Bigg Boss Telugu 5, Episode 99, Kajal Eliminated: వచ్చేవారం (డిసెంబర్ 19న) గ్రాండ్ ఫినాలే జరగబోతుందని వెల్లడించాడు కింగ్ నాగార్జున. అంటే నెక్స్ట్ సండే ఎవరు విన్నర్ అనేది తేలనుందన్నాడు. ఇక ఈరోజు ఎవరెవరు ఫినాలేలో అడుగుపెట్టనున్నారనేది కూడా తేల్చేశాడు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలుచుకుని శ్రీరామ్ ఫస్ట్ ఫైనలిస్టుగా నిలవగా సన్నీని రెండో ఫైనలిస్టుగా ప్రకటించారు. నేటి(డిసెంబర్ 12) ఎపిసోడ్‌లో సిరిని మూడో ఫైనలిస్టుగా, షణ్నును నాలుగో ఫైనలిస్టుగా వెల్లడించడంతో వాళ్లు సంతోషంలో మునిగి తేలారు.
అనంతరం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వీడియో ద్వారా ప్రశ్నలను సంధించగా హౌస్‌మేట్స్ వాటికి సమాధానాలు చెప్పారు.
► జెస్సీ: షణ్నుకి, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో నాకు తెలుసు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? అని ఎప్పుడైనా ఆలోచించావా?
షణ్ను: ఫ్యామిలీస్ ఇంట్లోకి వచ్చినప్పటినుంచి నాకూ ఈ ప్రశ్న ఎదురైంది. అది తప్పే, కానీ సిరి నా బెస్ట్‌ఫ్రెండ్.. జీవితాంతం ఆమెకు సపోర్ట్‌గా ఉంటాను.
► యానీ మాస్టర్: బిగ్‌బాస్ నుంచి వచ్చాక కొన్ని ఎపిసోడ్లు చూశాను. సన్నీ, మానస్ నా వెనకాల మాట్లాడారు. నేనెప్పుడూ నీ గురించి బ్యాక్ బిచింగ్ చేయలేదు. నువ్వు నా గుడ్ ఫ్రెండ్ అన్నాను. కానీ నువ్వు మాత్రం నేను నటిస్తున్నానని ఇంకా ఏవేవో అన్నావు. నిజంగా నీ మీద జెలసీ ఉంటే నిన్ను కెప్టెన్ చేయడం కోసం నేను కష్టపడకపోయేదాన్ని!
సన్నీ: నేను బ్యాక్ బిచింగ్ చేయలేదు. యానీ మాస్టర్ కొన్నిసార్లు మాట మీద నిలబడదు, అప్పుడు నేను నా అభిప్రాయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నానంతే.. ఆమె నాకెప్పుడూ మంచి స్నేహితురాలే..
► నటరాజ్ మాస్టర్: ఐస్ టాస్క్‌లో పింకీ చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ నడవలేకపోయాడు. టికెట్ టు ఫినాలే టాస్కులో వేరేవాళ్లు నీ తరపున గేమ్ ఆడారు. అంటే పింకీ చేసిన వైద్యం గేమ్‌పరంగా నీకు ప్లస్ అయిందా? మైనస్ అయిందా?
శ్రీరామ్: ఇది ప్లస్సో, మైనసో పక్కనపెడితే నేను టాస్కుల్లో 100% ఇచ్చాను. నా ఆట నేను ఆడలేకపోయాను కాబట్టి మైనస్ అయింది.
► ప్రియాంక: ఇన్నిరోజులు హౌస్‌లో నన్ను భరించావా? నటించావా?
మానస్: కచ్చితంగా భరించాను. నేనైతే నటించలేదు
► జెస్సీ: సిరి.. బిగ్‌బాస్ హౌస్‌లోకి గేమ్ ఆడటానికి వెళ్లావు కదా! కానీ నువ్వు గేమ్ మీద శ్రద్ధ తగ్గించి ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నాను అదీఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు, నీకిది అవసరమా?
సిరి: గేమ్ ఆడటానికే వచ్చాను. మధ్యలో కొన్నికొన్ని ఎమోషన్స్ తీసుకుంటున్నాను. కానీ గేమ్‌లో ఎమోషనల్ కనెక్ట్ అయితే అవసరం లేదు
► ప్రియ: బయట ఎలా ఉంటావో తెలుసుకోవాలని ఉంది. సహజంగా నువ్వు ఇలాగే ఉంటావా? గేమ్ వరకేనా?
కాజల్: నాకు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవాలనిపిస్తే అలానే రియాక్ట్ అవుతున్నా. నేనిలాగే ఉంటాను.
ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత మానస్‌ను ఐదో ఫైనలిస్టుగా ప్రకటించిన నాగ్ కాజల్ ఎలిమినేట్ అయినట్లు వెల్లడించాడు. దీంతో సన్నీ, మానస్ వెక్కివెక్కి ఏడ్చారు. ఇక శ్రీరామ్‌తో నువ్వెప్పటికీ నా బ్రదర్‌వే అని చెప్పుకొచ్చింది కాజల్. నన్ను బాగా మిస్సవ్వండి అంటూ బిగ్‌బాస్ హౌస్ నుంచి నిష్క్రమించింది. స్టేజీ మీదకు వచ్చిన కాజల్‌తో నాగార్జున ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు. ఐదు ఎమోషన్స్‌ను ఐదుగురు కంటెస్టెంట్లకు అంకితమివ్వాలన్నాడు.
సన్నీ ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తే మానస్ ఐదు రెట్ల ఫ్రెండ్‌షిప్ చేస్తాడంది కాజల్. సిరి ఐదు రెట్ల ఎమోషన్ ఇస్తే, శ్రీరామ్ ఐదు రెట్ల యాక్షన్ చేస్తాడని తెలిపింది. షణ్ముఖ్ ఐదు రెట్ల డ్రామా చేస్తాడని పేర్కొంది. సిరిని కంట్రోల్ చేయడం, తిట్టడం, హగ్గులివ్వడం.. ఇలా ప్రతిదాంట్లో డ్రామా ఉంటుందని అభిప్రాయపడింది.
తాను టాప్ 6లో ఉండగానే ఎలిమినేట్ అవుతానని కల వచ్చిందని, చివరకు అదే నిజమైందని నాగార్జునతో చెప్పుకొచ్చింది. చివరగా ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ తనే మూల కారణమని ఒప్పుకోవడం గమనార్హం. కానీ అవేవీ తను కావాలని చేయలేదని స్పష్టం చేసింది. ఫైనల్‌గా శ్రీరామ్, సిరి, మానస్, షణ్ను, సన్నీ ఈ సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిచి ట్రోఫీ కోసం పోటీపడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment