sarayu
-
1,100 మంది వేదాచార్యులతో సరయూ హారతి
లక్నో: ఉత్తరప్రదేశ్ యోగి సర్కారు అక్టోబర్ 28 నుంచి 30 వరకు రామనగరి అయోధ్యలో దీపోత్సవం నిర్వహించనుంది. ఈ సందర్భంగా మొత్తం 25 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఈ సందర్భంగా పలు కళాకారుల బృందాలు రామాయణంలోని వివిధ ఘట్టాల ఆధారంగా ప్రదర్శనలను నిర్వహించనున్నాయి.ఈ దీపోత్సవ్‌కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరుకానున్నారు. లక్ష్మణ్ ఖిలా ఘాట్ నుంచి నయా ఘాట్ వరకు 1100 మంది వేదాచార్యులతో సరయూ హారతి నిర్వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పుతామని యోగి ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. రామ్ కీ పైడీలో లక్షల దీపాల మధ్య భారీ వేదికపై కళాకారులచేత సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ దీపోత్సవంలో ఆరు దేశాలకు చెందిన కళాకారులు రాంలీలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా థాయ్‌లాండ్, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, నేపాల్‌కు చెందిన కళాకారులు తమ ప్రతిభను చాటనున్నారు. అలాగే కశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, చండీగఢ్, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన కళాకారులు అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
విజేత అర్జున్... రన్నరప్ సరయు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆదిరెడ్డి అర్జున్, వేల్పుల సరయు అదరగొట్టారు. హరియాణాలోని కర్నాల్ పట్టణంలో జరిగిన ఈ టోరీ్నలో ఓపెన్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఆదిరెడ్డి అర్జున్ టైటిల్‌ను నిలబెట్టుకోగా... వరంగల్ జిల్లాకు చెందిన సరయు రన్నరప్‌గా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 14 ఏళ్ల అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అర్జున్ 8 గేముల్లో గెలిచి, 3 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు. సౌరత్ బిశ్వాస్ (పశ్చిమ బెంగాల్; 8.5 పాయింట్లు) రెండో స్థానంలో, జైవీర్ మహేంద్రు (మహారాష్ట్ర; 8.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో సరయు నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9 పాయింట్లతో మృతిక మల్లిక్ (పశ్చిమ బెంగాల్)తో కలిసి సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. అయితే చాంపియన్‌ను నిర్ణయించేందుకు మైరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. మెరుగైన టైబ్రేక్ స్కోరుతో మృతిక టైటిల్ సొంతం చేసుకోగా... సరయుకు రెండో స్థానంతో రన్నరప్ ట్రోఫీ దక్కింది. సరయు తొమ్మిది గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయింది. విజేత అర్జున్, రన్నరప్ సరయులను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు. -
అయోధ్యలో జ్యేష్ఠ పౌర్ణమి పుణ్య స్నానాలు
హిందూ క్యాలెండర్లో పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఏడాదికి 12 సార్లు వస్తుంది. ప్రతి పౌర్ణమికీ ఏదోఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు పవిత్ర నదులలో స్నానం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు.ఈసారి జ్యేష్ఠ పౌర్ణమి తిథి జూన్ 21న ఉదయం 6:01కి మొదలై జూన్ 22 ఉదయం 5:07 వరకూ ఉంది. ఈ సందర్భంగా అయోధ్యకు చేరుకున్న లక్షలాదిమంది భక్తులు సరయూ నదిలో స్నానాలు చేస్తున్నారు. ఈరోజు సరయూ జయంతి నిర్వహిస్తున్నారు. సరయూ నది ఈ రోజునే భూమిపైకి వచ్చిందని చెబుతారు. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు వీలుగా స్థానిక అధికారులు సరయూ ఘాట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
ఢిల్లీ, ముంబైలకు పోటీనివ్వనున్న అయోధ్య స్టార్ హోటళ్లు!
అయోధ్యలో నూతన రామమందిరం రాకతోనే పలు ప్రాజెక్టులు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. అయోధ్యలో నూతన రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పుడు దేశంలోనే అత్యంత విలాసవంతమైన తొలి సెవెన్ స్టార్ హోటల్‌ను అయోధ్యలో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విలాసవంతమైన హోటల్ విదేశీయులకు, ప్రముఖులకు అనువైన వసతిని అందించనుంది. ఇక్కడ విశేషమేమంటే ఈ సెవెన్ స్టార్ హోటల్లో కేవలం శాకాహారం మాత్రమే అందించనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలో రామమందిర సందర్శనకు పర్యాటకుల రద్దీ అధికంగా ఉండనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు ఈ ప్రాంతంలో స్థార్ హోటళ్లను నిర్మించేందుకు నూతన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. జనవరి 22 నుంచి అయోధ్యలో పలు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయి. సెవెన్ స్టార్ హోటల్‌తో పాటు ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మరో ఫైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించనున్నదని తెలుస్తోంది. దీనితో పాటు పలు చిన్న హోటళ్ళు కూడా ఇక్కడ ప్రారంభంకానున్నాయి. ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ సంస్థ జనవరి 22న ‘ది సరయూ’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. 45 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులో నది ఒడ్డున విలాసవంతమైన హోటల్ కూడా నిర్మితం కానుంది. ఇక్కడ పలు ఇళ్లు కూడా నిర్మించనున్నారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఇక్కడ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయన 10 వేల చదరపు అడుగుల స్థలాన్ని రూ. 14 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే అయోధ్యలో త్వరలో నిర్మితమయ్యే విలాసవంతమైన హోటళ్లు ముంబై, ఢిల్లీలలోని స్టార్ హోటళ్లను తలదన్నేలా ఉండనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: అయోధ్య రామాలయం రెడీ -
దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు
శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించే దీపావళికి ఇంకా కొద్దిరోజులే ఉంది. ఈ నేపధ్యంలో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు యూపీలోని అయోధ్య నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. దీపావళి రోజున అయోధ్యలో దీపాల పండుగతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రామాయణంలోని పలు సంఘటనల ఆధారంగా వివిధ నృత్య , సంగీత కార్యక్రమాలను కళాకారులు ప్రదర్శించనున్నారు. రామాయణంలోని వివిధ పాత్రలతో కూడిన శకటాలు రామకథా పార్కుకు చేరుకుంటాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీటికి సారధ్యం వహిస్తారు. దీపావళి రోజున సరయూ నది ఒడ్డున నిర్వహించే దీపోత్సవం కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజున ఇక్కడికి తరలివచ్చే భక్తుల కోసం అధికారులు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: యోగి సర్కార్ దీపావళి కానుక.. వీధి వ్యాపారులకు పండుగే పండుగ! -
బిగ్‌బాస్ షో ఫేక్.. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు
బూతు డైలాగులు, వల్గర్ పంచులతో రెచ్చిపోయే నటి సరయు. యూట్యూబ్‌లో 7 ఆర్ట్స్ ఛానల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు, షార్ట్ వీడియోలు చేస్తూ రెచ్చిపోయే సరయు ఆ మధ్య బిగ్‌బాస్ షోలో పాల్గొంది. బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఎంట్రీ ఇచ్చిన సరయు షో మొదలైన వారం రోజులకే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో పార్టిసిపేట్ చేయగా ఇక్కడ నాలుగువారంలో ఎలిమినేట్ అయింది. డబ్బులిచ్చి కొనుక్కోవడమే రెండు సార్లు బిగ్‌బాస్ షోలో పాల్గొన్న సరయు.. తాజాగా ఈ రియాలిటీ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాసే కాదు.. 'ఈ రియాలిటీ షోలు అన్నీ ఫేక్. కొనుక్కుని, లేదంటే తిరిగి వాళ్లకే డబ్బులిచ్చి మన అనుకునేవాళ్లను ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్లాట్‌ఫామ్సే ఈ రియాలిటీ షోలు. మిమ్మల్ని, మనల్ని.. జనాలందరినీ పిచ్చోళ్లను చేస్తున్నారు. దయచేసి ఇలాంటి రియాలిటీ షోలు చూడకండి. మీ టైం పాడు చేసుకోకండి. వారితో ఫైట్ చేస్తే మనమే నెగెటివ్ నేను బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చాను కాబట్టే ఈ మాట చెప్తున్నాను. బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు నాకేం తెలియదు. అంతకుముందు ఉద్యోగం చేశామా? ఇంటికొచ్చామా? యూట్యూబ్ వీడియోలు చేస్తున్నామా? అంతే ఉండేది. కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాక కొంతమందికి బయట నుంచే కాకుండా లోపల కూడా సపోర్ట్ ఉండేది. వారి కాన్ఫిడెన్స్ వేరేలా ఉంటుంది. అలాంటివాళ్లతో పోరాడటం చాలా కష్టం. వారితో ఫైట్ చేస్తే మనమే నెగెటివ్ అవుతాం. ఒత్తిడికి లోనయ్యేదాన్ని' అని చెప్పుకొచ్చింది సరయు. కాగా సరయు 18 పేజెస్ చిత్రంలో హీరో నిఖిల్ స్నేహితురాలిగా నటించింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో భైరవకోన, భారీ తారాగణం.. ఇలా పలు చిత్రాల్లో నటిస్తూ పోతోంది. View this post on Instagram A post shared by Sweta (@sarayuofficial) చదవండి: నచ్చినావురో ఫోక్ సాంగ్‌లో కనిపించిన నటి హీరోయిన్గా -
‘లెహరాయి’ టీంతో ‘బిగ్‌బాస్’ సరయు చిట్ చాట్
-
దేవుడా, నువ్వున్నావా? ఇది చూస్తున్నావా?: సరయు
బిగ్‌బాస్ షోలో నామినేషన్స్, ఎలిమినేషన్స్ మనం ఊహించినట్లుగా ఉండవు. మరీ ముఖ్యంగా ఎలిమినేట్ అవుతారనుకున్న కంటెస్టెంట్లు ఎక్కువ వారాలు హౌస్‌లో కొనసాగుతే, ఫినాలేకు చేరుకునే సత్తా ఉన్న హౌస్మేట్స్ మధ్యలోనే వెనుదిరుగుతారు. ఇలాంటి అద్భుతాలు ఒక్క బిగ్‌బాస్‌లోనే జరుగుతాయి. తాజాగా బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షోలో నుంచి మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. అతడి స్థానంలో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్‌ను హౌస్‌లోకి పంపించారు. బాబాను ఇంట్లోకి పంపడం మంచి నిర్ణయమే కానీ చాలా ఆలస్యంగా దాన్ని అమలు చేశారు. అయితే గేమ్‌లో ప్రత్యర్థులకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న మహేశ్‌ను ఎలిమినేట్ చేయడమే అస్సలు బాగోలేదంటున్నారు ఆయన ఫ్యాన్స్. తాజాగా సరయు సైతం ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను నమ్మకం కోల్పోయాను. దేవుడా, అసలు నువ్వు నిజంగానే ఉన్నావా? ఇక్కడ జరిగేది గమనిస్తున్నావా? అంటూ భావోద్వేగానికి లోనైంది. ఇతరులను బాధపెట్టడానికి ట్రోల్స్ చేస్తుంటారు. కానీ దానివల్ల వారి కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతిని డిప్రెషన్లోకి కూడా వెళ్తుంటారు అని అఖిల్ సార్థక్ తల్లి దుర్గ ఓ పోస్ట్ షేర్ చేసింది. దీనికి సరయు స్పందిస్తూ కరెక్ట్‌గా చెప్పారు ఆంటీ అంటూ ఆ పోస్ట్‌ను తిరిగి షేర్ చేసింది. చదవండి: సమంత ఒంటిపై మూడు టాటూలు, పచ్చబొట్టు వేయించుకోవద్దంటున్న సామ్ గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
Bigg Boss: అంచనాలు తారుమారు, సరయు ఎలిమినేట్!
బుల్లితెర బిగ్గెస్ట్ హిట్ షో బిగ్‌బాస్.. తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకుందీ రియాలిటీ షో. ఈ క్రమంలో హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందో చూడండంటూ లైవ్ స్ట్రీమింగ్‌తో ముందుకు వచ్చింది ఓటీటీ. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ద్వారా కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఫిబ్రవరి 26న 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. అందులో ముమైత్ ఖాన్, శ్రీరాపాక, ఆర్జే చైతూ ఉన్నారు. తాజాగా నాలుగో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఈ వారం సరయు హౌస్‌ను వీడనుందని ప్రచారం చేస్తున్నారు లీకువీరులు. ఇప్పటివరకు వారు చెప్పిందే నిజమవుతూ వచ్చింది కాబట్టి ఇది కూడా నిజమయ్యే అవకాశాలున్నాయి. నిజానికి నాలుగోవారం చాలెంజర్స్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నారంతా. పెద్దగా పాపులారిటీ లేని అనిల్, మిత్ర శర్మలలో ఎవరో ఒకరు బయటకు వచ్చేయడం తథ్యం అని ఫిక్స్ అయ్యారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ చాలెంజర్స్‌లో నుంచి కాకుండా వారియర్స్‌లో నుంచి సరయు ఎలిమినేట్ అయిపోవడం కొంత ఆశ్చర్యకరమే! కాగా సరయు నాలుగో సీజన్లో ఎంట్రీ ఇచ్చి తొలి వారమే ఎలిమినేట్ అయింది. ఆమెకు మరోసారి ఓటీటీ నుంచి పిలుపు రావడంతో ఈసారి టాప్ 5లోకి అయినా చేరుకోవాలనుకుంది. కానీ నాలుగువారాలకే తిరుగుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. చదవండి: అందువల్లే ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యాడా? Bigg Boss: చెంపలు వాయించుకుని ఏడ్చేసిన మాస్టర్ -
సరయు నడిస్తే భూకంపం వచ్చినట్లే ఉంది: అరియానా తీవ్ర వ్యాఖ్యలు
సండేను ఫండే చేసేందుకు నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్ల లెక్క సరిచేసేందుకు ఆయన రెడీ అయ్యాడు. దీనికంటే ముదు హీరోయిన్ శ్రద్ధా దాస్ స్టేజీపై చిందులేసి అలరించింది. ఆ తర్వాత ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తోనూ డ్యాన్సులేయించాడు నాగ్. ఈ క్రమంలో అషూ, హమీదా రెచ్చిపోయి మరీ చిందేశారు. అనంతరం గతవారం జరిగిన మోస్ట్ ఇరిటేట్ పర్సన్ ఎవరన్న ఓటింగ్ ఫలితాలను అందరిముందు ప్రకటించాడు నాగ్. అందరూ అనుకున్నట్లుగా శివకు కాకుండా ఆర్జే చైతూకు ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. అలాగే హౌస్‌లో మోస్ట్ ఫేక్ హౌస్ పర్సన్ ఎవరని చేపట్టిన ఓటింగ్ ఫలితాలను సైతం రివీల్ చేశాడు. అనంతరం సరయు తన మీద బాడీ షేమింగ్ జరిగిన విషయాన్ని నాగార్జునకు తెలిపింది. నేను నడుచుకుంటూ వస్తుంటే భూకంపం వచ్చినట్లు ఉందని అరియానా కామెంట్ చేసిందని చెప్పుకొచ్చింది. దీంతో అరియానా తనేమీ సీరియస్‌గా అనలేదని కవర్ చేసే ప్రయత్నం చేయగా నాగ్ వీడియో చూపించాడు. అందులో అరియానా తప్పు చేసినట్లు అడ్డంగా దొరికిపోవడంతో మారు మాట్లాడకుండా నిల్చుండిపోయింది. ఇక అరియానా చేసింది తప్పా? ఒప్పా? అన్నదానిపై హౌస్మేట్స్ అభిప్రాయాలు తెలుసుకోనున్నాడు నాగ్. మరి కంటెస్టెంట్లు సరయు పక్కన నిలబడతారా? లేదంటే అరియానాకు మద్దతిస్తారా? అన్నది తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: మేఘన్‌తో పడుకున్నానని చెప్తే రూ.50 లక్షలిస్తామని ఆఫర్! -
సరయుపై శ్రీరాపాక దాడి! షాకైన హౌస్మేట్స్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌తో రసవత్తరంగా మారింది. అటు వారియర్స్, ఇటు చాలెంజర్స్.. తగ్గేదే లే అన్న రేంజ్లో ఆడుతున్నారు. గాయాలవుతున్నా సరే వాటిని పట్టించుకోకుండా ప్రత్యర్థుల మీదకు దూకుతున్నారు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ మొదటి లెవల్లో వారియర్స్ స్మగ్లర్లుగా, చాలెంజర్స్ పోలీసుల్లా మారగా రెండో లెవల్లో వారి పాత్రలు తారుమారయ్యాయి. దీంతో వారియర్స్‌కు చుక్కలు చూపించడానికి సిద్ధమయ్యారు చాలెంజర్స్. ఈసారి ఎలాగైనా గేమ్ గెలవాలనుకున్న వీళ్లు తమకు తోచిన ప్లాన్లన్నీ అమల్లో పెట్టినట్లు కనిపిస్తోంది. మరోపక్క ఇదే గేమ్‌లో గాయపడ్డ రాపాక అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. తన దగ్గరున్న బొమ్మలను సరయుపైకి విసిరేయడంతో ఆమె తలకు చేతులు పట్టుకుని కూలబడిపోయింది. అక్కడే ఉన్న అఖిల్ ఏం చేస్తున్నావో తెలుస్తుందా? అని ఆమె మీదకు ఫైర్ అయ్యాడు. ఇక స్రవంతి స్విమ్మింగ్ పూల్‌లో దూకడంతో అందరూ వెళ్లి ఆమెను బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హెల్త్ బాగోలేనప్పుడు దూకడం ఎందుకు? అన్న సరయు మీద అరిచినంత పని చేసింది స్రవంతి. నా ఆరోగ్యపరిస్థితి గురించి తెలియకుండా మాట్లాడకు అంటూ సరయు మీద ఓ రేంజ్లో ఫైర్ అయింది. మొత్తానికి సరయు మీద హౌస్‌లో నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యతిరేకతకు చెక్ పెట్టే ప్రయత్నం చేయకపోతే అది ఆమె ఎలిమినేషన్‌కు కూడా దారి తీయవచ్చు. -
బిగ్‌బాస్ ఓటీటీ ఎలిమినేషన్స్: ఆ ఇద్దరిలో ఒకరు అవుట్!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం అంటూ ఊరించిన బిగ్‌బాస్ షో లైవ్ స్ట్రీమింగ్‌ను ఆపేస్తూ అభిమానులకు సడన్ షాకిచ్చింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో లైవ్ స్ట్రీమింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి మళ్లీ స్ట్రీమింగ్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది హాట్‌స్టార్. ఇకపోతే షోలో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచిపెడుతున్నారు. ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, ఏడుపులు, అల్లర్లు, గొడవలు.. ఇలా అన్నింటినీ చూపిస్తున్నారు. 17 మందితో మొదలైన ఈ షోలో మాజీలతో పోటీపడి మరీ ఆడుతున్నారు కొత్త కంటెస్టెంట్లు. నామినేషన్స్‌లో కూడా తగ్గేదేలే అన్నట్లుగా వారియర్ల (సీనియర్ల) తప్పొప్పులను ఎత్తిచూపిస్తూ నామినేట్ చేశారు. ఈ వారం వారియర్స్ టీమ్‌లో నుంచి సరయు, నటరాజ్ మాస్టర్, అరియానా గ్లోరీ, హమీదా, ముమైత్ ఖాన్ చాలెంజర్స్ టీమ్‌లో నుంచి మిత్ర శర్మ, ఆర్జే చైతూ నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురిలో అరియానా, హమీదాకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో వీరు ఎలిమినేషన్ దరిదాపుల్లో కూడా ఉండరు. ఆర్జే చైతూకు యాంకర్ శ్రీముఖి, ఆర్జే కాజల్ సహా పలువురి సపోర్ట్ ఉండనే ఉంది. కాబట్టి అతడు కూడా గండం గట్టెక్కినట్లే! ముమైత్ ఖాన్‌కు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో ఆమె ఎలిమినేట్ అయ్యే దాఖలాలు కనిపించడం లేదు. మిగిలిందల్లా నటరాజ్ మాస్టర్, సరయు, మిత్ర శర్మ. ఈ ముగ్గురిలో నటరాజ్ మాస్టర్, సరయుకు బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ల నుంచి సపోర్ట్ లభిస్తోంది. అలాగే మాస్టర్ ఉంటే షోలో కొంత గొడవల మసాలా కూడా ఉంటుందని భావించేవాళ్లు చాలామందే. ఈ లెక్కన నటరాజ్ మాస్టర్ కూడా సేవ్ అయిపోతాడని తెలుస్తోంది. గత సీజన్లో మొదటివారంలోనే ఎలిమినేట్ అయింది సరయు. ఈసారి ఆమె ఆటతీరు చూడాలని ప్రేక్షకులు ఛాన్స్ ఇస్తే ఆమె కూడా హౌస్‌లో ఉండగలుగుతుంది. మిత్రశర్మ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అందులోనూ నామినేషన్స్‌లో ఎక్కువతగా తడబడింది. తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేకపోయింది. ఈ తడబాటు వల్లే వారియర్స్ ఆమెను ఏకగ్రీవంగా నామినేట్ చేశారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మిత్ర శర్మకు తక్కువ ఓట్లు నమోదయ్యాయట. పరిస్థితి ఇలాగే కొనసాగితే తొలి వారంలోనే మిత్ర శర్మ తిరుగుముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది! -
తోలు తీస్తా, ఏం పీకుతావ్..: యాంకర్ శివపై నటరాజ్ ఉగ్రరూపం
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో నిమిషానికో రకంగా మారిపోతున్నారు హౌస్మేట్స్. అప్పుడే నవ్వుతూ కనిపించే కంటెస్టెంట్లు ఆ మరుక్షణమే గొడవలో దూరుతూ కన్నీళ్లు పెట్టుకుంటే మరికొందరేమో బూతులు మాట్లాడుతూ చెవులు మూసుకునేలా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గొడవలంటే చాలు ఎవరూ తగ్గేదే లే అన్నట్లుగా ఢీ అంటే ఢీ అంటూ ముందుకు దూకుతున్నారు. ఫలితంగా ఏడుపులు, పెడబొబ్బలు ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలో నా మంచితనాన్ని ఆధారంగా చేసుకుని నన్ను చులకన చేస్తున్నారంటూ ఏడ్చేసింది సరయు. హమీదా ఎప్పుడూ తనను చులకన చేస్తూ మాట్లాడుతోందని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అఖిల్ వెళ్లి ఆమెను ఓదార్చాడు. ఆ తర్వాత సరయు నేరుగా హమీదా దగ్గరకు వెళ్లి తన పైన జోకులు చేయొద్దని నొక్కి చెప్పింది. మరోవైపు యాంకర్ శివ పులిహోర కలుపుతూనే ఉన్నాడు. హౌస్‌లో అడుగుపెట్టగానే అరియానాను పొగిడిన ఆయన ఆ తర్వాత బిందు మాధవిని ఫోకస్ చేస్తూ ఆమె మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. చదవండి: అషూ మీద నీళ్లు ఉమ్మేసిన చైతూ, షాకైన హౌస్మేట్స్ ఇక కెప్టెన్సీ టాస్ఖ్లో అఖిల్, బిందు మాధవికి మధ్య పెద్ద ఫైటే జరిగింది. తాను ఫిజికల్ అయితే మామూలుగా ఉండదంటూ హీరోయిన్‌కు వార్నింగ్ ఇచ్చాడు అఖిల్. మరో పక్క నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. రా అన్నావంటే తోలు తీస్తా, ఏం పీకుతావో చూస్తా అంటూ యాంకర్ శివ పైపైకి వెళ్లాడు మాస్టర్. దీంతో మిగతా హౌస్మేట్స్ వారిని కూల్ చేసేందుకు చాలానే ప్రయత్నించారు. ఫైనల్‌గా మహేశ్, తేజస్వి, నటరాజ్, సరయు మొదటి వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. మరి వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! Voice being raised 🔊 words being exchanged 🤬 Can the contestants keep their 🆒?! Don't miss the recap episodes every day at 10 am and 9 pm, exclusively on @DisneyPlusHS@EndemolShineIND#BiggBoss #BiggBossNonStop #BiggBossTelugu pic.twitter.com/o5bSEoMqih — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 2, 2022 -
ఇంట్లో మంట పెడతానంటున్న సరయు
సరయు పూర్తి పేరు సరయు రాయ్. నిన్నే పెళ్లాడతా సీరియల్లో నెగెటివ్ రోల్లో నటించింది. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్లో అడల్ట్ కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది. బిగ్‌బాస్ ఐదో సీజన్లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సరయు మొదటివారంలోనే ఎలిమినేట్ అయ్యింది. తన ఆటను చూడకుండా ఒక్కవారానికే ఎలా ఎలిమినేట్ చేస్తారని బాధపడిపోయిన సరయు మరోసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. తనేంటో, తన పవరేంటో ఇప్పుడు చూపిస్తానంటోందీ భామ. హౌస్‌లో ఎలా మంటపెడతాన్నో చూడండి అంటూ ఫైర్ ట్యాగ్‌తో హౌస్‌లోకి వెళ్లింది సరయు. మరి ఆమె నోటిప్రవాహాన్ని ఇతర కంటెస్టెంట్లు తట్టుకోగలరా? ఆమె బూతుల దండకానికి ఆడియన్స్ ఓట్లు గుద్దుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
సారీ చెప్పిన సరయు, వివాదం గురించి ఏమందంటే?
బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్, ‘7ఆర్ట్స్’ సరయుపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఓ షార్ట్ ఫిల్మ్ హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందంటూ సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి చేసిన ఫిర్యాదు మేరకు గతంలో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సరయు, ఆమె టీమ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే సరయు ఈ కేసు గురించి వివరణ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'నేను గిప్పనిస్తా అనే షార్ట్ ఫిలింలో నేను నటించాను. అందులో 7 ఆర్ట్స్‌కు సిరిసిల్లలో ఒక బిర్యానీ ఫ్రాంచైజీ ఓపెన్ అయింది. ఈ బిర్యానీ ప్రమోషన్లో గణపతి బప్పా రిబ్బన్ కట్టుకుని మందు తాగాం. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి అలా చేయలేదు. విజయ్ సేతుపతి సినిమాలో నుంచి ఒక సీన్‌ను రిఫరెన్స్‌గా తీసుకునే అలా చేశాం. కానీ సిరిసిల్లలో విశ్వ హిందూ పరిషత్ వాళ్లకు అది నచ్చలేదు. ఇందులో సీన్ మా మనోభావాలను కించపరిచేలా ఉందని అభ్యంతరం చెప్పడంతో ఆ సీన్ తీసేశాం. తర్వాత బిర్యానీ పాయింట్ ఓపెన్ చేశాం.' 'అంతా అయిపోయిందనుకుంటుంటే ఏడాది తర్వాత ఆ కేసును బంజారాహిల్స్‌కు బదిలీ చేశారు. పోలీస్ ఎంక్వైరీ కోసం వెళ్లివచ్చాం కూడా! మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించామంటున్నారు కానీ అది జరగలేదు. ఒక నటిగా దర్శకుడు ఏది చెప్తే అది చేసి వెళ్తాను. నేనూ ఒక హిందువును, నాది హిందూ కుటుంబం. నా మతం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా సహించను.. ఒక హిందూ అమ్మాయిగా హిందువుల మనోభావాలను కించపరచను. మీ మనోభావాలు దెబ్బ తినుంటే సారీ' అని క్షమాపణలు చెప్పింది సరయు. -
వెనక్కి తగ్గిన సరయూ, పోలీస్ స్టేషన్‌కు పిటిషనర్..
బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్, ‘7ఆర్ట్స్’ సరయూపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. గతంలో ఆమె నటించిన ఓ షార్ట్ ఫిల్మ్ హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందంటూ సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ ఫిర్యాదు చేశాడు. దీంతో బంజారాహిల్స్‌లో పోలీసులు సరయూతో పాటు ఆమె షార్ట్ ఫిల్మ్ బృందాన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. చదవండి: యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం 7 ఆర్ట్స్ సరయు అరెస్ట్.. ఈ క్రమంలో సరయూ బంజారాహిల్స్ పోలీసులకు వివరణ ఇచ్చింది. తన వీడియోలో ఉన్న కంటెంట్‌పై అభ్యంతరాలు ఉంటే, సదరు వ్యక్తులకు క్షమాపణ చెప్పేందుకు సిద్దమని ప్రకటించింది. అంతేకాదు పటిషనర్ డిమాండ్స్ మేరకు కంటెంట్‌ని తొలగించేందుకు తాము సిద్ధమని తెలిపింది. ఇప్పటికే ఆ వీడియోలోని అభ్యంతకర సన్నివేశాన్ని ఎడిట్ చేసేశామని, ఇంకా అభ్యంతరం అనుకుంటే వీడియో డిలీట్ చేస్తామంటూ సరయూ, ఆమె టీం వెనక్కి తగ్గింది. ఇదిలా ఉంటే కాసేపట్లో పిటిషనర్ చేపూరి అశోక్ సిరిసిల్ల నుంచి బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకోనున్నాడు. చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమే, లేదంటే సహజీవనం: కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్ పిటిషనర్ వచ్చాక ఇరు వర్గాలను కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేపట్టనున్నారని సమాచారం. సరయూ ‘7 ఆర్ట్స్’ అనే యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తుంది. ఆ ఛానల్ రూపొందించిన అనేక షార్ట్ ఫిల్మ్స్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది. 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో రిలీజ్ చేసింది. అయితే ఇందులో సరయు సహా ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు. -
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం 7 ఆర్ట్స్ సరయు అరెస్ట్..
Is 7Arts Sarayu Arrested By Banjara Hills Police?: యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం 7 ఆర్ట్స్ సరయు ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ఓ యాడ్‌లో నటించిందంటూ ఆమెపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు ఆధారంగా సరయును నిన్న బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. సుమారు గంటన్నరకు పైగా ప్రశ్నించిన పోలీసులు సరయుతో పాటు ఆమె వీడియో టీం సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తిక్, కృష్ణమోహన్‌లను అరెస్ట్ చేశారు. వారిని బంజారాహిల్స్ పోలీసు ఠాణాకు తరలించారు. కాగా 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో రిలీజ్ చేసింది.అయితే ఇందులో సరయు సహా ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు. ఇది హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా 153A, 295A సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అభ్యంతరకర వీడియో.. వివాదంలో బిగ్‌బాస్ ఫేం సరయు -
7ఆర్ట్స్ సరయుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
-
7ఆర్ట్స్ సరయుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
Case Filed On 7 Arts,Bigbos Fame Sarayu: యూట్యూబూర్ 7ఆర్ట్స్ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన బోల్డ్నెస్తో నెట్టింట రచ్చ చేసే సరయు బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర విజువల్స్ ఉన్నాయంటూ సరయుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో సరయూ, ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు. ఇది హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కరోనా, సెల్ఫీలు వద్దని సలహా!
కరోనా మహమ్మారి జనాలను పట్టిపీడిస్తోంది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందనుకునేలోపే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిత్రపరిశ్రమలోనూ ఎంతోమంది ఈ వైరస్ బారిన పడగా తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కౌశల్, సరయులకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) 'కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలున్నాయి. ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్నాను. గత వారం రోజుల్లో నన్ను కలిసిన అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను. గుంపులుగా గుమిగూడకండి. వ్యాక్సిన్ వేయించుకోండి, మాస్కులు ధరించండి. కరచాలనం, సెల్ఫీలు మానేయండి. నేను షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయకే ఈ పరిస్థితి తెచ్చుకున్నాను' అని రాసుకొచ్చాడు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్ సరయూ సైతం తనకు పాజిటివ్ వచ్చిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. View this post on Instagram A post shared by 7 Arts Sarayu (@7arts_sarayu) -
ప్రపోజ్ చేసిన హీరోయిన్, గాల్లో తేలిపోయిన సన్నీ
Bigg Boss Telugu 5, BB Telugu Grand Finale Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు అందరినీ బిగ్‌బాస్ స్టేజీపైకి తీసుకొచ్చారు. రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్, రష్మిక మందన్నా, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, నాని, సాయిపల్లవి, కృతీశెట్టి, జగపతిబాబు.. వీళ్లేకాక మరెంతోమంది సింగర్లు, నటీనటులు, సెలబ్రిటీలు షోలో సందడి చేశారు. తారల తళుకుబెళుకులతో బిగ్‌బాస్ స్టేజీ మరింత కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఫైనలిస్ట్ సన్నీకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ ఆలియాభట్. తన ఫేవరెట్ హీరోయిన్ అయిన ఆమె కళ్లముందు స్టేజీపై కనిపించగానే సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు సన్నీ. అతడికి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఆలియా ఏకంగా సన్నీకి ఐ లవ్యూ చెప్పింది. ఇది కలా? నిజమా? అనుకుంటూ గాల్లో తేలిపోయిన సన్నీ పరవశంతో సరదాగా కిందపడిపోయాడు. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్‌తో ఐ లవ్యూ చెప్పించుకున్న సన్నీ ఈ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకోవడం ఖాయం. అటు సరయూ నాగార్జునను డేట్‌కు వెళ్దామని అడిగింది. దీనికి సరేనంటూ తలూపిన నాగ్.. గ్రాండ్ ఫినాలే అయిపోగానే డేట్‌కి వెళ్దామని పచ్చజెండా ఊపాడు. ఇక స్టార్ సెలబ్రిటీలు చేసిన హంగామా చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
ప్రియ ఇంట పెళ్లి వేడుకలు, హాజరైన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు
సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రియ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రియకు ఇటీవల బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ షోలో వాలిపోయింది. అక్కడ ఇతర కంటెస్టెంట్లను, వారి గేమ్‌ను అంచనా వేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గేమాడింది ప్రియ. కెప్టెన్సీ కాలేరని తెలిసినా చిరునవ్వుతో ఆ నిర్ణయాన్ని స్వాగతించి ఎందరో మనసులను కొల్లగొట్టింది. చివరకు అసాధ్యం అనుకున్న కెప్టెన్సీని సైతం సుసాధ్యం చేస్తూ ఐదో వారం కెప్టెన్‌గా అవతరించింది. కానీ సన్నీతో వైరం కొనితెచ్చుకుని అతడి మీద నోరు పారేసుకోవడంతో అప్రతిష్ట మూటగట్టుకుంది. టాస్క్‌లో అతడిని రెచ్చగొట్టడం, చెంప పగలగొడతానంటూ హెచ్చరించడంతో సోషల్ మీడియాలోను ఆమెను ట్రోల్ చేశారు. ఫలితంగా ఓట్లు తగ్గి ఏడో వారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. View this post on Instagram A post shared by Priya (@priyaartist) ఇదిలా వుంటే నేడు(నవంబర్ 21న) ప్రియకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు జెస్సీ, ఉమాదేవి, సరయు విచ్చేశారు. పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 'మా ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ' అంటూ ఇంటి ముందు ముగ్గులేసిన ఫొటోను ప్రియ ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సైతం ఎప్పటికప్పుడు పంచుకుంది. View this post on Instagram A post shared by £0{-}!t{-}@👑 (@lohi.79) View this post on Instagram A post shared by £0{-}!t{-}@👑 (@lohi.79) -
ఏడేళ్లు రిలేషన్లో ఉన్నా, నా ఆస్తి అడిగాడు: సరయూ
Bigg Boss 5 Telugu, 1st Eliminated Contestant Sarayu: ఆమె నోరు తెలిస్తే చాలు బూతులు.. ఆ బూతులే ఆమెను పాపులర్ చేశాయి. ఆ తిట్ల దండకాలే ఆమెను బిగ్‌బాస్ గడపకు చేర్చాయి. ఎవరి గురించి చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. ఆవిడే సరయూ. 7 ఆర్ట్స్ ఛానల్లో ఆమె చేసే అడల్ట్ కామెడీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే నోటికొచ్చినట్లుగా పచ్చి బూతులు మాట్లాడటాన్ని విమర్శించేవాళ్లూ లేకపోలేదు. ఏదేమైనా యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన సరయూ బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ బిగ్‌బాస్ హౌస్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేక, అందులో ఇమడలేక మొదటి వారానికే బయటకు వచ్చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. 'ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్లో ఉన్నాను. అది మా ఇంట్లో వాళ్లకు, అబ్బాయి ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. మా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నేనేదీ చేయను. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నా కెరీర్‌ను పక్కన పెట్టాను. రిలేషన్లో అతడికి 100 పర్సెంట్ ఇచ్చేశాను. నేను వర్జిన్ కూడా కాదు. మేము పెళ్లి చేసుకుందామనుకున్నాం, కానీ కుదరలేదు. కట్నం దగ్గర గొడవ రావడంతో పెళ్లిపీటల దాకా వచ్చిన వివాహం రద్దయిపోయింది. ముందు పాతిక లక్షలు అడిగారు, తర్వాత అరకోటి, కోటి, ఆ తర్వాత సగం ఆస్తి అడిగారు. ఇప్పటినుంచే ఇలా చేస్తే పెళ్లయ్యాక ఇంకెన్ని అడుగుతారో, ఇంకెలా ఉంటారో? అని క్యాన్సిల్ చేశాను. నువ్వు నాకు తగినవాడివి కాదని అతడి ముఖం మీదే చెప్పేశాను' అని చెప్పుకొచ్చింది సరయూ. -
బిగ్‌బాస్ అన్యాయం చేశాడని ఏడ్చేసిన సరయూ
Bigg Boss Telugu 5, Sarayu Roy Says Bigg Boss Injustice Her: 7 ఆర్ట్స్ సరయూ 7 డేస్‌కే బిగ్‌బాస్ ఐదో సీజన్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే వచ్చేముందు బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లు ఒక్కొక్కరికి దుమ్ము దులిపింది. సిరి, షణ్ముఖ్.. బయటే ఫిక్సింగ్ చేసుకుని వచ్చారని ఆరోపించింది. షణ్ముఖ్‌కు ఒంటరిగా ఆడటం చేతకాదని, అలాంటప్పుడు గాజులేసుకుని మూలన కూర్చోవాలంటూ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యాఖ్యలతో హర్ట్ అయిన షణ్నూ అభిమానులు సరయూ మీద నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. ఈ క్రమంలో తనతో పాటు, తన తల్లిని కూడా దారుణంగా తిడుతూ కామెంట్లు చేశారని వాపోయింది సరయూ. తను షణ్నూను ఎందుకు కించపరిచి మాట్లాడాల్సి వచ్చిందో తాజా వీడియోలో వెల్లడించింది. షణ్ముఖ్ నంగనాచిలా గేమ్ ఆపేందుకు ట్రై చేశాడు అందులో సరయూ మాట్లాడుతూ.. 'తొలివారం జరిగిన కెప్టెన్సీ టాస్కులో పోటీదారులు తొక్కే సైకిల్ లైట్ వెలుగుతుందా? లేదా? చూసుకునేందుకు వారి ముందు అద్దాలు పెట్టారు. టాస్క్ మధ్యలో సిరి, షణ్ముఖ్ సైగలు చేసుకున్నారు. దీంతో షణ్నూ.. వెంటనే హమీదాకు సైకిల్ లైట్ కనిపించకుండా ఆమె ముందు నిల్చున్నాడు. తనకు లైట్ కనిపించట్లేదని హమీదా చెప్పడంతో అక్కడి నుంచి జరగమని షణ్నూకు పలుమార్లు సూచించారు. కానీ అతడు మాత్రం అందుకు నిరాకరించాడు. ఒ పక్క కాజల్ ధైర్యంగా అందరి ముందు వెనక నుంచి అటాక్ చేస్తుంది. కానీ షణ్ముఖ్ మగాడై ఉండి, నంగనాచిగా ఎవరికీ తెలీకుండా దొంగచాటుగా గేమ్‌ను ఆపడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత మాత్రం సిరి దగ్గరకు వెళ్లి నీకసలు సపోర్ట్ చేయలేదు అంటూ అబద్ధమాడాడు. సెప్టెంబర్ 9వ ఎపిసోడ్లో 46వ నిమిషం నుంచి చూస్తే వారి సైగలు మీకు తప్పకుండా కనిపిస్తాయి' అని మొదటి సాక్ష్యాన్ని బయటపెట్టింది. కెప్టెన్ అవ్వాలనుకోలేదని డ్రామా, కానీ ముందే అనుకుని వచ్చింది 'నేను కెప్టెన్ అవ్వాలనుకోలేదు అంటూ అంత ఏడ్చి డ్రామా చేసిన సిరి హౌస్‌లో ఒక మాట అంది. ఫస్ట్ కెప్టెన్ నేనే అవుతానంటూ బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పి వచ్చానని అందరి ముందే గట్టిగా అరిచి చెప్పింది. కానీ ఇది టెలికాస్ట్ అవలేదు. ఇకపోతే రవి.. ముళ్లపంది అన్నందుకు లోబో హర్టయ్యాడు. తనను ఎలిమినేట్ చేసి పంపించేయమని ఏడ్చాడు. అప్పుడు నేను అతడికి ధైర్యం చెప్పాను. నేను లోబోతో కామెడీ చేస్తుంటే చూడలేక రవి అన్న అతడిని నా దగ్గరి నుంచి తీసుకెళ్లిపోయేవాడు. ఇక నాగార్జునగారు బూతులు మాట్లాడమని చెప్పినప్పటికీ.... బిగ్‌బాస్ షోను ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారని బూతులు మాట్లాడలేదు. కానీ సిగరెట్ తాగితే ఇంత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు' అంటూ ఏడ్చేసింది. బిగ్‌బాస్ షోకు నేను అన్‌ఫిట్ ఒకవేళ మళ్లీ బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వస్తే వెళ్తారా? అన్న ప్రశ్నకు.. తాను బిగ్‌బాస్‌కు అన్‌ఫిట్ అని చెప్పింది. ఒకవేళ మళ్లీ వెళ్లినా వారం రోజుల్లోనే వచ్చేస్తానని, ఎందుకంటే స్క్రీన్ స్పేస్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు అని అభిప్రాయపడింది సరయూ. ఒకవిధంగా బిగ్‌బాస్ తనపై పక్షపాతం చూపిస్తూ అన్యాయం చేశాడని బాధపడింది. -
బిగ్‌బాస్: వారం రోజులకు సరయూ ఎంత తీసుకుందంటే?
Bigg Boss Telugu 5, Sarayu Remuneration: వంద రోజులుంటానని కొండంత ఆశతో బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టింది యూట్యూబర్ సరయూ. కానీ టైం బాగోలేక వారానికే ఇంటి బాట పట్టింది. అయితే ఆమెకు తనను తాను నిరూపించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వలేదన్నది అభిమానుల వాదన! అంతేకాదు, నామినేషన్లో ఉన్న హమీదాకు సరయూ కంటే తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఆమెను లవ్ ట్రాకుల కోసం షోలో ఉంచారని, సరయూను బలి చేశారని వాదిస్తున్నారు. ఇదిలావుంటే బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూసిన సరయూ కంటెస్టెంట్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చాలామంది ఇంకా ముసుగులు వేసుకునే ఆడుతున్నారని చెప్పింది. షణ్ముఖ్, సరయూ.. బయటే అంతా ఫిక్స్ చేసుకుని హౌస్‌లో అడుగుపెట్టారని ఆరోపించింది. సిరి మగాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతుందని, వీజే సన్నీ తన మీద పగ పెంచుకున్నాడంటూ బిగ్‌బాస్ బజ్ ప్రోగ్రామ్‌లో యాంకర్ అరియానా ముందే కంటెస్టెంట్ల మీద తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో ట్రెండింగ్ మారింది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో సరయూ పారితోషికం గురించి కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. బిగ్‌బాస్ ఆమెకు 70 వేల నుంచి లక్ష రూపాయల మేరకు ముట్టజెప్పాడని సమాచారం. వారం రోజులకు గానూ ఈ మొత్తాన్ని సరయూకు అందించినట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్: మెరుపుతీగలా వచ్చిపోయింది వీళ్లే!
Telugu Bigg Boss, 1st Week Eliminated Contestants: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అంటే ఇదేనేమో.. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చినా ప్రేక్షకులు కనికరించకపోవడంతో మొదటివారమే ఇంటిబాటపట్టారు చాలామంది సెలబ్రిటీలు. బిగ్‌బాస్ ఆడే నాటకంలో వారం రోజులకే ఎలిమినేట్ అవక తప్పలేదు. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఐదుగురు సెలబ్రిటీలు అందరి కంటే ముందే షోలో ఎలిమినేట్ అయ్యారు. వారెవరన్నది చూసేద్దాం.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ తొలి సీజన్లో నటి జ్యోతి అందరికంటే ముందుగా ఎలిమినేట్ అయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించిన రెండో సీజన్లో సంజన అన్నె షోలో అడుగు పెట్టిన వారం రోజులకే అందరికీ వీడ్కోలు పలుకుతూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కింగ్ నాగ్ బిగ్‌బాస్ హోస్టింగ్‌ను భుజానికెత్తుకున్న మూడో సీజన్లో నటి హేమ మొదటివారమే ఎలిమినేట్ అయింది. నాలుగో సీజన్లో సూర్య కిరణ్‌ను ఎలిమినేట్ చేయగా తాజా సీజన్లో సరయూ ఫస్ట్ వీక్‌లోనే బయటకొచ్చింది. అయితే వీరిలో కొందరు కోపం, కొట్లాటల కారణంగానే ముందుగా ఎలిమినేట్ అయ్యారనేది తెలిసిన విషయమే. కాకపోతే ఒక్కవారంలోనే కంటెస్టెంట్లను జడ్జ్ చేయడం సరికాదని బిగ్‌బాస్ వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా నామినేషన్స్‌లోకి వచ్చినవారిలో కొందరిని బిగ్‌బాస్ కావాలని నెగెటివ్‌గా చూపిస్తారనేది కూడా కొంతమంది వాదన. మరికొందరినేమో కనీసం తెర మీద కూడా చూపించకుండా మాయ చేస్తాడనేది మరో విమర్శ. అందుకే ఎన్నో ఆశలతో బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టే కంటెస్టెంట్లకు వారేంటో నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం. ఇందుకుగానూ తొలివారం ఎలిమినేషన్‌ను ఎత్తేస్తే బాగుంటుందని బుల్లితెర అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? -
షణ్ముఖ్.. నువ్వు మగాడివేనా, గాజులేసుకుని మూలన కూర్చో: సరయూ
Sarayu Comments In Bigg Boss 5 Buzz: సెప్టెంబర్ 5న అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో మొదటి ఎలిమినేషన్ ఘట్టం ముగిసింది. అయితే మొదట్లో జెస్సీ ఎలిమినేట్ అవుతాడని అంతా ఊహించినప్పటికీ చివర్లో ఊహించని విధంగా సరయూ పేరు తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే సరయు ఎలిమినేట్ అయింది. కానీ వంద రోజులు ఉండాల్సిన తాను వారానికే బయటకు వచ్చేయడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. లోపల కంటెస్టెంట్లు కొందరు ముసుగులు వేసుకుని సేఫ్ గేమ్ ఆడటం వల్ల తాను బయటకు వచ్చేశానని రగిలిపోయింది. ఆ ఆగ్రహాన్ని అంతటినీ బిగ్‌బాస్ బజ్‌లో హోస్ట్ అరియానా గ్లోరీ ముందు వెల్లగక్కింది. ఈ క్రమంలో హౌస్‌లో ఉన్న ఒక్కో కంటెస్టెంటు బండారాన్నంతా బయటపెట్టింది. ముందుగా హౌస్‌లో కెప్టెన్‌గా కొనసాగుతున్న సిరి హన్మంత్ గురించి చెప్తూ ఆమె మగాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతుందని విమర్శించింది. యాంకర్ రవి.. మంచోడిలాగా నీతి సూత్రాలు బోధిస్తాడు, కానీ అతడి దగ్గర విషయమే లేదు అని పెదవి విరుస్తూ అతడి ఫొటోను విరగ్గొట్టింది. వీజే సన్నీకి అసలు క్యారెక్టరే లేదని తేల్చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో దమ్మున్న మగాడు ఎవరైనా ఉన్నారా? అంటే అతడు విశ్వ ఒక్కడే అని చెప్పింది. ఇక షణ్ముఖ్ జశ్వంత్ మీద మరోసారి విరుచుకుపడింది సరయూ. 'నిజంగా నీలో దమ్ము, ధైర్యం ఉంటే, నువ్వు మగాడివైతే సింగిల్‌గా ఆడు.. లేదంటే గాజులేసుకుని మూలన కూర్చో.. అయినా నేను గాజులేసుకుని కూడా ఒక్కదాన్ని ఆడుతా, నువ్వు ఇంటికి వెళ్లి మూలన కూర్చో' అంటూ షణ్ముఖ్‌ను ఏకిపారేసింది. -
ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, నీలాగే.. :ఇచ్చిపడేసిన సరయూ
వంద రోజులు ఉంటానని ఆశతో వెళ్లిన సరయూ వారం రోజులకే వెనుదిరిగింది. బయట అందరినీ గడగడలాడించే ఆమె హౌస్‌లో ఎక్కువరోజులు ఉండలేకపోయింది. మొదటివారంలోనే నామినేషన్లో నిలిచి తక్కువ ఓట్లతో హౌస్ నుంచి నిష్క్రమించింది. కన్నీళ్లతో హౌస్‌కు వీడ్కోలు పలికిన సరయూ స్టేజీ మీదకు వచ్చాక మాత్రం పూనకంతో ఊగిపోతూ ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది. తను నా బెస్ట్‌ఫ్రెండ్, కానీ నిర్లక్ష్యం చేశా.. హౌస్‌లో 5 బెస్ట్, 5 వరస్ట్ హౌస్మేట్స్ ఎవరో చెప్పమంటూ సరయూతో గేమ్ ఆడించాడు నాగ్. ముందుగా ఐదురుగు బెస్ట్ కంటెస్టెంట్ట గురించి చెప్తూ సరయూ ఎమోషనల్ అయింది. శ్వేత స్వచ్ఛమైనదని, మానస్ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడని, ప్రియాంకను ఎక్కువగా మిస్ అవుతాను అని చెప్పింది. విశ్వ ఇంట్లో అన్ని పనులు చేస్తాడని, పొద్దున్నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేస్తాడు, కానీ అస్సలు అలిసిపోడు అంది. హమీద తన బెస్ట్ ఫ్రెండ్ అని, కానీ ఆమెనే ఎక్కువగా నిర్లక్ష్యం చేశానని బాధపడింది. అక్కడ ఆయన ఇగో హర్ట్ అయింది.. వరస్ట్ కంటెస్టెంట్లుగా సిరి, షణ్ముఖ్, లహరి, సన్నీ, కాజల్‌ను ఎంచుకున్న సరయూ వాళ్ల గురించి చెప్తూ శివాలెత్తింది. చాలామంది హౌస్మేట్స్ ముందు ఒకలా, వెనక మరోలా ఉంటున్నారని ఆరోపించింది. సిరి, షణ్ముఖ్ ఒక స్ట్రాటజీతో వచ్చారని, బయటే అంతా ఫిక్స్ చేసుకుని వచ్చారని అభిప్రాయపడింది. ఆ తర్వాత సన్నీ గురించి చెప్తూ.. గతంలో ఆయనతో ఓ సినిమా చేశాను, అక్కడ జరిగిన చిన్న సంఘటనతో ఆయన ఇగో హర్ట్ అయింది. అప్పటి నుంచి తను నామీద పగ పెంచుకున్నాడని నొక్కి చెప్పింది. అంత ఈగో ఏంటి? టోన్ మార్చుకో! అయితే అలాంటిదేమీ లేదని సన్నీ చెప్తుండగా మధ్యలో అడ్డుపడిన సరయూ.. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్‌గా నువ్వు నా మీద కోపం పెంచుకున్నావని తెలుసు అంటూ ఊగిపోయింది. అనంతరం లహరిని ఓ రేంజ్లో ఆడుకుంది. 'ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట, అంత ఈగో ఏంటి? ఆ టోన్ మార్చుకో, ఎదగడానికి మనుషులను తొక్కాల్సిన అవసరం లేదు' అని గట్టిగానే ఇచ్చిపడేసింది. తర్వాత షణ్ముఖ్ గురించి చెప్తూ.. అరేయ్ ఏంట్రా ఇది? బయటే అనుకుని ఇలా రావొద్దురా! అయినా సిరిని లేపాక నువ్వు లేద్దామని అనుకుంటున్నావా? అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇక కాజల్‌ను కూడా వరస్ట్ కంటెస్టెంట్స్ లిస్టులో చేర్చిన సరయూ ఆమెను బుర్ర పెట్టి ఆడమని సలహా ఇచ్చింది. -
సరయూ ఎలిమినేట్, చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన విశ్వ
Bigg Boss Telugu 5, Episode 07: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్న 19 మంది కంటెస్టెంట్లలో ఒకరిని బయటకు పంపే సమయం రానే వచ్చింది. సోషల్ మీడియాలో ముందుగా లీకైనట్లుగానే 7 ఆర్ట్స్ సరయూ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో హౌస్ అంతా కాసేపు ఉద్విగ్న వాతావారణం నెలకొంది. అయితే స్టేజీ మీదకు వచ్చిన సరయూ ఒక్కో కంటెస్టెంట్‌కు ఇచ్చిపడేసింది. మరి నేటి(సెప్టెంబర్ 12) ఎపిసోడ్ ఎలా సాగిందో చదివేద్దాం.. ర్యాంప్ వాక్‌ను ఖూనీ చేసిన లోబో, ఉమాదేవి సండే ఎపిసోడ్ కోసం అందంగా ముస్తాబైన ఇంటిసభ్యులు జంటలుగా విడిపోయి ర్యాంప్ వాక్ చేశారు. వీరికి జెస్సీ, నాగ్ మార్కులేశారు. అయితే ర్యాంప్ వాక్‌ను లోబో, ఉమాదేవి ఖూనీ చేసి నవ్వించారు. రవి, హమీదా.. జెస్సీ, యానీ మాస్టర్ల కుర్చీ గొడవను గుర్తు చేస్తూ కామెడీ చేశారు. శ్రీరామచంద్ర దొరికించే ఛాన్స్ అనుకుని సిరిని ఎత్తుకుని తిప్పాడు. మిగతావాళ్లందరూ కూడా తమతమ స్టైల్లో ర్యాంప్ వాక్ చేసి అలరించారు. అనంతరం నాగ్.. మానస్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. సిరి అసలు పేరు తెలుసా? తర్వాత ఇంటిసభ్యులను 9 జంటలుగా విడగొట్టి 'నేను నీకు తెలుసా?' అనే టాస్క్ ఆడించాడు. ఇందులో మొదట సిరి.. జెస్సీని నువ్వెందుకంత ఓవర్ చేస్తావని అడిగితే.. అతడు మాత్రం ఎందుకింత త్వరగా ఎంగేజ్ అయ్యావని తిరిగి ప్రశ్నించాడు. దీంతో షాకైన సిరి నువ్వు వస్తావని తెలీక అని చిలిపిగా సమాధానమిచ్చింది. సిరి అసలు పేరేంటని నాగ్ ప్రశ్నించగా శిరీష హన్మంత్ అని సరైన సమాధానం చెప్పాడు జెస్సీ. తర్వాత ఉమాకు రౌడీ రంగమ్మ పాత్ర సూటవుతుందని సరయూ,. సరయూకు అర్జున్‌రెడ్డి క్యారెక్టర్ సూటవుతుందని ఉమాదేవి చెప్పింది. ఎప్పుడూ ఆవిడ గురించే షణ్ముఖ్ జపం! షణ్ముఖ్, విశ్వ జోడీ వంతు రాగా నాగ్... షణ్ముఖ్ ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడతాడని ప్రశ్నించాడు. దీనికి విశ్వ దీప్తి సునయన పేరు చెప్పాడు. హౌస్‌మేట్స్‌లో ఎవరి గురించి? అని నొక్కి ప్రశ్నించడంతో వెంటనే సిరి అని టపీమని బదులిచ్చాడు. విశ్వ లోబోను ఎత్తుకోగలడా? అన్నదానికి అతడు ఏకంగా ఎత్తుకునే చూపించాడు. షణ్ముఖ్ చేయి మీద ఏమని టాటూ ఉంటుందని అడగ్గా విశ్వ.. D అనే అక్షరం ఉంటుందని కరెక్ట్ ఆన్సరిచ్చాడు. కాజల్ ఎలుక, సరయూ తొండ ప్రియాంక క్రష్ ఎవరని మానస్‌ను అడగ్గా అతడు శ్రీరామచంద్ర పేరు చెప్పాడు. ప్రియాంకను చేసుకునేవాడికి ఎక్కుగా ఏం ఉండాలి? అన్నదానికి కేరింగ్ అని చెప్పాడు మానస్. ఇలా అన్ని జంటల మధ్య ఫిట్టింగ్ పెట్టే ప్రశ్నలడిగాడు. ఆ తర్వాత లోబో.. ఇంట్లో వాళ్లకు ముద్దుపేర్లు పెట్టాడు. రవికి.. మిల్క్‌బాయ్, శ్వేత.. టామ్ బాయ్, సన్నీ.. చాక్లెట్, మానస్.. హ్యాండసమ్గాయ్, ప్రియాంక సింగ్.. బ్యూటిఫుల్, యానీ మాస్టర్.. అమ్మ, కాజల్.. ఎలుక, సరయూ.. తొండ, నటరాజ్.. బావ, ప్రియ.. క్వీన్, విశ్వ.. చపాతీ, షణ్ముఖ్.. డార్లింగ్, హమీదా.. ఎరోప్లేన్, శ్రీరామచంద్ర.. మూడీగయ్, సిరి.. సీతాకోక చిలుక, జెస్సీ.. పిల్లి అని చెప్పాడు. లహరి, ఉమాదేవికి మాత్రం తాను నిక్‌నేమ్స్ పెట్టలేనని చేతులెత్తేశాడు. అనంతరం కాజల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. సరయూ అవుట్, ఏడ్చేసిన విశ్వ, హమీదా తర్వాత నామినేషన్లో ఉన్న జెస్సీ, సరయూలకు చెరో సైకిల్ ఇచ్చాడు బిగ్‌బాస్. వీరిలో ఎవరి సైకిల్‌కు లైట్ వెలుగుతుందో వారు సేఫ్ అయినట్లని చెప్తూ వారిని టెన్షన్ పెట్టించాడు. కొద్ది క్షణాల అనంతరం జెస్సీ సైకిల్ బల్బ్ వెలగడంతో అతడు సేఫ్ అని నాగ్ ప్రకటించాడు. సరయూ ఎలిమినేట్ అయిందని వెల్లడించాడు. ఇది తట్టుకోలేకపోయిన విశ్వ హౌస్ లోపలకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాడు. అటు హమీదాను ఆపడం కూడా ఎవరి తరమూ కాలేదు. ఇక సరయూ చివరిసారిగా విశ్వను పట్టుకుని గట్టిగా ఏడ్చేసి అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది. -
బిగ్‌బాస్: సరయూ ఎలిమినేట్ అవడానికి కారణాలివే!
Bigg Boss 5 Telugu Sarayu Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ జోష్‌గా నడుస్తోంది. ఈసారి కంటెస్టెంట్లు ఎవరూ తగ్గేదేలే అన్న రేంజ్లో పర్ఫామ్ చేస్తున్నారు. అయితే షో ప్రారంభమై అప్పుడే వారమైపోయింది. యాంకర్ రవి, హమీదా, జెస్సీ, సరయూ, మానస్, కాజల్ తొలివారం నామినేషన్లోకి వచ్చారు. వీరిలో 7 ఆర్ట్స్ సరయూ ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించగా ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అందరినీ దమ్‌దమ్ చేస్తానన్న ఆమె మొదటి వారంలోనే ఎందుకు ఇంటి బాట పట్టింది? ఆమె ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలేంటో చూసేద్దాం.. మొదటివారమే నామినేషన్: సరయూను ముగ్గురు నామినేట్ చేశారు. వాళ్లలో మానస్, కాజల్, వీజే సన్నీ ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరు సరయూను నామినేట్ చేయకపోయినా ఆమె నామినేషన్ జోన్లోకి వచ్చేదే కాదు, తద్వారా ఎలిమినేట్ అయ్యేదే కాదు. కాజల్‌తో గొడవ: సరయూ బిగ్‌బాస్ హౌస్‌లో అందరినీ కలుపుకుపోయిన దాఖలాలు కనిపించలేదు. పోనీ తన పనేదో తను చేసుకుందా అంటే అదీ లేదు. కొన్నిసార్లు అనవసరంగా తగాదా పెట్టుకున్నట్లు అనిపించింది. కెప్టెన్సీ టాస్కులో పోటీదారులకు హౌస్మేట్స్ మద్దతు ఇవ్వొచ్చు, డిస్టర్బ్ కూడా చేయొచ్చు అని బిగ్‌బాసే స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ కాజల్.. విశ్వను ఒక్కడినే టార్గెట్ చేయడాన్ని సరయూ సహించలేకపోయింది. టాస్క్‌ను సరిగా అర్థం చేసుకోకుండా ఆమెతో కొట్లాటకు దిగి మాటలు జారింది. లెక్క చేయని సరయూ: నామినేషన్స్‌లో ఉన్నప్పుడు మిగతా కంటెస్టెంట్లతో పోటీ పడుతూ ఆడాలి. స్క్రీన్ స్పేస్ కోసం ప్రయత్నించాలి. కానీ సరయూ ఈ రెండూ చేయలేదనే తెలుస్తోంది. టాస్క్‌ల మీద కన్నా ఇంటి పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రేక్షకులను ఎలా తనవైపు తిప్పుకోవాలి? వారి నుంచి ఎలా ఓట్లు రాబట్టాలి? అన్న విషయాలను బేఖాతరు చేసింది. స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే: వీకెండ్ వచ్చేసరికి నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో సరయూ చివరి స్థానంలో ఉంది. హౌస్‌లో యాంకర్ రవి ఎంటర్టైన్ చేయగా హమీదా, మానస్ పవర్ రూమ్ యాక్సెస్ దక్కించుకున్నారు. కాజల్.. అందరి వ్యక్తిగత విషయాలు అడుగుతూ, గొడవ పడుతూ ఏదో ఒక విధంగా స్క్రీన్‌పై కనిపించింది. జెస్సీ.. జైల్లోకి వెళ్లడంతో సింపతీ ఓట్లు సంపాదించాడు. కానీ సరయూ అవేవీ చేయలేదు. ఆమెకు సరైన స్క్రీన్ స్పేస్ కూడా దక్కలేదు. కనిపించిన కొద్ది సందర్భాల్లోనూ ఆమెను నెగెటివ్‌గానే చూపించారు. బూతులు, స్మోకింగ్: పొగ తాగడం అనేది ఆమె వ్యక్తిగత విషయం. కానీ బిగ్‌బాస్ వీక్షకుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారు. చాలామంది ఈ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోలేకపోయారు. పైగా అంతపెద్ద షోలో పచ్చి బూతులు మాట్లాడటాన్ని కూడా చాలామంది తప్పుగా భావించారు. దీనివల్ల కూడా ఆమె ఓట్లకు గండి పడిందనేది కాదనలేని నిజం. -
నాగార్జునతో డేట్‌కు రెడీ అయిన బిగ్‌బాస్ బ్యూటీ!
7 ఆర్ట్స్ సరయూ.. యూట్యూబ్‌లో అడల్ట్ కామెడీతో వీడియోలు చేసే ఈవిడ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తోటి కంటెస్టెంట్లనే కాదు ఏకంగా బిగ్‌బాస్‌నే దమ్‌దమ్ చేస్తానంటూ ఐదో సీజన్లో అడుగు పెట్టిందీ భామ. షో ప్రారంభం రోజే నాగ్ ఎదుట పచ్చి బూతులు మాట్లాడి తనేంటో బొమ్మ చూపించేసింది. స్టేజీ మీదే ఆ రేంజ్లో బూతులతో చెలరేగిపోయిన సరయూ హౌస్‌లో ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో అనుకున్నారు నెటిజన్లు. కానీ తన బూతు పురాణాన్ని భరించడం ప్రేక్షకుల వల్ల కాదనుకుందో ఏమో కానీ కొంత సైలెంట్‌గానే ఉంది. అప్పుడప్పుడు కొన్ని శాంపిల్స్‌ను వదిలినప్పటికీ అసలు విశ్వరూపం మాత్రం చూపించలేదు. అయితే నాగ్‌కు మాత్రం ఆమె అలా గమ్మున కూర్చోవడం అస్సలు నచ్చలేదు. శనివారం నాటి ఎపిసోడ్లో నాగ్ సరయూను బూతులు మాట్లాడటం లేదేంటి? అని ప్రశ్నించాడు. మీరు తిడతారేమోనన్న భయంతో సైలెంట్‌గా ఉన్నానని సమాధానమిచ్చిన సరయూ... లేదంటే రెచ్చిపోయేదాన్నని చెప్పకనే చెప్పింది. దీంతో నాగ్.. నువ్వు నీలా ఉండని చెప్తూ ఆమె స్వేచ్ఛగా బూతులు మాట్లాడొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే చాన్స్ అనుకున్న సరయూ మీరు డేట్‌కు తీసుకు వెళ్తానంటే బూతులు మొదలుపెడతా అని ఆఫరిచ్చింది. దీంతో నాగ్ నిన్ను డేట్‌కు తీసుకెళ్లాలంటే ముందు బయటకు రావాలి కదా! అని ఉన్నమాట చెప్పాడు. అప్పుడు సరయూ.. ఇప్పుడు కాదులే సర్, వంద రోజుల తర్వాత డేట్‌కు వెళ్దాం అని ఆశగా అడిగింది. దీనికి నాగ్‌కు కూడా వంద రోజుల తరువాతా.. అయితే ఓకే అని పచ్చజెండా ఊపడంతో సరయూ ఎగిరి గంతేసింది. ఈ డేటింగ్ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఎలిమినేషన్లో ట్విస్ట్! సరయూ అవుట్?
Bigg Boss Telugu 5 First Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ మొదటి వారంలో యాంకర్ రవి, మోడల్ జెస్సీ, నటి హమీదా, యూట్యూబ్ స్టార్ సరయూ, నటుడు మానస్, ఆర్జే కాజల్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ రవి ఎక్కువ ఓట్లతో మొట్టమొదటగా సేవ్ అవుతాడన్న విషయం తెలిసిందే! ఆ తర్వాత ఆర్జే కాజల్, నటుడు మానస్ సేఫ్ జోన్లో ఉన్నట్లు అనఫీషియల్ పోల్స్‌లో వెల్లడుతోంది. హమీదా, సరయూ, జెస్సీ డేంజర్ చివరి మూడుస్థానాల్లో తచ్చాడుతున్నారు. అయితే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో హమీదా పవర్ యాక్సెస్ పొంది ప్రేక్షకులకు తన పవరేంటో చూపించింది. మొదట్లో తన ఏడుపుతో ఈ సీజన్‌కు పాతాళగంగలా మారుతుందేమో అనిపించినప్పటికీ తర్వాత మాత్రం గేమ్‌లో తన సత్తా చూపించి జనాలను ఆకట్టుకుంది. ఇక జెస్సీ.. ఎప్పుడేం చేయాలి? ఎప్పుడేం మాట్లాడాలో అర్థం కాని కన్ఫ్యూజన్లోనే వారం నెట్టుకొచ్చేశాడు. ఒకరిద్దరితో జరిగిన గొడవలు అతడికి మైనస్‌గా మారాయి. ఇక సరయూ.. ఆమెకు ఒకరు ఎదురొచ్చినా, ఆమె ఇంకొకరికి ఎదురెళ్లినా వారికే రిస్కు. ఆమెకు ఏదైనా తప్పనిపిస్తే అక్కడే కుండ బద్ధలు కొట్టి చెప్పేస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే కూడా అస్సలు సహించదు. అలాంటి తను కాజల్‌తో గొడవకు దిగింది. కెప్టెన్సీ టాస్కులో కాజల్ వైఖరిపై మండిపడింది. ఈ గొడవ మినహాయిస్తే సరయూను స్క్రీన్‌పై పెద్దగా చూపించింది కూడా లేదు. ఇదిలా వుంటే ఈ వారం ఎలిమినేట్ అయింది ఈ కంటెస్టెంటే అంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో లీకైంది. 7 ఆర్ట్స్ సరయూ బిగ్‌బాస్‌ను వీడబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ వార్త చాలామందిని షాక్‌కు గురి చేస్తోంది. జెస్సీ ఈ వారం గండం గట్టెక్కడం కష్టమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్న తరుణంలో అతడికి బదులు సరయూను ఎలిమినేట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరోపక్క ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, జెస్సీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు కొందరు లీకువీరులు. మరి డేంజర్‌జోన్‌లో ఉన్న సరయూ, జెస్సీలలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! -
ఏడుపులు, పెడబొబ్బలు, నాగ్ ముందు మళ్లీ మొదలెట్టేశారు
Bigg Boss Telugu 5 Promo: బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల గొడవలకు హద్దు లేకుండా పోతోంది. కిచెన్‌లో, పనుల పంపకాల్లో, బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లలో అన్ని చోట్లా వాదులాటకు దిగుతూ ప్రేక్షకులకు తలనొప్పిగా మారుతున్నారు హౌస్మేట్స్. దీంతో వీరి గొడవలకు మూలాలేంటో తెలుసుకుని, వారిని సరిదిద్దేందుకు వీకెండ్ ఎపిసోడ్ ద్వారా నాగ్ సిద్ధమయ్యాడు. పనిలో పనిగా వారి అసలు స్వరూపాలను కూడా ప్రేక్షకుల ముందుంచే ప్లాన్ చేశాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో నాగ్ ఇంటిసభ్యులకు.. ఎవరితో సెట్? ఎవరితో కట్? అనే టాస్క్ ఇచ్చాడు. ముందుగా శ్వేత వర్మ మాట్లాడుతూ.. 2017లో అమ్మను కోల్పోయాను. ఇక్కడ యానీ మాస్టర్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను అంటూ ఆమెతో సెట్ అని చెప్పకనే చెప్పింది. ఆ తర్వాత సింగర్ శ్రీరామచంద్ర.. శ్వేత వర్మ సెట్ అని పేర్కొన్నాడు. ఎవరితో బంధం కట్ చేసుకోవాలన్న విషయంలో లోబో, శ్రీరామచంద్ర.. కాజల్ ఫొటోలను చించేసినట్లు తెలుస్తోంది. ఇక సరయూ.. సిరి ఫొటోను చించేస్తూ.. 'ఇతరుల సహకారంతో గేమ్ ఆడటం చాలా ఈజీ. కానీ ఎవరి సహకారం లేకుండా ఆడటం చాలా కష్టం, అది ఆడి చూపించు' అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలతో షాకైన సిరి.. ఏ రోజైనా గెలిపించమని చెప్పానా? అని ప్రశ్నిస్తూనే కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కంటతడికి కరిగిపోని సరయూ.. 'మీరాడే ఆటలకు నేనూ రోజు ఏడవాలి' అని తిరిగి బదులిచ్చింది. వీరిద్దరూ తన ముందే ఈ రేంజ్లో మాటల యుద్ధానికి దిగడాన్ని చూసిన నాగ్.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో జరిగుంటుందని అనుమానపడ్డాడు. మొత్తానికి ఈరోజు కామెడీ డోస్ కంటే కూడా ఏడుపులు, పెడబొబ్బలే ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. మరి ఈ ఎపిసోడ్ చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
ఈ గేములు సెట్టయితలే, పోయి దుకాణంలో కూర్చుంట: లోబో
Bigg Boss Telugu 5, Episode 05: బిగ్‌బాస్ ఐదో సీజన్లో కామెడీ, లవ్ ట్రాక్‌ల సంగతేమో కానీ కొట్లాటలకు మాత్రం కొదవ లేకుండా పోయింది. అర్థం పర్థం లేని విషయాలకు కూడా గొడవ పడుతూ ప్రేక్షకులకు తలనొప్పిగా మారుతున్నారు. కెప్టెన్ వచ్చాక అయినా ఇల్లు చక్కదిద్దుకుంటుందేమో అంటే ఆ తర్వాత కూడా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. తొలి కెప్టెన్‌గా నియామకమైన చలాకీ సిరి వీరిని అందరినీ దారిలో పెడుతుందా? అనేది ఆసక్తికరంగానే మారింది. మరి నేటి(గురువారం) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. ఫ్రస్టేషన్ బయటపెట్టిన లోబో కెప్టెన్సీ పోటీదారుడు మానస్‌కు ఇచ్చిన టాస్క్ ప్రకారం.. అర్ధరాత్రి ఎవరు నిద్ర లేచినా ముందు కాజల్‌ను లేపాల్సి ఉంటుంది. కానీ ఈ నియమాన్ని లహరి, శ్రీరామచంద్ర తుంగలో తొక్కడంతో పదేపదే అలారమ్ మోగింది. ఫలితంగా ఇంటి సభ్యుల నిద్ర చెదిరిపోయింది. మరోపక్క షణ్నూకు సపర్యలు చేసి అలిసిపోయాడు అతడి సేవకుడు లోబో. వారు చేయిస్తున్న టాస్క్‌లకు దండం పెట్టేశాడు. స్మోకింగ్ రూమ్‌లో తన ఫ్రస్టేషన్‌ను విశ్వ ముందు బయటపెట్టాడు. 'ఈ గేములు నాకు నచ్చట్లేదు, ఇది నా టేస్ట్ కాదు, నాకు సెట్టయితలేదు. పోయి నా దుకాణంలో ఉంటా, కానీ ఇదంతా ఏంది?' అని అసహనానికి లోనయ్యాడు. దీంతో ఇది టాస్క్ అని, కాస్త ఓపిక పట్టమని ఊరడించాడు విశ్వ. గెలిచిన హమీదా, ప్రియకు కోలుకోలేని దెబ్బ అనంతరం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో హమీదా గెలిచింది. పవర్ రూమ్‌లో అడుగు పెట్టిన ఆమెకు బిగ్‌బాస్ కఠినమైన టాస్కే ఇచ్చాడు. ఆమె ఎంచుకునే కంటెస్టెంట్ హౌస్‌లో ఎప్పటికీ కెప్టెన్ కాలేరని చెప్పాడు. దీంతో ఆమె నటి ప్రియ పేరు చెప్పింది. ఇదే విషయాన్ని హౌస్మేట్స్ దగ్గర చెప్పగా అంతా ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ప్రియ మాత్రం దీన్ని స్పోర్టివ్‌గా తీసుకోవడం విశేషం. ఐ లవ్యూ.. మానస్‌ను మధ్యలో లాగిన ప్రియాంక రెస్ట్ రూమ్ క్లీన్ చేస్తున్న లోబో అక్కడికి వచ్చిన ప్రియాంక సింగ్‌ను చూసి తన పని ఆపేశాడు. ఆమెను తదేకంగా చూస్తూ ఐ లవ్యూ అంటూ ప్రపోజ్ కూడా చేశాడు. అయితే ఆమె మాత్రం నీకు దమ్ముంటే మానస్ ఎదురుగా నాకు లైనేయ్ అని సవాలు చేయడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. ఇదే విషయాన్ని లోబో.. మానస్ దగ్గర ప్రస్తావించగా అతడు తేలికగా నవ్వేసి మధ్యలో నా అనుమతి అవసరం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. ఆ తర్వాత కంటెస్టెంట్లు లోబోను అమ్మాయిగా రెడీ చేసి ఓ ఆట ఆడేసుకున్నారు. మరోవైపు ఏమైందో ఏమో కానీ సరయూ ఉన్నట్టుండి ఏడుపందుకుంది. రెండో రోజే అందరూ కలిసి ఉండి నాలుగో రోజుకే ఎలా గ్రూప్స్ అవుతాయని భోరున ఏడ్చేయగా యానీ మాస్టర్ ఆమెను ఓదార్చింది. సంచాకురాలి ఎంపిక విషయంలో రచ్చ అనంతరం 'శక్తి చూపరా డింభకా!' టాస్క్ పూర్తైందని వెల్లడించిన బిగ్‌బాస్ హమీదా, మానస్, విశ్వ, సిరి తొలి కెప్టెన్సీ టాస్క్‌కు పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. 'తొక్కరా తొక్కు హైలెస్సా' అనే టాస్కులో సైకిల్ నిరంతరాయంగా తొక్కుతూ దాని మీదున్న బల్బ్ వెలుగుతూ ఉండేలా జాగ్రత్తపడాలని ఆదేశించాడు. మధ్యలో బజర్ మోగిన ప్రతిసారి మిగతా హౌస్మేట్స్.. పోటీదారుల్లో ఒకరికి నీళ్లు తాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ఈ టాస్క్‌కు ప్రియ సంచాలకురాలిగా వ్యవహరిస్తే బాగుంటుందని సన్నీ అభిప్రాయపడ్డాడు. అతడి నిర్ణయంతో హౌస్‌లో కొంత రచ్చ జరిగినా ఎక్కువమంది ప్రియనే సంచాలకురాలిగా ఎన్నుకున్నారు. కాజల్ వర్సెస్ సరయూ ఈ టాస్క్‌లో కాజల్.. విశ్వకు ఇమ్యూనిటీ అవసరం లేదంటూ అతడిని డిస్టర్బ్ చేయగా ఆటలో నుంచి అవుటయ్యాడు. అయితే విశ్వను ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేశావని సరయూ కాజల్‌ను నిలదీసింది. నేను అమ్మాయిలకే సపోర్ట్ చేస్తానని, విశ్వకు ఇమ్యూనిటీ అవసరం లేదని అతడికే డైరెక్ట్‌గా చెప్పానని క్లారిటీ ఇచ్చింది కాజల్. కాసేపటివరకు వీరి మధ్య ఓరకంగా మాటల యుద్ధమే నడిచిందని చెప్పవచ్చు. మొత్తానికి రసాభాసగా సాగిన ఈ టాస్క్‌లో సిరి గెలుపొంది హౌస్‌కు తొలి కెప్టెన్‌గా అవతరించింది. ఆమెకు ప్రియ కెప్టెన్ బాండ్ తొడిగింది. అనంతరం సిరి.. విశ్వను రేషన్ మేనేజర్‌గా ఎంపిక చేసింది. నాన్‌వెజ్ వండను, శుభ్రం కూడా చేయను ఇక కిచెన్‌లో పనులు పంచుకునే దగ్గర మరోసారి లొల్లి షురూ అయింది. నాన్‌వెజ్ వండలేను, ఎవరైనా నాన్‌వెజ్ వండితే ఆ గిన్నెలను శుభ్రం చేయను అని ఉమాదేవి తేల్చి చెప్పింది. మార్నింగ్ వెజ్ వండేందుకు ప్రియాంక సింగ్ ఉందని లహరి చెప్పగా దాన్ని ఉమాదేవి తప్పుగా అర్థం చేసుకుంది. అంటే వెజ్ వండటానికి నేను పనికి రానని అంటున్నారంటూ కొత్త వాదన ఎత్తుకుని తగవు పెట్టుకుంది. దీంతో చిర్రెత్తిపోయిన లేడీ అర్జున్ రెడ్డి లహరి.. ఆమె అరిస్తే పడాలా? అని నిలదీసింది. దీంతో జోక్యం చేసుకున్న కెప్టెన్.. లహరి 'పనికి రాదు' అనే పదం వాడలేదని ఉమాదేవికి గట్టిగానే క్లారిటీ ఇవ్వడంతో ఈ గొడవ చప్పున చల్లారిపోయింది. ఇప్పుడే ఈ రేంజ్లో గొడవ పడితే రేపటి నుంచి కెప్టెన్ సిరికి కంటెస్టెంట్లు చుక్కలు చూపిస్తారేమో చూడాలి! -
ఎందుకు టార్గెట్ చేశావ్?: ఏడ్చేసిన సరయూ
బిగ్‌బాస్ హౌస్‌లో పవర్ రూమ్‌లో అడుగుపెట్టిన విశ్వ, మానస్, సిరి, హమీదా కెప్టెన్సీ కోసం పోటీకి దిగారు. వీరికి బిగ్‌బాస్ సైకిల్ తొక్కే టాస్క్ ఇచ్చాడు. ఇందులో మిగతా కంటెస్టెంట్లు తమకు నచ్చినవారికి సపోర్ట్ చేస్తూనే అవతలివాళ్లు టాస్క్ గెలవకుండా ఆటంకం కలిగిస్తున్నారు. ఈ క్రమంలో కెప్టెన్సీ పోటీదారుల కన్నా ముందు వారికి మద్దతునిస్తున్న హౌస్మేట్స్ మధ్యలో గొడవలు మొదలైనట్లు కనిపిస్తోంది. సరయూ తన దోస్త్ విశ్వకు సపోర్ట్ చేస్తుంటే కాజల్ మాత్రం అతడు గెలవకుండా అడ్డుపడినట్లు ప్రోమోలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఎందుకు ఒక్కడినే టార్గెట్ చేశావని సరయూ కాజల్‌ను నిలదీసింది. దీనికి కాజల్ సమాధానమిస్తూ.. అతడు కెప్టెన్ అయ్యేందుకు అర్హుడు కాదని చెప్పుకొచ్చింది. మరోవైపు సన్నీ, రవి మధ్య కూడా వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. రెండో రోజు మంచిగా ఉండి, నాలుగో రోజుకే గ్రూప్స్ ఎలా అవుతాయని సరయూ ఏడ్చేసింది. ఇంతకీ రవికి, సన్నీకి మధ్య జరిగిన గొడవేంటి? విశ్వను టార్గెట్ చేసిన కాజల్ ఎవరికి సపోర్ట్ చేసింది? కెప్టెన్ ఎంపిక సజావుగానే సాగిందా? అన్న విషయాలకు సమాధానం దొరకాలంటే గురువారం నాటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
బిగ్‌బాస్: లోబోతో కలిసి దమ్ము కొట్టిన భామలు
బిగ్‌బాస్ ఐదో సీజన్లో 10 మంది అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే మేల్ కంటెస్టెంట్లలో పెళ్లైనవాళ్లు, చిన్నపిల్లే ఉన్నారని.. తనకెవరూ కనెక్ట్ అయ్యేలా లేరని లహరి షారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ప్రియాంక సింగ్ అందరినీ బ్రో అని పిలిచింది కానీ మానస్‌ను మాత్రం అలా పిలవలేనని సిగ్గులమొగ్గయింది. ఇక యానీ మాస్టర్ మార్నింగ్ డ్యాన్స్‌లో మాత్రమే కనిపిస్తుండగా తాజాగా హమీదా, సరయూ స్మోకింగ్ జోన్లో దర్శనమిచ్చారు. లోబోతో కలిసి ఈ ఇద్దరు భామలు దమ్ము లాగుతూ కనిపించారు. గుప్పుమని పొగలు వదులుతూ ఇంటి ముచ్చట్లను ప్రస్తావించారు. ఇంటి సభ్యుల్లో కొందరు కనెక్ట్ కావడం కష్టమని, బయటే కనెక్ట్ అవుతామంటూ సంభాషించారు. అనంతరం సిగరెట్లను భద్రంగా కవర్లలో దాచుకున్నారు. సిగరెట్లు ప్రతిరోజు వస్తాయో లేదో అని హమీదా అనుమానం వ్యక్తం చేయగా ప్రతిరోజు వస్తాయని బదులిచ్చాడు లోబో. అన్‌సీన్ ఎపిసోడ్లో ప్రసారం చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు 'అరేయ్ ఏంట్రా ఇది?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by BiggBossTelugu5 (@bbtelugu5offl) -
బిగ్‌బాస్: తొలి వారం నామినేషన్లో ఆరుగురు, లిస్ట్ ఇదే!
Bigg Boss 5 Telugu 1st Week Nominations: బిగ్‌బాస్ ఐదో సీజన్లో తొలి రోజే కంటెస్టెంట్లకు నిద్ర లేకుండా చేశాడు లోబో. తన గురకతో హౌస్మేట్స్ అందరినీ నిద్రకు దూరం చేశాడు. అతడి గురకను ఆపడానికి రవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరోవైపు అదే రాత్రి తమకు బోర్ కొడుతోందంటూ దొంగతనానికి పూనుకున్నారు సిరి హన్మంత్, జెస్సీ. కంటెస్టెంట్ల వస్తువులను దాచేసి తర్వాత నిమ్మకు నీరెత్తనట్లు ఊరకుండిపోయారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి ఆరుగురు నామినేట్ అయ్యారు. ఆ ఆరుగు ఎవరు? తొలి రోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో చదివేయండి. దొంగతనం చేశామని ఒప్పుకున్న సిరి ఇక తర్వాతి రోజును ఉరకలెత్తించే డ్యాన్స్‌తో ఉల్లాసంగా, ఉత్సాహంగా మొదలుపెట్టారు కంటెస్టెంట్లు. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ పోయాయని ఒకరు, చెప్పులు పోయాయని మరొకరు గోల పెట్టినా అసలు దొంగలు మాత్రం చీమ కుట్టనట్లు ఉండిపోయారు. అయితే యాంకర్ రవి మాత్రం జెస్సీనే దొంగ అని ముందుగానే పసిగట్టడంతో సిరి తామే దొంగలమని ఒప్పుకోక తప్పుకోలేదు. మూడున్నరేళ్ల నుంచి మోసం చేస్తున్నా.. ఇక ప్రియాంక సింగ్ తాను అతడు నుంచి అమ్మాయిగా మారేందుకు చేసుకున్న ఆపరేషన్ గురించి ఆర్జే కాజల్‌తో మాట్లాడింది. ఈ విషయంలో మూడున్నరేళ్ల నుంచి మా నాన్నను మోసం చేస్తున్నానని చెప్తూ ఎమోషనల్ అయింది. ఒకసారి తను నన్ను ముట్టుకుని గడ్డాలు, మీసాలు ఏవని అడిగితే లేడీ గెటప్ కోసం తీసేయించుకున్నానని అబద్ధం చెప్పానంటూ కంటతడి పెట్టుకుంది. దీంతో ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చింది కాజల్. చెత్తకుండీలో కంటెస్టెంట్ల ఫొటోలు అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో తొలివారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారి ఫొటోలు ఉన్న చెత్త కవర్లను చెత్తకుండీలో వేయాలి. ముందుగా సింగర్ శ్రీరామచంద్ర.. మానస్, జెస్సీలను నామినేట్ చేశాడు. సరయూ.. ఆర్జే కాజల్, యాంకర్ రవిని; శ్వేత వర్మ.. హమీదా, నటరాజ్ మాస్టర్‌ను, జెస్సీ.. విశ్వ, హమీదాను; ఉమాదేవి.. కాజల్, జెస్సీలను నామినేట్ చేశారు. చదవండి: Bigg Boss 5 Telugu: నాగ్ పారితోషికం ఎంతో తెలుసా? యాంకర్ రవికి కౌంటరిచ్చిన నటరాజ్ మాస్టర్ ఇక బిహేవియర్ నచ్చలేదని జెస్సీని, అందరితో క్లోజ్ అవ్వాలంటూ మానస్‌ను నామినేట్ చేశాడు విశ్వ. తనకు కాంపిటీషన్‌గా వస్తుందని సిరిని, కోపం తగ్గించుకోవాలంటూ జెస్సీని నామినేట్ చేసింది యానీ మాస్టర్. బయట ఉన్నట్లుగా హౌస్‌లో లేడని నటరాజ్ మాస్టర్‌ను, రిలాక్స్‌గా ఉంటున్నాడని మానస్‌ను నామినేట్ చేశాడు రవి. అయితే తనకు నటించడం రాదని రవికి గట్టి కౌంటరిస్తూనే అతడిని నామినేట్ చేశాడు నటరాజ్ మాస్టర్. అమాయకత్వంతో ఈ హౌస్‌లో ఉండలేవంటూ జెస్సీని నామినేట్ చేశాడు. ఫస్ట్ వీక్‌లోనే అందరూ నామినేట్ చేస్తుండటం, అందులోనూ వాళ్లు చెప్పే కారణాలను జీర్ణించుకోలేకపోయిన జెస్సీ అందరిముందే ఏడ్చేశాడు. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూశాడని రవిని నామినేట్ చేసిన లోబో రూడ్‌గా మాట్లాడుతుందని లహరిని, తనను కామెంట్ చేశాడని జెస్సీని నామినేట్ చేసింది హమీదా. తనకు టాస్క్‌లు ఆడమని చెప్పడం నచ్చలేదని సన్నీని, ఎక్కువగా జోక్యం చేసుకోవడం నచ్చదని లోబోను నామినేట్ చేశాడు షణ్ముఖ్. యాటిట్యూడ్ చూపించిందని ప్రియను, యాపిల్ తినేటప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ యాటిట్యూడ్ చూపించాడని రవిని నామినేట్ చేశాడు లోబో. మొదటి వారం నామినేట్ అయిన ఆరుగురు మానస్.. విశ్వ, సరయూ; సిరి.. హమీదా, ప్రియను; సన్నీ.. షణ్ముఖ్, లహరిని; ప్రియాంక సింగ్.. షణ్ముఖ్, హమీదాలను; ప్రియ.. సిరి, కాజల్‌ను; మానస్.. విశ్వ, సరయూలను; కాజల్.. సరయూ, ఉమాదేవిని; లహరి.. హమీదా, కాజల్‌ను నామినేట్ చేశారు. దీంతో మొదటివారం నామినేషన్ ప్రక్రియ పూర్తైంది. ఎక్కువగా ఓట్లు పడిన రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. మరి వీరిలో ఎలిమినేషన్ గండం గట్టెక్కేది ఎవరనేది చూడాలి! -
బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?!
బోర్డమ్ను దూరం చేసేందుకు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్. ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ షోలో ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ ఆడియన్స్‌కు మాటిచ్చేశాడు నాగ్. అన్నట్లుగా ఎక్కువ వినోదాన్ని అందించాలంటే అంతే ఎక్కువ కంటెస్టెంట్లు ఉండాలనుకున్నారో ఏమోగానీ ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపారు. వీరిలో నటి సిరి హన్మంత్, వీజే సన్నీ, నటి లహరి, సింగర్ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, లోబో, ప్రముఖ నటి ప్రియ, మోడల్ జశ్వంత్ పడాల(జెస్సీ), ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్, షణ్ముఖ్ జశ్వంత్, నటి హమీదా, నటరాజ్ మాస్టర్, నటి ఉమాదేవి, విశ్వ, 7ఆర్ట్స్ సరయూ, నటుడు మానస్, ఆర్జే కాజల్, నటి శ్వేత వర్మ, యాంకర్ రవి ఉన్నారు. నేడు హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ జరగబోతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈవారం నామినేషన్లో ఉండేది వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. యాంకర్ రవి, జెస్సీ, మానస్, హమీదా, కాజల్, సరయూ తొలివారం నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ప్రియ కూడా ఈ లిస్టులో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో మొట్టమొదట సేవ్ అయ్యే కంటెస్టెంట్ యాంకర్ రవి అని ఊహించవచ్చు. యాంకర్ రవికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అతడు ఈజీగా ఈ గండం నుంచి గట్టెక్కుతాడు. మరి మిగతా ఆరుగురిలో ఎవరు సేవ్ అవుతారు? ఈ లిస్టులో ఏమైనా మార్పుచేర్పులు ఉన్నాయా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
బిగ్‌బాస్ 5: అందరినీ దమ్‌దమ్ చేస్తానంటున్న సరయూ
ప్రత్యేక యాసతో ఉన్నదున్నట్లు మాట్లాడే సరయూ గురించి యూట్యూబ్ వీక్షకులకు తెలిసే ఉంటుంది. తను 7 ఆర్ట్స్ ఛానల్లో అప్లోడ్ చేసే వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌కు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. బోల్డ్ వీడియోలు చేసే సరయూ తన మాటలు, బిహేవియర్‌తో హౌస్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. బిగ్‌బాస్ ఐదో సీజన్లో పదమూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సరయూ బిగ్‌బాస్‌నే కాదు, లోపల కంటెస్టెంట్లను కూడా దమ్‌దమ్ చేస్తానంటొంది. కాగా ఒక్కసారైనా అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్లాలని చిన్నప్పుడు తరచూ అనుకునేదాన్నని, ఇప్పుడా కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చింది. మరి సరయూ దూకుడును, ఆమె వాగ్ధాటిని తోటి కంటెస్టెంట్లు తట్టుకుని నిలబడతారా? అన్నది డౌటానుమానంగానే ఉంది. -
చతురంగ తరంగం
ఆడపిల్లలని వివక్ష చూపకుండా గోరంత ప్రోత్సాహమిస్తే, కొండంత ఉత్సాహం తెచ్చుకుని, పుట్టినింటి పేరునే కాదు, పుట్టిన దేశానికే ప్రపంచ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టగలరు. రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్‌షిప్ ఐదుసార్లు సాధించిన ఈ చిచ్చర పిడుగే అందుకు నిదర్శనం. ఇటీవల జాతీయ స్థాయిలో ఓరుగల్లు కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన సరయు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడానికి పావులు కదుపుతోంది. గ్రాండ్‌మాస్టర్ కావడమే లక్ష్యమని చెబుతోంది చిన్నారి చతురంగ తరంగం... వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన వేల్పుల రజిత–సంపత్ దంపతులకు సరయు, శరణ్య కవల పిల్లలు. 7వ తరగతి చదువుతున్న సరయు చదరంగంలో రాణిస్తుండగా శరణ్య క్లాసికల్ డాన్స్‌లో దిట్ట. తల్లి రజిత గృహిణి, తండ్రి సంపత్ ఆర్ఎంపీ. డాక్టర్‌గా మొండ్రాయి గ్రామంలో క్లినిక్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.‘అప్పుడు సరయు 4వ తరగతి చదువుతోంది. ఒక రోజు తండ్రి సంపత్, మేనమామ రవి, బాబాయి సలెందర్ చదరంగం ఆడుతున్నారు. ఈ క్రమంలో వారి ఆటను గమనిస్తున్న సరయు ఓడిపోతున్న తండ్రిని తన ఎత్తులతో గెలిపించింది’.తర్వాత సరయును గొర్రెకుంటలోని విజ్ఞాన్స్కూల్లో చేర్పించారు. ప్రిన్సిపాల్ గిరిధర్, పీఈటీ సునీల్‌లకు తన కూతురుకు చెస్ అంటే ఇష్టమని చెప్పారు. దాంతో వారు చెస్టోర్నమెంట్లకు తరచూ తీసుకుని వెళ్తుండేవారు. ఆ తర్వాత తేజస్వీ హైస్కూల్లో చేర్పించారు. అక్కడ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రావు సరయు ప్రతిభను గుర్తించి ఉచిత విద్యనందించడంతోపాటు టోర్నీలకు అయ్యే ఖర్చులను భరిస్తూ ప్రోత్సహించారు. ఎలాంటి శిక్షణ లేకుండానే 2015 సంవత్సరం గోవాలో నిర్వహించిన చాంపియన్‌షిప్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. శిక్షణ ఇప్పిస్తే మరింత రాణిస్తుందని సంపత్ అనే కోచ్వద్ద శిక్షణ ఇప్పించారు. ప్రత్యర్థి ఎత్తుగడలను, ఆలోచనలు, ఊహలను ముందే పసిగడుతూ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ చిచ్చర పిడుగు సరయూ చదరంగంలో రాణిస్తున్న సరయు అంతర్జాతీయ క్రీడాకారులు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్‌ల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో రాణించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. 2018 ఏప్రిల్‌లో ఏషియన్ స్థాయిలో థాయిలాండ్‌లో జరిగే అండర్ 12 విభాగం, 2018 నవంబర్‌లో గ్రీస్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి అండర్ 12 విభాగం పోటీల్లో సరయు పాల్గొననుంది. రాష్ట్ర స్థాయిలో చాంపియన్... 2015లో వరంగల్‌లో జరిగిన అండర్–9 విభాగం పోటీల్లో, 2016 సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన అండర్–11 విభాగంలో చాంపియన్‌షిప్, 2017 సెప్టెంబర్ హైదరాబాద్‌లో అండర్విభాగంలో రెండో స్థానం, ఇదే నెలలో ఖమ్మంలో జరిగిన అండర్ 17 విభాగంలో చాంపియన్, అక్టోబర్‌లో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్11 విభాగంలో చాంపియన్, వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్–14 క్రీడా పోటీల్లో చాంపియన్‌గా నిలిచింది. – గజ్జెల శ్రీనివాస్, సంగెం, సాక్షి వరంగల్ రూరల్ గ్రాండ్మాస్టర్అవుతాను – సరయు ఇప్పటివరకు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించాను. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి గ్రాండ్‌మాస్టర్ కావాలన్నది నా లక్ష్యం. పెద్దలెవరైనా అండదండలు అందిస్తే నా చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యసాధనకు కృషి చేస్తాను. జాతీయస్థాయి పోటీల్లో... తొలిసారిగా 2015 గోవాలో జరిగిన అండర్–9 విభాగంలో పాల్గొంది. 2016 సంవత్సరం నాగపూర్‌లో జరిగిన అండర్–11 విభాగంలో పాల్గొంది. ఇదే సంవత్సరం మేలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అండర్–11 విభాగంలో పాల్గొంది. 2017 జనవరి మహారాష్ట్రలో జరిగిన అండర్–11 విభాగంలో 5వ స్థానంలో నిలిచింది. 2017 జూన్‌లో పంజాబ్‌లో జరిగిన అండర్–13 విభాగంలో పాల్గొంది. 2017 నవంబర్23–30 వరకు పుణేలో జరిగిన జాతీయ స్థాయి అండర్11 విభాగం చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రెండోస్థానంలో నిలచి అంతర్జాతీయ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైంది. అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇప్పించాలి నా కూతురు సరయూకు చదరంగం అంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను. నా శక్తిమేర మూడేళ్లుగా శిక్షణ ఇప్పిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఉన్నతస్థాయిలో శిక్షణ అవరం. అందుకు లక్షల్లో ఖర్చవుతుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాకు ఇది శక్తికి మించిన పని. ప్రభుత్వం సరయూ ప్రతిభను గుర్తించి శిక్షణకు అయ్యే ఖర్చును భరించి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. – వేల్పుల సంపత్, సరయు తండ్రి -
ఓపెన్ టు ఆల్ విజేత సరయు
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ మహేశ్వరి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఓపెన్ టు ఆల్ చెస్ పోటీల్లో హన్మకొండకు చెందిన వేల్పుల సరయు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ముగింపు సభలో ముఖ్య అతిథిగా శాప్ మాజీ డైరక్టర్ రాజనాల శ్రీహరి హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ద్వితీయ విజేతగా ఎం.శ్రీకాంత్, తృతీయ స్థానాన్ని ఆర్.శివకుమార్ దక్కించుకున్నట్లు నిర్వాహకుడు సంపత్ తెలిపారు. అండర్–15 కేటగిరీలో విజేతగా అభిలాష్, ద్వితీయ స్థానంలో కార్తికేయ అండర్–13 విభాగంలో థామస్, జాహిద్‌ఖాన్‌లు వరుస రెండు స్థానాల్లో నిలువగా దీపక్ ప్రత్యేక ప్రతిభ కనబరిచి బహుమతులను అందుకున్నట్లు తెలిపారు. -
చక్రపాణికి కన్నీటి వీడ్కోలు
ఎస్పీనగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు గౌతంనగర్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య సరయూ నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందిన చక్రపాణి అంత్యక్రియలు శుక్రవారం మల్కాజిగిరి ఎస్పీనగర్ శ్మశాన వాటికలో బంధు, మిత్రుల కన్నీటి వీడ్కోల మధ్య జరిగాయి. గత నెల 30న అయోధ్యలో నిర్వహించిన సుందరకాండ పారాయణ యాగానికి వెళ్లిన చక్రపాణి నదిలో స్నానం చేస్తూ మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరిన చక్రపాణి మృతదేహాన్ని మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక అంబులెన్స్‌లో మల్కాజిగిరి వాణినగర్‌లోని చక్రపాణి నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే అతని తల్లిదండ్రులు కృ ష్ణ కిశోర్‌శర్మ, రాజేశ్వరి గుండెలు పగిలేలా రోదిం చారు. పెద్ద సంఖ్యలో స్థానికులు, బంధువులు చ క్రపాణి మృతదేహాన్ని చూసి నివాళులర్పించారు. అలాగే, స్థానిక కార్పొరేటర్ ఆర్. సుమలతారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్. రాంచందర్‌రావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి, సంతాపం వ్యక్తం చేశారు. మృతిని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నగర విద్యార్థులకు జలగండం
మొన్న బియాస్.. నిన్న డిండి.. నేడు సరయూ.. 21 మంది మృత్యువాత తాజాగా సరయూ నదిలో మరో ఇద్దరి గల్లంతు నెలరోజుల్లోనే మూడు దుర్ఘటనలు ఆందోళన చెందుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు నగర విద్యార్థులకు జలగండం పొంచి ఉన్నట్టుంది. నెలరోజుల వ్యవధిలో వరుసగా జరిగిన మూడు ఘటనలను పరిశీలిస్తే ఇలాంటి అనుమానమే కలుగుతోంది. ఆయా నదులు, ప్రాజెక్టుల్లో సరాదాగా ఫొటోలు దిగుతున్న సమయంలోనే విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కడుపుకోతను భరించలేకతల్లడిల్లిపోతున్నారు. నగర విద్యార్థులు బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు జలాశయాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. నెలరోజుల వ్యవధిలోనే వేర్వేరు ప్రమాదాల్లో నగరానికి చెందిన 21 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తాజాగా బుధవారం సరయూ నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతవడం కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. నగర వాసులనూ తీవ్రంగా కలిచివేసింది. గత నెలలో హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో 16 మంది సిటీ విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయి మరణించిన హృదయవిదారక ఘటన మరవక ముందే.. గత సోమవారం నల్లగొండ జిల్లా డిండి రిజర్వాయర్‌లో మరో ఐదుగురు మృత్యువాత పడడం కలకలం సృష్టించింది. తాజాగా బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని సరయూ నదిలోకి సరదాగా దిగిన మరో ఇద్దరు విద్యార్థులు గల్లంతవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలను పరిశీలిస్తే.. జలక్రీడలు, జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ సరదాగా గడపడంతోపాటు ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించేందుకు మక్కువ చూపుతోన్న విద్యార్థులుసరదా మాటున పొంచిఉన్న ప్రమాదాల బారిన పడుతున్నారని తెలుస్తోంది. అక్కడి పరిస్థితులను పసిగట్టలేకపోవడం వల్లే ప్రమాదాలకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏదేని కొత్త ప్రాంతానికి వెళ్లిన వారికి ఆయా ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, జలాశయాలు, నదుల ప్రవాహ రీతులు, లోతు, ప్రమాదం జరిగేంద ుకు ఆస్కారమున్న ప్రదేశాలపై సంపూర్ణ అవగాహన లేకపోవడం కూడా కారణమని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు గల్లంతైన విద్యార్థుల్లో ఈత రానివారే అధికంగా ఉన్నారు. ఒకవేళ మోస్తరుగా ఈత వచ్చినా.. గతంలో స్విమ్మింగ్ పూల్‌లో ఈదిన అనుభవం మినహా సువిశాలమైన జలాశయాల్లో ఈదే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవడం కూడా శాపంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. వాటర్‌గేమ్స్‌తో సేదదీరాలనుకొని పర్యాటక, అధ్యయన టూర్లకు వెళ్తున్న నగర విద్యార్థులు తమ వెంట లైఫ్‌జాకెట్లు తీసుకెళ్లకపోవడం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, కనీసం వాటిని వెంట తీసుకెళ్లాలని చెప్పే వారూ లేకపోవడంతోనే వరుస అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. పరిష్కారమార్గాలివే... ఆయా జలాశయాల వద్ద వరుసగా జరుగుతున్న దుర్ఘటనల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖ కెరీర్ కౌన్సెలింగ్ నిపుణుడు, సామాజిక వేత్త ఆకెళ్ల రాఘవేంద్ర సూచిస్తున్న పరిష్కారాలివీ... విద్యార్థులు నగరం దాటి పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు కళాశాల యాజమాన్యాలు లేదా తల్లిదండ్రులు, టూరు నిర్వాహకులు కనీస జాగ్రత్తలను విధిగా వారికి చెప్పాలి. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే ఘోర దుర్ఘటనలు జరుగుతున్నాయి. సంబంధిత పర్యాటక ప్రదేశంపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు కంప్యూటర్ ద్వారా ప్రజెంటేషన్ చూపించాలి. గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ టెక్నాలజీ ఆధారంగా ప్రజెంటేషన్ సాగాలి. వెళ్లే ప్రాంతంపై ముందుగా భౌగోళిక అవగాహన కల్పించాలి. అక్కడి వాతావరణ అనుకూలతలు, ప్రతికూల పరిస్థితులపై అవగాహన కల్పించాలి. తగిన జాగ్రత్తలు సూచించినప్పుడు విద్యార్థులు సైతం వినాల్సి ఉంటుంది. ప్రమోదం మాటునే ప్రమాదం పొంచి ఉందన్న విషయం మరవరాదు. ప్రస్తుత విద్యావిధానంలో తరగతి గదులు, ప్రత్యేక క్లాసులతో బిజీ అవుతున్న విద్యార్థులకు ఈత వంటి ఆత్మరక్షణ అంశాల్లో ప్రావీణ్యం లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు, క ళాశాలల యాజమాన్యాలు చొరవ తీసుకొని వీటిని నేర్పించేందుకు కృషిచేయాలి. కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు విధిగా ఆయా ప్రాంతాల్లో పర్యాటక శాఖ గుర్తింపు పొందిన గైడ్‌ను వెంట తీసుకెళ్లాలి. బృందాలుగా పర్యటన చేస్తున్న సమయంలో సదరు విషయాన్ని అక్కడి స్థానిక రెవెన్యూ, పోలీసు యంత్రాగానికి తెలపాలి. అప్పుడే అనర్థాలు జరిగినపుడు వెంటనే వారు రంగంలోకి దిగే వీలుంటుంది. ముందుగానే తగిన జాగ్రత్తలు సూచించే వీలుంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు పరిసరాల పట్ల ఆచితూచి వ్యవహరించాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కెమెరాల్లో ఫొటోలు బంధిస్తున్నప్పుడు అదుపుతప్పి నీటిలో జారిపడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో నీటిలోకి దిగాల్సి వస్తే లైఫ్ జాకెట్లు ధరించాలి. తేలికపాటి బోట్లు, స్థానికుల సహకారం తీసుకోవాలి. వెంట తీసుకెళ్లే ఫ్యాకల్టీ విద్యార్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.