Adi Reddy
-
"దమ్ముంటే రా.." ఆదిరెడ్డి వాసుకి ఛాలెంజ్
-
'తప్పుగా అనుకోవద్దు ప్లీజ్'.. వారందరికీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ రిక్వెస్ట్!
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్‌బాస్ సీజన్-7పై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఆదిరెడ్డికి ఓ సమస్య వచ్చిపడింది. సాయం కావాలంటూ ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అభిమానులుకు ఆదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ కూడా ఇలా రావొద్దంటూ రిక్వెస్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: అయోధ్య రామ మందిరానికి బిగ్ బాస్ 'ఆదిరెడ్డి' విరాళం) ఆది రెడ్డి వీడియోలో మాట్లాడుతూ మాట్లాడుతూ.. 'దయచేసి అర్థం చేసుకోండి .. నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. నాకు వీలైనంత సాయం చేస్తుంటే ఉంటా. కానీ డైరెక్ట్‌గా ఇంటికి చాలా మంది వస్తున్నారు. వాళ్ల అందరికి నేనేం చేయగలను చెప్పండి . ఎవరు వచ్చినా ఆహారం అంటే ఒకరోజు పెట్టించగలను. కానీ వాళ్ల బాధలన్నీ చెప్పినా నేను ఏం చేయలేని పరిస్థితి. దయచేసి ఎవరు కూడా ఇంటికి కానీ.. సెలూన్‌కు కానీ రావొద్దు. సమాజానికి నా వంతు కృషి చేస్తాను. అంతే కానీ అందరికి చేయలేను కదా. ఎలాగోలా వచ్చిన వాళ్లకి ఛార్జీలకి ఇచ్చి పంపుతున్నా . దయచేసి అర్థం చేస్కోండి. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నాతో మాట్లాడాలంటే కామెంట్స్, మెసేజేస్ ద్వారా పంపండి.' అంటూ విజ్ఞప్తి చేశారు ఆదిరెడ్డి. కాగా.. ఆదిరెడ్డి ఇటీవలే 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించాడు. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) -
యాంకర్ రవికి ఎందుకు సారీ చెప్పానంటే?: బిగ్‌బాస్ ఆదిరెడ్డి
బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్న మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి. తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. అయితే తాను ప్రస్తుతం యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. గతేడాది జరిగిన బిగ్‌బాస్ సీజన్-7 షోపై కూడా చాలా వీడియోలు చేశాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్‌గా చాలా సార్లు మాట్లాడారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆది రెడ్డి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో యాంకర్ రవిపై చేసిన వీడియో పట్ల సారీ చెప్పడంపై ఆయన స్పందించారు. ఆదిరెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'యాంకర్ రవి అంటే నాకు భయం లేదు. కానీ నేను అతనికి సారీ చెప్పా. ఎందుకంటే నేను ఫ్యామిలీ రిలేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. నా వల్ల వాళ్లు బాధ పడ్డప్పుడు నేను సారీ చెప్తే తప్పేముంది? మనకు ఫ్యామిలీ రిలేషన్స్ ముఖ్యం కదా?. అసలు ఏం జరిగిందంటే.. బిగ్‌బాస్ టాస్క్‌లో యాంకర్ రవి అన్న సంచాలక్. ఆయనకు బిగ్‌బాస్ కొన్ని రూల్స్ చెప్పాడంట. ఆ విషయం బయట ఉన్న మనకు తెలియదు. కానీ.. నేను రవి అన్న కావాలనే సన్నీని ఓడించాడని నెగెటివ్‌గా వీడియోలో చెప్పా. కానీ హౌస్ లోపల జరిగేవి కొన్ని మనకు చూపించరు కదా. ఆ విషయం నాకు బిగ్‌బాస్ వెళ్లి వచ్చాక అర్థమైంది. మనమే రవిని తప్పుగా అనుకున్నామని నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సారీగా ఫీలయ్యాను. ' అంటూ క్లారిటీ ఇచ్చారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
అమ్మ ఆత్మహత్య చేసుకుంది: కన్నీళ్లు పెట్టుకున్న ఆదిరెడ్డి
ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఆదిరెడ్డి. నామినేషన్స్‌లో తను మాట్లాడినప్పుడు ఎదురు తిరగడానికి హౌస్మేట్స్ జంకేవారు. అంత సూటిగా, గునపంలా తన నామినేషన్ పాయింట్ దింపేవాడు. ఏదైనా పొరపాటు చేసినట్లు అనిపిస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాడు కానీ తను తప్పు చేయలేదనిపిస్తే నాగార్జునను సైతం ఎదిరించేందుకు వెనుకాడడు. బిగ్‌బాస్ ఆరో సీజన్లో అతడు థర్డ్ రన్నరప్‌గా నిలిచాడు. గుండె నిండా సంతోషంతో బయటకు వచ్చిన ఆదిరెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు. 'ఒకప్పుడు నాకెన్నో సమస్యలుండేవి, కానీ ఈరోజు లేదు. 2013లో అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పటికే బ్యాంకులో తీసుకున్న రూ.11 లక్షల లోన్ కట్టలేకపోయాం. 2018లో ఒకటిన్నర ఎకరా అమ్మేసి ఆ లోన్ తీర్చేశాం. అప్పటిదాకా చెల్లె పెన్షన్‌తో బతికాం. నెల్లూరులోని వరికుంటపాడుకు వెళ్తే అక్కడున్న ప్రతి మనిషి నేను పడ్డ కష్టాలన్నీ చెప్తారు. అమ్మ చనిపోయిన పదిహేను రోజుల తర్వాత బయటకు వెళ్తే తిన్నావా? అని జాలిగా అడిగేవారు. అంత దుర్భర స్థితిలో కాలం వెళ్లదీసాం. పెద్దయ్యాక మా అక్క ఫోన్ చేసి రెండు లక్షలు సంపాదించరా? నేను రెండు లక్షలు అప్పు చేసి నీకు పెళ్లి చేస్తానని మాట్లాడింది. అలాంటి దీన స్థాయి నుంచి పెళ్లి చేసుకుని నా కుటుంబంతో మంచి పొజిషన్లో నిలబడటమే కాకుండా ఇంతమంది జనాల ప్రేమను పొందడం నా సక్సెస్. ఒకప్పుడు వదులైన బట్టలేసుకుని తిరిగాను, ఇప్పుడు సూట్లు వేసుకుని దర్జాగా తిరుగుతున్నాను. ఒకప్పుడు నా ఊరు నన్ను జాలిగా చూసింది, ఇప్పుడు వారు గర్వపడేలా చేశాను. చాలా హ్యాపీ.. కష్టాల వల్ల అమ్మ ఆత్మహత్య చేసుకుంది. నాకూ కష్టాలు ఎదురయ్యాయి. కానీ వాటిని తట్టుకుని నిలబడ్డాను. అమ్మ చనిపోయేముందు వరకు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలంటే ఎవరి దగ్గరైనా ఒక బంగారు నగ అడిగి అది వేసుకునేది. ఆమె బతికి ఉండుంటే ఒంటినిండా నగలు వేసేవాడిని' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చదవండి: హీరోయిన్ కంటే ఎక్కువే సంపాదించిన ఆదిరెడ్డి గ్రాండ్ ఫినాలే నుంచి నేరుగా మండపానికి, నేహా పెళ్లి ఫోటో వైరల్ -
హీరోయిన్ కంటే ఎక్కువే సంపాదించిన ఆదిరెడ్డి!
కామన్ మ్యాన్ నుంచి రివ్యూయర్‌గా.. రివ్యూయర్ నుంచి కంటెస్టెంట్‌గా.. కంటెస్టెంట్ నుంచి కెప్టెన్‌గా.. కెప్టెన్ నుంచి థర్డ్ రన్నరప్‌గా ఎదిగాడు ఆదిరెడ్డి. విన్నర్ కాలేకపోయానన్న బాధ కన్నా తనను ఫినాలే వరకు తీసుకొచ్చి ఆదరించినందుకు ఎక్కువ సంతోషపడుతున్నాడు. తనకింత గుర్తింపు తెచ్చిన బిగ్‌బాస్ షోకు, ఓట్లేసి ఇంత దూరం తీసుకువచ్చిన ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. ప్రేక్షకుల అభిమానమే కాకుండా బిగ్‌బాస్ ద్వారా అతడు ఎంత సంపాదించాడో చూద్దాం.. గత కొన్ని సీజన్ల నుంచి ఆదిరెడ్డి రివ్యూలు ఇస్తూ పోతున్నాడు. అతడి రివ్యూలను మెచ్చుకునేవాళ్లు ఉన్నారు, విమర్శించే వాళ్లూ ఉన్నారు. ఏ కంటెస్టెంట్ దగ్గరో డబ్బులు నొక్కేసాడు, అందుకే వారిని పొగుడుతూ వేరేవారిని తిడుతున్నాడన్న మాటలు కూడా వినిపించేవి. కానీ అలాంటి విమర్శలను ధీటుగా తిప్పికొట్టేవాడు ఆదిరెడ్డి. నాకు డబ్బిచ్చేంత సీన్ ఏ కంటెస్టెంట్‌కూ లేదని, బిగ్‌బాస్ షోలో ఉన్నవారి కంటే యూట్యూబ్‌లో తాను ఎక్కువ సంపాదిస్తానని చెప్పేవాడు. తనను కొనడం ఎవ్వరితరం కాదని కుండ బద్ధలు కొట్టేవాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాని మాట్లాడుతూ.. ఒక సినిమాకు స్టార్ హీరోయిన్ అందుకునే పారితోషికం.. తన నెల సంపాదనతో సమానం అని ఆదిరెడ్డే స్వయంగా చెప్పాడని తెలిపాడు. అతడు డబ్బుల కోసం కాకుండా బిగ్‌బాస్ జర్నీని ఆస్వాదించాలని వచ్చాడని పేర్కొన్నాడు. షానీ చెప్పినదాని ప్రకారమైతే బిగ్‌బాస్ అతడికి కోట్లల్లో ఇవ్వాలి. కానీ అంత ఇచ్చుకోలేమని బిగ్‌బాస్ చేతులెత్తేశాడట! సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వారానికి లక్ష రూపాయలకు అటూఇటుగా పారితోషికం అందుకున్నాడట ఆది. ఈ లెక్కన 15 వారాలకుగానూ అతడు దాదాపు రూ.12 లక్షల వరకు ఆర్జించినట్లు తెలుస్తోంది. చదవండి: గ్రాండ్ ఫినాలే రోజు గ్రాండ్‌గా నేహా పెళ్లి, ఫోటో వైరల్ శ్రీహాన్‌కు హింట్.. బిగ్‌బాస్‌పై రేవంత్ ఫ్యాన్స్ ఫైర్ -
కీర్తి వల్ల ఆత్మహత్యలు ఆగుతాయి: ఆదిరెడ్డి
స్పెషల్ గెస్టులతో బిగ్‌బాస్ ఫినాలే అదిరిపోయింది. అయితే సెలబ్రిటీలను ఊరికే పిలుస్తారా? వారితో ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. మొదటగా నిఖిల్ హౌస్‌లోకి వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరైన రోహిత్‌ను ఎలిమినేట్ చేసి తనతోపాటు స్టేజీపైకి తీసుకొచ్చాడు. తర్వాత ధమాకా హీరోహీరోయిన్లు రవితేజ, శ్రీలీల జింతాత స్టెప్పుతో స్టేజీని అల్లాడించారు. అనంతరం ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. పదిమంది నామీద పడి మాట్లాడినా నేను ఎదురునిలబడగలనన్న ధైర్యం బిగ్‌బాస్‌తో వచ్చిందన్నాడు ఆది. తర్వాత అతడు టాప్ 3 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. 'కీర్తి బిగ్‌బాస్ షోలో కనిపించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆత్మహత్యలు ఆగుతాయి. అన్ని కష్టాల్లో ఉన్న ఆమె అంత ధైర్యంగా ముందుకెళ్లడం చాలామందికి ఇన్స్పిరేషన్. రేవంత్‌లో 20 తప్పులు ఉంటే 40 పాజిటివ్‌లు ఉంటాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వదిలి వచ్చి హౌస్‌లో గేమ్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. నాకంటే ఆ ముగ్గురు బాగా ఆడారు. కాబట్టి వాళ్లకంటే ముందే ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉంది' అన్నాడు. చదవండి: కాసేపట్లో పెళ్లి పెట్టుకుని గ్రాండ్ ఫినాలేకు వచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్ లవర్ బాయ్ ఎవరంటే? -
గ్రాండ్ ఫినాలే ప్రోమో అదిరింది.. ఆదిరెడ్డి స్థానం మారింది!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ఎంత గ్రాండ్‌గా ప్రారంభమైందో అంతే గ్రాండ్‌గా ముగియనుంది. మరికొద్ది గంటల్లో ఫినాలే ఎపిసోడ్ మొదలుకానుంది. ఈ ఎపిసోడ్ ఏ రేంజ్లో ఉండబోతోందో సాంపుల్ చూపించేందుకు తాజాగా ప్రోమో వదిలారు. ఇందులో మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు హీరోయిన్స్ స్పెషల్ డ్యాన్సులు కూడా ఉండనున్నాయి. అలాగే నిఖిల్, ధమాకా టీమ్ రవితేజ, శ్రీలీల కూడా స్టేజీపై సందడి చేసినట్లు తెలుస్తోంది. తర్వాత మాస్ మహారాజకు బ్రీఫ్‌కేస్ ఇచ్చి హౌస్ లోపలకు పంపించారు. కానీ ఫైనలిస్టులు ఎవరూ దాన్ని అందుకోవడానికి రెడీగా లేనట్లు కనిపించింది. ఇకపోతే ఎలాగో రేవంత్ విజేతగా అవతరించగా శ్రీహాన్ రన్నర్‌గా నిలిచాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మూడో స్థానంలో ఆదిరెడ్డి ఉన్నాడని మొదట పుకార్లు వ్యాపించినప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం కీర్తి సెకండ్ రన్నరప్‌గా నిలిచిందట. ఆదిరెడ్డి నాలుగో స్థానంతో, రోహిత్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: రూ. 5 లక్షలు పట్టేసిన శ్రీహాన్ -
రూ.5 లక్షలు గెలుచుకున్న శ్రీహాన్, రియలైజ్ అయిన కీర్తి
మాజీ కంటెస్టెంట్ల రాకతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కళ వచ్చింది. మొదటగా రోల్ రైడా హౌస్‌లో అడుగుపెట్టి త్వరలో బీబీ జోడీ షో రాబోతుందంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అది కంటెస్టెంట్లు జంటలుగా పాల్గొనే రియాలిటీ డ్యాన్స్ షో అని తెలిపాడు. తర్వాత ఫైనలిస్టులకు ఆల్ ద బెస్ట్ చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. తర్వాత మెహబూబ్, అషూ జంటగా లోపలకు ఎంట్రీ ఇచ్చారు. వారు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించారు. అందులో భాగంగా ఏ ప్రశ్న అడిగినా తప్పు సమాధానమే చెప్పాలన్నారు. ఇందులో కీర్తి.. శ్రీహాన్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? అని అడగ్గా ఆదిరెడ్డి టపీమని ఇనయ పేరు చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు. అంతలోనే బ్యాడ్‌న్యూస్ అంటూ.. హౌస్‌లో ఒకరిని తమతోపాటు ఎలిమినేట్ చేసి తీసుకెళ్తామనగానే అందరి ముఖాలు వాడిపోయాయి. మరీ టెన్షన్ పెట్టడం మంచిదికాదని భావించిన వాళ్లు ఇది ప్రాంక్ అని చెప్పడంతో హౌస్మేట్స్ ఊపిరి పీల్చుకున్నారు. వారు వెళ్లిపోగానే అవినాష్- అరియానా వచ్చి డ్యాన్స్ చేసి, పంచ్‌లు పేల్చుతూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత చైతూ, కాజల్ వచ్చి ఫైనలిస్టులను సర్ప్రైజ్ చేశారు. శ్రీహాన్ అంటే ఎంటర్టైన్మెంట్, రేవంత్.. కోపం, ఆదిరెడ్డి.. కాన్ఫిడెంట్, రోహిత్.. కామ్ అండ్ కంపోజ్డ్, కీర్తి గేమ్ బాగా ఆడుతుందంటూ ఒక్కొక్కరి గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాడు చైతూ. అనంతరం కొన్ని వస్తువులు వాడుతూ డ్యాన్స్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో కీర్తి గెలిచి ఫ్రైడ్ చికెన్ సంపాదించుకుంది. ఈ జంట వెళ్లిపోగానే రవి-భాను లోపలకు ఎంట్రీ ఇచ్చారు. ఫైనలిస్టులకు టంగ్ ట్విస్టర్స్ ఇచ్చి వాటిని స్పీడ్‌గా చెప్పాలన్నాడు. అందరూ బానే చెప్పినా తెలుగు రాని కీర్తి కొంత తడబడుతూ దాన్ని పూర్తి చేసింది. తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. సీజన్ ముగింపుకు వచ్చేసరికి ఎవరి మీద అభిప్రాయం మారిందో చెప్పాలన్నాడు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. మొదట్లో కీర్తి మంచి ఫ్రెండ్‌గా ఉండేది. కానీ రానురానూ గొడవలయ్యాయి. జీవితంలో ఎన్నో కష్టాలు దాటుకుంటూ వచ్చి ఇక్కడ గేమ్ మీద ఫోకస్ పెట్టి ఇంతవరకు రావడం చిన్న విషయం కాదంటూ ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి.. మొదట్లో రేవంత్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడనిపించింది. కానీ చాలాకాలానికి అది యాటిట్యూడ్ కాదని అర్థమైందన్నాడు. రోహిత్ వంతు రాగా ఆదిరెడ్డి తప్పును అంగీకరిస్తారని తెలుసుకున్నానన్నాడు. రేవంత్ మాట్లాడుతూ.. ఆదిరెడ్డి రివ్యూయర్ కాబట్టి మానిప్యులేటర్ అనుకునేవాడిని. ఈ మధ్యకాలంలో అతడితో ఎక్కువగా ఉంటున్నాను. ఆ సమయంలోనే ఆయన్ను నేనెందుకు అర్థం చేసుకోలేకపోయానని ఫీలయ్యానని చెప్పాడు. కీర్తి వంతు రాగా.. శ్రీహాన్ జెన్యూన్ కాదు, డ్రామా చేస్తున్నాడనుకున్నాను. నాకు సారీ చెప్పినప్పుడు కూడా అది నిజమని నమ్మలేదు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది అని చెప్పింది. ఇకపోతే కొన్నివారాలుగా ఆన్లైన్లో లెన్స్‌కార్ట్ స్టైలిష్ కంటెస్టెంట్ పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే కదా! ఇందులో శ్రీహాన్ గెలిచి స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలవడమే కాకుండా రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ మరుసటి రోజు అఖిల్ సార్థక్, తేజస్విని మదివాడ హౌస్‌లోకి వచ్చి ఆటపాటలతో సందడి చేసి వీడ్కోలు తీసుకున్నారు. చదవండి: అర్జున్ కల్యాణ్‌కు నేనంటే లవ్.. వీడియో చూసి షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ విన్నర్ అతడే! -
సస్పెన్స్‌కు తెరపడింది.. బిగ్‌బాస్6 విన్నర్ అతడే!
బిగ్‌బాస్ సీజన్-6కి మరికాసేపట్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సత్య ఎలిమినేట్ అవగా చివరగా ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరన్న దానిపై నెట్టింట బాగా చర్చ నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌కు పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. టాప్-2లో ఉండాల్సిన ఇనయాను కావాలనే ఎలిమినేట్ చేయడం, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకు ఒకరోజు ముందు సత్యను ఎలిమినేట్ చేయడంపై ఇప్పటికే ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్ పవర్‌తో రేవంత్‌ను విన్నర్ కాకుండా చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు బిగ్‌బాస్ సీజన్-6 విజేత ఎవరన్నదానిపై హౌస్మేట్స్ ఫ్యామిలీతో పాటు ఆడియెన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న(శుక్రవారం)అర్థరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తుంది. ఇక టాప్-4 ప్లేస్‌ను కీర్తి దక్కించుకుంది. టాప్-3లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్‌లు ఉన్నారు. వీరిలో అత్యదికంగా ఓట్లు సంపాదించుకొని సింగర్ రేవంత్ సీజన్-6 విజేతగా నిలవగా, శ్రీహాన్ రన్నరన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్-3తో సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతనిజం ఉందన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
నా తప్పులు మన్నించి విజేతగా నిలపండి.. ప్రేక్షకులను ఓట్లడిగిన శ్రీసత్య
Bigg Boss Telugu 6, Episode 102 Highlights: కంటెస్టెంట్లు అందరూ మీ గమ్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఫినాలే కోసం ఊదరగొట్టాడు బిగ్‌బాస్. మీ మనసుల్లోని మాటలను ప్రేక్షకులతో నేరుగా పంచుకుని వారి నుంచి ఓట్లు కోరవచ్చంటూ ఓట్ అప్పీల్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మొదటగా మీకు వినిపిస్తుందా? అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో బిగ్‌బాస్ ప్లే చేసిన సౌండ్స్‌ను గుర్తించి సరైన ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తక్కువ పాయింట్లు వచ్చిన కీర్తి, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ఛాలెంజ్ నుంచి తొలగిపోయారు. అయితే శ్రీసత్య అరవడం వల్లే తన గేమ్ పోయిందని విసుకున్నాడు శ్రీహాన్. నీ తప్పు కూడా ఉంది, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకు అని గట్టిగానే ఆన్సరిచ్చింది శ్రీసత్య. కాసేపటికి శ్రీహాన్ సారీ చెప్పడంతో గొడవ చప్పున చల్లారింది. మొదటి ఛాలెంజ్‌లో గెలిచిన ఆదిరెడ్డి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ల అప్పీలు కోసం ఎన్నుకోమన్నాడు బిగ్‌బాస్. రేవంత్ మినహా మిగిలిన ముగ్గురూ రోహిత్‌కే ఓటేయడంతో అతడు ఓట్లు అడిగే అవకాశాన్ని గెలుచుకున్నాడు. దీంతో రోహిత్ మాట్లాడుతూ.. మొదటి నుంచి నేను ఎలా ఆడుతున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? నా థింకింగ్ ఏంటి? నా క్యారెక్టర్ ఏంటి? అన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మొదట్లో మెరీనాతో కలిసి ఆడేవాళ్లం. సెపరేట్ అయ్యాక విడివిడిగా ఆడాం. నాకు ఎప్పుడూ అదృష్టం కలిసిరావట్లేదు. ఈ సీజన్ 6 టైటిల్ గెలవాలన్నదే నా కోరిక. నా కుటుంబం గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి' అంటూ తన స్పీచ్ ముగించాడు. తర్వాత ఎగ్స్ షాట్ అనే ఛాలెంజ్‌లో రేవంత్, శ్రీసత్య, కీర్తి, శ్రీహాన్ పాల్గొనగా రేవంత్, శ్రీసత్య గెలుపొందారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో సెలక్ట్ చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్, కీర్తి, రోహిత్.. శ్రీసత్యకు ఓటేయగా ఆదిరెడ్డి ఒక్కడే రేవంత్‌కు మద్దతు పలికాడు. గెలిచేవాడికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆదిరెడ్డి పరోక్షంగా రేవంతే విజేత అని అభిప్రాయపడినట్లు కనిపించింది. రేవంత్ స్ట్రాంగ్ ప్లేయర్ అని అతడికి ఈ ఓట్ అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలని శ్రీసత్యకు ఇస్తే ఏం యూజ్ ఉంటుందని మాట్లాడాడు. దీనికి శ్రీసత్య కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. ఆల్రెడీ గెలుస్తాడంటున్నారు, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓట్లు అడిగే అవసరమెందుకు? అని కౌంటరిచ్చింది. ఏదేమైనా ఈ ఛాలెంజ్‌లో తనకు సపోర్ట్ చేయలేదని రేవంత్ ఒకింత హర్టయ్యాడు. ఇక శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లు అడుగుతూ.. 'మొదట్లో నాకు దెబ్బలు తగలకుండా ఆడాలనుకునేదాన్ని. కానీ మూడో వారం నుంచి నేను వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నేనేమైనా తప్పు చేసుంటే క్షమించండి. ఈ హౌస్‌లోకి వచ్చినప్పుడే విన్నర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ విజయం మీ చేతుల్లోనే ఉంది. ఈ టైటిల్ నాకెంతో ముఖ్యం.. ఈ సీజన్‌కు లేడీ విన్నర్ అయితే బాగుంటుంది. కాబట్టి మర్చిపోకుండా నాకు ఓటేయండి' అని అభ్యర్థించింది. మరోపక్క సోషల్ మీడియాలో శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె లేడీ విన్నర్ కావాలనుకుంటుందని చెప్పడంతో అభిమానుల మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి ఎన్నో వారాలుగా అన్యాయం.. ఎట్టకేలకు రోహిత్‌కు ఛాన్స్ -
చివరి రౌండ్లో ఆదిరెడ్డి, ఇనయ... ఇంకా సస్పెన్స్ ఏముంది?
బిగ్‌బాస్ షోలో ఈ వారం ఇనయ ఎలిమినేట్ కానుంది అన్న విషయాన్ని ఆమె అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. లేడీ సింగాన్ని బయటకు పంపించేయడమేంటని బిగ్‌బాస్‌పై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ ప్రోమో రిలీజైంది. ఇందులో నాగ్ హౌస్‌మేట్స్‌తో ఓ ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరు డ్యాన్స్ స్టెప్ వేస్తే అది ఏ పాటో మిగతావాళ్లు గెస్ చేయాల్సి ఉంటుంది. అలా పాటలు, డ్యాన్సులతో హౌస్మేట్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. ఆదిరెడ్డి అయితే నేను డ్యాన్సర్ అంటూ అందరికంటే ఓ స్టెప్పు ఎక్కువే వేశాడు. తర్వాత అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరికి ఆదిరెడ్డి, ఇనయ మిగిలారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది బోర్డుపై చూపిస్తానడంతో ప్రోమో ముగిసింది. ఎలాగో ఆది సేవ్ అవగా ఇనయ ఎలిమినేట్ అయిందని అందరికీ తెలిసిపోవడంతో ఈ ఎలిమినేషన్ ఎలాంటి సస్పెన్స్ లేకుండా జరిగిపోయింది. చదవండి: అది రేవంత్‌ను చూసే నేర్చుకున్నా: నాగార్జున -
భయపడి చస్తూనే గెలిచేశారుగా, ఇప్పుడు ప్రైజ్‌మనీ ఎంతంటే?
Bigg Boss Telugu 6, Episode 95: ఇప్పటిదాకా నేను ఆడతానంటే నేను ఆడతానని ముందుకు వచ్చిన హౌస్మేట్స్ ఈరోజు దెయ్యం టాస్కులో మాత్రం నావల్ల కాదు బాబోయ్ అంటూ బెంబేలెత్తిపోయారు. అయినా సరే విడిచిపెట్టని బిగ్‌బాస్ వారిని చీకటి గదిలోకి పిలిచి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఇంతకీ ఈ టాస్కులో వారు గెలిచారా? లేదా? అసలు ప్రైజ్‌మనీ లెక్క సెట్టయిందా? అనే విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! దెయ్యం దెబ్బకు జడుసుకుని చస్తున్నారు హౌస్మేట్స్. మరీ ముఖ్యంగా దెయ్యం పేరెత్తితేనే వణికిపోతున్నాడు ఆదిరెడ్డి. చూడటానికి తాటిచెట్టులా ఉన్నావు, అలా భయపడతావేంటి భయ్యా అని రేవంత్ సెటైర్లు వేశాడు. ఇకపోతే బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు నేడు ఐదో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో రోహిత్, ఆదిరెడ్డి పాల్గొన్నారు. వీరిలో విజేతను ఎంచుకోండంటూ మిగతా ఇంటిసభ్యులకు తలా ఇరవై వేలు అప్పజెప్పాడు బిగ్‌బాస్. ఈ ఛాలెంజ్‌లో ఆదిరెడ్డి విజయం సాధించాడు. శ్రీసత్య మినహా మిగతా నలుగురు ఆదిరెడ్డికి సపోర్ట్ చేయడంతో వారి దగ్గరున్న మొత్తం కలిపి రూ.80 వేలు గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత పరమాన్నం కోసం కప్పులు తెచ్చుకోండని శ్రీహాన్‌కు చెప్పాడు రేవంత్. అన్నం తిన్నాక పరమాన్నం తింటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. దీంతో రేవంత్.. నేను మీకు తినమని చెప్పలేదు, కేవలం రుచి చూడమన్నాననంతేనని మాట మార్చాడు. ఈ మాటతో అవాక్కైన శ్రీహాన్, శ్రీసత్య.. ఇందాకే కదా, కప్పులు తెచ్చుకో అన్నావ్ అని నిలదీయగా నేను జస్ట్ టేస్ట్ చూడమన్నాను, ప్రతిదాంట్లో తప్పులు వెతక్కండి అని అలిగాడు. రేవంత్‌కు తన తప్పులు చెప్తే అస్సలు తీసుకోడంటూ అసహనం వ్యక్తం చేశాడు శ్రీహాన్. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ఇచ్చిన ఆరో ఛాలెంజ్‌లో శ్రీహాన్, కీర్తి పోటీపడ్డారు. హౌస్మేట్స్ అందరూ నీకే ఓటేస్తారు కాబట్టి బాగా ఆడి గెలవమని శ్రీహాన్‌కు సిగ్నల్స్ ఇచ్చింది కీర్తి. అన్నట్లుగానే ఈ గేమ్‌లో హౌస్మేట్స్ అందరూ శ్రీహాన్‌కే సపోర్ట్ చేయగా అతడు గెలవడంతో ప్రైజ్‌మనీలో రెండు లక్షలు జమయింది. ఈ టాస్కులో కుండ పగలగొట్టగా దాని మట్టి ఏరుకుని తిన్నారు శ్రీసత్య, ఇనయ, కీర్తి. ఇది చూసిన బిగ్‌బాస్.. ఇకనుంచి మీకు రేషన్‌కు బదులుగా మట్టి పంపిస్తే సరిపోతుందా అని ఆటపట్టించాడు. తర్వాత ఇంటిసభ్యులకో డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు. సమయానుసారం కన్ఫెషన్ రూమ్‌కి పిలుస్తానని, అప్పుడు తాను చెప్పిన ఆజ్ఞలను పాటిస్తే డబ్బులు లభిస్తాయన్నాడు. మొదట ఆదిరెడ్డిని పిలిచాడు. కన్ఫెషన్ రూమ్ గదంతా చీకటిగా ఉండటంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు ఆది. గదిలోని క్యాండిల్ వెతికి బయటకు తీసుకెళ్లమని ఆదేశించాడు బిగ్‌బాస్. అతడికి ఎంతసేపటికి క్యాండిల్ దొరకకపోవడంతో ఎవరైనా తోడు కావాలా? అని అడిగాడు. దీంతో అతడు శ్రీహాన్ పేరు చెప్పాడు. ఇక అప్పటికే భయపడి చస్తున్న ఆదిరెడ్డిని తన భయంతో మరింత హడలెత్తించాడు. ఇద్దరూ భయపడి చస్తూనే వస్తువులను వెతికారు. వీరి భయాన్ని చూసి ప్రేక్షకులు నవ్వాపుకోవడం కష్టమే! ఫైనల్‌గా ఇద్దరూ కలిసి క్యాండిల్, గన్ సాధించి పట్టుకోవడంతో మరింత డబ్బు జమైంది. ఫైనల్‌గా ఈ రోజు ఎపిసోడ్ ముగిసే సమయానికి ప్రైజ్‌మనీ రూ. 44,35,100కి చేరింది. చదవండి: రేవంత్ ఫుడ్ గొడవలు, ఇక మారడా? బుట్టబొమ్మతో లవ్‌లో పడ్డ సల్మాన్ ఖాన్ -
వణికిపోయిన శ్రీహాన్, ఆది.. ఉట్టి పిరికిపందల్లా ఉన్నారే!
మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా మాటలో, ఆటలో దూసుకుపోయే ఆదిరెడ్డి, శ్రీహాన్‌లను భయంతో గజగజ వణికిపోయేలా చేస్తున్నాడు బిగ్‌బాస్. నిన్న దెయ్యం అరుపులతో హౌస్‌మేట్స్‌ను హడలెత్తించిన బిగ్‌బాస్ నేడు వారందరికీ ఓ స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. చీకటి గదిలోకి వెళ్లి క్యాండిల్‌ను కనుక్కోవాలని ఆదిరెడ్డికి ఓ పని అప్పజెప్పాడు. కానీ ఆది అడుగు తీసి అడుగు ముందుకు వేస్తే కదా.. భయంతో ఉన్నచోటనే ఉండిపోయాడు. అతడు భయపడటంతో మీకు తోడు కోసం ఎవరినైనా పంపించాలా? అని బిగ్‌బాస్ అడిగాడు. ఇందుకతడు శ్రీహాన్ పేరు చెప్పడంతో అతడిని చీకటి గదిలోకి రమ్మన్నాడు బిగ్‌బాస్. శ్రీహాన్ వచ్చి ధైర్యం చెప్తాడనుకుంటే అరుపులు, కేకలతో ఆదిరెడ్డిని మరింత భయపెట్టాడు. మరి ఇంతకీ వాళ్లిద్దరూ ఆ ఛాలెంజ్ గెలిచారా? లేదా? చూడాలి. చదవండి: కేజీఎఫ్ నటుడు కన్నుమూత -
ఇనయకు దెయ్యం పట్టింది! భయంతో వణికిపోయిన ఆదిరెడ్డి, శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 94: మొన్నటిదాకా ప్రైజ్‌మనీకి కోతలు పెట్టిన బిగ్‌బాస్ ఇప్పుడు దాన్ని పెంచుకునేందుకు హౌస్‌మేట్స్‌కు వరుస ఛాలెంజ్‌లు విసురుతున్నాడు. ఆ ఛాలెంజ్‌లలో ఎవరు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో చెప్పాలన్నాడు. అందులో ఎవరు గెలుస్తారో కూడా ముందే ఊహించాలన్నాడు. కరెక్ట్‌గా గెస్ చేస్తేనే డబ్బులు తిరిగిస్తానని మెలిక పెట్టాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నేడు రెండో ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రేవంత్, ఇనయ పోటీపడ్డారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది మెజారిటీ ఇంటిసభ్యులు కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.1,10,000 ప్రైజ్‌మనీకి తిరిగి యాడ్ అవుతాయన్నాడు. అందరూ అనుకున్నట్లుగా పిరమిడ్ పడొద్దు అనే ఛాలెంజ్‌లో రేవంత్ విజయం సాధించడంతో రూ.1,10,000 గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత మూడో ఛాలెంజ్ కోసం ఏకాభిప్రాయంతో రెండు జంటలను ఎంచుకోమన్నాడు. దీంతో ఆదిరెడ్డి- కీర్తి, శ్రీహాన్- శ్రీసత్య మనీ ట్రాన్స్ఫర్ గేమ్‌లో పోటీపడ్డారు. ఇనయ, రేవంత్, రోహిత్.. ఆదిరెడ్డి టీమ్ గెలుస్తుందని చెప్పారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీహాన్- శ్రీసత్య గెలవడంతో వారు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత రేవంత్ ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అంటూ పాట పాడగా ఆదిరెడ్డి అందుకనుగుణంగా స్టెప్పులేశాడు. అనంతరం బిగ్‌బాస్ నాలుగో ఛాలెంజ్ ప్రవేశపెట్టాడు. పవర్ పంచ్ టాస్క్‌లో రేవంత్, ఇనయ పాల్గొనగా అందరూ ఊహించినట్లు రేవంత్ గెలవడంతో ప్రైజ్‌మనీకి మరో రూ.2 లక్షలు జమయ్యాయి. దీంతో మొత్తం ప్రైజ్‌మనీ రూ.41,10,100కి చేరింది. రాత్రి శ్రీసత్య ఓ దెయ్యం కథ చెప్పింది. ఓ ఫంక్షన్లో ఓ అబ్బాయి వింతగా ప్రవర్తించాడని చెప్పింది. అందరూ ఆ అబ్బాయిని కొడుతున్నా అతడికి చలనం లేకుండా అలాగే నడుచుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాడని చెప్పింది. ఇంతలో సడన్‌గా దెయ్యం సౌండ్ వినిపించడంతో శ్రీసత్య పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీహాన్ బెడ్ మీదకు చేరింది. ఇక శ్రీహాన్ అయితే బాత్రూమ్కి వెళ్లడానికి కూడా భయపడ్డాడు. అది గమనించిన శ్రీసత్య కావాలని దెయ్యంలా నవ్వుతూ అతడిని మరింత భయపెట్టింది. ఇక ఇనయ అయితే ఏకంగా దెయ్యం పట్టినదానిలా ప్రవర్తించి ఆదిరెడ్డిని వణికిపోయేలా చేసింది. దెయ్యం భయంతో అందరూ జడుసుకుంటూ, నవ్వుకుంటూ ఏ అర్ధరాత్రికో పడుకున్నారు. చదవండి: స్టేజీపై భార్యను పరిచయం చేసిన హీరో సత్యదేవ్ నేను టాప్5లో ఉండనని తెలుసు, రేవంత్ ఎలిమినేట్ అవ్వాలి: ఫైమా -
ఫైమా ఎలిమినేట్, ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున
Bigg Boss Telugu 6, Episode 92: బిగ్‌బాస్ ఆరో సీజన్లో మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఫన్ అండ్ గేమ్ రెండూ కలిపి కొట్టే ఫైమా ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. ఈరోజు హౌస్‌లో హిట్ 2 చిత్రయూనిట్ స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసి ఎంటర్టైన్ చేశారు. మరి నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. జీవితాంతం ఎవరు ఫ్రెండ్‌గా ఉంలనుకుంటున్నారు? ఎవరిని జీవితంలో అసలు ఫ్రెండ్‌గా వద్దనుకుంటున్నారో చెప్పాలంటూ చిన్న టాస్క్ ఇచ్చాడు నాగార్జున. దీనికి ఆది.. ఫైమాను ఫ్రెండ్ అని, ఇనయతో అంత ఫ్రెండ్షిప్ ఉండదంటూ ఆమె ఫోటోను డస్ట్‌బిన్‌లో వేశాడు. ఇనయ.. కీర్తిని ఫ్రెండ్‌గా, శ్రీహాన్‌తో ఫ్రెండ్షిప్ డౌటేనంటూ అతడి ఫోటోను చించేసింది. శ్రీహాన్ వంతు రాగా రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆదిరెడ్డి నెల్లూరులో ఉంటాడు కాబట్టి ఎక్కువగా కలిసే ఛాన్స్ ఉండదని అతడి ఫోటోను చించేశాడు. రోహిత్.. రేవంత్ ఫ్రెండ్ అని, ఫైమాతో స్నేహం కట్ అవుతుందేమోనన్నాడు. ఫైమా.. ఆదిరెడ్డి తన జీవితాంతం ఫ్రెండ్ అని రోహిత్‌తో ఎక్కువ కనెక్షన్ లేదని చెప్పింది. కీర్తి.. ఇనయ ఫ్రెండ్ అంటూ శ్రీహాన్‌కు కటీఫ్ చెప్పింది. రేవంత్.. శ్రీసత్యతో దోస్తానా చేస్తానని, కీర్తి తనను తక్కువ అర్థం చేసుకుంటుందంటూ సైడ్ చేశాడు. శ్రీసత్య.. ఎక్కువ గొడవపడేది, ఎక్కువ క్లోజ్ అయింది రేవంత్‌తోనే అంటూ అతడే లైఫ్‌టైమ్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇంట్లో అందరికన్నా రోహిత్‌తో తక్కువ కనెక్షన్ ఉందని తన ఫొటోను చెత్తబుట్టలో పడేసింది. తర్వాత హిట్ 2 హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ శైలేష్ కొలను స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. ఇక అడివిశేష్‌కు ఓ కేసు అప్పజెప్పాడు నాగ్. బిగ్‌బాస్ హౌస్‌లో అద్దంపై కోడిబుర్ర అని రాసిందెవరో కనిపెట్టమన్నాడు. శేష్ ఎంతో ఈజీగా ఆ బొమ్మ గీసింది రేవంతేనని కనిపెట్టాడు. తర్వాత ఇంటిసభ్యులతో మూవీ డంబ్ షేర్ ఆర్ట్స్ ఆడిస్తూ వారికోసం కొన్ని సినిమా పోస్టర్లను అంకితమిచ్చాడు. అనంతరం ఫైమా ఎలిమినేట్ కావడంతో ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. స్టేజీమీదకు వచ్చిన ఫైమాతో ఎవరితో ఫన్? ఎవరితో ఫ్రస్టేషన్? చెప్పాలన్నాడు నాగ్. దీనికి ఫైమా ఫన్ కేటగిరీలో ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య, శ్రీహాన్, ఇనయ, రోహిత్‌లను చేర్చింది. రేవంత్‌ను ఫ్రస్టేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పేర్కొంది. ఇక ఫైమాకు చేతిని ముద్దుపెట్టుకుంటే చక్కిలిగిలి పుడుతుందని తెలియడంతో నాగార్జున ఆమె చేతిని ముద్దాడాడు. ఆమెకు వీడ్కోలు పలికిన అనంతరం నాగ్ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పాడు. ఈ సీజన్ విన్నర్ రూ.25 లక్షల విలువైన 605 గజాల ప్లాట్ కూడా సొంతం చేసుకుంటారని చెప్పాడు. చదవండి: సెలూన్ అమ్మేసి పాత ఇల్లు కొన్న జబర్దస్త్ కమెడియన్ తండ్రి మాట వినకపోతే బన్నీలా తయారవుతారు: బండ్ల గణేశ్ -
ఆదిరెడ్డితో ఫ్రెండ్షిపే వద్దన్న శ్రీహాన్, రోహిత్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో రోహిత్ మినహా అందరూ ఏదో ఒక వారం కెప్టెన్ అయ్యారు. ఇప్పటికే ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? అని ఆరా తీస్తే ఇనయ బెస్ట్, ఆదిరెడ్డి వరస్ట్ కెప్టెన్ అని తేలింది. ఇక ఈ రోజు మరో ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు నాగ్. హౌస్ నుంచి బయటకు వెళ్లాక జీవితాంతం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఎవరితో ఫ్రెండ్షిప్ను ఇక్కడే కట్ చేస్తారని అడిగాడు. దీనికి శ్రీహాన్, రోహిత్.. రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆది రెడ్డిని తరచూ కలవడం కష్టమని చెప్పారు. కీర్తి మాట్లాడుతూ.. ఇనయ బాగా క్లోజ్ అయిందని చెప్పింది. తర్వాత రేవంత్ తెలివిగా అబ్బాయిల్లో నుంచి శ్రీహాన్, అమ్మాయిల్లో నుంచి శ్రీసత్య జీవితాంతం స్నేహితులుగా ఉండిపోతారని చెప్పాడు. ఇక హౌస్మేట్స్ వ్యక్తిత్వానికి సరిపోయేలా కొన్ని సినిమా పోస్టర్లను వారికి అంకితం చేశాడు బిగ్‌బాస్. అలా శ్రీసత్యకు అందాల రాక్షసి పోస్టర్, శ్రీహాన్‌కు దేశముదురు, ఇనయకు ఓ పిట్టకథ ఇలా పోస్టర్లు వేసుకుంటూ వెళ్లారు. చదవండి: బ్యూటీ సెలూన్ అమ్మి పాత ఇల్లు కొన్న కమెడియన్ క్రికెటర్‌తో లవ్.. మా మధ్య స్నేహం చెడింది: నటి -
హీరో అడివి శేష్‌కు ఆదిరెడ్డి కౌంటర్.. పగలబడి నవ్విన నాగ్
బిగ్‌బాస్ స్టేజీపైకి హిట్ 2 హీరో అడివి శేష్ వచ్చాడు. వచ్చీరాగానే అతడికో కేస్ అప్పజెప్పాడు నాగార్జున. అతడు వచ్చేముందే ఇంటిసభ్యుల్లో ఎవరైనా అద్దంపై కోడి బుర్ర అని రాసి దానిపై హారర్ బొమ్మ వేయమని సూచించాడు. తర్వాత అడివి శేష్‌ను పిలిచి ఆ బొమ్మ గీసిన నేరస్తుడిని పట్టుకోమని సవాలు విసిరాడు. ఆ బొమ్మ చూసిన అడివి శేష్ నన్ను కోడిబుర్ర అంటున్నారా? అని అడగడంతో అందరూ ఫక్కుమని నవ్వేశారు. ఇక శేష్ తనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి బొమ్మ గీసిందెవరో కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, నువ్వే గీశావా? అని అడగ్గా కనుక్కోవాల్సింది మీరు కదా సర్ అంటూ కౌంటరిచ్చాడు ఉడాల్ మామ. దీంతో నాగార్జున పగలబడి నవ్వాడు. తర్వాత హౌస్‌మేట్స్‌తో ఫన్ గేమ్స్ ఆడించాడు. మరి అడివి శేష్ చేసిన ఎంటర్టైన్మెంట్ చూడాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే! చదవండి: ఈ వారం ఆమె ఎలిమినేట్, సీజన్ బెస్ట్ కెప్టెన్ ఎవరంటే? కాబోయే భర్తను పరిచయం చేసిన బాహుబలి సింగర్ -
ఈ వారం ఆమె ఎలిమినేట్, సీజన్లోనే బెస్ట్ కెప్టెన్‌గా ఇనయ!
Bigg Boss Telugu 6, Episode 91: రేవంత్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడు తండ్రైన శుభవార్తను చెప్పాడు. డిసెంబర్ 1న రాత్రి 11 గంటలకు నాకు లక్ష్మీదేవి పుట్టిందంటూ అతడు ఇంటిసభ్యులతో ఈ గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. తర్వాత శ్రీహాన్, రేవంత్ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడగా శ్రీహాన్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్టుగా అవతరించాడు. ఇక నాగార్జున వచ్చీరాగానే ఈ 13 వారాల్లో మీరు రిగ్రెట్ అయిన వారం ఏంటి? దేనికోసం ఫీలయ్యారో చెప్పాలన్నాడు. దీనికి ఫైమా ఆరోవారం సుదీపతో మాట్లాడిన విధానం వల్లే నాకు వెటకారం అన్న ట్యాగ్ వచ్చిందని బాధపడింది. తర్వాత ఇనయ మాట్లాడుతూ.. తొమ్మిదోవారంలో నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి నానామాటలు అన్నాను, అలా అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. శ్రీహాన్ వంతు రాగా.. ఫ్యామిలీ వీక్ (12వ వారం)లో సిరి చెప్పడం వల్ల నా వెటకారంతో కీర్తి బాధపడుతుందని తెలిసింది. అలా చేయకుండా ఉండాల్సిందన్నాడు. కీర్తి మాట్లాడుతూ.. 13వ వారంలో టికెట్ టు ఫినాలే రేసులో టవర్ టాస్కును తన్నకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చింది. ఫస్ట్ వీక్ నుంచి ఆరో వారం వరకు నేను కోపతో ఏది పడితే అది అనేశాను. ఎనిమిదోవారం చేపల టాస్కులో ఫిజికల్‌గా ఆది, గీతూ, ఇనయలను బాధపెట్టాను. 13వ వారం ఆదిరెడ్డి రెచ్చగొట్టేసరికి ఓవర్‌గా రియాక్ట్ అయ్యాను, ఇవన్నీ నా పొరపాట్లేనని అంగీకరించాడు రేవంత్. 12వ వారం కెప్టెన్సీ టాస్కులో ఇనయను నమ్మి పెద్ద తప్పు చేశానన్నాడు రోహిత్. 2వ వారంలో నాకు దెబ్బలు తగులుతాయన్న భయంతో గేమ్ ఆడకుండా కూర్చున్నా, 11వ వారంలో కీర్తిని ఇమిటేట్ చేశా.. అదే నా రిగ్రెట్ అని చెప్పింది శ్రీసత్య. 2వ వారంలో నేను కూడా దెబ్బలు తగులుతాయేమోనని పెద్దగా ఆడలేదు, 9వ వారంలో మైక్ విసిరికొట్టాను, 11వ వారంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల యూజ్ ఉండదు అని అందరిముందు చెప్పడం తప్పనిపించింది. అమ్మాయిల విషయంలో ఓవర్ సెన్సిటివ్‌గా ఆడటం కూడా తప్పేనన్నాడు ఆదిరెడ్డి. తర్వాత నాగార్జున ఎవరు బెస్ట్ కెప్టెన్? ఎవరు వరస్ట్ కెప్టెన్? చెప్పాలంటూ గేమ్ ఆడించాడు. కంటెస్టెంట్ ఉత్తమ కెప్టెన్ చెత్త కెప్టెన్ రోహిత్ కీర్తి ఆదిరెడ్డి ఆదిరెడ్డి ఇనయ శ్రీసత్య శ్రీసత్య ఇనయ ఆదిరెడ్డి ఇనయ శ్రీసత్య శ్రీహాన్ శ్రీహాన్ ఇనయ ఆదిరెడ్డి కీర్తి ఫైమా శ్రీహాన్ ఫైమా ఇనయ రేవంత్ రేవంత్ ఆది రెడ్డి ఇనయ ఫైనల్‌గా హౌస్ మొత్తం ఇనయను బెస్ట్ కెప్టెన్‌గా, ఆదిరెడ్డిని వరస్ట్ కెప్టెన్‌గా నిలబెట్టింది. ఇకపోతే రేవంత్ అమ్మాయిలే వీక్ అని మాట్లాడాడని ఆదిరెడ్డి ఎప్పటినుంచో వాదిస్తూ వస్తున్నాడు. గతవారం ఈ విషయమై రేవంత్ అలా అనలేదని నాగార్జున క్లారిటీ ఇస్తూ వీడియో కూడా చూపించాడు. అయినప్పటికీ ఆది మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా పూర్తి వీడియోలో రేవంత్ ఆ మాట అన్నాడంటూ మొండిగా వ్యవహరించాడు. దీంతో నాగ్ ఈసారి పూర్తి వీడియో చూపించాడు. మొత్తం వీడియో చూపించాక రేవంత్ ఆడపిల్లలు వీక్, వాళ్లు వస్తే ఈజీగా ఆడేయొచ్చు అని అన్నాడా? లేదా? అని ఇనయ, కీర్తి, ఫైమాలను అడగ్గా వారు ముక్తకంఠంతో లేదని చెప్పారు. దీంతో నాగార్జున.. ఆది నాన్సెన్స్ మాట్లాడుతున్నావు, ఇకమీదట దీన్ని సాగదీయకుండా ఇక్కడితో ఆ ప్రస్తావనే ఆపేసేయ్ అని వేడుకున్నాడు. అనంతరం నాగ్.. రేవంత్‌ను సర్ప్రైజ్లో ముంచెత్తాడు. అతడికి తన భార్యాబిడ్డలతో మాట్లాడే అదృష్టాన్ని కల్పించాడు. వీడియో కాల్ ద్వారా స్క్రీన్‌పై భార్యాబిడ్డను చూసుకుని రేవంత్ మురిసిపోయాడు. ఈ సమయంలో నేను నీకు తోడుగా లేనందుకు సారీ అంటూ ఎమోషనలయ్యాడు. తర్వాత.. పెదవే పలికిన మాటల్లోన సాంగ్ పాడి దాన్ని అందరు తల్లులకు డెడికేట్ చేశాడు. ఇకపోతే ఈ వారం ఫైమా ఎలిమినేషన్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. చదవండి: వంద కోట్ల దాకా పోగొట్టుకున్నాను, జయసుధ కూడా అంతే: చంద్రమోహన్ మహేశ్‌బాబు అలా అనగానే కన్నీళ్లు ఆగలేదు: అడివి శేష్ -
ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే: ఆదిరెడ్డి
ఏకాభిప్రాయం అనే ఒకే ఒక్క మాటతో హౌస్‌మేట్స్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాడు బిగ్‌బాస్. ఇంత దూరం వచ్చాక కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా మీలో మీరు కొట్టుకు చావండి, కానీ మీలో కొందరినే గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేసుకోమనడంతో కంటెస్టెంట్లు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసులో ఇనయ, శ్రీసత్య, కీర్తి గేమ్ నుంచి అవుట్ అయ్యారు. మిగిలిన ఐదుగురిలో ఏ ముగ్గురు నెక్స్ట్ ఛాలెంజ్ ఆడతారో ఏకాభిప్రాయానికి వచ్చి వారి పేర్లు చెప్పమన్నాడు బిగ్‌బాస్. ఎవరికి వారు నేను ఆడతానంటే నేను ఆడతాననడంతో సంచాలకులైన మిగతా ముగ్గురికి ఆ బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఇనయ.. స్కోర్ బోర్డులో టాప్‌లో ఉన్న ఆదిరెడ్డి, శ్రీహాన్‌ను తొలగించి రేవంత్, ఫైమా, రోహిత్ ఆడతారని వెల్లడించింది. ఇది విన్న ఆదిరెడ్డి ఈ సీజన్లో తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం ఇదేనని ఫైరయ్యాడు. ఈ గొడవంతా ఎందుకనుకున్న రోహిత్ తాను ఆట నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటానన్నాడు. గేమ్ ఆడాలి కానీ ఫెయిర్‌గా కూడా ఆడాలి అంటూ రోహిత్ మిగతావారికి ఛాన్స్ ఇస్తూ సైడ్ అయిపోయాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు రోహిత్ ఆటలో గాని మాటలోగాని మచ్చలేని మనిషి అని మెచ్చుకుంటున్నారు. నిజాయితీకి నిలువెత్తు రూపం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: విర్రవీగుతున్న రేవంత్, తప్పు చేసి అవతల వాళ్లను నిందించటమే పని! తండ్రయిన సింగర్ రేవంత్ -
విర్రవీగుతున్న రేవంత్.. ఓడిపోయినా బిల్డప్ కొడుతున్నాడే!
Bigg Boss 6 Telugu, Episode 89: టికెట్ టు ఫినాలే రేస్‌లో ఏకాభిప్రాయం పేరుతో ఇంటిసభ్యులను ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. ఛాలెంజ్ ఇచ్చిన ప్రతిసారి ఆ ఛాలెంజ్‌లో ఏ నలుగురు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో పేర్లు చెప్పమంటున్నాడు. దీంతో హౌస్మేట్స్ ఇదెక్కడి గొడవరా బాబూ అని తలలు బాదుకుంటున్నారు. ఈరోజు మొదటగా ఇవ్వబోయే ఛాలెంజ్‌లో ఏ నలుగురు పార్టిసిపేట్ చేస్తారో ఏకాభిప్రాయంతో చెప్పమన్నాడు బిగ్‌బాస్. మళ్లీ ఏకాభిప్రాయం ఏంట్రా దేవుడా అనుకున్న హౌస్మేట్స్ చిరాకు ప్రదర్శించారు. ఈ సమయంలో ఆదిరెడ్డి తెలివిగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ ఛాలెంజ్‌లో తను, రేవంత్ పక్కకు తప్పుకునేందుకు రెడీ అన్నాడు. కానీ నెక్స్ట్ ఛాలెంజ్‌లో ఫైమా, శ్రీహాన్ తప్పుకుంటానంటేనే ఈసారికి మేము సైడ్ అవుతామన్నాడు. అతడి నిర్ణయానికి అందరూ అంగీకారం తెలిపారు. దీంతో బిగ్‌బాస్ ఇచ్చిన రోల్ బేబీ రోల్ అనే టాస్క్‌లో రోహిత్, ఫైమా, శ్రీహాన్, కీర్తి పాల్గొన్నారు. సంచాలకులైన ఇనయ, శ్రీసత్య టవర్ పొడవుగా పేర్చిన శ్రీహాన్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టవర్ గేమ్‌లో శ్రీహాన్‌కు 4, రోహిత్‌కు 3, ఫైమాకు 2, కీర్తికి 1 పాయింట్స్ లభించాయి. సంచాలకులపై నిర్ణయంపై కీర్తి అసహనం వ్యక్తం చేసింది. ఇష్టమొచ్చినవాళ్లకు ఇచ్చుకోండి అంటూ కోపంతో ఊగిపోతూ ఆవేశంలో తన టవర్‌ను తన్నేసింది. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపు బిగ్‌బాస్ మార్కుల పట్టిక రిలీజ్ చేయగా శ్రీహాన్ 10, ఆది రెడ్డి 9, రేవంత్ 8, ఫైమా 7, రోహిత్ 4, కీర్తి 3 పాయింట్లతో ఉన్నారు. ఈ లెవల్ ముగిసే సమయానికి తక్కువ పాయింట్లు ఉన్న కీర్తిని రేసు నుంచి తొలగించాడు బిగ్‌బాస్. తర్వాత టికెట్ టు ఫినాలే రేసులో నెక్స్ట్ లెవల్ ప్రారంభమైంది. ఇప్పుడు ఇచ్చే మొదటి ఛాలెంజ్‌లో ఏ ముగ్గురు పాల్గొంటారో చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ముందుగా అనుకున్న రూల్ ప్రకారం ఈసారి ఫైమా, శ్రీహాన్ గేమ్ నుంచి సైడవగా రేవంత్, ఆది రెడ్డి, రోహిత్ ఆటలో పాల్గొన్నారు. గుడ్డు జాగ్రత్త గేమ్‌లో అద్భుతంగా ఆడిన ఆదిరెడ్డికి 3, రోహిత్‌కు 2, రేవంత్‌కు 1 పాయింట్ వచ్చింది. ఓటమిని జీర్ణించుకోలేని రేవంత్ సంచాలకురాలైన కీర్తి కావాలనే మనసులో ఏదో పెట్టుకుని నన్ను తప్పించాలని చూసిందని ఉడికిపోయాడు. నేనెక్కడ గెలుస్తానోన్న భయంతో, నామీదే ధ్యాస పెట్టిందని, అలా భయపడాలి అంటూ తనకు తానే సెల్ఫ్ డబ్బా వాయించుకున్నాడు. ఓడిన ప్రతిసారి అందుకు ఇతరులే కారణమని నిందించడం అతడికి అలవాటుగా మారింది. ఇక ఇప్పటివరకు ఆడిన గేమ్ ఆధారంగా మార్కుల పట్టికలో ఆదిరెడ్డి(12 పాయింట్లు), శ్రీహాన్(10), రేవంత్(9), ఫైమా(7), రోహిత్(6) వరుస స్థానాల్లో ఉన్నారు. అనంతరం బిగ్‌బాస్.. కంటెస్టెంట్లు ట్రోఫీ గెలవడానికి గల ప్రాముఖ్యతను వివరించమన్నాడు. ► మా అమ్మకు ఇచ్చిన మాట కోసం ట్రోఫీ గెలవాలి. వాళ్లు మొదటిసారి కోరిన కోరికను నెరవేర్చాలి - శ్రీహాన్ ► నాన్న పేరు నిలబెట్టేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - రోహిత్ ► బిగ్‌బాస్ షోలో మొదటి రోజు నుంచి ప్రతి టాస్కులో ఆడుతూనే ఉన్నాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు వెళ్తూనే ఉన్నాను. అందరికంటే ఆ ట్రోఫీ నాకే ఎక్కువ ముఖ్యం - రేవంత్ ► నా జీవితంలో ఏదీ అంత ఈజీగా దొరకలేదు, పోరాడి సాధించాను. బిగ్‌బాస్ ట్రోఫీ గెలిస్తే ఆ కిక్కే వేరు. కప్పు కొట్టాలన్న అమ్మానాన్న కల నెరవేర్చాలని ఉంది - శ్రీసత్య ► నాలాంటి అమ్మాయిలకు నేను ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలవాలి - కీర్తి ► కుటుంబం కోసం, అలాగే అమ్మాయిలకు ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - ఫైమా ► మొదటిసారి ఓ కామన్ మ్యాన్ 13 వారాలు హస్‌లో ఉన్నాడు. అడ్డదారులు తొక్కకుండా జెన్యూన్‌గా ఆడి ట్రోఫీ గెలిస్తే హ్యాపీ - ఆదిరెడ్డి ► నువ్వు అమ్మాయివి, నువ్వేం చేయలేవు, చదువుకోలేదు అని నన్ను నానామాటలన్నారు. ఏమీ లేకపోయినా ఏదైనా సాధించవచ్చని నిరూపించాలనుకుంటున్నా. అందుకే ఈ ట్రోఫీ గెల్చుకుని చాలామందికి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. ఈ కప్పు కొట్టి నాన్నకు అంకితమిస్తా - ఇనయ చదవండి: డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాక అదే చేశా, అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాకైన హౌస్మేట్స్ -
ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్, గొప్పోడివయ్యా రోహిత్!
Bigg Boss Telugu 6, Episode 88: ఎలాగైనా సరే టికెట్ టు ఫినాలే కొట్టాల్సిందేనని కసిగా ఆడుతున్నారు హౌస్మేట్స్. అయితే మొదట్లోనే ఆటలో అవుట్ అయిన శ్రీసత్య, కీర్తి, ఇనయలకు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. 'రంగు పడితే రివైవల్' గేమ్‌లో గెలిచినవారు తిరిగి రేసులో పాల్గొంటారని చెప్పాడు. ఈ గేమ్‌లో ముగ్గురమ్మాయిలు పోటాపోటీగా ఆడగా కీర్తి గెలిచి తిరిగి రేసులో నిలబడింది. అనంతరం శ్రీసత్య, ఇనయ మినహా పోటీలో ఉన్న మిగతా ఆరుగురు 'జెండాల జగడం' అనే గేమ్‌లో పాల్గొన్నారు. ఈ ఆటలో రేవంత్, ఆదిరెడ్డి తొలి రెండు స్థానాల్లో, ఫైమా, శ్రీహాన్, కీర్తి, రోహిత్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలబడ్డారు. తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్‌లో పాల్గొనే నలుగురి సభ్యులు ఎవరో ఏకాభిప్రాయంతో చెప్పమని ఆదేశించాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ ఇచ్చిన ఈ ట్విస్ట్‌తో హౌస్మేట్స్ డీలా పడ్డారు. ఎంతో కీలకమైన టికెట్ టు ఫినాలే గేమ్‌లో ఏకాభిప్రాయం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. నన్ను గేమ్‌లో నుంచి తీసేస్తే మాత్రం ఏ ఒక్కడినీ గెలవనివ్వను అని శ్రీహాన్ వార్నింగ్ ఇవ్వగా నాదీ అదే మాట అంటూ వంత పాడాడు రేవంత్. ఆడి ఓడిపోయినా సర్వాలేదు కానీ ఏకాభిప్రాయం వల్ల అసలు ఆటనే ఆడకపోవడం తట్టుకోలేమన్నాడు రోహిత్. దీంతో బిగ్‌బాస్.. ఆటలో లేని ఇనయ, శ్రీసత్యలను ఎవరు గేమ్‌లో ఉండాలి? ఎవరు గేమ్ నుంచి తప్పుకోవాలో డిసైడ్ చేయమన్నాడు. దీంతో వాళ్లు గత గేమ్‌లో చివరి ర్యాంకింగ్‌లో ఉన్న కీర్తి, రోహిత్‌లను ఆటలో నుంచి తొలగించారు. వారి నిర్ణయంపై కీర్తి రుసరుసలాడింది. ఇనయ వెళ్లి తనతో మాట్లాడించేందుకు ప్రయత్నించగా అది కాస్తా గొడవగా మారింది. దీంతో అటు కీర్తి, ఇటు ఇనయ ఇద్దరూ కంటతడి పెట్టుకున్నారు. రోహిత్ మాత్రం సరైన నిర్ణయమే తీసుకున్నారని మెచ్చుకోవడంతో శ్రీసత్య అతడి నిజాయితీని పొగడకుండా ఉండలేకపోయింది. ఇక బ్యాలెన్స్ ద స్కోర్స్ గేమ్‌లో ఫైమా మొదట అవుట్ అయింది. తర్వాత రేవంత్, శ్రీహాన్ వరుసగా ఓడిపోగా ఆదిరెడ్డి కడ వరకు నిలబడ్డారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్ కోపంతో శ్రీసత్యపై చిటపటలాడాడు. ఈ గేమ్‌లో పర్ఫామెన్స్‌కుగానూ బిగ్‌బాస్ మార్కుల పట్టికను విడుదల చేశాడు. ఇందులో ఆదిరెడ్డికి 9, రేవంత్‌కు 8, శ్రీహాన్‌కు 6, ఫైమా 5 పాయింట్స్‌తో వరుస స్థానాల్లో ఉన్నారు. ఇకపోతే ఆదిరెడ్డి టికెట్ టు ఫినాలే గెలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: నన్ను సైడ్ చేస్తే ఎవ్వడినీ గెలవనివ్వను: శ్రీహాన్ పుష్ప సినిమా చూశా.. కానీ ఆ హీరో ఎవరో తెలియదు: నటి -
టికెట్ టు ఫినాలే విజేత, ఫస్ట్ ఫైనలిస్ట్ అతడే!
టికెట్ టు ఫినాలే.. ఈ ఒక్క టాస్క్ గెలిస్తే చాలు నేరుగా ఫినాలేలో అడుగు పెట్టొచ్చు. అందుకే ఎలాగైనా ఈ బంపర్ ఆఫర్ అందుకుని తీరాల్సిందేనని కసిగా ఆడుతున్నారు హౌస్మేట్స్. అయితే ఈ పోటీలో నెక్స్ట్ ఛాలెంజ్ కోసం పోటీపడే నలుగురు సభ్యులు ఎవరనేది ఇంటిసభ్యులే ఏకాభిప్రాయంతో నిర్ణయించాలన్నాడు బిగ్‌బాస్. ఇది విని హౌస్మేట్స్ డీలా పడిపోయారు. ఏకాభిప్రాయంలో తమని తీసేస్తే అప్పటిదాకా పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆవేదన చెందారు. అయినా టికెట్ టు ఫినాలేలో ఏకాభిప్రాయం ఆప్షన్ పెట్టడమేంటని అసహనం వ్యక్తం చేశాడు ఆదిరెడ్డి. ఆడి ఓడిపోయినా పర్వాలేదు కానీ ఏకాభిప్రాయం వల్ల ఆడకుండానే ఆట నుంచి తప్పుకుంటే అది భరించలేమన్నాడు రోహిత్. ఒకవేళ టికెట్ టు ఫినాలేలో ఏకాభిప్రాయం వల్ల నన్ను తీసేస్తే ఒక్కడిని కూడా గెలవనివ్వని వార్నింగ్ ఇచ్చాడు శ్రీహాన్. మరి కంటెస్టెంట్లు తిరగబడటంతో బిగ్‌బాస్ వెనక్కు తగ్గాడా? లేదంటే హౌస్‌మేట్సే అడ్జస్ట్ అయి ఆటలో ముందుకు సాగారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సోషల్ మీడియా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిరెడ్డి టికెట్ టు పినాలే టాస్క్ గెలిచి టాప్ 5లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: టికెట్ టు ఫినాలే కోసం పోటాపోటీగా ఫైట్ చేసిన లేడీ టైగర్స్ -
నీలాంటోళ్లు బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉండొద్దు: రేవంత్
Bigg Boss 6 Telugu, Episode 86: ఇరవై ఒక్క మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఈ వారం ఇనయ కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. అటు రాజ్ తన వల్లే వెళ్లిపోయాడని తెగ ఫీలైంది ఫైమా. ఇంతకీ ఈరోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! నేను శ్రీసత్యతో కలిసి ఉన్నందుకు ఏవేవో అనేస్తున్నావు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావని రేవంత్ మీద సీరియసయ్యాడు శ్రీహాన్. ఏదైనా అనేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ గరమయ్యాడు. దీంతో హర్టయిన రేవంత్ దూరంగా వెళ్లి కూర్చున్నాడు. కానీ కాసేపటికే ఈ గొడవలన్నీ ఎందుకు? మునుపటిలా మాట్లాడుకుందామంటూ కలిసిపోయారు. మరోపక్క ఫైమా.. తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఓట్లు వచ్చినా సరే రాజ్ వెళ్లిపోయాడని ఏడ్చేసింది. గతవారం రేవంత్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు పాడైపోయిన పండ్లు, ఆకుకూరల ఫొటోలను రోహిత్‌కు చూపించాడు బిగ్‌బాస్. ఇక మీదటైనా ఆహారం వేస్ట్ కాకుండా చూసుకోమని హెచ్చరించాడు. ఇంట్లో జరిగిన తప్పు కారణంగా తమకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ రద్దు చేయమని అడిగాడు ప్రస్తుతం రేషన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రోహిత్. అనంతరం ఇంట్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.. ► ఆదిరెడ్డి.. రేవంత్, రోహిత్ ► ఫైమా.. రేవంత్, రోహిత్ ► శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి ► కీర్తి.. రేవంత్, శ్రీసత్య ► శ్రీసత్య.. కీర్తి, ఆదిరెడ్డి ► రోహిత్.. ఆది రెడ్డి, ఫైమా ► రేవంత్.. ఆది రెడ్డి, ఫైమా ► ఇనయ.. రేవంత్, శ్రీసత్య ముందుగా ఆదిరెడ్డి.. నాగార్జునగారు చూపించిన వీడియోలో ముందు జరిగిన డిస్కషన్ చూపించలేదు. నువ్వు గేమ్‌లో అమ్మాయి వస్తే మనకే లాభం అన్నట్లుగా మాట్లాడావు. అప్పుడు, ఇప్పుడు, ఇంకో పదేళ్ల తర్వాత కూడా నేను ఈ మాటపైనే స్టాండ్ అయి ఉంటా అని బల్లగుద్ది చెప్పాడు. అటు రేవంత్ మాత్రం నాగ్ సర్ ఆల్రెడీ నీదే తప్పని చెప్పాడు, ఇంక దీనికోసం చర్చించడం అనవసరం అంటూ నిట్టూర్చాడు. అటు ఫైమా - రేవంత్, శ్రీహాన్ - ఆదిరెడ్డిల మధ్య ఫైట్ మామూలుగా జరగలేదు. 'రోహిత్ స్ట్రాంగ్ అని నామినేట్ చేస్తున్నావ్, అంటే నువ్వు వీక్ కదా, అలాంటివాళ్లు హౌస్‌లో ఉండనవసరం లేదు, నిన్ను బయటకు పంపించడానికే నామినేట్ చేస్తున్నా' అని ఫైమాతో వాదించాడు రేవంత్. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఫైమా ఉగ్రరూపం దాల్చింది. 'రేవంత్ ముందొకటి మాట్లాడతాడు, వెనకాల ఒకటి మాట్లాడతాడు. ఇలా మాటలు మార్చేది ఎవరికీ కనిపించట్లేదా? ఎన్నోసార్లు నోరుజారాడు. అదెందుకు కనిపించట్లేదు?' అని అటు కంటెస్టెంట్లు, ఇటు బిగ్‌బాస్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది.ఫైనల్‌గా ఈ వారం ఫైమా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్, కీర్తి నామినేట్ అయ్యారు. చదవండి: నోరు జారుతుంది నువ్వు.. రేవంత్‌పై ఫైమా ఉగ్రరూపం బిగ్‌బాస్: రాజ్ రెమ్యునరేషన్ ఎంతంటే? -
ఆదిరెడ్డి Vs శ్రీహాన్, నామినేషన్లో ఎవరున్నారంటే?
రాజ్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఇనయ కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. ఇక నామినేషన్ ప్రక్రియకు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజైంది. ఫైమా మాట్లాడుతూ.. రేవంత్ తర్వాత నువ్వే స్ట్రాంగ్ అంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. నేను చెప్పేది వినకపోతే వెళ్లి సోఫాలో కూర్చో అంటూ రేవంత్ మీద ఫైరయ్యాడు ఆదిరెడ్డి. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో బిగ్‌బాస్ కనిష్ట ధర నీ నిర్ణయానికే వదిలేసినా నువ్వు చెక్ మీద లక్ష రూపాయలు రాయడం తప్పన్నాడు శ్రీహాన్. అంతా అయిపోయాక ఎవ్వరైనా మాట్లాడతారని ఆదిరెడ్డి పెదవి విరవడంతో అది మినిమమ్ కామన్సెన్స్ అన్నా, నేనైతే రూపాయి కూడా రాసేవాడిని అని మండిపడ్డాడు శ్రీహాన్. సెన్స్ అంటే ఫీలైన నువ్వు కామన్సెన్స్ అని మాట్లాడుతున్నావు, అది ఎంతవరకు కరెక్టో నీకే తెలియాలి అని కౌంటరిచ్చాడు ఆది. ఇక ఈ వారం కెప్టెన్ ఇనయ, శ్రీహాన్ మినహా మిగతా ఆరుగురు నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రాజ్ ఎలిమినేషన్‌కు కారణాలివే! ఒక్కటైన ప్రేమ జంట, ఫోటోలు వైరల్ -
రాజ్ ఎలిమినేట్, అంధురాలి పెన్షన్‌తో ఐదేళ్లు బతికామన్న ఆది!
Bigg Boss 6 Telugu, Episode 84: ఇంటిసభ్యుల రాకతో హౌస్మేట్స్ ఫుల్ జోష్ మీదున్నారు. వారి జోష్ రెట్టింపు చేయడానికి మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను రప్పించారు. అయితే వారి గొంతు గుర్తుపడితనే వారితో మాట్లాడే అవకాశం కల్పిస్తానని మెలిక పెట్టాడు నాగ్. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ గొంతును గుర్తుపట్టడం డెడ్ ఈజీ కాబట్టి అందరూ ఎంచక్కా ఫ్యామిలీస్‌తో కబుర్లాడారు. మొదటగా ఇనయ కోసం ఆమె తమ్ముడితోపాటు మాజీ కంటెస్టెంట్ సోహైల్ వచ్చారు. ఇనయను, ఆమె తల్లిని కలిపినందుకు బిగ్స్కు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఫినాలేలో డబ్బు ఆఫర్ చేస్తే తనలా సూట్‌కేస్ తీసుకోమని సలహా ఇచ్చాడు. తనకోసం వచ్చిన సోహైల్‌కు థ్యాంక్స్ చెప్పిన ఇనయ బయటకు వచ్చాక ఫోన్ నెంబర్ తీసుకుంటానంటూ మెలికలు తిరిగింది. సోహైల్ కోసం ఆమె మణికొండకు వచ్చిందని, తన జిమ్ సెంటర్లో జాయిన్ అయిందంటూ ఆమె గుట్టంతా బయటపెట్టాడు సోహైల్. ఇనయకు హౌస్‌లో రేవంత్ టఫ్ కాంపిటీషనర్ అని, ఆదిరెడ్డి అసలు పోటీ ఇవ్వడని ఇనయ తమ్ముడు అభిప్రాయపడ్డాడు. తర్వాత శ్రీహాన్ కోసం అతడి తండ్రి, శివబాలాజీ వచ్చారు. ఈ సందర్భంగా శివబాలాజీ.. నేను షో గెలిచి బయటకు వచ్చినప్పుడు రేవంత్ హౌస్‌లో జరిగేదంతా నిజమేనా? అడిగాడు. అవునని చెప్పినప్పుడు చచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్నాడు. మరి ఇప్పుడేంటి? అంటూ ఆటపట్టించాడు. తర్వాత శ్రీహాన్‌కు రేవంత్ కాంపిటీషన్ అయితే, ఫైమా పోటీనే కాదని చెప్పాడు. ఈ 12 వారాల ఆటకు శ్రీహాన్‌కు 9 మార్కులిచ్చాడు. ఫైమా తన అక్క సల్మాను, బుల్లెట్ భాస్కర్‌ను చూడగానే ఏడ్చేసింది. భాస్కర్ అయితే పంచులతో అందరినీ నవ్వించాడు. ఇనయను ఎలా భరిస్తున్నారో అర్థం కావట్లేదన్నాడు. ఫైమాకు ఇనయ గట్టి పోటీ ఇస్తుందని, శ్రీసత్య పోటీనే కాదని చెప్పాడు. ఫైమా మాట్లాడుతూ.. అమ్మవాళ్లకు సొంతిల్లు కట్టించి, బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ చేశాకే తాను పెళ్లి చేసుకుంటానంది. అనంతరం రేవంత్ అన్నయ్య సంతోష్, స్నేహితుడు రోల్ రైడా స్టేజీపైకి వచ్చారు. తన తమ్ముడికి శ్రీహాన్ పోటీ అని, రోహిత్ అసలు పోటీనే కాదన్నాడు. తర్వాత రోహిత్ కోసం అతడి తమ్ముడు డింప్, నటుడు ప్రభాకర్ వచ్చి పలకరించారు. రోహిత్‌కు రేవంత్ పోటీ అని, రాజ్ పోటీయే కాదని చెప్పాడు ప్రభాకర్. రేవంత్‌ను గెలిస్తే టైటిల్ గెలవడం ఈజీ అని ఉన్నమాట చెప్పి అందరికీ హింటిచ్చాడు. తర్వాత ఆదిరెడ్డి కోసం చెల్లెలు నాగలక్ష్మి, మాజీ కంటెస్టెంట్ లహరి వచ్చారు. నువ్వు కనిపించనందుకు బాధగా ఉందన్నా అంటూ అంధురాలైన నాగలక్ష్మి బాధపడింది. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. ఐదేళ్లు నేను ఖాళీగా ఉన్నసమయంలో మా కుటుంబమంతా చెల్లెలు పెన్షన్‌తో బతికాం అని చెప్పాడు. ఆదికి రేవంత్ కాంపిటీషన్ అని, శ్రీసత్య పోటీయే కాదని చెప్పింది నాగలక్ష్మి. కళ్లు లేని పిల్ల అని నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేయరు. ఇప్పుడు లహరి నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంది అని మురిసిపోయింది. శ్రీసత్య కోసం తన బెస్ట్‌ఫ్రెండ్ హారిక, నటి విష్ణుప్రియ స్టేజీపైకి వచ్చారు. ఆమెకు రేవంత్ పోటీ అని, కీర్తి పోటీయే కాదని చెప్పారు. శ్రీసత్యను తన తల్లి కోసం టెన్షన్ పడొద్దని సూచించారు. అమ్మకు రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ జరుగుతోందని, తన ఆరోగ్యం గురించిఆందోళన పడొద్దని చెప్పారు. తర్వాత రాజ్ ఫ్రెండ్ వెంకీ, హీరో సాయిరోనక్ వచ్చి రాజ్‌కు ఆటలో రేవంత్ కాంపిటీషన్ అయితే, ఇనయ పోటీయే కాదని స్పష్టం చేశారు. కీర్తి కోసం ప్రియాంక, వితికాషెరు వచ్చారు. ఎవరూ లేరని నువ్వు బాధపడుతున్నావు, కానీ బయట చాలామంది నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు అని కీర్తిలో ధ:ర్యం నింపింది వితికా. కీర్తికి హౌస్‌లో శ్రీహాన్ పోటీ అని, శ్రీసత్య పోటీయే కాదని కుండ బద్ధలు కొట్టారు ప్రియాంక, వితికా. ఇకపోతే సండే షూటింగ్ ఆల్రెడీ పూర్తవగా రాజ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నటించినందుకు నా భార్య ఇప్పటికీ ఏదోలా ఫీలవుతుంది: విష్ణు విశాల్ ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి?: స్పందించిన కూతురు -
‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి ఆదిరెడ్డి ఫ్యామిలీ.. రేవంత్ కంటతడి
బిగ్‌బాస్ ఆరో సీజన్ చూస్తుండగానే పదకొండు వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు. ఇందులో బాగంగా మొదటగా ఆదిరెడ్డి ఫ్యామిలీ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఆదిరెడ్డి తన భార్య కవిత, కూతురు అద్వితను చూడగానే చాలా ఎమోషనల్ అయ్యాడు. కూతురికి అన్నం తినిపించాడు. అనంతరం తన ఆటతీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాడు. తన డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్నామని కవిత చెప్పడంతో ఆదిరెడ్డితో సహా ఇంటి సభ్యులంతా పగలబడి నవ్వారు. ‘అందరు మంచి వాళ్లు గేమ్ వరకు కొట్టుకోండి..తింటుకోండి కానీ..’ అని కవిత ఏదో చెప్పబోతుండగా.. ‘ఏంటి నన్ను కూడా కొట్టమంటున్నావా?’ అని ఆదిరెడ్డి అంటాడు. హా..నువ్వేమైనా పెద్ద తోపా అంటూ ఆదిరెడ్డికే సెటైర్ వేసింది కవి. కేక్ కట్ చేసి కూతురు బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు. భార్య, కూతురు రాకతో ఆదిరెడ్డి చాలా సంతోషంగా ఉంటే.. రేవంత్ మాత్ర తన భార్య, పుట్టబోయే బిడ్డను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడు. మరి రేవంత్ ఫ్యామిలీ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తుందా? అన్నది చూడాలి. -
ఆదిరెడ్డి ఇమేజ్ టోటల్ డ్యామేజ్.. గీతూకి పట్టిన గతి రాకుండా చూస్కో!
Bigg Boss 6 Telugu, Episode 77: ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎదుటివాళ్ల కంటే మనకే ఎక్కువ నష్టం అన్న విషయాన్ని పసిగట్టలేకపోతున్నాడు ఆదిరెడ్డి. ఇప్పటికే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేజేతులా గేమ్‌ను నాశనం చేసుకుని గీతూ బయటకు వెళ్లిపోయింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు ఆది. దీంతో నాగార్జున అతడికి చీవాట్లు పెట్టి తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చాడు. మరి ఇంకా ఎవరెవరికి ఎలాంటి క్లాస్‌లు పీకాడు? ఎవరి బండారాలు బయటపెట్టాడు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! కెప్టెన్సీ అంటే అధికారం కాదని, బాధ్యత అని రేవంత్‌కు గుర్తు చేశాడు నాగార్జున. ఏదైనా పని చెప్పేటప్పుడు మాట్లాడే తీరు చూసుకోమని విసుక్కున్నాడు. శక్తి ఆటలో ప్రదర్శించమని, మాటలో కాదు అని చురకలంటించాడు అనంతరం ఆదిరెడ్డికి గట్టిగానే క్లాస్ పీకాడు. ఓ కథ చెప్పి మరీ అతడిని దోషిగా నిలబెట్టాడు. నోటికొచ్చిన స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావని గడ్డి పెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్, అది దక్కించుకుంటే ఓట్లు పడవు అని ఆడకుండా మూలన కూర్చున్నావు. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో డిసైడ్ చేయడానికి నువ్వేమైనా తోపా? తురుమా? అని తిట్టిపోశాడు. నువ్వు కామన్ మ్యాన్‌గా ఆడటానికి వచ్చావు, కేవలం మాట్లాడటానికి కాదు, గేమ్‌లో ఉన్న వాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేసి నీ అభిప్రాయాలను వారితో చెప్పిస్తున్నావు. గేమ్ విషయంలో ఎక్కువ ఆలోచించి లూప్‌లు వెతికితే నీకూ గీతూ పరిస్థితే వస్తుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాక కెప్టెన్సీ కంటెండర్ గేమ్‌లో నువ్వు రూపాయి పెట్టి కూడా ముందుకు వెళ్లొచ్చు, కానీ లక్ష రూపాయలు రాశావు. ఇమ్యూనిటీ కోసమే కదా.. అని లాజిక్ అడిగాడు. ఇదే ప్రశ్న రాజ్ అడిగితే ఏదేదో చెప్పి అతడి నోరు మూయించాడు ఆది. ఇప్పుడు నాగ్ కూడా అదే అడిగేసరికి అడ్డంగా దొరికిపోయాడు. ఇకపోతే శ్రీహాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు శ్రీసత్యకు వంట రాదంటే వదిలేసి కీర్తిని మాత్రం వంట రాదంటే నేర్చుకుని చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఇదే అంశాన్ని ఓ ఆడియన్ అడగ్గా.. తనకసలు గుర్తే లేదని జవాబిచ్చాడు. దీంతో నాగ్.. గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తానన్నట్లుగా ఓ వీడియో వదిలాడు. అందులో శ్రీసత్య నాకు రాదు, చేయను అని స్పష్టంగా చెప్పింది. అయినా ఆమెను వదిలేసి, కీర్తిని మాత్రం వంట నేర్చుకుని చేయమన్నాడు. అంత అడ్డంగా దొరికినప్పటికీ సరిగా వినపడలేదంటూ మళ్లీ కవర్ చేయడానికి ప్రయత్నించాడు. అలాగే కుక్కలు మొరిగితే దేవలోకానికి ఏమీ కాదని కీర్తి చెప్పిన సామెతను సామెతలాగే చూడాలే తప్ప దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయనవసరం లేదని శ్రీహాన్, శ్రీసత్యలకు మొట్టికాయలు వేశాడు. ఇక ప్రతివారం నామినేషన్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది శ్రీసత్య. పక్కనోళ్లు నామినేట్ చేసుకుంటుంటే మరీ ముఖ్యంగా ఇనయను నామినేట్ చేసేటప్పుడు తెగ నవ్వుతుంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ లేవనెత్తాడు నాగ్. నామినేషన్స్‌లో నీకు నవ్వెందుకు వస్తుందని అడిగాడు. లోపల ఉన్న అహంకారం, వెటకారం వల్లే ఆ నవ్వు వస్తుందని ఆమె పరువు తీశాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో మీమ్స్ గేమ్ జరిగింది. అందులో భాగంగా అక్కడున్న మీమ్ కార్డులు ఎవరికి సూటవుతాయో వారికి ఇవ్వాలన్నాడు నాగ్. రేవంత్‌ను ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నాడు ఆది. శ్రీసత్యకు ఓరి.. దీని వేషాలూ అన్న మీమ్ ఇచ్చాడు శ్రీహాన్. రాజ్.. ఓన్లీ వన్స్ ఫసక్ అనేలా మాట్లాడుతున్నాడంది ఫైమా. ఫైమాకు అట్లుంటది మనతోని ట్యాగ్ ఇచ్చాడు రాజ్. శ్రీహాన్‌కు సరె సర్లే, చాలా చూశాం ట్యాగ్ ఇచ్చింది కీర్తి. వీడెవడు ఓవరాక్షన్ చేస్తున్నాడు.. చైల్డ్ ఆర్టిస్టా? అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది ఇనయ. మస్తు షేడ్స్ ఉన్నాయ్రా నీలో, ఆట్.. కమల్ హాసన్ అన్న మీమ్ శ్రీహాన్‌కే సూటవుతుందన్నాడు రోహిత్. చాలా ఉన్నాయ్ దాచాం.. లోపల కుప్పలు కుప్పలుగా ఉన్నాయ్ అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది శ్రీసత్య. ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలా.. అన్న మీమ్ రోహిత్కిచ్చింది మెరీనా. ఆదిరెడ్డి పని అయిపాయే అన్నాడు రేవంత్. నిజంగానే ఈరోజు ఎపిసోడ్లో ఆదిరెడ్డి పని అయిపోయింది. చదవండి: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయింది ఎవరంటే? పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా.. -
ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్టా? నువేమైనా తోపా? తురుమా?: నాగ్
బిగ్‌బాస్ ఇచ్చే ఏ టాస్క్ అయినా ఆడి తీరాల్సిందే.. ఆడి గెలుస్తావో, ఆట మొదట్లోనే ఓడిపోతావో.. అదంతా నీ ఇష్టం. కానీ నాకు నచ్చదు, నాకు అక్కర్లేదు, అసలు ఆడేవాళ్లే వేస్ట్ అని పోజులు కొట్టడానికి వీల్లేదు. ఈ వైఖరిని బిగ్‌బాస్ అస్సలు సహించడు. ఇంతకీ ఎవరి కోసం చెప్తున్నామో ఈపాటికే మీకర్థమై ఉంటుంది. ఇంకెవరు? రివ్యూయర్ ఆదిరెడ్డి గురించే.. ఇమ్యూనిటీ దక్కించుకునేందుకు గేమ్ ఇచ్చినప్పుడు కూడా ఇదంతా అనవసరం అన్నట్లుగా మాట్లాడాడు. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినప్పుడైతే నేను ఆడను, నాకు అవసరమే లేదని దర్జాగా కూర్చున్నాడు. టాస్క్ ఇచ్చినప్పుడు ఆడాలి అని అవతలివాళ్లు చెప్పినా ఆడకపోవడమే నా గేమ్ అని అతి తెలివి ప్రదర్శించాడు. చివరికి ఈరోజు నాగార్జున చేతిలో చీవాట్లు తిన్నాడు. 'బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు ఆడాలి కానీ అడ్డమైన కారణాలు చెప్పి ఆడకుండా ఉండొద్దు. నువ్వే ఆ టాస్క్ గెలిచుంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాయంతో జెన్యూన్ కంటెస్టెంట్ ఎలిమినేషన్‌ను ఆపగలిగేవాడివి కదా!అది సపోర్ట్ చేయడం కాదా? ఆటతీరు కాదా? అలా చేసుంటే జనాలు ఎంత మెచ్చుకునేవారు. అదంతా పక్కనపెట్టి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్ అంటావా? ఆ పాస్ ఎవరికి వస్తే వారికి ఓట్లు రావా? నువ్వేమైనా తోపా? తురుమా? ఆడియన్స్ ఏం అనుకుంటున్నారో డిసైడ్ చేయడానికి అని ఫైర్ అయ్యాడు. నీ తీరు మార్చుకో, లేదంటే ప్రేక్షకులే నిన్ను బయటకు పంపించేస్తార'ని హెచ్చరించాడు. దీంతో ఆదిరెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. చదవండి: టాప్ 10లో నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్ పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, ఒక్కరోజు బతికినా చాలు -
ఆడియన్స్ ప్రశ్నలతో బయటపడ్డ శ్రీహాన్, శ్రీసత్య నిజస్వరూపం!
Bigg Boss 6 Telugu, Episode 75: సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరోవైపు ఈ వారం వెళ్లిపోయేది తనే అని ఫిక్సయిన మెరీనా తన పెళ్లి రోజు గురించి కలలు కంది. నవంబర్ 29న వెడ్డింగ్ యానివర్సరీ ఉందని, ఆ రోజును ఇద్దరం కలిసే సెలబ్రేట్ చేసుకోవాలనుందని చెప్పింది. హౌస్ లోపల అయినా బయట అయినా ఇద్దరం కలిసే పెళ్లిరోజు జరుపుకోవాలని, అందుకు నువ్వే ఏదో ఒకటి చేయాలంటూ బిగ్‌బాస్‌ను వేడుకుంది. అంటే ఉంచితే ఇద్దరినీ హౌస్‌లో ఉంచమని పంపిస్తే డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరినీ పంపించేయమని చెప్పకనే చెప్పింది. బిగ్‌బాస్‌కు కొత్త కొత్త ఐడియాలివ్వకని రోహిత్ చురకలేశాడు. అనంతరం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో పోటీదారులు శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్.. ఇతరుల గోల్ పోస్ట్‌లోకి బంతి వేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌కు ఫైమా సంచాలకుడిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రేవంత్, శ్రీహాన్ కలిసి ఆడినట్లే అనిపించింది. ఇది చూసిన ఫైమా.. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటాడు, మరి ఇప్పుడు ఈయన చేసేదేంటని సెటైర్లు వేసింది. మొదటి రౌండ్లో రోహిత్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్లో ఎవరూ అవుట్ కాకపోవడంతో కంటెండర్లు ఏకాభిప్రాయంతో ఒకరిని తొలగించాలన్నాడు బిగ్‌బాస్. ఎక్కువ ఓట్లు ఆదిరెడ్డికి పడటంతో అతడు అవుట్ అయ్యాడు. ఇక రేవంత్, ఫైమా గేమ్ ఆసాంతం దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. నీలాగా సపోర్ట్ తీసుకుని ఆడను అని రేవంత్ ఫైమాను ఉద్దేశించి అన్నాడు. వెంటనే ఆదిరెడ్డి అందుకుంటూ బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావా? అన్నాడు. ఓపక్క నాతో, అటు ఇనయతో, తీరా గేమ్‌లోకి దిగాక శ్రీహాన్‌తో కలిసి ఆడావని కౌంటరిచ్చాడు. దీనికి కిమ్మనుకుండా సైలెంట్ అయిపోయాడు రేవంత్. మూడో రౌండ్లో ఇనయ తనను తాను సేవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడింది, కానీ గెలవలేకపోయింది. దీంతో కెప్టెన్ కాలేకపోయానని వెక్కివెక్కి ఏడ్చింది ఇనయ. చివరగా రేవంత్.. శ్రీహాన్‌ను ఓడించి కెప్టెన్‌గా అవతరించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రెండోసారి కెప్టెన్ అవడంతో రేవంత్ కంటి నుంచి ఆనందభాష్పాలు రాలాయి. అనంతరం ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలన్నాడు బిగ్‌బాస్. మొదటి ప్రశ్న: నీ కెప్టెన్సీలో కీర్తిని రూడ్‌గా వంట చేయమన్నావు. ఆమె తనకు రాదని చెప్తే నేర్చుకోమన్నావు. మరి నీ ఫ్రెండ్ శ్రీసత్యకు ఎందుకు చెప్పలేదు? శ్రీహాన్: వంట ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఆమెను కిచెన్ టీమ్‌లో వేశా. అంతేకాదు అప్పుడప్పుడు ఆమె కిచెన్‌లో పని చేయడం చూశాను. శ్రీసత్య వంట చేయను అన్న మాట నాకు వినిపించలేదు. అయినా తను కిచెన్‌లో ఏదో ఒక పని చేస్తూనే ఉంది అని చెప్పాడు. నిజానికి శ్రీసత్య వంట రాదు, చేయను అన్నా కూడా శ్రీహాన్ లైట్ తీసుకున్నాడు. ఇద్దరూ అడ్డంగా దొరికిపోవడంతో కీర్తి ముఖం మతాబులా వెలిగిపోయింది. రెండో ప్రశ్న: ఫైమా మీరు మొదట్లో చూడటానికి ఎంతో ఎంటర్టైనింగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు స్వార్థపరురాలిగా కనిపిస్తున్నారు. ఈ రెండింటిలో మీ అసలు రూపం ఏది? ఫైమా: ఆటలో గెలవాలన్న కసి ఎక్కువైంది. దానిమీద ఎక్కువ దృష్టి పెట్టి ఎంటర్టైన్ పక్కన పెట్టేశాను. మూడో ప్రశ్న: ఒక రివ్యూయర్ అయి ఉండి మీకు గేమ్ బాగా తెలుసని మీరే అంటుంటారు. కానీ మీ నామినేషన్స్ అందరికన్నా సిల్లీగా, సేఫ్‌గా ఉంటాయి. మీరు ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని నామినేట్ చేసి అప్పుడు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకోండి.. ఆదిరెడ్డి: స్ట్రాంగ్ ప్లేయర్స్‌ను బయటకు పంపించాలన్న ఆలోచన నాకు లేదు. వారితో గేమ్ ఆడి గెలవాలనుకుంటాను. నా కళ్ల ముందు జరిగే సంఘటనలను బట్టే నామినేషన్స్ చేశాను, తప్ప సిల్లీ రీజన్స్ ఇవ్వలేదు. మీకలా అనిపిస్తే నేనేం చేయలేను. మరీ ముఖ్యంగా నన్ను రివ్యూయర్‌గా కాకుండా కంటెస్టెంట్‌గా చూడండి. ప్రశ్న: ఇనయ తన ఫ్రెండ్‌ని వెన్నుపోటు పొడిచిందన్నారు. కానీ మీరు రేవంత్‌ను మూడుసార్లు నామినేట్ చేశారు. కెప్టెన్సీలో తనకి సపోర్ట్ చేయలేదు. అర్జున్ను యూజ్ చేసుకున్నారు. తన గేమ్ కూడా మీరే ఆడి తనని నామినేట్ చేశారు. మీరు చెప్పే విషయాలు మీరసలు పాటిస్తారా? శ్రీసత్య: తప్పుంటే ఎవరినైనా నామినేట్ చేస్తాను. రేప్పొద్దున శ్రీహాన్ది తప్పుంటే అతడిని కూడా నామినేట్ చేస్తా. ఇనయను రెచ్చగొట్టడానికే ఆమె వెన్నుపోటు పొడిచిందన్నాను. ఫ్రెండ్షిప్, గేమ్ ఒకటి కాదు. రేపు పాయింట్ ఉంటే శ్రీహాన్‌ను కూడా నామినేట్ చేస్తాను. అర్జున్ను నేను యూజ్ చేసుకోలేదు. హోటల్ టాస్క్‌లో సర్వీసెస్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాను. నేను చెప్పే విషయాలు కచ్చితంగా పాటిస్తాను. చదవండి: ఈడీ ఆఫీసులో పూరీ, చార్మీ కూతురి సినీ ఎంట్రీపై స్పందించిన రోజా -
బ్రెయిన్ దగ్గర పెట్టుకుని మాట్లాడు: రేవంత్‌కు ఆది వార్నింగ్
తాజాగా రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లు ఫైర్ మీదున్నారు. ఈ ఫైర్ మొదటినుంచీ ఉండుంటే బిగ్‌బాస్ ఇలా ప్రైజ్‌మనీ నుంచి లక్షల రూపాయలు కట్ చేసేవాడు కాదు. ఇప్పుడనుకునేం లాభం.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. అన్నట్లుగా బోర్ కొట్టించినందుకు ఫలితంగా ప్రైజ్‌మనీని తగ్గించుకుంటూ పోతున్నాడు. వీళ్లకంటే నాన్‌స్టాప్ సీజన్ కంటెస్టెంట్లే నయమని నెటిజన్లు అంటున్నారంటే వీరి ఎంటర్టైన్మెంట్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇనయ, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్ ఈ పోటీలో పాల్గొన్నారు. ఇనయను గేమ్‌లో అవుట్ చేసేందుకు ప్రయత్నించిన రోహిత్‌ను టైం చూసి దెబ్బ కొట్టాడు ఆదిరెడ్డి. తర్వాత శ్రీహాన్, రేవంత్ కలిసి ఆదిరెడ్డిని అవుట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆది కోపంతో ఊగిపోయాడు. ఇక గేమ్‌లో రేవంత్, ఫైమా మధ్య ఫైట్ జరిగింది. వెటకారం తగ్గించుకుంటే మంచిది, నీలాగా నేను వెటకారం చేస్తే ఏడుస్తావని రేవంత్ చెప్పగా అమ్మో, నాకు భయమైతుంది మరి అని కౌంటరిచ్చింది ఫైమా. పక్కనోడు సపోర్ట్ చేస్తే కానీ గేమ్ ఆడలేవు, నువ్వు నాకు చెప్తున్నావా? అని ఆగ్రహించాడు రేవంత్. నువ్వు కూడా సపోర్ట్‌తోనే ఆడుతున్నావు, సొంతగా ఆడలేదని ఫైమా అనడంతో మరింత రెచ్చిపోయాడు రేవంత్. నేను ఎవ్వడి సాయం తీసుకోలేదని కరాఖండిగా చెప్పాడు. ఈ మాటతో షాకైన ఆదిరెడ్డి.. మాట్లాడేటప్పుడు బ్రెయిన్ దగ్గర పెట్టుకో. ఇంతకుముందే మనిద్దరం ఒక టీమ్ అన్నట్లుగా చెప్పావు. ఇక్కడేమో శ్రీహాన్‌తో కలిసిపోయి ఆడావు. ఎంతమందితో కలిసి ఆడుతావు? అని విమర్శించాడు. కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోవడాన్ని ఇనయ జీర్ణించుకోలేక ఏడ్చేసింది. మొత్తానికి ఈ వారం రేవంత్ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తారక్‌తో చేయాల్సింది ప్రైజ్‌మనీకి భారీగా ఎసరు, కొత్త కెప్టెన్ ఎవరంటే? -
తగ్గేదే లేదంటున్న బిగ్‌బాస్, విన్నర్‌కు మిగిలేది ఎంతంటే?
Bigg Boss 6 Telugu, Episode 74: వీలైనంత ప్రైజ్‌మనీని తగ్గించాలని బిగ్‌బాస్ కంకణం కట్టుకున్నట్లున్నాడు. కంటెస్టెంట్లు నో చెప్పడానికి వీలు లేని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌కు ఓ రేటు ఫిక్స్ చేశాడు. అలా ప్రైజ్‌మనీలో నుంచి కావాల్సినంత దండుకుంటున్నాడు. ఇంతకీ ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలు తగ్గింది? నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. రివ్యూలు వద్దని స్వయంగా నాగార్జునే చెప్పినా పట్టించుకోని ఆదిరెడ్డి ఈవారం ఎవరు వెళ్తారని సత్యతో డిస్కషన్ పెట్టాడు. దీనికామె క్షణం ఆలోచించకుండా కీర్తి అని చెప్పింది. అటు ఆదిరెడ్డి కూడా నాకూ అలాగే అనిపిస్తోందని వంత పాడాడు. అనంతరం బిగ్‌బాస్.. బీబీ ట్రాన్స్పోర్ట్ అనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బీబీ ట్రక్కు సమయానుసారం ఒక్కో స్టాప్ దగ్గర ఆగిపోతుంది. అలా ఆగిన ప్రతిసారి ఎవరైతే ముందు వచ్చి ఎక్కుతారో వారే కెప్టెన్సీ పోటీదారులవుతారు. అయితే ప్రతి స్టాప్‌లో ఆ వాహనం ఎక్కేందుకు ఓ ధర ఉంటుందని, దాన్ని విన్నింగ్ ప్రైజ్‌మనీలో నుంచి తీసేస్తామని చెప్పాడు. దీనితోపాటు ఆ ట్రక్కు ఎక్కలేకపోయిన మిగతా ఇంటి సభ్యులు తమలో కెప్టెన్సీకి అనర్హులుగా భావించే ఇద్దరి పేర్లను చెప్తే వారిలో ఎవరు పోటీలో పాల్గొంటారు? ఎవరు రేస్ నుంచి తప్పుకుంటారనేది పోటీదారులు నిర్ణయిస్తారు. మొదటి రౌండ్లో ఆదిరెడ్డి గెలవగా అతడు తన కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం లక్ష రూపాయలు వాడతానన్నాడు. ఇక ఇంటిసభ్యులు పోటీలో నుంచి ఎవరిని తప్పిద్దామని చర్చలు మొదలుపెట్టారు. శ్రీహాన్.. రోహిత్ కెప్టెన్‌గా ఇంటిని చూసుకోగలడన్న నమ్మకం లేదన్నాడు. దీనికి రోహిత్ ఆన్సరిస్తూ.. నువ్వు నన్ను కాంపిటీషన్‌గా చూస్తున్నావేమో, అందుకే పక్కన పెడుతున్నావని కౌంటరిచ్చాడు. దీనికి శ్రీహాన్.. అసలు నువ్వు నాకు కాంపిటీషనే కాదని బిల్డప్ ఇవ్వడం గమనార్హం. ఇక కీర్తి.. శ్రీసత్య, శ్రీహాన్ పేరు చెప్పడంతో శ్రీహాన్ వెటకారం మొదలుపెట్టాడు. అలా వీళ్లిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. చివరగా రోహిత్, ఫైమాలను నిల్చోబెట్టగా వీళ్లలో రోహిత్‌కు ఛాన్స్ ఇచ్చి ఫైమాను తొలగించాడు ఆదిరెడ్డి. రెండోసారి రేవంత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఈ రౌండ్లో ప్రైజ్‌మనీలో నుంచి రూ.25 వేలు తగ్గించాడు బిగ్‌బాస్. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, రాజ్‌లను ఎన్నుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్లయిన రేవంత్, ఆది.. శ్రీహాన్‌ను గేమ్‌లో ఉంచాలనుకుని రాజ్‌ను సైడ్ చేశారు. మూడో రౌండ్లో రోహిత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఇందుకుగానూ రూ.45,000 కట్ చేశాడు. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, శ్రీసత్యలను నిలబెట్టగా కెప్టెన్సీ కంటెండర్లు శ్రీహాన్‌ను గేమ్‌లో కంటిన్యూ చేయనున్నట్లు ప్రకటించారు. నాలుగో రౌండ్లో శ్రీహాన్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలవగా ఇందుకోసం రూ.30,000 కోత పెట్టాడు బిగ్‌బాస్. కంటెండర్లు మెరీనాను ఆటలో కంటిన్యూ చేసి కీర్తిని సైడ్ చేశారు. ఐదో రౌండ్లో కంటెండర్‌షిప్ కోసం పోటీపడేందుకు రూ.70 వేలు పెట్టాడు బిగ్‌బాస్. ఈసారి ఇనయ ముందుగా ట్రక్ ఎక్కి కంటెండర్‌గా నిలిచింది. మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ద్వారా రూ.3 లక్షలు కోత పెట్టడంతో ప్రైజ్‌మనీ రూ. 41,00,300 చేరింది. తర్వాత శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ సరదాగా మాట్లాడుకున్నారు. శ్రీహాన్, శ్రీసత్య మాట్లాడుకున్నప్పుడు నేను ఆటలో అరటిపండు అయ్యాననే టైంలో రాజ్ క్లోజ్ అయ్యాడన్నాడు రేవంత్. ఆ మాటతో మండిపడ్డ శ్రీహాన్.. మేము మాట్లాడుకునేటప్పుడు నిన్ను రావద్దని అనలేదు కదా? అని ప్రశ్నించాడు. నేనేదో చాలా సాధారణంగా అన్నానని రేవంత్ అన్నా సరే శ్రీహాన్ వినిపించుకోలేదు. మేమిద్దరం కలిసి నిన్ను ఏదో చేస్తున్నామన్నట్లుగా చెప్తున్నావని సీరియస్ అయ్యాడు. అటు శ్రీసత్య కూడా మధ్యలో అందుకుంటూ.. ఇప్పుడేంటి, నేను శ్రీహాన్‌తో ఎక్కువగా మాట్లాడొద్దు, అంతే కదా అని సూటిగా అడిగేసింది. చిన్నమాటను ఎక్కడికో తీసుకువెళ్తున్నారని భావించిన రేవంత్ గొడవ చేయడం ఎందుకని సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, ఇనయ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో రేవంత్ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది! చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్ ఓటీటీలో ప్రిన్స్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
ప్రైజ్‌మనీలో మళ్లీ కోత! వాళ్లే కెప్టెన్సీ కంటెండర్స్!
ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అని ఫీలైనట్లున్నాడు బిగ్‌బాస్. మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, మీలో ది బెస్ట్ కంటెస్టెంట్‌కు అర కోటి ప్రైజ్‌మనీ ఇస్తానన్నాడు. కానీ ఎక్కడా? ఆదిరెడ్డి అన్నట్లు ఈ సీజన్లో ఎక్కువగా తుప్పాస్ కంటెస్టెంట్లే ఉన్నారు. బాగా ఆడి టీఆర్పీలు పెంచమంటే ఎవరికి వారు పిక్నిక్కు వచ్చినట్లు రిలాక్స్ అయ్యారు. దీంతో సీజన్‌కు చెడ్డపేరు వచ్చింది. ఫలితంగా బిగ్‌బాస్‌కు కోపం వచ్చింది. ఇంకేముంది.. ప్రైజ్‌మనీకి కత్తెర పెట్టే పనులు చేస్తున్నాడు. ఇప్పటికే నామినేషన్స్‌లో ఒకరిని సేవ్ చేయడం, బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ఓడిపోవడంతో ప్రైజ్‌మనీ రూ.50 లక్షల నుంచి రూ.44,00,300కి చేరింది. తాజాగా బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ కూడా డబ్బులతో ముడిపెడుతూ మీ అర్హతను కొనుక్కోమన్నాడు. ఐదో సీజన్లో పెట్టిన ట్రక్కు టాస్క్‌ను కొద్దిగా అటూఇటూ మార్చి మళ్లీ అదే టాస్క్ ప్రవేశపెట్టాడు. ఈ గేమ్‌లో ఇనయ, ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో ఇనయ, రోహిత్ ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవనేలేదు. మరి ఈసారైనా వీరికి ఛాన్స్ వస్తుందేమో చూడాలి! ఇకపోతే ఈ టాస్క్ విలువ రెండు లక్షలని తెలుస్తోంది. మరి ఈ టాస్క్ గెలిచి ప్రైజ్‌మనీని కాపాడుకున్నారా.. మరో రెండు లక్షలు పోగొట్టుకున్నారా? తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: ఇంటి అద్దె కట్టలేక కష్టాలు, ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారు: ఫైమా బిగ్‌బాస్ 6 విన్నర్ తానే అని గాల్లో తేలిపోతున్న ఆదిరెడ్డి -
మూడు రోజులు ఫ్యామిలీ అంతా తిండి లేక పస్తులున్నాం: శ్రీసత్య
బిగ్‌బాస్ సీజన్ 6ను రసవత్తరంగా మార్చడంలో కంటెస్టెంట్లు సఫలం కాలేదని వారి మీద కక్ష గట్టినట్టున్నాడు బిగ్‌బాస్. విన్నర్ క్వాలిటీస్ ఏ ఒక్కరికీ సరిగా లేవనుకున్నాడో, లేదా వారికి రూ.50 లక్షలు అనవసరం అనుకున్నాడో ఏమో కానీ ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టడం మొదలు పెట్టాడు. సండే రోజు నాగార్జున విజేత రూ.50 లక్షలు గెలుచుకుంటాడని ప్రకటించాడు. అంతలోనే అనేక ట్విస్టుల మధ్య ఈ ప్రైజ్‌మనీ రూ. 44,00,300కు పడిపోయింది. ఈ ఊచకోత ఇంకా జరిగేట్లు కనిపిస్తోంది. ఇకపోతే ఇంటిసభ్యులకు డబ్బెందుకు అవసరం? వారు డబ్బు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వారికి ప్రైజ్‌మనీ ఎందుకు అవసరం? అనేది చెప్పాలన్నాడు. మొదటగా ఫైమా మాట్లాడుతూ.. 'మా అమ్మకు మేము నలుగురం ఆడపిల్లలం.. చిన్నప్పటినుంచి చాలా కష్టాలు పడ్డాం. రోజూ పొలం పనికి వెళ్లి ఆ డబ్బుతో నిత్యావసరాలు తెచ్చుకునేవాళ్లం. ఊర్లో ఎన్నో కిరాయి ఇళ్లు తిరిగాం, ఎన్నో అవమానాలు పడ్డాం. ఒకసారైతే మాకంటే వేరేవాళ్ల అద్దె ఎక్కువ ఇస్తామన్నారని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నారు. కానీ ఎంత తిరిగినా ఉండటానికి ఇల్లు దొరకలేదు. మా అమ్మకు మంచి ఇల్లు కట్టివ్వాలన్నదే నా కోరిక' అని చెప్పింది. ఆదిరెడ్డి వంతు రాగా.. 'మా నాన్న సరిగా పనిచేయకపోవడం వల్ల అమ్మ ఎన్నో కష్టాలు పడింది. ఆమె తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా నెత్తిన గడ్డిమోపు వేసుకుని పని చేసేది. నాకిప్పుడు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. కానీ మా ఆవిడకు ఇల్లంటే ఇష్టం. బిగ్‌బాస్ ప్రైజ్‌మనీతో సొంతిల్లు కొనాలన్నదే నా డ్రీమ్' అన్నాడు. శ్రీసత్య మాట్లాడుతూ.. 'అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఏ లోటూ తెలియకుండా పెంచారు. కష్టమనేదే లేకుండా చూసుకున్నారు. కానీ ఒకానొక సమయంలో ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి. నా జీవితంలో మొట్టమొదటిసారి మా కుటుంబమంతా మూడు రోజులు తిండి లేక పస్తులున్నాం. డబ్బు లేకపోతే మన ముఖం కూడా ఎవరూ చూడరు. అమ్మకు వైద్యం చేయించేందుకు ఇల్లు కూడా అమ్మేశాం. నేను సంపాదించేదంతా అమ్మ వైద్యానికే అవుతుంది. బిగ్‌బాస్ విన్నింగ్ ప్రైజ్‌మనీతో మా అమ్మ కోలుకునేలా మంచి వైద్యం చేయించడంతో పాటు సొంతిల్లు కొనాలనుంది' అని చెప్పుకొచ్చింది. కీర్తి మాట్లాడుతూ.. నాకు సొంతంగా ఏదీ కొనాలని లేదు. కానీ నాలాంటి అనాధల కోసం ఒక ఆశ్రమం పెట్టాలని ఉందని చెప్పింది. చదవండి: ప్రైజ్‌మనీకి గురి పెట్టిన బిగ్‌బాస్ -
నేనే విన్నర్, నా ప్రైజ్‌మనీలో నుంచి డబ్బులు కట్ చేస్తారా?: ఆది
Bigg Boss Telugu 6, Episode 73: నామినేషన్స్‌లో జరిగిన గొడవను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు కీర్తి, సత్య. కానీ గొడవ సద్దుమణగడం కాదు కదా అది మరింత అగ్గి రాజుకుంది. శ్రీసత్య వైఖరితో ఏడ్చేసిన కీర్తి.. శ్రీసత్యకు రెచ్చగొట్టే అలవాటుందని నాకు బిగ్‌బాస్‌కు రాకముందే తెలుసు. తన క్యారెక్టరే అంత అని ఊరుకున్నా.. కానీ ఈరోజు నన్ను ఇమిటేట్ చేసి మాట్లాడటం నచ్చలేదని మిగతా వాళ్ల దగ్గర బాధపడింది. తను చేసింది తప్పని ఫీలైందో మరేంటో కానీ అర్ధరాత్రి శ్రీసత్య.. కీర్తి దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. నెక్స్ట్ డే ఏదో చిన్న విషయంలో శ్రీహాన్‌కు, రేవంత్‌కు మధ్య గొడవైంది. ఈ ఫ్రస్టేషన్లో తన మనసులో ఉన్న కోపాన్నంతా శ్రీసత్య ముందు కక్కేశాడు శ్రీహాన్. 'రేవంత్ నన్ను నామినేట్ చేసి నా తప్పు చెప్పాలనుకున్నాడట.. అలాగైతే వాడిదగ్గర వంద తప్పులు కనిపిస్తున్నాయి. కానీ నేను నా ఫ్రెండ్‌ను బయటకు పంపించి నువ్వు తప్పు చేశావని చెప్పాలనుకోను, పక్కకు పిలిచి అతడి తప్పేంటో చెప్తా. పదిమందిలో వాడిని లోకువ చేయను. కానీ వాడు మాత్రం అందరి ముందు నా తప్పు చెప్పాలనుకున్నాడు' అంటూ రగిలిపోయాడు. అనంతరం బిగ్‌బాస్.. నామినేషన్స్‌లో ఉన్నవారు తమను సేవ్ చేసుకుని ఇమ్యూనిటీ దక్కించుకునేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ ఆ ఇమ్యూనిటీకి ఒక ధర ఉందని, ఆ మొత్తం విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి తగ్గిస్తామని చెప్పాడు. నామినేట్ అయిన సభ్యులు చేయాల్సిందల్లా.. వారు ఏ ధరకు ఇమ్యూనిటీని కొనుక్కుంటారో చెక్‌లో రాయాల్సి ఉంటుంది. ఏ సభ్యుడు ఎక్కువ ధర రాస్తాడో వారు సేవ్ అవుతారని ట్విస్ట్ ఇచ్చాడు. అది కూడా లక్ష నుంచి రూ.5 లక్షల మధ్యే రాయాల్సి ఉంటుందన్నాడు. దీంతో శ్రీహాన్ లక్ష రాయగా ఆదిరెడ్డి తానసలు ఇమ్యూనిటీయే కోరుకోవట్లేదని చెప్పాడు. 'ఒక సామాన్యుడిగా అడుగుపెట్టాను. జనాలకు నా ఆట నచ్చి వారి సపోర్ట్‌తో 11 వారాలు హౌస్‌లో ఉన్నాను. ఇలాంటి ఇమ్యూనిటీ కోరుకుని ఇక్కడిదాకా రాలేదు. ఈ సీజన్ గెలుస్తానని నాకు గట్టిగా నమ్మకముంది. అంటే నా ప్రైజ్‌మనీలో నుంచి రూ.5 లక్షలు కట్ అవుతాయన్నమాట! నా దాంట్లో నుంచి కట్ అవుతాయని తెలిసినా ఆ ఇమ్యూనిటీతో ముందుకు వెళ్లాలని లేదు. జనాల ఓట్లతో ముందుకు వెళ్తాను. ఇకపోతే ఇమ్యూనిటీ కోసం ఎక్కువ అమౌంట్ రాసేవారికి ఇంట్లో ఉండే అర్హతే లేదు' అంటూ గాల్లో మేడలు కట్టేశాడు ఆది. అనంతరం అతడు లక్ష రూపాయలు రాశాడు. శ్రీసత్య, కీర్తి, రేవంత్.. రూ.4,99,999, రోహిత్.. రూ.2,51,001, రాజ్.. రూ.4,99,700, మెరీనా, ఇనయ.. రూ.4,99,998 రాశారు. చెక్‌పై రాసే మొత్తాన్ని ఎవరితో షేర్ చేసుకోవద్దని చెప్పినా శ్రీసత్య.. శ్రీహాన్‌తో కోడ్ భాషలో చెప్పిందంటూ ఆమెపై అనర్హత వేటు వేశాడు బిగ్‌బాస్. అలాగే ఒకే అమౌంట్ ఇద్దరూ రాస్తే వారిని రిజెక్ట్ చేశాడు. దీంతో చివరగా రోహిత్, రాజ్ మిగిలారు. వీరిలో రాజ్ రాసిన చెక్ ధర ఎక్కువగా ఉండటంతో అతడు ఇమ్యునిటీ పొందినట్లు ప్రకటించాడు. అతడు రాసిన రూ.4,99,700 విన్నర్ ప్రైజ్‌మనీలో కోత పెట్టగా రూ.45,00,300 మిగిలింది. తర్వాత ఈ ప్రైజ్‌మనీని కాపాడుకోమంటూ సమయానుసారంగా ఛాలెంజ్‌లు ఇస్తానన్నాడు బిగ్‌బాస్. మొదటి ఛాలెంజ్‌లో భాగంగా కేవలం రన్స్ తీస్తూనే సెంచరీ పూర్తి చేయమన్నాడు. ఇందులో రోహిత్, రేవంత్ పాల్గొని 82 పరుగులు తీశారు. సెంచరీ పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ మరో లక్ష ప్రైజ్‌మనీ కట్ చేశాడు. దీంతో విన్నర్ ప్రైజ్ మనీ రూ.44,00,300కు వచ్చింది. ఇక ఈ వారం కెప్టెన్ ఫైమా, రాజ్ మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు. చదవండి: భలే ట్విస్ట్, ప్రైజ్‌మనీ కట్ -
భలే ట్విస్ట్.. ప్రైజ్‌మనీ కట్ చేసేందుకు పూనుకున్న బిగ్‌బాస్!
బిగ్‌బాస్ షో మొదలై పదివారాలు పూర్తయినా నామినేషన్స్ మాత్రం ఇంకా చప్పగానే సాగుతున్నాయి. నిన్నటి నామినేషన్స్ చెత్తగా ఉన్నాయని సోషల్ మీడియాలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే నామినేషన్స్ నుంచి కాపాడుకునేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఒక చెక్ ఇచ్చి దాని మీద యునిక్‌గా అనిపించే అమౌంట్ రాయమన్నాడు. ఏ సభ్యులైతే చెక్‌పై ఎక్కువ మనీ రాస్తారో వారు నామినేషన్ నుంచి సేవ్ అవుతారని చెప్పాడు. అయితే ఈ మొత్తం బిగ్‌బాస్ ప్రైజ్‌మనీలో నుంచి తగ్గిస్తామని ట్విస్ట్ ఇచ్చాడు. చెక్‌పై ఎంత రాస్తున్నామన్నది ఎవరితో చర్చించడానికి వీల్లేదని బిగ్‌బాస్ మరీమరీ చెప్పాడు. ఈ నియమాన్ని ఉల్లంఘించడంతో శ్రీసత్య ఈ పోటీలో అనర్హురాలిగా నిలిచింది. ఇక సేవ్ అవడం కోసం కక్కుర్తి పడి ఎక్కువ డబ్బులు రాస్తే మాత్రం వారికి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదన్నాడు ఆదిరెడ్డి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎవరెంత అమౌంట్ రాశారంటే... ► ఆదిరెడ్డి - లక్ష రూపాయలు ► శ్రీహాన్ - లక్ష రూపాయలు ► రోహిత్ - రూ. 2.51,001 ► రాజ్ - రూ.4,99,700 ► మెరీనా - రూ.4,99,998 ► ఇనయ - రూ.4,99,998 ► కీర్తి - రూ. 4,99,999 ► రేవంత్ - రూ.4,99,999 ► సత్య - రూ.4,99,999 లక్షలు రాశారు. అదేంటో గానీ అత్యధిక నంబర్ రాసినవారు కాకుండా రాజ్‌ను సేవ్ చేశాడట బిగ్‌బాస్. అంతేకాదు, ప్రైజ్ మనీలో నుంచి రూ. 5 లక్షలు కట్ అయ్యాయట. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా? మరి అదెలా జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే! చదవండి: చెత్త రీజన్స్, చెత్త నామినేషన్స్.. కాకపోతే ఓ ట్విస్ట్ -
ఆ ఇద్దరే టార్గెట్, నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే?
నామినేషన్స్ ఊహించగలమేమో కానీ ఎలిమినేషన్ మాత్రం ఊహించలేకున్నాం. ఈ మధ్య అనుకోని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటివరకు 11 మంది ఎలిమినేట్ అవడంతో ప్రస్తుతం హౌస్‌లో 10 మంది మాత్రమే మిగిలారు. తాజాగా వీరందరూ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొన్న ప్రోమో రిలీజైంది. ఇందులో నామినేట్ చేయాలనుకున్న ఇంటిసభ్యులపై చెత్తను గుమ్మరించాల్సి ఉంటుంది. మొదటిసారి ఆదిరెడ్డి.. తానింతవరకు నామినేట్ చేయని ఇంటిసభ్యులైన శ్రీహాన్, రోహిత్‌లను సెలక్ట్ చేసుకున్నాడు. బాతూ మాట్లాడాడంటూ రోహిత్‌పై చెత్త గుమ్మరించింది ఫైమా. ఎప్పటిలాగే శ్రీహాన్.. కీర్తిని నామినేట్ చేశాడు. ఇకపోతే శ్రీహాన్- ఇనయల గొడవ గాలి మళ్లి ఆది- ఇనయల గొడవగా మారింది. ఈ మధ్య వీరిద్దరు ఎక్కువ కొట్లాడుకుంటున్నారు. అయితే ఈవారం ఇనయను నామినేట్ చేయలేకపోవడంతో ఆది నెక్స్ట్ వీక్ మాత్రం తననే నామినేట్ చేస్తానని స్పష్టం చేశాడు. బిగ్‌బాస్ హెచ్చరించినా సరే శ్రీసత్య, శ్రీహాన్, రేవంత్ నామినేషన్లో ముసిముసి నవ్వులు నవ్వుతుండటం గమనార్హం. ఇక ఈ వారం కెప్టెన్ ఫైమా మినహా అందరూ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌లో ఎక్కువమంది రోహిత్, ఇనయలనే టార్గెట్ చేశారు. చదవండి: వాసంతి ఎలిమినేట్, ఆ ముగ్గురే తన ఫేక్ ఫ్రెండ్స్ -
ఆదిరెడ్డిని ఆటపట్టించిన నాగార్జున
బిగ్‌బాస్ హౌస్‌లో బాలాదిత్య ఎలిమినేషన్‌ను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మంచి మనిషిని బిగ్‌బాస్ హౌస్‌లో ఇక మీదట చూడబోమని సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఆయన మాత్రం గెలుపైనా, ఓటమైనా సమానంగా స్వీకరిస్తానన్నట్లుగా చిరు దరహాసంతో వీడ్కోలు పలికారు. ఇకపోతే ఈరోజు మరొకరిని ఎలిమినేట్ చేయనున్నాడు నాగ్. అంతకన్నా ముందు ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తో గేమ్ ఆడించనున్నాడు. కంటెస్టెంట్ ఒకరు బొమ్మ గీస్తే వారి టీమ్ మేట్స్ అది ఏ సినిమానో గుర్తుపట్టాలి. సినిమా విషయం పక్కనపెడితే వారు గీసింది ఏ బొమ్మో అర్థం కాకుండా ఉంది. ఇక ఆడపిల్లలు వస్తే బాగా డ్యాన్స్ చేస్తున్నావని ఆదిరెడ్డిని ఆటపట్టించాడు నాగ్. మొత్తానికి తనకు రాని డ్యాన్స్ కూడా బాగా నేర్చుకున్నాడు ఆది. చివర్లో అందరూ జై బాలయ్య స్టెప్పు వేసి అదుర్స్ అనిపించారు. చదవండి: చివరి నిమిషంలో ట్విస్ట్, బాలాదిత్యతో పాటు వాసంతి అవుట్ శ్రీహాన్ టాప్ 5లో డౌటే, ఇనయ లేకపోతే బిగ్‌బాసే లేదు: గీతూ -
జైల్లో ఇనయ, వదిలేస్తే టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారే!
Bigg Boss 6 Telugu, Episode 69: గీతూ వెళ్లిపోయాక ఆదిరెడ్డి మరీ విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి అతడి మాటలు, ఆట చూస్తుంటే గీతూ పూనినట్లే అనిపిస్తోంది. ఇనయ మీద నోరేసుకుని పడిపోయి అనవసరంగా ఆమెకు హైప్ ఇస్తున్నాడు ఆది. హౌస్‌లో అందరూ ఇనయ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నా బయట తనకది పాజిటివ్ అవుతుండటం గమనార్హం. నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. కెప్టెన్సీ టాస్క్‌లో ఆదిరెడ్డి, ఫైమా కలిసి ఆడారని ఇనయ ఆరోపించింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆది.. 'అసలు నీకు బ్రెయిన్ ఉందా? నేను ఫైమాతో ప్లాన్ చేశానని తేలితే బిగ్‌బాస్ వదిలి వెళ్లిపోతా' అని సవాలు విసిరాడు. అటు ఫైమా కూడా.. నువ్వు ఎంత ఒర్రినా ఎక్కువ రోజులుండవులే అని శివాలెత్తింది. సంచాలక్ కన్ఫ్యూజన్కు శ్రీసత్యకు చిర్రెత్తిపోయింది. కళ్ల ముందు తనను లాగుతున్నా ఏమీ అనకుండా నిల్చుండిపోయాడని రేవంత్‌పై అసహనం వ్యక్తం చేసింది. చివరగా ఈ పోటీలో ఫైమా గెలిచి కొత్త కెప్టెన్‌గా అవతరించింది. గెలవగానే ఫైమా ఇనయను పట్టుకుని ఏడ్చేసింది. ఇది చూసి షాకైన హౌస్మేట్స్ ఇప్పుడే గొడవ పెట్టుకున్నారు, అప్పుడే కలిసిపోయారా? అని ఆశ్చర్యపోయారు. రాత్రి రేవంత్, రాజ్ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో శ్రీహాన్‌ను మధ్యలోకి లాగుతూ.. నేను గెలిస్తే రావు, కానీ సత్య గెలిస్తే దుప్పటి పట్టుకుని మరీ తన దగ్గరకు వెళ్లిపోతావు అని కామెంట్ చేశాడు. ఇది శ్రీహాన్ సరదాగా తీసుకోలేకపోయాడు. కామెడీగా అయినా సరే, ఏది పడితే అది అనేయకు అని హెచ్చరించాడు. అలా నోటికొచ్చింది మాట్లాడితే నీకు, ఇనయకు తేడా ఏంటని ప్రశ్నించాడు. దీనికి రేవంత్.. తానసలు ఆ మాటే అనలేదని బుకాయించాడు. అనంతరం బిగ్‌బాస్ ఈవారం వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమన్నాడు. ముందుగా ఫైమా.. వాసంతికి; ఇనయ, కీర్తి.. రోహిత్‌కు; వాసంతి, మెరీనా.. కీర్తికి; రాజ్.. శ్రీసత్యకు స్టాంప్ వేశారు. సంచాలక్‌గా కన్ఫ్యూజ్ అయ్యావంటూ రేవంత్‌కు స్టాంప్ వేశాడు బాలాదిత్య. సంచాలక్‌గా నువ్వు గేమ్ మధ్యలో రూల్స్ మార్చావు, ముందు వారాల్లో కంటే ఇప్పుడు నీలో చాలా మార్పు కనిపించింది. ఈ వారం నీలో ఏదీ నచ్చలేదని రేవంత్‌కు స్టాంప్ వేసింది శ్రీసత్య. అటు ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్.. ఇనయకు స్టాంపేశారు. తర్వాత రేవంత్ వంతు రాగా.. అరవడం గురించి మీరు నాతో పోల్చుకున్నారు. అది నచ్చలేదు. రాత్రి నీ గురించి మాట్లాడుకున్నాం అన్నావు, అది నీ భ్రమ అంటూ తిరిగి శ్రీసత్యకు స్టాంప్ గుద్దాడు. ఎక్కువగా ఇనయకు ఓట్లు పడటంతో ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపిక చేసి జైలుకు పంపించారు. అయితే హౌస్మేట్స్ ఆమెతో ఎంత గొడవపడితే బయట ఆమెకు అంత మద్దతు పెరుగుతుండటం గమనార్హం. ఈ క్రమంలో ఆమెను ఏకంగా జైలుకే పంపించి ఇనయకు మరింత హైపిచ్చారు. చూస్తుంటే అందరూ కలిసి ఇనయకు టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారు. చదవండి: బిగ్‌బాస్, నాగార్జున నేనే తోపు అన్నట్లు పొగిడారు: గీతూ డ్రైవర్‌కు రూ.15 లక్షల సాయం చేసిన బన్నీ, ఎందుకో తెలుసా? -
గీతూ అలానే వెళ్లిపోయింది, ఇప్పుడు మీరు మొదలుపెట్టారా?: ఇనయ
బిగ్‌బాస్ హౌస్‌లో పదకొండో వారం కెప్టెన్‌గా ఫైమా ఎన్నికైనట్లు ఆల్రెడీ లైవ్‌లో ప్రసారమైంది. కానీ ప్రధాన ఎపిసోడ్లో మాత్రం ఇంకా కెప్టెన్సీ పోటీనే చూపిస్తూ సాగదీస్తున్నారు. ఇక ఈ గేమ్‌లో అయోమయం రేవంత్‌ను సంచాలక్‌గా పెట్టడంతో ఆటను గందరగోళం చేసి పడేశాడు. కీర్తి సర్కిల్లో నుంచి కాళ్లు బయటపెట్టినా ఆమెను సేవ్ చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి కీర్తి బ్యాగు కింద పెట్టడంతో ఆమెను రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. అలాగే ఫైమా సర్కిల్ దాటి బయటకు వచ్చినా తను అవుట్ అని ప్రకటించలేదు. గోనెసంచిని చేత్తో పట్టుకోవద్దని రూల్ పెట్టిన రేవంత్.. ఆదిరెడ్డి తన మోచేత్తో బ్యాగును పట్టుకుంటే శిలా విగ్రహంలా చూస్తూ ఉండిపోయాడు. రూల్స్ కరెక్ట్‌గా ఫాలో అయిన రోహిత్‌ను అవుట్ చేశాడు. ఇలా రేవంత్ కన్ఫ్యూజన్తో సరిగ్గా ఆడినవారు పోటీనుంచి వైదొలగిపోగా ఫైమా కెప్టెన్‌గా అవతరించింది. ఇకపోతే కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేసుకున్నారని ఇనయ.. ఆదిరెడ్డి, ఫైమాలపై మండిపడింది. గీతూ అలానే ఇద్దరిని గెలిపించి వెళ్లిపోయింది, ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు అని విమర్శలు గుప్పించింది. దీనికి ఆది.. నేను ఫైమాతో ప్లాన్ చేసి ఆడినట్లు తేలితే బిగ్‌బాస్ నుంచే వెళ్లిపోతానని శపథం చేశాడు. చదవండి: రేవంత్ చెత్త సంచాలక్, రోహిత్‌కు తీవ్ర అన్యాయం -
బిగ్‌బాస్‌కు రాకుండా ఉండాల్సింది: ఏడ్చిన రేవంత్
Bigg Boss Telugu 6, Episode 67: బిగ్‌బాస్ షో మొదలై పది వారాలు కావస్తోంది. ఇప్పటివరకు కెప్టెన్ కాలేని వాళ్లు చాలామందే ఉన్నారు. అందులో ఒకరు ఈవారం కెప్టెన్‌గా అవతరించారు. మరి ఆ కొత్త కెప్టెన్ ఎవరు? ఈ రోజు ఎపిసోడ్ ఎలా జరిగిందో తెలియాలంటే నేటి బిగ్‌బాస్ హైలైట్స్ చదివేయాల్సిందే! నిన్నటి గేమ్‌లో అవుట్ అయిన సత్య, ఇనయ, వాసంతి, రోహిత్ తిరిగి రేస్‌లోకి వచ్చేందుకు మంచి ఆఫరిచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా వీళ్లు ప్రత్యర్థుల మీద స్టిక్కర్స్ అతికించాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో సత్య, రోహిత్ విజయం సాధించి తిరిగి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో పాల్గొన్నారు. ఆటలో ఓడిపోయినందుకు ఫ్రస్టేట్ అయిన ఇనయ ఏదో బూతు మాట్లాడేసి తర్వాత అనుకోకుండా అన్నానని సారీ చెప్పింది. కెప్టెన్సీ కంటెండర్లు అవడానికి బిగ్‌బాస్ చివరగా నాగమణి అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో నిచ్చెన టీమ్(బాలాదిత్య, రాజ్, రేవంత్, సత్య, మెరీనా,) మణులను కాపాడుకోవాల్సి ఉండగా మిగతా టీమ్ వాటిని దక్కించుకోవాల్సి ఉంటుంది. నిచ్చెన టీమ్ దగ్గరున్న మణులను పాము టీమ్ సభ్యులు తీసుకునేందుకు నానారకాలుగా ప్రయత్నించారు. అందులో భాగంగా మొట్టమొదటగా రేవంత్‌ను కావాలని రెచ్చగొడితే అతడు ఆటాడకుండా పక్కకు తప్పుకుంటారని ప్లాన్ వేశారు. గేమ్ మొదలు కాగానే అదే ప్లాన్‌ను అమల్లో పెట్టారు. రేవంత్ జస్ట్ తోసేసినా సరే ఫిజికల్ అవుతున్నాడంటూ కావాలని రెచ్చగొట్టారు. వారి మాటలకు ఆవేశంతో ఊగిపోయిన రేవంత్ ఫిజికల్ అయితే తోలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఆదిరెడ్డి, ఫైమా అయితే రేవంత్‌కు మరింత కోపం తెప్పించేందుకు ప్రయత్నించారు. అవతలి టీమ్‌లోని శ్రీహాన్ , ఆది రెడ్డి అయితే బాలాదిత్య, రేవంత్‌ల కాళ్లు పట్టుకుని ఈడ్చుకు లాగారు. ఆట ముగిసేసరికి సంచాలకులుగా వ్యవహరించిన వాసంతి, ఇనయ పాము టీమ్ గెలిచినట్లు తెలిపారు. దీంతో ఆ టీమ్‌లోని ఫైమా, ఆదిరెడ్డి రోహిత్, కీర్తి కెప్టెన్సీ కోసం పోటీపడారు. నాగ్ ఇచ్చిన పనిష్మెంట్ కారణంగా శ్రీహాన్ పోటీపడే అర్హత కోల్పోయాడు. అతడి స్థానంలో వేరొకరిని ఎంపిక చేసుకోవచ్చని బిగ్‌బాస్ తెలపడంతో శ్రీహాన్.. తన స్థానంలో శ్రీసత్య పోటీపడుతుందని తెలిపాడు. బంగారు మణి నిచ్చెన టీమ్‌లోని మెరీనా దగ్గర ఉండటంతో ఆమె సైతం కెప్టెన్సీ బరిలో నిలిచింది. ఇక ఈ గేమ్‌లో ఫైమా కొత్త కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అందరూ తన వీక్నెస్ మీద కొట్టడాన్ని తట్టుకోలేకపోయాడు రేవంత్. 'టాస్క్ సమయంలో నేను కోప్పడుతున్నానని కావాలని లేనిపోనివి చెప్పి నా కాళ్లూచేతులు కట్టేశారు. ఇంకోసారి ఫిజికల్‌గా ఆడితే ఎల్లో కార్డ్ ఇస్తానన్నారు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఈ బిగ్‌బాస్ హౌస్‌కి రాకుండా ఉండాల్సింది' అంటూ ఎమోషనలయ్యాడు రేవంత్. చదవండి: బిగ్‌బాస్: గీతూ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? ఫిజికల్ అన్నారంటే తోలు తీస్తా: రేవంత్ వార్నింగ్ -
శ్రీసత్య, శ్రీహాన్ ఓవరాక్షన్.. ఇనయ సోది మొహమన్న ఫైమా
Bigg Boss Telugu 6, Episode 65: చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ షో మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. గేమ్ ఆడుతున్న గీతూ ఎందుకు ఎలిమినేట్ అయిందో అర్థం కాక జుట్టు పీక్కున్నారు మిగతా కంటెస్టెంట్లు. బిగ్‌బాస్ షో పదోవారంలోకి ఎంటరయ్యేసరికి హౌస్‌లో పన్నెండు మంది మాత్రమే మిగిలారు. మరి వీరిలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల ముఖాలపై గ్లాసు నీళ్లు పోయాన్నాడు బిగ్‌బాస్. కెప్టెన్ శ్రీసత్యను నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టమని ఆదేశించాడు. ► శ్రీసత్య.. బాలాదిత్య, ఇనయ ► ఆదిరెడ్డి.. ఇనయ, రేవంత్ ► వాసంతి.. ఇనయ, ఆదిరెడ్డి ► రేవంత్.. వాసంతి, ఆదిరెడ్డి ► కీర్తి.. శ్రీహాన్, ఇనయ ► బాలాదిత్య.. శ్రీహాన్, ఇనయ ► మెరీనా.. ఆది రెడ్డి, ఇనయ ► రాజ్.. ఇనయ, శ్రీహాన్ ► రోహిత్.. రేవంత్, ఆదిరెడ్డి ► ఫైమా.. వాసంతి, మెరీనా ► శ్రీహాన్.. కీర్తి, ఇనయ ► ఇనయ.. ఫైమా, శ్రీహాన్‌లను నామినేట్ చేసింది. అత్యధికంగా ఇనయకు ఎక్కువ నామినేషన్ ఓట్లు పడ్డాయి. గేమ్ కసిగా ఆడటం తప్పు కాదు, కానీ కంటెస్టెంట్ల మీద అగ్రెసివ్ చూపించకు. నీ వల్ల ఇప్పటికీ నా చేయి నొప్పిగా ఉంది. ఇనయను లాగి పడేశావు. అలాగే ఎంత కోపంలో ఉన్నా కూడా నోరు జారకూడదు అని హెచ్చరించాడు ఆదిరెడ్డి. అవతలివాళ్లను హర్ట్ చేసేంత కసి మంచిది కాదు అని సలహా ఇచ్చాడు. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో గీతూ చేసిన పనికి ఆదిరెడ్డి మైక్ విసిరేయడంతో అతడి టీమ్ గెలుపుకు ఒక దూరంలో ఆగిపోయింది. ఇదే కారణం చెప్పి బ్లూ టీమ్‌లోని సభ్యులు అతడిని నామినేట్ చేశారు. దీంతో ఆది.. 'తప్పంతా బిగ్‌బాస్‌ది. ఆయన్ను నామినేట్ చేయాలి. మన టీమ్‌కు బిగ్‌బాస్ అన్యాయం చేశాడు. మన టీమ్ ఓడిపోవడానికి బిగ్‌బాసే కారణం' అని ఫ్రస్టేట్ అయ్యాడు. ఓపక్క నామినేషన్స్ జరుగుతుంటే శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ వెకిలి చేష్టలు చేస్తూ పడీపడీ నవ్వుతుండటంతో బిగ్‌బాస్ సీరియసయ్యాడు. ఆ జోకేంటో బయటకు చెప్తే మిగతావాళ్లు కూడా నవ్వుతారు అని గద్దించాడు. నామినేషన్ ప్రక్రియకున్న మర్యాదను కనీసం కెప్టెన్ అయినా కాపాడితే బాగుంటుందనడంతో శ్రీసత్య సారీ చెప్పింది. ఇక ఇనయ, ఫైమాలు నామినేషన్లో వాదులాటకు దిగారు. నువ్వు నాకు నచ్చలేదంటే నాకు నచ్చలేదని ఒకరినొకరు తిట్టుకున్నారు. నువ్వు వెనక మాట్లాడుతావు, ఫేక్.. ఈ హౌస్‌లో ఎవరికీ నచ్చవు. సినిమాలో యాక్టింగ్ చేయు, ఇక్కడ కాదు. మనిషిని బ్లేమ్ చేయాలనుకుంటున్నావు, సోది ముఖం అంటూ ఇనయను నానా తిట్టిపోసింది ఫైమా. ఆమె అనే మాటలకు రివర్స్ కౌంటరిస్తూ పోయింది ఇనయ. ఫైనల్‌గా పదో వారం బాలాదిత్య, మెరీనా, కీర్తి, ఫైమా, వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయ నామినేట్ అయ్యారు. చదవండి: చచ్చేదాకా రుణపడి ఉంటా: గీతూ పోస్ట్ వైరల్ కంటెంట్ క్వీన్ గీతూ ఎలిమినేషన్‌కు ఇవే కారణాలు -
ఇనయను మళ్లీ ఓ ఆటాడుకున్న ఆది రెడ్డి, నామినేషన్స్‌లో 9 మంది!
బిగ్‌బాస్ హౌస్ నుంచి గీతూ వెళ్లిపోవాలని చాలామంది బలంగా కోరుకున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్లో మాత్రం గీతూ వెళ్లిపోతుంటే ఎంతోమంది ఎమోషనలయ్యారు. ఆమె బిగ్‌బాస్‌ను వీడలేక వీడుతుంటే భారంగా నిట్టూర్చారు. ఈరోజు గీతూ లేకుండానే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. శ్రీహాన్‌కు, నాకూ బయట ఒక లైఫ్ ఉంది. మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడటం నచ్చలేదని ఇనయను నామినేట్ చేసింది శ్రీసత్య. పోయినవారం హ్యుమానిటీ గురించి మాట్లాడావు.. అని కీర్తి మాట్లాడటం మొదలు పెట్టిందో లేదో మధ్యలో అందుకున్నాడు శ్రీహాన్. హ్యుమానిటీ గురించి నేను హైలైట్ చేసుకోలేదు, హీరోయిన్లా నువ్వు చెప్పుకున్నావు అని కౌంటరిచ్చాడు. దీనికి కీర్తి.. ఇక్కడ ఎవరూ హీరోయిన్ కాదు, ఎవరూ హీరో కాదు, ఇదే కొంచెం తగ్గించుకోండి అని చురకలంటించింది. కావాలని ఒకరిని కొట్టడం తప్పని రేవంత్.. వాసంతిని నామినేట్ చేశాడు. దీంతో అవాక్కైన వాసంతి.. నువ్వు మనుషులను ఎలా విసిరేస్తున్నావో ఫుటేజీతో సహా అందరం చూశామని ఎద్దేవా చేసింది. అటు ఆదిరెడ్డి.. రేవంత్‌తో పాటు ఇనయను నామినేట్ చేశాడు. బాత్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఏడవడం, బిగ్‌బాస్ పిలిస్తేనే బయటకు వస్తాననడం తప్పనిపించలేదా? అని అడిగాడు. దీనికామె అది నాకు, బిగ్‌బాస్‌కు మధ్య విషయం, మధ్యలో మీకెందుకు అని ప్రశ్నించింది. మీ ఇద్దరికీ ఉంటే మీరు బయటకు పోయి మాట్లాడుకోండి అని చిరాకు పడ్డాడు ఆది. అయినా ఇప్పటికీ దాన్ని తప్పుగా ఫీలవకపోవడం నా దురృదృష్టం అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ వారం తొమ్మిది మంది నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్, రాజ్, కెప్టెన్ శ్రీసత్య మినహా మిగిలిన తొమ్మిది మంది.. వాసంతి, రేవంత్, కీర్తి, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, మెరీనా, బాలాదిత్య, ఫైమా నామినేషన్స్‌లో ఉన్నారట! చదవండి: కంటెంట్ క్వీన్ ఎలిమినేట్ అవడానికి కారణాలివే! నేనిక్కడే ఉంటా బిగ్‌బాస్, ఎక్కడికీ పోను: ఏడ్చిన గీతూ -
నేనిక్కడే ఉంటా బిగ్‌బాస్.. గుండె పగిలేలా ఏడ్చిన గీతూ
Bigg Boss 6 Telugu, Episode 64: గెలుపు కోసం తాపత్రయపడింది, ఎలాగైనా గెలిచి తీరాలనుకుంది. తనమన బేధాలు చూడకుండా గేమ్ ఆడింది. కలలో కూడా బిగ్‌బాస్‌నే కలవరించింది. అందరికీ ఆదర్శంగా నిలవాలనుకుంది. ఎవ్వరేమన్నా లెక్క చేయకుండా ముందుకు వెళ్లింది. భుజబలం కంటే బుద్ధి బలాన్నే ఎక్కువగా వాడుతూ తొమ్మిది వారాలు హౌస్‌లో కొనసాగింది. కళ్లు మూసినా, తెరిచినా కప్పు అందుకున్నట్లే అని పగటి కలలు కంది. కానీ చివరికి అది నిజంగానే పగటి కలగా మిగిలిపోయింది. ఊహించని ఎలిమినేషన్‌తో ఆమె గుండె ముక్కలయ్యింది. మరి ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయే చివరి క్షణాల్లో ఏం మాట్లాడిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నాగార్జున రావడంతోనే హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు. మీ గేమ్‌లో పాములా కాటేసేది ఎవరు? నిచ్చెనలా సాయపడేది ఎవరని అడిగాడు. దీనికి కంటెస్టెంట్లు ఏమని సమాధానమిచ్చారంటే.. ముందుగా బాలాదిత్య.. గీతూ పాము, ఆదిరెడ్డి నిచ్చెన అని చెప్పాడు. ఆదిరెడ్డి.. శ్రీహాన్ పాము, గీతూ నిచ్చెన గీతూ.. బాలాదిత్య పాము, ఆది నిచ్చెన ఫైమా.. ఇనయ పాము, గీతూ నిచ్చెన ఇనయ.. ఆది పాము, గీతూ నిచ్చెన రాజ్.. ఆది పాము, ఫైమా నిచ్చెన రోహిత్.. గీతూ పాము, మెరీనా నిచ్చెన శ్రీహాన్.. ఇనయ పాము, రేవంత్ నిచ్చెన రేవంత్.. వాసంతి పాము, శ్రీహాన్ నిచ్చెన వాసంతి.. శ్రీహాన్ పాము, ఆది నిచ్చెన కీర్తి.. శ్రీహాన్ పాము, మెరీనా నిచ్చెన మెరీనా.. గీతూ పాము, ఆది నిచ్చెన శ్రీసత్య.. ఫైమా పాము, గీతూ నిచ్చెన అని చెప్పుకొచ్చారు. ఇక ఇనయను ప్రాంక్ చేశాడు నాగ్. నువ్వు ఎవరి కోసం ఎదురుచూస్తున్నావో తెలుసు అంటూ సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయమన్నాడు. దీంతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లగా అక్కడ సూర్య ఫొటో మాత్రమే ఉంది. దానికి ముద్దులు పెట్టి ఎమోషనలైంది. నువ్వు అనుకుంటున్నట్లు సూర్య సీక్రెట్ రూమ్‌లో లేడని, ఇంట్లో బుజ్జమ్మతో ఉన్నాడని గాలి తీశాడు. ముందు నీ గేమ్ మీద ఫోకస్ చేయమని హితవు పలికాడు. నాగ్ నామినేషన్లో ఉన్న అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో సత్య, గీతూ ఇద్దరూ మిగిలారు. గీతూ యూ ఆర్ ఎలిమినేటెడ్ అనగానే రాయలక్క ఆ మాట వినలేక చెవులు మూసుకుంది. నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవుదామనుకుంటే పంపించేస్తున్నారేంటి బిగ్‌బాస్ అని ఏడ్చేసింది. నేను బాధపెట్టి ఉంటే ఐయామ్ సారీ అని వెక్కి వెక్కి ఏడ్చింది గీతూ. నువ్వు నాకు బిగ్‌బాస్ ఇచ్చిన గిఫ్ట్ అని ఆదిని పట్టుకుని ఎమోషనలైంది. ఐ లవ్ యూ బిగ్‌బాస్, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు పోవాలని లేదు, వెళ్లను అని బోరుమని ఏడ్చింది. ఆమె వెళ్లిపోతుంటే రేవంత్, ఫైమా, సత్య, శ్రీహాన్, బాలాదిత్య, ఆదిరెడ్డి అందరూ దుఃఖం ఆపుకోలేకపోయారు. ప్రతి నిమిషం ప్రాణం పెట్టి ఆడాను. నిద్రలో కూడా బిగ్‌బాస్ షో గెలవాలనే అనుకున్నా. కానీ ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని కలలో కూడా అనుకోలేదంటూ నాగార్జున ముందు కన్నీరు పెట్టుకుంది గీతూ. ఆమెను ఓదారుస్తూ షో బ్రేకర్స్ ఎవరు? షో మేకర్స్ ఎవరు? అనే గేమ్ ఆడించాడు నాగ్. అందులో భాగంగా గీతూ.. ఆది, రేవంత్, సత్య, ఫైమా, శ్రీహాన్‌ల వల్ల షో ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని చెప్పింది. ఆదిరెడ్డి అంత మంచోడిని నేనెప్పుడూ చూడలేదని, ఫైమాకు చాలా తెలివితేటలు ఉన్నాయంది. తనకు తెలియకుండానే ఆమెను ఇష్టపడ్డానంది. ఇనయ, మెరీనా, రోహిత్, రాజ్, కీర్తిల గేమ్ తక్కువగా ఉందనిపించిందని చెప్పుకొచ్చింది. తర్వాత ఆది మాట్లాడుతూ.. గీతూ ఒక యునిక్ కంటెస్టెంట్, 24 గంటలు గేమ్ గురించే ఆలోచించి, గేమ్‌లో రిలేషన్స్ కూడా చూడని ఆ కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ హౌస్ బయట చూడటం బాధగా ఉందని ఎమోషనలయ్యాడు. చివరగా రేవంత్.. వాలుకనుల దానా నీ విలువ చెప్పు మైనా.. అంటూ గీతూకోసం పాటందుకోవడంతో ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. నేనిక్కడి నుంచి పోను, ఇక్కడే ఉంటానని వేడుకుంది. కానీ ఒక్కసారి ఎలిమినేట్ అయ్యాక తనను బయటకు పంపించడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా అలాగే నిల్చుండిపోయాడు నాగ్. చదవండి: గీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే! గీతూ కోసం ఏడ్చేసిన శ్రీహాన్, ఫైమా -
అడ్డంగా దొరికిన శ్రీహాన్, ఇనయ.. గీతూ వల్ల అతడికి పనిష్మెంట్!
Bigg Boss Telugu 6, Episode 63: ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో రెడ్, బ్లూ టీమ్ మెంబర్స్‌కు ర్యాంకులివ్వమని గీతూ, ఆదిరెడ్డిలను ఆదేశించాడు నాగ్. బ్లూ టీమ్ లీడర్ ఆది రెడ్డి.. రాజ్ ఫస్ట్, ఇనయ సెకండ్ అని చెప్పి మెరీనా, వాసంతి, బాలాదిత్య, రోహిత్‌లకు వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు ర్యాంకులిచ్చాడు. తనకు ఏడో ర్యాంకు ఇచ్చుకున్నాడు ఆది. ఈ సందర్భంగా నాగ్.. సిగరెట్ల కోసం గీతూను నానామాటలు అన్నావు, సిగరెట్ తాగగానే సారీ చెప్పావు అంటూ బాలాదిత్య మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీంతో అతడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక మీదట సిగరెట్ ముట్టుకోనని శపథం చేశాడు. ఆట అయిపోయాక బాలాదిత్య బలహీనత మీద ఆడుకోవడం కరెక్ట్ కాదని గీతూకు కూడా హితవు కలిపాడు నాగ్. రెడ్ టీమ్ లీడర్ గీతూ.. శ్రీహాన్‌కు ఫస్ట్, ఫైమాకు సెకండ్, శ్రీసత్య, రేవంత్, కీర్తిలకు మూడు, నాలుగు, ఆరో ర్యాంకులిచ్చింది. తనకు తాను మాత్రం ఐదో ర్యాంకిచ్చుకుంది. రేవంత్ ఉన్మాదిలా ఆడిన వీడియోను చూపించాడు నాగ్. అందులో అతడు ఇనయను బలంగా నెట్టేశాడు. నువ్వు ఇంకా నీ కోపాన్ని తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత శ్రీహాన్‌ను.. కెప్టెన్సీలో నువ్వేం పొడిచావో చెప్పమని అడగడంతో అతడు నీళ్లు నమిలాడు. లాస్ట్ వీక్ గీతూకు వాష్‌రూమ్స్ కడగాలని ఇచ్చిన పనిష్మెంట్ ఎందుకు తగ్గించావని ప్రశ్నించాడు. ఆదిరెడ్డి సాయం చేస్తుంటే చూస్తూ కూర్చున్నావెందుకని నిలదీశాడు. వీడియో వేసి మరీ చూపించడంతో అడ్డంగా దొరికిపోయిన శ్రీహాన్ తప్పు తనదేనని ఒప్పుకున్నాడు. తప్పు చేసినందుకు ఫలితంగా నెక్స్ట్ వీక్ కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయావన్నాడు నాగ్. అనంతరం బ్లూ టీమ్‌లో ఆది, రెడ్ టీమ్‌లో గీతూకు వరస్ట్ పర్ఫామర్ ట్యాగిచ్చాడు. తర్వాత ఆది, కీర్తి, రేవంత్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. ఇక బిగ్‌బాస్ ఇంటి విషయాల గురించి నాగ్ మాట్లాడుతూ.. ఇంట్లో ఫుడ్ సరిపోవట్లేదంటున్నారు. ఆల్రెడీ మీకు కావాల్సినంత ఫుడ్ బిగ్‌బాస్ పంపిస్తూనే ఉన్నాడు. అయినా ఎందుకా సమస్య తలెత్తుతోందని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. వేస్ట్ చేసిన ఫుడ్ వీడియోను చూపించి తప్పు మీ దగ్గరే ఉందని నిందించాడు. తనను టార్గెట్ చేస్తున్నారని పదే పదే వాదిస్తున్న ఇనయ తనకు ఏదైనా కావాలంటే ముందుగా కెప్టెన్‌కు చెప్పమని సూచించాడు. అందరూ రెండుసార్లు టీ తాగినంత మాత్రాన నీకు రెండుసార్లు పాలు ఇవ్వడం ఎలా కుదురుతుందని ప్రశ్నించాడు. ఇకపోతే శ్రీహాన్‌ను నువ్వెక్కడ పడుకుంటున్నావో చూస్తున్నా అనడం తప్పని స్పష్టం చేశాడు. దానికి ఇనయ తాను వేరే ఇంటెన్షన్‌తో అన్నానని ఆన్సరివ్వగా కెమెరాలు చూస్తున్నాయి, ఎంత కవర్ చేసినా దొరుకుతావు ఇనయ.. అని గద్దించాడు. దీంతో ఆమె కిమ్మనకుండా సైలెంట్ అయిపోయింది. ఇదిలా ఉంటే రేపటి ఎపిసోడ్లో గీతూ ఎలిమినేట్ అవగా నేను వెళ్లనంటూ ఏడుపందుకుందట. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. The weekend heat is on 🔥 @iamnagarjuna confronts the housemates on this week's happenings! Don't miss tonight's exciting episode of #BiggBossTelugu6 on @StarMaa & @DisneyPlusHSTel.#BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/NjDGUcR07T — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 5, 2022 చదవండి: షాకింగ్ ఎలిమినేషన్, గీతూ రాయల్ అవుట్ ఇనయపై సూర్య ప్రతీకారం? ఆ పోస్ట్‌తో క్లారిటీ! -
గీతూ చేసిన పనికి ఆదిరెడ్డిని శిక్షించిన బిగ్‌బాస్!
ఆకు వచ్చి ముళ్లు మీద పడ్డా, ముళ్లొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే.. ఈ సామెత ప్రస్తుతం ఆదిరెడ్డికి బాగా సెట్టయింది. గీతక్క గీతక్క అంటూ ఆమెను నమ్మినందుకు గేమ్‌లో వెన్నుపోటు పొడిచింది. ఆల్రెడీ తను అవుట్ అయినా సరే గేమ్ ఆడి ఆదికి కోపం తెప్పించి అతడు కూడా గేమ్‌లో లేకుండా చేసింది. ఆదిరెడ్డి ఆవేశంలో మైక్ విసిరేసినందుకు వారం అతడిని కెప్టెన్సీ టాస్క్‌కు అనర్హుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్. చేసిందంతా చేశాక కాళ్లబేరానికి వచ్చింది గీతూ. ఆది దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. నువ్వు చెప్పిన రూల్ నువ్వే ఫాలో కాలేదు, నీ వల్ల నేను చచ్చిపోయాను అని బాధపడ్డాడు ఆది. అనంతరం మెరీనా, వాసంతి, ఫైమా, గీతూ, సత్య, ఇనయ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. బెలూన్లు కాపాడుకునే టాస్క్‌లో శ్రీసత్య గెలిచి కెప్టెన్‌గా అవతరించింది. చదవండి: గీతక్కా, నీకు కన్నీళ్లు తెప్పిస్తా, చూడు..: ఉడాల్ మామ వార్నింగ్ ఆ హీరోతో ఒక్క సినిమా కూడా చేయని టబు -
గీతక్కా, నీకు కన్నీళ్లు తెప్పిస్తానని మాటిస్తున్నా: ఆది
బిగ్‌బాస్ సీజన్ 6లో శ్రీహాన్, ఇనయ గొడవ ఎంతో ఫేమస్. నామినేషన్స్ వస్తున్నాయంటే చాలు వీరి పోట్లాట చూద్దామని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఆ రేంజ్లో ఉంటాయి వీరి గొడవలు. అయితే గీతూ, ఆదిరెడ్డి గొడవ పెట్టుకుంటే చూడాలని వెయిట్ చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇన్నాళ్లకు వారి ముచ్చట తీరబోతోంది. ఈ రోజు గేమ్‌లో ఆది గీతూతో పోట్లాటకు దిగాడు. ఆటలో నమ్మించి గొంతు కోసిందని ఫ్రస్టేట్ అయ్యాడు ఆది. తన టీషర్ట్ స్ట్రిప్స్ దొంగతనం చేయనని మాటిచ్చి తీరా అదే పని చేసి ఆదికి ఝలక్ ఇచ్చింది గీతూ. ఇది తెలిసిన ఆది ఆవేశం ఆపుకోలేక తన టీషర్ట్ తీసేసి మైక్ విసిరికొట్టాడు. నువ్వు పర్సనల్‌గా ఆడావు అని ఫైర్ అయ్యాడు. నిన్ను ఏడిపించే రోజు దగ్గరలోనే ఉందని మాటిస్తున్నా, అదే నేను కొట్టే దెబ్బ అని రగిలిపోయాడు ఆదిరెడ్డి. కాగా గీతూ తనకు దగ్గరైన అందరినీ దూరం చేసుకుంటూ వస్తోంది. మొదట రాజ్‌తో మంచిగా ఉండి అతడితో కయ్యానికి దిగి దూరమైంది. తర్వాత బాలాదిత్యతో కావాలని గొడవలు పెట్టుకుంది. ఇప్పుడు ఉన్న ఒక్క ఫ్రెండ్ ఆదిరెడ్డని నమ్మించి మోసం చేసి అతడి కోపానికి కారణమైంది. మరోపక్క ఇనయ.. తనను కావాలని కొడుతున్నారని ఆరోపించింది. దీనికి శ్రీహాన్.. ఇంటెన్షన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అని ఎగతాళి చేశాడు. ఇకపోతే ఆల్రెడీ శ్రీసత్య కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: ఫ్లైట్ నుంచి దూకేశా: శర్వానంద్ ముంబై హీరోయిన్స్‌పై అడివి శేష్ షాకింగ్ కామెంట్స్ -
గీతక్క మాయలో ఆదిరెడ్డి, కొత్త కెప్టెన్ ఎవరంటే?
Bigg Boss 6 Telugu, Episode 61: బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతోంది. సీక్రెట్ మిషన్ టాస్క్‌లో భాగంగా రెడ్ టీమ్ కావాలనే బాత్రూమ్ను డర్చీగా మార్చింది. కానీ ఆ నిందను బ్లూ టీమ్ మేద వేయడంతో హౌస్‌లో రచ్చ రంబోలా జరిగింది. సీక్రెట్ గేమ్ సక్సెస్ కావడంతో బ్లూ టీమ్‌లో చనిపోయిన రోహిత్‌ను తిరిగి బతికించారు. మధ్యాహ్నం భోజనం సమయానికి సూర్య ప్లేటు కోసం ఇల్లంతా వెతికింది ఇనయ. ఎక్కడా కనిపించకపోవడంతో ప్లేటు మీద సూర్య పేరును ఎవరు చెరిపేశారు? అని నిలదీసింది. దీనికి బాలాదిత్య నువ్వు వాడుతున్నావనే చెరిపేశారని ఆన్సరిచ్చాడు. అది విన్న రేవంత్.. అలా అనడం తప్పంటూ అందుకున్నాడు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు, సత్య ఏం అందో అదే చెప్పానని బదులిచ్చాడు. నా ఎమోషన్‌తో ఆడుకుంటున్నారని ఫైర్ అయిన ఇనయ అన్నం తిననంటూ ఓ మూలన కూర్చుని ఏడ్చింది. ఇది చూసిన శ్రీసత్య.. అంత ప్రేముంటే బిగ్‌బాస్‌ను అడిగి మిడ్ వీక్ ఎలిమినేషన్లో వెళ్లిపోయి సూర్య ఇంట్లో కూర్చోమను అని వెక్కిరించింది. ఇనయ అలిగి ఏడుస్తూ కూర్చోవడంతో కీర్తి ఓదార్చగా మెరీనా గోరు ముద్దలు తినిపించింది. తర్వాత గేమ్ తిరిగి ప్రారంభం కాగా రెడ్ స్క్వాడ్‌లో రేవంత్ కంటికి గాయం అయింది. ఇంతలో గీతూ అవుట్ అయింది. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన రెండో మిషన్‌లో రెడ్ టీమ్ గెలవడంతో వారు రోహిత్‌ను తిరిగి చంపేశారు. ఇక ఈ రోజుకు టాస్క్ సమయం ముగిసిందన్నాడు బిగ్‌బాస్. అయితే రాత్రి టీ షర్ట్లు దొంగిలిద్దామని ప్లాన్ వేసింది గీతూ. కానీ ఆదిరెడ్డితో మాత్రం టాస్క్ ఆన్ అయ్యాకే తిరిగి గేమ్ స్టార్ట్ చేద్దామని మాయమాటలు చెప్పింది. అతడూ సరేనని నమ్మాడు. అలా అతడిని బురిడీ కొట్టించి అర్ధరాత్రి ఆది రెడ్డి టీషర్ట్ దొంగిలించింది గీతూ. తెల్లవారుజామున ఆదిరెడ్డికి గీతూ గేమ్ అర్థమైంది. గేమ్ పాజ్‌లో ఉన్నప్పుడు టీషర్ట్స్ స్ట్రాప్స్ తీసేయడం తప్పని వారించగా తానసలు తీయలేదని అబద్ధమాడింది గీతూ. గీతూ తీసిందని తేలితే ఇకపై గీతూ వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్ అవుతుందని హెచ్చరించాడతడు. అయితే ఈ మిషన్ పాజిబుల్ గేమ్ డ్రా అయిందట. దీంతో రెండు టీమ్స్‌లోని మెరీనా, వాసంతి, ఇనయ, ఫైమా, సత్య, గీతూ కెప్టెన్సీ కోసం పోటీపడగా సత్య కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: బుజ్జమ్మ తన గర్ల్‌ఫ్రెండే కాదన్న సూర్య, ఇనయ లైన్ క్లియర్? -
ఇప్పుడసలైన మజా.. ఆదిరెడ్డి వర్సెస్ గీతూ గేమ్ స్టార్ట్!
బిగ్‌బాస్ ఇచ్చే గేమ్‌లో ఏవైనా లొసుగులు ఉన్నాయా? అని చూసే మొట్టమొదటి వ్యక్తి గీతూ. ఫిజికల్‌గా గేమ్ ఆడలేని ఆమె బుద్ధి బలంతో గేమ్‌ను రఫ్ఫాడించాలనుకుంటుంది. ఈ క్రమంలో అతి తెలివి ప్రదర్శించి నాగార్జునతో గతవారం చీవాట్లు కూడా తింది. ఇకపోతే నిన్నటివరకు బాలాదిత్య వీక్నెస్ మీద దెబ్బ కొట్టిన గీతూ ఈరోజు ఆదిరెడ్డితో గొడవ పెట్టుకునేట్లు కనిపిస్తోంది. బాత్రూమ్ ఏరియాలో ఆది టీషర్ట్ దాచుకుంటే వెళ్లి దాన్ని దొంగిలించింది గీతూ. పోనీ తను గేమ్‌లో ఉందా? అంటే లేదు. ఆల్రెడీ బ్లూ టీమ్ తనను అవుట్ చేసింది. అయినా సరే, ఆది టీషర్ట్ దొంగిలించి దాచేసింది. ఎవరు తీశారని అడిగితే తాను తీయలేదని చెప్పింది. కానీ ఆది మాత్రం ఆమె మీదే డౌట్ పడ్డాడు. ఒకవేళ గీతూ తీసిందని తేలితే ఇకపై గీతూ వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్ అవుతుందని హెచ్చరించాడు ఆది. చదవండి: బుజ్జమ్మ సూర్య గర్ల్‌ఫ్రెండే కాదట, అంటే ఇనయ లైన్ క్లియర్ అయినట్లేనా? అంత ప్రేముంటే ఇప్పుడే సూర్య ఇంటికి వెళ్లిపోమను: శ్రీసత్య -
గీతూ చెత్త సంచాలక్, బాలాదిత్య చేతులెత్తి మొక్కినా..
Bigg Boss 6 Telugu, Episode 60: బిగ్‌బాస్ అంటే మైండ్ గేమ్ అని కొందరు, కాదు ఫిజికల్ గేమ్ అని మరికొందరు, ఆ రెండింటికన్నా వ్యక్తిత్వం ఇంపార్టెంట్ బ్రదరూ అనేవాళ్లూ ఉన్నారు. కానీ కంటెస్టెంట్లలో కచ్చితంగా ఈ మూడు క్వాలిటీస్ ఉండాల్సిందే! దురదృష్టం కొద్దీ ఆ విషయాన్ని గాలికొదిలేస్తున్నారు హౌస్మేట్స్. ఫిజికల్ గేమ్ వచ్చినప్పుడు మైండ్ గేమ్, మైండ్ గేమ్ వచ్చినప్పుడు ఫిజికల్ గేమ్ ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా టాస్క్ రాగానే వారి బలహీనతల మీద దెబ్బ కొట్టి రెచ్చగొట్టి పెంట చేస్తున్నారు. దీంతో గేమ్ స్పిరిట్ కంటే గొడవలే ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో భాగంగా ఇతర స్క్వాడ్‌లోని సభ్యులను చంపేందుకు క్యాప్చర్ ద వార్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే గ్రనైట్ రెడ్ స్క్వాట్ ఆధీనంలో ఉండటంతో ఎవరెవరు పోటీపడాలి? సంచాలకులుగా ఎవరు ఉండాలనేది రెడ్ టీమ్ ఎంపిక చేయొచ్చని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకేముంది, గీతూ సంచాలక్ అయింది. బ్లూ టీమ్‌లో వీక్‌గా ఉన్నారనుకున్న ఇనయ, వాసంతి, మెరీనాలు.. రేవంత్, శ్రీహాన్, ఫైమాతో పోటీపడాలని నిర్ణయించారు. గేమ్ మొదలు కాకముందే ఎప్పటిలా కొత్త రూల్స్ పెట్టింది గీతూ. గోడ మీద నుంచి రెండు కాళ్లు కింద పెడితే అవుట్ అని చెప్పింది. గేమ్ ప్రారంభం కాగానే ముగ్గురు ఆడాళ్లు సివంగుల్లా పోట్లాడారు. వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేసిన రేవంత్‌ను అవుట్ చేసింది వాసంతి. శ్రీహాన్ ఇనయను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ.. నామినేషన్లో తప్ప కంటెంట్ లేనిదానివి నువ్వు మట్లాడుతున్నావు అని విమర్శించాడు. దీనికి ఇనయ.. నువ్వూ ఈ మధ్య కంటెంట్ బాగా ఇస్తున్నావ్లే, ఎక్కడ వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నా అంది. ఇక ఇనయ నెట్టేసే క్రమంలో శ్రీహాన్ రెండు కాళ్లు కింద పెట్టినా గీతూ మాత్రం తాను చూడలేదని మాట్లాడింది. ఎవ్వరు చెప్పినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ మొదటి మిషన్‌లో రెడ్ స్క్వాడ్ గెలవగా వారు బ్లూ స్క్వాడ్‌లో రోహిత్‌ను చంపారు. తర్వాత శ్రీహాన్.. ఇనయ దగ్గరకు వెళ్లి నా క్యారెక్టర్ గురించి ఏదో నోరు జారుతున్నావేంటి అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మా రిలేషన్‌కు ఓ పేరుంది, లిమిట్ ఉంది అని ఎగబడ్డారు శ్రీసత్య, శ్రీహాన్. దానికి ఇనయ మీరు కింద పడుకోవడం చూశానని ఆన్సరిచ్చింది. మరోపక్క బాలాదిత్య సిగరెట్ల కోసం అల్లాడిపోయాడు. చేసింది చాలు, తప్పు చేయకు, నా మనసు విరిగిపోయింది అని సిగరెట్లు అడగ్గా గీతూ మాత్రం ఇవ్వనంటూ మొండికేసింది. నా స్టూడెంట్స్‌కు నేను సిగరెట్లు తాగడం తెలియొద్దనుకున్నా, కానీ తెలిసిపోయింది. అమ్మ చూస్తే బాధపడుతుంది అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు ఆదిత్య. ఆదిరెడ్డి సహా అందరూ బతిమాలడంతో చివరాఖరికి సిగరెట్లు ఇచ్చేసి ఏడ్చేసింది గీతూ. దీంతో ఆవేశంలో సిగ్గులేదు అన్నందుకు తనను క్షమించమని చేతులెత్తి వేడుకున్నాడు బాలాదిత్య. గీతూ మాత్రం అతడిని క్షమించే ప్రసక్తే లేదన్నట్లు ప్రవర్తించింది. తెల్లారి బాలాదిత్య సిగరెట్లు తాగుదామనుకునేలోపు లైటర్ కనిపించకుండా పోయింది. దీంతో ఆదిరెడ్డి.. బిగ్‌బాస్.. వీక్నెస్తో ఆడుకోమన్నాడని చెప్పి మీ బలాన్ని ప్రయోగించరా? అని కరెక్ట్ పాయింట్ లాగాడు. అటు గీతూ మాత్రం.. నేను దొంగ, వెధవెన్నర వెధవ.. జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి కాసేపు సతాయించి తర్వాత లైటర్ ఇచ్చేసింది. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇనయ సూర్య జ్ఞాపకాలతో తడిసి ముద్దైంది. నీ షర్ట్ వేసుకునే గేమ్ ఆడాను. ఎందుకింత గుర్తొస్తున్నావంటూ సూర్యను తలుచుకుని ముసిముసి నవ్వులు నవ్వింది. అటు శ్రీసత్య మాత్రం ఎవరు ఏ పాయింట్లో ట్రిగ్గర్ అవుతారో నాకు తెలుసు. కాబట్టి రేపు ఎదుటివాళ్లను రెచ్చగొట్టి గేమ్ ఆడదామని రేవంత్‌తో చెప్పుకొచ్చింది. మరుసటి రోజు ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికి సీక్రెట్ మిషన్ ఇచ్చాడు. వాష్‌రూమ్‌ను పూర్తిగా అశుభ్రపరిచి ఆ నింద రెడ్ స్క్వాడ్‌లో ఒకరి మీద వేయాలన్నాడు. ఈ మిషన్ కంప్లీట్ చేస్తే బ్లూ టీమ్‌లో ఒకరిని బతికించొచ్చన్నాడు. మరి ఆ సీక్రెట్ మిషన్ పాజిబులా? ఇంపాజిబులా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే! చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల అందరికీ రుణపడి ఉంటా: రంభ వీడియో వైరల్ -
ఇనయ బండారం బయటపెట్టిన రేవంత్, నామినేషన్స్‌లో 10 మంది!
Bigg Boss Telugu 6, Epispde 58: ఆర్జే సూర్య ఎలిమినేషన్ నేటి నామినేషన్స్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఓ పక్క సూర్య కప్‌లో కాఫీ తాగుతూ అతడి జ్ఞాపకాల్లో మునిగి తేలుతోంది ఇనయ. ఆమెను చూసిన ఫైమా.. సూర్యతో మాట్లాడితే బయటకు నెగెటివ్‌గా పోతుందన్న ఆమె అతడు వెళ్లిపోతుంటే ముద్దులు పెట్టింది.. మరి అది నెగెటివ్‌గా పోదా? అంటూ గీతూతో చెప్పుకొచ్చింది. అసలు సూర్యను నామినేట్ చేసి అతడు బయటకు వెళ్లడానికి ప్రధాన కారణంగా నిలిచింది ఇనయ అంటూ మెజారిటీ హౌస్మేట్స్ ఆమెకు ఒకటే నామినేషన్లు గుద్దారు. మరి ఇంటిసభ్యులు ఎవరెవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ ఎదుట ఉన్న దిష్టిబొమ్మలపై కుండలు పగలగొట్టాలని ఆదేశించాడు బిగ్‌బాస్. మొదటగా వచ్చిన గీతూ.. నీ భర్తతో కలిసి ఆడుతున్నావంటూ మెరీనాను, నువ్వో కన్ఫ్యూజన్ పర్స్ అంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. రేవంత్.. ఇనయను నామినేట్ చేసే క్రమంలో వీరి మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఇప్పటివరకు సూర్య నామినేషన్లోకి రాలేదు, గుద్దితే వెళ్లిపోతాడు. చాలా సేఫ్‌గా ఆడుతున్నాడు.. అని నువ్వే అన్నావు కదా అంటూ ఇనయను ఇరికించేశాడు. నేనలా అనలేదు, సూర్య గురించి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదని ఫైర్ అయింది ఇనయ. ఇక తనను ఛీ, తూ అనేసిందని కీర్తి కుండ పగలగొట్టాడు రేవంత్. ఈ హౌస్‌లో ఇనయ మోస్ట్ ఫేకః ఫేకస్య ఫేకోభ్యః అన్నాడు ఆది. సూర్యను నామినేట్ చేయడం, అతడు వెళ్లిపోయినప్పుడు బాధపెడటం? ఇదంతా ఫేక్ అన్నాడు. విన్నర్ క్వాలిటీస్ సహజంగా ఉండాలే తప్ప కావాలని ఇముడ్చుకోవాలని చూస్తున్నావనడంతో మధ్యలో అందుకున్న ఇనయ.. అవును నేను విన్నర్ అంటూ రెచ్చిపోయింది. వీరి గొడవ చూసి శ్రీసత్య, గీతూ, శ్రీహాన్, రేవంత్ పడీపడీ నవ్వారు. తర్వాత రేవంత్ కుండ పగలగొట్టాడు ఆది. గేమ్‌లో మమ్మల్ని పర్సనల్‌గా రెచ్చగొట్టావ్. అలాగే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నాకు ఓటేసి ఇప్పుడేమో నా గేమ్ అర్థం కావట్లేదని నామినేట్ చేయడం సిల్లీగా అనిపించిందంటూ గీతూ దిష్టిబొమ్మ కుండ పగలగొట్టాడు రోహిత్. కరెక్ట్‌గా పాయింట్ టూ పాయింట్ మాట్లాడటంతో గీతూ నోరు మూయించాడు. తర్వాత శ్రీసత్యను నామినేట్ చేశాడు. మంచితనం ఎక్కువైందంటూ బాలాదిత్యను, ప్రవర్తన నచ్చట్లేదంటూ ఇనయను నామినేట్ చేసింది ఫైమా. సూర్య పేరు రాసుకున్నప్పుడు, సూర్యుడి బొమ్మ వేసుకున్నప్పుడు, అతడికి ముద్దులు పెట్టినప్పుడు బయటకు నెగెటివ్ అవుతావని అనిపించలేదా? అని ఫైమా నిలదీయగా సూర్య అంటే నాకిష్టం అంది ఇనయ. సూర్య నీకడ్డం అవుతాడని నామినేట్ చేసి పంపించావు. అతడికి వెన్నుపోటు పొడిచావంటూ ఆదిరెడ్డి పదే పదే అనడంతో ఇనయ కంట్లో నీళ్లు తిరిగినా అది బయటపడకుండా కంట్రోల్ చేసుకుంది. ఫ్రెండ్షిప్లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లు ఎవరూ పొడవరంటూ ఇనయను నామినేట్ చేశాడు శ్రీహాన్. పైగా తను కెప్టెన్ కావడంతో ఈరోజు నువ్వు నన్ను నామినేట్ చేయలేవు అని చివర్లో ఆనందపడ్డాడు. మెరీనా - శ్రీసత్య, గీతూ; బాలాదిత్య - శ్రీసత్య, ఫైమా; కీర్తి - గీతూ, రేవంత్; వాసంతి - గీతూ, రేవంత్; రాజ్ - గీతూ, బాలాదిత్య; సత్య - బాలాదిత్య, ఇనయలను నామినేట్ చేశారు. ఫైనల్‌గా ఈ వారం బాలాదిత్య, గీతూ, ఇనయ, రేవంత్, ఫైమా, శ్రీసత్య, కీర్తి, రోహిత్, ఆది రెడ్డి, మెరీనా నామినేషన్లో ఉన్నారు. చదవండి: మూడు నెలలుగా కోమాలో, నటుడి భార్య మృతి లవ్‌లో ఉన్నాం.. హీరోహీరోయిన్లు -
విన్నర్ క్వాలిటీస్.. బిగ్‌బాస్ 6 విన్నర్ నేనే: ఇనయ
అపరిచితురాలులా మారిపోయిన ఇనయకు నామినేషన్స్‌లో గట్టి దెబ్బే తగిలేట్లు కనిపిస్తోంది. కారణం.. ఇనయకు మొదట్లో ఆర్జే సూర్యతో అంతగా పడలేదు. కానీ ఎప్పుడైతే ఆరోహి వెళ్లిపోయిందో అప్పుడు అతడితో బాగా క్లోజ్ అయింది. బావా అంటూ వెనకాలే తిరుగుతూ అతడే తన ప్రపంచం అన్నట్లుగా మారిపోయింది. మళ్లీ అంతలోనే నీతో ఫ్రెండ్షిప్ కట్ అంటూ నామినేట్ చేసింది. ఆమె నామినేట్ చేసిన వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఇక్కడ విడ్డూరం ఏంటంటే.. సూర్య వెళ్లిపోవడాన్ని ఇనయ తట్టుకోలేక బోరుమని ఏడ్చింది. మరి వెళ్లిపోతే అంత బాధపడేదానివి ఎందుకని నామినేట్ చేశావ్.. అంటూ ఇనయపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ముప్పుతిప్పలు పెట్టారు హౌస్మేట్స్. ఆదిరెడ్డి అయితే.. ఫేకః.. ఫేకస్య.. ఫేకోభ్యః అంటూ ఇనయపై సెటైర్లు వేశాడు. సూర్యను నామినేట్ చేసింది నువ్వే.. ఎలిమినేషన్‌కు కారణమూ నువ్వే! మరి అతను వెళ్లిపోతే బాధపడతామన్నప్పుడు ఎందుకు నామినేట్ చేయడం? అని పాయింట్ లాగాడు. దీనికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాని ఇనయ అది నా ఇష్టమని బదులిచ్చింది. ఇక రేవంత్ కూడా ఇది యాక్టింగా? ఫేకా? అని అడగ్గా.. సూర్య గురించి ఇక్కడ తీసుకురానవసరం లేదు అంటూ ఫైర్ అయింది ఇనయ. విన్నర్ క్వాలిటీస్ మనలో ఉండాలే తప్ప.. కావాలని వాటిని మనలో పెట్టుకుని చేయకూడదని ఆదిరెడ్డి అనడంతో మధ్యలో అందుకున్న ఇనయ.. విన్నర్ క్వాలిటీస్ అన్నారు కదా, నేనే విన్నర్.. బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ నేనే అని గొంతెత్తి అరిచింది. దీంతో ఆదిరెడ్డి, శ్రీహాన్ నవ్వాపుకోలేకపోయారు. చదవండి: గీతూ పెద్ద ఇడియట్, ఇనయ, ఫైమాకు బలుపెక్కువ తల్లి కోసం రూ.80 లక్షలు ఖర్చు పెట్టిన శ్రీసత్య -
చివరిసారిగా సూర్యకు ఇనయ ముద్దుల వర్షం, భారంగా వీడ్కోలు
Bigg Boss 6 Telugu, Episode 56: నాగార్జున వచ్చీరాగానే తన కోపాన్నంతా కక్కేశాడు. చేపల చెరువు టాస్క్‌లో గీతూ ఎలా ఆడిందో ఆదిని రివ్యూ ఇవ్వమన్నాడు. గీతూ ఫిజికల్‌గా బాగా ఆడిందని వెనకేసుకొచ్చాడు ఆది. మరి అంత బాగా ఆడితే మీ దగ్గరే ఎందుకు తక్కువ చేపలున్నాయన్నాడు. దీంతో వాళ్లు మౌనంగా ఉండిపోయారు. గీతూ మధ్యలో ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా పానకంలో పుడకలా మధ్యలో మాట్లాడకని వార్నింగ్ ఇచ్చాడు నాగ్. సంచాలక్‌గా తన ఆటతీరు ఎలా ఉంది? అని ప్రశ్నించగా మెజారిటీ హౌస్మేట్స్ ఆమె అలా ఆట మధ్యలో దూరడం తప్పని చెప్పారు. అయితే గీతూ మాత్రం.. నేనుండే సీజన్లో ఎవరు ఆడకపోయినా నేనే ఆడిస్తానని రెచ్చగొట్టాను. బయట కూడా నేను గేమర్‌ను అని చెప్పుకొచ్చింది. ఎదుటివాళ్ల వీక్నెస్ మీద ఆడటం గేమర్ లక్షణం కాదు. నువ్వు గేమర్ కాదు, వేస్ట్.. ఓటమి తట్టుకోలేక ఏడ్చావు. గేమ్ ఇంట్రస్టింగ్‌గా ఆడటం మా బిగ్‌బాస్ చూసుకుంటాడు. నువ్వేం చేయనవసరం లేదు. సరే పోనీ, కూరగాయలు కట్ చేశాక ఆ తొక్క అంతా డస్ట్‌బిన్‌లో వేయడానికి అంత గొడవ అవసరమా? నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది. కోపమొస్తే కామన్సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావని క్లాస్ పీకాడు నాగ్. నువ్వు గెలవడాని కంటే అవతలివాళ్ల వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలని చూశావని ఫైర్ అయ్యాడు. సంచాలక్‌గా తప్పు చేసిన గీతూ బిగ్‌బాస్ చెప్పేవరకు బాత్రూమ్స్ క్లీన్ చేయాలని పనిష్మెంట్ ఇచ్చాడు. ఎవరి ఆట వాళ్లు బాగా ఆడితే సీజన్ ఎక్కడుండాలో అక్కడుటుంది అన్నాడు. ఆట ఆడుతూనే అమ్మాయిల డ్రెస్ సరిదిద్దావంటూ బాలాదిత్యను మెచ్చుకున్నాడు నాగ్. శ్రీహాన్-శ్రీసత్య కలిసి ఆడారా? మిగతా జంటల సాయం తీసుకున్నారా? అని అడగ్గా వారు కలిసే ఆడామని తలూపారు. నాగ్ మాత్రం.. గీతూ దయాదాక్షిణ్యాల మీద మీ గేమ్ ఆధారపడిందని సెటైర్ వేశాడు. సూర్య.. తనను ముగ్గురమ్మాయిల(ఇనయ, ఫైమా, కీర్తి) కన్నా నేను ఫిజికల్‌గా తక్కువ అనేసరికి బాధపడ్డానంది వాసంతి. ఫెమినిస్ట్ అయి ఉండి అలా మాట్లాడతావా? అని విమర్శించడంతో ముఖం మాడ్చాడు సూర్య. కామెడీ విషయంలో కొన్నిసార్లు నోరుజారుతున్నావు, జాగ్రత్తగా ఉండని ఫైమాను హెచ్చరించాడు నాగ్. గేమ్‌లో రేవంత్ మిగతావారిని నెట్టేసిన వీడియో చూపించిన నాగ్.. ఉన్మాదిలా ఆడుతున్నావు, ఆ కోపం తగ్గించుకుంటూనే గేమ్ ఆడు అని సలహా ఇచ్చాడు. ఈ వారం అనర్హులు బ్యాడ్జ్ ఎవరికి ఇస్తావంటే కెప్టెన్ శ్రీహాన్.. కీర్తి పేరు సూచించాడు. పాజిటివ్ తీసుకున్నంత ఈజీగా నెగెటివ్ తీసుకోలేదంటూ ఆమెకు అనర్హురాలు బ్యాడ్జ్ తగిలించాడు. తర్వాత డైరెక్ట్ ఎలిమినేషన్ అంటూ సూర్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. ఊహించని ఎలిమినేషన్‌తో ఇనయ వెక్కి వెక్కి ఏడ్చింది. అతడిపై ముద్దుల వర్షం కురిపిస్తూ భారంగా వీడ్కోలు పలికింది. ఫైమా, కీర్తి సైతం సూర్య వెళ్లిపోతుంటే కంటనీరు పెట్టుకున్నారు. మిగతా హౌస్మేట్స్ అతడిని సీక్రెట్ రూమ్‌కి పంపిస్తారేమోనని అభిప్రాయపడ్డారు. మరి సూర్య స్టేజీపైన ఏం మాట్లాడాడు? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే! చదవండి: గీతూను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: అనుపమ్ ఖేర్ -
నా చేతివంట తిన్నాక నాన్నకు గుండెపోటు వచ్చింది: ఇనయ
Bigg Boss 6 Telugu, Episode 55: ముందుగా అనుకున్నట్లుగానే శ్రీహాన్ కెప్టెన్ అయ్యాడయ్యాడు. అలా కెప్టెన్ అయ్యాడో లేదో ఇలా ఇనయతో గొడవపడ్డాడు. మొన్నటిదాకా కలిసిపోయిన వీళ్లిద్దరి కథ కెప్టెన్సీ టాస్క్‌తో మళ్లీ మొదటికి వచ్చింది. ఇనయ కత్తిపోటు వేయడాన్ని శ్రీహాన్ జీర్ణించుకోలేకపోయాడు. సరైన సమయం వచ్చినప్పుడు తనేంటో చూపిస్తాననడి డిసైడ్ అయ్యాడు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. సూర్య, ఇనయల ట్రాక్ చూసి జనాలు వీరిని సునయ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ నాగార్జున వీకెండ్లో పదేపదే బుజ్జమ్మ పేరు ఎత్తడంతో ఇనయ బాగా హర్టయింది. సూర్యకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని అన్నిసార్లు గుర్తు చేసినప్పుడు తను క్లోజ్‌గా ఉండటం తప్పని భావించింది. ఏకంగా అతడి ఫ్రెండ్షిప్నే వద్దంది. సూర్య మీద ద్వేషం పెంచుకుంది. టాప్ 5లో కాదు కదా వీలైనంత వెంటనే బయటకు వెళ్లిపోవాలని రగిలిపోయింది. కానీ ఆ కోపం చప్పున చల్లారిపోయినట్లు కనిపిస్తోంది. నాకు కోపమొస్తే అవతలివారిని బాధపెడతాడనని సూర్యతో చెప్పుకొచ్చింది ఇనయ. నీ బ్రాస్లేట్ రేవంత్ దగ్గర ఉండటం నచ్చలేదు, అందుకే తీసుకున్నానన్నాడు సూర్య. అలా ఇద్దరూ కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్సీ పోటీ కంటిన్యూ అయింది. నిన్న రాజ్, రోహిత్, రేవంత్.. సూర్యకు; బాలాదిత్య, గీతూ.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చగా ఇనయ.. శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. నేటి ఎపిసోడ్లో వాసంతి, ఆదిరెడ్డి, మెరీనా, ఫైమా.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చారు. తక్కువ కత్తులు దిగిన శ్రీహాన్ కెప్టెన్‌గా అవతరించాడు. మరోవైపు కిచెన్‌లో గీతూ, బాలాదిత్య పంచాయితీకి దిగారు. కూరగాయలు కట్ చేసినప్పుడు దాని తొక్కలు డస్ట్‌బిన్‌లో వేయొచ్చు కదా అని బాలాదిత్య.. నేను ఎందుకు వేస్తా, అంత అవసరమనుకుంటే నువ్వే వేసేయ్ అంటూ గీతూ దెబ్బలాడుకున్నారు. అలా ఇద్దరి గొడవతో ఇంట్లో రగడ జరిగింది. తర్వాత యమహా కాల్ ఆఫ్ ద బ్లూ టాస్క్‌లో రోహిత్ గెలిచి జాకెట్ గెలుచుకున్నాడు. తనను విన్నర్‌గా ప్రకటించకపోవడంతో రేవంత్ చిర్రుబుర్రులాడాడు. అనంతరం వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమని కెప్టెన్ శ్రీహాన్‌ను ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో కెప్టెన్.. బాలాదిత్య ముఖానికి పెయింట్ పూయడంతో అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గీతూ ప్రవర్తన మీద ఓ కన్నేసిన ఆది రెడ్డి తన అభిప్రాయాన్ని ఆమె ముందుంచాడు. గీతక్క నువ్వు రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నావనిపిస్తోందన్నాడు. ఆమె మాత్రం అదేమీ పెద్దగా పట్టించుకోనట్లే కనిపించింది. ఇక ఆది కూతురు హద్విత ఫస్ట్ బర్త్‌డే కావడంతో అతడికి ఫ్యామిలీ వీడియో చూపించాడు బిగ్‌బాస్. ఆ వీడియోలో ఆది భార్య కవిత కూతురికి కేక్ కట్ చేసి తినిపించింది. తన తల్లిని, పెళ్లాంబిడ్డలను చూసి ఆది సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కెప్టెన్ శ్రీహాన్ ఇంటిసభ్యులకు పనులు అప్పగించేందుకు రెడీ అయిపోయాడు. ఇనయను వంట చేయమని అడిగాడు. దీనికి ఇనయ స్పందిస్తూ.. 'నేను చివరిసారిగా వంట చేసింది మా డాడీకే, నా వంట తిన్నాక ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి వంట ముట్టుకోలేదు, ఇక మీదట చేయను కూడా' అని తెగేసి చెప్పింది. కొందరు అన్నం వదిలేస్తున్నారని శ్రీహాన్ అనగా కూర లేకపోవడంతోనే తాను రైస్ పక్కన పెట్టేశానని మధ్యలో కల్పించుకుని ఆన్సరిచ్చింది ఇనయ. అసలు నీ పేరు ప్రస్తావించనప్పుడు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావంటూ ఫైర్ అయ్యాడు కెప్టెన్. అలా ఇద్దరి మధ్య కాసేపు చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏదేమైనా అన్నం పడేస్తే మాత్రం అస్సలు ఊరుకోనన్నాడు శ్రీహాన్. మళ్లీ గొడవలవుతున్నాయని శ్రీహాన్ చిరాకుపడుతుంటే గీతూ మాత్రం.. ఇలా గొడవ జరిగితేనే సీజన్ హిట్టవుతుందని చెప్పుకురావడం విశేషం.. -
ఒక్క చేపతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న రేవంత్‌ను కిందకు దించిన గీతూ
Bigg Boss 6 Telugu, Episode 53: గేమ్‌లో ఉన్నా లేకపోయినా ఆటాడాల్సిందేనని డిసైడ్ అయిపోయింది గీతూ. అందుకే సంచాలకురాలిగా ఉన్నా కూడా గేమ్ పడింది. ఇక్కడ తను ఫేవరిటిజం చూపిస్తూ ఆది ఫేవరిటిజం చూపిస్తున్నాడని అడ్డదిడ్డంగా వాగింది. మరోపక్క చేపల చెరువు టాస్క్‌లో మెరీనా- బాలాదిత్య జంట ఎక్కువ టార్గెట్ అయింది. మరి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఎక్కడివరకు వచ్చింది? హౌస్‌లో ఏమేం జరిగిందో ఇప్పుడు చదివేద్దాం.. అప్పటిదాకా ఫెవికాల్లా కలిసిపోయిన సూర్య- ఇనయ నామినేషన్స్ నుంచి సరిగా మాట్లాడుకోవడమే మానేశారు. పైగా ఇనయ సూర్య మీద కక్ష పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 'సూర్యకు బుజ్జమ్మ ఉన్నప్పుడు అతడితో క్లోజ్ అవడం తప్పనిపించింది. సూర్యను టాప్ 5లో ఉండనివ్వకూడదు. అతడు చాలా తప్పులు చేస్తున్నాడు, ఇక వదిలిపెట్టను. ప్రతివారం నామినేట్ చేస్తాను. గీతూ కూడా త్వరలోనే వెళ్లిపోతుంది' అంటూ ఏదేదో మాట్లాడింది ఇనయ. మరోపక్క రేవంత్ వల్లే తన గేమ్ ఆగిపోయింది అని ఉడికిపోయిన గీతూ అర్ధరాత్రి అతడి చేపలు దొంగతనం చేయడానికి ప్రయత్నించింది. కానీ వర్కవుట్ కాలేదు. ఇక పొద్దున్నే స్విమ్మింగ్ పూల్‌లో నల్ల చేప కనిపించడంతో లటుక్కున పట్టుకుని దాచేసుకుంది గీతూ. ఇకపోతే తాను దొంగతనానికి ప్రయత్నించిన విషయాన్ని ఎందుకు అందరికీ చెప్తున్నావని మెరీనా మీద మండిపడింది గీతూ. నువ్వు ఆడవు, ఒకరిని ఆడనివ్వవు అంటూ ఫైర్ అయింది. గెలవలేకపోతున్నావు కాబట్టే ఫ్రస్టేట్ అవుతున్నావంటూ ఉన్నమాట అనేసింది మెరీనా. తర్వాత చేపల చెరువు టాస్క్ తిరిగి ప్రారంభమైంది. ఈసారి గీతూ, ఆదిలు సంచాలకులుగా వ్యవహరించారు. అయితే చేపలు పడుతుంటే వాటిని క్యాచ్ చేసేందుకు ప్రయత్నించింది గీతూ. నువ్వు గేమ్ ఆడితే సంచాలకురాలిగా అనర్హత వేటు వేస్తానని హెచ్చరించాడు ఆది. అయినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. తర్వాత పూల్‌లో దిగిన ఫైమాకు గోల్డ్ కాయిన్ దొరికింది. దీని సాయంతో బిగ్‌బాస్ ఇచ్చిన రెండో ఛాలెంజ్ షీల్డ్ వార్ టాస్క్‌లో ఏయే జంటలను ఎంపిక చేయాలనేది ఫైమా జోడీ నిర్ణయిస్తున్నంది. ఫైమా- రాజ్.. తమతో పాటు సూర్య- వాసంతి, ఆదిత్య- మెరీనా, శ్రీసత్య- శ్రీహాన్ జంటలు పోటీకి దిగుతాయని వెల్లడించారు. ఈ ఛాలెంజ్‌లో సూర్య- వాసంతి టీమ్ గెలిచి 15 చేపలు గెలుచుకుంది. ఫైనల్‌గా చేపల చెరువు టాస్క్ ముగిసే సమయానికి శ్రీసత్య- శ్రీహాన్ 67, రేవంత్- ఇనయ 129, ఫైమా- రాజ్ 109, సూర్య- వాసంతి 89, రోహిత్- కీర్తి 84, బాలాదిత్య- మెరీనా -37 చేపలు సంపాదించారు. అయితే నల్ల చేప సాయంతో రెండు జంటల చేపలను స్వాప్ చేయొచ్చని బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకే దొరికింది ఛాన్స్ అనుకున్న గీతూ పొద్దున దొరికిన బ్లాక్ ఫిష్‌ను బయటకు తీసింది. ఫ్రెండ్స్ మధ్యలో చిచ్చు పెడ్తానంటూ అందరికంటే ఎక్కువ చేపలు ఉన్న రేవంత్- ఇనయ జోడీని శ్రీసత్య- శ్రీహాన్‌తో స్వాప్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రేవంత్ జోడీకి 67 చేపలు రాగా శ్రీహాన్ జోడీకి 129 చేపలు వచ్చాయి. అందరికంటే తక్కువ చేపలున్న బాలాదిత్య- మెరీనా జంట ఆట నుంచి వైదొలిగారు. చదవండి: లైగర్ వివాదం.. పూరీ డబ్బులెందుకు ఇవ్వాలి?: నిర్మాత అమ్మ ఆరోగ్యానికి రిస్క్, అయినా నాన్న పట్టించుకోలేదు: శ్రీదేవి కూతురు అంపైర్‌గా ఉండమంటే బ్యాటింగ్, ఇలాగైతే తిట్టరా మరి! -
అంపైర్‌గా ఉండమంటే బ్యాటింగ్, గీతూను ఛీ కొడుతున్న నెటిజన్స్
బిగ్‌బాస్ హౌస్ చేపల మార్కెట్‌గా మారిపోయింది. పై నుంచి చేపల వర్షం పడుతుంటే వాటిని పట్టుకునేందుకు పోటీపడుతున్నారు హౌస్మేట్స్. చేపల చెరువు అనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో ఇప్పటికే గీతూ- ఆదిరెడ్డి జంట ఔట్ అయింది. దీంతో బిగ్‌బాస్ నెక్స్ట్ లెవల్ కోసం ఆ జంటను సంచాలకులుగా నిర్ణయించాడు. ఇదే సరైన అవకాశం అనుకున్న గీతూ ఆటను తనకు నచ్చినట్లు మార్చేస్తోంది. చేపలు దాచుకునే బుట్టను ఎవరూ కవర్ చేయకూడదని కొత్త రూల్ తీసుకొచ్చింది. అలాగే మిగతా హౌస్‌మేట్స్‌తో పాటు తను కూడా చేపలు పట్టుకునేందుకు వెళ్లింది. మెరీనాను టార్గెట్ చేసి ఆమె దగ్గరున్న చేపలను లాక్కుని విసిరేసింది. ఇవన్నీ చూసి సహసంచాలకుడైన ఆదిరెడ్డికి తిక్క లేచింది. నువ్వు చేస్తోంది తప్పని ఆమెను విమర్శించాడు. దీనికి గీతూ.. నువ్వు అతి చేయకు ఆదిరెడ్డి, నా గేమ్ మధ్యలో ఎందుకు వస్తున్నావు? అని ప్రశ్నించింది. ఇన్ని రోజులలో ఏ సంచాలకుడైనా గేమ్ ఆడటం చూశావా? అని ఆది నిలదీయగా తాను గేమ్ ఆడట్లేదని, ఆడిస్తున్నానని ఆన్సరిచ్చింది గీతూ. ఇక గీతూ అతి తెలివి ప్రదర్శించడంపై హౌస్మేట్స్ మండిపడ్డారు. బ్యాట్స్‌మెన్ షాట్ కొట్టాక అంపైర్ క్యాచ్ పట్టడంలా ఉంది అని బాలాదిత్య సెటైర్ వేయగా అవును, అసలది కరెక్ట్ కాదని అసహనం ప్రదర్శించాడు ఆదిరెడ్డి. అయినా సరే అడ్డదిడ్డంగా వాదిస్తూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు ప్రవర్తిస్తూ రెచ్చిపోతోంది గీతూ. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు గీతూను దుమ్మెత్తిపోస్తున్నారు. ఓటమిని సహంచలేక ఆమె ఇలా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తోందని విమర్శిస్తున్నారు. ఇంత దరిద్రమైన గేమ్ ఆడే కంటెస్టెంట్‌ను ఎన్నడూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్‌లో చేపల లొల్లి, వెక్కివెక్కి ఏడ్చిన గీతూ -
గీతూపై మెరీనా ఫైర్.. నా జోలికి రావొద్దంటూ వార్నింగ్
బిగ్‌బాస్ సీజన్-6లో ఈవారం పోటీదారుల కోసం చేపల చెరువు అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా వీలైనన్ని ఎక్కువ చేపల్ని తమ బుట్టలో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫైర్ లేదని బిగ్‌బాస్ మండిపడటంతో కంటెస్టెంట్లు తెగ కష్టపడుతున్నారు. వంత శాతం ఎఫర్ట్ పెట్టి మరీ చెడుగుడు ఆడేస్తున్నారు. ఇక ఈ టాస్కులో ఇద్దరు సభ్యులను ఒక టీంగా విభజించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫిజికల్‌గా పోటీ పడకపోతే, మెంటల్‌గా రేవంత్‌ను దెబ్బకొట్టాలి అంటూ గీతూ ఆదికి సలహా ఇస్తుంది. మరోవైపు గీతూకి, రోహిత్‌కి కూడా టాస్క్‌లో గొడవ అవడంతో..మెరీనాను ఉద్దేశించి మీరు ఎప్పుడూ భార్యభర్తలుగానే టాస్కులు ఆడుతున్నారంటూ గీతూ కౌంటర్ ఇవ్వగా, మెరీనా ఫైర్ అయ్యింది. నా జోలికి రావొద్దు..వస్తే మామూలుగా ఉండదంటూ మెరీనా విశ్వరూపం చూపించింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
ఆది రెడ్డి జీరో, ఎలిమినేట్ అయిపోతావ్!: గీతూ
Bigg Boss Telugu 6, Episode 46: బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీ గేమింగ్ లీగ్ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే కదా! ఈ లీగ్‌లో రేవంత్, ఫైమా, బాలాదిత్య, ఆదిరెడ్డి, రాజ్, కీర్తి, ఇనయ, శ్రీహాన్.. టాలీవుడ్ ఫాంటసిస్ టీమ్ కాగా సూర్య, రోహిత్, అర్జున్, రాజ్, శ్రీసత్య, గీతూ, మెరీనా, వాసంతి టాలీవుడ్ డైనమిక్ టీమ్‌లో ఉన్నారు. ఈ రెండు టీమ్స్‌లో అతి కొద్ది మంది మాత్రమే పర్ఫామ్ చేయగా మిగతా ఎవరూ అసలు టాస్క్‌ను సరిగా పట్టించుకోలేదని ఫైర్ అయ్యాడు బిగ్‌బాస్. ఆ కోపాన్ని నేటి ఎపిసోడ్‌లోనూ కంటిన్యూ చేశాడు. ఇంటిసభ్యులతో మాట్లాడటం మానేశాడు. ఏది చెప్పాలనుకున్నా లెటర్స్ ద్వారానే తెలియజేశాడు. మరి ఆ వివరాలేంటో నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రద్దవడంతో కెప్టెన్‌గా తాను ఫెయిలయ్యానంటూ కెమెరాల ముందు ఏడ్చేశాడు సూర్య. మరోపక్క ఆదిరెడ్డి రివ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ఈ సీజన్‌కు వచ్చినవాళ్లలో ఎక్కువమంది తుప్పాస్ కంటెస్టెంట్స్ అని గీతూతో చెప్పుకొచ్చాడు. ఆమెనేమో.. నువ్వు నిన్నటి టాస్క్‌లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, బిగ్‌బాస్‌ను కాదు నన్ను నిరాశపర్చావు అంటూ పెద్ద క్లాస్ పీకింది. ఇలాగైతే ఫేమ్ ఉన్నవాళ్లు ఉండి లేనివాళ్లు వెళ్లిపోతారని జోస్యం పలికింది. 'నువ్వు ఎక్కడ పోతావోనని నాకు భయమేస్తోంది ఆది రెడ్డి. నువ్వు కూడా ఎలిమినేట్ అయ్యేవాళ్ల లిస్ట్‌లో ఉండొచ్చు. కానీ నా వల్ల సేఫ్ అవుతావు. అది పక్కన పెట్టేస్తే నీ వల్ల ఎంటర్టైన్ చేసేవాళ్లు వెళ్లిపోయినా బాధపడతా. నీ దగ్గర ఎంటర్టైన్మెంట్ జీరో' అని అతడిని తక్కువ చేస్తూ మాట్లాడింది. ఆమె మాటలు చూస్తుంటే బాధపడతానంటూనే ఆదిరెడ్డి వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు ఉంది. ఇంతలో అక్కడికి బాలాదిత్య రావడంతో.. నువ్వు మోస్ట్ ఇమ్మేచ్యూర్ పర్సన్‌వి అంటూ అతడిని కూడా తిట్టేసింది. అయినా సరే ఆయన ఒక్క మాట మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయాడు. టాస్క్ బాగా ఆడనివాళ్లలో ఇనయ పేరు కూడా ఉంది. దీంతో తన ఫ్రెండ్సే సరిగా పట్టించుకోవడం లేదని ఫీలైంది ఇనయ. ఆ బాధ పరోక్షంగా శ్రీహాన్‌తో మాట్లాడటానికి కారణమైంది. నన్ను నామినేట్ చేశావనే కోపంతో నిన్ను నామినేట్ చేశానంతే తప్ప నీమీద ఎలాంటి కోపం లేదు, చాలామంది కంటే నువ్వు బెటర్ అని శ్రీహాన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చింది ఇనయ. ఆమె అలా పొగడటంతో సంతోషపడిపోయాడు శ్రీహాన్. మరోపక్క ఇనయను కావాలనే దూరం పెడుతున్నానని సూర్య కెమెరాలతో చెప్పాడు. తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులను బెడ్రూమ్లో ఉండాలని ఆదేశించాడు. వాళ్లందరూ బెడ్రూమ్లో ఉన్నప్పుడు లాక్ చేసేసి ఇంట్లోకి దొంగలను పంపించి ఫుడ్ అంతా వెనక్కు తీసుకెళ్లాడు. అంతేకాదు, ఇప్పటినుంచి ఏది కావాలన్నా పోరాడి సంపాదించుకోవాలని చెప్పాడు. మరోవైపు ఆకలి బాధతో సూర్య, గీతూ స్పూన్ చక్కెర దొరుకుతే దాన్ని సీక్రెట్‌గా ఆరగించారు. ఆకలితో అలమటిస్తున్న ఇంటిసభ్యులకు కబడ్డీ పోటీ పెట్టాడు బిగ్‌బాస్. టాలీవుడ్ ఫాంటసీస్, టాలీవుడ్ డైనమిక్ టీమ్స్ పోటాపోటీగా తలపడ్డాయి. కబడ్డీ ఆటలో అమ్మాయిలు రెచ్చిపోయి మరీ ఆడారు. ఈ పోటీకి గీతూ సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో టాలీవుడ్ డైనమిక్ టీమ్ గెలవడంతో అందులోని సభ్యులకు అన్నం, పప్పు పంపించగా వాళ్లు కడుపు నిండా ఆరగించారు. తర్వాత రివర్స్ టగ్ ఆఫ్ వార్ టాస్క్ జరగ్గా దీనికి ఫైమా సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో టాలీవుడ్ ఫాంటసిస్ టీమ్ గెలిచింది. వీరికి రోటీలు రావడంతో ఆవురావురుమని తిన్నారు. అయితే వేరే టీమ్ మెంబర్ అయిన గీతూ.. ఆదిరెడ్డి ప్లేట్లో నుంచి కొంత తీసుకుని తింది. ఫలితంగా బిగ్‌బాస్ వాళ్లిద్దరికీ పనిష్మెంట్ ఇచ్చాడు. బయట నుంచి అంట్ల గిన్నెలను పంపించి వాటిని శుభ్రంగా తోమాలని శిక్ష విధించాడు. చచ్చాంరా దేవుడా అనుకుంటూ గీతూ, ఆది వాటిని క్లీన్ చేశారు. ఫస్ట్ టైం అంట్లు తోమామని తెగ బాధపడిపోయారు. తర్వాత హౌస్మేట్స్ శ్రీహాన్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. చదవండి: ఆదిరెడ్డి ముఖంపై కాలు పెట్టిన గీతూ విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల ఫొటోలు, వీడియోలు -
ఆది, గీతూలతో అంట్లు తోమించిన బిగ్‌బాస్
హౌస్మేట్స్ మీద పీకల్లోతు కోపంలో ఉన్నాడు బిగ్‌బాస్. ఎంటర్టైన్ చేయండ్రా బాబూ అంటే సోది కబుర్లు పెట్టుకుంటూ టైంపాస్ చేస్తున్నారని కంటెస్టంట్లపై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. వీళ్ల కడుపు మాడ్చితేనే దారికొస్తారని డిసైడ్ అయిన బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న వంటసామాగ్రి అంతా లాగేసుకున్నాడు. మళ్లీ అంతలోనే ఆకలితో అలమటిస్తున్న ఇంటిసభ్యులను చూసి జాలిపడిన ఆయన హౌస్‌లోకి ఫుడ్ పంపించాడు. కాకపోతే దాన్ని దక్కించుకోవాలంటే టాస్కులు గెలవాలని మెలిక పెట్టాడు. అలా కబడ్డీ, రివర్స్ టగ్ ఆఫ్ వార్ టాస్కులిచ్చాడు. గెలిచిన టీమ్ సభ్యులు తమ ఆహారాన్ని మిగతా టీమ్ సభ్యులతో షేర్ చేసుకోకూడదని ముందుగానే హెచ్చరించాడు. అయినా ఇదేమీ పట్టించుకోని గీతూ.. గెలిచిన టీమ్ మెంబర్ అయిన ఆది రెడ్డి ప్లేటులోని ఆహారాన్ని కొంత తీసుకుని తినేసింది. దీంతో బిగ్‌బాస్.. తన మాట పెడచెవిన పెట్టిన ఇద్దరికీ పనిష్మెంట్ ఇచ్చాడు. బయట నుంచి అంట్ల పాత్రలు పంపించి వాటిని కడగమని ఆదేశించాడు. చేసినదానికి అనుభవించక తప్పుతుందా? అనుకుంటూ ఆది రెడ్డి, గీతూ.. ఇద్దరూ అంట్లు తోమారు. ఆ తర్వాత ఇద్దరూ తెగ బాధపడ్డారు. ఇంతవరకు ఎప్పుడూ అంట్లు తోమిందే లేదు, ఇదేం టార్చర్‌రా బాబు అని తలలు పట్టుకున్నారు. చదవండి: ఆది రెడ్డి ముఖంపై కాళ్లూపిన గీతూ విష్ణుప్రియ ఫేస్బుక్లో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు -
ఆది రెడ్డి ముఖంపై కాలు పెట్టిన గీతూ, నెట్టింట ట్రోలింగ్!
ప్రతి ఇంట్లో తనలాంటి అమ్మాయి ఉండాలి అనుకునేలా చేస్తానంది గీతూ రాయల్. మరి నిజంగానే గీతూ అందరికీ రోల్ మోడల్‌గా నిలబడేట్లుగా ప్రవర్తిస్తుందా? అంటే ఆమెకు గుండె ధైర్యం, ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకునే స్థైర్యం, వాక్చాతుర్యం, ఎవరేమన్నా డోంట్ కేర్ అంటూ లెక్కచేయని తత్వం ఉన్నాయి. కానీ అదే సమయంలో ఎదుటివారిని చులకన చేస్తూ మాట్లాడే స్వభావం, పక్కవాళ్లను (ఆఖరికి బిగ్‌బాస్‌ను సైతం) కాస్తైనా పట్టించుకోని తెంపరి తనం, హద్దులు మీరే అల్లరి.. ఇలా చాలానే ఉన్నాయి. అంతదాకా ఎందుకు? గీతూ ప్రవర్తనకు నిదర్శనంగా పై ఒక్క ఫొటో చాలు.. బిగ్‌బాస్ ఇంట్లో ఎవరితోనూ రిలేషన్స్ పెట్టుకోను, వాళ్లతో కలిసి ఉన్నంత మాత్రాన సంబంధాలు కలుపుకోను అని మొదట్లో బల్ల గుద్ది చెప్పింది గీతూ. కానీ సీజన్ సగానికి వచ్చేసరికి బాలాదిత్య, ఆదిరెడ్డిలతో బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ పెట్టుకుంది. వసంతి నామినేట్ చేసినప్పుడు కూడా నాకు క్లోజ్‌గా ఉన్న నువ్వు నామినేషన్ చేస్తే తీసుకోలేకపోయానంది. ఇలా తనకెవరూ వద్దంటూనే అందరితో బాగా కలిసిపోయింది. ఇదిలా ఉంటే ఎటూ ఆదిరెడ్డి.. గీతక్క.. గీతక్క.. అంటూ వెనకాలే తిరుగుతుండటంతో అతడిపై తన పైత్యం చూపించింది గీతూ. సోఫాలో పడుకుని తన కాళ్లు ఆదిరెడ్డి ముఖం వైపు చాపింది. అంతేనా? ఆది ముఖం మీదే కాళ్లు ఊపుతూ మాట్లాడింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మనిషి ముఖం మీద కాళ్లు ఊపడం సంస్కారమా? అని ఫైర్ అవుతున్నారు. తను ఏం చేసినా అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతోనే గీతూ తలపొగరు రోజురోజుకూ పెరిగిపోతుంది అని మండిపడుతున్నారు. అమ్మాయిలకు ఆదర్శంగా ఉంటానన్నావు, అవునవున్లే, నిన్ను చూసి ఎలా ఉండకూడదో తెలుసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. ముఖం మీద కాలు పెట్టొద్దన్న కామన్సెన్స్ కూడా లేదు, మళ్లీ అందరికీ నీతులు చెప్తుంది, వరస్ట్ బిహేవియర్ అంటూ ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా గీతూ అతి చేష్టలు తగ్గించుకోకపోతే ఆమెకు మొదటికే మోసం వస్తుంది! Intlo ala alavatu ayyundochu... But thats a very bad habit.. Moham meedha kalu petta koodadhu anedhi just common sense...she need to change thay habit... atleast when she said when I want to inspire girls or everyone #GeetuRoyal #BiggBossTelugu6 pic.twitter.com/KSi0rdIVr6 — Vamc Krishna (@lyf_a_zindagi) October 18, 2022 చదవండి: టాస్క్‌లో బోరింగ్ ఫర్ఫామెన్స్, బిగ్‌బాస్ వార్నింగ్ -
హౌస్మేట్స్ కోసం త్యాగం, చివరకు బకరా అయిన రోహిత్!
Bigg Boss Telugu 6, Episode 40: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీహాన్, శ్రీసత్య, సుదీప, బాలాదిత్య, ఇనయ, అర్జున్, ఆది రెడ్డి, గీతూలకు సర్ప్రైజ్లు అందాయి. వారు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి ఇంటిసభ్యులతో ఆడియో కాల్, వీడియో కాల్, ఫొటో ఫ్రేమ్, ఫుడ్ అందుకున్నారు. మిగిలిన హౌస్మేట్స్ నేడు వారి ఫ్యామిలీతో మాట్లాడారు. మరి ఎవరికి ఎలాంటి సర్ప్రైజ్లు అందాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి.. ఇనయ- సూర్యలు ఒకరికొకరు ఫెవికాల్లా అతుక్కుపోయారు. ఇప్పటిదాకా ఒకరికొకరు గోరుముద్దలు పెట్టుకున్న ఈ ఇద్దరు పొద్దుపొద్దున్నే ఒకరి లాలీపాప్‌ను మరొకరు చప్పరించారు. ఇనయ లాలీపాప్ తింటూ దాన్ని సూర్యతో షేర్ చేసుకుంది. అతడు కూడా వద్దనుకుండా దాన్ని నోట్లో పెట్టుకోవడం గమనార్హం. అటు బాలాదిత్య సిగరెట్లు లేక అల్లాడిపోయాడు. పొద్దునకల్లా తిరిగి పంపించేస్తాను ఒక్కసారి సిగరెట్లు ఇవ్వండి బిగ్‌బాస్ అని కెమెరాల దగ్గర మొత్తుకున్నాడు. కానీ బిగ్‌బాస్ ఏడిపించే రకమే కానీ కరుణించే రకం కాదు కదా! మరోవైపు అన్నం సరిపోవట్లేదు కొంచెం ఎక్కువ వండమని ఆదిరెడ్డి కెప్టెన్‌ను అడిగాడు. దానికతడు రైస్ వేస్ట్ కాకూడదు అంటూ కస్సుబుస్సులాడాడు. నీ కెప్టెన్సీలో అన్నం లేక ఇబ్బందిపడటం మీకు ఇష్టమా? అని ఆదిరెడ్డి ప్రశ్నించగా మీరు ఇబ్బందిపడ్డారా? అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడాడు రేవంత్. రైస్ ఎక్కువ ఉంది కాబట్టే అడిగానని ఆదిరెడ్డి చెప్తున్నా అతడు వినిపించుకోలేదు. ఇంతలో టెలిఫోన్ బూత్‌కు బిగ్‌బాస్ కాల్ చేశాడు. రోహిత్, వాసంతిలలో ఎవరైనా ఒకరు రెండు వారాలు స్వతాహాగా నామినేట్ అయితే బ్యాటరీ ఫుల్‌గా రీచార్జ్ అవుతుందన్నాడు. ఇంటిసభ్యుల కోసం తాను నామినేట్ అవడానికి సిద్ధమని రోహిత్ వెల్లడించడంతో బ్యాటరీ వంద శాతం రీచార్జ్ అయింది. కాకపోతే ఈసారి బిగ్‌బాస్ పిలవడం కాకుండా ఫోన్ రింగ్ అయినప్పుడు ఎవరు ముందుగా లిఫ్ట్ చేస్తే వారికే సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. మొదటగా రేవంత్ కాల్ లిఫ్ట్ చేశాడు. అతడు 10 శాతం రీచార్జ్ వినియోగిస్తూ భార్య ఫొటో సెలక్ట్ చేసుకున్నాడు. ఫైమా 25 శాతం రీచార్జ్ ఉపయోగించి అమ్మతో వీడియో కాల్ మాట్లాడింది. కీర్తి.. 15 శాతం ఉన్న మానస్ ఆడియో మెసేజ్ విని సంతోషపడింది. సూర్య.. 20 శాతం ఉన్న అమ్మ లేఖ అందుకుని చదివి మురిసిపోయాడు. వాసంతి.. 15 శాతం రీచార్జ్ ఉన్న అక్క కూతురి ఫొటో తీసుకుంది. రాజ్.. 15 శాతం రీచార్జ్ వినియోగిస్తూ అమ్మతో ఆడియో కాల్ తీసుకున్నాడు. రోహిత్, మెరీనాలకు అవకాశం రాకుండానే బ్యాటరీ రీచార్జ్ మొత్తం అయిపోయింది. నిజానికి రోహిత్ వల్లే బ్యాటరీ రీచార్జ్ అయినా అతడికి, మెరీనాకు మాత్రం ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. అనంతరం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా బంతిని వారి బాస్కెట్లో వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో కిందామీదా పడ్డ హౌస్‌మేట్స్‌కు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పట్టు విడవకుండా గేమ్ ఆడి రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. చదవండి: శ్రీసత్య కన్నింగ్, వాసంతి ఎడ్డిది: స్రవంతి సినిమా ఛాన్స్ పేరుతో నన్ను ఇంటికి పిలిచి... బిగ్‌బాస్ కంటెస్టెంట్ బండారం బయటపెట్టిన నటి -
ఇనయకు తెలిస్తే శ్రీసత్యను చెప్పుతో కొట్టడం ఖాయం.. కీర్తి
Bigg Boss Telugu 6, Episode 38: బిగ్‌బాస్ షో ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ కొన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడు. ఆడియో కాల్, వీడియో కాల్, ఇంటి నుంచి ఫుడ్ అంటూ వారిని సర్ప్రైజ్ చేశాడు. అయితే ఇక్కడే ఏదో మెలిక కూడా పెట్టాడు. మరి ఆ సర్ప్రైజ్లు ఎవరెవరికి దక్కాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నామినేషన్స్ ముగిసినా దాన్నుంచి బయటపడలేకపోయింది కీర్తి. 'ఇనయను నీ ఎంకమ్మ అనడం పెద్ద బూతు అని శ్రీసత్య అందరి ముందు నొక్కి చెప్పింది. కానీ అదే శ్రీసత్య ఇనయను ఘోరమైన బూతులు అంది. అదేంటో చెప్తే ఇనయ ఆమెను చెప్పు తీసుకుని కొట్టడం ఖాయం. ఆమె ఏమందో చెప్తే హౌస్ అల్లకల్లోలం అయిపోతుంది' అని ఫైమాతో చెప్పుకొచ్చింది కీర్తి. మరుసటి రోజు బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా గార్డెన్ ఏరియాలో 100% చార్జ్ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ వారం హౌస్మేట్స్ కోసం బిగ్‌బాస్ కొన్ని సర్ప్రైజ్లను ప్లాన్ చేశాడు. అయితే ఇంటిసభ్యులు ఎంచుకునే ప్రతి సర్ప్రైజ్కు బదులుగా బ్యాటరీలోని కొంత చార్జ్ తగ్గిపోతుంది. అంతేకాక ఇంటి నియమాలను ఉల్లంఘిస్తే కూడా చార్జ్ తగ్గిపోతుందని చెప్పాడు బిగ్‌బాస్. ముందుగా శ్రీహాన్‌ను పిలిచి నాన్నతో వీడియో కాల్ మాట్లాడటానికి 58%, సిరితో ఆడియో కాల్‌కు 30%, ఇంటి నుంచి మటన్ బిర్యానీ కావాలంటే 15% బ్యాటరీ ఉపయోగించాలని బిగ్‌బాస్ తెలిపాడు. మొదట ఇవేవీ తనకు వద్దనుకున్నాడు, కానీ బిగ్‌బాస్ ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిందేనని హెచ్చరించడంతో మటన్ బిర్యానీ కావాలని చెప్పాడు. తర్వాత సుదీపను పిలిచి నీ భర్తతో మాట్లాడతావా? టీషర్ట్ కావాలా? మీ అమ్మ చేసిన చికెన్ కర్రీ కావాలా? అని అడిగాడు. అందుకామె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉన్నదాంట్లో తక్కువ బ్యాటరీ ఉన్న ఆడియో కాల్(30%)ను ఎంచుకుంది. దీంతో ఆమె తన భర్త రంగనాథ్‌తో తనివితీరా మాట్లాడింది. అటు శ్రీహాన్ తన మటన్ బిర్యానీని గీతూతో షేర్ చేసుకున్నాడు. రేవంత్ పడుకోవడంతో 5% , గీతూ సరిగా మైక్ ధరించకపోవడంతో మరో 5% తగ్గిపోయింది. తర్వాత ఆదిరెడ్డి అందరి గురించి ఆలోచించను, ఇప్పుడు తనకు ఫ్యామిలీనే ముఖ్యం అనుకున్నాడు. ఎక్కువ బ్యాటరీ కట్ అయ్యే ఫ్యామిలీతో వీడియో కాల్(40%)ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. దీంతో అతడు తన భార్యాకూతురితో వీడియో కాల్ మాట్లాడగా... ఈ సంతోషంతో ఆదిరెడ్డికి రాత్రి నిద్ర కూడా పట్టినట్లు లేదు. చదవండి: వాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఎందుకుంటున్నారో తెలీట్లేదు స్టేజ్‌పై ఏడ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ -
బిగ్‌బాస్ ట్విస్టులు.. అప్పుడే ఏడిపించి, ఆ వెంటనే..
నామినేషన్స్‌తో ఫైర్ మీదున్న కంటెస్టెంట్లను బిగ్‌బాస్ కూల్ చేసినట్లు తెలుస్తోంది. బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌తో వారిని ఏడిపించి చివర్లో మాత్రం నవ్వించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో సుదీప, ఆదిరెడ్డిలకు తమ ఇంటిసభ్యుల నుంచి ఆడియో కాల్ కావాలా? వీడియో కాల్ కావాలా? ఫుడ్ కావాలా? అని అడిగాడు. వారు ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి బ్యాటరీలు డౌన్ అవుతాయని చెప్పాడు. దీంతో వారు ఏది సెలక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఎమోషనలయ్యారు. అయితే సుదీప తన ఫ్యామిలీతో ఫోన్ కాల్ మాట్లాడినట్లు కనిపిస్తోంది. మరి మిగతావారికి ఆడియో కాలా? వీడియో కాలా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి నేటి ఎపిసోడ్ బోలెడన్ని ట్విస్టులు, సర్ప్రైజ్లతో రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది. చదవండి: బిగ్‌బాస్ వార్నింగ్, ఏడ్చేసిన శ్రీహాన్ ఒకే ఒక జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది -
నీవల్లే చంటి వెళ్లిపోయాడు.. నామినేషన్లో ఒకటే గుద్దుడు!
Bigg Boss 6 Telugu, Episode 37: మండే వచ్చిందంటే చాలు బయట వాతావరణం కూల్‌గా ఉన్నా బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం హీట్ ఓ రేంజ్లో ఉంటుంది. వారంలో ఎన్నడూ నోరు మెదపని కంటెస్టెంట్ కూడా నామినేషన్స్‌లో గొంతు విప్పాల్సిందే! అవసరమైతే పోట్లాటకు, కుదిరితే కొట్లాటకు సైతం రెడీగా ఉండాల్సిందే! ఆ లెవల్లో ఉంటాయి బిగ్‌బాస్ నామినేషన్స్. మరి ఈ ఆరోవారం నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే ఈ హైలైట్స్ చదివేయండి. మొన్నటిదాకా శ్రీసత్య- అర్జున్, సూర్య-ఆరోహిలను జంటలుగా చూపించారు. అయితే శ్రీసత్య తనకు ఇంట్రస్ట్ లేదని, ఎంత ట్రై చసినా వేస్ట్ అని చెప్పేయడంతో వారి ప్రేమ కహానీ అక్కడే ఆగిపోయింది. అటు ఆరోహి ఎలిమినేట్ అవడంతో ఇనయ వెంటపడ్డాడు సూర్య. ప్రస్తుతానికి హౌస్‌లో వీరేదో ప్రేమపక్షులు అన్నంత రేంజ్లో పర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇదిలా పక్కన పెడితే ఆటకు కాకుండా అందానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే వాసంతి అంటే రేవంత్‌కు ఇంట్రస్ట్ ఉందంటూ ఆదిరెడ్డి చెవులు కొరికింది గీతూ. దీనికి అర్జున్ కూడా అవునంటూ వంత పాడాడు. అతడు వేరేవాళ్లను లింక్ చేస్తే జోక్.. మనం చేస్తే మాత్రం సీరియస్ అవుతాడని చిటపటలాడాడు. తర్వాత బిగ్‌బాస్.. ఇద్దరు ఇంటిసభ్యుల ముఖంపై ఫోమ్ పూసి నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించాడు. మొదటగా కెప్టెన్ రేవంత్.. బాలాదిత్య, సుదీపలను నామినేట్ చేశాడు. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. హౌస్‌లో గేమ్ ఆడుతూ ఉండాలే తప్ప మంచితనంతో ఉండొద్దంటూ మెరీనాను నామినేట్ చేశాడు. ఓవర్ థింకింగ్ అంటూ కీర్తికి ఫోమ్ పూశాడు. మెరీనా నామినేట్ చేసేటప్పుడు ఆది హైపర్ అయిపోయాడు. ఈ క్రమంలో రోహిత్, ఆది కొట్టుకునేదాకా వెళ్లారు. కీర్తి.. గీతూ, సత్యలను; రోహిత్.. శ్రీహాన్, ఆదిని; సుదీప.. ఆది, కీర్తిలను; వాసంతి.. గీతూ, ఆదిలను; శ్రీహాన్.. గీతూ, రాజ్‌లను; బాలాదిత్య.. గీతూ, రాజ్‌లను; అర్జున్.. కీర్తిని, ఆదిని; సూర్య.. గీతూ, ఆదిని; ఫైమా.. సుదీప, బాలాదిత్యను; ఇనయ.. శ్రీహాన్, కీర్తి; రాజ్.. గీతూ, బాలాదిత్యను; మెరీనా.. కీర్తి, ఆది రెడ్డిని నామినేట్ చేశారు. రాజ్ తనను నామినేట్ చేయడం సహించలేకపోయిన గీతూ తన వంతు వచ్చేసరికి చెలరేగిపోయింది. 'నన్ను తుప్పాస్ రీజన్స్‌తో నామినేట్ చేశావు. నువ్వు ఈ హౌస్‌లో అందరికంటే వీక్, ఒక్క శాతం ఎంటర్టైన్మెంట్ చేయలేదు అంటూ రాజ్‌ను ఏకిపారేసింది. అతడితో పాటు కీర్తిని నామినేట్ చేసింది. శ్రీసత్య మాట్లాడుతూ.. బూతులు మాట్లాడావంటూ కీర్తిని, ఎంటర్టైన్మెంట్ తక్కువైందని ఆదిని నామినేట్ చేసింది. నీ వల్లే చంటి బయటకు వెళ్లాడని కీర్తికి ఎక్కువ నామినేషన్ ఓట్లు పడటం గమనార్హం. ఫైనల్‌గా ఈ వారం కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, మెరీనా నామినేట్ అయ్యారు. చదవండి: ఆ హగ్గులేంది? రాత్రిపూట ఆ రచ్చేంది? గీతూకే అంతుంటే నాకెంతుండాలి? -
నామినేషన్స్ హీట్: ఆదిరెడ్డితో గొడవకు దిగిన రోహిత్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రారంభమై ఐదు వారాలు కావస్తున్నా కొందరి ఆటతీరు మాత్రం ఇప్పటికీ బయటపడటం లేదు. అసలు వాళ్లు ఎందుకు ఉన్నారో కూడా అర్థం కావడం లేదు. ఆ జాబితాలో రోహిత్- మెరీనా జంట ఉంది. తామేంటో నిరూపించుకునే అవకాశం రావడం లేదో మరి అవకాశాలు వచ్చినా ప్రూవ్ చేసుకోవడం లేదో కానీ ఇన్నివారాల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇచ్చిందే లేదు. ఎంటర్టైన్మెంట్ టాస్కుల్లో, కొట్లాటల దగ్గరా ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అయితే విచిత్రంగా ఈరోజు నామినేషన్స్‌లో రోహిత్‌కు కోపమొచ్చింది. ప్రతిదానికీ రివ్యూ ఇచ్చే ఆదిరెడ్డితో గొడవపడ్డాడు. కళ్లు పెద్దవి చేస్తూ అతడి మీదమీదకు వెళ్లాడు. అటు సూర్యకు, గీతూకు.. ఇటు కీర్తి, ఇనయకు మధ్య కూడా పెద్ద వాగ్వాదమే జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవల్లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! చదవండి: బిగ్‌బాస్: నామినేషన్స్‌లో తొమ్మిది మంది ఈ దీపావళికి సందడి చేసే చిత్రాలివే! -
రేవంత్ నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు, ఫైమాతో.. : గీతూ
బిగ్‌బాస్ 6- ఎపిసోడ్ 33 హైలైట్స్: బిగ్‌బాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా వినోదాన్ని పంచింది. మొత్తంగా ఇలా అయినా జనాలకు కావాల్సినంత ఫన్ దొరికింది. అయితే బర్త్‌డే వేడుకల్లో భాగంగా ఇంటిసభ్యులందరూ తన కోరికలు తీర్చడానికి ప్రయత్నించడంతో, ఈ రోజు హౌస్మేట్స్ కోరికలను తెలుసుకోవాలనుకున్నాడు బిగ్‌బాస్. అందులో భాగంగా కంటెస్టెంట్లు వారి కుటుంబసభ్యులు నెరవేర్చగలిగే కోరికలేంటో చెప్పమని ఆదేశించాడు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. 'నా బర్త్‌డేకు నా చేతుల మీదుగా శ్రీహాన్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనాథలకు, వృద్ధులకు సాయం చేద్దామనుకున్నా. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నా కాబట్టి సిరి ఆ పని పూర్తి చేయాలి. అలాగే మా అమ్మానాన్నలకు రోజుకొక్కసారైనా ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడు సిరి' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. తన గారాలపట్టికి హౌస్ నుంచి బయటకు వచ్చాక మంచి పేరు పెడతానంటూ ఎమోషనల్ అయ్యాడు బాలాదిత్య. మా బావ, అమ్మ ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలనుందని మనసులో మాటను బయటపెట్టింది ఫైమా. నా తల్లిదండ్రులు మాట్లాడిన ఒక వీడియో బైట్ చూపిస్తే అంతే చాలంటూ ఎమోషనలయ్యారు అర్జున్, సూర్య. మా అమ్మ బిగ్‌బాస్ హౌస్‌కు రావాలి, తనని గట్టిగా హగ్ చేసుకోవాలనుంది. తనను మా నాన్న అంత బాగా చూసుకోలేనేమో కానీ ఆయన లేని లోటును మాత్రం గుర్తు చేయను అని ఏడ్చేసింది ఇనయ. మా ఆయన రంగనాథ్, కుటుంబం అంతా మాట్లాడిన వీడియో చూపించాలని కోరుకుంటున్నానంది పింకీ. 'ఓరియో నాకు ప్రతిరోజు ముద్దు పెట్టి నిద్ర లేపుతాడు. నా పెంపుడు కుక్కలు ఓరియో, ఫిడోల బొచ్చు కావాలి. అది నాకు చాలా అమూల్యమైనది' అని చెప్పుకొచ్చింది గీతూ. 'అక్టోబర్ 27న నా కూతురి బర్త్‌డే. ఆమె పుట్టినరోజు బిగ్‌బాస్ హౌస్‌లో జరగాలన్నదే నా కోరిక' అని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. అనంతరం బిగ్‌బాస్ ఈ వారం ఎక్కువ ఎంటర్టైన్ చేసిన ఆరుగురిని కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఎంపిక చేయమని కెప్టెన్ కీర్తికి బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఆమె ఫైమా, రేవంత్, సూర్య, గీతూ, ఆదిత్య, రాజశేఖర్ పేర్లను సూచించింది. వీరు గేమ్ ఆడగా.. మొదటి లెవల్లో గెలిచి తొలి మూడు స్థానాల్లో ఉన్న సూర్య, బాలాదిత్య, రేవంత్ రెండో లెవల్‌కు వెళ్లారు. రెండో లెవల్ గేమ్ రేపు ప్రసారం కానుంది. అయితే ఈ ముగ్గురిలో రేవంత్ గెలిచి కెప్టెన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేవంత్ తన బుగ్గ మీద ముద్దుపెట్టడం నచ్చలేదని అతడితోనే చెప్పింది గీతూ. తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పడంతో తన తీరు మార్చుకుంటానన్నాడు రేవంత్. అలాగే ఫైమా కాళ్లపై పడుకున్నావని, కాస్త వాళ్లు కంఫర్టో కాదో చూసుకోమని సూచించింది గీతూ. చదవండి: మూడుసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చిన గీతూ తండ్రి గురించి చెప్తూ కంటతడి పెట్టిన అర్జున్ -
Bigg Boss 6 : ట్రాక్ తప్పిన ఇనయా గేమ్.. పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్
బిగ్‌బాస్-6, ఎపిసోడ్32 హైలైట్స్ : బిగ్‌బాస్ ఫైమాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్మేట్స్ నిద్ర లేపాల్సి ఉంటుంది. ఇక ఆమె టాస్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్న టైంలో వసంతి, మెరీనాలు దెయ్యం గెటప్‌లు వేసి ప్రాంక్ చేస్తారు. ఈవారం వారిద్దరూ నామినేషన్స్‌లో ఉండటంతో ఎలా అయినా కాస్తైనా కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దెయ్యం గెటప్‌లు వేసి ఎంటర్టైన్ చేద్దామనుకున్నారు. కానీ వాళ్లు వేసి దెయ్యం గెటప్‌లకు హౌస్‌లో ఎవరూ భయపడలేదు. దీంతో వాళ్ల కష్టం వృదా అయినట్లే అనిపించింది. ఇక్కడ ఫైమాకు కూడా మైనస్ అయ్యింది. ఆమె సీక్రెట్ టాస్క్ చేద్దామంటే, వీళ్లు వచ్చి టైం వేస్ట్ చేసేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్మేట్స్ కోసం చిన్న కేక్ పీస్ పంపించాడు. దీన్ని ఎవరైనా నలుగురు తినాల్సిందిగా కోరగా, సుదీప తన డామినేటింగ్ వాయిస్‌తో ఓటింగ్‌కి వెళ్దామని చెప్తుంది. దీంతో ప్రతిదానికి ఓటింగ్ ఏంటంటూ రేవంత్ చాలా అసహనం వ్యక్తం చేశారు. వీళ్లు ఇలా తేల్చుకునేలోపే ఆ కేక్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టమని బిగ్‌బాస్ ఆదేశించాడు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా రేవంత్, శ్రీహాన్‌లు వేసిన లేడీ గెటప్‌లు ఎంటన్టైనింగ్గా అనిపించాయి. ఆ తర్వాత చంటి, శ్రీహాన్‌లకు కాళ్లు వ్యాక్స్ చేయించుకోవాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించగా, శ్రీహాన్ అక్కడ కామెడీ చేస్తాడు. ఇదిలా ఉండగా కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన ఇనయాను ఏదైనా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటూ బిగ్‌బాస్ ఆదేశించగా, తనకు సూర్య అంటే క్రష్ అని, అతనిపై రోజురోజుకు ఇష్టం పెరుగుతుందని చెప్తుంది. అంతేకాకుండా ఆరోహితో సూర్య క్లోజ్‌గా ఉంటే తనకు జలసీగా అనిపిస్తుందని చెప్తుంది. ఇప్పటికే ఆరోహి-సూర్యలపై బయట నెగిటివ్‌గానే ఉంది. ఇనయా కూడా సూర్య అంటే ఇష్టం అని చెప్పడం, అతనికి హగ్గులు ఇస్తూ క్లోజ్‌గా ఉండటం ఆమె గ్రాఫ్‌ను తగ్గించింది. ఓటింగ్‌లోనూ మునుపటి కంటే వెనుకపడిపోయింది. మరి రానున్న రోజుల్లో ఈ ట్రయాంగిల్ ఆమె ఆటతీరును మార్చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
Bigg Boss 6 : కెప్టెన్‌గా ఆదిరెడ్డి, జైలుకు వెళ్లిన అర్జున్.. ఏడ్చేసిన కీర్తి
బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా ఆదిరెడ్డి విజేతగా నిలుస్తాడు. ఇక అందరికంటే ఎక్కువగా కంటెంట్ ఇస్తున్నది తానే అంటూ గీతూ తన అభిప్రాయం చెప్తుంది. దీనికి ఇంటి సభ్యులు కూడా అంగీకరించి ఆమెకు 10నిమిషాల చైన్‌ను కట్టబెడతారు. మరోవైపు అందరికంటే తక్కువగా జీరో మినిట్స్ ట్యాగ్‌తో అర్జుణ్ జైలుకు వెళ్తాడు. ఇంకా మరెన్నో విశేషాలను బిగ్‌బాస్ సీజన్-6 20వ ఎపిసోడ్ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ కొత్త కెప్టెన్సీ ఎంపిక కోసం ఎత్తెర జెండా అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా ఇసుక కుప్పలో నుంచి ఇసుకను ఓ చిన్న బకెట్లో తీసుకెళ్లి వాళ్లకు కేటాయించిన డబ్బాలో వేయాల్సి ఉంటుంది. పైమా డిస్క్వాలిఫై అయినందున ఆదిరెడ్డి, శ్రీహాన్, సత్యలు ఈ టాస్క్‌లో ఆడారు. శ్రీహాన్ గెలుపుకు ఒక అడుగు దూరంలో మిగిలిపోతాడు. అందరికంటే ముందుగా ఆదిరెడ్డి టాస్క్‌ను విజయవంతంగా కంప్లీట్ చేయడంతో అతనే కెప్టెన్‌గా నిలుస్తాడు. దీంతో తన భార్య కవితను తలుచుకొని ఉద్వేగానికి లోనవుతాడు. నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటావ్.. లవ్ యూ కవిత అంటూ భార్యకు ప్రేమ సందేశాన్ని పంపుతాడు. ఇక డేంజర్ జోన్లో ఉన్న వసంతికి ఎందుకో గానీ ఎలిమినేట్ అవుతాన్న భయం మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇనయాతోనూ ఇదే విషయాన్ని చర్చించింది. మరోవైపు గీతూ కావాలని కేవలం కంటెంట్ కోసమే చేస్తున్నా అందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారంటూ ఫీల్ అవుతుంది. ఇక ఎపిసోడ్లో ఎవరు ఎన్ని నిమిషాలు కనిపిస్తారన్నది ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని దానికి సంబంధించిన చెయిన్స్ ధరించాల్సి ఉంటుంది అని టాస్క్ నిర్వహించగా, అందరి కంటే ఎక్కువగా గీతూ 10నిమిషాల చైన్‌ను ధరిస్తుంది. రేవంత్ 7నిమిషాలు, ఫైమా 6నిమిషాలు, శ్రీహాన్, ఇనయాలకు 5నిమిషాల చైన్ ధరిస్తారు. ఇక చివరగా అందరికంటే తక్కువగా జీరో నిమిషాలు సంపాదించిన ఆరోహి, ఆర్జున్, కీర్తిలలో ఎవరో ఒకరు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. దీంతో ముగ్గురూ ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని అర్జున్ను జైలుకు పంపుతారు. అయితే తనకు జీరో అన్న ట్యాగ్ రావడంపై కీర్తి భోరుమని ఏడ్చేస్తుంది. దీంతో శ్రీహాన్ ఆమెను ఓదారుస్తాడు. -
బిగ్‌బాస్-6 రెండోవారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే..
బిగ్‌బాస్-6 ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్ అని ఏ ముహూర్తాన నాగార్జున అన్నాడో కానీ హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. ఈ సీజన్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే అలకలు, గొడవలతో ఆడియెన్స్‌కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందుతుంది. గత సీజన్లతో పోలిస్తే నామినేషన్ ప్రక్రియలో మార్పులు చేసిన బిగ్‌బాస్ ఈసారి ఇంటిసభ్యులకు నామినేట్ చేయడానకి ఒక ఓటు మాత్రమే లభిస్తుందని ఆదేశించాడు. దీంతో అసలు రచ్చ మొదలైంది. హౌస్‌లో అందరితో ర్యాపో ఉంది కానీ మీతో లేదు అంటూ ఆరోహి ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. దీనికి కౌంటర్‌గా ఇంట్లో గేమ్ ఆడనివాళ్లు వెళ్లిపోవాలా లేక నీతో ర్యాపో లేదని వెళ్లిపోవాలా అని ఎదురు ప్రశ్న విసిరాడు. ఆట విషయంలో కూడా మీకంటే బెటర్‌గానే ఆడుతున్నానంటూ ఆదిరెడ్డి పేర్కొనగా ఆరోహి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి ఏం ఇరగదేశారని అంత ఆశ్చర్యపోతున్నారు అంటూ ఆదిరెడ్డి గట్టిగా బదులిచ్చాడు. ఇక బిగ్‌బాస్ డిసీషన్నే నామినేట్ చేస్తున్నా అంటూ మెరీనా అండ్ రోహిత్‌లను కూడా నామినేట్ చేశాడు. మరోవైపు రేవంత్-కీర్తి భట్ల మధ్య కూడా వాగ్వాదం నడిచింది. ఇక సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం..రేవంత్, శ్రీ సత్య, షానీ, ఫైమా, మెరీనా అండ్ రోహిత్, ఆదిరెడ్డి, గీతూ, అభినయలు నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. -
క్యారెక్టర్ చంపుకోలేను, ఈ నిమిషమే పంపించేయండి: రేవంత్
బిగ్‌బాస్ అంటేనే కొట్లాట అన్నట్లు ఉంది ప్రస్తుతం హౌస్ పరిస్థితి. నామినేషన్స్‌ను అందరూ లైట్ తీసుకున్నా రేవంత్ మాత్రం బాగా హర్ట్ అయినట్లు కనిపించాడు. అవును మ హౌస్‌లో అతడికే కదా ఎక్కువ నామినేషన్ ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఆ ఫ్రస్టేషన్‌ను ఈరోజు కూడా కొనసాగించడంతో అందరితో గొడవలు పడ్డాడు. తన వాదన కరెక్ట్‌గానే ఉన్నా సీరియస్‌గా చెప్పడంతో అతడే ఏదో తప్పు చేస్తున్నట్లు చూశారు మిగతా హౌస్మేట్స్. మరి ఈ రోజు హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయి? ఎవరు ప్లాన్‌గా గేమ్ ఆడుతున్నారు? అనేది బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లోని ఐదో ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో ఆరోహి తనను బాడీ షేమింగ్ చేసిందని కన్నీళ్లు పెట్టుకుని మరీ చెప్పింది మెరీనా. ఈరోజుమాత్రం నిజానిజాలేంటో ఆరా తీసిన తర్వాత తన మాటను వెనక్కు తీసుకుంది. తను మాట్లాడినదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అందరి ముందు క్లారిటీ ఇచ్చింది. ఇక రేవంత్ పరిస్థితి చూసిన గీతూ అతడి మీద జోకులేసింది. 'ఆయన మరీ అమాయకంగా ఉన్నాడు. ఆయన ఎంత త్వరగా వెళ్లిపోతే ఆయనకే మంచిది. మారేట్లు కూడా అనిపించడం లేదు' అని అభిప్రాయపడింది. భార్యాభర్తలైన మెరీనా-రోహిత్ ఎప్పటిలాగే గొడవపడ్డారు. రోహిత్ తనతో కాసేపు వాకింగ్ చేయమంటే పట్టించుకోకుండా శ్రీసత్యతో వెళ్లిపోయాడంటూ గొడవకు దిగింది మెరీనా. నా భర్తతో నేను వాకింగ్ చేయొద్దా అంటూ రాద్ధాంతం చేసి రచ్చ చేసి ఏడ్చి ఇదంతా ప్రాంక్ అనేసింది. కానీ అప్పటికే అదంతా నాటకం అని మిగతా హౌస్‌మేట్స్‌కు అర్థమవడంతో ఆ ప్రాంక్ పెద్దగా పేలలేదు. ఎవరేం చేస్తున్నారా? అని అందరి మీద ఓ కన్నేసిన చంటి.. గీతూ సరిగా పని చేయదు, కానీ పక్కనోళ్లకు మాత్రం పని చెప్తుందని అసహనానికి లోనయ్యాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులను రెండు టీమ్స్‌గా విడిపోమని చెప్పి డీస్నీ హాట్‌స్టార్ గేమ్ ఆడించాడు. ఇందులో సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఆరోహి, రేవంత్, పింకీ, మెరీనా, రోహిత్, ఫైమా, అభినయ, ఆదిరెడ్డి, వాసంతి, షని.. A టీమ్ కాగా మిగతా వారంతా B టీమ్‌లో ఉన్నారు. B టీమ్ తరపు నుంచి ఆడేందుకు నేను వెళ్తానంటే నేను వెళ్తానని ఆరోహి, రేవంత్ పోటీపడ్డారు. చివరికి ఆరోహి పోటీలో పాల్గొనేందుకు వెళ్లింది. అయితే ఈ గేమ్‌లో B టీమ్ గెలవడంతా వారు స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు. A టీమ్ సభ్యుడైన రేవంత్ మాత్రం డిసప్పాయింట్ అయ్యాడు. రెండుసార్లు నేను వెళ్తానంటే కూడా వినిపించుకోకుండా ఆరోహి వెళ్లిందని, చివరికి గేమ్ ఓడిపోయామని చిటపటలాడాడు. అతడి మాటలతో హర్ట్ అయిన ఆరోహి నాతో మాట్లాడకు అంటూ వేలెత్తి చూపించి పౌరుషంగా అక్కడినుంచి వెళ్లిపోయి బోరుమని ఏడ్చేసింది. ఇదెక్కడి గోలరా బాబు, ఇప్పుడేమన్నానని ఇంత సీన్ అనుకున్న రేవంత్ కెమెరా ముందుకెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. 'నా వల్ల ప్రాబ్లమ్ అనుకుంటే నన్ను పంపించేయండి. అంతేకానీ ఇలా నటిస్తూ ఒకర్ని సంతోషపెట్టడం కోసం నా క్యారెక్టర్‌ను నేను చంపుకోలేను. ఇక్కడ చాలామంది గ్రూప్‌గా ఆడుతున్నారు. నేను సింగిల్‌గా ఆడతా, ఎన్నిరోజులైనా ఆడతా. ఇంత సిన్సియర్ పీపుల్ మధ్య నేను అర్హుడిని కాదేమో, ఈ నిమిషమే నన్ను పంపించేయండి. ఇలా యాక్ట్ చేస్తూ బతకడం రాదు' అని చెప్పాడు. కానీ రాత్రయ్యేసరికి ఆరోహి రేవంత్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. అయినా వీరి గొడవ సద్దుమణిగినట్లు కనిపించలేదు. ఫ్రస్టేషన్ పీక్స్‌లో ఉన్న రేవంత్ తన మనసులో ఉన్న ఆవేశాన్ని బయటకు కక్కుతూ.. నేనేంటో చూపిస్తా అన్నాడు. ఆ పాయింట్ పట్టుకున్న ఆదిరెడ్డి వెంటనే మధ్యలో దూరి ఇక్కడ అందరూ సమానమే అని వాదనకు దిగుతూ రేవంత్‌ను రెచ్చగొట్టినట్లు అనిపించింది. . దీంతో రేవంత్ నేనేం సోషల్ మీడియా నుంచి రాలేదు అని నోరు జారాడు. అంటే సోషల్ మీడియా నుంచి వచ్చినవాళ్లు చులకనగా కనిపిస్తున్నారా? అని ఆదిరెడ్డి ప్రశ్నించాడు. అలా వీరి గొడవ పెద్ద జడివానలా మారేట్లు ఉందని గ్రహించిన శ్రీహాన్ రేవంత్‌ను హౌస్‌లోకి తీసుకెళ్లాడు. ఇక ఈరోజంతా గొడవలు పడి మైండ్ హీటెక్కిన రేవంత్‌ను పెదరాయుడు బాలాదిత్య ఎప్పటిలాగే అతడిని కూర్చోబెట్టుకుని నాలుగు మంచి మాటలు చెప్తూ అతడి మైండ్ కూల్ చేశాడు. చదవండి: చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో కూలీ పనులకు వెళ్లేదాన్ని ట్విస్ట్, ఒక్కరు కాదు ఇద్దరు ఎలిమినేట్ అవుతారట -
కామన్ మెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి
Adi Reddy In Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ రివ్యూలతో పాపులర్ అయిన ఆదిరెడ్డి కామన్ మ్యాన్‌గా ఈసారి బిగ్‌బాస్ సీజన్-6లో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అసలు ఆదిరెడ్డి ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్న విషయాల గురించి నెట్టింట చర్చ మొదలైంది. నెల్లూరులో ఉదయగిరిలోని వరికుంటపాడు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఫ్రెండ్ సలహాతో ఓసారి సరదాగా బిగ్‌బాస్ సీజన్-2పై రివ్యూ ఇస్తూ ఓ వీడియోను నెట్టింట అప్లోడ్ చేయగా ఆ వీడియో పాపులర్ అయ్యింది. దీంతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి బిగ్‌బాస్ షోలపై తనదైన విశ్లేషణతో గుర్తింపు పొందాడు. మరి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇస్తున్న ఆదిరెడ్డి బిగ్‌బాస్ షోలో ఎలా అలరిస్తాడో చూద్దాం. -
బిగ్‌బాస్-6 ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్లే.. నో ఛేంజ్
బుల్లితెరపై బిగ్‌బాస్-6 సందడి మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే హౌజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీజన్-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వినోదం పంచనున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ రియాల్టీ షో రేపు(ఆదివారం)నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే నెట్టింట బిగ్‌బాస్ సందడి షూరు అయ్యింది. ఈసారి షోలో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీరిలో 20మంది పేర్లు బయటికి రాగా ఇదే ఫైనల్ లిస్ట్ అని లీకు వీరులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం..గీతూ రాయల్, ఆదిరెడ్డి, సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, యాంకర్ నేహా చౌదరి, ఆర్జే సూర్య, కమెడియన్ చంటి,నటుడు బాలాదిత్య, షాన్ని, సింగర్ రేవంత్, నటి సుదీప(పింకీ), యాంకర్ ఆరోహీ రావ్, సీరియల్ నటి శ్రీ సత్య, కీర్తి, ఇనయా సుల్తానా(ఆర్జీవీ వీడియోతో పాపులర్), లేడీ కమెడియన్ ఫైమా, నటి వసంతి, అర్జున్, రాజశేఖర్, రియల్ కపుల్ రోహిత్, మరీనాలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు లేదా ముగ్గురు కామనర్స్ కూడా ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. -
ఆదిరెడ్డి, అమర్దీప్.. బిగ్‌బాస్ 6లో ఇంకా ఎవరెవరంటే?
బిగ్‌బాస్ షో కోసం తెగ వెయిట్ చేస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్‌బాస్ ఐదో సీజన్ తర్వాత నాన్‌స్టాప్ పేరుతో ఓటీటీలో బిగ్‌బాస్ ప్రారంభమైనా అది అందరికీ చేరువవలేదు. కేవలం హాట్‌స్టార్‌ను వీక్షించేవారు మాత్రమే దాన్ని చూసేందుకు వీలుండటంతో చాలావరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రియాలిటీ షోను మిస్సయ్యారు. అయితే వారి నిరీక్షణకు తెరదించుతూ త్వరలోనే షో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్ ఘనంగా లాంచ్ కానుంది. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చింది. కానీ కొందరు మాత్రం ఇంకా రావాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దీపికా పిల్లి, నేహా చౌదరి, శ్రీహాన్, ఆర్జే సూర్య, యాంకర్ ఉదయభాను, అమర్దీప్, ఆదిరెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్, సింగర్ రేవంత్, యాంకర్ అరోహి.. షోలో అడుగు పెట్టబోతున్నారట. గత సీజన్లో సిరి రాగా, ఈసారి సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ వస్తుండటంతో అతడి మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక బుల్లితెర నటుడు అమర్దీప్ ఇటీవలే తన ప్రేయసి, సహనటి తేజస్వితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. మరి అతడు పెళ్లిని వాయిదా వేసుకుని వస్తాడా? లేదంటే త్వరగా పెళ్లి చేసేసుకుని బిగ్‌బాస్ షోకు రెడీ అవుతాడా? అన్నది చూడాలి! ప్రతి సీజన్లో ఓ కమెడియన్ ఉన్నట్లే ఈసారి కూడా ఓ హాస్యనటుడిని తీసుకురావాలనుకున్నారు. అందులో భాగంగానే చలాకీ చంటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గీతూ రాయల్.. సోషల్ మీడియాలో కొటేషన్లు చెప్తూ బాగా ఫేమస్ అయింది. అలాగే బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చింది. ఆది రెడ్డి కూడా ఈ షోపై రివ్యూలు ఇచ్చిన వ్యక్తే. బిగ్‌బాస్ ఓటీటీలో షోపై రివ్యూలు ఇచ్చిన యాంకర్ శివను లోనికి పంపించారు. ఈలెక్కన ఈసారి వీరిద్దరినీ కూడా హౌస్‌లోకి పంపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అందరినీ మించి ఉదయభాను షోలో అడుగుపెడ్తే ఎలా ఉంటుందో చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరి బిగ్‌బాస్‌కు వస్తుండటం కూడా చాలామంది ఆశ్చర్యపరుస్తోంది. మరి వీరిలో ఎవరు చివరిదాకా ఉంటారు? ఎవరు మొదట్లోనే హ్యాండ్ ఇస్తారు? ఇంకా ఎవరెవరు హౌస్‌లోకి రాబోతున్నారు? వంటి విషయాలు తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే! చదవండి: ఎక్కువగా అబ్బాయి పాత్రలనే పోషించిన ఈ నటి గురించి తెలుసా? ఆర్ఆర్ఆర్లో కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే.. -
యాక్షన్ హీరోగా...
ప్రముఖ నిర్మాత, అమ్మ ఆర్ట్స్ అధినేత ఆదిరెడ్డి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించనుంది. శుక్రవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. యాక్షన్, సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులందరూ నటించనున్నారు. దసరా పండగ తర్వాత హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, ఊటీ, మైసూర్ తదితర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరగనుందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
ఇచ్చిన బాకీ తిరిగి రాలేదని..
అద్దంకి: ఇచ్చిన బాకీ తిరిగి రాలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు 60 అడుగుల ఎత్తున 33 కిలోవాట్ల విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ శివార్లలోని మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రహదారిలో శింగరకొండ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఎదురుగా ఆదివారం జరిగింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో నివశిస్తున్న పెట్లూరి వెంకటరెడ్డికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మూడో కుమారుడు ఆదిరెడ్డి (22) ఏడో తరగతి వరకు చదువుకుని బడిమానేశాడు. విజయవాడలోని ఓ పళ్ల దుకాణంలో కొన్నేళ్లు..ఆ తరువాత అద్దంకి పట్టణంలోని ఓ వాటర్ ప్లాంటులో రెండేళ్లు పనిచేశాడు. ప్లాంటు యజమానికి *2 లక్షల అప్పు ఇంటి నుంచి తెచ్చి ఇచ్చాడు. ఇటీవల అప్పు వసూలు విషయంలో యజమానికి.. తనకు పడకపోవడంతో అక్కడ పని మానేశాడు. శింగరకొండ రహదారిలో ఉన్న ఓ దాబాలో బాయ్‌గా చేరాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆదిరెడ్డిని గతంలో పనిచేసిన వాటర్ ప్లాంట్‌లో పనిచేసే ఇద్దరు స్నేహితులు వచ్చి సినిమాకు పిలిచారు. దాబా ఓనర్ వద్ద అనుమతి తీసుకుని సినిమాకు వెళ్లాడు. సినిమా చూసి రాత్రి 11గంటల సమయంలో దాబా వద్దకు చేరుకున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెల్లవారే సరికి యువకుడు అరవై అడుగుల విద్యుత్ టవర్‌పై శవమై కనిపించాడు. దాబా సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు వారు బహిర్భూమికి బయటకు రావడంతో అద్దంకి నుంచి మండలంలోని కుంకుపాడులో ఉన్న కల్లం స్పిన్నింగ్ మిల్కు వెళ్లే 33 కిలోవాల్టుల కెపాసిటీ ఉన్న 60 అడుగుల విద్యుత్ టవర్‌పై ఓ యువకుని శవాన్ని గమనించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సాంబశివరావు, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు వివరాలు సేకరించారు.యువకుడు వేసుకున్న చొక్కా..తల వెంట్రుకలు బూడిదై కింద రాలిపడ్డాయి. సంతమాగులూరు నుంచి క్రేన్ తెప్పించి రెండు గంటల అనంతరం ఇద్దరు యువకులు టవర్ ఎక్కి ఇనుప గిలక కట్టి మోకు సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇచ్చిన అప్పు రాకపోవడమే మృతికి కారణం... తాను 2 లక్షల అప్పు ఇచ్చిన యజమాని ఎన్నిసార్లు అడిగినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది, ఇంట్లో డబ్బు ఏదని అడుగుతుండడంతో బాధ భరించలేక ఆదిరెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. విచారణ నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.