
Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ ప్రియులు పొద్దుటి నుంచి ప్రోమో కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారి సహనానికి పరీక్ష పెట్టిన బిగ్‌బాస్ టీం ఎట్టకేలకు ప్రోమో వదిలింది. ఇందులో కింగ్ నాగార్జున కంటెస్టెంట్ల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకున్నాడు. సిరి.. తనను తిడుతున్నాడని షణ్ముఖ్ మీద ఫిర్యాదు చేసింది. కాజల్.. నా మీద అరిచేస్తున్నాడంటూ సన్నీపై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో నాగ్.. సన్నీతో ఆమెకు సారీ చెప్పించాడు.
సిరి హెలికాప్టర్ సౌండ్‌ను కనిపెట్టలేకపోయిన విషయాన్ని నాగ్ ప్రస్తావిస్తూ ఆమెపై సెటైర్లు వేశాడు. మీ ఊర్లో ట్రాక్టర్ సౌండ్ అలాగే వస్తుందా? అని కౌంటరిచ్చాడు. మరోపక్క శ్రీరామ్ సేఫ్ అయితేనే అతడికి ఫస్ట్ ఫైనలిస్టు ట్రోఫీ దక్కుతుందన్నాడు నాగ్. ఎలాగో శ్రీరామ్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఈరోజు శ్రీరామ్ టికెట్ టు ఫినాలేలో గెలిచిన ట్రోఫీని తన సొంతం చేసుకోబోతున్నాడన్న మాట!
Comments
Please login to add a commentAdd a comment