Ariyana Glory
-
భక్తిపారవశ్యంలో బుల్లితెర సెలబ్రిటీలు (ఫోటోలు)
-
రెడ్ డ్రెస్‌లో అరియానా.. అందాల ఆరబోతలో తగ్గేదే లే (ఫొటోలు)
-
లంబోదరుడి సేవలో బిగ్ బాస్ బ్యూటీ అరియానా (ఫొటోలు)
-
ఆర్జీవీకి బాగా క్లోజ్.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
వైట్ డ్రెస్‌లో శ్రీలీల హోయలు.. ట్రెండీ లుక్‌లో బిగ్‌బాస్ బ్యూటీ!
క్రేజీ లుక్‌లో హీరోయిన్ శ్రీలీల..ఎరుపు డ్రెస్‌లో శ్రీముఖి హోయలు..కసరత్తులు చేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ...దేవర భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్స్..ట్రెడిషనల్ లుక్‌లో బిగ్‌బాస్ భామ ఇనయా సుల్తానా పోజులు..పుష్ప భామ రష్మిక మందన్నా స్మైలీ లుక్స్... View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
'రాజ్ తరుణ్ ఫోన్ నుంచే కాల్ చేసింది'.. ఆమెపై లావణ్య షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం టాలీవుడ్లో రాజ్ తరుణ్-లావణ్య టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్‌కు రిలేషన్ ఉందని ఆరోపించిన లావణ్య.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీతో రిలేషన్ ఉన్న మాట నిజమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అరియానా గ్లోరీతో రాజ్‌తరుణ్‌కు ఎఫైర్ ఉందని మీకెలా తెలుసు? అన్న ప్రశ్నకు ఆమె స్పందించింది.లావణ్య మాట్లాడుతూ..' ఎందుకు నీ చట్టు తిప్పుకుంటున్నావ్ ఓ సారి నేను అరియానా గ్లోరీని అడిగా. ఒక అబ్బాయితో అమ్మాయి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. హీరోతో మామూలుగా మాట్లాడి ఉంటే నేను పట్టించుకునే దాన్ని కాదు. తనే రాజ్ తరుణ్‌ను బాయ్‌ఫ్రెండ్‌గా భావించింది. వాళ్లు దిగిన ఫోటోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంతే కాకుండా రాజ్ తరుణ్.. అరియానా గ్లోరీ ఇంటికి వస్తున్నాడని నాకు కొందరు చెప్పారు. ఆ తర్వాత నేను గోవాలో ఉండగా.. రాజ్ తరుణ్ ఫోన్ నుంచి కాల్ చేసి నాతో మాట్లాడింది. నువ్వు ఎంత సంపాదిస్తావ్ అని అడిగింది. నాకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తోందంటూ నాతో ఇన్సల్ట్గా మాట్లాడింది. ఆ తర్వాత అరియానా నాకు సారీ చెప్పింది. ఆ ఆడియో కూడా నా వద్ద ఉంది. ఇప్పుడైతే ఆమెతో నాకు ఎలాంటి విభేదాల్లేవ్' అని లావణ్య చెప్పుకొచ్చింది. కాగా.. రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా స్వామి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
Ariyana Glory: డోసు పెంచిన అరియానా.. తట్టుకోవడం కష్టమే! (ఫోటోలు)
-
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవంలో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
Anchors Sankranti Celebrations Pics: బుల్లితెర యాంకర్లు సంబరాలు..ఎంత బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యారు ఒక్క లుక్ వేయండి
-
అలా కనిపించిన అరియానా.. ఐటమ్ బ్యూటీ మెల్ట్ అయ్యే లుక్
జనవరి గురించి అనసూయ పోస్ట్.. క్రేజీ ఫొటోలు కూడా 'లియో' నటి జనని క్యూట్ డ్యాన్స్ వీడియో వైరల్ అందాల విందు చేస్తున్న నటి ఇషా తల్వార్.. చూస్తే అంతే తెల్లచీరలో మెరిసిపోతున్న హీరోయిన్ శివానీ రాజశేఖర్ సోకుల వయ్యారాలతో టెంప్ట్ చేస్తున్న 'బిగ్‌బాస్' అరియానా ఫుల్ జాలీ మూడ్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందాన్న జిమ్‌లో సెల్ఫీతో క్యూట్‌గా కవ్విస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి మరింత అందంగా కనిపిస్తూ మెరిసిపోతున్న హంస నందిని View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by Isha Talwar (@talwarisha) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
పింక్ శారీలో శ్రీలీల అందాలు.. నిహారికకు లావణ్య స్పెషల్ విషెస్
►పింక్ శారీలో శ్రీలీల అందాలు ►నగలతో మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి ►శారీలో అనసూయ హోయలు ►నిహారికకు వరుణ్‌తేజ్, లావణ్య స్పెషల్ విషెస్ ►ప్రియా భవానీ శంకర్ స్మైలీ లుక్స్ ►వీకెండ్ మూడ్‌లోనే నేహాశర్మ ►ఎల్లో డ్రెస్‌లో అరియానా గ్లోరీ అదిరిపోయే పోజులు View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
'యానిమల్' బ్యూటీ సరికొత్త లుక్.. మరింత అందంగా ఆ తెలుగు హీరోయిన్!
సిల్క్ చీరలో కేక పుట్టించేస్తున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ గాయత్రి మత్తెక్కించే పోజులు బికినీలో రెచ్చిపోయిన 'బిగ్‌బాస్' తెలుగు ఫేమ్ అరియానా క్యూట్ లుక్స్‌తో మెల్ట్ చేసేస్తున్న హీరోయిన్ నభా నటేశ్ ఉప్పొంగే అందాలతో తెలుగు హీరోయిన్ అమైరా దస్తూర్ టైట్ ఫిట్ డ్రస్‌తో కాక రేపుతున్న హీరోయిన్ రుహానీ శర్మ గ్లామర్ గేట్లు తెరిచిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఇయర్ రౌండప్ గ్లామర్ వీడియో షేర్ చేసిన శ్రియ శరణ్ View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Gayatri Bhardwaj (@gayatribhardwaj__) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nitya Naresh (@nityanaresh) View this post on Instagram A post shared by Kaali (@meerachopra) View this post on Instagram A post shared by Komalee (@komaleeprasad) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam | Actor | influencer (@aditigautamofficial) -
బికినీ ఫోటోలు షేర్ చేసిన అరియానా.. ఇంటర్నెట్లో వైరల్
యాంకర్‌గా కెరీయర్ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చినా వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను అరియానా సొంతం చేసుకుంది. తాజాగా అరియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ తన గ్లామర్‌తో కట్టిపడేసే ఈ బ్యూటీ బికినీతో ఉన్న ఫోటోలు షేర్ చేసి ఇంటర్నెట్లో హీట్ పెంచేసింది. ఓటమి ఎదరైనప్పుడు ఇతరులు ఏమనుకుంటున్నారో అని భయపడవద్దు.. భిన్నంగా ఆలోచించండి. ఇతరులు ఏదో అనుకుంటారనే ట్రాప్‌లో పడకండి.' అంటూ ఆమె వ్యాఖ్యానించింది. అరియానా షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆమే ఫోటోలు షేర్ చేసిందో లేదో అప్పుడే వరుస బెట్టి నెగటివ్ కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఇదే విషయంలో మరికొందరు అరియానకు సపోర్టుగా కామెంట్లు చేస్తున్నారు. అమె ఉండేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఈరోజుల్లో ఇలాంటి ఫోటోలు కామన్ అంటూ తెలుపుతున్నారు. వెండితెరపై ఇప్పుడిప్పుడే కనిపించే వారే హాట్ ఫోజులకు వెనకాడటం లేదు. మరి ఆమె చేస్తే తప్పేంటి అంటూ కామెంట్లు వస్తున్నాయి. అరియానా ఏ విషయంలోనైనా బోల్డే... ఆమె ఏదైనా విషయంపై మాట్లాడినా చాలా ఓపెన్‌గానే చెబుతుంది. తనకు నచ్చినట్లే ఉంటుంది. ఇదే విషయాన్ని బిగ్ బాస్‌లో ఉన్నప్పుడే ఆమె తెలిపింది. View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) -
Ariyana Glory: బొద్దుగుమ్మలా ఆరియానా...ఈ సొగసరి సోకులు చూస్తే మతిపోవడం ఖాయం! (ఫోటోలు)
-
ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వార్నింగ్ ఇచ్చిన అరియాన
యాంకర్‌గా కెరీయర్ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చినా వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను అరియానా సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: స్టేజీపై బతుకమ్మ ఆడిన కాజల్, శ్రీలీల.. వీడియో వైరల్) బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లొచ్చాక పలు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ప్రోగ్రామ్స్‌తో పాటు సెలబ్రిటీల ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటీ సొంతం చేసుకుంది. కానీ ఆమె కొన్నిరోజులపాటు స్క్రీన్కు దూరంగా ఉండటం జరిగింది. దీంతో ఆమె కొంచెం బొద్దుగా తయారైంది. ఈ క్రమంలో ఆమె ఫోటో షేర్ చేసినా.. వీడియో షేర్ చేసినా ట్రోలర్స్ దారుణమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు. మరికొందరైతే అరియానా పట్ల బాడీ షేమింగ్ కూడా చేశారు. అలాంటి వారికి ఆమె స్టైల్ల్లో సమాధానం ఇచ్చిపడేసింది. పనికి మాలిన వేస్ట్ ఫెల్లోస్ కోసం ఇది చెబుతున్నా.. నేను సన్నగా ఉంటే..? సన్నగా ఉన్నావ్ అన్నారు. సర్లే అని లావు అయితే.. ఏంటి ఇంత లావుగా ఉన్నావు. ఆంటీలా అయ్యావ్ అని అంటున్నారు. ఇలాంటి కామెంట్లు చేసే వాడు ఎలా ఉంటాడో ఒక ఫోటో పెడితే మేం కూడా చూస్తాం కదా..? నీకు నాతో ఏమైనా ఇబ్బంది ఉంటే అన్ ఫాలో కొట్టొచ్చు కదా..? నేను ఎలా ఉంటే నీకేంటి..? సన్నగా ఉంటే నీకేంటి..? లావుగా ఉంటే నీకేంటి..? నా జీవితంలో ముందుకు వెళ్లేందుకు కనీసం నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాను. నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి కామెంట్ చేయ్.. నేను ఎలా ఉంటే నీకేంటి..? కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఏదుటివారి మీద పడి ఎందుకు ఏడుస్తారు. పనీ పాట లేకపోతే ఏదైనా ఓ పని చేసుకోవచ్చు కదా అని ట్రోలర్స్‌పై అరియానా విరుచుకుపడింది. ప్రస్తుతం ఆమె పలు డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by starmaa__shows (@starmaa__shows) -
మగధీర టైమ్‌లో చూడాలనుకున్న ప్రదేశానికి వెళ్లిన రాజమౌళి
► నార్వేలో మగధీర కోసం పరిశోధన చేస్తున్నప్పుడు చూడాలనుకున్న పల్పిట్ రాక్ ప్రదేశాన్ని తాజాగ చూసేశాం అంటున్న రాజమౌళి ►ట్రెండీ శారీతో హీట్ పెంచుతున్న విష్ణు ప్రియ ►అరియానతో సోహైల్ లుక్ అదుర్స్ ►చెరువు గట్టు వద్ద కూర్చోని చేపలకు ఆహారం వేస్తున్న గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ►ఫ్యామిలీ ఫోటోను విడుదల చేసిన సుశాంత్ View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by RamCharan.k 🔵 (@ramcharankonidella.k) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
Ariyana Glory: ఇలియానాలా ఉండేది, ఇప్పుడేంటి ఇలా అయిపోయింది (ఫోటోలు)
-
అరియానా లుక్‌పై ట్రోల్స్.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా అంటూ..?
బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలతో ఎప్పుడూ షేర్ చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ట్రాక్ చేంజ్ చేసి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ యంగ్ లేడీ. దీంతో ఎప్పుడూ ఆడియన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను అరియానా సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే) బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లొచ్చాక పలు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ప్రోగ్రామ్స్‌తో పాటు సెలబ్రిటీల ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటీ సొంతం చేసుకుంది. మరోవైపు వెబ్ సిరీసుల్లో కూడా భాగమవుతూనే.. బీబీ జోడీ ప్రోగ్రామ్‌తో అరియానా ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను షేర్ చేస్తుంటుంది. తాజాగా అరియానా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె అస్సలు గుర్తుపట్టలేని విధంగా కనిపించడంతో.. అభిమానులు షాక్ అయ్యారు. ఆ ఫోటోల్లో ఉండేది నిజంగానే అరియానానేనా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియా టూర్లో ఉన్నట్లు ఫోటోలను షేర్ చేసింది. (ఇదీ చదవండి: ధోని ఎంట్రీ ఖాయం ..ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త) అరియానా తాజా లుక్‌లో కొంచెం బొద్దుగా కనిపిస్తుంది. డబుల్ చిన్తో ఏ మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో అభిమానులతో పాటు కొందరు నెటిజన్లు అరియానాపై ఇలా కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి బాగా తిని నిద్రపోతున్నావా..? మరీ బొద్దుగా అయ్యావ్ అంటూనే గతంలో మాదిరే సన్నగా ఉంటేనే బాగుంటావ్ అని కామెంట్ల ద్వారా తెలుపుతున్నారు. ఇలా అయితే ఇండస్ట్రీలో ఎలా అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఏదైనా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నావా? అంటున్నారు. షూటింగ్‌లకు గుడ్‌బై చెప్పి పెళ్లి కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా? ఏంటి అని మరికొందరు అంటున్నా... సాధ్యమైనంత త్వరగా మళ్లీ సన్నగా అవ్వండని సలహాలు కూడా ఇస్తున్నారు. ఇలా ఎవరికి తోచింది వారు కామెంట్ల చేస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
చీరలో అరియానా.. 'స్పై' బ్యూటీ స్పైసీ లుక్!
చీరలో అరియానా.. హాట్ పోజులు ఎదురుచూస్తున్న ఈషా రెబ్బా రెడ్ డ్రస్‌లో హాట్‌గా 'స్పై' బ్యూటీ ఉల్లిపొర లాంటి చీరలో కల్యాణి ప్రియదర్శన్ షూటింగ్ లో రాశీఖన్నా బిజీ.. ఓర కంటితో చూస్తూ రోజువారీ లైఫ్.. ఒక్క ఇన్‌స్టా పోస్టుతో చెప్పేసిన మృణాల్ కలర్ కలర్ డ్రస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
బొద్దుగా కనిపిస్తున్న అరియాన.. హాట్ ఫోటోలతో స్పీడ్ పెంచిన 'స్పై' బ్యూటీ
► బ్లూస్ అంటూ రెచ్చగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు ► చీర కట్టులో అందంగా కనిపిస్తున్న కాజల్ అగర్వాల్ ► నీతోనే డ్యాన్స్ అంటూ హీరోయిన్ సదా ఫోజులు ► గ్రీనరీ గార్డెన్లో జంపింగ్ చేస్తున్న పాయల్ రాజ్‌పూత్ ► స్టార్ వార్స్ అంటూ ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన శ్రీముఖి ఫోటోలు ► బొద్దుగా మారుతున్న అరియానా.. బ్లాక్ డ్రెస్‌లో ఫోటోలు అదుర్స్ ► నిఖిల్ 'స్పై' బ్యూటీ సాన్యా థాకూర్ ఫోటోలతోనే హీట్ పెంచేస్తుంది View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Sanya Thakur (@sanya_thakurrr) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) -
అరియానా హాట్ పోజులు.. రాశీ ఖన్నా నాభి అందాలు
► హాట్ పోజులతో కుర్రకారు మతులు పొగొడుతోంది అరియానా ► ప్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది అషురెడ్డి ► నడుముసొగసులు చూపిస్తూ కవ్విస్తోంది రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by Kashika Kapoor (@kashikakapoor09) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) -
అనారోగ్యం బారిన పడిన బిగ్‌బాస్ బ్యూటీ అరియానా
బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న అరియానా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను షేర్ చేస్తుంటుంది. చదవండి: పోలీస్ ఆఫీసర్‌తో ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్ తాజాగా అరియానా అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా తనే ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. చాలారోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాను. డెంగ్యూ బారిన పడ్డాను. ప్రస్తుతం కోలుకుంటున్నా అంటూ ఇన్‌స్టాలో పోస్ట్చేసింది అరియానా. చదవండి: న్యూసెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎలా ఉందంటే? View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
రీతౌ చౌదరి గ్లామర్ డోస్.. శివాత్మిక స్టన్నింగ్ లుక్స్
View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Inaya Sultan (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by 𝐕𝐚𝐢𝐬𝐡𝐧𝐚𝐯𝐢 𝐊𝐨𝐯𝐯𝐮𝐫𝐢 (@vaishnavi.k_official) View this post on Instagram A post shared by Shamita Shetty (@shamitashetty_official) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
విజయవాడ: వస్త్ర దుకాణంలో బిగ్‌బాస్ ఫేం అరియానా సందడి (ఫొటోలు)
-
బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ జోడీలు.. ఎంటర్టైన్మెంట్ అదిరిపోలా!
రేపటితో బిగ్‌బాస్ షో కథ క్లోజ్ కానుంది. శ్రీసత్య ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఐదుగురు మిగిలారు. వీరంతా ఫైనల్‌కు చేరుకున్నామన్న సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇకపోతే గత బిగ్‌బాస్ సీజన్లలో అలరించిన కొందరు కంటెస్టెంట్లతో త్వరలో బీబీ జోడీ రానుంది. ఈ షోలో ముక్కు అవినాష్- అరియానా, అఖిల్-తేజస్వి, అర్జున్- వాసంతి, సూర్య- ఫైమా, రవికృష్ణ- భాను, మెహబూబ్- అషు, చైతు- కాజల్, రోల్ రైడా-స్రవంతి జంటలుగా పాల్గొననున్నారు. ఈ షోను ప్రమోట్ చేసే క్రమంలో నేడు అషు, మెహబూబ్, అవినాష్, అరియానా హౌస్‌లో అడుగుపెట్టారు. ఇక ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్ అయిన అవినాష్ ఇంట్లో బెల్లీ డ్యాన్స్, నాగిని డ్యాన్స్ చేసి అందరినీ నవ్వించారు. మరి మాజీ కంటెస్టెంట్ల రచ్చ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: డబ్బు కోసమే వచ్చానన్న శ్రీసత్య ఎంత సంపాదించిందంటే? తుస్సుమన్న అవతార్ 2, ఆసినిమాను కూడా దాటలేకపోయింది -
బ్లూ డ్రెస్‌లో అరియానా..రెడ్ శారీలో శ్రీముఖీ అందాలు..చూపుతిప్పుకోనివ్వడం లేదుగా
మాల్దీవుల్లో యాంకర్ రష్మి ఎంజాయ్ చేస్తోంది. పడవలో వెళ్తూ పై నుంచి విమానాన్ని చూసి తెగ సంబరపడిపోతుంది రెడ్ కలర్ శారీలో ఆందాలను ఆరబోస్తోన్న హాట్ యాంకర్ శ్రీముఖి. బుల్లితెరపై జెట్ స్పీడ్‌తో దూసుకెళుతోన్న ఓ ముద్దుగుమ్మ కూడా సరదాగా వెకేషన్‌కు వెళ్లింది. అక్కడి సాగర తీరంలో హాట్ ఫొటోషూట్లు చేస్తోంది. బ్లాక్ కలర్ టాప్‌లో రాశీ ఖన్నా అందాల ప్రదర్శన నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కంటే గొప్పదేది లేదంటుంది బిగ్‌బాస్ బ్యూటీ అరియా గ్లోరీ ‘మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా..’ అంటూ కవితలు చెబుతోన్న యాంకర్ అనసూయ View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) -
శ్రీసత్యకు దండం పెట్టాలి, ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందనుకున్నా
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. రేపోమాపో టికెట్ టు ఫినాలే ప్రారంభం కానుంది. ఆల్రెడీ హౌస్‌మేట్స్‌కు బూస్ట్ ఇచ్చేందుకు ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించి సర్ప్రైజ్ ఇస్తున్నాడు బిగ్‌బాస్. మరోవైపు బిగ్‌బాస్ షో గురించి నిత్యం ఎవరో ఒకరిని పిలిచి డిబేట్ పెడుతూనే ఉంది అరియానా. తాజాగా బిగ్‌బాస్ కెఫెకు మాజీ కంటెస్టెంట్ హమీదా వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'శ్రీసత్యకు దండం పెట్టాలి. ఆమె ఎలిమినేట్ అయిపోతుందని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం తగ్గించుకుంటే మంచిది' అని అభిప్రాయపడింది. తన పేరెంట్స్ మాత్రం ఇనయకు పెద్ద ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చింది. అది సరే కానీ శ్రీసత్య ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నావా? అంటూ కౌంటరిచ్చింది అరియానా. చదవండి: రేవంత్‌కు బిగ్‌బాస్ షాక్, అంతలోనే సర్ప్రైజ్ ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్ -
వాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఎందుకుంటున్నారో తెలీట్లేదు: స్పై అక్క
ప్రతి బిగ్‌బాస్ సీజన్లో ఎంటర్టైన్మెంట్, టాస్కులు అంటూ వాటి వెనక పరుగులు తీస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఈ సీజన్లో మాత్రం అదిగో కెమెరా, ఇదిగో కంటెంట్ అంటూ కాస్త అతి చేస్తున్నారు. ఆరో సీజన్ మొదలై ఐదు వారాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కొందరు పూర్తిగా గేమ్‌లో దిగనేలేదు. అదేమంటే బిగ్‌బాస్ అంటే గేమ్ ఒక్కటే కాదని పాఠాలు వల్లిస్తున్నారు. అందులో రోహిత్, మెరీనా జంట కూడా ఉంది. కిచెన్‌లో ఎంతో కష్టపడే మెరీనా తన మంచితనంతోనే హౌస్‌లో నెట్టుకొస్తోంది. కానీ అదొక్కటే ఉంటే సరిపోదు కదా! అన్నింట్లోనూ ఉండాలి. బిగ్‌బాస్ షోపై రివ్యూలు ఇచ్చే స్పై అక్క కూడా ఇదే అంటోంది. మెరీనా- రోహిత్ ఎందుకుంటున్నారో తెలియడం లేదని వారి గాలి తీసేసింది. ఈ మేరకు బిగ్‌బాస్ కెఫెలో అరియానా గ్లోరీ కాలిఫోర్నియాలో ఉంటున్న స్పై అక్కతో వీడియో కాల్లో మాట్లాడింది. ఫెమినిస్ట్ పదానికి గొప్ప అర్థం తెచ్చిన మహానుభావుడు సూర్య.. అంటూ అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చాలామంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మెరీనా- రోహిత్ అసలు గేమే ఆడటం లేదు. గీతూ 24 గంటలు కంటెంట్ అంటూ కెమెరాలు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఉంటుంది. తనే కాదు, అందరూ కంటెంట్ వెనకాల పరిగెడుతుంటే రేవంత్ వెనక కంటెంట్ పరిగెడుతోంది. బాలాదిత్య నా అంచనాలను తారుమారు చేస్తున్నాడు అంటూ ఈ సీజన్‌పై రివ్యూ ఇచ్చింది. చదవండి: బ్యాటరీ రీచార్జ్ టాస్క్.. ఏడ్చేసిన శ్రీహాన్, శ్రీసత్య చెల్లో షో బాలనటుడు మృతి -
బిగ్‌బాస్ నుంచి బయటకు అరియానా.. ఎంత గెలుచుకుందంటే ?
Bigg Boss Non Stop Telugu Grand Finale: Ariyana Came Out With 10 Lakhs: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే నుంచి అనిల్, బాబా భాస్కర్, మిత్రా శర్మ బయటకు వచ్చాక డబ్బుల ఎపిసోడ్ రసవత్తరంగా మారింది. డబ్బుల బ్రీఫ్‌కేసుతో హౌజ్‌లోకి వెళ్లిన అనిల్ రావిపూడి, సునీల్ డబ్బులతో బేరం చేశారు. అఖిల్ కప్ కోసం వచ్చానని చెప్పగా, బిందు మాధవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడానికే వచ్చానని తెలిపింది. అరియానా అయితే డబ్బు కోసమే వచ్చానని, ఒక ప్లాట్ కొనాలనే కోరికతోనే వచ్చానని వెల్లడించింది. తన ఆర్థిక కష్టాలని తీర్చుకునేందుకు, కప్పు కూడా కొట్టాలని ఉద్దేశ్యంతోనే వచ్చినట్లు శివ చెప్పుకొచ్చాడు. దీంతో డబ్బుల బేరం మొదలైంది. ఈ బేరంలో అందరు సైలెంట్‌గా ఉంటే అరియానా మాత్రం ఎంత డబ్బు ఉండొచ్చని, డబ్బు తీసుకునేందుకే ఉత్సాహాన్ని చూపించింది. కానీ అందులో ఎంత డబ్బు ఉందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అందులో లక్షల్లో డబ్బు ఉందని నాగార్జున మాటిచ్చిన తర్వాత అరియానా ఈ సూట్‌కేస్‌ను తీసుకుంది. సూట్‌కేస్‌తో స్టేజ్‌పైకి వచ్చిన అరియానాతో నాగార్జున, అనిల్, సునీల్ ఆట ఆడుకున్నారు. అందులో డబ్బు ఉందంటే ఎలా నమ్మావ్ అని బాంబు పేల్చారు. దీంతో అనిల్, సునీల్‌లను దొంగసచ్చినోళ్లను నమ్మి వ్చచానని అరియానా తిట్టేసింది. కొద్దిసేపు అరియానా అనిల్, సునీల్, నాగార్జున, బాబా భాస్కర్ ఆడుకున్నారు. చివరికి అందులో రూ. 10 లక్షలు ఉన్నాయని నాగార్జున చెప్పడంతో అరియానా ఊపిరి పీల్చుకుంది. -
Bigg Boss OTT: 10 లక్షల సూట్‌కేస్‌తో తప్పుకున్న అరియానా!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. గత సీజన్ల కంటే భిన్నంగా ఏడుగురు కంటెస్టెంట్లతో గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న బిగ్‌బాస్ చివరి మజిలీకి చేరుకుంది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. నెట్టింట లీక్ అవుతున్న సమాచారం ప్రకారం.. బిందు మాధవి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. దీంతో ఈసారైనా విన్నర్ అవ్వాలన్నా అఖిల్ కల కలగానే మిగిలిపోయింది. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఒక అమ్మాయి టైటిల్ విన్నర్‌గా నిలవడం బిందుకే సాధ్యమైంది. ఆడపులి హ్యాష్‌ట్యాగ్‌తో ఫేమస్ అయిన బిందు ఓటీటీ విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది. కాగా ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన బాబా మాస్టర్ టాప్7 స్థానంలో నిలవగా, అనిల్ 6వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మిత్రా, అరియానా గ్లోరీ, శివ వరుసగా టాప్- 3 స్థానాల్లో నిలిచినట్లు టాక్ వినిపిస్తుంది. టాప్-4లో ఉన్న కంటెస్టెంట్లకు నాగార్జున డబ్బులు ఆఫర్ చేయగా అరియానా గ్లోరీ 10 లక్షల బ్రీఫ్ కేసును తీసుకొని టైటిల్ రేసు నుంచి స్వయంగా తప్పుకుంది. ఆ తర్వాత టాప్-3లో ఉండగా మరోసారి డబ్బులు ఆఫర్ చేయగా, శివ, బిందు, అఖిల్ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.ఫైనల్‌గా బిందు, అఖిల్‌కి మధ్య జరిగిన రేస్‌లో బిందు విజేతగా నిలిచినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా బిందుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
బ్రేకప్‌తో బిజీ అయ్యావా? షణ్ముఖ్‌పై నాగ్ సెటైర్లు
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఈ వారం సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నాడు. ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్‌ను పంపి హౌస్మేట్స్ ముఖాల్లో వెలుగులు తీసుకొచ్చిన బిగ్‌బాస్ వీకెండ్లో ఏకంగా వారి క్లోజ్‌ఫ్రెండ్స్‌ను, మరికొందరి పేరెంట్స్‌ను, బంధువులను స్టేజీమీదకు తీసుకొచ్చాడు. వారిని చూసి మరోసారి సర్ప్రైజ్ అయ్యారు కంటెస్టెంట్లు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అఖిల్ కోసం సోహైల్ స్టేజీపైకి వచ్చి స్నేహితుడిని పొగిడేస్తుండగా... నాకోసం కూడా చెప్పరా అంటూ మధ్యలో అరియానా లేచి నిలబడింది. దీంతో సోహైల్.. నేను అన్నీ విన్నాలే, కూర్చో అన్నట్లుగా పంచ్ వేశాడు. తర్వాత అరియానా కోసం ఆమె సోదరి, దేవి నాగవల్లి, యాంకర్ శివ కోసం అతడి ఫ్రెండ్స్ ధనుష్, షణ్ముఖ్ వచ్చారు. చదవండి: మహేశ్‌బాబు పెన్నీ సాంగ్ కోసం సితార ఎందుకన్నారు: తమన్ షణ్నును చూసిన నాగ్ బిగ్‌బాస్ తర్వాత ఎక్కడా కనపడలేదేంటి, బ్రేకప్‌తో బిజీగా ఉన్నావా? అని ప్రశ్నించడంతో అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్న అషూ.. దీప్తి సునయన ఎలా ఉందని అడుతూ షణ్నును మరింత ఉడికించింది. అనంతరం సిరి స్టేజీపైకి రాగా మిత్రశర్మ ఎమోషనలైంది. అనిల్ కోసం వచ్చిన తండ్రి మాట్లాడుతూ.. అతడు మాట్లాడకపోవడానికి కారణం నేనే, వాడిని అలా పెంచాను అంటూ గొప్పగా చెప్పాడు. దీంతో విషయం అర్థమైన నాగ్ మాట్లాడనివ్వకుండా పెంచారా? అని సెటైర్ వేశాడు. ఇక వచ్చినవారితో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పమని గేమ్ ఆడించాడు. ఈ గేమ్‌తో ఎవరు ఫినాలేలో చోటు దక్కించుకుంటారు? ఎవరికి టైటిల్ గెలిచే ఆస్కారం ఉందన్న విషయాలపై ఓ క్లారిటీ రానుంది. చదవండి: అనిల్ అదృష్టం, బిగ్‌బాస్ నుంచి హమీదా ఎలిమినేట్! -
అమ్మాయిలా, రాక్షసులా? మిత్ర చేయి విరగ్గొట్టేలా ఉన్నారే!
బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మరింత రసవత్తరంగా మారింది. ఆయన వచ్చీరావడంతోనే బిందుమాధవిని సేవ్ చేయడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా అతడు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్నాడు. అరియానా, హమీదా, బిందుమాధవి, అజయ్, నటరాజ్ మాస్టర్ ఏలియన్స్ టీమ్‌లో, మిగిలినవారంతా హ్యూమన్స్ టీమ్‌లో ఉన్నారు. ఏలియన్స్ దగ్గర ఉన్న బ్యాటరీలను దొంగిలించి పగలగొట్టడం హ్యూమన్స్ పనైతే వారి చేతులకు రంగు పూయడం ఏలియన్స్ పని. ఈ టాస్క్ కోసం రక్తాలు కారేలా ఆడారు హౌస్మేట్స్. అమ్మాయిలా, ఆటంబాంబులా అనేలా రెచ్చిపోయారు ఏలియన్స్ టీమ్ సభ్యులు. అయితే ఈ క్రమంలో వారు గేమ్‌లో శృతి మించిపోయినట్లు కనిపిస్తోంది. హ్యూమన్స్ టీమ్‌లోని మిత్ర శర్మను దొరపుచ్చుకుని ఆమె చేతికి రంగు పూయాలని భావించింది ఏలియన్స్ టీమ్. అనుకున్నదే తడవు పదేపదే ఆమెను టార్గెట్ చేస్తూ దాడి చేసింది. ఆమె చేయి పట్టుకుని లాగుతూ, కిందపడేస్తూ నానారచ్చ చేశారు. కిందపడేసినప్పుడు తనకు దెబ్బలు తాకినా ఏమాత్రం పట్టించుకోకుండా బిందు మాధవి ఆమె చేయి పట్టుకుని లాగింది. ఒకరకంగా చెప్పాలంటే హమీదా, అరియానా, బిందు ఆమెను హింసించారు. దీంతో సోషల్ మీడియాలో వీరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె చేయి విరగ్గొట్టేలా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిత్ర అవస్థను గుర్తించిన బాబా భాస్కర్వెంటనే వెళ్లి జుట్టు సరిచేసి చెమట తుడిచి గేమ్ పాజ్ చేశాడు. అటు అఖిల్ ఆమె షర్ట్ పైకి పోవడంతో దాన్ని కిందకు సరిచేశాడు. వీళ్లిద్దరూ అంత మానవత్వంతో ప్రవర్తిస్తుంటే ఆ ముగ్గురు మాత్రం మరీ దారుణంగా వ్యవహరించారని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. మిత్ర గేమ్ ఆడిన విధానం బాగుందని మెచ్చుకుంటున్నారు. చదవండి: యశ్ నుంచి ప్రకాశ్ రాజ్ దాకా.. కేజీఎఫ్ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే? నన్ను కొట్టింది, నేనూ కొడ్తా: మిత్ర వెనకాల హమీదా పరుగు -
అషూకు ఆదిలోనే దెబ్బ, సిగ్గు లేదంటూ రెచ్చిపోయిన మిత్ర
బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో సీన్ మారిపోయింది. అతడు వచ్చీరావడంతోనే బిందుమాధవిని నామినేషన్స్‌లో నుంచి సేవ్ చేయడంతో అందరూ ఖంగు తిన్నారు. తన గురించి ఒక్క మాట మాట్లాడలేదేంటని అఖిల్ హర్టయ్యాడు. ఇక బిందును సేవ్ చేసి తనకు జనాల్లో ఎంత పాపులారిటీ ఉందో చెప్పకనే చెప్పేశాడు బాబా. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఇందులో అషూ, శివ, మిత్ర, అఖిల్, అనిల్, బాబా భాస్కర్లను మనుషుల టీమ్‌గా, అరియానా, బిందుమాధవి, అజయ్, హమీదా, నటరాజ్ మాస్టర్లను ఏలియన్స్ టీమ్‌గా విభజించారు. ఈ క్రమంలో ఏలియన్స్ తమదగ్గరున్న వస్తువులను కాపాడుకునే ప్రయత్నం చేయగా హ్యూమన్స్ వాటిని తీసుకుని పగలగొట్టి హ్యూమన్స్ టీమ్‌లో నుంచి ఒక్కొక్కరిని గేమ్‌లో నుంచి తొలగించేందుకు ట్రై చేస్తారు. గేమ్ ఆడే క్రమంలో ఏలియన్స్ స్విమ్మింగ్ పూల్‌లో దూకగా అందుకు వీల్లేదని స్పష్టం చేశాడు బిగ్‌బాస్. అందుకు శిక్షగా అషూ తన దగ్గరున్న మైక్ ధరించడానికి వీల్లేదని ప్రకటించాడు. అయితే ఇదే విషయాన్ని అరియానా చెప్పడానికి ప్రయత్నించగా అషూ అస్సలు వినిపించుకోలేదు. సంచాలక్ చెప్తేనే వింటానంటూ మొండికేయడంతో బాబా భాస్కర్ జరిగింది చెప్పి ఆమె దగ్గర నుంచి మైక్ తీసుకున్నాడు. ఇక గేమ్‌లో హమీదా, మిత్ర కొట్టుకున్నంత పని చేశారు. మిత్ర కొడుతుందని, తాను కూడా కొడతానంటూ ఆమె వెనకాల పరిగెత్తింది హమీదా. తనను కింద పడేయడంతో సిగ్గు లేదు అంటూ అమ్మాయిల మీద అరిచేసింది మిత్ర. ఇక ఈ టాస్క్‌లో హ్యూమన్స్ టీమ్ గెలిచి అందులోని సభ్యులు కెప్టెన్సీ కంటెండర్స్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్ కాదు! నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, సాగిన చర్మం, గడ్డకట్టిన ప్యాడ్లు.. కాజల్ -
నామినేషన్స్ రచ్చ.. ఈవారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ షోలో అన్ని రోజులు ఒక ఎత్తైతే, నామినేషన్స్ రోజు మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆరోజు వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నవాళ్లు కూడా నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం అన్నీ పక్కనపెట్టేసి నామినేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఎనిమిదో వారం నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి. షోలో మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌లా కలిసున్న అషూ, అరియానా నామినేషన్స్‌లో మాత్రం బద్ద శత్రువులుగా మారినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇక మరోవైపు ఎప్పటిలాగే బిందు, అఖిల్ ఈసారి కూడా నామినేషన్స్‌లో గొడవ పడ్డారు. స్రవంతి అనే ఎమోషన్‌ను యూజ్ చేసుకున్నావంటూ బిందు ఫైర్ అయ్యింది. దీంతో చిర్రెత్తిపోయిన అఖిల్ ఏం మాటలు మాట్లాడుతున్నావ్? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడ్డాడు. అజయ్, హమీదా కూడా ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. మొత్తానికి వాడివేడిగా సాగిన ఈ ప్రక్రియలో అఖిల్, అషూ, అజయ్, అనిల్, హమీదా, బిందు నిలిచారు. వీరిలో బాబా భాస్కర్ మాస్టర్ పన పవర్‌ని ఉపయోగించి బిందుని సేవ్ చేసినట్లు తెలుస్తోంది. -
అజయ్‌కు అరియానా గోరుముద్దలు, అడ్డుపడ్డ అషూ!
ప్రయోగాత్మకంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. కంటెస్టెంట్ల కొట్లాటలతో ఆట మరింత రంజుగా మారుతోంది. 17 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం 11 మంది మిగిలారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో వీరిని జంటలుగా విభజించి అషూను సంచాలకురాలిగా వ్యవహరించాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు రాజుకుంటున్నట్లు తెలుస్తోంది. గురువారం రిలీజ్ చేసిన ప్రోమోలో అషూ, అరియానా మధ్య వార్ నడిచినట్లు కనిపిస్తోంది. అరియానా ప్లేటులో భోజనం పెట్టుకొని వచ్చి అజయ్‌కు తినిపించింది. అయితే ముందు కార్డు చూపించంటూ కెప్టెన్ అషూ పదేపదే అడగడంతో అన్నం మీద అలిగి వెళ్లిపోయింది అరియానా. ప్లేటులో ఫుడ్డు పెట్టుకొని వచ్చి ఎమోషన్స్ వాడుకుందామనుకుంటే కరెక్ట్ కాదని వ్యాఖ్యానించింది అషూ. దీనికి అరియానా.. వేరేవాళ్లను బ్యాడ్ చేసి గేమ్ ఆడటంలేదంటూ కౌంటరిచ్చింది. ఇక శివ బెడ్రూమ్లో తింటూ దొరికిపోవడంతో అతడిని బయటకు పంపించేసింది అషూ. బయటకు వచ్చిన శివ కోపంతో నీళ్ల బాటిల్‌ను నేలకేసి కొట్టాడు. ఇంతకూ ఈ గేమేంటి? ఈ గేమ్‌లో ఎవరి జోడీ గెలుస్తుంది? అన్నది తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత వాడు అమ్మాయి టచ్ కోరుకున్నాడు: అజయ్ -
చూడకూడని స్థితిలో బావను చూశాను, విడిపోదామనుకున్నా: ఏడ్చేసిన అరియానా
తొలి ప్రేమ కొందరికి తీపి గుర్తులను మిగుల్చుతే మరికొందరికి మాత్రం భారమైన జ్ఞాపకాలను వదులుతుంది. తొలి ప్రేమను చివరి మజిలీదాకా తీసుకువెళ్లడం అంత ఈజీయేం కాదు. చాలామంది ఫస్ట్ లవ్ బ్రేకప్‌తోనే ముగుస్తుంది. ఈ లిస్టులో తాను కూడా ఉన్నానంటోంది బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ. చిన్నతనంలోనే తండ్రి ప్రేమకు దూరమైన ఆమె తన బావను ప్రేమించి నయవంచనకు గురయ్యానంటోంది. 'తొమ్మిదో తరగతిలోనే బావకు, నాకు మధ్య లవ్ స్టోరీ మొదలైంది. అది పదో తరగతిలో బలపడింది. చిన్నప్పటి నుంచే డాడీ లేడు. అతడు తిన్నావా? ఎలా ఉన్నావు? అంటూ నా మీద కేరింగ్ చూపిస్తుండటం నచ్చేది. అతడు విజయవాడలో, నేను తాండూరులో ఉండేవాళ్లం. ఫోన్లు మాట్లాడుకునేవాళ్లం. అతడిది డిగ్రీ అయిపోయాక తనకో జాబ్ వచ్చింది. మేము హైదరాబాద్‌లో కలిసి ఉన్నాం. రిలేషన్షిప్లో ఉండి అప్పటికే మూడేళ్లకు పైనే అయింది. కానీ అతడికి నేను బోర్ కొట్టేశాను అన్న విషయం ఇప్పుడు అర్థమవుతోంది. ఒకరోజు ఏమైందంటే.. చూడకూడని స్థితిలో మా బావను చూశాను. కలలో కూడా అనుకోలేదు అలా జరుగుతుందని! అక్కడేం జరిగిందనేది ఈ ప్రపంచానికి కూడా చెప్పుకోలేను. అది చూశాక నా గుండె పగిలిపోయింది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. విడిపోదామనుకున్నాం కానీ తను వచ్చి సముదాయించాడు. సరేనని మళ్లీ రెండేళ్లదాకా అతడితోనే ఉన్నాను. నాకు ఆర్జే అవాలనుందని చెప్తే సరే ట్రై చేసుకో అన్నాడు. ఈ ప్రయత్నంలో నాకో అబ్బాయి పరిచయమయ్యాడు. దాన్ని అతడు అనుమానించాడు. ఇంత అనుమానిస్తుంటే నా వల్ల కాదని బ్రేకప్ చెప్పుకున్నాం. ఆ తర్వాత నేను ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో కూడా నాకు బావ రోజూ గుర్తొచ్చేవాడు. ప్లీజ్ మాట్లాడు బావా, తప్పైపోయింది బావా, మళ్లీ కలిసిపోదాం అని బతిమిలాడాను. మా అత్తమ్మను ఒప్పించి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దామనుకున్నాను. సెప్టెంబర్ 19 తెల్లవారుజామున నాలుగు గంటలకు పింక్ కలర్ పట్టు చీర తీసుకుని అత్తమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి డోర్ కొట్టాను. మా బావ తలుపు తీసి ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారంటూ అక్కడి నుంచి వెళ్లిపోమన్నాడు. అక్కడే కొద్ది దూరంలో బయట చిట్టినగర్ రోడ్డు మీద కూర్చొన్నాం. హ్యాపీ బర్త్‌డే బావ అని గిఫ్టిచ్చాను. ఈ గిఫ్ట్ తీసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది, నేను తీసుకోలేను అన్నాడు. అన్ని రోజులు నన్ను చూసుకున్నాడు, నాకోసం ఖర్చుపెట్టాడు కదా, ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను కాబట్టి ఏదైనా కానుక ఇవ్వాలని ఉండేది కానీ అది కూడా రిజెక్ట్ అయిపోయింది. 7-8 ఏళ్ల రిలేషన్షిప్.. సెట్ అవలేదంతే. ఇప్పుడు బావ వచ్చినా కూడా నాకు వద్దు' అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది అరియానా. చదవండి: టాప్ 5లో ఉంటుందనుకుంటే ఎలిమినేట్ అయిపోయిన తేజస్వి ‘బీస్ట్’ సినిమా విడుదల.. ఫ్యాన్స్ హెచ్చరించిన విజయ్ -
సరయు నడిస్తే భూకంపం వచ్చినట్లే ఉంది: అరియానా తీవ్ర వ్యాఖ్యలు
సండేను ఫండే చేసేందుకు నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్ల లెక్క సరిచేసేందుకు ఆయన రెడీ అయ్యాడు. దీనికంటే ముదు హీరోయిన్ శ్రద్ధా దాస్ స్టేజీపై చిందులేసి అలరించింది. ఆ తర్వాత ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తోనూ డ్యాన్సులేయించాడు నాగ్. ఈ క్రమంలో అషూ, హమీదా రెచ్చిపోయి మరీ చిందేశారు. అనంతరం గతవారం జరిగిన మోస్ట్ ఇరిటేట్ పర్సన్ ఎవరన్న ఓటింగ్ ఫలితాలను అందరిముందు ప్రకటించాడు నాగ్. అందరూ అనుకున్నట్లుగా శివకు కాకుండా ఆర్జే చైతూకు ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. అలాగే హౌస్‌లో మోస్ట్ ఫేక్ హౌస్ పర్సన్ ఎవరని చేపట్టిన ఓటింగ్ ఫలితాలను సైతం రివీల్ చేశాడు. అనంతరం సరయు తన మీద బాడీ షేమింగ్ జరిగిన విషయాన్ని నాగార్జునకు తెలిపింది. నేను నడుచుకుంటూ వస్తుంటే భూకంపం వచ్చినట్లు ఉందని అరియానా కామెంట్ చేసిందని చెప్పుకొచ్చింది. దీంతో అరియానా తనేమీ సీరియస్‌గా అనలేదని కవర్ చేసే ప్రయత్నం చేయగా నాగ్ వీడియో చూపించాడు. అందులో అరియానా తప్పు చేసినట్లు అడ్డంగా దొరికిపోవడంతో మారు మాట్లాడకుండా నిల్చుండిపోయింది. ఇక అరియానా చేసింది తప్పా? ఒప్పా? అన్నదానిపై హౌస్మేట్స్ అభిప్రాయాలు తెలుసుకోనున్నాడు నాగ్. మరి కంటెస్టెంట్లు సరయు పక్కన నిలబడతారా? లేదంటే అరియానాకు మద్దతిస్తారా? అన్నది తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: మేఘన్‌తో పడుకున్నానని చెప్తే రూ.50 లక్షలిస్తామని ఆఫర్! -
Bigg Boss Non Stop: నామినేషన్స్‌లో 12 మంది!
బిగ్‌బాస్ కంటెస్టెంట్ల భవిష్యత్తును చెప్పేది నామినేషన్సే. ఈ ఒక్క గండం నుంచి బయటపడ్డారంటే ఆ వారం నిశ్చింతగా గుండెల మీద చేయేసుకుని నిద్రపోవచ్చు. ఒకవేళ నామినేషన్స్‌లోకి వచ్చారంటే వీకెండ్ వరకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే! విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్లకు ఆ చింత అక్కర్లేదనుకోండి, అది వేరే విషయం. ఇక బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ముచ్చటగా మూడో నామినేషన్స్ జరిగాయి. పక్కనే ఉండి గోతులు తవ్వేవాళ్లే అంటే నా జీవితంలో కూడా ఇష్టముండరంటూ తేజస్వి బోల్డ్ బ్యూటీ అరియానాను నామినేట్ చేసింది. ఇంతమాట అన్నాక అరియానా ఊరుకుంటుందా? తాను గోతులు తవ్వుతున్నట్లు అనిపిస్తే తేజు ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నట్లు అనిపిస్తోందంటూ ఆమెను నామినేట్ చేసింది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్ మండా ఇక నామినేషన్స్‌లో చైతూ ఎవరివో కాళ్లు పట్టుకుంటానంటూ నామినేట్ చేశాడు. యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ మధ్య మహేశ్, అనిల్ మధ్య కూడా ముసలం మొదలైనట్లు కనిపిస్తోంది. ఎప్పటిలాగే అఖిల్, బిందుమాధవికి అస్సలు పడలేదు. మొత్తంగా ఈ మూడో వారం సరయు, అషూ రెడ్డి, కెప్టెన్ అనిల్ మినహా మిగతా 12 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. -
బిగ్‌బాస్ ఓటీటీ భామ అరియానా గ్లోరీ అందాలు (ఫొటోలు)
-
అంత బలుపెందుకు? అంటూ హీరోను తిట్టేసిన అరియానా
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో రోజురోజుకీ రంజుగా మారుతోంది. 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన షోలో ఇప్పటికే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా తాజాగా మరో కంటెస్టెంట్ హౌస్‌ను వీడే సమయం ఆసన్నమైంది. సోషల్ మీడియాలో లీకువీరులు శ్రీరాపాక ఎలిమినేట్ అయిందని దండోరా వేస్తుండగా మరికొందరు మాత్రం మిత్రశర్మ వెళ్లిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ సంగతి పక్కనపెడితే తాజాగా స్టాండప్ రాహుల్ చిత్రయూనిట్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హౌస్‌లో అడుగుపెట్టి కంటెస్టెంట్లతో ఓ ఆటాడించారు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో ఈ వారం మహేశ్ విట్టా వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అతిథులుగా వచ్చిన హీరోహీరోయిన్లను హౌస్మేట్స్ తమ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించి ఇంప్రెస్ చేశారు. కాగా రాజ్‌తరుణ్ అనుభవించు రాజా సినిమాలో అరియానా నటించిన విషయం తెలిసిందే! ఇక్కడ ఏర్పడ్డ పరిచయంతో హీరోతో చనువు పెంచుకున్న బోల్డ్ బ్యూటీ తాజాగా ప్రోమోలో రాజ్‌తరుణ్‌పై సీరియస్ అయింది. నీకు హాయ్ చెప్పడానికి బలుపేంటి? అని నిలదీసింది. రాగానే చెప్పాను కదా అని రాజ్‌తరుణ్ సమాధానం చెప్పినప్పటికీ ఆమె శాంతించలేదు. ఏంటి నీ ఫ్రెండ్ హాయ్ చెప్పట్లేదు అని చైతూ అప్పటినుంచి అంటున్నాడు అంటూ గరం అయింది. అయితే వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్సే కాబట్టి అంత సీరియస్ ఏం అయుండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ స్టాండప్ రాహుల్ టీమ్‌తో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఆటను చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ వీక్షించాల్సిందే! చదవండి: నా ఫ్రెండ్‌ను నేనే చంపానంటున్నారు, అవును, నావల్లే: హీరోయిన్ -
Bigg Boss: చెప్పుతో కొట్టిన అషూ, హర్ట్ అయిన అరియానా!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. ఇచట అన్ని రకాల ఎమోషన్స్ దొరుకుతాయి. వారియర్స్, చాలెంజర్స్ తగ్గేదేలే అన్నట్లుగా ఆడుతున్నారు. అయితే మార్చి 3 నాటి ఎపిసోడ్లో అషూ, అరియానా ఇద్దరూ చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో హర్టయిన అరియానా చెప్పుతో కొట్టడం నచ్చలేదని మాట్లాడింది. నువ్వు అలా చేశావ్ కాబట్టే తాను తిరిగి కొట్టానని చెప్పింది. దీంతో అషూ ఆమెకు సారీ చెప్పింది. ఇక అషూ తన సిగరెట్ ప్యాకెట్లు దాచిందన్న అనుమానంతో ఆమెకు సంబంధించిన బ్యాగ్‌ను దాచేశాడు యాంకర్ శివ. ఎలాగైనా తన బ్యాగ్‌ను తిరిగి రాబట్టాలనుకున్న అషూ.. 'శివ ఎలా అయిపోతున్నాడో చూడండి, సిగరెట్లు తాగకుండా ఉండలేకపోతున్నాడు, పిచ్చెక్కిపోతున్నాడు, గజతాగుబోతుగా తయారైపోతున్నాడు' అంటూ కామెంట్రీ మొదలు పెట్టడంతో శివ వెంటనే లేచి ఆమె బ్యాగును అప్పజెప్పాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. వారియర్స్ గతంలో బిగ్‌బాస్ షోకు వచ్చినప్పడు చేసిన పొరపాట్లు ఏంటి? వాటి నుంచి నేర్చుకున్న గుణపాఠాలేంటో చెప్పాలన్నాడు. ఇందులో భాగంగా అఖిల్ మాట్లాడుతూ.. తనెక్కువగా నవ్వలేదని, దానివల్లే గెలవలేకపోయానని చెప్పుకొచ్చాడు. మోనాల్‌తో ఉన్న బంధం వల్లే గెలవలేదని బయట టాక్, దీనికేమంటావని యాంకర్ శివ ప్రశ్నించాడు. మోనాల్‌తో ఫ్రెండ్షిప్ వల్ల వెనకబడిపోయానంటే ఒప్పుకోను, ఆమెతో స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు అఖిల్. తర్వాత అరియానా మాట్లాడుతూ.. ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడతానని చెప్పుకొచ్చింది. గతంలో నేర్చుకున్న గుణపాఠాల వల్ల ఇప్పుడు అందరినీ అంత ఈజీగా నమ్మలేనని తెలిపింది తేజస్వి. వేరే వాళ్లు ఎక్కువ రోజులు ఉండేందుకు నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి పంపించేయాలనుకున్నారంటూ పరోక్షంగా వితిక- వరుణ్‌ల మీద ఫైర్ అయ్యాడు మహేశ్. ఇంతకుముందు వచ్చినప్పుడు బిగ్‌బాస్ షోను చాలా లైట్ తీసుకున్నానంటూ అషూ ఉపన్యాసం మొదలు పెట్టిందో లేదో మధ్యలో తేజస్వి కల్పించుకోవడంతో వీరిమధ్య గొడవ రాజుకుంది. అనంతరం వారియర్స్ టీమ్‌లో నుంచి మరో ఇద్దరిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎన్నుకోమని ఆదేశించగా మెజారిటీ సీనియర్లు అఖిల్, అరియానా పేర్లు చెప్పారు. దీంతో తొలివారం కెప్టెన్సీ కోసం మహేశ్, తేజస్వి, సరయు, నటరాజ్‌తో పాటు వీరిద్దరూ పోటీపడ్డారు. ఎంత ప్రెషర్ పెట్టి ఆడుతున్నా మోటివేషన్ లేకపోయేసరికి నిరాశగా అనిపిస్తోంది. ముమైత్, మహేశ్ తప్ప ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు అని బాధపడింది. అర్ధరాత్రి లైట్లు ఆర్పేశాక తనలో తనే కుమిలిపోతూ ఏడ్చేసింది. ఫైనల్‌గా మొదటి వారం తేజస్వి కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. -
అరియానా, అషూ రెడ్డికి షాకిచ్చిన ఆర్జీవీ!
బిగ్‌బాస్ హౌస్ ఈసారి మరింత కలర్ఫుల్గా ఉంది. హౌస్‌లో 17 మంది కంటెస్టెంట్లు అడుగుపెడితే అందులో పది మంది అమ్మాయిలే కావడం గమనార్హం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవచ్చేమోకానీ, ఒకే ఇంట్లో రెండు కొప్పులు ఇమడవు అని ఓ సామెత ఉంది. అలాంటిది బిగ్‌బాస్ హౌస్‌లో 10 మంది అమ్మాయిలు ఒకేచోట ఉన్నారు. మరి కలిసుంటారా? కొట్లాటలతో హౌస్‌ను హీటెక్కిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బిగ్‌బాస్‌లోని ఓ కంటెస్టెంట్‌కు మద్దతు ప్రకటించాడు. నగ్నం హీరోయిన్ శ్రీరాపాకకు ఆల్‌ద బెస్ట్ చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో అవాక్కైన నెటిజన్లు అరియానా, అషూ రెడ్డి పరిస్థితేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అరియానాకు మద్దతిచ్చారు, ఆమె టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఇప్పుడు రాపాకకు సపోర్ట్ అంటున్నారంటే, ఈమె కూడా ఫినాలే వరకు ఉంటుందోమో చూడాలి అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయింది అరియానా. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్నప్పుడు ఈ బోల్డ్ బ్యూటీకి మద్దతు పలికాడు వర్మ. అటు అషూతోనూ ఇంటర్వ్యూలు చేస్తూ రచ్చరచ్చ చేశాడు. దీంతో ఈసారి ఆర్జీవీ సపోర్ట్ ఈ ఇద్దరికీ తప్పకుండా ఉంటుందని ఫ్యాన్స్ ఊహించారు. కానీ ఆ ఊహలను పటాపంచలు చేస్తూ తను డైరెక్ట్ చేసిన నగ్నం సినిమా హీరోయిన్ శ్రీరాపాకకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడీ దర్శకుడు. మరి ఆమె బిగ్‌బాస్ ఓటీటీలో ఎలా రాణిస్తుందో చూడాలి! Wishing all the best to Sweety aka @ShreeRapaka for her entry into BIG BOSS 👍💪💐💐💐 pic.twitter.com/AqBMzBZEXQ — Ram Gopal Varma (@RGVzoomin) February 27, 2022 -
బిగ్‌బాస్ షోలో అప్పుడే గొడవలు, అరియానాది ఓవరాక్టింగ్ అన్న శ్రీరాపాక
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ అంటే ఇష్టపడేవాళ్లు ఎంతోమంది. దేశంలోని పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ షో తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ షో ఓటీటీ ట్రాక్ ఎక్కింది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌గా హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. మాజీ కంటెస్టెంట్లు వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లు చాలెంజర్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్‌బాస్ ఇంట్లో అందరూ సమానమే అంటూ ప్రోమో వదిలింది హాట్‌స్టార్. ప్రతిరోజు చాలెంజర్స్ నుంచి అనుమతి పొందిన ఒక వారియర్‌కు మాత్రమే బెడ్రూమ్లో నిద్రపోయే అవకాశం లభిస్తుందని మెలిక పెట్టారు. చాలెంజర్స్ భోజనం చేసిన తర్వాతే వారియర్స్ ఒకేచోట కలిసి ఒకేసారి తినాలని నిబంధన పెట్టారు. వారియర్స్ సభ్యులు ఎవరే పని చేయాలో నిర్ణయించేందుకు చాలెంజర్స్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. ఈ క్రమంలో శ్రీరాపాకకు, అరియానాకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇంటర్వ్యూలో ఓవరాక్టింగ్ వద్దని శ్రీరాపాక అనడంతో భగ్గున లేచింది అరియానా. స్టేట్మెంట్స్ ఇవ్వద్దు, నా స్టైల్ ఇలానే ఉంటుంది అని కౌంటరిచ్చింది బోల్డ్ బ్యూటీ. ఇక హౌస్‌లో నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. మరి ఎవరెవరు ఎవరెవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే హాట్‌స్టార్‌లో నాన్‌స్టాప్ స్ట్రీమింగ్ చూసేయండి. "Prathi roju challengers nunchi anumathi pondhina okka Warrior ki maatrame Bedroom lo nidhara poye avakasam labhistundi!" 😱😱😱 How will the Warriors react?!#Biggboss #BiggBossTelugu #BiggBossNonStop @DisneyPlusHS @EndemolShineIND pic.twitter.com/QkGGqDD1WX — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 27, 2022 -
సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారన్న అరియానా గ్లోరీ!
యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన అరియానా పలు టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ భామకు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పిలుపు రావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తన అందచందాలతోనే కాకుండా ఆటతోనూ అభిమానులను కట్టిపడేసిన అరియానా.. తనకు తప్పనిపిస్తే బిగ్బాస్నేంటి? ఏకంగా నాగార్జునను సైతం నిలదీసింది. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన అరియానా థర్డ్ రన్నరప్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత ఐదో సీజన్ బజ్కు హోస్ట్‌గానూ వ్యవహరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. బిగ్‌బాస్ తర్వాత జీరో ఫ్యాన్‌బేస్ నుంచి ప్రపంచం మొత్తానికి పరిచయమయ్యానంటూ ఎగ్జైట్ అయ్యింది అరియానా. అంతేకాదు సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్లెవరో బయటపెట్టనని చెప్పింది. అయితే నాగ్ కూపీ లాగేందుకు ప్రయత్నించడంతో అలాంటిదేమీ లేదని, ఇప్పటివరకు ఎవరూ కనెక్ట్ కావడం లేదని చెప్పుకొచ్చింది. మరి అరియానా ఈసారైనా కప్పు కొడుతుందా? లేదా? అనేది చూడాలి! -
బోల్డ్ బ్యూటీకి నడుముపై కిస్ ఇచ్చిన అషూ రెడ్డి!
అరియానా గ్లోరీ, అషూ రెడ్డి.. వీళ్లిద్దరూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. కాకపోతే అషూ మూడో సీజన్లో అరియానా నాలుగో సీజన్లో పాల్గొన్నారు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీని నానాటికీ పెంచుకుంటూ పోతున్నారు వీరిద్దరు. ఈ క్రమంలో అషూ రీసెంట్గా పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందంటారా? అషూ.. అరియానా నడుముకి ముద్దు పెట్టింది. దీంతో బోల్డ్ బ్యూటీ ఓ రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అషూ 'అనంతమైన హావభావం' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇదేమైనా సాంగ్ పర్ఫామెన్సా? లేదా వీళ్ల క్రేజీనెస్సా? తెలీదు కానీ నెటిజన్లు మాత్రం కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 'ఏందిరా ఈ చండాలము, ఈ పోస్ట్ వల్ల ఉపయోగం ఏంటో ఎవరైనా చెప్తారా?', 'ఏదో తేడాగా ఉందే', 'ఈ ఫొటో ఆర్జీవీ కానీ చూడాలి', 'లెస్బియన్స్ అంటే వినడమే తప్ప చూడలే అనుకున్నా, కానీ ఇప్పుడు చూసేశా', 'ఇది చాలా టూమచ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసిన అరియానా.. 'ఒసేయ్ అషూ నీకు, నీ క్రేజీనెస్‌కి దండమే తల్లి. పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారే, జడ్జిమెంటల్ అవుతున్నాం' అని ఆందోళనతో కామెంట్ చేసింది. దీనికి అషూ స్పందిస్తూ.. 'మంచైనా, చెడైనా ప్రజలెప్పుడూ జడ్జ్ చేస్తూనే ఉంటారు. అలా అని మన క్రేజీనెస్‌ని వదిలేయకూడదు. ఎందుకంటే అదే మనల్ని ఇతరుల కన్నా ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ విషయం నేను ఆర్జీవీ నుంచే నేర్చుకున్నా' అని రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
బిగ్‌బాస్ ఓటీటీ: కొత్త ట్విస్ట్.. బరిలోకి మాజీ కంటెస్టెంట్స్, లిస్ట్ ఇదే!
బుల్లితెరపై అన్ని రియాల్టీ షోలు ఒకెత్తు అయితే... బిగ్‌బాస్ రియాల్టీ షో మరో ఎత్తు. దేశవ్యాప్తంగా ఈ షోకి అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ బిగ్ రియాల్టీ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. 2017లో మొదలైన మొదటి సీజన్ నుంచి 2021లో ముగిసిన ఐదో సీజన్ వరకు ‘బిగ్‌బాస్’కు ఆదరణ పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గిందే లేదు. గతేడాది డిసెంబర్లో ఐదో సీజన్ ముగిసింది. ఆ తర్వాత ఆరో సిజన్‌కి మరో ఆర్నేల్లు అయినా ఆగాల్సిదిందే అనుకున్న ప్రేక్షకులకు.. గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీదే గుడ్ న్యూస్ చెప్పాడు హోస్ట్ నాగార్జున. త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని చెప్పారు. దీనికి కూడా నాగార్జుననే హోస్ట్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈ షోకి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్ షో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. హిందీ మాదిరే తెలుగులో కూడా బిగ్‌బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతందని తెలియడంతో... తొలి సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఓటీటీ బిగ్‌బాస్ ఎలా ఉంటుంది? ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఇప్పటికే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక చివరి దశకు చేరిందని తెలుస్తోంది. ఈ ఓటీటీ బిగ్‌బాస్‌లోకి కొంతమంది మాజీ కంటెస్టెంట్లను కూడా తీసుకుంటున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. వారిలో అరియానా గ్లోరి ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఆమెతో మంతనాలు పూర్తయ్యాయని, మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి అరియనా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. ఈ సారి ఎలాగైన ట్రోఫీ గెలిచి, మరింత ఫేమస్ కావాలని అరియానా భావిస్తోందట. అందుకే ఓటీటీ బిగ్‌బాస్‌కి ఓకే చెప్పిందట. అరియానాతో పాటు మాజీ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక కొత్త వారిలో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరెవరు ‘బిగ్‌బాస్’హౌస్‌లోకి అడుగుపెడతారు తెలియాలంటే కొద్ది రోజుల పాటు వేచి చూడాల్సిందే. -
షణ్ను లేకపోయుంటే సిరి టాప్ 5లో ఉండేదే కాదు: శ్రీరామ్
తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వాలన్న ఏకైక ఆశయంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టాడు శ్రీరామచంద్ర. తను కోరినట్లుగానే లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సీజన్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆయన అభిమానులకు మాత్రం అతడే విన్నర్. షో నుంచి బయటకు వచ్చేసిన అతడు తాజాగా అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ బజ్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. షణ్ముఖ్, సిరి, జెస్సీతో మాట్లాడిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చన్నాడు. నామినేషన్స్‌లో సన్నీ, తాను పిచ్చిపిచ్చిగా అరుచుకున్నప్పటికీ ఆ తర్వాత వెంటనే కలిసిపోయేవాళ్లమని తెలిపాడు. నన్ను మొదటి వారం నుంచి నామినేట్ చేసిన ఏకైక వ్యక్తి యానీ మాస్టర్ అని చెప్పుకొచ్చాడు. షణ్ముఖ్ సపోర్ట్ లేకపోతే సిరి టాప్ 5లోకి వచ్చేదా? అన్న ప్రశ్నకు లేదని ఆన్సరిచ్చాడు శ్రీరామ్. తనకు తెలిసినంతవరకు షణ్ను లేకపోయుంటే సిరి ఫినాలేలో అడుగుపెట్టేది కాదన్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో మానస్‌కు, తనకు మధ్య కోల్డ్‌వార్ జరిగేదని పేర్కొన్నాడు. -
సిరికి చుక్కలు చూపించిన అరియానా.. ప్రతి ప్రశ్నలో కౌంటర్ అటాక్
BB5 Siri Bigg Boss Buzz Interview With Ariyana, Check Promo Inside: బిగ్‌బాస్ టాప్-5లో చోటు దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్ సిరి. మొదటి నుంచి అబ్బాయిలకు సమానంగా గట్టి పోటీ ఇచ్చిన సిరి ఒక దశలో టాప్-3 ఉంటందనుకున్నారు. కానీ షణ్నూతో మితిమీరిన హగ్గులతో విపరీతంగా ట్రోల్స్ బారిన పడింది. పైకి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పినా జనాలకు మాత్రం వీరి మధ్య ఇంకేదో రిలేషన్ ఉందని గట్టిగా ఫిక్స్ అయ్యేలా ప్రవర్తించారు. దీంతో అప్పటివరకు వీళ్లకు సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్లు సైతం సైడయ్యారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం అరియానాతో బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా సన్నీని కావాలనే టార్గెట్ చేశావా అన్న ప్రశ్నకు లేదు అని ఆన్సర్ ఇచ్చింది. టాస్కుల్లో ఎప్పుడూ గొడవలే జరుగుతుండటంతో ఇక ఫ్రెండిష్ ఎక్కడ నుంచి వస్తుంది అని బదులిచ్చింది. దీంతో మరి షణ్నూతో కూడా గొడవలు అవుతుంటాయి కదా అంటూ అరియానా కౌంటర్ వేసింది. ఇక రవిని నామినేట్ చేసి అతను ఎలిమినేట్ అయ్యాక మాత్రం రవి కోసం గేమ్ ఆడుతున్నాం అని చెప్పడం ఏంటి అని అడగ్గా.. కొంచెం సందేహంలో పడిపోయిన సిరి రవి ఎలిమినేషన్‌ను ఊహించలేదని ఆన్సర్ ఇచ్చింది. చివరగా ఒకనొక సందర్భంలో చోటు లేదా షణ్నూ ఇద్దరిలో ఒకరినే సెలక్ట్ చేసుకోవాలి అంటే ఎవరిని ఎంచుకుంటావ్ అంటూ అరియానా ప్రశ్నించింది. దీంతో ఒకింత అయోమయంలో పడిపోయిన సిరి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు.. అరియానా అడిగిన ప్రశ్నలకు సిరికి బొమ్మ కనపడుతుందంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ మా రిలీజ్ చేసింది. -
చేయని తప్పుకు నిందమోశాను, నేనంటే ఎవరికీ ఇష్టం లేదు
Bigg Boss 5 Telug Winner Sunny Exclusive Interview: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ విజయానందంలో తేలియాడుతున్నాడు. ఏ క్షణమైతే తన తల్లి ట్రోఫీ తీసుకురావాలని చెప్పిందో అప్పుడే కప్పు తనదేనని ఫిక్సయ్యాడు. చివరికి అమ్మ కలను నిజం చేస్తూ బిగ్‌బాస్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. షో నుంచి విన్నర్‌గా బయటకు వచ్చిన అనంతరం అతడు అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని అరియానాతో పంచుకున్న సన్నీ హౌస్‌లో తను బాధపడ్డ క్షణాలను, హౌస్మేట్స్ గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. 'నేను చేయని తప్పుకు రెండుమూడుసార్లు నింద పడ్డాను. కానీ ఆ బాధతో వెనక్కి తగ్గకుండా టాస్కుల్లో మరింత గట్టిగా ఫైట్ చేశాను. బేటన్ టాస్కులో చాలా కష్టపడ్డాను కానీ అందరూ నన్ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. నేను కెప్టెన్సీ కోసం నిలబడ్డప్పుడు అందరూ ఏవేవో సిల్లీ రీజన్స్ చెప్పి కత్తితో కసాకసా పొడిచేశారు. చాలా బాధేసింది. ఎందుకో తెలీదు కానీ హౌస్‌లో నేను వాళ్లకు నచ్చలేదు. శ్రీరామ్ నామినేషన్స్‌లో ఒకలా ఉంటాడు, సాధారణసమయంలో ఇంకోలా ఉంటాడు. ఉమాదేవి.. సూర్యకాంతం.. బయటకు అరుస్తారు కానీ చాలా మంచావిడ. విశ్వ గేమ్ అంటే ప్రాణమిస్తాడు. నటరాజ్ మాస్టర్ హార్డ్ వర్కర్, అతడిని ముద్దుగా సింహం అని పిలుచుకుంటాం. సరయూను అర్థం చేసుకునే సమయంలోనే ఆమె వెళ్లిపోయింది. ప్రియాంక సింగ్ బంగారం, డాక్టర్ ప్రియాంక ఎవరు బాధపడినా తట్టుకోలేదు. పింకీలాంటి అమ్మాయి దొరకాలంటే రాసిపెట్టుండాలి. లహరి చాలా జెన్యూన్, యానీ మాస్టర్ స్వీట్, స్ట్రాంగ్ లేడీ. రవి ఫైటర్. కాజల్ స్మార్ట్, స్ట్రయిట్ ఫార్వర్డ్. ఆమెకు నాగిని, స్ట్రాటజీ క్వీన్ అని చాలా స్టాంపులు వేశారు. శ్రీరామచంద్ర హౌస్‌లో లేకపోతే చాలా బోర్ అయ్యేది. ఆయన టాలీవుడ్లో మంచి బెస్ట్ సింగర్‌గా ఎదుగుతాడు. సిరి షణ్ముఖ్ ఫ్రెండ్షిప్ బాగుండేది. వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు కేర్ తీసుకునేవారు. మానస్ నా డార్లింగ్, ఇద్దరం కుక్కపిల్లల్లా కొట్టుకుంటాం. అతడు నన్ను చాలా నడిపించాడు. అలాంటి ఫ్రెండ్ దొరకాలంటే అదృష్టం ఉండాలి. జెస్సీ చిన్నపిల్లోడు. మొదట్లో అందరూ టార్గెట్ చేశారు. లోబో మంచి వ్యక్తి, ఎంటర్టైనర్. ప్రియకు నాకు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. కానీ తర్వాత క్లోజ్ అయ్యాం. హమీదా ఫ్రెండ్లీ నేచర్, టాకెటివ్, టాలెంటెడ్. శ్వేత చాలా డిఫరెంట్. షణ్ను బ్రహ్మ బ్రెయిన్‌తో గేమ్ ఆడాడు. నిజానికి నాతో, మానస్‌తో పాటు కాజల్ లేదా శ్రీరామ్ టాప్ 3లో ఉంటారు అనుకున్నా. కానీ అది జరగలేదు' అని చెప్పుకొచ్చాడు సన్నీ. -
సమంత ఐటెం సాంగ్‌కి చిందేసిన బోల్డ్ బ్యూటీ అరియానా
Ariyana Dancing For Samantha Oo Antava Oo Oo Antava Song In Pushpa: 'పుష్ప' మ్యానియా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తే, సమంత స్పెషల్ సాంగ్‌తో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. సౌత్ ఇండియన్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ వ్యూస్ రాబట్టిన పాటగా దుమ్మురేపుతుంది. ముఖ్యంగా సమంత స్టన్నింగ్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ సైతం ఈ పాటకు తనదైన స్టైల్లో చిందులేసింది. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్17న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
నా వెనకాల మాట్లాడాడు, శ్రీరామ్‌కు ఇచ్చిపడేసేదాన్ని!
Bigg Boss 5 Telugu Buzz: Kajal Comments On Shannu And Sunny: బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి స్ట్రాటజీ మంత్రం జపం చేసిన కాజల్ 14వ వారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. టాప్ 5లో ఉంటే అంతే చాలనుకున్న ఆమె కల కలగానే మిగిలిపోయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. 'హౌస్‌లో అందరూ నన్ను నెగెటివ్‌గా చూశారు. నెగెటివిటీకి మారు పేరు అన్నారు. షణ్ముక్ అయితే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడవలు ఆగిపోతాయన్నాడు.. ఆ మాట నన్ను చాలా బాధపెట్టింది' అని విచారం వ్యక్తం చేసింది కాజల్. షణ్ముఖ్.. నేను ఏదైనా మాట అంటే చాలు, అందులో నుంచి ఒక నెగెటివ్ స్టేట్మెంట్ తీస్తాడు, అది నాకు నచ్చేదే కాదని చెప్పుకొచ్చింది. శ్రీరామ్ ఎప్పుడూ నీ స్ట్రాటజీలు అన్నీ తెలిసిపోతాయ్ అంటాడు, అది నిజమేనా? అన్న అరియానా ప్రశ్నకు.. అతడు నా వెనకాల రియాక్ట్ అయ్యాడు. ముందు రియాక్ట్ అయ్యుంటే అప్పుడే ఇచ్చిపడేసేదాన్ని అని బదులిచ్చింది కాజల్. హౌస్‌లో మానస్, సన్నీ ఇద్దరూ ఫ్రెండ్సే అయినప్పటికీ సన్నీ ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. -
బిగ్‌బాస్ నుంచి ఢీ 13 వరకు: తాండూరు మెరికలు.. బుల్లి తెరపై మెరుపులు
తాండూరుకు చెందిన యువ కళాకారులు బుల్లితెరపై తళుక్కున మెరుస్తున్నారు. ప్రఖ్యాత టెలివిజన్ షోలల్లో సత్తాచాటుతూ జిల్లాకు మంచి పేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో ఒకరు ఢీ– 13లో టైటిల్ సాధించగా, మరొకరు గతేడాది నిర్వహించిన బిగ్‌బాస్– 4లో టాప్– 5 ఫైనలిస్ట్ల్లో నిలిచారు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదని ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు. తాండూరు టౌన్: పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన దువచర్ల మహేశ్– పద్మావతి దంపతుల కూతురు కావ్యశ్రీ ఇటీవల ముగిసిన ఢీ– 13 విన్నర్‌గా నిలిచింది. కావ్యశ్రీ తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి నలుగురు ఆడపిల్లలు. అమ్మాయిలు ఇంటికే పరిమితం కావాలనే ధోరణి నుంచి వారికి నచ్చిన రంగాల్లో రాణించేలా పిల్లలను ప్రోత్సహించారు. దీంతో కావ్యశ్రీ తనకిష్టమైన డ్యాన్స్‌ను ఎంచుకుంది. ప్రస్తుతం తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కావ్యశ్రీ ఓ శుభకార్యంలో చేసిన డ్యాన్స్‌ను చూసిన మాస్టర్ ఆమెకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఢీ షో కోసం సైడ్ డ్యాన్సర్‌గా చేరింది. మాస్టర్ పల్టీ రవి ఆధ్వర్యంలో అక్కడే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. 2015లో ఢీ– జూనియర్స్ సీజన్– 2లో గ్రూప్ డ్యాన్సర్‌గా చేసింది. తల్లిదండ్రులతో కావ్యశ్రీ అనంతరం ఢీ– 13లో కంటెస్టెంట్‌గా వైల్డ్‌కార్డు ఎంట్రీతో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి వెనుకడుగు వేయకుండా తన డ్యాన్స్‌లతో అదరగొట్టి, ఫినాలేలోకి అడుగు పెట్టింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె ఈనెల 8వ తేదీన నిర్వహించిన ఢీ–13 ఫైనల్లో విన్నర్‌గా నిలిచింది. సినీ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా టైటిల్‌తో పాటు ప్రైజ్ మనీ అందుకుంది. } ఢీ–13లో స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్న కావ్యశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కావడమే లక్ష్యం చిన్ననాటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. అదృష్టవశాత్తు ఢీ– 13లో అవకాశం దక్కింది. నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ శ్రీకాంత్, మాస్టర్లు శ్రీను, రాముకు రుణపడి ఉంటా. ఫైనల్లోకి ప్రవేశించి.. టైటిల్ సాధించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్‌గా రాణించాలనేదే నా లక్ష్యం. – కావ్యశ్రీ, ఢీ– 13 టైటిల్ విన్నర్ బిగ్‌బాస్ షోలో అదరగొట్టిన అరియానా గతేడాది జరిగిన బిగ్‌బాస్– 4 రియాల్టీ షోలో తాండూరు అమ్మాయి అరియానా గ్లోరీ మెరిసింది. 105 రోజుల పాటు కొనసాగిన ఈ పోటీలో టాప్– 5 పోటీదారుల్లో నిలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ వరకు గట్టి పోటీ ఇచి్చంది. తాండూరు మండలం అంతారానికి చెందిన సత్యనారాయణ, శశికళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. సత్యనారాయణ ఫొటోగ్రాఫర్ కాగా శశికళ నర్స్‌గా పనిచేసి రిటైరయ్యారు. వీరి చిన్న కూతురు అరియానా ఇంటర్ వరకు తాండూరులో అభ్యసించింది. కూకట్‌పల్లిలోని ప్రగతి కళాశాలలో డిగ్రీ చదివింది. తాండూరులో అభిమానులకు అభివాదం చేస్తున్న అరియానా (ఫైల్) అల్లు అర్జున్ చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ తీసుకుంటున్న కావ్యశ్రీ చిన్ననాటి నుంచి చురుకైన అమ్మాయిగా పేరున్న అరియానా తనలోని ప్రతిభను చాటిచెప్పాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుంది. స్టూడియో వన్, జెమినీ కామెడీ, కెవ్వు కేక, జింగ్ జింగ్ అమేజింగ్ తదితర టీవీ షోలకు వ్యాఖ్యాతగా పనిచేసింది. తన కళాత్మక దృష్టిని యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం చేసింది. ఈ క్రమంలో బిగ్‌బాస్– 4 నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. తొలిరోజు నుంచి తన చురుకైన∙ప్రదర్శనలతో టాప్ ఫైవ్ అభ్యర్థుల్లో నిలిచింది. బిగ్‌బాస్‌లో వచ్చిన ప్రైజ్‌మనీతో ఇల్లు కట్టుకోవడంతో పాటు గ్రామంలోని రైతులకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పడం విశేషం. ప్రస్తుతం టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గా చేస్తున్న అరియానా మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిద్దాం. -
మానస్ బండారం బయట పెట్టిన అరియాన, కన్నీళ్లు పెట్టుకున్న పింకీ
Bigg Boss 5 Telugu Priyanka Singh Interview With Ariyana Glory: అందరూ ఊహించినట్టుగానే బిగ్‌బాస్ 13వ వారం ఎలిమినేషన్లో భాగంగా ప్రియాంక సింగ్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ ఫినాలే వైపు అడుగులెస్తోంది. మొదటి ఫినాలే కంటెస్టేంట్గా శ్రీరామ్ ఎన్నికయ్యాడు. ఇక హౌజ్‌లో మానస్, శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, కాజల్, సిరిలు మాత్రమే ఉన్నారు. ఇక ఎలిమినేట్ అయిన ప్రియాంక అరియానతో బిగ్‌బాస్ బజ్‌లో ముచ్చటించింది. హౌజ్‌లో ఉన్నంత కాలం మానస్ జపం చేసిన పింకీ బయటకు వచ్చాక కూడా మానస్ పేరునే కలవరించింది. ఈ క్రమంలో ఆమె హౌజ్‌లోని కంటెస్టెంట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎవరూ గెలుస్తారని అరియాన అడగ్గా మానస్ పేరు చెప్పింది. దీంతో అరియాన ఆమె కళ్లు తెరిపిస్తూ పింకీకి ఓ షాకింగ్ వీడియో చూపించింది. చదవండి: ఎలిమినేషన్ అనంతరం పింకీ తొలి ఇంటర్య్వూ.. మానస్ గురించి ఏం చెప్పిందంటే అది చూసి ప్రియాంక భావోద్యేగానికి లోనవుతూ కంటితడి పెట్టుకోగా అరియాన సైతం ఆమెను హత్తుకుని ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానస్, కాజల్.. ప్రియాంక గురించి మాట్లాడుకుంటున్నా వీడియోను అరియానా చూపించింది. ఆ వీడియో చూసి షాకైన పింకీ.. ‘మానస్ చాలా సారీ.. ఇది నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు’ అంటూ చెప్పుకోచ్చింది. మానస్‌కు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడగ్గా.. మానస్ గురించి నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే.. ఎవరినైనా చదివి పక్కనపెట్టేస్తాడు. నాకు పిల్లలుంటే ఎలా చూసుకునేదాన్నో అలాగే చూసుకుంటానంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. చదవండి: సోనూసూద్‌కు మరోసారి షాకిచ్చిన బీఎంసీ, మాట నిలబెట్టుకోలేదంటూ హెచ్చరిక ఇక అరియానా ఇచ్చిన టాస్కులో డౌన్ తంబ్ సింబల్ కాజల్‌కు ఇవ్వగా.. లవ్ సింబల్ శ్రీరామచంద్రకు ఇచ్చింది. పంచ్ సింబల్ మాత్రం మానస్‌కు ఇచ్చి షాకిచ్చింది పింకీ. అలా ఎందుకు అని అరియానా అడగ్గా.. ఏదైనా ఉంటే నాతో మాట్లాడోచ్చు కదా అంటూ సమాధానమిచ్చింది. ఇక పింకీ అంటే మానస్ గుర్తోస్తాడని అరియానా అనగా.. మానస్ గేమ్ నేను ఆడితే ఇక మా ఇద్దరికి ఓకే ట్రోఫీ ఇచ్చేయ్యొచ్చు కదా అంటూ బదులిచ్చింది. కాజల్ మీద మీ అభిప్రాయం ఏంటీ.. తన ఆట ఎలా ఉంటుంది అని అరియానా అడగ్గా.. ప్రతి విషయాన్ని లాగుతూ ఆ గొడవను ఇంక పెద్దతి చేయాలని చూస్తుందనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. అలాగే షణ్ముఖ్ సైలెంట్ కిల్లర్ అని.. స్ట్రాంగ్ అని.. టాస్కులలో తను చేయాలనుకున్నది ఎలాగైనా చేసేస్తాడని చెప్పింది. -
రాజ్ తరుణ్ అంటే అసలు నచ్చదు.. అరియానా షాకింగ్ కామెంట్స్
Ariyana Glory Shocking Comments On Raj Tarun: యంగ్ హీరో రాజ్‌తరుణ్‌పై బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు రాజ్ తరుణ్ అంటే అసలు నచ్చదంటూ అందరినికి షాక్ గురి చేసింది. రాజ్ తరుణ్ తాజాగా నటించిన అనుభవించు రాజా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అరియానా ఓ పాత్ర పోషించింది. ఈ సందర్భంగా మూవీ టీంతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియాన సరదాగా హీరో, దర్శకుడిని ఆటపట్టించింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ఆర్ఆర్ఆర్ మూవీకి అలియా పారితోషికమెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే! ఈ మేరకు అరియాన మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే నాకు అస్సలు నచ్చదు. కానీ తనతో సినిమాకు ఎలా చేశానో అర్థం కావట్లేదు. టీవీలో ఆయన సినిమాలు వస్తే అవి తీసేయ్‌మని చెప్పేదాన్ని. ఒకరోజు రాజ్ కారులో వెళుతుంటే తనకి యాక్సిడెంట్ అవ్వాలని కోరుకున్నా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎందుకని అంత అసహ్యమని మిగతా సినిమా క్రూడ్ అడగ్గా.. ‘ఇలాగే ఒక ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పుడు చాలా సేపు వేయిట్ చేయించాడు. నా ముందే కారులో వెళుతుంటే హీరో ఏంటి వెళ్లిపోతున్నాడని అడగ్గా డబ్బింగ్ కరెక్షన్ ఉందని వెళుతున్నాడు’ అని చెప్పారు. చదవండి: శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలుసా? అంతకు ముందు కూడా ఓ చానల్లో చేసేటప్పుడు రాజ్‌ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. వాళ్ల సినిమా చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. ఇక హీరోతో ఇంటర్వ్యూ అని చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నాను. చూస్తున్నా, చూస్తున్నా ఆయన ఎంతకు రావడం లేదు. మూడు గంటలు వేయిట్ చేశాను. చివరకు ఆయన సినిమా హిట్ అయ్యిందని, సార్ పటా వెళ్లిపోయారని చెప్పారు. ఇలా రెండుసార్లు రాజ్ వల్ల నాకు చేదు అనుభవం ఎదురైంది. అందుకే కారులో వెళుతుంటే యాక్సిడెంట్ అయ్యి కాలో, చెయ్యో విరగాలి అనుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు రాగానే తన ఫస్ట్ మూవీ రాజ్‌తో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. ఇక సినిమా సెట్‌కు రాగానే రాజ్ ఎదురవ్వడంతో ఈయన ఎందుకు వచ్చాడా? అని అనుకున్నానని పేర్కొంది. చదవండి: సెట్లో గాయపడ్డ యంగ్ హీరో, 25 కుట్లు, 2 నెలలు షూటింగ్‌కు బ్రేక్.. ఇక రాజ్ తరణ్ తన పక్కనే కూర్చుని మాట్లాడుతుంటే ‘ఇతనేందుకు నాతో మాట్లాడుతున్నాడు’ అని అనుకునేదాన్ని అంంటూ దర్శకుడు గవిరెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్‌తో మాట్టాడటం నచ్చక మధ్య మధ్యలో గవిరెడ్డి గారిని చూస్తూ ఈయనేవరో తెలియదు, సినిమా ఎందుకు ఒప్పుకున్నానో ఏంటో అంటూ మనసులో తిట్టుకున్నట్టు చెప్పింది. అంతేగాక రాజ్‌తో సీన్స్ చేస్తున్నప్పుడు దర్శకుడు గవిరెడ్డిని చూస్తు ఈయన నా ముందు ఉంటే బాగుండు, ఈ సీన్లో ఆయన ఉంటే బాగుండు అనుకునేదాన్నంటూ అరియాన కామెంట్స్ చేసింది. అంతేగాక ఓ రోజు కావాలనే సెట్లో రాజ్ తరుణ్‌ను 8 గంటలు వేయిట్ చేయించాను అనగానే డైరెక్టర్ అరియానను ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఈ ఇంటర్వ్యూలో అనుభవించు రాజా మూవీ హీరోయిన్, దర్శకుడు గవిరెడ్డి, బిగ్‌బాస్ ఫేం రవి కృష్ణ కూడా పాల్గొన్నారు. -
ఒకరు చచ్చిపోతుంటే కూడా కాజల్‌కు అదే కావాలి: యానీ
Bigg Boss Telugu 5, Anee Master Bigg Boss Buzz Video: బిగ్‌బాస్ హౌస్‌లో 11 వారాల జర్నీకి ఫుల్స్టాప్ పెట్టింది యానీ మాస్టర్. ఆమెను మరికొద్ది రోజులు హౌస్‌లో ఉంచేందుకు ప్రేక్షకులు విముఖత చూపించడంతో షో నుంచి ఎలిమినేట్ అయింది. భారంగా బిగ్‌బాస్ హౌస్‌కు వీడ్కోలు పలికింది. బయటకు వచ్చిన వెంటనే అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. అరియానాకిచ్చిన ఇంటర్వ్యూలో హౌస్మేట్స్ గురించి యానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సిరి షణ్నుతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందటగా అని అరియానా అడగ్గా.. వాళ్లను చూసి అయ్యబాబోయ్ ఏంటీ హగ్గులు, మాకు హగ్గులు దొరకవా అనుకునేవాళ్లమని చెప్పింది యానీ. కాజల్ గురించి చెప్తూ.. ఒకరు చచ్చిపోతుంటే కూడా ముందు నీ స్ట్రాటజీ ఏంటో చెప్పంటూ గుచ్చిగుచ్చి అడుగుతుందని కామెంట్ చేసింది. హౌస్‌లో ఇప్పటికీ నటిస్తున్నవాళ్లు ఉన్నారని, కానీ వాళ్ల పేర్లు మాత్రం బయటకు చెప్పనని దాగుడు మూతలు ఆడింది. శ్రీరామ్ నాలుగో వారం నుంచే తనకు సపోర్ట్‌గా ఉన్నాడని, కానీ ఆ విషయం తనకు తెలియలేదంటూ ఎమోషనల్ అయింది. యానీ మాస్టర్ కన్నింగ్, ఫాల్తూ గేమ్ ఆడుతుందంటూ ఉమాదేవి మాట్లాడిన వీడియో చూపించడంతో ఆమె కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ బజ్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
షణ్ముఖ్, సిరిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సీ.. అరియాన షాక్
Bigg Boss 5 Telugu Jessie Shocking Comments On Shanmukh Jaswanth: బిగ్‌బాస్ హౌజ్ నుంచి జెస్సీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్యం వెంటాడటంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోక తప్పలేదు. సీక్రెట్ రూమ్‌లో పెడితే తనను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోనని వేయి కళ్లతో ఎదురు చూసిన జెస్సీ నిరాశే ఎదురైంది. అయితే జెస్సీ వెళ్లిపోయేముందు కంటెస్టెంట్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చాడు. కాజల్‌కు అందరిని నమ్మకు నీ ఆట నువ్వు ఆడు అంటూ హెచ్చరించాడు. హౌజ్ వీడాకా బిగ్‌బాస్ బజ్‌లో అరియాన గ్లోరీతో ముచ్చటించాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను విడులైంది. ఈ సందర్భంగా జెస్సీ తన విశ్వరూపం చూపించాడు. హౌజ్‌లో పిల్లాడిలా ఉన్న జెస్సీ బయటకు వచ్చాక మిస్టర్ మజ్నుగా మారాడు. చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ! ఇక సిరి, శ్వేతలో ఎవరు నీకు ఇష్టం అని అరియానా ప్రశ్నిస్తే.. ఇద్దరు కలిసొస్తే బావుంటుందని జెస్సీ అన్నాడు. ఇక అరియాన తనదైనశైలో పంచ్ వేయడంతో ఆమెకు కూడా కూడా ఐ లవ్ యూ చెప్పేశాడు. ఈ నేపథ్యంలో సిరిని చూడగానే తెలియని క్రష్ ఏర్పడిందా? అని అరియాన ప్రశ్నించగా షాకింగ్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సిరి, షణ్నుల గురించి మాట్లాడుతూ.. షణ్నుని సిరి భరిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ముగ్గురం టీంగా ఉన్నప్పటికీ షణ్ను ఏదైన తప్పు చేసినా తామే అతని దగ్గరకు వెళ్లి సారీ చెప్పేవాళ్లమన్నాడు. ఇదిలా ఉంటే హౌజ్‌లో అమ్మాయిల ప్రస్తావన రాగానే జెస్సీ ప్లేబాయ్‌లా మాట్లాడటం మొదలు పెట్టాడు. చదవండి: నిన్ను వాడుకుంటున్నారు, జాగ్రత్త: జెస్సీ హెచ్చరిక దీంతో అసలు ఏ అమ్మాయిని వదలవా అని అరియానా అడిగితే, సీక్రెట్ రూమ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిని పంపుతారని ఎదురుచూశానని. కానీ బిగ్‌బాస్ ఎవరినీ పంపలేదన్నాడు. రూంలో ఒక్కడినే ఉన్నా అనడంతో అరియాన అలా అంటుంటే చంఢాలంగా ఉందనడంతో.. నువ్వు సోహైల్ మాత్రం సీక్రెట్ రూమ్‌లో ఉండలేదా? అని ఎదురు ప్రశ్నించాడు. ఆ మాటతో అరియాన కామ్ అయిపోయింది. బాబోయ్ ఎక్కువ మాట్లాడితే నా సీక్రెట్స్యే బయటకు పడేలా ఉన్నాయంటూ వెనక్కి తగ్గింది. ప్రొమో చూస్తుంటే ప్రతి సారి అరియాన అందరిని ఆడుకుంటే ఈ సారి జెస్సీ అరియానను ఆడుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రోగ్రామ్ చివరల్లో ఏదీ ఎడిట్ చేయకండని, అది ఎడిట్ చేస్తే చంపేస్తానని అరియానా వార్నింగ్ ఇవ్వడం కొస మెరుపు. చదవండి: కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి.. ముఖంపై పిడిగుద్దులు, హత్యాయత్నం -
షణ్నుకు వచ్చే భార్య కూడా సిరిలా చేయదు: లోబో
Bigg Boss Buzz, Lobo Interview: ఎంటర్టైనర్ ఆఫ్ హౌస్‌గా పేరు తెచ్చుకున్నాడు లోబో. మొదట్లో తెగ నవ్వించినా రానురానూ డల్ అయిపోయాడు. ఆరోవారం ఫేక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ బయటకు వచ్చేసిన లోబో తాజాగా అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరించే బిగ్‌బాస్ బజ్కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు తన దోస్త్ రవిని పదేపదే ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో చెప్పాడు. అందరూ కొత్త ముఖాలే అని, అందుకే తనకు తెలిసిన రవిని నామినేట్ చేశానని సింపుల్‌గా చెప్పేశాడు. కాజల్ బిగ్‌బాస్ హౌస్‌లో సంవత్సరం ఉండమన్నా ఉంటుందని కామెంట్ చేశాడు. సిరి, షణ్నుతో ఫ్రెండ్షిప్ చేసి జెస్సీ హౌస్‌లో కంటిన్యూ కావాలనుకుంటున్నాడా? అన్న అరియానా ప్రశ్నకు అతడో స్వార్థపరుడని పెదవి విరిచాడు. షణ్నుకు డిఫరెంట్ యాటిట్యూడ్ ఉందని, తనకు గేమ్ ఎలా ఆడాలో బాగా తెలుసని చెప్పుకొచ్చాడు. చెటాకు మాటకు నాలుగు లక్షల మాటలు చెప్పుడు వద్దే వద్దని రవికి సూచించాడు. సిరి.. ఓ పక్క చేసేది చేస్తూనే ఒర్రుతుందన్నాడు. ఇక ఆమె షణ్నుకు చేసే సపర్యల గురించి చెప్తూ.. షణ్ను లేవగానే చేతికి బ్రష్ అందిస్తుంది. అన్ని పనులు చేసి పెడుతుంది. అతడికి వచ్చే భార్య కూడా ఇంతలా చేయకపోవచ్చు. మరోసారి ప్రజల వల్లే తానీ స్టేజీలో ఉన్నానని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు లోబో. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్‌గా మారింది. -
ఎనర్జీ కావాలంటున్న అనుపమ.. కొటేషన్ చెప్పిన అనసూయ
► ఎనర్జీ కావాలంటున్న అనుపమ ► యాంకర్ అనసూయ స్టన్నింగ్ లుక్స్ ► జిమ్‌లో ఫన్నీ వీడియో షేర్ చేసిన జెనీలియా View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
దీపావళికి ఎంటర్టైన్మెంట్ మోత, బిగ్‌బాస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు!
Bigg Boss 5 Telugu, Diwali Episode: పండగ వచ్చిందంటే చాలు సంబరాలు రెట్టింపు చేస్తుంది బిగ్‌బాస్ టీమ్. దసరాకు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసిన బిగ్‌బాస్ ఈసారి దీపావళికి మరో కొత్త ప్లాన్‌తో ముందుకు రాబోతోంది. ఎంటర్టైన్మెంట్ను రెట్టింపు చేసేందుకు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లను రంగంలోకి దించుతోందట! అంటే ఈ వారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బిగ్‌బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్ బాబా భాస్కర్, నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, దివి, సోహైల్, ముక్కు అవినాష్ సండే రోజు నాగ్‌తో కలిసి సందడి చేయబోతున్నారట! మరి వీరిని లోనికి పంపిస్తారా? లేదా గతేడాది లాగే ఓ ప్రత్యేక గదిలో పెట్టి అక్కడినుంచే గేమ్స్ ఆడిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే మరోసారి వారిని బిగ్‌బాస్‌లో చూసే అవకాశం రావడంతో తెగ సంబరపడిపోతున్నారు వారి అభిమానులు. వారి రాకతో ఈ దీపావళి మరిత కలర్ఫుల్గా ఉండటం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఏదేమైనా ఈ మాజీ కంటెస్టెంట్లు షోలోకి వస్తున్నారన్న వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు బిగ్‌బాస్ లవర్స్, -
'రవి కన్నింగ్, స్ట్రాంగ్ కంటెస్టెంట్లను పంపించేస్తున్నాడు'
Bigg Boss 5 Telugu, Priya Elimination Interview: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాపులర్ కంటెస్టెంట్ ప్రియ. అదరకుండా, బెదరకుండా గేమ్ ఆడే ప్రియ ఒకే ఒక్క గొడవతో ఎలిమినేట్ అయిపోయింది. ఒక టాస్కులో సన్నీని రెచ్చగొట్టడం, చెంప పగలగొడతానంటూ నోరు జారడం, అనవసరంగా కయ్యం పెట్టుకోవడం లాంటి వింత ప్రవర్తనను బిగ్‌బాస్ ప్రేక్షకులు సమ్మతించలేకపోయారు. ఫలితంగా అప్పటిదాకా ఓటింగ్‌లో టాప్‌లో దూసుకెళ్లిన ప్రియ ఆ ఒక్క ఎపిసోడ్‌తో కిందకు పడిపోయింది. వెరసి.. ఏడోవారం బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పేసింది. తాజాగా ఆమె అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. యాంకర్ రవి గురించి చెప్తూ.. అతడు ఎత్తుకు పై ఎత్తులు వేయగలడని తెలిపింది. 'రవితో కలిసి గేమ్ ఆడినవాళ్లు ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నారో, మరేంటో తెలీదు కానీ నెక్స్ట్ వీక్ వాళ్లు పక్కా ఎలిమినేట్ అవుతున్నారు, ఎందుకు?' అని ప్రశ్నించింది అరియానా. దీనికి ప్రియ బదులిస్తూ.. అందుకే అతడిని వెరీ కన్నింగ్, వెరీ స్మార్ట్ అంటుంటాను. 'ఎవరెవరు స్ట్రాంగో, వాళ్లను పంపించే ప్లాన్‌లో ఉన్నాడు రవి' అని అతడి గేమ్‌ను బయటపెట్టింది. కాజల్ గేమ్‌ప్లాన్‌కు అందరూ భయపడాల్సిందేనన్న ప్రియ ఆమె టాప్ 5లో ఉండకూడదని కోరుకోవడం గమనార్హం. 'ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలనుకుంటే వారి అంతు చూసేంతవరకు వదలరా?' అని అరియానా సూటిగా ప్రశ్నించగా 'అది నా గేమ్ ప్లాన్' అంటూ తెలివిగా బదులిచ్చింది ప్రియ. స్టేజీమీద షణ్ముఖ్‌ను ఆకాశానికెత్తేసిన ప్రియ ఇంటర్వ్యూలో మాత్రం అతడు భయంకరమైన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. అతడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదని పేర్కొంది. సిరి మాట్లాడేదంతా ఫేకే అని, ఆమె మాటలేవీ తనకు నచ్చవని చెప్పింది. సిరి గేమ్ కోసం ఏదైనా చేస్తుందని చెప్పుకొచ్చింది. ప్రియాంకను దూరం పెడితే ప్రేక్షకులు ఏం అనుకుంటారోనని మానస్ ఆమెను భరిస్తున్నాడా? అని అరియానా క్వశ్చన్ చేయగా.. అదంతా ఫేక్ అని తేల్చే పారేసింది ప్రియ. మొత్తానికి ఈ ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే ప్రియ బిగ్‌బాస్ స్టేజీపై మాట్లాడినదానికి, బజ్ ఇంటర్వ్యూలో మాట్లాడినదానికి పొంతనే లేదంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు. -
జాగ్రత్త అంటోన్న అక్షయ్, అవి కూడా జీవితాన్నిఇస్తాయంటున్నా అరియాన
తక్కువ విచారించండి, ఎక్కువ నవ్వండి: ప్రగ్యా జైస్వాల్ కొన్ని సమయంలో జీవం లేని వస్తువులు కొత్త జీవితాన్ని ఇస్తాయంటున్న అరియాన గ్లోరీ రణ్వీర్ సింగ్‌కు అలియారేఅలియా స్టేప్పులేస్తున్న అక్షయ్ కుమార్. ఈ స్టెప్పులతో జాగ్రత్త అంటూ హెచ్చరిక ‘నేటి ఈ కష్టం రేపటి మీ బంగారు భవిష్యత్తుకు పునాది’ అంటున్న ప్రియమణి View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి!
టీవీ కమెడియన్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ వివాహ వేడుక ముగిసింది. ఇటీవల తన చిన్ననాటి స్నేహితురాలైన అనుజను నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ ఈ రోజు ఆమె మెడలో మూడు మూళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది నటీనటుల మధ్య అవినాష్ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ దివి, అరియాన గ్లోరీ, సయ్యద్ సోహైల్‌తో పాటు పలువురు వివాహ వేడుకకు హజరై సందడి చేశారు. చదవండి: పెళ్లి కొడుకుగా ముస్తాబైన ముక్కు అవినాష్..ఫోటోలు వైరల్ ఇక అవినాష్, అనుజ మెడలో తాళి కడుతున్న వీడియోను కమెడియన్ రాంప్రసాద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే అవినాష్ తన పెళ్లి వీడియోను తన సొంత యుట్యూబ్లో చానల్ ద్వారా విడుదల చేసి అందరికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. కానీ ముందుగానే రాంప్రసాద్ ‘సారీ అవినాష్ బ్లండర్ మిస్టేక్ జరిగింది. కానీ తప్పడం లేదు’ అంటూ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. అలాగే అరియాన, దివితో పాటు పలువురు నటీనటులు పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: పూజా నాకొక్కడికే స్పెషల్ అనుకున్నా.. కానీ కాదు: అల్లు అర్జున్ View this post on Instagram A post shared by Jabardasth Ram Prasad (@jabardasth_ramprasad) -
షణ్ముఖ్, జెస్సీని సిరి రెచ్చగొడుతుంది: శ్వేత
బిగ్‌బాస్ హౌస్‌లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో సెట్ శ్వేత ఒకరు. ముక్కుసూటితనం, ఏదైనా నిలదీసే గుండెధైర్యం.. ఇవన్నీ చూసి శ్వేత హౌస్‌లో చాలారోజులపాటు కొనసాగుతుందనుకున్నారంతా! కానీ ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆమెను ఆరోవారంలోనే షో నుంచి పంపించివేశారు. బిగ్‌బాస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నెటిజన్లు. లోబోకు బదులుగా ఆమెను సీక్రెట్ రూమ్‌కు పంపించినా ఆట రసవత్తరంగా ఉండేదని పెదవి విరుస్తున్నారు. తను రీఎంట్రీ ఇస్తే బాగుండని ఆశపడుతున్నారు అభిమానులు. ఇదిలా వుంటే ఎలిమినేట్ అయిన శ్వేతా వర్మ.. అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. రవి ఏది చెప్తే అది లోబో ఫాలో అయిపోతాడంది, ఇక రవి తన గేమ్ తను ఆడాలని హితవు పలికింది. మీ కంటే వీక్ కంటెస్టెంట్ ఎవరున్నారు? అన్న అరియానా ప్రశ్నకు కాజల్ మీద మంచి ఒపీనియన్ లేదని చెప్పుకొచ్చింది. రవి మీద కూడా పాజిటివ్ ఒపీనియన్ లేదని తెలిపింది. బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి రోజు నుంచి సిరిని ఇండివిడ్యువల్‌గా చూడలేదంది. సిరి.. షణ్ముఖ్, జెస్సీని రెచ్చగొడుతుందా? అన్న ప్రశ్నకు శ్వేత అవునని బదులిచ్చింది. మా అమ్మ ఉండుంటే ఇంకోలా ఉండేది, నా తల్లిని మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ అయింది శ్వేత. -
అతడి ఫొటోను కాలితో తన్నిన నటరాజ్ మాస్టర్, షాక్‌లో అరియానా!
Nataraj Master BiggBoss Telugu 5 Elimination Interview: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో నుంచి నాలుగోవారం సింహం బయటకు వచ్చేసింది. కంటెస్టెంట్లందరికీ ఒక్కో జంతువు పేరిచ్చే నటరాజ్ మాస్టర్ తనకు తాను సింహం అని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే కదా! ఈ సింహం సింగిల్‌గానే షో నుంచి ఎలిమినేట్ అయింది. తాజాగా మాస్టర్ బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరేంటి? అనేది పూసగుచ్చినట్లుగా వివరించాడు. తనకు ఎవరి మీదైతే కోపం ఉందో ఇంటర్వ్యూలో వారి తాట తీసినట్లు కనిపిస్తోంది. అరియానా గ్లోరీ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడాడో చదివేయండి.. మొదటగా నటరాజ్ మాస్టర్ విశ్వతో పాటు మరో కంటెస్టెంట్ ఫొటోను కింద పడేసి కాలితో తన్నేశాడు. తన ఫ్రస్టేషన్ అంతా బయటపెడుతూ గట్టిగా అరవడంతో అరియానా ఒక్కసారిగా షాకైంది. తర్వాత మాస్టర్.. ఒక్కో కంటెస్టెంట్ గురించి మాట్లాడాడు. యాంకర్ రవి టాస్క్ వచ్చినప్పుడు నత్తలాగా, నామినేషన్స్‌లో గుంటనక్కలాగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. శ్వేత.. బిగ్‌బాస్ హౌస్‌లో తనకో ప్రపంచాన్ని సృష్టించుకుందన్నాడు. ప్రియను ఫిట్టింగ్ మాస్టర్ అని పేర్కొన్నాడు. తర్వాత జెస్సీ గురించి మాట్లాడుతూ.. వీడు పిల్ల బచ్చానే కానీ, మొన్న పులిహోర కలపడానికి ప్రయత్నించగా అది పులిసిపోయింది అని నవ్వేశాడు. శ్రీరామచంద్ర ముద్దపప్పులా వచ్చాడని, అతడు యాక్ట్ చేస్తున్నాడని కుండ బద్ధలు కొట్టేశాడు. 'మీరు మైక్ ధరించండి, చెవుల్లో మాట్లాడకూడదు' అన్న హెచ్చరికలు కాజల్నుద్దేశించే వస్తాయని తెలిపాడు. షణ్ముఖ్ పరమానందయ్య శిష్యుడని, తెలివి ఉన్నప్పటికీ దాన్ని వాడట్లేదని పెదవి విరిచాడు. ఇక లోబోను పొగిడినట్లే పొగిడి అతడి గాలి తీసేశాడు నటరాజ్ మాస్టర్. బిగ్‌బాస్ అంత ఫుడ్ పంపిస్తున్నా లోబో డస్ట్‌బిన్‌లో ఆహారం వెతుక్కోవమేంటి? అని అరియానా ప్రశ్నించగా అదంతా డ్రామా అని నొక్కి చెప్పాడు నట్టూ. లోబో ఇంకా రవి ఇచ్చిన మాస్క్‌లోనే ఉన్నాడని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. -
కొత్త కారుతో అరియానా ఫొటో షూట్.. కేక పుట్టిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ
యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అరియానా గ్లోరీ.. బిగ్‌బాస్ నాల్గో సీజన్ ద్వారా చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్‌గా ఎన్నో ఇంటర్వ్యూలు చేసినప్పటికీ.. రామ్‌గోపాల్ వర్మ ఇంటర్వ్యూతోనే ఆమె ఫేమస్ అయిందని చెప్పాలి అరియానా సూటి ప్రశ్నలకు.. ఆర్జీవీ బోల్డ్ సమాధాలు ఇవ్వడంతో ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఆ ఇంటర్వ్యూ వల్లే అరియానా బిగ్‌బాస్ రియాల్టీషోలో పాల్గొనే అవకాశాన్ని పొందింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన అనంతరం అరియానా ఎక్కువ రోజులు ఉండదేమో అనుకున్నారు. కానీ అవినాష్‌తో కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ఆమె షో చివరి వరకు ఉన్నారు. బిగ్‌బాస్ హౌస్ ద్వారా అరియానా భారీ రెమ్యునరేషనే అందుకుందట. మొదట్లో వెళ్లిపోవాల్సిన ఆమె చివరి వరకు పోరాడి టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక అవినాష్‌తో ఇంటర్వ్యూలు కొనసాగిస్తూ యూట్యూబ్ ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సంపాదించింది ప్రస్తుతం అరియానా బిగ్‌బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తుంది. ఇక రీసెంట్గా అరియానా గ్లోరీ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఎప్పటి నుంచో సొంతంగా మంచి కారు కొనుక్కోవాలని చూస్తున్న అరియానా మొత్తానికి ఇప్పుడు తన కలను నెరవేర్చుకుంది. కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను కూడా అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
సెలబ్రేషన్స్‌లో సమంత...తర్వాత జరిగేది ఇదేనన్న దీపిక
► సెల్ఫ్ టైం అంటున్న సదా ► సాకీ సెలబ్రేషన్స్‌లో సమంత... ► కాలం గడుస్తున్నా నేను ఇలానే ఉన్నా అంటున్న లావణ్య ► పెరుగన్నాన్ని ఎంజాయ్ చేస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్ View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by HK (@realhinakhan) -
కంటెంట్ కోసం నువ్వు కాజల్ దగ్గరకు వెళ్లావు: అరియానా పంచ్
19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. తొలివారం సరయు, రెండోవారం ఉమాదేవి, థర్డ్ వీక్‌లో లహరి షారి(అమ్ము) హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. తాజాగా ఎలిమినేట్ అయిన లహరి బిగ్‌బాస్ బజ్‌లో అరియానా గ్లోరీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. నిజానికి ఇది ఇంటర్వ్యూలా కాకుండా వీళ్లిద్దరికీ మధ్య చిన్నపాటి ఫైట్ జరిగినట్లే కనిపించింది. అరియానా ఏకధాటి ప్రశ్నలతో లహరికి ముచ్చెమటలు పట్టించింది. జెస్సీ ఏం చేయకుండానే కెప్టెన్ అయ్యారంటారా? అని సూటిగా ప్రశ్నించడంతో లహరి నీళ్లు నమిలింది. కాజల్ అస్తమానం ఏదో ఒక కంటెంట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుందని అమ్ము ఆరోపించగా.. కంటెంట్ కోసం మీరు కాజల్ దగ్గరకు వెళ్లినట్లు అనిపించిందని కౌంటరిచ్చింది అరియానా. అలా అనిపించిందీ అంటే మీరు సరిగా షో చూడలేదని రివర్స్ పంచ్ ఇచ్చింది లేడీ అర్జున్‌రెడ్డి. అలాగే బిగ్‌బాస్ షోలో ఫ్యాన్‌బేస్ అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం అని లహరి అభిప్రాయపడగా.. 'ఆడియన్స్ ఓటేయాలంటే ముందు మనం గేమ్ ఆడాలి' అని ఆమె పెద్దగా పర్ఫామ్ చేయలేదని చెప్పకనే చెప్పింది బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం ఈ బిగ్‌బాస్ బజ్ ప్రోమో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. 'వాళ్లు ఓటేయాలంటే ముందు మనం గేమ్ ఆడాలి' అని అరియానా ఇచ్చిన లాస్ట్ పంచ్ మాత్రం అదిరిపోయిందంటున్నారు అభిమానులు. మూడో ఇంటర్వ్యూకే ఆమె హోస్టింగ్ చాలా మెరుగుపడిందంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రం ఆమె ఇంటర్వ్యూ చెత్తగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎలిమినేట్ అయ్యానన్న బాధలో ఉన్న లహరిని టార్గెట్ చేస్తూ, తన ప్రశ్నలతో మానసికంగా మరింత బాధపెట్టిందని అంటున్నారు. బిగ్‌బాస్ షో నుంచి వెళ్లిపోయి ఏడాది దాటుతున్నా బిగ్‌బాస్ బజ్కు హోస్ట్‌గా మారి మరోసారి కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తోందని విమర్శిస్తున్నారు. -
కొత్త కారు కొన్న అరియానా, ఆ ఇద్దరితో ఫస్ట్ రైడ్!
Bigg Boss Beauty Ariyana Purchase New Car: బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ ఓ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది. కొత్త కారు కొన్నానంటూ దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అభిమానులతో పాటు, పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన కియా కారును ఇంటికి తీసుకొచ్చినందుకు గాల్లో తేలిపోతుందీ అరియానా. బిగ్‌బాస్ నాల్గో సీజన్ సెకండ్ రన్నరప్ సోహైల్, బుల్లితెర నటుడు అమర్దీప్ అప్పుడే ఫ్రెండ్ కారెక్కి షికారు కూడా మొదలెట్టేశారు. బిగ్‌బాస్‌లో సోహైల్, స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో అమర్దీప్ అరియానాకు క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో కొత్త కారు కొన్న సంతోషాన్ని ఆ ఇద్దరితో పంచుకుంటూ అప్పుడే షికారు మొదలెట్టేసిందీ బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం అరియానా బిగ్‌బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా మరోవైపు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా మారింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సరయు, ఉమాదేవి ఇద్దరినీ అరియానా ఇంటర్వ్యూ చేయగా ఆ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
హల్చల్ : అలా ఉండాలంటున్న వర్మ .. మిస్ అవుతున్న అనన్య
► బిగ్‌బాస్ బ్యూటీస్‌తో ఆర్జీవీ ► ఆలోచనల్లో పడిపోయిన రాశీ ఖన్నా ► మిస్ అవుతానంటున్న అనన్య పాండే ► రీల్స్‌లో మునిగిపోయిన అలేఖ్య ► ఒకే ఫ్రేములో బిగ్‌బాస్ బజ్ హోస్టులు ► అఖిల్ తన ఫర్ఎవర్ ఫ్రెండ్ అంటున్న మోనాల్ View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by Marina Abraham Sahni (@marina.a1203) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
జీవితమే పెద్ద ఛాలెంజ్, బాధగా ఉన్నా స్వీకరించాల్సిందే: అరియానా
Ariyana Glory As Bigg Boss Buzz Host: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా బిగ్‌బాస్ బజ్కు మహిళా కంటెస్టెంట్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతోంది. నాలుగో సీజన్లో ఫైటర్‌గా పోరాడి టాప్ 5కు చేరుకున్న బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ ఈ సీజన్ బజ్కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ రోజు ఎలిమినేట్ అవనున్న కంటెస్టెంట్‌పై ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. 'బిగ్‌బాస్ బజ్ చేయడం నాకు కష్టంగా ఉంది. ఎందుకంటే నేను హౌస్‌లో ఉన్నప్పటి విషయాలు గుర్తొస్తున్నాయి. ఈ రోజు ఎలిమినేట్ అయ్యే వ్యక్తిని ఫేస్ చేయబోతున్నా.. ఆ వ్యక్తి ఎవరనేది నాకు తెలీదు. హౌస్ నుంచి బయటకు వచ్చే వ్యక్తికి నేనిచ్చే సందేశం ఒకటే.. జీవితం చాలా పెద్దది. ప్రతి ఒక్కటి ఒక అనుభవం, ఇది చాలా పెద్ద అనుభవం. ఈ అనుభవం నుంచి జీవితాన్ని ఇంకా చూడబోతున్నారు. జీవితమే ఒక పెద్ద ఛాలెంజ్. బాధగా ఉన్నా దాన్ని స్వీకరించాల్సిందే' అని అరియానా చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
టెన్షన్ పడుతున్న అరియాన, తగ్గేదే లే అంటున్న శేఖర్ మాస్టర్!
► బిగ్‌బాస్ బజ్‌లో టెన్షన్ పడుతున్న అరియాన గ్లోరీ, తొలి ఎలిమినేట్ కంటెస్టెంట్‌తో మాజీ కంటెస్టెంట్ చిట్‌చాట్ ► హోయలు పోతున్న బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ ► బ్లాక్ డ్రెస్‌లో రష్మి ఫొటోషూట్, ఫిదా చేస్తున్నా యాంకర్మ ► చీరకట్టులో యాంకర్ వర్షిణీ ► అల్లు అర్జున్‌తో శేఖర్ మాస్టర్, తగ్గేదే లే అంటున్న ఈ టాప్ కొరియోగ్రాఫర్ ► రోమియో.. జూలియట్ అంటూ ప్రేమకథలు చెబుతున్న ఊర్వశి రౌతెల View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sekhar Master (@sekharmaster) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shalini (@shalzp) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) -
లంగా ఓణిలో నభా ,చీరకట్టులో రష్మీ.. తారల అందాలు చూడతరమా!
ఫ్యామిలీతో వినాయక చవితి పూజలు జరుపుకుంది భాలీవుడ్ భామ కరీనా కపూర్. దానికి సంబంధించిన ఫోటోని అభిమానులతో పంచుకుంది యాంకర్ లాస్య తన తండ్రికి ట్రాక్టర్‌ను బహుమతిగా అందించింది లంగా ఓణి ధరించి కొలను వద్ద సందడి చేసింది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ చీరకట్టులో నిండు జాబిలిగా దర్శనమిచ్చింది యాంకర్ రష్మీ View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Allu Arha❤️ (@alluarhaaa) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
రేపటి నుంచి అరియానా కథ వేరే ఉంటది: సోహైల్
Bigg Boss 5 Telugu Buzz Host: తెలుగు ప్రేక్షకులకు టన్నుల కొద్దీ కిక్కిచ్చేందుకు బిగ్‌బాస్ సీజన్ 5 రెడీ అయింది. ఎప్పటిలాగే ఈసారి కూడా హౌస్‌లో సోషల్ మీడియా, బుల్లితెర సెలబ్రిటీల సంఖ్యే అధికంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఇక వారాంతాల్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసే బిగ్‌బాస్ బజ్ ప్రోగ్రామ్‌కు గత సీజన్ నుంచి ఓ కంటెస్టెంట్‌ను నిర్వాహకులు సెలక్ట్ చేశారు. ఆమె మరెవరో కాదు బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. తాజాగా అరియానా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన వీడియోతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లైంది. 'అందరికీ నమస్కారం. బిగ్‌బాస్ 4 జర్నీకి ఏడాది పూర్తైంది. నాకోసం సమయం కేటాయించి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రేపు ఒక ఎగ్జయిటింగ్ వార్తను మీకు తెలియజేయబోతున్నాను, అప్పటివరకు వెయిట్ చేయండి' అని చెప్పుకొచ్చింది. తను షేర్ చేసిన మరో వీడియోలో సోహైల్ మాట్లాడుతూ.. 'అరియానా రేపు టీవీలో కనిపిస్తుంది. చాలా స్పెషల్. రేపటినుంచి కథ వేరే ఉంటది. ఆల్ ద బెస్ట్ అరియానా, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. కుమ్మేసేయ్. ఆమె కోసం వెయిట్ చేయండి' అంటూ అరియానా బిగ్‌బాస్ బజ్ హోస్ట్‌గా రాబోతోందని చెప్పకనే చెప్పేశాడు. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
అవినాష్ పెళ్లిపై స్పందించిన బిగ్‌బాస్ బ్యూటీ..
Ariyana Glory On Avinash Engagement: ముక్కు అవినాష్ జబర్దస్త్ కార్యక్రమంతో మంచి గుర్తింపే కాకుండా బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ నటుడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బిగ్‌బాస్ బ్యూటీ అరియాన గ్లోరీ స్పందించింది. బిగ్ బాస్ హౌస్‌లో అవినాష్, అరియానతో చనువుగా ఉండటం, ఈ షో అయ్యాక కూడా తరచూ వీరు కలిసి ఈవెంట్స్ చేయడం, గోవా ట్రిప్‌లు, వీడియోలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని పుకార్లు వచ్చాయి. అయితే అవినాష్ తన పెళ్లి వార్తతో ఆ పుకార్లకు బ్రేక్ వేశాడు. ఇక దీనిపై అరియాన.. అవినాష్ పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటూ తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ‘మా మధ్య ఏదో ఉందని చాలా పుకార్లు ఉన్నాయి కానీ అలాంటిదేమీ లేదు. తను నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అవినాష్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’..అని క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న అరియాన బాగా డబ్బు సంపాదించి, సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. చదవండి: Tollywood Drug Case: అమ్మతోడు ఈడీ కార్యాలయానికి అందుకే వచ్చా: బండ్ల గణేశ్ -
బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ బజ్ హోస్ట్‌గా అరియాన గ్లోరీ!
బుల్లితెరపై బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ సందడి మొదలైంది. బిగ్‌బాస్ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది. ఈ ఏడాది షో ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు చెక్ పెడుతూ ఈ షో ప్రోమోను నిర్వాహకులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే షో ప్రారంభం కానున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్‌ను అగష్టు 22న క్వారంటైన్‌కు పంపించనున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కాగా బిగ్‌బాస్‌కు సీక్వెన్స్‌గా బిగ్‌బాస్ బజ్ అనే మరో కార్యక్రమం కూడా ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోకు హోస్ట్గ్ హౌజ్‌లో అంత్యంత క్రేజ్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్‌ను నిర్ణయిస్తారు నిర్వహకులు. గత సీజన్లో హీరో తనిష్, రాహుల్ సిప్లీగంజ్‌లు హోస్ట్‌గా వ్యవహరించగా ఈ సారి బిగ్‌బాస్ బజ్కు అరియాన గ్లోరీని హోస్ట్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంతో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను ఇంటర్వ్యూ చేసిన హౌజ్‌లో వారి అనుభవాన్ని, ఇతర ఆసక్తిరకర విషయాలపై చర్చిస్తారు. కాగా నాలుగవ సీజన్లో అరియాన హౌజ్‌లో తనదైన తీరు, ముక్కుసూటి తనంతో ఎంతో మంది ప్రేక్షక ఆదరణను పొందింది. నేపథ్యంలో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బిగ్‌బాస్ బజ్కు అరియానను హోస్ట్‌గా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
గరం గరం ముచ్చట్లు 01 August 2021
-
హల్చల్ : రీల్స్‌తో సమంత.. అలా సరదా అంటున్న సునీత
♦ రీల్స్‌తో అదరగొట్టిన సమంత ♦ షూటింగ్లో పిల్లలతో ఉండటం సరదా అంటున్న సునీత ♦ బీచ్ అందాలను ఎంజాయ్ చేస్తున్న లావణ్య ♦ గ్రీన్ డ్రెస్‌లో కంగనా సోయగాలు ♦ కవ్విస్తున్న మలైకా అరోరా అందాలు ♦ గ్రేస్‌లో ఆరు గజాలుంటాయంటున్న షెఫాలి ♦ బెస్ట్ మూమెంట్స్‌ని ఎలా ఫీల్ అవ్వాలో చెబుతున్న అరియానా View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) -
వెంటిలేటర్‌పై బిగ్‌బాస్ బ్యూటీ అరియానా.. ఫోటో వైరల్
Ariyana on Ventilator : బిగ్‌బాస్ షో అనంతరం అరియానా గ్లోరీ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందన్న సంగతి తెలిసిందే. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా అరియానా పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. రీసెంట్గా ఆర్టీజీవో చేసిన ఇంటర్వ్యూతో అరియానా పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌పై ఫోకస్ చేసిన అరియానా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫోటో అభిమానులను షాక్‌కి గురిచేసింది. వెంటిలేటర్‌పై అరియానాను చూసి ఆమె ఫ్యాన్స్‌కి గుండె ఆగినంత పని అయ్యింది. అయితే ఇది రియల్ లైఫ్‌లో జరిగింది కాదు. సినిమా షూటింగ్లో భాగంగా అరియానా అలా వెంటిలేటర్‌పై కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా అరియానా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సినిమాలో అరియానా ఓ రోల్లో కనిపించనున్నట్లు తెలిసిందే. షూట్లో భాగంగా వెంటిలేటర్‌పై కనిపించి అరియానా షాకిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
హల్చల్ : అనసూయ నవ్వులు.. అరియానా కొటేషన్లు
♦ భర్తతో క్యూట్ ఫోటో షేర్ చేసిన యాంకర్ అనసూయ ♦ 60మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్న నేహా కక్కర్ ♦ లాస్యతో బోల్డ్ లేడీ అరియానా నవ్వులు ♦ కూతురికి ప్రేమగా విషెస్ తెలిపిన శ్రీదేవి ♦ బాయ్ ఫ్రెండ్ రియాక్షన్‌పై రీల్స్ చేసిన టిక్‌టాక్ బ్యూటీ భాను ♦ క్యాప్షన్స్ కోసం ఆలోచిస్తే సాంగ్స్ వస్తాయేంటో అంటున్న దివ్యాంక ♦ పిట్ట మనుసులో ఏముంది అంటూ అషూ రెడ్డి రీల్స్ ♦ ఫోటో షూట్ షేర్ చేసిన యాంకర్ లాస్య ♦ పానీపూరి బండిని తోలుతున్న తేజస్వి ♦ బీచ్‌లో సందడి చేస్తున్న ఎఫ్-3 బ్యూటీ మెహ్రీన్ View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by 𝘊𝘩𝘢𝘳𝘭𝘪𝘦 𝘊𝘩𝘢𝘶𝘩𝘢𝘯 🅷🅴🅴🆁 🕉️ (@charliechauhan) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)