కరోనా మహమ్మారి జనాలను పట్టిపీడిస్తోంది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందనుకునేలోపే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిత్రపరిశ్రమలోనూ ఎంతోమంది ఈ వైరస్ బారిన పడగా తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కౌశల్, సరయులకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
'కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలున్నాయి. ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్నాను. గత వారం రోజుల్లో నన్ను కలిసిన అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను. గుంపులుగా గుమిగూడకండి. వ్యాక్సిన్ వేయించుకోండి, మాస్కులు ధరించండి. కరచాలనం, సెల్ఫీలు మానేయండి. నేను షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయకే ఈ పరిస్థితి తెచ్చుకున్నాను' అని రాసుకొచ్చాడు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్ సరయూ సైతం తనకు పాజిటివ్ వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment