'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్‌బాస్ ఆదిరెడ్డి ఆవేదన! | Bigg Boss Adi Reddy Emotional Video On Vizag Incident | Sakshi
Sakshi News home page

Adi Reddy: 'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్‌బాస్ ఆదిరెడ్డి ఆవేదన!

Apr 15 2025 7:56 PM | Updated on Apr 15 2025 8:12 PM

Bigg Boss Adi Reddy Emotional Video On Vizag Incident

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్‌ మ్యాన్‌ కోటాలో బిగ్‌ బాస్‌-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్‌-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా  బిగ్‌బాస్‌ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్‌ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.

తాజాగా ఇటీవల విశాఖలో జరిగిన దారుణంపై ఆదిరెడ్డి స్పందించారు. ప్రేమ పెళ్లి చేసుకుని నిండు గర్భిణీని హత్య చేసిన ఘటనపై ఆదిరెడ్డి ఎమోషనలయ్యారు. రెండు ప్రాణాలను ఎలా చంపేశావ్‌ రా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. మరికొన్ని గంటల్లో డెలివరీ కాబోతున్న భార్యను గొంతు నులిమి చంపే కోపం ఎందుకు వస్తుందని అని నిలదీశారు. నిన్ను నమ్మి తన కుటుంబాన్ని వదిలేసి వస్తే ఇంత దారుణానికి ఒడిగట్టావంటే నువ్వెంత కసాయి నాకొడుకు అయి ఉండాలి ఆదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మాయిలు ప్రేమించేటప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచించండి.. ప్రేమలో ఉన్నప్పుడు ఎందుకంటే అబ్బాయిలు నటించడం వారితి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఆరెంజ్‌డ్ మ్యారేజ్ చేసే తల్లిదండ్రులు సైతం పొరపాట్లు చేస్తున్నారు. అబ్బాయి కాస్తా ఎర్రగా ఉండి, డబ్బులు, ఆస్తి ఉంటే చాలని పెళ్లిళ్లు చేసేస్తున్నారు. వాడి గుణమేంటో ఎవరూ చూడట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోబోయే వాడి సిబిల్ స్కోర్‌, వాడు మంచోడా కాదా? వాడి మిత్రులు, బంధువులను అడిగి తెలుసుకోవాలి.. అలా చేయకపోతే తర్వాత అమ్మాయి జీవితాన్ని మనమే నాశనం చేసినవాళ్లమవుతాం అన్నారు. సమాజంలో ఉన్న ఇలాంటి సైకో గాళ్లను కచ్చితంగా ఉరి తీయాలని ఆదిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement