Vishwa
-
నేరుగా ఓటీటీకి వస్తోన్న లవ్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఇటీవల ఓటీటీలు అద్భుతమైన కంటెంట్ అందిస్తున్నాయి. చిన్న సినిమాలైనా సరే కథ, కథనం బాగుంటే చాలు. ఇలాంటి సినిమాలే ఓటీటీల్లో దూసుకెళ్తున్నాయి. కొన్ని చిన్న చిత్రాలైతే థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ అలా విడుదలయ్యే ట్రెండ్ ఇప్పుడిప్పుడే మరింత ఊపందుకుంటోంది.తాజాగా మరో టాలీవుడ్ సినిమా ఓటీటీలోనే విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 35 చిన్న కథ కాదు హీరో విశ్వదేవ్ నటించిన లేటేస్ట్ మూవీ నీలి మేఘ శ్యామ. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా కనిపించనుంది. రవి ఎస్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి అర్జున్-కార్తిక్ కథను అందించారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. గతంలోనే అనౌన్స్ ఓటీటీకి వస్తుందని ప్రకటించిన చిత్రబృందం.. స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఆహాలో అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ చూస్తే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.కాగా.. ఈ సినిమాకు శరణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. మొదట థియేటర్లలో రిలీజ్ చేయడానికి చాలా రోజులు ప్రయత్నించినా.. తర్వాత నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ఇటీవల 35 చిన్న కథ కాదు మూవీతో మెప్పించిన విశ్వదేవ్ రాచకొండ ఇటీవల విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. -
SL vs NZ: ప్రత్యర్థులకు దడ పుట్టించే లంక బౌలర్ ఎంట్రీ!
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందరర్భంగా శ్రీలంక ఓ అన్క్యాప్డ్ ప్లేయర్‌కి జట్టులో చోటిచ్చింది. విశ్వ ఫెర్నాండో గాయపడిన కారణంగా అతడి స్థానంలో ఆఫ్ స్పిన్నర్ నిషాన్ పెరిస్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది. గాలె వేదికగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో లంక కివీస్‌ను చిత్తు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.2018లోనే జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపులెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (4/136; 5/68) స్పిన్ మాయాజాలం కారణంగా శ్రీలంకకు ఈ విజయం సాధ్యమైంది. ఇక ఇరుజట్ల మధ్య సెప్టెంబరు 26 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో నిషాన్ పెరిస్ను జట్టులోకి తీసుకున్నట్లుశ్రీలంక బోర్డు తెలిపింది.33 ఏళ్ల విశ్వ ఫెర్నాండో ప్రాక్టీస్ సమయంలో తొడకండరాలు పట్టేయడంతో నొప్పితో బాధపడ్డాడని.. అతడిస్థానాన్ని నిషాన్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా నిషాన్‌కు 2018లోనే జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అకిల ధనుంజయ గాయపడటంతో మూడో మ్యాచ్‌కు అతడిని ఎంపిక చేశారు.ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దడ పుట్టించిన ఘనతకానీ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలోనూ జట్టుకు ఎంపికైనా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి కూడా అరంగేట్రం చేసే అవకాశం కనిపించడం లేదు. కాగా నిషాన్ పెరిస్ 41 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఏకంగా 172 వికెట్లు పడగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దడ పుట్టించిన ఘనత సొంతం చేసుకున్నాడు.ఇందులో 12సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. ఇక 61 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు తీశాడు. ఒకవేళ నిషాన్‌ను గనుక తుదిజట్టులోకి ఎంపిక చేస్తే మరో భయంకర స్పిన్నర్‌ను ఎదుర్కొనేందుకు కివీస్ సిద్ధపడాల్సిందే!న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు శ్రీలంక జట్టుదిముత్ కరుణరత్నే, పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), దినేశ్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో, మిలన్ ప్రియనాథ్ రాత్నాయక్, సదీర సమరవిక్రమ, జెఫ్రీ వాండర్సే, ఓషద ఫెర్నాండో, నిషాన్ పెరిస్.చదవండి: మోర్నీ పనికిరాడన్నట్లు చూశారు.. తామే గొప్ప అనుకుంటారు: పాక్ మాజీ క్రికెటర్ -
Actor Vishwa: బిగ్‌బాస్ కంటెస్టెంట్ విశ్వ రెండో కుమారుడి అన్నప్రాసన (ఫోటోలు)
-
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘కలియుగం పట్టణంలో’
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా తాజా చిత్రం‘కలియుగ పట్టణంలో’. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం టైటిల్ లోగోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదగా రిలీజ్ చేయగా.. మంచి స్పందల లభించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కడప జిల్లాలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఒకే షెడ్యూల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు. -
వారికి గుడ్‌న్యూస్: 5 శాతం వడ్డీతో లక్షరూపాయల లోన్
PM Vishwakarma Scheme: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశ్వకర్మ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సంప్రదాయ నైపుణ్యాలు కలిగిన వారి కోసం 13 -15వేల కోట్ల రూపాయల కేటాయింపుతో విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. తాజాగా నైపుణ్యాలు కలిగినవ్యక్తులను ఆదుకునేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి అశ్విని వైష్షవ్ వెల్లడించారు.ఈ పథకం వల్ల 30 లక్షల మంది హస్తకళాకారులు మరియు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. 2028 వరకు ఐదు సంవత్సరాల కాలానికి రూ13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో కూడిన ఈ పథకం, తొలి ఏడాది 18 సంప్రదాయ వ్యాపారాలను కవర్ చేస్తుంది. ఇందులో భాగంగా లక్ష రూపాయలను రుణాన్ని ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. "పీఎం విశ్వకర్మ" కింద తొలి విడతగా వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, కమ్మరి, తాళాలు చేసేవారు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు, చెప్పులు కుట్టేవారు తాపీ పని వారికి లబ్ధి చేకూరనుంది. ఈ రుణాలపై కేవలం 5 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేయన్నుట్టు తెలిపారు. చేతి వృత్తుల కళాకారులకు, మత్య్సుకారులకు, తాపీ పనిచేసే వారికి ఆర్థిక చేయూతనందించాలనేది లక్ష్యమన్నారు. అలాగే మొబిలిటీ ఫండ్ కింద రూ.57వేల కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పీఎం ఈ-బస్ సేవకు కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపిందనీ, దీని కింద100 నగరాలు, పట్టణాలకు 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. ప్రైవేట్-పబ్లిక్ పార్టనర్షిప్ మోడల్లో సిటీ బస్సుల కార్యకలాపాలను 10,000 ఇ-బస్సులను అందించే పథకం అంచనా వ్యయం రూ. 57,613 కోట్లు. ఈ పథకంలో రెండు విభాగాలు ఉన్నాయి - ఒకటి సిటీ బస్ సేవలను పెంపొందించడానికి మరియు మరొకటి గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనిషియేటివ్స్ కింద ఇన్ఫ్రా అభివృద్ధి చేయడానికి సిటీ బస్సు కార్యకలాపాల్లో సుమారు 10,000 బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా ఈ పథకం 45,000 నుండి 55,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. The PM in Union Cabinet meeting today approved ‘PM Vishwakarma’ scheme to support people with traditional skills. Under this scheme, loans up to Rs 1 lakh will be provided on liberal terms: Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/CcDkV5slX1 — ANI (@ANI) August 16, 2023 -
గుడ్ న్యూస్ చెప్పిన భార్య.. ఏడ్చేసిన విశ్వ
నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ విశ్వ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అమె భార్య శ్రద్ధా యూట్యూబ్ వీడియో ద్వారా అభిమానులకు వెల్లడించింది. రెండోసారి మేము తల్లిదండ్రులు కాబోతున్నాం.. 'విశ్వకు ఇంకా ఈ గుడ్‌న్యూస్ చెప్పలేదు, తనను కలిసి సర్ప్రైజ్ చేస్తా. మొదటిసారి గర్భం దాల్చినప్పుడు నేను బాంబేలో ఉన్నా, ఆయన హైదరాబాద్‌లో ఉన్నాడు. వీడియో కాల్లో ఆ విషయం చెప్పాను. ఈసారి మాత్రం డైరెక్ట్‌గా చెప్పాలనుకున్నా.. పనిలో పనిగా ఈ ఆనందకర క్షణాలను వ్లాగ్‌లో రికార్డ్ చేస్తున్నాను. అది ఇంకా హ్యాపీ' అని చెప్పుకొచ్చింది. ఇక వీడియోలో శ్రద్ధా కొబ్బరి బోండాం కావాలని అమాయకంగా అడిగింది. సరేనని విశ్వ కొబ్బరి బోండాం కొనిచ్చాడు. ఆ నీళ్లు తాగిన శ్రద్ధ ఇదేంటి పుల్లగా ఉందని హింటిచ్చింది. అది అర్థం చేసుకోని విశ్వ కొబ్బరి నీళ్లు తాగి తీయగానే ఉన్నాయిగా, ఏమైనా ప్రాంక్ చేస్తున్నావా? అని అడిగాడు. తర్వాత చాక్లెట్ కావాలని అడిగడంతో అది కూడా తీసుకొచ్చాడు. ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్ తీసుకొచ్చావు, ఫ్యామిలీ అని నొక్కి చెప్పింది శ్రద్ధ. అయినా సరే అర్థం చేసుకోలేకపోయాడు విశ్వ. ఇంకా ఏడిపించడం వద్దనుకున్న శ్రద్ధ చివర్లో తను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని రివీల్ చేయడంతో ఎమోషనలయ్యాడు విశ్వ. చదవండి: 2022లో పత్తా లేని హీరోలు -
ఒకసారి మంచాన పడ్డా.. అప్పటి నుంచి అది ప్రారంభించా : విశ్వ
Bigg Boss 5 Vishwa Home Tour Video Goes Viral: బిగ్‌బాస్ రియాలిటీ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న వారిలో నటుడు విశ్వ ఒకరు. బిగ్‌బాస్ కంటే ముందు కొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ షోతో ఎంతోమందికి చేరువయ్యాడు. టాస్కుల్లో మిగతా కంటెస్టెంట్ల కంటే స్ట్రాంగ్ అనేలా పేరు తెచ్చుకున్న విశ్వ బిగ్‌బాస్ అనుకోని విధంగా ఎలిమినేట్ అయి షాకిచ్చాడు. కానీ బిగ్‌బాస్ అనంతరం సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వివిధ రకాల వీడియోలతో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. తాజాగా తన సొంతింటిని నెటిజన్లకు పరిచయం చేశాడు. అంతేకాకుండా తన ఇంటికి ఎలా రావాలో స్వయంగా కారు నడుపుకుంటూ అడ్రస్ చూపించాడు. ఇక ఇది తన సొంతిల్లు అని, 2017లో దీన్ని నిర్మించుకున్నట్లు తెలిపాడు. ఇంట్లో వాళ్లందరిని పరిచయం చేస్తూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను వివరించాడు. మరి విశ్వ హోంటూర్పై మీరు కూడా ఓ లుక్కేయండి. -
బీఎండబ్ల్యూ కారు కొన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్
Bigg Boss Contestants Owns BMW Car: బిగ్‌బాస్ షో అందరికీ కలిసిరాకపోయినా కొందరికి బాగా కలిసొస్తుంది. అందులో విశ్వ ఒకరు. లాక్డౌన్లో కూతురు చదువు ఫీజు కట్టడానికి కూడా డబ్బుల్లేవని ఏడ్చిన అతడికి బిగ్‌బాస్ షోతో దశ తిరిగిపోయినట్లు కనిపిస్తుంది. తాజాగా అతడు లగ్జరీ కారు కొన్నాడు. లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారును తన సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈ శుభవార్తను అతడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'నా జీవితంలోకి కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చింది. కలలు కన్న కారును కొంటే ఆ ఆనందమే వేరు. మొత్తానికి నేను ఎంతగానో ఇష్టపడే కారును కొని కల నెరవేర్చుకున్నాను. దీనికి కారణమైన ఆ దేవుడికి, బిగ్‌బాస్‌కు ఇదే నా కృతజ్ఞతలు. అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. బ్లాక్ బీఎండబ్ల్యూ కారు ముందు ఫొటోలకు పోజిచ్చాడు. దీంతో చాలామంది విశ్వకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బిగ్‌బాస్‌తో విశ్వ రేంజ్ మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం షోలో స్కూలు ఫీజుకు కూడా డబ్బుల్లేవని చెప్పాలి, బయటకు వచ్చాక బీఎండబ్ల్యూ కారులో తిరగాలి అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Actor Vishwa (@actorvishwaa_official) View this post on Instagram A post shared by Actor Vishwa (@actorvishwaa_official) -
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ సీక్రెట్ రివీల్ చేసిన విశ్వ..
Bigg Boss Telugu 5, Vishwa Reveals BB5 Winner Name: బిగ్‌బాస్ రియాలిటీ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరున్న విశ్వ గతవారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తాను హౌస్ నుంచి బయటకు రావడం నమ్మలేకపోతున్నానని, అయితే ప్రేక్షకుల ఓటింగ్‌ను స్వాగతిస్తున్నా అని పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వ..బిగ్‌బాస్ షో గురించి పలు ఆసక్తిక విషయాలు పంచుకున్నాడు.ఈ షో ద్వారా లోబో తనకు బెస్ట్‌ఫ్రెండ్‌గా మారిపోయాడని, బిగ్‌బాస్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అదేనన్నాడు. ఇక అందరూ అనుకుంటున్నట్లుబిగ్బాస్ స్క్రిప్టెడ్ కాదని, అందులో జరిగేవన్నీ వాస్తవాలే అని తెలిపాడు. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే తప్పకుండా వెళ్తానని చెప్పాడు. ఇక బిగ్‌బాస్ ఈ సీజన్ విజేత శ్రీరామచంద్ర అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాని, మంచి స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపాడు. -
ఒకరి జీవితంతో ఆడుకోకండి: విశ్వ వార్నింగ్
Bigg Boss Buzz Interview With Vishwa: బిగ్‌బాస్ హౌస్ నుంచి సగర్వంగా వీడ్కోలు తీసుకున్నాడు విశ్వ. ఈ సీజన్‌కే సూపర్ హీరో అనిపించుకుని మరీ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. శ్రీరామచంద్రను ఫైటర్‌గా కొనియాడిన విశ్వ.. మానస్ ఓటమిని కూడా అంగీకరించాలన్నాడు. గ్రూప్స్ వల్ల ఏ కంటెస్టెంట్ అయినా సేవ్ అయ్యారా? అన్న అరియానా ప్రశ్నకు షణ్ముఖ్, జెస్సీ, సిరి అని బదులిచ్చాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను నామినేట్ చేయాలన్న యానీ మాస్టర్ స్ట్రాటజీ ఎందుకు నచ్చలేదన్న క్వశ్చన్‌కు ఆమె తన గేమ్ ఎలా ఆడాలనే విషయాన్ని పక్కనపెట్టి పక్కవాళ్ల గేమ్ ఎలా ఆపాలని చూస్తుంది, అది నచ్చదని చెప్పుకొచ్చాడు. 'షణ్ముఖ్.. గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా ఉంటాడు. అతడు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాడు. మానస్‌కు ఏం జరిగినా వెంటనే పింకీ అక్కడుంటుంది. కానీ ఆమె కింద పడినప్పుడు మానస్ వెళ్లలేదు. ఎందుకని అడిగితే పోనని ఆన్సరిచ్చాడు. సిరికి షణ్ముఖ్ బయట ఫ్రెండ్ కావచ్చు, ఇక్కడ ఫ్రెండ్ కావచ్చు. కానీ ఒకరి జీవితంతో ఆడుకోవద్దు' అని హెచ్చరించాడు విశ్వ. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. -
బిగ్‌బాస్ ద్వారా విశ్వ ఎంత వెనకేశాడో తెలుసా?
Bigg Boss Telugu 5, Eliminated Contestant Vishwa Remuneration: బిగ్‌బాస్ షో చూస్తుండగానే 9 వారం ముగింపుకు చేరుకుంది. ఇప్పటివరకు హౌస్‌లో నుంచి 8 మంది వెళ్లిపోయారు. వీరిలో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతవర్మ, ప్రియ, లోబో ఉన్నారు. తాజాగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల లిస్టులో విశ్వ చేరడంతో ఈ సంఖ్య 9కి చేరింది. ఎంతో స్ట్రాంగ్ అనుకున్న విశ్వ హౌస్ నుంచి వెళ్లిపోవడం అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు బుల్లితెర అభిమానులకు సైతం షాకింగ్‌గా ఉంది. ఏ టాస్క్ ఇచ్చినా తిరుగులేని ప్రదర్శన ఇచ్చే విశ్వ ఎలిమినేట్ అవడం ఏంటో అర్థం కాక బుర్రలు బద్ధలు కొట్టుకున్నారు హౌస్మేట్స్. అన్నింట్లో ది బెస్ట్ ఇచ్చి, రంగులు మార్చకుండా మొదటి నుంచి ఒకేలా ఉన్న వ్యక్తిని ఎలా ఎలిమినేట్ చేస్తారని యానీ తల పట్టుకుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను పంపించేసి ఇంకేం గేమ్ ఆడతారని పెదవి విరుస్తున్నారు. అసలు బిగ్‌బాస్ వల్ల విశ్వ ఏమైనా లాభపడ్డాడా? అని చర్చిస్తున్నారు. అసలే లాక్డౌన్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అతడికి బిగ్‌బాస్ ఏమైనా ప్లస్ అయిందా? అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో విశ్వ రెమ్యునరేషన్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే అతడికి వారానికి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు ఇస్తున్నారట! ఈ లెక్కన అతడు 9 వారాలకు గానూ 22 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది! -
విన్నర్, టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పేసిన విశ్వ
Bigg Boss 5 Telugu, 9th Week Vishwa Eliminated: విశ్వ ఎలిమినేషన్‌తో ఇంటిసభ్యులు డల్ అయిపోయారు. బెస్ట్ సంచాలకుడు, బెస్ట్ రేషన్ మేనేజర్, బెస్ట్ కెప్టెన్, బిగ్‌బాస్ హౌస్‌కు సూపర్ హీరో విశ్వ అని అతడిని ఆకాశానికెత్తారు. ఎంతో బాగా గేమ్ ఆడే విశ్వ వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఇక విశ్వ వెళ్లిపోతూ కంటెస్టెంట్లకు ర్యాంకులివ్వడంతో పాటు వారికి సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇంట్లోకి వెళ్లాక నా మనసుకు కనెక్ట్ అయిన మొదటి వ్యక్తి ప్రియాంక అంటూ ఆమెకు 10వ ర్యాంక్ ఇచ్చాడు. కాజల్ బాగా ఆడుతుందని, కానీ తను ధైర్యాన్ని కోల్పోతుందంటూ 9వ ర్యాంకిచ్చాడు. నువ్వు స్ట్రాంగ్, కానీ గేమ్‌లో గివప్ ఇవ్వకూడదని జెస్సీకి సలహా ఇస్తూ అతడిని 8వ స్థానంలో ఉంచాడు. యానీ ఫైటర్ అని మెచ్చుకుంటూ ఆమెకు 7వ ర్యాంకిచ్చాడు. గెలుపోటములు సహజమని, ఓడిపోయినప్పుడు అతిగా బాధపడొద్దని మానస్‌కు సూచిస్తూ 6వ ర్యాంక్ ఇచ్చాడు. తర్వాత టాప్ 5 కంటెస్టెంట్లను వెల్లడించాడు. సిరి టాప్ 5లో ఉండాలన్నాడు. సన్నీ ఇలా కూల్‌గా ఉంటే బాగోలేడని, నువ్వు నీలాగే ఉండంటూ అతడికి నాల్గో ర్యాంకిచ్చాడు. గెలిస్తే చిల్ అవుతూ ఓడిపోతే కింద కుంపటి పెట్టినట్లు ఫీల్ అయ్యే షణ్ముఖ్‌కు 3వ స్థానం ఇచ్చాడు. రవిని అందరూ గుంటనక్క అనుకుంటారు, కానీ అతడు అలాంటివాడు కాదంటూ రవిని 2వ స్థానంలో నిలబెట్టాడు. ఇక శ్రీరామ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు విశ్వ. తాను కోల్పోయిన తమ్ముడిని శ్రీరామ్‌లో చూసుకుంటున్నాననంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఈ సీజన్‌కు విన్నర్‌గా మొదటి స్థానంలో నిలబెట్టాడు. -
విశ్వ ఎలిమినేటెడ్, శోకసంద్రంలో యానీ మాస్టర్
Bigg Boss Telugu 5, Vishwa Eliminated: సండేను ఫండేగా మార్చడానికి రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. హౌస్‌మేట్స్‌తో 'బొమ్మ ఇక్కడ, పాట ఎక్కడ?' అనే గేమ్ ఆడించాడు. అందులో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. A టీమ్‌లో సన్నీ, విశ్వ, షణ్ముఖ్, కాజల్, ప్రియాంక ఉండగా మిగిలినవారంతా B టీమ్‌లో ఉంటారు. ఇక ఈ గేమ్‌లో విజువల్స్ చూసి సాంగ్ గెస్ చేయాలి. ఈ గేమ్‌లో రవి టీమ్(B టీమ్) గెలిచింది. తర్వాత శ్రీరామ్ సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్. అనంతరం నాగ్ ఇంటిసభ్యులతో 'నేను ఎవరిని?' గేమ్ ఆడించారు. ఇందులోని చీటీలలో కంటెస్టెంట్ల పేర్లు రాసి ఉన్నాయి. టీమ్ నుంచి ఒక్కొక్కరు వస్తూ తము తీసుకున్న చీటీలో ఎవరి పేరైతే ఉంటుందో వారిని ఇమిటేట్ చేయాలి. సదరు టీమ్ వాళ్లు గెస్ చేయాలి. ఇందులో ఒకరినొకరు బాగా ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించారు. ఫైనల్‌గా ఈ గేమ్‌లో సన్నీ( A) టీమ్ గెలిచింది. తర్వాత జెస్సీ సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని నాగ్ ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో సన్నీ, మానస్.. షణ్ముఖ్‌ను, షణ్ముఖ్.. ప్రియాంక సిరిపై దాడి చేసిందంటూ ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డారు. ప్రియాంక.. విశ్వను; విశ్వ.. జెస్సీని; జెస్సీ, సిరి, శ్రీరామ్.. కాజల్; కాజల్.. సిరి; రవి.. మానస్‌ను; యానీ.. సన్నీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొన్నారు. ఎక్కువ ఓట్లు పడ్డ కాజల్ వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నికైంది. తర్వాత ప్రియాంక సింగ్ సేఫ్, కాజల్ సేఫ్ అవగా విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. విశ్వ ఎలిమినేషన్‌తో కంటెస్టెంట్లు షాకయ్యారు. ఎవరి జోలికి పోకుండా పర్ఫెక్ట్గా గేమ్ ఆడేవాడు వెళ్లిపోయాడు అంటూ యానీ కంటతడి పెట్టుకుంది. -
అతడి పాపం పండింది: నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ 9 వారం ముగింపుకు చేరుకుంది. ఈ వారం సన్నీ, శ్రీరామచంద్ర, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, విశ్వ నామినేషన్లో ఉన్నారు. వీరిలో విశ్వ, కాజల్, జెస్సీలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. తాజాగా కండల వీరుడు విశ్వ హౌస్‌ను వీడనున్నట్లు వార్త లీకైంది. ఓ పక్క సూపర్ హీరో అని మెచ్చుకుంటూనే హౌస్మేట్స్ విశ్వను ఇంటి నుంచి పంపించివేస్తున్నారని నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ స్పందించారు. 'అందరికీ సూపర్ ఎగ్జయిట్మెంట్ ఉన్న వార్త.. హౌస్‌లో నుంచి ఊసరవెల్లి బయటకు వచ్చేసింది. ఎందుకంటే అది చేసిన పాపాలు పండాయి కాబట్టే ఇలా జరిగింది' అని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నటరాజ్ మాస్టర్‌ను ఏకిపారేస్తున్నారు. 'మరి నువ్వెందుకు నాలుగో వారంలోనే బయటకు వచ్చావు? అంటే తమరెన్ని పాపాలు చేశారో!', 'మీ పాపం నాలుగో వారంలోనే పండింది', 'నువ్వు విశ్వ ఆడినదాంట్లో సగం కూడా ఆడలేదు, పైగా పోజులు కొడుతున్నావ్', 'నీ సోది జంతువులకు చెప్పుకోపో' అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. View this post on Instagram A post shared by BIGGBOSS 5 TELUGU 🧿 (@biggboss5teluguoffficial) -
బిగ్‌బాస్: హీరో అంటూనే నామం పెట్టారు! ఆవిడే విలన్!
Bigg Boss 5 Telugu, Episode 63: సిరిని ఓదార్చడానికి షణ్నుకు తల ప్రాణం తోకకొచ్చింది. 'దీనమ్మ ప్రేమేందిరాబై గిట్ల సంపుతున్నాది, పోరీ పీకినాక హ్యాంగోవర్ టార్చరున్నాది..' అంటూ ఒంటరిగా పాటందుకున్నాడు. అయినా దీపు(దీప్తి సునయన)ను భరిస్తే ఎవరినైనా భరించగలను అంటూ తనను తానే ఓదార్చుకున్నాడు. మరోపక్క పింకీ.. దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ అర్ధరాత్రి ఏడుపందుకుంది. అప్పుడు నీతో హ్యాపీగా ఉండేదాన్నని మానస్‌తో గోడు చెప్పుకుంటూ బాధపడింది. దీంతో మానస్.. ఆమెను చేరదీసి ఓదార్చాడు. కెప్టెన్‌గా షణ్నుకు 9 మార్కులు: నాగ్ కానీ మరుసటి రోజు మాత్రం పింకీకి క్లాస్ పీకాడు. 'నువ్వు కావాలని, ఏదో అనుకుని నాతో మాట్లాడుతున్నావు, నేను చిన్నపిల్లాడిని కాదు, నాకు తెలీదు అనుకోకు..' అని చురకలంటించాడు. దీంతో పింకీ సరేనని తలూపింది. కెప్టెన్సీ టాస్క్‌లో షణ్ను తమను సపోర్ట్ చేయలేదని అటు సిరి, ఇటు జెస్సీ బాగా హర్టయ్యారు. దీంతో షణ్ను వాళ్లిద్దరినీ బతిమాడలేక చచ్చిపోయాడు. నాగార్జున స్టేజీపైకి వచ్చీరావడంతోనే యానీ కెప్టెన్ అయిందంటూ ఆమెను మెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా నీకు నువ్వు ఎన్ని మార్కులిచ్చుకుంటావని నాగ్ అడగ్గా అతడు 7 అని టపీమని ఆన్సరిస్తాడు. కానీ తాను మాత్రం 9 మార్కులిస్తానని చెప్పాడు నాగ్. ఇక కొద్దిరోజులుగా దూరందూరంగా ఉంటున్న సిరి, షణ్నులను ఫ్రెండ్షిప్ సాంగ్‌తో కలిపేశాడు నాగ్. (చదవండి: Archana: ఆ హీరో వంకరగా ఆలోచించేవాడు.. అతడి నిజస్వరూపం వేరే..) కాజల్‌తో నాగిన్ జ్యూస్ తాగిపించిన యానీ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో నిన్ను చిత్రహింసలు పెట్టిన టీమ్‌లో నుంచి ఒకరిపై ప్రతీకారం తీర్చుకోమని అవకాశం ఇచ్చాడు నాగ్. దీంతో రవి.. సోయా సాస్, చిల్లీ సాస్, గుడ్డు.. అన్నీ కలిపి దానికి షణ్స్ సిర్స్ జెస్స్ కాక్టెయిల్ అని పేరుపెట్టాడు. తప్పించుకునే దారి లేక షణ్ను దాన్ని అతి కష్టం మీద దాన్ని తాగేశాడు. యానీ... కాజల్‌తో మిర్చి తినిపించి తర్వాతో నాగిన్ జ్యూస్ తాగమని చేతికందించింది. అయితే కాజల్ ఎత్తిన గ్లాసు దించకుండా తాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రియాంక ఇచ్చిన పచ్చిగుడ్డును మింగేశాడు రవి. శ్రీరామ్.. సన్నీతో మిర్చి తినిపించాడు. ఆ వెంటనే జ్యూస్‌లో ఇంకేవేవో కలపడానికి ప్రయత్నించగా మొగడా ఆగరా అంటూ విసుక్కుంటూనే మొత్తానికి తాగేశాడు సన్నీ. నేను నమ్మే ఏకైక వ్యక్తి ఇతడే: కాజల్ హౌస్‌మేట్స్‌తో నాగ్.. ఎవరు హీరో? ఎవరు విలన్? గేమ్ ఆడించాడు. ముందుగా సిరి.. షణ్ముఖ్‌కు స్టార్ బ్యాడ్జ్ పెట్టి అతడు ఎప్పుడూ హీరోనే అని చెప్తూ మురిసిపోతూ, ప్రియాంక సింగ్ తనకు విలన్ అని పేర్కొంది. ప్రియాంక.. మానస్ హీరో అని, సిరి విలన్ అని తెలిపింది. శ్రీరామ్.. విశ్వ తన హీరో అని, సిరి విలన్ అని పేర్కొన్నాడు. కాజల్.. నన్ను విలన్ అనుకుంటున్న యానీయే విలన్ అని చెప్పుకొచ్చింది. ఇక సన్నీకి హీరో బ్యాడ్జ్ పెట్టబోగా అతడు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నాడు. దీంతో కాజల్ యూటర్న్ తీసుకుని మానస్‌కు స్టార్ బ్యాడ్జ్ పెట్టింది. నేను నమ్ముతున్న ఏకైక వ్యక్తి మానస్ అంటూ అతడిని హీరోను చేసింది. సన్నీ.. జెస్సీ హీరో అవ్వాలంటూ అతడికి స్టార్ బ్యాడ్జ్ పెట్టాడు. ప్రియాంకను విలన్ అని చెప్పుకొచ్చాడు. తర్వాత సిరి సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. నాకెప్పుడూ ఒకరే విలన్: షణ్ను తర్వాత రవి వంతు రాగా.. తన నమ్మకం ఎప్పుడూ వమ్ము చేయలేదని, టాస్కుల్లో 100 శాతం కష్టపడతాడంటూ విశ్వను హీరోగా పేర్కొన్నాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని షణ్ను విలన్ అని చెప్పాడు. ఇక షణ్ను.. తనకెప్పుడూ ఒకరే విలన్ అంటూ రవి మీద క్రాస్ గుర్తు గుద్దాడు. ఈ విలన్ లేకపోతే తాను హీరో అవలేనన్నాడు. అబ్బాయిల కంటే దారుణంగా గేమ్ ఆడే సిరి హీరో అని పొగిడాడు. యానీ.. కాజల్‌తో కంఫర్టబుల్‌గా లేనంటూ ఆమెను విలన్‌గా పేర్కొంది. మొదటి వారం నుంచి చాలా చక్కగా ఆడుతాన్నాడంటూ విశ్వకు స్టార్ బ్యాడ్జ్ ఇచ్చింది. విశ్వ.. గేమ్ ఛేంజర్ శ్రీరామ్ హీరో అని, ప్రియాంక సింగ్ విలన్ అని అభిప్రాయపడ్డాడు. పాపం సన్నీ, ఆఖరికి కమెడియన్.. జెస్సీ.. తన గురించి ఎంతో కేర్ తీసుకుంటూ, అమ్మలా చూసుకునే సిరి హీరో అని ఆకాశానికెత్తాడు. గేమ్‌లో డల్ అవుతున్న కాజల్ విలన్ అని చెప్పుకొచ్చాడు. మానస్.. ప్రియాంక తనకు హీరో అని చెప్పడంతో ఆమె ఆనంద భాష్పాలు కార్చింది. అనంతరం రవి విలన్ అని చెప్పాడు. మొత్తంగా ఈ టాస్క్‌లో విశ్వ ఈ హౌస్‌కు హీరోగా, ప్రియాంకను విలన్‌గా తేల్చేశాడు నాగ్. హీరో, విలన్ ఏ ట్యాగూ రాని సన్నీని హీరోకు, విలన్‌కు మధ్యలో ఉన్న కమెడియన్ అన్నాడు నాగ్. ఏదేమైనా విశ్వను హీరో అంటూనే హౌస్ నుంచిం పంపించి వేస్తున్నట్లు తెలుస్తోంది. ] -
హౌస్‌మేట్స్‌కు ముచ్చెమటలు పట్టించే కంటెస్టెంట్ అవుట్!
బుల్లితెర అభిమానులు ఎంతగానో ఇష్టపడే రియాలిటీ షో బిగ్‌బాస్. తమ అభిమాన తారలు స్క్రీన్ బయట ఎలా ఉంటారు? వాళ్ల ఇష్టాయిష్టాలేంటి? వాళ్ల లైఫ్‌లో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? భవిష్యత్తు కోసం ఏం ప్లాన్లు వేసుకుంటున్నారు? వంటి ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే షో బిగ్‌బాస్. ఇక్కడ పాల్గొనే కంటెస్టెంట్లు తమ జీవితాలను తెరచిన పుస్తకంలా ప్రేక్షకుల ముందుంచుతారు. దీంతో అభిమాన తారల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఫ్యాన్స్‌కు బిగ్‌బాస్ ద్వారా నెరవేరుతుందన్న మాట! అయితే తారలనే కాకుండా పెద్దగా పాపులర్ కానివారిని కూడా తీసుకువచ్చి వారి ఎదుగుదలకు బాటలు వేస్తుందీ గేమ్ షో. ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ 5 నడుస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. సరయూ, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో వరుసగా వెళ్లిపోయారు. ఈ వారం సన్నీ, శ్రీరామచంద్ర, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, విశ్వ నామినేషన్లో ఉన్నారు. వీరిలో జెస్సీ, విశ్వ డేంజర్ జోన్లో ఉన్నట్లు మొదటి నుంచీ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎవరు ఎలిమినేట్ అయ్యారన్న విషయాన్ని ఎప్పటిలాగే లీకువీరులు సోషల్ మీడియాలో చాటింపు వేసేశారు. కండల వీరుడు విశ్వ హౌస్‌ను వీడనున్నట్లు పేర్కొన్నారు. విశ్వ విషయానికి వస్తే అతడు గేమ్‌లో విశ్వరూపం చూపిస్తాడు. అతడు టాస్క్‌లో పాల్గొంటున్నాడంటే చాలు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడతాయి. విశ్వను ఓడించడం కష్టం అని ముందుగానే డిసైడ్ అయిపోతారు. ఎలిమినేట్ అయిన పలువురు కంటెస్టెంట్లు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఆట ఒక్కటే ఉంటే సరిపోదు, ఆకట్టుకునే టాలెంట్ కూడా ఉండాలి. ప్రేక్షకులు తనకు ఓటేసేలా ఆకర్షించడంలో విశ్వ వెనకబడ్డాడు. దీంతో ఈ వారం అతడు ఎలిమినేట్ అయినట్లు తెలిస్తోంది. ఏదేమైనా బిగ్‌బాస్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను కోల్పోయిందంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు! -
బిగ్‌బాస్: ఆడు, ఈడు అంటూ రెచ్చిపోయిన ప్రియ..ఏయ్ అంటూ సన్నీ ఫైర్
Bigg Boss Telugu 5, Episode 46: కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విశ్వకు స్పెషల్ పవర్ ఉన్న ఒక ఎల్లో గుడ్డు లభించింది. దాని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశం లభించింది. అయితే దాని కోసం ఎక్కువ దుస్తులు ధరించాలనే ఒక టాస్క్‌ను కూడా ఇచ్చాడు బిగ్‌బాస్. విశ్వతో పాటు ఆయన ఎంచుకున్న మరో వ్యక్తి ఈ టాస్క్ ఆడాల్సి ఉంటుంది. దీంతో కాజల్‌ని తన పోటీదారునిగా ఎంచుకున్నాడు విశ్వ. ఇద్దరు పోటా పోటీన దుస్తులు ధరించారు. ఈ టాస్క్‌లో సన్నీ.. కాజల్‌కి హెల్ప్ చేశాడు. ఆమె చేతఎక్కువ దుస్తులు ధరింపజేయాలని ఇంటి సభ్యుల లోదుస్తులతో సహా అన్ని పట్టుకొచ్చాడు. అవి చూసి ప్రియాంక ‘ఛీ’అంటూ తెగ నవ్వేసింది. ఈ టాస్క్‌లో మొత్తంగా విశ్వ 106 దుస్తులు ధరించి కాజల్(79 దుస్తులు)పై గెలిచాడు. దుస్తులు తొలగించే క్రమంలో విశ్వ తన ఒంటి పై ఉన్న నిక్కరు తప్ప అన్ని విప్పేశాడు. దీంతో ప్రియాంక ‘అది కూడా తీసేయ్’అని అనడంతో ఇంటి సభ్యులంతా నవ్వేశారు. జస్వంత్‌కి సీక్రెట్ టాస్క్ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌లో భాగంగా జెస్సీకి బిగ్‌బాస్ ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఎవరైనా ముగ్గురు సభ్యులు సభ్యుల దగ్గర గుడ్లు లేకుండా నాశనం చేయాల్సి ఉంటుందని, ఈ సీక్రెట్ టాస్క్‌లో గెలిస్తే నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికవుతారని చెప్పాడు. ఈ టాస్క్‌లో సహాయకులుగా ఒకర్ని ఎంచుకోవచ్చని బిగ్ బాస్ చాయిస్ ఇచ్చాడు. దీంతో సిరి సహాయం తీసుకున్నాడు జెస్సీ. వీరిద్దరు కలిసి.. షణ్ముఖ్, ప్రియ, ప్రియాంక దగ్గర ఎగ్స్ లేకుండా చేయాలని డిసైడ్ అయ్యారు. షణ్ణ్నూ దగ్గరకు వెళ్లిన సిరి.. అతని దగ్గర ఉన్న ఎగ్స్‌ని ఇచ్చేయడానికి ఒప్పించింది. ఆ తరువాత ప్రియాంక దగ్గరకు వెళ్లి నాపై నమ్మకం పెట్టుకుని నీ దగ్గర ఎక్స్ ఏమీ పెట్టుకోకు.. తరువాత నువ్వే హ్యాపీ ఫీల్ అవుతావు అని చెప్పింది. దీంతో ప్రియాంక కూడా ఎగ్స్ లేకుండా చూసుకుంటానని మాట ఇచ్చింది. ఆ తర్వాత ప్రియను కూడా ఒప్పించారు. జెస్సీ గుడ్లు నొక్కేసిన సన్నీ అందరూ పడుకున్న తరువాత సన్నీ గుడ్లు నొక్కేయడం మొదలుపెట్టాడు. జెస్సీ దాచుకున్న గుడ్లను కొట్టేసి మానస్‌కి ఇచ్చాడు. అయితే ఇది కామెడీగానే చేశాడు సన్నీ. కానీ అదే వారిద్దరి మధ్య గొడవకు దారి తీసింది. సన్నీ గుడ్లు తీసిన విషయాన్ని ప్రియ పసిగట్టి సిరికి చెప్పింది. ఈ విషయంపై జెస్సీ, సన్నీల మధ్య మాటల యుద్దం జరిగింది. చెప్ప పగిలిపోద్దన్న ప్రియ.. దమ్ముంటే కొట్టమన్న సన్నీ ‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో భాగంగా సన్నీ ఒక్కో గుడ్డును ఏరుకొని తన బుట్ట దాచుకుంటే.. వాటిని నొక్కేసే ప్రయత్నం చేసింది ప్రియ. ఈ క్రమంలో సన్నీ, ప్రియల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒకానొక దశలో ఫిజికల్ అటాక్ వరకు వెళ్లింది. బుట్టలోని గుడ్లను దొంగిలించడానికి ప్రియ ప్రయత్నించగా.. ప్లీజ్ ప్రొటక్షన్ అంటూ ఆమెను పక్కకి తోసేశాడు సన్నీ. దీంతో కోపోద్రిక్తురాలైన ప్రియ.. అతనిపై పూల కుండీ ఎత్తేసి.. ఫిజికల్ ఎటాక్ చేస్తే మరద్యాదగా ఉండదు.. చెంప పగిలిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి సన్నీ నోరు ఉందికదా అని పారేసుకోవద్దు అంటూ సీరియస్ అయ్యాడు. మిగిలిన ఇంటి సభ్యులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికి గొడవ తగ్గలేదు. ప్రియ మరింత రెచ్చిపోయి.. నా మీదికి వస్తే చెంపపగిలిపోద్ది అని పదే పదే అనడంతో.. దమ్ముంటే కొట్టు అని సన్నీ మీది మీదికి వెళ్లాడు. ఇంటి సభ్యులు కలగజేసుకొని వారిద్దరిని శాంతింపజేశారు ప్రియ.. కాజల్ వెకిలి నవ్వులు సన్నీని టార్గెట్ చేసిన ప్రియ.. చేసిందంతా చేసి.. మళ్లీ తనపై ఫిజికల్ అటాక్ చేశాడంటూ ఎడ్వడం మొదలెట్టింది. అంతేకాదు ఆడు ఈడు అని మాట్లాడలేదని, ఒకవేళ తనకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే అలా కూడా అంటానని తనను తాను సమర్థించుకుంది. చేసేదంతా చేసేసి ఈ సింపథీ డ్రామాలేంటి? అని సన్నీ మిగతా సభ్యులతో అన్నాడు. ఇక కాజల్ మధ్యలో కలగజేసుకొని మా బుట్టలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడగ్గా.. మిమ్మల్నే టార్గెట్ చేస్తానని ప్రియ ముఖం మీదే చెప్పేసింది. దీంతో కాజల్ వెతకారంగా నవ్వగా.. ప్రియ కూడా అలానే నవ్వేసింది.వీరిద్దరి వెకిలి నవ్వులు చూసిన యానీ మాస్టర్ నవ్వును ఆపుకోలేకపోయింది. సిరితో రవి డీల్ బంగారు కోడిపెట్ట టాస్క్‌లో తొలిరోజే సిరి స్టిక్కర్స్‌ని కోల్పోయిన విషయం తెలిసిందే కదా. అయితే సిక్టర్స్ ఇస్తే.. గుడ్లు ఇస్తావా అని డీల్ కుదుర్చుకున్నాడు. నాలుగు గుడ్లు ఇచ్చింది. శ్రీరామ్‌కు స్పెషల్ బ్లూ ఎగ్.. బట్ నో యూజ్ టాస్క్‌లో భాగంగా శ్రీరామ్‌కు స్పెషల్ బ్లూ ఎగ్ లభించింది. దీని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అందుకోసం ఒకరిని ఎంచుకొని ఆ వ్యక్తితో గేమ్ ఆడాల్సి ఉంటుంది. దీంతో శ్రీరామ్ తెలివిగా తనకంటే పొట్టిగా ఉన్న యానీ మాస్టర్ని ఎంచుకున్నాడు. దీంట్లో భాగంగా ఇద్దరి సభ్యులకు ప్రభాకర్, దివాకర్ అనే బాతు బొమ్మలను ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ బొమ్మను చేతుల్లో పట్టుకొని.. కింద పడిపోకుండా ఎవరు కాపాడుకుంటారో వారికే ఐదు గుడ్లు లభిస్తాయి. ఈ గేమ్‌లో యానీ మాస్టర్ గెలిచి, ఐదు గుడ్లను స్వంతం చేసుకుంది. -
రవి అలాంటి వాడు..విశ్వ పైకి అలా కనిపిస్తాడు కానీ!: అలీ రెజా
Bigg Boss Fame Ali Reza About Anchor Ravi: టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ చాలామందికి ఫేమ్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటివరకు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా బిగ్‌బాస్ షోతో ఓవర్ నైట్ స్టార్డం వస్తుంది. అదే స్థాయిలో కొందరి పాపులారిటీ అమాంతం తగ్గిపోతుంది. షోలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కొందరు డీఫేమ్తో బయటకు రావడం చూస్తుంటాం. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో అందరి కన్నా ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లలో యాంకర్ రవి ఒకరు. అయితే ప్రియ-లహరి ఎపిసోడ్ తర్వాత రవిపై నెగిటివిటి సైతం పెరిగిపోయింది. మొన్నటికి మొన్న శ్వేత సైతం రవికి దూరంగా ఉండాలంటూ హౌస్ మేట్స్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. చేసిన తప్పులు ఒప్పుకోకపోవడం సహా ఇతరులపై నిందలు వేస్తాడంటూ రవిని సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. దీనిపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, రవి స్నేహితుడు అలీ రెజా స్పందించాడు. షోకు వెళ్లేముందే ఈ విషయాల గురించి మాట్లాడుకున్నామని, ఇలా అవుతుందని తనకు ముందే తెలుసని అలీ పేర్కొన్నాడు. ఎవరితోనైనా గొడవలు వస్తే అది పరిష్కరించుకోవాలని రవి భావిస్తాడని, అయితే కొందరు అపార్థం చేసుకుంటున్నారన్నాడు. రవి తనకు వ్యక్తిగతంలో తెలుసని, కాబట్టి షో చూసి జడ్జ్ చేయనని రవికి కితాబిచ్చాడు. ఇక మరో కంటెస్టెంట్ విశ్వ పైకి చాలా పహిల్వాన్లా కనిపించినా తను చాలా ఎమోషనల్ పర్సన్ అని, బయట కూడా అతను అలాగే ఉంటాడని చెప్పుకొచ్చాడు. -
రవికి దూరంగా ఉండండి, అతడు డేంజర్!: శ్వేత వార్నింగ్
Bigg Boss 5 Telugu, Episode 43: లోబో తండ్రి చనిపోయినప్పుడు వాడితో నేనున్నాను, ఆ టైంలో ఎవరూ లేకపోయినా మూడు రోజులు వాడితో ఉన్నాను. అతడు అమాయకుడు అంటూ హౌస్ నుంచి వెళ్లిపోయిన తన జిగిరీ దోస్త్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు రవి. ఇక నాగ్.. ఇంటిసభ్యులతో ఫన్ టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా సన్నీ, మానస్, జెస్సీ, యానీ, ప్రియ, శ్వేతలను బి టీమ్‌గా మిగిలిన వారిని ఏ టీమ్‌గా విభజించాడు. టాస్క్‌లో భాగంగా చీటీలో ఉండే పాట పేరును పీకతో వాయించగా మిగిలిన వారు గుర్తుపట్టాలి. బిగ్ బ్రదర్‌గా చెప్తున్నా.. ఈ అవకాశాన్ని వాడుకో: నాగ్ మొదటగా షణ్ను పీకతో మ్యూజిక్ వాయించగా సిరి.. అది రింగరింగ పాట అని ఇట్టే గుర్తుపట్టింది. తర్వాత సన్నీ వాయించిన పాటను శ్రీరామ్.. సారంగదరియా అని పసిగట్టాడు. ఇలా ప్రతి ఒక్కరు చిట్టీ తీయడం, దాన్ని కరెక్ట్‌గా గెస్ చేసిన టీమ్ డ్యాన్స్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ టాస్క్‌లో టీమ్ ఏ గెలిచింది. అనంతరం నాగ్.. షణ్ముఖ్, ప్రియాంక, శ్రీరామ్, సన్నీ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. మరోపక్క సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబోను పలకరించాడు నాగ్. నీకో బిగ్ బ్రదర్‌గా చెప్తున్నా.. ఈ అవకాశాన్ని బాగా వాడుకో.. అని సలహా ఇచ్చాడు. కానీ లోబో మాత్రం సీక్రెట్ రూమ్‌లో ఉన్నందుకు సంతోషించాల్సింది పోయి నిరుత్సాహపడ్డాడు. శ్వేత ఎలిమినేట్, ఏడుపందుకున్న కంటెస్టెంట్లు తర్వాత ఇంటిసభ్యుల కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు. ఇందులో కళ్లకు గంతలు కట్టుకున్న వారు బోనును కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో కూడా టీమ్ ఏ విజయం సాధించింది. అనంతరం జెస్సీ సేఫ్ అయినట్లు నాగ్ వెల్లడించాడు. మిగిలిన సిరి, శ్వేతను గార్డెన్ ఏరియాకు రమ్మన్న నాగ్.. వారితో ఓ బాక్సు బద్దలు చేయించాడు. అందులోని బాక్సులో ఎవరి ఫోటో ఉందో వాళ్లు సేఫ్ అని తెలిపాడు. ఆ బాక్సు తెరిచి చూడగా అందులో సిరి ఫొటో ఉండటంతో ఆమె హౌస్‌లో కంటిన్యూ కాగా శ్వేత ఎలిమినేట్ అయింది. దీంతో షాక్‌కు గురైన యానీ, సన్నీ, ప్రియాంక, విశ్వ ఏడుపందుకున్నారు. వాళ్లను టాప్ 5లో చూడాలనుకుంటున్నా: శ్వేత ఇక స్టేజీ మీదకు వచ్చిన శ్వేతతో సైన్ గేమ్ ఆడించాడు నాగ్. రవి వెరీ స్మార్ట్ అని, అతడికి దూరంగా ఉండాలని కంటెస్టెంట్లను హెచ్చరించింది శ్వేత. హౌస్‌లో మానస్ డేంజర్ అని అభిప్రాయపడింది, తక్కువ మాట్లాడి ఎక్కువ ఆడాలని యానీ మాస్టర్‌కు సలహా ఇచ్చింది. నిన్ను టాప్ 5లో చూడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. శ్రీరామ్‌కు త్వరగా రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అతడిని టాప్ 5లో చూడాలనుకుంటున్నానంది. విశ్వ ఒలంపిక్స్‌కు కూడా వెళ్తాడనిపిస్తోంది విశ్వ గేమ్‌లో దారి తప్పుతున్నాడంది. కాకపోతే టాస్కుల్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడని, అతడిని చూస్తుంటే విశ్వ ఒలంపిక్స్‌కు కూడా వెళ్లిపోవచ్చనిపిస్తుందని చెప్పుకొచ్చింది శ్వేత. కాజల్ డెడ్ ఎండ్ అని, మాట మార్చి యూటర్న్ తీసుకుంటుందని అభిప్రాయపడింది. శ్రీరామ్.. శ్వేత కోసం ముస్తఫా ముస్తఫా పాట పాడి అక్కడున్నవాళ్లను ఏడిపించాడు. అనంతరం భారమైన హ00దయంతో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది శ్వేతా వర్మ. -
డేంజర్ జోన్లో ఆ ముగ్గురు, అందరికళ్లు ఆమెపైనే!
Bigg Boss 5 Telugu, 6th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఆరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఇప్పుడు 14 మంది మాత్రమే మిగిలారు. ఈ వారం వీరిలో నుంచి ఏకంగా 10 మంది నామినేట్ అయ్యారు. శ్రీరామచంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్, ప్రియాంక, సన్నీ, శ్వేత, యాంకర్ రవి, జెస్సీ నామినేషన్లో ఉన్నారు. మరి ఈ 10 మందిలో నుంచి హౌస్‌కు వీడ్కోలు పలికేదెవరు? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఓటింగ్‌లో మొదటి నుంచి టాప్‌లో దూసుకుపోతున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అంగుళం కూడా లేదు. ప్రతిసారి తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్న యాంకర్ రవికి కావాల్సినంత పాపులారిటీ ఉంది కాబట్టి అది అతడిని నీడలా రక్షిస్తోంది. సన్నీ, శ్రీరామ్‌కు కూడా భారీగానే ఓట్లు గుద్దుతున్నారు.. కనుక వీళ్లూ సేఫ్ జోన్లోనే ఉన్నట్లు లెక్క! సిరి, ప్రియాంక, జెస్సీ కూడా బయటకు వెళ్లేట్లు కనిపించడం లేదు. మిగిలిందల్లా శ్వేత, విశ్వ, లోబో. వీరిలో ఒకరిపై ఎలిమినేషన్ వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. విశ్వ రెండోసారి కెప్టెన్‌గా గెలిచి సత్తా చాటడంతో అతడి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నికైన శ్వేత గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఈ లెక్కన శ్వేత హౌస్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది బిగ్‌బాస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు, కాబట్టి ఎలిమినేషన్లో ఏం ట్విస్ట్ ఇస్తారో? ఎవరిని పంపించేస్తారో చూడాలి! -
నామినేషన్స్ లీక్: ఈసారి ఏకంగా 10 మంది, ఎవరెవరంటే?
Bigg Boss 5 Telugu, 6th Week Nominations: మండే.. అనగానే బిగ్‌బాస్ ప్రేక్షకులకు చటుక్కున గుర్తొచ్చేది నామినేషన్స్. అప్పటిదాకా చిరునవ్వుతో విప్పారిన ముఖాలు కాస్తా ఈ నామినేషన్స్ రాగానే కోపంతో ఎర్రబడిపోతాయి. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లు ఒకరి మీద ఒకరు తెగ అరుచుకుంటారు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో నేడు ఆరోవారం నామినేషన్స్ జరగబోతున్నాయి. ఇందుకోసం కంటెస్టెంట్లకు అగ్నిపరీక్ష పెట్టాడు బిగ్‌బాస్. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి పొటోలను మంటల్లో వేయమని ఆదేశించాడు. ఈ క్రమంలో మానస్ తనకు టాస్కులో సపోర్ట్ చేసిన జెస్సీని నామినేట్ చేశాడు. నీకు సపోర్ట్ చేసినందుకు బాగా బుద్ధి చెప్పావంటూ కౌంటరిచ్చాడు జెస్సీ. అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకని విశ్వను హెచ్చరించింది యానీ మాస్టర్. రేషన్ మేనేజర్ అంటే అందరికీ సమానంగా ఫుడ్ పంచాలే తప్ప ఫస్ట్ మనమే వెళ్లి తినడం కాదు.. అంటూ విశ్వపై సెటైర్ వేసింది ప్రియ. ఆమె అలా మాట్లాడటం నచ్చని విశ్వ.. నా కడుపు నా ఇష్టం, తింటాను అని ఆన్సరిచ్చాడు. ఇక సిరి, శ్వేత మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కెప్టెన్ ప్రియ, షణ్ముఖ్, యానీ మాస్టర్, కాజల్ మినహా మిగిలిన 10 మంది నామినేట్ అయ్యారట! అంటే సన్నీ, విశ్వ, సిరి, జెస్సీ, రవి, మానస్, శ్రీరామచంద్ర, లోబో, శ్వేత, ప్రియాంక సింగ్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు భోగట్టా! ఒకవేళ ఇదే నిజమైతే లోబో, శ్వేత, సిరి, విశ్వ డేంజర్ జోన్లో ఉన్నట్లేనని గుసగుసలు పెడుతున్నారు నెటిజన్లు. -
ఉమాపై గెలుపు, ఏడుస్తూనే ట్విస్ట్ ఇచ్చిన లోబో!
Bigg Boss Telugu 5, Episode 12: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఏమోగానీ అరుపులు, కొట్లాటలు, ఒకరి మీద ఒకరు పడటాలు, మల్లయుద్ధాలు, కుస్తీ పోటీలతో బిగ్‌బాస్ హౌస్ భయానకంగా మారిపోయింది. దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఆవేశాలను చల్లార్చేందుకు మరో టాస్క్ ప్రవేశపెట్టాడు. అప్పటిదాకా శివమూగిన కంటెస్టెంట్లు ఇందులో మాత్రం తెగ నవ్వించారు. మరి నేటి(సెప్టెంబర్ 16వ) ఎపిసోడ్లో ఏమేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. చాక్లెట్లతో సర్ప్రైజ్ చేసిన బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారులను ఎంచుకునే క్రమంలో బిగ్‌బాస్ 'అగ్గిపుల్లా మజాకా' టాస్క్ ఇచ్చాడు. ఇందులో రెండు టీమ్స్ తమ తమ బాక్సుల్లోని ఇసుకలో అగ్గిపుల్లలు ముట్టించి చివర్లో ఉన్న కర్పూరం అంటుకునేలా చేయాల్సి ఉంటుంది. ఈ టాస్కులో పర్పుల్ టీమ్ గెలవడంతో జెండా లభించింది. ఓవరాల్‌గా 'పంతం నీదా నాదా' టాస్క్ ముగిసే సమయానికి గద్ద టీమ్ ఆరు, నక్క టీమ్ ఐదు జెండాలు సాధించింది. దీంతో గద్ద టీమ్ గెలిచిందని స్పష్టమవుతోంది. అనంతరం హౌస్‌లో శ్వేత బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా శ్వేత తండ్రి విషెస్ చెప్పిన వీడియోను బిగ్‌బాస్ ప్లే చేయడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యుల కోసం చాక్లెట్లు పంపి సర్ప్రైజ్ చేశాడు. ఇదిలా వుంటే రాత్రిపూట గిన్నెలు కడుగుతున్న మానస్‌కు సాయం చేయడానికి వచ్చింది లహరి. ఆ తర్వాత అతడిని బెడ్ దాకా రమ్మని చెప్పి హగ్గులిచ్చాక గుడ్‌నైట్ చెప్పింది. కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి ఉమా, లోబోల రొమాన్స్ చూడలేకపోయారు హౌస్మేట్స్. అందరికన్నా నువ్వే అందంగా ఉన్నావంటూ ఉమాకు సోపేశాడు లోబో. దీంతో పడిపోయిన ఉమా.. అతడికి స్పూన్‌తో తినిపిస్తూ చేతులు తడిమింది, హత్తుకుంది కూడా! ఇది చూసిన రవి.. మీది యాక్టింగ్ అని తెలిసిపోతుందిలే అని గాలి తీసేశాడు. గద్ద టీమ్ కెప్టెన్ శ్రీరామచంద్ర.. విశ్వ, యానీ మాస్టర్, పింకీ, హమీదాలను కెప్టెన్సీకి పోటీదారులుగా ప్రకటించాడు. వీరికి బిగ్‌బాస్.. 'కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్మేట్స్ కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నారో వారి బీకర్లలో కొబ్బరికాయ నీళ్లు నింపాల్సి ఉంటుంది. ఎవరి బీకరు ముందుగా నిండితే వాళ్లు కెప్టెన్ అయినట్లు లెక్క! ఈ టాస్కులో విశ్వ గెలిచి సెకండ్ కెప్టెన్‌గా నిలిచాడు. హమీదా స్మార్ట్, హాట్, క్యూట్.. అంటున్న షణ్ముఖ్ షణ్ముఖ్లోని మరో కోణాన్ని బట్టబయలు చేశాడు యాంకర్ రవి. హౌస్‌లో హమీదా స్మార్ట్, హాట్, క్యూట్, ఇంటెలిజెంట్ అని నాతో అన్నావ్ కదా అని అందరి ముందే షణ్ముఖ్‌ను అడిగేశాడు. చెల్లెలు కూడా అన్నావనగానే ఆ మాట మాత్రం అనలేదు, తాము ఫ్రెండ్స్ అని చెప్పాడు. దీంతో అవాక్కైన రవి.. షణ్ముఖ్ ఎంతో ఇష్టపడే పిల్లో మీద S(షణ్ముఖ్), D(దీప్తి సునయన)తో పాటు H(హమీదా) కూడా రాద్దామని జోక్ చేశాడు. అయితే హమీదా మాత్రం.. దీప్తి పేరు తీసేసి తన పేరు రాసుకోమంది, కావాలంటే బయటకెళ్లాక మళ్లీ దీప్తి పేరు రాసుకోమని సలహా ఇవ్వడంతో అక్కడున్న రవి, లహరి నోరెళ్లబెట్టారు. అయితే చివర్లో మాత్రం ఫ్రెండ్షిప్ అంటూ కవర్ చేసింది హమీదా. ఆనందంతో పూల్‌లో మునకేసిన లోబో ఇక ఇంట్లో సింగిల్ బెడ్ దక్కించుకునేందుకు ఉమ, లోబోకు ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. వీళ్లిద్దరిలో ఎవరు ఎక్కువ నవ్విస్తే వాళ్లకు ఆ బెడ్ సొంతమని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన లోబో.. పింకీతో కలిసి స్కిట్ వేసి కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత వచ్చిన ఉమాదేవి.. సిరితో కలిసి అత్తాకోడళ్ల స్కిట్ వేసి కామెడీ పండించింది. కానీ దీనికోసం లోబోను బర్రె, జెస్సీని ఆవుతో పోల్చడం సరికాదనేది పలువురి అభిప్రాయం. మొత్తానికి ఈ కామెడీ స్కిట్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న లోబో విజేతగా నిలిచాడు. దీంతో ఆనందం ఉండబట్టలేక అతడు ఏకంగా స్విమ్మింగ్ పూల్‌లో మునకేశాడు. ఇన్నాళ్లు నేలపై పడుకున్న తనకు సింగిల్ బెడ్ లభించడంతో ఎమోషనల్ అయిన లోబో కన్నీళ్లతో హౌస్‌మేట్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు. తనేదైనా తప్పు చేస్తే క్షమించమని కోరాడు. తను గెలిచిన బెడ్‌ను ఉమాదేవికి అందించాడు. షణ్ను బర్త్‌డే సెలబ్రేషన్స్ ఆ తర్వాత హౌస్‌లో షణ్ముఖ్ బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ల పేరెంట్స్విషెస్ తెలిపిన వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్. అనంతరం ప్రేయసి దీప్తి సునయన ఐ లవ్యూ చెప్పిన వీడియో ప్లే చేయడంతో అతడి కళ్లలో నీళ్లు తిరగ్గా అందరూ తనను ఓదార్చారు. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ ఏ గొడవా లేకుండా కొనసాగింది. మరి రేపటి లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో బిగ్‌బాస్ వీళ్ల మధ్య మళ్లీ అగ్గి రాజేస్తాడేమో చూడాలి! -
ఏందయ్యా బిగ్‌బాస్, నువ్వే లీక్ చేస్తే ఎలా?.. పేలుతున్న జోకులు
బిగ్‌బాస్ తప్పులో కాలేశాడు. సెకండ్ కెప్టెన్ ఎవరనేది తనంతట తానుగా లీక్ చేశాడు. అయితే విశ్వ కెప్టెన్ అయ్యాడనేది ఒక రోజు నుంచే ప్రచారం జరుగుతోంది అది వేరే విషయం. కానీ అదే నిజమంటూ ప్రోమోలో క్లారిటీ ఇచ్చేశాడు బిగ్‌బాస్. నేడు రిలీజైన ఒక ప్రోమోలో లోబో, ఉమాదేవి పోటీపడి మరీ స్కిట్ చేస్తున్నారు. వీరి కామెడీని చూసి తట్టుకోలేకపోయిన కంటెస్టెంట్లు పడీపడీ నవ్వారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ హౌస్మేట్స్ నవ్వులను చూపించాడు. అందులో విశ్వ ఎడమచేతికి కెప్టెన్ బ్యాండ్ ఉంది. దీన్ని పసిగట్టిన నెటిజన్లు బిగ్‌బాస్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు. ఇదేందయ్యా.. నువ్వే లీక్ చేశావ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరే లీక్ చేస్తే మరి మేమేం చేయాలి అని సెటైర్ వేస్తున్నారు లీకువీరులు. కంటెంట్ దొరికింది, వదిలేదే లేదు అంటూ బిగ్‌బాస్‌ను ఆడేసుకుంటున్నారు మీమర్స్.. సోషల్ మీడియాలో పేలుతున్న జోకులను మీరూ చూసేయండి.. View this post on Instagram A post shared by biggbosstelugu5 (@biggbosstelugu.5) View this post on Instagram A post shared by @biggbosstelugu5official_ View this post on Instagram A post shared by ʙɪɢɢʙᴏꜱꜱ5 ᴛᴇʟᴜɢᴜ™ (@team__biggboss) View this post on Instagram A post shared by Biggboss5official 🔵 (@biggboss5teluguofficialll) View this post on Instagram A post shared by Pedda Dora (@peddadora) View this post on Instagram A post shared by BIGG BOSS TELUGU SEASON 5 (@biggbosstelugu.officials) -
గెలవడానికి రాలే, రూ.50 లక్షలిస్తే వాళ్ల ముఖాన కొడ్తా: శ్రీరామ్
Bigg Boss Telugu 5, Episode 11: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఏమో కానీ బిగ్‌బాస్ కుస్తీల ప్రోగ్రామ్‌లా మారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే వారి ఆటతో ప్రేక్షకులకు చెమట్లు పట్టించారు. అప్పటిదాకా స్నేహగీతం పాడుకున్నవాళ్లు కూడా బద్ధ శత్రువుల్లా మారిపోయారు. సైలెంట్‌గా కనిపించే శ్రీరామ్ శివాలెత్తిపోగా శ్వేత అందర్నీ ఓ ఆటాడించింది. కంటిచూపుతో గడగడలాడించే ఉమాదేవిపై దాడి చేయడంతో ఆమె కాళికా అవతారమెత్తింది. దీంతో మరోసారి యానీ మాస్టర్, ఉమాల మధ్య అగ్గి రాజుకుంది. మరి దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో ఇచ్చిన మూడు లెవల్స్‌లో ఏ టీమ్ గెలిచింది? అనేది చూసేద్దాం.. సిగ్గుతో తల దించుకోవాలి.. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లోని రెండో లెవల్ 'సాగరా సోదరా' టాస్క్‌లో నక్క(ఎల్లో) టీమ్ సభ్యులు ఎక్కువగా సాగదీసి నిలబడ్డారు. ఎల్లో టీం 33.3 మీటర్స్.. బ్లూ టీం 33 మీటర్స్ పొడువు ఉండగలిగాయి. అయితే ఇరువైపులా లెక్కలు తీసుకున్నాక మానస్ డన్ అనడంతో చివరి క్షణంలో శ్వేత కిందపడిపోయింది. అయితే అప్పటికే టాస్క్ అయిపోయింది కాబట్టి అది పరిగణనలోకి తీసుకోరని మానస్ టీమ్ ఎంత వారించినా అవతలి టీమ్ ఒప్పుకోలేదు. సంచాలకులు ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో టాస్క్ రద్దు చేస్తున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో శ్రీరామచంద్ర ఓవర్ ఎగ్జయిట్మెంట్లో డ్యాన్స్ చేశాడు. అతడి ప్రవర్తనకు చిర్రెత్తిన రవి టాస్క్ రద్దయినందుకు సిగ్గుతో తల దించుకోవాలని చురకలంటించాడు. సిగ్గు మీకు, కానీ మాకవసరం లేదు అని కౌంటరిచ్చింది ప్రియ. నాతో మైండ్ గేమ్ ఆడకు: రవికి వార్నింగ్ ఇచ్చిన సింగర్ ఆ తర్వాత మళ్లీ 'పంతం నీదా నాదా' టాస్క్ మొదలు కాగా ఎల్లో టీమ్ రెచ్చిపోయి ఆడింది. ఈ క్రమంలో శ్వేత కొట్టిందని సిరి ఆరోపించింది. దీంతో తిక్క లేచిన ప్రియ.. సాయంత్రం కాగానే ఆమెకు దెయ్యం పూనుతుందని మండిపడింది. టాస్క్‌కు బ్రేక్ ఇచ్చిన తర్వాత యాంకర్ రవి.. శ్రీరామచంద్రతో ఉన్న గొడవను పరిష్కరించుకుందామని చూశాడు. కానీ అతడితో మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడని శ్రీరామ్.. సేఫ్ గేమ్ ఆడుకో, నాతో మైండ్ గేమ్ ఆడకు అని సలహా ఇచ్చాడు. తాను తెలుగువాళ్లకు చేరువయ్యేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నానే తప్ప గెలవడానికి రాలేదని, రూ.50 లక్షలు ఇచ్చినా వాళ్ల ముఖాన కొడ్తానని చెప్పాడు. ఫ్యామిలీని గుర్తు చేసుకుని ఏడ్చేసిన లోబో ఇక తర్వాతి రోజు శ్రీరామ్- మానస్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. మానస్‌ను పిలిచి వయసెంత అని అడిగాడు శ్రీరామ్. అతడు 28 అని చెప్పాడు. అందుకే నీ ఏజ్ అడిగా, ఇప్పటికీ చిన్నపిల్లోడివే, నీకు మెచ్చురిటీ లేదని సింగర్ వ్యాఖ్యానించగా.. మీకు ఏజ్ పెరిగినా మెచ్యురెటీ లేదని రివర్స్ కౌంటరిచ్చాడు మానస్. మరోవైపు లోబో తన ఇంటిని గుర్తు చేసుకుని ఏడ్చేశాడు. తనకేమైనా ఐతే తన వాళ్లను చూసుకునే వాళ్లెవరూ లేరని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ తర్వాత ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా? టాస్క్ మొదలైంది. ఇందులో లోబో లేకుండానే గద్ద టీమ్ ఆడి గెలిచింది. దీంతో వారికి ఒక ఫ్లాగ్ వచ్చింది. ఉమాదేవిపై దాడి, ఆమె ఊరుకుంటుందా! అనంతరం 'పంతం నీదా నాదా' టాస్క్ తిరిగి ప్రారంభమైంది. ఇందులో అనుకోకుండా సన్నీ పింకీ చేయిని విసిరేయడంతో ఆమె కిందపడిపోయింది. అది చూసిన శ్రీరామ్.. పగిలిపోద్ది అని సన్నీని తిట్టాడు. తన మీద నోరు జారినందుకు సన్నీ ఆవేశపడుతుండగా.. మగాడివైతే ఆడుదువు రా అంటూ అతడిని మరింత రెచ్చగొట్టింది ప్రియ. పర్పుల్ టీమ్ మీద పడి పిల్లోస్ తీసుకోవాలని చూసిన ఉమాదేవిని ప్రియ ఓ వస్తువుతో కొట్టింది. తనను మాటంటేనే పడని ఉమా దెబ్బకు దెబ్బ తీయకుండా ఉంటుందా! తన మీద చేయి చేసుకున్న ఆ టీమ్ సభ్యులను ఉతికారేయాలని చూసింది. తనను కొడితే డ్రెస్సు చింపుతానని ఉమా అనడంతో యానీ మాస్టర్ రెచ్చిపోయింది. ఒసేయ్ ఉమా, సిగ్గు లేదా, థూ అని చీదరించుకుంది. మరోపక్క పర్పుల్ టీమ్ దగ్గరకు వచ్చిన శ్వేతను తన్నేందుకు ప్రయత్నించింది ప్రియ. రక్తాలు వచ్చేలా కొట్టుకు చస్తున్నా పట్టించుకోని బిగ్‌బాస్ అంతా అయిపోయాక మాత్రం హౌస్‌లో హింసకు తావు లేదంటూ హెచ్చరిక చేయడం గమనార్హం. శ్రీరామ్‌తో మసాజ్ చేయించుకున్న హమీదా ఈ టాస్క్ పూర్తయ్యే సమయానికి రెండు టీమ్స్ దగ్గరా 11 బెటాన్స్ ఉండటంతో ఇరు టీమ్స్‌కు ఐదు జెండాలు పంపించాడు బిగ్‌బాస్. ఇక రాత్రిపూట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్న శ్రీరామ్ హమీదాకు మసాజ్ చేశాడు. ఈ సందర్భంగా హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, కానీ అంతలోనే మళ్లీ దూరంగా ఉండాలనిపిస్తుంది అని మనసులోని మాట చెప్పింది. ఈ మాటతో గాల్లో తేలిపోయిన శ్రీరామ్.. ఇంకెవరైనా గుర్తొస్తే మాత్రం ఎవరి దగ్గరా ఉండకూడదు అని పంచ్ ఇవ్వడంతో ఫక్కున నవ్వేసింది హమీదా. వీరి మధ్య ఏమైనా మొదలువుతుందా? లేదా ఈ ఇద్దరిదీ స్నేహమేనా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. -
బిగ్‌బాస్ నుంచి మరో లీక్, సెకండ్ కెప్టెన్‌గా కండల వీరుడు
Bigg Boss Telugu 5, Second Week Captain: టాలీవుడ్ కింగ్ నాగార్జున చెప్పినట్లు బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ప్రేక్షకులకు ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ముఖ్యంగా మగవాళ్లకన్నా లేడీ కంటెస్టెంట్లు టాస్కుల్లో తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు బూతులు కూడా మాట్లాడి అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం టాస్క్ నడుస్తోంది. ఇందుకోసం ఇంటిసభ్యులు గద్ద( లోబో, యానీ మాస్టర్, శ్రీరామ్, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్, ప్రియాంక), నక్క(ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్, సన్నీ, కాజల్, శ్వేత, నటరాజ్) టీములుగా విడిపోయారు. టాస్కు గెలిచేందుకు ఓ రకంగా యుద్ధమే చేస్తున్నారు కంటెస్టెంట్లు. స్నేహితులుగా ఉన్నవాళ్లు కూడా గేమ్‌లో బద్ధ శత్రువులుగా మారిపోయారు. మొత్తానికి బిగ్‌బాస్ ఇచ్చిన ఈ టాస్కులో గద్ద టీమ్ గెలిచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ టీములో నుంచి విశ్వ కెప్టెన్‌గా ఎంపికైనట్లు ఓ వార్త లీకైంది. మొదటి వారంలో రేషన్ మేనేజర్‌గా కొనసాగిన విశ్వ రెండో వారంలో కెప్టెన్ అయ్యాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!