
బిగ్ బాస్ షోలో కొన్ని టాస్క్‌లు కాస్త కఠినంగా ఉంటాయి. కంటెస్టెంట్స్ వాటిని చాలెంజ్‌గా తీసుకొని వందశాతం ఎఫెర్ట్స్ పెట్టి ఆడతారు. దెబ్బలు తగిలినా పట్టించుకోరు. ఒకనొక దశలో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు అరుస్తూ కొట్టుకునే స్థాయికి వెళ్తారు. . బిగ్ బాస్‌లో ఇలాంటి కామన్. అయితే బిగ్ బాస్ 5లో టాస్క్‌ల డోస్ కొంచెం పెరిగినట్లు కనిపిస్తోంది. రెండో వారంలోనే బిగ్‌బాస్ ఇంట్లో ఓ రేంజ్‌లో గొడవలు జరిగినట్లు తాజా ప్రోమోలు చూస్తే అర్థవుతుంది.
కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కింద ఇంటి సభ్యులను రెండు జట్టులుగా విభజించాడు బిగ్‌బాస్. ‘పంథం నీదా నాదా’అనే ఈ టాస్క్‌లో భారీగా గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఉమెన్ కార్డు వాడొద్దని కాజల్‌కి వార్నింగ్ ఇచ్చాడు సింగర్ శ్రీరామచంద్ర. సన్నీ టూ మచ్ ఇది అంటూ షణ్ముఖ్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇంట్లో ఎంతో క్లోజ్‌గా మూవ్ అవుతున్న విశ్వ, రవిల మధ్య కూడా పెద్ద గొడవే జరిగినట్టుంది. రవి అయితే ‘ఛీ’అంటూ విశ్వపై గట్టిగా అరిచాడు. విశ్వ కూడా తగ్గేదే లేదనట్లుగా రవికి గట్టిగానే ఇచ్చేశాడు. లహరి ఒకవైపు, సన్నీ మరోవైపు భోరున విలపిస్తున్నారు. ఈ మాటల యుద్దం ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment