Siri Hanmanth
-
వాడికి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు
-
Siri Hanumanth: పెళ్లి కూతురైన బ్యూటీ సిరి..చూపుతునే చంపేస్తుందిగా! (ఫోటోలు)
-
Siri Hanmanth- Shrihan: తొమ్మిదేళ్లుగా లవ్.. పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన సిరి హన్మంత్ (ఫోటోలు)
-
జవాన్ డైరెక్టర్ గట్టిగా తిట్టేసరికి ఏడ్చేసాను..
-
అది ఫ్రాంక్ కాల్ అనుకున్నా.. ఆ రోజు వరకు నమ్మలేదు: సిరి
బిగ్‌బాస్ సిరి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ రియాలిటీ షో ద్వారా ఈ ముద్దుగుమ్మ తెగ పాపులర్ అయిపోయింది. బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టిన సిరి 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది. ఆమె ప్రియుడు శ్రీహాన్ తో కలిసి అనేకమైన వెబ్ సిరీస్‌ల్లో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ఇటీవల రిలీజైన షారుక్ ఖాన్ జవాన్‌లో సిరి హన్మంత్ కీలకపాత్రలో కనిపించింది. జవాన్‌లో అవకాశం రావడం పట్ల సిరి తొలిసారి స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిరి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. (ఇది చదవండి: మెగా ఇంట్లో సందడి.. ఈ సారి ప్రత్యేకత ఏంటో తెలుసా? ) జవాన్‌లో నటించేందుకు నాకు ఫోన్ రాగా.. మొదట ప్రాంక్ కాల్ అనుకుని కొట్టిపారేశానని తెలిపింది. అయితే ఆ తర్వాత మేనేజరు ఫోన్ చేసి చెప్పడంతో నిజమని తెలిసిందని సిరి హన్మంత్ వెల్లడించింది. షూటింగ్లో కోసం ముంబయి వెళ్లిన తొలిరోజే భయంతో ఏడ్చేశానని పేర్కొంది. సెట్స్ చూశాక కూడా నమ్మకం కలగలేదని.. ఇది షారుక్ సినిమానేనా అంటూ అక్కడ ప్రతి ఒక్కరినీ అడిగానని చెప్పారు. ముంబయి తనకు కొత్తకావడంతో.. తన ఫ్రెండ్ శ్రీహాన్ తోడుగా నిలిచారని పేర్కొన్నారు. (ఇది చదవండి: హీరోయిన్ సీమంతం వేడుక.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!) సిరి మాట్లాడుతూ..' ఈ సినిమా సెలక్షన్‌కు ముందు అట్లీ నన్ను తెలుగు అమ్మాయి అనుకోలేదు. ఇతర రాష్ట్రానికి చెందిన అమ్మాయినని అనుకున్నారు. ఓ డైలాగ్‌కు సెవెన్ టేక్స్ తీసుకోవడంతో నాపై గట్టిగా అరిచారు. దీంతో ఏడ్చేశా.' అని అన్నారు. కాగా.. అట్లీ తెరకెక్కించిన జవాన్‌లో సిరి హన్మంత్ చిన్న పాత్రలో కనిపించారు.ఈ నెల 7న విడుదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. -
జవాన్ సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ.. ఇచ్చిపడేసిందిగా!
పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డుల దుమ్ము దులిపాడు షారుక్ ఖాన్. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. తన నుంచి మరో సినిమా వస్తుందంటే అందరి అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఆ రేంజ్‌కు తగ్గట్లే సౌత్ డైరెక్టర్ అట్లీ ఓ కథ సిద్ధం చేసుకుని వినిపించగా షారుక్‌కు కూడా తెగ నచ్చేసింది. ఇంకేముంది జవాన్ సినిమా మొదలైంది. లేడీ సూపర్ స్టార్ నయనతార జవాన్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. దీపికా పదుకోణ్ ముఖ్య పాత్రలో మెరిసింది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ లేరే అన్న లోటును తీర్చేసిందో బ్యూటీ. బిగ్‌బాస్ బ్యూటీ సిరి హన్మంతు జవాన్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. ఇందులో ఆమె పాత్రకు డైలాగులు లేవు కానీ, షారుక్ పక్కనే కనిపించింది. జైలర్ ఆజాద్‌గా షారుక్ నటించగా, ఆయనకు సబ్ ఆర్డినేట్ ఆఫీసర్‌గా సిరి కనిపించింది. బాలీవుడ్ సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ చోటు దక్కించుకోవడం మామూలు విషయం కాదంటున్నారు నెటిజన్లు. బిగ్‌బాస్ ద్వారా మూటగట్టుకున్న నెగెటివిటీని ఈ బ్యూటీ తన అందం, ప్రతిభ ద్వారా వచ్చిన ఆఫర్లతో తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. తమిళ దర్శకుడు అట్లీ కూడా జవాన్‌లో చిన్న పాత్రలో మెరిశారు. ఇకపోతే జవాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో షారుక్ గత సినిమా రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోతున్నారు. మరి ఈ మూవీ రానున్న రోజుల్లో ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! చదవండి: జవాన్ సినిమా ఓటీటీ రైట్స్‌కు రికార్డు ధర.. ఆ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు ఛాన్స్! మిస్ శెట్టి కూడా అక్కడే.. -
ఏంటి సిరి.. రోజురోజుకీ అందం పెరిగిపోతోంది (ఫోటోలు)
-
ఇండస్ట్రీకి రాకముందు సిరి ఏం చేసేదో తెలుసా? ఫస్ట్ జాబ్ అదేనట
నటప్రతిభనే తన సిరి, సంపదగా మార్చుకుని, బుల్లితెరపై కనిపిం, వెండితెరపై మెరిసింది .. సిరి హనుమంత్! ప్రస్తుతం వరుస సిరీస్‌లతో వెబ్ వీక్షకుల వీరాభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఈ నటి గురిం కొన్ని మాటలు.. సిరి పుట్టి, పెరిగినదంతా వైజాగ్‌లోనే. ఎంబీఏ చదువుతున్నప్పుడే జీవితంలో ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకుంది. అందుకే ఆ చదువును మధ్యలోనే వనేసి హైదరాబాద్‌కు వచ్చేసింది. మొదట కొన్ని లోకల్ చానల్స్‌లో న్యూస్‌రీడర్‌గా పనిచేసింది. ►‘ఉయ్యాలా జంపాలా’ అనే సీరియల్లో నటించే అవకాశం రావడంతో నటన వైపు ఆడుగులు వేసింది. తర్వాత ‘అగ్నిసాక్షి’, ‘సావిత్రమ్మగారి అబ్బాయి’ వంటి పలు సీరియల్స్‌లోనూ చేసింది. సిరీస్‌ల్లోనూ తన అభినయ సత్తాను చాటుకుంది. ఆమె నటించిన ‘ సాఫ్ట్వేర్ బిచ్చగాళ్లు’, ‘రామ్ లీలా’, ‘మేడం సార్ మేడం అంతే’ వంటి వెబ్ సిరీస్‌లు యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచాయి. ►మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన ‘హే సిరి’ యూట్యూబ్ చానల్‌కు ఆరు లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించుకుంది. ఇక బిగ్‌బాస్ సీజన్5 కి వెళ్లొచ్చాక తనకున్న పాపులారిటీని డబుల్ కాదు, త్రిబుల్ చేసుకుంది. చేతినిండా పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలతో పాటు అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతోన్న సూపర్ హిట్ ‘పులి మేక’ , ఆహా లోని ‘బీఎఫ్ఎఫ్’ సిరీస్‌లతో అలరిస్తోంది. ►చిన్నప్పుడే తండ్రికి దూరం కావడంతో చాలా కష్టాలు చూశా. అందుకే, బాగా సెటిల్ అయి., మంచి స్థాయికి చేరుకున్నాకే పెళ్లి చేసుకుంటా. – సిరి హనుమంత్ -
షణ్ముఖ్, సిరితో గొడవలు.. నా ఫోన్ కట్ చేస్తున్నారు.. జెస్సీ
బిగ్‌బాస్ ఐదో సీజన్లో షణ్ముఖ్- సిరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్దరికీ బయట ప్రేమికులు ఉన్నా కూడా హౌస్ లోపల మాత్రం నీకు నేను, నాకు నువ్వు అన్నట్లుగా మెదిలారు. వీరి అతి ప్రేమను చూసి జనాలు ముక్కున వేలేసుకున్నారు. అటు సిరి ప్రియుడు శ్రీహాన్ కూడా ఓసారి స్టేజీపైకి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తున్నవారా? అని ఎంతో దీనంగా అడిగిన డైలాగ్ ఇప్పటికీ బిగ్‌బాస్ ఆడియన్స్ మర్చిపోలేరు. అయితే షణ్ను, సిరిలతో మోడల్ జెస్సీ క్లోజ్‌గా ఉండేవాడు. మిగతా హౌస్మేట్స్ ఈ ముగ్గురిలో ఎవరినైనా ఒక్క మాట అంటే చాలు మిగతా ఇద్దరూ రెచ్చిపోయి గొడవ చేసేవారు. కానీ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక సీన్ మారింది. ఎవరి దారి వారు చూసుకున్నారు. అంతేకాదు ఎంతో స్నేహంగా మెదిలినవాళ్లే ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో జెస్సీ మాట్లాడుతూ.. 'నాకు బాగా క్లోజ్ అయినవాళ్లకు ఐ లవ్యూ చెప్తుంటాను. కానీ వాళ్లు(సిరి, షణ్ముఖ్) ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు. ఒక్కసారి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డాక అంత ఈజీగా తెగిపోతుందని నేను ఊహించలేదు. చెప్పుడు మాటలు విని దూరం పెట్టారు. చాలా బాధేసింది. నాకు ఫోన్ చేసి ఇలా అంటున్నారు, నిజమా? కాదా? అని అడిగి తిట్టే స్వతంత్రం వారికుంది. నేను తప్పు చేశానంటే కచ్చితంగా ఒప్పుకుంటాను. వీళ్లకి అర్థం కాని విషయం ఏంటంటే.. ఒకప్పుడు వాళ్లను ఛీ, తూ.. అన్నవాళ్ల దగ్గరకే వెళ్తున్నారు. వాళ్లు మిమ్మల్ని వాడుకుంటున్నారు. అది తెలుసుకుంటే మంచిది. నేను ఫేమస్ అవ్వడానికి వాళ్లను వాడుకుంటున్నానని టాక్ వచ్చింది. నాకంత అవసరం లేదు, అయినా షణ్ముఖ్ అంత పిచ్చోడేం కాదు. వాడికి ఫలానా వాడు ఫేక్ అనిపిస్తే వదిలేస్తాడు. బిగ్‌బాస్ షోలో నాకోసం ఏడ్చాడు. నాలుగో వారంలో నన్ను జైల్లో పెట్టినప్పుడు నేను నిన్ను నమ్ముతానురా అని నాతో కూర్చున్నాడు. నేను ఫేక్‌గా లేను కాబట్టే నాతో ఉన్నాడు. కానీ ఇప్పుడు నా ఫోన్ కట్ చేసేంత స్థితికి ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. ఒకరిని ఫ్రెండ్ అనుకున్నానంటే ఏదున్నా ముఖం మీదే చెప్పేస్తాను. వారికిప్పుడు నా ప్రవర్తన నచ్చడం లేదంటే సరే! షణ్ను నన్ను అన్‌ఫాలో కొట్టాడు. ఎందుకు అలా చేశాడో తెలియదు. బాధేసింది. కొందరైతే నేనేదో తప్పు చేసినట్లు కామెంట్లలో నన్ను తిట్టేవాళ్లు. వాడికి నా పిల్లచేష్టలు, ప్రవర్తన నచ్చలేదని దూరం పెట్టాడేమో! నావంతు ప్రయత్నం చేశాను. కలిశా, అడిగా, సంవత్సరం వెయిట్ చేశా.. కానీ వాళ్లు వద్దనుకుంటున్నారు. ఒకానొక సమయంలో నాకూ కోపమొచ్చింది. వారు నన్ను ఇష్టపడనప్పుడు ఎందుకు వెనకపడటం అనిపించింది. అందుకే నేనూ దూరంగా ఉంటున్నాను' అని చెప్పుకొచ్చాడు జెస్సీ. -
‘పులి మేక’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
కొత్త బైక్ కొన్న శ్రీహాస్.. ఆ పాటతో పార్టీ అడిగిన సిరి, వీడియో వైరల్
బుల్లితెర జోడి శ్రీహాన్, సిరి హన్మంత్ల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కలిసి నటించిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ ప్రేమికులుగా మారారు. అయితే ఈ జంటకు బాగా పేరొచ్చింది మాత్రం బిగ్‌బాస్ రియాల్టీ షో వల్లే. బిగ్‌బాస్ ఐదో సీజన్లో సిరి, ఆరో సీజన్లో శ్రీహాన్ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరు తమదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. శ్రీహాన్ అయితే చివరి వరకు హౌస్‌లో ఉండి రన్నరఫ్‌గా నిలిచాడు. వాస్తవానికి అతను కూడా విన్నరనే చెప్పాలి. ఆడియన్స్ వేసిన ఓట్ల పరంగా శ్రీహాన్ విజేతగా నిలిచినప్పటికీ.. నాగార్జున ఆఫర్ చేసిన రూ.40 లక్షల సూట్ కేసుకి తలొంచడంతో రేవంత్ విజేతగా నిలిచాడు. మొత్తానికి బిగ్‌బాస్ కారణంగా శ్రీహాన్.. అటు అభిమానుల్ని పెంచుకోవడంతో పాటు, ఇటు డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. ప్రస్తుతం ఆ డబ్బుతో లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా శ్రీహాన్ కొత్త బైక్‌ని కొన్నాడు. ప్రియురాలు సిరి, అతని కుమారుడు(సిరి, శ్రీహాన్ కలిసి ఓ పిల్లాడిని దత్తత తీసుకున్నారు)తో కలిసి కొత్త బైక్‌కి పూజలు కూడా చేయించారు. దీనికి సంబంధించిన వీడియోని సిరి తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘వేర్ ఈజ్ ద పార్టీ’పాట రూపంలో బాయ్ఫ్రేండ్ని పార్టీ అడిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by siri shrihan vibes 💙✨ (@siri_shrihan_vibes) -
షణ్ముఖ్‌తో అతి సన్నిహితం.. తప్పు చేశానంటూ స్టేజ్‌పై సిరి కన్నీళ్లు!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో షణ్ముఖ్- సిరిల ఫ్రెండ్షిప్ హద్దు మీరిన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిపించినా వీడి ఉండలేకపోతున్నామని వాపోయారు. కానీ ఎప్పుడైతే సిరి బాయ్‌ఫ్రెండ్, నటుడు శ్రీహాన్ బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చాడో అతడికి ముఖం చూపించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది సిరి. ఇక శ్రీహాన్.. నన్ను వదిలేస్తున్నావా? అని ఒక డైలాగ్ విసరడంతో సిరిని మరింత తిట్టిపోశారు నెటిజన్లు. ఇక కట్ చేస్తే షో అయిపోయాక వాళ్లిద్దరూ ఎప్పటిలాగే కలిసిపోయారు. నెగెటివిటీకి చెక్ పెడుతూ మరింత దగ్గరయ్యారు. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా స్టార్ మా నిర్వహించిన స్పెషల్ ఎపిసోడ్లో శ్రీహాన్, సిరి జంట పాల్గొంది. వారితో పాటు మిగతా బుల్లితెర రియల్ కపుల్స్ కూడా ఈ ఈవెంట్లో సందడి చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సిరి తాను తప్పు చేశానంటూ స్టేజ్‌పైనే నిర్మోహమాటంగా ఒప్పేసుకుంది. శ్రీహాన్‌కు గోల్డ్ రోజు ఇచ్చి ప్రపోజ్ చేసిన సిరి, అతడు చాలా యూనిక్ అంటూ పొగిడింది. శ్రీహాన్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు అతడిని చాలా మిస్ అయ్యానని, గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ షర్ట్‌పై ముద్దులు పెట్టేదాన్ని అని చెప్పింది. అనంతరం ఆ షర్ట్‌ను ప్రియుడు శ్రీహాన్‌కు గిఫ్ట్ ఇచ్చింది. అలా పలు గిఫ్ట్‌లతో శ్రీహాన్‌ను సర్ప్రైజ్ చేసిన సిరి అనంతరం మాట్లాడుతూ.. ‘చిన్న, చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ స్టేజ్‌పై ఎవరు దాన్ని ఒప్పుకోరు. నేను నిజంగానే తప్పు చేశాను.. అది నాకు తెలియకుండానే జరిగింది’ అంటూ కన్నీరు పెట్టుకుంది. దీంతో సిరిని శ్రీహన్ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. దీంతో అక్కడ ఉన్న యాంకర్ రవి, రష్మీతో పాటు మిగతా కంటెస్టెంట్స్ సైతం స్టేజ్‌పైకి వచ్చి సిరిని ఓదార్చారు. కాగా బిగ్‌బాస్ షో అనంతరం షణ్ముఖ్‌కు దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: కిరాక్ ఆర్పీ చేపల పులుసు బిజినెస్ వారి భిక్షే: రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్ సీక్రెట్ డేటింగ్.. ఎట్టకేలకు మూడుమూళ్ల బంధంతో ఒక్కటైన హీరోహీరోయిన్ -
శ్రీహాన్‌తో పెళ్లి ఎప్పుడో చెప్పిన సిరి!
షార్ట్ ఫలింస్, రీల్స్‌తో పాపులర్ అయిన జంటలో సిరి హన్మంత్, శ్రీహాన్ జంట ఒకటి. రీల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరు జంటగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా రిలేషన్లో ఉంటున్న వీరిద్దరు బిగ్‌బాస్ షోతో బాగా పాపులర్ అయ్యారు. సిరి హన్మంత్ బిగ్‌బాస్ 5వ సీజన్లో, శ్రీహన్ బిగ్‌బాస్ 6వ సీజన్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌజ్‌లో తనదైన ఆట, చలాకితనంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న సిరి మరోవైపు విపరీతమైన నెగిటివిటీని కూడా మూటగట్టుకుంది. చదవండి: ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డు ఖాయం, రాసిపెట్టుకొండి: హాలీవుడ్ నిర్మాత హౌజ్‌లో తన కో-కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో అతి సన్నిహితంగా మెదిలి ట్రోల్స్ బారిన పడింది. బయటకు వచ్చాక శ్రీహాన్‌తో ఆమెకు అభిప్రాయభేదాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికి మనస్పర్థలు తొలగడంతో ఇద్దరు ఒక్కటయ్యారు. అయితే బిగ్‌బాస్ 5వ సీజన్ తర్వాత విడిపోయిన షణ్ముఖ్, దీప్తి సునేయన మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సిరీ బర్త్‌డే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ 6వ సీజన్లో రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్ గర్ల్‌ఫ్రెండ్ సిరి బర్త్‌డేను చాలా గ్రాండ్ సెలబ్రెట్ చేశాడు. ఆమెకు కాస్ట్లీ డైమండ్ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చాడు. చదవండి: నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలనే ఇలా చేస్తున్నారు: కిరణ్ అబ్బవరం ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటించిన సిరి శ్రీహాన్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ సిరి-శ్రీహాన్ పెళ్లిపై ప్రశ్నించాడు. ‘శ్రీహాన్‌ను మీరు త్వరగా పెళ్లి చేసుకోండి. మాకు చూడాలని ఉంది’ అని కోరాడు. ఇందుకు సిరి స్పందిస్తూ.. తప్పుకుండా.. త్వరలోనే చేసుకుంటామని సమాధానం ఇచ్చింది. అయితే ఎప్పుడు చేసుకుంటారనేది మాత్రం క్లారిటీగా చెప్పలేదు. మరోవైపు ఈ ఏడాది సిరి-శ్రీహాన్‌లు పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లు వారి సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కాగా కొంతకాలంగా రిలేషన్లో సిరి-శ్రీహాన్ ఓ బాబును దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. -
శ్రీహాన్‌తో బ్రేకప్‌పై తొలిసారి నోరు విప్పిన సిరి!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో షణ్ను- సిరిల ఫ్రెండ్షిప్ హద్దు మీరిన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిపించినా వీడి ఉండలేకపోతున్నామని వాపోయారు. కానీ ఎప్పుడైతే సిరి బాయ్‌ఫ్రెండ్, నటుడు శ్రీహాన్ బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చాడో అతడికి ముఖం చూపించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది సిరి. ఇక శ్రీహాన్.. నన్ను వదిలేస్తున్నావా? అని ఒక డైలాగ్ విసరడంతో సిరిని మరింత తిట్టిపోశారు నెటిజన్లు. అంత మంచివాడిని ఎలా మోసం చేయాలనిపించిందంటూ నానామాటలన్నారు. కట్ చేస్తే షో అయిపోయాక వాళ్లిద్దరూ ఎప్పటిలాగే కలిసిపోయారు. నెగెటివిటీకి చెక్ పెడుతూ మరింత దగ్గరయ్యారు. ఈసారి శ్రీహాన్ షోలో అడుగుపెట్టాడు. గేమ్ బాగా ఆడుతున్నాడు. కానీ వెటకారం, ఫ్రెండ్షిప్ వల్ల గెలుపుకు దూరం అవుతున్నాడు. అతడికి బయట నుంచి భీభత్సంగా సపోర్ట్ చేస్తోంది సిరి. తాజాగా ఆమె బిగ్‌బాస్ కెఫెలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలు మనసు విప్పి మాట్లాడింది. 'ఇంట్లో ఎవరూ శ్రీహాన్‌కు బెస్ట్ ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వలేదు. అది చూసిన నాకే ఎంతో బాధనిపించింది, ఆ పరిస్థితిలో శ్రీహాన్ ఎంత బాధపడ్డాడో! నాకు పెళ్లి కాకుండానే కొడుకు చైతూ ఎలా వచ్చాడనుకుంటున్నారు. అతడు మా మామయ్య కొడుకు. కరోనా సమయంలో వైజాగ్ వెళ్లాం. అప్పుడు మాకు బాగా దగ్గరయ్యాడు. మామయ్యకు ఆరోగ్యం, ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో మేము తెచ్చేసుకుని పెంచుకుంటున్నాం. బహుశా ఏడాదిలోపు మా పెళ్లి కూడా అయిపోతుందనుకుంటా' అని చెప్పుకొచ్చింది. బ్రేకప్ రూమర్స్ గురించి మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ ఐదో సీజన్ తర్వాత మా మధ్య చాలా గొడవలయ్యాయి. బ్రేకప్ వరకూ వెళ్లాము. అతడు నన్ను వదిలి వెళ్లాక నాకు కోవిడ్ వచ్చింది. ఎవరికీ కనిపించకుండా ఎటైనా వెళ్లిపోదామనుకున్నాను. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి రోడ్ల మీద చెప్పులు లేకుండా తిరిగాను. ఫోన్ ఆన్ చేయగానే శ్రీహాన్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే జీవితంలో కనిపించను అని మెసేజ్ పెట్టాడు. వెంటనే నేను కాల్ చేశాను, రోడ్డు మీద తిరుగుతున్న నన్ను వచ్చి తీసుకెళ్లాడు. అలా చాలా జరిగాయి. కానీ ఇప్పుడు మేము ఎప్పటికీ విడిపోనంత దగ్గరయ్యాం' అని చెప్పుకొచ్చింది సిరి. చదవండి: సూసైడ్ బాంబ్ అనుకొని అరెస్ట్ చేశారు: సత్యదేవ్ శ్రీసత్య, ఇనయల పరువు పాయే -
ఇనయ కల నెరవేర్చిన బిగ్‌బాస్, శ్రీహాన్ కాళ్లు మొక్కిన సిరి
Bigg Boss Telugu 6, Episode 82: పన్నెండు వారాల ఎడబాటుకు తెర దించుతూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపుతున్నాడు బిగ్‌బాస్. వారిని చూసి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు హౌస్మేట్స్. తమ వాళ్లను చూడగానే తెలియకుండానే కన్నీళ్లు కార్చుతున్నారు. వారితో కలిసి చిందులేస్తున్నారు. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏయే కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చాయో చూద్దాం.. పన్నెండు వారాల తర్వాత ప్రేయసి కళ్లముందుకు రావడంతో భావోద్వేగానికి లోనయ్యాడు శ్రీహాన్. హౌస్‌లోకి వెళ్లగానే శ్రీహాన్‌ను గట్టిగా పట్టుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించింది సిరి. ఈ పదేళ్లు నా వెనకుండి నువ్వెలా నడిపించావో, భవిష్యత్తు అంతా కూడా నువ్వ నాతోనే ఉండాలంటూ తన పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నానని మెడపై ఉన్న టాటూ చూపించింది. తర్వాత సిరి కొడుకు చైతూ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. వచ్చీరాగానే ఈ చిచ్చరపిడుగు తన బుల్లిబుల్లి మాటలతో అందరినీ నవ్వించాడు. ఎవరెలా మాట్లాడతారో వారి డైలాగులను సరిగ్గా దింపేశాడు. తర్వాత.. ఇంతందం దారి మళ్లిందా.. పాటకు సిరి, శ్రీహాన్ స్టెప్పులేశారు. వారిద్దరి మధ్యలో చైతూ వచ్చేందుకు ప్రయత్నించడంతో పానకంలో పుడకలా వస్తావేంట్రా అని తిట్టలేక నవ్వుకున్నాడు శ్రీహాన్. చివరగా వెళ్లిపోయేముందు శ్రీహాన్ పాదాలు తాకి వీడ్కోలు తీసుకుంది సిరి. ఇక రాత్రిపూట కడుపులో మండుతుందని పాలు అడిగాడు రాజ్.. ఎప్పటిలాగే స్ట్రిక్ట్ మాస్టర్ రేవంత్ కుదరదని తెగేసి చెప్పాడు. అడిగినప్పుడు ఇవ్వడానికి ఏం ప్రాబ్లమ్ అని లోలోనే గునుక్కున్నాడు రాజ్. తర్వాతి రోజు కీర్తి కోసం ఆమె స్నేహితుడు, బుల్లితెర నటుడు మహేశ్ వచ్చాడు. ఆమెతో కలిసి డ్యాన్స్ చేసి గోరుముద్దలు తినిపించాడు. ఎవ్వరూ కోల్పోలేనిది నువ్వు కోల్పోయావు. కానీ ఆ దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్ బిగ్‌బాస్. ఇక్కడ నీతో నీకే పోటీ.. లక్షల మంది సైన్యం నీ వెంట ఉన్నారు.. అదే నీ బలం.. అంటూ ఆమెలో పాజిటివిటీ నింపాడు. తను దత్తత తీసుకున్న పాప ఫొటోను బహుమతిగా అందించాడు. అయితే ఆమెను కాపాడుకోలేకపోయానని బోరున ఏడ్చింది కీర్తి. అనంతరం మహేశ్.. ఇనయను ముద్దుపెట్టమని అడగడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. అతడికి నో చెప్పడం ఇష్టం లేని ఇనయ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అనంతరం ఇనయ సుల్తాన తల్లి నజ్బూర్ హౌస్‌లోకి వచ్చింది. ఆమెను చూడగానే ఎమోషనలైంది ఇనయ. 'నాకోసం నువ్వు మనసులో ఇంత బాధపడుతున్నావని తెలీదు, అందుకే వచ్చాను. నీ జీవితం నువ్వు చూసుకున్నావు, ఇంత కష్టపడ్డావు. బిగ్‌బాస్‌కు వచ్చావు. గెలిచి రావాలి. నువ్వు బాగుండాలనేదే నా కోరిక' అని చెప్పింది. హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోదాం అని ఇనయ అడిగితే అది తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే బాగా ఆడి గెలిచి రా అని బదులిచ్చింది. కేజీఎఫ్‌లోని అమ్మ సాంగ్ వేయడంతో తల్లి కాళ్ల మీద పడి ఏడ్చింది ఇనయ. అనంతరం ఆమె అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. తల్లిని బిగ్‌బాస్ హౌస్‌లో చూడాలన్న తన కల నెరవేరడంతో ఇనయ తెగ సంతోషపడిపోయింది. చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్ భారత ఆర్మీని అవమానించిందంటూ నటిపై ట్రోలింగ్ -
కొడుకుతో హౌస్‌లోకి సిరి, శ్రీహాన్ పేరు పచ్చబొట్టు..
బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఫ్యామిలీ వీక్ ఎంతో ఎమోషనల్‌గా సాగుతుంది. వారాల తరబడి అయినవారికి దూరంగా ఉన్న హౌస్మేట్స్ కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను చూడగానే ఎగిరి గంతేస్తుంటారు. ప్రస్తుతం ఆరో సీజన్లో కూడా సేమ్ సిచ్యుయేషన్. 12 వారాల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌ను చూడటంతో భావోద్వేగానికి లోనవుతున్నారు టాప్ 9 కంటెస్టెంట్లు. నిన్న ఫైమా, శ్రీసత్య, రోహిత్ తల్లి హౌస్‌లోకి రాగా ఈ రోజు ఎపిసోడ్లో శ్రీహాన్ ప్రియురాలు సిరి, తన కొడుకు చైతూతో కలిసి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. హౌస్‌లోకి వచ్చిన సిరిని చూసి ఏడుస్తూనే కన్ను కొట్టాడు శ్రీహాన్. నీకోసం ఓ సర్ప్రైజ్ అంటూ వెనక్కు తిరిగి మెడ కింద శ్రీహాన్ అని పొడిపించుకున్న పచ్చబొట్టు చూపించింది. అలాగే కొడుకు చైతూను తీసుకొచ్చింది. అతడు లోపలకు రాగానే తన మాటలతో చెలరేగిపోయాడు. హౌస్మేట్స్ తరచూ ఏమేం డైలాగ్స్ వాడతాడో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సర్ప్రైజ్లు చూసి శ్రీహాన్ సంతోషంలో మునిగి తేలాడు. నిజానికి ఇదంతా లైవ్‌లో నిన్ననే టెలికాస్ట్ అవగా ఈరోజు ఎపిసోడ్లో చూపించనున్నారు. చదవండి: అప్పుడు ఏడిపించంటూ సవాల్, ఇప్పుడు నిత్యం ఏడుస్తూనే ఉంది డబ్బుల్లేక అమ్మకు ఫిజియోథెరపీ ఆపేశారు: శ్రీసత్య ఎమోషనల్ -
కొత్త కారు కొన్న సిరి.. డ్రైవింగ్ నేర్చుకో అని సెటైర్లు
సిరి హన్మంత్.. బిగ్‌బాస్ రియాల్టీ షో ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. బిగ్‌బాస్-5లో ఆమె చేసిన రచ్చ అంత ఇంత కాదు. హౌస్‌లో షణ్ముఖ్‌తో క్లోజ్‌గా ఉండటం..బయటకు వచ్చాక ఆమె కారణంగానే షణ్ముఖ్, దీప్తి సునైనా విడిపోయారనే వార్తలు వినిపించడంతో సిరి పేరు నెట్టింట మరింత వైరల్ అయింది. ఒకానొక దశలో సిరి, ఆమె ప్రియుడు శ్రీహాన్ కూడా విడిపోయారనే టాక్ వచ్చింది. కానీ మళ్లీ కలిశారు. ఇప్పుడు ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. తాజాగా వీరిద్దరు కలిసి కొత్త కారు కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సిరి ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందులో శ్రీహాన్ కూడా ఉన్నాడు. అంతేకాదు సిరి కొత్త కారు కొనడంపై శ్రీహాన్ కౌంటర్ కూడా వేశాడు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూనే ‘ముందు డ్రైవింగ్ నేర్చుకో సిరి..’అంటూ తనదైన స్టైల్లో కౌంటర్ వేశాడు. మొత్తానికి విడిపోతారనుకున్న సిరి, శ్రీహాన్ ఇలా జంటగా కారు కొనడం పట్ల ఇరువురి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్ ఆరో సీజన్లోకి శ్రీహాన్ రాబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే శ్రీహాస్ వస్తే మాత్రం ఆట అదిరిపోతుంది. View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) -
బిగ్‌బాస్ 6లోకి సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ !..
Siri Hanmanth Boyfriend Srihan In Bigg Boss Season 6 Telugu: మొన్నటిదాకా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ) సందడి చేసింది. ఇప్పుడు బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్ 6 అలరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన లోగో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే కంటెస్టెంట్స్ ఎవరబ్బా అనే ముచ్చట జోరుగా నడుస్తోంది. అయితే వీరిలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు శ్రీహాన్. నిజానికి బిగ్‌బాస్ ఓటీటీ మొదటి సీజన్లోనే శ్రీహాన్ కంటెస్టెంట్‌గా రాబోతున్నాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే బిగ్‌బాస్ బుల్లితెర ఐదో సీజన్లో సిరి, షణ్ముఖ్ ట్రాక్ వారిపై నెగెటివిటీని తెచ్చిపెట్టింది. ఈ నెగెటివిటీ శ్రీహాన్‌కు కలిసొచ్చింది. అంతేకాకుండా బిగ్‌బాస్ స్టేజ్‌పై శ్రీహాన్ మాట్లాడిన మాటలు, పాడిన పాట అందరిని ఆకట్టుకున్నాయి. సిరి, షణ్ముఖ్‌పై వచ్చిన ట్రోలింగ్‌తో బాధపడిన శ్రీహాన్ తన మాటలు, పాట రూపంలో చూపించి బీభత్సమైన పాజిటివిటీని సంపాదించుకున్నాడు. దీంతో శ్రీహాన్‌కు బిగ్‌బాస్ ఓటీటీ అవకాశం వచ్చిన దాన్ని తిరస్కరించాడని సమాచారం. అయితే తాజాగా బిగ్‌బాస్ సీజన్ 6లో శ్రీహాన్ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో శ్రీహాన్ పాల్గొంటే కచ్చితంగా టైటిల్ రేస్‌లో ముందుంటాడని చాలా మంది భావిస్తున్నారట. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ సీజన్ 6కు హోస్ట్‌గా స్టార్ హీరోయిన్ సమంత రానుందన్న వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. చదవండి: అక్కినేని ఫ్యాన్స్‌కు షాక్, బిగ్‌బాస్ హోస్ట్‌గా సమంత? View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) -
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన షణ్ముఖ్
సిరి హన్మంత్, షణ్ముఖ్ జశ్వంత్.. బిగ్‌బాస్ షో వల్ల వీరి ఇమేజ్ డ్యామేజ్ అయిందనుకున్నారంతా.. సోషల్ మీడియాలో నెగెటివిటీ వల్ల సిరి కొన్నాళ్లపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోగా షణ్ముఖ్‌కు దీప్తి సునయనతో బ్రేకప్ అయింది. ఈ అనూహ్య పరిణామాలతో కొంతకాలంపాటు వార్తల్లో నిలిచారిద్దరూ. కానీ తమ టాలెంట్‌తో నెగెటివ్ కామెంట్లు చేసేవారి నోరు మూయించారిద్దరూ. ఇటీవలే సిరి హన్మంత్ బీఎఫ్ఎఫ్ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించగా తాజాగా షణ్ముఖ్ జశ్వంత్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈమేరకు ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఇన్వెస్టిగేషన్ త్వరలో ప్రారంభమవుతుందని, కేస్ వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించాడు. అటు బీఎఫ్ఎఫ్, ఏజెంట్ ఆనంద్ సంతోష్.. ఈ రెండూ కూడా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానున్నాయి. మొత్తానికి వారు పంచుకున్న గుడ్‌న్యూస్ విని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Agent Anand Santosh vachesthunnadu... Case vivaraalu thvaralo!💥💥💥@shannu__7 pic.twitter.com/daqJ3QqsGL — ahavideoin (@ahavideoIN) May 14, 2022 Who is she?🤔 Workaholic ✅ Responsible ✅ Crazy ✅ Anni check unte, kacchithanga maa Nitya ne😉 Introducing #SiriHanumanth as Nithya#BFF, An Aha Original, Coming Soon. #BFFOnAha #RamyaPasupuleti @DiceMediaIndia @TamadaMedia @DaburHoney_Ind @tnldoublehorse pic.twitter.com/nGenP6lYRc — ahavideoin (@ahavideoIN) May 14, 2022 చదవండి: 'సర్కారు వారి పాట'ను వీక్షించిన నమ్రతా శిరోద్కర్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్ పాన్ ఇండియా సినిమాలు చూసుంటారు, పాన్ ఇండియా రౌడీలను చూశారా? -
సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది: శ్రీహాన్
బిగ్‌బాస్ షోతో లాభపడేవాళ్లతోపాటు నష్టపోయేవాళ్లు కూడా ఉన్నారు. ఈ షోలో అడుగుపెట్టిన కొందరికి సినిమా అవకాశాలు వస్తే మరికొందరు మాత్రం నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వచ్చారు. అలాంటివారిలో సిరి హన్మంత్ ఒకరు. సీరియల్స్, యూట్యూబ్ వెబ్‌సిరీస్‌తో పాపులర్ అయిన ఆమె హౌస్‌లో షణ్ముఖ్ జశ్వంత్‌తో క్లోజ్‌గా ఉండటంతో ఆమెపై ఎక్కడలేని నెగెటివిటీ వచ్చింది. బయట తనకోసం ప్రియుడు శ్రీహాన్ ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్లు ప్రవర్తిస్తుందని విమర్శలు వచ్చాయి. అంతేకాదు బిగ్‌బాస్ దెబ్బతో షణ్ముఖ్- దీప్తి సునయన విడిపోయినట్లుగానే సిరి, శ్రీహాన్ కూడా విడిపోనున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ బిగ్‌బాస్ తర్వాత ఇద్దరూ కలిసి పార్టీలకు హాజరవుతూ రూమర్లకు చెక్ పెట్టేశారు. తాజాగా తన ప్రేయసిపై పొగడ్తలు కురిపించాడు శ్రీహాన్. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లతో ఓ సరదా ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ రవి. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా అందులో శ్రీహాన్ ఓ వీడియో సందేశం పంపాడు. అందులో సిరి గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. 'సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకిప్పటికీ పడుతూనే ఉంది. సిరి ఏదైనా సాధించాలనుకుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా దేన్నీ పట్టించుకోదు. తను వైజాగ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి కొన్ని సాధించాలనుకుంది. యాంకరింగ్ చేసుకుంటూ సీరియల్స్, సీరియల్స్ నుంచి సినిమాలు, సినిమాల నుంచి మొన్నటి బిగ్‌బాస్ వరకు.. మొత్తం తన కష్టమే. ఎవ్వరూ సాయం చేసింది లేదు. ఎవరి సపోర్ట్ తను తీసుకుందీ లేదు. కానీ ఎంత మాట్లాడినా సిరిని అర్థం చేసుకోవడం మాత్రం కష్టం' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రముఖ సీరియల్ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో! -
బ్రేకప్‌తో బిజీ అయ్యావా? షణ్ముఖ్‌పై నాగ్ సెటైర్లు
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఈ వారం సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నాడు. ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్‌ను పంపి హౌస్మేట్స్ ముఖాల్లో వెలుగులు తీసుకొచ్చిన బిగ్‌బాస్ వీకెండ్లో ఏకంగా వారి క్లోజ్‌ఫ్రెండ్స్‌ను, మరికొందరి పేరెంట్స్‌ను, బంధువులను స్టేజీమీదకు తీసుకొచ్చాడు. వారిని చూసి మరోసారి సర్ప్రైజ్ అయ్యారు కంటెస్టెంట్లు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అఖిల్ కోసం సోహైల్ స్టేజీపైకి వచ్చి స్నేహితుడిని పొగిడేస్తుండగా... నాకోసం కూడా చెప్పరా అంటూ మధ్యలో అరియానా లేచి నిలబడింది. దీంతో సోహైల్.. నేను అన్నీ విన్నాలే, కూర్చో అన్నట్లుగా పంచ్ వేశాడు. తర్వాత అరియానా కోసం ఆమె సోదరి, దేవి నాగవల్లి, యాంకర్ శివ కోసం అతడి ఫ్రెండ్స్ ధనుష్, షణ్ముఖ్ వచ్చారు. చదవండి: మహేశ్‌బాబు పెన్నీ సాంగ్ కోసం సితార ఎందుకన్నారు: తమన్ షణ్నును చూసిన నాగ్ బిగ్‌బాస్ తర్వాత ఎక్కడా కనపడలేదేంటి, బ్రేకప్‌తో బిజీగా ఉన్నావా? అని ప్రశ్నించడంతో అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్న అషూ.. దీప్తి సునయన ఎలా ఉందని అడుతూ షణ్నును మరింత ఉడికించింది. అనంతరం సిరి స్టేజీపైకి రాగా మిత్రశర్మ ఎమోషనలైంది. అనిల్ కోసం వచ్చిన తండ్రి మాట్లాడుతూ.. అతడు మాట్లాడకపోవడానికి కారణం నేనే, వాడిని అలా పెంచాను అంటూ గొప్పగా చెప్పాడు. దీంతో విషయం అర్థమైన నాగ్ మాట్లాడనివ్వకుండా పెంచారా? అని సెటైర్ వేశాడు. ఇక వచ్చినవారితో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పమని గేమ్ ఆడించాడు. ఈ గేమ్‌తో ఎవరు ఫినాలేలో చోటు దక్కించుకుంటారు? ఎవరికి టైటిల్ గెలిచే ఆస్కారం ఉందన్న విషయాలపై ఓ క్లారిటీ రానుంది. చదవండి: అనిల్ అదృష్టం, బిగ్‌బాస్ నుంచి హమీదా ఎలిమినేట్! -
శ్రీహాన్‌పై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు, చివరికి ఇలా క్లారిటీ ఇచ్చిందా?
సిరి హన్మంత్.. బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్ 5 సీజన్ తర్వాత సిరి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. విమర్శలు, ట్రోల్స్‌తో ఆమె బాగా పాపులర్ అయ్యింది. దీనికి కారణం బిగ్‌బాస్ హౌస్‌లో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ఆమె అతి సన్నిహితంగా ఉండటమే. ఇక బయటకు వచ్చిన ఆమె తనపై వస్తున్న నెగిటివిటీని చూసి షాకయ్యింది. ఈ స్థాయిలో తనకు వ్యతిరేకత రావడం చూసి డిప్రెషన్లోకి వెళ్లింది. అలాంటి సమయంలో ఆమె బాయ్‌ఫ్రెండ్, నటుడు శ్రీహాన్ ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు. చదవండి: ఎన్టీఆర్‌ను చూస్తే కన్నీళ్లు వచ్చాయి, ఎమోషనల్ అయ్యా: ఒలీవియా అయితే ప్రారంభంలో అతను కూడా సిరిని దూరం పెట్టాడని వార్తలు వినిపించాయి. అంతేకాదు వారిద్దరికి సంబంధించిన వ్యక్తిగత పోస్ట్‌లను కూడా శ్రీహాన్ డిలిట్ చేయడంతో షణ్మఖ్-దీప్తి సునైన బాటలోనే వీరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. కానీ అలాంటిదేం లేదని శ్రీహాన్ క్లారిటీ ఇచ్చాడు. అటు సిరి కూడా శ్రీహాన్ బర్త్‌డే విష్ తప్పితే అతడి గురించి స్పెషల్‌గా ఎలాంటి పోస్ట్ షేర్ చేయకపోవడంతో ఆ ఊహాగానాలకు బ్రేక్ పడలేదు. దీంతో వారి ఫాలోవర్స్‌లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా వాటిన్నింటికి చెక్ పెడుతూ సిరి, శ్రీహాన్‌తో దిగిన ఫొటోను పంచుకుంది. ఈ సందర్భంగా అతడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ప్రతి క్షణం(మంచి-చెడు సమయాల్లో) నా పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మర్గదర్శి, నా గార్డియన్, నా సర్వస్వం. అతడే ఇతను. మై వన్ అండ్ ఓన్లీ శ్రీహాన్’ అంటూ సిరి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. వీరిద్దరిని ఒక్కటిగా చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ పోస్ట్‌తో వారి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయని సిరి చెప్పకనే చెప్పిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా మొత్తానికి సిరి-శ్రీహాన్ కలిశారని, ఇక షణ్ముఖ్, దీప్తిలో ఎప్పుడు కలుస్తారో అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాగా బిగ్‌బాస్‌లో షణ్ముఖ్, సిరి తీరుపై విపరీతమైన నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్, దీప్తి విడిపోవడానికి సిరి కారణమంటూ ఆమెను నిందించారు. తనకు బయట ఒక ప్రియుడున్నప్పటికీ ఆ విషయం మర్చిపోయి షణ్నూకి హగ్గులు, ముద్దులిస్తూ అతిగా ప్రవర్తించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) -
మా బ్రేకప్‌కు చాలా కారణాలున్నాయి, సిరి వల్ల కాదు: షణ్ముక్
బిగ్‌బాస్ 5 సీజన్ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ జీవితమే మారిపోయింది. హౌజ్ నుంచి బయటకు వచ్చిన ఆనంతరం మిగతా కంటెస్టెంట్స్ కంటే షణ్ముఖ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. దానికి కారణంగా తన ప్రియురాలు దీప్తి సునయనతో విడిపోవడమే. ఎన్నో ఆశలతో, ఉత్సహంతో మూడు నెలల అనంతరం బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. ఇక అప్పటి నుంచి వీరి గరించిన రకారకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు షణ్ముక్ మై లవ్ ఈజ్ గాన్ అంటూ ఇన్‌స్టాలో బ్రేకప్ పోస్టులు, ఎమోజీలు పెడుతూ ఒంటరిగా గడిపేస్తున్నాడు. ఇక వీరి బ్రేకప్‌కు అందరూ సిరి కారణమని, ఆమెతో అతి సన్నిహితమే అతడి కొంప ముంచిందని ఫిక్స్ అయ్యారు. అయితే తమ బ్రేకప్‌కు కారణం సిరి కాదని, దానికి మరో రీజన్ ఉందంటూ ఆసక్తి కామెంట్స్ చేశాడు షణ్నూ. వాలంటైన్స్ డే సందర్భంగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా షణ్ను మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి బ్రేకప్ సిరి కారణం కాదు. చెప్పాలంటే సిరి, దీప్తి ఎప్పటికి మంచి స్నేహితులే. మేం విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది. నెటిజన్లు నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు తను నాకు సపోర్ట్ చేసింది. అయితే సిరితో చనువుగా ఉండడం నెటిజన్లతో పాటు దీప్తి కుటుంబానికి కూడా నచ్చలేదు. దీంతో తన కుటుంబం నుంచి ఆమెకు ఒత్తిడి పెరిగింది. ఇకనైన తను సంతోషంగా ఉండాలనే ఉద్ధేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము మా కెరీర్ పై దృష్టి పెట్టాం… మేము మళ్లీ కలుస్తామా ? లేదా ? అనేది దేవుడి చేతుల్లో ఉంది. విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను.. మా బ్రేకప్ గురించి సిరిని నిందించడం సరైనది కాదు..తప్పు నాదే అందుకు నన్ను నిందించాలి’ అంటూ షణ్నూ చెప్పుకొచ్చాడు. అంతేగాక ‘ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికే బిగ్‌బాస్ హౌజ్‌కు వచ్చాను. నిజం చెప్పాలంటే నా మూడీ పర్సన్‌కు బిగ్‌బాస్ కరెక్ట్ కాదు. నేను ఇతరులతో తక్కువగా మాట్లాడతాను. నా గురించి పాజిటివ్ ఆలోచిస్తారు అనుకున్నా.. కానీ షో నుంచి బయటకు వచ్చాక నాపై ఎంత నెగిటివిటీ వచ్చిందో అర్థమైంది. నేను 27 సంవత్సరాల వయసులోనే ఎన్నో ఎదురుదెబ్బలు చూశాను. వీటివలన ఇంకా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది నేర్చుకుంటున్నాను’ అన్నాడు. ఇక ‘హౌజ్‌లో సిరికి నేను అండగా ఉన్నాను. ఇంటి సభ్యులు సిరిని ఎమైనా అంటే తనకు సపోర్ట్ ఇచ్చాను. కానీ అవన్నీ వదిలేసి సిరి వాళ్లమ్మ నన్ను తనను తప్పుగా అర్థం చేసుకోవడం బాధించింది’ అని పేర్కొన్నాడు. -
బ్రేకప్‌కు ఎండ్ కార్డ్.. మళ్లీ కలిసిపోయిన సిరి-శ్రీహాన్
Siri Hanmanth And Shrihan Patchup After Bigg Boss: బిగ్‌బాస్ సీజన్-5 ఎఫెక్ట్ రెండు జంటల మధ్య చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కి బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. అటు శ్రీహాన్ కూడా సిరి ఫోటోలు డిలీట్ చేయడంతో అతను కూడా దీప్తి సునయనను ఫాలో అయినట్లు అందరూ అనుకున్నారు. దీంతో అతడు కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెప్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనంతటిని పటాపంచలు చేస్తూ సిరి-శ్రీహాన్‌లు కలిసిపోయారు. రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన వీరిద్దరు యాంకర్ రవి ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు. అనంతరం వాళ్ల ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. మీ ఇద్దరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది. దీంతో సిరి-శ్రీహాన్‌ల బ్రేకప్‌కు ఎండ్ కార్డ్ పడినట్లయ్యింది. ఏది ఏమైనా ఎన్ని కలతలు వచ్చినా బిగ్‌బాస్ తర్వాత మీరిద్దరు కలవడం సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీప్తి సునయన- షణ్నూలు కూడా కలిసిపోతే బావుండు అని కోరుకుంటున్నారు. -
బిగ్‌బాస్ బ్యూటీ సిరికి కరోనా పాజిటివ్..
Bigg Boss Fame Siri Hanmanth Tested Positive For Covid 19: దేశంలో కరోనా కలకలం సృష్టిస్తున్న వేళ ఇండస్ట్రీలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ, టాప్-5 కంటెస్టెంట్ సిరి హన్మంతుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సిరి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. కాగా బిగ్‌బాస్ సీజన్-5 ముగిసినా సిరిపై ఇంకా ట్రోలింగ్ ఆగడం లేదు. ఇటీవలె షణ్నూ-దీప్తి సునయనల బ్రేకప్‌కి సైతం పలువురు సిరిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ అంశంపై స్పందించిన సిరి వాళ్ల బ్రేకప్‌కు తాను కారణం కాదంటూ చెప్పుకొచ్చింది.