెలిచాడు. తర్వాత స్టేజీ మీద సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీమ్. హీరో అఖిల్.. తనతో పాటు తీసుకొచ్చిన పూజా హెగ్డేను ఇంప్రెస్ చేయమని ఇంట్లోని మగవాళ్లకు టాస్క్ ఇచ్చాడు. దీంతో శ్రీరామ్ పాట పాడగా, సన్నీ మిమిక్రీ చేశాడు. షణ్ముఖ్ మాత్రం సింగిల్స్ కోసం స్కిట్ వేశాడు. జెస్సీ, మానస్ డ్యాన్స్‌తో పడగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ పూజా మాత్రం.. తను అఖిల్‌కే పడిపోయానని చెప్పింది. అయితే ఈ గేమ్‌లో మానస్ గెలిచాడని తెలిపాడు నాగ్. దీంతో మానస్‌కు ఫ్యామిలీ వీడియో చూపించారు. తర్వాత షణ్ముఖ్ సేవ్ అయినట్లు ప్రకటించారు. చివరగా విశ్వ, హమీదా మిగలగా... వీరిలో నుంచి హమీదా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. హౌస్‌కు తానే హీరోయిన్ అని చెప్పుకొచ్చింది హమీదా. -
నాగార్జున పంచ్.. ఏడ్చేసిన యాంకర్ రవి
అందరూ కలిసి చేసుకునేదే పండగ. కానీ ఈ పండక్కి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అక్కడున్నవాళ్లతోనే వేడుకలు జరుపుకునే అవకాశం ఉంది తప్ప వారివారి ఫ్యామిలీని కలుసుకునే, చూసుకునే ఛాన్సే లేదు. కానీ పండగ రోజు వారి మనసు కష్టపెట్టడం తగదనుకున్నాడో ఏమోకానీ వారి ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన వీడియోలు చూపించి హౌస్‌మేట్స్‌ను సర్ప్రైజ్ చేశాడు. దాదాపు నెల రోజులుగా ఇంట్లోవాళ్లను చూడకుండా ఉన్న కంటెస్టెంట్లు వారి మాటలు వినగానే ఎమోషనల్ అయ్యారు. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదిలా వుంటే నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన హైపర్ ఆది ఎప్పటిలాగే తన పంచులతో హౌస్‌మేట్స్‌ను రోస్ట్ చేస్తూ నవ్వించాడు. శ్వేతతో పులిహోర కలపడం వచ్చుగానీ చపాతీ పిండి కలపడం రాదా? అని సెటైర్ వేశాడు. నేను టైటిల్ వెంట పడుతుంటే పింకీ నా వెంట పడుతుందేంటి? అని అనిపించిందా? అని మానస్‌ను గుచ్చిగుచ్చి అడిగాడు. కాజల్‌ను నిద్రలో నుంచి లేపి పేరేంటి? అని అడిగితే స్ట్రాటజీ అంటుందని ఆమెమీద పంచ్ వేయడంతో అందరూ ఘొల్లున నవ్వారు. ఇక నాగ్ కూడా రవిని.. ఏంటి, ఇన్ఫ్లూయెన్స్ చేస్తావా? అంటూ ఆటపట్టించడం గమనార్హం. ఆటలు, పాటలు, ఆనందాలు, కన్నీళ్లు.. అన్నింటి కలయికగా వస్తున్న నేటి ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు. -
త్వరలో నీ గేమ్ బెడిసికొట్టే రోజొస్తుంది: రవికి కాజల్ వార్నింగ్
Bigg Boss Telugu 5, Episode 35: ఐదు రెట్ల ఫన్, ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్, ఐదు రెట్ల కాంట్రవర్శీ, ఐదు రెట్ల ఎఫైర్స్, ఐదు రెట్ల డ్రామా గ్యారెంటీ.. అంటూ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్. ఈ రియాలిటీ షో ప్రారంభమై అప్పుడే ఐదు వారాలు ముగిశాయి. ఈ వారం నామినేషన్లో ఏకంగా 9 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మరి వీరిలో నాగార్జున ఎవరిని సేవ్ చేశారు? ఎవరికి చీవాట్లు పెట్టారు? అనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 09) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! రవి అందరికీ బ్రెయిన్‌వాష్ చేస్తున్నాడు.. ఇంటిసభ్యులందరూ కలిసి తనను జైల్లో వేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది కాజల్. ఈ క్రమంలో ఆమెను ఊరడించాల్సింది పోయి అగ్గిపుల్ల గీకాడు మానస్. నువ్వు సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నావని యాంకర్ రవి తనతో అన్నాడంటూ కాజల్‌తో చెప్పుకొచ్చాడు. అతడు హౌస్‌లో అందరికీ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇది విన్న కాజల్ తన వెనక ఇంత కుట్ర జరుగుతోందా? అని ఓ లుక్కిచ్చింది. సిరికి క్లాస్ పీకిన నాగ్ వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు హాయ్ చెప్పిన నాగార్జున వచ్చీరాగానే శ్రీరామ్‌కు ఇబ్బందికర ప్రశ్న విసిరాడు. బిగ్‌బాస్ టైటిల్ ఇష్టమా? హమీదా ఇష్టమా? అని సూటిగా అడిగేశాడు. దీంతో కొద్ది క్షణాలపాటు ఆలోచించిన శ్రీరామ్ బిగ్‌బాస్ టైటిల్ అని తడుముకోకుండా ఆన్సరిచ్చాడు. అతడి సమాధానం విని మన్మథుడిలా నవ్వేసిన నాగ్.. నీ కెప్టెన్సీ బాగుందంటూనే, ఎవరి వంట వాళ్లు వండుకోవాలని ఆర్డర్ వేయడం బాగోలేదని చురకలంటించాడు. తర్వాత సిరిని నిల్చోబెట్టి క్లాస్ పీకాడు. రోజంతా పక్కవాళ్ల గురించి మాట్లాడటమే పనా? అని కడిగిపారేశాడు. ఎదుటివాళ్లకు నీతులు చెప్తాం కానీ మనం మాత్రం చేయమని కౌంటరిచ్చాడు. దీంతో సిరి సిగ్గుతో తలదించుకోక తప్పలేదు. రకుల్‌ను ప్రేమించావా?: వైష్ణవ్‌కు నాగ్ సూటి ప్రశ్న తర్వాత 'కొండపొలం' సినిమా టీమ్ బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేసింది. ఈ క్రమంలో నాగ్.. ఇంత చిన్నవయసులోనే రకుల్‌ను ప్రేమించేశావా అనడంతో వైష్ణవ్‌తేజ్ తెగ సిగ్గుపడ్డాడు. తర్వాత క్రిష్.. టాస్కులు ఆడకుండా ఈ ఎంటర్టైన్మెంట్ ముసుగులో ఎన్నాళ్లు ఉంటావని లోబోను నిలదీయడంతో అతడు నీళ్లు నమిలాడు. ఆ తర్వాత ప్రియాంక సింగ్ ఫినాలే గురించి మాట్లాడుతూ.. తనతో పాటు షణ్ముఖ్, రవి, మానస్, శ్రీరామ్ టాప్ 5లో ఉంటారని అభిప్రాయపడింది. కంటెస్టెంట్లను ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టించిన అనంతరం వైష్ణవ్ తేజ్, క్రిష్ బిగ్‌బాస్ స్టేజీకి వీడ్కోలు పలికారు. కావాలని వేలు చూపించలేదు: లోబో ఎవరైనా మిడిల్ ఫింగర్ చూపించారా? అని నాగ్ కాజల్‌ను ప్రశ్నించగా ఆమె అవునని తలూపింది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు వీడియో ప్లే చేయించాడు నాగ్. అందులో లోబో మిడిల్ ఫింగర్ చూపించినట్లు స్పష్టమైంది. అయితే తను కావాలని వేలు చూపించలేదని, అక్కడ పైన బల్లి తిరుగుతుంటే దాన్ని చూపించానంటూ దేవుడి మీద ఒట్టేశాడు. దీంతో చల్లబడిన నాగ్.. చేసింది తప్పే.. కానీ కావాలని చేయలేదంటున్నావు, దాన్ని మేమంతా నమ్ముతున్నాం అనడంతో లోబో ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం నాగ్.. హౌస్‌మేట్స్‌తో రూలర్ ఎవరు? బానిస ఎవరు? అన్న టాస్క్ ఆడించాడు. మొదటగా వచ్చిన కెప్టెన్ ప్రియ.. శ్రీరామ్ రూలర్, హమీదా బానిస అని చెప్పింది. శ్రీరామ్.. హౌస్ అంతా తన గురించి మాట్లాడుకునేలా చేసిన కాజల్ రూలర్, షణ్ముఖ్ బానిస అని పేర్కొన్నాడు. ఇన్ఫ్లూయెన్స్ చేసే రవి బానిస: కాజల్ కాజల్.. అందరితో మంచిగుండాలనుకునే ప్రియను రూలర్‌గా, అందరినీ ఇన్ఫ్లూయెన్స్ చేసే రవిని బానిసగా చెప్పుకొచ్చింది. త్వరలోనే రవి గేమ్ రవికే బెడిసికొట్టే రోజు వస్తుందని హెచ్చరించింది. ప్రియాంక సింగ్.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలైంది. రవి.. మానస్‌ను రాజుగా, ప్రియాంక సింగ్‌ను బానిసగా తెలిపింది. సన్నీని రాజుగా చూసుకుంటానంటూ మానస్.. తన బెస్ట్ ఫ్రెండ్‌కు కిరీటం ధరించాడు. శ్రీరామ్‌తో ఎక్కువ కనెక్ట్ అయి, గేమ్‌కు డిస్కనెక్ట్ అవుతున్నావంటూ హమీదాను బానిసగా ఫీలయ్యాడు. ఈ వారం హమీదా కనిపించనేలేదు: షణ్ను సన్నీ.. మానస్ రాజు, విశ్వ బానిస అని పేర్కొన్నాడు. లోబో.. సన్నీకి కిరీటం ధరించి రాజును చేయగా విశ్వను బానిస అని తెలిపాడు. తర్వాత షణ్ముఖ్.. నాకు నేనే రాజు అని ప్రకటించుకున్నాడు. దీంతో నాగ్.. ఇలాంటి పని చేశావు కాబట్టే 8 మంది నామినేట్ చేశారని కౌంటరిచ్చాడు. దీంతో కొంత వెనక్కు తగ్గని షణ్ను.. మైండ్‌గేమ్ ఆడిన రవి కింగ్ అని చెప్తూనే, ఈ వారం మొత్తంలో హమీదా ఎక్కడా కనిపించలేదంటూ ఆమెను బానిసగా అభివర్ణించాడు. ఇక హమీదా.. మానస్‌ను రాజుగా, సన్నీని బానిసగా ఫీలైంది. తర్వాత శ్వేత.. ఇన్ఫ్లూయెన్స్ చేసే కాజల్ రాణి, ఇన్ఫ్లూయెన్స్ అయ్యే మానస్ బానిస అని అభిప్రాయపడింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు రాజు.. జెస్సీ.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలయ్యాడు. యానీ మాస్టర్.. సన్నీని రాజుగా, లోబోను బానిసగా పేర్కొంది. సిరి.. రవికి కిరీటం తొడిగించి రాజుగా అందలం ఎక్కించగా, శ్రీరామ్‌ను బానిసగా ఫీలైంది. తర్వాత విశ్వ వంతు రాగా.. అతడు రవిని రాజుగా కీర్తించాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు రవి అని మెచ్చుకున్నాడు. కెప్టెన్ ప్రియను మాత్రం బానిసగా పేర్కొన్నాడు. 9 మంది నామినేషన్లో ఉన్నప్పటికీ నాగార్జున ఈరోజు ఎవరినీ సేవ్ చేయకపోవడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మాత్రం హమీదా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి, -
కనెక్షన్ వద్దని తేల్చేసిన కంటెస్టెంట్లు.. కాజల్ ఒంటరి రోదన
Bigg Boss Telugu 5, Episode 34: ప్రతివారం బిగ్‌బాస్ హౌస్‌లో బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకుంటున్న సంగతి తెలిసిందే కదా! ఈ వారం కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. కానీ బెస్ట్‌గా ఆడినవాళ్లను అలా ఉంచి ఎవరు చెత్తగా ఆడారో చెప్పమని ఆదేశించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో కాజల్‌తో మాకసలు కనెక్షనే వద్దంటూ ఆమెకు దండం పెట్టేశారు హౌస్మేట్స్. నేటి ఎపిసోడ్ చూస్తుంటే దాదాపు హౌస్మేట్స్ అంతా కలిసి కాజల్ మీద దండయాత్ర చేసినట్లే కనిపించింది. మరి కాజల్ వీటిని ఎలా ఎదుర్కొంది? నేటి(అక్టోబర్ 08) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదవాల్సిందే! గోరుముద్దలు పెడతానంటే గోల చేసిన మానస్ బిగ్‌బాస్ ఇచ్చిన ప్రత్యేక అధికారంతో కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచిన ప్రియ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా అవతరించింది. మరోపక్క టాస్క్‌లో శ్వేత తనకు సపోర్ట్ ఇవ్వలేదని తెగ ఫీలయ్యాడు సన్నీ. ఈ క్రమంలో మానస్, సన్నీ తెగ ఏడ్చేశారు. ఎందుకింత ఎమోషనల్ అవుతున్నారో అర్థం కాని లోబో, విశ్వ వారిని ఊరడించేందుకు ప్రయత్నించారు. మరోపక్క పింకీ మానస్‌కు తినిపించాలని ఎంతో ప్రేమకొద్దీ ప్లేటు పట్టుకుని వెళ్లింది. కానీ అతడు మాత్రం తనకు వద్దని కటువుగా ఆన్సరివ్వడంతో చిన్నపిల్లలా ఏడ్చేసింది. బలిపీఠం ఎక్కించి నీళ్లు గుమ్మరించాలి.. ఇక సన్నీ, శ్వేత.. వారిమధ్య వచ్చిన మనస్పర్థలను చెరిపేసుకుని తిరిగి మామూలు ఫ్రెండ్స్‌లా మారిపోయారు. గేమ్‌లో అన్నీ సాధారణమేనంటూ తిరిగి కలిసిపోయారు. అనంతరం బిగ్‌బాస్.. ఈ వారం వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకుని జైలుకు పంపించాల్సి ఉంటుందని ఆదేశించాడు. అందులో భాగంగా.. కంటెస్టెంట్లు దోషి అనుకుంటున్న వ్యక్తులను బలిపీఠం ఎక్కించి, అందుకు తగిన కారణాలు చెప్పి, వారి ముఖం మీద నీళ్లు చల్లాల్సి ఉంటుంది. దయచేసి ఫ్రెండ్షిప్ను చెడగొట్టవద్దు మొదటగా వచ్చిన శ్వేత.. తనకు, సన్నీ, యానీకి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని, దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్‌తో చెడగొట్టవద్దని కాజల్‌కు హితవు పలికింది. తర్వాత వచ్చిన జెస్సీ.. నా ఫుడ్ నన్ను వండుకోమని ఆర్డర్ చేయడం నచ్చలేదంటూ శ్రీరామ్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. ఈ క్రమంలో శ్రీరామ్, జెస్సీకి మధ్య పెద్ద ఫైటే నడిచింది. ఇక టాస్క్‌లో చిల్లర, థూ అంటూ మాటలు జారడం నచ్చలేదని విశ్వను వరస్ట్ పర్ఫామర్‌గా నామినేట్ చేశాడు షణ్ముఖ్, సిరి, ప్రియ. అనంతరం హమీదా.. మన మధ్య ఏ రిలేషన్ ఉండొద్దంటూ కాజల్ ముఖం మీద నీళ్లు గుమ్మరించింది. ఇక నుంచి ఆ రిలేషన్ కూడా వద్దు: కాజల్ శ్రీరామ్.. కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొనడంతో ఆమె బాగా హర్టయ్యింది. ఇక నుంచి మన మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కూడా వద్దని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఆమె దెబ్బకు దెబ్బ అన్న రీతిలో శ్రీరామ్‌నే వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడింది. 'నువ్వు నన్ను చీడపురుగులా చూస్తావు, అనుమానిస్తావు.. ఇకనుంచి నిన్ను బ్రదర్ అని పిలవను' అని చెప్తూ అతడి ముఖం మీద నీళ్లు గుమ్మరించింది. తన కోపాన్ని చూపించలేక యానీ మాస్టర్ వింత ప్రవర్తన కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్న యానీ మాస్టర్ ఆమె మీద కోపంతో తన ముఖం మీద తానే నీళ్లు గుమ్మరించుకుంది. తర్వాత ప్రియాంక సింగ్.. విశ్వ నోరు జారాడంటూ వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకుంది. అనంతరం వచ్చిన లోబో.. టాస్క్‌లో రవిని వెన్నుపోటు పొడిచావంటూ కాజల్ మీద నీళ్లు పోశాడు. ఇక రవి వంతురాగా.. నేను కిచెన్‌లో పని చేయలేదని స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు అంటూ కాజల్‌ను నిందించాడు. దీంతో ఆమె ముందు నన్ను ఫ్రెండ్ అని పిలవడం మానేయమని హెచ్చరించింది. దీంతో చిర్రెత్తిపోయిన రవి.. నామీదకు చేయి ఎత్తొద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఉద్వేగానికి లోనైన కాజల్.. శ్రీరామ్ సంచాలకుడిగా సరిగా పని చేయట్లేదంటూ మానస్, సన్నీ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. తర్వాత వచ్చిన విశ్వ కూడా కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. అయితే హౌస్‌లో ఇంతమంది తనను వరస్ట్ అనుకుంటున్నారని అర్థమైన కాజల్ తన కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఎక్కువమంది దోషిగా అభిప్రాయపడ్డ కాజల్‌ను బిగ్‌బాస్ జైల్లో వేయమని చెప్పగానే కంటతడి పెట్టుకుంది. -
వరస్ట్ పర్ఫామర్ ఎవరు? ఈ వారం జైలుకు వెళ్లేది ఆవిడేనా?
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఎటు పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. సీజన్ మొత్తానికి కెప్టెన్ కాలేరన్న ప్రియను బిగ్‌బాస్ ప్రత్యేక అధికారంతో కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కల్పించడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. దీంతో ఎవరు చెత్త ఆటగాళ్లనుకుంటున్నారో వారిని బలిపీఠం ఎక్కించి ముఖం మీద నీళ్లు గుమ్మరించాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో శ్వేత మాట్లాడుతూ.. 'నాకు, సన్నీ, యానీ మేడమ్‌కు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, అది టాస్క్ వల్ల ఎండ్ అయ్యేది కాదు. సో ఇన్ఫ్లూయెన్స్ చేయడానికి ట్రై చేయకండి' అని సూచిస్తూ కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది. ఇక మరోసారి జెస్సీ, సిరి, షణ్ముఖ్ గ్యాంగ్‌కు శ్రీరామ్‌కు మధ్య రచ్చ మొదలైనట్లు తెలుస్తోంది. తాను వయొలెంట్‌గా ఉన్నానంటూ సిరి గ్యాంగ్ సభ్యులందరూ చేయెత్తడంతో శ్రీరామ్ ఖంగు తిన్నాడు. తర్వాత రవికి కాజల్‌కు మధ్య కూడా గట్టి ఫైట్ నడిచినట్లు కనిపించింది. ఎవరి మీదా చేయెత్తొద్దు అంటూ కాజల్‌కు నీతి వాఖ్యాలు బోధించాడు రవి. చివర్లో యానీ మాస్టర్ ఎవరి ముఖం మీదా నీళ్లు గుమ్మరించలేక తన ఫేస్ మీద తానే నీళ్లు చల్లుకోవడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న లీకుల ప్రకారమైతే ఈవారం కాజల్ వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలుకు వెళ్లినట్లు సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
బెడిసి కొట్టిన ప్లాను.. హమీదా త్యాగంతో కెప్టెన్‌గా ప్రియ!
Bigg Boss Telugu 5, Episode 33: ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్‌కు జీవితంలోనే మర్చిపోలేని కానుకను అందించాడు బిగ్‌బాస్. ఆమె ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయాన్ని తండ్రి స్వాగతించిన వీడియోను ప్లే చేసి చూపించాడు. 'అబ్బాయైనా, అమ్మాయైనా సర్వం నువ్వే నాకు. నువ్వు అనుకుంది సాధించాకే ఇంటికి రావాలి. నువ్వు అమ్మాయిగా మారావని ఆదరించడం మానేస్తాం అని ఎప్పుడూ అనుకోకు' అంటూ తల్లిదండ్రులు మాట్లాడిన వీడియో చూపించడంతో ఆమె తెగ ఎమోషనల్ అయింది. ఆమెను మరింత సంతోషపెడుతూ బిగ్‌బాస్ ఆమెకు చీర, పూలు, గాజులు, స్వీట్లు పంపించాడు. నాన్నను పట్టుకుని ఏడవాలనుంది: పింకీ ఈ సందర్భంగా తను పడ్డ కష్టాలను గుక్కపెట్టి చెప్పుకుంటూ ఏడ్చేసింది పింకీ. పండగకు ఇంటికి వెళ్లినా కూడా దొంగచాటుగా వెళ్లేదాన్నని, అలాంటిది మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేశాడంటే నమ్మలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకుంది. ఇక తను బిగ్‌బాస్ నుంచి ఏ వారం వెళ్లిపోయినా సరే, కానీ వెళ్లగానే నాన్నను పట్టుకుని గట్టిగా ఏడవాలనుందని మనసులోని మాటను బయటపెట్టింది. అనంతరం పింకీ అందంగా ముస్తాబవగా.. ఆమె యానీ మాస్టర్, సన్నీ, మానస్‌ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఇంతలో హమీదా తన ఫ్యామిలీని గుర్తు చేసుకుని ఏడవడంతో శ్రీరామ్ ఆమెను హత్తుకుని ఓదార్చాడు. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ ఇక కంటెస్టెంట్లు ఏ రాజుకు సపోర్ట్ చేయాలన్న విషయంపై మల్లగుల్లాలు పడ్డారు. ఇంతలో బిగ్‌బాస్ ఫైనల్‌గా రాజుల దగ్గరున్న నాణాల సంఖ్యను వెల్లడించమని ఆదేశించాడు. సన్నీ దగ్గర 30, ఆయన రాజ్యంలోని మానస్ దగ్గర 240, షణ్ముఖ్ దగ్గర 220, జెస్సీ దగ్గర 209 నాణాలున్నాయి. రవి రాజు దగ్గర 50, అతడి రాజ్యంలోని యానీ మాస్టర్ దగ్గర 176, హమీదా దగ్గర 60, విశ్వ దగ్గర 10, శ్రీరామచంద్ర దగ్గర 52 నాణాలున్నాయని తెలిపారు. నాణాల లెక్కింపు తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరు.. ఇప్పటికీ కంటెస్టెంట్లు వారి యువరాజుకు సపోర్ట్ ఉపసంహరించుకోవచ్చని, లేదా వేరే రాజుకు మద్దతు తెలపవచ్చని ఛాన్స్ ఇచ్చాడు. మొత్తంగా టాస్క్ ముగిసే సమయానికి రాకుమారుడు సన్నీ దగ్గర ఆరుగురు, రవి దగ్గర ఏడుగురు ప్రజలు ఉన్నట్లు కెప్టెన్ శ్రీరామ్ బిగ్‌బాస్‌కు విన్నవించాడు. దీంతో ఎక్కువ ప్రజలు కలిగి ఉన్నందున యువరాజు రవి నేరుగా కెప్టెన్సీకి పోటీపడతాడని ప్రకటించగా.. ఇంటిసభ్యులు అతడికి పట్టాభిషేకం జరిపించారు. అంతేకాకుండా ఓడిపోయిన రాకుమారుడితోపాటు అతడి ప్రజల ధనాన్ని స్వాధీనం చేసుకునే ప్రత్యేక అవకాశాన్ని రవికి కల్పించాడు బిగ్‌బాస్. దీంతో జెస్సీ, షణ్మఖ్, సిరి, కాజల్‌లు కష్టపడి దొంగిలిచిన నాణాలు కూడా రవి వశమయ్యాయి. షణ్ముఖ్‌ను ప్రాధేయపడ్డ రవి.. అయినా పట్టించుకోలే అయితే షణ్ముఖ్ సరిగా మాట్లాడట్లేదని తెగ ఫీలయ్యాడు రవి. మనసులోనుంచి మాట్లాడురా అని నోరు తెరిచి అడిగినప్పటికీ అతడు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇక రాజైన రవి.. ఆయన వెన్నంటే ఉండి రాజుగా గెలిపించిన ముగ్గురిని సమానంగా ధనాన్ని పంచి కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటించమని ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో రవి.. యానీ మాస్టర్, హమీదా, శ్వేతను పోటీదారులుగా పేర్కొన్నాడు. ఇంతలో బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ప్రియ కోసం వెనక్కు తగ్గిన హమీదా ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే అర్హతను కోల్పోయిన ప్రియకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు. అంతేకాకుండా ఆమె కెప్టెన్‌గా గెలిస్తే ఈ సీజన్లో అందరిలాగే కెప్టెన్‌గా పోటీచేసే అర్హత తిరిగి లభిస్తుందని చెప్పాడు. దీంతో కెప్టెన్సీ కంటెండర్స్ పోటీ నుంచి వెనక్కు తగ్గిన హమీదా.. తన స్థానాన్ని ప్రియకు ఇచ్చింది. అనంతరం బిగ్‌బాస్ 'పదివేలు సరిపోవు సోదరా' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కొన్ని రంధ్రాలున్న వాటర్ ట్యాంకులను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. టాస్క్ ముగిసే సమయానికి ఎవరి దగ్గరున్న వాటర ట్యాంకులో ఎక్కువ నీళ్లుంటాయో వారే గెలిచినట్లు లెక్క! అని క్లారిటీ ఇచ్చాడు. ఈ టాస్కులో రవి, యానీ మాస్టర్, శ్వేత, ప్రియ పోటీపడగా... ఫైనల్‌గా ప్రియ గెలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అదెంతవరకు నిజమనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది! -
ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌గా మారడాన్ని స్వాగతించిన తండ్రి
Bigg Boss Telugu 5, Episode 32: బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన 'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి లెవల్లో ఇచ్చిన కుస్తీపోటీలో విశ్వ మానస్‌ను ఓడించి పైచేయి సాధించాడు. తర్వాత తనతో పోటీలోకి దిగిన యానీ మాస్టర్‌ను చిత్తుచిత్తుగా ఓడించాడు జెస్సీ. అనంతరం ప్రియాంక సింగ్‌ను అతి సునాయాసంగా ఓడించింది శ్వేత. మొత్తంగా ఈ టాస్క్‌లో యాంకర్ రవి రెండు పాయింట్ల ఆధిక్యంతో గెలిచాడు. దీంతో అతడికి 150 నాణాలు వచ్చాయి. అయితే ఖజానాలో నుంచి నాణాలు దొంగిలిస్తున్నారంటూ విశ్వ చిర్రుబుర్రులాడాడు. కానీ విశ్వ పేరు పెట్టి ఎవరినీ తిట్టకపోవడంతో మానస్ ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరికీ మధ్య చిన్నపాటి వాగ్వాదమే జరిగింది. సైగలతో సంభాషించుకున్న శ్రీరామ్, హమీదా ఇక రాత్రిపూట దుప్పటి కప్పుకుని జెస్సీ, సిరి, షణ్ముఖ్ నాణాలు పంచుకున్నారు మరోపక్క హమీదా శ్రీరామ్‌ను తన కౌగిలిలో బంధించింది. తర్వాత వీళ్లిద్దరూ ఎప్పటిలాగే సైగలతో సంభాషించుకుని గుడ్‌నైట్ చెప్పుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'రాజుగారి గోడ' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఖాళీ గోడలపై హౌస్మేట్స్ వారికి నచ్చిన రాజు ఫొటోలను అతికించాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ రాకుమారుడి ఫొటోలు ఎక్కువ ఉంటే అతడే గెలిచినట్లు లెక్క! శ్రీరామ్ గాలి తీసేశారు..: షణ్ను దీంతో సన్నీకి సపోర్ట్‌గా మానస్, జెస్సీ బరిలోకి దిగారు. ఈ క్రమంలో యువరాజు రవికి మద్దతుగా వచ్చిన విశ్వను ఆపేందుకు మానస్ తీవ్రంగా ప్రయత్నించాడు. జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేశాడు. అయితే శ్రీరామే జెస్సీని కొడుతున్నాడని, అది కళ్లారా చూశానని ఆవేశపడ్డాడు సన్నీ. దీంతో చిర్రెత్తిపోయిన శ్రీరామ్.. ఏకంగా గోడను మొత్తం నేలకూల్చాడు. కానీ చివరగా ఈ టాస్క్‌లో యువరాజు సన్నీ విజయం సాధించడం విశేషం. సన్నీ గెలుపును అభినందించిన షణ్ను.. ఇప్పటిదాకా స్ట్రాంగ్ అనుకున్న శ్రీరామ్ గాలి తీసేశారంటూ సెటైర్ వేశాడు. ఆ అవార్డు ఉంటే అది కాజల్‌కే చెల్లుతుంది: యానీ ఇంతలో కాజల్ నాణాలు దొంగతనం చేయడం చూశాడు రవి. అయితే అందుకు తగిన ఆధారాలు చూపించమంటూ బుకాయించింది కాజల్. అడ్డంగా దొరికాక కూడా తప్పించుకోవాలని ప్రయత్నించిన కాజల్ యవ్వారంతో ఇరకాటంలో పడ్డాడు రవి.. ఆమెతో పెట్టుకుంటే పనులు అయినట్లేనని ఆమెను అలా వదిలేశాడు. ఈ సీను అంతా చూసిన యానీ మాస్టర్.. నిజానికి ప్రోవోక్ అనే అవార్డు ఉంటే అది కాజల్‌కే ఇవ్వాలంది. ఇంతలో సిరి.. సడన్‌గా రవి రాజ్యంలో నుంచి సన్నీ రాజ్యంలోకి షిఫ్ట్ అయింది. మళ్లీ గెలిచిన సన్నీ.. అనంతరం బిగ్‌బాస్.. 'లాక్కో లాక్కో తాడు' టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు రాకుమారులతో పాటు, వారి ప్రజలు తాడును లాగాల్సి ఉంటుంది. ఏ రాకుమారుడైతే ఇతర రాజ్యంలోని ప్రజలను తమవైపు లాక్కుంటారో వారే గెలిచినట్లు లెక్క! ఈ టాస్క్‌లో మరోసారి యువరాజు సన్నీ గెలుపు సాధించడంతో అతడి ప్రజానీకం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక రేపటి ఎపిసోడ్లో ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు ఆమెగా మారిన విషయాన్ని పింకీ తండ్రి స్వాగతించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పింకీ ఎంతో భావోద్వేగానికి లోనవగా హౌస్ మొత్తం కూడా ఎమోషనల్‌గా మారినట్లు కనిపిస్తోంది. -
కాజల్‌కు మిడిల్ ఫింగర్ చూపించిన లోబో, వేలు నరికేస్తానన్న పింకీ!
Bigg Boss Telugu 5, Episode 31: కెప్టెన్ శ్రీరామ్ ఎప్పుడైతే ఎవరి ఫుడ్ వాళ్లు వండుకుని తినాలని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటినుంచి సిరి గ్యాంగ్‌కు యాంటీ అయిపోయాడు. జెస్సీ మాటతీరు వల్లే తాను అలా అనాల్సి వచ్చిందని అతడు నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ సిరి, షణ్ను వినిపించుకోలేదు. జెస్సీ తన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి స్టాండ్ తీసుకున్నానని షణ్ను, అయినా మధ్యలో ఏజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావని సిరి శ్రీరామ్ మీద ఒంటికాలిపై లేచారు. మొత్తంగా ఈ గొడవతో అటు సిరి, షణ్ను, జెస్సీ, ఇటు శ్రీరామ్, హమీదా ఏమీ తినకుండా ఫుడ్ మీద తమ ప్రతాపాన్ని చూపించారు. తమ పేరెంట్స్‌కు టీవీ, వాచ్, స్మార్ట్ ఫోన్ గిఫ్టులుగా ఇచ్చిన కంటెస్టెంట్లు.. అయితే నీకు ఆకలేస్తే తినంటూ శ్రీరామ్ హమీదాను బుజ్జగించాడు. కానీ ఆమె అందుకు నిరాకరించడంతో పస్తులతోనే పడుకున్నారు. అయితే తర్వాతి రోజు అందరూ వారి గిల్లికజ్జాలను పక్కన పెట్టి టిఫిన్ కుమ్మేసినట్లు కనిపించింది. అనంతరం అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో భాగంగా పలువురు ఇంటిసభ్యులు వారి ఫ్యామిలీకి బహుమతులను అందించే అవకాశాన్ని కొట్టేశారు. ఇందుకోసం కెప్టెన్ శ్రీరామ్.. ప్రియ, షణ్ముఖ్, హమీదా, మానస్‌లను ఎంచుకున్నాడు. మొదటగా ప్రియ.. తన తల్లికి టీవీని బహుమతిగా ఇచ్చే అవకాశాన్ని అందుకుంది. తర్వాత షణ్ముఖ్.. డైరెక్టర్ సుబ్బుకు ల్యాప్‌టాప్ బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. మానస్.. తన తల్లికి బ్రాండెడ్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు వెల్లడించాడు. హమీదా.. తన తల్లికి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇస్తున్నట్లు తెలిపింది. మజాక్ అనేది కొంతవరకు ఉంటేనే బెటర్.. ఇక రవి, కాజల్ మధ్య మరోసారి అగ్గి రాజుకుంది. నెల రోజుల నుంచి లోబో, రవి వాష్‌రూమ్ క్లీనింగ్ తప్ప కిచెన్ వంకే చూడట్లేదని సెటైర్ వేసింది కాజల్. దాన్నే కాస్త పొడిగిస్తూ డ్యాన్సులు కూడా చేసింది. అయితే మజాక్ అనేది కొంతవరకు ఉంటేనే బెటర్ అని కాజల్‌పై చిరాకుపడ్డాడు రవి. ఇక లోబో అయితే ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించి ఆమెకు ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో లోబో చేసింది తప్పని వాదించింది కాజల్. ఇదే విషయాన్ని కాజల్ పింకీతో చెప్పుకురాగా.. తనకుగానీ అలా వేలు చూపిస్తే కట్ చేసి పడేస్తానని హెచ్చరించింది. బిగ్‌బాస్ హౌస్‌లో హింసకు తావు లేనందున అక్కడి నుంచి సైలెంట్‌గా వచ్చేశానంది కాజల్. రవిని ఫ్రెండుగా ఉండమని నేనేమైనా అడిగానా?: కాజల్ నెల రోజులన నుంచి కిచెన్‌లో తానేమీ పని చేయలేదని ఎలా స్టేట్మెంట్ ఇస్తావని కాజల్‌ను నిలదీశాడు రవి. దీంతో మాట మార్చిన కాజల్.. కేవలం మీకు కిచెన్ డ్యూటీ రాలేదని మాత్రమే అన్నానని కవర్ చేసింది. కాజల్ వింత ప్రవర్తన చూసిన మానస్ ఎందుకు అరుస్తున్నావు? ఎవరి మీద అరుస్తున్నావు? అని ప్రశ్నించాడు. ఇదేమీ పెద్దగా పట్టించుకోని కాజల్.. అయినా రవిని నా ఫ్రెండుగా ఉండమని ఎప్పుడైనా అడిగానా? అని అసహనానికి లోనైంది. లోబో మిడిల్ ఫింగర్ చూపిస్తే సపోర్ట్ చేస్తున్నావు అనడంతో షాకైన రవి.. అలా వేలు చూపించడం తప్పని లోబోను కూడా హెచ్చరించానన్నాడు. ఇక శ్రీరామ్ వీళ్ల మధ్య గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేశాడు కానీ ఎవరూ అతడు మాటను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ రాజు దగ్గర ఎక్కువ ధనం ఉంటే ఆ రాజ్యంలోని వాళ్లే కెప్టెన్సీకి అర్హులు తర్వాత బిగ్‌బాస్.. 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్‌లో భాగంగా ఇద్దరు రాజులు రవి, సన్నీ సింహాసనాన్ని గెలుచుకోవడానికి పోటీపడతారు. మిగతా ఇంటి సభ్యులు ప్రజలుగా వ్యవహరిస్తారు. ఇద్దరు రాకుమారులు వారి దగ్గరున్న ధనాన్ని టాస్క్‌లతో పాటు సేవలు చేయించుకోవడానికి వినియోగించుకోవాల్సి ఉంటుంది. టాస్క్ పూర్తయ్యే సమయానికి ఏ రాకుమారుడికి ఎక్కువ మద్దతు లభిస్తే వాళ్లు సింహాసనాన్ని అధిష్టిస్తారు. అందరి కంటే ఎక్కువ ధనం ఉన్న రాజు, అతడి ప్రజలు కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని అందుకుంటారు. దీంతో రవి, సన్నీ సపోర్ట్ కోసం హౌస్మేట్స్ వెంట పడ్డారు. ఈ క్రమంలో యాంకర్ రవికి విశ్వ, శ్రీరామ్, హమీదా, శ్వేత, యానీ మాస్టర్ సపోర్ట్ చేయగా.. సన్నీకి మానస్, లోబో, ప్రియాంక సింగ్, ప్రియ, సిరి, షణ్ముఖ్, జెస్సీ మద్దతుగా నిలబడ్డారు. తర్వాత సడన్‌గా సిరి.. రవి గ్యాంగ్‌లో జాయిన్ అయిపోయింది. అయితే ఖజానాలో నుంచి ఒక్క పైసా దొంగిలించేది లేదని విశ్వ కుండ బద్ధలు కొట్టి చెప్పేశాడు. కానీ జెస్సీ, సిరి, షణ్ముఖ్, కాజల్ మాత్రం దొంగిలించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతలో ఖజానాలో నుంచి నాణాలు పోయాయని గుర్తించిన విశ్వ.. ఇవన్నీ చేతగానోళ్లు చేసే పనులంటూ చీదరించుకున్నాడు. తర్వాత బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన 'మట్టిలో మహాయుద్ధం' అనే కుస్తీపోటీలో రవి వైపు నుంచి నుంచి విశ్వ, శ్వేత, యానీ మాస్టర్; సన్నీ వైపు నుంచి మానస్, జెస్సీ, పింకీ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఏ రాజు గెలిస్తే అతడికి 150 నాణాలు లభిస్తాయి. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారనే విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టారు. ఈ గేమ్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే! -
సన్నీ Vs రవి: తొడగొట్టి సవాలు విసిరిన విశ్వ!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. ఈ రాజ్యానికి ఒక్కడే రాజు అని కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే కుర్చీ కోసం యాంకర్ రవి, సన్నీ ఇద్దరూ తెగ కష్టపడుతున్నారు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఖజానాలోని నాణాలను కూడా పంచుతున్నారు. ఈ క్రమంలో సిరి, షణ్ముఖ్, జెస్సీ, ప్రియాంక సింగ్, లోబో, ప్రియ.. సన్నీకి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించగా.. రవికి.. విశ్వ, శ్రీరామ్, హమీదా, శ్వేత, యానీ సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించారు. ఇక ఇద్దరు రాజుల కోసం విశ్వ, మానస్ బురదలో ఫైట్ చేసినట్లు కనిపించింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. దమ్ముంటే ముందుకొచ్చి ఆడాలి, కానీ దొంగబుద్ధులు ఏంది? అని తొడగొట్టి ప్రశ్నించాడు విశ్వ. పేరు తీసి మాట్లాడు, కానీ అందరినీ ఎందుకు అంటున్నావని ఆవేశపడ్డాడు మానస్. మరి హౌస్‌లో ఏం జరిగింది? ఎవరు కెప్టెన్ అయ్యారు? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్: నీకు సరదానేమో.. నాకు కాదు: కాజల్‌కు రవి వార్నింగ్
Heated Argument Between Ravi and Kajal: బిగ్‌బాస్ ఐదో సీజన్లో గొడవల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. సోమవారం ఎపిసోడ్లో కిచెన్‌లో పనుల పంపకాల్లో బేధాభిప్రాయాలు రావడంతో కెప్టెన్ శ్రీరామ్, జెస్సీ, షణ్ముఖ్, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. జెస్సీ ఫుడ్ జెస్సీనే వండుకుని తినాలని కెప్టెన్ శ్రీరామ్ ఆదేశించడం.. దీనిపై సిరి, షణ్ను సీరియస్ అవ్వడంతో ఇంట్లో యుద్ద వాతావరణం కనిపించింది. చివరకు శ్రీరామ్ ప్లేట్లో అన్నం తీసుకొచ్చి జెస్సీ, షణ్నూలకు తిపిపించడంతో గొడవ సమసిపోయినట్లు అనిపించింది. దీంతో ఇంట్లో అంతా హ్యాపీగా గేమ్‌పై ఫోకస్ పెడుతారనుకుంటున్న క్రమంలో రవి, కాజల్‌ల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తాజాగా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. బెడ్రూమ్లో పడుకుని ముచ్చట్లు పెట్టుకుంటున్న రవి, లోబోల దగ్గరకు వెళ్లిన కాజల్.. ‘నిన్న గొడవ జరిగింది దేనికి అంటే.. రవి, ఇంకా లోబో వాష్ రూమ్‌లో నుంచి లేచి, డిన్నర్‌లోకి రావడానికి’ అని సరదాగా ఆటపట్టిస్తూ చిందులేసింది. అదికాస్త పెద్ద గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. కాజల్ మాటలను సీరియస్‌గా తీసుకున్న రవి. అలా ఎలా అంటావంటూ. ఆమెపై ఫైర్ అయ్యాడు. ‘నేను సరదాగా అన్నాను’ అని కాజల్ చెప్పగా, ‘నీకు సరదానేమో, అవతలి వ్యక్తికి కాదు, అది తెలుసుకోకుండా ఎలా వస్తారు’అంటూ రవి ఫైర్ అయ్యాడు. అంతే కాదు రెచ్చగొట్టడం నాకు కూడా వస్తుందంటూ కాజల్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈ మాటల యుద్దం ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్: ఐదో వారం నామినేషన్లో 9 మంది!
Bigg Boss 5 Telugu, 5th Week Nominations: సండే ఫండే అంటాడు నాగార్జున.. కానీ కంటెస్టెంట్ల మధ్య మంట పెట్టే నామినేషన్స్ ఉన్న మండేనే అసలైన ఫండే అంటారు బిగ్‌బాస్ వీక్షకులు. ఎప్పటిలాగే ఈ వారం కూడా కంటెస్టెంట్లు నామినేషన్ ప్రక్రియకు రెడీ అయిపోయారు. గేమ్ సరిగా ఆడలేకపోతున్నవారితో పాటు, గ్రూపిజం చేస్తూ తమ మీద ప్రతాపాన్ని చూపిస్తున్న కంటెస్టెంట్లను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అయితే ఈసారి బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను భిన్నంగా నిర్వహించాడు. ముఖాముఖిగా నామినేషన్స్ జరపకుండా సీక్రెట్ రూమ్‌కి పిలిచి నామినేట్ చేయాలనుకుంటున్నవారి పేర్లు, అందుకు తగిన కారణాలను చెప్పమని ఆదేశించాడు. అయితే సన్నీ.. ఇలా సీక్రెట్‌గా కాకపోయినా, బయట నామినేషన్స్ జరిగినా ఈ రెండు పేర్లే చెప్దామని డిసైడ్ అయ్యాను అని పేర్కొన్నాడు. కాజల్.. తన స్ట్రాటజీ ప్రకారం.. తనను నామినేట్ చేసినవాళ్లనే నామినేట్ చేస్తానని క్లారిటీ ఇచ్చేసింది. లోబో.. ఇంటిసభ్యుల్లోని కొందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. నేనా రోజు సైలెంట్‌గా మాట్లాడుంటే షణ్ముఖ్ ఎవరిని నామినేట్ చేసేవాడని ప్రశ్నించాడు. ఇక రవి.. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని జెస్సీ నా పేరు ట్యాగ్ చేయడం ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అనిపిస్తుందంటూ అతడిని నామినేట్ చేశాడు. సింగర్ శ్రీరామచంద్ర.. సిరి, షణ్ముఖ్, జెస్సీ గ్రూపిజం చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇలా అందరూ వారివారి కారణాలు చెప్తూ నామినేట్ చేశారు. అయితే నామినేషన్స్‌కు సంబంధించిన షూటింగ్ నిన్ననే పూర్తవడంతో ఈవారం ఎవరెవరు నామినేట్ అయ్యారనే లిస్టు సోషల్ మీడియాలో లీకైంది. అనూహ్యంగా 9 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిలో యాంకర్ రవి, మానస్, సన్నీ, షణ్ముఖ్, సిరి, ప్రియ, విశ్వ, లోబో, హమీదా, జెస్సీ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సారి నామినేషన్లో ఊహించని కంటెస్టెంట్లు ఉండటంతో ఎలిమినేషన్ మరింత ఆసక్తికరంగా మారింది! -
నన్ను వాడుకుంటున్నావు: సిరికి షాకిచ్చిన షణ్ముఖ్
Bigg Boss 5 Telugu, Episode 28: జెస్సీని జైలు నుంచి విడుదల చేయడంతో వీకెండ్ ఎపిసోడ్ ప్రారంభమైంది. షణ్ముఖ్ తనను మళ్లీ దూరం పెడుతున్నాడని ఏడ్చేసింది సిరి. జెస్సీతో బానే ఉండి తనకు స్పేస్ ఇవ్వకపోవడంతో మండిపోతోంది అని కాజల్ దగ్గర వాపోయింది. అందుకే ఫ్రెండ్షిప్, కనెక్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు, లేదంటే ఇదిగో ఇలా ఒకటే యాపారం ఉంటుందని అంది. తర్వాత షణ్ముఖ్, సిరి ఒకే దగ్గర కూర్చుని మాట్లాడుకున్నారు. 'మెంటల్లీ నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. నన్ను వాడుకుంటున్నారన్న ఫీలింగ్ వస్తోంది. జెస్సీతో నాకున్న బాండింగ్ వేరు, కాబట్టి వాడు నన్ను వాడుకున్నా ఆ ఫీలింగ్ రాదు. కానీ నీ విషయంలో అలా కాదు' అని సిరి ముఖం మీదే చెప్పాడు. నిన్ను వాడుకున్నారనుకోవడం నీ అభిప్రాయం, తప్పు అనడం లేదు. నేను నీ దగ్గరుంటే గేమ్‌పై ప్రెజర్ పడుతుందని ఫీలవుతున్నావ్, అంతేగా.. ఈ ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్ ఉంది కానీ చెప్పను, టైం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు అని చెప్పింది సిరి. సింపతీ కార్డ్ వాడొద్దు: నాగ్ హెచ్చరిక తర్వాత నాగార్జున.. ఇంటిసభ్యులకు హాయ్ చెప్తూనే.. జెస్సీ మీద జాలిపడ్డాడు. హౌస్‌లో అతడిని తొక్కేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తర్వాత లోబోను నామినేషన్స్‌లో అంతెత్తున అరిచేసి సారీ చెప్పడం కరెక్టా? అని ప్రశ్నించాడు. దీనికతడు తన ప్రేమ గురించి కామెంట్ చేయగానే హర్ట్ అయ్యానని, కానీ గొంతు చించుకోలేదని చెప్పాడు. దీంతో నాగ్ నామినేషన్స్ టైంలో లోబో అరిచిన వీడియోను ప్లే చేయమంటావా? అని ప్రశ్నించగానే అతడు నీళ్లు నమిలాడు. పదేపదే బస్తీ నుంచి వచ్చానంటూ సింపతీ కార్డ్ యూజ్ చేయొద్దని హితవు పలికాడు. మీ వల్ల జెస్సీ సఫర్ అవుతున్నాడు బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు స్పెషల్ ఫుడ్ ఐటమ్స్‌ను పంపించడంతో కంటెస్టెంట్లు వాటిని గబగబా ఆరగించారు. అయితే షణ్ముఖ్- సిరి జోడీకి మాత్రం ఘాటైన పచ్చిమిర్చిని పంపించాడు. ఈ సందర్భంగా నాగ్.. షణ్ముఖ్ కూర్చుని కబుర్లు చెప్తున్నాడని, అతడిలోని ఫైర్ బయటకు తీసుకురావాలని మిర్చి పంపించాడని పేర్కొన్నాడు. నీ ఆట నువ్వు ఆడని సిరికి సూచిస్తూనే మీ వల్ల జెస్సీ సఫర్ అవుతున్నాడని తెలిపాడు. తర్వాత నాగ్ గిటార్ అందుకుని శ్రీరామ్ పాడిన పాట ప్లే చేశాడు. ఈ పాట వింటుంటే ఏం ఫీల్ వస్తుందని అడగ్గా.. హమీదా లవ్ ఫీల్ వచ్చిందని పేర్కొంది. దీంతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని మరోసారి చెప్పకనే చెప్పాడు నాగ్. తర్వాత యాంకర్ రవి సేవ్ అయినట్లు ప్రకటించాడు. లోబో ఉరిమి ఉరిమి చూస్తున్నాడు అనంతరం నాగ్ హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు. మొదటగా వచ్చిన రవి.. ప్రియాంక సింగ్‌ను అటెన్షన్ సీకర్‌గా పేర్కొన్నాడు. తర్వాత వచ్చిన ప్రియ.. లోబోను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమంటూ వాచ్ యువర్ టంగ్ అని పేర్కొంది. అతడు ఏం చేస్తానో తెలుసా? అంటూ భయపెట్టాడని, ఇప్పటికీ ఉరిమి ఉరిమి చూస్తున్నాడని చెప్పడంతో నాగ్.. బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ సేఫ్ అని వెల్లడించాడు. తర్వాత మానస్.. లోబో బ్రెయిన్ వాడితే బాగుంటుందని సూచించాడు. ఇక లోబో, యానీ మాస్టర్ కూడా ప్రియాంక సింగ్‌ను అటెన్షన్ సీకర్‌గా పేర్కొన్నాడు. ఇంతలో ప్రియ కలగజేసుకుంటూ.. శ్రీరామ్- మానస్ మధ్య ఏదైనా ఫైటింగ్ జరిగితే.. నా రెండు కళ్లు కొట్టుకుంటున్నాయ్ అని పింకీ తెగ బాధపడిపోతుందని చెప్పుకొచ్చింది. లోబో భార్యకు నాగ్ స్పెషల్ విషెస్ తర్వాత హమీదా.. సన్నీని బుర్ర వాడమని సూచించింది. కాజల్.. లోబో సింపతీ కోరుకుంటాడని పేర్కొంది. అనంతరం ప్రియ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. ఇక మళ్లీ గేమ్ కొనసాగగా నటరాజ్ మాస్టర్.. విశ్వ సింపతీ పొందాలని చూస్తాడని విమర్శించాడు. ఇక విశ్వ, సిరి.. లోబో మెదడు వాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇంతలో లోబో లేచి.. తన భార్య ఫాతిమా.. ఏడు నెలల గర్భవతి అని, ఆమెది ఈరోజు బర్త్‌డే అని చెప్పడంతో నాగ్ స్పెషల్ విషెస్ చెప్పాడు. ప్రియాంక సింగ్, శ్రీరామ్.. లోబోను, శ్వేత.. కాజల్‌ను వాచ్ యువర్ టంగ్ అని పేర్కొన్నారు. సేవ్ అయితే నాలో కొత్త సిరిని చూస్తారు తర్వాత వచ్చిన జెస్సీ.. రవిని మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని వార్నింగ్ ఇచ్చాడు. నీ గేమ్ నువ్వు ఆడుకో, నా మీద ఫోకస్ పెట్టడం ఆపేయ్ అని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. దీంతో నాగ్ కూడా రవికి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత షణ్ముఖ్.. సిరిని బ్రెయిన్ వాడమని సలహా ఇచ్చాడు. దీంతో సిరి.. తాను సేవ్ అయితే రేపటినుంచి ఇంకో సిరిని చూస్తారని సవాలు విసిరింది. అనంతరం నాగ్.. సన్నీ, కాజల్ సేవ్ అయినట్లు వెల్లడించాడు. దీంతో లోబో, యానీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్ ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీళ్లలో నటరాజ్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. -
బిగ్‌బాస్: నటరాజ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు
బిగ్‌బాస్ షోను జంతుప్రదర్శనశాలగా మార్చేస్తున్నాడు నటరాజ్ మాస్టర్. ప్రతి ఒక్కరినీ ఒక్కో జంతువుతో పోలుస్తూ అందరికీ ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు. తననేమైనా అంటే చెడుగుడు ఆడేసే ఈయన మిగతా కంటెస్టెంట్లను మాత్రం నోటికొచ్చినట్లు తిడుతుంటాడు. వారిని ఆయా జంతువులతో పోలుస్తూ టార్చర్ పెడుతుంటాడు. మొదట్లో హౌస్‌లో గుంటనక్క ఉందని ప్రచారం చేశాడు నటరాజ్. ఆ గుంటనక్క ఎవరు? అని స్వయంగా హోస్ట్ నాగార్జున అడిగినప్పటికీ ఆయన పెదవి విప్పలేదు. పైపెచ్చు హౌస్‌లో ఊసరవెల్లి కూడా ఉందని, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ రెండూ ఎవరో చెప్తానన్నాడు. అయితే రానురానూ ఆ రెండింటితో పాటు పిల్లి, నెమలి, ఎలుగుబంటి.. ఇలా ఎన్నో రకాల జంతువులు ఆయన లిస్టులో చేరాయి. అయితే రవిని గుంటనక్క అన్న అతడు.. ఇప్పుడు అదే రవిని నత్తతో పోల్చాడు, అది కూడా లోబో దగ్గర! దీంతో లోబో ఈ విషయాన్ని రవి చెవిలో ఊదాడు. దీంతో మరోసారి ఖంగు తిన్న రవి.. ఆయన తననెందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదని తల పట్టుకున్నాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా నటరాజ్ మాస్టర్ పద్ధతి బాగోలేదని విమర్శిస్తున్నారు. ఒకటీరెండుసార్లు ఏదైనా అంటే లైట్ తీసుకుంటారేమోకానీ పదేపదే జంతువులతో పోల్చడం ఏంటి? అని తిట్టిపోస్తున్నారు. ఈయన హౌస్‌మేట్స్‌కు పూటకో జంతువు పేరు పెడతాడంటూ నటరాజ్‌ను జంతుశాస్త్ర పితామహుడు అని సెటైర్లు వేస్తున్నారు. ఈయనను బిగ్‌బాస్‌లో కాకుండా జంతు ప్రదర్శనశాలలో ఉంచాల్సిందని కామెంట్ చేస్తున్నారు. #nattunuggets what amma, what is this amma?? New insect in bb house 🤦♀️ Votes enduku vesaramma , zoo ki velthe aipoyedi ga #BiggBossTelugu5 — Capri#ᴬᵇⁱʲᵉᵉᵗᴮᴰᵃʸᵀʳᵉⁿᵈᴼⁿᴼᶜᵗ¹⁰ᵗʰ (@BbfanCapricorn) October 1, 2021 #Nuggets assemble kotha name vacchindhi 😪 Ravi anniyaaa ki — 𝑺. (@ShravanUniverse) October 1, 2021 అయ్యా #Biggboss గారు దయచేసి #NatrajMaster ని లాస్ట్ వరకు ఉంచండి 🙏 ఎందుకంటే ఆయన ద్వారా మేము మరిన్నీ Animal's పేర్లు ఆ Animal's కి సంబంధించిన వారి పోలికలు మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం 😂 pic.twitter.com/jfYLH2uFN1 — Balu Nadiminti (@Balu_nadiminti) October 1, 2021 Arey bb 5 lo entertainer lobo kadu ra #natrajmaster 😂😂 — nithin_13🇮🇳 (@Nithin_rss) October 1, 2021 Zoo ki kothaga natha vachindhi ippudu 😂 Nattu master mari ekkuva ayindhi idhi next week ayina vellipovali 😴😪 Okati rendu ok Ravi Kuda enni sarulu silent vuntadu Siri Shannu waste raa babu target cheyadam or influence cheyadam idhe pani...😿#BiggBossTelugu5 pic.twitter.com/mbpPbzjP36 — Jahnavi#ᴬᵇⁱʲᵉᵉᵗᴮᴰᵃʸᵀʳᵉⁿᵈᴼⁿᴼᶜᵗ¹⁰ᵗʰ (@jahnavi003) October 1, 2021 Welcome to Bigg Boss house nattha garu. Go and meet guntanakka, nemali, oosaravelli, Baloo #BiggBossTelugu5 pic.twitter.com/vBOox1qmRP — RJ KAJAL ARMY (@bigbossstelugu5) October 1, 2021 #Ravi fed up with natraj finally One or two times Ok its will be irritation to anyone calling many times #BiggBossTelugu5 — 𝓢𝓷𝓮𝓪𝓴𝔂 ⛥ (@sneaky__7) October 1, 2021 -
కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు, గెలుపెవరిదో తెలుసా?
Bigg Boss Telugu 5, Episode 25: బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ వల్ల హౌస్‌మేట్స్‌కు అన్నం విలువేంటో తెలుసొచ్చింది. కడుపులో పేగులు అరుస్తున్నా గేమ్ కోసం వారి ఆకలిని చంపుకుని మరీ ఆడారు. వీరి జిహ్వచాపల్యానికి పరీక్ష పెడుతూ బిగ్‌బాస్ పదేపదే రుచికరమైన వంటకాలను పంపించాడు. మరి వాటిని ఎవరెవరు ఆరగించారు? ఎవరు గెలిచారు? అనేది తెలియాలంటే నేటి(సెప్టెంబర్ 29) ఎపిసోడ్ చదివేయాల్సిందే! ఎలాగైనా ఒక్క బజర్ అయినా కొట్టి బరువు తగ్గాల్సిందేనని సన్నీ, మానస్ తెగ ఆశపడ్డారు. కానీ అదేసమయంలో ముద్దపప్పు, ఆవకాయ గుర్తొస్తుందంటూ ఊహల్లో తేలిపోయారు. అటు లోబో పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. కానీ అతడి జంటసభ్యుడు అయిన నటరాజ్ మాస్టర్ మాత్రం ఎలాగైనా నోరు కట్టేసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో లోబో సరేనని తలూపాడు. మరోపక్క బిగ్‌బాస్ పావ్‌బాజీ పంపించగా ఇంటిసభ్యులు దాన్ని తిరస్కరించారు. ఆకలికి, ఆహారానికి మధ్య గ్యాప్‌లో బతికేస్తున్న ఎన్నో జీవితాలకు ఏదైనా మంచి సందేశమివ్వాలని బిగ్‌బాస్ ఆదేశమివ్వడంతో హౌస్మేట్స్ చిన్న స్కిట్ వేసి అందరినీ అలరించారు. అనంతరం కెప్టెన్ జెస్సీ తన ఆదేశాలను బేఖాతరు చేశాడని బిగ్‌బాస్ ఆగ్రహించాడు. ఇంట్లోని ఆహార పదార్థాలను ఇచ్చేయమని చెప్పినప్పుడు లోబో, సన్నీ తింటున్నా ఏమనకుండా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతడికి పెద్ద శిక్ష విధించాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో నుంచి జెస్సీతో పాటు అతడి జోడీ కాజల్‌ను అనర్హులుగా ప్రకటించాడు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన జెస్సీ.. ఏ ఒక్కరూ తన మాట వినలేదని చిర్రెత్తిపోయాడు. తనను టార్గెట్ చేయడమైతే వచ్చని చిందులు తొక్కాడు. అయినా కెప్టెన్‌కు సహకరించకపోవడం మన తప్పేనని కొందరు ఇంటిసభ్యులు పశ్చాత్తాపపడుతుంటే నటరాజ్ మాస్టర్ మాత్రం అసలు కెప్టెన్ ఇలా ఉంటాడా? కమాండింగ్‌గా ఉండాలి అని హితబోధ చేశాడు. ఇక జెస్సీని చెడగొడుతున్నారని సన్నీ, మానస్ అభిప్రాయపడ్డారు. మరోవైపు షణ్ముఖ్.. జెస్సీని కూర్చోబెట్టుకుని ఇక్కడ అందరూ సమానమే, ఎవరినీ అన్న, తమ్ముడు అని కాకుండా పేరు పెట్టి పిలవమని సూచించాడు. తర్వాత పిడుగుల శబ్ధం వినబడగానే విశ్వ మొదటగా వెళ్లి బజర్ నొక్కాడు. దీంతో విశ్వ-రవి జోడీ.. ప్రియాంక సింగ్-ప్రియను పోటీదారులుగా ఎంచుకున్నారు. ఈ రెండు గ్రూపులకు కట్టెలు కొట్టడాన్ని టాస్క్‌గా ఇచ్చారు. ఇందులో 'విశ్వ' ప్రతాపం చూపించడంతో వీళ్ల జంట గెలిచింది. ఇక షణ్ముఖ్ మరోసారి.. టాస్కులో నీ వల్ల ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నానని రవితో చెప్పుకొచ్చాడు. అసలు నీవల్ల జెస్సీ ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడని రవి రివర్స్ కౌంటరివ్వగా వాడే నాకు చెప్తూ ఉంటాడని కవరింగ్ ఇచ్చాడు షణ్ను. నీతో మాట్లాడటమే లేదు, అయినా ఇంకా ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నా అనడమేంటో అర్థం కావడం లేదని అయోమయానికి లోనయ్యాడు. దీన్ని తెగేదాకా లాగడం అనవసరమని భావించి అక్కడితో ఆ విషయానికి ఫుల్స్టాప్ పెట్టాడు రవి. ఇంతలో బిగ్‌బాస్ బర్గర్ అండ్ ఫ్రైడ్ చికెన్ పంపించగా దాన్ని ఆరగిస్తానంటూ జెస్సీ ముందుకు వచ్చాడు. కానీ అంతలోనే పింకీ వచ్చి ఆ ప్లేటు పట్టుకెళ్లిపోయింది. లోబో ఆకలి చూపులు అర్థమైన రవి.. నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి ఎందుకైనా మంచిది, నీ జోడీని ఓ కంట కనిపెడుతూ ఉండమని హెచ్చరించాడు. అలా హెచ్చరించాడో లేదో, అటు లోబో ఆకలిని తట్టుకోలేక చెత్త కవర్లో ఫుడ్ కోసం వెతికాడు. అతడి బాధ అర్థమైన మాస్టర్.. నీకు ఆకలైతే తినేసేయ్ అని చెప్పాడు. తర్వాతి రౌండ్లో సన్నీ బజర్ నొక్కగా, అతడు లోబో-నటరాజ్ మాస్టర్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. వీరికి బిగ్‌బాస్ మునుగుతారా? తేలుతారా? అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో కొన్ని వస్తువులు నీళ్లలో మునుగుతాయా? లేదా? అన్నది కరెక్ట్‌గా గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తెలివిగా ఆడిన మానస్-సన్నీ గెలుపొందారు. తర్వాత బిగ్‌బాస్ మటన్ బిర్యానీ పంపడంతో అందరూ ఆవురావురుమని ఆరగించారు. నటరాజ్ మాస్టర్, శ్రీరామ్, సన్నీ, హమీదా, సిరి, షణ్ముఖ్, మానస్ మాత్రం ముక్క కూడా ముట్టకుండా ఉపవాసం చేశారు. మొత్తంగా ఎక్కువ కిలోలు తగ్గిన మూడు జోడీల నుంచి ముగ్గురు.. సన్నీ, శ్రీరామ్, శ్వేత కెప్టెన్సీకోసం పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. వీరిలో శ్రీరామచంద్ర నాలుగో కెప్టెన్‌గా అవతరించాడని అంటున్నారు. మరి అందులో ఎంత నిజముందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. -
దయనీయం: చెత్తబుట్టలో నుంచి ఫుడ్ ఏరుకున్న లోబో
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఆకలి విలువేంటో నేర్పుతున్నాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడిపోమన్న బిగ్‌బాస్ వారిని బరువు తగ్గమని ఆదేశించాడు. ఇందుకోసం వారికి తిండి పెట్టకుండా సతాయిస్తున్నాడు. కేవలం ప్రోటీన్స్ షేక్, కొబ్బరి బోండాం నీళ్లు మాత్రమే అందిస్తున్నాడు. దీంతో ఓవైపు ఆకలితో అలమటిస్తూనే మరోవైపు ఎలాగైనా టాస్క్‌లో గెలవాల్సిందేనని కసితో రగిలిపోతున్నారు కంటెస్టెంట్లు. కానీ ఆకలితో నకనకలాడిపోతున్న లోబో తన కడుపు మాడ్చుకోలేక చెత్తబుట్టలో ఫుడ్ కోసం వెతికాడు. ఇది చూసి అక్కడున్న రవి షాకయ్యాడు. బుల్లితెర ప్రేక్షకులు సైతం లోబో పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు. కాగా ఈ టాస్క్ ప్రారంభమవడానికి ముందు ఇంట్లోని ఫుడ్ మొత్తాన్ని పంపించేయమని ఆదేశించాడు బిగ్‌బాస్. ఆ సమయంలో లోబో తన యాపిల్‌ను దాచుకుని దాచుకుని తిన్నాడు. దీంతో బిగ్‌బాస్ తన ఆదేశాలను బేఖాతరు చేశారంటూ కెప్టెన్ జెస్సీకి శిక్ష విధించాడు. జెస్సీతో పాటు అతని జోడీ కాజల్ కూడా కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయారని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో జెస్సీ, కాజల్ షాక్‌లోకి వెళ్లిపోయారు. హౌస్‌మేట్స్‌ను టెంప్ట్ చేసేందుకు బిగ్‌బాస్ ఫుడ్ పంపించగా ప్రియాంక సింగ్ తన నోటిని కట్టేసుకోలేక అందరికీ ఊరిళ్లు వచ్చేలా ఆ వంటకాన్ని ఆవురావుమని ఆరగించింది. -
బిగ్‌బాస్ అరాచకం.. తినే కంచాన్ని లాగేసుకున్నాడు!
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ రియాల్టీషో బిగ్‌బాస్ సీజన్ 5లో టాస్కుల మోతాదు రోజు రోజుకు పెరుగుతోంది. ఇన్ని రోజులు కెప్టెన్సీ కంటెడర్ టాస్క్‌లుగా చిన్న చిన్న గేమ్స్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఈ సారి మాత్రం టాస్క్ ఆడాలంటే బరువు తగ్గాల్సిందేనని కండీషన్ పెట్డాడు. మరి ఆ కండీషన్‌ని కంటెస్టెంట్స్ ఫాలో అయ్యారా? ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచేందుకు ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఎలాంటి టాస్కులు ఇచ్చాడు? వాటిని ఎలా ఆడారో నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. గుంట నక్క నేనే కదా: రవి నిన్నటి నామినేషన్స్‌లో మరోసారి తెరపైకి వచ్చిన గుంటనక్క ఇష్యూని రవి మర్చిపోలేకపోతున్నాడు. గుంటనక్క అని నన్నే అన్నావ్ కదా అని నటరాజ్ మాస్టర్ని రవి అడిగాడు. అయితే మాస్టర్ మాత్రం నేరుగా చెప్పకుండా నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావ్ అని కౌంటర్ ఇచ్చాడు. పికాక్ ఎగిరిపోయిందని లహరిని ఉద్దేశించి రవి దగ్గర జోక్ చేశాడు నటరాజ్ మాస్టర్. సర్లే మాస్టర్ గుంటనక్క నేనే కదా.. నిజం చెప్పండి మాస్టర్.. ప్రతివారం నాగార్జున గారు గుంటనక్క అని అంటే.. అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు.. నాకు ఎట్లా ఉంటుంది అన్నా.. అని ఎమోషనల్ అయ్యాడు రవి. దీంతో నటరాజ్ మాస్టర్ నవ్వుతూ.. నువ్వు ఇంకొకరి ఇన్ఫ్లుయన్స్ చేయకు బ్రదర్ అని పరోక్షంగా గుంటనక్క నువ్వే అని చెప్పేశాడు. అలాగే ఆ మాట నేను ఎప్పుడో మర్చిపోయానని, కానీ ఓ ఊసరవెళ్లి నా దగ్గరకు వచ్చి రవికి కరెక్ట్ పేరు పెట్టావు అని చెప్పాడు అని పరోక్షంగా విశ్వను ఉద్దేశించి అన్నాడు. ఈ విషయాన్ని డైరెక్ట్‌గా విశ్వ దగ్గర ప్రస్తావించాడు రవి. ‘నేను విశ్వ అన్నా.. విశ్వ అన్నా అని అంటుంటే నువ్ మాస్టర్ దగ్గరకు పోయి.. గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నావట’అని విశ్వని నిలదీశాడు రవి. దీంతో విశ్వ షాకయ్యాడు. నేను ఆ మాట అనలేదు డార్లింగ్. ఆ మనిషితో మాట్లాడటమే వేస్ట్ అని మాస్టర్ని అన్నాడు. మరోవైపు నామినేషన్లో లోబో అన్న మాటలకు ప్రియ బాగా హర్ట్ అయింది. తను ఏడుస్తుంటే మిగతా సభ్యులంతా వెళ్లి ఓదార్చారు. లోబో వెళ్లి ప్రియని హగ్ చేసుకొని ఇద్దరి మధ్య ఉన్న గొడవని పోగొట్టేశాడు. (చదవండి: బిగ్‌బాస్: డేంజర్ జోన్లో ఆ ముగ్గురు, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..) నన్ను ఫ్రెండ్ అని పిలవకు.. రవికి కాజల్ వార్నింగ్ నిన్నటి నామినేషన్స్‌లో ఆర్జే కాజల్‌ని నామినేట్ చేస్తూ ఆమె ఫిజికల్‌గా తనని కొట్టిందని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పారు యాంకర్ రవి. ఆ మాటకి కాజల్ బాగా హర్ట్ అయింది. ఒక్కొక్కరి కూల్ చేసుకుంటు వస్తున్న రవి.. కాజల్‌తో మాట్లాడేందుకు దగ్గరకు రాగా.. ప్లీజ్ రవి.. నీతో నాకు మాట్లాడలని లేదు. ఫిజికల్ అని అంటావా? ఏమనుకోవాలి? నువ్ నాతో మాట్లాడకు రవి అంటూ అక్కడ నుంచి లేచి లోపలికి వెళ్లిపోయి బోరు బోరున ఏడ్చేసింది. లవ్ అంటే ఏంటో చూపిస్తాం బిగ్‌బాస్ : జెస్సీ బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ చిన్న పిల్లాడిగా ట్రీట్ చేసే జెస్సి.. తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటపెట్టాడు. శ్వేతతో కలిసి శ్వేతతో పులిహోర కలిపాడు ఈ అమాయకపు చక్రవర్తి. శ్వేతకు తన గర్ల్‌ఫ్రెండ్ పాత్ర ఇచ్చి ఓ టాస్క్ఇవ్వడంటూ ఏకంగా బిగ్‌బాస్‌కే విజ్ఞప్తి చేశాడు. ‘నేను రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్‌బాస్.. మా ఇద్దరిని కలిపి బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌గా ఓ రోల్ పెట్టండి. ‘మనోహర.. మనోహర’అనే రొమాంటిక్ సాంగ్ ప్లే చేయండి’అంటూ బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఇక జెస్సీ మాటలకు శ్వేత పడిపడి నవ్వింది. తినే తిండిని లాగేసుకున్నాడు గార్డెన్ ఏరియాలో ఓ వేయింగ్ స్కేల్ ఏర్పాటు చేసి ఇంటి సభ్యులందరి బరువుని కొలిపించాడు బిగ్‌బాస్. అనంతరం వారిని బయట ఉంచి, ఇంట్లోకి అజ్ఞాతవాసులు వచ్చి కిచెన్‌లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకెళ్లారు. దీంతో ఇంటి సభ్యులందరూ కామెడిగా గట్టిగా అరిచారు. డోర్స్ ఓపెన్ చేశాక ఇంట్లోకి వెళ్లి దాచుకున్న ఫుడ్ ఐటమ్స్ తినడం మొదలు పెట్టారు. దీంతో ఇంట్లో మిగిలిఉన్న ఆహార పదార్థాలన్నీ తీసుకురావాల్సిందిగా కెప్టెన్ జెస్సిని ఆదేశించాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ ఆర్డర్ వేయడంతో చేసేదేమిలేక తినే తిండిని ఇచ్చేశారు కంటెస్టెంట్స్. లోబో అయితే ఆపిల్‌ని దాచుకొని మరి తింటూ చివరకు ఇచ్చాడు. సన్నీ కూడా దాచుకున్న ఫుడ్‌ని చాటున తిన్నాడు. జంటలుగా విడిపోయారు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను జంటలుగా విడిపోవాలని ఆదేశించాడు బిగ్‌బాస్. జోడిని ఎంచుకునే చాయిస్‌ని ఇంటి సభ్యులకే ఇచ్చేశాడు. దీంతో జశ్వంత్-కాజల్, సిరి-షణ్ముఖ్, లోబో- నటరాజ్ మాస్టర్, రామ్-హమిదా, యానీ-శ్వేత, ప్రియా- ప్రియాంక, రవి-విశ్వ, సన్నీ-మానస్ విడిపోయారు. గెలవాలంటే తగ్గాల్సిందే.. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులకు ‘గెలవాలంటే తగ్గాల్సిందే’టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ఏ జంట అయితే అందరికంటే ఎక్కువగా బరువుని కోల్పోతారో వారే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌గా నిలుస్తారు. సమయానుసారం బిగ్‌బాస్ మీకు కొన్ని చాలెంజర్స్ ఇస్తాడు బిగ్‌బాస్. దీంట్లో గెలిచిన జంటకు అర కేజీ బరువు తగ్గుతుంది. ఓడిన జంటకు అరకేజీ బరువు పెరుగుతుంది. ఇక టాస్క్ అనగానే.. జంటలన్నీ బరువు తగ్గేందుకు వర్కౌట్ స్టార్ట్ చేశాయి. హమిదా-శ్రీరామ్ జంట అయితే ఫుడ్‌తో పాటు వాటర్ కూడా తీసుకోవద్దని డిసైడ్ అయింది. ఫస్ట్ చాలెంజ్.. పట్టుకోండి చూద్దాం గెలవాలంటే తగ్గాల్సిందే టాస్క్‌లో భాగంగా తొలి చాలెంజ్‌గా ‘పట్టుకోండి చూద్దాం’అనే గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. దీంట్లో భాగంగా.. పవర్ రూమ్ యాక్సెస్ పొందిన జంట..తమతో పోటీకి దిగబోయే జంటను ఎంచుకునే అవకాశం ఉటుంది. ఇందులో నటరాజ్ మాస్టర్-లోబో జంట పవర్ రూమ్ యాక్సెస్ పొంది శ్రీరామ్-హమిదాలను తమ పోటీదారులుగా ఎంచుకున్నారు. ఈ గేమ్‌లో శ్రీరామ్-హమిదా జంట విజయ సాధించింది. -
బిగ్‌బాస్: పికాక్ ఎగిరిపోయింది, అతనే ఊసరవెళ్లి.. విశ్వని ఇరికించిన నటరాజ్
బిగ్‌బాస్ హౌస్‌లో అందరి ప్రవర్తన ఒక తీరు అయితే నటరాజ్ మాస్టర్ ప్రవర్తన మరోతీరు. నామినేషన్ ప్రక్రియ మొదలైయ్యిందంటే చాలు.. ఊగిపోతాడు. ఎవరైనా తనను నామినేషన్ చేస్తే చాలు తన వెనుక ఎవరో ఉన్నారని, అందుకే తనను నామినేట్ చేశారని ఆరోపిస్తాడు. తొలి వారం నుంచి నటరాజ్ మాస్టర్ ఈ ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. హౌస్‌లో అంతా నటిస్తున్నారని, తాను మాత్రమే ఓపెన్‌గా ఉంటున్నానని తనకు తాను కితాబిచ్చుకుంటాడు. అంతేకాదు ఇంట్లో గుంటనక్క, ఊసరవెళ్లి, గొర్రెలు ఉన్నాయంటూ హౌస్‌మేట్స్‌పై విరుచుకుపడుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ గుంటనక్క, ఊసరవెళ్లి, గొర్రెలు ఎవరో చెప్పడానికి మాత్రం మాస్టర్ వెనకడుగు వేయడం ఇంటి సభ్యులకు మింగుడుపడటం లేదు. (చదవండి: ఏడేళ్లు సహజీవనం చేశా, నా ఆస్తి అడిగాడు: సరయూ) ఇక నిన్నటి నామినేషన్స్‌లో కూడా గుంటనక్క ఇష్యూ తెరపైకి వచ్చింది. గుంటనక్క అని నన్నే అన్నావ్ కదా అని యాంకర్ రవి అడగ్గా.. నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావ్ అని నటరాజ్ మాస్టర్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఈ రోజు కూడా గుంటనక్క ఇష్యూపై ఇంట్లో చర్చ జరిగినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. పికాక్ ఎగిరిపోయిందని లహరిని ఉద్దేశించి రవి దగ్గర జోక్ చేశాడు నటరాజ్ మాస్టర్. సర్లే మాస్టర్ గుంటనక్క నేనే కదా.. నిజం చెప్పండి మాస్టర్.. ప్రతివారం నాగార్జున గారు గుంటనక్క అని అంటే.. అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు.. నాకు ఎట్లా ఉంటుంది అన్నా.. అని ఎమోషనల్ అయ్యాడు రవి. దీంతో నటరాజ్ మాస్టర్ రవి దగ్గర గుంటనక్క మ్యాటర్ ఓపెన్ అయ్యాడు. ఓ ఊసరవెళ్లి నా దగ్గరకు వచ్చి రవికి గుంటనక్క అని కరెక్ట్‌గా పేరు పెట్టారని అన్నాడు అంటూ విశ్వని ఇరికించాడు మాస్టర్. ఈ విషయాన్ని డైరెక్ట్‌గా విశ్వ దగ్గర ప్రస్తావించాడు రవి. ‘నేను విశ్వ అన్నా.. విశ్వ అన్నా అని అంటుంటే నువ్ మాస్టర్ దగ్గరకు పోయి.. గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నావట’అని విశ్వని నిలదీశాడు రవి. దీంతో విశ్వ షాకయ్యాడు. మరోవైపు నామినేషన్ ప్రక్రియ రవి, కాజల్ మధ్య దూరం పెంచినట్లు తెలుస్తోంది. నన్ను చెంపపై కొట్టావని చెబుతూ రవి నామినేట్ చేయడాన్ని అస్సల్ రిసీవ్ చేసుకోలేకపోయింది కాజల్. నీతో మాట్లాడలని లేదు అని రవి ముఖం మీదే చెప్పింది. -
తలదించుకున్న రవి, చెప్పుతో కొట్టినా పడతానన్న లోబో
Bigg Boss Telugu 5, Episode 23: బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లను ఎప్పుడూ వెంటాడే గండం నామినేషన్స్. ఈ నామినేషన్స్‌లో ఇరుక్కున్నవాళ్లు వారమంతా బిక్కుబిక్కుమంటూ టెన్షన్‌తోనే గడపాల్సి వస్తుంది. నామినేట్ కాని ఇంటిసభ్యులు ఎంచక్కా జాలీగా గడుపుతూ ఇంకో వారం దాకా మన బెర్త్‌కు ఏ ఢోకా లేదని ధీమాగా ఉంటారు. నేటి(సెప్టెంబర్ 27) ఎపిసోడ్లో నామినేషన్స్ వాడివేడిగా జరిగాయి. ఒక్కొక్కరి బండారాలు బయటపెడుతూ నామినేట్ చేసుకున్నారు ఇంటిసభ్యులు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేద్దాం... నువ్వంటే ఇష్టం, ఎలా కనెక్ట్ అయ్యానో తెలీదు: హమీదా లహరి విషయంలో అమ్మ మీద ఒట్టేసి అబద్ధం ఎలా చెప్పానని యాంకర్ రవి తనలో తానే మథనపడ్డాడు. తర్వాత ఇంట్లోకి వచ్చిన అతిథి బేబీ బొమ్మను బిగ్‌బాస్ తిరిగి తీసుకున్నాడు. ఇక హమీదా.. నువ్వంటే నాకిష్టం, నీకు ఎలా కనెక్ట్ అయ్యానో తెలీదు అంటూ మరోసారి శ్రీరామ్ దగ్గర ప్రేమ ఊసులు మాట్లాడింది. అతడు మాత్రం ఇంకా వివరంగా చెప్పంటూ అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగోవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు ఇంటిసభ్యుల ముఖాల్లోని ఒక భాగాన్ని తీసివేసి స్విమ్మింగ్ పూల్‌లో వేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. చెప్పు తీసుకుని కొట్టు వింటాను, కానీ..: లోబో మొదటగా వచ్చిన ప్రియ.. తనతో సరిగా ఉండట్లేదని లోబో, మానస్‌ను నామినేట్ చేసింది. విశ్వ.. రవి, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. లోబో.. నేను లైఫ్‌లో ఒకే ఒక అమ్మాయిని ప్రేమించా. నా లవ్ గురించి చెప్తుంటే నువ్వు అది సినిమా స్టోరీలా ఉందన్నావు. ఆ మాటతో నా ఖలేజా పగిలిపోయింది. నన్ను తిట్టు, చెప్పు తీసుకుని కొట్టు వింటా.. కానీ అలా మాట్లాడకు అంటూ ప్రియపై గయ్యిమని అరిచాడు. అతడు తన మీదకు అలా దూసుకురావడంతో షాకైన ప్రియ.. నాపై అరిచే హక్కు నీకు లేదని వార్నింగ్ ఇచ్చింది. ఆ టైంలో ఆకలేంటి?: లోబో అయినప్పటికీ వెనక్కు తగ్గని లోబో.. నేను ప్రేమించిన, టైంపాస్ చేయలే, అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చిన అని చెప్తుండగా మధ్యలో అడ్డుకున్న ప్రియ.. తెలుస్తుంది అమ్మాయిలకు ఎంత గౌరవమిస్తావో అని కౌంటరిచ్చింది. జనాలవల్లే తానీ స్టేజీలో ఉన్నానంటూ అరిగిన టేపు రికార్డర్‌లా చెప్పిందే మరోసారి చెప్పాడు లోబో. అంతలోనే ఆకాశం వంక చూసి ఏడ్చేయడంతో రవి అతడిని ఓదార్చాడు. ఈ సీన్ చూసిన ప్రియ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడొద్దు అని చురకలంటించింది. తర్వాత అతడు సిరిని నామినేట్ చేస్తూ.. కాజల్ లవ్‌స్టోరీ చెప్తుండగా ఆకలేస్తోంది అని ఎలా అనగలిగావని విమర్శించాడు. ప్రతిసారి బస్తీ నుంచి వచ్చాననకు: చిరాకు పడ్డ షణ్ముఖ్ శ్రీరామ్.. లాస్ట్ వీక్ తనను నామినేట్ చేసిన శ్వేత, యానీ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. తర్వాత షణ్ముఖ్.. మీ వల్ల ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నానంటూ రవిని, ప్రియకు రెస్పెక్ట్ ఇవ్వలేదని లోబోను నామినేట్ చేశాడు. దీంతో లోబో మరోసారి తను పేదవాడినంటూ ఫ్లూటు వాయించాడు. దీంతో చిర్రెత్తిపోయిన షణ్ను ప్రతిసారి బస్తీ నుంచి, కింది నుంచి వచ్చానని చెప్పొద్దు, అందరం అక్కడి నుంచే వచ్చామంటూ అతడి నోరు మూయించాడు. తర్వాత వచ్చిన కాజల్.. నామినేషన్స్‌ను వ్యక్తిగతంగా తీసుకుంటారని నటరాజ్ మాస్టర్‌ను, సేఫ్ గేమ్ ఆడొద్దంటూ సన్నీని నామినేట్ చేసింది. మధ్యలో దూరి ఏదో ఒకటి అనేయకండి: మానస్ హెచ్చరిక లోబో ఎప్పుడెలా ఉంటాడో ఎవరికీ తెలీదు, అప్పుడప్పుడు కామెడీ కూడా లిమిట్ దాటుతుంది. మీరు సింపథీకి ట్రై చేస్తున్నారనిపిస్తోందంటూ సిరి లోబోను, తర్వాత యానీ మాస్టర్‌ను నామినేషన్లోకి పంపించింది. మానస్.. నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేయగా ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇద్దరు మాట్లాడినప్పుడు మధ్యలో దూరి ఏదో ఒకటి అనేయకండని మానస్ హెచ్చరించాడు. అసభ్యకరమైన భాష వాడొద్దని లోబో ఫొటోలో నుంచి ఓ ముక్కను విసిరేశాడు. శ్వేత.. లోబో, రవిని; హమీదా.. లోబో, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశారు. డైరెక్ట్‌గా చేయి పెట్టడం నచ్చలేదు: ప్రియాంక సింగ్ నటరాజ్ మాస్టర్.. అతిగా నటించకూడదు, నువ్వు వీక్ అనిపిస్తోంది అంటూ విశ్వను చిన్నచూపు చూస్తూ నామినేట్ చేశాడు. నువ్వెవరివి నన్ను నటిస్తున్నావని డిసైడ్ చేయడానికి అని విశ్వ ఫైర్‌కావడంతో మాస్టర్ మీసం మెలేస్తూ మరింత రెచ్చగొట్టాడు. 'సింహంతో వేట నాతో ఆట రెండూ ప్రమాదకరమే, అది అడవిలో ఉంటది, ఇది బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటుంది' అని డైలాగులు వల్లె వేయడంతో కాజల్ ఫక్కున నవ్వేసింది. మీకోసం వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఫామ్ అవుతుందన్న ఆలోచనే తప్పని నొక్కి చెప్పింది, కానీ అతడు వినిపించుకోనేలేదు. ఇక తనను ఇన్ఫ్లూయెన్స్ చేయొద్దని హెచ్చరిస్తూ రవిని నామినేట్ చేశాడు మాస్టర్. ప్రియాంక సింగ్.. సోఫాలో నిలబడ్డప్పుడు మీరు డైరెక్ట్‌గా చేయి పెట్టారు. అది నాకు నచ్చలేదంటూ లోబోను తర్వాత కాజల్‌ను నామినేట్ చేసింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయిన యాంకర్ రవి అనంతరం వచ్చిన రవి.. అందరి ముందుకు రావాలంటేనే సిగ్గుగా ఉందని తలదించుకున్నాడు. శనివారం నా జీవితంలోనే వరస్ట్ రోజు. నేను ముగ్గురికి.. ప్రియ, లహరి, అమ్మకు సారీ చెప్తున్నాను. ప్రియకు చెప్పిన మాటను చెప్పలేదంటూ అమ్మ మీద ఒట్టేశాను అని బాధతో పశ్చాత్తాపపడ్డాడు. తనను కొట్టిందంటూ కాజల్‌ను, మీరు గుంటనక్క అని తననే అన్నారంటూ నటరాజ్ మాస్టర్‌ను రవి నామినేట్ చేశాడు. తర్వాత యానీమాస్టర్ తనను నామినేట్ చేసిన శ్రీరామ్, సిరి ఫొటోల ముక్కలు పూల్‌లో వదిలేసింది. సన్నీ.. తనను పదేపదే సేఫ్ గేమ్ ఆడుతున్నారన్న ప్రియ, కాజల్‌ను; జెస్సీ.. ప్రియాంక, రవిని నామినేట్ చేశారు. మొత్తంగా ఈ నాలుగో వారం నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. -
బిగ్‌బాస్: నాలుగోవారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది!
