![Bigg Boss 5 Telugu: Srihan, Shiva Balaji And More Family Members On The Stage - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/27/siri-boy-friend6.jpg.webp?itok=PC9nwbRb)
బిగ్‌బాస్‌లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో సరదాగా సాగింది. ఫ్యామిలీ మెంబర్స్ బిగ్‌బాస్‌లోకి ఎంటర్ కావడంతో రియల్ ఎమోషన్స్ బయటకొచ్చాయి.దాదాపు 80 రోజుల తర్వాత కుటుంబసభ్యులను చూసే అవకాశం రావడంతో హౌస్‌మేట్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. అయితే యాంకర్ రవి, కాజల్ కుటుంబసభ్యులు మినహాయించి మిగతా కంటెస్టెంట్ల కోసం కేవలం ఫ్యామిలీలోనే ఒకరిని మాత్రమే బిగ్‌బాస్‌లోకి అనుమతించారు.
తాజాగా హౌస్‌మేట్స్ ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడానికి డబుల్ ఎమోషన్స్‌ని బయటకు రప్పించడానికి మిగతా కుటుంబసభ్యులను కూడా బిగ్‌బాస్ ఆహ్వానించారు. ఇందులో భాగంగానే రవికోసం ఆయన తల్లి, కాజల్ ఫ్రెండ్ సహా సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ సైతం బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. శ్రీహాన్‌ను చూడగానే సిరి తలదించుకుంది.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ 'వదిలేస్తున్నావా సిరి'.. అంటూ శ్రీహాన్ అడగ్గానే ఏం చెప్పాలో తెలియక బాగా ఎమోషనల్ అయ్యింది సిరి. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్ చేసింది. ఇప్పటివరకు సిరిని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న శ్రీహాన్..అలా 'వదిలేస్తున్నావా సిరి'.. అని ఎందుకు అడిగాడు అన్నది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Weekend is here...More family members on the stage #BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Wp3ayU5TV8
— starmaa (@StarMaa) November 27, 2021
Comments
Please login to add a commentAdd a comment