
నామినేషన్స్ అంటేనే రగడ. కంటెస్టెంట్ల మధ్య మంట పెట్టే ఈ నామినేషన్స్ నేడు వెరైటీగా నిర్వహించనున్నాడు బిగ్‌బాస్. నామినేషన్స్ బాధ్యతను ముగ్గురు హంటర్స్ అయిన జెస్సీ, శ్రీరామ్, సన్నీకి అప్పగించాడు. దీంతో గేమ్‌లో ఊహించని ట్విస్టులు ఇస్తూ హౌస్‌మేట్స్‌కు షాకుల మీద షాకులిస్తున్నారు హంటర్స్. తాజాగా రిలీజైన ప్రోమోలో అనీ మాస్టర్‌పై కవిత విసిరాడు రవి. 'అనీ, ఓ అనీ... చేస్తావు మమ్మల్ని నామినేషన్స్ స్ట్రాంగ్ అని! శ్వేత పోయింది.. ఎవర్నంటావు కూతురని!' అని చదవడంతో మాస్టర్ వహ్వా వహ్వా అంటూ చప్పట్లు కొట్టింది.
ఇక నామినేషన్స్‌లో ప్రియ మరోసారి సిల్లీ రీజన్‌తో రవిని నామినేట్ చేసింది. సోఫా మీద టవల్ ఆరేయడం నచ్చలేదని చెప్పుకొచ్చింది.. ఆమె చెప్పిన కారణం విని ఖంగు తిన్న రవికి నోట మాట రాలేదు. ఇక ఈ టాస్క్‌లో సన్నీ, ప్రియ, పింకీలకు మధ్య పెద్ద ఫైటే జరిగినట్లు కనిపిస్తోంది. సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఫేక్ జనాలతో నేనుండలేను అంటూ పింకీ చిర్రుబుర్రులాడింది.
ఇక సన్నీ.. రవిని నామినేట్ చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. శ్వేత ఉంటే నిన్ను కచ్చితంగా నామినేట్ చేసేదని రవికి చెప్పడంతో షాకైన అతడు శ్వేత నావల్ల వెళ్లిపోయిందా? అని ప్రశ్నించాడు. శ్వేత గురించి మాట్లాడొద్దంటూ సన్నీకి సూచించింది యానీ. అందరితో విసిగి వేసారిన సన్నీ.. ''గేమ్ మీరాడొద్దు, నేనాడుతా.. నామినేషన్స్ అంటే మజాక్ అయితుందా?'' అని ఫైర్ అయ్యాడు.