'బిగ్‌బాస్‌లో అన్ని టాస్కుల యందు నామినేషన్ టాస్కు వేరయా!' అంటారు బుల్లితెర అభిమానులు. ఎందుకంటే అప్పుడే కదా కంటెస్టెంట్లు కొట్టుకునేది, తిట్టుకునేది, అరుచుకునేది.. ఆ సమయంలోనే కదా వారి నిజస్వరూపాలేంటో తెలుసుకునేది! అందుకనే బిగ్‌బాస్ వీక్షకులకు మండే వచ్చిందంటే చాలు పండగే! టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చూస్తుండగానే మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి షారి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. తాజాగా నాలుగో కంటెస్టెంట్‌ను బయటకు పంపిచేందుకు నామినేషన్స్ జరగనున్నాయి. అయితే ఈ నామినేషన్ల పర్వానికి సంబంధించిన షూటింగ్ నిన్ననే పూర్తి కావడంతో ఈవారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారంటూ తాజాగా ఓ లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లిస్టులో సిరి హన్మంత్, ప్రియ, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, యాంకర్ రవి, వీజే సన్నీ, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. మరి నాలుగోవారం నామినేషన్లో ఉన్నది ఈ 8 మందేనా? అన్నదానిపై స్పష్టత రావాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
లహరి ఎలిమినేట్, షాకైన యాంకర్ రవి!
చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదంటారు! కానీ ఇది అన్నిచోట్లా వర్తించదు. మరీ ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో! ఇక్కడ తప్పు చేసి తప్పించుకు తిరిగేవారుంటారు, తాము చేసిన తప్పులకు వేరొకరిని బలి చేసేవాళ్లూ ఉంటారు.. ఆ రకంగా చూస్తే ఈవారం యాంకర్ రవి, ప్రియ చేసిన తప్పిదాలకు లహరి శిక్ష అనుభవించేట్లు కనిపిస్తోంది. నేటి ఎపిసోడ్లో ఆమె ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లీకువీరులు సోషల్ మీడియాలో టముకేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా వుంటే ఎలిమినేట్ అయ్యేది ఎవరంటూ తాజాగా ప్రోమో రిలీజైంది. ప్రియ, లహరి పేర్లు రాసి ఉన్న బల్బ్స్ పట్టుకున్న నాగ్ ఎవరికి గ్రీన్ లైట్ వస్తే వారు సేఫ్ అని పేర్కొన్నాడు. ఇలా చెప్పిన మరికాసేపటికే ప్రియ నమస్కరించడానికి అన్నట్లుగా చేతులు పైకెత్తినట్లు కనిపించడంతో ఆమె సేఫ్ అని తెలుస్తోంది. దీంతో లహరి ఎలిమినేట్ అయినట్లు స్పష్టమవుతోంది. ఇక లహరి ఎలిమినేషన్‌తో యాంకర్ రవి ఒక్కసారిగా షాక్ అయినట్లు చూపించారు. మరి హౌస్‌ను వీడేది లహరియేనా? కాదా? ఆమె ఎలిమినేషన్ హౌస్‌మేట్స్‌పై ఎలాంటి ప్రభావం చూపనున్నది అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
అమ్మపై ఒట్టేసి అబద్ధమాడిన రవి, ఇజ్జత్ తీసిన నాగ్
Bigg Boss 5 Telugu, Episode 21: రవి-ప్రియ-లహరిల మధ్య జరిగిన వాదోపవాదాలకు తెర దించాడు నాగార్జున. ఒక్క వీడియోతో లహరి కళ్లు తెరిపించాడు. రవి చేతిలో నమ్మకద్రోహానికి గురైన లహరి తనకు నిజానిజాలేంటో తెలియచేసినందుకు నాగ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఇంటిసభ్యులు ఎవరు హౌస్‌లో ఉండకూడదనుకుంటున్నారో వారిచేతే చెప్పించాడు. ఇక ఈ వారం నామినేషన్లో ఉన్న ఐదుగురిలో ఇద్దరిని సేవ్ చేశాడు. మరి నేటి(సెప్టెంబర్ 25) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. బిగ్‌బాస్‌కు నేను కరెక్ట్ కాదు: షణ్ముఖ్ ఈవారం సిరితో ఎక్కువగా ఉండలేదని, అయినప్పటికీ వీకెండ్లో నాగార్జున సిరిని తనను కలిపి ఏమైనా అన్నారంటే టీవీలోంచి దూకేస్తా అన్నాడు షణ్ముఖ్. ఇక్కడ ఫ్రెండ్షిప్ చేయాలంటేనే భయమేస్తుందన్నాడు. అసలు బిగ్‌బాస్‌కు తాను కరెక్ట్ కాదని బాధపడ్డాడు. యాంకర్ రవి ఇచ్చే సలహాలు కూడా నచ్చడం లేదని జెస్సీ దగ్గర విసుక్కున్నాడు. మరోపక్క సిరి మాత్రం.. ఇప్పటికీ షణ్ను తనను ఎందుకు దూరం పెడుతున్నాడో అర్థం కావడం లేదని బాధపడింది. జెస్సీ మాటలకు షణ్ను ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడని అభిప్రాయపడింది. పింకీ అందాన్ని చూసి మైమరచిపోయిన శ్రీరామ్ పాట పాడటంతో ఆమె ఆ పాటకు తగ్గట్టు స్టెప్పులేసింది. నిజం తెలుసుకున్న లహరి తర్వాత నాగార్జున ఇంటిసభ్యులను పలకరిస్తూనే రవి, ప్రియ పేర్లు రాసి ఉన్న టైల్స్‌ను సుత్తెతో పగలగొట్టాడు. దీంతో రవి, ప్రియ నామినేషన్స్‌లో జరిగిన రచ్చను మరోసారి ప్రస్తావించారు. అయితే వీరి గొడవలో బాధితురాలైన లహరికి అసలు నిజమేంటో తెలియాలని ఆమెను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి రవి మాట్లాడిన వీడియో చూపించారు. ఆ వీడియోలో లహరి యాంకరింగ్ కోసం ట్రై చేస్తుందని, ఇంట్లో పెళ్లికాని వాళ్లు (సింగిల్ మెన్) ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని తప్పుగా మాట్లాడిన మాటల్ని చూసి షాకైంది లహరి. దీంతో నాగ్.. తప్పు చేసినవాళ్లను నిలదీసి, తప్పు చేయనివాళ్లకు హగ్గివ్వమని సూచించాడు. కవర్ చేయబోయిన రవి, ఫైర్ అయిన నాగ్ హాల్లోకి వచ్చిన లహరి.. 'యాంకర్ అవ్వాలనుకున్నా, ఇక్కడ సింగిల్ మెన్‌ను వదిలేసి నీ వెనకాలే పడుతున్నా అన్నారు. ఇది చాలా తప్పు. నేను వీడియో చూశాను' అని రవిపై ఫైర్ అవుతూ ప్రియకు హగ్గిచ్చింది. దీంతో ఇష్యూ క్లియర్ అయిందా అని నాగ్ రవిని అడగ్గా అతడు ఏదో కవర్ చేద్దామని ప్రయత్నించాడు. ఇంతలో నాగ్ మధ్యలో అడ్డుకుంటూ.. ఇదంతా కాదు, అమ్మ మీద ఒట్టు, నేను సింగిల్ మెన్ అనే పదమే అనలేదు అక్కా అని అన్నావా? లేదా? అని గట్టిగా నిలదీయడంతో రవి నిజం ఒప్పేసుకున్నాడు. కానీ ప్రియ, లహరి దగ్గర అప్పటిదాకా ఆ విషయం ఒప్పుకోలేదని వాళ్లు చెప్పుకొచ్చారు. ఈ ఇష్యూతో రవి పరువు మొత్తం పోయినట్లైంది. వాడికోసం నువ్వు బాధపడొద్దు: నాగ్ అనంతరం నాగ్.. మానస్ తనకు తానే వరస్ట్ పర్ఫామర్ అని చెప్పుకోవడాన్ని తప్పుపట్టాడు. జైలు జీవితం బాగుందనడాన్ని కూడా విమర్శించాడు. కాజల్.. విశ్వను వరస్ట్ కెప్టెన్ అందన్న నాగ్.. ఇంట్లోవాళ్ల అభిప్రాయం అడిగాడు. అయితే కాజల్‌కు దిమ్మతిరిగేలా మెజారిటీ జనాలు అతడిని బెస్ట్ కెప్టెన్ అని పేర్కొన్నారు. ఇక ఈ వారం కెప్టెన్ అయిన జెస్సీకి కెప్టెన్ బాండ్ ఒక్కటే ఉందని, నిర్ణయాలు మాత్రం షణ్ముఖ్ తీసుకుంటున్నాడని సెటైర్ వేశాడు నాగ్. అలాగే సిరితో ఫ్రెండ్షిప్ కట్ చేయడాన్ని వ్యతిరేకించాడు. ఎలిమినేట్ అయి ఇక్కడినుంచి వెళ్లిపోయినవాళ్లు ఏదో అన్నారని, అనుకుంటున్నారని సిరికి దూరమవద్దని సలహా ఇవ్వడంతో వాళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారు. ప్రియాంక లవ్‌స్టోరీ గుర్తు చేసిన నాగ్.. నిన్ను బాధపెట్టినవాడి కోసం చింతించొద్దని ధైర్యాన్ని నూరిపోశాడు. ఏంట్రా? ఈ నోటి దూలేంట్రా.. తర్వాత హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లను డోర్ దగ్గర నిలబెట్టి ముఖం మీద తలుపేయమని కంటెస్టెంట్లతో గేమ్ ఆడించాడు. మొదటగా వచ్చిన ప్రియ.. లోబో ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పింది. తర్వాత లోబో.. అందంతో అందరినీ పరేషాన్ చేస్తోందంటూ లహరిని; లహరి.. రవి; రవి.. ప్రియ; జెస్సీ, ప్రియాంక సింగ్, విశ్వ, కాజల్.. లోబో; శ్వేత, యానీ మాస్టర్.. మానస్; మానస్.. యానీ మాస్టర్; నటరాజ్ మాస్టర్, హమీదా.. కాజల్; షణ్ముఖ్, సిరి.. సన్నీ; సన్నీ.. సిరి; శ్రీరామ్.. జెస్సీ పేర్లను ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సూచించారు. ఇక టాస్క్‌లో శ్వేతను, ఫ్రెండ్షిప్ కట్ చేసి సిరిని ఏడిపించిన షణ్ముఖ్‌ను బాగానే ఆడుకున్నాడు నాగ్. ఏంట్రా? ఈ నోటి దూలేంట్రా? అటు శ్వేతను, ఇటు సిరిని ఏడిపిస్తున్నావు? అని కౌంటరేశాడు. ఇక గుంటనక్క ఎవరని నాగ్ నటరాజ్ మాస్టర్‌ను నిలదీయగా నెక్స్ట్ టైమ్ చెప్తానని దాటవేశాడు. తర్వాత శ్రీరామ్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. -
మహేశ్‌బాబులా ఉండే అతడికే నా ఫుల్ సపోర్ట్: టిక్‌టాక్ దుర్గారావు
టిక్‌టాక్ బ్యాన్ కాకముందు ఆ యాప్ ద్వారా బాగా పాపులర్ అయిన వాళ్లలో దుర్గారావు ఒకరు. అతడు భార్యతో కలిసి చేసిన 'నాది నెక్కిలీసు గొలుసు' డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ఒక్కరోజులోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. దీంతో తరచూ భార్యతో కలిసి డ్యాన్సులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. దీంతో అతడికి పలు బుల్లితెర షోల నుంచి ఆఫర్లు వచ్చాయి. సతీసమేతంగా షోకు రండంటూ ఆహ్వానాలు అందడంతో పలు షోలలోనూ కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే అతడు బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లోనూ పాల్గొంటున్నాడని తెగ ప్రచారం జరిగింది. అతడు కూడా పలు ఇంటర్వ్యూల్లో తనకు బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వచ్చిందని చెప్పుకొచ్చాడు. తీరా ఈ సీజన్లో మాత్రం పాల్గొనలేదు. తాజాగా అతడు బిగ్‌బాస్ షో గురించి మాట్లాడుతూ.. 'యాంకర్ రవి కోసమే బిగ్‌బాస్ చూస్తున్నాను. ఆయన నవ్వు, అందం.. అచ్చం మహేశ్‌బాబులానే ఉంటారు. నేను మహేశ్‌బాబు అభిమానిని. రవిని చూస్తుంటే మహేశ్‌బాబుగారే గుర్తొస్తారు. నా ఫుల్ సపోర్ట్ రవిగారికే! ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే అతడంటే నాకు, నా భార్యకు చాలా ఇష్టం' అని చెప్పుకొచ్చాడు. -
యాంకర్ రవి నిజ స్వరూపం బయటపెట్టిన నాగ్
బిగ్‌బాస్ హౌస్‌లో మూడోవారం జరిగిన నామినేషన్స్ వల్ల ఈసారి ఎలిమినేషనే తలకిందులయ్యేలా ఉంది. ప్రియ, యాంకర్ రవి వల్ల లహరి బ్యాడ్ అయింది. యాంకర్ రవి ఆడిన డబుల్ గేమ్ వల్ల అటు ప్రియ, ఇటు లహరి ఇద్దరూ సఫర్ అయ్యారు. ఎలాగంటే.. యాంకర్ రవి.. ప్రియతో నామినేషన్స్ కంటే ముందు లహరి గురించి మాట్లాడాడు. 'ఆమె యాంకరింగ్ కోసం ట్రై చేస్తుంది. కానీ 'సింగిల్ మెన్'(పెళ్లి కాని వాళ్లు)ను వదిలేసి నా వెంటే పడుతోంది. ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు' అని వాపోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రియ లహరి మీద ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలో రవి, లహరి రాత్రిపూట వాష్‌రూమ్ దగ్గర హగ్ చేసుకోవడాన్ని చూసింది. నామినేషన్స్‌లో ఈ హగ్గు విషయాన్ని ప్రస్తావిస్తూ 'నువ్వు మగాళ్లతోనే బిజీ' అని లహరిని నానా మాటలు అంది. ఈ గొడవ పెద్దది కాగా అందులో యాంకర్ రవి కూడా ఇరుక్కున్నాడు. అయితే తాను సింగిల్ మెన్ అనే మాటే అనలేదని ప్లేటు ఫిరాయించాడు. నువ్వు అన్నావు కదా అని ప్రియ నిలదీసినప్పటికీ తను మాత్రం అనలేదని బుకాయించాడు. ప్రియ తనను బ్యాడ్ చేయడానికి అలా చేస్తుందని, తనకు ఫ్యామిలీ ఉంది, కూతురు ఉంది అని సెంటిమెంట్ డైలాగులు వల్లించడంతో లహరి రవి తప్పు లేదని నమ్మేసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున.. రవిని.. ప్రియతో లహరి గురించి సింగిల్ మెన్ అన్నావా లేదా? అని నిలదీయగా.. వెంటనే 'అన్నాను సర్' అని మరోసారి మాట మార్చాడు. దీంతో షాకైన ప్రియ.. ఇప్పటివరకూ ఆ మాట అన్నానని రవి ఒప్పుకోలేదు సర్ అని చెప్పింది. తర్వాత ఈ విషయం గురించి మరింత క్లారిటీ ఇవ్వడానికి నాగ్.. లహరికి ఆమె గురించి రవి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో చూపించడంతో అతడి నిజస్వరూపం బయటపడింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు రవికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అంటున్నారు. -
14 ఏళ్ల ప్రేమ, ఆమె బర్త్‌డేకు టాటూ వేసుకున్నా, కానీ: లోబో
Bigg Boss Telugu 5, Episode 19: ప్రియ నెక్లెస్ దొంగిలించాలన్న సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకుగానూ యాంకర్ రవి కెప్టెన్సీకి పోటీపడేందుకు అర్హత సాధించాడు. ఈ వారం కెప్టెన్సీకి ఎవరెవరు పోటీపడతారో మీరే తేల్చుకుని చెప్పండని బిగ్‌బాస్ కంటెస్టెంట్ల నిర్ణయానికే వదిలేశాడు. దీంతో జెస్సీ, రవి, శ్వేత, శ్రీరామచంద్ర కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. అయితే లహరి కూడా కెప్టెన్సీకి ట్రై చేస్తానని అన్నప్పటికీ ఆమెకెవరూ సపోర్ట్ చేయకపోవడంతో బాగా హర్ట్ అయింది. షణ్ముఖ్ దూరం పెడుతున్నాడంటూ ఏడ్చేసిన సిరి మరోపక్క షణ్ముఖ్ మాట్లాడట్లేదని సిరి హర్ట్ అయింది. ప్లీజ్ మాట్లాడరా.. అంటూ అతడి వెనకాల పడింది. అయినప్పటికీ ఏమాత్రం చలించిన షణ్ను నీతో ఫ్రెండ్షిప్ కూడా ఇంట్రస్ట్ లేదని ముఖం మీదే చెప్పాడు. దీంతో సిరి ముఖం మాడ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. 'షణ్ను 24 గంటలు శ్వేతతో ఉంటున్నాడు, నేనేమైనా అంటున్నానా? నాకు స్పేస్ ఇవ్వట్లేదు, దూరం పెడుతున్నాడు' అంటూ కాజల్ దగ్గర ఏడ్చేసింది సిరి. అయితే వీళ్లిద్దరినీ కలిపేందుకు జెస్సీ విశ్వ ప్రయత్నం చేశాడు. మూడో కెప్టెన్‌గా జెస్సీ తర్వాత కెప్టెన్సీ టాస్క్ 'స్విమ్ జర స్విమ్' టాస్క్ ప్రారంభం అయింది. పూల్‌లోని కెప్టెన్సీ లెటర్స్‌ను తీసుకొచ్చి కెప్టెన్ అని రాసున్న ఖాళీ స్లాట్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్కులో చాలామంది తక్కువ అంచనా వేసిన జెస్సీ గెలిచి మూడో కెప్టెన్‌గా నిలిచి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అనంతరం అతడు తన స్నేహితుడు షణ్ముఖ్‌ను రేషన్ మేనేజర్‌గా నియమించాడు. అయితే జెస్సీ కెప్టెన్ అవగానే గ్రూపులు స్టార్ట్ అయ్యాయని లోబో పెదవి విరిచాడు. ఫస్ట్ లవ్ ఫెయిల్: షణ్ముఖ్ తొలి ప్రేమ జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకోండంటూ బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'మరుపురాని తొలి ప్రేమ' టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మీ తొలి ప్రేమ పేరు రాసి ఎందుకు ప్రత్యేకమైందో చెప్పాలని ఆదేశించాడు. మొదటగా షణ్ముఖ్ తన లవ్‌స్టోరీ రివీల్ చేస్తూ.. '8వ తరగతి నుంచి ఓ అమ్మాయంటే పిచ్చి. ఇంటర్ సెకండియర్‌లో ఆమె బర్త్‌డే రోజు ప్రేమను వెలిబుచ్చాను. కానీ ఈ ప్రేమలో ఫెయిలయ్యాను. ఆ సమయంలోనే పట్టుదలతో నటన, డ్యాన్స్ నేర్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని అడిగాడు: యానీ మాస్టర్ విశ్వ తెలియని వయసులో పుట్టిన ప్రేమ గురించి చెప్తూ.. 'ఆరో తరగతిలో సుమలతను చూడగానే ఏదో తెలియని ఫీలింగ్. మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాక ఆమెకు పెళ్లైపోయిందని తెలిసింది, ఆమెకు ఒక పాప కూడా ఉంది. నా ఫస్ట్ హీరోయిన్ ఆమెనే. కానీ ఆమె చనిపోయింది' అని ఫస్ట్ లవ్ గుర్తు చేసుకున్నాడు. యానీ మాస్టర్.. 'ప్రమోద్ చాలా సింపుల్ పర్సన్. నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని డైరెక్ట్‌గా అడిగాడు. మాకు పెళ్లైంది, బాబు కూడా పుట్టాడు. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు నొప్పి భరించలేకపోయాను. నాకు ఆసుపత్రిలో కాళ్లు ఒత్తుకుంటూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏ ఒక్కరోజూ నేను లేట్‌గా ఎందుకు వచ్చానని ప్రశ్నించలేదు, అంతలా అర్థం చేసుకున్నాడు' అంటూ ఎమోషనల్ అయింది. మా ఫ్రెండ్ సెట్ చేయమంటే వాడిని సైడ్ చేశాను: రవి యాంకర్ రవి ఫస్ట్ లవ్ కోసం మాట్లాడుతూ.. 'సాయిబాబా గుడిలో హారతి ఇచ్చే సమయంలో ఆమెను చూశాను, వావ్ అనిపించింది. ఆ అమ్మాయి కోసం కాలేజీలో జాయిన్ అయ్యాను. నాఫ్రెండ్ ఆ అమ్మాయితో సెట్ చేయమని అడిగితే నేను మెల్లిగా వాడిని సైడ్ చేశాను. చదువు లేకపోతే భవిష్యత్తు లేదన్న భ్రమలో ఉన్న నాకు ఏదైనా సాధించవచ్చన్న ధైర్యాన్ని నింపింది. నాలుగేళ్లు సంతోషంగా గడిపాం. మా ఇద్దరికీ పెళ్లయింది. నా భార్య నిత్యను ముద్దుగా లడ్డూ అని పిలుచుకుంటాను. లవ్ యూ' అంటూ ఆమె పేరు రాసిన బెలూన్ను సంతోషంగా గాల్లోకి ఎగిరేశాడు. ఆమెకు ప్రపోజ్ చేశాను, పెళ్లి కూడా చేసుకున్నా: నటరాజ్ మాస్టర్ నటరాజ్ మాస్టర్ తన సక్సెస్ఫుల్ లవ్‌స్టోరీ గురించి చెప్తూ.. 'ప్రేమంటే పెద్దగా గిట్టేది కాదు. నా చుట్టూ కలర్‌ఫుల్ లైఫ్ ఉండేది, అందుకే నన్ను ప్రేమించిన అమ్మాయిని పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. బేబీ, రాజు అని ముద్దుగా పిలిచేది, కానీ నేను మాత్రం లెక్క చేసేవాడిని కాదు. కానీ నన్ను పిచ్చిగా ప్రేమించిన ఆమెను ఫస్ట్ టైమ్ క్యాండిల్ లైట్ డిన్నర్‌కు పిలిచి ప్రపోజ్ చేశాను, పెళ్లి చేసుకున్నాను. నా భార్య లేకపోతే ఇప్పుడిలా ఇక్కడ ఉండేవాడిని కాదు' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆమె సింగిల్ అయితే మింగిల్ అవడానికి రెడీ: జెస్సీ జెస్సీ మాట్లాడుతూ.. 'చిన్నీ, నా క్లాస్మేట్. సైకిల్ మీద తనను ఫాలో అయ్యేవాడిని. ఒకరోజు ఆమెను ఆపి చాక్లెట్ ఇచ్చి ఐ లవ్యూ చెప్పా. నవ్వుతూనే అడ్డంగా తలూపి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఒకసారి ఆమెకు ఫోన్ చేస్తే బ్లాక్ చేసింది. ఈ మధ్యే రెండురోజులు నాన్‌స్టాప్‌గా చాట్ చేసింది. నాకు చెప్పాల్సిందంతా చెప్పేసి మళ్లీ బ్లాక్ చేసింది. ఇప్పటివరకు ఆమె వేలిని కూడా టచ్ చేయలేదని, ఆమె సింగిల్ అయితే తాను మింగిల్ అవడానికి రెడీ' అంటూ సిగ్నల్స్ ఇచ్చేశాడు. హీరో అవుదామని వచ్చాడు, ఇంటికొచ్చి పెళ్లన్నాడు: ప్రియ తర్వాత ప్రియ మాట్లాడుతూ.. 'పదో తరగతి తర్వాత ఈ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడిని కేక్ అని పిలిచేదాన్ని. ఇంజనీరింగ్ చేసిన అతడు హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు. ఒక స్టూడియోలో అనుకోకుండా తారసపడ్డాం. నన్ను ఇష్టపడి మా ఇంటికొచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అప్పుడు మా ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దీంతో మా ఫ్యామిలీ బాధ్యతలు నేను తీసుకోవాలి, ఇప్పుడే పెళ్లి వద్దన్నాను. అత్తవాళ్లు ఒప్పుకోలేదు, కానీ పేరెంట్స్ ఒప్పుకుని పెళ్లి చేశారు. ఇతడు నా ఫస్ట్ లవ్, ఇప్పటికీ ప్రేమిస్తున్నా. కానీ ఆత్మగౌరవం కోల్పోతే అక్కడ ప్రేమ, ఇష్టం ఏదీ ఉన్నా దానికి విలువ లేదని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను మ్యారీడా, డివోర్స్డా? సెపరేటా? అన్నది నాకే తెలియని పరిస్థితిలో ఉన్నా. మాకో బుజ్జి బాబు సోనూ ఉన్నాడు' అంటూ ఎమోషనల్ అయింది. అమ్మానాన్న అన్నం తింటుండగా పోలీసులు వచ్చారు: కాజల్ కాజల్.. 'నాది సక్సెస్ఫుల్ లవ్‌స్టోరీ. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకున్నాం. మా విషయం తెలిసి నన్ను వైజాగ్ పంపించేశారు. తర్వాత మళ్లీ నా పేరెంట్స్ వచ్చి ఇంటికి తీసుకొచ్చేశారు. అప్పుడు నేను 100కు డయల్ చేసి బలవంతంగా ఇంట్లో ఉంచారని చెప్పాను. అమ్మానాన్న అన్నం తింటుండగా పోలీసులు వచ్చారు. పోలీసులు రాగానే వెంటనే వాళ్లతో వెళ్లిపోయాను. కానీ నాకు కూతురు పెట్టాక ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది. వాళ్లనెంత బాధపెట్టానో.. ఇప్పుడు వాళ్లు ఇంట్లో నా పాపను, భర్తను చూసుకుంటున్నారు కాబట్టే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను' అని ఎమోషనల్ అయింది. 14 ఏళ్ల ప్రేమ, వేరొకరితో పెళ్లైంది: లోబో తర్వాత లోబో.. 14 ఏళ్ల నిజమైన ప్రేమ మాది. ఆమె తాగిన ప్లాస్టిక్ టీ కప్పులు, వాడిన టిష్యూ పేపర్స్ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. ఆమెకు పెళ్లైంది, కొడుకు పుట్టాడు. నాకూ పెళ్లైంది, కూతురు ఉంది. ఆమె బర్త్‌డేకు కాలిపై టాటూ వేసుకుని గిఫ్ట్ ఇచ్చాను. ఈ టాటూలో మే 22న 1.30 గంటలకు ప్రపోజ్ చేసినట్లు ఉంటుంది. ఇది నా జీవితాన్నే మార్చేసింది. ఆమెను పిలిచే ముద్దుపేరుతోనే నా కూతురిని పిలుస్తున్నాను. అయితే ఈ రోజు ఈ స్టేజ్‌లో ఉండటానికి మాత్రం నా భార్యే కారణం' అని చెప్పుకొచ్చాడు. -
బిగ్‌బాస్: ఆ ఇద్దరు చేసిన తప్పుకు లహరి బలి కానుందా?!
Bigg Boss 5 Telugu, 3rd Week Elimination: బిగ్‌బాస్ హౌస్‌లో మూడోవారం జరిగిన నామినేషన్స్ యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. నామినేషన్స్‌లో ప్రియ చేసిన కామెంట్ల మీద ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. కేవలం లహరి తనతో ఉండట్లేదన్న బాధతో.. ఆమె అబ్బాయిలతో బిజీగా ఉందని, అలాంటప్పుడు అమ్మాయిలతో ఉండటానికి టైం ఎక్కడుంటుందని నోటికొచ్చినట్లు మాట్లాడింది. అదీకాకుండా రాత్రిపూట వాష్‌రూమ్ దగ్గర యాంకర్ రవికి హగ్గివ్వడం కళ్లారా చూశానంటూ దాన్నో పెద్ద బూతుగా చిత్రీకరించింది. అనాల్సిందంతా అన్నాక తాను చెప్పిన విధానం కరెక్ట్ కాదంటూ లహరికి సారీ చెప్పి చేతులు దులిపేసుకుంది. అయితే ఇక్కడ ప్రియ ఒక్కరిదే తప్పు కాదు, యాంకర్ రవిది కూడా ఉంది. నామినేషన్స్ కన్నా ముందు అతడు ప్రియ దగ్గర లహరి గురించి కొంత బ్యాడ్‌గా చెప్పాడు. లహరి యాంకర్ అవడానికి ప్రయత్నిస్తోందని, అందుకే తన పనులన్నీ చేసి పెడుతోందని, ఇంట్లో సింగిల్ మెన్ (పెళ్లికాని అబ్బాయిలు) ఉన్నా కూడా తన వెంటే తిరుగుతోందని, ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని ప్రియ దగ్గర వాపోయాడు. కానీ తర్వాత మాత్రం సింగిల్ మెన్ అనే మాటే తన నోటి నుంచి రాలేదంటూ ప్లేటు ఫిరాయించాడు. అటు ప్రియ కూడా.. వీరిద్దరి వ్యవహారాన్ని పెద్ద ఇష్యూ చేసి మిడ్నైట్ హగ్గు అంటూ ఓ అమ్మాయి గురించి దారుణంగా మాట్లాడి పెద్ద తప్పే చేసింది. అయితే రవి, ప్రియ చేసిన తప్పులకు లహరికి శిక్ష పడేలా కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్స్‌లో మానస్, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్రతో పాటు ప్రియ, లహరి నామినేషన్స్‌లో ఉన్నారు. ప్రతి సమస్యను ఎంతో కూల్‌గా డీల్ చేస్తున్న మానస్‌కు బాగానే ఓట్లు పడుతున్నాయి. అటు శ్రీరామ్‌కు సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా చాలామందే ఉన్నారు. తనంతట తానుగా ఏ గొడవలోనూ దూరకుండా ఉంటున్న ప్రియాంక సింగ్‌కు కూడా బాగానే ఓట్లు గుద్దుతున్నారు. మిగిలిందల్లా ప్రియ, లహరి. నామినేషన్స్ జరిగినరోజు ప్రియ మీద తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. కానీ రవి.. లహరి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో బయటకు రావడంతో ప్రియపై కాస్త నెగెటివిటీ తగ్గింది. ఎటొచ్చీ లహరికి అంతగా ఫ్యాన్ బేస్ లేకపోవడంతో ఆమె డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ లహరికి సానుభూతి ఓట్లు పడితే మాత్రం ఆమె కచ్చితంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఓటర్లు ప్రియకు సపోర్ట్ చేస్తారా? లేదా లహరిని హౌస్‌లో కొనసాగనిస్తారా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
లోబో అసభ్యంగా తాకాడు, వెంటనే డ్రెస్ మార్చుకున్నా: ప్రియాంక సింగ్
Bigg Boss 5 Telugu, Episode 17: నామినేషన్స్‌తో హౌస్‌లో కార్చిచ్చు రగిల్చాడు బిగ్‌బాస్. ఈ నామినేషన్ ప్రక్రియతో కంటెస్టెంట్ల మధ్య పెరిగిన దూరాన్ని చెరిపేసేందుకు వినోదాత్మకమైన టాస్క్ ఇచ్చాడు. అయినప్పటికీ హౌస్‌లో నెలకొన్న అశాంతి ఛాయలు పూర్తిగా కనుమరుగైనట్లు కనిపించలేదు. మరి నేటి(సెప్టెంబర్ 21) నాటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. నామినేషన్లో ఐదుగురు జెస్సీ.. మానస్, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో మాస్టర్, జెస్సీకి మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఒకరు చెప్తేనే నన్ను నామినేట్ చేశావని తెలుసు, నువ్వో చిన్నపిల్లోడివి, జుజ్జూ అంటూ ఫైర్ అయ్యాడు. తర్వాత షణ్ముఖ్.. ప్రియ, లహరిని; శ్వేత.. శ్రీరామచంద్ర, లోబోను; హమీదా.. ప్రియ, ప్రియాంక సింగ్‌ను; కాజల్.. ప్రియాంక, ప్రియను; విశ్వ.. నటరాజ్ మాస్టర్, ప్రియను నామినేట్ చేశారు. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం లహరి, ప్రియాంక, ప్రియ, మానస్, శ్రీరామ్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ప్లేటు ఫిరాయించిన రవి, ఏడ్చేసిన ప్రియ 'యాంకరింగ్ కోసం లహరి ట్రై చేస్తుంది, అందుకని నాతో ఉంటుంది. కానీ ఆమె పెళ్లికాని అమ్మాయి కదా! నేను ఆమెతో చెప్పలేకపోతున్నానని రవి ప్రియతో అన్నారట' అని పింకీ లహరితో చెప్పుకొచ్చింది. ఇందులో నిజమెంతుందో తెలుసుకుందామని రవితో భేటీ అయింది లహరి. 'నేను యాంకరింగ్ కోసం ట్రై చేస్తున్నాను అని, అందుకే నీ పనులు చేసి పెడుతున్నాను అని అన్నావట, ఇక్కడ పెళ్లి కాని వాళ్లు చాలామంది ఉన్నారు. తనకెలా చెప్పాలో తెలియడం లేదు అని అన్నావా?' అని నిలదీసింది. దీనికి రవి అడ్డంగా తలూపుతూ అబ్బే ఆ మాటే అనలేదని ప్లేటు ఫిరాయించాడు. కానీ ప్రియ మాత్రం.. 'లహరి సింగిల్‌గా ఉన్న అబ్బాయిలను వదిలేసి నాతోనే ఉంటుంది, నేను ఏమీ అనలేకపోతున్నాను అని రవి అన్నాడు' అని బల్లగుద్ది చెప్తూనే ప్రియ ఏడ్చేసింది. అయితే రవి మాత్రం తను ఆ మాటే అనలేదని కరాఖండిగా చెప్పాడు. నిజంగానే నువ్వు ఆ మాట అన్నావు బ్రో, అది నేను విన్నానంటూ ప్రియ వెక్కివెక్కి ఏడ్చేసింది. సడన్‌గా వచ్చి చేయి పెట్టాడు: పింకీ మరోవైపు ప్రియాంక సింగ్.. లోబో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కాజల్, సిరి దగ్గర వాపోయింది. 'నిన్న హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకున్నాను. అది కొంచెం అన్ కంఫర్టబుల్‌గా అనిపించింది. కానీ వీలైనంతవరకు కవర్ చేసుకుంటూనే ఉన్నాను. అక్కడ నేను ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నన్ను చూసి సైగలు చేశాడు. నాకర్థమైంది. నా కవరింగ్ నేను చేసుకుంటున్నాను. అంతలో సడన్‌గా వచ్చి చేయి పెట్టాడు. ఫన్నీగానే తీసుకున్నాను, కానీ వెంటనే డ్రెస్ మార్చేసుకున్నాను' అని చెప్తూ బాధపడింది. ఇది విని షాకైన కాజల్.. ఇంకోసారి ఇలా చేయకు అని లోబోకు సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సిందని ఆగ్రహించింది. పక్కనే ఉన్న సిరి.. ఈ విషయాన్ని రవికి చెప్తా అనడంతో పింకీ వదిలేయండి అని చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన లోబో ప్రియాంకక్ హగ్ ఇచ్చి వెళ్లాడు. కుమిలి కుమిలి ఏడ్చిన ప్రియ హౌస్‌లో అందరూ తనను టార్గెట్ చేయడంతో ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చింది ప్రియ. 'నువ్వేదైతే నేర్పించావో అలాగే ఉన్నానమ్మా.. ఏదీ కల్పించి చెప్పలేదు. ఒక్క ముక్క కూడా అబద్ధం చెప్పలేదు, నువ్వు నన్ను నమ్మితే చాలు' అంటూ తల్లిని గుర్తు చేసుకుని బాధపడింది. ఆ తర్వాతి రోజు ప్రియ.. తన గుండెలోని భారాన్ని దింపేసుకుంటూ లహరికి సారీ చెప్పింది. మీ అందరి రియాక్షన్ చూశాక నేను తప్పు విధానంలో చెప్పానని అర్థమైందని ప్రాయశ్చిత్తపడింది. ఫన్ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్ తర్వాత బిగ్‌బాస్.. హౌస్‌మేట్స్‌కు 'హైదరాబాద్ అమ్మాయి - అమెరికా అబ్బాయి' టాస్క్ ఇచ్చాడు. హైదరాబాద్ అమ్మాయి కుటుంబలో లహరి అమ్మాయి, జెస్సీ ఆమె సోదరుడిగా, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ వీరి తల్లిదండ్రులుగా, రవి అమ్మాయి మామయ్యగా, ప్రియాంక చిన్ననాటి స్నేహితురాలిగా నటించాల్సి ఉంటుంది. అమెరికా అబ్బాయి కుటుంబంలో శ్రీరామ్ అమెరికా నుంచి వచ్చిన అబ్బాయిగా, కాజల్ అతడి అక్కగా, ప్రియ వీరి తల్లిగా, విశ్వ అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్‌గా, సిరి చిన్ననాటి స్నేహితురాలుగా, సన్నీ అబ్బాయి స్నేహితుడిగా, షణ్ముఖ్ మ్యారేజ్ బ్రోకర్‌గా, లోబో ఈవెంట్ మేనేజర్, శ్వేత లోబో అసిస్టెంట్, హమీదా.. అబ్బాయి ఎక్స్‌గర్ల్‌ఫ్రెండ్, మానస్ అమ్మాయి పొరుగింటివారిగా నటించాల్సి ఉంటుంది. టాస్క్ మొదలవగానే కంటెస్టెంట్లు అందరూ పోటీపడుతూ నటించారు. ఈ టాస్క్ రేపటి ఎపిసోడ్లో కంటిన్యూ కానుంది. -
Bigg Boss 5 Telugu: అసలు బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోంది?
అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదా? అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడటం తప్పా? ‘హగ్’ ఇచ్చిపుచ్చుకోవడం తప్పా? ‘బిగ్‌బాస్ 5’లో కంటెస్టెంట్లు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలో జడ్జిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ జడ్జిమెంట్స్ చేస్తున్నది అమ్మాయిలే కావడం గమనార్హం. అసలు బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోంది? ఇన్నేళ్ల స్త్రీ ఉద్యమాలు, మహిళా చైతన్యం, జెండర్ సెన్సిటివిటి ప్రయత్నాలు... ఇవన్నీ చాలామంది సెలబ్రిటీల వరకూ చేరినట్టు లేదు. స్త్రీ, పురుషుల వ్యక్తిగతాల ప్రస్తావన ఎంత చేయాలో కూడా తెలుస్తున్నట్టు లేదు. నటుడు నాగార్జున యాంకర్‌గా పని చేస్తున్న ‘బిగ్‌బాస్ 5’లో కీచులాటలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇంతకు మునుపు లేని తకరార్లు కనిపిస్తున్నాయి. ఒక ఎపిసోడ్లో కంటెస్టెంట్లు రవి, కాజల్‌లు రిపోర్టర్లుగా మారి ప్రతి కంటెస్టెంట్ తో ‘హౌస్ లో ఎవరు భార్య, ఎవరు ప్రియురాలు, ఎవరు పని మనిషి’గా ఉండాలనుకుంటున్నారు అని అడిగితే ‘పనిమనిషి’గా అందరూ మహిళా కంటెస్టెంట్ల పేర్లే చెప్పారు, సరదాగానే. వీరందరికీ ‘పనిమనిషి’ స్త్రీయే. ఒక్కరు కూడా ‘పనివాడు’ కోరలేదు... ఫలానా మగ కంటెస్టెంట్‌ను పనివాడుగా పెట్టుకుంటాను అనలేదు. ‘ఇంటి పని’, ‘పని మనిషి’ స్త్రీకే కేటాయించబడుతోంది ఇంకా. (చదవండి: మిడ్నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్) బిగ్‌బాస్ హౌస్‌లో వంట విషయం కూడా ప్రతిసారి స్త్రీల వ్యవహారంగా మారుతూ ఉంటుంది. మగ కంటెస్టెంట్లు హౌస్‌కు సంబంధించిన ఇతర పని పంచుకున్నా వంటను స్త్రీల పనిగానే స్టీరియోటైప్ చేస్తూ వెళ్లడం కొనసాగుతోంది. గత బిగ్‌బాస్ షో లో నటుడు బాలాజీ వంట పని చేశాడు. ఎన్.టి.ఆర్ బిర్యానీ వండాడు. మగవారిని వంటకు ప్రోత్సహించే ఇలాంటి చర్యలు తక్కువయ్యాయి. ఇక సోమవారం (సెప్టెంబర్ 20) నామినేషన్ సందర్భంగా నటి ప్రియ కొన్ని అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసింది. నటి లహరి కేవలం అబ్బాయిలతోనే మాట్లాడుతోందని ఫిర్యాదు. యాంకర్ రవికి హగ్ ఇస్తూ కనిపించిందని మరో ఫిర్యాదు. ఈమె ఈ రెండు మాటలను ‘క్యాజువల్’గా కాక ‘ఫిర్యాదు’ టోన్‌తో ‘చేయకూడని’ పనిగా చెప్పడంతో హౌస్‌లోని అందరూ హతాశులయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌లో హగ్ ఇవ్వడం సర్వసాధారణమే అయినా ప్రియా చెప్పిన తీరు ‘నింద’ ను వేసేలా, ‘కంట్రోల్’ చేసేలా దానికి లహరి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చేట్టుగా మార్చింది. అమ్మాయిలు పూర్తిగా అబ్బాయిలతో మాట్లాడటం, స్నేహం చేయడం తప్పు అనే ధోరణిని నటి ప్రియ వ్యక్తపరిచింది. ఇంకా ఆమె ‘లహరి సింగిల్ కనుక ఆమె ఎలా అయినా వ్యవహరించవచ్చు... కాని రవి వివాహితుడు కనుక అలా చేయడానికి లేదు’ అని వ్యక్తిగత ప్రవర్తనలు ఎలా ఉండాలో తీర్పులు వ్యక్తం చేసింది. దాంతో నెటిజన్లు భారీగా ప్రియను ట్రోల్ చేస్తున్నారు. -
Bigg Boss 5 Telugu: మ్యారేజ్ బ్రోకర్‌గా షణ్ముఖ్.. హౌస్‌లో నవ్వులే నవ్వులు
గతవారం కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘పంథం నీదా నాదా’అనే టాస్క్ ఇచ్చి హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం మాత్రం కామెడీ టాస్క్‌తో ముందుకు వచ్చాడు. కెప్టెన్సి కంటెండర్ టాస్క్‌గా ‘హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అబ్బాయి’అనే ఫన్నీ గేమ్‌ని ఇచ్చాడు. ఇందులో హైదరాబాద్ అమ్మాయిగా లహరి, అమెరికాగా అబ్బాయిగా శ్రీరామ చంద్ర సెలెక్ట్ అయ్యారు. ఇక అమ్మాయి మామయ్యగా రవి, అబ్బాయి మాజీ ప్రియురాలిగా హమిదాను సెలెక్ట్ చేశాడు బిగ్‌బాస్. సెలైంట్‌గా ఉన్న షణ్ముఖ్‌కు మ్యారేజ్ బ్రోకర్ క్యారెక్టర్ ఇచ్చాడు. వీరికి ఇచ్చిన రోల్స్ ను సిరి చదువుతూ ఉంటే హౌస్ లో ఉన్నవారంతా పడిపడి నవ్వారు. (బిగ్‌బాస్: మిడ్నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్) తమకు ఇచ్చిన పాత్రల్లో హౌస్మేట్స్ లీనమైపోయినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతంది. మామయ్య పాత్ర అనగానే రవి గెటప్ చేంజ్ చేసుకున్నాడు. పొట్టపెంచుకొని రవి చేసిన కామెడీ నవ్వులు పూయిస్తోంది. మరోవైపు మ్యారెజ్ బ్రోకర్ షణ్ముఖ్‌తో బేరాలాడుతున్నాడు మానస్. తనకు అమ్ము(లహరి)తో పెళ్లి కావాలని, ఎంత డబ్బులైనా తీసుకొని తన పెళ్లి జరిపించాలని కోరాడు.దీనికి లోబో ‘పది కోట్లు కావాలి ఇస్తావా’అంటూ తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఇంట్లో ఇంత కామెడీ జరుగుతున్న క్రమంలో రవికి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెడర్ పోటీ దారులయ్యే అవకాశాన్ని ఒక సీక్రెట్ టాస్క్ ద్వారా కల్పిస్తున్నట్లు రవికి చెప్పి బయటకు పంపించాడు. మరి రవికి ఇచ్చిన ఆ సీక్రెట్ టాస్క్ ఏంటి? అందులో రవి గెలిచాడా లేదా? తెలియాలంటే స్టార్ మాలో నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్: మిడ్నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రియ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. లహరిని నామినేట్ చేసిన ప్రియ.. రవి, లహరి అర్థరాత్రి సమయంలో రెస్ట్ రూమ్‌లో హగ్ చేసుకున్నారని, ఆమె ఎక్కువగా మగాళ్లతోనే తిరుగుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే అది నార్మల్ హగ్గేనని, రవిని నేను బ్రో అని పిలుస్తానని , మా మధ్య వేరే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టింది లహరి. రవి కూడా అలాంటి రాంగ్ స్టెట్మెంట్స్ ఎలా ఇస్తావంటూ ప్రియపై ఫైర్ అయ్యాడు. (చదవండి: రవి, లహరి మిడ్నైట్ హగ్ ఇష్యూ.. యాంకర్ భార్య షాకింగ్ కామెంట్) తన కూతురికి ఈ విషయం అర్థమయితే ఎలా ఉంటుందంటూ ఎమోషనల్ అయ్యాడు కూడా. ఇక లహరి కూడా ఒక నేషనల్ మీడియాలో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారంటూ భావోద్వేగానికి లోనైంది. ప్రియ మాత్రం తాను చూసిందే చెప్పానంటూనే రవి, లహరిలకు సారీ చెప్పింది. అయితే ఈ ఇష్యూ ఇంతటితో ఆగలేదని తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అందులో ప్రియ ఎందుకు ఆ కామెంట్ చెప్పిందో వివరించింది. గొడవ జరగడానికి ముందు రవి తనకు ఎం చెప్పాడో ఆ విషయాన్ని లహరితో షేర్ చేసుకుంది ప్రియ. లహరి బిగ్ బాస్ తరువాత యాంకర్‌గా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తుందని.. అందుకే నా వెంట పడుతుందనే అనుమానం ఉందని ప్రియతో అన్నాడు రవి. అంతేకాదు హౌస్‌లో అంతమంది పెళ్లి కాని వాళ్లు ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని.. ఎక్కడికి వెళ్లినా తనతో వస్తుందని.. ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటూ రవి తనతో చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్లుగా లహరికి వివరించింది ప్రియ. దీంతో లహరి డైరెక్ట్‌గా వచ్చి రవిని నిలదీసింది. దీంతో షాకైన రవి.. ‘అక్కా నేను అసలు సింగిల్ మెన్ అనే పదాన్ని ఉపయోగించలేదు.. నేను నీతో అలా చెప్పలేదు’ అని ప్రియతో వాదనకు దిగాడు. అయితే ప్రియ మాత్రం నువ్ అన్నావ్ బ్రో అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ఆ తరువాత తనని బ్యాడ్ చేయడానికే ప్రియ ఇలా అంటుందంటూ లహరికి చెప్పాడు రవి. Lol 😂😂😂#BiggBossTelugu5 https://t.co/vAyUID78MD pic.twitter.com/TB0edqWllg — S. (@sahithi_123) September 21, 2021 అయితే లహరి గురించి ప్రియతో రవి చెప్పిన మాటలు నిజమేనని నిన్నటి బిగ్‌బాస్ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరి అర్థమవుతంది. తాజాగా లహరి గురించి రవి మాట్లాడిని మాటలకు తాలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందో రవి నిజంగా లహరిపై బ్యాడ్ కామెంట్స్ చేశాడు. అయితే అతని ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ ప్రియతో అలా చెప్పడం, ప్రియ అదే విషయానికి కొంచెం మసాలా దట్టించి నామినేషన్ ప్రక్రియలో అందరి ముందు నోరు విప్పడం.. వివాదానికి దారి తీసింది. అయితే నిన్నటి వరకు ప్రియని తిట్టుకున్న వాళ్లంతా తాజా వీడియో చూసి రవిని కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ మిడ్నైట్ హగ్ గొడవ ఎక్కడి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
రవి, లహరి మిడ్నైట్ హగ్ ఇష్యూ.. యాంకర్ భార్య షాకింగ్ కామెంట్
బిగ్‌బాస్ హౌస్‌లో నిన్న రాత్రి ప్రియ చేసిన వ్యాఖ్యలు దూమారం లేపాయి. లహరి ఎప్పుడూ అబ్బాయిలతోనే తిరుగుతుందని, అర్థరాత్రి రవి, ఆమె హగ్ చేసుకున్నారంటూ ప్రియ షాకింగ్ విషయాలను వెల్లడించిది.ఆమె వ్యాఖ్యలపై లహరి, రవితో పాటు మిగతా ఇంటి సభ్యులు కూడా ఓ రేంజ్లో మండిపడ్డారు. లహరి అయితే నేషనల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తావంటూ ప్రియపై సీరియస్ అయింది. తన కూతురుకు ఈ వ్యాఖ్యలు అర్థం అయితే ఎలా ఉంటుందంటూ రవి ఫైర్ అయ్యాడు. ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి, ఒక మనిషికి హగ్గిస్తే బూతు కాదని హితవు పలికాడు సన్నీ. ఇలా బిగ్‌బాస్ హౌస్‌లోని ప్రతి ఒక్కరు ప్రియ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ గొడవ ఇంకా పెద్దదైనట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం ప్రస్తుతం ఇది హాట్ టాపిగ్గా మారింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై రవి భార్య సోషల్ మీడియా వేదికగా స్పందించింది. (చదవండి: ఆమె బిగ్‌బాస్ షోకు పనికి రాదు: ఉమా దేవి) చాలామంది ఈ ఇష్యూపై స్పందిస్తూ నాకు చాలా మెసేజ్‌లు పెడుతున్నారు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. మీ మద్దతు తెలియజేస్తున్నందుకు చాలా పెద్ద థాంక్స్.నేను రవి చాలా డిఫికల్ట్ పరిస్థితుల్ని ఫేస్ చేశాం.. కానీ మా బంధాన్ని విడగొట్టలేరు. మా మధ్య చెరగని నమ్మకం మమ్మల్ని మరింత బలోపేతం చేసింది. అంటూ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే నిత్య పోస్ట్‌పై రవి అభిమానులు స్పందిస్తూ.. ఖచ్చితంగా అన్నయ్య టైటిల్ గెలుస్తాడు.. భార్య అంటే మీలా ఉండాలి.. నిజమైన ప్రేమ అంటే మీదే. ప్రియని ఈ వారం ఎలిమినేట్ చేయాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Nitya Saxena (@nitya.saxena1186) -
లహరి సింగిల్, రాత్రి రెస్ట్ రూమ్‌లో యాంకర్ రవికి హగ్గిస్తూ..: ప్రియ
Bigg Boss 5 Telugu,Episode 16: కంటెస్టెంట్ల అసలు రంగును బయటపెట్టేది నామినేషన్సే. ఈ నామినేషన్స్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఈ ప్రక్రియ వాడివేడిగానే జరిగింది. నామినేట్ చేసే క్రమంలో ఇంటి సభ్యులు ఒకరి మీద ఒకరు నిప్పులు చెరిగారు. కొందరైతే నోరు కూడా జారారు. వాళ్లెవరు? నేటి(సెప్టెంబర్ 20) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేద్దాం.. డబ్బులు లేక స్కూల్లో జాయిన్ చేయించలేకపోయా: విశ్వ సన్నీ మంచోడే కానీ పని దొంగ, అటు హమీదా పని చేయదు కానీ ఆర్డర్లు వేస్తుంది అని చిరాకు పడ్డాడు మానస్. నాగార్జున ఆదేశం మేరకు మటన్ బిర్యానీకి అవసరమైన సరుకులన్నింటినీ బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాడు. కానీ అది కాజల్ మాత్రమే వండాలని మెలికపెట్టడంతో ఆమె గరిటె పట్టక తప్పలేదు. విశ్వ బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చేముందు లాక్డౌన్లో తన పరిస్థితి ఎలా ఉందో షణ్ముఖ్ దగ్గర గోడు వెల్లబోసుకున్నాడు. భార్య, కొడుక్కు ఏమైనా కొందామంటే డబ్బుల్లేవని, నాలుగు నెలల అద్దె కూడా కట్టలేదని ఎమోషనల్ అయ్యాడు. కొడుకును స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తే డబ్బులు తక్కువున్నాయని సీట్ రాలేదు అని ఏడ్చాడు. దీంతో షణ్ముఖ్ అతడిని ఓదార్చాడు. 21 సార్లు స్విమ్మింగ్ పూల్‌లో మునకేసిన షణ్ముఖ్ హౌస్‌లో షణ్ముఖ్ పట్టపగలు నిద్రపోవడంతో కెప్టెన్ విశ్వ అతడికి కఠిన శిక్ష విధించాడు. స్విమ్మింగ్ పూల్‌లో 21 సార్లు దూకాలని చెప్పడంతో షణ్ను తనకు విధించిన శిక్షను పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా కంటెస్టెంట్లు వాళ్లు నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ పేరును టైల్ మీద ముద్రించి దాన్ని పగలగొట్టాల్సి ఉంటుంది. మొదటగా శ్రీరామ్.. మానస్, రవిని; సిరి.. శ్వేత, లహరిని నామినేట్ చేశారు. మీరన్న మాట తీసుకోలేకపోయానంటూ సన్నీ.. ప్రియను నామినేట్ చేయగా వాటే సేఫ్ ప్లే అంటూ చప్పట్లు కొట్టింది. తర్వాత సన్నీ.. కాజల్‌ను నామినేట్ చేశాడు. నేను రిలేషన్ కోసం రాలే, సరిగ్గానే ఆడుతున్నా: జెస్సీ కౌంటర్ అనంతరం నటరాజ్ మాస్టర్ వంతు రాగా.. గేమ్‌లో నా వీపు మీదెక్కి కూర్చుందని, ముఖం మీద కూడా గట్టిగా ప్రెస్ చేసింది, అంతేకాకుండా చాలాసార్లు వాడు, వీడు అని మాట్లాడటం విన్నానంటూ సిరిని, సెల్ఫిష్ అంటూ కాజల్‌ను నామినేట్ చేశాడు. యానీ మాస్టర్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటూ శ్రీరామ్, మానస్‌లను నామినేట్ చేసింది. యాంకర్ రవి.. చిన్న చెడ్డీలు వేసుకుని ఆ దెబ్బ చూపిస్తూ ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను వేస్ట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుందని, ఇప్పటికైనా గేమ్ ఆడంటూ జెస్సీని నామినేట్ చేశాడు. దీనికి అతడు రియాక్ట్ అవుతూ తాను పర్ఫెక్ట్గా గేమ్ ఆడుతున్నానని, ఎలాంటి రిలేషన్ కోసం రాలేదని కౌంటరిచ్చాడు. నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు అనంతరం లహరి.. ప్రియను నామినేట్ చేయగా ఇది కదా సేఫ్ గేమ్ అని ఆమె పెదవి విరించింది. అసలు మీరు నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని లహరి అడగ్గా.. ఎందుకంటే నువ్వు హౌస్‌లో అందరు అబ్బాయిలతో బిజీ కాబట్టి! అబ్బాయిలతో నీకు ఏ ప్రాబ్లమ్ లేదు, కానీ అమ్మాయిలతోనే అసలు ప్రాబ్లమ్ అని వెటకారంగా ఆన్సరిచ్చింది. ఈ సమాధానం విని అక్కడున్నవాళ్లంతా షాకయ్యారు. తర్వాత ప్రియ శ్రీరామ్ పేరున్న ప్లేట్‌ను పగలగొట్టింది. నువ్వు అబ్బాయిలతో బాగా బిజీ: ప్రియ లోబో.. ప్రియాంక సింగ్, శ్రీరామ్‌ను; ప్రియాంక సింగ్.. లోబో, జశ్వంత్‌ను; మానస్.. శ్రీరామ్, రవిని నామినేట్ చేశారు. ప్రియ.. తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు లహరి కోసం చూశానని, కానీ ఆమె నా దగ్గరకు రాలేదని, ఎందుకంటే ఇంట్లో మగవాళ్లతో బిజీగా ఉందని మరోసారి అదే మాటను నొక్కి చెప్పింది. ఒకసారైతే రాత్రి రెస్ట్ రూమ్‌లో రవికి హగ్గిస్తూ కనిపించావంది. దీంతో చిర్రెత్తిపోయిన లహరి.. జాతీయ మీడియాలో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోకండి అని మండిపడింది. మిడ్నైట్ హగ్గు అనడం ఎంతవరకు కరెక్ట్: మండిపడ్డ రవి రవి బ్రదర్ బర్త్‌డే కోసం షర్ట్ పంపించమని కెమెరాల దగ్గర రిక్వెస్ట్ చేశానని, అతడు తనకు బ్రో మాత్రమేనంటూ ఏడ్చేసింది లహరి. తర్వాత రవి మాట్లాడుతూ.. మిడ్నైట్ హగ్గు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు. నేను లహరి కంటే సిరి, కాజల్‌తో ఎక్కువగా ఉంటాను, అప్పుడు లేని సమస్య లహరి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వస్తుంది? మమ్మల్ని అందరినీ దోషులుగా చూపిస్తున్నావు అని కడిగి పారేశాడు. దీనికి ప్రియ బదులిస్తూ.. ఆమె సింగిల్, ఏదైనా చేయగలదు అని మరోసారి ఆమె క్యారెక్టర్‌ను నిందించేలా కామెంట్ చేయడంతో లహరి ఆవేశంతో ఊగిపోయింది. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. మనిషికి హగ్గిస్తే బూతు కాదు: సన్నీ మాకు ఫ్యామిలీస్ ఉన్నాయని, రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నావంటూ ప్రియ మీద ఒంటికాలిపై లేచాడు రవి. నా బిడ్డకు ఈ స్టేట్మెంట్ అర్థమైతే ఎలా ఉంటుంది? మీకూ పిల్లలు ఉన్నారు కదా! అని ఆవేదన చెందాడు. ఈ గొడవతో మరింత హీటెక్కిపోయిన ప్రియ.. లహరి పేరును టైల్‌పై ముద్రించి దాన్ని కసితీరా పగలగొట్టింది. తర్వాత సన్నీని నామినేట్ చేసింది. ఈ సందర్భంగా సన్నీ.. ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి, ఒక మనిషికి హగ్గిస్తే బూతు కాదని హితవు పలికాడు. అలా హగ్గివ్వడం తప్పని తాను అనలేదని, కేవలం చూసింది చెప్పానంటూ ప్రియ గొంతు చించుకుని అరిచినా ఆమెను పట్టించుకునేవాళ్లే లేకుండా పోయారు. ఈ నామినేషన్ రచ్చ రేపటి ఎపిసోడ్‌లోనూ కొనసాగనుంది. -
లహరి మీద ప్రియ అభాండం! మగాళ్లతో బిజీ కదా అంటూ నీచంగా..!
Bigg Boss Telugu 5, Nominations: బిగ్‌బాస్ మూడోవారం 'వాల్ ఆఫ్ షేమ్' అనే నామినేషన్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఎవరైతే ఈ షోలో కొనసాగడం అనవసరం అనుకుంటారో వారి పేరును బద్ధలు కొడుతూ నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అందరూ పోటాపోటీగా నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ల పేర్లను ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఈ క్రమంలో లహరి.. ప్రియను నామినేట్ చేసింది. మీరు నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. దీనికి ప్రియ బదులిస్తూ.. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్న అందరు అబ్బాయిలతో బిజీగా ఉన్నావు, కాబట్టి! అని స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రియకు వార్నింగ్ ఇచ్చిన రవి ఆమె సమాధానం విని షాకైన లహరి.. ఎవరితో ఉన్నానో చెప్తారా? అని అడిగింది. ఇందుకామె రవి, మానస్‌తో బిజీగా ఉన్నావని చెప్పింది. ప్రియ మాటలు విని షాకైన రవి.. సిరిన ఉదాహరణగా చెప్తూ.. ఆమెను ఒక ఫ్రెండ్‌లాగా, సోదరిలాగా భావిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇంతలో మధ్యలోనే అడ్డుకున్న ప్రియ.. ఇప్పుడు మీరు అందరి దగ్గరా సపోర్ట్ ఆశించకండి అని కౌంటరిచ్చింది. ఆమె మాటలతో తల పట్టుకున్న రవి.. అలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వొద్దంటూ ప్రియకు వార్నింగ్ ఇచ్చాడు. అటు లహరి కూడా మరోసారి తనలోని అర్జున్‌రెడ్డి యాంగిల్‌ను బయటపెడుతూ.. నా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని హెచ్చరించింది. ప్రియ కంటే ఉమాదేవి నయం! ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ప్రియలో సెకండ్ యాంగిల్ బయటపడింది, అప్పుడు సన్నీ, ఇప్పుడు లహరి మీద తన అక్కసు వెళ్లగక్కింది, ఈవిడ కంటే ఉమాదేవి 100 రెట్లు నయం అంటూ విమర్శిస్తున్నారు. బహుశా ఆమె చెప్పింది నిజమే కావచ్చేమో కానీ చెప్పిన విధానం బాగోలేదంటున్నారు మరికొందరు. ప్రియ ఇలాగే ఇతర కంటెస్టెంట్లను చులకన చేస్తే మాట్లాడితే ఈ వారం వెళ్లిపోవడం ఖాయమని చెప్తున్నారు. మరి ఈ గొడవ తర్వాత ఒకరికొకరు సారీ చెప్పుకుని కలిసిపోతారా? లేదా ప్రియ, లహరి మధ్య వైరం కొనసాగనుందా? అనేది చూడాల్సిందే! -
నామినేషన్స్ ఫైట్స్: జెస్సీని ఆడేసుకున్న ఆ ఇద్దరు!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ప్రస్తుతం 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో నుంచి ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపేందుకు మండే ఎపిసోడ్లో నామినేషన్స్ జరగనున్నాయి. ఇంకేముందీ.. నామినేషన్స్ మొదలవగాఏ కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు ఫైర్ అవుతూ, దూషించుకోవడం మొదలు పెట్టారు. ఇక మానస్, శ్రీరామ్‌ల మధ్య రగులుకున్న అగ్ని గుండం ఇప్పుడప్పులే చల్లారేలా కనిపించడం లేదు. దీంతో మరోసారి శ్రీరామ్.. మానస్‌ను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులో తన మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ప్రియ మాటలను మనసులో పెట్టుకున్నాడు సన్నీ. అందుకే మీరు అన్న మాటలను నేను తీసుకోలేకపోతున్నా అంటూ ప్రియను నామినేట్ చేశాడు. అయితే తనేం అందో? చెప్పమని అడగ్గా.. అది మీకు కూడా తెలుసు అని సన్నీ బదులిచ్చాడు. తర్వాత లహరి కూడా ప్రియను నామినేట్ చేసినట్లు కనిపించింది. దీంతో ప్రియ.. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావని అనడంతో ఇది సేఫ్ గేమ్ కాదు, సేఫ్ గేమ్ అనుకుంటే నామినేట్ చేయడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు అని కౌంటర్ ఇచ్చింది లహరి. చదవండి: Bigg Boss Telugu 5: ఉమాదేవి అవుట్, కన్నీళ్లు ఆపుకోలేకపోయిన లోబో ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, జెస్సీల మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. ఒకరు చెప్తే నువ్వు నన్ను నామినేట్ చేశావని తెలుసు అని నటరాజ్ మాస్టర్ జెస్సీ మీద ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. నువ్వు చిన్నపిల్లోడివి, జుజూ అంటూ ఓ రేంజ్లో రియాక్ట్ అవగా దానికి అతడు కూడా అవును, నేను చిన్నపిల్లోడినే అని తిరిగి కౌంటరిచ్చాడు. స్త్రీలతో వ్యవహరించే విధానం నచ్చలేదంటూ విశ్వ.. నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు యాంకర్ రవి కూడా జెస్సీ మీద అసహనం వ్యక్తం చేశాడు. ఎన్ని రోజులు చిన్న చెడ్డీలు వేసుకుని ఆ దెబ్బ చూపించి సింపథీ పొందడానికి ట్రై చేస్తూ ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను వేస్ట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుందంటూ జెస్సీ పరువు తీశాడు రవి. ఇక లోబో ప్రియాంకను నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. మరి వీళ్ల వాగ్వాదాలు, నామినేషన్స్ కొట్లాటలు చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
యాంకర్ రవి బర్త్‌డే, బిగ్‌బాస్ హౌస్ బయట రచ్చ!
తెలుగు బుల్లితెర మీద దమ్మున్న మేల్ యాంకర్లలో రవి ఒకరు. పంచ్‌లతో, కామెడీతో, యాక్టింగ్‌తో అటు అభిమానులు, ఇటు ఆడియన్స్ ఇద్దరినీ ఎంటర్టైన్ చేయడంలో యాంకర్ రవి దిట్ట. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై తన ప్రస్థానం కొనసాగిస్తున్న రవి ఈ మధ్యే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో అడుగు పెట్టాడు. ఎంతో బ్యాలెన్స్డ్గా ఆడుతూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్న అతడి బర్త్‌డే నేడు(సెప్టెంబర్ 19). ఈ సందర్భంగా రవి ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ బిగ్‌బాస్ హౌస్ బయట రచ్చరచ్చ చేశారు. పటాసులు పేలుస్తూ రవికి వినబడేలా గట్టిగా అరుస్తూ బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ క్రమంలో రవి కూతురు వియా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ బెలూన్లు గాల్లో వదిలింది. అనంతరం తండ్రిని గుర్తు చేసుకుని ఏడ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోపక్క యాంకర్ రవికి బిగ్‌బాస్ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ పంపిన లెటర్, గిఫ్ట్‌ను అతడికి అందించనున్నట్లు సమాచారం. ఇక హౌస్‌లో రవి బర్త్‌డే సెలబ్రేషన్స్ చూడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
బిగ్‌బాస్: దమ్ముంటే రా అంటూ రెచ్చగొడుతున్న లేడీ కంటెస్టెంట్లు
అసలే నామినేషన్స్‌తో రగిలిపోతున్నారు ఇంటిసభ్యులు. దాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాల్సిన బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌తో ఇంట్లో మరింత అగ్గి రాజేశాడు. ఈ టాస్క్‌లో నువ్వా?నేనా? అన్న రీతిలో కొట్టుకోవడానికి కూడా వెనుకాడట్లేదు. అబ్బాయిలు శారీరక దాడి చేయకుండా ఆడుతున్నారు కానీ అమ్మాయిలు మాత్రం తోసేసుకుంటూ, కొట్టుకుంటూ, దెబ్బలు తగిలించుకుంటూ ఆటలో విశ్వరూపం చూపిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ టాస్క్ వల్ల శ్రీరామచంద్ర, యాంకర్ రవి మధ్య గొడవలు మొదలయ్యాయి. దాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించాడు రవి. కానీ అప్పటికే బాగా హర్ట్ అయిన శ్రీరామచంద్ర అతడి మాటలు వినడానికి కూడా ఇష్టం చూపలేదు. సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఆడు, కానీ తనతో మైండ్ గేమ్స్ ఆడొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అటు మానస్‌తో కూడా కయ్యానికి కాలు దువ్వినట్లు తెలుస్తోంది. తనతో ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి చెప్పు, నువ్వింకా చిన్నపిల్లాడిలాగే ప్రవర్తిస్తున్నావు అని సెటైర్ వేశాడు. సాగరా సోదరా టాస్కులో దమ్ముంటే రా అని సిరి రెచ్చగొట్టడంతో శ్వేత ఆమె మీదకు దూసుకెళ్లింది. కానీ అక్కడున్న ఇతర కంటెస్టెంట్లు ఆమెను ఆపేందుకు చాలానే ప్రయత్నించారు. అయితే కూల్‌గా కనిపించే శ్వేత ఇలా మారడంతో ఆశ్చర్యపోయిన నటి ప్రియ సాయంత్రం అయితే ఆమెకు దెయ్యం పూనుతుంది అని కౌంటర్ వేసింది. ఇక సన్నీని కూడా మగాడివైతే రా అంటూ సవాలు విసిరింది. మొత్తాన్ని ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. -
బిగ్‌బాస్ : విశ్వపై రవి ఫైర్.. ఛీ అంటూ..
బిగ్ బాస్ షోలో కొన్ని టాస్క్‌లు కాస్త కఠినంగా ఉంటాయి. కంటెస్టెంట్స్ వాటిని చాలెంజ్‌గా తీసుకొని వందశాతం ఎఫెర్ట్స్ పెట్టి ఆడతారు. దెబ్బలు తగిలినా పట్టించుకోరు. ఒకనొక దశలో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు అరుస్తూ కొట్టుకునే స్థాయికి వెళ్తారు. . బిగ్ బాస్‌లో ఇలాంటి కామన్. అయితే బిగ్ బాస్ 5లో టాస్క్‌ల డోస్ కొంచెం పెరిగినట్లు కనిపిస్తోంది. రెండో వారంలోనే బిగ్‌బాస్ ఇంట్లో ఓ రేంజ్లో గొడవలు జరిగినట్లు తాజా ప్రోమోలు చూస్తే అర్థవుతుంది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కింద ఇంటి సభ్యులను రెండు జట్టులుగా విభజించాడు బిగ్‌బాస్. ‘పంథం నీదా నాదా’అనే ఈ టాస్క్‌లో భారీగా గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఉమెన్ కార్డు వాడొద్దని కాజల్‌కి వార్నింగ్ ఇచ్చాడు సింగర్ శ్రీరామచంద్ర. సన్నీ టూ మచ్ ఇది అంటూ షణ్ముఖ్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇంట్లో ఎంతో క్లోజ్‌గా మూవ్ అవుతున్న విశ్వ, రవిల మధ్య కూడా పెద్ద గొడవే జరిగినట్టుంది. రవి అయితే ‘ఛీ’అంటూ విశ్వపై గట్టిగా అరిచాడు. విశ్వ కూడా తగ్గేదే లేదనట్లుగా రవికి గట్టిగానే ఇచ్చేశాడు. లహరి ఒకవైపు, సన్నీ మరోవైపు భోరున విలపిస్తున్నారు. ఈ మాటల యుద్దం ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
కాజల్ బండారం బయటపెట్టిన నాగ్, ఇన్‌స్టాలో ఆ వీడియోలేంటి?
Bigg Boss Telugu5, Episode 07: నిప్పుల కుంపటిగా మారిన బిగ్‌బాస్ హౌస్‌ను చల్లార్చడానికి వీకెండ్ ఎపిసోడ్లో వచ్చేశాడు కింగ్ నాగార్జున. వచ్చీరావడంతోనే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్లపై రివ్యూ ఇచ్చాడు. ఉమాదేవి అందరిమీదా అరిచేస్తుంటే, కాజల్ అందరి విషయాల్లో జోక్యం చేసుకుంటోందని అభిప్రాయపడ్డాడు. లహరి ఇరిటేట్ అవుతుంటే, జెస్సీ పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వట్లేదన్నాడు. లోబో మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఈ వారం హౌస్‌లో జరిగిన తప్పొప్పులను కడిగేస్తానన్నాడు నాగ్. మరి నేటి(సెప్టెంబర్ 11) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే దీన్ని చదివేయాల్సిందే! జెస్సీని జైల్లో చూసి ఏడ్చేసిన సిరి, కాజల్ వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జెలు జీవితం గడుపుతున్న జెస్సీ తనలో తానే కుమిలిపోయాడు. ఇతన్ని మిగతా కంటెస్టెంట్లు ఓదారుస్తుంటే యానీ మాస్టర్, రవి.. వీళ్ల నటనను నిజమని నమ్ముతున్నాడంటూ జెస్సీ మీద జాలిపడ్డారు. అయితే సరయూ తనను బూతులు తిడుతోందం చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు జెస్సీ. అతడని అలాంటి పరిస్థితిలో చూసిన కాజల్, సిరి కూడా కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత సరయూ అతడికి దగ్గరకు వెళ్లి అన్నీ మర్చిపో అంటూ సారీ చెప్పింది. ఇక ఒకరోజు శిక్ష పూర్తి చేసుకున్న అనంతరం జెస్సీ జైలు నుంచి విడుదలయ్యాడు. సరయూను బూతులు మాట్లాడమన్న నాగ్ వీకెండ్ అనగానే కంటెస్టెంట్లు అందరూ అందంగా ముస్తాబయ్యారు. వారికి నాగార్జున కనిపించగానే గ్రీకువీరుడు పాటతో హోస్ట్‌ను ఫిదా చేసేందుకు ప్రయత్నించారు. ఇక నాగ్ వారి అందాలను పొగుడుతూనే సరయూ బూతులు మాట్లాడట్లేదేంటి? అని అనుమానం వ్యక్తం చేశాడు. తిడతారేమోనన్న భయంతో సైలెంట్‌గా ఉన్నానన్న సరయూను.. నువ్వు నీలా ఉండు అంటూ ఆమె నోటికి పని చెప్పమని ప్రోత్సహించాడు. ఇక షణ్నూను 'అరేయ్ ఏంట్రా ఇది? కొంచెం కనబడరా, వన్ వీక్ అయిపోయింది. ఆట మొదలెట్రా' అని దెప్పి పొడిచాడు. కాజల్ హౌస్‌లో మ్యాట్రీమొనీ సర్వీసెస్ నడిపిస్తున్నట్లు ఉందని నాగ్ సెటైర్ వేశాడు. ఇక జెస్సీ తనకు అక్షింతలు పడతాయేమోనని టెన్షన్‌తో వణికిపోతుంటే నాగ్ మాత్రం హౌస్‌లో బాగానే ఉంటున్నావని మెచ్చుకోవడం విశేషం. కాజల్ బండారం బయటపెట్టిన నాగ్ అనంతరం ఇంటిసభ్యులకు 'ఎవరితో సెట్? ఎవరితో కట్?' అనే టాస్క్ ఇచ్చాడు. సెట్ అనుకునేవాళ్లకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి, కట్ అనుకునేవాళ్ల ఫొటోలను చింపేయాలని ఆదేశించాడు. మొదటగా ఈ వారం బెస్ట్ పర్ఫామర్ విశ్వ.. తనకు మానస్ సెట్ అని, ఇంటి పనులు చేయనన్న కాజల్‌తో కట్ అని చెప్పాడు. ఈ సందర్భంగా నాగ్.. కాజల్ తనకు వంట రాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నీ వంటకు సంబంధించిన వీడియోలు ఉన్నాయేంటని అనడంతో కాజల్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. అవి యూట్యూబ్‌లో చూస్తూ చేసినవని, సొంతంగా రావంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఇక తనవంతు రాగానే జెస్సీ.. సన్నీతో సెట్, సరయూతో కట్ అని; లహరి.. ప్రియతో సెట్, కాజల్‌తో కట్ అని తేల్చేశారు. నేను వన్ మ్యాన్ ఆర్మీ, నాకు ఎవరూ సెట్ కాదు: సరయూ లోబో.. షణ్ముఖ్‌లో నాన్నగారిని చూశానని ఎమోషనల్ అవుతూ అతడితో సెట్, కాజల్‌తో కట్ అని వెల్లడించాడు. సరయూ వంతు రాగా.. తను ఎవరితోనూ సెట్ కాదని, వన్ మ్యాన్ ఆర్మీని అని పేర్కొంది. 'ఇతరుల సహకారంతో ఆడటం చాలా ఈజీ, ఎవరి సహకారం లేకుండా ఆడటం కష్టం, అది ఆడి చూపించు' అంటూ సిరి ఫొటోను చించేసి ఆమెతో కట్ అని చెప్పకనే చెప్పింది. శ్వేత.. యానీ మాస్టర్‌తో సెట్, ఉమాదేవితో కట్ అని; శ్రీరామచంద్ర.. కల్మషం లేని శ్వేతతో సెట్, కాజల్‌తో కట్ అని; సన్నీ.. హమీదాతో సెట్, రవితో కట్ అని చెప్పారు. సిరి మాట్లాడుతూ.. బయట మా ఇద్దరికీ పడదు కానీ ఇక్కడ షణ్నూ సెట్ అయ్యాడు. సరయూతో మాత్రం కట్ అని ఫొటో చించి చెత్తబుట్టలో పడేసింది. ఆ తర్వాత రవి సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. తెగ నటిస్తోందంటూ కాజల్ ఫొటో చించి చెత్తకుండీలో వేసిన ఉమాదేవి నటరాజ్ మాస్టర్ తన వంతు వచ్చేసరికి లోబోతో సెట్, కాజల్‌తో కట్ అని క్లారిటీ ఇచ్చేశాడు. మానస్.. రవితో సెట్, జెస్సీతో కట్ అని చెప్పగా, రవి.. పింకీతో సెట్, జెస్సీతో కట్ అని వెల్లడించాడు. ఉమాదేవి.. పింకీతో సెట్, నటిస్తున్న కాజల్‌తో కట్ అని కుండ బద్ధలు కొట్టేసింది. హమీదా.. సరయూతో సెట్, షణ్నూతో కట్ అని; ప్రియ... యానీ మాస్టర్‌తో సెట్, హమీదాతో కట్ అని; పింకీ.. ప్రియతో సెట్, నటరాజ్ మాస్టర్‌తో కట్ అని; కాజల్.. శ్రీరామచంద్రతో సెట్, ఉమాదేవితో కట్ అని చెప్పేశారు. ఆమెలో అమ్మను చూసుకుంటున్నా: ఏడ్చేసిన శ్వేత యానీ మాస్టర్.. తనలో అమ్మను చూసుకుంటున్న శ్వేతతో సెట్, కాజల్‌తో కట్ అంది. షణ్నూ.. తనతో ఈజీగా కలిసిపోయిన రవితో సెట్, హమీదాతో కట్ అని చెప్పాడు. అనంతరం తన దిండు సీక్రెట్‌ను బయటపెట్టాడు. అది కనిపించకపోతే కంగారెత్తిపోయే తాను దిండు మీద గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన పేరు రాశానని చెప్తూ తెగ సిగ్గుపడిపోయాడు. అనంతరం నాగార్జున హమీదా సేఫ్ అయినట్లు ప్రకటించాడు. ఇంకా మానస్, కాజల్, సరయూ, జెస్సీ డేంజర్ జోన్లోనే ఉన్నారు. వీరిలో నాగ్ ఎవర్ని సేవ్ చేస్తాడు? ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు? అన్నది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే! -
అతడికే కండలున్నాయా?: యాంకర్ రవిపై మాస్టర్ ఫైర్
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో వినాయక చవితి వేడుకలు షురూ అయ్యాయి. ఇంటిసభ్యులు మట్టి గణపతిని తయారు చేసి, అనంతరం బొజ్జ గణపయ్యను ప్రతిష్టించి పూజలు చేశారు. ఈ క్రమంలో తమతమ ఫ్యామిలీ మెంబర్స్‌ను గుర్తు చేసుకుని కంటెస్టెంట్లు ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కుటుంబ సభ్యులు లేకుండానే వేడుకలు జరుపుకుంటున్నందుకు చింతించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా రిలీజైన ప్రోమోలో నటరాజ్ మాస్టర్, లోబో సహా పలువురు కంటతడి పెట్టుకోగా... సడన్‌గా ఇల్లు ఇల్లులా లేనట్లు అనిపించిందని షణ్ముఖ్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు హౌస్మేట్స్ ఇంటి సరుకులు అందుకునేందుకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. కళ్లకు గంతలు కట్టుకుని సరుకులు రాసి ఉన్న కుండలు పగల కొట్టమని ఆదేశించినట్లున్నాడు. దీంతో సింగర్ శ్రీరామచంద్ర.. విశ్వను ఎత్తుకుని ఉట్టికొట్టేందుకు సహాయపడ్డాడు. ఈ టాస్క్‌లో విశ్వ తన విశ్వరూపం చూపించినట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్లు కూడా అతడిని బాగానే ఎంకరేజ్ చేశారు. అయితే నటరాజ్ మాస్టర్ మాత్రం ఈ టాస్క్‌లో కొంత నిరుత్సాహపడ్డట్లు కనిపిస్తోంది. 'విశ్వ ఒక్కడికే కండలున్నాయా? అతడు మాత్రమే ఈ టాస్క్ చేయగలుగుతాడా? విశ్వ మాత్రమే కాదు, ఇంకో ఇద్దరినైనా నేను లేపుతాను' అని యాంకర్ రవి మీద ఫైర్ అయ్యాడు మాస్టర్. మరి వీరిద్దరి మధ్య గొడవ సమసిపోయిందా? లేదా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
బిచ్చం అడుక్కోవడానికి రాలేదు, రవి ఇక్కడ యాంకర్ కాదు!
Bigg Boss 5 Telugu, September 8th Episode: బిగ్‌బాస్ ఐదో సీజన్లో ఆదిలోనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు కంటెస్టెంట్లు. ఓవైపు సమస్యలు పరిష్కరించుకుందాం అంటూనే మరోవైపు గొడవలకు దిగుతున్నారు. ఇక అమాయకుడన్న జెస్సీ ఆవేశంతో రెచ్చిపోతుంటే షణ్ముఖ్‌కు ఇప్పుడిప్పుడే స్క్రీన్ స్పేస్ దొరుకుతోంది. లోబో మరోసారి తన కామెడీతో అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు. ఇంతకీ ఈరోజు ఎవరు పోట్లాడుకున్నారు? నేటి(బుధవారం) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటనేవి చూసేద్దాం.. కాజల్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్న హౌస్మేట్స్ మానస్ చెప్పినట్లుగా కాజల్ అందరూ పడుకున్నాకే నిద్రించేందుకు రెడీ అయింది. కానీ మిగతా కంటెస్టెంట్లందరూ కాజల్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఆ రోజంతా నిద్రపోకూడదని ఫిక్సయ్యారు. ఈ టాస్క్ ముందుకు జరగాలంటే అందరూ నిద్రించాల్సిందేనని కాజల్ మొత్తుకున్నా అందరూ పడుకునేందుకు ససేమీరా అన్నారు. దీంతో చేతులెత్తేసిన కాజల్ తను మాత్రం హాయిగా బెడ్డెక్కి నిద్రపోయింది. దీంతో హౌస్‌లో రెండు మూడు సార్లు అలారమ్ మోగింది. ఇక పొద్దున్నే కిచెన్‌లోనూ అంట్లు తోమడం తన వల్ల కాదని, ఇంట్లో కూడా ఆ పని చేయలేదంది. అయితే ఇది బిగ్‌బాస్ హౌస్ కాబట్టి ఏ పనైనా చేయక తప్పదు. నేనేమైనా వాళ్లింట్లో పని చేస్తున్నానా? ఏడ్చేసిన లహరి నేనేదైనా అడిగితే ఎందుకు సరిగా సమాధానం ఇవ్వవని లహరి హమీదాను ప్రశ్నించింది. కానీ హమీదా తనను బేఖాతరు చేస్తూ నా ఇష్టం, నేనిలాగే మాట్లాడతానని దురుసుగా వ్యవహరించింది. ఆమె మాటలకు హర్ట్ అయిన లహరి.. నేనేమైనా వాళ్లింట్లో పని చేస్తున్నానా? ఎందుకలా రఫ్‌గా మాట్లాడుతుందంటూ ఏడ్చేసింది. కానీ ఆ తర్వాత లహరి, హమీదా ఇద్దరూ ఒకరికొకరు హగ్గులిచ్చుకుని వారి గొడవకు ఎండ్ కార్డ్ వేశారు. ఇదిలావుంటే శ్రీరామచంద్ర, హమీదా మధ్య లవ్ ట్రాక్ మొదలైనట్లు చూపించిన ప్రోమో అంతా వట్టిదేనని రుజువైంది. సాధారణ స్నేహితుల్లా వీరిద్దరూ కాసేపు కబుర్లాడారు. ఆ తర్వాత కాజల్.. సింగర్ శ్రీరామచంద్రను ఎలాంటి అమ్మాయి నచ్చుతుందని అడగ్గా.. సరదాగా, బబ్లీగా ఉండే అమ్మాయి ఇష్టమని వ్యాఖ్యానించాడు. షణ్నూకు సపర్యలు చేసిన లోబో 'శక్తి చూపరా డింభకా' టాస్క్‌లో సిరి గెలుపొందగా ఆమె ఇద్దరు ఇంటిసభ్యులను ఎంచుకుంది. వారిలో ఒకరు ఇంకొకరికి వ్యక్తిగత సేవకుడిగా ఉండాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా సిరి.. షణ్ముఖ్‌ను యజమానిగా, లోబోను సేవకుడిగా సూచించింది. ఇదే విషయాన్ని హౌస్‌మేట్స్‌తో చెప్పింది సిరి. దొరికిందే చాన్స్ అనుకున్నాడో ఏమో కానీ వెంటనే లోబోతో మసాజ్ చేయించుకున్నాడు షణ్నూ. తర్వాత హౌస్‌మేట్స్‌ను ఇమిటేట్ చేయమని అసిస్టెంట్‌ను ఆదేశించాడు. దీంతో రెచ్చిపోయిన లోబో అందరినీ అనుకరిస్తూ కామెడీ చేయడంతో కంటెస్టెంట్లు పడీపడీ నవ్వారు. ఆ తర్వాత ర్యాప్ సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు. షణ్నూ మీద ప్రతీకారం తీర్చుకుంటానన్న లోబో ఇక సిరిని పవర్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్.. మీకిచ్చిన టాస్క్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మిగతావాళ్లకు కూడా సపర్యలు చేస్తున్న లోబో వెంటనే ఆ పనులను ఆపేసి షణ్నుకు సేవలు చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా షణ్ముఖ్ బట్టలను కూడా అతడే ఉతకాల్సి వచ్చింది. దీనికి లోలోపలే ఉడుక్కున్న లోబో ఇందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ పూనాడు. మా అమ్మ వచ్చినప్పుడు రవికి గట్టిగానే ఉంటుంది: మానస్ మానస్.. తనను పదేపదే ప్రియాంక సింగ్‌తో ముడిపెట్టడాన్ని ఇబ్బందిగా ఫీలయ్యాడు. రవి బ్రో బయట యాంకర్ కావచ్చు కానీ ఇక్కడ కాదు కదా, మా అమ్మ వచ్చినప్పుడు రవి బ్రోను ఓ రౌండ్ వేసుకుంటే అప్పుడే తెలుస్తుందని కాజల్‌తో చెప్పుకొచ్చాడు. ఇక కిచెన్‌లో అప్పుడే మంట మొదలైంది. ఆలూ కూర తనకు వడ్డించకుండా ఫ్రిజ్‌లో పెట్టారని యానీ మాస్టర్ మీద మండిపడింది ఉమాదేవి. నేను అడిగినప్పుడు కూర లేదన్నారు, మరి ఇప్పుడెలా ఉందని నిలదీసింది. నేను బిచ్చం అడుక్కోవడానికి రాలేదంటూ ఫైర్ అయింది. ఆలూ కర్రీ పెట్టలేదని శివాలెత్తిన ఉమాదేవి దీంతో యానీ మాస్టర్ సెకండ్ తినేవాళ్లకు కూర సరిపోవట్లేదని తానే ఆలూ కర్రీ ఫ్రిజ్‌లో పెట్టానని, కానీ ఆ విషయం మర్చిపోయానని చెప్పింది. ఆమె సమాధానంతో సంతృప్తి చెందని ఉమాదేవి.. అంటే దీనిప్రకారం మొదట కాకుండా సెకండ్ తినాలన్నమాట అని వ్యంగ్యంగా కౌంటరివ్వగా.. కలిసి తింటే సరిపోతుందని యానీ చెప్పింది. అయినా రెండు కూరలు ఎందుకు చేసుకోవడం? ఒకటే కూర చేసుకుని తింటే చాలని మండిపడింది. ఉమాదేవి తగ్గేలా లేదని అర్థమైన యానీ మాస్టర్ తనే ఓ మెట్టు దిగి సారీ చెప్పడంతో ఆమె కూల్ అయిపోయింది. -
బిగ్‌బాస్: యాంకర్ రవి పారితోషికం ఎంతో తెలుసా?
Anchor Ravi Remuneration for Bigg Boss Telugu 5: యాంకర్ రవి.. మోస్ట్ వాంటెడ్ యాంకర్లలో ఈయన ఒకరు. తన కామెడీతో, పంచులతో టీవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఇతడు తాజాగా బిగ్‌బాస్ ఐదో సీజన్లో అడుగు పెట్టాడు. నిజానికి అతడికిప్పటికే కావాల్సినంత పాపులారిటీ ఉంది. చేతినిండా సంపాదించుకునే సత్తా ఉంది. మరి అతడెందుకు షోలో పాల్గొన్నాడనుకుంటున్నారా? దానికి కూడా అతడు స్టేజీ మీదే సమాధానమిచ్చాడు. ఇప్పటివరకు తనను యాంకర్ రవిగానే చూశారే తప్ప రవికిరణ్‌గా చూడలేదని, తన వ్యక్తిత్వం, వైఖరిని ప్రజలకు చూపించేందుకే బిగ్‌బాస్‌కు వచ్చానన్నాడు రవి. అయితే బిగ్‌బాస్ కోసం తను చేస్తున్న షోలతో పాటు ఒప్పుకున్న ప్రాజెక్టులను కూడా మధ్యలోనే వదిలేసి వచ్చాడీ యాంకర్. మరి అతడికి బిగ్‌బాస్ ఎంత ముట్టజెప్పుతుందనుకుంటున్నారు? ఒక్క వారానికి సుమారు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారట! యాంకర్ రవికున్న క్రేజ్ దృష్ట్యా అతడికి ఐదు లక్షలు ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదంటున్నారు అభిమానులు. ఇక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ రవి ఫినాలే వరకు చేరుకునే సత్తా ఉన్నవాడు. ఒకవేళ అతడు నిజంగానే ఫినాలేకు చేరుకుంటే కేవలం రెమ్యునరేషన్ రూపంలోనే అరకోటికి పైగా అందుకునే అవకాశం ఉంది. అయితే ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచితే ఈ పారితోషికాన్ని పెంచే ఆస్కారమూ లేకపోలేదు! -
బిగ్‌బాస్: తమ్ముడి మరణం, రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ
Bigg Boss Telugu 5, September 7th Episode: బుల్లితెరపై బిగ్‌బాస్ సందడి మొదలైంది. అక్కడ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య కొట్లాట కూడా షురూ అయింది. ఇలా పరిచయాలు అయ్యాయో లేదో అప్పుడే ఒకరి మీద ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. షో ఆరంభంలోనే ఈ రేంజ్లో గొడవలు ఉంటే రానురానూ ఇది ఏ స్థాయిలో ఉండబోతుందో అంటున్నారు బిగ్‌బాస్ ఫ్యాన్స్. మరి నేటి(మంగళవారం) ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. మానస్‌ను అన్నయ్య అని పిలవలేను మగవాళ్లు జిమ్ములో కూర్చుంటున్నారు తప్ప ఏ పనీ చేయట్లేదని ఉమాదేవి చిరాకుపడింది. ఇంట్లో ఉన్న అందరూ పని చేయాల్సిందేని అభిప్రాయపడింది. మరోపక్క లహరితో దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది కాజల్. కానీ అది ఫ్లోలో జరగాలి తప్ప ఇలా మాట్లాడుకుంటే కుదరదు అని లహరి అనడంతో ఊరకుండిపోయింది. ఇక రవి, విశ్వను అన్నయ్య అని పిలుస్తానన్న ప్రియాంక సింగ్.. మానస్‌ను మాత్రం అలా పిలవలేనని చెప్తూ తెగ సిగ్గుపడింది. దీంతో అందరూ మానస్‌ను లవర్ బాయ్ అంటూ ఆటపట్టించారు. ఈ సీజన్లో కొత్తగా పవర్ రూమ్‌ను పరిచయం చేశాడు బిగ్‌బాస్. ఈ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించిన సభ్యులకు పవర్ యాక్సెస్ దొరుకుతుందని, తద్వారా వారికి ఆటను మార్చగలిగే శక్తి దొరుకుతుందని చెప్పాడు. అందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ 'శక్తి చూపరా డింభకా!'ను ప్రవేశపెట్టాడు. ఒంటి మీదున్న దుస్తులను పంపించేసిన రవి, ప్రియ ఈ టాస్క్‌లో ఉరుముల శబ్ధం వినిపించగానే పవర్ స్కాన్‌పై ఎవరు మొదట చేయి పెడతారో వారికి ఆ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించినట్లు లెక్క. ఈ టాస్క్‌లో మొదట గెలిచిన విశ్వ పవర్ రూమ్‌లో అడుగు పెట్టాడు. ఇద్దరు ఇంటిసభ్యులు వారి ఒంటి మీదున్న దుస్తులతో సహా అన్ని బట్టలు, వస్తువులను స్టోర్‌రూమ్‌కు పంపించాలని, అయితే ఆ ఇద్దరూ వారి స్వంత బట్టలు కాకుండా ఒకరి దుస్తులను మరొకరు ధరించవచ్చని మెలిక పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ కోసం విశ్వ.. ప్రియ, రవి పేర్లను సూచించాడు. దీంతో ఆ ఇద్దరూ తమ సామానంతా పంపించేసి.. ప్రియ బట్టలను రవి, రవి బట్టలను ప్రియ వేసుకున్నారు. నాలో తమ్ముడిని చూసుకో.. లేడీ గెటప్‌లో ఉన్న రవిని కాసేపు ఎత్తుకుని తిప్పిన విశ్వ తన తమ్ముడిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. గతేడాది తమ్ముడిని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యాడు. రవి తనను అన్న అని పిలుస్తాడని, నా కోసం ఈ టాస్క్‌కు ఒప్పుకున్నాడంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో రవి.. నాలో తమ్ముడిని చూసుకో అంటూ అతడిని హత్తుకుని ఓదార్చాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో తర్వాత మానస్ గెలుపొంది పవర్‌ను సాధించాడు. అతడు ఎంచుకునే కంటెస్టెంట్ హౌస్‌లోని ఇంటి సభ్యులందరూ పడుకున్నాకే నిద్రించాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. లేదంటే పెద్ద సౌండ్‌తో అలారమ్ మోగుతుందని చెప్పాడు. ఈ టాస్క్‌కు మానస్.. ఆర్జే కాజల్ పేరును ఎంచుకున్నాడు. గొడవపడ్డట్లు డ్రామా.. చివర్లో అంతా ఉట్టిదే ఇంతలో లోబో.. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా అను, మోతెబరిలా మాట్లాడకు అని సిరిని నిందించాడు. ముఖం అద్దంలో చూసుకో, హైట్ చూసుకో, నా ముందు చెటాకంత ఉన్నవ్ అంటూ నానామాటలు అన్నాడు. ఇవన్నీ చెవిన పడటంతో ఆవేశంతో అట్టుడికిపోయిన సిరి ఫేస్ గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది అని వార్నింగ్ ఇచ్చింది. వీళ్లిద్దరికీ సడన్‌గా ఏమైంది? ఇంత గొడవపడుతున్నారు? అని కంటెస్టెంట్లంతా టెన్షన్ పడుతుండగా ఇదంతా వుట్టి డ్రామా అని ఇద్దరూ పెద్దగా నవ్వేసి అందరినీ పిచ్చోళ్లను చేశారు. హైడ్రామా చేస్తున్నావంటూ కాజల్‌కు చురకలు కిచెన్‌లో పనులను షేర్ చేసుకుందామని కాజల్ అందరినీ పిలిచి హడావుడి చేస్తుండగా.. ఎందుకంత హైపర్ అవుతున్నారని లహరి ప్రశ్నించింది. నార్మల్‌గా మాట్లాడండి, అంతే తప్ప కంటెంట్ క్రియేట్ చేయాలని చూడొద్దని కాజల్‌కు సూచించింది. చాలా హైడ్రామా చేస్తున్నారని చురకలంటించింది. దీంతో కాజల్ ఆమెకు క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చి ఏడ్చేసింది. జెస్సీ మీద యానీ మాస్టర్ ఫైర్ ఇక రాత్రి అందరూ ముచ్చట్లు పెట్టుకుంటుండగా సిరి ప్లేస్‌లో హమీదా కూర్చుంటే ఆమెను అక్కడి నుంచి లేవమన్నాడు జెస్సీ. ఆమె కుదరదనడంతో సిరిని తన స్థానంలో కూర్చోమన్నాడు. ఆ తర్వాత మరో ఖాళీ కుర్చీ దొరికితే దాని మీద కాలేసి కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన యానీ మాస్టర్ తనకు చెయిర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ప్లీజ్ అంటున్నా అతడు నిరాకరించడంతో యానీకి బుర్ర వేడెక్కిపోయింది. నాటకాలు చేయకు, నీ గొంతే కాదు నా వాయిస్ కూడా లేస్తుంది, అక్కడ కాళ్లెందుకు పెట్టినవ్ అని జెస్సీ మీద పూనకంతో ఊగిపోయింది. ఇంతలా ఆవేశపడ్డ యానీ మాస్టర్ తన బెడ్ దగ్గరకు వెళ్లి ఏడ్చేయడం గమనార్హం. ఈరోజు ఎపిసోడ్లో ఇంత రభస ఉంటే మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి! -
బిగ్‌బాస్ అరాచకం.. రవి, ప్రియల ఒంటిపై దుస్తులతో సహా అన్ని లాక్కెళ్లాడు
బుల్లితెరపై బిగ్‌బాస్ ఐదో సీజన్ సందడి మొదలైంది. గత నాలుగు సీజన్లకు భిన్నంగా ఈ సారి హౌస్‌లోకి ఏకంగా 19 మందిని పంపి షాకిచ్చాడు బిగ్‌బాస్. తొలి రోజు మూడు టాస్కులు ఇచ్చి గేమ్ స్టార్ట్ చేసిన బిగ్‌బాస్.. రెండో రోజు నామినేషన్ల ప్రక్రియతో ముగించాడు. ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారిలో రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు ఉన్నారు. ఇక అసలు కథ ఈ రోజు నుంచే మొదలైనట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. గేమ్‌లో భాగంగా తొలిసారి పవర్ రూమ్‌ని పరిచయం చేశాడు బిగ్‌బాస్. దీని కోసం ఓ గేమ్ పెట్టగా, అందులో విశ్వ గెలిచాడు. అయితే ఇక్కడ విశ్వకి ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. తాను ఎంచుకున్న ఇద్దరి ఇంటి సభ్యుల ఒంటిపై ఉన్న దుస్తులతో సహా అన్ని వస్తువులన్నింటిని స్టోర్ రూమ్‌లో పెట్టాలని చెప్పాడు. దీంతో యాంకర్ రవి, ప్రియలను ఎంచుకున్నాడు విశ్వ. వారిద్దరి దుస్తులలతో పాటు అన్ని వస్తువులు లాక్కెళ్లిపోవడంతో రవి, ప్రియ వెరైటీ డ్రెస్సుల్లో కనిపించారు. యాంకర్ రవి లేడీస్ డ్రెస్ ధరించగా, ప్రియ అబ్బాయి డ్రెస్‌లో కనిపించి షాకిచ్చింది. ఇక అమ్మాయి డ్రెస్‌లో ఉన్న రవిని ఎత్తుకొని సందడి చేశాడు విశ్వ. మరోవైపు ప్రియాంక సింగ్ ఏమో మానస్‌ని తనదైన శైలీలో ఆటపట్టించింది. రవిని, విశ్వని అన్నయ్య అని పిలుస్తా కానీ, మోనస్ని మాత్రం అలా పిలవలేనని చెప్పడంతో ఇంటి సభ్యులంతా ఘొల్లున నవ్వారు. మరి ఇంకా బిగ్‌బాస్ ఇంట్లో ఎలాంటి సందడి జరిగిందో తెలియాలంటే నేటి సాయంత్రం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. -
బిగ్‌బాస్: తొలి వారం నామినేషన్లో ఆరుగురు, లిస్ట్ ఇదే!
Bigg Boss 5 Telugu 1st Week Nominations: బిగ్‌బాస్ ఐదో సీజన్లో తొలి రోజే కంటెస్టెంట్లకు నిద్ర లేకుండా చేశాడు లోబో. తన గురకతో హౌస్మేట్స్ అందరినీ నిద్రకు దూరం చేశాడు. అతడి గురకను ఆపడానికి రవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరోవైపు అదే రాత్రి తమకు బోర్ కొడుతోందంటూ దొంగతనానికి పూనుకున్నారు సిరి హన్మంత్, జెస్సీ. కంటెస్టెంట్ల వస్తువులను దాచేసి తర్వాత నిమ్మకు నీరెత్తనట్లు ఊరకుండిపోయారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి ఆరుగురు నామినేట్ అయ్యారు. ఆ ఆరుగు ఎవరు? తొలి రోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో చదివేయండి. దొంగతనం చేశామని ఒప్పుకున్న సిరి ఇక తర్వాతి రోజును ఉరకలెత్తించే డ్యాన్స్‌తో ఉల్లాసంగా, ఉత్సాహంగా మొదలుపెట్టారు కంటెస్టెంట్లు. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ పోయాయని ఒకరు, చెప్పులు పోయాయని మరొకరు గోల పెట్టినా అసలు దొంగలు మాత్రం చీమ కుట్టనట్లు ఉండిపోయారు. అయితే యాంకర్ రవి మాత్రం జెస్సీనే దొంగ అని ముందుగానే పసిగట్టడంతో సిరి తామే దొంగలమని ఒప్పుకోక తప్పుకోలేదు. మూడున్నరేళ్ల నుంచి మోసం చేస్తున్నా.. ఇక ప్రియాంక సింగ్ తాను అతడు నుంచి అమ్మాయిగా మారేందుకు చేసుకున్న ఆపరేషన్ గురించి ఆర్జే కాజల్‌తో మాట్లాడింది. ఈ విషయంలో మూడున్నరేళ్ల నుంచి మా నాన్నను మోసం చేస్తున్నానని చెప్తూ ఎమోషనల్ అయింది. ఒకసారి తను నన్ను ముట్టుకుని గడ్డాలు, మీసాలు ఏవని అడిగితే లేడీ గెటప్ కోసం తీసేయించుకున్నానని అబద్ధం చెప్పానంటూ కంటతడి పెట్టుకుంది. దీంతో ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చింది కాజల్. చెత్తకుండీలో కంటెస్టెంట్ల ఫొటోలు అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో తొలివారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారి ఫొటోలు ఉన్న చెత్త కవర్లను చెత్తకుండీలో వేయాలి. ముందుగా సింగర్ శ్రీరామచంద్ర.. మానస్, జెస్సీలను నామినేట్ చేశాడు. సరయూ.. ఆర్జే కాజల్, యాంకర్ రవిని; శ్వేత వర్మ.. హమీదా, నటరాజ్ మాస్టర్‌ను, జెస్సీ.. విశ్వ, హమీదాను; ఉమాదేవి.. కాజల్, జెస్సీలను నామినేట్ చేశారు. చదవండి: Bigg Boss 5 Telugu: నాగ్ పారితోషికం ఎంతో తెలుసా? యాంకర్ రవికి కౌంటరిచ్చిన నటరాజ్ మాస్టర్ ఇక బిహేవియర్ నచ్చలేదని జెస్సీని, అందరితో క్లోజ్ అవ్వాలంటూ మానస్‌ను నామినేట్ చేశాడు విశ్వ. తనకు కాంపిటీషన్‌గా వస్తుందని సిరిని, కోపం తగ్గించుకోవాలంటూ జెస్సీని నామినేట్ చేసింది యానీ మాస్టర్. బయట ఉన్నట్లుగా హౌస్‌లో లేడని నటరాజ్ మాస్టర్‌ను, రిలాక్స్‌గా ఉంటున్నాడని మానస్‌ను నామినేట్ చేశాడు రవి. అయితే తనకు నటించడం రాదని రవికి గట్టి కౌంటరిస్తూనే అతడిని నామినేట్ చేశాడు నటరాజ్ మాస్టర్. అమాయకత్వంతో ఈ హౌస్‌లో ఉండలేవంటూ జెస్సీని నామినేట్ చేశాడు. ఫస్ట్ వీక్‌లోనే అందరూ నామినేట్ చేస్తుండటం, అందులోనూ వాళ్లు చెప్పే కారణాలను జీర్ణించుకోలేకపోయిన జెస్సీ అందరిముందే ఏడ్చేశాడు. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూశాడని రవిని నామినేట్ చేసిన లోబో రూడ్‌గా మాట్లాడుతుందని లహరిని, తనను కామెంట్ చేశాడని జెస్సీని నామినేట్ చేసింది హమీదా. తనకు టాస్క్‌లు ఆడమని చెప్పడం నచ్చలేదని సన్నీని, ఎక్కువగా జోక్యం చేసుకోవడం నచ్చదని లోబోను నామినేట్ చేశాడు షణ్ముఖ్. యాటిట్యూడ్ చూపించిందని ప్రియను, యాపిల్ తినేటప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ యాటిట్యూడ్ చూపించాడని రవిని నామినేట్ చేశాడు లోబో. మొదటి వారం నామినేట్ అయిన ఆరుగురు మానస్.. విశ్వ, సరయూ; సిరి.. హమీదా, ప్రియను; సన్నీ.. షణ్ముఖ్, లహరిని; ప్రియాంక సింగ్.. షణ్ముఖ్, హమీదాలను; ప్రియ.. సిరి, కాజల్‌ను; మానస్.. విశ్వ, సరయూలను; కాజల్.. సరయూ, ఉమాదేవిని; లహరి.. హమీదా, కాజల్‌ను నామినేట్ చేశారు. దీంతో మొదటివారం నామినేషన్ ప్రక్రియ పూర్తైంది. ఎక్కువగా ఓట్లు పడిన రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. మరి వీరిలో ఎలిమినేషన్ గండం గట్టెక్కేది ఎవరనేది చూడాలి! -
బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?!
బోర్డమ్ను దూరం చేసేందుకు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్. ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ షోలో ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ ఆడియన్స్‌కు మాటిచ్చేశాడు నాగ్. అన్నట్లుగా ఎక్కువ వినోదాన్ని అందించాలంటే అంతే ఎక్కువ కంటెస్టెంట్లు ఉండాలనుకున్నారో ఏమోగానీ ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపారు. వీరిలో నటి సిరి హన్మంత్, వీజే సన్నీ, నటి లహరి, సింగర్ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, లోబో, ప్రముఖ నటి ప్రియ, మోడల్ జశ్వంత్ పడాల(జెస్సీ), ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్, షణ్ముఖ్ జశ్వంత్, నటి హమీదా, నటరాజ్ మాస్టర్, నటి ఉమాదేవి, విశ్వ, 7ఆర్ట్స్ సరయూ, నటుడు మానస్, ఆర్జే కాజల్, నటి శ్వేత వర్మ, యాంకర్ రవి ఉన్నారు. నేడు హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ జరగబోతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈవారం నామినేషన్లో ఉండేది వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. యాంకర్ రవి, జెస్సీ, మానస్, హమీదా, కాజల్, సరయూ తొలివారం నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ప్రియ కూడా ఈ లిస్టులో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో మొట్టమొదట సేవ్ అయ్యే కంటెస్టెంట్ యాంకర్ రవి అని ఊహించవచ్చు. యాంకర్ రవికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అతడు ఈజీగా ఈ గండం నుంచి గట్టెక్కుతాడు. మరి మిగతా ఆరుగురిలో ఎవరు సేవ్ అవుతారు? ఈ లిస్టులో ఏమైనా మార్పుచేర్పులు ఉన్నాయా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
హౌస్‌మేట్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న లోబో
కనివినీ ఎరుగని రీతిలో 19 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ మొదలైంది. హౌస్‌లో అడుగుపెట్టగానే పరిచయాలు పెంచుకుని ఇంటిని అలవాటు చేసుకునే పనిలో పడ్డారు హౌస్మేట్స్. కొత్త ప్రదేశం కాబట్టి తొలిరోజే కొందరికి నిద్ర పట్టడం కూడా కష్టమే. అలాంటిది రాత్రిపూట ఎవరైనా గురక పెడితే ఇంకేమైనా ఉందా? బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు కూడా ఇలాంటి గడ్డు పరిస్థితే ఎదురైంది. యాంకర్ లోబో అర్ధరాత్రి ఆదమరిచి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతడి గురక సౌండ్‌కు నిద్రలో నుంచి లేచి కూర్చున్నారు హౌస్మేట్స్. యాంకర్ రవి అయితే అతడికి దుప్పటి కప్పి, బయటకు పెద్దగా సౌండ్ వినిపించకుండా రెండు దిండ్లను కూడా లోబో ముఖం మీద పెట్టి ఉంచాడు. అయినా సరే లోబో గురకను ఆపడం ఎవరి తరమూ కాలేదు. దీంతో రాత్రంతా వారికి జాగారమే అయినట్లు కనిపిస్తోంది. మరోవైపు సిరి హన్మంత్, జెస్సీ ఏదో దొంగతనం ప్లాన్ చేసినట్లున్నారు. వీరిద్దరూ కలిసి ఒకరి చెప్పులు, మరొకరి ఇయర్ రింగ్స్‌ను దాచేసినట్లు తెలుస్తోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. మరి బిగ్‌బాస్ హౌస్‌లో చోరీకి పాల్పడిన ఈ దొంగలను ఇతర కంటెస్టెంట్లు పట్టుకోగలరా? లేదా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారనుంది. -
బిగ్‌బాస్ 5: పెళ్లి మాట ఎత్తొద్దంటున్న యాంకర్ రవి
Anchor Ravi In Bigg Boss 5 Telugu: యాంకర్ రవి... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఆరంభించిన రవి అనంతర కాలంలో యాంకరింగ్ వైపు అడుగులు వేశాడు. ఈ క్రమంలో లాస్యతో కలిసి చేసిన సమ్‌థింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ వీళ్లిద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. ఈ ఆన్‌స్క్రీన్ పెయిర్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. దీంతో ఈ జంట ఎన్నో ప్రోగ్రామ్‌లు చేయగా, తక్కువ కాలంలోనే రవి మోస్ట్ వాంటెడ్ యాంకర్‌గా పేరు గడించాడు. అయితే తర్వాత రవికి కొన్ని ఒడిదుడుకులు ఎదురవగా.. వాటిని తట్టుకుని, ఎదిరించి ఇప్పటికీ యాంకర్‌గా రాణిస్తూ కోట్లాదిమందిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. యాంకరింగ్ అంటే ప్రాణం అని చెప్తున్న ఇతడు 2017లో ఇది మా ప్రేమకథ సినిమాతో హీరోగానూ లక్ పరీక్షించుకున్నాడు. ఈ సినిమా బెడిసికొట్టడంతో సినిమాలు పెద్దగా వర్కవుట్ కాదని గ్రహించి తిరిగి బుల్లితెర ద్వారానే జనాలను అలరిస్తున్నాడు. వన్ షో, ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, మొండి మొగుడు పెంకి పెళ్లాం, కిరాక్ సహా పలు షోలకు యాంకరింగ్ చేశాడు. ఇతడికి భార్య నిత్య సక్సేనా, కూతురు వియా ఉంది. బిగ్‌బాస్ ఐదో సీజన్లో పంతొమ్మిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన రవి తనకు పెళ్లై 9 సంవత్సరాలైందని, దయచేసి ఇప్పుడా పెళ్లి విషయం మాత్రం తీయొద్దని నాగ్‌ను కోరాడు. మరి హౌస్‌లో అడుగు పెట్టిన ఈ యాంకర్ హౌస్‌లో ఎలా ఉంటాడు? ఎన్నిరోజులు ఉంటాడు అన్నది మున్ముందు చూడాల్సిందే! -
బిగ్‌బాస్ 5: కంటెస్టెంట్స్ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్!
ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్ 5 త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు స్పందించిన బయటకు వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే సెప్టెంబర్‌లో ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో అగష్టు 22 నుంచి కంటెస్టెంట్స్‌ను క్వారంటైన్ పంపించనున్నారని వినికిడి. కానీ బిగ్‌బాస్ 5 సీజన్ కంటస్టెంట్స్కు సంబంధించిన ఖచ్చితమైన జాబితాపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. చదవండి: బిగ్‌బాస్ 5: బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన యాంకర్, సింగర్! ఈ సీజన్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే పలువురు టీవీ నటీనటులు, యాంకర్లు, యూట్యూబ్ స్టార్ల పేర్లు వినిపించాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో జాబితా బయటకు వచ్చింది. అయితే ఇందులో కొంతమంది కొత్తవాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ కొత్త జాబితాలో యాంకర్ రవి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్ లోబో, సిరి హన్మంతు, నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7 ఆర్ట్స్ సరయు, నటుడు మానస్ షా, మోడల్ జస్వంత్, నటుడు సన్నీ, విశ్వ, టీవీ9 యాంకర్ ప్రత్యూష్, ఆట సందీప్/రఘు మాస్టర్ల పేర్లు ఉన్నాయి. చదవండి: బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ బజ్ హోస్ట్‌గా అరియాన గ్లోరీ! ఇంతకుముందు వచ్చిన జాబితాలో యాంకర్ వర్షిణీ, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్, యానీ మాస్టర్, యూట్యూబర్ నిఖిల్ల పేర్లు ఉండగా.. ఈ కొత్త లిస్టులో వారి పేర్లు లేకపోవడం గమనార్హం. దీంతో ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 5లో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అని, అందులో డౌట్ లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల బిగ్‌బాస్ ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షో హోస్ట్ ఎవరనే దానిపై ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ నాగార్జున ‘బోర్‌డమ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. వచ్చేసింది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5’ అంటూ సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ కొత్త జాబితా: యాంకర్ రవి ఆర్జే కాజల్ శ్వేతా వర్మ లహరి షారి కమెడియన్ లోబో సిరి హన్మంతు నటి ప్రియ కార్తీకదీపం ఉమాదేవి 7 ఆర్ట్స్ నటి సరయు నటుడు మానస్ షా మోడల్ జస్వంత్ నటుడు సన్నీ విశ్వ టీవీ9 యాంకర్ ప్రత్యూష్ ఆట సందీప్/రఘు మాస్టర్లు -
హల్చల్ : సెల్ఫీ మూడ్‌లో సమీరా..యోగా ఫోజులతో మలైకా
♦ మైఖేల్ జాన్సన్ మళ్లీ పుట్టాడంటున్న యాంకర్ రవి ♦ సెట్లో చాలా గ్యాప్ తర్వాత అంటున్న కాజోల్ ♦ షాట్ బ్రేక్‌లో శ్రీముఖి ఓవర్ యాక్షన్ ♦ భర్తతో ఫర్ ఎవర్ అంటున్న సోనమ్‌కపూర్ ♦ భర్తకు చాలా పెద్ద ఫ్యాన్ అంటున్న నాజ్రియా ♦ లవ్ కొటేషన్స్ చెప్తున్న టిక్‌టాక్ బ్యూటీ బన్నీవాక్స్ ♦ పాటలో పరవశించిపోయిన సునీత ♦ యోగా ఫోజులతో మలైకా అరోరా ♦ సోమవారం మరింత షైన్ అవ్వాలంటున్న సదా ♦ సెల్ఫీ మూడ్‌లో సమీరా రెడ్డి View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Bunny Vox (@bunnyvox) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
యాంకర్ రవిపై ఫన్ బకెట్ జస్విక ఆసక్తికర వ్యాఖ్యలు
ఫన్ బకెట్ జూనియర్ ఫేం జస్విక, యంకర్ రవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. యూట్యూబ్, టిక్ టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న జస్విక మంగళవారం లైవ్ చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ యాంకర్ రవి గురించి చెప్పమని, ఆయనపై మీ అభిప్రాయం ఎంటని అడిగాడు. దీనిపై జస్విక స్పందిస్తూ.. ‘రవి అన్న యూనిక్‌గా ఉంటారు. సెట్లో ప్రతీ ఒక్క విషయాన్ని ఆయన ఎంతో బాగా హ్యాండిల్ చేస్తారు. అందరితో ఫన్నీగా మాట్లాడుతూ సెట్ వాతావరణాన్ని సరదాగా మారుస్తారు. ఆయన ఒక గొప్ప మెంటర్. ఆయనతో కలిసి పని చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రవి అన్న నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయనకు ఉన్న నాలెడ్జ్ అనంతమైంది. ఎంతో స్ఫూర్తివంతమైన వ్యక్తి’ అంటూ జస్విక చెప్పుకొచ్చింది. అంతేగాక రవి అన్నను ఓ షోలో మొదటి సారి చూసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి షాక్ అయ్యానని, ఆ షో అంతా కళ్లు తిప్పుకోకుండా అన్ననే చూస్తూ ఉండిపోయాను అని చెప్పింది. ఇక ఆయన ప్రతీ ఒక్కరినీ పలకరించే విధానం, తోటి ఆర్టిస్టుల పట్ల ఆయన చూపించే అభిమానం నన్ను ఎంతో ఆకట్టుకుందని తెలిపింది. ఇక తన గురించి జస్విక చెప్పిన మాటలకు రవి ఫిదా అయిపోయాడు. ‘నా గురించి ఇంత బాగా చెప్పినందుకు థ్యాంక్యూ జస్విక, నువ్వు ఎంతో స్వీట్.. మళ్లీ మనం సెట్ మీద కలిసి పనిచేసే సమయం కోసం ఎదురుచూస్తుంటాను’ అంటు రవి ఎమోషనల్ అయ్యాడు. -
సోషల్ హల్చల్ : నిక్కీ అందాలు.. పార్వతి పరువాలు.. నేహా వయ్యారాలు
♦ రెడ్ డ్రెస్‌లో మతి పొడొగుతున్న నిక్కీ తంబోలి ♦ నచ్చింది చేసుకుంటూ పొమ్మంటున్న సొట్టబుగ్గల లావణ్య ♦ నా గతానికి, భవిష్యత్తుకు అక్షరాలు లేవంటున్న పున్ను ♦ అయితే ఓకే అంటున్న వైష్ణవి ♦ ఇబ్బంది పెట్టొద్దంటున్న మోడల్ కోమల్ పాండే ♦ అది మిస్సవుతున్నా అంటోన్న అదితి ♦ జిలేబి అంటున్న నేహా శర్మ ♦ వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న సోనమ్ కపూర్ ♦ ఆ రెండూ ఎప్పుడు తనతోనే ఉంటాయన్న యాంకర్ రవి View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by DP (@dishaparmar) -
యాంకర్ రవికి బ్లాక్ మెయిల్..ఆ వీడియోలు పెట్టమంటావా అంటూ..
యాంకర్ రవి..బుల్లితెరపై టాప్ యాంకర్‌గా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తాడు. ఇక సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాడు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తోనూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మగువా మగువా పాట స్పూఫ్ చేశాడు. పురుషా పురుషా అంటూ సాగే ఈ పేరడి పాటకు రీల్స్ చేశాడు. ఇందులో ఇంట్లో పనులంతా తానే చేస్తున్నట్లు వీడియో రూపొందించాడు. ఇళ్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, వంటలు చేయడం, పాపను రెడీ చేయడం ఇలా అన్ని పనులను తానే చేసినట్టుగా రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది ఇన్‌స్టాలో తన 400వ పోస్ట్ అని, దీన్ని మగజాతి ఆణిముత్యాలకు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. రవి చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యాంకర్ వర్షిణి, వింధ్యా సహా పలవురు రవి వీడియోపై స్పందించారు. ఇంట్లో ఖాళీగా సోఫాలో కూర్చొని టీవీ చూడటం తప్పా ఇంకేం చేయవు..నువ్వు ఇన్ని పనులు చేశావా అంటూ సెటైర్లు వేశారు. మరికొందరేమో నీ భార్య నిత్యతో పనులు చేయించి నువ్వు రీల్స్ అప్లోడ్ చేస్తున్నావా అంటూ గాలి తీశారు. కాగా ఈ వీడియోపై రవి భార్య నిత్య కూడా స్పందించింది. ఈ వీడియోల వెనుక ఏం జరిగింది మేకింగ్ వీడియోలు పెట్టమంటావా అని ఫన్నీగా బెదిరించింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని రవి ఎన్ని వీడియోలు పెట్టినా మా ఉద్యమం ఆగదు అంటూ కామెంట్ చేశాడు. చదవండి : యాంకర్ రవి కారులో.. సీక్రెట్స్ బయటపెట్టేసిన లాస్య 'టౌటే'తో బాల్కనీ పైకప్పు కూలిపోయింది: నటి -
అనసూయ బర్త్‌డే పార్టీ, బిర్యానీ వండిన రవి
► వర్షంలో గొడుగుతో విహరిస్తున్న ఫొటోను షేర్ చేసిన ధన్య బాలకృష్ణ ► ఒక్కసారి ప్రేమిస్తే వదలనంటున్న అఖిల్ సార్థక్ ► ఇప్పుడు అందరికీ అవసరమైన ప్రేమను ఎమోజీ రూపంలో సెండ్ చేస్తానంటోన్న శృతీ హాసన్ ► నా పిల్ల ఎక్కడుందో అని ప్రేమ పాటలు పాడుకుంటున్న మెహబూబ్ దిల్సే ► లాస్ట్ ఫొటోతో భయపెట్టేసిన అదా శర్మ ► క్వారంటైన్ బర్త్‌డే జరుపుకున్న అనసూయ భరద్వాజ్ ► కూతురి కోసం మటన్ బిర్యానీ వండిన యాంకర్ రవి View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
నాగబాబు అరుదైన ఫోటో.. ఆర్జీవీ ఫన్నీ వీడియో
మథర్స్‌డే సందర్భంగా అమ్మ, నాన్నతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసుకున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. ఈ ఫోటో చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఓ ఫన్నీ వీడియోని షేర్ చేస్తూ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మథర్స్‌డే సందర్భంగా తల్లితో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది హీరోయిన్ లక్ష్మీరాయ్. నల్ల చీర అందాలతో రెచ్చగొడుతున్న యాంకర్ రష్మీ View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
యాంకర్ రవి కారులో.. సీక్రెట్స్ బయటపెట్టేసిన లాస్య
బుల్లితెరపై యాంకర్ రవి-లాస్య జోడీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 'సమ్‌థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ జోడీ కొన్ని కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా టామ్ అండ్ జెర్రీలా కలిసున్న వీరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసిపోయారు. దీంతో మరోసారి ఆన్‌స్ర్కీన్‌పై రవి-లాస్య సందడి చేస్తున్నారు. ఒకానొక దశలో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఇంకెప్పుడో కలిసి షోలు చేయం అని భీష్మించుకున్న ఈ జంట కొందరు మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మళ్లీ కలిసారు. దీంతో ఈ జోడీకున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని స్పెషల్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు షో నిర్మాతలు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి-లాస్య తామిద్దరం మళ్లీ ఎలా కలిశారు? అప్పుడు నెలకొన్న పరిస్థితులు సహా పలు విషయాలపై చర్చించారు. ఈ క్రమంలోనే రవికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను లాస్య బయటపెట్టేసింది. సోషల్ మీడియా, ఫోన్, శానిటైజర్..ఈ మూడు లేకుండా రవి బతకలేడని, ఎక్కడకి వెళ్లినా ఈ మూడు తప్పనిసరి అని పేర్కొంది. అంతేకాకుండా ఇప్పుడైతే కరోనా సమయమని అందరం చాలా ఎక్కువగా శానిటైజర్ వాడుతున్నామని, అయితే రవి మాత్రం కరోనాకు ముందు నుంచే శానిటైజర్ వాడే అలావాటుందని పేర్కొంది. తన కారులో ఎప్పుడూ ఓ శానిటైజర్ బాటిల్ ఉంటుందని, ఏదైనా ముట్టుకుంటే వెంటనే శానిటైజర్ రాసుకుంటాడని తెలిపింది. చదవండి : లాస్యకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి పెళ్లి కాలేదని చెప్పి..వేరే అమ్మాయిలతో నటుడి ఎఫైర్స్ -
యాంకర్ ప్రదీప్‌కి కరోనా పాజిటివ్.. అందుకే ఆ షోకి వెళ్లిన రవి!
కరోనా సెకండ్ వేవ్‌కి దేశం అతలాకుతలం అవుతోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కర్ప్యూ, లాక్డౌన్ ప్రకటించినా..కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి మృతి చెందారు. కొంతమంది ఇప్పటికీ ఐసోలేషన్ల్లో ఉన్నారు. తాజాగా ప్రముఖ యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజుకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న ఓ షోకి యాంకర్ రవి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ప్రదీప్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. చదవండి: అలా పెళ్లి చేసుకోలేదు.. తన లవ్‌స్టోరీ చెప్పిన ఇంద్రజ క్వారంటైన్లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ -
కూతురి కోసం యాంకర్ రవి ఏం చేశాడో తెలుసా?
యాంకర్ రవి..బుల్లితెరపై టాప్ యాంకర్‌గా అలరిస్తున్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తాడు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో గడిపేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటూ రవి పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. తన గారాల పట్టి వియా అంటూ చెప్పలేనంత ప్రేమ అని తనకోసం ఏదైనా చేస్తానంటున్నాడు రవి. తాజాగా కూతురు అడిగిందని వెంటనే తనకోసం స్పెషల్‌గా చికెన్ చేసి తినిపించాడు. అంతేకాకుండా తన చిట్టితల్లికి కారం తగలొద్దని జాగ్రత్తలు తీసుకొని మరీ వంట చేశాడట. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కూతురిపై రవి కురిపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు..మీరు చేసే వీడియోలు చూసి మా భార్యలు మమ్మల్ని కూడా వంట చేయమని డిమాండ్ చేస్తున్నారంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక రియాలిటీ షోలతో బిజీగా ఉంటున్న రవి...బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇస్తున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకు మందు సీజన్లలోనూ బిగ్‌బాస్ టీం తనను సంప్రదించిందని, అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అప్పుడు వెళ్లలేదని గతంలో రవి పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి ఈ సీజన్లో అయినా అడుగుపెడతాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. చదవండి : (చిరంజీవి చేతుల మీదుగా 'విరాటపర్వం') (లాస్యకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి) -
లాస్యకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి
బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నా రవి-లాస్య జోడీకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. టీఆర్పీ రేటింగ్‌లోనూ వీరిద్దరి కాంబో హిట్ పెయిర్‌గా నిలిచింది. రవి-లాస్య జోడీకి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారంటే వీరిద్దరి కాంబినేషన్ ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'సమ్‌థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ జోడీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అప్పటిదాకా టామ్ అండ్ జెర్రీలా కలిసున్న వీరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. పెళ్లి తర్వాత బుల్లితెరకు కొంచెం గ్యాప్ ఇచ్చిన లాస్య తాజాగా బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ క్యూట్ పెయిర్ మళ్లీ తెరపై కనిపించనున్నారు. ఈ విషయన్ని స్వయంగా యాంకర్ రవి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా వెల్లడించాడు. సంక్రాంతి స్పెషల్ వేడుకగా వీరిద్దరితో 'స్టార్‌మా' వాళ్లు ఓ షో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ ఈవెంట్‌తో రవి-లాస్య కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
అభిజిత్‌లో ధోనీని చూశా: యాంకర్ రవి
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో ఇచ్చిన "ఉక్కు హృదయం" టాస్క్ వల్ల హౌస్ ఎంత రసాభాసగా మారిందో తెలిసిందే కదా. అయితే ఎదురుగా ఉన్న ప్రత్యర్థులు బలమైన వారని తెలిసి అభిజిత్ బుద్ధికి పని చెప్పాడు. కిడ్నాప్ ప్లాన్ రచించగా, అది వీర లెవల్లో సక్సెస్ అయింది. ఊహించని దెబ్బకు మనుషుల టీమ్ గిలగిలా కొట్టుకున్నారు. నమ్మకద్రోహం అంటూ అభిజిత్‌పై పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఈ క్రమంలో తనను ఎన్ని మాటలన్నా, పరుష పదజాలం ఉపయోగించినా అభి సహనాన్ని కోల్పోలేదు. అంత కోపమొంటే నామినేట్ చేయండి అని సింపుల్‌గా గొడవకు ముగింపు పలికాడు. ఇది జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ తను మాత్రం ఏమీ ఆశ్చర్యపోలేదంటున్నాడు యాంకర్ రవి. ఇతడు అభిజిత్‌కు బంధువు అవుతాడు. (చదవండి: వర్కవుట్ అయిన కిడ్నాప్; నాకిది అగ్ని పరీక్ష) తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి మాట్లాడుతూ.. "నేను బిగ్‌బాస్ ప్రోమోలు చూస్తున్నాను. గేమ్‌లో పరిస్థితిని అంచనా వేసి అప్పటికప్పుడు అభిజిత్ కిడ్నాప్ ప్లాన్ చేయడం ప్రశంసనీయం. పైగా అందరూ అతడిపై అరుస్తున్నా సహనంగా ఉన్నాడు. అది చూసి నేనేమీ షాక్ అవలేదు. ఎందుకంటే అతడిలో నాకు ఎమ్ఎస్ ధోనీ కనిపిస్తున్నాడు. అభి.. ఏదైనా గొడవ జరిగితే తిరిగి అరవడం బదులు కూర్చుని మాట్లాడుకుందాం అనే టైపు. అతడు రియల్ లైఫ్‌లో కూడా ఇలానే ఉంటాడు. చాలా సైలెంట్. అవసరమైతేనే మాట్లాడతాడు. ఓ ఫంక్షన్లో మేము మాస్ డ్యాన్స్ చేస్తున్నాం. అక్కడే ఉన్న అభిని డ్యాన్స్ చేయమని పిలిచాం. కానీ అతను సాల్సా వంటి పాటలకైతేనే స్టెప్పులేస్తానన్నాడు. కానీ అభి ఒక్కసారి నమ్మాడంటే అది ఏదైనా సరే విడిచిపెట్టడు. అతడు తప్పకుండా టాప్ 3లో ఉంటాడు. కానీ రేపు పొద్దున ఏదైనా తప్పు చేస్తే మొదట నేనే అతడిని విమర్శిస్తా" అని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..) -
తోట బావిలో...
యాంకర్ రవి, గౌతమి జంటగా నటిస్తున్న చిత్రం ‘తోట బావి’. గద్వాల్ కింగ్ సమర్పణలో ఆలూర్ ప్రకాశ్‌గౌడ్ నిర్మించారు. అంజి దేవండ్ల దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేసి మాట్లాడుతూ– ‘‘రవిని చాలాకాలంగా టీవీలో చూస్తున్నాను. మంచి టైమింగ్ ఉన్న నటుడు’’ అన్నారు. ‘‘రవి ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు అంజి దేవండ్ల. ‘‘యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో మా దర్శకుడు సినిమాను ఇంట్రస్టింగ్‌గా తీశారు. మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న దర్శకునిలా తీశారు’’ అన్నారు ప్రకాష్ గౌడ్. ఈ చిత్రానికి దౌలు, చిన్నస్వామి, అభిషేక్ .బి సహనిర్మాతలు. -
యాంకర్ రవి 'తోటబావి' టీజర్
యాంకర్ రవి హీరోగా గౌతమి హీరోయిన్గా గద్వాల్ కింగ్స్ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్ పతాకంపై అంజి దేవండ్ల దర్శకత్వంలో ఆలూర్ ప్రకాష్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `తోటబావి`. దౌలు(విష్ణుప్రియహోటల్), చిన్నస్వామి, అభినేష్. బి సహనిర్మాతలు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'టీజర్ చాలా బాగుంది. దర్శకుడు మంచి విజన్‌తో తెరకెక్కించాడని తెలుస్తోంది. నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా ఉన్నాయి. రవిని చాలా కాలంగా టెలివిజన్‌లో చూస్తున్నాను. మంచి టైమింగ్ ఉన్న నటుడు. ఆయన హీరోగా చేస్తున్న చిత్రం `తోటబావి`. టైటిల్ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమా దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకరావాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్' అన్నారు. యాంకర్ రవి హీరోగా నటిస్తోన్న`తోటబావి` టీజర్ ని విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ దర్శకుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ..`నా సినిమా టీజర్‌ను దర్శకుడు ఎన్. శంకర్ గారు విదలచేయడం హ్యాపీగా ఉంది. హీరో రవిగారు ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు ఏం కావాలో అన్ని సమకూర్చి నాకు సహకరించారు. తప్పకుండా మీ అందరికి నచ్చుతుందనే భావిస్తున్నాను` అన్నారు. చదవండి: భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న ‘అంగుళీక’ నిర్మాత ఆలూర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. `మా సినిమా టీజర్ విడుదల చేసిన దర్శకుడు ఎన్. శంకర్ గారికి హృదయపూర్వక దన్యవాదాలు. మా మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో మా దర్శకుడు కథ, కథనాలు చాలా ఇంట్రస్టింగ్‌గా తయారు చేశారు. మొదటి సినిమా అయినా ఒక అనుభవం ఉన్న దర్శకుడిలా చక్కగా తెరకెక్కించారు. మా హీరో రవి గారి సపోర్ట్ మరువలేనిది. సినిమా మేము అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ` అన్నారు. రవి, గౌతమి, శివశంకర్ మాస్టర్, ఛత్రపతి శేఖర్, నర్సింహా రెడ్డి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, రోహిణి, ఉన్నికృష్ణ, అభి, శివం తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చిడతల నవీన్; ఎడిటర్: గిరి, సంగీతం: దిలీప్ బండారి, స్టంట్స్: శంకర్, కొరియోగ్రఫీ: సన్ని, లిరిక్స్: రామాంజనేయులు, స్టిల్స్: పాండు రంగ, సహనిర్మాతలు: దౌలు (విష్ణుప్రియ హోటల్), చిన్న స్వామి, అభినేష్ .బి, నిర్మాత: ఆలూర్ ప్రకాష్ గౌడ్, కథ- స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: అంజి దేవండ్ల. -
ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..
బంజారాహిల్స్: వారంతా బుల్లి తెరపై మెరిసి ఆ తర్వాత వెండితెరపై మైమరపిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. టీవీ నటులుగా వెలుగొందిన అనంతరం చలనచిత్రాలపై దృష్టి సారించి ఔరా అనిపిస్తున్నారు. ఒకప్పుడు వెండితెరపై కనిపించాలంటే నాటకాల్లో నటించి.. ప్రతిభను కనబరిచి సినిమా అవకాశాల్లోకి వచ్చేవారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, సూర్యకాంతం, నాగభూషణం, రావుగోపాలరావు తదితర మేటి నటీనటులు నాటకాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపి సినిమాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన కృష్ణ, శోభన్‌బాబు తదితరులతో పాటు మెగాస్టార్ చిరంజీవి అప్పటి మద్రాస్ పాండీబజార్లో సినిమా కార్యాలయాల చుట్టూ తిరిగి తమ ప్రతిభను చాటి అవకాశాలు తెచ్చుకున్నారు. 2000 సంవత్సరం తర్వాత కూడా ఒక వెలుగు వెలిగిన నటులంతా చెన్నైలో సినిమా అవకాశాల కోసం తిరిగి దర్శకులను ఒప్పించి, మెప్పించి తారలుగా వెలుగొందారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాల్లో అవకాశాల కోసం బుల్లితెరను నమ్ముకుంటున్నారు. వెండితెరపై వెలగాలంటే ముందుగా బుల్లితెరను మెప్పించాల్సి ఉంటోంది. టీవీల్లో ఒకవైపు సీరియళ్లు, ఇంకోవైపు షోలలో అలరిస్తూ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. పలు టీవీ చానళ్లు నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా చాలా మంది యువతీ యువకులు వెండితెరపై వెలిగిపోతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే నాటి నాటకాల వేదికలే ఇప్పుడు బుల్లితెరలుగా మారాయి. టీవీషోలకు దూరం కాలేదు.. ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు సినిమాల్లో చాన్సులు కొట్టేస్తున్నారు కొందరు నటులు. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కదా అని వీరు టీవీలను మాత్రం వదలడం లేదు. యాంకర్ రష్మీ రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించినా బుల్లితెరను మాత్రం వదులుకోలేదు. పాటల్లో నటించే అవకాశం వచ్చినా అనసూయ కూడా యాంకర్‌గా, ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగా చేస్తున్నా తాను నమ్ముకున్న టీవీని మాత్రం వదులుకోలేదు. ఇప్పుడిప్పుడే మరింత మంది టీవీనటులకు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ముందుగా టీవీ షోలలో మెప్పించి ఆ తర్వాత సినిమా స్క్రీన్లపై కనిపించేందుకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. నవ్విస్తూ.. మెప్పిస్తూ.. బుల్లితెరపై సందడి చేస్తున్న ప్రముఖ హాస్యనటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ రవితో పాటు రష్మీ, హీరో హీరోయిన్లుగా వెండితెరపై ప్రేక్షకుల్ని మెప్పించారు. వీరికి బుల్లితెర అనే వేదిక లేకపోతే వెండితెర ఏమాత్రం పరిచయం కాకపోయి ఉండేది. టీవీల్లో హాస్య ప్రధానంగా వస్తున్న కార్యక్రమం ద్వారా మహేష్ అనే నటుడు ఏకంగా రామ్‌చరణ్ తేజ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో మంచి చాన్స్ కొట్టేసి ఇప్పుడు బిజీగా మారాడు. మాటీవీలో సందడి చేసిన బిగ్‌బాస్ సీజన్– 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఏకంగా రంగమార్తాండ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు కాగా జీవితా రాజశేఖర్ కూతురు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక యాంకర్‌గా ఒక వెలుగు వెలుగుతున్న అనసూయ భరద్వాజ్ కూడా బుల్లితెరపై మెప్పించి పలు సినిమాల్లో కూడా నటించారు. సుడిగాలి సుధీర్ హీరోగా సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. మేడమీద అబ్బాయి అనే సినిమాలో హైపర్ ఆది సెకండ్ హీరోగా నటించారు. యాంకర్ శ్రీముఖి కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. చలాకీ చంటి, చమ్మక్‌చంద్ర, రాకెట్ రాఘవ, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, అప్పారావు తదితరులు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. టీవీషోల ద్వారానే వీరందరికీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయనడంతో సందేహంలేదు. రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్‌తో నటించిన టీవీ నటుడు మహేష్ -
‘అందుకే శ్రీముఖికి సపోర్ట్ చేయడం లేదు’
బుల్లితెరపై సందడి చేస్తున్న బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 3కి మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా.. వారి తరపున బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. మేము గొప్ప అంటే మేమే గొప్ప అంటూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. కాగా, ప్రచారంలో సెలబ్రీటీలు సైతం పాలు పంచుకుంటున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్టు చేయాలంటూ అభిమానులను కోరుతున్నారు. ఇప్పటికే శ్రీముఖికి జబర్దస్త్ యాంకర్ రష్మీ, రాంప్రసాద్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ రవి కూడా తన బెస్ట్ప్రెండ్ అలీ రేజాకి మద్దతు తెలిపాడు. తన స్నేహితున్ని గెలిపించాలని కోరుతూ ఫేస్బుక్ లైవ్ నిర్వంచారు. అయితే ఫేస్బుక్ లైవ్‌లో రవి పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న అందరూ తనకు ఇష్టమేనని, కానీ తన మద్దతును మాత్రం అలీరెజాకే ఇస్తానని చెప్పాడు. శ్రీముఖినీ కాదని అలీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో కూడా వివరించారు. ‘అలీ రేజా నా కుటుంబ సభ్యుడులాంటి వాడు. ఇండస్ట్రీలో నా బెస్ట్ప్రెండ్ అతనే. మా ఇంట్లో పండుగైతే వాళ్లు వస్తారు.. వారింట్లో పండగైతే మేము వెళ్తాం. రంజాన్ పండగ రోజు బిర్యానీ పంపిస్తాడు. నాతో కలిసి దీపావళి పండుగ జరుకుంటాడు. మా మధ్య అంతమంచి బాండ్ ఉంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో అందరూ నాకు నచ్చివాళ్లే. కానీ అలీ నాకు సొంత అన్నలాంటివాడు. అందుకే అతనికి సపోర్ట్ చేస్తున్నా. గేమ్ బాగా ఆడుతున్నాడు. అలీ మొదటి నుంచి 49 వరకు ఏంటో మీకు తెలుసు. ఎలిమినేట్ అయినప్పుడు నాతో పాటు అందరు బాధపడ్డారు. అతను చాలా మంచోడు..గేమ్ బాగా ఆడుతుంటే ఎందుకు ఎలిమినేట్ చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. బయటకు వచ్చాక కూడా అలీని కలిశా. పార్టీ చేసుకున్నాం. ఆ తర్వాత బిగ్‌బాస్ టీం వచ్చి రీఎంట్రీకి అడిగినప్పుడు ఆలోచించాడు. అతనేం సొంతంగా వెళ్లలేదు. అతను ఉంటే బాగుంటుందని భావించే బిగ్‌బాస్ మేనేజ్మెంటే మళ్లీ ఆహ్వానించింది. అయితే రీఎంట్రీ తర్వాత అలీ అలాగే ఉన్నాడు. కానీ చూపించే విధానం మారింది. అది ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. వారికి నచ్చింది వారు చూపిస్తారు. దీంట్లో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. 24 గంటల్లో కేవలం ఒక గంట మాత్రమే వారిని చూపిస్తారు. ఇండస్ట్రీ వాళ్లం కాబట్టి మాకు అంతా తెలుసు. షూటింగ్, రేటింగ్, ఔట్ పుట్, మనీ ఇవన్నీ మాకు తెలుసు. మీరు చూసేవాళ్లు మాత్రమే. మేం ఏది చూపిస్తే అది చూస్తారు. మిమ్మల్ని నమ్మేలా చేసేది మేం. ఇది బిజినెస్. ఒక గంట చూసి ఒకరు మంచోడు ఒకరు చెడ్డోడు అని ఎలా డిసైడ్ అవుతారు. అది ఒక గేమ్.. అంతా చూపించరు. దయచేసి ట్రోలింగ్ చేయకండి. అలీ చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాడు. తెలుగు నేర్చుకున్నాడు. యాక్టింగ్ నేర్చుకున్నాడు. కష్టపడి సీరియల్స్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్‌లోకి వచ్చి కూడా జన్యూన్‌గా ఆడుతున్నాడు. గేమ్‌లోకి వేళ్లేముందు అలీకి ససోర్ట్ చేస్తానని మాట ఇచ్చా. అందకే సపోర్ట్ చేస్తున్నాను. శ్రీముఖికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని అందరూ ట్రోల్ చేస్తున్నారు. శ్రీముఖి నా కోయాంకర్ మాత్రమే. మా మధ్య మంచి బాండ్ ఉంది. తను కూడా గేమ్ బాగా ఆడుతోంది. ఈ విషయాన్ని నేను బిగ్‌బాస్ షోకి వెళ్లినప్పుడు కూడా చెప్పాను. అయినా ట్రోల్ చేస్తున్నారు. అందరికి సపోర్ట్ చేయాలని ఉందా? శివజ్యోతికి బిత్తిరి సత్తి సపోర్ట్ చేస్తున్నారా? ఒక్కొక్కరికి ఒక్కరు నచ్చుతారు. అలీ నా అన్న లాంటి వాడు అందుకే శ్రీముఖిని కాదని అతనికి సపోర్ట్ చేస్తున్నా. మీకు నచ్చిన వారికి సపోర్ట్ చేసుకోండి కానీ ట్రోలింగ్ చేయకండి ప్లీజ్. హౌజ్ నుంచి బయటకు వచ్చాక అందరూ కలిసి ఉంటారు. మీకు గొడవలు ఎందుకు? ఇకనైనా ట్రోలింగ్ ఆపండి’ అని రవి కోరారు. అయితే ఫైనల్స్‌కు ఎవరు వెళ్తారని నెటిజన్ అడగ్గా.. రాహుల్, అలీలు టాప్ వన్, టూలో ఉంటారని అభిప్రాయపడ్డాడు. బిగ్‌బాస్ 3 విన్నర్ ఎవరో తనకు తెలుసని, అది మాత్రం ఇప్పుడు చెప్పనని రవి అన్నాడు.