బికినీ ఫోటోలు షేర్‌ చేసిన అరియానా.. ఇంటర్నెట్‌లో వైరల్‌ | Actress Ariyana Glory Sher Photos Goes Viral | Sakshi
Sakshi News home page

బికినీ ఫోటోలు షేర్‌ చేసిన అరియానా.. ఇంటర్నెట్‌లో వైరల్‌

Dec 15 2023 5:53 PM | Updated on Dec 15 2023 6:21 PM

Actress Ariyana Glory Sher Photos Goes Viral - Sakshi

యాంకర్‌గా కెరీయర్‌ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలను ఎప్పుడూ  సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చినా వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో మరింత పాపులర్‌ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను అరియానా  సొంతం చేసుకుంది.

తాజాగా అరియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో భారీగా వైరల్‌ అవుతున్నాయి. ఎప్పుడూ తన గ్లామర్‌తో కట్టిపడేసే ఈ బ్యూటీ బికినీతో ఉన్న ఫోటోలు షేర్‌ చేసి ఇంటర్నెట్‌లో హీట్‌ పెంచేసింది. ఓటమి ఎదరైనప్పుడు ఇతరులు ఏమనుకుంటున్నారో అని భయపడవద్దు.. భిన్నంగా ఆలోచించండి. ఇతరులు ఏదో అనుకుంటారనే ట్రాప్‌లో పడకండి.' అంటూ ఆమె వ్యాఖ్యానించింది. అరియానా షేర్‌ చేసిన ఫోటోలపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆమే ఫోటోలు షేర్‌ చేసిందో లేదో అప్పుడే వరుస బెట్టి నెగటివ్‌ కామెంట్లు చేయడం ప్రారంభించారు.

ఇదే విషయంలో మరికొందరు అరియానకు సపోర్టుగా కామెంట్లు చేస్తున్నారు. అమె ఉండేది గ్లామర్‌ ఫీల్డ్‌ కాబట్టి ఈరోజుల్లో ఇలాంటి ఫోటోలు కామన్‌ అంటూ తెలుపుతున్నారు. వెండితెరపై ఇప్పుడిప్పుడే కనిపించే వారే హాట్‌ ఫోజులకు వెనకాడటం లేదు. మరి ఆమె చేస్తే తప్పేంటి అంటూ కామెంట్లు వస్తున్నాయి. అరియానా ఏ విషయంలోనైనా బోల్డే... ఆమె ఏదైనా విషయంపై మాట్లాడినా చాలా ఓపెన్‌గానే చెబుతుంది. తనకు నచ్చినట్లే ఉంటుంది. ఇదే విషయాన్ని బిగ్‌ బాస్‌లో ఉన్నప్పుడే ఆమె తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement