
Bigg Boss 5 Telugu, 1st Eliminated Contestant Sarayu: ఆమె నోరు తెలిస్తే చాలు బూతులు.. ఆ బూతులే ఆమెను పాపులర్ చేశాయి. ఆ తిట్ల దండకాలే ఆమెను బిగ్‌బాస్ గడపకు చేర్చాయి. ఎవరి గురించి చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. ఆవిడే సరయూ. 7 ఆర్ట్స్ ఛానల్‌లో ఆమె చేసే అడల్ట్ కామెడీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే నోటికొచ్చినట్లుగా పచ్చి బూతులు మాట్లాడటాన్ని విమర్శించేవాళ్లూ లేకపోలేదు. ఏదేమైనా యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన సరయూ బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ బిగ్‌బాస్ హౌస్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేక, అందులో ఇమడలేక మొదటి వారానికే బయటకు వచ్చేసింది.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. 'ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్‌లో ఉన్నాను. అది మా ఇంట్లో వాళ్లకు, అబ్బాయి ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. మా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నేనేదీ చేయను. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు నా కెరీర్‌ను పక్కన పెట్టాను. రిలేషన్‌లో అతడికి 100 పర్సెంట్ ఇచ్చేశాను. నేను వర్జిన్ కూడా కాదు. మేము పెళ్లి చేసుకుందామనుకున్నాం, కానీ కుదరలేదు. కట్నం దగ్గర గొడవ రావడంతో పెళ్లిపీటల దాకా వచ్చిన వివాహం రద్దయిపోయింది. ముందు పాతిక లక్షలు అడిగారు, తర్వాత అరకోటి, కోటి, ఆ తర్వాత సగం ఆస్తి అడిగారు. ఇప్పటినుంచే ఇలా చేస్తే పెళ్లయ్యాక ఇంకెన్ని అడుగుతారో, ఇంకెలా ఉంటారో? అని క్యాన్సిల్ చేశాను. నువ్వు నాకు తగినవాడివి కాదని అతడి ముఖం మీదే చెప్పేశాను' అని చెప్పుకొచ్చింది సరయూ.
Comments
Please login to add a commentAdd a comment