RJ Kajal
-
ఆర్జే కాజల్ ఇల్లు చూశారా? అన్నీ బహుమతులే!
ఆర్జే కాజల్.. అమె మాటల ప్రవాహానికి అడ్డుకట్ట ఉండదు. బిగ్‌బాస్ హౌస్‌లోనూ వాగుడుకాయగా పేరు తెచ్చుకుంది కాజల్. బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టిన తొలినాళ్లో అందరితో గొడవలు పెట్టుకుని నెగెటివిటీ సంపాదించుకున్న ఆమె రానురానూ తన తప్పొప్పులు తెలుసుకుని తనను తాను మార్చుకోవడంతో ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. మానస్, సన్నీల దోస్తీ చేయడమే కాకుండా వారికోసం నాగార్జునను సైతం ఎదిరించే ధైర్యానికి అభిమానులు సలాం కొట్టారు. బిగ్‌బాస్ తర్వాత పలు షోలతో నిత్యం బిజీగా ఉంటున్న కాజల్ తాజాగా తన ఇల్లును చూపిస్తూ హోంటూర్ వీడియో చేసింది. ఇల్లు సర్దలేనంటూనే తన గృహాన్ని చూపించింది. అనివార్య కారణాల వల్ల త్వరలోనే ఈ ఇంటిని వదిలేసి కొత్తింటికి మారిపోతున్నామని అందుకే హోం టూర్ వీడియో చేశానని చెప్పుకొచ్చింది. ఇంట్లో అడుగుపెట్టగానే మొదటగా స్కూల్ నుంచి కాలేజీ వరకు గెలుచుకున్న బహుమతులను చూపించింది కాజల్. అవన్నీ దాదాపు పాటలో పోటీలో విన్ అయిన బహుమతులేనని తెలిపింది. అలాగే షోలో గెల్చుకున్న గిఫ్ట్స్‌ను సైతం అందంగా అమర్చుకుంది. వరుసగా అమర్చిన పుస్తకాలను చూపిస్తూ ఫరియా అబ్దుల్లా తనకో పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిందని చెప్పింది. హాల్, కిచెన్, పూజా గది, గెస్ట్ రూమ్, బాల్కనీతో పాటు తన సోదరి గదిని చూపించింది. ఆ తర్వాత గెస్ట్ రూమ్ ఉందని, అమ్మవాళ్లు వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారంది. అలాగే ఏదైనా షోకు వెళ్లేముందు ఇక్కడే రెడీ అయ్యేదాన్నని చెప్పింది. తర్వాత తన గదిని చూపిస్తూ అక్కడ రెండు వార్డ్రోబ్లు ఉన్నాయని, అటాచ్డ్ బాల్కనీ ఉందని తెలిపింది. అయితే అపార్ట్మెంట్స్, ఫ్లాట్ కాకుండా ఎప్పటికైనా సొంతిల్లు ఉండాలన్నదే తన కల అని చెప్పుకొచ్చింది కాజల్. చదవండి: ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య! -
ఆర్జే కాజల్‌కి అదిరిపోయే పంచ్ వేసిన వరుణ్ సందేశ్
Varun Sandesh Hilarious Punch to RJ Kajal: తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ హీరోగా చేసిన సినిమా సకలగుణాభిరామ. ఇటీవలె ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌కి శ్రీరామచంద్ర, వరుణ్‌తేజ్, సోహేల్, ఆనీ మాస్టర్, మానస్ సహా పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆర్జే కాజల్ హోస్ట్‌గా నిర్వహించింది. కాగా సన్నీతో అనుబంధం గురించి హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతతూ.. సన్నీ తనకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసని, బిగ్‌బాస్‌తో అందరి మనసులు గెలుచుకున్నాడని అభినందించాడు. సకలగుణాభిరామ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అంటూ తన స్పీచ్‌ని ముగించాడు. అయితే వరుణ్ మాట్లాడిన వెంటనే మైక్ అందుకున్న కాజల్.. నీ ఇందువదన సినిమాకి ఆల్ ది బెస్ట్ అని పేర్కొనగా సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యిందంటూ వరుణ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అక్కడుకున్న వారంతా కౌజల్ తప్పులో కాలేసిందంటూ తెగ నవ్వుకున్నారు. -
కాజల్ ఎలిమినేషన్‌కు అసలు కారణాలివే!
బిగ్‌బాస్ అంటే చాలామందికి ఇష్టం. కానీ ఈమెకు మాత్రం పిచ్చి. ఆ పిచ్చి ప్రేమతోనే బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టింది ఆర్జే కాజల్. ప్రతిచిన్న విషయానికి కూడా తెగ ఎగ్జైట్ అయ్యేది. బిగ్‌బాస్ తన పేరును పిలిస్తే కూడా పరవశించిపోయేది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా ఈ అతి ఆమె కొంప ముంచింది. ఫలితంగా 14వ వారంలో ఎలిమినేట్ అయింది. దీంతో టాప్ 5లో అడుగు పెట్టాలన్న కోరిక ఫలించకుండానే వెనుదిరిగింది. కాజల్ ఎలిమినేషన్ వెనక పెద్ద రాజకీయాలు, కుట్రలు ఏమీ జరగలేవనే చెప్పాలి. ఎందుకంటే ఉన్న ఆరుగురిలో కాజల్‌కు తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారందరితో పోలిస్తే కాజల్ టాస్కుల్లోనూ వెనకబడిందనే చెప్పుకోవాలి. పైగా ఇన్ని వారాలు హౌస్‌లో ఉండగలిగినా ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయింది. గత బిగ్‌బాస్ సీజన్ల కంటెస్టెంట్స్‌ను ఇంటర్వ్యూ చేయడమే కాక రివ్యూలు కూడా ఇచ్చింది కాజల్. దీంతో ఆమెకు బిగ్‌బాస్ షో మీద మంచి పట్టు ఉందని, ఎప్పుడేం చేయాలో అంతా ముందే ప్లాన్ చేసుకుని వచ్చిందని అంతా భావించారు. ఆమె మాట్లాడినా, ఏం చేసినా కూడా అదంతా గేమ్‌లో భాగమనే నిర్ణయానికి వచ్చారు. ప్రతి విషయంలో తలదూర్చడం, అతిగా ఎగ్జైట్ అవడంతో ఆమెకు కంటెంట్ క్వీన్, నాగిణి, ట్రాకులు సెట్ చేస్తుంది, మ్యారేజ్ బ్యూరో నడుపుతుందంటూ రకరకాల బిరుదులు ఇచ్చారు. అలా ఇంటాబయటా నెగెటివిటీ పెరిగింది. దాదాపు అందరు కంటెస్టెంట్లతో గొడవపడింది కాజల్. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఎంతోమంది హౌస్మేట్స్ కాజల్‌తో మాకు కనెక్షన్ లేదని తెగేసి చెప్పారు. హౌస్‌లో ఉన్నవాళ్లలో కూడా ఆమె నుంచి నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయంటూ దూరం పెట్టారు. ఇలా మొదటి నుంచి ఆమె నెగెటివిటీని మోస్తూనే వచ్చింది. యానీ మాస్టర్ అయితే కాజల్‌ను చూస్తే చాలు తోక తొక్కిన త్రాచులా లేచేది. వీళ్ల గొడవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటు రవిని కూడా ఫ్రెండ్ అంటూనే పదేపదే తగాదా పడుతూ వచ్చింది. కంటెంట్ కోసమే ఇలా గొడవలు పడుతుంది అని హౌస్మేట్స్ ఓ భావనకు వచ్చారు. మొదట్లో షణ్ముఖ్, తర్వాత మానస్, సన్నీలతో ఉండటాన్ని కూడా ప్రేక్షకులు తప్పుపట్టారు. మారుతున్న గేమ్‌ను బట్టి ఆమె తను ఫ్రెండ్షిప్ను మార్చుకుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పుడైతే కాజల్‌కు మానస్, సన్నీలతో దోస్తానా కుదిరిందో అప్పటినుంచి ఆమెపై పాజిటివిటీ పెరిగింది. అప్పడం గొడవలో సన్నీ తరపున వకీల్సాబ్లా వాదించి నాగార్జుననే ఎదిరించింది. ఈ విషయంలో స్నేహం కోసం ఎంతకైనా తెగిస్తుందని ఆమెపై ప్రేక్షకుల్లో అభిమానం పెరిగింది. హౌస్మేట్స్ అంతా తనను విమర్శిస్తున్నా అవేమీ పట్టించుకోకుండా సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చేలా చేసింది. హౌస్‌లో అందరూ ఆమెను అందరూ టార్గెట్ చేసినా చిరునవ్వుతో ఎదురించింది. మాటల్లో క్లారిటీ, ఆత్మవిశ్వాసం, గుండెధైర్యం, స్నేహం విషయంలో నిజాయితీ.. ఆమెను ఇన్నివారాలు ఇంట్లో ఉండనిచ్చాయి. మొత్తంగా ముళ్లదారిలో ప్రయాణం మొదలుపెట్టిన కాజల్ పాజిటివిటీతో బయటకు వచ్చింది. -
నా వెనకాల మాట్లాడాడు, శ్రీరామ్‌కు ఇచ్చిపడేసేదాన్ని!
Bigg Boss 5 Telugu Buzz: Kajal Comments On Shannu And Sunny: బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి స్ట్రాటజీ మంత్రం జపం చేసిన కాజల్ 14వ వారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. టాప్ 5లో ఉంటే అంతే చాలనుకున్న ఆమె కల కలగానే మిగిలిపోయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. 'హౌస్‌లో అందరూ నన్ను నెగెటివ్‌గా చూశారు. నెగెటివిటీకి మారు పేరు అన్నారు. షణ్ముక్ అయితే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడవలు ఆగిపోతాయన్నాడు.. ఆ మాట నన్ను చాలా బాధపెట్టింది' అని విచారం వ్యక్తం చేసింది కాజల్. షణ్ముఖ్.. నేను ఏదైనా మాట అంటే చాలు, అందులో నుంచి ఒక నెగెటివ్ స్టేట్మెంట్ తీస్తాడు, అది నాకు నచ్చేదే కాదని చెప్పుకొచ్చింది. శ్రీరామ్ ఎప్పుడూ నీ స్ట్రాటజీలు అన్నీ తెలిసిపోతాయ్ అంటాడు, అది నిజమేనా? అన్న అరియానా ప్రశ్నకు.. అతడు నా వెనకాల రియాక్ట్ అయ్యాడు. ముందు రియాక్ట్ అయ్యుంటే అప్పుడే ఇచ్చిపడేసేదాన్ని అని బదులిచ్చింది కాజల్. హౌస్‌లో మానస్, సన్నీ ఇద్దరూ ఫ్రెండ్సే అయినప్పటికీ సన్నీ ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. -
కాజల్‌పై బిగ్‌బాస్ నిర్వాహకులు సీరియస్! ఆ రూల్ బ్రేక్ చేసిందా?
Bigg Boss Team Fires On RJ Kajal Over Breaks Rules After Elimination: బిగ్‌బాస్ విన్నర్ కాకపోయిన టాప్ 5లో ఉండాలనుకున్న ఆర్జే కాజల్ నిన్నటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. దీంతో బిగ్‌బాస్ టైటిల్‌కు చేరువలో సన్నీ, శ్రీరామ్, మనస్, సిరి, షణ్ముక్ జస్వంత్ ఉన్నారు. ఇదిలా ఉంటే హౌజ్ నుంచి బయటకు వచ్చిన కాజల్‌పై బిగ్‌బాస్ నిర్వహకులు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. బయటకు వచ్చిన కాజల్ బిగ్‌బాస్ రూల్స్ బ్రేక్ చేసిందని, దీంతో ఆమెపై బిగ్‌బాస్ నిర్వహకులు సీరియస్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మనకు లైవ్ అంటూ వచ్చే బిగ్‌బాస్ ఎపిసోడ్ ఒక రోజు లేదా రెండు రోజుల ముందుగానే షూటింగ్ జరుగుతుంది. చదవండి: ‘తగ్గేదే లే’ డైలాగ్‌తో తండ్రి మ్యానరిజం చూపించిన అయాన్, ఆర్హ ఇక వీకెండ్ ఎపిసోడ్ షూట్ కూడా ఒకరోజు ముందుగానే జరుగుతుంది. అంటే ఆదివారం ఎలిమినేట్ అయ్యే సభ్యులు శుక్రవారం కానీ శనివారం కానీ బయటకు వస్తారు. ఇక బిగ్‌బాస్ ఒప్పందం ప్రకారం షో టెలికాస్ట్కు ముందే వచ్చిన ఇంటి సభ్యులు బిగ్‌బాస్ టెలికాస్ట్ అయ్యి బిగ్‌బాస్ బజ్కు ఇంటర్య్వూ ఇచ్చాకే వారు బయటకు రావాలి. ఏలాంటి ఇంటర్య్వూలు అయినా ఆదివారం తర్వాతే ఇవ్వాలి. ఇక బిగ్‌బాస్‌పై లీక్ వీరుల దృష్టి ఎప్పుడు ఉండేదే. ఎపిసోడ్ టెలికాస్ట్కు ముందే ఎలిమినేట్ అయ్యేది ఎవరో సోషల్ మీడియాలో రీవిల్ చేస్తారు. అయితే అలా లీక్ అయితే బిగ్‌బాస్ నిర్వహకులు పట్టించుకోరు కానీ ఎలిమినేట్ అయిన విషయం కంటెస్టెంట్యే నేరుగా చెప్పకూడదు. చదవండి: సమంతకు థ్యాంక్స్ చెప్పిన బన్నీ కాగా ఈ ఒప్పందాన్నే కాజల్ ఉల్లఘించిందని సమాచారం. 14వ వారం ఎలిమినేషన్లో భాగంగా బయటకు వచ్చిన కాజల్ కాస్తా తొందరపడి ముందుగానే ఓ యూట్యూబ్ చానల్ లైవ్‌లో కనబడటమే కాకుండా ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చిందట. దీంతో ఆదివారానికి ముందే కాజల్ బయటకు వస్తుందని అందరికీ అధికారికంగా తెలిసిపోయింది. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ‘బిగ్‌బాస్ బజ్ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు బయట కనిపించకూడదనే విషయం మీకు తెలియదా’ అని ఆమెను నిలదీసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుంది, దీనిపై కాజల్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలకు నేనే మూల కారణం: కాజల్ -
బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలకు నేనే మూల కారణం: కాజల్
Bigg Boss Telugu 5, Episode 99, Kajal Eliminated: వచ్చేవారం (డిసెంబర్ 19న) గ్రాండ్ ఫినాలే జరగబోతుందని వెల్లడించాడు కింగ్ నాగార్జున. అంటే నెక్స్ట్ సండే ఎవరు విన్నర్ అనేది తేలనుందన్నాడు. ఇక ఈరోజు ఎవరెవరు ఫినాలేలో అడుగుపెట్టనున్నారనేది కూడా తేల్చేశాడు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలుచుకుని శ్రీరామ్ ఫస్ట్ ఫైనలిస్టుగా నిలవగా సన్నీని రెండో ఫైనలిస్టుగా ప్రకటించారు. నేటి(డిసెంబర్ 12) ఎపిసోడ్లో సిరిని మూడో ఫైనలిస్టుగా, షణ్నును నాలుగో ఫైనలిస్టుగా వెల్లడించడంతో వాళ్లు సంతోషంలో మునిగి తేలారు. అనంతరం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వీడియో ద్వారా ప్రశ్నలను సంధించగా హౌస్మేట్స్ వాటికి సమాధానాలు చెప్పారు. ► జెస్సీ: షణ్నుకి, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో నాకు తెలుసు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? అని ఎప్పుడైనా ఆలోచించావా? షణ్ను: ఫ్యామిలీస్ ఇంట్లోకి వచ్చినప్పటినుంచి నాకూ ఈ ప్రశ్న ఎదురైంది. అది తప్పే, కానీ సిరి నా బెస్ట్‌ఫ్రెండ్.. జీవితాంతం ఆమెకు సపోర్ట్‌గా ఉంటాను. ► యానీ మాస్టర్: బిగ్‌బాస్ నుంచి వచ్చాక కొన్ని ఎపిసోడ్లు చూశాను. సన్నీ, మానస్ నా వెనకాల మాట్లాడారు. నేనెప్పుడూ నీ గురించి బ్యాక్ బిచింగ్ చేయలేదు. నువ్వు నా గుడ్ ఫ్రెండ్ అన్నాను. కానీ నువ్వు మాత్రం నేను నటిస్తున్నానని ఇంకా ఏవేవో అన్నావు. నిజంగా నీ మీద జెలసీ ఉంటే నిన్ను కెప్టెన్ చేయడం కోసం నేను కష్టపడకపోయేదాన్ని! సన్నీ: నేను బ్యాక్ బిచింగ్ చేయలేదు. యానీ మాస్టర్ కొన్నిసార్లు మాట మీద నిలబడదు, అప్పుడు నేను నా అభిప్రాయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నానంతే.. ఆమె నాకెప్పుడూ మంచి స్నేహితురాలే.. ► నటరాజ్ మాస్టర్: ఐస్ టాస్క్‌లో పింకీ చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ నడవలేకపోయాడు. టికెట్ టు ఫినాలే టాస్కులో వేరేవాళ్లు నీ తరపున గేమ్ ఆడారు. అంటే పింకీ చేసిన వైద్యం గేమ్పరంగా నీకు ప్లస్ అయిందా? మైనస్ అయిందా? శ్రీరామ్: ఇది ప్లస్సో, మైనసో పక్కనపెడితే నేను టాస్కుల్లో 100% ఇచ్చాను. నా ఆట నేను ఆడలేకపోయాను కాబట్టి మైనస్ అయింది. ► ప్రియాంక: ఇన్నిరోజులు హౌస్‌లో నన్ను భరించావా? నటించావా? మానస్: కచ్చితంగా భరించాను. నేనైతే నటించలేదు ► జెస్సీ: సిరి.. బిగ్‌బాస్ హౌస్‌లోకి గేమ్ ఆడటానికి వెళ్లావు కదా! కానీ నువ్వు గేమ్ మీద శ్రద్ధ తగ్గించి ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నాను అదీఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు, నీకిది అవసరమా? సిరి: గేమ్ ఆడటానికే వచ్చాను. మధ్యలో కొన్నికొన్ని ఎమోషన్స్ తీసుకుంటున్నాను. కానీ గేమ్‌లో ఎమోషనల్ కనెక్ట్ అయితే అవసరం లేదు ► ప్రియ: బయట ఎలా ఉంటావో తెలుసుకోవాలని ఉంది. సహజంగా నువ్వు ఇలాగే ఉంటావా? గేమ్ వరకేనా? కాజల్: నాకు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవాలనిపిస్తే అలానే రియాక్ట్ అవుతున్నా. నేనిలాగే ఉంటాను. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత మానస్‌ను ఐదో ఫైనలిస్టుగా ప్రకటించిన నాగ్ కాజల్ ఎలిమినేట్ అయినట్లు వెల్లడించాడు. దీంతో సన్నీ, మానస్ వెక్కివెక్కి ఏడ్చారు. ఇక శ్రీరామ్‌తో నువ్వెప్పటికీ నా బ్రదర్వే అని చెప్పుకొచ్చింది కాజల్. నన్ను బాగా మిస్సవ్వండి అంటూ బిగ్‌బాస్ హౌస్ నుంచి నిష్క్రమించింది. స్టేజీ మీదకు వచ్చిన కాజల్‌తో నాగార్జున ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు. ఐదు ఎమోషన్స్‌ను ఐదుగురు కంటెస్టెంట్లకు అంకితమివ్వాలన్నాడు. సన్నీ ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ ఇస్తే మానస్ ఐదు రెట్ల ఫ్రెండ్షిప్ చేస్తాడంది కాజల్. సిరి ఐదు రెట్ల ఎమోషన్ ఇస్తే, శ్రీరామ్ ఐదు రెట్ల యాక్షన్ చేస్తాడని తెలిపింది. షణ్ముఖ్ ఐదు రెట్ల డ్రామా చేస్తాడని పేర్కొంది. సిరిని కంట్రోల్ చేయడం, తిట్టడం, హగ్గులివ్వడం.. ఇలా ప్రతిదాంట్లో డ్రామా ఉంటుందని అభిప్రాయపడింది. తాను టాప్ 6లో ఉండగానే ఎలిమినేట్ అవుతానని కల వచ్చిందని, చివరకు అదే నిజమైందని నాగార్జునతో చెప్పుకొచ్చింది. చివరగా ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ తనే మూల కారణమని ఒప్పుకోవడం గమనార్హం. కానీ అవేవీ తను కావాలని చేయలేదని స్పష్టం చేసింది. ఫైనల్‌గా శ్రీరామ్, సిరి, మానస్, షణ్ను, సన్నీ ఈ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిచి ట్రోఫీ కోసం పోటీపడనున్నారు. -
ఆర్జే కాజల్ పారితోషికం ఎన్ని లక్షలో తెలుసా?
Bigg Boss Telugu 5, Eliminated Contestant RJ Kajal Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో కాజల్ ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. మొదట్లో అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ వారి పర్సనల్స్ గురించి కూపీ లాగే ప్రయత్నం చేసినందుకుగానూ ఆమెను లేడీ నారదగా పేర్కొన్నారు. అందరితోనూ గొడవపడుతుంటే స్క్రీన్‌స్పేస్ కోసం డ్రామాలన్నారు. బిగ్‌బాస్ అనేది తన డ్రీమ్ అంటూ ప్రతి విషయానికి ఎగ్జైట్ అవడాన్ని సైతం అందరూ తప్పుపట్టారు. గేమ్‌లో తను వాడే స్ట్రాటజీలను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరేమన్నా, ఎవరేమనుకున్నా పట్టించుకునే ప్రసక్తే లేదన్నట్లుగా తనకు నచ్చినట్లుగా ఉంటూ వచ్చింది కాజల్. జర్నీ సగం వరకు తనమీద వ్యతిరేకత పెరుగుతూ పోయినా ఆ తర్వాత సన్నీ, మానస్‌లతో కుదిరిన దోస్తీతో అది పటాపంచలైనట్లు కనిపించింది. ఎమోషనల్‌గా కనెక్ట్ అవడానికి రాలేదంటూనే తనకు తెలీకుండా వీళ్లిద్దరికీ బాగా క్లోజ్ అయింది కాజల్.. వాళ్ల కోసం ఎన్నోసార్లు స్టాండ్ తీసుకోవడమే కాక సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావడానికి ముఖ్య కారకురాలైంది. ఆ సమయంలో హౌస్ అంతా తనను తిట్టిపోస్తున్నా వెనక్కి తగ్గకుండా సన్నీకి పాస్ వచ్చేలా చేసింది. ఇక అప్పడం గొడవలో సన్నీని నాగార్జున సైతం విమర్శించినప్పటికీ సన్నీ తప్పు లేదంటూ అతడికి అండగా నిలబడింది. సన్నీ మీద నాగ్ ఫైర్ అవుతుండగా అతడి ఇంటెన్షన్ వేరంటూ హోస్ట్‌కే ఎదురు తిరిగింది. అలా తనకు కనెక్ట్ అయినవారి కోసం ఏదైనా చేసే కాజల్ స్వభావం ఎంతోమందిని కట్టిపడేసింది. తన స్నేహితుడిని నిందితుడిగా ముద్ర వేయకుండా కాపాడటానికి ఏకంగా నాగార్జునతోనే వాదించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎవరేమంటున్నా, ఎన్ని గొడవలైనా చిరునవ్వుతో వాటిని స్వీకరించే మనసుకు ఎంతోమంది ఫిదా అయ్యారు. కానీ ఫ్యాన్ బేస్ తక్కువగా ఉండటం, నామినేషన్లో ఉన్నవారిలో తనకు తక్కువ ఓట్లు నమోదవడంతో 14వ వారం ఎలిమినేట్ అయింది కాజల్. ఈ క్రమంలో బిగ్‌బాస్ నుంచి కాజల్‌కు ఎంత ముట్టిందన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాజల్‌కు వారానికి రూ. 2 లక్షల పైనే పారితోషికం ఫిక్స్ చేశారట! అంటే 14 వారాలకుగానూ కాజల్‌కు 30 లక్షల రూపాయలు ముట్టినట్లు తెలుస్తోంది. తనకు రూ.30 లక్షల అప్పు ఉందన్న కాజల్ ఈ రెమ్యునరేషన్‌తో ఆ రుణభారాన్ని వదిలించుకునే అవకాశం ఉంది. -
మాట మార్చిన సిరి, 4వ స్థానానికి పడిపోయిన షణ్ముఖ్
Bigg Boss 5 Telugu, Episode 98: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఓ ప్రమోషన్ టాస్క్ ఇచ్చాడు. ఈ టీవీఎస్ అపాచీ గేమ్‌లో కాజల్ సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే గేమ్‌లో సన్నీకి గైడెన్స్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది సిరి. పైగా సన్నీ చిన్నచిన్న పొరపాట్లు చేసినప్పటికీ కాజల్ అతడినే విజేతగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయింది. సంచాలకురాలిగా కాజల్ ఫెయిలయిందని చెప్పిందే చెప్తూ ఆమెను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఫ్రెండ్ అని సన్నీని విన్నర్‌గా ప్రకటించిందని మండిపడింది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ చాలాసేపు గొడపడ్డారు. ఇక స్టేజీపైకి వచ్చిన నాగార్జున హౌస్‌మేట్స్‌తో ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు. ఈ పద్నాలుగో వారాల్లో సంతోషపెట్టిన క్షణాలతో పాటు, బాధపడ్డ రోజులు, రిగ్రెట్‌గా ఫీలైన సంఘటనలు ప్రతి ఒక్కరికీ ఉండే ఉంటాయని, ఈ జర్నీలో ఏ వారంలో మీకు రిగ్రెట్ ఉందో చెప్పాలన్నాడు నాగ్. మొదటగా కాజల్ మాట్లాడుతూ.. '9 వారంలో జైలు నామినేషన్ జరిగింది. అప్పుడు సన్నీ, మానస్‌ను సేవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ వాళ్లను చేయలేదు. శ్రీరామచంద్రతో మాట్లాడాక షణ్నును సేవ్ చేయాలనుకున్నా. అంటే ఎవరో గుర్తు చేస్తే నన్ను సేవ్ చేశావని అతడూ హ్యాపీగా లేడు' అని చెప్పుకొచ్చింది. షణ్ను మాట్లాడుతూ.. 'ఎమోషనల్ కనెక్ట్ పెద్ద రిగ్రెట్. 11వ వారంలో నా వల్ల సిరి తలబాదుకోవడం నచ్చలేదు. 14వ వారం టాప్ 5 గురించి మరీ ఎక్కువగా ఆలోచించాను. హౌస్మేట్స్ ఏం చేసినా, ఏం మాట్లాడినా గేమ్ గురించేనేమో అని అనుమానపడి సిరిని కొన్ని విషయాల్లో ఆపాను. అయితే ఆమెకు సాయం చేద్దామనేదే నా ఉద్దేశ్యం. కానీ ఆమె గేమే బాగుందేమో, అనవసరంగా సాయం చేస్తున్నానేమో అని కొంత రిగ్రెట్‌గా ఫీలయ్యా. ఒకవేళ ఆమె టాప్ 5లో లేకపోతే అది నా తప్పు అవుతుందేమో అనిపిస్తోంది' అని చెప్పుకొచ్చాడు. సన్నీ వంతురాగా.. '12వ వారంలో నేను అగ్రెసివ్ అయి గేమ్ ఆడాను. దీనివల్ల సిరి ఐస్బకెట్లో నుంచి కాళ్లు తీయకుండా ఆడింది. దీంతో వారమంతా సఫర్ అయింది. అది నా వల్లే అనిపించింది. మరొకటి గిల్టీబోర్డు వేసుకున్నది కూడా మర్చిపోలేను' అని తెలిపాడు. మానస్.. '4వ వారంలో కెప్టెన్సీ కోసం బరువు తగ్గాం, చాలా కష్టపడ్డాం. అప్పుడు సన్నీ,నేను ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీకి పోటీపడాలా అని ఆలోచించుకున్నాక సన్నీకి అవకాశమిచ్చాను. అయితే హౌస్‌లో ఎక్కువ కత్తిపోట్లు సన్నీకే పడ్డాయి. ఏ కారణం లేకుండానే అందరూ కత్తితో పొడిచేస్తున్నారు. ఆరోజు నేనే పోటీకి వెళ్లుంటే వాడు అలాంటి స్థితి ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండేది అనిపించింది' అన్నాడు. శ్రీరామ్.. '4వ వారంలో ఎవరి వంట వాళ్లు వండుకోవాలి అన్న గొడవ జరిగింది. ఆ తర్వాత నేను చాలా డల్ అయ్యాను. ఎక్కువ తప్పు జరిగిపోయిందా? నావల్లే ఇంట్లో గొడవలు మొదలయ్యాయా? అని తెగ ఆలోచించి డిస్టర్బ్ అయ్యాను' అని పేర్కొన్నాడు. సిరి.. 11వ వారంలో షణ్నుతో గొడవపడి తల బాదుకోవడం తప్పనిపించిందని చెప్పుకొచ్చింది. అనంతరం నాగ్ మరో గేమ్ ఆడించాడు. ఈ పద్నాలుగువారాలను పరిగణనలోకి తీసుకుని ఎవరు హిట్ స్టార్? ఎవరు ఫ్లాప్ స్టార్? చెప్పాలన్నాడు. ముందుగా కాజల్.. సన్నీకి హిట్ స్టార్, షణ్నుకి ఫ్లాప్ స్టార్ అన్న ట్యాగ్‌నిచ్చింది. శ్రీరామ్.. సన్నికీ హిట్, కాజల్‌కు ఫ్లాప్ స్టార్ బిరుదునిచ్చాడు. సన్నీ.. మానస్‌కు హిట్, షణ్నుకి ఫ్లాప్ స్టార్ అన్న ట్యాగ్‌నిచ్చాడు. కానీ పద్నాలుగు వారాలను పరిగణనలోకి తీసుకోవాలని నాగ్ గుర్తు చేయగానే ఆ ఫ్లాప్ స్టార్ ట్యాగ్‌ను షణ్నుకి కాకుండా సిరికిచ్చాడు. తర్వాత సిరి.. షణ్నును హిట్, సన్నీని ఫ్లాప్ స్టార్‌గా పేర్కొంది. మానస్.. సన్నీకి హిట్, షణ్నుకు ఫ్లాప్ స్టార్ ట్యాగ్ ఇచ్చాడు. షణ్ముఖ్.. సిరికి హిట్, కాజల్‌కు ఫ్లాప్ స్టార్ బిరుదునిచ్చాడు. అనంతరం సన్నీని సెకండ్ ఫైనలిస్టుగా ప్రకటించారు. తర్వాత హౌస్‌మేట్స్‌ను మరోసారి 1 నుంచి 6 ర్యాంకుల వరకు నిల్చోమన్నాడు నాగ్. కాజల్, సిరి తప్ప మిగతా మేల్ కంటెస్టెంట్స్ అంతా మొదటి స్థానం తమదే అన్నారు. దీంతో నాగ్.. అమ్మాయిలిద్దరు మాత్రమే రెండో స్థానానితో సరిపెట్టుకుంటున్నారని పెదవి విరిచారు. షణ్నును మొదటి స్థానంలో చూడాలనుకుంటున్న సిరి తన మాటను వెనక్కు తీసుకుంటూ వెళ్లి ఫస్ట్ ర్యాంక్‌పై నిలబడింది. శ్రీరామ్, కాజల్, షణ్ముఖ్, సన్నీ, మానస్ వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల వరకు నిలబడ్డారు. -
టాప్ 5 ఆశలు గల్లంతు, కాజల్ ఎలిమినేట్!
Bigg Boss Telugu, 14th Week Elimination, Kajal Exit From BB5 Show: ఇప్పటివరకు బిగ్‌బాస్ షోలో హౌస్మేట్స్ ఎన్నోవారాలు నామినేషన్లో ఉన్నారు, ఎన్నోవారాలు ఎలిమినేషన్ చివరి అంచుల వరకు వచ్చి చివరి క్షణంలో సేవ్ అయ్యారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా ఈ ఒక్కవారం మాత్రం వారి తలరాతను మార్చనుంది. ఫినాలేకు పంపాలా? వద్దా? అని డిసైడ్ చేయనుంది. ఈ పద్నాలుగో వారం మానస్, సిరి, షణ్ను, కాజల్, సన్నీ.. ఐదుగురూ నామినేషన్లో ఉన్నారు. వీరిలో షణ్ను, సన్నీ సేవ్ అవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షణ్ను కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయన్నారు కానీ అదంతా ఫేక్! షణ్ను, సన్నీలకు భారీ ఎత్తున ఓట్లు నమోదవుతున్నాయని సమాచారం.. మానస్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. ఇక సిరి, కాజల్‌లో ఒకరు ఎలిమినేట్ అవుతారని మొదటి నుంచీ అంతా అనుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఎవరు ఎలిమినేట్ అయ్యారన్న విషయం లీకైంది. కాజల్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే టాప్ 5లో అడుగుపెట్టాలన్న ఆమె ఆశలు అడియాసలైనట్లు కనిపిస్తోంది. దోస్తులతో పాటు తాను కూడా ఫినాలేలో అడుగుపెట్టాలన్న కల నెరవేరకుండానే బిగ్‌బాస్ షో నుంచి నిష్క్రమించనుంది కాజల్. దీంతో ఆమె అభిమానులు ఈ ఎలిమినేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిని కాపాడటానికే కాజల్‌ను పంపించివేస్తున్నారంటూ షోను దుమ్మెత్తిపోస్తున్నారు. -
సన్నీ ఏడవడం చూసి ఎమోషనల్ అయ్యా: మానస్
Bigg Boss Telugu 5 Promo: ఇవాళ శనివారం.. అంటే టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేసే రోజు. ప్రతి శనివారం ఆయన నామినేషన్లో ఉన్న కొంతమందిని సేఫ్ చేస్తాడు. కానీ ఇవాళ మాత్రం సేఫ్ చేయడానికి బదులుగా ఎవరెవరు ఫినాలేలో అడుగుపెట్టనున్నారో వెల్లడించనున్నాడు. ఇకపోతే ఇన్నివారాల జర్నీని ఒకసారి గుర్తు చేస్తూ వీల్ ఆఫ్ ద వీక్స్‌ను ప్రవేశపెట్టాడు. ఏ వారంలో అతిగా బాధపడ్డారో, ఏ వారంలో తప్పులు చేశామని ఫీలయ్యారో వాటిని కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. మొదటిసారి సన్నీ ఏడవడంచూసి తాను మొట్టమొదటిసారిగా ఎమోషనల్ అయ్యానన్నాడు మానస్. గడిచిన సమయం మళ్లీ వస్తే అలా చేసుకోనని ఫిక్స్ అయ్యానంటూ తను బాధపడిన సంఘటన గురించి చెప్పుకొచ్చింది సిరి. హిట్ స్టార్ ఎవరు? ఫ్లాప్ స్టార్ ఎవరు? అన్న గేమ్ ఆడించగా అందులో కాజల్.. షణ్నుకు ఫ్లాప్ స్టార్ అన్న బిరుదిచ్చింది. దీంతో నాగ్ కాజల్ మీద సెటైర్లు వేశాడు. సన్నీ, సిరి ఒకరికొకరు ఫ్లాప్ ట్యాగిచ్చుకున్నారు. మరి శ్రీరామచంద్ర తర్వాత ఇంకా ఎవరెవరు ఫినాలేకు వెళ్లబోతున్నారనే సస్పెన్స్‌కు నేడు తెర దించనున్నట్లు కనిపిస్తోంది. ఎవరెవరు టాప్ 5లో ఉంటారనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
సిరిని కంట్రోల్లో పెడుతున్నానని అంగీకరించిన షణ్ను!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న సంఘటనలపైనే కాకుండా కంటెస్టెంట్లపై కూడా ప్రేక్షకులకు అనేక అనుమానాలున్నాయి. వాటిలో కొన్నింటికి నేడు సమాధానం దొరకనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. ఇంటిసభ్యులందరూ ప్రేక్షకుల ప్రశ్నలు ఎదుర్కోవాలన్నాడు నాగ్. అందులో భాగంగా శ్రీరామ్‌కు.. ఇప్పుడు మీరు షణ్ను గ్రూప్‌లో ఉన్నారా అన్న ప్రశ్న ఎదురైంది. ఈ క్వశ్చన్ చూసి అవాక్కైన షణ్ను.. నాకో గ్రూప్ కూడా ఉందా? అంటూ నవ్వుకున్నాడు. మానస్‌కు మరో వింత ప్రశ్న ఎదురైంది. ఆడియన్స్ దగ్గర మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌గా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా? అని ఓ ప్రేక్షకుడు సూటిగా ప్రశ్నించాడు. ఇలాంటి క్వశ్చన్ వస్తుందని ఊహించలేదని సిరి షాకైంది. ఇక షణ్ముఖ్‌కు.. 'సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్ అవుతారు? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? తనని తనలా ఎందుకు ఉండనివ్వరు?' అని ఆడియన్స్‌లో ఒకరైన సునీత ప్రశ్నించింది. నిజంగానే కంట్రోల్ చేస్తున్నావా? అని శ్రీరామ్ ప్రశ్నించగా అంత లేదన్నట్లు సిరి మాట్లాడింది. కానీ షణ్ను మాత్రం నువ్వు కంట్రోల్ అవ్వనిదే ఎవరూ ఆ క్వశ్చన్ వేయరంటూ ఆమెను నియంత్రిస్తున్నానని అంగీకరించాడు. 'మొదట్లో షణ్ముఖ్‌తో, తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ ఇంకా మానస్‌తో ఫ్రెండ్‌లా ఉంటున్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా?' అని ఓ ప్రేక్షకుడు కాజల్‌ను నిలదీశాడు. కానీ అదంత మంచి ప్రశ్నలా కనిపించకపోవడంతో కాజల్ ఏడ్చేసింది. అటు శ్రీరామ్ మాత్రం ఈ క్వశ్చన్‌ను నేను కాజల్‌ను ఇదివరకే అడిగానంటూ సిరి, షణ్నులతో చెప్పుకొచ్చాడు. మరి ఈ ప్రశ్నలకు హౌస్మేట్స్ ఎలాంటి సమాధానాలు చెప్తారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
ఎమోషనల్ కనెక్షన్, లైట్ తీస్కోమన్న శ్రీరామ్.. ఏడ్చేసిన కాజల్
Bigg Boss 5 Telugu, Episode 96: కంటెస్టెంట్లు ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగేందుకు బిగ్‌బాస్ అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచినవారికి ఓట్లు వేయమని అడిగేందుకు ఛాన్స్ ఇస్తారు. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలను రీక్రియేట్ చేసే టాస్కులో షణ్ను గెలిచి ఓట్లు వేయమని అభ్యర్థించే అవకాశాన్ని గెలుపొందాడు. అలాగే నవ్వకుండా ఉండాల్సిన టాస్కులో శ్రీరామ్, మానస్ ఇద్దరూ గెలిచినట్లు నేటి(డిసెంబర్ 9) ఎపిసోడ్లో వెల్లడైంది. ఇద్దరికీ టై అవడంతో శ్రీరామ్ మానస్‌కు ఛాన్స్ ఇచ్చాడు. అలా మానస్ మైకు ముందుకు వచ్చి.. తనకు ఓట్లేయండంటూనే తన ఫ్రెండ్స్ కాజల్, సన్నీకి కూడా ఓట్లేసి గెలిపించమని కోరుకున్నాడు. హౌస్‌లో శ్రీరామ్, కాజల్‌కు మరోసారి గొడవ జరిగింది. తిట్టుకుంటున్న క్రమంలోనే కాజల్ అతడిని బ్రో అనేసింది. అది నచ్చని శ్రీరామ్.. నువ్వు నాకు సిస్టర్ కాదు, బ్రో అని పిలవకు అని ముఖం మీదే చెప్పాడు. దీంతో హర్టైన కాజల్ బోరుమని ఏడ్చేసింది. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను, అతడు అలా పిలవద్దనేసరికి తట్టుకోలేకపోయానంటూ తన బాధను సన్నీ, మానస్‌లకు చెప్పింది. అటు నుంచి కనెక్షన్ లేనప్పుడు నిన్ను లైట్ తీసుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దంటూ హితవు పలికాడు సన్నీ. ఇక వోట్ అప్పీల్ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ మూడో అవకాశం ఇచ్చాడు. ఇంటిసభ్యులందరూ సూపర్ స్టార్స్‌లా నటించాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా సన్నీ.. బాలయ్య, శ్రీరామ్.. చిరంజీవి, కాజల్.. శ్రీదేవి, మానస్.. పవన్ కల్యాణ్, షణ్ను.. సూర్య, సిరి.. జెనీలియాగా నటించారు. ప్రతి ఒక్కరూ వారివారి పాత్రల్లో జీవించేశారు. క్లాస్, మాస్ పాటలకు స్టెప్పులు కూడా ఇరగదీశారు. ఈ టాస్క్ వల్ల హౌస్మేట్స్ అంతా కలిసిపోయారు. ఇంతలో షణ్ను సిరికి మధ్య మరోసారి తగవు మొదలైంది. నువ్వు వాళ్లతో(సన్నీ గ్రూప్‌తో) అయితే హ్యాపీగా ఉంటావు, వెళ్లు, నీతో నేను సింక్ అవ్వట్లేదు అని సిరికి ముఖం మీదే చెప్పాడు షణ్ను. ఎప్పుడూ లేనిది ఈ వారమే నీకు ప్రాబ్లం అవుతుంది కదా అంటూ సిరి అసహనం వ్యక్తం చేసింది. కాసేపటికే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ షణ్ను కోపాన్ని కరిగించింది. అతడు నవ్వేయగానే మన ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమంటూ వెళ్లి అతడిని హత్తుకుంది. అలా వీళ్ల గొడవ చప్పున చల్లారిపోయింది. కానీ రేపటి ఎపిసోడ్లో కూడా వీళ్లు మళ్లీ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. -
టోటల్ ఇమేజ్ డ్యామేజ్.. ఎవరు ఎలిమినేట్?
Bigg Boss 5 Telugu, 14th Week Elimination: ఒక్క ఎలిమినేషన్.. ఒకే ఒక్క ఎలిమినేషన్‌తో తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో టాప్ 5లో ఎవరుంటారన్నది తేలిపోనుంది. ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్‌లో కొన్ని మాత్రమే ట్విస్టులుండగా మిగతావన్నీ ఊహించినవే నిజమయ్యాయి! కానీ ఈ వారం మాత్రం ఎవరు హౌస్‌ను వీడనున్నారు? అన్నది చెప్పడం కొంత క్లిష్టంగా మారింది! టికెట్ టు ఫినాలే అందుకున్న శ్రీరామ్ మినహా సిరి, షణ్ను, సన్నీ, మానస్, కాజల్.. ఐదుగురూ నామినేషన్స్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో చూద్దాం.. అనధికారిక పోలింగ్స్‌లో షణ్ను, సన్నీలకు భారీ ఎత్తున ఓట్లు నమోదవుతున్నాయి. వీళ్ల ఫాలోయింగ్ చూస్తుంటే ఇద్దరూ టైటిల్ కోసం పోటీపడేలా ఉన్నారు.. కాబట్టి వీళ్లు ఎలిమినేట్ అవుతారన్న సందేహమే అవసరం లేదు. కానీ వీళ్లిద్దరి వల్ల మిగతావారి ఓటింగ్ జాతకాలు మారుతున్నట్లు కనిపిస్తోంది. సిరిని మానసికంగా వేధిస్తున్నాడంటూ షణ్ముఖ్‌పై ఈ వారం విపరీతమైన నెగెటివిటీ పెరిగిపోయింది. షణ్ను ప్రవర్తన వల్ల సిరి కూడా డిస్టర్బ్ అయినట్లు కనిపిస్తోంది. అందరికీ ఇచ్చిపడేసే సిరి షణ్ను తనను కంట్రోల్ చేస్తున్నా నిమ్మకు నీరెత్తనట్లు ఉండటంతో ఆమె మీద కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె ఓట్లకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. టాస్కుల్లో 100 % ఇచ్చే మానస్‌కు బాగానే ఓట్లు పడుతున్నాయి. ఎటొచ్చీ సిరి, కాజల్ తక్కువ ఓట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే 14వ వారం ఈ ఇద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ వారం కూడా ఒక లేడీ కంటెస్టెంట్ బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. కానీ బిగ్‌బాస్ వాళ్లిద్దరినీ ఫినాలేకు పంపాలనుకుంటే మాత్రం మానస్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్ ఉంది. మానస్, కాజల్‌లో ఎవరు ఎలిమినేట్ అయినా అది సన్నీకి ప్లస్ అవుతుంది. బయట నుంచి వారి ఫ్యాన్స్ సపోర్ట్‌తో మరిన్ని ఓట్లు సన్నీకి పడతాయి. లేదంటే వాళ్లిద్దరూ కూడా ఫినాలేలో అడుగుపెడితే మాత్రం సన్నీకి పడే ఓట్లు కూడా చీలిపోవచ్చు. అంటే సన్నీకి ఏడెనిమిది వేసి మిగతావాటిని మానస్, కాజల్‌కు వేసే అవకాశం ఉంది. ఒకవేళ సిరిని బయటకు పంపితే మాత్రం షణ్ముఖ్‌కు మరింత ప్లస్ అవుతుంది. ఇప్పటికే సిరి వల్ల ఇమేజ్ డ్యామేజ్ అవుతుండటంతో ఆమె బయటకు వస్తే నెగెటివిటీ తగ్గేందుకు ఆస్కారం ఉంది. మరి బిగ్‌బాస్ హౌస్‌కు ఈవారం ఎవరు టాటా చెప్తారో చూడాలి మరి! -
పవన్‌కల్యాణ్‌గా రఫ్ఫాడించిన మానస్, పింకీ లేదనేగా!
Bigg Boss Telugu 5 Promo: ఎప్పుడూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఫైటింగ్ చేసే కంటెస్టెంట్లు నేడు మాత్రం ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఇంటిసభ్యులందరూ వారికి నచ్చిన సూపర్ స్టార్లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆదేశించాడు బిగ్‌బాస్. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిలో దాదాపు అందరూ నటీనటులే కావడంతో ఈ టాస్క్ చేయడం వారికి ఈజీ అయింది. టాస్క్‌లో భాగంగా సన్నీ బాలయ్య గెటప్ వేయగా సిరి జెనీలియా, కాజల్ శ్రీదేవి, మానస్ పవన్ కల్యాణ్, శ్రీరామ్ చిరంజీవి, షణ్ముఖ్ సూర్య గెటప్‌లు వేశారు. అంతేకాదు ఆ స్టార్ నటుల ఫేమస్ క్యారెక్టర్లను కళ్ల ముందుంచుతూ అలరించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన మానస్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా డ్యాన్స్‌తో రఫ్ఫాడించేశాడు. ఈ ప్రోమో చూసిన కొందరు నెటిజన్లు మానస్ హుషారు చూసి అవాక్కవుతున్నారు. పింకీ వెళ్లిపోయాక గాలికి వదిలేసిన పక్షిలా హాయిగా ఎగురుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ టాస్కులో కాజల్ గెలిచి ప్రేక్షకులను నేరుగా ఓట్లడిగే అవకాశాన్ని గెలుచుకున్నట్లు సమాచారం! -
Bigg Boss-5: సన్నీ అరాచకం.. హగ్‌లతో ‘అప్పడం’.. షణ్ముఖ్ పరువు తీశాడుగా!
Bigg Boss 5 Telugu, Episode 94: ఇంటి సభ్యులకు సూపర్ లగ్జరీ ఐటమ్స్ ఇచ్చేందుకు చిన్నపాటి టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. లగ్జరీ ఐటమ్ పొందాలంటే ముందుగా గుజాబ్ జామ్ టాస్క్ గెలవాలని కండీషన్ పెట్టారు. చేతులు ఉపయోగించకుండా ఎవరైతే ఎక్కువగా గులాబ్ జామ్‌లు తింటారో వారే టాస్క్ విజేతలుగా నిలిచి, లగ్జరీ ఐటమ్ పొందుతారు. ఈ టాస్క్‌లో సిరి గెలిచి ఫ్రైడ్ చికెన్ ఐటమ్ పొందింది. ‘అప్పడం’ చేసేసిన సన్నీ ప్రేక్షకులకు నచ్చిన ఐకానిక్ సంఘటనల్ని ఒకరి రోల్ మరొకరు ప్లే చేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్‌బాస్. ఎవరైతే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకి గార్డెన్ ఏరియాలో స్పెషల్‌గా ఏర్పాటు చేసిన ఓటింగ్ బూత్ నుంచి ఆడియన్స్‌కి ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా సన్నీ-సిరిల మధ్య జరిగిన ‘అప్పడం’వివాదాన్ని ఇమిటేట్ చేసి చూపించాలని ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఈ టాస్క్‌లో సన్నీలా సిరి, సిరిలా షణ్ముఖ్, షణ్ముఖ్‌లా సన్నీ, కాజల్‌లా శ్రీరామ్.. యానీ మాస్టర్లా మానస్, రవిలా కాజల్ వారి వారి పాత్రల్లో అద్భుత నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా షణ్ముఖ్ పాత్ర చేసిన సన్నీ అయితే... తనదైన యాక్టింగ్‌తో తెగ నవ్వించేశాడు. సద్దుదొరికితే చాలు... సిరి పాత్రలో ఉన్న షణ్ముఖ్‌ని గట్టిగా చేసుకుంటూ.. ఆంటీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ రోజూ షణ్ముఖ్-సిరిలు ఎలాగైతే చేస్తారో అలా చేసి నవ్వులు పూయించాడు. సన్నీ వేసే పంచులకు షణ్ముఖ్ బిత్తరపోయాడు. తనను మాములుగా ఇమిటేట్ చేస్తేనే భరించలేని షన్నూ.. సన్నీ ఫెర్ఫామెన్స్‌ని తట్టుకోలేక పాత్ర నుంచి బయటకు వచ్చి.. ఇదే వేరే విధంగా వెళ్తుంది.. నువ్ బాగా ఓవర్ చేస్తున్నావ్ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సన్నీ కొంచెం తగ్గాడు. మొత్తానికి ఈ అప్పడం టాస్క్‌లో అయితే సన్నీ కొంచెం అతిగా రెచ్చిపోయి... షణ్ముఖ్, సిరిల పరువు తీశాడనే చెప్పాలి. అయితే ఇది సన్నీ కేవలం నవ్వించడానికే చేశాడు తప్ప కావాలని చేసినట్లయితే కనిపించదు. టాస్క్ అయిపోయిన తరువాత.. సన్నీ దగ్గరకు వచ్చిన షణ్ముఖ్.. నువ్ చాలా వెకిలి చేష్టలు చేశావ్.. ఇమిటేట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు.. ఇమిటేషన్ వేరు.. వెకిలివేరు.. నువ్ చేసినట్టుగా ఎదుటివాళ్లు నీ గురించి చేస్తే బాధ తెలుస్తుంది.. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు అని చెప్పడంతో సన్నీ వివరణ ఇచ్చేకున్నాడు. నేను కామెడీగానే చేశాను.. క్యారెక్టర్లో ఉన్నాను.. కాజల్‌ని కూడా తిట్టాను కదా.. నెక్స్ట్ టైం అలా చేయను అంటూ వచ్చి షణ్ముఖ్‌ని హగ్ చేసుకున్నాడు సన్నీ. పక్కనే ఉన్న సిరి.. సర్లే అయిపోయిందిగా వదిలేయండి అని చెప్పడంతో షణ్ముఖ్ కూల్ అయిపోయాడు. కాజల్‌పై మానస్ ఫైర్ ఇక ఈ రెండో టాస్క్‌గా మానస్-ప్రియాంకల ప్రయాణాన్ని ఇమిటేట్ చేసి చూపించాలని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో సన్నీ ప్రియాంకలా మారగ, కాజల్ మానస్‌లా మారిపోయింది. శ్రీరామ్‌లా సిరి, జెస్సీలా షణ్ముఖ్, సిరిలా శ్రీరామ్ మారిపోయారు. అయితే ఈ టాస్క్ కోసం సన్నీ రెడీ అవుతున్న క్రమంలో కాజల్, మానస్‌ల మధ్య గొడవ జరిగింది. పింకీకి 100 సార్లు ఐలవ్యూ చెబుతానని కాజల్ కామెడీగా అన్నప్పటికీ.. మానస్ సీరియస్‌గా తీసుకున్నాడు. గబ్బు చేస్తే బాగుండదని మానస్ ముందే హెచ్చరించగా.. ఎట్ల అనిపిస్తే అట్ల చేస్తామని సన్నీ తేలిగ్గా తీసిపాడేశాడు. ఎంటర్టైనింగ్ చేస్తున్నామని కాజల్ చెప్పబోగా.. ‘ఎంటర్టైనింగ్గా చేస్తే చేయ్.. కానీ 100సార్లు ఐ లవ్యూ అని ఎవడు చెప్పాడు?’అని కాజల్‌పై మానస్ సీరియస్ అయ్యాడు. దీంతో బాగా హర్ట్ అయిన కాజల్.. మానస్ క్యారెక్టర్ చేయనని చెప్పింది. సన్నీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. కాజల్ వినలేదు. దీంతో సన్నీ మానస్‌ని పింకీ క్యారెక్టర్ చేయమని కోరగా.. దానికి మానస్ ఓకే చెప్పేశాడు. పింకీగా మానస్.. మళ్లీ సన్నీ అదరగొట్టేశాడుగా పింకీగా మానస్ , మానస్‌గా సన్నీ.. ఇద్దరు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా మానస్ అయితే.. అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా తీర్చుకున్నాడు. మానస్ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్ కూడా చేయించుకున్నాడు. మరోవైపు షణ్ముఖ్ జెస్సీలా మారి.. సిరిని ఓ రేంజ్లో ఆటపట్టించాడు. జెస్సీలా మాట్లాడుతూ.. సిరి ఓ ముద్దు అడిగాడు. దీంతో సిరిగా మారిన శ్రీరామ్ చేతులు అడ్డుపెట్టి షన్నూకు లిప్‌లాక్ ఇచ్చాడు. ఇక చివరగా.. మానస్ నుంచి పింకీ ఎలాంటి ప్రేమను ఆశించిందో అది చేసి చూపించాడు సన్నీ. పింకీ పాత్రలో ఉన్న మానస్ దగ్గరు వెళ్లి.. నా ప్రేమ, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే కొనసాగుతుంది పింకీ అని భరోసా ఇచ్చాడు. ఇది చూసి కాజల్ కనీళ్లు పెట్టుకుంది. తమ తమ క్యారెక్టర్ల నుంచి బయటకు వచ్చి ముగ్గురు గట్టిగా హగ్ చేసుకున్నారు. మొత్తనానికి మంగళవారం ఎపిసోడ్లో సన్నీ తన ఆట తీరుతో అందరిని మెప్పించాడనే చెప్పాలి. -
బిగ్‌బాస్: 100 స్లారు ఐలవ్యూ అని ఎవరు చెప్పారు.. కాజల్‌పై మానస్ ఫైర్!
బిగ్‌బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు వచ్చింది. మరో పక్షం రోజుల్లో ఈ బిగ్ రియాల్టీ షోకి శుభం కార్డు పడుతుంది. ఈ నేపథ్యంలో మిగిలిన కొద్ది రోజుల్ని మరింత ఎంటర్టైన్మెంట్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్న బిగ్‌బాస్ నిర్వాహకులు. దీంట్లో భాగంగా ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్‌లు ఇస్తున్నారు. మంగళవారం ఇంటి సభ్యులకు ‘రోల్ ప్లే’టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బిగ్‌బాస్-5 కంటెస్టెంట్స్ ఎవరెలా ప్రవర్తించారో చేసి చూపించారు ఇంటి సభ్యులు. సన్నీ ప్రియాంకలా మారగ, కాజల్ మానస్‌లా మారిపోయింది. ఇలా ఒక్కొక్కరు వేరే వేరే పాత్రలు ధరించి.. వారిని ఇమిటేట్ చేశారు. ఈక్రమంలో మానస్, సన్నీ, కాజల్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. టాస్క్‌లో భాగంగా మానస్ క్యారెక్టర్లో ఉన్న కాజల్.. ప్రతిసారి పింకీకి ఐలవ్యూ చెప్పడాన్ని మానస్ తప్పుపట్టాడు. గబ్బు చేస్తే బాగుండదని మానస్ ముందే హెచ్చరించగా.. ఎట్ల అనిపిస్తే అట్ల చేస్తామని సన్నీ తేలిగ్గా తీసిపాడేశాడు. ఎంటర్టైనింగ్ చేస్తున్నామని కాజల్ చెప్పబోగా.. ‘ఎంటర్టైనింగ్గా చేస్తే చేయ్.. కానీ 100సార్లు ఐ లవ్యూ అని ఎవడు చెప్పాడు?’అని కాజల్‌పై మానస్ సీరియస్ అయ్యాడు. దీంతో బాగా హర్ట్ అయిన కాజల్.. మానస్ క్యారెక్టర్ చేయనని బయటకు వెళ్లిపోయింది. మరి ఈ గొడవ ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే మంగళవారం ఎపిసోడ్ చూడాల్సిందే. -
సిరి - సన్నీకి లింకు, భరించలేకపోయిన షణ్ను
Bigg Boss 5 Telugu 14th Week Nominations, Episode 93: కాజల్‌కు మరీ ఎక్కువ అటాచ్ అవద్దని సిరికి సూచించాడు షణ్ను. ఆ వెంటనే ఫ్రెండ్షిప్ హగ్ అంటూ ఒకరికొకరు హగ్గిచ్చుకున్నారు. రాత్రవగానే కాజల్ సన్నీకి, సిరి షణ్నుకు దిష్టి తీశారు. మరోవైపు ప్రియాంక వెళ్లిపోయిన బాధతో మానస్ ఒంటరిగా కూర్చుంటే కాజల్, సన్నీ వెళ్లి అతడిని ఏడిపించారు. ప్రియాంక కోసం పాడిన లవ్ సాంగ్‌ను పాడుతూ మానస్‌ను టీజ్ చేశారు. మాది ఫ్రెండ్షిప్రా, లవ్ కాదురా అని మానస్ మొత్తుకున్నప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు. ఆ తర్వాత మానస్, కాజల్... సన్నీ, సిరి ఇద్దరికీ లింకు పెడుతూ జోక్ చేశారు. సిరి కనబడగానే నీ ఆలియాభట్ వస్తుందంటూ కామెంట్లు చేశారు. కానీ దీన్ని సరదాగా తీసుకోలేకపోయిన షణ్ను సిరిపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. మీ ఇద్దరి మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారని, నువ్వు జాగ్రత్తపడకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని హెచ్చరించాడు. వాళ్లు సరదాగా అన్నార్లే అని సిరి లైట్ తీసుకోవడంతో మరింత ఉడికెత్తిపోయిన షణ్ను ఇది చెప్పడం వల్ల నాకు ఒరిగేదేమీ లేదంటూ విసురుగా వెళ్లిపోయాడు. దీంతో సిరి ఏడ్చేసింది. తర్వాతి రోజు ఉదయం సన్నీ నటించిన సకలగుణాభిరామ సినిమాలోని సైకో సైకో పిల్లా సాంగ్ ప్లే చేయడంతో అతడు ఆనందంతో ఎగిరి గంతేశాడు. అటు షణ్ను మాత్రం మళ్లీ.. ఈ హౌస్‌లో ఎందుకున్నాను అంటూ తనలో తానే సణుక్కున్నాడు. 'నేను మోస్ట్ బోరింగ్ పర్సన్‌ను. ఇన్నివారాలు ఎలా ఉన్నానా? అనిపిస్తుంది. ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. కానీ నేను ఒంటరిగా పోరాడుతున్నాను, నా క్యారెక్టర్ ఇంతే.. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు నువ్వెక్కడా నాకు సాయం చేసినట్లు అనిపించలేదు బిగ్‌బాస్' అని కెమెరాలతో తన గోడు చెప్పుకున్నాడు. ఆ తర్వాత సిరి దగ్గరకెళ్లి మనిద్దరం దూరం కావాలని వాళ్లు ప్లాన్లు చేస్తున్నారని షణ్ను అభిప్రాయపడ్డాడు. సన్నీతో గొడవ పెట్టుకున్న ప్రియ, రవి అందరూ వెళ్లిపోయారని కాజల్ ఆలోచిస్తుంది. ఆమె నెక్స్ట్ నీ దగ్గరకే వస్తుందంటూ సిరిని హెచ్చరించాడు. నిన్ను నా నుంచి దూరం పెట్టాలని చూస్తున్నారు అని అభిప్రాయపడ్డాడు. అనంతరం బిగ్‌బాస్ 1 నుంచి 6 ర్యాంకుల వరకు మీ స్థానాలకు నిర్ణయించుకోవాలని ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో అందరూ ఏయే స్థానాల్లో నిలబడాలో ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ముందుగా షణ్ను మాట్లాడుతూ.. ఫస్ట్ ప్లేస్‌లో నేను, సెకండ్ ప్లేస్‌లో శ్రీరామ్, మూడో స్థానంలో సన్నీ, నాల్గో స్థానంలో సిరి, ఐదారు స్థానాల్లో మానస్, కాజల్ ఉంటారన్నాడు. కాజల్ మాట్లాడుతూ.. నేను 1, సన్నీ 2, మానస్ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5, షణ్ముఖ్ 6 స్థానాల్లో ఉండాలని అభిప్రాయపడింది. మానస్ మాట్లాడుతూ.. సన్నీ 1, కాజల్ 2, షణ్ముఖ్ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5 స్థానాల్లో ఉండాలన్నాడు. శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. షణ్ముఖ్, సిరి 2, సన్నీ 3, కాజల్ 4, మానస్ 5వ ర్యాంకులో ఉండాలన్నాడు. ఫస్ట్ స్థానం ఆ దేవుడే నిర్ణయిస్తాడన్నాడు. తర్వాత సన్నీ వంతు రాగా.. కాజల్ 1, మానస్ 2, సిరి 3, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ 4, నేను 5వ స్థానంలో ఉంటానన్నాడు. అనంతరం సిరి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌కు అన్‌ఫిట్ అనుకున్నాను, కానీ ఆ అభిప్రాయాన్ని షణ్ను మార్చాడు కాబట్టి అతడిని ఫస్ట్ ర్యాంక్‌లో చూడాలనుంది. వాడి పక్కనే రెండో ర్యాంక్‌లో నేను ఉండాలనుకుంటున్నాను. సన్నీ 3, శ్రీరామ్ 4, మానస్, కాజల్ 5 ర్యాంకుల్లో ఉంటారు అని చెప్పుకొచ్చింది. అందరూ అభిప్రాయాలు చెప్పడం పూర్తయ్యాక.. సన్నీ 1, షణ్ను 2, కాజల్ 3, శ్రీరామ్ 4, మానస్ 5, సిరి 6 స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం బిగ్‌బాస్ శ్రీరామ్ మినహా మిగతా ఇంటిసభ్యులందరూ 14వ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారని ప్రకటించాడు. ర్యాంకుల టాస్కులో తన అభిప్రాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని షణ్ను ఆరవ స్థానంలో నిలబడటాన్ని సహించలేకపోయింది కాజల్. ఇదంతా కావాలనే చేశాడని ఫీలైంది. అలా షణ్ను-కాజల్ మధ్య మరోసారి ఫైట్ నడిచింది. దీంతో కాజల్ చాలా యాటిట్యూడ్ చూపిస్తుందన్నాడు షణ్ను. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంది సెటైర్ వేసిం సిరి. ఏదేమైనా ఈ వారం ఎలిమినేషన్‌తో టాప్ 5లో ఎవరుంటారనేది తేలిపోనుంది! -
ఫస్ట్ ప్లేస్‌లో నేను కాదు షణ్ను ఉండాలి: సిరి
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. వీరిలో శ్రీరామ్ టికెట్ టు ఫినాలే ట్రోఫీ అందుకుని ఇప్పటికే ఫినాలేలో అడుగుపెట్టాడు. కాబట్టి అతడు ఈ వారం నామినేషన్లో లేనట్లే! మిగతా ఐదుగురు ఇంటిసభ్యులైన సన్నీ, షణ్ముఖ్, కాజల్, సిరి, మానస్ టాప్ 5లో చోటు దక్కించుకునేందుకు పోరాడుతున్నారు. పద్నాలుగో వారం వీరంతా నామినేషన్లో ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. హౌస్మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో మొదటి నుంచి ఆరు స్థానాల వరకు ర్యాంకులిచ్చుకోవాలని ఆదేశించాడు బిగ్‌బాస్. మొదట్లో ఫస్ట్ ప్లేస్ తనకే కావాలన్న సిరి తర్వాత మాత్రం షణ్నును మొదటి స్థానంలో చూడాలనుకుంటున్నానంది. అదేంటి? నిన్ను నువ్వు ఫస్ట్ ర్యాంక్‌లో చూసుకోవా? అని శ్రీరామ్ ప్రశ్నించగా లేదని అడ్డంగా తలూపింది. సిరి కంటే కొంచెం తక్కువగా ఆడతావంటూ షణ్ను ఆరో ర్యాంక్ దగ్గర నిలబడటమే కరెక్ట్ అంది కాజల్. గేమ్ ఇలా ఆడటం తప్పంటే ఆరో స్థానంలో నిల్చుంటానంటూ టాప్ 6 బోర్డు దగ్గర నిలబడ్డాడు షణ్ను. మరి బిగ్‌బాస్ చెప్పినట్లు అందరూ ఒక ఏకాభిప్రాయానికి వస్తారా? లేదా? అన్నది చూడాలి! -
సన్నీ నెంబర్ 1, షణ్ముఖ్ ర్యాంక్ ఎంతంటే?
Bigg Boss 5 Telugu Promo: అసలు ఆట ఇప్పుడే మొదలవుతుందంటూ బిగ్‌బాస్ ఓ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చాడు. ఒకటి నుంచి ఆరు వరకు ఎవరెవరు ఏయే ర్యాంకుల్లో ఉండాలో నిర్ణయించుకుని వాటి వెనకాల నిల్చుండాలని ఆదేశించాడు. దీంతో షణ్ముఖ్, సన్నీ, కాజల్, సిరి ఫస్ట్ ర్యాంకు నాకు కావాలంటే నాకు కావాలని పోటీపడ్డారు. మరీ ముఖ్యంగా కాజల్ మాత్రం మొదటి స్థానంలో నిల్చుండాలని తహతహలాడింది. అయితే సన్నీ అందుకు ఒప్పుకోలేదు. అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదంటూ డైలాగులు వల్లించాడు. అయితే మొత్తానికి సన్నీ ఫస్ట్ ప్లేస్‌లో నిల్చున్నట్లు సమాచారం. రెండో స్థానంలో షణ్ముఖ్, మూడో స్థానంలో కాజల్, నాలుగో ప్లేస్‌లో శ్రీరామ్, ఐదో స్థానంలో మానస్, ఆరో ర్యాంక్ వద్ద సిరి నిలబడ్డారట! అంటే హౌస్మేట్స్ అభిప్రాయం మేరకు సిరి వచ్చే వారం వెళ్లిపోతే మిగతా ఐదుగురు ఫినాలేలో అడుగుపెడతారన్నమాట! ఇంటిసభ్యులు సన్నీని విన్నర్‌గా, షణ్ముఖ్‌ను రన్నర్‌గా తేల్చారు. కానీ వీళ్లమధ్య గట్టి పోటీ నడుస్తుండటంతో ఈ ఇద్దరిలో ఎవరు విజేత అని ఇప్పుడే చెప్పడం కష్టంగా మారింది. -
మానస్ బండారం బయట పెట్టిన అరియాన, కన్నీళ్లు పెట్టుకున్న పింకీ
Bigg Boss 5 Telugu Priyanka Singh Interview With Ariyana Glory: అందరూ ఊహించినట్టుగానే బిగ్‌బాస్ 13వ వారం ఎలిమినేషన్లో భాగంగా ప్రియాంక సింగ్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ ఫినాలే వైపు అడుగులెస్తోంది. మొదటి ఫినాలే కంటెస్టేంట్గా శ్రీరామ్ ఎన్నికయ్యాడు. ఇక హౌజ్‌లో మానస్, శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, కాజల్, సిరిలు మాత్రమే ఉన్నారు. ఇక ఎలిమినేట్ అయిన ప్రియాంక అరియానతో బిగ్‌బాస్ బజ్‌లో ముచ్చటించింది. హౌజ్‌లో ఉన్నంత కాలం మానస్ జపం చేసిన పింకీ బయటకు వచ్చాక కూడా మానస్ పేరునే కలవరించింది. ఈ క్రమంలో ఆమె హౌజ్‌లోని కంటెస్టెంట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎవరూ గెలుస్తారని అరియాన అడగ్గా మానస్ పేరు చెప్పింది. దీంతో అరియాన ఆమె కళ్లు తెరిపిస్తూ పింకీకి ఓ షాకింగ్ వీడియో చూపించింది. చదవండి: ఎలిమినేషన్ అనంతరం పింకీ తొలి ఇంటర్య్వూ.. మానస్ గురించి ఏం చెప్పిందంటే అది చూసి ప్రియాంక భావోద్యేగానికి లోనవుతూ కంటితడి పెట్టుకోగా అరియాన సైతం ఆమెను హత్తుకుని ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానస్, కాజల్.. ప్రియాంక గురించి మాట్లాడుకుంటున్నా వీడియోను అరియానా చూపించింది. ఆ వీడియో చూసి షాకైన పింకీ.. ‘మానస్ చాలా సారీ.. ఇది నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు’ అంటూ చెప్పుకోచ్చింది. మానస్‌కు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడగ్గా.. మానస్ గురించి నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే.. ఎవరినైనా చదివి పక్కనపెట్టేస్తాడు. నాకు పిల్లలుంటే ఎలా చూసుకునేదాన్నో అలాగే చూసుకుంటానంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. చదవండి: సోనూసూద్‌కు మరోసారి షాకిచ్చిన బీఎంసీ, మాట నిలబెట్టుకోలేదంటూ హెచ్చరిక ఇక అరియానా ఇచ్చిన టాస్కులో డౌన్ తంబ్ సింబల్ కాజల్‌కు ఇవ్వగా.. లవ్ సింబల్ శ్రీరామచంద్రకు ఇచ్చింది. పంచ్ సింబల్ మాత్రం మానస్‌కు ఇచ్చి షాకిచ్చింది పింకీ. అలా ఎందుకు అని అరియానా అడగ్గా.. ఏదైనా ఉంటే నాతో మాట్లాడోచ్చు కదా అంటూ సమాధానమిచ్చింది. ఇక పింకీ అంటే మానస్ గుర్తోస్తాడని అరియానా అనగా.. మానస్ గేమ్ నేను ఆడితే ఇక మా ఇద్దరికి ఓకే ట్రోఫీ ఇచ్చేయ్యొచ్చు కదా అంటూ బదులిచ్చింది. కాజల్ మీద మీ అభిప్రాయం ఏంటీ.. తన ఆట ఎలా ఉంటుంది అని అరియానా అడగ్గా.. ప్రతి విషయాన్ని లాగుతూ ఆ గొడవను ఇంక పెద్దతి చేయాలని చూస్తుందనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. అలాగే షణ్ముఖ్ సైలెంట్ కిల్లర్ అని.. స్ట్రాంగ్ అని.. టాస్కులలో తను చేయాలనుకున్నది ఎలాగైనా చేసేస్తాడని చెప్పింది. -
బిగ్‌బాస్ హౌస్‌లో అపరిచితుడు, మహానటి ఎవరో తెలుసా?
Bigg Boss Telugu 5 Promo: సండేను ఫండేగా మార్చేందుకు సరికొత్త గేమ్స్‌తో ముందుకు వచ్చాడు నాగ్. ఈ క్రమంలో కొన్ని సినిమా పాత్రలను కంటెస్టెంట్లు ఒకరికొకరు అంకితమిచ్చుకోవాలని ఆదేశించాడు. ఈ క్రమంలో మహానటి పోస్టర్ చూడగానే సన్నీ తడుముకోకుండా ప్రియాంక పేరు చెప్పాడు. సావిత్రితో పోలుస్తున్నందుకు పింకీ ఉప్పొంగిపోగా... నిన్ను సావిత్రితో పోల్చలేదమ్మా.. బాగా నటించే వ్యక్తివని అర్థం అంటూ ఆమె గాలి తీసేశాడు. ఇంకొకరిని కంట్రోల్లో పెట్టే డా.వశీకరన్ పాత్ర షణ్నుకు బాగా సెట్టవుతుందని చెప్పింది సిరి. అంటే అతడు తనని కంట్రోల్లో పెడతాడని చెప్తూ వాపోయింది. సన్నీ అర్జున్‌రెడ్డి అని, శ్రీరామ్ రేలంగి మావయ్య అని, మానస్ అపరిచితుడు అని పేర్కొన్నారు. ఇంట్లో ఎవరు సింపతీ కోసం ప్రయత్నిస్తారని నాగ్ ప్రశ్నించగా మానస్ కాజల్ పేరు చెప్పాడు. నా వాళ్లే నన్నిలా అంటే ఎలారా? అని కాజల్ చెప్పాల్సిన డైలాగ్‌ను నాగ్ ఇమిటేట్ చేయడంతో అంతా ఘొల్లుమని నవ్వారు. -
సన్నీతో సారీ చెప్పించిన నాగ్, సిరిపై సెటైర్లు
Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ ప్రియులు పొద్దుటి నుంచి ప్రోమో కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారి సహనానికి పరీక్ష పెట్టిన బిగ్‌బాస్ టీం ఎట్టకేలకు ప్రోమో వదిలింది. ఇందులో కింగ్ నాగార్జున కంటెస్టెంట్ల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకున్నాడు. సిరి.. తనను తిడుతున్నాడని షణ్ముఖ్ మీద ఫిర్యాదు చేసింది. కాజల్.. నా మీద అరిచేస్తున్నాడంటూ సన్నీపై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో నాగ్.. సన్నీతో ఆమెకు సారీ చెప్పించాడు. సిరి హెలికాప్టర్ సౌండ్‌ను కనిపెట్టలేకపోయిన విషయాన్ని నాగ్ ప్రస్తావిస్తూ ఆమెపై సెటైర్లు వేశాడు. మీ ఊర్లో ట్రాక్టర్ సౌండ్ అలాగే వస్తుందా? అని కౌంటరిచ్చాడు. మరోపక్క శ్రీరామ్ సేఫ్ అయితేనే అతడికి ఫస్ట్ ఫైనలిస్టు ట్రోఫీ దక్కుతుందన్నాడు నాగ్. ఎలాగో శ్రీరామ్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఈరోజు శ్రీరామ్ టికెట్ టు ఫినాలేలో గెలిచిన ట్రోఫీని తన సొంతం చేసుకోబోతున్నాడన్న మాట! -
ప్రియాంకకు బిగ్‌బాస్ వార్నింగ్, సొంత వైద్యం అక్కర్లేదని హెచ్చరిక!
Bigg Boss 5 Telugu, Episode 90: వీకెండ్ దగ్గరపడుతుందంటే చాలు హౌస్‌మేట్స్‌లో ఎక్కడలేని భయం తొంగి చూస్తుంది. ఈ వారం నేను లేదా కాజల్ ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉందని ప్రియాంక అభిప్రాయపడింది. కానీ షణ్ను మాత్రం మానస్ కూడా వెళ్లొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. అనఫీషియల్ పోలింగ్ చూస్తుంటే పింకీ మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక ఇంటిసభ్యులు 'టికెట్ టు ఫినాలే' టాస్క్‌లో ఫోకస్ ఛాలెంజ్ ఎంచుకున్నారు. ఇందులో భాగంగా కొన్ని శబ్ధాలు ప్లే చేయగా వాటిని సరిగ్గా గుర్తించి వరుస క్రమంలో రాసినవాళ్లు మొదటి స్థానంలో నిలుస్తారని బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే కాజల్ పదేపదే మధ్యలో మాట్లాడుతూ పోటీదారులను డిస్టర్బ్ చేయడంతో సన్నీ ఆమెపై ఫైర్ అయ్యాడు. ఇది తర్వాత చిలికి చిలికి గాలివానలా మారింది. ఇక హెలికాప్టర్ సౌండ్‌ను ట్రాక్టర్ అని, గురక శబ్ధాన్ని పులి గాండ్రింపు అని సిరి రాయడంతో అందరూ నవ్వాపుకోలేకపోయారు. షణ్ను అయితే ఈ విషయంలో సిరిని చాలా ఏడిపించాడు. ఈ ఛాలెంజ్‌లో సన్నీ, మానస్ ఎక్కువ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా శ్రీరామ్, సిరి తర్వాతి స్థానాల్లో నిలిచారు. గేమ్‌లో సన్నీని డిస్టర్బ్ చేసినందుకు కాజల్ పదేపదే సారీ చెప్పింది. అయినప్పటికీ సన్నీ తన మాటలను పట్టించుకోనట్లు నటిస్తూ ఆమెను మరింత ఉడికించాడు. చిర్రెత్తిపోయిన కాజల్.. టిష్యూ పేపర్‌ను ముఖం మీద విసరగా అసహనానికి లోనైన సన్నీ కామన్సెన్స్ లేదని తిట్టాడు. దీంతో కాజల్ దుప్పటి కప్పుకుని ఏడ్చేసింది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అక్యురెసీ అనే ఐదో ఛాలెంజ్ ఎంచుకున్నారు హౌస్మేట్స్. ఈ టాస్క్‌లో బోర్డుపై ఉన్న బల్బ్స్లో కొన్ని ఆన్, కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. తక్కువ సమయంలో అన్నింటినీ ఆన్ చేసినవారు ప్రథమస్థానంలో నిలుస్తారు. ఈ గేమ్‌లో ఇప్పటికీ సరిగా నడవలేకపోతున్న సిరి, శ్రీరామ్ ఇద్దరి తరపున షణ్ను ఆడాడు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్, సన్నీ, సిరి, మానస్ వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ ఛాలెంజ్‌లన్నీ ముగిసే సమయానికి చివరి రెండు స్థానాల్లో ఉన్న సిరి, సన్నీ రేసు నుంచి తప్పుకోగా మానస్, శ్రీరామ్ ఫినాలే టికెట్ కోసం పోటీపడ్డారు. సిరికి మోషన్స్ అవుతున్నాయంటే ప్రియాంక ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించింది. షుగర్ వాటర్ తాగమని, అరటిపండు తినమని తనకు తోచిన సూచనలు ఇచ్చింది. ఇప్పటికే ఆమె చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు కొత్తగా సిరికి వైద్యసలహా ఇవ్వడంతో వెంటనే స్పందించిన బిగ్‌బాస్ నీకోసం కానీ, ఇతర ఇంటిసభ్యుల కోసం కానీ సొంత వైద్యం చేయడం శ్రేయస్కరం కాదని హెచ్చరించాడు. ఈ దెబ్బతో పింకీ తలెక్కడ పెట్టుకోవాలో తెలియక చిన్నబుచ్చుకుంది. ఆఖరి రౌండ్లో శ్రీరామ్, మానస్ పోటీపడగా శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. షణ్ను, సన్నీ ఇద్దరూ తన గెలుపుకు సాయం చేశారని వారికి అభినందనలు తెలిపాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యానోచ్ అంటూ తెగ సంబరపడిపోయిన శ్రీరామ్‌కు పట్టరాని ఆనందంతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మరోపక్క చివరిదాకా వచ్చి ఓటమిని చవిచూసినందుకు మానస్ దిగులుచెందాడు. ఫినాలే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని ఎంతగానో బాధపడ్డాడు. -
పింకీ, కాజల్‌లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Bigg Boss 5 Telugu, 13th Week Elimination: బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ తెలుగులో విజయవంతంగా దూసుకుపోతోంది. నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఐదో సీజన్ ముగింపుకు చేరుకుంటోంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలారు. వీరందరూ ఫినాలేలో చోటు దక్కించుకోవడం కోసం నువ్వా?నేనా? అన్న రీతిలో పోరాడుతున్నారు. ఇదిలా వుంటే ఈ వారం షణ్ముఖ్, సన్నీ మినహా శ్రీరామ్, సిరి, మానస్, ప్రియాంక, కాజల్ నామినేషన్లో ఉన్నారు. ఎలాగో ఇందులో శ్రీరామ్ భారీ ఓట్లతో ఓటింగ్‌లో ముందు వరుసలో దూసుకుపోతున్నాడు. అటు మానస్ కూడా కేవలం గేమ్ మీదే ఫోకస్ పెట్టి ఆడుతూ తనకు మంచి ఓట్లు పడేలా జాగ్రత్తపడుతున్నాడు. మిగిలిందల్లా సిరి, కాజల్, ప్రియాంక. నిజానికి గతవారంలోనే వీళ్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ యాంకర్ రవిని ఎలిమినేట్ చేసి షాకిచ్చారు. ఇక ఈ వారం దాదాపు ప్రియాంక హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశాలున్నాయి. లేదంటే కాజల్‌ను పంపించేందుకు ఆస్కారం ఉంది. సిరి టాప్ 5లో పాగా వేసే ఛాన్స్ ఉంది. కానీ మొన్నటి ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ అభిమానులకు భయం పట్టుకుంది. ఎవరో ఒకరిని రక్షించడం కోసం మళ్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయరు కదా! అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వారం బిగ్‌బాస్ పింకీని పంపించేస్తాడా? లేదా వేరే ఆప్షన్ ఎంచుకుంటాడా? అన్నది చూడాలి! -
'చూసుకుంటున్నాడు, హగ్గివ్వకపోతే ఎలా?' తల్లిని తలుచుకున్న సిరి
Bigg Boss Telugu 5, Episode 89: టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా.. 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంజ్‌లో మానస్ మొదటి స్థానంలో నిలిచాడు. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ప్రియాంక, కాజల్, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మానస్ సాయం చేసినా సన్నీ ఓడిపోవడంతో హౌస్మేట్స్ అతడిపై కౌంటర్లు వేశారు. మరోపక్క సిరి హగ్గివ్వంటూ షణ్నును అడిగింది. దీంతో అతడు కాస్త తటపటాయిస్తూనే ఫ్రెండ్షిప్హగ్ అని కెమెరాల వంక చూడగా.. నన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి హగ్గివ్వకపోతే ఎలా అంటూ అతడిని హత్తుకుంది సిరి. వారి ఫ్రెండ్షిప్ గురించో మరేంటో కానీ.. మా అమ్మకు ఇప్పుడు అర్థమవుతుందని తనలో తానే అనుకుంది సిరి. అయితే వీళ్ల హగ్గులు చూసిన పింకీ.. తనకు కూడా ఓ హగ్గివ్వమని కోరింది కానీ అతడు మాత్రం పట్టించుకోలేదు. అనంతరం షణ్ను, కాజల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నిజంగా నేను తప్పైతే నీకంటే ముందే వెళ్లిపోతా! అని కాజల్‌తో శపథం చేశాడు షణ్ను. నువ్వెప్పుడూ నేను తప్పు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తావని ఫైర్ అయింది కాజల్. ఈ క్రమంలో షణ్ను నీ బొంద, కామన్సెన్స్ అంటూ కొన్ని అనవసర మాటలు జారాడు. తర్వాతరం హౌస్మేట్స్ స్కిల్ ఛాలెంజ్ స్వీకరించారు. ఇందులో భాగంగా ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌లో ఉన్న బాల్స్ కింద పడేలా చేయాలి. ఎవరైతే అన్ని బాల్స్ ముందుగా కిందపడేలా చేస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. ఐస్ టాస్క్ వల్ల ఇప్పటికీ నిలబడి నడవలేకపోతున్న శ్రీరామ్, సిరిల స్థానంలో సన్నీ, షణ్ను ఆడారు. ఇక ఈ గేమ్‌లో మానస్, శ్రీరామ్, సిరి, ప్రియాంక, కాజల్, సన్నీ, షణ్ముఖ్ వరుసగా ఏడు స్థానాల్లో నిలిచారు. మొత్తంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో మూడు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సరికి తక్కువ పాయింట్లు ఉన్న కాజల్, ప్రియాంక రేసు నుంచి తప్పుకున్నట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. సన్నీ, షణ్ముఖ్లిద్దరికీ సమాన పాయింట్లు రావడంతో వీరికి మళ్లీ గేమ్ పెట్టగా ఇందులో సన్నీ గెలిచి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు. షణ్ను రేసు నుంచి వైదొలిగాడు. రేపటి ఎపిసోడ్లో మానస్, సన్నీ, షణ్ను, సిరిలకు చివరి పోటీ పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచి ఫినాలేలో మొదటగా అడుగు పెడతారో రేపటి ఎపిసోడ్లో చూడాలి! -
జీవితంలో మాట్లాడను, కట్ చేస్తే కాసేపటికే హగ్గులు
Bigg Boss Telugu 5, Episode 87: ప్రియాంక.. కాజల్‌ను నామినేట్ చేయడంపై మానస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తను నిన్ను సపోర్ట్ చేసింది, కానీ నువ్వు ఆమెను ఫ్రెండ్ అనుకోలేదు కాబట్టే నామినేట్ చేశావని అసహనం వ్యక్తం చేశాడు. ముందు నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోమని చెప్తూ అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్లిపోయాడు. అతడు చెప్పాలనుకుంది చెప్పాడు, మరి తన సమాధానం కూడా వినాలి కదా! అని నిలదీసింది పింకీ. నీది మాట్లాడటం అయిపోతే వెళ్లిపోతావా? అని ఆగ్రహంతో ఊగిపోయింది. కానీ కాసేపటికే మళ్లీ మానస్ దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలని చెప్పింది. అయితే అతడు మాత్రం నేనిప్పుడు మాట్లాడలేనన్నాడు. ఎవడో కోన్‌కిస్కా గొట్టం గాడు ఇలా అంటే పట్టించుకోను కానీ నువ్వంటే మాత్రం బాధపడతానని గట్టిగా అరిచేసింది పింకీ. ఎందుకు బాధపడతావని మానస్ అడగ్గానే ఒళ్లు కొవ్వెక్కి అంటూ ఏడ్చేసింది. నువ్వు నన్ను తప్పుగా ఫ్రూవ్ చేయాలని చూస్తున్నావంటూ మానస్ అనడంతో షాకైన పింకీ.. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేను జీవితంలో మాట్లాడను అని తేల్చి చెప్పింది. దీంతో మానస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రంతా మానస్- ప్రియాంక మధ్య ఈ గొడవ జరుగుతుంటే కాజల్ ఎంట్రీతో ఇది మరింత పెద్దదిగా మారింది. 'ఈ పంచాయితీలు వద్దు, నాకు నువ్వు నచ్చట్లేదు, నీతో మాట్లాడాలనుకోవడం' లేదు అంటూ మానస్ ఆమె ముఖం మీదే చెప్పాడు. అయినప్పటికీ పింకీ అతడితో మాట్లాడటానికి ఎంతగానో ప్రయత్నించగా కాజల్ అది కుదరనివ్వలేదు. దీంతో చిర్రెత్తిపోయిన పింకీ.. కాజల్‌ను షటప్ అని తిట్టి వెళ్లింది. ఆమె ఎక్కడుంటే అక్కడ గొడవలుంటాయనేది నిజమని, రెచ్చగొట్టి ఏమీ ఎరుగనట్లు సైలెంట్‌గా కూర్చుంటుందని నానా మాటలు అంది. కట్ చేస్తే పింకీ ఇంకా భోజనం చేయలేదని తెలిసిన మానస్.. ఆమెను తినమని బతిమాలాడు. తన కోపం, ఆవేశం, ఆవేదన అంతా కలిసి దుఃఖంగా ఉప్పొంగుకురాగా అతడిని హగ్ చేసుకుని ఏడ్చేసింది. దీంతో మానస్ ఆమెను ఓదార్చాడు. మరోపక్క కాజల్‌కు ఎలా ఓట్లేస్తున్నారో అర్థం కాక షణ్ను, సిరి తల పట్టుకున్నారు. సన్నీ ఫ్యాన్స్ తనకు ఓట్లేస్తారనే కాజల్ అతడితో సన్నిహితంగా ఉందన్నాడు షణ్ను. ఇంతలో షణ్ను కెప్టెన్సీ పూర్తయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. అనంతరం బిగ్‌బాస్ ప్రతిష్టాత్మకమైన "టికెట్ టు ఫినాలే" టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో మొదటి లెవల్ 'ఎండ్యురెన్స్ టాస్క్'లో భాగంగా కంటెస్టెంట్లు వీలైనంత ఎక్కువ సేపు ఐస్ టబ్‌లో ఉండాలి. ఒక్క కాలు బయటపెట్టినా సరే ఆ సమయంలో ఇతరులు వారి టబ్‌లోని బాల్స్ తీసుకోవచ్చని తెలిపాడు. ఆట మొదలవగానే అందరూ ఐస్ వాటర్‌లో నిలబడ్డారు. కానీ సన్నీకి చెరోవైపు కాజల్, మానస్, షణ్ను పక్కన సిరి ఉండటంతో వారి బాల్స్ దొంగిలించడానికి కూడా ప్రయత్నించడం లేదు. ఇది అర్థమైన బిగ్‌బాస్ వెంటనే రెండో లెవల్ మొదలవుతుందంటూ షణ్ను, సన్నీలను స్థానాలు మార్చుకోమని ఆదేశించాడు. దీంతో రేపటి ఎపిసోడ్లో అసలు గేమ్ మొదలైనట్లు కనిపిస్తోంది. అంతేకాదు..సిరికి, సన్నీకి మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. -
వాళ్ల కంట్రోల్లో పింకీ, వద్దన్నా హగ్గిచ్చిన సిరి!
Bigg Boss Telugu 5, Episode 86: ఇంటిసభ్యులంతా రవి ఎలిమినేషన్ గురించే చర్చించారు. టాప్ 3లో ఉంటాడనుకున్నా అని షణ్ను, టాప్ 2లో ఊహించానని శ్రీరామ్.. రవి గురించి అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. అటువైపు కాజల్ మాత్రం ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో కాకుండా ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అయ్యానని తెగ సంతోషపడిపోయింది. మరోపక్క మానస్.. తను టైటిల్‌ను లెక్క చేయనని తేల్చేశాడు. ప్రజల మనసులు గెలవడమే తనకు ముఖ్యమన్నాడు. ఈ మధ్య ప్రియాంకను కనీసం ముట్టుకోవడం లేదన్నాడు. ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో అన్న భయంతో హగ్ చేసుకోవడం మానేశానని చెప్పుకొచ్చాడు. పింకీ చాలా ఒంటరిగా ఫీల్ అవుతోందని, నన్ను తనతో ఉండమంటోందని షణ్నుతో చెప్పుకొచ్చింది సిరి. తర్వాత పింకీ దగ్గరకు వెళ్లి ఏమైంది డల్‌గా ఉన్నావంటూ ఆమె బాధను పోగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో ప్రియాంక రవి లేని లోటు గురించి చెప్పుకొచ్చింది. నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు నాకు కనిపించే వ్యక్తి రవి అన్నయ్య, అతడు లేకపోతే నాకు ధైర్యం లేనట్లు అనిపిస్తోందని బాధపడింది పింకీ. మరోపక్క షణ్ను వద్దంటున్నా సిరి హగ్గివ్వడానికి వెళ్లింది. అతడు ఎంత వారించినా వినకుండా ఫ్రెండ్షిప్ హగ్గంటూ షణ్నును హత్తుకుంది. ఎప్పటిలాగే కాజల్ ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉంటారు? ఎవరు ఎవర్ని చేస్తారని లెక్కలు వేసుకుంటూ కూర్చుంది. సన్నీనెవరూ నామినేట్ చేయరని ఘంటాపథంగా చెప్పింది. చివరకు ఆమె అన్నదే నిజమైందనుకోండి, అది వేరే విషయం! మరోపక్క షణ్ముఖ్.. ప్రియాంకతో మాట్లాడుతూ.. సన్నీ, మానస్, కాజల్ ధైర్యం ఏంటంటే.. నిన్నేం చేసినా నువ్వు వాళ్లను నామినేట్ చేయవు, ఎదురు తిరగవని వాళ్ల నమ్మకం. నువ్వు వాళ్ల కంట్రోల్లో ఉన్నావనుకుంటున్నారు అని ఆమెను మేల్కొలిపేందుకు ప్రయత్నించాడు. అనంతరం 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇంటిసభ్యులు తగిన కారణాలు చెప్తూ ఇద్దరు సభ్యుల ముఖం ఉన్న బాల్స్‌ను గేటు బయటకు తన్నాలి. కమ్యూనిటీ(ట్రాన్స్‌జెండర్) పేరు తీయడం తప్పంటూ కెప్టెన్ షణ్ముఖ్ కాజల్‌ను నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంకను నామినేట్ చేస్తూ ఆమె ఫేస్ ఉన్న బంతిని ఒక్క తన్ను తన్నాడు. ప్రియాంక.. ఎవరిని నామినేట్ చేయాలో అర్థం కావట్లేదని సమయం వృథా చేయగా బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. నామినేషన్స్ తెలపకపోతే నేరుగా నామినేట్ అవుతావని హెచ్చరించాడు. దీంతో పింకీ.. సిరిని, కాజల్‌ను నామినేట్ చేసింది. శ్రీరామ్.. నన్ను అగౌరవపర్చారంటూ మానస్, కాజల్‌ను నామినేట్ చేశాడు. ఎమోషనల్‌గా కనెక్ట్ అవకుండా నీ గేమ్ నువ్వు ఆడంటూ సిరి.. పింకీ ఫేస్ ఉన్న బంతిని తన్నింది. కమ్యూనిటీ అన్న పదం వాడటం తప్పంటూ కాజల్‌ను నామినేట్ చేసింది. సన్నీ, మానస్.. సిరి, శ్రీరామ్‌లను నామినేట్ చేశారు. నేను కమ్యూనిటీ అన్న పదం తీయడం తప్పు తప్పు అని భూతద్దంలో చూపిస్తున్నారంటూ కాజల్.. సిరి, ప్రియాంకను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం సిరి, మానస్, ప్రియాంక, శ్రీరామ్, కాజల్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. -
రూ.50 లక్షలు గెలిస్తే అమ్మనవుతా: ట్రాన్స్‌జెండర్ ప్రియాంక
Bigg Boss Telugu 5, Ravi Eliminated From BB Show: ఇప్పటివరకు బిగ్‌బాస్ షో విజేతలకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సీజన్లో మాత్రం దీనికి అదనంగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన భూమిని కూడా కానుకగా అందిస్తున్నారు. ఈ విషయాన్ని మన్మథుడు నాగార్జున అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాస్ విన్నర్ రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు నాగ్. మొదటగా ప్రియాంక మాట్లాడుతూ.. 'నేను రూ.50 లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉండేది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలన్నారు. కాబట్టి ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటా' అని చెప్పుకొచ్చింది. శ్రీరామ్ మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వడానికే షోకు వచ్చాను. పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్‌తో కలిసి ఉండాలన్నది నా కోరిక' అని చెప్పాడు. 'కొంత వియా చదువు కోసం పొదుపు చేస్తా. నిర్మాణసంస్థ నెలకొల్పాన్న కోరికను నెరవేర్చుకుంటా' అని చెప్పాడు రవి. కాజల్ తనకున్న 30 లక్షల రూపాయల అప్పు తీర్చుకుంటానంది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలనుకుంటున్నానని చెప్పింది. సువర్ణ కుటీర్‌లో ఇల్లు కట్టుకుంటానంది. సన్నీ వచ్చిందంతా అమ్మకిచ్చేస్తానని, కొంత డబ్బు తీసుకుని సెలూన్ పెడతానన్నాడు. మానస్ తనకు వచ్చిన డబ్బుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తానని చెప్పాడు. షణ్ముఖ్.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న అమ్మకు 25 లక్షలు ఇస్తానన్నాడు. తనకెన్నో సార్లు డబ్బు సాయం చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన దీప్తి సునయనకు మరో 25 లక్షలిస్తానన్నాడు. సిరి శ్రీహాన్ పేరెంట్స్‌కు ఉన్న 10 లక్షల అప్పు తీర్చేసి కొంత అమ్మకిస్తానని, అలాగే అంధులకు సాయం చేస్తానని పేర్కొంది. తర్వాత షణ్ముఖ్, ప్రియాంక సేఫ్ అవగా రవి, కాజల్ మాత్రమే నామినేషన్స్‌లో మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను నువ్వు వాడుకుంటావా? లేదా వీళ్లలో ఒకరిని సేవ్ చేస్తావా? అని నాగ్ సన్నీని అడిగాడు. ఆ పాస్ తనకు రావడం కోసం ఎంతగానో ఫైట్ చేసిన కాజల్‌కు వాడాడు. కానీ ఓటింగ్‌లో రవి చివరి స్థానంలో ఉండటంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని నాగ్ ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి ఉపయోగం లేకపోయింది. రవి కోసం వాడి ఉంటే కనీసం అతడైనా సేవ్ అయ్యేవాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న రవి ఎలిమినేట్ అవడంతో ఏడుపాపుకోలేకపోయిన సన్నీ తన దగ్గరున్న గిఫ్ట్ వోచర్‌ను అతడికి బహుమతిగా ఇచ్చాడు. సన్నీ మాత్రమే కాదు, ఇంటిసభ్యులెవరూ రవి ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోయారు. అందరూ కన్నీటితో భారంగా ఆయనకు వీడ్కోలు పలికారు. స్టేజీ మీదకు వచ్చిన రవి చాలా తొందరగా బయటకు వచ్చేశానని బాధపడ్డాడు. అనంతరం ఈ బిగ్‌బాస్ జర్నీలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్? అనే గేమ్ ఆడాడు. షణ్ను పాస్ అయ్యాడని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. లేట్‌గా కనెక్ట్ అయిన చందూలో అన్నీ పాజిటివ్సే ఉన్నాయన్నాడు రవి. నువ్వు లోపలి నుంచి ఆడు, నేను బయట నుంచి ఆడతానని చెప్తూ అతడిని పాస్ చేశాడు. ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు, తోపు అంటూ సన్నీని పాస్ చేశాడు. ప్రియాంక, సిరి, కాజల్‌కు ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. టాప్ 5లోకి రావాలని సిరిని ఎంకరేజ్ చేశాడు. మానస్‌ను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానంటూనే అతడికి ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. షణ్ను ఎంతకూ కన్నీళ్లను ఆపుకోలేకపోవడంతో రవి.. నేనెళ్తేనే నువ్వు గెలుస్తావంటూ ఆఖరి మాటగా చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. -
అంతా కలిసి సన్నీని విన్నర్‌గా తేల్చారు! టాప్ 5లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 5, Episode 84: కింగ్ నాగార్జున హౌస్మేట్స్ కోసం సర్ప్రైజ్ పట్టుకొచ్చాడు. కంటెస్టెంట్ల కోసం మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ స్టేజీపైకి వస్తారని చెప్పాడు. కానీ వాళ్లు మిమ్మల్ని కలవాలంటే మీకు బాగా నచ్చిన వస్తువులను త్యాగం చేయాలని మెలిక పెట్టాడు. అయినవాళ్లను చూడటం కన్నా విలువైనది ఏముంటుందనుకున్న హౌస్మేట్స్ అందుకు ఓకే అనేశారు. మొదటగా యాంకర్ రవి పాప బొమ్మను త్యాగం చేయడంతో అతడి తల్లి ఉమాదేవి స్టేజీపైకి వచ్చింది. ఫ్యామిలీ అంతా నిన్ను చూసి గర్వపడుతుందని నువ్వు బిగ్‌బాస్ హౌస్‌కు రాజువని మెచ్చుకుంది. రవి కోసం బిగ్‌బాస్ తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ కూడా షోకి విచ్చేశాడు. హౌస్‌లో ఎవరికి సపోర్ట్ చేయొద్దని, నీకు చెప్పాలనిపించిన పాయింట్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. అనంతరం ఉమావేవి.. రవి, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని చెప్పుకొచ్చింది. తర్వాత పింకీ మేకప్ కిట్ త్యాగం చేయగా ఆమెకోసం హాస్యనటులు సాయి, అప్పారావు వచ్చారు. వీరు ప్రియాంకను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, శ్రీరామ్, రవి, మానస్‌లను టాప్ 5లో ఉంచారు. ఈ సందర్భంగా పింకీ మాట్లాడుతూ.. 'నన్ను కన్నడ నుంచి తెలుగుకి తీసుకువచ్చి కామెడీ షో చేయించారు.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం' అంటూ అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపింది. సన్నీ తనకు ఫ్రెండ్స్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌ను త్యాగం చేయగా ఇద్దరు ఫ్రెండ్స్ నిఖిల్, వెంకట్ స్టేజీపై సందడి చేశారు. కప్పు ముఖ్యం బిగిలూ అంటూనే బోర్డు మీద సన్నీని విన్నర్ స్థానంలో ఉంచారు. షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు. మానస్.. తల్లి పంపిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేయగా అతడి కంటే ఎక్కువగా పింకీ బాధపడిపోయింది. తర్వాత మానస్ తండ్రి వెంకట్రావు, ఫ్రెండ్ అమర్దీప్ వచ్చాడు. ఏమీ లేనివాడిని తీసుకొచ్చి అన్నీ ఉన్నవాడిలా చేశాడు, నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే మానస్ వల్లేనంటూ అతడిని పొగిడేశాడు. అనంతరం మానస్‌ను ఫస్ట్ ప్లేస్‌లో సన్నీ, కాజల్, శ్రీరామ్, షణ్ముఖ్‌ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు. కాజల్ ఎంతగానో ఇష్టపడే బొమ్మను త్యాగాల పెట్టెలో పడేసింది. ఆమెను కలవడానికి సోదరితో పాటు, సింగర్ లిప్సిక కూడా వచ్చారు. వీళ్లు కాజల్‌ను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, షణ్ను, శ్రీరామచంద్ర, మానస్‌ను తర్వాతి స్థానాల్లో పెట్టారు. అనంతరం శ్రీరామ్.. హమీదా ఇచ్చిన కానుకను త్యాగం చేయగా అతడి కోసం తల్లి, స్నేహితురాలు వచ్చారు. వీళ్లు శ్రీరామ్, రవి, ప్రియాంక సింగ్, సన్నీ, షణ్ముఖ్‌లు వరుసగా టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. సిరి కోసం వచ్చిన శ్రీహాన్.. సన్నీ, షణ్ముఖ్, రవి, శ్రీరామ్, సిరిలు వరుసగా టాప్ 5లో ఉంటారన్నాడు. చివరగా షణ్ముఖ్.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ను భారంగా త్యాగం చేశాడు. అతడి కోసం మొదట అన్నయ్య సంపత్ రాగా తర్వాత దీప్తి సునయన స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో షణ్ను ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని దీప్తి సూచించింది. నాకు నువ్వేంటో తెలుసంటూ అతడికి ముద్దులు పంపించింది. షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు. ఫినాలేలో కలుద్దామంటూ వీడ్కోలు తీసుకుంది. ఈరోజు వచ్చిన మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్ సన్నీని టాప్ 5లోని మొదటి రెండు స్థానాల్లో పెడుతూ అతడే విన్నర్ అని చెప్పకనే చెప్పారు. -
బిగ్‌బాస్‌లో సిరి బాయ్‌ఫ్రెండ్.. 'వదిలేస్తున్నావా సిరి' అంటూ సూటి ప్రశ్న
బిగ్‌బాస్‌లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో సరదాగా సాగింది. ఫ్యామిలీ మెంబర్స్ బిగ్‌బాస్‌లోకి ఎంటర్ కావడంతో రియల్ ఎమోషన్స్ బయటకొచ్చాయి.దాదాపు 80 రోజుల తర్వాత కుటుంబసభ్యులను చూసే అవకాశం రావడంతో హౌస్మేట్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. అయితే యాంకర్ రవి, కాజల్ కుటుంబసభ్యులు మినహాయించి మిగతా కంటెస్టెంట్ల కోసం కేవలం ఫ్యామిలీలోనే ఒకరిని మాత్రమే బిగ్‌బాస్‌లోకి అనుమతించారు. తాజాగా హౌస్మేట్స్ ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడానికి డబుల్ ఎమోషన్స్‌ని బయటకు రప్పించడానికి మిగతా కుటుంబసభ్యులను కూడా బిగ్‌బాస్ ఆహ్వానించారు. ఇందులో భాగంగానే రవికోసం ఆయన తల్లి, కాజల్ ఫ్రెండ్ సహా సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ సైతం బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. శ్రీహాన్‌ను చూడగానే సిరి తలదించుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ 'వదిలేస్తున్నావా సిరి'.. అంటూ శ్రీహాన్ అడగ్గానే ఏం చెప్పాలో తెలియక బాగా ఎమోషనల్ అయ్యింది సిరి. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్ చేసింది. ఇప్పటివరకు సిరిని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న శ్రీహాన్..అలా 'వదిలేస్తున్నావా సిరి'.. అని ఎందుకు అడిగాడు అన్నది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. Weekend is here...More family members on the stage #BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Wp3ayU5TV8 — starmaa (@StarMaa) November 27, 2021 -
ఎలిమినేషన్: ఈ ముగ్గురిలో ఒకరు అవుట్!
Bigg Boss Telugu 5, 12th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ముగింపుకు చేరుకుంటోంది. ఇప్పటివరకు 11 వారాల్లో పదకొండుమంది ఎలిమినేట్ అయ్యారు. వీరిలో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్ ఉన్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరిలో ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. మానస్ మినహా కాజల్, సిరి, రవి, షణ్ముఖ్, సన్నీ, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్ర నామినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అనఫీషియల్ ఓటింగ్‌లో షణ్ముఖ్, సన్నీ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. నామినేషన్స్‌లోకి వచ్చిన ప్రతిసారి వీళ్లిద్దరూ తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతుండటం విశేషం. వీళ్ల తర్వాత మూడు, నాలుగు స్థానాల కోసం యాంకర్ రవి, సింగర్ శ్రీరామ్ పోటీపడుతున్నారు. అంటే మొదటి నాలుగు స్థానాల్లో నలుగురు అబ్బాయిలే ఉండగా చివరి మూడు స్థానాల్లో అమ్మాయిలు ఉన్నారు. దీంతో ఈ వారం మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. కాజల్, సిరి, ప్రియాంక ఎవరి స్టైల్లో వారు గేమ్ ఆడుతున్నారు. స్ట్రాటజీనే నమ్ముకున్న కాజల్ అప్పడం గొడవలో సన్నీకి సపోర్ట్ చేయడంతో అతడి ఫ్యాన్స్ ఈమెకు సేవ్ చేయడానికి ఓట్లేస్తున్నారు. సిరి.. మగరాయుడిలా గేమ్స్‌లో విజృంభించి ఆడుతుంటడంతో ఆమెకు కూడా మంచి ఓట్లు పడే అవకాశం ఉంది. మిగిలింది ప్రియాంక సింగ్. మిగతా ఇద్దరి కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో వెనకబడిన పింకీకి చాలా తక్కువ ఓట్లు గుద్దుతున్నారట! మానస్ నామినేషన్స్‌లో లేకపోయినప్పటికీ అతడి అభిమానులు చాలామటుకు ఆమెకు ఓటేయడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పింకీ ఉంటే మానస్ గేమ్ దెబ్బతింటుందని, అతడు టాప్ 5కి చేరుకోవడంపై దృష్టి పెట్టలేడని అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఆమెను బయటకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే లవ్ ట్రాక్ కోసమైనా ఆమెను ఉంచాలనుకుంటే మాత్రం కాజల్, సిరిలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది! -
చెంపలు వాయించుకున్న పింకీ.. సంతోషంగా ఉందన్న కాజల్ కూతురు
Bigg Boss Telugu 5, Episode 81: కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ 'నియంత మాటే శాసనం' గేమ్‌లో రవి, షణ్ముఖ్, ప్రియాంక మిగిలారు. బజర్ మోగగానే మొదటగా సింహాసనమెక్కాడు షణ్ను. దీంతో మిగిలిన ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకావం అందిపుచ్చుకున్నాడు. దీంతో ప్రియాంక.. ట్రాన్స్ కమ్యూనిటీకి తను ఆదర్శంగా ఉండాలనుకుంటున్నానని, ఒక్కసారైనా కెప్టెన్ అవ్వాలని ఉందంటూ తనను గేమ్‌లో నుంచి తొలగించవద్దని కోరింది. అయితే షణ్ను.. తాను రవికి ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేకపోయానని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అతడిని సేవ్ చేస్తున్నానని నిర్ణయాన్ని ప్రకటించాడు షణ్ను. తన కమ్యూనిటీ కోసం అయినా పింకీని సేవ్ చేయొచ్చుగా అని కాజల్ పింకీకి సపోర్ట్ చేయడంతో షణ్ను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. కమ్యూనిటీ గురించి తీయడం తప్పంటూ హెచ్చరించాడు. నేనేమైనా ఎదవలా కనిపిస్తున్నానా? ఆ పదం ఎందుకు వాడుతున్నారు? అని మండిపడ్డాడు. ఈ గొడవతో తన బుర్ర హీటెక్కిపోయిన ప్రియాంక తన చెంపలు వాయించుకుని వాష్‌రూమ్ హాల్లోకి వెళ్లి ఏడ్చేసింది. పింకీ బర్త్‌డే కాబట్టి ఆమెను సేవ్ చేయాల్సిందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ఈ గొడవతో షణ్ను సిరిని పట్టుకుని ఏడ్చేశాడు. ఫైనల్‌గా షణ్ముఖ్, రవి కెప్టెన్సీ కంటెండర్లు అవగా శ్రీరామ్ తప్ప మిగతా అందరూ షణ్నుకు ఓటేయడంతో అతడు ఈ సీజన్లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచాడు. సిరి అందంగా కనిపించాలంటూ షణ్ను ఆమెకు ముక్కుపుడకిచ్చాడు. తనకు అది పెట్టుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ షణ్ను కోసం దాన్ని ధరించించిది సిరి. అనంతరం బీబీ ఎక్స్‌ప్రెస్ అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లంతా రైలు బోగీలా మారడంతో పాటు రైలులా కదలాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో అందరూ వినోదాన్ని పంచారు. అందరూ పాజ్‌లో(ఆగిపోయి) ఉన్నప్పుడు కాజల్ భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చారు. తల్లిని చూడగానే కాజల్ కూతురు గుక్కపెట్టి ఏడ్చింది. కాజల్‌ను రిలీజ్ అని చెప్పగానే ఆమె తన ఫ్యామిలీని పట్టుకుని ఎమోషనల్ అయింది. భర్తపై ముద్దుల వర్షం కురిపించింది. నువ్వు ఇక్కడివరకు వస్తావనుకోలేదని కూతురు అనడంతో కాజల్ నవ్వేసింది. కనీసం టాప్ 5కి చేరుకున్నా సంతోషమే అని చెప్పింది. మమ్మీనెవరైనా నామినేట్ చేస్తే కోపమొస్తదా? అని శ్రీరామ్ అడగ్గా కాజల్ కూతురు అవునని తలూపింది. రవి, శ్రీరామ్‌ను రెండుసార్లు, యానీ మాస్టర్నైతే లెక్కలేనన్నిసార్లు తిట్టుకున్నానంది. యానీ మాస్టర్ ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉన్నానంటూనే జస్ట్ జోక్ చేశానని కవర్ చేసింది. ఈ సీన్‌తో షణ్నుకు తన ఫ్యూచర్ గురించి టెన్షన్ పట్టుకుంది. తనకోసం ఎవరు వస్తారో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. అయ్యా, నమస్కారం, ఎవరిని పంపిస్తున్నారో చెప్తే నేను ముందుగానే ప్రిపేర్ అవుతానంటూ కెమెరాకు విన్నవించాడు. -
ఇట్స్ ఫ్యామిలీ టైమ్: కూతుర్ని హత్తుకుని ఏడ్చేసిన కాజల్
Bigg Boss 5 Telugu Promo: నామినేషన్స్‌లో గొడవలతో దద్దరిల్లిపోయిన బిగ్‌బాస్ హౌస్‌లో నేడు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకోనున్నాయి. ప్రతి సీజన్లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించాడు బిగ్‌బాస్. గతేడాది కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల గాజు అద్దంలో నుంచే చూసి మాట్లాడేలా షరతులు విధించారు. కానీ ఈసారి వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో హౌస్మేట్స్ కుటుంబ సభ్యులను మూడు రోజులపాటు క్వారంటైన్లో ఉంచి నేరుగా ఇంట్లోకి పంపించారు. బీబీ ఎక్స్‌ప్రెస్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్లను కదలకుండా ఆగుమన్న సమయంలో వారి కుటుంబ సభ్యులను లోనికి పంపించి సర్ప్రైజ్ చేశాడు బిగ్‌బాస్. ఈక్రమంలో నేడు కాజల్ భర్త, కూతురు ఇంట్లో అడుగుపెట్టారు. వారిని చూడగానే కాజల్ ఎమోషనల్ అయింది. తల్లీకూతుళ్లు ఒకరినొకరు హత్తుకుని ఏడ్చారు. ఇక కాజల్ గురించి ఆమె భర్త మాట్లాడుతూ.. ఎవరెక్కడ ఏం మాట్లాడినా మా ఆవిడ గొంతు వినిపిస్తుంటుందని చెప్పాడు. 'మీ మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే కోపమొస్తుందా?' అని శ్రీరామ్ అడగ్గా అందుకు కాజల్ కూతురు అవునంటూ పవన్ కల్యాణ్ స్టైల్లో ఆన్సరిచ్చింది. తర్వాత శ్రీరామ్ కోసం ఆమె సోదరిని పంపించినట్లు తెలుస్తోంది. షణ్ముఖ్ తనకోసం ఎవరిని పంపిస్తున్నారో ముందే చెప్తే తన మైండ్‌ను ప్రిపేర్ చేసుకుంటానని కెమెరాకు విన్నవించాడు. అయితే నెట్టింట వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి షణ్ను కోసం ఆమె తల్లి హౌస్‌లోకి వస్తుండగా వీకెండ్ ఎపిసోడ్లో దీప్తి సునయనను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట! మరి ఇది నిజమేనా? ఇందులో ఏదైనా ట్విస్టు ఉంటుందా? అన్నది చూడాలి! -
బిగ్‌బాస్-5: శ్రీరామ్ పిచ్చి ప్రశ్నలు.. బాత్రూమ్లో వెక్కివెక్కి ఏడ్చిన కాజల్
Bigg Boss 5 Telugu 12 Week Captaincy Contender Task: బిగ్‌బాస్ ఐదో సీజన్లో చివరి కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. దీనిలో భాగంగా ఇంటి సభ్యులకు ‘నియంత మాటే శాసనం’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో నియంత సింహాసనం ఏర్పాటు చేశారు. సైరన్ మోగిన ప్రతిసారి ఆ సింహాసనంలో ఎవరైతే ముందుగా కూర్చుంటారో వాళ్లు ఆ రౌండ్ ముగిసేవరకు నియంతలా వ్యవహరిస్తారు. అంతేకాదు ఆ రౌండ్ వరకు వాళ్లు సేఫ్ అవుతారు కూడా. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకోవడానికి ఓ చాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరి ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్ చేసే అవకాశం నియంత కుర్చిలో కూర్చున్న వ్యక్తికి ఉంటుంది. సన్నీకి హ్యాండిచ్చిన సిరి తొలి రౌండ్లో నియంత సింహాసనాన్ని సిరి దక్కించుకుంది. దీంతో నియంత సిరిని మినహాయించి మిగిలిన ఇంటి సభ్యులకు ఒక చాలెంజ్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. గార్డెన్ ఏరియాలో హుక్స్‌కి వేలాదదీయబడిన క్యాప్‌లను చేతితో తాకకుండా తలకు ధరించి.. పక్కనే ఉన్న హుక్స్‌కి పెట్టాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో రవి, సన్నీలు మాత్రమే చివరి రెండు స్థానాల్లో నిలిచి నియంత దగ్గరకు వెళ్లి తమ వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న సిరి.. అందరు ఊహించినట్లే సన్నీని తొలగించి రవిని సేవ్ చేసింది. దీంతో బాగా హర్ట్ అయిన సన్నీ.. ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నారని, ఫస్ట్ రౌండ్లోనే డిస్ క్వాలిఫై అయినందుకు బాధగా ఉందని షణ్ముఖ్ దగ్గర వాపోయాడు. బాత్రూమ్లో వెక్కివెక్కి ఏడ్చిన కాజల్ ఇక రెండో రౌండ్లో నియంత సింహాసనాన్ని శ్రీరామ్ చేజిక్కించుకున్నాడు. దీంతో మిగిలిన ఆరుగురికి మరో చాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. కాళ్లకి చెప్పులు ధరించి ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో అతికించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఎత్తులో ఆ చెప్పుల్ని అతికిస్తారో వాళ్లు సేవ్ అవుతారని.. తక్కువ ఎత్తులో చెప్పుల్ని అతికించిన చివరి ఇద్దరి సభ్యులు నియంతని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో మానస్ అందరికంటే ఎత్తులు చెప్పులు అతికించగా.. రవి, కాజల్ తక్కువ ఎత్తులు చెప్పులు అతికించి నియంత శ్రీరామ్‌ని ఎదుర్కొన్నారు. అయితే నియంతగా ఉన్న శ్రీరామ్ కాజల్‌ని నెక్స్ట్ రౌండ్‌కి పంపడానికి ఇష్టపడలేదు. ‘నేను ఇంతవరకు కెప్టెన్ కాలేదు. ఇదే నాకు చివరి చాన్స్.. ఇప్పుడు నేను కెప్టెన్ కావాలనుకుంటున్నా’అని రిక్వెస్ట్ చేసినప్పటికీ... ఆమెను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి డిస్క్వాలిపై చేశాడు. దీంతో బాగా హర్ట్ అయిన కాజల్.. ‘ఈ తొక్కలో డిస్కషన్స్ ఎందుకు రవికి ఇస్తానని ముందే చెప్పొచ్చుగా’అంటూ శ్రీరామ్‌పై సీరియస్ అయింది. కెప్టెన్ అయ్యే చివరి అవకాశం లేకుండా పోయిదంటూ.. బాత్ రూంలోకి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చింది. ప్రియాంక వెళ్లి ఆమెను ఓదార్చింది. ఇక మూడో రౌండ్లో రవి నియంత సింహాసనాన్ని దక్కించుకున్నాడు. మిగిలిన ఇంటిన సభ్యులకు ఆరెంజ్ టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా తలపై ఆరెంజ్‌లను పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి కొంచెం దూరంలో ఉన్న బుట్టలో వేయాలి. ఈ టాస్క్‌లో మానస్, షణ్ముఖ్ చివరి స్థానాల్లో నిలిచి నియంత రవిని ఎదుర్కొన్నారు. ఇరు వాదనలు విన్న రవి.. అందరు ఊహించినట్లే షణ్ముఖ్‌ని సేవ్ చేశాడు. నాలుగో రౌండ్లో ప్రియాంక నియంత సింహాసనాన్ని దక్కించుకుంది. మిగిలిన ఇంటి సభ్యులకు వాటర్ డ్రమ్స్ టాస్క్ ఇచ్చారు. ఈ చాలెంజ్‌లో షణ్ముఖ్, శ్రీరామ్‌లు చివరి రెండు స్థానాల్లో నిలిచి నియంతను ఎదుర్కొన్నారు. ఇక్కడ ప్రియాంక చాలా తెలివిగా వ్యవహరించి శ్రీరామ్‌ని డిస్ క్వాలిఫై చేసింది. శ్రీరామ్ కూడా కెప్టెన్సీ టాస్క్ నుంచి వైదొలగడంతో కాజల్ పండగ చేసుకుంది. ఐదో రౌండ్లో భాగంగా.. నియంత సింహాసనంపై ఒకేసారి సిరి, ప్రియాంక కూర్చున్నారు. అయితే సిరి కంటే ముందుగా ప్రియాంకే కుర్చుదంటూ.. సిరిని కాదని పింకీకే అవకాశం ఇచ్చాడు. దీంతో సిరి చాలా ఎమోషనల్ అయింది. ఫస్ట్ నేనే కూర్చున్న వాళ్లు అబద్దాలు చెబుతున్నారంటే ఏడ్చేసింది. ఇలాంటి చిన్న చిన్న వాటికి ఏడుస్తారా? గేమ్ ఆడు.. నువ్ ఇంత వీక్ అయితే నా ఫ్రెండ్‌గా ఉండకు అని చెబుతూ సిరిని హెచ్చరించాడు షణ్ణ్ముఖ్. ప్రియాంకను గెలిపించాలని ఉంటే గెలిపించుకోండి కానీ.. అన్ ఫెయిర్ గేమ్ ఆడొద్దని వార్నింగ్ ఇచ్చింది సిరి. మరి బిగ్‌బాస్ హౌస్‌లో చివరి కెప్టెన్ ఎవరు అయ్యారో బుధవారం నాటి ఎపిసోడ్లో తెలుస్తుంది. -
బిగ్‌బాస్: నియంతలా శ్రీరామ్.. కెప్టెన్ అయ్యే అర్హత కాజల్‌కు లేదా?
బిగ్‌బాస్ ఐదో సీజన్లో 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ అలా ముగిసిందో లేదో.. ఇంతలోనే ‘కెప్టెన్సీ టాస్క్’ అంటూ ఇంటి సభ్యుల మధ్య మరో చిచ్చు పెట్టాడు బిగ్‌బాస్. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ చాలా ఆసక్తి కనబర్చుతున్నారు. దీని కోసం ‘నియంత మాటే శాసనం’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక నియంత సింహాసనం ఉంటుంది. అందులో ఎవరైతే ముందుగా కూర్చుంటారో వాళ్లు ఆ రౌండ్ ముగిసేవరకు నియంతలా వ్యవహరిస్తారు. అంతేకాదు ఆ రౌండ్ వరకు వాళ్లు సేఫ్ అవుతారు కూడా. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకోవడానికి ఓ చాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరి ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్ చేసే అవకాశం నియంత కుర్చిలో కూర్చున్న వ్యక్తికి ఉంటుంది. ఈ టాస్క్‌లో ముందుగా సిరి నియంత సింహాసనం ఎక్కి..‘ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. అమ్మాయిలు వాట్ టు డు.. వాట్ నాట్ టు డు’అంటూ హౌస్‌మేట్స్‌ని నవ్వించింది. ఇక నామినేషన్స్ ప్రక్రియలో మొదలైన గొడవను కెప్టెన్సీ టాస్క్‌లోనూ కంటిన్యూ చేశారు కాజల్, శ్రీరామ్. చాలెంజ్‌లో ఓడిన కాజల్, రవిలలో ఒకరిని సేవ్ చేసే చాన్స్ శ్రీరామ్‌కు వచ్చింది. ‘నేను కెప్టెన్ కావాలనుకుంటున్నా’అని కాజల్ అడగ్గా, ‘నువ్వు రెండు ఫొటోలు కాల్చేశావు కదా! నువ్వు కెప్టెన్ అయితే ఏం చేసేదానివి’ అని శ్రీరామ్ ప్రశ్నించారు. కెప్టెన్ అయితే ఫెరింజన్లో కూర్చును’అని సమాధానం చెప్పింది కాజల్. ఆమె సమాధానానికి సంతృప్తి చెందని శ్రీరామ్..అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే కెప్టెన్ బ్యాండ్ వేసుకోవాలి అంటూ రవిని సేవ్ చేశాడు. మరి ఈ టాస్క్‌లో గెలిచి కెప్టెన్ అయిందెవరో తెలియాలంటే.. ఆ వారం ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఒకరు చచ్చిపోతుంటే కూడా కాజల్‌కు అదే కావాలి: యానీ
Bigg Boss Telugu 5, Anee Master Bigg Boss Buzz Video: బిగ్‌బాస్ హౌస్‌లో 11 వారాల జర్నీకి ఫుల్స్టాప్ పెట్టింది యానీ మాస్టర్. ఆమెను మరికొద్ది రోజులు హౌస్‌లో ఉంచేందుకు ప్రేక్షకులు విముఖత చూపించడంతో షో నుంచి ఎలిమినేట్ అయింది. భారంగా బిగ్‌బాస్ హౌస్‌కు వీడ్కోలు పలికింది. బయటకు వచ్చిన వెంటనే అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. అరియానాకిచ్చిన ఇంటర్వ్యూలో హౌస్మేట్స్ గురించి యానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సిరి షణ్నుతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందటగా అని అరియానా అడగ్గా.. వాళ్లను చూసి అయ్యబాబోయ్ ఏంటీ హగ్గులు, మాకు హగ్గులు దొరకవా అనుకునేవాళ్లమని చెప్పింది యానీ. కాజల్ గురించి చెప్తూ.. ఒకరు చచ్చిపోతుంటే కూడా ముందు నీ స్ట్రాటజీ ఏంటో చెప్పంటూ గుచ్చిగుచ్చి అడుగుతుందని కామెంట్ చేసింది. హౌస్‌లో ఇప్పటికీ నటిస్తున్నవాళ్లు ఉన్నారని, కానీ వాళ్ల పేర్లు మాత్రం బయటకు చెప్పనని దాగుడు మూతలు ఆడింది. శ్రీరామ్ నాలుగో వారం నుంచే తనకు సపోర్ట్‌గా ఉన్నాడని, కానీ ఆ విషయం తనకు తెలియలేదంటూ ఎమోషనల్ అయింది. యానీ మాస్టర్ కన్నింగ్, ఫాల్తూ గేమ్ ఆడుతుందంటూ ఉమాదేవి మాట్లాడిన వీడియో చూపించడంతో ఆమె కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ బజ్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
కాజల్‌పై భగ్గుమన్న శ్రీరామ్, దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన సన్నీ
Bigg Boss 5 Telugu, 12th Week Nominations: బిగ్‌బాస్ కథ కంచికి చేరుకుంటోంది. 19 మందితో మొదలైన బిగ్‌బాస్ ప్రయాణంలో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరంతా ఎవరికి వారు టాప్ 5కి చేరుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే తమలో నుంచి ఒకరిని పంపించే నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈమేరకు తాజా ప్రోమో రిలీజైంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో సన్నీని గెలిపించడం కోసం సిరి, యానీ ఇద్దరి ఫొటోలు కాల్చేసిన కాజల్‌పై భగ్గుమని లేచాడు శ్రీరామ్. అందరూ ఒకరిని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఆడితే నువ్వు మాత్రం ఇద్దరిని గేమ్ నుంచి సైడ్ చేయాలని ఆడావు. అది నాకు నచ్చలేదని చెప్తూ కాజల్‌ను నామినేట్ చేశాడు. దీనికి కాజల్ స్పందిస్తూ.. నా ఫ్రెండ్‌ను సేవ్ చేసి అతడికి పాస్ వచ్చేలా చేయడమే నాక్కావాల్సింది అని తేల్చి చెప్పింది. ఆమె సమాధానం నచ్చని శ్రీరామ్.. నీ ఫ్రెండ్ వెళ్లిపోతాడని భయమా? అని ప్రశ్నించాడు. తర్వాత సన్నీతోనూ పోట్లాటకు దిగాడు. సిరి, షణ్ను, రవి, నేను ఒక గ్రూప్ అని ఒప్పుకున్నాడు. అంతెందుకు, నేను, ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక గ్రూప్.. ఇప్పుడు చెప్పు అని శ్రీరామ్ డైలాగ్ విసరగా.. 'ఆ గ్రూపుకు నేను లీడర్‌ను' అంటూ దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు సన్నీ. ఇదిలా వుంటే కెప్టెన్ మానస్ మినహా మిగతా అందరూ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం! -
సన్నీ-కాజల్ రిలేషన్‌పై నోరు జారిన సుదర్శన్.. వీడియోతో క్లారిటీ
Comedian Sudharshan Says Sorry To Sunny And Kajal Fans: బిగ్‌బాస్ రియాలిటీ షోలో వీకెండ్ ఎపిసోడ్స్ మరింత స్పెషల్‌గా ఉంటాయన్నది తెలిసిందే. సండే(నవంబర్21)ఫండేగా సాగిన ఎపిసోడ్లో 'అనుభవించు రాజా' టీం సందడి చేసింది. హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, కౌశిష్, నటుడు నెల్లూరు సుదర్శన్ కాసేపు హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్ చేసి అందరినీ సరదాగా నవ్వించారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా కాజల్-సన్నీల రిలేషన్‌ను తప్పుబడుతూ సుదర్శన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి గేమ్‌పై అప్పటివరకు సరదాగా పంచులేసిన సుదర్శన్..'చివర్లో కాజల్ మీరు అలిగినప్పుడు చాలా బాగుంటుంది. సన్నీ వచ్చి ఓదార్చడం..అదో టైప్ రొమాన్స్ బాగుంది'.. అంటూ నోరుజారాడు. దీంతో షాక్ అయిన సన్నీ.. మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే సన్నీ-కాజల్‌ల రిలేషన్‌పై తప్పుగా మాట్లాడినందుకు కమెడియన్ సుదర్శన్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఫ్రెండ్స్‌లా ఉన్న వాళ్లు మీకు రొమాన్స్ చేస్తూ ఎప్పుడు కనిపించారు? అయినా సినిమా ప్రమోషన్స్‌కి వచ్చి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం సన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న సుదర్శన్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. 'మేం చాలా మాట్లాడుకున్నాం. కానీ ఎడిటింగ్ వల్ల కేవలం 5నిమిషాలే చూపించారు. కాజల్-సన్నీ రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. బయటకు వచ్చిన వీడియో వల్ల నెగిటివ్‌గా అనుకుంటున్నారు. సన్నీ ఫ్యాన్స్, కాజల్ ఫ్యామిలీకి క్షమాపణలు చెబుతున్నా' అంటూ వీడియో రిలీజ్ చేశాడు సుదర్శన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
'ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడు!'
Bigg Boss 5 Telugu, Task For Eviction Free Pass: బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, ప్రియాంక సింగ్, యానీ, మానస్ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. రింగ్ ఈజ్ కింగ్ టాస్క్‌లో ఎవరు రింగ్‌ను చివరి వరకు పట్టుకుంటారో వాళ్లే కెప్టెన్‌గా నిలుస్తారు. ఈ గేమ్‌లో మానస్ గెలిచి విజేతగా అవతరించాడు. కెప్టెన్ మానస్ కాజల్‌కు సారీ చెప్పి ఆమెతో గొడవలకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టాడు. 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా' టాస్క్‌లో మీ ఫొటో కాలకుండా చూసుకోవాలని, చివరి వరకు ఎవరి ఫొటో కాలకుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు ఈ పాస్ దక్కుతుందని ప్రకటించాడు. అయితే తనకెందుకో ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడనిపిస్తోందని రవి జోస్యం చెప్పాడు. ఒకవేళ ఎవిక్షన్ పాస్ గెలిచినా కూడా సన్నీ దాన్ని వాడుకోడని అభిప్రాయపడ్డాడు. తర్వాత టాస్క్‌లో భాగంగా ఫైర్ ఇంజన్ అలారమ్ మోగగా రవి, షణ్ముఖ్ మొదట ట్రక్ ఎక్కారు. వీరికి మానస్, శ్రీరామ్ ఫొటోలు వచ్చాయి. షణ్ను సేవ్ చేసే అవకాశం మానస్కిద్దామంటే రవి మాత్రం శ్రీరామ్‌కే ఇద్దామని ఒప్పించాడు. అలా మానస్ ఫొటో మంటల్లో కాలిపోయింది. నెక్స్ట్ రౌండ్లో సన్నీ, మానస్ ట్రక్ ఎక్కారు. వీరి ఎదుట రవి, యానీ మాస్టర్ ఫొటోలు రాగా.. ఏకాభిప్రాయంతో రవి ఫొటోను కాల్చేశారు. షణ్ను, సిరిలు ట్రక్ ఎక్కగా వారు పింకీని కాకుండా సన్నీని సేవ్ చేశారు. తర్వాత యానీ, శ్రీరామ్‌ల వంతు రాగా జనాల ఓటింగే నాకు ముఖ్యం, ఈ పాస్ అవసరం లేదన్నాడు షణ్ను. ఆడియన్స్ సపోర్ట్‌తోనే ఇక్కడిదాకా వచ్చాను, వారి డెసిషన్‌తోనే వెళ్లిపోవాలని ఉందని చెప్పుకొచ్చింది సిరి. వీళ్లిద్దరూ తమకీ పాస్ అవసరం లేదని చెప్పినప్పటికీ యానీ, శ్రీరామ్ ఆలోచించుకుని సిరిని సేవ్ చేశారు. దీంతో ఆమె సంతోషంతో షణ్నును హత్తుకుని అతడికి ఐ లవ్యూ చెప్పింది. ప్రియాంక, కాజల్.. శ్రీరామ్, సిరిలలో నుంచి సిరిని సేవ్ చేశారు. యానీ, ప్రియాంకలకు సన్నీ, కాజల్ ఫొటోలు వచ్చాయి. యానీ.. ఆ రెండు ఫొటోలు కాల్చేద్దామని చెప్పింది. కానీ పింకీ అది తప్పని వారించడంతో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి కాజల్ ఫొటోను కాల్చేసి సన్నీని సేవ్ చేశారు. తర్వాత అలారమ్ మోగినప్పుడు ట్రక్‌లో కూర్చున్న మానస్, కాజల్‌లకు యానీ, సిరి ఫొటోలు వచ్చాయి. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇద్దరూ కాలిపోతే సన్నీ గేమ్‌లో ఉంటాడని కాజల్ అభిప్రాయపడింది. తన ఫొటోను కాల్చేస్తారని భయపడిపోయిన యానీకి కోపం కట్టలు తెంచుకుంది. తనకు పాస్ దక్కుండా చేస్తున్నారని మండిపడిపోయింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకైతే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సన్నీకి దక్కినట్లు సమాచారం! -
బిగ్‌బాస్: స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన బిగ్‌బాస్.. గెలుపెవరిది?
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ స్నేహితుల మధ్య చిచ్చుపెట్టింది. హౌస్‌లో మంచి స్నేహితులుగా ఉన్న మానస్-సన్నీ మధ్య విభేదాలు వచ్చినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా బెలూన్స్ పలగగొట్టే గేమ్‌లో ప్రియాంక, మానస్‌లో పోటీపడ్డారు. ఈ గేమ్‌లో మానస్ గెలిచి సన్నీతో పోటీ పడ్డాడు. స్విమ్మింగ్‌పూల్-టీషర్ట్ గేమ్‌లో మానస్, సన్నీ హోరా హోరీగా పోటీపడ్డారు. టీషర్ట్ ధరించి పూల్‌లోకి దూలి అవతలి వైపు వెళ్లాలి. అక్కడ టీషర్ట్ ధరించి మళ్లీ వెనక్కి రావాలి. ఇలా ఎక్కువ టీషర్ట్స్ ఎవరు ధరిస్తారో వారే విజేతలు. ఈ గేమ్‌లో సన్నీ ఇంటి సభ్యులపై ఫైర్ అయ్యాడు. తాను ధరించిన టీ షర్ట్‌కి లెబుల్ లేదంటూ రవిపై సీరియస్ అయ్యాడు. తనకు ఆడాలనే ఉత్సాహం కూడా లేదంటూ ఇంట్లోకి వెళ్లిపోయాడు. ‘గేమ్ ఆడే హడావుడిలో కూడా లెబుల్ ఉన్న టీషర్ట్‌నే ఎంచుకోవాలి. అదే గేమ్’అని కాజల్ చెప్పినప్పటికీ.. సన్నీ వినలేదు. ‘ప్రతిసారీ మీరే విజయం సాధించాలనుకుంటున్నారు. కాబట్టి మీరే ఆడుకోండి’అంటూ కాజల్, మానస్‌లపై పైర్ అయ్యాడు. మరి ఈ గేమ్‌లో ఎవరు విజయం సాధించారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఆ రోజు నేను కాజల్ కాళ్లు మొక్కుతాను: యానీ మాస్టర్
Bigg Boss Telugu 5, Episode 72, 11th Week Nominations List: బుల్లితెర ప్రియుల ఫేవరెట్ షో బిగ్‌బాస్ చూస్తుండగానే 11వ వారంలోకి ప్రవేశించింది. 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం 9 మంది మాత్రమే మిగిలారు. మరి వీరిలో ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారు? నామినేషన్ ప్రక్రియ ఎలా సాగింది అన్న వివరాలు నేటి(నవంబర్ 15) ఎపిసోడ్లో చదివేద్దాం.. జెస్సీ వెళ్లిపోయినప్పుడు నాకే ఏడుపు రాలేదు, వీళ్లకెలా వస్తుంది? ఎందుకు డ్రామాలు ఆడుతున్నారని హౌస్‌మేట్స్‌ను విమర్శించాడు షణ్ముఖ్. అసలు వీళ్లు నిజంగానే ఏడ్చారా? అని అనుమానం వ్యక్తం చేశాడు. మరోపక్క కాజల్.. జెస్సీ వార్నింగ్‌తో అయోమయంలో పడిపోయింది. నీ ఫ్రెండ్స్ నిన్ను వాడుకుంటున్నారని, వారు నిన్ను నమ్మడం లేదని జెస్సీ చేసిన వ్యాఖ్యల్లో ఎంత మేర నిజం ఉందో తెలుసుకోవాలనుకుంది. గత వారం నామినేషన్స్‌లో మిమ్మల్ని సేవ్ చేయనందుకు నాపై నమ్మకం సన్నగిల్లిందా? అని సన్నీ, మానస్‌లను నిలదీసింది. అందుకు మానస్.. గేమ్‌లో నిన్ను నమ్మం కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం నిన్ను ఎన్నడూ తక్కువ చేసి చూడమని క్లారిటీ ఇచ్చాడు. ఇక రవి.. సన్నీ ఇంతవరకు సిరి, షణ్నుకు సారీ చెప్పలేదని యానీతో గుసగుసలాడాడు. గిల్టీ బోర్డును మెడలో వేసుకున్న సన్నీ హౌస్మేట్స్ గురించి మానస్, కాజల్‌తో మాట్లాడాడు. యానీ మాస్టర్ అనకొండ, సిరి కట్లపాము, షణ్ముఖ్ నల్లతాచు అని పేర్లు పెట్టాడు. రవికి మాత్రం నటరాజ్ మాస్టర్ ఇచ్చిన గుంటనక్కే సరిగ్గా సరిపోతుందన్నాడు. తాను మంకీ లేదా చింపాంజీనని చెప్పుకొచ్చాడు. తర్వాత 11వ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల తలపై బాటిల్లోని ద్రవాన్ని పోయాలని ఆదేశించాడు. సన్నీ మెడలో గిల్టీ ట్యాగ్‌ను తొలగించడంతో ఈ ప్రక్రియ మొదలైంది. మొదటగా కెప్టెన్ రవి.. తనను ఫేక్ అనడం నచ్చలేదంటూ సన్నీని, సన్నీని రెచ్చగొట్టిందంటూ కాజల్‌ను నామినేట్ చేశాడు. షణ్ముఖ్.. కాజల్ ఇంటి నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గిపోతాయని ఆశిస్తున్నానంటూ ఆమెను నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంక సింగ్‌పై బాటిల్లోని ద్రవాన్ని పోశాడు. మానస్.. షణ్ను, యానీ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. శ్రీరామ్.. మానస్, సన్నీని నామినేట్ చేశాడు. కాజల్ మాట్లాడుతూ.. నేను ఎంత ట్రై చేసినా కనెక్ట్ కావట్లేదని, పైగా వెక్కిరించడం అస్సలు నచ్చలేదంటూ యానీని నామినేట్ చేసింది. దీంతో పిచ్చెక్కిపోయిన యానీ కుప్పిగెంతులేసి ఆమె సహనాన్ని పరీక్షించింది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గిపోతాయనుకోవడం నచ్చలేదని షణ్నును సైతం నామినేషన్లోకి పంపించింది. సిరి.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో ప్రియాంక సింగ్ తనకు సపోర్ట్ చేయలేదని, మానస్ గేమ్ కూడా తానే ఆడుతోందంటూ నామినేట్ చేసింది. సిల్లీ రీజన్స్ ఇవ్వకంటూ కాజల్ తలపై బాటిల్లోని ద్రవాన్ని గుమ్మరించింది. తర్వాత ప్రియాంక సింగ్.. సిరి, షణ్ముఖ్‌లను నామినేట్ చేసింది. సన్నీ.. శ్రీరామ్‌ను నామినేట్ చేసే సమయంలో వీళ్లిద్దరూ గొడవపడ్డారు. శ్రీరామ్‌తో పాటు సిరిని నామినేట్ చేశాడు. అనంతరం యానీ వంతు రాగా.. నేను మా ఫ్యామిలీని మిస్ అవుతున్నానని హగ్ చేశాను. కానీ హగ్ పాయింట్‌ను ఇలా బయటకు తీసుకువచ్చి నామినేట్ చేయడం నచ్చలేదంటూ మానస్ తలపై బాటిల్ గుమ్మరించింది. ఆ తర్వాత కాజల్‌ను నామినేట్ చేస్తూ వెక్కిరించింది. ఇలా వెక్కిరించడాన్నే అగౌరవపర్చడం అంటారని కాజల్ అంది. దీంతో యానీ.. వెక్కిరించడం అంటే అవమానించడం అని ఏ ఒక్కరితో అనిపించినా ఆ రోజు నేను నీ కాళ్లు మొక్కుతాను, అది కూడా సాష్టాంగ నమస్కారం చేస్తానని శపథం చేసింది. మొత్తంగా 11 వారం కెప్టెన్ రవి మినహా మిగతా 8 మంది నామినేషన్లో ఉన్నారు. -
బిగ్‌బాస్: నామినేషన్స్ రచ్చ.. యానీ వెకిలి నవ్వులు.. కాజల్ ఫైర్
బిగ్‌బాస్ ఐదో సీజన్ పదివారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని 11వ వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్‌లో 9 మంది ఉన్నారు. ఇక నుంచి గేమ్ మరింత రసవత్తరంగా మారనుంది. ప్రతి చిన్న అంశం.. ఎలిమినేషన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇంటి సభ్యులు ఆచి, తూచి ఆటను ఆడుతున్నారు. ఇంట్లో ఉన్న తొమ్మిది మందికి 11వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ‘అందరికీ మనసులో ఉన్న నిజాలు బయటపెట్టే ధైర్యం ఉండదు. నిజాలను నిర్భయంగా నిలదీసే అవకాశమే ఈరోజు జరిగే నామినేషన్’అంటూ ఇంటి సభ్యులను రెచ్చగొట్టాడు బిగ్‌బాస్. ఏ వ్యక్తినైనా నామినేట్ చేస్తే.. అందుకు గల కారణాలను ధైర్యంగా చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో.. ఇంటి సభ్యులు తమలో దాగిఉన్న కోపాన్ని బయటపెట్టారు. ముఖ్యంగా సన్నీని టార్గెట్ చేసినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలు చూస్తే అర్థమవుతుంది. నిన్నటి ఎపిసోడ్లో తనకు ఫేక్ ట్యాగ్ ఇచ్చిన సన్నీని నామినేట్ చేశాడు రవి. ‘నీ తప్పు నీకు చెబితే.. నేను ఎలా ఫేక్ అనిపించానో నాకు అర్థం కాలేదు’అని రవి అడగ్గా.. ‘అందరి ముందు నాది బ్యాడ్ బిహేవియర్ అని చెప్పడాన్ని తీసుకోలేకపోయాను. నా గురించి నువ్వు మాట్లాడటం నాకు నచ్చలేదు. అందుకే ఫేక్ అన్నాను. అయినా అది నా అభిప్రాయం. దాన్ని ఎవ్వరూ మార్చలేరు’అని సన్నీ బదులు ఇచ్చాడు. షణ్ముఖ్.. కాజల్‌ని నామినేట్ చేస్తూ... తన వల్లే ఇంటి సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయని, ఆమె బయటకు వెళ్లే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీన్ని కాజల్ తిప్పికొట్టింది.తన వల్ల ఇంట్లో ఒక్క గొడవ కూడా కాలేదని బదులు ఇస్తుండగా , యానీ మాస్టర్ వెకిలి నవ్వులు నవ్వింది. మరి ఈ వారం నామినేషన్లో ఎవరు ఉన్నారు? ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? నామినేషన్ రచ్చ ఎలా ఉందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
నిన్ను వాడుకుంటున్నారు, జాగ్రత్త: జెస్సీ హెచ్చరిక
Bigg Boss 5 Telugu, 10th Week Jessie Eliminated: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో! అదృష్టం బాగుండి నామినేషన్లో లేకపోయినా అనారోగ్యం వెంటాడటంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోక తప్పలేదు. సీక్రెట్ రూమ్‌లో పెడితే తనను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోనని వేయి కళ్లతో ఎదురు చూసిన జెస్సీ ఆశలు అడియాశలే అయ్యాయి. బిగ్‌బాస్ హౌస్‌లో నీ జర్నీ పూర్తైందని పంపించివేశారు. అయితే వెళ్లిపోయేముందు జెస్సీ కంటెస్టెంట్లకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడు. ల్యాండ్‌ఫోన్ ద్వారా ఒక్కొక్కరితో పర్సనల్‌గా మాట్లాడే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ముందుగా జెస్సీ.. సన్నీతో మాట్లాడుతూ.. 'జాగ్రత్తగా ఉండు, టెంపర్ లూజ్ అవకు. ఒక్కడిగా గేమ్ ఆడితే ఇండివిడ్యువల్ హీరో అవుతావు, లేదంటే కమెడియన్ అవుతావు' అని ఒకరకంగా వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత మానస్‌తో మాట్లాడుతూ.. 'నువ్వు సైలెంట్ కిల్లర్. రవికే బాబువి నువ్వు, ఒప్పుకోవు కానీ ఇదే నిజం. నీ ఐడియాస్ బాగున్నాయ్ కానీ అందరినీ నెగెటివ్‌గా చూడకు' అని సూచించాడు. కాజల్‌తో.. 'నీ గేమ్ ఏమైంది? నువ్వు పక్కవాళ్లను హైలైట్ చేయడానికి రాలేదు. నీ ఫ్రెండ్స్ నీకు వాల్యూ ఇస్తున్నారనుకుంటున్నావు, కానీ ఇవ్వట్లేదు. నిన్ను వాడుకుంటున్నారు అది తెలుసుకో' అని హెచ్చరించాడు. యానీ మాస్టర్ గేమ్ బాగుందన్న జెస్సీ ప్రియాంక సింగ్‌ను త్యాగాలు ఆపేయమని హితవు పలికాడు. నీ గేమ్ ఇదేనా? అని నిలదీశాడు. 'తర్వాత సీజన్లో వచ్చేవాళ్లు నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, అంతేకానీ అబ్బో, అది 10 వారాలు ఎలా ఉంది? అని చులకనచేయొద్దు' అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. దేనిలో ఇన్వాల్వ్ అవని శ్రీరామ్ టాప్ 5లో ఉంటాడని అభిప్రాయపడ్డాడు. రవితో ఫోన్లో ముచ్చటిస్తూ.. ఇన్ఫ్లూయెన్స్ చేసినా కానీ నీ గేమ్ బాగుంటుంది. ఫైనల్లో కలుస్తానని చెప్పాడు. తర్వాత సిరితో మాట్లాడుతూనే తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక పక్క తంతానంటూనే మరోపక్క నీ ఫైటింగ్ బాగుందని మెచ్చుకున్నాడు. కానీ నీ గేమ్ నువ్వు ఆడమని హెచ్చరించాడు. తర్వాత కిస్సులు లేవా? అని అడడగడంతో గాల్లోనే ముద్దులు పంపింది సిరి. చివర్లో వచ్చేవారమే బయటకు వచ్చేయకు, ఫైనల్‌దాకా అక్కడే ఉండమని చెప్పాడు. షణ్ముఖ్‌తో మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు జెస్సీ. 'హౌస్‌లో ఉన్న చివరి రోజుల్లో నీతో ఉండలేకపోయానన్నదే నా బాధ. నేను ఎప్పటికీ నీ సీక్రెట్ ఫ్రెండ్‌నే' అన్నాడు. ఇక షణ్ను మాట్లాడుతూ.. 'నువ్వు ఫస్ట్ వీక్‌లోనే వెళ్లిపోతావనుకున్నారు, కానీ పదో వారంలో ఒకరికి లైఫ్ ఇచ్చి వెళ్లిపోతున్నావ్.. అదిరా నా జెస్సీ' అని పొగిడేయడంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఈ ఫోన్ సంభాషణల్లో జెస్సీ.. సిరి, షణ్ను, శ్రీరామ్, రవి టాప్ 5లో ఉంటారని చెప్పకనే చెప్పాడు. తర్వాత జెస్సీ భారమైన హృదయంతో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు. -
ఒకరికి లైఫ్ ఇచ్చి మరీ వెళ్లిపోయిన జెస్సీ
Bigg Boss Telugu 5, Episode 71, Jessie Exit From Show: బిగ్‌బాస్ షో ద్వారా గంగవ్వ కొత్తింటి కల నెరవేరిందన్న శుభవార్తను హౌస్‌మేట్స్‌కు తెలియజేశాడు నాగార్జున. గంగవ్వ ఇంటిని వీడియో ద్వారా హౌస్‌మేట్స్‌కు చూపించాడు. తర్వాత ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించి గేమ్స్ ఆడించాడు. టీమ్ Aలో షణ్ముఖ్, యానీ, ప్రియాంక, సన్నీ ఉండగా మిగిలినవారంతో టీమ్ Bలో ఉన్నారు. మానస్ సంచాలకుడిగా వ్యవహరించాడు. మొదటి గేమ్‌లో కంటెస్టెంట్లు డ్యాన్స్ చేస్తున్న క్రమంలో నాగార్జున ఫైర్, ఐస్, వాటర్ అని పలికినప్పుడు ఆయా బోర్డుల దగ్గరకు పరిగెత్తుకెళ్లాలి. చివరగా బోర్డును చేరుకున్న వ్యక్తి ఓడిపోయినట్లు లెక్క! అంతేకాకుండా వారికి పనిష్మెంట్ కూడా ఉంటుంది. అలా ఈ గేమ్‌లో నాగ్.. రవితో గోడకుర్చీ వేయించి, షణ్నును మోకాళ్ల మీద కూర్చోబెట్టి, సిరిని ఒంటికాలిపై, యానీని రెండు చేతులు పైకెట్టి నిల్చోబెట్టాడు. మొత్తంగా ఈ గేమ్‌లో A టీమ్‌లోని సన్నీ గెలిచాడు. తర్వాత గేమ్‌లో హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు చూపించగా అది ఎవరో గుర్తుపట్టాలన్నాడు నాగ్. ఈ గేమ్‌లోనూ A టీమ్ విజయం సాధించింది. తర్వాతి గేమ్‌లో కొన్ని పదాలున్న మెడల్స్‌ను దానికి సరిగ్గా సరిపోయే వ్యక్తికి వేయాలన్నాడు. సన్నీ.. ఫేక్ అన్న మెడల్‌ను రవికి వేశాడు. మానస్.. ప్రియాంక తనకు తలనొప్పిగా మారిందన్నాడు. శ్రీరామ్.. గేమ్‌లో కాజల్ కన్నింగ్ అని చెప్పాడు. రవి.. పొగరుబోతు(యారోగెంట్) అన్న మెడల్‌ను యానీకి ఇచ్చాడు. ప్రియాంక సింగ్.. షణ్ముఖ్ సెల్ఫిష్ అని చెప్పింది. యానీ.. సన్నీ సెల్ఫిష్ అంది. కాజల్.. సిరి డబుల్ ఫేస్ (రెండు నాలుకల పాము) అని తెలిపింది. సిరి.. షణ్ముఖ్ ప్రతిసారి నేను వెళ్లిపోతానేమోనని నెగెటివ్‌గా మాట్లాడుతాడని బుంగమూతి పెట్టుకుంది. తర్వాత మానస్, కాజల్ ఇద్దరూ సేఫ్ అని ప్రకటించిన నాగ్ మీ ఇద్దరూ కాకుండా మరొక హౌస్‌మేట్ వెళ్లిపోతున్నాడని చెప్పాడు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ ఆరోగ్యం బాగోలేనందున అతడిని పంపించివేయక తప్పదని వెల్లడించాడు. అలా మానస్, కాజల్‌లలో ఒకరికి బదులుగా అసలు నామినేషన్లోనే లేని జెస్సీ ఆట నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. స్టేజీ మీదకు వచ్చిన పిదప తన జర్నీ వీడియో చూసుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. నిజానికి పలు పోల్స్‌లో కాజల్ తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉంది. ఆమె ఎలిమినేట్ అవడం ఖాయం అనుకున్నారంతా! కానీ చివరకు జెస్సీని పంపించేయడంతో ఆమెను సేవ్ చేసి లైఫ్ ఇచ్చినట్లైంది. -
రవి ఫేక్, సిరి డబుల్ ఫేస్.. 'అరె, కరెక్ట్‌గా సెట్టయ్యిందే!'
Bigg Boss Telugu 5 Promo: సండేను ఫండే చేస్తానంటూ కంటెస్టెంట్లతో టాస్క్‌లు ఆడిస్తుంటాడు నాగ్. అయితే కొన్ని ఫన్నీగా ఉన్నా, మరికొన్ని మాత్రం హౌస్మేట్స్ మధ్య చిచ్చు రాజేసేలా ఉంటాయి. తాజగా అలాంటి టాస్కే హౌస్‌మేట్స్‌కు ఇచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో.. నాగ్ కొన్ని పదాలు ఇచ్చి అది ఎవరికి సెట్ అవుతాయో చెప్పాలన్నాడు. దీంతో శ్రీరామ్.. గేమ్‌లో కాజల్ కన్నింగ్ అని చెప్పుకొచ్చాడు. కాజల్.. సిరి గురించి చెప్తూ ఆమెకు రెండు ముఖాలున్నాయని, టాస్క్‌లో ఒక ఫేస్, సాధారణంగా ఒక ఫేస్ ఉంటుందని తెలిపింది. ఇవి కాకుండా సిరి తనకు మూడో ఫేస్ కూడా ఉందని చెప్తూ ఉంటుందని, అది హౌస్ బయటకెళ్లాక చూపిస్తానందని పేర్కొంది. తర్వాత సన్నీ.. రవి మాట మార్చుతాడంటూ అతడు ఫేక్ అని చెప్పాడు. దీంతో చిర్రెత్తిపోయిన రవి.. ఎంత చెప్పినా వినకుండా నాకు నచ్చింది చేస్తా, ఎవ్వడు చెప్పినా నేను వినను అంటే అది యారోగెంటే కదా అంటూ ఆ ట్యాగును సన్నీ మెడలో వేశాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అందరూ కరెక్ట్ ట్యాగులిచ్చుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. -
బ్యాడ్ బిహేవియర్, సన్నీని దోషిగా తేల్చిన నాగ్
Bigg Boss Telugu 5, Episode 70: సన్నీ నోటికొచ్చినట్లు వాగాడంటూ సిరి.. షణ్నును పట్టుకుని ఏడ్చేసింది. ఓ పక్క అతడి మీదున్న కోపాన్ని బయటకు కక్కుతూనే మరోపక్క షణ్నుకు హగ్గులిస్తూ ఐ లవ్యూ చెప్పింది. కాజల్ పేరు తీస్తేనే బుసలు కొడుతున్న యానీ బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నంతవరకు ఆమెతో మాట్లాడనని, ముఖం కూడా చూడనని భీష్మించుకు కూర్చుంది. అటు మానస్ కూడా పింకీ ప్రవర్తనలో ఏదో తేడా కొడుతోందని ఆమెను కట్ చేయాలని చూస్తున్నాడు. కంటెస్టెంట్లు పలుచబడే కొద్దీ కంటెస్టెంట్ల మధ్య వైరాలు పెరుగుతున్నాయి. తర్వాత ఓ టాస్క్‌లో ప్రియాంక గెలిచి రామ్‌చరణ్ ఆటోగ్రాఫ్ అందుకుని మురిసిపోయింది. సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ తన శరీరం లావైతున్నట్లుగా, ఎవరో బాడీని పట్టుకున్నట్లుగా ఉందని, చూపు షేక్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు జెస్సీకి మరింత మెరుగైన చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు. భీమ్లా నాయక్ పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటిసభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొదటగా యానీ.. కాజల్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. నాగ్ ముందే నాగిణి డ్యాన్స్ చేస్తూ ఆమెను వెక్కిరించింది. అయినప్పటికీ మెజారిటీ కంటెస్టెంట్లు యానీకే సపోర్ట్ చేశారు. తర్వాత రవి.. వెరీ బ్యాడ్ బిహేవియర్, లూజ్ టంగ్ అంటూ సన్నీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. తంతా, అప్పడం చేసి అమ్మేస్తా అన్నాడని రవి చెప్పడంతో తాను అనలేదని బుకాయించాడు సన్నీ. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. సన్నీ మొదట తంతానన్నాడని, కానీ ఎవరిని అనడంతో టవర్‌ను తంతానని కవర్ చేశాడని నాగ్ చెప్పడంతో అతడి పరువు పోయినట్లైంది. అయితే సన్నీ మాత్రం తాను బ్రిక్స్నే తంతానన్నానని మరీమరీ చెప్పాడు. అమ్ముతానని సిరిని అన్నావంటూ మరో వీడియో చూపించాడు నాగ్. సన్నీ తరపున వాదించిన కాజల్ అతడు సిరిని అమ్ముతానని అనలేదని బల్లగుద్ది చెప్పింది. తర్వాత సన్నీ.. సిరిని బోనులో నిలబెట్టి ఎఫైఆర్ ఫైల్ చేశాడు. కానీ మానస్, కాజల్ తప్ప అందరూ సిరిని నిర్దోషి అని పేర్కొన్నారు. మానస్.. యానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అది వీగిపోయింది. శ్రీరామచంద్ర.. ప్రియాంకను బోనులో పెట్టాడు. ఎన్ని పాటలు పాడినా 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేదని ఆరోపించాడు. శ్రీరామ్ ముందుగానే ఫ్లాట్ అయిపోయి పాట పాడితే నాది తప్పా? అని రాగాలు తీసింది. హౌస్మేట్స్ సగం మంది తనను గిల్టీ, మిగతావాళ్లు గిల్టీ కాదని చెప్పారు. మానస్ గట్టిగా అరవడం నచ్చలేదని అతడిని ప్రియాంక బోనులో పెట్టింది. అయితే హౌస్మేట్స్ మానస్‌ను నిర్దోషిగా తేల్చారు. తర్వాత కాజల్.. యానీ తనను వెక్కిరిస్తుందంటూ బోనులో నిలబెట్టింది. అయితే ఆమె వెక్కిరించలేదని, అది తన బాడీ లాంగ్వేజ్ అని సిరి వాదించింది. మెజారిటీ కంటెస్టెంట్లు సిరి వాదనతో ఏకీభవించడం విశేషం. తర్వాత షణ్ను.. నేను ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడతాననడం, నన్ను యూట్యూబ్ వరకే అని చెప్పడం నచ్చలేదంటూ సన్నీని బోనులో నిలబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్లే చేసి చూపించగా రవి, శ్రీరామ్, సిరి, యానీ.. అతడు షణ్నును యూట్యూబ్ వరకే అన్నాడని చెప్పగా మిగిలిన ముగ్గురు షణ్నును అనలేదని, కామెంట్లు యూట్యూబ్ వరకే అని చెప్పాడని వివరించే ప్రయత్నం చేశారు. కానీ మెజారిటీ కంటెస్టెంట్లు షణ్నును సమర్థించారు. అందరూ మధ్యలో రావడం వల్లే గొడవలు వస్తున్నాయని కాజల్ ఉన్నమాట చెప్పింది. సిరి సన్నీ గొడవ పడుతుంటే షణ్ను మధ్యలోకి రావడం వల్లే గొడవ పెద్దదైందని తెలిపింది. అయితే నాగ్ మాత్రం కాజల్.. యానీకి గిలిగింతలు పెట్టడం వల్లే అసలు గొడవ మొదలైందన్నాడు నాగ్. మొత్తంగా సన్నీ మెడలో గిల్టీ బోర్డు వేలాడదీశారు. తర్వాత సన్నీ సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్. -
అనారోగ్యంతో బిగ్‌బాస్‌కు జెస్సీ గుడ్‌బై
Bigg Boss 5 Telugu, 10th Week Elimination: బిగ్‌బాస్ షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్ట్రాటజీకి మారుపేరైన కాజల్ తక్కువ ఓట్లతో పోలింగ్‌లో వెనకబడటంతో అందరూ ఆమె వెళ్లిపోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. అయితే జెస్సీని అనారోగ్యం వేధించడంతో వారం మధ్యలోనే హౌస్ నుంచి నిష్క్రమించాడు. కానీ ఎలిమినేట్ అవలేదు. అతడిని సీక్రెట్ రూమ్‌కి పంపించి తిరిగి హౌస్‌కు పంపిద్దామనుకున్నారు. అయితే అతడి ఆరోగ్యం మెరుగవకపోవడంతో ఈ వారం జెస్సీని ఇంటికి పంపించివేస్తున్నారట! దీంతో జెస్సీ తిరిగి వస్తాడేమోనన్న సిరి, షణ్ముఖ్‌ల ఆశ అడియాశలైనట్లు కనిపిస్తోంది. ఇక జెస్సీ ఎలిమినేషన్‌తో కాజల్ ఎలిమినేషన్ గండం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. -
'టచ్ చేయకు, నా దగ్గరకు రాకు తల్లీ' యానీ నాగిణి డ్యాన్స్
Bigg Boss 5 Telugu Promo, Anee Vs Kajal: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ బీబీ హోటల్లో సరదాగా ఉన్న కంటెస్టెంట్లు కెప్టెన్సీ టాస్క్ టవర్‌లో ఉంది పవర్లో మాత్రం కొట్లాటలకు దిగారు. సిరి, సన్నీ, కాజల్, రవి కెప్టెన్సీకి పోటీ పడగా మిగతా ఇంటిసభ్యులు వారికి మద్దతిచ్చారు. ఈ క్రమంలో కాజల్.. రవికి సపోర్ట్ చేస్తున్న యానీ మాస్టర్‌కు కితకితలు పెట్టి ఆమె ఆటను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఎప్పటిలాగే యానీ దీన్ని కూడా సీరియస్‌గానే తీసుకుంది. ఇలా చేశావంటే ఈ టాస్క్‌లో నీపై అనర్హత వేటు వేస్తానని కాజల్‌ను హెచ్చరించింది. నువ్వు ఈ గేమ్‌లో ఓడిపోయాక ఎవరికి సపోర్ట్ చేస్తున్నావని అడిగింది. అందుకామె రవికి అని సమాధానమివ్వడంతో షాకైన యానీ.. రవికి సపోర్ట్ అంటూనే అతడికి మద్దతుగా నిలబడ్డవాళ్లకు గిలిగింతలు పెడతావా? అని నిలదీసింది. ఇందుకు కాజల్ నా గేమ్ అదే అని చెప్పింది. ఈ సమాధానంతో షాకైన యానీ.. 'నన్ను టచ్ చేయకు, నా దగ్గరకు రాకు తల్లి' అంటూ ఆవేశపడుతూ నాగిని డ్యాన్స్ చేసింది. 'నా పైసలు దొంగిలించావు, ఒక్క గేమ్ నిజాయితీగా ఆడలేదు' అని విమర్శించింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు యానీ విశ్వరూపాన్ని చూసి మహానటి సాంగ్ ఆమెకు డెడికేట్ చేస్తున్నారు. ఆమె ఎందుకిలా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదని కామెంట్లు చేస్తున్నారు. -
జెస్సీకి తిరగబెట్టిన రోగం, కొత్త లక్షణాలతో సతమతం!
Bigg Boss 5 Telugu, Episode 68: బిగ్‌బాస్ షోలో బీబీ హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో హోటల్‌కు విచ్చేసిన అతిథులు సన్నీ, సిరి, కాజల్, ప్రియాంక, మానస్.. అక్కడి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటూ టిప్పులివ్వకుండా విసిగించారు. వీరి ప్రవర్తనతో చిర్రెత్తిపోయిన హోటల్ స్టాఫ్ ముందు పైసలు తీయండి, కావాల్సినంత సేవలు చేయించుకోండి అని అభ్యర్థించినప్పటికీ వారు వినిపించుకోలేదు. రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని తెలిసిపోయింది! చేసేదేం లేక సిబ్బంది అతిథుల సేవల్లో తరించారు. హనీమూన్ కపుల్ ప్రియాంక- మానస్‌ల కోసం యానీ మాస్టర్ పూలతో బెడ్ అలంకరించింది. మీ శోభనం కోసం అన్నీ సిద్ధం చేశానని చెప్తుండగా సన్నీ వెళ్లి ఆ బెడ్‌మీద పడి దొర్లి దాన్ని నాశనం చేశాడు. మరోపక్క షణ్ముఖ్.. నువ్వు దొంగతనం చేశావన్న విషయం తనకు తెలుసంటూ రవితో నేరుగా చెప్పాడు. అడ్డంగా దొరికిపోయినప్పటికీ రవి మాత్రం తాను తీయలేదని బుకాయించాడు. టాస్క్ చెడగొట్టే పనిలో భాగంగా కాజల్ వాటర్ బాటిల్లో కారం పోశాడు. అయితే హౌస్మేట్స్ ఇది చేసింది రవే అని పసిగట్టారు. అతడికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని, ఇక నుంచి రవికి డబ్బులు ఇవ్వకూడదని ఓ నిర్ణయానికి వచ్చారు. డబ్బులివ్వడం లేదని ఏడ్చేసిన యానీ మరోపక్క సన్నీ.. పింకీ-మానస్‌ల క్యాండిల్ లైట్ డిన్నర్‌ను సర్వనాశనం చేశాడు. దీంతో అలకమంచం ఎక్కిన పింకీని బుజ్జగించి కూల్ చేశాడు మానస్. ఇదిలా వుంటే తన డబ్బులు కొట్టేశారన్న బాధలో ఉన్న కాజల్ ఎలాగైనా వాటిని సంపాదించుకోవాలనుకుంది. ఇందుకోసం యానీ బ్యాగులో నుంచి డబ్బులు దొంగిలించింది. కానీ హౌస్మేట్స్ మాత్రం ఇది కచ్చితంగా రవి పనే అయ్యుంటుందని అతడి మీద అనుమానం వ్యక్తం చేశారు. బండెడు పనులు చేయించుకుని చారానా వంతు టిప్పు ఇస్తున్నారని అసహనానికి లోనైన యానీ ఇన్ని పనులు చేయిస్తున్నారు.. నేను మనిషినా? పశువునా? అని ఆవేశపడింది. కుక్కల్లా పనులు చేయిస్తున్నారు, కానీ డబ్బులు ఇవ్వరు అంటూ ఏడ్చేసింది. జెస్సీకి తిరగబెట్టిన రోగం ఇలాగైతే తమకు డబ్బులు రావని అర్థమైన సిబ్బంది మాకు 10 వేల రూపాయలు ఇచ్చేవరకు అతిథులెవరికీ ఫుడ్ పెట్టమని తేల్చి చెప్పారు. దీంతో అతిథులు ఓ మెట్టు దిగి వచ్చి డబ్బులు ఇచ్చి ఆహారం అందుకున్నారు. ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ తను సరిగా చూడలేకపోతున్నానని, ఒక వైపుకు నెట్టేసినట్లు పడిపోతున్నానని బిగ్‌బాస్‌కు చెప్పుకున్నాడు. పడుకున్నప్పుడు స్నేక్ ఉన్నట్లుగా అనిపిస్తుందన్నాడు. దీంతో అతడిని చెకప్ చేసేందుకు డాక్టర్ రాగా.. జెస్సీ తన చేతులు లావైనట్లు అనిపిస్తోందని ఇలా ఇంతకుముందెన్నడూ అనిపించలేదని తెలిపాడు. నీకు మెరుగైన వైద్యం అవరసరమన్న డాక్టర్, అందుకు తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ ఇస్తామని, ధైర్యంగా ఉండమని జెస్సీకి భరోసా ఇచ్చాడు. -
Elimination: డేంజర్ జోన్లో స్ట్రాటజీ మర్చిపోయిన కాజల్!
Bigg Boss Telugu 5, 10th Week Elimination: స్ట్రాటజీకీ మారుపేరు ఆర్జే కాజల్. తను ఏం చేసినా, చేయకపోయినా అన్నింటికీ స్ట్రాటజీ అని పేరు పెడుతుంది. బిగ్‌బాస్ హౌస్‌లో రిలేషన్స్‌కు చోటు లేదంటూ ఎమోషన్స్ పక్కన పెట్టి మరీ ఆడింది. మొదట్లో కాజల్ ఆటను చూసిన హౌస్మేట్స్ ఆమెను ఎదుర్కోవాలంటే ఒక అడుగు వెనక్కు వేసేవారు. ఎప్పుడు ఏ పాయింట్ పట్టుకుని లాగుతుందోనని చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. కానీ రానురానూ కాజల్ వైఖరిలో మార్పు వచ్చింది. తను కూడా తోటి కంటెస్టెంట్లతో ఫ్రెండ్షిప్ బాండ్ పెంచుకుంది. ఇంటి నుంచి పంపిన లెటర్ తనకు దక్కకుండా పోతుందేమో అనుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. ఫ్రెండ్స్ తనను పట్టించుకోనప్పుడూ అలిగి ఏడ్చింది. ఇవన్నీ కాజల్కూ ఓ మనసుందని నిరూపించాయి. గేమ్ కోసం ఏదైనా చేసే కాజల్ గత కొంతకాలంగా ఆటలో వెనకబడిపోయినట్లు కనిపిస్తోంది. ఎవరి మాటలు నమ్మాలో? ఎవరు తనవైపు నిలబడుతున్నారో అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్లిపోయింది. టాస్కుల్లోనూ మెరుగైన ప్రదర్శన ఇవ్వడం లేదు. ఇదే కారణాన్ని హౌస్మేట్స్ ప్రస్తావిస్తూ గత కొన్ని వారాలుగా కాజల్ హౌస్‌లో(గేమ్‌లో) కనిపించడం లేదంటూ రెండు సార్లు ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకుని జైలుకు పంపించారు. మరోవైపు ఈ వారం సిరి, రవి, సన్నీ, మానస్‌లతో పాటు కాజల్ కూడా నామినేషన్లో ఉంది. వీరిలో రవి, సన్నీలు ఓటింగ్‌లో టాప్‌లో దూసుకుపోతున్నారు. మానస్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. మిగిలిందల్లా సిరి, కాజల్. షణ్ముఖ్ ఎలాగో నామినేషన్స్‌లో లేడు కాబట్టి అతడి ఓట్లు కూడా సిరికే పడుతున్నాయి. దీంతో ఆమె ఈ వారం సేవ్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటివరకైతే అనధికారిక పోల్స్‌లో కాజల్ తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉండటంతో ఈ వారం కాజల్ ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అవగా ఈ సండే కాజల్ వారి సరసన చేరనుందని కామెంట్లు చేస్తున్నారు. -
కాజల్‌కు షాకిచ్చిన రవి, మేడమ్ మేడమ్ అంటూనే..
Bigg Boss 5 Telugu, Episode 67: కేక్ తినే అర్హత ఎవరికి ఉందని కంటెస్టెంట్లు చర్చోపచర్చలు పెట్టారు. ఈ తొక్కలో మీటింగ్ ఏంటో అర్థం కాని సన్నీ తినేస్తే పోలా అని కేక్ తీసుకుని లాగించాడు. ఖరాబవుతుందని తిన్నానంటూనే ఇప్పుడు ఏం పంచాయితీ అవుతుందోనని మథనపడ్డాడు. అన్నట్లుగానే యానీ మాస్టర్ వచ్చి సన్నీ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడని, నువ్వెలా తింటావని తిట్టుకుంటూ వెళ్లి ఏడ్చేసింది. బిగ్‌బాస్ బీబీ హోటల్ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్ కీపింగ్ స్టాఫ్‌లో ఉంటూనే అతిథులకిచ్చే సర్వీసులను చెడగొట్టమని రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. బీబీ హోటల్లో శ్రీరామ్, షణ్ముఖ్ చెఫ్స్, వెయిటర్లుగా, యానీ మాస్టర్ మేనేజర్, రిసెప్షనిస్ట్‌గా, రవి ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న హౌస్ కీపింగ్, మానస్- ప్రియాంక హనీమూన్‌కు వచ్చిన జంట, కాజల్.. హోటల్ ఓనర్‌కు స్నేహితురాలు, సన్నీ తొలిసారి 5 స్టార్ హోటల్‌కు వచ్చిన అతిథిగా, సిరి.. ఎంతో గారాబంగా పెరిగిన డాన్ కూతురుగా నటించాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో హోటల్ సిబ్బంది అతిథుల నుంచి రూ.15 వేల రూపాయలు గెలిస్తే వారు గెలిచినట్లు లెక్క! టాస్క్ మొదలవగానే ఇంటిసభ్యులు రెచ్చిపోయి మరీ ఆడారు. సన్నీ, సిరి అయితే పాత్రలో జీవించారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న సిరి షణ్ముఖ్‌ను ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించింది. సిరితో ఈజీ కాదు అని పాట పాడుతూ స్విమ్మింగ్ పూల్‌లోని నీటిని స్పూన్‌తో తీస్తూ కాఫీ కప్పు నింపాడు షణ్ను. దీంతో అతడికి టిప్పిచ్చింది సిరి. సన్నీ తనను టచ్ చేస్తుంటే సైలెంట్‌గా ఉన్నావేంటని మానస్ మీద చిర్రుబుర్రులాడింది పింకీ. మరోపక్క రవి.. కాజల్ బ్యాగులోంచి డబ్బులు కొట్టేసి ఏమీ ఎరగనట్లున్నాడు. దీంతో కాజల్ డబ్బులు పోయాయంటూ మొత్తుకుంది. మరి రేపటి ఎపిసోడ్లో అతిథులు హోటల్ సిబ్బందిని ఇంకెన్ని తిప్పలు పెడతారో చూడాలి! చదవండి: బిగ్‌బాస్ షోలో షాకింగ్ ఘటన, కంటెస్టెంట్ సూసైడ్ అటెంప్ట్! -
సీక్రెట్ రూమ్‌కు జెస్సీ, రగిలిపోయిన షణ్ముఖ్!
Bigg Boss 5 Telugu, Episode 66: జెస్సీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడి ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. నీకు మెడికల్ ట్రీట్మెంట్ అవసరమని, ఇందుకోసం బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నాడు. దీంతో జెస్సీ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ 'బిగ్‌బాస్ నా లైఫ్ అనుకున్నా, ఇంతవరకు వచ్చినందుకు హ్యాపీ' అంటూనే అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు. జెస్సీ తిరిగొస్తాడు కదూ* జెస్సీ ఉన్నఫళంగా హౌస్ వదిలి వెళ్తాడని చెప్పగానే షణ్ముఖ్, సిరి గుక్కపెట్టి ఏడ్చారు. సిరి అయితే అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని తలపై ఆప్యాయంగా ముద్దు పెట్టింది. జెస్సీ వెళ్లిపోయే ముందు చివరిసారిగా హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ.. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు సన్నీ, మానస్, పింకీ, కాజల్, యానీ.. అందరూ పాంపరింగ్ చేశారంటూ బాధపడ్డాడు. తన ఫ్రెండ్స్ షణ్ను, సిరి ఇద్దరు ఉన్నంతవరకు బిగ్‌బాస్ జర్నీ చూస్తానని చెప్తూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు లేకపోవడంతో తీవ్రంగా దుఃఖించిన సిరి.. జెస్సీ తిరిగొస్తాడేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది. మానస్ కోసమే వచ్చావా?: పింకీపై కాజల్ ఫైర్ మరోపక్క నామినేషన్స్ ఎఫెక్ట్‌తో ప్రియాంక సింగ్ మీద అలక బూనాడు మానస్. ఆమె దగ్గరవ్వాలని ప్రయత్నించేకొద్దీ అతడు తప్పించుకు తిరిగాడు. నేనేమైనా తప్పు చేస్తే చెప్పంటూ బతిమాలినప్పటికీ మానస్ మాత్రం అసలు పట్టించుకోలేదు. దీంతో పింకీ.. మానస్ ఎందుకు మాట్లాడట్లేదో తెలియడం లేదని తెగ ఫీలైంది. ఇది విన్న కాజల్.. నువ్వు తనకోసం వచ్చావా? అని ఫైర్ అయింది. మనం గేమ్ ఆడటానికి వచ్చాం, మానసే నేరుగా వచ్చి మాట్లాడేదాకా వెయిట్ చెయ్, లేదంటే వదిలెయ్ అని సలహా ఇచ్చింది. (చదవండి: చివరి క్షణంలో బిగ్‌బాస్ ట్విస్ట్.. నామినేషన్స్‌లో ఐదుగురు) మాట్లాడే అధికారమే కోల్పోయావు: సన్నీ పైకి గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ కాజల్ బాధను దిగమింగుతోంది. నామినేషన్స్‌లో తన ఫ్రెండ్స్ సన్నీ, మానస్‌లను సేవ్ చేయనందుకు వారు మాట్లాడకపోవడంతో ఎంతగానో బాధపడింది. ఎలాగో ఈవారం ఎలిమినేట్ అవుతానని అటు కాజల్, ఇటు మానస్ ఎవరికి వారే అభిప్రాయపడ్డారు. అయితే మానస్ వెళ్లిపోతాడంటే తట్టుకోలేకపోయిన పింకీ.. అలా అనొద్దని వేడుకుంది. దీంతో చిర్రెత్తిపోయిన సన్నీ.. నువ్వు మాట్లాడే అధికారమే కోల్పోయావని తేల్చేశాడు. ఇక కాజల్ నామినేషన్స్ సమయంలో వారిని సేవ్ చేయకుండా నమ్మకాన్ని వమ్ము చేసినందుకు సారీ చెప్పింది. ఎప్పటిలా ఉందామని ఎన్నిసార్లు బతిమాలినా, ఎన్నిసార్లు సారీ చెప్పినా సన్నీ, మానస్ వినిపించుకోకపోవడంతో తను కూడా ఏడ్చేసింది. సీక్రెట్ రూమ్‌లో జెస్సీ, క్వారంటైన్ అయ్యాక హౌస్‌కు! ఇదిలా వుంటే జెస్సీని బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌లో ఉంచాడు బిగ్‌బాస్. శ్రీరామ్.. కాజల్ బాగా ఇన్ఫ్లూయెన్స్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. మరోపక్క మానస్.. పింకీ ఇచ్చిన వస్తువులను తిరిగిచ్చేయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. రవి కోసం బంటులా పని చేస్తే మాత్రం పింకీని అస్సలు నమ్మనని తెగేసి చెప్పాడు. తాను, జెస్సీ, షణ్ను ముగ్గురం కంటెండర్ అవగానే కెప్టెన్ అయ్యామని చెప్తూ ఉప్పొంగిపోయింది సిరి. కానీ నేను కంటెండర్ అవగానే నామినేట్ అవుతున్నానని రవి అనగా.. ఎలిమినేట్ మాత్రం అవడం లేదు, అదే నా బాధ అని మనసులో మాట బయటపెట్టాడు షణ్ను. నా మీదే జోకులా, నేనేంటో చూపిస్తా! తర్వాత సిరి అందరిముందే తన మీద జోకేసిందని తెగ ఫీలయ్యాడు షణ్ను. ఎవడన్నా జోకేస్తే చెప్పు తీసి కొట్టేవాడినని చిరాకుపడ్డాడు. క్లోజ్ ఫ్రెండే జోకేస్తే తీసుకోని షణ్ను రవి జోక్ చేస్తే ఊరుకుంటాడా? అందరి ముందు తన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేయడంతో బాగా హర్టయ్యాడు. ఇలాంటి వెకిలి జోకులను తాను తీసుకోలేనని ముఖం మీదే చెప్పాడు. పింకీ నన్ను గెలికింది, ఇక ఎలా ఉంటుందో చూడని సిరితో చెప్పుకొచ్చాడు. ఇలా చనువు తీసుకుని అతి చేస్తారనే మనుషుల్ని దూరం పెడతానని పేర్కొన్నాడు. (చదవండి: ఒకరి జీవితంతో ఆడుకోకండి: విశ్వ వార్నింగ్) ముద్ద వద్దు, ముద్దులే కావాలన్న మానస్ సన్నీ, మానస్‌ల పోరుతో ఆలోచనలో పడ్డ కాజల్.. షణ్నును సేవ్ చేయకుండా నన్నెందుకు సేవ్ చేశావని శ్రీరామ్‌ను అడిగింది. దీంతో అతడు మనిద్దరి మధ్య గొడవకు ముగింపు పలకడానికే చేశానని బదులిచ్చాడు. ఎట్టకేలకు మానస్ కోపాన్ని కరిగించేసింది ప్రియాంక. భోజనం ప్లేటు పట్టుకుని ముద్దు కావాలా? ముద్ద కావాలా? అని అడిగితే మానస్ ముద్దే కావాలన్నాడు. దీంతో ప్రియాంక దొరికిందే ఛాన్స్ అనుకుని ముద్దుల మీద ముద్దులిచ్చింది. -
Bigg Boss: చివరి క్షణంలో బిగ్‌బాస్ ట్విస్ట్.. నామినేషన్స్‌లో ఐదుగురు
Bigg Boss 5 Telugu,10th Week Nomination List: బిగ్‌బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే నామినేషన్స్‌తో హోరెత్తిపోతుంది. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇంటి సభ్యులు చేయని ప్రయత్నాలు, కుట్రలు ఉండవు. అయితే పదోవారం మాత్రం నామినేషన్ ప్రక్రియని కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. కాజల్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నించిన సిరి, రవిలో చివరకు బకరాలయ్యారు. యానీ మాస్టర్‌పై ప్రేమను పెంచుకున్న బిగ్‌బాస్.. ఆమెకు వరుసగా స్పెషల్ పవర్ ఇస్తూ ఇంటి సభ్యులకు షాకిచ్చాడు. దీంతో పదోవారం నామినేషన్స్‌లో ఐదుగురు ఉన్నారు. ఆ ఐదుగురు ఎవరు? వారు ఎలా నామినేట్ అయ్యారు? సిరి, రవిలు వేసిన ప్లాన్ ఏంటి? బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టులేంటి? చదివేయండి. ప్రస్తుతం హౌజ్‌కి కెప్టెన్‌గా ఉన్నయానీ మాస్టర్ని ఎవరైన నలుగురు కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేసి జైలులో కూడా పెట్టాలని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో యానీ.. మానస్, కాజల్, సన్నీ, షణ్ముఖ్‌లను నామినేట్ చేసి జైలులో పెట్టింది.యానీ మాస్టర్ చేసిన నామినేషన్‌ని మార్చే అవకాశాన్ని మిగిలిన ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్. దీనిలో భాగంగా.. బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న తాళాలను పట్టుకుని వాటి ద్వారా తమకి ఇష్టమైన వ్యక్తిని బయటకు తీసుకురావొచ్చు. అలా బయటకు వచ్చిన వ్యక్తి మరో ఇద్దరిని నామినేట్ చేస్తే.. వారిలో ఒకరి నామినేట్ అయి జైలుకు వెళ్లాలి. అయితే మొదట బజర్ మోగేసరికి పింకీ పరుగున వెళ్లి సంకెళ్లను చేజిక్కించుకుంది. వెంటనే మానస్‌ని జైలు నుంచి విముక్తి కల్పించింది. అయితే మానస్.. రవి, జెస్సీలను నామినేట్ చేయగా.. చివరికి ప్రియాంక, మానస్లు చర్చించి జెస్సీని జైలుకి పంపి నామినేట్ చేశారు. ఆ తర్వాతి బజర్‌కి సిరి తాళాలను దక్కించుకొని షణ్ముఖ్‌ని కాదని జెస్సీని బయటకు తీసుకొచ్చింది. అయితే తనను బయటకు తీసుకురావొద్దని ముందు సిరికి చెప్పాడు షణ్ముఖ్. అందుకే అతన్ని కాదని జెస్సీని విడిపించింది. బయటకు వచ్చిన జెస్సీ.. తిరిగి మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఫైనల్‌గా ఆ ఇద్దరిలో సిరి అందరూ ఊహించినట్టే సిరి మానస్‌ని నామినేట్ చేసింది. ఆ తరువాత జెస్సీ సంకెళ్లను చేజిక్కించుకుని షణ్ముఖ్ జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. షణ్ముఖ్‌కి నామినేట్ చేసే చాన్స్ రావడంతో.. పింకీ, సిరిలను నామినేట్ చేశాడు. వారిలో ప్రియాంక జైలుకు వెళ్లింది. ఇక్కడ పింకీ, షణ్ముఖ్‌ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కాబట్టి ఆమెను ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తున్నానని చెప్పడం పట్ల బాగా హర్ట్ అయిన పింకీ.. ‘ఉన్న నలుగురిలో వేరే ఆప్షన్ లేదని నన్ను నామినేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నా పాయింట్లో నువ్వు కరెక్ట్ కాదు. తరువాత ఎప్పుడైనా నన్ను నామినేట్ చేయాలనుకుంటే సరైన కారణం ఇవ్వు’అంటూ అసహనం వ్యక్తం చేయగా.. ‘నా పాయింట్లో ఇదే కరెక్ట్.. నేను ఇలానే నామినేట్ చేస్తా. అది నా ఇష్టం’అంటూ షణ్ముఖ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక కాజల్‌పై పగ పెంచుకున్న సిరి ఈ సారి ఎలాగైనా ఆమెను నామినేషన్స్‌కి పంపాలని కుట్రపన్నింది. కాజల్‌ని నామినేషన్స్‌లో ఉంచాలంటే ఇలా గేమ్ ఆడాలంటూ.. రవి, శ్రీరామ్, షణ్ముఖలకు ట్రైనింగ్ ఇచ్చింది. సిరికి మద్దతుగా నిలిచాడు రవి. బజర్ మోగగానే తాళాలను దక్కించుకొని ప్లాన్ ప్రకారం.. పింకీని బయటకు తీసుకొచ్చాడు. ఆమె షణ్ముఖ్, జెస్సీలను నామినేట్ చేయడంతో ఫైనల్‌గా రవి జెస్సీని సేవ్ చేసి షణ్ముఖ్‌ని మళ్లీ జైలు లోపలికి పంపాడు. రవి ఇచ్చిన ప్లాన్ ప్రకారం.. శ్రీరామ్ తాళలను దక్కించుకొని కాజల్‌ని సేవ్ చేశాడు. దీంతో బయటకు వచ్చిన కాజల్.. సిరి, రవిలను నామినేట్ చేయగా.. శ్రీరామ్ సిరిని ఫైనల్ చేసి జైలుకు పంపాడు. ఇలా కాజల్‌ని జైలులో ఉంచాలని కుట్ర పన్నిన సిరి... చివరకు ఆమె వల్లే జైలుపాలై నామినేషన్స్‌లో నిలిచింది. మరోవైపు ఎలాంటి ఒప్పందం లేకుండా నిన్ను బయటకు తెచ్చానని.. నీకు చాన్స్ వస్తే సిరిని సేవ్ చేయాలని కాజల్‌పై ఒత్తిడి తెచ్చాడు శ్రీరామ్. దీనికి కాజల్ ఒప్పుకోలేదు. తన స్నేహితులైన మానస్, సన్నీలలో ఒకరిని బయటకు తెస్తానని చెప్పింది. అలా చెయ్యొద్దని, గతంలో లెటర్ త్యాగం చేసిన షణ్ముఖ్‌ని అయినా బయటకు తీసుకురా అని శ్రీరామ్ చెప్పడంతో.. కాజల్ అదే పని చేసింది. బయటకు వచ్చిన షణ్ముఖ్.. ట్విస్ట్ ఇస్తూ రవి, శ్రీరామ్‌లను నామినేట్ చేశాడు. ఈ ఇద్దర్లో కాజల్ చివరికి రవిని నామినేట్ చేసి జైలుకు పంపింది. చివరికి జైలులో మిగిలిన మానస్, సిరి, సన్నీ, రవిలు నామినేట్ కాగా.. అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది అన్నట్టు చివరిలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. కెప్టెన్ అయిన యానికి మరో పవర్ ఇచ్చాడు. నామినేట్ అయిన సభ్యులు కాకుండా మిగిలిన వారిలో ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయమని ఆదేశించాడు. దీంతో యానీ అంతా ఊహించినట్లే కాజల్‌ని నామినేట్ చేసింది. దంతో పదోవారం నామినేషన్స్‌లో మానస్, సిరి, కాజల్, రవి, సన్నీ ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించారు. మరి ఈ ఐదురురిలో ఎవరు పదోవారం బయటకు వెళ్లారో చూడాలి. -
రెండోసారి జైలుపాలైన నాగిని!
సండే ఫండే అంటూనే నాగార్జున బిగ్‌బాస్ ఇంట్లో వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని హౌస్‌మేట్స్‌ను ఇరకాటంలోకి నెట్టాడు. తొలుత సన్నీ తటపటాయిస్తూనే షణ్నును వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డాడు. మానస్ కూడా షణ్నునే వరస్ట్ అని పేర్కొన్నాడు. శ్రీరామ్ వరస్ట్ పర్ఫామర్ అన్న ట్యాగ్‌ను కాజల్‌కు ఇచ్చాడు. తర్వాత యానీ వంతు రాగా.. ఆమె ఎలాగో నేనే చెత్తగా ఆడానంటుందని మైండ్‌లో బలంగా ఫిక్సైన కాజల్.. ఈ ట్యాగ్ ఎందుకు తీయడం? నేనే ఉంచుకుంటానులేనని చెప్పుకొచ్చింది. దీంతో చిరాకుపడ్డ యానీ.. ఇదే సార్ ప్రాబ్లమ్ అంటూ నాగ్ ముందు ఇరిటేట్ అయింది. అయితే యానీ.. సన్నీని వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డట్లు ప్రోమోలో తెలుస్తోంది. మొత్తానికి ఈ టాస్క్‌లో ఎక్కువమంది కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మరోసారి జైల్లో పడిందని సమాచారం! ఇక ఈ వారం గేమ్‌లో విశ్వరూపం చూపించే విశ్వ ఎలిమినేట్ అయ్యాడన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే బిగ్‌బాస్ హౌస్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను కోల్పోతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. -
Bigg Boss 5 Telugu: ఆ 10 మందికి సూపర్ చాన్స్.. పాపం కాజల్!
బిగ్‌బాస్ హౌస్‌లో 9వ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ మినహా..మిగిలిన సభ్యులంతా నామినేట్ అయ్యారు. ఇంట్లో 11 మందిలో ఒకేసారి 10 మంది నామినేట్ కావడం గమనార్హం. ఒక్కో ఓటు వచ్చిన యానీ మాస్టర్, విశ్వలు సైతం నామినేషన్స్‌లోకి వెళ్లారు. షణ్ముఖ్ కెప్టెన్ కావడం వల్ల సేఫ్ అయ్యాడు. అయితే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్‌బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చినట్లు తాజా ప్రోమో ద్వారా తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: లోబో అన్ని లక్షలు వెనకేసుకున్నాడా?) గార్డెన్ ఏరియాలో ఒక సేఫ్ జోన్ డోర్‌లోకి తమ ఫోటో కాకుండా.. మిగిలిన సభ్యుల ఫోటో ఉన్న బ్యాగులు తీసుకొని పరుగెత్తాలి. వీరిలో ఎవరైతే చివరిగా సేఫ్‌జోన్ డోర్‌లోకి వెళ్లారో.. ఆ సభ్యుడితో పాటు అతని చేతిలో ఎవరి బ్యాగు ఉందో ఇద్దరు డేంజర్లోకి వెళ్తారు. ఈ గేమ్‌లో కాజల్, శ్రీరామచంద్ర తొలి రౌండ్లోనే డేంజర్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాజల్ ఫోటో ఉన్న బ్యాగును తీసుకున్న శ్రీరామచంద్ర.. ముందుగా గార్జెన్ ఏరియాలోకి వచ్చినప్పటికీ.. కావాలనే సేఫ్ జోన్ డోర్‌లోకి వెళ్లనట్లు తెలుస్తోంది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి.. నామినేషన్స్ నుంచి బయటపడ్డారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్‌ను చూడాల్సిందే. -
బిగ్‌బాస్ హౌస్‌లో కాటు వేసే నాగిణి ఎవరో తెలుసా?
Bigg Boss Telugu 5, Episode 56: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు. యానీ మాస్టర్, శ్రీరామ్, విశ్వ, రవి, లోబో ఒక టీమ్ కాగా మిగిలినవారంతా మరో టీమ్. ఈ గేమ్‌లో కాజల్ టీమ్ ముందుగా 50 పూరీలు చేసినప్పటికీ అవి సరిగా లేవంటూ సంచాలకుడు షణ్ను యానీ టీమ్‌ను విజేతగా ప్రకటించాడు. దీంతో గెలిచిన టీమ్ సభ్యులందరికీ ఏడాది పాటు వంటనూనె ఉచితంగా లభించే ఆఫర్ అందుకున్నారు. అయితే కాజల్ వాళ్లు కష్టపడి త్వరగా పూరీలు చేశారని సన్నీ జైల్లో నుంచి తన ఒపీనియన్ చెప్పాడు. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. 'బుద్ధుండాలి, మధ్యలో నీ జడ్జిమెంట్ ఏంటి? న్యూట్రల్‌గా మాట్లాడు' అని వేలెత్తి చూపుతూ రెచ్చిపోయింది. సౌతిండియన్, నార్తిండియన్ అంటూ వీళ్లిద్దరూ ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారగా విసిగిపోయిన సన్నీ చెంపలేసుకున్నాడు. వీళ్లిద్దరికీ గొడవ జరుగుతుంటే షణ్ను నవ్వాపుకోలేకపోయాడు. ఒకపక్క హౌస్ అంతా ఆవేశంతో ఊగిపోతుంటే కెప్టెన్ మాత్రం దాన్ని ఎంజాయ్ చేస్తూ నవ్వడమేంటని ఫైర్ అయ్యాడు సన్నీ. 'హౌస్‌లో కొందరు బాధపడుతుంటే నీకు నవ్వొస్తుంది, అది తప్పు' అని నొక్కి చెప్పాడు. ఆ మాటలను పెద్దగా పట్టించుకోని షణ్ను తన నవ్వును కంటిన్యూ చేస్తూ సన్నీని మరింత రెచ్చగొట్టాడు.నువ్వు కొడతానంటే కొట్టు, వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ గొడవలతో హౌస్ అంతా హీటెక్కిపోగా వారికి కూల్ చేసేందుకు స్టేజీపై ఎంటరయ్యాడు నాగార్జున. రవి.. డబ్బుల గురించి రాలేదని, నా భార్యాపిల్లలు ఎలా ఉన్నారో చెప్పండని, లేదంటే బిగ్‌బాస్ నుంచి పంపించివేయండి అని మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించాడు నాగ్. నువ్వు వెళ్లిపోతానంటే చెప్పు గేట్లు ఓపెన్ చేయిస్తానని హెచ్చరించాడు. కెప్టెన్సీ టాస్క్‌ను మధ్యలో వదిలేసిన యానీ మాస్టర్‌ను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి ఎందుకు? అని ప్రశ్నించాడు. ఇకపై డల్‌గా ఉండొద్దని సూచించాడు. కాజల్‌ను తొండాట వద్దని, పద్ధతిగా ఆడమని హితవు పలికాడు. తర్వాత సన్నీ ఫొటోను చేతులతో చింపేశిన నాగ్.. వరస్ట్ పర్ఫామర్‌గా జైలుకు పంపించినా మార్పు రాలేదా? అని నిలదీశాడు. ఒక వ్యక్తి పట్టుకున్న బ్యాగును తన్నడం సరైనదా? అని తిట్టిపోశాడు. బాగా ఆడుతున్నావ్ అంటూనే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోమని సూచించాడు. తర్వాత హౌస్‌మేట్స్‌తో వైకుంఠపాళి గేమ్ ఆడించాడు నాగ్. ఈ ఇంట్లో పైకి వెళ్లకుండా కాటేసేది, ముందుకు వెళ్లడానికి నిచ్చెనలా సాయం చేసేది ఎవరో చెప్పాలని ఆదేశించాడు. ముందుగా కాజల్.. తను ముందుకు వెళ్లడానికి సాయపడే నిచ్చెన మానస్ అని, పాములా అడ్డుకునేది శ్రీరామ్ అని చెప్పుకొచ్చింది. రవి.. తనను పైకి ఎక్కించేది షణ్ను అని, కాజల్‌తో కనెక్షన్ అవడం లేదంటూ ఆమెను పాముగా పేర్కొన్నాడు. జెస్సీ.. విశ్వ నిచ్చెన అని, తనకు గొడవలు నచ్చవంటూ సన్నీని పాముగా తెలిపాడు. ప్రియాంక.. అందరూ ఊహించినట్లుగానే మానస్ తనను ముందుకు తీసుకెళ్లే నిచ్చెనగా, లోబోను పాముగా పేర్కొంది. సన్నీ.. మానస్ నిచ్చెన అని, సైలెంట్‌గా ఉంటూ కాటేసే షణ్ముఖ్ పాము అని అభిప్రాయపడ్డాడు. యానీ.. రవిని నిచ్చెనగా, కాజల్‌ను పాముగా; విశ్వ.. లోబోను నిచ్చెనగా, కాజల్‌ను పాముగా తెలిపారు. లోబో.. రవి నిచ్చెన అని, సన్నీ పాము అని చెప్పుకొచ్చాడు. సొంత నీడను కూడా నమ్మొద్దని, ఇప్పటికైనా కళ్లు తెరువు అని లోబో సన్నీకి క్లాస్ పీకాడు. శ్రీరామచంద్ర.. యానీ నిచ్చెన అని, పాములో ఉండాల్సిన లక్షణాలన్నీ కాజల్‌కు ఉన్నాయని తెలిపాడు. మానస్.. సన్నీని నిచ్చెనగా, రవిని పాముగా అభిప్రాయపడ్డాడు. రవి కరెక్ట్ టైంలో సపోర్ట్ చేయలేదని ఫీలయ్యాడు. ఇక షణ్ముఖ్.. సిరిని నిచ్చెనగా, రవిని పాముగా చెప్పుకొచ్చాడు. రవి నా మైండ్ ఎక్కడ చదివేస్తాడో అని భయమేస్తుందంటూనే తన వల్లే గేమ్‌లో ముందుకెళ్తున్నానన్నాడు. సిరి మోటివేట్ చేస్తుందని చెప్తూ వాళ్లిద్దరూ హౌస్‌లో ఉండాలన్నాడు. తర్వాత సిరి.. షణ్నును నిచ్చెనగా, సన్నీని పాముగా చెప్పుకొచ్చింది. మొత్తంగా కాజల్‌ను నాగిణిగా, సన్నీని పాముగా ప్రకటించాడు నాగ్. అనంతరం 'మెడలో మోత- సరిపోయే సామెత' గేమ్ ఆడించాడు. ఇందులో నాగ్ సామెతలు చెప్తే దానికి సంబంధించిన ప్లేట్‌ను ఎవరికి సూటవుతుందో వారి మెడలో వేయాలన్నాడు. సన్నీ.. కుక్క తోక వంకర సామెతను జెస్సీకి అంకితమిచ్చాడు. మానస్.. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలని రవికి సూచించాడు. కాజల్.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్న సామెత శ్రీరామ్‌కు సెట్టవుతుందని చెప్పింది. యానీ.. రానురాను రాజు గుర్రం గాడిదైంది అన్నదాన్ని కాజల్‌కు ఇచ్చింది. ప్రియాంక.. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్న సామెతను సిరికి అంకితమిచ్చింది. తర్వాత శ్రీరామ్.. అంతంత కోడికి అద్దసేరు మసాలా సామెత కాజల్‌కు సూటవుతుందన్నాడు. విశ్వ.. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు సామెత లోబోకు సెట్టవుతుందన్నాడు. జెస్సీ.. పైన పటారం, లోన లొటారం అన్న ప్లేటును సన్నీకిచ్చాడు. సిరి.. అందని ద్రాక్ష పళ్లు పుల్లన అన్న ప్లేటును షణ్ను మెడలో వేసింది. షణ్ను.. ఏకులా వచ్చి మేకులా తగులుకున్నాడని రవి గురించి అభిప్రాయపడ్డాడు. రవి.. ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న అనేది మానస్‌కు సరిపోతుందన్నాడు. లోబో.. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్న సామెతను యానీకి అంకితమిచ్చాడు. ఈ రోజు నాగ్ ఎవరినీ సేవ్ చేయలేదు. ఇదిలా వుంటే రేపటి దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో శ్రియ, సుమ, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సహా పలువురు సెలబ్రిటీలు స్పెషల్ గెస్ట్స్‌గా రాబోతున్నారు. ఆ హంగామా చూడాలంటే రేపు సాయంత్రం ఆరు గంటలకు రెడీగా ఉండాల్సిందే! -
'ఎవడిక్కావాలి నీ సారీ'.. ఉలిక్కిపడ్డ శ్రీరామ్
Bigg Boss Telugu 5 Promo-Captaincy Task Fight Between Kajal and Sunny: ఈసారి కెప్టెన్సీ టాస్క్‌ను భిన్నంగా నిర్వహిస్తున్నాడు బిగ్‌బాస్. హౌస్‌నంతా లాక్డౌన్లో పెట్టి కంటెస్టెంట్లను బయటే ఉండాలని ఆదేశించాడు. తను ఇచ్చే టాస్కుల్లో గెలుపొందినవారు మాత్రమే ఇంటి లోపలికి వెళ్లేందకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో భాగంగా ఇప్పటివరకు మూడు ఛాలెంజ్‌లు పూర్తి కాగా వాటిలో షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ విజయం సాధించారు. నేడు జరగబోయే మరో రెండు ఛాలెంజ్‌లలో సన్నీ, యానీ మాస్టర్ గెలిచినట్లు సమాచారం. అయితే ఈ ఐదుగురితో పాటు ఇంకో కంటెస్టెంట్ కూడా కెప్టెన్సీకి పోటీపడేందుకు స్పెషల్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఓ సర్కిల్ మధ్యలో బంతిని పెట్టి దాన్ని ముందుగా అందుకున్నవాళ్లు కెప్టెన్సీకి పోటీపడే అర్హత సాధిస్తారని ప్రకటించాడు. ఈ గేమ్‌లో మానస్ గెలుపొందినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు షణ్ను, సిరి మరోసారి గొడవపడ్డారు. దీంతో ఎప్పటిలాగే సిరికి సారీ చెప్పాడు షణ్ను. అయితే అప్పటికే అలకమంచం ఎక్కిన సిరి.. నాకొద్దు నీ సారీ అంటూ బుంగమూతి పెట్టుకుంది. సారీ చెప్పాను కదా, ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావ్? అని షణ్ను అనడంతో మండిపోయిన సిరి.. ఎవడిక్కావాలి నీ సారీ అంటూ ఫైర్ అయింది. సడన్‌గా ఏమైంది? అని శ్రీరామ్ ఉలిక్కిపడగా ఇదంతా మాకు మామూలే అంటూ ఓ లుక్కిచ్చాడు షణ్ను. -
మొత్తానికి సన్నీ అనుకున్నది సాధించాడుగా!
Bigg Boss 5 Telugu, VJ Sunny Is New Captain: సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడం ఒక ఎత్తయితే ఇక్కడ ఎక్కువ వారాలు ఉండి ఏదో ఒకటి సాధించడం మరో ఎత్తు. కొందరు ఎలాగైనా ట్రోఫీ కొట్టాలని కసిగా ఆడితే మరికొందరు మాత్రం ఉన్న కొద్ది వారాలైనా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటే చాలని సంతోషిస్తారు. ఇక మరికొందరు టాప్ 5లో ఉంటే అదే పదివేలని భావిస్తారు. ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎవరు టాప్ 5లో ఉంటారని చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వీరిలో మానస్, సన్నీ, రవి, షణ్ముఖ్, శ్రీరామచంద్ర ఫినాలే వరకు వెళ్తారని కొందరు అభిప్రాయపడుతుండగా, షణ్ముఖ్ గ్యాంగ్‌తోపాటు ప్రియాంక సింగ్, సన్నీ ట్రోఫీ కోసం పోటీ పడతారని మరికొందరు అంటున్నారు. అయితే వీరిలో సన్నీకి ట్రోఫీ సాధించడం కన్నా ముందు మరొక కల ఉంది. అదే కెప్టెన్ కావడం. కొన్ని వారాలుగా కెప్టెన్సీ వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. అయితే ఎట్టకేలకు అతడి కోరిక నెరవేరినట్లు తెలుస్తోంది. తాజాగా హౌస్‌లో జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో సన్నీ గెలిచినట్లు లీకువీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అతడు కాజల్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకున్నాడట! ఇప్పటివరకు లీకువీరులు చెప్పిన ప్రతీది నిజమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సన్నీ కెప్టెన్ కావడం కూడా ఖాయమే అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి అతడి కల నెరవేరిందని, కెప్టెన్సీ కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్న డ్రెస్ ధరించే సమయం వచ్చేసిందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
అర్ధరాత్రి దుప్పటి తీసి మానస్‌కు బొట్టు పెట్టిన పింకీ!
Bigg Boss Telugu 5, Episode 40: దొంగతనాలు, కొట్లాటలు, గుంజుకోవడాలు, అరుచుకోవడాల మధ్య ఎట్టకేలకు బొమ్మల కొలువు టాస్క్ ముసిగింది. ఏ టీమ్ ఎన్ని బొమ్మలు చేసిందో చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో కాజల్ మరోసారి కౌంటింగ్ మొదలు పెట్టగా మొదటి నుంచి కౌంటింగ్ అవసరం లేదంటూ గొడవకు దిగింది సిరి. సంచాలకురాలిగా నీ పవర్‌ను వృధా చేస్తున్నావని కాజల్‌ను హెచ్చరించాడు రవి. అయినప్పటికీ ఆమె మాత్రం తన నిర్ణయానికి తిరుగులేదు అన్నట్లుగా వ్యవహరించింది. మరోసారి లెక్కించి రెడ్ టీమ్ దగ్గర 17, గ్రీన్ టీమ్ 24 ఉన్నట్లు ప్రకటించింది. దీంతో సిరి కూడా ఇక తప్పదన్నట్లుగా మరోసారి లెక్కపెట్టి బ్లూ టీమ్ 17, ఎల్లో టీమ్ 14 బొమ్మలు చేసినట్లు తెలిపింది. సిరి కన్నీరు, ఓదార్చిన షణ్ముఖ్ అయితే రెడ్ టీమ్ తమకు లభించిన స్పెషల్ బొమ్మ ద్వారా ఎల్లో టీమ్‌లోని సగం బొమ్మలను చెత్త బుట్టలో పడేసింది. అనంతరం బిగ్‌బాస్ హౌస్మేట్స్ మీద గరమయ్యాడు. శ్వేత, లోబో బిగ్‌బాస్ ఇంట్లోని కుషన్స్‌ను కట్ చేసి అందులోని దూది తీసి పాడు చేశారని ఆగ్రహించాడు, సంచాలకులైన కాజల్, సిరి దీన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంటూ వారిని కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో అనర్హులుగా ప్రకటించారు. దీంతో కెప్టెన్ అయ్యే ఛాన్స్ పోయిందేనని సిరి కన్నీరుపెట్టుకోగా షణ్ముఖ్ ఆమెను ఓదార్చాడు. కెప్టెన్సీకి పోటీపడేందుకు అర్హత సాధించిన సంతోషంలో బ్లూ టీమ్‌లోని మానస్ యానీ మాస్టర్‌ను ఎత్తుకుని తిప్పాడు. నీ మీదున్న ప్రేమ కంటే మానస్ మీదే ఎక్కువ ప్రేమ నీకు నీ మీదున్న ప్రేమ కంటే మానస్ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోందని ప్రియాంక గురించి ఆమెతోనే చెప్పుకొచ్చింది కాజల్. మానస్ కోసం ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్లు అనిపిస్తోందని చెప్పింది. దీంతో ఆలోచనలో పడిన పింకీ.. మానస్ విషయంలో తను చేస్తోంది తప్పా? అని అడిగింది. దానికి కాజల్ తప్పేం కాదని ఆన్సరిచ్చింది. ఇక విశ్వ సెల్ఫిష్ అని, అటెన్షన్ సీకర్ అని అభిప్రాయపడింది ప్రియ. మానస్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు: షణ్ముఖ్ ప్రియాంకకు గెలుపు పాఠాలు నేర్పిన జెస్సీ మీద ఫైర్ అయ్యాడు షణ్ముఖ్. మిగతావాళ్లకు ఎలాంటి సలహాలు ఇవ్వొద్దని నొక్కి చెప్తూ జెస్సీకి ఉచిత సలహా ఇచ్చాడు. అయితే ఇది ఇద్దరికీ(జెస్సీ, షణ్ను) వర్తిస్తుందని కౌంటరిచ్చింది సిరి. మేము చెప్తే అసలు వినదు ఈ పుడుంగి, పెద్ద చెప్పడానికి వచ్చింది అంటూ ఆమె మీద కౌంటరేశాడు షణ్ను. దీంతో హర్టయిన సిరి అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో తనను రమ్మని పిలువురా అంటూ జెస్సీని రాయబారం కోరాడు షణ్ను. అందుకు జెస్సీ నో చెప్పడంతో చేసేదేం లేక అతడే స్వయంగా వెళ్లి సారీ చెప్పి ఆమె కోపాన్ని చల్లార్చాడు. ఇక సన్నీ వల్ల మానస్ లాభపడుతున్నాడని అభిప్రాయపడ్డాడు షణ్ను. మానస్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని పేర్కొన్నాడు. పింకీని గెలిపించిన మానస్, సన్నీ మరోవైపు కాజల్.. నీ కోసం ముగ్గురు కొట్టుకుంటున్నారని మానస్‌తో ముచ్చట్లు పెట్టింది. పింకీతోపాటు ప్రియ నీ విషయంలో పొజెసివ్ అనిపిస్తుందని చెప్పుకొచ్చింది, కానీ మూడో వ్యక్తి ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు. అనంతరం రెడ్, బ్లూ టీమ్‌లోని ప్రియాంక సింగ్, యానీ మాస్టర్, ప్రియ, మానస్, సన్నీ, విశ్వలకు ఇసుకతో ఆట ఈజీ కాదు బేటా అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో విశ్వ విజేతగా నిలిచి హౌస్‌కు కెప్టెన్‌గా అవతరించాడు. షన్ మేనేజర్ పోస్టు కోసం పోటీపడ్డ మానస్, ప్రియాంక, సన్నీలకు డబ్బాల ధమాకా అనే టాస్క్ ఇచ్చాడు. అయితే సన్నీని గెలవద్దని అతడి కాళ్ల మీద పడినంత పని చేశాడు విశ్వ. దీంతో అతడి అభ్యర్థనకు ఓకే చెప్పి ఆటను తూతూమంత్రంగా కానిచ్చాడు. మొత్తానికి ఇందులో ఎక్కువ క్యారేజీలను సరిగా అమర్చి పింకీ గెలిచింది, కాదు మిగతా ఇద్దరు గెలిపించారు. నీకు మానస్ అన్నయ్య అవుతాడు: పింకీ అర్ధరాత్రి దుప్పటి కప్పుకుని పడుకున్న మానస్‌కు నుదుటన బొట్టు పెట్టేసింది పింకీ. ఇది చూసి అక్కడున్నవాళ్లంతా షాకయ్యారు. పింకీ మనసులోని భావాలను పాటల రూపంలో బయటపెట్టారు. మానస్ క్యూట్ ఉంటాడంటూ పింకీని మరింత ఉడికించింది సిరి, అయితే అతడి వైపు కన్నెత్తి చూడగానే ఆమెను కిందకు నెట్టేసి పడుకోమని హెచ్చరించింది పింకీ. నీకు మానస్ అన్నయ్య అవుతాడని చెప్పగా సిరి మాత్రం.. కానే కాదని, తను నా ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. -
బిగ్‌బాస్: కాజల్ కన్నింగ్ ప్లాన్.. ఫీలైన ప్రియాంక.. ఓదార్చిన మానస్
Bigg Boss Telugu, Episode 39 Highlights: గ్రీన్ టీం సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్ బొమ్మ రూపంలో స్పెషల్ పవర్ లభించిన విషయం తెలిసిందే. దీంతో వారు మిగిలిన మూడు టీమ్‌లలో తమకు నచ్చిన టీమ్ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు. దీంతో యాంకర్ రవి.. స్పెషల్ పవర్ ద్వారా ఎక్కువ బొమ్మలు తయారు చేసిన యానీ మాస్టర్ టీమ్ దగ్గర ఉన్న బొమ్మల్ని తీసేసుకున్నారు. దీంతో యానీ మాస్టర్ మరో ప్లాన్ చేసింది. శ్వేత దాచిపెట్టిన బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యాజీల మధ్య పెద్ద గొడవే జరిగింది.దీంతో బాగా హర్ట్ అయిన యానీ.. లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్షిప్ నాకొద్దంటూ బయటకు వచ్చేసింది. దీంతో బెడ్‌పై పడుకొని శ్వెత కన్నీటిపర్యంతమైంది.ఇక శ్వేతపై అరిచిన యానీమాస్టర్ తినడం మానేసింది. శ్వేత కూడా తినకుండా ఆగిపోయింది. దీంతో యానీ మాస్టర్.. రా తిందాం అని అడిగింది. యాంకర్ రవిది క్రిమినల్ మైండ్: సన్నీ రవి టీమ్‌కి వచ్చిన స్పెషల్ పవర్ కారణంగా అన్ని బొమ్మలను కోల్పోయిన బ్లూ కలర్ టీమ్ సభ్యులు( మానస్, సన్నీ, యానీ మాస్టర్).. చేసేదేమి లేక మూలన కూర్చొని బాధపడ్డారు. సన్నీ, మానస్ అయితే రవి గేమ్ ప్లాన్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అందరూ బొమ్మల్ని కష్టపడి కుడుతుంటే వాళ్లు మాత్రం చాలా రిలాక్స్‌గా ఉన్నారు.. ఇంత క్రిమినల్ మైండ్ నేనెక్కడా చూడలేదని సన్నీ అన్నాడు. ఇక మానస్ మాట్లాడుతూ.. ‘యాంకర్ రవి ఆన్సర్ షీట్ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడు.. రవికి ఆ బొమ్మలో స్లిప్ ఉందని ఎలా తెలుసు? అందుకే వాళ్లు మొదటి నుంచి చాలా కూల్‌గా ఉన్నారు. వాళ్లు పత్తి తీసుకుందాం బొమ్మలు కుట్టి గెలుద్దాం అని ఆడలేదు.. ఆ పవర్ ఉన్న బొమ్మ వస్తుంది.. దాన్ని గుంజుకుని.. ఎవరు ఎక్కువ బొమ్మలు చేస్తే వాళ్ల దగ్గర నుంచి తీసుకుందాం అనే ఆట ఆడారు’అన్నారు. ఫీలైన ప్రియాంక.. ఓదార్చిన మానస్ అర్థరాత్రి తర్వాత మానస్ దగ్గరకు వెళ్లిన ప్రియాంక.. కోపంగా ఉన్నావా? నీతో మాట్లాడొచ్చా అని అడిగింది. ఏం లేదు చెప్పు అన్నాడు మానస్. చెప్పాక తిట్టవు కదా అంది ప్రియాంక. తిట్టనులే చెప్పు అని మానస్ హామీ ఇవ్వడంతో.. టాస్క్‌ల్లో నేను వందశాతం ఎఫర్ట్ ఇస్తున్నానా? అని అడిగింది. హా ఇస్తున్నావ్ గా అని చెప్పాడు మానస్. దీంతో ప్రియ.. ‘నువ్ అంటుంటావ్ కదా.. నేనొక బార్డర్ పెడతా దాన్ని ఎవరూ క్రాస్ చేయలేరు అని.. నేనెప్పుడైనా అది క్రాస్ చేసినట్టు నీకు అనిపించిందా? అని అడిగింది. అదేం లేదు.. ఈ ప్రశ్న చాలాసార్లు అడుగుతున్నావ్ ఎందుకు? నేను బార్డర్ ఎందుకు పెడతా అంటే.. ఎదుటి వాళ్లు హర్ట్ అవుతారని.. ప్రతి ఒక్క రిలేషన్‌లోనూ ఎక్స్ పర్టేషన్స్ ఉంటాయి.. అది వాళ్లు రీచ్ కాలేకపోతే ఫీల్ అయిపోయినట్టు కాకుండా మంచి ఒపీనియన్ ఉండాలనే బార్డర్ పెడతా.. ఈ విషయం గురించి నన్ను పదే పదే అడిగి నువ్ ఇబ్బంది పడకు.. నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పాడు మానస్. దీంతో ప్రియాంక్ ఎమోషనల్ అయి ఏడ్చేసింది. మానస్ వెళ్లి ఓదార్చాడు. రవిని టార్గెట్ చేసిన కాజల్ తొలి నుంచి పక్కా ప్లాన్‌తో గేమ్ ఆడుతూ వస్తున్న కాజల్.. ఈ వారం ఎలాగైన కెప్టెన్ కావాలని ఫిక్స్ అయింది. తనకు పోటీ ఉండకూడదని రవిని తొలగించే ప్లాన్ వేసింది. సంచాలకురాలిగా తనకున్న అధికారాన్ని ఉపయోగించి రవికి చెక్ పెట్టే ప్లాన్ వేసింది. గతంలో చెక్ చేసి ఓకే చెప్పిన బొమ్మలను కూడా మళ్లీ పరిశీలించాలని పట్టుపట్టింది. సంచాలకులదే తుది నిర్ణయం కావడంతో.. కాజల్ చెప్పినట్టుగానే అన్ని బొమ్మలను మళ్లీ తీసుకొచ్చింది రవీ టీమ్. వాటిలో కొన్ని బొమ్మలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి కాజల్ కన్నింగ్ ప్లాన్‌ను రవి ఎలా ఎదుర్కొన్నారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
త్వరలో నీ గేమ్ బెడిసికొట్టే రోజొస్తుంది: రవికి కాజల్ వార్నింగ్
Bigg Boss Telugu 5, Episode 35: ఐదు రెట్ల ఫన్, ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్, ఐదు రెట్ల కాంట్రవర్శీ, ఐదు రెట్ల ఎఫైర్స్, ఐదు రెట్ల డ్రామా గ్యారెంటీ.. అంటూ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్. ఈ రియాలిటీ షో ప్రారంభమై అప్పుడే ఐదు వారాలు ముగిశాయి. ఈ వారం నామినేషన్లో ఏకంగా 9 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మరి వీరిలో నాగార్జున ఎవరిని సేవ్ చేశారు? ఎవరికి చీవాట్లు పెట్టారు? అనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 09) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! రవి అందరికీ బ్రెయిన్‌వాష్ చేస్తున్నాడు.. ఇంటిసభ్యులందరూ కలిసి తనను జైల్లో వేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది కాజల్. ఈ క్రమంలో ఆమెను ఊరడించాల్సింది పోయి అగ్గిపుల్ల గీకాడు మానస్. నువ్వు సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నావని యాంకర్ రవి తనతో అన్నాడంటూ కాజల్‌తో చెప్పుకొచ్చాడు. అతడు హౌస్‌లో అందరికీ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇది విన్న కాజల్ తన వెనక ఇంత కుట్ర జరుగుతోందా? అని ఓ లుక్కిచ్చింది. సిరికి క్లాస్ పీకిన నాగ్ వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు హాయ్ చెప్పిన నాగార్జున వచ్చీరాగానే శ్రీరామ్‌కు ఇబ్బందికర ప్రశ్న విసిరాడు. బిగ్‌బాస్ టైటిల్ ఇష్టమా? హమీదా ఇష్టమా? అని సూటిగా అడిగేశాడు. దీంతో కొద్ది క్షణాలపాటు ఆలోచించిన శ్రీరామ్ బిగ్‌బాస్ టైటిల్ అని తడుముకోకుండా ఆన్సరిచ్చాడు. అతడి సమాధానం విని మన్మథుడిలా నవ్వేసిన నాగ్.. నీ కెప్టెన్సీ బాగుందంటూనే, ఎవరి వంట వాళ్లు వండుకోవాలని ఆర్డర్ వేయడం బాగోలేదని చురకలంటించాడు. తర్వాత సిరిని నిల్చోబెట్టి క్లాస్ పీకాడు. రోజంతా పక్కవాళ్ల గురించి మాట్లాడటమే పనా? అని కడిగిపారేశాడు. ఎదుటివాళ్లకు నీతులు చెప్తాం కానీ మనం మాత్రం చేయమని కౌంటరిచ్చాడు. దీంతో సిరి సిగ్గుతో తలదించుకోక తప్పలేదు. రకుల్‌ను ప్రేమించావా?: వైష్ణవ్‌కు నాగ్ సూటి ప్రశ్న తర్వాత 'కొండపొలం' సినిమా టీమ్ బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేసింది. ఈ క్రమంలో నాగ్.. ఇంత చిన్నవయసులోనే రకుల్‌ను ప్రేమించేశావా అనడంతో వైష్ణవ్‌తేజ్ తెగ సిగ్గుపడ్డాడు. తర్వాత క్రిష్.. టాస్కులు ఆడకుండా ఈ ఎంటర్టైన్మెంట్ ముసుగులో ఎన్నాళ్లు ఉంటావని లోబోను నిలదీయడంతో అతడు నీళ్లు నమిలాడు. ఆ తర్వాత ప్రియాంక సింగ్ ఫినాలే గురించి మాట్లాడుతూ.. తనతో పాటు షణ్ముఖ్, రవి, మానస్, శ్రీరామ్ టాప్ 5లో ఉంటారని అభిప్రాయపడింది. కంటెస్టెంట్లను ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టించిన అనంతరం వైష్ణవ్ తేజ్, క్రిష్ బిగ్‌బాస్ స్టేజీకి వీడ్కోలు పలికారు. కావాలని వేలు చూపించలేదు: లోబో ఎవరైనా మిడిల్ ఫింగర్ చూపించారా? అని నాగ్ కాజల్‌ను ప్రశ్నించగా ఆమె అవునని తలూపింది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు వీడియో ప్లే చేయించాడు నాగ్. అందులో లోబో మిడిల్ ఫింగర్ చూపించినట్లు స్పష్టమైంది. అయితే తను కావాలని వేలు చూపించలేదని, అక్కడ పైన బల్లి తిరుగుతుంటే దాన్ని చూపించానంటూ దేవుడి మీద ఒట్టేశాడు. దీంతో చల్లబడిన నాగ్.. చేసింది తప్పే.. కానీ కావాలని చేయలేదంటున్నావు, దాన్ని మేమంతా నమ్ముతున్నాం అనడంతో లోబో ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం నాగ్.. హౌస్‌మేట్స్‌తో రూలర్ ఎవరు? బానిస ఎవరు? అన్న టాస్క్ ఆడించాడు. మొదటగా వచ్చిన కెప్టెన్ ప్రియ.. శ్రీరామ్ రూలర్, హమీదా బానిస అని చెప్పింది. శ్రీరామ్.. హౌస్ అంతా తన గురించి మాట్లాడుకునేలా చేసిన కాజల్ రూలర్, షణ్ముఖ్ బానిస అని పేర్కొన్నాడు. ఇన్ఫ్లూయెన్స్ చేసే రవి బానిస: కాజల్ కాజల్.. అందరితో మంచిగుండాలనుకునే ప్రియను రూలర్‌గా, అందరినీ ఇన్ఫ్లూయెన్స్ చేసే రవిని బానిసగా చెప్పుకొచ్చింది. త్వరలోనే రవి గేమ్ రవికే బెడిసికొట్టే రోజు వస్తుందని హెచ్చరించింది. ప్రియాంక సింగ్.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలైంది. రవి.. మానస్‌ను రాజుగా, ప్రియాంక సింగ్‌ను బానిసగా తెలిపింది. సన్నీని రాజుగా చూసుకుంటానంటూ మానస్.. తన బెస్ట్ ఫ్రెండ్‌కు కిరీటం ధరించాడు. శ్రీరామ్‌తో ఎక్కువ కనెక్ట్ అయి, గేమ్‌కు డిస్కనెక్ట్ అవుతున్నావంటూ హమీదాను బానిసగా ఫీలయ్యాడు. ఈ వారం హమీదా కనిపించనేలేదు: షణ్ను సన్నీ.. మానస్ రాజు, విశ్వ బానిస అని పేర్కొన్నాడు. లోబో.. సన్నీకి కిరీటం ధరించి రాజును చేయగా విశ్వను బానిస అని తెలిపాడు. తర్వాత షణ్ముఖ్.. నాకు నేనే రాజు అని ప్రకటించుకున్నాడు. దీంతో నాగ్.. ఇలాంటి పని చేశావు కాబట్టే 8 మంది నామినేట్ చేశారని కౌంటరిచ్చాడు. దీంతో కొంత వెనక్కు తగ్గని షణ్ను.. మైండ్‌గేమ్ ఆడిన రవి కింగ్ అని చెప్తూనే, ఈ వారం మొత్తంలో హమీదా ఎక్కడా కనిపించలేదంటూ ఆమెను బానిసగా అభివర్ణించాడు. ఇక హమీదా.. మానస్‌ను రాజుగా, సన్నీని బానిసగా ఫీలైంది. తర్వాత శ్వేత.. ఇన్ఫ్లూయెన్స్ చేసే కాజల్ రాణి, ఇన్ఫ్లూయెన్స్ అయ్యే మానస్ బానిస అని అభిప్రాయపడింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు రాజు.. జెస్సీ.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలయ్యాడు. యానీ మాస్టర్.. సన్నీని రాజుగా, లోబోను బానిసగా పేర్కొంది. సిరి.. రవికి కిరీటం తొడిగించి రాజుగా అందలం ఎక్కించగా, శ్రీరామ్‌ను బానిసగా ఫీలైంది. తర్వాత విశ్వ వంతు రాగా.. అతడు రవిని రాజుగా కీర్తించాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు రవి అని మెచ్చుకున్నాడు. కెప్టెన్ ప్రియను మాత్రం బానిసగా పేర్కొన్నాడు. 9 మంది నామినేషన్లో ఉన్నప్పటికీ నాగార్జున ఈరోజు ఎవరినీ సేవ్ చేయకపోవడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మాత్రం హమీదా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి, -
కనెక్షన్ వద్దని తేల్చేసిన కంటెస్టెంట్లు.. కాజల్ ఒంటరి రోదన
Bigg Boss Telugu 5, Episode 34: ప్రతివారం బిగ్‌బాస్ హౌస్‌లో బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకుంటున్న సంగతి తెలిసిందే కదా! ఈ వారం కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. కానీ బెస్ట్‌గా ఆడినవాళ్లను అలా ఉంచి ఎవరు చెత్తగా ఆడారో చెప్పమని ఆదేశించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో కాజల్‌తో మాకసలు కనెక్షనే వద్దంటూ ఆమెకు దండం పెట్టేశారు హౌస్మేట్స్. నేటి ఎపిసోడ్ చూస్తుంటే దాదాపు హౌస్మేట్స్ అంతా కలిసి కాజల్ మీద దండయాత్ర చేసినట్లే కనిపించింది. మరి కాజల్ వీటిని ఎలా ఎదుర్కొంది? నేటి(అక్టోబర్ 08) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదవాల్సిందే! గోరుముద్దలు పెడతానంటే గోల చేసిన మానస్ బిగ్‌బాస్ ఇచ్చిన ప్రత్యేక అధికారంతో కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచిన ప్రియ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా అవతరించింది. మరోపక్క టాస్క్‌లో శ్వేత తనకు సపోర్ట్ ఇవ్వలేదని తెగ ఫీలయ్యాడు సన్నీ. ఈ క్రమంలో మానస్, సన్నీ తెగ ఏడ్చేశారు. ఎందుకింత ఎమోషనల్ అవుతున్నారో అర్థం కాని లోబో, విశ్వ వారిని ఊరడించేందుకు ప్రయత్నించారు. మరోపక్క పింకీ మానస్‌కు తినిపించాలని ఎంతో ప్రేమకొద్దీ ప్లేటు పట్టుకుని వెళ్లింది. కానీ అతడు మాత్రం తనకు వద్దని కటువుగా ఆన్సరివ్వడంతో చిన్నపిల్లలా ఏడ్చేసింది. బలిపీఠం ఎక్కించి నీళ్లు గుమ్మరించాలి.. ఇక సన్నీ, శ్వేత.. వారిమధ్య వచ్చిన మనస్పర్థలను చెరిపేసుకుని తిరిగి మామూలు ఫ్రెండ్స్‌లా మారిపోయారు. గేమ్‌లో అన్నీ సాధారణమేనంటూ తిరిగి కలిసిపోయారు. అనంతరం బిగ్‌బాస్.. ఈ వారం వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకుని జైలుకు పంపించాల్సి ఉంటుందని ఆదేశించాడు. అందులో భాగంగా.. కంటెస్టెంట్లు దోషి అనుకుంటున్న వ్యక్తులను బలిపీఠం ఎక్కించి, అందుకు తగిన కారణాలు చెప్పి, వారి ముఖం మీద నీళ్లు చల్లాల్సి ఉంటుంది. దయచేసి ఫ్రెండ్షిప్ను చెడగొట్టవద్దు మొదటగా వచ్చిన శ్వేత.. తనకు, సన్నీ, యానీకి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని, దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్‌తో చెడగొట్టవద్దని కాజల్‌కు హితవు పలికింది. తర్వాత వచ్చిన జెస్సీ.. నా ఫుడ్ నన్ను వండుకోమని ఆర్డర్ చేయడం నచ్చలేదంటూ శ్రీరామ్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. ఈ క్రమంలో శ్రీరామ్, జెస్సీకి మధ్య పెద్ద ఫైటే నడిచింది. ఇక టాస్క్‌లో చిల్లర, థూ అంటూ మాటలు జారడం నచ్చలేదని విశ్వను వరస్ట్ పర్ఫామర్‌గా నామినేట్ చేశాడు షణ్ముఖ్, సిరి, ప్రియ. అనంతరం హమీదా.. మన మధ్య ఏ రిలేషన్ ఉండొద్దంటూ కాజల్ ముఖం మీద నీళ్లు గుమ్మరించింది. ఇక నుంచి ఆ రిలేషన్ కూడా వద్దు: కాజల్ శ్రీరామ్.. కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొనడంతో ఆమె బాగా హర్టయ్యింది. ఇక నుంచి మన మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కూడా వద్దని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఆమె దెబ్బకు దెబ్బ అన్న రీతిలో శ్రీరామ్‌నే వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడింది. 'నువ్వు నన్ను చీడపురుగులా చూస్తావు, అనుమానిస్తావు.. ఇకనుంచి నిన్ను బ్రదర్ అని పిలవను' అని చెప్తూ అతడి ముఖం మీద నీళ్లు గుమ్మరించింది. తన కోపాన్ని చూపించలేక యానీ మాస్టర్ వింత ప్రవర్తన కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్న యానీ మాస్టర్ ఆమె మీద కోపంతో తన ముఖం మీద తానే నీళ్లు గుమ్మరించుకుంది. తర్వాత ప్రియాంక సింగ్.. విశ్వ నోరు జారాడంటూ వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకుంది. అనంతరం వచ్చిన లోబో.. టాస్క్‌లో రవిని వెన్నుపోటు పొడిచావంటూ కాజల్ మీద నీళ్లు పోశాడు. ఇక రవి వంతురాగా.. నేను కిచెన్‌లో పని చేయలేదని స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు అంటూ కాజల్‌ను నిందించాడు. దీంతో ఆమె ముందు నన్ను ఫ్రెండ్ అని పిలవడం మానేయమని హెచ్చరించింది. దీంతో చిర్రెత్తిపోయిన రవి.. నామీదకు చేయి ఎత్తొద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఉద్వేగానికి లోనైన కాజల్.. శ్రీరామ్ సంచాలకుడిగా సరిగా పని చేయట్లేదంటూ మానస్, సన్నీ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. తర్వాత వచ్చిన విశ్వ కూడా కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. అయితే హౌస్‌లో ఇంతమంది తనను వరస్ట్ అనుకుంటున్నారని అర్థమైన కాజల్ తన కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఎక్కువమంది దోషిగా అభిప్రాయపడ్డ కాజల్‌ను బిగ్‌బాస్ జైల్లో వేయమని చెప్పగానే కంటతడి పెట్టుకుంది. -
వరస్ట్ పర్ఫామర్ ఎవరు? ఈ వారం జైలుకు వెళ్లేది ఆవిడేనా?
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఎటు పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. సీజన్ మొత్తానికి కెప్టెన్ కాలేరన్న ప్రియను బిగ్‌బాస్ ప్రత్యేక అధికారంతో కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కల్పించడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. దీంతో ఎవరు చెత్త ఆటగాళ్లనుకుంటున్నారో వారిని బలిపీఠం ఎక్కించి ముఖం మీద నీళ్లు గుమ్మరించాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో శ్వేత మాట్లాడుతూ.. 'నాకు, సన్నీ, యానీ మేడమ్‌కు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, అది టాస్క్ వల్ల ఎండ్ అయ్యేది కాదు. సో ఇన్ఫ్లూయెన్స్ చేయడానికి ట్రై చేయకండి' అని సూచిస్తూ కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది. ఇక మరోసారి జెస్సీ, సిరి, షణ్ముఖ్ గ్యాంగ్‌కు శ్రీరామ్‌కు మధ్య రచ్చ మొదలైనట్లు తెలుస్తోంది. తాను వయొలెంట్‌గా ఉన్నానంటూ సిరి గ్యాంగ్ సభ్యులందరూ చేయెత్తడంతో శ్రీరామ్ ఖంగు తిన్నాడు. తర్వాత రవికి కాజల్‌కు మధ్య కూడా గట్టి ఫైట్ నడిచినట్లు కనిపించింది. ఎవరి మీదా చేయెత్తొద్దు అంటూ కాజల్‌కు నీతి వాఖ్యాలు బోధించాడు రవి. చివర్లో యానీ మాస్టర్ ఎవరి ముఖం మీదా నీళ్లు గుమ్మరించలేక తన ఫేస్ మీద తానే నీళ్లు చల్లుకోవడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న లీకుల ప్రకారమైతే ఈవారం కాజల్ వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలుకు వెళ్లినట్లు సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
కాజల్‌కు మిడిల్ ఫింగర్ చూపించిన లోబో, వేలు నరికేస్తానన్న పింకీ!
Bigg Boss Telugu 5, Episode 31: కెప్టెన్ శ్రీరామ్ ఎప్పుడైతే ఎవరి ఫుడ్ వాళ్లు వండుకుని తినాలని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటినుంచి సిరి గ్యాంగ్‌కు యాంటీ అయిపోయాడు. జెస్సీ మాటతీరు వల్లే తాను అలా అనాల్సి వచ్చిందని అతడు నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ సిరి, షణ్ను వినిపించుకోలేదు. జెస్సీ తన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి స్టాండ్ తీసుకున్నానని షణ్ను, అయినా మధ్యలో ఏజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావని సిరి శ్రీరామ్ మీద ఒంటికాలిపై లేచారు. మొత్తంగా ఈ గొడవతో అటు సిరి, షణ్ను, జెస్సీ, ఇటు శ్రీరామ్, హమీదా ఏమీ తినకుండా ఫుడ్ మీద తమ ప్రతాపాన్ని చూపించారు. తమ పేరెంట్స్‌కు టీవీ, వాచ్, స్మార్ట్ ఫోన్ గిఫ్టులుగా ఇచ్చిన కంటెస్టెంట్లు.. అయితే నీకు ఆకలేస్తే తినంటూ శ్రీరామ్ హమీదాను బుజ్జగించాడు. కానీ ఆమె అందుకు నిరాకరించడంతో పస్తులతోనే పడుకున్నారు. అయితే తర్వాతి రోజు అందరూ వారి గిల్లికజ్జాలను పక్కన పెట్టి టిఫిన్ కుమ్మేసినట్లు కనిపించింది. అనంతరం అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో భాగంగా పలువురు ఇంటిసభ్యులు వారి ఫ్యామిలీకి బహుమతులను అందించే అవకాశాన్ని కొట్టేశారు. ఇందుకోసం కెప్టెన్ శ్రీరామ్.. ప్రియ, షణ్ముఖ్, హమీదా, మానస్‌లను ఎంచుకున్నాడు. మొదటగా ప్రియ.. తన తల్లికి టీవీని బహుమతిగా ఇచ్చే అవకాశాన్ని అందుకుంది. తర్వాత షణ్ముఖ్.. డైరెక్టర్ సుబ్బుకు ల్యాప్‌టాప్ బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. మానస్.. తన తల్లికి బ్రాండెడ్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు వెల్లడించాడు. హమీదా.. తన తల్లికి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇస్తున్నట్లు తెలిపింది. మజాక్ అనేది కొంతవరకు ఉంటేనే బెటర్.. ఇక రవి, కాజల్ మధ్య మరోసారి అగ్గి రాజుకుంది. నెల రోజుల నుంచి లోబో, రవి వాష్‌రూమ్ క్లీనింగ్ తప్ప కిచెన్ వంకే చూడట్లేదని సెటైర్ వేసింది కాజల్. దాన్నే కాస్త పొడిగిస్తూ డ్యాన్సులు కూడా చేసింది. అయితే మజాక్ అనేది కొంతవరకు ఉంటేనే బెటర్ అని కాజల్‌పై చిరాకుపడ్డాడు రవి. ఇక లోబో అయితే ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించి ఆమెకు ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో లోబో చేసింది తప్పని వాదించింది కాజల్. ఇదే విషయాన్ని కాజల్ పింకీతో చెప్పుకురాగా.. తనకుగానీ అలా వేలు చూపిస్తే కట్ చేసి పడేస్తానని హెచ్చరించింది. బిగ్‌బాస్ హౌస్‌లో హింసకు తావు లేనందున అక్కడి నుంచి సైలెంట్‌గా వచ్చేశానంది కాజల్. రవిని ఫ్రెండుగా ఉండమని నేనేమైనా అడిగానా?: కాజల్ నెల రోజులన నుంచి కిచెన్‌లో తానేమీ పని చేయలేదని ఎలా స్టేట్మెంట్ ఇస్తావని కాజల్‌ను నిలదీశాడు రవి. దీంతో మాట మార్చిన కాజల్.. కేవలం మీకు కిచెన్ డ్యూటీ రాలేదని మాత్రమే అన్నానని కవర్ చేసింది. కాజల్ వింత ప్రవర్తన చూసిన మానస్ ఎందుకు అరుస్తున్నావు? ఎవరి మీద అరుస్తున్నావు? అని ప్రశ్నించాడు. ఇదేమీ పెద్దగా పట్టించుకోని కాజల్.. అయినా రవిని నా ఫ్రెండుగా ఉండమని ఎప్పుడైనా అడిగానా? అని అసహనానికి లోనైంది. లోబో మిడిల్ ఫింగర్ చూపిస్తే సపోర్ట్ చేస్తున్నావు అనడంతో షాకైన రవి.. అలా వేలు చూపించడం తప్పని లోబోను కూడా హెచ్చరించానన్నాడు. ఇక శ్రీరామ్ వీళ్ల మధ్య గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేశాడు కానీ ఎవరూ అతడు మాటను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ రాజు దగ్గర ఎక్కువ ధనం ఉంటే ఆ రాజ్యంలోని వాళ్లే కెప్టెన్సీకి అర్హులు తర్వాత బిగ్‌బాస్.. 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్‌లో భాగంగా ఇద్దరు రాజులు రవి, సన్నీ సింహాసనాన్ని గెలుచుకోవడానికి పోటీపడతారు. మిగతా ఇంటి సభ్యులు ప్రజలుగా వ్యవహరిస్తారు. ఇద్దరు రాకుమారులు వారి దగ్గరున్న ధనాన్ని టాస్క్‌లతో పాటు సేవలు చేయించుకోవడానికి వినియోగించుకోవాల్సి ఉంటుంది. టాస్క్ పూర్తయ్యే సమయానికి ఏ రాకుమారుడికి ఎక్కువ మద్దతు లభిస్తే వాళ్లు సింహాసనాన్ని అధిష్టిస్తారు. అందరి కంటే ఎక్కువ ధనం ఉన్న రాజు, అతడి ప్రజలు కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని అందుకుంటారు. దీంతో రవి, సన్నీ సపోర్ట్ కోసం హౌస్మేట్స్ వెంట పడ్డారు. ఈ క్రమంలో యాంకర్ రవికి విశ్వ, శ్రీరామ్, హమీదా, శ్వేత, యానీ మాస్టర్ సపోర్ట్ చేయగా.. సన్నీకి మానస్, లోబో, ప్రియాంక సింగ్, ప్రియ, సిరి, షణ్ముఖ్, జెస్సీ మద్దతుగా నిలబడ్డారు. తర్వాత సడన్‌గా సిరి.. రవి గ్యాంగ్‌లో జాయిన్ అయిపోయింది. అయితే ఖజానాలో నుంచి ఒక్క పైసా దొంగిలించేది లేదని విశ్వ కుండ బద్ధలు కొట్టి చెప్పేశాడు. కానీ జెస్సీ, సిరి, షణ్ముఖ్, కాజల్ మాత్రం దొంగిలించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతలో ఖజానాలో నుంచి నాణాలు పోయాయని గుర్తించిన విశ్వ.. ఇవన్నీ చేతగానోళ్లు చేసే పనులంటూ చీదరించుకున్నాడు. తర్వాత బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన 'మట్టిలో మహాయుద్ధం' అనే కుస్తీపోటీలో రవి వైపు నుంచి నుంచి విశ్వ, శ్వేత, యానీ మాస్టర్; సన్నీ వైపు నుంచి మానస్, జెస్సీ, పింకీ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఏ రాజు గెలిస్తే అతడికి 150 నాణాలు లభిస్తాయి. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారనే విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టారు. ఈ గేమ్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే! -
బిగ్‌బాస్: నీకు సరదానేమో.. నాకు కాదు: కాజల్‌కు రవి వార్నింగ్
Heated Argument Between Ravi and Kajal: బిగ్‌బాస్ ఐదో సీజన్లో గొడవల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. సోమవారం ఎపిసోడ్లో కిచెన్‌లో పనుల పంపకాల్లో బేధాభిప్రాయాలు రావడంతో కెప్టెన్ శ్రీరామ్, జెస్సీ, షణ్ముఖ్, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. జెస్సీ ఫుడ్ జెస్సీనే వండుకుని తినాలని కెప్టెన్ శ్రీరామ్ ఆదేశించడం.. దీనిపై సిరి, షణ్ను సీరియస్ అవ్వడంతో ఇంట్లో యుద్ద వాతావరణం కనిపించింది. చివరకు శ్రీరామ్ ప్లేట్లో అన్నం తీసుకొచ్చి జెస్సీ, షణ్నూలకు తిపిపించడంతో గొడవ సమసిపోయినట్లు అనిపించింది. దీంతో ఇంట్లో అంతా హ్యాపీగా గేమ్‌పై ఫోకస్ పెడుతారనుకుంటున్న క్రమంలో రవి, కాజల్‌ల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తాజాగా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. బెడ్రూమ్లో పడుకుని ముచ్చట్లు పెట్టుకుంటున్న రవి, లోబోల దగ్గరకు వెళ్లిన కాజల్.. ‘నిన్న గొడవ జరిగింది దేనికి అంటే.. రవి, ఇంకా లోబో వాష్ రూమ్‌లో నుంచి లేచి, డిన్నర్‌లోకి రావడానికి’ అని సరదాగా ఆటపట్టిస్తూ చిందులేసింది. అదికాస్త పెద్ద గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. కాజల్ మాటలను సీరియస్‌గా తీసుకున్న రవి. అలా ఎలా అంటావంటూ. ఆమెపై ఫైర్ అయ్యాడు. ‘నేను సరదాగా అన్నాను’ అని కాజల్ చెప్పగా, ‘నీకు సరదానేమో, అవతలి వ్యక్తికి కాదు, అది తెలుసుకోకుండా ఎలా వస్తారు’అంటూ రవి ఫైర్ అయ్యాడు. అంతే కాదు రెచ్చగొట్టడం నాకు కూడా వస్తుందంటూ కాజల్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈ మాటల యుద్దం ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్‌లో ఆ లేడీ కంటెస్టెంట్‌కే ఓటేయండి: హరితేజ
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ పలు భాషల్లో ప్రసారమవుతోంది. తెలుగులో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఐదో సీజన్ కొనసాగుతోంది. సోషల్ మీడియా సెన్సేషన్లను, యూట్యూబ్ స్టార్ల మీద ఫోకస్ పెట్టిన బిగ్‌బాస్ నిర్వాహకులు ఈసారి కూడా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ముఖాలనే హౌస్‌లోకి పంపించారు. కానీ రోజులు గడిచేకొద్దీ వారి ఆటతో, కొట్లాటలతో, లవ్ ట్రాకులతో చాలా తొందరగానే ఫేమస్ అయ్యారు. ఇదిలా వుంటే పలువురు కంటెస్టెంట్లకు బయట సెలబ్రిటీల నుంచి సపోర్ట్ గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నటి ప్రియకు గత సీజన్ బిగ్‌బాస్ రన్నరప్ అఖిల్ సార్థక్ మద్దతిస్తుండగా మానస్‌కు హీరో సందీప్ కిషన్ సపోర్ట్ చేస్తున్నాడు. సన్నీకి బుల్లితెర సెలబ్రిటీల సపోర్ట్ ఉండనే ఉంది. తాజాగా ఆర్జే కాజల్‌కు మద్దతూ పలుకుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చింది హరితేజ. మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన హరితేజ కాజల్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని, అందులో సందేహమే లేదంటోంది. ఈ వారం నామినేషన్లో ఉన్న ఆమెకు అభిమానులందరూ ఓట్లు వేసి సేవ్ చేయాలని కోరుతోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కాజల్ తప్పకుండా టాప్ 5లో ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది. అప్పటివరకు ఆమెకు అందరూ సపోర్ట్ చేయమని అభ్యర్థించింది. -
తలదించుకున్న రవి, చెప్పుతో కొట్టినా పడతానన్న లోబో
Bigg Boss Telugu 5, Episode 23: బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లను ఎప్పుడూ వెంటాడే గండం నామినేషన్స్. ఈ నామినేషన్స్‌లో ఇరుక్కున్నవాళ్లు వారమంతా బిక్కుబిక్కుమంటూ టెన్షన్‌తోనే గడపాల్సి వస్తుంది. నామినేట్ కాని ఇంటిసభ్యులు ఎంచక్కా జాలీగా గడుపుతూ ఇంకో వారం దాకా మన బెర్త్‌కు ఏ ఢోకా లేదని ధీమాగా ఉంటారు. నేటి(సెప్టెంబర్ 27) ఎపిసోడ్లో నామినేషన్స్ వాడివేడిగా జరిగాయి. ఒక్కొక్కరి బండారాలు బయటపెడుతూ నామినేట్ చేసుకున్నారు ఇంటిసభ్యులు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేద్దాం... నువ్వంటే ఇష్టం, ఎలా కనెక్ట్ అయ్యానో తెలీదు: హమీదా లహరి విషయంలో అమ్మ మీద ఒట్టేసి అబద్ధం ఎలా చెప్పానని యాంకర్ రవి తనలో తానే మథనపడ్డాడు. తర్వాత ఇంట్లోకి వచ్చిన అతిథి బేబీ బొమ్మను బిగ్‌బాస్ తిరిగి తీసుకున్నాడు. ఇక హమీదా.. నువ్వంటే నాకిష్టం, నీకు ఎలా కనెక్ట్ అయ్యానో తెలీదు అంటూ మరోసారి శ్రీరామ్ దగ్గర ప్రేమ ఊసులు మాట్లాడింది. అతడు మాత్రం ఇంకా వివరంగా చెప్పంటూ అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగోవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు ఇంటిసభ్యుల ముఖాల్లోని ఒక భాగాన్ని తీసివేసి స్విమ్మింగ్ పూల్‌లో వేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. చెప్పు తీసుకుని కొట్టు వింటాను, కానీ..: లోబో మొదటగా వచ్చిన ప్రియ.. తనతో సరిగా ఉండట్లేదని లోబో, మానస్‌ను నామినేట్ చేసింది. విశ్వ.. రవి, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. లోబో.. నేను లైఫ్‌లో ఒకే ఒక అమ్మాయిని ప్రేమించా. నా లవ్ గురించి చెప్తుంటే నువ్వు అది సినిమా స్టోరీలా ఉందన్నావు. ఆ మాటతో నా ఖలేజా పగిలిపోయింది. నన్ను తిట్టు, చెప్పు తీసుకుని కొట్టు వింటా.. కానీ అలా మాట్లాడకు అంటూ ప్రియపై గయ్యిమని అరిచాడు. అతడు తన మీదకు అలా దూసుకురావడంతో షాకైన ప్రియ.. నాపై అరిచే హక్కు నీకు లేదని వార్నింగ్ ఇచ్చింది. ఆ టైంలో ఆకలేంటి?: లోబో అయినప్పటికీ వెనక్కు తగ్గని లోబో.. నేను ప్రేమించిన, టైంపాస్ చేయలే, అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చిన అని చెప్తుండగా మధ్యలో అడ్డుకున్న ప్రియ.. తెలుస్తుంది అమ్మాయిలకు ఎంత గౌరవమిస్తావో అని కౌంటరిచ్చింది. జనాలవల్లే తానీ స్టేజీలో ఉన్నానంటూ అరిగిన టేపు రికార్డర్‌లా చెప్పిందే మరోసారి చెప్పాడు లోబో. అంతలోనే ఆకాశం వంక చూసి ఏడ్చేయడంతో రవి అతడిని ఓదార్చాడు. ఈ సీన్ చూసిన ప్రియ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడొద్దు అని చురకలంటించింది. తర్వాత అతడు సిరిని నామినేట్ చేస్తూ.. కాజల్ లవ్‌స్టోరీ చెప్తుండగా ఆకలేస్తోంది అని ఎలా అనగలిగావని విమర్శించాడు. ప్రతిసారి బస్తీ నుంచి వచ్చాననకు: చిరాకు పడ్డ షణ్ముఖ్ శ్రీరామ్.. లాస్ట్ వీక్ తనను నామినేట్ చేసిన శ్వేత, యానీ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. తర్వాత షణ్ముఖ్.. మీ వల్ల ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నానంటూ రవిని, ప్రియకు రెస్పెక్ట్ ఇవ్వలేదని లోబోను నామినేట్ చేశాడు. దీంతో లోబో మరోసారి తను పేదవాడినంటూ ఫ్లూటు వాయించాడు. దీంతో చిర్రెత్తిపోయిన షణ్ను ప్రతిసారి బస్తీ నుంచి, కింది నుంచి వచ్చానని చెప్పొద్దు, అందరం అక్కడి నుంచే వచ్చామంటూ అతడి నోరు మూయించాడు. తర్వాత వచ్చిన కాజల్.. నామినేషన్స్‌ను వ్యక్తిగతంగా తీసుకుంటారని నటరాజ్ మాస్టర్‌ను, సేఫ్ గేమ్ ఆడొద్దంటూ సన్నీని నామినేట్ చేసింది. మధ్యలో దూరి ఏదో ఒకటి అనేయకండి: మానస్ హెచ్చరిక లోబో ఎప్పుడెలా ఉంటాడో ఎవరికీ తెలీదు, అప్పుడప్పుడు కామెడీ కూడా లిమిట్ దాటుతుంది. మీరు సింపథీకి ట్రై చేస్తున్నారనిపిస్తోందంటూ సిరి లోబోను, తర్వాత యానీ మాస్టర్‌ను నామినేషన్లోకి పంపించింది. మానస్.. నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేయగా ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇద్దరు మాట్లాడినప్పుడు మధ్యలో దూరి ఏదో ఒకటి అనేయకండని మానస్ హెచ్చరించాడు. అసభ్యకరమైన భాష వాడొద్దని లోబో ఫొటోలో నుంచి ఓ ముక్కను విసిరేశాడు. శ్వేత.. లోబో, రవిని; హమీదా.. లోబో, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశారు. డైరెక్ట్‌గా చేయి పెట్టడం నచ్చలేదు: ప్రియాంక సింగ్ నటరాజ్ మాస్టర్.. అతిగా నటించకూడదు, నువ్వు వీక్ అనిపిస్తోంది అంటూ విశ్వను చిన్నచూపు చూస్తూ నామినేట్ చేశాడు. నువ్వెవరివి నన్ను నటిస్తున్నావని డిసైడ్ చేయడానికి అని విశ్వ ఫైర్‌కావడంతో మాస్టర్ మీసం మెలేస్తూ మరింత రెచ్చగొట్టాడు. 'సింహంతో వేట నాతో ఆట రెండూ ప్రమాదకరమే, అది అడవిలో ఉంటది, ఇది బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటుంది' అని డైలాగులు వల్లె వేయడంతో కాజల్ ఫక్కున నవ్వేసింది. మీకోసం వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఫామ్ అవుతుందన్న ఆలోచనే తప్పని నొక్కి చెప్పింది, కానీ అతడు వినిపించుకోనేలేదు. ఇక తనను ఇన్ఫ్లూయెన్స్ చేయొద్దని హెచ్చరిస్తూ రవిని నామినేట్ చేశాడు మాస్టర్. ప్రియాంక సింగ్.. సోఫాలో నిలబడ్డప్పుడు మీరు డైరెక్ట్‌గా చేయి పెట్టారు. అది నాకు నచ్చలేదంటూ లోబోను తర్వాత కాజల్‌ను నామినేట్ చేసింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయిన యాంకర్ రవి అనంతరం వచ్చిన రవి.. అందరి ముందుకు రావాలంటేనే సిగ్గుగా ఉందని తలదించుకున్నాడు. శనివారం నా జీవితంలోనే వరస్ట్ రోజు. నేను ముగ్గురికి.. ప్రియ, లహరి, అమ్మకు సారీ చెప్తున్నాను. ప్రియకు చెప్పిన మాటను చెప్పలేదంటూ అమ్మ మీద ఒట్టేశాను అని బాధతో పశ్చాత్తాపపడ్డాడు. తనను కొట్టిందంటూ కాజల్‌ను, మీరు గుంటనక్క అని తననే అన్నారంటూ నటరాజ్ మాస్టర్‌ను రవి నామినేట్ చేశాడు. తర్వాత యానీమాస్టర్ తనను నామినేట్ చేసిన శ్రీరామ్, సిరి ఫొటోల ముక్కలు పూల్‌లో వదిలేసింది. సన్నీ.. తనను పదేపదే సేఫ్ గేమ్ ఆడుతున్నారన్న ప్రియ, కాజల్‌ను; జెస్సీ.. ప్రియాంక, రవిని నామినేట్ చేశారు. మొత్తంగా ఈ నాలుగో వారం నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. -
బిగ్‌బాస్: నాలుగోవారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది!
'బిగ్‌బాస్‌లో అన్ని టాస్కుల యందు నామినేషన్ టాస్కు వేరయా!' అంటారు బుల్లితెర అభిమానులు. ఎందుకంటే అప్పుడే కదా కంటెస్టెంట్లు కొట్టుకునేది, తిట్టుకునేది, అరుచుకునేది.. ఆ సమయంలోనే కదా వారి నిజస్వరూపాలేంటో తెలుసుకునేది! అందుకనే బిగ్‌బాస్ వీక్షకులకు మండే వచ్చిందంటే చాలు పండగే! టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చూస్తుండగానే మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి షారి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. తాజాగా నాలుగో కంటెస్టెంట్‌ను బయటకు పంపిచేందుకు నామినేషన్స్ జరగనున్నాయి. అయితే ఈ నామినేషన్ల పర్వానికి సంబంధించిన షూటింగ్ నిన్ననే పూర్తి కావడంతో ఈవారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారంటూ తాజాగా ఓ లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లిస్టులో సిరి హన్మంత్, ప్రియ, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, యాంకర్ రవి, వీజే సన్నీ, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. మరి నాలుగోవారం నామినేషన్లో ఉన్నది ఈ 8 మందేనా? అన్నదానిపై స్పష్టత రావాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
అందరూ కలిసి కాజల్‌ను పని మనిషిని చేశారు!
Bigg Boss 5 Telugu, Episode 13: మానస్‌లో చాలా మార్పొచ్చిందని శ్రీరామ్‌తో ముచ్చట్లు పెట్టాడు విశ్వ. మరోవైపు ఇంటిసభ్యులను ఇమిటేట్ చేస్తూ శ్వేతను తెగ నవ్వించాడు జెస్సీ. అతడిలో ఈ టాలెంట్ చూసిన శ్వేత.. నీలో చాలా షేడ్స్ ఉన్నాయిరా అని కామెంట్ చేసింది. అనంతరం రెండోవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ మొదలైంది. ఇందులో భాగంగా స్క్రీన్‌పై చూపించిన కంటెస్టెంట్లు బజర్ మోగగానే బంతిని పట్టుకోవాలి. పట్టుకున్న బంతిపై ఏ ఫుడ్ రాసి ఉంటుందో దాన్ని మాత్రమే పంపిస్తాడు బిగ్‌బాస్. టాస్క్ స్టార్ట్ అవగానే విశ్వ, లహరి, లోబో, సిరి.. ఎవరూ బాల్ పట్టుకోలేకపోయారు. కానీ నటరాజ్ మాస్టర్, ప్రియాంక మాత్రం బాల్ క్యాచ్ చేసి ఇంట్లో వాళ్లకు ఫుడ్ దొరికేలా చేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొదలైందిగా.. ఇదిలా వుంటే శ్రీరామచంద్ర నీమీద ఆసక్తి చూపిస్తున్నాడంటూ కాజల్ హమీదాతో చెప్పింది. సన్నీ కూడా నిన్ను తెగ ఇష్టపడతాడని యానీ మాస్టర్ నొక్కి చెప్పింది. అయితే హమీదా మాత్రం తనకు సన్నీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని చెప్పాడు. వీళ్ల మాటలను చూస్తుంటే హౌస్‌లో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మొదలైనట్లే కనిపిస్తోంది. తర్వాత బిగ్‌బాస్ ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో బెస్ట్, వరస్ట్ పర్ఫామర్ పేర్లను ఎంచుకోమన్నాడు. దీంతో విశ్వ, హమీదా.. షణ్ముఖ్‌ను; శ్రీరామచంద్ర, మానస్, సన్నీ, యాంకర్ రవి, లోబో.. నటరాజ్ మాస్టర్‌ను; లహరి, షణ్ముఖ్.. మానస్‌ను; ప్రియ, సిరి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్.. శ్రీరామచంద్రను; ఉమాదేవి, శ్వేత వర్మ.. జెస్సీని బెస్ట్ పర్ఫామర్లుగా పేర్కొన్నారు. ఎక్కువ ఓట్లు సాధించిన నటరాజ్ మాస్టర్ ఈ వారం బెస్ట్ పర్ఫామర్‌గా ఎంపికయ్యాడు. వరస్ట్ పర్ఫామర్‌గా సన్నీ అనంతరం చెత్త ఆటగాడిని ఎంచుకోవాల్సి రాగా, మొదటగా కెప్టెన్ విశ్వ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. పింకీ త్వరగా రెడీ అయితే బాగుంటుందని సూచిస్తూ ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. ఇది మింగుడుపడని పింకీ.. తాను చాలా తక్కువగా రెడీ అవుతానని, ఎంత రెడీ అయినా తనెప్పుడూ అందరికీ సమయానికి వంట సిద్ధం చేశానని స్పష్టం చేసింది. తర్వాత యాంకర్ రవి.. యాటిట్యూడ్ చూపించాడంటూ సన్నీని ఎంచుకున్నాడు. శ్వేత.. సిరిని; మానస్.. టాస్క్‌లో సహనాన్ని కోల్పోయిన శ్రీరామ్‌ను; ఉమాదేవి, కాజల్, షణ్ముఖ్, ప్రియ, సిరి.. సన్నీని; యానీ మాస్టర్.. ఉమాదేవిని; శ్రీరామచంద్ర.. యాంకర్ రవిని వరస్ట్ పర్ఫామర్లుగా అభిప్రాయపడ్డారు. అయితే ఎక్కువ ఓట్లు వచ్చిన సన్నీని ఈవారం వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించడంతో అతడిని జైల్లో బందీని చేశారు. వామ్మో, ఈమె ఎన్ని అబద్ధాలు ఆడుతోంది: ప్రియ కిచెన్‌లో జరిగిన విషయాల గురించి కాజల్, ప్రియ డిస్కషన్ చేశారు. అది కాస్తా గొడవగా మారి సంస్కారం అంటూ పెద్దపెద్ద మాటలు అనుకునేదాకా వెళ్లింది. ముందు ఒకలా, వెనుక ఒకలా మాట్లాడుతూ సింపతీ గేమ్ ఆడాలని చూడకు అంటూ కాజల్‌పై బాగానే ఫైర్ అయింది ప్రియ. వామ్మో, ఈమె సెకనుకో అబద్ధం ఆడుతుందని కామెంట్ చేసింది. దీంతో కాజల్ ఏడుపు ఆపుకోలేకపోయింది. కానీ అంతలోనే ప్రియ వచ్చి సారీ చెప్పి ఈ గొడవను అక్కడితో ముగించింది. పెళ్లి కాకపోయుంటే ఆమెకు సైట్ కొట్టేవాడిని: రవి తర్వాత బిగ్‌బాస్... ఇంటిసభ్యులు మనసు విప్పి మాట్లాడండంటూ బీబీ న్యూస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రవి, కాజల్ రిపోర్టర్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. టాస్క్ మొదలవగానే.. కాజల్, రవి.. తమ వాగ్ధాటితో రెచ్చిపోయారు. పెళ్లి కాకపోయుంటే ఇంట్లో ఎవరికి సైట్ కొట్టేవాళ్లు అని కాజల్ రవిని ప్రశ్నించగా అతడు ఎంతో తెలివిగా తిరిగి ఆమె పేరే చెప్పాడు. దీంతో అవాక్కైన కాజల్ అంత సీన్ లేదులే అని నవ్వేసింది. తర్వాత యానీ మాస్టర్.. తనకు హౌస్‌లో పెద్ద కూతురు దొరికిందంటూ శ్వేత గురించి చెప్పింది. పనిలో పనిగా శ్రీరామ్, హమీదా, సన్నీ మధ్యలో ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుందని ఓ సీక్రెట్‌ను బయటపెట్టేసింది. ఇద్దరు భార్యలు, ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్: శ్రీరామ్ లోబో.. ఉమాదేవి తన లవర్ అని పరిచయం చేశాడు. తమ జోడీ తర్వాత ఇంట్లో మానస్, ప్రియాంక లవ్‌స్టోరీ బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. తర్వాత శ్రీరామచంద్ర ప్రేమ గురించి మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్‌లో సిరి, హమీదా మీద, తర్వాత అమ్ము(లహరి) మీద, ఇప్పుడు ప్రియ మీద లవ్ స్టార్ట్ అయిందని చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఉన్నవాళ్లలో భార్య, గర్ల్‌ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, పని మనిషిగా ఎవరు సెట్ అనుకుంటున్నారో చెప్పమని రవి ప్రశ్నించాడు. దీనికి శ్రీరామ్ ఏమాత్రం తడుముకోకుండా లహరి, ప్రియ భార్యగా, సిరి, హమీదా గర్ల్‌ఫ్రెండ్స్‌గా, శ్వేత బెస్ట్ ఫ్రెండ్‌గా, కాజల్ పని మనిషిగా ఉంటే బాగుంటుందని టపీమని చెప్పాడు. దీంతో యాంకర్ రవి.. శ్రీరామచంద్ర ఇంటి పనిమనిషిగా కాజల్ వస్తే బాగుంటుందన్నాడంటూ నానా హల్చల్ చేశాడు. దీంతో కాజల్ ముఖం వాడిపోయింది. శ్రీరామ్‌తో డ్యాన్స్ చేసిన హమీదా మానస్.. సిరి బెస్ట్‌ఫ్రెండ్, ప్రియాంక మరదలు, హమీదా ప్రేయసి, లహరి భార్య అయితే బాగుంటుందన్నాడు. సన్నీ.. శ్వేతను భార్యగా, హమీదాను గర్ల్‌ఫ్రెండ్‌గా, సిరిని పనిమనిషిగా సెలక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత జెస్సీ.. సిరిని గర్ల్‌ఫ్రెండ్‌గా, కాజల్‌ను పని మనిషిగా ఎంచుకున్నాడు. మొత్తానికి అందరూ కలిసి కాజల్‌ను పనిమనిషిని చేశారు. ఇక శ్రీరామచంద్ర, షణ్ముఖ్లలో ఎవరిని సెలక్ట్ చేసుకుంటావన్న ప్రశ్నకు హమీదా వెంటనే శ్రీరామ్ అని ఒక్క ముక్కలో చెప్పేసింది. అంతే కాదు.. శ్రీరామచంద్ర, హమీదా ఇద్దరూ రొమాంటిక్ పాటకు తెగ ఫీలైపోయి డ్యాన్స్ చేశారు. -
మరోసారి మంట పెట్టిన బిగ్‌బాస్, వరస్ట్ పర్ఫామర్ అతడేనట!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ మొదటి ఎపిసోడ్‌కు 18 టీఆర్పీ వచ్చింది. ఈ లాంచింగ్ ఎపిసోడ్‌కు అతిథులెవరూ రాకపోయినా, సినిమా హీరోయిన్ల డ్యాన్సులు లేకపోయినా, కంటెస్టెంట్లలో చాలావరకు కొత్తముఖాలున్నా కింగ్ నాగార్జున మాత్రం తనదైన హోస్టింగ్‌తో జనాలను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు. అటు కంటెస్టెంట్లు కూడా దొరికించే చాన్స్ అన్నట్లుగా హౌస్‌లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇచ్చిన ప్రతి టాస్క్‌ను రఫ్ఫాడిస్తున్నారు. తాజాగా ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ 'బాల్ పట్టు, లగ్జరీ బడ్జెట్ కొట్టు' టాస్క్ ఇచ్చాడు. ఈ మేరకు రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లెవరూ బంతిని పట్టుకోలేకపోయినట్లు చూపించారు. ఇదిలా వుంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ద్వారా ఇంట్లో మంట పెట్టిన బిగ్‌బాస్ ఇప్పుడు మరోసారి అగ్గి రాజేసినట్లు తెలుస్తోంది. ఇంటిసభ్యులంతా ఏకాభిప్రాయంతో వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోవాలని ఆదేశించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఆ వరస్ట్ పర్ఫామర్ సన్నీ అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అతడి అభిమానులు బిగ్‌బాస్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. సరిగా ఆడేవాళ్లకు ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా, హౌస్మేట్స్ అందరూ కలిసి అతడిని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరోవైపు హౌస్‌లో మరోసారి కాజల్ గొడవపడింది. ఏదో విషయం గురించి ఆమె ప్రియతో మాట్లాడగా అది కాస్తా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అబద్ధం కూడా చాలా అందంగా చెప్తావంటూ కాజల్‌ను నిందిస్తూ ప్రియ ఆమెకు చేతులెత్తి మొక్కింది. అసలు వీళ్ల మధ్య గొడవెందుకు మొదలైంది? నిజంగానే సన్నీ వరస్ట్ పర్ఫామరా? అన్న విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
బిగ్‌బాస్ : విశ్వపై రవి ఫైర్.. ఛీ అంటూ..
బిగ్ బాస్ షోలో కొన్ని టాస్క్‌లు కాస్త కఠినంగా ఉంటాయి. కంటెస్టెంట్స్ వాటిని చాలెంజ్‌గా తీసుకొని వందశాతం ఎఫెర్ట్స్ పెట్టి ఆడతారు. దెబ్బలు తగిలినా పట్టించుకోరు. ఒకనొక దశలో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు అరుస్తూ కొట్టుకునే స్థాయికి వెళ్తారు. . బిగ్ బాస్‌లో ఇలాంటి కామన్. అయితే బిగ్ బాస్ 5లో టాస్క్‌ల డోస్ కొంచెం పెరిగినట్లు కనిపిస్తోంది. రెండో వారంలోనే బిగ్‌బాస్ ఇంట్లో ఓ రేంజ్లో గొడవలు జరిగినట్లు తాజా ప్రోమోలు చూస్తే అర్థవుతుంది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కింద ఇంటి సభ్యులను రెండు జట్టులుగా విభజించాడు బిగ్‌బాస్. ‘పంథం నీదా నాదా’అనే ఈ టాస్క్‌లో భారీగా గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఉమెన్ కార్డు వాడొద్దని కాజల్‌కి వార్నింగ్ ఇచ్చాడు సింగర్ శ్రీరామచంద్ర. సన్నీ టూ మచ్ ఇది అంటూ షణ్ముఖ్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇంట్లో ఎంతో క్లోజ్‌గా మూవ్ అవుతున్న విశ్వ, రవిల మధ్య కూడా పెద్ద గొడవే జరిగినట్టుంది. రవి అయితే ‘ఛీ’అంటూ విశ్వపై గట్టిగా అరిచాడు. విశ్వ కూడా తగ్గేదే లేదనట్లుగా రవికి గట్టిగానే ఇచ్చేశాడు. లహరి ఒకవైపు, సన్నీ మరోవైపు భోరున విలపిస్తున్నారు. ఈ మాటల యుద్దం ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్: లీకైన రెండో వారం నామినేషన్ లిస్ట్!
Bigg Boss Telugu 5, Second Week Nominations: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో డేరింగ్ అండ్ డాషింగ్ కంటెస్టెంట్ సరయూ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు హౌస్‌లో 18 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఎలాంటి బెరుకు లేకుండా ఉన్నదున్నట్లు ముఖం మీదే మాట్లాడే సరయూ ఎలిమినేషన్‌తో ఇతర కంటెస్టెంట్లలో కదలిక మొదలైనట్లు కనిపిస్తోంది. ఇంకా సైలెంట్‌గా ఓ మూలన కూర్చుంటే తొక్కేస్తారనుకుందో ఏమో కానీ శ్వేత వర్మ నేటి నామినేషన్స్‌లో విరుచుకుపడింది. దీంతో శ్వేతలో ఈ యాంగిల్ ఇంతవరకు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి బిగ్‌బాస్ పెట్టిన నామినేషన్ మంట హౌస్‌లో బాగానే రగులుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే ఈవారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, లోబో, ప్రియ, ఉమాదేవి, ప్రియాంక సింగ్ నామినేషన్ జోన్లోకి వచ్చారని లీకువీరులు దండోరా వేసి మరీ చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో కాజల్ మినహా అందరూ కొత్తగా నామినేషన్లోకి ఎంటరైనవారే. మరి ఈసారి నిజంగానే ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండబోతున్నారా? లేదా ఈ లిస్టులో ఏమైనా మార్పులు చోటు చేసుకోనున్నాయా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
కాజల్ బండారం బయటపెట్టిన నాగ్, ఇన్‌స్టాలో ఆ వీడియోలేంటి?
Bigg Boss Telugu5, Episode 07: నిప్పుల కుంపటిగా మారిన బిగ్‌బాస్ హౌస్‌ను చల్లార్చడానికి వీకెండ్ ఎపిసోడ్లో వచ్చేశాడు కింగ్ నాగార్జున. వచ్చీరావడంతోనే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్లపై రివ్యూ ఇచ్చాడు. ఉమాదేవి అందరిమీదా అరిచేస్తుంటే, కాజల్ అందరి విషయాల్లో జోక్యం చేసుకుంటోందని అభిప్రాయపడ్డాడు. లహరి ఇరిటేట్ అవుతుంటే, జెస్సీ పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వట్లేదన్నాడు. లోబో మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఈ వారం హౌస్‌లో జరిగిన తప్పొప్పులను కడిగేస్తానన్నాడు నాగ్. మరి నేటి(సెప్టెంబర్ 11) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే దీన్ని చదివేయాల్సిందే! జెస్సీని జైల్లో చూసి ఏడ్చేసిన సిరి, కాజల్ వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జెలు జీవితం గడుపుతున్న జెస్సీ తనలో తానే కుమిలిపోయాడు. ఇతన్ని మిగతా కంటెస్టెంట్లు ఓదారుస్తుంటే యానీ మాస్టర్, రవి.. వీళ్ల నటనను నిజమని నమ్ముతున్నాడంటూ జెస్సీ మీద జాలిపడ్డారు. అయితే సరయూ తనను బూతులు తిడుతోందం చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు జెస్సీ. అతడని అలాంటి పరిస్థితిలో చూసిన కాజల్, సిరి కూడా కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత సరయూ అతడికి దగ్గరకు వెళ్లి అన్నీ మర్చిపో అంటూ సారీ చెప్పింది. ఇక ఒకరోజు శిక్ష పూర్తి చేసుకున్న అనంతరం జెస్సీ జైలు నుంచి విడుదలయ్యాడు. సరయూను బూతులు మాట్లాడమన్న నాగ్ వీకెండ్ అనగానే కంటెస్టెంట్లు అందరూ అందంగా ముస్తాబయ్యారు. వారికి నాగార్జున కనిపించగానే గ్రీకువీరుడు పాటతో హోస్ట్‌ను ఫిదా చేసేందుకు ప్రయత్నించారు. ఇక నాగ్ వారి అందాలను పొగుడుతూనే సరయూ బూతులు మాట్లాడట్లేదేంటి? అని అనుమానం వ్యక్తం చేశాడు. తిడతారేమోనన్న భయంతో సైలెంట్‌గా ఉన్నానన్న సరయూను.. నువ్వు నీలా ఉండు అంటూ ఆమె నోటికి పని చెప్పమని ప్రోత్సహించాడు. ఇక షణ్నూను 'అరేయ్ ఏంట్రా ఇది? కొంచెం కనబడరా, వన్ వీక్ అయిపోయింది. ఆట మొదలెట్రా' అని దెప్పి పొడిచాడు. కాజల్ హౌస్‌లో మ్యాట్రీమొనీ సర్వీసెస్ నడిపిస్తున్నట్లు ఉందని నాగ్ సెటైర్ వేశాడు. ఇక జెస్సీ తనకు అక్షింతలు పడతాయేమోనని టెన్షన్‌తో వణికిపోతుంటే నాగ్ మాత్రం హౌస్‌లో బాగానే ఉంటున్నావని మెచ్చుకోవడం విశేషం. కాజల్ బండారం బయటపెట్టిన నాగ్ అనంతరం ఇంటిసభ్యులకు 'ఎవరితో సెట్? ఎవరితో కట్?' అనే టాస్క్ ఇచ్చాడు. సెట్ అనుకునేవాళ్లకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి, కట్ అనుకునేవాళ్ల ఫొటోలను చింపేయాలని ఆదేశించాడు. మొదటగా ఈ వారం బెస్ట్ పర్ఫామర్ విశ్వ.. తనకు మానస్ సెట్ అని, ఇంటి పనులు చేయనన్న కాజల్‌తో కట్ అని చెప్పాడు. ఈ సందర్భంగా నాగ్.. కాజల్ తనకు వంట రాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నీ వంటకు సంబంధించిన వీడియోలు ఉన్నాయేంటని అనడంతో కాజల్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. అవి యూట్యూబ్‌లో చూస్తూ చేసినవని, సొంతంగా రావంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఇక తనవంతు రాగానే జెస్సీ.. సన్నీతో సెట్, సరయూతో కట్ అని; లహరి.. ప్రియతో సెట్, కాజల్‌తో కట్ అని తేల్చేశారు. నేను వన్ మ్యాన్ ఆర్మీ, నాకు ఎవరూ సెట్ కాదు: సరయూ లోబో.. షణ్ముఖ్‌లో నాన్నగారిని చూశానని ఎమోషనల్ అవుతూ అతడితో సెట్, కాజల్‌తో కట్ అని వెల్లడించాడు. సరయూ వంతు రాగా.. తను ఎవరితోనూ సెట్ కాదని, వన్ మ్యాన్ ఆర్మీని అని పేర్కొంది. 'ఇతరుల సహకారంతో ఆడటం చాలా ఈజీ, ఎవరి సహకారం లేకుండా ఆడటం కష్టం, అది ఆడి చూపించు' అంటూ సిరి ఫొటోను చించేసి ఆమెతో కట్ అని చెప్పకనే చెప్పింది. శ్వేత.. యానీ మాస్టర్‌తో సెట్, ఉమాదేవితో కట్ అని; శ్రీరామచంద్ర.. కల్మషం లేని శ్వేతతో సెట్, కాజల్‌తో కట్ అని; సన్నీ.. హమీదాతో సెట్, రవితో కట్ అని చెప్పారు. సిరి మాట్లాడుతూ.. బయట మా ఇద్దరికీ పడదు కానీ ఇక్కడ షణ్నూ సెట్ అయ్యాడు. సరయూతో మాత్రం కట్ అని ఫొటో చించి చెత్తబుట్టలో పడేసింది. ఆ తర్వాత రవి సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. తెగ నటిస్తోందంటూ కాజల్ ఫొటో చించి చెత్తకుండీలో వేసిన ఉమాదేవి నటరాజ్ మాస్టర్ తన వంతు వచ్చేసరికి లోబోతో సెట్, కాజల్‌తో కట్ అని క్లారిటీ ఇచ్చేశాడు. మానస్.. రవితో సెట్, జెస్సీతో కట్ అని చెప్పగా, రవి.. పింకీతో సెట్, జెస్సీతో కట్ అని వెల్లడించాడు. ఉమాదేవి.. పింకీతో సెట్, నటిస్తున్న కాజల్‌తో కట్ అని కుండ బద్ధలు కొట్టేసింది. హమీదా.. సరయూతో సెట్, షణ్నూతో కట్ అని; ప్రియ... యానీ మాస్టర్‌తో సెట్, హమీదాతో కట్ అని; పింకీ.. ప్రియతో సెట్, నటరాజ్ మాస్టర్‌తో కట్ అని; కాజల్.. శ్రీరామచంద్రతో సెట్, ఉమాదేవితో కట్ అని చెప్పేశారు. ఆమెలో అమ్మను చూసుకుంటున్నా: ఏడ్చేసిన శ్వేత యానీ మాస్టర్.. తనలో అమ్మను చూసుకుంటున్న శ్వేతతో సెట్, కాజల్‌తో కట్ అంది. షణ్నూ.. తనతో ఈజీగా కలిసిపోయిన రవితో సెట్, హమీదాతో కట్ అని చెప్పాడు. అనంతరం తన దిండు సీక్రెట్‌ను బయటపెట్టాడు. అది కనిపించకపోతే కంగారెత్తిపోయే తాను దిండు మీద గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన పేరు రాశానని చెప్తూ తెగ సిగ్గుపడిపోయాడు. అనంతరం నాగార్జున హమీదా సేఫ్ అయినట్లు ప్రకటించాడు. ఇంకా మానస్, కాజల్, సరయూ, జెస్సీ డేంజర్ జోన్లోనే ఉన్నారు. వీరిలో నాగ్ ఎవర్ని సేవ్ చేస్తాడు? ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు? అన్నది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే! -
బిగ్‌బాస్ 5: బెస్ట్, వరస్ట్ పర్ఫామర్స్ ఎవరో తెలుసా?
Bigg Boss Telugu 5, Episode 06: అన్ని విషయాల్లో తలదూర్చే కాజల్ పని దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాదూ, కూడదని మొండికేస్తోంది. ముఖ్యంగా కిచెన్ తనవల్లకాదని చెప్తోంది. హౌస్‌లో పనులు విభజించిన సమయంలో కాజల్‌ను కిచెన్ టీమ్‌లో అడ్జస్ట్ చేయాలని చూడగా ఆమె మాత్రం వంట చేయను, గిన్నెలు కూడా శుభ్రం చేయను అని తేల్చి చెప్పేసింది. దీంతో అందరూ ఆమె మీదకు ఒంటికాలిపై లేచారు. మరోవైపు 'నువ్వు కెప్టెన్ అయ్యాకే ఈ ఫ్లవర్ నా చేతికివ్వు' అంటూ మానస్ ఇచ్చిన పువ్వును అతడికే తిరిగిచ్చేసింది ప్రియాంక సింగ్. ఒకవేళ ఈ పువ్వు వేరే ఎవరి దగ్గర చూసినా అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చింది. దీనికి మానస్ సరేనంటూ బుద్ధిగా తలూపాడు. ఒకరిని కాదు ఇద్దరినైనా లేపుతా, మాస్టర్ రచ్చ ఇక తర్వాతి రోజు బిగ్‌బాస్ హౌస్‌లో వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో హౌస్మేట్స్ అందరూ అందంగా ముస్తాబయ్యారు. కానీ ఈసారి తమ ఫ్యామిలీస్‌తో లేనందుకు కొంత ఎమోషనల్ అయ్యారు. గణపతి పూజ అనంతరం బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు పాల్గొనాల్సి ఉండగా హౌస్మేట్స్ విశ్వ, శ్రీరామచంద్ర పేర్లను సూచించారు. ఈ నిర్ణయంపై నటరాజ్ మాస్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక్కడ బలం చూడాలి కానీ కండలు కాదంటూ విశ్వను సెలక్ట్ చేయడాన్ని తప్పు పట్టాడు. తాను ఒక్కరిని కాదు, ఇద్దరినైనా లేపుతానంటూ రభస చేయగా యాంకర్ రవి ఆయనకు నచ్చజెప్పాడు. మొత్తానికి విశ్వ, శ్రీరామచంద్ర ఈ టాస్క్‌లో పాల్గొని విజయవంతంగా తమకు కావాల్సిన సరుకులను తెచ్చుకున్నారు. రవి టాస్క్‌ను జోక్‌గా తీసుకున్నాడు.. అనంతరం ఈవారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఇంటిసభ్యులను ఆదేశించాడు. మొదటగా రవి.. అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న లోబో బెస్ట్ పర్ఫామర్ అని, కంటెస్టెంట్లతో గొడవలు పెట్టుకున్న జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని పేర్కొన్నాడు. లోబో.. కిచెన్‌లో ఎలాంటి సమస్యలు తేనందుకు యానీ మాస్టర్ బెస్ట్ అని.. తెలిసో, తెలియకో తప్పులు చేస్తూ, నోరు జారుతున్న జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని తెలిపాడు. అనంతరం జెస్సీ వంతురాగా.. సిరిని బెస్ట్, టాస్క్‌ను జోక్‌గా తీసుకున్నాడంటూ రవిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపిక చేశాడు. శ్వేత వర్మ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వ బెస్ట్, పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్న ఉమాదేవి వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది. ప్రతి ఒక్కరికీ ప్రేమను పంచుతున్న ఆమె బెస్ట్ పర్ఫామర్ ఉమాదేవి.. విశ్వ బెస్ట్‌గా, కాజల్ వరస్ట్‌గా ఆడుతున్నారని సింపుల్‌గా తేల్చేసింది. సిరి.. నటరాజ్ మాస్టర్ బెస్ట్, ఉమాదేవి ప్రవర్తన వల్ల కొందరు ఇబ్బందిపడుతున్నారని, అందువల్ల ఆవిడే వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది. విశ్వ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికీ ప్రేమను పంచుతున్న ప్రియాంక సింగ్ బెస్ట్ అని చెప్పడంతో పింకీ ఎమోషనల్ అయింది. ఇక పనులు రావని చెప్పి తప్పించుకునే కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా సూచించాడు. లహరి.. విశ్వ బెస్ట్ పర్ఫామర్ అని, కెప్టెన్ అయింది సిరి కానీ, అలా వ్యవహరిస్తుంది మాత్రం కాజల్ అంటూ ఆమెను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పుకొచ్చింది. నీతో మాట్లాడటమే వేస్ట్..: ఉమాదేవి తన జీవితం ముళ్ల పాన్పు అంటూ మొదలెట్టిన ప్రియాంక సింగ్ 14 ఏళ్లకే ఇంటి బాధ్యతలు తీసుకున్నానంది. గత కొన్నేళ్లుగా నవ్వడమే మర్చిపోయిన తనను మనసారా నవ్వించిన లోబో బెస్ట్ పర్ఫామర్ అంది. ఇక పెద్దావిడగా మంచీ చెడ్డలు చెప్పాల్సిన ఉమాదేవి మనిషులను చులకనగా చూస్తూ, అమర్యాదగా మాట్లాడతారని పేర్కొంది. ఆమె ప్రవర్తన రూడ్ అని చెప్తూ ఉమాదేవిని వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడింది. అయితే ఆమె మాటలతో ఏకీభవించని ఉమా.. నీతో మాట్లాడటమే వేస్ట్ అంది. ఈ మాటతో ఆవేశపడ్డ పింకీ.. మీలా మనుషులను చీప్‌గా తీసిపడేయలేను అని ధీటుగా బదులిచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే రాజుకుంది. ఒకరి మీదకు ఒకరు దూసుకు వెళ్లడమే కాక పింకీ షటప్ అంటూ ఆమెకు వేలు చూపించడంతో ఉమాదేవి కాళికావతారం ఎత్తింది. అయితే కొన్ని క్షణాల తర్వాత నోరుజారానని తెలుసుకున్న పింకీ తాను కోపంలో షటప్ అనేశానని ఉమాకు సారీ చెప్పి ఏడ్చేసింది. ఆమెను ఎగతాళి చేస్తూనే ఉన్నారు: సరయూ ఇక ఉమాదేవిని ఎవరో ఒకరు ఎగతాళి చేస్తూనే ఉన్నారని సరయూ తెగ ఫీలై ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత యానీ మాస్టర్.. పింకీ బెస్ట్, జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది. సరయూ.. లోబోను బెస్ట్ పర్ఫామర్‌గా సూచించింది. 'జెస్సీ చిన్నపిల్లాడు కాదు, అతడికి ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏ పనీ చేయడు. ఓన్లీ టాయిలెట్‌కు వెళ్లడమే నువ్వు చేసే పనా?' అని ప్రశ్నిస్తూ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా సూచించింది. వరస్ట్ పర్ఫామర్‌గా జెస్సీ.. జైల్లో బందీ 19 మంది కంటెస్టెంట్లు వారి అభిప్రాయాలు తెలిపిన అనంతరం.. ఎక్కువ ఓట్లతో విశ్వ బెస్ట్ పర్ఫామర్‌గా, జెస్సీని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించారు. బిగ్‌బాస్ ఆదేశం మేరకు వరస్ట్ పర్ఫామర్ అయిన జెస్సీని జైల్లో బందీ చేశారు. తనకు పట్టిన దుస్థితికి అతడు లోలోపలే కుమిలిపోయాడు. అతడి బాధ అర్థమైన హౌస్మేట్స్.. అందరం నీ వెనకాలే ఉంటామంటూ ఓదార్చారు. చూస్తుండగానే తొలి వారాంతం వచ్చేసింది.. రేపటి ఎపిసోడ్లో నాగ్ ఎవరెవరిని సేవ్ చేస్తాడో చూడాలి! -
ఈ గేములు సెట్టయితలే, పోయి దుకాణంలో కూర్చుంట: లోబో
Bigg Boss Telugu 5, Episode 05: బిగ్‌బాస్ ఐదో సీజన్లో కామెడీ, లవ్ ట్రాక్‌ల సంగతేమో కానీ కొట్లాటలకు మాత్రం కొదవ లేకుండా పోయింది. అర్థం పర్థం లేని విషయాలకు కూడా గొడవ పడుతూ ప్రేక్షకులకు తలనొప్పిగా మారుతున్నారు. కెప్టెన్ వచ్చాక అయినా ఇల్లు చక్కదిద్దుకుంటుందేమో అంటే ఆ తర్వాత కూడా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. తొలి కెప్టెన్‌గా నియామకమైన చలాకీ సిరి వీరిని అందరినీ దారిలో పెడుతుందా? అనేది ఆసక్తికరంగానే మారింది. మరి నేటి(గురువారం) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. ఫ్రస్టేషన్ బయటపెట్టిన లోబో కెప్టెన్సీ పోటీదారుడు మానస్‌కు ఇచ్చిన టాస్క్ ప్రకారం.. అర్ధరాత్రి ఎవరు నిద్ర లేచినా ముందు కాజల్‌ను లేపాల్సి ఉంటుంది. కానీ ఈ నియమాన్ని లహరి, శ్రీరామచంద్ర తుంగలో తొక్కడంతో పదేపదే అలారమ్ మోగింది. ఫలితంగా ఇంటి సభ్యుల నిద్ర చెదిరిపోయింది. మరోపక్క షణ్నూకు సపర్యలు చేసి అలిసిపోయాడు అతడి సేవకుడు లోబో. వారు చేయిస్తున్న టాస్క్‌లకు దండం పెట్టేశాడు. స్మోకింగ్ రూమ్‌లో తన ఫ్రస్టేషన్‌ను విశ్వ ముందు బయటపెట్టాడు. 'ఈ గేములు నాకు నచ్చట్లేదు, ఇది నా టేస్ట్ కాదు, నాకు సెట్టయితలేదు. పోయి నా దుకాణంలో ఉంటా, కానీ ఇదంతా ఏంది?' అని అసహనానికి లోనయ్యాడు. దీంతో ఇది టాస్క్ అని, కాస్త ఓపిక పట్టమని ఊరడించాడు విశ్వ. గెలిచిన హమీదా, ప్రియకు కోలుకోలేని దెబ్బ అనంతరం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో హమీదా గెలిచింది. పవర్ రూమ్‌లో అడుగు పెట్టిన ఆమెకు బిగ్‌బాస్ కఠినమైన టాస్కే ఇచ్చాడు. ఆమె ఎంచుకునే కంటెస్టెంట్ హౌస్‌లో ఎప్పటికీ కెప్టెన్ కాలేరని చెప్పాడు. దీంతో ఆమె నటి ప్రియ పేరు చెప్పింది. ఇదే విషయాన్ని హౌస్మేట్స్ దగ్గర చెప్పగా అంతా ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ప్రియ మాత్రం దీన్ని స్పోర్టివ్‌గా తీసుకోవడం విశేషం. ఐ లవ్యూ.. మానస్‌ను మధ్యలో లాగిన ప్రియాంక రెస్ట్ రూమ్ క్లీన్ చేస్తున్న లోబో అక్కడికి వచ్చిన ప్రియాంక సింగ్‌ను చూసి తన పని ఆపేశాడు. ఆమెను తదేకంగా చూస్తూ ఐ లవ్యూ అంటూ ప్రపోజ్ కూడా చేశాడు. అయితే ఆమె మాత్రం నీకు దమ్ముంటే మానస్ ఎదురుగా నాకు లైనేయ్ అని సవాలు చేయడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. ఇదే విషయాన్ని లోబో.. మానస్ దగ్గర ప్రస్తావించగా అతడు తేలికగా నవ్వేసి మధ్యలో నా అనుమతి అవసరం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. ఆ తర్వాత కంటెస్టెంట్లు లోబోను అమ్మాయిగా రెడీ చేసి ఓ ఆట ఆడేసుకున్నారు. మరోవైపు ఏమైందో ఏమో కానీ సరయూ ఉన్నట్టుండి ఏడుపందుకుంది. రెండో రోజే అందరూ కలిసి ఉండి నాలుగో రోజుకే ఎలా గ్రూప్స్ అవుతాయని భోరున ఏడ్చేయగా యానీ మాస్టర్ ఆమెను ఓదార్చింది. సంచాకురాలి ఎంపిక విషయంలో రచ్చ అనంతరం 'శక్తి చూపరా డింభకా!' టాస్క్ పూర్తైందని వెల్లడించిన బిగ్‌బాస్ హమీదా, మానస్, విశ్వ, సిరి తొలి కెప్టెన్సీ టాస్క్‌కు పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. 'తొక్కరా తొక్కు హైలెస్సా' అనే టాస్కులో సైకిల్ నిరంతరాయంగా తొక్కుతూ దాని మీదున్న బల్బ్ వెలుగుతూ ఉండేలా జాగ్రత్తపడాలని ఆదేశించాడు. మధ్యలో బజర్ మోగిన ప్రతిసారి మిగతా హౌస్మేట్స్.. పోటీదారుల్లో ఒకరికి నీళ్లు తాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ఈ టాస్క్‌కు ప్రియ సంచాలకురాలిగా వ్యవహరిస్తే బాగుంటుందని సన్నీ అభిప్రాయపడ్డాడు. అతడి నిర్ణయంతో హౌస్‌లో కొంత రచ్చ జరిగినా ఎక్కువమంది ప్రియనే సంచాలకురాలిగా ఎన్నుకున్నారు. కాజల్ వర్సెస్ సరయూ ఈ టాస్క్‌లో కాజల్.. విశ్వకు ఇమ్యూనిటీ అవసరం లేదంటూ అతడిని డిస్టర్బ్ చేయగా ఆటలో నుంచి అవుటయ్యాడు. అయితే విశ్వను ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేశావని సరయూ కాజల్‌ను నిలదీసింది. నేను అమ్మాయిలకే సపోర్ట్ చేస్తానని, విశ్వకు ఇమ్యూనిటీ అవసరం లేదని అతడికే డైరెక్ట్‌గా చెప్పానని క్లారిటీ ఇచ్చింది కాజల్. కాసేపటివరకు వీరి మధ్య ఓరకంగా మాటల యుద్ధమే నడిచిందని చెప్పవచ్చు. మొత్తానికి రసాభాసగా సాగిన ఈ టాస్క్‌లో సిరి గెలుపొంది హౌస్‌కు తొలి కెప్టెన్‌గా అవతరించింది. ఆమెకు ప్రియ కెప్టెన్ బాండ్ తొడిగింది. అనంతరం సిరి.. విశ్వను రేషన్ మేనేజర్‌గా ఎంపిక చేసింది. నాన్‌వెజ్ వండను, శుభ్రం కూడా చేయను ఇక కిచెన్‌లో పనులు పంచుకునే దగ్గర మరోసారి లొల్లి షురూ అయింది. నాన్‌వెజ్ వండలేను, ఎవరైనా నాన్‌వెజ్ వండితే ఆ గిన్నెలను శుభ్రం చేయను అని ఉమాదేవి తేల్చి చెప్పింది. మార్నింగ్ వెజ్ వండేందుకు ప్రియాంక సింగ్ ఉందని లహరి చెప్పగా దాన్ని ఉమాదేవి తప్పుగా అర్థం చేసుకుంది. అంటే వెజ్ వండటానికి నేను పనికి రానని అంటున్నారంటూ కొత్త వాదన ఎత్తుకుని తగవు పెట్టుకుంది. దీంతో చిర్రెత్తిపోయిన లేడీ అర్జున్ రెడ్డి లహరి.. ఆమె అరిస్తే పడాలా? అని నిలదీసింది. దీంతో జోక్యం చేసుకున్న కెప్టెన్.. లహరి 'పనికి రాదు' అనే పదం వాడలేదని ఉమాదేవికి గట్టిగానే క్లారిటీ ఇవ్వడంతో ఈ గొడవ చప్పున చల్లారిపోయింది. ఇప్పుడే ఈ రేంజ్లో గొడవ పడితే రేపటి నుంచి కెప్టెన్ సిరికి కంటెస్టెంట్లు చుక్కలు చూపిస్తారేమో చూడాలి! -
ఎందుకు టార్గెట్ చేశావ్?: ఏడ్చేసిన సరయూ
బిగ్‌బాస్ హౌస్‌లో పవర్ రూమ్‌లో అడుగుపెట్టిన విశ్వ, మానస్, సిరి, హమీదా కెప్టెన్సీ కోసం పోటీకి దిగారు. వీరికి బిగ్‌బాస్ సైకిల్ తొక్కే టాస్క్ ఇచ్చాడు. ఇందులో మిగతా కంటెస్టెంట్లు తమకు నచ్చినవారికి సపోర్ట్ చేస్తూనే అవతలివాళ్లు టాస్క్ గెలవకుండా ఆటంకం కలిగిస్తున్నారు. ఈ క్రమంలో కెప్టెన్సీ పోటీదారుల కన్నా ముందు వారికి మద్దతునిస్తున్న హౌస్మేట్స్ మధ్యలో గొడవలు మొదలైనట్లు కనిపిస్తోంది. సరయూ తన దోస్త్ విశ్వకు సపోర్ట్ చేస్తుంటే కాజల్ మాత్రం అతడు గెలవకుండా అడ్డుపడినట్లు ప్రోమోలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఎందుకు ఒక్కడినే టార్గెట్ చేశావని సరయూ కాజల్‌ను నిలదీసింది. దీనికి కాజల్ సమాధానమిస్తూ.. అతడు కెప్టెన్ అయ్యేందుకు అర్హుడు కాదని చెప్పుకొచ్చింది. మరోవైపు సన్నీ, రవి మధ్య కూడా వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. రెండో రోజు మంచిగా ఉండి, నాలుగో రోజుకే గ్రూప్స్ ఎలా అవుతాయని సరయూ ఏడ్చేసింది. ఇంతకీ రవికి, సన్నీకి మధ్య జరిగిన గొడవేంటి? విశ్వను టార్గెట్ చేసిన కాజల్ ఎవరికి సపోర్ట్ చేసింది? కెప్టెన్ ఎంపిక సజావుగానే సాగిందా? అన్న విషయాలకు సమాధానం దొరకాలంటే గురువారం నాటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
బిగ్‌బాస్ 5 ఆర్జే కాజల్ ఫొటోలు
-
బిగ్‌బాస్: 'ఆ నలుగురి ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాం'
బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాక అన్ని రకాల ఎమోషన్లు పండించాలి. నవ్వడం, నటించడం, పోట్లాటకు దిగడం, టాస్క్‌లు ఆడటం.. అన్నీ చేయాల్సిందే! కానీ బిగ్‌బాస్ ఇంకా ఏ టాస్క్ ఇవ్వకముందే వీళ్లకు వీళ్లే దొంగతనాలు చేస్తూ, ప్రాంక్‌లు చేస్తూ, గొడవలు పెట్టుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు. కలిసుంటే కలదు సుఖం అన్న మాటకు పూర్తి వ్యతిరేకంగా కడుపు నింపేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అతి చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు షోలోకి వచ్చినప్పటి నుంచి కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని, అదంత మంచిది కాదని హితవు పలుకుతున్నారు. దొంగతనం చేసి దొరికిపోయారు! సెప్టెంబర్ ఐదున బిగ్‌బాస్ షో అంగరంగ వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షోలో సెకండ్ కంటెస్టెంట్‌గా వచ్చిన సన్నీకి తన స్వప్న సుందరిని హౌస్‌లో వెతుక్కోమని సలహా ఇచ్చాడు నాగ్. ఈ మాత్రం చాన్స్ ఇస్తే చాలని రెచ్చిపోయిన సన్నీ గేట్ ద్వారా కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగు పెట్టిన ప్రతిసారి కొంత అతి చేశాడని అభిప్రాయపడ్డారు నెటిజన్లు. ఇక బిగ్‌బాస్ కన్నా ముందే తమకు తామే దొంగతనం టాస్క్ ఇచ్చుకున్నారు సిరి హన్మంత్, జెస్సీ. చిన్నాచితకా వస్తువులు దొంగతనం చేసినా యాంకర్ రవి వీరిని పసిగట్టేయడంతో చోరీ టాస్క్ అట్టర్ ఫ్లాప్ అయింది. మొదటికే మోసం తెచ్చిన ప్రాంక్ ఇది చాలదన్నట్లు సిరి.. లోబోతో గొడవ పడుతున్నట్లు ప్రాంక్ చేసి అందరినీ నమ్మించాలనుకుంది. అనుకోవడమే కాదు నిజంగానే లోబోతో ఓ రేంజ్లో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ నానామాటలు అనుకున్నారు. ఇది చూసి కంటెస్టెంట్లు నోరెళ్లబెట్టేసరికి ఇది ప్రాంక్ అంటూ వారిని వెర్రోళ్లను చేశారు. అయితే ఇది కరెక్ట్ కాదని, కంటెంట్ కోసం చేసినట్లుందని సరయూ నిర్మొహమాటంగానే చెప్పేసింది. మరోపక్క కాజల్ అత్యుత్సాహం అసలుకే ఎసరు తెస్తోంది. అతి చేయకుండా నార్మల్‌గా ఉండమని లహరి అందరి ముందే కౌంటరిచ్చింది. అయితే లహరి కూడా కావాలని అందరి దగ్గరా గొడవ పెట్టుకుంటోందని అంటున్నారు. అతి చేస్తుంది ఈ నలుగురేనా? మొత్తంగా వీజే సన్నీ, సిరి హన్మంత్, కాజల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే అతి చేయడం మొదలు పెట్టేశారని చెప్తున్నారు. ఇక కాజల్ అందరి దగ్గరకు వెళ్లి పర్సనల్ విషయాలను ఎందుకు అడుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు. లేడీ అర్జున్‌రెడ్డి లహరి కూడా కావాలని అందరితో గొడవలు కొని తెచ్చుకుంటున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. మెజారిటీ నెటిజన్లు వీజే సన్నీ, సిరి హన్మంత్, లహరి, కాజల్ ఓవరాక్షన్ చేస్తున్నారని, వీళ్లు 'అతి' తగ్గించుకుంటే షోలో ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు. -
బిగ్‌బాస్: తమ్ముడి మరణం, రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ
Bigg Boss Telugu 5, September 7th Episode: బుల్లితెరపై బిగ్‌బాస్ సందడి మొదలైంది. అక్కడ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య కొట్లాట కూడా షురూ అయింది. ఇలా పరిచయాలు అయ్యాయో లేదో అప్పుడే ఒకరి మీద ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. షో ఆరంభంలోనే ఈ రేంజ్లో గొడవలు ఉంటే రానురానూ ఇది ఏ స్థాయిలో ఉండబోతుందో అంటున్నారు బిగ్‌బాస్ ఫ్యాన్స్. మరి నేటి(మంగళవారం) ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. మానస్‌ను అన్నయ్య అని పిలవలేను మగవాళ్లు జిమ్ములో కూర్చుంటున్నారు తప్ప ఏ పనీ చేయట్లేదని ఉమాదేవి చిరాకుపడింది. ఇంట్లో ఉన్న అందరూ పని చేయాల్సిందేని అభిప్రాయపడింది. మరోపక్క లహరితో దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది కాజల్. కానీ అది ఫ్లోలో జరగాలి తప్ప ఇలా మాట్లాడుకుంటే కుదరదు అని లహరి అనడంతో ఊరకుండిపోయింది. ఇక రవి, విశ్వను అన్నయ్య అని పిలుస్తానన్న ప్రియాంక సింగ్.. మానస్‌ను మాత్రం అలా పిలవలేనని చెప్తూ తెగ సిగ్గుపడింది. దీంతో అందరూ మానస్‌ను లవర్ బాయ్ అంటూ ఆటపట్టించారు. ఈ సీజన్లో కొత్తగా పవర్ రూమ్‌ను పరిచయం చేశాడు బిగ్‌బాస్. ఈ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించిన సభ్యులకు పవర్ యాక్సెస్ దొరుకుతుందని, తద్వారా వారికి ఆటను మార్చగలిగే శక్తి దొరుకుతుందని చెప్పాడు. అందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ 'శక్తి చూపరా డింభకా!'ను ప్రవేశపెట్టాడు. ఒంటి మీదున్న దుస్తులను పంపించేసిన రవి, ప్రియ ఈ టాస్క్‌లో ఉరుముల శబ్ధం వినిపించగానే పవర్ స్కాన్‌పై ఎవరు మొదట చేయి పెడతారో వారికి ఆ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించినట్లు లెక్క. ఈ టాస్క్‌లో మొదట గెలిచిన విశ్వ పవర్ రూమ్‌లో అడుగు పెట్టాడు. ఇద్దరు ఇంటిసభ్యులు వారి ఒంటి మీదున్న దుస్తులతో సహా అన్ని బట్టలు, వస్తువులను స్టోర్‌రూమ్‌కు పంపించాలని, అయితే ఆ ఇద్దరూ వారి స్వంత బట్టలు కాకుండా ఒకరి దుస్తులను మరొకరు ధరించవచ్చని మెలిక పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ కోసం విశ్వ.. ప్రియ, రవి పేర్లను సూచించాడు. దీంతో ఆ ఇద్దరూ తమ సామానంతా పంపించేసి.. ప్రియ బట్టలను రవి, రవి బట్టలను ప్రియ వేసుకున్నారు. నాలో తమ్ముడిని చూసుకో.. లేడీ గెటప్‌లో ఉన్న రవిని కాసేపు ఎత్తుకుని తిప్పిన విశ్వ తన తమ్ముడిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. గతేడాది తమ్ముడిని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యాడు. రవి తనను అన్న అని పిలుస్తాడని, నా కోసం ఈ టాస్క్‌కు ఒప్పుకున్నాడంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో రవి.. నాలో తమ్ముడిని చూసుకో అంటూ అతడిని హత్తుకుని ఓదార్చాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో తర్వాత మానస్ గెలుపొంది పవర్‌ను సాధించాడు. అతడు ఎంచుకునే కంటెస్టెంట్ హౌస్‌లోని ఇంటి సభ్యులందరూ పడుకున్నాకే నిద్రించాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. లేదంటే పెద్ద సౌండ్‌తో అలారమ్ మోగుతుందని చెప్పాడు. ఈ టాస్క్‌కు మానస్.. ఆర్జే కాజల్ పేరును ఎంచుకున్నాడు. గొడవపడ్డట్లు డ్రామా.. చివర్లో అంతా ఉట్టిదే ఇంతలో లోబో.. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా అను, మోతెబరిలా మాట్లాడకు అని సిరిని నిందించాడు. ముఖం అద్దంలో చూసుకో, హైట్ చూసుకో, నా ముందు చెటాకంత ఉన్నవ్ అంటూ నానామాటలు అన్నాడు. ఇవన్నీ చెవిన పడటంతో ఆవేశంతో అట్టుడికిపోయిన సిరి ఫేస్ గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది అని వార్నింగ్ ఇచ్చింది. వీళ్లిద్దరికీ సడన్‌గా ఏమైంది? ఇంత గొడవపడుతున్నారు? అని కంటెస్టెంట్లంతా టెన్షన్ పడుతుండగా ఇదంతా వుట్టి డ్రామా అని ఇద్దరూ పెద్దగా నవ్వేసి అందరినీ పిచ్చోళ్లను చేశారు. హైడ్రామా చేస్తున్నావంటూ కాజల్‌కు చురకలు కిచెన్‌లో పనులను షేర్ చేసుకుందామని కాజల్ అందరినీ పిలిచి హడావుడి చేస్తుండగా.. ఎందుకంత హైపర్ అవుతున్నారని లహరి ప్రశ్నించింది. నార్మల్‌గా మాట్లాడండి, అంతే తప్ప కంటెంట్ క్రియేట్ చేయాలని చూడొద్దని కాజల్‌కు సూచించింది. చాలా హైడ్రామా చేస్తున్నారని చురకలంటించింది. దీంతో కాజల్ ఆమెకు క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చి ఏడ్చేసింది. జెస్సీ మీద యానీ మాస్టర్ ఫైర్ ఇక రాత్రి అందరూ ముచ్చట్లు పెట్టుకుంటుండగా సిరి ప్లేస్‌లో హమీదా కూర్చుంటే ఆమెను అక్కడి నుంచి లేవమన్నాడు జెస్సీ. ఆమె కుదరదనడంతో సిరిని తన స్థానంలో కూర్చోమన్నాడు. ఆ తర్వాత మరో ఖాళీ కుర్చీ దొరికితే దాని మీద కాలేసి కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన యానీ మాస్టర్ తనకు చెయిర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ప్లీజ్ అంటున్నా అతడు నిరాకరించడంతో యానీకి బుర్ర వేడెక్కిపోయింది. నాటకాలు చేయకు, నీ గొంతే కాదు నా వాయిస్ కూడా లేస్తుంది, అక్కడ కాళ్లెందుకు పెట్టినవ్ అని జెస్సీ మీద పూనకంతో ఊగిపోయింది. ఇంతలా ఆవేశపడ్డ యానీ మాస్టర్ తన బెడ్ దగ్గరకు వెళ్లి ఏడ్చేయడం గమనార్హం. ఈరోజు ఎపిసోడ్లో ఇంత రభస ఉంటే మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి! -
ఆర్జే కాజల్‌ను ఆడేసుకుంటున్న అభిజిత్ ఫ్యాన్స్!
అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అంటే ఏ విషయంలోనైనా అతిగా ఉండకూడదు అని! కానీ అతి ఎగ్జయిట్‌మెంట్‌తో ఆదిలోనే అడ్డంకులు ఎదుర్కొంటోంది ఆర్జే కాజల్. తనకు బిగ్‌బాస్ షో అంటే ఎంతో ఇష్టమని, అలాంటిది ఆ షోలో తను భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని తొలి రోజే ఉబ్బితబ్బిబ్బైపోయింది కాజల్. హౌస్ అంతా కలియతిరుగుతూ అందరితోనూ మాట కలుపుతూ హడావుడి చేస్తోంది. అయితే ఆమె ఉత్సుకత మిగతావారికి మింగుడు పడటం లేదు. ఇదంతా ఏదో కావాలని చేస్తున్నట్లు ఉందని కొందరు కంటెస్టెంట్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో హౌస్‌లో ఆమె ఏం చేసినా ఒకరకంగా దాన్ని ఓవరాక్షన్ అనే వర్ణిస్తున్నారు. వాళ్లే కాదు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఇదే అభిప్రాయపడుతున్నారు. నామినేషన్ ప్రక్రియలో 'బిగ్‌బాస్ తన కలల హౌస్' అంటూ డ్రీమ్ కార్డ్ వాడిన ఆమె, నేటి ప్రోమోలో కన్నీళ్లు పెట్టుకుని చైల్డ్ కార్డ్ వాడుతోందంటూ సెటైర్లు వేస్తున్నారు. గత సీజన్లో అభిజిత్ పీఆర్ టీమ్ పెట్టుకున్నాడంటూ నెగెటివిటీ వ్యాప్తి చేసిన ఆమెను అభి ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. పైగా తొలి రోజే కాజల్ అందరి దగ్గరకు వెళ్లి వారి పర్సనల్ విషయాల కూపీ లాగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె హౌస్‌లో ఓ వైరస్ లాంటిదని, వీలైనంత తొందరగా తనను బయటకు పంపించేయండని అభి ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కాజల్ అభిమానులు మాత్రం ఈ ట్రోలింగ్‌ను గట్టిగా తిప్పికొడుతున్నారు. ఆమె మీద ఇంత విషం చిమ్మడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. తన ఎగ్జయిట్‌మెంట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఆమె ఆటతీరు చూశాక మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. మరి ఈ నెగెటివిటీ నుంచి కాజల్ ఎలా బయటపడుతుంది? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. Odiyamma badava idendayya idi😂 Iddaru strong ani nominate chestene vallani nominate chesav kada Khaja akka... Alantidi enno valid points tho nominate chesina #Abijeet ni ennesi matalu annav#BiggBoss Nee dream aithey Pakkodidhi enti ?icecream ha??#BiggBossTelugu5 #RJKajal pic.twitter.com/O6AHUxor3Y — Vamc Krishna (@vamccrishnaa) September 7, 2021 Karma hits back like BOOMERANG 🪃 @RJKajal tanu tesukunna gotilo thane padutundi🤣#kajalions #5muchdrama #BiggBossTelugu5 #biggboss5telugu #RJKajal pic.twitter.com/v6TgzJhL0O — PeddaDora (@DoraPedda) September 7, 2021 #Abijeet ni PR team ani cheppi negative ga spread chesina #RJKajal pakka preplanned ga motham PR set chesi ochindhi! #BiggBossTelugu5 'You don't have a point you need a point ' Nee dramal ki evdu karagadu! Infront there is crocodile festival.. pic.twitter.com/y5FvDEPvMF — Vamsi (@Darlingvamsi38_) September 7, 2021 5 much negativity on #Abijeet in Her Reviews kanipinchaledha 😌😌#RjKajal #BiggBossTelugu5 https://t.co/Oc9CxHJXks — Rooba_Rooba (@rooba_rooba) September 7, 2021 Bigg Boss ni pindesi ochina contestant laga ayite naku kanipinchaledu RJ Kajal. Emotions fake anipinchayi and also logic behind her nominations is the worst !!! #RJKajal #BiggBossTelugu5 #biggboss5telugu #BiggBossTeluguSeason5 — Hydrocker (@Hyd_Rocker) September 6, 2021