Bigg Boss 5 Telugu Today Promo: Anchor Ravi Wife And Daughter Entry In BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: అదిరిపోయిన ప్రోమో.. రవి ఎక్సయిట్‌మెంట్‌ హైలైట్‌

Published Fri, Nov 26 2021 11:47 AM | Last Updated on Fri, Nov 26 2021 12:25 PM

Bigg Boss 5 Telugu: Anchor Ravi Wife And Daughter Entry In BB House - Sakshi

Bigg Boss 5 Telugu Today Promo, Anchor Ravi Gets Emotional:  బిగ్‌బాస్‌ హౌస్‌ ఎమోషన్స్‌తో నిండిపోయింది. ప్రతి సీజన్‌లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్‌ బిగ్‌బాస్‌లోకి ఎంటర్‌ కావడంతో రియల్‌ ఎమోషన్స్‌ బయటకొచ్చాయి. ఇప్పటికే కాజల్‌, శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, మానస్‌ల కుటుంబసభ్యులు ఎంటర్‌ అవగా, నేటి ఎపిసోడ్‌లో యాంకర్‌ రవి కోసం భార్య నిత్య, కూతురు వియా వచ్చారు. దీంతో రవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ప్రతిరోజూ వియా ఫోటో చూడనిదే నిద్ర లేవని రవి నేరుగా కూతుర్ని చూడటంతో సంతోషంలో మునిగిపోయాడు. ప్రేమగా హత్తుకొని కాసేపు కబర్లు చెప్పడంతో పాటు సరదాగా ఆడిస్తాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్‌ చేసింది. ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. రవి కూతురు వియా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement