Bigg Boss OTT Telugu Non Stop: Nagarjuna Satires On Shanmukh Jaswanth Breakup, Promo Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: మిత్ర కోసం సిరి, శివ కోసం షణ్ను.. టాప్‌ 5 ఎవరంటూ..

Published Sun, May 1 2022 12:53 PM | Last Updated on Sun, May 1 2022 1:39 PM

Bigg Boss OTT Non Stop: Nagarjuna Satires On Shanmukh Jaswanth Breakup - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు ఈ వారం సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నాడు. ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్‌ను పంపి హౌస్‌మేట్స్‌ ముఖాల్లో వెలుగులు తీసుకొచ్చిన బిగ్‌బాస్‌ వీకెండ్‌లో ఏకంగా వారి క్లోజ్‌ఫ్రెండ్స్‌ను, మరికొందరి పేరెంట్స్‌ను, బంధువులను స్టేజీమీదకు తీసుకొచ్చాడు. వారిని చూసి మరోసారి సర్‌ప్రైజ్‌ అయ్యారు కంటెస్టెంట్లు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అఖిల్‌ కోసం సోహైల్‌ స్టేజీపైకి వచ్చి స్నేహితుడిని పొగిడేస్తుండగా... నాకోసం కూడా చెప్పరా అంటూ మధ్యలో అరియానా లేచి నిలబడింది. దీంతో సోహైల్‌.. నేను అన్నీ విన్నాలే, కూర్చో అన్నట్లుగా పంచ్‌ వేశాడు. తర్వాత అరియానా కోసం ఆమె సోదరి, దేవి నాగవల్లి, యాంకర్‌ శివ కోసం అతడి ఫ్రెండ్స్‌ ధనుష్, షణ్ముఖ్‌ వచ్చారు.

చదవండి: మహేశ్‌బాబు పెన్నీ సాంగ్‌ కోసం సితార ఎందుకన్నారు: తమన్‌

షణ్నును చూసిన నాగ్‌ బిగ్‌బాస్‌ తర్వాత ఎక్కడా కనపడలేదేంటి, బ్రేకప్‌తో బిజీగా ఉన్నావా? అని ప్రశ్నించడంతో అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్‌ అయిపోయాడు. దొరికిందే ఛాన్స్‌ అనుకున్న అషూ.. దీప్తి సునయన ఎలా ఉందని అడుతూ షణ్నును మరింత ఉడికించింది. అనంతరం సిరి స్టేజీపైకి రాగా మిత్రశర్మ ఎమోషనలైంది. అనిల్‌ కోసం వచ్చిన తండ్రి మాట్లాడుతూ.. అతడు మాట్లాడకపోవడానికి కారణం నేనే, వాడిని అలా పెంచాను అంటూ గొప్పగా చెప్పాడు. దీంతో విషయం అర్థమైన నాగ్‌ మాట్లాడనివ్వకుండా పెంచారా? అని సెటైర్‌ వేశాడు. ఇక వచ్చినవారితో టాప్‌ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పమని గేమ్‌ ఆడించాడు. ఈ గేమ్‌తో ఎవరు ఫినాలేలో చోటు దక్కించుకుంటారు? ఎవరికి టైటిల్‌ గెలిచే ఆస్కారం ఉందన్న విషయాలపై ఓ క్లారిటీ రానుంది.

చదవండి: అనిల్‌ అదృష్టం, బిగ్‌బాస్‌ నుంచి హమీదా ఎలిమినేట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement