Bigg Boss Telugu 5, BB Telugu Grand Finale Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు అందరినీ బిగ్‌బాస్ స్టేజీపైకి తీసుకొచ్చారు. రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్, రష్మిక మందన్నా, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, నాని, సాయిపల్లవి, కృతీశెట్టి, జగపతిబాబు.. వీళ్లేకాక మరెంతోమంది సింగర్లు, నటీనటులు, సెలబ్రిటీలు షోలో సందడి చేశారు. తారల తళుకుబెళుకులతో బిగ్‌బాస్ స్టేజీ మరింత కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఫైనలిస్ట్ సన్నీకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ ఆలియాభట్. తన ఫేవరెట్ హీరోయిన్ అయిన ఆమె కళ్లముందు స్టేజీపై కనిపించగానే సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు సన్నీ. అతడికి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఆలియా ఏకంగా సన్నీకి ఐ లవ్యూ చెప్పింది. ఇది కలా? నిజమా? అనుకుంటూ గాల్లో తేలిపోయిన సన్నీ పరవశంతో సరదాగా కిందపడిపోయాడు. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్‌తో ఐ లవ్‌యూ చెప్పించుకున్న సన్నీ ఈ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకోవడం ఖాయం. అటు సరయూ నాగార్జునను డేట్‌కు వెళ్దామని అడిగింది. దీనికి సరేనంటూ తలూపిన నాగ్.. గ్రాండ్ ఫినాలే అయిపోగానే డేట్‌కి వెళ్దామని పచ్చజెండా ఊపాడు. ఇక స్టార్ సెలబ్రిటీలు చేసిన హంగామా చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment