
ఆదిరెడ్డి
ప్రముఖ నిర్మాత, అమ్మ ఆర్ట్స్ అధినేత ఆదిరెడ్డి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించనుంది. శుక్రవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. యాక్షన్, సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులందరూ నటించనున్నారు. దసరా పండగ తర్వాత హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, ఊటీ, మైసూర్ తదితర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరగనుందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment