Bigg Boss 5 Telugu 1st Week Elimination: Sarayu Evicted Bigg Boss Show - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: సరయూ అవుట్‌, వెక్కి వెక్కి ఏడ్చిన విశ్వ

Published Sun, Sep 12 2021 11:22 PM | Last Updated on Mon, Sep 13 2021 3:20 PM

Bigg Boss Telugu 5: Sarayu Evicted From Bigg Boss Show - Sakshi

Bigg Boss Telugu 5, Episode 07: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్న 19 మంది కంటెస్టెంట్లలో ఒకరిని బయటకు పంపే సమయం రానే వచ్చింది. సోషల్‌ మీడియాలో ముందుగా లీకైనట్లుగానే 7 ఆర్ట్స్‌ సరయూ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌. దీంతో హౌస్‌ అంతా కాసేపు ఉద్విగ్న వాతావారణం నెలకొంది. అయితే స్టేజీ మీదకు వచ్చిన సరయూ ఒక్కో కంటెస్టెంట్‌కు ఇచ్చిపడేసింది. మరి నేటి(సెప్టెంబర్‌ 12) ఎపిసోడ్‌ ఎలా సాగిందో చదివేద్దాం..

ర్యాంప్‌ వాక్‌ను ఖూనీ చేసిన లోబో, ఉమాదేవి
సండే ఎపిసోడ్‌ కోసం అందంగా ముస్తాబైన ఇంటిసభ్యులు జంటలుగా విడిపోయి ర్యాంప్‌ వాక్‌ చేశారు. వీరికి జెస్సీ, నాగ్‌ మార్కులేశారు. అయితే ర్యాంప్‌ వాక్‌ను లోబో, ఉమాదేవి ఖూనీ చేసి నవ్వించారు. రవి, హమీదా.. జెస్సీ, యానీ మాస్టర్‌ల కుర్చీ గొడవను గుర్తు చేస్తూ కామెడీ చేశారు. శ్రీరామచంద్ర దొరికించే ఛాన్స్‌ అనుకుని సిరిని ఎత్తుకుని తిప్పాడు. మిగతావాళ్లందరూ కూడా తమతమ స్టైల్లో ర్యాంప్‌ వాక్‌ చేసి అలరించారు. అనంతరం నాగ్‌.. మానస్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు.

సిరి అసలు పేరు తెలుసా?
తర్వాత ఇంటిసభ్యులను 9 జంటలుగా విడగొట్టి 'నేను నీకు తెలుసా?' అనే టాస్క్‌ ఆడించాడు. ఇందులో మొదట సిరి.. జెస్సీని నువ్వెందుకంత ఓవర్‌ చేస్తావని అడిగితే.. అతడు మాత్రం ఎందుకింత త్వరగా ఎంగేజ్‌ అయ్యావని తిరిగి ప్రశ్నించాడు. దీంతో షాకైన సిరి నువ్వు వస్తావని తెలీక అని చిలిపిగా సమాధానమిచ్చింది. సిరి అసలు పేరేంటని నాగ్‌ ప్రశ్నించగా శిరీష హన్మంత్‌ అని సరైన సమాధానం చెప్పాడు జెస్సీ. తర్వాత ఉమాకు రౌడీ రంగమ్మ పాత్ర సూటవుతుందని సరయూ,. సరయూకు అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌ సూటవుతుందని ఉమాదేవి చెప్పింది.

ఎప్పుడూ ఆవిడ గురించే షణ్ముఖ్‌ జపం!
షణ్ముఖ్‌, విశ్వ జోడీ వంతు రాగా నాగ్‌... షణ్ముఖ్‌ ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడతాడని ప్రశ్నించాడు. దీనికి విశ్వ దీప్తి సునయన పేరు చెప్పాడు. హౌస్‌మేట్స్‌లో ఎవరి గురించి? అని నొక్కి ప్రశ్నించడంతో వెంటనే సిరి అని టపీమని బదులిచ్చాడు. విశ్వ లోబోను ఎత్తుకోగలడా? అన్నదానికి అతడు ఏకంగా ఎత్తుకునే చూపించాడు. షణ్ముఖ్‌ చేయి మీద ఏమని టాటూ ఉంటుందని అడగ్గా విశ్వ.. D అనే అక్షరం ఉంటుందని కరెక్ట్‌ ఆన్సరిచ్చాడు.

కాజల్‌ ఎలుక, సరయూ తొండ
ప్రియాంక క్రష్‌ ఎవరని మానస్‌ను అడగ్గా అతడు శ్రీరామచంద్ర పేరు చెప్పాడు. ప్రియాంకను చేసుకునేవాడికి ఎక్కుగా ఏం ఉండాలి? అన్నదానికి కేరింగ్‌ అని చెప్పాడు మానస్‌. ఇలా అన్ని జంటల మధ్య ఫిట్టింగ్‌ పెట్టే ప్రశ్నలడిగాడు. ఆ తర్వాత లోబో.. ఇంట్లో వాళ్లకు ముద్దుపేర్లు పెట్టాడు. రవికి.. మిల్క్‌బాయ్‌, శ్వేత.. టామ్‌ బాయ్‌, సన్నీ.. చాక్లెట్‌, మానస్‌.. హ్యాండసమ్‌గాయ్‌, ప్రియాంక సింగ్‌.. బ్యూటిఫుల్‌, యానీ మాస్టర్‌.. అమ్మ, కాజల్‌.. ఎలుక, సరయూ.. తొండ, నటరాజ్‌.. బావ, ప్రియ.. క్వీన్‌, విశ్వ.. చపాతీ, షణ్ముఖ్‌.. డార్లింగ్‌, హమీదా.. ఎరోప్లేన్‌, శ్రీరామచంద్ర.. మూడీగయ్‌, సిరి.. సీతాకోక చిలుక, జెస్సీ.. పిల్లి అని చెప్పాడు. లహరి, ఉమాదేవికి మాత్రం తాను నిక్‌నేమ్స్‌ పెట్టలేనని చేతులెత్తేశాడు. అనంతరం కాజల్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు.

సరయూ అవుట్‌, ఏడ్చేసిన విశ్వ, హమీదా
తర్వాత నామినేషన్‌లో ఉన్న జెస్సీ, సరయూలకు చెరో సైకిల్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. వీరిలో ఎవరి సైకిల్‌కు లైట్‌ వెలుగుతుందో వారు సేఫ్‌ అయినట్లని చెప్తూ వారిని టెన్షన్‌ పెట్టించాడు. కొద్ది క్షణాల అనంతరం జెస్సీ సైకిల్‌ బల్బ్‌ వెలగడంతో అతడు సేఫ్‌ అని నాగ్‌ ప్రకటించాడు. సరయూ ఎలిమినేట్‌ అయిందని వెల్లడించాడు. ఇది తట్టుకోలేకపోయిన విశ్వ హౌస్‌ లోపలకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాడు. అటు హమీదాను ఆపడం కూడా ఎవరి తరమూ కాలేదు. ఇక సరయూ చివరిసారిగా విశ్వను పట్టుకుని గట్టిగా ఏడ్చేసి అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement